
సాక్షి,హైదరాబాద్: మాకు పార్లమెంట్ ఎన్నికల్లో గుండు సున్నా వచ్చింది నిజమే. కానీ కేంద్రం బడ్జెట్‌లో తెలంగాణకు వచ్చింది గుండు సున్నానే. పురావస్తు శాఖ చరిత్రను తవ్వినట్లు.. గత ప్రభుత్వం, గత ప్రభుత్వము అని తవ్వుతూనే ఉంది. మరి కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంటే కేంద్రాన్ని ఒక్క మాట కూడా అనడం లేదని మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు.
తెలంగాణ అసెంబ్లీలో కేటీఆర్ మాట్లాడారు. ‘కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ అభివృద్ది వేగంగా జరిగింది. బీఆర్‌ఎస్ హయాంలో తెలంగాణ అన్నీ రంగాల్లో అభివృద్ధిని సాధించింది. కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి రాష్ట్రం పేరు ఎక్కడా వినపడలేదు. అధికారంలోకి ఎవరు వచ్చినా రాష్ట్రాభివృద్ధే మాకు ముఖ్యం.తెలంగాణా పథకాలను కేంద్రం కాపీ కొట్టింది. రాష్ట్రానికి ఎన్నోసార్లు కేంద్రం అన్యాయమే చేసింది. డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే ఏంటి? మాకు పార్లమెంట్ ఎన్నికల్లో గుండు సున్నా వచ్చింది నిజమే. కానీ కేంద్రం బడ్జెట్‌లో తెలంగాణకు వచ్చింది గుండు సున్నానే. 2014 నుంచి కేంద్రంతో సఖ్యతతో ఉండి రాష్ట్రానికి నిధులు తెచ్చుకునే ప్రయత్నం చేశాం. ట్యాక్స్ రూపంలో రాష్ట్రం నుంచి కేంద్రానికి వెళ్లే నిధులు ఎక్కువ.. రాష్ట్రానికి వచ్చేది తక్కువ.
కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం జరిగింది దానిపై భట్టి విక్రమార్క ఒక్క మాట అనలేదు. 8 ప్లస్ 8 16కావాలి...కానీ తెలంగాణలో గుండు సున్నా అయింది. భారత జాతిని సాధుతున్న రాష్ట్రంలో తెలంగాణ టాప్ ఫైవ్‌లో ఉంది. పురావస్తు శాఖలో చరిత్రను తవ్వినట్లు.. గత ప్రభుత్వము అని తవ్వుతూనే ఉన్నారు. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం జరిగిందని ఒక్కరూ మాట్లాడలేదు. ఒక్క విభజన హామీ నెరవేర్చలేదు.

తెలంగాణ నుంచి ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నారు...ఒకరేమో సహాయ మంత్రి, ఇంకొకరు నిస్సహాయమంత్రి. హైదరాబాద్ మెట్రో, అదిలాబాద్ వెనుకబడిన ప్రజలకు ఒక్క రూపాయి ఇవ్వలేదు. ధర్మంతో కూడిన రాజకీయాలు చేయాలి తప్ప.. రాజకీయాల్లోకి ధర్మాన్ని లాగొద్దు. దేశం కోసం ధర్మం కోసం అనే వాళ్ళు వేములవాడ, కొండగట్ట, ధర్మపురి, భద్రాచలం ఆలయాలకు ఒక్క రూపాయి ఇవ్వలేదు. మహాకుంభ మేళాకు కేంద్రం 2100 వంద కోట్లు ఇచ్చింది.
వన్ ట్రిలియన్ ఎకానమీ 2030 వరకు ఎలా సాధిస్తారో చెప్పాలి. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు కొటేషన్స్‌కు మాత్రమే పరిమితం అయ్యాయి. గత బడ్జెట్‌లో ఇండ్ల లెక్కలు 6లక్షలు అన్నారు.. ఈ సారి 5లక్షలు అంటున్నారు. కేంద్రంతో సఖ్యత అంటున్నారు..మరి ఏం సాధించారో చెప్పాలి. మా ప్రభుత్వం పోగానే ల్యాండ్ క్యూజర్లు కొన్నారని విమర్శలు చేశారు. అప్పటి ప్రభుత్వం కొనుగోలు చేసిన కార్లను ఇప్పుడు సీఎం,మంత్రులు వినియోగిస్తున్నారని’ అన్నారు.