Hanamkonda
-
హనుమకొండ : సంబురంగా సదర్ ఉత్సవం (ఫొటోలు)
-
హన్మకొండలో సందడి చేసిన సినీనటి కీర్తి సురేశ్ (ఫొటోలు)
-
ప్రజాభిప్రాయమే జీవోగా రైతుభరోసా
సాక్షిప్రతినిధి, వరంగల్: ప్రజల అభిప్రాయాలనే ప్రభుత్వ ఉత్తర్వులుగా..చరిత్రాత్మక నిర్ణయంగా తీసుకురావడంలో ఎలాంటి సందేహం లేదని, రైతుభరోసా విషయంలో కూడా ప్రజల అభిప్రా యమే జీవోగా రాబోతుందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. రైతుల అభిప్రా యాల మేరకు శాసనసభలో రైతుభరోసా పథకం రూపకల్పనకు చర్చిస్తామని చెప్పారు. సోమ వారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్లోని కాన్ఫ రెన్స్ హాల్లో రైతుభరోసా పథకం అమలు కోసం విధివిధానాలపై ఉమ్మడి వరంగల్ జిల్లా విస్తృత స్థాయి సమావేశం జరిగింది.మంత్రివర్గ ఉపసంఘం చైర్మన్ మల్లు భట్టి విక్రమార్క, సభ్యులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితోపాటు జిల్లామంత్రులు మంత్రి కొండా సురే ఖ, ధనసరి అనసూయ (సీతక్క), ప్రభుత్వ విప్ జాటోత్ రామచంద్రునాయక్, ఎంపీలు, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, హాజరయ్యారు. వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారదాదేవి అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశంలో రైతులు, రైతుసంఘాల ప్రతినిధులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.అనంతరం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో భట్టి విక్రమార్క మాట్లాడుతూ రైతుభరోసా విషయంలో సంపూర్ణంగా ప్రజలు ఏం చెబితే దాన్నే అమ లు చేస్తామన్నారు. అందరి సూచనలు నోట్ చేసు కున్నామని, వాటిని ప్రభుత్వం పరిశీలిస్తుందని, అందరి అభిప్రాయానికి తగినట్టుగా సబ్‌కమిటీ నిర్ణయం తీసుకుంటుందని భట్టి విక్రమార్క చెప్పా రు. వరంగల్ నుంచే ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ రైతు æభరోసా హామీ ఇచ్చారని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. రైతుభరోసాపై అసెంబ్లీలో ఒక రోజంతా చర్చిస్తామని, ఆ తర్వాత అసెంబ్లీలోనే నిర్ణయం తీసుకుంటామని భట్టి పేర్కొన్నారు. రైతుల నోటా..వైఎస్ రాజశేఖరరెడ్డి మాటహన్మకొండ అర్బన్: ఉమ్మడి వరంగల్ జిల్లా విస్తృతస్థాయి సమావేశంలో పాల్గొని మాట్లాడిన రైతుల్లో 90శాతం మంది దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి పేరు ప్రస్తావించారు. నాడు వైఎస్ వల్లనే ఉచిత విద్యుత్, మద్దతుధర, సబ్సిడీ విత్తనాలు, పంట బీమా వచ్చాయని తెలిపారు. ఆయన కాలంలో వ్యవసాయం పండుగలా సాగిందని చెప్పుకొచ్చారు. ఆ తర్వాత వ్యవసాయం గురించి, రైతుల గురించి పట్టించుకున్న ప్రభుత్వం, నాయకులు లేరన్నారు. రైతును రాజును చేయడానికి వైఎస్ కృషి చేశాడని కొనియాడారు. -
ప్రేమ పేరుతో మోసం.. యువకుడి ఆత్మహత్య
కాజీపేట: ప్రేమ పేరుతో యువతి మోసం చేసిందనే మనస్తాపంతో ఓ యువకుడు రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన నల్లగొండ సమీపంలో చోటు చేసుకుంది. మృతుడి కుటుంబీకుల కథనం ప్రకారం.. కాజీపేట మండలం సోమిడికి చెందిన మంతుర్తి రమేశ్, రాజమ్మ దంపతుల కుమారుడు రాజ్‌కుమార్ (28) దాదాపు ఏడేళ్లుగా హైదరాబాద్‌లో ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. పనిచేసే చోట పరిచమైన ఓ యువతితో కొద్దికాలంగా చనువుగా ఉంటున్నాడు. సూర్యాపేట జిల్లాకు చెందిన సదరు యువతి కుటుంబీకులకు ఇటీవల వీరి ప్రేమ విషయం తెలియడంతో రాజ్‌కుమార్‌ను హెచ్చరించారు. దీంతో రాజ్‌కుమార్ ఎదురు తిరగడంతో యువతి బంధువులు సూర్యాపేట పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ప్రేమించిన యువతి.. కుటుంబీకుల ఒత్తిడికి తలొగ్గి ఎదురు తిరుగడం, బంధువులు చంపేస్తామంటూ బెది రించడంతో రాజ్‌కుమార్ మనస్తాపానికి గురయ్యాడు. దీంతో ఏడేళ్లుగా సాగిన ప్రేమాయణం.. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను వివరిస్తూ సెల్ఫీ వీడియోను రికార్డు చేసి ఆత్మహత్య చేసుకుంటున్నట్లు బంధు, మిత్రులకు పంపించాడు. వెంటనే అప్రమత్తమైన సన్నిహితులు రాజ్‌కుమార్‌ను వెతకడానికి ప్రయత్నించగా సూర్యాపేటలో చిక్కాడు. ఎంత నచ్చ చెప్పినా వినకుండా తనకు ఆత్మహత్యే శరణ్యమని చెప్పి పరారయ్యాడు. ఈ క్రమంలో శనివారం ఉదయం నల్లగొండ సమీపంలో గుర్తుతెలియని రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడిన విషయం వెలుగు చూసింది. యువతి కుటుంబీకుల బెదిరింపుల వల్లే తమ కుమారుడు ఆత్మహత్యకు పాల్పడినట్లు మృతుడి తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. కాగా, చెట్టంత ఎదిగిన కుమారుడు ప్రేమ కోసం బలయ్యాడని, తనను బెదిరించిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని కుటుంబీకులు కోరారు. -
బీజేపీకి వచ్చే సీట్లు అవే: కేసీఆర్ కీలక వ్యాఖ్యలు
