BSP
-
మేనల్లుడికి మరోసారి మాయావతి షాక్
ఢిల్లీ : బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) అధినేత్రి మాయవతి కీలక నిర్ణయం తీసుకున్నారు. తన మేనల్లుడు ఆకాష్ ఆనంద్‌కు మరోసారి ఝలక్‌కు ఇచ్చారు. తాజాగా, ఆకాశ్ ఆనంద్‌ను పార్టీ జాతీయ సమన్వయకర్తతో పాటు అన్నీ పదవుల నుంచి తొలగించారు. గతేడాది ఆకాష్ ఆనంద్‌కు ఇదే పదవిలో కొనసాగుతుండగా.. తొలగిస్తూ మాయావతి అన్యూహ్య నిర్ణయం తీసుకున్నారు. ఆ తర్వాత తిరిగి నియమించారు. ఈ క్రమంలో తాజాగా మరోసారి బాధ్యతల నుంచి ఆకాష్ నుంచి పార్టీ పదవుల నుంచి తొలగించారు మాయావతి. ఆకాష్ స్థానంలో ఆయన తండ్రి ఆనంద్ కుమార్, సీనియర్ నాయకుడు రామ్‌జీ గౌతమ్‌లను జాతీయ సమన్వయకర్తలుగా నియమించారు.2019 లోక్‌సభ ఎన్నికలకు ముందు ఆకాష్ ఆనంద్ రాజకీయ అరంగేట్రం చేశారు. సోషల్ మీడియా ప్రచారంలో కీలక పాత్ర పోషించిన ఆయన, 2023 చివర్లో పార్టీ జాతీయ సమన్వయకర్తతో నియమితులయ్యారు. అయితే, లోక్‌సభ ఎన్నికలకు ముందు మాయావతి అతనిని పార్టీలోని పదవుల నుంచి తొలగించింది. రాజకీయాల్లో ఆకాష్ మరింత పరిణితి పొందాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం వ్యక్తం చేశారు. తర్వాత జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో బీఎస్పీ సున్నా స్థానాలకే పరిమితమైంది. ఆ తర్వాత జూన్ 2024లో ఆకాష్ ఆనంద్‌ను తిరిగి పార్టీకి తీసుకున్నారు. పలు పార్టీ పదవుల్ని కట్టబెట్టారు. మళ్లీ ఏమైందో ఏమో ఆ మేనల్లుడిని అన్నీ పార్టీ పదవుల నుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకోవడం చర్చాంశనీయంగా మారింది. -
రెండు జాతీయ పార్టీలకు నోటా కంటే తక్కువ ఓట్లు
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల డేటా విశ్లేషణలో ఆసక్తికర అంశాలు వెలుగు చూశాయి. ఢిల్లీ ఓటర్లు గుర్తింపు పొందిన జాతీయ పార్టీలైన బీఎస్పీ, సీపీఎం కంటే నోటా (నాన్ ఆఫ్ ది ఎబవ్)ఆప్షన్ వైపే ఎక్కువగా మొగ్గు చూపారని తేలింది. మొత్తం పోలైన ఓట్లలో నోటా ఆప్షన్‌కు 0.57 శాతం ఓట్లు పడగా బీఎస్పీకి 0.55 శాతం, సీపీఎంకు 0.01శాతం మంది మాత్రమే ఓటేయడం గమనార్హం. ఈ రెండు పార్టీలకు దక్కిన ఓట్ల కంటే నోటా ఓట్ల శాతమే ఎక్కువ. ఈ ఎన్నికల్లో సీపీఐకి 0.01, జేడీయూకు 0.53 శాతం ఓట్లు పడ్డాయి. -
Delhi Elections-2025: బడా పార్టీలకు ఛోటా దళాల షాక్?
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఫిబ్రవరిలో జరిగే అసెంబ్లీ ఎన్నికలకు అన్ని రాజకీయ పార్టీలు తమ పూర్తి సత్తాను సమకూర్చుకుంటున్నాయి. బహుజన్ సమాజ్ పార్టీ, ఏఐఎంఐఎం లాంటి చిన్న రాజకీయ పార్టీలు ప్రధాన రాజకీయ పార్టీలైన ఆమ్ ఆద్మీ పార్టీ, భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్‌లతో పూర్తిస్థాయిలో పోటీపడేందుకు ప్లాన్ చేస్తున్నాయి. ఇటువంటి పరిస్థితులను చూస్తుంటే బడా పార్టీలకు ఛోటా దళాలు షాకివ్వనున్నాయనే వాదన వినిపిస్తోంది. ఢిల్లీ ఎన్నికల్లో బీఎస్పీ మొత్తం 70 స్థానాల్లో పోటీ చేయనున్నట్లు ప్రకటించగా, ఆల్ ఇండియా మజ్లిస్-ఎ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ 10కిపైగా ముస్లిం ప్రాబల్య స్థానాల్లో అభ్యర్థులను నిలబెడుతోంది.మరిన్ని ర్యాలీలకు మాయావతి సిద్ధంమీడియాకు అందిన వివరాల ప్రకారం బీఎస్పీ, ఏఐఎంఐఎంలు ఎన్నికల ప్రచారంలో బడా నేతలను రంగంలోకి దింపాలని ప్లాన్ చేస్తున్నాయి. ఒకవైపు బీఎస్పీ అధినేత్రి మాయావతి ర్యాలీలు నిర్వహిస్తుండగా, మరోవైపు ఎఐఎంఐఎం నుంచి అసదుద్దీన్ ఒవైసీ ర్యాలీలు మొదలుపెట్టారు. ఢిల్లీలోని చిన్న రాజకీయ పార్టీలు రాబోయే ఎన్నికల్లో బడా పార్టీలకు గట్టి సవాలు విసరడానికి సిద్ధమవుతున్నాయి. ముస్లిం ప్రాబల్యం కలిగిన ప్రాంతాల్లో వివిధ సమస్యలను పరిష్కరించడం, అవినీతిని అరికట్టడం, సుపరిపాలన అందించడం లాంటి పలు వాగ్దానాలను ఆ పార్టీలు చేస్తున్నాయి.‘ఆప్’కు పోటీ ఇస్తామంటున్న బీఎల్పీబడా పార్టీలతో పోటీపడుతున్న చిన్న పార్టీలలో భారతీయ లిబరల్ పార్టీ (బీఎల్పీ) కూడా ఉంది. దీనిని ఇటీవల అమెరికాకు చెందిన డాక్టర్ మునీష్ కుమార్ రైజాదాతో పాటు అన్నా హజారే అవినీతి వ్యతిరేక ఉద్యమంలో పాల్గొన్న పలువురు కలిసి స్థాపించారు. ఈ సందర్భంగా డాక్టర్ మునీష్ కుమార్ రైజాదా మీడియాతో మాట్లాడుతూ తాను ఒకప్పుడు అరవింద్ కేజ్రీవాల్ చేపట్టిన అవినీతి వ్యతిరేక ఉద్యమంలో భాగమయ్యామని, కానీ ఇప్పుడు ‘ఆప్’కు గట్టి పోటీ ఇవ్వాలని నిర్ణయించుకున్నానని అన్నారు. దాదాపు 15 నెలల క్రితం భారతదేశానికి తిరిగి వచ్చిన రైజాదా, న్యూఢిల్లీ స్థానం నుండి ఆప్ అధినేత కేజ్రీవాల్‌పై పోటీ చేయనున్నారు. ఈ స్థానం నుంచి బీజేపీ మాజీ ఎంపీ ప్రవేశ్ వర్మ కూడా పోటీ చేస్తుండగా, కాంగ్రెస్ పార్టీ సందీప్ దీక్షిత్ కు టికెట్ ఇచ్చింది.ఢిల్లీలో బీఎల్పీ అధికారంలోకి వస్తే, తాము చేసే మొదటి పని అవినీతి నిరోధక కమిషన్ (ఏసీసీ) ఏర్పాటు చేయడమేనని రైజాదా అన్నారు. కాగా దళితులు, వెనుకబడిన వర్గాల్లో తన స్థానాన్ని బలోపేతం చేయడంపై దృష్టి సారించిన బీఎస్పీ ఢిల్లీలోని మొత్తం 70 స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయించుకుంది. రాబోయే రోజుల్లో మాయావతి మరిన్ని ర్యాలీలు నిర్వహించే ప్రణాళికపై కూడా పార్టీ కసరత్తు చేస్తోంది.బీజేపీతో ప్రత్యక్ష పోరాటంపై ఏఐఎంఐఎం దృష్టిహైదరాబాద్ లోక్‌సభ సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీకి చెందిన ఏఐఎంఐఎం ఢిల్లీలోని 10 నుంచి 12 స్థానాల్లో పోటీకి దిగుతున్నట్లు తెలుస్తోంది. పార్టీ ఇప్పటివరకు ఇద్దరు అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. ముస్తఫాబాద్ నుండి తాహిర్ హుస్సేన్, ఓఖ్లా నుండి షఫా ఉర్ రెహ్మాన్ పోటీ చేస్తారని తెలిపింది. 2020 ఢిల్లీ అల్లర్ల కేసుల్లో వీరిద్దరూ నిందితులు. ఢిల్లీ ఏఐఎంఐఎం అధ్యక్షుడు షోయబ్ జమాయ్ మీడియాతో మాట్లాడుతూ, సీఏఏ, ఎన్ఆర్సీలకు వ్యతిరేకంగా జరిగిన నిరసనల్లో ప్రముఖ పాత్ర పోషించిన ఇద్దరు బలమైన అభ్యర్థులను పార్టీ ఇప్పటికే నిలబెట్టిందని తెలిపారు. ముస్లిం ప్రాబల్యం ఉన్న నియోజకవర్గాల్లో బీజేపీతో ప్రత్యక్ష పోరాటంపై పార్టీ దృష్టి సారించిందన్నారు. కాగా ఫిబ్రవరి 5న ఢిల్లీలో ఒకే దశలో పోలింగ్ నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 8న ఫలితాలు వెల్లడికానున్నాయి.ఇది కూడా చదవండి: Mahakumbh 2025: విదేశీ మహిళ ఒడిలో గణేశుడు.. ‘బ్యూటీ ఆఫ్ సనాతన్’ -
వంద రోజుల్లో దళితులపై వంద దాడులు
మదనపల్లె: టీడీపీ ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వం దళిత వ్యతిరేక పాలన చేస్తోందని బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ) ఆగ్రహం వ్యక్తం చేసింది. వంద రోజుల కూటమి పాలనలో దళితులపై వంద దాడులు జరిగినా.. దళితుల ఆత్మగౌరవానికి భంగం కలిగినా ఏమీపట్టనట్టు వ్యవహరిస్తోందని ధ్వజమెత్తింది. ‘వంద రోజుల టీడీపీ కూటమి ప్రభుత్వం.. దళితులపై 100 దాడుల ప్రభుత్వం’ పేరిట బీఎస్పీ ఆధ్వర్యంలో సోమవారం అన్నమయ్య జిల్లా సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా జరిగింది. టీడీపీ కూటమి ప్రభుత్వం, దళిత వ్యతిరేక ప్రభుత్వమని నినాదాలు చేస్తూ దళితులు నిరసన తెలిపారు. ఉండి ఎమ్మెల్యే కె.రఘురామకృష్ణరాజు, కాకినాడ ఎమ్మెల్యే పంతం నానాజీ దిష్టిబొమ్మలను దహనం చేశారు.ఈ సందర్భంగా బీఎస్పీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బందెల గౌతమ్‌కుమార్ మాట్లాడుతూ.. గత ప్రభుత్వంలో నాలుగేళ్ల కాలంలో జరిగిన దాడులు, టీడీపీ పాలనలో కేవలం నాలుగు నెలల్లోనే జరిగాయన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దళితుల ఆత్మగౌరవానికి భంగం కలుగుతోందన్నారు. బీఆర్ అంబేడ్కర్ ఫ్లెక్సీని తొలగించిన ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజును బర్తరఫ్ చేయాలని, దళిత వైద్యుడు ఉమామహేశ్వరరావుపై దాడిచేసి దూషణకు పాల్పడిన కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీని తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. వంద రోజుల కూటమి పాలనను గమనిస్తే.. దళితులనే లక్ష్యంగా పెట్టుకుని దాడులకు పాల్పడుతున్నట్టు తెలుస్తోందన్నారు. కూటమి ప్రభుత్వంపై దళితులంతా ఆగ్రహంతో ఉన్నారని, ఇదే పంథాలో పాలన కొనసాగిస్తే టీడీపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉంటామన్నారు. బీఎస్పీ నేతలపై కేసులు నమోదుసబ్ కలెక్టరేట్ ఎదుట టీడీపీ, జనసేన ఎమ్మెల్యేల దిష్టిబొమ్మలను దహనం చేస్తున్నారన్న సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన సబ్ కలెక్టరేట్‌కు చేరుకుని బీఎస్పీ నాయకులు, కార్యకర్తలను అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. బీఎస్పీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బందెల గౌతమ్‌కుమార్‌తో పాటు మరో ఐదుగురిని బలవంతంగా పోలీసు జీపులోకి ఎక్కించి, వన్‌టౌన్ స్టేషన్‌కు తరలించారు. రోడ్డుపై ధర్నా నిర్వహించినందుకు ఐపీసీ సెక్షన్ 188, సెక్షన్ 290, పబ్లిక్ న్యూసెన్స్ సెక్షన్ 341, సెక్షన్ 34 కింద కేసులు నమోదు చేశారు. బీఎస్పీ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించిన ప్రభుత్వ చర్యల్ని బీఎస్పీ స్టేట్ కోఆర్డినేటర్, మాజీ డీజీపీ పూర్ణచంద్రరావు, రాష్ట్ర అధ్యక్షులు బి.పరంజ్యోతి ఖండించారు. -
రాజకీయాల నుంచి వైదొలగడం లేదు: మాయావతి
లక్నో: తాను రాజకీయాల నుంచి వైదొలగనున్నట్లు వస్తున్న ప్రచారాన్ని బహుజన్ సమాజ్‌వాదీ పార్టీ (బీఎస్పీ) చీఫ్ మాయావతి ఖండించారు. తాను క్రియాశీలక రాజకీయాలకు దూరం అవుతున్నాననే వార్తలు పూర్తిగా అవాస్తవమని సోమవారం స్పష్టం చేశారు.తాను రాజకీయాల వైదొలగటం లేదని, కొన్ని మీడియా సంస్థలు ఇలాంటి తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్నాయని ఆరోపించారు. ఉద్దేశపూర్వంగా కొన్ని మీడియా సంస్థలు తనపై దుష్ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. చివరి శ్వాసవరకు తాను బీఎస్పీని ముందుకు తీసుకెళ్లటంలో పోరాటం కొనసాగిస్తానని అన్నారు.‘‘డాక్టర్. అంబేద్కర్, కాన్షీరామ్ వారసులైన బహుజనులను బలహీనపరిచే ప్రత్యర్థుల కుట్రలను తిప్పికొట్టడానికి నా చివరి శ్వాస వరకు ఆత్మగౌరవ ఉద్యమానికి అంకితం అవుతాను. క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకునే ప్రసక్తే లేదు. నేను అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు పార్టీని ఆకాష్ ఆనంద్ ముందుకు తీసుకువెళ్తారు. నాపై వస్తున్న అసత్య ప్రచారాలపై ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. కొన్ని మీడియా సంస్థలు ఇలాంటి తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్నాయి’’ అని ‘ఎక్స్’లో తెలిపారు. అయితే గత కొన్ని రోజులుగా మాయావతి రాజకీయాలకు దూరంగా ఉండనున్నారని వార్తలు వస్తున్నాయి.26-08-2024-BSP PRESS NOTE-SANYAS FAKE NEWS pic.twitter.com/nhbBIEJhUl— Mayawati (@Mayawati) August 26, 2024 -
ఆర్మ్‌స్ట్రాంగ్ హత్య కేసులో నిందితుడు ఎన్కౌంటర్
చెన్నై : పోలీసులు జరిపిన ఎన్కౌంటర్లో తమిళనాడు బీఎస్పీ అధ్యక్షుడు ఆర్మ్‌స్ట్రాంగ్ హత్య కేసులో నిందితుల్లో ఒకరైన తిరువేంగడం మరణించాడు. శనివారం సాయంత్రం చెన్నై పోలీసులు ఆర్మ్‌స్ట్రాంగ్ హత్య కోసం నిందితుడు తిరువేంగడం ఉపయోగించిన ఆయుధాలను స్వాధీనం చేసుకునేందుకు పోలీసులు నిందితుణ్ని ఘటనా స్థలానికి తీసుకెళ్లారు. అయితే అక్కడ లభ్యమైన గన్‌తో నిందితుడు పోలీసులపై కాల్పులు జరిపాడు. దీంతో ఆత్మరక్షణ నిమిత్తం పోలీసులు ఎదురు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో నిందితుడు తీవ్రంగా గాయపడ్డాడు.అత్యవసర చికిత్స కోసం పోలీసులు ఆస్పత్రికి తరలించగా.. నిందితుడు అప్పటికే మరణించినట్లు వైద్యులు నిర్ధారించారని చెన్నై పోలీస్ అధికారులు తెలిపారు. కొద్ది రోజుల క్రితం బీఎస్పీ తమిళనాడు అధ్యక్షుడు ఆర్మ్‌స్ట్రాంగ్ దారుణహత్యకు గుయ్యారు. చెన్నై పెరంబూర్‌లో నివాసం ఉంటున్న ఆయన శుక్రవారం రాత్రి ఇంటి ముందు నిలుచుని ఉన్నారు. అక్కడికి వచ్చిన ఆరుగురు వ్యక్తులు కత్తితో దాడిచేసి పారిపోయారు.స్థానికులు వెంటనే ఆయన్ను చికిత్స నిమిత్తం థౌజండ్‌లైట్స్‌లోని అపోలో ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందారు.ఈ దాడిపై సీబీఐ విచారణ జరిపించాలని బీఎస్పీ అధినేత్రి మాయావతి డిమాండ్ చేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు కాపాడాలని నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని, ముఖ్యంగా ముఖ్యమంత్రిని కోరుతున్నాను. ముఖ్యంగా బలహీన వర్గాలు సురక్షితంగా ఉండాలని, ప్రభుత్వం సీరియస్‌గా ఉంటే, నిందితులను అరెస్టు చేసి ఉండేవారు. అది లేదు కాదు కాబట్టి కేసును సీబీఐకి అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం’ అని ఆమె అన్నారు. -
Haryana: ఐఎన్ఎల్-బీఎస్పీ దోస్తీ.. అసెంబ్లీ ఎన్నికలకు కసరత్తు
చండీగఢ్: ఈ ఏడాది అక్టోబర్‌లో హర్యానాలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపధ్యంలో ఇండియన్ నేషనల్ లోక్ దళ్ (ఐఎన్ఎల్), బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) కలిసి పోటీ చేసేందుకు సిద్ధమయ్యాయి. చండీగఢ్‌లో ఇరు పార్టీల ప్రతినిధులు పొత్తును అధికారికంగా ప్రకటించారు.హర్యానాలోని మొత్తం 90 అసెంబ్లీ స్థానాల్లో ఐఎన్ఎల్ 53 స్థానాల్లో, బహుజన్ సమాజ్ పార్టీ 37 స్థానాల్లో పోటీ చేయనున్నాయి. ఈ పార్టీల మధ్య పొత్తు కుదరడం ఇది మూడోసారి. 1996 లోక్‌సభ ఎన్నికల సమయంలో ఈ రెండు పార్టీల మధ్య తొలి కూటమి ఏర్పడింది. 1996 లోక్‌సభ ఎన్నికల్లో బీఎస్పీ ఒక లోక్‌సభ స్థానాన్ని, ఐఎన్ఎల్డీ నాలుగు లోక్‌సభ స్థానాలను గెలుచుకున్నాయి.2018లోనూ ఐఎన్ఎల్, బీఎస్పీ కలిసి ఎన్నికల్లో పోటీ చేశాయి. ఇప్పుడు మళ్లీ 2024 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి ఇరు పార్టీలు ఒక్కటయ్యాయి. బీఎస్పీ అధినేత్రి మాయావతి, ఐఎన్ఎల్డీ ప్రిన్సిపల్ జనరల్ సెక్రటరీ అభయ్ చౌతాలా మధ్య గంటసేపు చర్చలు జరిగాయి. ఈ భేటీలో హర్యానాలో కూటమి ఏర్పాటుకు అంగీకారం కుదిరింది. హర్యానాలో బహుజన్ సమాజ్ పార్టీకి సంప్రదాయ ఓటు బ్యాంకు ఉంది. -
తమిళనాడు బీఎస్పీ చీఫ్ ఆర్మ్‌స్ట్రాంగ్ హత్యపై ప్రభుత్వం సీరియస్
చెన్నై : చెన్నైలో బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ)చీఫ్ కే.ఆర్మ్‌స్ట్రాంగ్ హత్యతో తమిళనాడు ప్రభుత్వం సీరియస్ అయ్యింది. చెన్నై పోలీస్ కమిషనర్ సందీప్ రాయ్ రాథోర్‌ను బదిలీపై వేటు వేసింది. చెన్నై అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ఏడీజీపీ లా అండ్ ఆర్డర్)గా ఉన్న అరుణ్‌ను కమిషనర్‌గా నియమించింది.ఇప్పటి వరకు చెన్నై పోలీస్ కమిషనర్‌గా ఉన్న సందీప్ రాయ్‌ని చెన్నై పోలీస్ ట్రైనింగ్ కాలేజీ డీజీపీగా ఎంపిక చేసింది. -
ఆర్మ్‌స్ట్రాంగ్ హత్య కేసు: సీబీఐ దర్యాప్తునకు మాయావతి డిమాండ్
చెన్నై: తమిళనాడు బహుజన్ సమాజ్‌వాదీ పార్టీ (బీఎస్పీ) చీఫ్ కే. ఆర్మ్‌స్ట్రాంగ్ గుర్తుతెలియని దుండగుల చేతిలో శుక్రవారం హత్యకు గురయ్యారు. ఆదివారం మాజీ సీఎం, బీఎస్పీ జాతీయ అధ్యక్షురాలు మాయావతి ఆర్మ్‌స్ట్రాంగ్ భౌతికకాయనికి నివాళులు అర్పించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. ఈ హత్య కేసులు పోలీసులు అరెస్ట్ చేసిన నిందితలు అసలైనవారు కాదని అన్నారు. హత్య కేసులో సీబీఐతో దర్యాప్తు జరిపించాలని ఆమె తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్‌ను డిమాండ్ చేశారు.#WATCH | Chennai, Tamil Nadu: BSP Chief Mayawati and party's National Coordinator, Akash Anand pay their last respects to Tamil Nadu BSP President K Armstrong.K Armstrong was hacked to death by a group of men near his residence in Perambur on 5 July. pic.twitter.com/4kQImXFYX9— ANI (@ANI) July 7, 2024 ఆర్మ్‌స్ట్రాంగ్ హత్య పట్ల మాయావతి ఆవేదన వ్యక్తం చేశారు. దుండగులు గుంపుగా వచ్చి ఆర్మ్‌స్ట్రాంగ్‌ను హత్య చేసిన తీరును గమనిస్తే.. తమిళనాడులో అసలు శాంతి భద్రతలు లేవనిపిస్తోందని అన్నారు. సీఎం ఎంకే స్టాలిన్ ఈ కేసును వెంటనే సీబీఐతో దర్యాప్తు చేయించి, న్యాయం అందించాంని డిమాండ్ చేశారు. రాష్ట్రం ప్రభుత్వం ఈ కేసులో తమకు న్యాయం చేస్తుందనే నమ్మకం లేదని తెలిపారు. ఆర్మ్‌స్ట్రాంగ్ ఘటనతో రాష్ట్రంలో దళితలు అభద్రతాభావంతో తీవ్రంగా ఆందోళన పడుతున్నారని అన్నారు. ఈ ఘటనను బీఎస్పీ చాలా సీరియస్‌గా తీసుకుంది. కానీ, పార్టీ కార్యకర్తలు చట్టాన్ని చేతిలోకి తీసుకోకూడదని అన్నారు.బహుజన్ సమాజ్‌వాదీ పార్టీ (బీఎస్పీ) తమిళనాడు రాష్ట్ర అధ్యక్షుడు చీఫ్ కె ఆర్మ్‌స్ట్రాంగ్ (47) గుర్తు తెలియని వ్యక్తుల చేతుల్లో దారుణ హత్యకు గురుయ్యారు. చెన్నై పెరంబూర్ ప్రాంతంలో శుక్రవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. బైకుల మీద వచ్చిన కొందరు దుండగులు ఆర్మ్‌స్ట్రాంగ్‌పై కత్తులతో దాడి చేశారు. ఆ టైంలో ఆయన వెంట ఉన్న మరో ఇద్దరిని కూడా గాయపరిచారు. వెంటనే ఆయన్ను స్థానిక రాజీవ్ గాంధీ జనరల్ ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే ఆయన మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. -
తమిళనాడు బీఎస్పీ చీఫ్ ఆర్మ్‌స్ట్రాంగ్ దారుణ హత్య
చెన్నై: బహుజన్ సమాజ్‌వాదీ పార్టీ (బీఎస్పీ) తమిళనాడు రాష్ట్ర అధ్యక్షుడు చీఫ్ కె ఆర్మ్‌స్ట్రాంగ్ ( 47) గుర్తు తెలియని వ్యక్తుల చేతుల్లో దారుణ హత్యకు గురుయ్యారు. చెన్నై పెరంబూర్ ప్రాంతంలో శుక్రవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. బైకుల మీద వచ్చిన కొందరు దుండగులు ఆర్మ్‌స్ట్రాంగ్‌పై కత్తులతో దాడి చేశారు. ఆ టైంలో ఆయన వెంట ఉన్న మరో ఇద్దరిని కూడా గాయపరిచారు. వెంటనే ఆయన్ను స్థానిక రాజీవ్ గాంధీ జనరల్ ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే ఆయన మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. ఈ ఘటన స్థానికంగా అలజడి సృష్టించింది.దాడి ఆయన ఇంటికి సమీపంలోనే చోటు చేసుకుందని సెంబియమ్ పోలీసులు తెలిపారు. ఫుడ్ డెలివరీ బాయ్స్ గెటప్‌లు వేసుకొచ్చారని, పార్టీ కార్యకర్తలతో ఆయన మాట్లాడుతుండగానే కత్తులతో దాడి చేశారని ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాన్ని పోలీసులు మీడియాకు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. మరోవైపు.. ఆర్మ్‌స్టాంగ్ హత్యకేసులో శనివారం వేకువజామున పోలీసులు 8 మంది అనుమానితుల్ని అరెస్ట్ చేశారు. హత్యకు రాజకీయ వైరమా? వ్యక్తిగత కక్షలా? అన్నది తేలాల్సి ఉంది. ఈ హత్యను రాజకీయ వర్గాలు ఖండిస్తున్నాయి. ఆయన మృతిపై పలువురు నేతలు సంతాపం తెలియజేస్తున్నారు. ఆర్మ్‌స్ట్రాంగ్ హత్యను ఖండించిన బీఎస్పీ చీఫ్ మాయావతికె ఆర్మ్‌స్ట్రాంగ్ హత్యపై బీఎస్పీ చీఫ్ మాయావతి స్పందించారు. ‘ఆర్మ్‌స్ట్రాంగ్ హత్యను తీవ్రంగా ఖండిస్తున్నా. ఆయన్ను గుర్తుతెలియని దుండగులు హత్య చేయటం విచారకరం. ఆయన వృత్తిరీత్యా అడ్వకేట్‌గా పనిచేశారు. తమిళనాడులో బలమైన దళిత నాయకుడిగా తన గళాన్ని వినిపించేవారు. నిందితులను ప్రభుత్వం శిక్షించాలి’ అని ‘ఎక్స్’వేదికగా స్పందించారు. మరోవైపు.. రాష్ట్రంలో శాంతి భద్రతలు దెబ్బతిన్నాయని ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి.The gruesome killing of Mr. K. Armstrong, Tamil Nadu state Bahujan Samaj Party (BSP) president, outside his Chennai house is highly deplorable and condemnable. An advocate by profession, he was known as a strong Dalit voice in the state. The state Govt. must punish the guilty.— Mayawati (@Mayawati) July 5, 2024 -
ఆకాష్‌పై అలక వీడిన మాయావతి
మేనల్లుడు ఆకాష్ ఆనంద్‌పై బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్పీ) జాతీయ అధ్యక్షురాలు మాయావతి అలక వీడాడు. ఆమె తాజాగా ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో జాతీయ కార్యవర్గ సమావేశం నిర్వహించారు. దీనికి హాజరైన ఆమె మేనల్లుడు ఆకాష్ అత్త మాయావతి పాదాలను తాకి, ఆశీర్వదించాలని కోరారు. దీంతో ఆమె ఆనందంతో పొంగిపోతూ ఆకాష్ తలపై చేయివుంచి, నిండుగా ఆశీర్వదించారు.అలాగే మాయావతి ఆకాష్ వీపు తడుతూ ఇకపై జాగ్రత్తగా ఉండు అనేలా సంకేతమందించారు. దీనికితోడు అతనిని రాబోయే ఉత్తరాఖండ్, పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు స్టార్ క్యాంపెయినర్‌గా ఎంపిక చేశారు. ఆకాష్ ఆనంద్ బీఎస్పీ మాజీ జాతీయ సమన్వయకర్త.గతంలో మాయావతి ఆకాష్ ఆనంద్‌ను తన వారసునిగా ప్రకటిస్తూ యూపీ, ఉత్తరాఖండ్ మినహా ఇతర రాష్ట్రాల్లో పార్టీని బలోపేతం చేసే బాధ్యతను అప్పగించారు. అయితే ఆకాష్ ఎన్నికల సమయంలో సీతాపూర్‌లో వివాదాస్పద ప్రసంగం చేయడంతో అతనిని జాతీయ సమన్వయకర్త పదవి నుంచి తప్పించారు. అయితే ఇది జరిగిన రెండు నెలల తర్వాత ఆమె ఆకాష్‌పై అలకవీడి స్టార్ క్యాంపెయినర్‌గా ఎంపికచేసి, పార్టీలో తగిన స్థానం కల్పించారు. #WATCH | Former Uttar Pradesh CM and BSP chief Mayawati holds a meeting with party workers in Lucknow. pic.twitter.com/b5bBrDlesv— ANI (@ANI) June 23, 2024 -
ఆప్ ఎమ్మెల్యే రాజ్‌కుమార్ ఆనంద్‌పై అనర్హత వేటు
సాక్షి, ఢిల్లీ: ఆప్ ఎమ్మెల్యే రాజ్‌కుమార్ ఆనంద్‌పై అనర్హత వేటు పడింది. బీఎస్పీ తరపున ఎంపీ ఎన్నికల్లో పోటీ చేసిన రాజ్‌కుమార్.. విచారణకు హాజరుకావాలని స్పీకర్ ఆదేశించారు. విచారణకు హాజరుకాకపోవడంతో రాజ్‌కుమార్ అసెంబ్లీ సభ్యత్వంపై అనర్హత వేటు వేసినట్టు స్పీకర్ రామ్ నివాస్ గోయెల్ శుక్రవారం తెలిపారు. జూన్ 11న విచారణకు హాజరుకావాలని నోటీస్ ఇచ్చినా కానీ ఆయన హాజరుకాలేదని గోయెల్ పేర్కొన్నారు. మరోసారి జూన్ 14న హాజరుకావాలని ఆదేశించినా స్పందించలేదన్నారు. ఈ క్రమంలో ఆయన అసెంబ్లీ సభ్యత్వాన్ని రద్దు చేసినట్టు స్పీకర్ తెలిపారు.'ఆప్' సారథ్యంలోని ఢిల్లీ ప్రభుత్వంలో పలు మంత్రిత్వ శాఖలను రాజ్‌కుమార్ ఆనంద్ నిర్వహించారు. అరవింద్ కేజ్రీవాల్ సారథ్యంలోని ఆమ్ ఆద్మీ పార్టీ దళితులకు సరైన ప్రాతినిధ్యం ఇవ్వడం లేదని ఆరోపిస్తూ.. గత ఏప్రిల్‌లో మంత్రి పదవికి రాజీనామా చేశారు. అనంతరం ఆమ్ ఆద్మీ పార్టీని కూడా వీడారు. ఆప్‌లోని దళిత ఎమ్మెల్యేలు, మంత్రులు, కౌన్సిలర్లకు ఎలాంటి గౌరవం ఇవ్వడం లేదంటూ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన ఆయన.. గత మేలో బీఎస్పీలో చేరారు. బీఎస్పీ తరఫున ఎంపీ ఎన్నికల్లో రాజ్‌కుమార్ పోటీ చేశారు. -
మాయావతి పార్టీ మరో లిస్ట్..
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో జరుగుతున్న లోక్‌సభ ఎన్నికలకు బహుజన్ సమాజ్ పార్టీ గురువారం మరో ఇద్దరు అభ్యర్థులను ప్రకటించింది. బీఎస్పీ ప్రకటించిన అభ్యర్థుల 14వ జాబితా ఇది.ఖుషీనగర్ లోక్‌సభ స్థానం నుంచి శుభ్ నారాయణ్ చౌహాన్‌ను, డియోరియా లోక్‌సభ స్థానం నుంచి సందేశ్ యాదవ్‌ను తమ అభ్యర్థులుగా బరిలోకి దింపుతున్నట్లు బహుజన్ సమాజ్ పార్టీ ఇక్కడ ఒక ప్రకటనలో తెలిపింది.ఖుషీనగర్, డియోరియా లోక్‌సభ స్థానాలకు జూన్ 1న చివరి దశలో ఎన్నికలు జరగనున్నాయి. జూన్ 4న ఓట్ల లెక్కింపు జరగనుంది. జాన్పూర్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి తెలుగు మహిళ శ్రీకళా రెడ్డికి తొలుత అవకాశమిచ్చిన మాయావతి పార్టీ తర్వాత అభ్యర్థిని మార్చి షాకిచ్చింది. ఆమె నామినేషన్ దాఖలు చేసినప్పటికీ సిట్టింగ్ ఎంపీ శ్యామ్ సింగ్ యాదవ్‌కు బీఎస్పీ బీ-ఫారం ఇచ్చింది. -
Mayawati: మేనత్త నిర్ణయంపై పెదవి విప్పిన ఆకాష్ ఆనంద్
లక్నో: తన మేల్లుడైన ఆకాశ్ ఆనంద్‌ను రాజకీయ వారసుడిగా, పార్టీ జాతీయ కో-ఆర్డినేటర్ పదవి నుంచి బీఎస్పీ అధినేత్రి మాయావతి బుధవారం తొలగించారు. ఈ తొలగింపుపై తాజాగా గురువారం ‘ఎక్స్’ వేదికగా ఆకాష్ ఆనంద్ స్పందించారు. ‘బీఎస్పీ చీఫ్ మాయావతి.. బహుజన సమాజానికి రోల్ మోడల్. బహుజనలు అంటే.. దళితులు, ఎస్టీలు, ఓబీసీలు. మీ పోటం వల్లనే నేడు బహుజన సమాజానికి ఇంత రాజకీయం బలం చేకూరింది. బహుజన సమాజం గౌరవంగా బ్రతకటం నేర్చుకుంది. మీరే మా అధినేత్రి. నా కడ శ్వాస వరకు భీమ్ మిషన్, బహుజన సమాజం కోసం పోరాడతాను’’ అని ఆకాష్ ఆనంద్ ‘ఎక్స్’లో తెలిపారు.ఇక.. ఇటీవల ఆకాశ్ ఆనంద్ బీజేపీపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆకాశ్ రాజకీయంగా పరిణతి సాధించే వరకు అన్ని బాధ్యతల నుంచి దూరంగా ఉంచుతున్నట్లు మాయావతి ప్రకటించారు. ఇటీవల ఓ ఎన్నికల ప్రచార ర్యాలీలో ఆకాశ్ మాట్లాడుతూ యూపీలోని బీజేపీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. బీజేపీ ప్రభుత్వాన్ని బుల్డోజర్ గవర్నమెంట్‌గా అభివర్ణించారు.आदरणीय बहन @mayawati जी, आप पूरे बहुजन समाज के लिए एक आदर्श हैं, करोड़ों देशवासी आपको पूजते हैं। आपके संघर्षों की वजह से ही आज हमारे समाज को एक ऐसी राजनैतिक ताक़त मिली है जिसके बूते बहुजन समाज आज सम्मान से जीना सीख पाया है। आप हमारी सर्वमान्य नेता हैं। आपका आदेश सिर माथे पे।…— Akash Anand (@AnandAkash_BSP) May 9, 2024 రాష్ట్రంలోని యువతను ఆకలితో ఉంచుతూ, పెద్దలను బానిసలుగా మార్చుకుంటోందని అన్నారు. ఆయన చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన ఈసీ అధికారులు ఎన్నికల నియమావళి ఉల్లంఘన కింద నోటీసులు అందజేశారు. ఆకాశ్‌తో పాటు ర్యాలీ నిర్వహించిన మరో ముగ్గురిపై కూడా కేసు నమోదు చేశారు. దీంతో ఆకాశ్‌కు సంబంధించిన అన్ని ర్యాలీలను బీఎస్పీ రద్దు చేసింది.2023 డిసెంబరులో మాయావతి తన రాజకీయ వారసుడిగా ఆకాశ్‌ను ప్రకటించిన విషయం తెలిసిందే. మాయావతి తమ్ముడి కుమారుడైన ఆకాశ్ లండన్‌లో ఎంబీఏ చదివారు. ఇక.. 2017లో బీఎస్పీలో చేరారు. అనంతరం 2019 లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ తరఫున ప్రచారం చేశారు. పార్టీలో మాయావతి తర్వాత అత్యధిక ప్రాధాన్యం కలిగిన వ్యక్తిగా గుర్తింపు తెచ్చుకున్నారు. -
ఎన్నికల బరిలోకి 'జస్వీర్ సింగ్ గర్హి'.. అక్కడ నుంచే పోటీ
చండీగఢ్: ఇప్పటికే దేశంలో పలుచోట్ల రెండు దశల్లో ఓటింగ్ ప్రక్రియ పూర్తయింది. ఇంకా ఐదు దశల్లో ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ తరుణంలో బిఎస్పీ శనివారం ఆనంద్‌పూర్ సాహిబ్ పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి తన అభ్యర్థిగా పంజాబ్ యూనిట్ చీఫ్ 'జస్వీర్ సింగ్ గర్హి'ని బరిలోకి దింపింది.జస్వీర్ సింగ్ గర్హిని బరిలోకి దింపుతున్నట్లు పంజాబ్, హర్యానా, చండీగఢ్‌ల బీఎస్పీ ఇంచార్జి రణధీర్ సింగ్ బెనివాల్ ప్రకటించారు. దీంతో పార్టీ మొత్తం 13 లోక్‌సభ స్థానాలకు బీఎస్పీ అభ్యర్థులను ప్రకటించింది.ఆనంద్‌పూర్ సాహిబ్ స్థానానికి ప్రస్తుతం చండీగఢ్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసిన కాంగ్రెస్ ఎంపీ మనీష్ తివారీ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే ఇప్పుడు గర్హి ఆప్‌కి చెందిన మల్విందర్ కాంగ్, కాంగ్రెస్‌కు చెందిన విజయ్ ఇందర్ సింగ్లా, శిరోమణి అకాలీదళ్‌కు చెందిన ప్రేమ్ సింగ్ చందుమజ్రాతో తలపడనున్నారు. బీజేపీ తన అభ్యర్థిని ఇంకా ప్రకటించలేదు. పంజాబ్‌లోని 13 లోక్‌సభ స్థానాలకు జూన్ 1న పోలింగ్ జరగనుంది. -
బీజేపీ నేత కొడుక్కి బీఎస్పీ టికెట్
లక్నో: ఉత్తర ప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తికరమైన పరిణామం చోటు చేసుకుంది. మాయావతి నేతృత్వంలోని బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ నేత కుమారుడికి టికెట్ ఇచ్చింది. ప్రతాప్‌గఢ్ పార్లమెంట్ స్థానం నుంచి సుప్రీంకోర్టు న్యాయవాది ప్రథమేష్ మిశ్రాను పోటీకి దింపాలని నిర్ణయించింది.ప్రథమేష్ పొరుగున ఉన్న కౌశాంబి పార్లమెంటరీ నియోజకవర్గానికి భారతీయ జనతా పార్టీ లోక్‌సభ ఎన్నికల ఇంచార్జి అయిన శివ ప్రకాష్ మిశ్రా సేనాని కుమారుడు. పల్టాన్ బజార్‌కు చెందిన శివ ప్రకాష్ మిశ్రా సేనాని గతంలో బీఎస్పీలో ఉన్నారు. 1999, 2007, 2012లో కుందా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి, 2004లో ప్రతాప్‌గఢ్ లోక్‌సభ స్థానం నుంచి బీఎస్పీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఆయన భార్య సింధూజా మిశ్రా సేనాని కూడా 2012లో విశ్వనాథ్‌గంజ్ నుంచి బీఎస్పీ అభ్యర్థిగా, 2022లో కుందా నుంచి బీజేపీ అభ్యర్థిగా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు.ఇక ప్రథమేష్ విషయానికి వస్తే సుప్రీంకోర్టులో న్యాయవాది అయిన ఆయన క్రియాశీల రాజకీయాల్లోకి రావడం ఇదే తొలిసారి. ప్రతాప్‌గఢ్‌లో సిట్టింగ్ ఎంపీగా ఉన్న బీజేపీకి చెందిన సంగం లాల్ గుప్తా, సమాజ్‌వాదీ పార్టీ టిక్కెట్‌పై ‘ఇండియా’ కూటమి అభ్యర్థిగా బరిలోకి దిగిన ఎమ్మెల్సీ ఎస్పీ సింగ్ పటేల్‌పై ఆయన పోటీ చేస్తున్నారు. బీఎస్పీ నుంచి ఎన్నికల్లో పోటీ చేయాలన్నది తన కుమారుడి నిర్ణయమని, తాను మాత్రం బీజేపీలోనే ఉంటానని ప్రథమేష్ తండ్రి శివప్రకాశ్ మిశ్రా సేనాని స్పష్టం చేశారు. -
వారణాసిలో మోదీ ప్రత్యర్థి.. ఎవరీ 'అథర్ జమాల్ లారీ'?
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మాయావతి నేతృత్వంలోని బీఎస్పీ పార్టీ 2024 లోక్‌సభ ఎన్నికలకు 11 మంది అభ్యర్థులతో కూడిన జాబితాను మంగళవారం విడుదల చేసింది. ఇందులో భారత ప్రధాని మోదీకి ప్రత్యర్థిగా వారణాసి నుంచి 'అథర్ జమాల్ లారీ'ని రంగంలోకి దించారు. ఇంతకీ అథర్ జమాల్ లారీ ఎవరు? ఆయన బ్యాగ్రౌండ్ ఏంటి అనే వివరాలు వివరంగా ఇక్కడ తెలుసుకుందాం. వారణాసిలో జూన్ 1న లోక్‌సభ ఎన్నికల పోలింగ్ జరగనుంది. వారణాసి నరేంద్ర మోదీకి కంచుకోట. ఇప్పటికే 2014, 2019 లోక్‌సభ ఎన్నికల్లో రెండుసార్లు విజయం సొంతం చేసుకున్నారు. ఇప్పుడు మరోమారు వారణాసి నుంచే ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. అథర్ జమాల్ లారీ (Athar Jamal Lari) ఎవరు? అథర్ జమాల్ లారీ వారణాసికి చెందిన స్థానిక వ్యక్తి. ఈయన 1980 నుంచి రాజీకీయాల్లో చురుకుగా పాల్గొంటున్నారు. ప్రస్తుతం బీఎస్పీ పార్టీలో ఉన్న అథర్ జమాల్.. ఇంతకు ముందు జనతాదళ్, సమాజ్‌వాదీ పార్టీ, అప్నా దళ్, క్వామీ ఏక్తా దళ్‌తో సహా అనేక రాజకీయ పార్టీలతో కలిసి పనిచేశారు. లారీ గతంలో జరిగిన ఎన్నికల్లో పోటీ చేసి మూడుసార్లు అసెంబ్లీ ఎన్నికల్లో.. రెండుసార్లు లోక్‌సభ ఎన్నికల్లో విఫలమయ్యారు. వారణాసి లోక్‌సభ స్థానం నుంచి అథర్ జమాల్ పోటీ చేయడం ఇదే మొదటిసారి కాదు. 1984లో మొదటిసారి యూపీ స్థానం నుంచి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేశారు. ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన శ్యామ్‌లాల్ యాదవ్ విజయం సాధించగా.. లారీ 50329 ఓట్లను పొందారు. 2004 లోక్‌సభ ఎన్నికలలో వారణాసిలో మళ్లీ తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. అప్పుడు కూడా గెలువలేకపోయారు. 93228 ఓట్లతో మూడోస్ స్థానంలో నిలిచారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజేష్ కుమార్ మిశ్రా ఈ స్థానంలో గెలుపొందారు. 1991, 1993లో జనతాదళ్ టిక్కెట్‌పై వారణాసి కాంట్ స్థానం నుంచి ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేసి ఓటమిపాలయ్యారు. 2022లో యూపీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు లారీ సమాజ్‌వాదీ పార్టీలో చేరారు. ముస్లిం కమ్యూనిటీ నుంచి మద్దతు ఆశించి వారణాసి స్థానంలో లారీని బీఎస్పీ రంగంలోకి దింపిందని పలువురు భావిస్తున్నారు. ఈ నియోజకవర్గంలో మూడు లక్షల మంది ఓటర్లు ఉన్నారు. ఇదే అంచనాలతో మాయావతి 2009లో బీజేపీ అభ్యర్థి మురళీ మనోహర్ జోషిపై.. ముఖ్తార్ అన్సారీని రంగంలోకి దించారు. కానీ గెలుపొందలేకపోయారు. అయితే త్వరలో జరగనున్న ఎన్నికల్లో గెలుపోటములు ఎవరివనేది తెలుస్తుంది. Uttar Pradesh: BSP announced the names of 11 more candidates for Lok Sabha elections The Mainpuri Lok Sabha ticket has been changed and given to Shiv Prasad Yadav. Athar Jamal Lari has been fielded from Varanasi against PM Modi. pic.twitter.com/qSGERi22ik — ANI UP/Uttarakhand (@ANINewsUP) April 16, 2024 -
‘మేం గెలిస్తే ప్రత్యేక రాష్ట్రం’
లక్నో: తాము కేంద్రంలో అధికారంలోకి వస్తే పశ్చిమ ఉత్తరప్రదేశ్‌ను ప్రత్యేక రాష్ట్రంగా మార్చేందుకు తమ పార్టీ గట్టి చర్యలు తీసుకుంటుందని బహుజన్ సమాజ్ పార్టీ (BSP) అధినేత్రి మాయావతి ప్రకటించారు. ముజఫర్‌నగర్ లోక్‌సభ స్థానం బీఎస్పీ అభ్యర్థి దారా సింగ్ ప్రజాపతికి మద్దతుగా మాయావతి ప్రచారం నిర్వహించారు. ఇక్కడ జరిగిన ర్యాలీని ఉద్దేశించి మాయావతి మాట్లాడుతూ బీజేపీకి మళ్లీ అధికారంలోకి వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయన్నారు. "పశ్చిమ ఉత్తరప్రదేశ్ ప్రత్యేక రాష్ట్రం కావాలని మీరు కోరుకుంటున్నారు. ఇందుకోసం కేంద్రంలో మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటాం" అని మాయావతి చెప్పారు. స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిగి ఓటింగ్ యంత్రాలను తారుమారు చేయకుంటే ఈసారి బీజేపీ అధికారంలోకి రాదని బీఎస్పీ చీఫ్ అన్నారు. ముజఫర్‌నగర్‌లో బీజేపీ నుంచి సంజీవ్ కుమార్ బల్యాన్, సమాజ్ వాదీ పార్టీ నుంచి హరేంద్ర సింగ్ మాలిక్ పోటీ చేస్తున్నారు. ఇక్కడ తన ర్యాలీకి ముందు, మాయావతి సహరాన్పూర్ జిల్లాలో జరిగిన బహిరంగ సభలో కూడా ప్రసంగించారు. ఉత్తరప్రదేశ్‌లోని సహరాన్పూర్, కైరానా, ముజఫర్‌నగర్, బిజ్నోర్, నగీనా, మొరాదాబాద్, రాంపూర్, పిలిభిత్‌లలో మొత్తం ఎనిమిది పార్లమెంట్ నియోజకవర్గాలకు ఏప్రిల్ 19న మొదటి దశ ఎన్నికల పోలింగ్ జరగనుంది. జూన్ 4న ఓట్ల లెక్కింపు జరుగుతుంది. -
‘నా భార్య కాంగ్రెస్.. ఇంటికి వెళ్లను’ ఓ అభ్యర్థి కఠిన నిర్ణయం
భోపాల్: ఈ సార్వత్రిక ఎన్నికలు భార్యాభర్తల మధ్య ఎడబాటును కలిగిస్తున్నాయి. మధ్యప్రదేశ్‌లోని బాలాఘాట్ లోక్‌సభ స్థానం నుంచి బీఎస్పీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కంకర్ ముంజరే తాత్కాలికంగా ఇంటిని వీడి బయటకు వచ్చేశారు. ఎన్నికలు పూర్తయ్యే వరకూ ఇంట్లో అడుగు పెట్టను అని కఠిన నిర్ణయం తీసుకున్నారు. తన ఇంటిని విడిచిపెట్టి బయటకు వచ్చేశానని బీఎస్పీ అభ్యర్థి కంకర్ ముంజరే శనివారం తెలిపారు. తన తన భార్య, కాంగ్రెస్ ఎమ్మెల్యే అనుభా ముంజరే అక్కడ ఉంటున్నారని, ఇద్దరు వ్యక్తులు వేర్వేరు సిద్ధాంతాలను అనుసరిస్తున్నప్పుడు ఒకే పైకప్పు కింద ఉండకూడదని అన్నారాయన. ఏప్రిల్ 19న పోలింగ్ రోజు తర్వాతే ఇంటికి తిరిగి వెళ్తానని మాజీ ఎమ్మెల్యే, ఎంపీ కంకర్ ముంజరే చెప్పారు. "నేను శుక్రవారం నా ఇంటి నుంచి బయటకు వచ్చేశాను. ఆనకట్ట సమీపంలో ఒక గుడిసెలో నివసిస్తున్నాను. వేర్వేరు భావజాలాన్ని అనుసరించే ఇద్దరు వ్యక్తులు ఒకే పైకప్పు కింద నివసిస్తుంటే, అది మ్యాచ్ ఫిక్సింగ్ అని ప్రజలు భావిస్తారు ” అని ఆయన పీటీఐతో తెలిపారు. 2023 అసెంబ్లీ ఎన్నికలలో ఆయన భార్య అనుభా ముంజరే బీజేపీ అభ్యర్థి గౌరీశంకర్ బిసెన్‌ను ఓడించారు. అయితే తన భర్త నిర్ణయంతో బాధపడ్డానని, పెళ్లి అయి మెట్టినింటికి వెళ్లిన మహిళ చనిపోయే వరకు అక్కడే ఉంటుందని అనుభా ముంజరే చెబుతున్నారు. గతంలో ఆయన ఇక్కడి పరస్వాడ నుండి గోండ్వానా గంతంత్ర పార్టీ అభ్యర్థిగా ఉన్నప్పుడు, తాను కాంగ్రెస్ టిక్కెట్‌పై బాలాఘాట్ నుండి పోటీ చేసినప్పుడు తాము కలిసే ఉన్నామని తెలిపారు. తాను నమ్మకమైన కాంగ్రెస్ కార్యకర్తనని, బాలాఘాట్ నుంచి లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి సామ్రాట్ సరస్వత్ విజయానికి కృషి చేస్తానని అనుభా ముంజరే పేర్కొన్నారు. -
Lok sabha elections 2024: మ్యాచ్ ఫిక్సింగ్ అంటారని..
బాలాఘాట్: అనుభా ముంజారే మధ్యప్రదేశ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే. ఈమె భర్త కంకర్ ముంజారే గతంలో ఎమ్మెల్యే, ఎంపీగా ఎన్నికయ్యారు. తాజాగా బాలాఘాట్ లోక్‌సభ స్థానానికి బీఎస్పీ అభ్యరి్థ. తామిద్దరి మధ్య సిద్ధాంత వైరుధ్యాలు ఉన్నందున ఒకే ఇంట్లో ఉండలేకపోతున్నానంటూ కంకర్ ముంజారే ఓ విచిత్ర నిర్ణయం తీసుకున్నారు. ‘భిన్న సిద్ధాంతాలు కలిగిన పారీ్టల్లో కొనసాగుతూ ఇద్దరం ఒకే చోట ఉంటే మ్యాచ్ ఫిక్సింగ్ అని అందరూ మమ్మల్ని అనుమానిస్తారు. అందుకే శుక్రవారం నుంచి వేరే చోట ఓ గుడిసెలో ఉంటున్నాను. ఎన్నికల పోలింగ్ రోజున ఏప్రిల్ 19వ తేదీన తిరిగి మా ఇంటికి వెళ్తా’అని ఆయన తెలిపారు. భర్త నిర్ణయం తనను బాధిస్తోందని అనుభ చెప్పారు. ‘గతంలో ఆయన గోండ్వానా గణతంత్ర పార్టీ తరఫున పారస్వాడ స్థానానికి, నేను బాలాఘాట్‌లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసినప్పుడు కూడా ఒకే ఇంట్లో ఉన్నాం. పెళ్లైనప్పటి నుంచి 33 ఏళ్లుగా కుమారుడితోపాటు కలిసే సంతోషంగా ఉంటున్నాం’అని ఆమె అన్నారు. కాంగ్రెస్ తరఫున ఎన్నికల ప్రచారంలో భర్త కంకర్పై విమర్శలు చేయబోనన్నారు. కాగా, 2023 నవంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బాలాఘాట్‌లో బీజేపీ సీనియర్ నేత గౌరీశంకర్ బిసెన్పై అనుభా ముంజారే ఘన విజయం సాధించారు. -
బీఎస్పీ అభ్యర్థికి గుండెపోటు
బహుజన్ సమాజ్ పార్టీ అలీగఢ్ అభ్యర్థి గుఫ్రాన్ నూర్ గుండెపోటుకు గురై ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం ఆయనకు చికిత్స జరుగుతోంది. విషయం తెలిసిన వెంటనే బీఎస్పీ కార్యకర్తలు ఆస్పత్రికి చేరుకున్నారు. తన తండ్రి ఇప్పటికే హార్ట్ పేషెంట్ అని, ఆయన ఆరోగ్యం క్షీణించడంతో ఐసీయూలో చేర్చినట్లు గుఫ్రాన్ నూర్ కుమారుడు ఆదిల్ తెలిపారు. బీఎస్పీ రెండు రోజుల క్రితం గుఫ్రాన్ నూర్‌ను అభ్యర్థిగా ప్రకటించింది. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎంపీ బాబు ముంకద్ అలీ.. గుఫ్రాన్ నూర్ అభ్యర్థిత్వాన్ని వెల్లడించారు. కాగా బీఎస్పీ అలీగఢ్ లోక్‌సభ నియోజకవర్గ అభ్యర్థిని మార్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, పార్టీ మాత్రం ఇంకా దీన్ని ధ్రువీకరించలేదు. 2012లో గుఫ్రాన్ నూర్ బరౌలీ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి క్వామీ ఏక్తా దళ్ టిక్కెట్‌పై అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు. 2023లో జరిగిన మేయర్ ఎన్నికల్లో ఎంఐఎం నుంచి పోటీ చేశారు. -
UP: సింగిల్‌గా పోటీ.. ఫస్ట్ లిస్ట్ ప్రకటించిన మాయావతి
బహుజన్ సమాజ్ పార్టీ (BSP) ఉత్తరప్రదేశ్‌లోని 80 లోక్‌సభ స్థానాలకు గాను తొలివిడతలో 16 స్థానాలకు అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. పొత్తు పుకార్లను కొట్టిపారేస్తూ బీఎస్పీ అధినేత్రి మాయావతి వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో తాము స్వతంత్రంగానే పోటీ చేయాలని నిర్ణయించారు. బీఎస్పీ తొలి విడత జాబితాలో ఉత్తరప్రదేశ్‌లోని సహారన్పూర్, కైరానా, ముజఫర్‌నగర్, బిజ్నౌర్, నగీనా, మురాదాబాద్, రాంపూర్, సంభాల్, అమ్రోహా, మీరట్, బాగ్పట్ స్థానాలతో సహా 16 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఈ రాష్ట్రంలో మొత్తం 80 లోక్ సభ నియోజకవర్గాలు ఉన్నాయి. సహరాన్పూర్ నుంచి మాజిద్ అలీ, కైరానా నుంచి శ్రీపాల్ సింగ్, ముజఫర్‌నగర్ నుంచి దారా సింగ్ ప్రజాపతి, బిజ్నోర్ నుంచి విజయేంద్ర సింగ్, నాగినా (ఎస్సీ స్థానం) నుంచి సురేంద్ర పాల్ సింగ్, మొరాదాబాద్ నుంచి మహ్మద్ ఇర్ఫాన్ సైఫీలను బరిలోకి దించింది. ఇక రాంపూర్ నుంచి జిషాన్ ఖాన్, సంభాల్ నుంచి షౌలత్ అలీ, అమ్రోహా నుంచి మొజాహిద్ హుస్సేన్, మీరట్ నుంచి దేవవ్రత్ త్యాగి, బాగ్పత్ నుంచి ప్రవీణ్ బన్సాల్‌లకు బీఎస్పీ టికెట్ ఇచ్చింది. గౌతమ్ బుద్ధ నగర్ నుంచి రాజేంద్ర సింగ్ సోలంకి, బులంద్‌షహర్ (ఎస్సీ స్థానం) నుంచి గిరీష్ చంద్ర జాతవ్, అయోన్లా నుంచి అబిద్ అలీ, పిలిభిత్ నుంచి అనిస్ అహ్మద్ ఖాన్ అలియాస్ ఫూల్ బాబు, షాజహాన్‌పూర్ (ఎస్సీ) నుంచి దోదరం వర్మ బరిలోకి దిగనున్నారు. -
కాంగ్రెస్‌లో చేరిన బీఎస్పీ సస్పెండెడ్ ఎంపీ
లక్నో:పార్లమెంట్ ఎన్నికల వేళ పలువురు కీలక నేతలు, ఎంపీలు, మాజీ ఎంపీలు పార్టీలు మారుతూ రాజకీయ వేడిని పెంచుకుతున్నాయి. తాజాగా సస్పెండెడ్ బీఎస్పీ ఎంపీ డానిష్ అలీ కాంగ్రెస్ పార్టీ చేరారు. ఐదు రోజుల కింద డానిష్ అలీ కాంగ్రెస్ సీనియర్ నేత సోనియా గాంధీని కలిసి ఆమె ఆశీర్వాదం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే ఆరోజు నుంచే ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరతారని ఊహాగానాలు ఉచ్చాయి. అనుకున్నట్టుగానే ఆయన బుధవారం కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఇక.. ఆయన అమ్రోహా లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్ తరఫున బరిలోకి దిగుతారని వార్తలు వచ్చాయి. అయితే ఈ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) నుంచి సీట్ల పంపణీలో పొందినట్లు తెలుస్తోంది. రాహుల్‌గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ యాత్రలో డానిష్ అలీ జనవరిలో మణిపూర్‌లో పాల్గొన్నారు. ఆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...‘ ఈ సందర్భంగా నాకు చాలా ముఖ్యమైంది. ఇక్కడ రావటంతో నా మనసు కుదుటపడింది. నాకు రెండు మార్గాలు ఉన్నాయి. నాలో మార్పు లేకుండా దళితులు, వెనబడిన, గిరిజన, మైనార్టీలు, పేదల దోపిడీని విస్మరించడం. లేదా.. దేశంలో భయం, ద్వేషం, దోపిడడీ, విభజన వాతావరణానికి వ్యతిరేకంగా ప్రచారం ప్రారంభించటం’ అని డానిష్ అన్నారు. మరోవైపు.. ‘కాంగ్రెస్ నేతలతో సన్నిహతంగా ఉంటుంన్నారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. పార్టీలో చేరే సమయంలో ఇచ్చిన హామీలు మరచిపోయారు. ఆ కారణంగా డానిష్ అలీని సస్పెండ్ చేస్తున్నాం’ బీఎస్పీ గతేడాది ఆయన సస్పెన్షన్‌పై వివరణ ఇచ్చింది. డానిష్ అలీపై బీఎస్సీ పార్టీ ఎంపీ రమేష్ బిధూరి చేసిన అనుచిత వ్యాఖ్యలు చేసిన సమయంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ.. అలీకి మద్దతుగా నిలిచిన విషయం తెలిసిందే. -
పొత్తుకు బ్రేక్.. బీఆర్ఎస్తో ఎన్నికల పొత్తుపై బీఎస్పీ వెనకడుగు
సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికల్లో బహుజన్ సమాజ్ పార్టీతో పొత్తు కుదిరిందని బీఆర్ఎస్ ప్రకటించిన కొద్ది గంటల్లోనే బ్రేక్ పడింది. బీఆర్ఎస్తో పొత్తును విరమించుకుంటున్నట్లు బీఎస్పీ అధిష్టానం నుంచి ఆదేశాలు అందినట్లు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ వెల్లడించారు. పొత్తు కోసం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు ఇచ్చిన మాట తప్పడం తనకు ఇష్టం లేదని చెప్పడంతోపాటు తాను బీఎస్పీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అనంతరం నందినగర్‌లో కేసీఆర్‌తో ప్రవీణ్‌కుమార్ శనివారం మధ్యాహ్నం సుమారు మూడు గంటలపాటు సమావేశమై సుదీర్ఘంగా చర్చలు జరిపారు. తన భవిష్యత్తు ప్రస్థానం బీఆర్ఎస్, కేసీఆర్‌తో కొనసాగుతుందని భేటీ అనంతరం ప్రవీణ్‌కుమార్ ప్రకటించారు. ఇదిలాఉంటే ఒకట్రెండు రోజుల్లో ప్రవీణ్‌కుమార్ బీఆర్ఎస్లో చేరతారని ఆయన సన్నిహితవర్గాలు చెప్పాయి. బీఎస్పీతో పొత్తు విచ్ఛిన్నమైన నేపథ్యంలో నాగర్‌కర్నూల్ లోక్‌సభ స్థానం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా ప్రవీణ్‌కుమార్ పోటీ చేయనున్నారు. పొత్తులో భాగంగా నాగర్‌కర్నూల్, హైదరాబాద్ స్థానాలను కేటాయిస్తున్నట్లు ప్రకటించిన బీఆర్ఎస్ తాజా పరిణామాల నేపథ్యంలో రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాల్లోనూ అభ్యర్థులను బరిలోకి దించాలని నిర్ణయించింది. ఇదిలాఉంటే ప్రవీణ్‌కు బీఆర్ఎస్లో కీలక పదవి కూడా దక్కే అవకాశమున్నట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. కేసీఆర్‌కు ఇచ్చిన మాట తప్పకూడదనే..: ప్రవీణ్ కేసీఆర్‌తో భేటీ ముగిసిన తర్వాత ప్రవీణ్‌కుమార్ మీడియాతో మాట్లాడారు. ‘పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్‌తో కాకుండా ప్రాంతీయ పార్టీలతో బీఎస్పీ పొత్తు పెట్టుకోవాలని అందరితో చర్చించి నిర్ణయించుకున్నాం. అందులోభాగంగా బీఆర్ఎస్తో జరిగిన చర్చల ఫలితంగా నాగర్‌కర్నూల్, హైదరాబాద్ స్థానాలు కేటాయించారు. దీనికి బీఎస్పీ జాతీయ నాయకత్వం కూడా అంగీకరించినా బీఆర్ఎస్తో పొత్తు కుదుర్చుకోవడం బీజేపీకి నచ్చలేదు. పొత్తును విరమించుకోవాలని బీఎస్పీ అధిష్టానంపై బీజేపీ ఒత్తిడి తెచ్చింది. బీఆర్ఎస్తో తెగదెంపులు చేసుకుంటున్నట్లు మీడియా సమావేశం పెట్టాలని బీఎస్పీ అధిష్టానం నుంచి నాకు ఆదేశాలు అందాయి. పొత్తు కోసం కేసీఆర్‌కు ఇచ్చిన మాట తప్పడం నాకు ఇష్టం లేదు. ప్రస్తుత రాజకీయ పరిణామాలపై కేసీఆర్‌తో చర్చించాను. రాబోయే రోజుల్లో కేసీఆర్, బీఆర్ఎస్తో కలిసి పనిచేస్తా. తెలంగాణ ప్రయోజనాల కోసమే ఈ నిర్ణయం తీసుకున్నా. బహుజన వాదాన్ని ఎన్నటికీ వీడను. తెలంగాణ ప్రయోజనాల కోసమే బీఎస్పీ నుంచి బయటకు రావాలని నిర్ణయం తీసుకున్నా. శ్రేయోభిలాషులతో చర్చించి రాజకీయ నిర్ణయం తీసుకుంటా’ అని ప్రవీణ్‌కుమార్ చెప్పారు. ఆది నుంచీ ఊగిసలాటే... లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో బీఎస్పీ, బీఆర్ఎస్ నడుమ పొత్తు చర్చల్లో మొదటి నుంచీ ఊగిసలాట ధోరణి కనిపించింది. ఓ వైపు పొత్తులకు సంబంధించి కేసీఆర్‌తో చర్చలు జరుగుతున్న నేపథ్యంలోనే తాము దేశంలో ఏ పార్టీతోనూ కలిసి పోటీ చేయడం లేదని బీఎస్పీ అధినేత్రి మాయావతి సామాజిక మాధ్యమ వేదిక ‘ఎక్స్’లో ప్రకటించారు. అయితే మాయావతి ప్రకటన తెలంగాణకు వర్తించదని ప్రవీణ్ పేర్కొన్నారు. మరోవైపు మాయావతితో కేసీఆర్ మాట్లాడారని కూడా పేర్కొన్నారు. రెండు దఫాలుగా జరిగిన చర్చల్లో బీఎస్పీ మూడు సీట్లు కోరినట్లు ప్రచారం జరగ్గా.. నాగర్‌కర్నూల్, హైదరాబాద్ స్థానాలను కేటాయిస్తున్నట్లు బీఆర్ఎస్ ప్రకటించింది. అది జరిగి 24 గంటలు కాకమునుపే బీఎస్పీని వీడుతున్నట్లు ప్రవీణ్ ప్రకటించి కేసీఆర్‌తో భేటీ అయ్యారు.ఐపీఎస్ అధికారి నుంచి... సీనియర్ ఐపీఎస్ అధికారిగా ఉమ్మడి రాష్ట్రంలో వివిధ హోదాల్లో పనిచేసి తనకంటూ ప్రత్యేకతను చాటుకున్న ప్రవీణ్‌కుమార్ తెలంగాణ రాష్ట్ర అవతరణ తరువాత గురుకులాల కార్యదర్శిగా వ్యవహరించారు. గురుకుల విద్యార్థులను అన్ని రంగాల్లో ఉన్నతస్థాయికి తెచ్చేందుకు కృషి చేశారు. ‘స్వేరోస్’ సంస్థ ద్వారా గురుకులాల విద్యార్థులకు ప్రత్యేక గుర్తింపు తెచ్చారు. 2021లో తన పదవికి స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన ప్రవీణ్‌కుమార్ అదే సంవత్సరం ఆగస్టులో మాయావతి సమక్షంలో బీఎస్పీలో చేరారు. రాష్ట్రంలో కాన్షీరాం అధ్యక్షుడిగా ఉన్న 1994 నుంచి రాజకీయ మనుగడ కోసం ప్రయత్నిస్తూ విఫలమైన బీస్పీలో ప్రవీణ్‌కుమార్ చేరడమే అప్పట్లో చర్చనీయాంశమైంది. బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులైన ప్రవీణ్‌కుమార్ బీఆర్ఎస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక కార్యక్రమాలను ఎత్తిచూపుతూ రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర, పర్యటనలు చేశారు. టీఎస్పీఎస్సీ పరీక్ష పత్రాల లీకేజీ వ్యవహారంపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరుద్యోగ యువతను ఏకం చేయడంలో ఆయన సఫలీకృతమయ్యారు. ఈ నేపథ్యంలో వచ్చిన శాసనసభ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా 107 మంది బీఎస్పీ అభ్యర్థులను బరిలో నిలిపారు. ఆయన స్వయంగా ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలోని సిర్పూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో రాజకీయ మనుగడ కోసం తాను పోరాడిన బీఆర్ఎస్తోనే కలిసి నడవాలని నిర్ణయించుకున్నారు. -
బీఎస్పీకి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాజీనామా
సాక్షి, హైదరాబాద్: బహుజన్ సమాజ్‌వాదీ పార్టీ (బీఎస్పీ)కి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గుడ్‌బై చెప్పారు. బీఎస్పీ పార్టీ తెలంగాణ చీఫ్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రకటించారు. ‘బహుజన్ సమాజ్ పార్టీని వీడాలని నిర్ణయించుకున్నాను. నా నాయకత్వంలో తెలంగాణలో ఇటీవల కాలంలో తీసుకున్న నిర్ణయాల (వాటికి ఎంత మంచి ప్రాముఖ్యత ఉన్నా) వల్ల బీఎస్పీ వంటి గొప్ప పార్టీ ఇమేజ్ దెబ్బతినడం నాకు ఇష్టం లేదు’ అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ‘ఎక్స్’లో పేర్కొన్నారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌తో భేటీ కానున్నారు. ఇటీవల బీఆర్ఎస్-బీఎస్పీ పార్టీలు లోక్‌సభ ఎన్నికల కోసం పొత్తు ఖరారు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బీఎస్పీకి రాజీనామా చేసిన ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ బీఆర్ఎస్లో చేరనున్నట్లు తెలుస్తోంది. Dear fellow Bahujans, I am unable to type this message, but I must do it anyway, as the time to take new path has arrived now. Please forgive me for this post and I have no choice left. With heavy heart I have decided to leave Bahujan Samaj Party😭. I don’t want the image of… — Dr.RS Praveen Kumar (@RSPraveenSwaero) March 16, 2024 బీఆర్ఎస్-బీఎస్పీ పొత్తులో భాగంగా ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలలోని నాగర్‌ర్నూల్‌తో పాటు హైదరాబాద్ లోక్‌సభ నియోజకవర్గాల నుంచి బీఎస్పీ పోటీ చేస్తుందని ఆ పార్టీ తెలంగాణ చీఫ్‌గా ప్రవీణకుమార్ ప్రకటించారు. నాగర్‌కర్నూల్ స్థానం నుంచి స్వయంగా ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్(ఆర్ఎస్పీ) ఎన్నికలో బరిలో దిగనున్నారని బీఎస్పీ ప్రకటించింది. ఇక హైదరాబాద్ స్థానం నుంచి ఎవరు పోటీ చేయాలన్నదానిపై బీఎస్పీ నిర్ణయం తీసుకోవాల్సి ఉందని పేర్కొంది. ఇలాంటి తరుణంలో ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ బీఎస్పీకి రాజీనామా చేయటం పార్టీకి పెద్ద షాక్ అని పార్టీ శ్రేణుల్లో చర్చ జరుగుతోంది. -
బీఎస్పీకి రెండు లోక్‌సభ సీట్లు
సాక్షి, హైదరాబాద్: పార్లమెంటు ఎన్నికల్లో రాష్ట్రంలోని 17 స్థానాలకు గాను రెండు లోక్‌సభ సీట్లను పొత్తులో భాగంగా బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ)కి ఇవ్వాలని భారత రాష్ట్ర సమితి నిర్ణయించింది. ఈ మేరకు హైదరాబాద్, నాగర్‌కర్నూలు లోకసభ స్థానాలను ఇచ్చేందుకు బీఆర్ఎస్ అంగీకరించింది. బీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావుతో బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.ఎస్. ప్రవీణ్‌కుమార్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం ఇటీవల రెండు పర్యాయాలు చర్చలు జరిపిన విషయం తెలిసిందే. ఈ చర్చల్లో నాగర్‌కర్నూలుతో పాటు మరో రెండు స్థానాలను బీఎస్పీ కోరినప్పటికీ రెండు సీట్లు మాత్రమే ఇచ్చేందుకు బీఆర్ఎస్ సుముఖత వ్యక్తం చేసింది. బీఎస్పీకి కేటాయించిన రెండు స్థానాల్లో అభ్యర్థుల ఎంపికను ఆ పార్టీ చేసుకుంటుందని బీఆర్ఎస్ ప్రకటించింది. కేసీఆర్‌తో జరిగిన చర్చల సారాంశాన్ని తమ పార్టీ జాతీయ అధ్యక్షురాలు మాయావతికి వివరించిన అనంతరం బీఆర్ఎస్ ప్రతిపాదనకు అంగీకరిస్తున్నట్లు బీఎస్పీ ప్రకటించింది. కాగా, 15 ఎంపీ సీట్లలో బీఆర్ఎస్ పోటీ చేయనుంది. ఇప్పటికే 11 స్థానాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు ఖరారయ్యారు. భువనగిరి, నల్లగొండ, మెదక్, సికింద్రాబాద్ లోక్‌సభ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులను ఇంకా ఖరారు చేయాల్సి ఉంది. ఆయా స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు ఖరారు అయిన తర్వాతే బీఆర్ఎస్ జాబితా వెల్లడయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. -
బీఎస్పీకి రెండు సీట్లిచ్చిన బీఆర్ఎస్.. ‘ఆర్ఎస్పీ’ పోటీ అక్కడి నుంచే..
సాక్షి,హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలో ప్రతిపక్ష బీఆర్ఎస్, బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్పీ)తో పొత్తు కుదుర్చుకున్న విషయం తెలిసిందే. ఈ పొత్తులో భాగంగా బీఎస్పీకి బీఆర్ఎస్ రెండు సీట్లు కేటాయించింది. ఈ మేరకు బీఆర్ఎస్ పార్టీ శుక్రవారం(మార్చ్15) ఒక ప్రకటన విడుదల చేసింది. పొత్తులో భాగంగా ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలలోని నాగర్‌ర్నూల్‌తో పాటు హైదరాబాద్ లోక్‌సభ నియోజకవర్గాల నుంచి బీఎస్పీ పోటీ చేయనుంది. నాగర్‌కర్నూల్ స్థానం నుంచి స్వయంగా బీఎస్పీ తెలంగాణ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్(ఆర్ఎస్పీ) ఎన్నికలో బరిలో దిగనున్నారని బీఎస్పీ ప్రకటించింది. ఇక హైదరాబాద్ స్థానం నుంచి ఎవరు పోటీ చేయాలన్నదానిపై బీఎస్పీ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. కాగా, ఇప్పటివరకు మొత్తం 17 లోక్‌సభ స్థానాలకుగాను 11 సీట్లకు బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితా ఖరారైంది. తాజాగా నాగర్‌కర్నూల్, హైదరాబాద్ లోక్‌సభ స్థానాలను పొత్తులో భాగంగా బీఎస్పీకి కేటాయించడంతో మరో నాలుగు స్థానాలకు అభ్యర్థులను బీఆర్ఎస్ ఖరారు చేయాల్సి ఉంది. అభ్యర్థులను ప్రకటించాల్సిన నియోజకవర్గాల జాబితాలో సికింద్రాబాద్, నల్లగొండ, భువనగిరి, మెదక్ ఉన్నాయి. కాంగ్రెస్ జాబితా వెలువడిన తర్వాత మిగతా నియోజకవర్గాల్లో అభ్యర్థుల పేర్లను ప్రకటించాలని కేసీఆర్ భావిస్తున్నట్లు సమాచారం. అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ కొలిక్కి వస్తున్న నేపథ్యంలో ఎన్నికల ప్రచార సభల షెడ్యూల్‌పైనా కేసీఆర్ కసరత్తు చేస్తున్నారు. చేవెళ్ల లోక్‌సభ స్థానం పరిధిలో ఈ నెల 23న బహిరంగ సభ నిర్వహించేందుకు బీఆర్ఎస్ సన్నాహాలు చేస్తోంది. అభ్యర్థులు ఖరారైన చోట బహిరంగ సభలు, ప్రచార షెడ్యూల్‌పై స్థానికంగా సమన్వయ సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలని నేతలను కేసీఆర్ ఇప్పటికే ఆదేశించినట్లు సమాచారం. ఇదీ చదవండి.. మరో ఇద్దరికి కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ -
సోనియా గాంధీని కలిసిన డానిష్ అలీ.. కాంగ్రెస్ తరఫున పోటీ!
ఢిల్లీ: పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ సస్పెండెడ్ బీఎస్పీ ఎంపీ డానిష్ అలీ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేయనున్నట్లు ఊహాగానాలు వ్యాప్తిస్తున్నాయి. ఆయన ఈ రోజు ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యురాలు సోనియా గాంధీని ఆమె నివాసంలో కలిశారు. దీంతో ఆయన అమ్రోహా లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్ తరఫున బరిలోకి దిగుతారన్న వార్తలకు ప్రాధాన్యత చేకూరుతోంది. ‘నేను సోనియా గాంధీ ఆశీస్సులు తీసుకున్నా. రానున్న ఎన్నికల్లో అమ్రోహా లోక్‌సభ స్థానం నుంచి రెండోసారి పోటీ చేస్తాను. ఆమె హృదయం పేద ప్రజలకు కోసం తపిస్తూ ఉంటుంది’అని డానిష్ అలీ ‘ఎక్స్’ ట్విటర్ వేదికగా పేర్కొన్నారు. సోనియా గాంధీ నేతృత్వంలోని నేషనల్ అడ్వైజరీ కౌన్సిల్(NAC).. ఎంఎన్ఆర్ఈజీ, ఆర్టీఐ, విద్యా హక్కు, ఆహార భద్రతా బిల్లు వంటి పేదల, పారదర్శక చట్టాలను ప్రయోగాత్మకంగా రూపొందించిందని డానిష్ అన్నారు. లోక్‌సభ ఎన్నికల కోసం ప్రతిపక్షాల ఇండియా కూటమిలో భాగంగా సమాజ్‌వాదీ పార్టీతో సీట్ల సంప్రదింపుల్లో అమ్రోహా సెగ్మెంట్ గురించి చర్చలు జరిపింది. Honoured to get blessings of epitome of sacrifice, Smt #SoniaGandhi for my 2nd #LokSabhaElection from #Amroha. Her heart beats for India’s poor. It was NAC headed by her that piloted landmark pro-poor & transparency laws like MNREGA, #RTI, Right to Education, Food Security Bill. pic.twitter.com/AAesBjF2FH — Kunwar Danish Ali (@KDanishAli) March 14, 2024 అయితే రాహుల్‌గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ యాత్రలో డానిష్ అలీ జనవరిలో మణిపూర్‌లో పాల్గొన్నారు. ఆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...‘ ఈ సందర్భంగా నాకు చాలా ముఖ్యమైంది. ఇక్కడ రావటంతో నా మనసు కుదుటపడింది. నాకు రెండు మార్గాలు ఉన్నాయి. నాలో మార్పు లేకుండా దళితులు, వెనబడిన, గిరిజన, మైనార్టీలు, పేదల దోపిడీని విస్మరించడం. లేదా.. దేశంలో భయం, ద్వేషం, దోపిడడీ, విభజన వాతావరణానికి వ్యతిరేకంగా ప్రచారం ప్రారంభించటం’ అని డానిష్ అన్నారు. ‘కాంగ్రెస్ నేతలతో సన్నిహతంగా ఉంటుంన్నారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. పార్టీలో చేరే సమయంలో ఇచ్చిన హామీలు మరచిపోయారు. ఆ కారణంగా డానిష్ అలీని సస్పెండ్ చేస్తున్నాం’బీఎస్పీ గతేడాది వివరణ ఇచ్చింది. డానిష్ అలీపై బీఎస్సీ పార్టీ ఎంపీ రమేష్ బిధూరి చేసిన అనుచిత వ్యాఖ్యలు చేసిన సమయంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ.. అలీకి మద్దతుగా నిలిచిన విషయం తెలిసిందే. -
‘అది ఓ ముఖ్యమంత్రి మాట్లాడే భాషేనా?’
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాంబుల భాష వాడడం అంత బాగోలేదని చెప్పాలి. 'ఎవడన్న టచ్ చేసి చూడండి.. మా పాలమూరు బిడ్డలు అగ్ని కణితలైతరు. మానవ బాంబులైతరు..ఎవడన్నా మిగుల్తాడేమో నేను చూస్తా"అని రేవంత్ హెచ్చరించారు.ఆ తర్వాతత మరో సభలో ఫామ్ హౌస్ ఇటుకలు కూడా మిగలవని అన్నారు. రేవంత్ కు ఎందుకు ఇంత అసహనం. కేవలం ప్రజల సానుభూతి కోసమే ఈ ప్రయత్నమా? లేక నిజంగానే ఆయన ప్రభుత్వాన్ని ఎవరైనా టచ్ చేస్తారని, తన సీఎం సీటుకు గండం వస్తుందని భయపడుతున్నారా? నిజానికి ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ నుంచి ఎవరూ పార్టీ మారలేదు. పైగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కొందరు ఆయనను కలవడం అనుమానంగా ఉంది. అయినా రేవంత్ ఇలా మాట్లాడుతున్నారంటే ఏమని అనుకోవాలి. నిజమే ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాల ఏర్పాటు, అసమ్మతి, ప్రభుత్వాలు పడిపోవడం జరుగుతోంది. అదేమి కొత్త విషయం కాదు. దానిని సమర్ధించడం లేదు. కాని తన ప్రభుత్వాన్ని టచ్ చేస్తే పాలమూరు బిడ్డలు మానవ బాంబులు అవుతారని అనడం మాత్రం అభ్యంతరకరం. మీ రాజకీయ క్రీడలోకి సామాన్య కార్యకర్తలను లాక్కురావడం దేనికో తెలియదు. విశేషం ఏమిటంటే గతంలో కేసీఆర్ ప్రభుత్వాన్ని కూలదోయడానికి ఆనాటి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచనల మేరకు ఎమ్మెల్సీ ఎన్నికలలో నామినేటెడ్ ఎమ్మెల్యేని కొనుగోలు చేయడానికి వెళ్లి రేవంత్ అరెస్టు అయ్యారు. అప్పుడు అదంతా కుట్ర అని రేవంత్ చెబుతారు. అది కుట్రనా , కాదా, అన్నది పక్కనబెడితే ఏభై లక్షల నగదు ఎందుకు ఆ ఎమ్మెల్యే వద్దకు తీసుకు వెళ్లారో వివరణ ఇచ్చే పరిస్థితి లేదు. ఇంకా ఈ కేసు కోర్టు విచారణలోనే ఉంది.అయినా అదృష్టవశాత్తు రేవంత్ ముఖ్యమంత్రి స్థాయికి రాగలిగారు. అంతవరకు సంతోషమే. కాని ఇప్పుడు ఇలా మాట్లాడడం పద్దతి అనిపించదు. నిజంగా ప్రతిపక్ష బీఆర్ఎస్ కు రేవంత్ ప్రభుత్వాన్ని పడగొట్టే అంత సీన్ ఉన్నట్లు కనిపించదు. బీజేపీ వారు పార్లమెంటు ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోతుందని ప్రచారం చేస్తున్నప్పటికి అది అంత తేలిక కాదు. అదేదో రాజకీయ విమర్శ మాదిరి, పార్లమెంటు ఎన్నికలలో లబ్ది పొందడానికి ఎవరికి వారు ఆరోపణలు చేసుకుంటూ కధ నడుపుతున్నారు. ఎప్పుడు రేవంత్ ప్రభుత్వానికి చిక్కులు వస్తాయి?తెలంగాణలో కాంగ్రెస్ కు ఉన్న మెజార్టీ కేవలం నాలుగు సీట్లే. మిత్రపక్షం సిపిఐ కి ఉన్న మరో సీటు కూడా కలిపితే ఐదు సీట్ల మెజార్టీ ఉన్నట్లు. కేసీఆర్ 2014లో అధికారంలోకి వచ్చినప్పుడు కూడా మూడు సీట్ల మెజార్టీనే వచ్చింది. ఓటు కు నోటు కేసు తర్వాత ఆయన పలువురు ఇతర పార్టీల ఎమ్మెల్యేలను టిఆర్ఎస్ లోకి లాగారు. అది విమర్శలకు గురైనా ఆయన అదే రీతిలో ముందుకు వెళ్లారు. 2018లో మంచి మెజార్టీతో కెసిఆర్ అదికారంలోకి వచ్చినా మళ్లీ అదే పద్దతి అవలంభించారు.దాని వల్ల కేసీఆర్ కు కొంత అప్రతిష్ట వచ్చింది. 2014లో కాంగ్రెస్ కు 21సీట్లు, టీడీపీ,బీజేపీ కూటమికి 20 సీట్లు రావడం వల్ల కేసీఆర్ కు అంత ఇబ్బంది రాలేదు. 2023లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ కు కూడా అదే తరహా కంపోజిషన్ ఉందని చెప్పాలి. బీఆర్ఎస్ కు 39 సీట్లు వస్తే, బీజేపీకి ఎనిమిది, ఎంఐఎంకు ఏడు సీట్లు వచ్చాయి. బీఆర్ఎస్ , బీజేపీ కలిసినా నలభైఏడు సీట్లే అవుతాయి.కాని ఇప్పటికిప్పుడు ఈ రెండు పార్టీల మద్య అవగాహన కుదిరే అవకాశం కనిపించడం లేదు. ఒకవేళ కలిసినా ఆ సంఖ్యతో కాంగ్రెస్ కు ధ్రెట్ అవడం కష్టం. ఎంఐఎం నేరుగా బీజేపీతో పొత్తు పెట్టుకునే పరిస్థితి ఉండక పోవడం కూడా కాంగ్రెస్ కు కలిసి వస్తుంది. బీజేపీ మినహా ఎవరు అధికారంలో ఉంటే వారివైపు వెళ్లడానికి ఎంఐఎం ప్రాధాన్యత ఇస్తుంటుంది.ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసిని ప్రోటెం స్పీకర్ ను చేయడం, లండన్ పర్యటనకు ఆహ్వానించడం తదితర చర్యల ద్వారా ఆ పార్టీవారిని తమ వైపు అవసరమైతే ఉండేలా కాంగ్రెస్ జాగ్రత్తపడుతోంది. అయినా రేవంత్ ఎందుకు సీరియస్ ప్రకటనలు చేస్తున్నారు?అంటే పార్లమెంటు ఎన్నికలలో కాంగ్రెస్ కు ఆశించిన సీట్లు రాకపోతే సొంత పార్టీలోనే కొత్త కుంపట్లు వస్తాయని ఆయన భయపడుతుండవచ్చు.దానిని దృష్టిలో ఉంచుకుని ఇప్పటి నుంచి తనకు అనుకూలంగా ప్రజాభిప్రాయాన్ని కూడగట్టుకునే యత్నం చేస్తున్నారనుకోవాలి.అలాగే పార్లమెటు ఎన్నికలలో కరువు, నీటి సమస్య, నెరవేరని హామీలు చర్చకు రాకుండా రేవంత్ ఈ మానవ బాంబుల భాష వాడి ఉండవచ్చు. రేవంత్ అక్కడితో ఆగలేదు..ఒక్కొక్కడిని పండబెట్టి తొక్కి పేగులు తీస్కొని మెడల వేస్కుని ఊరేగుతాం బిడ్డా ఎవడన్నా ఈ ప్రభుత్వం మీదకు వస్తే.. .అంటూ తీవ్రంగా హెచ్చరింకలు చేశారు. కొద్ది రోజుల క్రితం ప్రతిపక్షనేత ,బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేసిన కొన్ని వ్యాఖ్యల ఆధారంగా రేవంత్ మాట్లాడి ఉండవచ్చు.వచ్చే పదేళ్లు అధికారంలో ఉంటామని విశ్వాసం వ్యక్తం చేస్తున్న ఆయన మానవ బాంబుల గురించి ప్రస్తావించవలసిన అవసరం ఏమి ఉంటుంది?ఇలాంటి వ్యాఖ్యల వల్ల ఎవరైనా సామాన్య కార్యకర్త తొందరపడితే ఎంత ప్రమాదం!దానికి రేవంత్ బాధ్యత వహిస్తారా? తెలంగాణ ఉద్యమ సమయంలో ఒక నాయకుడు పెట్రోల్ పోసుకోబోతున్నట్లు ప్రయత్నించిన సన్నివేశంపై ఎన్ని విమర్శలు వచ్చాయో అందరికి తెలుసు. ఆ తర్వాత మరికొందరు అదే ప్రయత్నం చేశారు. చివరికి శ్రీకాంతాచారి ఆ నిప్పుకే బలైపోయారు.ఎంత దారుణం. మానవత్వం ఉన్నవారెవరూ ఇలాంటివాటిని సమర్ధించరాదు.రేవంత్ రెడ్డి కూడా తెలంగాణ ఉద్యమ సమయంలో కొంత ఆవేశంగా మాట్లాడేవారు. కొన్నిసార్లు ఆంద్రులను ఉద్దేశించి కూడా అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. అదంతా గతం.ఇంకో సంగతి చెప్పాలి. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ మానవ బాంబుకే బలైపోయారు.అది అత్యంత దురదృష్టకర ఘటన . శ్రీలంక ఉగ్రవాదులు చేసిన ఘాతుకం అది.దేశంలో పలువురు ప్రముఖులు బాంబులు పేలిన ఘటనలలో మరణించారు. వాటి గురించి ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నవారు ప్రస్తావించడం ఏ మాత్రం సహేతుకం కాదని స్పష్టంగా చెప్పాలి. ప్రస్తుతానికి అయితే కాంగ్రెస్ ప్రముఖ నేతలు ఎవరూ రేవంత్ కు వ్యతిరేకంగా మాట్లాడడం లేదు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి ఫోటో లేకుండా ప్రచార ప్రకటనలు వస్తున్నా ఆయన కూడా నోరెత్తలేదు. అలాగే మాజీ పీసీసీ అధ్యక్షుడు ఉత్తంకుమార్ రెడ్డి కూడా రేవంత్ కు అసమ్మతిగా మారలేదు. కాస్తా,కూస్తో గతంలో రేవంత్ కు పార్టీలో ప్రత్యర్ధిగా ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇప్పుడు మంత్రి అయిన తర్వాత తన బాణీ మార్చుకున్నారు. రేవంత్ ను తెగ పొగుడుతున్నారు.అందువల్ల రేవంత్ కు వచ్చిన తక్షణ ప్రమాదం కనిపించదు. అయితే కాంగ్రెస్ రాజకీయాలలో ఎప్పుడు ఏమైనా జరగవచ్చు. మరో వైపు రేవంత్ ప్రధాని మోడీని బడా బాయి అని అనడం ఆధారంగా బిఆర్ఎస్ నేత కెటిఆర్ తదితరులు విమర్శలు గుప్పించారు. ఇందులో రేవంత్ ను పెద్దగా తప్పు పట్టనక్కర్లేదు. ప్రధానిని గౌరవించడం సంస్కారమే.కాని మరీ బంధం ఎక్కువగా ఉందేమో అన్న చందంగా పద ప్రయోగం చేస్తే కాంగ్రెస్ లోనే అనుమానం రావచ్చు. అందుకే ఆ తర్వాత మోడీని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు కూడా అంత సముచితంగా లేవు. కాగా కేసీఆర్ బీఎస్పీ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ తో ఒప్పందం చేసుకోవడం కాస్త ఆశ్చర్యంగానే ఉంది. దీనిపై రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి లు ఘాటైన విమర్శలే చేశారు. పదేళ్లు మాదిగలను వంచించి మోసగించిన దొర దగ్గరకు వెళ్లడం ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ కు న్యాయమా?అని రేవంత్ ప్రశ్నించారు. కేసీఆర్ ఆశ్చర్యకరమైన రీతిలోనే బీఎస్పీతో పొత్తు పెట్టుకున్నారని చెప్పాలి. దీని వల్ల ఆయన పార్టీ బలహీనపడిందన్న సంకేతాన్ని ఇచ్చినట్లయింది. బహుశా దళిత ఓట్లను ఆకర్షించడానికి ఈ పొత్తు పెట్టుకుని ఉండవచ్చు. అధికారంలో ఉన్నప్పుడు సిపిఐ,సిపిఎం వంటి పార్టీలతో వ్యవహరించిన తీరు విమర్శలకు గురి అవుతుండేది. మునుగోడు ఉప ఎన్నికలో వామపక్షాల మద్దతు తీసుకుని, సాధారణ ఎన్నికలలో వారిని పట్టించుకోకపోవడం వల్ల కేసీఆర్ కు నిలకడ లేదన్న అభిప్రాయానికి తావిచ్చారు. ఇప్పుడు బిఎస్పితో ఎంతకాలం పొత్తు ఉంటుందన్నది చూడాలి. ఏది ఏమైనా రేవంత్ రెడ్డి అయినా, మరొకరు అయినా బాంబుల భాష వాడకుండా ఉంటే మంచిది. ప్రస్తుత రాజకీయ వేడిలో ఇలాంటి హితోక్తిలను నేతలు వినే పరిస్థితి ఉండడం లేదు. అయినా మనం చెప్పవలసింది చెప్పాలి. – కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
అవన్నీ అసత్యాలే.. తేల్చి చెప్పేసిన మాయావతి
BSP Mayawati : రానున్న లోక్‌సభ సార్వత్రిక ఎన్నికల్లో బహుజన్ సమాజ్ పార్టీ ఒంటరిగానే పోటీ చేయనుంది. ఈ మేరకు ఆ పార్టీ అధినేత్రి మాయావతి తేల్చి చెప్పేశారు. తమ పార్టీ పొత్తుతో వెళ్తుందని వస్తున్న వదంతులన్నీ అబద్ధమని స్పష్టం చేశారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’ (గతంలో ట్విటర్)లో ఈ మేరకు మాయావతి పోస్ట్ చేశారు. ‘రానున్న లోక్‌సభ సార్వత్రిక ఎన్నికలలో బీఎస్పీ తన సొంత బలంతో పోటీ చేస్తుంది. ఇందుకోసం పార్టీ పూర్తి సన్నద్ధత, బలంతో ఉంది. ఇటువంటి పరిస్థితిలో పొత్తులు, మూడవ ఫ్రంట్ ఏర్పాటు గురించి వస్తున్నవి తప్పుడు వార్తలు. ఇలాంటి వార్తలతో మీడియా తన విశ్వసనీయతను కోల్పోకూడదు. ప్రజలు కూడా జాగ్రత్తగా గమనించాలి’ అని తన పోస్ట్‌లో రాసుకొచ్చారు. ఉత్తరప్రదేశ్‌లో లోక్‌సభ ఎన్నికల ప్రణాళికల గురించి మాయావతి పేర్కొంటూ.. “ముఖ్యంగా యూపీలో బీఎస్పీ ఒంటరిగా ఎన్నికలలో పోటీ చేస్తుండటంతో ఇతర పక్షాలు అసహనానికి గురవుతున్నాయి. అందుకే రోజూ రకరకాల పుకార్లు పుట్టిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నాయి. అయితే బహుజన వర్గాల ప్రయోజనాల దృష్ట్యా ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయాలనే బీఎస్పీ నిర్ణయం దృఢమైనది" అన్నారు. -
కిడ్నాప్ కేసు.. పోలీసుల అదుపులో మాజీ ఎంపీ
సాక్షి, లక్నో: ‘నమామి గంగే’ ప్రాజెక్ట్ మేనేజర్ అభినవ్ సింఘాల్‌ను కిడ్నాప్ చేసి, దోపిడీ, దుర్వినియోగం, బెదిరింపులకు పాల్పడిన కేసులో మాజీ ఎంపీ ధనంజయ్ సింగ్, అతని అనుచరుడు సంతోష్ విక్రమ్‌లను స్థానిక కోర్టు దోషులుగా నిర్ధారించింది. అడిషనల్ సెషన్స్ జడ్జి శరద్ కుమార్ త్రిపాఠి ఇరు వర్గాల వాదనలు విన్న తర్వాత ఈ కేసులో ధనంజయ్ సింగ్, అతని సహచరుడిని జ్యుడీషియల్ కస్టడీకి ఆదేశించారు. కేసు పూర్వాపరాలను పరిశీలిస్తే.. జౌన్పూర్ జిల్లా ప్రభుత్వ న్యాయవాది (క్రిమినల్) సతీష్ పాండే మాట్లాడుతూ, ముజఫర్‌నగర్ నివాసి అభినవ్ సింఘాల్ ధనంజయ్ సింగ్, అతని సహచరుడు విక్రమ్‌పై 2020 మే 10న లైన్‌బజార్ పోలీస్ స్టేషన్లో పలు సెక్షన్ల కింద కేసులు నమోదైనట్లు తెలిపారు. గన్‌తో బెదిరిస్తూ విక్రమ్, సహచరులతో కలిసి సింఘాల్‌ను కిడ్నాప్ చేసి, తన నివాసానికి తీసుకెళ్లారని,అక్కడ ధనంజయ్ సింగ్ గన్‌తో బెదిరిస్తూ దుర్భాషలాడారని వెల్లడించారు. అంతేకాదు నాణ్యత లేని మెటీరియల్‌ను సరఫరా చేయాలని ఒత్తిడి చేశారని, నిరాకరించడంతో బెదిరించి దోపిడీకి పాల్పడ్డారని ఆరోపించారు. ఇప్పటికే ఈ కేసులో మాజీ ఎంపీ అరెస్ట్ అయ్యారని, తర్వాత అలహాబాద్ హైకోర్టు నుంచి బెయిల్ పొందారని పాండే అన్నారు. Bahubali Leader Dhananjay Singh was detained by the UP police in an old case. Few days ago he announced that he will contest Loksabha Elections as an independent candidate From Jaunpur #DhananjaySingh#LokSabhaElection2024 pic.twitter.com/fYoIAZMOtQ — Desh Ka Verdict (@DeshKaVerdict) March 5, 2024 పూర్వాంచల్ బాహుబలి బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) సభ్యుడిగా 2009 నుండి 2014 వరకు 15వ లోక్‌సభలో పార్లమెంటు సభ్యునిగా ధనంజయ్ సింగ్‌కు ‘పూర్వాంచల్ బాహుబలి’గా పేరుంది. అయితే 2011లో బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారనే ఆరోపణలపై ఆయనను పార్టీ నుంచి బహిష్కరించారు. ప్రస్తుతం జనతాదళ్ యునైటెడ్ (జేడీయూ)లో ఉన్న ధనంజయ్ సింగ్ ఇటీవల ఎక్స్.కామ్‌లో తాను వచ్చే లోక్‌సభ ఎన్నికలలో జౌన్పూర్ స్థానం నుండి పోటీ చేయబోతున్నట్లు స్పష్టం చేశారు. 2002లో తొలిసారిగా రారీ అసెంబ్లీ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందారు. -
దీర్ఘకాలిక లక్ష్యంతోనే పొత్తు
సాక్షి, హైదరాబాద్: ప్రజల ఆకాంక్షలకు అనుగు ణంగా దీర్ఘకాలిక లక్ష్యంతోనే బీఎస్పీతో పొత్తు కుదుర్చుకున్నట్లు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించారు. తెలంగాణ భవన్లో మంగళవారం జరిగిన మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూలు లోక్‌సభ నియోజకవర్గాలకు చెందిన పార్టీ నేతలతో ఉమ్మడి భేటీలో కేసీఆర్ మాట్లా డారు. బీఎస్పీతో పొత్తుకు సంబంధించి ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్‌తో జరిగిన చర్చలు, తీసుకున్న నిర్ణయాలను వివరించారు. శక్తులను కూడదీసుకోవాలి ‘ప్రస్తుత పరిస్థితుల్లో మనం మన శక్తులను కూడదీసుకోవడంతోపాటు కలసి వచ్చే భావసా రూప్య శక్తులను కలుపుకొని పోవాలి. ఆ దిశగా మనం తీసుకున్న నిర్ణయం రాష్ట్రవ్యాప్తంగా ప్రజాప్రయోజనాలను కాపాడే దీర్ఘకాలిక లక్ష్యంతో కూడుకొని ఉంది. లౌకికవాద తాత్వికతతో బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్ల పాలనలో చేసిన కృషి దేశానికే ఆదర్శంగా నిలిచింది. ఈ నేపథ్యంలో దళిత బహుజన శక్తులతో కలసి పనిచేయడం ద్వారా తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు మరింత చేరువవుతాం. బీఎస్పీ కలసికట్టుగా పనిచేసి ప్రజాభీష్టాలను సంపూర్ణంగా నెరవేరుద్దాం. ఈ దిశగా మరిన్ని చర్చలు జరిపి రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో పొత్తుల విధివిధానాలను ఖరారు చేస్తాం’ అని కేసీఆర్ ప్రకటించారు. ఈ ప్రకటనను హర్షధ్వానాల నడుమ ముక్తకంఠంతో పార్టీ నేతలు ఏకీభవించారు. లోక్‌సభ ఎన్నికల్లో ప్రజాదరణ పొందుదాం ‘ఉద్యమ కాలం నుంచి తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగానే బీఆర్ఎస్ పనిచేస్తోంది. అదే స్ఫూర్తిని కొనసాగిస్తూ లోక్‌సభ ఎన్నికల్లో ప్రజాదరణ పొందుదాం. ఉమ్మడి రాష్ట్రంలో పాలకుల నిర్లక్ష్యంతో నిలిచిన పెండింగ్ ప్రాజెక్టుల తోపాటు పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించాం. బీఆర్ఎస్ ప్రభుత్వం రూపొందించిన ఎత్తిపోతల పథకం ద్వారానే కొడంగల్‌కు పుష్కలంగా సాగునీటిని తరలించవచ్చు. అయినా ఉన్నదాన్ని తీసేసి కొడంగల్‌కు లిఫ్ట్‌ను ఏర్పాటు చేయాలను కోవడం సరైన నిర్ణయం కాదు’ అని కేసీఆర్ వ్యాఖ్యానించారు. పార్టీని వీడే వారి గురించి ఆలోచించకుండా ప్రజా సమస్యలపై పోరాడదా మని పిలుపునిచ్చారు. డొల్లతనంతో కాంగ్రెస్ సర్కార్ అభాసుపాలు ‘ఓట్లేసి గెలిపించిన కాంగ్రెస్ ప్రభుత్వం తాగు, సాగునీరు, విద్యుత్ వంటి కనీస అవసరాలను తీర్చలేకపోవడంతో ప్రజలు విస్మయం చెందుతున్నారు. కొత్తగా ఇచ్చే తెలివి లేక గత బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన పథకాలను కూడా కొనసాగించలేక పాలనలోని డొల్లతనాన్ని స్వయంగా కాంగ్రెస్ సర్కార్ బయటపెట్టుకొని అభాసుపాలవు తోంది. ప్రభుత్వం ఏర్పాటై 100 రోజులు కాకముందే ప్రజావ్యతిరేకతను మూటకట్టు కుంది. అధికారం కోసం ఎన్నికల ముందు గ్యారంటీల పేరిట అలవికాని హామీలు ఇచ్చింది. ఇప్పుడు అమలు చేతకాక అబద్ధాలకు, బెదిరింపులకు దిగి తప్పించుకుంటోంది’ అని కేసీఆర్ మండిపడ్డారు. మహబూబ్‌నగర్ అభ్యర్థిగా మన్నె శ్రీనివాస్‌రెడ్డి మహబూబ్‌నగర్ బీఆర్ఎస్ అభ్యర్థిగా సిట్టింగ్ ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి పేరును కేసీఆర్ ఖరారు చేశారు. ఆయన గెలుపు కోసం అను సరించాల్సిన కార్యాచరణౖపై నేతలకు దిశాని ర్దేశం చేశారు. తక్షణమే మండలాలవారీగా ఎన్నికల సన్నాహక సమావేశాల ఏర్పాటుకు షెడ్యూల్ సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు. ఆ తర్వాత నియోజకవర్గాల వారీగా సన్నాహక సమావేశాలు ఉంటాయని, త్వరలో మహబూ బ్‌నగర్ పట్టణంలో భారీ బహిరంగ సభ ఉంటుందని కేసీఆర్ ప్రకటించారు. మరోవైపు బీఎస్పీతో పొత్తు నేపథ్యంలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ నాగర్ కర్నూలు నుంచి పోటీ చేస్తారనే అంశాన్ని కేసీఆర్ సూత్రప్రాయంగా వెల్లడించారు. కాగా, ఉచిత ఎల్ఆర్ఎస్ బుధ, గురువారాల్లో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు పిలుపునివ్వడం, శుక్ర వారం శివరాత్రి పర్వదినం కావడంతో ఉమ్మడి జిల్లాలవారీగా నిర్వహిస్తున్న భేటీలకు బీఆర్ ఎస్ 3 రోజుల బ్రేక్ ఇచ్చింది. ఈ నెల 9 నుంచి ఉమ్మడి జిల్లాలవారీగా కేసీఆర్‌తో భేటీలు తిరిగి మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి. -
కలసి నడుస్తాం.. లోక్‌సభ ఎన్నికల్లో బీఎస్పీతో బీఆర్ఎస్ జట్టు
సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలో కలసి నడవాలని భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్), బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) నిర్ణయించాయి. పొత్తు విధివిధానాలు, సీట్ల సర్దుబాటు అంశాలపై బుధవారం లోతుగా చర్చించాలని ఇరు పార్టీల అధ్యక్షులు నిర్ణయానికి వచ్చారు. చర్చల సారాంశాన్ని బీఎస్పీ జాతీయ అధ్యక్షురాలు మాయావతికి వివరించి ఆమోదం పొందిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడించనున్నారు. ఈ మేరకు బీఆర్ఎస్ అధ్యక్షుడు, కె.చంద్రశేఖర్‌రావు, బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ మంగళవారం సంయుక్త ప్రకటన చేశారు. కేసీఆర్‌తో ప్రవీణ్ భేటీ.. నాగర్‌కర్నూలు లోక్‌సభ స్థానం నుంచి పోటీలో ఉంటానని ప్రకటించిన ప్రవీణ్‌కుమార్ మంగళవారం ఉదయం అనూహ్యంగా నందినగర్‌లోని కేసీఆర్ నివాసానికి చేరుకున్నారు. ఆయన వెంట బీఎస్పీ ప్రధాన కార్యదర్శి విజయ్ ఆర్య, ఉపాధ్యక్షుడు దయానంద్‌రావు ఉన్నారు. వారికి రాజ్యసభ ఎంపీ జె.సంతోష్ కుమార్ స్వాగతం పలికారు. కేసీఆర్‌తో భేటీలో మాజీ మంత్రులు హరీశ్‌రావు, వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ తదితరులు పాల్గొన్నారు. సుమారు 3 గంటలపాటు జరిగిన ఈ భేటీలో జాతీయ, రాష్ట్ర రాజకీయాలకు సంబంధించిన పలు అంశాలపై చర్చ జరిగింది. కేసీఆర్‌తో కలసి ప్రవీణ్ కుమార్, ఇతర నేతలు మధ్యాహ్న భోజనం చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో కలసి పోటీ చేయాలనే సూత్రప్రాయ అంగీకారం కుదిరిన నేపథ్యంలో కేసీఆర్, ప్రవీణ్ సంయుక్తంగా మీడియాతో మాట్లాడారు. సిద్ధాంతపరంగా సారూప్యత ఉంది: కేసీఆర్ ‘వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణలో బీఆర్ఎస్, బీఎస్పీ కలసి పనిచేయాలని నిర్ణయించుకున్నాం. సిద్ధాంతపరంగా ఇరు పార్టీల నడుమ సారూప్యత ఉంది. మేము అమలు చేసిన దళితబంధు, దళిత సంక్షేమం, రెసిడెన్షియల్ పాఠశాలలు, బలహీనవర్గాల అభ్యున్నతి తదితరాల ఆధారంగా ఒక ప్రతిపాదన వస్తే ఇద్దరం కలసి చర్చించాం. బీఎస్పీ హైకమాండ్ అనుమతితో చర్చించి కలసి పనిచేయాలని స్థూలంగా ఒక నిర్ణయానికి వచ్చాం. మిగతా విషయాలు ఒకట్రెండు రోజుల్లో వెల్లడిస్తాం. ఎవరు ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలనే అంశంపై బుధవారం చర్చిస్తాం. పొత్తుపై అవగాహన ఏర్పడిన నేపథ్యంలో గౌరవప్రదంగా సీట్ల పంపిణీ ఉంటుంది. నేను ఇప్పటివరకు బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతితో మాట్లాడలేదు. కానీ ఆమెతో ఉన్న పాత పరిచయాన్ని దృష్టిలో పెట్టుకొని నేను కూడా మాట్లాడతా’అని కేసీఆర్ తెలిపారు. రాజ్యాంగం రద్దుకు బీజేపీ కుట్ర: ఆర్.ఎస్. ప్రవీణ్ ‘కేసీఆర్‌ను కలవడం ఆనందంగా ఉంది. తెలంగాణతోపాటు దేశవ్యాప్తంగా లౌకికత్వం ప్రమాదంలో ఉంది. లౌకికత్వాన్ని దెబ్బతీసేందుకు రాజ్యాంగాన్ని రద్దు చేసేందుకు బీజేపీ పెద్ద ఎత్తున కుట్రలు చేస్తోంది. లౌకిక భావాలతో నిరంతరం లౌకికవాదాన్ని కాపాడిన బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్‌ను మాయావతి ఆశీస్సులతో కలిశా. తెలంగాణలో రాజ్యాంగం, లౌకికత్వానికి ప్రమాదం పొంచి ఉంది. లౌకికత్వాన్ని దెబ్బతీసే విషయంలో కాంగ్రెస్ కూడా బీజేపీలాగానే మారుతోంది. ఇరు పార్టీల ముప్పు నుంచి తెలంగాణను కాపాడేందుకు కలసి పనిచేయాలని నిర్ణయించుకున్నాం. సీట్ల సర్దుబాటు విషయంలో మా అధిష్టానానికి నివేదిస్తాం. ఇరు పార్టీల స్నేహం తెలంగాణలో ప్రజల జీవితాలను మారుస్తుంది. మా స్నేహాన్ని ప్రజలు ఆశీర్వదిస్తారు. ఇక్కడి ప్రజల విలువలు, గంగా–జమునా తహజీబ్ సంస్కృతిని కాపాడతాం. బహుజన వర్గాల జీవితాలు కూడా బాగుపడతాయి. రేవంత్ ప్రభుత్వంపట్ల నిరుద్యోగులు సంతోషంగా లేరు. పట్టుమని 4 నెలలు కాకముందే రోడ్డెక్కే పరిస్థితి ఉంది’అని ఆర్.ఎస్. ప్రవీణ్ పేర్కొన్నారు. -
బీఆర్ఎస్తో బీఎస్పీ పొత్తు
సాక్షి, హైదరాబాద్: పార్లమెంట్ ఎన్నికల కోసం తెలంగాణలో బీఆర్ఎస్, బీఎస్పీ పొత్తు ఖరారైంది. కలిసి పోటీ చేయాలని ఇరు పార్టీల నేతలు నిర్ణయించుకున్నారు. ఈ మేరకు అధినేత, మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావును బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ కలిసి పొత్తుపై చర్చించారు. అయితే.. తెలంగాణను కాపాడేందుకే బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకుంటున్నామని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ అన్నారు. మంగళవారం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌తో కలిసి ఆయన మీడియా ముందు మాట్లాడారు. బీఆర్ఎస్, బీఎస్పీ చాలా అంశాల్లో కలిసి పని చేసింది. అందుకే లోక్‌సభ ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని నిర్ణయించాం. కేవలం ఆర్ఎస్ ప్రవీణ్‌తోనే ఇప్పడు మాట్లాడాం. రేపు బీఎస్పీ అధినేత్రి మాయవతితో మాట్లాడతా. కచ్చితంగా కలిసి పోటీ చేస్తాం. సీట్ల పంపకాలపై త్వరలోనే ప్రకటన చేస్తాం అని కేసీఆర్ చెప్పారు. ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ మాట్లాడుతూ.. నాలుగు నెలలు కాకముందే కాంగ్రెస్ పై ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది. బీజేపీ, కాంగ్రెస్‌తో రాజ్యాంగానికి ముప్పు ఉంది. రాజ్యాంగాన్ని రద్దు చేసే కుట్ర జరుగుతోంది. ఆ రెండు పార్టీలను కట్టడి చేయాల్సిన అవసరం ఉంది. మా స్నేహం తెలంగాణ ను పూర్తిగా మారుస్తుంది అని అన్నారు. నాగర్‌కర్నూల్ నుంచి పోటీ? ఇక పొత్తు ఖరారు నేపథ్యంలో.. లోక్‌సభ ఎన్నికల్లో నాగర్ కర్నూల్ పార్లమెంట్ స్థానం నుంచి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ పోటీ చేయబోతున్నారనే ప్రచారం తెరపైకి వచ్చింది. మంగళవారం కేసీఆర్ అధ్యక్షతన మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ పార్లమెంటరీ స్థాయి సమావేశం జరిగింది. అయితే.. మహబూబ్ నగర్ లోక్‌సభ అభ్యర్థిగా సిట్టింగ్ ఎంపీ మన్నె శ్రీనివాసరెడ్డి పేరును కేసీఆర్ అధికారికంగా ప్రకటించారు. కానీ, నాగర్ కర్నూల్ పార్లమెంటరీ స్థానం సమావేశం మాత్రం జరగలేదు. రెండ్రోజుల తర్వాత సమావేశం ఉంటుందని చివరి నిమిషంలో ప్రకటించడంతో.. అక్కడి కీలక నేతలు తెలంగాణ భవన్ నుంచి వెనుదిరగాల్సి వచ్చింది. దీంతో.. ప్రవీణ్‌కుమార్ పేరు పరిశీలన కోసమే ఈ మీటింగ్ వాయిదా పడి ఉండొచ్చన్న సంకేతాలు బలపడుతున్నాయి. ఇదిలా ఉంటే.. నాగర్ కర్నూల్ సిట్టింగ్ ఎంపీ రాములు బీఆర్ఎస్కు గుడ్‌బై చెప్పి.. బీజేపీలో చేరారు. ఇటీవల బీజేపీ ప్రకటించిన లోక్‌సభ అభ్యర్థుల తొలి జాబితాలో రాములు తనయుడు భరత్‌కు నాగర్ కర్నూల్ సీటు కేటాయించింది కమలం పార్టీ. మరోవైపు కాంగ్రెస్ నుంచి ఈ స్థానానికి గట్టి పోటీనే ఉంది. అయితే.. సీనియర్ నేత మల్లు రవిని పార్టీ బరిలో నిలిపే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. బీఆర్ఎస్ అధినేత శ్రీ కేసీఆర్ గారితో నంది నగర్ నివాసంలో మర్యాదపూర్వకంగా భేటీ అయిన బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, ఆ పార్టీ ప్రతినిధుల బృందం. pic.twitter.com/bynXDHVXMB — BRS Party (@BRSparty) March 5, 2024 -
మధ్యప్రదేశ్‌లో బీఎస్పీ నేత దారుణ హత్య
మధ్యప్రదేశ్‌లోని ఛతర్పూర్లో బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) నేత హతమయ్యాడు. సాగర్ రోడ్డులోని మ్యారేజ్ గార్డెన్ సమీపంలో బీఎస్పీ నేత మహేంద్ర గుప్తా తలపై దుండగులు తుపాకీతో కాల్పులు జరిపినట్లు జిల్లా ఎస్పీ అమిత్ సంఘీ మీడియాకు తెలిపారు. మహేంద్ర గుప్తా ఘటనా స్థలంలోనే మృతి చెందాడని పేర్కొన్నారు. నిందితులు అక్కడి నుంచి పారిపోయారని తెలిపారు. ఈ హత్య కేసుపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నిందితుల కోసం గాలిస్తున్నారు. ఇషానగర్ పట్టణానికి చెందిన మహేంద్ర గుప్తా 2023 మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బిజావర్ స్థానం నుంచి బీఎస్పీ టికెట్‌పై పోటీ చేశారు. 10,400 ఓట్లతో మూడో స్థానంలో నిలిచారు. ఓ వివాహ వేడుకకు హాజరయ్యేందుకు గుప్తా ఛతర్పూర్కు వచ్చినట్లు తెలుస్తోంది. బీఎస్పీ నేత మహేంద్ర గుప్తా వ్యక్తిగత సెక్యూరిటీ గార్డు అబ్దుల్ మన్సూరీ మాట్లాడుతూ ఓ వ్యక్తి బైక్‌పై వచ్చి, కాల్పులు జరిపాడని తెలిపారు. దాడి చేసిన వ్యక్తిని పట్టుకునేందుకు తాను చేసిన ప్రయత్నం విఫలమయ్యిందన్నారు. తాను దాడి చేసిన వ్యక్తిని చూశానని, అతనిని గుర్తించగలనని అన్నారు. -
లోక్‌సభ ఎన్నికల వేళ.. బీఎస్పీకి షాక్
లక్నో: బహుజన్ సమాజ్‌వాదీ పార్టీ(బీఎస్పీ) ఎంపీ రితేష్ పాండే బీఎస్పీ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. మామావతి నేతృత్వంలోని బీఎస్పీ పార్టీకి రాజీనామా చేసినట్లు ఎంపీ రితేష్ పాండే.. ఆదివారం సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఆయన ఉత్తరప్రదేశ్‌లోని అంబేద్కర్‌నగర్ నుంచి లోక్‌సభ బీఎస్పీ ఎంపీగా ప్రాతినిధ్యం వస్తున్నారు. లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆయన బీఎస్పీ రాజీనామా చేయటంతో బీజేపీలో చేరుతారన్న ఊహాగానాలు ఊపందుకున్నాయి. बहुजन समाज पार्टी की प्राथमिक सदस्यता से त्यागपत्र pic.twitter.com/yUzVIBaDQ9 — Ritesh Pandey (@mpriteshpandey) February 25, 2024 ఉత్తరప్రదేశ్ లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో సహకరించిన బీఎస్పీ పార్టీ నేతలు,కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. ‘చాలా కాలంగా నాకు పార్టీలో ఎటువంటి గుర్తింపు లభించటం లేదు. పార్టీ సమావేశాల్లో కూడా నాకు సీనియర్ నేతలు తగిన ప్రాధాన్యత ఇవ్వటం లేదు. అయనా.. నా నియోజకర్గం ప్రజలు, పార్టీ కార్యకర్తలతో సమావేశం అవుతూ ఉన్నా. ఇక పార్టీని నా సేవలు అవసరం లేదని భావిస్తున్నా. అందుకే పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నా’ అని ఎంపీ రితేష్ పాండే తెలిపారు. మరోవైపు ఎంపీ రితేష్ పాండే బీజేపీ చేరుతారని ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి. 10 రోజుల క్రితం ప్రధాన మంత్రి నరేంద్రమోదీని కలిసిన పాండే.. ఒక సోషల్ మీడియా పోస్ట్‌లో మోదీని ప్రశంసిస్తూ పోస్టులు పెట్టారు. దీంతో ఆయన బీజేపీలో చేరుతారని చర్చ జరుగుతోంది. బీజేపీలో చేరిన రితేష్ పాండే బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్సీ)కి రాజీనామా చేసిన అంబేద్కర్ నగర్ లోక్‌సభ నియోజకవర్గ ఎంపీ రితేష్ పాండే ఉత్తరప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి బ్రజేష్ పాఠక్ సమక్షంలో బీజేపీలో చేరారు. -
మా పిల్లల ప్రాణాలకు గ్యారంటీ ఇవ్వండి
సూర్యాపేట రూరల్: సీఎం రేవంత్‌రెడ్డి ఆరు గ్యారంటీల పథకాల కంటే ముందు రాష్ట్రంలోని గురుకుల పాఠశాలల్లో చదువుతున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలైన తమ పిల్లల ప్రాణాలకు గ్యారంటీ ఇవ్వాలని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కోరారు. సూర్యాపేట జిల్లా సూర్యాపేట మండలంలోని ఇమాంపేట గురుకుల పాఠశాలలో వైష్ణవి మృతికి పాఠశాల ప్రిన్సిపాల్, ఆర్సీఓలే కారణమని తల్లిదండ్రులు ఆ పాఠశాల వద్ద ఆందోళనకు దిగారు. ఈ ఆందోళనకు ప్రవీణ్ కుమార్ హాజరై తల్లిదండ్రులను ఓదార్చిన అనంతరం మాట్లాడారు. ‘సీఎం ఆరు గ్యారంటీలు అమ లు చేయకపోయినా మాకు నష్టం లేదు. ఇందు కోసమేనా కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దెదించి మిమ్మ ల్ని అధికారంలోకి తీసుకొచ్చింది. ఆదాయం వచ్చే శాఖలకు మంత్రులను కేటాయించారే గానీ గిరి జన సంక్షేమ శాఖకు ప్రత్యేక మంత్రిని కేటాయించకపోవడం బాధాకరం. భువనగిరి గురుకులంలో ఇద్దరు విద్యార్థినులు చనిపోతే రెండు నిమిషాలు కూడా మౌనం పాటించకపోవడం హేయమైన చర్య’ అని ఆవేదన వ్యక్తంచేశారు. వైష్ణవి మృతిపై విచారణ జరిపి ఘటనకు బాధ్యులైన వారిని సస్పెండ్ చేయాలన్నారు. మృతురాలి కుటుంబానికి రూ.కోటి ఎక్స్‌గ్రేషియా ప్రకటించి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని కోరారు. 3 గంటలకు పైగా ఆందోళన కొనసాగ డంతో 3 కి.మీ. మేర ట్రాఫిక్ స్తంభించింది. కలెక్టర్ పాఠశాల వద్దకు రావాలని నినాదాలు చేశారు. విషయం తెలుసుకున్న జిల్లా అదనపు కలెక్టర్ వెంకట్‌రెడ్డి, డీఎస్పీ నాగభూషణం, సీఐ రాజశేఖర్‌తో పాటు మరో ఇద్దరు సీఐలు, ఎస్సైలు గురుకుల పాఠశాల వద్దకు వచ్చారు. వైష్ణవి కుటుంబానికి న్యాయం చేస్తామని ప్రవీణ్‌కుమార్‌కు వెంకట్‌రెడ్డి హామీ ఇచ్చి ఆందోళనను విరమింపజేశారు. -
Mayawati: మీ సంగతి చూసుకోండి
లక్నో: బీఎస్పీపై ఇష్టారాజ్యంగా విమర్శలు చేసే ముందుకు ఆత్మపరిశీలన చేసుకోవాలని సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్‌కు మాయావతి సూచించారు. బీఎస్పీని ఇండియా కూటమిలో చేర్చుకుంటారా అని మీడియా ప్రశ్నించగా ఎన్నికల తర్వాత పొత్తులు మార్చే అలవాటున్న మాయావతి పార్టీని ఎవరు నమ్ముతారని అఖిలేశ్ ప్రశ్నించారు. వీటిపై మాయా మండిపడ్డారు. బీజేపీని బలోపేతం చేస్తూ, వారితో అంటకాగుతున్న అఖిలేశ్ ప్రతిష్ట మంటగలిసిందని విమర్శించారు. 2019 ఎన్నికల ముందు, తర్వాత ప్రధాని మోదీని నాటి ఎస్పీ చీఫ్ ములాయం సింగ్ యాదవ్ ఆశీర్వదించారని గుర్తు చేశారు. -
‘మాయావతిని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించండి.. కూటమిలో చేరుతాం’
రాబోయే 2024 పార్లమెంట్ సార్వత్రిక ఎన్నికల్లో బహుజన్ సమాజ్ వాదీ పార్టీ అధినేత్రి మాయావతిని ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించాలని ఆ పార్టీ ఎంపీ మాలూక్‌నగర్ డిమాండ్ చేశారు. తాము ఇండియాలో కూటమి చేరాలంటే బీఎస్పీ చీఫ్ మాయావతిని ప్రధాన మంత్రి అభ్యర్థిగా ప్రకటించాలని షరతు పెట్టారు. కాంగ్రెస్ కూటమిలో భాగంగా ఏఐసీసీ అధ్యక్షుడు మళ్లికార్జున ఖర్గేను.. ప్రధానమంత్రిగా పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రతిపాదించిన విషయం తెలిసిందే. తమ పార్టీ ఎమ్మెల్యేల విషయంలో కాంగ్రెస్ పార్టీ.. మాయావతికి క్షమాపణ చెప్పాలన్నారు. అదేవిధంగా మాయావతిని ప్రతిపక్షాల ప్రధాని అభ్యర్థిగా ప్రకటించాలని డిమాండ్ చేశారు మాలూక్‌నగర్. అలా అయితే ఇండియా కూటమి 2024లో బీజేపీని ఎదుర్కొగలదని అన్నారు. ప్రధాని అభ్యర్థిగా దళిత సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న వారిలో మాయావతికి ప్రత్యామ్నాయ వ్యక్తి ఎవరూ లేరని తెలిపారు. కాంగ్రెస్ తమ షరతులకు అంగీకరం తెలుపుతుందని మాయావతి సానుకూలంగా ఉందన్నారు. తమకు ఉత్తరప్రదేశ్‌లో 13.5 శాతం ఓట్ల షేరు ఉందని, అది పెరిగే అవకాశం కూడా ఉన్నట్లు తెలిపారు. మాయావతిని ప్రధాని అభ్యర్థిగా ప్రకటిస్తే.. 60 కంటే ఎక్కువ ఎంపీ సీట్లను బీఎస్పీ గెలుచుకుంటుందని అన్నారు. బీఎస్పీకి, ఎస్పీకి మధ్య విభేదాలు ఉన్నాయన్న ప్రచారాన్న మాలూక్ నగర్ ఖండించారు. ఇండియా కూటమిలో మాయావతి చేరుతానంటే ఎస్పీ నేత అఖిలేష్ యాదవ్ ఎటువంటి అభ్యంతరం తెలపరని అన్నారు. మాయావతి పట్ల అఖిలేష్ యాదవ్ అసంతృప్తిగా ఉన్నారన్న ప్రచారంలో నిజం లేదని ఆయన స్పష్టం చేశారు. చదవండి: ఖతార్‌లో ఉరిశిక్ష పడిన భారత నేవీ మాజీ అధికారులకు ఊరట.. -
బహుజనవాదం .. బహుదూరం
సాక్షి, హైదరాబాద్/ ఆసిఫాబాద్: బహుజన సమాజ్ పార్టీకి మరోసారి చుక్కెదురైంది. బహుజనవాదం నినాదంతో రాష్ట్రంలో కొన్ని సీట్లతో పాటు మెరుగైన ఓట్ల శాతం సాధించాలని కలలుగన్న బీఎస్పీ ఆశలు నీరుగారి పోయాయి. ఐపీఎస్ అధికారిగా స్వచ్చంద పదవీ విరమణ పొంది బీఎస్పీ సారథ్య బాధ్యతలు తీసుకొన్న ఆర్.ఎస్. ప్రవీణ్‌కుమార్ సారథ్యంలో 108 స్థానాల్లో పోటీ చేసిన బీఎస్పీకి రెండు చోట్ల మాత్రమే డిపాజిట్ దక్కింది. అందులో ఒకటి ప్రవీణ్‌కుమార్ పోటీ చేసిన సిర్పూరు కాగా, రెండోస్థానం పటాన్చెరు. సిర్పూరులో గెలుపుపై ఆశలు రేకెత్తించిన ప్రవీణ్‌కుమార్‌కు లభించిన ఓట్లు 44,646. ఇక్కడ అనూహ్యంగా పుంజుకున్న బీజేపీ అభ్యర్థి పాల్వాయి హరీశ్‌బాబు విజయం సాధించగా, ప్రవీణ్ కుమార్ మూడో స్థానానికి పరిమితమయ్యారు. దళిత, గిరిజన బహుజనుల ఓట్లపై గంపెడాశెలు పెట్టుకున్న ప్రవీణ్‌కుమార్ స్థానికేతరుడు కావడం కూడా ఇక్కడ ఆయన విజయావకాశాలను దెబ్బతీసినట్లు రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న కోనేరు కోనప్పను తెలంగాణేతరుడుగా ప్రచారం చేయడంలో ప్రవీణ్‌కుమార్ విజయం సాధించినప్పటికీ, హరీశ్‌బాబు స్థానికుడు కావడంతో ఓట్లన్నీ గంపగుత్తగా పోలయినట్లు తెలుస్తోంది. కాగా పటాన్చెరులో చివరి నిమిషంలో బీఎస్పీ టికెట్టుపై పోటీ చేసిన కాంగ్రెస్ రెబల్ నీలం మధుకు 46,162 ఓట్లు మాత్రమే లభించి మూడోస్థానానికి పరిమితమయ్యారు. ఇక్కడ బీఆర్ఎస్ అభ్యర్థి గూడెం మహిపాల్ రెడ్డి 7వేల పైచిలుకు ఓట్లతో విజయం సాధించగా, కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన కాటా శ్రీనివాస్ గౌడ్ రెండోస్థానంలో నిలిచారు. ఇక ప్రవీణ్‌కుమార్ సోదరుడు ప్రసన్న కుమార్ స్వచ్చంద విరమణ చేసి ఆలంపూర్ నుంచి పోటీ చేయగా, కేవలం 4,711 ఓట్లు మాత్రమే లభించాయి. వీరు కాకుండా పెద్దపల్లి నుంచి పోటీ చేసిన దాసరి ఉష 10,315 ఓట్లు సాధించగా, సూర్యా పేటలో వట్టి జానయ్యకు 13,907 ఓట్లు దక్కా యి. చొప్పదండి నుంచి పోటీ చేసిన శేఖర్‌కు 5,153 ఓట్లు లభించాయి. ఇలా మరికొన్ని స్థానాల్లో స్వ ల్పంగా ఓట్లు మాత్రమే సాధించి బహుజనవాదం వినిపించడంలో ఆ పార్టీ విఫలమైంది. ప్రవీణ్‌కుమార్‌కు నిరాశ బహుజన వాదం నినా దంతో కుమురంభీంజిల్లా సిర్పూర్ నియోజక వర్గంలో పాగా వేయా లని ఆశపడిన బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమా ర్కు నిరాశ తప్పలేదు. దళితులు, గిరిజనులు, బుద్ధిస్టుల ఓట్లు అధికంగా ఉన్న ఈ నియోజకవర్గం నుంచి కచ్చితంగా గెలుస్తామనే ధీమాతో ఆర్ఎస్పీ పోటీకి మొగ్గు చూపారు. పోలింగ్ సరళిని బట్టి ఆ పార్టీకి అధిక సంఖ్యలో ఓట్లు పడ్డాయని విశ్లేషకులు భావించారు. అయితే ఆ పార్టీ నాయకులు వేసిన అంచనాలు తారుమారయ్యాయి. -
ప్రజాగొంతుకనై ఉంటా!
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల అనంతరం కొత్త ప్రభుత్వ ఏర్పాటులో బీఎస్పీ పాత్ర కీలకం అవుతుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ అన్నారు. ఐపీఎస్ అధికారిగా ఏడేళ్ల సర్విస్‌ను వదులుకొని రాజకీయాల్లోకి వచ్చి ప్రజల గొంతుకగా మారిన తాను ఎన్నికల అనంతరం కూడా అదేవిధంగా ఉంటానని అన్నారు. ఎన్నికల ప్రచారం ముగిసిన నేపథ్యంలో ఆయ న మంగళవారం ‘సాక్షి’తో మాట్లాడారు. రాష్ట్రంలోని 111 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్న బీఎస్పీ అధికార, ప్రతిపక్ష పార్టీలకు గట్టిపోటీ ఇస్తుందన్నారు. చాలా నియోజకవర్గాల్లో అనూహ్య విజయాలు సాధించబోతున్నామని చెప్పారు. అధికార బీఆర్ఎస్తోపాటు కాంగ్రెస్, బీజేపీల ధనబలాన్ని తట్టుకొని బీఎస్పీ అభ్యర్థులు ధీటైన పోటీ ఇస్తున్నారని చెప్పారు. సిర్పూరులో తనతోపాటు చాలా జిల్లాల్లో బీఎస్పీ అభ్యర్థులు విజయం సాధించబోతున్నారని ధీమా వ్యక్తం చేశారు. నిరుద్యోగుల పక్షాన నిలిచిన బీఎస్పీకి రాష్ట్రంలోని 30 లక్షల మంది నిరుద్యోగులు అండగా నిలిచారన్నారు. ఆదివాసీల పోడుభూముల కోసం పోరుబాట పట్టిన విషయాన్ని గుర్తుచేశారు. దళిత, గిరిజన, బీసీ వర్గాలతోపాటు ఆర్థికంగా వెనుకబడ్డ అగ్రవర్ణాల కోసం రెండేళ్లుగా రాజకీయ పోరాటం సాగిస్తున్నానని చెప్పారు. ఈ ఎన్నికల్లో అన్నివర్గాల ప్రజలు అత్యధిక స్థానాల్లో బీఎస్పీ అభ్యర్థులను గెలిపించి ఆదరిస్తారని భావిస్తున్నట్లు చెప్పారు. గెలిచిన తరువాత ప్రభుత్వ ఏర్పాటులో కీలకపాత్ర పోషించడంతోపాటు ప్రజల జీవన ప్రమాణాలు మెరుగయ్యేందుకు, నిరుద్యోగులకు న్యాయం జరిగేందుకు పోరాడతానని చెప్పారు. -
అందరి తెలంగాణగా మార్చడమే లక్ష్యం
సాక్షి, హైదరాబాద్: కొందరి తెలంగాణను అందరి తెలంగాణ చేయడమే బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) లక్ష్యమని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెప్పారు. సాక్షి టీవీకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన పలు ప్రశ్నలకు సమాధానమిచ్చారు. రాష్ట్రాన్ని దొరల తెలంగాణ కాకుండా పేదల తెలంగాణగా మార్చాలనేది బీఎస్పీ ఆలోచన అని తెలిపారు. తెలంగాణలో దొరలు వదిలిపెట్టిన గడీలు గత తొమ్మిదేళ్లలో మళ్లీ పునర్నిర్మాణమయ్యాయని ఆయన విమర్శించారు. బాంచన్ కాల్మొక్త అనే సంస్కృతి తెలంగాణలో పోలేదని చెప్పారు. అన్ని వర్గాలను కలుపుకుంటాం... పేదల రాజ్యాధికారంతోనే బాంచన్ సంస్కృతి పూర్తిగా పోతుందని ప్రవీ ణ్‌కుమార్ స్పష్టం చేశా రు. స్పష్టమైన ప్రణాళిక తో అన్ని వర్గాలను కలుపుకొని కృషి చేస్తే రాజ్యాధికారం తప్పకుండా సాధ్యమవుతుందన్నారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో డబుల్ డిజిట్ సీట్లు సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. వీలైతే రాజ్యాధికారం చేపడతామని ఆశిస్తున్నట్లు చెప్పారు. జార్ఖండ్‌లో గతంలో స్వతంత్ర ఎమ్మెల్యేగా గెలిచిన మధు కోడా ముఖ్యమంత్రి అయిన విషయాన్ని ప్రవీణ్‌కుమార్ గుర్తుచేశారు. మాయావతి వల్లే యూపీలో బహుజనులకు రాజ్యాధికారం... దళితులు కేవలం ఎమ్మెల్యేలు, మంత్రులైతే సరిపోదని, స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకొనే స్థితిలో ఉంటేనే రాజ్యాధికారం వచ్చినట్లవుతుందని ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్‌లో మాయావతి సీఎం అయిన తర్వాతే బహుజనులకు రాజ్యాధికారం వచ్చిందన్నారు. మాయావతి హయాంలో దళితులకు భూముల పంపిణీ జరిగిందని, ఆమె ప్రభుత్వం మహిళలకు రక్షణ కల్పించిందని చెప్పారు. మాయావతి పాలన వల్ల రెండు, మూడు తరాల బహుజనులు బాగుపడ్డారని ఆయన తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేటులో కలిపి 10 లక్షల ఉద్యోగాలిస్తాం.. ముఖ్యమంత్రిని కలిసి తమ ఆలోచనలు పంచుకొనే అవకాశం రాష్ట్రంలో ఏ అధికారికీ లేదని ప్రవీణ్‌కుమార్ చెప్పా రు. స్పెషల్ చీఫ్ సెక్రటరీ స్థాయి అధికారులు సైతం కానిస్టే బుల్ ఆపితే ప్రగతి భవన్ గేటు వద్ద నుంచే వెనక్కి వెళ్లిన సందర్భాలున్నాని పేర్కొన్నారు. గురుకులాల సెక్రటరీగా వెళ్లిన వెంటనే తాను దళిత, నిమ్న, వెనుకబడిన, అణగారిన అనే పదాలను నిషేధించి స్వేరో అనే పదాన్ని తీసుకొచ్చానని తెలిపారు. తమ పార్టీ మేనిఫెస్టోలో పేర్కొన్న 10 లక్షల ఉద్యోగా ల హామీ మొత్తం ప్రభుత్వ ఉద్యోగాలు కాదని, ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాలన్నీ కలిపి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తా మని ఆయన వివరణ ఇచ్చారు. ఇవేగాక మరిన్ని విషయా లను ప్రవీణ్‌కుమార్ సాక్షి టీవీతో పంచుకున్నారు. -
అందరి తెలంగాణగా మార్చడమే లక్ష్యం : ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్
సాక్షి,హైదరాబాద్ : కొందరి తెలంగాణను అందరి తెలంగాణ చేయడమే బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) లక్ష్యమని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెప్పారు. సాక్షి టీవీకి ఇచ్చిన ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూలో ఆయన పలు ప్రశ్నలకు సమాధానమిచ్చారు. దొరల తెలంగాణ కాకుండా పేదల తెలంగాణగా మార్చుదామనేది బీఎస్పీ ఆలోచన అని తెలిపారు. తెలంగాణలో దొరలు వదిలిపెట్టిపోయిన గడీలు గడిచిన తొమ్మిదేళ్లలో మళ్లీ పునర్మిర్మాణమయ్యాయన్నారు. బాంచన్ కాల్మొక్త అనే సంస్కృతి తెలంగాణలో పోలేదని చెప్పారు. రాజ్యాధికారంతోనే బాంచన్ కాల్మొక్త సంస్కృతి పూర్తిగా పోతుందని ప్రవీణ్‌కుమార్ స్పష్టం చేశారు. స్పష్టమైన ప్రణాళికతో అన్ని వర్గాలను కలుపుకుని కృషి చేస్తే రాజ్యాధికారం తప్పకుండా సాధ్యమవుతుందన్నారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో డబుల్ డిజిట్ సీట్లు సాధించి, వీలైతే రాజ్యాధికారం చేపడతామని ఆశాభావం వ్యక్తం చేశారు. జార్ఖండ్‌లో మధుకోడా ఒక్కడే ఎమ్మెల్యే అయి ముఖ్యమంత్రి అయిన విషయాన్ని ప్రవీణ్‌కుమార్ గుర్తుచేశారు. దళితులు ఎమ్మెల్యేలు, మంత్రులు అయితే సరిపోదని, స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే స్థితిలో ఉంటేనే రాజ్యాధికారం వచ్చినట్లవుతుందన్నారు. ఉత్తరప్రదేశ్‌లో మాయావతి సీఎం అయిన తర్వాత బహుజనులకు రాజ్యాధికారంవచ్చిందన్నారు. మయావతి హయాంలో దళితులకు భూముల పంపిణీ జరిగిందని, మహిళలకు రక్షణ కల్పించిందని చెప్పారు. మాయావతి పాలన వల్ల బహుజనుల రెండు, మూడు తరాలు బాగుపడ్డాయని తెలిపారు. తెలంగాణలో ముఖ్యమంత్రిని కలిసి వారి ఆలోచనలు చెప్పుకునే అవకాశం తెలంగాణలో ఏ బ్యూరోక్రాట్‌కు లేదన్నారు. స్పెషల్ చీఫ్ సెక్రటరీ స్థాయి అధికారులు కానిస్టేబుల్ ఆపితే ప్రగతిభవన్ గేటు వద్ద నుంచే వెనక్కు వెళ్లిన సందర్భాలున్నాయన్నారు. గురుకులాల సెక్రటరీగా వెళ్లిన వెంటనే దళిత, నిమ్న, వెనుకబడిన, అణగారిన అనే పదాలను నిషేధించి స్వేరో అనే పదాన్ని తీసుకొచ్చానని తెలిపారు. బీఎస్పీ మేనిఫెస్టోలో పెట్టిన 10 లక్షల ఉద్యోగాలు మొత్తం ప్రభుత్వ ఉద్యోగాలు కాదని, ప్రభుత్వ,ప్రైవేట్ ఉద్యోగాల అన్నీ కలిపి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని క్లారిటీ ఇచ్చారు. ఇవేకాక మరిన్ని విషయాలను ప్రవీణ్‌కుమార్ సాక్షి టీవీతో పంచుకున్నారు. -
వారి వాగ్దానాలు నమ్మొద్దు
సాక్షి, పెద్దపల్లి: బీఆర్ అంబేడ్కర్‌కు భారతరత్న ఇవ్వకుండా అడ్డుకున్న పార్టీ కాంగ్రెస్ అని, కాన్షీరాం చనిపోతే కనీసం సంతాపదినం ప్రకటించని ఆ పార్టీని ఓడించాలని బీఎస్పీ జాతీయ అధ్యక్షురాలు మాయావతి అన్నారు. అంబేడ్కర్ రాసిన రాజ్యాంగంతోనే అణచివేతకు గురైన వర్గాలకు విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో అవకాశాలు వచ్చాయని చెప్పారు. మండల్ కమిషన్ సిఫారసులు అమలు చేయాలని దేశవ్యాప్తంగా కాన్షీరాంఉద్యమం చేయడంతోనే ఓబీసీలకు విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు దక్కాయని గుర్తుచేశారు. గురువారం పెద్దపల్లిలో నిర్వహించిన ఘీంకార బహిరంగ సభలో ఆమె మాట్లాడారు. సీఎం కేసీఆర్ దళిత వ్యతిరేకి అని, దళితులను కేసీఆర్ ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని మండిపడ్డారు. వారిని ఓటు బ్యాంకుగానే గుర్తిస్తూ రాజకీయంగా అణచివేస్తోందని దుయ్యబట్టారు. 1989లో తాను తొలిసారి ఎంపీగా గెలిచాక నాటి వీపీ సింగ్ ప్రభుత్వం తనకు కేంద్ర మంత్రి పదవి ఇస్తానంటే వద్దని చెప్పానని, మండల్ కమిషన్ సిఫారసులు అమలు చేయాలంటూ పట్టుబట్టి ప్రభుత్వం మెడలు వంచానన్నారు. దేశంలో బీఎస్పీ అధికారంలోకి వస్తేనే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు న్యాయం జరుగుతుందన్నారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఏ వర్గానికీ న్యాయం జరగలేదన్నారు. రాష్ట్రంలో కేసీఆర్ నియంతలా పాలిస్తూ ప్రజల హక్కులు కాలరాస్తున్నారని విమర్శించారు. చట్టసభల్లో మహిళలకు కల్పించిన 33 శాతం రిజర్వేషన్లలో ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించాలని ఆమె డిమాండ్ చేశారు. దళితుల అణచివేతలో భాగంగానే ప్రవీణ్ కుమార్, ఆయన కుమారుడు పునీత్‌పై పోలీసులు అక్రమంగా హత్యాయత్నం కేసులు నమోదు చేశారని ఆరోపించారు. ఉత్తరప్రదేశ్‌లో బీఎస్పీ నాలుగుసార్లు అధికారంలోకి వచ్చి పేదలకు భూములు పంచి, లక్షలాదిమంది యువతకు ఉపాధి అవకాశాలు కల్పించిందని చెప్పారు. తెలంగాణలో కూడా బీఎస్పీ అధికారంలోకి వస్తే అలాంటి పథకాలు అమలు చేసి బహుజనుల రాజ్యాన్ని నిర్మిస్తామని హామీ ఇచ్చారు. బీఆర్ఎస్ను ఓడించాలి: ప్రవీణ్ కుమార్ రాష్ట్రాన్ని దోచుకుంటున్న బీఆర్ఎస్ను ఓడించాలని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పిలుపునిచ్చారు. అమరుల త్యాగాలతో ఏర్పడ్డ తెలంగాణలో బహుజనుల ఓట్లతో గద్దెనెక్కిన కేసీఆర్ దోపిడీకి పాల్పడుతున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో పార్టీ పెద్దపల్లి అభ్యర్థి దాసరి ఉష, రామగుండం అభ్యర్థి అంబటి నరేశ్‌యాదవ్, మంథని అభ్యర్థి చల్లా నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ప్రగతిభవన్‌లో ఎంట్రీపై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంచలన కామెంట్స్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అమరవీరుల త్యాగాలను కళ్లారా చూశాను. తెలంగాణలో బాన్చన్ కల్చర్ సజీవంగా ఉందన్నారు బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. నన్ను హిందూ వ్యతిరేకి అంటూ అసత్య ప్రచారం చేస్తున్నారు అంటూ మండిపడ్డారు. కాగా, ఆర్ఎస్పీ తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. ‘ప్రగతి భవన్‌లోకి సీఎస్‌లకు ఎంట్రీ నిరాకరించిన సందర్భాలున్నాయి. అపాయిమెంట్ ఉంటేనే లోపలికి అనుమతించేవారు. చాలా మంది గంటలు గంటలు బయట వేచి చూడటం నాకు తెలుసు. ఏ విధంగా అభివృద్ధి చేయాలో అని అధికారులను ఏనాడూ అడగలేదు. అధికారులు చెప్పినా కేసీఆర్ పట్టించుకోలేదు. తెలంగాణలో అభిప్రాయాలు చెప్పుకునే స్వేచ్చ బ్యూరోక్రాట్స్‌కు లేదు. ఎంతమంది తెలంగాణ బిడ్డలకు కేటీఆర్ ఉద్యోగాలు ఇచ్చారు?. కుట్రలతో నాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. మాయావతి ఏడు లక్షల ఎకరాల భూమిని పంచారు. బడుగు, బలహీన, వెనుకబడిన అనే పదాలను నిషేధించాలి. మేం బీఫాంలు ఎప్పుడూ అమ్ముకోలేదు. మేము అధికారంలోకి వస్తే 10 లక్షల ఉద్యోగాలు సృష్టిస్తాం. అసత్యాన్ని అతికేలా చెప్పడే బీజేపీ సిద్ధాంతం. బీసీలకు అడుగడుగునా బీజేపీ ప్రభుత్వం అన్యాయం చేస్తోంది. స్వేరోస్ అంటే ఆకాశమే హద్దుగా అని అర్థం. అంకితభావంతో పనిచేసే వాళ్లను ఎప్పుడూ పార్టీ వదులుకోదు. పేద పిల్లలు ఎప్పుడూ కూలీలుగానే ఉండాలా?. బీఎస్పీ పార్టీకి డబుల్ డిజిట్లో సీట్లు వస్తాయి. పెద్ద కంపెనీల్లో ఒక్క పేదవాడైనా పెద్ద హోదాలో ఉన్నాడా?. ఈసారి 80 శాతం టికెట్లు మా పార్టీ వారికే ఇచ్చాం. ఏపీలో ఇంగ్లీష్ మీడియం బోధన నిర్ణయాన్ని సమర్థిస్తాను. మాతృభాషతో పాటు ఇంగ్లీష్ బోధనను ప్రమోట్ చేయాలి. ఇంగ్లీష్ మీడియం తీసుకువచ్చి ఏపీ ప్రభుత్వం మంచి పనిచేసింది. జీవితంలో ఎదగాలంటే ప్రతీ ఒక్కరికీ చదువు అవసరం. మన విద్యార్థులు అంతర్జాతీయ స్థాయిలో ఎదగాలి’ అంటూ కామెంట్స్ చేశారు. -
BSP అధ్యక్షుడిగా ఫస్ట్ పొలిటికల్ ఫైట్ లో పాస్ అవుతారా?
-
బహుజన వాదం బలపడేనా.. వినబడేనా?
ఉత్తరప్రదేశ్‌లో బలమైన రాజకీయశక్తిగా ఎదిగిన నాటినుంచి తెలుగునేలపై కాలు మోపాలని యత్నిస్తున్న బహుజన సమాజ్ పార్టీ ఈసారి మాత్రం ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకొంది. అందుకే ఏకంగా రాష్ట్రంలోని 119 నియోజకవర్గాలకు అభ్యర్థులను నిలిపింది. కేవలం ఎన్నికల సమయంలోనే వినిపించే బహుజనవాదాన్ని రెండేళ్లుగా జనాల్లోకి తీసుకెళ్లిన ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్. ప్రవీణ్‌కుమార్ ఈ దఫా బీఎస్పీ సత్తా చూపాలని పట్టుదలతో ఉన్నారు. అభ్యర్థుల ఎంపిక నుంచి ప్రచారం వరకు వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్న ప్రవీణ్ కుమార్ స్వయంగా ఆసిఫాబాద్ జిల్లా సిర్పూరు నుంచి సీనియర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్పను ఢీ కొంటున్నారు. పటాన్చెరు, సూర్యాపేట, పెద్దపల్లి, అలంపూర్, జహీరాబాద్, నకిరేకల్, వర్ధన్నపేట, పాలేరు వంటి పలు నియోజకవర్గాల్లో ప్రధాన పార్టీలకు బీఎస్పీ అభ్యర్థులు సవాల్ విసురుతున్నారు. ప్రధాన పక్షాలుగా ఉన్న బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలకు చెందిన అభ్యర్థుల అధికార, అర్ధబలం తట్టుకొని బీఎస్పీ అభ్యర్థులు చివరి వరకు ఎలా నిలబడతారన్నదే ప్రశ్న అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. బీఎస్పీ అంటే దళితుల పార్టీ అనే ముద్రను చెరిపివేసేందుకు ఆ పార్టీ రాష్ట్ర సారథి ప్రవీణ్ కుమార్ భారీ కసరత్తు చేశారు. ఐపీఎస్‌గా, గురుకులాల కార్యదర్శిగా వ్యవహరించిన సమయంలో ఉన్న సంబంధాలు ఆయనకు రాజకీయంగా ఉపయోగపడ్డాయనే చెప్పాలి. అగ్ర కులాలు మొదలుకొని 60 శాతం మంది బీసీలకు సీట్లిచ్చారు. ప్రవీణ్‌కుమార్ జనరల్ సీటు అయిన సిర్పూరు నుంచి పోటీ చేస్తుండడం గమనార్హం. బహుజన వాదమే ఎజెండాగా చెపుతున్న ఆయన అభ్యర్థుల ఎంపికలోనూ విలక్షతను చాటుకున్నారు. మంథనిలో చల్లా నారాయణరెడ్డి, నల్లగొండలో కోమటి సాయితేజ్ రెడ్డి, పెద్దపల్లిలో ఉష (పద్మశాలి), నిజామాబాద్‌లో షేక్ ఇమ్రాన్‌ఖాన్, సూర్యాపేటలో వట్టె జానయ్య (యాదవ), ఎల్బీనగర్– గువ్వ సాయి రామకృష్ణ ముదిరాజ్ ..ఇలా వివిధ వర్గాల వారికి సీట్లు ఇచ్చారు. వరంగల్ ఈస్ట్ నుంచి ట్రాన్స్‌జెండర్ చిత్రపు పుష్పిత లయకు సీటు కేటాయించడం ద్వారా రాష్ట్రంలో కొత్త సంప్రదాయానికి శ్రీకారం చుట్టారు. 1994 నుంచి బరిలో నిలుస్తున్నా... రాష్ట్రంలో 1994 శాసనసభ ఎన్నికల సమయంలోనే అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో బీఎస్పీ వ్యవస్థాపకుడు కాన్షీరాం, అధ్యక్షురాలు మాయావతి తమ పార్టీ తరపున అభ్యర్థులను నిలబెట్టినా ఫలితం దక్కలేదు. అప్పటి నుంచి అడపాదడపా ఎన్నికల సమయంలో బీఎస్పీ పోటీలో నిలబడడం, ఏనుగు గుర్తుపై అభ్యర్థులు పోటీ చేయడం జరుగుతూ వచ్చింది. 2004 ఎన్నికల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని పాడేరు నుంచి లాకే రాజారావు బీఎస్పీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. తెలంగాణ ఏర్పాటైన తరువాత 2014లో అప్పటి రాజకీయ సమీకరణాల దృష్ట్యా ప్రస్తుత మంత్రి ఎ.ఇంద్రకరణ్‌రెడ్డి నేతృత్వంలో పలువురు అభ్యర్థులు వివిధ నియోజకవర్గాల్లో పోటీ చేశారు నిర్మల్ నుంచి పోటీ చేసిన ఇంద్రకరణ్‌రెడ్డి, సిర్పూరు నుంచి బరిలో నిలిచిన కోనేరు కోనప్ప మాత్రమే విజయం సాధించారు. కానీ గెలిచిన వెంటనే బీఆర్ఎస్ (అప్పటి టీఆర్ఎస్) అధినేత కేసీఆర్ పిలుపు మేరకు అధికార పార్టీలో చేరారు. 2018 ఎన్నికల్లో బెల్లంపల్లి నుంచి పోటీ చేసిన ప్రస్తుత కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వినోద్ రెండోస్థానానికి పరిమితమయ్యారు. రాష్ట్రంలో బీఎస్పీపై ప్రవీణ్ ముద్ర ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా అలంపూర్‌కు చెందిన రేపల్లె శివ ప్రవీణ్‌కుమార్ 1995 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పోలీస్ అధికారిగా వివిధ హోదాల్లో పనిచేసిన ఆయన 2013 నుంచి 2021 జూలై నెలలో వాలంటరీ రిటైర్మెంట్ తీసుకునేంత వరకు ప్రభుత్వ గురుకులాల సంస్థ (స్వేరోస్) కార్యదర్శిగా సేవలు అందించారు. ప్రవీణ్‌కుమార్ అదే సంవత్సరం ఆగస్టులో మాయావతి సమక్షంలో బీఎస్పీలో చేరారు. ప్రభుత్వంలో లోటుపాట్లు, మంచి చెడులు తెలిసిన ఆయన బహుజనవాదం నినాదంతో బీఎస్పీని రాష్ట్రంలో బలమైన శక్తిగా తయారు చేసేందుకు తనవంతు ప్రయత్నం చేశారు. ఇందులో భాగంగా ఏడాది కాలం పాటు పాదయాత్ర జరిపి వేలాది గ్రామాలను చుట్టి వచ్చారు. సొంత నియోజకవర్గం అలంపూర్‌ను కాదని సిర్పూర్ నుంచి బీఎస్పీ అభ్యర్థిగా పోటీ చేస్తూ, మిగతా అన్ని నియోజకవర్గాలకు అభ్యర్థులను నిలిపారు. -పోలంపల్లి ఆంజనేయులు -
అధికారంలోకి వస్తే పది లక్షల ఉద్యోగాలు
వేములవాడ: బీఎస్పీ అధికారంలోకి వస్తే 10 లక్షల ఉద్యో గాలిచ్చి నిరుద్యోగులకు బాసటగా నిలుస్తామని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.ఎస్.ప్రవీణ్‌కుమార్ అన్నారు. ఇందులో మహిళలకే 5 లక్షల ఉద్యోగాలిస్తామని హామీ ఇచ్చా రు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో సోమవారం నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో ఆయన పాల్గొన్నా రు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఇక్కడ ప్రకృతి ఆగ్రహించి టెంట్లను కూల్చి వేసినట్లుగానే బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూకటివేళ్లతో పెకిలించేందుకు ప్రజలు సిద్ధమవుతున్నారన్నారు. ఏనాడూ రాని దొరలు ఇప్పుడు ఓటుకు రూ.2 వేలు ఇస్తామంటూ మన ఇంటికి వస్తున్నారన్నారు. ఒక్కసారి ఓటు అమ్ముకుంటే మన బిడ్డల భవిష్యత్‌ను బొంద పెట్టుకున్నట్లేనని హెచ్చరించారు. రాష్ట్రంలో బీఎస్పీ ప్రభుత్వం రాగానే భూమిలేని ప్రతీ నిరుపేదకు ఎకరం భూమి ఇస్తామని భరోసా ఇచ్చారు. కేసీఆర్ మూడెకరాలు ఇస్తామని నమ్మబలికి దళితులకు చెందిన 35 వేల ఎకరాల భూమిని కబ్జా చేశారని ఆరోపించారు. గల్ఫ్ బాధితుల కోసం రూ.500 కోట్లు కేటాయిస్తామన్న కేసీఆర్ వాగ్దానం ఎక్కడకు పోయిందని ప్రశ్నించారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే గల్ఫ్ బాధితులకోసం రూ.5 వేల కోట్లతో ప్రత్యేకంగా నిధిని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే కులాలవారీగా కాంట్రాక్టులు కేటాయిస్తామని తెలిపారు. రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతోందన్నారు. ఎమ్మెల్సీ కవిత అక్రమంగా రూ.100 కోట్లు ఢిల్లీకి పంపిందని, ఆమె రూ.20 లక్షల ఖరీదైన వాచ్ ధరిస్తుందని ఆరోపించారు. పార్టీ వేములవాడ అభ్యర్థి, విద్యావంతుడైన డాక్టర్ గోలి మోహన్‌కు కాకుండా ఎవరికి ఓటు వేసినా మీ జీవితాలు నాశనమేనన్నారు. కూలిన టెంట్లు.. పలువురికి గాయాలు సభ ప్రారంభంలో వేములవాడ అభ్యర్థి గోలి మోహన్ మాట్లాడుతున్న సమయంలో అకస్మాత్తుగా వచ్చిన సుడిగాలితో టెంట్లు కూలిపోయాయి. అనుకోని ఈ ఘటనతో పలువురు మహిళలు, జర్నలిస్టులు గాయపడ్డారు. క్షతగాత్రులను వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని కాంగ్రెస్ అభ్యర్థి ఆది శ్రీనివాస్, సీపీఐ నేత చాడ వెంకట్‌రెడ్డి పరామర్శించారు. -
Rajasthan elections 2023: ఏం ‘మాయ’ చేయనుందో...!
రాజస్తాన్‌లో హోరాహోరీ తలపడుతున్న అధికార కాంగ్రెస్, బీజేపీ గెలుపోటములను మాయావతి సారథ్యంలోని బీఎస్పీ మరోసారి ప్రభావితం చేసేలా కనిపిస్తోంది. దాంతో పోలింగ్ మరో పది రోజుల్లోకి వచ్చిన వేళ రాష్ట్రంలో రాజకీయం రసకందాయంలో పడింది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఏకంగా 30 అసెంబ్లీ స్థానాల్లో గెలుపోటములను బీఎస్పీ ప్రభావితం చేసింది. ఏకంగా 6 స్థానాలను దక్కించుకుంది. ఈ ఎన్నికల్లో ఏకంగా 60 స్థానాలే లక్ష్యంగా పావులు కదుపుతోంది. సాక్షి, న్యూఢిల్లీ కుల సమీకరణలతో... ► రాజస్తాన్ ఓటర్లలో 18 శాతం మంది ఎస్సీలు, 9 శాతం మంది ముస్లింలున్నారు. దాంతో ఉత్తర్‌ప్రదేశ్‌లో మాదిరిగానే ఇక్కడ కూడా దళిత–ముస్లిం ఫార్ములానే బీఎస్పీ నమ్ముకుంది. ► గత ఎన్నికల్లో ఇదే ఫార్ములాతో బీఎస్పీ 6 అసెంబ్లీ స్థానాలు నెగ్గడమే గాక 4 శాతం ఓట్లు రాబట్టింది. ► బీఎస్పీ ప్రభావం చూపిన మరో 30 స్థానాల్లో బీజేపీ ఏకంగా 17 స్థానాలను అతి తక్కువ మెజారిటీతో కాంగ్రెస్‌కు కోల్పోయింది. ► మరో మూడింట స్వతంత్రులు గెలిచారు. ఈ దెబ్బకు బీజేపీ అధికారాన్నే కోల్పోవాల్సి వచి్చంది. ► ఆ 17 స్థానాల్లో బీజేపీ గెలుచుంటే ఆ పార్టీ బలం 73 నుంచి 90 స్థానాలకు పెరిగేది. ► 100 సీట్లు నెగ్గిన కాంగ్రెస్ 83కు పరిమిత ► మయ్యేది. బీజేపీకి ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశాలు మెరుగ్గా ఉండేవి. ఈసారి కూడా... ► ఈసారి కూడా రాష్ట్రంలో 200 సీట్లకు గాను ఏకంగా 183 చోట్ల బీఎస్పీ బరిలో దిగింది. మిషన్–60 లక్ష్యంతో దూసుకెళ్తోంది. ► ఆ 60 స్థానాల్లో బలమైన సోషల్ ఇంజనీరింగ్ చేసింది. ఈ విషయంలో పార్టీ నిపుణుడైన రామ్‌జీ గౌతమ్ వ్యూహాలను అమలు చేస్తోంది. ► ధోల్పూర్, భరత్పూర్, కరౌలీ, సవాయి మధోపూర్, దౌసా, ఆళ్వార్, సికర్, ఝుంఝును, ఛురు, హనుమాన్‌గఢ్, గంగానగర్, బార్మేర్, జాలోర్, నగౌర్, జైపూర్ రూరల్ జిల్లాల్లోని 60 నియోజకవర్గాలపై ప్రధానంగా దృష్టి పెట్టి ప్రచారం చేస్తోంది. ► ఈ నెల 17 నుంచి 20 వరకు మాయావతి భరత్పూర్, అల్వార్, ఖేత్రి జిల్లాల్లో ఏకంగా 8 బహిరంగ సభల్లో పాల్గొననున్నారు. ► దాంతో గాలి తమకు మరింత అనుకూలంగా మారుతుందని బీఎస్పీ అభ్యర్థులు అంటున్నారు. -
కోనప్ప Vs ఆర్ఎస్ ప్రవీణ్ గా మారిన సిర్పూర్ రాజకీయం
సాక్షి, ఆసిఫాబాద్: జిల్లాలో శాసనసభ ఎన్నికలు సెగ పుట్టిస్తున్నాయి. మరీ ముఖ్యంగా సిర్పూర్ బరిలో నిలిచిన బీఆర్ఎస్, బీఎస్పీ అభ్యర్థులు ‘నువ్వా– నేనా’ అన్నట్లు సిగపట్లకు దిగుతుండటంతో నియోజకవర్గంలో పలుచోట్ల ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ప్రచారంలో భాగంగా ఇరు పార్టీల శ్రేణులు బాహాబాహీకి దిగుతుండటం ఘర్షణకు దారితీస్తోంది. అభ్యర్థులు ఏకంగా ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకునే స్థాయికి వెళ్లడంతో ఈ పరిణామాలు ఎక్కడికి దారితీస్తాయోనని రాజకీయ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆరోపణలు.. ప్రత్యారోపణలు రాష్ట్రంలోనే వరుస పరంగా నంబర్– 1 నియోజకవర్గమైన సిర్పూర్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, బీఎస్పీ పార్టీల మధ్య చతుర్ముఖ పోటీ నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ నియోజకవర్గంలో ఇప్పటికే మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన కోనేరు కోనప్ప నాలుగోసారి బరిలో ఉన్నారు. రావి శ్రీనివాస్, పాల్వాయి హరీశ్‌బాబు, ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ క్షేత్రస్థాయిలో ప్రచారం ముమ్మరం చేశారు. కాగా.. 2014లో కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వకపోవడంతో కోనేరు కోనప్ప బీఎస్పీ తరఫున ఎన్నికల్లో నిలబడి గెలిచి.. బీఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఇప్పుడు అదే బీఎస్పీ తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్(ఆర్ఎస్పీ) కోనప్పకు పోటీగా నిలబడ్డారు. కోనప్పను కచ్చితంగా ఓడించి తీరుతానని ఆర్ఎస్పీ ధీమా వ్యక్తం చేస్తున్నారు. చాపకింద నీరులా నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో బీఎస్పీ దూసుకెళ్లేలా ప్రణాళికలు రచించారు. గ్రామం, మండలం, పట్టణం.. ఇలా ఇంటింటా తిరుగుతూ అధికార పార్టీ వైఫల్యాలను ఎండగడుతున్నారు. ఒక దశలో ‘కోనేరు కోనప్ప.. కలప దొంగ’ అంటూ మీడియా ముందు తీవ్ర ఆరోపణలు చేయడం.. అందుకు కౌంటర్‌గా కోనప్ప ‘మర్డర్లు చేసిన ఘనత మాకే ఉంది. ఎన్కౌంటర్లు కూడా మేమే చేపించాం. పరిటాల రవిని మేమే చంపించాం. బెల్లంపల్లి, కరీంనగర్లో హత్యలు మేమే చేపించాం. ప్రవీణ్‌కుమార్ ఒక పొలిటికల్ టూరిస్ట్’ అంటూ ఆర్ఎస్పీపై ప్రత్యారోపణలు చేశారు. అప్పటి నుంచి ఇరువురి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు నెలకొన్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పార్టీ శ్రేణుల్లో ఘర్షణ వాతావరణం.. నియోజకవర్గంలో బీఆర్ఎస్, బీఎస్పీలకు చెందిన అభిమానులు, కార్యకర్తలు, నాయకులు వర్గాలుగా విడిపోయి ప్రచారంలో పాల్గొంటున్నారు. శ్రేణుల ప్రచారం తారస్థాయికి చేరడమే కాకుండా పలుచోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. ఈ నెల 11న కాగజ్‌నగర్ పట్టణంలోని బస్టాండ్ ఏరియాలో బీఎస్పీ కార్యకర్త షేక్ ఆసిఫ్‌ను బీఆర్ఎస్ నాయకుడు కోనేరు ఫణితోపాటు పలువురు ఆకారణంగా దాడిచేయడమే కాకుండా చంపుతామని బెదిరించినట్లు ఆరోపిస్తూ బాధితుడు ఆసిఫ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇటీవల పోలీసులు ఫణితోపాటు పలువురిపై కేసు సైతం నమోదు చేశారు. ఇక ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఆయా పార్టీల్లో ఉన్న అసంతృప్తులకు అభ్యర్థులు గాలం వేస్తుండటం.. భారీ ఆర్థిక ప్యాకేజీలు ఇచ్చి తమవైపు తిప్పుకోవడం పరిపాటిగా మారింది. పార్టీ ఫిరాయింపులు గెలుపోటములపై ప్రభావం చూపుతుండటంతో అభ్యర్థులు దీనిని తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఫలితంగా ప్రచారంలో ప్రత్యర్థులపై దాడులకు దిగడానికి సైతం వెనుకాడకపోవడంతో నియోజకవర్గంలో ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఆదివారం రాత్రి కాగజ్‌నగర్ పట్టణంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా విజయబస్తీలో ఇరు పార్టీల శ్రేణుల మధ్య ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. అనంతరం బీఆర్ఎస్ ప్రచార రథం డైవర్‌పై దాడి చేశారంటూ ఆ పార్టీ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేయడం.. తమ ప్రచారాన్ని అడ్డుకోవడమే కాకుండా అన్యాయంగా కేసు పెట్టారని నిరసన తెలుపుతూ బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్పీ కాగజ్‌నగర్ పోలీసు స్టేషన్లో బైఠాయించారు. పోలీసులు చివరకు ఇరువర్గాల అభ్యర్థులు, కార్యకర్తలపై కేసులు నమోదు చేయడంతో పరిస్థితులు సద్దుమణిగాయి. అయితే ఇలాంటివి పునరావృతమైతే మాత్రం నియోజకవర్గంలో ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించడం పోలీసులకు సవాలుగా మారనుంది. -
ఆ వివరాలు ఆఫిడవిట్లో.. పొందుపర్చలేదని.. బీఆర్ఎస్ అభ్యర్ధిపై దుమారం!
సాక్షి, జోగులాంబ: అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థుల నామినేషన్ల పరిశీలనలో దూమారం రేగింది. బీఆర్ఎస్ అభ్యర్ధి నామినేషన్‌పై ఇతర పార్టీల అభ్యర్థులు అభ్యంతరం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ అభ్యర్థి దాఖలు చేసిన నామినేషన్ పత్రాల్లో, ఆఫిడవిట్లో ఫిల్డ్ అసిస్టెంట్‌గా పని చేసిన వివరాలు పొందుపర్చలేదని ఫిర్యాదు చేశారు. దీంతో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉత్కంఠత కొనసాగింది. అలంపూర్ తహసీల్దార్ కార్యాలయంలోని అసెంబ్లీ ఎన్నికల బరిలో అభ్యర్థులు దాఖలు చేసిన నామినేషన్ పత్రాల పరిశీలన సోమవారం జరిగింది. ఈ సందర్భంగా నామినేషన్ దాఖలు చేసిన అభ్యర్థులు హాజరయ్యారు. బీఆర్ఎస్ అభ్యర్ధి విజయుడి నామినేషన్ పరిశీలన సమయంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి సంపత్ కుమార్, బీజేపీ అభ్యర్ధి రాజగోపాల్, బీఎస్పీ అభ్యర్ధి ప్రసన్న కుమార్‌తోపాటు ఇతర అభ్యర్థులు అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు తెలిపారు. బీఆర్ఎస్ అభ్యర్ధి విజయుడి నామినేషన్, ఆఫిడవిట్లో ఫిల్డ్ అసిస్టెంట్‌గా పని చేసిన వివరాలు, రాజీనామా చేసిన కాఫీని పొందపర్చలేదని ఎన్నికల నిబంధనల మేరకు తిరస్కరించాలని రిటర్నింగ్ అధికారిని కోరినట్లు తెలిపారు. కానీ బీఆర్ఎస్ అభ్యర్ధి నామినేషన్‌ను ఎన్నికల రిటర్నింగ్ అధికారిణి అమోదించినట్లు చెప్పారు. దీంతో అభ్యర్థులు కలిసి ఎన్నికల రిటర్నింగ్ అధికారికి లిఖీతపూర్వకంగా ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు. అదే సమయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారిణి బయటికి వెళ్లడానికి వాహనం వద్దకు రాగా వారు అడ్డుపడుతూ.. నామినేషన్‌ను తిరస్కరించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సాధరణ అబ్జర్వర్ వసంత్ కుమార్ అక్కడికి చేరుకున్నారు. దీంతో అక్కడ నిరసన వ్యక్తం చేస్తున్న అభ్యర్థులతో మాట్లాడారు. అభ్యర్థులు నామినేషన్ కేంద్రం వద్దనే ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉండటంతో ఉత్కంఠత కొనసాగింది. అనంతరం ఫిర్యాదు చేసిన అభ్యర్థులు బయటికి వచ్చి ప్లకార్డులను ప్రదర్శించారు. నామినేషన్ల పరిశీలనలో ఉత్కంఠత నెలకొనడంతో పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. అలంపూర్ సీఐ రాజు, శాంతినగర్ సీఐ శివకుమార్ గౌడ్లు ఎస్ఐలు, పోలీసులు బందోబస్తు నిర్వహించారు. డీఎస్పీ వెంకటేశ్వర్లు అక్కడికి చేరుకోని పర్యవేక్షించారు. ఇవి కూడా చదవండి: నామినేషన్ల పరిశీలన పూర్తికాగా.. ఎన్నికల సామగ్రి వచ్చేసింది! -
బీఎస్పీ అభ్యర్థిగా నీలం మధు
సాక్షి, హైదరాబాద్: బహు జన సమాజ్ పార్టీ అభ్య ర్థులు రాష్ట్రంలోని 119 ని యోజకవర్గాల్లో నామినేష న్లు దాఖలు చేశారు. శుక్రవారం పార్టీ 21 అసెంబ్లీ స్థానాలతో తుది జాబితాను ప్రకటించింది. రాష్ట్రంలో బీఎస్పీ తొలిసారి మొత్తం 119 నియోజకవర్గాల్లో పోటీ చేస్తోంది. కాగా, నాటకీయ పరిణామాల మధ్య పటాన్చెరు స్థానం నుంచి నీలం మధు బీఎస్పీ అభ్యర్థిగా బరిలోకి దిగారు. కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థిగా ఆయన పేరును మొదట ప్రకటించినప్పటికీ, తర్వాత ఆయన అభ్యర్థిత్వాన్ని చివరి నిమిషంలో మార్చడంతో మధు బీఎస్పీలో చేరారు. అవినీతి, కుటుంబ పాలనకు చరమగీతం: ప్రవీణ్‌కుమార్: తెలంగాణలో అవినీతి, కు టుంబ పాలనకు చరమగీతం పాడేందుకు ప్ర జలు సిద్ధంగా ఉన్నారని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షు డు ప్రవీణకుమార్ ఒక ప్రకటనలో పేర్కొన్నా రు. బహుజనుల రాజ్యాధికార కల సాకారం అ య్యే రోజు దగ్గర్లోనే ఉందని, బీఆర్ఎస్, కాంగ్రెస్‌లను జనం నమ్మడం లేదని అన్నారు. -
మరో 25 మందితో బీఎస్పీ మూడో జాబితా
సాక్షి, హైదరాబాద్: బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ) మూ డో విడత అభ్యర్థుల జాబితాను ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షు డు ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ శనివారం ప్రకటించారు. 25 మందితో కూడిన ఈ జాబితాతో ఇప్పటి వరకు బీఎస్పీ ప్రకటించిన అభ్యర్థుల సంఖ్య 88కు చేరింది. ప్రజల మధ్యన ఉండే వారినే బీఎస్పీ అభ్యర్థులుగా నిర్ణయించడం జరిగిందని ఈ సందర్భంగా ఆయన చెప్పారు. సిర్పూర్ నియోజకవర్గంలో తాను పోటీ చేస్తున్నానని, సిర్పూర్‌ను ఆంధ్ర వలస దారుని పాలన నుంచి విముక్తి కల్పించడమే తన ధ్యేయమన్నారు. 10న నామినేషన్ దాఖలు చేయనున్నట్లు చెప్పారు. కేసీఆర్‌ను పోటీకి అనర్హుడిగా ప్రకటించాలి 2018 శాసనసభ ఎన్నికల్లో గజ్వేల్ నుంచి శాసనసభ్యుడిగా పోటీ చేసిన సీఎం కేసీఆర్ అఫిడవిట్లో తన ఆస్తుల వివరాలను వెల్లడించలేదని ప్రవీణ్‌కుమార్ తెలిపారు. ఆర్టీఐ కింద గజ్వేల్ ఆర్డీవో నుంచి తాము తీసుకున్న వివరాల్లో కేసీఆర్ ఆస్తుల వివరాలు లేవని తెలిపారు. ఆస్తుల వివరాలు వెల్లడించని నామినేషన్‌ను ఆమోదించిన అప్పటి రిటర్నింగ్ అధికారిపై చర్యలు తీసుకోవడంతో పాటు ప్రజా ప్రాతినిధ్య చట్టాన్ని అపహాస్యం చేసిన కేసీఆర్‌ను మళ్లీ పోటీ చేయకుండా అనర్హుడిగా ప్రకటించాలని ఎన్నికల సంఘాన్ని కోరారు. ఈ మేరకు ఎన్నికల కమిషన్‌కు లేఖ రాస్తున్నట్లు చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అక్రమాలపై తాము మొదటి నుంచీ హెచ్చరిస్తున్నామనీ, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టుల భద్రతపై కూడా తమకు అనుమానాలున్నాయని, జనావాసాల మధ్య కట్టిన ఈ ప్రాజెక్టులకు ఏమైనా జరిగితే భారీగా ఆస్తి, ప్రాణ నష్టాలు తప్పవని ప్రవీణ్‌కుమార్ హెచ్చరించారు. -
వినిపిస్తోందా.. మూడో స్వరం
ప్రజాస్వామ్య సౌధమైన శాసనసభలో మూడో స్వరం వినిపించేందుకు ట్రాన్స్జెండర్లు ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. వరంగల్ తూర్పు సెగ్మెంట్ నుంచి బీఎస్పీ అభ్యర్థి గా పోటీ చేసేందుకు రామన్నపేటకు చెందిన చిత్రపు పుష్పిత లయకు తాజాగా అవకాశం లభించగా, గత ఎన్నికల్లో గోషామహల్ నుంచి బీఎల్ఎఫ్ అభ్యర్థి గా పోటీ చేసిన చంద్రముఖి కూడా ఈసారి ఇండిపెండెంట్‌గా బరిలో నిలిచేందుకు సన్నద్ధమవుతున్నారు. ఇక ట్రాన్స్జెండర్లతో పాటు ప్రజల్లో ఓటు అవగాహనకు రాష్ట్ర ఎన్నికల ప్రచార కర్తగా వరంగల్‌కు చెందిన ట్రాన్స్‌జెండర్ లైలాను రాష్ట్ర ఎన్నికల కమిషన్ నియమించింది. ఆమె తమ కమ్యూనిటీ వారు ఓటు నమోదు చేసుకునేందుకు అవగాహన కలిగిస్తున్నారు. – సాక్షిప్రతినిధి, వరంగల్/హైదరాబాద్ రాష్ట్రంలో సుమారు 50 వేల మందికి పైగా ట్రాన్స్జెండర్లు ఉన్నట్లు స్వచ్చంద సంస్థలు అంచనా వేస్తున్నాయి. కానీ ఓటర్లుగా నమోదైన వారి సంఖ్య మాత్రం చాలా తక్కువగా ఉంది. ట్రాన్స్జెండర్ల పట్ల సమాజం నుంచి ఎదురయ్యే వివక్ష, అవమానాలు, వేధింపుల కారణంగానే చాలామంది ‘మగవారు’గానే మనుగడ కొనసాగిస్తున్నట్టు ఆయా సంస్థలు చెబుతున్నాయి. అన్ని జీవన సమూహాల్లాగే ట్రాన్స్జెండర్లు కూడా స్వేచ్ఛా యుతమైన జీవనాన్ని కొనసాగించే హక్కును కలిగి ఉన్నట్లు గతంలో వెలువరించిన సుప్రీంకోర్టు తీర్పు వారికి గొప్ప ఆత్మస్థైర్యాన్ని కలిగించింది. మరోవైపు వివిధ స్వచ్చంద సంస్థలు, ప్రజాసంఘాలు, హక్కులసంఘాల నుంచి వారికి సంపూర్ణమైన మద్దతు, అండదండలు లభించాయి. దీంతో ట్రాన్స్ జెండర్లు సంఘటితమయ్యారు. తమ ఉనికిని బలంగా చాటుకొనేందుకు ఎన్నికలను ఒక అస్త్రంగా మలుచుకున్నారు. తీవ్రమైన వివక్ష, అణచివేతకు గురవుతున్న ట్రాన్స్జెండర్ల అస్తిత్వాన్ని చాటుకొనేందుకు, ఆకాంక్షలనువెల్లడించేందుకు చట్టసభలను వేదికగా చేసుకోవాలని భావిస్తున్నట్లు చిత్రపు పుషి్పత లయ, చంద్రముఖి చెబుతున్నారు. బీఎస్పీ కార్యకర్త నుంచి అభ్యర్థిగా చిత్రపు పుష్పిత లయ ప్రస్థానం వరంగల్ రామన్నపేటకు చెందిన చిత్రపు పుష్పిత లయ బీఎస్పీ పార్టీ కార్యకర్తగా ఢిల్లీలో ఐదేళ్లు పనిచేశారు. ఆ తర్వాత డాక్టర్ అంబేడ్కర్ అసోసియేషన్ మహిళా అధ్యక్షురాలిగా పనిచేశారు. రెండేళ్ల నుంచి వరంగల్ తూర్పు బీఎస్పీ నియోజకవర్గ ఇన్చార్జ్గా పనిచేస్తున్నారు. అసెంబ్లీలో అడుగు పెట్టేందుకు ట్రాన్స్జెండర్ల తరఫున తనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటానని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈసారి స్వతంత్ర అభ్యర్థి గా చంద్రముఖి ట్రాన్స్జెండర్ల అస్తిత్వాన్ని చాటుకొనేందుకు మరోసారి ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్నట్టు మువ్వల చంద్రముఖి వెల్లడించారు. భరతనాట్య కళాకారిణి. వ్యాఖ్యాత, సినీనటి అయిన చంద్రముఖి దశాబ్దకాలంగా ట్రాన్స్‌జెండర్స్ హక్కుల కోసం పోరాడుతున్నారు. ప్రజాస్వామ్య సౌధంలో మూడోస్వరాన్ని వినిపించేందుకే 2018లో ట్రాన్స్జెండర్ల ప్రతినిధిగా, బీఎల్ఎఫ్ అభ్యర్థి గా గోషామహల్ నుంచి పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో ఆమెకు 1125 ఓట్లు లభించాయి. ఈ సారి మాత్రం స్వతంత్ర అభ్యర్థిగా నిలబడాలనుకుంటున్నట్లు చెప్పారు. ఏ నియోజకవర్గం నుంచి అనేది ఇంకా నిర్ణయించుకోలేదన్నారు. ఎన్నికల ప్రచారకర్తగా లైలా.. మహబూబాబాద్ జిల్లాలోని అన్నారం గ్రామానికి చెందిన లైలా అలియాస్ ఓరుగంటి లక్ష్మణ్ డిగ్రీ చదువుకునే రోజుల్లో హిజ్రావైపు మళ్లారు. పూర్తిస్థాయి ట్రాన్స్‌జెండర్‌గా మారి డబుల్ పీజీ కూడా చేశారు. 20 ఏళ్ల నుంచి మ్యారీ అనే స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో హెచ్ఐవీ ప్రాజెక్ట్‌లో హెల్త్ వర్కర్‌గా పనిచేస్తూ వరంగల్‌లో ఉంటున్నారు. రాష్ట్ర హిజ్రాల వెల్ఫేర్ సంఘం సభ్యురాలుగా కూడా ఎన్నికయ్యారు. వారి కమ్యూనిటీ సమస్యల పరిష్కారం కోసం రాష్ట్రస్థాయిలో కృషి చేస్తున్నారు. ఈమె సేవలను గుర్తించిన రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఈ ఏడాది సెపె్టంబర్ 19వ తేదీన ఎన్నికల ప్రచారకర్త (అంబాసిడర్)గా నియమించడం విశేషం. -
ట్రాన్స్‌జెండర్‌కు బీఎస్పీ టికెట్
సాక్షి, హైదరాబాద్: బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) నుంచి పోటీ చేసే అభ్యర్థుల రెండో జాబితాను ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.ఎస్. ప్రవీణ్‌కుమార్ ప్రకటించారు. సోమవారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో 43 మంది అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు. ఈ జాబితాలో 26 మంది బీసీలతోపాటు ఆరుగురు ఎస్సీలు, ఏడుగురు ఎస్టీలు, ముగ్గురు అగ్రవర్ణాలు, ఇద్దరు మైనారిటీలకు చోటు కలి్పంచారు. వరంగల్ తూర్పు నుంచి చిత్రపు పుష్ప తలయ అనే ట్రాన్స్‌జెండర్‌ను బరిలోకి దింపడం గమనార్హం. ఈ నెల 3న 20 మంది అభ్యర్థులతో తొలి జాబితాను ప్రకటించగా 43 మందితో కూడిన రెండో విడత జాబితాతో ఇప్పటివరకు ప్రకటించిన అభ్యర్థుల సంఖ్య 63కు చేరింది. ఆ పార్టీలవి మాయమాటలు: ఆర్ఎస్ ప్రవీణ్.. ఎన్నికల్లో ఓట్ల కోసమే ఇతర రాజకీయ పారీ్టలు మోసపూరిత వాగ్దానాలు చేస్తున్నాయని ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ విమర్శించారు. మాయమాటలతో వంచించే బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీని నమ్మొద్దని ప్రజలను కోరారు. తెలంగాణలో బీసీని ముఖ్యమంత్రి చేస్తానన్న అమిత్ షా వ్యాఖ్యలు హాస్యాస్పదమన్నారు. బీసీ కులాలకు చెందిన బండి సంజయ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉంటే ఓర్వలేని ఆ పార్టీ... బీసీని సీఎం చేస్తామనడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. దేశంలో బీసీ ప్రధానిగా ఉన్నా బీసీ కులగణన ఎందుకు చేపట్టడం లేదని ప్రశ్నించారు. బీఎస్పీ జనబలం ముందు కేసీఆర్ ధనబలం పనికిరాదన్నారు. ఎన్నికల్లో డబ్బులు పంచే, ప్రలోభాలకు గురిచేసే పార్టీలకు ఓట్లను అమ్ముకోవద్దని ప్రజలకు సూచించారు. జనాభాలో 99 శాతం పేదలకు అధికారం దక్కాలన్నదే బీఎస్పీ లక్ష్యమన్నారు. -
బీఎస్పీ బహుజన భరోసా!
సాక్షి, హైదరాబాద్, పెద్దపల్లి రూరల్: బహుజన భరోసా పేరుతో బహుజన్ సమాజ్ పార్టీ మేనిఫెస్టోను ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ విడుదల చేశారు. మంగళవారం హైదరా బాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పార్టీ నాయకుల సమ క్షంలో పది ప్రధాన హామీలతో కూడిన మేనిఫెస్టో ను ప్రకటించారు. 3.91 కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు బహుజన భరోసా ఆవిష్కరిస్తున్న ట్లు ఈ సందర్భంగా ప్రవీణ్‌కుమార్ తెలిపారు. పోరాడి సాధించుకున్న తెలంగాణ ఒక కుటుంబం పాలైందని, ఈ రాష్ట్రాన్ని అందరి తెలంగాణగా మార్చేందుకే బహుజన భరోసా ప్రకటిస్తున్నట్లు చెప్పారు. తెలంగాణలో తొమ్మిదిన్నరేళ్లు అధికారం చెలాయించిన బీఆర్ఎస్ ఎన్నికల్లో ఇచ్చిన హామీ లను నెరవేర్చకుండా మేనిఫెస్టోల పేరుతో మరో సారి అంకెల గారడీ చేసిందని విమర్శించారు. గ్రూ ప్ పరీక్షలు రాసి ఉద్యోగం రాదని తెలిసి ఆత్మ హత్యకు పాల్పడ్డ యువతి ప్రవల్లిక వ్యక్తిత్వాన్ని కించపరిచేలా తప్పుడు మాటలు మాట్లాడారని విమర్శించారు. ఈ నేపథ్యంలో భవిష్యత్ తెలంగా ణ ఎలా ఉండాలని మేధావులు, రిటైర్డ్ అధికారు లు, అన్నివర్గాల ప్రజలతో చర్చించి బహుజన భరో సా పేరుతో మేనిఫెస్టో రూపొందించినట్లు ప్రవీణ్ తెలిపారు. ఇది ప్రొవిజనల్ మేనిఫెస్టో మాత్రమే నని, తెలంగాణ ప్రజలు ఇంకా ఏమైనా కోరుకుంటే వారి ఆకాంక్షల మేరకు వాటిని కూడా పొందుపరు స్తామని చెప్పారు. కాగా, పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ని బీఎస్పీ కార్యాలయంలో కాల్వశ్రీరాంపూర్ మండలానికి చెందిన మాజీ మావోయిస్టు నిదానపురం కొమురయ్య బీఎస్పీలో చేరారు. ఆయనకు ప్రవీణ్‌కుమార్ బీఎస్పీ కండువా కప్పి ఆహ్వానించారు. అదేవిధంగా పెద్దపల్లి పట్టణానికి చెందిన బీఆర్ఎస్ నేత మర్రిపల్లి సతీశ్ బీఎస్పీలో చేరారు. మేనిఫెస్టోలో బీఎస్పీ ఇచ్చిన 10 ప్రధాన హామీలు.. 1. ‘కాన్షీ’ యువ సర్కార్: యువతకు ఐదేళ్లలో 10 లక్షల ఉద్యోగాలు. మహిళలకు 5 లక్షల ఉద్యో గాలు. షాడో మంత్రులుగా విద్యార్థి నాయ కులు. 2. పూలే విద్యా దీవెన: మండలానికి ఒక ఇంటర్నేషనల్ స్కూల్, ప్రతి మండలం నుంచి ఏటా 100 మంది విద్యార్థులకు విదేశీ విద్య, డేటా, ఏఐ, కోడింగ్ లో శిక్షణ. 3. బహుజన రైతు ధీమా: ప్రతి పంట కనీస మద్దతు ధరతో కొనుగోలు. రైతులకు విత్తు నుంచి విక్రయం వరకు కచ్చితమైన ప్రభుత్వ రాయితీ. ధరణి పోర్టల్ రద్దు. 4. చాకలి ఐలమ్మ మహిళా జ్యోతి: మహిళా కార్మికులు, మహిళా రైతులకు ఉచిత వాషింగ్ మెషీన్, స్మార్ట్ ఫోన్, డ్రైవింగ్‌లో శిక్షణ. అంగన్ వాడీ, ఆశా వర్కర్ల ఉద్యోగులు క్రమబద్దీకరణ. మహిళా సంఘాలకు ఏటా రూ. 1 లక్ష 5. భీం రక్షా కేంద్రాలు: వృద్ధులకు హాస్టల్, ఆహారం, ఉచిత వైద్య సేవలు. రక్షా కేంద్రాల్లో వికలాంగులకు, ఒంటరి మహిళలకు తోడ్పాటు. 6. బ్లూ జాబ్ కార్డ్: పల్లె, పట్టణాల్లో 150 రోజుల ఉపాధి హామీ, రోజు కూలి రూ. 350 కి పెంపు. కూలీలకు ఉచిత రవాణా, ఆరోగ్య, జీవిత భీమా 7. నూరేళ్ల ఆరోగ్య ధీమా: ప్రతి కుటుంబానికి రూ.15 లక్షల ఆరోగ్య బీమా ప్యాకేజీ. ఏటా రూ. 25,000 కోట్లతో పౌష్టికాహార, ఆహార బడ్జెట్ 8. వలస కార్మికుల సంక్షేమ నిధి: రూ. 5,000 కోట్ల నిధితో గల్ఫ్ కార్మికులకు సంక్షేమ బోర్డు. వలస కార్మికులకు వసతి, కార్మికులు, లారీ, టాక్సీ డ్రైవర్లకు 600 సబ్సిడీ క్యాంటీన్లు. 9. షేక్ బందగీ గృహ భరోసా: ఇల్లు లేని వారికి 550 చదరపు గజాల ఇంటి స్థలం, ఇల్లు కట్టుకునే వారికి రూ. 6 లక్షలు సహాయం. ఇంటి పునర్నిర్మా ణానికి రూ.1 లక్ష సహాయం. 10. దొడ్డి కొమురయ్య భూమి హక్కు: భూమిలేని ప్రతి పేద కుటుంబానికి ఎకరం భూమి, మహిళల పేరిట పట్టా. -
అడవికి రాజెవరో?
ఆకుల రాజు : అడవుల జిల్లా ఉమ్మడి ఆదిలాబాద్‌లో ఓట్ల వేట హోరాహోరీగా సాగనుంది. ఆదిలాబాద్, పెద్దపల్లి లోక్‌సభ స్థానాల పరిధిలో ఉన్న పది అసెంబ్లీ స్థానాల్లో అన్ని రాజకీయ పార్టీల ప్రచారం అప్పుడే ముమ్మరంగా నడుస్తోంది. భౌగోళికంగా చూస్తే పశ్చిమ ప్రాంతంగా ఉన్న నిర్మల్, ముథోల్, బోథ్, ఖానాపూర్, ఆదిలాబాద్, తూర్పున మంచిర్యాల, బెల్లంపల్లి, చెన్నూరు, సిర్పూర్, ఆసిఫాబాద్ నియోజకవర్గాలు మైదాన, గిరిజన, కోల్‌బెల్ట్ ఓటర్లతో నిండి ఉన్నాయి. ఆయా నియోజకవర్గాల్లో ఆదివాసీ, గిరిజన, ఓసీ, బీసీ, మైనార్టీ వర్గాల వారీగా ఓట్ల కోసం రాజకీయ పార్టీలు వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నాయి. పూర్వ వైభవం కోసం కాంగ్రెస్.. బోణీ కొట్టేందుకు బీజేపీ పోరాటం గతంలో ఓ వెలుగు వెలిగిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్రం ఏర్పడ్డాక జరిగిన రెండు ఎన్నికల్లోనూ పదింటా ఒక్కో స్థానానికే పరిమితమైంది. ప్రస్తుతం అభ్యర్థుల ఎంపిక కసరత్తు జరుగుతోంది. పది స్థానాలకు 94మంది దరఖాస్తు చేసుకున్నారు. మళ్లీ పూర్వ వైభవం వస్తుందంటూ కాంగ్రెస్ నేతలు ఆశల పల్లకీలో ఊరేగుతున్నారు. ఇక ఉమ్మడి జిల్లాలో ఒక్క ఎమ్మెల్యే కూడా గెలవని బీజేపీ ఈసారి సత్తా చాటేందుకు చెమటోడుస్తోంది. గత లోక్‌సభ ఎన్నికల్లో అనూహ్యంగా ఆదిలాబాద్ ఎంపీగా సోయం బాపురావు గెలవడంతో పార్టీకి హైప్ తెచ్చింది. ఈసారి కచ్చితంగా మెజారిటీ సీట్లు గెలుస్తామనే ధీమాతో కమలనాథులు ఉన్నారు. ప్రచారంలో ‘కారు’ స్పీడు.. అభ్యర్థులను ముందే ప్రకటించి ‘కారు’ పార్టీ ప్రచారంలో స్పీడ్‌గా ఉంది. అభ్యర్థులు తమ పర్యటనలో అభివృద్ధి, సంక్షేమ పథకాలను పదే పదే వల్లె వేస్తున్నారు. గత ఎన్నికల్లో ప్రధానంగా బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ మధ్యే ప్రధాన పోటీ ఉండగా, ప్రస్తుతం బీజేపీతోపాటు కొన్ని చోట్ల బీఎస్పీ, సీపీఐ అభ్యర్థులు బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపోటములు ప్రభావితం చేయనున్నాయి. ముప్పై ఏళ్ల రాజకీయం, ఐదు ఎన్నికలను ఎదుర్కొన్న మంత్రి ఐకే రెడ్డి, మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్‌రావుతో పాటు ఎన్నికలంటే తెలియని, ఖానాపూర్ బీఆర్ఎస్ అభ్యర్థి జాన్సన్ నాయక్ లాంటి వారు కూడా పోటీలో ఉండడం ఆసక్తి కలిగిస్తోంది. విపక్షాల ప్రచార అస్త్రాలు ♦ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై భూ కబ్జాలు, అవినీతి, లైంగిక వేధింపుల ఆరోపణలు ♦ డబుల్ బెడ్ రూం ఇళ్లు, దళిత, బీసీ బంధు అర్హులందరికీ రాకపోవడం ♦ ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టుకు ప్రత్యామ్నాయం చూపకపోవడం ♦ గిరిజన ప్రాంతాల్లో విద్యా, వైద్యం, రోడ్లు లేకపోవడం ♦ జిల్లాల్లో మూత పడిన పరిశ్రమలు తెరవకపోవడం అధికార పార్టీ ప్రచారాస్త్రాలు ♦48వేల మందికి, లక్ష ఎకరాల పోడు పట్టాల పంపిణీ ♦ ఏడు వేలకు పైగా సింగరేణి స్థలాలకు ఇళ్ల పట్టాల పంపిణీ ♦మంచిర్యాల, ఆసిఫాబాద్, నిర్మల్‌లో మెడికల్ కాలేజీల ఏర్పాటు ♦ రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్దిదారులు బోథ్, ఖానాపూర్‌లో బీఆర్ఎస్కు ఇక్కట్లు ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్‌కు బదులు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ స్నేహితుడైన భూక్య జాన్సన్ నాయక్‌కు, బోథ్‌లో రాథోడ్ బాçపూరావును కాదని అనిల్‌కుమార్ జాదవ్‌కు టికెట్ ఇచ్చారు. ఆసిఫాబాద్‌లో కాంగ్రెస్ నుంచి గెలిచి బీఆర్ఎస్లో చేరిన ఎమ్మెల్యే ఆత్రం సక్కును పక్కకు పెట్టి, గత ఎన్నికల్లో ఓడిన బీఆర్ఎస్ అభ్యర్థి, కుమురంభీం జిల్లా జెడ్పీ చైర్ పర్సన్ కోవ లక్షి్మకి మళ్లీ అవకాశం ఇచ్చారు. దీంతో ఖానాపూర్, బోథ్ ఎమ్మెల్యేలు పార్టీని వీడుతామని ప్రకటించారు. ఈ క్రమంలో వీళ్లిద్దరూ ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారనేది ఆసక్తి రేపుతోంది. ఇక చెన్నూరులో ఎమ్మెల్యే సుమన్‌తో పొసగక, మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు పార్టీ వీడి కాంగ్రెస్ నుంచి పోటీకి సిద్ధపడ్డారు. టికెట్ దక్కని మాజీ ఎంపీ నగే«శ్, మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీశ్ పార్టీలోనే ఉన్నా అంటీముట్టనట్టు ఉంటున్నారు. బహుజనవాదంతో బీఎస్పీ బహుజన వాదంతో ఇక్కడి ఓట్లను పట్టేందుకు బీఎస్పీ సిద్ధమైంది. సిర్పూర్లో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడుఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ బరిలో ఉంటానని చెప్పడం ఆసక్తి రేపుతోంది. ఖానాపూర్‌లో బన్సీలాల్‌కు అవకాశం ఇచ్చారు. కామ్రేడ్ల ఆశలు బెల్లంపల్లి నుంచి సీపీఐ బరిలో దిగేందుకు రంగం సిద్ధం చేసుకుంది. పార్టీ అనుబంధ కార్మిక సంఘం ఏఐటీయూసీ బలంతో కార్మిక వాడల్లో నాయకులు ప్రచారం మొదలు పెట్టారు. కాంగ్రెస్‌తో పొత్తు ఉంటే..సీటు ఇస్తారో లేదా చూడాలి. సామాజిక సమీకరణాలు ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, సిర్పూర్, ముథోల్‌లో బీసీ ఓట్లు. ఖానాపూర్, ఆసిఫాబాద్, బోథ్‌లో ఎస్టీ ఓట్లు, బెల్లంపల్లిలో నేతకాని, ఎస్సీ చెన్నూరులో నేతకాని, ఎస్సీ ఓట్లు మంచిర్యాలలో పెరిక, మున్నూరుకాపు, యాదవ, పద్మశాలి, గౌడ ఓట్లు, ఆదిలాబాద్‌లో మున్నూరుకాపు, పద్మశాలి, యాదవ, ముదిరాజ్, నిర్మల్‌లో మున్నూరుకాపు, పద్మశాలి, ముదిరాజ్, సిర్పూర్లో గిరిజన, బుద్ధిస్టు, ముస్లిం, ముథోల్‌లో ముస్లిం ఓట్లు గెలుపోటముల్లో కీలకం. -
హంగ్ వస్తే.. సీఎం కుర్చీలో బీఎస్పీ
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఒక వేళ హంగ్ పరిస్థితులే ఉంటే సీఎం పదవిని ఆఫర్ చేసిన పార్టీకే తమ మద్దతు ఉంటుందని బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్పీ) రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ప్రకటించారు. ఎన్నికల శంఖారావం పేరుతో కొత్తగూడెంలో జరిగిన భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రభుత్వంపై పలు విమర్శలు చేయడంతో పాటు బీఎస్పీకి సంబంధించిన మేనిఫెస్టోలోని కీలక అంశాలను వెల్లడించారు. పులికి భయమెందుకు.. తెలంగాణ రాష్ట్ర ఖజానా నుంచి నెలకు రూ.3.50 లక్షల జీతం తీసుకుంటున్న సీఎం కేసీఆర్ నెల రోజుల నుంచి ఎందుకు కనిపించడం లేదని ప్రశ్నించారు. అక్టోబర్ 15న పులి బయటకు వస్తుందని మంత్రి కేటీఆర్ అంటున్నారని, ఆయన పులి అయితే ప్రతిపక్షాలంటే ఎందుకు భయపడు తున్నారని, ఎందుకు అక్రమ అరెస్టులు చేస్తున్నారని ప్రశ్నించారు. ప్రతిపక్షాలకు మైండ్ బ్లాంక్ అయ్యే పథకాలతో ప్రజల ముందుకు వస్తామని మంత్రి హరీశ్‌రావు అంటున్నారని, ఇప్పటికే ప్రజల మైండ్లను నాశనం చేశారని ప్రవీణ్ విమర్శించారు. ఈసీకి ఫిర్యాదు చేస్తాం ఎన్నికలను లక్ష్యంగా చేసుకుని అనేక జిల్లాల్లో కీలక పదవుల్లో తమ అడుగులకు మడుగులు ఒత్తే అధికారులను బీఆర్ఎస్ పార్టీ నియమించుకుందని ప్రవీణ్‌కుమార్ ఆరోపించారు. అందరి వివరాలతో జాబితా రెడీ చేస్తున్నామని, త్వరలోనే ఎన్నికల కమిషన్‌ను కలిసి ఈ అంశంపై ఫిర్యాదు చేస్తామని చెప్పారు. వివిధ పదవుల నుంచి రిటైరైన కేసీఆర్ కుటుంబ సభ్యులు, దూరపు బంధువులకు ఇంటెలిజెన్స్ విభాగంలో కీలక బాధ్యతలు అప్పగించినట్టు తమ దృష్టికి వచ్చిందన్నారు. ఎన్నికలు ముగిసేవరకు వారిని ఆ పోస్టులకు దూరంగా ఉంచాలని ఈసీని కోరారు. కొందరు అధికారులు కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత కూడా పాత తేదీలతో సంతకాలు చేస్తున్నారని, ఆ వివరాలను సేకరిస్తున్నామని తెలిపారు. కాగా, కమ్యూనిస్టులు కమ్యూనిజాన్ని మరిచిపోయి దొరల గడీల దగ్గర కాపలా కాస్తున్నారని ఆయన విమర్శించారు. 119 నియోజకవర్గాల్లో పోటీ రాబోయే ఎన్నికల్లో బీఎస్పీ 119 నియోజ కవర్గాల్లో పోటీ చేస్తుందని ప్రవీణ్ కుమార్ ప్రకటించారు. ఈ మేరకు 1,300 దరఖాస్తులు తమకు అందాయన్నారు. ఇందులో మేధా వులు, ప్రొఫెసర్లు, రిటైర్డ్ ఐఏఎస్‌లు, స్కాలర్లు ఉన్నారని తెలిపారు. తాము అధికారంలోకి వస్తే ధరణిని రద్దు చేస్తామని ప్రకటించారు. బీఎస్పీ మేనిఫెస్టోలో కీలక అంశాలు ♦ ఏజెన్సీ ప్రాంతాల్లో ఎస్సీ, బీసీ, అగ్రవర్ణ పేదలకు పోడు పట్టాల పంపిణీ ♦ భూమి లేని వారికి కనీసం ఎకరం భూమి పంపిణీ ♦ ప్రతీ మండలంలో అంతర్జాతీయ ప్రమాణాల తో పాఠశాల ♦ రాష్ట్ర వ్యాప్తంగా ఏసీ సౌకర్యంతో కూడిన కోచింగ్ సెంటర్లు ♦ ప్రతీ కుటుంబం నుంచి ఒకరు విదేశాల్లో విద్యనభ్యసించేలా ప్రణాళిక ♦ ఆయుఃప్రమాణం వందేళ్లకు పెంచేలా వైద్య రంగంలో మార్పులు ♦ మహిళలకు ఉచితంగా డ్రైవింగ్‌లో శిక్షణ ♦ పది లక్షల ఉద్యోగాల కల్పన, అందులో 50 శాతం మహిళలకు.. ♦ కౌలు రైతులను ఆదుకునేలా విధానాలు ♦ జనాభా ప్రాతిపదికన ప్రభుత్వ కాంట్రాక్టుల కేటాయింపులు. -
బీఎస్పీకి అధికారం ఖాయం
సాక్షి, హైదరాబాద్, గన్‌పౌండ్రీ: రానున్న ఎన్నికల్లో ఎవరెన్ని కుట్రలు చేసినా, తెలంగాణలో బీఎస్పీ అధికారంలోకి రావడం ఖాయమని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.ఎస్ ప్రవీణ్‌కుమార్ ధీమా వ్యక్తం చేశారు. ఈ ఎన్నికలు కొండ చిలువలకు, చలిచీమలకు మధ్య పోటీ అని వ్యాఖ్యానించారు. బీఎస్పీ ఆధ్వర్యంలో ఎగ్జిబిషన్ గ్రౌండ్లో సోమవారం కాన్షీరాం 17వ వర్ధంతి సందర్భంగా ఎన్నికల నగారా సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాబలం బీఎస్పీకి ఉందనీ, మరో రెండు నెలలు పార్టీ శ్రేణులు రాత్రింబవళ్లూ కష్టపడి పార్టీని అధికారంలోకి తీసుకురావాలని పిలుపునిచ్చారు. బహుజనులు పాలకులు కావాలని కలలుగన్న కాన్షీరాం పేద ప్రజల గుండెల్లో చిరస్మరణీయంగా నిలిచిపోతారన్నారు. ఎస్సీ, ఎస్టీలపై దాడులు జరుగుతుంటే ఈ వర్గాల ఎమ్మెల్యేలు ప్రభుత్వాన్ని ప్రశ్నించకపోవడం విచారకరమన్నారు. రాష్ట్రంలో ప్రతిపక్ష నేతలపై పోలీసులు అక్రమ కేసులు పెడుతున్నారని ఆరోపించారు. మంత్రి జగదీశ్ రెడ్డి ప్రోద్బలం, ఒత్తిడితోనే వట్టే జానయ్య యాదవ్‌పై నిరాధారంగా పోలీసులు కేసులు పెట్టారని విమర్శించారు. తెలంగాణ గడ్డపై నీలి జెండా ఎగురవేయాలి బీఎస్పీ నేషనల్ కో–ఆర్డినేటర్, రాజ్యసభ సభ్యుడు రాంజీ గౌతమ్ మాట్లాడుతూ ఎన్నికల్లో తెలంగాణ గడ్డపై నీలి జెండా ఎగురవేసి, ఏనుగుపై ప్రగతి భవన్‌కు వెళ్ళాలని పిలుపునిచ్చారు. తెలంగాణలో బీసీ, ఎస్సీ, ఎస్టీల సంక్షేమం గురించి మాట్లాడుతున్న బీజేపీ, కాంగ్రెస్‌లు రాజస్తాన్, మధ్యప్రదేశ్‌లలో ఎందుకు మాట్లాడడం లేదన్నారు. కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలపై దాడులు పెరుగుతున్నాయన్నారు. మెజారిటీ ప్రజలకు అధికారం దక్కాలనేదే బీఎస్పీ ధ్యేయమని పార్టీ రాష్ట్ర చీఫ్ కోఆర్డనేటర్ మంద ప్రభాకర్ అన్నారు. సభలో పార్టీ ఉపాధ్యక్షులు దాగిళ్ళ దయానంద్, చాట్ల చిరంజీవి, రుద్రవరం సునీల్ పాల్గొన్నారు. -
రాజకీయం గరం గరం
