
హైదరాబాద్,సాక్షి: అప్పుడైనా,ఇప్పుడైనా తెలంగాణకి బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ శ్రీరామ రక్ష అని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు. ప్రస్తుత రాష్ట్ర రాజకీయాలపై కవిత ఎక్స్ వేదికగా స్పందించారు.
అసెంబ్లీ ఆమోదించిన చట్టాలను కోల్డ్ స్టోరేజీకి పంపే స్క్రీన్ ప్లే.బీజేపీని కాపాడేందుకే సీఎం రేవంత్ రెడ్డి డైవర్షన్ డ్రామా. మరో సారి బయటపడిన కాంగ్రెస్, బీజేపీ బంధం. బీసీలకు రాజకీయ, విద్య, ఉద్యోగ రిజర్వేషన్లపై అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లకుండా కుతంత్రం.అఖిలపక్షాన్ని తీసుకెళ్తే కేంద్రాన్ని నిలదీస్తారన్న జంకు. అందుకే ఢిల్లీలో బీసీ సంఘాల ధర్నాకు హాజరు పేరిట మమ అనిపించే యత్నం.
మోదీ సర్కారుకు ఎలాంటి ఇబ్బంది రాకుండా పకడ్బందీ స్కెచ్. తెలంగాణ ప్రజల ఓట్లే తప్ప.. వాళ్ల పాట్లు పట్టని కాంగ్రెస్ అగ్రనాయకత్వం. ఢిల్లీలో బీసీ సంఘాల ధర్నాకు కాంగ్రెస్ నేత, లోక్ సభలో ప్రధాన ప్రతిపక్ష నేత హాజరవుతారని ప్రచారం. జంతర్ మంతర్‌కు కూతవేటు దూరంలోనే ఉన్నా ధర్నాకు రాకుండా బీసీలను అవమానించిన కాంగ్రెస్ అగ్రనాయకత్వం.
అసెంబ్లీ ఆమోదించిన చట్టాలను కోల్డ్ స్టోరేజీకి పంపే స్క్రీన్ ప్లే...
బీజేపీని కాపాడేందుకే సీఎం రేవంత్ రెడ్డి డైవర్షన్ డ్రామా...
మరో సారి బయటపడిన కాంగ్రెస్, బీజేపీ బంధం...
బీసీలకు రాజకీయ, విద్య, ఉద్యోగ రిజర్వేషన్లపై అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లకుండా కుతంత్రం...…— Kavitha Kalvakuntla (@RaoKavitha) April 2, 2025
తెలంగాణ లో సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ సాగిస్తున్న ఏ ఒక్క దమనకాండపై ఇప్పటి వరకు నోరు విప్పని రాహుల్ గాంధీ. లగచర్ల రైతుల మీద, బంజారా మహిళలపై సర్కార్ అఘాయిత్యాలపై మాట్లాడరు. మూసి ప్రాజెక్టు పేరిట పేద ప్రజల ఇళ్లను కూలగొడితే స్పందించరు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థులపై పోలీసులు లాఠీలు ఝుళిపించినా ఖండించరు.
ఇప్పుడు ఢిల్లీ వేదికగా మా బీసీ బిడ్డల ధర్నాకు రాకుండా అవమానించారు. అందుకే మేము ముందే చెప్పాం.. ఆయన ఎన్నికల గాంధీ అని.రాహుల్ గాంధీకి తెలంగాణతో పేగుబంధం లేదు.. ఉన్నది కేవలం ఎన్నికల బంధం మాత్రమేనని. అప్పుడైనా,ఇప్పుడైనా తెలంగాణకి కేసీఆర్ మాత్రమే శ్రీరామ రక్ష’ అని వ్యాఖ్యానించారు.