సాక్షి,హైదరాబాద్: బీజేపీ కి రెండు వందల సీట్లు కూడా వచ్చే పరిస్థితి లేదని, కేంద్రంలో హంగ్ వస్తే.. పార్లమెంట్లో బీఆర్ఎస్ కీలకం అవుతుందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. బస్సు యాత్రలో భాగంగా హన్మకొండలో ఆదివారం( ఏప్రిల్ 28) జరిగిన రోడ్‌షోలో కేసీఆర్ మాట్లాడారు.‘ఓరుగల్లు చైతన్యం ఉన్న జిల్లా. చరిత్ర వైభవానికి ప్రతీక వరంగల్ జిల్లా. ఓరుగల్లు మట్టితో నాది విడదీయరాని బంధం. ఐదు మెడికల్ కాలేజీలు వరంగల్ ఉమ్మడి జిల్లాకు తెచ్చుకున్నాం. ఈ ముఖ్యమంత్రి విచిత్రమైన మాటలు మాట్లాడుతున్నాడు. ఈ ముఖ్యమంత్రికి తెలంగాణ చరిత్ర తెలియదు. భూగోళం తెలియదు. ఏరి కోరి మొగుణ్ణి తెచ్చుకుంటే ఎగిరిఎగిరి తన్నట్లుంది తెలంగాణ పరిస్థితి. రాష్ట్రంలో ఏం జరుగుతోంది. ఈ ప్రభుత్వ పాలనలో రియల్ ఎస్టేట్ రంగం పూర్తిగా దివాలా తీసింది. తెలంగాణ గొంతుకోసి మోదీ గోదావరి జలాలను తమిళనాడు కు తరలించే కుట్రలు చేస్తున్నాడు.మోదీ గోదావరిని ఎత్తుకు పోతా అంటుంటే ఈ ముఖ్యమంత్రి మూతి ముడుచుకొని కూర్చున్నాడు. . బీజేపీ చాలా ప్రమాద కరమైన పార్టీ. ప్రజల మధ్య పంచాయితీలు పెట్టడం తప్ప మరో ప్రణాళిక లేదు. బీజేపీ ఎజెండాలో ప్రజల కష్టసుఖాలు ఉండవు. అచ్చే దిన్ రాలేదు కానీ సచ్చేదిన్ వచ్చింది. రూపాయి విలువ పడిపోయింది. కడియం శ్రీహరి బీఆర్ఎస్కు చేసిన మోసానికి శాశ్వతంగా ఆయన రాజకీయ జీవితం సమాధి చేసుకున్నాడు. మూడు నెలల్లో స్టేషన్ ఘన్‌పూర్‌కు ఉప ఎన్నికలు రాబోతున్నాయి. రాజయ్య ఎమ్మెల్యే కాబోతున్నాడు. రాజయ్య చేతిలో కడియం ఓటమి ఖాయం.గోదావరి, కృష్ణా నదులను కాపాడుకోవాలంటే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలవాలి. రేవంత్ రెడ్డి నా గుడ్లు పీకి గోలీలు ఆడుకుంటాడట.. నా లాగు కూడా ఊడ తీస్తాడట. నన్ను చర్లపల్లి జైలులో వేస్తాడట. నీ జైళ్ళు, తోకమట్ట దెబ్బలకు కేసీఆర్ భయపడడు. ఇంకా చేయాల్సిన అభివృద్ధి చాలా ఉంది. అభివృద్ధి అంటే ఎలా ఉంటుందో వరంగల్‌లో కట్టిన 24 అంతస్తుల ఆస్పత్రే నిదర్శనం’ అని కేసీఆర్ అన్నారు -
Bhimaa Movie: గోపీచంద్ ‘భీమా’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
విద్యార్థిని అనుమానాస్పద మృతి
హసన్‌పర్తి: హనుమకొండ జిల్లా హసన్‌పర్తి శివారులోని ఓ విద్యాసంస్థలో బీఎస్సీ అగ్రికల్చర్ చదువుతున్న విద్యార్ధిని అనుమానాస్పదంగా మృతి చెందింది. అయితే తన కూతురును హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని మృతురాలి తండ్రి రాథోడ్ మోహన్‌సింగ్ ఆరోపించారు. ఈ మేరకు హసన్‌పర్తి ఠాణాలో ఫిర్యాదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. ఆదిలాబాద్ జిల్లా బోధ్ మండలం కండెపల్లికి చెందిన రాథోడ్ మోహన్‌సింగ్ (డిప్యూటీ కలెక్టర్, మైనారిటీ కార్పొరేషన్ అ«ధికారి, నిర్మల్) కూతురు రాథోడ్ దీప్తి(19) కళాశాల హాస్టల్లోనే ఉంటూ అగ్రికల్చర్ బీఎస్సీ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. శుక్రవారం దీప్తి కళాశాల హాస్టల్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఎంజీఎంకు తరలించారు. ఉరి వేసుకున్నట్టు సమాచారం ఇవ్వలేదు దీప్తి ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని, గురువారం సాయంత్రం తాను ఫోన్లో మాట్లాడినట్టు తండ్రి మోహన్‌సింగ్ పేర్కొన్నారు. ఉదయం తన భార్య ఫోన్ చేస్తే త్వరగా ఎంజీఎంకు రమ్మన్నారే తప్ప ఆత్మహత్య చేసుకున్న విషయం చెప్పలేదన్నారు. మృతదేహాన్ని కిందకు దింపిన సమయంలో సెక్యూరిటీ సిబ్బందితోపాటు మరికొంతమంది మగవారు ఉన్నట్టు స్పష్టమవుతోందన్నారు. కిందకు దింపినప్పుడు తహసీల్దార్, పోలీసులకు ఎందుకు సమాచారం ఇవ్వలేదని ప్రశ్నించారు. దీప్తిపై అత్యాచారం, ఆపై హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని మృతురాలి తండ్రి మోహన్‌సింగ్ పోలీసులకు ఇచి్చన ఫిర్యాదులో పేర్కొన్నారు. 11,12 తేదీల్లో సీసీ ఫుటేజీ సేకరించాలని పోలీసులను కోరారు. దీప్తి మృతిపై సమగ్ర విచారణకు పలు విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. టీజీవీపీ, టీఎస్ఎఫ్, గిరిజన శక్తి మోర్చ సంఘాలు ఆ విద్యాసంస్థ ఎదుట ఆందోళన నిర్వహించాయి. యూనివర్సిటీ గుర్తింపు రద్దు చేయాలని డిమాండ్ చేశాయి. దీప్తి మృతిపై సమగ్ర విచారణ జరుపుతున్నట్టు హసన్‌పర్తి ఇన్స్పెక్టర్ గోపి తెలిపారు. కాజీపేట ఏసీపీ డేవిడ్ రాజు ఆధ్వర్యంలో ఈ విచారణ కొనసాగుతుందన్నారు. ఆత్మహత్య చేసుకున్న గదిని సీజ్ చేసినట్టు తెలిపారు. -
ఒకే రోజు రెండు ఘోర ప్రమాదాలు.. ఎనిమిది మంది మృతి
సాక్షి, ప్రకాశం జిల్లా: ప్రకాశం జిల్లాలో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పెద్దారవీడు మండలం దేవరాజు గట్టు గ్రామం వద్ద ఎదురుగా వస్తున్న ఆటోను కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతిచెందారు. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. అయితే వారిని మార్కాపురం జిల్లా ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రుల్లో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. మృతి చెందిన వారిలో కారులో ప్రయాణిస్తున్న గుంటూరుకు చెందిన రావు నాగేశ్వరరావు రావు వెంకటేశ్వర్లు, ఆటోలో ప్రయాణిస్తున్న మార్కాపురం పట్టణానికి చెందిన షేక్ బాబు, ఆమని గుడిపాడుకు చెందిన ఎనిబెర అభినయ్ అక్కడిక్కడే ప్రాణాలు విడిచారు.. ఆటోలోని నలుగురికి తీవ్రగాయాలు కావడంతో స్థానికులు మార్కాపురం జిల్లా ఆసుపత్రికి తరలించారు. మరోవైపు హనుమకొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ, కారు ఢీకొన్న సంఘటనలో ఒకే కుటుంబానికి చెందిన నాలుగురు అక్కడిక్కడే మృతి చెందారు. ఏటూరునాగారం మండల కేంద్రానికి చెందిన మంతెన శంకర్ తన కుటుంబ సభ్యులతో వేములవాడ వెళ్తుండగా హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం పెంచికలపేట వద్ద ఈ ప్రమాదం జరిగింది. కరీంనగర్ నుంచి వస్తున్న ఇసుక లారీ కారును ఢీకొట్టడంతో కారులో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. రోడ్డు ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు.. క్షతగాత్రులను వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. మృతులను మంతెన కాంతయ్య (7 ), మంతెన శంకర్ (60), మంతెన భరత్ (29), మంతెన వందన (16)గా గుర్తించారు. తీవ్ర గాయాలతో ఎంజీఎం లో చికిత్స పొందుతున్న వారిలో మంతెన రేణుక (60), మంతెన భార్గవ్ (30), మంతెన శ్రీదేవి (50), ఉన్నారు. -
ఓటు వేసి.. మృత్యుఒడిలోకి..
హన్మకొండ: అసెంబ్లీ ఎన్నికలు ఆ కుటుంబంలో విషాదాన్ని నింపాయి. స్వగ్రామంలో ఓటు వేసి తిరిగి వెళ్తుండగా మృత్యువు కారు రూపంలో వచ్చి వారు ప్రయాణిస్తున్న ద్విచక్రవాహనాన్ని ఢీకొంది. ఈ ప్రమాదంలో భార్య మృతి చెందగా భర్తకు తీవ్ర గాయాలయ్యాయి. అలాగే ఇద్దరు కుమారుల కాళ్లు విరిగి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మృతురాలి బంధువుల కథనం ప్రకారం. వరంగల్ జిల్లా ఖానాపురం మండలం రాగంపేటకు చెందిన వాంకుడోత్ రవీందర్ తన కుటుంబంతో కలిసి హనుమకొండ రెడ్డికాలనీలో నివాసముంటున్నారు. గురువారం అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా స్వగ్రామంలో ఓటు హక్కు వినియోగించుకుని బైక్ పై భార్య మానస(27), ఇద్దరు కుమారులు జ్ఞాన చైతన్య, హర్షవర్ధన్‌ను తీసుకుని హనుమకొండకు తిరుగు ప్రయాణమయ్యాడు. మార్గమధ్యలో వరంగల్–నర్సంపేట రహదారిపై గీసుకొండ మండలం కొమ్మాల శివారులోకి రాగానే నర్సంపేట వైపునకు ఎదురుగా వస్తున్న కారు డ్రైవర్ అతి వేగంగా వచ్చి వారి ద్విచక్ర వాహనాన్ని ఢీకొంది. ఈ ప్రమాదంలో రవీందర్, మానసకు బలమైన గాయాలు కాగా వారి కుమారుల కాళ్లు విరిగాయి. వారందరినీ 108 అంబులెన్స్‌లో ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యసేవల కోసం మానసను హనుకొండలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ ఆమె శుక్రవారం ఉదయం మృతి చెందింది. అజాగ్రత్తగా కారు నడిపిన డ్రైవర్‌పై చట్టరీత్యా చర్య తీసుకోవాలని, మృతురాలి బంధువు వాంకుడోత్ ప్రవీణ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు గీసుకొండ సీఐ రామకృష్ణ తెలిపారు. -
Rashi Khanna Latest HD Images: ఓరుగల్లులో సినీనటి రాశీఖన్నా సందడి (ఫోటోలు)
-
ఒకే కుటుంబం నుంచి ఏకంగా 78 మంది ఉపాధ్యాయులు
సాక్షి, హన్మకొండ: ఒక కుటుంబంలో ఒకరు లేదా ఇద్దరు.. మహా అయితే నలుగురు ఒకే వృత్తిని ఎంచుకోవడం సాధారణం. కానీ ఒకే కుటుంబం నుంచి ఏకంగా 78 మంది ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగుతున్నారు. బెంజిమన్ అనే వ్యక్తికి చెందిన నాలుగు తరాలకు చెందిన 78మందికి బుధవారం హనుమకొండ కంచరకుంటలోని సెయింట్‌పాల్ హైస్కూల్ చైర్మన్ ఎం.ఆనంద్ ఆహ్వానం పంపగా 22మంది హాజరయ్యారు. వీరిని గురుపూజోత్సవం సందర్భంగా సన్మానించారు. బెంజిమన్ తండ్రి మోజెస్ బ్రిటిష్ ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేశారు. 1901లో బెంజిమన్ కుటుంబ సమేతంగా హనుమకొండలో స్థిరపడ్డారు. ఆయనకు ఐదుగురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. చదవండి: చంటి బిడ్డను చేతులపై ఎత్తుకుని వాగు దాటించిన బాబాయి -
ప్రధాని మోదీ తెలంగాణ పర్యటన ఖరారు.. ఆ రోజే వరంగల్‌కు రాక
సాక్షి, వరంగల్: తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో బీజేపీ అగ్రనేతలు రాష్ట్రానికి క్యూ కడుతున్నారు. ఇప్పటికే ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నాగర్ కర్నూల్లో బహిరంగ సభ నిర్వహించగా.. తాజాగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ తెలంగాణలో పర్యటించనున్నారు. ఈ మేరకు మోదీ రాష్ట్ర పర్యటన షెడ్యూల్ ఖరారైంది. జూలై 8న వరంగల్‌లో ప్రధాని పర్యటించనున్నారు. రైల్వే శాఖ ఆధ్వర్యంలో కాజీపేటలో ఏర్పాటు చేయనున్న వేగన్ ఓవర్ హాలింగ్ సెంటర్‌కు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం వరంగల్ మెగా టెక్స్టైల్ పార్క్‌కు శంకుస్థాపన చేస్తారు. తరువాత హన్మకొండలోని ఆర్ట్స్ కళాశాలలో నిర్వహించే బహిరంగ సభలో ప్రధాని మోదీ పాల్గొని ప్రసంగిస్తారు. 200 ఎకరాల్లో రూ. 10 వేల కోట్లతో టెక్స్ టైల్ పార్కును కేంద్ర ప్రభుత్వం నిర్మించబోతోంది. చదవండి: జూలై 3న కేంద్ర కేబినెట్ భేటీ.. ఆరోజే మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ! అయితే ప్రధాని అధికారిక కార్యక్రమాన్ని రాజకీయంగా ఉపయోగించుకోవాలని బీజేపీ రాష్ట్ర నాయకత్వం యోచిస్తోంది. ఈ క్రమంలో అధికార కార్యక్రమాలతోపాటు, బహిరంగ సభకు కాషాయ నేతలు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇదిలా ఉండగా రాష్ట్ర నాయకత్వ మార్పు, బండి సంజయ్‌కు కేంద్రమంత్రి పదవి, కిషన్ రెడ్డికి తెలంగాణ అధ్యక్షుడి బాధ్యతలు అప్పగించనున్నట్లు ఇటీవల వార్తలు చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. ఈ తాజా పరిణామాల నేపథ్యంలో ప్రధాని తెలంగాణ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. చదవండి: Hyderabad: ఎమ్మెల్యే చిన్నయ్య బాధితురాలు శేజల్ సూసైడ్ అటెంప్ట్ -
బావిలో భారీ కొండచిలువ
సాక్షి, హన్మకొండ: మంచినీటి బావిలో భారీ కొండచిలువ కనిపించడంతో నీటి కోసం వచ్చిన మహిళలు హడలిపోయారు. హనుమకొండ జిల్లా శాయంపేట మండలం పెద్దకోడెపాక గ్రామంలో మంగళవారం జరిగిన ఈ సంఘటన వివరాలివి. రోజు మాదిరిగానే ఉదయం తాగునీటిని తెచ్చుకోవడానికి మంచినీటి బావి వద్దకు వెళ్లి మహిళలకు అందులో అతిపెద్ద కొండచిలువ కనిపించింది. దీంతో మహిళలు భయబ్రాంతులై కేకలు వేయడంతో స్థానిక సర్పంచ్ అబ్బు ప్రకాశ్‌రెడ్డి చేరుకుని అటవీ అధికారులకు సమాచారం అందించారు. అటవీ అధికారులు మూడున్నర మీటర్ల పొడవున్న కొండచిలువను పట్టుకుని అడవిలో వదిలేశారు. చదవండి: వెనక్కి తగ్గిన బీజేపీ.. కేసీఆర్ వైఫల్యాలపై రివర్స్ అటాక్ కు ‘నో’ -
మొన్ననే వివాహం.. ప్రియుడితో కలిసి ఆత్మహత్యాయత్నం.. ప్రియురాలు మృతి
సాక్షి న్యూస్ వరంగల్: ప్రేమ... పెళ్ళి... ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. ప్రేమించిన యువకుడిని కాదని మరో అబ్బాయితో పెళ్లి చేసుకున్న యువతి, చివరకు ప్రియుడితో కలిసి ఆత్మహత్యకు పాల్పడింది. యువతి వరంగల్ ఎంజీఎంలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోగా ప్రియుడు హైదరాబాద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రేమించిన విషయం ముందే చెప్పి ఉంటే మరో అబ్బాయికి ఇచ్చి పెళ్ళి చేసే వాళ్ళం కాదంటున్నారు మృతురాలి బంధువులు. భీమదేవరపల్లి మండలం గొల్లపల్లికి చెందిన సంఘ లింగయ్య-రాజేశ్వరి దంపతుల కుమార్తె. మానస అదే మండలంలోని కొత్తకొండకు చెందిన విజయ్ ప్రేమించుకున్నారు. ప్రేమ వ్యవహారం తెలియక పెద్దలు మానస కు హుస్నాబాద్ మండలానికి చెందిన అబ్బాయితో ఈనెల 11న వివాహం జరిపించారు. పెద్దలు కుదిర్చిన పెళ్ళిని కాదనలేక, ప్రియుడిని వదులుకోలేక మానసిక ఆందోళన చెందిన మానస 19న హన్మకొండలో ప్రియుడిని కలిసి మూడుముళ్ళ బంధంతో ఏడడుగులు నడవలేక పోయినా కలిసి చనిపోవాలనుకున్నారు. ఇద్దరు పాయిజన్ తీసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించగా స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ప్రియురాలు మానస వరంగల్ ఎంజీఎంలో చికిత్స పొందుతు చివరకు ప్రాణాలు కోల్పోయారు. ప్రేమించిన విషయం ముందే చెప్పి ఉంటే ఇంత ఘోరం జరిగి ఉండేది కాదంటున్నారు మృతురాలి కుటుంబ సభ్యులు. ప్రేమించిన విషయం చెప్పలేదని, చెప్పిఉంటే మరో అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేసే వాళ్ళం కాదని తెలిపారు. - లింగయ్య, మృతురాలి తండ్రి కులాలు వేరు కావడంతో ప్రేమ పెళ్ళికి పెద్దలు అంగీకరించలేదని ప్రచారం జరుగుతుంది. ప్రేమ గురించి మానస పెద్దలకు చెప్పినప్పటికీ యాదవ వర్గాని చెందిన అమ్మాయిని పద్మశాలి వర్గానికి చెందిన ప్రియుడికి ఇచ్చి వివాహం చేయలేకనే తమ కులానికి చెందిన మరో అబ్బాయితో పెళ్ళి జరిపించినట్లు ప్రియుడి బందువులు తెలిపారు. ప్రియుడు ప్రస్తుతం హైదరాబాద్ లో చికిత్స పొందుతున్నారు. -
అన్న ప్రభుత్వ ఉద్యోగి, తమ్ముడు సాఫ్ట్వేర్.. ఊహించని రోడ్డు ప్రమాదంలో
సాక్షి, హన్మకొడ: హన్మకొండ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. రోడ్డు ప్రమాదం ఇద్దరు అన్నదమ్ముల్ని పొట్టన పెట్టుకుంది. హసన్‌పర్తి మండలం అనంతసాగర్ క్రాస్ వద్ద గుర్తు తెలియని వాహనం బైక్‌ను ఢీ కొట్టడంతో ఇద్దరు యువకులు మృతిచెందారు. సోమవారం తెల్లవారుజామున ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మృతులను కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండలం కందుగులకు చెందిన ఇప్పలపల్లి శివరాం, హరికృష్ణగా గుర్తించారు. వివరాలు.. హుజూరాబాద్ కందుగుల గ్రామానికి చెందిన ఇప్పలపల్లి మనోహర్‌కు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు శివరామకృష్ణ (25), చిన్న కుమారుడు హరికృష్ణ (23). శివరామకృష్ణ రైల్వే శాఖలో ఉద్యోగానికి ఎంపికై మౌలాలీ (సికింద్రాబాద్)లో శిక్షణ పొందుతున్నాడు. హరికృష్ణ హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పని చేస్తున్నాడు. కాగా ఇటీవల పెద్దకుమారుడు శివరామకృష్ణకు పోస్టల్ శాఖలో మరో ఉద్యోగం వచ్చింది. ఈ విషయం చెప్పడం కోసం ఆదివారం స్వగ్రామం కందుగులకు వచ్చాడు. తిరిగి సోమవారం డ్యూటీకి వెళ్లాలని ఉదయం 4.30 గంటలకు ఇంటి నుంచి తమ్ముడితో కలిసి స్కూటీపై హైదరాబాద్‌కు బయలుదేరాడు. ఈ క్రమంలో హనుమకొండ జిల్లా హసన్‌పర్తి మండలం అనంతసాగర్ క్రాస్ రోడ్డు వద్ద 5.30 గంటల ప్రాంతంలో గుర్తు తెలియని వాహనం వారి స్కూటీని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో శివరామకృష్ణ, హరికృష్ణ తలలకు బలమైన గాయాలై అక్కడికక్కడే మృతి చెందారు. విషయం తెలిసిన కుటుంబసభ్యులు ఘటనా స్థలానికి చేరుకొని కన్నీరుమున్నీరుగా విలపించారు. ఇద్దరు కొడుకులు మృతి చెందడంతో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. తండ్రి మనోహర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదానికి కారణమైన వాహనాన్ని గుర్తించేందుకు స్థానికంగా ఉన్న సీసీ ఫుటేజ్‌ను పోలీసులు పరిశీలిస్తున్నారు. -
హనుమకొండ : వస్త్ర దుకాణం ప్రారంభోత్సవంలో పూజా హెగ్డే సందడి (ఫొటోలు)
-
హన్మకొండలో దారుణం.. వివాహితను బలవంతంగా ఆటోలో ఎక్కించి..
సాక్షి, వరంగల్: మహిళల రక్షణకు ఎన్ని కఠిన చట్టాలు తీసుకొచ్చిన కామాంధుల్లో కనీస మార్పు రావడం లేదు. రోజురోజుకీ మృగాలు రెచ్చిపోతుండటంతో ఆడవాళ్లు ఇంటి నుంచి కాలు బయట పెట్టాలంటేనే భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రతిరోజు ఎక్కడో ఒక చోట మహిళలపై లైంగిక వేధింపులు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. తాజాగా హన్మకొండలో దారుణం చోటుచేసుకుంది. ఓ వివాహితపై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. నయీమ్‌నగర్‌కు చెందిన వివాహిత ఇంట్లో గొడవపడి రోడ్డు మీదకు రాగా.. ముగ్గురు వ్యక్తులు ఆమెను ట్రాప్ చేశారు. బలవంతంగా ఆటోలో ఎక్కించి భీమారం వైపు తీసుకెళ్లి మహిళపై అత్యాచారానికి ఒడిగట్టారు. కాగా మూడు రోజుల క్రితం జరిగిన ఈ ఘటనపై బాధితురాలు శనివారం హన్మకొండ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. మహిళ ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. రాకేశ్ అనే ఆటోడ్రైవర్‌తోపాటు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో విచారణ జరుగుతోందని పోలీసులు తెలిపారు. చదవండి: మౌనిక మృతి.. ‘బయటకెళ్తే ఇంటికొస్తారనే నమ్మకం లేదు’ -
బండి సంజయ్ బెయిల్ రద్దు చేయాలన్న పిటిషన్ కొట్టివేత
-
అధికారంలోకి వచ్చాక లెక్క తేలుస్తాం: ఈటల
సాక్షి, హన్మకొండ: ప్రభుత్వాన్ని గద్దె దించే వరకూ పోరాటం కొనసాగిస్తామని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. తెలంగాణ సీఎం కేసీఆర్ తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదన్నా ఈటల. అధికారంలోకి వచ్చాక లెక్క తేలుస్తామని ఈటల అన్నారు. హన్మకొండలో బీజేపీ నిరుద్యోగ మార్చ్ చేపట్టింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, బీజేపీ నాయకులు లక్ష్మణ్, ఈటల రాజేందర్, బీజేపీ రాష్ట్ర, జిల్లా నాయకులతో పాటు నిరుద్యోగ యువత ఈ మార్చ్‌లో పాల్గొన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శించారు. కాలయాపన వద్దు.. కొలువులు ముద్దు అంటూ నిరుద్యోగ యువత మార్చ్‌లో పాల్గొంది. కేయూ క్రాస్ నుండి బీజేపీ నిరుద్యోగ మార్చ్ ప్రారంభమయ్యే బీజేపీ నిరుద్యోగ మార్చ్. నయీమ్ నగర్ మీదుగా అంబేద్కర్ సెంటర్ వరకూ కొనసాగనుంది. -
సంజయ్‌కు బెయిల్
సాక్షి ప్రతినిధి, వరంగల్/ వరంగల్ లీగల్: పదో తరగతి ప్రశ్నపత్రం లీక్ కేసులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌కు హనుమకొండ నాలుగో మున్సిఫ్ మేజిస్ట్రేట్ కోర్టు గురువారం రాత్రి బెయిల్ మంజూరు చేసింది. కమలాపూర్ జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో పదో తరగతి హిందీ పరీక్ష పత్రం లీక్, కాపీ కుట్ర కేసులో పోలీసులు బుధవారం బండి సంజయ్‌ను అరెస్టు చేసి, రిమాండ్‌కు పంపిన విషయం తెలిసిందే. ఈ కేసులో సంజయ్ తరఫు న్యాయవాదులు వేసిన బెయిల్ పిటిషన్‌పై గురువారం సుదీర్ఘంగా విచారణ సాగింది. పలుమార్లు వాయిదాలతో.. సుమారు 8 గంటల పాటు జరిగిన వాదోపవాదాల అనంతరం రాత్రి 10 గంటల సమయంలో జడ్జి రాపోలు అనిత తీర్పు ఇచ్చారు. రూ.20 వేల చొప్పున ఇద్దరు జమానతుదారుల పూచీకత్తుపై బెయిల్ మంజూరు చేశారు. దేశం విడిచి వెళ్లకూడదని, కేసు విచారణ నిమిత్తం ప్రాసిక్యూషన్‌కు సహకరించాలని, సాక్షులను ప్రభావితం చేయకూడదని, సాక్ష్యాలను చెరిపివేయకూడదని షరతులు విధించారు. బెయిల్ ప్రక్రియ పూర్తయ్యేసరికి గురువారం రాత్రి అవడంతో.. బండి సంజయ్ శుక్రవారం ఉదయం కరీంనగర్ జైలు నుంచి విడుదల కానున్నారు. దురుద్దేశంతో ఇరికించారు..: సంజయ్ లాయర్లు బండి సంజయ్ బెయిల్ విషయమై కోర్టులో గురువారం లంచ్ విరామం తర్వాత మొదలైన వాదనలు రాత్రి 8 గంటల వరకు కొనసాగాయి. రాష్ట్ర ప్రభుత్వం పార్లమెంట్ సభ్యుడైన బండి సంజయ్‌ను అప్రతిష్టపాలు చేసేందుకు దురుద్దేశపూర్వకంగా పోలీసులతో అక్రమ కేసు బనాయించిందని ఆయన తరఫు న్యాయవాదులు శ్యాంసుందర్‌రెడ్డి, విద్యాసాగర్‌రెడ్డి, రామకృష్ణ, సునీల్‌లు వాదించారు. రిమాండ్ రిపోర్టులో పేర్కొన్న ఆరోపణలుగానీ, ఫిర్యాదుదారు పిటిషన్లో ఆరోపించిన విషయాలుగానీ బండి సంజయ్‌కు వర్తించవని.. దురుద్దేశంతోనే కేసులో ఇరికించారని పేర్కొన్నారు. ఇప్పటికే కేసుకు సంబంధించి విచారణ పూర్తయిందని, నివేదిక మాత్రమే కోర్టులో దాఖలు చేయాల్సి ఉందని కోర్టుకు విన్నవించారు. సాక్షులను ప్రభావితం చేయడంగానీ, సాక్ష్యాధారాలను చెరిపేయడంగానీ చేసే ఆస్కారం లేనందున సంజయ్‌కు బెయిల్ మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రధాని మోదీ తెలంగాణకు వస్తున్న సందర్భంగా ఎంపీగా, సంబంధిత పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా సంజయ్ ఆ కార్యక్రమాల్లో పాల్గొనాల్సిన అవసరాన్ని దృష్టిలో పెట్టుకోవాలని కోరారు. బెయిలిస్తే శాంతిభద్రతల సమస్య: పబ్లిక్ ప్రాసిక్యూటర్ మరోవైపు సంజయ్‌కు బెయిల్ ఇవ్వకూడదని పబ్లిక్ ప్రాసిక్యూటర్ రేవతిదేవి కోర్టును కోరారు. ‘‘తెలంగాణ వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు జరుగుతున్నాయి. విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని ఇదే తీరుగా నేరాలు పునరావృతం కాకుండా జాగ్రత్తపడాల్సి ఉంది. నిందితుడు బండి సంజయ్‌కు బెయిల్ ఇస్తే విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆయనపై తీవ్రమైన చర్యలకు పాల్పడే అవకాశం ఉంది. అది రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్యగా మారే ప్రమాదం ఉంది. అంతేగాకుండా ఈ కేసులో మరికొందరు సాక్షులను విచారించాలి. నిందితులు ముందస్తుగా కుట్రపన్ని ప్రశ్నపత్రాల లీక్, కాపీకి పాల్పడ్డారు. వారి ఫోన్‌కాల్స్, వాట్సాప్ చాట్ల వివరాలను విశ్లేషించడం ద్వారా వారి పాత్ర బయటపడింది. ఇంకా సాంకేతిక ఆధారాలు లభించాల్సి ఉంది. వాస్తవాలను వెలికితీసేందుకు లోతైన దర్యాప్తు అవసరం. ఏ1 నిందితుడికి బెయిలిస్తే సాక్షులను బెదిరించి, దర్యాప్తునకు ఆటంకం కల్పించడంతోపాటు సాంకేతిక ఆధారాలను చెరిపేసే అవకాశం ఉంది. సంజయ్ బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించాలి’’ అని కోరారు. బెయిల్ మంజూరు.. కస్టడీ పిటిషన్ వాయిదా ప్రాసిక్యూషన్, బండి సంజయ్ తరఫు న్యాయవాదుల వాదనల అనంతరం గురువారం రాత్రి 10 గంటల సమయంలో జడ్జి తీర్పు ఇచ్చారు. సంజయ్‌కు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేశారు. జమానతుదారుల పూచీకత్తు పత్రాలను సంజయ్ తరఫు న్యాయవాదులు సమర్పించగా.. కోర్టు విడుదల ఆదేశాలు (రిలీజ్ ఆర్డర్) జారీ చేసింది. మరోవైపు సంజయ్‌ను విచారణ నిమిత్తం తమ కస్టడీకి ఇవ్వాలన్న పోలీసుల పిటిషన్‌పై తీర్పును సోమవారానికి వాయిదా వేసింది. శనివారం ఉదయం విడుదల బండి సంజయ్ బెయిల్ పేపర్లు ఇంకా మాకు అందలేదు. అందినా రాత్రి పూట విడుదల చేసే అవకాశం లేదు. శుక్రవారం ఉదయం బెయిల్ పేపర్లు అందే అవకాశాలు ఉన్నాయి. రాగానే వాటిని పరిశీలించి సంజయ్‌ను విడుదల చేస్తాం. – సమ్మయ్య, కరీంనగర్ జైలు సూపరింటెండెంట్ చదవండి: బండి సంజయ్ చేసిన తప్పేంటి?.. అది లీకేజీ ఎలా అవుతుంది: హైకోర్టు -
బండి సంజయ్‌కు 14 రోజుల రిమాండ్.. జైలుకు తరలింపు..
సాక్షి, వరంగల్: మంగళవారం అర్ధరాత్రి అరెస్టయిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ను హన్మకొండ ప్రిన్సిపల్ మెజిస్ట్రేట్ అనిత రావుల ముందు హాజరుపరిచారు పోలీసులు. బండి సంజయ్‌తో పాటు ప్రశాంత్, శివ గణేష్, మహయ్లను కూడా మెజిస్ట్రేట్ ముందుకు తీసుకెళ్లారు. టెన్త్ పేపర్ లీక్ వ్యవహారానికి సంబంధించి ప్రభుత్వం, బండి సంజయ్ తరఫు న్యాయవాదుల వాదనలు విన్న మెజిస్ట్రేట్ ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించారు. వాడీవేడీగా వాదనలు.. టెన్త్ పేపర్ లీక్ కేసులో ఏ1గా ఉన్న బండి సంజయ్‌ను విచారించేందుకు 14 రోజుల రిమాండ్ విధించాలని ప్రభుత్వ తరఫు న్యాయవాదులు మెజిస్ట్రేట్‌ను కోరారు. మరోవైపు బండి సంజయ్ అరెస్టు అక్రమమని అతని తరఫు న్యాయవాదులు వాదించారు. బెయిల్ మంజూరు చేయాలని కోరారు. వాదనల అనంతరం దాదాపు రెండు గంటల తర్వాత మెజిస్ట్రేట్ తీర్పు వెలువరించారు. భారీ భద్రత.. అంతకుముందు ముందుజాగ్రత్త చర్యగా హన్మకొండ కోర్టు వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే బండిని కోర్టు నుంచి మెజిస్ట్రేట్ ఇంటి వద్దకు తీసుకెళ్తుండగా బీజేపీ కార్యకర్తలు అడ్డుకునేందుకు ప్రయత్నించడం తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. బండి అరెస్టును నిరసిస్తూ వారు పెద్దఎత్తున నినాదాలు చేశారు. దీంతో పోలీసులు వారిని చెదరగొట్టారు. ఈ క్రమంలో ఇరవర్గాల మధ్య తోపులాటలు జరిగాయి. ఖమ్మం జైలుకు.. తీర్పు అనంతరం బండి సంజయ్‌ను కరీంనగర్ జైలుకు తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే మెజిస్ట్రేట్ ఇంటి వద్దకు బీఆర్ఎస్, బీజేపీ శ్రేణులు భారీగా తరలిరావడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చొక్కా విప్పిన బండి.. కాగా.. పోలీసులు తనతో దురుసుగా ప్రవర్తించారని బండి సంజయ్ తన న్యాయవాదులకు చెప్పారు. చొక్కా తీసి తన ఒంటిపై గాయాలను కూడా చూపించారు. పోలీసులు వ్యవహరించిన తీరు, అరెస్టు చేసిన విధానాన్ని బీజేపీ లీగల్ సెల్ ప్రతినిధులకు బండి వివరించారు. చదవండి: బండి సంజయ్‌పై నమోదైన కేసు ఇదే.. అరెస్టుపై అమిత్‌షా ఆరా.. ఏం జరిగిందో చెప్పిన కిషన్ రెడ్డి.. -
హన్మకొండలో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య
సాక్షి, వరంగల్: హన్మకొండలో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య కలకలం సృష్టిస్తుంది. నగరంలోని సువిద్యా జూనియర్ కళాశాలకు చెందిన ఫస్టియర్ విద్యార్థిని నాగజ్యోతి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆత్మహత్యకు గల కారణాలు స్పష్టంగా తెలియకపోయినప్పటికీ నిన్న జరిగిన ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్ సరిగా రాయకపోవడంతోనే ఆత్మహత్య చేసుకున్నట్లు భావిస్తున్నారు. జనగామ జిల్లా కొడకండ్ల మండలం ఏడునూతల గ్రామానికి చెందిన నాగజ్యోతి కళాశాలకు చెందిన హాస్టల్లో ఉంటూ చదువుకుంటున్నారు. నిన్న పరీక్ష రాసి హాస్టల్‌కు వెళ్లిన విద్యార్థిని రాత్రి ఉరి వేసుకుంది. వెంటనే తోటి విద్యార్థులతో పాటు కళాశాల యాజమాన్యం ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. పేరెంట్స్ వస్తే గాని విద్యార్థిని ఆత్మహత్యకు గల కారణాలు తెలిసే అవకాశాలు ఉన్నాయి. విద్యార్థిని ఆత్మహత్యతో కళాశాల వద్ద పోలీసులు భారీగా మోహరించి ఆందోళనలకు తావు లేకుండా చర్యలు చేపట్టారు. ఇంటర్ పరీక్షలు ప్రారంభమైన రోజునే విద్యార్థిని ఆత్మహత్య చేసుకోవడం సర్వత్రా ఆందోళనకు గురిచేస్తుంది. చదవండి: అందం ఆమె పాలిట శాపమైంది -
ఇద్దరు కొడుకులతో కలసి బావిలోకి దూకిన తల్లి
నడికూడ: ఇద్దరు కొడుకులతో కలసి తల్లి బావిలో దూకగా.. ఒక కొడుకు, తల్లి మృతిచెందిన ఘటన హనుమకొండ జిల్లా నడికూడ మండలం కంఠాత్మకూర్ గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన మామిడి కుమారస్వామితో దేశాయిపేటకు చెందిన కావ్య అలియాస్ లావణ్య (30)కు 12 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద కొడుకు విద్యాధర్ 3వ తరగతి చదువుతుండగా.. చిన్న కొడుకు శశిధర్ (7) ఒకటో తరగతి చదువుతున్నాడు. కాగా, కావ్య ఆదివారం మధ్యాహ్నం తన ఇద్దరు కుమారులతో కలసి గ్రామంలోని ఓ వ్యవసాయ బావి వద్దకు వెళ్లింది. ముందుగా ఇద్దరు కుమారులను బావిలోకి తోసి.. ఆ తర్వాత తానూ బావిలోకి దూకింది. వీరిలో పెద్ద కుమారుడు బావిలోని విద్యుత్ మోటార్ పైపును పట్టుకొని గట్టిగా కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు, వ్యవసాయ కూలీలు వచ్చి విద్యాధర్‌ను పైకి తీశారు. అప్పటికే తల్లి, చిన్న కుమారుడు శశిధర్ మృతిచెందారు. కావ్య ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. కొడుకు విద్యాధర్‌ను ప్రశ్నించగా నానమ్మతో తల్లికి గొడవ జరిగిందని తెలిపాడు. మృతురాలు కావ్యకు మతిస్థిమితం సరిగా లేదని తెలిసింది. -
ఈటల ఇలాకాలో కేటీఆర్‌కు నిరసన సెగ.. చేనేత కార్మికుల నిలదీత
హన్మకొండ: ఈటల రాజేందర్ ఇలాక కమలాపూర్‌లో మంత్రి కేటీఆర్ పర్యటన ఉద్రిక్త పరిస్థితుల మధ్య సాగింది. ఎన్ఎస్యూఐ కార్యకర్తలు కేటీఆర్ కాన్వాయ్ ముందు నల్ల చొక్కాలతో నిరసన వ్యక్తం చేశారు. వీరిపై బీఆర్ఎస్ శ్రేణులు దాడి చేయడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు రంగంలోకి దిగి నిరసన తెలిపిన ఐదుగురు ఎన్ఎస్యూఐ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు కమ్యూనిటీ కాంప్లెక్స్ వద్ద మంత్రి కేటీఆర్‌ను చేనేత కార్మికులు నిలదీశారు. తమ అభివృద్ధి కోసం ఏం చేశారో చెప్పాలని ప్రశ్నించారు. దీనికి స్పందనగా పద్మశాలీల అభివృద్ధికి ఏం చేశారో మోదీని అడగాలని కేటీఆర్ బదులిచ్చారు. దీంతో మోదీ మాకు తెల్వదు.. మీరే అభివృద్ధి చేయాలంటూ ఓ మహిళ సమాధానమిచ్చింది. పిల్లలతో భోజనం.. నిరసనలు ఎదురైన తన పర్యటను యథావిధిగా కొనసాగించారు కేటీఆర్. కమలాపుర్ ఎంజేపీ స్కూల్ పిల్లలతో కలిసి భోజనం చేశారు. వారితో మాట్లాడి ముచ్చటించారు. అనంతరం డ్రోన్ల ఉపయోగాల గురించి వివరించారు. 'డ్రోన్‌తో రైతుల పంటపొలాలపై పురుగుల మందు స్ప్రే చేయొచ్చు. డ్రోన్ అంటే కెమెరా కాదు.. మనుషులను తీసుకుకేళ్ళే వాహనం కూడా అవుతుంది. డ్రోన్‌తో అమ్మాయిల భద్రత విషయంలో చర్యలు తీసుకోవచ్చు. వీటితో గుట్టలు, చెరువులు, కుంటల సరిహద్దులను నిర్ధరించవచ్చు. ఎవరూ చొరబడకుండా చూడవచ్చు' అని కేటీఆర్ చెప్పారు. అలాగే చదువుకుని మీరంతా ఎమవుతారు? ఉద్యోగం చేస్తారా? అని విద్యార్థులను కేటీఆర్ ప్రశ్నించారు. చదువు పూర్తయ్యాక ఉద్యోగం చేయవచ్చు లేదా 10 మందికి మీరే ఉపాధి కల్పించవచ్చని చెప్పారు. అవకాశాలు చాలా ఉన్నాయని పేర్కొన్నారు. టెన్త్, ఇంటర్ పిల్లలను హైదరాబాద్‌లోని టీ-హబ్ టాస్క్‌కు తీసుకురావాలని కలెక్టర్, ప్రిన్సిపాల్‌లను కేటీఆర్ అదేశించారు. చదవండి: తెలంగాణ బడ్జెట్‌కి గవర్నర్ ఆమోదం -
