TPCC
-
కాంగ్రెస్ నుంచే బీసీ ముఖ్యమంత్రి అవుతాడు: టీపీసీసీ చీఫ్
హైదరాబాద్: టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్(Mahesh Goud) కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్రానికి ఏదో ఒక రోజు కాంగ్రెస్ నుంచి ఒక బీసీ ముఖ్యమంత్రి అవుతాడన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్. ఈ ఐదేళ్లు రేవంత్ రెడ్డే తెలంగాణకు సీఎం(Telangana CM)గా ఉంటారని వ్యాఖ్యానించిన మహేష్ గౌడ్.. ఏదో ఒక రోజు తెలంగాణ రాష్ట్రానికి బీసీ ముఖ్యమంత్రిని కూడా చూస్తామన్నాను. అది కూడా కాంగ్రెస్ నుంచే బీసీ వ్యక్తి ముఖ్యమంత్రి అవుతాడని వ్యాఖ్యానించారు. అదే సమయంలో కేంద్ర మంత్రిగా ఉన్న బండి సంజయ్(Bandi Sanjay).. ముస్లింలకు వ్యతిరేకంగా మాట్లాడటం కరెక్టా అని ప్రశ్నించారు మహేష్ గౌడ్.దశాబ్లాలు దేశంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ.. తెలంగాణలో ఒక్క బీసీ వ్యక్తిని కూడా ఎందుకు ముఖ్యమంత్రిని చేయలేదని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ప్రశ్నించిన సంగతి తెలిసిందే. శనివారం నల్లగొండ బీజేపీ కార్యాలయంలో మాట్లాడిన కిషన్‌రెడ్డి.. తెలంగాణలో ఇప్పటివరకూ బీసీ వ్యక్తిని ఎందుకు ముఖ్యమంత్రిగా చూడలేకపోయామనే కోణాన్ని లేవనెత్తుతూ.. అందుకు కాంగ్రెస్ పార్టీనే కారణమని విమర్శించారు. దీనికి బదులుగా టీపీసీసీ చీఫ్ మహేష్‌గౌడ్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ నుంచి బీసీ వ్యక్తిని సీఎంగా చూస్తామన్నారు. -
ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నకు షోకాజ్ నోటీసులు
సాక్షి,హైదరాబాద్ : ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నకు షోకాజ్ నోటీసులు. టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ షో కాజ్ నోటీస్ జారీ చేసింది. ఈ నెల 12లోగా వివరణ ఇవ్వాలని ఆ నోటీసుల్లో పేర్కొంది. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి కుల గణాంక నివేదికను కాల్చివేయడంపై పార్టీ కార్యకర్తలు, ఓబీసీ సంఘాల నుండి అనేక ఫిర్యాదులు, అభ్యంతరాలు అందాయి. మీరు కుల గణన సర్వేపై అభ్యంతరకర భాషను ఉపయోగించారు. కులగణన సర్వే రాహుల్ గాంధీ ఆలోచన. తెలంగాణ రాష్ట్రం కేవలం 50 రోజుల్లో కుల గణాంకాన్ని పూర్తిచేసి చరిత్రలో నిలిచింది. ఈ గణాంకాలు 56 శాతం జనాభా వెనుకబడిన వర్గాలకు చెందినవారిగా, అందులో 10 శాతం ముస్లిం మైనారిటీలుగా నిర్ధారించాయి.రాష్ట్రంలో ప్రతీ ఒక్కరూ ఈ కుల గణాంకాలను 50 రోజుల్లో పూర్తి చేయడాన్ని, ఎస్సీలను మూడు వర్గాలుగా వర్గీకరించడాన్ని ప్రశంసించారు. కానీ మీరు పార్టీ ప్రయోజనాలను పక్కనపెట్టి, వ్యక్తిగత ప్రయోజనాల కోసం ప్రయత్నిస్తున్నారు. ఎమ్మెల్సీగా పార్టీ నిబంధనలు, మార్గదర్శకాలను ఉల్లంఘించారు. గౌరవించాల్సిన నియమాలను విస్మరించారు. ఇది పార్టీ నిబంధనలకు పూర్తిగా విరుద్ధం. మీకు ఈ షోకాజ్ నోటీసు అందిన తేదీ నుండి ఏడు రోజుల్లో వివరణ ఇవ్వాలి. లేదంటే మీపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లకు పంపిన షోకాజు నోటీసుల్లో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ హెచ్చరించింది. -
తీన్మార్ మల్లన్నకు షోకాజ్ నోటీసు..?
సాక్షి,హైదరాబాద్: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన కులగణన నివేదికను కాల్చివేయడంపై టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ సీరియస్‌గా ఉన్నట్లు సమాచారం. ఈ విషయంలో క్రమశిక్షణా కమిటీతో గాంధీభవన్‌లో పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్ చర్చించనున్నారు.పీసీసీ చీఫ్‌తో చర్చించిన తర్వాత తీన్మార్‌మల్లన్నపై క్రమశిక్షణ కమిటీ చర్యలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. మల్లన్నపై ఎలాంటి చర్యలు తీసుకుంటారన్నదానిపై రాజకీయ వర్గాల్లో ప్రస్తుతం జోరుగా చర్చ జరుగుతోంది.బీసీ కులగణన నివేదికతో పాటు సొంత పార్టీ నేతలపై వరంగల్ బీసీ గర్జనలో చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకుగాను మల్లన్నకు షోకాజ్ నోటీసులిస్తారన్న ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే మల్లన్న తనపై చేసిన వ్యాఖ్యలకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కౌంటర్ ఇచ్చారు. కాగా, మల్లన్న గత కొంతకాలంగా పార్టీలో తనకు ప్రాధాన్యత దక్కడం లేదని బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. దీనిపై తన యూట్యూబ్ ఛానల్లో చర్చలు కూడా పెడుతున్నారు. సొంత పార్టీ లీడర్లపైనా యూట్యూబ్ ఛానల్ వేదికగా విమర్శలు చేస్తున్నట్లు టీపీసీసీ దృష్టికి వచ్చింది. వీటన్నిటిపైనా పార్టీ అధిష్టానానికి ఫిర్యాదులు అందాయి. -
ఓవైపు గాంధీ పరివార్.. మరోవైపు గాడ్సే పరివార్: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: ‘దేశంలో రెండు పరివారాల మధ్య యుద్ధం జరుగుతోంది. ఒకటి గాంధీ పరివారం.. మరోటి గాడ్సే పరివారం. గాంధీ పరివార్ వైపు నుంచి రాహుల్‌గాంధీ పోరాడుతున్నారు. గాడ్సే పరివారం నుంచి మోదీ ఉన్నారు. మనమంతా గాంధీ పరివారంగా రాహుల్‌గాందీకి మద్దతుగా నిలవాలి. రాహుల్ నేతృత్వంలో దేశంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి రాజ్యాంగాన్ని పరిరక్షించాలి..’ అని సీఎం రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఏఐసీసీ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘జై బాపు, జై భీమ్, జై సంవిధాన్’ ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇది ఎన్నికల ర్యాలీ కాదని, ఓ యుద్ధమని అభివర్ణించారు. ‘రాజ్యాంగ పరిరక్షణ కోసం పోరాడే వారికి, రాజ్యాంగాన్ని మార్చాలనుకునే వారికి మధ్య ఈ యుద్ధం జరుగుతోంది. ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచీ మోదీ రాజ్యాంగాన్ని మార్చే పనిలో ఉన్నారు. గజనీ మహ్మద్ నాడు భారత్‌ను దోచుకునేందుకు యత్నించినట్టు నేడు రాజ్యాంగాన్ని మార్చేందుకు మోదీ యత్నిస్తున్నారు. అయితే ఆయన ప్రయత్నాలు ఫలించడం లేదు. మోదీ యత్నాలు ముందే గుర్తించిన రాహుల్‌గాంధీ రాజ్యాంగ పరిరక్షణ కోసం పోరాడుతున్నారు. నాడు బ్రిటిషర్ల నుంచి దేశాన్ని మహాత్మాగాంధీ రక్షించినట్టు నేడు బ్రిటిష్ జనతా పార్టీని ఎదుర్కొనేందుకు ఆయన నిలబడ్డారు. ఈ యుద్ధంలో అందరూ రాహుల్‌గాంధీతో కలిసి నడవాలి. రాజ్యాంగ పరిరక్షణ కోసం కలిసికట్టుగా పోరాడాలి..’ అని సీఎం పిలుపునిచ్చారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్‌తో పాటు పలువురు మంత్రులు, ఎంపీలు, మాజీ ఎంపీలు, పార్టీ సీనియర్ నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
బీజేపీవి రాజ్యాంగ విరుద్ద కార్యక్రమాలు: టీపీసీసీ చీఫ్
సాక్షి, హైదరాబాద్: దేశంలో కాషాయ ఎజెండాను అమలుచేయాలని బీజేపీ చూస్తోందని ఆరోపించారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. ఇదే సమయంలో ప్రజల పక్షాన కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ ఉంటుందన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన అందిస్తోందని చెప్పుకొచ్చారు.గణతంత్ర దినోత్సవం సందర్భంగా గాంధీ భవన్లో జాతీయ పతాకాన్ని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, ఎంపీ అనిల్ యాదవ్, మాజీ ఎంపీ హనుమంతరావు, చైర్మన్లు శివసేనారెడ్డి, చల్లా నర్సింహారెడ్డి, మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ కుసుమ కుమార్ తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్బంగా మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. రిపబ్లిక్ దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు. బీజేపీ దేశంలో కాషాయ ఎజెండాను అమలు చేయాలని చూస్తోంది. అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని పక్కన పెట్టి మనువాద సిద్ధాంతాన్ని అమలు చేయాలని ప్లాన్ చేస్తోంది. అందుకే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పార్లమెంట్‌లోనే అంబేద్కర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసి అవమాన పరిచారు. ఇక్కడ కేంద్రమంత్రి బండి సంజయ్ ఇందిరమ్మ పేరు పెట్టవద్దని అంటున్నాడు. ఇవన్నీ రాజ్యాంగ విరుద్ధ కార్యక్రమాలు.రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రజా పాలన అందిస్తుంది. తెలంగాణలో బీఆర్ఎస్ పదేళ్లు నియంత పాలన చేసింది. ఒక్క రేషన్‌కార్డు కూడా ఇవ్వలేదు. ఒక్క ఇల్లు కట్టలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏడాదిలోనే రాష్ట్రంలో అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాము. ఈరోజు రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు, ఇందిరమ్మ భరోసా కింద 12 వేల రూపాయలు, రైతు భరోసా కార్యక్రమాలు అమలు చేస్తున్నాం. రాజ్యాంగబద్దంగా పాలన చేస్తూ ప్రజల మన్ననలు పొందుతున్నాము. హైదరాబాద్ మెట్రో విస్తరణ ఒక పెద్ద ముందడుగు. కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన ఎల్లప్పుడు ఉంటుంది. అందుకే జై గాంధీ, జై భీం, జై సంవిధాన్ కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ చేపట్టింది. ప్రజలంతా మద్దతు ప్రకటించాలి అని కోరారు. -
టీపీసీసీ సెర్చ్ ఆపరేషన్!
సాక్షి, హైదరాబాద్: పార్టీ, ప్రభుత్వ పదవుల భర్తీ ప్రక్రియ టీపీసీసీకి కత్తిమీద సాములా మారింది. కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్లు, ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, జిల్లా పార్టీ అధ్యక్షులు, కార్పొరేషన్ల చైర్మన్లు, కమిషన్ల సభ్యులు, ఏఐసీసీ కార్యదర్శులు, ఎమ్మెల్సీ పదవులకు సమర్థుల కోసం ఏఐసీసీ, పీసీసీ అన్వేషిస్తున్నాయి. పార్టీ కార్యవర్గంతో పాటు నామినేటెడ్ పోస్టులను ఈ నెలాఖరు నాటికి భర్తీ చేయాలన్న ఏఐసీసీ ఆదేశాల మేరకు టీపీసీసీ కసరత్తు ముమ్మరం చేసింది. జంబో కార్యవర్గం.. ఈసారి టీపీసీసీ కార్యవర్గాన్ని ఆచితూచి ఎంపిక చేయాలని ఏఐసీసీ, టీపీసీసీ భావిస్తున్నాయి. పీసీ సీకి నలుగురు వర్కింగ్ ప్రెసిడెంట్లను నియమిస్తా రని తెలుస్తోంది. పీసీసీ అధ్యక్షుడిగా బీసీ నేత ఉన్నందున, రెడ్డి సామాజిక వర్గానికి వర్కింగ్ ప్రెసిడెంట్ (ఆర్గనైజేషన్) ఇస్తారని, మరో మూడు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవులు ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల నేతలకు ఇస్తారనే చర్చ జరుగుతోంది. వీటి తో పాటు ప్రతి పార్లమెంటు నియోజకవర్గానికి ఒక వైస్ ప్రెసిడెంట్ పదవి, ప్రతి జిల్లాకు ఇద్దరు ప్రధాన కార్యదర్శులను నియమించాలని నిర్ణయించారు. పార్టీ అధికార ప్రతినిధులుగా మరో 10 మంది, పీసీసీ కార్యదర్శులుగా 50 మందిని నియమించే అవకాశాలున్నాయి. ఇవన్నీ కలిపి దాదాపు 200 వరకు పెరిగి పీసీసీ జంబో కార్యవర్గం ఉండవచ్చని అంచనా. ఈ పదవుల భర్తీపై ఇప్పటికే రెండు సార్లు సీఎం రేవంత్‌రెడ్డి, పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దీపాదాస్ మున్షీలు భేటీ అయ్యారు. దాదాపు 10 జిల్లాలకు ఎమ్మెల్యేలే పార్టీ అధ్యక్షులుగా ఉన్నా రు. వీరిలో కొందరిని తప్పించి, సమర్థులైన మరికొందరు ఎమ్మెల్యేలను డీసీసీ అధ్యక్షులుగా నియమించాలని భావిస్తున్నారు. నామినేటెడ్ పోస్టులపై ఆచితూచి.. నామినేటెడ్ పోస్టుల భర్తీ కూడా గత ఎనిమిది నెలలుగా వాయిదా పడుతూ వస్తోంది. పార్లమెంటు ఎన్నికలకు ముందు 33 కార్పొరేషన్లకు చైర్మన్లను నియమించారు. మరో 40 వరకు కార్పొరేషన్ పదవులు ఖాళీగా ఉన్నట్టు సమాచారం. వీటితో పాటు పలు కమిషన్లలో మరో 30 మంది వరకు అవకాశం కల్పించవచ్చు.అంటే 70 వరకు పదవులు ఇవ్వొ చ్చని ప్రచారం జరుగుతోంది. వీటికి ఆయా కార్పొరేషన్ల డైరెక్టర్ల పోస్టులను కలిపితే వందల సంఖ్యలో ఉంటాయి. ఈ పోస్టుల భర్తీపై సామాజిక, ప్రాంతీయ సమీకరణల కసరత్తు ఎటూ తేలకపోవడంతో ఇప్పటికే పలుమార్లు ఈ ప్రక్రియ వాయిదా పడింది. ఎమ్మెల్సీ హడావుడికాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు ఎమ్మెల్సీ హడావుడి కనిపిస్తోంది. మార్చి నాటికి 8 ఎమ్మెల్సీలు పదవీ విరమణ చేస్తారు. వీటిలో మెజారిటీ సీట్లు దక్కించుకునేందుకు కాంగ్రెస్ వ్యూహాలు రచిస్తోంది. కరీంనగర్–నిజామాబాద్–ఆదిలాబాద్–మెదక్ పట్టభద్రుల స్థానం నుంచి పోటీకి ఆల్ఫోర్స్ నరేందర్‌రెడ్డి, ముస్కు రమణారెడ్డి, ముదనం గంగాధర్, హరికృష్ణ, వెల్చాల రాజేందర్ పేర్లు రేసులో వినిపిస్తున్నాయి. రెండు టీచర్ ఎమ్మెల్సీల విషయంలో మిత్రపక్ష ఉపాధ్యాయ సంఘాలకు మద్దతిచ్చే ఆలోచనలో కాంగ్రెస్ ఉంది. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీల్లో మూడు పదవులు నికరంగా కాంగ్రెస్‌కు రానున్నాయి. ఈ కోటాలో ప్రస్తుత ఎమ్మెల్సీ టి. జీవన్‌రెడ్డికి మళ్లీ అవకాశం వస్తుందని చెబుతున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి విదేశీ పర్యటన అనంతరం ఇతర పోస్టులపై స్పష్టత వస్తుందని, నెలాఖరు కల్లా అధికారికంగా ప్రకటిస్తారని తెలుస్తోంది. -
యూత్ కాంగ్రెస్ నేతలకు టీపీసీసీ వార్నింగ్
సాక్షి, హైదరాబాద్: బీజేపీ కార్యాలయంపై యూత్ కాంగ్రెస్(Youth Congress leaders) నాయకుల దాడిపై టీపీసీసీ(TPCC) సీరియస్ అయ్యింది. ప్రజాస్వామ్య పద్దతిలో నిరసన ఉండాలి.. ప్రియాంక గాంధీపై బీజేపీ నాయకులు చేసిన వ్యాఖ్యలు తీవ్రంగా ఖండించాల్సినవే. కానీ యూత్ కాంగ్రెస్ఇ లా ఒక రాజకీయ పార్టీ కార్యాలయంపైన దాడికి వెళ్లడం సరైంది కాదని టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు.యూత్ నేతలను పిలిచి మందలించనున్న మహేష్ కుమార్ గౌడ్.. బీజేపీ నేతలు కూడా ఇలా దాడులు చేయడం సరైంది కాదన్నారు. బీజేపీ నేతల తీరును తీవ్రంగా ఖండిస్తున్నా.. ప్రజాస్వామ్యంలో దాడులు పద్ధతి కాదు. శాంతి భద్రతల విషయంలో బీజేపీ నాయకులు సహకరించాలి’’ అని మహేష్‌కుమార్ గౌడ్ అన్నారు.కాగా, ప్రియాంక గాంధీపై ఢిల్లీ బీజేపీ కాల్కాజీ ఎమ్మెల్యే అభ్యర్థి రమేష్ బిదురి చేసిన వ్యాఖ్యలు వివాదం రేపాయి. ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ కేంద్ర మంత్రులను అడ్డుకోవాలంటూ యూత్ కాంగ్రెస్ నేతలు నిరసన తెలిపారు. కాంగ్రెస్ కార్యకర్తలు హైదరాబాద్‌లోని నాంపల్లి బీజేపీ కార్యాలయాన్ని ముట్టడించి. రాళ్లు, కోడిగుడ్లతో దాడులు చేశారు. రమేష్ బిదూరి దిష్టిబొమ్మను దహనం చేశారు.కాంగ్రెస్ కార్యకర్తలు చేసిన దాడిలో బీజేపీ కార్యకర్త తలకు తీవ్ర గాయమైంది. దీంతో కోపోద్రికులైన బీజేపీ కార్యకర్తలు.. యూత్ కాంగ్రెస్ నేతలపై కర్రలతో దాడులు చేసేందుకు ప్రయత్నించడంతో ఉద్రిక్తతకు దారి తీసింది.ఇదీ చదవండి: హైకోర్టులో ఎదురుదెబ్బ..కేటీఆర్ రియాక్షన్ ఇదే..! -
‘ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తే ఉపేక్షించం’
నిజామాబాద్: చిత్ర పరిశ్రమపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపణలు చేయడం తగదన్నారు తెలంగాణ పీసీసీ చీఫ్ మహేష్‌కుమార్ గౌడ్. మద్రాస్ నుంచి చిత్ర పరిశ్రమను తీసుకొచ్చిందే కాంగ్రెస్ పార్టీ అని, పద్మాలయ, రామానాయుడు స్టూడియలకు కాంగ్రెస్ ప్రభుత్వం భూములు ఇచ్చి చిత్ర పరిశ్రమను ప్రోత్సహించిందన్నారు.తమకు ఎవరిపైనా ద్వేషం లేదని, ప్రభుత్వానికి అంతా సమానమన్నారు మహేష్‌కుమార్‌గౌడ్.తొక్కిసలాటలో ఓ మహిళ చనిపోయి, ఆమె కొడుకు చావుబతుకల మధ్య ఉంటే దానిపై బీజేపీ, బీఆర్ఎస్లు ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. ఈ ఘటనపై సీఎం రేవంత్‌రెడ్డి అసెంబ్లీలో మాట్లాడితే లేనిపోని ఆరోపణలు చేయడం తగదన్నారు.ఫార్ములా ఈ-రేస్‌లో అడ్డంగా దొరికిన కేటీఆర్ మొన్నటివరకూ జైలకు వెళ్లేందుకు సిద్ధమన్నారని, ఇప్పుడు కోర్టును ఆశ్రయించారని ఎద్దేవా చేశారు.ఫ్యాన్స్‌కు అల్లు అర్జున్ రిక్వెస్ట్అల్లు అర్జున్‌కు అండగా బండి సంజయ్ -
అందుకే బీజేపీ నేతలు భయపడుతున్నారు: టీపీసీసీ చీఫ్
సాక్షి, హైదరాబాద్: గుజరాత్‌కు తెలంగాణ పోటీ వస్తుందని బీజేపీ నేతలు భయపడుతున్నారని టీపీసీసీ చీఫ్ మహేష్‌కుమార్ గౌడ్ వ్యాఖ్యానించారు. ఆదివారం ఆయన గాంధీ భవన్లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, తెలంగాణ అభివృద్ధి కాకూడదన్నది బీజేపీ నేతల ఉద్దేశంగా ఉందన్నారు. గుజరాత్ గులామ్‌లా ఎందుకు వ్యవహరిస్తున్నారు. మూసీ సుందరీకరణను ఎందుకు అడ్డుకుంటున్నారు?. క్షేత్రస్థాయికి వెళ్లి వాస్తవాలను పరిశీలించండి’’ అని మహేష్‌కుమార్ గౌడ్ హితవు పలికారు.మూసీ ప్రాజెక్టు ఆపేందుకు బీజేపీ, బీఆర్ఎస్ కుమ్మక్కై ఆపేందుకు కుట్ర చేస్తున్నారు. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఫోటో షూట్ కోసం మూసీ నిద్ర చేశారు. బస చేసే ముందు ఆ ప్రాంతంలో దోమల, ఈగల మందు కొట్టారు. మూడు నెలలు అక్కడ ఉంటే ప్రజల అవస్థలు తెలుస్తాయి. మూసీ పక్కన మూడు నెలల బస చేయండి అని మా సీఎం సవాల్.. నేను కూడా వస్తాను. మీరు నేను ఇద్దరం కలసి మూడు నెలలు అక్కడ బస చేద్దాం రండి. అక్కడి ప్రజలు అనారోగ్యాల పాలవుతున్నారు.బీఆర్ఎస్ గ్రాఫ్ పడిన ప్రతీ సారి కిషన్‌రెడ్డి బయటకి వస్తాడు. బీఆర్ఎస్ను ప్రొటెక్ట్ చేయడానికి కిషన్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నాడు. ఒక్కరోజు నిద్ర చేసి ఏం సాధించారు?. తెలంగాణ అభివృద్ధికి అందుకు అడ్డుపడుతున్నారు. సబర్మతి రివర్ ఫ్రంట్‌కి ఒక న్యాయం.. మూసీ రివర్కి ఒక న్యాయమా?. మూసీ నిర్వాసితులకు డబుల్ బెడ్ రూమ్ ఇచ్చి ఆదుకుంటాం. వారి పిల్లలకు విద్యావకాశాలు కల్పిస్తున్నాం. గుజరాత్ గులామ్‌లా ఎందుకు వ్యవహరిస్తున్నారు. ప్రపంచంతో తెలంగాణ పోటీ పడుతుందనగానే వీళ్లకు భయం పట్టుకుంది.ఒక్కరోజు నిద్రతో అక్కడి ప్రజల అవస్థలు ఏం తెలుసుకున్నారో చెప్పండీ. డీపీఆర్ వచ్చాక ఎక్కడ రిటర్నింగ్ వాల్ కట్టలో తెలుస్తుంది. ఎవరికి అన్యాయం జరగకుండా చూసుకునే బాధ్యత మా ప్రభుత్వానిది. పదేళ్లు తెలంగాణ అభివృద్ధి కుంటూ పడింది. అభివృద్ధిలో తెలంగాణ మార్పు చూస్తారు. తెలంగాణ రైజింగ్‌గా ముందుకు వెళ్తుంది. మూసీ ప్రక్షాళన చేసి తీరుతాం. కిషన్‌రెడ్డి కాళ్లకు సాక్సులు వేసుకొని నిద్రపోయారు. అంటే అక్కడ ఎన్ని దోమలు ఉన్నాయో అర్థం అవుతుంది.బీజేపీ, బీఆర్ఎస్ ఎవరికి ఆపద వచ్చినా ఒకరిని ఒకరు పరస్పరం ఆడుకుంటున్నారు. బుల్డోజర్ పాలన మాది కాదు. కిషన్ రెడ్డి నడిపి అన్న యోగి అధిత్యనాథ్ది బుల్డోజర్ పాలన. నిజాం కాలంలో మూసీ బోర్డు కూడా ఉండేది. లగచర్ల దాడిలో కేటీఆర్ ఉన్నాడని స్పష్టమైంది.. కాబట్టే డైవర్ట్ చేయడానికి కిషన్‌రెడ్డి బస చేస్తున్నారు. మేము అక్కడ రియల్ ఎస్టేట్ చేస్తే నువ్వు అక్కడ ప్లాట్ కొనుక్కుంటావా కిషన్ రెడ్డి’’ అంటూ మహేష్‌కుమార్ గౌడ్ ఎద్దేవా చేశారు. -
‘మా పార్టీలోకి చేరికలు ఆగలేదు’
సాక్షి, ఢిల్లీ : తెలంగాణలో కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు ఆగలేదని స్పష్టం చేశారు టీపీసీసీ చీఫ్ మహేష్‌కుమార్ గౌడ్. దీనిలో భాగంగానే కొత్త, పాత నాయకులను సర్దుబాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఉన్నోళ్లను కాపాడుకునేందుకే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మాతో టచ్‌లో ఉన్నట్లు బీఆర్ఎస్ పార్టీ చెప్పుకుంటోందని మహేష్‌కుమార్ గౌడ్ ఎద్దేవా చేశారు. త్వరలో కాంగ్రెస్ పార్టీలోకి మరిన్ని చేరికలు ఉంటాయని ఢిల్లీలో మీడియాతో చిట్ చాట్‌లో మహేష్‌కుమార్ గౌడ్ తెలిపారు.‘కేటీఆర్‌తో సన్నిహితంగా ఇన్ అండ్ ఔట్ ఉన్నవాళ్లే కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారు. జీవన్‌రెడ్డి అనుచరుడి హత్యపై విచారణ చేయాలని సీఎం కార్యాలయం నుంచి ఆదేశాలు ఇచ్చారు. మంత్రివర్గ విస్తరణ అధిష్టానం, సీఎం చేతుల్లో ఉంది. కేసీఆర్ అవినీతి పై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఆయన చేసిన తప్పులకు కేటీఆర్ రెండు, మూడు ఎల్లుకాదు 10 ఏళ్ళు జైలు శిక్ష కూడా తక్కువే.కాళేశ్వరం మతలబు ఏంటి? అంత వ్యయం పెట్టి కట్టాల్సిన అవసరం ఏం వచ్చింది. విద్యుత్ కొనుగోళ్లలో అవకతవకలు జరిగాయి. ఇప్పుడు చాలా తక్కువధరకే విద్యుత్ దొరుకుతుంది. విద్యుత్ చార్జీల పెంపు ఆలోచన లేదు. కేసీఆర్‌కు ఉన్న ఆర్థిక వెసులుబాటు మాకు లేదు. తెలంగాణ ఏర్పడ్డప్పుడు మిగులు బడ్జెట్‌తో ఉంది.. కానీ 10 ఏళ్లలో రూ. 8 లక్షల కోట్ల అప్పు చేశారు. తమ ప్రభుత్వం ఏ పథకాన్ని ఆపలేదు. త్వరలోనే పథకాలను గ్రౌండ్ చేస్తాం. గత 10 ఏళ్లలో విడతాల వారీగా చేసిన దాని కంటే మేము రుణమాఫీ చేసిన మొత్తం ఎక్కువ. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు, కేసీఆర్ చేసిన అప్పులను ప్రజలు అర్థం చేసుకోవాలి. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చుతాం. పథకాలని ఎగ్గొట్టే ఆలోచన లేదు. హైడ్రాలో ఒక్కటే పేద వాళ్ల ఇల్లు కూలింది. హైడ్రాపై సోషల్ మీడియాలో అనైతికంగా ప్రచారం చేస్తున్నారు. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో యథేచ్ఛగా చెరువుల కబ్జా జరిగింది. వయనాడ్‌లో జరిగిన విధ్వంసం తెలంగాణ జరగకూడదనే యుద్ధ ప్రాతిపదికన మూసి ప్రక్షాళన చేపట్టాం. విడతల వారీగా మూసీ ప్రక్షాళన చేస్తున్నాం. హైడ్రా తో పేదవారికి నష్టం కలగకుండా చర్యలు తీసుకుంటాం’ అని మహేష్‌గౌడ్ తెలిపారు. -
జీవన్ రెడ్డి సేవలు పార్టీకి అవసరం..
-
రిజర్వ్డ్ కేటగిరీలకు నష్టం జరగదు
సాక్షి, హైదరాబాద్: గ్రూప్–1 పరీక్షల విషయంలో నిరుద్యోగులు ఆందోళన చెందాల్సిన పనిలేదని.. రిజర్వ్డ్ కేటగిరీలకు చెందిన అభ్యర్థులకు నష్టం జరుగుతుందన్న వాదన పచ్చి అబద్ధమని టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బి.మహేశ్‌కుమార్‌గౌడ్ పేర్కొన్నారు. పీసీసీ అధ్యక్షుడిగా తాను భరోసా ఇస్తున్నానని, మెయిన్స్‌కు అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో ఎలాంటి నష్టం జరగలేదని, భవిష్యత్తులో కూడా ఎలాంటి నష్టం జరగదని చెప్పారు. ఆదివారం గాం«దీభవన్‌లో ఎంపీ అనిల్‌కుమార్‌యాదవ్, ఇతర నేతలతో కలసి మహేశ్‌గౌడ్ మీడియాతో మాట్లాడారు. ప్రతిపక్షాలు గ్రూప్–1 మెయిన్స్ విషయంలో నిరుద్యోగులను రెచ్చగొడుతూ.. లేనిపోని అనుమానాలు, అపోహలు సృష్టిస్తున్నాయని ఆరోపించారు. అపోహలు వద్దు ‘పీసీసీ అధ్యక్షుడిగా, బీసీ వర్గాలకు చెందిన వ్యక్తిగా గ్రూప్–1 అభ్యర్థులందరికీ భరోసా ఇస్తున్నా. మెయిన్స్‌కు అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో రిజర్వ్డ్ కేటగిరీల అభ్యర్థులకు అన్యాయం జరగదు. ఇది పార్టీ, ప్రభుత్వ పక్షాన మేమిస్తున్న భరోసా. అన్ రిజర్వ్డ్ మెరిట్ జాబితాలోకి వచ్చిన అభ్యర్థులను మళ్లీ రిజర్వ్డ్ కేటగిరీలో లెక్కించరు. మెరిట్ జాబితాలో ఎంపికైన రిజర్వ్డ్ అభ్యర్థులు ఓపెన్ కేటగిరీలోనే కొనసాగుతారు. రిజర్వ్డ్ పోస్టుల్లో తక్కువ పడితేనే ఇతర అభ్యర్థులను తీసుకుంటారు. అందుకే సంఖ్య ఎక్కువగా కనిపిస్తోంది. అసలు నష్టమే జరగదు. అర్థం చేసుకోవాలి’అని మహేశ్‌గౌడ్ వివరించారు. విద్యార్థులను తప్పుదోవ పట్టిస్తున్నాయి గాం«దీభవన్ సేకరించిన సమాచారం ప్రకారం.. మొత్తం అభ్యర్థుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన అభ్యర్థులే 75 శాతం ఉంటారని మహేశ్‌గౌడ్ చెప్పారు. కానీ బీఆర్ఎస్, బీజేపీ కుమ్మక్కై పరీక్షల విషయంలో లేనిపోని అనుమానాలు సృష్టిస్తున్నాయని, విద్యార్థులను తప్పుదోవ పట్టిస్తున్నాయని ఆరోపించారు. నియామకాల పేరుతో అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్.. పదేళ్లలో ఎన్ని గ్రూప్–1 ఉద్యోగాలు ఇచ్చిందో చెప్పాలని డిమాండ్ చేశారు. పదేళ్లలో 70 వేల ఉద్యోగాలు భర్తీ చేసిన బీఆర్ఎస్ది చిత్తశుద్ధా? పది నెలల్లో 50వేల ఉద్యోగాలిచ్చిన కాంగ్రెస్‌ది చిత్తశుద్ధా అన్నది నిరుద్యోగులు ఆలోచించాలన్నారు. ఇంటర్ ఫలితాలను కూడా సక్రమంగా ఇవ్వలేని బీఆర్ఎస్ తమకు బుదు్ధలు చెప్పాల్సిన పనిలేదని వ్యాఖ్యానించారు. దేశంలో ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన బీజేపీ.. ఎన్ని ఉద్యోగాలిచ్చిందో బండి సంజయ్ చెప్పాలని, ఏ ముఖం పెట్టుకుని బీజేపీ నేతలు ధర్నాలు చేస్తున్నారో చెప్పాలని విమర్శించారు. -
'గ్రూప్–1'పై ఆదుర్దా.. ఆందోళన..
‘‘మేం రాజకీయాలకు అతీతం.. మా చివరి అవకాశాన్ని వృ«థా చేయకండి. ఆర్థికంగా, మానసికంగా నష్టపోయి ఉన్న మా బాధ వినండి. పరీక్షలు వాయిదా వేయండి’’.. – ఇదీ నిరుద్యోగ అభ్యర్థుల ఆవేదన ‘‘అంతా సవ్యంగానే ఉంది. జీవో 29 విషయంలో గానీ, మెయిన్స్‌కు అర్హత పొందిన అభ్యర్థుల విషయంలోగానీ నిరుద్యోగులకు ఎలాంటి నష్టం లేదు. అపోహలకు పోకుండా పరీక్షలు రాయండి. అన్ని ఏర్పాట్లు చేశాం’’.. – ఇదీ పరీక్షలు నిర్వహించేయాలన్న ఆదుర్దాలో రాష్ట్ర ప్రభుత్వం సూచన.సాక్షి, హైదరాబాద్: .. గ్రూప్–1 మెయిన్స్ పరీక్షల విషయంలో ఇరుపక్షాలు పట్టువీడని పరిస్థితి. పరీక్షలను వాయిదా వేయాల్సిందేనంటూ నిరుద్యోగులు, అభ్యర్థులు ఓ వైపు ఆందోళనలను కొనసాగిస్తుండగానే.. మరోవైపు పరీక్షల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసేసింది. జీవో 29 కారణంగా రిజర్వుడ్ కేటగిరీల వారికి నష్టం జరుగుతుందని అభ్యర్థులు మొత్తుకుంటుంటే.. అలాంటిదేమీ లేదంటూ ప్రభుత్వం ముందుకెళుతోంది. ఎట్టి పరిస్థితుల్లో పరీక్షలు వాయిదా వేయాల్సిందేనంటూ ఆదివారం నిరుద్యోగులు, అభ్యర్థులు హైదరాబాద్‌లోని అశోక్‌నగర్ చౌరస్తాలో బైఠాయించినా.. గాందీభవన్ ముట్టడికి ప్రయత్నించినా.. ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ఆందోళన చేస్తున్నవారిని పోలీసులు బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. కనీసం అభ్యర్థులు ప్రెస్‌మీట్ పెట్టి తమ ఆవేదన చెప్పుకొనేందుకు కూడా అనుమతించలేదు. ప్రతిపక్షాల మద్దతుతో.. ఆందోళన తెలుపుతున్న అభ్యర్థులు, నిరుద్యోగులకు ప్రతిపక్షాలు బాసటగా నిలిచాయి. గ్రూప్–1 పరీక్షలు వాయిదా వేస్తే ప్రభుత్వానికి వచ్చిన నష్టమేమిటని బీఆర్ఎస్, బీజేపీ నేతలు ప్రశ్నించారు. పరీక్షలు కూడా సక్రమంగా నిర్వహించలేని అసమర్థ ప్రభుత్వమని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి మండిపడ్డారు. ఎన్నికలకు ముందు అశోక్‌నగర్‌కు వచ్చిన రాహుల్‌గాంధీ నిరుద్యోగ యువతకు చెప్పిందేమిటి? కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక ఇప్పుడు చేస్తోందేమిటని నిలదీశారు. ఇక బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ కూడా ప్రభుత్వ తీరును తప్పుపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం భేషజాలకు పోవడం ఎందుకని, పరీక్షలను వాయిదా వేసి తప్పులను సరిదిద్దితే వచ్చిన నష్టమేంటని నిలదీశారు. మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతుగా టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్ స్పందించారు. మెయిన్స్‌కు అభ్యర్థుల ఎంపికలో ఏ ఒక్క వర్గానికీ నష్టం జరగలేదని, భవిష్యత్తులోనూ నష్టం జరగకుండా చూస్తానని టీపీసీసీ అధ్యక్షుడి హోదాలో భరోసా ఇస్తున్నానని ప్రకటించారు. ఇక నిరుద్యోగుల ఆందోళనలను పట్టించుకోకుండా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) సోమవారం నుంచి గ్రూప్–1 మెయిన్స్ పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేసింది. అభ్యర్థుల ఆందోళనల నేపథ్యంలో.. పరీక్షలు ప్రశాంతంగా కొనసాగేందుకంటూ పరీక్షా కేంద్రాల వద్ద పెద్ద ఎత్తున పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. నేడు సుప్రీంకోర్టులో విచారణ గ్రూప్–1 మెయిన్స్ పరీక్షలను వాయిదా వేయాలంటూ నిరుద్యోగులు, అభ్యర్థులు వేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు సోమవారం విచారణ జరపనుంది. అటు విద్యార్థుల ఆందోళన, ఇటు రాష్ట్ర ప్రభుత్వ పట్టుదల మధ్య.. కోర్టు ఎలాంటి ఆదేశాలు ఇస్తుందన్నది ఉత్కంఠగా మారింది. -
బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం దివాలా తీసింది
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లలో రూ.7 లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసి రాష్ట్రాన్ని దివాళా తీసిందని అన్నారు పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్. బుధవారం హైదరాబాద్ జిల్లా కాంగ్రెస్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. క్రమశిక్షణ ఉల్లంగిస్తే చర్యలు తప్పవు. ఎంత పెద్దవారైనా ఉపేక్షించేది లేదు. పార్టీ లైన్లో పని చేయాల్సిందేనని ఆదేశించారు. రాబోయే గ్రేటర్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మంచి ఫలితాలు సాధించాలి. బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లలో రూ. 7 లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసి రాష్ట్రాన్ని దివాళా తీసింది. కానీ కాంగ్రెస్ అలా కాదు.. అధికారంలోకి వచ్చాక 10 నెలల కాలంలో అనేక అద్భుతమైన పనులు చేసింది.. అటు రాష్ట్రాభివృద్ధి, ప్రజా సంక్షేమ కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేపట్టింది. ఇచ్చిన హామీలను నెరవేర్చింది. గ్రేటర్ ఎన్నికల్లో ప్రభుత్వం చేస్తున్న ప్రజా సంక్షేమ కార్యక్రమాలు ప్రజల్లోకి మరింత విస్తారంగా తీసుకెళ్లాలి. రాబోయే గ్రేటర్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మంచి ఫలితాలు సాధించాలి. మనం గట్టిగా పనిచేస్తేనే ప్రజల్లోకి వెళ్తాం. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడంలో చరిత్ర సృష్టించింది. ప్రభుత్వం చేస్తున్న పనులను నాయకులు లోతుగా అధ్యయనం చేయాలి.. అర్థం చేసుకోవాలి. ప్రజల్లో మంచి స్పందన ఉంది.ప్రతి పక్ష బీఆర్ఎస్, బీజేపీ రెండు పార్టీలు కలిసి పోయాయి.. రెండు పార్టీ లు కలిసి కాంగ్రెస్‌ను దెబ్బతీయాలని చూస్తున్నాయి. ప్రతిపక్ష పార్టీ కుట్రల్ని మనం తిప్పికొట్టారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నందున గ్రేటర్ లో విజయం సాధిస్తేనే మనకు అన్ని రకాలుగా అనుకూలంగా ఉంటుంది. కాబట్టి హైదరాబాద్ జిల్లా నాయకులు పకడ్బందీగా పని చేసి ఫలితాలు సాధించాలి’అని బి.మహేష్ కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు. -
కేసీఆర్ కేజీ టు పీజీ కథ చెప్పి చేసిన మోసం
-
వారంలో ఇద్దరు మంత్రులు గాంధీభవన్‌లో
సాక్షి, హైదరాబాద్: ప్రతీవారంలో ఇద్దరు మంత్రులు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యాల యమైన గాంధీ భవన్‌ను సందర్శించనున్నారు. ఈ మేరకు సోమవారం టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ షెడ్యూల్ విడుదల చేశారు. ప్రతి బుధ, శుక్రవారాల్లో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం వరకు పార్టీ కార్యకర్తలు, సమస్యలు చెప్పుకునేందుకు వచ్చే ప్రజలను గాంధీభవన్‌లో కలుస్తారన్నారు. ఈ సందర్భంగా ప్రజల ఫిర్యాదులు, అర్జీలను ఆ రోజున తీసుకుంటారని మహేశ్‌కుమార్‌గౌడ్ ఆ షెడ్యూల్లో వివరించారు. మంత్రుల షెడ్యూల్ ఇలా...25 సెప్టెంబర్: దామోదర రాజనర్సింహ, 27 సెప్టెంబర్: శ్రీధర్‌బాబు, 2 అక్టోబర్: గాంధీ జయంతి (కార్యక్రమం లేదు), 4 అక్టోబర్ : ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, 9 అక్టోబర్: పొన్నం ప్రభాకర్, 11 అక్టోబర్: సీతక్క, 16 అక్టోబర్: కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, 18 అక్టోబర్: కొండా సురేఖ, 23 అక్టోబర్: పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, 25 అక్టోబర్: జూపల్లి కృష్ణారావు, 30 అక్టోబర్: తుమ్మల నాగేశ్వరరావు -
మా జోలికొస్తే ఊరుకోం: సీఎం రేవంత్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎవరి జోలికి వెళ్లబోరని.. అలాగని ఎవరైనా తమ జోలికి వస్తే ఊరుకోబోమని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి హెచ్చరించారు. పాడి కౌశిక్‌రెడ్డి, అరికెపూడి గాందీల వివాదాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘‘వాడొకడు వీడొకడు మోపైండు. కార్యకర్తలపై కేసులు పెట్టాలని చూస్తున్నారు. కొందరు సన్నాసులు మన వాళ్ల ఇంటికి వస్తామన్నారు. కానీ మనవాళ్లే వాళ్ల ఇంటికి వెళ్లారు. ఇంటికి రమ్మన్నవాడికి చింతపండు అయినంక దాడికి వచ్చారని అంటున్నాడు. మరి ఇంటికి ఎందుకు రమ్మనాలి? .. .. డానికి పిలవాల్నా’’ అని పేర్కొన్నారు. తమ మంచితనాన్ని చేతగానితనంగా తీసుకుని ఎవరైనా తమ జోలికి వస్తే.. వీపు చింతపండు అవుతుందని వ్యాఖ్యానించారు. పీసీసీ కొత్త అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ సౌమ్యుడేనని.. కానీ ఆయన వెనుక తాను ఉన్నానని గుర్తుపెట్టుకోవాలని హెచ్చరించారు. పార్టీ జెండాను మోస్తున్న కార్యకర్తలను కాపాడుకుంటామని.. పార్టీని, ప్రభుత్వాన్ని జోడెద్దుల్లా ముందుకు తీసుకెళతామని చెప్పారు. టీపీసీసీ కొత్త అధ్యక్షుడిగా ఎమ్మెల్సీ బి.మహేశ్‌కుమార్‌గౌడ్ ఆదివారం గాందీభవన్‌లో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో సీఎం రేవంత్‌రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. పదేళ్లు అధికారంలో ఉంటాం.. కొత్త పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌గౌడ్‌పై పార్టీ గురుతర బాధ్యతను పెట్టిందని రేవంత్ అన్నారు. ‘‘మా ఎన్నికలు అయిపోయాయి. ఇప్పుడు మీ ఎన్నికలు రాబోతున్నాయి. సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జెడ్పీటీసీ ఎన్నికలు వస్తాయి. ఈ ఎన్నికల్లో పార్టీ జెండా మోసిన కార్యకర్తలను గెలిపించుకునే బాధ్యతలను నేను, మహేశ్‌గౌడ్ తీసుకుంటాం. మా ఎన్నికల కంటే ఎక్కువగా మీ ఎన్నికల కోసం పనిచేస్తాం. మీరు గెలిస్తేనే మేం గెలిచినట్టు, కాంగ్రెస్ పార్టీ గెలిచినట్టు. స్థానిక ఎన్నికల్లో విజయానికి పునరంకితమవుదాం’’అని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. మూడు, నాలుగు నెలల్లో కులగణన పూర్తవుతుందని.. ఆ తర్వాత స్థానిక ఎన్నికలు జరుగుతాయని రేవంత్ చెప్పారు. గతంలో పదేళ్లు టీడీపీ, ఆ తర్వాత పదేళ్లు కాంగ్రెస్, మళ్లీ పదేళ్లు టీఆర్ఎస్ రాష్ట్రంలో అధికారంలో ఉన్నాయని.. ఇదే పద్ధతిలో మరో పదేళ్లపాటు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుందని చెప్పారు. ఆ ఎన్నికలు ఫైనల్స్ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు సెమీఫైనల్స్‌లో లభించిన విజయం మాత్రమేనని సీఎం రేవంత్ అన్నారు. ‘‘2029లో ఫైనల్స్ జరగబోతున్నాయి. ఆ ఎన్నికల్లో ఢిల్లీ గద్దెపై కాంగ్రెస్ జెండా ఎగరాలి. మోదీని ఓడించి రాహుల్‌గాం«దీని ప్రధానిని చేయాలి. అప్పుడే మనం ఫైనల్స్‌లో గెలిచినట్టు. తెలంగాణ నుంచి ఆ ఎన్నికల్లో 15 మందిని కాంగ్రెస్ ఎంపీలుగా గెలిపించాలి. అప్పటివరకు ఎవరూ విశ్రమించొద్దు’’అని పిలుపునిచ్చారు. రాజీనామా చేస్తానన్న వ్యక్తి ఎక్కడ? తాను టీపీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించాక ఇంద్రవెల్లిలో సమరశంఖం పూరించానని సీఎం రేవంత్ గుర్తు చేసుకున్నారు. అప్పటి నుంచి వెనుదిరిగి చూడకుండా నేతలను, కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి తెచ్చేందుకు పనిచేశానని చెప్పారు. అధికారంలోకి వచ్చిన రెండు రోజులకే ఆరు గ్యారంటీల అమలు ప్రారంభించామన్నారు. ‘‘దేశంలో ఎక్కడా లేని విధంగా రైతులకు ఒకేసారి రూ.18 వేల కోట్లు రుణమాఫీ చేశాం. కాంగ్రెస్ రైతు రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తానన్న సన్నాసి ఎక్కడ? కావాలంటే వివరాలు పంపిస్తా..’’అని రేవంత్ వ్యాఖ్యానించారు. కేసీఆర్, కేటీఆర్‌ల ఉద్యోగాలు ఊడగొడితేనే నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయని తాను చెప్పానని.. చెప్పినట్టుగానే ఇప్పటికే 65 వేల ఉద్యోగాలు ఇచ్చామని పేర్కొన్నారు. దేశానికి ఒలింపిక్స్ బంగారు పతకం తెస్తాం! క్రీడలను ప్రోత్సహించేందుకు రాష్ట్రంలో స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నామని సీఎం రేవంత్ చెప్పారు. 2028 ఒలింపిక్స్‌లో దేశం తరఫున బంగారు పతకాన్ని తెచ్చే బాధ్యతను తెలంగాణ తీసుకుంటుందన్నారు. రాష్ట్ర భవిష్యత్ అవసరాలకు తగినట్టుగా ఫోర్త్ సిటీ ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. నేను పవర్ సెంటర్‌ను కాదు – సీఎం, మంత్రులు గాంధీభవన్‌కు రావాలి: టీపీసీసీ చీఫ్ మహేశ్‌గౌడ్ కార్యకర్తలకు కాంగ్రెస్ పార్టీ గుర్తింపు ఇస్తుందనేందుకు తన నియామకమే నిదర్శనమని నూతన టీపీసీసీ చీఫ్‌గా మహేశ్‌కుమార్‌గౌడ్ చెప్పారు. తాను పీసీసీ అధ్యక్షుడిని అవుతానని అనుకోలేదని.. పార్టీ బాధ్యతలు చూడాల్సి వస్తుందని అప్పుడప్పుడూ రేవంత్‌రెడ్డి అంటుంటే ఊరికే అంటున్నారని భావించేవాడినని తెలిపారు. పీసీసీ అధ్యక్షుడిగా తనకెలాంటి భేషజాలు లేవని.. తాను పవర్ సెంటర్‌ను కానని చెప్పారు. తాను ప్రభుత్వానికి, పారీ్టకి మధ్య వారధిగా ఉంటానని.. తాను పీసీసీ అధ్యక్షుడిగా, రేవంత్‌రెడ్డి సీఎంగా ఉన్నంత కాలం పార్టీ కార్యకర్తలపై గీత కూడా పడనీయమని పేర్కొన్నారు. ప్రతి జిల్లాలో పార్టీ కార్యాలయాలు నిర్మించాలన్నదే తన లక్ష్యమని, ఆ దిశలో ప్రభుత్వం కూడా సహకారం అందించాలని కోరారు. మంత్రులు వారంలో రెండు రోజులు గాంధీ భవన్‌కు రావాలని.. జిల్లాలకు వెళ్లినప్పుడు జిల్లా పార్టీ కార్యాలయాలకు వెళ్లాలని కోరారు. సీఎం రేవంత్ కూడా వీలును బట్టి నెలకు రెండు సార్లయినా గాం«దీభవన్‌కు వచ్చి వెళ్లాలన్నారు. దీనివల్ల పార్టీ శ్రేణులతో మమేకం కావొచ్చన్నారు. సౌమ్యుడినేగానీ.. కరాటే బ్లాక్ బెల్ట్ ఉంది.. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బద్నాం చేయాలని ప్రతిపక్షాలు చూస్తున్నాయని.. సోషల్ మీడియాను సోషల్సెన్స్ లేకుండా ఉపయోగించుకుంటున్నాయని మహేశ్‌గౌడ్ విమర్శించారు. వాటిని ఎదుర్కోవాల్సింది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలేనని, గ్రామగ్రామానికి వెళ్లి ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను వివరించాలని పిలుపునిచ్చారు. తనను సౌమ్యుడని సీఎం రేవంత్‌రెడ్డి అంటున్నారని.. ప్రజాస్వామ్యంలో తాను సౌమ్యుడినే అయినా కరాటేలో బ్లాక్‌బెల్ట్ ఉందని చమత్కరించారు. గాందీభవన్‌లో ‘లాల్ సలామ్’! టీపీసీసీ కొత్త చీఫ్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో కమ్యూనిస్టుల తరహాలో ‘లాల్‌సలామ్’ వినిపించడం ఆసక్తిగా మారింది. ప్రజాగాయకుడు గద్దర్‌కు నివాళి అరి్పస్తూ సాగిన పాటలో ‘లాల్‌సలామ్’ అనే చరణం ఉంది. ఇది విని కొందరు కాంగ్రెస్ ఆఫీసులో కమ్యూనిస్టు పాట అంటూ చమత్కరించారు. – పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌గౌడ్ ప్రసంగిస్తున్న సమయంలోనే మంత్రి శ్రీధర్‌బాబు వేదిక మీదకు వచ్చారు. ఆయనకు స్వాగతం పలికిన మహేశ్‌గౌడ్.. ‘అయ్యగారు వచ్చారు. ఆయన రాకతో మంత్రిమండలి సంపూర్ణంగా వచ్చినట్టయింది..’ అని వ్యాఖ్యానించారు. – సీనియర్ కాంగ్రెస్ నేత వీహెచ్ వేదికపైకి వచ్చినప్పుడు.. తొలి వరుసలో కూర్చున్న మంత్రి పొన్నం ప్రభాకర్ లేచి, వీహెచ్‌కు తన స్థానం ఇచ్చి వెనుక వరుసలోకి వెళ్లి కూర్చున్నారు. – సభలో ఎవరెవరు మాట్లాడాలనే విషయంలో గందరగోళం లేకుండా స్వయంగా సీఎం రేవంత్‌రెడ్డి ఆ జాబితాను రాసి ఇచ్చారు. పెళ్లి ముహూర్తం పెట్టిన అయ్యగారితోనే.. మహేశ్‌కుమార్‌గౌడ్ తన పెళ్లికి ముహూర్తం పెట్టిన పురోహితుడితోనే పీసీసీ అధ్యక్ష బాధ్యతల స్వీకార కార్యక్రమంలో పూజలు చేయించారు. ఆయన నిజామాబాద్ జిల్లా డిచ్పల్లికి చెందిన పూజారి కృష్ణమాచార్యులు. ఆయన, గాంధీభవన్ పూజారి శ్రీనివాసమూర్తి ఇద్దరూ కలిసి పూజలు చేశారు. ఇక గాంధీభవన్‌తో తనకు 40 ఏళ్ల అనుబంధం ఉందని, తన అడుగుపడని మిల్లీమీటర్ స్థలం కూడా గాందీభవన్‌లో లేదని.. ప్రతి గోడ, కిటికీ, తలుపును తాను తాకానని మహేశ్‌గౌడ్ గుర్తు చేసుకున్నారు. పీసీసీ అధ్యక్షుడిగా తన తొలి ప్రసంగంతోనే కార్యకర్తలను ఆకట్టుకున్నారు. సౌమ్యుడిని అంటూనే కరాటేలో బ్లాక్‌బెల్ట్ ఉందన్నారు. పార్టీ నేతలకు అందుబాటులో ఉండటం కోసం మంత్రులు తరచూ గాంధీభవన్‌కు, జిల్లా కార్యాలయాలకు రావాలని కోరారు. రేవంత్ నుంచి జెండా అందుకుని.. పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకునేందుకు మహేశ్‌గౌడ్ హైదరాబాద్‌లోని నార్సింగి నుంచి భారీ ర్యాలీగా అమరవీరుల స్థూపం వద్దకు వచ్చారు. అక్కడ నివాళులు అర్పించిన అనంతరం గాందీభవన్‌కు చేరుకుని.. సీఎం రేవంత్‌రెడ్డి నుంచి టీపీసీసీ చీఫ్ బాధ్యతలు తీసుకున్నారు. సభా ప్రాంగణంలో రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా పార్టీ జెండాను అందుకున్నారు. -
టెక్నికల్ గా అరికెపూడి గాంధీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే
-
బీఆర్ఎస్ ఎదురుదాడి తిప్పికొడతా: పీసీసీ చీఫ్ మహేష్‌కుమార్ గౌడ్
సాక్షి,హైదరాబాద్: రెండు మూడు రోజుల్లో పీసీసీ బాధ్యతలు చేపడుతానని, బీఆర్ఎస్ ఎదురు దాడిని ఎప్పటికప్పుడు తిప్పి కొడతానని తెలంగాణ నూతన ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్ అన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల కోసం క్యాడర్‌ను సిద్ధం చేస్తానని చెప్పారు. పీసీసీ అధ్యకక్షునిగా నియామకమైన తర్వాత శనివారం(సెప్టెంబర్7) సాక్షిటీవీతో మహేష్‌కుమార్‌గౌడ్ ప్రత్యేకంగా మాట్లాడారు.‘పార్టీని ప్రభుత్వంతో సమన్వయం చేసుకోవడం నా ముందు ఉన్న పెద్ద టాస్క్. ఆర్గనైజేషన్‌లో క్రమశిక్షణ, అంకితభావంతో పనిచేస్తే పదవులు ఇస్తారని నన్ను చూస్తే తెలుస్తుంది. పార్టీలో చాలా పోటీ ఉన్నాబీసీకి పీసీసీ ఇవ్వాలని హైకమాండ్ డిసైడ్ అయింది. నాకు పదవి ఇచ్చింది. త్వరలోనే పార్టీ పదవుల భర్తీ ఉంటుంది. రెండు మూడు రోజుల్లో పీసీసీ బాధ్యతలు చేపడుతా. -
టీపీసీసీ అధ్యక్షుడిగా మహేశ్‌కుమార్‌గౌడ్
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా బొమ్మా మహేశ్‌కుమార్‌గౌడ్ నియమితులయ్యారు. ఈ మేరకు ఏఐసీసీ ప్రధానకార్యదర్శి కేసీ వేణుగోపాల్ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఇంతకాలం టీపీసీసీ చీఫ్‌గా రేవంత్‌రెడ్డి అద్భుతంగా పనిచేశారంటూ పార్టీ అధిష్టానం అభినందించింది. మహేష్‌కుమార్‌గౌడ్ నియామకం వెంటనే అమల్లోకి వస్తుందని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. – సాక్షి, న్యూఢిల్లీ/హైదరాబాద్విద్యార్థి నేత నుంచిబొమ్మా మహేశ్‌కుమార్‌గౌడ్ 1980లో భారత జాతీయ విద్యార్థి సంఘం (ఎన్ఎస్యూఐ) ద్వారా విద్యార్ధి దశలోనే రాజకీయాల్లోకి వచ్చారు. నిజామాబాద్ జిల్లా ఎన్ఎస్యూఐ అధ్యక్షుడిగా పనిచేసిన ఆయన, ఎనిమిదేళ్లపాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఎన్ఎస్యూఐ కమిటీకి రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఆపై యూత్‌కాంగ్రెస్ జాతీయకార్యదర్శిగా, ఆ తర్వాత రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కమిటీల్లో స్థానం సంపాదించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో టీపీసీసీ అధికార ప్రతినిధిగా, కార్య దర్శిగా, ప్రధానకార్యదర్శిగా పలు హోదాల్లో పని చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన సమ యంలో ఏపీ వేర్‌హౌజింగ్ కార్పొరేషన్ చైర్మన్‌గా ఉన్న మహేశ్‌కుమార్‌గౌడ్ 2014 అసెంబ్లీ ఎన్నికల్లో నిజామాబాద్ అర్బన్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2017లో టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డి నియమితుౖలెన సమయంలోనే మహేశ్‌కుమార్‌గౌడ్‌కు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా అవకాశం దక్కింది. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత తొమ్మిది నెలలుగా టీపీసీసీకి అన్నీ తానై వ్యవహరిస్తున్నారు. మహేశ్‌కుమార్‌గౌడ్ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో నిజామాబాద్ అర్బన్ స్థానం నుంచి టికెట్ ఆశించినా దక్కలేదు. పార్టీ వ్యవహారాల్లో నిమగ్నమై ఉండాలని హైకమాండ్ నుంచి వచ్చిన ఆదేశాల మేరకు టికెట్ రేసు నుంచి తప్పుకున్నారు. ఆయన సేవలను గుర్తించిన కాంగ్రెస్ అధిష్టానం ఎమ్మెల్సీగా అవకాశం కల్పించింది. విధేయతకు పెద్దపీట వేస్తూ తాజాగా అధిష్టానం ఆయన్ను టీపీసీసీ అధ్యక్షుడిగా నియమించింది. తెలంగాణ ఏర్పాటయ్యాక నాలుగో పీసీసీ అధ్యక్షుడిగా మహేశ్‌కుమార్‌గౌడ్ బాధ్యతలు స్వీకరించనున్నారు. పొన్నాల లక్ష్మయ్య, కెప్టెన్.ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఎ.రేవంత్‌రెడ్డిల తర్వాత అధ్యక్షుడు కానున్నారు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్న ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి పదోన్నతి కల్పించి పీసీసీ అధ్యక్షుడిగా నియమించిన కాంగ్రెస్ హైకమాండ్... మళ్లీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్న మహేశ్‌కుమార్‌గౌడ్‌కు పదోన్నతి కల్పించి అధ్యక్షుడిగా నియమించడం గమనార్హం.కరాటే ‘డాన్’....రాజకీయాల్లో నిత్యం బిజీగా ఉండే మహేశ్‌కుమార్‌గౌడ్ తనకు ఇష్టమైన కరాటే పట్ల ఆసక్తిని మాత్రం తగ్గనివ్వలేదు. 2006లో కరాటే బ్లాక్‌బెల్ట్ 6వ డాన్ పూర్తి చేసిన ఆయన రాష్ట్రంలో కరాటే క్రీడ అభివృద్ధికి తన వంతు పాత్ర పోషిస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణ స్పోర్ట్స్ కరాటే అసోసియేషన్ అధ్యక్షునిగా పనిచేస్తున్నారు.చిత్తశుద్ధి, అంకితభావంతో పార్టీని బలోపేతం చేస్తా : మహేశ్కుమార్గౌడ్నిరంతరం కార్యకర్తలు, నాయకులకు అందుబాటులో ఉంటూ పార్టీకి, ప్రభుత్వానికి అనుసంధానంగా పనిచేసి రాష్ట్రాభివృద్ధితోపాటు పార్టీ పటిష్టతకు కృషి చేస్తానని టీపీసీసీ కొత్త అధ్యక్షుడు బొమ్మా మహేశ్‌కుమార్‌గౌడ్ తెలిపారు. పార్టీ అప్పగించిన బాధ్యతలను చిత్తశుద్ధి, అంకిత భావంతో నెరవేరుస్తానని చెప్పారు. టీపీసీసీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించిన కాంగ్రెస్ అధిష్టానానికి ధన్యవాదాలు తెలుపుతూ శుక్రవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.‘ఏఐసీసీ అగ్రనేత సోనియాగాంధీ, అధ్యక్షుడు మల్లికార్జునఖర్గే, పార్లమెంట్లో ప్రతిపక్షనేత రాహుల్‌గాంధీ, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ, రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్చార్జి దీపాదాస్ మున్షీ, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డిలకు హృదయపూర్వక ధన్యవాదాలు. ఇంతకాలం నాకు సహకరించిన నాయకులు, కార్యకర్తలకు కృతజ్ఞతలు.’అని ఆ ప్రకటనలో మహేశ్‌కుమార్‌గౌడ్ తెలిపారు. ⇒ మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు గోపిశెట్టి నిరంజన్, అధికార ప్రతినిధి శ్రీరంగం సత్యం తదితరులు వేర్వేరు ప్రకటనల్లో హర్షం వ్యక్తం చేశారు. మహేశ్‌గౌడ్‌ను పీసీసీ అధ్యక్షుడి గా నియమించిన వార్త తెలియగానే గాంధీ భవన్లో టీపీసీసీ కల్లుగీత కార్మిక విభాగం అ«ధ్యక్షుడు నాగరాజుగౌడ్ ఆధ్వర్యంలో టపాసులు పేల్చి సంబురాలు చేసుకున్నారు. ⇒ మహేశ్‌కుమార్‌గౌడ్‌కు సీఎం రేవంత్‌రెడ్డి ఫోన్ చేసినట్టు గాంధీభవన్ వర్గాలు తెలిపాయి. కొత్త అధ్యక్షుడికి ఫోన్ చేసిన రేవంత్ అభినందనలు తెలిపారని, పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కోరినట్టు వెల్లడించాయి.మహేశ్‌కుమార్‌గౌడ్ ప్రొఫైల్పేరు: బొమ్మా మహేశ్కుమార్గౌడ్తండ్రి: గంగాధర్‌గౌడ్ (లేట్)పుట్టిన తేదీ: 24–02–1966జన్మస్థలం: రహత్‌నగర్, భీంగల్ మండలం, నిజామాబాద్ జిల్లావిద్యార్హత: బీకాంరాజకీయ ప్రస్థానం: నిజామాబాద్ జిల్లా ఎన్ఎస్యూఐ అధ్యక్షుడు (1986–1990) ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఎన్ఎస్యూఐ అధ్యక్షుడు (1990–98) యూత్ కాంగ్రెస్ జాతీయకార్యదర్శి (1998–2000) పీసీసీ కార్యదర్శి (2000–2003), అధికార ప్రతినిధి (2012–2016) టీపీసీసీ ప్రధాన కార్యదర్శి (2016–2021) టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ (2017–2024) -
టీపీసీపీ ఛీఫ్‌కు రేవంత్ శుభాకాంక్షలు.. ఎమోషనల్ కామెంట్స్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ పీసీసీ చీఫ్‌గా నియమించబడిన మహేష్ కుమార్ గౌడ్‌కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఈ క్రమంలోనే తాను పీసీసీ చీఫ్‌గా ఉన్న సమయంలో తనకు సహకరించిన పార్టీ నేతలు, కార్యకర్తలను సీఎం రేవంత్ కృతజ్ఞతలు చెప్పారు.కాగా, సీఎం రేవంత్ రెడ్డి ట్విట్టర్ వేదికగా..‘పీసీసీ అధ్యక్షుడిగా నన్ను నియమించిన నాటి నుంచి సోనియా గాంధీ నాకు పూర్తి సహాకారం, స్వేచ్ఛ ఇచ్చారు. నాపై పూర్తి విశ్వాసం ఉంచారు. పీసీసీగా భారత్ జోడో యాత్ర నిర్వహాణ నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. డిజిటల్ మెంబర్షిప్ ద్వారా రాష్ట్రంలో పార్టీ బలాన్ని నిరూపించాం. తుక్కుగూడ బహిరంగతో రాష్ట్రంలో ఎన్నికల శంఖారావం పూరించి విజయం సాధించాం. తెలంగాణలో బీఆర్ఎస్ వైఫల్యాలను సమర్దవంతంగా ఎండగట్టగలిగాం.సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, కేసి వేణుగోపాల్ మద్దతు మరచిపోలేనిది. ఈ సమయంలో మాకు మద్దతుగా నిలిచిన తెలంగాణ ప్రజలందరికీ, పార్టీ నాయకులకు, సహచరులకు, కాంగ్రెస్ సైనికులకు ధన్యవాదాలు. మీ అందరి సహకారం చెప్పలేదని అంటూ కామెంట్స్ చేశారు.As I hand over the baton of the Telangana Pradesh Congress Committee to my colleague Shri @Bmaheshgoud6666 garu,I look back with joy, gratitude & pride.Since the day I took charge as TPCC president on 7th July 2021, I have felt blessed that my leader Smt #SoniaGandhi ji,… pic.twitter.com/t0SrTVcZVh— Revanth Reddy (@revanth_anumula) September 6, 2024 -
టీపీసీసీ అధ్యక్ష పదవి బీసీకీ దక్కే అవకాశం
-
‘టీపీసీసీ కొత్త అధ్యక్షుడిపై’ నిర్ణయం తీసుకోండి
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కొత్త అధ్యక్షుడి నియామకంపై నిర్ణయం తీసుకోవాలని టీపీసీసీ అధ్యక్షుడు, సీఎం రేవంత్‌రెడ్డి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికా ర్జునఖర్గేను కోరారు. ఈ విషయాన్ని వీలైనంత త్వరగా తేల్చాలని విజ్ఞప్తి చేశారు. శుక్రవారం మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో కలిసి ఢిల్లీలో ఖర్గేతో రేవంత్‌రెడ్డి మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. పార్టీకి కొత్త «అధ్యక్షుడిగా ఎవరిని నియ మించినా కలిసి పనిచేసేందుకు తాను సిద్ధంగా ఉన్నట్టు రేవంత్ చెప్పినట్టు సమాచారం.త్వరలో చేపట్టనున్న మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పోస్టుల భర్తీ తదితర ఆంశాలపైనా చర్చించినట్టు తెలిసింది. పదవుల భర్తీల్లో భాగంగా, ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి కూడా అవకాశా లపైనా మంతనాలు జరిపినట్టు సమాచారం. రైతు రుణమా ఫీ సందర్భంగా వరంగల్‌లో నిర్వహించనున్న కృతజ్ఞత సభ, సచివాలయంలో రాజీవ్‌గాంధీ విగ్రహం ఏర్పాటుపై కూడా చర్చించి, ఆహ్వానించినట్టు తెలిసింది. అనంతరం ఏఐసీసీ సంస్థాగత వ్యవహారాల ప్రధానకార్యదర్శి కేసీ.వేణుగోపాల్ తోనూ రేవంత్ భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు.రేవంత్‌తో సింఘ్వీ భేటీసాక్షి, న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కాంగ్రెస్ నేత అభిషేక్ మను సింఘ్వీ శుక్రవారం ఢిల్లీలో భేటీ అయ్యారు. తెలంగాణ నుంచి రాజ్యసభ ఉప ఎన్నికకు కాంగ్రెస్ అభ్యర్థిగా సింఘ్వీని ప్రకటించాక మొదటిసారి ఉభయులూ సమావేశమయ్యారు. సెప్టెంబర్ 3న ఉప ఎన్నిక జరగనున్న నేపథ్యంలో.. ఈ నెల 21న నామినేషన్ దాఖలు సహా వివిధ అంశాలపై లోతుగా చర్చించినట్టు అభిషేక్ మను సింఘ్వీ ట్వీట్ చేశారు. -
అధ్యక్షుడు, నలుగురు వర్కింగ్ ప్రెసిడెంట్లు..