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ వెలువడటంతో రాష్ట్రంలో రాజకీయం మరింత వేడెక్కింది. ప్రధాన రాజకీయ పక్షాలైన బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీతోపాటు బీఎస్పీ ఇప్పటికే ఎన్నికల కోసం సిద్ధమవడం మొదలుపెట్టగా.. ఇకపై పూర్తిస్థాయిలో శక్తియుక్తులను కేంద్రీకరించనున్నాయి. అభ్యర్థుల జాబితాలు, మేనిఫెస్టోల ప్రకటన, ఎన్నికల ప్రచార సభలు, సమావేశాలు, స్టార్ క్యాంపెయినర్ల ప్రచారం వంటివి ఊపందుకోనున్నాయి. అభ్యర్థుల ప్రకటనతో బీఆర్ఎస్ దూకుడు ఈ ఏడాది మార్చి నుంచే ఆత్మీయ సమ్మేళనాల పేరిట ఎన్నికల సన్నద్ధతను బీఆర్ఎస్ మొదలుపెట్టింది. అధికారిక కార్యక్రమాల పేరిట సీఎం కేసీఆర్, మంత్రులు జిల్లాల్లో విస్తృతంగా పర్యటించారు. అంతేగాకుండా 50రోజుల క్రితమే అంటే ఆగస్టు 21న అసెంబ్లీ అభ్యర్థుల జాబితాను కూడా విడుదల చేశారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలకే పెద్దపీట వేయడంపై తలెత్తిన అసంతృప్తిని వివిధ నామినేటెడ్ పదవులు, ఇతర రూపాల్లో బుజ్జగించారు. పార్టీ టికెట్ దక్కని ఎమ్మెల్యేలు రేఖానాయక్, బాపూరావు రాథోడ్, ఎమ్మెల్సీలు కసిరెడ్డి నారాయణరెడ్డి, తన కుమారుడికి టికెట్ ఇవ్వలేదనే కారణంతో ఎంపీ మైనంపల్లి హన్మంతరావు బీఆర్ఎస్ను వీడారు. మరోవైపు గడిచిన పక్షం రోజుల్లోనే మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు సుమారు 70 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటనలు చేయడం ఎన్నికల ప్రచార సభలను తలపించింది. ఈ నెల 15న పార్టీ మేనిఫెస్టో ప్రకటన, అభ్యర్థులకు బీఫారాల పంపిణీతోపాటు ఎన్నికల ప్రచార సభలకు కేసీఆర్ శ్రీకారం చుడుతున్నారు. గ్యారంటీలతో కాంగ్రెస్ అడుగులు రైతు, యువత డిక్లరేషన్లు, ఆరు గ్యారంటీ స్కీమ్‌ల ప్రకటన వంటి అంశాలతో ఓటర్లను ఆకట్టుకునేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు మొదలుపెట్టింది. జాతీయ పార్టీ వర్కింగ్ కమిటీ సమావేశాలను హైదరాబాద్‌లో నిర్వహించడం ద్వారా పార్టీ కేడర్‌లో ఉత్సాహం నింపి, ఎన్నికల సన్నాహాలను వేగవంతం చేసింది. తుక్కుగూడ బహిరంగ సభలో పార్టీ అగ్రనేతలతో హామీలు ఇప్పించింది. ప్రస్తుతం అభ్యర్థుల ఎంపిక కసరత్తుపై పూర్తిస్థాయిలో దృష్టి కేంద్రీకరించింది. ఎన్నికల మేనిఫెస్టోకు తుదిరూపునిచ్చి మరో పది రోజుల్లో విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది. అయితే పార్టీ అభ్యర్థుల ఖరారుపై ఇటు హైదరాబాద్, అటు ఢిల్లీలో చర్చలు, సంప్రదింపుల ప్రక్రియ కొనసాగుతున్నా.. ఇంకా కొలిక్కి రాలేదు. 2018 ఎన్నికల్లో చివరి నిమిషం దాకా అభ్యర్థుల ప్రకటనలో జాప్యంతో నష్టం జరిగిందని.. ఈసారి వీలైనంత త్వరగా ప్రకటించాలని పార్టీ నేతలు కోరుతున్నారు. త్వరలో టీపీసీసీ నేతలు బస్సుయాత్ర ప్రారంభించనుండటంతో.. టికెట్ రానివారితో ఇబ్బందులు వస్తాయన్న భావన పార్టీలో వ్యక్తమైంది. ఈ నేపథ్యంలో దసరా పండుగ తర్వాత అభ్యర్థుల జాబితాను విడుదల చేసే యోచనలో కాంగ్రెస్ అధిష్టానం ఉన్నట్టు సమాచారం. మంగళవారం హైదరాబాద్‌లో జరిగే కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల సలహా కమిటీ (పీఏసీ) భేటీలో బస్సుయాత్ర, ఇతర అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలిసింది. అగ్రనేతలను రంగంలోకి దింపుతున్న బీజేపీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వెలువడిన నేపథ్యంలో బీజేపీ ప్రచారం కోసం అగ్రనేతలను రంగంలోకి దింపుతోంది. ఇప్పటికే అమిత్‌షా సహా పలువురు కేంద్ర మంత్రుల పర్యటనలు ఖరారయ్యాయి. మంగళవారం ఆదిలాబాద్‌లో బహిరంగ సభతోపాటు హైదరాబాద్‌లో వివిధ రంగాలకు చెందిన వృత్తినిపుణులు, మేధావులతో నిర్వహించే సమావేశంలో అమిత్‌షా పాల్గొంటారు. ఈ నెల 27న కూడా అమిత్‌షా మరోమారు తెలంగాణలో ఎన్నికల ప్రచారానికి రానున్నారు. ఇక ఈ నెల 14న హైదరాబాద్ శివార్లలోని శేరిలింగంపల్లితోపాటు మరో నియోజకవర్గం పరిధిలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్, 15న ముషీరాబాద్‌తోపాటు మరోచోట కేంద్ర మంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి పర్యటిస్తారని బీజేపీ ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి వెల్లడించారు. ఈ నెల 16న హుజూరాబాద్, మహేశ్వరం అసెంబ్లీ స్థానాల్లో కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ పర్యటిస్తారని.. 19న మధిరలో కేంద్ర మంత్రి నారాయణస్వామి పర్యటిస్తారని తెలిపారు. మరోవైపు ఈ నెలాఖరులోగా ప్రధాని మోదీ, జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సభలు నిర్వహించేందుకు బీజేపీ సిద్దమవుతోంది. ఎన్నికల మేనిఫెస్టోకు ముఖ్య నేతలు తుదిమెరుగులు దిద్దుతున్నారు. ఈ నెల 15 లేదా 16 తేదీల్లో 38 మంది అభ్యర్థులతో తొలి జాబితా విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. కమ్యూనిస్టులు, ఇతర పార్టీలూ తెరపైకి.. కమ్యూనిస్టు పార్టీలు సీపీఐ, సీపీఎం ఇటీవల కాంగ్రెస్‌తో ఎన్నికల పొత్తుకు సిద్ధమయ్యాయి. కానీ చర్చలు కొలిక్కి రాలేదు. సీపీఐ, సీపీఎం పార్టీలకు చెరో రెండు స్థానాలు ఇచ్చేందుకు జాతీయ స్థాయిలో ఒప్పందం కుదిరినట్టు ప్రచారం జరుగుతోంది. కొత్తగూడెం, మునుగోడులో సీపీఐ.. భద్రాచలం, కొత్తగూడెంలో సీపీఐకి కాంగ్రెస్ సీట్లు ఇస్తుందని అంటున్నారు. కానీ అధికారికంగా ఏదీ తేలలేదు. మరోవైపు ప్రొఫెసర్ కోదండరామ్ నేతృత్వంలోని తెలంగాణ జనసమితి కూడా కాంగ్రెస్‌తో కలసి పోటీచేయాలని భావిస్తున్నా.. ఎలాంటి పురోగతి కనిపించడం లేదు. కాంగ్రెస్‌లో వైఎస్ షర్మి ల నేతృత్వంలోని వైఎస్సార్ తెలంగాణ పార్టీ విలీనం అంశం కూడా మరుగున పడింది. మరోవైపు బహుజన సమాజ్ పార్టీ తొలి విడత జాబితాను ప్రకటించింది. జనసేన, టీటీడీపీ వంటి పార్టీలు కూడా తమ అభ్యర్థులను బరిలోకి దింపేందుకు సన్నాహలు చేస్తున్నాయి. గతం కన్నా వారం ముందు.. ఈసారి అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ గతసారితో పోలిస్తే వారం రోజులు ముందే జర గనుంది. గత ఎన్నికల్లో డిసెంబర్ 7న పోలింగ్ నిర్వహించగా.. ఈసారి నవంబర్ 30వ తేదీనే జరగనుంది. మొత్తంగా ఎన్నికల షెడ్యూల్ నాటి నుంచి పోలింగ్ వరకు 51 రోజులు మాత్రమే గడువు మిగిలింది. -
ఆ పార్టీలు చేతులు కలిపేనా? కాంగ్రెస్‌లో కొరవడిన స్పష్టత
సాక్షి, హైదరాబాద్: వచ్చే ఎన్నికల్లో ఇతర పార్టీలతో పొత్తుపై కాంగ్రెస్ పార్టీలో స్పష్టత రావడం లేదు. ఉభయ కమ్యూనిస్టు పార్టీలతో పాటు తెలంగాణ జన సమితి (టీజేఎస్), బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ)లతో ఈసారి పొత్తు కుదిరే అవకాశముందనే చర్చ జరుగుతోంది. కానీ ఎన్నికల షెడ్యూల్ వెలువడే సమయం సమీపిస్తున్నా రాష్ట్రస్థాయిలో ఇంతవరకూ ఎలాంటి స్పష్టమైన ప్రతిపాదనలు లేకపోవడం, ఈ దిశగా ఎలాంటి తాజా కదలిక లేకపోవడంతో పొత్తు ఉంటుందా? ఉండదా? అనే అంశంపై పార్టీ కేడర్ గందరగోళానికి గురవుతోంది. ముఖ్యంగా సీపీఐ, సీపీఎంలతో పొత్తు విషయంలో అయోమయం నెలకొంది. వాస్తవానికి ఆ పార్టీలతో గతంలో ఢిల్లీ స్థాయిలో చర్చలు జరిగాయి. ఏఐసీసీ నేత కేసీ వేణుగోపాల్ హైదరాబాద్‌లో సీపీఐ నేత నారాయణతో మంతనాలు జరిపారు. కానీ ఇంతవరకు ఏమీ తేల్లేదు. కామ్రేడ్లు అడిగినట్టుగా భావిస్తున్న సీట్లపై ఎలాంటి స్పష్టత రాలేదు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఎంపిక కసరత్తును వేగవంతం చేయడంతో వామపక్షాలతో పొత్తు ఉంటుందా? ఉండదా? అన్న దానిపై రాష్ట్ర కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.దీనిపై అధిష్టానం వీలున్నంత త్వరగా స్పష్టత ఇవ్వాలని, ఏదో ఒకటి త్వరగా తేల్చితేనే ఎన్నికలను సమర్థంగా ఎదుర్కోవడం సాధ్యమవుతుందని, లేదంటే గత ఎన్నికల్లో మహాకూటమి పొత్తు లాగానే విఫలమయ్యే ప్రమాదం ఉందని అంటున్నారు. ఆరు స్థానాలపై టీజేఎస్ దృష్టి విశ్వసనీయ సమాచారం ప్రకారం.. టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాంను కూడా ఇప్పటికే కాంగ్రెస్ వర్గాలు సంప్రదించాయి. ఢిల్లీ నుంచి ఆయనతో మంతనాలు జరిగాయని, ఈ సందర్భంగా పార్టీ విలీనం ప్రస్తావన వచ్చిందని, ఈ ప్రతిపాదనను సున్నితంగా తిరస్కరించిన ప్రొఫెసర్.. పొత్తుకు మాత్రం అభ్యంతరం లేదని చెప్పారని తెలిసింది. అయితే ఈసారి ఆరు స్థానాలపై టీజేఎస్ దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. సూర్యాపేట, జహీరాబాద్, నర్సంపేట, ఎల్లారెడ్డి, గద్వాల, కోరుట్లపై ప్రధానంగా దృష్టి సారించామని, ఒంటరిగా పోటీ చేయాల్సి వస్తే మిగిలిన చోట్లా తమకు అభ్యర్థులు ఉన్నారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఇక జాతీయ స్థాయిలో బీఎస్పీతో సంబంధాలు ఎలా ఉన్నా రాష్ట్ర స్థాయిలో ఆ పార్టీతో పొత్తు పెట్టుకునే ప్రతిపాదన ఉందని కాంగ్రెస్ నేతలు చెపుతున్నారు. అయితే ఇంతవరకూ ప్రాథమిక స్థాయిలో కూడా చర్చలు ప్రారంభం కాకపోవడం గమనార్హం. కాంగ్రెస్‌లో భిన్నాభిప్రాయాలు ఈసారి పొత్తుల విషయమై కాంగ్రెస్ పార్టీలో రెండు అభిప్రాయాలు స్పష్టంగా వినిపిస్తున్నాయి. ఇతర పార్టీలకు వీలున్నన్ని తక్కువ స్థానాలు ఇచ్చి పొత్తు కుదుర్చుకుంటే మంచి ఫలితం వస్తుందని కొందరు అభిప్రాయ పడుతున్నారు. మరికొందరు మాత్రం ఏ పార్టీ తోనూ పొత్తు అవసరం లేదని, ఒంటరిగా ఎన్నికలకు వెళితేనే కచ్చితంగా మేలు జరుగుతుందని అంటున్నారు. అయితే పార్టీ అధిష్టానం రాష్ట్ర నాయకులకు సమాచారం లేకుండానే ఇతర పార్టీలతో చర్చలు జరుపుతుండటంతో భవిష్యత్తులో ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొందని రాష్ట్ర కాంగ్రెస్ నేతలు అంటున్నారు. -
రమేశ్ బిధూరీపై సస్పెన్షన్ వేటు వేయాలి
న్యూఢిల్లీ: లోక్‌సభలో బీఎస్పీ ఎంపీ డానిష్ అలీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎంపీ రమేశ్ బిధూరీపై కఠిన చర్యలు తీసుకోవాలని వివిధ ప్రతిపక్ష పారీ్టల నేతలు శనివారం డిమాండ్ చేశారు. బిధూరీపై సస్పెన్షన్ వేటు వేయాలని, సభ నుంచి బహిష్కరించాలని స్పీకర్‌కు విజ్ఞప్తి చేశారు. కొందరు స్పీకర్‌కు లేఖ రాశారు. కాగా, రమేశ్ బిధూరీ వ్యాఖ్యల్లో నిజానిజాలు నిగ్గుతేల్చడానికి విచారణ కమిటీ ఏర్పాటు చేయాలని బీజేపీ ఎంపీ నిషికాంత్ పేర్కొన్నారు. -
ఆ గొంతులన్నీ మూగబోయాయి
SAS (అందోల్): రాష్ట్ర సాధన ఉద్య మంలో పాటల రూపంలో ఉత్తేజపరిచిన గొంతులన్నీ మూగబో యాయని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ అన్నారు. శుక్రవారం సంగారెడ్డి జిల్లా జోగిపేటలోని ‘బీఎస్పీ శక్తి ప్రదర్శన’ నియోజకవర్గ ఇన్చార్జ్ ముప్పారం ప్రకాశ్ ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ సందర్భంగా ప్రవీణ్‌కుమార్ మాట్లాడుతూ కవులు, కళాకారులందరూ రాష్ట్రంలోని 4 కోట్ల ప్రజల గొంతుకల కోసం బీఎస్పీలోకి రావాలని పిలుపునిచ్చారు. విప్లవా త్మకమైన పాటలను రాసిన వారిని, పాడిన వారిని గుర్తు చేసుకుంటూ పాటలు పాడుతూ అక్కడున్న వారిని ఆయన ఉత్తేజపరిచారు. సీఎం కేసీఆర్ ఫామ్‌హౌస్ కోసమే రూ.2 వేల కోట్లతో కొండపోచమ్మ రిజర్వాయర్‌ను రెండేళ్లలో పూర్తిచేశారని, సంగమేశ్వర, బస్వవేశ్వర ఎత్తిపోథల పథకానికి రూ.4 వేల కోట్లు మంజూరు చేయకపోతే క్రాంతి కిరణ్ ఎందుకు మౌనంగా ఉన్నారని ఆయన ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈశ్వర్, జిల్లా అధ్యక్షుడు నటరాజన్ పాల్గొన్నారు. జర్నలిస్టుపై దాడిచేస్తే స్పందించని ఎమ్మెల్యే అందోల్‌లో అధికార పార్టీ నాయకుల అహంకారానికి అల్లాదుర్గం సాక్షి దినపత్రిక జర్నలిస్టుపై దాడిచేయడమే నిదర్శనమన్నారు. జర్నలిస్టు ఎమ్మె ల్యేగా ఉన్నా క్రాంతికిరణ్ జర్నలిస్టుపై జరిగిన దాడిని ఖండించకపోవడం సిగ్గుచేటన్నారు. ఆయ న్ను వచ్చే ఎన్నికల్లో ఓడించాలని పిలుపునిచ్చారు. -
ఒంటరిగానే పోటీచేస్తాం: ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్
అచ్చంపేట/ కల్వకుర్తి రూరల్: రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ప్రకటించారు. ఆదివారం రాత్రి నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట లో నిర్వహించిన నల్లమల నగారా సభలో, అంతకు ముందు కల్వకుర్తిలో మీడియాతో ఆయన మాట్లా డారు. రాజ్యాధికారం కోసం బహుజనులు ఎవరి వద్దకు వెళ్లాల్సిన అవసరం లేదని, బీసీలకు తమ పార్టీ 70 స్థానాలను కేటాయిస్తుందని చెప్పారు. సూర్యాపేటలో జానయ్యపై చేస్తున్న దాడులను, మణిపూర్, భూపాల్ దాడులను ఖండిస్తున్నామన్నా రు. ఒక శాతం ఉన్న దొరలు 99 శాతం ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అగ్రవర్ణ పేదలను అణగదొక్కుతున్నారని ఆరోపించారు. 2008 డీఎస్సీ అభ్యర్థులకు న్యాయం చేయాలని సీఎం కేసీఆర్‌ను కోరారు. తాము ఎవరి వైపున ఉండమని.. రాజ్యాంగం వైపు ఉంటామని ప్రవీణ్‌కుమార్ పేర్కొన్నారు. -
TS Election 2023: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో.. రాష్ట్ర సరిహద్దుల్లో పటిష్ట నిఘా..!
కామారెడ్డి: రాష్ట్రంలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర సరిహద్దులు, జిల్లాల సరిహద్దుల్లో చేపట్టే పకడ్బందీ చర్యలపై శనివారం నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధి సాలూర రోడ్డులోని ఎన్ఎన్ కన్వెన్షన్ హాలులో మహారాష్ట్ర పోలీసులతో పాటు, రాష్ట్రంలోని ఆరు జిల్లాల ఎస్పీల సమావేశం జరిగింది. సమావేశంలో నిజామాబాద్ పోలీస్ కమిషనర్ వి.సత్యనారాయణ మాట్లాడు తూ రాష్ట్ర, జిల్లా సరిహద్దుల్లో చెక్ పోస్టులను ఏర్పాటు పటిష్ట నిఘా పెట్టాలన్నారు. మద్యం, నగదు సరఫరాపై నియంత్రణ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. చెక్ పోస్టుల వద్ద తనిఖీలు నిర్వహిస్తూ గంజాయి, ఇతర మాదక ద్రవ్యాల రవాణాను నియంత్రించాలన్నారు. నిజామాబాద్, నిర్మల్, అదిలాబాద్, కామారెడ్డి, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, నాందేడ్ జిల్లా సరహద్దుల్లో ఉన్న సమస్యాత్మక గ్రామాలపై ప్రత్యేక దృష్టి సారించి తనిఖీలు చేయాలన్నారు. ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు చెక్ పోస్టులను సంబంధిత అధికారులు ఏర్పాటు చేసుకొని నిరంతరాయంగా తనిఖీలు చేపట్టాలని సూచించారు. నాన్ బెయిలబుల్ వారెంట్ విషయంలో ఇరు జిల్లాల, రాష్ట్రాల అధికారులు సహకరించుకుంటూ ముందుకు వెళ్లాలన్నారు. అంతర్రాష్ట్ర చెక్ పోస్టులైన సాలూర, కండ్గావ్, కందకుర్తి, పోతంగల్ వద్ద చెక్ పోస్టులు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. వీటితో పాటు అంతర్ జిల్లా చెక్ పోస్టులు డోడ్గాన్ (సోన్) బ్రహ్మంగారి గుట్ట, సిరికొండ, ఇందల్వాయి టోల్‌ప్లాజా, మల్లారం గండి, యంచ (బాసర)ల వద్ద చెక్ పోస్టులు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. గతంలో అక్రమ రవాణా చేస్తూ పట్టుబడిన వారిపై ప్రత్యేక నిఘా పెట్టాలని, వారిని నియంత్రించడానికి ప్రణాళిక రూపొందించాలన్నారు. సరిహద్దులో హైవే పెట్రోలింగ్, మొబైల్ పెట్రోలింగ్ పెంచాలని, పోలీస్ అధికారులు వాట్సప్గ్రూప్లను ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందించాలన్నారు. ఇరు రాష్ట్రాల పోలీసులు పరస్పర సహాయ సహకారాలు అందించుకుంటూ ఎన్నికలు సజావు గా సాగేలా చర్యలు చేపట్టాలని కోరారు. సమావేశంలో అదిలాబాద్ జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్, నిర్మల్ జిల్లా ఎస్పీ ప్రవీణ్ కుమార్, జగిత్యాల జిల్లా ఎస్పీ భాస్కర్, కామారెడ్డి జిల్లా ఎస్పీ బి శ్రీనివాస్‌రెడ్డి, నాందేడ్ జిల్లా (బోకర్) అదనపు ఎస్పీ కేఏ ధరణి, నిజామాబాద్ జిల్లా అదనపు డిప్యుటీ కమిషనర్ జయరామ్, నిజామాబాద్ జిల్లా కమర్షియల్ ట్యాక్స్ అధికారి లావణ్య, ఎకై ్సజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి, బోధన్, బాన్సువాడ, నిజామాబాద్ స్పెషల్ బ్రాంచ్ అధికారులు, సీఐలు, రోడ్డు, ట్రాన్స్‌పోర్టు, ఫారెస్టు, రెవెన్యూ శాఖల అధికారులు, మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా పోలీసు అధికారులు సమీక్ష పాల్గొన్నారు. -
TS Election 2023: 'బీఆర్ఎస్.. బీజేపీ.. బీఎస్పీ' ల మధ్యే అసలు పోటీ..!
కుమరం భీం: రాష్ట్రంలో ఉత్కంఠ రేపిన బీఆర్ఎస్ అసెంబ్లీ అభ్యర్థుల జాబితా వెల్లడికావడంతో సిర్పూర్ సెగ్మెంటులో ఆ పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం తొణకిసలాడుతోంది. సిట్టింగ్ ఎమ్మెల్యే, ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు కోనేరు కోనప్పకే మళ్లీ టికెట్ ఖరారు కావడంతో ఇప్పుడాయనకు పోటీగా విపక్ష పార్టీ అభ్యర్థులెవరనే ప్రశ్న చర్చనీయాంశమైంది. ఇప్పటికే వరుసగా రెండుసార్లు గెలిచిన కోనప్పకు ఈసారి బీజేపీ, బీఎస్పీల రూపంలో గట్టిపోటీ ఎదురయ్యే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే అధికార, విపక్ష పార్టీల నేతల సవాళ్లు, ప్రతిసవాళ్లతో నియోజకవర్గంలో రాజకీయ వేడి క్రమంగా రాజుకుంటుంది. త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలు మరింత ఆసక్తిని రేకెత్తించడమే కాకుండా సిర్పూర్ సింహబలుడెవరన్నది తేలుతుందని వారు అంటున్నారు. పోటీ తీవ్రం.. సిర్పూర్ నియోజకవర్గంలో అధికార బీఆర్ఎస్, బీజేపీ, బీఎస్పీల మధ్యే పోటీ ఉండనుంది. బీజేపీ నుంచి డాక్టర్ పాల్వాయి హరీశ్‌బాబు, డాక్టర్ కొత్తపల్లి శ్రీనివాస్‌లో ఎవరో ఒకరు బరిలో నిలవనుండగా.. బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ప్రవీణ్‌కుమార్ ఇక్కడి నుంచే పోటీ చేయనున్నారు. ఈ ముగ్గురు మధ్యే త్రిముఖ పోటీ ఉండనుంది. కమ్మ సామాజికవర్గానికి చెందిన కోనప్ప తొలిసారి 2004లో కాంగ్రెస్ అభ్యర్థిగా అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగి విజయం సాధించారు. ఆ తరువాత 2009లో టీఆర్ఎస్ అభ్యర్థి కావేటి సమ్మయ్య చేతిలో 7,414 ఓట్ల తేడాతో ఓటమి చెందారు. 2014లో బీఎస్పీ తరఫున పోటీ చేసిన కోనప్ప తమ సమీప టీఆర్ఎస్ అభ్యర్థి కావేటి సమ్మయ్యపై 8,837 ఓట్ల మెజార్టీతో గెలుపొంది ఓటమికి ప్రతీకారం తీర్చుకున్నారు. ఆ తరువాత ఆయన టీఆర్ఎస్ పార్టీలో చేరారు. 2018 ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన కోనప్ప తమ సమీప కాంగ్రెస్ అభ్యర్థి పాల్వయి హరీశ్‌బాబుపై 24,036 ఓట్ల మెజా ర్టీతో భారీ విజయం సాధించారు. అనంతరం హరీశ్‌బాబు బీజేపీలో చేరడంతో కాంగ్రెస్ పా ర్టీలో సగానికిపైగా శ్రేణులు ఆయన వెంటే నడిచాయి. దీంతో కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో తీవ్ర ప్రభావం చూపే పరిస్థితి లేదని తెలుస్తోంది. ఫలితంగా నియోజకవర్గంలో బీజేపీ, అధి కార పార్టీకి ప్రధాన ప్రతిపక్షంగా మారింది. 17 సార్లు ఎన్నికలు.. సిర్పూర్ నియోజకవర్గం 1952లో ఏర్పడింది. 1957 లో ద్విసభ్య నియోజకవర్గంగా రూపాంతరం చెంది, తిరిగి 1962లో జనరల్ నియోజకవర్గంగా ఏర్పడింది. 2010లో జరిగిన ఉప ఎన్నికతో సహా ఇప్పటి వర కు 17 సార్లు ఎన్నికలు జరిగాయి. 1972, 1978 సంవత్సరాల్లో జరిగిన ఎన్నికల్లో వరుసగా రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన కె.వి.శేషవులు దివంగత ప్రధాని పీవీ నరసింహరావుకి అత్యంత సన్నిహితులు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఇక్కడ ఆరుసార్లు గె లువగా.. టీఆర్ఎస్, టీడీపీ మూడేసి సార్లు, ఇండిపెండెంట్ అభ్యర్థి రెండుసార్లు, పీఎస్పీ, సోషలిస్ట్, బీఎస్పీ పార్టీలు ఒక్కోసారి గెలిచాయి. కాంగ్రెస్, బీఎ స్పీ, టీఆర్ఎస్ తరఫున ఎమ్మెల్యేగా గెలిచిన కోనేరు కోనప్ప తాజాగా నాలుగోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. పాల్వాయి కుటుంబానికి పట్టు.. ఆది నుంచి నియోజకవర్గంలో డాక్టర్ పాల్వాయి హరీశ్‌బాబు కుటుంబానికి మంచి పట్టుంది. హరీశ్‌బాబు తండ్రి పాల్వాయి పురుషోత్తంరావు స్థానికుడు. 1989, 1994 ఎన్నికల్లో పురుషోత్తంరావు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన భార్య పాల్వాయి రాజ్యలక్ష్మి సైతం 1999లో టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచారు. వరుసగా ఆ కుటుంబసభ్యులు మూడుసార్లు గెలవడం నియోజకవర్గంలో వారికున్న పట్టుకు అద్దం పడుతోంది. ఈ నేపథ్యంలో బీజేపీ నుంచి పాల్వాయి హరీశ్‌బాబుకు టికెట్ దక్కితే హోరాహోరీ పోరు ఉంటుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. ఆర్ఎస్పీ సైతం ఇక్కడి నుంచే.. మరోవైపు బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ప్రవీణ్‌కుమార్ సిర్పూర్ నుంచే పోటీ చేస్తానని ప్రకటించడంతో ఆ పార్టీ శ్రేణులు చాపకింద నీరులా నియోజకవర్గంలో తమ కార్యకలాపాలు విస్తరిస్తున్నాయి. నిన్నటి వరకు ఎమ్మెల్యే కోనప్పకు అండగా నిలిచిన పొరుగు రాష్ట్రానికి ఆనుకుని ఉన్న కౌటాల మండలం గుండాయిపేట, మొగడ్‌దగడ్, తుమ్మిడిహెట్టి, వీర్దండి, తాటిపల్లి గ్రామాల ఓటర్లు బీఎస్పీ వైపు మొగ్గు చూపుతునట్లు తెలుస్తోంది. పైగా ఇక్కడి ఓటర్లు మాటిస్తే వందశాతం ఓట్లు వేస్తారన్న నమ్మకం ఉంది. చింతలమానెపల్లి మండలం బూరెపల్లి గ్రామం ఎస్టీ వర్గానికి చెందిన సిడాం గణపతి(ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మాజీ జెడ్పీ చైర్మన్)సైతం ఈ ఎన్నికల్లో బీఎస్పీకి మద్దతు ఇస్తున్నారు. బెజ్జూర్‌కు చెందిన మాజీ ప్రాథమిక వ్యవసాయ, సహకార సంఘం చైర్మన్ హర్షద్ ఉస్సేన్ బీఎస్పీలో కీలకంగా మారడంతో సిర్పూర్(టి), బెజ్జూర్, కాగజ్‌నగర్‌లో ఉన్న ముస్లిం ఓట్లు కొంత బీఎస్పీకి పడే అవకాశాన్ని కొట్టిపారేయలేమని రాజకీయ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ నుంచి ఎవరో..? కాంగ్రెస్‌లో టికెట్ ఆశిస్తున్న రావి శ్రీనివాస్, కోరళ్ల కృష్ణారెడ్డి ఇద్దరూ క్షేత్రస్థాయిలో విభేదాలకు అతీతంగా పనిచేసుకుపోతున్నారు. ఈ ఇద్దరు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, కొక్కిరాల ప్రేంసాగర్‌రావు, విశ్వప్రసాద్‌కు సన్నిహితులుగానే గుర్తింపు పొందారు. ఎవరికి టికెట్ ఇచ్చినా కలిసి పనిచేయాల న్న ఏకాభిప్రాయంతో ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మైనార్టీ విభాగం జిల్లా అధ్యక్షుడు యూనుస్ హుస్సే న్ కూడా టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. కోనప్పకు ఎదురుందా! సిర్పూర్ నియోజకవర్గంలో అత్యంత ప్రజాదరణ ఉన్న నేతగా పేరొందిన కోనేరు కోనప్పకు ఈసారి జరగనున్న ఎన్నికలు ఆషామాషీగా ఉండవని రాజకీయ నిపుణులు అంచనా వేస్తున్నారు. నియోజకవర్గంలో దాదాపు 2.17 లక్షలకు పైగా ఓటర్లు ఉన్నారు. ఇందులో బీసీ, ఎంబీసీ, డీఎన్టీ కులాలకు చెందిన ఓటర్లు 60 శాతంపైగా ఉన్నారు. ఈ కులాల్లో అత్యధికంగా మహాత్మా జ్యోతిబా పూలే సామాజిక వర్గానికి చెందిన మాలి కులస్తులు 28 వేల ఓటర్లు ఉన్నారు. ఎస్సీలు 53 వేలు, ఎస్టీలు 27 వేల వరకు ఉన్నట్లు సమాచారం. అలాగే ఆరె సామాజికవర్గానికి చెందిన ఓటర్లు 40 వేలకు పైగా ఉన్నారు. ఇక ముస్లిం ఓటర్లు సైతం 35 వేలకు పైగా ఉన్నట్లు తెలుస్తోంది. వీరి ఓట్లు సిర్పూర్ ఎమ్మెల్యే అభ్యర్థి విజయంలో కీలకపాత్ర పోషించనున్నాయి. కాగా, బీఆర్ఎస్కు సంస్థాగతంగా బూత్‌స్థాయి నుంచి మండలస్థాయి వరకు బలమైన క్యాడర్ ఉండడం కొంత కలిసొచ్చే అంశం. -
ప్రవీణ్‌కుమార్ హౌస్ అరెస్ట్
బండ్లగూడ, నాంపల్లి: అక్రమంగా అరెస్టులు చేసి తమను భయపెట్టాలని చూస్తే మరింత ఉవ్వెత్తున ఉద్యమిస్తామని బీఎస్పీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.ఎస్.ప్రవీణ్‌కుమార్ హెచ్చరించారు. గ్రూప్–2 పరీక్షలను రద్దు చేయాలని కోరతూ నిరసన చేపట్టేందుకు వెళ్తున్న ఆయనను శనివారం పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. దీంతో ఉదయమే బండ్లగూడలోని ఆయన నివాసంలో సత్యగ్రహ దీక్షకు కూర్చున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ శాంతియుతంగా దీక్ష చేస్తున్న తనను అర్థరాత్రి పోలీసులు అకారణంగా నిర్బంధించారని ఆరోపించారు. తమకు ఆదేశాలు ఉన్నాయంటూ రాద్ధాంతం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. శాంతియుతంగా నిరసన చేపట్టిన తన మాదిరిగానే రాష్ట్రవ్యాప్తంగా వేలాదిమంది బీఎస్పీ కార్యకర్తలను అరెస్టు చేశారని ఆందోళన వ్యక్తం చేశారు. సీఎం పోలీసులను నమ్ముకొని పాలన చేస్తున్నారని, భవిష్యత్‌లో ఇదే కేసీఆర్‌ను ఫామ్‌హౌజ్‌లోనే బందోబస్తు చేస్తారని ధ్వజమెత్తారు. గ్రూప్–2 ఉద్యోగాల్లో కొన్ని తమ అనుచరులకు కావాలని ముందుగానే పబ్లిక్ సర్విస్ కమిషన్‌కు చెప్పారనీ అందుకే నిరుద్యోగుల సమస్యలు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. పబ్లిక్ సరీ్వస్ కమిషన్ బోర్డులో కొంత మంది దొంగలను సీఎం నియమించారని విమర్శించారు. లీకేజీ కారకులను అరెస్టు చేయకుండా పరీక్షలు ఎలా? పేపర్ లీకేజీ కారకులను ఇంతవరకూ అరెస్టు చేయకుండా, తిరిగి వెంటనే పరీక్షలు నిర్వహించడం సరికాదని ప్రవీణ్‌కుమార్ అభిప్రాయపడ్డారు. 2014 నుంచి ఉద్యో గ నియామకాలు చేపట్టకుండా 2022లో ఒకేసారి నోటి ఫికేషన్ ఇచ్చి నిరుద్యోగులపై తీవ్ర భారం మోపారని ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం ఎన్నికల కోసమే ఆగమేఘాల మీద ఉద్యోగ పరీక్షలు నిర్వహిస్తున్నారని నిందించారు. ఇప్పటి వరకు డీఎస్సీ ఎందుకు నిర్వహించలేదని ఆయన ప్రశ్నించారు. నియంత, నిరంకుశ కేసీఆర్ వల్ల ఒక తరం నాశనం అయ్యిందని ప్రవీణ్ ధ్వజమెత్తారు. టీచర్ ఉద్యోగ పరీక్షలు రాసిన వాళ్లు గ్రూప్ పరీక్షలు రాయకూడదనేది కేసీఆర్ కుట్రగా పేర్కొన్నారు. ’’ముఖ్యమంత్రి కొడుకు, మనుమడు, ఎమ్మెల్యేలు, మంత్రులు ఎప్పుడైనా పోటీ పరీక్షలు రాశారా... ఆరునెలల్లో పరీక్ష సిలబస్ మార్చి మెటీరియల్ ఇవ్వకుండా వాళ్లు పరీక్ష రాయగలరా..’’అని నిలదీశారు. ఫేక్ యూనివర్సిటీలు యూనివర్సిటీలు బాగు చేయమంటే ఫేక్ ప్రైవేట్ యూనివర్సిటీలు ఏర్పాటు చేస్తున్నారని ప్రవీణ్‌కుమార్ ఆరోపించారు. తెలంగాణ ఉద్యమంలో పెన్ డౌన్, సకల జనుల సమ్మె, ఇలా ఎన్నో ఉద్యమాలు చేసినప్పుడు ఎలాంటి అణచివేత ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రం కల్వకుంట్ల కుటుంబంగా మారిందని విమర్శించారు. పేపర్ లీకేజీలో రమేష్, రాజశేఖర్‌రెడ్డి దొరికిన వెంటనే కేటీఆర్ దొంగ అని తేలిపోయిందనీ, అందుకే కేటీఆర్ ట్విట్టర్లో కూడా నిరుద్యోగ సమస్యలపై మాట్లాడడం లేదని ప్రవీణ్ విమర్శించారు. పేపర్ లీకేజీపై సీబీఐ విచారణ జరపాలని, విద్యార్థులపై పెట్టిన అక్రమ కేసులు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. బీఎస్పీ నేతల సత్యాగ్రహ దీక్ష భగ్నం గ్రూపు–2 పరీక్షలను వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ శనివారం ఉదయం నగరంలోని గన్‌పార్కు వద్ద సత్యాగ్రహ దీక్షకు దిగన బీఎస్సీ నాయకులు, కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. చేతుల్లో ప్లకార్డులను పట్టుకుని జైభీమ్ అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేస్తూ ప్రధాన రోడ్డు నుండి గన్పార్కులోనికి పరుగులు తీసిన వారిని పోలీసులు అడ్డుకుని బలవంతంగా లాక్కెళ్లారు. గన్‌పార్కు వైపునకు వచ్చినవారిని వచి్చనట్లుగానే అరెస్టు చేశారు. అరెస్టు చేసిన వారిని ముషీరాబాదు, నాంపల్లి పోలీసుస్టేషన్లకు తరలించారు. -
పెద్దపల్లి: గెలుపు, ఓటములు శాసించేది వారే.. మరి టికెట్ దక్కెనా?
ఈ నియోజకవుర్గంలో పెద్దపల్లి అతిపెద్ద మండలంగా నిలుస్తుంది. పెద్దపల్లి గెలుపోవటములను శాసించేది కూడా ఇదే మండలం. ఈ మండల కేంద్రంలో అత్యధికంగా ముస్లిం మైనారిటీల ఓట్లు ఉంటాయి. ముస్లిం మైనారిటీలు ఏ పార్టీకైతే ఓటు వేస్తారో ఆ పార్టీ విజయం సులభం అవుతుంది. 2009 నాటి నియోజకవర్గాల పునర్విభజన ప్రకారం పెద్దపల్లి నియోజకవర్గంలో మొత్తం 6 మండలాలను ఏర్పడ్డాయి. ఈ నియోజకవర్గంలో ఇప్పటివరకు 14 సార్లు సాధారణ ఎన్నికలు, ఒక ఉప ఎన్నిక జరిగాయి. కాంగ్రెస్ 6, టిడిపి 4, బీఆర్ఎస్ 2, బీజెపి 1, పీడీఎఫ్ 1, స్వతంత్య్ర అభ్యర్థి ఒకసారి గెలుపొందారు. పెద్దపల్లి నియోజకవర్గంలో గెలుపు ఓటములను శాసించేది బీసీ ఓటర్లు. కానీ చాలా కాలం నుండి ఈ నియోజకవర్గ టికెట్‌ను బీసీలకు కేటాయించాలని అన్ని పార్టీల ఆశావాహుల నుండి ఒత్తిడి వస్తుంది. ఈసారి ఎన్నికల్లో బిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల నుండి బీసీలకు టికెట్ కేటాయించాలని ఆయా పార్టీల అధిష్టానాలకు ఒత్తిళ్లు వస్తున్నాయి. ► బీసీలు : 70% ► ఎస్సీలు: 14% ► ఇతరులు: 16% ఇక్కడ ఎప్పుడు హోరాహోరీ పోటే..! 1983 ఎన్నికలు: ఈ ఎన్నికలలో సంజయ్ విచార్ మంచ్ తరపున పోటీచేసిన గోనె ప్రకాష్ రావు తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గీట్ల ముకుందరెడ్డిపై విజయం సాధించారు. 1984లో గోనె ప్రకాష్ రావు రాజీనామా చేయుటతో 1984లో ఉప ఎన్నికలు జరిగాయి. 1984 ఉప ఎన్నికలు: 1983లో విజయం సాధించిన గోనె ప్రకాష్ రావు (సంజయ్ విచార్ మంచ్) రాజీనామా చేయుటంతో 1984లో ఉప ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గీట్ల ముకుందరెడ్డి సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వేముల రమణయ్యపై విజయం సాధించి తొలిసారి శాసనసభలో ప్రవేశించారు. 2009 ఎన్నికలు: 2009 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి విజయ రమణారావు తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన జి.ముకుందరెడ్డిపై 23,483 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఈ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ తరఫున గుజ్జుల రామకృష్ణారెడ్డి, కాంగ్రెస్ పార్టీ తరఫున గీట్ల ముకుందరెడ్డి, ప్రజారాజ్యం పార్టీ నుండి వేముల పద్మావతి, లోక్‌సత్తా పార్టి తరఫున శ్రీనివాసరావు పోటీచేశారు. 2014 ఎన్నికలు: 2014 ఎన్నికలలో ఇక్కడి నుంచి తెరాస అభ్యర్థి దాసరి మనోహర్ రెడ్డి తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ పార్టీకి చెందిన భానుప్రసాదరావుపై 62677 ఓట్ల మెజారిటితో విజయం సాధించి తొలిసారి శాసనసభలో ప్రవేశించారు. 2018 ఎన్నికలు: 2018 ఎన్నికలలో తెరాస తరఫున దాసరి మనోహర్ రెడ్డి, భాజపా తరఫున గుజ్జుల రామకృష్ణారెడ్డి, జనకూటమి తరఫున కాంగ్రెస్ పార్టీకి చెందిన చింతకుంట విజయరమణారావు చేశారు. తెరాసకు చెందిన దాసరి మనోహర్ రెడ్డి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీకి చెందిన చింతకుంట విజయరమణారావు పై 8,466 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఉపాధ్యాయుడి నుంచి ఎమ్మెల్యేగా.. దాసరి మనోహర్ రెడ్డి కరీంనగర్ జిల్లాకు చెందిన తెలంగాణ ఉద్యమకారుడు కూడా. రాజకీయ నాయకుడ. ఈయన ట్రినిటీ విద్యాసంస్థల అధినేతగానూ ఉన్నారు. కరీంనగర్ జిల్లా కాసులపల్లి గ్రామానికి చెందిన మనోహర్ రెడ్డి ఎంఏ, బీఈడి వరకు అభ్యసించి ప్రారంభంలో ఉపాధ్యాయుడిగా పనిచేశారు. తర్వాత పలు విద్యాసంస్థలు స్థాపించి నిర్వహిస్తున్నారు. అతని తండ్రి పేరు రామ్ రెడ్డి. దాసరి ఒక వ్యవసాయ నేపథ్య కుటుంబం నుండి రాజకీయాల్లోకి వచ్చారు. మనోహర్ రెడ్డి ఎమ్.ఎ, బి.ఎడ్ డిగ్రీని కలిగి ఉన్నారు. వ్యవసాయ వృత్తిలో ఉన్నప్పటికీ,సామాజిక సేవలో అతని ఆసక్తి రాజకీయాల్లోకి తన ప్రవేశానికి దారితీసింది. తెలంగాణ తరపున శాసనసభకు పోటీ చేసి గెలిచిన మొదటి వ్యక్తి దాసరి మనోహర్ రెడ్డి. 2009-11 కాలంలో తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. 2010లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరి నియోజకవర్గ బాధ్యతలు స్వీకరించారు. 2014 శాసనసభ ఎన్నికలలో పెద్దపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తెరాస తరపున పోటీచేసి విజయం సాధించారు. దాసరి మనోహర్‌రెడ్డికి ఉన్న ప్రతికూల అంశాల కలగా మిగిలిన పెద్దపల్లి బస్సు డిపో ఎస్సారెస్పి ద్వారా చివరి ఆయకట్టు వరకు సాగు నీరు అందకపోవడం. పెద్దపల్లి, సుల్తానాబాద్ రాజీవ్ రహదారి నుండి పల్లెలకు వెళ్లే ప్రధాన రహదారుల సమస్య. పేదలకు అందని ద్రాక్షల డబల్ బెడ్ రూమ్ ఇండ్లు. మానేరు వాగు పై ఏర్పడ్డ ఇసుక రీచుల నుండి భారీగా ముడుపులు ముట్టినట్టు ఆరోపణలు. నియోజకవర్గం లో జరిగే ప్రతి అభివృద్ధి పనిలో అన్ని తానై వ్యవహారిస్తారని, సర్పంచులు, ఎంపిటిసిలు, కౌన్సిలర్ల నిరుత్సాహం. చెరువుల పూడికతీత పేరిట స్థానిక ఇటుక బట్టీలకు మట్టి అమ్ముకుంటున్నారని ఆరోపణలు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న నాయకులను పక్కన పెట్టి వలస నాయకులకు ప్రాధాన్యం ఇస్తున్నారని సీనియర్ నాయకుల అసంతృప్తి. పెద్దపల్లి నియోజకవర్గం లోని రైస్ మిల్లుల నుండి విలువడే కాలుష్య నివారణ కు ఎలాంటి చర్యలు చేపట్టలేదు. మానేరు వాగుపై నిర్మించిన చెక్ డ్యామ్ ల నిర్మాణంలో అవినీతి ఆరోపణలు. రైస్ మిల్లు వద్ద ముడుపులు తీసుకుని తరుగు పేయుట కొనుగోలు కేంద్రాల్లో రైతులను ఇబ్బంది పెట్టిన పట్టించుకోలేదని అపవాదు. ఎమ్మెల్యే మనోహర్ రెడ్డికి సానుకూల అంశాలు: పెద్దపల్లి పట్టణంలో మినీ ట్యాంక్ బండ్ ఏర్పాటు చేయడం పెద్దపల్లి పట్టణ సుందరీకరణ లో భాగంగా రోడ్ల విస్తరణ. పెద్దపాలి పట్టణ ప్రజలకు త్రాగు నీటి సమస్య తీర్చడం. సుల్తానాబాద్ పట్టణంలో మినీ స్టేడియం ఏర్పాటు. ఓదెల మల్లికార్జున స్వామి దేవాలయ అభివృద్ధి కి కృషి. పెద్దపల్లి లో మాతా శిశు ఆసుపత్రి ఏర్పాటు. సుల్తానాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి అభివృద్ధి కి కృషి. పెద్దపల్లి నియోజకవర్గంలో పోటీపడే ప్రధాన పార్టీల నాయకులు. బీఆర్ఎస్ పార్టీ... అధికార బిఆర్ఎస్ పార్టీలో సిట్టింగ్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్న దాసరి మనోహర్ రెడ్డికే మరోసారి అధిష్టానం టికెట్ ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ.... తెలుగుదేశం పార్టీ నుండి ఒకసారి ఎమ్మెల్యేగా గెలుపొందిన మాజీ ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు, ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నుండి బీసీలకు టికెట్ ఇవ్వాలంటూ నియోజకవర్గం లో విస్తృతంగా పర్యటిస్తున్న ఓదెల జడ్పిటిసి సభ్యుడు గంట రాములు, పెద్దపల్లి మాజీ జెడ్పిటిసి గతంలో డిసిసి అధ్యక్షులుగా ఉన్న ఈర్ల కొమురయ్య, తెలుగుదేశం పార్టీలో ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచిన మాజీ ఎమ్మెల్యే బిరుదు రాజమల్లు సైతం కాంగ్రెస్ లో చేరి పార్టీ నుండి పోటీలో నిలిచే అవకాశం ఉంది. భారతీయ జనతా పార్టీ.... బిజెపి పార్టీ నుండి తెలుగుదేశం అలయన్స్‌లో గెలిచిన మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణారెడ్డి, జాతీయ స్థాయి నాయకులతో మంచి సంబంధాలు కలిగిన దుగ్యాల ప్రదీప్ రావు, కాంగ్రెస్ పార్టీ నుండి ఇటీవలే బిజెపిలో చేరిన గొట్టముక్కుల సురేష్ రెడ్డి లు బిజెపి నుండి టికెట్ రేసులో ఉన్నారు. బహుజన సమాజ్ పార్టీ... ఇటీవల బీఎస్పీ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సమక్షంలో బీఎస్పీలో చేరిన దాసరి ఉష ఇప్పటికే గ్రామస్థాయిలో పర్యటిస్తూ బూతు స్థాయిలో పార్టీని బలోపేతం చేస్తూ పోటీ చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. భౌగోళిక పరిస్థితులు: ► పెద్దపల్లి నియోజకవర్గం సరిహద్దుల నుండి మానేరు నది ప్రవహిస్తూ పంటలను సస్యశ్యామలం చేస్తుంది. ఇటీవల కాలంలో మానేరు నదిలో ప్రభుత్వం ఇసుక తవ్వకాలకు అనుమతి ఇవ్వడంతో స్థానిక రైతులు అధికార పార్టీపై వ్యతిరేక భావనతో ఉన్నారు. ► పెద్దపల్లి నియోజకవర్గానికి మరో వైపు రామగిరి పర్వతాలు మంచి పర్యాటక కేంద్రాలుగా గుర్తింపు కలిగి ఉన్నాయి. ► సుప్రసిద్ధ శైవ క్షేత్రమైన శ్రీ భ్రమరాంబ సమేత ఓదెల మల్లికార్జున స్వామి ఆలయం భక్తులకు కొంగుబంగారంగా నిలుస్తోంది. ► నియోజకవర్గంలో ప్రసిద్ధిగాంచిన సబితం జలపాతం (వాటర్ ఫాల్స్) పర్యాటకులను ఆకర్షిస్తుంది. -
ధర్మపురి: అధికారిక పార్టీకి అవే మైనస్? వారి తీర్పే కీలకం
ధర్మపురి మున్సిపాలిటీతో పాటు, గొల్లపల్లి మండల ఓటర్ల తీర్పు కీలకం కాబోతున్నాయి. ధర్మపురి నియోజకవర్గంలో గత అసెంబ్లీ ఎన్నికలు హోరాహోరీగా జరిగాయి. ప్రస్తుత సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ తన ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అడ్లూరి లక్ష్మణ్ కమార్‌పై 441 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. అయితే మంత్రి కొప్పుల గెలుపుపై తనకు అభ్యంతరాలు ఉన్నాయని తన ప్రత్యర్థి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ రీకౌంటింగ్ కోసం హైకోర్టును ఆశ్రయించగా.. విచారణ జరుగుతోంది. ఈసారి జరుగనున్న ఎన్నికల్లో బీఅర్ఏస్ పార్టీ నుండి ప్రస్తుత సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పోటీ చేసే అవకాశం ఉంది. త్రిముఖ పోటీ: కాంగ్రెస్ పార్టీ నుండి డీసీసీ అధ్యక్షుడు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ బరిలో నిలిచే అవకాశం ఉంది. అలాగే గజ్జెల స్వామి, మద్దెల రవీందర్‌లు కూడా కాంగ్రెస్ నుండి టికెట్ ఆశిస్తూ.. నియోజకవర్గంలో వ్యక్తిగతంగా తమ అనుచరులతో కలసి పర్యటిస్తున్నారు. బిజేపి నుండి గతంలో కన్నం అంజన్న పోటీ చేశారు. ఐతే గత కొద్దికాలంగా అయన పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. అయితే ధర్మపురి నుండి మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి పోటీ చేస్తారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. గత ఏడాదిన్నరగా వివేక్ నియోజకవర్గంలో అడపాదడపా పర్యటిస్తున్న.. ధర్మపురి నుండి పోటీపై ఇప్పటికీ క్యాడర్‌కు ఏలాంటి స్పష్టత ఇవ్వలేదు. ఒకవేళ ధర్మపురి నుండి వివేక్ పోటీచేస్తే మాత్రం ఎన్నికల్లో మూడు ప్రముఖ పార్టీల మధ్య త్రిముఖ పోటీ ఉండవచ్చు. పార్టీపై ప్రజల్లో వ్యతిరేకత: వివేక్ కాకుండా బిజేపి నుండి కన్నం అంజన్న లేదా.. మరో కొత్త అభ్యర్థి పోటీ చేసిన బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్యే ద్విముఖ పోటీ ఉంటుంది. ధర్మపురి మున్సిపాలిటీలో మంచినీటి సమస్య, కరెంట్ కోతలతో పాటు, లబ్ధిదారులకు డబుల్ బెడ్రూం ఇండ్లను కేటాయించకపోవడంతో అధికార పార్టీ పని తీరుపై ధర్మపురి ప్రజల్లో తీవ్ర వ్యతిరేకతను తీసుకువస్తుండగా.. ఇథనాల్ ప్రాజెక్ట్ ఏర్పాటు, కాళేశ్వరం లింక్ 2 ప్రాజెక్ట్ భూసేకరణతో వెల్గటూర్,పెగడపల్లి మండలాల్లోని కొన్ని గ్రామాలు మంత్రి కొప్పులకు తలనొప్పిగా మారాయి. గడిచిన నాలుగున్నర ఏళ్ళలో నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి పనులతోపాటు.. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలతో ప్రజలు మరోసారి పట్టం కడతారని కొప్పుల ఈశ్వర్ ధీమాతో ఉన్నారు. ఓడిపోయిన గత నాలుగున్నర ఏళ్లుగా ప్రజల మధ్య వుండడంతో పాటు, ప్రజల్లో సానుభూతి లక్ష్మణ్ కుమార్‌కు కలసి వచ్చే అంశం. నియోజకవర్గ భౌగోళిక పరిస్థితులు: ధర్మపురి నియోజకవర్గంలో ప్రముఖ పుణ్యక్షేత్రం ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయంతోపాటు, పవిత్ర గోదావరి నది దక్షిణవాహినిగా ప్రవహిస్తుంది. అలాగే శాతవాహనుల తొలి రాజధాని కోటిలింగాల కోటేశ్వర స్వామి ఆలయాలు ఉన్నాయి. నియోజకవర్గంలో ఎక్కువ సంఖ్యలో ప్రజలు వ్యవసాయరంగంతో పాటు, జీవనోపాధి కోసం గల్ఫ్ దేశాలకు వలస వెళ్తారు. -
హలో కేటీఆర్‌గారూ.. ఈ ఫొటో గుర్తుందా?
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ భూముల అమ్మకంపై బీఎస్పీ తెలంగాణ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ట్విట్టర్ వేదికగా మంత్రి కేటీఆర్‌పై సెటైర్లు వేశారు. ‘ప్రభుత్వ భూముల వేలం పాటను ఆపివేయాలి. ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని మానుకోవాలి’అంటూ కేటీఆర్ ఓ ప్లకార్డు ప్రదర్శిస్తున్న పాత ఫొటోను జత చేస్తూ శుక్రవారం ఓ ట్వీట్ చేశారు. ‘తమరు ప్రతిపక్షంలో ఉంటే చెప్పేవి శ్రీరంగనీతులు, అధికారంలోకి వచి్చన తర్వాత ఆ నీతులు ఎక్కడో కొట్టుకొని పోయినయి! ఐనా చెప్పిందల్లా చేయడానికి మీరేమన్నా సన్నాసులా (నాన్న గారి మాటల్లోనే)!. మీరు మీ పత్రికల ద్వారా గతాన్ని తుడిచేయాలని శతవిధాలా ప్రయత్నిస్తున్నప్పటికీ చరిత్రను మరిచిపోయేంత సన్నాసులం మేం కాదు. 75 ఏళ్ల నుంచి 99 శాతం ఉన్న బహుజనులు 1శాతం ఉన్న ఆధిపత్య పాలకులకు ఓట్లేసి గెలిపిస్తే పేదల భూములను కాపాడలేదు సరికదా అమాంతంగా మింగేసిండ్రు. బీఎస్పీ అధికారంలోకి వచి్చన వెంటనే పేదల భూములకు రక్షణ కలి్పస్తాం’అని తన ట్వీట్లో ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ పేర్కొన్నారు. కాగా వందల కోట్లకు అసైన్డ్ భూములను కొంటున్న కేసీఆర్, కేటీఆర్ బినామీల నుంచి భూములను తిరిగి తీసుకుంటామని, వాటిని పేద రైతులకు పంచుతామని ట్విట్టర్లో బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ పేర్కొన్నారు. నిన్న కోకాపేట, రేపు బుద్వేల్, ఎల్లుండి ఆర్ఆర్ఎర్ చివరికి మిగిలేది గోచి గుడ్డనే అని ఎద్దేవాచేశారు. హలో... @KTRBRS గారు గీ ఫోటో గుర్తుందా? తమరు ప్రతిపక్షంలో ఉంటే చెప్పేవి శ్రీరంగనీతులు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ నీతులు ఎక్కడో కొట్టుకొని పోయినయి! ఐనా చెప్పిందల్లా చేయడానికి మీరేమన్నా సన్నాసులా(నాన్న గారి మాటల్లోనే) ! మీరు మీ పత్రికల ద్వారా గతాన్ని తుడిచేయాలని శతవిధాలా… pic.twitter.com/XdWrEhdOtz — Dr.RS Praveen Kumar (@RSPraveenSwaero) August 4, 2023 -
ముఖేష్ ఉపాధ్యాయ కు పాలతో స్నానం
-
హైదరాబాద్‌లో అంబేడ్కర్ భారీ విగ్రహం.. మాయావతి ఫైర్
సాక్షి, హైదరాబాద్: అంబేడ్కర్ పేరుతో తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం స్వార్థ రాజకీయాలు చేస్తోందని బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ) జాతీయ అధ్యక్షురాలు మాయావతి మండిపడ్డారు. అంబేడ్కర్ రాసిన రాజ్యాంగాన్ని మార్చాలంటున్న కేసీఆర్.. ఆ మహానుభావుడి విగ్రహాల సాకుతో అణగారిన వర్గాలను మరోసారి ఏమార్చేందుకు వస్తున్నారని విమర్శించారు. బీఎస్పీ తెలంగాణ శాఖ ఆధ్వర్యంలో ఆదివారం హైదరాబాద్ సరూర్‌నగర్ స్టేడియంలో ‘తెలంగాణ భరోసా సభ’ జరిగింది. మాయవతి ఈ సభలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. తాను ఉత్తరప్రదేశ్ సీఎంగా ఉన్నప్పుడు భూమి లేని దళితులకు మూడెకరాల భూమిని ఉచితంగా ఇచ్చానని.. కేసీఆర్ ఆ పథకాన్ని కాపీకొట్టి ఎన్నికల హామీగా ఇచ్చారని మాయావతి చెప్పారు. కానీ కేసీఆర్ దళితులకు భూమి పంపిణీ చేయకుండా మోసం చేశారని మండిపడ్డారు. రాష్ట్రంలో బీఎస్పీ బలోపేతం అవడంతో కేసీఆర్‌కు భయం పట్టుకుందన్నారు. కేసీఆర్ పాలనలో అన్నివర్గాలకు ఇబ్బంది కేసీఆర్ సర్కార్ తీరుతో దళితులు, ఆదివాసీలు, ఓబీసీలు, ముస్లిం తదితర అణగారిన వర్గాలన్నీ ఇబ్బంది పడుతున్నాయని మాయావతి ఆరోపించారు. బిహార్‌లో తెలంగాణకు చెందిన దళిత ఐపీఎస్‌ను చంపిన హంతకుడిని అక్కడి ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా విడుదల చేస్తే.. సీఎం కేసీఆర్ కనీసం కూడా ప్రశ్నించలేదేమని నిలదీశారు. అంబేడ్కర్, కాన్షీరాం స్ఫూర్తితో బీఎస్పీ అణగారిన వర్గాలకు అండగా నిలిచిందని.. భవిష్యత్తులో తెలంగాణలో అధికారంలోకి వస్తే యూపీలో అమలుచేసిన సంక్షేమ పథకాలను ఇక్కడా అమలు చేస్తామని మాయావతి ప్రకటించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల్లోని పేదలు, రైతులు, కూలీలు, నిరుద్యోగులు, మైనారిటీవర్గాలతో పాటు ఉన్నత వర్గాల్లోని పేదలకు కూడా బీఎస్పీ అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ సహా అన్ని పార్టీలు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్తున్నాయని.. కానీ నిరుద్యోగులకు ఇవ్వాల్సింది భృతి కాదని, ఉద్యోగాలు ఇవ్వాలని పేర్కొన్నారు. ఇక్కడ అధికారంలోకి వస్తే ప్రవీణ్‌కుమారే సీఎం తెలంగాణలో బీఎస్పీ అధికారంలోకి వస్తే ఆర్ఎస్ ప్రవీణ్‌కుమారే ముఖ్యమంత్రి అని మాయావతి ప్రకటించారు. ఆయన ఐపీఎస్ ఉద్యోగానికి రాజీనామా చేసి, పేదలకు సేవ చేయడానికి రాజకీయాల్లోకి వచ్చారని.. అలాంటి వ్యక్తి సీఎం అయితే తెలంగాణ అభివృద్థి చెందుతుందని చెప్పారు. రాష్ట్రంలో అధికారంలోకి రావడం, లోక్‌సభ ఎన్నికల్లో మెజారిటీ సీట్లు సాధించడమే లక్ష్యంగా కార్యకర్తలు పనిచేయాలని పిలుపునిచ్చారు. గ్రామగ్రామాన బీఎస్పీని బలోపేతం చేయాలన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో బీఎస్పీ పాత్ర కీలకమని, పార్లమెంటులో తెలంగాణ బిల్లుకు తాము సంపూర్ణ మద్దతు తెలిపామని మాయావతి గుర్తు చేశారు. బీఎస్పీకి భయపడే అంబేడ్కర్ విగ్రహం: ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ కల్వకుంట్ల కుటుంబం తెలంగాణను దోచుకుంటోందని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ఆరోపించారు. ప్రగతిభవన్ మీద నీలి జెండా ఎగరవేయడం ఖాయమని, తెలంగాణను దోపిడీ దొరల నుంచి విముక్తి చేయడమే తమ లక్ష్యమని ప్రకటించారు. ఏనాడూ అంబేడ్కర్ ఫోటోకు, విగ్రహానికి దండ వేయని కేసీఆర్.. బీఎస్పీకి భయపడే 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహం పెట్టారని పేర్కొన్నారు. తాను బీఎస్పీలో చేరిన తర్వాతే దళిత బంధు పథకాన్ని తెచ్చారన్నారు. ‘దళితబంధు’లో ఎమ్మెల్యేలు మూడు లక్షల రూపాయల చొప్పన కమీషన్లు తీసుకుంటున్నట్టు స్వయంగా చెప్పిన కేసీఆర్.. దమ్ముంటే ఆ ఎమ్మెల్యేల పేర్లను ఏసీబీకి ఇవ్వాలని సవాల్ చేశారు. రైతులు పంట నష్టపోయి కష్టాలు పడుతుంటే.. కేసీఆర్ ప్రగతిభవన్‌లో మహారాష్ట్ర వాళ్లను పార్టీలో చేర్చుకునే పనిలో ఉన్నారని, తెలంగాణ ప్రజాధనాన్ని మహారాష్ట్ర వ్యక్తులకు దోచిపెడుతున్నారని మండిపడ్డారు. టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీతో ఒక్కో ఉద్యోగాన్ని రూ.10 లక్షల నుంచి కోటి రూపాయల వరకు అమ్ముకున్నారని ఆరోపించారు. ప్రతీ నెలా ఒకటో తేదీన జీతం తీసుకునే కేసీఆర్.. ఉద్యోగులకు మాత్రం 10వ తేదీన జీతాలు ఇస్తున్నాడని ప్రవీణ్‌కుమార్ మండిపడ్డారు. పేద ఆర్టిజన్ కార్మికుల మీద ఎస్మా కింద కేసులు పెట్టారని, నెలకు 4లక్షలకుపైగా జీతం తీసుకుంటున్న కేసీఆర్‌పై ఎస్మా ప్రయోగించాలని వ్యాఖ్యానించారు. తెలంగాణ కోసం నాడు తాము గజ్జె కట్టామని.. ఇప్పుడు అన్యాయం జరిగితే గల్లా పడతామని హెచ్చరించారు. బీఎస్పీ అధికారంలోకి వస్తే 10 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని.. భూమి లేని వారికి ఎకరం భూమి ఇస్తామని ప్రకటించారు. ఈ సమావేశంలో బీఎస్పీ తెలంగాణ కోఆర్డినేటర్ రాంజీ గౌతమ్, ఏపీ అధ్యక్షుడు పరంజ్యోతి, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి వెంకటేశ్ చౌహాన్, అరుణ, సంజయ్ కుమార్, దాసరి ఉష తదితరులు పాల్గొన్నారు. -
బీఎస్పీ ఎంపీకి నాలుగేళ్ల జైలుశిక్ష
-
గ్రూప్–1 టాపర్ ఎవరో చెబితే ప్రభుత్వం కూలుతుంది: ఆర్ఎస్ ప్రవీణ్
సాక్షి, హైదరాబాద్: టీఎస్పీఎస్సీ గ్రూప్–1 మొదటి ర్యాంకు ఎవరిదో చెబితే బీఆర్ఎస్ ప్రభుత్వం కూలిపోతుందని బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.ఎస్. ప్రవీణ్‌కుమార్ వ్యాఖ్యానించారు. కేసీఆర్, కేటీఆర్‌లకు ఏమాత్రం చిత్తశుద్ది ఉన్నా గ్రూప్–1 టాపర్లు ఎవరో ప్రకటించాలని డిమాండ్ చేశారు. మంగళవారం బీఎస్పీ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరుద్యోగ భోరోసా దీక్షలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఎస్పీఎస్సీ సిబ్బంది, ఈ కేసులో నిందితులైన రాజశేఖర్‌రెడ్డి, దాసరి కిషోర్‌లకు గ్రూప్–1 ప్రిలిమ్స్‌లో 150 మార్కులకుగాను 120 మార్కులు సాధించినట్లు చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవితకు తెలిసిన వారే టీఎస్పీఎస్సీ సభ్యులుగా ఉన్నారని, అందువల్ల ఆ కమిషన్‌ను వెంటనే రద్దు చేయాలన్నారు. ఏ నిరుద్యోగ బిడ్డల త్యాగం వల్ల తెలంగాణ వచి్చందో, ఆ తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాలను కేసీఆర్ ప్రభుత్వం రూ. 10 లక్షల నుంచి రూ. కోటి వరకు అమ్ముకుంటోందని ప్రవీణ్‌కుమార్ ఆరోపించారు. ‘టెన్త్’లో అలా.. టీఎస్పీఎస్సీలో ఇలా.. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ విషయంలో ‘సిట్’విచారణ నత్తనడకన సాగుతోందని... నిందితులను బాధితులుగా చూపే ప్రయత్నం జరుగుతోందని దుయ్యబట్టారు. టెన్త్ పేపర్ లీకేజీ కేసులో పోలీసులు 48 గంటల్లోనే పాత్రదారులు, సూత్రదారులను అరెస్ట్ చేశారని... కానీ టీఎస్పీఎస్సీ కేసులో సూత్రదారులు తెలంగాణ ప్రభుత్వంలో ఉన్నందునే ఇప్పటివరకు అరెస్టు చేయలేదని ఆరోపించారు. ఈ కేసుపై స్పందించకుండా ముఖ్యమంత్రి మౌనం వహిస్తున్నారంటే తప్పు చేసినట్లు అంగీకరిస్తున్నట్లేనని ఆయన వ్యాఖ్యానించారు. అందుకే ముఖ్యమంత్రి గద్దె దిగాలని తాము డిమాండ్ చేస్తున్నామన్నారు. సీఎం కేసీఆర్‌కు దమ్ముంటే అమరవీరుల స్థూపం వద్దకు రావాలని, తాము పేపర్ లీక్‌కు సంబందించి ఆధారాలతో వస్తామని ఆయన సవాల్ చేశారు. 18న నిరసన దీక్ష... టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో నిరుద్యోగులకు న్యాయం చేసేలా ప్రతిపక్ష పారీ్టలంతా ఏకతాటిపైకి రావాలని ప్రవీణ్‌కుమార్ పిలుపునిచ్చారు. అలాగే కొత్త కమిషన్ వేశాకే పరీక్షలు నిర్వహించాలనే డిమాండ్‌తో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామన్నారు. అన్ని పార్టీల నాయకులు, విద్యార్థి సంఘాలతో ఈ నెల 18న ఇందిరాపార్కు వద్ద నిరసన దీక్ష చేయనున్నట్లు ప్రవీణ్‌కుమార్ తెలిపారు. సీఎంకు 25 ప్రశ్నలు రాజకీయ ప్రయోజనాల కోసమే సీఎం కేసీఆర్ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ పేరు వాడుకుంటున్నారని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ విమర్శించారు. మంగళవారం బీఎస్పీ కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాలను ఓటుబ్యాంకుగా చూడటమే తప్ప చిత్తశుద్ధి లేదని విమర్శించారు. 2016లో ఇచ్చిన హామీ మేరకు ఇప్పటికైనా 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని... కానీ గతంలో దళిత, బహుజనులకు ఇచ్చిన హామీల సంగతేంటని ప్రశ్నించారు. ఈ సందర్భంగా 25 ప్రశ్నలతో సీఎంకు రాసిన బహిరంగ లేఖను విడుదల చేశారు. చదవండి: టీఎస్పీఎస్సీ లీకేజీ.. రంగంలోకి ఈడీ -
సంచలన కేసులో.. రెండో నిందితుడి ఎన్కౌంటర్
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో ఉమేష్ పాల్ హత్య కేసు సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఈ హత్య కేసులో సోమవారం ఉదయం యూపీ పోలీసులు మరో నిందితుడిని ఎన్కౌంటర్ చేశారు. కాగా, ఉమేష్ పాల్‌పై మొదట కాల్పులు జరిపిన ఉస్మాన్‌ను పోలీసులు ఎన్కౌంటర్ చేశారు. వివరాల ప్రకారం.. యూపీలో బీఎస్పీకి చెందిన రాజ్ పాల్‌ను 2005లో హత్య చేశారు. ఈ కేసులో ప్రధాని సాక్షిగా ఉన్న ఉమేష్ పాల్‌ను ఆరుగురు వ్యక్తులు గత వారం నడిరోడ్డుపై కాల్పులు జరిపి హత్య చేశారు. దీనిపై యూపీ అసెంబ్లీ సమావేశాల సందర్బంగా కూడా తీవ్ర దుమారం రేగింది. దీంతో, సీఎం యోగి ఆదిత్యనాథ్.. నేరుస్తులను విడిచిపెట్టే ప్రసక్తే లేదని వార్నింగ్ ఇచ్చారు. ఈ క్రమంలోనే ఉమేశ్ భార్య జయ పాల్ ఫిర్యాదు మేరకు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్నారు పోలీసులు. ఇందులో భాగంగా మాజీ ఎంపీ, గ్యాంగ్‌స్టర్ అతీక్ అహ్మద్, అతడి సోదరుడు అష్రఫ్, ఇద్దరు అనుచరులు, మరో తొమ్మిది మందిపై కేసులు నమోదు చేశారు. కాగా, ఈ కేసులో నిందితులుగా ఉన్న వారి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలోనే సోమవారం తెల్లవారుజామున ప్రయాగ్‌రాజ్‌లోని కౌంధియారా పోలీసు స్టేషన్లో నిందితుడు విజయ్ అలియాస్ ఉస్మాన్‌ను ఎన్కౌంటర్లో కాల్చి చంపినట్లు పోలీసులు వెల్లడించారు. ఉమేశ్ పాల్‌పై కాల్పులు జరిపిన వారిలో ఉస్మాన్ మొదటి వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. కాగా.. ఈ కేసులో మరో నిందితుడు అర్బాజ్‌ను ఫిబ్రవరి 27న పోలీసులు ఎన్కౌంటర్ చేసిన విషయం తెలిసిందే. అతడు పారిపోవడానికి సిద్ధంగా ఉన్న సమయంలో ఎన్కౌంటర్ జరిగింది. ఇదిలా ఉండగా.. యూపీలో 2004లో జరిగిన అలహాబాద్ అసెంబ్లీ స్థానం ఉప ఎన్నికల్లో రాజ్ పాల్ బీఎస్పీ తరఫున పోటీచేసి విజయం సాధించారు. ప్రత్యర్థిగా ఉన్న అతీక్ అహ్మద్(ఎస్పీ) తమ్ముడు ఖలీద్ అజిమ్ ఓటమి చెందారు. కాగా, ఈ ఎన్నికల జరిగిన కొన్ని రోజులకే రాజ్ పాల్ హత్యకు గురయ్యారు. ఈ కేసులోనే ఉమేష్ సాక్షిగా ఉన్నారు. -
బీఆర్ఎస్, బీజేపీలవి దొంగాటలు
ఆలంపూర్: ప్రజల సమస్యల నుంచి దృష్టి మళ్లించడానికే బీఆర్ఎస్, బీజేపీ దొంగాటలు అడుతున్నాయని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ధ్వజమెత్తారు. జోగుళాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి మండలంలో బీఎస్పీ బహుజన రాజ్యాధికార యాత్ర శుక్రవారం కొనసాగింది. ఈ సందర్భంగా ఆలంపూర్లోని పార్టీ కార్యాలయంలో జరిగిన ప్రత్యేక సమావేశంలో ఆయన మాట్లాడారు. అసెంబ్లీలో సంపూర్ణ మెజార్టీ ఉన్నప్పటికీ బీసీ రిజర్వేషన్‌ను 27 నుంచి 50 శాతానికి ఎందుకు పెంచడం లేదని సీఎం కేసీఆర్‌ను నిలదీశారు. బీసీ రిజర్వేషన్లు పెంచడానికి ప్రభుత్వానికి వస్తున్న అడ్డంకులేమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. రిజర్వేషన్ల గురించి ఎమ్మెల్యేలెవరైనా మాట్లాడితే వారిని ప్రగతిభవన్‌లోకి అడుగు పెట్టనీయరని, అందుకే వారు క్యాంపు కార్యాలయాలకే పరిమితమయ్యారని అన్నా రు. అంతర్జాతీయ మహిళాదినోత్సవం నేపథ్యంలో ఎమ్మెల్సీ కవితకు మహిళారిజర్వేషన్లు గుర్తుకు వచ్చాయని, అందుకే నిరాహార దీక్ష చేస్తానని అంటున్నారని అన్నారు. తెలంగాణలో 2014 నుంచి 2018 వరకు ఒక్క మహిళామంత్రి లేరని, అప్పుడు ఎందుకు కవితకు నిరాహార దీక్ష ఆలోచన రాలేదని ప్రశ్నించారు. బీఎస్పీ కేవలం మహిళల గురించే కాదు బీసీలు, మైనారీ్ట, ఎస్టీల రిజర్వేషన్ల కోసం కూడా పోరాడుతుందన్నారు. రూ.3 లక్షల కోట్ల రాష్ట్ర బడ్జెట్లో ముస్లింల కోసం ఒక శా తం కంటే తక్కువగా నిధులు కేటాయించడం శోచనీయమని అన్నారు. ముస్లింల పై సానుభూతి వ్యక్తం చేసే పారీ్టలు ఎందుకు ఈ విషయం గురించి మాట్లాడటం లేదని ప్రశ్నించారు. సమావేశంలో బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు కేశవరావు, ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా మహిళా కనీ్వనర్ రాములమ్మ తదితరులు పాల్గొన్నారు. -
సీఎం కేసీఆర్‌కు కుర్చీనే దొరకలేదా..?: ప్రవీణ్‌కుమార్
అయిజ: ఎన్నికల్లో గెలిచిన అనంతరం కుర్చీ వేసుకొని కూర్చొని ఆలంపూర్ ఆయకట్టుకు నీరు పారిస్తానని చెప్పిన సీఎం కేసీఆర్‌కు ఇంత వరకు కుర్చీనే దొర కలేదా? జాగా దొరకడం లేదా? అని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ఎద్దేవా చేశారు. బహుజన రాజ్యాధికార యా త్ర మంగళవారం జోగుళాంబ గద్వాల జిల్లా అయిజ మండలంలో కొనసాగింది. ఉత్తనూ రు సమీపంలో ప్రవీణ్ విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రం సిద్ధించినా ఆలంపూర్ నియోజకవర్గం అభివృద్ధికి నోచుకోలేదన్నారు. -
దళితబంధు.. బీఆర్ఎస్ కార్యకర్తలకు విందు
జన్నారం (ఖానాపూర్): తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన దళితబంధు పథకం బీఆర్ఎస్ కార్యకర్తలకు విందుగా మారిందని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ఆరోపించారు. మంగళవారం బీఎస్పీ రాజ్యాధికార యాత్రలో భాగంగా మంచిర్యాల జిల్లా జన్నా రం మండలం ధర్మారం, కామన్పల్లి, ఇందన్పల్లి, జన్నారం గ్రామాల్లో పర్యటించారు. జన్నారంలో ప్రవీణ్ మీడియాతో మాట్లాడారు. దళితబంధు పథకం ప్రకటనకే పరిమితమైందని విమర్శించారు. ఏజెన్సీ ప్రాంతాల్లోని గిరిజనులతోపాటు గిరిజనేతరులు కూడా అటవీ హక్కు పత్రాలు అందజేయాలని డిమాండ్ చేశారు. టైగర్‌జోన్ పేరుతో అడవిలో ఉన్న గిరిజనులు, గిరిజన గ్రామాలను తరలించడం సరికాదన్నారు. ఎస్సీ కార్పొరేషన్ రుణాలు అందించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. సర్పంచ్ల ఆత్మహత్యలకు కారణమవుతున్న ఈ ప్రభుత్వాన్ని సాగనంపాలని ప్రవీణ్ పిలుపునిచ్చారు. సమావేశంలో రాష్ట్ర నాయకులు రమేశ్, ఖానాపూర్ నియోజకవర్గ ఇన్చార్జి రాథోడ్ బన్సీలాల్ తదితరులు పాల్గొన్నారు. -
రాష్ట్రంలో మ్యాచ్ ఫిక్సింగ్ రాజకీయాలు
ఉట్నూర్/ఇంద్రవెల్లి: రాష్ట్రంలో బీఆర్ఎస్, బీజేపీలు మ్యాచ్ ఫిక్సింగ్ రాజకీయాలు చేస్తున్నాయని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ విమర్శించారు. బహుజన రాజ్యాధికార యాత్రలో భాగంగా సోమవారం ఆయన ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్, ఇంద్రవెల్లి మండలాల్లో పర్యటించారు. ముందుగా ఉట్నూర్ తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించారు. ధరణి పోర్టల్ పనితీరు వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. పోడు భూముల సమస్యను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. అనంతరం ఐబీ చౌరస్తాలో మాట్లాడుతూ, పేదలకు మెరుగైన విద్య, వైద్యం అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయడంలో కాంగ్రెస్, బీజేపీలు పూర్తిగా విఫలమయ్యాయన్నారు. సచివాలయం గుమ్మటాలు కూల్చుతామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదమన్నారు. కూల్చాల్సింది గుమ్మటాలు కాదని.. రాష్ట్రంలో అవినీతిలో కురుకుపోయిన బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అని అన్నారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పాలనకు చరమగీతం పాడి, బీఎస్పీని ఆదరించాలన్నారు. అనంతరం యాత్ర పెర్కగూడ, శ్యాంపూర్, యోందా, ఉమ్రి, నర్సాపూర్, గోట్టిపటార్ మీదుగా ఇంద్రవెల్లి చేరుకుంది. ఇంద్రవెల్లిలోని బుద్ధనగర్, ప్రబుద్ధనగర్, సట్వాజిగూడ, బుర్సన్‌పటర్ గ్రామాల్లో యాత్ర సాగింది. -
వారి ఆకాంక్షలను బడ్జెట్ నెరవేర్చింది.. విపక్షాల స్పందన ఇదే!
