
సభలో అభివాదం చేస్తున్న బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రవీణ్‌కుమార్, నాయకులు
హన్మకొండ అర్బన్: జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం ఖిలాషాపూర్‌లో మార్చి 6న ప్రారంభమైన బహుజన రాజ్యాధికార యాత్ర బహుజనుడిని ముఖ్యమంత్రి చేసేవరకు ఆగేదిలేదని బీఎస్‌పీ రాష్ట్ర అధ్యక్షుడు, రిటైర్డ్ ఐపీఎస్ అధికారి డాక్టర్ ఆర్‌ఎస్.ప్రవీణ్‌కుమార్ అన్నారు. 2023లో తెలంగాణ లో బీఎస్‌పీ అధికారంలోకి వస్తుందని, ప్రగ తిభవన్‌పై నీలిజెండా ఎగురుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
అధికార పార్టీ లో ఉండి దొరలకు చెంచా కొడుతున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ నాయకులు బీఎస్పీలో చేరాలని ఆయన పిలుపునిచ్చారు. బహుజన రాజ్యాధికార యాత్ర వంద రోజులు పూర్తిచేసుకున్న సందర్భంగా హనుమకొండలోని హయగ్రీవాచారి మైదానంలో ఆదివారం రాత్రి ఏర్పాటు చేసిన సభలో బీఎస్పీ నేషనల్ కోఆర్డినేటర్ ఆకాశ్‌ఆనంద్, ఎంపీ రాంజీగౌతం, ఇతర నాయకులు ప్రసంగించారు.
ఈ సందర్భంగా ప్రవీణ్‌కుమార్ మాట్లాడుతూ తమ పార్టీ అధికారంలోకి రాగానే రాష్ట్రంలో అర్హులైన ప్రతి నిరుపేద కుటుంబానికి ఎకరం భూమి, ఉచితంగా విద్య, వైద్యం అందిస్తామన్నారు. పది లక్షల ఉద్యోగావకాశాలు కల్పిస్తామన్నారు. 60వేల పుస్తకాలు చదివిన మేధావులకు ప్రశాంత్‌కిశోర్ సలహా లు ఎందుకని ప్రశ్నించారు. బీఎస్పీలో 60 వేల పుస్తకాలు చదివిన మేధావులు, 90 ఎంఎల్ తాగుబోతులు లేరని ఎద్దే వా చేశారు. తమ వెనక పార్టీని నడపడానికి స్వామీజీలు లేరని, మెగా, మైహోం లు లేవని, కాళేశ్వరం ప్రా జెక్టులు లేవని, బహుజనుల గుండె ధైర్యం ఉందని అన్నారు.