సాక్షి, హైదరాబాద్ : నామినేటెడ్ పోస్టుల భర్తీ, మంత్రివర్గ విస్తరణ త్వరలోనే జరుగుతుందన్న వార్తలకు తోడు టీపీసీసీ అధ్యక్షుడి ఎంపిక, అనుబంధ సంఘాల అధ్యక్షుల మార్పు కూడా ఉంటుందన్న చర్చ జరుగుతోంది. అమెరికా పర్యటనను ముగించుకొని వచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గురువారం రాత్రి ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. దీంతో అధికార కాంగ్రెస్‌పార్టీలో సంస్థాగత మార్పులపై చర్చ జోరందుకుంది. ముఖ్యంగా టీపీసీసీ అధ్యక్షుడి నియా మకంతోపాటు అనుబంధ సంఘాల విషయంలో అధిష్టానం ఏం నిర్ణయం తీసుకుంటుందోననే ఉత్కంఠ నెలకొంది. బీసీ లేదా లంబాడానేనా?టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డి స్థానంలో ఎవరిని నియమించాలన్న అంశం చాలా రోజులుగా కొలిక్కి రావడం లేదు. ముఖ్యంగా సామాజిక సమీకరణల లెక్కలు అధ్యక్షుడి విషయంలో కుదరడం లేదు. సీఎంగా అగ్రవర్ణాలకు చెందిన నేత ఉండటంతో బీసీ లేదా ఇతర సామాజికవర్గాలకు టీపీసీసీ అధ్యక్ష పద వి ఇస్తారనే అభిప్రాయం పార్టీవర్గాల్లో ఉంది. కాంగ్రె స్ అధిష్టానం వద్ద కూడా బీసీ, ఎస్సీ, ఎస్టీ నాయకు ల పేర్లపై చర్చ జరిగింది. బీసీల నుంచి మహేశ్‌కు మార్‌గౌడ్, మధుయాష్కీగౌడ్, ఎస్సీల నుంచి సంపత్‌కుమార్, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, ఎస్టీల నుంచి బలరాంనాయక్‌ల పేర్లు బలంగా వినిపించాయి. వీ రిలో ఒకరికి అధ్యక్షుడి అవకాశం దక్కుతుందని అనుకోగా, తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో మాదిగ సామాజిక వర్గానికే పీసీసీ అధ్యక్ష పదవి ఇస్తారనే చర్చ ఊపందుకుంది. దీనికితోడు రాష్ట్ర ప్రభుత్వంలో కీలకపాత్ర పోషిస్తోన్న అగ్రవర్ణాలకే చెందిన ఒక మంత్రిని కూడా నియమిస్తారనే చర్చ కూడా తెరపైకి వచ్చింది. టీపీసీసీ అధ్యక్షు డితోపా టు నలుగురు వర్కింగ్ ప్రెసిడెంట్లు, ప్రచార కమిటీ చైర్మన్ పదవులు కూడా కొత్త వారికి ఇచ్చే అవకాశా లు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో టీపీసీ సీ అధ్యక్ష వ్యవహారం ఈసారి ఢిల్లీ చర్చల్లో పూర్తవు తుందనే అభిప్రాయం గాంధీభవన్వర్గాల్లో వ్యక్తమవుతోంది. పార్టీ పెద్దలను కలిసి వరంగల్‌లో నిర్వహించతల పెట్టిన రైతు రుణమాఫీ సభకు ఆహ్వానిస్తారు. శుక్రవారం ఢిల్లీలో రేవంత్ మంత్రి శ్రీధ ర్బాబుతో కలిసి అక్కడే ఫాక్స్‌కాన్, యాపిల్ ప్రతిని ధులతో సమావేశం అవుతారని సమాచారం.అనుబంధ సంఘాల్లో మార్పులు టీపీసీసీ అనుబంధ విభాగాల్లోనూ త్వరలో మార్పులు జరగనున్నాయి. ఇప్పటికే ఎన్ఎస్ యూఐ, యూత్‌కాంగ్రెస్ అధ్యక్షుల మార్పు ప్రక్రియ మొదలైంది. ఎన్ఎస్యూఐ అధ్యక్షుడిగా బల్మూరి వెంకట్ స్థానంలో యడవల్లి వెంకటస్వామిని నియమిస్తూ అధిష్టానం ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఇక, శివసేనారెడ్డి స్థానంలో యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడి ఎన్నిక ప్రక్రియ ప్రస్తుతం జరుగుతోంది. వీటికితోడు మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలిని మారుస్తారని తెలుస్తోంది. మూడేళ్ల పదవీకాలాన్ని పూర్తి చేసుకున్న ప్రస్తుత అధ్యక్షురాలు సునీతారావు స్థానంలో గద్వాల నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన సరితా తిరుపతయ్యయాదవ్, మహేశ్వరం టికెట్ ఆశించిన పారిజాతానర్సింహారెడ్డి, టీపీసీసీ అధికార ప్రతినిధులు భవానీరెడ్డి, రవళిరెడ్డిల పేర్లు వినిపిస్తున్నాయి. సరితా తిరుపతయ్యకు మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్ష పదవి ఇవ్వాలని కోరుతూ టీపీసీసీ అధ్యక్ష హోదాలో రేవంత్‌రెడ్డి కూడా మహిళా కాంగ్రెస్ జాతీయ అధ్యక్షురాలు అల్కా లాంబాకు లేఖ రాసినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో త్వరలోనే మహిళాకాంగ్రెస్కు కూడా కొత్త అధ్యక్షురాలు రానున్నారు. వీరితోపాటు ఇటీవల పలువురు అనుబంధ సంఘాల అధ్యక్షులకు కార్పొరేషన్ల చైర్మన్ పదవులు అప్పగించారు. కార్పొరేషన్ చైర్మన్‌గిరీ వచ్చిన అనుబంధ సంఘాల అధ్యక్షుల స్థానంలో కొత్త వారిని నియమిస్తారని తెలుస్తోంది. త్వరలోనే ఈ మార్పు మొదలవుతుందని సమాచారం. మొత్తంమీద అటు టీపీసీసీ అధ్యక్షుడి ఎంపిక, కొత్త కార్యవర్గం, అనుబంధ సంఘాల్లో మార్పుల నేపథ్యంలో అధికార కాంగ్రెస్ పార్టీలో సంస్థాగత పదవుల సందడి నెలకొంది, -
కాసేపట్లో ప్రజా భవన్ లో టీపీసీసీ కార్యవర్గ సమావేశం
-
రుణమాఫీ చేస్తున్నాం.. హరీష్ రాజీనామాకు సిద్ధమా?: సీఎం రేవంత్
Updates..టీపీసీసీ కార్యవర్గ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి కామెంట్స్..👉ఆగస్టు 15వ తేదీలోపు రుణమాఫీ చేస్తామని చెప్పాం. చెప్పిన దాని కంటే ముందే చేస్తున్నాం. రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తానని హరీష్ రావు అన్నారు. రుణాలు మాఫీ చేస్తామని చెప్తే ఇది అసాధ్యం అని చాలామంది మాట్లాడారు. చిత్తశుద్ధి ఉంటే అన్ని సాధ్యమని నిరూపించాం. 👉60 సంవత్సరాల తెలంగాణ ఆకాంక్షను సోనియాగాంధీ నెరవేర్చారు. సోనియా గాంధీ కుటుంబం గౌరవం కాపాడాలి. దేశానికి ఆదర్శ పాలన మనం ఎందుకు చేయకూడదు.👉వ్యవసాయం దండుగ కాదు పండుగ. రైతులకు రుణమాఫీ చేయడం నా జీవితంలో మర్చిపోలేనిది. రేపటి రాజకీయ భవిష్యత్తు రుణమాఫీతో ముడిపడి ఉంది. రేపు సాయంత్రం రైతుల ఖాతాలో డబ్బు పడుతుంది. ఆగస్టు 15వ తేదీ లోపల మరో లక్ష రూపాయలు వేస్తాం అని చెప్పుకొచ్చారు. 👉రుణమాఫీపై జాతీయ స్థాయిలో ప్రచారం చేయాలి. పార్లమెంటు సభ్యులు రుణమాఫీపై నేషనల్ మీడియాలో చెప్పాలి. భారతదేశంలో ఇంతవరకూ ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయలేని పని తెలంగాణ ప్రభుత్వం చేసింది. రుణమాఫీ మోదీ హామీ కాదు. ఇది రాహుల్ గాంధీ హామీ. దివంగత మహానేత వైఎస్సార్ ఉచిత కరెంట్, ఆరోగ్య శ్రీ, ఇందిరమ్మ ఇళ్ల గురించి ఇప్పటికీ చెప్పుకుంటున్నాం. అలాగే, రుణమాఫీ గురించి కూడా 20 ఏళ్లపాటు చెప్పుకోవాలి.👉విజయ్ మాల్యా, నీరవ్ మోదీ లాంటి వాళ్లు, వేల కోట్ల అప్పులు ఉన్నవాళ్లకి కూడా ఏం కాదు. రైతులు ఆత్మహత్య చేసుకోవద్దని చెప్పడానికే రెండు లక్షల రుణమాఫీ చేస్తున్నాం. దీనిపై గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో నియోజకవర్గం స్థాయిలో ప్రచారం చేయాలి. ఓట్లు అడగడానికి గ్రామాలకు వెళ్ళాం. ఇపుడు రుణమాఫీ చేశామని గ్రామాల్లో చెప్పండి. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కామెంట్స్.. 👉‘ఆగస్టు దాటకుండానే రూ.2లక్షల రుణమాఫీ చేస్తాం. రుణమాఫీ అమలుకు నిద్రలేని రాత్రులు గడిపాం. అర్హులైన అందరికీ రైతు రుణమాఫీ చేస్తాం. రూ.7లక్షల కోట్ల అప్పులతో అధికారం చేపట్టినప్పటికీ రూ.2లక్షల రుణమాఫీని నెలల వ్యవధిలోనే అమలు చేసేందుకు శ్రీకారం చుట్టాం. రేషన్‌కార్డులు లేని ఆరు లక్షల కుటుంబాలకు రుణమాఫీ చేస్తాం. ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా అధికారంలోకి వచ్చిన కొద్ది కాలంలోనే ఐదు హామీలు అమలు చేస్తున్నాం. అయితే, అనుకున్నంతగా ఈ పథకాలు క్షేత్రస్థాయిలో ప్రచారం జరగడం లేదు. 👉 సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ప్రజాభవన్‌లో టీపీసీసీ కార్యవర్గ సమావేశం ప్రారంభమైంది. 👉 కాగా, రేపు లక్ష రూపాయల వరకు రుణమాఫీ చేయనున్న నేపథ్యంలో ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేలా కార్యాచరణ రూపొందిస్తున్నారు. 👉 కాసేపట్లో ప్రజాభవన్‌లో టీపీసీసీ కార్యవర్గ సమావేశం జరుగనుంది.👉పీసీసీ అధ్యక్షుడు, సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ భేటీ జరుగుతుంది. 👉ఇక, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత జరుగుతున్న సమావేశం కావడంతో ఈ భేటీకి ప్రాధాన్యత చోటుచేసుకుంది.👉ప్రజాభవన్ వేదికగా జరగనున్న ఈ సమావేశానికి సీఎం రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, డీసీసీ అధ్యక్షులు, టీపీసీసీ ఆఫీస్ బేరర్లు హాజరు కానున్నారు. ఈ సమావేశానికి రావాలంటూ గాంధీభవన్ నుంచి నేతలందరికీ సమాచారం పంపారు.👉మరోవైపు ఈరోజు భేటీలో ప్రభుత్వ నిర్ణయాలు, పార్టీ నేతల మధ్య సమన్వయంపై చర్చ జరుగనుంది. అలాగే, ప్రతిపక్షాల విమర్శలకు కౌంటర్‌పై పార్టీ నేతలకు సీఎం రేవంత్ దిశానిర్దేశం చేయనున్నారు.👉ఈ సమావేశంలో రైతు రుణమాఫీపైనే ప్రధానంగా చర్చించనున్నట్టు తెలుస్తోంది. పంద్రాగస్టు లోపు రైతులకు రుణమాఫీ చేస్తామన్న సీఎం రేవంత్ హామీ అమలు కానున్న నేపథ్యంలో పార్టీ పరంగా అనుసరించాల్సిన వైఖరిపై ఈ సమావేశంలో చర్చిస్తారు.👉అలాగే, రుణమాఫీ సందర్భంగా రైతుల సమక్షంలో నిర్వహించాల్సిన సంబురాలకు సంబంధించిన కార్యాచరణ గురించి సమావేశం పిలుపునిస్తుందని గాంధీభవన్ వర్గాలు వెల్లడించాయి.👉ఇటీవలి రాజకీయ పరిణామాలు, నామినేటెడ్ పోస్టుల భర్తీ, రైతు భరోసా అమలు, విద్యుత్ ఒప్పందాలపై ఏర్పాటు చేసిన కమిషన్ విషయంలో సుప్రీం ఆదేశాల పర్యవసానాలు తదితర అంశాలపై కూడా సమావేశంలో చర్చించనున్నట్టు తెలుస్తోంది. -
వారానికో జిల్లాకు సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి క్షేత్రస్థాయి పర్యటనలపై దృష్టి పెట్టారు. ఇకపై ప్రతి వారం ఒక జిల్లాకు వెళ్లాలని, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలును సమీక్షించడంతో పాటు ఆయా జిల్లాల వారీగా పెండింగ్‌లో ఉన్న పనులన్నింటినీ త్వరితగతిన పూర్తి చేసేలా అధికారులకు దిశానిర్దేశం చేయాలని ఆయన నిర్ణయించుకున్నారు. తన సొంత జిల్లా పాలమూరు నుంచి ఆయన పర్యటనలు ప్రారంభించనున్నారు. ఈ నెల 9వ తేదీన ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా సమీక్ష నిర్వహించనున్నారు. జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి పనులు, సంక్షేమ కార్యక్రమాల అమలును సీఎం సమీక్షిస్తారని, ఈ మేరకు అన్ని వివరాలతో సమావేశానికి రావాలని క్షేత్రస్థాయి యంత్రాంగాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఉమ్మడి జిల్లా పరిధిలోని అన్ని జిల్లాల కలెక్టర్లు, వివిధ శాఖల అధిపతులు కూడా ఈ కార్యక్రమానికి హాజరు కావాలని ఇప్పటికే ప్రభుత్వ వర్గాల నుంచి సమాచారం అందింది. కీలక రంగాలపై ఫోకస్ జిల్లాల పర్యటనలో భాగంగా కీలక రంగాలపై ఫోకస్ పెట్టాలని ముఖ్యమంత్రి నిర్ణయించినట్టు తెలిసింది. విద్యాసంవత్సరం ప్రారంభం కానుండడం, వర్షాకాలం నేపథ్యంలో విద్య, వైద్యం, సాగునీటి రంగాల్లో చేపట్టాల్సిన కార్యక్రమాలు, తీసుకోవాల్సిన చర్యలపై ఆయన సమీక్ష జరుపుతారని సీఎంవో వర్గాల ద్వారా తెలిసింది. ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేయడంపై ఇప్పటికే దృష్టి పెట్టిన సీఎం.. ఆ దిశలో చేపట్టాల్సిన చర్యలపై అధికారులకు సూచనలు చేయనున్నారు. ఇంటిగ్రేటెడ్ స్కూల్ కాంప్లెక్సుల నిర్మాణం, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లుగా ఐటీఐల అప్‌గ్రెడేషన్ తదితర అంశాలపై కూడా ఆయన దృష్టి పెట్టనున్నారు. వర్షాకాలంలో వచ్చే అంటు వ్యాధులు, వైద్య శాఖ తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రభుత్వ వైద్యరంగ బలోపేతం తదితర అంశాలపై కూడా సూచనలు చేయనున్నారు. ఇక ప్రతి జిల్లాలో పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టుల గురించి స్థానిక అధికారులతో సీఎం ప్రత్యేకంగా మాట్లాడతారని, త్వరగా పూర్తయ్యేందుకు అవకాశం ఉన్న ప్రాజెక్టుల పురోగతిని సమీక్షించడం ద్వారా వీలైనంత వేగంగా వాటిని పూర్తి చేసి రైతాంగానికి సాగునీరు అందించేలా అధికారులకు మార్గదర్శనం చేస్తారని సమాచారం. వీటితో పాటు వ్యవసాయ సీజన్‌కు సంబంధించిన కార్యాచరణ, ఎరువుల లభ్యత, ఉపాధి హామీ పనులను సమీక్షించనున్న సీఎం.. రైతుభరోసా అమలు విధివిధానాలపై కూడా అధికారులతో చర్చించనున్నారు. ఎక్కడికక్కడ జిల్లాల వారీగా పెండింగ్‌లో ఉన్న సమస్యలను స్థానిక అధికారులను అడిగి తెలుసుకోనున్న ముఖ్యమంత్రి, జిల్లా స్థాయిలో అమలు కావాల్సిన అన్ని కార్యక్రమాల అమలుపై అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు. అదే సమయంలో జిల్లాల్లోని శాంతిభద్రతల పరిస్థితిని కూడా సీఎం సమీక్షించనున్నారు. ఏడు నెలల పాలనపై ఏమంటారు? గత ఏడాది డిసెంబర్ 7వ తేదీన ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం పాలనా పరంగా సాధారణ కార్యక్రమాలు కొనసాగుతున్నప్పటికీ, సీఎం ఎక్కువగా రాజకీయ అంశాలపైనే దృష్టి సారించాల్సి వచ్చింది. ముఖ్యంగా లోక్‌సభ ఎన్నికలు, ఆ తర్వాత టీపీసీసీ అధ్యక్షుడి నియామకం, కేబినెట్ విస్తరణ లాంటి అనివార్య రాజకీయ కార్యకలాపాల్లో నిమగ్నమయ్యారు. అదే సమయంలో పార్టీలో చేరికలపై కూడా దృష్టి పెట్టారు. ఇక వీలున్నంత మేరకు ప్రభుత్వ పాలనపై కూడా సమీక్షలు నిర్వహించారు. ఇటీవలే అన్ని శాఖల ఉన్నతాధికారులతో సమావేశమైన సీఎం ప్రజలతో మమేకం కావాలని వారికి సూచించారు. ఆఫీసుల్లో కూర్చుని పనిచేయడం కన్నా క్షేత్రస్థాయికి వెళ్లి ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి ప్రాధాన్యమివ్వాలని స్పష్టం చేశారు. కేబినెట్ విస్తరణ, పీసీసీ అధ్యక్షుడి నియామకం లాంటివి తాత్కాలికంగా వాయిదా పడిన నేపథ్యంలో ప్రస్తుతానికి పాలన వ్యవహారాలపై రేవంత్ దృష్టి సారించారు. తాను సైతం క్షేత్రస్థాయికి వెళ్లాలని నిర్ణయించారు. తొలుత గత ఏడు నెలల పాలనపై అధికారుల నుంచి అభిప్రాయాలు సేకరించడంతో పాటు కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై ప్రజల మనోగతం ఎలా ఉందన్న దానిపై కూడా జిల్లాల పర్యటనల సందర్భంగా ఆయన ఫీడ్‌బ్యాక్ తీసుకోనున్నారు. ముఖ్యంగా రైతు రుణమాఫీ, రైతు భరోసా లాంటి ప్రతిష్టాత్మక కార్యక్రమాల అమలుపై ప్రజల అభిప్రాయాలను తెలుసుకోవాలని భావిస్తున్నారు. స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉన్నందున క్షేత్రస్థాయిలో ప్రజల మూడ్ ఎలా ఉందన్న దానిపై కూడా ఆయన ఫోకస్ పెట్టారని, అందులో భాగంగానే జిల్లాల పర్యటనకు శ్రీకారం చుడుతున్నారని సీఎంవో వర్గాలు చెబుతున్నాయి. నేడు మంగళగిరికి రేవంత్ దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి 75వ జయంతి వేడుకల్లో పాల్గొనేందుకు గాను ముఖ్యమంత్రి సోమవారం ఏపీకి వెళ్లనున్నారు. మధ్యాహ్నం 3:15 నిమిషాలకు బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో మంగళగిరికి వెళ్లి సీకే కన్వెన్షన్‌లో జరిగే వైఎస్సార్ జయంతి వేడుకల్లో పాల్గొంటారని, కార్యక్రమం ముగిసిన తర్వాత గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి రాత్రి 7:45 నిమిషాలకు హైదరాబాద్ వస్తారని సీఎంవో వర్గాలు వెల్లడించాయి. -
టీపీసీసీ అధ్యక్ష పదవి రేసులో నేను ఉన్న: ఎంపీ బలరాం నాయక్
-
టీపీసీసీ చీఫ్.. కసరత్తు కొలిక్కి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) నూతన అధ్యక్షుడి నియామక కసరత్తు ఓ కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. గత 20 రోజులుగా అధిష్టానం పరిశీలనలో ఉన్న కొత్త అధ్యక్షుడి ఎంపిక వ్యవహారం పలుమార్లు చర్చల అనంతరం తుది దశకు చేరుకుందని కాంగ్రెస్ పార్టీ వర్గాలంటు న్నాయి. బీసీ సామాజిక వర్గానికి చెందిన టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ బి. మహేశ్ కుమార్‌గౌడ్, మాజీ ఎంపీలు మధుయాష్కీ గౌడ్, అంజన్ కుమార్ యాదవ్ పేర్లు అధిష్టానం తుది పరిశీలనలో ఉన్నట్లు గాంధీ భవన్ వర్గాలు చెబుతున్నాయి. అలాగే ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, బలరాం నాయక్‌ల పేర్లను కూడా అధిష్టానం పరిశీలిస్తోందని పార్టీ వర్గాలు తెలిపాయి. ఎస్సీ కోటాలో తమ జిల్లాకు చెందిన అడ్లూరి లక్ష్మణ్‌కు అవకాశం ఇవ్వాలని మంత్రి డి.శ్రీధర్‌బాబు, సీనియర్ నేత జీవన్‌రెడ్డి అధిష్టానాన్ని కోరినట్లు తెలుస్తోంది. అన్ని ప్రతిపాదనలను పరిశీలించిన అనంతరం వారిలో ఒకరిని ఈ నెల ఆరో తేదీలోగా పీసీసీ చీఫ్‌గా ప్రకటిస్తారని గాంధీ భవన్ వర్గాలు అంటున్నాయి. దీనిపై తుది నిర్ణయం తీసుకునేందుకు రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్య నేతలతో మరోమారు అధిష్టానం చర్చించనుంది. ఇందుకోసం సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క బుధవారం ఢిల్లీ వెళ్లనున్నారు. వారితో చర్చించాక టీపీసీసీ అధ్యక్షుడి ఎంపికపై అధిష్టానం తుది నిర్ణయం తీసుకోనుంది. అయితే మహేశ్‌కుమార్ గౌడ్ వైపు అధిష్టానం మొగ్గుచూపే అవకాశం ఉందని గాంధీ భవన్ వర్గాలు అంటున్నాయి.మంత్రివర్గం రేసులో బాలూనాయక్, టి. రామ్మోహన్రెడ్డిమంత్రివర్గ విస్తరణలో నల్లగొండ జిల్లాకు చెందిన లంబాడా సామాజికవర్గానికి చెందిన సీనియర్ ఎమ్మెల్యే ఎన్. బాలూనాయక్‌కు అవకాశం దక్కనున్నట్లు తెలుస్తోంది. గిరిజన వర్గాల నుంచి ఆదివాసీలకు ఇప్పటికే కేబినెట్లో స్థానం కల్పించినందున లంబాడా సామాజికవర్గానికి కూడా అనివార్యంగా మంత్రి పదవి ఇవ్వాల్సి ఉంటుందని, ఈ కోటాలో బాలూనాయక్ పేరు కూడా ఉందని తెలుస్తోంది. బాలూనాయక్‌కు మంత్రి పదవి లభిస్తే డిప్యూటీ స్పీకర్‌గా ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డిని ఎంపిక చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే అదే జిల్లాకు చెందిన పరిగి ఎమ్మెల్యే టి. రామ్మోహన్‌రెడ్డి కూడా మంత్రివర్గంలో స్థానం కోసం ఢిల్లీలోనే ఉండి ప్రయత్నాలు చేస్తున్నారు. వారిలో ఎవరిని ఏ పదవికి ఎంపిక చేయాలనే విషయంపైనా బుధవారం నాటి చర్చల్లో స్పష్టత రానుంది.పీసీసీ చీఫ్‌గా నా పేరు పరిశీలించండిఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేను కలిసి కోరిన మహేశ్కుమార్గౌడ్సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రెసిడెంట్‌గా తన పేరును పరిశీలించాలని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ మహేశ్ గౌడ్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు మంగళవారం ఢిల్లీలో ఖర్గేను ఆయన కలిశారు. పీసీసీ చీఫ్ పదవి ఆశిస్తున్న నేతలు అధిష్టానం పెద్దలను కలుస్తూ తమ పేర్లను పరిశీలించాలని కోరుతున్నారు. అందులో భాగంగానే మహేశ్‌కుమార్‌గౌడ్ ఖర్గేను కలిసి తన పేరును పరిశీలించాలని కోరినట్లు తెలిసింది. ఆయన ఇటీవల కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ సోనియా గాంధీతోపాటు జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ను కూడా కలవడం తెలిసిందే. -
అధికారంలో ఉన్నా.. ఆశ తీరలేదేం?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలోని 17 లోక్‌సభ స్థానాలకు గాను కనీసం 11–12 చోట్ల గెలుస్తామని.. పరిస్థితి సానుకూలంగా ఉంటే 14 సీట్లు వస్తాయని కాంగ్రెస్ హైకమాండ్ లెక్కలు వేసుకుంది. తక్కువలో తక్కువగా 10 స్థానాలైనా గెలుస్తామని భావించింది. కానీ ఫలితాలు గతం కంటే మెరుగే అయినా.. 8 స్థానాల్లోనే కాంగ్రెస్ గెలిచింది. అదే సమయంలో బీజేపీ కూడా ఇదే సంఖ్యలో సీట్లు సాధించింది. దీంతో తెలంగాణలో ఆశించిన స్థాయిలో ఫలితాలు ఎందుకు రాలేదని.. రాష్ట్రంలో పార్టీ అధికారంలో ఉండటంతో మెరుగైన ఫలితాలు సాధించే అవకాశమున్నా ఎందుకిలా జరిగిందని అధిష్టానం పోస్టుమార్టం ప్రారంభించింది. తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల ఫలితాలను సమీక్షించేందుకు రాజ్యసభ మాజీ చైర్మన్ కురియన్, అసోం ఎంపీ రకీబుల్ హసన్, పంజాబ్ ఎమ్మెల్యే పర్గత్ సింగ్‌లతో కమిటీని ఏర్పాటు చేసింది. నిజానికి లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై టీపీసీసీ నుంచి ఇప్పటికే అధిష్టానానికి నివేదిక వెళ్లింది. ఏఐసీసీ రాష్ట్ర ఇన్చార్జి దీపాదాస్ మున్షీ కూడా తన నివేదికను అందించారు. కాంగ్రెస్ అధిష్టానం వాటిని కాదని కమిటీని ఏర్పాటు చేయడం గాంధీభవన్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.ఏం చేస్తారు.. ఎక్కడికి వెళ్తారు?ఇటీవలి లోక్‌సభ ఎన్నికల పనితీరుపై సమీక్షతోపాటు వచ్చే లోక్‌సభ ఎన్నికల కోసం రూపొందించే కార్యాచరణ కోసమే కొత్తగా త్రిసభ్య కమిటీని నియమించారనే చర్చ గాంధీభవన్ వర్గాల్లో జరుగుతోంది. ఆ కమిటీ త్వరలోనే తెలంగాణకు వచ్చి పని ప్రారంభిస్తుందని రాష్ట్ర కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. ముఖ్యంగా ఈ కమిటీ మూడు అంశాలపై దృష్టి పెట్టి పనిచేస్తుందని అంటున్నారు. ‘అధికారం, అన్ని వనరులు ఉండి కూడా బీజేపీతో అంత గట్టిగా ఎందుకు పోటీపడాల్సి వచ్చింది? తూర్పు, దక్షిణ తెలంగాణల్లో పట్టు నిలుపుకొన్న పార్టీ.. పశ్చిమ, ఉత్తర తెలంగాణల్లో ఎందుకు నిలబడలేకపోయింది? పార్టీ నాయకులందరూ తమకు అప్పగించిన బాధ్యతలను నెరవేర్చారా లేదా?’ అన్న కోణాల్లో పోస్టుమార్టం జరుగుతుందని నేతలు చెప్తున్నారు. ముఖ్యంగా తక్కువ తేడాతో ఓడిపోయిన మెదక్, సికింద్రాబాద్, మహబూబ్‌నగర్ ఎంపీ స్థానాల విషయంలో ఏం జరిగిందనేది తేల్చే చాన్స్ ఉందని అంటున్నారు. ఇంకొంచెం కష్టపడి ఉంటే ఈ మూడు చోట్ల గట్టెక్కేవాళ్లమని పేర్కొంటున్నారు. ఈ స్థానాలు దక్కించుకోలేక పోవడానికి ఎలాంటి పరిస్థితులు కారణమనే అంశంపై.. పార్టీ ముఖ్య నేతలతోపాటు ఆయా చోట్ల పోటీచేసి ఓడిన అభ్యర్థులతోనూ మాట్లాడనున్నట్టు తెలిసింది. ఇక చేవెళ్ల, మల్కాజ్గిరి, ఆదిలాబాద్ స్థానాల్లో అభ్యర్థుల మార్పు ఏ మేరకు ఉపయోగపడిందనే కోణంలోనూ త్రిసభ్య కమిటీ నిగ్గు తేలుస్తుందని సమాచారం. అన్ని విషయాల్లో ఓ అంచనాకు వచ్చిన తర్వాత ఈ కమిటీ హైకమాండ్‌కు నివేదిక ఇస్తుందని.. ఆ నివేదిక ఆధారంగా టీపీసీసీ ప్రక్షాళన జరుగుతుందని గాంధీభవన్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. లోక్‌సభ ఎన్నికల్లో సరిగా పనిచేయని నేతలకు ఝలక్ ఇచ్చే అవకాశం ఉందని నేతలు అంటున్నారు.22న ‘నామినేటెడ్’ ఉత్తర్వులు?లోక్‌సభ ఎన్నికల కంటే ముందు రాష్ట్రంలో ప్రకటించిన 37 నామినేటెడ్ పోస్టులకు సంబంధించిన ఉత్తర్వులు ఈనెల 22వ తేదీన వచ్చే అవకాశముందని తెలిసింది. వాటితోపాటు మరో 17 పోస్టులను కలిపి ఒకేసారి ఉత్తర్వులు ఇవ్వాలని సీఎం రేవంత్ భావించినా.. ఈ 17 పోస్టులకు సంబంధించిన కసరత్తు ఇంకా పూర్తికాలేదని సమాచారం. వీలునుబట్టి మొత్తం పోస్టులకు, లేదా ఇప్పటికే ప్రకటించిన 37 పోస్టులకు ఉత్తర్వులు వస్తాయని గాంధీభవన్ వర్గాలు చెప్తున్నాయి. అయితే, లోక్‌సభ ఎన్నికల్లో నేతల పనితీరు ఆధారంగా నామినేటెడ్ పోస్టుల్లో మార్పులు జరుగుతాయనే ప్రచారం జరిగినా.. ఉత్తర తెలంగాణకు చెందిన ఇద్దరు మంత్రుల మధ్య నామినేటెడ్ పందేరంలో తలెత్తిన విభేదాల కారణంగానే జాప్యం జరిగిందని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఇప్పుడా ఇద్దరు మంత్రుల మధ్య సయోధ్య నెలకొందని, నామినేటెడ్ ఉత్తర్వులకు లైన్ క్లియర్ అయిందని అంటున్నాయి. -
టీపీసీసీ కొత్త బాస్ ఎవరు?.. హైకమాండ్ నిర్ణయం ఏంటి?
తెలంగాణ కాంగ్రెస్‌కు త్వరలోనే కొత్త అధ్యక్షుడు రాబోతున్నారు. లోక్‌సభ ఎన్నికలు ముగియడం, పీసీసీ చీఫ్‌గా రేవంత్ రెడ్డి పదవీకాలం కూడా ఈ నెలలో ముగుస్తుండటంతో గాంధీభవన్‌కు కొత్త బాస్ నియామకం అనివార్యమైంది. టీ.పీసీసీ చీఫ్ పదవి కోసం చాలా మంది సీనియర్లు ప్రయత్నిస్తున్నారు. అయితే ఏఐసీసీ పెట్టిన నిబంధన వారికి తలనొప్పిగా మారిందట. ఇంతకీ కాంగ్రెస్ హైకమాండ్ పీసీసీ చీఫ్ పదవికి పెట్టిన నిబంధన ఏంటి? పీసీసీ చీఫ్ పదవి ఆశిస్తున్న నాయకులు ఎవరు?తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పీసీసీ చీఫ్ బాధ్యతలు కూడా నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో పీసీసీ చీఫ్‌గా ఉన్న రేవంత్‌రెడ్డిని సీఎం పదవి వరించింది. అయితే లోక్‌సభ ఎన్నికలు కూడా దగ్గర్లోనే ఉండటంతో ఆయన్నే పీసీసీ చీఫ్‌గా కొనసాగించారు. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు ముగిసాయి. కేంద్రంలో కొత్త ప్రభుత్వం కూడా కొలువు తీరింది. అదే సమయంలో రేవంత్‌రెడ్డి పీసీసీ చీఫ్ పదవి కూడా ఈ నెల 27తో ముగియబోతోంది.దీంతో జోడు గుర్రాలపై ఉన్న రేవంత్‌రెడ్డికి పార్టీ బాధ్యతల నుంచి విముక్తి కలిగించి, ఆయన పూర్తిగా పాలన మీదే దృష్టి సారించేలా చూడాలని పార్టీ నాయకత్వం నిర్ణయిచింది. అందుకే ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటూ పార్టీని బలోపేతం చేయగలిగే నేతను పీసీసీ చీఫ్‌గా నియమించేందుకు కాంగ్రెస్ హైకమాండ్ కసరత్తు ప్రారంభించింది. పీసీసీ చీఫ్‌గా ఎవరిని నియమిస్తే బాగుంటుందనే చర్చ కాంగ్రెస్ క్యాడర్లో విస్తృతంగా జరుగుతోంది. గాంధీభవన్ బాస్‌గా హై కమాండ్ ఎవరిని నియమించినా తనకు సమ్మతమేనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తున్నారట. పార్టీని ప్రతిపక్షం నుంచి అధికారంలోకి తీసుకొచ్చిన రేవంత్ రెడ్డి స్థాయిలో పనిచేయగలిగే వ్యక్తి ఎవరున్నారనే అంశంపై పార్టీ అధిష్ఠానం ఫోకస్ చేసినట్టు తెలుస్తోంది. పీసీసీ అధ్యక్షుడిగా ఎవరైతే బాగుంటుంది? ఎవరైతే నేతలందరినీ కలుపుకొని వెళ్ళగలరు అనే దానిపై హై కమాండ్ సమాచారం సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం అనేక పలువురు సీనియర్ల పేర్లను పరిశీలిస్తున్నట్లు సమాచారం.పీసీసీ చీఫ్ పదవిపై చాలా మంది సీనియర్ నేతలు ఆశలు పెట్టుకున్నట్లు బహిరంగంగానే ప్రకటిస్తున్నారు. రాష్ట్ర పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ తూర్పు జయప్రకాష్‌రెడ్డి అలియాస్ జగ్గారెడ్డి తనకు పీసీసీ అధ్యక్ష పదవి ఇవ్వాలని చాలారోజుల నుండి అడుగుతున్నారు. ఇప్పుడు కూడా తాను పీసీసీ చీఫ్ రేసులో ఉన్నట్లు చెబుతున్నారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో తాను పోటీ చేయకుండా ఇద్దరు కుమారులకు సీట్లు ఇప్పించుకుని గెలిపించుకున్న సీనియర్ నేత జానారెడ్డి పీసీసీ చీఫ్ పదవి కోరుతున్నారు. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా పీసీసీ చీఫ్ పదవి కావాలని హైకమాండ్ ని రిక్వెస్ట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతలకు పీసీసీ చీఫ్ పదవి ఇవ్వరనే వాదన బలంగా వినిపిస్తోంది. దీంతో బీసీ, ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాల నేతలు పీసీసీ చీఫ్ పదవిపై ఆశలు పెట్టుకున్నారు.మంత్రి పొన్నం ప్రభాకర్ సైతం పీసీసీ చీఫ్ రేసులో ఉన్నారు. తాను విద్యార్థి దశ నుండి కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నానని తనకి అధ్యక్షుడిగా అవకాశం ఇస్తే బాగుంటుందని కాంగ్రెస్ పెద్దల దగ్గర చెబుతున్నట్లు సమాచారం. వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ సైతం పీసీసీ రేసులో తాను ఉన్నట్లు ప్రకటించారు. మరో బీసీ నేత మధుయాష్కీ గౌడ్ కూడా పీసీసీ చీఫ్ రేసులో ఉన్నట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఏఐసీసీ సెక్రటరీ సంపత్‌కుమార్ సైతం ఆ పదవి తనకి వస్తుందనే ధీమాలో ఉన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో నాగర్ కర్నూల్ ఎంపీ టికెట్ ఆశించినా సంపత్‌కు టిక్కెట్ దక్కలేదు. అందుకే ఆయన పీసీసీ పదవి విషయంలో పట్టుపడుతున్నారు. ఎస్టీ సామాజికవర్గాల నుంచి మంత్రి సీతక్క, బలరాం నాయక్ కూడా పీసీసీ చీఫ్ పదవి కోసం ప్రయత్నిస్తున్నారు.చాలా మంది పీసీసీ చీఫ్ రేసులో ఉన్నప్పటికీ ఒక్కరికి ఓకే పదవి అనే నిబంధన ఏఐసీసీ పెట్టడంతో చాలా మంది సీనియర్లు అసంతృప్తి కి లోనవుతున్నారట. పీసీసీ పదవి ఆశిస్తున్న పలువురు నేతలు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలుగా ఉన్నారు. దీంతో వీరందరికీ ఏఐసీసీ నిబంధన ఇబ్బందికరంగా మారిందట. కర్నాటక రాష్ట్రంలో డిప్యూటీ సీఎంగా ఉన్న డీకే శివకుమార్.. పీసీసీ చీఫ్‌గా కూడా వ్యవహరిస్తున్నారు. పక్క రాష్ట్రంలో లేని నిబంధన తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు అంటూ ఇక్కడి సీనియర్లు ప్రశ్నిస్తున్నారు.ముఖ్యంగా పీసీసీ చీఫ్ పదవి ఆశిస్తున్న మంత్రులు అధికార పదవి వదిలిపెట్టడానికి సిద్ధంగా లేరు. కొంత మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సైతం ఈ నిబంధనను వ్యతిరేకిస్తున్నారు. అయితే కొందరు నేతలు మాత్రం చట్టసభల్లో లేనివారు, ప్రభుత్వంలో భాగస్వామ్యం లేనివారికి పీసీసీ చీఫ్ పదవి ఇస్తే పార్టీకి ఎక్కువ సమయం ఇస్తారని చెప్తున్నారు. మరి కాంగ్రెస్ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.. -
‘జన జాతర’కు ప్రియాంక
సాక్షి, హైదరాబాద్: రానున్న లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పక్షాన ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ విస్తృతంగా ప్రచారం నిర్వహించనున్నారు. ఇందిరాగాంధీ గతంలో ప్రాతినిధ్యం వహించిన మెదక్ లోక్‌సభ స్థానంతో పాటు పార్టీకి విజయావకాశాలున్న పలు చోట్ల ఆమె చురుగ్గా ప్రచారం నిర్వహించే అవకాశాలున్నాయని గాం«దీభవన్ వర్గాలు వెల్లడించాయి. ఈసారి ఎన్నికల్లో తెలంగాణ పరిధిలో ఆమె సేవలు వినియోగించుకోవాలని ఏఐసీసీ స్థాయిలో నిర్ణయించిన కారణంగానే ఈనెల 6వ తేదీన తుక్కుగూడలో జరగనున్న ‘జనజాతర’సభకు హాజరు కానున్నట్టు సమాచారం. తొలుత ఈ సభకు రాహుల్‌గాందీ, మల్లికార్జు న ఖర్గే మాత్రమే రావాలని నిర్ణయించినా ప్రియాంకను కూడా పంపాలని ఏఐసీసీ నిర్ణయించింది. తుక్కుగూడ సభతో పాటు లోక్‌సభ ఎన్నికల ప్రచార షెడ్యూల్‌ను ఏఐసీసీతో సమ న్వయం చేసే బాధ్యతలను టీపీసీసీ ముఖ్య నేతలకు అప్పగించినట్టు తెలుస్తోంది. మేనిఫెస్టో.. మరుసటి రోజే తుక్కుగూడ సభను టీపీసీసీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. దేశ వ్యాప్తంగా జరిగే లోక్‌సభ ఎన్నికల కోసం ఈనెల ఐదో తేదీన మేనిఫెస్టో విడుదల చేసిన మరుసటి రోజే తుక్కుగూడలో సభ జరుగుతుండడం, సభకు రాహుల్, ప్రియాంక, ఖర్గే తదితర ముఖ్యులు హాజరు కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున జనసమీకరణ చేపట్టాలని భావిస్తోంది. భారీ జనసందోహం మధ్య లోక్‌సభ ఎన్నికలకు తెలంగాణ గడ్డ నుంచే ఏఐసీసీ జంగ్ సైరన్ మోగిస్తుందని టీపీసీసీ వర్గాలు చెపుతున్నాయి. ఈ సభలో పార్టీ మేనిఫెస్టోతో పాటు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అమలుచేయనున్న ఐదు గ్యారంటీలను తెలుగులో విడుదల చేయనున్నారు. అచ్చొచ్చిన చోట.. పది లక్షల మందితో తుక్కుగూడలోని 60 ఎకరాల విశాలమైన మైదానంలో జన జాతర బహిరంగ సభ నిర్వహించేందుకు కాంగ్రెస్ పార్టీ ఏర్పాట్లు చేస్తోంది. మైదానం పక్కనే వాహనాల పార్కింగ్ కోసం 300 ఎకరాల స్థలాన్ని అందుబాటులో ఉంచారు. ఈ సభకు కనీసం పదిలక్షల మంది హాజరవుతారని గాందీభవన్ వర్గాలు చెబుతున్నాయి. ఆదిలాబాద్ నుంచి ఆలంపూర్ వరకు, జహీరాబాద్ నుంచి భద్రాచలం వరకు పెద్ద ఎత్తున పార్టీ కేడర్ తరలివచ్చేలా ఎక్కడికక్కడ ఏర్పాట్లుచేస్తున్నారు. ఇప్పటికే సీఎం రేవంత్‌రెడ్డితో పాటు పలువురు మంత్రులు ఈ సభ ఏర్పాట్లను పరిశీలించారు. ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో కూడా తుక్కుగూడ నుంచే రేవంత్ నేతృత్వంలో టీపీసీసీ ఎన్నికల సమర శంఖాన్ని పూరించింది. తెలంగాణ విలీన దినోత్సవం సందర్భంగా గత ఏడాది సెపె్టంబర్ 17న ఇక్కడ నిర్వహించిన సభకు సోనియాగాంధీ హాజరై ఆరు గ్యారంటీలను ప్రకటించారు. విజయభేరి పేరుతో సభ నిర్వహించిన ఈ ప్రాంతం కలిసివచ్చిందని, తెలంగాణలో అధికారంలోకి తెచ్చిన ప్రారంభ సభ ప్రాంతాన్నే లోక్‌సభ ఎన్నికల కోసం ఎంచుకున్నామని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. ఈ సభ స్ఫూర్తితోనే దేశంలో పదేళ్లనియంతృత్వ, అప్రజాస్వామిక బీజేపీ పాలనకు తెరదించుతామని చెబుతున్నాయి. ఆసక్తి రేపుతున్న రేవంత్ వ్యాఖ్యలు గత ఎన్నికలకు ముందు తుక్కుగూడలో నిర్వహించిన సభలోనే కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చి తీరుతుందని అప్పటి పీసీసీ అధ్య క్షుడు, ప్రస్తుత సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. డిసెంబర్ 9న కొలువుదీరే ప్రజాప్రభుత్వ ప్రమాణ స్వీకారానికి అందరూ ఆహా్వనితులేనని చెప్పుకొచ్చారు. ఈనెల 6న జరిగే సభ ఏర్పాట్లను స్వయంగా పరిశీలించేందుకు రెండురోజుల కిందట తుక్కుగూడకు వచ్చిన సీఎం.. జూన్ 9న ఎర్రకోటపై కాంగ్రెస్ జెండా ఎగురవేస్తామని ప్రకటించారు. దీంతో తుక్కుగూడ వేదికగా రేవంత్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. -
హస్తినలో సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర కాంగ్రెస్ పెద్దలు ఢిల్లీ వెళ్లారు. ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డితోపాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు సోమవారం సాయంత్రం బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో హస్తిన చేరుకున్నారు. సీఎం రేవంత్ తదితరులు ఏఐసీసీ కీలక నేత రణ్‌దీప్ సూర్జేవాలా కుమారుడి వివాహానికి హాజరై వధూవరులను ఆశీర్వదించారు. మంగళవారం పార్టీ పెద్దలను కలిసే అవకాశమున్నట్టు టీపీసీసీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. పార్టీ సంస్థాగత వ్యవహారాల ఇన్చార్జి కె.సి.వేణుగోపాల్ సహా వీలును బట్టి మరికొందరు పెద్దలతో వీరు సమావేశమవుతారని తెలుస్తోంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్‌ను కూడా కలిసి రాష్ట్రానికి అందించాల్సిన ఆర్థిక సాయంపై వినతిపత్రం ఇవ్వనున్నట్టు సమాచారం. అలాగే మరో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిసే అవకాశం ఉన్నట్లు తెలిసింది. మూడు కీలకాంశాలపై చర్చ ఉంటుందా? సీఎం, డిప్యూటీ సీఎంతో పాటు మరో మంత్రి ఢిల్లీ బయలుదేరడంతో రాష్ట్ర కాంగ్రెస్ వర్గాల్లో పలు రకాల చర్చలు జరుగుతున్నాయి. ఈ ముగ్గురూ పార్టీ హైకమాండ్‌ను కలిసి మూడు కీలకాంశాలపై చర్చించే అవకాశముందని టీపీసీసీ వర్గాలంటున్నాయి. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల విషయంతో పాటు నామినేటెడ్ పోస్టుల గురించి హైకమాండ్‌తో చర్చించిన తర్వాత కొంత స్పష్టత వస్తుందని తెలుస్తోంది. ఈ రెండింటితో పాటు కీలకమైన కేబినెట్ విస్తరణ గురించి కూడా చర్చ జరుగుతుందని సమాచారం. అయితే, కేబినెట్ విస్తరణ లోక్‌సభ ఎన్నికల తర్వాత ఉంటుందా? ఇప్పుడే ఉంటుందా అన్న దానిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సామాజిక సమీకరణల ప్రకారం ఎస్టీ (లంబాడా), బీసీ, మైనార్టీలకు కేబినెట్లో బెర్తులు దక్కాల్సి ఉంది. ఈ బెర్తులను భర్తీ చేసి పార్లమెంటు ఎన్నికలకు వెళితే ఉపయోగం ఉంటుందనే చర్చ పార్టీ వర్గాల్లో జరుగుతోంది. అయితే, మరో మూడు బెర్తులకు పోటీ తీవ్రంగా ఉన్నందున ఇప్పుడే కాకుండా లోక్‌సభ ఎన్నికల తర్వాత కేబినెట్ విస్తరణ చేపట్టడం ద్వారా ఎలాంటి ఇబ్బందులు ఉండవనే అభిప్రాయాన్ని కూడా కొందరు వ్యక్తం చేస్తున్నారు. సీఎం రేవంత్ మాత్రం మంత్రివర్గ విస్తరణ గురించి ఇప్పటికే ఓ అభిప్రాయానికి వచ్చారని, ఒకవేళ ఈ పర్యటనలో హైకమాండ్‌తో ఈ విషయం గురించి చర్చ జరిగి, ఢిల్లీ పెద్దల నుంచి గ్రీన్‌సిగ్నల్ లభిస్తే త్వరలోనే మంత్రివర్గ ప్రమాణ స్వీకారం ఉంటుందని, లేదంటే పార్లమెంటు ఎన్నికల వరకు ఆగాల్సిందేనని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. కొత్తగా వచ్చిన వారికి అవకాశంపై చర్చ? లోక్‌సభ అభ్యర్థుల విషయంలో కూడా కాంగ్రెస్ పార్టీ క్రమంగా ఓ అభిప్రాయానికి వస్తున్నట్టు అర్థమవుతోంది. హైదరాబాద్ (మైనార్టీ), కరీంనగర్ మినహా 15 స్థానాల్లో పోటీకి ఎవరిని దింపాలన్న దానిపై షార్ట్ లిస్ట్ రెడీ అయిందని, ఈ జాబితాను ఇప్పటికే హైకమాండ్‌కు పంపారని, కేంద్ర ఎన్నికల కమిటీ (సీఈసీ) భేటీ అనంతరం పార్టీ అభ్యర్థిత్వాలను ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. పార్టీలోకి ఇటీవలి కాలంలో జరుగుతున్న చేరికలు కూడా పార్లమెంటు అభ్యర్థిత్వాల చుట్టూనే తిరుగుతున్నాయి. బొంతు రామ్మోహన్ (సికింద్రాబాద్), నీలం మధు (మెదక్), పట్నం సునీతారెడ్డి (చేవెళ్ల), వెంకటేశ్ నేతకాని (పెద్దపల్లి), కంచర్ల చంద్రశేఖర్‌రెడ్డి (మల్కాజ్గిరి), తాటికొండ రాజయ్య (వరంగల్)కు లోక్‌సభ అభ్యర్థిత్వం విషయంలో స్పష్టత వచ్చిందనే చర్చ జరుగుతోంది. దీనికి తోడు నల్లగొండ, భువనగిరి, పెద్దపల్లి, ఖమ్మం స్థానాల్లో పార్టీ నేతల బంధువులు, కుటుంబ సభ్యులు టికెట్లు అడుగుతున్నారు. ఈ నేపథ్యంలో లోక్‌సభ అభ్యర్థిత్వాల విషయంలో అనుసరించనున్న మార్గదర్శకాలపై కూడా సీఎం, డిప్యూటీ సీఎం, శ్రీధర్‌బాబు చర్చించే అవకాశాలున్నట్టు సమాచారం. నామినేటెడ్ ‘నారాజ్’.... పార్టీ అధికారంలోకి వచ్చి రెండు నెలలు పూర్తయినా నామినేటెడ్ పోస్టులను భర్తీ చేయడం లేదనే అసంతృప్తి రాష్ట్ర కాంగ్రెస్ వర్గాల్లో కనిపిస్తోంది. అదిగో, ఇదిగో అంటూ ఊరిస్తున్నా ఈ పదవులను పంపిణీ చేయకపోవడంతో ఎప్పుడెప్పుడా అని కాంగ్రెస్ నేతలు చాలా మంది ఎదురుచూస్తున్నారు. తొలుత 9 కార్పొరేషన్లకు చైర్మన్లు, డైరెక్టర్లను ప్రకటిస్తారనే చర్చ జరగ్గా, ఆ తర్వాత ఆ సంఖ్య 18కి చేరింది. పార్లమెంటు ఎన్నికలకు ముందే ఈ పదవుల పంపకాలుంటాయని ఓసారి, ఎన్నికల తర్వాతే ఉంటాయని మరోసారి చర్చలు జరుగుతున్నాయి. అయితే, అడపాదడపా కొందరికి నామినేటెడ్ పదవులు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో త్వరలోనే నామినేటెడ్ పోస్టులను భర్తీ చేసే (పార్లమెంటు ఎన్నికలకు ముందే) అంశంపై కూడా ఈ పర్యటనలోనే రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్యులు ఢిల్లీ పెద్దలతో చర్చిస్తారని టీపీసీసీ వర్గాల ద్వారా తెలుస్తోంది. -
వెళ్లిన వారు వచ్చేయండి: కాంగ్రెస్
సాక్షి, హైదరాబాద్ : అసెంబ్లీ ఎన్నికలకు ముందు పార్టీని వీడినవారు తిరిగి సొంతగూటికి రావాలని కాంగ్రెస్ పార్టీ కోరింది. ఈ మేరకు మంగళవారం గాందీభవన్‌లో టీపీసీసీ అధ్యక్షుడు, సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. సమావేశంలో భాగంగా పలువురు సభ్యులు మాట్లాడుతూ టికెట్ ఇవ్వలేదని, సరైన అవకాశాలు కల్పించలేదనే ఆవేదనతోనే కొందరు పార్టీని వదిలివెళ్లారని, వారిని తిరిగి చేర్చుకోవాలని పీఈసీ సభ్యులను కోరారు. అయితే, ఎలాంటి నిబంధనలు పెట్టకుండా పార్టీలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నవారిని మాత్రమే చేర్చుకోవాలని సూచించారు. ఈ ప్రతిపాదనకు పీఈసీ అంగీకారం తెలపడంతో ఎన్నికలకు ముందు బయటకు పోయినవారు మళ్లీ వచ్చేందుకు కాంగ్రెస్ ద్వారాలు తెరుచుకున్నట్టయ్యింది. పీఈసీ భేటీలో భాగంగా గత పదేళ్ల కాలంలో విద్యార్థి, ప్రజాసంఘాల నేతలపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలన్న సూచనకు కూడా కమిటీ ఆమోదం తెలిపింది. లోక్‌సభ అభ్యర్థులెవరు? వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహం, అభ్యర్థుల ఖరారుపై పీఈసీ ప్రధానంగా చర్చించింది. ప్రతి నియోజకవర్గంలో టికెట్ ఆశిస్తున్న వారి నుంచి కొన్ని పేర్లను డీసీసీ అధ్యక్షులు ప్రతిపాదించారు. 17 లోక్‌సభ స్థానాలకుగాను 187 పేర్లతో కూడిన జాబితాను ఎన్నికల కమిటీకి వారు అందజేశారు. ఈ జాబితాను పరిశీలించిన పీఈసీ వచ్చే నెల మూడో తేదీ సాయంత్రం ఐదు గంటల వరకు ఆశావహుల నుంచి దరఖాస్తులు తీసుకోవాలని నిర్ణయించింది. దరఖాస్తుతోపాటు ఎస్సీ, ఎస్టీ, వికలాంగులు అయితే రూ.25వేలు, ఇతరులు రూ.50వేల చొప్పున రుసుము చెల్లించాలని నిర్ణయించారు. ఈ దరఖాస్తులను షార్ట్‌లిస్ట్ చేసి అదే నెల ఆరో తేదీలోపు కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ)తో పాటు హరీశ్‌చౌదరి, జిగ్నేశ్ మేవాని, విశ్వజిత్ కదంలతో కూడిన స్క్రీనింగ్ కమిటీకి కూడా పీఈసీ పంపనుంది. భేటీలో భాగంగా త్వరలో జరగనున్న రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఎవరన్న దానిపై చర్చ జరిగింది. అయితే, ఇక్కడ ఫలానా నాయకుల పేర్లపై చర్చ జరపడం సరైంది కాదని, అభ్యర్థుల ఎంపిక అధికారాన్ని ఏఐసీసీకి ఇవ్వాలనే సూచన రావడంతో ఈ మేరకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జునఖర్గే, కేంద్ర ఎన్నికల కమిటీ (సీఈసీ)లకు ఈ అధికారాన్ని కట్టబెడుతూ ఏకగ్రీవ తీర్మానాన్ని కమిటీ ఆమోదించింది. మాకు అవకాశమివ్వండి భేటీలో భాగంగా సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మాట్లాడుతూ ఇందిరాగాంధీ గెలిచిన తర్వాత మెదక్ లోక్‌సభ నుంచి ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ గెలవలేదని గుర్తు చేశారు. సీఎం రేవంత్‌తో పాటు పార్టీ ఇన్చార్జ్ మున్షీ నిర్ణయిస్తే తాను పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పారు.యూత్‌కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శివసేనారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా పోటీ చేసే అవకాశం యూత్‌కాంగ్రెస్ కోటాలో ఇవ్వాలని, ఒకవేళ సమీకరణలు కుదరకపోతే రాజ్యసభ సభ్యునిగా యూత్‌కాంగ్రెస్ నాయకుడిని ఎంపిక చేసే అంశాన్ని పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు. ఈ ప్రతిపాదనలపై అధిష్టానంతో మాట్లాడాలని పీఈసీ అభిప్రాయపడింది. టీపీసీసీ ఎన్నికల కమిటీ సమావేశంలో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ దీపాదాస్ మున్షీ, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు డి.శ్రీధర్‌బాబు, ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సీతక్క, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, కమిటీ సభ్యులు జానారెడ్డి, జీవన్‌రెడ్డి, వి.హనుమంతరావు, రేణుకాచౌదరి, మహేశ్‌కుమార్‌గౌడ్, మధుయాష్కీగౌడ్, షబ్బీర్‌అలీ, అంజన్‌కుమార్‌యాదవ్, అజారుద్దీన్, చల్లా వంశీచంద్‌రెడ్డి, బలరాంనాయక్, ప్రేంసాగర్‌రావు, సంపత్‌కుమార్, బల్మూరి వెంకట్, సునీతారావులతో పాటు ఏఐసీసీ కార్యదర్శులు పాల్గొన్నారు. అయోధ్య అక్షింతల తరహాలో సమ్మక్క బంగారం అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ట సందర్భంగా దేశవ్యాప్తంగా అయోధ్య నుంచి అక్షింతలు పంపినట్టుగానే తెలంగాణ ప్రభుత్వం తరఫున సమ్మక్క–సారలమ్మ బంగారాన్ని రాష్ట్రంలోని ప్రతి గ్రామానికి పంపే అంశాన్ని పరిశీలించాలని మంత్రి శ్రీధర్‌బాబు ప్రతిపాదించారు. బెల్లంతో పాటు పసుపు, కుంకుమ పంపే అంశంపై చర్చించి నిర్ణయం తీసుకోవాలన్నారు. గ్రామాలకు వెళ్లే బంగారాన్ని పార్టీ ఎమ్మెల్యేలు, పోటీ చేసిన అభ్యర్థులు, స్థానిక కేడర్ నేతృత్వంలో ప్రజలకు పంచాలనే అభిప్రాయం సభ్యుల నుంచి వ్యక్తమైంది. దీనిపై స్పందించిన సీఎం రేవంత్ ఈ ప్రతిపాదనను అమల్లోకి తెచ్చే అంశాన్ని అధికారులతో కలిసి పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని మంత్రులు సీతక్క, కొండా సురేఖలకు సూచించారు. -
ఇంద్రవెల్లి నుంచి కాంగ్రెస్ రణభేరి
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తూనే టీపీసీసీ చీఫ్‌గా వచ్చే పార్లమెంటు ఎన్నికలకు రేవంత్‌రెడ్డి సిద్ధమవుతున్నారు. ఒకవైపు ఎన్నికల్లో ప్రజలకిచ్చిన హామీల అమలుకు కృషి చేస్తూనే, మరోవైపు లోక్‌సభ ఎన్నికల్లో 12 స్థానాల్లో గెలుపే లక్ష్యంగా ముందుకు సాగాలని నిర్ణయించుకున్నారు. వారంలో మూడు రోజుల పాటు పార్టీ కోసం సమయం కేటాయిస్తానని చెప్పిన రేవంత్.. ఫిబ్రవరి 2న ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి సభతో ఈ మేరకు కార్యాచరణ ప్రారంభించనున్నారు. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ నాలుగు అసెంబ్లీ సీట్లను సాధించినప్పటికీ, లోక్‌సభ స్థానంలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో ఒక్క ఖానాపూర్‌లోనే విజయం సాధించింది. మిగతా ఆరింటిలో నాలుగు చోట్ల బీజేపీ విజయం సాధించింది. ఆదిలాబాద్, నిర్మల్, ముథోల్, సిర్పూరులలో బీజేపీ గెలుపొందగా, బీఆర్ఎస్ బోథ్, ఆసిఫాబాద్‌లలో విజయం సాధించింది. కాగా ఖానాపూర్‌లో వెడ్మ బొజ్జు అనూహ్య విజయాన్ని రేవంత్ అన్ని సభల్లో చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆదిలాబాద్ లోక్‌సభ స్థానం నుంచే పార్లమెంటు ఎన్నికల రణభేరి మోగించాలని ఆయన నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా సోమవారం ఆదిలాబాద్ ఇన్చార్జి మంత్రి సీతక్కతో హైదరాబాద్‌లో ఆయన సమావేశం కానున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన పార్టీ ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులను ఈ భేటీకి ఆహ్వానించారు. ఇంద్రవెల్లి సభ తర్వాత కూడా లోక్‌సభ నియోజకవర్గాల వారీగా సభలు, సమావేశాలు నిర్వహించడం ద్వారా పార్టీ యంత్రాంగాన్ని చురుగ్గా ఉంచాలని సీఎం నిర్ణయించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఉత్తర, దక్షిణ తెలంగాణ జిల్లాల్లో పార్లమెంటు నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహించి, చివరలో హైదరాబాద్‌లో భారీ బహిరంగ సభ జరపాలని కూడా భావిస్తున్నట్లు తెలిసింది. ఓటర్లను ఆకర్షించేలా మరో రెండు పథకాలు! ఆరు గ్యారంటీల్లో భాగంగా ఇప్పటికే అమలవుతున్న మహిళల ఉచిత బస్సు ప్రయాణానికి మంచి స్పందన లభించిందని కాంగ్రెస్ భావిస్తోంది. రూ.10 లక్షల వరకు ఆరోగ్యశ్రీ పరిమితి పెంపును కూడా అమలు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇదే క్రమంలో పార్లమెంటు ఎన్నికల్లో ఓటర్ల దృష్టిని ఆకర్షించేలా మరో రెండు గ్యారంటీల అమలుకు మార్గదర్శకాలను సిద్ధం చేయాలని ఇప్పటికే అధికార యంత్రాంగాన్ని ఆదేశించింది. అందులో ఒకటి రూ.500కే గ్యాస్ సిలిండర్ కాగా, మరొకటి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్. అయితే సబ్సిడీపై సంవత్సరానికి ఎన్ని గ్యాస్ సిలిండర్లు ఇవ్వాలనే అంశంపై ఇప్పటికే అధికారులు ఓ రోడ్‌మ్యాప్ తయారు చేసినట్లు సమాచారం. కాగా రూ.500కే సిలిండర్‌ను నేరుగా తెచ్చినప్పుడే ఇచ్చే విధంగా విధి విధానాలు రూపొందిస్తున్నట్లు తెలిసింది. దీనివల్ల రూ.500కే గ్యాస్ వచ్చిన భావన మహిళలకు కలుగుతుందని, ఇది ఎన్నికల్లో ఉపకరిస్తుందని కాంగ్రెస్ భావిస్తోంది. అలాగే 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పథకానికి సంబంధించి ఇప్పటికే ఇది అమలవుతున్న కర్ణాటకలో అధికారులు పరిశీలించినట్లు తెలిసింది. -
‘బడ్జెట్’ లోపే కేబినెట్ విస్తరణ!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు రంగం సిద్ధమవుతోంది. వచ్చే బడ్జెట్ సమావేశాల్లోపే కేబినెట్ విస్తరణ ఉండవచ్చని గాందీభవన్ వర్గాలు చెప్తున్నాయి. ప్రస్తుతం కేబినెట్లో ఆరు బెర్తులు ఖాళీగా ఉండటంతో.. ఎవరెవరికి అవకాశం వస్తుందన్న దానిపై కాంగ్రెస్ నేతల్లో తీవ్ర ఉత్కంఠ కనిపిస్తోంది. కొత్తగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల నుంచి ఒక్కొక్కరికి, అగ్రవర్ణాలకు చెందిన ఇద్దరు నేతలకు అమాత్యయోగం దక్కుతుందన్న చర్చ జరుగుతోంది. అయితే అందుబాటులో ఉన్న ఆరు పదవులను ఒకేసారి భర్తీ చేస్తారా? పలు సమీకరణాల నేపథ్యంలో ఒకట్రెండు బెర్తులు ఖాళీగా ఉంచుతారా? అన్నదానిపై స్పష్టత రావడం లేదు. వచ్చే 15 రోజుల్లోనే కేబినెట్ విస్తరణ జరిగినా ఆశ్చర్యం లేదని టీపీసీసీ నేతలు చెప్తున్నారు. ఏ కోటాలో ఎవరికి? రాష్ట్ర కేబినెట్లో సీఎం సహా మొత్తం 18 మంది అవకాశం ఉంది. ఇప్పటికే 12 మందితో రేవంత్ ప్రభుత్వం కొలువుదీరింది. ఇందులో ఎస్టీలకు ఒకటి, బీసీలు, ఎస్సీలకు రెండు చొప్పున ఇవ్వగా, ఏడు పదవులను అగ్రవర్ణాలకు కేటాయించారు. ఇందులో రెడ్డి సామాజికవర్గానికి నాలుగు.. వెలమ, కమ్మ, బ్రాహ్మణ వర్గాలకు ఒక్కోటి ఇచ్చారు. ఈ నేపథ్యంలో తాజా విస్తరణలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఒక్కో మంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఎస్సీ కోటాలో చెన్నూరు ఎమ్మెల్యే జి.వివేక్ వెంకటస్వామి, ఎస్టీ కోటాలో దేవరకొండ నుంచి బాలూనాయక్‌లకు.. బీసీ కోటాలో మక్తల్ నుంచి వాకిటి శ్రీహరి ముదిరాజ్కుగానీ, ఎంబీసీ కోటాలో ఈర్లపల్లి శంకర్ (షాద్‌నగర్)కుగానీ అవకాశం రావొచ్చని అంటున్నారు. అగ్రవర్ణాలకు సంబంధించి.. రెడ్డి సామాజికవర్గం నుంచి పి.సుదర్శన్‌రెడ్డి (బోధన్), కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి (మునుగోడు), మల్రెడ్డి రంగారెడ్డి (ఇబ్రహీంపట్నం)ల పేర్లు వినిపిస్తున్నాయి. వీరిలో మల్‌రెడ్డికి అసెంబ్లీలో చీఫ్‌విప్ హోదా ఇవ్వొచ్చనే ప్రచారం కూడా జరుగుతోంది. ఇక వెలమ సామాజికవర్గ కోటాలో కె.ప్రేమ్‌సాగర్‌రావు (మంచిర్యాల), మదన్మోహన్రావు (ఎల్లారెడ్డి) పేర్లు వినిపిస్తున్నాయి. మరికొందరు నేతలూ రేసులో.. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నిక కాబోతున్న ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ పేరు కూడా మంత్రి పదవి రేసులో వినిపిస్తోంది. ఆయనకు శాసనమండలిలో విప్ హోదా ఇస్తారని కూడా అంటున్నారు. అయితే వెంకట్‌కు మంచి హోదా కలి్పంచాలని స్వయంగా రాహుల్‌గాంధీ చెప్పారని.. ఈ నేపథ్యంలో ఆయనకు కేబినెట్ అవకాశం దక్కవచ్చని గాం«దీభవన్ వర్గాలు చెప్తున్నాయి. మొత్తమ్మీద 15 రోజుల్లోనే, లేదా బడ్జెట్ సమావేశాల్లోపు కేబినెట్ విస్తరణ ఉంటుందని అంటున్నాయి. మంత్రి పదవుల కోసం సామాజిక వర్గాల వారీగా మరికొందరు నేతలు, మహిళా ఎమ్మెల్యేలు కూడా పోటీలో ఉన్నారని పేర్కొంటున్నాయి. మైనార్టీ కోటాలో ఎవరికి? కేబినెట్లో మైనార్టీ కోటా కింద ఎవరిని, ఎలా ఎంపిక చేస్తారన్న దానిపై స్పష్టత రావడం లేదు. ఈసారి విస్తరణలో ఖాళీగా ఉన్న ఆరు బెర్తులు భర్తీ చేస్తారా, నాలుగైదు మాత్రమే నింపుతారా అన్నది మైనార్టీ కోటాను బట్టే ఉంటుందనే చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ తరఫున మైనార్టీ నేతలెవరూ ఎమ్మెల్యేలుగా ఎన్నికకాకపోవడంతో.. వారికి ఎమ్మెల్సీలుగా అవకాశమిస్తేనే మంత్రి పదవి లభించనుంది. ప్రస్తుతం ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీలుగా బీసీ, ఓసీ వర్గాలకు చెందిన ఇద్దరిని కాంగ్రెస్ ఎంపిక చేసింది. నల్లగొండ గ్రాడ్యుయేట్స్, పాలమూరు స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ మైనార్టీలు పోటీచేసే అవకాశం లేదన్న అంచనాలు ఉన్నాయి. ఈ క్రమంలో గవర్నర్ కోటాలో మైనార్టీ నేతను శాసనమండలికి పంపి మంత్రి పదవి కేటాయించాల్సి ఉంటుంది. ఈ విషయంలో అటు అధిష్టానం, ఇటు సీఎం రేవంత్‌ల మదిలో ఏముందనే దానిపై స్పష్టత లేదు. మైనార్టీ కోటాలో మంత్రిపదవి రేసులో.. మాజీ మంత్రి షబ్బీర్ అలీ, అజారుద్దీన్, ఫిరోజ్‌ఖాన్‌ల పేర్లు ఉన్నాయి. ఆమేర్ అలీఖాన్, జాఫర్ జావేద్‌ల పేర్లు గవర్నర్ కోటా ఎమ్మెల్సీల జాబితాలో ఉండటం గమనార్హం. త్వరలోనే నామినేటెడ్ పదవులు కూడా.. రాష్ట్రంలో నామినేటెడ్ పదవుల పంపకాలను చేపట్టేందుకూ కాంగ్రెస్ సర్కారు సిద్ధమైంది. విదేశ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్‌రెడ్డి ఈనెల 22న ఉదయం రాష్ట్రానికి తిరిగి రానున్నారు. తర్వాత రెండు, మూడు రోజుల్లో నామినేటెడ్ పోస్టుల ప్రకటన ఉంటుందని గాంధీభవన్ వర్గాలు చెప్తున్నాయి. ఆర్టీసీ, టీఎస్ఐఐసీ, రైతు సమన్వయసమితి, మహిళా కమిషన్‌తోపాటు పలు కార్పొరేషన్లకు చైర్మన్లు, డైరెక్టర్లను ప్రకటించే అవకాశం ఉందని వివరిస్తున్నాయి. -
ఎమ్మెల్సీలు@ సస్పెన్స్
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ చాన్స్ ఎవరికి అన్నదానిపై కాంగ్రెస్ పార్టీలో ఇంకా ఉత్కంఠ కొనసాగుతోంది. రెండు రోజులుగా ఢిల్లీ వేదికగా పలుమార్లు భేటీలు జరిగినా.. అభ్యర్థుల ఎంపిక ఓ కొలిక్కి వచ్చిందని గాందీభవన్ వర్గాలు చెప్తున్నా.. అభ్యర్థులు ఎవరనే దానిపై ఆదివారం రాత్రి వరకు కూడా ఎలాంటి ప్రకటన రాలేదు. ఈ నెల 18లోపు నామినేషన్లు దాఖలు చేయాల్సిన నేపథ్యంలో.. సోమవారం లేదా మంగళవారం (16న) అభ్యర్థులను ప్రకటించవచ్చని సమాచారం. ఎవరెవరికి చాన్స్? తుంగతుర్తి అసెంబ్లీ టికెట్‌ను త్యాగం చేసిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ ఉద్యమకారుడు అద్దంకి దయాకర్, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్‌కుమార్‌గౌడ్ ఇద్దరూ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ఖరారైనట్టు గాందీభవన్ వర్గాలు చెప్తున్నాయి. ఇదే సమయంలో మైనార్టీ నేతను ఎమ్మెల్సీగా చట్టసభకు పంపి కేబినెట్ అవకాశం ఇవ్వాలనే కోణంలో మాజీ మంత్రి షబ్బీర్‌అలీ పేరు కూడా పరిశీలనలో ఉన్నట్టు సమాచారం. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్‌గాంధీ, కేసీ వేణుగోపాల్, సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తదితరులు జరిపిన చర్చల్లో.. ఇందులో ఇద్దరు పేర్లను ఖరారు చేశారని, అధికారికంగా ప్రకటించడమే తరువాయి అని గాంధీభవన్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఆ రెండు అభ్యర్థిత్వాలపైనా చర్చ ఇక గవర్నర్ కోటాలో ఖాళీగా ఉన్న మరో రెండు ఎమ్మెల్సీ పదవులపైనా కాంగ్రెస్ కసరత్తు పూర్తి చేసినట్టు తెలుస్తోంది. ఈ కోటాలో ఇప్పటికే పలువురి పేర్లు తెరపైకి వచ్చాయి. తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం పేరును పరిశీలిస్తున్నారనే చర్చ జరుగుతున్నా.. రాజకీయ పార్టీకి అధ్యక్షుడిగా ఉన్న ఆయన అభ్యర్థిత్వానికి గవర్నర్ ఆమోదం విషయంలో ఇబ్బంది రావొచ్చనే చర్చ జరిగినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీగా కోదండరాంకు అవకాశం దక్కుతుందని అంటున్నారు. వీలుంటే ఇప్పుడు లేదంటే మరోమారు ఎమ్మెల్యే కోటాలో ఆయనను శాసన మండలికి పంపుతారని.. సాంకేతిక సమస్యలను అధిగమించగలిగితే గవర్నర్ కోటాలోనే సిఫార్సు చేయవచ్చని తెలిసింది. మరోవైపు గవర్నర్ కోటాలో మైనార్టీలకు అవకాశం కల్పించే అంశాన్ని కాంగ్రెస్ పార్టీ పరిశీలిస్తోంది. ఈ కోటా కింద హైదరాబాద్ కేంద్రంగా విద్యాసంస్థలను నిర్వహిస్తున్న జాఫర్ జావేద్, సియాసత్ పత్రిక ఎడిటర్ జాహెద్ అలీఖాన్‌ల పేర్లు కొత్తగా తెరపైకి వచ్చాయి. అయితే గతంలో తనకు వచ్చిన రాజ్యసభ అవకాశాన్ని జాహెద్ అలీఖాన్ తిరస్కరించిన నేపథ్యంలో.. ఆయన కుమారుడు అమేర్అలీఖాన్ను ఎంపిక చేయవచ్చని అంటున్నారు. ఆ రెండు దాదాపు ఖరారేనా? మహబూబ్‌నగర్ జిల్లా స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా మాజీ మంత్రి జి.చిన్నారెడ్డి పేరు దాదాపు ఖరారు చేయగా.. నల్లగొండ–వరంగల్–ఖమ్మం జిల్లాల గ్రాడ్యుయేట్ నియోజకవర్గ అభ్యర్థిగా గత ఎన్నికల్లో ఓటమి పాలైన చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న అభ్యర్థిత్వానికి కాంగ్రెస్ అధిష్టానం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. అయితే ప్రస్తుతానికి రెండు ఎమ్మెల్యే కోటా పేర్లను మాత్రమే ప్రకటిస్తారని, సమయాన్ని బట్టి మిగిలిన నాలుగు ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాలను అధికారికంగా ప్రకటిస్తారని గాందీభవన్ వర్గాలు చెప్తున్నాయి. నామినేటెడ్ పదవుల టెన్షన్ రాష్ట్రంలో నామినేటెడ్ పోస్టుల భర్తీ అంశం కాంగ్రెస్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. సంక్రాంతికి ముందే ఈ పోస్టులను భర్తీ చేస్తారని గతంలో చర్చ జరిగినా కసరత్తు ఓ కొలిక్కిరాలేదు. తొలిదశలో పది వరకు కార్పొరేషన్లకు చైర్మన్లు, డైరెక్టర్లను ప్రకటిస్తారని భావించారు. తర్వాత ఈ సంఖ్య 18కి చేరింది. ఈ క్రమంలో తొలిదఫాలో 9 లేదా 18 కార్పొరేషన్ల పదవులను ఈ నెల 20 తర్వాత ప్రకటిస్తారని గాందీభవన్ వర్గాలు చెప్తున్నాయి. ఇందులో పార్టీ అనుబంధ సంఘాల అధ్యక్షులకు ప్రాధాన్యత ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. సామాజిక కోణంలోనూ సరిపడేలా ఎస్సీ సెల్ చైర్మన్ నాగరిగారి ప్రీతం, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేనారెడ్డి, ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్, టీపీసీసీ ఫిషర్మెన్ సెల్ చైర్మన్ మెట్టుసాయికుమార్లకు తొలిదఫాలోనే అవకాశం ఇవ్వనున్నారని తెలుస్తోంది. అయితే ఎవరికి, ఏ కార్పొరేషన్ ఇస్తారన్న అంశం బయటికి రాకుండా కాంగ్రెస్ పార్టీ జాగ్రత్తలు తీసుకుంటోంది. మహిళల కోటా కింద తొలిదఫాలో మాజీ మంత్రి పుష్పలీలకు అవకాశం రావొచ్చని, ఆమెను మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా నియమించవచ్చని గాం«దీభవన్ వర్గాలు చెప్తున్నాయి. నామినేటెడ్ పోస్టుల జాబితా ఇప్పటికే రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి దీపాదాస్ మున్షీకి చేరిందని అంటున్నాయి. -
అజ్మీర్ దర్గాకు చాదర్ సమర్పించిన అజహరుద్దీన్ (ఫొటోలు)
-
గాంధీభవన్ లో టీపీసీసీ కార్యవర్గ సమావేశం
-
ఆరు గ్యారంటీల కోసం ఇందిరమ్మ కమిటీలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేసేందుకు గ్రామస్థాయిలో ఇందిరమ్మ కమిటీలను ఏర్పాటు చేయాలని, ప్రతి గ్రామానికి, వార్డుకు ఐదుగురితో ఏర్పాటు చేసే కమిటీల ద్వారా ఆరు గ్యారంటీలను ప్రజలందరికీ అందించేలా పనిచేయాలని టీపీసీసీ విస్తృతస్థాయి కార్యవర్గ సమావేశం నిర్ణయించింది. మరోవైపు లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ మెజార్టీ స్థానాల్లో విజయం సాధించేలా ఈ భేటీ రోడ్ మ్యాప్‌ను రూపొందించింది. టీపీసీసీ అధ్యక్షుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన బుధవారం గాంధీభవన్‌లో ఈ సమావేశం జరిగింది. ఇందులో మూడు తీర్మానాలను ఆమోదించడంతో పాటు లోక్‌సభ ఎన్నికల సందర్భంగా అనుసరించాల్సిన వ్యూహాలు, ఆరు గ్యారంటీల అమలులో పార్టీ పాత్ర తదితర అంశాలపై చర్చించారు. ఆరు గ్యారంటీలను అమలు చేయించే బాధ్యతను పార్టీ తీసుకోవాలని, ప్రజలకు చేరవేసే పనిని పార్టీ కార్యకర్తలకు అప్పగించాలని నిర్ణయించారు. 12 స్థానాల్లో గెలుపే ధ్యేయం లోక్‌సభ ఎన్నికల్లో కనీసం 12 స్థానాల్లో గెలుపే ధ్యేయంగా ముందుకెళ్లాలని, ఇందుకోసం రేవంత్‌రెడ్డి సమక్షంలో సన్నాహక సమావేశాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. రోడ్‌మ్యాప్‌లో భాగంగా ఈనెల 8వ తేదీన 5 ఉమ్మడి జిల్లాలు, 9న మరో 5 జిల్లాల నేతలతో ఆయన సమీక్ష నిర్వహించాలని, ఆ తర్వాత 10, 11, 12 తేదీల్లో 17 లోక్‌సభ నియోజకవర్గాల సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలని, ఈ నెల 20 తర్వాత ముఖ్యమంత్రి క్షేత్రస్థాయికి వెళ్లాలని నిర్ణయించారు. రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్చార్జిగా కొత్తగా నియమితులైన దీపాదాస్ మున్షీ, ఇప్పటివరకు ఇన్చార్జిగా పనిచేసిన మాణిక్‌రావ్ ఠాక్రేలను అభినందిస్తూ వేర్వేరు తీర్మానాలు, లోక్‌సభ ఎన్నికల్లో సోనియాగాంధీ తెలంగాణ నుంచి పోటీ చేయాలని కోరుతూ మరో తీర్మానాన్ని రేవంత్‌రెడ్డి ప్రవేశపెట్టగా సమావేశం ఏకగ్రీవంగా ఆమోదించింది. మరింత టీం వర్క్ కావాలి: మున్షీ సమావేశంలో దీపాదాస్ మున్షీ మాట్లాడుతూ..తెలంగాణలో పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు కార్యకర్తలు పదేళ్ల పాటు కష్టపడ్డారని అన్నారు. భవిష్యత్తులో మన ముందు చాలా ఎన్నికలున్నాయని, ఈసారి ఎన్నికల్లో గెలుపొందేందుకు కార్యకర్తలు మరింత శ్రమించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం, పార్టీ మధ్య సమన్వయం ఉండాలని, మరింత టీంవర్క్‌తో కలిసి పనిచేయాలని కోరారు. ఆరు గ్యారంటీలు అమలు చేసి తీరతాం: రేవంత్ కాంగ్రెస్ కేడర్ అవిశ్రాంత కృషితోనే రాష్ట్రంలో అధికారంలోకి వచ్చామని రేవంత్‌రెడ్డి అన్నారు. పార్టీ కోసం కష్టపడిన వారిని గుర్తించి వారికి సముచిత స్థానం కల్పించే బాధ్యతను తాము తీసుకుంటామని హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రజలకిచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేసి తీరతామన్నారు. ఎన్నికల్లో బోర్లాపడి బొక్కలు విరిగినా బీఆర్ఎస్కు బుద్ధి రాలేదని, తాము అధికారంలోకి వచ్చి నెలరోజులు గడవక ముందే కాంగ్రెస్ హామీలపై పుస్తకాలు విడుదల చేస్తున్నారని విమర్శించారు. ఆ పార్టీ విమర్శలను ధీటుగా తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ఆదాయం తగ్గినట్టుందని, అందుకే కాళేశ్వరంపై ఆయన సీబీఐ విచారణ కోరుతున్నారని ఎద్దేవా చేశారు. గతంలో కాళేశ్వరంపై తానే స్వయంగా సీబీఐ విచారణను కోరానని, అప్పుడు బీజేపీ నేతలు ఏం చేశారని ప్రశ్నించారు. బీజేపీ, బీఆర్ఎస్లు తోడుదొంగలని, ఇద్దరూ కలిసే కాళేశ్వరం పేరుతో దోచుకున్నారని ఆరోపించారు. కాళేశ్వరంలో అవినీతిపై న్యాయ విచారణ జరిపిస్తామని అన్నారు. పథకాలు ప్రజలకు చేరవేయండి: భట్టి విక్రమార్క దశాబ్ద కాలం తర్వాత కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలకు గొప్ప అవకాశం లభించిందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. పారీ్టపై విశ్వాసంతో ప్రజలు గెలిపించారని, వారి నమ్మకాలను వమ్ము చేయకుండా ప్రభుత్వ పథకాలను వారికి చేరవేసే బాధ్యతను పార్టీ శ్రేణులు తీసుకోవాలని కోరారు. పార్టీ కార్యకర్తలు, నేతల త్యాగాల ఫలితంగానే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని, వారి కష్టానికి తగిన ఫలితం ఉంటుందని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చెప్పారు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ బి.మహేశ్‌కుమార్‌గౌడ్ సమన్వయకర్తగా వ్యవహరించిన ఈ సమావేశంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్‌బాబు, దామోదర రాజనర్సింహ, జూపల్లి కృష్ణారావు, కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పలువురు మాజీ ఎంపీలు, మాజీ మంత్రులు, ఏఐసీసీ కార్యదర్శులు, టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు, అధికార ప్రతినిధులు, అనుబంధ సంఘాల అధ్యక్షులు, డీసీసీ అధ్యక్షులు, మండల, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఆరు గంటలకు పైగా ట్రాఫిక్ ఇబ్బందులు టీపీసీసీ సమావేశం సందర్భంగా గాం«దీభవన్, నాంపల్లి, ఆబిడ్స్, మొజాంజాహి మార్కెట్ పరిసరాల్లో తీవ్ర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. మధ్యాహ్నం 2 గంటలకు సమావేశం ప్రారంభం కావాల్సి ఉండగా, సీఎం మధ్యాహ్నం 3: 30కి గాం«దీభవన్‌కు చేరుకున్నారు. అయితే అంతకంటే ముందే ట్రాఫిక్ జామ్ అయింది. మంత్రుల కాన్వాయ్‌లోని వాహనాలు, పైలట్ వాహనాలను రోడ్డుపైనే పార్క్ చేశారు. పెద్ద ఎత్తున వచ్చిన కార్యకర్తల వాహనాలతో గాంధీభవన్ పరిసరాలన్నీ కిటకిటలాడిపోయాయి. దీంతో రాత్రి 8 గంటల వరకు ట్రాఫిక్ జామ్‌తో వాహనదారులు, సాధారణ ప్రజలు ఇబ్బందులు పడాల్సి వచ్చింది. మల్లు రవిని అడ్డుకున్న పోలీసులు టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లు రవిని పోలీసులు గాంధీభవన్ ప్రధాన ద్వారం వద్దే ఆపేశారు. భేటీకి హాజరయ్యే నేతల జాబితాలో పేరుంటేనే లోపలికి పంపుతామని చెప్పారు. దీంతో ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను అడ్డుకుంటారా అని గట్టిగా కేకలు వేస్తూ లోనికి వెళ్లారు. మరోవైపు దీపాదాస్ మున్షీ గాం«దీభవన్లోకి ప్రవేశించేందుకు పోలీసులు ఓవైపు నుంచి మార్గం ఏర్పాటు చేయగా, డ్రైవర్ ప్రధాన ద్వారం వైపునకు వాహనం తీసుకువచ్చారు. పోలీసులు అనుమతించకపోవడంతో ఆమె అక్కడే దిగి నడుచుకుంటూ గాంధీభవన్‌లోకి Ððవెళ్లాల్సి వచ్చింది. -
ఠాక్రేకు టీపీసీసీ వీడ్కోలు త్వరలోనే బాధ్యతలు స్వీకరించనున్న మున్షీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి బాధ్యతల నుంచి అధిష్టానం తప్పించిన నేపథ్యంలో మాణిక్ రావ్ ఠాక్రే తన సొంత రాష్ట్రా నికి వెళ్లిపోయారు. గోవా ఇన్ చార్జిగా నియమితులైన ఆయన కు ఆదివారం ఎమ్మెల్యే క్వార్ట ర్స్‌లో పలువురు టీపీసీసీ నేత లు కలిసి అభినందనలు తెలి పారు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసి డెంట్ మహేశ్‌కుమార్‌గౌడ్, ఉపాధ్యక్షులు హర్కర వేణు గోపాల్, అంజన్‌కుమార్ యాదవ్, వేం నరేందర్ రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి రోహిత్ చౌదరి, ఏఐసీసీ సభ్యుడు ఎం.ఎ.ఫహీం, కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు భూపతిరెడ్డి నర్సారెడ్డి, నల్లగొండ డీసీసీ అధ్యక్షుడు శంకర్ నాయక్ ఆయనను కలిసి వీడ్కోలు పలికారు. ఠాక్రేకు టీపీసీసీ పక్షాన జ్ఞాపికను అందజేశారు. అనంతరం ఆయన రోడ్డు మార్గంలోనే మహారాష్ట్ర కు వెళ్లినట్టు కాంగ్రెస్ వర్గాల ద్వారా తెలిసింది. కొత్త ఇన్చార్జిగా నియమితులైన దీపాదాస్ మున్షీ త్వర లో బాధ్యతలు స్వీకరించనున్నట్టు సమాచారం. -
అమెరికాలో కాంగ్రెస్ గెలుపు సంబురాలు
-
రేవంత్ రెడ్డిని CLP లీడర్ గా ఎన్నుకున్నట్లు తెలిపిన నేతలు
-
ఓవర్ టు ఢిల్లీ..!
