
6న నారా లోకేశ్ నామినేషన్
ముఖ్యమంత్రి చంద్రబాబు కుమారుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీ స్థానానికి ఈ నెల 6వ తేదీన నామినేషన్
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు కుమారుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీ స్థానానికి ఈ నెల 6వ తేదీన నామినేషన్ వేయనున్నట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీ స్థానాన్ని లోకేశ్‌కు ఇవ్వాలని ఇటీవల టీడీపీ పొలిట్‌బ్యూరో సమావేశంలో నిర్ణయించిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో 6వ తేదీ మంచిరోజు కావడంతో నామినేషన్ వేయాలని లోకేశ్ నిర్ణయించుకున్నట్లు పార్టీ నేతలు తెలిపారు. లోకేశ్‌తోపాటు మిగిలిన టీడీపీ అభ్యర్థుల జాబితాను చంద్రబాబు త్వరలో వెల్లడించనున్నారు. కాపుల రిజర్వేషన్ ఉద్యమం నేపథ్యంలో ఆ వర్గానికి చెందిన నేతలు చంద్రబాబుపై ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం.