
సాక్షి,హన్మకొండజిల్లా:తెలంగాణ రాజకీయల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిని కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి కలిశారు. కిషన్‌రెడ్డి ఆదివారం(ఫిబ్రవరి16) హన్మకొండ పర్యటనకు వచ్చినపుడు ఎమ్మెల్యే ఆయనను కలిసి చర్చిచండంతో పాటు అభివృద్ధి పనులపై వినతి పత్రం సమర్పించారు.
వేయిస్తంభాల గుడిని అభివృద్ధి చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించాలని,కుడా ఆధ్వర్యంలో చేపట్టే పనులకు అనుమతులు, నిధులు కేటాయించాలని కిషన్‌రెడ్డిని ఎమ్మెల్యే కోరారు. ఎలాంటి రాజకీయ బేషమ్యాలకు పోకుండా హన్మకొండ అభివృద్దే తన ధ్యేయం అని ఎమ్మెల్యే చెప్పారు. అభివృద్ధి కోసమే కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిని కలిశానని ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి చెప్పారు. తెలంగాణ రాజకీయాల్లో ఇది కొత్త ఒరవడిని సృష్టిస్తుందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment