మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కూడా మార్పు... కొత్తవారికి ఇచ్చే యోచనలో అధిష్టానం
పరిశీలనలో సరితా తిరుపతయ్య, పారిజాతా నర్సింహారెడ్డి, భవానీరెడ్డిల పేర్లు
కార్పొరేషన్ చైర్మన్ పదవులు వచ్చిన అనుబంధ సంఘాల అధ్యక్షులు సైతం మార్పు?
అధికార పార్టీలో సంస్థాగత సందడి..
సాక్షి, హైదరాబాద్ : నామినేటెడ్ పోస్టుల భర్తీ, మంత్రివర్గ విస్తరణ త్వరలోనే జరుగుతుందన్న వార్తలకు తోడు టీపీసీసీ అధ్యక్షుడి ఎంపిక, అనుబంధ సంఘాల అధ్యక్షుల మార్పు కూడా ఉంటుందన్న చర్చ జరుగుతోంది. అమెరికా పర్యటనను ముగించుకొని వచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గురువారం రాత్రి ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. దీంతో అధికార కాంగ్రెస్‌పార్టీలో సంస్థాగత మార్పులపై చర్చ జోరందుకుంది. ముఖ్యంగా టీపీసీసీ అధ్యక్షుడి నియా మకంతోపాటు అనుబంధ సంఘాల విషయంలో అధిష్టానం ఏం నిర్ణయం తీసుకుంటుందోననే ఉత్కంఠ నెలకొంది.
బీసీ లేదా లంబాడానేనా?
టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డి స్థానంలో ఎవరిని నియమించాలన్న అంశం చాలా రోజులుగా కొలిక్కి రావడం లేదు. ముఖ్యంగా సామాజిక సమీకరణల లెక్కలు అధ్యక్షుడి విషయంలో కుదరడం లేదు. సీఎంగా అగ్రవర్ణాలకు చెందిన నేత ఉండటంతో బీసీ లేదా ఇతర సామాజికవర్గాలకు టీపీసీసీ అధ్యక్ష పద వి ఇస్తారనే అభిప్రాయం పార్టీవర్గాల్లో ఉంది. కాంగ్రె స్ అధిష్టానం వద్ద కూడా బీసీ, ఎస్సీ, ఎస్టీ నాయకు ల పేర్లపై చర్చ జరిగింది.
బీసీల నుంచి మహేశ్‌కు మార్‌గౌడ్, మధుయాష్కీగౌడ్, ఎస్సీల నుంచి సంపత్‌కుమార్, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, ఎస్టీల నుంచి బలరాంనాయక్‌ల పేర్లు బలంగా వినిపించాయి. వీ రిలో ఒకరికి అధ్యక్షుడి అవకాశం దక్కుతుందని అనుకోగా, తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో మాదిగ సామాజిక వర్గానికే పీసీసీ అధ్యక్ష పదవి ఇస్తారనే చర్చ ఊపందుకుంది. దీనికితోడు రాష్ట్ర ప్రభుత్వంలో కీలకపాత్ర పోషిస్తోన్న అగ్రవర్ణాలకే చెందిన ఒక మంత్రిని కూడా నియమిస్తారనే చర్చ కూడా తెరపైకి వచ్చింది.
టీపీసీసీ అధ్యక్షు డితోపా టు నలుగురు వర్కింగ్ ప్రెసిడెంట్లు, ప్రచార కమిటీ చైర్మన్ పదవులు కూడా కొత్త వారికి ఇచ్చే అవకాశా లు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో టీపీసీ సీ అధ్యక్ష వ్యవహారం ఈసారి ఢిల్లీ చర్చల్లో పూర్తవు తుందనే అభిప్రాయం గాంధీభవన్‌వర్గాల్లో వ్యక్తమవుతోంది. పార్టీ పెద్దలను కలిసి వరంగల్‌లో నిర్వహించతల పెట్టిన రైతు రుణమాఫీ సభకు ఆహ్వానిస్తారు. శుక్రవారం ఢిల్లీలో రేవంత్ మంత్రి శ్రీధ ర్‌బాబుతో కలిసి అక్కడే ఫాక్స్‌కాన్, యాపిల్ ప్రతిని ధులతో సమావేశం అవుతారని సమాచారం.
అనుబంధ సంఘాల్లో మార్పులు
టీపీసీసీ అనుబంధ విభాగాల్లోనూ త్వరలో మార్పులు జరగనున్నాయి. ఇప్పటికే ఎన్‌ఎస్ యూఐ, యూత్‌కాంగ్రెస్ అధ్యక్షుల మార్పు ప్రక్రియ మొదలైంది. ఎన్‌ఎస్‌యూఐ అధ్యక్షుడిగా బల్మూరి వెంకట్ స్థానంలో యడవల్లి వెంకటస్వామిని నియమిస్తూ అధిష్టానం ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఇక, శివసేనారెడ్డి స్థానంలో యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడి ఎన్నిక ప్రక్రియ ప్రస్తుతం జరుగుతోంది. వీటికితోడు మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలిని మారుస్తారని తెలుస్తోంది.
మూడేళ్ల పదవీకాలాన్ని పూర్తి చేసుకున్న ప్రస్తుత అధ్యక్షురాలు సునీతారావు స్థానంలో గద్వాల నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన సరితా తిరుపతయ్యయాదవ్, మహేశ్వరం టికెట్ ఆశించిన పారిజాతానర్సింహారెడ్డి, టీపీసీసీ అధికార ప్రతినిధులు భవానీరెడ్డి, రవళిరెడ్డిల పేర్లు వినిపిస్తున్నాయి. సరితా తిరుపతయ్యకు మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్ష పదవి ఇవ్వాలని కోరుతూ టీపీసీసీ అధ్యక్ష హోదాలో రేవంత్‌రెడ్డి కూడా మహిళా కాంగ్రెస్ జాతీయ అధ్యక్షురాలు అల్కా లాంబాకు లేఖ రాసినట్టు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో త్వరలోనే మహిళాకాంగ్రెస్‌కు కూడా కొత్త అధ్యక్షురాలు రానున్నారు. వీరితోపాటు ఇటీవల పలువురు అనుబంధ సంఘాల అధ్యక్షులకు కార్పొరేషన్ల చైర్మన్ పదవులు అప్పగించారు. కార్పొరేషన్ చైర్మన్‌గిరీ వచ్చిన అనుబంధ సంఘాల అధ్యక్షుల స్థానంలో కొత్త వారిని నియమిస్తారని తెలుస్తోంది. త్వరలోనే ఈ మార్పు మొదలవుతుందని సమాచారం. మొత్తంమీద అటు టీపీసీసీ అధ్యక్షుడి ఎంపిక, కొత్త కార్యవర్గం, అనుబంధ సంఘాల్లో మార్పుల నేపథ్యంలో అధికార కాంగ్రెస్ పార్టీలో సంస్థాగత పదవుల సందడి నెలకొంది,
Comments
Please login to add a commentAdd a comment