సాక్షి, హైదరాబాద్/న్యూఢిల్లీ: అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన మెజారిటీ సాధించినా.. ముఖ్యమంత్రిని ఎంపిక అంశం కొలిక్కి రాలేదు. సోమవారం పొద్దంతా భేటీలు, సమావేశాలు, చర్చలు, ఇంకాసేపట్లోనే ప్రమాణ స్వీకారమనే ప్రచారాల మధ్య ఈ వ్యవహారం ఢిల్లీకి చేరింది. పార్టీ శాసనసభాపక్షం (సీఎల్పీ) నాయకుడిని నిర్ణయించేందుకు సోమవారం హైదరాబాద్‌లోని ఎల్లా హోటల్లో సమావేశమైన కొత్త ఎమ్మెల్యేలు తమ అభిప్రాయాన్ని వెల్లడించేందుకు మాత్రమే పరిమితమయ్యారు. వారి అభిప్రాయాలను ఢిల్లీకి పంపి, అధిష్టానం స్పందన కోసం ఎదురుచూసిన కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ నేతృత్వంలోని పరిశీలకుల బృందం.. ఎలాంటి తుది నిర్ణయాన్ని ప్రకటించకుండానే హస్తిన బాట పట్టింది. మంగళవారం పార్టీ అధిష్టానం పెద్దలతో డీకే బృందం భేటీ కానుంది. అనంతరం సీఎం, మంత్రి పదవులు, ఇతర కీలక అంశాలపై తుది నిర్ణయం వెలువడనుందని టీపీసీసీ వర్గాలు చెప్తున్నాయి. అయితే తుది నిర్ణయాన్ని వెలువరించే ముందు అధిష్టానం పెద్దలు మరోసారి టీపీసీసీ ముఖ్యులతో సంప్రదింపులు జరిపే అవకాశం ఉందని అంటున్నాయి. ఈ ప్రక్రియ ముగిసేందుకు రెండు రోజుల సమయం పడుతుందని పేర్కొంటున్నాయి. సీఎంతోపాటు డిప్యూటీ సీఎంలు, మంత్రివర్గ బెర్తులు ఖరారైన తర్వాతే ప్రమాణస్వీకార కార్యక్రమం నిర్వహించాలన్న అభిప్రాయాల నేపథ్యంలో.. ఈనెల 7 నుంచి 9వ తేదీ వరకు ఎప్పుడైనా కొత్త ప్రభుత్వం కొలువు దీరనుందనే చర్చ కాంగ్రెస్ వర్గాల్లో జరుగుతోంది. ఏకవాక్య తీర్మానానికి ఆమోదం సోమవారం ఉదయం 11.30 గంటలకు ఎల్లా హోటల్ వేదికగా కాంగ్రెస్ శాసనసభాపక్షం (సీఎల్పీ) సమావేశమైంది. కాంగ్రెస్ నుంచి తాజాగా గెలిచిన 64 మంది ఎమ్మెల్యేలు దీనికి హాజరయ్యారు. డీకే శివకుమార్ పర్యవేక్షణలో ఏఐసీసీ పరిశీలకులు కేజీ జార్జి, దీపాదాస్మున్షీ, అజయ్‌కుమార్, ఠాక్రే, ఏఐసీసీ కార్యదర్శులు కూడా పాల్గొన్నారు. తొలుత పార్టీ ఎమ్మెల్యేలను ఉద్దేశించి డీకే శివకుమార్ మాట్లాడారు. గెలిచిన అభ్యర్థులకు అభినందనలు తెలిపి.. సీఎం ఎంపిక వ్యవహారంలో పార్టీ తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉండాలని స్పష్టం చేశారు. తర్వాత సీఎం అభ్యర్థి ఎంపిక అధికారాన్ని ఏఐసీసీ అధ్యక్షుడికి కట్టబెడుతూ టీపీసీసీ అధ్యక్షుడి హోదాలో రేవంత్‌రెడ్డి ఏకవాక్య తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. సీఎల్పీ నేత భట్టి తీర్మానాన్ని సమరి్థంచగా.. మిగతా ఎమ్మెల్యేలంతా ఆమోదించారు. సీఎం ఎవరైతే బాగుంటుంది? ఏఐసీసీ పరిశీలకులు సీఎల్పీ సమావేశం తర్వాత ఎమ్మెల్యేలందరితో విడివిడిగా సమావేశమై.. సీఎం ఎవరైతే బాగుంటుందన్న అభిప్రాయాలు తీసుకున్నారు. ఈ క్రమంలో కొందరు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ పేరు చెప్పగా, మరికొందరు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఉత్తమ్‌కుమార్‌రెడ్డిల పేర్లు చెప్పారని, ఇంకొందరు మాత్రం ఏఐసీసీ ఎవరిని ఎంపిక చేసినా తమకు సమ్మతమేనని చెప్పినట్టు సమాచారం. డీకే బృందం ఈ అభిప్రాయాలను వెంటనే ఢిల్లీకి చేరవేసింది. వాటిని హైకమాండ్ పరిశీలించి ఏం చెప్తుందోనని సాయంత్రం వరకు ఎదురుచూసింది. కానీ డీకే బృందాన్ని ఢిల్లీ రావాల్సిందిగా అధిష్టానం నుంచి పిలుపువచ్చింది. దీంతో డీకే శివకుమార్, ఏఐసీసీ పరిశీలకులు బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్లారు. మంగళవారం తెలంగాణ సీఎం ఎంపిక వ్యవహారంపై హైకమాండ్ పెద్దలతో చర్చించనున్నారు. సీఎం క్యాండిడేట్పై స్పష్టతకు వచ్చాక రాష్ట్రంలోని ముఖ్య నేతలతో చర్చించి, అవసరమైతే వారిని ఢిల్లీకి పిలిపించి మాట్లాడనున్నట్టు సమాచారం. తర్వాత సీల్డ్ కవర్లో సీఎం అభ్యర్థి పేరును హైదరాబాద్‌కు పంపి, సీఎల్పీ సమావేశంలో సదరు నేతను ఎన్నుకుంటారని తెలిసింది. గెలిచిన వారికి అభినందనలు ఢిల్లీలోని సోనియా నివాసంలో సోమవారం జరిగిన పార్లమెంటరీ స్ట్రాటజీ కమిటీ సమావేశం తెలంగాణలో గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలను అభినందించింది. ఈ సమావేశంలో సీఎం ఎంపిక వ్యవహారంపై ఎలాంటి చర్చ జరగలేదని ఏఐసీసీ నేతలు జైరాం రమేశ్, మాణిక్యం ఠాగూర్ తెలిపారు. తెలంగాణ నుంచి ఢిల్లీకి వస్తున్న ఏఐసీసీ పరిశీలకులతో మాట్లాడాక హైకమాండ్ తుదినిర్ణయం తీసుకుంటుందన్నారు. సోమవారమే ప్రమాణమంటూ హడావుడి! సోమవారం మధ్యాహ్నం సీఎల్పీ సమావేశం ముగియకముందే కాంగ్రెస్ పక్షాన సీఎం ఎంపిక పూర్తయిందని, సాయంత్రమే రాజ్‌భవన్‌లో సీఎం, ఒకరిద్దరు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తారనే ప్రచారం జరిగింది. ఈ మేరకు రాజ్‌భవన్‌లో ఏర్పాట్లు జరుగుతున్నాయంటూ కొన్ని వీడియోలు కూడా బయటికి వచ్చాయి. గాం«దీభవన్ వర్గాల్లోనూ దీనిపై చర్చ జరిగింది. కానీ ఏఐసీసీ పెద్దలు డీకే టీమ్‌ను ఢిల్లీకి పిలిపించాక ఈ హడావుడి ఆగిపోయింది. హడావుడి వద్దు... ఆచితూచి నిర్ణయాలు తీసుకోండి సీఎల్పీ సమావేశానికి ముందు హోటల్ పార్క్ హయత్‌లో కీలక సమావేశం జరిగింది. భట్టి, ఉత్తమ్, శ్రీధర్‌బాబు, ప్రేమ్‌సాగర్‌రావు, దామోదర రాజనర్సింహ, రాజగోపాల్‌రెడ్డి తదితరులు డీకే శివకుమార్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారి మధ్య వాడీవేడి చర్చ జరిగినట్టు తెలిసింది. ముఖ్యంగా సీఎం అభ్యర్థి ఎంపిక వ్యవహారం, ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సంబంధించి జరుగుతున్న హడావుడి పార్టీకి నష్టం చేస్తుందని వారు డీకేతో పేర్కొన్నట్టు సమాచారం. ‘‘ఫలానా వారికి సీఎం పదవి ఇవ్వవద్దని మేమేమీ అనడం లేదు. కానీ అందరు ఎమ్మెల్యేలతో మాట్లాడి వారి అభిప్రాయాలు తీసుకోవాలి. ఆ అభిప్రాయాలపై నిర్ణయం తీసుకునేందుకు అనంతరం జరిగే పరిణామాల గురించి ఆలోచించాలి. ఆ తర్వాతే నిర్ణయం తీసుకోవాలి. మనం ఇప్పుడు ప్రజల్లోకి పంపాల్సింది ‘స్ట్రాంగ్’ మెసేజ్ కాదు.. ‘స్మార్ట్’ మెసేజ్. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పార్టీ ఇచ్చిన హామీలను అమలుచేసి ఫలితాలు సాధించాల్సిన బాధ్యతను పరిగణనలోకి తీసుకోవాలి’’ అని వారు డీకేకు స్పష్టం చేసినట్టు సమాచారం. పార్టీ భవిష్యత్తును, పార్టీ పట్ల విధేయత, అనుభవాలను ఆచితూచి అంచనా వేసి నిర్ణయం తీసుకోవాలని.. ఇప్పటికిప్పుడే ఎమ్మెల్యేలకు వచ్చే ఇబ్బందేమీ ఉండదని వారు పేర్కొన్నట్టు తెలిసింది. -
విజయశాంతికి ధన్యవాదాలు
-
ఓటు వేసిన తర్వాత రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
-
హరీష్ రావు వల్లే రైతు బంధు నిలిచిపోయింది: రేవంత్
-
కాంగ్రెస్‌లో రె‘బెల్స్’
సాక్షి, హైదరాబాద్: ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి రెబెల్స్ బెడద తప్పేలా లేదు. ఒక్కో నియోజకవర్గం నుంచి ముగ్గురు, నలుగురు నేతలు టికెట్లు ఆశించగా, అందులో టికెట్లు రాని అసంతృప్తులు రాష్ట్రవ్యాప్తంగా 24 చోట్ల నామినేషన్లు దాఖలు చేశారు. ఈ 24 మందిని కాంగ్రెస్ పెద్దలు బుజ్జగించే ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కనీసం 10 చోట్ల ఆ పార్టీకి రె‘బెల్స్’మోగక తప్పదని గాందీభవన్ వర్గాలే అంటున్నాయి. ముఖ్యంగా సూర్యాపేట, బాన్సువాడ, వరంగల్ వెస్ట్, డోర్నకల్, వైరా, ఇల్లందు నియోజకవర్గాల్లో ఏం జరుగుతుందోననే ఉత్కంఠ నెలకొంది. హైదరాబాద్‌కు రండి.. ఈసారి కాంగ్రెస్ రెబెల్స్‌గా జంగా రాఘవరెడ్డి (వరంగల్ వెస్ట్), నరేశ్ జాదవ్ (బోథ్), గాలి అనిల్‌కుమార్ (నర్సాపూర్), ఎస్.గంగారాం (జుక్కల్), కాసుల బాలరాజు (బాన్సువాడ), నాగి శేఖర్ (చొప్పదండి), దైద రవీందర్ (నకిరేకల్), రామ్మూర్తి నాయక్ (వైరా), ప్రవీణ్ నాయక్, చీమల వెంకటేశ్వర్లు (ఇల్లందు), విజయ్‌కుమార్‌రెడ్డి (ముథోల్), లక్ష్మీనారాయణ నాయక్ (పాలకుర్తి), సున్నం వసంత (చేవెళ్ల), నెహ్రూ నాయక్ (డోర్నకల్), భూక్యా మంగీలాల్ (మహబూబాబాద్), పటేల్ రమేశ్‌రెడ్డి (సూర్యాపేట), చిమ్మని దేవరాజు (పరకాల), సిరిసిల్ల రాజయ్య (వర్ధన్నపేట)తోపాటు మరికొంత మంది రంగంలోకి దిగారు. వీరిలో ఒకరిద్దరు ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ (ఏఐఎఫ్బీ) టికెట్లు తెచ్చుకుని సింహం గుర్తుపై పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. రెబెల్స్‌గా నామినేషన్లు దాఖలు చేసిన వారితో మంతనాలు జరిపి వారి నామినేషన్లను ఉపసంహరింపజేసే బాధ్యతలను రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇంచార్జి మాణిక్‌రావ్ ఠాక్రే, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ బి.మహేశ్‌కుమార్‌గౌడ్‌లకు పార్టీ అప్పగించింది. దీంతో వీరందరినీ హైదరాబాద్‌కు రావాలని ఆహ్వానించారు. వీరిలో నలుగురైదుగురు మాత్రమే అందుబాటులోకి రాగా, మిగిలిన వారితో ఠాక్రే, మహేశ్‌గౌడ్ ఫోన్లో సంప్రదింపులు జరిపారు. దీనిపై మహేశ్‌కుమార్‌గౌడ్ ‘సాక్షి’తో మాట్లాడుతూ.. రెబెల్స్‌గా బరిలోకి దిగిన పార్టీ నాయకులందరితో మాట్లాడామని, అందరూ సర్దుకుంటారని చెప్పారు. బుధవారం సాయంత్రానికి మెజార్టీ నాయకులు తమ నామినేషన్లను ఉపసంహరించుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎంత ప్రయత్నించినా... టికెట్లు ఆశించే వారి సంఖ్య ఎక్కువగా ఉండటంతో కాంగ్రెస్ నెల రోజులుగా బుజ్జగింపు యత్నాలు చేస్తూనే ఉంది. టికెట్లు రాని వారితో సంప్రదింపులు జరిపేందుకు సీనియర్ నేత జానారెడ్డి నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీతోపాటు ఏఐసీసీ నుంచి సమన్వయకర్తలుగా వచ్చిన దీపాదాస్ మున్షీ, జ్యోతిమణి, రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇంచార్జి మాణిక్‌రావ్ ఠాక్రేలు టికెట్లు దక్కవని తెలిసిన వారితో మంతనాలు జరిపి వారికి భవిష్యత్తుపై భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇక, ఏఐసీసీ సంస్థాగత వ్యవహారాల ఇన్చార్జి కేసీ వేణుగోపాల్ హైదరాబాద్‌కు వచ్చినప్పుడు 15 మంది నేతలతో సమావేశమై బుజ్జగించారు. ఇన్ని ప్రయత్నాలు చేసిన తర్వాత కూడా 20 మందికి పైగా రెబెల్స్ నామినేషన్లు వేశారు. వీరిలో ఓ 10 మంది వెనక్కు తగ్గినా, మరో 10 మంది బరిలో ఉండే అవకాశముందని తెలుస్తోంది. వీరిలో ఎంతమంది బరిలో ఉంటారు? ఎంత మంది ఉపసంహరించుకుంటారనే దానిపై బుధవారం సాయంత్రానికి స్పష్టత రానుంది. పార్టీలు మారిన చాలా మంది రెబెల్స్‌గా నామినేషన్లు వేసిన వారితోపాటు చివరి క్షణంలో పార్టీలు మారిన వారి నుంచి ఎలాంటి ముప్పు వస్తుందోననే ఆందోళన కాంగ్రెస్ నేతల్లో వ్యక్తమవుతోంది. మునుగోడు నుంచి ముషీరాబాద్ వరకు, ఆదిలాబాద్ నుంచి నకిరేకల్ వరకు 20కి పైగా నియోజకవర్గాలకు చెందిన నాయకులు ఇటీవలే పార్టీ నుంచి వెళ్లిపోయారు. వీరిలో చాలా తక్కువ మంది బీజేపీలోకి వెళ్లగా, మెజార్టీ నేతలు గులాబీ కండువాలు కప్పుకున్నారు. చివరి క్షణం వరకు టికెట్ రేసులో ఉండి పార్టీ నుంచి వెళ్లిపోయిన నేతలు కాంగ్రెస్‌ను ఓడించాలనే ఏకైక లక్ష్యంతో పనిచేస్తున్నారు. వీరికితోడు మరో 10 మంది వరకు రెబెల్స్ బరిలో ఉండే అవకాశాలుండటంతో టికెట్ల ‘అసంతృప్తి’పార్టీ పుట్టి ముంచుతుందేమోనన్న ఆందోళన నేతల్లో వ్యక్తమవుతోంది. -
కేసీఆర్ కు బీఆర్ఎస్ నాయకులకే నమ్మకం లేదు: రేవంత్
-
నీ ముక్కు నేలకు రాస్తావా.. కేసీఆర్‌కు రేవంత్ సవాల్
సాక్షి, రంగారెడ్డి జిల్లా: కాంగ్రెస్ సృష్టించే సునామీలో బీఆర్ఎస్ కొట్టుకుపోతుందని రేవంత్‌రెడ్డి అన్నారు. శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని తుండుపల్లిలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో రేవంత్ మాట్లాడుతూ, దొరల తెలంగాణ కావాలా?.. ప్రజల తెలంగాణ కావాలా?. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రూ.4వేల పెన్షన్ ఇస్తాం. తెలంగాణలో అన్ని వర్గాలకు అన్యాయం జరిగింది. తెలంగాణలో రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమే’’ అంటూ ధీమా వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ పార్టీ శంషాబాద్ మండలానికి చేసింది ఏమీ లేదని జాతీయస్థాయిలో శంషాబాద్‌కు పేరు తెచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీ దేననన్నారు. శంషాబాద్‌కు అంతర్జాతీయ విమానాశ్రయం తెచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్కిందన్నారు. ఔటర్ రింగ్‌రోడ్‌తో పాటు మెట్రో రైల్, సాఫ్ట్వేర్ కంపెనీలు తెచ్చింది కాంగ్రెస్సేనన్నారు. జీవో 111 పేరుతో రాజేంద్రనగర్ నియోజకవర్గ ప్రజలను ప్రతిసారీ మోసం చేస్తూ ఎన్నికలను తెస్తున్నారని తెలిపారు. ఎన్నికలు వచ్చిన ప్రతిసారి జీవో 111 ఎత్తివేస్తామంటూ గెలుస్తున్నారన్నారు. బడా నాయకులు ఫామ్ హౌస్‌లు, విల్లాలు కట్టుకుంటే జీవో 111 వర్తించదు. కానీ అదే పేదోడు చిన్న ఇల్లు కడితే మాత్రం 111 జీవో అడ్డు వస్తుందని రేవంత్ మండిపడ్డారు. 24 గంటల ఉచిత విద్యుత్ ఇచ్చినట్టు బీఆర్ఎస్ పార్టీ నిరూపిస్తే రాజేంద్రనగర్ నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి కస్తూరి నరేందర్‌తో పాటు తాను కూడా నామినేషన్ ఉపసంహరిస్తామని లేదంటే.. 8 గంటల విద్యుత్ ఇస్తున్నారని నిరూపిస్తే శంషాబాద్ బస్టాండ్ ముందు ఉన్న అంబేద్కర్ విగ్రహం ముందు ముక్కు నేలకు రాస్తావా అంటూ కేసీఆర్‌కు రేవంత్ సవాల్ విసిరారు. చదవండి: రేవంత్ మాటమార్చి బుకాయిస్తున్నడు: మంత్రి హరీష్‌రావు -
ఉచిత విద్యుత్ పేటెంట్ కాంగ్రెస్‌దే..
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: రైతులు బాగు పడాలని ఉచిత కరెంట్ ఆలోచన చేసినదే కాంగ్రెస్ పార్టీ అని, అసలు ఉచిత విద్యుత్ గురించి చెప్పుకొనే పేటెంట్ హక్కు తమ పార్టీకే ఉందని టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. 2004లో ముఖ్యమంత్రి పదవీ బాధ్యతలు స్వీకరించినప్పుడు వైఎస్ రాజశేఖరరెడ్డి వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌పైనే తొలి సంతకం చేశారని, రూ.1,200 కోట్ల విద్యుత్ బకాయిల ను రద్దు చేసి, రైతులపై ఉన్న అక్రమ కేసులను సైతం తొలగించారని గుర్తు చేశారు. అలాంటి కాంగ్రెస్‌పై బీఆర్ఎస్, ఆ పార్టీ నేతలు అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తాను రైతులకు 24 గంటల కరెంట్ వద్దు.. 3, 5 గంటలు చాలని అన్నట్టు దుష్ప్రచారం చేస్తు న్నారని.. తాను అలా ఎక్కడ అన్నానో నిరూ పించాలని సవాల్ విసిరారు.ఉమ్మడి పాల మూ రు జిల్లాలోని అలంపూర్, గద్వాల, మక్తల్ నియోజకవర్గాల పరిధిలో మంగళవారం నిర్వ హించిన ప్రజాగర్జన సభల్లో రేవంత్‌రెడ్డి మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే.. ‘‘అలంపూర్ సాక్షిగా చెబుతున్నా.. ఏదైనా ఒక సబ్‌స్టేషన్‌కు వెళ్లి పరిశీలిద్దాం. రైతులకు 24 గంటల కరెంట్ ఇస్తే నా నామినేషన్ వాపస్ తీసుకుంటా. లేకుంటే ఇదే నడిగడ్డ మీద సీఎం కేసీఆర్ ముక్కు నేలకు రాసి రైతులకు క్షమాపణలు చెప్పాలి. వస్తావా? లేక తీసేసిన అబ్రహమో, కొత్త అభ్యర్థి పేరు తెల్వదు గానీ దొరగారి గడీల బానిస వస్తాడా.. లేక కేటీ ఆర్‌ను పంపిస్తావా? కర్ణాటకలో మా ప్రభుత్వం ఉంది. మిత్రుడు డిప్యూటీ సీఎం డీకే శివ కుమార్, సీఎం సిద్ధరామయ్యతో నేను, అలంపూర్ సంపత్‌కుమార్ కూర్చొని మాట్లాడి తుమ్మిళ్ల ప్రాజెక్టు సమస్యను పరిష్కరిస్తాం. కృష్ణా పుష్కరాల సందర్భంగా రూ.100 కోట్లతో జోగుళాంబ ఆలయాన్ని అభివృద్ధి చేస్తానన్న కేసీఆర్ హామీ ఏమైంది? ముదిరాజ్‌లు అక్కర్లేదా? తెలంగాణలో 11 శాతం ఉన్న ముదిరాజ్‌లకు బీఆర్ఎస్ ఒక్క టికెట్ ఇవ్వలేదు. ఇవాళ ముదిరాజ్‌ల ఓట్లు అక్కర్లేకుండా పోయాయా? కేసీఆర్ సమాధానం చెప్పాలి. హేమాహేమీలు పోటీపడ్డా ముదిరాజ్‌లకు సముచిత స్థానం కల్పించేందుకే వారికి కాంగ్రెస్ పార్టీ టికెట్లు ఇచ్చింది. మక్తల్‌లో వాకిటి శ్రీహరి, రాజేంద్రనగర్‌లో నరేందర్, గోషామహల్లో సునీతారావు, పటాన్చెరులో నీలం మధుకు టికెట్ ఇచ్చాం. ధరణి కంటే మెరుగైన విధానం తెస్తాం సీఎం కేసీఆర్ కుటుంబం ధరణిని దోపిడీకి వాడుకుంటోంది. ధరణి వారికి ఏటీఎంగా మారింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ధరణి కంటే నాణ్యమైన విధానాన్ని తీసుకొకొచ్చి భూములను కాపాడుతాం. ఎక్కడైతే డబుల్ బెడ్రూం ఇళ్లు ఇచ్చారో అక్కడ బీఆర్ఎస్ ఓట్లు అడగాలి. ఎక్కడైతే ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చామో అక్కడ కాంగ్రెస్ ఓట్లు అడుగుతుంది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 24 గంటలపాటు ఉచిత విద్యుత్ ఇచ్చే బాధ్యతను తీసుకుంటుంది. ధరణి రద్దు చేస్తే రైతుబంధు పోతుందని అబద్ధాలు మాట్లాతున్నారు. ధరణి లాంటిది లేకుండానే వైఎస్ హయాంలో రైతులకు రుణమాఫీ, బీమా సౌకర్యం, ఎరువుల సబ్సిడీ ఇవ్వలేదా? లక్ష కోట్ల దోపిడీ జరిగింది ఎవరో పనిమంతుడు పందిరేస్తే.. కుక్కతోక తగలగానే కూలిపోయిందట. కాళేశ్వరం పరిస్థితి అట్లా ఉంది. మేడిగడ్డ కడితే భూమిలోకి కుంగిపోయింది. అన్నారం కడితే ఫక్కున పగిలిపోయింది. సుందిళ్ల రేపోమాపో కూలేటట్టు ఉంది. ఇక మీ పాపం పండిపోయింది. కాళేశ్వరం ప్రాజెక్ట్ పేరిట రూ.లక్ష కోట్ల దోపిడీకి పాల్పడ్డారు. ఇప్పటికే తప్పుడు వాగ్దానాలతో కేసీఆర్ రెండు సార్లు సీఎం అయ్యారు. పది వేల ఎకరాల భూములను అక్రమంగా సంపాదించుకున్నారు. ఆయన ఇంట్లో అల్లుడు, బిడ్డ, కొడుక్కు పదవులు ఇచ్చారు. మూడోసారి గెలిస్తే మనవడికి కూడా పదవి ఇచ్చేలా ఉన్నారు. గుడిని, గుడిలోని లింగాన్ని మింగేసే కేసీఆర్‌ను మళ్లీ గెలిపిస్తే కృష్ణా నదిలో ముంచేస్తారు. దొరల తెలంగాణ కావాలా.. ప్రజల తెలంగాణ కావాలా.. ప్రజలు ఆలోచించుకోవాలి. కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి..’’ అని రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఈ సభల్లో కాంగ్రెస్ అభ్యర్థులు సంపత్‌కుమార్, సరిత తిరుపతయ్య, వాకిటి శ్రీహరి, మాజీ ఎమ్మెల్యే సీతాదయాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఎన్నికల్లో కలిసి పనిచేసే అంశంపై కోదండరాంతో చర్చలు జరిపాం : రేవంత్ రెడ్డి
-
‘చేయి’స్తారా!
సాక్షి, హైదరాబాద్/సాక్షి నెట్వర్క్: కాంగ్రెస్ అభ్యర్థుల రెండో జాబితాపై రాష్ట్ర వ్యాప్తంగా ఆ పార్టీ నేతల్లో తీవ్ర నిరసన, అసంతృప్తి వ్యక్తమవుతోంది. టికెట్లు ఆశించి భంగపడిన పలువురు నేతలు టీపీసీసీ అధ్యక్షుడిపై, అధిష్టానంపై మండిపడుతున్నారు. దొంగ సర్వేలు నిర్వహించి, వాటి పేరిట తమ వారికి టికెట్లు అమ్ముకున్నారని, పార్టీని నమ్ముకుని పనిచేస్తున్న వారిని కాదని పారాచూట్ నేతలకు టికెట్లు కేటాయించారని తీవ్రస్థాయిలో ఆరోపణలు గుప్పిస్తున్నారు. తమను మోసం చేసిన వారిని ఎన్నికల్లో ఓడిస్తామంటూ కొందరు బహిరంగంగానే శపథం చేస్తున్నారు. పార్టీ తమకు న్యాయం చేస్తుందనే ఆశతో, ఎంతో ఉత్కంఠతో రెండో జాబితా కోసం ఎదురుచూసిన మరికొందరు భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. కొందరు ఏదేమైనా బరిలోకి దిగుతామంటుంటే (రెబల్స్), మరికొందరు ఏకంగా రాజీనామాల బాట పట్టారు. మరోవైపు పలువురు నేతల అనుచరులు నిరసన కార్యక్రమాలకు దిగారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యాలయం గాందీభవన్పై మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్‌రెడ్డి అనుచరులు కొందరు రాళ్ల దాడి చేశారు. తమ నేతకు జూబ్లీహిల్స్ టికెట్ ఇవ్వనందుకు నిరసనగా పార్టీ జెండాలను తగులపెట్టారు. ఇటుక పెళ్లలను విసరడంతో రేవంత్‌రెడ్డి ఫ్లెక్సీకి రంధ్రం పడింది. పార్టీతో తెగదెంపులు: టికెట్ దక్కనందుకు నిరసనగా కాంగ్రెస్ అనుబంధ విభాగమైన మైనార్టీ సెల్ చైర్మన్ సోహైల్ తన పదవికి రాజీనామా చేశారు. పార్టీతో 34 ఏళ్ల అనుబంధాన్ని తెంచుకుంటున్నానని ప్రకటించారు. ఈ మేరకు ఖర్గేకు లేఖ పంపినట్లు ఆయన తెలిపారు. తెలంగాణ కాంగ్రెస్ తాళం ఆర్ఎస్ఎస్, ఏబీవీపీ చేతుల్లో ఉందన్నారు. పాత కాంగ్రెస్‌ను రేవంత్‌రెడ్డి చంపేశారని ఆరోపించారు. డిసెంబర్ 3 తర్వాత గాందీభవన్‌లో ఒక్కరు కూడా కనిపించరని అన్నారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజక వర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ ఆశించిన పీసీసీ ప్రధాన కార్యదర్శి వడ్డేపల్లి సుభాష్‌రెడ్డి కూడా కాంగ్రెస్‌కు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. శనివారం కార్యకర్తలతో సమావేశమైన ఆయన తనకు పార్టీ అన్యాయం చేసిందని బోరుమన్నారు. ఆయన్ను చూసి కార్యకర్తలు కూడా కంటతడి పెట్టారు. గత ఎన్నికల్లో తాను టికెట్ త్యాగం చేశానని, ఈసారి ఇస్తామని చెప్పి చివరకు డబ్బులకు అమ్ముకున్నారని ఆరోపించారు. ఎల్లారెడ్డి నుంచి బరిలోకి దిగుతానని, కాంగ్రెస్ అభ్యర్థి మదన్మోహన్రావ్ను ఓడించి తీరతానని శపథం చేశారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నానని, త్వరలోనే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని పార్టీ నేత, ఎన్ఆర్ఐ విజయ్‌కుమార్‌రెడ్డి చెప్పారు. ముధోల్ కాంగ్రెస్ టికెట్‌ను ఎంతకు అమ్ముకున్నారో రేవంత్‌రెడ్డి చెప్పాలన్నారు. అమెరికాలో ఉన్న తనను ఇక్కడికి రప్పించి టికెట్ ఇస్తామని ఆశ చూపి పని చేయించుకున్నారని, ఇప్పుడు వేరే అభ్యర్థికి టికెట్ అమ్ముకుని తనను మోసం చేశారని ఆరోపించారు. కాగా ఆయన అనుచరులు, కార్యకర్తలు కాంగ్రెస్ ఫ్లెక్సీలను చించివేసి తగులబెట్టారు. తిరుగుబాటు బావుటాలు టికెట్ దక్కని కాంగ్రెస్ ఆశావహులు కొందరు ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకుంటున్నారు. కొందరు పార్టీని ధిక్కరించి ఎన్నికల బరిలో నిలిచేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. వడ్డేపల్లి సుభాష్‌రెడ్డితో పాటు మునుగోడు టికెట్ రాని చల్లమల్ల కృష్ణారెడ్డి, హుస్నాబాద్ టికెట్ ఆశించిన అలిగిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి, వరంగల్ వెస్ట్‌లో జంగా రాఘవరెడ్డి, ఆసిఫాబాద్‌లో ముందు నుంచి పనిచేస్తున్న తనను కాదని శ్యామ్‌నాయక్‌కు టికెట్ కేటాయిచండంపై మండిపడుతున్న ఆదివాసీ మహిళా నాయకురాలు మర్సుకోలు సరస్వతి స్వతంత్ర అభ్యర్థులు రంగంలో ఉంటామని స్పష్టం చేశారు. అనుచరులతో సమావేశాలు ఏర్పాటు చేసుకుని ఒకట్రెండు రోజుల్లో భవిష్యత్ కార్యాచరణ ప్రకటించేందుకు సిద్ధమవుతున్నారు. కాగా అధిష్టానం తనను వంచించిందని హుస్నాబాద్ నేత అలిగిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. యుద్ధానికి సిద్ధంగా ఉన్నా.. వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో తాను యుద్ధానికి ఆయుధంతో సిద్ధంగా ఉన్ననని, ప్రజలు గెలిపించడానికి సిద్ధంగా ఉన్నానని డీసీసీబీ మాజీ చైర్మన్ జంగా రాఘవరెడ్డి తెలిపారు. నాయిని రాజేందర్‌రెడ్డికి ఏ సర్వే ప్రకారం టికెట్ ఇచ్చారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఇక నర్సాపూర్ టికెట్ ఆవుల రాజిరెడ్డికి కేటాయించడంపై టికెట్ ఆశించి భంగపడిన పీసీసీ ఉపాధ్యక్షుడు గాలి అనిల్‌కుమార్, ముఖ్యనాయకులు రెడ్డిపల్లి ఆంజనేయులు, సోమన్నగారి రవీందర్‌రెడ్డి రగిలిపోతున్నారు. హత్నూర మండలంలోని ఓ ఫాంహౌస్‌లో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. తక్షణం అభ్యర్థిని మార్చాలని, లేకుంటే తమ ముగ్గురిలో ఒకరు స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగుతామని హెచ్చరించారు. పరకాల నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జి ఇనగాల వెంకట్రామ్రెడ్డి.. అవసరమైతే ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తానని అనుచరులతో చెప్పినట్లు తెలిసింది. రాహుల్ సభను అడ్డుకుంటామంటున్నారు.. తనకు టికెట్ ఇవ్వకపోవడానికి నిరసనగా వచ్చే నెల 1న జడ్చర్లలో జరిగే రాహుల్‌గాంధీ బహిరంగ సభను అడ్డుకుంటామని తన అనుచరులు చెబుతున్నారని మాజీ ఎమ్మెల్యే ఎర్రశేఖర్ చెప్పారు. కార్యకర్తలు, అనుచరులతో చర్చించి భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటానని ఆయన అన్నారు. బెల్లంపల్లి కాంగ్రెస్ టికెట్ స్థానికులకు ఇవ్వకుంటే రెండ్రోజుల్లో సమావేశమై భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని మాజీ ఎమ్మెల్సీ కె.ప్రేమ్‌సాగర్‌రావు వర్గీయులు ప్రకటించారు. బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి వన్నెల అశోక్ అభ్యర్థిత్వాన్ని రద్దు చేయాలని ఆడె గజేందర్ అనుచరులు, కాంగ్రెస్ నాయకులు అధిష్టానాన్ని డిమాండ్ చేశారు. ఇదేవిధంగా వరంగల్ తూర్పు నియోజకవర్గం నుంచి కొండా సురేఖ టికెట్‌ను వెనక్కి తీసుకుని, స్థానికులకు పోటీ చేసే అవకాశం ఇవ్వాలని అసంతృప్తి నేతలు పలువురు డిమాండ్ చేశారు. లేనిపక్షంలో పోటీ బరిలోకి దిగాలనే నిర్ణయం తీసుకున్నట్లు మాజీ డిప్యూటీ మేయర్ ఎంబాడి రవీందర్ తెలిపారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంపై కూడా కాంగ్రెస్ అధిష్టానం పునరాలోచించాలని, సర్వేలన్నీ తనకే అనుకూలంగా ఉన్నప్పటికీ తనకు కాకుండా ఇతరులకు టికెట్ కేటాయించడం సమంజసం కాదని పీసీసీ కార్యదర్శి, ప్రచార కమిటీ సభ్యుడు దండెం రాంరెడ్డి అన్నారు. మల్రెడ్డి రంగారెడ్డిని కొనసాగిస్తే తాపే రెబల్ అభ్యర్థిగా పోటీలో ఉండడం ఖాయమని స్పష్టం చేశారు. నిరాశలో యువనేతలు కాంగ్రెస్ పార్టీ టికెట్లు ఆశించిన పలువురు యువ నేతలు నిరాశ నిస్పృహల్లో మునిగిపోయారు. ముఖ్యంగా ఎన్ఎస్యూఐ, యూత్ కాంగ్రెస్, గిరిజన విభాగం అధ్యక్షులు బల్మూరి వెంకట్, శివసేనారెడ్డి, బెల్లయ్య నాయక్‌లు ఈసారి తప్పకుండా తమకు పోటీ చేసే అవకాశం వస్తుందని భావించారు. కానీ వారికి అధిష్టానం గ్రీన్‌సిగ్నల్ ఇవ్వలేదు. ముఖ్యంగా హుజూరాబాద్ టికెట్‌ను బల్మూరి వెంకట్‌కు కేటాయించకపోవడంపై పార్టీలో చర్చ జరుగుతోంది. ఈటల రాజేందర్ రాజీనామా చేసిన సందర్భంగా జరిగిన ఉప ఎన్నికల్లో చివరి నిమిషంలో ఆయనకు టికెట్ ఇచ్చి బలి పశువును చేశారని, ఆ తర్వాత కూడా పార్టీ కోసం ఎంత కష్టపడినా వెంకట్‌కు పార్టీ గుర్తింపు ఇవ్వలేదని అంటున్నారు. రేవంత్‌పై ఫిర్యాదుకు సిద్ధం టికెట్లు రాని నేతలు కొందరు పార్టీ నాయకత్వంపై, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిపై బహిరంగ విమర్శలకు దిగుతున్నారు. పార్టీ టికెట్లను అమ్ముకుంటున్నారని కొందరు ఆరోపించడం గమనార్హం. మరోవైపు రేవంత్‌రెడ్డిపై పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేసేందుకు అసమ్మతి నేతలు సిద్ధమయ్యారు. శనివారం లక్డీకాపూల్‌లోని సెంట్రల్ కోర్టు హోటల్లో కొందరు నేతలు రహస్యంగా సమావేశమయ్యారు. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజిక వర్గాల పట్ల రేవంత్ రెడ్డి కుట్రపూరితంగా వ్యవహరించారని ఆవేదనతో ఉన్న నేతలు ఈ భేటీకి హాజరైనట్లు సమాచారం. అద్దంకి దయాకర్, రాములు నాయక్ తదితరులు పాల్గొన్నారని, తమ భవిష్యత్తు కార్యచరణపై సమాలోచనలు జరిపారని తెలుస్తోంది. రెబల్ అభ్యర్థులుగా పోటీ చేయాలనే నిర్ణయానికి కూడా వచ్చినట్టు సమాచారం. అభ్యర్థిత్వాలను సమీక్షించండి: సీనియర్ల లేఖ టికెట్ల కేటాయింపు తీరుపై సీనియర్లలోనూ అంతర్గతంగా తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. టికెట్ల ఖరారు ప్రాతిపదికకు అర్థం లేకుండా పోయిందని, ఏళ్ల తరబడి పార్టీని పట్టుకుని వేలాడిన వారిని పట్టించుకోకుండా ఇతర పార్టీల నుంచి చేర్చుకున్న వారికి పట్టం కట్టారని వాపోతున్నారు. కొందరు సీనియర్లు పార్టీ అధిష్టానానికి లేఖ రూపంలో తమ ఆవేదన వ్యక్తం చేశారు. ‘దశాబ్దాలుగా పార్టీతో కలిసి నడుస్తున్న నేతలు, కేడర్‌లో అభ్యర్థులను ఎంపిక చేసిన తీరు తీవ్ర అసంతృప్తిని కలిగిస్తోంది. రెండు జాబితాల్లో ప్రకటించిన అభ్యర్థులను చూస్తే ప్యారాచూట్లకు మాత్రమే ప్రాధాన్యమిచ్చారని, పార్టీకి విధేయులుగా ఉండి ఎన్నికలను ఎదుర్కొనగలిగిన సత్తా ఉన్న నాయకులను పార్టీ అధిష్టానం విస్మరించిందనే అభిప్రాయం ఏర్పడుతోంది. కేడర్ మనోభావాలను పరిగణనలోకి తీసుకుని తొలి రెండు జాబితాల్లో ప్రకటించిన పేర్లను సమీక్షించాలి. అప్పుడే పార్టీ కేడర్‌లో విశ్వాసం పెరగడంతో పాటు పార్టీపై సానుకూల దృక్పథం ఏర్పడుతుంది..’ అని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సంస్థాగత వ్యవహారాల ఇన్చార్జి కేసీ వేణుగోపాల్‌కు పంపిన లేఖలో సీనియర్ నేతలు కోరారు. -
నాలుగు సీట్లను వామపక్షాలకు కేటాయించిన కాంగ్రెస్
-
ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రాబబుల్స్ జాబితా
-
Telangana: ఇంతకీ కాంగ్రెస్ ప్లాన్ ఏంటి?
ఇది జంపింగ్ జపాంగ్‌ల టైమ్. ఆ పార్టీలో సీటు రాకపోతే.. ఈ పార్టీలోకి.. ఈ పార్టీలో సీటు రాకపోతే ఆ పార్టీలోకి..ఇలా పార్టీలన్నీ కప్పల తక్కెళ్ళ మాదిరిగా తయారయ్యాయి. గులాబీ పార్టీ టిక్కెట్లు ప్రకటించేసింది. కాంగ్రెస్ సగం ఇచ్చింది. బీజేపీ ఇంకా ప్రకటించలేదు. దీంతో పక్క పార్టీల్లోకి వెళ్ళే నాయకులు బిజీగా తయారయ్యారు. ముఖ్య నేతల దగ్గర కొందరు జాయిన్ అవుతుంటే.. మరికొందరు ఎక్కడికక్కడ స్థానికంగా తమకు అవకాశం ఉన్న పార్టీలో చేరిపోతున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ ఆపరేషన్ లోకల్ అంటూ ముందుకు సాగుతోంది? ఇంతకీ కాంగ్రెస్ ప్లాన్ ఏంటి? , ఈసారి కాంగ్రెస్ పార్టీ చాలా మారిపోయింది. గెలుపు గుర్రాలైతే ఎక్కడి నుంచి వచ్చారన్నది చూడకుండా టిక్కెట్లు ఇచ్చేస్తోంది. కొద్ది రోజుల క్రితం ప్రకటించిన సగం సీట్ల అభ్యర్థుల్లో 11 మంది కొత్తవారు ఉన్నారని పార్టీలోని సీనియర్లు కొందరు రగిలిపోతున్నారు. తమకు సీట్లెందుకు ఇవ్వలేదని అగ్రనాయకత్వాన్ని ముఖ్యంగా పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డిని నిలదీస్తున్నారు. గాంధీభవన్‌లో కూడా ఆందోళనలు జరిగాయి. ఇక జనగాం టిక్కెట్ ఆశించి భంగపడిన సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య రేవంత్‌రెడ్డి తీరును తీవ్రంగా తప్పుపట్టారు. తన నియోజకవర్గంలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ బహిరంగసభలో ఆయన సమక్షంలోనే గులాబీ కండువా కప్పుకున్నారు. ఇక నాగర్‌కర్నూల్ టిక్కెట్ ఆశించిన మరో సీనియర్ నేత నాగం జనార్థనరెడ్డి కూడా రేవంత్ రెడ్డి టిక్కెట్లు అమ్ముకుంటున్నారంటూ కామెంట్స్ చేశారు. నాగర్ కర్నూల్లో కాంగ్రెస్ ఎలా గెలుస్తుందో చూస్తా అంటూ నాగం ఛాలెంజ్ చేశారు. ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే. మొత్తం రాష్ట్రమంతా ఆశావహులు పార్టీ నాయకత్వం మీద ముఖ్యంగా పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి మీద రగలిపోతున్నారు. ఒకవైపు పార్టీలోని సీనియర్లు టిక్కెట్లు రాలేదని, ఇక రాబోదని నాయకత్వం మీద తిరుగుబాటు చేస్తుంటే..మరోవైపు రేవంత్‌రెడ్డి జెట్ స్పీడ్‌లో ఇతర పార్టీల్లోని సీనియర్లను, టిక్కెట్లు రానివారిని కాంగ్రెస్‌లో చేర్చుకుంటున్నారు. కొందరితో మంతనాలు జరుపుతున్నారు. ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో ఇప్పటికే పలువురు ఎమ్మెల్యే స్థాయి నేతలను చేర్చుకుంది హస్తం పార్టీ. ఇక అన్ని నియోజకవర్గాల్లో బలమైన నాయకత్వం ఏర్పడడంతో కాంగ్రెస్ పార్టీ పోల్ మేనేజ్మెంట్ పై దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. బూత్ స్థాయిలో బలమైన క్యాడర్ కోసం ఆపరేషన్ లోకల్ పేరుతో అన్వేషణ మొదలు పెట్టింది హస్తం పార్టీ. ముఖ్యంగా అధికార పార్టీ నేతలే టార్గెట్ గా ఈ చేరికలు జరుగుతున్నట్లు కనిపిస్తోంది. మున్సిపల్ ఛైర్మన్ ల నుంచి గ్రామ సర్పంచ్ ల వరకు పలు పార్టీల నేతలకు కాంగ్రెస్ కండువా కప్పుతూ చేరికల స్పీడ్ పెంచారు కాంగ్రెస్ నేతలు. బూత్ స్థాయిలో బలహీనంగా ఉన్న ప్రాంతాల వివరాలను ఇప్పటికే సునీల్ కనుగోలు టీం పీసీసీకి రిపోర్ట్ అందించింది. దీంతో పార్టీ బలహీనంగా ఉన్న బూత్ లలో ఆపరేషన్ ఆకర్ష్ అమలు చేస్తోంది టీ కాంగ్రెస్. ఇప్పటికే పీసీసీ ఛీఫ్ రేవంత్ రెడ్డి ఇంటి దగ్గర రోజూ పదుల సంఖ్యలో సర్పంచ్ లు, ఎంపీటీసీలు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. మరోవైపు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలోనూ చేరికలు జరుగుతున్నాయి. బీఆర్ఎస్ జీహెఎంసీ కార్పోరేటర్లు జగదీశ్వర్ గౌడ్ తో పాటు ఆయన భార్య పూజిత , షాద్‌నగర్‌కు చెందిన సర్పంచులు ప్రతాప్, బాల్ రాజ్, గోపాల్, మంజుల కాంగ్రెస్ పార్టీలో చేరారు. వికారాబాద్ చెందిన ఎంపీపి హన్మంతురెడ్డితో పాటు వివిధ జిల్లాలకు చెందిన పలువురు స్థానిక ప్రజాప్రతినిధులు రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. ఇక నల్లగొండ మున్సిపల్ వైస్ ఛైర్మన్ రమేష్ గౌడ్‌తో పాటు ఆరుగురు కౌన్సిలర్లు కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. కోదాడ మాజీ ఎమ్మెల్యే చందర్ రావు , శశిథర్ రెడ్డితో పాటు పలువురు సర్పంచ్ లు, జెడ్పీటీసీ లు కాంగ్రెస్ లో చేరారు. ఇదే ఫార్ములా ను రాష్ట్రం మొత్తం అమలు చేయాలని కాంగ్రెస్ ప్లాన్ చేస్తోంది. మండవ వెంకటేశ్వరరావు, రేవూరి ప్రకాశ్‌రెడ్డి, ఆకుల లలిత వంటి సీనియర్లతోనూ మంతనాలు జరుగుతున్నాయి. స్థానిక నేతల బలం పెరిగితే ఎన్నికల్లో పోల్ మేనేజ్మెంట్ ఈజీ అవుతుందని టీ కాంగ్రెస్ భావిస్తోంది. అందుకోసమే స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు గాలం వేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఆపరేషన్ లోకల్ కాంగ్రెస్ పార్టీకి ఎంత మేరకు ఉపయోగపడుతుందో చూడాలి. -
తెలంగాణ కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ కీలక భేటీ
ఢిల్లీ: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో భాగంగా కాంగ్రెస్ రెండో జాబితా ఖరారుకు సంబంధించి పార్టీ ముఖ్య నేతలో స్క్రీనింగ్ కమిటీ సమావేశం శనివారం సాయంత్రం ప్రారంభమైంది. ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ నివాసంలో తెలంగాణ కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ సమావేశం జరుగుతోంది. ఈ సమావేశానికి స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ మురళీధరన్, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, మల్లు భట్టి విక్రమార్క, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తదితరులు హాజరయ్యారు. ఈ భేటీ తర్వాత తెలంగాణ కాంగ్రెస్ రెండో జాబితా ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. రెండో జాబితాను అతి త్వరగా విడుదల చేయాలని చూస్తోన్న కాంగ్రెస్.. ఈ సమావేశంలో అభ్యర్థులను దాదాపు ఖరారు చేసే అవకాశంఉంది. ‘క్లిక్ చేసి వాట్సాప్ ఛానెల్ ఫాలో అవ్వండి’’ -
మద్యం, డబ్బుతో కేసీఆర్ సిద్ధం: రేవంత్
సాక్షి, హైదరాబాద్: మద్యం, డబ్బు పంచకుండా ఎన్నికల్లో పోటీ చేసేలా అమరవీరుల స్థూపం వద్ద ప్రమాణం చేయాలంటూ తాను విసిరిన సవాల్‌ను ముఖ్యమంత్రి కేసీఆర్ స్వీకరించకపోవడంతో ఈ విషయంలో బీఆర్ఎస్ వైఖరి అర్థమైందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి విమర్శించారు. మునుగోడు, హుజూరాబాద్ తరహాలో మరోసారి మద్యం, డబ్బుతో ఎన్నికల్లో పోటీకి కేసీఆర్ సిద్ధమయ్యారని ఆరోపించారు. కాంగ్రెస్ మాత్రం ఆరు గ్యారంటీలతోనే ఎన్నికలకు వెళుతుందని, డబ్బు, మద్యం పంపిణీ చేయదని స్పష్టం చేశారు. మంగళవారం గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. మేం ఎక్కడా మద్యం, డబ్బు పంచలేదు దేశంలోనే హుజూరాబాద్ అత్యంత ఖరీదైన ఎన్ని కని ఆనాడు విశ్లేషకులు చెప్పారని రేవంత్ గుర్తు చేశారు. మునుగోడులో కూడా మద్యం ఏరులై పారిందని విమర్శించారు. కానీ కాంగ్రెస్ ఆ రెండు చోట్లా చుక్క మందు కానీ, డబ్బు కానీ పంచలేద న్నారు. తెలంగాణ ప్రజలు కోరుకున్న స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమాన అభివృద్ధిని కేసీఆర్ పక్కనబెట్టారన్నారు. నీళ్లు, నిధులు, నియామకాల ను తన కుటుంబానికే పరిమితం చేశారని ఆరోపించారు. నిరుద్యోగ యువతి ప్రవళిక ఆత్మహత్య చేసుకుంటే.. ఆ కుటుంబం పరువును మంటగలి పేలా ప్రభుత్వం వ్యవహరించిందని ధ్వజమెత్తారు. ప్రవళిక మరణంపై తప్పుడు వ్యాఖ్యలు చేసిన పోలీస్ అధికారిపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయనున్నట్లు చెప్పారు. ప్రవళిక కుటుంబ సభ్యు లను తాను రాహుల్‌గాంధీ వద్దకు తీసుకెళ్లాలను కుంటే.. ప్రగతిభవన్‌లో బంధించారని అన్నారు. కేసీఆర్, కేటీఆర్ ఉద్యోగాలను ఊడగొట్టాలి రాష్ట్రంలో రిటైర్డ్ అయిన అధికారులను ప్రభుత్వం ఎందుకు కొనసాగిస్తోందని, వీరికి ఎన్నికల నియ మావళి వర్తించదా? అని రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. బంధువులు, కావలసిన కొందరు రిటైర్డ్ అధికారు లను ప్రైవేటు సైన్యంగా చేసుకొని కేసీఆర్ తమపై దాడులు చేయిస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలన్నింటినీ రెట్టింపు చేసి కేసీఆర్ మేనిఫెస్టోలో పెట్టారని, కానీ 2 లక్షల ఉద్యోగాల ఊసు ఎందుకు ఎత్తలేదని ప్రశ్నించారు. ఈ 45 రోజులు ప్రతి నిరుద్యోగ యువకుడు ముందుకొచ్చి కేసీఆర్, కేటీఆర్ ఉద్యోగాలను ఊడగొట్టాలని, అప్పుడే రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయని అన్నారు. నిరుద్యోగులు కేసీఆర్‌పై కదం తొక్కాలని, 30 లక్షల నిరుద్యోగ యువకులు కాంగ్రెస్‌కు ఓటు వేయడంతో పాటు తల్లిదండ్రులతో కూడా వేయిస్తే 90 లక్షల ఓట్లతో పాటు 90 సీట్లు వస్తాయని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగా నే జాబ్ క్యాలండర్ ప్రకారం ఉద్యోగ నియామకా లు చేపడుతుందని హామీ ఇచ్చారు. ఒక ఆడబిడ్డ కుటుంబాన్ని అవమానించేలా వ్యవహరించిన ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలన్నారు. గోషామహల్లో ఎంఐఎం పోటీ చేయదా? కామారెడ్డిలో కాంగ్రెస్ నుంచి ఎన్నికవుతూ వస్తున్న షబ్బీర్ అలీ అనే మైనారిటీ నేతను ఓడించేందుకు కేసీఆర్ అక్కడి నుంచి పోటీ చేస్తున్నారని రేవంత్‌రెడ్డి ధ్వజమెత్తారు. ఓ మైనారిటీని ఓడించేందుకు పోటీ చేస్తున్న కేసీఆర్‌కు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ మద్దతివ్వడం వెనుకున్న ఒప్పందం ఏంటని ప్రశ్నించారు. అలాగే ఎంఐఎంను, ఒవైసీ కుటుంబాన్ని దూషించిన బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై ఎంఐఎం ఎందుకు పోటీ చేయడం లేదో చెప్పాల న్నారు. మోదీ, కేసీఆర్, అసదుద్దీన్ ఒవైసీ ముగ్గురు ఒక్కటేనని, వారి ఒప్పందంలో భాగంగానే గోషా మహల్లో రాజాసింగ్‌పై ఎంఐఎం పోటీ చేయడం లేదని చెప్పారు. -
అక్కడికి రా.. ప్రమాణం చేద్దాం?.. సీఎం కేసీఆర్‌కు రేవంత్ సవాల్
సాక్షి, హైదరాబాద్: ‘కాంగ్రెస్ నిర్ణయాలు కాపీ కొట్టడంలో కేసీఆర్ బిజీబిజీ అయ్యారు.. మా అభ్యర్థులను ప్రకటించే దాకా కేసీఆర్ బీఫారం లు ఇవ్వలేదు’’ అంటూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఎద్దేవా చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, మేం 55 మందిని ప్రకటిస్తే కేసీఆర్ 51 మందికే బీ ఫామ్‌లు ఇచ్చారు. కేసీఆర్ లాగా మేం ఉత్తుత్తి హామీలు ఇవ్వలేదు. మేం ఇచ్చిన హామీలన్నీ ఆచరణకు సాధ్యమే’’ అని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ‘‘కాంగ్రెస్ ఇచ్చిన హామీలు సాధ్యమేనని కేసీఆర్ రాజముద్ర వేశారు. మా ఆరు గ్యారెంటీ స్కీమ్లకే కొంత డబ్బులు పెంచారు. మా గ్యారెంటీ స్కీమ్ చూసి కేసీఆర్ పెద్ద లోయలో పడిపోయారు. కేసీఆర్‌కి ఆలోచన చేసే శక్తి తగ్గిపోయింది. కేసీఆర్ ఇప్పుడు పరాన్నజీవి’’ అని రేవంత్ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ హామీలను కేసీఆర్ తన మేనిఫెస్టోలో పెట్టారు. రాబోయే ఎన్నికల్లో పైసా ఇవ్వకుండా, మందు పోయకుండా ప్రజల్లోకి వెళ్దామా?. 17న మధ్యాహ్నం 12 గంటలకు అమరవీరుల స్థూపం వద్ద నువ్వు, నేను ప్రమాణం చేద్దామా? అంటూ రేవంత్ సవాల్ విసిరారు. ‘‘నవంబర్ నెల 1వ తేదీన పెన్షన్లు, జీతాలు వేస్తే కేసీఆర్‌ను ప్రజలు నమ్ముతారు. కేసీఆర్ ఇచ్చిన అనేక హామీలు నెరవేర్చలేదు. బ్లాక్ అండ్ వైట్ సినిమాను కలర్లో వేసినట్టు పాత అంశాలను మేనిఫెస్టోలో పెట్టారు. మేం పొగ పెడితే బొక్కలో ఉన్న ఎలుక బయటకి వచ్చింది. అవినీతికి బ్రాండ్ అంబాసిడర్ కేసీఆర్.. కేసీఆర్ ఎక్పైరీ డేట్ అయిపోయింది. కేసీఆర్ ఎన్నికల బరిలో నుండి తప్పుకుంటే మంచిది’’ అంటూ రేవంత్ వ్యాఖ్యానించారు. చదవండి: బీఆర్ఎస్ మేనిఫెస్టో.. కేసీఆర్ హామీలివే.. -
Telangana Congress: 70 సీట్లు ఓకే!
సాక్షి, న్యూఢిల్లీ/ సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల కోసం అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను కాంగ్రెస్ పార్టీ ఓ కొలిక్కి తెచ్చింది. రాజకీయ అనుభవం, కుల సమీకరణాలు, ఆర్ధిక పరిస్థితులు, సర్వేలను బేరీజు వేసుకుంటూ దాదాపు 70 స్థానాల్లో అభ్యర్థులను కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ ఖరారు చేసింది. కమిటీ సభ్యుల మధ్య ఏకాభిప్రాయం కుదరని మిగతా సీట్లకు అభ్యర్థుల ఎంపికపై మరో సారి భేటీ అయి చర్చించాలని నిర్ణయించింది. ఏకాభిప్రాయం రాని స్థానాలకు ఇద్దరు చొప్పున పేర్లతో జాబితా సిద్ధం చేసి పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ (సీఈసీ)కి పంపాలని.. వారు ఇచ్చే మార్గదర్శకాలకు అనుగుణంగా పేర్లను ఖరారు చేయాల ని తీర్మానించింది. ఇప్పటికే ఒక్కో పేరును ఖరారు చేసిన నియోజకవర్గాల జాబితాకు సీఈసీ అను మతి తీసుకుని విడుదల చేయాలని నిర్ణయించింది. ఈ నెల 14 తర్వాత సీఈసీ భేటీ అయి అభ్యర్థుల జాబితాలను పరిశీలించనుందని.. ఈ నేపథ్యంలో ఈ నెల 16న లేక 18న తొలి జాబితాను విడుదల చేసే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. అయితే ఈ నెల 15 నుంచి ముఖ్య నేతలతో బస్సు యాత్ర చేపట్టాలని టీపీసీసీ నిర్ణయించడంతో.. ఆ బస్సు యాత్ర పూర్తయ్యాక అభ్యర్థుల జాబితాను ప్రకటించే ఆలోచన కూడా ఉందని అంటున్నాయి. వాడీవేడిగా సమావేశం.. అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ ఆదివారం ఢిల్లీలోని కాంగ్రెస్ వార్‌రూమ్‌లో భేటీ అయింది. కమిటీ చైర్మన్ మురళీధరన్ అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్‌రావ్ ఠాక్రే, రేవంత్‌రెడ్డి, భట్టి విక్రమార్క, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, మధుయాష్కీగౌడ్, ఎన్నికల వ్యూహకర్త సునీల్ కనుగోలు, ఇతర కార్యదర్శులు హాజరయ్యారు. ఈ సందర్భంగా గత నెలలో ఖరారు చేసిన కొన్ని స్థానాలు సహా మొత్తంగా 70 సీట్లలో అభ్యర్థులను ఖరారు చేసి.. ఒక్కో పేరుతో జాబితాను పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ (సీఈసీ) ఆమోదానికి పంపాలని నిర్ణయించినట్టు తెలిసింది. సుమారు 10 గంటల పాటు సుదీర్ఘంగా జరిగిన ఈ భేటీ ఆసాంతం నేతల వాదనలు, అభిప్రాయాలతో వాడీవేడీగానే జరిగినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. కొన్ని నియోజకవర్గాలపై సభ్యుల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడం, ఇంకొన్ని చోట్ల కుల సమీకరణాలపై ఎవరి వాదన వారే వినిపించడంతో సమావేశం హీటెక్కినట్టు పేర్కొన్నాయి. ముఖ్యంగా డోర్నకల్, మహబూబాబాద్, జూబ్లీహిల్స్, ఆసిఫాబాద్, జనగాం, నారాయణఖేడ్, ఎల్లారెడ్డి, జుక్కల్, సికింద్రాబాద్, నర్సాపూర్ నియోజకవర్గాల అభ్యర్థుల ఖరారు అంశంపై నేతలు వేర్వేరు పేర్లను సూచించినట్టు తెలిసింది. సర్వేల ఆధారంగా గెలవగలిగే వారిని ఖరారు చేయాలని కొందరు సూచిస్తే.. సీనియారిటీ, పార్టీకి పనిచేసిన అనుభవం, ఆర్థిక, కుల సమీకరణాల ఆధారంగా ఎంపిక ఉండాలని ఇంకొందరు పట్టుబట్టినట్టు సమాచారం. ఉద్యమకారులకు టికెట్లు ఇవ్వాలంటూ.. టికెట్ల కేటాయింపులో తమకు ప్రాధాన్యం ఇవ్వాలంటూ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి సంఘాల నేతలు, ఉద్యమకారులు కాంగ్రెస్ వార్‌రూమ్ ముందు నిరసనకు దిగారు. టికెట్లు ఆశిస్తున్న కురువ విజయ్‌కుమార్ (గద్వాల), మానవతారాయ్ (సత్తుపల్లి), పున్నా కైలాశ్ నేత (మునుగోడు), దుర్గం భాస్కర్ (చెన్నూరు), కేతూరి వెంకటేశ్ (కొల్లాపూర్), ఇతర నేతలు అక్కడ ఆందోళన చేశారు. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన తమకు టికెట్లు ఇవ్వాలని, ఉదయ్‌పూర్ డిక్లరేషన్‌ను అమలు చేయాలని ప్లకార్డులు ప్రదర్శించారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జితేంద్రసింగ్ వారితో మాట్లాడి, అన్ని అంశాలను పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. వీలైనంత త్వరగా తొలి జాబితా: ఠాక్రే ఆదివారం రాత్రి స్క్రీనింగ్ కమిటీ భేటీ అనంతరం పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్ రావ్ ఠాక్రే మీడియాతో మాట్లాడారు. పార్టీ సీఈసీ సమావేశానికి ముందు మరోమారు స్క్రీనింగ్ కమిటీ భేటీ ఉంటుందని.. వీలైనంత త్వరగా అభ్యర్థుల జాబితాను సీఈసీకి అందిస్తామని చెప్పారు. త్వరలోనే తొలి జాబితాను విడుదల చేస్తామని వెల్లడించారు. వివిధ సామాజికవర్గాల నుంచి దరఖాస్తులు వచ్చాయని, పీసీసీ నుంచి ఒక జాబితా వచ్చిందని తెలిపారు. వచ్చిన అన్ని దరఖాస్తులను స్క్రీనింగ్ కమిటీ భేటీలో పరిశీలించామని.. అన్నివర్గాలకు తగిన ప్రాతినిధ్యం ఉండేలా చూస్తున్నామని వివరించారు. అయితే టికెట్ల ఖరారులో తుది నిర్ణయం పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీదే (సీఈసీ)నని చెప్పారు. కాగా.. త్వరలో సీఈసీ సమావేశం ఉండే అవకాశం ఉందని, వారం, పది రోజుల్లో తొలి జాబితా విడుదల చేస్తామని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. తొలి జాబితాలో ఉండే అభ్యర్థులు ఇలా.. (పీసీసీ వర్గాల సమాచారం మేరకు) 1. కొడంగల్ – రేవంత్‌రెడ్డి 2. హుజూర్నగర్ – ఉత్తమ్‌కుమార్‌రెడ్డి 3. కోదాడ – పద్మావతి 4. మధిర – భట్టి విక్రమార్క 5. మంథని – శ్రీధర్‌బాబు 6. జగిత్యాల – జీవన్‌రెడ్డి 7. ములుగు – సీతక్క 8. భద్రాచలం – పొదెం వీరయ్య 9. సంగారెడ్డి – జగ్గారెడ్డి 10. నల్గొండ – కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి 11. అలంపూర్ – సంపత్‌కుమార్ 12. నాగార్జునసాగర్ – కుందూరు జైవీర్ రెడ్డి 13. కామారెడ్డి – షబ్బీర్ అలీ 14. పాలేరు – తుమ్మల నాగేశ్వర్రావు 15. కొత్తగూడెం – పొంగులేటి శ్రీనివాసరెడ్డి 16. పరిగి – రామ్మోహన్‌రెడ్డి 17. వికారాబాద్ – గడ్డం ప్రసాద్‌కుమార్ 18. మహేశ్వరం – చిగురింత పారిజాత నర్సింహారెడ్డి 19. ఆలేరు – బీర్ల ఐలయ్య 20. దేవరకొండ – ఎన్.బాలూనాయక్ 21. వేములవాడ – ఆది శ్రీనివాస్ 22. ధర్మపురి – అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ 23. జడ్చర్ల – అనిరుధ్‌రెడ్డి 24. నాంపల్లి – ఫిరోజ్ ఖాన్ 25. కోరుట్ల– జువ్వాడి నర్సింగ్‌రావు 26. అచ్చంపేట – వంశీకృష్ణ 27. జహీరాబాద్ – ఎ.చంద్రశేఖర్ 28. ఆందోల్ – దామోదర రాజనర్సింహ 29. మంచిర్యాల – ప్రేమ్‌సాగర్‌రావు 30. కొల్లాపూర్ – జూపల్లి కృష్ణారావు 31. ఆదిలాబాద్ – కంది శ్రీనివాస్‌రెడ్డి 32. వరంగల్ ఈస్ట్ – కొండా సురేఖ 33. భూపాలపల్లి – గండ్ర సత్యనారాయణ 34. షాద్‌నగర్ – వీర్లపల్లి శంకర్ 35. నిజామాబాద్ అర్బన్ – ధర్మపురి సంజయ్ 36. ఎల్బీనగర్ – మధుయాష్కీగౌడ్ 37. కల్వకుర్తి– కసిరెడ్డి నారాయణరెడ్డి 38. అశ్వారావుపేట– తాటి వెంకటేశ్వర్లు 39. పటాన్చెరు – కాట శ్రీనివాస్‌గౌడ్ 40. సూర్యాపేట – ఆర్.దామోదర్‌రెడ్డి 41. గద్వాల – సరితా తిరుపతయ్య 42. నాగర్‌కర్నూల్ – కూచుకుళ్ల రాజేశ్‌రెడ్డి 43. మేడ్చల్ – తోటకూర జంగయ్య యాదవ్ 44. ముషీరాబాద్ – అంజన్‌కుమార్ యాదవ్ 45. శేరిలింగంపల్లి – రఘునాథ్ యాదవ్ 47. ముథోల్ – ఆనందరావు పటేల్ 48. బెల్లంపల్లి – గడ్డం వినోద్‌కుమార్ 49. ఇల్లెందు – కోరం కనకయ్య 50. చొప్పదండి – మేడిపల్లి సత్యం 51. నారాయణపేట – ఎర్ర శేఖర్ 52. రామగుండం – రాజ్‌ఠాకూర్ 53. వరంగల్ వెస్ట్ – నాయిని రాజేందర్‌రెడ్డి 54. గజ్వేల్ – తూంకుంట నర్సారెడ్డి 55. నిర్మల్ – శ్రీహరిరావు 56. భువనగిరి – కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి 57. పెద్దపల్లి – విజయరమణారావు 58. నర్సంపేట – దొంతి మాధవరెడ్డి 59. పాలకుర్తి – హనుమాండ్ల ఝాన్సీ 60. మహబూబ్‌నగర్ – యెన్నం శ్రీనివాస్‌రెడ్డి 61. ఇబ్రహీంపట్నం – మల్రెడ్డి రంగారెడ్డి 62. ఖానాపూర్ – ఎడ్మ బొజ్జు 63. బాల్కొండ – ఆరెంజ్ సునీల్‌రెడ్డి 64. రాజేంద్రనగర్ – జ్ఞానేశ్వర్ ముదిరాజ్ 65. హుస్నాబాద్ – పొన్నం ప్రభాకర్ 66. తాండూర్ – వై.మనోహర్‌రెడ్డి 67. సిరిసిల్ల – కేకే మహేందర్‌రెడ్డి 68. దుబ్బాక – చెరుకు శ్రీనివాస్‌రెడ్డి 69. మల్కాజ్గిరి – మైనంపల్లి హన్మంతరావు 70. కంటోన్మెంట్ – వెన్నెల (గద్దర్ కుమార్తె) -
రావణుడిగా రాహుల్ మార్ఫింగ్ ఫోటో.. తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ నిరసన
సాక్షి, హైదరాబాద్: నేడు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలకు టీపీసీసీ పిలుపునిచ్చింది. రాహుల్ గాంధీ ఫోటోలను మార్ఫింగ్ చేసి రావణుడిగా చిత్రీకరించి.. బీజేపీ నేతలు సోషలో మీడియాలో ప్రచారం చేస్తున్నారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. బీజేపీ, మోదీ దిష్టిబొమ్మను దగ్ధం చేయాలని పిలుపునిచ్చారు. దీంతో అన్ని జిల్లాల్లో నిరసన కార్యక్రమాలకు కాంగ్రెస్ నేతలు సిద్ధమయ్యారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై బీజేపీ చేసిన ట్వీట్ వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. రావణుడి అవతారంలో రాహుల్ గాంధీ ఫొటోను బీజేపీ ట్విట్టర్లో షేర్ చేసింది. ఇక, రాహుల్ ఫొటోకు మరింత వివాదాస్పదంగా టైటిల్‌ను పెట్టింది. దుర్మార్గుడు, ధర్మ వ్యతిరేకి, రాముడికి వ్యతిరేకి అంటూ కింద క్యాప్షన్ రాసుకొచ్చింది. భారత దేశాన్ని నాశనం చేయడమే రాహుల్ గాంధీ లక్ష్యం అంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతూ కామెంట్స్ చేసింది. ఈ వివాదాస్పద ఫొటోపై కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. చదవండి: 15 నుంచి కాంగ్రెస్ బస్సుయాత్ర! -
ఇక టీపీసీసీ స్క్రీనింగ్ కమిటీ సమావేశం లేనట్టే
-
ఓటుకు కోట్లు కేసులో రేవంత్ రెడ్డి జైలుకెళ్లడం ఖాయం: హరీష్ రావు
-
‘కాంగ్రెస్‌ను అడ్డుకోవడం నీ వల్ల కాదు.. నీ అయ్య వల్ల కూడా కాదు’
హైదరాబాద్: వారంటీ లేని కాంగ్రెస్ పార్టీకి గ్యారెంటీ లేదంటూ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలను చూసి తండ్రికి చలి జ్వరం పట్టుకుంటే కొడుకేమే పూర్తిగా మతి తప్పి మాట్లాడుతున్నాడని మండిపడ్డారు రేవంత్‌రెడ్డి. నిండా అవినీతిలో మునిగి, నిద్రలో కూడా కమీషన్ల గురించి కలవరించే మీరా కాంగ్రెస్ గురించి మాట్లాడేది అంటూ విమర్శనాస్త్రాలు సంధించారు. పక్క రాష్ట్రంపై నీ గాలి మాటలను కాసేపు పక్కనబెట్టి,తెలంగాణలో మీ కల్వకుంట్ల SCAMILY గురించి చెప్పు. దళిత బంధులో 30 శాతం కమీషన్లు దండుకుంటున్నమని స్వయంగా మీ అయ్యనే ఒప్పుకున్న సంగతి గురించి చెప్పు. లిక్కర్ స్కామ్ లో మీ చెల్లి రూ.300 కోట్లు వెనకేసిందని దేశమంతా చెప్పుకుంటున్న మాటల గురించి చెప్పు.భూములు, లిక్కర్ అమ్మితే తప్ప తెలంగాణలో పాలన నడుస్తలేదని కాగ్ కడిగేసిన విషయం గురించి చెప్పు. తెలంగాణలో ఎన్ని ప్రభుత్వ భూములను అమ్ముకున్నరో, ఎన్నిఎకరాలను మీ రియల్ ఎస్టేట్ మాఫియాకు కట్టబెట్టిండ్రో, ఎంత మంది మీ బినామీ బిల్డర్లతో హైదరాబాద్ మాఫియా సామ్రాజ్యాన్ని నడిపిస్తున్నరో, ఎన్ని లక్షల చ. అడుగుల స్థలాలు మీ మాఫియా కబంధ హస్తాల్లో చిక్కుకున్నయో.. అన్నీ లెక్కలతో సహా తేలుస్తాం. కాంగ్రెస్‌ను అడ్డుకోవడం నీ వల్ల కాదు.. నీ అయ్య వల్ల కూడా కాదు’ అని మండిపడ్డారు. కాంగ్రెస్ 6 గ్యారంటీలను చూసి తండ్రికి చలి జ్వరం పట్టుకుంటే, కొడుకేమో పూర్తిగా మతి తప్పినట్టుగా మాట్లాడుతున్నడు. నిండా అవినీతిలో మునిగి, నిద్రలో కూడా కమీషన్ల గురించే కలవరించే మీరా కాంగ్రెస్ గురించి మాట్లాడేది? పక్క రాష్ట్రంపై నీ గాలి మాటలను కాసేపు పక్కనబెట్టి, తెలంగాణలో మీ… https://t.co/8UceqyxnLD — Revanth Reddy (@revanth_anumula) September 30, 2023 చదవండి: నేను పురుషులకంటే మెరుగ్గానే పనిచేస్తా: గవర్నర్ సంచలన వ్యాఖ్యలు -
ఖరారుకు ముందే తకరారు
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీలో అసెంబ్లీ టికెట్లు ఎవరెవరికి ఇచ్చేదీ ఇంకా ఖరారుకాక ముందే అసమ్మతి సెగ మొదలైంది. స్క్రీనింగ్ కమిటీ సమావేశాల్లో జరుగుతున్న చర్చలు, ఖరారయ్యాయని భావిస్తున్న స్థానాల గురించిన సమాచారం బయటికి వస్తుండటంతో అసంతృప్తులు గళం విప్పుతున్నారు. పార్టీ టికెట్లను అమ్ముకుంటున్నారంటూ.. మహేశ్వరం నియోజకవర్గానికి చెందిన నాయకుడు కొత్త మనోహర్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర కాంగ్రెస్‌లో తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఆశావహుల గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీలో బీసీలు, ఎస్టీలు, ఎస్సీలు, మాల, మాదిగ, లంబాడీ, ఆదివాసీ, పార్టీ అనుబంధ సంఘాలు, ఇతర కేటగిరీల పేరుతో ఇప్పటికే టికెట్ల కోసం డిమాండ్లు వినిపిస్తున్న నేపథ్యంలో.. టికెట్ల ప్రకటన తర్వాత పరిస్థితి ఇంకెలా ఉంటుందోనన్న చర్చ జరుగుతోంది. ఇప్పటికే ఢిల్లీకి బీసీ నేతలు ఈసారి బీసీలకు టికెట్ల కేటాయింపు కాంగ్రెస్‌లో పెద్ద చిచ్చు రాజేసేలా కనిపిస్తోంది. ప్రతి పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో రెండు చొప్పున 34 స్థానాలు బీసీలకు ఇస్తామని రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం మాట ఇచ్చింది. ఈ మేరకు తమకు కనీసం 34 అసెంబ్లీ టికెట్లు ఇవ్వాలని.. వాటిని 40 వరకు పెంచాలని బీసీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఇందుకోసం హైదరాబాద్ వేదికగా పలుమార్లు సమావేశం కావడంతోపాటు ఇప్పుడు హస్తిన బాట పట్టారు. బీసీ నేతలు బుధవారమే ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలవాల్సి ఉన్నా.. ఆయన బెంగళూరులో ఉండటంతో వీలుకాలేదు. అందుబాటులో ఉన్న అధిష్టానం నేతలను కలుస్తున్న బీసీ నేతలు.. గురువారం ఖర్గేను, వీలుంటే రాహుల్‌ను కలిసే అవకాశం ఉందని సమాచారం. అయితే టీపీసీసీ నాయకత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుందా అన్న దానిపై బీసీ నేతలు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. సర్వేలలో మంచి ఫలితాలు రావడం లేదన్న సాకు చూపి తమకు ఇవ్వాల్సిన టికెట్లను అగ్రవర్ణాలకు కేటాయించే కుట్ర జరుగుతోందని ఆరోపిస్తున్నారు. అందుకే తొలి జాబితాలో బీసీ నేతల పేర్లు రాకుండా చేసి, వారిని టికెట్ ఒత్తిడిలో ఉంచి మిగతా వారి కోసం మాట్లాడకుండా చేయాలనే ప్రయత్నమని పేర్కొంటున్నారు. ఈసారి టికెట్ల కేటాయింపులో తేడా వస్తే సహించేది లేదని స్పష్టం చేస్తున్నారు. అయితే టికెట్లు ఆశిస్తున్న బీసీల్లో ఎక్కువ శాతం అగ్రవర్ణ నాయకులతోనే పోటీ పడుతుండటంతో.. తమను కాదని ఓసీ నేతలకు టికెట్లు ఇస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరిస్తున్నారు. మాకు మరో మూడు సీట్లివ్వండి ఎస్టీ నేతలు కూడా తమకు తగిన ప్రాధాన్యం ఇవ్వాలని టీపీసీసీ పెద్దలను కోరుతున్నారు. 40–50 స్థానాల్లో ప్రభావితం చేయగల తమ సామాజిక వర్గానికి రిజర్వ్ అయిన 12 అసెంబ్లీ సీట్లకుతోడు కనీసం మరో 3 జనరల్ స్థానాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. రిజర్వుడు నియోజకవర్గాల్లో కూడా లంబాడా, కోయ (ఆదివాసీ) సామాజిక వర్గాలకు ఏయే సీట్లు ఇవ్వాలనే విభజన కూడా చేస్తున్నారు. దేవరకొండ, వైరా, ఖానాపూర్, బోథ్, మహబూబాబాద్, డోర్నకల్, ఇల్లందు స్థానాలు లంబాడాలకు ఇవ్వాలని.. ఆసిఫాబాద్‌లో ఆదివాసీలకు, ములుగు, భద్రాచలం, అశ్వారావుపేట, పినపాక కోయ వర్గానికి ఇవ్వాలని కోరుతున్నారు. అంతేగాకుండా తెలంగాణలో 31 లక్షలకు పైగా ఎస్టీ జనాభా ఉందని.. జనాభా ప్రాతిపదికన మరో మూడు జనరల్ స్థానాల్లో కూడా ఎస్టీలకు అవకాశం ఇవ్వాలని అంటున్నారు. మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్, నల్లగొండ డీసీసీ అధ్యక్షుడు శంకర్‌నాయక్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మరీ ఈ విజ్ఞప్తి చేశారు. ఇందుకోసం తాము కూడా బీసీ నేతల తరహాలోనే ఢిల్లీ వెళ్లి పార్టీ అధిష్టానాన్ని కలుస్తామని కూడా పేర్కొనడం గమనార్హం. బుజ్జగింపులు షురూ అసమ్మతి కుంపట్లపై ఓ అంచనాకు వచ్చిన కాంగ్రెస్ అధిష్టానం.. పరిస్థితిని చక్కదిద్దేందుకు రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్చార్జి మాణిక్‌రావ్ ఠాక్రేను రంగంలోకి దింపింది. స్క్రీనింగ్ కమిటీ సమావేశాలు ప్రారంభమవడానికి ముందే తన పని మొదలుపెట్టిన ఆయన ఇప్పుడు మరింత ముమ్మరం చేశారు. గాందీభవన్, ఎమ్మెల్యే క్వార్టర్స్ వేదికగా మంతనాలు జరుపుతున్నారు. నేతలతో మాట్లాడుతూ.. పార్టీపై నమ్మకం ఉంచాలని, టికెట్ వచ్చినా, రాకపోయినా సహకరించాలని కోరుతున్నారు. మొత్తమ్మీద టికెట్ల ప్రకటన ఘట్టం కోసం కాంగ్రెస్ పార్టీ నేతలు అటు ఉత్కంఠతోనూ, ఇటు ఆందోళనతోనూ ఎదురుచూస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఒక్కోచోట పది మంది.. కాంగ్రెస్ టికెట్ల కోసం పదిమందికిపైగా దరఖాస్తు చేసుకున్న స్థానాలు 50కి పైగా ఉన్నాయి. ఇందులో ఇద్దరు లేదా ముగ్గురు గట్టిగానే యత్నిస్తున్నారు. వివిధ సమీకరణాల్లో లాబీయింగ్ చేసుకుంటూ అధిష్టానాన్ని ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. ఈ నేపథ్యంలో ఏ ఒక్కరికి టికెట్ వచ్చినా మిగతా నేతలు రోడ్డెక్కే అవకాశాలున్నాయి. ముఖ్య నాయకులపై ఉన్న అసంతృప్తిని కక్కేసి ఇతర పార్టీలోకి వెళ్లిపోవాలని కొందరు, పార్టీలోనే ఉండి తమకు అన్యాయం చేసిన నేతలను బహిరంగంగా విమర్శించాలని మరికొందరున్నట్టు సమాచారం. టికెట్లు అమ్ముకుంటున్నారని ఆరోపించిన మహేశ్వరం నేత కొత్త మనోహర్‌రెడ్డిని సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించిన నేపథ్యంలో.. అధికారికంగా టికెట్లు ప్రకటించాక ఎన్ని చోట్ల అసమ్మతి రగులుతుంది? దాన్ని చల్లార్చే యత్నాలు ఏమేరకు గట్టెక్కుతాయి? టికెట్లు రాక రోడ్డెక్కేనేతలపై ఏ చర్యలు తీసుకునే అవకాశం ఉందన్న అంశాలు చర్చనీయాంశంగా మారాయి. -
కాంగ్రెస్‌లో ‘సర్వే’ల పీటముడి!
సాక్షి, హైదరాబాద్/న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ టికెట్ల ఖరారు ప్రక్రియలో ‘సర్వే’ల అంశంతో పీటముడి పడుతోంది. సర్వేల ప్రాతిపదికగానే టికెట్లు కేటాయిస్తామని ఏఐసీసీ, టీపీసీసీ నేతలు ముందునుంచీ చెప్తూనే ఉన్నా.. అలా చేస్తే ఇబ్బందికరమేనన్న వాదన పార్టీ నేతల్లో వినిపిస్తోంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ఢిల్లీలో జరిగిన స్క్రీనింగ్ కమిటీ సమావేశాల్లో 60 స్థానాలపై ఏకాభిప్రాయం వచ్చిందని, ఆయా స్థానాల్లో ఒక్కో పేరునే కేంద్ర ఎన్నికల కమిటీ (సీఈసీ)కి పంపాలని నేతలు నిర్ణ యించారు. మరో 30–35 సీట్లపై ఏకాభిప్రాయం రాలేదు. ఈ స్థానాల్లో సర్వేల్లో వెల్లడైన బలాబలాల ప్రకారమే అభ్యర్థులను ఖరారు చేయాలని కొందరు నేతలు ప్రతిపాదించగా.. ఈ ప్రతిపాదన సరికాదని మరికొందరు నేతలు పేర్కొంటున్నట్టు తెలిసింది. కొత్తగా వచ్చిన నాయకులను సర్వేల ఆధారంగా కొన్నిచోట్ల మాత్రమే ఖరారు చేయవచ్చని, మిగతా చోట్ల సర్వేలతోపాటు పార్టీకి విధేయత, ఇతర కోణాలనూ సరిచూసుకుని అభ్యర్థులను ఖరారు చేయాలని కోరినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో సర్వేలను పునఃపరిశీలించడంతోపాటు ఆశావహు లతో మాట్లాడి, టికెట్లు ఇవ్వలేని నేతలను బుజ్జగించేందుకు రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్చార్జి మాణిక్‌రావ్ ఠాక్రే ఈనెల 25న సమావేశం ఏర్పాటు చేస్తున్నట్టు తెలిసింది. ఆ భేటీ ముగిశాక ఈ నెల 28న లేదా 29న స్క్రీనింగ్ కమిటీ మరోమారు భేటీ అవుతుందని, అది ఢిల్లీలోనే జరిగే అవకాశం ఉందని పీసీసీ వర్గాలు చెప్తున్నాయి. ఈ భేటీ తర్వాత మెజార్టీ స్థానాలపై ఏకాభిప్రాయం తీసుకుని, సీఈసీ ఆమోదంతో ఒకేసారి జంబో జాబితా విడుదల చేస్తామని అంటున్నాయి. కొంత ఆలస్యమైనా ఎక్కువ సంఖ్యలో అభ్యర్థులను ఒకేసారి ప్రకటించడమే మేలనే అభిప్రాయంతో ఏఐసీసీ పెద్దలు ఉన్నారని వివరిస్తున్నాయి. ఈ క్రమంలో జాబితాల విడుదల వాయిదా పడే అవకాశమూ ఉందని పేర్కొంటున్నాయి. ఇక కాంగ్రెస్ టికెట్లు ఆశిస్తున్న నేతలు ఢిల్లీలో నేతల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ప్యారాచూట్లకు టికెట్లా? స్క్రీనింగ్ కమిటీలో జరిగిన చర్చ ప్రకారం ప్యారాచూట్లకు ఈసారి కూడా పెద్ద సంఖ్యలోనే టికెట్లు వచ్చే అవకాశం ఉందన్న దానిపై కాంగ్రెస్‌లోని సీనియర్ ఆశావహులు రగిలిపోతున్నారు. ప్యారాచూట్లకు టికెట్లు ఇవ్వబోమని, పార్టీ కోసం పనిచేసిన వారికే ప్రాధాన్యమిస్తామని అగ్రనేత రాహుల్‌గాంధీ, టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి పలుమార్లు ప్రకటించారని గుర్తు చేస్తున్నారు. ఆ ప్రకారం దశాబ్దాలుగా పార్టీకి సేవ చేస్తున్న తమకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. ఉప్పల్, గద్వాల, దుబ్బాక, మహబూబ్‌నగర్, ఆసిఫాబాద్ సహా పలుచోట్ల ప్యారాచూట్లకు ఇచ్చిన ప్రాధాన్యం తమకు ఇవ్వడం లేదని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పార్టీలోకి కొత్తగా వచ్చిన వారికి సర్వేలు ఎలా అనుకూలంగా ఉంటాయని ప్రశ్నిస్తున్నారు. పార్టీ బలంగా ఉండటంతోనే సర్వేలు అనుకూలంగా చూపుతున్నాయని.. అందువల్ల పార్టీలో ముందునుంచీ ఉన్నవారికే అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. వీరేశం చేరిక వాయిదా! నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం కాంగ్రెస్‌లో చేరే కార్యక్రమం వాయిదా పడింది. ఆయన శనివారమే రాహుల్ లేదా ఖర్గే సమక్షంలో పార్టీలో చేరుతారని భావించారు. కానీ ఆ ఇద్దరు నేతలు అందుబాటులో లేనందున వీరేశంతోపాటు వెళ్లిన ఆయన ప్రధాన అనుచరులు మాత్రం రేవంత్ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. అయితే ఈనెల 29న హైదరాబాద్‌లో జరిగే కార్యక్రమంలో వీరేశంతోపాటు ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్, మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు, ఆయన కుమారుడు రోహిత్ తదితరులు కాంగ్రెస్ కండువా కప్పుకుంటారని సమాచారం. అవకాశాన్ని బట్టి అగ్రనేతలు అందుబాటులో ఉంటే ఢిల్లీలోనే చేరికల కార్యక్రమం ఉంటుందన్న చర్చ జరుగుతోంది. కాగా వికారాబాద్ జిల్లా తాండూరుకు చెందిన మున్సిపల్ మాజీ చైర్మన్ సంపత్ కుమార్, వ్యాపారవేత్త పి.శ్రీనివాస్‌రెడ్డి తదితరులు శనివారం ఢిల్లీలో రేవంత్ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. -
విజయభేరి సభలో ఎలాంటి చేరికలు ఉండవు: టీపీసీసీ
సాక్షి, హైదరాబాద్: సెప్టెంబర్ 17న తుక్కుగూడలో జరిగే విజయభేరి సభలో ఎలాంటి చేరికలు ఉండవని టీపీసీసీ పేర్కొంది. ఆ సభ కేవలం ఆరు గ్యారంటీల ప్రకటన కోసం ప్రత్యేకించినది తెలిపింది. కాంగ్రెస్‌లో చేరాలనుకుంటున్న నేతలు ఎక్కడికక్కడ చేరికలు జరగాలని వెల్లడించింది. ఈరోజు ఉదయం 10 గంటలకు ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి నివాసంలో జిట్టా బాలకృష్ణ రెడ్డి కాంగ్రెస్‌లో చేరగా.. కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు కోమటిరెడ్డి. ఇక ఈరోజు (శనివారం) సాయంత్రం తాజ్‌కృష్ణ హోటల్లో జరిగే సీడబ్ల్యూసీ సమావేశంలో మల్లికార్జున ఖర్గే సమక్షంలో తుమ్మల పార్టీలో చేరనున్నారు. అనంతరం సోనియా గాంధీ రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీలతో తుమ్మల కలవనున్నారు. మరికొందరు తాజ్ కృష్ణ హోటల్లోనే కాంగ్రెస్ అగ్ర నాయకుల సమక్షంలో పార్టీలో చేరనున్నారు. ఇవాళ cwc సమావేశం తర్వాత కానీ, రేపు సమావేశం ముందు కానీ అగ్ర నేతల సమయాన్ని భట్టి చేరకలుఉ ండనున్నాయి. పార్టీలో చేరనున్న నాయకులను సిద్ధంగా ఉండాలని ఇప్పటికే పీసీసీ సమాచారం ఇచ్చింది. చదవండి: Live: సీడబ్ల్యూసీ.. హైదరాబాద్ చేరుకున్న సోనియా, రాహుల్, ప్రియాంక -
రెండో రోజు టీపీసీసీ మేనిఫెస్టో కమిటీ భేటీ
సాక్షి, హైదరాబాద్: రానున్న ఎన్నికల్లో ఓటర్లకు ఇచ్చే హామీల కూర్పుపై టీపీసీసీ మేనిఫెస్టో కమిటీ వరుసగా రెండోరోజు సమావేశమైంది. మేనిఫెస్టో కమిటీ చైర్మన్, మాజీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అధ్యక్షతన బుధవారం గాంధీభవన్‌లో జరిగిన ఈ సమావేశానికి సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, కమిటీ సభ్యులు హాజరై మేనిఫెస్టోలో పొందుపర్చా ల్సిన అంశాలపై చర్చించారు. కాగా, మాజీ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి నేతృత్వంలోని సోషల్ డెమొక్రటిక్ ఫోరం ప్రతినిధులు గాంధీభవన్‌కు వచ్చి మేనిఫెస్టో కమిటీతో చర్చించారు. తెలంగాణలో విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల అభివృద్ధి, అవినీతి నిర్మూలన, రాష్ట్రంలో చేపట్టాల్సిన కులగణన వంటి అంశాలపై కమిటీకి పలు సూచనలందించారు. దామోదర రాజనర్సింహ, పొన్నాల లక్ష్మయ్య, మేనిఫెస్టో కమిటీ వైస్ చైర్మన్ గడ్డం ప్రసాద్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. నేడు చార్జిషీట్ కమిటీ సమావేశం టీపీసీసీ చార్జిషీట్ కమిటీ భేటీ గురువారం గాంధీభవన్‌లో కమిటీ చైర్మన్ సంపత్‌కుమార్ అధ్యక్షతన జరగనుంది. అలాగే మధ్యాహ్నం 12 గంటలకు జెట్టి కుసుమకుమార్ అధ్యక్షతన టీపీసీసీ కమ్యూనికేషన్స్ కమిటీ సమావేశం జరగనున్నట్టు గాంధీభవన్ వర్గాలు తెలిపాయి. -
తెలంగాణలోనూ ‘గృహలక్ష్మి’?
సాక్షి, హైదరాబాద్: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో మహిళల ఓట్ల వర్షం కురిపించిన ‘గృహలక్ష్మి’ పథకాన్ని తెలంగాణలోనూ అమలు చేస్తామని హామీ ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతోంది. ఈనెల 17వ తేదీన తుక్కగూడలో నిర్వహించే భారీ బహిరంగ సభ వేదికగా ఈ పథకాన్ని సోనియా గాంధీ చేత ప్రకటింపజేయాలని యోచిస్తోంది. కుటుంబ యజమాని హోదాలో ప్రతి మహిళకు నెలకు రూ.2వేల నగదు సాయం చేయడం ద్వారా పెరిగిన గ్యాస్, నిత్యావసరాల ధరలను సర్దుబాటు చేసుకునేందుకు వీలుగా ఈ పథకాన్ని అమలు చేసి మహిళలకు అండగా నిలుస్తామని ప్రకటించనున్నట్టు తెలుస్తోంది. ఈసారి ఎన్నికల్లో అధికారంలోకి రావడమే ధ్యేయంగా హిమాచల్‌ప్రదేశ్, కర్ణాటక ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ఐదు గ్యారంటీ కార్డు స్కీంల సంప్రదాయాన్ని తెలంగాణలోనూ కొనసాగించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఈ ఐదు గ్యారంటీ కార్డు స్కీంలలో ఏయే పథకాలను ప్రకటించాలన్న దానిపై టీపీసీసీ పెద్ద కసరత్తే చేస్తోంది. ఓటు బ్యాంకు బ్రేక్ చేయాల్సిందే..! ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై క్షేత్రస్థాయిలో తీవ్ర వ్యతిరేకత ఉందనే అంచనాల్లో కాంగ్రెస్ పార్టీ ఉంది. వరుసగా మూడోసారి బీఆర్ఎస్కు ఓటేయాల్సి రావడం కూడా ప్రజలను ఆలోచింప చేస్తోందని కూడా ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. కానీ, పింఛన్, రైతుబంధు, కేసీఆర్ కిట్లు, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లాంటి సంక్షేమ పథకాల ద్వారా మహిళలు పెద్ద స్థాయిలోనే లబ్ధి పొందుతున్నారు. ప్రత్యక్ష రాజకీయాలు పెద్దగా పట్టని గ్రామీణ మహిళా లోకం ఆలోచనలు ఎలా ఉంటాయనే గుబులు కాంగ్రెస్ పార్టీలో మొదటి నుంచీ వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో రూ.500కే గ్యాస్‌సిలిండర్ ఇస్తామని ప్రకటించడం ద్వారా మహిళలను ఆకర్షించాలని భావించింది. అయితే, ఈ కార్యక్రమం అమలు కోసం నిన్న మొన్నటి వరకు రూ.1,100 ఉన్న వంటగ్యాస్ సిలిండర్‌ను రూ.500కు ఇవ్వాలంటే ఆ మేరకు రూ.600 నగదు బదిలీ జరగాల్సి ఉంటుంది. ఎలాగూ నగదు బదిలీ చేయాల్సినందున కర్ణాటక తరహాలో రూ.2వేల నగదు సాయం అందించే గృహలక్ష్మి లాంటి పథకాన్ని ప్రకటిస్తే గంపగుత్తగా మహిళల ఓట్లు పొందే అవకాశముందని భావిస్తోంది. బీఆర్ఎస్ ఓటు బ్యాంకును కచ్చితంగా బ్రేక్ చేయవచ్చనే ఆలోచనతోనే ఈ పథకాన్ని గ్యారంటీ కార్డు స్కీంలలో పొందుపర్చనున్నట్టు తెలుస్తోంది. ఇక, రూ. 2 లక్షల వరకు రైతు రుణమాఫీ, నెలకు రూ. 4 వేల పింఛన్ పథకాలను ఐదు స్కీంలలో చేరుస్తామని, మిగిలిన రెండింటిలో ఒకటి బీసీ వర్గాలకు, మరొకటి మైనార్టీ వర్గాలకు లేదంటే ఎస్సీ, ఎస్టీల కోసం ప్రకటించే అవకాశముందని గాంధీభవన్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. రూ. లక్ష కోట్ల పైనే ఆదా చేయొచ్చు.. దీనిపై టీపీసీసీ ముఖ్య నేత ఒకరు మాట్లాడుతూ ‘కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులు కట్టి రూ.లక్ష కోట్లు పెట్టారు. ఇప్పుడు ఆ ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉండదు. ఈ డబ్బులన్నింటినీ సంక్షేమ పథకాలకు అమలు చేస్తే ఐదేళ్లు సంక్షేమ పాలన వర్ధిల్లుతుంది. వీటికి తోడు సెక్రటేరియట్‌కు పెట్టిన రూ.1,500 కోట్లు, మిషన్‌భగీరథకు వెచ్చించిన రూ.45 వేల కోట్లు... ఇలా లెక్కపెట్టుకుంటూ పోతే కమీషన్ల కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన మరో లక్ష కోట్ల రూపాయలను ఆదా చేయవచ్చు. ఆ నిధులతో సంక్షేమాన్ని డబుల్ ఇంజిన్‌తో ముందుకు తీసుకెళ్లవచ్చు. పథకాలను ఆషామాషీగా ప్రకటించడం కాంగ్రెస్‌కు అలవాటు లేదు. నాడు రైతులకు ఉచిత విద్యుత్, రైతు రుణమాఫీ నుంచి నేటి కర్ణాటక పథకాల అమలు వరకు కాంగ్రెస్ చెప్పిందే చేస్తుంది. అన్ని లెక్కలు కట్టిన తర్వాతే ఈ పథకాలపై ప్రజలకు హామీ ఇస్తున్నాం. అందుకే తుక్కుగూడ సభలో సోనియాగాంధీ చేత ఐదు గ్యారంటీ స్కీంలపై హామీ ఇప్పించబోతున్నాం. సోనియా హామీ ఇచ్చిన విధంగా తెలంగాణ ఎలా ఇచ్చారో ఈ హామీలను కూడా అలాగే నిజం చేస్తామనే భరోసా ప్రజల్లో కల్పిస్తాం.’ అని వ్యాఖ్యానించారు. నిధుల సమీకరణ ఎలా? కాంగ్రెస్ పార్టీ ప్రకటిస్తున్న పథకాలు అమల య్యేవి కావని, అధికారంలోకి వచ్చే అవకాశా లు లేనందునే రోజుకో డిక్లరేషన్‌ను ప్రకటిస్తు న్నారని బీఆర్ఎస్, బీజేపీలు విమర్శిస్తున్నాయి. అర్థం లేకుండా పథకాలు ప్రకటిస్తున్నారని, ఇవన్నీ ఇచ్చాక అభివృద్ధి ఎలా చేస్తారనే ప్రశ్న కూడా రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. అయితే, ఇందుకు దీటైన సమాధానం తమ దగ్గర ఉందని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. తాము మొదటి నుంచీ ఆరోపిస్తున్న విధంగా పాలనలో అవినీతిని నిర్మూలించి, రిటైరయిన వారికి నామినేటెడ్ పదవుల పేరిట కోట్ల రూపాయల జీతాలను నివారిస్తే తమ పథకాల అమలు అసాధ్యమేమీ కాదని వారంటున్నారు. అలాగే పథకాల అమలులో పారదర్శకతతో పాటు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు, నిధులను సద్వినియోగం చేసుకుంటే ఆయా పథకాలను ఇబ్బంది లేకుండా అమలు చేయొచ్చని చెబుతున్నారు. -
T Congress: అంతా హైకమాండ్ కంట్రోల్లోకి..
సాక్షి, హైదరాబాద్: ఎన్నికలు తరుముకొస్తున్న వేళ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలన్నింటినీ ఏఐసీసీ హ్యాండోవర్ చేసుకుందా? ఈసారి తెలంగాణలో గెలుపు అవకాశాలున్నాయనే అంచనాల నేపథ్యంలో టీపీసీసీకి సంబంధించిన కీలక నిర్ణయాలన్నీ ఢిల్లీలోనే జరుగుతున్నాయా? రాష్ట్ర పార్టీ నేతల అభిప్రాయాలను గౌరవిస్తున్నామన్న భావన కల్పిస్తూనే చేయాల్సిందంతా అధిష్టానమే చేస్తోందా? తెలంగాణ కాంగ్రెస్ పార్టీలోని తాజా పరిణామాలను గమనిస్తే.. అవుననే సమాధానమే వస్తోంది. పార్టీ కమిటీల ఏర్పాటు నుంచి టికెట్ల కేటాయింపు వరకు అంతా ఢిల్లీ కనుసన్నల్లోనే జరిగేలా ప్రణాళిక అమలవుతోందని, ఇటీవలి అన్ని పరిణామాలు టీపీసీసీకి పూర్తిస్థాయిలో సమాచారం లేకుండానే జరిగాయనే చర్చ గాంధీభవన్ వర్గాల్లో జరుగుతోంది. తెలంగాణ పార్టీలో ఉన్న కుమ్ములాటలు పుట్టి ముంచుతాయనే అభిప్రాయానికి వచ్చిన టెన్ జన్‌పథ్ వర్గాలు పూర్తిస్థాయిలో తెలంగాణ వ్యవహారాలను స్వయంగా పర్యవేక్షిస్తున్నాయని, అప్పుడప్పుడూ బెంగళూరు నుంచి అందే సంకేతాలు కూడా ఏఐసీసీ నిర్ణయాలను ప్రభావితం చేస్తున్నాయని అంటున్నారు. రాష్ట్ర నాయకత్వానికి తెలియకుండానే.. రాష్ట్రాల్లోని ఇతర పార్టీల విషయంలో అవలంబించాల్సిన వైఖరిపై జాతీయ పార్టీలు సాధారణంగా ఆయా రాష్ట్రాల్లోని పార్టీ నేతల అభిప్రా యాలు తీసుకుంటాయి. కాంగ్రెస్ పార్టీ లోనూ ఇదే పరిస్థితి కొనసాగుతోంది. కానీ వైఎస్సార్టీపీ నేత షర్మిలతో చర్చలు, వచ్చే ఎన్ని కల్లో కమ్యూనిస్టు పార్టీలతో పొత్తుల గురించి ఢిల్లీలో నిర్ణయం తీసుకున్న తర్వాతే రాష్ట్ర పార్టీ నేతలకు తెలియడం గమనార్హం. షర్మిల బెంగళూరులో డి.కె.శివకుమార్‌ను కలిసినప్పటి నుంచే ఆమె కాంగ్రెస్‌లో చేరతారన్న దానిపై ఊహాగానాలు సాగినప్పటికీ, దీనిపై నామమాత్రంగా కూడా రాష్ట్ర పార్టీ నేతలతో ఢిల్లీ పెద్దలు చర్చించకపోవడం గమనార్హం. మరోవైపు ఇండియా కూటమిలో భాగస్వాములైన సీపీఐ, సీపీఎం పార్టీలతో వచ్చే ఎన్నికల్లో పొత్తు గురించి కూడా రాష్ట్ర పార్టీ అభిప్రాయంతో పనిలేకుండా ఏఐసీసీయే రంగంలోకి దిగింది. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి ఠాక్రే కమ్యూనిస్టు పార్టీలతో చర్చలు జరిపిన తర్వాతే విషయం రాష్ట్ర నాయకత్వానికి తెలిసింది. ఇటీవల జరిగిన సంస్థాగత కమిటీల ఏర్పాటు విషయంలో కూడా తెలంగాణ నాయకత్వానికి తెలియకుండానే నిర్ణయాలు జరిగిపోవడం గమనార్హం. పార్టీలో అత్యున్నత విధాన నిర్ణాయక మండలి అయిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)లో తెలంగాణ నుంచి ఎవరికి అవకాశం వస్తుందన్న దానిపై అనేక ఊహాగానాలు వచ్చాయి. ఫలానా నేతను టీపీసీసీ సిఫారసు చేసిందనే సమాచారం కూడా బయటకు వచ్చింది. కానీ ఎన్నడూ చర్చ జరగని ఇద్దరు నేతలకు అనూహ్యంగా సీడబ్ల్యూసీలో చోటు దొరికింది. తమ పేర్లు ఎందుకు రాలేదా అని రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్లు ఆరా తీస్తున్న సమయంలోనే వారికి మరో షాక్ తగిలింది. కేంద్ర ఎన్నికల కమిటీ (సీఈసీ)ని ప్రకటించిన అధిష్టానం రాష్ట్ర పార్టీతో సంబంధం లేకుండానే తెలంగాణ నుంచి ఒకరికి అవకాశం కల్పించింది. అంతకంటే ముందు ఏర్పాటు చేసిన పార్టీ స్క్రీనింగ్ కమిటీలోనూ గతంలో ఎన్నడూ లేని విధంగా పీసీసీ అధ్యక్షుడు, సీఎల్పీ నేతతో పాటు మరో నేతను నియమించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ‘సీడబ్ల్యూసీ’పై పీఈసీలో తీర్మానం! గతంలో ఎన్నడూ లేని విధంగా సీడబ్ల్యూసీ సమావేశాలను హైదరాబాద్‌లో నిర్వహిస్తున్నారు. అయితే వీటి నిర్వహణ విషయంలోనూ అధిష్టానమే నిర్ణయం తీసుకుని టీపీసీసీకి సమాచారం ఇచ్చిందని అంటున్నారు. ఆ సమాచారం మేరకే సీడబ్ల్యూసీ సమావేశాలతో ఎలాంటి సంబంధం లేని ప్రదేశ్ ఎన్నికల కమిటీ (పీఈసీ) సమావేశంలో.. సీడబ్ల్యూసీ సమావేశాలు రాష్ట్రంలో నిర్వహించాలనే తీర్మానం చేశారనే చర్చ గాంధీభవన్ వర్గాల్లో జరుగుతోంది. ఈ తీర్మానం తర్వాత ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే ఒకసారి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డితో సమావేశాల నిర్వహణపై ఆరా తీశారు. ఆ తర్వాత ఉన్నట్టుండి సీడబ్ల్యూసీ సమావేశాల షెడ్యూల్‌ను ఏఐసీసీ ప్రకటించింది. అలాగే ఈనెల 18న సీడబ్ల్యూసీ సభ్యులు, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పీసీసీ అధ్యక్షులు, సీఎల్పీ నాయకులు తెలంగాణ వ్యాప్తంగా 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటిస్తారన్న విషయాన్ని కూడా నేరుగా అధిష్టానమే ప్రకటించింది. కేవలం సోనియాగాంధీ పాల్గొనే సభ, ఆ సభలో ప్రకటించాల్సిన ఐదు గ్యారంటీ కార్డు స్కీంల గురించి మాత్రమే టీపీసీసీకి ముందస్తు సమాచారం ఉందని, మిగిలిన అంశాల్లో ఏఐసీసీ నిర్ణయం తీసుకుని టీపీసీసీకి చేరవేసిందనే చర్చ జరుగుతోంది. ఎందుకిలా? తెలంగాణ వ్యవహారాలను పూర్తిగా అధిష్టానం టేకోవర్ చేయడంపై గా>ంధీభవన్ వర్గాల్లో పలు రకాల చర్చలు జరుగుతున్నాయి. ముఖ్యంగా రాష్ట్ర పార్టీ నేతల మధ్య పాతుకుపోయిన అనైక్యత ఇప్పట్లో సర్దుకునే అవకాశం లేదనే భావనతోనే ఏఐసీసీ రంగంలోకి దిగిందనే చర్చ జరుగుతోంది. ప్రతి చిన్న పరిణామంపైనా తీవ్రమైన విమర్శలు, ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో అన్ని విషయాలపై హస్తినలో నిర్ణయం తీసుకున్న తర్వాతనే టీపీసీసీకి సమాచారం ఇస్తున్నారని కొందరు నేతలు విశ్లేషిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో గ్రూపు గొడవలు, భిన్నాభిప్రాయాలు సహజమే అయినా గతంలో ఎన్నడూ లేని విధంగా ఇవి తారస్థాయికి చేరాయని, ఎన్నికల్లో గెలుపు అంచనాలున్న పరిస్థితుల్లో తాము రంగంలోకి దిగడమే మంచిదనే నిర్ణయానికి అధిష్టానం వచ్చిందని అంటున్నారు. మరోవైపు రాష్ట్ర పార్టీలో జరుగుతున్న ప్రతి చిన్న పరిణామంపైనా ఢిల్లీకి నివేదికలు వెళుతున్నాయని, ఈ నివేదికల నేపథ్యం కూడా ఏఐసీసీ ఆజమాయిషీకి కారణమని తెలుస్తోంది. -
తాజ్ కృష్ణలో ప్రారంభమైన స్క్రీనింగ్ కమిటీ సమావేశం
-
నేడు మరోసారి భేటీకానున్న టీపీసీసీ స్క్రీనింగ్ కమిటీ
-
పేర్లు చూసి టిక్కు పెట్టాలా?..నామ్ కే వాస్తే లిస్ట్..!
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల వడపోతపై మంగళవారం జరిగిన ప్రదేశ్ ఎన్నికల కమిటీ (పీఈసీ) సమావేశం వాడీవేడిగా జరిగింది. సీనియర్ నేతలు కొందరు పలు అంశాలపై సందేహాల పేరిట ఆగ్రహం వ్యక్తం చేశారు. టీపీసీసీ ఇచ్చిన ఆశావహుల జాబితాలో పేర్లు తప్ప ఎలాంటి సమాచారం లేకపోవడంపై జానారెడ్డి, జీవన్‌రెడ్డి, పొన్నాల లక్ష్మయ్యలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పోటీ చేయడానికి దరఖాస్తు చేసుకున్న వారి వివరాలేవీ లేకుండా కేవలం జాబితా ఇచ్చేసి టిక్కులు పెట్టమంటే ఎలా అంటూ మండిపడ్డారు. ఒక కుటుంబంలో ఒకరికంటే ఎక్కువ టికెట్ల అంశంపై సీనియర్ నేతల మధ్య వాగి్వవాదం చోటు చేసుకున్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో పీఈసీ వడపోత కార్యక్రమాన్ని సెపె్టంబర్ 2వ తేదీకి వాయిదా వేసింది. ఆ రోజు జరిగే సమావేశంలో తుది నిర్ణయం తీసుకుందామని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి నేతృత్వంలో గాం«దీభవన్‌లో జరిగిన భేటీలో నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశంలో పీఈసీ సభ్యులు భట్టి విక్రమార్క, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, జీవన్‌రెడ్డి, దామోదర రాజనర్సింహ, పొన్నాల లక్ష్మయ్య, వి.హన్మంతరావు, శ్రీధర్‌బాబు, జగ్గారెడ్డి, సీతక్క, మహేశ్‌కుమార్‌గౌడ్, అంజన్‌కుమార్ యాదవ్, షబ్బీర్ అలీ, మధుయాష్కీ గౌడ్, రేణుకా చౌదరి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, బలరాం నాయక్, సంపత్‌కుమార్, వంశీచందర్‌రెడ్డి, ప్రేంసాగర్‌రావు, సునీతారావ్, శివసేనారెడ్డి, బల్మూరి వెంకట్రావు, మిద్దెల జితేందర్లు పాల్గొన్నారు. అభ్యర్థుల ఖరారులో అనుసరించాల్సిన మార్గదర్శకాలు, వచ్చే ఎన్నికలకు ఎలాంటి వ్యూహాలు రూపొందించాలి, ఇతర పారీ్టలతో పొత్తులు తదితర అంశాలపై రాష్ట్ర కాంగ్రెస్ నేతలు చర్చించారు. పేర్లిస్తే సరిపోతుందా? విశ్వసనీయ సమాచారం మేరకు.. సమావేశం ప్రారంభం కాగానే సభ్యులందరికీ నియోజకవర్గాల వారీగా దరఖాస్తుదారుల పేర్లతో కూడిన జాబితా ఇచ్చారు. ప్రతి నియోజకవర్గానికి మూడు పేర్ల చొప్పున టిక్ చేయాలని కోరారు. అయితే జాబితాలో కేవలం పేర్లు మాత్రమే ఉండటంపై జీవన్‌రెడ్డి, జానారెడ్డి, పొన్నాల తదితరులు అభ్యంతరం వ్యక్తం చేశారు. బీసీలకు, మహిళలకు ఎన్ని సీట్లు ఇస్తారన్న అంశంపై ఎలాంటి స్పష్టత లేకుండా, ఆయా నియోజకవర్గాల్లో ఏ వర్గం ఓటర్లు అధికంగా ఉన్నారు? అనే వివరాలు కూడా లేకుండా అభ్యర్థులను ఎలా షార్ట్ లిస్ట్ చేయాలని ప్రశ్నించారు. ఆశావహుల సీనియార్టీ, పారీ్టలో హోదా, పూర్వ అనుభవం, పార్టీ కోసం చేసిన సేవ, కులం లాంటి వివరాలేవీ లేకుండా కేవలం పేర్లు చూసి టిక్ పెట్టాలంటే ఎలా పెడతామని జీవన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. జానారెడ్డి, పొన్నాల కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా సామాజిక వర్గాల విశ్లేషణ లేకుండా, ఏ ప్రాతిపదికన ఏ కులానికి టికెట్లు ఎన్ని ఇవ్వాలో నిర్ధారించకుండా, ఆయా నియోజకవర్గాల్లోని సామాజిక వర్గాల ఓటర్లను అంచనా వేయకుండా టిక్కులు చేయడం ఎలా కుదురుతుందని వారు ప్రశ్నించారు. ఆశావహుల పూర్తి వివరాలతో పాటు నియోజకవర్గాల వారీగా ఓటర్ల సామాజిక వివరాలు ఇవ్వాలని, ఇందుకోసం సమగ్ర సర్వే వివరాలను కానీ, ఇప్పటికే ఏఐసీసీకి పంపిన వివరాలను కానీ జత చేయాలని పొన్నాల సూచించారు. యూత్‌కు ఎన్ని టికెట్లు? సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి మాట్లాడుతూ ఎన్ఎస్యూఐ, యూత్ కాంగ్రెస్ నేతలకు ఇచ్చే టికెట్లను తొలి జాబితాలోనే ప్రకటించాలని అన్నారు. నియోజకవర్గాల్లో పని చేసేందుకు తగిన సమయం ఇవ్వాలని, ఎన్నికల్లో అన్ని విధాలా వారికి సాయం చేయాలని సూచించారు. యువకులకు ఎన్ని టికెట్లు ఇస్తారో తేల్చాలని మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ డిమాండ్ చేశారు. కుటుంబంలో ఒకరి కంటే ఎక్కువ టికెట్లు ఇచ్చే పక్షంలో తన కుమారుడు కూడా యూత్ కాంగ్రెస్‌లో చురుగ్గా పని చేస్తున్నందున తనతో పాటు తన కుమారుడికి అవకాశం కలి్పంచాలని కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్ కోరారు. బీసీలకు ఎన్ని టికెట్లు ఇస్తారో తేల్చాలని వీహెచ్, మహిళలకు తగిన అవకాశాలు కలి్పంచాలని రేణుకా చౌదరి అన్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతానికి ముగ్గురిని షార్ట్‌లిస్ట్ చేసే ప్రక్రియను వాయిదా వేయాలని, సెప్టెంబర్ 2న మరోమారు సమావేశమై అన్ని వివరాలతో కూడిన నివేదికలపై చర్చించి వడపోత చేపట్టాలని పీఈసీ నిర్ణయించింది. కుటుంబంలో ఒకరి కంటే ఎక్కువ మందికి టికెట్లు, బీసీలకు ఎన్ని టికెట్లు ఇవ్వాలి? మహిళలకు ఎలాంటి ప్రాతినిధ్యం కలి్పంచాలనే అంశాలపై వచ్చే నెల 2న జరిగే సమావేశంలోనే నిర్ణయం తీసుకోవాలని పీఈసీ నిర్ణయించింది. బీఆర్ఎస్కు కౌంటర్ వ్యూహం ఉండాలి బీఆర్ఎస్ ఇప్పటికే ప్రచార రంగంలోకి దిగిపోయిందని, దళిత బంధు లాంటి పథకాల ద్వారా కొత్తగా నియోజకవర్గానికి మరో 10 వేల ఓటు బ్యాంకు తయారు చేసుకుంటోందని, ఈ ఓటు బ్యాంకును కౌంటర్ చేసేలా పార్టీ వ్యూహం ఉండాలని, వీలున్నంత త్వరగా అభ్యర్థుల వడపోత ప్రక్రియను పూర్తి చేసి త్వరలోనే మొదటి జాబితా విడుదల చేయాలని సమావేశంలో పాల్గొన్న నేతలు చెప్పినట్లు సమాచారం. కాగా కొత్తగా ఏర్పాటైన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) తొలి సమావేశాన్ని హైదరాబాద్‌లో నిర్వహించాలని ఏఐసీసీని కోరుతూ సమావేశంలో తీర్మానాన్ని ఆమోదించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలతో తొలి జాబితా: మహేశ్‌కుమార్‌గౌడ్ సమావేశానంతరం టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్‌కుమార్‌గౌడ్ విలేకరులతో మాట్లాడారు. పీఈసీ సమావేశంలో దరఖాస్తుదారుల వివరాలను పరిశీలించినట్టు చెప్పారు. దరఖాçస్తుదారుల అన్ని వివరాలతో కూడిన నివేదికలపై చర్చించేందుకు సెపె్టంబర్ 2న పీఈసీ మరోమారు సమావేశమవుతుందని తెలిపారు. 4వ తేదీన స్క్రీనింగ్ కమిటీ రాష్ట్రానికి వస్తుందని, కమిటీ చైర్మన్ మురళీధరన్‌తో పాటు సభ్యులు సిద్ధిఖీ, జిగ్నేశ్ మేవానీలు మూడు రోజుల పాటు రాష్ట్రంలోనే ఉండి అన్ని స్థాయిల్లోని నాయకత్వంతో మాట్లాడి నివేదికలు రూపొందిస్తారని చెప్పారు. తొలి జాబితాలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు చెందిన వారి పేర్లు ఉండాలని పీఈసీలో నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. పొత్తు పొరపాట్లు చేయొద్దు ఈసారి ఎన్నికల్లో లెఫ్ట్‌తో పాటు ఇతర పారీ్టలతో పొత్తుల అంశంపై కూడా పీఈసీ సమావేశంలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ పొత్తుల విషయంలో ఆచితూచి నిర్ణయం తీసుకోవాలని, తొందరపాటు నిర్ణయాలు తీసుకుని పొరపాట్లకు తావివ్వద్దని సూచించారు. ‘గతంలో లాగా ఒక పార్టీ నుంచి ఇంకో పారీ్టకి ఓట్ల బదిలీ జరగడం లేదు. మనం పొత్తుల పేరుతో వెళ్లి సీట్లు త్యాగం చేయడం వల్ల ప్రయోజనం లేదు. పొత్తుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి..’ అని వారు చెప్పినట్టు తెలిసింది. 60 చోట్ల భారీగా దరఖాస్తులు కాంగ్రెస్ టికెట్ల కోసం దరఖాస్తుల ప్రక్రియను పరిశీలిస్తే.. 60 నియోజకవర్గాల్లో భారీ సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి. 45 నియోజకవర్గాల్లో 10 మందికి పైగా దరఖాస్తు చేసుకోగా, 5 నియోజకవర్గాల్లో 9 చొప్పున, 10 నియోజకవర్గాల్లో 8 చొప్పున దరఖాస్తులు వచ్చాయి. కొడంగల్, జగిత్యాలలో కేవలం ఒక్క దరఖాస్తు మాత్రమే రాగా, మిగిలిన చోట్ల 2 నుంచి 7 వరకు వచ్చాయి. అత్యధికంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందులో 32 దరఖాస్తులు రావడం గమనార్హం. -
టీపీసీసీకి దామోదర రాజనర్సింహ కమిటీ రిపోర్ట్
-
నాగర్ కర్నూల్ పీఎస్ లో రేవంత్ పై కేసు నమోదు
-
సర్కార్ వైఫల్యంతోనే భారీ నష్టం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో భారీ వర్షాల కారణంగా తీవ్ర స్థాయిలో ఆస్తి, పంట నష్టపోయిన వారిని వెంటనే ఆదుకోవాలని, ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు తక్షణమే నష్టపరిహారం ఇవ్వాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కోరారు. మంగళవారం కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లు అంజన్ కుమార్ యాదవ్, మహేష్ కుమార్ గౌడ్, సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లు రవితో కలిసి భట్టి రాజ్‌భవన్‌కి వెళ్లి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ను కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో భారీ వర్షాల కారణంగా జరిగిన నష్టం వివరాలను అందజేశారు. అనంతరం భట్టి మీడియాతో మాట్లాడుతూ భారీగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు అప్రమత్తం చేసినప్పటికీ , రాష్ట్ర ప్రభుత్వం యంత్రాంగాన్ని సమాయత్తం చేయకుండా నిర్లిప్తంగా వ్యవహరించడం వల్లనే ఇంత నష్టం జరిగిందన్నారు. కాళేశ్వరం, సీతారామ ప్రాజెక్టుల నిర్మాణం అశాస్త్రీయంగా జరగడం వల్లనే అనేక ప్రాంతాలు, గిరిజన గూడేలు ముంపునకు గురయ్యాయన్నారు. మున్నేరు, కిన్నెరసాని నదులపై నిర్మించిన చెక్ డ్యాములను ఇంజనీరింగ్ అధికారులతో శాస్త్రీయంగా డిజైన్ చేసి ఉంటే ఇంత నష్టం జరిగేది కాదన్నారు. మహారాష్ట్రకు విమానాలు పంపించారు కానీ ఇక్కడ వరద ప్రాంతాలకుహెలికాప్టర్లు పంపించలేదు ప్రజల అవసరాల కోసం కాకుండా కేసీఆర్ తన రాజకీయ అవసరాల కోసం అధికార యంత్రాంగాన్ని వాడుకున్నారని భట్టి ఆరోపించారు. మహారాష్ట్రకు ప్రత్యేక విమానాలు పంపించి అక్కడి నాయకులను ప్రగతిభవన్‌కు పిలిపించుకొని గులాబీ కండువాలు కప్పే దానిపై ఉన్న శ్రద్ధ వరద బాధితులను ఆదుకోవడంలో లేకుండా పోయందని విమర్శించారు. మహారాష్ట్రకు విమానాలు పంపించిన సీఎం కేసీఆర్ గోదావరి వరదలతో మునిగిపోయిన ఏజెన్సీ ఏరియాలో గిరిజన ప్రజలను ఆదుకోవడానికి హెలికాప్టర్లు పంపించ లేకపోయారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో వరదలతో ప్రజలు అల్లాడుతుంటే బాధితులను, ఏజెన్సీ ప్రాంతాలను సందర్శించకుండా కేసీఆర్ మహారాష్ట్ర టూర్ కి వెళ్లడం ఏంటని ప్రశ్నించారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం కాంగ్రెస్ విజయమే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని గతంలో తాము కోరినప్పుడు సీఎం కేసీఆర్ వ్యక్తిగతంగా దుర్భాషలాడుతూ నీతిమాలిన, పనికిమాలిన, ఆలోచన లేని నాయకులంటూ తప్పు పట్టారని భట్టి విక్రమార్క గుర్తుచేశారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచి అధికారంలోకి రాగానే ఆరీ్టసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని ప్రకటించిందని, ఆ భయంతోనే కేసీఆర్ విలీన నిర్ణయం తీసుకున్నారని అన్నారు. ఆర్టీసీకి ఆస్తులు కూడబెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని, కాంగ్రెస్ సంపాదించి పెట్టిన ఆర్టీసీ ఆస్తులను బీఆర్ఎస్ ప్రభుత్వం కొల్లగొట్టడానికి చూస్తే రోడ్లపైకి వస్తామని భట్టి హెచ్చరించారు. వరద సహాయం సరిపోదు: గవర్నర్ తమిళిసై ఊహించిన దానికంటే పరిస్థితులు దయనీయంగా ఉన్నాయి పునరావాస కేంద్రాలను పెంచాలి ప్రభుత్వంతో పాటు స్వచ్ఛంద సంస్థలు, దాతలు ముందుకు రావాలి కుంభవృష్టిగా కురిసిన వర్షాలతో ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాల పట్ల రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఊహించిన దానికంటే పరిస్థితులు అత్యంత దయనీయంగా ఉన్నాయని, ఈ క్లిష్ట సమయంలో బాధిత కుటుంబాలకు అందిస్తున్న సహాయం సరిపోదని తాను భావిస్తున్నానని స్పష్టం చేశారు. ఈ మేరకు మంగళవారం ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. పాఠశాలలు, ప్రభుత్వ భవనాల్లో ప్రభుత్వం పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసిందని, వరదల విధ్వంసం కొనసాగుతున్న నేపథ్యంలో వీటి సంఖ్యను పెంచాల్సిన అవసరం ఉందన్నారు. వరదలతో తీవ్రంగా నష్టపోయిన ఉత్తర తెలంగాణలోని 10 జిల్లాలతో పాటు మధ్య తెలంగాణకు పరీక్షా సమయమని, ఇక్కడ తీవ్రంగా నష్టపోయిన కుటుంబాలకు సాధ్యమైనంతగా సహకారం అందించాలని రాష్ట్ర ప్రభుత్వానికి, స్వచ్ఛంద సంస్థలకు పిలుపునిచ్చారు. వరద బాధిత కుటుంబాలకు తక్షణమే సహాయం అందించాలని ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ తెలంగాణ రాష్ట్ర, కేంద్ర, జిల్లా కార్యాలయాలకు పిలుపునిచ్చారు. జిల్లా యంత్రాంగంతో కలిసి వరద బాధితులకు ఇప్పటికే రెడ్‌క్రాస్ సహాయం అందిస్తోందన్నారు. వరద బాధిత కుటుంబాలకు తక్షణమే ఆహారం, ఆశ్రయం, వంట సామాగ్రి, ఆరోగ్య శిబిరాలు నిర్వహించేందుకు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని, వరద నష్టాన్ని వేగంగా అంచనా వేయాలని సూచించారు. దాతలు, స్వచ్ఛంద సంస్థలు, లయన్స్ క్లబ్, రోటరీ క్లబ్, యూఎన్డీపీ, యూనిసెఫ్, సీఎస్ఆర్ ఫౌండేషన్లు, వైద్యులు, మీడియా భాగస్వామ్యంతో కింది సేవలు అందించాలని పిలుపునిచ్చారు. తక్షణ ఉపశమనంగా షెల్టర్ హోమ్స్, ఆహారం, తాగునీటి సరఫరా, అత్యవసర వైద్య బృందాల ను పంపించాలి. శిథిలాల తొలగింపు చేపట్టాలి. వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించడానికి ఎన్డీ ఆర్ఎఫ్ బృందాలు చర్యలు తీసుకోవాలి. చిన్నారులు, బాలికలు, మహిళల రక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయాలి. ప్రాణ, ఆస్తి, ఉపాధికి జరిగిన నష్టాన్ని కచ్చితంగా మదించి పునరావాసం కల్పించాలి. బిల్లులు తిప్పి పంపడానికి కారణాలున్నాయి.. ప్రభుత్వానికి మూడు బిల్లులు వెనక్కి పంపించడానికి కారణాలున్నాయని గవర్నర్ తమిళిసై వ్యాఖ్యానించారు. గవర్నర్ తిప్పి పంపిన బిల్లు లను అసెంబ్లీ సమావేశాల్లో ఆమోదించి మళ్లీ గవర్నర్‌కు పంపిస్తామని, అప్పుడు ఆమోదించక తప్పదంటూ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్య లపై ఆమె మీడియాతో మాట్లాడుతూ స్పందించారు. ‘నేను పంపించిన మూడు బిల్లులు ఎందుకు పంపించానో వివరంగా పేర్కొన్నాను. అందుకు సహేతుక కారణాలున్నాయి. ప్రతి బిల్లుపై నాకున్న అనుమానాలను నివృత్తి చేయాలని కోరా. కావాలని ఏ బిల్లునూ కారణం లేకుండా తిప్పి పంపలేదు. బిల్లులు ఆపేశానని అనవసరంగా నిందించడం సరి కాదు’ అని గవర్నర్ వ్యాఖ్యానించారు. -
‘నన్ను పార్టీ మారమని అడిగే దమ్ము ఎవరికి లేదు’
సాక్షి, సూర్యాపేట జిల్లా: తాను పార్టీ మారుతున్నానంటూ వస్తున్న వార్తలపై టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు, మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి తీవ్రంగా స్పందించారు. పార్టీ మారుతున్నట్లు జరుగుతున్నదంతా తప్పుడు ప్రచారమేనని, కొంతమంది కావాలనే తనపై ఈ రకమైన ప్రచారానికి తెరలేపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘పనికట్టుకుని బీఆర్ఎస్తో పాటు కొంతమంది సొంత పార్టీ నాయకులే దుష్ప్రచారం చేస్తున్నారు. నాలుగు తరాలుగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాలాంటి వ్యక్తి పై దుష్ప్రచారం జరగడం దురదృష్టకరం. దయచేసి ప్రజలు , కార్యకర్తలు ఎవరు దుష్ప్రచారాన్ని నమ్మొద్దు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎవరు నన్ను సంప్రదించలేదు. నన్ను పార్టీ మారమని అడిగే దమ్ము ఎవరికి లేదు. నా పుట్టుక కాంగ్రెస్ చివరి శ్వాస వరకు కాంగ్రెస్‌లోనే. కాంగ్రెస్ పార్టీ టికెట్ పై సూర్యాపేట నుండే పోటీ చేయబోతున్నా. టికెట్ నాదే.. గెలుపు నాదే ఇందులో ఎలాంటి అనుమానంలేదు. లోకల్ నాన్ లోకల్ అని ప్రచారం కరెక్ట్ కాదు. ఎవరు పార్టీలో లేనప్పుడు నేనొక్కడినే ఇక్కడ నుండి గెలిచా. రాష్ట్రవ్యాప్తంగా పార్టీ బలోపేతమే లక్ష్యంగా పనిచేశా. ఇండిపెండెంట్ గా గెలిచినా ఎన్ని అవకాశాలు వచ్చినా పార్టీ మారకుండా తిరిగి కాంగ్రెస్ లోకే వచ్చా. నాకు గ్రూపులు లేవు నాది కాంగ్రెస్ గ్రూపు సోనియా గ్రూపు. పార్టీని అధికారంలోకి తేవడమే లక్ష్యంగా పనిచేస్తా’ అని దామోదర్‌రెడ్డి స్పష్టం చేశారు. చదవండి: ఔటర్ రింగ్ రోడ్డుపై వెళ్తున్నారా?.. ట్రాఫిక్ రూల్స్ మారాయ్.. కొత్త స్పీడ్ లిమిట్స్ ఇవిగో -
నేడు కాంగ్రెస్ కీలక భేటీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుల భేటీ ఆదివారం జరగనుంది. రాష్ట్రంలోని రాజకీయ పరిణా మాలు, పార్టీ అంతర్గత వ్యవహారాలపై చర్చించేందుకు గాను ఆదివారం సాయంత్రం 4 గంటలకు టీపీసీసీ రాజకీ య వ్యవహారాల కమిటీ(పీఏసీ) గాంధీభవన్‌లో సమావేశం కానుంది. రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్చార్జి మాణిక్‌రావు ఠాక్రే, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, ఎంపీలు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిలతో పాటు ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, పార్టీ ఎమ్మెల్యేలు, వర్కింగ్ ప్రెసిడెంట్లు, పీఏసీ కన్వీనర్ షబ్బీర్‌అలీ, ఇతర సభ్యులు ఈ సమావేశానికి హాజరు కానున్నారు. టీపీసీసీ ఆధ్వర్యంలో చేపట్టనున్న బస్సుయాత్ర, ఇతర పార్టీల నుంచి నేతల చేరికలు, ప్రియాంకా గాంధీ హాజరు కానున్న కొల్లాపూర్ సభ అంశాలే ప్రధాన ఎజెండాగా ఈ భేటీ జరుగుతుందని గాంధీభవన్ వర్గాలు చెబుతున్నాయి. బస్సుయాత్రపై నిర్ణయం రాష్ట్రంలోని కాంగ్రెస్ నేతలందరూ ఐక్యంగా ఉన్నామని చాటేందుకు గాను రాష్ట్రవ్యాప్తంగా సీనియర్ నేతలతో కలిసి బస్సుయాత్ర చేపట్టాలని నిర్ణయించిన నేపథ్యంలో ఈ యాత్ర విధివిధానాలను ఖరారు చేసుకోవడంతో పాటు ఎప్పుడు యాత్ర చేపట్టాలనే దానిపై ఈ సమావేశంలో నిర్ణ యం తీసుకోనున్నారు. అదేవిధంగా రాష్ట్రంలోని పలు నియోజకవర్గాలకు చెందిన మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యే స్థాయి నేతలు పార్టీలో చేరేందుకు మొగ్గుచూపు తున్న నేపథ్యంలో వారి చేరికలకు సంబంధించిన చర్చ కూడా జరగనుంది. దీంతో పాటు మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు చేరిక సందర్భంగా ఈనెల 30న కొల్లాపూర్‌లో జరిగే సభకు హాజరు కావాలంటూ పార్టీ అధిష్టానాన్ని టీపీసీసీ ఇప్పటికే కోరింది. ఈ సభ ఏర్పాట్లపై కూడా సమావేశంలో చర్చించనున్నట్టు సమాచారం. నేడు తెలంగాణ ఉద్యమకారుల సమావేశం రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తోన్న తెలంగాణ ఉద్యమ కారులు నేడు సమావేశం కానున్నారు. హైదరాబాద్‌లోని ఓ హోటల్లో జరిగే ఈ సమావేశానికి సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి. తెలంగాణ ఉద్యమకారులుగా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై చర్చిస్తారు. రాష్ట్ర సాధన ఆకాంక్షలకు అనుగుణంగా కాంగ్రెస్ పార్టీని వేదికగా చేసుకుని ఎలా పనిచేయాలన్న దానిపై ఈ సమావేశంలో కార్యాచరణ రూపొందిస్తారని నిర్వాహకులు చెబుతున్నారు. పొన్నంకు చైర్మన్ పదవి? మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌కు రాష్ట్ర స్థాయిలో ఏర్పా టు చేసే ఓ కమిటీకి చైర్మన్‌గా నియమించే అవకాశాలు కనిపిస్తు న్నాయి. ఇటీవల ఏఐసీసీ నియమించిన ప్రదేశ్ ఎన్నికల కమిటీ (పీఈసీ)లో చోటు లభించకపోవడంతో పొన్నం కొంత అసంతృప్తితో ఉన్నారన్న వాదనలు విని పిస్తున్నాయి. అయితే ఆయనకు కమిటీ చైర్మన్ హోదా ఇవ్వాలన్న ఆలోచనతోనే పీఈసీ సభ్యునిగా చేర్చలేదనే చర్చ గాంధీభవన్‌లో జరుగుతోంది. పార్టీ మేనిఫెస్టో, కోఆర్డినేషన్, ఎలక్షన్ మేనేజ్మెంట్, ఏఐసీసీ కార్య క్రమాల అమలు, శిక్షణ, మీడియా కమిటీలను ఏఐసీసీ ప్రకటించాల్సి ఉంది. ఈ కమి టీల్లో ఏదో ఒక కమిటీకి సీనియర్ నేత పొన్నంను చైర్మన్‌గా ప్రకటించే అవకా శాలు కనిపిస్తున్నాయి. కాగా, ఈ కమిటీ లను మరో వారం, పది రోజుల్లోగా ఏఐసీసీ ప్రకటిస్తుందన్న చర్చ గాంధీభవన్ వర్గాల్లో జరుగుతోంది. -
రేపట్నుంచి కాంగ్రెస్ రైతు భరోసా యాత్ర
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని రైతుల పక్షాన భరోసా యాత్ర చేపట్టాలని టీపీసీసీ కిసాన్ సెల్ నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా 32 జిల్లాల్లో రైతాంగ సమస్యలే ఎజెండాగా ఈనెల 19 నుంచి యాత్రను ప్రారంభించనుంది. ఆదిలాబాద్‌లో ప్రారంభం కానున్న ఈ యాత్ర ఆగస్టు 2న నిజామాబాద్‌లో ముగియనుంది. రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాట కార్యాచరణను రూపొందించటంతో పాటు ఆయా జిల్లాల రైతాంగానికి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏం చేస్తుందన్న దానిపై స్పష్టత ఇచ్చేందుకు గాను ‘రైతు భరోసా యాత్ర’ను చేపడుతున్నట్టు టీపీసీసీ కిసాన్ సెల్ అధ్యక్షుడు సుంకెట అన్వేశ్‌రెడ్డి సోమవారం వెల్లడించారు. యాత్ర షెడ్యూల్ ఇలా.. టీపీసీసీ సోమవారం ఈ యాత్రకు సంబంధించిన షెడ్యూల్‌ను విడుదల చేసింది. షెడ్యూల్ ప్రకారం ఈనెల 19న సాయంత్రం ఆదిలాబాద్‌లో యాత్ర ప్రారంభం కానుంది. 20న ఆసిఫాబాద్, మంచిర్యాల, 21న జగిత్యాల, సిరిసిల్ల, 22న సిద్దిపేట, జనగామ, 23న హనుమకొండ, వరంగల్, 24న పెద్దపల్లి, భూపాలపల్లి, 25వ తేదీన ములుగు, మహబూబాబాద్, 26న కొత్తగూడెం, ఖమ్మం, 27న సూర్యాపేట, యాదాద్రి, 28వ తేదీన రంగారెడ్డి, నాగర్‌కర్నూల్, 29న వనపర్తి, గద్వాల, 30న మహబూబ్‌నగర్, నారాయణపేట, 31న వికారాబాద్, సంగారెడ్డి, ఆగస్టు1న మెదక్, కామారెడ్డిల మీదుగా ఆగస్టు 2వ తేదీన నిజామాబాద్ జిల్లాలో యాత్ర ముగించనున్నారు. కాగా, రైతు భరోసా యాత్ర ముగింపు సందర్భంగా నిజామాబాద్‌లో భారీ సభ నిర్వహించాలని టీపీసీసీ కిసాన్‌సెల్ నేతలు యోచిస్తున్నారు. -
24 గంటల విద్యుత్‌పై రేవంత్ రెడ్డి షాకింగ్ కామెంట్స్