Congress Party
-
వక్ఫ్ సవరణ బిల్లుపై సుప్రీంను ఆశ్రయిస్తాం: కాంగ్రెస్
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ఆమోదించిన వక్ఫ్ సవరణ బిల్లును(waqf amendment bill) సుప్రీం కోర్టులో సవాల్ చేస్తామని కాంగ్రెస్ పార్టీ అంటోంది. వీలైనంత త్వరలోనే ఇది ఉంటుందని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ ప్రకటించారు. రాజ్యాంగ సూత్రాలు, నిబంధనలపై దాడి చేస్తున్న మోదీ ప్రభుత్వాన్ని ప్రతిఘటిస్తూనే ఉంటామన్న ఆయన.. గతంలో సీఏఏ, ఆర్టీఐ, ఎన్నికల నియమాలపై పోరాటాలు చేశామని జైరాం రమేశ్(Jairam Ramesh) తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ ద్వారా తెలియజేశారు. The INC's challenge of the CAA, 2019 is being heard in the Supreme Court.The INC's challenge of the 2019 amendments to the RTI Act, 2005 is being heard in the Supreme Court.The INC’s challenge to the validity of the amendments to the Conduct of Election Rules (2024) is being…— Jairam Ramesh (@Jairam_Ramesh) April 4, 2025 ఇదిలా ఉంటే.. రాజ్యసభ(Rajya Sabha)లో గురువారం మధ్యాహ్నాం నుంచి సుమారు 13 గంటలపాటు వక్ఫ్ బిల్లుపై చర్చ జరిగింది. ఓటింగ్‌లో బిల్లుకు అనుకూలంగా 128 మంది, వ్యతిరేకంగా 95 మంది సభ్యులు ఓటేశారు. ప్రతిపక్షాలు ప్రతిపాదించిన సవరణలు వీగిపోయాయి. దీంతో శుక్రవారం ఉదయం బిల్లును ఆమోదించినట్లు పార్లమెంట్ అధికారికంగా ప్రకటించింది. బిల్లుపై చర్చ సందర్భంగా.. ఇది మైనారిటీలకు వ్యతిరేకంగా.. రాజ్యాంగవిరుద్ధంగా ఉందంటూ పలు పార్టీలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. అదే సమయంలో ఇది చారిత్రక సంస్కరణగా అభివర్ణించిన కేంద్రం ఈ బిల్లు ముస్లింలకు లబ్ధి చేకూరుస్తుందని అంటోంది. అంతకు ముందు..సుదీర్ఘ సంవాదాల అనంతరం వక్ఫ్ (సవరణ) బిల్లు-2025కు లోక్‌సభ(Lok Sabha) ఆమోదం తెలిపింది. చర్చ సమయంలో అధికార, విపక్ష సభ్యుల వాద ప్రతివాదాలతో సభ ప్రతిధ్వనించింది. బుధవారం మధ్యాహ్నం నుంచి గురువారం తెల్లవారుజాము 2.15 గం.లు దాటే వరకూ చర్చ, ఓటింగ్ ప్రక్రియ కొనసాగింది. బిల్లుకు అనుకూలంగా 288 మంది, వ్యతిరేకంగా 232 మంది సభ్యులు ఓటు వేశారు. దీంతో.. 56 ఓట్ల తేడాతో ప్రతిపక్షాల అభ్యంతరాలు వీగిపోయాయి. -
బీసీ రిజర్వేషన్ల పెంపుకోసం కొట్లాడుతాం
సాక్షి, న్యూఢిల్లీ: బీసీ రిజర్వేషన్లు 42 శాతానికి పెంచాలని అసెంబ్లీలో తీర్మానం చేయటంద్వారా సామాజిక న్యాయ సాధనలో తెలంగాణ రాష్ట్రం దేశానికే దారి చూపిందని కాంగ్రెస్ అగ్రనేతలు సోనియాగాం«దీ, రాహుల్‌గాంధీ అన్నారు. కులగణనను పూర్తి చేయడంతో పాటు దానికి అసెంబ్లీ ఆమోదం పొందిన తీరు అభినందనీయమని ప్రభుత్వాన్ని ప్రశంసించారు. రాష్ట్ర ప్రభుత్వ చొరవ వల్ల విద్య, ఉద్యోగాల్లో బీసీలకు న్యాయం జరుగుతుందని ఆకాంక్షించారు.బీసీ రిజర్వేషన్ల పెంపునకు తమవంతు సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. పార్లమెంట్ వెలుపలా, లోపలా ఈ తీర్మానం కోసం పోరాటం చేస్తామని తెలిపారు. గురువారం పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆది శ్రీనివాస్, వాకిటి శ్రీహరి, బీర్ల అయిలయ్య, రాజ్‌ఠాకూర్, వీర్లపల్లి శంకర్, సంజీవ్‌రెడ్డి తదితరులు సోనియా, రాహుల్‌లను పార్లమెంట్ ప్రాంగణంలో విడివిడిగా కలిశారు.జనగణన, బీసీ బిల్లుపై తీర్మానం, జంతర్‌మంతర్‌లో ధర్నా గురించి వారికి వివరించారు. పార్లమెంట్లో వక్ఫ్ బిల్లుపై కీలక చర్చ జరుగుతున్న నేపథ్యంలో ధర్నాకు హాజరు కాలేకపోయానని రాహుల్‌గాంధీ ఈ సందర్భంగా చెప్పారు. బీసీలకు సామాజిక న్యా యం జరిగేవరకు అన్ని రకాలుగా మద్దతుగా ఉంటామని హామీ ఇచ్చారు. కేంద్రం చిత్తశుద్ధి నిరూపించుకోవాలి తెలంగాణ అసెంబ్లీ ఆమోదించిన బీసీ రిజర్వేషన్ల పెంపు తీర్మానాన్ని పార్లమెంట్లో ఆమోదించి బీజేపీ తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. తమిళనాడు తరహాలో 42 శాతం రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించాలని కోరారు. రాహుల్, సోనియాతో భేటీ అనంతరం వారు విలేకరులతో మాట్లాడారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై చర్చించేందుకు ప్రధానమంత్రి అపాయింట్మెంట్ తీసుకోవాలని తెలంగాణ బీజేపీ నేతలకు సూచించారు. రిజర్వేషన్ల అమలుకై ఎక్కడికైనా వచ్చేందుకు సీఎం రేవంత్‌తో సహా కేబినెట్ మంత్రులంతా సిద్ధంగా ఉన్నారని తెలిపారు. హెచ్‌సీఏ భూములు వాస్తవంగా ప్రభుత్వానికి చెందినవని చెప్పారు. ఈ భూముల విషయంలో బీఆర్ఎస్, బీజేపీలు అసత్య ప్రచారం చేస్తున్నాయని విమర్శించారు. కాంగ్రెస్ ప్రతినిధి బృందం కేంద్ర సామాజిక న్యాయశాఖ మంత్రి వీరేంద్రకుమార్‌ను కలిసి బీసీ రిజర్వేషన్ల బిల్లుపై చర్చించింది. -
కాంగ్రెస్ సర్కారు ఐదేళ్లు కొనసాగితేనే మంచిది
సాక్షి, హైదరాబాద్ : ‘ప్రస్తుతం రాష్ట్రంలో కొనసాగుతున్న కాంగ్రెస్ ప్రభుత్వ పతనాన్ని మనం కోరుకోవొద్దు. రేవంత్ ప్రభుత్వం ఐదేళ్ల పూర్తికాలం అధికారంలో కొనసాగితేనే.. మనం చేసిన మంచి ఏమిటో వెలుగు చూస్తుంది. ఈ ప్రభుత్వం పనితీరుపై ప్రజలు ఇప్పటికే విసిగివేసారిపోయారు. రాష్ట్రంలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఉపఎన్నికలు రావడం ఖాయం. కాంగ్రెస్ హామీలు అమలు చేయకపోవడంతో జనంలో తిరుగుబాటు మొదలైంది. బీఆర్ఎస్ నేతలు అనునిత్యం ప్రజాక్షేత్రంలో అందుబాటులో ఉంటే మన పట్ల సానుకూలత పెరుగుతుంది’అని బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. ఎర్రవల్లిలో గురువారం ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాలకు చెందిన బీఆర్ఎస్ ముఖ్య నేతలతో కేసీఆర్ భేటీ అయ్యారు. పార్టీ రజతోత్సవాల నిర్వహణ, వరంగల్‌లో జరిగే రజతోత్సవ సభ ఏర్పాట్లపై ముఖ్యనేతలకు దిశానిర్దేశం చేశారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు గంగుల కమలాకర్, జోగు రామన్న, కొప్పుల ఈశ్వర్ తదితరులు పాల్గొన్న ఈ భేటీలో కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. రేవంత్ సర్కారుపై జనం తిరుగుబాటు ‘సెంట్రల్ యూనివర్సిటీ భూముల అమ్మకం విషయంలో రేవంత్ సర్కారుపై జనం తిరుగుబాటు ఆహ్వానించదగిన పరిణామం. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిరుపయోగంగా ఉన్న వాటితోపాటు ఆక్రమణలకు గురవుతున్న భూములను కాపాడి వాటిని పారదర్శకంగా వేలం వేసి ఖజానాకు ఆదాయం సమకూర్చాం. కానీ రేవంత్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులు, ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండా భూముల విక్రయంలో విచక్షణ కోల్పోయి వ్యవహరిస్తోంది’అని కేసీఆర్ అన్నారు. రాష్ట్ర బీజేపీలో నాయకత్వలేమి ‘బీజేపీకి రాష్ట్రంలో సరైన నాయకుడు లేక నాయకత్వ లేమితో కొట్టుమిట్టాడుతోంది. పార్టీలోనూ అంతర్గతంగా నాయకుల నడుమ తీవ్ర విభేదాలు నెలకొన్నాయి. కాంగ్రెస్, బీజేపీ పట్ల ప్రజల్లో తీవ్రస్థాయిలో వ్యతిరేకత కనిపిస్తోంది. రాష్ట్రంలో ఉప ఎన్నికలతోపాటు ఏ ఇతర ఎన్నికలు జరిగినా ఆ రెండు పార్టీల పట్ల ప్రజల్లో ఉన్న వ్యతిరేకత ప్రతిఫలిస్తుంది’అని కేసీఆర్ వ్యాఖ్యానించారు. వరంగల్ సభకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి ప్రత్యేకించి మానకొండూరు, హుస్నాబాద్, హుజూరాబాద్ నియోజకవర్గాల నుంచి పెద్దఎత్తున జన సమీకరణ చేయాలని సూచించారు. ఉమ్మడి కరీంనగర్ నుంచి 2 లక్షలు, ఆదిలాబాద్ నుంచి లక్షన్నరకు తగ్గకుండా జన సమీకరణ చేయాలన్నారు. బీఆర్ఎస్ ముఖ్య నేతలు హాజరు కేసీఆర్‌తో జరిగిన భేటీలో మాజీ ఎంపీలు బోయినపల్లి వినోద్‌కుమార్, జోగినపల్లి సంతోష్ కుమార్, ఎమ్మెల్సీ ఎల్.రమణ ఎమ్మెల్యేలు కల్వకుంట్ల సంజయ్, పాడి కౌశిక్‌రెడ్డి, అనిల్ జాదవ్, కోవా లక్ష్మి, పార్టీ జిల్లా అధ్యక్షులు జీవీ రామకష్ణారావు (కరీంనగర్), తోట ఆగయ్య (సిరిసిల్ల ) జోగు రామన్న (ఆదిలాబాద్ ), బాల్క సుమన్ (మంచిర్యాల) పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యేలు వొడితెల సతీష్ కుమార్, రసమయి బాలకిషన్ , సుంకే రవిశంకర్, దాసరి మనోహర్‌రెడ్డి, కోరుకంటి చందర్, పుట్టా మధు, కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు, నడిపెల్లి దివాకర్‌రావు, దుర్గం చిన్నయ్య తదితరులు పాల్గొన్నారు . బండెనక బండి కట్టి.. గులాబీల జెండ పట్టి రజతోత్సవ సభ నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ రూపొందించిన ‘బండెనక బండి కట్టి.. గులాబీల జెండ పట్టి‘పాటను కేసీఆర్ ఆవిష్కరించారు. పార్టీ అవతరణ నాటి నుంచి నేటి వరకు ప్రస్థానాన్ని గుర్తు చేసేలా పాటలు, కళారూపాలు రూపొందించాలని రసమయి బాలకిషన్‌కు కేసీఆర్ సూచించారు. -
రాజ్యసభ ముందుకు వక్ఫ్ బిల్లు
-
HCU విద్యార్థులపై కేసులు ఎత్తివేస్తాం: భట్టి
సాక్షి, ఢిల్లీ: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థులపై పెట్టిన కేసులను ఎత్తివేస్తామని తెలిపారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. వర్సిటీలో విద్యార్థులపై పోలీసులు దుందుడుకుగా వ్యవహరించవద్దని సూచనలు చేశారు. అలాగే, హెచ్సీయూకు సంబంధించిన ఇంచు భూమిని కూడా ప్రభుత్వం తీసుకోదని స్పష్టం చేశారు.డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఢిల్లీలో సాక్షితో మాట్లాడుతూ..‘గతంలో చంద్రబాబు బిల్లి రావుకు అప్పనంగా 400 ఎకరాలు కట్టబెట్టాడు. భారత్ ఐఎంజీ బోగస్ కంపెనీ అని నాటి ముఖ్యమంత్రి వైఎస్సార్ ఆ భూములను రద్దు చేసి ప్రభుత్వ ఆస్తులను కాపాడారు. ఆ వెంటనే భూములను బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకోకుండా, ప్రైవేటు వారికి లాభం కలిగేలా ఉపేక్షించింది. ప్రైవేటు వారికే ఆ భూములు కట్టబెట్టేలా బీఆర్ఎస్ పని చేసింది. మేం అధికారంలోకి రాగానే హైకోర్టు, సుప్రీంకోర్టులో పోరాటం చేసి 400 ఎకరాలను ప్రభుత్వం స్వాధీనం చేసుకోగలిగింది. ఆ భూములతో హైటెక్ సిటీ ప్రాజెక్టును విస్తరించి ఐటీ కంపెనీలకు అప్పగిస్తాం. హెచ్సీయూకు సంబంధించిన ఇంచు భూమిని కూడా మేము తీసుకోము. పర్యావరణాన్ని, జీవజాలాన్ని కాపాడుతాం. విద్యార్థులపై పెట్టిన కేసులను ఎత్తివేస్తాం. విద్యార్థులపై పోలీసులు అనుచితంగా వ్యవహరించవద్దు. ఆర్ఎస్ఎస్ భావజాలంతో అక్కడున్న విద్యార్థులను కొందరు రెచ్చగొడుతున్నారు. అభివృద్ధి కోసమే భూములను వినియోగిస్తాం. హెచ్సీయూకు ఇప్పటికే వేరే భూములను బదలాయించారు’ అని చెప్పుకొచ్చారు. -
కేటీఆర్‌వి పగటి కలలు.. టీపీసీసీ చీఫ్ సెటైర్లు
సాక్షి, ఢిల్లీ: తెలంగాణలో మళ్లీ అధికారంలోకి వస్తామని కేటీఆర్ పగలు కంటున్నారని కామెంట్స్ చేశారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. రాష్ట్రంలో రాబోయే రాజకీయ ముఖ చిత్రంలో బీఆర్ఎస్ ఉండదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో బంగారం లాంటి భూములను దోచుకున్న ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిది అంటూ విమర్శలు చేశారు.టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. గతంలో చంద్రబాబు ఐఎంజీ భారత్‌కు భూములను అప్పనంగా కట్టబెట్టారు. అప్పుడే వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆ భూమి కేటాయింపులను రద్దుచేసి ప్రభుత్వ భూములను కాపాడారు. రాష్ట్రంలో బంగారం లాంటి భూములను దోచుకున్న ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిది. అన్యాక్రాంతమైన ప్రభుత్వ భూములపైన విచారణ జరగాలి. లక్షల కోట్ల అప్పుల్లో ముంచి తెలంగాణను నాశనం చేసిన వ్యక్తి కేటీఆర్. మళ్లీ అధికారంలోకి వస్తామని కేటీఆర్ పగటి కలలు కంటున్నారు. రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీనే ఉండదు అంటూ వ్యాఖ్యలు చేశారు.అలాగే, మంత్రి వర్గ విస్తరణ ఏఐసీసీ పరిధిలో ఉంది. ఇద్దరు బీసీలకు అవకాశం కల్పించాలని కోరాం. మొత్తం మంత్రి వర్గంలో ఆరు ఖాళీలు ఉన్నాయి. మంత్రి వర్గ విస్తరణలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ప్రాంతాలు, కులాల వారీగా చూడాల్సిన అవసరం ఉంది. త్వరలోనే ఏఐసీసీ నిర్ణయం తీసుకుంటుంది. మంత్రి వర్గ విస్తరణలో మైనార్టీకి అవకాశం ఉంటుందన్నారు. మరోవైపు.. ఢిల్లీలో మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ..‘ఈడబ్ల్యూఎస్ కింద ముస్లింలకి బీజేపీ రిజర్వేషన్లను ఇస్తోంది. ఏపీ నాలుగు శాతం ముస్లిం రిజర్వేషన్లు అమలవుతున్నాయి. ఆ రిజర్వేషన్లను తొలగించే దమ్ము బీజేపీకి ఉందా?. 70 ముస్లిం తెగలకు రిజర్వేషన్లు ఇచ్చామని గతంలోనే నరేంద్ర మోదీ చెప్పారు. తెలంగాణలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను బీజేపీ ఎందుకు అడ్డుకుంటుంది అని ప్రశ్నించారు. -
ఇప్పటికే 14 నెలలు వృథా.. ఇంకా టైం ఎలా అడుగుతారు?: సుప్రీం కోర్టు అసహనం
న్యూఢిల్లీ, సాక్షి: తెలంగాణ ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై సుప్రీం కోర్టు(Supreme Court)లో విచారణ ముగిసింది. అన్నివైపులా వాదనలు పూర్తి కావడంతో జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ అగస్టీన్ జార్జ్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది. అయితే.. 8 వారాల్లోగా తీర్పు వెల్లడించాలని బీఆర్ఎస్ తరఫు న్యాయవాది ఆర్యమా సుందరం విజ్ఞప్తి చేశారు. తెలంగాణ అసెంబ్లీ కార్యదర్శి తరపున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ ఇవాళ ఫిరాయింపుల కేసు(Defections Case)లో వాదనలు వినిపించారు. స్పీకర్ నిర్ణయానికి కాలపరిమితి విధించే విషయంలో ఇప్పటి వరకు ఎలాంటి తీర్పులు లేవని సింఘ్వీ బెంచ్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ క్రమంలో రీజనబుల్ టైం ఏంటో చెప్పాలని స్పీకర్‌ను కోరుతూ.. మరోసారి ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. మీ అభిప్రాయం ప్రకారం సమంజసమైన కాల వ్యవధి(Reasonable Time) అంటే ఎంత?. 2028 జనవరి-ఫిబ్రవరి వరకు ఎదురు చూసేలా.. వ్యవస్థను మార్చేందుకు అనుమతించాలా?. మేము కొంత న్యాయసమ్మతమైన ధోరణిని ఆశిస్తున్నాం అని సింఘ్వీని ఉద్దేశించి జస్టిస్ గవాయి వ్యాఖ్యానించారు. న్యాయవాదులు ఇలాంటి కేసుల విషయంలో వ్యవహరించే విధానం చాలా ఇబ్బందికరంగా ఉందని.. సుప్రీంకోర్టుకు వచ్చిన తర్వాత వారి తీరు పూర్తిగా మారిపోతోందని వ్యాఖ్యానించారు. అనర్హత పిటిషన్లపై విచారణకు మీకు ఎంత సమయం కావాలి? అని ప్రశ్నించగా.. ఒక్క మాటలో చెప్పాలంటే ఆరు నెలల సమయం కావాలి అని న్యాయవాది సింఘ్వీ అన్నారు. దీంతో జస్టిస్ గవాయ్ అసహనం వ్యక్తం చేశారు. ఇప్పటికే 14 నెలల సమయం వృథా అయ్యింది. మరో ఆరు నెలలు ఎలా అడుగుతారు?. ఇన్ని నెలలు గడిచాక కూడా కోర్టులు జోక్యం చేసుకోవాల్సిన సమయం రాలేదా? అని ప్రశ్నించారు. అయితే.. స్పీకర్‌కు తుపాకీ గురిపెట్టి నిర్ణయం తీసుకోమని ఒత్తిడి చేస్తున్నారని లాయర్ సింఘ్వీ అన్నారు. ఈ క్రమంలో.. బీఆర్ఎస్ తరఫు న్యాయవాది ఆర్యమా సుందరం కలుగజేసుకుని సీఎం రేవంత్ అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించారు. ఉప ఎన్నికలు రావని అసెంబ్లీలో సీఎం ప్రకటించారు. స్పీకర్ తరఫునే ఈ వ్యాఖ్యలు చేస్తున్నానని ఆయన చెప్పారు. స్పీకర్ తరఫున సీఎం ఎలా కామెంట్ చేస్తారు?. అసెంబ్లీలో మాట్లాడితే ఏ కోర్టు నుంచి అయినా రక్షణ ఉంటుందని అన్నారు. సీఎం ఉప ఎన్నికలు రావని అసెంబ్లీలో చెప్పాక.. పిటిషన్లపై విచారణ జరుగుతుందని మేమెలా నమ్మాలి అని లాయర్ సుందరం అన్నారు. దీనిపై జస్టిస్ గవాయ్(Justice Gavai) స్పందిస్తూ ‘‘సీఎం కనీసం స్వీయ నియంత్రణ పాటించలేరా? గతంలో కూడా ఇలాంటి ఘటనే జరిగింది. ఆ తర్వాత కూడా ఇలాగే వ్యవహరిస్తే ఎలా?’’ అని ప్రశ్నించారు. మరోవైపు అభిషేక్ మనుసింఘ్వీ కలుగజేసుకుని ప్రతిపక్షం నుంచి అంతకుమించిన రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఉన్నాయని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఇప్పుడు అవన్నీ అప్రస్తుతమని ధర్మాసనం వాటిని పక్కన పెట్టింది. అయితే.. సీఎం మాటలు కోర్టు ధిక్కారం కింద తీసుకోవాల్సి ఉంటుందని జస్టిస్ గవాయ్ హెచ్చరించారు. ‘‘మేం సంయమనం పాటిస్తున్నాం.. మిగతా రెండు వ్యవస్థలు అదే గౌరవంతో ఉండాలి’’ అని వ్యాఖ్యానించారు. స్పీకర్‌కు ఫిర్యాదు చేసిన తర్వాత కోర్టులో కేసులతో తీవ్రస్థాయిలో ఒత్తిడి తీసుకురావాలని చూశారని సింఘ్వీ పేర్కొనగా.. సింగిల్ జడ్జి ఇచ్చిన సూచనలను సానుకూలంగా తీసుకుని ఉంటే కేసు ఇక్కడి వరకు వచ్చేది కాదని జస్టిస్ గవాయ్ అన్నారు. అన్నివైపులా వాదనలు పూర్తి కావడంతో కేసు విచారణ ముగిస్తున్నట్లు.. తీర్పును రిజర్వ్ చేస్తున్నట్లు జస్టిస్ గవాయ్ తెలిపారు. తెలంగాణలో బీఆర్ఎస్ కారు పార్టీ గుర్తు మీద గెలిచిన పది మంది ఎమ్మెల్యేలు.. కాంగ్రెస్‌లోకి ఫిరాయించారని, ఉన్నత న్యాయస్థానం చెప్పినా వాళ్లపై స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకోవడం లేదని.. అనర్హత వేటు కోరుతూ బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, పాడి కౌశిక్‌రెడ్డి, కేపీ వివేకానంద దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ కొనసాగింది. బీఆర్ఎస్ తరఫున ఆర్యమా సుందరం, తెలంగాణ స్పీకర్ తరఫున ముకుల్ రోహత్గీ, అసెంబ్లీ కార్యదర్శి తరఫున న్యాయవాది అభిషేక్ మనుసింఘ్వీ వాదనలు వినిపించారు. -
బందిపోట్లలా కాంగ్రెస్ సర్కారు తీరు!: కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ) భూముల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తీరు బందిపోట్లను తలపిస్తోందని బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు వ్యాఖ్యానించారు. వందలాది బుల్డో జర్లను రంగంలోకి దించి యూనివర్సిటీ భూమిలో విధ్వంసానికి పాల్పడటం రేవంత్ మనస్తత్వానికి అద్దంపడుతోందని విమర్శించారు. ఇతర అంశాల్లోనూ రేవంత్ దూకుడు ఇదే తరహాలో ఉండ టాన్ని ప్రజలు తప్పు పడుతున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పతనం దిశగా వేగంగా పయనిస్తోందని, దానిని ఎవరూ రక్షించలేరని కేసీఆర్ పేర్కొన్నారు. కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వచ్చేది లేదని తెలుసుకునే సీఎంతోపాటు మంత్రులు వీలైనంత త్వరగా సొంత జేబులు నింపుకొనేందుకు పోటీ పడుతున్నారని ఆరోపించారు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వ పతనానికి దారితీస్తుందని చెప్పారు. బుధవారం ఎర్రవల్లి నివాసంలో ఉమ్మడి మెదక్, నిజామాబాద్ జిల్లాలకు చెందిన బీఆర్ఎస్ ముఖ్య నేతలతో కేసీఆర్ భేటీ అయ్యారు. ఈ నెల 27న వరంగల్‌లో నిర్వహించే బీఆర్ఎస్ రజతోత్సవ సభ ఏర్పాట్లు, దేశ, రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఉదయం 11.30 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు జరిగిన ఈ భేటీలో పలు కీలక అంశాలు ప్రస్తావనకు వచ్చినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు, మాజీ మంత్రులు హరీశ్‌రావు, వేముల ప్రశాంత్‌రెడ్డి సహా 20కిపైగా మంది ముఖ్య నాయకులు పాల్గొన్నట్టు వెల్లడించాయి.మోదీ పట్ల ఆర్ఎస్ఎస్ అసంతృప్తి..‘‘దేశవ్యాప్తంగా బీజేపీ ప్రతిష్ట క్రమంగా మసకబారుతోంది. గత ఏడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి సీట్లు తగ్గడమే దీనికి సంకేతం. ఆర్ఎస్ఎస్ కూడా ప్రధాని మోదీ పనితీరు పట్ల సంతృప్తిగా లేదు. ఆయన ఒంటెద్దు పోకడల పట్ల ఆర్ఎస్ఎస్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. పదవి కోసం ఆర్ఎస్ఎస్ను దేబిరించాల్సిన పరిస్థితిలో ప్రధాని మోదీ ఉన్నారు..’’ అని కేసీఆర్ పేర్కొన్నారు. కేంద్రంలో తొలి రెండు పర్యాయాలు ప్రజలను మభ్యపెట్టి మసిపూసి మారేడుకాయ చేయడం ద్వారానే బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు. బీజేపీ రెండుసార్లు అధికారంలోకి వచ్చినా నిర్మాణాత్మకంగా దేశానికి చేసినది చెప్పుకునేందుకు ఏమీ లేదని.. దీంతో ప్రజలు మళ్లీ తమవైపు చూస్తున్నారని చెప్పారు. పదేండ్లలో బీఆర్ఎస్ చేసిన పనితో ఇతర పార్టీల పనితీరును ప్రజలు పోల్చి చూసుకుంటున్నారని.. రాష్ట్ర రాజకీయాల్లో నిరంతరం బీఆర్ఎస్ చేసిన పనులే ఇతర పార్టీల పనితీరుకు గీటు రాయిలా ఉంటాయని అభిప్రాయం వ్యక్తం చేశారు.లక్షలాదిగా సభకు తరలిరావాలి..ఏప్రిల్ 27న అన్ని గ్రామాల్లోనూ పార్టీ కార్యకర్తలు, నాయకులు బీఆర్ఎస్ జెండా ఎగరవేసి వరంగల్ సభకు బయలుదేరాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. వరంగల్‌కు దగ్గరలో ఉండే సిద్దిపేట, గజ్వేల్, దుబ్బాక, మెదక్ నియోజకవర్గాల నుంచి ఎక్కువ సంఖ్యలో పార్టీ శ్రేణులు తరలిరావాలన్నారు. ఒక్కో జిల్లా నుంచి కనీసం రెండు లక్షల మంది తరలివచ్చేలా వాహనాలు సమకూర్చుకోవాలని.. ఆర్టీసీ, ఇతర బస్సులను ఇప్పటి నుంచే సమీకరించడం ప్రారంభించాలని సూచించారు. బీఆర్ఎస్ రజతోత్సవ సభ ప్రచార పోస్టర్ రూపకల్పనకు సంబంధించి కేసీఆర్ పలు సూచనలు చేశారు. ఈ సమావేశంలో ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి ఎమ్మెల్సీలు దేశపతి శ్రీనివాస్, యాదవరెడ్డి, ఎమ్మెల్యేలు కొత్త ప్రభాకర్‌రెడ్డి, చింత ప్రభాకర్, మాణిక్‌రావు, సునీతా లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు పద్మా దేవేందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు క్రాంతి కిరణ్, భూపాల్‌రెడ్డి, పార్టీ నేతలు జైపాల్‌రెడ్డి, ఆదర్శ్‌రెడ్డి... ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి మాజీ ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, గణేశ్ బిగాల, గంప గోవర్ధన్, జాజాల సురేందర్, హన్మంత్ షిండే, ఆశన్నగారి జీవన్‌రెడ్డి, కామారెడ్డి జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు ముజీబుద్దీన్, మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్, పార్టీ రాష్ట్ర నాయకుడు కల్వకుంట్ల వంశీధర్‌రావు తదితరులు పాల్గొన్నారు. -
'భరోసా'.. మెల్లమెల్లగా!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రైతులకు పెట్టుబడి సాయాన్ని అందించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న రైతుభరోసా పథకం నిధుల కొరత కారణంగా క్రమక్రమంగా అమలవుతోంది. ఎకరాకు రూ. 6 వేలు చెల్లించే కార్యక్రమాన్ని జనవరి 26న లాంఛనంగా ప్రారంభించిన ప్రభుత్వం.. రైతుల భూమి విస్తీర్ణాన్ని బట్టి వారి ఖాతాల్లో పెట్టుబడి సాయాన్ని జమచేస్తోంది. జనవరి 27న అన్ని మండలాల్లోని 577 గ్రామాల్లోని సాగు యోగ్యమైన భూములన్నింటికీ రైతు భరోసాను జమ చేసిన ప్రభుత్వం.. ఆ తరువాత మూడు విడతల్లో కలిపి 3 ఎకరాల్లోపు భూములున్న 44.82 లక్షల మంది రైతులకు చెందిన 58.13 లక్షల ఎకరాలకు రూ. 3,487.82 కోట్లను జమ చేసింది. మార్చి నెలాఖరు నుంచి ఇప్పటివరకు మరో రూ.1,500 కోట్ల మేర రైతుల ఖాతాల్లో జమ చేసింది. రాష్ట్ర ఖజానా పరిస్థితి, నిధుల లభ్యతను పరిగణనలోకి తీసుకుంటూ ప్రభుత్వం ఇప్పటివరకు రైతుల ఖాతాల్లోకి రూ. 5,057 కోట్లను జమ చేసినట్లు ఓ ఉన్నతాధికారి తెలిపారు. ఈ లెక్కన 84.28 లక్షల ఎకరాలకు ప్రభుత్వం రైతుభరోసా నిధులు జమచేసినట్లు తెలుస్తోంది. సుమారు 57 లక్షల మంది ఖాతాల్లో రైతు భరోసా జమ అయినట్లు అధికారులు చెబుతున్నారు. మిగతా వారికి ఎలా? ప్రభుత్వం ఇంకా సుమారు మరో 13 లక్షల మంది రైతులకు దాదాపు రూ. 4 వేల కోట్ల వరకు చెల్లించాల్సి ఉంది. ఖజానా నుంచి 2–3 రోజులకోసారి రూ. 100 కోట్లకుపైగా నిధులను రైతుల ఖాతాల్లో జమ చేస్తుండటంతో ఇప్పటివరకు ఎన్ని ఎకరాల విస్తీర్ణం వరకు రైతుభరోసా నిధులు పడ్డాయనే కచి్చతమైన సమాచారం అధికారుల వద్ద కూడా లేకపోవడం గమనార్హం. అయితే గత ప్రభుత్వ హయాంలో రైతుబంధు కింద వచ్చిన నిధుల లెక్కలను బట్టి దాదాపు 5 ఎకరాల విస్తీర్ణం వరకు గల భూములకు రైతుభరోసా డబ్బులు జమ అయినట్లు తెలుస్తోంది. 2024–25 ఆర్థిక సంవత్సరం ముగిసిన నేపథ్యంలో మిగతా వారికి ఏ సంవత్సరం పద్దు కింద పెట్టుబడి సాయం అందజేస్తారనే విషయంలో స్పష్టత లేదు. యాసంగి కోతలు మొదలైనా తప్పని నిరీక్షణ రాష్ట్రంలో యాసంగి కోతలు మొదలయ్యాయి. నల్లగొండ, నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో ఏర్పాటు చేసిన 44 కొనుగోలు కేంద్రాల ద్వారా 183 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మార్చి నెలాఖరు వరకే కొనుగోలు చేశారు. బుధవారం నుంచి కొనుగోలు కేంద్రాల సంఖ్యను కూడా పెంచుతున్నారు. ఒకవైపు యాసంగి కోతలు మొదలై పంట చేతికి వస్తున్నప్పటికీ ఇంకా రైతుభరోసా డబ్బులు ఖాతాల్లో జమ కాకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. యాసంగి కోతలు పూర్తయితే జూన్ నుంచి వానాకాలం పంటసాగు మొదలవనుంది. ఇప్పటికే మరో రూ. 4 వేల కోట్లు పెండింగ్‌లో ఉండగా వచ్చే వానాకాలం సాగుకు ఆర్థికసాయం సకాలంలో అందే అవకాశాలు కష్టమేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. కొర్రీలతో చాలా మంది రైతులకు ఆగిన సాయం రైతుభరోసా కింద సాగుయోగ్యమైన భూములన్నింటికీ పెట్టుబడి సాయం అందజేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించినప్పటికీ వివిధ కారణాలతో చాలా గ్రామాల్లోని రైతుల ఖాతాల్లో డబ్బులు జమకాలేదు. రీసర్వే సెటిల్మెంట్ రిజిస్టర్ (ఆర్ఎస్ఆర్)లో ఉన్న భూవిస్తీర్ణంకన్నా రైతుల పాస్ పుస్తకాల్లో ఎక్కువుంటే ఆ సర్వే నంబర్లోని రైతులకు డబ్బులు పడలేదు. దీనిపై ఫిర్యాదులతో సమస్య పరిష్కారం అయినట్లు అధికారులు చెబుతున్నప్పటికీ చాలా జిల్లాల్లో ఆ సమస్య పెండింగ్‌లోనే ఉంది. గత ప్రభుత్వ హయాంలో రైతుబంధు అధిక మొత్తంలో పొందేందుకు కొందరు రైతులు రెవెన్యూ, వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి భూవిస్తీర్ణాన్ని పెంచడమే అందుకు కారణమని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. అలాగే వ్యవసాయ భూముల్లో సొంత ఇళ్లు ఉన్నవారికి కూడా ఆయా సర్వే నంబర్లలోని భూములను రైతుభరోసాకు మినహాయించారు. స్కూళ్లు, కళాశాలలు, రైస్ మిల్లులు, కోళ్ల ఫారాల వంటి వాణిజ్య కార్యకలాపాలు ఉన్న భూముల సర్వే నంబర్లలో వ్యవసాయం చేసే రైతులకు కూడా చాలాచోట్ల రైతుభరోసా జమకాలేదు. కొన్ని గ్రామాల్లో ఒకే సర్వే నంబర్లో ఉన్న ఒక రైతుకు రైతుభరోసా సాయం అందితే పక్కనున్న మరో రైతుకు డబ్బు జమకాలేదు. అలాగే భూ లావాదేవీల్లో కొత్తగా భూమి పట్టా అయి పాస్‌పుస్తకం వచ్చిన వారికి కూడా చాలా చోట్ల డబ్బులు జమకాలేదు. ఇలాంటి సమస్యలు ఎందుకొచ్చాయో తెలియట్లేదని అధికారులు చెబుతుండటం గమనార్హం. -
అప్పుడైనా,ఇప్పుడైనా తెలంగాణకు కేసీఆర్ శ్రీరామ రక్ష
హైదరాబాద్,సాక్షి: అప్పుడైనా,ఇప్పుడైనా తెలంగాణకి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ శ్రీరామ రక్ష అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు. ప్రస్తుత రాష్ట్ర రాజకీయాలపై కవిత ఎక్స్ వేదికగా స్పందించారు.అసెంబ్లీ ఆమోదించిన చట్టాలను కోల్డ్ స్టోరేజీకి పంపే స్క్రీన్ ప్లే.బీజేపీని కాపాడేందుకే సీఎం రేవంత్ రెడ్డి డైవర్షన్ డ్రామా. మరో సారి బయటపడిన కాంగ్రెస్, బీజేపీ బంధం. బీసీలకు రాజకీయ, విద్య, ఉద్యోగ రిజర్వేషన్లపై అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లకుండా కుతంత్రం.అఖిలపక్షాన్ని తీసుకెళ్తే కేంద్రాన్ని నిలదీస్తారన్న జంకు. అందుకే ఢిల్లీలో బీసీ సంఘాల ధర్నాకు హాజరు పేరిట మమ అనిపించే యత్నం.మోదీ సర్కారుకు ఎలాంటి ఇబ్బంది రాకుండా పకడ్బందీ స్కెచ్. తెలంగాణ ప్రజల ఓట్లే తప్ప.. వాళ్ల పాట్లు పట్టని కాంగ్రెస్ అగ్రనాయకత్వం. ఢిల్లీలో బీసీ సంఘాల ధర్నాకు కాంగ్రెస్ నేత, లోక్ సభలో ప్రధాన ప్రతిపక్ష నేత హాజరవుతారని ప్రచారం. జంతర్ మంతర్‌కు కూతవేటు దూరంలోనే ఉన్నా ధర్నాకు రాకుండా బీసీలను అవమానించిన కాంగ్రెస్ అగ్రనాయకత్వం.అసెంబ్లీ ఆమోదించిన చట్టాలను కోల్డ్ స్టోరేజీకి పంపే స్క్రీన్ ప్లే...బీజేపీని కాపాడేందుకే సీఎం రేవంత్ రెడ్డి డైవర్షన్ డ్రామా...మరో సారి బయటపడిన కాంగ్రెస్, బీజేపీ బంధం...బీసీలకు రాజకీయ, విద్య, ఉద్యోగ రిజర్వేషన్లపై అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లకుండా కుతంత్రం...…— Kavitha Kalvakuntla (@RaoKavitha) April 2, 2025 తెలంగాణ లో సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ సాగిస్తున్న ఏ ఒక్క దమనకాండపై ఇప్పటి వరకు నోరు విప్పని రాహుల్ గాంధీ. లగచర్ల రైతుల మీద, బంజారా మహిళలపై సర్కార్ అఘాయిత్యాలపై మాట్లాడరు. మూసి ప్రాజెక్టు పేరిట పేద ప్రజల ఇళ్లను కూలగొడితే స్పందించరు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థులపై పోలీసులు లాఠీలు ఝుళిపించినా ఖండించరు.ఇప్పుడు ఢిల్లీ వేదికగా మా బీసీ బిడ్డల ధర్నాకు రాకుండా అవమానించారు. అందుకే మేము ముందే చెప్పాం.. ఆయన ఎన్నికల గాంధీ అని.రాహుల్ గాంధీకి తెలంగాణతో పేగుబంధం లేదు.. ఉన్నది కేవలం ఎన్నికల బంధం మాత్రమేనని. అప్పుడైనా,ఇప్పుడైనా తెలంగాణకి కేసీఆర్ మాత్రమే శ్రీరామ రక్ష’ అని వ్యాఖ్యానించారు. -
కాసుల కక్కుర్తితో HCU విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడొద్దు
తెలంగాణ భవన్,సాక్షి: హెచ్‌సీయూ భూముల కోసం న్యాయ పోరాటం చేస్తున్న విద్యార్థులను.. పెయిడ్ బ్యాచ్ అని మంత్రులు మాట్లాడడం సిగ్గుచేటు’అని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి జగదీష్‌రెడ్డి ఆరోపించారు.హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులపై జరిగిన లాఠీ ఛార్జీపై జగదీష్‌రెడ్డి మాట్లాడారు. తెలంగాణ భవన్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. హెచ్‌సీయూ భవిష్యత్తు కోసం ఆందోళన చేస్తున్న విద్యార్థులపై పోలీసుల జరిపిన లాఠీఛార్జ్‌ను బీఆర్ఎస్ ఖండిస్తోంది. 1969లో విద్యార్థుల పోరాట ఫలితం వల్లనే HCUను సాధించుకున్నాం. ఉద్యమ ఫలితంగా సాధించిన HCUను కాపాడుకునేందుకు విద్యార్థులు పోరాటం చేస్తున్నారు.న్యాయ పోరాటం చేస్తున్న విద్యార్థులను.. పెయిడ్ బ్యాచ్ అని మంత్రులు మాట్లాడడం సిగ్గుచేటు. ఈ రాష్ట్రంలో పెయిడ్ బ్యాచ్ ముఖ్యమంత్రి,మంత్రులు. బ్లాక్ దందా వల్ల వచ్చిన పైసలతో పదవులు తెచ్చుకున్నారు. సమాజ శ్రేయసు కొరకు విద్యార్థులు పాటుపడుతారు. విద్యార్థులకు మద్దతుగా మాట్లాడిన కాంగ్రెస్ పార్టీ ఎంపీ కార్తి చిదంబరం, నటుడు ప్రకాష్ రాజ్ పేమెంట్ బ్యాచ్ నా. కేసీఆర్ హరితహారం చేస్తే , కాంగ్రెస్ హరితసంహారం చేస్తుంది.కేసీఆర్ వనసంరక్షణ చేస్తే రేవంత్ రెడ్డి హరిత భక్షణ చేస్తున్నారు. బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే హెచ్‌సీయూలో జరుగుతున్న పనులు ఆపొచ్చు. పోలీసులను బయటకు పంపొచ్చు. కాంగ్రెస్, బీజేపీలు నాటకం ఆడుతున్నాయి. వైస్ ఛాన్సలర్ పర్మిషన్ లేకుండా పోలీసులు ఎలా లోపటికి వెళ్తారు. డ్రోన్ కెమెరా ఎగరేస్తే 500 రూపాయలతో ఫైన్ వేయొచ్చు అని మాట్లాడిన రేవంత్ రెడ్డి. ఇవ్వాళ హెచ్‌సీయూ విద్యార్థులు డ్రోన్ ఎగరేశారని వారిని అరెస్ట్ చేసి కేసులు పెట్టారు.హెచ్‌సీయూ భూముల అమ్మక వ్యవహారం చీకటి దందాలో భాగమే.హెచ్‌సీయూ భూములను గురువు కోసం (చంద్రబాబు నాయుడు) అప్పనంగా రేవంత్ రెడ్డి చీకటి దందాకు తెరలేపారు. సేవ్ హెచ్‌సీయూ అని యూనివర్సిటీ విద్యార్థులకు సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే 5 లక్షల మంది మద్దతు పలికారు. వారందరూ పెయిడ్ బ్యాచ్చేనా. హెచ్‌సీయూ భూములను అమ్మిన మూటల కోసమే రాహుల్ గాంధీ మౌనంగా ఉంటున్నారు.యూనివర్సిటీనీ గౌరవించే మా హయంలో రోడ్లు వెయ్యలేదు. కమిషన్ల కొరకు కక్కుర్తి పడి రైతుల జీవితాలతో , విద్యార్థుల జీవితాలతో ఈ ప్రభుత్వం చెలగాటం ఆడుతుందని ఆరోపణలు గుప్పించారు. -
తప్పులను సరిదిద్దుకోకపోతే సంకటమే!
ఎంతో చారిత్రక నేపథ్యంతో పాటు బోధన, పరిశోధనల్లో దేశంలోనే పేరెన్నికగన్నది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ). ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే ఆ యూనివర్సిటీలో అలజడికి కారణమవ్వడం చర్చనీయాంశమయ్యింది. ‘ఆరు సూత్రాల పథకం’లో భాగంగా 2,300 ఎకరాల విస్తీర్ణంలో 1974లో ఈ విశ్వవిద్యాలయం ప్రారంభమయ్యింది. ఈ కేంద్ర విశ్వవిద్యాలయం రెండు తెలుగు రాష్ట్రాల విద్యార్థులతో పాటు దేశంలోని పలు రాష్ట్రాల విద్యార్థులకు వైవిధ్యమైన, ఉన్నతమైన విద్యా జీవితాన్ని అందిస్తున్నది. 2015లో ఉత్తమ కేంద్ర విశ్వవిద్యాలయంగా భారత రాష్ట్రపతి ‘విజిటర్స్’ అవార్డును సహితం పొందింది. 2020లో ‘ఇండియా టుడే’ ప్రకటించిన ర్యాంకింగ్‌లో దేశంలోని మొత్తం ఉత్తమ ప్రభుత్వ వర్సిటీలలో రెండో స్థానంలో నిలిచింది. అకడమిక్ సంబంధిత అంశాల్లోనే కాకుండా సామాజిక మార్పు దిశగా దేశంలో జరుగుతున్న ప్రతి ప్రయత్నంతోనూ అనుబంధాన్ని కొనసాగిస్తూ, ప్రత్యక్షంగానో, పరోక్షంగానో భాగస్వామిగా ఉంటూ, విశ్వవిద్యాలయానికి ఉండవలిసిన మానవీయ చలనశీల స్వాభా వికతను కూడా హెచ్‌సీయూ కాపాడుకుంటూనే ఉన్నది. విద్యార్థులలో ప్రజల కోసం అమరులైన వీరస్వామి లాంటి వాళ్ళు, వివక్ష సమాజంపై సిరా దండోరా మోగించిన నాగప్పగారి సుందర్ రాజు లాంటి కీర్తిశేషులైన అధ్యాపకులు, అలాగే సమాజంతో మేధాపరమైన సంబంధాన్ని నిత్యం ఉనికి లోనే ఉంచుకొని వృత్తి జీవితాన్ని మరింత చైత న్యవంతంగా కొనసాగించిన రత్నం, హర గోపాల్ వంటి ఎందరో మేధావులకు చిరునామా హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం.జాతీయ, అంతర్జాతీయ అంశాలపై లోతైన అధ్యయనాలు, అర్థవంతమైన చర్చలు, ఆరోగ్యవంతమైన భావజాల సంఘర్షణలకు హెచ్‌సీయూ కేంద్రం. 2016లో జరిగిన రోహిత్ వేముల బాధాకర ఉదంతం, సెంట్రల్ వర్సిటీలలో కొన సాగుతున్న అవలక్షణాలను సహితం దేశ వ్యాప్తంగా చర్చకు పెట్టి పెద్ద పోరాటానికి దారితీసింది. ఆ సందర్భంలోనే హెచ్‌సీయూ గేట్ ముందు రాహుల్ గాంధీ కూడా ధర్నాలో కూర్చొని విద్యావ్యవస్థలో వివక్షకు వ్యతిరేకంగా, పాలకుల వైఖరిని ఎండగడుతూ ప్రసంగించారు. రెండు సార్లు భిన్న సందర్భాల్లో హెచ్సీయూకు వచ్చిన రాహుల్ గాంధీకి ఈ వర్సిటీతో స్నేహ పూర్వక సంబంధమే కాదు... దానిపై సంపూ ర్ణమైన అవగాహనే ఉండి ఉంటుంది. అలాంటి వర్సిటీలో సొంత పార్టీ రాష్ట్ర ప్రభుత్వం అనా లోచితంగా, ఉగాది పండుగనాడు ప్రదర్శించిన పోలీస్ జులుం దేశవ్యాప్తంగా చర్చగా మారిన తర్వాత కూడా రాహుల్ కనీసం స్పందించక పోవడం బాధాకరం. విద్యార్థుల ఉద్యమానికి కుట్రకోణం ఆపాదించేందుకు అరెస్ట్ చేసిన ఇద్దరు విద్యార్థులను అసలు వారు వర్సిటీ విద్యా ర్థులే కాదని పోలీస్ అధికారితో ప్రకటింపజేసి... రిమాండ్ రిపోర్టులో మాత్రం వర్సిటీ విద్యార్థు లుగా పేర్కొని ప్రభుత్వం అభాసుపాలైంది.వివాదానికి కారణంగా చెబుతున్న 400 ఎక రాలు సర్కార్‌వేనని హెచ్‌సీయూ అంగీకరించిందని అబద్ధాలు వల్లించింది రాష్ట్ర సర్కార్. తీరా అసలు రెవెన్యూ సిబ్బంది సర్వేనే నిర్వహించ లేదనీ, హద్దులే నిర్ణయించలేదనీ వర్సిటీ రిజిస్ట్రార్ అధికారికంగా ప్రకటించడంతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం అబద్ధం బట్టబయలైపోయింది. అసలు 2004 ఎన్నికలకు ముందు ఆనాటి చంద్రబాబు ప్రభుత్వం చివరిరోజుల్లో అనుమానాస్పదంగా బిల్లీరావు అనే అతనికి చెందిన ‘ఐఎంజీ అకాడమీస్ భారత ప్రైవేట్ లిమిటెడ్’ అనే సంస్థకు అప్పనంగా 400 ఎకరాల విలువైన ఈ భూమిని కేటాయించడమే అతి పెద్ద రాజ కీయ వివాదమైంది. క్రీడల అభివృద్ధి పేరిట జరిగిన భూ పందేరాన్ని 2006లో వైఎస్సార్ ప్రభుత్వం పరిశీలించి, పనులే ప్రారంభించని కారణంగా రద్దు చేసింది. ఆనాటి చంద్రబాబు ప్రభుత్వ నిర్వాకం వల్ల వైఎస్సార్ సర్కార్ రద్దు చేసినా, సుప్రీం కోర్ట్ దాకా తర్వాతి ప్రభుత్వాలు న్యాయపరమైన భూపోరాటం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇలా అనాడు సర్కార్ దిగి పోయే ముందు అన్యాయమైన విధానంలో స్వాధీనం చేసుకొని, పందేరం చేసిన విలువైన వర్సిటీ భూములను తాజాగా రేవంత్ రెడ్డి సర్కార్ స్వాధీనం చేసుకొని, వేలం వేసేందుకు ఉవ్విళ్లూరుతుండటమే విద్యార్థిలోకానికి ఆవేదన కలిగిస్తున్నది. ఎడాపెడా వాగ్దానం చేసిన పథ కాల అమలుకు కావలసిన నిధుల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం విశ్వవిద్యాలయ భూముల వేలానికి దిగజారడం అన్యాయం.ఇప్పటికైనా హెచ్‌సీయూ విజ్ఞప్తిని సానుకూలంగా అర్థం చేసుకొని, భూములను దానికే అప్పగించాలి. చేసిన తప్పులకు దిద్దుబాటు చర్యలు తీసుకోకపోతే తగిన రాజకీయ మూల్యాన్ని కాంగ్రెస్ పార్టీ చెల్లించుకోవలసి వస్తుంది.డా‘‘ ఆంజనేయ గౌడ్ వ్యాసకర్త తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ మాజీ చైర్మన్ ‘ 98853 52242 -
మాకూ 'మంత్రి' ఇవ్వండి
సాక్షి, హైదరాబాద్: ఎడతెగని సస్పెన్స్‌గా మారిన రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ అంశం ఆశావహులను ఒక్కచోట నిలువనీయటం లేదు. అమాత్య పదవి కోసం ఎవరి ప్రయత్నాలు వారు చేసుకొంటున్నారు. కొందరు నేతలు పార్టీ అధిష్టానానికి లేఖల ద్వారా విన్నపాలు చేసుకుంటున్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సమయంలోనే ఢిల్లీ పెద్దలకు సామాజిక వర్గాలవారీగా ఎమ్మెల్యేలు లేఖలు రాశారు. తాజాగా పార్టీ సీనియర్ నేత కె.జానారెడ్డి రాసిన లేఖ కూడా వెలుగులోకి వచ్చింది. ఉమ్మడి రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల నుంచి మంత్రివర్గంలో ప్రాతినిధ్యం కల్పించాలని ఆయన ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు రాసిన లేఖ పార్టీలో చర్చకు దారితీసింది. ఉమ్మడి జిల్లాలు.. సామాజిక వర్గాలురాష్ట్ర మంత్రివర్గంలో ప్రస్తుతానికి ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకు ప్రాతినిధ్యం లేదు. రెడ్డి సామాజిక వర్గానికి నాలుగు, బీసీలకు రెండు, మాల, మాదిగ, ఆదివాసీ వర్గాలకు ఒక్కోటి చొప్పున కేబినెట్ బెర్తులు లభించాయి. విస్తరణ జరిగితే బీసీ, రెడ్డి వర్గాలకు ఒకటి లేదా రెండు బెర్తులు ఇవ్వాలనే డిమాండ్ ఉంది. జనాభా ప్రాతిపదికన మాదిగ, లంబాడా వర్గాలకు చెరో బెర్తు ఇవ్వాలనే డిమాండ్ కూడా తెరపైకి వచ్చింది. బెర్తు దక్కని నాలుగు ఉమ్మడి జిల్లాల నేతల నుంచి కూడా కేబినెట్లో స్థానంపై చాలా ఆశలున్నాయి. ఒకరిద్దరు ఎమ్మెల్యేలకు అసెంబ్లీ ఎన్నికలకు ముందే అధిష్టానం మాట ఇచ్చిందనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఏ ప్రాతిపదికన కేబినెట్లో ఖాళీ బెర్తులు భర్తీ చేయాలి? ఎన్ని భర్తీ చేయాలన్న దానిపై అధిష్టానం మల్లగుల్లాలు పడుతోంది. విస్తరణ వార్తల నేపథ్యంలో మాదిగ, లంబాడా వర్గాలతో పాటు రంగారెడ్డి జిల్లా నేతలు ఇప్పటికే అధిష్టానానికి లేఖలు రాశారు. ఒకరిద్దరికి మంత్రి పదవుల కేటాయింపులో కుటుంబ కథా చిత్రాలు కూడా నడుస్తున్నాయి. ఉంటుందా... వాయిదానా?ఇలాంటి పరిస్థితుల్లో అసలు కేబినెట్ విస్తరణ ఉంటుందా లేదా? అన్న అనుమానాలు రాష్ట్ర కాంగ్రెస్ నేతల్లో వ్యక్తమవుతున్నాయి. అయితే, ఈ నెల 3 లేదా 4వ తేదీన విస్తరణ ఉంటుందని, మళ్లీ వాయిదా పడినా మరో వారం రోజుల్లో కచ్చితంగా విస్తరణ జరుగుతుందని ఢిల్లీ నుంచి సంకేతాలు అందుతున్నాయి. మరోవైపు కేబినెట్ విస్తరణ జరిగితే ఈ వారంలోనే ఉంటుందని, లేదంటే నిరవధికంగా వాయిదా పడినట్టేననే చర్చ కూడా కాంగ్రెస్ వర్గాల్లో జరుగుతుండడం గమనార్హం.ఢిల్లీకి వెళ్లిన సీఎం, నేడు వెళ్లనున్న డిప్యూటీముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి మంగళవారం ఢిల్లీ వెళ్లారు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క బుధవారం వెళ్లనున్నారు. బీసీలకు విద్య, ఉద్యోగ రంగాల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ అసెంబ్లీలో చేసిన తీర్మానాన్ని పార్లమెంటులో కూడా ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తూ బీసీ సంఘాలు జంతర్‌మంతర్ వద్ద నిర్వహిస్తున్న ధర్నాలో వారు పాల్గొంటారు. ఈ ధర్నాలో పాల్గొనేందుకు పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, బీసీ ఎమ్మెల్యేలు ఆది శ్రీనివాస్, బీర్ల అయిలయ్య, వాకిటి శ్రీహరి, మక్కాన్‌సింగ్ రాజ్‌ఠాకూర్, ప్రకాశ్‌గౌడ్, ఈర్లపల్లి శంకరయ్య తదితరులు ఇప్పటికే ఢిల్లీ చేరుకున్నారు. ఈ ధర్నాకు లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ కూడా హాజరయ్యే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ఢిల్లీలో రాహుల్‌ను సీఎం కలుస్తారని సమాచారం. రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్య నేతలంతా ఢిల్లీలోనే ఉన్నందున వారితో పార్టీ అధిష్టానం మరోమారు చర్చలు జరిపి, మంత్రివర్గ విస్తరణ ముహూర్తాన్ని ఫైనల్ చేస్తుందా? అనేది నేడో రేపో తేలనుంది. -
మోదీ ఫొటో పెట్టాలనడం సరికాదు
సాక్షి, యాదాద్రి, కనగల్: రేషన్ దుకాణాల్లో నరేంద్రమోదీ ఫొటో పెట్టాలని బండి సంజయ్ జోక్ చేస్తున్నాడని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. కేంద్రం ఏం ఇస్తుందని ప్రధాని ఫొటో రేషన్ దుకాణాల్లో పెట్టాలని ఆయన ప్రశ్నించారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో, నల్లగొండ జిల్లా కనగల్ మండలం జి.ఎడవల్లి గ్రామంలో మంగళవారం సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, శంషాబాద్ ఎయిర్‌పోర్టు కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో నిర్మించారని, అందులో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం వాటా 13 శాతం ఉందన్నారు. మరి ఎయిర్‌పోర్టులో తెలంగాణ సీఎం ఫొటో ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. బండి సంజయ్ చిల్లర రాజకీయం మానుకోవాలని హితవుపలికారు. రాష్ట్రాల సముదాయమే కేంద్రమని, రాష్ట్రాల నుంచి వచ్చే ఆదాయంతోనే కేంద్రం నడుస్తుందన్నారు. కేంద్రానికి తెలంగాణ రాష్ట్రం రూపాయి ఇస్తే.. 42 పైసలే వాపస్ ఇస్తున్నారని అన్నారు. ఉత్తరప్రదేశ్, బిహార్ రాష్ట్రాలకు రూపాయి ఇస్తే.. 7 రూపాయలు తిరిగి ఇస్తున్నారని.. బండి సంజయ్ ఇది తెలుసుకోవాలన్నారు. సన్న బియ్యం పథకం చరిత్రలో నిలిచిపోతుంది..సన్న బియ్యం పథకం నిరుపేదల ఆత్మగౌరవమని, ఇది చరిత్రలో నిలిచిపోయే పథకమని మంత్రి కోమటిరెడ్డి అన్నారు. గత ప్రభుత్వం పదేళ్లలో ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని, తమ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు ఇస్తోందని, 20 లక్షల మంది పేర్లు రేషన్ కార్డులలో చేర్పించామని చెప్పారు. రూ.3 కోట్ల పది లక్షల మందికి సన్నబియ్యం ఇవ్వనున్నామని, పేదలకు ఇందిరమ్మ ఇళ్లు ఇస్తున్నామని తెలిపారు. ఆయా కార్యక్రమాల్లో ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి, నల్లగొండ కలెక్టర్ ఇలా త్రిపాఠి, భువనగిరి కలెక్టర్ హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. -
హెచ్‌సీయూది కాదు.. ఆ 400 ఎకరాలు
సాక్షి, హైదరాబాద్: కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమి హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయానిది (హెచ్‌సీయూ) కాదని ప్రభుత్వం పేర్కొంది. ఆ భూమి వర్సిటీదే కానప్పుడు తీసుకుంటున్నామనడంలో వాస్తవం ఏముంటుందని ప్రశ్నించింది. ఈ భూముల కోసం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అలుపెరుగని పోరాటం చేశారని గుర్తు చేసింది. ఈ భూమిని పరిశ్రమల స్థాపనకు వినియోగిస్తామని తెలిపింది. ప్రస్తుతం వర్సిటీ పరిధిలో ఉన్న భూములకు చట్టబద్ధత కల్పిస్తామని వెల్లడించింది. హెచ్సీయూకు చెందిన ఇంచ్ భూమిని కూడా తీసుకునే ఉద్దేశం లేదని స్పష్టం చేసింది. పర్యావరణానికి ముప్పు తెచ్చే చర్యలు వర్సిటీ పరిసర ప్రాంతాల్లో ఏమాత్రం చేపట్టబోమని హామీ ఇచ్చింది. హెచ్‌సీయూ భూములను లాక్కునేందుకు ప్రభు త్వం ప్రయత్నిస్తోందంటూ వివిధ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మంగళవారం సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరణ ఇచ్చారు. రాజకీయ లబ్ధి కోసం, అభివృద్ధిని అడ్డుకునేలా బీఆర్ఎస్, బీజేపీ అసత్య ప్రచా రం చేస్తున్నాయని విమర్శించారు. ఆ 400 ఎకరాల భూమి ప్రభుత్వ అ«దీనంలోనే ఉందని చెప్పారు. వర్సిటీకి భూమి ఇచ్చింది కాంగ్రెస్ సర్కారే: భట్టి భూమి ఇచ్చి హెచ్‌సీయూను ఏర్పాటు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని భట్టి అన్నారు. ఇందులో 400 ఎకరాల భూమిని తెలుగుదేశం ప్రభుత్వం బిల్లీరావుకు చెందిన మోసపూరితమైన కంపెనీ ఐఎంజీ భారత్‌కు కట్టబెట్టిందని తెలిపారు. ఈ భూమి తీసుకున్నందుకు పరిహారంగా యూనివర్సిటీకి ఆనుకునే మరోచోట (గోపన్‌పల్లి వైపు) 397 ఎకరాలు ఇచ్చిందని చెప్పారు. ఇందుకు సంబంధించి ప్రభుత్వం, యూనివర్సిటీ అధికారుల మధ్య అప్పట్లోనే ఒప్పందం జరిగిందన్నారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత 2006 నవంబర్ 21న ఐఎంజీ భారత్‌కు టీడీపీ ఇచ్చిన భూమిని రద్దు చేశారని తెలిపారు. దీంతో బిల్లీరావు హైకోర్టును ఆశ్రయించారని, కానీ వైఎస్సార్ అలుపెరగని న్యాయ పోరాటంతో ప్రజల భూమిని తిరిగి దక్కించుకునేందుకు ప్రయత్నం చేశారని తెలిపారు. అయితే రాష్ట్ర విభజన అనంతరం అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్ళుగా ఈ భూమిని కాపాడే ప్రయత్నం చేయలేదని విమర్శించారు. రూ.కోట్ల విలువైన భూమిని గాలికొదిలి పరోక్షంగా ఫ్రాడ్ కంపెనీకి మేలు చేసిందని దుయ్యబట్టారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తిరిగి న్యాయ పోరాటం చేసి, విజయం సాధించామని, ప్రజల భూమిని ప్రజలకు చెందేలా చేశామని వివరించారు. ప్రస్తుతం ఈ భూమిని టీజీఐఐసీ ద్వారా పరిశ్రమల స్థాపనకు వినియోగించే ప్రయత్నం చేస్తున్నామని భట్టి పేర్కొన్నారు. పెద్ద ఎత్తున పెట్టుబడులు తెచ్చి, యువతకు ఉద్యోగాలు కల్పించడమే దీని ఉద్దేశమన్నారు. ఇందులో ప్రభుత్వంలోని ఏ ఒక్కరి స్వార్థం లేదని చెప్పారు. వర్సిటీ పరిసర ప్రాంతాల్లో బహుళ అంతస్తుల భవనాలు వెలుస్తుంటే వాటికి తమ హయాంలోనే అనుమతులు ఇచ్చిన బీఆర్ఎస్ పార్టీ నేతలు..ఇప్పుడు పర్యావరణం దెబ్బతింటోందని మాట్లాడటంలో అర్థం లేదని విమర్శించారు. వారి రాజకీయ కుట్రలను తిప్పికొట్టాలని ప్రజలకు భట్టి విజ్ఞప్తి చేశారు. ఆ ప్రచారంలో వాస్తవం లేదు: శ్రీధర్‌బాబు కంచె గచ్చిబౌలిలోని 25వ సర్వే నంబర్లో ఉన్న భూమికి ఇప్పటివరకూ కచ్చితమైన రికార్డులు లేవని మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. 2016లో దీనిపై అప్పటి ప్రభుత్వం ఐఏఎస్‌లతో కమిటీ వేసిందని, ఆ కమిటీ 1,500 ఎకరాలపై యూనివర్సిటీకి హక్కులు కల్పించేందుకు కొన్ని సిఫారసులు చేసిందని చెప్పారు. అయితే గత ప్రభుత్వం ఈ దిశగా ఎలాంటి చర్యలూ తీసుకోలేదని మంత్రి విమర్శించారు. ఇటీవల తాము యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్, రిజి్రస్టార్‌తో సంప్రదింపులు జరిపామని, చట్టబద్ధమైన హక్కులు కల్పించే దిశగా కార్యాచరణ రూపొందిస్తున్నామని వెల్లడించారు. ఆ 400 ఎకరాల భూమిలో చెరువులు, బండరాళ్లు దెబ్బతింటున్నాయని ఒక వర్గం మీడియా, కొన్ని రాజకీయ పార్టీలు చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. ఫెవికాల్ బంధంతో అసత్యాల ప్రచారం: పొంగులేటి హెచ్‌సీయూ ప్రాంతంలో పర్యావరణం దెబ్బతింటోందని నిరూపించగలరా? అని బీఆర్ఎస్, బీజేపీ నేతలకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి సవాల్ విసిరారు. దీనిపై ప్రత్యేక కమిటీ వేస్తామని, ఒక్క పక్షిగానీ, జంతువు గానీ చనిపోయిందని రుజువు చేయాలని విపక్షాలను డిమాండ్ చేశారు. రెండు ప్రతిపక్ష పార్టీలూ ఫెవికాల్ బంధంతో అసత్యాలను ప్రచారం చేస్తున్నాయని విమర్శించారు. దశాబ్దాలుగా ఈ భూమి కోర్టు పరిధిలో ఉంటే పోరాటం చేయలేని బీఆర్ఎస్, పరోక్షంగా బిల్లీరావుకు సహకరించిందని ఆరోపించారు. ప్రజల భూమిని తాము కాపాడుతుంటే అబద్ధాలతో గందగోళం సృష్టిస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ కృషిని చూసి విపక్షాలు జీరి్ణంచుకోలేకపోతున్నాయన్నారు. యూనివర్సిటీ ఏర్పాటు మొదలు, దాని అభివృద్ధికి కృషి చేసింది కాంగ్రెస్ ప్రభుత్వాలేనని పేర్కొన్నారు. వర్సిటీ భూమిలోంచి గత ప్రభుత్వం రోడ్డు వేయబోతుంటే హెచ్‌సీయూ వీసీ కోర్టును ఆశ్రయించారని, అప్పుడు ఈ భూమిపై వర్సిటీకి అధికారం లేదని అప్పటి ప్రభుత్వం చెప్పిందన్నారు. విద్యార్థుల మనోభావాలు ఏమాత్రం దెబ్బతిననివ్వబోమని చెప్పారు. విద్యార్థుల ముసుగులో అరాచకం చేయాలని చూసే శక్తులను ఏమాంత్రం ఉపేక్షింబోమని మంత్రి హెచ్చరించారు. -
కాంగ్రెస్ పార్టీలో ఏముందోయ్.. నేనే బీఎస్పీలోకి వద్దామనుకున్నా!
జగిత్యాల జిల్లా: ‘కాంగ్రెస్ పార్టీలో ఏముందోయ్.. నేనే బీఎస్పీలోకి వద్దామనుకున్నా’ అని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వ్యాఖ్యానించడం మరోసారి చర్చకు దారి తీసింది.. కాంగ్రెస్ పార్టీలో చేరడానికి వచ్చిన ఓ కార్యకర్తతో జీవన్ రెడ్డి అన్న మాటలు హాట్ టాపిక్ అయ్యాయి. కాంగ్రెస్ పార్టీ వైఖరిపై తీవ్ర అసంతృప్తితో ఉన్న జీవన్ రెడ్డి.. తన మనసులోని మాటను బయటపెట్టారు.ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ జన్మదిన వేడుకల్లో ఈ వ్యాఖ్యలు చేశారు జీవన్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీలో చేరిన ధర్మపురి బీఎస్పీ ఎమ్మెల్యే అభ్యర్థి విజయ్ తో అవాక్కయ్యేలా మాట్లాడారు జీవన్ రెడ్డి. ‘ నేనే మీ పార్టీలో వద్దామనుకున్నా.. ఏదో ఉందని నువ్వు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చావ్’ అంటూ పార్టీ తీరుపై బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేశాచు.‘మీ పార్టీకి.. మీకో దండం’ అంటూ ఆనాడే వ్యాఖ్యలుతన ముఖ్యఅనుచరుడైన గంగారెడ్డి గతేడాది హత్య గావించబడ్డ దగ్గర్నుంచీ జీవన్ రెడ్డి.. కాంగ్రెస్ పార్టీపై అసహనం వ్యక్తం చేస్తూనే ఉన్నారు. అధికారంలో కాంగ్రెస్ ఉన్న సమయంలోనే తన అనుచరుడు హత్యకు గురి కావడంతో జీవన్ రెడ్డి బహిరంగంగానే పార్టీ తీరుపై నిరసన స్వరం వినిపిస్తున్నారు. ‘ ఏదైనా స్వచ్ఛంద సంస్థ పెట్టుకునైనా సేవ చేస్తా. మీ పార్టీకి మీకో దండం అంటూ గతంలో జీవన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ వద్ద ఈ వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే ఎన్నో అవనానాలు భరించామని. ఇక భౌతికంగా లేకుండా చేయలేని చూస్తే చేసేది ఏముంటుందటూ జీవన్ రెడ్డి ఆ సమయంలో మాట్లాడారు. -
కేబినెట్ విస్తరణ.. కాంగ్రెస్ హైకమాండ్‌కు జానారెడ్డి లేఖ
సాక్షి, హైదరాబాద్: త్వరలోనే మంత్రి వర్గ విస్తరణ ఉండే చాన్స్ ఉందనే ప్రచారం నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్టానానికి ఆ పార్టీ సీనియర్ నేత జానారెడ్డి లేఖ రాశారు. ఖర్గే, కేసీ వేణుగోపాల్‌కు లేఖ రాశారు. రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్యేలకు మంత్రి వర్గంలో చోటు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు మంత్రి పదవి ఇవ్వాలని ఆయన కోరారు. ఈ నిర్ణయంతో ప్రజలకు ప్రయోజనమే కాకుండా, కాంగ్రెస్ పార్టీకి, తెలంగాణ రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి దోహద పడుతుందని ఆయన లేఖలో పేర్కొన్నారు.కాగా, తెలంగాణ కేబినెట్ విస్తరణకు రేవంత్ సర్కార్ రెడీ అవుతోంది. ఇప్పటికే ఆశాహుల జాబితాను హైకమాండ్‌కు పంపించినట్లు సమాచారం. ఇప్పటికే తమ వర్గాలకు ప్రాతినిధ్యం కల్పించాలని కోరుతూ.. ఇటీవల మాదిగ, లంబాడి, బీసీ సామాజికవర్గ ఎమ్మెల్యేలు కూడా అధిష్టానానికి లేఖలు రాశారు. ఈ మేరకు ఏఐసీసీ నేతలు రాహుల్, ఖర్గే, కేసీ వేణుగోపాల్, పార్టీ ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్‌లకు తమ వినతులను పంపారు. ప్రస్తుతం రేవంత్‌రెడ్డి ప్రభుత్వంలో ఆరు మంత్రి పదవులు ఖాళీగా ఉండగా.. ఇందులో నాలుగింటిని భర్తీ చేయాలని భావిస్తున్నట్లు తెలిసింది. -
పార్లమెంట్‌కు చేరిన HCU భూముల వ్యవహారం
న్యూఢిల్లీ, సాక్షి: హెచ్‌సీయూ భూముల వ్యవహారం పార్లమెంట్‌కు చేరింది. బడ్జెట్ సమావేశాల్లో భాగంగా.. మంగళవారం రాజ్యసభ జీరో అవర్‌లో బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ఈ అంశాన్ని చర్చకు తీసుకొచ్చారు. భూముల వేలాన్ని తక్షణమే ఆపివేయాలని పెద్దల సభ వేదికగా ప్రభుత్వాన్ని ఆయన కోరారు. భూముల వేలాన్ని ఆపి పర్యావరణాన్ని రక్షించాలి. అరుదైన పక్షులు, వృక్షజాతులు అక్కడ ఉన్నాయి. ఉగాది పండుగ రోజున అర్ధరాత్రి హెచ్‌సీయూ భూముల్లో బుల్డోజర్లు నడిపించారు. భూముల అమ్మకాన్ని వ్యతిరేకిస్తూ విద్యార్థులు ప్రభుత్వంపై యుద్ధం ప్రకటించారు. ఉచిత హామీల పథకం కోసం భూములను అమ్మవద్దు. తెలంగాణలో అంబేద్కర్ రాజ్యాంగం అమలు కావడం లేదు. రాహుల్ రేవంత్ రాజ్యాంగ నడుస్తుంది అని మండిపడ్డారాయన.అంతకుముందు ఈ అంశంపై ఈటల రాజేందర్ మీడియాతో మాట్లాడారు. కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్‌ను కలిశాం. తొలి దశ తెలంగాణ ఉద్యమంలో కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీని మంజూరు చేసింది. ఈ భూములను ఎవరికి ధారధత్తం చేయవద్దని సుప్రీంకోర్టు గతంలోనూ తీర్పు చెప్పింది. కానీ, ఢిల్లీకి కప్పం కట్టేందుకు ప్రభుత్వ భూములను రేవంత్ పనిచేస్తున్నారు. ఈ ప్రభుత్వం జింకలను , నెమళ్లను చంపి భూములను నాశనం చేస్తుంది. రూ.40 వేల కోట్ల రూపాయల విలువైన భూములను అమ్మి.. తెలంగాణ ప్రజల నోట్లో మట్టి కొడుతున్నారు. విద్యార్థులపై రేవంత్ ప్రభుత్వం పాశవిక చర్యలు మానుకోవాలి అని అన్నారు. బీజేపీ ఎంపీ నగేష్ మాట్లాడుతూ.. హెచ్‌సీయూ యూనివర్సిటీని అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దాలని కేంద్రం ఆలోచిస్తుందన్న విషయం మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తమకు తెలియజేశారని, అలాంటి యూనివర్సిటీ భూములను అమ్మొద్దని తాము పోరాటం చేస్తామని అన్నారు. -
సన్న బువ్వ సంబురం
ఉగాది పండగ పూట, పేదల ఆకలి తీర్చాలని ఉచిత సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజా ప్రభుత్వం పేదల పక్షపాతి అని మరోసారి రుజువు చేసుకుంది. పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో హుజూర్ నగర్ నుండి ప్రజా పంపిణీ విధానంలో ఇకనుండి పేద ప్రజలందరికీ 6 కిలోల చొప్పున సన్న బియ్యం అందించే చరిత్రాత్మక పథకానికి స్వీకారం చుట్టింది ప్రభుత్వం. తెలంగాణ మొత్తం జనాభాలో 3.10 కోట్ల (84%) మంది ప్రజలకు, శ్రీమంతులు తినే సన్నబియ్యాన్ని ఉచితంగా రేషన్ షాపుల ద్వారా పంపిణీ చేయాలనే సంక ల్పానికి యావత్ తెలంగాణ హర్షం వ్యక్తం చేస్తోంది. ఉమ్మడి రాష్ట్రంలో నాటి కాంగ్రెస్ ప్రభుత్వం కోట్ల విజయభాస్కర్ రెడ్డి ముఖ్య మంత్రిగా ఉన్నప్పుడు పేదలకు రూ. 1.90 లకు కిలో బియ్యం పథకాన్ని ప్రారంభిస్తే, తెలంగాణ ఏర్పాటైన 11 ఏళ్లకు రేవంత్ రెడ్డి సీఎంగా మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వమే పేదలకు సన్నబియ్యం అందించే బృహత్తర కార్యక్రమం అమలు చేస్తోంది. గతంలో దొడ్డు – నాసిరకం బియ్యం పంపిణీ చేయడంతో పేదవాడి ఆకలి తీర్చాలనే ప్రజాపంపిణీ వ్యవస్థ లక్ష్యం నీరుగారింది. నెలకురూ. 10,600 కోట్లు ఈ బియ్యం పంపిణీపై ఖర్చు చేసినా ఫలితం పేదలకు అందలేదు. రైసు మిల్లర్లకు, దళారులకు, అవినీతి పరులకు మంచి ఆదాయ వనరుగా రేషన్ బియ్యం మారి పోయాయి. రేషన్ బియ్యాన్ని రీసైక్లింగ్ చేసి, తిరిగి ప్రభుత్వానికి లాభకరమైన ధరకు అమ్మి మిల్లర్లు గత ప్రభుత్వ కాలంలో దోపిడీకి పాల్పడి నట్లు ఆధారాలు బయటపడ్డాయి. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి రాగానే, కేసీఆర్ 10ఏళ్ల పాలనలో నిర్లక్ష్యానికి గురైన ప్రజా పంపిణీ వ్యవస్థను ప్రక్షాళన చేయాలని సంకల్పించింది. వెంటనే అందుకు సంబంధించిన కార్యా చరణ మొదలుపెట్టింది. రాష్ట్రంలో సన్న వడ్ల సాగును ప్రోత్సహించి, సన్న వాటిని సాగుచేసిన రైతులకు క్వింటాలుకు రూ. 500 చొప్పున బోనస్‌గా అందించింది. తద్వారా, సన్న బియ్యాన్ని సమీకరించి తెలుగువారి నూతన సంవత్సరం (ఉగాది పండుగ) పర్వదినాన అశేష ప్రజానీకం సాక్షిగా తెలంగాణ ప్రజలందరికీ సన్న బియ్యం అందించే బృహత్తర కార్యక్రమాన్ని మొదలుపెట్టినం. ఇప్పుడున్న 90.42 లక్షల రేషన్ కార్డులకు అదనంగా పది లక్షల రేషన్ కార్డులు కొత్తగా జారీ చేస్తూ లబ్ధిదారులందరికీ సన్న బియ్యం అందేలా పక్కా ప్రణాళికను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుంది. ఈ మంచి పని చేస్తే మమ్మల్ని అభినందించాల్సింది పోయి, బీజేపీ కోడిగుడ్డు మీద ఈకలు పీకే రాజకీయం మొదలుపెట్టింది. పండుగ రోజు కూడా పచ్చి అబద్ధాలతో బీజేపీకి చెందిన కేంద్ర మంత్రి ఒకరు ఈ ప్రజా ప్రభుత్వాన్ని విమర్శించారు. రేషన్ షాపులలో మోదీ ఫోటో పెట్టాలని ఆయన వితండవాదం చేస్తున్నారు. బీజేపీ భాగస్వామిగా ఉన్న పక్క రాష్ట్రంలోనూ కేవలం ముఖ్యమంత్రి ఫొటో మాత్రమే ఉంది కాని ప్రధాని మోదీది లేదనే విషయం తెలియనిది కాదు. మరి తెలంగాణలో మోదీ ఫోటో ఎందుకు పెట్టాలో వారే చెప్పాలి. కాంగ్రెస్ తన పథకాల ద్వారా ప్రజలకు మరింత చేరువ అయితే తమ పార్టీని ప్రజలు దూరంగా పెడతారని బీజేపీవారు భావించడం వల్లనే ఇటువంటి అర్థం పర్థం లేని డిమాండ్లతో ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నం చేస్తున్నారు. చదవండి: మనిషిని మార్చే సాన్నిధ్యంఎవరు ఎన్ని విమర్శలు చేసినా తెలంగాణలో ఉన్న ప్రతి పేద ఇంటికీ నెల నెలా సన్నబియ్యం అందించే యజ్ఞానికి సబ్బండ వర్గాలు సహక రిస్తాయి. ప్రతిపక్షాల అబద్ధపు ప్రచారాలను ప్రజలే తిప్పికొడతారు. సమాజంలోని మేధా వులు, కవులు, కళాకారులు ప్రజా సంక్షేమం కొరకు చిత్తశుద్ధితో అడుగులు వేస్తున్న ఈ ప్రజా ప్రభుత్వానికి సహకరిస్తూ అండగా నిలబడాలని కోరుతున్నాం.-డా. కొనగాల మహేష్ (కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి) -
సన్న బియ్యం పంపిణీకి బ్రేక్
హైదరాబాద్: ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఈనెల 1వ తేదీ నుంచి ఇవ్వాల్సిన సన్నబియ్యం పంపిణీకి బ్రేక్ పడింది. రేషనింగ్ ఖైరతాబాద్ సర్కిల్–7 పరిధిలోని 81 రేషన్‌షాపుల పరిధిలో రూ.2,95,779 మంది కార్డుదారులకు తీవ్ర నిరాశే మిగిలింది. ఉగాది కానుకగా వీరందరికీ ఒక్కొక్కరికీ ఆరు కిలోల చొప్పున సన్నబియ్యం పంపిణీ చేయాల్సి ఉంది. అయితే కోడ్ నేపథ్యంలో సన్నబియ్యం పంపిణీ చేపట్టవద్దని ఉత్తర్వులు వెలువడ్డాయి. దీంతో సర్కిల్–7 పరిధిలో ఏప్రిల్ నెల కోటా కింద దొడ్డి బియ్యాన్ని పంపిణీ చేయాలని అధికారులు ఆదేశించారు. సన్న బియ్యం బస్తాలు ఒక మూలన పెట్టాలని కూడా ఆదేశించారు. అన్ని రేషన్ షాపులు దొడ్డి బియ్యం పంపిణీ చేయనున్నారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఏప్రిల్ 29 వరకు అమలులో ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఏప్రిల్ నెల కోటా కింద సన్న బియ్యం ఇవ్వడం లేదని, మే నెల నుంచి పంపిణీ చేస్తామని అధికారులు పేర్కొన్నారు. -
40 వేల ఎకరాలు అమ్ముతున్నావు.. ఆ 400 ఎకరాలు వదిలేయ్
సాక్షి, హైదరాబాద్: 40 వేల ఎకరాలను అమ్మకానికి పెట్టిన సీఎం రేవంత్‌రెడ్డి...హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన 400 ఎకరాలను వదిలేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. హెచ్‌సీయూ భూములను విక్రయించొద్దంటూ విద్యార్థులు నిస్వార్థంగా చేస్తున్న ఆందోళనకు ఆయన సంపూర్ణ మద్దతు ప్రకటించారు. సోమవారం తెలంగాణభవన్‌లో కేటీఆర్ హెచ్‌సీయూ విద్యార్థులు, విద్యార్థి సంఘ నాయకులతో కలిసి విలేకరులతో మాట్లాడారు. వందలాది మంది పోలీసులు, జేసీబీలు, బుల్డోజర్లతో వేలాది వృక్షాలను నేలకూల్చడంతోపాటు, నెమళ్లు, దుప్పులు, జింకలు, అరుదైన పక్షిజాతులను అక్కడ నుంచి తరలించే యత్నం చేస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు.తెలంగాణ ఉద్యమ వీరుల త్యాగాల ఫలితమే సెంట్రల్ యూనివర్సిటీ అని చెప్పారు. యూనివర్సిటీ భూములు, విద్యార్థులపై ప్రభుత్వం రాజకీయాలు చేస్తోందని ఆరోపించారు. ఆ ప్రాంతం మొత్తం కాంక్రీట్ జంగిల్‌గా మారిందని అక్కడున్న ఈ లంగ్‌స్పేస్ లేకుండా చేయడంతో జీవవైవిధ్యాన్ని దెబ్బతీస్తున్నారని అన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి భూములు అమ్మడం, అప్పులు తేవడమే ఎజెండాగా పనిచేస్తున్నారని విమర్శించారు. ముంబైలో 2,500 చెట్లు కొడితేనే.. పర్యావరణం నాశనమైందని గొంతు చించుకున్న రాహుల్‌గాంధీ హెచ్‌సీయూ గురించి ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. హైకోర్టులో ఇప్పటికే ఈ అంశంపై పిల్ ఉన్న నేపథ్యంలో కోర్టుకు సెలవులున్న తరుణంలో రాత్రికిరాత్రే విధ్వంసం సృష్టిస్తున్నారన్నారు. ఈ అంశంపై తమ పార్టీ ఎంపీలు రాజ్యసభలో కేంద్రాన్ని ప్రశ్నిస్తారని, కేంద్ర వైఖరి ఏమిటో చెప్పాలని డిమాండ్ చేస్తామన్నారు. రేవంత్‌రెడ్డి ఎన్నికలయ్యాక సెంట్రల్ యూనివర్సిటీలో ఫుట్‌బాల్ ఆడడానికి వచ్చినప్పుడే ఆ భూములపై కన్నేశారని కేటీఆర్ విమర్శించారు. విద్యార్థులను జైలుకు పంపించినట్టు చెబుతున్నారని, వారికి ఏ విధంగా న్యాయ సహాయం చేయాలో ఆలోచిస్తామన్నారు. గుంట నక్కలు అంటూ... ఆయన కామెంట్లు చేశారని, తాము ప్రవేశిస్తే ఇదంతా బీఆర్ఎస్ చేయిస్తుందని ఉద్యమాన్ని పక్కదారి పట్టిస్తారనే ఆగామని చెప్పారు. యూనివర్సిటీ పూర్వ విద్యార్థులైన భట్టి విక్రమార్క, శ్రీధర్‌బాబు అయినా జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు. పోరాటం చేస్తాం: విద్యార్థులు రాష్ట్ర ప్రభుత్వం యూనివర్సిటీని భయకంపితం చేస్తోందని, విద్యార్థులపై తీవ్ర బలప్రయోగం చేస్తోందని, అడ్డుకుంటున్నవారిని అదుపులోకి తీసుకుంటోందని విద్యార్థి సంఘం నాయకులు ఉమేష్ అంబేడ్కర్, శరణ్య, నిహార్ సులేమాన్, త్రివేణి వాపోయారు. న్యాయపరమైన అంశాలు తర్వాత చర్చించొచ్చని ముందు పర్యావరణాన్ని కాపాడాలని, నెమళ్లు, జింకలు చేస్తున్న రోదనలు పాలకులకు వినిపించడం లేదా అని వారు ప్రశ్నించారు. ఆ భూములను కాపాడుకోవడానికి ఎంతవరకైనా పోరాడుతాం అని స్పష్టం చేశారు. -
Girija Vyas : హారతి ఇస్తుండగా మంటలు అంటుకుని.. కేంద్ర మాజీ మంత్రికి తీవ్ర గాయాలు
జైపూర్: సీనియర్ కాంగ్రెస్ నాయకులు, మాజీ కేంద్రమంత్రి గిరిజా వ్యాస్ (Girija Vyas) అగ్ని ప్రమాదంలో పడ్డారు. రాజస్థాన్ రాష్ట్రం ఉదయపూర్‌లోని తన నివాసంలో పూజ చేసే సమయంలో హారతి (harathi) ఇచ్చే సమయంలో ఆమెకు మంటలు అంటుకున్నాయి. దీంతో అప్రమత్తమైన కుటుంబ సభ్యులు అత్యవసర చికిత్స నిమిత్తం ఉదయపూర్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. పలు వైద్య పరీక్షలు చేసిన డాక్టర్లు.. మెరుగైన వైద్యం కోసం ఆమెను 250 కిలోమీటర్ల దూరంలో ఉన్న అహ్మదాబాద్‌కు తరలించాలని సూచించారు. ఇంట్లో జరిగిన అగ్ని ప్రమాదంపై గిరిజా వ్యాస్ సోదరుడు గోపాల్ శర్మ స్పందించారు. గిరిజా వ్యాస్ ఇంట్లో హారతి ఇచ్చే సమయంలో ప్రమాదవ శాత్తూ కింద నుంచి మంటలు ఆమె దుప్పటాకు మంటలు అంటుకున్నాయి. వెంటనే ఆస్పత్రికి తరలించినట్లు చెప్పారు. पूर्व केन्द्रीय मंत्री डॉ. गिरिजा व्यास जी के आग से झुलसकर घायल होने का समाचार चिंताजनक है। मैं ईश्वर से उनके जल्द स्वास्थ्य लाभ की प्रार्थना करता हूं।— Ashok Gehlot (@ashokgehlot51) March 31, 2025 గిరిజా వ్యాస్ అగ్నిప్రమాదానికి గురయ్యారన్న వార్తలపై రాజస్థాన్ మాజీ సీఎం అశోక్ గెహ్లాత్ స్పందించారు. మాజీ కేంద్ర మంత్రి డాక్టర్ గిరిజా వ్యాస్ అగ్ని ప్రమాదంలో గాయపడడం ఆందోళన కలిగిస్తోంది. ఆమె త్వరగా కోలుకోవాలని దేవుణ్ని ప్రార్థిస్తున్నట్లు ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.ప్రముఖ కాంగ్రెస్ నేత గిరిజా వ్యాస్ గతంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలలో కీలక పదవులు నిర్వహించారు.1985 నుండి 1990 వరకు ఎమ్మెల్యేగా, రాజస్థాన్ పర్యాటక మంత్రిగా పనిచేశారు1991లో తొలిసారిగా లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో విజయం సాధించారు. 1996, 1999లో ఉదయపూర్ లోక్ సభ నియోజకవర్గం నుంచి,2009లో చిత్తోరగఘ్ నుండి లోక్ సభ సభ్యురాలిగా పనిచేశారుకేంద్ర ప్రభుత్వంలో మంత్రిగా, అలాగే నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ (NCW) చైర్ పర్సన్‌గా సేవలందించారు. -
HCU భూములపై తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో హెచ్‌సీయూ యూనివర్సిటీ వద్ద 400 ఎకరాల భూమి అమ్మకం వ్యవహారంలో చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో 400 ఎకరాల భూమి వివాదంపై తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఆ భూమి ప్రభుత్వానిదే అంటూ క్లారిటీ ఇచ్చింది.నగరంలోని హెచ్‌సీయూ వద్ద 400 ఎకరాల భూ వ్యవహారంపై ఎట్టకేలకు ప్రభుత్వం స్పందించారు. ఈ క్రమంలో..‘ఆ 400 ఎకరాల భూమి ప్రభుత్వానిదే. ప్రాజెక్టులో సెంట్రల్ యూనివర్సిటీ భూమి లేదు. ఆ భూమి యజమాని తామేనని న్యాయస్థానం ద్వారా తెలంగాణ ప్రభుత్వం నిరూపించుకుంది. ప్రైవేటు సంస్థకు 21 ఏళ్ల క్రితం కేటాయించిన భూమిని న్యాయపోరాటం ద్వారా ప్రభుత్వం దక్కించుకుంది. వేలం.. అభివృద్ధి పనులు అక్కడ ఉన్న రాళ్లను దెబ్బతీయవు. అభివృద్ధికి ఇచ్చిన భూమిలో చెరువు (లేక్) లేదు సర్వేలో ఒక్క అంగుళం భూమి కూడా హెచ్‌సీయూది కాదని తేలింది అని క్లారిటీ ఇచ్చింది. అలాగే, విద్యార్థులను కొందరు తప్పుదోవ పట్టిస్తున్నారు అంటూ చెప్పుకొచ్చింది. మరోవైపు.. సెంట్రల్ యూనివర్సిటీలో నిరసనల్లో పాల్గొన్న విద్యార్థులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఇద్దరు పీహెచ్డీ స్కాలర్స్ విద్యార్థులపై కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. ఎర్రం నవీన్ కుమార్, రోహిత్‌పై 329(3), 118(10, 132, 191(3), 351(3) r/w 3(5) బీఎన్ఎస్ యాక్ట్ కింద గచ్చిబౌలి పోలీసులు కేసులు పెట్టారు. -
‘HCU విద్యార్థులపై లాఠీచార్జ్.. 400 ఎకరాలు అమ్మి రాష్ట్రాన్ని పాలిస్తారా?’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో గత బీఆర్ఎస్ పాలన కంటే కాంగ్రెస్ పాలనలోనే అరాచకత్వం ఎక్కువైందని ఆరోపించారు కేంద్రమంత్రి బండి సంజయ్. హెచ్‌సీయూలో విద్యార్థులను కొట్టడం ఎంత వరకు కరెక్ట్?. అమ్మాయిలను మెడలు పట్టుకుని లాక్కెళ్లడం దారుణం. వర్సిటీలో 400 ఎకరాలు అమ్మి రాష్ట్రాన్ని పాలిస్తారా? అని ప్రశ్నించారు.హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ(HCU)లో విద్యార్థుల అరెస్ట్, అక్కడ ఉద్రిక్తతలపై కేంద్రమంత్రి బండి సంజయ్ స్పందించారు. తాజాగా బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ..‘హెచ్‌సీయూ ఘటన వీడియోలు చూసి తెలంగాణ సమాజం బాధ పడుతుంది. దొంగతనంగా రాత్రికి రాత్రికి చెట్లు కొట్టేశారు. 400 ఎకరాలు అమ్మి రాష్ట్రాన్ని పాలిస్తారా?. వర్సిటీలో భూములు అమ్మితే కానీ కాంగ్రెస్ ప్రభుత్వం నడిచే పరిస్థితి లేదు. గజం తావు కూడా లేకుండా కాంగ్రెస్ ప్రభుత్వం పాలన చేస్తోంది.ఎబీవీపీ కార్యకర్తను పోలీస్ స్టేషన్ లోపల వేసి కొట్టారు. బీఆర్ఎస్ కంటే ఎక్కువ అరాచకం కాంగ్రెస్ చేస్తోంది. విద్యార్థులపై లాఠీఛార్జ్ చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలి. విద్యా కమిషన్ పదవులు తీసుకున్న అర్బన్ నక్సల్స్ ఎందుకు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించడం లేదు. భూముల వేలం ఆపాలని డిమాండ్ చేస్తున్నాం. భూములు అమ్మి పాలించమంటే ఎవరైనా పాలించగలరు. రేషన్ బియ్యానికి ఏడాదికి పది వేల కోట్ల రూపాయలు కేంద్రం కేటాయిస్తుంది. కిలోకు 40 రూపాయలు ఇస్తున్నది మోదీ ప్రభుత్వం. కిలోకి పది రూపాయలు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చి హంగామా చేస్తుంది. బీజేపీ కార్యకర్తలు రేషన్ షాపుల వద్ద ప్రజలకు అవగాహన కల్పించాలి. రేషన్ షాపుల వద్ద మోదీ ఫోటో పెట్టాలి.Telangana was promised Mohabbat ki Dukaan but got Loot aur Lathi ki Sarkar.Rahul Gandhi speaks of Mohabbat, but show Lathi on students to Loot land. ABVP students are protesting against the auction of HCU lands, and I fully support them. Instead of addressing their concerns,… pic.twitter.com/LRoF0DDizh— Bandi Sanjay Kumar (@bandisanjay_bjp) March 30, 2025హైదరాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలో కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసి ఎంఐఎంకు మద్దతు చెబుతున్నారు. బీఆర్ఎస్కి ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు, ఎమ్మెల్సీలు ఉన్నా ఎందుకు పోటీ చేయడం లేదు?. కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసే ఎంఐఎంను గెలిపించాలని చూస్తున్నారు. తెలంగాణ సమాజాన్ని ఎంఐఎంకు అప్పగించాలని చూస్తున్నారు. గ్రూప్-1 అభ్యర్థుల ఫిర్యాదులను పరిగణనలోకి తీసుకోవాలి. మెరిట్ అభ్యర్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నాం’ అంటూ కామెంట్స్ చేశారు.Green Murder in Telangana - BRS cut, Congress cuts deeper.BRS axed 25 lakh trees for Kaleshwaram, gifted Conocarpus mess in the guise of Haritha Haram.Congress joins the green destruction at Kancha Gachibowli.Same axe, new hands.Telangana isn’t governed, but held hostage by…— Bandi Sanjay Kumar (@bandisanjay_bjp) March 31, 2025 -
సన్నబియ్యం చరిత్రాత్మకం: సీఎం రేవంత్
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: సన్న బియ్యం పథకం దేశ చరిత్రలోనే నిలిచిపోతుందని, ఆ చరిత్రకు హుజూర్నగర్ వేదికగా నిలుస్తుందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. భవిష్యత్తులో ఏ సీఎం వచ్చినా ఈ పథకాన్ని రద్దు చేయలేరని చెప్పారు. ఆనాడు ఇందిరాగాంధీ రోటీ, కప్డా, మకాన్ అనే నినాదంతో పేద వారికి కడుపు నిండా అన్నం, గుడ్డ, ఇల్లు ఉండాలన్న ఉద్దేశంతో 25 లక్షల ఎకరాలను పేదలకు పంచారని గుర్తుచేశారు. దాంతో పేదల్లో చైతన్యం వచ్చి పెద్ద ఎత్తున పంటలు పండించారని, నేడు అదే స్ఫూర్తితో తెలంగాణలో పెద్ద ఎత్తున పంటలు పండిస్తున్నారని పేర్కొన్నారు. ఆనాడు పేదలు.. పండుగ నాడే కాకుండా ప్రతిరోజూ తెల్ల బువ్వ తినాలనే ఉద్దేశంతో కోట్ల విజయభాస్కర్‌రెడ్డి రూ.1.90కు కిలో బియ్యం పథకం తెచ్చారని, అయితే ఎన్నికల కారణంగా అది అమలు కాలేదని చెప్పారు. తర్వాత అధికారంలోకి వచ్చిన ఎన్టీఆర్ రూ.2కు కిలో బియ్యం పథకాన్ని 1983లో ప్రారంభించారని..ఆనాడు మొదలు పెట్టిన దొడ్డు బియ్యం పంపిణీ పథకమే ఇప్పటివరకు కొనసాగిందని అన్నారు. అయితే దొడ్డు బియ్యం పేదల కడుపు నింపడం లేదని ఆలోచించి, పేదలంతా తినేలా తాము సన్న బియ్యం పథకానికి శ్రీకారం చుట్టామని వివరించారు. ఇక నుంచి 3.10 కోట్ల మందికి సన్న బియ్యం ఇచ్చి ప్రతిరోజూ పండుగలా పేదవాడి కడుపు నింపాలనే ఉద్దేశంతో ఈ పథకాన్ని తెచ్చామని చెప్పారు. ఉగాది సందర్భంగా ఆదివారం సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లో సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ఆయన లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన బహరంగ సభలో మాట్లాడారు. నల్లగొండ గడ్డకు ఎంతో చరిత్ర ‘ఈ పథకాన్ని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధ్యక్షతన, పద్మావతిరెడ్డి ఆధ్వర్యంలో హుజూర్నగర్ నియోజకవర్గంలో ప్రారంభించడం హర్షించదగిన విషయం. ఈ ప్రాంతం పోరాటాలకు మారు పేరు. ఎందరో మహనీయులు భూమి కోసం భుక్తి కోసం, విముక్తి కోసం ఇక్కడి నుంచే పోరాటాలు చేశారు. రావి నారాయణరెడ్డిని నెహ్రూ కంటే అత్యధిక మెజార్టీతో గెలిపించిన చరిత్ర కూడా నల్లగొండ గడ్డకే ఉంది. ఇటీవల జరిగిన ఎంపీ ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో నల్లగొండ ఎంపీని గెలిపించింది కూడా నల్లగొండ బిడ్డలే. ఇలాంటి చోట ప్రారంభించిన ఈ సన్న బియ్యం పథకం దేశ చరిత్రలో నిలిచిపోతుంది. ఈ పథకం ద్వారా 3.10 కోట్ల మందికి సన్న బియ్యం అందిస్తాం..’ అని ముఖ్యమంత్రి తెలిపారు. మిల్లర్లు, దళారుల చేతుల్లోకి దొడ్డు బియ్యం ‘ప్రభుత్వం 3 కోట్ల మందికి దొడ్డు బియ్యం ఇస్తుంటే, ఆ పథకం మిల్లర్ల మాఫియా, దళారుల చేతిలోకి వెళ్లిపోయి, రూ.10 వేల కోట్ల దోపిడీ జరుగుతోంది. పేదలు దొడ్డు బియ్యం తినలేక, రూ.10కు కిలో అమ్ముకుంటుంటే మిల్లర్లు కొనుగోలు చేసి, రీసైక్లింగ్ చేసి తిరిగి ప్రభుత్వానికే కిలో రూ.30కి అమ్ముతున్నారు. పేదలకు దొడ్డు బియ్యం ఉపయోగ పడటం లేదనే సన్న బియ్యం ఇస్తున్నాం..’ అని రేవంత్ తెలిపారు. రైతులను వరి వద్దన్న కేసీఆర్ తన ఫామ్‌హౌస్‌లో పండించారు ‘రాష్ట్రాన్ని పదేళ్లు పాలించిన, 80 వేల పుస్తకాలు చదివానని చెప్పుకునే కేసీఆర్.. ఏనాడైనా పేదలకు సన్న బియ్యం ఇవ్వాలన్న ఆలోచన చేశారా? మీరు వరి వేస్తే ఉరేసుకున్నట్లేనని, మేం వడ్లు కొనమని చెప్పిన ఆయన.. ఎర్రవెల్లిలోని తన ఫామ్‌హౌస్‌లో వడ్లనే పండించారు. ఆ వడ్లను క్వింటాల్‌కు రూ.4,500 చొప్పున చెల్లించి కావేరీ సీడ్స్ అనే కంపెనీ కొనుగోలు చేసింది. రైతులు పండించిన ధాన్యాన్ని రూ.2 వేలకు కొనేవారు దిక్కులేక వాళ్లు ఉరేసుకుంటుంటే, ఆయన పండించిన ధాన్యాన్ని క్వింటాల్‌కు అంత ధర పెట్టి కొన్నారంటే అవి వడ్లా లేదా బంగారమా? చెప్పాలి..’ అని సీఎం అన్నారు. ఎస్ఎల్బీసీ టన్నెల్‌ను పక్కనబెట్టారు ‘నల్లగొండ జిల్లా రైతాంగాన్ని ఆదుకునేందుకు నాగార్జునసాగర్ సహా అనేక ప్రాజెక్టులు కాంగ్రెస్ తెచ్చింది. జిల్లా కాంగ్రెస్ నేతలు పోరాటం చేసి ఎస్ఎల్బీసీ టన్నెల్ వంటి పథకాలు సాధించుకున్నారు. కానీ కేసీఆర్ వాటిని పక్కన పెట్టారు. 44 కిలోమీటర్ల సొరంగం అప్పట్లోనే 34 కిలోమీటర్లు పూర్తయింది. ఏటా ఒక్క కిలోమీటర్ తవ్వినా బీఆర్ఎస్ కాలంలోనే సొరంగం పూర్తయ్యేది. 3.5 లక్షల ఎకరాలకు నీరు పారేది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తిరిగి టన్నెల్ పనులు ప్రారంభించాం. రూ.లక్ష కోట్లతో కేసీఆర్ కట్టిన కాళేశ్వరం మూడేళ్లకే కూలిపోయింది. ఈ విషయంలో కేసీఆర్‌కు ఉరేసినా తప్పులేదు..’ అంటూ ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్‌కు నాకు పోలికేంటి..? ‘2006లో జెడ్పీటీసీగా రాజకీయం మొదలుపెట్టిన నేను ప్రజల ఆశీర్వాదంతో ఎమ్మెల్సీ అయ్యా. 2018లో కేసీఆర్ నాపై కక్షగట్టి ఎమ్మెల్యేగా ఓడించినా ప్రజలు ఆశీర్వదించి ఎంపీగా గెలిపించారు. ఢిల్లీకి వెళితే సోనియాగాంధీ పీసీసీ అధ్యక్ష పదవి ఇచ్చారు. అదే నన్ను సీఎంను చేసింది. కేసీఆర్‌కు నాకు పోలికేంటి? మా ఇద్దరికి నందికి, పందికి ఉన్నంత తేడా ఉంది. నేను రుణమాఫీ చేశా. రైతుబంధును పెంచా. కేసీఆర్ ఎగ్గొట్టిన రైతుబంధు రూ.7,625 కోట్లు..మా ప్రభుత్వం ఏర్పడిన మూడు నెలల్లోనే రైతుల ఖాతాల్లో వేశాం. 15 నెలల కాలంలో రుణమాఫీ కింద రూ.21 వేల కోట్లు, రైతు భరోసా కింద రూ.12 వేల కోట్లు వేశాం. సన్న వడ్లకు రూ.1,200 కోట్లు బోనస్ ఇచ్చాం. రైతులకు పంగనామం పెట్టిన కేసీఆర్ నన్ను పోల్చుకోవడమేంటి? మేం రైతుల గుండెల్లో శాశ్వతంగా నిలిచేలా కార్యక్రమాలు చేశాం. ఒకరోజు వెనుకా ముందూ అయినా ఇచ్చిన హామీలను అమలు చేస్తాం..’ అని సీఎం స్పష్టం చేశారు. సభలో అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, మంత్రులు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, సీతక్క, ఎంపీలు కుందూరు రఘువీర్‌రెడ్డి, చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, బలరాంనాయక్, ఎమ్మెల్యేలు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తదితరులు పాల్గొన్నారు. -
విద్యార్థులపై ఇష్టానుసారం దాడి చేస్తారా?, ప్రభుత్వంపై బండి సంజయ్ ఆగ్రహం
సాక్షి,హైదరాబాద్: ప్రతిష్టాత్మక హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ((Hyderabad Central University)ని కాంగ్రెస్ ప్రభుత్వం భ్రష్టు పట్టిస్తోందని కేంద్రమంత్రి బండి సంజయ్ ఆరోపించారు.హెచ్‌సీయూలో భూముల వేలం వివాదాన్ని వ్యవతిరేకిస్తూ ఏబీవీపీ విద్యార్థుల ఆందోళన చేపట్టారు. విద్యార్థుల ఆందోళనతో భారీగా మొహరించిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో గచ్చిబౌలి సెంట్రల్ వర్శిటీలో ఉద్రిక్తతపై బండి సంజయ్ స్పందించారు. ‘విద్యార్థులపై లాఠీఛార్జీ అమానుషం. ప్రభుత్వ భూములను తెగనమ్మి రాష్ట్రాన్ని పాలిస్తారా?. భావితరాలకు గజం జాగా కూడా మిగిల్చరా? పోలీసుల ద్వారా భయాందోళనలకు గురిచేసి కాంగ్రెస్ పాలన చేయాలనుకుంటోంది. వర్శిటీ భూములకే రక్షణ లేకపోతే ఎలా?. ప్రతిష్టాత్మక సెంట్రల్ యూనివర్సిటీని కాంగ్రెస్ ప్రభుత్వం భ్రష్టు పట్టిస్తోంది.భూముల రక్షణ కోసం ఆందోళన చేస్తున్న విద్యార్థులపై ఇష్టానుసారం దాడి చేస్తారా?.తక్షణమే అరెస్ట్ చేసిన విద్యార్థులను విడుదల చేయాలి. హెచ్‌సీయూ భూముల వేలం నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి’ అని డిమాండ్ చేశారు. -
ఒక్క సంతకంతో కొడంగల్‌కు అన్నీ వస్తాయి: సీఎం రేవంత్
కొడంగల్: ‘ఒక్క సంతకంతో కొడంగల్‌కు అన్నీ వస్తాయి. ఎవరినీ అడుక్కోవాల్సిన అవసరం లేదు’ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. మంచి చెడుల్లో ఎల్లప్పుడూ కొడంగల్ ప్రజలు తనను గుండెల్లో పెట్టుకుని చూసుకున్నారని చెప్పారు. రాష్ట్రాన్ని పాలించే శక్తిని కొడంగల్ ప్రజలే ఇచ్చారని వ్యాఖ్యానించారు. కొడంగల్‌లోని రాఘవేంద్ర ఫంక్షన్ హాల్లో ప్రభుత్వం శనివారం ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ఆయన పాల్గొన్నారు. ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన అనంతరం మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ముస్లింలకు రాజకీయ అవకాశాలు కల్పిస్తోందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ మత రాజకీయాలు చేయదని అన్నారు. కొందరికి వాళ్ల కుర్చీ పోయిందనే దుఃఖం ఉందని, వారి మాటలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని చెప్పారు. నేనేం చేస్తానో.. ఏం చేశానో నాకంటే మీకే ఎక్కువగా తెలుసునన్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గురునాథ్‌రెడ్డి, ఎమ్మెల్యేలు రామ్మోహన్‌రెడ్డి, మనోహర్‌రెడ్డి, పీసీసీ సభ్యుడు మహ్మద్ యూసుఫ్ పాల్గొన్నారు. శ్రీవారికి పట్టు వస్త్రాల సమర్పణ కొడంగల్ చేరుకున్న సీఎం రేవంత్‌రెడ్డి ముందుగా పద్మావతీ సమేత శ్రీమహాలక్ష్మీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ప్రభుత్వం తరఫున స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆలయ ధర్మకర్తలు శ్రీవారి ప్రతిమను బహూకరించారు. అర్చకులు ఆశీర్వాదం అందించారు. -
ప్రతిపక్ష పార్టీలపై వివక్ష తగదు: కాంగ్రెస్ ఎంపీ లేఖ
ఢిల్లీ : ప్రతిపక్ష పార్టీలపై చూపెడుతున్న వివక్షపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరుతూ భువనగిరి కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు లోక్‌సభ స్పీకర్‌కు లేఖ రాశారాయన. లోక్‌సభ స్పీకర్‌కు ఆయన రాసిన లేఖలో సారాంశం ఇలా ఉంది.. లోక్‌సభలో ఉపసభాపతి నియామకం జరగకపోవడం2019 నుండి ఉపసభాపతి పదవి ఖాళీగా ఉంది. రాజ్యాంగంలోని 93వ అధికరణం ప్రకారం ఎన్నిక జరగాల్సి ఉండగా ఉపసభాపతి లేకపోవడం ఒక ప్రమాదకరమైన దృష్టాంతాన్ని ఏర్పరుస్తోంది, ఇది సభ నిష్పక్షపాతతను మరియు పనితీరును ప్రభావితం చేస్తోంది. ప్రధాన ప్రతిపక్ష నేతకు మాట్లాడే అవకాశాన్ని నిరాకరించడంప్రోటోకాల్ ప్రకారం ప్రధాన ప్రతిపక్ష నేత వేదికపై నిలబడినప్పుడు వారికి మాట్లాడే అవకాశాన్ని ఇవ్వాల్సిన సంప్రదాయాన్ని పదేపదే పట్టించుకోవడం లేదు. ఇది గత పార్లమెంటరీ ప్రవర్తనలకు భిన్నంగా ఉండటమే కాకుండా, సభలో ఆరోగ్యకరమైన వాతావరణాన్ని తగ్గిస్తుంది. ప్రతిపక్ష నేతలు మరియు ఎంపీల మైక్రోఫోన్లు ఆఫ్ చేయడంప్రతిపక్ష ఎంపీలు పాయింట్ ఆఫ్ ఆర్డర్ తీసుకురాగానే వారి మైక్రోఫోన్లు ఆఫ్ చేయడం ఒక సాధారణ ఘటనగా మారిపోయింది, అయితే అధికార పక్ష సభ్యులు మాత్రం స్వేచ్ఛగా మాట్లాడే అవకాశాన్ని పొందుతున్నారు. ఈ విధానం ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాల గొంతు నొక్కడమే అవుతుంది. సభానిర్వహణ సలహా కమిటీ (BAC) నిర్ణయాలను పట్టించుకోకపోవడంప్రభుత్వం BACలోని ఇతర పక్షాలతో సంప్రదించకుండా, వారికీ ఎటువంటి సమాచారం ఇవ్వకుండా ఏకపక్షంగా వ్యవహరిస్తోంది. గత వారం గౌరవ ప్రధానమంత్రి ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండానే సభలో ప్రవేశపెట్టడం ఇందులో భాగమే.5)బడ్జెట్ మరియు వివిధ మంత్రిత్వ శాఖలకు గ్రాంట్ల కోసం డిమాండ్ చర్చలో కీలక మంత్రిత్వ శాఖలను మినహాయించడం: ముఖ్యమైన మంత్రిత్వ శాఖలను బడ్జెట్ కేటాయింపులు మరియు గ్రాంట్ల కోసం డిమాండ్ చర్చల నుండి మినహాయిస్తున్నారు. ఇది ఆర్థిక నిర్ణయాలపై పార్లమెంటరీ పర్యవేక్షణను తగ్గిస్తోంది.193వ నియమం ప్రకారం చర్చల్లో కోతఅత్యవసరమైన ప్రజా సమస్యలపై ఓటింగ్ లేకుండా చర్చించేందుకు అనుమతించే 193వ నియమాన్ని ఇప్పుడు చాలా అరుదుగా ఉపయోగిస్తున్నారు. దీని ద్వారా దేశానికి అత్యంత ప్రాధాన్యమైన అంశాలపై బాధ్యత వహించకుండా తప్పించుకుంటున్నారు.పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీల్లో జోక్యంపార్లమెంటరీ స్టాండింగ్ కమిటీలు స్వతంత్రంగా పనిచేసి నిపుణులకు చట్టపరమైన పర్యవేక్షణను అందించాలి. అయితే, స్పీకర్ కార్యాలయం కమిటీ నివేదికల్లో సవరణలు సూచించిన సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. దీని వల్ల వాటి స్వతంత్రత దెబ్బతింటోంది.వాయిదా తీర్మానాలను నిర్లక్ష్యం చేయడం మరియు తిరస్కరించడంగతంలో జీరో అవర్ లో చర్చకు అనుమతించే వాయిదా తీర్మానాలను ఇప్పుడు పట్టించుకోవడం లేదు. వాటిని తక్షణమే తిరస్కరిస్తున్నారు. ఇది అత్యవసరమైన జాతీయ సమస్యలను ప్రస్తావించే ఎంపీల హక్కులను పరిమితం చేస్తోంది.ప్రైవేట్ సభ్యుల బిల్లులు మరియు తీర్మానాలను నిర్లక్ష్యం చేయడంప్రైవేట్ సభ్యుల బిల్లులు మరియు తీర్మానాలు ప్రజాస్వామ్యంలో భాగస్వామ్య స్ఫూర్తిని ప్రతిబింబిస్తాయి. కార్యనిర్వాహక అధికారానికి బయట ఉన్న ఎంపీలు చట్టాలను ప్రతిపాదించే అవకాశాన్ని కల్పిస్తాయి. అయితే, వీటిపై తగినంత చర్చకు సమయం ఇవ్వకపోవడ వల్ల చట్టసభలో చర్చలు కుదించబడుతున్నాయి.సంసద్ టీవీప్రతిపక్ష ఫ్లోర్ లీడర్లు మరియు ఎంపీలు మాట్లాడినప్పుడు లోక్ సభ అధికారిక టీవీ ఛానల్ సంసద్ టీవీ వారి ముఖాలను చూపకుండా కెమెరా యాంగిల్‌ను మార్చడం ఒక సర్వసాధారణ ఘటనగా మారింది. ఇది పార్లమెంటరీ కార్యకలాపాల పారదర్శకతను దెబ్బతీస్తుంది. సభా కమిటీకమిటీల ఏర్పాటు మరియు ఛైర్మన్ నియామకంపై ప్రతిపక్ష పార్టీలతో సంప్రదింపు లేకుండా నిర్ణయాలు తీసుకుంటున్నారు.సంప్రదింపుల కమిటీ సమావేశాలు: సంప్రదింపుల కమిటీ సమావేశాలు క్రమంగా నిర్వహించాల్సిన అవసరం ఉంది. అయితే, అనేక కమిటీలు నిబంధనలకు విరుద్ధంగా క్రమం తప్పకుండా సమావేశం కావడం లేదు.ఈ పరిణామాలు తీవ్రమైన ఆందోళనకు కారణమయ్యాయి మరియు మన పార్లమెంటరీ ప్రజాస్వామ్యపు సమగ్రతను పరిరక్షించేందుకు తక్షణ సవరణ చర్యలు అవసరమని సూచిస్తున్నాయి. పార్లమెంటరీ న్యాయం, పారదర్శకత, పార్లమెంటరీ ప్రమాణాలకు కట్టుబడటాన్ని పునరుద్ధరించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని మేము తమరికి విజ్ఞప్తి చేస్తున్నాము. -
డీసీసీ చీఫ్‌లు మూడేళ్ల పాటుఎన్నికల్లో పోటీకి దూరమే!
సాక్షి, న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ)లను బలోపేతం చేయాలన్న లక్ష్యంతో వరుస భేటీలు నిర్వహిస్తున్న కాంగ్రెస్ అధిష్టానం మరో కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. జిల్లాల్లో పార్టీకి మూలస్తంభాలైన డీసీసీ అధ్యక్షులు పార్టీ కార్యలాపాలపై పూర్తి దృష్టి పెట్టేందుకు వీలుగా నియమితులైన మొదటి మూడేళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయడాన్ని నిషేధించే విషయాన్ని పరిశీలించనున్నట్లు తెలిసింది. క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతంపై ఏఐసీసీ నియమించిన ముకుల్ వాస్నిక్ కమిటీ చేసిన మూడేళ్ల నిషేధం ప్రతిపాదనను పార్టీ పరిగణనలోకి తీసుకున్నట్లు సమాచారం. వాస్నిక్ కమిటీ సిఫార్సుల ప్రకారం డీసీసీ అధ్యక్షులు తమ ఐదేళ్ల పదవీ కాలంలో తొలి మూడేళ్ల పాటు ఎలాంటి ఎన్నికల్లో పోటీకి అనుమతించరు. వీరంతా క్షేత్ర స్థాయిలో పార్టీని బలోపేతం చేయడం, ఓటర్ల జాబితాలను నిర్ధారించడం, ఎన్నికల ప్రచారాన్ని నిశితంగా పరిశీలించడం, సామాజిక ఇంజనీరింగ్, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలను ఎదుర్కోవడం, పార్టీ అనుకూల కథనాలను రూపొందించడం, జిల్లాల్లో ని అన్ని స్థాయిలలో మీడియా, సోషల్ మీడియా కార్యకర్తలకు శిక్షణ ఇవ్వడం వంటి పనులకు నాయకత్వం వహిస్తారు. అభ్యర్థుల ఎంపికలో, వివిధ పదవులకు నామినీల పరిశీలనలో వీరే క్రియాశీలంగా ఉంటారు. ఎన్నికల్లో గెలుపోటములకు బాధ్యత వహిస్తారు. ఈ మూడేళ్ల తర్వాత పదవుల ఎంపికలో డీసీసీలకు ప్రాధాన్యమిస్తారు. మూడేళ్ల ప్రతిపాదనపై వచ్చే నెలలో గుజరాత్లో జరిగే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ భేటీలో ఓ నిర్ణయం తీసుకునే అవకాశముందని తెలుస్తోంది. -
రేవంత్ వ్యాఖ్యలు.. న్యాయ వ్యవస్థకు సవాలే!
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి న్యాయ వ్యవస్థకు సవాల్ విసిరారా? బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పది మంది కాంగ్రెస్‌లోకి ఫిరాయించిన కేసు సుప్రీంకోర్టులో విచారణలో ఉన్న సమయంలో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు సహజంగానే అందరి దృష్టిని ఆకర్షిస్తాయి. ఫిరాయింపు ఎమ్మెల్యేల పదవులు పోవని, ఉప ఎన్నికలు రావని ఆయన శాసనసభ సాక్షిగా వ్యాఖ్యానించారు. ఇది ఫిరాయింపు ఎమ్మెల్యేలకు ఒక విధంగా భరోసా ఇచ్చినట్లే. అదే టైమ్‌లో ఉప ఎన్నికలకు వెళ్లడానికి కాంగ్రెస్ వెనుకంజ వేస్తోందన్న సంకేతం కూడా ఇచ్చినట్లయింది. ప్రజలలో వ్యతిరేకత ఉందంటూ బీఆర్ఎస్, బీజెపిలు చేస్తున్న ప్రచారానికి ఊతమిచ్చినట్లవుతుంది.రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్న బలహీనతలు, న్యాయ వ్యవస్థ లోపాలను బహిర్గతం చేశాయి. గతంలో కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్య తీసుకోని న్యాయ వ్యవస్థ ఇప్పుడు మాత్రం ఎలా తీసుకుంటుందన్నది ఆయన ప్రశ్న కావచ్చు. ఇది హేతుబద్దంగానే కనిపిస్తున్నా నైతికతే ప్రశ్నార్థకం. శాసనసభలో జరిగే చర్చలకు రక్షణ లేదా ఇమ్యూనిటి ఉన్నప్పటికీ, రేవంత్ వ్యాఖ్యల వీడియోని సుప్రీం కోర్టులో ప్రదర్శిస్తే న్యాయమూర్తులు ఎలా స్పందిస్తారన్నది అప్పుడే చెప్పలేం. వారు సీరియస్‌గా తీసుకోకపోతే ఫర్వాలేదు. లేకుంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి కొన్ని సమస్యలు వచ్చే ప్రమాదముంది.అత్యున్నత న్యాయస్థానం రేవంత్ వ్యాఖ్యలనే సాక్ష్యంగా తీసుకుంటే అది పెద్ద సంచలనమవుతుంది. బీఆర్ఎస్ అధినేత, గత ముఖ్యమంత్రి కేసీఆర్ ఫిరాయింపులను ప్రోత్సహించిన మాట నిజం. వారిలో కొందరికి మంత్రి పదవులు ఇచ్చిన సంగతి అందరికి తెలిసిందే. తలసాని శ్రీనివాసయాదవ్ టీడీపీ నుంచి బీఆర్ఎస్లోకి వచ్చి మంత్రి అయ్యారు. దానికి మూల కారణం ఓటుకు నోటు కేసు కావడం విశేషం. ఎమ్మెల్సీ ఎన్నికలలో ఒక నామినేటెడ్ ఎమ్మెల్యే ఓటును పొందడం కోసం ఆయనకు రూ.ఏభై లక్షలు ఇస్తూ రేవంత్ రెడ్డి పట్టుబడినట్లు కేసు నమోదు అయిన సంగతి విదితమే. టీడీపీ అధినేత చంద్రబాబు అప్పట్లో హైదరాబాద్ ఉమ్మడి రాజధానిలోనే ఉండేవారు. కేసీఆర్ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి ఆయన కుట్రపన్నారని బీఆర్ఎస్ నేతలు ఆరోపించే వారు.తొలి ఎన్నికలలో టీఆర్ఎస్కు 63 సీట్లే ఉండేవి. ఈ క్రమంలో రాజకీయంగా పొంచి ఉన్న ప్రమాదాన్ని గమనంలోకి తీసుకుని కేసీఆర్ ఇతర పార్టీల ఎమ్మెల్యేలను ఆకర్షించారు. దానిపై టీడీపీ పక్షాన రేవంత్ కాని, ఇతరత్రా మరికొందరు కాని హైకోర్టుకు వెళ్లారు. అయినా పెద్దగా ఫలితం రాలేదు. రెండో టర్మ్‌లో కూడా కేసీఆర్ 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బీఆర్ఎస్లోకి తీసుకువచ్చారు. ఫలితంగా కాంగ్రెస్‌కు ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా పోయింది. కాంగ్రెస్ నుంచి వచ్చిన వారిలో సబితా ఇంద్రారెడ్డి మంత్రయ్యారు. శాసనసభ పక్షాల విలీనం పేరుతో కథ నడిపారు. మొత్తం ఎమ్మెల్యేలు ఒకసారి పార్టీ మారకపోయినా, స్పీకర్లు అధికార పార్టీ వారే కనుక ఇబ్బంది లేకుండా సాగిపోయింది.2014 టర్మ్‌లో ఏపీలో సైతం ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలను టీడీపీలోకి చేర్చుకోవడమే కాకుండా, వారిలో నలుగురికి మంత్రి పదవులు ఇచ్చారు. అయినా స్పీకర్ వారెవ్వరిపై అనర్హత వేటు వేయలేదు. ఈ నేపథ్యంలో ఈ ఫిరాయింపులపై ఫిర్యాదులు అందినా, అసెంబ్లీ గడువు ముగిసే టైమ్‌కు కూడా న్యాయ స్థానాలు తేల్చలేదు. తెలంగాణలో అప్పటికి, ఇప్పటికి ఒక తేడా ఉంది. గతంలో కాంగ్రెస్ నుంచి మెజార్టీ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లేదా బీఆర్ఎస్లోకి జంప్ చేయడంతో విలీనం కథ నడిచింది. రాజ్యసభలో కూడా నలుగురు టీడీపీ ఎంపీలను బీజేపీ ఇలాగే విలీనం చేసుకుంది. నిజానికి న్యాయ వ్యవస్థ ఈ ఫిరాయింపుల మూలానికి వెళ్లి ఉంటే బాగుండేది.అలా చేయకపోవడంతో ఆయా రాష్ట్రాలలో ఇది ఒక అంతులేని కథగా మారింది. కేసీఆర్ జమానాలో జరిగిన దానికి, రేవంత్ హయాంలో జరిగిన ఫిరాయింపులకు తేడా ఉంది. ఆనాడు సామూహిక ఫిరాయింపులన్నట్లుగా బీఆర్ఎస్ చూపింది. కాని ఇప్పుడు ఆ పరిస్థితి లేకపోవడం కాంగ్రెస్‌కు బలహీన పాయింట్ కావచ్చు. మొత్తం 38 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉంటే పది మంది మాత్రమే పార్టీ మారారు. వీరి ఫిరాయింపులకు సంబంధించిన ఆధారాలు ఉన్నప్పటికీ, వాటిని కోర్టులలో నిగ్గు తేల్చేసరికి పుణ్యకాలం ముగిసి పోవచ్చు. తెలంగాణ శాసనసభ స్పీకర్‌కు నోటీసు ఇచ్చి ఏడాది అయిపోయినా దానికి సమాధానం ఇవ్వకపోవడంపై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది.సుప్రీం వ్యాఖ్యల తర్వాత బీఆర్ఎస్ నేతలు కచ్చితంగా ఫిరాయింపు ఎమ్మెల్యేల పదవులు పోతాయని, ఉప ఎన్నికలు వస్తాయని ప్రచారం చేస్తున్నారు. స్టేషన్ ఘనపూర్ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత టి.రాజయ్య ఏకంగా ఎన్నికల ప్రచారమే ఆరంభించారట. దాంతో రేవంత్ అసెంబ్లీలో ఫిరాయింపు ఎమ్మెల్యేలకు ధైర్యం చెప్పడానికి ఈ వ్యాఖ్యలు చేసినట్లు కనిపిస్తుంది. కాని ఈ స్టేట్ మెంట్ ఆయనను ఆత్మరక్షణలోకి కూడా నెట్టినట్లయింది. ఉప ఎన్నికలకు వెనుకాడుతున్నారన్న సంకేతం కాంగ్రెస్‌కు ఎంతవరకు ప్రయోజనమన్న ప్రశ్న వస్తుంది. 2014-2023 వరకు బీఆర్ఎస్ ఏ సంప్రదాయాలు అమలు చేసిందో వాటినే తామూ పాటిస్తున్నామని ఆయన అంటున్నారు. గతంలో రాని ఉప ఎన్నికలు ఇప్పుడెలా వస్తాయని అడిగారు. దీనికి న్యాయ వ్యవస్థతో పాటు రాజకీయ పార్టీలు బదులు ఇవ్వవలసి ఉంటుంది. ఈ ఎమ్మెల్యేలు తాము పార్టీ మారలేదని అంటున్నారని కూడా రేవంత్ చెప్పారు. కాని కొందరు పార్టీ మారినట్లు ఆధారాలు స్పష్టంగా కనిపిస్తాయి. ఉదాహరణకు ఖైరతాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పార్లమెంటు ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేశారు. స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కుమార్తె కావ్య వరంగల్ నుంచి కాంగ్రెస్ పక్షాన పోటీ చేసినప్పుడు ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.అయితే పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహీపాల్ రెడ్డి, గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి వంటివారు తాము పార్టీ మారలేదని చెబుతున్నారు. అభివృద్ది పనుల కోసం సీఎంను కలిసి వచ్చామని కాంగ్రెస్ లో చేరినవాళ్లు అంటున్నారని కూడా రేవంత్ చెప్పారు. తాను మాట్లాడేది సబ్ జ్యుడీస్ అవుతుందన్న వాదనను ఆయన తోసిపుచ్చుతూ శాసనసభలో మాట్లాడితే రక్షణ ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఫిరాయింపుల విషయంలో గతంలో ఏ సీఎం కూడా ఇంత నేరుగా అసెంబ్లీలో ఈ విషయాలు మాట్లాడలేదు. బీఆర్ఎస్ చేసిన పనే తాము చేశామని, అప్పుడు లేని కొత్త నిబంధనలు ఇప్పుడు వస్తాయా అని ఆయన ప్రశ్నించారు. నిజమే. బీఆర్ఎస్కు ఈ వ్యవహారంలో నైతిక అర్హత లేదు. జాతీయ పార్టీగా కాంగ్రెస్ కూడా అదే రీతిలో ఫిరాయింపులను ఎంకరేజ్ చేయడాన్ని ఎలా సమర్థించుకుంటారో అర్థం కాదు. ఇప్పుడు న్యాయ వ్యవస్థ ఈ సవాల్‌ను ఎలా ఎదుర్కుంటున్నది చర్చనీయాంశం.కోర్టు నేరుగా ఎమ్మెల్యేలను అనర్హులుగా చేస్తూ తీర్పు ఇస్తే తప్ప, కేవలం స్పీకర్ ల నిర్ణయానికే వదలివేసే పరిస్థితి ఉంటే ఈ సమస్య పరిష్కారం అవుతుందని ఎవరూ అనుకోవడం లేదు. పూర్వం నుంచి ఈ ఫిరాయింపుల సమస్య ఉంది. దానిని అరికట్టాలని రాజ్యాంగ సవరణలు తెచ్చినా పెద్దగా ఫలితం ఉండడం లేదు. న్యాయ వ్యవస్థ కూడా ఆయా రాష్ట్రాలలో ఆయా రకాలుగా ఫిరాయింపులపై స్పందిస్తున్నదన్న అభిప్రాయం కూడా ఉంది. అధికారం ఎటు ఉంటే అటు వైపు పరుగులు తీసే ప్రజాప్రతినిధులు, వారిని ప్రోత్సహించే రాజకీయ పార్టీలు ఉన్నప్పుడు ఫిరాయింపుల గురించి మాట్లాడడం గొంగట్లో తింటూ వెంట్రుకలు ఏరుకుంటున్నట్లు అవుతుందేమో!- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
‘ప్లీజ్ సార్.. నాకూ అవకాశం ఇవ్వండి’
న్యూఢిల్లీ, సాక్షి: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ముగియడంతో.. తెలంగాణ రాజకీయం హైదరాబాద్ నుంచి హస్తినకు మారింది. త్వరలో కేబినెట్ విస్తరణ ఉండనున్న నేపథ్యంలో మంత్రి పదవుల కోసం ఆశావహులు ఢిల్లీకి క్యూ కడుతున్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రి, పీసీసీ చీఫ్‌తో అధిష్టానం చర్చలు పూర్తి చేసినప్పటికీ ‘చివరి అవకాశం’గా భావిస్తున్న కొందరు తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. అసెంబ్లీ సమావేశాలు ముగియడంతో.. మంత్రివర్గ విస్తరణపై రాష్ట్ర రాజకీయాల్లో వాడివేడిగా చర్చ నడుస్తోంది. తెలంగాణ కేబినెట్లో చోటు కోసం పెద్ద ఎత్తున లాబీయింగ్ నడుస్తోంది. ఎలాగైనా మంత్రిపదవిని ఖాయం చేసుకోవాలనే పట్టుదలతో కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యేలు ఉన్నారు. పార్టీ పెద్దల ఇల్లు, కార్యాలయాల చుట్టూ కొందరు ఎమ్మెల్యేలు పదే పదే చక్కర్లు కొడుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఎమ్మెల్యేలు రాజగోపాల్ రెడ్డి, దొంతి మాధవరెడ్డి, బాలు నాయక్ , మల్ రెడ్డి రంగారెడ్డి, ఎమ్మెల్సీ శంకర్ నాయక్ సహా పలువురు నేతలు ఢిల్లీలో మకాం వేసి తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. తనకు కేబినెట్లో చోటు కల్పించాలని మాధవరెడ్డి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలిశారు. పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ఇప్పటికే ఢిల్లీలో ఉన్నారు. డీసీసీ అధ్యక్షుల సమావేశం తర్వాత ఆయన అధిష్టాన పెద్దలను కలుస్తారని సమాచారం. మరోవైపు.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా శుక్రవారం ఉదయం ఢిల్లీ వెళ్లనున్నారు. ఏఐసీసీ ముసాయిదాపై జరగున్న సమావేశంలో పాల్గొననున్న భట్టి.. జాతీయ నేతలను కలసి మంత్రివర్గంలో తన వారి కోసం ప్రయత్నాలు చేస్తారనే ప్రచారం నడుస్తోంది. మంత్రివర్గంలో ఆరు బెర్తులు ఖాళీగా ఉన్నాయి. వీటిలో నాలుగు నుంచి ఐదు భర్తీ చేస్తారని తెలుస్తోంది. అతిత్వరలోనే(ఏప్రిల్ 3వ తేదీ అని ప్రచారం) మంత్రివర్గ విస్తరణ ఉండనుందని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. -
రణరంగంగా మారిన భువనేశ్వర్
భువనేశ్వర్: ఒడిశాలో బీజేపీ అధికారంలో వచ్చాక మహిళలపై అఘాయిత్యాలు పెరిగాయని నిరసిస్తూ కాంగ్రెస్ కార్యకర్తలు చేపట్టిన ర్యాలీతో గురువారం భువనేశ్వర్ రణరంగంగా మారింది. అసెంబ్లీ దిశగా దూసుకొస్తున్న కాంగ్రెస్ కార్యకర్తలను మహాత్మాగాంధీ మార్గ్‌లో అడ్డుకునేందుకు పోలీసులు బారికేడ్లను ఏర్పాటు చేశారు. బారికేడ్లను దాటుకుని వస్తున్న కాంగ్రెస్ శ్రేణులను పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులపైకి వారు రాళ్లు రువ్వారు. కుర్చిలను, బాటిళ్లను విసిరేశారు. ఒక పోలీసు వాహనానికి నిప్పుపెట్టేందుకు యత్నించారు. ఘటనలో 15 మంది పోలీసులతోపాటు ఒక టీవీ రిపోర్టర్ తలకు గాయాలయ్యాయి. దీంతో, పోలీసులు లాఠీచార్జి చేయడంతో 10 మంది వరకు గాయపడ్డారు. క్షతగాత్రులంతా ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని డీసీపీ జగ్మోహన్ మీనా చెప్పారు. -
ఢీ అంటే ఢీ.. సీఎం రేవంత్, కేటీఆర్ మధ్య మాటల తూటాలు
సాక్షి, హైదరాబాద్: ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీ రామారావు మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. సవాళ్లు, ప్రతిసవాళ్లు, ఆరోపణలు, ప్రత్యారోపణలు, వ్యక్తిగత విమర్శలతో గురువారం శాసనసభ అట్టుడికింది. బిల్లుపై చర్చ ప్రారంభంలో కేటీఆర్ మాట్లాడుతూ తొలుత కేంద్రంపై ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేశారు. కాంగ్రెస్ సర్కారు ఏ ఒక్క ఎన్నికల హామీ నిలబెట్టుకోలేదని, కక్షపూరితంగా వ్యవహరిస్తోందని అన్నారు. ఈ వైఖరి వల్ల రాష్ట్రానికి నష్టం జరుగుతోందని వ్యాఖ్యానించారు. ఈ దశలో ముఖ్యమంత్రి జోక్యం చేసుకుని కేటీఆర్ విమర్శలను తిప్పికొట్టారు. ‘మేం కక్ష పూరితంగా వ్యవహరిస్తే కేసీఆర్ కుటుంబం అసెంబ్లీలో కాదు.. జైల్లో ఉండేది’ అని సీఎం అంటే.. ‘మీరు ఏం చేయాలనుకుంటున్నారో చేసుకోండి. ఏం ఫరక్ పడదు’ అంటూ కేటీఆర్ స్పందించారు. ‘ఏం చేసినా పెద్దాయన (కేసీఆర్) ఆయన సీటు ఇవ్వడు..’ అని ముఖ్యమంత్రి అంటే.. ‘రేవంత్‌లో అపరిచితుడు ఉన్నాడు’ అని కేటీఆర్ ఎద్దేవా చేశారు. తెలంగాణను బీఆర్ఎస్ అప్పుల రాష్ట్రంగా మార్చిందని రేవంత్ విమర్శించారు. ఆ తర్వాత మాట్లాడిన కేటీఆర్ అదే స్థాయిలో సీఎంపై ధ్వజమెత్తారు. పదేళ్ళ బీఆర్ఎస్ ప్రభుత్వం కన్నా మెరుగైన రైతు రుణమాఫీ చేశామన్న రేవంత్ వ్యాఖ్యలను ఖండించారు. ఏ ఊర్లోనైనా రుణమాఫీ వంద శాతం జరిగిందని నిరూపిస్తే రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని సవాల్ విసిరారు. కేటీఆర్ ప్రసంగానికి అధికార పక్ష సభ్యులు అనేకసార్లు అడ్డుపడ్డారు. దీనిపై ప్రధాన ప్రతిపక్షం అభ్యంతరాలు లేవనెత్తడంతో ఇరు పక్షాల మధ్య వాగ్వాదం చోటు చేసకుంది. కేటీఆర్, సీఎం పరస్పర వ్యక్తిగత, రాజకీయ విమర్శలతో సభ వేడెక్కింది. విపక్షం ఆరోపణలకు సీఎం సుదీర్ఘ వివరణ ఇచ్చారు. కళ్లల్లో నిప్పులు పోసుకుంటున్నారు: రేవంత్ ‘రైతుల రూ.లక్ష లోపు పంట రుణాలు మాఫీ చేస్తామని చెప్పిన బీఆర్ఎస్ ప్రభుత్వం నాలుగేళ్లలో రూ.16,143 కోట్లే మాఫీ చేసింది. మొదటి ఐదేళ్లల్లో వడ్డీ తీసివేస్తే జరిగిన రుణమాఫీ రూ.13,514 కోట్లు మాత్రమే. రెండోసారి నాలుగేళ్ళల్లో ఒక్క రూపాయి కూడా చేయలేదు. ఆఖరి ఏడాది 21,35,557 మంది రైతులకు రూ.11,909 కోట్లు మాత్రమే మాఫీ చేశారు. కానీ మేం రుణమాఫీ చేసి చూపించాం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన పది నెలల్లోనే రూ.20,616,89 కోట్లు మాఫీ చేశాం. ఎన్నికల నిబంధనతో వారు రైతుబంధు ఇవ్వకపోతే..మేము వచ్చాక ఇచ్చాం. వరి వేస్తే ఉరి అని రైతులకు చెప్పి, కేసీఆర్ కుటుంబసభ్యుల ఫామ్‌హౌస్‌ల్లో పండిన వడ్లను క్వింటాల్‌కు రూ.4,500 చొప్పున కావేరి సీడ్స్‌కు అమ్ముకున్నారు. వారు పదేళ్లలో చేయలేని పనులు మేము చేస్తే కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నారు..’ అంటూ రేవంత్ ఫైర్ అయ్యారు. అప్పుల రాష్ట్రంగా మార్చారు.. ‘బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల పాల్జేసింది. 2014 నాటికి 16 మంది ముఖ్యమంత్రులు చేసిన అప్పు రూ.90,160 కోట్లయితే, పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో రూ. 6,69,257 కోట్లు అప్పు చేశారు. వాళ్ళు పెట్టిన రూ.40,154 కోట్ల బకాయిలు కలిపితే, మొత్తం అప్పు రూ.7,19,151 కోట్లు. మేము అధికారంలోకి వచ్చిన 15 నెలల్లో రూ.1,58,041 కోట్లు అప్పు చేశాం. గత ప్రభుత్వం పదేళ్లలో చేసిన అప్పులకు అసలు, వడ్డీ కలిపి రూ.1,53,359 కోట్లు చెల్లించాం. ఇవి తీసేస్తే మేము చేసిన అప్పు రూ.4,682 కోట్లు మాత్రమే. విపక్షం అబద్ధాల పునాదులపై వెళ్తే లాభం లేదు. ఇప్పటికే కూలిపోయింది. ఇప్పటికైనా మర్యాదగా ఉండాలి..’ అని సీఎం ధ్వజమెత్తారు. ఫాంహౌస్‌ల కోసం ప్రాజెక్టులు కట్టారు.. ‘బీఆర్ఎస్ నేతల ఫాం హౌస్‌ల కోసమే ప్రాజెక్టులు కట్టారు. ప్రతి ప్రాజెక్టు పక్కన వందల ఎకరాలు కొన్నారు. కొండపోచమ్మ నుంచి ఎర్రవల్లి ఫాం హౌస్‌కు కాల్వలు తీసి నీళ్ళు తీసుకెళ్ళారా లేదా? చెప్పాలి. రంగనాయక సాగర్ దగ్గర హరీశ్‌రావుకు ఫాం హౌస్ ఉందా లేదా? దీనిపై కాంగ్రెసేతర శాసనసభ్యులతో కమిటీకి సిద్ధమా? మేడిగడ్డ దగ్గర కాళేశ్వరం కడితే కుప్పకూలిపోతుందని ఇంజనీర్లు చెప్పినా బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదు. కమిషన్ నివేదిక వచ్చిన తర్వాత బాధ్యులను జైలుకు పంపుతాం. కాళేశ్వరంపై విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ఇచ్చిన నివేదికను వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో సభ ముందు పెడతాం. కాళేశ్వరం లేకున్నా వ్యవసాయానికి నీళ్శివచ్చు. లగచర్లలో అధికారులను చంపమని విపక్షం రెచ్చగొట్టింది..’ అని సీఎం ఆరోపించారు. పెద్దాయనకు ప్రమాదం తెచ్చేలా ఉన్నారు.. ‘పెద్దాయన (కేసీఆర్) సీటు కోసం కుటుంబంలోని ఇద్దరూ ఆశ పడుతున్నారు. కానీ పెద్దమనిషి వదిలేట్లు లేడు. వీపు చింతపండు అవుతుందని పెద్దాయనే చెప్పాడు. పెద్దమనిషి ఉంటేనే బాగుంటుందని మేము అనుకుంటున్నాం. ఆయన వందేళ్ళు ఉండాలని, ప్రతిపక్షంలో ఉంటూ మంచి సలహాలు ఇవ్వాలని కోరుకుంటున్నాం. కానీ వీళ్ళిద్దరూ పోటీ పడి పెద్దాయనకు ప్రమాదం తెచ్చేలా ఉన్నారు. ఆయనకు రక్షణ కల్పించాలి. ‘ఈ సందర్భంగా నేపాల్ యువరాజు దీపేంద్ర అధికారం కోసం కుటుంబాన్ని ఏకే 47 తుపాకీతో కాల్చిన ఉదంతాన్ని ప్రస్తావించారు) మీరు జాతిపిత అని చెబుతున్న కేసీఆర్‌ను కామారెడ్డిలో బండకేసి కొట్టారు..’ అని రేవంత్ వ్యాఖ్యానించారు. ఫాంహౌస్ ఫొటోలు పత్రికలకిచ్చానని కేసులు పెట్టారు – తీవ్రవాదులు, నక్సల్స్ ఉండే డిటెన్షన్ సెల్లో ఉంచారు: రేవంత్ ‘కేటీఆర్ ఫాంహౌస్‌ను ఎవరో డ్రోన్‌తో చిత్రీకరించి నాకు ఫోటోలు ఇస్తే.. నేను వాటిని పత్రికలకు పంపిస్తే అక్రమ కేసులు పెట్టారు. అనుమతి లేకుండా డ్రోన్ ఎగురవేస్తే రూ.500 జరిమానా విధిస్తారు. కానీ నేను అప్పుడు పార్లమెంట్ సభ్యుడిని. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్నా. నన్ను అరెస్టు చేసి నక్సల్స్, తీవ్రవాదులును నిర్బంధించే డిటెన్షన్ సెల్లో ఉంచారు. మరోఖైదీ కానీ, మరొక వ్యక్తి కానీ కనిపించని విధంగా కక్షసాధింపుగా ఆ గది కేటాయించారు. రాత్రిళ్లు పడుకోవడానికి కూడా సరిపోని గది అది. అందులోనే చిన్న బాత్రూమ్. బయటకు కనపడేలా ఉంటుంది. రాత్రి ఎలాగోలా పడుకుందామని అనుకున్నా. లైట్ ఆఫ్ చేశారు కాదు. ఏమిటంటే పైనుంచి ఆర్డర్ అనేవారు. ఆ ట్యూబ్‌లైట్ చుట్టూ పురుగులు.. వాటి కోసం వచ్చే 30 బల్లులు. ప్రతిరోజూ నిద్ర లేకుండానే గడిపా. ఉదయం పూట బయటకు వదిలినప్పుడు చెట్ల కింద పడుకున్నా. 16 రోజులు అలా నిర్బంధంలో ఉంచారు. నా కూతురు పెళ్లి పత్రిక రాసుకునే కార్యక్రమానికి కూడా వెళ్లడానికి వీల్లేదంటూ ఢిల్లీ నుంచి లాయర్‌ను తీసుకునివచ్చి వాదించారు. కోర్టు కండిషనల్ బెయిల్ ఇవ్వడంతో నేరుగా కార్యక్రమానికి వెళ్లి తిరిగి జైలుకు వచ్చా. ఇప్పుడు ఆ కోపాన్ని దిగమింగుకుని రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేస్తున్నా. అంతకంతకు దేవుడే చూసుకుంటాడని అనుకున్నా. సరిగ్గా నేను ప్రమాణ స్వీకారం చేసే రోజునే నాపై కక్ష చూపించిన వాళ్లు ఆసుపత్రిపాలయ్యారు. కక్ష సాధింపు ఎవరిది? మీదా? నాదా?. ఆ కుటుంబానికి చర్లపల్లి జైల్లో డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కట్టిస్తానంటూ ఎన్నికల్లో ఇచ్చిన హామీని కూడా నేను అమలు చేయలేదు..’ అంటూ సీఎం వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. డ్రోన్ ఎగరేసి ఆడోళ్ల ఫొటోలు తీస్తారా – మీ భార్యాపిల్లల ఫొటోలు తీస్తే ఊరుకుంటారా?: కేటీఆర్ ‘సీఎం ఇంటి మీదికి డ్రోన్ పంపిస్తే ఆయన ఊరుకుంటాడా? ఆయన భార్యా పిల్లలను ఇష్టం వచ్చినట్టు ఫొటోలు తీస్తామంటే ఊరుకుంటాడా? మీకే భార్యా పిల్లలు ఉన్నారా? వేరే వాళ్లకు లేరా? వాళ్లకు కుటుంబాలు ఉండవా? లేని రంకులు అంటగట్టిం ఆనాడు ఇష్టమున్నట్టు మాట్లాడినప్పుడుం నీతులు గుర్తుకు రాలేదా? మా ఇంట్లో పిల్లల్ని తిట్టింది ఈ కాంగ్రెస్ నేతలు కాదా? మా ఇంట్లోని మైనర్ పిల్లల్ని పట్టుకొని బూతులు మాట్లాడింది ముఖ్యమంత్రి కాదా?..’ అని కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను జైల్లో పెట్టించారంటూ సీఎం చేసిన వ్యాఖ్యలకు ఆయన కౌంటర్ ఇచ్చారు. ‘మా ఇంటి మీదకు డ్రోన్ ఎగరేసి ఇంటివాళ్ల ఫొటోలు తీయటం సరైన పనేనా అన్నది సీఎం చెప్పాలి. రేవంత్‌రెడ్డిని ప్రభుత్వం జైల్లో పెట్టలేదు. కోర్టులు రిమాండ్ చేశాయి. నేను కూడా తెలంగాణ ఉద్యమంలో వరంగల్ జైల్లో ఉన్నా. అయినా రేవంత్‌రెడ్డి స్వాతంత్య్రం కోసం పోరాడాడా? ఏం గొప్ప పని చేసి జైలుకెళ్లాడు? ముఖ్యమంత్రి ఏమనుకున్నా మాకు ఫరక్ పడదు. ఏం చేసినా ఫరక్ పడదు. పదవి, అధికారం శాశ్వతం అని సీఎం అనుకుంటున్నారు కానీ అవి ఏవీ శాశ్వతం కాదు. ముఖ్యమంత్రికి అపరిమిత అధికారాలు ఉండవు. ఆయన ఎవరినీ జైలుకు పంపలేరు. కోర్టులు మాత్రమే ఆ పని చేయగలవు. రేవంత్ తిట్లన్నీ మాకు దీవెనలే.ం ఆయనకు తుపాకుల గురించి బాగా తెల్సుం. తెలంగాణపై గన్ను ఎక్కుపెట్టిన రైఫిల్‌రెడ్డి రేవంత్‌రెడ్డి. తెలంగాణ జాతి పిత ముమ్మాటికీ కేసీఆరే. తెలంగాణ బూతు పిత రేవంత్‌రెడ్డే..’ అని కేటీఆర్ అన్నారు -
కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం జరిగింది
-
మంత్రి పదవి కోసం అధిష్టానం వద్దకు క్యూ..!
హైదరాబాద్: ఉగాది లోపు అంటే మరో రెండు రోజుల్లో తెలంగాణ క్యాబినెట్ విస్తరణపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉండటంతో ఢిల్లీకి కాంగ్రెస్ నేతలు క్యూకడుతున్నారు. పలువురు కాంగ్రెస్ నేతలు తమకు మంత్రి పదవి కావాలంటే తమకు కావాలంటూ ఢిల్లీ విమానం ఎక్కేవందుకు సన్నద్ధమయ్యారు. ఇవాళ సాయంత్రం కొంతమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఢిల్లీకి వెళ్లనున్నారు. ఇప్పటికే మహబూబాబాద్ ఎమ్మెల్యే మురళీ నాయక్, నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డిలు ఢిల్లీలో ఉండగా, ఈరోజు(గురువారం) సాయంత్రం ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిలతో పాటు పలువురు ఎస్టీ, ఎస్టీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఢిల్లీకి వెళ్లేందుకు సన్నద్ధమైనట్లు తెలుస్తోంది.తమ సామాజిక వర్గాలకు మంత్రి వర్గంలో ప్రాతినిధ్యం కల్పించాలని అధిష్టానానికి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు విన్నవించనున్నారు. ఈ మేరకు కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి మీనాక్షి నటరాజన్ తో వీరు సమావేశమయ్యే అవకాశం ఉంది.తెలంగాణ క్యాబినెట్ విస్తరణకు సంబంధించి రెండు రోజుల క్రితం హైకమాండ్ కసరత్తు చేసింది. డీనిలో భాగంగా పలువురు రాష్ట్ర ముఖ్యనేతలకు ఢిల్లీ పిలిచి క్యాబినెట్ విస్తరణపై సుదీర్ఘంగా చర్చించింది హైకమాండ్. అయితే క్యాబినెట్ విస్తరణలో ఎవరికి చోటు కల్పించాలి.. ఎవరికి ఉద్వాసన పలకాలి అనే అంశం ఇప్పటికే పూర్తయినట్లు తెలుస్తోంది. అయినప్పటికీ తమ వంతు ప్రయత్నంలో భాగంగా పలువురు నేతలు ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలను కలవనున్నారు. తెలంగాణ క్యాబినెట్ రేసులో సుదర్శన్ రెడ్డి, ప్రేమ్ సాగర్ రావు, వాకాటి శ్రీహరి, కోమటిరెడ్డి రాజగోపాల్, మల్ రెడ్డి రంగారెడ్డి, బాలు నాయక్ లు ఉన్నట్లు తెలుస్తోంది. -
‘ఒకరు సహాయ మంత్రి.. ఇంకొకరు నిస్సహాయ మంత్రి’.. అసెంబ్లీలో కేటీఆర్ సెటైర్లు
సాక్షి,హైదరాబాద్: మాకు పార్లమెంట్ ఎన్నికల్లో గుండు సున్నా వచ్చింది నిజమే. కానీ కేంద్రం బడ్జెట్లో తెలంగాణకు వచ్చింది గుండు సున్నానే. పురావస్తు శాఖ చరిత్రను తవ్వినట్లు.. గత ప్రభుత్వం, గత ప్రభుత్వము అని తవ్వుతూనే ఉంది. మరి కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంటే కేంద్రాన్ని ఒక్క మాట కూడా అనడం లేదని మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు. తెలంగాణ అసెంబ్లీలో కేటీఆర్ మాట్లాడారు. ‘కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ అభివృద్ది వేగంగా జరిగింది. బీఆర్ఎస్ హయాంలో తెలంగాణ అన్నీ రంగాల్లో అభివృద్ధిని సాధించింది. కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి రాష్ట్రం పేరు ఎక్కడా వినపడలేదు. అధికారంలోకి ఎవరు వచ్చినా రాష్ట్రాభివృద్ధే మాకు ముఖ్యం.తెలంగాణా పథకాలను కేంద్రం కాపీ కొట్టింది. రాష్ట్రానికి ఎన్నోసార్లు కేంద్రం అన్యాయమే చేసింది. డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే ఏంటి? మాకు పార్లమెంట్ ఎన్నికల్లో గుండు సున్నా వచ్చింది నిజమే. కానీ కేంద్రం బడ్జెట్లో తెలంగాణకు వచ్చింది గుండు సున్నానే. 2014 నుంచి కేంద్రంతో సఖ్యతతో ఉండి రాష్ట్రానికి నిధులు తెచ్చుకునే ప్రయత్నం చేశాం. ట్యాక్స్ రూపంలో రాష్ట్రం నుంచి కేంద్రానికి వెళ్లే నిధులు ఎక్కువ.. రాష్ట్రానికి వచ్చేది తక్కువ. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం జరిగింది దానిపై భట్టి విక్రమార్క ఒక్క మాట అనలేదు. 8 ప్లస్ 8 16కావాలి...కానీ తెలంగాణలో గుండు సున్నా అయింది. భారత జాతిని సాధుతున్న రాష్ట్రంలో తెలంగాణ టాప్ ఫైవ్‌లో ఉంది. పురావస్తు శాఖలో చరిత్రను తవ్వినట్లు.. గత ప్రభుత్వము అని తవ్వుతూనే ఉన్నారు. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం జరిగిందని ఒక్కరూ మాట్లాడలేదు. ఒక్క విభజన హామీ నెరవేర్చలేదు.తెలంగాణ నుంచి ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నారు...ఒకరేమో సహాయ మంత్రి, ఇంకొకరు నిస్సహాయమంత్రి. హైదరాబాద్ మెట్రో, అదిలాబాద్ వెనుకబడిన ప్రజలకు ఒక్క రూపాయి ఇవ్వలేదు. ధర్మంతో కూడిన రాజకీయాలు చేయాలి తప్ప.. రాజకీయాల్లోకి ధర్మాన్ని లాగొద్దు. దేశం కోసం ధర్మం కోసం అనే వాళ్ళు వేములవాడ, కొండగట్ట, ధర్మపురి, భద్రాచలం ఆలయాలకు ఒక్క రూపాయి ఇవ్వలేదు. మహాకుంభ మేళాకు కేంద్రం 2100 వంద కోట్లు ఇచ్చింది.వన్ ట్రిలియన్ ఎకానమీ 2030 వరకు ఎలా సాధిస్తారో చెప్పాలి. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు కొటేషన్స్‌కు మాత్రమే పరిమితం అయ్యాయి. గత బడ్జెట్లో ఇండ్ల లెక్కలు 6లక్షలు అన్నారు.. ఈ సారి 5లక్షలు అంటున్నారు. కేంద్రంతో సఖ్యత అంటున్నారు..మరి ఏం సాధించారో చెప్పాలి. మా ప్రభుత్వం పోగానే ల్యాండ్ క్యూజర్లు కొన్నారని విమర్శలు చేశారు. అప్పటి ప్రభుత్వం కొనుగోలు చేసిన కార్లను ఇప్పుడు సీఎం,మంత్రులు వినియోగిస్తున్నారని’ అన్నారు. -
అమిత్ షాపై సభా హక్కుల నోటీసు తిరస్కరణ
న్యూఢిల్లీ, సాక్షి: కేంద్ర హోం మంత్రి అమిత్‌షాకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ సమర్పించిన సభా హక్కుల ఉల్లంఘన నోటీసులను గురువారం రాజ్యసభ చైర్మన్ జగ్దీప్ ధన్‌ఖడ్ తిరస్కరించారు. ఆయన వ్యాఖ్యలను పరిశీలించాను. అందులో అతిక్రమణ ఏదీ కనిపించలేదని చెబుతూ నోటీసులను తిరస్కరించారు. విపత్తుల నిర్వహణ బిల్లు 2024పై రాజ్యసభలో మంగళవారం జరిగిన చర్చలో అమిత్‌షా మాట్లాడుతూ ‘‘కాంగ్రెస్ హయాంలో ప్రధానమంత్రి సహాయనిధి కేవలం ఒక కుటుంబం గుప్పిట్లో ఉండేదని, ప్రధానమంత్రి సహాయనిధిని ప్రభుత్వం ఏర్పాటు చేసినా అందులో కాంగ్రెస్ అధ్యక్షులు సభ్యులుగా ఉండేవారు’’ అని వ్యాఖ్యానించారు. అయితే ఈ వ్యాఖ్యలు పరోక్షంగా సోనియా గాంధీ పరువు ప్రతిష్టలకు భంగం కలిగించేవిగా ఉన్నాయని, హోం మంత్రి సభ్యులను తప్పుదోవ పట్టించారని, ఇది సభా హక్కుల ఉల్లంఘన కిందకే వస్తుందని పేర్కొంటూ జైరాం రమేశ్ ప్రివిలేజ్ నోటీసు రాజ్యసభ చైర్మన్‌కు అందించారు. -
తొలి సంతకం నేనే చేస్తా.. అవయవదానానికి ముందుకొచ్చిన కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ సాక్షిగా అవయవదానానికి మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముందుకొచ్చారు. అవయవదానం బిల్లుపై జరిగిన చర్చ సందర్భంగా సభలో తాను అవయవ దానానికి సిద్ధంగా ఉన్నట్లు ఆయన ప్రకటించారు. మనం లక్షలాది మంది ప్రజలకు ప్రతినిధులం. మనం అందరికీ ఆదర్శంగా నిలవాలి’’ అంటూ కేటీఆర్ పిలుపునిచ్చారు. మన నియోజకవర్గాల్లో కూడా అవయవదానం అంశంలో చైతన్యం తీసుకురావాలన్న కేటీఆర్.. ప్రజలందరికీ దీనిపై అవగాహన కల్పించాలని కోరారు.ఈ మేరకు ఆలోచన ఉన్న సభ్యులు ముందుకు వస్తే శాసన సభ ప్రాంగణంలోనే సంతకాల సేకరణ చేపడదామని స్పీకర్‌కు కేటీఆర్ సూచించారు. అందరి కంటే ముందు తానే సంతకం చేస్తానని సభలో కేటీఆర్ ప్రకటించారు. అవయవ దానం అనేది గొప్ప మానవీయ చర్య. ఇది మరింత మందికి జీవితాన్ని ప్రసాదిస్తుందని కేటీఆర్ అన్నారు.ఎంతో ఉపయోగకరం.. అభినందనలు: హరీష్రావుఅవయవదానం బిలుపై చర్చ సందర్భంగా మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు మాట్లాడుతూ.. ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అవయవదానంపై పెట్టిన బిల్లు ఎంతో ఉపయోగకరమని.. అభినందనలు తెలుపుతున్నామన్నారు. నాకున్న సమాచారం మేరకు ఈరోజు వరకు 3724 మంది అవయవదానం కోసం దరఖాస్తు చేసుకొని ఎదురు చూస్తున్నారు. ఈ రోజు పెట్టిన బిల్లు వీరందరికీ ఎంతో ఊరట చెందే విషయం. ఈ బిల్లు ద్వారా గ్రాండ్ పేరెంట్స్, గ్రాండ్ చిల్డ్రన్కు అవయవదానం చేసే అవకాశం కలుగుతుంది. అదేవిధంగా స్వాప్ ద్వారా పరస్పరం అవయవ దానం చేసుకునే అవకాశం కలుగుతుంది. అవయవాల మార్పిడి దందా చేసే ముఠాలపై కఠిన చర్యలు తీసుకోవచ్చు’’ అని ఆయన చెప్పారు...ఇప్పటివరకు బ్రెయిన్ డెడ్ అయిన విషయాన్ని న్యూరో ఫిజీషియన్లు మాత్రమే నిర్థారించే వారు. ఈ బిల్లు ద్వారా డాక్టర్లందరూ నిర్ధారణ చేసే అవకాశం కల్పించారు. దీంతో త్వరగా నిర్థారణ చేసి, అవయవ దానం చేసే అవకాశం కలుగుతుంది. జీవన్ దాన్ ప్రోగ్రాం విజయవంతంగా జరిగింది. ఉమ్మడి రాష్ట్రంలో 2013లో 189 అవయవ మార్పిడులు మాత్రమే జరిగితే. బీఆర్ఎస్ పాలనలో 2014లో 233, 2015లో 364, 2016లో 563, 2017లో 573, 2018లో 469, 2019లో 257, 2020లో 616, 2021లో 716, 2022లో 729, 2023లో 725 అవయవ మార్పిడులను జరిపాం. దేశంలో అత్యధిక అవయవదానాలు చేస్తున్న రాష్ట్రంగా తెలంగాణను నిలిపాం.తెలంగాణ రాష్ట్రం అనేక అవార్డులు కూడా పొందింది. ఒకపుడు అవయవదానానికి అమెరికా, లండన్ వెళ్లాల్సి వచ్చేది. బీఆర్ఎస్ హయాంలో నిమ్స్, ఉస్మానియా, గాంధీ లాంటి ప్రభుత్వాసుపత్రుల్లో 609 అవయవమార్పిడి చికిత్సలు జరిగాయి. అవయవమార్పిడి ఖరీదైన చికిత్స, పేదోళ్లు చేసుకోలేరు అనుకుంటారు, కానీ, కేసీఆర్ హయాంలో ఆరోగ్యశ్రీ కింద 577 అవయవమార్పిడిలు చేశాం. 20 లక్షల ఖర్చయ్యేవి నయాపైసా ఖర్చు లేకుండా ప్రభుత్వాసుపత్రుల్లో చేశాం. సంవత్సరం పాటు మందులు కూడా ఇచ్చాం. కుటుంబీకులు త్వరగా నిర్ణయం తీసుకుంటే ఎక్కువ మందికి మేలు జరుగుతుంది’’ అని హరీష్‌రావు వివరించారు. -
తెలంగాణ శాసనసభ నిరవధిక వాయిదా
తెలంగాణ శాసనసభ నిరవధిక వాయిదా11 రోజులు సభ జరిగింది.97 గంటల 32 నిమిషాలు సాగింది.శాసనసభలో 12 బిల్లులను ప్రవేశపెట్టి ఆమోదం తెలిపింది.11 రోజుల శాసనసభలో 146 మంది సభ్యులు మాట్లాడారు.16 ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారుశాసనసభలో కాంగ్రెస్ పార్టీ 65, టిఆర్ఎస్ 38, బిజెపి 8, ఎంఐఎం 7, సిపిఐ ఒక సభ్యులు ఉన్నట్లు ప్రకటించిన స్పీకర్డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క @అసెంబ్లీవాస్తవరూపిణ రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టాం.ఏ శాఖలకు కేటాయించిన బడ్జెట్‌ను ఆ శాఖలకు దాదాపు 70% పైగా ఖర్చు చేస్తాం.గత ప్రభుత్వం శాఖలకు కేటాయించిన బడ్జెట్‌ను పూర్తిగా ఖర్చు చేయలేదు.ఎస్సీ వెల్ఫేర్ కు 42 వేల కోట్లు, బీసీ వెల్ఫేర్‌కు 15000 కోట్లు ఖర్చు చేయలేదు.అన్ని శాఖలకు కలిపి 70 వేల కోట్లకు పైగా ఖర్చు చేయకుండా వదిలేశారుగత పదేళ్లుగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్థిక అరాచకత్వం చేసింది.గత ప్రభుత్వం లెక్క 20 శాతం పెంచకుండా జాగ్రత్తగా బడ్జెట్ తయారు చేశాం.బడ్జెట్ పై కాకుండా సొంత రాజకీయ వ్యాఖ్యలు సభలు చేస్తున్నారు.నేను ఆషామాషీగా రాజకీయాల్లోకి రాలేదు.యాదృచ్ఛికంగా రాజకీయాల్లోకి రాలేదు.నేను యాక్టింగ్, యాక్సిడెంటల్ పొలిటిషన్ కాదు.ఫ్యూడల్ వ్యవస్థలో అణిచివేతలను దాటుకుంటూ రాజకీయాల్లోకి వచ్చాను.కంఫర్ట్ లెవెల్స్ నాకు లేవు... నా లెక్క ఎవ్వరూ బాధపడొద్దు అనే ఆలోచన కలిగిన వ్యక్తిని నేను.దోపిడి చెయ్యడానికి రాజకీయాల్లోకి రాలేదు.సమాజానికి మంచి చేయాలనే ఆలోచనతో రాజకీయాల్లోకి వచ్చిన.నేను అడ్డగోలుగా ఎదిపడితే అది మాట్లాడొచ్చు కానీ చెయ్యను.జూన్ 2వ తేదీ తెలంగాణ ఆవిర్భావం రోజున రాజీవ్ యువ వికాసం సాంక్షన్ లెటర్లు ఇస్తాం.ఏలేటి మహేశ్వర్‌రెడ్డి BJLP ఫ్లోర్ లీడర్ @అసెంబ్లీతెలంగాణకు కేంద్రం నిధులు ఇవ్వలేదంటూ అవాస్తవాలు మాట్లాడొద్దు.కాంగ్రెస్ కూటమిలో చేరేందుకు BRS ప్రయత్నిస్తోంది.డీలిమిటేషన్‌తో అన్యాయం అంటూ కొత్త రాగం ఎత్తుకున్నారు.కుటుంబ పార్టీలే బీజేపీని వ్యతిరేకిస్తున్నాయి.రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయింది.అప్పులు తీర్చేందుకు మళ్లీ అప్పులు చేయాల్సిన స్థితిలో ప్రభుత్వం ఉంది.ఆటో డ్రైవర్లకు 12 వేలు ఇస్తామన్న హామీని నెరవేర్చాలి.రాష్ట్ర ప్రభుత్వ పరిస్థితి అప్పుల అప్పారావు, రొటేషన్ చక్రవర్తి వలే ఉంది. సీఎం రేవంత్ రెడ్డిమా ప్రభుత్వం ఎవరి పై కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడలేదు.500 ఫైన్ వేసే డ్రోన్ కేసులో నన్ను చర్లపల్లి జైలులో వేశారు.నక్సలైట్లు, దేశ ద్రోహులు ఉండే డిటెన్షన్ సెల్లో నన్ను వేశారునేను పడుకోకుండా రాత్రి కూడా లైట్లు వేసే వారు.16 రోజులు నిద్రపోకుండా చేశారునా బిడ్డ లగ్గానికి రాకుండా ఢిల్లీ నుంచి అడ్వకేట్లను తీసుకొచ్చారు.జైలు నుంచి ఫంక్షన్ హాల్‌కు వచ్చి...మళ్ళీ జైలుకు పోయా.నేను ప్రమాణ స్వీకారం చేసిన రోజే... కేసీఆర్ కుటుంబంలో ఏం జరగాలో అది జరిగింది.కక్ష్య సాదింపు ఎవరు చేశారు.నేను కక్ష్య సాదింపు దిగితే... కేసీఆర్ కుటుంబం జైలులో ఉండేది.కేసీఆర్ కుటుంబం జైలులో పెడతా అని ఎన్నికల హామీ ఇచ్చా...కానీ ఆ హామీని నెరవేర్చలేదు.మేం నిజంగా కక్ష సాధింపు చర్యలకు పాల్పడితే… వాళ్లు అక్కడ కూర్చుని నోటికొచ్చినట్లు మాట్లాడేవారు కాదుచంచలగూడ జైల్లోనో, చర్లపల్లి జైల్లోనో మమ్మల్ని పెట్టినచోటే ఉండేవారు.డ్రోన్ ఎగరేస్తే రూ. 500 ఫైన్ వేస్తారు.. కానీ అధికారం అడ్డుపెట్టుకుని ఎంపీగా ఉన్న నన్ను చర్లపల్లి జైల్లో పెట్టారు16 రోజులు నన్ను డిటెన్షన్ సెల్లో ఒక మనిషి కూడా కనిపించకుండా మమ్మల్ని నిర్బంధించిన ఆ కోపాన్ని బిగపట్టుకున్నాం తప్ప కక్ష సాధింపునకు పాల్పడలేదులైట్లు ఆన్ లోనే పెట్టి ఒక్క రాత్రి కూడా పడుకోకుండా జైల్లో గడిపేలా చేశారుకరుడు గట్టిన నేరస్తున్ని బంధించినట్లు ఒక పార్లమెంట్ సభ్యుడిగా ఉన్న నన్ను బంధించారువాళ్ల తప్పులను దేవుడు చూస్తాడు..అంతకు అంత అనుభవిస్తారు అనుకుని ఊరుకున్నానా మీద కక్ష చూపిన వారిని దేవుడే ఆసుపత్రిపాలు చేశాడుచర్లపల్లి జైలు నుంచి నా బిడ్డ లగ్నపత్రిక రాసుకోవడానికి వెళ్లకుండా అడ్డుకున్నారురాజకీయ కక్ష సాధింపులంటే మీవి కదాఅయినా నేను కక్షసాధింపు చర్యలకు పాల్పడలేదునిజంగానే నేను కక్ష సాధించాలనుకుంటే మీ కుటుంబమంతా చర్లపల్లి జైల్లో ఉండేవారుకానీ ఆ పని నేను చేయలేదు.. మేం విజ్ఞత ప్రదర్శించాం..ప్రజలు అధికారం ఇచ్చింది నా కక్ష తీర్చుకోవడానికి కాదని నేను విజ్ఞత ప్రదర్శించాసొంతపార్టీ ఆఫీసులో బూతులు తీయించి రికార్డు చేయించినా… చెంపలు వాయించే శక్తి ఉన్నా నేను సంయమనం పాటించాఎవరివి కక్ష సాధింపు చర్యలోతెలంగాణ సమాజం ఇదంతా గమనిస్తోంది..కేటీఆర్ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి కేటీఆర్ సవాల్.తెలంగాణ రాష్ట్రంలో పూర్తిగా రుణమాఫీ కాలేదు.కొడంగల్ అయినా సిరిసిల్ల అయిన వెళ్దాం 100శాతం రుణమాఫీ అయినట్లు నిరూపిస్తే శాశ్వతంగా రాజకీయాలు వదిలేస్తానేను తలచుకుంటే ఎవ్వరూ మిగలరని సీఎం అంటున్నారు.. ఎవరు తలచుకున్న ఏం ఫరక్ పడదు.మీ ఇండ్లపై డ్రోన్లు ఎగరవేసి మీ భార్య, బిడ్డల ఫోటోలు తీస్తే ఊరుకుంటారా?నేను జైలుకు వెళ్లాను తెలంగాణ కోసం కొట్లాడి జైలుకు వెళ్లాను.రేవంత్ రెడ్డి ఎవరికోసం జైలుకు వెళ్లారు ఎందుకోసమే వెళ్లారు?తమ వరకు వచ్చేసరికి భార్యా పిల్లలు గుర్తుకు వస్తారా ఇతరులకు భార్యా పిల్లలు ఉండరా?లేని రంగులు అంటగడితే అప్పుడు మాకు బాధ వేయడం ఈరోజు మీరు బాధపడితే ఎలా?డీలిమిటేషన్‌పై తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి. రేవంత్ కామెంట్స్.. జనాభా తగ్గిన రాష్ట్రాలు నష్టపోకూడదు. పునర్విభజనకు జనాభా ఒక్కటే ప్రామాణికం కాకూడదు. జనాభా నియంత్రణ శాపంగా మారకూడదు. రాష్ట్రాన్ని యూనిట్‌గా తీసుకుని నియోజకవర్గ పునర్విభజన చేయాలి. కేంద్రం నిర్ణయంతో ప్రజల్లో ఆందోళన నెలకొందిఅన్ని పార్టీలతో సంప్రదింపులు జరపాలి. ఆ తర్వాతే లోక్‌సభ సీట్ల పునర్విభజన జరగాలి.డీలిమిటేషన్‌పై కేంద్ర ప్రభుత్వం చర్యలే తీసుకోలేదు.ఎందుకు ఈ హడావిడి అని కేంద్రమంత్రులు మాట్లాడుతున్నారు.జనాభా నియంత్రణ కోసం కేంద్ర ప్రభుత్వం విధివిధానాలు ఖరారు చేసింది..జనాభా నియంత్రణను దక్షిణ భారత దేశం పాటిస్తే..ఉత్తరాది రాష్ట్రాలు నియంత్రణ చేయకపోవడంతో జనాభా పెరిగింది2026 తర్వాత జనాభా లెక్కించి.. దాని ప్రకారం నియోజకవర్గాల పునర్విభజన చేయాల్సి ఉండటంతో ఇది చర్చనీయాంశమైంది.1971 జనాభా లెక్కల తర్వాత కేంద్రం.. జనాభా నియంత్రణ విధివిధానాలను తీసుకువచ్చింది.ఇందిరాగాంధీ, వాజ్‌పేయి.. 25ఏళ్ల పాటు నియోజకవర్గాల పునర్విభజనను వాయిదా వేశారు.డీలిమిటేషన్ ఈజ్ లిమిటేషన్ ఫర్ సౌత్.ప్రస్తుత జనాభా ప్రకారం ఎస్సీ, ఎస్టీ సీట్లను పెంచాలి.ఉత్తరాది రాష్ట్రాలు జనాభా నియంత్రణ చేయలేదు.కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ద్వంద్వ విధానాలను నిరసిస్తూ.. అసెంబ్లీలో తీర్మానం పెట్టాం. సౌత్‌కు అన్యాయం జరుగుతుందని ఇందిరాగాంధీ గతంలోనే గుర్తించారు.2011 జనాభా లెక్కల ప్రకారం జమ్ము కశ్మీర్, సిక్కిం అసెంబ్లీలలో సీట్లు పెంచారు.డీలిమిటేషన్‌తో 24 శాతం ఉన్న దక్షిణాది ఎంపీల సంఖ్య 19 శాతానికి తగ్గిపోతుంది. హరీష్ రావు కామెంట్స్..ఈ సెషన్లో ఒక్కరోజు మాత్రమే క్వశ్చన్ అవర్ పెట్టారు..క్వశ్చన్ అవర్ లేకపోవడంతో సభ్యుల అనుమానాలు నివృత్తి కావడం లేదు..ఇకనైనా వీలైనన్ని రోజులు క్వశ్చన్ అవర్‌తో పాటు జీరో అవర్ పెట్టాలి.శ్రీధర్ బాబు కామెంట్స్..అర్ధరాత్రి వరకు సభ నడుపుతున్నాం.ప్రతీ సభ్యుడికి మాట్లాడే అవకాశం ఇస్తున్నాం..సభ్యులు అడిగిన ప్రతీ ప్రశ్నకు లేఖ ద్వారా సమాధానం తెలియజేస్తాం. తెలంగాణ అసెంబ్లీలో కాగ్ రిపోర్టును ప్రవేశపెట్టిన డిప్యూటీ సీఎం భట్టి.2023-24 ఏడాది కాలంతో కలిపి గత ఐదేళ్లలో 4లక్షల 3వేల 664 కోట్ల అప్పులు చేసినట్లు తెలిపిన కాగ్.2023-24 ఏడాదిలో పబ్లిక్ మార్కెట్ నుంచి 49,618 కోట్ల అప్పులు తెచ్చిన ప్రభుత్వం.గత ఏడాది కాలంలో 200 శాతం FRBM పరిధి పెరిగినట్లు తెలిపిన కాగ్2023-24లో తెలంగాణ రెవెన్యూ సర్ ప్లస్ 779 కోట్లుగా పేర్కొన్న కాగ్.2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఫైనాన్స్ అకౌంట్స్, అప్రోప్రియేషన్ అకౌంట్స్ పై నివేదిక2023-24 బడ్జెట్ అంచనా 2,77,690 కోట్లు, చేసిన వ్యయం 2,19,307 కోట్లుబడ్జెట్ అంచనాలో 79 శాతం వ్యయంజీఎస్డీపీలో వ్యయం అంచనా 15 శాతంఆమోదం పొందిన బడ్జెట్ కంటే అదనంగా అంచనాల్లో 33 శాతం 1,11,477 కోట్లు ఖర్చు చేసిన ప్రభుత్వం349 రోజుల పాటు 10,156 కోట్లు వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ సదుపాయాన్ని వినియోగించుకున్న ప్రభుత్వం35,425 కోట్ల ఓవర్ డ్రాఫ్ట్ సదుపాయాన్ని 145 రోజుల పాటు వినియోగించుకున్న ప్రభుత్వం2023-24లో వడ్డీల చెల్లింపుల కోసం 24,347 కోట్ల వ్యయంవేతనాలకు 26,981 కోట్లు ఖర్చుఖజానాకు పన్ను ఆదాయం నుంచే 61.83 శాతం నిధులు2023-24లో కేంద్రం నుంచి వచ్చిన గ్రాంట్ల మొత్తం కేవలం 9934 కోట్లురెవెన్యూ రాబడుల్లో 45 శాతం వేతనాలు, వడ్డీ చెల్లింపులు, పెన్షన్లకే ఖర్చు2023-24లో రెవెన్యూ మిగులు 779 కోట్లురెవెన్యూ లోటు 49,977 కోట్లు,జీఎస్డీపీలో రెవెన్యూ లోటు శాతం 3.332023-24 ముగిసే వరకు రుణాల మొత్తం 4,03,664 కోట్లు, జీఎస్డీపీలో అప్పుల శాతం 272023-24 వరకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన గ్యారంటీల మొత్తం 2,20,607 కోట్లు2023-24 లో తీసుకున్న 50,528 కోట్లలో 43,918 కోట్లను మూలధనం వ్యయం పై ఖర్చు చేసిన ప్రభుత్వం2023-24 లో స్థానిక సంస్థలు, ఇతర సంస్థలకు ప్రభుత్వం ఇచ్చిన నిధులు 76,773 కోట్లు, 11 శాతం పెరుగుదలశాసన మండలి ఆవరణలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీల నిరసనరైతు రుణమాఫీ చేయాలని శాసనమండలి ఆవరణలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీల నిరసనప్లకార్డులు పట్టుకుని నిరసన వ్యక్తం చేసిన ఎమ్మెల్సీలురైతు రుణమాఫీ బోగస్ అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీల నినాదాలు కాసేపట్లో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం.నేటితో ముగియనున్న తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.సభలో కాగ్ రిపోర్ట్ పెట్టనున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కద్రవ్యవినిమయ బిల్లుకు ఆమోదం తెలుపనున్న అసెంబ్లీఅసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యే కామెంట్స్..ఎమ్మెల్యే కేపీ వివేకానంద..బీజేపీ, కాంగ్రెస్ ఇద్దరు గల్లీలో దోస్తీ.. ఢిల్లీలో కుస్తీ అని మొదటి నుండి చెబుతున్నాం..నిన్న అసెంబ్లీ వేదికగా కాంగ్రెస్, బీజేపీ మధ్య పొత్తు అర్థం అయ్యింది..అసెంబ్లీ సమావేశంలో మా హరీష్ రావు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు లేక.. బీజేపీ ఎమ్మెల్యేలతో స్క్రిప్ట్ రాసి చదివిపిస్తుంది కాంగ్రెస్..కాంగ్రెస్ పార్టీ రాసిచ్చిన స్క్రిప్ట్ నే బీజేపీ ఎమ్మెల్యేలు, కేంద్ర మంత్రులు చదువుతున్నారు..నిన్న సభలో ఉత్తమ్ కుమార్ రెడ్డి వద్ద సమాధానం లేక బీజేపీ ఎమ్మెల్యేలకు ఇచ్చి మాట్లాడించారు..అన్ని అనుమతులతో కాళేశ్వరం కట్టాము..అప్పుడు కేంద్రంలో అధికారంలో ఉంది బీజేపీ పార్టీనే..మరి కేంద్రంలో బీజేపీ పార్టీ సమర్థవంతంగా పని చేయడం లేదా అని ప్రశ్నిస్తున్నాము..కాంగ్రెస్ తరపున మాట్లాడడం కంటే.. నేరుగా కాంగ్రెస్ కండువా కప్పుకుంటే సరిపోతుంది..ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అబద్దాలపై ఏర్పడిన ప్రభుత్వం..తమ హామీలు, తమ బాధ్యతలు విస్మరిస్తూ పరిపాలన చేస్తున్నారు..అధికారంలో రాక ముందు పీఆర్సీ, డీఏ లు ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చారు..ఈ రోజు మా పార్టీ తరపున సభలో వాయిదా తీర్మానం పెడుతున్నాం..తప్పకుండా ఉద్యోగులకు ప్రకటించిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేస్తున్నాం..ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్..మోడీ దేశంలో కాంగ్రెస్ హఠావో అంటున్నారు..తెలంగాణలో బీజేపీ నేతలు కాంగ్రెస్ బచావ్ అంటున్నారు..బీజేపీ నేతలు రేవంత్ రెడ్డితో డీలింగ్ చేసుకుంటున్నారు..భట్టి అంటే మాకు గౌరవం ఉండేది..ఇప్పుడు భట్టి అహంకారంతో మాట్లాడుతున్నారు..గత అసెంబ్లీలో మహిళా ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డిని మొహం ఎక్కడ పెట్టుకుంటారని అన్నారు..నిన్న ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని భట్టి అన్నారు..30 శాతం కమీషన్ తీసుకుంటున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అంటున్నారు..మా దగ్గర కమిషన్ తీసుకుంటున్నారని కాంట్రాక్టర్లు అంటున్నారు..దేశంలో ఎక్కడా లేని విధంగా సెక్రటేరియట్ లో కాంట్రాక్టర్లు ధర్నా చేశారు..నిన్న భట్టి మాట్లాడిన మాటలను ఉపసంహరించుకోవాలి..భట్టి రోజు రోజుకి అహంకారపూరితంగా మాట్లాడుతున్నారు..భట్టి తన గౌరవాన్ని నిలబెట్టుకోవాలి..ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి..సభలో శాంతి భద్రతలపై మాట్లాడితే మైక్ కట్ చేశారునా ఇంటిపై ఎమ్మెల్యే గాంధీతో పాటు రౌడీలు నా ఇంటిపై దాడి చేశారునన్ను హత్య చేసేందుకు ప్రయత్నించారుసైబరాబాద్ డీసీపీ, మాదాపూర్ ఏసీపీ స్వయంగా రౌడీ షీటర్లను తీసుకొచ్చి హత్య ప్రయత్నం చేశారుఇప్పటికే ఏడాది గడుస్తున్న వారిపై ఎందుకు చర్యలు తీసుకోలేదుశాసన సభ్యుడుగా నాకే భద్రత లేకపోతే సామాన్యుల పరిస్థితి ఏంటి?.సీఎం రేవంత్ రెడ్డిని డిమాండ్ చేస్తున్నా సైబరాబాద్ డీసీపీ మాదాపూర్ ఏసీపీని సస్పెండ్ చేయాలినన్ను హత్య చేసేందుకు వచ్చిన గాంధీపై త్రీ నాట్ సెవెన్ కేసు బుక్ చేశారుఇప్పటివరకు ఎందుకు అరెస్ట్ చేయలేదురాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉందా?నా ఫోన్ ట్యాపింగ్ అవుతుందని కంప్లైంట్ చేస్తే ఉల్టా నా పైనే కేసు పెట్టి బలవంతంగా మా ఇంటి డోర్లు పగలగొట్టి తీసుకెళ్లారుపార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో నిన్న సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు.కేసు సుప్రీంకోర్టులో ఉండగా ఉప ఎన్నికలు రావని ప్రకటన చేశారుదీనిపై ఏప్రిల్ 2న సీఎం వ్యాఖ్యలపై సుప్రీం దృష్టికి తీసుకెళ్తాంపార్టీ మారిన 10 నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు తప్పవుప్రభుత్వ నిర్లక్ష్యంతో నా నియోజకవర్గంలో పంటలు ఎండిపోతున్నాయిమంత్రి పొంగులేటికి సంబంధించిన రాఘవ కన్ స్ట్రక్షన్ కంపెనీని బ్లాక్‌లిస్టులో పెట్టాలిసుంకేశాల కన్ స్ట్రక్షన్ చేసిన కంపెనీని బ్లాక్ లిస్టులో పెట్టాలికాళేశ్వరం ప్రాజెక్టు తో 18 లక్షల ఎకరాలకు సాగునీరు అందించారు కేసీఆర్చిన్న కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించడం లేదు.. వెంటనే వారికి బిల్లు చెల్లించాలి -
‘కమీషన్ల’పై దద్దరిల్లిన సభ!
