‘రాహుల్, కాంగ్రెస్ పార్టీలకు భయపడి మేం నిర్ణయాలు తీసుకోం’ | Union Minister Kishan Reddy On Caste Census | Sakshi
Sakshi News home page

‘రాహుల్, కాంగ్రెస్ పార్టీలకు భయపడి మేం నిర్ణయాలు తీసుకోం’

Published Thu, May 1 2025 4:22 PM | Last Updated on Thu, May 1 2025 5:09 PM

Union Minister Kishan Reddy On Caste Census

ఢిల్లీ :  వచ్చే జనగణనలో కులగణన చేర్చుతూ కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయం తర్వాత ప్రతిపక్ష పార్టీలు రాజకీయ నాటకాలకు తెరలేపుతున్నారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. గతంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బీసీ రిజర్వేషన్లకు సంబంధించి కుట్రలు, కుతంత్రాలు చేశారని, ముస్లింలందరినీ బీసీల్లో చేర్చారన్నారు కిషన్ రెడ్డి.  

కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం తమ ఘనతేనని చెప్పుకుంటున్న కాంగ్రెస్ కు స్ట్రాంగ్ కౌంటరిచ్చారు కిషన్ రెడ్డి. తాము రాహుల్ గాంధీకో, కాంగ్రెస్‌కో భయపడి కులగణన నిర్ణయం తీసుకోలేదన్నారు. జనగణనపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఏమన్నారంటే..

  • జనగణనలో భాగంగా కులగణన చేపట్టాలన్న కేంద్ర కేబినెట్ నిర్ణయించడం పట్ల.. ప్రధానమంత్రి నరేంద్రమోదీ గారికి హృదయపూర్వక ధన్యవాదములు తెలియజేస్తున్నాను.

  • ఈ కులగణన చరిత్రపుటల్లో నిలిచిపోనుంది. 

  • కేంద్ర ప్రభుత్వ నిర్ణయం తర్వాత ప్రతిపక్ష పార్టీలు.. రాజకీయ నాటకాలకు తెరలేపుతున్నారు.

  • గతంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో.. బీసీ రిజర్వేషన్లకు సంబంధించి.. కుట్రలు, కుతంత్రాలు చేశారు.

  • ముస్లింలందరినీ.. బీసీల్లో చేర్చారు.

  • దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటినుంచి.. ప్రజలను మతం పేరుతో విడగొడుతూ.. మతఘర్షణలు సృష్టించిన కాంగ్రెస్ పార్టీ.. కులాల పేరుతోనూ.. సమాజాన్ని విచ్ఛిన్నం చేసే కుట్ర చేసింది.

  • కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీలపై, బీసీలపై కపటప్రేమను చూపించడం ఒక్కటే కాదు.. వీలు చిక్కినపుడల్లా విషం కక్కిన సందర్భాలు కూడా చరిత్రలో ఎన్నో ఉన్నాయి.

  • ఎస్సీ అయిన రామ్‌నాథ్ కోవింద్ గారిని, ఎస్టీ అయిన ద్రౌపది ముర్ముగారిని రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించినపుడు.. వ్యతిరేకించి తమ పార్టీ అభ్యర్థులను బరిలో దింపిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది.

  • దశాబ్దాలుగా పెండింగ్ లో ఉన్న మాదిగ రిజర్వేషన్ల సమస్యను పరిష్కరించేందుకు.. మోదీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పూర్తి వివరాలు అందజేసిన తర్వాత.. ఎస్సీ వర్గీకరణకు మార్గం సుగమమైంది.

  • వెనుకబడిన వర్గాలనుంచి వచ్చిన.. ప్రధానమంత్రి నరేంద్రమోదీని కులం పేరుతో దూషించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది.

  • కాంగ్రెస్ పార్టీ మొదట్నుంచీ కూడా.. బీసీలపట్ల మొసలికన్నీరు కార్చుతోంది. వెనుకబడిన వర్గాల అభ్యున్నతి కోసం కాంగ్రెస్ ఏనాడూ పనిచేయలేదు.

  • 2018లో జాతీయ బీసీ కమిషన్ కు చట్టబద్ధత కల్పించిన ఘనత ఎన్డీయే ప్రభుత్వానికే దక్కుతుంది.

  • 2019లో ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణాలకోసం 10% రిజర్వేషన్ ను (EWS) అమల్లోకి తీసుకొచ్చింది.

  • సమాజంలోని అన్ని వర్గాలకు సరైన న్యాయం జరగాలని.. ‘సబ్ కా సాథ్, సబ్ కా వికాస్’ నినాదంతో చిత్తశుద్ధితో ముందుకెళ్తున్నాం. 

  • మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించి వారి సాధికారిత  కోసం, వారికి ఆత్మగౌరవం కల్పించిన ఘనత మోదీ గారిది.

  • ముస్లిం మహిళలపై ‘ట్రిపుల్ తలాక్’ వంటి అనాగరికమైన విధానాలను రద్దు చేసి..ముస్లిం మహిళలకు హక్కులు, అధికారాన్ని కల్పించిన ఘనత మోదీ ప్రభుత్వానిది.

  • సమాజంలోని ఏ ఒక్క వర్గానికీ.. తమను పట్టించుకోవడం లేదు.. అనే భావన రానీయకుండా మేం పనిచేస్తున్నాం.

  • 1881 నుంచి 1931 కులగణన జరిగింది. కానీ స్వాతంత్ర్యానంతరం కులగణన జరగకూడదని కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. 

  • దీని ప్రకారం 1951 నుంచి నేటివరకు ఏనాడూ కులగణన జరగలేదు.

  • మొదటినుంచీ కాంగ్రెస్ పార్టీ కులగణనకు వ్యతిరేకంగానే ఉంది. నెహ్రూ, మౌలానా ఆజాద్ వంటి సీనియర్ కాంగ్రెస్ నాయకులు కులగణన పట్ల బహిరంగంగానే విముఖత వ్యక్తం చేశారు.

  • మండల్ కమిషన్ ఇచ్చిన నివేదికను రాజీవ్ గాంధీ వ్యతిరేకించారు.

  • 6 సెప్టెంబర్, 1990 నాడు.. పార్లమెంటులో రాజీవ్ గాంధీ మాట్లాడుతూ.. దేశంలో బీసీలకంటే ముస్లింలు విద్యాపరంగా, సామాజికంగా, ఆర్థికంగా వెనకబడి ఉన్నారని, వారికి చేయూత అందించాలని చెప్పారు. బీసీలను పక్కనపెట్టి ముస్లింల హక్కుల గురించి మాట్లాడారు.

  • అంతే తప్ప బీసీలకు న్యాయం చేసే విషయంలో ఒక్క మాట కూడా సానుకూలంగా మాట్లాడలేదు.

  • 2010లో నాటి ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్‌ గారు.. కులగణనపై మంత్రులతో సబ్ కమిటీ వేసి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. 

  • అదే సమయంలో, 2010లో బీజేపీ పక్షనేత సుష్మాస్వరాజ్ గారు.. నాటి ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ గారికి లేఖ రాస్తూ.. తమ పార్టీ కులగణనకు అనుకూలంగా ఉన్నామని లేఖ రాశారు.

  • దీనిపై కాంగ్రెస్ పార్టీ ఈ అంశాన్ని పక్కనపెట్టి.. 2011లో జనగణన చేసింది.

  • బీజేపీ  మొదట్నుంచీ కులగణనకు సంపూర్ణమైన మద్దతును తెలియజేస్తోంది. 

  • కానీ ఇది రాజకీయ అస్త్రంగా కాకుండా.. సామాజికంగా అన్ని వర్గాల అభ్యున్నతికి ఉపయోగపడేలా ఉండాలనేది బీజేపీ ఆలోచన.

  • దేశంలో కులగణన జరిగితే.. సామాజిక, ఆర్థిక పరమైన లబ్ధి పేదలకు అందించడంలో ఈ డేటా ఉపయోగపడుతుంది.

  • సంక్షేమపథకాలు, రిజర్వేషన్లను సమర్థవంతంగా అమలు చేసేందుకు జనగణన డేటా ఉపయుక్తం అవుతుంది.

  • ఇది మా ప్రభుత్వ స్పష్టమైన వైఖరిని ప్రస్ఫుటం చేసింది.

  • కానీ, 2011లో జనగణనతో పాటుగా కులగణన చేయడాన్ని నాటి హోంమంత్రి చిదంబరం.. వ్యతిరేకించారు.

