Nominated Posts
-
టీపీసీసీ సెర్చ్ ఆపరేషన్!
సాక్షి, హైదరాబాద్: పార్టీ, ప్రభుత్వ పదవుల భర్తీ ప్రక్రియ టీపీసీసీకి కత్తిమీద సాములా మారింది. కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్లు, ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, జిల్లా పార్టీ అధ్యక్షులు, కార్పొరేషన్ల చైర్మన్లు, కమిషన్ల సభ్యులు, ఏఐసీసీ కార్యదర్శులు, ఎమ్మెల్సీ పదవులకు సమర్థుల కోసం ఏఐసీసీ, పీసీసీ అన్వేషిస్తున్నాయి. పార్టీ కార్యవర్గంతో పాటు నామినేటెడ్ పోస్టులను ఈ నెలాఖరు నాటికి భర్తీ చేయాలన్న ఏఐసీసీ ఆదేశాల మేరకు టీపీసీసీ కసరత్తు ముమ్మరం చేసింది. జంబో కార్యవర్గం.. ఈసారి టీపీసీసీ కార్యవర్గాన్ని ఆచితూచి ఎంపిక చేయాలని ఏఐసీసీ, టీపీసీసీ భావిస్తున్నాయి. పీసీ సీకి నలుగురు వర్కింగ్ ప్రెసిడెంట్లను నియమిస్తా రని తెలుస్తోంది. పీసీసీ అధ్యక్షుడిగా బీసీ నేత ఉన్నందున, రెడ్డి సామాజిక వర్గానికి వర్కింగ్ ప్రెసిడెంట్ (ఆర్గనైజేషన్) ఇస్తారని, మరో మూడు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవులు ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల నేతలకు ఇస్తారనే చర్చ జరుగుతోంది. వీటి తో పాటు ప్రతి పార్లమెంటు నియోజకవర్గానికి ఒక వైస్ ప్రెసిడెంట్ పదవి, ప్రతి జిల్లాకు ఇద్దరు ప్రధాన కార్యదర్శులను నియమించాలని నిర్ణయించారు. పార్టీ అధికార ప్రతినిధులుగా మరో 10 మంది, పీసీసీ కార్యదర్శులుగా 50 మందిని నియమించే అవకాశాలున్నాయి. ఇవన్నీ కలిపి దాదాపు 200 వరకు పెరిగి పీసీసీ జంబో కార్యవర్గం ఉండవచ్చని అంచనా. ఈ పదవుల భర్తీపై ఇప్పటికే రెండు సార్లు సీఎం రేవంత్‌రెడ్డి, పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దీపాదాస్ మున్షీలు భేటీ అయ్యారు. దాదాపు 10 జిల్లాలకు ఎమ్మెల్యేలే పార్టీ అధ్యక్షులుగా ఉన్నా రు. వీరిలో కొందరిని తప్పించి, సమర్థులైన మరికొందరు ఎమ్మెల్యేలను డీసీసీ అధ్యక్షులుగా నియమించాలని భావిస్తున్నారు. నామినేటెడ్ పోస్టులపై ఆచితూచి.. నామినేటెడ్ పోస్టుల భర్తీ కూడా గత ఎనిమిది నెలలుగా వాయిదా పడుతూ వస్తోంది. పార్లమెంటు ఎన్నికలకు ముందు 33 కార్పొరేషన్లకు చైర్మన్లను నియమించారు. మరో 40 వరకు కార్పొరేషన్ పదవులు ఖాళీగా ఉన్నట్టు సమాచారం. వీటితో పాటు పలు కమిషన్లలో మరో 30 మంది వరకు అవకాశం కల్పించవచ్చు.అంటే 70 వరకు పదవులు ఇవ్వొ చ్చని ప్రచారం జరుగుతోంది. వీటికి ఆయా కార్పొరేషన్ల డైరెక్టర్ల పోస్టులను కలిపితే వందల సంఖ్యలో ఉంటాయి. ఈ పోస్టుల భర్తీపై సామాజిక, ప్రాంతీయ సమీకరణల కసరత్తు ఎటూ తేలకపోవడంతో ఇప్పటికే పలుమార్లు ఈ ప్రక్రియ వాయిదా పడింది. ఎమ్మెల్సీ హడావుడికాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు ఎమ్మెల్సీ హడావుడి కనిపిస్తోంది. మార్చి నాటికి 8 ఎమ్మెల్సీలు పదవీ విరమణ చేస్తారు. వీటిలో మెజారిటీ సీట్లు దక్కించుకునేందుకు కాంగ్రెస్ వ్యూహాలు రచిస్తోంది. కరీంనగర్–నిజామాబాద్–ఆదిలాబాద్–మెదక్ పట్టభద్రుల స్థానం నుంచి పోటీకి ఆల్ఫోర్స్ నరేందర్‌రెడ్డి, ముస్కు రమణారెడ్డి, ముదనం గంగాధర్, హరికృష్ణ, వెల్చాల రాజేందర్ పేర్లు రేసులో వినిపిస్తున్నాయి. రెండు టీచర్ ఎమ్మెల్సీల విషయంలో మిత్రపక్ష ఉపాధ్యాయ సంఘాలకు మద్దతిచ్చే ఆలోచనలో కాంగ్రెస్ ఉంది. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీల్లో మూడు పదవులు నికరంగా కాంగ్రెస్‌కు రానున్నాయి. ఈ కోటాలో ప్రస్తుత ఎమ్మెల్సీ టి. జీవన్‌రెడ్డికి మళ్లీ అవకాశం వస్తుందని చెబుతున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి విదేశీ పర్యటన అనంతరం ఇతర పోస్టులపై స్పష్టత వస్తుందని, నెలాఖరు కల్లా అధికారికంగా ప్రకటిస్తారని తెలుస్తోంది. -
టీడీపీలో పదవుల నైరాశ్యం
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు పదవుల పంపిణీ చేస్తున్న తీరుపై తెలుగుదేశం పార్టీలో అసహనం వ్యక్తమవుతోంది. ఎన్నో లెక్కలు వేసి, సమీకరణలు చూసి పార్టీ నేతలకు పదవులు ఇస్తున్నట్లు పైకి చెబుతున్నా నేతలు మాత్రం అసంతృప్తితో రగిలిపోతున్నారు. నామినేటెడ్ పదవులు, టీటీడీ బోర్డు సభ్యులు, విప్ల నియామకంపై సీనియర్లు పెదవి విరుస్తున్నారు. సీనియారిటీ, పార్టీలో చేసిన పని గురించి పట్టించుకోకుండా తమకు నచ్చిన వారికే పదవులు ఇస్తున్నారనే అభిప్రాయం అన్ని స్థాయిల్లోనూ వినిపిస్తోంది. రెండు విడతలుగా నియమించిన సుమారు 80 కార్పొరేషన్ చైర్మన్ల పదవుల పంపకంపై పార్టీలో తీవ్ర చర్చ జరుగుతోంది. పార్టీ కోసం పనిచేసిన వారికన్నా లాబీయింగ్ చేసే వారికే ప్రాధాన్యత ఇస్తున్నట్లు నేతలు వాపోతున్నారు. లాబీయిస్టులకే పదవులు..పార్టీ ఆఫీసులో తిష్టవేసి లాబీయింగ్ చేసేవాళ్లు, క్షేత్రస్థాయిలో అసలు ఎప్పుడూ తిరగని వారికే మంచి పదవులు వచ్చాయనే ఆందోళన ఎక్కువమంది నేతల్లో వ్యక్తమవుతోంది. కొమ్మారెడ్డి పట్టాభిరాం, ఆనం వెంకటరమణారెడ్డి, నీలాయపాలెం విజయ్‌కుమార్, గోనుగుంట్ల కోటేశ్వరరావు తదితరులకు ఈ కోవలోనే పదవులు దక్కినట్లు బహిరంగంగానే విమర్శలు గుప్పిస్తున్నారు. టీటీడీ బోర్డు సభ్యుల పదవుల్లోనూ సీనియర్లను పక్కన పెట్టారనే ఆందోళన నెలకొంది. నంద్యాలకు చెందిన రౌడీషీటర్ మల్లెల రాజశేఖర్‌ను బోర్డు సభ్యునిగా నియమించడంపై స్థానికంగా దుమారం చెలరేగింది. అతనికి పదవి ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ నంద్యాల నేతలు ఏకంగా చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు. అయినా ఆయన పదవి పదిలంగానే ఉండడం విశేషం.సీనియర్లకు ఝలక్.. జూనియర్లకు విప్ పదవులు..మరోవైపు.. ఇటీవల నియమించిన శాసనసభ, శాసన మండలి చీఫ్‌విప్‌లు, విప్ల నియామకంపైనా ఎమ్మెల్యేల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. శాసనసభ చీఫ్‌విప్‌గా తనకు అవకాశం దక్కుతుందని సీనియర్ ఎమ్మెల్యే ధూళిపాళ నరేంద్ర ఆశలు పెట్టుకున్నారు. మంత్రి పదవి ఎలాగూ ఇవ్వలేదు కనీసం ఈ పదవైనా ఇస్తారని ఆయన వర్గం ఎన్నో ఆశలు పెట్టుకుంది. కానీ, ఆయన్ను కాదని వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులికి ఆ పదవి కట్టబెట్టడంతో నరేంద్ర రగిలిపోతున్నారు. భారీ సంఖ్యలో టీడీపీ తరఫున 11 మందికి విప్ పదవులు ఇచ్చినా చాలావరకూ జూనియర్లకే అవకాశం ఇవ్వడంతో సీనియర్లు నోరు విప్పలేక మిన్నకుండిపోయారు. ఇక తొలిసారి ఎమ్మెల్యేలుగా గెలిచిన యనమల దివ్య, రెడ్డప్పగారి మాధవి, యార్లగడ్డ వెంకట్రావు, వి. థామస్ తదితరులకు విప్‌లు ఇచ్చి తమను అవమానించారంటూ ప్రత్తిపాటి పుల్లారావు, గంటా శ్రీనివాసరావు, కళా వెంకట్రావు, పరిటాల సునీత, గోరంట్ల బుచ్చయ్యచౌదరి, జ్యోతుల నెహ్రూ, చింతమనేని ప్రభాకర్ వంటి నేతలు ఆవేదనలో మునిగిపోయారు.సీట్లు వదులుకున్న సీనియర్లలో అసంతృప్తిగత ఎన్నికల్లో సీట్లు వదులుకున్న ఎస్వీఎస్ఎన్ వర్మ, దేవినేని ఉమామహేశ్వరరావు, కొమ్మాలపాటి శ్రీధర్, జితేంద్రగౌడ్, ప్రభాకర చౌదరి, కేఏ నాయుడు, బూరుగుపల్లి శేషారావు, గన్ని వీరాంజనేయులు తదితరులకు రెండు విడతలుగా ప్రకటించిన నామినేటెడ్ పోస్టుల్లో నిరాశే ఎదురైంది. ఉదా..» పవన్‌కళ్యాణ్ కోసం పిఠాపురం సీటు వదులుకున్న వర్మకు తొలిదశలోనే మంచి పదవి వస్తుందని అందరూ భావించారు. చంద్రబాబు, లోకేశ్ కూడా ఆయనకు ప్రాధాన్యత ఇస్తామని హామీ ఇచ్చి ఎన్నికల్లో పనిచేయించారు. కానీ, ఆయన్ను పట్టించుకునే వారే లేరని చెబుతున్నారు. » ఎన్డీఆర్ జిల్లా మైలవరం సీటు త్యాగంచేసిన మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పరిస్థితి కూడా దయనీయంగా మారింది. పార్టీలో అత్యంత సీనియర్‌గా ఉండి ఇప్పుడు ఆయన కనీస ప్రాధాన్యానికి నోచుకోలేకపోతున్నారు. జిల్లాలో ఆయన్ను వ్యతిరేకించి సుదీర్ఘకాలం రాజకీయాలు చేసిన కేపీ సారథి టీడీపీలో చేరి మంత్రి కాగా, పక్కలో బల్లెంలా మారి తన సీటును ఎగరేసుకుపోయి గెలిచిన వసంత కృష్ణప్రసాద్‌కి గౌరవం దక్కుతుండడంతో దేవినేని ఉమ అసంతృప్తితో రగిలిపోతున్నారు. రెండు విడతల నామినేటెడ్ పోస్టుల్లో ఆయన్ను చంద్రబాబు పట్టించుకోలేదు. » అనంతపురం అర్బన్ సీటును కొత్తగా వచ్చిన వారికి ఇవ్వడంతో ప్రభాకర్ చౌదరి, చివర్లో జంప్ జిలానీలా వచ్చిన నేత గుంతకల్ సీటు తన్నుకుపోవడంతో జితేంద్రగౌడ్ వంటి వారికి పదవుల పంపకంలో న్యాయం జరగలేదని పార్టీ నేతలు చెబుతున్నారు. » ఇక అధికారంలో లేనప్పుడు ఎంత కష్టపడినా ఇప్పుడు గుర్తింపు దక్కడంలేదని, కనీసం తమను పట్టించుకోవడంలేదని బుద్ధా వెంకన్న వంటి నేతలు వాపోతున్నారు. -
రెండో విడత నామినేటెడ్ పందేరం
సాక్షి, అమరావతి: రెండో విడత నామినేటెడ్ పదవుల్లోనూ మిత్రపక్షాలైన జనసేన, బీజేపీకి చంద్రబాబు ఝలక్ ఇచ్చారు. కంటి తుడుపుగా ఇచ్చామంటే ఇచ్చామన్నట్లుగా పదవులు ఇచ్చారు. చంద్రబాబు కూటమి ప్రభుత్వం రెండో దఫా 59 నామినేటెడ్ పదవులను ప్రకటించింది. వీటిలో రెండు సలహాదారుల పదవులు ఉన్నాయి. ఏ పార్టీతో సంబంధం లేని ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావుకు సలహాదారు పదవి ఇచ్చారు. ఆయనకు విద్యార్థులకు నైతిక విలువలు బోధించే పదవిని ఇచ్చారు. మిగిలిన 58 పదవుల్లో జనసేనకు దక్కింది 9 మాత్రమే. బీజేపీకి రెండే పదవులు ఇచ్చారు.ఓ సలహాదారు పదవి సహా మిగిలినవన్నీ టీడీపీకే. మొదటి విడత ప్రకటించిన 20 కార్పొరేషన్లలోనూ కేవలం మూడు జనసేనకు, ఒకటి బీజేపీకి ఇచ్చి అవమానించారు. వీటితో సంబంధం లేకుండా టీటీడీ ఛైర్మన్ పదవిని చంద్రబాబు తన ఇష్ట్రపకారం భర్తీ చేసుకున్నారు. ఇప్పుడు రెండో విడతలో 58 పదవులు ప్రకటించినా, అంతకంటే ఘోరంగా జనసేన, బీజేపీకి నామమాత్రంగా.. అదీ కూడా అసలు ప్రాధాన్యత లేని పదవులు ఇచ్చారని ఆ పార్టీల నేతలు వాపోతున్నారు. కీలకమైన, ప్రాధాన్యం ఉన్న పదవులన్నీ టీడీపీ నేతలకే కట్టబెట్టారు. టీడీపీ సీనియర్ నాయకుడు ఎంఏ షరీఫ్‌ను రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా నియమించి కేబినెట్ ర్యాంకు ఇచ్చారు. మిగిలిన 57 మందిని ప్రభుత్వం వివిధ కార్పొరేషన్లు, సంస్థలకు చైర్పర్సన్లుగా నియమించింది. వీటిలో 18 కుల కార్పొరేషన్లు, 13 అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలు ఉన్నాయి. పలువురు మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, గత ఎన్నికల్లో టికెట్టు దక్కని నేతలకు ఈ జాబితాలో అవకాశం కల్పించారు.రెండోదఫా నామినేటెడ్ పదవులు సలహాదారులు 1. మహమ్మద్ షరీఫ్ – మైనారిటీ వ్యవహారాలు 2. చాగంటి కోటేశ్వరరావు – స్టూడెంట్స్ ఎథిక్స్ అండ్ వాల్యూస్ వివిధ సంస్థల చైర్మన్లు 1. కుడిపూడి సత్తిబాబు – ఏపీ శెట్టి బలిజ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ 2. మాల సురేంద్ర – ఏపీ గవర వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ 3. రోణంకి కృష్ణంనాయుడు – ఏపీ కళింగ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ 4. పీవీజీ కుమార్ – ఏపీ కొప్పుల వెలమ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ 5. దేవేంద్రప్ప – ఏపీ కురుబ – కురుమ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ 6. ఆర్ సదాశివ – ఏపీ నాయీబ్రాహ్మణ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ 7. సావిత్రి – ఏపీ రజక వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (బీజేపీ) 8. పాలవలస యశస్వి – ఏపీ తూర్పు కాపు వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (జనసేన) 9. కప్పట్రాల సుశీలమ్మ – ఏపీ వాల్మీకి – బోయ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ 10. సీఆర్ రాజన్ – ఏపీ వన్యకుల క్షత్రియ కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ 11. నరసింహ యాదవ్ – ఏపీ యాదవ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ 12. చిలకలపూడి పాపారావు – ఏపీ అగి్నకుల క్షత్రియ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (జనసేన) 13. వీరంకి వెంకట గురుమూర్తి – ఏపీ గౌడ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ 14. గండి బాబ్జి – ఏపీ కోఆపరేటివ్ ఆయిల్ సీడ్స్ గ్రోవర్స్ ఫెడరేషన్ 15. మంజులారెడ్డి రెంటచింతల – ఏపీ శిల్పారామం ఆర్ట్స్, క్రాఫ్టŠస్ అండ్ కల్చరల్ సొసైటీ 16. నీలాయపాలెం విజయ్‌కుమార్ – ఏపీ స్టేట్ బయో డైవర్సిటీ బోర్డు 17. జీవీ రెడ్డి – ఏపీ స్టేట్ ఫైబర్‌నెట్ లిమిటెడ్ 18. మన్నవ మోహన్‌కృష్ణ – ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ లిమిటెడ్ 19. తేజస్వి – ఏపీ కల్చరల్ కమిషన్ 20. పోలంరెడ్డి దినే‹Ùరెడ్డి – ఏపీ ఎని్వరాన్‌మెంట్ మేనేజ్మెంట్ కార్పొరేషన్ 21. సుజయ్‌కృష్ణ రంగారావు – ఏపీ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ 22. గోనుగుంట్ల కోటేశ్వరరావు – ఏపీ గ్రంధాలయ పరిషత్ 23. డేగల ప్రభాకర్ – ఏపీ ఇండ్రస్టియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ 24. కేకే చౌదరి – ఏపీ ఖాదీ అండ్ ఇండస్ట్రీస్ బోర్డు 25. చిల్లపల్లి శ్రీనివాసరావు – ఏపీ మెడికల్ సర్వీసెస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (జనసేన ) 26. ప్రగడ నాగేశ్వరరావు – ఏపీ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ 27. మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి – ఏపీ స్టేట్ అగ్రికల్చర్ మిషన్ 28. ఆనం వెంకట రమణారెడ్డి – ఏపీ స్టేట్ ఆక్వా కల్చర్ డెవలప్మెంట్ అథారిటీ 29. రఘురామరాజు – ఏపీ స్టేట్ బిల్డింగ్ అండ్ అదర్ కన్సస్ట్రక్షన్ వర్కర్స్ అడ్వైజరీ కమిటీ 30. సావల దేవదత్ – ఏపీ స్టేట్ ఆర్గానిక్ ప్రొడక్టŠస్ సర్టిఫికేషన్ అథారిటీ 31. రావి వెంకటేశ్వరరావు – ఏపీ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ 32. కావలి గ్రీష్మ – ఏపీ ఉమెన్స్ కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ 33. ఏపీఎస్ఆర్టీసీ రీజనల్ బోర్డు ఛైర్మన్లు – దొన్ను దొర, రెడ్డి అప్పలనాయుడు (జనసేన), సురేష్ రెడ్డి (బీజేపీ), పోలా నాగరాజు 34. సజ్జా హేమలత – ఏపీ హ్యాండ్లూమ్ కోఆపరేటివ్ సొసైటీ 35. గుమ్మడి గోపాలకృష్ణ – ఏపీ నాటక అకాడమీ 36. సీతంరాజు సుధాకర్ – ఎనీ్టఆర్ వైద్య సేవ 37. కొమ్మారెడ్డి పట్టాభిరామ్ – స్వచ్ఛాంధ్ర మిషన్ 38. అల్లాడ స్వామినాయుడు – అమలాపురం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ 39. టీసీ వరుణ్ – అనంతపూర్ – హిందూపూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (జనసేన) 40. రూపానందరెడ్డి – అన్నమయ్య అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ 41. సలగల రాజశేఖర్‌బాబు – బాపట్ల అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ 42. తెంటు లక్ష్మీనాయుడు – బొబ్బిలి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ 43. కె హేమలత – చిత్తూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ 44. తుమ్మల రామస్వామి – కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (జనసేన) 45. సోమిశెట్టి వెంకటేశ్వర్లు – కర్నూలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ 46. మట్టా ప్రసాద్ – మచిలీపట్నం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (బీజేపీ ) 47. కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి – నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ 48. బొడ్డు వెంకట రమణచౌదరి – రాజమండ్రి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ 49. కె. రవికుమార్ – శ్రీకాకుళం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (జనసేన) 50. ప్రణవ్ గోపాల్ – విశాఖపట్నం మెట్రో రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ 51. ముస్తాక్ అహ్మద్ – ఏపీ స్టేట్ మైనార్టీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ 52. డి. రాకేష్ – ఏపీ ఆర్యవైశ్య వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ 53. వి. సూర్యనారాయణరాజు (కనకరాజు సూరి) – ఏపీ క్షత్రియ వెల్ఫేర్ అండ్ డెవలప్మెం ట్ కార్పొరేషన్ (జనసేన) 54. కొత్తపల్లి సుబ్బారాయుడు – ఏపీ స్టేట్ కాపు వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (జనసేన) 55. ఉండవల్లి శ్రీదేవి – ఏపీ మాదిగ వెల్ఫేర్ కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ 56. పి. విజయ్‌కుమార్ – ఏపీ మాల వెల్ఫేర్ కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ (జనసేన ) 57. కిడారి శ్రావణ్ – ఏపీ గిరిజన కోఆపరేటివ్ కార్పొరేషన్ -
హతవిధీ.. ఎంతటి అవమానం ఇది!
సాక్షి, అమరావతి:నామినేటెడ్ పదవుల పంపకంపై టీడీపీలో అసంతృప్తి జ్వాలలు తీవ్ర స్థాయిలో రగులుతున్నాయి. పార్టీ కోసం పనిచేసిన వారిని, సీనియర్లను కాదని ముఖ్య నేతల కోటరీకి దగ్గరగా ఉండే వారికి పదవులు కట్టబెట్టారనే ఆగ్రహం వ్యక్తమవుతోంది. తొలి దశలో భర్తీ చేసిన 21 కార్పొరేషన్లు, అందులోని ఏడు కార్పొరేషన్లలోని డైరెక్టర్ పదవుల భర్తీకి హేతుబద్ధత లేదని వాపోతున్నారు. హవ్వ.. డైరెక్టర్ పదవులిస్తారా!పలువురు మాజీ ఎమ్మెల్యేలు, గత ఎన్నికల్లో ఎంపీ, ఎమ్మెల్యే సీట్ల కోసం పోటీపడ్డ వారిని కార్పొరేషన్ డైరెక్టర్లుగా నియమించి పార్టీ పెద్దలు చేతులు దులిపేసుకున్నారు. ఇది వారిని అవమానించడమేనని పార్టీలో చర్చ జరుగుతోంది. రంపచోడవరం ఎమ్మెల్యేగా పనిచేసిన వంతల రాజేశ్వరిని సివిల్ సప్లైస్ కార్పొరేషన్ డైరెక్టర్‌గా నియమించారు. ఎంపీ సీటు కోసం పోటీ పడిన గుడివాడకు చెందిన శిష్ట్లా లోహిత్కూ అదే కార్పొరేషన్లో డైరెక్టర్ పదవి ఇచ్చారు. విజయనగరం జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే గద్దే బాబూరావును అందులోనే డైరెక్టర్‌గా నియమించారు. మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై, ఒకసారి మంత్రిగా పనిచేసిన సూళ్లూరుపేట నియోజకవర్గానికి చెందిన పరసా వెంకటరత్నానికి ఒక కార్పొరేషన్లో డైరెక్టర్ పదవి ఇవ్వడం అవమానించడం కాకపోతే ఏమిటనే ప్రశ్నలు టీడీపీ నేతల నుంచి వినిపిస్తున్నాయి. సీట్లు వదులుకున్న వారికి మొండిచేయి గత ఎన్నికల్లో బీజేపీ, జనసేనతో పొత్తు, ఇతర సమీకరణల వల్ల 36 మంది నేతలు సీట్లు వదులుకున్నారు. వారిలో మంతెన రామరాజు, పీలా గోవింద సత్యనారాయణకే ఈసారి అవకాశం కల్పించారు. వీరు కాకుండా సీట్లు ఆశించి భంగపడిన నేతలు మరో 50 మంది వరకూ ఉన్నారు. వారందరికీ పదవుల పంపకంలో మొండిచేయి ఎదురైంది. మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమామహేశ్వరరావు మైలవరం సీటు వదులుకున్నా.. ఆయనకు ప్రాధాన్యత ఇవ్వలేదు. ఆర్టీసీ ఛైర్మన్ పదవి ఆయనకే ఇస్తారని ప్రచారం జరిగినా.. చివరికి జాబితాలో ఆయన పేరు లేదు. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పోటీ చేయడంతో కాకినాడ జిల్లా పిఠాపురం సీటును త్యాగం చేసిన ఎస్వీఎస్ఎన్ వర్మను పట్టించుకోలేదు. వాస్తవానికి ఆయనకు తొలి విడతలోనే ఎమ్మెల్సీగా అవకాశం కల్పించాల్సి ఉన్నా పక్కనపెట్టారు. ఇప్పుడు నామినేటెడ్ పదవుల్లోనూ ఆయనకు అవకాశం కల్పించలేదు.సీనియర్ల ఆశలు నెరవేరలేదుమరోవైపు కచ్చితంగా తొలి దశలోనే తమకు పదవులు వస్తాయని భావించిన కొమ్మారెడ్డి పట్టాభిరామ్, ఆనం వెంకటరమణారెడ్డి, అశోక్‌బాబు, మాల్యాద్రి, నీలాయపాలెం విజయ్‌కుమార్, బుద్దా వెంకన్న వంటి నేతలను తొలి దశలో పరిగణనలోకి తీసుకోలేదు. కొమ్మారెడ్డి పట్టాభికి సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇస్తారని ప్రచారం జరిగినా.. అది ఆయనకు దక్కలేదు. పార్టీ కోసం తాను ఎంతో కష్టపడ్డానని తొలి దశలోనే తనకు అవకాశం దక్కుతుందని చెప్పుకున్న ఆనం వెంకటరమణారెడ్డిఇ మొండిచేయే ఎదురైంది. ఇంకా వివిధ జిల్లాల్లో అనేక మంది నేతల ఆశలు నెరవేరలేదు. దీంతో వారంతా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఏ ప్రాతిపదికన నామినేటెడ్ పదవులను భర్తీ చేశారో చెప్పాలని సీనియర్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. సీఎం తనయుడు లోకేశ్ కోటరీ సూచనల ప్రకారమే పదవులు కట్టబెట్టారని, ఆయన దృష్టిలో ఉన్న వారికి తప్ప మిగిలిన వారిని పక్కనపెట్టారని ఆగ్రహం వ్యక్తమవుతోంది. -
ఉమాకు తప్పని వెన్నుపోటు!
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించిన నామినేటెడ్ పదవుల్లో ఎన్టీఆర్ జిల్లా నాయకులకు చోటు దక్కలేదు. పలువురు ఆశావహులకు నిరాశే మిగిలింది. మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నాయకుడు దేవినేని ఉమా, టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి, మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షుడు నెట్టెం రఘురాంకు నామినేటెడ్ పదవులు దక్కుతాయని అశించారు. అయితే వీరికి తొలి జాబితాలో చోటు దక్కకపోవడంపై పార్టీ వర్గాల్లో అసంతృప్తి సెగలు రగులుతున్నాయి.సాక్షి ప్రతినిధి, విజయవాడ: మాజీ మంత్రి దేవినేని ఉమా ఉమ్మడి కృష్ణా జిల్లాలో 2014–19 మధ్య నీటిపారుదల శాఖ మంత్రిగా చక్రం తిప్పారు. టీడీపీలో తానే నంబరు టూ అన్నంతగా బిల్డప్ ఇచ్చారు. పార్టీ కష్ట కాలంలో వెన్నంటే ఉండి పార్టీకి సేవలందించారు. అయితే వైఎస్సార్సీపీ నుంచి వసంత కృష్ణ ప్రసాద్ టీడీపీలో చేరడంతో, దేవినేని ఉమాకు కష్టాలు మొదలయ్యాయి. ఉమాను పక్కన పెట్టి మైలవరం ఎమ్మెల్యే సీటును వసంత కృష్ణ ప్రసాద్‌కు కేటాయించారు. ఈ నేపఽథ్యంలో పార్టీ కోసం సీటు త్యాగం చేశారన్న కోటాలో దేవినేని ఉమాకు మొదటి విడతలోనే ఆర్టీసీ చైర్మన్‌గా నామినేటెడ్ పదవి కేటాయిస్తారని జోరుగా ప్రచారం జరిగింది. అయితే ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ లోకేష్ కోటరీలో ఉండటంతో పాటు, అధిష్టానం అండదండలు ఆయనకే మెండుగా ఉండటంతో ప్రస్తుతం వసంత మాటే చెల్లుబాటు అవుతోంది. నియోజకవర్గంలో కూడా తన పట్టు జారిపోతుందన్న భయంతో ఇటీవల మైలవరం నియోజకవర్గంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో దేవినేని ఉమా విస్తృతంగా పర్యటించి తన పట్టు నిలుపుకొనే యత్నం చేశారు. ప్రస్తుత ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్, ఆదినుంచి టీడీపీ కోసం కష్టపడిన నాయకులకు ప్రాధాన్యం కల్పించకుండా, వైఎస్సార్ సీపీని వీడి తనతో పాటు టీడీపీలో చేరిన నాయకులకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ విషయంపై టీడీపీ నాయకులు బహిరంగంగానే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ అసమ్మతి నాయకులంతా దేవినేని ఉమా వైపు క్యూ కట్టడంతో తనకు రాజకీయంగా ఇబ్బంది తలెత్తే ప్రమాదం ఉందని వసంత కృష్ణ ప్రసాద్ భావించారు. ఈ నేపథ్యంలో దేవినేని ఉమాకు రాజకీయంగా చెక్ పెట్టేందుకు పావులు కదిపారు. చినబాబు లోకేష్ అండతో ఉమాకు నామినేటెడ్ పదవి రాకుండా వసంత అడ్డుకున్నారనే భావన టీడీపీ వర్గాల్లో వ్యక్తం అవుతోంది. చినబాబు సైతం సీనియర్లతో తనకు ఎప్పుడైనా ఇబ్బంది వస్తుందనే భావనతో ముందుచూపుతో పక్కన పెడుతున్నారు. ఈ నేపథ్యంలో రాజకీయంగా దేవినేని ఉమా శకం ఇక ముగిసినట్టేనని, పాపం..ఉ మా అంటూ పార్టీ వర్గాలే సానుభూతి వ్యక్తం చేస్తున్నాయి.ప్రెస్మీట్ల పట్టాభితెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి పట్టాభి వివాదాస్పద ప్రెస్మీట్లతో పార్టీ అధిష్టానం దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేశారు. ఈయనకు పౌర సరఫరాల సంస్థ కార్పొరేషన్ చైర్మన్ పదవి వస్తుందని ప్రచారం జరిగింది. తీరా పదవి రాకపోవడానికి కారణం ఈయన దుందుడుకు చర్యలేననే భావన పార్టీ వర్గాల్లో వ్యక్తం అవుతోంది. మొత్తం మీద పార్టీలో లోకేష్ కోటరీలోని వ్యక్తుల హవా సాగుతోందని, అందుకే జిల్లాలో పలువురు టీడీపీ సీనియర్ నేతలకు నామినేటెడ్ పదవులు దక్కలేదనే భావనను పార్టీ శ్రేణులే వ్యక్తం చేస్తున్నాయి.రఘురాంకు అడ్డుకట్టేసిన తాతయ్యమాజీ మంత్రి నెట్టెం రఘురాం ఎన్టీఆర్ జిల్లా పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించారు. పార్టీ అధికారంలోకి రాగానే మంచి పదవి వస్తుందని ప్రచారం జరిగింది. అయితే ప్రస్తుతం గెలుపొందిన ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య నెట్టెం రఘురాంకు పదవి ఇస్తే జగ్గయ్యపేటలో రెండు అధికార కేంద్రాలు ఏర్పడతాయని, పార్టీలో గ్రూపులు పెరుగుతాయని, అధిష్టానం దృష్టికి తీసుకెళ్లి రఘురాంకు పదవి రాకుండా అడ్డుకట్ట వేసినట్లు పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది. నెట్టెం రఘురాంకు పదవి దక్కకపోవడంతో ఆయన వర్గీయులు అసంతృప్తితో రగిలి పోతున్నారు.బుద్దా వెంకన్నకు శఠగోపంమాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న తాను పార్టీ కోసం ఎంతో కష్టపడి పనిచేశానంటూ గొప్పలు చెబుతూ ప్రెస్మీట్లు పెట్టి హడావుడి చేస్తూ, చాలెంజ్‌లు చేస్తూ అధిష్టానం దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేశారు. ఓ దశలో ఎన్నికల సమయంలో చంద్రబాబు పాదాలకు రక్తాభిషేకం కూడా చేశారు. తనకు తప్పకుండా పదవి వస్తుందని తన అనుచరుల వద్ద ధీమా వ్యక్తం చేసేవారు. అయితే వెస్ట్ ఎమ్మెల్యే సుజనా చౌదరి రూపంలో అతని పదవికి అడ్డుకట్ట పడింది. నియోజకవర్గంలో జరిగే వ్యవహారాలన్నింటిని సుజనాచౌదరి అధిష్టానం దృష్టికి తీసుకెళ్లడంతో ప్రస్తుతం బుద్దా వెంకన్నకు అధిష్టానం వద్ద పరపతి తగ్గిపోయింది. ఇప్పటికే టీటీడీ లెటర్ల కోసం ఇబ్బంది పడుతున్నామని సాక్షాత్తూ బుద్దా వెంకన్న ప్రకటించటంతోనే, ఎమ్మెల్యేకు, ఆయనకు మధ్య అంతరం ఏర్పడినట్లు స్పష్టం అవుతోంది. దీనికితోడు చినబాబుతో సంబంధాలు కూడా అంతంత మాత్రంగా ఉండటంతో, ఇతనికి పదవి రాకుండా అడ్డుకోవడంలో సుజనా చౌదరి సఫలీకృతం అయినట్లు పార్టీ శ్రేణులే వ్యాఖ్యానిస్తున్నాయి. -
కూటమి ప్రభుత్వంలో అగ్గి రాజేసిన నామినేటెడ్ పదవుల భర్తీ !
-
కూటమిలో 'నామినేటెడ్' పంచాయతీ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వంలో నామినేటెడ్ పదవుల పంచాయితీ ఎటూ తేలడంలేదు. టీడీపీ, జనసేన పార్టీల మధ్య పదవుల పంపకం మధ్య ఏకాభిప్రాయం వచ్చినా.. బీజేపీ మాత్రం వారి దారికి రాలేదు. దీంతో పదవుల నియామకంలో ప్రతిష్టంభన నెలకొంది. ఇప్పట్లో వాటి వ్యవహారం కొలిక్కి వచ్చే అవకాశం కనిపించకపోవడంతో మూడు పార్టీల నేతలు, శ్రేణుల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబుతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి, ముఖ్య నాయకుడు శివప్రకాశ్ మంగళవారం సమావేశమై పదవులపై చర్చ జరిగినా ఏ నిర్ణయం తీసుకోలేకపోయారు. రాష్ట్ర స్థాయి నుంచి నియోజకవర్గం వరకు పదవులు ఎలా పంచుకోవాలనే దానిపై గతంలో ఒక ఫార్ములా రూపొందించినట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నా.. ముందుకు వెళ్లలేకపోయారు. బీజేపీ అభ్యంతరాలుమొత్తం పదవుల్లో 70 శాతం టీడీపీకి, 20 నుంచి 25 శాతం జనసేనకు, మిగిలినవి బీజేపీకి ఇవ్వాలని మొదట్లో ఒక అభిప్రాయం కుదిరింది. అలాగే ఏ పార్టీ గెలిచిన నియోజకవర్గాల్లో ఆ పార్టీకి పదవుల్లో ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించారు. టీడీపీ ఏ నిర్ణయం తీసుకున్నా తమకు సమ్మతమేనని జనసేన తేల్చి చెప్పేయడం, వారు ఎన్ని పదవులు ఇస్తే అంతటితో సరిపెట్టుకునేందుకు సిద్ధమవడంతో ఆ పార్టీ నుంచి టీడీపీకి ఇబ్బంది రాలేదు. అయితే కేవలం 5 నుంచి 10 శాతం పదవులు ఇస్తామనడంపై బీజేపీలో అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. రాష్ట్ర స్థాయిలో కీలకమైన పది కార్పొరేషన్ చైర్మన్ పదవులు, టీటీడీలో ప్రాధాన్యం, నియోజకవర్గాల్లోనూ కీలక పదవులు తమకు కేటాయించాలని ఆ పార్టీ పట్టుబడుతోంది. ఇందుకు సంబంధింది ఇప్పటికే ఒక జాబితా కూడా చంద్రబాబుకు ఇచి్చనట్లు తెలిసింది. అయితే అందులో సోము వీర్రాజు, విష్ణువర్ధన్‌రెడ్డి వంటి నేతలకు కీలక కార్పొరేషన్లు ఇవ్వాలని ప్రతిపాదించడం పట్ల టీడీపీ వ్యతిరేకంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అదే సమయంలో తమ పార్టీలో ఎవరికి పదవులు ఇవ్వాలో టీడీపీ ఎలా నిర్ణయిస్తుందని బీజేపీ నేతల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ విషయంపై ఇరు పార్టీల మధ్య ఏకాభిప్రాయం రాకపోవడంతో బీజేపీ జాతీయ నాయకత్వం జోక్యం చేసుకోవాల్సివచ్చిందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే మంగళవారం చంద్రబాబు వద్దకు ఆ పార్టీ తరఫున జాతీయ ప్రతినిధి వచ్చి చర్చలు జరిపారు. అయినా ఏకాభిప్రాయం రాలేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో నామినేటెడ్ పదవుల నియామకం ఇప్పట్లో లేదని చెబుతున్నారు. ‘నామినేటెడ్’కు మరికొంత సమయంబీజేపీకి స్పష్టం చేసిన సీఎం చంద్రబాబు నామినేటెడ్ పదవులు భర్తీ ఇప్పుడే ఉండబోదని, దానికి మరికొంత సమయం పట్టవచ్చని బీజేపీ నేతలకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. ప్రభుత్వ నామినేటెడ్ పదవుల్లో తమ పార్టీ నేతలకు ప్రాధాన్యత, తమ పార్టీ రాష్ట్ర కార్యాలయ కొత్త భవన నిర్మాణానికి ప్రభుత్వ స్థలం కేటాయింపు తదితర అంశాలపై చర్చించేందుకు బీజేపీ జాతీయ సహ సంఘటనా కార్యదర్శి శివప్రకాశ్, బీజేపీ రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలు పురందేశ్వరి ముఖ్యమంత్రి చంద్రబాబుతో మంగళవారం భేటీ అయ్యారు. 26 జిల్లాలకు సంబంధించి జిల్లాకు కనీసం రెండు చొప్పున అయినా నామినేటెడ్ పదవులు కేటాయించాలని చంద్రబాబు దృష్టికి శివప్రకాశ్ తీసుకొచ్చినట్లు తెలిసింది. నామినేటెడ్ పదవులను ఆశిస్తున్న బీజేపీ నేతల జాబితాను గతంలోనే ముఖ్యమంత్రికి అందజేయగా.. దానికి అదనంగా మరి కొంతమంది ఆశావహుల జాబితాను కూడా ఈ సందర్భంగా చంద్రబాబుకు ఇచ్చారని సమాచారం. ఈ సందర్భంగా.. నామినేటెడ్ పదవుల నియామకానికి కొంత సమయం పట్టవచ్చని బీజేపీ నేతలకు చంద్రబాబు వివరించినట్టు తెలిసింది. ఇక బీజేపీ భవనానికి మంగళగిరి సమీపంలో, లేదంటే అమరావతి రాజధాని ప్రాంతంలో స్థలం కేటాయించాలంటూ ఆ పార్టీ నేతలు సీఎం దృష్టికి తీసుకొచ్చారు. చంద్రబాబుతో భేటీ అనంతరం పురందేశ్వరి నివాసంలో పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలకు విందు ఇచ్చారు. ఈ సందర్భంగా శివప్రకాశ్.. పార్టీ సభ్యత్వ నమోదుపై పలు సూచనలు చేశారు. విందు అనంతరం పురందేశ్వరి మాట్లాడుతూ.. కూటమి బలోపేతంపైనే ముఖ్యమంత్రి చంద్రబాబుతో చర్చ జరిగిందని చెప్పారు. మంత్రి సత్యకుమార్ మాట్లాడుతూ.. పార్టీ నాయకులకు నామినేటెడ్ పదవుల ఆశ ఉంటుందని, వారి ఆశలు హేతుబద్ధమైనవేనని తెలిపారు. రెండున్నర నెలలైనా ఒక్క పదవీ ఇవ్వలేదు కూటమి అధికారంలోకి వచ్చి రెండున్నర నెలలు దాటినా కీలకమైన నామినేటెడ్ పదవులను భర్తీ చేయకపోవడం ఏమిటని మూడు పార్టీల నేతల్లోనూ ఆగ్రహం వ్యక్తమవుతోంది. అత్యంత ప్రాధాన్యమైన టీటీడీ పాలకవర్గాన్ని నియమించకపోవడం అసమర్థతకు నిదర్శనమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఏపీఐఐసీ, ఏపీఎస్ఆర్టీసీ, సివిల్ సప్లయిస్ కార్పొరేషన్, ఎస్సీ, ఎస్టీ కమిషన్లు, కార్పొరేషన్లు వంటి కీలకమైన సంస్థల్లో నియామకాలు చేయలేకపోవడం పట్ల అసహనంతో రగిలిపోతున్నారు. కాగా, పార్టీ కోసం కష్టపడిన తమకు పదవులు ఇవ్వాలని పలువురు టీడీపీ నేతలు కేంద్ర మంత్రి రామ్మోహన్నాయుడిని కోరారు. మంగళగిరి టీడీపీ కార్యాలయంలో మంగళవారం రామ్మోహన్నాయుడు, విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని, మంత్రి వాసంశెట్టి సుభా‹Ù, ఎమ్మెల్యేలు ఎన్.కిషోర్‌కుమార్‌రెడ్డి, శ్రీరాం రాజగోపాల్, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావులతో కలిసి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా పలువురు నేతలు బయోడేటా, పార్టీ కోసం చేసిన కార్యక్రమాలు, ఇతర వివరాలను చూపించి న్యాయం చేయాలని కోరారు. -
అధ్యక్షుడు, నలుగురు వర్కింగ్ ప్రెసిడెంట్లు..
సాక్షి, హైదరాబాద్ : నామినేటెడ్ పోస్టుల భర్తీ, మంత్రివర్గ విస్తరణ త్వరలోనే జరుగుతుందన్న వార్తలకు తోడు టీపీసీసీ అధ్యక్షుడి ఎంపిక, అనుబంధ సంఘాల అధ్యక్షుల మార్పు కూడా ఉంటుందన్న చర్చ జరుగుతోంది. అమెరికా పర్యటనను ముగించుకొని వచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గురువారం రాత్రి ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. దీంతో అధికార కాంగ్రెస్‌పార్టీలో సంస్థాగత మార్పులపై చర్చ జోరందుకుంది. ముఖ్యంగా టీపీసీసీ అధ్యక్షుడి నియా మకంతోపాటు అనుబంధ సంఘాల విషయంలో అధిష్టానం ఏం నిర్ణయం తీసుకుంటుందోననే ఉత్కంఠ నెలకొంది. బీసీ లేదా లంబాడానేనా?టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డి స్థానంలో ఎవరిని నియమించాలన్న అంశం చాలా రోజులుగా కొలిక్కి రావడం లేదు. ముఖ్యంగా సామాజిక సమీకరణల లెక్కలు అధ్యక్షుడి విషయంలో కుదరడం లేదు. సీఎంగా అగ్రవర్ణాలకు చెందిన నేత ఉండటంతో బీసీ లేదా ఇతర సామాజికవర్గాలకు టీపీసీసీ అధ్యక్ష పద వి ఇస్తారనే అభిప్రాయం పార్టీవర్గాల్లో ఉంది. కాంగ్రె స్ అధిష్టానం వద్ద కూడా బీసీ, ఎస్సీ, ఎస్టీ నాయకు ల పేర్లపై చర్చ జరిగింది. బీసీల నుంచి మహేశ్‌కు మార్‌గౌడ్, మధుయాష్కీగౌడ్, ఎస్సీల నుంచి సంపత్‌కుమార్, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, ఎస్టీల నుంచి బలరాంనాయక్‌ల పేర్లు బలంగా వినిపించాయి. వీ రిలో ఒకరికి అధ్యక్షుడి అవకాశం దక్కుతుందని అనుకోగా, తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో మాదిగ సామాజిక వర్గానికే పీసీసీ అధ్యక్ష పదవి ఇస్తారనే చర్చ ఊపందుకుంది. దీనికితోడు రాష్ట్ర ప్రభుత్వంలో కీలకపాత్ర పోషిస్తోన్న అగ్రవర్ణాలకే చెందిన ఒక మంత్రిని కూడా నియమిస్తారనే చర్చ కూడా తెరపైకి వచ్చింది. టీపీసీసీ అధ్యక్షు డితోపా టు నలుగురు వర్కింగ్ ప్రెసిడెంట్లు, ప్రచార కమిటీ చైర్మన్ పదవులు కూడా కొత్త వారికి ఇచ్చే అవకాశా లు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో టీపీసీ సీ అధ్యక్ష వ్యవహారం ఈసారి ఢిల్లీ చర్చల్లో పూర్తవు తుందనే అభిప్రాయం గాంధీభవన్వర్గాల్లో వ్యక్తమవుతోంది. పార్టీ పెద్దలను కలిసి వరంగల్‌లో నిర్వహించతల పెట్టిన రైతు రుణమాఫీ సభకు ఆహ్వానిస్తారు. శుక్రవారం ఢిల్లీలో రేవంత్ మంత్రి శ్రీధ ర్బాబుతో కలిసి అక్కడే ఫాక్స్‌కాన్, యాపిల్ ప్రతిని ధులతో సమావేశం అవుతారని సమాచారం.అనుబంధ సంఘాల్లో మార్పులు టీపీసీసీ అనుబంధ విభాగాల్లోనూ త్వరలో మార్పులు జరగనున్నాయి. ఇప్పటికే ఎన్ఎస్ యూఐ, యూత్‌కాంగ్రెస్ అధ్యక్షుల మార్పు ప్రక్రియ మొదలైంది. ఎన్ఎస్యూఐ అధ్యక్షుడిగా బల్మూరి వెంకట్ స్థానంలో యడవల్లి వెంకటస్వామిని నియమిస్తూ అధిష్టానం ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఇక, శివసేనారెడ్డి స్థానంలో యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడి ఎన్నిక ప్రక్రియ ప్రస్తుతం జరుగుతోంది. వీటికితోడు మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలిని మారుస్తారని తెలుస్తోంది. మూడేళ్ల పదవీకాలాన్ని పూర్తి చేసుకున్న ప్రస్తుత అధ్యక్షురాలు సునీతారావు స్థానంలో గద్వాల నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన సరితా తిరుపతయ్యయాదవ్, మహేశ్వరం టికెట్ ఆశించిన పారిజాతానర్సింహారెడ్డి, టీపీసీసీ అధికార ప్రతినిధులు భవానీరెడ్డి, రవళిరెడ్డిల పేర్లు వినిపిస్తున్నాయి. సరితా తిరుపతయ్యకు మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్ష పదవి ఇవ్వాలని కోరుతూ టీపీసీసీ అధ్యక్ష హోదాలో రేవంత్‌రెడ్డి కూడా మహిళా కాంగ్రెస్ జాతీయ అధ్యక్షురాలు అల్కా లాంబాకు లేఖ రాసినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో త్వరలోనే మహిళాకాంగ్రెస్కు కూడా కొత్త అధ్యక్షురాలు రానున్నారు. వీరితోపాటు ఇటీవల పలువురు అనుబంధ సంఘాల అధ్యక్షులకు కార్పొరేషన్ల చైర్మన్ పదవులు అప్పగించారు. కార్పొరేషన్ చైర్మన్‌గిరీ వచ్చిన అనుబంధ సంఘాల అధ్యక్షుల స్థానంలో కొత్త వారిని నియమిస్తారని తెలుస్తోంది. త్వరలోనే ఈ మార్పు మొదలవుతుందని సమాచారం. మొత్తంమీద అటు టీపీసీసీ అధ్యక్షుడి ఎంపిక, కొత్త కార్యవర్గం, అనుబంధ సంఘాల్లో మార్పుల నేపథ్యంలో అధికార కాంగ్రెస్ పార్టీలో సంస్థాగత పదవుల సందడి నెలకొంది, -
చంద్రబాబుని ఎలా అడగాలో అర్థం కావట్లేదు: డిప్యూటీ సీఎం పవన్
అమరావతి, సాక్షి: నామినేటెడ్ పదవుల విషయంలో జనసేన అధ్యక్షుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అందరికీ పదవుల మీద ఆశ ఉంటుందని, కానీ.. పదవులు అడిగే వాళ్లు వాళ్ల అనుభవాలను, వారి అర్హతలకు దగ్గరగా ఉండే పదవులు అడగాలని కోరారాయన.సోమవారం పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. నామినేటెడ్ పోస్టులు ఉంటాయి. కానీ ప్రతి ఒక్కరూ ఛైర్మన్ పదవులు ఆశిస్తే కష్టం. కొందరు టీటీడీ ఛైర్మన్ సహా ఇంకొన్ని ఛైర్మన్ల పదవులు అడగుతున్నారు. ఒక్క టీటీడీ ఛైర్మన్ పదవి కోసమే 50 మంది అడిగారు. కానీ ఆ పదవి ఒక్కరికే ఇవ్వగలరు.నా కుటుంబ సభ్యులెవరు టీటీడీ ఛైర్మన్ పదవి అడగలేదు. కానీ నా కుటుంబ సభ్యులు టీటీడీ ఛైర్మన్ పదవి అడిగారని ప్రచారంలో పెట్టారు. ఈ పదవుల కోసం చంద్రబాబుని ఎలా అడగాలో తెలియడం లేదు. మీకిది చేశాం కాబట్టి.. మాకు ఈ పదవి ఇవ్వండి అని అడగలేం. అందరికీ న్యాయం చేసేలా నా వంతు ప్రయత్నం చేస్తా.ఇదీ చదవండి: ఇంత ఘోరంగా మోసం చేస్తారా?కానీ.. ఎవరికైనా పదవి ఇవ్వలేకుంటే పెద్ద మనస్సుతో ఆలోచించండి. ప్రధానిని నేనూ కెబినెట్ పదవి అడగగలను.. కానీ నేను అడగలేదు. పదవుల కోసం మనం పని చేయడం లేదు. ఎవరైనా ఏమైనా పదవి కావాలంటే అడగండి. కమిటీలో చర్చించి పదవులిచ్చే ప్రయత్నం చేస్తాం. కష్టపడిన వారిని మరిచిపోం’’ అని అన్నారాయన. కూటమి విజయానికి జనసేన నిర్ణయం తీసుకోవడమే కారణం. నేను ఉపముఖ్యమంత్రిని అవుతానని అనుకోలేదు. ప్రభుత్వంలో భాగం కావడం పెద్ద బాధ్యత అని పవన్ అన్నారు. -
నామినేటెడ్ పదవుల కోసం బాబు సర్వే
నామినేటెడ్ పోస్టుల విషయంలో చంద్రబాబు అనుసరిస్తున్న కొత్త పంథా చూసి పార్టీ క్యాడర్ గగ్గోలు పెడుతోంది. పార్టీ అధికారంలోకి వస్తే కష్టపడిన నాయకులకు తగిన గుర్తింపునిస్తామన్న బాబు తీరా ‘కూటమి’గా జతకట్టి అధికారంలోకి రావడంతో ఆశావహుల విషయంలో పాము చావకుండా..కర్రా విరగకుండా అనే లెవెల్లో వారికి అగ్నిపరీక్ష పెట్టారు. తాను నిర్వహించే సర్వేలో ఎవరికి జనాదరణ ఉందో వారికే నామినేటెడ్ పదవులంటూ ఝలక్ ఇచ్చారు. పదవుల కోసం కూటమి నేతల మధ్య తీవ్ర పోటీ నెలకొన్న తరుణంలో సర్వే చర్చనీయాంశమైంది. బహిరంగంగానే టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు.సాక్షి ప్రతినిధి, తిరుపతి: పార్టీ అధికారంలోకి వస్తే నామినేటెడ్ పదవులు వస్తాయని భావించి పనిచేసిన నాయకులకు అధినేత షాక్ ఇచ్చారు. ఎమ్మెల్యే అభ్యర్థిత్వానికే కాదు.. నామినేటెడ్ పోస్టులు కావాలన్నా సర్వేలో నిరూపించుకోవాల్సిందేనని మరోసారి తేల్చిచెప్పారు. అధినేత తీరుపై పార్టీ కేడర్‌లో తీవ్ర అసహనం వ్యక్తమవుతోంది. అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం నామినేటెడ్ పదవుల కోసం టీడీపీ, బీజేపీ, జనసేన నేతలు పోటీపడుతున్నారు. గత సార్వత్రిక ఎన్నికల్లో శాసనసభ, లోకసభ స్థానాలకు అభ్యర్థుల ఎంపికలో అవలంభించిన ఐవీఆర్ఎస్ సర్వేను నామినేటెడ్ పదవుల కేటాయింపులోనూ అనుసరించాలని టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు భావించినట్లు తెలుస్తోంది. దీంతో పదవుల కోసం నెల రోజులుగా ఎమ్మెల్యేలు, మంత్రులతో టచ్‌లో ఉన్న నాయకుల ఆశలన్నీ నీరుగారిపోయాయి. తిరుమల–తిరుపతి దేవస్థానం పాలకమండలి చైర్మన్‌తో పాటు శ్రీకాళహస్తి దేవస్థానం, తుడా చైర్మన్‌తో పాటు వివిధ కార్పొరేషన్ అధ్యక్ష, సభ్యుల కోసం ఎవరికి వారు పోటీపడుతున్న విషయం తెలిసిందే. పార్టీ కోసం కష్టపడిన వారిని పక్కనబెట్టిన అధిష్టానం సర్వే నివేదిక సమాచారం చూపించి తప్పించుకునేందుకు ప్రయత్నాలను ప్రారంభించింది. అందులో భాగంగా ఐవీఆర్ఎస్ సర్వే పేరుతో ఆలస్యం చేయడంతో పాటు.. తమకు అనుకూలమైన వారికి పదవులు కట్టబెట్టి, రాని వారికి సర్వేలో అనుకూలంగా రాలేదని చెప్పి, తప్పించుకునేందుకు ఎత్తుగడ వేసింది! పార్టీ అధిష్టానం ఐవీఆర్ఎస్ సర్వే పేరుతో విషమ పరీక్ష పెట్టడంతో ఆశావహుల్లో ఆందోళన మొదలైంది. పార్టీ బలోపేతం కోసం ఇన్నాళ్లూ కష్టపడి, తీరా అధికారంలోకి వచ్చాక తమకే నామినేటెడ్ పదవులు దక్కుతాయన్న గ్యారెంటీ లేకపోవడంతో పార్టీ క్యాడర్‌కు నిద్ర కరువవుతోంది.నేను మీ చంద్రబాబు నాయుడు...‘‘నేను మీ చంద్రబాబునాయుడు..మీ ప్రాంతంలో పార్టీ కోసం కష్టపడిన వారికి తగిన రీతిలో గుర్తింపునివ్వాల్సిన అవసరం ఉంది..మీకో ఎస్ఎంఎస్ వస్తుంది. అందులో లింక్‌ను ఓపెన్ చేయండి.. మీప్రాంతంలో ఎవరైతే బాగా కష్టపడ్డారో వారి గురించి తెలియజేయండి..వారిని తగిన విధంగా గౌరవిస్తాం’’ అని ఇటీవల ప్రజలకు టీడీపీ అధినేత చంద్రబాబు గొంతుకతో రికార్డెడ్ వాయిస్ కాల్స్ వచ్చాయి. దీంతో ఆ పార్టీ నాయకులు ఖంగుతిన్నారు. గుర్తింపు అనేది ఏ రూపంలో ఇస్తారో తెలియక జుత్తు పీక్కుంటున్నారు.! అలా ఎస్ఎంఎస్లో లింకులు వచ్చిన పక్షంలో తమ పేర్లు అందులో ప్రస్తావించాలని కొందరు నాయకులు ప్రజలు, కార్యకర్తలను ప్రాధేయపడుతున్నట్టు తెలియవచ్చింది. మరికొందరు దీనిని కూడా తమకు అవకాశంగా మలచుకునేందుకు గట్టిగా యత్నిస్తున్నట్టు తెలుస్తోంది.అన్ని దశలూ దాటాల్సిందే!నామినేటెడ్ పదవుల భర్తీకి టీడీపీ అధిష్టానం అన్ని అంశాలకు పరిగణనలోకి తీసుకుని పరీక్షించనుంది. ఐదు దశల్లో అభ్యర్థులను ఎంపిక చేయనున్నట్లు విశ్వసనీయ సమాచారం. నియోజకవర్గ ఎమ్మెల్యేలు, ఇన్చార్జిలు, జిల్లా పార్టీ అధ్యక్షుడు, పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షులు, నియోజకవర్గ పరిశీలకులు, స్క్రీనింగ్ కమిటీల ద్వారా ఒక్కొక్క నియోజకవర్గం నుంచి ఆశావహుల జాబితాను 100మంది లోపు ఉండేలా సిద్ధం చేయించి ఆ పేర్లతో కూడిన జాబితాను అధిష్టానానికి పంపాలి. వారి సామర్థ్యం, విధేయత, నిబద్ధతను పరిగణనలోకి తీసుకుని ఏ పదవికి ఎవరెవరు సమర్థులో నిర్ణయించనున్నట్లు పేర్కొన్నారు. ఇందుకుగాను వేర్వేరు జాబితాలను సిద్ధం చేసి అందులో ఉన్న వారి పేర్లను నియోజకవర్గంలోని పార్టీ కార్యకర్తలు, ప్రజలకు ఫోన్లు చేసి ఐవీఆర్ఎస్ సర్వే చేయించి పదవులను ఎంపిక చేసేందుకు అధిష్టానం వేగంగా అడుగులు వేస్తుండడంతో ఆశావహుల్లో అంతర్మథనం మొదలైంది.అవసరం తీరిందనుకుంటున్నారా?ఎన్నికల సమయంలో పార్టీ అధికారంలోకి వస్తే ఆ చైర్మన్ పదవి నీకే..నీకే అని హామీలతో ఊదరగొట్టిన అధి నాయకులు.. అధికారంలోకి వచ్చాక సర్వే పేరుతో పదవులు కట్టబెట్టాలని చూస్తుండటంపై నాయకులు, కార్యకర్తలు తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్నారు. పార్టీ కోసం కష్టపడిన తమకు అధికారం వచ్చాక పదవులను కట్టబెట్టేందుకు ఎక్కడలేని విచిత్రమైన విధానాలను అవలంభిస్తున్నారని కుతకుతమని ఉడికిపోతున్నారు. కూటమిలోని టీడీపీ, జనసేన, బీజేపీలకు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో ఎన్నికల్లో శక్తివంచన లేకుండా శ్రమించామని ఎవరికి వారు అధిష్టానానికి వివరించారు. తమ శ్రమకు తగిన ఫలితం కోసం ఎదురు చూస్తున్నామని సమాచారం ఇచ్చారు. ఆశావహుల జాబితా పెద్దదిగా ఉందని చెప్పి, వారికి ఇష్టమొచ్చిన వారికి కట్టబెట్టి, చేతులు దులుపుకునేందుకు సర్వేకు పూనుకున్నారని టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు చర్చించుకుంటున్నారు. సర్వే పేరుతో ఎవరికి పదవులు వరిస్తాయో.. ఎవరికి మొండిచెయ్యి చూపుతారోననే గుబులు నాయకులు, కార్యకర్తలకు నిద్రలేకుండా చేస్తుండటం కొసమెరుపు.కేడర్ అంటే చులకనా?తిరుమల–తిరుపతి దేవస్థానం, శ్రీకాళహస్తీశ్వరస్వామి, కాణిపాకం ఆలయ పాలక మండలి అధ్యక్ష పదవులతో పాటు సభ్యులు, రాష్ట్ర, జిల్లా, నియోజక వర్గ, మండల స్థాయి నామినేటెడ్ పదవులతో పాటు కార్పొరేషన్ చైర్మన్ వంటి పదవులపై ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని టీడీపీ, బీజేపీ, జనసేన నేతలు ఆశలు పెట్టుకున్నారు. పదవులు తమకే వరిస్తాయని ఇప్పటికే తన అనుయులతో గొప్పలు చెప్పుకున్నారు. ఇక పదవి వరించడమే తరువాయి అన్నట్లు నెలరోజులుగా నాయకులు, కార్యకర్తలు ఊహల్లో విహరించారు. తమకు పదవుల విషయంలో ఎలాంటి బ్రేకులు పడకుండా ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్య నాయకులతో సన్నిహితంగా మసలుతూ వారి తల్లో నాలుకగా విధేయతను ప్రదర్శిస్తున్నారు. అయితే ‘తామొకటి తలచిన బాబొకటి తలచెన్’ అని లెవెల్లో పార్టీ అధిష్టానం వారందరికీ ఝలక్ ఇచ్చింది. గతంలోలా ఈసారి కూడా ఎమ్మెల్యేలు సిఫార్సు చేసిన వారికే పదవులు వస్తాయనే వారి కలలను కల్లలు చేసింది. ఎమ్మెల్యే అనుగ్రహం ఒక్కటే ఉంటే సరిపోదు.. క్షేత్రస్థాయిలో పార్టీ కార్యకర్తలు, ప్రజల అనుగ్రహం కూడా ఉండాలనే సాకు చూపించి, ఐవీఆర్ఎస్ సర్వేనే ప్రధాన ఆయుధంగా వారిపై ప్రయోగించేందుకు సిద్ధమైంది. -
ఆషాఢం తర్వాతే..! కేబినెట్ విస్తరణ, పీసీసీ, నామినేటెడ్ పదవుల భర్తీ
సాక్షి, న్యూఢిల్లీ: సమీకరణలు కుదరలేదు. జిల్లాలు, సామాజిక వర్గాల ప్రాతిపదికపై ఏకాభిప్రాయం వ్యక్తం కాలేదు. దీంతో రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ, పీసీసీ అధ్యక్షుడి నియామకం, నామినేటెడ్ పదవుల భర్తీ ఆశలపై కాంగ్రెస్ అధిష్టానం తాత్కాలికంగా నీళ్లు చల్లింది. ఆయా అంశాలపై మరో వారం, పదిరోజుల తర్వాత తీరిగ్గా చర్చిద్దామంది. అప్పటివరకు వేచి చూడాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి సూచించింది. వాస్తవానికి జూలై మొదటి వారంలోనే కీలక పదవుల భర్తీ జరుగుతుందని సీఎం స్వయంగా ప్రకటించారు. ఆ మేరకు ముమ్మర కసరత్తు జరిగినా చివరకు అన్నీ వాయిదా పడ్డాయి. కేబినెట్ విస్తరణ సహా పదవుల పంపకాలన్నీ ఆషాఢ మాసం పూర్తయ్యాక ఆగస్టులోనే ఉండే అవకాశం ఉందని ఏఐసీసీ వర్గాలంటున్నాయి. తాజా భేటీలోనూ తేలని సమీకరణలు రాష్ట్ర కేబినెట్లో ఖాళీలు పూరించడం, కొత్త పీసీసీ అధ్యక్షుడి ఎంపిక, నామినేటెడ్ పదవుల భర్తీపై గడిచిన వారం, పది రోజులుగా ముమ్మర కసరత్తు జరుగుతున్న విషయం తెలిసిందే. సీఎం రేవంత్‌రెడ్డి వారం కిందట కూడా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో ఈ అంశాలపై చర్చలు జరిపారు. అధిష్టానం సైతం ఈ విషయమై రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి దీపాదాస్ మున్షీ, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సీనియర్ మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిల అభిప్రాయాన్ని తీసుకుంది. తాజాగా బుధవారం కూడా ఈ అంశాలపై చర్చించేందుకు ఢిల్లీ వచ్చిన రేవంత్‌రెడ్డి మరోమారు ఖర్గే, ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్‌గాం«దీ, కేసీలతో భేటీ అయ్యారు. సుమారు గంట పాటు చర్చలు కొనసాగాయి. మంత్రివర్గంలోకి తీసుకునేందుకు పరిగణనలోకి తీసుకుంటున్నవారి పేర్లను మరోమారు పరిశీలించారు. ఇందులో మహబూబ్‌నగర్ జిల్లా నుంచి వాకిటి శ్రీహరి, నిజామాబాద్ జిల్లా నుంచి పి.సుదర్శన్‌రెడ్డి, నల్లగొండ జిల్లా నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, బాలూనాయక్, రంగారెడ్డి జిల్లా నుంచి మల్రెడ్డి రంగారెడ్డి, టి.రామ్మోహన్ రెడ్డి, ఆదిలాబాద్ జిల్లా నుంచి ప్రేంసాగర్‌రావు, వివేక్‌ల పేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. ఇందులో వాకిటి శ్రీహరి పేరుపై ఏకాభిప్రాయం ఉన్నప్పటికీ మిగతా పేర్ల విషయంలో పీఠముడి నెలకొంది. ఇలాగైతే ఏం చేయాలి..? నిజామాబాద్ జిల్లా నుంచి పీసీసీ అధ్యక్ష రేసులో మహేశ్‌కుమార్ గౌడ్, గతంలో నిజామాబాద్ నుంచి ఎంపీగా ఉన్న మధుయాష్కీ గౌడ్లు ఉన్న దృష్ట్యా, ఒకవేళ వీరిలో ఒకరికి ఆ పదవి కట్టబెడితే, అదే జిల్లా నుంచి మంత్రి పదవి ఆశిస్తున్న సుదర్శన్‌రెడ్డిని ఏమి చేయాలన్న దానిపై సందిగ్ధత నెలకొంది. దీనిపై నేతలు తర్జనభర్జన పడుతున్నారు. ఇక నల్లగొండ జిల్లాలో రాజగోపాల్‌రెడ్డికి మంత్రి పదవి ఇస్తే, ఇదే జిల్లా నుంచి ఇప్పటికే ప్రాతినిధ్యం వహిస్తున్న ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిలతో కలిపి మొత్తం ముగ్గురు రెడ్లు మంత్రులవుతారు. ఒకవేళ ఆ అంశాన్ని పక్కన పెట్టినా, జిల్లా నుంచి ఎస్టీ ఎమ్మెల్యేగా ఉన్న బాలూనాయక్‌కు మంత్రి పదవి ఇవ్వడం కష్టంగా మారుతుంది. ఇక ఆదిలాబాద్ జిల్లా నుంచి ఇద్దరు సీనియర్ నేతలు జి.వివేక్, ప్రేంసాగర్ రావుల విషయంలోనూ సందిగ్ధత నెలకొంది. భట్టి సహా ఇతర నేతలు మద్దతిస్తున్న వెలమ సామాజిక వర్గానికి చెందిన ప్రేంసాగర్‌ను కేబినెట్లోకి తీసుకుంటే ఓసీ సామాజికవర్గం నుంచి మంత్రుల సంఖ్య పెరుగుతుంది. ఇక గ్రేటర్ హైదరాబాద్ నుంచి మల్రెడ్డి, రామ్మోహన్‌రెడ్డి రేసులో ఉండగా, ఇక్కడ ఒక మైనార్టీకి అవకాశం కల్పించాలనే డిమాండ్ కూడా గట్టిగా ఉంది. దీంతో వీరి విషయంలోనూ నిర్ణయానికి రాలేకపోయారు. ఇలా పలు పేర్ల విషయంలో పలు సమీకరణాలు ముడిపడి ఉండటంతో నేతలు ఒక నిశి్చతాభిప్రాయానికి రాలేకపోయారు. ఈ దృష్ట్యానే కేబినెట్ విస్తరణ అంశాన్ని ప్రస్తుతానికి పక్కన పెట్టాలని, వారం, పదిరోజుల తర్వాత దీనిపై చర్చిద్దామని హైకమాండ్ పెద్దలు ముఖ్యమంత్రికి చెప్పినట్లుగా కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. పీసీసీ సైతం వాయిదానే.. బుధవారం నాటి భేటీలో పీసీసీ అధ్యక్షుడి ఎంపికపై కూడా చర్చించినా, దీన్ని సైతం అధిష్టానం పెద్దలు తేల్చలేకపోయారు. అధ్యక్ష పదవిని బీసీ సామాజిక వరాŠిగ్నకి చెందిన సీనియర్ నేతలు మహేశ్, మధుయాష్కీలలో ఒకరికి కట్టబెట్టాలనే ఆలోచన చేసిప్పటికీ సమీకరణలు కుదరని దృష్ట్యా, ఎస్సీ సామాజిక వర్గం నుంచి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, సంపత్‌కుమార్, ఎస్టీ సామాజిక వర్గం నుంచి బలరాం నాయక్‌ల పేర్లు కూడా మరోమారు చర్చకు వచ్చినట్లు తెలిసింది. దీంతో జిల్లాలు, సామాజిక వర్గాల సమీకరణలు, మంత్రివర్గ విస్తరణ తేలిన తర్వాతే దీనిపై నిర్ణయం తీసుకోవాలని అధిష్టానం భావించినట్లు తెలిసింది. ఇక కేబినెట్ విస్తరణ, పీసీసీ అధ్యక్షుడి నియామకం పూర్తయ్యాకే ఇతర పదవుల భరీŠత్ అంశంపై హైకమాండ్ దృష్టి పెట్టే అవకాశం ఉందని ఏఐసీసీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. కాంగ్రెస్ గూటికి కేకే – పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన మల్లికార్జున ఖర్గే – కేకే అనుభవం కాంగ్రెస్‌ను బలోపేతం చేస్తుందని వ్యాఖ్య సాక్షి, న్యూఢిల్లీ: బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు కాంగ్రెస్ గూటికి చేరారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే బుధవారం కేకేకు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీ లోక్‌సభా పక్ష నేత రాహుల్‌గాందీ, రా్ర‹Ù్టర వ్యవహారాల ఇన్చార్జి దీపాదాస్ మున్షీ, సీఎం రేవంత్‌రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కేకే రాకను స్వాగతించిన ఖర్గే, రాహుల్.. రాష్ట్రంలో పార్టీ పటిష్టతకు పని చేయాలని సూచించారు. కాంగ్రెస్‌లో చేరికతో తిరిగి సొంత ఇంటికి వచ్చినట్లుగా ఉందని కేకే వ్యాఖ్యానించారు. ఈ భేటీ అనంతరం కేకే రాకను స్వాగతిస్తూ ఖర్గే ఎక్స్‌లో పోస్ట్ చేశారు. కేకే అనుభవం పార్టీని బలోపేతం చేసేందుకు దోహదపడుతుందని పేర్కొన్నారు. -
త్వరలోనే నామినేటెడ్ పదవుల భర్తీ
సాక్షి, అమరావతి: త్వరలోనే నామినేటెడ్ పదవులను భర్తీ చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. తెలుగుదేశం పార్టీలో కింది స్థాయి నుంచి ఎవరు, ఎక్కడ ఏం పని చేశారో తెలుసుకుంటున్నానన్నారు. నాయకులు, కార్యకర్తలు సాధికారత సాధిస్తేనే పార్టీ పునాదులు బలంగా ఉంటాయన్నారు. ఈ నేపథ్యంలో వారికి ఎలా చేయాలి, ఏం చేయాలనే విషయంపై ఆలోచిస్తున్నామని చెప్పారు. ఎన్నికల్లో కష్టపడి పనిచేసిన వారికి నామినేటెడ్ పదవులు ఇస్తానన్నారు. సీఎంగా బాధ్యతలు చేపట్టాక చంద్రబాబు శనివారం తొలిసారి గుంటూరు జిల్లా మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయానికి వెళ్లారు. అక్కడ పలువురు నాయకులు, కార్యకర్తలతో ఫొటోలు దిగారు. అనంతరం టెలీకాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్రంలోని కార్యకర్తలు, నాయకులతో మాట్లాడారు. తాను ఇకపై తరచూ పార్టీ కేంద్ర కార్యాలయానికి, జిల్లాలకు వెళ్లినప్పుడు జిల్లా పార్టీ కార్యాలయాలకు వెళతానని తెలిపారు. గతంలోనే కార్యకర్తల సంక్షేమ నిధి ఏర్పాటు చేసి సాయం అందించామని, ఇక ముందు కూడా ఇలాగే ఆదుకుంటానన్నారు. అధికారం వచ్చిందని కక్షసాధింపు చర్యలకు పాల్పడటం, విర్రవీగడం చేయొద్దన్నారు. ఎమ్మెల్యేలు.. నాయకులు, కార్యకర్తలను విస్మరించవద్దని సూచించారు. ప్రజలు తప్పుపట్టేలా ఎటువంటి పనులు చేయొద్దని హెచ్చరించారు. కూటమి విజయం వెనుక నాయకులు, కార్యకర్తల కష్టం.. కృషి ఎంతో ఉన్నాయన్నారు. కూటమి 93 శాతం స్ట్రైక్ రేట్‌తో 57 శాతం ఓట్ షేర్‌ను సాధించిందని తెలిపారు. ప్రజలు ఇచ్చిన మెజారిటీని కాపాడుకోవాలన్నారు. ఎన్నికల ముందు సూపర్ సిక్స్, మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను తప్పకుండా అమలు చేస్తామని చంద్రబాబు తెలిపారు. ఇప్పటికే మెగా డీఎస్సీ ఫైల్‌పై సంతకం చేసి 16,347 ఉద్యోగాల భర్తీకి ఆదేశాలు ఇచ్చామని గుర్తు చేశారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపై రెండో సంతకం, పెన్షన్ రూ.4 వేలకు పెంపుపై మూడో సంతకం, స్కిల్ గణనపై నాలుగో సంతకం, అన్న క్యాంటీన్ల పునరుద్ధరణపై ఐదో సంతకం చేశానని తెలిపారు. యువతలో నైపుణ్యం ఏ మేరకు ఉందో గణన చేసి అవసరమైన అవకాశాలు కల్పిస్తామన్నారు. నైపుణ్య గణనతో జీవన ప్రమాణాలను మార్చడానికి అవకాశం ఉంటుందని అభిప్రాయపడ్డారు. 2014–2019 మధ్య ఎక్కడెక్కడ అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేశామో, వాటన్నింటినీ వంద రోజుల్లోనే ఏర్పాటు చేస్తామని చెప్పారు. ప్రజల జీవన ప్రమాణాలు మార్చేలా పథకాలు అమలు చేస్తామన్నారు. ఇప్పటికే ప్రజాపాలనకు శ్రీకారం చుట్టామన్నారు. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా ముందుకెళ్తామని చెప్పారు. వినతుల స్వీకరణకు ప్రత్యేక వ్యవస్థ ప్రజల సమస్యలు, వినతుల స్వీకరణకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. నిర్దిష్ట సమయంలో పరిష్కారమయ్యేలా చర్యలు తీసుకుంటామన్నారు. సచివాలయానికి రాకపోకలు కొనసాగించేందుకు రవాణా సౌకర్యాలను మెరుగుపరుస్తామని చెప్పారు. పోలవరం సందర్శనతోనే తన క్షేత్ర స్థాయి పర్యటనలు ప్రారంభమవుతాయన్నారు. విధ్వంస పాలనకు గుర్తుగా ప్రజా వేదిక శిథిలాలను అలాగే ఉంచుతామని, తొలగించేది లేదని వెల్లడించారు. -
నామినేటెడ్ పదవుల పందేరం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని 37 కార్పొరేషన్లకు చైర్మన్లను ప్రభుత్వం నియమించింది. నామినేటెడ్ పదవుల కసరత్తు పూర్తయిందని, ఏ క్షణమైనా ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు వెలువడవచ్చని మూడు రోజులుగా గాందీభవన్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కానీ లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ వచ్చిన రోజున శనివారం రాత్రి అనధికారిక సమాచారం మీడియాకు అందింది. అయితే, ఈనెల 14వ తేదీనే ఉత్తర్వులు వెలువడినట్టు ఇందులో పేర్కొన్నారు. పదవుల పంపిణీ ఇలా... 1) పటేల్ రమేశ్‌రెడ్డి – టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్; 2) కె.శివసేనారెడ్డి – స్పోర్ట్స్ అథారిటీ; 3) ఎన్.ప్రీతమ్ – ఎస్సీ కార్పొరేషన్; 4) నూతి శ్రీకాంత్–బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్; 5) ఎస్.అన్వేశ్ రెడ్డి–విత్తనాభివృద్ధి కార్పొరేషన్; 6) ఈరవత్రి అనిల్–మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్; 7) ఎం.విజయబాబు – సహకార, గృహనిర్మాణ సమాఖ్య; 8) రాయల నాగేశ్వరరావు – వేర్ హౌసింగ్ కార్పొరేషన్; 9) కాసుల బాలరాజు– ఆగ్రో ఇండస్ట్రీస్; 10 నేరెల్ల శారద – మహిళా కమిషన్; 11) బంట్రు శోభారాణి – మహిళా సహకార అభివృద్ధి కార్పొరేషన్; 12) సీహెచ్ జగదీశ్వర్‌రావు – నీటిపారుదల అభివృద్ధి కార్పొరేషన్; 13) జంగా రాఘవరెడ్డి – నూనె గింజల పెంపకందారుల సమాఖ్య; 14) మానాల మోహన్‌రెడ్డి – కోఆపరేటివ్ యూనియన్ లిమిటెడ్; 15) బెల్లయ్యనాయక్ – గిరిజన, సహకార, ఆర్థికాభివృద్ధి కార్పొరేషన్; 16) ఆర్,గురునాథ్‌రెడ్డి– పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్; 17) జ్ఞానేశ్వర్‌ముదిరాజ్ – డెయిరీ డెవలప్మెంట్ కార్పొరేషన్; 18) చల్లా నర్సింహారెడ్డి యూఎఫ్ఐడీసీ; 19) మెట్టు సాయికుమార్ – మత్స్యసహకార సొసైటీల సమాఖ్య; 20) కొత్తాకు నాగు – ఎస్టీ సహకార ఆర్థికాభివృద్ధి సంస్థ; 21) జనక్ ప్రసాద్ – కనీస వేతన సలహా మండలి; 22) ఎండీ రియాజ్ – గ్రంథాలయ పరిషత్; 23) ఎం.వీరయ్యవర్మ – వికలాంగుల కార్పొరేషన్; 24) నాయుడు సత్యనారాయణ – చేనేత; 25) ఎంఏ జబ్బార్ – వైస్ చైర్మన్, మైనార్టీస్ ఫైనాన్స్; 26) నిర్మలా జగ్గారెడ్డి – పారిశ్రామిక మౌలికసదుపాయాల కార్పొరేషన్ (టీజీఐఐసీ); 27) మల్రెడ్డి రాంరెడ్డి – రహదారుల అభివృద్ధి; 28) కల్వ సుజాత – వైశ్య కార్పొరేషన్; 29) పొడెం వీరయ్య – అటవీ అభివృద్ధి; 30) ప్రకాశ్‌రెడ్డి – ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్; 31) కె.నరేందర్‌రెడ్డి – సుడా(శాతవాహన అర్బన్ డెవలప్మెంట్); 32) పుంజాల అలేఖ్య – సంగీత నాటక అకాడమీ; 33) గిరిధర్‌రెడ్డి – చలనచిత్ర అభివృద్ధి సంస్థ (ఎఫ్‌టీసీ); 34) మన్నె సతీ‹Ùకుమార్ – టీఎస్టీఎస్; 35) జెరిపేటి జైపాల్ – అత్యంత వెనకబడిన తరగతుల అభివృద్ధి కార్పొరేషన్ (ఎంబీసీ); 36) వెంకట్రాంరెడ్డి – కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (కుడా), 37) ఎంఏ ఫయీం – తెలంగాణ ఫుడ్స్ (నోట్: ఈ జాబితా అనధికారిక సమాచారం మేరకు మాత్రమే. ఇందుకు సంబంధించిన అధికారిక ఉత్తర్వులు ఈ నెల 14నే ఇచ్చినా ప్రభుత్వ వర్గాలు ఇంకా అధికారికంగా వెలువడించాల్సి ఉంది.) -
రాజ్యసభకు సత్నామ్.. మోదీ అభినందనలు.. ఎవరీయన?
ప్రముఖ విద్యావేత్త, చండీగఢ్ యూనివర్సిటీ వ్యవస్థాపకుడు సత్నామ్ సింగ్ సంధూను రాజ్యసభ సభ్యుడిగా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నామినేట్ చేశారు. ఈ మేరకు కేంద్ర హోంమంత్రిత్వశాఖ మంగళవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. సత్నామ్ సంధూ ఎగువసభకు నామినేట్ చేయడాన్ని ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కర్ స్వాగతించారు. సమాజ సేవ చేయడంలో సంధూ కృష్టి, విద్య, ఆవిష్కరణలపై ఆయనకున్న అభిరుచి రాజ్యసభ ఉన్నతికి ఉపయోగపడుతుందని భావిస్తున్నట్లు చెప్పారు. అతని పదవి కాలం ఉత్తమంగా సాగాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఈసందర్భంగా సంధూకు ప్రధాని నరేంద్రమోదీ అభినందనలు తెలియజేశారు. సత్నామ్ సింగ్‌ను రాజ్యసభకు రాష్ట్రపతి నామినేట్ చేసినందుకు సంతోషిస్తున్నట్లు తెలిపారు. ఆయన గొప్ప విద్యావేత్త అని, సామాజిక కార్యకర్తగా అభివర్ణించారు. అట్టడుగు స్థాయి ప్రజలకు సేవ చేస్తున్నారని పేర్కొన్నారు. దేశ సమైక్యత కోసం విస్తృతంగా పనిచేస్తున్నారని, ఆయన పార్లమెంటరీ ప్రయాణం ఉత్తమంగా సాగాలని ఆశిస్తున్నట్లు తెలిపారు. ఆయన అభిప్రాయాలతో రాజ్యసభ కార్యకలాపాలు సుసంపన్నం అవుతాయని భావిస్తున్నట్లు ట్విటర్ ద్వారా వెల్లడించారు. I am delighted that Rashtrapati Ji has nominated Shri Satnam Singh Sandhu Ji to the Rajya Sabha. Satnam Ji has distinguished himself as a noted educationist and social worker, who has been serving people at the grassroots in different ways. He has always worked extensively to… pic.twitter.com/rZuUmGJP0q — Narendra Modi (@narendramodi) January 30, 2024 రైతు కొడుకు నుంచి యూనివర్సిటీ ఫౌండర్‌గా.. పంజాబ్‌కు చెందిన సత్నామ్ సింగ్ సంధూ ఓ సాధారణ రైతు కుటుంబంలో జన్మించాడు. తన చిన్నతనంలో చదువుకునేందుకు ఎన్నో ఇబ్బందులు పడిన సత్నామ్..తనలా ఎవరూ బాధలు పడకూడదని నిర్ణయించుకొని అత్యుత్తమ నైపుణ్యాలతో విద్యను అందించేందుకు 2001లో మొహాలిలోని లాండ్రాన్‌లో చండీగఢ్ గ్రూప్ ఆఫ్ కాలేజీలను స్థాపించాడు. 2012లో చండీగఢ్ యూనివర్సిటీని ఏర్పాటు చేశారు. ఆసియాలోనే అత్యుత్తమ ప్రైవేటు వర్సిటీగా తొలి స్థానంలో నిలిచింది. ప్రస్తుతం ఈ వర్సిటీకి ఆయన ఛాన్సలర్‌గా వ్యవహరిస్తున్నారు. దేశంలోనే ప్రముఖ విద్యావేత్తగా పేరు తెచ్చుకున్నారు సంధూ. ఇతరులకు సాయం చేయడంలోనూ ఆయన ముందుంటారు. ఇండియన్ మైనారిటీస్ ఫౌండేషన్,(IMF) న్యూ ఇండియా డెవలప్మెంట్ (NID) ఫౌండేషన్ పేరుతో రెండు ఎన్జీవోలను ఏర్పాటుచేసి ప్రజల ఆరోగ్యం, వారి అభివృద్ధికి కృషి చేస్తున్నారు. లక్షల మంది విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు ఆర్థికసాయం చేస్తున్నారు. విద్యా రంగంలో ఆయన సేవలను గుర్తించి కేంద్రం ఆయనకు రాష్ట్రపతి కోటాలో రాజ్యసభ సభ్యత్వం కల్పించింది. కాగా వివిధ రంగాకు చెందిన వారికి డైరెక్ట్ రాజ్యసభకు నామినేట్ చేసే హక్కు రాష్ట్రపతికి ఉంటుంది. భారత రాజ్యాంగంలోని నాల్గవ షెడ్యూల్ ప్రకారం.. కళలు, సాహిత్యం, సైన్స్ మరియు సామాజిక సేవలకు చేసిన సేవలకు గాను 12 మంది సభ్యులను ఆరేళ్ల కాలానికి రాజ్యసభకు రాష్ట్రపతికి ఉంటుంది. -
నామినేటెడ్ పోస్టుల భర్తీ షురూ
సాక్షి, హైదరాబాద్: నామినేటెడ్ పోస్టుల భర్తీకి అధికార కాంగ్రెస్ శ్రీకారం చుట్టింది. ఇటీవల ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులను ఖరారు చేసిన ఆ పార్టీ, తాజాగా నలుగురు ముఖ్య కాంగ్రెస్ నేతలకు కేబినెట్ హోదా కల్పించింది. సీఎం రేవంత్‌రెడ్డికి అత్యంత సన్నిహితుడైన వేం నరేందర్‌రెడ్డిని సీఎం సలహాదారుడిగా (ప్రజా వ్యవహారాలు) నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. షబ్బీర్‌అలీ (ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ శాఖలు), హర్కర వేణుగోపాల్ (ప్రొటోకాల్, ప్రజాసంబంధాలు)లను రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులుగా, మాజీ ఎంపీ మల్లు రవిని ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా నియమించారు. ఈ నలుగురికి కేబినెట్ హోదా కల్పిస్తూ విడివిడిగా ఉత్తర్వులు జారీ అయ్యాయి. సీఎం రేవంత్ దావోస్ నుంచి రాగానే నామినేటెడ్ పదవులు భర్తీ చేస్తారని కాంగ్రెస్ నేతల్లో చర్చ జరిగింది. అయితే సీఎం విదేశీ పర్యటన ముగించుకొని వస్తున్న ముందు రోజే ఈ ఉత్తర్వులు వెలువడడం గమనార్హం. త్వరలోనే మాకు కూడా...! : మిగిలిన నామినేటెడ్ పోస్టుల భర్తీ కూడా త్వరలోనే ఉంటుదన్న ఉత్సాహం కాంగ్రెస్ నేతల్లో కనిపిస్తోంది. సీఎం దావోస్ నుంచి వచ్చిన తర్వాత ఒకట్రెండు రోజుల్లోనే పలు కార్పొరేషన్లకు చైర్మన్లు, డైరెక్టర్లను ప్రకటిస్తారని గాం«దీభవన్ వర్గాలంటున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారాల్లో కీలకంగా ఉండే ముఖ్యమైన కార్పొరేషన్లతో పాటు మొత్తం 9 లేదా 18 కార్పొరేషన్ పదవులను ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ‘రాష్ట్రంలో పదేళ్ల తర్వాత అధికారంలోకి వచ్చాం. చాలాకాలంగా అధికారిక పదవుల కోసం ఎదురుచూస్తున్నాం. ఇప్పుడు ప్రభుత్వ సలహాదారుల నియామకంతో మాకు కూడా త్వరలోనే పదవులు వస్తాయనే ఆశ చిగురించింది. నామినేటెడ్ జాబితా ఎప్పుడొస్తుందా అని వేయికళ్లతో ఎదురుచూస్తున్నాం.’అని కార్పొరేషన్ పదవుల ఆశావహుల లిస్టులో ముందు వరుసలో ఉన్న ఓ మాజీ ఎమ్మెల్యే వ్యాఖ్యానించడం గమనార్హం. రాష్ట్రస్థాయి పదవులతో పాటు నియోజకవర్గాల్లో ఎక్కువగా ప్రభావం ఉండే మార్కెట్ కమిటీల పదవులపై కూడా కాంగ్రెస్ పార్టీ క్షేత్రస్థాయిలో కసరత్తు ప్రారంభించింది. పార్లమెంట్ ఎన్నికల సన్నద్ధతకు జిల్లాల వారీగా మంత్రులు, ఎమ్మెల్యేలతో భేటీ అయిన సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత నియమించిన మార్కెట్ కమిటీలను రద్దు చేస్తానని, కొత్త పాలకవర్గాల నియామకంపై ఎమ్మెల్యేలు, మంత్రులు కసరత్తు చేయాలని సూచించారు. ఈ నేపథ్యంలో క్షేత్రస్థాయిలోని కీలక పదవులైన మార్కెట్ కమిటీ నియామకాలు కూడా త్వరలోనే జరుగుతాయనే చర్చ కాంగ్రెస్ శ్రేణుల్లో జరుగుతోంది. పలువురి అభినందనలు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులుగా నియమితులైన వేం నరేందర్‌రెడ్డి, షబ్బీర్లీ, హర్కర వేణుగోపాల్, ఢిల్లీలో ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా నియమితులైన మల్లురవిలకు పలువురు అభినందనలు తెలిపారు. ఆదివారం ఉదయం నుంచే వారి నివాసాలకు కాంగ్రెస్ నేతలు క్యూ కట్టారు. పలువురు మంత్రులు కూడా వేర్వేరు ప్రకటనల్లో వీరికి శుభాకాంక్షలు తెలియజేశారు. పార్టీ అధిష్టానం, సీఎం రేవంత్‌రెడ్డిలకు వేం, షబ్బీర్, హర్కర, మల్లురవిలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తమపై నమ్మకంతో ఇచ్చిన బాధ్యతలను సక్రమంగా నిర్వహించి రాష్ట్ర ప్రజలకు మేలు కలిగేలా ప్రయత్నిస్తామని వారు వెల్లడించారు. -
నామినేటెడ్ పోస్టుల భర్తీపై కాంగ్రెస్ లో ఎడతెగని చర్చ
-
ప్రజాపాలన తర్వాత నామినేటెడ్‌పై ఫోకస్
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 6వ తేదీన ప్రజాపాలన కార్యక్రమం ముగిసిన తర్వాత నామినేటెడ్ పోస్టులను ఖరారు చేసే ఆలోచనలో సీఎం రేవంత్‌రెడ్డి ఉన్నారు. మొదటి నుంచీ చర్చ జరుగుతున్న విధంగా సంక్రాంతి లోపు మొదటి దఫా నామినేటెడ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేసేందుకు తనను కలిసిన విలేకరులతో సీఎం రేవంత్ ఈ మేరకు తన మనసులో మాట చెప్పారు. నామినేటెడ్ పోస్టులను భర్తీ చేసే క్రమంలో తనతో ఉన్న సాన్నిహిత్యం, పార్టీలో పలుకుబడి పనిచేయవని, పార్టీ కోసం కష్టపడ్డవారికి, కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకురావడంలో భాగంగా త్యాగం చేసిన వారికి మాత్రమే ప్రాధాన్యత ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ఎవరికి నామినేటెడ్ పదవులు ఇవ్వాలన్నది పార్టీ నిర్ణయిస్తుందని చెప్పారు. తీవ్ర పోటీ పార్టీ నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేల సలహాలు, సూచనలు, సిఫారసులు తీసుకుని ఆరో తేదీ తర్వాత ముఖ్యమంత్రి కసరత్తు పూర్తి చేయనున్నారు. అనంతరం ఆ జాబితాను పార్టీ అధిష్టానానికి పంపి అక్కడ అనుమతి తీసుకున్న తర్వాత సంక్రాంతిలోపు ఈ పదవుల పందేరంపై ప్రకటన చేస్తారని తెలుస్తోంది. కాగా, పదేళ్ల తర్వాత అధికారం దక్కిన నేపథ్యంలో నామినేటెడ్ పదవుల కోసం కాంగ్రెస్ పారీ్టలో తీవ్ర పోటీ నెలకొంది. రాజకీయంగా గుర్తింపు ఉండే కీలక కార్పొరేషన్లతో పాటు ఇతర కార్పొరేషన్లకు చైర్మన్ పదవులతో పాటు డైరెక్టర్ల కోసం పోటీ పడుతున్న వారి జాబితా చాంతాడంత తయారయింది. ఈ నేపథ్యంలో సామాజిక సమీకరణలు, జిల్లాల వారీ ప్రాతినిధ్యం, పార్టీలో అనుభవం తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని తుది జాబితా తయారు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. బుధవారం జరిగే టీపీసీసీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశంలో కూడా సీఎం రేవంత్ ఈ పోస్టులపై మరింత స్పష్టత ఇస్తారనే చర్చ గాం«దీభవన్ వర్గాల్లో జరుగుతోంది. -
Telangana: ఎంపీ అభ్యర్థుల ప్రకటనపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్ ఎన్నికలు నెల రోజుల మందే రావచ్చని రేవంత్ అన్నారు. అలాగే, సంక్రాంతి తర్వాత కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థుల ప్రకటన ఉంటుందని స్పష్టం చేశారు. కాగా, సీఎం రేవంత్ రెడ్డి పీఏసీ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ.. తెలంగాణలో ఎమ్మెల్సీ సీట్ల అంశం అధిష్టానం చూసుకుంటుంది. నామినేటెడ్ పదవుల ఎంపిక బాధ్యత ఇంఛార్జ్ మాణిక్‌రావ్ ఠాక్రే, ఏఐసీసీ కార్యదర్శులదే. నెల రోజుల్లో నామినేటెడ్ పోస్టుల భర్తీ ఉంటుంది. మన పార్టీ ఎమ్మెల్యే ఉన్నాడా లేదా అని కాకుండా, మన కోసం పనిచేసిన అందరికీ సంక్షేమ పథకాలు అందాల్సిందే. సంక్షేమ పథకాల అమలు బాధ్యత జిల్లా ఇంఛార్జ్‌లదే. మన కార్యకర్తలు సంతృప్తి చెందేలా పనిచేద్దాం. మనం బీఫార్మ్ ఇచ్చిన నాయకుడి ద్వారానే పథకాలు అందాలి. గ్రామసభల్లోనే లబ్ధిదారుల ఎంపిక జరగాలి అని కామెంట్స్ చేశారు. ఇక అంతకుముందు.. గాంధీభవన్‌లో జరిగిన కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశానికి ముఖ్య నేతలంతా హాజరయ్యారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ తెలంగాణ నుంచి పార్లమెంట్ స్థానానికి పోటీ చేయాలని తీర్మానించారు. తెలంగాణలో ఇచ్చిన హామీల మేరకు ఆరు గ్యారెంటీల్లో రెండింటిని అమలు చేశాం. రాష్ట్రంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్థిక క్రమశిక్షణ పాటించలేదన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పుల వివరాల అసెంబ్లీ వేదికగా వివరిస్తాం. సభలో మంత్రి భట్టి విక్రమార్క.. గత ప్రభుత్వ అప్పులపై ప్రజెంటేషన్ ఇస్తారు. త్వరలోనే గ్రామసభలు నిర్వహించి అర్హులైన వారికి రేషన్‌కార్డులు పంపిణీ చేస్తామన్నారు. -
సీఎం రేవంత్ ఎఫెక్ట్.. అధికారుల్లో కొత్త టెన్షన్!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పాలనా యంత్రాంగంలో భారీస్థాయిలో మార్పులు చేపట్టేందుకు కొత్త సర్కారు రంగం సిద్ధం చేస్తున్నట్టు సమాచారం. ప్రత్యేక ప్రధాన కార్యదర్శుల నుంచి జిల్లాల కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్ల వరకు అఖిల భారత సర్వీసు అధికారుల బదిలీల కోసం కసరత్తు జరుగుతున్నట్టు ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. ముఖ్యమంత్రి, మంత్రులు బాధ్యతలు స్వీకరించిన వెంటనే సమీక్షా సమావేశాలు నిర్వహించడం వెనుక ఉద్దేశం కూడా ఇదేనని పేర్కొంటున్నాయి. ప్రాథమికంగా సమీక్షించి, ఆయా శాఖల్లో ఏం జరుగుతోందన్న అంశాలను అవగాహన చేసుకున్నాక.. ప్రక్షాళన మొదలుపెట్టనున్నట్టు వివరిస్తున్నాయి. కొందరు అధికారులపై ఫోకస్ కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పలువురు అధికారులు బీఆర్ఎస్ సర్కారుకు తొత్తులుగా పనిచేస్తున్నారంటూ విమర్శలు గుప్పించింది. హైదరాబాద్ పరిసర ప్రాంత జిల్లాల కలెక్టర్ల పనితీరుపై ఆరోపణలు చేసింది. ఈ నేపథ్యంలో.. ప్రస్తుతం రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న నవీన్ మిట్టల్, పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌కుమార్, ఐటీ–పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, సింగరేణి సీఎండీ శ్రీధర్, పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా, నీటి పారుదల శాఖ కార్యదర్శి స్మితా సబర్వాల్లకు స్థానభ్రంశం తప్పదన్న అభిప్రాయం ప్రభుత్వ వర్గాల్లో వినిపిస్తోంది. నవీన్ మిట్టల్ రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శితోపాటు సీసీఎల్ఏగా కూడా కొనసాగుతున్నారు. ఆయన స్థానంలో ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు లేదా శశాంక్ గోయల్‌ను నియమించే అవకాశాలు ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని తక్షణమే మార్చే ఉద్దేశం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆమెను మార్చే పక్షంలో రామకృష్ణారావుకు సీఎస్ బాధ్యతలు అప్పగించవచ్చని అంటున్నారు. రిటైరైనా కొనసాగుతున్నవారికి ఉద్వాసన పదవీ విరమణ చేసిన దేవాదాయ, పౌరసరఫరాల శాఖ కమిషనర్ అనిల్‌కుమార్‌ను గత ప్రభుత్వం అదే పోస్టులో కొనసాగిస్తూ వచ్చింది. ఇప్పుడు ఆయనకు ఉద్వాసన పలికే అవకాశం ఉందని అంటున్నారు. మైనారిటీ సంక్షేమశాఖ కార్యదర్శిగా ఉన్న రిటైర్డ్ అధికారి సయ్యద్ ఒమర్ జలీల్, పశుసంవర్థకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా తిరిగి నియమితులైన అదర్‌సిన్హా, కారి్మక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా తిరిగి నియమితులైన రాణి కుముదిని తదితరులనూ తప్పించనున్నట్టు చెప్తున్నారు. అప్రాధాన్య పోస్టుల్లో ఉన్న కీలక అధికారులకు.. గత సర్కారు అప్రాధాన్య పోస్టుల్లో కొనసాగించిన సీనియర్ ఐఏఎస్ అధికారుల జాబితాలో.. బుర్రా వెంకటేశ్వర్లు (వెనుకబడిన తరగతుల శాఖ కార్యదర్శి), అనితా రామచంద్రన్ (టీఎస్పీఎస్సీ కార్యదర్శి), విజయేంద్ర (ప్రత్యేక కార్యదర్శి ఆర్అండ్బీ), రాహుల్ బొజ్జా (విపత్తుల నిర్వహణ కార్యదర్శి) తదితరులు ఉన్నారు. వీరికి ప్రాధాన్య పోస్టులు లభించే అవకాశం ఉందని చర్చ జరుగుతోంది. మరోవైపు గత ప్రభుత్వంలో ఓ వెలుగు వెలిగిన ఉన్నతాధికారులు కేంద్ర సర్వీసులకు వెళ్లడానికి అప్పుడే ప్రయత్నాలు మొదలెట్టినట్టు ప్రచారం జరుగుతోంది. కలెక్టర్లకూ స్థాన చలనం కలెక్టర్లలో సంగారెడ్డి కలెక్టర్ శరత్, భూపాలపల్లి కలెక్టర్ భవ్యేశ్ మిశ్రా, రాజీవ్‌గాంధీ హన్మంతుతోపాటు పలువురు అధికారులకు స్థానభ్రంశం తప్పదని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. గతంలో రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్‌గా చేసి.. పీఎంవోకు డిప్యూటేషన్‌పై వెళ్లిన కాట ఆమ్రపాలి తిరిగి రాష్ట్ర సర్వీసులకు వచ్చారు. ఆమె పోస్టింగ్ కోసం ఎదురుచూస్తున్నారు. ఇక ఢిల్లీలోని తెలంగాణ భవన్ ఓఎస్డీగా ఉన్న సంజయ్ జాజు తిరిగి హైదరాబాద్‌కు వచ్చే అవకాశం ఉంది. వీరు కాకుండా మరో అరడజను మంది వరకు అధికారులు కేంద్ర ప్రభుత్వ సర్వీసులో ఉన్నారు. వారు ఐదేళ్లపాటు కేంద్ర సరీ్వసుల్లో డెప్యుటేషన్ పూర్తి చేసుకున్నాకే రాష్ట్ర సర్వీసుకు వస్తారు. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా కోరితే రిలీవ్ చేసే అవకాశం ఉంటుంది. -
మూడింటిపై ఫోకస్
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి రాష్ట్ర పాలనా వ్యవహారాల్లో బహుముఖ వ్యూహంతో ముందుకెళ్తున్నారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే రెండు హామీలను అమల్లోకి తేగా.. ఇప్పుడు రైతులకు సంబంధించిన అంశాలపై ఫోకస్ చేశారు. రైతు బంధు, రుణమాఫీలను వీలైనంత త్వరగా కొలిక్కి తెచ్చే యోచనలో రేవంత్ ఉన్నారని సీఎంవో వర్గాలు చెప్తున్నాయి. వీటితోపాటు నామినేటెడ్ పోస్టుల భర్తీపైనా ఆయన దృష్టి సారించారని అంటున్నాయి. ఇందులో భాగంగానే తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) నుంచి ముఖ్య నేతల పేర్లు, టీపీసీసీ ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శుల పేర్లను తెప్పించుకుని.. పదవుల పంపిణీపై కసరత్తు చేస్తున్నట్టు సమాచారం. నామినేటెడ్ పదవుల్లో భాగంగా ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ హోదాపై స్పష్టత వచ్చిందని, తనకు సన్నిహితుడైన మాజీ ఎమ్మెల్యే వేం నరేందర్‌రెడ్డికి ఈ పదవి ఇవ్వాలని రేవంత్ నిర్ణయించుకున్నారని గాందీభవన్ వర్గాలు చెప్తున్నాయి. బ్యాంకులకు వాయిదాలు..రైతులకు ఒకేసారి రైతుల పంట రుణాల మాఫీ విషయంలో సీఎం రేవంత్ ఒక ఆలోచనకు వచ్చినట్టు సీఎంవో వర్గాల్లో చర్చ జరుగుతోంది. రైతుల కు రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చిన నేపథ్యంలో.. అందుకు అవసరమైన మొత్తాన్ని ఎలా సర్దుబాటు చేయాలన్న దానిపై రేవంత్ పలు ప్రతిపాదనలను పరిశీలిస్తున్నట్టు తెలిసింది. రైతులకు బ్యాంకుల్లో ఉన్న రుణమొత్తాన్ని బట్టి నిధులు విడుదల చేస్తూ దశల వారీగా మాఫీ చేయాలా? లేక ఒకేసారి రుణమాఫీ చేస్తున్నట్టు ప్రకటించాలా అన్న దానిపై ఉన్నతాధికారులు, ఆర్థిక శాఖ అధికారులతో చర్చిస్తున్నట్టు సమాచారం. రైతు రుణమాఫీ కోసం మొత్తంగా ఎంత ఖర్చవుతుందన్న దానిపై సీఎం ఇప్పటికే ఓ అంచనాకు వచ్చారని సీఎంవో వర్గాలు చెప్తున్నాయి. అంత మొత్తాన్ని ఒకేసారి విడుదల చేయడం సాధ్యంకాని పరిస్థితుల్లో.. బ్యాంకులతో చర్చించడం ద్వారా రుణమాఫీ అంశాన్ని పరిష్కరించాలనే యోచనలో ఉన్నారని వివరిస్తున్నాయి. మాఫీ కోసం రూ.36 వేల కోట్లు! రూ.లక్ష వరకు రుణమాఫీకి రూ.18–19 వేల కోట్ల వరకు అవసరమని.. రూ.2లక్షల వరకు అయితే రూ.30 వేల కోట్లు కావాలని ఆర్థిక శాఖ అధికారులు సీఎంకు వివరించినట్టు తెలిసింది. ఈ మొత్తాన్ని నెలవారీ వాయిదాలుగా బ్యాంకులకు చెల్లించే ప్రతిపాదనపై ముందుకెళ్లాలని ఆయన ఆర్థిక శాఖ అధికారులను ఆదేశించినట్టు సమాచారం. మొత్తం రూ.30వేల కోట్లను ఐదేళ్లపాటు వడ్డీతో కలిపి చెల్లించాలంటే.. మొత్తంగా రూ.36 వేల కోట్లు అవుతాయన్న అంచనా వేసినట్టు తెలిసింది. దీంతో ప్రతి నెలా రూ.600 కోట్ల చొప్పున ఐదేళ్లపాటు రుణమాఫీ నిధులను బ్యాంకులకు చెల్లించే అంశాన్ని పరిశీలిస్తున్నట్టు సమాచారం. ఇందుకోసం నోడల్ బ్యాంకును ఏర్పాటు చేసుకోవాలని, అవసరమైతే రిజర్వ్ బ్యాంకు (ఆర్బీఐ)తో చర్చించాలని భావిస్తున్నట్టు తెలిసింది. బ్యాంకులకు నెలవారీ వాయిదాల్లో చెల్లించినా.. రైతులకు మాత్రం ఒకేసారి మొత్తం రుణమాఫీ చేసేలా బ్యాంకులను ఒప్పించాలన్నది సీఎం ఆలోచన అని సీఎంవో వర్గాలు చెప్తున్నాయి. ఈ ప్రతిపాదనపై అన్ని వర్గాల నుంచి సానుకూలత వస్తే.. త్వరలోనే అధికారికంగా ప్రకటన చేయాలని భావిస్తున్నట్టు పేర్కొంటున్నాయి. 15వ తేదీకల్లా రైతు బంధు.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఇప్పటికే ఆ శాఖ అధికారులతో చర్చించిన సీఎం రేవంత్.. వీలైనంత త్వరగా రైతుబంధు సొమ్ము విడుదల చేసేలా నిధులు సమీకరించాలని ఆదేశించారు. ఎన్నికల ప్రచార సమయంలో రైతుబంధు విడుదలకు ఈసీ అనుమతించి, తర్వాత నిలిపివేసిన విషయం తెలిసిందే. దాంతో తాము డిసెంబర్ 9న అధికారంలోకి వస్తామని, తర్వాత 10 రోజుల్లో రైతుబంధు సొమ్మును జమ చేస్తామని పీసీసీ చీఫ్ హోదాలో రేవంత్ హామీ ఇచ్చారు. ఈ మేరకు 19వ తేదీనాటికి రైతుబంధు నిధులను విడుదల చేయాల్సి ఉంది. అంతకు నాలుగు రోజుల ముందే, అంటే ఈ నెల 15వ తేదీకల్లా సుమారు 70లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.7 వేల కోట్లను జమ చేయాలని సీఎం భావిస్తున్నట్టు తెలిసింది. నామినేటెడ్ పదవులపై కసరత్తు ఓ వైపు పాలన, మరోవైపు పథకాల అమలుపై దృష్టి సారించిన సీఎం రేవంత్.. వాటికి సమాంతరంగా నామినేటెడ్ పదవుల భర్తీపై కసరత్తు చేస్తున్నారు. పదేళ్లుగా అధికారానికి దూరమై ప్రభుత్వ పదవుల కోసం ఎదురుచూస్తున్నవారు, గత ఎన్నికల్లో పోటీ అవకాశం రాని నేతలను నామినేటెడ్ పదవుల్లో నియమించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు గాందీభవన్ నుంచి ముఖ్య నేతలు, టీపీసీసీ ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, అనుబంధ సంఘాల నేతల పేర్లను తెప్పించుకున్నారని టీపీసీసీ వర్గాలు తెలిపాయి. పార్టీలోని నేతలతోపాటు పార్టీకి అండగా నిలిచిన బయటి ముఖ్యుల సేవలనూ వినియోగించుకోవాలని రేవంత్ యోచిస్తున్నారని వెల్లడించాయి. ఇందులో భాగంగా టీజేఎస్ అధినేత కోదండరాం, మాజీ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి తదితరుల పేర్లను పరిశీలిస్తున్నారని వివరించాయి. ఆప్తుడికి తొలి నామినేటెడ్ పదవి? సీఎం రేవంత్‌రెడ్డి నామినేటెడ్ పదవుల పంపకంలో భాగంగా తొలి పదవిని తనకు సన్నిహితుడైన మాజీ ఎమ్మెల్యే వేం నరేందర్‌రెడ్డికి ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆయనను కేబినెట్ హోదా ఉండే రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్‌గా నియమించాలని రేవంత్ భావిస్తున్నట్టు తెలిసింది. వేం నరేందర్‌రెడ్డి చాలా కాలం నుంచి రేవంత్ వెన్నంటే ఉంటున్నారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ.. పీసీసీ చీఫ్‌గా ఉన్న రేవంత్ శిబిరంలో కీలకంగా వ్యవహరించారు. తెర వెనుక ఉండి ప్రచారం, అభ్యర్థులతో సమన్వయం, కేడర్‌ను కదిలించడం, సభల ఏర్పాటు, నిర్వహణ వంటివి చూసుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీ చేస్తానని కూడా పట్టుబట్టలేదు. ఈ నేపథ్యంలో వేం నరేందర్‌రెడ్డికి తగిన గుర్తింపు ఇవ్వాలని రేవంత్ యోచిస్తున్నారని, త్వరలోనే ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్‌గా నియమిస్తూ ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉందని టీపీసీసీ వర్గాలు చెప్తున్నాయి. -
నామినేటెడ్ పదవులకు రాజీనామా
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్న నేపథ్యంలో గత ప్రభుత్వంలో నామినేటెడ్ పదవుల్లో నియమితులైన బీఆర్ఎస్ నేతలు రాజీనామా బాట పట్టారు. తమ పదవులనుంచి వైదొలగుతూ.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు సంబందిత శాఖల కార్యదర్శులకు రాజీనామా లేఖలు పంపిస్తున్నారు. రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ పదవికి బోయినపల్లి వినోద్ కుమార్, తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ వైస్ చైర్మన్ పదవికి జ్వాల నరసింహరావు వనం సోమవారం రాజీనామా చేశారు. బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ చైర్మన్, ప్రభుత్వ సలహాదారు పదవికి రిటైర్డు ఐఏఎస్ అధికారి రమణాచారి, తెలంగాణ గ్రంధాలయ సంస్థ చైర్మన్ ఆయాచితం శ్రీధర్ తమ పదవులకు రాజీనామా చేశారు. వీరితో పాటు బీఆర్ఎస్ ప్రభుత్వంలో పలు ప్రభుత్వ కార్పొరేషన్ చైర్మన్లుగా నామినేటైన నేతలు కూడా వైదొలగుతున్నారు. డాక్టర్ ఆంజనేయగౌడ్ (స్పోర్ట్స్ అథారిటీ), సోమ భరత్‌కుమార్ (డెయిరీ డెవలప్మెంట్), జూలూరి గౌరీశంకర్ (తెలంగాణ సాహిత్య అకాడమీ), పల్లె రవికుమార్‌గౌడ్ (కల్లుగీత కార్పొరేషన్), మేడె రాజీవ్‌సాగర్ (టీఎస్ ఫుడ్స్), డాక్టర్ దూదిమెట్ల బాలరాజుయాదవ్ (గొర్రెలు, మేకల అభివృద్ధి సంస్థ), గూడూరు ప్రవీణ్ (టెక్స్టైల్), గజ్జెల నగేష్ (బేవరేజెస్), అనిల్ కూర్మాచలం (ఫిలిం డెవలప్మెంట్), రామచంద్ర నాయక్ (ట్రైకార్), వలియా నాయక్ (గిరిజన ఆర్థిక సహకార సంస్థ), వై.సతీష్ రెడ్డి (రెడ్కో), డాక్టర్ ఎర్రోళ్ల శ్రీనివాస్ (రాష్ట్ర వైద్య మౌలిక సదుపాయాల కల్పన సంస్థ), సర్దార్ రవీందర్‌సింగ్ (పౌర సరఫరాలు), జగన్మోహన్రావు (టెక్నాలజికల్ సరీ్వసెస్), మన్నె క్రిశాంక్ (మినరల్ డెవలప్మెంట్) రాజీనామా చేసిన వారిలో ఉన్నారు. వైదొలిగిన ఎస్ఐబీ చీఫ్ ప్రభాకర్‌రావు, టాస్క్‌ఫోర్స్ ఓఎస్డీ రాధాకిషన్‌రావు మావోయిస్టు ఆపరేషన్స్‌లో కీలకమైన స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ (ఎస్ఐబీ) చీఫ్‌గా పనిచేస్తున్న ఓఎస్డీ టి.ప్రభాకర్‌రావు సోమవారం తన పోస్టుకు రాజీనామా చేశారు. అలాగే, హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ ఓఎస్డీగా పనిచేసిన రాధాకిషన్‌రావు సైతం తన పోస్టుకు రాజీనామా చేశారు. ఏఏజీ రామచంద్రరావు రాజీనామా రాష్ట్ర అదనపు అడ్వొకేట్ జనరల్ జె.రామచంద్రరావు తన పదవికి రాజీనామా చేశారు. శాసనసభ ఎన్నికలు ముగిసి కొత్త ప్రభుత్వం బాధ్యతలు చేపట్టనున్న నేపథ్యంలో ఆయన తన రాజీనామాను సోమవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి పంపించారు. తొలిసారి కేసీఆర్ ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుంచి ఆయన అదనపు ఏజీగా పనిచేశారు. అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ కూడా రాజీనామా చేయనున్నట్లు సమాచారం. ట్రాన్స్‌కో, జెన్కో సీఎండీ కూడా.. తెలంగాణ ట్రాన్స్‌కో, జెన్కో సీఎండీ డి.ప్రభాకర్‌రావు రాజీనామా చేస్తున్నట్టు రాష్ట్ర ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదిర్శకి పంపిన లేఖలో తెలిపారు. కొత్త సీఎండీలను నియమించే వరకు..జెన్కో సీఎండీగా ఆ సంస్థ డైరెక్టర్ ఎ.అజయ్‌కు, ట్రాన్స్‌కో సీఎండీగా సంస్థ జేఎండీ సి.శ్రీనివాసరావుకు అదనపు బాధ్యతలు అప్పగించాలని ఆయన సిఫారసు చేశారు. అయితే ప్రభాకర్ రావు రాజీనామాను ఇంకా ఇంధన శాఖ ఆమోదించలేదని తెలిసింది. కాగా, ఏపీ నుంచి వచ్చిన విద్యుత్ ఉద్యోగులకు పోస్టింగ్‌లు ఇవ్వాల్సి రావడంతో ఏడాది కింద రివర్షన్లు పొందిన తెలంగాణ విద్యుత్ ఉద్యోగులకు ఎన్నికలైన వెంటనే పదోన్నతులు కల్చిస్తామని ప్రభాకర్‌రావు హామీనిచ్చారనీ, ఇప్పుడు ఆయన రాజీనామాతో తమకు తీవ్ర అన్యాయం జరిగిందని బాధిత ఉద్యోగులు ఓ ప్రకటనలో ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం అయినా తమకు న్యాయం చేయాలంటూ సోమవారం ట్రాన్స్‌కో జేఎండీ శ్రీనివాసరావును కలిసి వినతిపత్రం సమర్పించారు. -
ఆంగ్లో ఇండియన్ అంటే ఎవరు? వీరి ప్రాధాన్యత ఏమిటి?
దేశంలోని వివిధ రాష్ట్రాల్లోని లోక్‌సభ, అసెంబ్లీలలో ఆంగ్లో-ఇండియన్ కమ్యూనిటీ ప్రాతినిధ్యం ఉండేది. లోక్‌సభకు ఆంగ్లో ఇండియన్ ప్రతినిధులను రాష్ట్రపతి స్వయంగా ఎన్నుకునేవారు. సభలో ఈ సంఘానికి రెండు సీట్లు రిజర్వ్ చేసేవారు. పార్లమెంట్లో అన్ని ప్రాంతాలు, అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం ఉంటుంది. దేశంలో ఆంగ్లో-ఇండియన్ కమ్యూనిటీ చరిత్ర గురించి తెలుసుకుందాం. రాజ్యాంగంలోని ఆర్టికల్ 366 (2)లో ఆంగ్లో ఇండియన్ ప్రస్తావన కనిపిస్తుంది. ఆంగ్లో-ఇండియన్ అంటే భారతదేశంలో నివసిస్తూ, వారి తండ్రి లేదా అతని తండ్రితరపు పూర్వీకులు యూరోపియన్ సంతతికి చెందినవారై ఉండాలి. చరిత్రను పరిశీలిస్తే భారతదేశంలో ఆంగ్లో-ఇండియన్ల రాక బ్రిటీష్ వారు భారతదేశంలో రైల్వే ట్రాక్‌లు,టెలిఫోన్ లైన్లు వేసినప్పుడు ప్రారంభమైంది. ఈ పనుల కోసం యూరప్ నుండి జనం భారతదేశానికి తరలి వచ్చారు. తర్వాత ఇండియాలో ఇక్కడి యువతులనే వివాహం చేసుకుని ఇక్కడే స్థిరపడ్డాడు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 331 ప్రకారం.. భారతదేశంలోని ఆంగ్లో-ఇండియన్ల సంఘం ప్రతినిధులను దేశంలోని పార్లమెంటు, రాష్ట్రాలలోని అసెంబ్లీలకు నామినేట్ చేసేవారు.ఈ సంఘానికి సొంత నియోజకవర్గం అంటూ లేదు. ఈ హక్కును తొలిసారిగా ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ నుంచి ఫ్రాంక్ ఆంథోనీ అందుకున్నారు. లోక్‌సభలో మొత్తం 545 స్థానాలు ఉన్నాయి. వీటికి 543 మంది ఎంపీలు ఎన్నికవుతారు. ఈ ఎంపీలలో ఆంగ్లో-ఇండియన్ కమ్యూనిటీకి చెందినవారు ఎవరూ లేకపోతే రాజ్యాంగంలోని ఆర్టికల్ 331 ప్రకారం, రాష్ట్రపతి ఆంగ్లో ఇండియన్ సంఘానికి చెందిన ఇద్దరు ప్రతినిధులను లోక్‌సభకు నామినేట్ చేసేవారు. రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ ప్రకారం సభకు నామినేట్ అయిన ఆంగ్లో-ఇండియన్ 6 నెలల్లోపు ఏదైనా పార్టీ సభ్యత్వం తీసుకోవచ్చు. సభ్యత్వం తీసుకున్న తర్వాత వారు ఆ పార్టీ విప్‌కు కట్టుబడి ఉండాలి. దీనితో పాటు పార్టీ నియమనిబంధనల ప్రకానం నడుచుకోవాల్సి ఉంటుంది. ఇది కూడా చదవండి: సిక్కుల తలపాగా రహస్యం ఏమిటి? ఎందుకు ధరిస్తారు? రాష్ట్రాలలో ఏ ఆంగ్లో ఇండియన్లు అసెంబ్లీ ఎన్నికలలో గెలవని పక్షంలో గవర్నర్ ఆంగ్లో-ఇండియన్‌ను ఎన్నుకుని అసెంబ్లీకి పంపే హక్కు కలిగి ఉంటారు. ఇలా ఎన్నికైనవారు ప్రజల నుంచి ఎన్నుకోనివారై, రాష్ట్రపతి లేదా గవర్నర్ ద్వారా నామినేట్ అయితే వారికి రాష్ట్రపతి ఎన్నికలలో ఓటు వేసే హక్కు వారికి ఉండదు. 2012 రాష్ట్రపతి ఎన్నికలలో ఓటు వేసిన ఏకైక ఆంగ్లో-ఇండియన్ డెరెక్ ఓ బ్రియన్. ఈయన తృణమూల్ కాంగ్రెస్ నుంచి ఎంపీగా ఎంపికయ్యారు. ఆదరణ పొందిన కీలర్ సోదరులు పలువురు ఆంగ్లో-ఇండియన్లు మనదేశంలో ఆదరణ పొందారు. వారిలో కీలర్ సోదరులు ప్రముఖంగా కనిపిస్తారు. వీరిద్దరూ లక్నోలో పుట్టారు. ఎయిర్ ఫీల్డ్ మార్షల్ డెంజిల్ కీలర్, వింగ్ కమాండర్ ట్రెవర్ కీలర్ భారత వైమానిక దళంలో పని చేశారు. వీరు ప్రదర్శించిన ధైర్యసాహసాల కారణంగా 1965 ఇండో-పాక్ యుద్ధంలో వీరిద్దరికీ వీర చక్ర అవార్డు లభించింది. లక్నోలో చదువుకున్న ఫ్లైట్ లెఫ్టినెంట్ ఆల్ఫ్రెడ్ కుక్ కూడా 1965 ఇండో-పాక్ యుద్ధంలో వీర చక్ర అవార్డును అందుకున్నారు. పీటర్ ఫాంథమ్ పలుమార్లు ఉత్తరప్రదేశ్ శాసనసభ సభ్యునిగా ఉన్నారు. మోడీ ప్రభుత్వ నిర్ణయంతో.. మోడీ ప్రభుత్వం తన రెండవ టర్మ్ సమయంలో, ఆంగ్లో ఇండియన్ల ఎంపిక విషయంలో కఠిన నిర్ణయం తీసుకుంది. 2019 సంవత్సరంలో పార్లమెంటులో ఆంగ్లో-ఇండియన్ల ప్రాతినిధ్యాన్ని రద్దు చేసింది. ప్రతి పదేళ్ల తర్వాత పార్లమెంటులో రిజర్వేషన్లకు సంబంధించి సమీక్ష జరుగుతుంది. ఈ సమీక్షలో ఈ రెండు రిజర్వ్డ్ సీట్లలో రిజర్వేషన్ ఉంచాలా వద్దా అనేది నిర్ణయిస్తారు. వారి రిజర్వేషన్ వ్యవధి 2020, జనవరి 25తో ముగిసింది. రాజ్యాంగంలో 126వ సవరణ సమయంలో జరిగిన సమీక్ష సందర్భంగా ఈ రిజర్వేషన్‌ను కొనసాగించకూడదని మోదీ మంత్రివర్గం నిర్ణయించింది. దీంతో జార్జ్ బేకర్, రిచర్డ్ హే.. ఆంగ్లో-ఇండియన్ కమ్యూనిటీ నుండి పార్లమెంటుకు ఎంపికైన చివరి ఎంపీలుగా నిలిచారు. ఇది కూడా చదవండి: ఆమె మన దేశపు రాకుమారి.. పాక్ ప్రభుత్వంలో పనిచేస్తూ.. -
బీఆర్ఎస్లో అసంతృప్తి జ్వాలలు.. ప్రజల్లోకి ఎలా వెళ్లాలంటూ ఆవేదన
భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)లో పదవులు వాటంతట అవే నడుచుకుంటూ వస్తాయని దాదాపు నెలరోజుల క్రితం తెలంగాణ భవన్లో జరిగిన హైదరాబాద్ జిల్లా విస్తతస్థాయి సమావేశం ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ హామీ ఇచ్చారు. పదవులు నడచుకుంటూ రావడం కాదు కదా.. ఇప్పటివరకు కనీసం జిల్లా, డివిజన్‌స్థాయి కార్యవర్గాలు సైతం ఏర్పాటు కాకపోవడంతో ఆయా నేతల్లో అసంతృప్తి జ్వాలలు చెలరేగుతున్నా లోలోపలే అణచుకుంటున్నారు. అవి ఏ క్షణాన్నయినా భగ్గుమనేలా నివురుగప్పిన నిప్పులా ఉన్నాయి. పెద్దస్థాయి నేతలు కొందరికి పదవులుంటే సరిపోతుందా? డివిజన్లలో స్థానికంగా పనిచేసే తమకు ఎలాంటి పదవి, గుర్తింపు లేకుంటే తమను గుర్తించేదెవరు? అని పలు డివిజన్ల నేతలు ఆవేదన చెందుతున్నారు. ప్రజల్లోకి వెళ్లేదెలా? గ్రేటర్‌లోనే ఉన్న ఇతర జిల్లాల్లో నామినేటెడ్ పదవులు ఇస్తున్నా హైదరాబాద్ జిల్లా వారికి మాత్రం నామినేటెడ్ పదవులు కాదు కదా కనీసం పార్టీ కమిటీలు కూడా పూర్తిగా భర్తీ చేయకపోవడంతో నేతలు తీవ్ర నిరాశా నిస్పహల్లో మునిగారు. పదవులు నడచుకుంటూ వచ్చేది ఎప్పుడు.. పైస్థాయిలోని కొందరికి మాత్రం పదవులుంటే సరిపోతుందా.. అసెంబ్లీ ఎన్నికలు ఏ క్షణాన వస్తాయో తెలియని పరిస్థితి. ఈలోగా ఎలాంటి పదవులు లేకుంటే తాము ఏ ముఖం పెట్టుకొని ప్రజల్లోకి వెళ్లి ఓట్లు అడగాలని అంబర్‌పేట నియోజకవర్గానికి చెందిన ఓ నాయకుడు వ్యాఖ్యానించారు. నోటిఫికేషన్ వస్తే నామినేటెడ్ పోస్టులెలాగూ ఇవ్వరు. అప్పటికప్పుడు డివిజన్ కమిటీలు భర్తీ చేసినంత మాత్రాన ప్రయోజనమేముంటుంది. నియోజకవర్గ స్థాయి నేతలకు నామినేటెడ్ పోస్టులు లేకుంటే తాము ప్రజల తలలో నాలుకలా పనులు చేయాలంటే.. అధికారుల వద్దకు వెళ్లి చేయించాలంటే ఏదో ఒక పదవి కనీసం ఉండాలి కదా? అని గోషామహల్ నియోజకవర్గానికి చెందిన మరో నాయకుడు వేదన వ్యక్తం చేశారు. చదవండి: ‘హస్తం’లో కొత్త కోణం.. ఏళ్లుగా వైరం.. సేవ్ కాంగ్రెస్‌తో ఒక్కటైన వైనం అంతర్మథనంలో పార్టీ శ్రేణులు.. క్రమశిక్షణో, అధిష్టానానికి భయపడో బీఆర్ఎస్లో ఇప్పటి వరకు ఎలాంటి అసమ్మతి సెగలు బయటకు కనిపించలేదు. తాజాగా మేడ్చల్ జిల్లాలో ఎమ్మెల్యే స్థాయి నాయకులే మంత్రి తీరుపై తమ అసమ్మతి, అసంతప్తి గళాల్ని వినిపించడంతో ఎలాంటి హోదా, పదవులు లేని తాము ఎలా పనిచేయగలమని పలు డివిజన్లు, నియోజకవర్గాల స్థాయి నేతలు తీవ్ర అసంతప్తితో ఉన్నారు. ప్రభుత్వం ఏవైనా సంక్షేమ కార్యక్రమాలు ప్రకటించినప్పుడు అగ్రనేతలకు క్షీరాభిషేకాలు, భారీ ఊరేగింపులు, కటౌట్ల ఏర్పాట్లవంటి పనులే తమకు సరిపోతున్నాయని, తమను పట్టించునే నాయకుడే లేకుండా పోయారని వాపోతున్నారు. ఈ నేపథ్యంలో డివిజన్ స్థాయి నేతలు సైతం ఏదో ఒకదశలో రగులుతున్న తమ బడబాగ్నిని బహిరత్గం చేసే అవకాశం లేకపోలేదని జిల్లా స్థాయి నాయకుడొకరు అభిప్రాయపడ్డారు. ఇప్పటికైనా పార్టీ జిల్లా శాఖ అధ్యక్షుడు, జిల్లా మంత్రి డివిజన్ నేతల మనోగతాన్ని అర్థం చేసుకొని వివిధ కమిటీలు భర్తీ చేయాలని, నామినేటెడ్ పోస్టులిప్పించాలని వివిధ స్థాయిల నేతలు కోరుతున్నారు. మేయర్ వర్సెస్ ఎమ్మెల్యే.. మరోవైపు, ఆయా స్థాయిల నేతలకు పొసగడం లేదు. జీహెచ్ఎంసీ పరిధిలోకొచ్చే ఉప్పల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనడం తెలిసిందే. తాజాగా ఎమ్మెల్యే లేకుండా మేయర్ గద్వాల్ విజయలక్ష్మి వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడంతో ఎమ్మెల్యే అనుచరులు మేయర్ గోబ్యాక్ అంటూ ఆందోళనలు చేశారు. నియోజక వర్గాల సమ్మేళనాలెప్పుడో? రెండు మూడు రోజుల్లో నియోజకవర్గస్థాయి ఆత్మీయ సమ్మేళనాలు ఖరారు చేస్తామని ప్రకటించి నెలరోజులవుతోంది. ఇంతవరకు ఆ ఊసే లేదు. అనేక డివిజన్లలో పార్టీ కమిటీల్లేవు. ఏడాది కిందట ఏర్పాటు చేసిన కమిటీల్లో ఎన్ని పనిచేస్తున్నాయో తెలియదు. కార్పొరేటర్లు, ఎమ్మెల్యేల నడుమ విభేదాలతో చాలా డివిజన్ల కమిటీలు నిద్రాణంగా ఉన్నాయి. చాలా డివిజన్లలో అసంపూర్ణ కమిటీలున్నాయి. ఆత్మీయ సమ్మేళనాల్లో అన్నీ చర్చించి భర్తీ చేస్తామన్నారు. ఇంతవరకు అతీగతీ లేకపోవడంపై పార్టీ శ్రేణులు నిరాశలో కొట్టుమిట్టాడుతున్నాయి. -
కళ్లెదుటే సామాజిక మార్పు
సాక్షి, అమరావతి: నామినేటెడ్ పదవుల నుంచి మంత్రివర్గం వరకు సింహభాగం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకే అవకాశం ఇచ్చి.. రాజ్యాధికారంలో వాటా ఇవ్వడం ద్వారా సామాజిక సాధికారత సాధనలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి టార్చ్ బేరర్‌గా నిలిచారని సామాజిక, రాజకీయ విశ్లేషకులు ప్రశంసిస్తున్నారు. దేశ చరిత్రలో మంత్రివర్గంలో ఏకంగా 70 శాతం పదవులను ఆ వర్గాలకు ఇచ్చింది ఒక్క సీఎం వైఎస్ జగనేనని నొక్కి చెబుతున్నారు. సామాజిక న్యాయం నినాదంతో 2007లో ఉత్తరప్రదేశ్‌లో అధికారంలోకి వచ్చిన మాయావతి సైతం మంత్రివర్గంలో ఆ వర్గాలకు 40 శాతం మాత్రమే అవకాశం ఇచ్చారని గుర్తు చేస్తున్నారు. దేశ చరిత్రలో నామినేటెడ్ పదవులు, పనుల్లో 50 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు.. మహిళలకు రిజర్వ్ చేస్తూ చట్టం చేసి మరీ పదవులు ఇచ్చిన ఘనత ఒక్క సీఎం వైఎస్ జగన్‌దేనని స్పష్టం చేస్తున్నారు. 2019 ఎన్నికల్లో అఖండ విజయం తర్వాత వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తొలి రోజే సామాజిక న్యాయ సాధనకు నడుం బిగించారు. సంక్షేమ పథకాల ద్వారా ఆర్థిక తోడ్పాటు అందించి.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల్లో పేదరికాన్ని నిర్మూలించాలని, ఆ వర్గాల పిల్లలకు ఉన్నత విద్య అందించాలని ప్రణాళిక రచించి, వాటిని ఆచరణలోకి తెచ్చారు. 2019 జూన్ 8న తొలిసారి 25 మందితో ఏర్పాటు చేసిన మంత్రివర్గంలో (14 మందితో 56 శాతం) ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు అవకాశం ఇచ్చి, సామాజిక విప్లవానికి తెరతీసి.. నవశకానికి నాంది పలికారు. ఐదు డిప్యూటీ సీఎం పదవుల్లో నాలుగు (80 శాతం) ఆ వర్గాలకే ఇచ్చారు. దేశ చరిత్రలో తొలి సారిగా ఎస్సీ మహిళను హోం శాఖ మంత్రిగా నియమించారు. శాసనసభ స్పీకర్‌గా బీసీ వర్గాలకు అవకాశం ఇచ్చారు. పరిపాలనలో సింహభాగం వాటా ► స్థానిక సంస్థల్లో బీసీలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించడంపై టీడీపీ నేతలను హైకోర్టును ఆశ్రయించేలా చంద్రబాబు పురిగొల్పారు. దీనిపై హైకోర్టు ఇచ్చిన తీర్పుతో బీసీలకు రిజర్వేషన్ 24 శాతానికి తగ్గిపోయింది. రిజర్వేషన్లు తగ్గినా అంతకంటే ఎక్కువ మంది బీసీలకు స్థానిక సంస్థల్లో అవకాశం కల్పిస్తానని హామీ ఇచ్చిన సీఎం.. దాన్ని ఆచరించి చూపి, పదవులు ఇచ్చారు. ► జిల్లా పరిషత్ ఎన్నికల్లో 13 జిల్లా పరిషత్‌లను వైఎస్సార్సీపీ చేజిక్కించుకుంటే, అందులో తొమ్మిది జిల్లా పరిషత్ చైర్పర్సన్ పదవులను (70 శాతం) ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకే కేటాయించారు. ► మండల పరిషత్ ఎన్నికల్లో 648 మండలాలకు గాను వైఎస్సార్సీపీ 635 మండల పరిషత్ అధ్యక్ష పదవులను దక్కించుకుంటే.. అందులో 67 శాతం పదవులను ఆ వర్గాలకే ఇచ్చారు. ► 13 కార్పొరేషన్లలో వైఎస్సార్సీపీ క్లీన్ స్వీప్ చేస్తే.. ఏడు చోట్ల మేయర్ పదవులు బీసీలకు ఇచ్చారు. మొత్తంగా మేయర్ పదవుల్లో 92 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల వారికే ఇచ్చారు. ► 87 మున్సిపాలిటీల్లో 84 మున్సిపాలిటీలను వైఎస్సార్సీపీ చేజిక్కించుకుంటే.. వాటి చైర్పర్సన్ పదవుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 73 శాతం ఇచ్చారు. చట్టం చేసి మరీ నామినేటెడ్ పదవుల పంపకం ► దేశ చరిత్రలో ఎక్కడా లేని రీతిలో రాష్ట్రంలో నామినేటెడ్ పదవులు, పనుల్లో 50 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు రిజర్వేషన్ చేసేలా సీఎం వైఎస్ జగన్ ఏకంగా చట్టం తెచ్చారు. ► రాష్ట్రంలో 196 వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ చైర్మన్ పదవుల్లో 76 అంటే 39 శాతం బీసీలకు ఇచ్చారు. మొత్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 60 శాతం పదవులు ఇచ్చారు. ► వివిధ ప్రభుత్వ కార్పొరేషన్లలో 137 చైర్మన్ పదవుల్లో 53 (39 శాతం) బీసీలకు ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు మొత్తం 58 శాతం పదవులు ఇచ్చారు. బీసీలకు ప్రత్యేకంగా 56 కార్పొరేషన్లు, ఎస్సీలకు మూడు కార్పొరేషన్లు, ఎస్టీలకు ఒక కార్పొరేషన్ ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ► 137 కార్పొరేషన్లకు సంబంధించి మొత్తం 484 డైరెక్టర్ పదవుల్లో 201.. బీసీలకు (42 శాతం) ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు మొత్తం 58 శాతం డైరెక్టర్ పదవులు ఇచ్చారు. 56 ప్రత్యేక బీసీ కార్పొరేషన్లు, మూడు ఎస్సీ కార్పొరేషన్లు, ఒక ఎస్టీ కార్పొరేషన్లో 684 డైరెక్టర్ పదవులన్నీ ఆ వర్గాల వారికే ఇచ్చారు. సామాజిక మహా విప్లవానికి నాంది ► తొలిసారి ఏర్పాటు చేసిన మంత్రివర్గంలో 56 శాతం పదవులను ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఇచ్చి సామాజిక విప్లవాన్ని ఆవిష్కరించిన సీఎం వైఎస్ జగన్.. ఏప్రిల్ 11న పునర్వ్యవస్థీకరణ ద్వారా 70 శాతం పదవులు (17) ఆ వర్గాలకు ఇచ్చి సామాజిక మహా విప్లవానికి నాంది పలికారు. ► రాష్ట్ర శాసనమండలి చరిత్రలో తొలిసారిగా ఎస్సీ వర్గానికి చెందిన కొయ్యే మోషేన్ రాజును చైర్మన్‌గా, మైనార్టీ మహిళ జకియా ఖానంను డిప్యూటీ చైర్‌పర్సన్‌గా నియమించారు. ► గత మూడేళ్లలో ఎన్నికలు జరిగిన ఎనిమిది రాజ్యసభ స్థానాల్లో నాలుగు రాజ్యసభ స్థానాలను బీసీలకే ఇవ్వడం ద్వారా సామాజిక న్యాయమంటే ఇదీ అని దేశానికి చాటి చెప్పారు. ► శాసనమండలిలో వైఎస్సార్సీపీకి 32 మంది సభ్యులు ఉంటే.. అందులో 18 మంది (56.25 శాతం) ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలే కావడం గమనార్హం. ► మొత్తంగా వైఎస్ జగన్ సంస్కరణల వల్ల ఎన్నిక ఎన్నికకూ వైఎస్సార్సీపీకి ప్రజాదరణ పెరుగుతోంది. స్థానిక సంస్థల (పంచాయతీ, మండల పరిషత్, జిల్లా పరిషత్, మున్సిపాలిటీ, కార్పొరేషన్) ఎన్నికల్లో 80 శాతానికిపైగా స్థానాల్లో విజయభేరి మోగించింది. తిరుపతి లోక్‌సభ, బద్వేలు, ఆత్మకూరు శాసనసభ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో ఇదివరకటి కంటే అధికంగా మెజార్టీ రావడం గమనార్హం. పేదరిక నిర్మూలన.. విద్యకు బాసట ► పేదరిక నిర్మూలనే లక్ష్యంగా మూడేళ్లలో నవరత్నాలు, సంక్షేమ పథకాల కింద డీబీటీ (ప్రత్యక్ష నగదు బదిలీ) ద్వారా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేసిన రూ.1,58,375.03 కోట్లలో 80 శాతానికి పైగా నిధులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకే చేరాయి. నగదు బదిలీయేతర పథకాల ద్వారా మరో రూ.38,836.57 కోట్ల ప్రయోజనం చేకూర్చారు. ► అమ్మ ఒడి, పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ వంటి పథకాల ద్వారా విద్యావంతులుగా తీర్చిదిద్దే యత్నాలను చిత్తశుద్ధితో చేస్తున్నారు. నాడు–నేడు కింద ప్రభుత్వ పాఠశాలలను ఆధునికీకరించి.. ఇంగ్లిష్ మీడియంను ప్రవేశపెట్టారు. సీబీఎస్ఈ సిలబస్‌ను బోధిస్తూ.. బైజూస్‌తో ఉచితంగా కంటెంట్‌ను అందించేందుకు ఒప్పందం చేసుకోవడం ద్వారా ప్రపంచంలో మిగతా దేశాల విద్యార్థులతో పోటీ పడేలా రాష్ట్ర విద్యార్థులను తీర్చిదిద్దాలన్న అంకితభావంతో సీఎం వడివడిగా అడుగులు వేస్తున్నారు. -
పార్టీలో.. కుర్ర‘కారు’ జోరు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అవతరించిన టీఆర్ఎస్.. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పూర్తిగా రాజకీయ పునరేకీకరణపై దృష్టి సారించింది. ఉద్యమంలో క్రియాశీలంగా పాల్గొన్న విద్యార్థి నేతలకు వివిధ సందర్భాల్లో టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ అవకాశాలు ఇస్తూ వచ్చారు. అయితే ఇటీవలి కాలంలో ఈ నేతలకు వరుసగా నామినేటెడ్ పదవులు దక్కాయి. దీంతో చాలాకాలంగా టీఆర్ఎస్ విద్యార్ధి విభాగంలో పనిచేస్తున్న నేతలతోపాటు ఉద్యమ సమయంలో జైలుకెళ్లిన మరికొంతమంది విద్యార్థి నేతలు కేసీఆర్ దృష్టిలో పడేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ఏడాది శాసన మండలిలో 21 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో పూర్తిగా రాజకీయ సమీకరణాలు దృష్టిలో పెట్టుకుని అవకాశాలు ఇచ్చిన కేసీఆర్.. అసెంబ్లీ ఉప ఎన్నికలతోపాటు నామినేటెడ్ పదవుల భర్తీలో విద్యార్థి, యువనేతలకు అవకాశాలు ఇచ్చారు. 2023లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో భవిష్యత్తు నాయకత్వాన్ని తయారు చేసే లక్ష్యంతోనే కేసీఆర్ యువతకు పట్టం కడుతున్నట్లు పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. త్వరలో ఏర్పాటయ్యే పార్టీ రాష్ట్ర కార్యవర్గంలోనూ యువ నాయకత్వానికి ప్రాధాన్యతనిచ్చే అవకాశముంది. పార్టీ విద్యార్థి, యువజన, సోషల్ మీడియా విభాగాల రాష్ట్ర అధ్యక్షులుగా చురుకైన వారికి అప్పగించే యోచనలో కేసీఆర్ ఉన్నారు. తొలి విడతలో కొందరికే.. 2014 సాధారణ ఎన్నికల్లో టీఆర్ఎస్ విద్యార్ధి విభాగంలో చురుగ్గా పనిచేసిన బాల్క సుమన్‌కు పెద్దపల్లి ఎంపీగా, విద్యార్థి నాయకులు గువ్వల బాలరాజు, గ్యాదరి కిషోర్, పిడమర్తి రవికి ఎమ్మెల్యే అభ్యర్థులుగా అవకాశం ఇచ్చారు. పిడమర్తి మినహా మిగతా అందరూ విజయం సాధించారు. తర్వాత పిడమర్తి రవికి ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పదవి దక్కింది. పార్టీ యువజన విభాగం అధ్యక్షుడిగా పనిచేసిన విద్యార్థి నేత బొంతు రామ్మోహన్ గ్రేటర్ హైదరాబాద్ మేయర్‌గా, మరో విద్యార్థి నేత బాబా ఫసీయొద్దీన్ డిప్యూటీ మేయర్‌గా ఎన్నికయ్యారు. ఉద్యమ సమయంలో విద్యార్థి నేతలుగా పనిచేసిన డాక్టర్ కేతిరెడ్డి వాసుదేవరెడ్డి (వికలాంగుల కార్పొరేషన్), రాకేశ్ (టెక్నాలజీ సర్వీసెస్) కార్పొరేషన్ చైర్మన్లుగా, ఆంజనేయులు గౌడ్ బీసీ కమిషన్ సభ్యుడిగా నియమితులయ్యారు. టీఆర్ఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చాక బాల్క సుమన్, గువ్వల బాలరాజు ప్రభుత్వ విప్‌లుగా పనిచేస్తుండగా, చాలాకాలంగా అవకాశాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థి నేతలకు ఇటీవలి కాలంలో కేసీఆర్ వరుస అవకాశాలు ఇస్తున్నారు. రెండేళ్లపాటు ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్‌గా పనిచేసిన ఎర్రోళ్ల శ్రీనివాస్ తాజాగా వైద్య మౌలిక సదుపాయాల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్‌గా నియమితులయ్యారు. కేతిరెడ్డి వాసుదేవరెడ్డికి వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్‌గా పదవీ కాలం పొడిగించగా, పాటిమీద జగన్మోహన్రావు, మన్నె క్రిషాంక్, సాయిచంద్, దూదిమెట్ల బాలరాజు యాదవ్, కిషోర్, శుభప్రద్ పటేల్‌కు వివిధ కార్పొరేషన్లు, కమిషన్లలో చైర్మన్లు, సభ్యులుగా పదవులు లభించాయి. మరికొందరు ఆశావహులు బొంతు రామ్మోహన్ ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ పదవిని ఆశించగా, పిడమర్తి రవి ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ పదవిని ఆశిస్తున్నా రు. ఇటీవల హుజూరాబాద్ ఉప ఎన్నిక అభ్యర్థిగా పోటీ చేసిన టీఆర్ఎస్వీ అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్, పల్లా ప్రవీణ్‌రెడ్డి, రాజా రాం యాదవ్, ఆంజనేయులు గౌడ్, నేవూరు ధర్మేందర్‌రెడ్డి, తుంగ బాలు తదితర యువ నాయకులు నామినేటెడ్ పదవులు ఆశిస్తున్నారు. భవిష్యత్తులో అసెంబ్లీ ఎన్నికల్లో అవసరమైన చోట వీరిని అభ్యర్థులుగా నిలిపే అవకాశాలు కూడా ఉన్నాయని పార్టీలో ప్రచారం జరుగుతోంది. దీంతో విద్యార్థి, యువనేతలు కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దృష్టిలో పడేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. -
వంటేరు, వాసుదేవరెడ్డికి మళ్లీ చాన్స్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ విభాగాల పరిధిలో ఖాళీగా ఉన్న కార్పొరేషన్లకు చైర్మన్ల నియామక ప్రక్రియ వరుసగా మూడో రోజు కూడా కొనసాగింది. రాష్ట్ర వికలాంగుల సహకార సంస్థ చైర్మన్‌గా డాక్టర్ కేతిరెడ్డి వాసుదేవరెడ్డి పదవీ కాల పరిమితిని మరో రెండేళ్లు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ ఉద్యమంలో విద్యార్థి నాయకుడిగా చురుగ్గా పాల్గొన్న వాసుదేవరెడ్డి పదవీ కాలం ఈ ఏడాది ఆగస్టులో ముగిసింది. తాజా ఉత్తర్వుల ప్రకారం మరో రెండేళ్లు ఆయన ఈ పదవిలో కొనసాగుతారు. అలాగే తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్‌గా వంటేరు ప్రతాప్‌రెడ్డి పదవీ కాలాన్ని కూడా మరో రెండేళ్లు పెంచుతూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. సీఎం కేసీఆర్ ప్రాతినిథ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గానికి చెందిన వంటేరు ప్రతాప్‌రెడ్డి పదవీ కాలం అక్టోబర్‌లో ముగిసింది. వాసుదేవరెడ్డి, వంటేరు ప్రతాప్‌రెడ్డిల పదవీ కాలాన్ని పొడిగించిన నేపథ్యంలో రాష్ట్రంలో మూడు రోజుల వ్యవధిలో నామినేటెడ్ పదవులు దక్కించుకున్న టీఆర్ఎస్ నేతల సంఖ్య పదికి చేరింది. ఎర్రోళ్ల శ్రీనివాస్ (మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్), మన్నె క్రిషాంక్ (టీఎస్ఎండీసీ), సాయిచంద్ (వేర్ హౌజింగ్ కార్పొరేషన్), పాటిమీది జగన్ (టీఎస్టీఎస్), గజ్జెల నగేశ్ (బీవరేజెస్ కార్పొరేషన్), దూదిమెట్ల బాలరాజు యాదవ్ (గొర్రెలు, మేకల అభివృద్ధి సంస్థ), ఆకుల లలిత (మహిళా ఆర్థిక సంస్థ), జూలూరు గౌరిశంకర్ (సాహిత్య అకాడమీ) చైర్మన్లుగా నియమితులైన విషయం తెలిసిందే. ఇప్పటివరకు పదవులు రానివారిపై దృష్టి.. పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేస్తున్న వారు, ఉద్యమ సమయంలో పార్టీ విద్యార్థి, యువజన విభాగాల్లో చురుగ్గా పనిచేసిన వారు, వివిధ సందర్భాల్లో ఇతర పార్టీల నుంచి టీఆర్ఎస్లో చేరినా పదవులు పొందని వారిని గుర్తించి నామినేటెడ్ పదవుల భర్తీ ప్రక్రియను కేసీఆర్ చేపట్టారు. సుమారు 50 వరకు వివిధ ప్రభుత్వ కార్పొరేషన్ల చైర్మన్ల పదవులు, పాలక మండళ్లు ఏళ్ల తరబడి ఖాళీగా ఉండటంతో వాటిని వీలైనంత త్వరగా భర్తీ చేయాలని కేసీఆర్ చర్యలు తీసుకుంటున్నారు. ఇదిలా ఉండగా నామినేటెడ్ పదవుల భర్తీ వేగవంతం కావడంతో పదవులు ఆశిస్తున్న టీఆర్ఎస్ నేతలు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను కలవడంతో పాటు తమ జిల్లాలకు చెందిన మంత్రుల ద్వారా ప్రయత్నాలు ముమ్మరం చేశారు. -
ఆశల పల్లకిలో నేతలు.. కోడ్ ముగిశాకే ‘పార్టీ’!!
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్లో మళ్లీ సంస్థాగత పదవుల అంశం తెరపైకి వచ్చింది. స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగిశాక.. పార్టీ జిల్లా, రాష్ట్ర కమిటీల నియామకం చేపట్టే అవకా శం ఉందని టీఆర్ఎస్ వర్గాలు చెప్తున్నాయి. దీనితో శాసన మండలి సభ్యత్వాన్ని ఆశించి, అవకాశం దక్కనివారు.. తమ రూటు మార్చి నామినేటెడ్ పదవులు లేదా పార్టీ జిల్లా, రాష్ట్ర కమిటీల్లో ప్రాధాన్య పదవులపై దృష్టిపెట్టారు. శాసనమం డలి స్థానిక సంస్థల కోటా ఎన్నికల కోడ్ ఈ నెల 16న ముగియనుంది. ఆ తర్వత పదవుల పందే రం మొదలయ్యే అవకాశం ఉందని తెలిసింది. ఇప్పుడు అవకాశం వస్తేనే.. చాలాకాలంగా ఎమ్మెల్సీ, ఇతర పదవులు ఆశించి, అవకాశం రాని నేతలు.. 2023 సాధారణ ఎన్నికలలోపు ఏదో ఒక పదవిని దక్కించుకోవడంపై దృష్టిపెట్టారు. నామినేటెడ్ పదవులుగానీ, పార్టీ రాష్ట్ర కార్యవర్గంలోచోటుగానీ దొరికితేనే.. భవిష్యత్తులో రాజకీయ అవకాశాలు మెరుగ్గా ఉంటాయని భావి స్తున్నారు. 2023 సాధారణ ఎన్నికలలోపు పదవీ యోగం పొందడానికి ఇదే చివరి అవకాశమన్న అభిప్రాయం కూడా వారిలో వ్యక్తమవుతోంది. రాష్ట్రంలో 80కిపైగా ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సం స్థలకు సంబంధించిన కార్పొరేషన్లు ఉండగా.. అం దులో ప్రస్తుతం 35 కార్పొరేషన్లకు మాత్రమే పాలక మండళ్లు ఉన్నాయి. కీలక కార్పొరేషన్ల పాలకమండళ్లు ఖాళీగా ఉండటంతో.. తమకు అవకాశం ఇవ్వాలంటూ నేతలు సంబంధిత జిల్లా మంత్రులు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, అధినేత కేసీఆర్‌ల దృష్టిలో పడేందుకు ప్రయత్నిస్తున్నారు. సంస్థాగత పదవులైనా.. టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదును ఈ ఏడాది ఫిబ్రవరిలోనే ప్రారంభించింది. కానీ కోవిడ్ లాక్డౌన్, పలు ఇతర కారణాలతో సంస్థాగత కమిటీల ఏర్పాటు ప్రక్రియలో జాప్యం జరిగింది. ఈ ఏడాది సెప్టెంబర్ చివరి నాటికే గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు పార్టీ కమిటీల ఏర్పాటు పూర్తయ్యేలా షెడ్యూల్ ప్రకటించినా.. అమలుకాలేదు. వినాయక చవితి, దసరా పండుగలు, అసెంబ్లీ సమావే శాలు, హుజూరాబాద్ ఉప ఎన్నిక, శాసన మండలి ఎన్నికల నేపథ్యంలో జిల్లా, రాష్ట్ర కమిటీల ఏర్పాటు తరచూ వాయిదా పడుతోంది. పార్టీ ద్విదశాబ్ది ఉత్సవాల నేపథ్యంలో వరంగల్‌లో ‘తెలంగాణ విజయగర్జన’సభ నిర్వహించాలని భావించినా.. ఇప్పటికే రెండుసార్లు వాయిదా వేశారు. ప్రస్తుతం శాసనమండలి ఎన్నికల ప్రక్రియ 16న ముగుస్తుండటంతో జిల్లా, రాష్ట్రస్థాయి కమిటీలను ప్రకటించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. గతంలో రద్దు చేసిన జిల్లా కమిటీలను తిరిగి పునరుద్ధరిస్తామని ప్రకటించినా.. ప్రస్తుతానికి కేవలం జిల్లా కన్వీనర్లను మాత్రమే నియమించే అవకాశం ఉందని అంటున్నాయి. -
Andhra Pradesh: వెనకబాటు నుంచి వెన్నెముకగా..!
సాక్షి, అమరావతి: బ్యాక్వర్డ్ క్లాస్!!. బీసీలంటే అంతే!!. చంద్రబాబు దృష్టిలోనూ ఇంతే!!. వారికో ప్రత్యేక గుర్తింపునివ్వాలని... ఆర్థికంగానే కాక అధికారం కూడా ఇచ్చి బలోపేతం చేయాలని చంద్రబాబుకు తాను అధికారంలో ఉన్నపుడెప్పుడూ అనిపించలేదు. అలా అనిపించకపోవటం తప్పు అని ఆయనకు బాజా కొట్టే ‘ఈనాడు’కూ అనిపించలేదు. మా బాబు వాళ్లకేది విదిలిస్తే అదే గొప్ప... అన్న రీతిలో దాని వార్తాకథనాలు సాగిపోయాయి అప్పట్లో!. కానీ వైఎస్ జగన్ విషయంలో అలా కాదు.. వారిని సమాజానికి వెన్నెముకలా (బ్యాక్‌బోన్) చూశారు. అలా మార్చే పనిలో పడ్డారు. 56 బీసీ కార్పొరేషన్లకు స్థానమివ్వటమే కాదు... శాశ్వత బీసీ కమిషన్నూ ఏర్పాటు చేశారు. నామినేటెడ్ పోస్టులు, నామినేటెడ్ పనులు అన్నింటా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు సగం వాటా ఇవ్వాల్సిందే అని తీర్మానించటమే కాక... ప్రతి అడుగులోనూ దాన్ని తు.చ. తప్పకుండా అమలు చేస్తున్నారు. చదవండి: Andhra Pradesh: ఇళ్లకు సుముహూర్తం ఇవన్నీ ఒకెత్తు. గడిచిన 26 నెలల్లో బీసీలకు ఏకంగా రూ.54,878 కోట్ల నగదు అందజేయటం ఇంకో ఎత్తు. వివిధ పథకాల ద్వారా 3.44 కోట్ల మంది బీసీల ఖాతాల్లోకి ఈ నగదు నేరుగా చేరింది!. మరి ఇవన్నీ ‘ఈనాడు’కో... చంద్రబాబుకు కొమ్ముకాసే రామోజీరావుకో కనిపించవా? బాబు హయాంలో బీసీలకిచ్చిన అప్పులు మాత్రమే కనిపిస్తాయా? అవి ఇప్పుడివ్వటం లేదంటూ కథనాలేల? బీసీల అప్పుల కోసం మ్యాచింగ్ గ్రాంట్‌గా ఐదేళ్లలో బాబు ప్రభుత్వమిచ్చింది రూ.1,695 కోట్లట! మరి వై.ఎస్.జగన్ హయాంలో పథకాల రూపేణా వారికి నేరుగా ఇచ్చిన రూ.54,878వేల కోట్ల నగదుతో పోలిస్తే అదెంత? ఈ నిజాలు రాయటానికి ‘ఈనాడు’కు మనసొప్పదెందుకు? బీసీల విషయంలో అసలు ‘ఏది నిజం?’. చంద్రబాబు ప్రభుత్వంలో బీసీలే కాదు... ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలందరికీ బ్యాంకు రుణాలే దిక్కు. ఆ రుణాలేమైనా ఉదారంగా వస్తాయా అంటే... అదీ లేదు. లంచాలు ఇచ్చిన వారికి... పార్టీ– ప్రభుత్వ పెద్దల చేత సిఫార్సులు చేయించుకున్న వారికి మాత్రమే!! ఎందుకంటే వారికే ప్రభుత్వం సబ్సిడీని విడుదల చేసేది. అలా విడుదల చేశాకే బ్యాంకులు రుణాలిచ్చేవి. అవి కూడా అరకొరే!!. ఇక బీసీల కోసమంటూ చంద్రబాబు సర్కారు ఒక్క పథకాన్ని అమలు చేస్తే ఒట్టు!. చదవండి: Telangana: విద్యాసంస్థల పునఃప్రారంభం.. సీఎం కేసీఆర్ ఆదేశాలు వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి పగ్గాలు చేపట్టాక పరిస్థితి పూర్తిగా మారిపోయింది. అసలు బీసీలను అప్పుల ఊబిలోకి నెట్టడమే ఆయనకిష్టం లేదు. అందుకే నవరత్నాల్లోని ప్రతి పథకాన్నీ వారికి వర్తింపజేశారు. మారుమూలనున్న చిన్న చిన్న బీసీ కులాలకు కూడా గుర్తింపునిస్తూ... ఏకంగా 56 బీసీ కార్పొరేషన్లను ఏర్పాటు చేశారు. వారిలో ఆత్మగౌరవాన్ని ఇనుమడింపచేశారు. ‘‘మా కులం ఉత్తరాంధ్రలోని ఒక చిన్న ప్రాంతానికే పరిమితం. అలాంటిది మాకూ ఓ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేశారు. దీన్ని మేం కలలో కూడా ఊహించలేదు’’ అంటూ ఇటీవల ఓ కార్పొరేషన్ చైర్మన్‌గా ఎంపికైన మహిళ తండ్రి భావోద్వేగపూరితమయ్యారు. దీన్నిబట్టే వారికిచ్చిన ఈ గుర్తింపు వారిలో ఎంత ఆత్మ విశ్వాసాన్ని నింపిందో ఊహించొచ్చు. మీరు సగం.. ఏమీ తక్కువ కాదు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలంటే తక్కువేమీ కాదు. ఖచ్చితంగా సగం!! ఇదీ జగన్ ఆలోచన. ఆచరణలో కూడా ఒక్క అడుగు వెనక్కి తగ్గకుండా దాన్ని అమలుచేస్తూనే వస్తున్నారు. నామినేటెడ్ పోస్టులైనా, నామినేటెడ్ పనులైనా... ఈ సగాన్ని ఖచ్చితంగా పాటించి తీరుతున్నారు. అంతేకాదు! దీన్లో మహిళలకూ సమాన వాటా ఇవ్వాల్సిందేనంటూ... దాన్నీ అమలు చేస్తున్నారు. డెప్యూటీ సీఎం పదవి మాత్రమే కాదు... కేబినెట్లోనూ బీసీలకు పెద్దపీట వేశారు. మరి ఇంతటి చిత్తశుద్ధి... పోనీ దీన్లో ఓ 10 శాతమైనా చంద్రబాబులో ఏ కోశానైనా కనిపించిందా? లేనప్పుడు ‘ఈనాడు’ ప్రశ్నించలేదేం? ఇప్పుడు జరుగుతున్నదాన్ని ప్రశంసించడం సరే... ఉన్నది ఉన్నట్టు రాయరెందుకు? 26 నెలల్లో ...రూ.54,878 కోట్ల నగదు బదిలీ ‘మేనిఫెస్టోయే భగవద్గీత.. ఖురాన్... బైబిల్’ అని చెప్పే ముఖ్యమంత్రి జగన్... అందులో పేర్కొన్న విధంగా గత 26 నెలల పాలనలో 3.44 కోట్ల మంది బీసీల బ్యాంకు ఖాతాలకు రూ.54,878 కోట్ల నగదును నేరుగా బదిలీ చేశారు. నగదేతర పథకాల ద్వారా మరో 1.27 కోట్ల మంది బీసీలకు రూ.21,981 కోట్లు లబ్ధి చేకూర్చారు. మరి బీసీలను అప్పులు పాలు చేయకుండా నేరుగా వారి ఖాతాలకు నగదు బదిలీ చేయటం... ఇతర పథకాల ద్వారా వారిని అప్పులపాలు కాకలుండా ఆదుకోవటం ‘ఈనాడు’కు కనిపించవా? వాటిని ప్రస్తావించరెందుకు? ఇవన్నీ పక్కనబెట్టి రుణాల సంగతే చూసినా... బలహీన వర్గాలకు గత ఏడాది మార్చి నాటికి రాష్ట్రంలో బ్యాంకులు రూ.90,624 కోట్ల రుణాలు మంజూరు చేశాయి. ఈ ఏడాది మార్చి నాటికి ఆ వర్గాలకిచ్చిన రుణాలు రూ.95,526 కోట్లకు చేరాయి. నిజానికి బాబు హయాంలోనూ బీసీలకు బ్యాంకు రుణాలు ఇంతకన్నా ఎక్కువేమీ లేవని సాక్షాత్తూ ఎస్ఎల్బీసీ నివేదికే చెబుతోంది. బీసీలకు ప్రత్యేకం... అధికారంలోనూ పెద్ద పీట... ఆర్థికంగానే కాదు. రాజకీయంగానూ బీసీల అభ్యున్నతి ప్రధానమనేది ముఖ్యమంత్రి జగన్ భావన. అందుకే వారికి రాజ్యాధికారంలోనూ పెద్ద పీట వేశారు. మంత్రివర్గంలోనే కాకుండా బీసీల్లోని వివిధ వర్గాలకు జానాభా ప్రాతిపదికన కార్పొరేషన్లు ఏర్పాటు చేసి ఆయా వర్గాలకు నామినేటెడ్ పదవులను ఇచ్చారు. వీటిలోనూ 50 శాతం మహిళలుండాలన్న నియమాన్ని మాత్రం వీడలేదు. నవరత్నాలతో బీసీల్లోని అర్హులందరికీ ఆర్ధిక ప్రయోజనం చేకూర్చటమే కాక బీసీల్లోని 45 ఏళ్ల నుంచి 60 ఏళ్లలోపు మహిళలకు ప్రత్యేకగా వైఎస్సార్ చేయూత అందించారు. వైఎస్సార్ ఆసరా పేరిట స్వయం సహాయక బందాల్లోని బీసీ మహిళలకు ఆర్దిక సాయం... వారి కోసం వైఎస్సార్ ఆరోగ్య ఆసరా... ప్రత్యేకంగా మత్స్యకార భరోసా... వైఎస్సార్ చేనేత పథకాలు అమలు చేస్తున్నారు. రజకులు, టైలర్లు, నాయి బ్రాహ్మణుల కోసం జగనన్న చేదోడు పథకం అందించారు. చంద్రబాబు ప్రభుత్వంలో వీటిలో ఒక్కటీ అమలు చేయకున్నా... బీసీల ఊసే ఎత్తకున్నా... ‘ఈనాడు’ పెన్ను మాత్రం లేవలేదెప్పుడూ!!. -
YS Jagan: బడుగుల హృదయాల్లో శాశ్వత స్థానం
సామాజిక విప్లవాలు కేవలం నినాదాలు, డిమాండ్లు, డిక్లరేషన్లలతో ఉద్భవించవని.. పాలకుడి చిత్తశుద్ధితోనే సాధ్యం అవుతాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్‌రెడ్డి తాజాగా రుజువు పరిచారు. సుదీర్ఘకసరత్తు చేసి అన్ని సమీకరణాలను పరిగణనలోకి తీసుకొని మొత్తం 135 రాష్ట్ర, జిల్లా స్థాయి కార్పొరేషన్లు, సంస్థలకు చైర్మన్ పదవులను, ఇతర కీలక పదవులను భర్తీ చేసి అందులో 57% పదవులలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల వారిని నియమించడం ద్వారా ఓ నూతన రాజకీయ ఒరవడికి శ్రీకారం చుట్టారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఏ ముఖ్యమంత్రి చేయని ఓ గొప్ప సామాజిక విప్లవానికి అంకురార్పణ చేశారు. ఈ గౌరవాభి మానాలకు బడుగువర్గాల్లో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. ఆనందంతో వారు సంబరాలు జరుపుకున్నారు. అయితే, సామాజిక న్యాయానికి నిజమైన అర్థం తెలియని ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం, ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు, ఆయనకు వంత పాడుతున్న కొన్ని మీడియా సంస్థలు.. ఇందులో కూడా మంచిని గ్రహించలేకపోయాయి. కువిమర్శలకు పాల్పడ్డారు. నిధులు లేని కార్పొరేషన్లను బలహీనవర్గాలకిచ్చారని సత్యదూర ప్రచారం చేశారు. 2007లో టీడీపీ అధినేత చంద్రబాబు వరంగల్‌లో బీసీల సదస్సు నిర్వహించి.. 2009 సాధారణ ఎన్నికలలో తమ పార్టీ తరఫున బీసీలకు 100 టికెట్లు ఇస్తామని ఓ డిక్లరేషన్ ప్రకటించారు. బీసీల్లో పెద్ద ఎత్తున ఆశలు రేకెత్తించారు. ఆ వర్గాలను తన చుట్టూ తిప్పుకొన్నారు. తీరా ఎన్నికలొచ్చేసరికి.. తన సహజ ప్రవత్తిని చాటుకొంటూ బీసీలకు మొండిచేయి చూపించారు. బీసీలకు కనీసం 60 పార్టీ టిక్కెట్లు కూడా ఇవ్వలేదు. పైగా, 100 సీట్లు బీసీలకు ఇస్తే వారు గెలవలేరంటూ ఓ కుంటి సాకు చెప్పారు. మాట తప్పినందుకు చంద్రబాబు కనీసం విచారం కూడా వ్యక్తం చేయలేదు. బీసీలకు క్షమాపణ చెప్పలేదు. ఉమ్మడి రాష్ట్రంలో 9 ఏళ్లు, విభజిత రాష్ట్రంలో 5 ఏళ్లు.. మొత్తం 14 ఏళ్లపాటు అధికారం అనుభవించిన చంద్రబాబు ఏనాడూ సమాజంలో దీర్ఘకాలంగా నిర్లక్ష్యానికి గురౌతున్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు ప్రభుత్వంలో సముచిత భాగస్వామ్యం కల్పించిన దాఖలాలులేవు. 2014లో విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు తన క్యాబినెట్లో దాదాపు 4 ఏళ్లకుపైగా ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు భాగస్వామ్యం కల్పించకుండా అవమాన పరి చారు. రాష్ట్ర, జిల్లా స్థాయి నామినేటెడ్ పదవులను భర్తీచేస్తే అందులో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ నేతలకు భాగస్వామ్యం కల్పించాల్సి వస్తుందనే దుర్బుద్ధితో.. అనేక పదవులను భర్తీ చేయకుండా ఖాళీగా వదిలేశారు. బడుగులకు సముచిత భాగస్వామ్యం వైఎస్ జగన్ ప్రతిపక్ష నేతగా ఉండగానే.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున ‘బీసీ డిక్లరేషన్’ ప్రకటించారు. అధికారంలోకి వస్తే వివిధ బీసీ వర్గాలకు ప్రభుత్వం ప్రవేశపెట్టే పథకాలను ‘నవరత్నాలు’గా పార్టీ ఎన్నికల ప్రణాళికలో చేర్చారు. బలహీన వర్గాలకు సముచిత రాజకీయ భాగస్వామ్యం కల్పించడానికి 2019 ఎన్నికలలో 175 అసెంబ్లీ స్థానాలలో ఎస్సీ, ఎస్టీలకు కేటాయించే రిజర్వుడు స్థానాలు పోను మిగిలిన వాటిల్లో 41 సీట్లు బీసీ వర్గాలకు కేటాయించారు. ఎన్నికల సమయంలోనే రాష్ట్ర, జిల్లా స్థాయి నామినేటెడ్ పదవులలో 50% బలహీన వర్గాలకు కేటాయిస్తామని చెప్పారు. నామినేటెడ్ పదవులలో మహిళలకు పెద్దపీట వేసిన ఘనత కూడా ముఖ్యమంత్రి జగన్‌కే దక్కుతుంది. బీసీవర్గాలకు గతంలో రాష్ట్ర స్థాయిలో ఒకే ఒక కార్పొరేషన్ ఉంటే.. వైఎస్ జగన్ తొలిదశలో 57 బీసీ కార్పొరేషన్లు ఏర్పాటుచేసి వాటన్నింటికి పాలకవర్గాలను ఏర్పాటు చేశారు. వ్యవసాయ మార్కెట్ కమిటీల పాలకవర్గాల కూర్పులో 50 శాతం రిజర్వేషన్లు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు అందిస్తున్నారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు దాదాపు 1.80 లక్షల మంది ఉండగా అందులో 80 శాతం మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు చెందిన వారితోనే భర్తీ చేశారు. నేతన్నలు, మత్స్యకారులు, నాయిబ్రాహ్మణులు, యాదవులు, విశ్వబ్రాహ్మణులు, వడ్రంగులు.. ఇలా ప్రతి బడుగు వర్గానికి ప్రత్యేక పథకాలు ఏర్పరిచి వారిని ఆర్థికంగా, సామాజికంగా ఆదుకొంటున్నారు. బీసీలను హేళన చేసిన చంద్రబాబు అమరావతి ప్రాంతంలో పేదలైన బహుజన వర్గాలవారికి ఇళ్ల స్థలాలు కేటాయిస్తే అక్కడి సామాజిక జీవనంలో సమతుల్యత దెబ్బతింటుందని.. సంపన్నులు నివాసం ఉండేచోట బహుజనులు ఉండరాదన్న ఫ్యూడల్ మనస్తత్వంతో.. స్వయంగా జీవో జారీచేసిన దారుణ చరిత్ర చంద్రబాబుది. ‘న్యాయమూర్తులుగా బీసీలు పనికిరారు’ అంటూ సుప్రీంకోర్టుకు అధికార హోదాలో చంద్రబాబు లేఖలు రాసిన సంఘటనను ‘ది ఎకనమిక్స్ టైమ్స్’ అనే జాతీయ పత్రిక బయటపెట్టింది. చంద్రబాబులో పడగవిప్పిన అగ్రకుల దురంహంకారం బీసీలను ఎంతో బాధించింది. తమ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసినందుకు చంద్రబాబును ఎన్నటికీ క్షమించబోమని వారు ఆనాడే శపథం చేశారు. ఇక, తమ సమస్యలను చెప్పుకోవడానికి సచివాలయానికి వెళ్లిన పేద బీసీ కుల వృత్తులవారిని ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు వేలు చూపిస్తూ బెదిరించిన సంఘటన మరో చీకటి అధ్యాయం. అధికారంలో ఉన్నప్పుడు అడుగడుగునా కుల, ప్రాంత, ఆర్థిక వివక్షను చూపించిన చంద్రబాబును బీసీలు ఇకపై ఎందుకు నమ్మాలి? నమ్మించి గొంతు కోసినందుకా? రాజ్యసభ పదవులను ఎస్సీ నేతలకు ఇస్తానని చెప్పి చివరి క్షణం వరకు ఊరించి.. సొంత వారికి ఇచ్చుకున్న చంద్రబాబును ఎస్సీలు ఇకపై నమ్ముతారా? క్రిందటేదాడి 4 రాజ్యసభ సీట్లు ఖాళీకాగా సీఎం జగన్ అందులో రెండింటిని పార్టీలోని సీనియర్ బీసీ నేతలకు ఇచ్చారు. ఇది సామాజిక న్యాయం చేయడం కాదా? గతాన్ని మరింత తవ్వితే చంద్రబాబు చేసిన తప్పులు, ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలవారికి న్యాయంగా దక్కాల్సిన ఫలాలను ఏవిధంగా అందకుండా చేశారో బయటపడతాయి. మరోపక్క అవకాశం వచ్చినప్పుడు పార్టీలో, ప్రభుత్వంలో బడుగు బలహీన వర్గాల వారికి సామాజిక న్యాయం అమలు చేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ వర్గాల వారి హృదయాల్లో శాశ్వత స్థానం సంపాదించుకున్నారు. వాస్తవాలు ఈ విధంగా ఉండగా చంద్రబాబు, టీడీపీ నాయకులు సామాజిక న్యాయానికి కట్టుబడిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై తప్పుడు ప్రచారాన్ని సాగించినంత మాత్రాన ప్రజలకు నిజాలు తెలియకుండాపోతాయా? - డాక్టర్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు వ్యాసకర్త కేంద్ర మాజీ మంత్రి -
నామినేటెడ్ పోస్టులెప్పుడు?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు గడుస్తోంది. ఇప్పటికీ చాలా ప్రభుత్వరంగ సంస్థలు, కార్పొరేషన్లకు కొత్త పాలక మండళ్ల నియామకం జరగలేదు. ఆ నామినేటెడ్ పదవుల కోసం పెద్ద సంఖ్యలో టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు ఎదురుచూస్తున్నారు. వాటిని ఎప్పుడు భర్తీ చేస్తారో, తమకు ఎప్పుడు అవకాశం వస్తుందో అనే ఆశతో కీలక నేతల దృష్టిలో పడేందుకు ప్రయత్నిస్తున్నారు. మరో ఏడాదిన్నర గడిస్తే అసెంబ్లీ ఎన్నికల వాతావరణం మొదలయ్యే అవకాశం ఉండటంతో.. వీలైనంత త్వరగా నామినేటెడ్ పదవుల భర్తీ జరగాలని కోరుతున్నారు. రాష్ట్రస్థాయిలోనే కాకుండా జిల్లాల్లో దేవాలయాలు, మార్కెట్ కమిటీలు, గ్రంథాలయ సంస్థల పదవులు కూడా ఖాళీగా ఉండటంతో.. తమకు అవకాశం ఇవ్వాలంటూ కీలక నేతల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. అయితే హుజూరాబాద్ ఉప ఎన్నిక హడావుడి ముగిశాకగానీ, అక్టోబర్ తర్వాతగానీ నామినేటెడ్ పదవుల భర్తీకి శ్రీకారం చుట్టవచ్చని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. అప్పుడప్పుడు ఒకట్రెండు.. టీఆర్ఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చాక పరిమిత సంఖ్యలో మాత్రమే నామినేటెడ్ పదవుల భర్తీ జరిగింది. రాష్ట్రంలో వివిధ కేటగిరీల్లో ప్రభుత్వ రంగ సంస్థలు, చట్టబద్ధమైన కార్పొరేషన్లలో సుమారు 50కి పైగా పాలకమండళ్లు ఉన్నాయి. వాటిలో గణనీయంగానే ఖాళీలు ఉన్నాయి. మహిళా కమిషన్, టీఎస్పీఎస్సీ వంటి సంస్థలకు కోర్టు విధించిన గడువుకు తలొగ్గి నియమకాలు జరిపినట్టు విమర్శలు వచ్చాయి. రైతుబంధు సమితి, అటవీ అభివృద్ధి సంస్థ, మూసీ రివర్ ఫ్రంట్ కార్పొరేషన్, టీఎస్ఐఐసీ, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ తదితరాలకు కొత్త పాలకమండళ్లను నియమించారు. టీఎస్ఐఐసీ, స్పోర్ట్స్ అథారిటీ, వికలాంగుల కార్పొరేషన్‌కు గతంలో ఉన్న వారినే కొనసాగించారు. ఇటీవల హుజూరాబాద్‌కు చెందిన బండా శ్రీనివాస్ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్‌గా నియమితులయ్యారు. సాంస్కృతిక సారథి చైర్మన్‌గా ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ను మరోమారు నియమించారు. కొన్ని కార్పొరేషన్లకు చైర్మన్ల నియామకం జరిగినా సభ్యులను భర్తీ చేయకపోవడంతో పూర్తిస్థాయిలో కార్యకలాపాలు కొనసాగడం లేదు. భారీగానే ఆశావహులు.. తెలంగాణ ఉద్యమ కాలం నుంచీ పనిచేస్తున్న వారితోపాటు వివిధ సందర్భాల్లో పార్టీలో చేరిన నేతలతో టీఆర్ఎస్లో అన్నిచోట్లా బహుళ నాయకత్వం ఏర్పడింది. సుమారు 60కి పైగా అసెంబ్లీ నియోజకవర్గాల్లో విపక్షాలు బలహీనపడగా.. టీఆర్ఎస్లో ఒక్కో నియోజకవర్గంలో ఇద్దరు ముగ్గురు బలమైన నేతలు ఉన్నారు. శాసనసభ, శాసనమండలి, జెడ్పీ చైర్మన్, మున్సిపల్ మేయర్లు, చైర్మన్లుగా అవకాశాలు కల్పించినా.. ఇంకా రాష్ట్రస్థాయి పదవులను ఆశిస్తున్న నేతల జాబితా భారీగానే ఉంది. వివిధ సందర్భాల్లో పార్టీ అవసరాలతోపాటు సామాజిక సమీకరణాలను దృష్టిలో పెట్టుకుని పదవులు భర్తీ చేస్తున్నా.. ఖాళీగా ఉన్న పదవులు ఆశావహులను ఆకర్షిస్తున్నాయి. ఆయా నేతలు సీఎం కేసీఆర్, కేటీఆర్‌లతోపాటు ఇతర కీలక నేతల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. అయితే నామినేటెడ్ పదవుల భర్తీపై పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌కు స్పష్టమైన అవగాహన ఉందని.. ఎవరికి ఏ తరహా పదవులు ఇవ్వాలో ఆయనకు తెలుసని పార్టీ వర్గాలు అంటున్నాయి. పార్టీ కోసం పనిచేస్తున్న వారికి సరైన సమయంలో అవకాశాలు వస్తాయని పేర్కొంటున్నాయి. ఈ పదవులన్నీ ఖాళీయే.. పలు ప్రభుత్వ శాఖల పరిధిలోని కార్పొరేషన్లకు ఏళ్ల తరబడి పాలకమండళ్లను నియమించలేదు. బేవరేజెస్ కార్పొరేషన్, ఆర్టీసీ, పరిశ్రమల శాఖ పరిధిలో పలు సంస్థలకు పాలకమండళ్ల నియామకం జరగలేదు. మిషన్ భగీరథ, ఎస్టీ కార్పొరేషన్, ఎస్సీ, ఎస్టీ కమిషన్, సాహిత్య అకాడమీ, ఎంబీసీ, స్టేట్ మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్, తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ, టెస్కోవంటి సంస్థల పదవులు ఖాళీగా ఉన్నాయి. జిల్లాస్థాయిలో గ్రంథాలయ సంస్థల పాలక మండళ్ల పదవీకాలం ముగిసినా పాతవారినే కొనసాగిస్తూ వస్తున్నారు. కాళేశ్వరం, వేములవాడ, యాదాద్రి తదితర ప్రధాన ఆలయాలు కూడా ఏళ్ల తరబడి పాలక మండళ్లు లేకుండానే ప్రత్యేకాధికారుల పాలనలో కొనసాగుతున్నాయి. రాష్ట్రంలోని 192 వ్యవసాయ మార్కెట్ కమిటీలకు గాను 30 కమిటీలకు పాలకమండళ్లు లేవు. -
మహాత్ముల కలలను సీఎం నెరవేరుస్తున్నారు
శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): మహాత్మా గాంధీ, జ్యోతిరావు ఫూలే, అంబేడ్కర్ వంటి మహాత్ముల కలలను సీఎం వైఎస్ జగన్ నిజం చేస్తున్నారని అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. శ్రీకాకుళంలోని ఆర్ అండ్ బీ అతిథి గృహంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ కార్యక్రమాల్లో 85 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల వారికే అందుతున్నాయని తెలిపారు. సామాజిక న్యాయమే ప్రభుత్వ విధానంగా పాలన సాగుతోందని ప్రశంసించారు. నామినేటెడ్ పదవుల్లో సైతం సామాజిక న్యాయం ప్రస్ఫుటంగా కనిపించిందన్నారు. రాజ్యాధికారంలో బడుగు, బలహీన వర్గాలను సీఎం భాగస్వాములను చేశారన్నారు. వెనుకబడిన వర్గానికి చెందిన వ్యక్తికి స్పీకర్‌గా అవకాశం కల్పించిన ఘనత వైఎస్ జగన్‌కే దక్కిందన్నారు. కొత్తగా పదవుల్లో చేరిన వారు ఆశ్రిత పక్షపాతం లేకుండా మంచి పాలనను అందించాలని విజ్ఞప్తి చేశారు. -
నామినేటెడ్ పదవుల్లో మహిళలకు అధిక ప్రాధాన్యత
-
పాదయాత్రలో అన్ని వర్గాలను కలుసుకున్నారు వై ఎస్ జగన్
-
నామినేటెడ్ పదవుల్లో విశాఖ నేతలకు పెద్దపీట
-
చేతల్లో సామాజిక న్యాయం
సాక్షి, అమరావతి: రాజకీయంగా సామాజికన్యాయ సాధన దిశగా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మరో విప్లవాత్మక నిర్ణయం తీసుకున్నారు. సామాజిక న్యాయ సాధనలో స్వర్ణయుగాన్ని తీసుకువస్తూ రాష్ట్ర ప్రభుత్వ నామినేటెడ్ పదవుల్లో బడుగు, బలహీన, మైనార్టీ వర్గాలకు పెద్దపీట వేశారు. మహిళలకు సమున్నత స్థానం కల్పించారు. రాష్ట్ర చరిత్రలో గతంలో ఎన్నడూ లేని రీతిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు ఏకంగా 58 శాతం నామినేటెడ్ పదవులు ఇచ్చారు. మహిళలకు ఏకంగా 50.40 శాతం పదవులు దక్కాయి. రాష్ట్ర ప్రభుత్వం శనివారం 137 నామినేటెడ్ పదవులను ప్రకటించగా వాటిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 79 పదవులు దక్కడం ప్రాధాన్యం సంతరించుకుంది. మహిళలకు 69 పదవులు ఇవ్వడం విశేషం. ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమ జిల్లాలకు నామినేటెడ్ పదవుల్లో సమ ప్రాధాన్యమిచ్చారు. 13 జిల్లాల్లోని అన్ని రెవెన్యూ డివిజన్లకూ ప్రాతినిధ్యం కల్పిస్తూ పదవులను ప్రకటించారు. పదేళ్లుగా పార్టీ కోసం పని చేసిన అర్హులు, సమర్థులైన నేతలను నామినేటెడ్ పదవులకు ఎంపిక చేయడం ద్వారా తగిన గుర్తింపునిచ్చారని పార్టీ వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. బడుగు, బలహీన, మైనార్టీ వర్గాలకు పెద్దపీట రాజకీయ అధికారాన్ని కల్పించడం ద్వారానే బడుగు, బలహీన, మైనార్టీ వర్గాలు సామాజికంగా, ఆర్థికంగా పురోభివృద్ధి సాధించగలరన్న తన విధానాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నామినేటెడ్ పదవుల భర్తీలోనూ అనుసరించారు. కేవలం రిజర్వేషన్లు ఉన్న స్థానాలకే వారిని పరిమితం చేయాలన్న గత పాలకులకు భిన్నంగా నామినేటెడ్ పదవుల్లోనూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు కనీసం 50 శాతం పదవులు ఇవ్వాలని వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏకంగా చట్టం తీసుకురావడం ద్వారా కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టింది. ఆ చిత్తశుద్ధిని మాటల్లోనే కాకుండా చేతల్లో కూడా చూపిస్తూ ప్రభుత్వం శనివారం ప్రకటించిన నామినేటెడ్ పదవుల్లో ఈ వర్గాలకు 58 శాతం పదవులు కేటాయించడం విశేషం. మొత్తం 137 పదవుల్లో ఆ వర్గాలకు ఏకంగా 79 పదవులు దక్కడం ప్రాధాన్యం సంతరించుకుంది. అందులో కూడా కీలకమైన కార్పొరేషన్ల చైర్మన్లుగా బడుగు, బలహీన, మైనార్టీ వర్గాల వారిని ఎంపిక చేయడం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చిత్తశుద్ధికి నిదర్శనంగా నిలుస్తోంది. ఏపీ టిడ్కో, రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధి కార్పొరేషన్, రాష్ట్ర మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్(ఏపీఎండీసీ), రాష్ట్ర గిడ్డంగుల సంస్థ, విశాఖపట్నం–కాకినాడ పెట్రోలియం– కెమికల్ – పెట్రో కెమికల్ పెట్టుబడుల సంస్థ, విశాఖపట్నం రీజనల్ మెట్రో డెవలప్మెంట్ కార్పొరేషన్ (వీఎంఆర్డీఏ), సైన్స్ అండ్ టెక్నాలజీ కార్పొరేషన్, సొసైటీ ఫర్ ఎంప్లాయిమెంట్ జనరేషన్, ఎడ్యుకేషన్ వెల్ఫేర్–ఇన్ప్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్, రాష్ట్ర కనీస వేతనాల సలహా బోర్డు, సాహిత్య అకాడమి.. రాష్ట్ర అటవీ అభివృద్ధి కార్పొరేషన్, గిరిజన సహకార సంస్థ, రాష్ట్ర గ్రంథాలయ పరిషత్, రాష్ట్ర ఆర్థిక సంస్థ, రాష్ట్ర ఔట్సోర్సింగ్ ఉద్యోగుల కార్పొరేషన్ మొదలైన కీలక సంస్థల చైర్మన్ పదవులను బడుగు, బలహీన, మైనార్టీ వర్గాలకు ఇవ్వడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ వర్గాలకు అన్ని జిల్లాల్లోనూ కనీసం 50 శాతం పదవులు దక్కేలా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంది. మహిళ సాధికారత దిశగా ముందడుగు మహిళలకు అన్ని రకాల అవకాశాల్లోనూ సగభాగం కల్పించడమే తన విధానమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రతి సందర్భంలోనూ నిరూపిస్తున్నారు. తాజాగా భర్తీ చేసిన నామినేటెడ్ పదవుల్లోనూ అదే విధానాన్ని అనుసరించారు. ఏకంగా 50.40 శాతం పదవులు వీరికి కేటాయించడం ద్వారా తాను మహిళా పక్షపాతినని మరోసారి నిరూపించుకున్నారు. శనివారం ప్రకటించిన 137 పదవుల్లో మహిళలకు ఏకంగా 69 పదవులు ఇవ్వడం విశేషం. అత్యంత ప్రాముఖ్యమైన కార్పొరేషన్లకు మహిళలను చైర్పర్సన్లుగా నియమించడం ప్రాధాన్యం సంతరించుకుంది. అప్కాబ్, రాష్ట్ర సైన్స్ – టెక్నాలజీ కార్పొరేషన్, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్, రాష్ట్ర మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఎండీసీ), రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధి కార్పొరేషన్ (ఏపీఐడీసీ), రాష్ట్ర పట్టణ ఆర్థిక, మౌలిక సదుపాయాల అభివృద్ధి కార్పొరేషన్, రాష్ట్ర హస్తకళల అభివృద్ధి సంస్థ, రాష్ట్ర ఖాదీ, గ్రామీణ పరిశ్రమల సంస్థ, రాష్ట్ర నీటిపారుదల అభివృద్ధి కార్పొరేషన్, గిరిజన సహకార సంస్థ, విశాఖపట్నం రీజనరల్ మెట్రో డెవలప్మెంట్ కార్పొరేషన్ (వీఎంఆర్డీఏ), విశాఖపట్నం–కాకినాడ పెట్రోలియం – కెమికల్ – పెట్రో కెమికల్ పెట్టుబడుల సంస్థ, రాష్ట్ర కనీస వేతనాల సలహా మండలి, సాహిత్య అకాడమి, రాష్ట్ర నాటక అకాడమి, రాష్ట్ర దివ్యాంగులు, సీనియర్ సిటిజన్స్ కార్పొరేషన్ మొదలైన కీలకమైన కార్పొరేషన్ల చైర్పర్సన్ పదవులను మహిళలకే కేటాయించారు. వారిలో అత్యధికులు రాజకీయంగా పెద్దగా గుర్తింపు లేని సామాన్య కుటుంబాల నుంచి వచ్చిన వారే కావడం గమనార్హం. గుంటూరులోని 23వ వార్డులో వలంటీర్‌గా ఉన్న పఠాన్ ముంతాజ్‌ను రాష్ట్ర దివ్యాంగులు, సీనియర్ సిటిజన్స్ సంక్షేమ కార్పొరేషన్ చైర్‌పర్సన్‌గా నియమించడమే ఇందుకు తార్కాణం. అన్ని జిల్లాల్లోనూ మహిళలకు సమ ప్రాధాన్యమిచ్చారు. ఇది సామాజిక న్యాయ స్వర్ణయుగం ► అణగారిన వర్గాల రాజకీయ, ఆర్థిక అభ్యున్నతి సాధనే ఏకైక లక్ష్యంగా రాష్ట్రంలో సామాజిక న్యాయ స్వర్ణ యుగానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నాంది పలికారు. అందుకోసం రాజకీయ పదవుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు సింహభాగం కేటాయించడం వైఎస్సార్సీపీ విధానంగా ఆయన ఎన్నికల ముందే ప్రకటించారు. ► 2019 ఎన్నికల్లో టిక్కెట్ల కేటాయింపులో బడుగు, బలహీన, మైనార్టీ వర్గాలకు దాదాపు 60 శాతానికిపైగా సీట్లు కేటాయించి అత్యధిక ప్రాధాన్యమిచ్చారు. శ్రీకాకుళం, విజయనగరం, అనకాపల్లి లోక్‌సభ నియోజకవర్గాలతోపాటు సంప్రదాయంగా అగ్రవర్ణాల ఆధిపత్యం ఉన్న కర్నూలు, అనంతపురం, హిందూపురం, రాజమహేంద్రవరం లోక్‌సభ నియోజకవర్గాలను కూడా తొలిసారిగా బీసీలకు కేటాయించడం ద్వారా తన చిత్తశుద్ధిని నిరూపించుకున్నారు. ► ఎన్నికల్లో గెలుపొందిన తర్వాత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏర్పాటు చేసిన మంత్రివర్గంలోనూ ఏకంగా 56 శాతం పదవులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు కేటాయించడం ద్వారా జాతీయ స్థాయిలో అందరి దృష్టిని ఆకర్షించారు. ► ఐదు ఉప ముఖ్యమంత్రి పదవుల్లో నాలుగు ఆ వర్గాలకే కేటాయించారు. ఇందులో ఒక మహిళ కూడా ఉన్నారు. అసెంబ్లీ స్పీకర్ పదవినీ బీసీ వర్గాలకు ఇచ్చారు. అనంతరం నామినేటెడ్ పదవులు, నామినేషన్ పనుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు కనీసం 50 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని శాసనసభలో బిల్లు ఆమోదించారు. ఆ ప్రకారమే దేవలయాలు, మార్కెట్ కమిటీలు, ఇతర పాలక మండళ్లలో బడుగు, బలహీన, మైనార్టీ వర్గాలకు అత్యధికంగా పదవులు ఇచ్చారు. ► నలుగురు రాజ్యసభ సభ్యుల్లో ఇద్దరు బీసీలనే ఎంపిక చేశారు. తొలిసారిగా శెట్టిబలిజ వర్గానికి చెందిన పిల్లి సుభాస్ చంద్రబోస్, మత్స్యకార వర్గానికి చెందిన మోపిదేవి వెంకటరమణలను రాజ్యసభకు పంపడం ద్వారా కొత్త చరిత్ర సృష్టించారు. ► 2019లో అధికారంలోకి వచ్చాక ఇప్పటి వరకు వైఎస్సార్సీపీ తరఫున, గవర్నర్ కోటాలో 15 మందిని ఎమ్మెల్సీలుగా శాసనమండలికి పంపారు. వీరిలో 11 మంది బడుగు, బలహీన, మైనార్టీ వర్గాలకు చెందిన వారే ఉండటం విశేషం. ఎస్సీలకు 4, బీసీలకు 4, మైనార్టీలకు 3 ఎమ్మెల్సీ పదవులు ఇచ్చారు. ► 11 మున్సిపల్ మేయర్లు, 74 మున్సిపల్ చైర్పర్సన్ల పదవుల్లో 78 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు కేటాయించారు. ఈ పదవులన్నింటిలో 60.46 శాతం మహిళలకు ఇవ్వడం విశేషం. ► రాష్ట్రంలో తొలి సారిగా బీసీ వర్గాల కోసం 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి, చైర్పర్సన్ పదవులను కేటాయించారు. 2019 ఎన్నికల ముందు కూడా బీసీ వర్గానికి చెందిన సుభాస్ చంద్రబోస్, జంగా కృష్ణమూర్తిలను ఎమ్మెల్సీలు చేశారు. ► మాల, మాదిగ, రెల్లి కులాలకు వేర్వేరు కార్పొరేషన్ల ఏర్పాటు చేశారు. ఎస్సీ, ఎస్టీలకు వేర్వేరు కమిషన్లు ఏర్పాటు చేశారు. ► జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 60 శాతం టికెట్లు ఇచ్చారు. మొత్తం టికెట్లలో మహిళలకు 50 శాతం కేటాయించడం విశేషం. అయితే కోర్టులో కేసు కారణంగా ఈ ఎన్నికల ఫలితాలు ఇంకా వెల్లడి కాలేదు. -
మహిళలకు సీఎం వైస్ జగన్ పెద్దపీట వేశారు : మేడపాటి షర్మిలారెడ్డి
-
ఏపీలో నేడు నామినేటెడ్ పదవుల ప్రకటన
-
TRS: ‘నామినేటెడ్’పై చిగురిస్తున్న ఆశలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ)కు కొత్తగా జరిపిన నియమాకాల్లో ఉన్నతాధికారులుగా పనిచేస్తున్న వారితోపాటు, తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసిన వారికి చోటు దక్కడంతో నామినేటెడ్ పదవులపై ఆశావహుల కన్నుపడింది. ఎమ్మెల్సీతోపాటు ఇతర పదవులపై ఆశలు పెట్టుకున్న నేతలతోపాటు ఇతర ఔత్సాహికులు తమ వంతు కోసం ఎదురుచూస్తున్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఆరేళ్ల పదవీ కాల పరిమితి ఉన్నా కేసీఆర్ పిలుపుమేరకు ఏడాదిన్నరకే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన జర్నలిస్టు ఆర్.సత్యనారాయణకు టీఎస్పీఎస్సీ సభ్యుడిగా అవకాశం లభించింది. ఉద్యమ కాలంలో క్రియాశీలకంగా పని చేసి వివిధ కారణాలతో అవకాశం దక్కని వారికి ఎప్పటికైనా పదవులు వస్తాయనే సంకేతాన్ని ఆర్.సత్యనారాయణను నామినేట్ చేయడం ద్వారా కేసీఆర్ ఇచ్చినట్లు భావిస్తున్నారు. అదే సమయంలో కామారెడ్డి ప్రాంతంలో తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేసిన ప్రభుత్వ ఉపాధ్యాయిని సుమిత్రానంద్ తనోబాకు గతంలో అవకాశమిస్తానన్న కేసీఆర్.. ఇప్పుడు దాన్ని నిలబెట్టుకున్నారు. మరోవైపు, రాష్ట్ర ఆవిర్భావం తర్వాత టీఎన్జీఓ సంఘం అధ్యక్షుడిగా పనిచేసిన రవీందర్‌రెడ్డి కొంతకాలంగా నామినేటెడ్ పదవిని ఆశిస్తుండగా ఇప్పుడు నెరవేరింది. పదవుల భర్తీ కోసం ఎదురుచూపు రాష్ట్రంలో టీఆర్ఎస్ రెండో పర్యాయం అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు కావస్తున్నా రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ల పాలక మండళ్ల భర్తీ పూర్తి స్థాయిలో జరగలేదు. రెండో పర్యాయం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి లోక్‌సభ ఎన్నికలు మొదలుకుని స్థానిక సంస్థలు, మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లు ఇలా వరుసగా ప్రత్యక్ష ఎన్నికలు జరుగుతూ వస్తున్నాయి. అయితే వచ్చే రెండున్నరేళ్ల పాటు ఎలాంటి ప్రత్యక్ష ఎన్నికలు లేకపోవడంతో ముఖ్యమంత్రి, పార్టీ అధినేత కేసీఆర్ నామినేటెడ్ పదవుల భర్తీపై దృష్టి పెడతారని పార్టీ నేతలు భావిస్తున్నారు. నేతలు, కేడర్‌లో ఆత్మ విశ్వాసం నింపేందుకు నామినేటెడ్ పదవుల భర్తీపై కేసీఆర్ కసరత్తు ప్రారంభించినట్లు సమాచారం. మహిళా కమిషన్‌కు కొత్త కార్యవర్గాన్ని నియమించిన కేసీఆర్ జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్, టూరిజం కార్పొరేషన్ వంటి వాటికి పార్టీ నేతలను నామినేట్ చేశారు. ఎస్టీ, ఎస్సీ కమిషన్, బీసీ కమిషన్‌తో రాష్ట్ర ఖనిజాభివృద్ది సంస్థ వంటి కీలకమైన కమిషన్లు, కార్పొరేషన్లకు పాలక మండళ్లను నియమించాల్సి ఉంది. గత ఫిబ్రవరి నుంచి పార్టీ కార్యకలాపాలను స్వయంగా పర్యవేక్షిస్తున్న కేసీఆర్ త్వరలో నామినేటెడ్ పదవుల భర్తీ ప్రక్రియనూ పూర్తి చేస్తారని అంటున్నారు. ఎమ్మెల్సీ పదవులపై కన్ను ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ పదవిపై ఆశలు పెట్టుకున్న నేతలతో పాటు ఇతర నామినేటెడ్ పదవులు ఆశిస్తున్న ఔత్సాహికులు తమ వంతు కోసం ఎదురుచూస్తున్నారు. జూన్ 3న శాసన మండలిలో ఖాళీ అవుతున్న ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు ఎమ్మెల్యేల కోటాలో ఎన్నిక జరగాల్సి ఉంది. అయితే కోవిడ్ కారణంగా ఈ ఎన్నికను కేంద్ర ఎన్నికల సంఘం వాయిదా వేయడంతో ఆశావహులు నిరాశలో మునిగిపోయారు. అయితే ఆగస్టులోగా ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశముందని భావిసున్నారు. మరోవైపు వచ్చే జనవరిలోగా శాసన మండలి స్థానిక సంస్థల కోటాలో మరో 12 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నిక జరగనుంది. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నామినేట్ అయిన ప్రొఫెసర్ శ్రీనివాస్‌రెడ్డి పదవీ కాలం ఇటీవలే పూర్తయింది. దీంతో వచ్చే ఏడాది జనవరిలోపు 19 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉండటంతో ఆశావహులు ఎదురు చూస్తున్నారు. చదవండి: Koti ENT Hospital: బ్లాక్ ఫంగస్‌కు మెరుగైన చికిత్స -
టీఆర్ఎస్: తెరపైకి నామినేటెడ్ పదవులు
సాక్షి, వరంగల్ : తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసే దిశగా నాయకత్వం కసరత్తు ప్రారంభించింది. ఈక్రమంలో మళ్లీ జిల్లా కమిటీలను వేయాలన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. గ్రామస్థాయి నుంచి జిల్లాస్థాయి వరకు పార్టీతో పాటు అన్ని అనుబంధ కమిటీలను పునరుద్ధరించే యోచనలో అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం ముందుగా భారీగా సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టాలన్న సంకేతాలు కూడా పార్టీ శ్రేణులకు చేరినట్లు సమాచారం. వీటిపై సమాలోచనలు చేసేందుకు పార్టీ చీఫ్, సీఎం కేసీఆర్ ఆదివారం హైదరాబాద్‌లో కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఈ మేరకు ఉమ్మడి వరంగల్‌కు చెందిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, రాష్ట్ర నాయకులు, సీని యర్లకు శుక్రవా రం సమాచారం అందింది. ఈ సమావేశంలో ప్రభుత్వం, పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కీలకంగా వ్యవహరించేలా గ్రామ, మండల, జిల్లా కమిటీల పునరుద్ధరణతో పాటు సభ్యత్వ నమోదు అంశాలను చర్చించే అవకాశముందని పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. సంస్థాగత సందడి అధికార టీఆర్ఎస్లో ఇంతకాలం ఏ పదవీ లేకుండానే కొనసాగుతున్న పలువురు సీనియర్ నేతలను త్వరలోనే పదవులు వరించనున్నాయి. కొంతకాలంగా ప్రభుత్వ నామినేటెడ్, సంస్థాగత పదవులను ఆశిస్తున్న నాయకులు అటు అడగలేక, ఇటు నిలదీయ లేక ఇబ్బంది పడుతున్నారు. ఎమ్మెల్యే, ఎంపీ, జెడ్పీ చైర్మన్ తదితర పదవులను ఆశించి.. అవి దక్కకపోవడంతో హామీలు పొందిన సీనియర్లు అధినేత ప్రకటన కోసం ఎదురుచూస్తున్నారు. ఆవిర్భావం నుంచి పార్టీలో కొనసాగిన వారు, ఉద్యమ సమయంలో కీలకంగా వ్యవహరించిన వారు నామినేటెడ్, సంస్థాగత పదవులు ఎప్పుడెప్పుడు వరి స్తాయా అని ఎదురుచూస్తున్నారు. గులాబీ దళనేత, సీఎం కేసీఆర్ పిలుపు మేరకు వి విధ రాజకీయ పార్టీల నుంచి గులాబీ గూటికి చేరిన పలువురికి పదవుల్లేక రాజకీయ నిరుద్యోగులుగా మారామన్న అభిప్రాయంతో ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత స్థానిక సంస్థలు, ఎంపీ, ఉప ఎన్నికలు, అసెంబ్లీ సమావేశాలు, ఆర్టీసీ సమ్మె, మున్సిపల్ ఎన్నికలు, కోవిడ్... ఇలా అనే క అవాంతరాలు ఏర్పడటంతో పార్టీ అధినాయకత్వం పదవుల భర్తీపై అంతగా దృష్టి పెట్టలేదన్న వాదన ఉంది. ఈ నేపథ్యంలో ఆదివారం హైదరాబాద్‌లో జరగనున్న కీలక సమావేశంలో తీసుకునే నిర్ణయాలతో పదవుల భర్తీకి మళ్లీ మోక్షం కలగవచ్చన్న చర్చ జరుగుతోంది. తెరపైకి నామినేటెడ్ పదవులు పదవీకాలం పూర్తయిన చాలా నామినేటెడ్ పోస్టుల భర్తీ పెండింగ్‌లో పడగా.. పార్టీ పదవుల ప్రక్రియ ఊసే లేకుండా పోయింది. రాష్ట్ర స్థాయిలో నామినేటెడ్ పోస్టులు పొందిన పలువురి పదవీకాలం ముగిసిపోయి నెలలు దాటింది. ఉమ్మడి జిల్లా నుంచి వికలాంగుల అభివృద్ధి సంస్థ చైర్మన్ వాసుదేవరెడ్డి, ‘కుడా’ చైర్మన్ మర్రి యాదవరెడ్డి మినహా ఎవరికీ మళ్లీ ఛాన్స్ రాలేదు. ట్రైకార్ చైర్మన్ గాంధీనాయక్, మహిళా అర్థిక సంస్థ చైర్పర్సన్ గుండు సుధారాణి, ఆగ్రోస్ చైర్మన్ లింగంపల్లి కిషన్‌రావు, గొర్రెల పెంపకందారుల అభివృద్ధి సంస్థ చైర్మన్ కన్నెబోయిన రాజయ్య, హస్తకళల అభివృద్ధి సంస్థ చైర్మన్ బొల్లం సంపత్‌కుమార్, ఖాదీ గ్రామీ ణాభివృద్ధి సంస్థ చైర్మన్ యూసుఫ్ జాహేద్ పదవీకాలం ముగిసిపోయింది. గతేడాది ఉమ్మడి వరంగల్‌లో 12 నియోజకవర్గాల్లో పార్టీ సభ్య త్వ నమోదు పూర్తయినా జిల్లా కమిటీల ఊసులేకపోగా చాలా వరకు గ్రామ, మండలాలతో పాటు పట్టణ / నగర కమిటీలు సైతం పెండింగ్‌లో పెట్టారు. వాటి స్థానంలో పార్టీ నియోజకవర్గ కమిటీలను వేశారు. ఈ కమిటీల వల్ల పార్టీకి, ప్రభుత్వానికి అంతగా ప్రయోజనం లేకపోగా, సంస్థాగత కమిటీలు లేని లోటు పలు సందర్భాల్లో కనిపించింది. దీంతో ఈసారి గ్రామ, మండల కమిటీలతో పాటు జిల్లా కమిటీలు, వాటి అనుబంధ సంఘాలను ఎన్నుకునే యోచన చేస్తున్నారు. ఇదే సమయంలో పార్టీ కీలక సమావేశం జరుగుతుండగా, త్వరలోనే పదవులు భర్తీ అవుతాయన్న ఆశాభావం పార్టీవర్గాల్లో వ్యక్తమవుతోంది. -
ద్విముఖ వ్యూహం!
సాక్షి, హైదరాబాద్: ఓవైపు ప్రభుత్వపరంగా నిర్ణయాల్లో వేగం పెంచుతూనే... మరోవైపు క్షేత్రస్థాయిలో పార్టీ యంత్రాంగాన్ని క్రియా శీలం చేయాలని సీఎం, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిర్ణయించారు. ప్రభుత్వ నిర్ణయాలను వేగంగా అమలు చేయడం ద్వారా వివిధ వర్గాలను సంతృప్తిపర్చడం, పార్టీ కార్యకలాపాల్లో దూకుడు పెంచడం లక్ష్యంగా... ద్విముఖ వ్యూహాన్ని సిద్ధం చేశారు. నెలాఖరులోగా ప్రభుత్వ ఉద్యోగుల వేతన సవరణ, పదోన్న తులు, ధరణి పోర్టల్‌లో మార్పులు, చేర్పులు వంటి కీలక సమస్యలకు పూర్తిస్థాయిలో పరిష్కారం చూపనున్నారు. వచ్చే నెల 17న జరిగే తన జన్మదిన వేడుకల తర్వాత జిల్లా పర్యటనలకు సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టను న్నారు. ఇప్పటికే వేతన సవరణ నివేదిక ప్రభుత్వానికి అందగా, సంక్రాంతి తర్వాత పీఆర్సీపై సీఎం కేసీఆర్ ప్రకటన చేస్తారు. ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయుల పదోన్న తుల ప్రక్రియను ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని ఇదివరకే ఆదేశించిన నేపథ్యంలో, ఖాళీల సంఖ్యపై స్పష్టత వచ్చాక ఫిబ్రవరి మూడోవారంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ప్రకటన వెలువడే అవకాశం ఉంది. సోమవారం జరిగిన కలెక్టర్ల సమావేశంలో ధరణి పోర్టల్‌లో మార్పులు, చేర్పులకు కూడా వారం రోజుల గడువు ఇచ్చారు. ఎల్ఆర్ఎస్ వంటి అంశాలపైనా వీలైనంత త్వరగా ప్రభుత్వ వైఖరిని స్పష్టం చేయాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారు. యాదాద్రిలో భారీ యాగం యాదాద్రి ఆలయ నిర్మాణ పనులను కూడా ఫిబ్రవరి నెలాఖరులోగా పూర్తి చేసి ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. ఆలయ ప్రారంభోత్సవాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని భావిస్తున్న సీఎం ఈ సందర్భంగా భారీ యాగాన్ని కూడా నిర్వహించాలని నిర్ణయించారు. యాగం నిర్వహణ ఏ స్థాయిలో ఉండాలనే అంశంపైనా వేద పండితులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిసింది. మరోవైపు ఫిబ్రవరి మూడు లేదా నాలుగో వారం నుంచి జిల్లాల పర్యటనల ద్వారా పార్టీ కార్యకలాపాలను కూడా పట్టాలెక్కించాలని నిర్ణయించారు. సుమారు రెండున్నరేళ్ల క్రితం అన్ని జిల్లా కేంద్రాల్లో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాల నిర్మాణం ప్రారంభం కాగా, ఒకటి రెండు జిల్లాలు మినహా అన్ని చోట్లా పనులు దాదాపు పూర్తయ్యాయి. గత ఏడాది డిసెంబర్ 10న సిద్దిపేట జిల్లా కార్యాలయాన్ని ప్రారంభించిన కేసీఆర్ ఇతర జిల్లా కేంద్రాల్లోనూ తన చేతుల మీదుగా పార్టీ కార్యాలయాలను ప్రారంభించేలా షెడ్యూల్ రూపొందిస్తున్నారు. కార్యకర్తల శిక్షణ కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టి ఈ ఏడాది జూన్‌లోగా పూర్తి చేసేలా ప్రణాళిక సిద్దం చేశారు. శిక్షణలో కార్యకర్తలకు బోధించాల్సిన అంశాలపై రూపొందించిన హ్యాండ్‌బుక్ రూపకల్పనకు సంబంధించి సీఎం కేసీఆర్ పలు సూచనలు చేసినట్లు సమాచారం. నామినేటెడ్ పదవుల భర్తీపైనా కసరత్తు ఫిబ్రవరిలో జిల్లాల పర్యటనకు ముందే రాష్ట్ర, జిల్లా స్థాయి నామినేటెడ్ పదవుల భర్తీని కూడా పూర్తి చేయాలని కేసీఆర్ నిర్ణయించారు. ఇప్పటికే జిల్లాలు, నియోజకవర్గాల వారీగా నామినేటెడ్ పదవులు ఆశిస్తున్న నేతల జాబితా సీఎంకు చేరినట్లు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. మంత్రులు, ఎమ్మెల్యేల అభిప్రాయం తీసుకుంటూనే నామినేటెడ్ పదవుల భర్తీలో తనదైన ముద్ర ఉండేలా కసరత్తు జరుగుతోందని సమాచారం. త్వరలో జరిగే నాగార్జునసాగర్ అసెంబ్లీ ఉప ఎన్నిక, వరంగల్, ఖమ్మం కార్పోరేషన్ల ఎన్నికకు సంబంధించి ఇప్పటికే టీఆర్ఎస్ పరంగా పలు అంతర్గత సర్వేలు జరుగుతున్నాయి. మరోవైపు పార్టీ జిల్లా ఇన్చార్జిలు, సీఎంకు సన్నిహితంగా ఉండే నేతలు నాగార్జునసాగర్ నియోజకవర్గ, పార్టీ స్థితిగతులపైనా వేర్వేరు నివేదికలు సమర్పించారు. పార్టీ అభ్యర్థి ఎంపికపై అన్ని కోణాల్లో సమాచారం సేకరిస్తున్న సీఎం కేసీఆర్, పార్టీ యంత్రాంగాన్ని ఇప్పటి నుంచే ఎన్నికలకు సన్నద్దం చేయాలని నిర్ణయించారు. సాగర్ పరిధిలోని మండలాలు, మున్సిపాలిటీలకు ఒకటి రెండు రోజుల్లో పార్టీ ఇన్చార్జిలను ప్రకటించే అవకాశం ఉంది. -
బీసీ కార్పొరేషన్ల నామినేటెడ్ పోస్టుల భర్తీ రేపే
సాక్షి, అమరాతి: బీసీ కార్పొరేషన్ల నామినేటెడ్ పోస్టుల భర్తీపై ప్రభుత్వం బుధవారం ప్రకటన విడుదల చేయనుంది. రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా భారీగా బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేసిన ప్రభుత్వం..ఎన్నడూలేని విధంగా పెద్ద సంఖ్యలో కులాలకు ప్రాతినిథ్యం కల్పించనుంది. ఆయా కులాల ఆర్థిక, సామాజిక ప్రగతికి కార్పొరేషన్లు తోడ్పాటు అందించనున్నాయి. మొత్తంగా 56 కులాలకు ప్రభుత్వం కార్పొరేషన్లు ఏర్పాటు చేసింది. వన్నికుల క్షత్రియ, అగ్నికుల క్షత్రియ, బెస్త, ఈడిగ, నాగవంశీయులు, పులనాటి వెలమ తదితర కులాలకూ కార్పొరేషన్లు ఏర్పాటు చేసింది ప్రభుత్వం. 30 వేల పైబడి జనాభా ఉన్నవారందరికీ కార్పొరేషన్ల ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇక నామినేటెడ్ పదవుల్లో పురుషుల కన్నా మహిళలకు ఎక్కువ పోస్టులు కేటాయించనున్నారు. కార్పొరేషన్ల చైర్మన్లుగా 29 మంది మహిళలను, 27 మంది పురుషులను ప్రభుత్వం ఎంపిక చేయనుంది. అలాగే.. డైరెక్టర్ల పదవుల్లో మహిళలకు 50 శాతం ఇచ్చే అవకాశం ఉంది. అన్ని జిల్లాలకూ ఛైర్మన్ పదవుల్లో ప్రాతినిథ్యం కల్పించనున్నారు. డైరెక్టర్ల పదవుల్లోనూ వీలైనన్ని జిల్లాలకు కేటాయింపులు ఉండనున్నాయి. (చదవండి: ‘స్పందన’పై సీఎం జగన్ సమీక్ష.. కలెక్టర్లకు సూచనలు) జిల్లా పురుషులు స్త్రీలు మొత్తం అనంతపురం 2 2 4 చిత్తూరు 2 2 4 తూర్పుగోదావరి 1 3 4 గుంటూరు 2 2 4 కడప 2 2 4 కృష్ణా 2 3 5 కర్నూలు 2 2 4 నెల్లూరు 2 2 4 ప్రకాశం 2 2 4 శ్రీకాకుళం 3 3 6 విశాఖ 2 3 5 విజయనగరం 2 2 4 పశ్చిమగోదావరి 3 1 4 27 29 56 -
రాజ్యసభకు మాజీ సీజేఐ
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్‌ని కేంద్రం రాజ్యసభకు నామినేట్ చేసింది. ఈ మేరకు కేంద్ర హోం శాఖ సోమవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది కేటీఎస్ తులసి రిటైర్మెంట్తో ఖాళీ అయిన స్థానంలో జస్టిస్ గొగోయ్‌ని కేంద్ర ప్రభుత్వం నామినేట్ చేసింది. గత ఏడాది నవంబర్ 9న సున్నితమైన అయోధ్య కేసులో తీర్పు ప్రకటించిన ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనానికి జస్టిస్ గొగోయ్ నేతృత్వం వహించిన విషయం తెలిసిందే. అదే నెలలో ఆయన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదవీ విరమణ చేశారు. రఫేల్ ఫైటర్ జెట్స్ కేసును, శబరిమలలోకి మహిళల ప్రవేశానికి సంబంధించిన కేసును కూడా ఆయన విచారించారు. అయోధ్య కేసులో 2.77 ఎకరాల వివాదాస్పద స్థలం మొత్తాన్ని రామాలయ నిర్మాణం కోసం వినియోగించాలని ఆయన తీర్పునిచ్చారు. మసీదు నిర్మాణం కోసం అయోధ్యలోని మరో ప్రముఖ ప్రాంతంలో ఐదు ఎకరాల స్థలం కేటాయించాలని ఆదేశించారు. సీజేఐగా పదవీకాలంలో లైంగిక వేధింపుల ఆరోపణ సహా పలు వివాదాలను ఆయన ఎదుర్కొన్నారు. రఫేల్ ఫైటర్ జెట్ డీల్‌లో మోదీ ప్రభుత్వానికి క్లీన్ చిట్ ఇచ్చిన ధర్మాసనానికి కూడా జస్టిస్ గొగొయే నేతృత్వం వహించారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కార్యాలయం సమాచార హక్కు చట్టం పరిధిలోకే వస్తుందని సంచలన తీర్పునిచ్చింది కూడా ఆయన నేతృత్వంలోని ధర్మాసనమే. ఎన్నార్సీ ప్రక్రియను సమీక్షించిన బెంచ్‌కు కూడా జస్టిస్ గొగోయ్ నేతృత్వం వహించారు. రాజ్యసభకు నామినేట్ అవుతున్న తొలి సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఆయనే కావడం విశేషం. మాజీ సీజేఐ రంగనాథ్ మిశ్రా కూడా రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు కానీ, ఆయన నామినేటెడ్ సభ్యుడు కాదు. కాంగ్రెస్ తరఫున ఎగువ సభకు ఎన్నికయ్యారు. -
ఎదురుచూపులే!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం వరుసగా రెండోసారి అధికారం చేపట్టి ఏడాది పూర్తయినా పార్టీ నేతలకు నామినేటెడ్ పదవీ యోగం దక్కట్లేదు. లోక్‌సభ, స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత నామినేటెడ్ పదవుల భర్తీ ఉంటుందని ఆశిస్తూ వచ్చిన నేతలకు నెలల తరబడి ఎదురుచూపులు తప్పట్లేదు. గతేడాది డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి అవకాశం దక్కని నేతలతో పాటు, పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేస్తున్న సీనియర్లు, వేర్వేరు పార్టీల నుంచి చేరిన నేతలు నామినేటెడ్ పదవులను ఆశిస్తున్నారు. మంత్రి మండలిని మూడుసార్లు పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ విస్తరించారు. ఈ సందర్భంగా పార్టీ సీనియర్లకు త్వరలో కీలక పదవులు అప్పగిస్తామని సంకేతాలిచ్చారు. మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, పద్మా దేవేందర్‌రెడ్డి, బాజిరెడ్డి గోవర్ధన్ తదితరుల పేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. కడియంకు రాజ్యసభ, నాయినికి టీఎస్ఆర్టీసీ చైర్మన్, బాజిరెడ్డి గోవర్ధన్‌కు రైతు సమన్వయ సమితి చైర్మన్ పదవులు దక్కుతాయనే ప్రచారం జరిగింది. మంత్రి మండలి విస్తరణ జరిగి నాలుగు నెలలు కావస్తున్నా నామినేటెడ్ పదవుల భర్తీ అంశంపై స్పష్టత రాలేదు. కొద్దిమందికే అవకాశం రెండోసారి టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక పరిమిత సంఖ్యలో నామినేటెడ్ పోస్టుల భర్తీ జరిగింది. కరీంనగర్ మాజీ ఎంపీ బి.వినోద్‌కుమార్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఒకరిద్దరు నేతలకు కేబినెట్ ర్యాంకుతో పదవులు దక్కాయి. గుత్తా సుఖేందర్‌రెడ్డికి ఎమ్మెల్సీ, మండలి చైర్మన్‌గా అవకాశం కల్పించగా, మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డికి పౌరసరఫరాల సంస్థ కార్పొరేషన్ చైర్మన్‌గా నియమించారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సన్నిహితులు పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, నవీన్‌కుమార్‌కు ఎమ్మెల్సీలుగా అవకాశం దక్కింది. సుమారు 12 మంది నేతలకు కార్పొరేషన్ చైర్మన్లు, సలహాదారులుగా పదవీ కాలం పొడిగించారు. రాష్ట్రంలో సుమారు 90 ప్రభుత్వ కార్పొరేషన్లు ఉండగా, ఈ ఏడాది అక్టోబర్ నాటికి మెజారిటీ కార్పొరేషన్లలో పాలక మండళ్ల పదవీ కాల పరిమితి ముగిసింది. దీంతో తమ పదవీ కాలాన్ని పొడిగించాలని కోరుతూ కొందరు, కొత్తగా తమకు అవకాశం కల్పించాలంటూ మరికొందరు కేసీఆర్, కేటీఆర్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. 29 ప్రధాన కార్పొరేషన్లలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల కు అవకాశం కల్పించేందుకు ‘ఆఫీస్ ఆఫ్ ప్రాఫి ట్’ నిబంధన అడ్డుగా ఉందనే కారణంగా ఇటీ వల ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసింది. ఇదిలా ఉంటే క్షేత్ర స్థాయిలో మార్కెట్, దేవాలయ పాలక మండళ్లు కూడా చాలా చోట్ల ఖాళీగా ఉండటంతో ద్వితీయ శ్రేణి నేతలు తమకు అవకాశం కల్పించాలంటూ కోరుతున్నారు. మున్సిపల్ ఎన్నికల తర్వాతేనా! జనవరి మూడో వారంలో మున్సిపల్ ఎన్నికలు జరిగే అవకాశం ఉండటంతో నామినేటెడ్ పదవుల భర్తీ ఇప్పట్లో ఉండకపోవచ్చని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దసరా నాటికే జిల్లాల వారీగా పార్టీ కార్యాలయాల ప్రారంభోత్సవం, నియోజకవర్గం, జిల్లా, రాష్ట్ర స్థాయిలో సంస్థాగత కమిటీల నిర్మాణం వంటి సంస్థాగత అంశాలు పెండింగు పడుతూ వస్తున్నాయి. మున్సిపల్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న టీఆర్ఎస్ పార్టీ ఎన్నికలు తర్వాతే నామినేటెడ్ పదవుల భర్తీపై దృష్టి సారించే అవకాశం ఉంది. ప్రభుత్వ విప్‌లు, అసెంబ్లీ కమిటీల్లో కొందరు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు అవకాశం కల్పించడం ద్వారా నామినేటెడ్ పదవులు ఆశించవద్దనే సందేశాన్ని కొందరు సీనియర్ నేతలకు సీఎం పంపినట్లు సమాచారం. -
నామినేటెడ్ పోస్టుల్లో 50 శాతం బీసీ, ఎస్సీ,ఎస్టీ, మైనార్టీలకే
సాక్షి, అమరావతి : ‘అన్ని నామినేటెడ్ పోస్టుల్లో 50 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకే కేటాయిస్తున్నాం. నామినేటెడ్ పనుల్లో కూడా 50% ఆ వర్గాలకే ఇస్తున్నాం. మొత్తం మీద మహిళలకు 50 శాతం పదవులు ఇస్తున్నాం. ఈ మేరకు దేశంలో చట్టం చేసిన ఏకైక రాష్ట్రం మనదేనని గర్వంగా చెబుతున్నా’ అని సీఎం వైఎస్ జగన్ స్పష్టం చేశారు. సలహాదారుల నియామక అంశంపై అసెంబ్లీలో బుధవారం ప్రశ్నోత్తరాల సమయంలో టీడీపీ సభ్యులు అడిగిన ప్రశ్నపై ఆయన స్పందించి మాట్లాడారు. ఇప్పటికే ఆ వర్గాలకు చాలా పదవులు ఇచ్చామని, స్థానిక ఎన్నికల తర్వాత మిగిలిన పోస్టులు కూడా భర్తీ చేసి ఇదే శాసనసభలో తుది జాబితాను విడుదల చేస్తామన్నారు. ఆయా వర్గాల వారికి ఇస్తున్న ప్రాధాన్యతను ఇలా వివరించారు. బడుగు, బలహీన, మైనార్టీ వర్గాలకే పెద్దపీట ‘నామినేటెడ్ పదవుల అంశాన్ని చంద్రబాబు పార్టీ వక్రీకరిస్తోంది. ఇంతగా వక్రీకరించే పార్టీ ప్రపంచంలో మరెక్కడా లేదు. నామినేటెడ్ పోస్టుల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ మొట్టమొదటి అసెంబ్లీ సమావేశాల్లోనే దీనిపై చట్టం చేశాం. నామినేటెడ్ పనుల్లో కూడా ఈ వర్గాల వారికి 50 శాతం కల్పించిన ఏకైక రాష్ట్రం మనదే. ఇందులో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాం. రాజకీయంగా ఎంతో పలుకుబడి ఉన్న ఓసీలకు చెందిన వారికే అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ(ఏఎంసీ) చైర్మన్ పదవులు ఇచ్చే పరిస్థితి ఉండేది. అలాంటి పోస్టుల్లో కూడా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు రిజర్వేషన్లు కల్పిస్తున్నాం. కృష్ణా జిల్లాలో 19 మార్కెట్ కమిటీ పోస్టులు ఉంటే.. అందులో 10 బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ఇచ్చాం. దాంతోపాటు దేవాలయాల చైర్మన్ల పదవుల్లోనూ రిజర్వేషన్లు పాటిస్తున్నాం. ఎంతో పలుకుబడి ఉంటే తప్ప దేవాలయ చైర్మన్ పదవి వచ్చేది కాదు. కానీ మా ప్రభుత్వం దేవాలయాల చైర్మన్లు, సభ్యుల పదవుల్లో సైతం బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల వారికి 50 శాతం ఇస్తోంది. మొన్నటికి మొన్న డీసీసీబీలు, డీసీఎంఎస్‌లు 13 ఉంటే.. అందులో 7 బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ఇచ్చాం. తెలుగు అకాడమీ చైర్‌పర్సన్‌గా నందమూరి లక్ష్మీపార్వతిని నియమించాం. ఈమె టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ సతీమణి, చంద్రబాబుకు స్వయానా అత్త గారు. లక్ష్మీపార్వతికి వాళ్లు ఏమీ ఇవ్వలేదు. కానీ మేం ఇచ్చాం. ఇలా చెప్పుకుంటూ పోతే, ఈ జాబితాలో సగానికిపైగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలే ఉన్నారు. అయినా ఇది ప్రతిపక్షానికి కనిపించదు. ఇంకా 160కిపైగా చైర్మన్ స్థాయి నామినేటెడ్ పోస్టులు పెండింగులో ఉన్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలు ముగిశాక వాటన్నింటినీ భర్తీ చేస్తాం. తుది జాబితా వచ్చే సరికి 50శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలే ఉంటారు. అన్ని పోస్టులు భర్తీ చేసి మొత్తం జాబితాను ఇదే చట్టసభలో విడుదల చేస్తాం. సలహాదారులవి నామినేటెడ్ పోస్టులు కావు సలహాదారుల విషయానికొస్తే అవి నామినేటెడ్ పదవులు కావు. ఆయా రంగాల్లో నైపుణ్యం ఉన్న వారిని సలహాదారులుగా నియమిస్తారు. వారు ఆయా రంగాలకు సంబంధించి సలహాలు, సూచనలు ఇవ్వడం ద్వారా విలువ, సామర్థ్యాన్ని పెంచగలుగుతారని భావించి నియమిస్తారు. కుటుంబరావును చంద్రబాబు ఎందుకు తీసుకున్నారు? ఆయన సామాజిక వర్గానికి చెందిన వ్యక్తినే తీసుకున్నారని ఇవాళ నేను అనొచ్చు. నేను ఇక్కడ కులాన్ని ప్రస్తావించదలుచుకోలేదు. కేబినెట్లో 60 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలే మా కేబినెట్లో సుమారు 60 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలున్నారు. ఐదుగురు ఉప ముఖ్యమంత్రులు ఉంటే.. అందులో నలుగురు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలేనని గర్వంగా చెప్పగలుగుతాం. ఈ రాష్ట్రంలో హోంమంత్రి ఎవరని ఎవరినైనా అడిగితే.. దళిత మహిళ అని చెబుతారు. పిల్లలకు చదువులు చెప్పించే విద్యా శాఖ మంత్రి ఎవరని అడిగితే.. మాదిగ సామాజిక వర్గానికి చెందిన సురేష్ అని, రెవిన్యూ మంత్రి ఎవరంటే బీసీ వర్గానికి చెందిన సుభాష్ చంద్రబోస్ అని గర్వంగా చెప్పగలుగుతా. అలా ప్రతి అడుగులోనూ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు పెద్దపీట వేసిన ప్రభుత్వం మాదే’ అని వైఎస్ జగన్ అన్నారు. -
నామినేటెడ్ పోస్టుల్లో 50శాతం రిజర్వేషన్లు కల్పించాం
-
ఇంత దారుణమైన వక్రీకరణా?
సాక్షి, అమరావతి: ప్రతి విషయంలోనూ దారుణమైన వక్రీకరణకు టీడీపీ పాల్పడుతోందని, చరిత్రలో ఇంత దారుణంగా వక్రీకరణ చేసే వ్యక్తులు టీడీపీ నేతలు మాత్రమేనని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. అడ్వజయిర్ పదవుల విషయమై టీడీపీ నేతల రాద్ధాంతంపై సీఎం జగన్ సభలో సమాధానం ఇచ్చారు. ‘ మా ప్రభుత్వం వచ్చాక మొట్టమొదటి శాసనసభ సమావేశాల్లోనే నామినేటెడ్ పదవుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు 50శాతం రిజర్వేషన్ కల్పించే శాసనాన్ని తీసుకొచ్చాం. దేశ చరిత్రలోనే ఇలాంటి చట్టం తెచ్చిన ఏకైక రాష్ట్రం మనదే. నామినేటెడ్ పనుల్లోనూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు 50శాతం రిజర్వేషన్ కల్పించాం. ఒకప్పుడు మార్కెట్ యార్డు కమిటీ చైర్మన్ పదవులు రాజకీయ పలుకుబడి ఉన్న ఓసీ వర్గానికి మాత్రమే వచ్చేవి. కానీ ఈ చట్టాల వల్ల కృష్ణాజిల్లాలో 19 మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్ పదవులు ఉంటే అందులో పది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు వచ్చాయి. ఆలయ కమిటీ పదవుల్లోనూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు 50శాతం రిజర్వేషన్ కల్పించాం. జిల్లా సహకరా బ్యాంకులు, మార్కెటింగ్ సొసైటీల్లోనూ 50 రిజర్వేషన్ కల్పించాం. ఈ రిజర్వేషన్‌లోనూ 50శాతం పదవులు మహిళలకు ఇచ్చాం’ అని సీఎం జగన్ గుర్తుచేశారు. ఈ సందర్భంగా తమ ప్రభుత్వ హయాంలో వివిధ పదవులకు జరిగిన నియామకాల జాబితాను సీఎం జగన్ సభలో చదివి వినిపించారు. ఆ జాబితా.. జస్టిస్ ఏ శంకర్‌నారాయణ: చైర్మన్, ఏపీ శాశ్వత బీసీ కమిషన్ జక్కంపూడి రాజా : చైర్మన్, కాపు కార్పొరేషన్ శ్రీమతి ఆర్కే రోజా : చైర్పర్సన్, ఏపీఐఐసీ ప్రముఖ డాక్టర్ చంద్రశేఖర్‌రెడ్డి: చైర్మన్, ఏపీ స్టేట్ మెడ్ అండ్ ఇన్ఫస్ట్రక్చర్ డెవలప్మెంట్ శ్రీమతి లక్ష్మీపార్వతి : చైర్పర్సన్, ఏపీ తెలుగు అకాడమీ (ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. టీడీపీ వ్యవస్థాపకులుఎన్టీఆర్ భార్య, చంద్రబాబుగారి అత్తగారే. మీ అత్తగారే.. మీరు ఇవ్వలేదు. మేం ఇచ్చామని చంద్రబాబును ఉద్దేశించి అన్నారు) రామ్మోహన్రావు, లక్ష్మమ్మ : వైస్ చైర్పర్సన్లు, ఏపీ తెలుగు అకాడమీ బీ సుధీర్ ప్రేమ్‌కుమార్ : ఏపీసీఐ చీఫ్ సెక్రటరీ జస్టిస్ ఈశ్వరయ్య గౌడ్ : చైర్మన్, ఏపీ హయ్యర్ ఎడ్యుకేషన్ రెగ్యులేటరీ, మనిటరింగ్ కమిషన్ భార్గవరాం : వైస్ చైర్మన్, ఏపీ హయ్యర్ ఎడ్యుకేషన్ రెగ్యులేటరీ, మనిటరింగ్ కమిషన్ రామ్మోహన్రావు : చైర్మన్, ఏపీ కనీస వేతన సంఘం ఎండీ నౌమన్ : చైర్మన్, ఏపీ ఉర్దు అకాడమీ అబ్దుల్ రహీం అఫ్సర్ : వైస్ చైర్మన్, ఏపీ ఉర్దు అకాడమీ జియావుద్దీన్ : చైర్మన్, ఏపీ మైనారిటీ కమిషన్ బండి అర్జున మనోజ్‌కుమార్, వైస్ చైర్మన్, ఏపీ మైనారిటీ కమిసన్ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి జేసీ శర్మ: చైర్మన్, వన్ మ్యాన్ కమిషన్ (బేడ, బుడగ జగం వర్గాల సమస్యల పరిష్కారం కోసం) మధుసూదనరావు, చైర్మన్, రెల్లి కార్పరేషన్ శ్రీమతి అమ్మాజీ, చైర్మన్, ఏపీ మాల కార్పొరేషన్ కొమ్మూరి కనకరావు, ఏపీ మాదిగ కార్పొరేషన్ వాసిరెడ్డి పద్మ, ఏపీ మహిళా కమిషన్ ఫైనల్ లిస్ట్ అసెంబ్లీలో విడుదల చేస్తాం ఇందులో సగానికిపైగా పదవుల్లో చైర్మన్లు, చైర్పర్సన్లు ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు ఉన్నారని, అయినా ఇది టీడీపీ వాళ్లకు కనిపించడం లేదని సీఎం జగన్ అన్నారు. ఇంకా 150కుపైగా చైర్మన్ పోస్టులు భర్తీ చేయాల్సి ఉందని, లోకల్ బాడీ ఎన్నికల తర్వాత వాటిని నియమిస్తామని తెలిపారు. ఈ నియమకాలు ముగిసిన తర్వాత తుది జాబితాను అసెంబ్లీలో విడుదల చేస్తామని, ఈ జాబితాలో కచ్చితంగా 50శాతం పదవులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటటీలకు కేటాయిస్తామన్నారు. ఇక, అడ్వయిజర్లు నామినేటెడ్ పోస్టులు కావని, కేవలం ఒకటి, రెండేళ్లు మాత్రమే కొనసాగుతాయని అన్నారు. ఆయా రంగాల్లో నైపుణ్యం గల వారిని.. ఆయా రంగాల విలువను పెంచేందుకు అడ్వయిజర్లుగా తీసుకున్నామని సీఎం జగన్ వివరించారు. మీ హయాంలో మీ సామాజికవర్గానికి చెందిన కుటుంబారావును అడ్వయిజర్‌గా తీసుకున్నారని, కానీ దీనిని తాము ప్రశ్నించడం లేదని, కానీ, ఆ ప్రశ్నను ప్రశ్నించడం లేదని, అడ్వజయిర్ల పోస్టుల్లో కులం ప్రస్తావన తీసుకురావడం లేదని స్పష్టం చేశారు. ఈ రాష్ట్రంలో హోంమంత్రిగా ఎస్సీ దళిత మహిళ ఉండటం, ఒక విద్యామంత్రిగా మాదిగ సామాజిక వర్గానికి చెందిన సురేశ్ ఉండటం, రెవెన్యూ మంత్రిగా బీసీ వర్గానికి చెందిన సుభాష్ చంద్రబోస్ ఉండటం గర్వంగా ఉందని పేర్కొన్నారు. అయినా ప్రతి విషయంలో రాజకీయాలు, వక్రీకరణకు పాల్పడే టీడీపీ సభ్యులకు మైక్ ఇవ్వడం పాపం లాంటిదన్నారు. టీడీపీకి అది వెన్నతో పెట్టిన విద్య: కన్నబాబు ప్రతి విషయాన్ని వక్రీకరించడం టీడీపీకి వెన్నతో పెట్టిన విద్య అని మంత్రి కురసాల కన్నబాబు విమర్శించారు. గత ప్రభుత్వ హయాంలో 24 డిపార్ట్మెంట్లలో 264మందిని కన్సల్టెంట్ పోస్టుల్లో టీడీపీ నియమించిందని, బంధుప్రీతితో తమకు కావాల్సిన వాళ్లను, అనుయాయిలను మాత్రమే కన్సలెంట్లగా పెట్టుకుందని ఆయన విమర్శించారు. అడ్వయిజర్ల విషయంలో టీడీపీ కులాలు, మతాలు ప్రస్తావన తెచ్చి రాద్ధాంతం చేస్తుందన్నారు. సలహాదారులను కూలాన్ని, మతాన్ని చూసి నియమించుకోరని, ఆయా రంగాల్లో నిపుణులు, సమర్థులను మాత్రమే అడ్వయిజర్లుగా నియమించుకుంటారని ఆయన స్పష్టం చేశారు. అవి శాశ్వతమైన పోస్టులు కావని తెలిపారు. ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పదవిని మొట్టమొదటిసారిగా మహిళకు ఇచ్చిన ఘనత సీఎం వైఎస్ జగన్‌ది అని, టెంపుల్ కమిటీ మొదలుకొని మార్కెట్ కమిటీల వరకు ప్రతిచోటా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు 50శాతం రిజర్వేషన్ కల్పించామని తెలిపారు. నామినేటెడ్ పదవుల్లోనూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు 50శాతం రిజర్వేషన్ కల్పించామని వివరించారు. ప్రభుత్వం నియమించుకున్న 75మంది అడ్వయిజర్లలో అన్ని వర్గాలవారు ఉన్నారని తెలిపారు. ఎస్సీలు, బీసీలు, మైనారిటీలు కూడా అడ్వయిజర్లుగా ఉన్నారని వివరించారు. -
గులాబీ.. చకోర పక్షులు!
సాక్షి, నల్లగొండ : టీఆర్ఎస్ నాయకుల పరిస్థితి కక్కలేక .. మింగలేక అన్నట్టు తయారైంది. ప్రభుత్వ నామినేటెడ్ పదవులనో, లేక పార్టీ సంస్థాగత పదవులనో అడగలేక, నాయకత్వాన్ని నిలదీయ లేక ఇబ్బంది పడుతున్నారు. వివిధ సందర్భాల్లో ఆయా పదవుల హామీలు పొందిన నాయకులూ అవి అమలు కాక, ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక అసంతృప్తితో కొట్టుమిట్టాడుతున్నారు. ముందు నుంచీ పార్టీలో కొనసాగిన వారు, ఆయా సందర్భాల్లో ఆయా రాజకీయ పార్టీల నుంచి వచ్చి చేరిన వారికి ఎలాంటి పదవుల్లేక రాజకీయ నిరుద్యోగులుగా మారారన్న అభిప్రాయం బలంగా వ్యక్తమవుతోంది. పార్టీ అధినాయకత్వం పదవుల భర్తీపై అంతగా దృష్టి పెట్టకపోవడం, నామినేటెడ్ పదవుల పందేరం గురించి ఆలోచించక పోవడంతో తమకు పదవీ యోగం ఎల్లప్పుడు పడుతుందా అని చకోర పక్షుల్లా ఎదురు చూస్తున్నారు. ప్రధానంగా ద్వితీయ శ్రేణి నాయకత్వం బహిరంగంగా విమర్శలకు దిగడం లేదు కానీ, తమ ప్రైవేటు చర్చల్లో అధిష్టానంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సభ్యత్వ నమోదు పూర్తయ్యాక తప్పకుండా తమకు పార్టీ సంస్థాగత పదవులు దక్కుతాయని ఆశించారు. ఇక, ప్రభుత్వం భర్తీ చేయాల్సిన నామినేటెడ్ పదవులు ఉండనే ఉన్నాయి. గతంలో పదవులు దక్కిన వారే ఇప్పటికీ కొనసాగుతున్నా.. కొత్తవారికి మాత్రం ఎలాంటి అవకాశమూ దక్కలేదు. 2014లో పార్టీ తొలిసారి అధికారం చేపట్టినప్పుడు కొందరికి పదవులు సర్దారు. పదవీ కాలపరిమితి పూర్తయిన వారిలో కొందరికి రెన్యువల్ చేశారు. దేవాలయ కమిటీలు, మార్కెట్ కమిటీలు, రాష్ట్ర స్థాయి కార్పొరేషన్లు, ఆ కార్పొరేషన్లలో సభ్యుల పోస్టులు ఇలా పలు పదవులను భర్తీ చేయాల్సి ఉంది. ఇదే జరిగితే, తమకు ఏదో ఒక పదవి దక్కుతుందని ఎదురుచూస్తున్న వారికి రోజురోజుకూ నిరాశే మిగులుతోంది. స్థానిక సంస్థలకు జరిగిన ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పించలేకపోయిన వారికి నామినేటెడ్, లేదంటే పార్టీ పదవులు ఇస్తామని అపుడు నచ్చజెప్పిన నాయకత్వం ఇప్పుడు ఆ ఊసే ఎత్తడం లేదని వాపోతున్నారు. పార్టీ పదవులేవీ..? పార్టీ సభ్యత్వ నమోదు పూర్తయిన వెంటనే పార్టీ కమిటీలను ఎన్నుకోవాల్సి ఉంది. ఎక్కడా పోటీ జరిగే అవకాశం ఉండకపోవడం, ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేల నిర్ణయాల ప్రకారమే కమిటీల ఎంపిక జరిగే వీలున్నందున ఒక విధంగా పార్టీ పదవులకూ నామినేటెడ్ పద్ధతే అమలవుతోంది. ఈ పరిస్థితుల్లో పార్టీ పదవుల కోసం ఎమ్మెల్యేల చుట్టూ తిరుగుతున్న వారూ ఉన్నారు. అధినాయకత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు అందకుండా స్థానికంగా ఏ చిన్న పదవినీ ఎమ్మెల్యేలు భర్తీ చేసే అవకాశం లేకపోవడంతో చివరకు పార్టీ పదవులూ ఖాళీగానే ఉన్నాయని పేర్కొంటున్నారు. ప్రస్తుతం గ్రామ, మండల శాఖ పార్టీ కమిటీల నియామకం మొదలైంది. ఆ తర్వాత నియోజవర్గ స్థాయి, జిల్లా కమిటీలను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. గత ఏడాది మండల కమిటీలకే పరిమితమయ్యారు. నియోజకవర్గ, జిల్లా కమిటీల ఊసే మరిచారు. ఈ సంవత్సరం కూడా అదే పరిస్థితి ఎదురవుతుందా అన్న మీమాంస శ్రేణుల్లో నెలకొంది. ఇప్పటికే టీఆర్ఎస్ అగ్రనాయకత్వం పార్టీ నిబంధనావళిలో కొన్ని మార్పులు తీసుకువచ్చింది. ఈ మార్పుల నేపథ్యంలో జిల్లా అధ్యక్ష పోస్టును రద్దు చేశారు. ఆ స్థానంలో ఇద్దరిని జిల్లా ఇన్చార్జులను నియమించాలి. ఈ సవరణ జరిగి ఐదేళ్లు దాటుతున్నా అమల్లోకి మాత్రం రాలేదు. దీంతో జిల్లాలో పార్టీకి సంస్థాగత సారథి ఎవరూ లేకుండా పోయారు. ఉమ్మడి నల్లగొం డ జిల్లాకు ఎక్కువ కాలం అధ్యక్షుడిగా పనిచేసిన బండా నరేందర్‌రెడ్డి ప్రస్తుత జెడ్పీ చైర్మన్ పదవిలో ఉన్నారు. ఆయన స్థానంలో ఎవరినీ కొత్తవారికి నియమించలేదు. నియోజకవర్గ కమిటీలకు ఇన్చార్జులను నియమించాలి్సన ఎమ్మెల్యేలు సైతం కమిటీల ఏర్పాటుపై చొరవ తీసుకోవడం లేదు. ఇక,, ప్రభుత్వ నామినేటెడ్ పదవుల భర్తీ నిరాశాజనకంగానే ఉంది. పార్టీలో సీనియర్లుగా ఉన్నవారికి ఎలాంటి గుర్తింపు దక్కడం లేదన్న విమర్శ ఉంది. ‘కొత్త’ ... లొల్లి పాత, కొత్త నాయకులు, కేడర్‌తో పార్టీ కిక్కిరిసిపోయింది. దీంతో సహజంగానే గ్రూపులు తయారయ్యాయి. ఆయా నాయకులు వివిధ పార్టీల నుంచి టీఆర్ఎస్లో చేరిన సందర్భంలో వారి వెంట వచ్చిన కేడర్ కొంత ఉంది. ఒక విధంగా వీరిలో ముఖ్యులు అనుకున్న వారిని ఏదో ఒక పదవి ఆశచూపెట్టి వెంట తెచ్చుకున్నారు. కానీ, ఇక్కడకు వచ్చాక వారిని పార్టీ పదవుల్లో సర్దడం నాయకుల వల్ల కావడం లేదు. మరోవైపు వివిధ రాజకీయ పార్టీల వలసవచ్చిన వారు, ముందు నుంచీ పార్టీలో ఉండి పనిచేస్తున్న వారు కలిసి పనిచేయలేకపోతున్నా రు. ఫలితంగా గుంపు రాజకీయం నడుస్తోంది. ఈ పరిస్థితి నల్లగొండ, నకిరేకల్ మిర్యాలగూ డ, నాగార్జునసాగర్, దేవరకొండ నియోజకవర్గాల్లో కనిపిస్తోంది. మొత్తంగా జిల్లా టీఆర్ఎస్ లో ఇప్పుడు పదువుల లొల్లి మొదలైంది. ఈ సమస్యకు పరిష్కారం చూపాల్సిన అధినాయకత్వం మాత్రం పదవుల పంపకంపై మీనమేషా లు లెక్కిస్తోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
‘నామినేట్’ చేయండి.. బాస్
సాక్షి, హైదరాబాద్: నామినేటెడ్ పదవుల కోసం తెలంగాణ రాష్ట్ర సమితి ఆశావహులు అటు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధికార నివాసం ప్రగతిభవన్‌తో పాటు, పార్టీ రాష్ట్ర కార్యాలయం తెలంగాణ భవన్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. పార్టీ రెండోసారి అధికారంలోకి వచ్చి ఏడాదవుతున్నా ఈ పదవుల భర్తీ జరగలేదు. టీఆర్ఎస్ తొలిసారి అధికారంలోకి వచ్చిన తర్వాత నామినేటెడ్ పదవులు పొందిన నేతల పదవీ కాలం ముగియడంతో చాలామంది రెండోసారీ తమను కొనసాగించాలని కోరుతున్నారు. గత ఏడాది డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన అభ్యర్థులతో పాటు సిట్టింగ్ ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు కూడా ఈ పదవుల కోసం పోటీ పడుతున్నారు. రాష్ట్రంలో 50కి పైగా కార్పొరేషన్లు ఉండగా, వాటిలో 30 కార్పొరేషన్ చైర్మన్లకు కేబినెట్ హోదా దక్కుతుంది. వాటి కోసం పోటీ పడుతోన్న ఆశావహుల సంఖ్య పెద్దగానే ఉంది. ఈ ఏడాది సెప్టెంబర్ మొదటి వారంలో జరిగిన కేబినెట్ విస్తరణ సందర్భంగా 12 మంది సీనియర్ నేతలకు తొలి ప్రాధాన్యతగా నామినేటెడ్ పదవులు ఇస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ సంకేతాలిచ్చారు. కార్పొరేషన్లతో పాటు నాలుగువేలకు పైగా మార్కెట్, ఆలయ కమిటీలు, గ్రంథాలయ సంస్థ పాలక మండళ్లల్లో ఉద్యమకారులకు చోటిస్తామని ప్రకటించారు. మున్సిపల్ ఎన్నికల తర్వాత నామినేటెడ్ పదవుల భర్తీ ఉంటుందని ఇటీవల తనను కలిసిన వరంగల్ జిల్లా నేతలకు కేటీఆర్ చెప్పినట్లు సమాచారం. ఓడిన నేతలకు పదవులతో ఊరట అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో ఓటమి పాలైన వారికి నామినేటెడ్ పదవుల భర్తీలో ప్రాధాన్యత ఇస్తామని ప్రకటించారు. ఈ క్రమంలో కరీంనగర్ మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్‌కు రాష్ట్ర ప్రణాళిక బోర్డు వైస్ చైర్మన్‌గా కేబినెట్ హోదా దక్కింది. మాజీ మంత్రులు తుమ్మల నాగేశ్వర్రావు, జూపల్లి కృష్ణారావు, నాయిని నర్సింహారెడ్డి, జోగు రామన్న, పి.మహేందర్‌రెడ్డి, చందూలాల్, మాజీ స్పీకర్ మధుసూదనాచారి. మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి కీలక పదవుల కోసం ఎదురు చూస్తున్నారు. రైతు సమన్వయ సమితి చైర్మన్‌గా నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ పేరు ఖరారైనట్లు చెబుతున్నా ఇంకా స్పష్టత రాలేదు. హుజూర్నగర్ ఉప ఎన్నిక విజయంలో కీలక పాత్ర పోషించి సీఎం కేసీఆర్, కేటీఆర్ ప్రశంసలు అందుకున్న పల్లా రాజేశ్వర్‌రెడ్డికి మిషన్ భగీరథ కార్పొరేషన్ వైస్ చైర్మన్ పదవి దక్కుతుందనే ప్రచారం జరుగుతోంది. మూసీ రివర్ ఫ్రంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా గతంలో హుడా చైర్మన్‌గా పని చేసిన దేవిరెడ్డి సుధీర్‌రెడ్డికి అవకాశం కల్పిస్తానని కేసీఆర్ హామీ ఇచ్చినట్లు తెలిసింది. కొందరికే అవకాశం.. మరెందరో ఎదురుచూపులు ఒకరిద్దరు మినహా గతంలో కార్పొరేషన్ చైర్మన్లుగా నామినేటెడ్ పదవుల పొందిన నేతల పదవీ కాలం ఈ ఏడాది అక్టోబర్‌తో ముగిసింది. టీఆర్ఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చాక నలుగురైదుగురినే నామినేటెడ్ పదవుల్లో కొనసాగిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. పౌర సరఫరాల కార్పొరేషన్ చైర్మన్‌గా మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, టీఎస్ఐఐసీ చైర్మన్ గ్యాదరి బాలమల్లు, ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, గ్రంథాలయ సంస్థ చైర్మన్ శ్రీధర్ పదవీ కాలం పొడిగించారు. ఎనర్జీ రెగ్యులేషన్ కమిటీ చైర్మన్‌గా న్యాయవాది శ్రీరంగా రావు ఇటీవల బాధ్యతలు చేపట్టారు. సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే చింత ప్రభాకర్‌ను రాష్ట్ర చేనేత సహకార సంస్థ (టెస్కో) చైర్మన్‌గా నియమిస్తారనే ప్రకటన వెలువడినా అధికారికంగా ఉత్తర్వులు జారీ కాలేదు. మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి, సురేశ్‌రెడ్డి, మండవ వెంకటేశ్వర్రావు పలుమార్లు సీఎంను కలిశారు. తక్కళ్లపల్లి రవీందర్రావు, బస్వరాజు సారయ్య ఆశావహుల జాబితాలో ఉన్నారు. విద్యార్థి నాయకులు కె.వాసుదేవరెడ్డి, రాకేశ్‌రెడ్డి రెండోసారి కొనసాగింపు కోరుతుండగా, అవకాశం కోసం పల్లా ప్రవీణ్‌రెడ్డి, బాలరాజు యాదవ్, గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఎదురుచూస్తున్నారు. -
నామినేటెడ్ పదవుల కోసం ఆశావహులు ఎదురుచూపులు
సాక్షి, వరంగల్: విజయ దశమికి తమ దశ తిరుగుతుందన్న ఆశల పల్లకీలో పలువురు టీఆర్ఎస్ నేతలు ఊరేగుతున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుతో ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన పది మంది టీఆర్ఎస్ సీనియర్ నేతలకు రాష్ట్ర స్థాయిలో కార్పొరేషన్ చైర్మన్ పదవులు దక్కాయి. రాష్ట్ర వికలాంగుల సంస్థ చైర్మన్‌గా వాసుదేవరెడ్డి, ట్రైకార్ చైర్మన్‌గా గాంధీనాయక్, రాష్ట్ర మహిళా ఆర్థిక సంస్థ చైర్‌పర్సన్‌గా గుండు సుధారాణి, రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ చైర్మన్‌గా పెద్ది సుదర్శన్‌రెడ్డి పదవులు చేపట్టారు. అలాగే ‘కుడా’ చైర్మన్‌గా మర్రి యాదవర్‌రెడ్డి, రాష్ట్ర ఆగ్రోస్ సంస్థ చైర్మన్‌గా లింగంపెల్లి కిషన్‌రావు, గొర్రెలు, మేకల పెంపకందారుల అభివృద్ధి సంస్థ చైర్మన్‌గా కన్నెబోయిన రాజయ్యయాదవ్, హస్తకళల అభివృద్ధి సంస్థ చైర్మన్‌గా బొల్లం సునీల్‌కుమార్, ఖాదీగ్రామీణాభివృద్ధి సంస్థ చైర్మన్‌గా మౌలానా యూసుఫ్ జాహేద్, రైతు ఆత్మహత్యల న్యాయ విచారణ, విమోచన కమిటీ చైర్మన్‌గా నాగుర్ల వెంకటేశ్వర్ల దక్కించుకోగా.. మరో ఒకరిద్ద్దరికి రాష్ట్ర స్థాయిలో నామినేటెడ్ పదవులు వస్తాయని అనుకుంటున్న తరుణంలోనే ముందస్తుగా టీఆర్ఎస్ అసెంబ్లీ ఎన్నికలకు పోవడంతో పదవుల పందేరానికి బ్రేక్ పడింది. ముగుస్తున్న పదవుల కాలం.. రాష్ట్ర స్థాయిలో నామినేటెడ్ పోస్టులు పొందిన వారి కమిటీల పదవీకాలం ముగిసిపోతోంది. ఇందులో రెండు నెలల క్రితం వికలాంగుల అభివృద్ధి సంస్థ చైర్మన్ వాసుదేవరెడ్డి, ట్రైకార్ చైర్మన్ గాంధీనాయక్, మహిళా ఆర్థిక సంస్థ చైర్పర్సన్ గుండు సుధారాణి పదవీకాలం ముగిసింది. అక్టోబర్ 9న అంటే మరో పదిరోజుల్లో ‘కుడా’ చైర్మన్ మర్రి యాదవరెడ్డి, ఆగ్రోస్ చైర్మన్ లింగంపల్లి కిషన్‌రావు, గొర్రెలు పెంపకందారుల అభివృద్ధి సంస్థ చైర్మన్ కన్నెబోయిన రాజయ్య యాదవ్ పదవీకాలం ముగిసిపోనుంది. పౌర సరఫరాల సంస్థ చైర్మన్‌గా వ్యవహరిస్తున్న పెద్ద సుదర్శన్‌రెడ్డి నర్సంపేట ఎమ్మెల్యేగా గెలుపొందడంతో అది ఖాళీ అయ్యింది. డిసెంబర్ నెలతో హస్తకళల అభివృద్ధి సంస్థ చైర్మన్ బొల్లం సంపత్‌కుమార్, ఖాదీ గ్రామీణాభివృద్ధి సంస్థ చైర్మన్ యూసుఫ్‌జాహేద్ పదవీకాలం పూర్తవుతుంది. దీంతో ఉమ్మడి జిల్లాలో పది రాష్ట్ర స్థాయి పదవులు ఖాళీ కానున్నాయి. మరోసారి అవకాశం కోసం... ఇప్పటికే పదవీకాలం పూర్తి చేసుకున్న, త్వరలో పూర్తి కానున్న సంస్థల చైర్మన్లు మరోసారి అవకాశం ఇవ్వాలంటూ సీఎం కేసీఆర్‌తో పాటు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌కు ఇప్పటికే విన్నవించుకున్నట్లు తెలిసింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ముఖ్యమంత్రి, మంత్రుల చాంబర్లలో సదరు ఆశావహ నేతలే కనిపించడం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది. మరోవైపు విశ్వసనీయత, విధేయతే గీటు రాయి అన్న చందంగా టీఆర్ఎస్ అగ్రనేతలు పదవులు ఇస్తారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. పార్టీకి చేసిన సేవలతోనే పదవులు ఇస్తామని వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పలుమార్లు సమావేశాల్లో స్పష్టం చేయడంతో ఇటీవల జరిగిన సభ్యత్వ నమోదు, కమిటీల ఏర్పాటులో నాయకులు పోటీ పడి పనిచేశారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మంత్రులను ప్రసన్నం చేసుకునేందుకు ఎవరి స్టైల్లో వారు శ్రమించారని చెప్పక తప్పదు. ఖచ్చితమైన హామీ ఎవరికీ లభించనప్పటికీ ముగ్గురు మినహా గతంలో పొందిన నామినేడెడ్ పదవులను మళ్లీ తమకే కేటాయించాలంటూ ప్రయత్నాలు సాగిస్తుండటం చర్చనీయాంశంగా మారింది. ఆశల పల్లకిలో ఉద్యమకారులు... తెలంగాణ ఉద్యమంలో అలుపెరగని పోరాటం చేస్తూ కేసుల పాలైన పలువురు ఉద్యమకారులు ఈసారి తప్పకుండా నామినేటెడ్ పదవులు వస్తాయన్న ఆశతో ఎదురుచూస్తున్నారు. ఇప్పటి వరకు రాష్ట్ర స్థాయిలో కార్పొరేషన్లకు చైర్మన్లను నియమించినప్పటికీ పూర్తి స్థాయిలో కమిటీలను ఏర్పాటు చేయక పోవడం వల్ల డైరెక్టర్ల పోస్టులు సైతం పార్టీ కింది స్థాయి క్యాడర్‌కు దక్కలేదు. ఇప్పుడు అలా కాకుండా కార్పొరేషన్లకు చైర్మన్లతో పాటు డైరెక్టర్లను నియమించి అసంతృప్తి వాదులను సంతృప్తి చేయాలన్న దృఢ నిశ్చయంతో అధిష్టానం యోచిస్తోందని సమాచారం. గత అసెంబ్లీ ఎన్నికల్లో టిక్కెట్లు ఆశించిన పలువురు నేతలకు హామీ ఇచ్చిన నేపథ్యంలో కొత్తవారికి రాష్ట్ర స్థాయి చైర్మన్ పదవులు దక్కుతాయన్న ప్రచారం పార్టీలో జోరుగా సాగుతోంది. విజయదశమికి కొన్ని కార్పొరేషన్లకు చైర్మన్ పదవులు ప్రకటించే అవకాశం ఉన్నట్లు పార్టీ ముఖ్య నేతలు కొందరు వ్యక్తం చేశారు. -
పదవులేవీ.. అధ్యక్షా!
సాక్షి, నల్లగొండ : గత ఏడాది డిసెంబర్లో పార్టీ రెండో సారి అధికారం చేపట్టాక వెనువెంటనే జరిగిన గ్రామ పంచాయతీ, స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ పలువురికి అధికారిక పదవులు పొందే అవకాశం దక్కింది. సర్పంచులుగా, ఎంపీటీసీ సభ్యులు, జెడ్పీటీసీ సభ్యులుగా పోటీ చేయడానికి టికెట్ రాని వారిని పార్టీ పదవుల పేరుచెప్పి బుజ్జగించారు. ఒక్క మున్సిపల్ ఎన్నికలు మినహా.. ఇక ఏ ఎన్నికలూ లేవు. మున్సిపల్ ఎన్నికలు కేవలం పరిమి తమైన సంఖ్యలో మాత్రమే.. అదీ పట్టణ ప్రాంత కేడర్‌కు మాత్రమే అవకాశం కల్పించే వీలు ఉంది. కాగా, జిల్లా వ్యాప్తంగా ఆయా నియోజకవర్గాల్లో పనిచేస్తున్న నాయకులు తమకు ఎలాంటి గుర్తింపు లేకుండా పోయిందన్న ఆవేదనలో ఉన్నారు. మోక్షం లేని పార్టీ కమిటీలు సభ్యత్వ నమోదు పూర్తయ్యాక సంస్థాగత కమిటీలు ఏర్పాటు చేయాల్సి ఉంది. తద్వారా గ్రామ, మండల కమిటీల్లో కొందరిని సర్దే అవకా శం ఉండేదని అంటున్నారు. పార్టీ కమిటీల వ్య వహారం ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో.. పార్టీ పదవులకూ మోక్షం లభించడం లేదని అంటున్నారు. ఇక, నియోజవర్గ స్థాయి, జిల్లా కమిటీల ఊసే లేదు. 2014లో టీఆర్ఎస్ తొలి సారి అధికారంలోకి వచ్చాక పార్టీ నిబంధనావళికి కొన్ని సవరణలు చేసింది. వీటి ప్రకారం జిల్లా అధ్యక్ష పోస్టు లేకుండా పోయింది. జిల్లాకు ఇద్దరు ఇన్చార్జులను నియమిస్తామని ఆ సవరణల్లో పేర్కొంది. ఆ మేరకు కూడా జిల్లాలో ఎవరినీ నియమించలేదు. సుదీర్ఘ కాలం జిల్లా అధ్యక్షుడిగా పనిచేసిన ప్రస్తుత జెడ్పీ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి ఆ పదవిలో కొనసాగుతున్నారు. నియోజకవర్గాలకు ఎమ్మెల్యేల నేతత్వంలోనే ఇన్చార్జుల వ్యవస్థకు ప్రాణం పోసింది. దీంతో ఆ కమిటీలు లేకుండా పోయాయి. ఇపుడు సభ్యత్వ నమోదు కూడా పూర్తయ్యాక.. పార్టీ కమిటీలపై కసరత్తు చేయాల్సిన నాయకత్వం ఇంకా మీనమేషాలు లెక్కిస్తోందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. నామినేటెడ్ పదవుల ఊసేలేదు మరోవైపు పలువురు నాయకులు ప్రభుత్వ నామినేటెడ్ పదవులపై ఆశలు పెట్టుకున్నా.. ఆ పదవుల భర్తీ ఊసే కనిపించడం లేదు. టీఆర్ఎస్ ఆవిర్భావంనుంచి పార్టీలో పనిచేస్తున్న సీనియర్లు చాలామందికి గత ప్రభుత్వంలో పదవులు పొందే అవకాశం దక్కలేదు. రెండోసారి పార్టీ తిరిగి అధికారంలోకి రావడంతో ఈసారన్నా తమ కోరికి తీరుతుందా లేదా అన్న సంశయంలో కొందరు నాయకులు ఉన్నారు. జిల్లాలో కొందరు నాయకులకు నామినేటెడ్ పోస్టులు దక్కినా.. అది స్వల్పమే. రాష్ట్రస్థాయి కార్పొరేషన్లలో సభ్యులుగా.. జిల్లాస్థాయి పోస్టుల కోసం పలువురు ఇప్పటికీ ఆశగా ఎదురుచూస్తున్నారు. కొత్త–పాతల నడుమ పోటీ ప్రధానంగా పార్టీలో ఇప్పుడు కొత్త–పాతల పోటీ నడుస్తోంది. పార్టీ ఆవిర్భావంనుంచి కొనసాగుతున్న నాయకులు, కేడర్‌కు.. ప్రభుత్వం ఏర్పాటయ్యాక 2014 నుంచి ఇప్పటి దాకా ఆయా పార్టీల నేతలతో వలసవచ్చిన వారి మధ్య పొసగడం లేదు. నియోజకవర్గాల్లో ఇస్తున్న ప్రాధాన్యం విషయంలోనూ తారతమ్యం చూపిస్తున్నారన్న విమర్శ పాత నేతలనుంచి వస్తోంది. నకిరేకల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం వర్గాలు కొనసాగుతున్నాయి. అవి పదవుల విషయంలో తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందన్న అభిప్రాయం బలంగా వ్యక్తమవుతోంది. నల్లగొండ నియోజకవర్గం విషయానికి వచ్చేవరకు ముందు నుంచి పార్టీలో ఉన్న వారికంటే ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి వెంట, ఆ తర్వాత టీడీపీ నుంచి వచ్చిన వారికే ప్రాధాన్యం లభిస్తోందని వాపోతున్నవారూ ఉన్నారు. మిర్యాలగూడ నియోజకవర్గంలో సైతం ముందు నుంచి టీఆర్ఎస్లో ఉన్న వారికంటే, ఎమ్మెల్యే భాస్కర్ రావు వెంట కాంగ్రెస్ నుంచి పార్టీలోకి వచ్చిన వారికే ప్రాముఖ్యం ఇస్తున్నారని, పదవుల విషయంలోనూ ఇదే జరుగుతోందని పేర్కొంటున్నారు. నాగార్జున సాగర్ నియోజకవర్గంలో రెండు వర్గాలు ఉన్నాయి. దేవరకొండ నియోజకవర్గంలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. దీంతో అటు పార్టీ పదవులు దక్కడంలో కానీ, వ్యవసాయ మార్కెట్ కమిటీల పాలకమండళ్లు, దేవాలయ పాలక మండళ్లకు చెందిన పదవుల భర్తీ విషయంలో ప్రాధాన్యం లభించడం లేదన్న అసంతప్తి పాత కేడర్‌లో ఉంది. మొత్తంగా జిల్లా టీఆర్ఎస్లో ఇప్పుడు పదువుల లొల్లి షురూ అయ్యింది. పార్టీ సంస్థాగత పదవుల, నామినేటెడ్ పదవుల పందేరం మొదలైతే ఆయా నియోజకవర్గాల్లో పార్టీ శ్రేణుల నడుమ మరిన్ని తేడాలు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. -
అభిమానులే గెలిపించాలి
కెరీర్లో ఫుల్ ఫామ్‌తో దూసుకెళ్తున్నారు ఆలియా భట్. అవకాశాలు ఆమెకు క్యూ కడుతున్నాయి. ఇప్పుడు ఆలియాకు ఓ అరుదైన అవకాశం వచ్చింది. కానీ ఇందులో గెలవడం ఆలియా చేతిలో లేదు. ఆమె అభిమానులే గెలిపించాలి. ‘మోస్ట్ ఇన్స్పైరింగ్ ఆసియన్ ఉమెన్ పీపుల్ ఛాయిస్ అవార్డు’ కు అలియా భట్ నామినేట్ అయ్యారు. ఈ ఏడాది ఇండియా నుంచి నామినేట్ అయ్యింది ఆలియా భట్ ఒక్కరే కావడం విశేషం. ఇక ఆలియాను గెలిపించాలంటే ఆమె అభిమానులు ఆన్లైన్ పోల్ ఓట్లు వేయాలి. ఈ అవకాశం అక్టోబరు 18 వరకు ఉంటుంది. నవంబరు 10న విజేతను ప్రకటిస్తారు. చైనీస్ యాక్టర్ జౌ డోంగ్యూ, సౌత్ కొరియన్ నటి జంగ్ యు మీ, థాయ్ నటి ప్రయా లండ్‌బర్గ్ వంటి వారు ఆలియా భట్‌కు పోటీగా ఉన్నారు. ఇంతకుముందు ఈ అవార్డును ప్రియాంకా చోప్రా గెలుచుకున్నారు. మరి.. ఆలియా గెలుచుకుంటారా? అభిమానుల చేతుల్లోనే ఉంది. -
స్థానిక ఎన్నికల తరువాతే నామినేటెడ్ పదవులు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తయిన తరువాతే నామినేటెడ్ పదవులను భర్తీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ అంశంపై సీఎం వైఎస్ జగన్ బుధవారం మంత్రివర్గ సమావేశంలో సహచర మంత్రులకు స్పష్టత ఇచ్చినట్లు తెలిసింది. నామినేటెడ్ పదవులను భర్తీ చేస్తే బాగుంటుందని, ఆశావహులు ఎదురు చూస్తున్నారని ఉత్తరాంధ్రకు చెందిన ఓ మంత్రి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చినట్లు సమాచారం. మరో రెండు నెలల్లో పంచాయతీరాజ్, మున్సిపల్ ఎన్నికలు పూర్తి కావాల్సిన తరుణంలో ఇప్పుడు నామినేటెడ్ పదవుల నియామకం సరికాదనే అభిప్రాయాన్ని ముఖ్యమంత్రి వ్యక్తం చేశారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం... బుధవారం కేబినెట్ భేటీ ముగిశాక వైఎస్ జగన్ కొద్దిసేపు మంత్రులతో పిచ్చాపాటీగా మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికల తరువాతే నామినేటెడ్ పదవులను భర్తీ చేయాలన్న జగన్ వాదనతో పలువురు మంత్రులు ఏకీభవించారు. గ్రామ సచివాలయ కార్యదర్శుల నియామకాలపై మంత్రులు తమ అభిప్రాయాలు పంచుకున్నారు. పోటీ పరీక్షలు నిర్వహించి, సచివాలయ కార్యదర్శులను ఎంపిక చేయడమే అన్ని విధాలా సరైందని, దీనివల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు రాదని సీఎం చెప్పారు. ప్రతిభావ ంతులకే అవకాశం కల్పించినట్లవుతుందన్నారు. పథకాలన్నీ మొదటినుంచే అమలు చేయాలి మేనిఫెస్టోలో ప్రకటించిన పథకాలన్నీ ఇప్పుడే అమలు చేయడం సరైంది కాదేమోనని ఓ మంత్రి సీఎం దృష్టికి తీసుకొచ్చారు. పథకాలను దశల వారీగా అమలు చేయడం తమ విధానం కాదని, అన్నీ మొదటినుంచే అమలు చేసి తీరాల్సిందేనని జగన్ స్పష్టం చేశారు. వనరులను ఎలాగైనా సమీకరించుకోవాలే తప్ప పథకాల అమలును వాయిదా వేయడం మంచి పద్ధతి కాదన్నారు. మంత్రివర్గం కూర్పును తేలిగ్గా చేసుకోగలిగానని, కానీ తిరుమల టీటీడీ పాలకమండలి సభ్యుల నియామకాన్ని ఖరారు చేసే విషయంలో ఇబ్బందులు పడాల్సి వచ్చిందని వైఎస్ జగన్ తన మంత్రివర్గ సహచరులతో చెప్పినట్లు సమాచారం. -
నామినేటెడ్ పదవుల్లో యాభైశాతం వారికే
ఆకాశంలో సగం.. అవకాశాల్లో సగం.. ఇదీ ప్రస్తుత ప్రభుత్వ విధానం. అన్నింటా వారికి సమానావకాశాలు కల్పించారు. ప్రతి రంగంలోనూ వారికి పెద్ద పీటవేశారు. ఒకరికి ఉపముఖ్యమంత్రి పదవినీ.. మరొకరికి హోంశాఖను కట్టబెట్టిన సీఎం ఏకంగా నామినేటెడ్ పదవుల్లో 50శాతం కేటాయిస్తూ బిల్లు ప్రవేశపెట్టి దానిని ఆమోదింపజేశారు. ఉగాదినాటికి మహిళల పేరునే ఇళ్లస్థల పట్టాల పంపిణీకి ఏర్పాట్లు చేశారు. రుణమాఫీ పేరుతో డ్వాక్రా మహిళలను వంచించిన గత ప్రభుత్వం వారిని పథకాల ప్రచారానికీ.. సభలు.. సమావేశాలకే పరిమితం చేసింది. ప్రస్తుత ప్రభుత్వం తమకు కల్పిస్తున్న అవకాశాలను చూసి మహిళా లోకం ఉబ్బి తబ్బిబ్బవుతోంది. సాక్షి, విజయనగరం : మహిళలకు అంతచేస్తాం... ఇంత చేస్తాం... అని కేవలం మాటలతోనే పబ్బం గడుపుకున్న గత పాలకుల హయాంలో మహిళలు రాజ్యాధికారాలకు దూరమయ్యారు. కానీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్రెడ్డి అధికారం చేపట్టిన అనతి కాలంలోనే విప్లవాత్మక నిర్ణయం తీసుకున్నారు. నామినేటెడ్ పదవుల్లో మహిళలకు యాభైశాతం రిజర్వేషన్ కల్పించారు. జిల్లాలో ఇప్పటికే మహిళకు ఎమ్మెల్యే సీటిచ్చి, గెలిచిన తర్వాత ఉపముఖ్యమంత్రి హోదానిచ్చి, గిరిజన సలహామండలికి అధ్యక్షురాలిగా కూడా చేసి అత్యధిక ప్రాధాన్యమిచ్చారు. గత ప్రభుత్వ హయాంలో నిత్యం నరకం అనుభవిస్తూ అడుగడుగునా నయవంచనకు గురైన మహిళల బతుకుల్లో ప్రస్తుత ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలతో సంతో షాలు వెల్లివిరుస్తున్నాయి. జిల్లాలో మహిళదే పైచేయి జిల్లాలో 18,18,113 మంది ఓటర్లున్నారు. వీరిలో 8,98,331 మంది పురుషులు, 9,19,654 మంది మహిళలు. పురుష ఓటర్ల కంటే 21,323 మంది మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు. శాసనసభ ఎన్నికల్లో తొమ్మిది నియోజకవర్గాల్లో ఓటు హక్కు వినియోగంలోనూ మహిళలే ముందున్నారు. జిల్లా వ్యాప్తంగా 14,66,291 మంది ఓటు వేయగా వీరిలో 7,21,641 మంది పురుషులు, 7,44,630 మంది మహిళలున్నారు. ఈ లెక్కన ఓటు హక్కు వినియోగించుకున్న మహిళా ఓటర్ల సంఖ్య 22,989 అధికం. విజయనగరం లోక్‌సభ ఎన్నికల్లోనూ మహిళా ఓటర్లే అధికంగా ఓటు హక్కును సద్వినియోగం చేసుకున్నారు. ఏడు శాసనసభ నియోజకవర్గాల్లో మొత్తం 14,99,300 మంది ఓటర్లుండగా వీరిలో 7,49,489 మంది పురుషులు, 7,49,688 మంది మహిళలు ఉన్నారు. ఇందులో 12,08,191 మంది ఓటుహక్కు వినియోగించుకోగా... వారిలో 6,02,435 మంది పురుషులు, 6,05,749 మంది మహిళలు ఉన్నారంటే పురుషుల కంటే మహిళలే 3,314 అధికంగా ఓట్లేశారన్నమాట. గత ప్రభుత్వంలో నరకం గత టీడీపీ ప్రభుత్వంలో మహిళలు నిత్యం నరకం అనుభవించారు. జిల్లాలో మెప్మా, డీఆర్డీఏ వెలుగు శాఖల ఆధ్వర్యంలో 45 వేల మహిళా పొదుపు సంఘాలున్నాయి. వీటిలో సుమారు 4,50,000 మంది సభ్యులున్నారు. డ్వాక్రా రుణ మాఫీ దగ్గర్నుంచి అన్ని రకాలుగా చంద్రబాబు వారిని మోసం చేశారు. సున్నా వడ్డీకే రుణాలిచ్చే విధానాన్ని పూర్తిగా దూరం చేసి మహిళలను అప్పులపాలు చేశారు. అక్కడితో ఆగకుండా సాధికారమిత్రల పేరుతో ప్రభుత్వ పథకాలపై ప్రచారం చేయించుకోవడం కోసం 15,672 మం దిని నియమించుకుని వారికి జీతాలివ్వకుండా వంచించారు. మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకులకు ఇవ్వాల్సిన గౌరవ వేతనాన్ని కూడా ఎగవేసి వారు పస్తులుండేలా చేశారు. ఆదరణ పథకాన్ని బ్రష్టు పట్టించారు. వెలుగు ఉద్యోగులను రోడ్డున పడేశారు. అంగన్వాడీలకు కనీస వేతనా లు లేకుండా చేశారు. అయినప్పటికీ ప్రభుత్వ కార్యక్రమాలు, సీఎం సదస్సులకు ఆ మహిళలనే తరలించి వారి శ్రమను దోచుకున్నారు. చివరికి అదే మహిళల చేతిలో చిత్తుగా ఓడిపోయారు. కొత్త ప్రభుత్వంలో పెద్దపీట ప్రజాసంకల్పయాత్రలో మహిళల కష్టాలను స్వయంగా విన్న వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టిన వెంటనే మహిళా పక్షపాతిగా పేరుతెచ్చుకున్నారు. అమ్మ ఒడి పథకం ద్వారా జిల్లాలో పిల్లలను పాఠశాలకు, జూనియర్ కళాశాలకు పంపే తల్లులకు ఏటా రూ.15వేలు వంతున ఇస్తామని ప్రకటించారు. అంగన్వాడీ కార్యకర్తలకు, మధ్యాహ్న హోజన నిర్వాహకులకు, ఆశా వర్కర్లకు జీతాలు అనూహ్యంగా పెంచారు. మహిళలు కోరినదానికి మించి వారికి మంచి చేశారు. అంతే గాకుండా 45 ఏళ్లు నిండిన బడుగు, బలహీన వర్గాల మహిళకు వచ్చే ఏడాది నుంచి నాలుగేళ్లలో రూ.75వేలు ఇస్తామని సీఎం స్పష్టం చేశారు. ముఖ్యంగా తొలి సంతకంతోనే పింఛన్లను పెంచారు. ఒంటరి మహిళలకు అన్నగా ఆలోచించి ఆర్థిక భరోసానిచ్చారు. అంతేకాకుండా ఉగాది రోజు ఇళ్లులేని ప్రతి మహిళ పేరున ఇంటి స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేసి మరీ అందించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇలా అన్ని విధాలుగా మహిళల అభ్యున్నతికి పాటుపడుతున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తాజాగా నామినేటెడ్ పదవుల్లోనూ మహిళకే సగభాగం ఇస్తామని ప్రకటించడం మహిళాలోకం మరోవరంగా భావి స్తోంది. -
గౌరవంగా తప్పుకుంటే సరేసరి.. లేదంటే..!
సాక్షి, అమరావతి : గత ప్రభుత్వం అన్ని శాఖల్లో నియమించిన సలహాదారులు, చైర్పర్సన్లు, చైర్మన్లు, నిపుణులు, కన్సల్టెంట్లును తొలగించాల్సిందిగా సాధారణ పరిపాలన శాఖ (రాజకీయ) ముఖ్యకార్యదర్శి ఆర్పి సిసోడియా ఆదేశాలు జారీచేశారు. కొత్త ప్రభుత్వం ఏర్పడిన నేపథ్యంలో గత ప్రభుత్వంలో నామినేటెడ్ పదవుల్లో నియమితులైన వారు కూడా తమ పదవులకు రాజీనామా చేయాలని ఆ ఆదేశాల్లో పేర్కొన్నారు. వారంతా గౌరవంగా తప్పుకుంటే సరేసరని.. లేదంటే తొలగిస్తూ సంబంధిత శాఖలు ఆదేశాలు జారీచేయాలని సిసోడియా తన ఉత్తర్వుల్లో తెలిపారు. ఇప్పటికీ చాలామంది ఇలా కొనసాగుతున్నట్లు ప్రభుత్వం దృష్టికి వచ్చిందని.. అలాంటి వారిని తక్షణం తొలగిస్తూ చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. చంద్రబాబు హయాంలో ఏడు మిషన్లు, ఐదు గ్రిడ్ల పేరుతో సంబంధిత శాఖల్లో నిపుణుల పేరుతో అనేకమందిని ఎక్కువ వేతనాలకు తీసుకున్నారు. ఇప్పుడు కొత్త సర్కారు వచ్చినా ఇంకా వారు కొనసాగడంపట్ల అధికార వర్గాలు విస్మయం వ్యక్తంచేస్తున్నాయి. మున్సిపల్ పరిపాలన శాఖ అయితే ఏకంగా ఆయా మిషన్లలో పనిచేసే వారికి నిధులు కావాలంటూ ఆర్థిక శాఖకు ఫైలు పంపడం గమనార్హం. ఆర్టీసీ చైర్మన్ వర్ల రామయ్య అయితే ప్రభుత్వం మారినప్పటికీ చైర్మన్ పదవికి రాజీనామా చేయకుండా ఇంకా కొనసాగుతున్నారు. ఆర్టీసీ భవన్‌కు రాకుండానే ప్రభుత్వ వాహనాలను వినియోగించుకుంటున్నారు. సీఆర్డీఏ, అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్లో లక్షల్లో వేతనాలు తీసుకుంటూ కన్సల్టెంట్లు ఇప్పటికీ కొనసాగుతున్నారు. -
నామినేటెడ్ పదవుల్లో 50 % రిజర్వేషన్లు
సాక్షి, అమరావతి: బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలను రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా బలోపేతం చేయడమే లక్ష్యంగా.. దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా.. ఆ వర్గాలకు ప్రభుత్వంలోని అన్ని నామినేటెడ్ పదవుల్లో, అన్ని నామినేటెడ్ పనుల్లో 50 శాతం చొప్పున రిజర్వేషన్ కల్పిస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు రెండు బిల్లులను బీసీ సంక్షేమ శాఖ మంత్రి శంకర్ నారాయణ సోమవారం శాసనసభలో ప్రవేశపెట్టారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా మరిన్ని అవకాశాలను కల్పించే రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించేందుకు అసెంబ్లీ తొలి సమావేశాల్లోనే సీఎం వైఎస్ జగన్ శ్రీకారం చుట్టారు. అన్ని ప్రభుత్వ నామినేటెడ్ పదవుల్లో బీసీలకు 29 శాతం, ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు 6 శాతం రిజర్వేషన్లను ఒక బిల్లులో ప్రతిపాదించగా, మరో బిల్లులో అన్ని ప్రభుత్వ నామినేటెడ్ పనుల్లో కూడా ఇదే తరహాలో రిజర్వేషన్లు కల్పిస్తూ మరో బిల్లును ప్రవేశపెట్టారు. నామినేటెడ్ పదవుల్లోనూ, పనుల్లోనూ ఆయా వర్గాల మహిళలకే 50 శాతం చొప్పున రిజర్వేషన్ కల్పిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. సామాజిక, రాజకీయ వెనుకబాటుకు ఇక స్వస్తి అన్ని నామినేటెడ్ ప్రభుత్వ పదవుల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించడం ద్వారా ఈ వర్గాల్లో సామాజిక, రాజకీయ వెనుకబాటుతనానికి స్వస్తి పలికినట్లు అవుతుందని ప్రభుత్వం భావిస్తున్నట్లు బిల్లులో స్పష్టం చేశారు. అన్ని కార్పొరేషన్లు, ఏజెన్సీలు, సంస్థలు, సొసైటీలు, పరిపాలన విభాగాల్లో పనిచేసే కమిటీలన్నింటిలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించనున్నట్లు పేర్కొన్నారు. అదేవిధంగా నామినేట్ చేసే వీటి చైర్పర్సన్ పదవుల్లోనూ ఈ వర్గాలకు 50 శాతం రిజర్వేషన్లు వర్తించనున్నాయి. అలాగే నామినేట్ చేసే డైరెక్టర్లు, సభ్యుల పదవుల్లోనూ 50 శాతం రిజర్వేషన్లను కల్పిస్తారు. ఈ రిజర్వేషన్లు దేవదాయ చట్టం కింద ఏర్పడిన బోర్డులు, ట్రస్టులకు, అలాగే వక్ఫ్ బోర్డు చట్టం కింద ఏర్పడిన పదవులకు వర్తించవని పేర్కొన్నారు. నామినేటెడ్ పోస్టుల్లో ఈ రిజర్వేషన్ల అమలు తీరుతెన్నులను సాధారణ పరిపాలన శాఖ పర్యవేక్షించనుందని తెలిపారు. ఆర్థికంగా బలోపేతం ప్రభుత్వ నామినేటెడ్ పదవులు, పనులు, సర్వీసుల్లోనూ 50 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకే కేటాయించారు. తద్వారా ఆయా వర్గాలను ఆర్థికంగా బలోపేతం చేయాలనేది ప్రభుత్వం లక్ష్యంగా పేర్కొన్నారు. ఈ వర్గాలకు సమాన అవకాశాలు కల్పించాలనే రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగానే నామినేటెడ్ పనుల్లో రిజర్వేషన్లు కల్పిస్తున్నట్లు బిల్లులో ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇందులో భాగంగా ప్రభుత్వం ఆధ్వర్యంలో అన్ని నామినేటెడ్ సివిల్ పనుల కాంట్రాక్టులు, నామినేటెడ్ సర్వీసు పనుల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు 50 శాతం రిజర్వేషన్లను కల్పించనున్నట్లు పేర్కొంది. నామినేటెడ్ వర్క్ కాంట్రాక్టులు, సర్వీసు కాంట్రాక్టులు, అన్ని ఇంజనీరింగ్ విభాగాల్లోని పనుల్లో రిజర్వేషన్లను వర్తింపచేయనున్నారు. బీసీలకు 29 శాతం, ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు 6 శాతం రిజర్వేషన్లను కల్పించాలని ప్రతిపాదించారు. ఇందులోనే ఆయా వర్గాలకు చెందిన మహిళలకు 50 శాతం పనులను రిజర్వ్ చేయాలని స్పష్టం చేశారు. నామినేటెడ్ పనుల్లో రిజర్వేషన్లను అమలు చేసేందుకు రాష్ట్ర స్థాయిలో పంచాయతీరాజ్ శాఖ ఈఎన్సీ నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తారు. జిల్లా స్థాయిల్లో నామినేటెడ్ పనుల్లో, సర్వీసు కాంట్రాక్టు పనుల్లో రిజర్వేషన్ల అమలు బాధ్యతను జిల్లా కలెక్టర్లకు అప్పగించారు. సర్వీసు కాంట్రాక్టుల్లో రిజర్వేషన్ల అమలుకు సాధారణ పరిపాలన శాఖ నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తుంది. -
చంద్రబాబు బీసీల ద్రోహి
సాక్షి, అమరావతి: ‘దేశంలో తొలిసారిగా మన రాష్ట్రంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు నామినేటెడ్ పదవుల్లో, నామినేషన్ పనుల్లో 50 శాతం రిజర్వేషన్ కల్పించే బిల్లు తీసుకువస్తుంటే ప్రతిపక్షం అడ్డుకోవాలని చూస్తోంది. ఇంత అధ్వానమైన, దిక్కుమాలిన ప్రతిపక్షం దేశంలో ఎక్కడా ఉండదు. బడుగు, బలహీన వర్గాల ద్రోహులు వీళ్లు’ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి టీడీపీపై ధ్వజమెత్తారు. రాష్ట్రంలో నూతన అధ్యాయానికి తెరతీస్తూ రాష్ట్ర ప్రభుత్వం చరిత్రాత్మక బిల్లులను సోమవారం అసెంబ్లీలో ప్రవేశ పెట్టింది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు నామినేటెడ్ పదవులు, నామినేషన్ పనుల్లో 50 శాతం ఇచ్చే బిల్లులు, అన్ని నామినేటెడ్ పదవులు, నామినేషన్ పనుల్లో మహిళలకు 50 శాతం ఇచ్చే బిల్లులు, పరిశ్రమల్లో స్థానికులకు 75 శాతం ఉద్యోగాలు కల్పించే బిల్లు, శాశ్వత ప్రాతిపదికన బీసీ కమిషన్‌ను ఏర్పాటు చేసే బిల్లును అసెంబ్లీలో సోమవారం ప్రవేశపెట్టి ఆమోదించారు. కాగా ఈ బిల్లులు ప్రవేశ పెడుతున్నప్పుడు ప్రతిపక్ష నేత చంద్రబాబు, టీడీపీ సభ్యులు రాజధానిపై చర్చను కొనసాగించాలనే నెపంతో అడ్డుకునేందుకు ప్రయత్నించారు. అప్పటికే రాజధాని అంశంపై సుదీర్ఘ చర్చ ముగిసింది. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ వివరణ కూడా ఇచ్చారు. కానీ దీన్ని పట్టించుకోకుండా టీడీపీ సభ్యులు స్పీకర్ తమ్మినేని సీతారాం పోడియాన్ని చుట్టుముట్టి ఆందోళన కొనసాగించారు. దీనిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీవ్రంగా స్పందించారు. టీడీపీ సభ్యుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇలా మాట్లాడారు.. క్లారిఫికేషన్ తర్వాతా చర్చ ఉంటుందా? ‘40 ఇయర్స్ ఇండస్ట్రీ అంటారు. 40 ఏళ్ల అనుభవజ్ఞుడినైన రాజకీయ నేత అంటారు. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ప్రభుత్వం ఒక అంశంపై ప్రకటన చేసిన తర్వాత కేవలం క్లారిఫికేషన్ (వివరణ) మాత్రమే ఉంటుందని తెలిసినా కూడా దానిపై అర గంటపాటు మాట్లాడిన తర్వాత కూడా తృప్తి చెందకుండా ఇంకా గొడవ చేస్తున్నారు. ఇలాంటి విపక్షం ఎక్కడైనా ఉంటుందా? రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని రీతిలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు నామినేటెడ్ పోస్టులు, నామినేషన్ పనుల్లో 50 శాతం రిజర్వేషన్ కల్పిస్తున్నాం. దీన్ని కూడా అడ్డుకుంటున్న దిక్కుమాలిన ప్రతిపక్ష పార్టీ బహుశా ప్రపంచంలో మరెక్కడా ఉండదేమో? టీడీపీ ఓర్వలేకపోతోంది.. రాష్ట్ర చరిత్రలోనే కాదు.. దేశ చరిత్రలోనే తొలిసారి నామినేటెడ్ పదవులు, నామినేషన్ పనుల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు 50 శాతం ఇస్తుంటే టీడీపీ ఓర్వలేక పోతోంది. ఇంతకన్నా దిక్కుమాలిన ప్రతిపక్ష నేత మరొకరు ఉంటారా? ఇంతకన్నా దిక్కుమాలిన ప్రతిపక్ష పార్టీ మరొకటి ఉంటుందా? దేశ చరిత్రలోనే తొలిసారి నామినేటెడ్ పదవులు, నామినేషన్ పనుల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్ ఇస్తున్నాం. దీన్ని కూడా అడ్డుకుంటున్న దిక్కుమాలిన పార్టీ దేశంలో టీడీపీ తప్ప మరొకటి ఉండదు. ఉద్యోగాలు లేక మన పిల్లలు అల్లాడిపోతున్నారు. వారి జీవితాలు బాగు పరిచేందుకు పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే రిజర్వేషన్ కల్పిస్తూ బిల్లు తీసుకువస్తుంటే దీన్ని కూడా అడ్డుకుంటారా? ఇంతకంటే అధ్వానమైన, దిక్కుమాలిన ప్రతిపక్షం మరెక్కడా ఉండదు. శాశ్వత ప్రాతిపదికన బీసీ కమిషన్ ఏర్పాటుకు బిల్లు ప్రవేశపెడుతుంటే ఈ ప్రతిపక్షం అడ్డం పడుతోంది. ఇలాంటి ప్రతిపక్ష పార్టీ రాష్ట్రంలోనే కాదు దేశంలోనే మరొకటి లేదు. ఇంతకంటే దిక్కుమాలిన ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు కాకుండా మరొకరు దేశంలోనే ఉండరు. బీసీ స్పీకర్‌ను అవమానిస్తున్నారు గతంలో మేము ప్రతిపక్షంలో ఉండగా వాళ్లు అటువైపు నుంచి స్టేట్మెంట్ ఇస్తే క్లారిఫికేషన్‌కు మాకు రెండు మూడు నిముషాలు కూడా అవకాశం ఇచ్చేవారు కాదు. మరి ఇవాళ మేము స్టేట్మెంట్ చదివిన తర్వాత అరగంట సేపు చంద్రబాబు మాట్లాడారు. ఆ మాటల్లో ఏమాత్రం పస లేకుండా మాట్లాడారు. మళ్లీ దాని గురించి ఏకంగా పోడియం దగ్గరకు వచ్చి గొడవ చేస్తున్నారు. ఇంత దిక్కుమాలిన ప్రతిపక్షం మరొకటి ఉండదు. బీసీ వర్గానికి చెందిన స్పీకర్‌ను అవమానిస్తున్నారు. స్పీకర్ అన్న గౌరవం ఏమాత్రం లేకుండా అవమానిస్తున్నారు. బీసీ వర్గానికి చెందిన స్పీకర్ ఆధ్వర్యంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు 50 శాతం రిజర్వేషన్ కల్పిస్తుంటే అడ్డుకోవాలని చూస్తున్నారు. వీళ్లు బడుగు, బలహీన వర్గాల ద్రోహులు. వీళ్లకు జ్జానోదయం కలగాలని భగవంతుని కోరుకుంటున్నా. ఎన్నికల్లో ప్రజలు ఓడించినా సరే వీళ్లకు బుద్ధి రాలేదు. ఈ ద్రోహులను భగవంతుడే శిక్షిస్తాడు’ అని సీఎం మండిపడ్డారు. -
మరో చరిత్రాత్మక నిర్ణయం
సాక్షి, ఏలూరు (పశ్చిమ గోదావరి): ఎంత కష్టమైనా, నష్టమైనా ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం తన నైజం అని మరోసారి నిరూపించుకున్నారు యువ ముఖ్య మంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి. ఎన్నికల మ్యాని ఫెస్టోలో పేర్కొన్న విధంగానే ముఖ్యమంత్రి మరో చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు, మహిళలకు వెన్నుదన్నుగా నిలుస్తూ ప్రభుత్వంలోని అన్ని నామినేటెడ్ పోస్టులు, నామినేషన్ పనుల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించారు. ఈ కేటాయింపుల్లోనూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు చెందిన మహిళలకు 50 శాతం దక్కేలా చర్యలు తీసుకోనున్నట్లు ఇటీవల కేబినేట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఇప్పటివరకూ అభివృద్ధికి దూరంగా ఉన్న ఈ వర్గాలకు పెద్దపీట వేశారు. అట్టడుగు వర్గాలకు రాజ్యాధికారం దక్కిననాడే ఈ దేశం అభివృద్ధి పథంలో దూసుకుపోతుందని చెప్పిన నాయకుల వాక్కులను నిజం చేస్తూ ముఖ్యమంత్రి తీసుకున్న సాహసోపేత నిర్ణయంపై జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, మహిళల్లో ఆనందోత్సాహలు వ్యక్తమవుతున్నాయి. స్వాతంత్య్ర వచ్చి ఏడు దశాబ్దాలు కావస్తున్నా నేటికీ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా వెనుకబడే ఉన్నారు. ఆయా వర్గాల ప్రజలను కేవలం ఓటు బ్యాంకుగానే ఇప్పటివరకూ వివిధ రాజకీయ పార్టీలు పరిగణిస్తూ వచ్చాయి. దీంతో అభివృద్ధికి నోచుకోని ఈ వర్గాలు కేవలం పల్లకీ మోసే బోయీలుగానే మిగిలిపోయారు. తాజాగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిర్ణయంతో ఈ వర్గాలకు చెందిన వారు పల్లకీలు ఎక్కేస్థాయికి వచ్చారనే అభిప్రాయం అందరిలో వ్యక్తమవుతుంది. ఇప్పటివరకూ హామీలకే పరిమితం ఇప్పటివరకూ ప్రభుత్వాలు, వాటి పాలకులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, మహిళల సంక్షేమం, అభివృద్ధికి పెద్ద పీట వేస్తామంటూ ఉత్తుత్తి హామీలు ఇచ్చినవారే తప్ప నిజంగా వారి అభివృద్ధికి చేసింది ఏమీ లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కేవలం కాగితాలపై ఇన్ని వేల కోట్లు ఇచ్చాము, ఇస్తాము అంటూ కాకి లెక్కలకే పరిమిత మవుతూ వచ్చాయనేది ఆయా వర్గాల వాదనగా ఉండేది. దీనికి భిన్నంగా యువ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇచ్చిన హామీ మేరకు నామినేటెట్ పోస్టులు, పనుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, మహిళలకు 50 శాతం కేటాయింపులు చేయడం నిజంగా గొప్ప చరిత్రాత్మకమైన విషయమనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. అంబేద్కర్ ఆశయం సిద్ధించినట్లే రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, మహిళలకు నామినేటెడ్ పదవులు, పనుల్లో 50 శాతం రిజర్వేషన్లు కేటాయించడం ద్వారా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆశయం సిద్ధించినట్లే. అట్టడుగు పేదలకు రాజకీయ, ఆర్థిక, సామాజిక లబ్ధి చేకూరితేనే స్వాతంత్య్ర ఫలాలు అందరికీ సమానంగా అందినట్లు అవుతుంది. – డాక్టర్ మెండెం సంతోష్ కుమార్, ఆల్ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర అ«ధ్యక్షులు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టోలో హామీ ఇచ్చిన విధంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, మహిళలకు నామినేటెడ్ పదవులు, పనుల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించారు. ఇచ్చిన మాటను కేవలం నెలన్నర రోజుల్లోనే నిలబెట్టుకున్న గొప్ప వ్యక్తి ముఖ్యమంత్రి వైఎస్ జగన్. – ఉక్కుసూరి గోపాలకృష్ణ, ఉపాధ్యక్షులు, జిల్లా యాదవ సంఘం మహిళలకు పెద్ద పీట వేశారు ఇప్పటివరకూ మహిళలకు సంబంధించి రిజర్వేషన్లు అమలు చేస్తున్నామని చెబుతూనే ఉన్నా అవి పూర్తి స్థాయిలో అమలు కాలేదు. దీనికి భిన్నంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు కేటాయించిన రిజర్వేషన్లలో ఖచ్చితంగా 50 శాతం మహిళలకు అందిస్తానని చెప్పడం చాలా సంతోషంగా ఉంది. – మెతిక రాఘవ, బీసీ సంఘం నాయకురాలు జనాభా ప్రాతిపదికపై పదవులు కేటాయించాలి రాష్ట్ర ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయం చరిత్రాత్మకం. ఇదే క్రమంలో ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనారిటీలకు నామినేటెడ్ పదవులు, పనులు కేటాయింపులు చేసే టప్పుడు ఆయా కులాల జనాభా ప్రాతిపదికగా తీసుకుంటే అందరికీ సమన్యాయం జరుగుతుంది. ముఖ్యంగా రాష్ట్రంలోని 25 లక్షల మంది ఉన్న రజకులకు మేలు జరుగుతుంది. – చిలకలపల్లి కట్లయ్య, అధ్యక్షులు, జిల్లా రజక జన సంఘం -
ప్రభుత్వం మారినా పదవులను వదలరా!
సాక్షి, రాజమహేంద్రవరం : రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పాలన చేపట్టింది. ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి సుమారు నెలకావస్తోంది. అయితే గత టీడీపీ ప్రభుత్వ హయాంలో నామినేటెడ్ పదవులు చేపట్టిన తెలుగు తమ్ముళ్లు ఇంకా కొనసాగుతున్నారు. నిబంధనల ప్రకారం రాష్ట్రంలో ప్రభుత్వం మారగానే వారందరూ రాజీనామాలు సమర్పించాలి. వివరాల్లోకి వెళితే.. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో నగరంలో దేవదాయ ధర్మాదాయ శాఖ ద్వారా అందుబాటులోకి వచ్చే నామినేటెడ్ పదవులకు అభ్యర్థులను నియమించి హడావుడిగా ప్రమాణ స్వీకారాలు చేయించారు. మే 23న శాసనసభకు జరిగిన ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ ఘన విజయం సాధించింది. టీడీపీ ఘోర పరాజయం పాలైంది. రాజీనామా చేయకుండా.. వాస్తవంగా ఎన్నికల్లో గత ప్రభుత్వం విజయం సాధిస్తే ప్రస్తుతం నియమితులైన వారు నిర్ణీత పదవీకాలం పూర్తయ్యే వరకూ పదవుల్లో కొనసాగే అవకాశం ఉంది. ఓటమి పాలైన వారందరూ తక్షణమే రాజీనామా చేయాలి. కానీ రాజమహేంద్రవరం నగరంలో మాత్రం టీడీపీ నాయకులు ఇంకా నామినేటెడ్ పదవుల్లో కొనసాగుతున్నారు. నగరంలోని పలు ట్రస్ట్‌బోర్డులకు కమిటీల నియామకం జరిగింది. జీవకారుణ్య సంఘానికి వర్రే శ్రీనివాస్, హితకారిణి సమాజానికి యాళ్ల ప్రదీప్, శ్రీ ఉమా కోటిలింగేశ్వర దేవస్థానానికి అరిగెల బాబు నాగేంద్ర ప్రసాద్, చందాసత్రానికి ఇన్నమూరి దీపు, ఉమారాలింగేశ్వర కల్యాణ మండపానికి మజ్జి రాంబాబు, పందిరి మహదేవుడు సత్రానికి రెడ్డి మణి చైర్మన్లుగా ఉన్నారు. వీరందరూ ఇంకా పదవుల్లో కొనసాగుతూనే ఉన్నారు. -
ప్రభుత్వం మారినా కుర్చీలు వీడని టీడీపీ నేతలు
సాక్షి, దెందులూరు : వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పడి మూడు వారాలు దాటినా నామినేటెడ్ పదవులను టీడీపీ నేతలు వదలటం లేదు. ఎన్నికల ముందు ప్రతిపక్షం హోదా కూడా దక్కదు.. వైఎస్సార్సీపీకి పుట్టగతులుండవు.. మళ్లీ వచ్చేది టీడీపీ ప్రభుత్వమే అంటూ బీరాలు పలికి పందేలు కట్టి భుజాలు దాకా చేతులు కాల్చుకున్న వారు ఏం మాట్లాడాలో ఎప్పుడు మాట్లాడాలో, ఎవరితో మాట్లాడాలో అసలు ఏం చేయాలో తెలియక నానాటికీ నైతిక స్థైర్యాన్ని కోల్పోతున్నారు. ఒక వైపు స్థానిక సంస్థల ఎన్నికలు ముంచుకొస్తున్నాయి.. మరోవైపు తమగోడు చెప్పుకుందామంటే బూతద్దం పెట్టి వెతికినా చెప్పుకోవడానికి ఏ ఒక్క నాయకుడు గెలవలేదు. ఈ దశాబ్ధపు యోధుడు, ప్రజా నేత, వైఎస్ జగన్మోహన్రెడ్డి 3,648 కిలోమీటర్ల పాదయాత్ర, నవరత్న పథకాల రూపకల్పన ముందు గాలిలో సునామీ మాదిరిగా చాలెంజ్‌లు విసిరిన టీడీపీ నేతలంతా ఘోర ఓటమిని చవిచూశారు. అయితే దెందులూరు నియోజకవర్గంలో ఏఎంసీ చైర్మన్ పదవి కాలం ముగిసింది. ఏఎంసీ డైరెక్టర్లు, పాఠశాలల ఎస్ఎంసీ కమిటీలు, వైద్యశాలల అభివృద్ధి కమిటీలు, నీటి సంఘాలు, దేవదాయ శాఖ దేవాలయాల అధ్యక్షులు, కమిటీ సభ్యులతో పాటు ఇతర నామినేటెడ్ పదవులను గత టీడీపీ ప్రభుత్వ హయాంలో నియమితులైన టీడీపీ నేతలు నేటికీ ఆ పదవుల కుర్చీలను వదలటం లేదు. రాజ్యాంగ నిబంధనల ప్రకారం ప్రభుత్వం మారిన వెంటనే ఆ ప్రభుత్వ హయంలో నామినేటెడ్ పోస్టులన్నీ ముందస్తుగా స్వచ్ఛందంగా పదవుల్లో నియమితులైన నేతలు రాజీనామా చేయటం సంప్రదాయం. గతంలో ఏ ప్రభుత్వ శాఖకు అయినా అపవాదు లభిస్తే ఆ శాఖా మంత్రులు రాజీనామా చేసిన సంఘటనలు కోకొల్లలు. ఇందుకు భిన్నంగా సంప్రదాయాలు, ఆదర్శాలు, సంస్కృతిని అవహేళన చేస్తూ టీడీపీ నాయకులు కుర్చీలను పట్టుకు వేళాడుతున్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వాన్ని, పార్టీ నాయకులను చులకనగా, హేళనగా, అగౌరవంగా మాట్లాడిన టీడీపీ నాయకులు, కార్యకర్తలు నేడు వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఎలా కొనసాగుతారని గ్రామగ్రామాన ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తూ ప్రశ్నిస్తున్నారు. ఒకవైపు టీడీపీ ప్రభుత్వం ఘోర ఓటమి పాలవటంతో నేటికీ షాక్ నుంచి తేరుకోని ద్వితీయ, తృతీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలకు టీడీపీ రాజ్యసభ సభ్యులు కొందరు బీజేపీలోకి చేరడంతో మూలిగే నక్కపై తాటికాయ పడ్డ చందాన ఉంది. ఎంపీలే భవిష్యత్తు కోసం దారి వెతుక్కుంటుంటే గ్రామ శివారు ప్రాంతాల్లో ఐదేళ్లపాటు ఒంటరిగా ఏ అండా లేకుండా ఎలా ఈదుతామన్న బలమైన వాదన ద్వితీయ, తృతీయ శ్రేణి నాయకులతో పాటు కార్యకర్తలందరిలో స్పష్టంగా ఉంది. పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందు ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, మంత్రులు, ఇతర పార్టీల్లో చేరితో టీడీపీ మొత్తం ఖాళీ అవటం ఖాయమని ఆ పార్టీ నాయకులే బహిరంగంగా వ్యాఖ్యానించటం గమనార్హం. తమ ప్రభుత్వంలో సైతం నామినేటెడ్ పదవుల్లో ఉన్న టీడీపీ నేతలు ఇంకా రాజీనామా చేయకపోవడం పట్ల వైసీపీ శ్రేణులు మండిపడుతున్నారు. -
కుర్చీలు వీడరేం..
ఏలూరు (తూర్పు గోదావరి) : తొమ్మిదేళ్ల పాటు అధికారానికి దూరంగా ఉండడం వల్లనో ఏమో టీడీపీ నాయకులు ఎక్కిన కుర్చీలను వదిలే పరిస్థితి కనిపించడం లేదు. 2014లో అధికారంలోకి వచ్చిన నాటి నుంచి తెలుగుదేశం ప్రభుత్వం తమ పార్టీకి సేవ చేసిన వారికి పలు నామినేటెడ్ పదవులు కట్టబెట్టింది. దానిలో భాగంగా జిల్లాకు చెందిన పలువురు నాయకులు రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో నామినేటెడ్ పదవులు పొంది వాటిలో కొనసాగుతున్నారు. అయితే చాలాకాలం అధికారంలో లేకపోవడంతో వచ్చిన ఒక్క అవకాశాన్ని ఒదులుకోలేకపోతున్నారని పలువురు చర్చించుకుంటున్నారు. నామినేటెడ్ పదవులు పొందిన వారు వీరే.. జిల్లాకు చెందిన పలువురు టీడీపీ నాయకులు రాష్ట్ర స్థాయితో పాటు జిల్లాస్థాయిలో నామినేటెడ్ పదవులు పొందారు. వారిలో రాష్ట్ర హస్తకళాభివృద్ధి సంస్థ చైర్మన్ పాలి ప్రసాద్, రాష్ట్ర చేనేత కార్పొరేషన్ చైర్మన్ వావిలాల సరళాదేవి, రాష్ట్ర చలనచిత్ర, టీవీ, నాటకరంగ అభివృద్ధి సంస్థ చైర్మన్ అంబికా కృష్ణ, రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు డాక్టర్ రాజ్యలక్ష్మి, బ్రాహ్మణ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ చైర్మన్ ఎంబీఎస్ శర్మ, ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ కారెం శివాజీ, ఆర్టీసీ విజయవాడ జోన్ చైర్మన్ మెంటే పార్థసారథి రాష్ట్రస్థాయి పదవుల్లో కొనసాగుతున్నారు. జిల్లా స్థాయిలోనూ అదే తీరు. జిల్లా స్థాయిలో కూడా టీడీపీ తనను నమ్ముకున్న వారికి అనేక నామినేటెడ్ పదవులు కట్టబెట్టింది. ముఖ్యంగా జిల్లా సహకార బ్యాంక్ చైర్మన్ ముత్యాల వెంకటేశ్వరరావు, జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ అధ్యక్షుడు భూపతిరాజు రవి వర్మలకు పదవీ కాలం ఏడాదిన్నర క్రితమే ముగిసిపోయినా ప్రభుత్వ ప్రత్యేక జీఓతో వారు ఇంకా ఆ పదవుల్లోనే కొనసాగుతున్నారు. వారితో పాటు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ జయ్యవరపు శ్రీరామమూర్తి, జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ చైర్మన్ పాకలపాటి గాంధీ, ఏలూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ ఉప్పాల జగదీష్బాబులతో పాటు మెరగాని నారాయణమ్మ, గంగిరెడ్ల మేఘలాదేవి, అత్యం నాగమణి, కర్రా రాజారావు తదితరులు వివిధ పదవుల్లో కొనసాగుతున్నారు. ఇవి కాక జిల్లాలోని వివిధ 6ఏ దేవాలయాల (రూ. కోటి పైన వార్షిక ఆదాయం వచ్చే ఆలయాలు) ట్రస్ట్ బోర్డులు, ఇతర ఆలయాల ట్రస్ట్ బోర్డులు, ఏఎంసీ చైర్మన్ పదవులు, ఆసుపత్రి అభివృద్ధి కమిటీలు సైతం తమ పదవిని విడిచిపెట్టలేకపోతున్నారు. తీరని పదవీకాంక్ష సాదారణంగా రాష్ట్రంలో ప్రభుత్వంలో ఉన్న పార్టీ నుంచి నామినేటెడ్ పదవులు పొందిన నాయకులు తమ పార్టీ ఎన్నికల్లో ఓడిపోతే నైతిక బాధ్యత వహించి తమకు కట్టబెట్టిన పదవులకు రాజీనామా చేయడం చూస్తాం. కానీ జిల్లాలో టీడీపీ నాయకులకు మాత్రం అటువంటి నైతిక బాధ్యతగాని, రాజ్యాంగం పట్ల గౌరవం గాని ఉన్నట్లు కనిపించడం లేదు. రాష్ట్రస్థాయి పదవి పొందిన ఒక్క అంబికా కృష్ణ మినహా ఇతర జిల్లాస్థాయి, ఏఎంసీ, వివిధ అభివృద్ధి కమిటీల ప్రతినిధులు మినహా మిగిలిన నాయకులు మాత్రం ఇప్పటికీ తమ పార్టీయే అధికారంలో ఉందనే భ్రమలో కొనసాగుతున్నట్లు ఉన్నారంటున్నారు. ప్రభుత్వం మారి ఇన్ని రోజులైనా వారు తమ పదవీ కాంక్షతో కుర్చీలు వదిలిపెట్టడానికి సిద్ధంగా లేరని అర్థమౌతోంది. దీనిపై పలువురు ముక్కుపై వేలేసుకుంటున్నారు. పార్టీ ఓడిపోయినా తమ పదవులను మాత్రం పదిలంగా చూసుకోవడం చూస్తుంటే పదవులపై వారి పాకులాటకు నిదర్శనంగా కనిపిస్తోందంటున్నారు. ఇప్పటికే ప్రభుత్వం ఇటువంటి నామినేటెడ్ పదవులను రద్దు చేస్తూ ఆర్డినెన్స్ జారీ చేస్తామని ప్రకటించినా వారిలో చలనం లేకపోవడం వారి విజ్ఞతేనా అంటున్నారు. ఆర్డినెన్స్ జారీ చేసి పదవుల నుంచి గెంటేసే వరకూ తెచ్చుకుంటారా అని వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. -
‘ఆ పదవి పాముల పుట్ట వంటిది.. అందుకే’
సాక్షి, అమరావతి : వక్ఫ్ బోర్డు చైర్మన్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు మాజీ ఎమ్మెల్యే జలీల్‌ఖాన్ తెలిపారు. శనివారమిక్కడ ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన వైఎస్ జగన్మోహన్రెడ్డికి జలీల్‌ఖాన్ అభినందనలు తెలిపారు. తన రాజీనామా నేపథ్యంలో వక్ఫ్ బోర్డు చైర్మన్ పదవి అనేది పాముల పుట్టవంటిదని పేర్కొన్నారు. తమ నియోజకవర్గంలో టీడీపీ గట్టి పోటీ ఇచ్చిందని.. నువ్వా నేనా అన్నట్లుగా ఓట్లు వచ్చాయని వ్యాఖ్యానించారు. ఇతరుల వల్ల కొంత నష్టం జరిగిందని.. ఓడిపోయినా ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామని తెలిపారు. ఎన్నికలు మొత్తం కులరాజకీయాల మీద నడిచాయని పేర్కొన్నారు. కాగా గత ఎన్నికల్లో విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ టికెట్‌పై గెలిచిన జలీల్‌ఖాన్ ఆ తర్వాత టీడీపీలోకి ఫిరాయించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయనపై స్థానికంగా వ్యతిరేకత రావడంతో.. టీడీపీ అధినేత చంద్రబాబు.. ఈసారి జలీల్‌ఖాన్ కుమార్తెకు టికెట్ ఇచ్చారు. కానీ రాష్ట్రవ్యాప్తంగా జోరుగా ఫ్యాను హవా వీచిన నేపథ్యంలో ఆమె ఓటమి పాలయ్యారు. నామినేటెడ్ పదవుల రాజీనామా పర్వం రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైన నేపథ్యంలో జలీల్‌ఖాన్‌తో పాటు మరికొంత మంది టీడీపీ నాయకులు కూడా నామినేటెడ్ పదవులకు రాజీనామా చేస్తున్నారు. ఇందులో భాగంగా జమ్మలమడుగు ఏరియా ఆస్పత్రికి చైర్మన్‌గా ఉన్న మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి తనయుడు సుధీర్‌రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. అదే విధంగా టీవీ, నాటక రంగ అభివృద్ధి సంస్థ చైర్మన్ పదవి నుంచి అంబికా కృష్ణ వైదొలిగారు. ఇక ఇప్పటికే దుర్గ గుడి పాలక మండలి చైర్మన్ సభ్యులు రాజీనామా సమర్పించగా.. ఎస్వీబీసీ ఛానెల్లో పోస్టు దక్కించుకున్న రాఘవేంద్రరావు కూడా రాజీనామా చేశారు. అదే విధంగా.. ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ కార్పోరేషన్ చైర్మన్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు వేమూరి ఆనంద్ సూర్య తెలిపారు. -
ఉన్నత పదవుల్లో ఇండో అమెరికన్లు
వాషింగ్టన్: ముగ్గురు భారతీయ అమెరికన్లను కీలక పరిపాలనా స్థానాల్లో నియమించేందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నామినేట్ చేశారు. ప్రస్తుతం గేట్‌వే ఫర్ యాక్సెలరేటెడ్ ఇన్నోవేషన్ ఇన్ న్యూక్లియర్ (గెయిన్) డైరెక్టర్‌గా ఉన్న రీటా బరన్వాల్ను ఇంధన శాఖ (అణు ఇంధన) అసిస్టెంట్ సెక్రటరీగా, న్యాయవాద అధ్యాపకుడిగా ఉన్న ఆదిత్య బమ్జాయ్‌ని ప్రైవసీ అండ్ సివిల్ లిబర్టీస్ ఓవర్‌సైట్ బోర్డు సభ్యుడిగా, ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఓవర్‌సైట్ కౌన్సిల్లో డెప్యూటీ అసిస్టెంట్ సెక్రటరీగా ఉన్న బిమల్ పటేల్‌ను ట్రెజరీ అసిస్టెంట్ సెక్రటరీగా నియమించేందుకు ట్రంప్ ప్రతిపాదించారు. ఈ విషయాన్ని ట్రంప్ ముందుగానే ప్రకటించినప్పటికీ, నామినేషన్లను బుధవారమే శ్వేతసౌధం నుంచి సెనెట్‌కు పంపారు. ఇప్పటికవరకు మొత్తంగా ట్రంప్ 35 మందికి పైగా భారతీయ అమెరికన్లను కీలక స్థానాల్లో నియమించారు. బరన్వాల్ కొత్త బాధ్యతల్లో భాగంగా అణు ఇంధన కార్యాలయ పాలనా వ్యవహారాలతో పాటు, అణు సాంకేతికత పరిశోధన, అభివృద్ధి విభాగం, మౌలిక సదుపాయాల విభాగ యాజమాన్య బాధ్యతలు కూడా చూడాల్సి వుంటుంది. టెక్నాలజీ డెవలప్మెంట్ అండ్ అప్లికేషన్ డైరెక్టర్‌గా, మెటీరియల్స్ టెక్నాలజీ మేనేజర్‌గా బాధ్యతలు నిర్వహించిన ఆమె.. అమెరికా నౌకాదళ రియాక్టర్లకు అవసరమైన అణు ఇంధన మెటీరియల్‌పై పరిశోధన జరిపారు. ఇక యేల్ విశ్వవిద్యాలయంలో ఉన్నత విద్య అభ్యసించిన ఆదిత్యకు సివిల్ ప్రొసీజర్, పాలనాపరమైన శాసనాలు, ఫెడరల్ కోర్టులు, జాతీయ భద్రతా చట్టం, కంప్యూటర్ సంబంధిత నేరాలపై బోధన జరిపిన, రచనలు చేసిన అనుభవముంది. యూఎస్ సుప్రీంకోర్టు జస్టిస్ అంటోనిన్ స్కలియా వద్ద, అప్పీల్స్ కోర్టు (ఆరవ సర్క్యూట్) జడ్జి జెఫ్రీ వద్ద లా క్లర్క్‌గా విధులు నిర్వర్తించారు. అమెరికా న్యాయశాఖలో అటార్నీ అడ్వయిజర్‌గా, ప్రైవేటు రంగంలో అప్పిలేట్ అటార్నీగా కూడా పని చేశారు. మూడో వ్యక్తి బిమల్ పటేల్ ప్రస్తుతం ఆర్థిక స్థిరత్వ వ్యవహారాల పర్యవేక్షణ మండలికి సంబంధించిన ట్రెజరీలో డిప్యూటీ అసిస్టెంటీ సెక్రటరీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఆర్థిక వ్యవహారాల్లో పలు సంస్థలకు సలహాలిచ్చిన అనుభవముంది. తొలి దక్షిణాసియా వ్యక్తి డెమోక్రటిక్ పార్టీకి చెందిన భారతీయ అమెరికన్ చట్టసభ్యుడు రాజా కృష్ణమూర్తికి నిఘాపై ఏర్పాటైన కాంగ్రెషనల్ కమిటీలో చోటు దక్కింది. ఈ ఘనత సొంతం చేసుకున్న తొలి దక్షిణాసియా వ్యక్తి ఈయనే. అమెరికా జాతీయ భద్రతను పటిష్టం చేయడం ఈ కమిటీ బాధ్యత. కృష్ణమూర్తి (45) ప్రస్తుతం ఇల్లినాయిస్ 8వ కాంగ్రెషనల్ జిల్లాకు ప్రతినిధుల సభలో ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కృష్ణమూర్తిని కమిటీలో సభ్యుడిగా నియమిస్తున్నట్లు సభాపతి న్యాన్సీ పెలోసీ బుధవారం ప్రకటించారు. కృష్ణమూర్తి ఢిల్లీలో ఓ తమిళ కుటుంబంలో జన్మించారు. ఆయనకు మూడు మాసాల వయసున్నప్పుడే ఆయన కుటుంబం న్యూయార్క్‌లోని బఫెలో స్థిరపడింది. -
‘నామినేట్’ నాకే..!
టీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలో పగ్గాలు చేపట్టింది. ఇక నామినేటెడ్ పదవుల పందేరం మొదలైంది. ఉమ్మడి జిల్లాలో ఖాళీగా ఉన్న వ్యవసాయ మార్కెట్ కమిటీలు, దేవాలయాల పాలక మండళ్లు, రాష్ట్రస్థాయి కార్పొరేషన్ చైర్మన్ పదవులను దక్కించుకునేందుకు పోటీ పెరిగింది. నామినేటెడ్ పదవుల భర్తీ అంశం మళ్లీ తెరపైకి రావడంతో అవకాశం ఎవరికి లభిస్తుందోననేది పార్టీ శ్రేణుల్లో ఉత్కంఠ రేపుతోంది. గత ప్రభుత్వ హయాంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నలుగురు కార్పొరేషన్ చైర్మన్లు పనిచేయగా.. ఈసారి అటువంటి పదవులు ఎంత మందికి వరిస్తాయి.. పార్టీ ఏ రూపంలో అవకాశం కల్పిస్తుందనేది చర్చనీయాంశంగా మారింది. సాక్షిప్రతినిధి, ఖమ్మం: రాష్ట్రంలో నామినేటెడ్ పదవులను దక్కించుకునేందుకు టీఆర్ఎస్ నాయకులు ఎవరి ప్రయత్నాల్లో వారు నిమగ్నమయ్యారు. తమకు పార్టీలో పరిచయం ఉన్న రాష్ట్రస్థాయి నేతలను కలుస్తూ తమ పేరును పరిశీలించాలని కోరుతున్నారు. టీఆర్ఎస్ పార్టీలో విద్యార్థి ఉద్యమ నేతగా ఉన్న పిడమర్తి రవిని టీఆర్ఎస్ తొలిసారిగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన వెంటనే రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్‌గా నియమించింది. తర్వాత ఆయన పదవీ కాలాన్ని ప్రభుత్వం పొడిగించింది. ఇటీవల సత్తుపల్లి నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేసే సమయంలో చైర్మన్ పదవికి ఆయన రాజీనామా చేశారు. ఆయన ఓడిపోవడంతో పార్టీ ఏ రూపంలో ఆయనకు అవకాశం కల్పిస్తుందనేది చర్చనీయాంశంగా మారింది. రాష్ట్ర గిరిజనాభివృద్ధి సంస్థ చైర్మన్‌గా పనిచేసి.. ఇటీవల అశ్వారావుపేట టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీచేసే సమయంలో తన పదవికి రాజీనామా చేసిన తాటి వెంకటేశ్వర్లు సైతం అశ్వారావుపేట నుంచి ఓటమి చెందారు. రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్‌గా గత ప్రభుత్వం కొండబాల కోటేశ్వరరావును నియమించగా.. రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధి సంస్థ చైర్మన్‌గా అప్పటి పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న బుడాన్ బేగ్‌ను నియమించింది. అసెంబ్లీ ఎన్నికలకు కొద్ది రోజుల ముందు బేగ్ టీడీపీ తీర్థం పుచ్చుకోవడంతో జిల్లాకు చెందిన మైనార్టీలకు కార్పొరేషన్ పదవుల్లో అవకాశం లభిస్తుందనే ప్రచారం జరుగుతోంది. రాష్ట్రస్థాయి కార్పొరేషన్ చైర్మన్‌గా పనిచేసి.. ప్రస్తుతం పార్టీలో ఉన్న ముగ్గురిలో ఎంత మందికి మళ్లీ అవకాశం దక్కుతుందనే అంశం ఇప్పుడు పార్టీలో చర్చనీయాంశంగా మారింది. వీటితోపాటు కొద్దికాలంగా ద్వితీయ శ్రేణి నేతలను ఊరిస్తున్న నామినేటెడ్ పదవులపై నియోజకవర్గాల ద్వితీయ శ్రేణి నేతలు దృష్టి సారించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో పార్టీ జెండా మోసిన నాయకులకు ఈసారైనా గుర్తింపు ఇవ్వాలనే డిమాండ్‌తో తెలంగాణ ఉద్యమకారులు నామినేటెడ్ పదవులపై దృష్టి పెట్టి పార్టీలో.. ప్రభుత్వంలో తమకున్న పరిచయాల ద్వారా ప్రయత్నాలు చేస్తున్నారు. మార్కెట్ కమిటీలు.. ఇక ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అనేక వ్యవసాయ మార్కెట్ కమిటీల పదవీ కాలం ఇప్పటికే ముగిసింది. మరికొన్నింటి పదవీ కాలం 2019 ఫిబ్రవరిలో ముగియనుంది. గత ఏడాది అక్టోబర్‌లో ఉమ్మడి జిల్లాలో అత్యంత పెద్ద మార్కెట్‌గా ఉన్న ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కమిటీ పదవీ కాలం పూర్తయింది. చైర్మన్‌గా ఆర్జేసీ కృష్ణ వ్యవహరించారు. ఆ తర్వాత మార్కెట్ కమిటీ పాలక వర్గాన్ని ప్రభుత్వం భర్తీ చేయలేదు. ఈలోపు ఎన్నికలు రావడం.. ఖమ్మంలో టీఆర్ఎస్ విజయం సాధించడంతో ఈ పదవిపై ద్వితీయ శ్రేణి నేతల్లో మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయి. మార్కెట్ చైర్మన్ పదవి కోసం అనేక మంది తమవంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్ ఆశీస్సులున్న వారికి ఈ పదవి లభిస్తుందనే ప్రచారం జరుగుతుండడంతో తాము పార్టీకి చేసిన సేవలను వివరించడంతోపాటు ఉద్యమ సమయంలో పార్టీకి అండగా ఉన్న తీరు ను వివరించడం ద్వారా నామినేటెడ్ పదవుల్లో అవకాశం కల్పించాలని కోరుతున్నారు. అలాగే ఉమ్మడి జిల్లాలోని ఇల్లెందు, కొత్తగూడెం, బూర్గంపాడు, దమ్మపేట వ్యవసాయ మార్కెట్ కమిటీల పదవీ కాలం ఇప్పటికే పూర్తయింది. వీటికి కొత్త పాలక వర్గాలను ప్రభుత్వం నియమించాల్సి ఉండడంతో.. ఆయా మార్కెట్ కమిటీ చైర్మన్ పదవులను ఆశిస్తున్న నేతలు తమవంతు ప్రయత్నాలను ముమ్మరం చేశారు. భద్రాచలం, చర్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలక వర్గాల పదవీ కాలం మాత్రం వచ్చే ఫిబ్రవరి వరకు ఉంది. భద్రాచలం ట్రస్ట్ బోర్డు పదవికి ప్రయత్నాలు.. ఇక ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అత్యంత కీలకంగా భావించే.. దక్షిణ అయోధ్యగా పేరున్న భద్రాచలం ట్రస్ట్ బోర్డును ప్రభుత్వం సుదీర్ఘకాలంగా నియమించకపోవడం.. మరో నాలుగు నెలల్లో శ్రీరామనవమి ఉండడంతో తక్షణమే ప్రభుత్వం బోర్డును ఏర్పాటు చేస్తుందనే ఆశాభావంతో పలువురు కీలక నేతలు ఆ పదవి కోసం తమవంతు ప్రయత్నాలను ప్రారంభించారు. 2014లో అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పటివరకు భద్రాచలం ట్రస్ట్ బోర్డును నియమించలేదు. ఈ పదవి కోసం పలువురు రాష్ట్రస్థాయి నేతలు సైతం ప్రయత్నం చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇక పలు దేవాలయాల పాలక మండళ్ల పదవీ కాలం పూర్తి కావడంతో ఈ ఏడాది సెప్టెంబర్‌లో కొన్ని పాలక మండళ్లను పొడిగించారు. మరికొన్ని ఆలయాలకు కొత్త పాలక మండళ్లను నియమించారు. ఇంకా జిల్లాలో పలు దేవస్థానాల పాలక మండళ్లను నియమించాల్సి ఉండడంతో వీటిపై పార్టీ నేతలు దృష్టి సారించారు. ఇవి కాకుండా.. డీఆర్డీఏ, ఆర్టీఏ, సివిల్ సప్లై వంటి సంస్థల్లో పలువురు పార్టీ నేతలను సభ్యులుగా ప్రభుత్వం గతంలో నియమించింది. అయితే వారి పదవీ కాలం పూర్తయ్యేంత వరకు కొనసాగిస్తారా? మళ్లీ కొత్త సభ్యులను నియమిస్తారా? అనేది తేలాల్సి ఉంది. వీటితోపాటు గత ప్రభుత్వ హయాంలో నాలుగు కార్పొరేషన్ పదవులు ఉమ్మడి ఖమ్మం జిల్లాను వరించినా.. రాష్ట్రస్థాయి డైరెక్టర్ పదవులు మాత్రం జిల్లావాసులకు పెద్దగా దక్కలేదు. ఈసారి పలువురు నేతలు రాష్ట్రస్థాయి డైరెక్టర్లుగా అవకాశం కల్పించాలని కోరుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇక ఖమ్మం నగర పాలక అభివృద్ధి సంస్థ(స్తంభాద్రి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ) సుడాను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఏడాది క్రితం ఉత్తర్వులు జారీ చేసింది. దీనికి కమిటీని నియమించాల్సి ఉంది. సుడా చైర్మన్ పదవి కోసం పలువురు నేతలు తీవ్రస్థాయిలో ప్రయత్నాలు చేస్తుండడంతో ఈ పదవి ఎవరిని వరిస్తుందనే అంశం చర్చనీయాంశంగా మారింది. -
అశోక్‌బాబుపై ఉద్యోగుల ఆగ్రహం
సాక్షి, అమరావతి: ‘‘ప్రభుత్వ ఉద్యోగులు, కాంట్రాక్టు ఉద్యోగులు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారు. వాటి పరిష్కారంపై దృష్టి పెట్టకుండా, ప్రభుత్వాన్ని ప్రశ్నించకుండా మీరు రాజకీయంగా ఎదగాలనుకుంటున్నారు. మీరు సభలు నిర్వహిస్తే మేము రావాలా? మీ ఎదుగుదల కోసం మమ్మల్ని వాడుకుంటారా?’’ అని ఏపీ ఎన్జీవో సంఘం అధ్యక్షుడు అశోక్‌బాబుపై ప్రభుత్వ ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 23వ తేదీన గుంటూరులో సభ నిర్వహించాలని అశోక్‌బాబు నిర్ణయించిన సంగతి తెలిసిందే. ప్రభుత్వంలో నామినేటెడ్ పదవి కోసమే ఆయన ఈ సభ తలపెట్టారని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. నాలుగున్నరేళ్లుగా ఉద్యోగుల సమస్యలను పరిష్కరించకుండా ముఖ్యమంత్రికి వంతపాడిన ఆయన ఇప్పుడు గుంటూరులో సభ పేరుతో డ్రామాలు ఆడుతున్నారని తీవ్రంగా విమర్శిస్తున్నారు. రాజకీయాల్లో దిగేందుకే తమను వాడుకుంటున్నారని మండిపడుతున్నారు. టీడీపీ ప్రభుత్వానికి, అశోక్‌బాబుకు మధ్య ఉన్న సన్నిహిత సంబంధాల గురించి అందరికీ తెలుసని అంటున్నారు. ఏం చేశారని మీ వెంట రావాలి? ఏపీ ఎన్జీవో సంఘం అధ్యక్షుడు అశోక్‌బాబుకు పలువురు ఉద్యోగులు లేఖాస్త్రాలు సంధించారు. తమ సంక్షేమం కోసం ఇప్పటిదాకా మీరేం చేశారని మీ వెంట నడవాలని అశోక్‌బాబును నిలదీశారు. లేఖల్లోని కీలక అంశాలవీ... ⇒ మీరు(అశోక్‌బాబు) మీ అవసరాల కోసం ఎన్నోసార్లు ముఖ్యమంత్రిని కలిశారు. ఒక్కసారైనా కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ గురించి మాట్లాడారా? ⇒ జీవో నెం.27ను విడుదల చేసి కాంట్రాక్టు ఉద్యోగుల హక్కులను ప్రభుత్వం కాలరాస్తుంటే.. ఆ జీవోను మీరు సమర్థించినందుకు మీ వెంట రావాలా? ⇒ కాంట్రాక్టు సిబ్బంది క్రమబద్ధీకరణ కోసం ఒక్కసారైనా మంత్రివర్గ ఉపసంఘాన్ని కలిశారా? ⇒ సీపీఎస్ రద్దు గురించి ఏరోజైనా మీరు ముఖ్యమంత్రితో మాట్లాడిన సందర్భాలున్నాయా? ⇒ సీపీఎస్ కోసం కమిటీ వేసి కాలయాపన చేయండని ముఖ్యమంత్రికి చెప్పిన మాట వాస్తవం కాదా? ⇒ జీవో నెం.27తో లబ్ధి పొందిన అతికొద్ది మందితో మీరు సన్మానాలు చేయించుకోవడం నిజం కాదా? ⇒ ప్రభుత్వ ఉద్యోగులకు 15వ పీఆర్సీ జాప్యం జరిగితే మధ్యంతర భృతి గురించి ఒక్కమాటైనా అడిగారా? అశోక్‌బాబును విశ్వసించడం లేదు ‘‘ప్రభుత్వ ఉద్యోగులెవరూ అశోక్‌బాబును విశ్వసించడం లేదు. ఆయన వెంట నడిచేవారు ఎవరూ లేరు. సీపీఎస్‌పై పూటకోమాట మాట్లాడుతున్నారు. నూతన పెన్షన్ విధానం రద్దు అనేది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనే ఉంటుంది. ప్రభుత్వం ఇచ్చిన 653, 654, 655 జీవోలను రద్దు చేస్తే చాలు. అసెంబ్లీ తీర్మానం కూడా అవసరం లేదు’’ – పాలేల రామాంజనేయులు యాదవ్, అధ్యక్షులు, ఏపీ సీపీఎస్ ఎంప్లాయీస్ అసోషియేషన్ కాంట్రాక్టు ఉద్యోగులు ఇప్పుడే గుర్తొచ్చారా? ‘‘నాలుగున్నరేళ్లుగా కాంట్రాక్టు ఉద్యోగుల సమస్యల గురించి ఒక్కసారి కూడా మాట్లాడని అశోక్‌బాబు ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో సభలు నిర్వహించి, ఉద్యోగులను రమ్మని చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. నాలుగున్నరేళ్లుగా ఆయనకు కాంట్రాక్టు ఉద్యోగుల సమస్యలు, వారి పోరాటాలు కనిపించలేదా? ఇప్పుడే గుర్తొచ్చాయా? – ఏవీ శేషయ్య, కాంట్రాక్టు ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు, నెల్లూరు -
బీసీలకు మూడో వంతు నామినేటెడ్ పోస్టులేవీ?
సాక్షి, అమరావతి: బీసీలకు 1/3 వంతు నామినేటెడ్ పోస్టులు ఇస్తామని చెప్పిన చంద్రబాబు.. అధికారంలోకి వచ్చాక ఆ విషయాన్ని పూర్తిగా విస్మరించారని వైఎస్సార్ సీపీ బీసీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జంగా కృష్ణమూర్తి విమర్శించారు. శుక్రవారం విజయవాడలోని ఐవీ ప్యాలెస్‌లో విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ బీసీ కులాల అధ్యయన కమిటీ సమావేశం జరిగింది. సమావేశం అనంతరం జంగా విలేకరులతో మాట్లాడుతూ... టీడీపీ ప్రభుత్వ పాలనలో అన్ని వర్గాల ప్రజలూ బాధలు పడుతున్నారన్నారు. ముఖ్యంగా బీసీలను టీడీపీ వాడుకుని వదిలేసిందని విమర్శించారు. చంద్రబాబు సర్కారు విద్యా విధానాన్ని సర్వనాశనం చేసిందన్నారు. సంక్షేమ హాస్టళ్లను మూసివేసిందని ధ్వజమెత్తారు. వైఎస్సార్ ఫీజు రీయింబర్స్మెంట్ పథకం ద్వారా పేద విద్యార్థులకు ఉచితంగా ఉన్నత చదువులు అభ్యసించే అవకాశం కల్పించారని, చంద్రబాబు సర్కారు ఈ పథకానికి తూట్లు పొడుస్తోందని ధ్వజమెత్తారు. నిరుద్యోగులకు రూ.2 వేల నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి, ఇప్పుడు నాలుగున్నరేళ్ల తర్వాత కేవలం లక్షన్నర మందికి రూ.వెయ్యి ఇస్తున్నారన్నారు. బీసీల్లో సంచార జాతులు దీనావస్థలో ఉన్నాయని, వారికి కనీస సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. అధ్యయన కమిటీ దృష్టికి వచ్చిన సమస్యలపై పూర్తి స్థాయిలో అధ్యయనం చేసిన తరువాత తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డికి నివేదిక అందజేస్తామని తెలిపారు. మాజీ మంత్రి, అధ్యయన కమిటీ సభ్యులు నర్సేగౌడ్ మాట్లాడుతూ.. వైఎస్ జగన్ హామీ ప్రకారం ప్రతి కులానికి కార్పొరేషన్ ఏర్పాటు చేసి పేదవారికి సాయం చేస్తామని చెప్పారు. రిటైర్డ్ జడ్జి కృష్ణప్ప మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో బీసీలను మోసం చేసేందుకు చంద్రబాబు బీసీ అధ్యయన కమిటీ వేసినట్లు ఆరోపించారు. వైఎస్పార్ సీపీ బీసీ అధ్యయన కమిటీ సభ్యులు అవ్వారు ముసలయ్య మాట్లాడుతూ.. పార్టీలతో సంబంధం లేకుండా బీసీ కులాల వారు అధ్యయన కమిటీ వద్దకు వచ్చి సమస్యలు చెబుతున్నారన్నారు. వాటిపై అధ్యయనం చేసి నివేదిక ఇస్తామన్నారు. సమావేశంలో పార్టీ నేతలు మల్లాది విష్ణు, వెల్లంపల్లి శ్రీనివాస్, వసంత కృష్ణప్రసాద్, సామినేని ఉదయభాను, జోగి రమేష్, రక్షణ నిధి, మహమ్మద్ ఇక్బాల్, చిమటా సాంబు, బొమ్మన శ్రీనివాస్, కర్నాటి ప్రభాకర్, దుర్గారావుగౌడ్, విజిత, మహబూబ్, మీసాల రంగన్న పాల్గొన్నారు. -
ఆస్కార్ ఎంట్రీ!
ఆస్కార్ అవార్డ్స్ వేడుకకు దాదాపు ఆరు నెలల టైమ్ ఉంది. కానీ ఆ వేడుకకు సంబంధించిన కార్యక్రమాలు మాత్రం అప్పుడే మొదలైనట్లు ఉన్నాయి. ‘వాట్ విల్ పీపుల్ సే’ సినిమా 91వ అకాడమీ అవార్డ్స్ నామినేషన్ ఎంట్రీకి ఎంపికైందని వార్తలు వస్తున్నాయి. ఇరామ్ హాక్ దర్శకత్వం వహించారు. ఇందులో మారియా, అదిల్ హుస్సేన్ కీలక పాత్రలు చేశారు. ఆస్కార్ విషయాన్ని హుస్సేన్ ఫేస్బుక్ ద్వారా వెల్లడించారు. ‘‘2019 ఆస్కార్ అవార్డ్స్ నామినేషన్ ఆఫీషియల్ ఎంట్రీకి మా సినిమా ఎంపికైంది. మా సినిమా ఫారిన్ ఫిల్మ్ కేటగిరీ విభాగంలో నామినేషన్ దక్కించుకుంటుందని ఆశిస్తున్నాను. టీమ్ అందరికీ థ్యాంక్స్’’ అని పేర్కొన్నారు హుస్సేన్. 91వ ఆస్కార్ వేడుకలు 2019 ఫిబ్రవరి 24న జరగుతాయని వార్తలు వస్తున్నాయి. -
‘నామినేషన్’ దందా!