30% కమీషన్ తీసుకుంటున్నారని వాళ్ల ఎమ్మెల్యేలే అంటున్నారు. 20% కమీషన్ అంటూ సచివాలయంలో ధర్నాలు జరుగుతున్నాయి- కేటీఆర్కేటీఆర్ను చాలెంజ్ చేస్తున్నా.. మీ ఆరోపణలను రుజువు చేయండి. లేదంటే ప్రజలకు, సభకు క్షమాపణ చెప్పండి. ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి.-భట్టి సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర శాసనసభ బుధవారం దద్దరిల్లింది. ప్రభుత్వ పెద్దలు కమీషన్లు తీసుకుంటున్నారంటూ బీఆర్ఎస్ సభ్యుడు కె.తారకరామారావు పేర్కొనడం, ఒళ్లు దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా మాట్లాడాలంటూ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క హెచ్చరించడంతో ఇరుపక్షాల మధ్య విమర్శలు, ప్రతివిమర్శలు, అరుపులు, కేకలతో సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. మంత్రులు అడ్డుపడుతుండటంతో.. బడ్జెట్ పద్దులపై బుధవారం జరిగిన చర్చలో బీఆర్ఎస్ సభ్యుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి మాట్లాడుతుండగా మంత్రులు పదేపదే అడ్డుపడటంపై కేటీఆర్ అభ్యంతరం తెలిపారు. ‘‘మంత్రులు పదే పదే అడ్డుపడుతున్నారు. సంయమనం ఉండాలి. మేం కూడా రెచ్చగొట్టగలం. 30శాతం కమీషన్ తీసుకుంటున్నారని వాళ్ల ఎమ్మెల్యేలే అంటున్నారు. 20శాతం కమీషన్ అంటూ సచివాలయంలో (కాంట్రాక్టర్ల) ధర్నాలు అవుతున్నాయి’’అని వ్యాఖ్యానించారు. దీనిపై భట్టి విక్రమార్క తీవ్రంగా స్పందించారు. ‘‘కేటీఆర్‌ను చాలెంజ్ చేస్తున్నా.. మీ ఆరోపణలను రుజువు చేయండి. లేకుంటే సభకు, రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పండి’’అని సవాల్ చేశారు. గత ప్రభుత్వం పాపం వల్లే రూ.లక్ష కోట్ల పనులు చేసిన వారు బిల్లులు రాక సచివాలయం చుట్టూ తిరుగుతున్నారన్నారు. ఒళ్లు దగ్గరపెట్టుకుని మాట్లాడాలంటూ.. కేటీఆర్‌ను ఉద్దేశించి భట్టి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ‘‘బాధ్యతతో రాజకీయాల్లో వచ్చాం. అడ్డగోలుగా మీలా రాష్ట్రం మీద పడి బరితెగించి దోపిడీ చేయడానికి రాలేదు. నాలాగా అణగారిన వర్గాలు, బాధితులు, పీడితులు, పేద కుటుంబాల కోసం ఏదో చేయాలని ఉన్నతమైన ఆశయంతో వచ్చిన వాళ్లం. మీలా ఏడెనిమిది లక్షల కోట్ల అప్పులు చేసి రాష్ట్రాన్ని పాడు చేసిపోయేందుకు రాలేదు. మాట్లాడే ముందు బాధ్యత, నిబద్ధత ఉండాలి. ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి. ఏదీ పడితే అది మాట్లాడితే చెల్లుతుంది అనుకుంటున్నారా?’’అని మండిపడ్డారు. ఇదే సమయంలో కేటీఆర్ క్షమాపణ చెప్పాలంటూ కాంగ్రెస్ సభ్యులు పెద్ద ఎత్తున నినాదాలు మొదలుపెట్టారు. ‘30శాతం కమీషన్..’అంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను సభ రికార్డుల నుంచి తొలగిస్తామని ప్యానెల్ స్పీకర్ రేవూరి ప్రకాశ్‌రెడ్డి ప్రకటించారు. బీఆర్ఎస్ సభ్యుల నిరసనతో.. కేటీఆర్‌ను ఉద్దేశించి ‘ఒళ్లు బలిసి’అంటూ భట్టి తప్పుడు మాటలు మాట్లాడరంటూ బీఆర్ఎస్ సభ్యులు నిరసనకు దిగారు. కేటీఆర్ మాట్లాడేందుకు మళ్లీ మైక్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ వెల్ దగ్గరికి దూసుకెళ్లారు. మొదట కేటీఆరే రెచ్చగొట్టారని, ఒకట్రెండు అన్‌పార్లమెంటరీ పదాలుంటే తొలగిస్తామని ప్యానెల్ స్పీకర్ నచ్చజెప్పేందుకు ప్రయత్నించినా నిరసన కొనసాగించారు. ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని మాత్రమే తాను సూచించానని భట్టి వివరణ ఇచ్చారు. ఈ క్రమంలో పల్లా రాజేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ.. కమీషన్లపై కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చెప్పిన మాటలనే కేటీఆర్ ప్రస్తావించారని చెప్పారు. బట్టలు విప్పి కొడతామంటూ సభలో సీఎం రేవంత్ అన్నప్పుడు లేని అభ్యంతరం తమ మాటలకు ఎందుకని ప్రశ్నించారు. దీంతో ప్యానల్ స్పీకర్ ఆయన మైక్ కట్ చేసి బీజేపీ సభ్యుడికి మాట్లాడే అవకాశం ఇచ్చారు. దీనికి నిరసనగా ‘వద్దురా నాయనా.. ట్వంటీ పర్సెంట్ పాలన’అంటూ నినాదాలు చేస్తూ సభ నుంచి బయటకు వచ్చారు. కేటీఆర్, హరీశ్‌రావుతోపాటు పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ ప్రవేశద్వారం వద్ద కాసేపు బైఠాయించి నినాదాలు చేశారు. భట్టి దళితుడనే ఆరోపణలు: పొన్నం దళితుడైన భట్టి విక్రమార్కకు ప్రతిపక్ష నేత పదవి దక్కవద్దనే ఉద్దేశంతోనే గతంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బీఆర్ఎస్లో విలీనం చేసుకున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యానించారు. ఇప్పుడు దళితుడు ఆర్థిక మంత్రిగా ఉండటాన్ని జీర్ణించుకోలేకపోతున్నారని విమర్శించారు. -
మాదిగ.. లంబాడా.. రెండు బెర్తులు!
సాక్షి, హైదరాబాద్: ఎస్సీ, ఎస్టీ వర్గాల్లోని రెండు ప్రధాన సామాజిక వర్గాలకు ఇప్పుడు కేబినెట్ బెర్తుల ఫీవర్ పట్టుకుంది. మాదిగ, లంబాడా వర్గాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు వచ్చే నెల మూడో తేదీన జరుగుతుందని భావిస్తున్న మంత్రివర్గం విస్తరణలో స్థానం కోసం అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. త్వరలోనే మంత్రివర్గ విస్తరణ ఉంటుందని, ఫలానా ఎమ్మెల్యేలు మంత్రులయ్యే అవకాశాలున్నాయనే వార్తలు రావడం, తమ వర్గాలకు చెందిన పేర్ల ప్రస్తావన లేకపోవడంతో వారు అప్రమత్తమయ్యారు. తామెవరికీ వ్యతిరేకం కాదని, ఎవరికి మంత్రి పదవి ఇచ్చినా తమకు అభ్యంతరం లేదని, అయితే ఎస్సీ, ఎస్టీల జనాభా ప్రాతిపదికన మాదిగ, లంబాడా వర్గాలకు కచి్చతంగా అవకాశం కల్పించాలని వారు కోరుతున్నారు. ఈ మేరకు ఇప్పటికే పార్టీ అధిష్టానానికి మాదిగ, లంబాడా ఎమ్మెల్యేలు లేఖలు రాయగా, గురువారం అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ముగిసిన తర్వాత ఢిల్లీ వెళ్లి అధిష్టానం పెద్దలను కలిసేందుకు మాదిగ ఎమ్మెల్యేలు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. మాదిగ ఎమ్మెల్యేలు ఏమంటున్నారు..? ‘రాష్ట్రంలో 32.33 లక్షల మంది మాదిగ కులస్తులున్నారని 2011 జనగణనలో వెల్లడైంది. ఆ తర్వాత మరో 15 లక్షల మంది జత కలిశారు. మేమంతా కాంగ్రెస్ పార్టీకి విధేయులుగా, అండగా ఉంటున్నాం. అయితే ఇటీవల జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో ఎస్సీలకు రిజర్వు అయిన నాగర్‌కర్నూల్, పెద్దపల్లి, వరంగల్ లోక్‌సభ నియోజకవర్గాల్లో ఒక్కటి కూడా మాదిగ కులస్తులకు ఇవ్వలేదు. ఆయా జిల్లాల్లో మాదిగ జనాభానే ఎక్కువ ఉంటుంది. అందువల్ల త్వరలో జరిగే మంత్రివర్గ విస్తరణలో మా సామాజిక వర్గానికి అవకాశం ఇస్తే మాకు తగిన గౌరవం, గుర్తింపు ఇచ్చినట్టవుతుంది. మాదిగ సామాజిక వర్గానికి తెలంగాణ కేబినెట్లో మరో అవకాశం ఇవ్వండి..’అని రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్‌కు రాసిన లేఖలో మాదిగ సామాజిక వర్గ ఎమ్మెల్యేలు విజ్ఞప్తి చేశారు. ఈ లేఖను బుధవారం అసెంబ్లీ లాబీల్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సీనియర్ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డిలకు అందజేశారు. అనంతరం సీఎం రేవంత్‌రెడ్డిని కలిసిన వీరు లేఖ ప్రతిని అందజేశారు. మంత్రి పదవితో బంధం మరింత బలోపేతం మాదిగ ఎమ్మెల్యేల బాటలోనే లంబాడా ఎమ్మెల్యేలు కూడా లేఖాస్త్రం సంధించారు. తమ సామాజిక వర్గానికి రాష్ట్ర మంత్రివర్గంలో ప్రాతినిధ్యం కల్పించాలని కోరుతూ ఎన్. బాలూనాయక్, జె.రామచంద్రునాయక్, ఎం.రాందాస్‌నాయక్, బి.మురళీనాయక్‌లు అటు కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి, ఇటు సీఎం రేవంత్‌రెడ్డికి లేఖ రాశారు. ‘రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన సామాజిక, ఆర్థిక, రాజకీయ సర్వేలోనే తెలంగాణలో లంబాడాల జనాభా 32.20 లక్షలుగా వెల్లడైంది. రాష్ట్ర వ్యాప్తంగా 72 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 25 శాతానికి పైగా లంబాడా ఓటర్లున్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి లంబాడా సామాజిక వర్గం కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర కేబినెట్లో లంబాడా సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం కల్పించాలి. తద్వారా లంబాడాల ఆకాంక్షను గుర్తించాలి. కేబినెట్లో స్థానం కల్పించడం ద్వారా మా వర్గ ప్రాధాన్యతలను అసెంబ్లీలో, ప్రభుత్వంలో వినిపించే అవకాశం ఉంటుంది. లంబాడాలు, కాంగ్రెస్ పార్టీకి మధ్య ఉన్న బంధం మరింత బలోపేతమవుతుంది..’అని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాందీతో పాటు ముఖ్యమంత్రికి రాసిన లేఖలో పేర్కొన్నారు. ఈ లేఖను బుధవారం అసెంబ్లీలోని సీఎం చాంబర్లో ఆయన్ను కలిసి అందజేశారు. -
ఉప ఎన్నికలు రావు: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: ‘‘శాసనసభ 2014 నుంచి 2023 వరకు ఏ సంప్రదాయాలను ఆచరించిందో ఇప్పుడు కూడా వాటినే ఆచరిస్తున్నం. అప్పటి నుంచి చట్టం మారలే.. న్యాయం మారలే.. స్పీకర్ పదవి, విప్ పదవి మారలే.. పాలకపక్షం, ప్రతిపక్షం అట్లనే ఉన్నాయి. రాజ్యాంగం అసలే మారలేదు. ఇంక ఎట్లొస్తయ్ ఉప ఎన్నికలు? సభ్యులెవరూ ఆందోళన చెందవద్దు..’’ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. అంబేడ్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం పార్లమెంటరీ వ్యవస్థలో పాటించిన పద్ధతులను పరిగణనలోకి తీసుకుని గతంలో అవలంబించిన విధానాలను అనుసరిస్తున్నట్టు చెప్పారు. వాటి ప్రకారం ఏ ఉప ఎన్నికలు రావని వ్యాఖ్యానించారు. బుధవారం శాసనసభలో బడ్జెట్‌పై చర్చలో సీఎం రేవంత్ మాట్లాడారు. రాష్ట్రంలో ఉప ఎన్నికలు వస్తాయంటూ బీఆర్ఎస్ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలపై స్పందించారు. వివరాలు ఆయన మాటల్లోనే.. ‘‘పార్టీ మారారా, మారలేదా అంటే మేం మారనే లేదు. అభివృద్ధిలో భాగంగా సీఎంని కలసి వచ్చామని కాంగ్రెస్‌లో చేరినవాళ్లు అంటున్నారు. మీరు మంత్రులు చేసినవాళ్లు అనర్హులు కాలేదు. ఉప ఎన్నికలు రాలేదు. కానీ ఇప్పుడు ఉప ఎన్నికలు వస్తాయని, వచ్చే వారమే ఉప ఎన్నికలని అంటున్నారు. ఎట్లా వస్తాయి? రూల్‌బుక్ వాళ్లే రాశారు. రూల్‌బుక్ కూడా మారలేదు కదా. ప్రచారం కూడా చేసుకుంటున్నరు.. ఒకాయన (తాటికొండ రాజయ్య) నేనే అభ్యరి్థని అని ఆడ, ఈడ ప్రచారం చేసుకొంటున్నారు. ఆయన అమాయకుడు. తెల్లపంచె కట్టుకొని తిరుగుతున్నడని గతంలో ఉప ముఖ్యమంత్రి పదవినే ఊడబీకిన్రు. ఇప్పుడు ఆయన.. ఉప ఎన్నిక వచ్చింది. వచ్చే వారమే ఎలక్షన్ అని తిరుగుతున్నరు. సభ్యులెవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదు. ఏ ఉప ఎన్నికలు రావు. వారు (హరీశ్‌రావు) ఉప ఎన్నిక కోరుకున్నా కూడా రావు. ఒకవేళ ఆయన ఇటొచి్చనా, అటొచ్చినా కూడా ఏ ఉప ఎన్నికలు రావు. సభకు కోర్టు నుంచి రక్షణ ఉంటుంది.. పార్టీ ఫిరాయింపుల కేసు సుప్రీంకోర్టులో ఉంది. సభలో నేను మాట్లాడితే కొంత రక్షణ ఉంటుంది. బయట మాట్లాడేవాళ్లకు ఆ ప్రొటెక్షన్ ఉండదు. సభ బయట ఉప ఎన్నికలు వస్తాయని.. వచ్చే వారమే ఉప ఎన్నిక అని అంటున్నారు. అదంతా ఉత్తదే. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అభివృద్ధి మీదనే మేం దృష్టి పెట్టాం. ఎన్నికలు, ఉప ఎన్నికల మీద మాకు దృష్టి లేదు. రాష్ట్రంలో శాంతిభద్రతలు కాపాడాలి. తప్పు చేసినవాళ్లను శిక్షించాలి. అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేయాలనేదే మా ఉద్దేశం..’’ అని సీఎం రేవంత్ పేర్కొన్నారు. -
‘లోక్ సభలో నాకు మైకు ఇవ్వడం లేదు’
ఢిల్లీ: కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాపై(Lok Sabha Speaker Om Birla) ఆగ్రహం వ్యక్తం చేశారు. నేను మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నా స్పీకర్ మైక్ ఇవ్వడం లేదు. నేను మాట్లాడితే ఆయన పారిపోతున్నారని’ ఎద్దేవా చేశారు.లోక్‌సభలో తన ప్రసంగంపై రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడారు. ‘సభలో స్పీకర్ ఓం బిర్లా తాను మాట్లాడేందుకు అనుమతించడం లేదని, కార్యకలాపాలను నిర్వహించడానికి ఇది సరైన మార్గం కాదని అన్నారు. ‘ఏం జరుగుతుందో నాకు తెలియదు. నాకు మాట్లాడే అవకాశం ఇవ్వమని ఆయన్ని అభ్యర్థించాను. కానీ అతను (స్పీకర్) పారిపోయాడు. ఇది సభను నడపడానికి మార్గం కాదు. ఎలాంటి ఆధారాలు లేకుండా స్పీకర్ నా గురించి అసత్యాలు మాట్లాడుతున్నారు. సభను వాయిదా వేస్తున్నారు. ఇదంతా ఎందుకు.ప్రతిపక్ష నాయకుడికి సభలో ప్రసంగించడానికి అవకాశం ఇవ్వడమే ఈ సమావేశం ఉద్దేశ్యం. నేను లేచి నిలబడినప్పుడల్లా నాకు మాట్లాడేందుకు అనుమతి ఇవ్వడం లేదు. మేం ఏం చెప్పాలని అనుకుంటున్నామో అది చెప్పాలి. అందుకు మైక్ ఇవ్వాలి కదా. ఇవ్వడం లేదు. నేను ఏం చేయలేదు. నిశ్శబ్దంగా కూర్చున్నాను. అరె ఒక్క మాట కూడా మాట్లాడలేదు. 7-8 రోజులుగా నాకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదు. లోక్‌సభలో ప్రతిపక్షానికి అవకాశం ఇవ్వకుండా ఉండేందుకు కుట్ర జరుగుతోంది. ఆ రోజు కూడా అంతే ప్రధాని మోదీ కుంభమేళా గురించి మాట్లాడారు. ఆ సమయంలో నేను నిరుద్యోగం గురించి ప్రధాని మోదీని ప్రశ్నించాలని అనుకున్నాను. కానీ నాకు అనుమతి ఇవ్వలేదు. స్పీకర్ విధానం ఏంటో నాకు తెలియదు. కానీ మమ్మల్ని మాట్లాడటానికి అనుమతించడం లేదు. ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధం’ అని రాహుల్ గాంధీ ధ్వజమెత్తారు. -
పవన్‌కు విజయ కుమార్ ఛాలెంజ్
-
సభ నుంచి బీఆర్ఎస్ సభ్యుల వాకౌట్..
Telangana Assembly Session Updates..తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు..సభ నుంచి బీఆర్ఎస్ సభ్యుల వాకౌట్.. శాసనసభ నుంచి నిరసనలు తెలుపుతూ బయటకు వెళ్లిపోయిన బీఆర్ఎస్ సభ్యులు.వద్దురా నాయన కాంగ్రెస్ పాలన.. 30% పాలన అంటూ నినాదాలు.అసెంబ్లీ గేటు ఎంట్రన్స్ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేల నిరసన. ఎంట్రీ-4 వద్ద మెట్లపై కూర్చుని బీఆర్ఎస్ సభ్యుల నినాదాలుఅక్కడ నిరసనలు తెలుపవద్దని చీఫ్ మార్షల్ సూచనలుమార్షల్స్తో బీఆర్ఎస్ సభ్యులు వాగ్వాదం మంత్రి పొన్నం ప్రభాకర్ కామెంట్స్..దళితుడు అనే భట్టి విక్రమార్కపై విమర్శలు చేస్తున్నారు.గతంలో సీఎల్పీ లీడర్‌గా ఉన్నప్పుడు కూడా ఇలానే కామెంట్స్ చేశారు.దళితుడు ఆర్థిక మంత్రిగా ఉండొద్దు అని ప్రతిపక్షం అనుకుంటుందా?గతంలో సీఎల్పీ లీడర్‌గా దళిత లీడర్ భట్టి విక్రమార్క ఉన్నప్పుడు విమర్శలు చేశారు.తెలంగాణ శాసనసభలో కమీషన్లపై రచ్చ..అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం.40, 30, 20 శాతం ప్రభుత్వం కమీషన్లు తీసుకుంటుందన్న బీఆర్ఎస్, కేటీఆర్బీఆర్ఎస్ వ్యాఖ్యలను ఖండించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకమీషన్లపై స్పందించిన ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క.గత ప్రభుత్వం పెట్టిన 40,000 కోట్ల బకాయిలను కట్టడానికి నాన్న తంటాలు పడుతున్నాం.ఒక స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి.గత ప్రభుత్వం లాగా వ్యవహరించడం లేదు.దోచుకోవడానికి మేము అధికారంలోకి రాలేదు.ప్రతిపక్షం వెంటనే క్షమాపణ చెప్పాలి.ప్రభుత్వంపై విమర్శలు చేయడం తగదు.కమీషన్లు తీసుకున్నట్లు నిరూపించాలి.సభలో కమీషన్లపై ఆధారాలతో చూపించాలి.కేటీఆర్ ఆధారాలు నిరూపించకపోతే క్షమాపణ చెప్పాలి.కేటీఆర్ వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలి.కేటీఆర్ ను నేను ఎక్కడ విమర్శించలేదుసభలో మాట్లాడేటప్పుడు మనం ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి అని మాత్రమే అన్నాను.కేటీఆర్‌పై నేనెక్కడా అన్ పార్లమెంటరీ పదాలను ఉపయోగించలేదు శాసనసభలో అటు బీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ ఎమ్మెల్యేల నిరసనలు.డిప్యూటీ సీఎం వ్యాఖ్యలను ఖండిస్తూ బీఆర్ఎస్ నిరసన.కేటీఆర్ వ్యాఖ్యలకు నిరసనగా కాంగ్రెస్ ఎమ్మెల్యేల ఆందోళన. ఇరుపక్షాలకు సర్ది చెబుతున్న ప్యానెల్ స్పీకర్కేటీఆర్ వ్యాఖ్యలతో గొడవ మొదలైంది.అన్ పార్లమెంటరీ పదాలు ఉంటే రికార్డుల నుంచి తొలగిస్తాం.సీనియర్ సభ్యులుగా ఉండి నిరసన చేయడం కరెక్ట్ కాదు.కేటీఆర్ అన్ పార్లమెంటరీ పదాన్ని వాడారుకేటీఆర్ వ్యాఖ్యలకు ఆవేదనతో డిప్యూటీ సీఎం మాట్లాడారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి చిట్ చాట్..నేను పని మీదే దృష్టి పెట్టా.. సోషల్ మీడియా విమర్శలను పట్టించుకోను.మంత్రి వర్గ విస్తరణ కూడా పట్టించుకోలేదు..మొదటి కేబినెట్ సమయంలో కూడా నేను మంత్రి పదవి అడగలేదు.గద్దర్ అవార్డులను భట్టి చూసుకుంటుంన్నారు. మంత్రి భట్టి విక్రమార్క కామెంట్స్..భూములపై రైతులకు హాక్కు కల్పించింది కాంగ్రెస్..భూ రక్షణ కోసం ఏదైనా జరిగింది అంటే అది కాంగ్రెస్ ప్రభుత్వాలు చేసిందే.కబ్జా కాలం ఇచ్చి పేదలకు హక్కులు ఇచ్చాం.ధరణితో పేదల భూములను బీఆర్ఎస్ లాక్కుంది.భూస్వాముల చట్టం ధరణి.ధరణి మారుస్తాం అని చెప్పాం.. చేసి చూపిస్తున్నాం.లక్షల ఎకరాల భూములు వివాదంలో ఉండడానికి కారణం బీఆర్ఎస్.రైతుల హక్కులను కాల రాసారు.మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కామెంట్స్..ధరణి రెఫరెండంతో అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లాం.. ప్రజలు తీర్పు ఇచ్చారు.ధరణితో బీఆర్ఎస్ సభ్యులు ఇబ్బంది పడ్డారు.భూ భారతి కాన్సెప్ట్ తో వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు పోతాం..ధరణి తప్పిదాలను బీఆర్ఎస్ ఎందుకు ఒప్పుకోవడం లేదు.భూ భారతిని రెఫరెండంగా తీసుకుంటాం..ఎవరిని ఆదరిస్తారో చూద్దాం.పల్లా రాజేశ్వర్ రెడ్డి కామెంట్స్..భూ భారతి అయితదో.. భూ హారతి అయితదో చూద్దాం..భూ భారతి రెఫరెండం కాదు.. ఆరు గ్యారెంటీల రెఫరెండంతో ఎన్నికలకు వెళ్లండి.అనుభవదారుడి కాలంతో మళ్ళీ వివాదాలు వస్తాయి.మంత్రి పొంగులేటి కామెంట్స్.. అసత్యాన్ని సత్యాన్ని చేసేందుకు పల్లా ప్రయత్నం చేస్తున్నారు.2020న ధరణి చట్టం తీసుకువచ్చి.. 2023 వరకు రూల్స్ ఫ్రేమ్ చేయలేదు.వీఆర్ఏ, వీఆర్వో వ్యవస్థను తీసుకొస్తామని చట్టంలోనే పెట్టాం.. భట్టి విక్రమార్క కామెంట్స్..జమాబందీ వల్ల లాభం తప్ప నష్టం లేదు.ప్రతీ సంవత్సరం రెవెన్యూ సదస్సులు నిర్వహించడం వల్ల సమస్యలు పరిష్కారం అవుతాయి.. సభలో పదే పదే మంత్రులకు మైక్ ఇవ్వడం పట్ల బీఆర్ఎస్ అభ్యంతరం..తాము మాట్లాడుతుంటే మంత్రులు ఎందుకు అడ్డు వస్తున్నారన్న బీఆర్ఎస్ సభ్యులు..ప్యానెల్ స్పీకర్ రేవూరి ప్రకాష్ రెడ్డి కామెంట్స్..మంత్రులు అడిగితే మైక్ ఇవ్వాలి.. ఇది అసెంబ్లీ రూల్స్‌లో ఉంది.పదేళ్లు ప్రభుత్వం నడిపిన బీఆర్ఎస్ సభ్యులకు ఇది తెలియంది కాదు..రూల్స్ ప్రకారమే సభ్యులకు అవకాశం ఇస్తున్నా.. బీఆర్ఎస్ సభ్యుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి కామెంట్స్ఎంఎంటీఎస్ రైలులో అత్యాచారం జరిగితే.. పోలీసులు పట్టించుకోలేదు.అడ్వకేట్‌ను హత్య చేసినా పట్టించుకోవడం లేదు..క్రైం రేటు పెరుగుతోంది.మంత్రి పొన్నం ప్రభాకర్ కామెంట్స్..ఎంఎంటీఎస్ ఘటనపై ప్రభుత్వం సీరియస్‌గా ఉంది .కేసు దర్యాప్తుపై పోలీసులు దృష్టి సారించారు.పోలీసుల మనోభావాలు దెబ్బతినేలా బీఆర్ఎస్ సభ్యులు మాట్లాడొద్దు.మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి కామెంట్స్..గతం గురించి మాట్లాడేది కాంగ్రెస్ సభ్యులే..మేము చేసిన మంచి పనులు చెబుతున్నాం..ఇంకా బాగా పని చేయాలని సూచిస్తున్నాం..బీఆర్ఎస్ ఎమ్మెల్సీ నిరసన.. శాసనమండలి ఆవరణలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీల నిరసనకళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ కింద తులం బంగారం ఇచ్చే హామీని అమలు చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీల నిరసనతక్షణమే తులం బంగారం ఇవ్వాలని నినాదాలుబంగారు కడ్డీలను పోలిన వాటిని ప్రదర్శిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలుఇప్పటివరకు పెళ్లి చేసుకున్న వారికి కూడా తులం బంగారం ఇవ్వాల్సిందేనని బీఆర్ఎస్ ఎమ్మెల్సీల డిమాండ్తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు..శాసనసభ ఐదో సెషన్ పదో రోజు బిజినెస్ఉదయం 10 గంటలకు శాసనసభ, శాసనమండలి ప్రారంభం.ఉభయ సభల్లో ప్రశ్నోత్తరాలు రద్దుతెలంగాణ శాసనమండలిలో ఏడవ రోజు బిజినెస్మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ 2023-24 నివేదికను మండలిలో టేబుల్ చేయనున్నారు.ప్రభుత్వ తీర్మానం..శాసన సభ ఆమోదం పొందిన రెండు బిల్లులపై చర్చించి ఆమోదించనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ మున్సిపల్ అమెండ్మెంట్ బిల్లు-2025 శాసనమండలిలో చర్చించి సభ ఆమోదం కోసం కోరనున్నారురాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క తెలంగాణ పంచాయతీ రాజ్ అమెండ్మెంట్ బిల్లు-2025 శాసనమండలిలో చర్చించి సభ ఆమోదం కోసం కోరనున్నారు.శాసనమండలిలో తెలంగాణలో విద్య అనే అంశంపై స్వల్పకాలిక చర్చశాసనసభలో బడ్జెట్ పద్దులపై నాలుగో రోజు చర్చ -
బెట్టింగ్ యాప్ వ్యవహారం.. మాజీ సీఎం ఇళ్లలో సీబీఐ సోదాలు
రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత భూపేష్ బాఘేల్ వరుస షాక్‌లు తగులుతున్నాయి. పలు కేసుల్లో ఈడీ, సీబీఐ అధికారులు ఆయనను టార్గెట్ చేశారు. తాజాగా బెట్టింగ్ యాప్ వ్యవహారం విషయమై.. భూపేష్ బాఘేల్ ఇంట్లో సీబీఐ అధికారులు సోదాలు చేపట్టారు. ఇక, ఇప్పటికే ఇప్పటికే మద్యం కుంభకోణానికి సంబంధించి ఆయన నివాసంలో ఈడీ సోదాలు జరిపింది దీంతో, ఏ క్షణంలో ఏం జరుగుతుందోనన్న ఆందోళన కాంగ్రెస్ శ్రేణుల్లో నెలకొంది.వివరాల ప్రకారం.. మాజీ సీఎం భూపేష్ బాఘేల్‌ను పలు కేసులు టెన్షన్ పెడుతున్నాయి. ఆయనపై కేసుల ఉచ్చు బిగుస్తోంది. తాజాగా మహదేవ్ బెట్టింగ్ యాప్ వ్యవహారానికి సంబంధించిన కేసులో భూపేష్ బాఘేల్ నివాసాల్లో సీబీఐ దాడులు నిర్వహిస్తోంది. రాయ్‌పుర్, భిలాయిలోని ఆయన నివాసాల్లో సీబీఐ అధికారులు తనిఖీలు (CBI Raids) చేస్తున్నారు. ఇదే సమయంలో ఆయను అత్యంత సన్నిహితుడైన ఓ సీనియర్ పోలీసు అధికారి ఇంట్లోనూ ఈ దాడులు జరుగుతున్నాయి.మరోవైపు.. సీబీఐ సోదాలపై మాజీ సీఎం భూపేష్ బాఘేల్ స్పందించారు. ఈ సందర్బంగా ఆయన ట్విట్టర్ వేదికగా..‘ఇప్పుడు సీబీఐ వచ్చింది’ అంటూ వ్యాఖ్యలు చేశారు. ఇదిలా ఉండగా.. ఏప్రిల్ 8, 9 తేదీల్లో అహ్మదాబాద్ (గుజరాత్)లో జరగనున్న ఏఐసీసీ సమావేశం కోసం ఏర్పాటైన “డ్రాఫ్టింగ్ కమిటీ” సమావేశానికి భూపేష్ బాఘేల్ ఈరోజు ఢిల్లీకి వెళ్లనున్నారు. ఈ క్రమంలోనే నేడు ఉదయమే సీబీఐ రాయ్‌పూర్, భిలాయ్‌లోని ఆయన నివాసాలకు సీబీఐ అధికారులు సోదాలు నిర్వహించడం విశేషం.अब CBI आई है.आगामी 8 और 9 अप्रैल को अहमदाबाद (गुजरात) में होने वाली AICC की बैठक के लिए गठित “ड्राफ़्टिंग कमेटी” की मीटिंग के लिए आज पूर्व मुख्यमंत्री भूपेश बघेल का दिल्ली जाने का कार्यक्रम है.उससे पूर्व ही CBI रायपुर और भिलाई निवास पहुँच चुकी है.(कार्यालय-भूपेश बघेल)— Bhupesh Baghel (@bhupeshbaghel) March 26, 2025ఇదిలా ఉండగా.. ఇటీవలి కాలంలో మాజీ సీఎం భూపేష్ బాఘేల్‌ను పలు కేసులు వెంటాడుతున్నాయి. ఛత్తీస్‌గఢ్‌లో మద్యం కుంభకోణం కేసుకు సంబంధించి భూపేష్ బాఘేల్, ఆయన కుమారుడు చైతన్య నివాసంలో ఇటీవల ఈడీ అధికారులు దాడులు చేసిన విషయం తెలిసిందే. ఆ సోదాల సందర్భంగా రూ.30 లక్షల నగదు, పలు పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. సోదాల అనంతరం తిరిగి వెళ్తున్న ఈడీ అధికారుల వాహనాలపై నిరసనకారులు రాళ్లు రువ్వడంతో ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. దీంతో, ఒక్కసారిగా అక్కడ ఆందోళన నెలకొంది. #WATCH | Raipur: CBI raids underway at the residence of former Chhattisgarh CM and Congress leader Bhupesh Baghel. pic.twitter.com/McOgzts1qk— ANI (@ANI) March 26, 2025 -
తెలంగాణ మంత్రివర్గ విస్తరణ కసరత్తు పూర్తి అయిందా?
-
కేబినెట్ విస్తరణ.. మూడున ముహూర్తం!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ వచ్చే నెల 3న జరగనున్నట్టు సమాచారం. ఈ మేరకు కాంగ్రెస్ అధిష్టానం నుంచి గ్రీన్‌సిగ్నల్ వచ్చినట్టు తెలుస్తోంది. కేబినెట్ విస్తరణతో పాటు అదేరోజు మంత్రుల శాఖల్లో మార్పులు కూడా జరగనున్నాయని, ఈ మేరకు రాష్ట్ర కాంగ్రెస్ నేతలకు సమాచారం అందినట్లు పార్టీవర్గాలు వెల్లడించాయి. సోమవారం ఢిల్లీలో జరిగిన కాంగ్రెస్ అధిష్టానం, రాష్ట్ర పెద్దల భేటీ అనంతరం రాష్ట్ర పార్టీలో మంత్రివర్గ విస్తరణ అంశం హాట్‌టాపిక్‌గా మారింది. ఎవరెవరికి మంత్రి పదవులు వచ్చే అవకాశాలున్నాయి.. ఎవరి శాఖల్లో మార్పులు జరగొచ్చు.. ప్రస్తుత మంత్రుల్లో ఎవరినైనా తప్పిస్తారా? అనే అంశాలపై మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా నేతల్లో విస్తృత చర్చ జరిగింది. అటు కాంగ్రెస్ శ్రేణులు, ఇటు రాజకీయ వర్గాలతో పాటు శాసనసభ బడ్జెట్ సమావేశాలకు హాజరైన మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా చర్చోపచర్చలు సాగించారు. ఇంకా సమాచారం లేదన్న ఆ ముగ్గురూ.. మంగళవారం శాసనసభ లాబీల్లో మంత్రివర్గ విస్తరణే ప్రధాన చర్చనీయాంశం అయ్యింది. ఢిల్లీ వేదికగా జరిగిన చర్చల్లో పాల్గొన్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చాంబర్ ఎమ్మెల్యేలతో హడావుడిగా కనిపించింది. పలువురు ఆశావహ ఎమ్మెల్యేలతో పాటు మంత్రులు భట్టి చాంబర్‌కు వచ్చి చర్చలు జరిపారు. అసలు ఢిల్లీలో ఏం జరిగిందన్న దానిపై ఆరా తీశారు. మరోవైపు రాజగోపాల్‌రెడ్డి, వివేక్, శ్రీహరిలకు బెర్తులు ఖాయమయ్యాయన్న వార్తల నేపథ్యంలో అసెంబ్లీలో ఈ ముగ్గురికి అభినందనలు వెల్లువెత్తాయి. అసెంబ్లీ సమావేశాల విధులకు హాజరైన వివిధ ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులు, జర్నలిస్టులు కూడా ఆ ముగ్గురిని కలిసి అభినందనలు తెలిపారు. అందరికీ కృతజ్ఞతలు తెలిపిన ఆ ముగ్గురూ.. మరోవైపు ఇంకా సమాచారమేమీ లేదంటూ దాటవేసే ప్రయత్నం చేశారు. ఢిల్లీలో సాయంత్రం వరకు సీఎం కసరత్తు మంత్రివర్గ విస్తరణపై అధిష్టానంతో చర్చలు జరిపేందుకు సోమవారం ఢిల్లీ వెళ్లిన సీఎం రేవంత్‌రెడ్డి మంగళవారం రాత్రి హైదరాబాద్‌కు చేరుకున్నారు. అంతకుముందు మంగళవారం ఉదయం నుంచి హైదరాబాద్ బయలుదేరేంతవరకు ఢిల్లీలో ఒంటరిగానే గడిపారు. ఎలాంటి అపాయింట్మెంట్లు, పార్టీ పెద్దలతో ములాఖత్‌లకు వెళ్లని రేవంత్ మంత్రివర్గ కూర్పుపై ఏకాంతంగా కసరత్తు చేశారనే చర్చ జరుగుతోంది. కొత్తగా కేబినెట్లోకి తీసుకునే మంత్రులకు శాఖలు, ప్రస్తుతమున్న మంత్రుల శాఖల్లో మార్పుల గురించి ఓ అభిప్రాయానికి వచ్చే దిశలో ఆయన కసరత్తు చేశారని, ఈ మేరకు అధిష్టానానికి సమాచారమిచ్చారని తెలుస్తోంది. ఈ కసరత్తు నేపథ్యంలోనే అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పటికీ సాయంత్రం వరకు ఢిల్లీలోనే ఉండిపోయారని చెబుతున్నారు. ఇద్దరు కీలక మంత్రుల శాఖల్లో మార్పులు! కేబినెట్లోకి కొత్తగా నలుగురు లేదా ఐదుగురిని తీసుకుంటారనే చర్చతో పాటు ప్రస్తుత మంత్రుల్లో ఒకరిద్దరికి ఉద్వాసన పలకవచ్చనే చర్చ కూడా జరుగుతోంది. ఇందుకు సంబంధించి ఓ మహిళా మంత్రితో పాటు దక్షిణ తెలంగాణకు చెందిన మరో మంత్రి పేర్లు వినిపిస్తున్నాయి. వీరిని తప్పించేందుకు కారణాలున్నాయని కొందరు చెబుతుండగా, అధిష్టానం ఇప్పుడే ఆ నిర్ణయం తీసుకోదని, ప్రస్తుతమున్న మంత్రులంతా కొనసాగుతారని, కొత్తగా కొందరు మంత్రులవుతారని టీపీసీసీ వర్గాలంటున్నాయి. శాఖల మార్పుపై కూడా విస్తృత చర్చ జరుగుతోంది. ఒక సామాజిక వర్గానికి చెందిన ఇద్దరు కీలక మంత్రులకు చెందిన శాఖల్లో మార్పులుంటాయని, ఓ మహిళా మంత్రికి అదనపు బాధ్యతలిస్తారనే ఊహాగానాలు విన్పిస్తున్నాయి. మరోవైపు డిప్యూటీ స్పీకర్‌గా లంబాడా సామాజిక వర్గానికి చెందిన నల్లగొండ జిల్లా దేవరకొండ ఎమ్మెల్యే ఎన్.బాలూనాయక్ పేరు ప్రముఖంగా వినిపిస్తుండగా, కొత్తగా కోదాడ ఎమ్మెల్యే ఎన్.పద్మావతిరెడ్డి పేరు కూడా చర్చలోకి వచ్చింది. డిప్యూటీ స్పీకర్‌గా ఈమెను నియమించే అవకాశాలు కూడా ఉన్నాయని అంటున్నారు. మరోవైపు చీఫ్ విప్ పదవిలో ఎవరిని నియమిస్తారు?, విప్లలో ఎవరికైనా మంత్రిగా అవకాశమిస్తే వారి స్థానంలో ఎవరిని నియమిస్తారన్న దానిపైనా రకరకాల చర్చలు జరుగుతుండడం గమనార్హం. -
వార్షికోత్సవం చేసుకుంటున్నారా?: సుప్రీంకోర్టు
సాక్షి, న్యూఢిల్లీ: ‘ఫిరాయింపులపై చర్యలు తీసుకునేందుకు ఇంకెంత సమయం కావాలి? ఎమ్మెల్యేల పదవీకాలం పూర్తి అయ్యేవరకు వేచి చూడటం రీజనబుల్ టైం (తగిన సమయం) అవుతుందా? న్యాయపరంగా చర్యలు తీసుకోవడానికి ఒక గడువు అనేది ఉండాలి కదా? పార్టీ ఫిరాయింపులపై మొదటి ఫిర్యాదు అందినప్పటి నుంచి ఇప్పటివరకు ఎంత సమయం అవుతోంది? ఏడాది అవుతోందని వార్షికోత్సవం జరుపుకుంటున్నారా?..’ అంటూ స్పీకర్ కార్యాలయాన్ని ఉద్దేశించి సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. మీరు అడిగే సమయానికి ఒక నిర్దేశిత గడువు అనేది ఉండదా? అని ప్రశ్నిస్తూనే.. మరోపక్క ఎమ్మెల్యేల ఫిరాయింపుల వ్యవహారంలో స్పీకర్‌కు ఆదేశాలు ఇవ్వొచ్చా లేదా? అనే అంశంపై మాత్రమే తాము వాదనలు వింటున్నట్లు స్పష్టం చేసింది. తదుపరి విచారణను ఏప్రిల్ 2వ తేదీకి వాయిదా వేసింది. అదేరోజు స్పీకర్, అసెంబ్లీ కార్యదర్శుల వాదనలను వింటామని తెలిపింది. బీఆర్ఎస్ నుంచి పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావ్, దానం నాగేందర్లపై ఎమ్మెల్యేలు పాడి కౌశిక్‌రెడ్డి, కేపీ వివేకానంద్ల పేర్లతో స్పెషల్ లీవ్ పిటిషన్ (ఎస్ఎల్పీ).. ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఎం.సంజయ్‌కుమార్, కాలె యాదయ్య, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ప్రకాశ్ గౌడ్, గూడెం మహిపాల్ రెడ్డి, అరికెపూడి గాందీలపై బీఆర్ఎస్ పార్టీ, ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యే హరీశ్‌రావు, తదితరులు రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ రెండు పిటిషన్లపై జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ అగస్టీన్ జార్జి మైస్లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం మంగళవారం మరోసారి విచారణ జరిపింది. స్పీకర్ కార్యాలయం తరఫున సీనియర్ న్యాయవాదులు అభిషేక్ మనుసింఘ్వీ, ముకుల్ రోహత్గిలు హాజరయ్యారు. ఎస్ఎల్పీపై సీనియర్ న్యాయవాది ఆర్యమా సుందరం, రిట్ పిటిషన్‌పై దామ శేషాద్రినాయుడు, పి.మోహిత్‌రావు వాదనలు వినిపించారు. ఆ తీర్పుల ఆధారంగా చర్యలకు అవకాశం: ఆర్యమా సుందరం పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాల్సిందిగా గతేడాది మార్చి 15న తొలిసారి స్పీకర్‌కు తాము ఫిర్యాదు చేశామని ఆర్యమా సుందరం ధర్మాసనం దృష్టికి తెచ్చారు. ఆ తర్వాత ఏప్రిల్‌లో ఫిరాయింపులపై తొలిసారి కోర్టును ఆశ్రయించామని, జూన్‌లో రిట్ పిటిషన్ వేశామని చెప్పారు. దానం నాగేందర్ కాంగ్రెస్ బీ ఫామ్‌పై ఎంపీ ఎన్నికలకు పోటీ చేశారని, మరో ఎమ్మెల్యే తన కుమార్తె కోసం కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకుని ప్రచారం చేశారని, తెల్లం వెంకట్రావ్ సైతం పార్టీ ఫిరాయించారని పేర్కొన్నారు. ఈ ముగ్గురు ఎమ్మెల్యేలపై వేర్వేరుగా ఫిర్యాదు చేసినా స్పీకర్ స్పందించలేదని, కనీసం నోటీసులు ఇవ్వలేదని వివరించారు. దీనిపై రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించగా ఈ వ్యవహారంపై విచారణ సమయాన్ని ఖరారు చేయాలన్న సింగిల్ బెంచ్ నాలుగు వారాలు గడువు ఇచ్చిందని గుర్తు చేశారు. దీనిపై స్పీకర్ కార్యాలయం అప్పీల్ కు వెళ్లగా.. స్పీకర్‌కు తగినంత సమయం ఇవ్వాలన్న గ్రౌండ్స్‌పై ఈ ఉత్తర్వులను డివిజన్ బెంచ్ పక్కన పెట్టిందని తెలిపారు. కానీ ఇప్పటివరకు ఆ తగినంత సమయం అంటే ఎంతో చెప్పలేదన్నారు. స్పీకర్ తీసుకోవాల్సిన సమయంపై సుభాష్ దేశాయ్, కేశం మేఘాచంద్, రాజేంద్ర సింగ్ రాణా కేసుల్లో సుప్రీంకోర్టు స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చిందన్నారు. ఈ తీర్పుల ఆధారంగా పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకునేందుకు అవకాశం ఉందని విన్నవించారు. స్పీకర్ రాజ్యాంగ పరిరక్షణకు కట్టుబడి ఉండాలి సుప్రీంకోర్టును ఆశ్రయించిన తర్వాతే.. ఈ ఏడాది ఫిబ్రవరి 13న మూడు వారాల్లో రిప్లై ఇవ్వాలని స్పీకర్‌కు సర్వోన్నత న్యాయస్థానం నోటీసులు ఇచ్చిందని ఆర్యమా సుందరం గుర్తు చేశారు. ఈ సందర్భంగా జస్టిస్ గవాయి జోక్యం చేసుకున్నారు. ‘ఇప్పటికి ఏడాది అంటే...పార్టీ ఫిరాయింపులకు వార్షికోత్సవం అయ్యిందా? వార్షికోత్సం జరుపుకుంటున్నారా?’ అంటూ వ్యంగ్యంగా ప్రశ్నించారు. కేసు విషయంలో డిలే ట్యాక్టిక్స్ (ఆలస్యం చేసే చిట్కాలు) ఉపయోగించొద్దని అన్నారు. సుందరం తన వాదనలు కొనసాగిస్తూ.. ‘స్పీకర్ క్వాషి జ్యుడీషియరీ అధికారాలతో ఉన్నారు. రాజ్యాంగ పరిరక్షణకు కట్టుబడి ఉండాలి. రాజ్యాంగం కల్పించిన హక్కులు, అధికారాలను పరిరక్షించాల్సిన బాధ్యత స్పీకర్‌పై కూడా ఉంది. ఒకవేళ అది జరగడం లేదు అని భావిస్తే హైకోర్టు, సుప్రీంకోర్టును ఆశ్రయించడానికి కూడా రాజ్యాంగం అవకాశం కల్పించింది. స్పీకర్ క్వాషి జ్యుడీషియరీ అధికారాలతో ఒక ట్రిబ్యునల్‌గా వ్యవహరించాలి. స్పీకర్ అధికారాల్లోకి వెళ్లాలని, ఆయన విధుల్లో జోక్యం చేసుకోవాలని కోరడం లేదు కానీ, రాజ్యాంగ విధులు నిర్వర్తించాలని మాత్రమే మేము కోరుతున్నాం’ అని అన్నారు. ఆ ధర్మాసనాలు స్పష్టంగా చెప్పలేదు: జస్టిస్ గవాయి గతంలో ఇలాంటి కేసులు విచారించిన రాజ్యాంగ ధర్మాసనాలు స్పీకర్‌కు సమయంపై స్పష్టత ఇవ్వలేదని, ఉన్నత ధర్మాసనాల తీర్పులను తాము తిరిగి ఎలా రాయగలమని జస్టిస్ గవాయి వ్యాఖ్యానించారు. దీంతో ‘తగినంత సమయం’ అనే విషయంలో ఒక్కో కేసులో ఒక్కో విధంగా నిర్ణయాలు జరిగాయని సుందరం చెప్పారు. వారంలోపే హైకోర్టును ఆశ్రయించారు: సింఘ్వీ ఫిరాయింపులపై గతేడాది జూలై మొదటి వారంలో స్పీకర్‌కు ఫిర్యాదు చేస్తే, 9వ తేదీ నాటికే హైకోర్టులో పిటిషన్ వేశారని సింఘ్వీ చెప్పారు. నారిమన్ కేసులో ఫిర్యాదుకు, పిటిషన్‌కు మధ్య నిర్దిష్ట గడువు ఉండాలని కోర్టు తీర్పునిచ్చిందని చెప్పారు. ఇక్కడ ఫిరాయింపులపై ఫిర్యాదు అందగానే స్పీకర్ స్పందించి నోటీసులు ఇచ్చారని చెబుతుండగా జస్టిస్ గవాయి జోక్యం చేసుకుని.. గత విచారణ సందర్భంగా స్పీకర్, అసెంబ్లీ సెక్రటరీ, ఇతర ప్రతివాదులకు నోటీసులు జారీ చేసిన విషయం గుర్తు చేశారు. వారిపై చర్యలు తీసుకోండి: బీజేఎల్పీ నేత పిటిషన్ పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ బీజేపీ శాసనసభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి కూడా మంగళవారం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో ఆయన తరఫు న్యాయవాది మిథున్ శశాంక్ జోక్యం చేసుకుని.. ఫిరాయింపులకు సంబంధించి రాజ్యాంగంలోని అంశాలను ప్రస్తావించబోతుండగా.. జస్టిస్ గవాయి ఆసంతృప్తి వ్యక్తం చేశారు. ‘తాము ఈ కేసు మెరిట్స్‌లోకి వెళ్లడం లేదని ఇప్పటికే క్లారిటీ ఇచ్చాం. ఎమ్మెల్యేలు పార్టీ మారిన వ్యవహారంలో స్పీకర్‌కి ఆదేశాలు జారీ చేయవచ్చా లేదా అన్న అంశాన్ని మాత్రమే పరిశీలిస్తున్నాం..’ అని చెప్పారు. కాగా ఈ వ్యవహారంలో తాము వాదనలు వినిపించేందుకు సుదీర్ఘ సమయం కావాలని రోహత్గి కోరారు. ఈ అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం విచారణ వాయిదా వేసింది. -
తెలంగాణ మంత్రి వర్గ విస్తరణకు గ్రీన్ సిగ్నల్.. ఆ నలుగురికే ఛాన్స్!
ఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు కాంగ్రెస్ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు, ప్రస్తుతం కేబినెట్లో ఆరు మంత్రి పదవులు ఖాళీగా ఉండగా.. ఇందులో నాలుగు స్థానాలను భర్తీ చేయనున్నట్లు తెలుస్తున్నది. మైనారిటీలకు ఇవ్వాలనుకుంటే మరొకరికి అవకాశం కల్పించనుంది. ఇద్దరు రెడ్లు, ఒక బీసీ,ఒక ఎస్సీ సామాజిక వర్గం నేతకు అవకాశం కల్పించనుండగా.. చీప్ విప్ మాత్రం రెడ్డి సామాజిక వర్గం నేతకు కట్టబెట్టేయోచనలో అధిష్టానం నిర్ణయం తీసుకుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.ఇక ప్రస్తుతం మంత్రి పదవి రేసులో పలువురు ఎమ్మెల్యేల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వారిలో చెన్నూర్ ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి, దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్, ఇబ్రహీంపట్నం మల్రెడ్డి రంగారెడ్డి, మక్తల్ ఎమ్మెల్యే వాకాటి శ్రీహరి,మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిలు ఉన్నారు. అయితే, అధిష్టానం ఎవరివైపు మొగ్గుచూపితే వారికే మంత్రి పదవి ఖాయం. ఈ అంశంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇక, కేబినెట్ విస్తరణపై ఇప్పటికే సీఎం రేవంత్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌గౌడ్, ఏఐసీసీ ఇన్చార్జి మీనాక్షి నటరాజన్, రాష్ట్ర కోర్ కమిటీ నుంచి ఏఐసీసీ వివరాలు సేకరించింది. ఆ వివరాల ఆధారంగా మంత్రి పదవులు కేటాయింపు ఉంటుంది. -
‘దేవుళ్లని మోసం చేసిన రేవంత్‌కు రైతులను మోసం చేయడం ఓ లెక్క’
సాక్షి,మెదక్ జిల్లా : దేవుళ్లను మోసం చేసిన సీఎం రేవంత్ రెడ్డికి రైతులను మోసం చేయడం ఓ లెక్క’ అని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శలు గుప్పించారు. మెదక్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో హరీష్ రావు మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు. అధికారంలోకి వచ్చినా మొదటి రోజే రూ 2లక్షలు చేస్తామని చేతులెత్తేశారు. దేవుళ్లను మోసం చేసిన రేవంత్‌కు రైతులను మోసం చేయడం ఓ లెక్క. రైతులతో మిత్తిలు కట్టించి రుణాలు ఇవ్వలేదు. మొదటి ఏడాదిలో 2లక్షల ఉద్యోగాలు ఇస్తామని రేవంత్ సర్కార్ మోసం చేసింది. అన్ని వర్గాలను ప్రభుత్వం దారుణంగా మోసం చేసింది. అసెంబ్లీలో మేము అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ముఖం చాటేసిందది. రూ 2లక్షల రుణమాఫీ మీద రైతులు కాంగ్రెస్ నేతలను నిలదీయండి. రైతుబందు ఎగ్గొట్టింది. కరోనా కష్ట కాలంలో కూడా కేసీఆర్ రైతు బంధు అందించారు. కాంగ్రెస్ మాటలే తప్ప చేతలు లేవు. ఉద్యోగులకు పెన్షన్లు ఇవ్వడం లేదు. సర్పంచులకు, చిన్న కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వడం లేదు. సంపూర్ణ రుణమాఫీ అయ్యేదాకా రైతుల పక్షాన నిలదీస్తాం’ అని హరీష్ రావు స్పష్టం చేశారు. -
వీళ్లు ఏ పార్టీలో ఉన్నారు.. బీఆర్ఎస్? కాంగ్రెస్?
-
తెలంగాణ కేబినెట్ విస్తరణకు హైకమాండ్ గ్రీన్ సిగ్నల్
-
గురు శిష్యుల కాకమ్మ కథలు
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొన్ని విషయాలలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునే ఫాలో అవుతున్నట్లు అనిపిస్తుంది. సాధారణంగా రేవంత్‌ను చంద్రబాబు శిష్యుడుగానే చాలామంది భావిస్తుంటారు. దానిని రేవంత్ ఒప్పుకున్నా, లేకున్నా జనాభిప్రాయం అలాగే ఉంది. పలు విషయాలలో రేవంత్ చేస్తున్న వ్యాఖ్యలు, అనుసరిస్తున్న విధానాలు చంద్రబాబు తరహాలోనే కనిపిస్తుంటాయి. మార్గదర్శి అక్రమ డిపాజిట్లకు సంబంధించి హైకోర్టులో వీరిద్దరి ప్రభుత్వాలు దాదాపు ఒకే తరహాలో రామోజీ సంస్థకు అనుకూలంగా అఫిడవిట్లు వేసిన సంగతి తెలిసిందే. అందులోనే కాదు అనేక అంశాలలో ఇదే ధోరణి కనిపిస్తుంది. గత ప్రభుత్వాన్ని విమర్శించడంలో ఇద్దరిది ఒకటే తీరు. అప్పుల విషయంలో రేవంత్ గత కెసిఆర్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు.👉అలాగే చంద్రబాబు గత జగన్ ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తుంటారు. ఇది ఒకరకంగా చూస్తే ఆడలేక మద్దెల ఓడు అన్నట్లుగా అన్నమాట. రేవంత్ అధికారంలోకి వచ్చి అప్పుడే పదిహేను నెలలు గడిచిపోయింది. అయినా ఇంకా పట్టు రాలేదని ఆయనే చెబుతున్నారు. దానికి కూడా కేసీఆర్ కారణం అన్నట్లుగా మాట్లాడడం విడ్డూరమే అనిపిస్తుంది. అవినీతితో దోచుకుంటే పట్టు వచ్చినట్లవుతుందా అని కూడా ఆయన వ్యాఖ్యానించారు. రేవంత్ కొద్ది రోజుల క్రితం ఒక విషయం చెప్పారు. అది ఆయన నిజాయితీతో చెప్పారా?లేక కేసీఆర్ ప్రభుత్వంపై బండ వేయడానికి చెప్పారా? అన్నది తేల్చజాలం కాని, వినడానికి మాత్రం సంచలనంగానే ఉంది. 👉తెలంగాణ ప్రభుత్వానికి ఎక్కడా అప్పు పుట్టడం లేదని అన్నారు. తెలంగాణ పేరు గొప్పగాని, అప్పుపుట్టకుంది అని ఆయన అన్నారని మీడియాలో కథనాలు వచ్చాయి. డబ్బు తనవద్ద ఉంటే గంటలో రుణమాఫీ చేసేవాడినని, 25 లక్షల ఇళ్లు నిర్మించేవాడినని, ఎన్నో అద్భుతాలు చేసేవాడినని రేవంత్ అన్నారు. ఏపీలో సైతం ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా కొంత ఇదే తరహాలో మాట్లాడడం గమనార్హం. తాను ఇచ్చిన హామీల ప్రకారం సూపర్ సిక్స్ సంక్షేమ స్కీములు అమలు చేయాలని ఉందని, కాని నిధులు లేవని, గల్లా పెట్టే చూస్తే ఖాళీగా కనబడుతా ఉందని చంద్రబాబు సభలలో అంటున్నారు.👉తల్లికి వందనం స్కీము కింద ప్రతి విద్యార్ధికి పదిహేనువేల రూపాయలు ఇచ్చే స్కీమును ప్రస్తావిస్తూ అప్పులు దొరకడం లేదని అన్నారు. చంద్రబాబు, రేవంత్‌లు ఒకవైపు రాష్ట్రాలను గత ప్రభుత్వాలు అప్పుల పాలు చేశాయని చెబుతూ, మరో వైపు అప్పటికన్నా అప్పులు అధికంగా తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. ఎవరూ మనల్ని నమ్మడం లేదని రేవంత్ చెప్పడం సంచలనమే. గతంలో ఏ ముఖ్యమంత్రి ఈ తరహాలో మాట్లాడలేదు. కేసీఆర్ ప్రభుత్వాన్ని ఎలా నమ్మి ఆర్థిక సంస్థలు అప్పులు ఇచ్చాయని ఎవరైనా అడిగితే రేవంత్ ఏమని సమాధానం ఇస్తారో తెలియదు.👉కాళేశ్వరానికి అధిక వడ్డీకి రుణాలు తెచ్చారని, ఆ వడ్డీరేటును తగ్గించడానికి యత్నిస్తున్నానని అన్నారు. మంచిదే. కాని అన్నిటికి ఒకే మంత్రం జపించినట్లు కేసీఆర్ వల్లే తాను ఏమి చేయలేకపోతున్నట్లుగా చెప్పడం వల్ల ప్రయోజనం ఏమిటి?నిజానికి కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే అప్పులపై రేవంత్ చాలా విమర్శలు చేశారు కదా! దాదాపు ఏడు లక్షల కోట్ల అప్పులు చేసినట్లు కెసిఆర్ పై ఆరోపణలు చేశారు కదా?. కాని కాంగ్రెస్ బడ్జెట్లో అలా ఎందుకు చూపించలేకపోయారు. ఏపీలో కూడా ఇదే తంతు. మరీ ఘోరంగా జగన్ ప్రభుత్వం 14 లక్షల కోట్ల అప్పులు చేసిందని చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్‌లు పచ్చి అబద్దాలు ప్రచారం చేశారు. తీరా చూస్తే ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ చెప్పిన వివరాల ప్రకారమే గత ఏడాది ప్రభుత్వం మారేనాటికి అన్ని రకాల అప్పులు కలిసి ఏడు లక్షల కోట్లే ఉన్నాయి. ఇందులో చంద్రబాబు 2014 టరమ్ లో చేసిన అప్పులు, రాష్ట్రం విభజన నాటి అప్పులు కలిసి సుమారు మూడు లక్షలకోట్ల వరకు ఉన్నాయి.👉అంతేకాక రికార్డు స్థాయిలో ఈ ఆర్థిక సంవత్సరంలోనే ఏపీ ప్రభుత్వం సుమారు లక్ష ముప్పైవేల కోట్ల అప్పులు చేసింది. ఇవి చాలవన్నట్లుగా కేశవ్‌ను ఢిల్లీ పంపించి మరో 68 వేల కోట్ల అప్పుకోసం యత్నిస్తున్నారని ఎల్లో మీడియానే వార్తలు ఇచ్చింది. రేవంత్ ఒక మాట అన్నారు. ఎన్నిరోజులు దాచిపెట్టుకోను.. ఉన్నది ఉన్నట్లు చెబుతున్నా.. కాన్సర్ ఉంటే సిక్స్‌ఫ్యాక్ బాడీ అని చెప్పుకుంటే నమ్ముతారా అని ఆయన అన్నారు. ఇవి కొంచెం సీరియస్ వ్యాఖ్యలే. ఇలాంటి కామెంట్ల వల్ల తెలంగాణ ప్రభుత్వ పరపతి దెబ్బతింటుందని కొందరి అభిప్రాయం. అయితే వాస్తవ దృక్పధంతో రేవంత్ ఈ మాటలు చెప్పి ఉండవచ్చు. ఇక్కడ ఒకదానికి బేసిక్‌గా సమాధానం చెప్పవలసి ఉంటుంది.👉కాళేశ్వరం ప్రాజెక్టు అప్పులపై కాని, ఇతరత్రా రుణాలపై కాని 2023 ఎన్నికల కంటే ముందుగానే రేవంత్ కాని, కాంగ్రెస్ నేతలు కాని తీవ్ర విమర్శలు చేశారు కదా?. రాష్ట్రం అప్పులకుప్ప అయిపోయిందని అన్నారు కదా!. అయినా ఆరు గ్యారంటీలు అంటూ ఎందుకు భారీ హామీలు గుప్పించారు? అన్నదానికి ఎన్నడైనా జవాబిచ్చారా? ఈ విషయంలో చంద్రబాబు మాదిరే రేవంత్ కూడా వ్యవహరిస్తున్నారన్న భావన కలగదా! ఏపీ ఆర్థిక మంత్రి కేశవ్ తన బడ్జెట్ ప్రసంగంలో జగన్ ప్రభుత్వం ఆర్థిక విధ్వంసం చేసిందని అంటే, తెలంగాణ ఆర్థిక మంత్రి మల్లు భట్టి కూడా విధ్వంస తెలంగాణ నుంచి వికసిత తెలంగాణవైపు నడిపిస్తున్నామని చెప్పారు. అప్పు కూడా పుట్టడం లేదని ముఖ్యమంత్రి చెప్పడం తెలంగాణ వికసించడం ఎలా అవుతుంది?👉అంచనా వేసిన దానికన్నా 70 వేల కోట్ల ఆదాయం ఎలా తగ్గింది? ఏపీని రెండో ప్రపంచ యుద్ధంలో అణు బాంబులు పడిన హిరోషిమాతో కేశవ్ పోల్చితే, తెలంగాణ ఆర్థిక పరిస్థితిని కాన్సర్‌తో రేవంత్ పోల్చుతున్నారు. ఉద్యోగులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వడానికి కూడా డబ్బులు లేవని, గత ప్రభుత్వం ఎనిమిదివేల కోట్ల బకాయిపెట్టి వెళ్లిందని రేవంత్ చెప్పారు. ప్రభుత్వం అన్నది ఒక నిరంతర ప్రక్రియ. గత ప్రభుత్వంపై వ్యతిరేకతతోనో, లేక కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలకు ఆకర్షితులయ్యో ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఎన్నుకున్నారు కదా! ఎన్నికల సమయంలో ఎన్నడైనా చంద్రబాబుకాని, రేవంత్ కాని ఆర్థిక పరిస్థితిని పరిశీలించిన తర్వాత హామీలు అమలు చేస్తామని అన్నారా?లేదే!👉రేవంత్ ఏమో తాము అధికారంలోకి రాగానే రైతు బంధు డబ్బులు మరో ఐదువేలు కలిపి ఇస్తామని, రెండు లక్షల రూపాయల రుణ మాఫీ ఒకేసారి చేసి చూపిస్తామని ఎలా హామీ ఇచ్చారో చెబుతారా?. అది కూడా రాహుల్ గాంధీతో ప్రకటింపచేశారే?. చంద్రబాబేమో తాను అప్పులు చేయనక్కర్లేదని, సంపద సృష్టించి పేదలకు పంచుతానని ప్రచారం చేసి,ఇప్పుడేమో సంపద ఎలా సృష్టించాలో తెలియదని, అదెలాగో ప్రజలే చెవిలో చెప్పాలని ఒకసారి, జనానికి సంపద సృష్టి నేర్పుతానని మరోసారి అంటున్నారు. ఒక్కోసారి ఒక్కరకంగా చెబుతూ డబ్బులు లేవని కథలు చెబితే ప్రజలను పిచ్చోళ్లను చేసినట్లు కాదా?. ఇప్పుడు రేవంత్ ప్రయారిటీ ఫ్యూచర్ సిటీ అయితే, చంద్రబాబు ప్రాధాన్యత అమరావతి అన్నది అందరికి తెలిసిందే. అమరావతికి వేల కోట్ల అప్పులు తీసుకువస్తున్న చంద్రబాబు సంక్షేమానికి వ్యయం చేయలేనని చేతులెత్తేశారు.👉రేవంత్ ప్రభుత్వం కొంతలో కొంత బెటర్. ఇచ్చిన ఆరు గ్యారంటీలలో కొంతమేర అయినా అమలు చేసే యత్నం చేసింది.కాగా ఏటా అప్పులకే 66 వేల కోట్లు మిత్తి కింద కట్టవలసి వస్తోందని రేవంత్ అంటున్నారు. ఏది ఏమైనా రాజకీయ పార్టీలు ప్రజల ఓట్లను దండుకోవడానికి ఇష్టం వచ్చినట్లు హామీలు ఇవ్వడం, ఆ తర్వాత గత ప్రభుత్వాల మీద కాకమ్మ కబుర్లు చెబుతూ ప్రజల చెవిలో పూలు పెట్టాలని చూడడం శోచనీయం. ఇవన్ని గమనించిన తర్వాత చంద్రబాబు, రేవంత్‌లు గురు,శిష్యులే అనిపించదా!- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
ఉగాదికి అటు ఇటుగా!
సాక్షి, న్యూఢిల్లీ: ఎన్నో నెలలుగా ఊరిస్తున్న రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు సమయం సమీపించింది. ఉగాదికి కొంచెం అటు ఇటుగా కొత్త మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించాలని కాంగ్రెస్ అధిష్టానం, రాష్ట్ర పెద్దలు నిర్ణయించినట్లు సమాచారం. అయితే ఎంతమందికి అవకాశం దక్కుతుందన్న దానిపై మాత్రం ఇంకా స్పష్టత రాలేదు. నలుగురా? లేక ఐదుగురా? అన్నది తేలాల్సి ఉంది. ఏఐసీసీ వర్గాలు, రాష్ట్ర నేతలు అందిస్తున్న సమాచారం మేరకు.. సీనియర్ నేతలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, గడ్డం వివేక్, వాకిటి శ్రీహరి పేర్లు ఖరారైనట్లు తెలుస్తుండగా, మిగతా పేర్లపై నేడో, రేపో స్పష్టత వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. విస్తృత చర్చలు..అనేక కోణాల్లో పరిశీలన ప్రస్తుతం ఆరు కేబినెట్ స్థానాలు ఖాళీ ఉండగా, వీటి భర్తీపై గత కొన్ని నెలలుగా విస్తృత కసరత్తు జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సీనియర్ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్లు పలుమార్లు హైకమాండ్‌తో చర్చలు జరిపినా వివిధ కారణాలతో వాయిదా పడుతూ వస్తోంది. అయితే ప్రస్తుతం కీలకమైన కులగణన పూర్తికావడం, దానికి చట్టబద్ధత కల్పించే బిల్లుతో పాటు ఎస్సీ వర్గీకరణ బిల్లు ఆమోదం పొందడం, మరికొద్ది రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాల్సి ఉన్న నేపథ్యంలో మంత్రివర్గ విస్తరణపై అధిష్టానం దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో సోమవారం ఢిల్లీకి వచ్చిన రేవంత్, భట్టి, ఉత్తమ్, మహేశ్‌గౌడ్‌లు పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్‌గాందీ, పార్టీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్‌లతో ఇందిరా భవన్లో భేటీ అయ్యారు. సుమారు గంటన్నర పాటు జరిగిన చర్చల్లో జిల్లాల ప్రాతినిధ్యం, సామాజిక వర్గాలు, పారీ్టలో పనిచేసిన అనుభవం, సీనియార్టీ ఆధారంగా కొత్త మంత్రుల ఎంపికపై చర్చించినట్లు తెలిసింది. పార్టీ బీ–ఫామ్‌ల మీద గెలిచిన ఎమ్మెల్యేలకే మంత్రివర్గంలో చోటు కల్పించాలని, కాంగ్రెస్‌లో చేరిన ఇతర పారీ్టల ఎమ్మెల్యేలకు అవకాశం ఇవ్వరాదని అధిష్టానం నిర్ణయించినట్లు తెలిసింది. దీంతో బీఆర్ఎస్ నుంచి వచ్చిన నేతలెవరికీ పదవులు దక్కే అవకాశం లేదని పారీ్టవర్గాలు చెబుతున్నాయి. గుర్తించిన నేతలపై విస్తృత చర్చ సోమవారం నాటి భేటీలో మంత్రివర్గంలోకి తీసుకునేందుకు ఇదివరకే గుర్తించిన పేర్లపై మరోమారు చర్చించారు. ఇందులో మహబూబ్‌నగర్ జిల్లా నుంచి వాకిటి శ్రీహరి, నిజామాబాద్ జిల్లా నుంచి పి.సుదర్శన్‌రెడ్డి, నల్లగొండ జిల్లా నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, బాలూనాయక్, రంగారెడ్డి జిల్లా నుంచి మల్రెడ్డి రంగారెడ్డి, టి.రామ్మోహన్ రెడ్డి, ఆదిలాబాద్ జిల్లా నుంచి ప్రేమ్‌సాగర్‌రావు, వివేక్, కరీంనగర్ జిల్లా నుంచి ఆది శ్రీనివాస్, మైనార్టీ కోటాలో షబ్బీర్ అలీ, ఆమేర్ అలీఖాన్‌ల పేర్లు ఉన్నాయి. అలాగే మహిళా కోటాలో ఎమ్మెల్సీ విజయశాంతి పేరును కూడా పరిశీలించినట్టు సమాచారం. ఆమెను ఎమ్మెల్సీగా ప్రకటించినప్పుడే కేబినెట్లోకి కూడా తీసుకుంటారనే ప్రచారం జరిగింది. నిజామాబాద్ జిల్లా నుంచి ప్రాతినిధ్యం లేనందున సుదర్శన్‌రెడ్డికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెబుతున్నారు. ప్రేమ్‌సాగర్ వైపు భట్టి మొగ్గు వెలమ సామాజిక వర్గం నుంచి మంత్రి పదవికి పోటీ ఎక్కువగా ఉంది. ఈ సామాజిక వర్గం నుంచి ముగ్గురు ఎమ్మెల్యేలు ప్రేమ్‌సాగర్ రావు, మదన్మోహన్, మైనంపల్లి రోహిత్‌తో పాటు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ల మధ్య పోటీ నెలకొంది. అయితే ఈ సామాజిక వర్గం నుంచి ఇప్పటికే జూపల్లి కష్ణారావు ఉన్నందున మరొకరికి అవకాశం ఇవ్వాలా? లేదా? అన్న దానిపై చర్చలు జరుగుతున్నాయి. ప్రేమ్‌సాగర్‌రావుకు అవకాశం ఇవ్వాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సూచించినట్టు తెలిసింది. మదన్మోహన్కు పార్టీ పెద్దలు, రోహిత్‌కు సీఎం ఆశీస్సులు! మదన్మోహన్ పార్టీ పెద్దల నుంచి ఒత్తిళ్లు తెస్తుండగా, రోహిత్‌కు ముఖ్యమంత్రి మద్దతిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక బీఆర్ఎస్ నుంచి పారీ్టలో చేరిన ఎమ్మెల్యేలు దానం నాగేందర్, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, తెల్లం వెంకట్రావ్, కాలె యాదయ్య, సంజయ్‌కుమార్‌లలో ఒకరికి మంత్రి పదవి ఇవ్వాలనే డిమాండ్ ఉన్నా, తాజా నిర్ణయం నేపథ్యంలో వారికి అవకాశం లేదని తెలిసింది. నల్లగొండ జిల్లా నుంచి ఇప్పటికే ఎస్టీ (లంబాడా) కోటాలో శంకర్‌నాయక్‌ను ఎమ్మెల్సీగా చేసినందున, బాలూనాయక్‌ను కేబినెట్లోకి తీసుకోకుండా డిప్యూటీ స్పీకర్‌గా చేయాలన్న ప్రతిపాదనలపై చర్చలు జరిగాయి. త్వరలో కార్యవర్గం! పీసీసీ కార్యవర్గ ప్రకటన కూడా త్వరలో వెలువడే అవకాశం ఉంది. ఏఐసీసీ పెద్దలతో భేటీలో ఈ అంశం కూడా చర్చకు రాగా ముందుగా నలుగురు వర్కింగ్ ప్రెసిడెంట్లు, 20 మందికి పైగా వైస్ ప్రెసిడెంట్లను ప్రకటించేందుకు నిర్ణయం జరిగినట్లు తెలిసింది. కొన్ని నామినేటెడ్ పోస్టుల భర్తీపై సైతం చర్చించినట్లు చెబుతున్నారు. అలాగూ కులగణనపై ప్రజలు ఎలాంటి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు? ఎస్సీ వర్గీకరణపై ఏమనుకుంటున్నారు? స్థానిక సంస్థల ఎన్నికల్లో వీటి ప్రభావం ఎంతవరకు ఉంటుందనే అంశాలపై కూడా చర్చించినట్లు తెలుస్తోంది. మంత్రుల శాఖల్లో మార్పులు?కొత్తగా నలుగురిని లేక ఐదుగురిని మంత్రివర్గంలోకి తీసుకుంటే ముఖ్యమంత్రి వద్ద ఉన్న ఏయే శాఖలు వారికి కేటాయించాలి, కొంతమంది మంత్రుల శాఖల్లో మార్పులు చేయాలా? కొందరికి కీలక శాఖలు అప్పగించాలా? అన్న దానిపైనా చర్చ జరిగింది. ముఖ్యమంత్రి వద్ద ఉన్న మున్సిపల్, హోం, విద్యా శాఖలను సీనియర్ మంత్రులకు ఇవ్వాలన్న చర్చ జరిగింది. ఈ నేపథ్యంలో పాత మంత్రుల శాఖలు కొన్ని మార్చే అవకాశం ఉందని ఏఐసీసీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. -
ఢిల్లీ బయల్దేరిన సీఎం రేవంత్, మంత్రులు భట్టి, ఉత్తమ్
-
తెలంగాణ అసెంబ్లీ: మార్షల్స్‌తో బీజేపీ ఎమ్మెల్యేల వాగ్వాదం
Telangana Assembly Session Updates..అసెంబ్లీ లాబీలో ఆసక్తికర సన్నివేశం..లాబీలో ఎదురుపడిన కాంగ్రెస్ ఎమ్మెల్యే వివేక్, బీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్.అరగంట పాటు వివేక్, సుమన్ మధ్య చర్చలు.వారిద్దరినీ చూసి షాకైన కేటీఆర్. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కామెంట్స్..ప్రతిపక్షాలు విమర్శలు తప్ప.. సూచనలు చేయడం లేదు.పెట్టుబడిదారులను బెదిరించే విధంగా బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతున్నారని మాత్రమే సీఎం అన్నారు..సీఎం వ్యాఖ్యలను బీఆర్ఎస్ సభ్యులు వక్రీకరించి మాట్లాడుతున్నారు.జగదీశ్ రెడ్డి ఎమ్మెల్యే చిట్ చాట్..ఇప్పటి వరకు సస్పెండ్‌పై బులెటిన్ ఇవ్వలేదు.రావద్దు అనడానికి ఎలాంటి పరిమితి ఉంది అంటూ ఆగ్రహంబులెటిన్ ఇస్తే నేను రానుఏ కారణంతో నన్ను సస్పెండ్ చేశారు.వారం నుంచి బులెటిన్ విడుదల చేయలేదు.ఇష్టారాజ్యంగా అసెంబ్లీ నడుస్తుందిపద్దతి ప్రకారం అసెంబ్లీ నడవటం లేదురాజ్యాంగ విలువలు, నిబంధనలు లేకుండా అసెంబ్లీ నడుస్తుందిసస్పెండ్ చేశారో లేదో ఇప్పటికీ ఆధారాలు లేవు.మంద బలంతో సభ నడుపుతాం అంటే కుదరదు.ఇప్పుడు బులిటెన్ ఇస్తారో చూస్తా.. లేదంటే స్పీకర్‌ను కలుస్తాను.స్పీకర్ ను మళ్ళీ అడుగుతున్నా బులిటెన్ ఇవ్వాలి.వారం రోజుల నుండి రోజు అడుగుతున్నాను.కోర్టుకు పోతాం అనే భయంతోనే నాకు బులిటెన్ ఇవ్వడం లేదుసస్పెండ్ చేసిన వెంటనే బులిటెన్ ఇవ్వాలి.వారం గడిచినా ఎందుకు ఇవ్వడం లేదు. ఆధారాలు లేకనే సస్పెన్షన్ బులిటెన్ ఇవ్వడం లేదు.హెలికాప్టర్లలో తిరుగుతున్నారు మా నల్గొండ జిల్లా మంత్రులుగంట ప్రయాణానికి కూడా హెలికాప్టర్లో వెళ్తున్నారు.నిన్న జాన్ పాడ్‌లో జానారెడ్డి దావత్‌కు కూడా హెలికాప్టర్ లో వచ్చారు.ప్రశ్నలకు సమాధానం చెప్పలేక క్వశ్చన్ అవర్ రద్దు చేస్తున్నారు.ప్రజల సమస్యలు శాసన సభలో లేవనెత్తిన ప్రశ్నలకు జవాబు లేదు.మార్షల్స్‌తో బీజేపీ సభ్యుల వాగ్వాదం.. అసెంబ్లీ ఆవరణలో బీజేపీ ఎమ్మెల్యేలకు, మార్షల్స్కి మధ్య వాగ్వాదం.అకాల వర్షంతో నష్ట పోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్.మొక్కజొన్న కంకులు, మామిడి కాయలతో అసెంబ్లీకి వచ్చిన బీజేపీ ఎమ్మెల్యేలు.అసెంబ్లీ లోపలికి అనుమతించని మార్షల్స్ ..కంకులు, మామిడి కాయలతో ఎమ్మెల్యేలను మీడియా పాయింట్ వద్దకు కూడా అనుమతి ఇవ్వని మార్షల్స్.అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని బీజేపీ ఎమ్యెల్యేల డిమాండ్రైతులను ఆదుకోవాలని సభలో బీజేపీ సభ్యులు నిరసన.అసెంబ్లీలో SLBCపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్నెల రోజులుగా కొనసాగుతున్న సహాయక చర్యలు..ఇంకా కానరాని ఏడుగురి కార్మికుల ఆచూకీటన్నెల్ వద్ద పనుల పురోగతి.. తదుపరి చర్యలపై అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్న సంబంధిత అధికారులుకార్మికుల ఆచూకీపై కీలక ప్రకటన చేయనున్న ప్రభుత్వం.నల్లబ్యాడ్జీలతో బీఆర్ఎస్ నేతలు.. రుణమాఫీపై నల్లబ్యాడ్జీలతో అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతున్న బీఆర్ఎస్ శాసనసభ సభ్యులు...రెండు లక్షల రుణమాఫీ పూర్తి చేయాలి...మాట తప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం..రుణమాఫీ బూటకం .. కాంగ్రెస్ నాటకం .. అంటూ నినాదాలుఅసెంబ్లీకి హాజరైన బీఆర్ఎస్ సభ్యులు.రెండు లక్షల రుణమాఫీపై మాట తిప్పిన కాంగ్రెస్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు..అసెంబ్లీకి వచ్చిన ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి..అసెంబ్లీకి రావద్దని జగదీష్ రెడ్డికి సూచించిన చీఫ్ మార్షల్.తనను రావద్దని స్పీకర్ ఇచ్చిన బులిటన్ చూపించాలని డిమాండ్ చేసిన జగదీష్ రెడ్డి.. -
పనిచేసే వారికే టికెట్లు ఇస్తాం
సాక్షి, రంగారెడ్డిజిల్లా: కష్టపడి పనిచేసే నాయకులు, కార్యకర్తలకే కాంగ్రెస్ టికెట్లు ఇస్తామని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ చెప్పారు. ఆదివారం మైలార్‌దేవ్‌పల్లిలోని ఓ ఫంక్షన్ హాల్లో డీసీసీ అధ్యక్షుడు చల్లా నరసింహారెడ్డి అధ్యక్షతన జరిగిన ‘జైబాపు.. జైభీమ్..జై సంవిధాన్ అభియాన్’కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. తెలంగాణలో త్వరలో మరో 24 అసెంబ్లీ నియోజకవర్గాలు ఏర్పడతాయని, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో పెద్ద సంఖ్యలో సీట్లు పెరిగే అవకాశం ఉందన్నారు. కొత్తగా ఏర్పాటు కాబోయే ఆయా నియోజకవర్గాల్లో ఆశావహులందరికీ కాంగ్రెస్ పార్టీ అవకాశం కల్పిస్తుందని చెప్పారు. ఎమ్మెల్యేగా పోటీ చేయాలని భావించే వారు ఇప్పటి నుంచే సీరియస్‌గా పార్టీ కోసం పనిచేయాలని, నిత్యం ప్రజల్లో ఉండాలని సూచించారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కలిసికట్టుగా పనిచేసి పార్టీ అభ్యర్థులను గెలుపించుకోవాలన్నారు. మతవాద శక్తుల నుంచి దేశాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. జైబాపు, జైభీమ్, జై సంవిధాన్ అభియాన్పేరుతో గ్రామాల్లో పర్యటించి, రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని కార్యకర్తలకు సూచించారు. జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునరి్వభజన చేపడితే దక్షిణాది రాష్ట్రాలకు తీరని అన్యాయం జరిగే ప్రమాదం ఉందన్నారు. జిల్లాకు మంత్రి పదవి ఇవ్వాల్సిందే ఉమ్మడి రంగారెడ్డి నుంచి గెలుపొందిన ఎమ్మెల్యేలకు కేబినెట్లో స్థానం కల్పించకపోవడంతో జిల్లా ప్రజలు నష్టపోవాల్సి వస్తోందని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఉమ్మడి జిల్లాకు మంత్రి పదవి ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు. ఇదే అంశంపై జిల్లా ముఖ్య నేతలంతా ఓ తీర్మానం చేసి, పార్టీ అధిష్టానానికి పంపారు. ఈ సమావేశంలో సీడబ్ల్యూసీ సభ్యుడు వంశీచంద్‌రెడ్డి, ఎమ్మెల్యేలు నారాయణరెడ్డి, వీర్లపల్లి శంకర్ తదితరులు పాల్గొన్నారు. బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేలు ప్రకాశ్‌గౌడ్, కాలెయాదయ్య, అరికెపూడి గాంధీ ఈ సమావేశానికి హాజరుకాలేదు. -
కాంగ్రెస్ సర్కార్ అసమర్థ పాలనతోనే రైతులకు కష్టాలు: హరీష్‌రావు
సాక్షి, సిద్దిపేట: అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను తక్షణమే ఆదుకోవాలని ప్రభుత్వాన్ని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావు డిమాండ్ చేశారు. నారాయణరావుపేట మండలం లక్ష్మీదేవి పల్లి గ్రామంలో నిన్న(శనివారం) రాత్రి కురిసిన వర్షాలు, వడగండ్ల కారణంగా దెబ్బతిన్న పంటలను ఆదివారం ఆయన పరిశీలించారు.అనంతరం హరీష్ రావు మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను దగా చేస్తోందన్నారు. రెండు లక్షల రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని మండిపడ్డారు. రైతు బంధు రూపంలో కేసీఆర్ రైతులకు నేరుగా సాయం చేశారు. వానా కాలం యాసంగి రైతుబంధు రూ. 15 వేలు వెంటనే విడుదల చేయాలి. పంటల బీమా ఉండే రైతులకు ఇంత నష్టం ఉండేది కాదు. రైతులకు మూడు పంటల బీమా రాలేదు. రుణమాఫీ చేయలేదు ఇచ్చామని.. అబద్ధాలు ఆడుతున్నారు’’ అని కాంగ్రెస్‌పై హరీష్‌రావు మండిపడ్డారు.‘‘రేవంత్ రెడ్డి అన్ని అబద్ధాలు ఆడుతున్నారు. ఎండల వల్ల పంటలు ఎండటం లేదు. కాంగ్రెస్ అసమర్థ పాలన వల్ల నీళ్లులేక పంటలు ఎండిపోతున్నాయి. వడగండ్ల వాన వల్ల నష్టపోయిన రైతులను వెంటనే ఆర్థిక సాయం చేసి అందుకోవాలి. వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించాలి’’ అని హరీష్‌రావు పేర్కొన్నారు. -
కాంగ్రెస్ రైతులకు అన్యాయం చేసింది
-
చెన్నైలో జరిగిన డీలిమిటేషన్ సమావేశంపై కిషన్ రెడ్డి ఆగ్రహం
-
తెలంగాణ విద్యా కమీషన్లో అర్బన్ నక్సల్స్
సాక్షి,కరీంనగర్ : తెలంగాణ విద్యా కమీషన్లో అర్బన్ నక్సల్స్ ఉన్నారని కేంద్రమంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ భూములమ్మి జీతాలు చెల్లించే పరిస్థితి వచ్చిందన్నారు.బీఅర్ఎస్ అధినేతకు బీదర్‌లో దొంగనొట్లు ముద్రించే ప్రెస్ ఉందని, దొంగనోట్ల వ్యాపారం చేసి ఎన్నికల్లో డబ్బులు పంచారని ఆరోపించారు. పదేండ్లు బీఅర్ఎస్ తెలంగాణ ప్రజలను మోసం చేసింది. ప్రభుత్వం భూములు అమ్మి జీతాలు ఇచ్చే పరిస్థితి తెచ్చింది. ఈ ప్రభుత్వంలో 15 నుండి 18 కమిషన్ పెంచారు. కమిషన్ ఇచ్చిన వారికే బిల్లుల చెల్లింపులు జరుగుతున్నాయని విమర్శించారు. -
బీజేపీవైపు దక్షిణాది.. అందుకే డీలిమిటేషన్ డ్రామా: కిషన్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: దేశంలో డీలిమిటేషన్‌పై కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి. దక్షిణాదిలో బీజేపీ బలపడకూడదని కాంగ్రెస్, బీఆర్ఎస్, డీఎంకే కుట్ర చేస్తున్నాయని ఆరోపించారు. స్టాలిన్ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయింది. ప్రభుత్వ వ్యతిరేకతను డైవర్ట్ చేసేందుకు ముఖ్యమంత్రి స్టాలిన్ డీలిమిటేషన్ మీటింగ్ పెట్టారని అన్నారు. ఇదే సమయంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ జతకట్టిపోవడం వాళ్ల చీకటి ఒప్పందానికి నిదర్శనమని ఘాటు విమర్శలు చేశారు.కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి బీజేపీ ఆఫీసులో మీడియాతో మాట్లాడుతూ..‘డీలిమిటేషన్‌పై కాంగ్రెస్, బీఆర్ఎస్లు పార్టీలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల నిజస్వరూపం మరోసారి బయటపడింది. దక్షిణాదికి అన్యాయం చేసి బీజేపీ బలపడాలని అనుకోవడం లేదు. దక్షిణాదిలో బీజేపీ బలపడకూడదని కాంగ్రెస్, బీఆర్ఎస్, డీఎంకే కుట్ర చేస్తున్నాయి. చెన్నై సమావేశానికి బీఆర్ఎస్, కాంగ్రెస్ జతకట్టిపోవడం వాళ్ల చీకటి ఒప్పందానికి నిదర్శనం. దేశంలో లేని సమస్యను సృష్టించి రాజకీయ పబ్బం గడుపుకుంటున్నారు. లేని డీలిమిటేషన్‌పై కాంగ్రెస్, బీఆర్ఎస్ రాజకీయం చేస్తున్నాయి.తమిళనాడులో కుటుంబ, అవినీతి పాలన నడుస్తోంది. డీలిమిటేషన్‌పై కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. బీజేపీపై తప్పుడు ప్రచారాన్ని ఖండిస్తున్నాం. కుటుంబ, అవినీతి పార్టీలు మోదీపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నాయి. ఎలాంటి వివక్ష లేకుండా అన్ని రాష్ట్రాలు అభివృద్ధి జరగాలని ప్రధాని మోదీ కోరుకుంటున్నారు. స్టాలిన్ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయింది. తండ్రీకొడుకులు అక్కడ ఇచ్చిన హామీలు నెరవేర్చలేక ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకున్నారు. భాషల పేరు మీద దక్షిణాదికి అన్యాయం చేయాలని బీజేపీ అనుకోవడం లేదు. దక్షిణాది ప్రజలు బీజేపీవైపు చూస్తున్నారు. ప్రభుత్వ వ్యతిరేకతను డైవర్ట్ చేసేందుకు డీలిమిటేషన్ మీటింగ్ పెట్టారు. కాంగ్రెస్ కేవలం మూడు రాష్ట్రాలకే పరిమితమైంది. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తెలంగాణ, కర్ణాటకలో అధికారం బీజేపీదే. డీలిమిటేషన్ చేయాలంటే పార్లమెంట్లో చట్టం చేయాలి. ఇంకా జనాభా లెక్కల సేకరణే జరగలేదు’ అని చెప్పుకొచ్చారు. డీలిమిటేషన్ గురించి గతంలో ఉన్న చట్టాలు కాంగ్రెస్ తీసుకొచ్చినవే. ఏదో జరిగిపోతుందని కేటీఆర్, రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఆరు గ్యారంటీలపైన రేవంత్ దృష్టి పెడితే బాగుంటుంది. నిన్న జరిగిన సమావేశంలో ఆయా రాజకీయ పార్టీలు వారి స్వప్రయోజనం కోసం మాట్లాడుతున్నాయి. గతంలో ఇవే రాజకీయ పార్టీలు రాజ్యాంగం మారుస్తారని ప్రచారం చేశారు. ఏది జరిగినా ఏ ప్రాంతానికి అన్యాయం జరగదు. అవినీతి, కుటుంబ పార్టీలు చేస్తున్న వాటిని ప్రజలు తిప్పికొట్టాలి. బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య సయోధ్యని కుదుర్చే పనిలో ఎంఐఎం ఉంది అని వ్యాఖ్యలు చేశారు. -
రూ. 2 లక్షలపైన రుణమాఫీ లేదు: తుమ్మల నాగేశ్వరరావు
సాక్షి, హైదరాబాద్: ‘రైతు రుణమాఫీపై ప్రభుత్వ నిర్ణయం రూ. 2 లక్షల వరకు ఉన్న రుణం మాఫీ. రూ. 2 లక్షలపైన మాఫీ లేదు. కుటుంబానికి రూ. 2 లక్షలలోపు రుణం ఉన్న వాటిని మాఫీ చేస్తామన్నాం. ఇలాంటి కుటుంబాలు 25 లక్షలు ఉన్నట్లు మాకు వివరాలు అందాయి. ఆయా కుటుంబాలకు రూ. 20,616 కోట్లు జమ చేశాం. రుణమాఫీ విషయంలో ప్రతిపక్షాలు గందరగోళపడి రైతులను గందరగోళం చేయొద్దు’అని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. వ్యవసాయం, అనుబంధ రంగాలు, పశుసంవర్థక శాఖ పద్దులపై శనివారం అసెంబ్లీలో చర్చ సందర్భంగా తుమ్మల ఈ వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యేలు హరీశ్‌రావు, పాడి కౌశిక్‌రెడ్డి, కూనంనేని సాంబశివరావు, ఆది శ్రీనివాస్ మహేశ్వర్‌రెడ్డి సహా మొత్తం 13 మంది సభ్యులు అడిగిన పలు అంశాలపై మంత్రి తుమ్మల మాట్లాడారు. రైతులపై రుణభారం ఉండొద్దన్న ఉద్దేశంతోనే ప్రభుత్వం రుణమాఫీని ప్రధానాంశంగా తీసుకుందన్నారు. అలాగే రైతు భరోసా కోసం రూ. 7,625 కోట్లు విడుదల చేశామని.. ఈ పంటకు కూడా రైతు భరోసా నిధులు ఇస్తామన్నారు. ప్రభుత్వంపై భారం పడినా రైతులకు ఉచిత విద్యుత్‌ను కొనసాగిస్తామని స్పష్టం చేశారు. రైతులను ప్రోత్సహించడంతోపాటు కౌలు రైతులకు మేలు చేసేందుకే సన్న వడ్లకు క్వింటాల్‌కు రూ. 500 చొప్పున బోనస్ ఇస్తున్నామన్నారు. సన్నాలకు ఇప్పటివరకు రూ. 1,200 కోట్ల మేర బోనస్ ఇచ్చినట్లు తుమ్మల వివరించారు. ప్రభుత్వ నిర్ణయంతో సన్నాల సాగు 25 శాతం నుంచి 45 శాతానికి పెరిగిందన్నారు. ఎరువుల కొరత లేకుండా చూస్తున్నామని చెప్పారు. పంట నష్టపరిహారం ఎకరానికి రూ. 10 వేలు ఇస్తున్నామని.. రైతులు నష్టపోయిన పూర్తి పంటకు కూడా నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకుంటామని మంత్రి తుమ్మల హామీ ఇచ్చారు. భవిష్యత్తులో బీమా ప్రీమియం మొత్తం ప్రభుత్వమే భరించేలా చర్యలు తీసుకుంటామన్నారు. కాగా, రైతు రుణమాఫీపై ప్రభుత్వం మాట తప్పిందని ఆరోపిస్తూ బీఆర్ఎస్ సభ్యులంతా సభ నుంచి వాకౌట్ చేశారు. రుణమాఫీపై కాంగ్రెస్ మోసం బట్టబయలు: హరీశ్‌రావు రైతు రుణమాఫీపై కాంగ్రెస్ మోసం అసెంబ్లీ సాక్షిగా బట్టబయలైందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు ధ్వజమెత్తారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడుతూ ‘రూ. 2 లక్షలు పైబడిన రైతు రుణాలను మాఫీ చేయలేమని వ్యవసాయ మంత్రి అసెంబ్లీలో ప్రకటించడం సీఎం రేవంత్‌రెడ్డి చెప్పిన మాటలకు.. చేతలకు పొంతన లేదని రుజువు చేసింది. సీఎం మాటలు నమ్మి రూ. 2 లక్షలు పైబడిన రుణాలకు సంబంధించి వడ్డీ చెల్లించిన రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం త్రిశంకు స్వర్గంలోకి నెట్టింది. అలాగే రూ. 2 లక్షలలోపు తీసుకున్న రుణం ఇంకా మాఫీ కాక చాలా మంది రైతులు బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. ఖాతాల్లోని లోపాలను సవరించకుండా రైతులపైనే నెపం నెట్టి రుణమాఫీ నుంచి ప్రభుత్వం తప్పించుకుంది. రుణమాఫీ ప్రక్రియ పూర్తయిందని అసెంబ్లీ వేదికగా వ్యవసాయ శాఖ మంత్రి చెబుతున్నారు. బడ్జెట్లో పెట్టిన విధంగా రూ. 31 వేల కోట్ల మేర రుణమాఫీ చేయాలి’అని హరీశ్‌రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. -
హైదరాబాద్ నాంపల్లి బీజేపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత
-
‘తమ్ముడూ.. నీ లైఫ్ స్టైల్ వేరు.. నా లైఫ్ స్టైల్ వేరు’
హైదరాబాద్: సన్నవడ్లకు బోనస్ ఇవ్వడం లేదన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలకు మంత్రి సీతక్క కౌంటిరిచ్చారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను సీతక్క ఖండించారు. ‘ తమ్ముడూ నీ లైఫ్ స్టైల్ వేరు..నా లైఫ్ స్టైల్ వేరు. నియోజకవర్గంలో నేను తిరిగినట్లు నువ్వు తిరగలేవు. ప్రజలకు ఎవరు ఎక్కువ అందుబాటులో ఉంటారో తేల్చుకుందాం. హైదరాబాద్ లో తిరిగే వాల్లకు రైతులకు బోనస్ వస్తుందో లేదో తెలుస్తుందా?,రైతులతో సంబందం లేకుండా హైదరాబాద్ లో తిరుగుతున్నట్లు ఉంది. బోనస్ ఇస్తామని చెప్పి బోగస్ చేసింది మీరు. వరి వేస్తే ఉరి అన్నది మీరు. ప్రజా ప్రభుత్వం సన్న వడ్లకు రూ. 1200 కోట్లు బోనస్ ఇచ్చింది. ఇంకా ఎవరికన్నా రాకపోతే అవి కూడా ఇస్తాం. రైతు కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇస్తున్నాం. భూమి లేని వాల్లకే కూలీ భరోసా ఇస్తున్నాం. కొంత భూమి ఉన్న కూలీలకు ఇవ్వాలనే అంశం పరిశీలనలో ఉంది’అని సీతక్క పేర్కొన్నారు.బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మా ఇంటికి వచ్చి చూడండి..‘బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మా ఇంటికి వచ్చి చూడండి. మీరు మా ఇంటికి రావాలని ఆహ్వానం పలుకుతున్న. ప్రభుత్వం వసతి కల్పించిన క్వార్టర్స్ లోనే నేను నివసిస్తున్నాను. వైఎస్ భవనంలో ఉండటం అదృష్టంగా భావిస్తున్నారు. అది మా ప్రభుత్వం హయాంలో నిర్మించిన భవనమే. ఆ భనంలోనే ఉంటున్నాను. మీలాగా ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన కోటల్లో నివసించడం లేదు. మా ఇంటికి వస్తే అన్ని విషయాలు తెలుస్తాయి. మీ అందరిని భోజనానికి ఆహ్వానిస్తున్న... మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడూ ఆహ్వానించలేదు. నాది నిరాడంబర జీవితం. నా కుమారుడు కూడా హన్మకొండ లోనే ఉంటాడు’ అని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. -
సింగిల్‌గానే అధికారంలోకి వస్తాం: కేసీఆర్
హైదరాబాద్, సాక్షి: తెలంగాణలో మరోసారి బీఆర్ఎస్ అధికారం చేపట్టడం తథ్యమని బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు(Kalvakuntla Chandrasekar Rao) ఉద్ఘాటించారు. శనివారం ఎర్రవెల్లి ఫామ్‌హౌజ్‌లో జరిగిన రామగుండం నియోజకవర్గ బీఆర్ఎస్ నేతల సమావేశంలో ఆయన కీలక కామెంట్లు చేశారు.బెల్లం ఉన్న దగ్గర ఈగలు వస్తాయి. అలాగే సిరిసంపదలు ఉన్న తెలంగాణకు దోచుకోవడానికి కొందరు సిద్ధంగా ఉన్నారు. పదేళ్లు తెలంగాణలో ఎలాంటి ఇబ్బందులు లేవు. ఇప్పుడు సమస్యల వలయంలో చిక్కుకుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో రామగుండంలో గెలిచిన ఎమ్మెల్యే ఓ సన్నాసి అంటూ కామెంట్ చేశారు.ఆనాడు బలవంతంగా ఆంధ్రాలో కలిపారు. తెలంగాణను ఇందిరాగాంధీ మోసం చేశారు. మోదీ నా మెడపై కత్తి పెట్టినా.. నేను వెనకడుగు వేయలేదు. ఈ నేలపై ఎవరూ శాశ్వతం కాదు. అందరూ ఒక్కో కేసీఆర్(KCR)లా తయారు కావాలి. తెలంగాణ హక్కుల కోసం పోరాడాలి. ఏపీలో కూటమి లేకుంటే చంద్రబాబు(Chandrababu) గెలిచేవారు కాదు. కానీ, బీఆర్ఎస్ మాత్రం సింగిల్‌గానే అధికారంలోకి వస్తుంది.. ఇది ఖాయం అని కేసీఆర్ అన్నారు.కాంగ్రెస్ నోటికొచ్చిన హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది. కానీ ఒక్క హామీ కూడా నెరవేర్చడం లేదు. మేనిఫెస్టోలో పెట్టని హామీలు కూడా అమలు చేసిన ఘనత బీఆర్ఎస్దే. తెలంగాణ కోసం ఎప్పటికైనా పోరాడేది బీఆర్ఎస్ మాత్రమే అని కేసీఆర్ అన్నారు. -
బీజేపీ గూటికి శశిథరూర్?.. ఖచ్చితమైన సంకేతాలివే..
కాంగ్రెస్ సీనియర్ నేత, కేరళలోని తిరువనంతపురం ఎంపీ శశిథరూర్(MP Shashi Tharoor) బీజేపీలో చేరనున్నారనే వార్త ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. పార్టీలో తన పాత్ర విషయంలో శశిథరూర్ సంతృప్తిగా లేరని, అందుకే పార్టీని వీడాలనుకుంటున్నారని సమాచారం. దీనికితోడు ఆయన తాజాగా బీజేపీ ఎంపీ జై పాండాను కలుసుకోవడం, దానికి సంబంధించిన ఫొటో వైరల్ కావడం.. మొదలైనవన్నీ ఆయన బీజేపీలో చేరుతున్నారనడానికి సంకేతాలని పలువురు చెబుతున్నారు. శశి థరూర్ తిరువనంతపురం నుండి నాలుగు సార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. ఐక్యరాజ్యసమితిలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించారు. అయితే గత కొన్నేళ్లు ఆయనకు, కాంగ్రెస్ నాయకత్వానికి మధ్య దూరం పెరిగిందనే మాట వినిపిస్తోంది.పార్టీ నాయకత్వంపై అసంతృప్తికాంగ్రెస్ తన సామర్థ్యాలను పూర్తి స్థాయిలో ఉపయోగించుకోవడం లేదని థరూర్ భావిస్తున్నారు. 2022లో ఆయన కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోటీ చేశారు. కానీ మల్లికార్జున్ ఖర్గే(Mallikarjun Kharge) చేతిలో ఓడిపోయారు. జాతీయ స్థాయిలో కీలక బాధ్యతలు కావాలని ఆయన కోరుకుంటున్నారని నిపుణులు అంటున్నారు. ఇవి దక్కనందున ఆయనలో అసంతృప్తి నెలకొంది.కేరళలో నిర్లక్ష్యం శశి థరూర్ కేరళకు చెందిన నేత. ఆయన తిరువనంతపురం నుండి వరుసగా గెలుస్తూ వస్తున్నారు. కానీ కేరళ కాంగ్రెస్‌లో అతనికి ఎలాంటి కీలక పాత్ర లేదు. కేరళలో కాంగ్రెస్‌కు బలమైన నాయకత్వం అవసరమని థరూర్ పలుమార్లు అన్నారు. రాష్ట్రంలో ఆయనకు ప్రజాదరణ ఉన్నా, పార్టీ నాయకత్వం దానిని పట్టించుకోలేదని సమాచారం.పార్టీ వైఖరికి భిన్నంగా..శశి థరూర్ తరచూ పార్టీ వైఖరికి భిన్నంగా వ్యాఖ్యలు చేస్తుంటారు. ఇటీవల ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోదీని, కేరళ వామపక్ష ప్రభుత్వాన్ని ప్రశంసించారు. ఇది కాంగ్రెస్‌కు ఇబ్బందికరంగా మారింది. మోదీ-ట్రంప్ సమావేశం భారతదేశానికి ప్రయోజనకరంగా ఉంటుందని థరూర్ అన్నారు. ఇది కాంగ్రెస్ పార్టీ అభిప్రాయానికి భిన్నంగా ఉంది.థరూర్‌పై ఇతర పార్టీల కన్నుకేరళలోని అధికార లెఫ్ట్ ఫ్రంట్ (ఎల్డీఎఫ్) థరూర్‌ను పార్టీలోకి స్వాగతిస్తున్నదనే వార్తలు వినిపించాయి. దక్షిణ భారతదేశం(South India)లో తన ఉనికిని పెంచుకోవడానికి బీజేపీ థరూర్ సాయాన్ని తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎన్సీపీ వంటి ఇతర పార్టీలు కూడా థరూర్‌తో జత కట్టేందుకు సిద్ధంగా ఉన్నాయని సమాచారం.వ్యక్తిగత ఆశయంథరూర్ తాను కేవలం ఎంపీగానే ఉండాలని కోరుకోవడం లేదు. పార్లమెంటులో జరిగే ప్రధాన చర్చల్లో పాల్గొని జాతీయ లేదా రాష్ట్ర స్థాయిలో ప్రభావవంతమైన పాత్ర పోషించాలని అభిలషిస్తున్నారు. కానీ ఆయనకు కాంగ్రెస్‌లో ఇటువంటి అవకాశం రావడం లేదు. రాహుల్ గాంధీ- థరూర్ మధ్య ఇటీవల జరిగిన సమావేశం అసంపూర్ణంగానే ముగిసింది. ఇది కూడా చదవండి: Bihar Diwas: బీహార్ @ 113.. ప్రముఖుల శుభాకాంక్షలు -
తెలంగాణ అసెంబ్లీ: బీఆర్ఎస్ Vs మంత్రులు..
Telangana Assembly Session Updatesతెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభంబీఆర్ఎస్ నాయకులకు మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి సవాల్తెలంగాణవ్యాప్తంగా 29వేల కిలో మీటర్ల రోడ్లు ఉన్నాయి.మాజీ ఆర్ అండ్ బీ మంత్రి చేసిన ఘనకార్యం మాకు తెలుసుపదేళ్లలో 6వేల కిలో మీటర్లు రోడ్లు వేశారు.పదేళ్లలో 3900 కోట్లు ఆర్ అండ్ బీకి కేటాయించిగా 4వేల కోట్లు లోన్స్ తీసుకున్నారుహరీష్ రావు, ప్రశాంత్ రెడ్డి వస్తారా చూపిస్తాం.హరీష్ రావు మాట్లాడితే బాధ వేస్తోంది.మట్టి, బీటీ, లేకుండా కొత్త రోడ్ల నిర్మాణం ఉంటుంది.వచ్చే డిసెంబర్ నాటికి రోడ్లు అంటే ఇలా ఉండాలని ప్రజలకు అర్థం అవుతాయి.రీజినల్ రింగ్ రోడ్డు వేస్తే 50శాతం తెలంగాణ కవర్ అవుతుంది.మేము పనిచేస్తాం.. బీఆర్ఎస్ నేతల్లాగా మాట్లాడలేం.పీవీ నరసింహారావు ఫ్లై ఓవర్, ఔటర్ రింగ్ రోడ్డు వేసింది కాంగ్రెస్ పార్టీనే.ఉద్యోగాలు ఇచ్చాం అంటే మేము రెడీ చేసాం అంటున్నారు..మరి అంతా రెడీ చేసి సర్టిఫికెట్ లు ఎందుకు ఇవ్వలేదు.బంగారు తెలంగాణ అని అంతా నాశనం చేశారు.మాజీమంత్రి ప్రశాంత్ రెడ్డిరోడ్లు వేయలేదని మా ప్రభుత్వాన్ని బద్నాం చేస్తున్నారు.మంత్రి కోమటిరెడ్డి నియోజకవర్గంలోనే 200 కోట్లకు పైచిలుకు నిధులతో రోడ్లు వేశాను.ఉప్పల్ ఫ్లైఓవర్ కేంద్రం పరిధిలో ఉంది. పనులు అప్పుడు కాలేదు.కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 15 నెలలు దాటింది ఏమైనా పనులు జరిగాయా?నా క్యారెక్టర్ అశాశినేషన్ చేయకండి.మంత్రి కోమటిరెడ్డి కామెంట్స్..నా నియోజకవర్గంలో 200 కోట్లతో రోడ్లు వేసామని ప్రశాంత్ రెడ్డి అంటున్నారు.ఆ రోడ్లు ఎక్కడున్నాయో చూపిస్తే ప్రశాంత్ రెడ్డికి సన్మానం చేపిస్తా.బీఆర్ఎస్ నాయకుల అబద్దాలకు లెక్కలేదు. బీఆర్ఎస్ ప్రశ్నకు మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి సరైన సమాధానం చెప్పనందుకు నిరసనగా వాకౌట్.కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి రోడ్ల నిర్మాణంలో సత్యదూరమైన వ్యాఖ్యలు చేస్తున్నారన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కామెంట్స్..పదేళ్లలో బీఆర్ఎస్ పాలనలో డబల్ రోడ్లు 8000 కిలోమీటర్లు.నాలుగు లైన్ల రోడ్లు 600 కిలోమీటర్లు వేశాం.17వేల కిలో మీటర్లకు 23వేల కోట్లు ఖర్చు అవుతాయి.మొత్తం ఖర్చులో 40శాతం రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి ఉంటుంది.ప్రైవేట్ పెట్టుబడులతో కొత్త రోడ్లు వేస్తామని సర్కార్ అంటుంది.ప్రైవేట్ వ్యక్తులు అంటే ఎవరు? ఎవరి ఆధ్వర్యంలో రోడ్లు వేస్తారు.ఇప్పటికీ ఏడాదిన్నర కాలం పూర్తయింది.మూడున్నర సంవత్సరాలలో 17వేల కిలో మీటర్లు ఎలా వేస్తారు?మాజీ మంత్రి హరీష్ కామెంట్స్..ప్రభుత్వానికి క్లారిటీ లేకుండా పోయింది.సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు బాధ్యతగా ఇవ్వాలి.కొత్త ప్రతిపాదనలు లేవని మంత్రి అంటున్నారు.బడ్జెట్ పుస్తకంలో మాత్రం కొత్త ప్రతిపాదన ప్రస్తావన ఉంది.60 శాతం ప్రభుత్వమని భట్టి విక్రమార్క అంటే.. ప్రైవేట్ అని మంత్రి కోమటిరెడ్డి అంటున్నారు.బీఆర్ఎస్ పాలనలో ఏ పక్షం చూడకుండా అన్ని మండలాలకు డబల్ రోడ్డులు వేశాం. శాసనసభలో ప్రశ్నోత్తరాలపై ప్రారంభమైన ప్రశ్న..సరూర్‌నగర్ చెరువు, మూసీ అభివృద్ధిపై ప్రశ్న వాయిదాఫీజు రియింబర్స్‌మెంట్‌పై చర్చ ప్రారంభంమంత్రి శ్రీధర్ బాబు కామెంట్స్..ట్రిలియన్ డాలర్ టార్గెట్ రీచ్ అవ్వడం అంత ఈజీ కాదు.మేము టార్గెట్, ప్లాన్‌తో ముందుకు వెళ్తున్నాం.. సాధిస్తాంకొత్త వ్యాపారం చేసే మహిళలకు అవకాశాలు కల్పిస్తున్నాం.మినీ ఇండస్ట్రియల్ పార్క్ ను ఏర్పాటు చేయబోతున్నాం119 సెగ్మెంట్లలో మినీ ఇండస్ట్రియల్ పార్క్‌లను ఏర్పాటు చేస్తాం.భేషజాలకు పోను.. నా శాఖలో అసలే ఉండవు.సిద్దిపేట, సిరిసిల్లలో అన్ని రకాల అభివృద్ధి పనులు జరిగాయి.బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి చిట్ చాట్అభివృద్ధి పనులు, మెడికల్, ఇంజనీరింగ్ సీట్ల విషయమై ముఖ్యమంత్రిని కలిశాం72ఏళ్ల వయసులో నేను ఎందుకు పార్టీ మారతాను?కాంగ్రెస్ లోకి వెళ్లిన ఎమ్మెల్యేలే పరేషాన్ లో ఉన్నారుఎటూ కాకుండా పోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారుబీఆర్ఎస్ లో పోటీకి మా కుటుంబం నుంచి నలుగురం సిద్దంగా ఉన్నాంజమిలి ఎన్నికలు వస్తే నేను ఎంపీగా పోటీ చేస్తానుసీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావుఫీజు రీయింబర్స్మెంట్ పెండింగ్ బిల్లులు దాదాపు 7000 కోట్లు ఉన్నాయి.పెండింగ్ వల్ల కాలేజీలు మూతపడే అవకాశం ఉంది.కాలేజీలు మూతపడితే విద్యార్థులకు అన్యాయం జరుగుతుంది.మంత్రి సీతక్క కామెంట్స్.. ఫీజు రీయింబర్స్మెంట్ వైఎస్సార్ తీసుకొచ్చిన గొప్ప పథకంఫీజు పెండింగ్ బకాయిలను క్లియర్ చేస్తాంగత ప్రభుత్వంలోనే 4వేల కోట్లకు పైగా బకాయిలు ఉండేవి.కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక 11 వందల కోట్లకు పైగా బకాయిలు అయ్యాయి.12 వందల టోకెన్లు ఇప్పటికే రైజ్ అయ్యాయి.హరీష్ రావు కామెంట్స్..సీతక్క గత ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు.బీఆర్ఎస్ పాలనకు ముందు కాంగ్రెస్ రెండు వేల కోట్లు బకాయిలు ఉండేవి.బీఆర్ఎస్ పాలనలో ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించలేదు అనేది సత్యదూరం20వేల కోట్లు ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించాం.800 కోట్లు ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించామని సీతక్క అన్నారు.కేంద్రం నుంచి వచ్చిన నిధులు విడుదల చేశారు తప్ప.. రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేదు.వెంటనే 2వేల కోట్లు విడుదల చేస్తే కాలేజీలు బతుకుతాయి సచివాలయంలో ఎర్త్ అవర్..తెలంగాణ సచివాలయంలో శనివారం ఎర్త్ అవర్ పాటింపు.శనివారం 23/03/2025 రోజున ఎర్త్ అవర్‌లో పాల్గొనాలని ప్రభుత్వాన్ని కోరిన డబ్ల్యూడబ్ల్యూఎఫ్ఈ రోజు రాత్రి 8.30 నుంచి 9.30 గంటల వరకు సచివాలయంలో ఎర్త్ అవర్ పాటింపు.సచివాలయంలో గంటసేపు లైట్లు ఆఫ్ చేయాలని నిర్ణయం -
ఇది హామీలకు పాతరేసే బడ్జెట్
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలకు పాతరేసే రీతిలో రాష్ట్ర ప్రభుత్వ వార్షిక బడ్జెట్ ఉందని బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి విమర్శించారు. శుక్రవారం శాసనసభలో జరిగిన సాధారణ చర్చలో మహేశ్వర్‌రెడ్డి బడ్టెట్ తీరుతెన్నులను ఎండగట్టారు. ఇది కమీషన్ల ప్రభుత్వమంటూ తీవ్ర విమర్శలు చేశారు. ‘తెలంగాణలో ప్రజల బతుకులు బాగుపడతాయని భావిస్తే అప్పుల కుప్పగా చేశారు. గత పాలకుల అవినీతిని కక్కిస్తామని హడావుడి చేసి 14 నెలలుగా ఎవరిపైనా కేసులు, రికవరీలు లేవు. ఆరు గ్యారంటీలకు నిధుల కేటాయింపు అసమగ్రంగా ఉంది.అనేక పథకాలకు వరుసగా రెండో బడ్జెట్లోనూ ఎలాంటి కేటాయింపులు లేవు. కేవలం ఏడాదిన్నరలోపే రూ.1.63 లక్షల కోట్లు అప్పు తెచ్చి పురోగతి ఎలా సాధ్యమో చెప్పాలి. రుణమాఫీకి రూ.42వేల కోట్లు అవసరం కాగా, రేవంత్ కటింగ్ మాస్టర్ అవతారం ఎత్తి రూ.29వేల కోట్లు ఎగవేశారు. మూసీ ప్రక్షాళనపై డీపీఆర్‌లో అంచనాలు పెంచుతూ జేబు నింపుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి. భూ భారతి మార్గదర్శకాలు విడుదల చేయడంతోపాటు ధరణి అవకతవకలపై ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించాలి.రూ.2.50 లక్షల కోట్ల విలువ చేసే అసైన్డ్ భూములు అన్యాక్రాంతమైనట్టు గతంలో ఆరోపణలు చేసిన కాంగ్రెస్ వివరాలు బయట పెట్టాలి. రాజీవ్ యువ వికాసం కింద 35 లక్షల మంది యువత ఉంటే 10 లక్షల మందినే ఎలా ఎంపిక చేస్తారు. పదిశాతం జనాభా ఉన్న మైనారిటీ బీసీలకు రూ.3,500 కోట్లు కేటాయించిన ప్రభుత్వం హిందూ బీసీలకు రూ.11వేల కోట్లు మాత్రమే కేటాయించి మోసం చేస్తోంది’అని మహేశ్వర్‌రెడ్డి విమర్శించారు. అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనేందుకు వస్తున్న తనను స్పీకర్‌కు సమాచారం ఇవ్వకుండా పోలీసులు అదుపులోకి తీసుకున్నారని మహేశ్వర్‌రెడ్డి ఫిర్యాదు చేశారు. నిర్మల్ నియోజకవర్గ పరిధిలో నిర్మిస్తున్న పామాయిల్ ఫ్యాక్టరీతో ఎస్ఆర్ఎస్పీ ఆనకట్టకు ప్రమాదం పొంచి ఉందని సభ దృష్టికి తీసుకొచ్చారు.ప్రధానమంత్రి దగ్గరకు తీసుకెళ్లండి.. కలిసివస్తాం : ఏలేటికి మంత్రి శ్రీధర్‌బాబు కౌంటర్ రాష్ట్రాభివృద్ధి విషయంలో కేంద్రం నుంచి నిధుల సాధనకు చర్చించేందుకు పీఎం నరేంద్రమోదీ దగ్గరకు తీసుకెళ్లాలని, తాము ఎలాంటి భేషజాలు లేకుండా వచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని అసెంబ్లీలో ఏలేటి మహేశ్వర్‌రెడ్డిని ఉద్దేశించి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. బడ్జెట్‌పై చర్చ సందర్భంగా మహేశ్వర్‌రెడ్డికి కాంగ్రెస్ ఎమ్మెల్యే విజయరమణారావుకు మధ్య స్వల్ప వాగ్వాదం చోటు చేసుకుంది. హామీల అమలు పక్కన పెట్టి..మూసీ ప్రాజెక్టు ఎందుకు ముందు వేసుకున్నారని ప్రశ్నించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్‌బాబు కల్పించుకొని రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రంలోని పెద్దలతో చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. -
‘మహాలక్ష్మి పథకం లేదు కానీ.. అందాలు పోటీలకు మాత్రం సిద్ధం’
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ నాయకుడు హరీష్ రావు మరోసారి విమర్శలు గుప్పించారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వేదికగా మాట్లాడిన హరీష్ రావు.. కాంగ్రెస్ ప్రతీ విషయంలోనూ పారియిందంటూ మండిపడ్డారు. ఈరోజు(శుక్రవారం) అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడిన హరీష్ రావు.. కాంగ్రెస్ ప్రభుత్వం తాము అడిగిన ఏ ప్రశ్నకు సరైన సమాధానం ఇవ్వకుండా పారిపోయిందని ఎద్దేవా చేశారు. ‘ బడ్జెట్ పై ప్రభుత్వం క్లారిఫికేషన్ ఇవ్వకుండా పారిపోయింది. శాసన సభ చరిత్రలో చీకటి రోజు. ప్రభుత్వం తలుపు లు తెచిచే ఉంటాయని చెప్పిన డిప్యూటీ సీఎం భట్టి... కేవలం 20 శాతం కమిషన్ కోసం మాత్రమే తెరిచి ఉంచారని ఎద్దేవా చేశారు హరీష్.ప్రభుత్వం 20 శాతం కమిషన్ అడుగుతుందని కాంట్రాక్టర్లు సెక్రటేరియట్ లో ధర్మ చేశారు. ఉద్యోగుల విషయంలో భట్టి విక్రమార్క సభను తప్పుదోవ పట్టించారు. 2 లక్షల ఉద్యోగలా గురించి ప్రశ్నిస్తే సభను వాయిదా వేసి పారిపోయారు. ఎల్ఆర్ఎస్ అంశంలో భట్టి విక్రమార్క దాట వేశారు. ఎల్ఆర్ఎస్ ఉచితంగా చేయాలని మేము డిమాండ్ చేస్తే డబ్బులు చెల్లించాల్సిదేని భట్టి స్పష్టం చేశారు. ఫీజు రీయింబర్స్ మెంట్ పెండింగ్ బిల్లులు క్లియర్ చేయలేదు. బీఆర్ఎస్ అప్పులపై లెక్కలు చూపించాలంటే పారిపోయారు. కాంట్రాక్టర్లు అంటే పెద్ద పీట .. ఉద్యోగులు అంటే చిన్నచూపు. మహాలక్ష్మి పథకం అమలు లేదు కానీ.. అందాల పోటీలు పెడుతున్నారు. ప్రభుత్వం దగ్గర మా ప్రశ్నలకు సమాధానం చెప్పలేక పారిపోయింది. సభలో అబద్ధాలు చెప్పి ప్రభుత్వం పారిపోయింది’ హరీష్ విమర్శనాస్త్రాలు సంధించారు. -
సీఎం రేవంత్‌రెడ్డితో హరీష్‌రావు భేటీ.. కారణం ఇదే!
సాక్షి, హైదరాబాద్: సీఎం రేవంత్‌రెడ్డితో మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావు భేటీ అయ్యారు. ఆయన వెంట పద్మారావు, మాజీ మంత్రి మల్లారెడ్డి ఉన్నారు. సీఎంతో అరగంటకు పైగా హరీష్‌రావు మాట్లాడారు. నియోజకవర్గాల్లో ప్రొటోకాల్ పాటించడం లేదని ఫిర్యాదు చేసినట్లు సమాచారం. భేటీ అనంతరం పద్మారావు మీడియాతో మాట్లాడుతూ.. తమ నియోజకవర్గంలో ఉన్న సమస్య కోసం సీఎం దగ్గరకు వెళ్లామని పేర్కొన్నారు.‘‘మేము వెళ్లేసరికి సీఎం రూమ్ నిండా మంది ఉన్నారు. 15 నిమిషాల పాటు సీఎంతో ఏమీ మాట్లాడలేదు. పద్మారావు నియోజకవర్గంలో కేసీఆర్ మంజూరు చేసిన హై స్కూల్, కాలేజీ పనులను వెంటనే ప్రారంభించాలని సీఎం కోరాం. సీఎం వెంటనే వేం నరేందర్ రెడ్డికి ఆ పేపర్ ఇచ్చి చేయమని చెప్పారు’’అని పద్మారావు తెలిపారు. పద్మారావు రమ్మన్నారని తాను కూడా వెళ్లినట్లు హరీష్‌రావు పేర్కొన్నారు.డీలిమిటేషన్ పై కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీలో పెట్టిన మీటింగ్‌ను బహిష్కరించాం. చెన్నైలో జరిగే మీటింగ్ కాంగ్రెస్ ఆర్గనైజ్ చేయట్లేదు. డీఎంకే వాళ్ళు పిలిచారని మేము వెళ్తున్నాం. డీఎంకే మాకు ఫ్రెండ్లీ పార్టీ. ఘోష్ కమిటీ నివేదిక గురించి నాకు తెలియదు’’ అని హరీష్‌రావు చెప్పారు.కాగా, అంతకు ముందు.. సీఎం రేవంత్‌ను మల్లారెడ్డి కుటుంబ సభ్యులు కలిశారు. మెడికల్ కళాశాల సీట్ల పెంపు కోసం సీఎంను కలిసినట్లు మర్రి రాజశేఖరరెడ్డి చెప్పారు. కాగా, సీఎం రేవంత్‌రెడ్డి చెన్నై బయలుదేరారు. తమిళనాడు సీఎం స్టాలిన్ అధ్యక్షతన డీలిమినేషన్‌పై రేపు(శనివారం) చెన్నైలో అఖిలపక్ష సమావేశం నిర్వహించనున్నారు. ఈ అఖిలపక్ష సమావేశానికి రేవంత్ హాజరుకానున్నారు. -
తెలంగాణ పరువు తీసిందెవరు?.. కవితపై సీతక్క సీరియస్
సాక్షి, హైదరాబాద్: సీఎం రాష్ట్రం పరువు తీస్తున్నారంటూ శాసనమండలిలో కవిత చేసిన వ్యాఖ్యలపై మంత్రి సీతక్క ఘాటుగా స్పందించారు. మీ కుటుంబమే పరువు తీసిందంటూ కవితపై మండిపడ్డారు. మాకు ఢిల్లీ వ్యాపారాలు తెలియవు. ఢిల్లీ వ్యాపారాలతో రాష్ట్రం పరువు తీసింది.. మీ కుటుంబమే.. కాంగ్రెస్ పార్టీది త్యాగాల చరిత్ర. కరప్షన్‌కి కేరాఫ్ అడ్రస్ బీఆర్ఎస్.. మహిళలకు అడుగడుగున అన్యాయం చేసింది బీఆర్ఎస్సే’’ అంటూ సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు.‘‘మొదటి ఐదు సంవత్సరాల్లో మంత్రి పదవిలో మహిళలు లేరు. మహిళా కమిషన్‌కి సభ్యులు లేరు. మహిళలు పొదుపు చేసుకున్న రూ.1800 కోట్ల అభయ హస్తం నిధులు ఇవ్వలేదు. పావలా వడ్డీ ఇవ్వలేదు. మహిళ సంఘాలకు ఇవ్వాల్సిన రూ. 3700 కోట్ల వడ్డీలు చెల్లించలేదు. తెలంగాణను మీరు సస్యశ్యామలం చేస్తే.. రైతులు ఎందుకు ఇబ్బందులు పడ్డారు’’ అంటూ సీతక్క ప్రశ్నించారు.‘‘మేము పంట కాలువలు మూసివేసినట్లుగా బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తోంది. బీఆర్ఎస్ పార్టీ డీఎన్ఏలోనే కరప్షన్ ఉంది. ఇష్టానుసారంగా ఎస్టిమేషన్స్ పెంచి దోచుకుతున్నారు. మీరు నోటిఫికేషన్లు ఇస్తే నియామకాలను ఎవరు అడ్డుకున్నారు?. మీరు చేయలేని ఉద్యోగాల భర్తీ మేం చేస్తున్నాం. 59 వేల ఉద్యోగాలను భర్తీ చేశాం. మీరు అన్ని చేస్తే ప్రజలు ఎందుకు ఓడిస్తారు. బీఆర్ఎస్ పెద్దలు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మీరు బంపర్ మెజారిటీతో అధికారంలోకి రాలేదు. మీరు మొదటి సారి అధికారంలోకి వచ్చినప్పుడు 63 సీట్లతో వచ్చారు. మేము 65 సీట్లతో అధికారులకు వచ్చాము. పదేళ్లలో ఎన్ని ఇండ్లు ఇచ్చారు?’’ అంటూ సీతక్క నిలదీశారు.‘‘ప్రజలకు ఇళ్లు ఇవ్వలేదు కాబట్టి మిమ్మల్ని ప్రజలు ఇంట్లో కూర్చోబెట్టారు. మేము వచ్చి 15 నెలలు అయింది.. అప్పుడే అన్ని కావాలన్నట్టుగా అక్కసు వెళ్లగక్కుతున్నారు. ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ దేశం కోసం ప్రాణాలు అర్పించారు.. వారి పేరు పథకాలకు పెడితే ఎందుకంత కడుపు మంట?, మీరు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి ఇవ్వలేదు. ఎన్నో హామీలు తుంగలో తొక్కారు. రాష్ట్రం పరువు తీసింది మీరే.. తప్పుడు ప్రచారం చేయొద్దు. ఎఫ్ఆర్బీఎం నిబంధనలకు విరుద్ధంగా అప్పల కోసమే కార్పొరేషన్లను ఏర్పాటు చేశారు. మీరు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది’’ అని సీతక్క హితవు పలికారు. -
కర్ణాటక అసెంబ్లీని మళ్లీ కుదిపేసిన హనీట్రాప్
బెంగళూరు: కర్ణాటక రాజకీయాల్లో కలకలం రేపిన హనీ ట్రాప్(Honey Trap) వ్యవహారం.. ఇవాళ మళ్లీ అసెంబ్లీని కుదిపేసింది. ఈ అంశంపై శాసనసభలో చర్చించాల్సిందేనని బీజేపీ పట్టుబట్టింది. అయితే ఆ నిరసనలను పట్టించుకోకుండా ముస్లిం కోటా బిల్లును స్పీకర్ పాస్ చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో సభ ఒక్కసారిగా అలజడి రేగింది. ఆగ్రహంతో స్పీకర్ వెల్‌లోకి దూసుకెళ్లిన బీజేపీ సభ్యులు తమ చేతుల్లోని ముస్లిం కోటా బిల్లు(Muslim Quota Bill) ప్రతులను చించి స్పీకర్ ముఖంపైకి విసిరి కొట్టారు. ప్రతిగా.. కాంగ్రెస్ సభ్యులు బుక్‌లు, పేపర్లను ప్రతిపక్ష సభ్యులపైకి విసిరారు. ఈ గందరగోళం నడుమ సభను స్పీకర్ కాసేపు వాయిదా వేశారు.The #KarnatakaAssembly has passed a contentious bill that proposes providing 4% reservation to the Muslim community in contracts awarded by the state government. Opposing the move, the BJP MLAs stormed the well of the House and chanted slogans against the ruling Siddaramaiah… pic.twitter.com/0vVrJdpt9f— News9 (@News9Tweets) March 21, 2025పబ్లిక్ కాంట్రాక్ట్‌లలో ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం చట్టం తెచ్చింది. అయితే ఇది రాజ్యాంగ విరుద్ధమంటున్న బీజేపీ.. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయంపై కోర్టుకు వెళ్తామని చెబుతోంది. మరోవైపు సభలో ఇవాళ జరిగిన పరిణామాలపై బీజేపీ ఎమ్మెల్యే భరత్‌శెట్టి స్పందించారు. ‘‘హనీ ట్రాప్ వ్యవహారంపై చర్చించకుండా.. ముస్లిం కోటా బిల్లును ప్రవేశపెట్టడంపైన సీఎం సిద్ధరామయ్య దృష్టి పెట్టారు. అందుకే మేం నిరసన తెలిపాం. అంతేగానీ మేము ఎవరికీ హాని తలపెట్టలేదు’’ అని అన్నారాయన.ఎవరినీ రక్షించే ఉద్దేశం లేదు: సీఎం సిద్దుఇంకోవైపు ముస్లిం కోటా నిర్ణయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం సమర్థించుకుంది. సామాజిక న్యాయం, మైనారిటీలకు ఆర్థిక సాధికారకత కోసం రిజర్వేషన్లు తీసుకొచ్చామని సిద్ధరామయ్య ప్రభుత్వం చెబుతోంది. హనీట్రాప్‌లో ఎవరి ప్రమేయం ఉన్నట్లు తేలినా చర్యలు తీసుకుంటామన్న సీఎం సిద్ధరామయ్య(CM Siddaramaiah).. ఇందులో నుంచి ఎవరినీ రక్షించే ఉద్దేశం తమ ప్రభుత్వానికి లేదని వ్యాఖ్యానించారు. ఉన్నత స్థాయి కమిటీతో విచారణ చేస్తామని హోంమంత్రి జి పరమేశ్వర హామీ ఇచ్చినప్పటికీ బీజేపీ అనవసర రాద్ధాంతం సృష్టిస్తోందని మండిపడ్డారు.ఇదిలా ఉంటే.. మంత్రులు, ఎమ్మెల్యేలతో సహా 48 మంది రాజకీయ నేతలు హనీట్రాప్ బాధితులుగా ఉన్నారంటూ కర్ణాటక మంత్రి రాజన్న అసెంబ్లీ సాక్షిగా చేసిన ప్రకటన తీవ్ర చర్చనీయాశంమైన సంగతి తెలిసిందే. ఇందులో అధికార, విపక్ష సభ్యులతో పాటు జాతీయ స్థాయిలోని నాయకులు కూడా ఉన్నారంటూ బాంబ్ పేల్చారాయన. అయితే ఈ వ్యవహారంపై ఉన్నత స్థాయి దర్యాప్తు జరిపిస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతున్నప్పటికీ.. బీజేపీ మాత్రం ఈ వలపు వల వెనుక కాంగ్రెస్ ప్రభుత్వ హస్తమే ఉందని, కాబట్టి కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐతో దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేస్తోంది. -
ప్రభుత్వం రుణమాఫీ పూర్తి చేయలేదు: హరీష్ రావు
-
ఎనుముల వారి పాలనలో ఎన్ని ఎకరాలు అమ్ముతారు?: హరీష్‌రావు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ బడ్జెట్‌పై అసెంబ్లీ వేదికగా వాడీ వేడి చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ మంత్రులు.. మాజీ మంత్రి హరీష్ రావు మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. బడ్జెట్ కేటాయింపులు... కాంగ్రెస్ పాలనపై హారీష్ రావు సంచలన ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో ఆర్ఆర్ టాక్స్లతో ఆర్థిక మాంద్యం అల్లకల్లోలం అయింది. హైడ్రాతో భయపెట్టారని వ్యాఖ్యలు చేశారు.గత బడ్జెట్లో భట్టి విక్రమార్క చెప్పిన విషయాలను ప్రస్తావించిన హరీష్. సభలో మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ..‘గత సంవత్సరం బడ్జెట్‌ను సమీక్షించుకుందాం. ఫార్మాసిటీ భూములపై నాడు పోరాటం చేశారు. ఇప్పుడు బలవంతంగా రైతుల నుంచి లాక్కుంటున్నారు. అలాగే, రుణమాఫీకి 31వేల కోట్లు సిద్ధం చేశామని గత బడ్జెట్లో చెప్పారు. ఇప్పుడు 21వేల కోట్లు రుణమాఫీ చేశామని అంటున్నారు. చేతగాని వాళ్లు ఎవరో ప్రజలకు అర్థమైంది.👉ఏడాదిలో ఒక్క ఇల్లు కూడా కట్టలేదు. నిరుద్యోగులను మోసం చేశారు. ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు. ఎన్నికల హామీలను నెరవేర్చలేదు. రైతు భరోసా 15వేలు ఇస్తామన్నారు. వానాకాలంలో ఎగబెట్టారు. యాసంగిలో 12వేలు అన్నారు. అది కూడా సరిగా అందలేదు. కౌలు రైతులకు 12వేలు ఇస్తామన్నారు. ఇప్పడు, రైతులు, కౌలు రైతులే తేల్చుకోవాలంటున్నారు. కౌలు రైతులకు అన్యాయం జరిగింది. జాబ్ క్యాలెండర్.. జాబ్ లెస్‌గా క్యాలెండర్‌గా మారింది. రివైజ్డ్ ఎస్టిమేషన్స్‌లో 27వేల కోట్లు తక్కువ చేసి చూపారు.👉హెచ్ఎండీఏ ఆస్తులు తాకట్టు పెట్టి రుణాలు తెస్తామంటున్నారు. హౌసింగ్ బోర్డు భూముల అమ్మకాలు ప్రారంభమయ్యాయి. గతంలో ప్రభుత్వ భూములు అమ్మవద్దన్న వారే అప్పుడు అమ్మకానికి పెట్టారు. ప్రభుత్వ భూములు అమ్మితే ఆనాడు విమర్శించారు. మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాలు ఇవ్వనందుకు క్షమాపణ చెప్పాలి. బడ్జెట్లో ప్రజలను మాయచేసే ప్రయత్నం చేశారు.👉జాబ్ క్యాలెండర్‌పై నిలదీస్తే నిరుద్యోగులను అశోక్‌నగర్‌లో అరెస్ట్ చేశారు. రెండు లక్షల ఉద్యోగాలిస్తామన్నారు?.. ఉద్యోగాలు ఇచ్చారా?. కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క నోటిఫికేషన్ అయినా ఇచ్చిందా?. ఆర్ఆర్ఆర్ కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క ఎకరమైనా భూసేకరణ చేసిందా?. ఎన్నికల ముందు నో ఎల్ఆర్ఎస్.. నో బీఆర్ఎస్ అన్నారు.. ఇప్పుడు ముక్కు పిండి ఎల్ఆర్ఎస్ వసూలు చేస్తున్నారు. ఇవి అవాస్తవిక అంచానాలని ఆనాడే చెప్పాను.👉భూములను అమ్మడం, తాకట్టు పెట్టడం ద్వారా రూ.50వేల కోట్లు సేకరించే ప్రయత్నం చేస్తున్నారు. అనుముల వారి పాలనలో ఎన్నికల భూములు అమ్ముతారో చెప్పాలి. ప్రభుత్వ నిర్ణయాలతో ఆర్థిక వృద్ధి రేటు తగ్గుతోంది. దేశమంతా ఆర్థిక మాంద్యం ఉందని అబద్ధాలు చెబుతున్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని ఆర్థిక మాంద్యం తెలంగాణలో ఉందంటున్నారు. అంచనాలకు అనుగుణంగా రీచ్ అవుతున్నాయి. ఆర్థిక మాంద్యం ప్రపంచంలో కాదు.. ప్రభుత్వ పెద్దల బుద్ధిలో ఉంది. ప్రభుత్వ నిర్ణయాలతో ఆర్థిక వృద్ధి రేటు తగ్గుతోంది. స్టాంప్, రిజిస్ట్రేషన్ ఆదాయం తెలంగాణలో తగ్గింది. తెలంగాణ రైజింగ్ అంటూ ముఖ్యమంత్రి నినాదం ఇస్తున్నారు. తెలంగాణ రైజింగ్ ఎక్కడ ఉంది?.👉కాగ్ రిపోర్టు ప్రకారం రాష్ట్ర బుద్ధి రేటు 5.5% ఉంటే బడ్జెట్లో 20% ఉంది అన్నట్లు చెప్పారు. ఆర్థిక మాంద్యం దేశమంతా ఉంటే కర్ణాటకలో ఎందుకు లేదు?. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి జీఎస్టీ వృద్ధిరేటు దేశం కంటే ఏనాడు తక్కువ లేదు కాంగ్రెస్ పాలనలో తగ్గింది. గత బీఆర్ఎస్ పాలన కంటే ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ లో ఆదాయం తగ్గింది. కాంగ్రెస్ పార్టీ నెగిటివ్ వైబ్రేషన్స్ వల్ల స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ శాఖలో ఆదాయం తగ్గింది. బీఆర్ఎస్ పాలనలో అన్ని ఎక్కువగా ఉన్న కాంగ్రెస్ రాగానే అన్ని ఎందుకు తగ్గిపోయాయి?. రాష్ట్రంలో ఆర్ఆర్ టాక్స్లతో ఆర్థిక మాంద్యం అల్లకల్లోలం అయింది. హైడ్రాతో భయపెట్టారు, ఎయిర్‌పోర్టుకు మెట్రో రద్దు అన్నారు, మూసీ ప్రక్షాళన అన్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల రియల్ ఎస్టేట్ వ్యాపారంతో పాటు పెట్టుబడులు రాకుండా పోయాయి అని కామెంట్స్ చేశారు. -
కూల్చే పనిలో కాంగ్రెస్.. అమ్మే పనిలో బీజేపీ: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కూల్చే పనిలో రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం.. తూకానికి అమ్మే పనిలో కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఉందని ఎద్దేవాచేశారు. కొత్త పరిశ్రమలు పెట్టరు.. ఉన్న పరిశ్రమలను అమ్మేస్తున్నారని ఆరోపించారు.మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ ట్విట్టర్ వేదికగా.. బయ్యారంలో ఉక్కు పరిశ్రమ పెట్టరుఆదిలాబాద్లో సీసీఐ ఫ్యాక్టరీ వేలానికి పెడ్తరు.బీజేపీ నుండిఎనిమిది మంది ఎంపీలుఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఒక్కరూ నోరు తెరిచి దీని గురించి మాట్లాడరు.కాంగ్రెస్ నుండి ఎనిమిది మంది ఎంపీలు, 64 మంది ఎమ్మెల్యేలు ఒక్కరూ ఈ అన్యాయాన్ని ప్రశ్నించరు.కొత్త పరిశ్రమలు కావాలని అడగరు ... ఉన్న పరిశ్రమలను ఉంచాలని అడగరు.కూల్చే పనిలో రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ... తూకానికి అమ్మే పనిలో కేంద్ర బీజేపీ ప్రభుత్వం.మంటికైనా ఇంటోడే కావాలని ఊరికే అనలేదుఈ కాంగ్రెస్, బీజేపీలకు ఎప్పటికీ ఓట్లు, సీట్లే ముఖ్యంతెలంగాణ ప్రయోజనాలు, తెలంగాణ అభివృద్ధి, తెలంగాణ ఆకాంక్షలు ఈ పార్టీలకు పట్టవు.జాగో తెలంగాణ జాగో!’ అంటూ కామెంట్స్ చేశారు. బయ్యారంలో ఉక్కు పరిశ్రమ పెట్టరుఆదిలాబాద్లో సీసీఐ ఫ్యాక్టరీ వేలానికి పెడ్తరు.బీజేపీ నుండిఎనిమిది మంది ఎంపీలుఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఒక్కరూ నోరు తెరిచి దీని గురించి మాట్లాడరు.కాంగ్రెస్ నుండి ఎనిమిది మంది ఎంపీలు, 64 మంది ఎమ్మెల్యేలు ఒక్కరూ ఈ అన్యాయాన్ని ప్రశ్నించరు.… pic.twitter.com/ov56JVLvsv— KTR (@KTRBRS) March 21, 2025 -
Political Honey Trap: 20 ఏళ్లుగా ‘వలపు వల’లో రాజకీయ నేతలు!
బెంగళూరు: కన్నడనాట పొలిటికల్ హనీ ట్రాప్(Honey Trap) వ్యవహారం కలకలం రేగింది. మంత్రులు సహా అనేకమంది నేతలు వలపు వల విసిరారని.. అందులో కొందరు చిక్కుకున్నారని స్వయంగా ప్రభుత్వమే అసెంబ్లీలో ప్రకటించడం సంచలన చర్చకు దారి తీసింది. ఇందులో జాతీయ స్థాయి నేతలు కూడా ఉన్నట్లు తెలిపిన ప్రభుత్వం.. ఉన్నత న్యాయస్థాయి దర్యాప్తు జరిపిస్తామని ప్రకటించుకుంది. తనపై రెండుసార్లు హనీ ట్రాప్ ప్రయత్నాలు జరిగాయని పేర్కొన్న కర్ణాటక సహకార శాఖ మంత్రి కేఎన్ రాజన్న.. ఈ వ్యవహారంలో తనకు తెలిసే 48 మంది చిక్కుకుని ఉన్నారని అసెంబ్లీ ప్రకటించడం తీవ్ర దుమారం రేపింది. దీనిపై విచారణ జరిపించాలని అధికార, విపక్ష పార్టీ సభ్యులు డిమాండ్ చేసిన నేపథ్యంలో.. అందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆయన ప్రకటించారు.రాష్ట్రానికి చెందిన అనేక మంది రాజకీయ నేతలు హనీ ట్రాప్‌లో చిక్కుకుపోయారని, తనకు తెలిసినంతవరకు కనీసం 48 మంది ఇందులో బాధితులుగా ఉన్నారని, అధికారపక్షం సహా విపక్షానికి చెందిన వారు బాధితుల్లో ఉన్నారని, ఇంకా ఎంతో మంది ఉండొచ్చని అభిప్రాయపడ్డారాయన. బాధితులతో అసభ్యకర వీడియోలు చిత్రీకరించారని తెలిపారు. రాజకీయ లబ్ధి కోసమే ఇదంతా చేశారని పేర్కొన్నారు. వాళ్లకు సంబంధించిన సీడీలు, పెన్‌డ్రైవ్‌లలో వారి అసభ్య వీడియోలు ఉన్నాయన్నారు. ఇది ఏ ఒక్క పార్టీకో పరిమితమైన విషయం కాదన్నారు. ఈ వ్యవహారంపై ఉన్నత స్థాయి దర్యాప్తు అవసరమన్న మంత్రి రాజన్న.. దీనిపై హోంశాఖకు ఫిర్యాదు చేస్తానన్నారు. దీని వెనక ఎవరు(King Ping) ఉన్నారనే విషయం బయటపడుతుందని, ప్రజలకు కూడా ఈ విషయాలు తెలియాలని మంత్రి రాజన్న స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే రాజన్న సీఎం సిద్ధరామయ్యకు అత్యంత సన్నిహితుడు. హనీ ట్రాప్ ఆరోపణలపై కర్ణాటక హోంశాఖ మంత్రి జి.పరమేశ్వర సభలో స్పందించారు. ఉన్నత స్థాయి దర్యాప్తు జరిపిస్తామని హామీ ఇచ్చారు.మరోవైపు ఇదే వ్యవహారంపై డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ స్పందిస్తూ.. ఎవరినైనా అరెస్టు చేశారో లేదోనన్న విషయం తనకు తెలియదన్నారు. దర్యాప్తు పూర్తయితే అన్ని విషయాలు బయటకు వస్తాయన్నారు.అంతకుముందు ఇదే అంశంపై మంత్రి సతీశ్ జార్కిహోళీ మాట్లాడుతూ.. మంత్రివర్గంలోని ఒక సీని యర్ సహచరుడిపై హానీ ట్రాప్ ప్రయత్నాలు జరిగి నప్పటికీ అవి సఫలం కాలేదని అన్నారు. అయితే, ఇది రాష్ట్రానికి కొత్త కాదని, గత 20 ఏళ్లుగా జరుగుతున్న వ్యవహారమేనని, రాజకీయ ప్రయోజనాల కోసం కొంతమంది వీటిని వాడుకుంటున్నారని అన్నారు. ఈ తరహా ఘటనలకు ముగింపు పలకాల్సిన అవసరం ఉందన్నారు. మరోవైపు ఈ వ్యవహారంపై బీజేపీ దీనిపై సీబీఐ దర్యాప్తు కోరుతోంది.బుధవారం రాష్ట్ర శాంతి భద్రతల అంశంపై మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే వీ సునీల్ కుమార్ అసెంబ్లీలో ప్రస్తావించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం హనీ ట్రాప్ ప్రభుత్వం నడిపిస్తోందంటూ సంచలన ఆరోపణలు చేసిన ఆయన.. హోం శాఖ దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. ప్రత్యర్థులను ఓడించలేక అనైతిక చర్యలకు దిగుతున్నారని మండిపడ్డారు. రాజకీయ ప్రయోజనాలు నెరవేర్చుకోవడానికి బ్లాక్మెయిల్ చేస్తున్నారని ధ్వజమెత్తారు. హనీ ట్రాప్ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని, దోషులను కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని కోరారు. బీజేపీ ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్ యత్నల్ మాట్లాడుతూ... రాజకీయ ప్రత్యర్థులను అడ్డు తొలగించుకోవడానికి బ్లాక్మెయిల్ మార్గాలు ఎంచుకుంటున్నారని, ఇందులో భాగంగా హనీ ట్రాప్‌లకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఇదిలా ఉంటే.. గత వారం తుమకూరు(Tumakuru)కు చెందిన ఓ బీజేపీ నేతపై జరిగిన హనీ ట్రాప్ ప్రయత్నం తీవ్ర చర్చనీయాంశమైంది. అన్నప్ప స్వామి అనే నేతకు ఫేస్బుక్ ద్వారా పరిచయం అయిన ఓ మహిళ.. అసభ్యకర వీడియోలతో తనను బ్లాక్మెయిల్ చేసింది. ఈ వ్యవహారానికి సంబంధించి ఆయన పోలీసులను ఆశ్రయించగా.. ఇద్దరు మహిళలను పోలీసులు అరెస్ట్ చేశారు. -
పేరు గొప్పగుంది.. అప్పు పుట్టకుంది: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: ‘గత పాలకులు రిటైర్డ్ ఉద్యోగులకు పదవీ విరమణ ప్రయోజనాల కింద రూ.8 వేల కోట్లు బకాయిలు పెట్టి పోయారు. నెలకు కొంతమందికి అవసరానికి అనుగుణంగా సర్దుతున్నాం. మరోవైపు కొత్తగా నెలకు వెయ్యి మంది రిటైర్ అవుతున్నారు. వారికి బెనిఫిట్స్ ఇచ్చేందుకు కూడా డబ్బుల్లేవు. ఎక్కడా అప్పు పుడ్తలేదు.. ఎవ్వడు మనల్ని నమ్మడం లేదు. పేరు చూస్తే గొప్పగ ఉంది.. అప్పు పుట్టకొచ్చింది (పుట్టడం లేదు). ఎన్నిరోజులు దాచిపెట్టుకోను. క్యాన్సర్ ఉంటే సిక్స్‌ప్యాక్ బాడీ అని చెప్పుకుంటే నమ్ముతరా? ఉన్నదున్నట్లు చెపుతున్న..’ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. హైదరాబాద్ రవీంద్రభారతిలో గురువారం సాయంత్రం ‘ప్రజాపాలన..కొలువుల పండుగ’ పేరుతో నిర్వహించిన కార్యక్రమంలో.. పంచాయతీరాజ్, పురపాలక శాఖల్లో 922 మందికి కారుణ్య ఉద్యోగ నియామక పత్రాలు ఆయన అందజేశారు. అలాగే రాష్ట్రంలో కొత్త భవన నిర్మాణాలకు సంబంధించి ‘బిల్డ్ నౌ’ పోర్టల్‌ను ఆవిష్కరించారు. ఇందుకోసం ‘ఆన్లైన్’లో దరఖాస్తు చేసుకున్న ముగ్గురికి అనుమతి పత్రాలు అందజేసిన అనంతరం ప్రసంగించారు. ఆ డబ్బే ఉండుంటే అద్భుతాలు చేసేవాణ్ణి.. ‘ఒక ప్రాజెక్టుకు డీపీఆర్ ఇచ్చి, పద్ధతి ప్రకారం అప్పు తీసుకుంటే 4 శాతం వడ్డీకి అప్పులు ఇచ్చేందుకు ఎన్నో సంస్థలు సిద్ధంగా ఉన్నాయి. కానీ గుట్టుగా కమీషన్ల కోసం కాళేశ్వరానికి 11 శాతం వడ్డీతో అప్పు తెచ్చారు. దాన్ని 5 శాతం చేసేందుకు ప్రయత్నిస్తున్నా. అప్పటి పాలకులు తెచ్చిన అప్పులకు వడ్డీలు కట్టేందుకే నేను సీఎం అయ్యాక రూ.1.53 లక్షల కోట్లు అప్పులు తెచ్చిన. ఇందులో రూ.88వేల కోట్లు అసలు, రూ.66 వేల కోట్లు మిత్తి కింద కట్టిన. ఈ డబ్బు నాదగ్గర ఉండుంటే గంటలోనే రుణమాఫీ చేసేవాడిని. 25 లక్షల మందికి ఇళ్లు కట్టించి ఇచ్చేవాడిని. ఎన్నో అద్భుతాలు చేసేవాణ్ణి. అప్పట్లో రోజుకు లక్ష టన్నుల చొప్పున ఇసుక దోచుకున్నరు. రూ.7 వేల కోట్లు దోచుకున్నారు. ఇప్పుడు హైదరాబాద్‌లో రైతుబజార్ల తరహాలో ఇసుక బజార్లు పెట్టి మూడు ప్రాంతాల్లో అమ్ముతున్నం. అంతా ఆన్లైన్లోనే..’ అని సీఎం చెప్పారు. ముఖ్యమంత్రికి విజ్ఞత ఉండాలి ‘ప్రజలు మాపై కోపంగా ఉన్నారని కొందరు మాట్లాడుతున్నారు. ఎందుకు మాపై కోపం?. నిరుద్యోగులకు ఉద్యోగ నియామకపత్రాలు అందిస్తున్నందుకా..? అదానీ, అంబానీలతో పోటీ పడేలా ఆడబిడ్డలకు సోలార్ పవర్ ఉత్పత్తి చేసే అవకాశం కల్పించినందుకా? రేవంత్‌రెడ్డికి పాలనపై పట్టు రాలేదని మాట్లాడుతున్నారుం. రాజయ్య, ఈటల లాంటి బలహీనవర్గాల వారిని సస్పెండ్ చేస్తేనే పట్టు వచ్చినట్టాం? మేం గడీలలో పెరగలేదు. నల్లమల అడవుల్లో పేదలను చూస్తూ పెరిగాంం. అందుకే మాకు మానవత్వం ఉంది.. మీకు లేదు. ముఖ్యమంత్రికి విజ్ఞత ఉండాలిం. మేం విజ్ఞత ప్రదర్శిస్తున్నాం. ఆ విజ్ఞత లేకపోవడం వల్లే ఆయన ఫామ్‌హౌస్ నుంచి బయటకు రాలేకపోతున్నారు..’ అని రేవంత్ విమర్శించారు. మిస్ వరల్డ్ పోటీలతో వందల కోట్ల ఆదాయం ‘మిస్ వరల్డ్ పోటీలపై కూడా కొందరు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. పర్యాటక రంగానికి ఇదొక అద్భుతమైన అవకాశం. ప్రపంచం తెలంగాణ వైపు చూడబోతోంది. మే 7 నుంచి 31 వరకు ఈ పోటీలు ఇక్కడ జరగబోతున్నాయి. వేలాది మంది విదేశీయులు రాబోతున్నారు. వివిధ రంగాలకు ఉపాధి లభిస్తుంది. 3 వేల విదేశీ ఛానెల్స్, పత్రికలు రాబోతున్నాయి. వివిధ దేశాల నుంచి వచ్చే ప్రతినిధులు తెలంగాణలో ప్రసిద్ధి చెందిన పర్యాటక ప్రాంతాలను సందర్శిస్తారు. భవిష్యత్‌లో వందల కోట్ల ఆదాయం రాబోతోంది. ఫార్ములా–ఈ రేస్ ముసుగులో మీరు ప్రభుత్వ సొమ్ము దోచుకున్నారు. మీకు, మాకూ పోలికా? పట్టింపులేకుండా వ్యవహరించిన విధానం మీదిం. పట్టుదలతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలన్న సంకల్పం మాది. త్వరలోనే యాదగిరిగుట్టను వైటీడీ బోర్డు ద్వారా విశ్వవ్యాప్తం చేయబోతున్నాం..’ అని సీఎం తెలిపారు. ఈ ఉద్యోగాలు మీ హక్కు ‘ఈ కారుణ్య నియామకాలు మీ హక్కు. మీ కుటుంబసభ్యుల నుంచి వారసత్వంగా మీకు రావాల్సిన ఉద్యోగాలు ఇవి. గత పాలకులు ఈ నియామకాలను పట్టించుకోలేదంటే.. ఎంత నిర్లక్ష్యం వహించిందో ఆలోచించండి. అలాంటి నిర్లక్ష్యం ప్రజా ప్రభుత్వంలో ఉండకూడదనే ఈ నియామకాలు పూర్తి చేస్తున్నాం. మేం అధికారంలోకి రాగానే 57,924 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశాం. గ్రూప్ 1, 2, 3లలో 2 వేల పైచిలుకు ఉద్యోగాలకు మరికొన్ని రోజుల్లో నియామక పత్రాలు అందించబోతున్నాం..’ అని రేవంత్ తెలిపారు. అక్రమాలు అరికట్టేందుకే ‘బిల్డ్ నౌ’ పోర్టల్ ‘హైదరాబాద్ నగరంలో భవన నిర్మాణ అనుమతుల్లో అక్రమాలు అరికట్టేందుకే ‘బిల్డ్ నౌ’ పోర్టల్‌ను తీసుకొచ్చాం. ఎంతటివారైనా సరే ఆన్లైన్లో అనుమతులు తీసుకోవాల్సిందే. ప్రజలకు పారదర్శక పరిపాలన అందించాలన్నదే మా ఉద్దేశం.. అదే గుడ్ గవర్నెన్స్.. ఇది తెలంగాణ మోడల్..’ అని ముఖ్యమంత్రి చెప్పారు. మంత్రి ధనసరి అనసూయ, ఎమ్మెల్యేలు వీర్ల శంకర్, కాలె యాదయ్య, సీఎస్ శాంతికుమారి, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దానకిషోర్, డీటీసీపీ దేవేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
సంచలనం.. ‘హనీట్రాప్’లో 48 మంది ఎమ్మెల్యేలు.. సీడీలు,వీడియోలు కూడా
బెంగళూరు: ‘హాయ్..మైనేమ్ ఈజ్ సుజి(పేరు మార్చాం). వాట్ ఈజ్ యువర్ నేమ్. వేర్ ఆర్ యు ఫ్రమ్. ఐ యామ్ సింగిల్...’ అంటూ యువతుల్ని ఎరగా వేసి తమకు అవసరమైన సమాచారాన్ని రాబట్టడాన్ని‘హనీ ట్రాప్’ అంటారు. ఈ మధ్య కాలంలో మనం తరుచుగా హనీట్రాప్ అనే పేరును వింటూనే ఉన్నాం. ఇప్పడీ హనీ ట్రాప్ వలలో సుమారు 48 మంది ఎమ్మెల్యేలు పడ్డారని ఓ రాష్ట్ర మంత్రి అసెంబ్లీలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడీ అంశంపై దుమారం చెలరేగింది. కర్ణాటక అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సమావేశాల్లో ఇటీవల కర్ణాటకలో ఇద్దురు మంత్రులపై హనీ ట్రాప్ ప్రయత్నాలు జరిగాయని పీడబ్ల్యూడీ మంత్రి సతీష్ జార్కిహొళి అసెంబ్లీలో వెల్లడించారు. సీడీలు, పెన్‌డ్రైవ్‌లలో వారి అసభ్య వీడియోలు ఉన్నాయన్నారు. అధికారపక్షం సహా విపక్షానికి చెందిన వారు ఈ బాధితుల్లో ఉన్నారని అన్నారుఅంతేకాదు, సీఎం సిద్ధరామయ్య సన్నిహితుడు, కర్ణాటక సహకార శాఖ మంత్రి కేఎన్ రాజన్నపై రెండు సార్లు హనీట్రాప్ జరిగిందని ఇదే అంశంపై రాష్ట్ర హోంశాఖ విచారణ ప్రారంభించినట్లు చెప్పారు. గత 20 ఏళ్లుగా నేతల్ని హనీట్రాప్‌లోకి దించడం పరిపాటిగా మారింది. ఈ తరహా రాజకీయాలు చేయకూడదు. కొంతమంది వ్యక్తులు రాజకీయ ప్రయోజనాల కోసం హనీట్రాప్ చేస్తున్నారు. ఇది ఇంతటితో ఆగిపోవాలన్నారు. హనీ ట్రాప్‌పై కేఎన్ రాజన్న మాట్లాడుతూ.. హనీట్రాప్‌లో కనీసం 48 మంది ఎమ్మెల్యేలు పడ్డారనే అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇది కొత్త విషయం కాదు. వారిలో చాలామంది హైకోర్టులో స్టే తీసుకున్నారు. ఇప్పుడు నా పేరు ప్రస్తావనకు వచ్చింది. ఇదే అంశంపై ఫిర్యాదు చేసేందుకు సిద్ధంగా ఉన్నాను. హనీ ట్రాప్ సూత్రదారులు, పాత్రదారులెవరో తెలుసుకోవాలని అన్నారు. ప్రస్తుతం, ఈ అంశంపై దుమారం చెలరేగింది. విచారణ చేపట్టాలని కాంగ్రెస్, బీజేపీ నేతలు పట్టుబడుతున్నారు. ఇప్పటికే ఈ హనీట్రాప్‌పై కర్ణాటక ప్రభుత్వం విచారణ ప్రారంభించింది. -
వచ్చే ఏడాదిలో పాదయాత్ర చేస్తా : కేటీఆర్
సాక్షి,సూర్యాపేట: సూర్యాపేట జిల్లా వేదికగా మాజీ మంత్రి కేటీఆర్ కీలక ప్రకటన చేశారు. బీఆర్ఎస్ అధికారమే లక్ష్యంగా పాదయాత్ర చేస్తున్నట్లు వెల్లడించారు. ఇందుకోసం ప్రణాళికను సిద్ధం చేసినట్లు చెప్పారు. సూర్యాపేటలో గురువారం బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించింది. ఈ సమావేశం అనంతరం కేటీఆర్ మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. ‘వచ్చే ఏడాది పాదయాత్ర బీఆర్ఎస్ను అధికారంలోకి తీసుకురావడేమే లక్ష్యం. సూర్యాపేటలో జనాల్ని చూస్తుంటే పెద్ద బహిరంగ సభకే వచ్చినట్లుంది. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ దే అధికారం’ అని ధీమా వ్యక్తం చేశారు.మరోసారి కేసీఆరే సీఎంఅంతకుముందు బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. మరోసారి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మరోసారి ముఖ్యమంత్రి అవుతారని అన్నారు. ఈ క్రమంలో రాష్ట్ర బడ్జెట్‌పై ఆయన మాట్లాడారు. బడ్జెట్లో పథకాల అమలుకు సంబంధించి నిధుల కేటాయింపు లేదు.రుణమాఫీ చేశారో లేదో సీఎం రేవంత్‌రెడ్డి సొంత ఊరికి వెళ్లి అడుగుదాం. తెలంగాణ ధనం అంతా రాహుల్, సోనియా, ప్రియాంకా గాంధీ ఖాతాలో పడుతున్నాయి.ధాన్యం దిగుమతిలో తెలంగాణలో నల్లగొండను నంబర్ వన్ చేశారు కేసీఆర్.ఎస్ఎల్బీసీలో విషాదం.. చేపల కూర తింటున్న మంత్రులు ఎస్ఎల్బీసీలో విషాదం జరిగితే మంత్రులు చేపల కూర తింటున్నారు. ఓ మంత్రి నీళ్లు, వాటర్ కలిశాయని అంటున్నారు. గాడిదలను చూస్తేనే గుర్రాల విలువ తెలుస్తుంది. కాంగ్రెస్, బీజేపీలు తెలంగాణకు శత్రువులే. కేసీఆర్‌పై ద్వేషంతో జిల్లాలో పంటలకు నీళ్లు ఇవ్వడం లేదు. కాలం తెచ్చిన కరువు కాదు కాంగ్రెస్ తీసుకొచ్చిన కరువు ఇది. చెరువులు నింపితే బోర్లు ఎందుకు ఎండిపోతాయి. రేవంత్‌కు వ్యతిరేకంగా కిషన్ రెడ్డి, బండి సంజయ్, బీజేపీ ఒక్క మాట మాట్లాడదు. ఏం మాట్లాడకముందే జగదీష్ రెడ్డిని సస్పెండ్ చేశారు. అసెంబ్లీని గాంధీభవన్ అన్న మజ్లిస్ సభ్యులపై చర్యలు తీసుకునే దమ్ము లేదా? అని ప్రశ్నించారు. -
తెలంగాణ ఎమ్మెల్యేల అనర్హత కేసు.. సుప్రీం కోర్టులో కీలక పరిణామం
సాక్షి,ఢిల్లీ : తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హతకు (MLAs Disqualification) సంబంధించిన కేసు కొనసాగుతున్న తరుణంలో సుప్రీం కోర్టులో కీలక పరిణామం చోటు చేసుకుంది.ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. తాను పార్టీ ఫిరాయించలేదని,కాంగ్రెస్‌లో చేరలేదంటూ అఫిడవిట్ దాఖలు చేశారు. ఆ అఫిడవిట్లో తాను ఇప్పటికీ బీఆర్ఎస్లోనే కొనసాగుతున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యేగా గెలిచాక మర్యాదపూర్వకంగా తాను సీఎం రేవంత్‌రెడ్డిని కలిశానని స్పష్టం చేశారు. మీడియా వక్రీకరించిందని, తాను కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టు వచ్చిన వార్తలన్నీ అవాస్తవాలేనని పేర్కొన్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ మీద గెలిచిన పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరారు. ఈ అంశంపై బీఆర్ఎస్ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. తమ పార్టీమీద గెలిచి, కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేలపై అనర్హతవేటు వేయాలని పిటిషన్ దాఖలు చేసింది. ఆ పిటిషన్‌పై చివరి సారిగా (మార్చి 4,మంగళవారం) జరిగిన విచారణలో ఎమ్మెల్యేల అన్హత విషయంలో తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీం నోటీసులు జారీ చేసింది. ఆపరేషన్ సక్సెస్.. పేషెంట్ డెడ్బీఆర్ఎస్ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మాసిహ్ నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. పార్టీ మారి నెలలు గడుస్తున్నా పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయడంలో తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ జాప్యం చేయడంపై తీవ్రంగా పరిగణించింది. విచారణలో ‘ఆపరేషన్ సక్సెస్.. పేషెండ్ డెడ్’ ధోరణి సరైంది కాదని వ్యాఖ్యానించింది. తదుపరి విచారణ(మార్చి 25)లోగా వివరణ ఇవ్వాలంటూ సుప్రీం కోర్టు ధర్మాసనం పార్టీ మారిన ఎమ్మెల్యేలకు, తెలంగాణ ప్రభుత్వం, స్పీకర్ కార్యాలయం, తెలంగాణ శాసనసభ కార్యదర్శి, భారత ఎన్నికల సంఘానికి నోటీసులు జారీ చేసింది. విచారణను మార్చి 25కి వాయిదా వేసింది. -
ఆరు గ్యారంటీలు గోవిందా.. బడ్జెట్‌పై కేటీఆర్ సెటైర్లు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరించిందని ఆరోపించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. బడ్జెట్ కేటాయింపుల్లో తెలంగాణలోని ఆడబిడ్డలకు తీరని అన్యాయం జరిగిందన్నారు. అలాగే, పీఆర్సీకి సంబంధించి ఎలాంటి ప్రకటనలేదని కామెంట్స్ చేశారు.తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ బడ్జెట్ కేటాయింపులపై కేటీఆర్ స్పందించారు. అనంతరం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద కేటీఆర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆరు గ్యారంటీలు గోవిందా అని అర్థమైంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ మర్చిపోయింది. ఏడాది దాటినా ఉద్యోగాల ఊసేలేదు. దమ్ముంటే రాహుల్ గాంధీ అశోక్ నగర్‌కు రావాలి. బీఆర్ఎస్ హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్లను తామే ఇచ్చినట్టు కాంగ్రెస్ నేతలు చెప్పుకుంటున్నారు. కొంచెమైనా సిగ్గుగా అనిపించడం లేదా?. ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని రాహుల్ గాంధీ చెప్పారు. నిరుద్యోగ భృతి, విద్యాభరోసా కార్డు ఊసేలేదు. అబద్దాలతో కాంగ్రెస్ పార్టీ గెలిచింది.తులం బంగారం ఎక్కడ?.ఎన్నికల్లో ఇచ్చిన హమీ తులం బంగారం, మహిళలకు నెలకు రూ.2000 పథకానికి పాతరేశారు. రూ.4000 ఇస్తామన్న పెన్షన్లు గోవిందా అనేలా బడ్జెట్ ఉంది. బడ్జెట్లో మహిళలకు తీరని అన్యాయం జరిగింది. కులగణన సర్వే పేరుతో వెనుకబడిన వర్గాలను మోసం చేసింది. కాంగ్రెస్ ఎజెండా నెరవేర్చాల్సిన సమయం 40 శాతం గడిచిపోయింది. కాంగ్రెస్ ప్రభుత్వం దళితులను వెన్నుపోటు పొడిచింది. రైతు కూలీలకు ఏ ఒక్కరికీ రూ.12వేలు రాలేదు. ఆదాయం రూ.70వేల కోట్లు పడిపోయిందని సీఎం చెప్పారు. అంబేద్కర్ అభయహస్తం ప్రస్తావనే లేదు. తెలంగాణ ఆర్థిక వ్యవస్థను కాంగ్రెస్ కుప్పకూల్చింది. కరోనా కంటే ప్రమాదకరం కాంగ్రెస్ వైరస్. మేం సంవత్సరానికి రూ.40వేల కోట్లు అప్పు చేస్తే గగ్గోలు పెట్టారు. కాంగ్రెస్ సర్కార్ ఏడాదిలోనే లక్షా 60వేల కోట్లు అప్పు చేసిందన్నారు. పెండింగ్ నగరంగా హైదరాబాద్..తొండ ముదిరితే ఊసరవెల్లి అవుతుంది.. ఊసరవెల్లి ముదిరితే రేవంత్ రెడ్డి అవుతుంది. ప్రభుత్వ అందమే సక్కగా లేదు అందాల పోటీలు పెట్టేందుకు సిద్ధమవుతుంది ఈ ప్రభుత్వం. రంకెలు కాదు రేవంత్ రెడ్డి..అంకెలు ఎక్కడ పోయినాయి. ఆకాశం నుంచి పాతాళానికి బడ్జెట్ పోతుంది. పరిపాలనకు చేతకాని ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. బీఆర్ఎస్ హయాంలో చేనేతకు మా హయంలో 1200 కోట్ల రూపాయిలు కేటాయిస్తే.. ఇప్పుడు చేనేత కార్మికులకు 300 కోట్లు కేటాయిస్తూ పరిమితం చేశారు. ఆటో కార్మికుల గురించి ప్రస్తావనే లేదు. యాదవ సోదరుల ప్రస్తావన బడ్జెట్ లో లేదు. వైన్స్ షాపులో 25 శాతం రిజర్వేషన్ గౌడన్నలకు ఇస్తామనీ హామీ ఇచ్చారు. అది ప్రస్తావన లేదు. గురుకుల పాఠశాలలో పిల్లల చనిపోతే పట్టించుకోలేదు. హైదరాబాద్ మహా నగరం పెండింగ్ నగరంగా మారిపోయింది. పేద ప్రజల కష్టాలు తీర్చే బడ్జెట్ కాదు, ఢిల్లికి మూటలు పంపే బడ్జెట్ అంటూ ఎద్దేవా చేశారు. -
భారత్‌ను విమర్శించి తప్పుచేశా: శశిథరూర్
తిరువనంతపురం: కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ మరోసారి ఆసక్తికర కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచారు. రష్యా, ఉక్రెయిన్ యుద్ధం విషయంలో భారత్ సరైన నిర్ణయం తీసుకుందని కితాబు ఇచ్చారు. ఇదే సమయంలో భారత్ స్టాండ్‌ను తప్పుగా తీసుకుని విమర్శించినట్టు చెప్పుకొచ్చారు. దీంతో, తప్పులో కాలేసి ఇప్పుడు తన ముఖంపై గుడ్డుతో కొట్టించుకున్నంత పనిచేసినట్టు ఆసక్తికర కామెంట్స్ చేశారు.కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ తాజాగా ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ..‘రష్యా-ఉక్రెయిన్ యుద్ధం (Russia-Ukraine war) మొదలైన సమయంలో భారత్ వైఖరిని విమర్శించి నేను ఒక మూర్ఖుడిలా మిగిలిపోయాను. కానీ, భారత ప్రధాని రెండు వారాల వ్యవధిలో ఆ రెండు దేశాల అధినేతలను ఆలింగనం చేసుకొని వారి ఆమోదం పొందారు. చాలా తక్కువ దేశాలకు సాధ్యమయ్యే శాశ్వత శాంతి తీసుకొచ్చే స్థితిలో ప్రస్తుతం భారత్ ఉంది. యూరప్ వ్యవహారాల్లో ఎక్కువగా జోక్యం చేసుకోకపోవడం వల్ల భారత్ ఎన్నో ప్రయోజనాలు పొందుతోందని అన్నారు.ఇదే సమయంలో 2003లో భారత్.. ఇరాక్‌కు దళాలను పంపాలని అభ్యర్థించినప్పుడు ప్రతిఘటన ఎదురైంది. అమెరికా దాడి తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ భారత శాంతి పరిరక్షక దళాలు ఇరాక్‌కు వెళ్లవని పేర్కొంటూ పార్లమెంటు సమావేశమై ఒక తీర్మానాన్ని ఆమోదించిందని తెలిపారు. కానీ, ఉక్రెయిన్ విషయంలో అలా జరగడం నాకు కనిపించలేదన్నారు. శాంతి కోసమే భారత్ కచ్చితమైన నిర్ణయాలు తీసుకుందన్నారు. ఇక, ప్రస్తుతానికి తాను ప్రతిపక్షంలో ఉన్నట్టు చెప్పుకొచ్చారు. ఇంతకన్నా ఎక్కువ మాట్లాడలేను అంటూ వ్యాఖ్యలు చేశారు.#WATCH | On being asked about India's decision to buy fuel from Russia amid the Russia-Ukraine conflict, Congress MP Shashi Tharoor says, "I am still wiping the egg off my face because I was the one person in the parliamentary debate who had criticised the Indian position in… pic.twitter.com/1rekQNrLIc— ANI (@ANI) March 19, 2025మరోవైపు.. శశిథరూర్ వ్యాఖ్యలపై బీజేపీ అధికార ప్రతినిధి షెహజాద్ పూనవాలా స్పందించారు. తాజాగా పూనావాలా మాట్లాడుతూ.. రష్యా-ఉక్రెయిన్‌పై కాంగ్రెస్ స్వంత వైఖరి తప్పు అని, భారత ప్రభుత్వం చేసిన పనులు పూర్తిగా సరైనవని శశిథరూర్ అంగీకరించారు. ఈరోజు మనం రష్యా, పుతిన్, ఉక్రెయిన్ జెలెన్ స్కీ, అమెరికాతో మంచి సంబంధాలను కలిగి ఉన్నాం. ఇప్పటికైన ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ.. వాస్తవం తెలుసుకోవాలి. భారత విదేశాంగ విధానానికి వ్యతిరేకంగా వ్యవహరించకుండా ఉంటే మంచిది అంటూ కామెంట్స్ చేశారు. -
తెలంగాణ బడ్జెట్ మూడు లక్షల కోట్లు: భట్టి
👉తెలంగాణ బడ్జెట్ ప్రవేశపెడుతున్న ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క.. తెలంగాణ బడ్జెట్ రూ.3.4లక్షల కోట్లు2025-26 ఆర్థిక సంవత్సరానికి మొత్తం వ్యయం రూ.3,04,965 కోట్లు.రెవెన్యూ వ్యయం రూ.2,26,982 కోట్లు.మూలధన వ్యయం రూ.36,504 కోట్లు. బడ్జెట్ కేటాయింపులు..పౌరసరఫరాల శాఖ- 5734 కోట్లువిద్య - 23,108కోట్లుపంచాయతీ &రూరల్ డెవలప్మెంట్ -31605 కోట్లురైతు భరోసా- 18,000 కోట్లు.వ్యవసాయ రంగానికి -24,439 కోట్ల రూపాయలుపశుసంవర్ధక శాఖకు -1,674 కోట్లు.పౌరసరఫరాల శాఖకు -5,734 కోట్లు.మహిళా, శిశు సంక్షేమం -2,862 కోట్లుఎస్సీ అభివృద్ధి -40,232 కోట్లుఎస్టీ అభివృద్ధి-17,169 కోట్లుబీసీ అభివృద్ధి-11,405కోట్లుచేనేత రంగానికి-371మైనారిటీ-3,591కోట్లువిద్యాశాఖకు-23,108 కోట్లుకార్మిక ఉపాధి కల్పన-900 కోట్లుపంచాయతీరాజ్ శాఖకు-31,605 కోట్లుమహిళా శిశు సంక్షేమశాఖ-2,862 కోట్లు.షెడ్యూల్ కులాలు-40,232 కోట్లుషెడ్యూల్ తెగలు-17,169 కోట్లు.వెనుకబడిన తరగతుల సంక్షేమానికి-11,405 కోట్లు.ఐటీ శాఖకు-774 కోట్లువిద్యుత్ శాఖకు-21,221 కోట్లుమున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖకు-17,677 కోట్లునీటి పారుదల శాఖకు-23,373 కోట్లురోడ్డు భవనాలు శాఖకు-5907 కోట్లుపర్యాటక శాఖకు-775 కోట్లుక్రీడా శాఖకు-465 కోట్లు.అడవులు, పర్యావరణ శాఖకు-1023 కోట్లుదేవాదాయ శాఖకు-190 కోట్లుహోంశాఖకు- 10,188 కోట్లుమహాలక్ష్మి పథకానికి రూ.4305 కోట్లుగృహజోత్యి పథకానికి రూ.2080 కోట్లు.సన్న బియ్యం బోనస్‌కు రూ.1800 కోట్లు.రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకానికి రూ.1143 కోట్లు. బడ్జెట్ పూర్తి కాపీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..భట్టి ప్రసంగం..అంబేద్కర్ స్పూర్తితో ప్రజాపాలన కొనసాగిస్తున్నాం. దేశానికే తెలంగాణను ఆదర్శంగా తీర్చిదిద్దుతున్నాం.తెలంగాణ తాత్కాలిక, దీర్థకాలిక ప్రయోజనాలే ముఖ్యం. మాపై కొంతమంది సోషల్ మీడియాలో అసత్యపు ప్రచారం చేస్తున్నారు.అబద్ధపు వార్తలతో ప్రజలు మోసం చేస్తున్నారు. అబద్దపు విమర్శలను తిప్పి కొడుతూ వాస్తవాలను ప్రజలకు తెలియజేయడం మా బాధ్యత.అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలన అనే మూడు అంశాలు మా నినాదం.తెలంగాణ రైజింగ్ 2050 అనే ప్రణాళికతో సీఎం పాలనను ముందుకు నడిపిస్తున్నారు.నేడు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పరిణామం 200 బిలియన్ డాలర్లు. రాబోయే ఐదేళ్లలో ఐదు రెట్లు అభివృద్ధి చేసి 1000 బిలియన్ డాలర్లు ఉండేలా కార్యాచరణ. ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మాణానికి రూ.11,600కోట్లు.58 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్.AI సిటీగా 200 ఎకరాల్లో ప్రత్యేక టెక్ హబ్.డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కసన్న వడ్లకు క్వింటాల్‌కు 500 రూపాయలు బోనస్..40 లక్షల ఎకరాల్లో సన్న వడ్లసాగు విస్తరణ.ధాన్యం కొనుగోలు కేంద్రాల సంఖ్య 8,332కు పెంపు.ఆయిల్ ఫామ్ సాగుకు టన్నుకు 2000 అదనపు సబ్సిడీ.వడ్ల బోనస్ కింద రైతులకు 1,206 కోట్లు చెల్లింపు.తెలంగాణలో నిరుద్యోగ రేటు 22.9 శాతం నుంచి 18.1 శాతానికి తగ్గింపు.57,946 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ.. తెలంగాణ డిజిటల్ ఉపాధి కేంద్రం పునరుద్ధరణ.రాజీవ్ యువ వికాస పథకానికి రూ.6000 కోట్లు.బీఎఫ్ఎస్ఐ రంగంలో విద్యార్థులకు ప్రత్యేక కోర్సులుప్రతీ నియోజకవర్గంలో కనీసం ఒక యంగ్ ఇండియా స్కూల్ ఏర్పాటు.స్కూల్స్‌లో ఐఐటీ-జేఈఈ, నీట్ కోచింగ్‌తో పాటు ఉచిత వసతులు.గురుకులాల కోసం డైట్ ఛార్జీలు 40 శాతం, కాస్మోటిక్ ఛార్జీలు 200 శాతం పెంపు.విద్యార్థులకు ఉచితంగా సాయంత్రం స్నాక్స్ పథకం.కొత్తగా 1,835 వైద్య చికిత్సలు ఆరోగ్య శ్రీలో చేరిక.. 90 లక్షల పేద కుటుంబాలకు ఆరోగ్య శ్రీ లబ్ధి..ఆరోగ్య శ్రీ ప్యాకేజీల ఖర్చు 20 శాతం పెంపు..ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు వేగంగా వస్తున్న మార్పుల ప్రభావాన్ని తెలంగాణ సమర్థవంతంగా ఎదుర్కొంటుంది.తెలంగాణ ఆర్థిక వ్యవస్థ స్థిరమైన వృద్ధుని సాధిస్తుంది.24-25 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ స్థూల రాష్ట్ర ఉత్పత్తి ప్రస్తుత ధరల ప్రకారం 16,12,579 కోట్లు.గత ఏడాదితో పోల్చితే వృద్ధి రేటు 10.1శాతంగా నమోదైంది. బడ్జెట్ ప్రసంగం చదువుతున్న భట్టి విక్రమార్క. ఆర్థిక మంత్రిగా భట్టి మూడోసారి బడ్జెట్ ప్రసంగం..👉బడ్జెట్ ప్రసంగం సందర్భంగా బీఆర్ఎస్ నేతల నినాదాలు.. కాంగ్రెస్ వ్యతిరేక నినాదాలు.. 👉బడ్జెట్ ప్రతులను స్పీకర్ గడ్డం ప్రసాద్, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి అందజేసిన భట్టి, మంత్రి శ్రీధర్ బాబు, ఫైనాన్స్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు తదితరులు.అసెంబ్లీ వద్ద బీఆర్ఎస్ నేతల నిరసన..అసెంబ్లీ మీడియా పాయింట్ కేటీఆర్ కామెంట్స్..ఎండిన పంటలు, రైతులకు సంఘీభావంగా నిరసన చేస్తున్నాం.11 నెలలుగా మేము ప్రభుత్వాన్ని అలర్ట్ చేస్తున్నాం.వర్షాలు సమృద్ధిగా పడ్డాయి.. రైతులను ప్రభుత్వం పట్టించుకోలేదు.ప్రాజెక్టుల్లో నీళ్ళు ఉన్నా రైతులకు నీళ్లు ఇవ్వడం లేదు.తెలంగాణలో నాలుగు వందలకు పైగా రైతులు ఆత్మహత్య చేసుకున్నారు.కేసీఆర్ పై కోపంతో మేడిగడ్డను రిపేర్ చేయకుండా ఇసుక దోపిడి చేస్తున్నారు.కేసీఆర్ పాలనలో 36శాతం కృష్ణా జలాలను వాడుకొని రైతులకు నీళ్లు ఇచ్చాం.కాంగ్రెస్ పాలనలో కిందికి నీళ్లు వదిలి.. పంటలు ఎండబెట్టారు.కాలం తెచ్చిన కరువు కాదు.. ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువు.రేవంత్ రెడ్డి ముందు చూపులేని ప్రభుత్వం వల్ల పంటలు ఎండుతున్నాయి.రేవంత్ రెడ్డి గుడ్డి చూపు, చేతగాని, తెలివితక్కువ తనం వల్ల రైతులకు సమస్యలు.ఎండిన పంటలకు ఎకరానికి 25వేల పంట నష్టం ఈ బడ్జెట్ లో కేటాయించాలిపంటలు ఎండిపోవడానికి చెక్ డ్యామ్ లు, చెరువులు నిలపకపోవడం వల్లే నష్టం జరిగింది.త్వరలో ఎండిన పంటలు ఉన్న ప్రాంతాల్లో పర్యటన చేస్తాం👉తెలంగాణ వార్షిక బడ్జెట్ 2025-26కు కేబినెట్ ఆమోదం తెలిపింది. 👉అసెంబ్లీకి చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. ముఖ్యమంత్రి అధ్యక్షతన కేబినెట్ భేటీ ప్రారంభం కేబినెట్ భేటీ.. అసెంబ్లీ హాల్లో బడ్జెట్ మీద కేబినెట్ భేటీబడ్జెట్‌కు ఆమోదం తెలపనున్న మంత్రి మండలి11.14కు తెలంగాణ బడ్జెట్శాసన సభలో ప్రవేశపెట్టనున్న ఆర్థిక మంత్రి భట్టిమండలిలో ప్రవేశపెట్టనున్న మంత్రి శ్రీధర్‌బాబు బడ్జెట్ ప్రతులతో అసెంబ్లీకి చేరుకున్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్కఘనస్వాగతం పలికిన రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, పరిగి శాసనసభ్యులు రామ్మోహన్ రెడ్డి,ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, శాసనసభ సెక్రటరీ నరసింహచార్యులు, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు తదితరులు. ప్రజాభవన్ నుంచి అసెంబ్లీకి బయలుదేరిన భట్టి విక్రమార్క.అసెంబ్లీ కమిటీ హాల్లో జరగనున్న కేబినెట్ సమావేశానికి హాజరు కానున్న భట్టి. 👉నేడు అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క.👉వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2025–26) గాను రూ.3.05 లక్షల కోట్లతో బడ్జెట్‌ను ప్రతిపాదించనున్నట్టు తెలిసింది.👉2024–25లో ప్రతిపాదించిన రూ.2.91 లక్షల కోట్ల బడ్జెట్‌కు ఇది సుమారు 5 శాతం అదనం.👉ఉదయం 9:30 గంటలకు అసెంబ్లీ కమిటీ హాల్లో భేటీ కానున్న రాష్ట్ర మంత్రివర్గం బడ్జెట్ ప్రతిపాదనలను ఆమోదించనుంది. అనంతరం 11:14 గంటలకు అసెంబ్లీలో ఆర్థిక మంత్రి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క.. శాసనమండలిలో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు బడ్జెట్‌ను ప్రవేశపెడతారని అసెంబ్లీ వర్గాలు తెలిపాయి.గ్యారంటీలకు తోడుగా! 👉తాజా బడ్జెట్లో ఎప్పటిలాగే వ్యవసాయం, వైద్యం, సాగునీరు, విద్య, గ్రామీణాభివృద్ధి శాఖల పద్దులకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇచ్చే అవకాశం ఉందని ఆర్థిక శాఖ వర్గాలు చెబుతున్నాయి. ఆరు గ్యారంటీల అమలుతోపాటు అభివృద్ధి, సంక్షేమం సమన్వయంతో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా ఈ ప్రతిపాదనలు ఉంటాయని పేర్కొంటున్నాయి.👉ఆరు గ్యారంటీల్లో ఒకటైన సామాజిక పింఛన్ల పెంపు ద్వారా ఏటా రూ.3,500 కోట్ల మేర అదనపు భారం పడుతుందని, ఈ మేరకు పింఛన్ల బడ్జెట్ పెంచుతారని సమాచారం. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, రూ.500కే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ వంటి పథకాల కొనసాగింపునకు అవసరమైన మేర నిధులు కేటాయించనున్నారు.👉రైతు భరోసాకు రూ.18వేల కోట్లు, పంటల బీమా ప్రీమియం కోసం రూ. 5 వేల కోట్లను ప్రతిపాదించే అవకాశం ఉంది. రీజనల్ రింగ్ రోడ్డు భూసేకరణ, మూసీ పునరుజ్జీవం, మెట్రో విస్తరణ పథకాలకు సంబంధించి రాష్ట్రం భరించాల్సిన మొత్తాన్ని కూడా బడ్జెట్లో చూపించనున్నారు.👉గతంలో చేసిన అప్పులు తీర్చేందుకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ. 36వేల కోట్ల వరకు ప్రతిపాదించగా.. ఈసారి దీన్ని రూ.65 వేల కోట్లవరకు ప్రతిపాదించే అవకాశాలు కనిపిస్తున్నాయి.రూ.లక్ష కోట్ల నుంచి మూడు లక్షల కోట్ల దాకా..! 👉తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ఇప్పటివరకు 12 సార్లు బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఇందులో 2014–15 సంవత్సరానికి గాను 10 నెలల కాలానికి బడ్జెట్ పెట్టగా.. 2024–25లో కాంగ్రెస్ ప్రభుత్వం ఓటాన్ అకౌంట్‌తో పాటు పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. 2014–15లో నాటి ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ రాష్ట్ర తొలి బడ్జెట్‌ను రూ.లక్ష కోట్లతో ప్రవేశపెట్టారు. తర్వాతి నాలుగేళ్లలో బడ్జెట్ పరిమాణం రూ.1.75 లక్షల కోట్ల వరకు చేరింది.👉2019–20లో కరోనా ప్రభావంతో బడ్జెట్‌ను తగ్గించి రూ.1.46లక్షల కోట్లుగా ప్రతిపాదించారు. తర్వాతి రెండేళ్లలోనే ఏకంగా రూ.85 వేల కోట్ల మేర బడ్జెట్ పెరిగి రూ.2.30లక్షల కోట్లకు చేరింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటికి రూ.2.90లక్షల కోట్లుగా ఉన్న బడ్జెట్ 2024–25లో రూ.2.91లక్షల కోట్లుగా ప్రతిపాదించారు. అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ (2024–25) బడ్జెట్లో అంచనా వ్యయాన్ని రూ. 2.75 లక్షల కోట్లుగానే ప్రతిపాదించడం గమనార్హం. -
మీ మద్దతు లేకుండా అధికారం కష్టం
సాక్షి, హైదరాబాద్: వెనుకబడిన వర్గాల ప్రజ ల మద్దతు లేకుండా తెలంగాణలో ఎవరూ అ ధికారంలో కొనసాగలేరని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. బీసీల సహకారంతోనే రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఏర్పాటైందని చెప్పా రు. బీసీలకు న్యాయం చేయాలన్న ఉద్దేశంతో మనసు పెట్టి పనిచేశానని, పక్కాగా బీసీ జనా భా లెక్కలతో డాక్యుమెంట్ తయారు చేసి, చట్టం చేసి రక్షణ కల్పించామని వెల్లడించారు. బీసీ సంఘాలు పొలిటికల్ ట్రాప్‌లో పడి కులగణన విషయంలో విమర్శలు చేయవద్దన్నారు. బీసీ బిల్లులు అసెంబ్లీలో ఆమోదం పొందిన నేపథ్యంలో.. మంగళవారం అసెంబ్లీ కమిటీ హాల్లో పలు బీసీ సంఘాలు ఏర్పాటు చేసిన అభినందన సమావేశంలో సీఎం రేవంత్ పాల్గొన్నారు. సీఎంను బీసీ సంఘాల నేతలు శాలు వాలతో సత్కరించారు. అనంతరం రేవంత్ మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే.. ‘‘మీరు నాకు అభినందనలు చెబుతున్నా రు. ఈ అభినందనలన్నింటినీ మూటగట్టి తీసుకెళ్లి రాహుల్‌గాం«దీకిస్తా. భారత్‌జోడో యాత్ర సందర్భంగా కృష్ణా మండలం మీదుగా తెలంగాణలో ప్రవేశించినప్పటి నుంచి చార్మినార్ వరకు రాహుల్‌గాంధీ ఒకటే మాట చెప్పారు. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చే రాష్ట్రాలతోపాటు కేంద్రంలో అధికారంలోకి వస్తే జాతీ య స్థాయిలో కులగణన చేస్తామన్నారు. మీ సహకారంతోనే తెలంగాణలో ప్రజాప్రభుత్వం ఏర్పాటైంది. అందుకే బీసీలకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో మనసు పెట్టి పని చేశా. నిబద్ధతతో ముందుకు వెళ్లాం.. కులగణన చేసేందుకు ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని సబ్‌కమిటీ చైర్మన్‌గా నియమించాం. కొందరు దీన్ని కూడా తప్పుపట్టారు. కాంగ్రెస్ పార్టీ, రాహుల్‌గాంధీ ఆలోచనలను ముందుకు తీసుకెళ్లగలిగిన నిబద్ధత, అధికారులతో పని చేయించగలిగిన నైపుణ్యం ఉన్న నాయకుడు కనుకనే ఆయనకు బాధ్యత ఇచ్చాం. బీసీల జనాభాకు సంబంధించి ఏ పరీక్షకైనా, ఎలాంటి స్రూ్కటినీలో అయినా నిలబడేలా పక్కా డాక్యుమెంట్ రూపొందించాం. దాన్ని లాకర్లో దాచిపెట్టదల్చుకోలేదు. డాక్యుమెంట్‌ను బిల్లు పెట్టి చట్టం చేశాం. అందుకే బీసీల కులగణన విషయంలో నేను చరిత్రలో ఉండిపోతా. దేశంలో ఏ రాష్ట్రంలో కులగణన జరిగినా తెలంగాణకు వచ్చి నేర్చుకుని పోవాలి. అంబేడ్కర్ రాజ్యాంగాన్ని రాసినప్పుడు కూడా ఇంతటి కీర్తిని ఊహించి ఉండరు. అదే తరహాలో తెలంగాణలో బీసీల గణన గురించి ఇప్పటికిప్పుడు చర్చ జరగకపోవచ్చుగానీ మున్ముందు మాత్రం కచి్చతంగా తెలంగాణ గురించి చెప్పుకోవాల్సిందే. తప్పు ఉందంటే.. నష్టం చేసుకున్నట్టే.. బీసీ సోదరులు అర్థం చేసుకోవాలి. కులగణన లో తప్పు ఉందని అంటే.. మీకు మీరు నష్టం చేసుకున్నట్టే. స్వయంగా పర్యవేక్షణ చేస్తూ, అందరినీ భాగస్వాములను చేశాను కాబట్టే ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయగలిగాం. వాయిదా వేయాలనుకుంటే పదేళ్లకు కూడా వీడని విధంగా చిక్కుముళ్లు వేయొచ్చు. ఓబీసీలతో కాంగ్రె స్ పార్టీకి చరిత్రాత్మక అనుబంధం ఉంది. బీసీల మద్దతు లేకుండా ఎవరూ అధికారంలో కొనసాగలేరు. అడగాలి కొట్లాడాలే తప్ప మమ్మల్ని అనుమానించి అవమానిస్తే లాభం లేదు. బీసీల గణన విషయంలో తెలంగాణ ఇచి్చన డాక్యుమెంట్ ఓ బైబిల్, ఖురాన్, భగవద్గీత లాంటిది. అవసరమైనప్పుడు రాజ్యాంగాన్ని కూడా సవరించుకున్నాం. అలాగే ఈ డాక్యుమెంట్‌ను కూడా భవిష్యత్తులో అవసరమైతే సవరించుకుంటాం. 10 లక్షల మందితో సభ పెట్టండి బీసీ కుల గణన ప్రక్రియలో ఎన్నో పరిణామాలను ఎదుర్కొన్నా. అవన్నీ బయటకు చెప్పను. రిస్క్ చేసి బీసీల జనాభా లెక్కలు తేల్చా. మీరు అభినందనలు ఇక్కడే తెలపడం కాదు. పరేడ్ గ్రౌండ్స్‌లో 10 లక్షల మందితో సభ పెట్టండి. రాహుల్‌గాందీని పిలిపిస్తా. అభినందించండి. ఆయనకూ బలం వస్తుంది. దేశం మొత్తం కుల గణన జరపాలని పోరాడే శక్తి వస్తుంది’ అని సీఎం రేవంత్ అన్నారు. సమావేశంలో కేబినెట్ సబ్ కమిటీ చైర్మన్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మంత్రులు కొండా సురేఖ, పొన్నం, పొంగులేటి, వీహెచ్, టీపీసీసీ చీఫ్ మహేశ్‌గౌడ్, విప్‌లు ఆది శ్రీనివాస్, బీర్ల అయిలయ్య, ఎమ్మెల్యేలు ఈర్ల శంకరయ్య, రాజ్‌ఠాకూర్, వాకిటి శ్రీహరి, ప్రకాశ్‌గౌడ్, బీసీ సంఘాల నేతలు జాజుల శ్రీనివాస్‌గౌడ్, టి. చిరంజీవులు, దాసు సురేశ్ పాల్గొన్నారు. సీఎం చెప్పిన ఏడంతస్తుల కథ బీసీల కులగణన విషయంలో రాజకీయ నాయకుల విమర్శలను పెద్దగా పట్టించుకోనుగానీ బీసీ సంఘాలు మాత్రం విమర్శలు చేయవద్దని, తమను బాధ పెట్టవద్దని సీఎం రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. ‘‘బీసీల గణనకు నేను పునాదులు వేశా. స్లాబ్ వేసి ఓ అంతస్తు కట్టా. ఆ ఇంట్లోకి రండి. వచ్చి కాపురం చేయండి. అన్నం వండుకుని తినండి. మీకు వీలున్నప్పుడు రెండో అంతస్తు, మూడో కట్టుకోండి. అలా కాకుండా మాకు ఏడంతస్తుల భవనం కట్టివ్వలేదు. మేం ఆ ఇంట్లోకి రామంటే మీకే నష్టం. ఏడంతస్తులు కట్టేలోపు పునాదులు శిథిలమై స్లాబ్ కూలిపోతుంది. బీసీ సంఘాలు పొలిటికల్ ట్రాప్‌లో పడొద్దు. నేనిచ్చిన డేటా మీకు లంకెబిందెల్లాంటిది. కొట్లాడితే తెలంగాణ వచ్చింది. కొట్లాడితేనే దేశానికి స్వాతంత్య్రం వచి్చంది. కొట్లాడితే జనగణనలో కులగణన జరగదా? ఒక్కసారి జనగణనలో కులగణన ప్రారంభమైతే ప్రతి పదేళ్లకోసారి బీసీల జనాభా ఎంత ఉందో తేలిపోతుంది’’అని సీఎం రేవంత్ పేర్కొన్నారు. -
తెలంగాణ మార్గం చూపింది.. దేశమంతా జనగణన జరగాలి
సాక్షి, హైదరాబాద్/సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకిచ్చిన మరో వాగ్దానాన్ని నెరవేరుస్తూ బీసీ వర్గాలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లులను ఆమోదించిందని లోక్‌సభలో ప్రతిపక్షనేత రాహుల్‌గాంధీ ట్వీట్ చేశారు. జనగణన విషయంలో తెలంగాణ.. దేశానికి ఓ మార్గం చూపిందని, ఈ జనగణన దేశమంతా జరగాల్సిన అవసరం ఉందని పేర్కొంటూ మంగళవారం ఆయన ‘ఎక్స్’లో పోస్ట్ చేశా రు. ‘జనగణన ద్వారా మాత్రమే వెనుకబడిన వర్గాల హక్కులు సాధ్యమవుతా యని కాంగ్రెస్ పార్టీ మరోమారు స్పష్టం చేసింది. తెలంగాణ తీసుకున్న ఈ నిర్ణయం ద్వారా ఇప్పటి వరకు రిజర్వేషన్ల విషయంలో ఉన్న 50 శాతం పరిమితి తొలగింపునకు మార్గం సుగమమైంది. విద్య, ఉద్యోగాలు, రాజకీయాల్లో బీసీలకు తగిన ప్రాతినిధ్యం లభించనుంది’ అని రాహుల్ ఆ పోస్ట్‌లో పేర్కొన్నారు. మీకు అండగా ఉంటాం: ప్రియాంక ‘కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చింది. 42% రిజర్వేషన్లతో బీసీ వర్గాలు మరింత అభివృద్ధి సాధిస్తారు. తెలంగాణ ప్రజలు, బీసీ వర్గాలకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఇది కేవలం రిజర్వేషన్ల కల్పన మాత్రమే కాదు. సామాజిక న్యాయంపై కాంగ్రెస్ పార్టీ నిబద్ధతకు నిదర్శనం. మీరు మమ్మల్ని నమ్మినట్టుగానే, మేం మీకు అండగా ఉంటాం. జై తెలంగాణ, జైహింద్, జైకాంగ్రెస్’ అని ప్రియాంక ఫేస్బుక్లో పోస్టు చేశారు. కలలు సాకారమవుతున్నాయి: సీఎం రేవంత్ రాహుల్, ప్రియాంకాగాంధీలు సామాజిక మాధ్యమాల్లో చేసిన పోస్టులకు సీఎం రేవంత్‌రెడ్డి స్పందించారు. ‘గర్వించదగిన రోజు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభు త్వం వాగ్దానాలను నెరవేర్చుతోంది. రాహుల్, ప్రియాంక నేతృత్వంలో తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల కలలను సాకారం చేస్తూ, ప్రజలకిచ్చిన ప్రతి హామీని అమలు చేస్తూ, ప్రతి గ్యారంటీని నిజం చేస్తూ ముందుకెళుతోంది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కల్పన విప్లవాత్మక నిర్ణయం. సామాజిక న్యాయ అమలులో తెలంగాణ దేశానికి మార్గదర్శనం చేయడం గర్వకారణం. ఆ ఇద్దరి ప్రేరణకు ధన్యవాదాలు’ అని రేవంత్‌రెడ్డి రీట్వీట్ చేశారు. -
ఎస్సీ వర్గీకరణకు ఓకే
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో షెడ్యూల్డ్ కులాల (ఎస్సీ) ఉప వర్గీకరణకు లైన్ క్లియర్ అయింది. దీనికి సంబంధించి వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ మంగళవారం శాసనసభ, శాసనమండలిలో ప్రవేశపెట్టిన ఎస్సీ వర్గీకరణ బిల్లును ఉభయ సభలు ఏకగ్రీవంగా ఆమోదించాయి. అంతకు ముందు ఈ బిల్లుపై జరిగిన చర్చలో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం వచ్చే ఏడాది చేపట్టనున్న జనగణన తర్వాత ఎస్సీల సంఖ్య ఆధారంగా వారి రిజర్వేషన్లను మరింత పెంచుతామని ప్రకటించారు. వర్గీకరణ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలన్నదే కాంగ్రెస్ లక్ష్యమన్నారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ఎస్సీ వర్గీకరణ తీర్మానాన్ని శాసనసభలో ఆమోదింపజేయడంలో చూపిన చిత్తశుద్ధిని గుర్తు చేశారు. కాంగ్రెస్ దళితుల పక్షపాతి అని, రాజ్యాంగ రూపకల్పన కోసం డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్‌ను నియమించిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని చెప్పారు. అనేక మంది దళితులకు కాంగ్రెస్ పార్టీ కీలక పదవులు ఇచ్చి పైకి తెచ్చిందని.. దళిత బిడ్డ మల్లిఖార్జున ఖర్గేకి పార్టీ అధ్యక్ష పదవి ఇచ్చిందని పేర్కొన్నారు. అందరి అభీష్టం మేరకే.. ఎస్సీ వర్గీకరణకు సుప్రీంకోర్టు సానుకూలంగా తీర్పు ఇచ్చిన మరుక్షణమే తమ ప్రభుత్వం స్పందించిందని సీఎం రేవంత్ చెప్పారు. ‘‘మంత్రి ఉత్తమ్ నేతృత్వంలో మంత్రివర్గ ఉపసంఘం వేశాం. వారి సూచన మేరకు జస్టిస్ షమీమ్ అక్తర్ సారథ్యంలో ఏకసభ్య కమిషన్ వేశాం. వర్గీకరణపై కమిషన్ విస్తృతంగా సమాచారం సేకరించింది. అన్ని వర్గాల అభిప్రాయాలు తీసుకుంది. 8,681 విజ్ఞప్తులను కూలంకషంగా పరిశీలించింది. 59 ఎస్సీ ఉప కులాలకు సంబంధించిన స్థితిగతులతో నివేదిక ఇచ్చింది. ఆ సిఫార్సులను మంత్రివర్గం యథాతథంగా ఆమోదించింది. 59 ఉపకులాలను మూడు కేటగిరీలు చేశాం. అత్యంత వెనుకబడిన 15 ఉప కులాలకు ఒక్క శాతం, మధ్యస్తంగా వెనుకబడిన 18 ఉప కులాలకు 9శాతం, గణనీయంగా లబ్ధిపొందిన 26 ఉప కులాలకు 5 శాతం మేర విద్య, ఉద్యోగాలు, రాజకీయాల్లో రిజర్వేషన్ అమలు చేయాలని నిర్ణయించాం..’’ అని రేవంత్ తెలిపారు. ఆ దళిత కుటుంబాలకు సాయం ఎస్సీ వర్గీకరణ పోరాటంలో ప్రాణాలు కోల్పోయిన దళిత కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో ప్రాధాన్యమిస్తామని సీఎం తెలిపారు. రాజీవ్ యువ వికాసం పథకం కింద రూ.4 లక్షల సాయం అందించే ఏర్పాటు చేస్తామన్నారు. ఎస్సీ వర్గీకరణకు జనాభా లెక్కలే కీలమని చెప్పారు. 2026లో దేశవ్యాప్తంగా జనగణన చేపట్టే వీలుందని, అది పూర్తయిన తర్వాత రిజర్వేషన్లు మరింత పెంచుతామని వెల్లడించారు. ఎస్సీ వర్గీకరణ బిల్లు ఆమోదానికి సహకరించిన అన్నిపక్షాలకు రేవంత్ కృతజ్ఞతలు తెలిపారు. ఇది చరిత్రాత్మక దినం: ఉత్తమ్ ఎస్సీ వర్గీకరణ బిల్లును ఆమోదించుకున్న ఈ రోజు ఇది చరిత్రాత్మక దినంగా నిలిచిపోతుందని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అభివర్ణించారు. తాను తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటి నుంచి ప్రతి శాసనసభ సమావేశంలో, పార్లమెంటులో ఎస్సీ వర్గీకరణ జరగాలని అన్ని పార్టీలు, ప్రభుత్వాలు గొంతెత్తేవని గుర్తు చేశారు. ఎస్సీ వర్గీకరణకు ఉమ్మడి ఏపీలో, తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాలు మద్దతు ఇచ్చినా చట్టబద్దత రాలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత సీఎం రేవంత్ నాయకత్వంలో చిత్తశుద్ధితో ఎస్సీ వర్గీకరణను పూర్తి చేశామన్నారు. వర్గీకరణ కోసం ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘానికి చైర్మన్‌గా వ్యవహరించడం అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఎస్సీలకు 15శాతంగా ఉన్న రిజర్వేషన్లు త్వరలో పెరుగుతాయని తెలిపారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేలో ఎస్సీ జనాభా దాదాపు 18శాతంగా ఉన్నట్టు వెల్లడైందని గుర్తు చేశారు. ఎస్సీ రిజర్వేషన్లలో క్రీమీలేయర్ ఉండాలని కమిషన్ సిఫార్సు చేసిందని.. కానీ వర్గీకరణ ఫలాలు ఎస్సీల్లోని అన్ని కులాలకు దక్కాలన్న ఉద్దేశంతో దానిని మంత్రివర్గం ఆమోదించలేదని ఉత్తమ్ చెప్పారు. ఎస్సీలను కూరలో కరివేపాకులా వాడుకున్నారు గత ప్రభుత్వం ఎస్సీలను కూరలో కరివేపాకు మాదిరిగా చూసిందని ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆరోపించారు. వర్గీకరణపై ఇంత పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంటే మాజీ సీఎం, మాజీ మంత్రులంతా గైర్హాజరు కావడం బాధాకరమన్నారు. మాలలపై కొంతకాలంగా దుష్ప్రచారం జరుగుతోందని, జనాభా ప్రాతిపదికనే మాలలకు ఫలాలు దక్కాయని ఎమ్మెల్యే గడ్డం వివేక్ చెప్పారు. ఉద్యోగాలు, సంక్షేమ పథకాల్లో ఎక్కువగా మాదిగలకు దక్కాయని, ఆ తర్వాతే మాలలు ఉన్నారని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతమున్న ఎస్సీ జనాభా ఆధారంగా నిధులు కేటాయించాలని కోరారు. ఎస్సీ వర్గీకరణను కేంద్రంలో కూడా అమలు చేయాలని, కేంద్ర ఉద్యోగాల్లోనూ వర్గీకరణ ఆధారంగానే నియామకాలు చేపట్టాలని మాజీ మంత్రి కడియం శ్రీహరి కోరారు. ఈ మేరకు పార్లమెంటులోనూ చట్టం చేయాలన్నారు. ఎస్సీ వర్గీకరణను గ్రూప్–1, 2, 3లుగా విభజించారని.. అలాగాకుండా గ్రూప్–ఏ, బీ, సీ కేటగిరీలుగా చేయాలని ఎమ్మెల్యే పాయల్ శంకర్ ప్రభుత్వాన్ని కోరారు. ఇక బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాణిక్‌రావు, ఎంఐఎం ఎమ్మెల్యే మాజీద్ హుస్సేన్ మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ బిల్లుకు మద్దతు ప్రకటించారు. చర్చ అనంతరం బిల్లును సభ ఏకగ్రీవంగా ఆమోదించినట్టు సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ ప్రకటించారు. -
ఎస్సీ వర్గీకరణ బిల్లుకు తెలంగాణ శాసనసభ ఆమోదం
సాక్షి,హైదరాబాద్ : ఎస్సీ వర్గీకరణ బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి అసెంబ్లీలో మాట్లాడారు. సుదీర్ఘమైన వర్గీకరణ పోరాటంలో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. ఎన్నో ఏళ్ల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతున్న చారిత్రాత్మకమైన సందర్భం ఇది.దళితులకు అండగా ఉంటూ వారి అభ్యున్నతికి మా ప్రభుత్వం కృషి చేస్తోంది. 1960 లోనే ఉమ్మడి రాష్ట్రంలో దామోదరం సంజీవయ్య లాంటి దళితున్ని ముఖ్యమంత్రిని చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీది. దళితుడు మల్లికార్జున ఖర్గేను ఏఐసీసీ అధ్యక్షుడిగా పార్టీ నియమించింది. పంజాబ్ కేసు సుప్రీం కోర్టులో సుదీర్ఘంగా కొనసాగింది. మేం అధికారంలోకి వచ్చాక ఏడుగురు జడ్జిల ముందు ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా న్యాయవాదితో సుప్రీం కోర్టులో మన వాదనలు వినిపించాం. సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన వెంటనే వర్గీకరణకు అనుకూలంగానే శాసనసభలో తీర్మానం చేశాం. మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేశాం. న్యాయనిపుణులను సంప్రదించి వన్ మెన్ కమిషన్ ఏర్పాటు చేశాంవన్ మెన్ కమిషన్ ఇచ్చిన నివేదికను తూచ తప్పకుండా ఆమోదించాం. 59 ఉపకులాలను మూడు గ్రూపులుగా విభజించి 15 శాతం రిజర్వేషన్లు వారికి పంచాం.ఎస్సీ వర్గీకరణ పోరాటంలో ప్రాణాలు కోల్పోయినవారి కుటుంబాలను ప్రభుత్వం ఖచ్చితంగా ఆదుకుంటుంది. వారి కుటుంబాలకు ఇందిరమ్మ ఇండ్లు, రాజీవ్ యువ వికాసం పథకాల్లో ప్రాధాన్యం కల్పిస్తాం. వర్గీకరణ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అందరూ సమర్ధిస్తున్నారు2026 జనగణన పూర్తి కాగానే ఆ లెక్కల ప్రకారం ఎస్సీ రిజర్వేషన్లు పెంచుతాం. రిజర్వేషన్లు పెంచడం వాటిని సహేతుకంగా పంచడం మా బాధ్యత. సభా నాయకుడిగా నేను మాట ఇస్తున్నా… ఇందిరమ్మ రాజ్యంలో మీకు అన్యాయం జరగదు. రిజర్వేషన్లను పెంచి వాటిని అమలు చేసే బాధ్యత మేం తీసుకుంటాం’అని అన్నారు. బీసీ సంఘాల నాయకులకు సీఎం రేవంత్‌రెడ్డి పిలుపుఅంతకుముందు..కులగణన అందరికీ భగవద్గీత, బైబిల్, ఖురాన్ లాంటిది. మీ హక్కుల సాధన కోసం మీరే నాయకత్వం వహించండి. నేను మీకు మద్దతుగా నిలబడతా.రాహుల్ గాంధీకి పది లక్షల మందితో పరేడ్ గ్రౌండ్లో కృతజ్ఞత సభ పెట్టండి’అంటూ బీసీ సంఘాల నాయకులకు సీఎం రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు.బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు సంబంధించిన బిల్లులకు తెలంగాణ శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా తెలంగాణ కులగణన సర్వేపై రేవంత్‌రెడ్డి మాట్లాడారు. తెలంగాణ కులగణన సర్వే చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోతుంది. ఇందులో మేం భాగస్వాములవడం మాకు గర్వకారణం .దీనిని బీసీ సోదరులు అర్థం చేసుకోవాలి..తప్పుపడితే నష్టపోయేది బీసీ సోదరులే. కేవలం డాక్యుమెంట్ చేసి వదిలేయకుండా బిల్లు చేశాం. ఈ అభినందనలు నాకు కాదు ఈ అభినందనలు అందించాల్సింది రాహుల్ గాంధీని. భారత్ జోడో యాత్ర సందర్భంగా అధికారంలోకి వచ్చిన రాష్ట్రాల్లో కులగణన నిర్వహిస్తామని రాహుల్ గాంధీ స్పష్టంగా చెప్పారు. ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్రంలో కులగణన సర్వే నిర్వహించాం.50 శాతానికి మించి రిజర్వేషన్లు పెంచుకోవాలంటే ముందుగా జనాభా లెక్క తేలాలి.ఆ లెక్కలకు చట్టబద్ధత కల్పించాలి.. అప్పుడే రిజర్వేషన్లు పెంచుకునేందుకు వీలుంటుంది. అందుకే రాష్ట్రంలో బీసీ కులసర్వే నిర్వహించుకున్నాం. అసెంబ్లీలో ఫిబ్రవరి 4కు ప్రత్యేక స్థానం ఉంది.. అందుకే ఫిబ్రవరి 4ను సోషల్ జస్టిస్ డేగా ప్రకటించుకున్నాం.పక్కా ప్రణాళికతో మంత్రివర్గ ఉపసంఘం, అ తరువాత డెడికేషన్ కమిషన్ ఏర్పాటు చేసి ఒక టైం ఫ్రేమ్‌లో కులసర్వే పూర్తి చేశాం. మొదటి విడతలో కులగణన సర్వేలో పాల్గొనని వారికోసం రెండో విడతలో అవకాశం కల్పించాం.పూర్తి పారదర్శకంగా కులగణన సర్వేను పూర్తి చేశాం. ఏ పరీక్షలోనైనా మనం చేసిన పాలసీ డాక్యుమెంట్ నిలబడేలా జాగ్రత్తలు తీసుకున్నాం. దేశంలో ఏ రాష్ట్రంలో లెక్కలు తేల్చాలన్న మన రాష్ట్రాన్ని ఆదర్శంగా తీసుకోవాలనేదే మా ఆలోచన. ఈ కులగణన సర్వే చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోతుంది.ఇందులో మేం భాగస్వాములవడం మాకు గర్వకారణం.దీనిని బీసీ సోదరులు అర్థం చేసుకోవాలి.. దీన్ని తప్పుపడితే నష్టపోయేది బీసీ సోదరులే.కేవలం డాక్యుమెంట్ చేసి వదిలేయకుండా బిల్లు చేశాం. రాజకీయ పరమైన రిజర్వేషన్లు, విద్యా ఉద్యోగ రిజర్వేషన్ల కోసం వేర్వేరుగా రెండు బిల్లులు శాసనసభలో ఆమోదించుకున్నాం. జనగణనలో కులగణన ఎప్పుడూ జరగలేదు… జనగణనలో కులగణనను చేర్చితే సరైన లెక్క తేలుతుంది. మండల్ కమిషన్ కూడా బీసీల లెక్క 52 శాతం అని తేల్చింది.కానీ మేం కులసర్వే ద్వారా బీసీల లెక్క 56.36 శాతంగా తేల్చాంలెక్కతేల్చడం కోసమే స్థానిక ఎన్నికలు వాయిదా వేశాం.కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ బీసీలకు అండగా ఉంది.పీసీసీ అధ్యక్షులుగా పనిచేసినవారిలో ఎక్కువ మంది బీసీలే.ఈ కులగణన అందరికీ భగవద్గీత, బైబిల్, ఖురాన్ లాంటిది. ఈ కులగణన పునాది లాంటిది.. ముందు అమలు చేసుకుని తరువాత అవసరాన్నిబట్టి సవరణలు చేసుకోవచ్చు.కులం ముసుగులో రాజకీయంగా ఎదగాలని అనుకునే వారి ట్రాప్‌లో పడకండి. ఈ సర్వేను తప్పుపడితే నష్టపోయేది మీరే. పునాదిలోనే అడ్డుపడితే మీకు మీరే అన్యాయం చేసుకున్నవారవుతారు. మీ హక్కుల సాధన కోసం మీరే నాయకత్వం వహించండి నేను మీకు మద్దతుగా నిలబడతా. రాహుల్ గాంధీకి పది లక్షల మందితో కృతజ్ఞత సభ పెట్టండి. పరేడ్ గ్రౌండ్లో ఈ సభ ఏర్పాటు చేయండి’అని సూచించారు. -
శాస్త్రీయ విధానంతోనే పునర్విభజన: భట్టి విక్రమార్క
సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన విషయంలో శాస్త్రీయ విధానంతో కేంద్రం ముందుకెళ్లాలని, దీనికి ఆమోదం వచ్చేంతవరకు ఆ ప్రక్రియను వాయిదా వేయాలని రాష్ట్రంలోని పలు రాజకీయ పక్షాల నేతలు అభిప్రాయపడ్డారు. జనాభా ప్రాతిపదికన పునర్విభజన చేయడం వల్ల దక్షిణాది రాష్ట్రాలు తీవ్రంగా నష్టపోతాయని, ప్రధానంగా తెలంగాణకు రాజకీయ ముప్పు పొంచిఉంటుందని ఆందోళన వ్యక్తంచేశారు. దీనిపై శాస్త్రీయ విధానంతోనే కేంద్రం ముందుకెళ్లేలా ఒత్తిడి తెచ్చే కార్యాచరణను రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. సోమవారం అసెంబ్లీ కమిటీ హాల్లో లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనపై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, కాంగ్రెస్ సీనియర్ నేత కె.జానారెడ్డి నేతృత్వంలో అఖిలపక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశానికి కాంగ్రెస్, సీపీఐ, ఎంఐఎం, సీపీఎం, సీపీఐఎంఎల్, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా నాయకులు హాజరయ్యారు. భట్టి విక్రమార్క మాట్లాడుతూ లోక్‌సభ నియోజకవర్గ పునర్విభజన పేరుతో కేంద్రం ముందుకెళ్తున్న తీరుతో తెలంగాణకు జరిగే నష్టాన్ని ఎలా ఎదుర్కోవాలన్న అంశంపై చర్చించేందుకు సీఎం రేవంత్‌రెడ్డి సూచన మేరకు సమావేశాన్ని ఏర్పాటు చేసినట్టు చెప్పారు. బీఆర్ఎస్, బీజేపీ నేతలు ప్రత్యేక రాజకీయ కారణాలతో హాజరుకాలేదన్నారు. కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులో దక్షిణాది రాష్ట్రాల పాత్ర అనివార్యం కావాలని, ఈ క్రమంలో రాజకీయ పార్టీలు ఇచ్చే సూచనల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తుందని చెప్పారు. సభ తీర్మానం చేయాలి: ఎంఐఎం నేత అక్బరుద్దీన్ జానారెడ్డి మాట్లాడుతూ.. దేశంలో కొత్త ఆందోళనకు దారితీయకుండా కొంతకాలం ఇదే సీట్ల సంఖ్యను కొనసాగించాలని, ఈ విషయంలో కేంద్రం పునరాలోచించకపోతే ప్రమాదం పొంచి ఉంటుందన్న విషయాన్ని వారికి తెలియజేయాలని సూచించారు. ఎంఐఎం శాసనసభా పక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ మాట్లాడుతూ.. జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజనను వ్యతిరేకిస్తూ శాసనసభలో తీర్మానాన్ని ఆమోదించి కేంద్రానికి పంపాలని చెప్పారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ, సీపీఐ శాసనసభా పక్ష నేత కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ ఉత్తర భారతంలో పెరుగుతున్న లోక్‌సభ సీట్లకు అనుగుణంగా దక్షిణాదిలోనూ పెంచాలని అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్‌తోపాటు సీపీఐ, సీపీఎం లాంటి జాతీయ పార్టీలు ఒక విధానంతో వెళ్లాలనే అభిప్రాయం సమావేశంలో వ్యక్తమైంది. ప్రతి రాష్ట్రానికి సమాన హక్కు ఉండేలా నియోజకవర్గాల పునర్విభజన జరగాలని సీపీఐఎంఎల్ నేత హనుమేశ్ అభిప్రాయపడగా, ఉత్తరాదిలో పెరుగుతున్న సీట్ల శాతం ప్రకారమే దక్షిణాదిలోనూ పెంచాలని ఆర్పీఐ అధ్యక్షుడు మహేశ్‌గౌడ్ అభిప్రాయపడ్డారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావు, సీపీఎం మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, సీపీఐ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, పల్లా వెంకట్‌రెడ్డితోపాటు పలు పార్టీల నేతలు పాల్గొన్నారు. -
TG: ‘బీసీ’ బిల్లులు ఏకగ్రీవం
బీసీలకు రిజర్వేషన్ కల్పించే బిల్లును చట్టం చేసేలా కేంద్రంపై అన్ని పక్షాలు ఒత్తిడి పెంచాలి. దీనిపై తెలంగాణ సమాజం ఏకాభిప్రాయంతో ఉందనే సందేశాన్ని కేంద్రానికి పంపాలి. బీసీ రిజర్వేషన్ సాధనకు నేను నాయకత్వం వహిస్తా. సభా నాయకుడిగా హామీ ఇస్తున్నా.-సీఎం రేవంత్ రెడ్డిసాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రెండు బిల్లులను సోమవారం శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించింది. విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లకు సంబంధించి ఒక బిల్లు, స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లకు సంబంధించి మరో బిల్లు ఆమోదం పొందాయి. అనంతరం అసెంబ్లీ మంగళవారానికి వాయిదా పడింది. సోమవారం ఉదయం బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్.. ఈ రెండు బీసీ బిల్లులను శాసనసభలో ప్రవేశపెట్టారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, బీఆర్ఎస్ నుంచి మాజీ మంత్రి గంగుల కమలాకర్ బీసీ రిజర్వేషన్ల ఆవశ్యకతను వివరించారు. తర్వాత సాయంత్రం వరకు కూడా బీసీ రిజర్వేషన్ల బిల్లులపై శాసనసభలో సుదీర్ఘ చర్చ జరిగింది. ఫిబ్రవరి 4న సామాజిక న్యాయ దినోత్సవంగా జరుపుదాం.. బీసీ బిల్లులపై చర్చ అనంతరం సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడారు. ‘‘బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించాలన్నది కాంగ్రెస్ పార్టీ ఎజెండా. బీసీలకు 37శాతం రిజర్వేషన్ కల్పించే బిల్లును గతంలో అసెంబ్లీ ఆమోదించింది. దానికి సంబంధించిన తీర్మానం రాష్ట్రపతి వద్ద పెండింగ్‌లో ఉంది. సాంకేతిక కారణాల రీత్యా గతంలో చేసిన తీర్మానం ఉపసంహరించుకుని, కొత్తగా అసెంబ్లీ తీర్మానం చేసింది. బిల్లుకు మద్దతు ఇచ్చిన పక్షాలకు ధన్యవాదాలు తెలుపుతున్నాం. కేంద్రంలో అధికారంలోకి వస్తే దీన్ని అమలు చేస్తామని మా నేత రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. ఆ దిశగానే రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కోసం అడుగులు వేస్తోంది’’ అని పేర్కొన్నారు. రాష్ట్రంలో వెనుకబడిన వర్గాలకు 42 శాతం రిజర్వేషన్లు సాధించే వరకు విశ్రమించబోనని చెప్పారు. ఫిబ్రవరి 4వ తేదీని సామాజిక న్యాయ దినోత్సవంగా జరుపుదామన్నారు. ఏకాభిప్రాయంతో వెళదాం.. నాయకత్వం వహిస్తా.. బీసీల లెక్క తెలియకపోవడం వల్లే రిజర్వేషన్లపై గతంలో సుప్రీంకోర్టు అభ్యంతరం తెలిపిందని సీఎం రేవంత్ గుర్తు చేశారు. దీన్ని దృష్టిలో ఉంచుకునే రాష్ట్రం కులగణన సర్వే చేపట్టామన్నారు. ‘‘బీసీలకు రిజర్వేషన్ కల్పించే బిల్లును చట్టం చేసేలా కేంద్రంపై అన్ని పక్షాలు ఒత్తిడి పెంచాలి. దీనిపై తెలంగాణ సమాజం ఏకాభిప్రాయంతో ఉందనే సందేశాన్ని కేంద్రానికి పంపాలి. బీసీ రిజర్వేషన్ సాధనకు నేను నాయకత్వం వహిస్తా. సభా నాయకుడిగా హామీ ఇస్తున్నా. అఖిలపక్ష నాయకులంతా సమైక్యంగా ఢిల్లీకి వెళ్లి ప్రధాన మంత్రిని కలుద్దాం. ప్రధాని మోదీ అపాయింట్మెంట్ తీసుకొచ్చే బాధ్యత కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్ తీసుకోవాలి. మేం రాహుల్ గాం«దీని కలసి పార్లమెంట్లో ఈ అంశాన్ని ప్రస్తావించాలని కోరుతాం. ఆయనను కలిసే బాధ్యత, ఈ అంశాన్ని పార్లమెంట్లో ప్రస్తావించేలా చేసే బాధ్యతను పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్‌కు అప్పగిస్తాం..’’ అని సీఎం రేవంత్ చెప్పారు. బీసీ బిల్లు పార్లమెంట్లో ఆమోదం పొందేలా చేసే బాధ్యత ప్రతి పార్టీపైనా ఉందన్నారు. చట్టబద్ధత లభించేలా శాస్త్రీయంగా చేశాం: భట్టి విక్రమార్క బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లుపై రాష్ట్ర ప్రభుత్వం ఏడాది పాటు కసరత్తు చేసిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. రాహుల్ గాంధీ ఇచ్చిన హామీ ప్రకారం.. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కులగణన సర్వే చేపట్టిందన్నారు. శాస్త్రీయంగా, పకడ్బందీగా 50రోజుల్లో దీనిని పూర్తి చేశామని చెప్పారు. ‘‘దేశంలో కులగణన శాస్త్రీయంగా జరిగిందంటే అది ఒక తెలంగాణ రాష్ట్రంలోనే.. భవిష్యత్తులో ఇతర రాష్ట్రాలు కులగణన చేయాల్సిన సమయంలో మనం చేసిన సర్వేను మోడల్‌గా తీసుకునేంత శాస్త్రీయంగా చేయించాం. గతంలో కేంద్రానికి పంపిన అనేక తీర్మానాలు శాస్త్రీయంగా లేకపోవడం వల్ల కోర్టుల్లో వీగిపోయేవి. అలాంటి అనుభవాలను దృష్టిలో పెట్టుకొని శాస్త్రీయంగా సర్వే చేయించి, అసెంబ్లీలో తీర్మానం చేశాం..’’ అని భట్టి వివరించారు. కుల గణనలో బీసీలు 50.36 శాతం ఉన్నట్టు తేలిందని.. దీని ఆధారంగా బీసీలకు 42శాతం రిజర్వేషన్ అమలు కోసం సభలో తీర్మానం పెట్టామన్నారు. తెలంగాణలో కులగణన జరిగినట్టే దేశవ్యాప్తంగా జరగాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. తమిళనాడు తరహాలో రిజర్వేషన్లు సాధించుకుందాం: పొన్నం ప్రభాకర్ తమిళనాడులో మొత్తం 68శాతం రిజర్వేషన్లు అమలవుతున్నాయని.. 50శాతం రిజర్వేషన్లు మించకూడదన్న నిబంధన కూడా ఈడబ్ల్యూఎస్‌కు 10శాతం రిజర్వేషన్లతో తొలగిపోయిందని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. తమిళనాడు స్ఫూర్తితో రిజర్వేషన్లు సాధించుకుందామన్నారు. 42శాతం బీసీ రిజర్వేషన్లకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలుపుతుందన్న నమ్మకం ఉందని తెలిపారు. బీసీ రిజర్వేషన్లపై తెలంగాణ రాజకీయ పార్టీలన్నీ ఒకేతాటిపై ఉన్నాయన్న సంకేతం పంపిద్దామని.. ఎవరేం చేశారన్నది మరోసారి చర్చించుకుందామని చెప్పారు. బీసీ బిల్లుపై చర్చించేందుకు ప్రధాని అపాయింట్మెంట్ ఇప్పించే బాధ్యతను బీజేపీ నేతలు తీసుకోవాలన్నారు. బీజేపీకి ఇది శీలపరీక్ష లాంటిదని, ఆ పార్టీ వ్యాపారుల పార్టీనా, బీసీల పార్టీనా తేలిపోతుందని పేర్కొన్నారు. న్యాయపరమైన చిక్కులకు అవకాశం: కేపీ వివేకానంద కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువచ్చిన 42శాతం బీసీ రిజర్వేషన్ల బిల్లుకు న్యాయపరమైన చిక్కులు వచ్చే అవకాశం ఉందని బీఆర్ఎస్ సభ్యుడు కేపీ వివేకానంద పేర్కొన్నారు. బీసీ కమిషన్, డెడికేటెడ్ కమిషన్ల పేర్లతో శాస్త్రీయత లేకుండా బీసీ రిజర్వేషన్లను నిర్ధారిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని ఎవరైనా కోర్టుల్లో సవాల్ చేసే అవకాశం ఉందని.. బీజేపీ కేంద్ర మంత్రులు కూడా అదే చెప్తున్నారని తెలిపారు. ఒక పద్ధతి ప్రకారం రిజర్వేషన్ల పెంపు ప్రక్రియ జరగాల్సి ఉండగా.. అందుకు భిన్నంగా జరిపారని పేర్కొన్నారు. అయితే వివేకానంద చెప్పిన అంశాలపై మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క అభ్యంతరం తెలిపారు. కేంద్రం ఎలాంటి అడ్డంకులు లేకుండా బీసీ బిల్లును ఆమోదిస్తుందని చెప్పారు. ఇందుకోసం అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లి ప్రధానిని కలుస్తామన్నారు. ఇక బీసీ రిజర్వేషన్ల బిల్లుపై కాంగ్రెస్ సభ్యులు బీర్ల అయిలయ్య, వాకిటి శ్రీహరి, మక్కాన్‌సింగ్ రాజ్ ఠాకూర్ కూడా ప్రసంగించారు. స్వీట్లు తినిపించుకున్న మంత్రి, ఎమ్మెల్యేలు బీసీ బిల్లులకు శాసనసభ ఆమోదం పొందడం మంత్రి పొన్నం ప్రభాకర్, బీసీ ఎమ్మెల్యేలు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు అసెంబ్లీ మీడియా పాయింట్లో మంత్రి, బీసీ ఎమ్మెల్యేలు స్వీట్లు తినిపించుకున్నారు. -
‘అంత మాట అంటారా?.. పిల్ల చేష్టలు వద్దు’
ముంబై: మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ను ఔరంగజేబుతో పోలుస్తూ ఇటీవల ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలపై ఆ రాష్ట్ర బీజేపీ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రధానంగా మహారాష్ట్ర ప్రెసిడెంట్ హర్షవర్థన్ సప్కాల్.. ఫడ్నవీస్ ను ఔరంగజేబుతో పోల్చారు. దీనిపై మహారాష్ట్ర శాసనమండలిలో బీజేపీ మండిపడింది. సప్కాల్ పై కఠినమైన చర్యలు తీసుకోవాలంటూ బీజేపీ శాసనమండలిలో డిమాండ్ చేసింది.ఆదివారం ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ లో సప్కాల్ మాట్లాడుతూ.. ‘ ఔరంగజేబు ఒక క్రూరమైన పాలకుడిగా మనకు తెలుసు. ప్రస్తుత మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ కు కూడా ఔరంగజేబు లక్షణాలే ఉన్నాయి. ఎప్పుడూ మతపరమైన అంశాలకు మాత్రమే ప్రాధాన్యం ఇస్తారు తప్ప.. రాష్ట్రానికి చేసేందేమీ లేదు. రాష్ట్రంలోని హత్యకు గురైన సర్పంచ్ సంతోష్ దేశ్ ముఖ్ తరహా అంశాలకే ఆయన ప్రాధాన్యం ఉంటుంది. మరి ఆయన్ను ఔరంగజేబు పాలనతో పోల్చడంతో తప్పేంటి’ అని ఆరోపించారు.పిల్ల చేష్టలు వద్దు.. : బీజేపీ స్ట్రాంగ్ రియాక్షన్పబ్లిక్ లో ఏది పడితే అది మాట్లాడాతానంటే ఇక్కడ కుదరంటూ కాంగ్రెస్ ప్రెసిడెంట్ సప్కాల్ ను హెచ్చరించింది బీజేపీ. దీనిపై బీజేపీ నాయకుడు ప్రవీణ్ దరేకర్ మాట్లాడుతూ.. ‘ చీఫ్ మినిష్టర్ రాష్ట్రంలో అత్యద్భుతంగా పరిపాలన సాగిస్తున్నారు. అటువంటి నాయకుడ్ని ఔరంగజేబుతో పోలుస్తారా?, ఇది కచ్చితంగా ఖండించాల్సిన అంశమే. ఇది మహారాష్ట్రకే అవమానం. సప్కాల్ పై కేసు ఫైల్ చేయాల్సిందే. ఆయనపై కఠిన చర్యలు తీసుకుంటే వేరే వాళ్లు ఈ తరహా వ్యాఖ్యలు చేయరు. సప్కాల్ పై చర్యలు ఒక ఉదాహరణ కావాలి’ అని ప్రవీణ్ దరేకర్ డిమాండ్ చేశారు. -
కొత్త రేషన్ కార్డుల కోసం తప్పని నిరీక్షణ..!
మోర్తాడ్(బాల్కొండ): గణతంత్ర దినోత్సవాన ఎంపిక చేసిన గ్రామాల్లో రేషన్ కార్డులు పంపిణీ చేసి మురిపించారని, తరువాత ఆ ఊసే ఎత్తడం లేదని దరఖాస్తుదారులు అంటున్నారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని జనవరి 26న జిల్లాలోని 31 గ్రామాల్లో 1066 కుటుంబాలకు కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేశారు. అప్పటికే కొత్త కార్డుల కోసం జిల్లా వ్యాప్తంగా 81,148 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ లెక్కన 80వేల మందికి పైగా దరఖాస్తుదారులు తమకు కార్డు ఎప్పుడొస్తుందనే ఎదురుచూస్తూనే ఉన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో కొత్తకార్డుల పంపిణీకి బ్రేక్‌పడిందని కొన్నాళ్లపాటు చెప్పుకొచ్చినప్పటికీ.. ప్రస్తుతం కార్డులు అందజేసేందుకు ఏం అడ్డంకి ఉందని దరఖాస్తుదారులు ప్రశ్నిస్తున్నారు. ఏ సంక్షేమ పథకానికై నా ప్రభుత్వం రేషన్ కార్డునే ప్రామాణికం చేయడంతో నూతన కార్డులు జారీ చేయాలనే డిమాండ్ బలంగా వినిపిస్తోంది.మార్పులు, చేర్పులపై కనిపించని స్పందనరేషన్ కార్డుల్లో మార్పులు, చేర్పుల కోసం గత ఎనిమిదేళ్ల కాలంలో పలుమార్లు పౌర సరఫరాలశాఖ దరఖాస్తులు స్వీకరించినా ఎలాంటి ప్రయోజనం లేదు. కొత్తగా పెళ్లి చేసుకుని అత్తవారింటికి వచ్చిన వారి పేర్లను స్థానికంగా కార్డుల్లో చేర్చాల్సి ఉంది. అలాగే పిల్లల పేర్లనూ చే ర్చాల్సి ఉంది. ఇప్పటికే పలుమార్లు దరఖాస్తు చే సుకున్న వారు కార్డుల్లో పేర్లు నమోదుకాకపోవడంతో నిరాశకు గురవుతున్నారు. కొత్త కార్డుల జారీ లో జాప్యం, మార్పులు చేర్పుల అంశంపై ‘సాక్షి’ పౌర సరఫరాల శాఖ అధికారులను ఫోన్లో సంప్రదించగా తమకు ఎలాంటి సమాచారం లేదని వెల్లడించారు. ప్రభుత్వం నుంచి స్పష్టత వచ్చే వరకు తాము ఏమీ చెప్పలేమని సమాధానం ఇచ్చారు.హామీని నిలబెట్టుకోవాలికొత్తగా రేషన్ కార్డులను జారీ చేస్తామని ప్రజలకు ఇచ్చి న హామీని నిలబెట్టుకోవాలి. ఎన్నికలకు ముందు ఒక లా ఆ తరువాత మరోలా కార్డుల జారీపై మాట మా ర్చడం సరికాదు. నూతన కార్డులు జారీ చేయడంతో పాటు మార్పులు, చేర్పులు చే యాలి.– తోకల నర్సయ్య, మాజీ సర్పంచ్, తాళ్లరాంపూర్నిర్లక్ష్యం తగదుకొత్త కార్డుల జారీని ప్రభు త్వం నిర్లక్ష్యం చేయడం తగదు. ఎంతో మంది కార్డులు వస్తాయని ఆశతో ఉన్నారు. గత పదేళ్లలో బీఆర్ఎస్ ప్ర భుత్వం కార్డులు జారీ చేయకుండా నిర్లక్ష్యం చేసింది. ఇప్పుడు కూడా అదే విధా నం కొనసాగించడం సరికాదు. – పెద్దరాజారెడ్డి, మాజీ సర్పంచ్, గుమ్మిర్యాల్ -
రేవంత్.. నువ్వు దాటిన రేఖలు బయట పెట్టాలా?: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గాసిప్స్ బంద్ చేసి.. గవర్నరెన్స్‌పై రేవంత్ దృష్టి పెట్టాలన్నారు. కుటుంబాలు మాకు లేవా? అని ప్రశ్నించారు. నాకు అడ్డమైన వారితో లింకులు పెట్టిన నాడు.. మా కుటుంబాలు బాధ పడలేదా?. ఢిల్లీలో రేవంత్ రెడ్డి దూకిన గోడలు, హైదరాబాద్‌లో దాటిన రేఖలు బయట పెట్టాలా? అంటూ ఆసక్తికర కామెంట్స్ చేశారు.అసెంబ్లీ సమావేశాల సందర్బంగా కేటీఆర్ చిట్‌చాట్‌లో మాట్లాడుతూ..‘తెలంగాణ రాష్ట్రం పిచ్చోడి చేతిలో రాయి మాదిరి తయారైంది. రేవంత్ రెడ్డి అప్రూవర్‌గా మారి.. తన పాలన అట్టర్ ప్లాప్ అని తానే చెప్పాడు. 71వేల కోట్లు రెవెన్యూ తీసుకురాలేమని రేవంత్ ఒప్పుకున్నాడు. 2014లో రేవంత్ లాంటి మూర్ఖుడు సీఎం అయి ఉంటే.. తెలంగాణ వెనక్కి పోతుందన్న సమైఖ్యాంధ్రనేతల మాటలు నిజం అయ్యేవి. పిచ్చి పనులకు చేస్తున్నాడు కాబట్టే.. సీఎంను ప్రజలు తిడుతున్నారు.. దానికి ఎవరు ఏం చేస్తారు?.నిండు సభలో బట్టలు విప్పి కొడాతమని రేవంత్ బజారు భాష మాట్లాడారు. మెదటి ఏడాదిలో రేవంత్ రెడ్డికి పాస్ మార్కులు కూడా రాలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని రేవంత్ ఒప్పుకున్నాడు. సంపద సృష్టించే జ్ఞానం, తెలివి రేవంత్ రెడ్డికి లేదు. రాష్ట్రాన్ని క్యాన్సర్ రోగితో పోల్చితే.. తెలంగాణ పెరుగుతుందా?. కేంద్రంతో సఖ్యతగా ఉండి.. నిధులు సాధిస్తానని ఎంత తెచ్చాడు. కేసీఆర్‌పై కోపంతో.. రైతులను గోస పెడుతున్నాడు. రాష్ట్ర బడ్జెట్ గురించి చెప్పమంటే.. సీఎం ఢిల్లీకి పంపే మూటల లెక్కలు చెప్తున్నాడు. మల్లికార్జునఖర్గే, రాహుల్, ప్రియాంకాగాంధీ, కేసీ వేణుగోపాల్‌కు డబ్బులు పంపే పనిలో రేవంత్ బిజీగా ఉన్నారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో ఆందోళన అవుతుంటే.. రాహుల్ గాంధీ ఎందుకు స్పందించటం లేదు?.బీజేపీ, కాంగ్రెస్ నేతల రహస్య సమావేశాలపై రాజసింగ్ చేసిన కామెంట్స్‌ను ఎందుకు ఖండించటం లేదు. రాజాసింగ్‌ను సస్పెండ్ చేసే దమ్ము బీజేపీకి ఉందా?. సోషల్ మీడియా ప్రపంచవ్యాప్తంగా ఉన్న వ్యవస్థ. అమెరికాలో ఉన్నవాడు కామెంట్ పెడితే.. ఎలా శిక్షిస్తారు? రేవంత్ చెప్పాలి.గాసిప్స్ బంద్ చేసి.. రేవంత్ రెడ్డి గవర్నరెన్స్ పై దృష్టి పెట్టాలి. కుటుంబాలు మాకు లేవా?. పిల్లలు మాకు లేరా? రేవంత్‌కే ఉన్నారా?. నాకు అడ్డమైన వారితో లింకులు పెట్టిన నాడు.. మా కుటుంబాలు బాధ పడలేదా?. ఢిల్లీలో రేవంత్ రెడ్డి దూకిన గోడలు, హైదరాబాద్‌లో దాటిన రేఖలు బయట పెట్టాలా?. రేవంత్ రెడ్డి ఎక్కడెక్కడ గోడలు దూకుతాడో మాకు తెలియదా?. సాగర్ సొసైటీలో ఎంత సమయం గడిపేవాడో కూడా తెలుసు. బీజేపీ నేతల బాగోతాలు కూడా నా దగ్గర ఉన్నాయి. పదేళ్లు అధికారంలో ఉన్న మాకు ఎవరు ఏంటో అన్నీ తెలుసు. సమయం వచ్చినప్పుడు అన్నీ బయటకు తీస్తాం’ అంటూ ఆసక్తికర కామెంట్స్ చేశారు. -
సీఎం రేవంత్ రెడ్డి కి కేసీఆర్ ఫీవర్ పట్టుకుంది: కవిత
-
షుగర్స్ పునఃప్రారంభంలో ని‘జామ్’!
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు నిజాం షుగర్స్ పునఃప్రారంభానికి రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగులు వేసినప్పటికీ.. మళ్లీ సందిగ్ధం నెలకొంది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిటీ కొంత ప్రక్రియ పూర్తి చేసింది. ప్రైవేటు యాజమాన్యం పరిధిలోని ఈ ఫ్యాక్టరీకి చెందిన రూ.400 కోట్ల బ్యాంకుల బకాయిలకు సంబంధించి, వన్‌టైం సెటిల్మెంట్ కింద రాష్ట్ర ప్రభుత్వం రూ.190 కోట్లు చెల్లించింది. 2025 డిసెంబర్ నాటికి ఫ్యాక్టరీని తెరిపిస్తామని ప్రకటించినప్పటికీ.. అది మరింత ఆలస్యమయ్యే పరిస్థితి కనిపిస్తోంది. ఆలస్యంగానైనా.. పబ్లిక్ సెక్టార్‌లోనా, ప్రైవేటు సెక్టార్‌లోనా, సహకార విధానంలో ప్రారంభిస్తారా? అనే అంశంపై కూడా స్పష్టత లేకుండా పోయింది. మరోవైపు క్షేత్రస్థాయిలో సన్నద్ధత విషయంలో ఇప్పటికీ గందరగోళమే నడుస్తోంది. ఎందుకంటే ఈ ఏడాది క్రషింగ్ సీజన్ (అక్టోబర్ నుంచి డిసెంబర్) నాటికి సాధ్యమయ్యే పరిస్థితులు లేవు. ప్రభుత్వం నుంచి సైతం స్పష్టమైన ప్రకటన రావడం లేదు. బోధన్ ఫ్యాక్టరీని మరో చోటికి తరలించి.. కొత్త యంత్రాలతో నడిపించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు చర్చ జరుగుతోంది. రైతులతో విడతల వారీగా కమిటీ చర్చలు రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ప్రత్యేక కమిటీలో సభ్యుడైన మాజీ మంత్రి, బోధన్ ఎమ్మెల్యే పొద్దుటూరి సుదర్శన్‌రెడ్డి ఆధ్వర్యంలో కమిటీ రైతులతో విడతలవారీగా ముఖాముఖి చర్చలు జరిపింది. చెరుకు సాగును ప్రోత్సహించేందుకు అవగాహన సదస్సులు నిర్వహించారు. వ్యవసాయ శాస్త్రవేత్తలు, షుగర్ కేన్ బోర్డు రాష్ట్ర స్థాయి అధికారులు పాల్గొన్నారు. మరోవైపు ప్రస్తుతం ఫ్యాక్టరీ స్థితిగతులు, యంత్రాల పరిస్థితిని నిపుణుల బృందం పరిశీలిస్తోంది. తరువాత వారి నివేదిక మేరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. నిపుణుల బృందం నివేదిక ప్రభుత్వం వద్దకు వెళ్లి దని ప్రచారం జరుగుతోంది. నివేదికలో ఏముందో బయటకు రాలేదు. మరోవైపు చెరుకు సాగుపై రైతులు అంతగా ఆసక్తి చూపడం లేదు. ఈ క్రమంలో ప్రభుత్వం విధానపరంగా ఫ్యాక్టరీ పునఃప్రారంభం విషయమై స్పష్టత ఇవ్వలేదు. రైతులు గణనీయమైన స్థాయిలో చెరుకు పంటను పండించేందుకు సంసిద్ధత వ్యక్తం చేస్తేనే.. షుగర్ ఫ్యాక్టరీని పునఃప్రారంభించే పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో పునఃప్రారంభానికి అడుగులు మరింతగా పడాలంటే చెరుకు సాగు విస్తీర్ణమే ప్రధానం కానుంది. బోధన్ (ఉమ్మడి నిజామాబాద్), మంబోజిపల్లి (ఉమ్మడి మెదక్), ముత్యంపేట (ఉమ్మడి కరీంనగర్) జిల్లాల్లో నిజాం డెక్కన్ షుగర్ ఫ్యాక్టరీలున్నాయి. 2002లో ప్రైవేటుకు విక్రయించిన చంద్రబాబు ప్రభుత్వం.. నిజాం షుగర్స్ యూనిట్లను 2002లో డెల్టా పేపర్ మిల్స్ అనే ప్రైవేటు సంస్థకు అప్పటి చంద్రబాబు ప్రభుత్వం విక్రయించింది. 2014లో ఎన్నికల ప్రచారంలో కేసీఆర్ నిజాం షుగర్స్‌ను ప్రభుత్వపరం చేస్తామని హామీ ఇచ్చారు. కాగా 2015 డిసెంబర్ 23న ఫ్యాక్టరీ మూడు యూనిట్లకు లేఆఫ్ ప్రకటించారు. 2005–06లో చెరుకు దిగుబడి 35 వేల టన్నులున్నప్పటికీ నడిపిన ఈ కర్మాగారాలను.. 2015లో దిగుబడి లక్ష టన్నులకు పెరిగినా మూసేయడం గమనార్హం. దీంతో రైతులు వరి పంట వైపు మళ్లారు. నిజాం షుగర్స్ ఫ్యాక్టరీలున్న బోధన్, ముత్యంపేట, మంబోజిపల్లి ప్రాంతాల్లో రైతులు గణనీయమైన విస్తీర్ణంలో చెరుకు పంట పండించేందుకు ముందుకు వస్తేనే.. ప్రభుత్వం ఫ్యాక్టరీల పునఃప్రారంభం విషయంలో మరింత వేగంగా ముందుకెళ్లే పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో రైతులు చెరుకు సాగు చేయడంపై ఆసక్తి నెలకొంది. -
కేసీఆర్ పాపాల చిట్టా విప్పుతా: సీఎం రేవంత్
సాక్షిప్రతినిధి, వరంగల్: ‘అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో కేసీఆర్, ఆయన ప్రభుత్వంలో జరిగిన పాపాల చిట్టా విప్పుతా..19, 20 తేదీల్లో బట్టబయలు చేస్తా. ఇప్పటివరకు చెప్పింది ఇంటర్వెల్ వరకే...అసలు సినిమా ముందుంది. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను ధనిక రాష్ట్రంగా చేతుల బెడితే పదేళ్లలో రూ.8.29 లక్షల కోట్ల అప్పులు చేశారు. అవినీతికి పాల్పడ్డారు. రూ.లక్ష కోట్లు వెనకేసుకున్నారు. అప్పులకు అసలు, మిత్తీ కలిపి ఏడాదిలో రూ.1.53 లక్షల కోట్లు మా ప్రభుత్వం కట్టింది. ఆ డబ్బే ఉంటే రాష్ట్రంలో 30 లక్షల మంది పేదలకు ఇందిరమ్మ ఇళ్లు పూర్తయ్యేవి..’ అని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. ఆదివారం జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్ శివారు శివునిపల్లిలో జరిగిన ‘ప్రజాపాలన ప్రగతి బాట’ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. సుమారు రూ.800 కోట్ల విలువైన పలు అభివృద్ధి, సంక్షేమ పథకాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవం చేశారు. అనంతరం ఎమ్మెల్యే కడియం శ్రీహరి అధ్యక్షతన నిర్వహించిన బహిరంగ సభలో ప్రసంగించారు. అప్పుల్లోనే పథకాల అమలు ‘కేసీఆర్ పాలించిన ఆ పదేళ్లలో ధనిక రాష్ట్రం అప్పుల కుప్పయ్యింది. దివాళా తీసిన రాష్ట్రాన్ని మాకు అప్పజెప్పారు. ఆనాడు నెలకు అసలు, వడ్డీ కలిపి రూ.500 కోట్ల అప్పు ఉంటే ఈనాడు ప్రతినెలా వడ్డీ రూ.6,500 కోట్లు కట్టాల్సిన దుస్థితి వచ్చింది. కేసీఆర్ పాలనలో రూ.8.29 లక్షల కోట్లు అప్పు తేలింది. అయినా అధికారంలోకి వచ్చిన రెండురోజుల్లోనే ఎన్నికల్లో హామీ ఇచ్చిన ‘ఆడబిడ్డలకు ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణం’ అమలు చేశాం. ఈ మహాలక్ష్మి పథకంతో నేటికి 150 కోట్ల మంది ఆడబిడ్డలకు గాను రూ.5,005 కోట్లు ఖర్చు చేశాం. 50 లక్షల పేదల ఇళ్లకు 200 యూనిట్ల ఉచిత కరెంటుతో పాటు వ్యవసాయానికి ఉచిత కరెంటు అందిస్తున్నాం. అప్పుల పాలైన రాష్ట్రంలోనే రూ.500కే గ్యాస్ సిలిండర్, 25.35 లక్షల మంది రైతులకు రూ.20,617 కోట్ల పంట రుణమాఫీకి శ్రీకారం చుట్టాం..’ అని ముఖ్యమంత్రి చెప్పారు. ప్రాజెక్టులు, పథకాలపై చర్చకు రావాలి ‘కృష్టా, గోదావరి జలాల ప్రాజ్టెక్టులపై రూ.1.81 లక్షల కోట్లు ఖర్చు పెడితే.. అందులో రూ.1.02 లక్షల కోట్లతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు మూడేళ్లకే కూలిపోయి కూలేశ్వరంగా మారింది. తాటిచెట్టులా పెరిగిండ్రు కానీ ఆవకాయ అంత కూడా ఆయన మెదడులో తెలివి లేదు.. నేను హరీశ్‌రావుకు సవాల్ విసురుతున్నా. కాంగ్రెస్ హయాంలో నిర్మించిన ప్రాజెక్టులపై చర్చకు రావాలి. 300 టీఎంసీలతో శ్రీరాంసాగర్, 200 టీఎంసీల నాగార్జునసాగర్ వంటి ప్రాజెక్టులతో పాటు జూరాల, నెట్టెంపాడు, దేవాదుల, రాజీవ్, ఇందిరాసాగర్, శ్రీపాద ఎల్లంపల్లి వంటి పక్కా శాశ్వత ప్రాతిపదికన నిర్మించిన ప్రాజెక్టులు కాంగ్రెస్ పారదర్శక పాలనకు అద్దం పడతాయి. కాంగ్రెస్ ప్రాజెక్టులతోనే తెలంగాణ సస్యశ్యామలమవుతోంది. కేసీఆర్ కట్టిన కాళేశ్వరంతో సాగునీరు రాకున్నా కోటి 56 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వచ్చేలా తోడ్పాటు అందించాం. కొనుగోలు చేసిన ప్రతి క్వింటాల్‌కు రూ.500 బోనస్ ఇచ్చి అన్నదాతలను ఆదుకున్నాం. ఈ విషయాలపై విమర్శలు చేస్తున్న హరీశ్‌రావు, కేటీఆర్ పిల్లకాకులు. కేసీఆర్‌ను రమ్మన్నా..ఏ ప్రాజెక్టు వద్ద మాట్లాడుదాం రమ్మంటున్నా..’ అని రేవంత్ అన్నారు. జనగామ జిల్లా శివునిపల్లిలో మహిళా సంఘాలకు చెక్కు అందజేస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి, చిత్రంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, సీతక్క, కొండా సురేఖ, ఎంపీ కావ్య, ఎమ్మెల్యే కడియం శ్రీహరి తదితరులు ∙సభకు హాజరైన మహిళలు ఫామ్‌హౌస్‌లో పడుకొని ఉసిగొల్పుతుండు.. ‘అధికారం పోతే ప్రతిపక్ష పాత్ర పోషించకుండా కేసీఆర్ ఫామ్‌హౌస్‌లో పడుకొని ఉసిగొల్పుతుండు. అందుకే ఫామ్‌హౌస్‌లో నుంచి లేచి రమ్మన్నా. రూ.58 లక్షల ప్రజాధనం జీతభత్యాల కింద తీసుకున్నారు. ఏ రంగంలో జీతగాళ్లకైనా పని చేయకుంటే జీతం ఇస్తారా? అపార రాజకీయ అనుభవజు్ఞడైన కేసీఆర్ అ«ధికారం ఉంటే వస్తరు.. లేకుంటే అలిగి పండ్తరా? మీరైతే లక్షల కోట్లు సంపాదించి ఫామ్‌హౌస్‌లు, టీవీలు, పేపర్లు పెట్టుకున్నరు. నువ్వు గజ్వేల్, నీ కొడుకు జన్వాడ, నీ అల్లుడు మొయినాబాద్, నీ బిడ్డ శంకర్‌పల్లిలో ఫామ్‌హౌస్‌లు కట్టుకున్నరు. కానీ తెలంగాణ రైతులు ఉన్న భూములు అమ్ముకొని ఆత్మహత్యలకు పాల్పడుతుంటే మీరు క్యాప్సికమ్ పండించి కోట్లు సంపాదించిన తీరు వారికి, నిరుద్యోగ యువతకు చెప్పరా? అధికారం పోగానే దివిసీమ తుపాను బాధితుల కంటే ఎక్కువ ఆందోళనలో కేసీఆర్ కుటుంబం ఉంది. కేసీఆర్‌ను తెలంగాణ జాతిపిత అని హరీశ్‌రావు అంటున్నడు. జాతిపితకు, కేసీఆర్‌కు ఏమైనా పోలిక ఉందా? అసలైన జాతిపితకు మందు వాసన తెలుసా? అసలైన జాతిపిత దళిత వాడల్లో జీవితం గడిపితే.. హరీశ్‌రావు చెప్పే జాతిపిత ఫామ్‌హౌస్‌లో పడుకుంటున్నారు. తెలంగాణ జాతిపితలంటే కొండా లక్ష్మణ్ బాపూజీ, ప్రొ.జయశంకర్..’ అని సీఎం పేర్కొన్నారు. మా మీద ప్రజలకు కోపం ఎందుకుంటుంది... ‘ఎన్ని కష్టాలున్నా రాష్ట్రాన్ని పురోగతిలోకి తీసుకెళ్లే పయనంలో మహిళల అభ్యున్నతికి పాటు పడుతుంటే మాపై ప్రజలకు కోపం ఉందని చెబుతున్నారు. మాపై కోపం ఎందుకు ఉంటుంది? 65 లక్షల మందికి సారెచీర ఇచ్చినందుకా? వెయ్యి సమాఖ్యలకు ఆర్టీసీ బస్సులు ఇచ్చినందుకా? 1000 మెగావాట్ల సోలార్ విద్యుత్ తయారీతో శ్రీమంతులు చేసినందుకా? రూ.20,617 కోట్ల పంట రుణమాఫీ చేసినందుకా? రూ.500 బోనస్ ఇస్తూ రైతు భరోసా రూ.12 వేలకు పెంచినందుకా? మీడియా మిత్రులకు ఇళ్లపట్టాలు ఇచ్చినందుకా?..’ అని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఉన్న దొంగలకు ఉప్పు పాతర వేస్తా అన్నందుకు దోపిడీ వర్గాలకు నాపై కోపం ఉంటుంది తప్ప ప్రజలకు ఉండదన్నారు. దోచుకున్న డబ్బుతో ప్రభుత్వాన్ని కూల్చాలని చూస్తున్నారు: పొంగులేటి ‘గత బీఆర్ఎస్ పాలకులు రూ.లక్ష కోట్లు దోచుకున్నారు. దోచుకున్న డబ్బులతో ఇందిరమ్మ ప్రభుత్వాన్ని కూలగొట్టాలని చూస్తున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మాతో టచ్‌లో ఉన్నారని అసత్యాలు ప్రచారం చేస్తున్నారు..’ అని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఆరోపించారు. ప్రజలు రెండుసార్లు కర్రు కాల్చి వాత పెట్టినా బుద్ధి రావట్లేదన్నారు. సభలో మంత్రులు సీతక్క, కొండా సురేఖ, ఎంపీలు కడియం కావ్య, చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, బలరాం నాయక్, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు కేఆర్ నాగరాజు, నాయిని రాజేందర్‌రెడ్డి, రామచంద్రునాయక్, యశస్విని రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
సినిమాల్లోకి ఎంట్రీ.. జగ్గారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: గత మూడు నెలల క్రితం డైరెక్టర్ రామానుజం తనకు చూపిన ఫోటో చూసి కనెక్ట్ అయ్యానని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. 2013 నుంచి తనలాంటి వ్యక్తి కోసం చూస్తున్నానని.. టైం ఇస్తారా అని డైరెక్టర్ అడగగానే... టైం ఇవ్వలేనేమోననుకున్నా.. కానీ ఆ తర్వాత డైరెక్టర్ చూపెట్టిన ఫోటో చూసి ఇది కచ్చితంగా చేయాలని డిసైడ్ అయ్యా’’ అని జగ్గారెడ్డి చెప్పారు.‘‘ఏ వార్ ఆఫ్ లవ్’ క్యాప్షన్‌ను డైరెక్టర్ ముందే రాసుకున్నారు. నా కథకు, లవ్‌కు సంబంధం లేదు. కథ చెప్పే క్రమంలో స్టార్టింట్ అంతా డైరెక్టర్ చెప్పారు.. మిగతా అంతా నా లైఫ్‌లో జరిగిన కొన్ని విషయాలు చెప్పా. కొన్ని విషయాలలో డైరెక్టర్ కన్విన్స్ అయ్యారు. నేను సినిమాల్లోకి వెళ్లడానికి ఢిల్లీ టూర్ పనికొచ్చింది. నా రాజకీయానికి సంబంధం లేదు. నేను రాజకీయాల్లో ఉన్నా.. సినిమా ద్వారా కొత్త గా రాజకీయాల్లో అడ్వాంటేజ్ తీసుకునేదేమీలేదు’ అని జగ్గారెడ్డి చెప్పుకొచ్చారు.విద్యార్థి నేతగా, కౌన్సిలర్‌గా రోల్ ఉంటుంది. మున్సిపల్ ఛైర్మన్ ఎలా అయ్యాననేది ఇందులో చూపిస్తాం. లవ్, ఫ్యాక్షన్, ఎమోషన్ , పొలిటికల్‌గా సినిమా ఉంటుంది. ఢిల్లీ టూర్ నన్ను పూర్తి గా మార్చేసింది.. దీని పరిణామాలు ఎటు పోతాయో నాకు తెలియదు. సంగారెడ్డి అభివృద్ధిపై ఫోకస్ చేస్తూనే సినిమాపై దృష్టి పెడతా. మా ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి ఎక్కువ నిధులు సంగారెడ్డి తీసుకుపోయేందుకు ప్రయత్నం చేస్తా.. స్టేట్ పార్టీలో ఇప్పుడు నా అవసరం లేదు. ఉగాదికి నా సినిమా షూటింగ్ ప్రారంభమవుతుంది. సంగారెడ్డికి చెందిన మొగిలయ్య 18 ఏళ్ల క్రితం రాసిన పాటను విడుదల చేస్తాం’’ అని జగ్గారెడ్డి తెలిపారు. -
‘దోచుకున్న డబ్బుతో మా ప్రభుత్వాన్ని కూల్చాలని చూస్తున్నారు’
వరంగల్:: గత బీఆర్ఎస్ ప్రభుత్వం లక్ష కోట్ల రూపాయిలు దోచుకుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ దోచుకున్న డబ్బుతో ఇందిరమ్మ ప్రభుత్వాన్ని కూలగొట్టలాని బీఆర్ఎస్ నాయకులు చూస్తున్నారని మండిపడ్డారు. పలు అభివృద్ధి కార్యక్రమాలు, శంకుస్థాపనల్లో భాగంగా సీఎం రేవంత్ తో సహా కాంగ్రెస్ నేతలు వరంగల్ పర్యటనలో ఉన్నారు. దీనిలో భాగంగా పొంగులేటి శ్రీనివాస్.. బీఆర్ఎస్ లక్ష్యంగా విమర్శనాస్త్రాలు సంధించారు. ‘కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మాతో టచ్ లో ఉన్నారని అసత్యాలు ప్రచారం చేస్తున్నారు. రెండు సార్లు ప్రజలు కర్ర కాల్చి వాత పెట్టిన బుద్ధి రావట్లేదు.రాష్ట్ర విభజన జరిగిన నాడు తెలంగాణ ధనిక రాష్ట్రం. నిజాలు బయటపడతాయని కేసీఆర్ అసెంబ్లీలో మాట్లాడడు. బీఆర్ఎస్ శాసన సభ్యులు ఆహంకార పూరితంగా మాట్లాడుతున్నారు. అసెంబ్లీ బయట బావ, బామ్మర్ధులు సొల్లు మాటలు మాట్లాడుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో పంటలు ఎందుతున్నాయంటే దానికి కారకులు గత పాలకులే’ అని ధ్వజమెత్తారు పొంగులేటికాంగ్రెస్ అంటేనే సంక్షేమం.. సామాజిక న్యాయంఅసలు కాంగ్రెస్ అంటేనే సంక్షేమం, అభివృద్ధి, సామాజిక న్యాయమన్నారు మంత్రి సీతక్క. ఇంటింటికి ఒక్క ఉద్యోగం అని రంగుల ప్రపంచం కేసీఆర్ చూపించారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్12 నెలల్లోనే 57 వేల ఉద్యోగాలు ఇచ్చిందని, ఉద్యోగాలు ఇస్తుంటే కళ్లల్లో ప్రతిపక్షాలు నిప్పులు పోసుకుంటున్నాయన్నారు. సంవత్సరంలో రూ. 23, 600 కోట్లు వడ్డీ లేని రుణాలు మహిళా సంఘాలకు ఇచ్చాం. పరీక్షలు రాయకుండానే పేపర్లు లీకైన చరిత్ర బీఆర్ఎస్ ది. కాంగ్రెస్ పార్టీది త్యాగాల చరిత్ర. కడియం శ్రీహరి ఆధ్వర్యంలో స్టేసన్ ఘనపూర్ అభివ1ద్ధిలో అగ్రగామి అని సీతక్క స్పష్టం చేశారు. -
బీఆర్ఎస్, కాంగ్రెస్ సభ్యుల మధ్య వాగ్వాదం
-
అస్సాంలో అశాంతికి కాంగ్రెసే కారణం
దెర్గావ్జ్వాల్: అస్సాంలో శాంతియుత వాతావరణం నెలకొల్పి, మౌలిక వనరులను అభివృద్ధి చేసింది ప్రధాని మోదీయేనని హోం మంత్రి అమిత్ షా చెప్పారు. యువతకు ఉపాధి అవకాశాలను కల్పించిందని తెలిపారు. గత కాంగ్రెస్ ప్రభుత్వాలు రాష్ట్రంలో శాంతి నెలకొనకుండా అడ్డుకున్నాయని ఆయన ఆరోపించారు. అప్పట్లో రాష్ట్రానికి ఎటువంటి గ్రాంట్లు అందకపోవడంతో ఆందోళనలు, హింసాత్మక కార్యక్రమాలకు, వెనుకబాటుకు మారుపేరుగా మారిందని విమర్శించారు.శనివారం మంత్రి అమిత్ షా గోలాఘాట్ జిల్లా దెర్గావ్లోని లచిత్ బార్‌పుకాన్ పోలీస్ అకాడెమీ పునరుద్ధరణ మొదటి దశ పనులను ప్రారంభించడంతోపాటు రెండో దశ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ‘అస్సాంలో 10 వేల మందికి పైగా యువకులు ఆయుధాలు వదిలేసి జనజీవన స్రవంతిలో కలిశారు. దీంతో గత పదేళ్లుగా రాష్ట్రంలో శాంతి నెలకొంది. ఆందోళనలు, హింస, వేర్పాటువాదానికి పేరున్న అస్సాంలో నేడు రూ.27 వేల కోట్లకు పైగా పెట్టుబడితో అత్యాధునిక సెమీ కండక్టర్ పరిశ్రమ నడుస్తోంది. ఇది అస్సాం భవిష్యత్తునే మార్చనుంది’అని అన్నారు.ఇటీవల ముగిసిన అడ్వాంటేజ్ అస్సాం 2.0లో మరో రూ.3 లక్షల కోట్ల విలువైన పెట్టుబడుల ప్రతిపాదనలు అందాయి. ఇవి ఏర్పాటైతే యువతకు ఎన్నో అవకాశాలు అందుబాటులోకి వస్తాయి’అని మంత్రి చెప్పారు. మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్‌లతో ఉన్న సరిహద్దు వివాదాలను పరిష్కరించామన్నారు. విద్యార్థిగా ఉండగా అస్సాంకు వచ్చినప్పుడు జరిగిన పరిణామాలను ఆయన గుర్తు చేసుకుంటూ.. ‘అప్పట్లో కాంగ్రెస్ నేత హితేశ్వర్ సైకియా సీఎంగా ఉండేవారు. ఆందోళనల్లో పాల్గొన్న విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జి చేశారు. అరెస్టయిన వారిలో నేనూ ఉన్నా. అస్సాం జైలులో వారం పాటు నన్ను ఉంచారు’అని తెలిపారు.అప్పటి కాంగ్రెస్ హయాంతో, ఇప్పటి బీజేపీ పాలనతో పోల్చుకుంటే అస్సాంలో గుర్తు పట్టలేనన్ని మార్పులు సంభవించాయన్నారు. వచ్చే ఐదేళ్లలో లచిత్ బార్‌పుకాన్ పోలీస్ అకాడెమీ దేశంలోనే అగ్రగామిగా మారనుందని చెప్పారు. అనంతరం అమిత్ షా మిజోరం రాజధాని ఐజ్వాల్‌లో అస్సాం రైఫిల్స్ క్యాంప్‌లో జరిగిన కార్యక్రమంలో మాట్లాడారు. మిజోరంలో అభివృద్ధి పనుల పురోగతిపై స్వయంగా ప్రధాని మోదీయే సమీక్ష చేస్తున్నారని ఆయన అన్నారు.అస్సాం రైఫిల్స్ క్యాంప్‌ను ఐజ్వాల్ వెలుపలికి మార్చడం కీలక పరిణామంగా పేర్కొన్నారు. మిజో ప్రజల అభీష్టానికి అనుగుణంగా కేంద్రం పనిచేస్తుందనడానికి ఇదే ఉదాహరణ అని ఆయన తెలిపారు. 2014కు పూర్వం ప్రధానమంత్రులంతా కలిసి ఈశాన్య రాష్ట్రాలకు వచ్చింది 21 సార్లు మాత్రమే రాగా, ప్రధాని మోదీ ఈ ప్రాంతంలో 78 పర్యాయాలు పర్యటించారని అమిత్ షా చెప్పారు. -
సీఎం ప్రసంగాన్ని బహిష్కరించిన బీఆర్ఎస్
సాక్షి, హైదరాబాద్: గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై శాసనసభలో జరిగిన చర్చలో సీఎం రేవంత్‌రెడ్డి ప్రసంగాన్ని బీఆర్ఎస్ బహిష్కరించింది. పదేళ్లు ముఖ్యమంత్రిగా రాష్ట్ర పురోగతి కోసం శ్రమించిన కేసీఆర్ చావును రేవంత్ రెడ్డి కోరుకున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాణాలు ఫణంగా పెట్టి తెలంగాణ సాధించిన కేసీఆర్ చావును కోరుకోవడం దారుణమన్నారు. కేసీఆర్‌పై రేవంత్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగానే ముఖ్యమంత్రి ప్రసంగాన్ని బహిష్కరించామని బీఆర్ఎస్ సభ్యుడు హరీశ్‌రావు అసెంబ్లీ లాబీల్లో వ్యాఖ్యానించారు. ఉత్తమ్‌వి పచ్చి అబద్ధాలు కృష్ణా జలాల్లో తెలంగాణకు జరిగిన అన్యాయానికి కాంగ్రెస్ పార్టీనే కారణమని హరీశ్‌రావు విమర్శించారు. సీఎం ప్రసంగాన్ని బహిష్కరించిన అనంతరం అసెంబ్లీ లాబీలో ఆయన మీడియాతో ఇష్టాగోష్టి నిర్వహించారు. ‘నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి అసెంబ్లీలో పచ్చి అబద్ధాలు మాట్లాడారు. కాంగ్రెస్ నిర్లక్ష్యం వహించి ప్రాజెక్టులు నిర్మించకపోవడం వల్లే కృష్ణా జలాల్లో తెలంగాణకు 299 టీఎంసీలను పంపిణీ చేశారు. నాడు కృష్ణా జలాల్లో తెలంగాణకు తాత్కాలిక కేటాయింపులు మాత్రమే జరిగాయి. ఇటీవల తెలంగాణ అధికారులు రాహుల్ బొజ్జా, అనిల్ కుమార్ ఢిల్లీకి వెళ్లి 299 టీఎంసీలకు ఎందుకు ఒప్పుకుని వచ్చారు’అని హరీశ్ అన్నారు. ‘పోతిరెడ్డిపాడు ప్రాజెక్టుతో జరిగే అన్యాయంపై నాడు కాంగ్రెస్ నాయకులు పి.జనార్దన్‌రెడ్డి ఒక్కరే కొట్లాడారు. నాడు నాతోపాటు ఆరుగురు కాంగ్రెస్ మంత్రివర్గం నుంచి బయటకు వచ్చాం. కానీ ఉత్తమ్‌కుమార్ రెడ్డి.. కిరణ్‌కుమార్‌రెడ్డి మంత్రివర్గంలో చోటుకోసం నోరు మూసుకున్నారు. ఆయనది ద్రోహ చరిత్ర అయితే బీఆర్ఎస్ది త్యాగాల చరిత్ర. ఉత్తమ్ దంపతులు ఏపీ సీఎం చంద్రబాబు దగ్గరకు వెళ్లి భోజనం చేసి వచ్చి కృష్ణా నీటిలో తెలంగాణకు అన్యాయం చేశారు. సీతారామ ప్రాజెక్టుతో ఖమ్మం జిల్లాకు కేసీఆర్ నీళ్లు ఇస్తే.. హుజూర్‌నగర్‌ను ముంచి పులిచింతల ద్వారా ఆంధ్రాలో మూడో పంటకు నీళ్లు ఇచ్చిన ఘనులు కాంగ్రెస్ నాయకులు’అని హరీశ్‌రావు మండిపడ్డారు. సీఎం వ్యాఖ్యలను ఖండిస్తున్నాం ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు కోసం ఎన్నో త్యాగాలు చేసిన మాజీ సీఎం కేసీఆర్ మార్చురీకి పోతారని సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తీవ్రంగా ఖండించారు. శనివారం సీఎం ప్రసంగాన్ని బహిష్కరించిన అనంతరం మీడియా పాయింట్ వద్ద వేముల ప్రశాంత్‌రెడ్డి, కేపీ వివేకానంద, పల్లా రాజేశ్వరరెడ్డి మాట్లాడారు. కేసీఆర్‌ను కించపరచడం తప్ప సీఎం 3 గంటల పాటు అసెంబ్లీలో మాట్లాడిందేమీ లేదన్నారు. రాజముద్ర నుండి చార్మినార్, కాకతీయుల కళాతోరణం తీసే ప్రయత్నం జరుగుతోందని, దీనిని అడ్డుకుని తీరుతామని హెచ్చరించారు. జగదీశ్‌రెడ్డిపై సస్పెన్షన్ ఎత్తివేయండి బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డిపై విధించిన సస్పెన్షన్‌ను ఎత్తివేయాలని బీఆర్ఎస్ శాసనసభాపక్షం విజ్ఞప్తి చేసింది. హరీశ్‌రావు నేతృత్వంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు శనివారం స్పీకర్ చాంబర్లో శాసనసభాపతి గడ్డం ప్రసాద్‌కుమార్‌తో భేటీ అయ్యారు. సీనియర్ సభ్యుడైన జగదీశ్‌రెడ్డి స్పీకర్ పట్ల అమర్యాదగా ప్రవర్తించలేదనే విషయాన్ని హరీశ్‌రావు ప్రస్తావించారు. జగదీశ్‌రెడ్డిని సస్పెండ్ చేసే అంశంలో విపక్ష ఫ్లోర్ లీడర్ల అభిప్రాయం కోరలేదన్నారు. జగదీశ్‌రెడ్డి సస్పెన్షన్‌పై పునఃసమీక్షించి ఎత్తివేయాలని బీఆర్ఎస్ శాసనసభా పక్షం స్పీకర్‌కు విజ్ఞప్తి చేసింది. సభ ప్రారంభమైన తర్వాత హరీశ్‌రావు ఇదే విషయాన్ని మరోమారు అసెంబ్లీ దృష్టికి తీసుకొచ్చి సస్పెన్షన్ ఎత్తివేయాలని స్పీకర్‌ను కోరారు. -
పల్లా వర్సెస్ మంత్రులు
సాక్షి, హైదరాబాద్: గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై శనివారం శాసనసభలో జరిగిన చర్చలో హామీల అమలుతోపాటు పాలనలో ప్రభుత్వం విఫలమైందని బీఆర్ఎస్ సభ్యుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి దాడి చేయగా.. ఆయన చెప్పినవన్నీ అవాస్తవాలేనని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతోపాటు మంత్రులు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్ తీవ్రస్థాయిలో ప్రతిదాడి చేశారు. పల్లా రాజేశ్వర్‌రెడ్డి వరుస ఆరోపణలు చేస్తుండగా మంత్రులు పదేపదే కల్పించుకుని సమాధానాలిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన హామీల అమలుపై బీఆర్ఎస్ నేతలు వాస్తవాలను వక్రీకరించి ప్రచారం చేస్తున్నారని భట్టి విక్రమార్క మండిపడ్డారు. పల్లా సొంత నియోజకవర్గం జనగామలో 2018లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఐదేళ్లలో రూ.124 కోట్ల రుణమాఫీ చేస్తే.. తాము మూడు నెలల్లోనే రూ.263 కోట్లు మాఫీ చేశామన్నారు. మా సీఎం కూడా మీ సీఎంలాగే ఉండాలా?: భట్టి సీఎం రేవంత్‌రెడ్డి వద్దే విద్యా శాఖ ఉండడంతో పర్యవేక్షణ కొరవడిందని, 2 లక్షలమంది విద్యార్థులు డ్రాపౌట్ అయ్యా రని పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఆరోపణలు చేయగా, భట్టి విక్రమార్క తీవ్రస్థాయిలో ఖండించారు. మీ సీఎం (కేసీఆర్) తరహాలోనే మా సీఎం ఉండాలని ఊహించుకుంటే ఎలా? అని మండిపడ్డారు. సీఎం రేవంత్ డీఎస్సీతో 11వేల టీచర్ పోస్టులను భర్తీ చేశారని, 22వేల మంది టీచర్లకు పదోన్నతులు ఇచ్చారని, 36 వేల మంది టీచర్లకు బదిలీలు కల్పించారన్నారు. గత ప్రభుత్వం వర్సిటీలను గాలికి వదిలేస్తే, 12 మంది వీసీలను నియమించారన్నారు. మహిళా వర్సిటీకి వీరనారి చాకలి ఐలమ్మ పేరు పెట్టడంతోపాటు నిర్మాణానికి రేవంత్ రూ.540 కోట్లు మంజూరు చేయాలని ఆదేశించారన్నారు. గత ప్రభుత్వం మీకు (పల్లాకు), ఇతరులకు ప్రైవేటు వర్సిటీలను ధారాదత్తం చేస్తే వాటికి దీటుగా తాము ప్రభుత్వ వర్సిటీలను తీర్చిదిద్దుతున్నామన్నారు. బీఆర్ఎస్ ధోరణితోనే అన్యాయం: మంత్రి ఉత్తమ్ గత బీఆర్ఎస్ ప్రభుత్వ ధోరణితోనే రాష్ట్రానికి కృష్ణా జలాల విషయంలో తీరని నష్టం జరిగిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రత్యారోపణలు చేశారు. రాయలసీమ ఎత్తిపోతల నిర్మాణం, పోతిరెడ్డిపాడు, ముచ్చుమర్రి, మల్యాల సామర్థ్యం పెంపు విషయంలో ఏపీకి గత బీఆర్ఎస్ ప్రభుత్వం సహకరించిందన్నారు. తాము కేంద్రం, కృష్ణా బోర్డుతో కొట్లాడి సాగర్ కుడి కాల్వకు ఏపీ తీసుకుంటున్న జలాలను 10వేల నుంచి 5వేల క్యూసెక్కులకు తగ్గించామన్నారు. మంత్రి డి.శ్రీధర్‌బాబు మాట్లాడుతూ.. గత పదేళ్లలో ఒక్కసారి కూడా కాకతీయ ఉత్సవాలు నిర్వహించని బీఆర్ఎస్ వాళ్లు చరిత్రను వక్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ఒకేసారి రుణమాఫీ చేశామని, రైతులందరికీ బోనస్ చెల్లించామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. మహిళా జర్నలిస్టు ‘ఎక్స్’లో పెట్టిన వీడియోలోని భాషను చూసి కూడా ఆమెను సమరి్థస్తారా? అని పల్లా రాజేశ్వర్ రెడ్డిపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 100% రుణమాఫీ జరిగితే ముక్కును నేలకు రాస్తా: పల్లా రైతు రుణమాఫీ 50 శాతంలోపే జరిగిందని పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆరోపించారు. జనగామతోపాటు భట్టి నియోజకవర్గం మధిరలోని ఏ ఒక్క గ్రామంలోనైనా 100శాతం రుణమాఫీ జరిగితే తాను ముక్కును నేలకు రాసి, రాజీనామా చేస్తానని ప్రకటించారు. 27 శాతం మంది రైతులకే బోనస్ లభించిందని, ఏడాదిలో 564 మంది రైతులు, 116 మంది ఆటోడ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారని, గురుకులాల్లో 83 మంది విద్యార్థులు చనిపోయారని ఆరోపించారు. కరెంట్ కోతలపై ప్రశ్నించిన మహిళా జర్నలిస్టుపై కేసు పెట్టారని, అరెస్టైన జర్నలిస్టులు రేవతి, తన్వి యాదవ్‌ని విడుదల చేయాలన్నా రు. కాకతీయ కళాతోరణం, చారి్మనార్‌ను రాష్ట్ర చిహ్నం నుంచి తొలగిస్తే పోరాడతామన్నారు. తెలంగాణ తల్లి సాధారణంగా ఉండాలని, నగలు, వడ్డాణం ఉండకూడదని చెప్పేటోళ్లు రూ.కోట్ల వాచీలు, వారి కుటుంబ సభ్యులు ఖరీదైన నగలు ధరిస్తున్నారన్నారు. ఏడాదిలో కాంగ్రెస్ ప్రభుత్వం రూ.లక్షా 55వేల కోట్ల అప్పులు చేసిందని ధ్వజమెత్తారు. -
డిప్యూటీ సీఎం ప్రమోషన్ కొట్టాలని ప్రయత్నిస్తున్నారా ? : ప్రశాంత్ రెడ్డి
-
TS Assembly: తెలంగాణ శాసన సభ ఎల్లుండికి వాయిదా
హైదరాబాద్, సాక్షి: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మూడో రోజు కూడా హాట్ హాట్‌గా సాగుతున్నాయి. గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై శనివారం చర్చ జరిగింది. రుణమాఫీ, బకాయిల చెల్లింపు అంశాలపై అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష బీఆర్ఎస్ పోటాపోటీ విమర్శలు వెల్లువెత్తాయి. అనంతరం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గవర్నర్ ప్రసంగ తీర్మానంపై సమాధానమిచ్చారు. :తెలంగాణ శాసన సభ ఎల్లుండి( సోమవారానికి) వాయిదాతెలంగాణ శాసన సభలో పొట్టి శ్రీరాములు అమెండ్మెంట్ బిల్లును ప్రవేశపెట్టిన ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగంరుణమాఫీ చరిత్రలో మిగిలిపోయే అంశం.ఇప్పుడు కాళేశ్వరం నీళ్ళు రాకున్నా అత్యధిక ధాన్యం ఉత్పత్తి చేశాం.క్వింటాల్ కి 10 కిలోల తరుగు పేరిట కోట్లు కొల్లగోట్టారు.తరుగు తీస్తే.. తొలు తీస్తాం అని మేము చెప్పాం.కృష్ణ బేసిన్లో 299 టీఎంసీ లు చాలు అని సంతకం చేసి తెలంగాణకు మరణశాసనం రాసింది కేసీఆర్.. ఇది నిజం కదా..?వైఎస్సార్ ఆశీర్వాదంతో కేసీఆర్ కేంద్రంలో మంత్రి అయ్యారు.అప్పటి కేంద్ర మంత్రి కేసీఆర్, రాష్ట్ర మంత్రి హరీష్ రావు అడ్డుకుంటే పోతురెడ్డి పాడు పెద్దది అయ్యేదా..?కేసీఆర్ ఏడాది నుంచి 55 లక్షల జీతం జీతం తీసుకొని.. సభకు వచ్చింది రెండు రోజులు మాత్రమే.సీఎం రేవంత్ ప్రసంగంరైతులకు రుణమాఫీ చేసిందే కాంగ్రెస్సన్నవడ్లకు రూ.500 బోనస్ ఇచ్చాంగత ప్రభుత్వం మిల్లర్లతో కుమ్మక్కై అన్యాయం చేసిందిమార్చి 31వ తేదీ నాటికి రైతులందరినీ భరోసా అందిస్తాంఅధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే రూ.20 వేల కోట్ల రుణమాఫీ చేశాంరైతులు పండించిన పంట మొత్తం కొనుగోలు చేస్తామని చెప్పాంవరి వేస్తే.. ఉరి వేసుకున్నట్లేనని కేసీఆర్ అన్నారుగతంలో ఎక్కడ పంట పండినా.. కాళేశ్వరం వల్లే అని చెప్పుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగంకేబినెట్ విధానాలనే గవర్నర్ ప్రసంగిస్తారు.. మేము ఎన్నికల్లో ఇచ్చిన హామీలనే గవర్నర్ ప్రసంగంలో చేర్చాం ఈ మాత్రం అవగాహన లేకుండా మంత్రులుగా ఎలా చేశారో తెలియడం లేదు ఇష్టారీతిలో మాట్లాడి సభ నుంచి వెళ్లిపోతే.. భవిష్యత్‌లో కూడా బీఆర్ఎస్కు సున్నానే వస్తది బీఆర్ఎస్ బాయ్కాట్మాజీ సీఎం కేసీఆర్‌పై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు బీఆర్ఎస్ నిరసనరేవంత్ ప్రసంగం కొనసాగుతున్న వేళ సభ నుంచి బాయ్‌కాట్ గవర్నర్ ప్రసంగ ధన్యవాద తీర్మానంపై సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగం 2022లో గవర్నర్ ప్రసంగం లేకుండానే బీఆర్ఎస్ ప్రభుత్వం బడ్జెట్ సమావేశాలు నిర్వహించింది ఆ తర్వాత కోర్టు కఠినంగా వ్యవహరించడంతో గవర్నర్ ప్రసంగం చేర్చారుఓ గవర్నర్ అందునా మహిళా గవర్నర్‌ను బీఆర్ఎస్ ప్రభుత్వం హేళన చేసింది మేము రాజ్యంగబద్ద వ్యవస్థ కు గౌరవం ఇస్తాంగవర్నర్ ప్రసంగం.. గాంధీ భవన్ ప్రసంగంలా ఉందని కొందరు హేళన చేస్తున్నారుఅజ్ణానమే కొందరు విజ్ణానం గా భావిస్తున్నారు. శాసనసభలో ఉత్తమ్ కుమార్ రెడ్డి..కృష్ణ బేసిన్ ప్రాజెక్టుల్లో తెలిమెట్రీలను పెట్టిస్తాం గత ప్రభుత్వం పదేళ్ల నిర్లక్ష్యం వల్ల ఏపీ అక్రమంగా నీళ్లు తీసుకుపోయింది కృష్ణ జలాలు అక్రమంగా తరలిపోవడానికి గత ప్రభుత్వం సహకారం ఉంది. కృష్ణా బేసిన్ లో నీళ్ల వాటా కోసం మేము పోరాటం చేస్తాంబకాయిల పాపం ఎవరిది?: మంత్రి శ్రీధర్ బాబుబకాయిలు ఏ సంవత్సరం నుంచి ఉన్నాయి?పేరుకుపోయిన బకాయిలను 14 నెలల నుంచి చెల్లిస్తున్నాంప్రభుత్వంపై అసత్యాలు ప్రచారం చేయొద్దుబకాయిలంతా మీరు అధికారంలో ఉన్న సమయంలోవేమీరు పెండింగ్‌లో ఉంచిన బకాయిలను మేమే అధికారంలోకి వచ్చాక చెల్లించాముపళ్ల రాజేశ్వర్ రెడ్డి వాస్తవాలకు దగ్గరగా మాట్లాడాలిమీ ఇంజనీరింగ్ కాలేజ్‌లకు దీటుగా.. మేము మా ప్రభుత్వ కాలేజ్‌లను ముందుకు తీసుకవెళ్ళతాముఇంత బ్లైండ్‌గా మాట్లాడుతారనుకోలేదు: భట్టిమేం పనులు చేశాం.. మీలా ప్రచారాలు చేసుకోవడంలేదుఇచ్చిన మాట తప్పొద్దనే ఏడాదిలోపు రుణమాఫీ చేశాంఅన్ని గ్రామాల్లో ఆ జాబితా డిస్ప్లే చేస్తున్నాంపల్లా విద్యా సంస్థలు నడుపుతున్నారు. వాస్తవాలు చెబుతారని అనుకున్నాం.కానీ, ఇంతబ్లైండ్గా మాట్లాతారనుకోలేదుబీఆర్ఎస్ హయాంలో విద్యాశాఖను నిర్వీర్యం చేశారుబీఆర్ఎస్ పాలనలో డ్రాపౌట్స్ ఎందుకు పెరిగాయి?2 లక్షల మంది విద్యార్థులు ఎందుకు బడులు మానేశారు?మేం యూనివర్సిటీలను ధారదత్తం చేసి విద్యను అమ్ముకోలేదుటీచర్ రిక్రూట్మెంట్ ఎవరు ఇచ్చారు?ఇంకా 5, 6 మంది టీచర్లను రిక్రూట్ చేసుకుంటాంఒక్కసారైనా ఐటీఐల గురించి పట్టించుకున్నారా?. మేం అధికారంలోకి రాగానే వాటిని స్కిల్ సెంటర్లుగా మార్చాలని నిర్ణయించాం. మీలాగా గాలికి వదిలేయలేదుఅన్ని వర్సిటీలకు వీసీలను నియమించాంచాకలి ఐలమ్మ మహిళా యూనివర్సిటీకి వెళ్లి ఎప్పుడైనా చూశారా?వందేళ్ల చరిత్ర ఉన్న ఓయూకి మొదటిసారి దళిత వీసీని నియమించిన ఘనత రేవంత్రెడ్డిదేసీఎం ఎంత సీరియస్‌గా ఉన్నారో అర్థం చేసుకోండిమీరు చూసిన సీఎంలాగా ఇప్పటి సీఎం చేయరు ప్రభుత్వానికి BRS ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి సవాల్జనగామ నియోజకవర్గంలో 127 గ్రామాలు ఉన్నాయి.సీఎం, డిప్యూటీ సీఎం ఏ గ్రమానికైనా రచ్చి వందశాతం రుణమాఫీ చేసినట్లు నిరూపించాలి.ఏ గ్రామంలో అయినా వందశాతం రుణమాఫీ చేసినట్లు నిరూపిస్తే ముక్కు నేలకు రాస్తా!ఆ గ్రామంలోనే ముక్కు నేలకు రాసి రాజీనామా చేస్తా.జనగామనే కాదు డిప్యూటీ సీఎం మధిర అయినా పర్లేదు.వందశాతం రుణమాఫీ అయినట్లు నిరూపిస్తే ముక్కు నేలకు రాస్తాఅసెంబ్లీలో డిప్యూటీ సీఎం భట్టి..రూ.2 లక్షల రుణమాఫీ చేయలేదనడం సరికాదుఅధికారంలో వచ్చిన మూడు నెలలోనే రుణమాఫీ చేశాంసిరిసిల్ల, గజ్వేల్, సిద్ధిపేట నియోజకవర్గాలకు ఆ నేతలు చేసిన దానికంటే.. మేం చేసిన మేలు ఎక్కువఏ జిల్లాలో ఎంత రుణమాఫీ చేశామో లెక్కలతో సహా ఇస్తాంప్రతీ పథకాలను లెక్కలతో సహా చెప్పడానికి సిద్ధంఅధికారంలో ఉన్నన్నాళ్లూ మీరు ప్రచారాలు చేసుకున్నారుమేం అన్నీ చేసుకుంటూ పోతున్నాం.. కానీ, ప్రచారం చేసుకోవడం లేదుకావాలంటే.. శాసన సభ ప్రాంగణంలో రైతు బంధు, రైతు భరోసా లిస్టులు అంటిస్తాం115 నియోజకవర్గాలకు సంబంధించి.. గృహజ్యోతితో పాటు అన్ని పథకాల సమాచారం మా దగ్గర ఉందిమేం పని చేసేది ప్రజల కోసం మీలాంటి రాజకీయ పార్టీల కోసం కాదుబీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డిముఖ్యమంత్రి చెప్పాల్సిన సమాధానాలు.. డిప్యూటీ సీఎం చెబుతున్నారుడిప్యూటీ సీఎం ఎలాగైనా సీఎంకు రావాల్సిన క్రెడిట్ కొట్టేసి.. ప్రమోషన్ పొందాలని చూస్తున్నారుమేం అడిగిన ప్రశ్నలకు సీఎం సమాధానం చెప్పాలిమా ప్రభుత్వంలో రెండు విడతలుగా రుణమాఫీ చేశాంరైతు భరోసా ఎంత మందికి ఇచ్చారు?ఎంత మందికి ఇచ్చారో కాదు.. ఇంకా ఎంతమందికి ఇవ్వలేదో ఆ లెక్కలు కూడా చెప్పాలి కదా?అధికారంలోకి వచ్చి 15నెలలు అయ్యింది.. ఇంకెతం కాలం పడి ఏడుస్తారు?వరికి రూ.500 బోనస్ ఎప్పుడు ఇచ్చారు? ఎంత ఇచ్చారు?మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి.ఉమ్మడి నల్గొండ జిల్లా లో మెజార్టీ రైతులకు రుణమాఫీ అయ్యింది.. రైతు భరోసా ఇచ్చాము.మీ ప్రభుత్వo లో లక్ష రూపాయల రుణమాఫీ నాలుగు ఇన్స్టాల్ మెంట్ చేశారు...మేము 2లక్షలు ఒక్కటే సారి రుణమాఫీ చేసాము..దేశ చరిత్ర లో ఎక్కడ లేని విధంగా మేము ఒక్కటే సారి రుణమాఫీ చేసాము..మేము రుణమాఫీ చేస్తే మీరు ఓర్వలేక పోతున్నారు..బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డిరేపు సీఎం రేవంత్ స్టేషన్ ఘన్ పూర్ వస్తున్నారు.దేవాదుల ఆన్ చేసి ఎండుతున్న పంటలకు నీళ్లు ఇవ్వాలి.ఇప్పటికే 50 శాతం పంటలు ఎండిపోయాయి.రేపు సీఎం పంటనష్టం పై రైతులకు నిదులు ఇవ్వాలి.అంతకుముందు.. సభ ప్రారంభం కాగానే మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అంశం చర్చకు వచ్చింది. జగదీష్‌రెడ్డి సస్పెన్షన్ అంశం పునఃసమీక్షించాలని బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు స్పీకర్ గడ్డం ప్రసాద్‌ను కోరారు. ఇక ఇవాళ గవర్నర్ ప్రసంగ ధన్యవాద తీర్మానంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగించే అవకాశంఘుంది. అలాగే ఇవాళ కీలకమైన యూనివర్సిటీ బిల్లు కూడా సభ ముందుకు రానుంది. విభజన చట్టం 10 ఏళ్లు పూర్తి కావడంతో తెలుగు యూనివర్సిటీ పేరును మార్చడం, తెలంగాణ విద్యార్థులకే అడ్మిషన్లు లాంటి అంశాలను ఈబిల్లులో పొందుపరిచారు.అసెంబ్లీ లాబీలో ఆసక్తికర సన్నివేశంఇవాళ అసెంబ్లీలో శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ పై కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి సెటైరికల్ కామెంట్లు చేశారు. లాబీలో శ్రీధర్ బాబు ఛాంబర్ ముందు ఈ ఇద్దరు మంత్రులలు ఎదురు పడ్డారు. శ్రీధర్ బాబు వస్తుంటే ముఖ్యమంత్రి వచ్చినంత హంగామా ఉందని కోమటిరెడ్డి అనగా.. అసెంబ్లీ సిబ్బంది, అధికారులు నవ్వుకున్నారు. వెంకన్న నాపై అభిమానంతో అలా అంటారు..ఎవ్వరూ సీరియస్ గా తీసుకోవద్దని శ్రీధర్ బాబు అనడంతో మళ్లీ నవ్వులు పూశాయి. -
బలంగా గళం వినిపిస్తా
సాక్షి, హైదరాబాద్: ‘శాసనసభ్యుడిగా నా హక్కులు కాపాడుకోలేని నేను ప్రజల హక్కులను ఎలా కాపాడగలను? ఎలాంటి సభా సాంప్రదాయాలను ఉల్లంఘించకున్నా నన్నుఅసెంబ్లీ సమావేశాల నుంచి సస్పెండ్ చేయడం అన్యాయం, అక్రమం. నా సస్పెన్షన్‌కు చూపిన కారణాలేవీ సరికాదు. కాంగ్రెస్ పార్టీకి నా గొంతు నొక్కడం సాధ్యం కాదు. పంటలు ఎండి బాధ పడుతున్న రైతు గురించి, ప్రభుత్వం చేతిలో మోసానికి గురవుతున్న ప్రజల గురించి మరింత బలంగా నా గళం వినిపిస్తా.ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ప్రజలు అప్పగించిన బాధ్యతలు నిర్వర్తిస్తా..’అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి స్పష్టం చేశారు. గవర్నర్ ప్రసంగంపై బీఆర్ఎస్ నుంచి ఎవరు మాట్లాడినా సస్పెండ్ చేయాలని కాంగ్రెస్ పార్టీ శాసనసభ పక్షం భేటీలో సీఎం సమక్షంలో ముందే నిర్ణయం తీసుకున్నారన్నారు. అసెంబ్లీ సమావేశాల నుంచి తనను సస్పెండ్ చేయడంపై జగదీశ్‌రెడ్డి శుక్రవారం ‘సాక్షి’తో మాట్లాడారు. పథకం ప్రకారమే గొడవకు దిగారు ‘గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే అంశంపై కాంగ్రెస్ నుంచి ఇద్దరు సభ్యులు సుమారు గంటన్నర పాటు మాట్లాడినా మేం ఎక్కడా అడ్డు చెప్పలేదు. కానీ నేను మాట్లాడుతున్న సమయంలో కాంగ్రెస్ సభ్యులు పథకం ప్రకారమే గొడవకు దిగారు. స్పీకర్ గౌరవాన్ని తగ్గించేలా నేను ఒక్క అక్షరం కూడా ఉపయోగించలేదు. 50 మంది సభ్యులు అంతరాయం కలిగిస్తున్నా స్పీకర్ నా రక్షణకు రాలేదు. సభను నియంత్రణలో పెట్టాల్సిన బాధ్యత స్పీకర్‌పై ఉందని మాత్రమే చెప్పా.సభ్యులందరికీ సమాన హక్కులుంటాయనే విషయాన్ని గుర్తు చేశా. నేను స్పీకర్‌ను ఏకవచనంతో సంబోధించానని, దళితులను అవమాన పరిచానని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఇందులో దళిత కోణం ఎక్కడుందో చెప్పాలి. ఏకవచనంతో సంబోధించలేదు అనేందుకు అనేక ఆధారాలు ఉన్నాయి. సభాపతి స్థానానికి కుల మతాలు ఉండవు. ప్రజలు ప్రత్యక్షంగా నేను మాట్లాడిన తీరును వీక్షించారు. ఈ విషయంలో స్పీకర్ నిస్సహాయత స్పష్టంగా కనిపించింది. సభను ప్రభుత్వం నియంతృత్వ పద్ధతిలో నడిపిస్తోంది..’అని జగదీశ్‌రెడ్డి అన్నారు. సభా సాంప్రదాయాలు తుంగలో తొక్కారు ‘నా సస్పెన్షన్ విషయంలో అన్ని సభా సాంప్రదాయాలను తుంగలో తొక్కారు. అన్ని పార్టీల సభాపక్ష నేతల సమక్షంలో నా వ్యాఖ్యలపై చర్చించి నిర్ణయం తీసుకోవచ్చు. కానీ కనీసం వివరణ ఇచ్చే అవకాశం ఇవ్వకుండా ఏకపక్షంగా సస్పెండ్ చేశారు. నేను మాట్లాడిన అతికొద్ది సమయంలో ఎక్కడా అన్‌పార్లమెంటరీ పదాలు వాడలేదు..’అని మాజీమంత్రి చెప్పారు. -
‘కేంద్రానికి దక్షిణాది రాష్ట్రాలపై ఎటువంటి కుట్ర, కక్ష లేదు’
హైదరాబాద్: కేంద్రానికి దక్షిణాది రాష్ట్రాలపై ఎటువంటి కుట్ర, కక్ష లేదని బీజేపీ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ మరోసారి స్పష్టం చేశారు. ఈరోజు(శుక్రవారం) బీజేపీ రాష్ట్ర కార్యాలయం నుంచి ఎంపీ లక్ష్మణ్ ప్రెస్ మీట్ లో మాట్లాడారు. ‘ డీఎంకే ప్రాంతీయ సెంటిమెంట్ ను రెచ్చగొట్టే ప్రయంతం చేస్తోంది. అందులో భాగంగా కేంద్ర పై విషయ ప్రచారం మొదలెట్టింది. కేంద్రానికి దక్షిణాది రాష్ట్రాలపై ఎటువంటి కుట్ర లేదు. డీఎంకే ముసుగులో కాంగ్రెస్ పార్టీ, బీ అర్ ఎస్ పార్టీ లు ఉన్నాయి. దక్షిణాదిలో బీజేపీ బలపడటం చూసి ఈ మూడు పార్టీలు భయపడుతున్నాయి. ఏపీలో ఎన్డీఏ, పుదుచ్చేరి లో బీజేపీ ప్రభుత్వాలు అధికారంలో ఉన్నాయి. కర్ణాటకలో గాల్లో దీపంలా సిద్దరామయ్య ప్రభుత్వం ఉంది.డీఎంకే ఆధ్వర్యంలో జరిగే అఖిల పక్షం మీటింగ్ కి రేవంత్, కేటీఆర్ పోటీ పడి హాజరు అయ్యేందుకు సిద్ధమయ్యారు. రేవంత్ ఇచ్చిన 420 హామీల పై అఖిల పక్షం మీటింగ్ పెట్టాలి.హామీలపై కాంగ్రెస్ ను నిలదీయాల్సిన బీ అర్ ఎస్ కాంగ్రెస్ తో కలిసి అఖిల పక్షం మీటింగ్ కి హాజరు అవ్వడం ఏంటీ?, డిలిమిటేషన్ రాజ్యాంగ బద్దంగా జరిగే ప్రక్రియ. దీనికి రాజకీయాలు అంటగడతార?, బ్రిటిష్ నినాదం విభజించు - పాలించు ను కాంగ్రెస్ అనుసరిస్తుంది. గతంలో అధికార దుర్వినియోగం తో కాంగ్రెస్ బలవంతపు కుటుంబ నియంత్రణ చేపట్టింది. జనాభా తగ్గుదల పై కాంగ్రెస్ కు మాట్లాడే అర్హత లేదు ? , డిలిమిటేషన్ తో ఎస్సీ ఎస్టీలకు సీట్లు పెరుగుతాయి. మహిళలకు 33శాతం సీట్లు దక్కనున్నాయి మహిళలకు ప్రాధాన్యత ఇవ్వొద్దని రేవంత్ అనుకుంటున్నారా? , కాంగ్రెస్ దొంగ ఏడుపులు ఏడుస్తూ.....జనాభా లెక్కలు అడ్డుకోవాలని చూస్తోంది. దేశాన్ని ఇండియా - పాకిస్తాన్ మాదిరిగా విభజించినట్టు సౌత్, నార్త్ అంటూ ప్రజలను మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్న కాంగ్రెస్.. రేవంత్ 20 - 20 రాజకీయాలు చేయాలని మాట్లాడుతున్నారు. 20 - 20 మ్యాచ్ లో ఎన్నైనా అబద్ధాలు అడొచ్చా?, మొన్న జరిగిన ఢిల్లీ t20 లో మిమ్మల్ని డకౌట్ చేశారు. Mlc ఎన్నికల్లో రేవంత్ డాకౌట్ అయ్యారు. ఎటువంటి మ్యాచ్ జరిగిన మోదీ సెంచరీలు మోత మోగిస్తున్నారు’ అని ఎంపీ లక్ష్మణ్ స్పష్టం చేశారు. -
సీనియర్-జూనియర్.. ఇంతకీ నష్టం ఎవరికో?
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి... మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై చేసిన వ్యాఖ్యలు మరీ పరుషంగా ఉన్నాయి. అంత అర్థవంతంగానూ కనిపించడం లేదు అవి. కేసీఆర్‌ను రెచ్చగొట్టడం ద్వారా రాజకీయ ప్రయోజనం పొందాలని అనుకుంటున్నారా? లేక ఇంకేదైనా కారణం ఉందా?. ప్రస్తుతానికి కేసీఆర్ కూడా బీఆర్ఎస్ శాసనసభ పక్ష సమావేశంలో మాట్లాడుతూ.. రేవంత్‌కు అనుభవం, జ్ఞానం లేదని, కామన్ సెన్స్ వాడరు అంటూ వ్యాఖ్యానించి సరిపెట్టుకున్నారు. అంతకుమించి రేవంత్ వ్యాఖ్యలకు నేరుగా స్పందించ లేదు. అయితే.. ఆయన కుమారుడు కేటీఆర్, మేనల్లుడు హరీష్‌రావులు మాత్రం రేవంత్ వ్యాఖ్యలకు ధీటుగానే జవాబిస్తున్నారు. అయితే తెలంగాణలో మూడు పార్టీల రాజకీయం కొంత గందరగోళంగానే ఉందని చెప్పాలి. ఎవరు ఎవరికి రహస్యంగా మద్దతు ఇస్తున్నారో ప్రజలకు అర్థం కాని రీతిలో రాజకీయం సాగుతోంది. ‘‘కేసీఆర్‌ను కొట్టింది నేనే.. గద్దె దింపింది నేనే’’ అంటూ మరీ రేవంత్ రెడ్డి(Revanth Reddy) కొన్ని వ్యక్తిగత వ్యాఖ్యలు చేయడం సరికాకపోవచ్చు. రాజకీయాలలో గెలుపు ఓటములు ఉంటాయి. అంతమాత్రాన వ్యక్తుల గౌరవాలను తగ్గించుకునేలా మాట్లాడుకుంటే రాజకీయాల విలువ కూడా తగ్గుతుంది. 👉ఎల్లకాలం ఎవరూ ఒకరే ముఖ్యమంత్రిగా ఉండరన్న వాస్తవాన్ని అంతా గుర్తుంచుకోవాలి. పార్లమెంటు ఎన్నికలలో గుండు సున్నా ఇచ్చింది తానేనని రేవంత్ అన్నారు. ఆ ఎన్నికలలో కారణం ఏమైనా బీఆర్ఎస్ ఓటమి అనేది వాస్తవం. కాంగ్రెస్‌తోపాటు బీజేపీకి కూడా ఎనిమిది లోక్ సభ స్థానాలు వచ్చాయి. అది కాంగ్రెస్‌కు లాభమా? నష్టమా? అనేది ఆలోచించుకోవాలి. అప్పట్లో కాంగ్రెస్ ఓటమి లక్ష్యంగా బీఆర్ఎస్ పనిచేయడం వల్ల బీజేపీకి కొంత ఉపయోగం జరిగిందన్న భావన కూడా లేకపోలేదు. ఒకవేళ భవిష్యత్తులో బీజేపీతో బీఆర్ఎస్ పొత్తు పెట్టుకుంటే అది కాంగ్రెస్‌కు ఇబ్బంది కావొచ్చు. కాని ఆ పరిణామం జరుగుతుందని ఇప్పటికైతే ఎవరూ చెప్పలేరు. రేవంత్ నిజంగానే తాను బాగా బలపడ్డాడనని భావిస్తుంటే.. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి వచ్చిన పది మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి సవాల్ విసిరి గెలిస్తే ఆయన ప్రతిష్ట పెరుగుతుంది. కాని కేసీఆర్(KCR)ను విమర్శిస్తూ, ఆయన చేసిన తప్పులే రేవంత్ చేయడం వల్ల ఉపయోగం ఏమి ఉంటుంది?. తనది ముఖ్యమంత్రి స్థాయి అని, కేసీఆర్‌ది మాజీ ముఖ్యమంత్రి స్థాయి అని రేవంత్ అంటున్నారు. కాని కేసీఆర్ ప్రధాన కేసీఆర్ వయసు రీత్యా, అనుభవం రీత్యా తనకన్నా బాగా చిన్నవాడైన రేవంత్‌తో పోటీ పడడానికి చిన్నతనంగా భావిస్తున్నట్లు అనిపిస్తోంది. ఇది కూడా కరెక్టు కాదు. 👉రాజకీయాలలో సీనియర్, జూనియర్ అని ఉండదు. ఎవరు అధికారంలోకి వస్తే వారిదే పవర్. కేసీఆర్‌ను ఉద్దేశించి ఉదయం నుంచి సాయంత్రం వరకు తాగితే స్థాయి వస్తుందా? అనడం అంత మంచి సంప్రదాయం కాదు. ఎవరిని లక్ష్యంగా అన్నారో కాని, డ్రగ్స్ పెట్టుకుని పార్టీ చేసుకుంటే స్థాయి వస్తుందా? అనడంలో అంతర్యం ఏమిటో తెలియదు. తెలంగాణ సమాజాన్ని విలువల వైపు నడపవలసిన నేతలు ఇంత తక్కువ స్థాయిలో మాట్లాడుకోవడం జనానికి రుచించదనే చెప్పాలి. కేసీఆర్ స్థాయి కాంగ్రెస్‌లో ఎవరికీ లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అనడంపైనే రేవంత్ స్పందించి ఉండవచ్చు. కేటీఆర్ వ్యాఖ్యలను తిప్పికొట్టడం తప్పుకాదు. ఆ సందర్భంలో వాడే భాష విషయంలో జాగ్రత్తగా లేకపోతే రేవంత్‌కే నష్టం. 👉బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పుల వల్లే తెలంగాణలో ఈ పరిస్థితి ఉందని రేవంత్ అంటున్నారు. అదే టైమ్‌లో కేటీఆర్, హరీష్ రావులు అప్పులపై సీఎం అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని విమర్శిస్తూ కొన్ని ఆధారాలు చూపుతున్నారు. కాంగ్రెస్ పార్టీ శాసనసభ ఎన్నికలలో గెలవడానికి చేసిన హామీలకు అయ్యే వ్యయం ఎంత? ఏ మేరకు హామీలు అమలు చేశారు? మొదలైన విషయాలు చెప్పగలిగితే అధికార పార్టీపై ప్రజలలో విశ్వాసం ఏర్పడుతుంది. రేవంత్ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్ ప్రయాణం, రుణమాఫీ, రైతు బంధు, గ్యాస్ బండలు, గృహజ్యోతి వంటి స్కీముల అమలుకు కొంత ప్రయత్నం చేస్తున్న మాట నిజం. కానీ అమలు కానివి చాలానే ఉన్నాయి. ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్, బీజేపీలు సహజంగానే వాటిని ఎత్తిచూపే ప్రయత్నం చేస్తాయి. ఆ విషయాలను డైవర్ట్ చేయడానికి రేవంత్, ఇతర కాంగ్రెస్ నేతలు ప్రయత్నిస్తున్నట్లుగా ఉంది. అందుకే కేసీఆర్‌పై వ్యక్తిగత స్థాయిలో నిందలకు పాల్పడుతున్నారన్న అభిప్రాయం కలుగుతోంది. రేవంత్ తరచుగా ఢిల్లీకి వెళ్లడాన్ని బీఆర్ఎస్ తప్పు పడుతోంది. దానికి జవాబుగా 39 సార్లు కాదు.. 99 సార్లు వెళతానని రేవంత్ అన్నారు. గతంలో ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు అప్పటి కాంగ్రెస్ నేతలు తరచు ఢిల్లీ వెళ్లడమే పెద్ద అంశంగా.. అప్పుడే కొత్తగా వచ్చిన టీడీపీ మార్చింది. ఆ పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ దాన్ని ఆత్మగౌరవ సమస్యగా మార్చి ప్రజలను తనవైపునకు తిప్పుకున్నారన్న సంగతిని రేవంత్ దృష్టిలో పెట్టుకుంటే మేలు. కేసీఆర్ గతంలో కంచి వెళుతూ తిరుపతి వద్ద అప్పటి మంత్రి రోజా ఇంటిలో విందు తీసుకున్నప్పుడు కేసీఆర్ వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ రాయలసీమను రతనాల సీమను చేస్తానని చెప్పి రొయ్యల పులుసు తిన్నారని రేవంత్ ఎద్దేవా చేశారు. ఇప్పుడు ప్రాంతీయ భావాలు అవసరమా? అంటే రాజకీయంలో ఇవి సాధారణంగానే జరుగుతుంటాయి. దానికి పోటీగా చంద్రబాబు(Chandrababu)కు ప్రజాభవన్‌లో విందు ఇచ్చి, ఆయన వద్ద రేవంత్ సాగిలపడ్డారని హరీష్ రావు విమర్శించారు. కరీంనగర్లో ఎమ్మెల్సీ కాంగ్రెస్ అభ్యర్ధి ఓడిపోవడంపై రేవంత్‌కు అసంతృప్తి ఉండవచ్చు. దానిని రాజకీయంగా విమర్శించవచ్చు. బీజేపీ, బీఆర్ఎస్లు కలిసి ఓడించాయని, హరీష్‌రావు డబ్బులు ఇచ్చి మరీ బీజేపీకి ఓట్లు వేయించారని ఆయన అన్నారు, ఈ రోజుల్లో ఎవరి వ్యూహం వారిది అనుకోవాలి. 👉బీఆర్ఎస్ తనకు ప్రత్యర్ధి కాంగ్రెస్ అని భావిస్తూ ప్రస్తుతం పరోక్షంగా బీజేపీకి సహకరించి ఉండొచ్చు!. అయితే భవిష్యత్తులో అది బీఆర్ఎస్కు ఉపయోగపడవచ్చు.. పడకపోవచ్చు!!. మరో వైపు ప్రధాని మోదీని మెచ్చుకునే రీతిలో మాట్లాడి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వల్ల తెలంగాణకు నష్టం జరుగుతోందని రేవంత్ అనడాన్ని బీఆర్ఎస్ ప్రచారం చేస్తోంది. ‘‘యూజ్ లెస్ ఫెలో, హౌలే గాడు మాట్లాడే మాటలు పట్టించుకోనవసరం లేదు..’’ అంటూ బీఆర్ఎస్కు ఘాటైన రీతిలో సమాధానం చెప్పడం.. ఈ క్రమంలో అనుచిత భాష వాడడంలో సహేతుకత కనిపించదు. ఒకప్పుడు కేసీఆర్ అభ్యంతరక భాష వాడుతున్నారన్న విమర్శలు ఉండేవి.దానికి పోటీగా పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ తీవ్రమైన విమర్శలే చేసేవారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా కేసీఆర్‌ను మించి దూషణల పర్వం వాడడం వల్ల ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న రేవంత్ వ్యక్తిత్వానికి, గౌరవానికి అంత హుందా కాకపోవచ్చు.:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
బీజేపీపై ఎమ్మెల్సీ విజయశాంతి సంచలన వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ వ్యతిరేక శక్తులను మళ్లీ బీజేపీ దింపబోతుందంటూ కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతి సంచలన వాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికలకు ఆపరేషన్ స్టార్ట్ చేసింది. అందుకే తెలంగాణ ఉద్యమకారులపై కుట్ర చేస్తుందంటూ ఆమె ఆరోపణలు గుప్పించారు. ‘‘నాకు ఎమ్మెల్సీ ఇస్తే ఎందుకు అక్కసు. నేను తెలంగాణ కోసం ఆస్తులు అమ్మాను’’ అంటూ ఆమె వ్యాఖ్యానించారు.కేసీఆర్ నా పార్టీని విలీనం చేయాలని రిక్వెస్ట్ చేస్తే.. విలీనం చేసా.. నన్ను విమర్శించిన వారిని ఎవరినీ వదిలిపెట్టాను. కేసీఆర్‌ను వదిలిపెట్టేది లేదు.. అవినీతి విషయం లో అన్ని లెక్కలు తేలుస్తాం’’ అంటూ విజయశాంతి హెచ్చరించారు. ‘‘నేను కొత్త మనిషిలాగా ప్రశ్నలు వేస్తున్నారు. బీజేపీ, బీఆర్ఎస్లకు నేను సేవలు అందించాను. బీజేపీ, బీఆర్ఎస్ సరైన నిర్ణయాలు తీసుకోలేదు కాబట్టే ఆ పార్టీని వదిలేశాను’ అని విజయశాంతి చెప్పారు.‘‘ఎమ్మెల్సీగా మీ బండారం బయట పెడతానని భయం అవుతోందా?. నా పార్టీని విలీనం చేయించుకొని నన్ను మోసం చేశారు. విజయశాంతికి తెలంగాణకి సంబంధం లేదా?. ఒక్క ఓటు రెండు రాష్ట్రాలు అన్నారు కాబట్టి నేను బీజేపీకి వెళ్లాను. నేను తెలంగాణ ఉద్యమం మొదలు పెట్టినప్పుడు కేసీఆర్ టీడీపీలో ఉన్నారు. తెలంగాణ కేసీఆర్ సొత్తు కాదు. తెలంగాణ రాష్ట్ర సాధనకు నా వంతు కృషి నేను చేశాను. తెలంగాణ ఇస్తున్న సమయంలో కేసీఆర్ పార్లమెంటులో లేరు’’ అని విజయశాంతి అన్నారు.‘‘కేసీఆర్ తన దొరబుద్ది నిరూపించుకుంటున్నారు. దొరలు ఓటేస్తేనే కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యారా?. నింద వేయడం కాదు. నేను గట్స్ ఉన్న మహిళని. ప్రతిరోజూ నన్ను అవమానించారు. నన్ను హింసపెట్టి పార్టీని విలీనం చేయించుకున్నారు. ఇద్దరి ఆశయం తెలంగాణ రాష్ట్రం అయినప్పుడు రెండు పార్టీలు ఎందుకని అనుకున్నాం. తెలంగాణ వ్యతిరేకి కిరణ్ కుమార్‌రెడ్డి బీజేపీలోకి వచ్చినందుకు ఆ పార్టీని వదిలేశాను. మాజీ సీఎం కిరణ్ కుమార్‌రెడ్డి, కిషన్ రెడ్డి స్నేహితులు ’’ అని విజయశాంతి పేర్కొన్నారు. కాపలా కుక్కలాగా తెలంగాణని కాపాడుకున్నాం. 7 లక్షల కోట్ల అప్పు ఎలా అయిందో విడిచిపెట్టకుండా అడగాలి. కేసీఆర్ మోసాలన్నీ బయటకి తీయాలి. కేసీఆర్ ఇప్పటికైనా వాస్తవాలు మాట్లాడు. మేం కష్టపడి తెచ్చుకున్న రాష్ట్రం ఇది’’ అంటూ విజయశాంతి వ్యాఖ్యానించారు. -
నాకు మంత్రి పదవి వస్తే వారికే లాభం: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్: తనకు మంత్రి పదవి వస్తే పార్టీకి, తెలంగాణ ప్రజలకే లాభమని.. కానీ ఆ పదవి ఎప్పుడు వస్తుందో చెప్పలేనంటూ వ్యాఖ్యానించారు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి.. గురువారం ఆయన అసెంబ్లీ ప్రాంగణంలో మీడియాతో మాట్లాడుతూ, భువనగిరి పార్లమెంట్ స్థానం గెలవాలని తనకు అప్పగిస్తే.. నిద్రహారాలు మాని గెలిపించానన్నారు.బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్‌రెడ్డి సస్పెన్షన్‌పై రాజగోపాల్ రెడ్డి స్పందిస్తూ.. అసెంబ్లీలో జగదీస్‌రెడ్డి చాలా అతి చేశారన్నారు. మేము ఎవ్వరిని టార్గెట్ చేయం.. తప్పు చేస్తే వదిలి పెట్టం.. ఎమ్మెల్యే జగదీష్‌రెడ్డి చైర్‌ను ప్రశ్నించడం సరికాదు. స్పీకర్ కుర్చీని ఎవ్వరు క్వశ్చన్ చేయలేరు. స్పీకర్‌ను అవమానించినందుకే చర్యలు తీసుకున్నాం. ఎథిక్స్ కమిటికి సిఫార్సు చేశాం’’ అని రాజగోపాల్‌రెడ్డి చెప్పారు. -
అసెంబ్లీలో స్టార్ హీరోయిన్‌పై నోరు పారేసుకున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే
జైపూర్ : అసెంబ్లీలో కాంగ్రెస్ ఎమ్మెల్యే నోరు పారేసుకున్నారు. రాష్ట్రంలో సెకండ్ గ్రేడ్ యాక్టర్ బాలీవుడ్ నటి మాధురి దీక్షిత్ (madhuri dixit) ఫ్లెక్సీలే దర్శనమిస్తున్నాయి. సెకండ్ గ్రేడ్ యాక్టర్లు తప్ప మీకు ఇంకెవరి ఫొటోలు దొరకలేదా? షారుఖ్ ఖాన్ తప్ప మిగిలిన నటులంతా ఆ కోవకే చెందుతారంటూ తన నోటికి పనిచెప్పారు. ప్రస్తుతం సదరు కాంగ్రెస్ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలపై దుమారం చెలరేగింది.రాజస్థాన్ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్ష కాంగ్రెస్.. రాష్ట్రంలో జరిగిన ఐఫా అవార్డ్‌ల ఫంక్షన్‌పై బీజేపీ ప్రభుత్వంపై పలు ప్రశ్నలు సంధించింది.ఈ సందర్భంగా ప్రతిపక్ష కాంగ్రెస్ ఎమ్మెల్యే టికారం జుల్లీ (Congress MLA Tikaram Jully) అసెంబ్లీలో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం రూ.100 కోట్లు ప్రజాధనాన్ని ఖర్చు పెట్టి ఐఫా (IIFA Awards 2025) ఉత్సవాల్ని నిర్వహించింది. ఐఫా పేరిట దేనికి ఎంతెంత? ఖర్చు పెట్టారో లెక్కలు బయటకు తీయాలి. మీరు ఏర్పాటు చేసిన హోర్డింగ్‌లు రాష్ట్రాన్ని ప్రమోట్ చేస్తున్నట్లుగా లేదు. ఐఫాను ప్రమోట్ చేస్తునట్లుంది.ఐఫా వల్ల రాష్ట్రానికి ఏ ఒరిగింది? ఈ కార్యక్రమానికి వచ్చిన సినీ ప్రముఖులు టూరిస్ట్ ప్రాంతాల్ని సందర్శించారా? సినీ ఇండస్ట్రీ నుంచి ఐఫా కార్యక్రమానికి వచ్చిన స్టార్లు ఎవరు? నాకు తెలిసి షారుఖ్‌ఖాన్ మినహా మిగిలిన వాళ్లందరూ సెకండ్ గ్రేడ్ యాక్టర్లే. ఫస్ట్ గ్రేడ్ యాక్టర్లు ఈ కార్యక్రమానికి వచ్చినట్లు లేదే? అని వ్యాఖ్యానించారు.దీంతో ఎమ్మెల్యే టికారం జుల్లీ వ్యాఖ్యల్ని అధికార బీజేపీ ఎమ్మెల్యేలు ఖండించారు. ప్రతి స్పందనగా.. అవును మాధిరి దీక్షిత్ ఇప్పుడు సెకండ్ గ్రేడ్ యాక్టర్. నాటి దిల్, బేటా సినిమాలకు మాత్రమే ఆమె స్టార్. ఆమె ఎరా ఎప్పుడో ముగిసింది’అని తాను చేసిన వ్యాఖ్యల్ని సమర్ధించుకున్నారు.కొద్ది రోజుల క్రితం ఇదే కాంగ్రెస్ పార్టీకి చెందిన మహిళా నేత షామా మొహమ్మద్ (shama mohamed) ఎక్స్ వేదికగా చేసిన ట్వీట్ రాజకీయ దుమారం రేపింది. షామా తన ట్వీట్లో రోహిత్ శర్మ (rohit sharma) ఫిట్‌గా లేడు! బరువు తగ్గాలి. భారత క్రికెట్ జట్టులో గత సారథులతో పోల్చితే ఆకట్టుకోని కెప్టెన్ అతడే’ అని రాసుకొచ్చింది. ఆమె చేసిన ట్వీట్‌పై పెద్ద ఎత్తున దుమారమే చెలరేగింది.భారతీయులు రోహిత్ శర్మకు మద్దతు పలుకుతూ షామాపై విమర్శలు గుప్పించారు. ఆ విమర్శలు తట్టుకోలేక దెబ్బకు దిగొచ్చారు. దుబాయ్‌లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌లో భారత జట్టును విజయపథం వైపు నడిపించారంటూ రోహిత్ శర్మపై ప్రశంసల వర్షం కురిపించారు. -
జగదీష్ రెడ్డి సస్పెన్షన్‌పై కేటీఆర్ రియాక్షన్
-
ప్రమాదంలో విద్యార్థుల భవిష్యత్.. పేపర్ లీకేజీలపై రాహుల్ ట్వీట్
ఢిల్లీ: ప్రశ్నాపత్రాల లీకేజీలను వ్యవస్థాగత వైఫల్యంగా కాంగ్రెస్ అగ్ర నేత, లోక్‌సభ ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ అభివర్ణించారు. మరోసారి మోదీ సర్కార్‌పై విరుచుకుపడ్డారు. గురువారం ఆయన ఎక్స్ వేదికగా.. లీక్‌ల కారణంగా కష్టపడి చదివే ఎంతో మంది విద్యార్థులు ఆందోళనకు గురవుతున్నారని.. దీనిపై పోరాడేందుకు అన్ని రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలు విభేదాలు పక్కన పెట్టి కలిసి రావాలంటూ పిలుపునిచ్చారు.‘ప్రశ్నాపత్రాల లీకులతో ఆరు రాష్ట్రాల్లోని 85 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్ ప్రమాదంలో పడిందన్న రాహుల్.. వీటి కారణంగా కష్టపడి చదివే విద్యార్థులతో పాటు వారి కుటుంబాలు కూడా ఒత్తిడికి గురవుతున్నాయన్నారు. వారి కష్టానికి తగిన ఫలితం అందడం లేదన్నారు. దీంతో కష్టపడి పనిచేయడం కంటే నిజాయితీగా లేకపోవడమే మంచిదనే తప్పుడు సంకేతాలు భవిష్యత్ తరాలకు వెళ్తుందంటూ అభిప్రాయవ్యక్తం చేసిన రాహుల్.. ఇది ఆమోదయోగ్యం కాదన్నారు.‘‘ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త చట్టం లీకులను అడ్డుకోలేకపోయింది. ఇది వారి వైఫల్యానికి నిదర్శనం. అన్ని రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలు విభేదాలు పక్కనబెట్టి దీనిపై కఠిన చర్యలు తీసుకోవాలి. అప్పుడే వీటిని అరికట్టగలం. ఈ పరీక్షలు మన పిల్లల హక్కు. దాన్ని ఎలాగైనా రక్షించాలి’ అంటూ రాహుల్ ట్వీట్ చేశారు.6 राज्यों में 85 लाख बच्चों का भविष्य ख़तरे में - पेपर लीक हमारे युवाओं के लिए सबसे ख़तरनाक "पद्मव्यूह" बन गया है।पेपर लीक मेहनती छात्रों और उनके परिवारों को अनिश्चितता और तनाव में धकेल देता है, उनके परिश्रम का फल उनसे छीन लेता है। साथ ही यह अगली पीढ़ी को गलत संदेश देता है कि… pic.twitter.com/nWHeswvMOC— Rahul Gandhi (@RahulGandhi) March 13, 2025 -
జగదీష్ రెడ్డి క్షమాపణలు చెప్పకపోతే సస్పెండ్ చేసే అవకాశం?
-
సీఎం రేవంత్ సర్కార్ పై కపిల్ సిబల్ ఫైర్
-
జగదీష్ రెడ్డి వ్యాఖ్యలపై కాంగ్రెస్ సభ్యుల అభ్యంతరం
-
తెలంగాణ అసెంబ్లీ నుంచి జగదీష్‌రెడ్డి సస్పెన్షన్
👉తెలంగాణ అసెంబ్లీ: జగదీష్‌రెడ్డి సస్పెన్షన్👉బడ్జెట్ సమావేశాలు ముగిసే వరకు సస్పెన్షన్ వేటు👉ఈ సెషన్ మొత్తానికి జగదీష్‌రెడ్డి సస్పెన్షన్👉స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారని చర్యలు👉సభ నుంచి వెళ్లిపోయిన బీఆర్ఎస్ సభ్యులు👉తిరిగి ప్రారంభమైన తెలంగాణ అసెంబ్లీ..👉అసెంబ్లీ లాబీ లోకి చేరుకున్న మార్షల్స్👉ఇప్పటికే స్పీకర్ తో అధికార కాంగ్రెస్ ,ప్రతిపక్ష బిఆర్ఎస్ సభ్యులు భేటీ.👉ఈ సభ మీ సొత్తు కాదని స్పీకర్ ను ఉద్దేశించి వాఖ్యానించిన బిఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి.👉జగదీష్ రెడ్డి వాఖ్యల పట్ల అధికార కాంగ్రెస్ అభ్యంతరం..👉జగదీష్ రెడ్డి సస్పెండ్ కు అధికార కాంగ్రెస్ డిమాండ్..👉అధికార కాంగ్రెస్ ,ప్రతిపక్ష బిఆర్ఎస్ సభ్యుల పోటాపోటీ నిరసన నేపథ్యంలో సభను వాయిదా వేసిన స్పీకర్..👉సభలో జరిగిన వ్యవహారం పై సీఎం కు రిపోర్ట్ చేసిన మంత్రి శ్రీధర్ బాబు.👉దలిత స్పీకర్ ను అవమానించిన విషయం లో కఠినంగా ఉండాలని సీఎం ఆదేశం..👉జగదీష్ రెడ్డి సస్పెండ్ కు పట్టుబట్టాలని మంత్రులు నిర్ణయం .👉సభ ప్రారంబంకాగానే జగదీష్ రెడ్డి సస్పెండ్ కు పట్టుబట్టాలని మంత్రి సీతక్కకు సూచించిన శ్రీధర్ బాబు..👉అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఇవాళ మాజీ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి వ్యవహారం తీవ్ర చర్చనీయాంశమైంది. స్పీకర్‌ను జగదీష్ అవమానించారని.. ఆయనపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాల్సిందేనని అధికార కాంగ్రెస్ పట్టుబడుతోంది. అయితే జగదీష్ రెడ్డి మాట్లాడిన దాంట్లో తప్పేం లేదని, కాంగ్రెస్ డైవర్షన్ పాలిటిక్స్‌కు పాల్పడుతోందని బీఆర్ఎస్ ప్రతి విమర్శలకు దిగింది.👉గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా.. ఇవాళ శాసనసభలో గందరగోళం నెలకొంది. బీఆర్ఎస్, కాంగ్రెస్ సభ్యులు పరస్పరం వ్యంగ్యాస్త్రాలు సంధించుకోగా.. ఒకానొక స్థితిలో పరిస్థితి చేజారిపోయింది. స్పీకర్ ఛైర్‌ను సభ్యులు ప్రశ్నించకూడదని స్పీకర్ గడ్డం ప్రసాద్ అనడంతో పరిస్థితి మారిపోయింది. 👉ఈ సభ మీ ఒక్కరి సొత్తేం కాదంటూ జగదీష్‌రెడ్డి స్పీకర్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించడంతో ఒక్కసారిగా అలజడి రేగింది. జగదీష్ రెడ్డి క్షమాపణలు చెప్పాలని కాంగ్రెస్ సభ్యులు.. సభను అదుపులో పెట్టాలంటూ స్పీకర్ పోడియం దగ్గరకు వెళ్లి బీఆర్ఎస్ సభ్యులు పోటాపోటీగా నినాదాలు చేశారు. దీంతో సభ వాయిదా పడింది.👉మరోవైపు.. హరీష్ రావు నేతృత్వంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కొందరు స్పీకర్ గడ్డం ప్రసాద్‌ను విడిగా కలిశారు. జగదీష్‌రెడ్డి చేసిన వ్యాఖ్యల రికార్డును పరిశీలించాలని కోరారు. అనంతరం హరీష్ రావు మీడియాతో మాట్లాడారు. ‘‘జగదీష్ రెడ్డి స్పీకర్‌ను అవమానించలేదు. సభ మీ ఒక్కరిదీ కాదు.. అందరి అన్నారు. మీ అనే పదం సభ నిబంధనలకు విరుద్ధం కాదు. మీ ఒక్కరిదీ అనే పదం అన్‌పార్లమెంటరీ పదమూ కాదు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎందుకు నిరసన చేశారో తెలీదు. సభను ఎందుకు వాయిదా వేశారో తెలీదు’’ అని అన్నారు.👉ఇంకోవైపు.. జగదీష్‌రెడ్డి అంశాన్ని ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ దృష్టికి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తీసుకెళ్లారు. ఆయనకు ఫోన్లో విషయాన్ని తెలియజేశారు. అనంతరం సీఎం ఛాంబర్లో మంత్రులు ఈ అంశంపై భేటీ అయ్యారు. జగదీష్‌రెడ్డి స్పీకర్ ప్రసాద్‌కు క్షమాపణలు చెప్పాల్సిందేనని, వినకుంటే సస్పెండ్ చేయాల్సిందేనని మంత్రులు పట్టుబడుతున్నట్లు సమాచారం. ఈ సందర్భంగా గతంలో స్పీకర్ చైర్లో పేపర్లు విసిరినందుకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకున్న సందర్భాన్ని ప్రస్తావించినట్లు తెలుస్తోంది. మరోవైపు అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మీడియాతో ఒక్కొక్కరుగా మాట్లాడిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు.. బీఆర్ఎస్పై తీవ్ర విమర్శలు గుప్పించారు. స్పీకర్‌పై వ్యాఖ్యలకుగానూ క్షమాపణలు చెప్పకపోతే జగదీష్‌రెడ్డి శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేసే అంశాన్ని సైతం పరిశీలించాలని స్పీకర్‌ను కోరతామని అన్నారు. ఇదిలా ఉంటే.. జగదీష్ మాట్లాడిందాంట్లో తప్పేం లేదని బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు అంటుండగా, స్పీకర్ కుర్చీతో కాంగ్రెస్ డైవర్షన్ పాలిటిక్స్‌కు దిగిందని ప్రశాంత్‌రెడ్డి మండిపడ్డారు. -
బీజేపీలో పాత సామాను వెళ్లిపోవాలి.. రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: గోషామహాల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలంటే పార్టీలోని పాత సామాను బయటకు పోవాలి అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇదే సమయంలో సీఎం రేవంత్‌పై విరుచుకుపడ్డారు. హిందువులు పండుగలు ఎలా చేసుకోవాలో రేవంత్ చెప్పాల్సిన పనిలేదంటూ చురకలంటించారు.తెలంగాణలో హోలీ నిబంధనలపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజాసింగ్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో నిజాం పాలనలా కాంగ్రెస్ పాలన సాగుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తొమ్మిదో నిజాం లాగా వ్యవహరిస్తున్నారు. హిందువులు పండుగలు ఎలా చేసుకోవాలో రేవంత్ చెబుతారా?. హోలీ 12 గంటల వరకే జరుపుకోవాలన్న నిబంధన ఎందుకు?. రంజాన్ నెలలో ముస్లింలు హడావుడి చేసినా పట్టించుకోరు. కాంగ్రెస్ అంటేనే హిందువుల పండుగ వ్యతిరేకి. హిందువుల జోలికి వస్తే రేవంత్ తప్పకుండా మూల్యం చెల్లించుకుంటాడు. కేసీఆర్‌కు పట్టిన గతే రేవంత్‌కు కూడా పడుతుంది’ అని ఘాటు విమర్శలు చేశారు.ఇదే సమయంలో తెలంగాణ బీజేపీ నేతలపై రాజాసింగ్ సంచలన ఆరోపణలు చేశారు. రాజాసింగ్ మాట్లాడుతూ..‘తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుంది. అలా జరగాలి అంటే.. బీజేపీలోని పాత సామాను బయటకు పోవాలి. బీజేపీ అధిష్టానం దీనిపై ఫోకస్ పెట్టాలి. తెలంగాణలో ఏ ప్రభుత్వం వస్తే ఆ ముఖ్యమంత్రిని సీక్రెట్‌గా కలుస్తారు. నా అయ్య పార్టీ అనుకునే వాళ్లను పంపితేనే బీజేపీకి మంచి రోజులు వస్తాయి. తెలంగాణలో హిందువులు సేఫ్‌గా ఉండాలంటే బీజేపీ రావాలి’ అని చెప్పుకొచ్చారు. -
స్పీకర్‌పై జగదీష్‌రెడ్డి వ్యాఖ్యలు.. తెలంగాణ అసెంబ్లీలో గందరగోళం
హైదరాబాద్, సాక్షి: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో బుధవారం తీవ్ర గందరగోళం నెలకొంది. స్పీకర్ గడ్డం ప్రసాద్ ఉద్దేశించి మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు శాసనసభలో అలజడి రేపాయి. ప్రతిపక్షంగా తమకు కనీస గౌరవం ఇవ్వడం లేదంటూ బీఆర్ఎస్ స్పీకర్‌పై ఆరోపణలకు దిగగా.. బీఆర్ఎస్ సభ్యులు దళిత స్పీకర్‌ను అవమానించారంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నిరసనకు దిగారు. ఈ క్రమంలో ఇరు వర్గాల ఆందోళనలతో గందరగోళం నెలకొనగా సభ కాసేపు వాయిదా పడింది.తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు రెండో రోజు హాట్‌హాట్‌గా నడుస్తున్నాయి. గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ప్రవేశపెట్టారు. అయితే ఈ తీర్మానం చర్చ సందర్భంగా మాజీ మంత్రులు వర్సెస్ మంత్రులుగా వ్యవహారం నడిచింది. మాజీ మంత్రి జగదీష్‌రెడ్డి గవర్నర్ ప్రసంగంపై సెటైర్లు వేస్తూ కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించారు. ఈ క్రమంలో మంత్రి కోమటిెడ్డి వెంకట్ రెడ్డి అడ్డు పడి వాస్తవాలు మాట్లాడాలని జగదీష్‌రెడ్డికి సూచించారు. ఆ వెంటనే తలసాని జోక్యం చేసుకుని కోమటిరెడ్డి వ్యాఖ్యలను ఖండించారు. సభలో సభ్యులందరికీ సమాన నిబంధనలు ఉంటాయని అన్నారు. ఈలోపు.. మంత్రి శ్రీధర్ బాబు - బీఆర్ఎస్ సభ్యులకు మధ్య వాగ్వాదం జరిగింది. శ్రీధర్ బాబు ప్రసంగానికి బీఆర్ఎస్ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే బీఆర్ఎస్ సభ్యులు వ్యంగంగా నవ్వారు కాబట్టే అధికారం కోల్పోయారని శ్రీధర్ బాబు సెటైర్లు వేశారు. దీంతో పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. ఒకానొక తరుణంలో పరిస్థితి చేజారిపోతుండడంతో స్పీకర్ ప్రసాద్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ‘‘బీఆర్ఎస్ సభ్యులు సభను అవమానం ఇచ్చే విధంగా బీఆర్ఎస్ ప్రవర్తించవద్దు. స్పీకర్ తీరును సభ్యులు ప్రశ్నించొద్దు’’ అని స్పీకర్ ప్రసాద్ అనడంతో జగదీశ్ రెడ్డి లేచారు. స్పీకర్ వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. స్పీకర్ వ్యాఖ్యలను ఖండించిన జగదీశ్ రెడ్డి.. ‘‘మీరు ఈ సభకు పెద్ద మనిషి మాత్రమేనని, ఈ సభ అందరిదని, మీ ఒక్కరికే సొంతం కాదు’’ అని అన్నారు. దీంతో కాంగ్రెస్ సభ్యులు ఆందోళనకు దిగారు.జగదీష్ రెడ్డి పై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని, ఆయన్ని సభ నుంచి సస్పెండ్ చేయాలని కాంగ్రెస్ సభ్యులు నినాదాలు చేశారు. పోటీగా బీఆర్ఎస్ సభ్యులు స్పీకర్ పొడియం దగ్గరగా వెళ్లారు. సభను ఆర్డర్లో పెట్టాలని, ప్రతిపక్ష పార్టీకి కనీస గౌరవం ఇవ్వరా? అంటూ నినాదాలు చేశారు. అదే సమయంలో.. దళిత స్పీకర్‌ను అవమానించిన జగదీష్ రెడ్డిని వెంటనే సస్పెండ్ చేయాలని కాంగ్రెస్ డిమాండ్‌కు దిగింది. ఈ ఆందోళనలతో సభ వేడెక్కగా.. కాసేపు వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ గడ్డం ప్రసాద్ ప్రకటించారు. -
డీకేకు షాక్!.. సీఎం పదవిపై సిద్దరామయ్య ఆసక్తికర వ్యాఖ్యలు
బెంగళూరు: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని, మరో ఐదేళ్లపాటు తానే సీఎం పదవిలో కొనసాగుతానని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ కార్య కర్తలను హామీ కమిటీ చైర్మన్లు, సభ్యులుగా నియమించడం ద్వారా ప్రభుత్వం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను అవమానించిందని బీజేపీ ఆరోపించింది. ఇలాంటి నిర్ణయాలతో కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుడు సంకేతాలిస్తోందని ప్రతిపక్షనేత ఆర్.అశోక ఆరోపించారు. ఆయన వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వెంటనే స్పందించారు. ‘మేం ఎక్కడికీ పోం. మేం మళ్లీ గెలుస్తాం’ అని ధీమా వ్యక్తం చేశారు.ఇక, ఇటీవల అసెంబ్లీ ఉప ఎన్నికలు జరిగిన చన్నపట్న, షిగ్గావ్, సండూర్లలో బీజేపీ ఓటమిని సీఎం గుర్తు చేశారు. ఎన్నికలకు ముందు దమ్ముందా అంటూ తమకు సవాల్ విసిరారని, ఆ తరువాత ఫలితాలనూ చూశారని ఎద్దేవా చేశారు. మళ్లీ తాము అధికారంలోకి వస్తామని, తదుపరి ముఖ్యమంత్రిగా తానే ఉంటానని ఆయన స్పష్టం చేశారు. ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, తనకు మధ్య జరుగుతున్న ఆధిపత్యపోరు నేపథ్యంలో సిద్ధరామయ్య వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.కాగా, ప్రభుత్వ హామీల అమలు కోసం ప్రభుత్వం అన్ని జిల్లాల్లో కమిటీలను ఏర్పాటు చేసింది. ఈ కమిటీలకు చైర్మన్లు, సభ్యులుగా కాంగ్రెస్ తమ పార్టీ వారిని నియమించింది. దీనిపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ఈ కమిటీలను రద్దు చేయాలని కోరుతూ గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్‌ను బుధవారం కలిసి బీజేపీ.. వినతిపత్రం సమర్పించింది. ఇది శాసనసభ్యుల హక్కుల ఉల్లంఘనని బీజేపీ ఆందోళనకు దిగింది. అసెంబ్లీలో రెండో రోజు నిరసనను కొనసాగించింది. దీంతో మధ్యాహ్న భోజనం తరువాత అసెంబ్లీలో గందరగోళం ఏర్పడింది.అయితే ఎమ్మెల్యేలను అగౌరవ పరిచే పనిని తాను చేయబోనని సిద్ధరామయ్య స్పష్టం చేశారు. ప్రభుత్వ పాలనలో పార్టీ కార్యకర్తల భాగస్వామ్యం ముందు నుంచి ఉన్నదేనని, గతంలో బీజేపీ కూడా ఇలాగే చేసిందని చెప్పారు. బోర్డులు, కార్పొరేషన్లకు చైర్మన్లుగా పార్టీ కార్యకర్తలను చేయడం దుర్వినియోగం కాదా అని ప్రశ్నించారు. మహారాష్ట్రలో ఆర్ఎస్ఎస్ కార్యకర్తలను మంత్రుల వ్యక్తిగత సహాయకులుగా చేశారని గుర్తు చేశారు. దీంతో బీజేపీ ఎమ్మెల్యేల నినాదాలతో సభా కార్యకలాపాలు మరింత గందరగోళంగా మారాయి. అయితే కాంగ్రెస్ కార్యకర్తలను కమిటీ చైర్మన్లను చేయడానికి తాము వ్యతిరేకం కాదని, వారికి కార్యాలయం ఇవ్వడం, నెలకు రూ.18 వేల నుంచి రూ.20 వేల వరకు ఖర్చు చేయడంపైనే తమ అభ్యంతరమని ప్రతిపక్ష నేత అశోక తెలిపారు. -
గవర్నర్‌ది గాందీభవన్ ప్రసంగం: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీలో గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ చేసిన బడ్జెట్ ప్రసంగం.. గాందీభవన్‌లో కాంగ్రెస్ కార్యకర్తల ప్రెస్‌మీట్‌లా ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎద్దేవా చేశారు. గవర్నర్ ప్రసంగంపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం గవర్నర్ నోటి వెంట అబద్ధాలు, అసత్యాలు చెప్పించి ఆయన స్థాయిని దిగజార్చిందని ఆరోపించారు. ‘బడ్జెట్ ప్రసంగంలో కొత్త విషయాలు, ప్రజలకు ఇచ్చిన హామీలు, ఆరు గ్యారంటీలపై స్పష్టత ఇస్తారని, గత 15 నెలల పాలనపై ప్రాయశ్చిత్తం చేసుకుంటారని ఆశించాం. కానీ అలాంటిదేమీ జరగలేదుగానీ పెళ్లిలో చావుడప్పు కొట్టినట్టుగా ప్రసంగం ఉంది’అని విమర్శించారు. బుధవారం అసెంబ్లీ మీడియా పాయింట్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కలిసి కేటీఆర్ మాట్లాడారు. గవర్నర్ ప్రసంగం పూర్తిస్థాయిలో ప్రజలను వంచించడమేనని, ఆయన ప్రతిష్టను సైతం తగ్గించిందని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ప్రభుత్వ ఘోర వైఫల్యంతో రైతులు అరిగోసలు పడుతున్నారని, పంటలు ఎండిపోతున్నాయని, 480 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నా, గవర్నర్ ప్రసంగంలో ఆ కుటుంబాలకు భరోసా ఇచ్చే ఒక్కమాట కూడా లేదని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 25 నుంచి 30 శాతానికి మించి రుణమాఫీ జరగలేదని, గవర్నర్ నోటి ద్వారా మాత్రం రుణమాఫీ పూర్తయిందని అబద్ధాలు చెప్పించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు రుణమాఫీ, పెట్టుబడి సాయం అందక ఆగమాగమవుతుంటే, రైతుబంధు అందిందని, అసత్యాలు వల్లించారని విమర్శించారు. సాగునీటి సమస్య రోజురోజుకూ తీవ్రమవుతోందని, గోదావరి పరీవాహకంలో పంటలు ఎండిపోతున్నాయని, దీనికి సీఎం రేవంత్‌రెడ్డి బాధ్యత వహించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. 83 మంది విద్యార్థుల మరణాలపై గవర్నర్ ప్రసంగంలో ఒక్క సానుభూతి మాట కూడా లేదని విచారం వ్యక్తం చేశారు. బీసీలకు సామాజిక న్యాయమా? కులగణన పేరుతో బీసీల సంఖ్య తగ్గించి, వారిని మోసం చేసి.. ఏదో ఉద్ధరించినట్టు సోషల్‌జస్టిస్ అని గవర్నర్ నోటివెంట అబద్ధాలు చెప్పించడం సిగ్గుచేటని కేటీఆర్ దుయ్యబట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను అవమానించిందని తాము అనడం లేదని, అధికార కాంగ్రెస్ ఎమ్మెల్సీ ఒకరు గళం విప్పితే, ఆయన్ను సస్పెండ్ చేశారన్నారు. రాష్ట్రంలో ఒక్క బీసీ సంక్షేమ సంఘమైనా కులగణన లెక్కలు సరైనవని అంటుందా? ఒక్క బీసీ బిడ్డ మీ లెక్కతో ఏకీభవిస్తున్నడా? మీ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలైనా ఏకీభవించే పరిస్థితి ఉందా అంటూ ప్రశ్నించారు. నో విజన్.. ఓన్లీ కమీషన్ భారతదేశంలో ఏ రాష్ట్ర సచివాలయంలోనూ జరగని ఘోర సంఘటన తెలంగాణ సచివాలయంలో జరిగిందని కేటీఆర్ దుయ్యబట్టారు. 20 శాతం కమీషన్ ఇవ్వకపోతే బిల్లులు ఇవ్వడం లేదని కాంట్రాక్టర్లు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చాంబర్ ఎదుట ధర్నా చేసిన సంఘటనే దీనికి నిదర్శనమని ఆరోపించారు. ఈ ప్రభుత్వానికి విజన్ లేదు.. కేవలం 20 శాతం కమీషన్ కక్కుర్తి మాత్రమే ఉందని మండిపడ్డారు. కమీషన్ నుంచి వచ్చిన డబ్బులను ఢిల్లీకి మూటలు పంపుతున్నారని ఆరోపించారు. కేసీఆర్ ప్రభుత్వం 10 ఏళ్లలో రూ. 4.17 లక్షల కోట్ల అప్పు చేస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క సంవత్సరంలోనే రూ.1.62 లక్షల కోట్ల అప్పు చేసిందన్నారు. దావోస్‌లో రూ.1.79 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని గవర్నర్ ద్వారా అబద్ధాలు చెప్పించారని, గత ఏడాది చెప్పిన రూ.40,000 కోట్లలో ఒక్క పైసా కూడా రాలేదని, దీనిపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. గవర్నర్ ప్రసంగం వాస్తవాలను దాచిపెట్టే ప్రయత్నమని, తెలంగాణ ప్రజలు సమయం వచ్చినప్పుడు సమాధానం చెప్పడం ఖాయమన్నారు. పిచ్చికుక్క హద్దులన్నీ దాటేసింది ‘మర్యాదకు ఉండే హద్దులన్నింటినీ పిచ్చి కుక్కదాటేసింది. అతడిని వెంటనే ఏదైనా పిచ్చాస్పత్రికి వీలైనంత త్వరగా తీసుకెళ్లాలని కుటుంబ సభ్యులను కోరుతున్నారు. అసహనంతో ఉన్న అతను.. తన చుట్టూ ఉన్నవారిని కరవడం మొదలుపెడతాడేమో. త్వరగా కోలుకో ‘చీఫ్ మినిస్టర్’అని సీఎం రేవంత్‌ను ఉద్దేశించి కేటీఆర్ ‘ఎక్స్’లో పేర్కొన్నారు. -
మాటకు మాట.. తిప్పికొట్టాలి: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో అధికార కాంగ్రెస్ ఎమ్మెల్యేలు దూకుడుగా వ్యవహరించి.. ప్రతిపక్షాలను కకావికలం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు. ప్రతిపక్షాలు కావాలనే ప్రభుత్వంపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నాయన్న విషయాన్ని గుర్తించాలని.. సభ లోపల వారు మాట్లాడే ప్రతి పదాన్ని మాటకు మాట తిప్పికొట్టాలని దిశానిర్దేశం చేశారు. బడ్జెట్ సమావేశాల సందర్భంగా బుధవారం అసెంబ్లీ కమిటీ హాల్లో కాంగ్రెస్ శాసనసభాపక్షం (సీఎల్పీ) సమావేశమైంది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్న ఈ సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడారు. ‘‘ఈ బడ్జెట్ సమావేశాలు కీలకమైనవి. అధికారంలోకి వచ్చిన తర్వాత రెండో పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టబోతున్నాం. ఈ 15 నెలల కాలంలో ప్రజాప్రభుత్వం చేపట్టిన అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలపై చర్చించేందుకు బడ్జెట్ సమావేశాలను వేదికగా చేసుకోవాలి..’’ అని సూచించారు. గత పదేళ్లు పాలించిన బీఆర్ఎస్ కంటే ఎక్కువ కుంభకోణాలు చేసినవారెవరూ లేరని, రాష్ట్ర ప్రభుత్వంపై ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తే ఆ కుంభకోణాలను ప్రస్తావించి తిప్పికొట్టాలని దిశానిర్దేశం చేశారు. మొక్కుబడిగా హాజరవడం కాదు.. కాంగ్రెస్ సభ్యుల్లో ప్రతిఒక్కరూ తప్పనిసరిగా సమావేశాలకు హాజరుకావాలని, అంటే వచ్చి సంతకం పెట్టి వెళ్లిపోవడం కాదని, సభను సీరియస్‌గా ఫాలో కావాలని సీఎం రేవంత్ పేర్కొన్నారు. కొత్తగా ఎన్నికైన సభ్యులు సభ ప్రొసీడింగ్స్‌పై అవగాహన పెంచుకోవాలని సూచించారు. ఇష్టమైన సబ్జెక్టులను ఎంచుకుని వాటిపై అధ్యయనం చేసి సభలో మాట్లాడే ప్రయత్నం చేయాలని.. ఆయా సబ్జెక్టులపై ప్రతిపక్షాలు చెప్పే అంశాలను తిప్పికొట్టే స్థాయికి అవగాహన పెరగాలని చెప్పారు. సభ్యుల మధ్య సమన్వయం ఉండాలని, ప్రతి ఆరుగురు ఎమ్మెల్యేలు కలిసి ఓ మంత్రి సహకారంతో తమకు ఇష్టమైన సబ్జెక్టుల గురించి నేర్చుకోవాలని సూచించారు. నాకేమిటనే నిర్లక్ష్యం వద్దు ‘‘ప్రతిపక్షాల విమర్శలను అటు సభలో, ఇటు బయట కూడా సమర్థంగా ఎదుర్కోవాలి. బీఆర్ఎస్ ఏం చేసినా చూసీ చూడనట్టు ఉంటే వచ్చే ఎన్నికల్లో మీపై అభ్యర్ధిని నిలబెట్టరని ఏమైనా అనుకుంటున్నారా? ప్రతిపక్షాలు మాట్లాడే అంశాల గురించి నాకేమిటి, నా గురించి కాదు కదా? అని వదిలేయకుండా సమష్టి బాధ్యతగా తీసుకుని తిప్పికొట్టాలి..’’ అని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో కూడా చురుకుగా ఉండాలని సూచించారు. సభకు ఎవరు వస్తున్నారో, లేదో చూసుకోవాల్సిన బాధ్యత విప్లదేనని చెప్పారు. పార్లమెంటు తరహాలోనే ప్రతి రోజు మూడు సార్లు ఎమ్మెల్యేల అటెండెన్స్ తీసుకోవాలని విప్‌లను ఆదేశించారు. జిల్లాల వారీగా ఎమ్మెల్యేలను కలుస్తా.. త్వరలోనే జిల్లాల వారీగా పార్టీ ఎమ్మెల్యేలను కలుస్తానని, అందరితో కలసి భోజనం చేస్తానని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. జిల్లాల వారీ అభివృద్ధిపై సమీక్షలు జరుపుతామని, అటు పార్టీకి, ఇటు ప్రభుత్వానికి మేలు చేసే కార్యక్రమాల గురించి చర్చిద్దామని తెలిపారు. అలాగే ప్రతి ఎమ్మెల్యేతో కూడా తాను వ్యక్తిగతంగా మాట్లాడుతానని.. ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల్లోని సమస్యలు, అభివృద్ధి పనులకు సంబంధించిన ప్రతిపాదనలను సిద్ధం చేసుకోవాలని సూచించినట్టు సమాచారం. చెప్పేది సీరియస్‌గా తీసుకోండి.. సీఎల్పీ సమావేశంలో సభ్యుల అటెండెన్స్ గురించి రేవంత్ మాట్లాడుతున్న సమయంలోనే నాగార్జునసాగర్ ఎమ్మెల్యే కుందూరు జైవీర్‌రెడ్డి అసెంబ్లీ కమిటీ హాల్ నుంచి బయటికి వెళ్లారు. ఆ సమయంలోనే సీఎం పలు వ్యాఖ్యలు చేసినట్టు తెలిసింది. ‘‘సభ్యులందరూ కచ్చితంగా సభకు రావాలని నేను చెబుతుంటే కొందరు ఫోన్ చూసుకుంటూ బయటికి వెళుతున్నారు. సీఎల్పీ సమావేశంలో కూర్చునే ఓపిక కూడా ఉండదా? రాజకీయాలంటే పిల్లాలట కాదు. ఒక్కసారి గెలవగానే సరిపోదు. వచ్చే ఎన్నికల్లో కూడా గెలవడానికి సీరియస్‌గా ప్రయత్నించాలి. నాన్సీరియస్గా ఉంటే ఎలా?’’ అని పేర్కొన్నట్టు సమాచారం. -
ప్రభుత్వ విప్ లపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం
-
సీఎల్పీలో ఎమ్మెల్యేకి సీఎం రేవంత్ క్లాస్!
సాక్షి, హైదరాబాద్: సొంత పార్టీ ఎమ్మెల్యేపై సీఎం రేవంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నేను మాట్లాడే సమయంలో మీరు మధ్యలో వెళ్లిపోతే ఎలా? క్రమశిక్షణతో మెలిగితేనే ఫ్యూచర్ ఉంటుందని క్లాస్ తీసుకున్నారు. ఇంతకి సీఎం రేవంత్ క్లాస్ తీసుకున్న ఎమ్మెల్యే ఎవరు? అసలేం జరిగింది. నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. తొలిరోజు సమావేశాల్లో ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ శాసనసభలో ప్రసంగించారు. ఈ అసెంబ్లీ సమావేశాలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై సీఎల్పీ సమావేశం జరిగింది.ఈ సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డి ఆగ్రహానికి గురయ్యారు. అసెంబ్లీ సమావేశాల్లో వ్యవహరించాల్సిన విధానంపై సీఎం రేవంత్ ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలకు పలు సూచనలు చేస్తున్నారు. ఆ సమయంలో కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి కే.జానారెడ్డి కుమారుడు, నాగార్జున సాగర్ ఎమ్మెల్యే జైవీర్ రెడ్డి సమావేశం నుంచి భయటకు వెళ్లారు. దీంతో ఎమ్మెల్యే తీరుపై రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నేను మాట్లాడుతున్నా కదా. మీరు బయటకు వెళ్లడం ఏంటి? అని ప్రశ్నించారు. క్రమశిక్షణతో మెలిగితేనే ఫ్యూచర్ ఉంటుందని క్లాస్ తీసుకున్నారు. అనంతరం, తన ప్రసంగాన్ని కొనసాగించారు. -
Haryana: కాంగ్రెస్‌కు ఘోర పరాభవం
ఛండీగఢ్: హర్యానా స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఘోర పరాభవం ఎదురైంది. మొత్తం 10 మున్సిపల్ కార్పొరేషన్లకుగానూ తొమ్మిదింటిని బీజేపీ కైవసం చేసుకోగా.. మిగిలిన ఒక స్థానం మానేసర్‌లో బీజేపీ రెబల్ లీడర్ ఇంద్రజిత్ యాదవ్ ఆధిక్యంలో దూసుకుపోతున్నారు. ఆయన విజయం దాదాపు ఖరారైనట్లు సమాచారం. గురుగ్రామ్, ఫరిదాబాద్, రోహతక్, హిసార్లాంటి కీలక ప్రాంతాలతో పాటు మరో మూడు మున్సిపల్ కార్పొరేషన్లలో మార్చి 2వ తేదీన పోలింగ్ జరిగింది. అలాగే.. పానిపట్ మున్సిపల్ కార్పొరేషన్‌కు మార్చి 9వ తేదీన విడిగా పోలింగ్ జరిగింది. వీటితోపాటు అంబాలా, సోనిపట్ మేయర్ పోస్టుల కోసం ఉప ఎన్నికలు, అలాగే.. 21 మున్సిపల్ కమిటీల ప్రెసిడెంట్స్, వార్డ్ మెంబర్స్ ఎన్నిక కోసం మార్చి 2వ తేదీన ఎన్నికలు జరిగాయి. బుధవారం ఉదయం నుంచి ఫలితాలు వెలువడడం ప్రారంభం అయ్యాయి. దాదాపు అన్ని చోట్ల కమలం పార్టీ స్పష్టమైన ఆధిక్యం కనబరుస్తుండడంతో ఆ పార్టీ శ్రేణులు సంబురాల్లో మునిగిపోయాయి. ఏ చోటా కాంగ్రెస్ గట్టి పోటీ ఇవ్వలేకపోయింది. మాజీ సీఎం భూపిందర్ సింగ్ హుడా అడ్డా రోహతక్లోనూ కాంగ్రెస్‌కు ఓటమి తప్పలేదు. మరోవైపు.. పలు వార్డు మెంబర్స్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.ఇదిలా ఉంటే.. కిందటి ఏడాది అసెంబ్లీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ ఓటమి పాలైన సంగతి తెలిసిందే. అయితే ఈ స్థానిక సంస్థల ఎన్నికలను ఇటు బీజేపీ, అటు కాంగ్రెస్‌లు ప్రతిష్టాత్మకంగా భావించాయి. ఈ క్రమంలో రాజస్థాన్ సీఎం నయాబ్ సైనీ, ఢిల్లీ సీఎం రేఖా గుప్తాలతో బీజేపీ ప్రచారం చేయించగా.. ప్రతిగా కాంగ్రెస్ సచిన్ పైలట్, హుడాలతో ప్రచారం చేయించింది. అసెంబ్లీ ఎన్నికల్లో 68 శాతం ఓటింగ్ నమోదు కాగా.. ఈ లోకల్ బాడీ ఎన్నికల్లో 41 శాతం ఓటింగ్ నమోదు అయ్యింది. -
గవర్నర్ ప్రసంగంపై కేటీఆర్ గరం వ్యాఖ్యలు
హైదరాబాద్, సాక్షి: గవర్నర్ బడ్జెట్ ప్రసంగంలో(Governor Budget Speech) కొత్త విషయాలేవీ లేవని.. మరోసారి అబద్ధాలే చెప్పించారని కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు(KTR) గరం అయ్యారు. బుధవారం గవర్నర్ ప్రసంగం ముగిసిన అనంతరం ఆయన అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు.గత 15 నెలల పాలనలో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా వైఫల్యం చెందింది. ఆ వైఫల్యాలను అంగీకరిస్తారేమోనని అసెంబ్లీకి వచ్చాం. కానీ, అది జరిగేలా కనిపించడం లేదు. ఇది గవర్నర్ ప్రసంగంలా లేదు. గాంధీ భవన్ ప్రెస్‌మీట్‌లా ఉంది. రైతు సమస్యలతో పాటు దేనని ప్రస్తావించలేదు. గవర్నర్‌తో అన్నీ అబద్ధాలే చెప్పించారు. తద్వారా గవర్నర్ హోదాను దిగజార్చింది ఈ ప్రభుత్వం. రాష్ట్రంలో 400 మందికి పైగా ఆత్మహత్యలు చేసుకున్నారు. రేవంత్ చేతకానితనం వల్లే రాష్ట్రంలో పంటలు ఎండిపోతున్నాయి. రైతులు బాధ పడుతున్నారు. కానీ, రైతు సమస్యలపై గవర్నర్ ప్రసంగంలో ఊసే లేదు. సాగునీటి తో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటిదాకా 30 శాతం మించి రుణమాఫీ జరగలేదు. సాగు నీటి సంక్షోభం నెలకొన్నది. కేసీఆర్(KCR)పై కోపంతో మేడిగడ్డకు మరమత్తులు చేయించడం లేదు. 20% కమిషన్ కోసం కాంట్రాక్టర్లు ధర్నా చేశారు. సిగ్గుపడాల్సిన విషయం ఇది.... గురుకులాల్లో అధ్వానమైన పరిస్థితులు నెలకొన్నాయి. గతంలో అప్పులు చేశారంటూ గుండె బాదుకున్న సన్నాసులు.. ఏడాదిలోనే 1లక్ష 50 వేల కోట్ల అప్పు చేశారు. ఈ అంశం గవర్నరు ప్రసంగం లో లేదు. ఏడాదిలోనే వరి ధాన్యం పండించామని దేశంలో నెంబర్ వన్ అని చెప్పుకున్నారు. సిగ్గులేదు ఈ కాంగ్రెస్ పార్టీకి. గ్రామాలకు వెళ్తే తరిమి కొడుతున్నారు అని కేటీఆర్ మండిపడ్డారు. -
Telangana: రాష్ట్ర బడ్జెట్ రూ. 3.20లక్షల కోట్లు?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు బుధవారం ప్రారంభం అవుతున్నాయి. ఉదయం 11 గంటలకు పాత అసెంబ్లీ భవనంలో అసెంబ్లీ, మండలి భేటీతో ఈ సమావేశాలు మొదలవుతాయి. తొలిరోజు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అనంతరం సభ వాయిదాపడనుంది. ఆ తర్వాత శాసనసభా వ్యవహారాల సలహా కమిటీ (బీఏసీ) భేటీ నిర్వహిస్తారు. బడ్జెట్ సమావేశాలను ఎప్పటివరకు నిర్వహించాలి, ఏయే అంశాలను చేపట్టాలన్న దానిపై అందులో నిర్ణయం తీసుకుంటారు. గురువారం గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై అసెంబ్లీలో చర్చ జరగనుంది. గవర్నర్ ప్రసంగానికి ఆమోదం తెలిపిన తరువాత సభ వాయిదా పడనుంది. శుక్రవారం హోలీ పండుగ కావడంతో సెలవు ఉంటుందని, శనివారం వీలును బట్టి అసెంబ్లీ నిర్వహిస్తారని లేదంటే మళ్లీ సోమవారం అసెంబ్లీ ప్రారంభమవుతుందని సమాచారం. కాగా.. గత బడ్జెట్ కన్నా సుమారు పది శాతం అదనంగా రూ.3.20 లక్షల కోట్లతో ఈసారి బడ్జెట్ ఉండవచ్చని అధికారవర్గాలు చెబుతున్నాయి. సభ ముందుకు రెండు బిల్లులు.. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ ముగిసిన అనంతరం.. ఎస్సీ వర్గీకరణ, బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల బిల్లులను రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది. ఆ బిల్లులపై చర్చించి ఆమోదించనున్నారు. తర్వాత ఈనెల 19న లేదా 20న 2025–26 బడ్జెట్‌ను అసెంబ్లీలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మండలిలో శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ప్రవేశపెడతారు. ఈ బడ్జెట్ ప్రతిపాదనలు, శాఖల వారీ పద్దులపై చర్చిస్తారు. అనంతరం బడ్జెట్ ప్రతిపాదనలను ఆమోదించే ద్రవ్య వినిమయ బిల్లును ప్రవేశపెడతారు. ఇందుకోసం ఈనెల 27 లేదా 29వ తేదీ వరకు అసెంబ్లీ సమావేశాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. నిరసనలకు నో..! అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నిర్వహణ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. అటు అసెంబ్లీ, ఇటు ప్రభు త్వ, పోలీసు వర్గాలు సమన్వయంతో వ్యవహరించేలా శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, శాసనసభా వ్యవహారాల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఇప్పటికే ముందస్తు సమావేశాలు నిర్వహించి అధికారులకు దిశానిర్దేశం చేశారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా మూడంచెల భద్రతా ఏర్పాట్లు చేశారు. అసెంబ్లీ పరిసరాల్లో నిరసనలు, ర్యాలీలు, ధర్నాలకు అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు. ఎవరి వ్యూహం వారిదే.. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల కోసం అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీలతోపాటు ఎంఐఎం, సీపీఐ సిద్ధమయ్యాయి. గత ఏడాది కాలంలో రాష్ట్రంలో అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి పథకాల గురించి ప్రజలకు వివరించడమే ప్రధాన ఉద్దేశంగా ఈసారి అధికార కాంగ్రెస్ అసెంబ్లీని వేదికగా చేసుకోనుంది. ముఖ్యంగా కులగణన, ఎస్సీల వర్గీకరణతోపాటు ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలల ఏర్పాటు కోసం తీసుకున్న చర్యలు, సంక్షేమ పథకాల అమలు తీరును ప్రజలకు వివరించేలా ప్రణాళికలు రచిస్తోంది. మరోవైపు ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అస్త్రశ్రస్తాలు సిద్ధం చేసుకుంటోంది. ఆరు గ్యారంటీలు, కృష్ణా జలాలు, ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదం, రాష్ట్రంలో కరువు పరిస్థితులు, తాగు, సాగునీటి కొరత, యూరియా, సాగునీటి కోసం రైతుల ఇబ్బందులు తదితర అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీయాలని బీఆర్ఎస్ నిర్ణయించింది. ఇక బీజేపీ కూడా రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలే టార్గెట్‌గా ఈసారి బడ్జెట్ సమావేశాలకు హాజరుకానుంది. బడ్జెట్ పరిస్థితి ఏమిటి? రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబోయే బడ్జెట్ అంచనాలపై ఆసక్తి నెలకొంది. దేశవ్యాప్తంగా కనిపిస్తున్న ఆర్థిక మాంద్యంతోపాటు రాష్ట్ర సొంత పన్ను రాబడులు తగ్గిపోవడం, రిజి్రస్టేషన్లు, జీఎస్టీ రాబడుల్లో తగ్గుదల, రెవెన్యూ రాబడులకు, ఖర్చుకు మధ్య భారీ తేడా ఉండటం, ప్రతిపాదిత బడ్జెట్ అంచనాలు, సవరించిన అంచనాలకు మధ్య రూ.50 వేల కోట్ల వరకు లోటు ఉండటం వంటివి కీలకంగా మారాయి. అయితే అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకుని వాస్తవిక బడ్జెట్‌ను రూపొందించినట్టు ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో రూ.2.91 లక్షల కోట్ల బడ్జెట్ ప్రతిపాదించగా.. ఈసారి రూ.3.20 లక్షల కోట్ల వరకు ఉండవచ్చని ఆర్థిక శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో బడ్జెట్ పరిమాణం తగ్గినా ఆశ్చర్యం లేదని కూడా ఆర్థిక శాఖ వర్గాలు చెబుతుండటం గమనార్హం. నిజానికి ఎన్నికల్లో హామీ ఇచ్చిన మేరకు సంక్షేమ పథకాలకు పెద్ద మొత్తంలో నిధులు వ్యయం కానున్నాయి. ప్రభుత్వం ప్రతిష్టాత్మంగా తీసుకుంటున్న ఫ్యూచర్ సిటీ, ఇందిరమ్మ ఇళ్లకు రూ.20 వేల కోట్లు, నీటిపారుదల రంగానికి రూ.19 వేల కోట్లు, విద్యుత్ రంగానికి సుమారు రూ.14 వేల కోట్లు, రవాణాకు రూ.5,800 కోట్లు, పెన్షన్ల పెంపు అమలుకు మరో రూ.8 వేల కోట్లు కావాలి. ఇక యువ వికాసానికి రూ.6 వేల కోట్లు, ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్‌కు రూ.11,500 కోట్లు కేటాయింపులు చేస్తారని భావిస్తున్నారు. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధికి, వైద్యారోగ్య రంగాలకు కూడా ఎక్కువ మొత్తంలో నిధులు కేటాయించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. -
ఈసీకి జ్ఞానోదయం ఎప్పుడు?
తటస్థతకు తిలోదకాలొదిలి అవకతవకలకు అసలైన చిరునామాగా మారిన ఎన్నికల సంఘం(ఈసీ) సిగ్గుపడాల్సిన విషయమిది. ఆరోపణలొచ్చినప్పుడూ, ఫిర్యాదులందినప్పుడూ మౌనంతోనో, దబా యింపుతోనో తప్పించుకోజూస్తున్న ఈసీపై సోమవారం పార్లమెంటు ఉభయసభలూ దద్దరిల్లాయి. మహారాష్ట్రలో వోటర్ల జాబితా అవకతవకలపై కాంగ్రెస్ ఆరోపణలు చేసి మూణ్ణెల్లవుతోంది. నెల క్రితం కూడా ఆ పార్టీ నాయకుడు రాహుల్‌గాంధీ మీడియా సమావేశంలో ఈసీపై అభియోగాలు మోపారు. అయిదు నెలల వ్యవధిలో కొత్తగా 39 లక్షలమంది వోటర్లు ఎలా పుట్టుకొచ్చారని ప్రశ్నించారు. అవి ఆధార రహితం, తప్పుదోవ పట్టించే అభాండాలని చెప్పటం తప్ప నిర్దిష్టంగా ఫలానా చోట ఏం జరిగిందో, వోటర్ల సంఖ్య పెరగటానికి కారణమేమిటో వివరించే ప్రయత్నం ఈసీవైపు నుంచి లేదు! అటు బెంగాల్లో ఈ మాదిరి అవకతవకలే బయటపడి ఆ సంస్థ పరువు బజారుపాలు చేశాయి. వోటర్ల జాబితా అవకతవకలతోపాటు నకిలీ వోటరు కార్డులు రాజ్యమేలుతున్నాయని తృణమూల్ ఫిర్యాదు చేస్తే మూడు నెలల్లో సరిచేస్తామన్న జవాబొచ్చింది. వెనువెంటనే దర్యాప్తు చేసి దీనివెనక జరిగిందేమిటో తేల్చిచెప్పడానికి బదులు సరిచేస్తామనటంలో మర్మమేమిటి? అక్కడే కాదు... హరియాణా, గుజరాత్, ఒడిశా, యూపీల్లో సైతం ఇలాగే జరిగిందని విపక్ష సభ్యులు ఆరో పించారు. ఇటీవల ఎన్నికలు జరిగిన ఢిల్లీలోనూ ఇదే తంతు నడిచిందని ఆప్ ఆరోపణ. రాజ్యాంగ సంస్థగా ఎంతో హుందాగా, నియమ నిబంధనలకు లోబడి పనిచేయాల్సిన సంస్థ ఇలా అడుగడు గునా కంతలతో, లోపాయికారీ వ్యవహారాలతో ఎన్నికలు జరిపించటం సిగ్గుచేటు కాదా?ప్రజాస్వామ్యంలో ఎన్నికల నిర్వహణ నిష్టగా నిర్వహించాల్సిన క్రతువు. అది కాస్తా ఈమధ్య కాలంలో నవ్వుల పాలవుతున్న వైనం కనబడుతున్నా తనకేం సంబంధం లేనట్టు ఆ సంస్థ ప్రవర్తి స్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో నిరుడు ఎన్నికల సందర్భంగా కేంద్రంలోని అధికార ఎన్డీయే కూటమితో కొత్తగా చుట్టరికం కుదిరిందన్న ఏకైక కారణంతో అప్పటి విపక్ష నాయకులు చెప్పినట్టల్లా అధికారు లను బదిలీలు చేశారు. పర్యవసానంగా ఇతర జిల్లాల్లో జరిగిన దారుణ ఉదంతాల సంగతలా ఉంచి పల్నాడు ప్రాంతం ఎంతటి హింసను చవిచూసిందో, ఎన్ని గ్రామాల ప్రజలు ఇళ్లూ వాకిళ్లూ వదిలి ప్రాణభయంతో పారిపోయారో మీడియా సాక్షిగా వెల్లడైంది. పోలింగ్ కేంద్రాల దురాక్రమణ, తెల్లారుజాము వరకూ పోలింగ్ తంతు కానివ్వటం వంటి అరాచకాలకు అంతులేదు. సాయంత్రం గడువు ముగిసే సమయానికి పోలింగ్ కేంద్రం గేట్లు మూసి ఆ ఆవరణలో ఉన్నవారికి మాత్రమే స్లిప్‌లిచ్చి వోటు వేయటానికి అనుమతించాలని నిబంధనలు చెబుతున్నాయి. క్యూలో చిట్టచివర గేటు దగ్గర ఉన్నవారికి ఒకటో నంబర్ స్లిప్ ఇవ్వటంతో మొదలెట్టి బూత్ సమీపంలో ఉన్నవారికి ఆఖరి స్లిప్ ఇవ్వాలి. ఓటేశాక ఆ స్లిప్‌లు భద్రపరచాలి. సీసీ టీవీ ఫుటేజ్‌లు భద్ర పరచాలి. ఇదంతా జరిగిందా? పోలింగ్ ముగిసిన నాలుగురోజుల తర్వాత 12.5 శాతం వోటింగ్ పెరిగినట్టు చూప టానికి ఈసీ ఏమాత్రం మొహమాట పడలేదు. ఇదంతా ఎక్కడ బయటపడుతుందోనన్న కంగా రుతో పరాజితులు న్యాయస్థానాన్ని ఆశ్రయించే సమయానికే ఈవీఎంల డేటా ఖాళీ చేశారు. వీవీప్యాట్ స్లిప్‌లు ధ్వంసం చేశారు. ఈవీఎంలలో రికార్డయిన ఓట్ల లెక్కలు బయటకు తీసి, అవి వీవీప్యాట్ స్లిప్‌లతో సరిపోల్చాలని కోరితే డమ్మీ గుర్తులతో కొత్తగా నమూనా వోటింగ్ నిర్వహించ టానికి సిద్ధపడ్డారు! ఇక భద్రపరిచిన ఈవీఎంలలో చార్జింగ్ ఎలా పెరుగుతుందో ఇంతవరకూ చెప్పలేకపోయింది. వీటిపై వైఎస్సార్ కాంగ్రెస్ నిలదీస్తే జవాబివ్వటానికి ఈసీకి నోరు పెగలదు. పార్లమెంటులో ఇంత దుమారం రేగాక డూప్లికేట్ కార్డులపైనా, వోటర్ల జాబితా అవకతవక లపైనా సాధికారికంగా, పద్ధతిగా జవాబివ్వడానికి బదులు వేరే మార్గం ఎంచుకుంది. ‘ఈసీ వర్గాలు’ అనే పేరుతో ఒక వివరణ బయటికొదిలింది. ఆ సంస్థ తనను తాను ఏమనుకుంటున్నదో గానీ ఇలా మీడియాకు లీకులివ్వటం మర్యాదైన సంగతి కాదు. ఒక పార్టీయో లేదా ప్రభుత్వమో తమ ఆలోచనలపై ప్రజాస్పందనేమిటో తెలుసుకోవటానికి లీకులిస్తుంటాయి. దాని ప్రయోజనం దానికుంటుంది. కానీ ఈసీ అలా చేయటంలో ఆంతర్యమేమిటి? ఉదాహరణకు డూప్లికేట్ వోటర్ కార్డులు వారసత్వపు సమస్యగా తేల్చిచెప్పింది. 2008–13 మధ్యే ఈ కార్డులు జారీ అయ్యాయన్నది. అదే నిజమనుకుంటే ఆ సంగతి ఈసీకి ఎప్పుడు తెలిసింది? తెలిశాక తీసుకున్న చర్యలేమిటి? ఇన్నాళ్లూ సరిచేయక పోవటానికి కారణాలేమిటి? అధికారికంగా ఇలాంటి తెలివితక్కువ జవాబు లిస్తే మరిన్ని ప్రశ్నలు వచ్చిపడతాయన్న భయంతోనే ఆ సంస్థ లీకులతో సరిపెట్టింది.ఎంతకాలం ఈ దాగుడుమూతలు? ఎన్నాళ్లు ఈ అవకతవకలు? ఎన్నికల ప్రక్రియపైనా, వివిధ దశల్లో చోటుచేసుకున్న అక్రమాలపైనా ఫిర్యాదులొస్తే నిమ్మకు నీరెత్తినట్టు కూర్చుని ఇప్పుడు పార్లమెంటులో పెద్ద రాద్ధాంతం జరిగాక లీకులివ్వటం, అవి మరిన్ని సందేహాలకు తావీయటం అప్రదిష్ట కాదా? ఇందువల్ల తమ విశ్వసనీయత దెబ్బతింటుందన్న ఇంగితజ్ఞానం కూడా లేదా? ఓడిన రాజకీయ పార్టీలు మాత్రమే కాదు... సాక్షాత్తూ ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా పనిచేసిన ఎస్‌వై ఖురేషీ సైతం గతంలోనూ, ఇప్పుడూ కూడా అనేక ప్రశ్నలు లేవనెత్తారు. ఎన్నికల సంఘం తీరు సవ్యంగా లేదన్న అభిప్రాయం ప్రజల్లో బలపడుతున్నదని హెచ్చరించారు. కనుక ఆ సంస్థ ఇప్పటికైనా పారదర్శకతతో వ్యవహరించటం నేర్చుకోవాలి. తప్పును తప్పుగా ఒప్పుకొనే నిజాయితీ ప్రదర్శించాలి. లేనట్టయితే ప్రజానీకం దృష్టిలో దోషిగా మిగలక తప్పదు. -
14 నెలలైనా.. హామీల అమలులో అదే కాలయాపన
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు 6 గ్యారంటీలు ప్రకటించి, అధికారంలోకి వచ్చి 14 నెలలు గడుస్తున్నా ఆ హామీలు అమలు చేయకుండా కాలయాపన చేస్తోందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి మండిపడ్డారు. దేశ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే పార్టీ బీజేపీ అని, తాము చేయలేకపోయిన హామీలను ఇంకొకరి మీద వేసి, వారు అడ్డుకుంటున్నారు అని ఎప్పుడూ ఎవరినీ నిందించలేదని పరోక్షంగా సీఎం రేవంత్‌రెడ్డిని కిషన్‌రెడ్డి విమర్శించారు. కొత్త ప్రాజెక్టుల పేరు మీద రూ. 1.5 లక్షల కోట్లు కావాలి అంటూ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయడం చిన్నపిల్లల నవ్వులాటలా ఉందని ఎద్దేవా చేశారు. ఆర్థిక వనరులకు అనుగుణంగా కార్యాచరణ రూపొందించాలని కిషన్‌రెడ్డి సూచించారు. మంగళవారం సాయంత్రం ఢిల్లీలోని తన నివాసంలో భారతీయ పురాతన చేతివృత్తుల వైభవాన్ని గుర్తుచేస్తూ రచించిన ‘వూట్జ్: ద ఫర్గాటెన్ మెటల్ క్రాఫ్ట్ ఆఫ్ డెక్కన్’పుస్తకాన్ని కిషన్‌రెడ్డి ఆవిష్కరించారు.అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఇచ్చిన హామీలు అమలు చేయకుండా, తన వైఫల్యాలను ప్రశ్నిస్తున్న ప్రజల దృష్టి మళ్లించడానికి కొత్త ప్రాజెక్టుల రూపకల్పన చేసి కేంద్ర ప్రభుత్వాన్ని డబ్బులు అడుగుతున్నారని విమర్శించారు. ఇది దివాలాకోరు విధానం, బాధ్యతారాహిత్యమని మండిపడ్డారు. బీఆర్ఎస్ హయాంలో రూ. 7.5 లక్షల కోట్లు అప్పు చేసిందని, తమకు తెలియదని, రాష్ట్ర అప్పు రూ.3.5 లక్షల కోట్లే అనుకున్నానని రేవంత్‌రెడ్డి ఇటీవల చేసిన వ్యాఖ్యలను కిషన్‌రెడ్డి తప్పుబట్టారు. ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేకపోతున్నానని, హామీలు అమలు చేయలేకపోతున్నానంటూ ముఖ్యమంత్రి మాట మార్చడం రాహుల్‌గాం«దీ, రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు, అసమర్థతకు అద్దం పడుతోందని కిషన్‌రెడ్డి ధ్వజమెత్తారు. హైదరాబాద్ రీజినల్ రింగ్ రోడ్డుకు తామే హామీ ఇచ్చామని, తప్పకుండా అమలు చేస్తామని కేంద్రమంత్రి స్పష్టం చేశారు. బుధవారం నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాల్లో రైతు భరోసా, మహిళలకు ఇచ్చిన హామీలు, జాబ్ కేలండర్, నిరుద్యోగ భృతి, రైతులు, కౌలు రైతులకు ఆర్థిక సహాయం, పెన్షన్లు సహా ఇచి్చన అన్ని హామీల గురించి ప్రస్తావిస్తామన్నారు. వీటన్నింటి గురించి శాసనసభలో చర్చిస్తే బాగుంటుందని కిషన్‌రెడ్డి సూచించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 14 నెలల్లో రాష్ట్రాన్ని దోపిడీ చేశారని, రియల్టర్లను వేధిస్తున్నారని మండిపడ్డారు. ఓడిపోతామన్న భయంతోనే ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో తనపై వ్యక్తిగత విమర్శలు చేశారన్నారు. తనను ఎవరు తిట్టినా వారి విజ్ఞతకే వదిలేస్తానని చెప్పారు. -
నటనా రంగంలోకి అడుగు పెట్టనున్నకాంగ్రెస్ నేత జగ్గారెడ్డి
-
సినిమాల్లోకి జగ్గారెడ్డి ఎంట్రీ.. మూవీ పోస్టర్ విడుదల
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి త్వరలో సినిమా రంగంలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. త్వరలో ఒక ప్రేమ కథా చిత్రంలో ప్రత్యేక పోషిస్తున్నట్టు జగ్గారెడ్డి పేర్కొన్నారు. ఈ క్రమంలో జగ్గారెడ్డి సినిమాకు సంబంధించిన పోస్టర్ విడుదలైంది.కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రాజకీయాల నుంచి కొంత రిలాక్స్ అవుతున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే సినిమాలపై ఆసక్తితో ఉన్నట్టు జగ్గారెడ్డి తెలిపారు. తాజాగా జగ్గారెడ్డి మాట్లాడుతూ..‘నాకు సినిమా ఆఫర్ వచ్చింది. లవ్‌స్టోరీ చిత్రంలో ప్రత్యేక పాత్ర చేస్తున్నాను. ప్రేమికుల ప్రేమను కాపాడే క్యారెక్టర్లో జగ్గారెడ్డి కనిపిస్తాడు. మాఫీయాను ఎదిరించి ప్రేమ పెళ్లి చేసే నాయకుడి పాత్ర పోషిస్తున్నాను. రాజకీయాల్లో ఉంటా.. సినిమాల్లో కూడా ఉంటాను. రాజకీయాల్లో నన్ను ఎవరూ తొక్కలేరు. నా ఒరిజినల్ క్యారెక్టర్ సినిమాలో చూస్తారు. ఉగాదికి సినిమా కథ విని వచ్చే ఉగాదికి సినిమా పూర్తి చేస్తాను. పీసీపీ, ముఖ్యమంత్రికి చెప్పి సమయం తీసుకుని ఏడాది పాటు సినిమాలో నటిస్తాను అని చెప్పుకొచ్చారు. ఇక, తాజాగా జగ్గారెడ్డి పోస్టర్లను విడుదల చేసింది చిత్ర బృందం. ఈ చిత్రానికి వద్ది రామానుజం దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. మరోవైపు.. జగ్గారెడ్డి సినిమాల్లో ఎంట్రీ ఇస్తున్న నేపథ్యంలో ఆయన అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. -
కేంద్ర మంత్రుల పోస్టులు.. ఖండించిన కరీంనగర్ పోలీసులు
సాక్షి, హైదరాబాద్: ఛాంపియన్స్ ట్రోఫీ విజయ సంబురాల్లో జరిగిన పరిణామాలపై కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్‌లు ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అయితే లాఠీ ఛార్జ్ ఆరోపణలను కరీంనగర్ పోలీసులు ఖండిస్తూ ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు.కరీంనగర్లో పెద్ద సంఖ్యలో రోడ్లపైకి వచ్చిన అభిమానులపై పోలీసులు లాఠీలు ఝళిపించారని కేంద్ర మంత్రులు పోస్టులు చేశారు. దీనికి సంబంధించిన వీడియోలని పేర్కొంటూ.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వాటిని పోస్ట్ చేశారు. అయితే.. విజయ సంబురాల్లో ఎలాంటి లాఠీ ఛార్జ్ జరగలేదని.. సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్లో నిజం లేదంటూ కేంద్ర మంత్రుల ట్వీట్స్ ప్రెస్ నోట్ ద్వారా పోలీసులు వివరణ ఇచ్చారు. అవి ఫేక్ వీడియోలంటూ స్పష్టత ఇచ్చారు. ఇదిలా ఉంటే.. కరీంనగర్‌తో పాటు హైదరాబాద్‌లోని దిల్సుఖ్నగర్ ప్రాంతంలో అభిమానులపై పోలీసులు లాఠీచార్జ్ చేసి వారిని చెదరగొట్టారంటూ వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఈ ఘటనలపై కేంద్రమంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్ స్పందించారు. కిషన్‌రెడ్డి ట్విట్టర్ వేదికగా.. భారత జట్టు విజయం సాధించిన సందర్బంగా విజయోత్సవాలను తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డుకోవడం, అనుమతి ఇవ్వకపోవడం సిగ్గు చేటు అంటూ మండిపడ్డారు.This is how the Congress govt. in Telangana not allowing India’s #ChampionsTrophy2025 win celebrations.Shameful! pic.twitter.com/OxIdrfkn90— G Kishan Reddy (@kishanreddybjp) March 9, 2025బండి సంజయ్ కూడా ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ..‘కరీంనగర్ పోలీసులు ఏ దేశానికి మద్దతు ఇస్తున్నారు?. భారత విజయాన్ని మనం జరుపుకోలేము.. కానీ, పాకిస్తాన్ పేరుతో ఉన్న ఫ్లెక్సీని తొలగిస్తారా?. భారత విజయాన్ని జరుపుకోవడం మతపరమైన సమస్యగా ఎలా మారుతుంది?. శాంతిభద్రతల సమస్యలను సృష్టించడానికి ఎందుకు అంత ఆసక్తిగా ఉన్నారో తెలంగాణ పోలీసులు సమాధానం చెప్పాలి’ అని డిమాండ్ చేశారు.Can the Home Minister of Telangana Shri Revanth Reddy garu clarify - which country is Karimnagar police supporting?We can’t celebrate India’s win, but a flexi with Pakistan’s name will be removed?How does celebrating India’s victory become a “communal issue”? @TelanganaDGP… https://t.co/4Hpyid5ThM— Bandi Sanjay Kumar (@bandisanjay_bjp) March 9, 2025 -
మాజీ సీఎం ఇంట్లో ఈడీ సోదాలు.. కాంగ్రెస్ నేతల్లో టెన్షన్!
రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్‌లో రాజకీయం ఆసక్తికరంగా మారింది. మాజీ ముఖ్యమంత్రి భూపేష్ భాఘేల్, ఆయన కుమారుడి చైతన్య భాఘేల్ నివాసాల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సోదాలు నిర్వహిస్తున్నారు. మనీ లాండరింగ్ కేసు విషయమై 14 ప్రదేశాల్లో సోదాలు కొనసాగుతున్నట్టు అధికారులు తెలిపారు. దీంతో, మాజీ సీఎం నివాసం వద్దకు భారీ సంఖ్యలో కాంగ్రెస్ మద్దతుదారులు వచ్చి చేరుకున్నారు.ఛత్తీస్‌గఢ్‌లో మద్యం కుంభకోణంపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు దర్యాప్తు చేపట్టారు. అందులో భాగంగా మాజీ సీఎం భూపేశ్ భాఘేల్, ఆయన కుమారుడి నివాసాల్లో సోమవారం తెల్లవారుజాము నుంచి ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. భిలాయ్ 3 మానసరోవర్ కాలనీలో ఉన్న మాజీ సీఎం బంగ్లాలో ఈడీ తనిఖీలు చేపట్టింది. ఆర్థిక అవకతవకలు, మనీలాండరింగ్‌కు సంబంధించి ఈడీ దాడులు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు.ఈడీ సోదాల నేపథ్యంలో కాంగ్రెస్ మద్దతుదారులు మాజీ సీఎం ఇంటికి వద్దకు భారీ సంఖ్యలో వచ్చి చేరుకున్నారు. ఈ సందర్భంగా భద్రత కోసం హాజరైన సీఆర్పీఎఫ్ జవాన్లకు, కాంగ్రెస్ కార్యకర్తలకు మధ్య వాగ్వాదం జరిగింది. మీడియా సిబ్బంది కవరేజీని కాంగ్రెస్ శ్రేణులు అడ్డుకున్నాయి. అయితే కాసేపటి తర్వాత వాతావరణం సద్దుమణిగింది. కాంగ్రెస్ కార్యకర్తలు బీజేపీ ప్రభుత్వానికి, ప్రధానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.VIDEO | ED raids Congress leader Bhupesh Baghel's premises in Bhilai as part of a money laundering investigation against his son - Chaitanya Baghel - in an alleged liquor scam case.Chaitanya Baghel shares the Bhilai accommodation with his father and hence the premises are being… pic.twitter.com/AdUWic1y26— Press Trust of India (@PTI_News) March 10, 2025కేసు ఇదీ..ఛత్తీస్‌గఢ్‌లో భారీ మద్యం కుంభకోణం వెలుగులోకి వచ్చింది. ఈ స్కామ్ ద్వారా నిందితులు సుమారు రూ.2వేల కోట్లు లబ్ధి పొందినట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) తెలిపింది. రాష్ట్రంలో అన్ని మద్యం షాపులను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తుంది. ఇందులో భాగంగా ఛత్తీస్‌గఢ్ స్టేట్ మార్కెటింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ (CSMCL) షాపుల నిర్వహణ, నగదు వసూలు, బాటిల్ తయారీ, హాలోగ్రామ్ తయారీ కోసం టెండర్లు పిలుస్తుంది. ఈ క్రమంలో రాజకీయ నాయకులు, సీఎస్‌ఎమ్‌సీఎల్ కమీషనర్, ఎండీల సహకారంతో తన సన్నిహితులైన వికాస్ అగర్వాల్, అర్వింద్ సింగ్‌లతో కలిసి బాటిల్ తయారీ నుంచి మద్యం అమ్మకాల వరకు ప్రతి విభాగంలో పెద్ద ఎత్తున్న లంచాలు ఆశచూపి పూర్తి మద్యం సరఫరా వ్యవస్థను అన్వర్ తన ఆధీనంలోకి తెచ్చుకున్నట్లు ఈడీ వెల్లడించింది.తర్వాత మద్యం సరఫరా చేసే కంపెనీల నుంచి కేస్‌పై (మద్యం బ్రాండ్ ఆధారంగా) రూ. 75 నుంచి రూ. 150 కమిషన్ వసూలు చేయడంతోపాటు ప్రైవేటుగా నకిలీ మద్యం తయారుచేసి, వాటిని ప్రభుత్వ దుకాణాల్లో విక్రయించి 30 నుంచి 40 శాతం కమిషన్ పొందాడని ఈడీ ఆరోపించింది. అలా, 2019 నుంచి 2022లో సుమారు రూ. 1,200 నుంచి రూ. 1500 కోట్లు అక్రమంగా సంపాదించినట్లు గుర్తించింది. 2022లో ఐఏఎస్ అధికారి అనిల్ తుటేజాపై ఐటీశాఖ దాడులతో ఈ కుంభకోణం వెలుగు చూసింది. #WATCH | Chhattisgarh | Enforcement Directorate (ED) is conducting searches at the residence of former Chief Minister and Congress leader Bhupesh Baghel's son in an ongoing money laundering case. (Visuals from Durg) pic.twitter.com/k5Gmgew4K4— ANI (@ANI) March 10, 2025 -
బడ్జెట్ సమావేశాలు: రాజ్యసభ నుంచి వాకౌట్
Parliament Live Updates March 10th: పార్లమెంట్ మలి(రెండో) విడత బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. కాసేపటికే ఉభయ సభల్లో విపక్షాలకు ఆందోళనలకు దిగాయి.లోకసభ వాయిదామధ్యాహ్నం 12గంటల వరకు వాయిదా వేసిన స్పీకర్జాతీయ విద్యా విధానంలో త్రిభాషా వ్యవస్థకు వ్యతిరేకంగా విపక్షాల ఆందోళన గందరగోళం నడుమ సభను కాసేపు వాయిదా వేసిన స్పీకర్ ఓం బిర్లా #Loksabha adjourned till 12 noon. pic.twitter.com/OWiOwstBES— Lok Poll (@LokPoll) March 10, 2025 #WATCH | On the New Education Policy and three language row, Union Education Minister Dharmendra Pradhan says, "...They (DMK) are dishonest. They are not committed to the students of Tamil Nadu. They are ruining the future of Tamil Nadu students. Their only job is to raise… pic.twitter.com/LdBVqwH6le— ANI (@ANI) March 10, 2025 రాజ్యసభ నుంచి ప్రతిపక్షం వాకౌట్పెద్దల సభను కుదిపేసిన డీలిమిటేషన్ వ్యవహారంరాజ్యసభ నుంచి కాంగ్రెస్ సభ్యుల వాకౌట్ డీలిమిటేషన్(నియోజక వర్గాల పునర్వ్యవస్థీకరణ అంశంపై చర్చించాలని, అనుమానాలను నివృత్తి చేయాలని పట్టుబట్టిన విపక్షాలుప్రతిపక్షాల చర్యలపై ఎన్డీయే సభ్యుల ఆగ్రహం #WATCH | Delhi: Rajya Sabha MP Rekha Sharma says, "The opposition always obstructs the House and important issues are left behind...Today also they will do something similar and we are ready for that too...only those issues will come up in Parliament which are for the… pic.twitter.com/uWHQDiXooN— ANI (@ANI) March 10, 2025 రాజ్యసభలో టీమిండియాకు శుభాకాంక్షలుఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా భారత్టీమిండియాకు రాజ్యసభలో అభినందనలు #WATCH | Delhi: On behalf of Rajya Sabha members, Rajya Sabha Deputy Chairman Harivansh Narayan Singh congratulates the Indian team for clinching the Champions Trophy (Source: Sansad TV) pic.twitter.com/1HcsW5GgFb— ANI (@ANI) March 10, 2025 ప్రారంభమైన పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు కాసేపట్లో పార్లమెంట్ రెండవ విడత బడ్జెట్ సమావేశాలువక్ఫ్ బిల్లు ప్రవేశపెట్టడాన్ని వ్యతిరేకిస్తున్న విపక్షాలుఓటర్ల జాబితాలో అవకతవకలు, త్రిభాషా అంశం, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారతదేశం పై విధించే సుంకాల పై చర్చ జరపాలని డిమాండ్ చేసే అవకాశం మార్చి 10 నుండి ఏప్రిల్ 4 వరకు కొనసాగనున్న సమావేశాలు2025-26 ఆర్ధిక సంవత్సరానికి గాను డిమాండ్ ఫర్ గ్రాంట్ల పై జరుగనున్న చర్చనేడు లోక్ సభలో రెండో విడత పద్దులను ప్రవేశపెట్టనున్న ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్మణిపూర్ బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్లోక్ సభలో నేడు త్రిభువన్ సహకారి యూనివర్సిటీ బిల్లు ను ప్రవేశపెట్టనున్న కేంద్ర సహకార శాఖ మంత్రి అమిత్ షాఇనిస్టిట్యూట్ ఆఫ్ రూరల్ మేనేజ్మెంట్ ఆనంద్ ను, త్రిభువన్ సహకారి విశ్వవిద్యాలయంగా మారుస్తూ బిల్లుఈ సమావేశాల్లో బ్యాంకింగ్ చట్ట సవరణ బిల్లు, కోస్టల్ షిప్పింగ్ బిల్లు, 2024, ఇమ్మిగ్రేషన్ ఆండ్ ఫారినర్స్ బిల్లు,2025, రైల్వేస్ చట్ట సవరణ బిల్లు లను పార్లమెంట్ ఆమోదం కోసం ప్రవేశపెట్టనున్న కేంద్రంఈ సమావేశాల్లో వక్స్ బోర్డ్ సవరణ బిల్లు, 2024 ను కేంద్రం ప్రవేశపెట్టే అవకాశం -
నామినేషన్లకు నేడే చివరి రోజు.. ఎమ్మెల్సీ ఎన్నిక ఏకగ్రీవం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల దాఖలుకు నేడే చివరి రోజు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే అభ్యర్థులు నామినేషన్లు వేయనున్నారు. మొత్తం ఐదు స్థానాల్లో కాంగ్రెస్ నుంచి నలుగురు, బీఆర్ఎస్ నుంచి ఒక్కరే అభ్యర్థి పోటీలో నిలవడంతో ఎన్నిక ఏకగ్రీవం కానుంది.తెలంగాణలో ఎమ్మెల్సీ కోటా ఎన్నికలకు అభ్యర్థులు నేడు నామినేషన్ దాఖలు చేయనున్నారు. రాష్ట్రంలో ఐదు ఎమ్మెల్సీ స్థానాల్లో కాంగ్రెస్ నుంచి అద్దంకి దయాకర్, విజయశాంతి, శంకర్‌నాయక్, సీపీఐ అభ్యర్థి సత్యం బరిలో ఉన్నారు. ఇక, బీఆర్ఎస్ నుంచి దాసోజు శ్రవణ్ పోటీలో నిలిచారు. ఇక, నామినేషన్ పేపర్లపై అభ్యర్థులను బలపరుస్తూ కాంగ్రెస్ ఎమ్మెల్యేల సంతకాలను ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, అడ్లూరి లక్ష్మణ్ సేకరించారు. నేడు అసెంబ్లీలో నామినేషన్ కార్యక్రమానికి కాంగ్రెస్ పెద్దలు హాజరుకానున్నారు. -
సామాజిక కోణంలోనే ఎంపిక!
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో కాంగ్రెస్ అధిష్టానం సామాజిక సమీకరణాల తూకం పాటించింది. రెడ్డి, మైనార్టీ కోటాలో కూడా పలు పేర్లను పరిశీలించినప్పటికీ భవిష్యత్తులో చేపట్టాల్సిన మంత్రివర్గ విస్తరణ, పార్టీ కార్యవర్గ కూర్పు, ఇతర నామినేటెడ్ పదవులకు ఎంపికలను పరిగణనలోకి తీసుకుని.. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు ప్రాధాన్యత ఇచ్చినట్టు గాంధీభవన్ వర్గాలు చెబుతున్నాయి. ఇక కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ముగ్గురు ఎమ్మెల్సీ అభ్యర్థుల్లో ఇద్దరు ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన వారే కావడం గమనార్హం.ఢిల్లీలో చక్రం తిప్పిన విజయశాంతిఈసారి ఎమ్మెల్సీగా మహిళకు అవకాశమివ్వాలని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగానే ఎస్టీ కోటాలో మహిళను ఎంపిక చేయాలని తొలుత భావించింది. కానీ అనూహ్యంగా మహిళా కోటాలో సినీనటి, మాజీ ఎంపీ విజయశాంతి తెరపైకి వచ్చారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 15 నెలల కాలంలో విజయశాంతి ఎక్కడా రాష్ట్ర రాజకీయ ముఖచిత్రంలో కనిపించకపోవడం గమనార్హం. ఆమె రెండు రోజుల క్రితమే ఢిల్లీ వెళ్లి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో భేటీ అయ్యారు. మహిళ, బీసీ కోటాలో తనకు చాన్స్ ఇవ్వాలని పార్టీ అధిష్టానాన్ని కోరారు.పార్టీ కూడా ఆమె పట్ల సానుకూలంగా స్పందించడంతో.. పేరు ఖరారైందని గాంధీభవన్ వర్గాలు చెబుతున్నాయి. ఇక రాష్ట్ర కేబినెట్లో ఈసారి ఎస్టీ (లంబాడా) సామాజిక వర్గానికి అవకాశం కల్పించలేని పరిస్థితులున్న నేపథ్యంలో.. ఆ వర్గానికి ఎమ్మెల్సీగా అవకాశమివ్వాలని ఏఐసీసీ, టీపీసీసీ పెద్దలు భావించారు. ఈ కోటాలో కొందరి పేర్లు పరిశీలించారు. అయితే మాజీ మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత జానారెడ్డి చొరవతో ఆయన సన్నిహితుడు, నల్లగొండ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కె.శంకర్‌నాయక్‌ను ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎంపిక చేశారు. దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీకి ఆయన చేస్తున్న సేవలను కూడా అధిష్టానం గుర్తించినట్లయింది.మరోవైపు మొదటి నుంచీ ఊహిస్తున్న విధంగానే టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ పేరు కూడా ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఖరారైంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన తుంగతుర్తి నియోజకవర్గం నుంచి పోటీ చేయాల్సి ఉన్నా.. అప్పటి పరిస్థితుల మేరకు తన స్థానాన్ని త్యాగం చేశారు. పార్టీ అధికారంలోకి వచ్చాక మొదటిసారి జరిగిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలో ఆయన పేరును పరిశీలించినా చివరి నిమిషంలో ఆగిపోయింది. ఎస్సీ (మాల) సామాజికవర్గానికి చెందిన ఆయనను ఈసారి మండలికి పంపాలని పార్టీ నిర్ణయించింది. సీఎం రేవంత్‌రెడ్డికి సన్నిహితుడైన అద్దంకి దయాకర్‌కు అవకాశం కల్పించడం ద్వారా రేవంత్ మాటకు కూడా అధిష్టానం ప్రాధాన్యత ఇచ్చినట్లయింది. ఓసీ కోటా మినహాయింపుఈ దఫా ఎమ్మెల్సీ అభ్యర్థుల్లో ఓసీ కోటాను కాంగ్రెస్ అధిష్టానం మినహాయించింది. ఇద్దరు ఓసీ నేతల మధ్య తీవ్ర పోటీ ఏర్పడటంతోనే ఈ నిర్ణయం తీసుకుందనే చర్చ గాంధీభవన్ వర్గాల్లో జరుగుతోంది. ఓసీ కోటాలో ఎమ్మెల్సీగా ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్‌రెడ్డి పేరు వినిపించింది. ఆయన పేరును సీఎం రేవంత్‌రెడ్డి ప్రతిపాదించారని, కచ్చితంగా అవకాశం వస్తుందనే ప్రచారం జరిగింది. మరోవైపు శాసనమండలిలో కాంగ్రెస్‌పక్ష నేత టి.జీవన్‌రెడ్డి పదవీకాలం త్వరలో ముగుస్తోంది. ఈ క్రమంలో ఆయనను మళ్లీ మండలికి ఎంపిక చేయాలని రాష్ట్ర కాంగ్రెస్‌లోని ముగ్గురు సీనియర్ మంత్రులు పట్టుబట్టినట్టు తెలిసింది.ఈ ఇద్దరు నేతల మధ్య ఏర్పడిన పోటీ కారణంగానే అధిష్టానం ఈసారి ఓసీ కోటాను మినహాయించిందని, ఇందుకు ప్రతిగా కేబినెట్ విస్తరణలో రెండు బెర్తులు ఓసీలకు ఇస్తుందనే ప్రచారం జరుగుతోంది. జీవన్‌రెడ్డికి ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వకపోవడంతో మండలిలో కాంగ్రెస్‌పక్ష నేతగా కొత్త వారిని ఎంపిక చేయాల్సి ఉంది. ఇక బీసీల కోటాలో అనేక పేర్లు వినిపించినప్పటికీ చివరకు సినీనటి విజయశాంతి వైపు అధిష్టానం మొగ్గు చూపడం అనూహ్య పరిణామం. పీసీసీ చీఫ్ మహేశ్‌గౌడ్ కూడా ఈసారి ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల వారికే ఎమ్మెల్సీ అవకాశం దక్కేలా తన వంతు ప్రయత్నం చేశారు.ఎంఐఎంకు స్థానిక సంస్థల కోటాఅసెంబ్లీ ఎన్నికలకు ముందు సీపీఐతో అధికారికంగా పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ.. సీపీఐకి రెండు ఎమ్మెల్సీ స్థా నాలు ఇస్తామని హామీ ఇచ్చింది. అందులో భాగంగా ఇప్పు డు ఒక ఎమ్మెల్సీ స్థానాన్ని కేటాయిస్తూ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. మరోవైపు తమ సభ్యుడు రియాజుల్ హసన్ ఎమ్మెల్సీగా పదవీ విరమణ పొందుతున్న నేపథ్యంలో.. తమకు ఇప్పుడే అవకాశమివ్వాలని ఎంఐఎం నేతలు కాంగ్రెస్ పార్టీని కోరారు. కానీ సీపీఐకి ఇవ్వాల్సి వస్తున్నందున ఈసారికి సర్దుకోవాలని.. హైదరాబాద్ స్థానిక సంస్థల కోటా లో అవకాశం ఇస్తామని కాంగ్రెస్ విజ్ఞప్తి చేసినట్టు తెలిసింది. -
ఎన్నిక ఏకగ్రీవమే!
సాక్షి, హైదరాబాద్: శాసనమండలికి ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశం కనిపిస్తోంది. అనూహ్య పరిణామాలు జరిగితే తప్ప ఎన్నిక జరిగే ఐదు స్థానాల్లో కాంగ్రెస్ మూడు, సీపీఐ, బీఆర్ఎస్ చెరో స్థానాన్ని దక్కించుకోనున్నాయి. అసెంబ్లీలో ఎమ్మెల్యేల సంఖ్యాబలం ఆధారంగా అధికార కాంగ్రెస్ పార్టీ మూడు స్థానాల్లో అద్దంకి దయాకర్, విజయశాంతి, శంకర్ నాయక్‌లను అభ్యర్థులుగా ప్రకటించడంతోపాటు మరో స్థానాన్ని మిత్రపక్షం సీపీఐకి కేటాయించింది. బీఆర్ఎస్ అభ్యర్థిగా దాసోజు శ్రవణ్ పేరు ఖరారైంది. సీపీఐ తరఫున నెల్లికంటి సత్యం బరిలో ఉన్నారు.ఐదుగురు రిటైర్ అవుతుండటంతో.. ప్రస్తుతం శాసనమండలిలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలుగా ఉన్న సత్యవతి రాథోడ్, మహమూద్ అలీ, శేరి సుభాష్ రెడ్డి, ఎగ్గె మల్లేశం, మీర్జా రియాజుల్ హసన్‌ల పదవీకాలం ఈ నెల 29న ముగుస్తోంది. ఖాళీ అవుతున్న ఈ ఎమ్మెల్సీ స్థానాల్లో ఎన్నిక కోసం ఈ నెల 3న నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైంది. సోమవారంతో ఈ గడువు ముగుస్తోంది. 11న నామినేషన్ల పరిశీలన, 13న ఉపసంహరణకు గడువు ఉంది. ఎన్నిక అనివార్యమయ్యే పక్షంలో ఈ నెల 20న పోలింగ్ జరుగుతుంది. కానీ ఖాళీ అవుతున్న ఐదు స్థానాలకు ఐదుగురు అభ్యర్థులు మాత్రమే బరిలోకి దిగుతుండటంతో ఎన్నిక ఏకగ్రీవమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. విజయశాంతికి ఎమ్మెల్సీ చాన్స్⇒ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులను ఎంపిక చేసిన ఏఐసీసీ⇒ శంకర్‌నాయక్, అద్దంకి దయాకర్లకూ అవకాశం⇒ ఆదివారం సాయంత్రం ప్రకటించిన కేసీ వేణుగోపాల్సాక్షి, న్యూఢిల్లీ: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులను ఏఐసీసీ ఆదివారం సాయంత్రం ప్రకటించింది. రాష్ట్ర నేతల అభిప్రాయాలు, సామాజిక సమీకరణాలు, పార్టీలో పనిచేసిన అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని ముగ్గురు నేతలు అద్దంకి దయాకర్, కేతావత్ శంకర్‌నాయక్, విజయశాంతిలకు అవకాశం ఇచ్చింది. ఈ మేరకు ఏఐసీసీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఆదివారం సాయంత్రం ప్రకటన విడుదల చేశారు. ఎవరూ ఊహించని విధంగా సినీ నటి, మాజీ ఎంపీ విజయశాంతి పేరును ఎంపిక చేయడం మాత్రం టీపీసీసీ వర్గాలను కొంత ఆశ్చర్యానికి గురిచేసింది.నాలుగు స్థానాలకుగాను.. ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై వారం రోజులుగా సీఎం రేవంత్‌రెడ్డి, పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్, రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ తదితరులు ఏఐసీసీ పెద్దలతో చర్చలు జరిపారు. ఎమ్మెల్యే కోటా కింద కాంగ్రెస్ పార్టీకి నాలుగు ఎమ్మెల్సీ స్థానాలు దక్కే అవకాశం ఉండగా.. సీపీఐకి ఒక స్థానం కేటాయించడంపై విస్తృతస్థాయిలో చర్చలు జరిగాయి. ఎన్నికల ముందు పొత్తులో భాగంగా తమకు ఇచ్చిన హామీ మేరకు ఒక ఎమ్మెల్సీ స్థానం ఇవ్వాలని కాంగ్రెస్‌ను సీపీఐ జాతీయ కమిటీ బలంగా కోరింది. సీపీఐ జాతీయ నేత డి.రాజా, మరికొందరు నేతలు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో ఈ అంశంపై మాట్లాడారు. ఈ నేపథ్యంలోనే సీపీఐకి ఒక ఎమ్మెల్సీ స్థానం ఇచ్చేందుకు ఏఐసీసీ, టీపీసీసీ నిర్ణయం తీసుకున్నాయి. మిగతా మూడు స్థానాలకుగాను విజయశాంతి, అద్దంకి దయాకర్, శంకర్ నాయక్‌లను ఎంపిక చేశారు.నేడు ఉదయం 11 తర్వాత నామినేషన్లుసాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ఏఐసీసీ ప్రకటించిన ముగ్గురు కాంగ్రెస్ అభ్యర్థులు సోమవారం ఉదయం 11 గంటల తర్వాత నామినేషన్లు దాఖలు చేస్తారని సీఎల్పీ వర్గాలు వెల్లడించాయి. నామినేషన్ల దాఖలు కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌లతోపాటు పలువురు మంత్రులు హాజరుకానున్నారు. ఈ మేరకు సోమవారం అందుబాటులో ఉన్న వారంతా రావాలని సీఎల్పీ నుంచి పార్టీ ఎమ్మెల్యేలకు సమాచారం అందింది. -
సజాతి ధ్రువాల వికర్షణ
శశి థరూర్‌కీ, కాంగ్రెస్ నాయకత్వానికీ మధ్య తలెత్తినట్లుగా కనిపిస్తున్న విభేదాలను ఆసక్తికరంగా మారుస్తున్నది ఏమిటంటే,ఇరు వర్గాల గురించి ఆ విభేదాలు బయటికి ఏం వెల్లడిస్తున్నాయన్నదే. విభేదాలున్నా యన్న సంగతిని వారు ఒప్పుకొని, అంగీకరించకున్నా... ఒకటైతే వాస్తవం. వారు ఒకరి కొకరు పూర్తిగా భిన్నమైనవారు. బహుశా సమస్యకు మూలం, ప్రధానంగా అదే అయి వుండాలి. శశి థరూర్ ఫక్తు రాజకీయ నాయకుడు కారు. ముఠాలను, రహస్య మంతనాలను ఆయన నడపరు. బదులుగా, ఆయన తన సొంత ప్రతిభ, నైపుణ్యాల మీద ఆధారపడినవారు. దీనర్థం – ఆయనకు దాపరికాలేం ఉండవని. రాజకీయంగా పైకి రావాలన్న ఆకాంక్ష, గుర్తింపు కోసం ఆరాటం మాత్రమే ఉన్నాయని. అంతేకాదు, తన వైపునకు దృష్టిని మళ్లించుకోవాలని కూడా ఆయన కోరుకుంటారని అర్థమౌతోంది. ముందుకు సాగేందుకు ఆయన విధానం అది. అందులో విజయం సాధించారు కూడా. ట్విట్టర్లో ఆయన్ని అనుస రించే అసంఖ్యాక అభిమానులు, ఆయనకు గల ‘గుర్తింపు యోగ్యత’ ... ఇందుకు సాక్ష్యం. కాంగ్రెస్ నాయకత్వం, కనీసం ఇందిరాగాంధీ హయాం నుంచి చూసినా కూడా – ముఖస్తుతులు చెల్లించే వారి ద్వారా వర్ధిల్లుతూనే వచ్చింది. వారంతా గాంధీల అనుచరులు. వారి నాయకులు గాంధీలు. వారు తమ రాజకీయ జీవితాన్నంతా గాంధీల సేవకే అంకితం చేసినవారు. రాహుల్ గాంధీని మించి తాము శోభిల్లకూడదనీ, సోనియా గాంధీకి ఎదురు చెప్పకూడదనీ నేర్చుకున్నవారు. ఇక ఇప్పుడైతే ప్రియాంకా గాంధీకి పల్లకి మోయటానికి తయారవు తున్నవారు. అంతేనా, ఈ తరహా కుటుంబ ఆరాధనను నియమ బద్ధం చేయటానికి... గాంధీ కుటుంబం లేకుండా కాంగ్రెస్ పార్టీ మనుగడ సాగించలేదని తమను తాము నమ్మించుకుంటున్నవారు ఈ అనుచరులు. చిన్నపాటి పోలికలు శశి, రాహుల్‌ల మధ్య వ్యత్యాసాన్ని అర్థం చేయిస్తాయి. శశి తన ప్రతిభ, తెలివితేటలతో కష్టపడి పైకొచ్చినవారు. రాహుల్ బలం ఆయన ఇంటిపేరు. రాహుల్ స్వయంగా సాధించిన రాజకీయ విజయాలు పరిమితమైనవి. లేదా, ఏమంతగా గుర్తింపులో లేనివి. తగని సమయాలలో విహార యాత్రలకు వెళ్లిపోవటం ఆయన అభిరుచి. శశి బలం... దీర్ఘమైన ఆయన ఆంగ్ల పదాడంబరత, ఆహ్లాద కరమైన ఆయన నడవడిక. రాహుల్ స్పష్టంగా మాట్లాడలేని వ్యక్తిగా కనిపిస్తారు. రాహుల్‌కు తనేం చెప్పాలనుకుంటున్నారో దానిని వ్యక్తపరిచే విషయంలో సమస్యలు ఉన్నాయని చాలామంది నమ్ము తారు. శశి రచయిత. ఇరవైకి పైగా పుస్తకాలు రాశారు. ఆకాంక్షలు గల యువతను ఆయన ఆకర్షిస్తారు. రాహుల్ ఎప్పుడూ కూడా పేదలను, ఆర్థికంగా లేదా సామాజికంగా అణచివేతకు గురవుతున్నవారిని ఉద్దేశించి మాట్లాడుతుంటారు. మొత్తానికి, వీళ్లిద్దరూ భిన్న ప్రపంచాలలో ప్రకాశిస్తున్నవారు. మాజీ దౌత్యవేత్తగా శశి తీరు వివేకవంతంగా, వినయపూర్వకంగా, తన ప్రత్యర్థులు సాధించిన విజయాలను సైతం అంగీకరించే విధంగా ఉంటుంది. అందుకే మోదీ అమెరికా పర్యటనను, లేదా కేరళలో సీపీఎం స్టార్టప్‌లను అభివృద్ధి పరచటాన్ని ఆయన ప్రశంసించకుండా ఉండలేకపోయారు. రాహుల్ శైలి ఇందుకు విరుద్ధంగా కఠినంగా, గాయపరిచేలా ఉంటుంది. మాటల బాక్సర్ అతడు. కమిలిపోయేలా గట్టి దెబ్బ కొడతారు. కాంగ్రెస్ పార్టీలో రాహుల్ గాంధీ అతి సునాయాసంగా అత్యున్నత స్థానానికి చేరుకోగలిగారంటే అందులో ఆశ్చర్యం ఏమీ లేదు. పార్టీలో అతడిది ప్రశ్నించేవారే లేని, సర్వదా ఆమోదంపొందిన ఆరోహణ. ఇందుకు భిన్నమైనది శశి థరూర్ రాజకీయ జీవితం. అది వెలుగులను విరజిమ్మేదేమీ కాదు. ఆయన కొంతకాలం విదేశాంగ, మానవ వనరుల అభివృద్ధి శాఖల సహాయ మంత్రిగా పని చేశారు. 2014 తర్వాత రెండు పార్లమెంటరీ సెలక్ట్ కమిటీలకు చైర్మన్‌గా ఉన్నారు. అంతకుమించి, కాంగ్రెస్‌లో అగ్రశ్రేణి నాయ కుడిగా ఎప్పుడూ లేరు. ఆయన తన గతం వల్ల లేదా తన సహాయక రాజకీయేతర క్రీయాశీలతల వల్ల మాత్రమే ప్రసిద్ధులు. ఆయన్ని తన భవిష్యత్ నేతగా కాంగ్రెస్ పార్టీ ఒప్పుకోలేకపోతోంది. ఇవన్నీ కూడా నాలో మూడు ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి. అవి శశి థరూర్‌కు, ఆయన పార్టీ అయిన కాంగ్రెస్‌కు మధ్య ఉన్న వ్యత్యాసాలకు సంబంధించినవని నేను నమ్ముతున్నాను. మొదటిది, గొప్ప గౌరవ మర్యాదలను పొందుతూ, రాహుల్‌కు ప్రత్యర్థులు కావచ్చునని పరిగణన పొందుతున్న ప్రతిభావంతులైన వ్యక్తులతో ఎలా నడుచుకోవాలో కాంగ్రెస్ పార్టీకి తెలియటం లేదన్న విషయాన్ని ఈ విభేదాలు సూచిస్తున్నాయా?బయటి ప్రపంచానికి రాహుల్, శశి ఎలా కనిపిస్తారో ఒక్క క్షణం ఆలోచించండి. రాహుల్‌ను వారసత్వపు అర్హత గల రాజపుత్రుడిగా చూస్తారు. శశిని ప్రతిభకు, పనితీరుకు ప్రతీకగా చూస్తారు. కాంగ్రెస్ తన అధ్యక్ష వంశానికి విధేయతతో... ప్రతిభకు, పని తీరుకు మిగిల్చి ఉంచిన ఆ కాస్త చోటును కూడా పరిమితం చేసేసిందా?రెండవది... పార్లమెంటు లోపల గానీ, పార్లమెంటు బయట గానీ, పార్టీలో శశి థరూర్ పోషించవలసిన పాత్ర చాలా స్వల్ప మైనదిగా మాత్రమే ఉంది. ఆయన నేర్పును, నైపుణ్యాలను ఉపయో గించుకునే విషయంలో – అలాంటి అలవాటు లేకపోవటం కారణంగా – కాంగ్రెస్ జాగ్రత్త పడుతూ రావటమే కారణమా? ఒకప్పుడు విశాల గుడారమైన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు నెరవేర్చదగిన ఆకాంక్షలను గుర్తించే సామర్థ్యాన్ని కోల్పోయిందా?మూడవది, తానెప్పటికీ గెలవలేనని తెలుసు; తన ఆశయం, కనీసం తన ఉద్దేశం ఏమిటని ఆలోచించేవారిని అప్రమత్తం చేసే అవకాశం ఉంటుందని తెలిసినా శశి థరూర్ కాంగ్రెస్ అధ్యక్ష స్థానానికి పోటీ పడి తప్పు చేశారా? ఆ ఎన్నికలను ప్రజాస్వా మ్యబద్ధం చేయటానికే ఆయన పోటీలో నిలబడ్డారని నాకు తెలుసు. సాధారణంగానైతే ఆ చొరవను మెచ్చుకోవాలి. కానీ పోటీ లేకుండా అభ్యర్థిని గెలవనిచ్చే కాంగ్రెస్ సిద్ధాంతానికి వ్యతిరేకంగా ఇదంతా జరిగినట్లయిందా?నాల్గవ ప్రశ్న కూడా ఉంది. సాధారణమైన ప్రశ్న. శశి థరూర్ కనుక కాంగ్రెస్ నుండి విడిపోతే అది ఆ పార్టీకి ఏపాటి ఎదురు దెబ్బ అవుతుంది? ఆయన విషయానికొస్తే కేరళలో ఆయన ఆశలు విఫలం కావచ్చు. ఒకటి మాత్రం చెప్పగలను. ఆయన కాంగ్రెస్‌ను వీడతారో లేదో గానీ, బీజేపీలో చేరతారంటే మాత్రం నేను నమ్మలేను.» కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ హయాం నుంచి చూసినా కూడా – ముఖస్తుతులు చెల్లించే వారి ద్వారానే వర్ధిల్లుతూ వచ్చింది. వారంతా రాహుల్ గాంధీని మించి తాము శోభిల్లకూడదనీ, సోనియా గాంధీకి ఎదురు చెప్ప కూడదనీ నేర్చుకున్నవారు.» రాహుల్ గాంధీ అతి సునాయాసంగా అత్యున్నత స్థానానికి చేరుకోగలిగారంటే అందులో ఆశ్చర్యం లేదు. పార్టీలో అతడిది ప్రశ్నించేవారే లేని ఆరోహణ. ఇందుకు భిన్నమైనది శశి థరూర్ రాజకీయ జీవితం.- వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్- కరణ్ థాపర్ -
TG: ఊహించని విధంగా విజయశాంతికి ఎమ్మెల్సీ టికెట్
సాక్షి,హైదరాబాద్ : తెలంగాణలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులపై కసరత్తు పూర్తయింది. కొద్ది సేపటి క్రితమే ఎమ్మెల్సీ అభ్యర్థులను కాంగ్రెస్ అధిష్టానం ఖారారు చేసింది. ఎవరూ ఊహించని విధంగా పార్టీ అధిష్టానం విజయశాంతితో పాటు అద్దంకి దయాకర్, కెతావత్ శంకర్ నాయక్‌కు టికెట్లు ఇచ్చినట్లు అధికారికంగా ప్రకటించింది. సీపీఐ నుంచి ఒకరికి ఎమ్మెల్సీ టికెట్ కేటాయించింది.తెలంగాణ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై ఉత్కంఠ నెలకొంది. ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికను ఖరారు చేసేందుకు తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఢిల్లీ పర్యటనకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు.అయితే, చివరి నిమిషంలో ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ లేకపోవడంతో తెలంగాణ నేతల ఢిల్లీ పర్యటన రద్దయ్యింది. అయినప్పటికీ రాష్ట్ర అగ్రనేతలతో కేసీ వేణుగోపాల్ ఫోన్లో మంతనాలు జరిపారు. ముగ్గురు అభ్యర్థుల ఎంపికను ఖరారు చేయడంతో ఉత్కంఠతకు తెరపడింది. మరోవైపు ఎమ్మెల్సీ స్థానాల కోసం కాంగ్రెస్‌లో భారీ పోటీ నెలకొంది. తమకు అవకాశం కల్పించాలంటూ ఆశావహులు పెద్ద ఎత్తున లాబియింగ్‌లు జరిపారు. చివరికి పార్టీ అధిష్టానం విజయశాంతి, అద్దంకి దయాకర్, కెతావత్ శంకర్ నాయక్ పేర్లను ఫైనల్ చేసింది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ బరిలో ఓసీ కేటగిరి నుంచి వేం నరేందర్ రెడ్డి, పారిజాత నరసింహ రెడ్డి, సామ రామ్మోహన్ రెడ్డి, కుమార్ రావు, కుసుమ కుమార్ పేర్లు బలంగా వినిపించాయి. వీరితో పాటు బీసీ కేటగిరి నుండి ఇరవత్రి అనిల్, కొనగాల మహేష్, జెర్పేటి జైపాల్, గాలి అనిల్, ఎస్సీ కేటగిరి నుండి అద్దంకి దయాకర్, జ్ఞాన సుందర్, దొమ్మటి సాంబయ్య, రాచమల్ల సిద్దేశ్వర్, ఎస్టీ నుంచి బెల్లయ్య నాయక్, బానోతు విజయాభాయి, రేఖా నాయక్ పేర్లు వినిపించాయి. -
నేడు కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటన
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులపై కసరత్తు పూర్తయ్యింది. నేడు ఎమ్మెల్సీ అభ్యర్థులను కాంగ్రెస్ అధిష్ఠానం ఖారారు చేయనుంది. కాగా, చివరి నిమిషంలో తెలంగాణ నేతల ఢిల్లీ పర్యటన రద్దు అయ్యింది. కేసీ వేణుగోపాల్ ఢిల్లీలో లేకపోవడంతో పర్యటన రద్దు అయ్యింది. ఇవాళ రాష్ట్ర అగ్రనేతలతో ఫోన్లో కేసీ వేణుగోపాల్ మాట్లాడనున్నారు. ఎమ్మెల్సీస్థానాల కోసం కాంగ్రెస్‌లో భారీ పోటీ నెలకొంది. తమకు అవకాశం కల్పించాలంటూ ఆశావహులు కోరుతున్నారు. నేడు అభ్యర్థుల పేర్లను కాంగ్రెస్ హైకమాండ్ ప్రకటించే అవకాశముంది.కాగా, ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక విషయంలో ఉత్కంఠ నెలకొంది, ఎమ్మెల్సీ బరిలో ఓసీ కేటగిరి నుంచి వేం నరేందర్ రెడ్డి, పారిజాత నరసింహ రెడ్డి, సామ రామ్మోహన్ రెడ్డి, కుమార్ రావు, కుసుమ కుమార్ పేర్లు బలంగా వినిపిస్తున్నాయి.బీసీ కేటగిరి నుండి ఇరవత్రి అనిల్, కొనగాల మహేష్, జెర్పేటి జైపాల్, గాలి అనిల్ ఉన్నారు. ఎస్సీ కేటగిరి నుండి అద్దంకి దయాకర్, జ్ఞాన సుందర్, దొమ్మటి సాంబయ్య, రాచమల్ల సిద్దేశ్వర్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఎస్టీ నుంచి బెల్లయ్య నాయక్, బానోతు విజయాభాయి, రేఖా నాయక్ పేర్లను హైకమాండ్ పరిశీలిస్తున్నట్టు సమాచారం. -
దయ్యాల వేద పఠనం!
తెర వెనుక కత్తుల కోలాటమాడుతున్నవారు తెరముందుకొచ్చి శాంతి కపోతాలను వదులుతున్నారు. రోత చేష్టల రంగమార్తాండులు శ్రీరంగనీతులు బోధిస్తున్నారు. అదిగో దొంగ ఇదిగోదొంగ అంటూ గజదొంగలే అరుస్తున్నారు. ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్‌లో కంచె చేను మేస్తున్నది. పోలీసు వ్యవస్థను ప్రతిపక్షంపైకి పాలకులు ఉసిగొల్పుతున్నారు. ఇదే కదా, అసలు సిసలైన వ్యవస్థీకృత నేరం. అత్యున్నత స్థాయి పోలీసు అధికారి మంత్రి వర్గం ముందు హాజరై ఓ గొప్ప వాగ్దానం చేశాడని వార్తలు వెలువడ్డాయి. ప్రతిపక్షాన్నీ, దాని అభిమానులనూ వేటాడే పనిలో మరింత వేగం పెంచుతారట. దీన్నేమంటాము? నేరమే అధికారమై కొలువు దీరడం కాదా? నేరమే అధికారమై కొరడా ఝుళిపించడం కాదా?నేరమే అధికారమై ప్రజల్నే నేరస్థుల్ని చేస్తుంటే నోరుండీ ఊరక కూర్చున్న ప్రతి ఒక్కడూ నేరస్థుడేనంటారు విప్లవకవి వరవరరావు. ఈరోజు వేటాడుతున్నది ప్రతిపక్షాన్నే కావచ్చు. రక్తం రుచి మరిగిన పులికి పరిమితులూ, షరతులూ వర్తి స్తాయా? ఉపవాస దీక్షలేమైనా అడ్డొస్తాయా? పౌరహక్కులను పాదాల కింద తొక్కేయడానికి అలవాటుపడ్డ పోలీస్ రాజ్యం కూడా అంతే! ఈ రోజున వాడు తడుతున్నది నీ ఇంటి తలుపును కాకపోవచ్చు. నేడు కాకపోతే రేపు లేదా మరునాడు... నువ్వు నీ హక్కుల్ని గురించి ప్రశ్నించిన రోజున నీ ఇంటి ముంగిట కూడా ఆ బూట్ల చప్పుడు వినిపిస్తుంది.నేరమే అధికారమై ప్రశ్నిస్తున్న ప్రతివాడి మీద నేరస్థుడనే ముద్ర వేసే ధోరణిని ఆదిలోనే ప్రతిఘటించకపోతే ప్రజా స్వామ్య మనుగడకే ప్రమాదమేర్పడుతుంది. అధికారంలోకి రావడానికి అసత్యాలకూ, అభూత కల్పనలకూ ఒడిగట్టారు గనుక ప్రభుత్వపక్ష స్వభావాన్ని నేరపూరితమైనదిగా భావించ వలసి వస్తున్నది. అసత్యాలూ, అభూత కల్పనలన్నీ ఒక్కొ క్కటిగా రుజువౌతూ వస్తున్నాయి గనుక నేరమే అధికారం రూపు దాల్చిందని అనుకోవలసి వస్తున్నది. గతకాలపు జగన్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేసిందనీ, 14 లక్షల కోట్ల అప్పు చేశారనీ కూటమి పక్షం ఊరూవాడా ఏకంచేసి ప్రచారం చేసింది. మొన్ననే రాష్ట్ర శాసనసభలో సాక్షాత్తూ ఆర్థికమంత్రి పాత ప్రచారానికి విరుద్ధమైన ప్రకటన చేశారు. జగన్ ప్రభుత్వం చేసిన మొత్తం అప్పు 3 లక్షల 39 వేల కోట్లేనని తేల్చారు. ఎంత గుండెలు తీసిన బంట్లు వీరు? ఈ ఒక్క ఉదాహరణ చాలదా, ప్రభుత్వ నేరపూరిత స్వభావాన్ని నిర్ధారణ చేయడానికి?అప్పుల ప్రస్తావన మచ్చుకు మాత్రమే. ఇటువంటి బేషరమ్ ప్రచారాలు చాలా చేసింది కూటమి. సామాన్య ప్రజల ఆశల మీద, ఆకాంక్షల మీద కూటమి జూదమాడింది. వారి కలల అలల మీద ఆటలాడింది. ఏమార్చడానికి ఇచ్చిన ఎన్నికల మేనిఫెస్టోను డస్ట్‌బిన్‌లోకి గిరాటేసింది. కుర్చీ మీద కూర్చొని నవమాసాలు గడిచిపోయాయి. హామీల డెలివరీ ఆనవాళ్లే లేవు. ఉండకపోవచ్చు కూడా. బడ్జెట్లో కొన్ని హామీలకు మాత్రమే అరకొర కేటాయింపులు చూపారు. మిగతా వాటి ఊసే లేదు. నిరుద్యోగులకు నెలకు 3 వేల భృతి ఇస్తామన్నారు. మోసం చేశారు. ఆడబిడ్డలకు నెలకు పదిహేను వేలిస్తామన్నారు. మోసం చేశారు. స్కూలుకు వెళ్లే ప్రతి విద్యార్థికీ ఏటా 15 వేలిస్తా మన్నారు. దానికి ఒక ఏడాది ఎగనామం పెట్టి, ఈసారి బడ్జెట్లో అవసరమైన సొమ్ములో సగం మాత్రమే కేటాయించారు.ఇంతవరకూ ఒక్క పైసా కూడా లబ్ధిదారులకు చేరలేదు.రైతుకు ఏటా 20 వేల ఆర్థిక సాయమన్నారు. రైతన్న ఎదురు చూస్తూనే ఉన్నాడు.సాయం సంగతి దేవుడెరుగు. పండించిన పంటకు గిట్టు బాటు ధర లేక రైతులు అల్లాడుతున్నారు. జగన్ హయాంలో ఇరవై నుంచి ఇరవై ఏడు వేల దాకా పలికిన క్వింటాల్ మిర్చి ధర ఇప్పుడు ఆరేడు నుంచి పదివేల దాకా పడిపోయింది. పెట్టుబడి ఖర్చులు కూడా రైతులకు రాలేదు. అన్ని పంటల కథలూ దాదాపు ఇంతే! కాల్వల కింద వేసుకున్న వరి పైర్లు కూడా నీటి తడులు లేక ఎండిపోతున్న వైనాన్ని ఐదేళ్ల తర్వాత ఇప్పుడే చూస్తున్నాము. మహిళలకు ఉచిత బస్సు ఇంకా డిపో దాటి రోడ్డెక్కలేదు. అప్పుడే దానిమీద మాట మార్చడం మొదలైంది. ఉచిత బస్సును ఒక్క జిల్లాకే పరిమితం చేస్తామని ఇప్పుడు చెబుతున్నారు.ఈ రకంగా హామీల ఎగవేతతోపాటు పాలనా వైఫల్యాలతో ఆదిలోనే అప్రతిష్ఠ మూటగట్టుకున్న కూటమి సర్కార్ విమర్శ కుల నోళ్లు మూయించి, అసత్యాలను ప్రచారంలో పెట్టి పబ్బం గడుపుకోవాలనే నిర్ణయానికి వచ్చింది. ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షమైన వైసీపీపై దాడిని కేంద్రీకరించి, భారత న్యాయసంహితలోని 111వ సెక్షన్‌ను ఈ దాడికి ఆయుధంగా వాడటం మొదలుపెట్టారు. సోషల్ మీడియా వేదికగా విమర్శలు చేసే వారిపై ఈ సెక్షన్ వాడకూడదని ఏపీ హైకోర్టు చెప్పినా కూడా కూటమి సర్కార్ చెవికెక్కించుకోలేదు. కిడ్నాపులు, దోపిడీలు, భూకబ్జాలు, ఉగ్రవాద కార్యకలాపాలు, ఆర్థిక నేరాలు వగైరా ముఠాలుగా ఏర్పడి చేసే నేరాలు (వ్యవస్థీకృత నేరాలు) ఈ సెక్షన్ పరిధిలోకి వస్తాయి.సోషల్ మీడియాలో చేసే విమర్శలను ఈ పరిధిలోకి తెచ్చి రాష్ట్ర సర్కార్ చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తున్నది. ప్రత్యర్థుల పట్ల కక్షపూరిత వైఖరి కారణంగానే సర్కార్ ఈ కుట్రకు తెరతీసిందనుకోవాలి. సోషల్ మీడియాలో చేసే విమర్శల వెనుక ఎవరిదో ప్రోద్బలం ఉన్నదనీ, ఇదంతా వ్యవస్థీకృతంగా జరుతున్నదనీ ఓ స్క్రీన్‌ప్లేను తయారుచేసి, దానికి అనుగుణంగా కీలక వ్యక్తులను అరెస్ట్ చేయాలనీ, తద్వారా ఆ పార్టీని బలహీన పరచాలనే పన్నాగం స్పష్టంగానే కనిపిస్తున్నది. ఇందు కోసం వేలాదిమంది కార్యకర్తలు, అభిమానుల మీద కేసులు పెట్టాలనీ, వేధించాలనీ జిలాల్ల వారీగా టార్గెట్లు పెట్టుకున్నట్టు వార్తలు వస్తున్నాయి.ఇటీవల పోలీసు ఉన్నతాధికారి నిర్వహించిన ఒక సమీక్షా సమావేశంలో కూడా ఈ టార్గెట్లను చేరుకునేలా సహకరించాలనే ఆదేశాలిచ్చినట్టు వచ్చిన వార్తలు నిజమైతే అంతకంటే దౌర్భాగ్యం మరొకటి ఉండదు. గత ప్రభుత్వ హయాంలో కూటమి అగ్రనాయకులంతా బరితెగించి మాట్లాడిన బూతుల ఆడియోలు, చెప్పులు చూపెట్టిన వీడియోలు కోకొల్లలు. వీరికి భిన్నంగా వైసీపీ అధినేత ఏనాడూ ఏ ఒక్క అసభ్యకర వ్యాఖ్యానం చేయలేదు. అయినా సరే, వీరి బూతులకు బదు లిచ్చిన నేతలపై అక్రమ కేసులకు తెగబడుతున్నారు.మొన్నటి మంత్రివర్గ సమావేశం ఎజెండా ముగిసిన తర్వాత ఒక పోలీస్ ఉన్నతాధికారి హాజరై ఒక వింత సందేశాన్ని వినిపించినట్టు యెల్లో మీడియా టాప్ న్యూస్‌గా ప్రచారంచేసింది. బహుశా కూటమి పెద్దల తాజా కుట్రలో భాగంగానే ఈ వింత కథను ప్రచారంలోకి తెచ్చి ఉంటారు. అనారోగ్యంతో చికిత్స పొందుతూ ఇటీవల చనిపోయిన రంగన్న అనే వివేకానందరెడ్డి ఇంటి వాచ్‌మన్ మరణం అనుమానాస్పదమేనని ఆ ఉన్నతాధికారి మంత్రులకు ఉపదేశించారట! అనారోగ్యంతో ఉన్న తన భర్తను పోలీసులు వేధించారనీ, అందువల్లనే అయన చనిపోయాడనీ రంగన్న భార్య మీడియాతో మాట్లాడిన మాట లను వారెందుకు పరిశీలనలోకి తీసుకోలేదో తెలియదు మరి!అంతటితో ఆగలేదు. ఈమధ్యకాలంలో చనిపోయిన వ్యక్తులను వివేకానంద హత్య కేసుకు లింకు చేస్తూ అవన్నీ అనుమానాస్పద మరణాలేనని చెప్పడానికి పూనుకోవడం, మోకాలుకు, బోడిగుండుకు ముడిపెట్టినట్టు కథలు అల్లడం దిగ్భ్రాంతి కలిగిస్తున్నది. అనారోగ్యానికి గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయిన అభిషేక్ రెడ్డి మరణంపై కూడా అనుమానాలున్నాయట! జగన్ కుటుంబ సభ్యుల ప్రేమాభిమా నాలు చూరగొన్న డ్రైవర్ నారాయణ కేన్సర్ వ్యాధికి చికిత్స తీసుకుంటూ కొంతకాలం క్రితం చనిపోయాడు. అందులో కూడా అనుమానం ఉన్నదట! నీచమైన కుట్రలకు పరాకాష్ట డాక్టర్ గంగిరెడ్డి పేరును కూడా ఇందులోకి లాగడం. డాక్టర్గంగిరెడ్డి భారతమ్మ తండ్రి. కరోనా సోకడంతో ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటూ చనిపోయారు. ఆయన మరణం కూడా అనుమానమేనట! పోలీస్ అధికారి ఏం చెప్పాడో తెలియదుగానీ ‘ఈనాడు’ మాత్రం అరపేజీ ఫిక్షన్ రాసి పారేసింది.తాము చెప్పదలుచుకున్న కథలో ఆవగింజంత నిజమైనా ఉండాలన్న నియమం వారికేమాత్రం లేదు. చెప్పింది ప్రచారం చేసిపెట్టడానికి మోచేతి కింద వందిమాగధ మీడియా సిద్ధంగా ఉన్నది. చేతిలో అధికారం ఉన్నది. వ్యవస్థల మెడలకు బిగించిన ఇనుప గొలుసులు తమ చేతిలోనే ఉన్నాయి. ఉసిగొలిపితే చాలు. కేసులు పెట్టడం ఎంత పని? ఇప్పుడిదే కూటమి సర్కార్ సింగిల్ పాయింట్ ఎజెండా! దయ్యాలు వేదాలు వల్లించినట్టు,తోడేళ్లు – గుంటనక్కలూ శాకాహార ప్రతిజ్ఞలు చేసినట్టు ఈ పెద్దలంతా సభలు పెట్టుకొని ఒకరినొకరు పొగుడుకుంటూ, ప్రజా సంక్షేమం గురించి, ప్రజాస్వామ్యం గురించి, అభివృద్ధి గురించి మాట్లాడటం కంటే ఎబ్బెట్టు దృశ్యాలు ఇంకేముంటాయి? అటువంటి ఎబ్బెట్టు దృశ్యాన్ని ఈమధ్యనే విశాఖతీరంలో చూడవలసి వచ్చింది.తెలంగాణ పునరాలోచన?తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ ఏర్పాటై సరిగ్గా పదిహేను మాసాలైంది. అరవై మాసాల (ఐదేళ్ల) పాలన కోసం ప్రజలు ఎన్నుకున్నారనుకుంటే అందులో పావు భాగం ప్రయాణం పూర్తయిందన్నమాట. నిజానికి ఈపాటికే ప్రభుత్వం పూర్తిగా కుదురుకొని దాని ఎజెండాను పరుగెత్తించే క్రమంలో ఉండాలి. కానీ, ఎందుకనో ఇప్పటికీ పార్టీకి, ప్రభుత్వానికి మధ్య, ప్రభు త్వంలోని మంత్రుల మధ్య, మంత్రులకు అధికారులకు మధ్య సమన్వయ లోపం స్పష్టంగా కనిపిస్తున్నది. కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ గనుక ఇటువంటివన్నీ షరా మామూలేనని ఆ పార్టీ నేతలు సమర్థించుకోవచ్చు గాక. కానీ, ఈ వాదనను అంగీకరించడానికి జనం సిద్ధంగా లేరు.శాసన మండలి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఆర్భాటంగా పోటీ చేసి, ముఖ్యమంత్రితో సహా యంత్రాంగమంతా రంగంలోకి దిగి కూడా ఓటమి పాలైంది. అది కూడా బీజేపీ చేతిలో! రాష్ట్ర వ్యాప్తంగా బలమైన పునాది, కార్యకర్తల బలం, నాయకత్వ ఇమేజ్ ఉన్న బీఆర్ఎస్ చేతిలో ఓడిపోయి ఉంటే కనీసం గుడ్డిలో మెల్ల అనుకోవచ్చు. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ ప్రధాన శత్రువు, ఉత్తరాది పార్టీగా తాము విమర్శించే బీజేపీ చేతిలోభంగపడటం కచ్చితంగా కాంగ్రెస్ సర్కార్‌కు ఇబ్బందికరమైన విషయమే. బీఆర్ఎస్ ఈ ఎన్నికల్లో పోటీ చేయలేదు. పోటీ చేయకుండా బీజేపీకి సహకరించిందని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తున్నది.అయితే ఈ ఆరోపణకు సరైన ఆధారం కనిపించడం లేదు. బీఆర్ఎస్ గనుక లోపాయకారిగానైనా బీజేపీకి పూర్తిగా సహకరించి ఉంటే బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణకు అంత భారీస్థాయిలో ఓట్లు పడేవి కావు. బీసీ నినాదం వల్లనే హరికృష్ణ పెద్దసంఖ్యలో ఓట్లు సంపాదించారనే వాదన కూడా ఉన్నది. కానీ తెలంగాణ బీసీ సమూహాల్లో సామాజిక విధేయత కన్నా రాజకీయ విధేయతే ఎక్కువ. బీఆర్ఎస్కు విధేయంగా ఉండే ఓటర్లలో బీసీలే ఎక్కువ సంఖ్యలో ఉంటారు. కనుక బీఆర్ఎస్ ఓట్లు పెద్దసంఖ్యలో హరికృష్ణకు బదిలీ అయుండవచ్చనే అభిప్రాయం ఉన్నది.కేవలం వ్యక్తిగత సంబంధాల మీద ఆధారపడి పెద్దగా ఆర్థిక దన్ను లేకుండానే బీజేపీ, కాంగ్రెస్‌లకు హరికృష్ణ గట్టి పోటీ ఇవ్వగలిగినప్పుడు, బీఆర్ఎస్ రంగంలో ఉన్నట్లయితే గెలిచేది కాదా అనే చర్చ కూడా మొదలైంది. పోటీ చేయకపోవడానికి బీఆర్ఎస్కు ఉన్న కారణాలేమిటో అధికారికంగా తెలియదు. పార్టీ గుర్తుపై ఎన్నికై అధికార పార్టీలో చేరిన పదిమంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడి ఆ స్థానాల్లో ఉపఎన్నికలు రావాలని బీఆర్ఎస్ బలంగా కోరుకుంటున్నది. అందుకు కేంద్రంలో ఉన్న బీజేపీ సర్కార్ సహకారం అవసరమని కూడా ఆ పార్టీ భావిస్తుండవచ్చు. అందుకోసమే కౌన్సిల్ బరికి బీఆర్ఎస్ దూరం జరిగిందనే అభిప్రాయం కూడా ఉన్నది.తెలంగాణలో తమ పార్టీ బాగా బలపడిందని బీజేపీ శ్రేణులు బలంగా నమ్ముతున్నాయి. నిజంగానే అర్బన్, సెమీ ఆర్బన్ ప్రాంతాల్లో కొంత హిందూత్వ ప్రభావం ఆ పార్టీకి ఉపకరిస్తున్న సూచనలు కన్పిస్తున్నాయి. ముఖ్యంగా బీసీ యువతలో వీరహిందూత్వ ప్రచారం బాగానే పనిచేస్తున్నది. బంజారా, ఇతర గిరిజన తెగల్లో ప్రాబల్యం సంపాదించడానికి కాషాయ పార్టీ వ్యూహాత్మకంగా పనిచేస్తున్నది. ఈ పరిణామాలు సహజంగానే బీఆర్ఎస్, కాంగ్రెస్‌లకు కలవరం కలిగిస్తాయి.రాష్ట్రంలో రాజకీయ పరిస్థితి ఎలా ఉందో తెలుసుకోవాలంటే ఒక చిన్న లిట్మస్ టెస్ట్ అందుబాటులో ఉన్నది. పదిమంది ఫిరాయింపు ఎమ్మెల్యేల గుండెచప్పుడు వింటే చాలు. అనర్హత విషయంలో సుప్రీంకోర్టు పట్టుదలగా ఉండటంతో వారు తీవ్ర ఆందోళనకు గురయ్యారట. కాంగ్రెస్ టిక్కెట్‌పై ఉపఎన్నికల్లో గెలిచే ప్రసక్తే లేదని ఫిరాయింపుదారులు బలంగా నమ్ము తున్నారు. కొందరు బహిరంగంగా తాము పార్టీ మారలేదని చెబుతున్నారు. గోడ దూకినవారు మళ్లీ గోడెక్కి కూర్చుంటు న్నారు. మరికొందరు అంతర్గతంగా మథనపడుతున్నారు.అంతే తేడా!ప్రయాణంలో పాతిక శాతం కూడా పూర్తికాక ముందే కాంగ్రెస్ పార్టీ ఆత్మవిశ్వాసం కోల్పోయినట్టు కనిపిస్తున్నది. ధిక్కార స్వరాలు వినిపించడం మొదలైంది. ఈ పరిస్థితి రావడా నికి ప్రభుత్వంలో సమన్వయ లోపం, అనుభవ రాహిత్యం కూడా ప్రధాన కారణాలే! రైతులకు రెండు లక్షల రుణమాఫీకింద 20 వేల కోట్లు ఖర్చు పెట్టిన ప్రభుత్వం రైతాంగపు సానుభూతిని మాత్రం సంపాదించలేకపోయింది. రెండు లక్షల మీద ఐదువేలో పదివేలో వడ్డీ మిగిలిపోయిన వారికెవరికీ రుణమాఫీ జరగలేదు. సాంకేతిక కారణాల వల్ల 30 శాతంమందికి మాఫీ జరగలేదు. దానికితోడు రైతుబంధు నిలిచి పోవడం, గతంతో పోలిస్తే గిట్టుబాటు ధరలు దక్కకపోవడం, వేసంగి పంటకు నీళ్లివ్వలేకపోవడం, ఎప్పుడో మరిచిపోయిన కరెంటు కోతలు, మోటార్లు కాలిపోవడాలు మళ్లీ ప్రత్యక్షం కావ డంతో రైతాంగంలో వ్యతిరేకత పెరుగుతున్నది.ఆర్థిక మందగమనం అనే పరిణామం దేశవ్యాప్తంగా ఉన్నదే కావచ్చు. కానీ తెలంగాణలో స్వయంగా ప్రభుత్వమే పూనుకొని హైడ్రా అనే అసందర్భ శరభ నాట్యం చేయడం రియల్ ఎస్టేట్ రంగాన్ని కుదేలు చేసింది. ఇది రాష్ట్రమంతటా డబ్బు చలా మణిపై తీవ్రమైన ప్రభావాన్ని చూపింది. దానికితోడు కేసీఆర్ హయాంలో రైతుబంధు, దళిత బంధు వగైరా స్కీముల ద్వారా ఏటా జనం చేతుల్లోకి చేరిన వేలకోట్ల రూపాయలు ఆగి పోయాయి.అవసరాలకు భూమిని అమ్ముకోవాలన్నా, కొనే నా«థుడు దొరక్క రైతులు అవస్థలు పడ్డారు. ఆరోగ్యశ్రీ నిధులు సకాలానికి అందక, ఫీజు రియింబర్స్‌మెంట్ అమలు జరగక, రిటైర్మెంట్ బెనిఫిట్లు అందక వివిధ వర్గాల ప్రజలు సమస్యల్ని ఎదుర్కొంటున్నారు. అధికారంలోకి వచ్చిన కొత్తలో ఆర్భాటంగా ప్రారంభించిన ప్రజా దర్బార్ మూణ్ణాళ్ల ముచ్చటగా మిగిలి పోయింది. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ అధికారం కోల్పోవడానికి ఇటువంటి కారణాలేమీ లేవు. కేవలం నాయకత్వ అహంకారపూరిత ధోరణి ప్రజలకు దూరం చేసింది. నిరుద్యోగ యువత సమస్య లను విని వారిని సాంత్వన పరచడంలో చూపిన నిర్లక్ష్యం వల్ల భారీ మూల్యాన్ని చెల్లించవలసి వచ్చింది. దసరా సెలవుల్లో ఇళ్లకు చేరుకున్న ఈ యువత తల్లిదండ్రులను ప్రభుత్వానికి వ్యతిరేకంగా మార్చడంలో కృతకృత్యులయ్యారు. ప్రతిష్ఠాత్మకంగా భావించిన పథకాలు కొన్ని గురితప్పాయి. కొందరు ఎమ్మెల్యేల అహంకారం, అవినీతి కూడా జనంలో ఏహ్యభావం ఏర్పడ్డానికి కారణమై ఆ పార్టీకి నష్టం చేకూర్చాయి. అంతే తప్ప విస్తార జనబాహుళ్యం బీఆర్ఎస్ హయాంలో ఇక్కట్లపాలైన దాఖలాలు లేవు.చేసిన ఎన్నికల వాగ్దానాలను నెరవేర్చలేకపోగా కొన్ని సంక్షోభాలను పిలిచి మరీ అక్కున చేర్చుకుంటున్న కాంగ్రెస్ సర్కార్ పనితీరు మారకుంటే చేదు అనుభవాలను చవిచూడక తప్పక పోవచ్చు. ఈ వేసవి కష్టాలను, మంచినీటి కటకటను ప్రభుత్వం ఏ రకంగా ఎదుర్కోబోతున్నదో చూడవలసి ఉన్నది. మరో పక్కన గత కేసీఆర్ పాలనే ఈ పాలనకంటే బాగున్నదని బలపడుతున్న ప్రజాభిప్రాయాన్ని ఎలా మార్చగలరో కూడా చూడాలి. ఈ వేసవి పరీక్షలో గనుక కాగ్రెస్ ఫెయిలయితే వచ్చే రజతోత్సవ సభలో కేసీఆర్ పాంచజన్యం పూరించడం ఖాయం!వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com -
కాంగ్రెస్ నేతలపై రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు
గాంధీనగర్: గుజరాత్లో కాంగ్రెస్ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు పార్టీ అగ్రనాయకులు రాహుల్ గాంధీ. గుజరాత్లో కొందరు కాంగ్రెస్ నేతలు బీజేపీకి బీ-టీమ్‌గా వ్యవహరిస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ నకిలీ నేతలకు బుద్ధి చెప్పాలని ఘాటు వ్యాఖ్యలు చేశారు.లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు, ఎంపీ రాహుల్ గాంధీ గుజరాత్ పర్యటనలో ఉన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నేతలతో రాహుల్ సమావేశమయ్యారు. ఈ క్రమంలో సొంత పార్టీ నేతల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశంలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. గుజరాత్లో సగం మంది కాంగ్రెస్ నేతలు బీజేపీతో చేతులు కలిపారు. బీజేపీకి అనుకూలంగా పనిచేస్తున్నారు. బీజేపీకి బీటీమ్‌గా ఉన్న వారిని బయటకు పంపుతాం. బీజేపీకి అనుకూలంగా ఉన్న ఎవ్వరినీ వదిలిపెట్టేది లేదు. కాంగ్రెస్ పార్టీలో నేతలకు కొదవలేదు. తెలంగాణలో కాంగ్రెస్‌కు 22 శాతం ఓట్లు పెరిగాయి.. అసాధ్యం అనుకున్న చోట వారు సాధించి చూపించారు.గుజరాత్లో కూడా కాంగ్రెస్‌కు 40 శాతం ఓటు బ్యాంక్ ఉన్నది.. కానీ అందుకు భిన్నంగా పనిచేస్తూ పార్టీ ప్రతిష్టను రోజురోజుకూ దిగజార్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇది సరైన పద్ధతి కాదు.. అందరూ పార్టీ లైన్లో ఉండి పనిచేయాల్సింది.. గీత దాటిన వారిపై వేటు వేయడానికి ఎంతో సమయం పట్టదు.. ఇప్పుటికైనా మించిపోయిందేమీ లేదు. వైఖరి మార్చుకొని పార్టీ కోసం పనిచేయాలి. పీసీసీ నుంచి కింది స్థాయి కార్యకర్త వరకు అందరూ పనిచేయాలని పిలుపునిచ్చారు. అలాగే, గత 30 ఏళ్లుగా గుజరాత్లో కాంగ్రెస్ అధికారంలో లేదు. నేను ఇక్కడికి వచ్చిన ప్రతీసారీ 2007, 2012, 2017, 2022, 2027 అసెంబ్లీ ఎన్నికల గురించి చర్చలు జరుగుతాయి. కానీ ప్రశ్న ఎన్నికల గురించి కాదు. మన బాధ్యతలను నెరవేర్చే వరకు గుజరాత్ ప్రజలు మనల్ని ఎన్నికల్లో గెలిపించరు. ప్రజల పట్ల మనం బాధ్యతతో ఉన్న రోజున వారే మనకు అధికారం ఇస్తారు అని కీలక వ్యాఖ్యలు చేశారు. #WATCH | Ahmedabad, Gujarat: Lok Sabha LoP and Congress MP Rahul Gandhi says "...Gujarat is stuck, it is unable to see the way, Gujarat wants to move forward. I am a member of the Congress party and I am saying that the Congress party of Gujarat is unable to show it the way, and… pic.twitter.com/UYBZ5BdvfM— ANI (@ANI) March 8, 2025 -
రాహుల్ గాంధీ ధారావి పర్యటపై సెటైర్లు
ముంబై: కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత తాజాగా ముంబైలోని ధారావి ప్రాంతంలో పర్యటించారు(Dharavi Visit). అయితే ఈ పర్యటనలో కాంగ్రెస్ నేతలెవరూ కనిపించకపోవడంపై శివసేన నేత, మాజీ ఎంపీ సంజయ్ నిరుపమ్(Sanjay Nirupam) వ్యంగ్యాస్త్రాలు సంధించారు.గురువారం ధారావిలోని ఛామర్ స్టూడియోను సందర్శించిన రాహుల్ గాంధీ(Rahul Gandhi).. డిజైనర్ సుధీర్ రాజ్బర్ & టీంను కలిశారు. ఆపై సోషల్ మీడియాలో రాజ్బర్ బృందాన్ని అభినందనలతో ముంచెత్తారు కూడా.Sudheer Rajbhar of Chamar Studio encapsulates the life and journey of lakhs of Dalit youth in India. Extremely talented, brimming with ideas and hungry to succeed but lacking the access and opportunity to connect with the elite in his field. However, unlike many others from his… pic.twitter.com/VOtnA9yqSD— Rahul Gandhi (@RahulGandhi) March 6, 2025 అయితే ఒక కాంగ్రెస్ నేతగా కాకుండా.. యూట్యూబర్‌లాగా రాహుల్ ధారావిలో పర్యటించారంటూ సంజయ్ నిరుపమ్ ఎద్దేవా చేశారు. అంతేకాదు.. ముంబై కాంగ్రెస్ యూనిట్ డబ్బుల్లేక దివాళా తీసిందని సెటైర్లు కూడా వేశారు. ముంబైలో కాంగ్రెస్‌కు ఓట్లు మాత్రమే కాదు.. డబ్బులు కూడా లేకుండా పోయాయి. చాలాకాలంగా ముంబై కాంగ్రెస్ కార్యాలయం కరెంట్ బిల్లులు చెల్లించడం లేదు. ఆ బకాయిలు రూ. 5 లక్షల దాకా పేరుకుపోయాయి. అందుకే.. కావాలనే రాహుల్ కాంగ్రెస్ నేతలను కలవకుండా వెళ్లిపోయారు. ఒక కాంగ్రెస్ నేతలా కాకుండా.. యూట్యూబర్‌లాగా ఆయన పర్యటన సాగింది. గతంలో నేను ముంబై కాంగ్రెస్ యూనిట్ చీఫ్‌గా నాలుగేళ్లపాటు పని చేశా. కానీ, ఏనాడూ ఇంత ఘోరమైన పరిస్థితులు మాత్రం లేవు’’ అని సంజయ్ నిరుపమ్ అన్నారు.బాల్‌థాక్రే పిలుపుతో రాజకీయాల్లోకి అడుగు పెట్టిన సంజయ్ నిరుపమ్.. ఆ తర్వాత కాంగ్రెస్‌తోనూ అనుబంధం కొనసాగించారు. ఒకసారి శివసేన నుంచి, ఒకసారి కాంగ్రెస్ నుంచి రాజ్యసభకు వెళ్లారు. 2009-14 మధ్య కాంగ్రెస్ నుంచి లోక్‌సభ ఎంపీగా పని చేశారు. అయితే కిందటి ఏడాది ఏప్రిల్‌లో క్రమశిక్షణ చర్యల కింద కాంగ్రెస్ ఆయనపై ఆరేళ్లపాటు సస్పెన్షన్ వేటు వేసింది. దీంతో ఆయన కాంగ్రెస్‌కు రాజీనామా చేసి.. షిండే శివసేన వర్గంలో చేరారు. -
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ సీట్లపై కాంగ్రెస్ సూత్రప్రాయ నిర్ణయం
-
సీపీఐకి ఒకటి.. ఎస్టీ నేతకు మరొకటి!
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక కోసం అధికార కాంగ్రెస్ చేపట్టిన కసరత్తు తుదిదశకు చేరుకుంది. వచ్చే సోమవారంతో నామినేషన్ల దాఖలు గడువు ముగుస్తున్న నేపథ్యంలో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను టీపీసీసీ వేగవంతం చేసింది. ఎమ్మెల్యేల కోటాలో నాలుగు ఎమ్మెల్సీ స్థానాలు దక్కే అవకాశమున్న నేపథ్యంలో.. ఒక సీటును మిత్రపక్షమైన సీపీఐకి ఇవ్వాలని, మిగతా మూడింటిలో ఒక స్థానాన్ని ఎస్టీ వర్గానికి చెందిన నేతకు ఇవ్వాలని ప్రాథమికంగా నిర్ణయం తీసుకుంది. అందులోనూ మహిళకు అవకాశమివ్వాలని ఇటీవల సీఎం రేవంత్ నివాసంలో జరిగిన భేటీలో నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది. మిగతా రెండింటి కోసం ఎస్సీ, ఓసీ, బీసీ వర్గాలకు చెందిన నేతల పేర్లను పరిశీలిస్తున్నట్టు తెలిసింది. ఢిల్లీలో అభ్యర్థుల ఖరారు.. కేబినెట్ విస్తరణతో ముడిపెట్టి జరుగుతున్న కసరత్తులో భాగంగా ఈ మూడు సామాజిక వర్గాల నుంచి అవకాశం కలి్పంచాల్సి ఉంటుందని టీపీసీసీ వర్గాలు చెబుతున్నాయి. గతంలో రెండు ఎమ్మెల్సీ సీట్లలో ఒకటి, రెండు రాజ్యసభ ఎంపీ స్థానాల్లో ఒకటి చొప్పున బీసీలకు అవకాశం ఇచ్చిన నేపథ్యంలో.. ఈసారి బీసీ నేతలకు ఎమ్మెల్సీ అవకాశం ఉండకపోవచ్చని గాం«దీభవన్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇదే జరిగితే ఎస్టీ, ఎస్సీ, ఓసీ వర్గాల నేతలను ఎమ్మెల్సీలుగా ఎంపిక చేయవచ్చని అంటున్నారు. అభ్యర్థుల ఖరారు ప్రక్రియ శని, ఆదివారాల్లో ఢిల్లీ వేదికగా జరగనుంది.అధిష్టానం పెద్దలు కేసీ వేణుగోపాల్, మీనాక్షి నటరాజన్‌తో భేటీ అయ్యేందుకు గాను సీఎం రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ శనివారం మధ్యాహ్నం తర్వాత ఢిల్లీ వెళుతున్నారు. ఆదివారం ఉదయం ఏఐసీసీ పెద్దలతో భేటీ అయి ఎమ్మెల్సీ అభ్యర్థులను ఖరారు చేయనున్నారు. మధ్యాహా్ననికల్లా అభ్యర్థులను అధికారికంగా ప్రకటించే అవకాశాలు ఉన్నాయి.మిత్ర పక్షానికి.. ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీగా మిత్రపక్షం సీపీఐకి అవకాశం ఇవ్వడం దాదాపు ఖరారైనట్టేనని టీపీసీసీ వర్గాలు చెబుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కుదిరిన పొత్తులో భాగంగా, నాడు ఇచ్చిన మాట ప్రకారం సీపీఐకి ఒక ఎమ్మెల్సీ స్థానం ఇవ్వాలని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించిందని.. ఈ మేరకు టీపీసీసీ నాయకత్వానికి సమాచారం ఇచ్చిందని పేర్కొంటున్నాయి. -
మాది టీ20 మోడల్
సాక్షి, న్యూఢిల్లీ: ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రానిది టీ–20 మోడల్, దేశానికి రోల్‌మోడల్ అని.. గుజరాత్ మోడల్ కాలం చెల్లిన టెస్ట్ మ్యాచ్ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. గుజరాత్ మోడల్లో ఏ విధమైన సంక్షేమం లేదని, ఏమైనా అభివృద్ధి ఉందనుకుంటే అది మోదీ సీఎంగా ఉన్నప్పుడు ప్రయత్నించినదేనని పేర్కొన్నారు. ప్రధాన మంత్రి అయిన తర్వాత కూడా మోదీ గుజరాత్ కోసమే పనిచేస్తున్నారని ఆరోపించారు.దేశంలో ఏదైనా రాష్ట్రానికి పెట్టుబడులు వస్తే సహకరించడం లేదని.. గుజరాత్‌కు వెళ్లి పెట్టుబడులు పెట్టా లని చెబుతున్నారని విమర్శించారు. మోదీ ప్రధాని అయి ఉండీ ఇదేం పద్ధతని ప్రశ్నించారు. శుక్రవారం ఢిల్లీలో జరిగిన ఇండియాటుడే కాన్క్లేవ్లో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పలు అంశాలపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. వివరాలు ఆయన మాటల్లోనే.. ‘‘గుజరాత్ మోడల్‌కు, తెలంగాణ మోడల్‌కు మధ్య ఎంతో తేడా ఉంది.మాది అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలన నమూనా. తెలంగాణ నమూ నాతో ఎవరూ పోటీపడలేరు. అహ్మదాబాద్, హైదరాబాద్‌లోని మౌలిక వసతులను పోల్చిచూడాలి. హైదరాబాద్‌తో పోటీపడేలా ఔటర్ రింగు రోడ్డు, అంతర్జాతీయ విమానాశ్రయం అహ్మదాబాద్‌కు ఉన్నాయా? గుజరాత్లో ఫార్మా, ఐటీ పెట్టుబడులు ఉన్నాయా? గుజరాత్లో ఏం ఉంది? హైదరాబాద్ ఇప్పుడు అహ్మదాబాద్, ముంబై, బెంగళూరు, ఢిల్లీ నగరాలతో పోటీపడట్లేదు. మేం న్యూయార్క్, సియోల్, టోక్యోలతో పోటీపడాలనుకుంటున్నాం. చార్మినార్, గోల్కొండ కోట చంద్రబాబు కట్టారా? హైదరాబాద్ అభివృద్ధి ఇప్పుడు ప్రారంభమైంది కాదు. 450 ఏళ్లకుపైగా చరిత్ర ఉన్న నగరం. కులీకుతుబ్ షా నుంచి ప్రారంభమై నిజాం సర్కార్, తర్వాత బ్రిటిష్ ప్రభుత్వం, స్వాతంత్య్రం తర్వాత మర్రి చెన్నారెడ్డి, చంద్రబాబునాయుడు, వైఎస్ రాజశేఖర్‌రెడ్డి.. అలా ఇప్పుడు నేను అభివృద్ధి చేస్తున్నా. చార్మినార్, గోల్కొండ కోట చంద్రబాబు ఏమైనా కట్టారా? హైదరాబాద్‌లో ప్రముఖ కట్టడాలన్నీ 450 ఏళ్ల కింద ప్రారంభమయ్యాయి. ప్రభుత్వాలు మారినా సీఎంలు మారినా అభివృద్ధి కొనసాగింది. బీసీలకు బీజేపీ అన్యాయం జనాభా లెక్కల్లో ఎస్సీ, ఎస్టీల లెక్కలు తీస్తున్నప్పుడు బీసీల లెక్కలు ఎందుకు చేయకూడదు. అందుకే జనగణనలో కులగణన కూడా చేపట్టాలని శాసనసభలో తీర్మానం చేశాం. బీసీలకు బీజేపీ అన్యాయం చేసింది. గతంలో ఎస్సీ, ఎస్టీలకు కాంగ్రెస్ రిజర్వేషన్లు ఇచ్చింది. ఇప్పుడు ఓబీసీలకు ఇవ్వాలనుకుంటున్నాం.బీజేపీ అనుబంధ సంస్థలుగా ఈడీ, సీబీఐ, ఐటీ... కాంగ్రెస్ పార్టీకి అనుబంధ సంస్థలుగా యూత్ కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్, విద్యార్థి కాంగ్రెస్‌లు ఉంటే.. బీజేపీకి అనుబంధ సంస్థలుగా ఈడీ, సీబీఐ, ఐటీలు పనిచేస్తున్నాయి. ప్రజాస్వామ్యయుతంగా, ఉదారంగా ఉండటమే కాంగ్రెస్ పార్టీ బలహీనత. అయినా పార్టీ వేరు, ప్రభుత్వం వేరు అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.ముఖ్యమంత్రిగా నేను ప్రధాన మంత్రిని గౌరవిస్తా.. అదే సమయంలో పార్టీ వేదికపై పార్టీ విషయాలు మాట్లాడుతా. తెలంగాణలో స్కిల్ యూనివర్సిటీకి అదానీ రూ.వంద కోట్లు ఆఫర్ చేస్తే కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించలేదు. రాష్ట్రంలోని ప్రతిపక్షాలు బీజేపీ, బీఆర్ఎస్ వ్యతిరేకించాయి. మేం ప్రజల కోసం రూ.100 కోట్లు తేవాలనుకున్నాం. బీజేపీ అదానీ నుంచి తీసుకున్న బాండ్లను ఎందుకు వెనక్కి ఇవ్వలేదో చెప్పాలి?..’’ అని సీఎం రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. మోదీతో విభేదాల్లేవు.. ఆయన విధానాలతోనే.. అభివృద్ధి విషయంలో ఎవరిపైనా పక్షపాతం చూపవద్దనే నేను కోరుతున్నాను. ప్రధాని మోదీ గిఫ్ట్ సిటీని గుజరాత్‌కు తీసుకెళ్లారు. దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఎందుకు ఆ అవకాశం ఇవ్వలేదు? ప్రధాని మోదీతో నాకు వ్యక్తిగతంగా ఎటువంటి విభేదాలు లేవు. నేను మోదీ విధానాలతో విభేదిస్తున్నాను. దేశానికి ప్రధానిగా ఉన్నందున మోదీకి గౌరవం ఇవ్వాలి. ఆయనను కలసి తెలంగాణకు కావల్సినవి అడగడం నా హక్కు, నా బాధ్యత. ఆదాయంతో అన్నీ చేయగలమనుకున్నా.. అందరిలాగే 2023లో అధికారంలోకి వచ్చే వరకు కూడా నేను రాష్ట్రానికి రూ.3.75 లక్షల కోట్లు మాత్రమే అప్పు ఉందని అనుకున్నాను. వచ్చే ఆదాయంతో అన్నీ చేయగలమనుకున్నాను. సీఎం కురీ్చలో కూర్చున్న తర్వాత తెలంగాణకు రూ.7 లక్షల కోట్లు అప్పు ఉందన్న అసలు విషయం బయటపడింది. కేసీఆర్ పదేళ్ల కాలంలోనే రూ.6 లక్షల కోట్లకుపైగా అప్పులు చేసి వెళ్లారు. దక్షిణాది ప్రాతినిధ్యం తగ్గించేందుకు బీజేపీ ప్రయత్నం ఒకే దేశం– ఒకే ఎన్నిక, నియోజకవర్గాల పునర్విభజన, ఇతర అంశాలపైన మాత్రమే గాకుండా గ్యారంటీలపై, మూలధన వ్యయంపై చర్చ జరగాలి. దక్షిణాదిలో బీజేపీకి అధికారం, ప్రాతినిధ్యం లేనందునే ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తోంది. ఇందుకోసం నియోజకవర్గాల పునర్విభజన అనే ఆయుధాన్ని ఎంచుకుంది. దక్షిణాది ప్రాతినిధ్యాన్ని తగ్గించేందుకు ప్రయత్నిస్తోంది.కుటుంబ నియంత్రణ చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలిస్తే దక్షిణాది రాష్ట్రాలు అమలు చేసినందుకు ఇప్పుడు మాపై ప్రతీకారం తీర్చుకుంటారా? కొత్త కొత్త మార్గాల ద్వారా దక్షిణాదిని ఇబ్బందిపెట్టే ప్రయత్నం చేస్తోంది. కేంద్రానికి చిత్తశుద్ధి ఉంటే కుటుంబ నియంత్రణ విధానానికి ముందటి 1971 లెక్కల ప్రకారం నియోజకవర్గాల పునర్విభజన చేపట్టాలి. లేకుంటే కేవలం బిహార్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాలే ఎక్కువగా లబ్ధిపొందుతాయి. ఈ విషయంలో దక్షిణాది రాష్ట్రాలే కాకుండా పంజాబ్ సహా ఉత్తరాది రాష్ట్రాలు కలసి రావాలి. హైదరాబాద్‌కు ‘ఒలంపిక్స్’ చాన్స్ ఇవ్వాలి.. ఒలంపిక్స్ నిర్వహించేందుకు అహ్మదాబాద్ కన్నా వంద రెట్లు ఎక్కువగా హైదరాబాద్‌లో వసతులున్నాయి. అహ్మదాబాద్, హైదరాబాద్‌లలో ఏమేం వసతులు ఉన్నాయో తేల్చాలి. ఒలింపిక్స్ గేమ్స్ నిర్వహణలో హైదరాబాద్‌కు అవకాశం ఇవ్వాలి. ప్రపంచ సుందరి పోటీలు హైదరాబాద్‌లో జరుగుతున్నప్పుడు ఒలంపిక్స్ ఎందుకు జరగకూడదు? అహ్మదాబాద్‌కు నరేంద్ర మోదీ బ్రాండ్ అంబాసిడర్.. రాబోయే రోజుల్లో హైదరాబాద్ బ్రాండ్‌ను నేను ఎక్కడికి తీసుకెళతారో చూడండి. -
కాంగ్రెస్ పై బండి కామెంట్స్.. అమ్మకానికి ప్రభుత్వ భూమి
-
కాంగ్రెస్‌లో ఎమ్మెల్సీలు ఎవరు?.. స్థానాలు ‘నాలుగు’ రేసులో 16 మంది
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక విషయంలో ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో ఆదివారం(మార్చి 9న) తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఢిల్లీకి వెళ్తున్నారు. ఈ సందర్బంగా ఏఐసీసీ పెద్దలతో తెలంగాణ కాంగ్రెస్ నేతల భేటీ కానున్నారు.తెలంగాణలో ఎమ్మెల్సీ అభ్యర్థులు ఎవరు అనే సస్పెన్స్ కాంగ్రెస్ పార్టీ నేతలు నెలకొంది. ఈ క్రమంలో కాంగ్రెస్ రాష్ట్ర ఇంచార్జ్ మీనాక్షీ నటరాజన్, సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి ఉత్తమ్, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్.. ఆదివారం ఢిల్లీకి వెళ్లనున్నారు. అదే రోజున ఏఐసీసీ పెద్దలతో తెలంగాణ కాంగ్రెస్ నేతల భేటీ కానున్నారు. ఇక, తెలంగాణలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులను అధిష్ఠానం ఖరారు చేయనుంది. కాంగ్రెస్ నేతల భేటీ సందర్భంగానే మంత్రి వర్గ విస్తరణ, పార్టీలో కీలక పదవులు కూడా ఖరారు చేసే అవకాశం ఉంది. అన్ని పదవులు భర్తీ చేసి భవిష్యత్ కార్యాచరణపై దృష్టి పెట్టాలని కాంగ్రెస్ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.మరోవైపు.. ఎమ్మెల్సీ బరిలో ఓసీ కేటగిరి నుంచి వేం నరేందర్ రెడ్డి, పారిజాత నరసింహ రెడ్డి, సామ రామ్మోహన్ రెడ్డి, కుమార్ రావు, కుసుమ కుమార్ పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. బీసీ కేటగిరి నుండి ఇరవత్రి అనిల్, కొనగాల మహేష్, జెర్పేటి జైపాల్, గాలి అనిల్ ఉన్నారు. ఎస్సీ కేటగిరి నుండి అద్దంకి దయాకర్, జ్ఞాన సుందర్, దొమ్మటి సాంబయ్య, రాచమల్ల సిద్దేశ్వర్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఎస్టీ నుంచి బెల్లయ్య నాయక్ , బానోతు విజయాభాయి, రేఖా నాయక్ పేర్లను హైకమాండ్ పరిశీలిస్తున్నట్టు సమాచారం.ఇదిలా ఉండగా.. తెలంగాణ ఎమ్మెల్సీల నామినేషన్లు దాఖలుకు ఈ నెల 10 చివరి తేదీ కావడంతో కాంగ్రెస్ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ ఇప్పటికే వడపోత ప్రక్రియ ప్రారంభించారు. పలువురి పేర్లను ఖరారు చేసినట్టు తెలుస్తోంది. ఈనెల 20న ఎమ్మెల్సీ ఎన్నికల జరుగుతున్న క్రమంలో ఖాళీ అయిన ఐదు స్థానాలలో నాలుగు కాంగ్రెస్ పార్టీకి దక్కే అవకాశం ఉంది. ఇక, నాలుగు సీట్లలో ఒకటి సీపీఐకి ఇస్తారని ప్రచారం జరుగుతోంది. -
‘మా ప్రేమ కథకు కొనసాగింపు’.. తల్లిదండ్రులు కాబోతున్న క్రీడా జంట
భారత మాజీ రెజ్లర్ వినేశ్ ఫొగట్(Vinesh Phogat) శుభవార్త చెప్పింది. తాను తల్లి కాబోతున్నట్లు వెల్లడించింది. భర్త సోమ్‌వీర్ రాఠీ(Somvir Rathee)తో కలిసి తొలి బిడ్డకు స్వాగతం పలుకబోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా తెలిపింది. ‘‘మా ప్రేమ కథకు కొనసాగింపు.. సరికొత్త అధ్యాయంతో మొదలు’’ అంటూ చిన్నారి పాదం, లవ్ ఎమోజీలను షేర్ చేస్తూ ఈ క్రీడాకారుల జంట తమ సంతోషాన్ని అభిమానులతో పంచుకుంది.కాగా భారత స్టార్ రెజ్లర్‌గా పేరొందిన వినేశ్ ఫొగట్ గతేడాది పతాక శీర్షికల్లో నిలిచింది. ప్యారిస్ ఒలింపిక్స్-2024 ఫైనల్‌కు చేరుకున్న ఈ హర్యానా అథ్లెట్‌పై అనూహ్య రీతిలో ఆఖరి నిమిషంలో వేటు పడింది. నిర్ణీత బరువు కంటే వంద గ్రాములు అదనంగా ఉన్నందు వల్ల ఆమెను అనర్హురాలిగా తేల్చారు. దీంతో.. రెజ్లింగ్‌లో భారత్‌కు తొలి స్వర్ణం వస్తుందన్న ఆశలు ఆవిరి కాగా.. దేశవ్యాప్తంగా యూడబ్ల్యూడబ్ల్యూ తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి.అనర్హత వేటు ఎదుర్కోవాల్సిందేనన్న స్పోర్ట్స్ కోర్టుభారత ఒలింపిక్ సంఘం(IOA), అధికారుల తీరుపైనా ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో ఐఓఏ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్ (సీఏఎస్)లో అప్పీలు చేయగా నిరాశే ఎదురైంది. ‘‘అంతర్జాతీయ స్థాయిలో పోటీపడే క్రీడాకారులు నిబంధనలను పూర్తిగా తెలుసుకోవాలి’’ అంటూ వినేశ్ అభ్యర్థనను కొట్టిపారేసింది.‘క్రీడాకారులకు నిబంధనలపై పూర్తి అవగాహన ఉండాలి. బరిలోకి దిగే బరువు కేటగిరీ కంటే ఎక్కువ ఉంటే అనుమతించరు. అది అందరికీ వర్తిస్తుంది. ఇందులో ఎలాంటి మినహాయింపులు ఉండవు. నిర్ణీత బరువు కంటే ఒక్క గ్రాము ఎక్కువ ఉన్న అనర్హత వేటు ఎదుర్కోవాల్సిందే’’ అని సీఏఎస్ స్పష్టం చేసింది.ఈ క్రమంలో తొలి రోజు పోటీల్లో నిర్ణీత బరువుతోనే పోటీపడి విజయాలు సాధించినందుకుగానూ... గుజ్మన్ లోపెజ్‌తో కలిపి తనకూ రజతం ఇవ్వాలని వినేశ్ న్యాయపోరాటం చేసినా సానుకూల ఫలితం రాలేదు. దీంతో మహిళల 50 కేజీల ఫ్రీస్టయిల్ విభాగంలో సంచలన విజయాలు సాధించినా వినేశ్ పతకం లేకుండానే దేశానికి తిరిగి వచ్చింది. రాజకీయాల్లోకికాగా ప్యారిస్ ఒలింపిక్స్‌లో దిగ్గజ రెజ్లర్ యూ సుసూకీపై వినేశ్ సాధించిన విజయం చిరస్మరణీయంగా నిలిచిపోతుందనడంలో సందేహం లేదు. అంతేకాదు.. ఒలింపిక్స్ ఫైనల్‌కు చేరిన తొలి మహిళా రెజ్లర్‌గా చరిత్ర పుటల్లో ఆమె పేరు అజరామరంగా ఉంటుంది.అతడే ఆమెకు సర్వస్వంఇక ఈ తీవ్ర నిరాశ అనంతరం.. కుస్తీకి స్వస్తి చెప్పిన వినేశ్ ఫొగట్ రాజకీయాల్లో ప్రవేశించింది. కాంగ్రెస్ పార్టీలో చేరి హర్యానాలోని ఝులన్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైంది. కాగా వినేశ్ భర్త సోమ్‌వీర్ కూడా రెజ్లరే. హర్యానాకు చెందిన అతడు.. జాతీయ స్థాయిలో పతకాలు గెలుచుకున్నాడు. వినేశ్, సోమ్‌వీర్ రాఠీ రైల్వేలో ఉద్యోగం చేస్తున్న సమయంలో ప్రేమలో పడ్డారు.అయితే, వ్యక్తిగతంగా, కెరీర్ పరంగా అనుకున్న లక్ష్యాలు చేరుకునే క్రమంలో వినేశ్‌కు సోమ్‌వీర్ అన్నిరకాలుగా అండగా నిలిచాడు. ఈ క్రమంలో పెళ్లి బంధంతో ఒక్కటవ్వాలని నిర్ణయించుకున్న ఈ క్రీడా జంట 2018లో వివాహం చేసుకున్నారు. ‘బేటీ బచావో.. బేటీ పడావో.. బేటీ ఖిలావో’ అంటూ సప్తపదికి మరో అడుగును జతచేసి పెళ్లినాడు ఎనిమిది అడుగులు వేశారు.సంబంధిత వార్త : తను లేకుంటే నేను లేను.. వినేశ్‌కు అతడే కొండంత అండ -
కాంగ్రెస్‌లో కులాల ‘లెక్కలు’
సాక్షి, హైదరాబాద్: అధికార కాంగ్రెస్ పార్టీలో పదవుల భర్తీకి కులాల కోణంలోనే కసరత్తు జరుగుతోంది. ముందుగా కేబినెట్ బెర్తుల్లో రెడ్లు, బీసీలకు రెండేసీ పదవులు ఇవ్వాలా అనే విషయంలో పోటీ ఏర్పడుతోందని సమాచారం. ఇద్దరు బీసీలకు మంత్రి పదవులు కావాలని టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్ గట్టిగా అడుగుతుండగా, రెడ్డి నాయకులకు కచ్చితంగా రెండు కేబినెట్ బెర్తులు అవసరమే అని మరో ముఖ్యనేత పట్టుపడుతున్నట్టు తెలిసింది.ఎస్సీల్లో మాల, మాదిగలు, బీసీల్లో ప్రధాన ఐదు కులాలతోపాటు ఎంబీసీలు, ఎస్టీల్లో లంబాడ సామాజికవర్గాన్ని నొప్పించకుండా పదవులు భర్తీ చేసేందుకు కాంగ్రెస్ సిద్ధమవుతోంది. గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన వారిని ప్రత్యేక ప్రతి«నిధులుగా, ప్రభుత్వ సలహాదారులుగా నియమించే అవకాశాలున్నాయి. ఈనెల 10వ తేదీ కల్లా పదవుల కసరత్తు పూర్తి చేసేలా..7న కీలక భేటీ జరగనుంది. భర్తీ చేసే పదవులు ఇవే.. ఆరు కేబినెట్ బెర్తులు, ఒక డిప్యూటీ స్పీకర్, ఒక చీఫ్ విప్, ఢిల్లీలో ప్రత్యేక ప్రతినిధి, రెండు లేదా మూడు ప్రభుత్వ సలహాదారులు, నాలుగు ఎమ్మెల్సీలు, నలుగురు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్లు, ఇద్దరు ఏఐసీసీ కార్యదర్శులు, ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ, క్రమశిక్షణ కమిటీ, టీపీసీసీ కోశాధికారి, 20 మంది వరకు ఉపాధ్యక్షులు, 25–30 మంది ప్రధాన కార్యదర్శులు, 20 వరకు కార్పొరేషన్ చైర్మన్లు, అన్ని కార్పొరేషన్లకు డైరెక్టర్లు పోస్టులను భర్తీ చేయనున్నారు. మూడు సూత్రాల ఆధారంగా... మంత్రివర్గ విస్తరణ విషయంలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు కొందరు నేతలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని, రాష్ట్రంలో పదవుల పంచాయితీలు ఉండొద్దని, సామాజిక న్యాయం జరగాలని, బీసీలు, మాదిగలకు ప్రాధాన్యం తగ్గొద్దని ఏఐసీసీ సూత్రీకరించింది. అక్కడి నుంచి సంకేతాల మేరకు వివిధ పదవుల భర్తీకి టీపీసీసీ మల్లగుల్లాలు పడుతోంది. రెండింటికీ లింకు పెట్టి.... ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులకు.. కేబినెట్ భర్తీకి లింకు పెట్టి కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈసారి కేబినెట్లో ఎస్టీ (లంబాడ)లకు అవకాశం ఇవ్వలేని నేపథ్యంలో ఆ సామాజికవర్గానికి చెందిన నేతను ఎమ్మెల్సీగా ఎంపిక చేస్తారు. అందులో భాగంగానే అటు లంబాడ, ఇటు మహిళ కోటాలో ఖమ్మం జిల్లాకు చెందిన విజయాబాయి పేరు తెరపైకి వచ్చింది. దీంతోపాటు అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌గా లంబాడ వర్గానికే చెందిన బాలూనాయక్‌ను నియమించనున్నారు. ఎంపీ బలరాంనాయక్, కార్పొరేషన్ చైర్మన్ బెల్లయ్య నాయక్‌లలో ఒకరికి వర్కింగ్ ప్రెసిడెంట్‌గా అవకాశం ఇస్తారని గాంధీభవన్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.మాలలకు కేబినెట్లో అవకాశమిస్తే మాదిగసామాజిక వర్గానికి చెందిన దొమ్మాట సాంబయ్య, రాచమళ్ల సిద్దేశ్వర్లలో ఒకరికి ఎమ్మెల్సీగా అవకాశమిస్తారు. గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన ఏఐసీసీ కార్యదర్శి ఎస్.సంపత్‌కుమార్‌ను ఢిల్లీలో ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా పంపనున్నారు. ఎమ్మెల్సీ టికెట్ ఆశిస్తున్న మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ జెట్టి కుసుమకుమార్‌ను ఏఐసీసీ కార్యదర్శిగా పంపే అవకాశాలున్నాయి. మల్లురవి, మధుయాష్కీలలో ఒకరికి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా అవకాశమిచ్చే యోచనలో అధిష్టానం ఉన్నట్టు తెలుస్తోంది. ఇక, ఓసీ కోటాలో వేం నరేందర్‌రెడ్డి, టి. జీవన్‌రెడ్డిల పేర్లు వినిపిస్తున్నాయి. ఓసీలకు కాదంటే జీవన్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా నియమించే చాన్స్ ఉంది. బీసీ కోటాలో ఈసారి ఎమ్మెల్సీగా యాదవసామాజిక వర్గానికి చెందిన నేతను నియమించొచ్చు. మున్నూరుకాపు, ముదిరాజ్, పద్మశాలి, గౌడ్లకు కేబినెట్లో ప్రాతినిధ్యం లభిస్తే.. కచి్చతంగా ఎమ్మెల్సీగా యాదవ వర్గానికి అవకాశం దక్కుతుంది. ఈ కోటాలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి చరణ్‌కౌశిక్ యాదవ్ పేరు వినిపిస్తోంది. మొత్తం మీద కాంగ్రెస్ పార్టీలో పదవుల భర్తీ అంశం పూర్తి గా సామాజిక కోటాలోనే జరుగుతుండడం గమనార్హం. మంత్రి పదవులు ఐదా.. ఆరా?రాష్ట్ర కేబినెట్ 18 మంత్రి పదవులు భర్తీ చేసే అవకాశముంది. ప్రస్తుతం సీఎంతో కలిపి 12 మంది మంత్రివర్గంలో ప్రాతినిధ్యం వహిస్తున్నారు. » ఆరుగురికి మంత్రి పదవులు ఇస్తారంటూ ప్రచారం జరుగుతోంది. రెండు రెడ్లకు, రెండు బీసీ (ముది రాజ్, మున్నూరుకాపు), ఒకటి ఎస్సీ (మాల), ఒకటి మైనార్టీ వర్గానికి ఇవ్వనున్నారు. ఒకవేళ ఐదింటిని మాత్రమే భర్తీ చేయాలనుకుంటే మైనార్టీ లేదంటే రెడ్లలో ఒకటి తగ్గించొచ్చు. » అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఏఐసీసీ మాట ఇచ్చిన విధంగా కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, గడ్డం వివేక్‌లకు బెర్తులు ఖాయమైనట్టే. » బీసీల కోటాలో వాకిటి శ్రీహరి, ఆది శ్రీనివాస్లకూ దాదాపు ఓకే అయినట్టే. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన పి.సుదర్శన్‌రెడ్డి (నిజామాబాద్)కి కూడా మంత్రి పదవి ఖరారైనట్టే. » మైనార్టీ కోటాలో షబ్బీర్‌అలీ లేదంటే ఆమేర్ అలీ ఖాన్ల పేర్లు వినిపిస్తున్నాయి. » ఐదింటిని మాత్రమే భర్తీ చేయాలనుకుంటే సుదర్శన్‌రెడ్డిని ఆపేసి షబ్బీర్‌అలీని మంత్రిని చేసే అవకా శాలున్నాయి. లేదంటే మైనార్టీ కోటాను ప్రస్తుతానికి పెండింగ్‌లో పెట్టి ఇద్దరు రెడ్డి, ఇద్దరు బీసీ, ఒక ఎస్సీ నేతతో మంత్రివర్గ విస్తరణ చేసే అవకాశాలున్నాయి. » మంత్రివర్గ విస్తరణ కసరత్తులో రంగారెడ్డి జిల్లాకు ప్రాతినిధ్యం లభించే అవకాశం లేనందున, ఆ జిల్లా కు చెందిన మల్రెడ్డి రంగారెడ్డి, రామ్మోహన్‌రెడ్డిల లో ఒకరిని అసెంబ్లీలో చీఫ్‌విప్‌గా నియమించే అవకాశాలున్నాయి. ఎంబీసీ వర్గాలకు చెందిన మక్కాన్‌సింగ్ రాజ్‌ఠాకూర్‌ను విప్‌గా అవకాశమిస్తారు.