నటరాజ వందనం.. శివుడికే అంకితం
సాక్షి, హన్మకొండ: ‘నటరాజ వందనం.. శివుడికి అంకితం చేసిన నృత్య ప్రదర్శన. నా తల్లి మృణాళిని సారాభాయ్ వెలువరించిన ‘లవ్ సాంగ్స్ టు శివ’ పుస్తకం నుంచి రూపొందించింది. సాధారణంగా పురుష దేవతల్లో ఐక్యత కోసం నాయిక అన్వేషణగా ఇది ప్రదర్శితమవుతుంది.’ అని అంతర్జాతీయ శాస్త్రీయ నృత్యకారిణి, పద్మభూషణ్ అవార్డు గ్రహీత మల్లికా సారాభాయ్ అన్నారు. కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రామప్ప ఉత్సవాల్లో భాగంగా శనివారం సాయంత్రం హనుమకొండ బాలసముద్రం ‘కుడా’ మైదానంలో ‘నటరాజ వందనం’ నృత్యాన్ని ప్రదర్శించారు. ఈసందర్భంగా ఆమె ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. తన నృత్య అనుభవం.. నటరాజ వందనం ప్రదర్శన తీరు, వివిధ ఆలయాల్లోని శిల్పాల్లో నృత్య భంగిమల ప్రత్యేకతల్ని వివరించారు. ఆ వివరాలు ఆమె మాటల్లోనే.. నాకు నృత్యమంటే ప్రాణం. ఈ ఇష్టం మా అమ్మ నుంచి వచ్చినట్టుంది. అమ్మ శాస్త్రీయ నృత్యకారిణి. పుస్తకాలు రచించేది. ఆ అభిరుచి నాకు కూడా అలవడింది. కాకతీయుల కాలం నుంచి ప్రసిద్ధి చెందిన పేరిణి నృత్యం గురించి నాకు తెలుసు. 40 ఏళ్ల క్రితం కూచిపూడి గ్రామానికి చెందిన సీఆర్ ఆచార్యుల వద్ద నేను నృత్యం నేర్చుకున్నా. ప్రపంచ వ్యాప్తంగా పేరిణి నృత్య ప్రదర్శనలిచ్చా. శాస్త్రీయ సమకాలీన రచనలు సృష్టించి ప్రదర్శనలిస్తూ వస్తున్నా. 30 ఏళ్లుగా ప్రతిష్టాత్మక ఆర్ట్స్ సంస్థ ‘దర్పణ అకాడమీ ఆఫ్ ఫెర్ఫార్మింగ్ ఆర్ట్స్’కు కో–డైరెక్టర్‌గా ఉన్నా. 1989లో మహిళా శక్తిని బలోపేతం చేసే సోలో థియేట్రికల్ వర్క్‌లను ప్రదర్శించాం. సామాజిక మార్పు కోసం, మహిళా సాధికారత, పర్యావరణ స్పృహ కలిగించేలా మా ప్రదర్శనలుంటాయి. అనేక రంగస్థల నిర్మాణాల్ని రూపొందించాం. సామాజిక మార్పు, పరివర్తన కోసం కళల్ని ఉపయోగించడమే నా ధ్యేయం. నాట్యాల్లో ప్రత్యేకం.. నాట్యాల్లో నటరాజ వందనం ప్రదర్శన ఒక ప్రత్యేకం. మా అమ్మ మృణాళిని సారాభాయ్ రచించిన ‘లవ్ సాంగ్స్ టు శివ’ పుస్తకం నుంచి దీన్ని కూర్పు చేశాను. పరమాత్మ కోసం ఆత్మ చేసే అన్వేషణే భరతనాట్యం. శివపార్వతుల నృత్యాన్ని చూడడానికి విశ్వం నిశ్చలంగా మారుతుంది. ఈ ప్రదర్శనను వర్ణం అని కూడా పిలుస్తారు. ఈప్రదర్శనలో నృత్యకారుడు శివుడి తాండవ నృత్య శక్తిని, గంభీరమైన రూపాన్ని చూపిస్తాడు. రామప్పలో ప్రదర్శించాలని కోరిక.. రామప్పలో నటరాజ నృత్య ప్రదర్శన ఇవ్వాలనేది నా కోరిక. కొన్ని కారణాల వల్ల ప్రదర్శన ఇవ్వలేకపోయా. కానీ కాకతీయులు ఏలిన వరంగల్ నగరంలో ప్రదర్శించడం కూడా సంతోషంగానే ఉంది. ఇందుకు కాకతీయ హెరిటెజ్ ట్రస్ట్ వారు చాలా సహకారం అందించారు. రామప్ప ఆలయంలోని శిల్పాల నృత్యభంగిమలు ఎంతో ప్రత్యేకమైనవి. పూర్వం పురాతన దేవాలయాల్లోనే శాస్త్రీయ నృత్య ప్రదర్శనలు జరిగేవి. అప్పటి వాళ్లు కళాపిపాసులు. అందుకేనేమో నృత్య ప్రదర్శనలను వివిధ నృత్య భంగిమల్లో శిల్పాలుగా రూపొందించారు. చరిత్రను, పురాతన దేవాలయాలను కాపాడుకోవాలి. అభిరుచి ఉండాలి.. ఈపోటీ ప్రపంచంలో శాస్త్రీయ నృత్యం నేర్చుకోవాలంటే అభిరుచి ఉండి తీరాలి. లేదంటే మనల్ని మనం నిరూపించుకోలేం. ముందు తరాల వారు శాస్త్రీయ నృత్యాన్ని పరిపూర్ణంగా నేర్చుకోవాలి. నేర్చుకోవాలనే బలమైన కోరిక ఉండి, ఆర్థిక బలహీనత వల్ల వెనకబడేవారికి నేర్చుకునేలా అవకాశం కల్పించాలి. మన ప్రభుత్వం శాస్త్రీయ కళలకు నిధులివ్వట్లేదు. ప్రభుత్వం నుంచి కూడా ప్రోత్సాహం అవసరం. మల్లికా సారాభాయ్ గురించి క్లుప్తంగా.. అంతరిక్ష శాస్త్రవేత్త విక్రమ్ సారాభాయ్, శాస్త్రీ య నృత్యకారిణి మృణాళిని సారాభాయ్ దంపతుల కుమార్తె మల్లికా సారాభాయ్. 1954 మే9న అహ్మదాబాద్‌లో జన్మించారు. చిన్నతనంలోనే నృత్యం నేర్చుకున్నారు. 15ఏళ్ల వయస్సులో సినీ నటిగా పేరు తెచ్చుకున్నారు. 18 ఏళ్ల వయస్సులో భరతనాట్యం, కూచి పూడి శాస్త్రీయ నృత్యంలో అసాధారణ మైన యువనర్తకిగా గుర్తింపు పొందారు. నాటక, నృత్యరంగంలో చేసిన కృషికిగానూ గుజరాత్ ప్రభుత్వం ఆమెకు గౌరవ్ పురస్కార్ అందించింది. 2010లో భారత ప్రభుత్వంచే పద్మభూషణ్ అవార్డు అందుకున్నారు.