
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు ఏకగ్రీవమయ్యాయి. నేటితో(గురువారం) ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థ/ల నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో ఈ ఎమ్మెల్సీ ఎన్నిక ఏకగీవ్రమైంది. మొత్తం ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు ఐదుగురు అభ్యర్థులు మాత్రమే ఉండగా, వీరిపై పోటీకి ఎవరూ సిద్ధం కాలేదు. దాంతో ఎమ్మెల్సీ కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు ఏకగ్రీవమయ్యాయి.
కాంగ్రెస్ నుంచి విజయశాంతి, అద్దంకి దయాకర్, శంకర్ నాయక్ లకు ఎమ్మెల్సీ టికెట్లు కేటాయించగా, బీఆర్ఎస్ నుంచి దాసోజు శ్రవణ్, సీపీఐ నుంచి నెల్లికంటి సత్యంలు అభ్యర్థులుగా ఉన్నారు. కాంగ్రెస్, సీపీఐ పొత్తులో భాగంగా ఒక సీటును సీపీఐకి ఇచ్చింది కాంగ్రెస్. రెండు స్థానాలను సీపీఐ అడిగినప్పటికీ ఒక స్థానమే సీపీఐకి కేటాయించింది కాంగ్రెస్. వీరి మధ్య గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పొత్తు కుదిరింది. దాంతో సీపీఐకి ఎమ్మెల్సీ స్థానం కేటాయించక తప్పలేదు.


అయితే ఉపసంహరణ గడువు ముగియడంతో అధికారిక ప్రకటన వెలువడింది. ఐదుగురు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు రిటర్నింగ్ అధికారి ఉపేందర్ రెడ్డి ప్రకటించారు. ఎమ్మెల్సీలుగా ఎన్నికైనట్లు ధ్రువీకరణ పత్రాలు అందించారు.
