
టీడీపీ 'ఎమ్మెల్యే కోటా' ఎమ్మెల్సీ అభ్యర్థులు ఖరారు
- లోకేశ్ అభ్యర్థిత్వాన్ని అధికారికంగా ప్రకటించిన పార్టీ
- కరణం బలరాం, డొక్కా మాణిక్యలకూ ఛాన్స్
సాక్షి, అమరావతి: ఎమ్మెల్యేల కోటాలో ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు నారా లోకేశ్‌కు గతంలో నిర్ణయించిన మేరకు సీటు ఖరారు చేశారు. కృష్ణా జిల్లా టీడీపీ అధ్యక్షుడు బచ్చుల అర్జునుడు, ప్రకాశం జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి, గుంటూరుకు చెందిన మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్, ప్రకాశం జిల్లాకు చెందిన పోతుల సునీతలను అభ్యర్థులుగా ఎంపిక చేశారు.
టీడీపీ నేత టీడీ జనార్దన్ ఆదివారం రాత్రి 12 గంటలు దాటిన తర్వాత ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాసం వద్ద అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు. ఎమ్మెల్సీ సీటు ఆశించిన విజయవాడకు చెందిన నాగుల్‌మీరాను పోలీస్ హౌసింగ్ బోర్డు కార్పొరేషన్ ఛైర్మన్‌గా ఎంపిక చేసినట్లు తెలిపారు.