  • బీజేపీ తరపున.. చాలా సందర్భాల్లో అమిత్ షా గారు మాట్లాడుతూ.. జనగణన చేపట్టినపుడు కులగణన చేస్తామని చెప్పారు.

  • గతంలో సుష్మాస్వరాజ్ గారు ఇచ్చిన లేఖ ఆధారంగా..  మా పాలసీ మేరకు.. ఇవాళ మేం జనగణనలో భాగంగా కులగణన చేయాలని నిర్ణయం తీసుకున్నాం. 

  • ఇవాళ, కాంగ్రెస్ అండ్ pvt Ltd కంపెనీలు.. రాజకీయ ప్రయోజనాల కోసం ప్రయత్నిస్తున్నాయి. 

  • మోదీ సర్కారు తీసుకున్న ఈ సానుకూల నిర్ణయం.. తమ ఘనత అన్నట్లు రాహుల్ గాంధీ చెప్పుకోవడం సిగ్గుచేటు.

  • రాహుల్ గాంధీకో, కాంగ్రెస్ పార్టీకో భయపడి బీజేపీ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోదు.

  • ఎద్దులబండి కింద కుక్క.. మొత్తం బండిని తానే మోస్తున్నానని అనుకుంటుంది.

  • అలాగే కాంగ్రెస్ పార్టీ కూడా.. తాము చెప్పినట్లే ప్రభుత్వాన్ని నడిపిస్తామని చెప్పుకుంటోంది.ఇది హాస్యాస్పదం.

  • 2010లో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఏ కమిట్‌మెంట్ తో అయితే.. నిర్ణయం తీసుకున్నామో.. దానికి కట్టుబడి ముందుకెళ్తున్నాం.

  • దేశానికి, సమాజానికి ఏ నిర్ణయం వల్ల మేలు జరుగుతుందో ఆలోచించి.. నిర్ణయం తీసుకుంటాం.

  • ఆ నిర్ణయాలు తీసుకునే సత్తా బీజేపీకి, ఎన్డీయేకు, మోదీ గారి నాయకత్వానికి ఉంది.

  • ఆర్టికల్ 370 రద్దు, రామజన్మభూమి, ట్రిపుల్ తలాక్, GST వంటి ఏ నిర్ణయాన్నయినా.. దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే నిర్ణయాలు తీసుకుంటాం.

  • మేం చేపట్టబోయే కులగణనలో.. ఎట్టిపరిస్థితుల్లోనూ ముస్లింలను బీసీల్లో చేర్చబోం.

  • మత ప్రాతిపదికన ఎవరినీ బీసీల్లో  చేర్చే ప్రసక్తే లేదు. 

  • రాజ్యాంగ విరుద్ధమన్న న్యాయస్థానాల తీర్పుకు విరుద్ధంగా బీసీ ముస్లింలు అనే ఆలోచనతో కాంగ్రెస్ ముందుకెళ్లింది. దీన్ని మేం ఎట్టిపరిస్థితుల్లోనూ అంగీకరించం.

  • కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఏం చేసినా, ఏ నిర్ణయం తీసుకున్నా.. షార్ట్ టర్మ్ లక్ష్యాలతో, ఓటుబ్యాంకు రాజకీయాలు, అధికార దాహంతో తీసుకున్న నిర్ణయాలే తప్ప.. దేశం హితం కోసం, దేశ ప్రజల అభ్యున్నతి గురించి ఆలోచించలేదు.

  • తెలంగాణ, కర్ణాటకల్లో రాష్ట్రాల్లో చేపట్టిన కులగణన కూడా హడావుడిగా.. ఏదో సాధించామని చెప్పుకునే ప్రయత్నం చేశారు తప్ప.. ఇందులో చిత్తశుద్ధి లేదు. 

  • ఇది కులగణన కాదు. ఇది కులాలకు సంబంధించిన సర్వే.

  • కులగణన చేయాలంటే.. విధానపరమైన నిర్ణయాలు చాలా తీసుకోవాల్సి ఉంటుంది.

  • 50% జనాభాను కూడా చేరుకోకుండా మొత్తం సర్వే పూర్తి చేశామని చెప్పడం హాస్యాస్పదం.

  • శాస్త్రీయమైన  పద్ధతిలో ఈ సర్వే  జరగలేదు.

  • బీసీల్లోని అన్ని వర్గాలకు న్యాయం జరగాలంటే.. నిష్పాక్షికమైన, సైంటిఫిక్ పద్ధతిలో కులగణన జరగాలనేదే మోదీ సర్కారు ఆలోచన. దీనికోసమే.. జనగణన వరకు వేచి చూశాం.

  • జనగణన చేస్తున్నప్పుడే.. కులగణన సాధ్యమవుతుంది.

  • ఈసారి నిర్మాణాత్మకంగా జనగణన చేపట్టడం అందులో భాగంగా కులగణన జరపాలనేదే మా ప్రభుత్వ స్పష్టమైన విధానం.

  • రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. మోదీ గారు పదేళ్లలో కులగణన ఎందుకు చేయలేదు? అని ప్రశ్నించారు.

  • 2010లో రేవంత్ ఏ పార్టీలో ఉన్నారో తెలియదు.

  • అప్పుడే మేం కులగణనకు ఆమోదం తెలిపాము.

  • ప్రతి పదేళ్లకోసారి, దశాబ్దపు మొదటి సంవత్సరంలో కులగణన జరుగుతుంది.
    బీజేపీ అధికారంలోకి వచ్చాక తొలిసారి జనగణన  జరుగుతున్నప్పుడు.. కులగణన కూడా జరుగుతుంది. 

  • ఎందుకు కాంగ్రెస్ పార్టీ కులగణన చేపట్టలేదో రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలి.

  • నెహ్రూ, ఇందిర, రాజీవ్ గాంధీలు కులగణను వ్యతిరేకించారు.

  • తూతూ మంత్రంగా.. తంతు లాగా కులగణన చేయాలని కేంద్ర ప్రభుత్వం అనుకోవడం లేదు.

  • వాస్తవాలకు అనుకూలంగా, శాస్త్రీయమైన పద్ధతిలో కులగణన ఉంటుంది.

  • ఒకసారి పబ్లిష్ చేసి.. లోపాలుంటే..  మరో రెండ్రోజులు సమయం ఇచ్చి.. మీ ఇష్టం వచ్చినట్లు సర్వే చేశారు తప్ప.. ఇందులో శాస్త్రీయత లేదు.
    ఈ విషయం రాహుల్ గాంధీకి అర్థం కాలేదు.

  • తెలంగాణలో ఉన్న రాంగ్ రోల్ మోడల్ మాకు అవసరం లేదు.

  • మారుమూల ప్రాంతాలకు కూడా వెళ్లి.. సమగ్రంగా జనగణ చేస్తాం.

  • కులగణన చేపట్టేందుకు ‘సెన్సెస్ యాక్ట్ 1948’లో సవరణ తీసుకొచ్చి.. ఇందులో ‘కులం’ అనే పదాన్ని ఓ ప్యారామీటర్ గా చేర్చాలి.

  • వచ్చే పార్లమెంటు సమావేశాల్లో.. దీనికి సంబంధించిన సవరణ తీసుకొచ్చాకే.. జనగణనపై ముందుకెళ్తాం.

  • కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ అబద్ధాలు మాట్లాడుతున్నారు.

  • తెలుగు ప్రజలు, దేశ ప్రజలు ఈ రెండు పార్టీలను నమ్మడం లేదు.

  • కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ ఏనాడూ బీసీలకు సంబంధించిన  అంశాల్లో..  రిజర్వేషన్ల విషయంలో చిత్తశుద్ధితో పనిచేయలేదు.

  • 42% బీసీ జనాభా ఉన్నప్పటికీ.. జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లను ఎందుకు ఇవ్వలేదు.

  • కులగణను ఏనాడూ బీజేపీ వ్యతిరేకించలేదు.

  • మూడు రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఓడిపోవడం ఖాయం.

  • 2026లో జనగణన మొదలయ్యే అవకాశం ఉంటుంది.

  • ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పుకు కట్టుబడే కులగణన ఉంటుంది.

  • రేవంత్ సర్కారు చేసిన సర్వే.. బీసీ వ్యతిరేక సర్వే.

  • బీసీ ముస్లింలని జోడించి చేసిన సర్వేను మేం వ్యతిరేకిస్తున్నాం.

  • హైదరాబాద్ లో 150 కార్పొరేషన్ సీట్లలో.. బీసీలకు రిజర్వ్ చేసిన 50 సీట్లలో.. 30 సీట్లు ముస్లింలే గెలిచారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement