హైదరాబాద్: దివంగత ప్రధానులు ఇందిరాగాంధీ, రాజీవ్గాంధీ పోస్టల్ స్టాంపులను రద్దు చేయడం సరికాదని తెలంగాణప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) ఆరోపించింది. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క ఈ మేరకు మీడియాతో మాట్లాడుతూ ప్రధాని మోదీ ప్రభుత్వం సంకుచితంగా ప్రవర్తిస్తుందని ఆరోపించారు.
విదేశాలు కూడా రాజీవ్ , ఇందిర పేరిట స్టాంపులు విడుదల చేశాయని అన్నారు. రాజీవ్ స్టాంపులను తిరిగి ప్రభుత్వం కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఈ నెల 22న తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో పోస్టాపీసుల ఎదుట కాంగ్రెస్ పార్టీ నిరసన వ్యక్తం చేస్తుందని స్పష్టం చేశారు.
'ఇందిర, రాజీవ్ స్టాంపులు కొనసాగించాల్సిందే'
Published Thu, Sep 17 2015 1:54 PM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM
Advertisement
Advertisement