సాక్షి ప్రతినిధి, కర్నూలు: కర్నూలు నగర పాలక సంస్థ పరిధిలో అధికార పార్టీ నేతలు మరోసారి నామినేషన్ పనుల పర్వానికి తెరతీశారు. మొత్తం రూ.25 కోట్ల పనులను నామినేషన్‌పై కాజేసేందుకు పథక రచన చేశారు. ఇందుకోసం ఒక్కో పని విలువను రూ.5 లక్షలకే పరిమితం చేశారు. ఈ విధంగా మొత్తం 500 పనులను తీసుకునేందుకు రంగం సిద్ధం చేశారు. వీటిని అప్పగించేందుకు కాంట్రాక్టర్లను సైతం ముందుగానే ఎంపిక చేసుకున్నారు. వారి నుంచి ఏకంగా 20 శాతం కమీషన్ తీసుకునేందుకు ఇటు కర్నూలు, అటు పాణ్యం నియోజకవర్గ అధికార పార్టీ నేతలు నిర్ణయించుకున్నారు. ఎంపిక చేసుకున్న పనుల విషయంలోనూ అనేక విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గతంలో చేసిన పనులతో పాటు సగం పూర్తి చేసిన వాటిని ఎంపిక చేసుకుని భారీగా కమీషన్లు దండుకునేందుకు ఎత్తుగడ వేసినట్లు సమాచారం. గతంలో ఒకసారి నామినేషన్ పనుల రుచి మరిగిన అధికార పార్టీ నేతలు మరోసారి నిధులను ఆరగించేందుకు రంగం సిద్ధం చేశారు. కర్నూలు నగరంతో పాటు కల్లూరు అర్బన్ ప్రాంతంలో సీసీ రోడ్లు, మురుగుకాలువల నిర్మాణానికి మొత్తం 500 పనులను నామినేషన్‌పై తీసుకునేందుకు గుర్తించారు. వీటి అంచనాలు కూడా ఇప్పటికే తయారుచేయించిన అధికారపార్టీ నేతలు..ఉన్నతాధికారుల నుంచి అనుమతి తీసుకునేందుకు యత్నిస్తున్నారు. టెండర్లు లేకుండానే... గతంలోనూ నామినేషన్‌పై పనులు చేపట్టారు. నామినేషన్‌పై పనులు అప్పగించాలంటే ఎంతో అత్యవసరమైనవై ఉండాలని మునిసిపల్ శాఖ డైరెక్టర్ కన్నబాబు మొదట్లో కొర్రీలు వేశారు. అత్యవసరమైనవి కాకపోతే.. టెండర్ల ద్వారానే చేపట్టవచ్చు కదా అని ప్రశ్నించారు. దీంతో మొదట్లో నామినేషన్ పనులకు బ్రేకులు పడ్డాయి. అయితే, చివరకు అధికార పార్టీ నేతల ఒత్తిళ్లే పనిచేశాయి. కర్నూలు, పాణ్యంకు చెందిన నేతలు అప్పట్లో సుమారు రూ.50 కోట్ల పనులను నామినేషన్‌పై తీసుకున్నారు. ఇవన్నీ కార్యకర్తలకు ఇచ్చేందుకేనని చెప్పి తీసుకున్న అధికార పార్టీ నేతలు.. ఆచరణలో మాత్రం కమీషన్లు దండుకున్నారు. పనులను కాస్తా తిరిగి కాంట్రాక్టర్లకే అప్పగించారు. ఒక్కో కాంట్రాక్టర్ నుంచి ప్రధాన నేతలకు రూ.25 వేల నుంచి రూ.30 వేల చొప్పున కమీషన్లు అందాయి. తిరిగి ఇప్పుడు మరోసారి కార్యకర్తల పేరుపై నామినేషన్ ప్రాతిపదికన పనులు తీసుకునేందుకు కర్నూలు, పాణ్యం నియోజకవర్గాలకు చెందిన అధికార పార్టీ నేతలు పావులు కదుపుతున్నారు. రూ.5 కోట్ల కమీషన్లు! కర్నూలు కార్పొరేషన్లో ఏ టెండర్లు పిలిచినా గతంలో 15 శాతం వరకూ తక్కువ ధరకే వేసేవారు. అయితే, అధికార పార్టీ నేత రంగంలోకి దిగిన తర్వాత ప్రతి టెండరు తనకు మాత్రమే దక్కేలా చేసుకోవడంతో పాటు రింగుకు పాల్పడుతున్నారు. ఫలితంగా ఒక్కో టెండరు 5 నుంచి 10 శాతం వరకూ అధిక ధరకు వేసే పరిస్థితి ఏర్పడింది. దీనివల్ల కార్పొరేషన్ ఖజానాకు గండి పడుతోంది. ఇప్పుడు నామినేషన్లపై తీసుకునే పనులకు కూడా టెండర్లను పిలిస్తే 15 శాతం వరకూ తక్కువ ధరకే చేపట్టేందుకు కాంట్రాక్టర్లు ముందుకొచ్చే అవకాశం ఉంది. అయితే, అధికార పార్టీ నేతల పేరుతో తీసుకోనుండడంతో అంచనా ధరకే పనులను అప్పగించనున్నారు. అది కూడా ఎంపిక చేసిన వారికి నామినేషన్‌పై మాత్రమే. ఇక్కడ ఇంజినీర్లతో ముందుగానే కుమ్మక్కై చేసిన పనులకే తిరిగి అంచనాలు వేయించడంతో పాటు అధికంగా కూడా వేయించి భారీగా దండుకోనున్నారు. మొత్తం 500 పనులకు గానూ ఒక్కో పని అంచనా విలువ రూ.5 లక్షలుగా నిర్ణయించిన నేపథ్యంలో మొత్తం రూ.25 కోట్ల పనుల్లో 20 శాతం కమీషన్ అంటే రూ.5 కోట్ల మేర దండుకునేందుకు ఇద్దరు అధికార పార్టీ నేతలు సిద్ధమయ్యారు. -
రాజ్యసభకు నలుగురు ప్రముఖుల నామినేషన్
-
రాజ్యసభకు కొత్తగా నలుగురు
న్యూఢిల్లీ/భువనేశ్వర్: ఇటీవల ఖాళీ అయిన నాలుగు రాజ్యసభ నామినేటెడ్ స్థానాలు భర్తీ అయ్యాయి. ఆరెస్సెస్ సిద్ధాంతకర్త రాకేశ్ సిన్హా, లోక్‌సభ మాజీ సభ్యుడు రామ్ సకల్, సంప్రదాయ నృత్యకారిణి సోనాల్ మాన్సింగ్, శిల్పి రఘునాథ్ మహాపాత్రోలు రాజ్యసభకు నామినేట్ అయ్యారు. ప్రభుత్వ సలహా మేరకు రాష్ట్రపతి కోవింద్ వీరిని ఎగువ సభకు నామినేట్ చేసినట్లు ప్రధాని కార్యాలయం(పీఎంవో) ప్రకటించింది. ఇటీవలే పదవీకాలం ముగిసిన క్రీడాకారుడు సచిన్, నటి రేఖ, న్యాయవాది పరాశరణ్, సామాజిక కార్యకర్త అను ఆగాల స్థానంలో వీరిని ఎంపికచేశారు. వీరి పదవీకాలం 2024లో ముగుస్తుంది. రామ్ సకల్: యూపీలోని రాబర్ట్స్‌గంజ్ నియోజక వర్గం నుంచి 3సార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. ఎంపీగా రామ్ సకల్ దళితులు, రైతులు, కార్మికుల సంక్షేమం కోసం పోరాడారని పీఎంవో కొనియాడింది. రాకేశ్ సిన్హా: ఆరెస్సెస్ సిద్ధాంతకర్త అయిన సిన్హా ఢిల్లీ కేంద్రంగా పనిచేస్తున్న మేధో సంస్థ ‘ఇండియా పాలసీ ఫౌండేషన్’ని స్థాపించారు. ఢిల్లీ వర్సిటీ అనుబంధ కళాశాల మోతీలాల్ నెహ్రూ కాలేజ్‌లో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ సోషల్ సైన్స్ రీసెర్చ్ (ఐసీఎస్ఎస్ఆర్)లో సభ్యుడిగా కొనసాగుతున్నారు. రఘునాథ్ మహాపాత్రో: 1959 నుంచి శిల్పకళలో విశేష కృషి చేస్తూ అంతర్జాతీయంగా పేరుప్రఖ్యాతులు సంపాదించారు. పూరీజగన్నాథ ఆలయ సుందరీకరణలో పాలుపంచుకున్నారు. పార్లమెంట్ సెంట్రల్ హాల్లోని ఆరు అడుగుల సూర్య భగవానుడి రాతి శిల్పం ఈయన సృష్టే. పద్మశ్రీ, పద్మ భూషణ్ పురస్కారాలు లభించాయి. సోనాల్ మాన్సింగ్: ఆరు దశాబ్దాలుగా భరతనాట్యం, ఒడిస్సీ కళారూపాల్లో సేవలందిస్తున్నారు. వక్త, సామాజిక కార్యకర్త కూడా అయిన ఈమె పద్మ విభూషణ్ పురస్కారం పొందారు. -
రాజ్యసభకు కొత్తగా నలుగురు ప్రముఖులు
న్యూఢిల్లీ : వివిధ రంగాలకు చెందిన నలుగురు ప్రముఖులను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ శనివారం రాజ్యసభకు నామినేట్ చేశారు. రాజ్యసభకు నామినేట్ అయిన వారిలో దళిత నాయకుడు రామ్ శకల్, ప్రముఖ కాలమిస్ట్ రాకేశ్ సిన్హా, శిల్పకారుడు రఘనాథ్ మహాపాత్ర, క్లాసికల్ డ్యాన్సర్ సోనాల్ మన్సింగ్ ఉన్నారు. ప్రధానమంత్రి సూచన మేరకు సాహిత్యం, కళ, సైన్స్, సామాజిక సేవా రంగాలకు చెందిన 12 మందిని రాజ్యసభకు నామినేట్ చేసే అధికారం రాష్ట్రపతికి ఉంది. కాగా ఈ ఏడాది ఏప్రిల్‌లో నలుగురు రాజ్యసభ సభ్యుల పదవీ కాలం పూర్తయిన సంగతి తెలిసిందే. దీంతో వారి స్థానంలో కొత్తగా నలుగురు సభ్యులను కోవింద్ నామినేట్ చేశారు. 1. రామ్ శకల్ : రామ్ శకల్ ఉత్తరప్రదేశ్‌లోని రాబర్ట్‌గంజ్ నియోజకవర్గం నుంచి మూడు సార్లు పార్లమెంట్ సభ్యునిగా పనిచేశారు. రైతు నాయకుడిగా ఉన్న శకల్ రైతుల, కూలీల, వలసదారుల హక్కుల కోసం పోరాడుతున్నారు. 2. రాకేశ్ సిన్హా : ఆరెస్సెస్ భావజాలం కలిగిన సిన్హా ఇండియన్ పాలసీ పౌండేషన్‌ను స్థాపించారు. కాలమిస్ట్‌గా సిన్హా తన ప్రత్యేకతను చాటుకున్నారు. అంతేకాకుండా ఢిల్లీ యూనివర్సిటీ పరిధిలోని మోతీలాల్ నెహ్రూ కళాశాలలో ప్రొఫెసర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. రచయితగా కూడా పలు పుస్తకాలు రచించారు. 3. రఘునాథ్ మహాపాత్ర : రఘునాథ్ తన శిల్పకళతో ప్రపంచవ్యాప్త గుర్తింపుపొందారు. 1959 నుంచి ఆయన శిల్పిగా కొనసాగుతున్నారు. ఆయనకు రెండు వేల మందిపైగా శిష్యులున్నారు. శ్రీ జగన్నాథ ఆలయం సుందరీకరణ కోసం ఆయన పనిచేశారు. భారత ప్రభుత్వం రఘునాథ్‌ను 2001లో పద్మభూషణ్‌తో, 2013 పద్మ విభూషణ్‌తో సత్కరించింది. ఆయన ప్రస్తుతం ఒడిశా లలితకళ అకాడమీకి చైర్మన్‌గా ఉన్నారు. 4. సోనాల్ మన్సింగ్ : మన్సింగ్ ఆరు దశాబ్దలకు పైగా శాస్త్రీయ నృత్యంలో కొనసాగుతున్నారు. ఆమె కొరియోగ్రాఫర్‌గా, టీచర్‌గా, సంఘ సేవకురాలుగా సేవలు అందించారు. 1977లో ఢిల్లీలో సెంటర్ ఫర్ ఇండియన్ క్లాసికల్ డ్యాన్సెస్ నెలకొల్పారు. శాస్త్రీయ నృత్యంలో ఆమె సేవలకు గాను భారత ప్రభుత్వం 1992లో పద్మభూషణ్, 2003లో పద్మవిభూషణ్‌తో గౌరవించింది. మన్సింగ్ 1977లో సంగీత నాటక అకాడమీ అవార్డు కూడా సొంతం చేసుకున్నారు. -
టీడీపీలో ‘నామినేటెడ్’ లొల్లి
సాక్షి, అమరావతి : నామినేటెడ్ çపదవుల పంపకం తీరుపై అధికార తెలుగుదేశం పార్టీలో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. పైస్థాయిలో ముఖ్య నాయకులకు పదవులు కట్టబెడుతూ తమను మాత్రం పట్టించుకోవడం లేదని ద్వితీయ శ్రేణి నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పార్టీ జెండాను మోస్తున్న తమను టీడీపీ అధిష్టానం గుర్తించడం లేదని, ఎదురుచూపులతోనే నాలుగేళ్ల కాలం గడచిపోయిందని వాపోతున్నారు. టీడీపీ ప్రభుత్వ పదవీ కాలం ఇంకా సంవత్సరం మాత్రమే మిగిలి ఉంది. ఇప్పటికైనా తమకు న్యాయం చేయాలని కింది స్థాయి నాయకులు కోరుతున్నారు. నామినేటెడ్ పదవుల కేటాయింపు కోసం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన వ్యవస్థ దారుణంగా వ్యవహరిస్తోందని, పార్టీ కోసం అహర్నిశలూ కష్టపడుతున్న తమను చిన్నచూపు చూస్తున్నారని నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పదవుల కేటాయింపును పర్యవేక్షిస్తున్న ఎమ్మెల్సీ వీవీవీ చౌదరి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఇటీవల ఎక్కువయ్యాయి. సిఫార్సులున్నా పోస్టులు కష్టమే నామినేటెడ్ పదవులు కావాలంటే దరఖాస్తులు పెట్టుకోవాలని టీడీపీ అధిష్టానం కిందిస్థాయి నాయకులకు సూచించింది. దీంతో వేలాదిగా దరఖాస్తులు వచ్చాయి. అయితే, వాటిని పెద్దగా పట్టించుకోవడం లేదు. ఏ పదవికైనా స్థానిక ఎమ్మెల్యే లేదా అక్కడి టీడీపీ ఇన్‌ఛార్జి సిఫార్సు లేఖ ఇవ్వాల్సిందే.జిల్లాలోని మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీల సిఫార్సు లేఖలను కూడా తీసుకురావాలంటున్నారు. వారిలో ఎవరైనా లేఖ ఇవ్వకపోయినా, ఏదైనా అభ్యంతరం వ్యక్తం చేసినా సదరు ఆశావహుడిని పక్కన పెట్టేస్తున్నారు. నానా తిప్పలు పడి అందరి లేఖలను సంపాదించినా పదవులు వస్తాయన్న నమ్మకం లేకుండా పోయిందని నాయకులు నిరాశకు లోనవుతున్నారు. ప్రతి పదవికీ రేటు ఎమ్మెల్సీ, కార్పొరేషన్ ౖచైర్మన్లు, దేవాలయాల పాలక మండళ్ల చైర్మన్ పోస్టులను గత ఎన్నికల్లో ఓడిపోయిన నేతలతో భర్తీ చేశారు. పయ్యావుల కేశవ్, మాగుంట శ్రీనివాసులురెడ్డి, దీపక్‌రెడ్డి, బీటెక్ రవి, వాకాటి నారాయణరెడ్డి, ఇతర పార్టీల నుంచి వచ్చిన జూపూడి ప్రభాకర్, డొక్కా మాణిక్యవరప్రసాద్‌కు ఎమ్మెల్సీ పదవులు ఇచ్చారు. కార్పొరేషన్ చైర్మన్ పోస్టులను వర్ల రామయ్య, జేఆర్ పుష్పరాజ్, చల్లా రామకృష్ణారెడ్డికి కట్టబెట్టారు. కార్పొరేషన్లు, ఆలయ పాలకవర్గాల్లో డైరెక్టర్లు, సభ్యులుగా కిందిస్థాయిలో ఎమ్మెల్యేలు సిఫార్సు చేసిన వారిని నియమించారు. మార్కెట్ యార్డుల ఛైర్మన్, డైరెక్టర్ పదవులను ఎమ్మెల్యేల ఇష్ట్రపకారం భర్తీ చేశారు. నామినేటెడ్ పదవులను ముఖ్య నాయకులకు సన్నిహితులైన వారికే కట్టబెట్టారని, తమను కనీసం పరిగణనలోకి తీసుకోలేదని కింది స్థాయి నాయకులు మండిపడుతున్నారు. గతంలో వెనుకబడిన తరగతుల(బీసీ)కు ఎక్కువ పదవులు లభించేవని, ప్రస్తుతం ఒకే సామాజికవర్గానికి పదవులన్నీ అప్పగిస్తున్నారని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తమకు ఇప్పటికైనా అవకాశం ఇవ్వాలని మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్యనేతల చుట్టూ తిరుగుతున్నారు. ప్రతి పదవికీ ఒక ధర నిర్ణయించారని, పార్టీ కార్యాలయంలో ఆ మేరకు డబ్బులు చెల్లించినవారికే నామినేటెడ్ పోస్టులు దక్కుతున్నాయని నాయకులు ఆరోపిస్తున్నారు. -
రాజ్యసభకు కపిల్‌దేవ్, మాధురీ!
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: రాజ్యసభలో నామినేటెడ్ సభ్యుల ఖాళీలను భర్తీ చేసే దిశగా కేంద్రం ప్రయత్నాలు ప్రారంభించింది. క్రికెటర్ సచిన్ టెండూల్కర్, సినీ నటి రేఖ, పారిశ్రామికవేత్త అను ఆఘా ఇటీవలే రిటైర్ అయ్యారు. సీనియర్ లాయర్ కే పరాశరన్ నేడు(శుక్రవారం) రాజ్యసభ నుంచి రిటైర్ కానున్నారు. దీంతో ప్రస్తుతం రాజ్యసభలో నామినేటెడ్ సభ్యుల ఖాళీల సంఖ్య నాలుగుకి చేరనుంది. ఈ నేపథ్యంలో బీజేపీ ఎవరిని రాజ్యసభకు నామినేట్ చేయనుందనే విషయంలో పలు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యే జూలై 18 నాటికి కొత్త సభ్యుల నియామకంపై ఒక స్పష్టత వస్తుందని భావిస్తున్నారు. రాజ్యసభలో మొత్తం 12 మంది నామినేటెడ్ సభ్యులుంటారు. మాజీ సీజేఐ, ఆర్మీ మాజీ చీఫ్ పేర్లు! రాజ్యసభకు నామినేట్ అయ్యే అవకాశమున్న వారిలో మాజీ క్రికెటర్ కపిల్ దేవ్, సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఆర్సీ లహోటియా, ఆర్మీ మాజీ చీఫ్ దల్బీర్ సింగ్, రాజ్యాంగ వ్యవహారాల నిపుణుడు సుభాష్ కాశ్యప్, బాలీవుడ్ నటి మాధురీ దీక్షిత్.. తదితరుల పేర్లు బీజేపీ వర్గాల్లో ఇప్పుడు ప్రధానంగా వినిపిస్తున్నాయి. దాదాపు వీరందరినీ ఇటీవల బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా కలిశారు. ‘సంపర్క్ సే సమర్థన్’ కార్యక్రమంలో భాగంగా ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా, క్రీడాకారుడు మిల్ఖా సింగ్, జర్నలిస్ట్ కుల్దీప్ నయ్యర్, యోగా గురు బాబా రామ్‌దేవ్, జస్టిస్ ఆర్సీ లహోటియా, మాజీ ఆర్మీ చీఫ్ దల్బీర్ సింగ్ సహా పలువురు ప్రముఖులను అమిత్ షా కలిసిన విషయం తెలిసిందే. హరియాణాకు చెందిన మాజీ క్రికెటర్ కపిల్ దేవ్‌కు, అలాగే, ఇటీవలి కాలం వరకు హీరోయిన్గా వెండితెరపై మెరిసిన మాధురీ దీక్షిత్‌కు దేశవ్యాప్తంగా అభిమానులున్న విషయాన్ని బీజేపీ పరిగణనలోకి తీసుకుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. -
వరల్డ్ స్టంట్ అవార్డ్స్‌కు హలో
‘టారస్ వరల్డ్ స్టంట్ అవార్డ్స్’ పేరుతో ప్రతి సంవత్సరం వరల్డ్ మూవీస్‌లోని బెస్ట్ స్టంట్ పెర్ఫార్మర్స్కు అవార్డ్స్ ప్రకటిస్తారు. ఈ ఉత్సవం లాస్ ఏంజెల్స్‌లో జరుగుతుంది. విశేషం ఏంటంటే.. ‘బెస్ట్ యాక్షన్ ఇన్ ఏ ఫారిన్ ఫిల్మ్ కేటగిరీ’లో ‘హలో’ సినిమా నామినేట్ అయింది. ఈ సందర్భంగా చిత్రదర్శకుడు విక్రమ్ కె. కుమార్ మాట్లాడుతూ – ‘‘హలో’ సినిమా ‘టారస్ వరల్డ్ అవార్డ్స్ క్యాటగిరీలో నామినేట్ అవ్వడం చాలా హ్యాపీగా ఉంది. నాగార్జున సార్, యాక్షన్ డైరెక్టర్ బాబ్ బ్రౌన్, కెమెరామేన్ పీయస్ వినోద్, ఎడిటర్ ప్రవీణ్ పూడి, సంగీతదర్శకుడు అనూప్ రూబెన్స్లకు థ్యాంక్స్. ఈ సినిమాలో యాక్షన్ సీక్వెన్స్ బాగా రావడానికి మీరంతా కారణం. లాస్ట్ బట్ నాట్ లీస్ట్.. అఖిల్.. నీ డెడికేషన్, హార్డ్ వర్క్, నీ యాటీట్యూడ్ నిన్ను కొత్త హైట్స్‌కు తీసుకువెళ్తాయి. ఎప్పుడూ ఇలానే ఉండు’’ అని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే.. నామినేషన్ అయితే సంపాదించుకుంది కానీ ‘హలో’కి అవార్డు దక్కలేదు. చైనీస్ మూవీ ‘ఉల్ఫ్ వారియర్ 2’కి అవార్డు దక్కింది. ఏది ఏమైనా ‘ప్రపంచ సినిమాలు’ పోటీ పడే అవార్డ్స్‌లో ఓ ఇండియన్ మూవీ నామినేషన్ వరకూ వెళ్లడం గొప్ప అని సినిమా లవర్స్ అంటున్నారు. -
మా నాన్నకు ఫోన్.. నాకు షాక్
సాక్షి, బెంగుళూరు : కర్ణాటక ఎన్నికల్లో అత్యంత ఆశ్చర్యకరమైన సంఘటన ఏదైనా ఉందంటే అది స్వయానా ముఖ్యమంత్రి అభ్యర్ధి కొడుకు చివరి నిమిషంలో నామినేషన్‌ను వేయకుండా వెనుదిరగడం. కర్ణాటక బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్ధి బీఎస్ యడ్యూరప్ప కుమారుడు బీవై విజయేంద్ర నామినేషన్ దాఖలు చేయడం కోసం అని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారు. కానీ చివరకు నామినేషన్ వేయలేదు. ఈ విషయం గురించి ఎన్నో అనుమానాలు, పుకార్లు వినిపించనప్పటికి విజయేంద్ర మాత్రం ఇంతవరకు నోరు మెదపలేదు. కానీ ఈమధ్యే ఓ ప్రముఖ టీవీ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో దీని వెనుక గల కారణాలను బయటపెట్టారు. ఈ విషయం గురించి మాట్లాడుతూ.. ‘ఆ రోజు(ఏప్రిల్ 23) ఉదయం 11 గంటల ప్రాంతంలో మా నాన్నకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఆ కాల్ మాట్లడిన తరువాత మా నాన్న నన్ను నామినేషన్ వేయవద్దని చెప్పారు. నాన్న మాట ప్రకారం నేను నా నామినేషన్‌ను రద్దు చేసుకున్నాను. తర్వాత యధావిధిగా మిగతా కార్యక్రమాలు పూర్తి చేసుకుని వచ్చాను. ఈ విషయం గురించి నేను మా నాన్నను ఏమి అడగలేదు. ఒకవేళ అధిష్టానం నిర్ణయం మేరకు మా నాన్న ఆ నిర్ణయం తీసుకుని ఉంటారనుకుంటున్నాను. అయితే ఈ విషయం గురించి నాకు కచ్చితంగా తెలియదు. ఆ రోజు నుంచి ఇప్పటి వరకూ నేను ‘ఫోన్ చేసింది ఎవర’ని మా నాన్నని అడగలేదు అని తెలిపారు. ఈ విషయం వల్ల తనకు దిగ్భ్రాంతి కంటే అధికంగా బాధ కలిగిందని తెలిపారు. దీనంతటికి కారణం తమ పార్టీలో చేరిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే అన్నారు. బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్ది కొడుకునే నామినేషన్ వేయకుండా ఆపితే పరిణామాలు ఎలా ఉంటాయో బీజేపీ అధిష్టానానికి తెలుసు. అయినా కూడా అంతటి సాహసం చేయడానికి ఒక బలమైన కారణమే ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి. మోదీ కర్ణాటకలో ఎన్నికల ప్రచారం సందర్భంగా రాహుల్ గాంధీని, కాంగ్రెస్ పార్టీని ఉద్ధేశించి ‘కుటుంబ పాలన’, ‘రాజరిక’మని విమర్శించారు. ఇలాంటి తరుణంలో ముఖ్యమంత్రి అభ్యర్ది కొడుకును కూడా రాజకీయాల్లోకి తీసుకువస్తే అప్పుడు తమను విమర్శించడానికి ప్రతిపక్షానికి అవకాశం కల్పించినట్టు అవుతుందని భావించి విజయేందర్‌ను నామినేషన్ వేయకుండా ఆపారని తెలిపారు. విజయేందర్ మైసూరులోని వరుణ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని భావించారు. అందుకే అక్కడ కొన్ని వారాల పాటు ప్రచారం కూడా నిర్వహించారు. విజయేందర్‌కు పోటీగా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్ధి సిద్దరామయ్య కుమారుడు కూడా ఇదే నిజయోకవర్గం నుంచి పోటీకి దిగారు. విజయేంద్ర నామినేషన్ వేయకపోవడంతో బీజేపీ కార్యకర్తలు ఆ రోజు రాత్రంతా నిరసన తెలుపుతూ కుర్చీలు విరగొట్టి బీభత్సం సృష్టించిన సంగతి తెలిసిందే. -
‘పుర’లో మళ్లీ నామినేషన్ పనులు!
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్‌సహా రాష్ట్రంలోని ఇతర నగరాలు, పట్టణాల్లో అత్యవసర పనులను నామినేషన్ పద్ధతిలో చేపట్టేందుకు ప్రభుత్వం అనుమతిచ్చింది. జీహెచ్ఎంసీలో రూ.25 లక్షలు, ఇతర కార్పొరేషన్లలో రూ.10 లక్షలు, మునిసిపాలిటీల్లో రూ.5 లక్షలలోపు అంచనా వ్యయం కలిగిన ‘అత్యవసర’పనులను నామినేషన్ విధానంలో చేపట్టేందుకు ఆయా సంస్థల అధికారులకు ప్రత్యేకాధికారాలను కట్టబెట్టింది. ఇటీవల రాష్ట్రంలో వడగండ్ల వాన సృష్టించిన బీభత్సం దృష్ట్యా ప్రస్తుత మే నుంచి వచ్చే సెప్టెంబర్ వరకు రాష్ట్రంలో కురిసే వర్షాలు, వడగండ్లు, ఇతర ప్రకృతి వైపరీత్యాలతో దెబ్బతినే రోడ్లు, మురుగు నీటి కాల్వలు, నాలాలకు అత్యవసర మరమ్మతుల నిర్వహణ కోసం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్ర పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్ కుమార్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రకృతి వైపరీత్యాల తర్వాత చేపట్టాల్సిన అత్యవసర పనులకే ఈ ప్రత్యేక అధికారాలను వినియోగించాలని, సెప్టెంబర్ 30 తర్వాత నామినేషన్ల విధానం కింద పనులకు పరిపాలనపర అనుమతులు జారీ చేయరాదని ఈ ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత రాష్ట్రంలోని పురపాలికల్లో నామినేషన్ పనులపై నిషేధం విధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయగా, తాజా ఉత్తర్వుల ద్వారా తాత్కాలిక సడలింపులు ఇచ్చింది. -
ద్రవిడ్ వ్యవహారంతో బీసీసీఐలో చీలిక
సాక్షి, ముంబై: భారత మాజీ కెప్టెన్, టీమిండియా అండర్-19 కోచ్ రాహుల్ ద్రవిడ్ పేరును ద్రోణాచార్య అవార్డుకు నామినేట్ చేయటం వివాదాస్పదంగా మారింది. ఏకంగా బీసీసీఐలోనే ఈ వ్యవహారం చీలిక తీసుకొచ్చింది. కోచ్‌గా అంతగా అనుభవం లేని వ్యక్తిని ప్రతిష్టాత్మక అవార్డుకు నామినేట్ ఎలా చేస్తారంటూ ఓ వర్గం అభ్యంతరం లేవనెత్తగా.. మరో వర్గం ద్రవిడ్ పేరును బలపరుస్తోంది. ‘ద్రవిడ్‌ను ద్రోణాచార్య పురస్కారానికి నామినేట్ చేయటం సమంజసం కాదు. కోచ్‌గా కనీసం ఆయనకు మూడేళ్ల అనుభవం కూడా లేదు. ఈ నిర్ణయం ఆటగాళ్లను చిన్నతనంలోనే సానబెట్టే గురువులకు అన్యాయం చేయటమే అవుతుంది. అలాగని ద్రవిడ్ బీసీసీఐకి అందిస్తున్న సేవలను నేను తక్కువ చేయటం లేదు. కానీ, ఆయనను అవార్డుకు నామినేట్ చేయటం మాత్రం సమంజం కాదని చెబుతున్నా’ అని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. సుప్రీం కోర్టు నియమించిన అడ్మినిస్ట్రేటర్స్ కమిటీ మాత్రం ద్రవిడ్.. ద్రోణాచార్య అవార్డుకు అన్ని విధాల అర్హుడంటూ వాదిస్తోంది. కమిటీ చీఫ్ వినోద్ రాయ్ గురువారం ద్రవిడ్ పేరును నామినేట్ చేసినట్లు ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ఆ సమయంలో రాయ్.. ద్రవిడ్‌పై ప్రశంసలు గుప్పించాడు. ఇక ఈ వ్యవహారం ముదరకుండా ఇరు వర్గాలు భేటీ కావాలని నిర్ణయించాయి. క్రీడా మార్గదర్శకాల ప్రకారం ఏదైనా ఆటలో 20 ఏళ్లు కోచ్‌గా అనుభవం ఉన్న వ్యక్తులనుగానీ లేదా తక్కువ సమయంలో గొప్ప ఆటగాళ్లను తయారు చేసే కోచ్‌ల పేర్లను ద్రోణాచార్య అవార్డుకు ప్రతిపాదించొచ్చు. -
ఎన్నికల్లో ఐదు రూపాయల డాక్టర్
మండ్య: మండ్య నగరంలో ఐదు రూపాయల డాక్టర్‌గా ప్రసిద్ధి చెంది న డాక్టర్. ఎస్.సి. శంకరేగౌడ ఎన్నికల నాడిని పరీక్షిస్తున్నారు. సోమవారం ఆయన మండ్య స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశా రు. నగరంలోని బందీగౌడ లేఔట్లో ఉన్న నివాసం నుంచి కలెక్టర్ కార్యాలయానికి వెళ్లి అక్కడ ఉన్న మహా పురుషుల విగ్రహాలకు పూలహారం వేసి నివాళులర్పించారు. తరువాత తాలూకా పంచాయతీ కార్యాలయానికి వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు. రోగుల నుంచి కేవలం ఐదు రూపాయలు ఫీజుగా తీసుకునే శంకరేగౌడ నామినేషన్ డిపాజిట్ నగదు రూ.10 వేలను కూడా ఐదు రూపాయల నాణేలనే ఇచ్చారు. -
కాంగ్రెస్ వర్సెస్ జేడీఎస్
మైసూరు :రాష్ట్రంలో జరుగుతున్న శాసన సభ ఎన్నికల్లో భాగంగా ప్రతిష్టాత్మకంగా ఉన్న చాముండేశ్వరి నియోజకవర్గానికి ప్రత్యేక స్థానం ఉంది. ఇక్కడి నుంచి సీఎం సిద్ధరామయ్య పోటీ చేస్తుండగా, జేడీఎస్ పార్టీ నుంచి జీటీ.దేవెగౌడ బరిలో ఉన్నారు. శుక్రవారం మంచి రోజు కావడంతో సీఎం సిద్దు నామినేషన్ దాఖలు చేయగా, జేడీఎస్ నుంచి జీటీ దేవెగౌడ సైతం నామినేషన్ దాఖలు చేశారు. ఇదిలా ఉంటే ముందస్తుగా పోలీసులు సీఎం సిద్దరామయ్యకు నామినేషన్ దాఖలుకు మధ్యాహ్నం 12.30 గంటలకు సమయం కేటాయించారు. అదే సమయంలో జేడీఎస్ అభ్యర్థి జీటీ దేవెగౌడకు మధ్యాహ్నం 1.30 గంటలకు సమయం ఇచ్చారు. సీఎం సిద్దు ఆలస్యంగా రావడంతో జీటీ దేవెగౌడ సహా ఆయన అభిమానులు, కార్యకర్తలు పోలీసులు ఇచ్చిన సమయానికి అక్కడికి చేరుకున్నారు. దీంతో కాంగ్రెస్, జేడీఎస్ కార్యకర్తల మధ్య మాటల యుద్ధం చెలరేగింది. పరిస్థితి అదుపు చేయడానికి పోలీసులు ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో లాఠీచార్జ్ చేసి ఇరు పార్టీల కార్యకర్తలను అక్కడి నుంచి తరిమివేశారు. అనంతరం సీఎం సిద్దు భారీ బందోబస్తు మధ్య నామినేషన్ దాఖలు చేయగా అనంతరం జీటీ దేవెగౌడ కూడా నామినేషన్ దాఖలు చేసి వెళ్లిపోయారు. -
పదవులు ఏవీ.. అధ్యక్షా !
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : పార్టీ ఆవిర్భావంనుంచి కొనసాగుతున్న వారికీ ఎలాంటి పదవీయోగం దక్కక గులాబీ నేతలు ఆవేదన చెందుతున్నారు. దశాబ్ధంన్నరకుపైగా జెండా మోస్తున్న వారిలో చాలామందినీ ఆ పార్టీ అధినాయకత్వం కరుణించలేదు. టీఆర్ఎస్లో ముందునుంచీ ఉన్న నాయకులే కాకుండా, కాంగ్రెస్, టీడీపీ తదితర పార్టీల నుంచి ఏదో ఒక సందర్భంలో వచ్చి చేరిన వారికీ మొండిచేయే చూపారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇప్పటికీ పదవుల కోసం ఆశగా ఎదరుచూస్తున్న వారిలో పధ్నా లుగేళ్ల పాటు ఉద్యమంలో పాల్గొని, పార్టీలో కొనసాగుతున్న వారున్నారు. తెలంగాణ రాష్ట్రం కల సాకారం అయ్యాక, తొలిప్రభుత్వాన్ని ఉద్యమ పార్టీ టీఆర్ఎస్ ఏర్పాటు చేయడంతో ఈ నేతలంతా తమకు ఏదో ఒక పదవి దక్కక పోతుందా అని ఆశపడిన వారే. కానీ, నియోజకవర్గాల్లో ఉన్న గ్రూపు గొడవలు పదవుల భర్తీకి పెద్ద అడ్డంకిగా మారాయి. జిల్లాకు రాష్ట్రస్థాయి కార్పొరేషన్ పోస్టులు రెండు దక్కినా, చాలా మందికి ఎలాంటి అవకాశం దక్కలేదు. జిల్లా గ్రంథాలయ సంస్థ, వివిధ దేవాలయాలకు పాలక మం డళ్లు నియమించారు. వివిధ వ్యవసాయ మార్కెట్ కమిటీల పాలకమండళ్ల నియామాకాల్లోనూ గ్రూపు రాజకీయాలు చోటు చేసుకోవడంతో కొన్ని ప్రధాన మార్కెట్ కమిటీల భర్తీ చేపట్టలేదు. దీంతో చాలా మందికి అవకాశం దక్కకుండా పోయింది. ద్వితీయశ్రేణి నాయకులు తమ ఎమ్మెల్యేలపై నిత్యం ఒత్తిడి తెస్తున్నా, వారూ సమాధానం చెప్పలేకపోతున్నారని పేర్కొం టున్నారు. మరో ఏడాదిలో ప్రభుత్వ పదవీ కాలం ముగియనుండడంతో ఇంకా ఎప్పుడు పదవులు ఇస్తారన్న ప్రశ్న గులాబీ శ్రేణులనుంచి వస్తోంది. పదవుల భర్తీ ప్రశ్నార్ధకం ? నల్లగొండ నియోజకవర్గ ఇన్చార్జ్గా పనిచేసిన దుబ్బాక నర్సింహారెడ్డికి రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇస్తామని బహిరంగంగా ప్రకటించి ఆరు నెలలు గడిచినా ఇప్పటికీ అతీగతీ లేకపోవడంతో ఆయన అనుచరులు అసంతృప్తితోనే ఉన్నారు. నల్లగొండలోనే గతంలో టీడీపీ నుంచి టీఆర్ఎస్కు వచ్చిన మున్సిపల్ మాజీ చైర్మన్ బోయపల్లి కృష్ణారెడ్డి వంటి సీనియర్ నాయకులకు ఎలాంటి ప్రాధాన్యం దక్కలేదు. ప్రధానమైన మిర్యాలగూడ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి ఎస్టీలకు రిజర్వ్ అయ్యింది. ఈ నియోజకవర్గంలో టీఆర్ఎస్ ఇన్చార్జ్గా చేసిన అమరేందర్‌రెడ్డి , కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లో చేరిన ఎమ్మెల్యే భాస్కర్‌రావు తమ అనుచరుల కోసం వేర్వేరు జాబితాలు ఇవ్వడంతో ఇప్పటికీ పాలకమండలి నియామకం జరగలేదు. ముందు నుంచీ పార్టీలో కొనసాగుతున్న, గతంలో ఇన్చార్జ్గా కూడా పనిచేసి నాగార్జునాచారి వంటి వారికి అవకాశమే దక్కలేదు. కాంగ్రెస్‌నుంచి టీఆర్ఎస్లోకి వచ్చిన మాజీ ఎమ్మెల్యే విజయ సింహారెడ్డి, చింతిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే రేపాల శ్రీనివాస్‌కు పదవులు దక్కలేదు. నాగార్జున సాగర్ నియోజకవర్గంలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. సీఎల్పీ నేత జానారెడ్డికి దగ్గరి అనుచర నేతలుగా పేరున్న మ్మడి రాష్ట్రంలో ఆప్కాబ్ చైర్మన్‌గా పనిచేసిన ఎడవెల్లి విజయేందర్ రెడ్డి, ఎంసీ కోటిరెడ్డి, మలిగిరెడ్డి లింగారెడ్డి, గార్లపాటి ధనమల్లయ్య వంటి వారు టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. విజయేందర్‌రెడ్డి జిల్లా రైతు సమన్వయ సమితి కో ఆర్డినేటర్ పదవి రేసులో నిలిచినా, ఆయన మండలానికే పరిమతమయ్యారు. ఇక, ముందునుంచీ టీఆర్ఎస్ జెండా మోసిన వర్రెవెంకటేశ్వర్రెడ్డి, నియోజకవర్గఇన్చార్జ్గా రెండు సార్లు వ్యవహరించిన బొల్లేపల్లి శ్రీనివాస్‌రావు వంటి వారికి పదవీయోగం కలగలేదు. దేవరకొండ నియోజకవర్గంలో గ్రూపులలొల్లి తప్పడం లేదు. దీంతో పదవుల భర్తీకి ఆటంకం కలుగుతోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇక్కడి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవినీ భర్తీ చేయలేదు. దేవరకొండ నియోజకవర్గ ఇన్చార్జ్గా పనిచేసిన బండారు బాల నర్సింహకు ఇప్పటికీ ఎదురుచూపులే మిగిలాయి. మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి ఆయన ఆశించినా ఇప్పటికీ దక్కలేదు. జెడ్పీ చైర్మన్ బాలునాయక్ వెంట కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లోకి వచ్చిన మైనారిటీ నాయకుడు సిరాజ్ఖాన్కు గుర్తింపు దక్కలేదు. ఆయనను జెడ్పీ కో–ఆప్షన్ సభ్యుడిగా నియమిస్తామని హామీ ఇచ్చినా నిలబెట్టుకోలేక పోయారు. పీఏపల్లి మండలానికి చెందిన ఏవీ రెడ్డి, అదే మాదిరిగా నాయిని మాధవరెడ్డి, సురేష్, నిస్సార్ అహ్మద్ వంటి నేతలు పదవుల కోసం ఎదురుచూస్తున్నారు. జిల్లా కేంద్రం నల్లగొండ మార్కెట్ కమిటీకి పాలక మండలిని నియమించడానికి పార్టీ నాయకత్వం ఇంకా మీనమేషాలు లెక్కిస్తోందని పేర్కొంటున్నారు. -
మాకేవి పదవులు!
సాక్షిప్రతినిధి, కరీంనగర్: కరీంనగర్ ఉమ్మడి జిల్లాకు సంఖ్యాపరంగా పదవులు పెద్దసంఖ్యలోనే వచ్చినప్పటికీ టీఆర్ఎస్ మొదటితరం నాయకుల్లో కొందరికి అంతగా అవకాశం లేకుండా పోతోందని బాధపడుతున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ఏడాది మాత్రమే మిగిలి ఉండడంతో ఇప్పుడు పదవులు రాకపోతే ఇక ఎప్పటికీ రానట్టేనన్న భావనలో ఉన్నారు. తమ బాధను వ్యక్తం చేసేందుకు అధినేత దర్శన భాగ్యమే కరువవుతోందని కొందరు బహిరంగంగానే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్, టీడీపీల నుంచి టీఆర్ఎస్లో చేరిన నేతలకు పోలీసు హౌసింగ్ కార్పొరేషన్ వంటి పోస్టులు రాగా, కొందరికి కీలకమైన రైతు సమన్వయ సమితి జిల్లా కో ఆర్డినేటర్ పదవులు దక్కాయి. టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి చురుగ్గా పనిచేస్తున్న జీవీ రామకృష్ణారావుకు రెండు రోజుల క్రితమే ‘సుడా’ చైర్మన్ పదవి దక్కగా, కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో మిగిలిన సీనియర్ నేతలు నామినేటెడ్ పదవుల కోసం ఎదురుచూస్తూనే ఉన్నారు. టీఆర్ఎస్ ఉద్యమం కేరాఫ్ కరీంనగర్ తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటు నుంచి పార్టీలో పలువురు నేతలు పనిచేశారు. మరి కొందరు ఆలస్యంగా వచ్చినప్పటికీ ఉద్యమ కీలక సమయంలో క్రియాశీల పాత్ర పోషించారు. ఇందులో చాలా మందికి పార్టీ, నామినేటెడ్ పోస్టులు దక్కాయి. అయితే చివరి వరకు పేర్లు ప్రచారంలోకి వచ్చినా చాలా మందికి ఆ పదవులు అందని ద్రాక్షగానే మారాయి. ఉమ్మడి జిల్లాకు చెందిన పన్యాల భూపతిరెడ్డి, కట్ల సతీశ్, గంటల వెంకటరమణారెడ్డి, హుజూరాబాద్‌కు చెందిన బండ శ్రీనివాస్, కోరుకంటి చందర్, జెడ్పీ మాజీ వైస్‌చైర్మన్ డాక్టర్ సుధీర్‌కుమార్, ఏవీ మైపాల్‌రెడ్డి తదితరులకు నామినేటెడ్ పదవులు దరిచేరలేదు. ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశాలు దక్కలేదు. జిల్లాస్థాయి దూరమే! ఇటీవల రైతుసమన్వయ సమితి కమిటీలు చేశారు. కరీంనగర్ జిల్లా చైర్మన్‌గా ఎంపికైన గూడెల్లి తిరుపతి గతంలో టీడీపీలో క్రియాశీలకంగా పనిచేసి ఇటీవల టీఆర్ఎస్లో చేరారు. పెద్దపల్లి జిల్లా చైర్మన్‌గా ఎంపికైన కోట రాంరెడ్డి సుల్తానాబాద్ మండలం తొగర్రాయి సర్పంచ్‌గా పలుమార్లు పనిచేశారు. కాంగ్రెస్‌లో కీలకనేతగా పనిచేసిన రాంరెడ్డి టీఆర్ఎస్లో చేరగానే పదవీ వరించింది. రాజన్నసిరిసిల్ల జిల్లా రైతు సమన్వయ సమితి కో–ఆర్డినేటర్‌గా నియమితులైన గడ్డం నర్సయ్య గతంలో కాంగ్రెస్ పార్టీ బీసీసెల్ జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర స్థాయి పదవులు కాకున్నా, జిల్లా స్థాయి నామినేటెడ్ పదవుల్లో తమకు ప్రాధాన్యం ఇవ్వడం లేదన్న వేదన కనిపిస్తోంది. ఆశల పల్లకిలోనే సీనియర్లు నామినేటెడ్ పోస్టుల భర్తీకి తాజాగా జాబితాలు సిద్ధమవుతున్నాయన్న ప్రచారంతో సీనియర్ టీఆర్ఎస్ నేతలు ఎవరికి వారుగా ప్రయత్నాలు ముమ్మరం చేశారు. మంత్రులు ఈటల రాజేందర్, కేటీఆర్‌లు ఈ విషయంలో ఆచీతూచీ వ్యవహరిస్తుండగా, ఎమ్మెల్యేలు సైతం అందరినీ సమన్వయం చేసి జాబితా ఇచ్చే పనిలో ఉన్నారు. ఇప్పటికే నియోజకవర్గాల వారీగా నామినేటెడ్ పోస్టుల కోసం రూపొందించిన జాబితాల్లో ఎవరెవరి పేర్లున్నాయనేది ప్రశ్నార్థకం కాగా, ఆయా జిల్లాలు, నియోజకవర్గాల్లో ఆశావహుల పేర్లు పుకార్లు చేస్తున్నాయి. కరీంనగర్ జిల్లాకు వచ్చే సరికి రాష్ట్ర, జిల్లాస్థాయి నామినేటెడ్ పదవుల కోసం పన్యాల భూపతిరెడ్డి, కట్ల సతీశ్, కొత్తకొండ శ్రీనివాస్, జక్కం నర్సయ్య, తిరుపతినాయక్, పొనగంటి మల్లయ్య, బండ శ్రీనివాస్, వీర్ల వెంకటేశ్వర్‌రావులతోపాటు 15 మందికిపైగా పేర్లు వినిపిస్తున్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాకు సంబంధించి చిక్కాల రామారావు, గ్రంథాలయసంస్థ చైర్మన్ కోసం ప్రయత్నించిన గూడూరి ప్రవీణ్, మాజీ ఎమ్మెల్యే రేగులపాటి పాపారావు, రవీందర్రావు తదితరుల పేర్లు వినిపిస్తున్నాయి. అయితే ప్రతిష్టాత్మకమైన వేములవాడ ఆలయ కమిటీ చైర్మన్ పదవీ బాధ్యతలు మాత్రం ఎమ్మెల్యే రమేశ్‌బాబుకే సీఎం కేసీఆర్ అప్పగించనున్నట్లు చెప్తున్నారు. పెద్దపల్లి జిల్లాకు వస్తే రామగుండం నుంచి ఎమ్మెల్యేగా పార్టీ టికెట్‌పై పోటీ చేసి ఓడిపోయిన కోరుకంటి చందర్‌తోపాటు దీటి బాలరాజు, జెడ్పీటీసీ కందుల సంధ్యారాణి, పెద్దంపేట శంకర్, నల్ల మనోహర్‌రెడ్డి తదితరులు ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. జగిత్యాల జిల్లాలో కోరుట్ల, ధర్మపురి నియోజవకర్గాల నుంచి లోక బాపురెడ్డికి మార్క్‌ఫెడ్, కటారి చంద్రశేఖర్‌రావుకు గ్రంథాలయసంస్థ చైర్మన్లు దక్కగా, ప్రధానంగా డాక్టర్ సంజయ్‌కుమార్, తాటిపర్తి శరత్‌రెడ్డితోపాటు ఏడేనిమిది మంది పేర్లు వినిపిస్తున్నాయి.