న్యూఢిల్లీ: కేంద్ర బడ్జెట్ 2023-24పై విపక్షాలు పెదవి విరిచాయి. ఈ బడ్జెట్ వల్ల పేదలు, సామాన్యులు నిరుద్యోగులకు ఒరిగేదేమీ లేదని మండిపడ్డాయి. ఇది అంబానీ, అదానీ, గుజరాత్‌కు మాత్రమే లాభం చేకూర్చేలా ఉందని ధ్వజమెత్తాయి. 2024 సార్వత్రిక ఎన్నికలను దృష్టిలోనే ఉంచుకునే బీజేపీ అవకాశవాద బడ్జెట్‌ను ప్రవేశపెట్టిందని మండిపడ్డాయి. వాళ్ల కోసమే: కాంగ్రెస్ కాంగ్రెస్ ఎంపీ కే సురేశ్ ఈ బడ్జెట్‌ను 'ప్రో కార్పొరేట్‌గా' అభివర్ణించారు. అంబానీ, అదానీ, గుజరాత్ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకునే కేంద్రం బడ్జెట్‌ను రూపొందించిందని ఆరోపించారు. అదానీ ఆకాంక్షలను ఇది నెరవేర్చిందని ధ్వజమెత్తారు. కానీ సామాన్యుడిని మాత్రం కేంద్రం అసలు పట్టించుకోలేదని విమర్శించారు. బడ్జెట్లో కొన్ని అంశాలు బాగానే ఉన్నాయని .. కానీ గ్రామీణ పేదలు, ఉపాధి హామీ పథకం, నిరుద్యోగం, ద్రవ్యోల్బణం వంచి కీలక అంశాల ప్రస్తావనే లేదని కాంగ్రెస్ నేత శశిథరూర్ అన్నారు. ప్రజా వ్యతిరేకం: మమత ఇది ప్రజా వ్యతిరేక బడ్జెట్ అని టీఎంసీ అధినేత్రి, బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. 2024 లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే దీన్ని రూపొందించారని విమర్శించారు. ఆదాయపన్ను శ్లాబులు మార్చడం వల్ల ఎవరికీ మేలు జరగదని అన్నారు. దేశంలో కీలక సమస్యగా మారిన నిరుద్యోగం గురించి బడ్జెట్లో ప్రస్తావనే లేదని దుయ్యబట్టారు. పేదలు మరింత పేదలుగా, ధనికులు మాత్రం మరింత సంపన్నులుగా మారేలా బడ్జెట్ ఉందని ఫైర్ అయ్యారు. సమాజంలో ఒక వర్గానికి మాత్రమే ఇది ప్రయోజనం చేకూర్చేలా ఉందన్నారు. సవతి ప్రేమ: కేజ్రీవాల్ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కూడా బడ్జెట్‌పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. గతేడాది 1.75 లక్షల కోట్లు ఇన్‌కం ట్యాక్స్ కట్టిన ఢిల్లీ నగరానికి బడ్జెట్లో కేవలం రూ.325 కోట్లు మాత్రమే కేటాయించడం బాధాకరమన్నారు. కేంద్రం మరోసారి ఢిల్లీపై సవతి ప్రేమను చూపించి తీరని అన్యాయం చేస్తోందన్నారు. అలాగే ధరల పెరగుదల, నిరుద్యోగం వంటి కీలక అంశాల గురించి బడ్జెట్లో ప్రస్తావనే లేదని విమర్శించారు. ఈ బడ్జెట్‌తో ద్రవ్యోల్బణం మరింత పెరుగుతుందని కేజ్రీవాల్ అన్నారు. విద్య కోసం బడ్జెట్ కేటాయింపులు 2.64 శాతం నుంచి 2.5 శాతానికి తగ్గించడం దురదృష్టకరమన్నారు. అలాగే ఆరోగ్య రంగానికి కేటాయింపులు 2.2 శాతం నుంచి 1.98 శాతానికి తగ్గించడం హానికరం అన్నారు. ఆశ లేదు నిరాశే: అఖిలేష్ కేంద్ర బడ్జెట్‌పై గంపెడాశలు పెట్టుకున్న ప్రజలకు నిరాశే మిగిలిందని సమాజ్‌వాదీ పార్టీ అధినేత, యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ విమర్శించారు. 10 ఏళ్లుగా బడ్జెట్ ప్రవేశపెడుతున్న బీజేపీ ఈసారి కూడా ప్రజలకు ఏమీ ఇవ్వలేదని మండిపడ్డారు. ఈ బడ్జెట్‌తో దేశంలో నిరుద్యోగం, ద్రవ్యోల్బణం ఇంకా పెరుగుతుందని అన్నారు. రైతులు, కార్మికులు, యువత, మహిళలుకు ఆశకు బదులు నిరాశే మిగిలిందన్నారు. కేవలం కొందరు ధనికులకు మాత్రమే ప్రయోజనం చేకూర్చేలా బడ్జెట్ ఉందన్నారు. ఎప్పటిలాగే చేశారు: మాయావతి ఎప్పటిలాగే ఈసారి కూడా దేశంలోని 100 కోట్ల మంది పేదల ఆశలపై నీళ్లు జల్లేలా బడ్జెట్ ఉందని బీఎస్పీ అధినేత్రి మాయావతి మండిపడ్డారు. బడ్జెట్ రూపొందించే ముందు దేశంలో 130 కోట్ల మంది పేదలు, కార్మికులు, అణగారిన వర్గాలు, రైతులు ఉన్నారనే విషయాన్ని ప్రభుత్వం గుర్తుంచుకోవాలన్నారు. వీరంతా అమృత కాలం కోసం ఎదురుచూస్తున్నారని, కానీ ఈసారి కూడా నిరాశే ఎదురైందన్నారు. కాస్త భిన్నం: మెహబూబా ముఫ్తీ గత 8-9 ఏళ్లతో పోల్చితే ఈసారి బడ్జెట్ కాస్త భిన్నంగా ఉందని జమ్ముకశ్మీర్ మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ అన్నారు. పన్నులు పెంచారని, సంక్షేమ పథకాలు, సబ్సీడీలకు కేటాయింపులు లేవని అన్నారు. ధనవంతులు, బడా వ్యాపారవేత్తల కోసమే ప్రజల నుంచి పన్ను వసూలు చేస్తున్నారని విమర్శించారు. చదవండి: బడ్జెట్లో రక్షణ శాఖకు కేటాయింపులు పెంపు.. ఎన్ని కోట్లంటే..? -
TS: బీఎస్పీకి కంచుకోట ఉందా? అక్కడి నుంచే ప్రవీణ్ కుమార్ పోటీ!
ఆ నియోజకవర్గం BSP కంచుకోటగా చెబుతారు. ఆ బహుజనుల కోట నుంచే పార్టీ రాష్ట్ర చీఫ్ ఎన్నికల బరలో దిగబోతున్నారా? అక్కడి నుంచే పోటీ చేయడానికి ప్రవీణ్‌కుమార్ భావించడానికి కారణం ఏంటి? నియోజకవర్గంలో ప్రవీణ్ పర్యటన ఎన్నికల యాత్రేనా? కుమ్రంబీమ్ జిల్లాలోని సిర్పూర్ టి నియోజకవర్గం బహుజన సమాజ్ పార్టీకి బలమైన స్థావరంగా భావిస్తారు. 2014 అసెంబ్లీ ఎన్నికలలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని రెండు సీట్లలో అనుహ్యంగా BSP రెండు స్థానాల్లో విజయం సాధించింది. వచ్చే ఎన్నికల్లో సిర్పూర్ టి నియోజకవర్గం నుండి BSP రాష్ట్ర అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్ బరిలో దిగాలని భావిస్తున్నారట. అందులో బాగంగానే బహుజన రాజ్యదికార యాత్రను ఐదురోజుల పాటు ఈ నియోజకవర్గంలో ప్రవీణ్ నిర్వహిస్తున్నారు. ఐదు రోజుల యాత్రలో తెలంగాణ సర్కారు వైఫల్యాలను ఇంటింటికి తీసుకువెళ్లుతున్నారు. ఈ సందర్భంగా బహుజన రాజ్యం తెచ్చేందుకు మద్దతివ్వాలని ప్రజలను కోరుతున్నారు. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడంలో ఎమ్మెల్యే కోనేటి కోనప్ప విఫలం చెందారని విమర్శనాస్త్రాలను సంధిస్తున్నారు. గుడ్‌బై ఐపీఎస్.. ఛలో అసెంబ్లీ సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్‌గా విధులు నిర్వహిస్తూ..ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి వచ్చిన ప్రవీణ్‌కుమార్ బహుజన సమాజ్ పార్టీ ద్వారా ప్రజా జీవితంలోకి అడుగు పెట్టారు. రాబోయే ఎన్నికలే ఆయన ఎదుర్కోబోతున్న తొలి ఎన్నికలు. సిర్పూర్ నియోజకవర్గం నుంచే ఎన్నికల బరిలోకి దిగాలని భావించిన ప్రవీణ్ అక్కడి పరిస్థితులు అధ్యయనం చేసేందుకే యాత్ర నిర్వహిస్తున్నారు. నియోజకవర్గం లో దళిత, గిరిజన, మైనారీటీ, బీసీ ఓటర్లు భారీగా ఉన్నారు. ఆయా వర్గాలే అభ్యర్థుల గెలుపు ఓటములను ప్రభావితం చేస్తాయి. పైగా 2014లో ఇక్కడ పార్టీ అభ్యర్థి విజయం సాధించారు. అందుకే సిన్సియర్ ఆఫీసర్‌గా పేరు తెచ్చుకున్న ప్రవీణ్ ఇక్కడి నుంచే పోటీ చేస్తే మళ్ళీ బలహీనవర్గాల ప్రజలంతా మద్దతిస్తారనే అంచనాతోనే ఈ స్థానంపై కన్నేసారని తెలుస్తోంది. పైగా స్థానిక ఎమ్మెల్యే కోనప్ప పై ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉందని టాక్. ఎమ్మెల్యేపై వ్యతిరేకత బిఎస్పీకి అనుకూలంగా మారుతుందని భావిస్తున్నారు. తాను ఎస్సీ వర్గానికి చెందిన వ్యక్తి అయినప్పటికీ...జనరల్ సీటులో గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టాలని ఆయన భావిస్తున్నారు. ఎంత పెద్ద నాయకులైనా రిజర్వుడు కేటగిరికి చెందినవారైతే..ఆ స్థానాల్లోనే పోటీ చేస్తారు. కాని దానికి భిన్నంగా అందరివాడిగా గుర్తింపు పొందాలని భావిస్తున్న ప్రవీణ్‌కుమార్ జనరల్ సీటునే ఎంపిక చేసుకున్నట్లుగా తెలుస్తోంది. స్థానికంగా ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ ఇక్కడి నుంచే పోటీ చేస్తారంటూ ప్రచారం సాగుతున్నా..పార్టీ నాయకత్వం మాత్రం దీనిపై ఇంకా ప్రకటన చేయలేదు. -పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్ feedback@sakshi.com -
బీఆర్ఎస్, బీజేపీ నా ఫోన్ ట్యాప్ చేస్తున్నాయి
కాగజ్‌నగర్‌టౌన్: ప్రశ్నించే గళాలను అణచివేయడా నికి బీఆర్ఎస్, బీజేపీ ప్రభుత్వాలు కుట్రలు చేస్తు న్నాయని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. ఈ కుట్రల్లో భాగంగా తన ఫోన్‌ను ట్యాప్ చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. తన ఆపిల్ సెల్‌ఫోన్‌ను ట్యాప్ చేస్తున్నట్లు ఆ సంస్థ తనకు మెయిల్ పంపించిందని తెలిపారు. ప్రవీణ్‌కుమార్ చేపట్టిన రెండో విడత బహుజన రాజ్యాధికార యాత్ర సోమవారం కుమురంభీం జిల్లా కాగజ్‌నగర్‌లో ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బహుజన రాజ్యం కోసం తాను చేస్తున్న పోరాటాన్ని జీర్ణించుకోలేక, బీఎస్పీకి పెరుగుతున్న ఆదరణను తట్టు కోలేక ప్రభుత్వాలు ఇలాంటి నేరపూరిత చర్యలకు పాల్పడుతున్నాయని విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా పలువురు జర్నలిస్టులు, ప్రజా సంఘాలు, రాజకీయ నాయకుల ఫోన్లు ట్యాపింగ్ చేస్తున్నారని, బీజేపీ, బీఆర్ఎస్ కలిసే ఈ పనిచేస్తున్నాయని ఆరోపించారు. కాగా, రైతుస్వరాజ్య వేదిక నాయకులను ఉద్దేశించి ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ, రైతులకు పల్లా బహిరంగ క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. సిర్పూర్ నియోజకవర్గంలో అధికార పార్టీ నాయకుల ఆగడాలు ఎక్కువయ్యాయని, పేదల భూములను ఎమ్మెల్యే అనుచరులు కబ్జా చేస్తున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి సిడాం గణపతి, జిల్లా అధ్యక్షుడు ఆకుల సంతోష్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
బీసీ రిజర్వేషన్లు 50 శాతానికి పెంచాలి.. సీఎంకు ప్రవీణ్‌కుమార్ లేఖ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో బీసీ రిజర్వే షన్లను 27% నుంచి 50 శాతానికి పెంచా లని, బీసీ జన గణన ను చేపట్టాలని ప్రభు త్వాన్ని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.ఎస్. ప్రవీణ్‌కుమార్ డిమాండ్ చేశారు. ఈ మేరకు సీఎం కేసీఆర్‌కు ఆయన బహిరంగ లేఖ రాశా రు. తెలంగాణలో బీసీల జనాభా 50 శాతా నికిపై ఉన్నా విద్య, ఉద్యోగాలు సహా అన్ని రంగాల్లో బీసీల వాటా 27శాతమే ఉందన్నారు. పెరిగిన జనాభా ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు రిజర్వే షన్లు కల్పించాలన్నారు. రాష్ట్ర బడ్జెట్లో 50% నిధులను బీసీలకు కేటా యించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ కాంట్రాక్టుల్లో రిజర్వేషన్లు కల్పించాలని, సమగ్ర కుటుంబ సర్వే నివేదికను బహిర్గతపరచాలని డిమాండ్ చేశారు. బీసీల సమస్యలను తక్షణ మే పరిష్కరించకపోతే ప్రభుత్వం రాజీనామా చేసి గద్దెదిగాలని లేఖలో డిమాండ్ చేశారు. చదవండి: రేవంత్‌రెడ్డి కొత్త పార్టీ?.. కాంగ్రెస్ తీవ్ర ఆగ్రహం.. -
బంగారు తెలంగాణ దొరలకే పరిమితమైంది
సాక్షి, పెద్దపల్లి: బంగారు తెలంగాణ దొరల ఇంటికే పరిమితమైందని, పేదలకు ఇళ్లు లేవు, ఇంటికి తలుపులు లేవని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ అన్నారు. బహుజన రాజ్యాధికార యాత్రలో భాగంగా మంగళవారం పెద్దపల్లి నియోజకవర్గంలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీఆర్ఎస్ దోచుకోడానికే అధికారంలోకి వచ్చాయని, అందుకే దొరల పాలన అంతం చేసి పేదల రాజ్యం తెచ్చుకోవాలన్నారు. ఒకవైపు మహిళల రక్షణ కోసం షీ టీమ్‌లు అని డబ్బాలు కొడుతున్నారని.. మరోవైపు బాలికలపై అధికార పార్టీ నేతలు అత్యాచారాలు చేస్తున్నారని ఆరోపించారు. -
పోలీసు నియామకాల నిబంధనలను మార్చాల్సిందే
సాక్షి, హైదరాబాద్: ఎస్ఐ, పోలీసు కానిస్టేబుల్ నియామకాల్లో ఉన్న నియమ నిబంధనలను మార్చాలని బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ డిమాండ్ చేశారు. మూడు ఈవెంట్స్ తప్పనిసరి చేయడంపై పునరాలోచించాలని, ఎత్తును మాన్యువల్‌గా కొలవాలని, షాట్‌పుట్ లైన్ మీద పడినా క్యాలిఫై చేయాలని కోరారు. సోమవారం బీఎస్పీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ, ఈసారి పరుగు పందెంలో పురుషులకు 1,600 మీటర్లు, అమ్మాయిలకు 800 మీటర్లు పెట్టడం నిరుద్యోగులను ఇబ్బందులకు గురిచేయడమనే అన్నారు. లాంగ్‌జంప్ 3.8 మీటర్లు పరిగణనలోకి తీసుకోవాలని, ఎత్తు కొలిచే సందర్భంలోనూ సాంకేతిక లోపంతో చాలా మంది అభ్యర్థులు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎత్తును మ్యానువల్‌గా కొలవాలని కోరారు. చాలా గ్రామాల్లో సరైన గ్రౌండ్స్ లేవని, పీఈటీ కూడాలేని పరిస్థితుల్లో మూడు ఈవెంట్స్ తప్పనిసరి చేయడం సరికాదని, ఎక్కువ మంది హాజరు కాకూడదనే కుట్రపూరితంగా ఇలా చేస్తున్నారని ప్రవీణ్‌కుమార్ విమర్శించారు. ప్రతి ఏడాది నోటిఫికేషన్ ఇవ్వకుండా ఎన్నికల సమయంలో ఉద్యోగాలంటూ అభ్యర్థులను ఆందోళనలకు గురి చేయడం ఏమిటని నిలదీశారు. నిబంధనలను మార్చకపోతే బీఎస్పీ నిరవధిక పోరాటం చేస్తుందని హెచ్చరించారు. -
రాష్ట్రంలో దౌర్జన్యకర పాలన
ధన్వాడ: రాష్ట్రంలోని ప్రతి గ్రామంలోనూ అధికార టీఆర్ఎస్ పార్టీ నాయకులు దౌర్జన్యం చేస్తూ ప్రజలను భయపెడుతూ పాలన సాగిస్తున్నారని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.ఎస్.ప్రవీణ్‌కుమార్ ధ్వజమెత్తారు. శనివారం ధన్వాడ మండలంలోని గున్ముక్లలో ఆయన పర్యటించి టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన పలువురు కార్యకర్తలకు కండువా కప్పి బీఎస్పీలోకి ఆహ్వానించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రతి గల్లీలో బెల్ట్‌షాపులు పెట్టి కేసీఆర్ ప్రభుత్వం ప్రజలను తాగుబోతులుగా చేసేందుకు యత్నిస్తోందని విమర్శించారు. రాష్ట్రంలో కార్పొరేట్ ఆస్పత్రులు ప్రజలను వైద్యం పేరుతో దోచుకుంటున్నాయని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో బీఎస్పీని ఆదరించాలని, తాము అధికారంలోకి వస్తే భూమి లేని వారికి ఎకరాభూమి ఇస్తామని, బెల్ట్‌షాపులను పాలబూతులుగా మారుస్తామని, ప్రతి మండలంలో ఇంటర్నేషనల్ స్కూలు ఏర్పాటు చేస్తామని హామీనిచ్చారు. ఇటీవల ఆత్మహత్యకు పాల్పడిన శ్రీనివాస్ కుటుంబీకులను ప్రవీణ్‌కుమార్ పరామర్శించారు. నిందితులపై చర్యలు తీసుకోవాలంటూ డీఎస్పీతో ఫోన్లో మాట్లాడారు. కార్యక్రమంలో ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
మద్యంతో వచ్చే డబ్బులా? ప్రజల భవిష్యత్ ముఖ్యమా..
బాలానగర్: సీఎం కేసీఆర్ పాలనలో రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతోందని బీఎస్పీ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ అన్నారు. మద్యం ద్వారా వచ్చే రూ.35 వేల కోట్లు కావాలా.. 3.77 కోట్ల మంది ప్రజల బంగారు భవిష్యత్ కావాలా అని ప్రశ్నించారు. మహబూబ్‌నగర్ జిల్లా బాలానగర్ మండలంలోని ఓ తండాలో అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన విద్యార్థిని కుటుంబాన్ని ప్రవీణ్‌కుమార్ శుక్రవారం పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... రాష్ట్రంలో ఆడపిల్లలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. మద్యం మత్తులోనే ఎక్కువ అత్యాచారాలు జరుగుతున్నాయని చెప్పారు. చక్కగా ఇంగ్లిష్ మాట్లాడే విద్యార్థులు తయారవుతున్న ఈ తరుణంలో గల్లీ గల్లీలో బెల్టు షాపులు ఏర్పడటంతో.. మద్యానికి అలవాటు పడిన యువకులు ఏం చేస్తున్నారో తెలియని పరిస్థితి నెలకొందన్నారు. ఎంతోమంది పిల్లల భవిష్యత్ నాశనమవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. మీకేమో లిక్కర్ స్కాములు.. మాకేమో మరణ శయ్యాలా..? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. బాలిక ఆత్మహత్య కేసులో నిందితులకు కఠిన శిక్ష పడేలా చూడాలని డిమాండ్ చేశారు. బాధితురాలి కటుంబానికి న్యాయపరంగా అండగా ఉంటామన్నారు. ఆయన వెంట బీఎస్పీ నియోజకవర్గ ఇన్చార్జ్ బాలవర్ధన్‌గౌడ్, మండల కోఆర్డినేటర్ యాదయ్య తదితరులుఉన్నారు. -
ముందస్తు ఎన్నికలు ఖాయం: ఆర్.ఎస్.ప్రవీణ్
కామారెడ్డి టౌన్: తెలంగాణలో ముందస్తు ఎన్నికలు వస్తాయని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ చెప్పారు. సీఎం కేసీఆర్ అకస్మాత్తుగా ఫామ్‌హౌస్ నుంచి బయటకు వచ్చి జిల్లాల పర్యటనలు, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం వెనక ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచన ఉండి ఉండవచ్చన్నారు. మంగళవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని బీఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రవీణ్ మాట్లాడుతూ టీఆర్ఎస్కు ఎలాంటి సిద్ధాంతం లేదన్నారు. ప్రత్యేక రాష్ట్ర ఎజెండాతో ఏర్పాటైన పార్టీని దేశవ్యాప్తంగా ప్రజలు ఎలా ఆదరిస్తారని ప్రశ్నించారు. బిహార్, పంజాబ్ రాష్ట్రాల్లో పలువురు రైతులు, సైనికులకు ఆర్థిక సాయం చేసినంత మాత్రాన ప్రజలు ఆదరించరని తెలిపారు. కమ్యూనిస్టుల మద్దతు తీసుకుని, వందలమంది నాయకులను మోహరించి, రూ.500 కోట్లు ఖర్చు చేస్తేగానీ మునుగోడు ఉపఎన్నికలో గెలవలేదని ప్రవీణ్ ఎద్దేవాచేశారు. బీఎస్పీ కార్యకర్తలు గ్రామగ్రామాన నూతన కమిటీలు ఏర్పాటు చేసి పార్టీని బలోపేతం చేయాలని కోరారు. త్వరలో బహుజన రాజ్యాధికార యాత్ర కామారెడ్డి జిల్లాలో చేపడతామన్నారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు బాల్‌రాజు, జిల్లా ఇన్చార్జులు సురేశ్‌గౌడ్, సాయిలు, జిల్లా ఉపాధ్యక్షుడు రాజేందర్, మహిళా కన్వీనర్ వసంత తదితరులు పాల్గొన్నారు. -
రిజర్వేషన్లపై ఎందుకు నిలదీయడం లేదు
జడ్చర్ల టౌన్: బీసీ రిజ ర్వేషన్లలో కోత విధించార ని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్ర శ్నించినట్లే.. బీసీ కుల గణన చేయాలని, జనాభా ప్రకారం రిజర్వేషన్లు పెంచాలని కేంద్రాన్ని ఎందుకు నిలదీయడం లేదని బీజేపీ నాయకులను బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ప్రశ్నించారు. సోమవారం మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లకు వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు. బీసీ రిజర్వేషన్లను జనాభా దామాషా పద్ధతిన పెంచాలని, బీసీ కుల గణన చేపట్టాలని ఇదివరకే రాష్ట్రవ్యాప్త ఉద్యమానికి తాము పిలుపునిచ్చామని చెప్పారు. ఆ ఉద్యమాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు 15 మందితో స్టీరింగ్ కమిటీని నియమించామని వివరించారు. రాష్ట్ర స్టీరింగ్ కమిటీ.. రాష్ట్ర స్టీరింగ్ కమిటీ కన్వీనర్‌గా డా.సాంబశివగౌడ్, కో కన్వీనర్‌గా దాసరి హనుమయ్య, సలహాదా రులుగా చంద్రశేఖర్ ముదిరాజ్, మహతి, రమేష్, రీసెర్చ్ ఇన్‌చార్జ్‌లుగా ఊరుమల్ల విశ్వం, జక్కని విజయ్‌కుమార్, గుర్రప్ప, కల్చరల్ ఇన్చార్జ్గా అశోక్, దయాకరణ్, మౌర్య, కోనేటి సుజాత, మీడి యా ఇన్చార్జ్గా డా.వెంకటేశ్ చౌహాన్, సభ్యులుగా నామాలక్ష్మి, కత్తుల పద్మయాదవ్, మౌలానాషఫి, శాంసన్‌లను నియమించారు. భవిష్యత్ కార్యాచ రణ రూపొందించి కార్యక్రమాలు నిర్వహించాలని వారికి సూచించారు. కాగా, అన్ని పార్టీల్లోని బీసీ నేతలు ఆయా పార్టీల నేతలకు ఊడిగం చేయకుండా బీసీల న్యాయమైన వాటా కోసం పోరాడాలని ప్రవీణ్‌కుమార్ ట్విటర్ వేదికగా పిలుపునిచ్చారు. -
తెలంగాణలో ఆరు నెలల్లో ఎన్నికలు ఖాయం
సిద్దిపేటజోన్: తెలంగాణలో ఆరు నెలల్లో ఎన్నికలు రావడం ఖాయమని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ అన్నారు. హైదరాబాద్ నుంచి కరీంనగర్ వెళ్తూ బుధవారం సిద్దిపేటలోని పార్టీ కార్యాలయంలో తన జన్మదిన వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..బీఎస్పీ శ్రేణులకు కేవలం 180 రోజుల సమయం ఉందని, గ్రామాల్లో విస్తృతంగా పర్యటించి పార్టీని బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ మరో 55 మంది కార్యకర్తలను తయారు చేయాలని, సామాజిక మాధ్యమాల్లో కాకుండా బహుజన కార్యకర్తలు గ్రామాల్లో ఉండాలని పిలుపునిచ్చారు. ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకుగాను ‘మై బీఎస్పీ టాక్ ఇన్’అనే పోర్టల్ అందుబాటులోకి తెచ్చామని తెలిపారు. తనపై కేసులు పెట్టినా, బెదిరింపులకు పాల్పడినా భయపడేదిలేదన్నారు. ఇదీ చదవండి: డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు లైన్ క్లియర్.. లబ్ధిదారుల ఎంపిక షురూ! -
బీజేపీ, టీఆర్ఎస్ రెండూ దొంగ పార్టీలే: ఆర్ఎస్పీ
కొల్లాపూర్ రూరల్: బీజేపీ, టీఆర్ఎస్ రెండూ దొంగ పార్టీలేనని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ విమర్శించారు. ఆదివారం నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలంలోని కుడికిల్లలో ఇటీవల పోడు భూముల సమస్యలతో నార్లాపూర్, కుడికిల్ల గ్రామాల రైతుల ఘర్షణలో గాయపడిన దళిత రైతులను పరామర్శించారు. అనంతరం ప్రవీణ్ విలేకరులతో మాట్లాడుతూ అంగట్లో సరుకుల మాదిరిగా ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం సిగ్గుచేటని దుయ్యబట్టారు. రెండు పార్టీలు ముందుగా మాట్లాడుకునే ఈ తతంగాన్ని నడిపాయని ఆరోపించారు. కొనుగోలుకు గురైన ఎమ్మెల్యేలను దించి.. బీఎస్పీ పార్టీ వారిని ఎమ్మెల్యేలుగా గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. -
బీఎస్పీకి ఓటేస్తే బీజేపీకి వేసినట్లే: ఎమ్మార్పీఎస్
మర్రిగూడ: బీఎస్పీకి ఓటు వేస్తే అది బీజేపీకి వేసినట్లేనని ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మేడి పాపన్న, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ అన్నారు. సోమవారం నల్లగొండ జిల్లా మర్రిగూడ మండల కేంద్రంలో నిర్వహించిన మాదిగ ఆత్మీయ సమ్మేళనంలో వారు మాట్లాడారు. నిత్యం దళితులపై దాడులు జరుగుతుంటే బీఎస్పీ పార్టీ ఎందుకు మౌనంగా ఉందో చెప్పాలన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు కలిసి ఐక్య ఉద్య మాలు చేస్తుంటే బీఎస్పీ మాత్రం ప్రేక్షక పాత్ర పోషిస్తోందని ఆరోపించారు. ప్రజలందరూ బీజేపీని ఓడించి టీఆర్ఎస్ అభ్యర్థి ప్రభాకర్ రెడ్డిని గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు గణేశ్, నర్సింహ, నరేందర్, శంకర్, సాలయ్య, సుదర్శన్ పాల్గొన్నారు. -
కూతురు కోసమే ఢిల్లీకి సీఎం కేసీఆర్
చండూరు : మద్యం కుంభకోణంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు బంధువు అభిషేక్‌రావు అరెస్టయ్యారని, తర్వాత ఎమ్మెల్సీ కవిత అరెస్టవుతుందని తెలిసి..తన కూతుర్ని కాపాడుకోవడం కోసమే కేంద్రంలో మంతనాలు జరపడానికి కేసీఆర్ ఢిల్లీకి వెళ్తున్నారని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ఆరోపించారు. నల్లగొండ జిల్లా చండూరు మండలం పరిధిలోని చండూరు, తుమ్మలపల్లి, దోనిపాముల, కొండాపురం, నెర్మట గ్రామాలలో మంగళవారం ప్రచారం నిర్వహించారు. టీఆర్ఎస్, బీజేపీ ఒక్కటేనని, ఒప్పందం ప్రకారం కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. స్కాంలు, కాంట్రాక్టుల కోసం అమ్ముడుపోయే నాయకులను, దోపిడీ పార్టీలను ప్రజలు ఓడించాలని పిలుపునిచ్చారు. ఉపఎన్నికల్లో గెలవడం కోసం ఆధిపత్య పార్టీలు వందల కోట్లు ఖర్చు చేస్తున్నాయన్నారు. ఈ ఉప ఎన్నిక కొండ చిలువకు, చలి చీమలకు మధ్య యుద్ధంగా అభివర్ణించారు. ఇప్పటికీ చండూరులో బుడగ జంగాలు, ఎరుకల కులాలు చెత్త ఏరుకుని బతుకుతున్నా యని ఆవేదన వ్యక్తం చేశారు. బీఎస్పీ పార్టీని ఆదరించి..ఆశీర్వదించాలని కోరారు. కార్యక్రమంలో బీఎస్పీ నాయకులు జగన్నాథ్‌గౌడ్, ప్రమీల, నిర్మల, సుజాత, గణేశ్, శివ పాల్గొన్నారు. -
మునుగోడు ఉప ఎన్నిక; బీఎస్పీ అభ్యర్థిగా యువ నాయకుడు
సాక్షి, హైదరాబాద్: మునుగోడు ఉప ఎన్నికలో తమ పార్టీ తరపున పోటీ చేయబోయే అభ్యర్థిని బహుజన సమాజ్ పార్టీ(బీఎస్పీ) తెలంగాణ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రకటించారు. ఆందోజు శంకరాచారిని తమ పార్టీ తరపున పోటీకి నిలబెడుతన్నట్టు ఆయన వెల్లడించారు. శనివారం శంకరాచారికి పార్టీ తరపున బిఫాం అందించారు. ఉన్నత విలువలున్న యువనాయకుడు శంకరాచారిని గెలిపించాలని ఈ సందర్భంగా కోరారు. కలుద్దాం- నిలుద్దాం- గెలుద్దాం నినాదంతో ముందుకు పోవాలని పిలుపునిచ్చారు. మునుగోడు ఉప ఎన్నికల పోలింగ్ నవంబర్ 3న జరగనుంది. ప్రధాన పార్టీలు ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించాయి. బీజేపీ నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, టీఆర్ఎస్ తరపున కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థిగా పాల్వాయి స్రవంతి పోటీ చేస్తున్నారు. ప్రజాశాంతి పార్టీ అభ్యర్ధిగా ప్రజాగాయకుడు గద్దర్‌ను ఖరారు చేశామని ఆ పార్టీ అధినేత కేఏ పాల్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక మునుగోడులో విజయం కోసం రాజకీయ పార్టీలు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రధాన పార్టీలు ముఖ్య నేతలను రంగంలోకి దించాయి. మునుగోడులో విజయం ఎవరిని వరిస్తుందో నవంబర్ 6న వెల్లడవుతుంది. (క్లిక్ చేయండి: పదోసారి పోటీ.. మునుగోడులో విజయం నాదే) -
మునుగోడులో సారా, కూర, ఖారతో ప్రలోభాలు
మర్రిగూడ: మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో అధికార పార్టీ సారా, కూర, ఖార ఇచ్చి ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తోందని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ఆరోపించారు. ఆదివారం నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలంలోని మర్రిగూడ, యరగండ్లపల్లి, తిరగండ్లపల్లి, లెంకలపల్లితోపాటు మరికొన్ని గ్రామాల్లో బహుజన రాజ్యాధికారయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలను నెరవేర్చాలన్నారు. 70 రోజులుగా 23 వేల మంది వీఆర్ఏలు శాంతియుతంగా సమ్మె చేస్తుంటే లాఠీచార్జి చేయించి అణచివేసే ప్రయత్నం చేస్తూ.. ప్రభుత్వం బెదిరింపులకు పాల్పడడం అమానుషమన్నారు. కాగా, మర్రిగూడ మండలంలోని పీహెచ్‌సీని ప్రవీణ్‌కుమార్ సందర్శించారు. అదే సమయంలో నడవలేక ఇబ్బంది పడుతున్న ఓ వృద్ధుని కుటుంబీకులు మోసుకెళ్తున్న దృశ్యం చూసి తాను కూడా చేయివేసి సాయం చేశారు. చదవండి: బీజేపీకి కొత్త పేరు చెప్పిన కేటీఆర్ -
దోచుకున్న సొమ్ముతో విమానాల కొనుగోలు: ఆర్ఎస్ ప్రవీణ్
మర్రిగూడ: ఎంతో మంది త్యాగాలతో సాధించుకున్న తెలంగాణలో నేడు కేసీఆర్ కుటుంబపాలన కొనసాగుతోందని, దోచుకున్న సొమ్ముతో విమానాలు కొంటున్నారంటే పాలన ఏవిధంగా ఉందో అర్ధమవుతుందని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ విమర్శించారు. ఆయన శుక్రవారం నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలంలో బహుజన రాజ్యాధికార యాత్ర నిర్వహించారు. ఆయా గ్రామాల్లో జరిగిన సభల్లో ప్రవీణ్‌కుమార్ మాట్లాడుతూ.. గ్రామాల్లో వన భోజనాలు, బతుకమ్మ చీరలతో మాయమాటలు చెబుతూ మత్తులో ముంచడం టీఆర్ఎస్ పార్టీకే చెల్లుతుందన్నారు. ఫార్మా కంపెనీలు, రీజినల్ రింగురోడ్ల పేర్లతో బడుగు, బలహీనవర్గాల భూములను లాక్కొంటున్నారని, అగ్రవర్ణాల వారి భూములను అలాగే ఉంచుతున్నారని ఆరోపించారు. చదవండి: సాగరహారంపై ‘పిట్ట పోరు’.. కేటీఆర్–రేవంత్‌ల మాటల యుద్ధం -
కేసీఆర్‌కు 300 ఎకరాలు ఎందుకు?
సంస్థాన్‌నారాయణపురం: ‘ముఖ్యమంత్రి కేసీఆర్‌కు 300 ఎకరాల భూమి ఉంది, పేదలకు మాత్రం ఎకరం భూమి లేదు, సరైన ఇళ్లు లేవు’ అని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్‌నారాయణపురం మండలం జనగాంలో గురువారం బహుజన రాజ్యాధికార యాత్ర కొనసాగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ.. ‘సీఎం కేసీఆర్, టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి, రాజగో పాల్‌రెడ్డి, కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, పాల్వాయి స్రవంతి భూమి దున్నగలరా, విత్తనాలు వేయగలరా, కలుపు తీయగలరా? వారికి వందల ఎకరాల భూమి ఎందుకు’అని ప్రశ్నించారు. గిరిజనులు చదును చేసి సాగు చేసుకుంటున్న భూములను గుంజుకుంటున్నారని, పట్టాలివ్వకుండా అన్యాయం చేస్తున్నారని ధ్వజమెత్తారు. బహుజన రాజ్యం వస్తే ప్రతి నిరుపేద కుటుంబానికి ఎకరం భూమితో పాటు పట్టాలు ఇస్తామని ప్రవీణ్‌కుమార్ హామీ ఇచ్చారు. కేసీఆర్ ప్రభుత్వం యువతకు నాణ్యమైన విద్య, ఉద్యోగాలు ఇవ్వడం లేదని, నాయకులు మాత్రం విదేశాల్లో కూడా వ్యాపారం చేసుకుంటూ కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారని దుయ్యబట్టారు. ఓట్ల సమయంలో పేదలకు డబ్బు, మద్యం పంచి ఎన్నికల అనంతరం అభివృద్ధికి దూరంగా ఉంచుతున్నారని విమర్శించారు. చదవండి: బుల్లెట్లతో ఎమ్మెల్యే పేరు.. సీఆర్పీఎఫ్ జవాన్ నిర్వాకం -
ప్రజలసొమ్ముతో టీఆర్ఎస్ నేతల దావత్‌లు
సంస్థాన్ నారాయణపురం: నల్లగొండ జిల్లా మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంలో టీఆర్ఎస్ నేతలు ఆత్మీయ సమ్మేళనాల పేరుతో సంపాదించిన సొమ్ముతోనే మనకు దావతులు ఇస్తున్నారని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ అన్నారు. బహుజన రాజ్యాధికార యాత్రలో భాగంగా సోమవారం యాద్రాది భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలంలోని మల్లారెడ్డిగూడెం, గుజ్జ తదితర గ్రామాలలో ఆయన పర్యటించారు. పాదయాత్ర చేస్తూ ప్రజలను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. దావతులు, డబ్బు, చీరలు పంచడం తప్ప టీఆర్ఎస్కు అభివృద్ధి చేతకాదని విమర్శించారు. చదవండి: ప్రాజెక్టులకు సహకరించని రాష్ట్ర సర్కారు -
ఎనిమిదేళ్లలో రూ.5 లక్షల కోట్ల అప్పు
చౌటుప్పల్: కేసీఆర్ తన ఎనిమిదేళ్ల పాలనలో రూ.5 లక్షల కోట్ల అప్పు చేశారని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ధ్వజమెత్తారు. బీఎస్పీ ఆధ్వర్యంలో చేపట్టిన బహుజన రాజ్యాధికార యాత్ర ఆదివారం యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని లక్కారం, చౌటుప్పల్, తంగడపల్లి గ్రామాల మీదుగా కొనసాగింది. ఈ సందర్భంగా చిరు వ్యాపారులు, వివిధ రంగాల కార్మికులతో ఆయన ముచ్చటించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మార్గమధ్యంలో చాకలి ఐలమ్మ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, సర్దార్ సర్వాయి పాపన్నల విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఆయన మాట్లాడుతూ కాళేశ్వరం, మిషన్ భగీరథ వంటి స్కీంలతో సీఎం కేసీఆర్ కోట్లు సంపాదించారని ఆరోపించారు. కేసీఆర్ తెచ్చేవి స్కీంలు కాదని, అన్నీ స్కాంలేనని అన్నారు. స్కీంల ద్వారా పేదల పేరు చెప్పుకొని టీఆర్ఎస్ నాయకులు జేబులు నింపుకుంటున్నారని మండిపడ్డారు. ఓట్ల కోసం నాసిరకం బతుకమ్మ చీరలు పంచుతూ మహిళలను అవమానపరుస్తున్నారని ఆగ్ర హం వ్యక్తం చేశారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం దేశాన్ని గుజరాత్ షేఠ్లకు అమ్ముతోందని ధ్వజమెత్తారు. మునుగోడు ఎన్నికల కోసం కేంద్రహోంమంత్రి అమిత్ షా తాజా మాజీ ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డికి రూ.150 కోట్లు ఇచ్చారని ఆయన ధ్వజమెత్తారు. -
మునుగోడు బరిలో ఉంటాం: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
బిజినేపల్లి: త్వరలో జరగబోయే మునుగోడు ఉప ఎన్నికలో తమ పార్టీ అభ్యర్థి బరిలో ఉంటారని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ చెప్పారు. ఆదివారం నాగర్‌కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలంలోని వెల్గొండలో మీడియాతో ఆయన మాట్లాడారు. మునుగోడు ప్రజలు తమ పార్టీ అభ్యర్థిని ఆదరిస్తా రన్న నమ్మకం ఉందన్నారు. అనంతరం రాబోయే అసెంబ్లీ ఎన్ని కల్లో కూడా తాము పూర్తిస్థాయిలో అభ్యర్థులను నిలబెడతామని వెల్లడించారు. చదవండి: బీజేపీకి తెలంగాణలో స్థానం లేకుండా చేయాలి: రేవంత్ -
మునుగోడు ఉప ఎన్నికల్లో పోటీకి సిద్ధం
సాక్షి, న్యూఢిల్లీ: మునుగోడు ఉప ఎన్నికల్లో పోటీకి సిద్ధంగా ఉన్నామని బహుజన్ సమాజ్‌వాదీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వెల్లడించారు. మునుగోడు ప్రజలు రాజగోపాల్‌రెడ్డికి బుద్ధి చెబుతారని స్పష్టం చేశారు. రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో అన్ని స్థానాల్లోనూ బీఎస్పీ ఒంటరిగా పోటీ చేస్తుందని, బీఎస్పీ గెలుపు చారిత్రక అవసరమన్నారు. సామాజిక న్యాయం అజెండాగా ఉప ఎన్నికల్లోకి వెళ్తామని ప్రవీణ్ కుమార్ తెలిపారు. నాలుగు రాష్ట్రాలకు చెందిన పార్టీ నేతలతో బీఎస్పీ అధినేత్రి మాయావతి గురువారం ఢిల్లీలో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న ప్రవీణ్ కుమార్ అనంతరం తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలోని సమస్యలను తప్పించుకోవడానికి కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీలు నాటకాలు ఆడుతున్నాయని మండిపడ్డారు. చదవండి: కాంగ్రెస్ గూటికి చెరుకు సుధాకర్.. మునుగోడు ఉపఎన్నికలో సామాజిక అస్త్రంగా! -
ఆత్మగౌరవంతో ముందుకు వెళదాం
సిరిసిల్ల: ఆకలితోనైనా చస్తాం.. కానీ ఆత్మగౌరవాన్ని పోగొట్టు కోమని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.ఎస్.ప్రవీణ్‌కుమార్ పేర్కొ న్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనా ర్టీలంతా కలసి ఆత్మగౌరవంతో ముందుకు వెళదామని అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో శనివారం విశ్వకర్మీయుల ఆత్మగౌరవసభలో ప్రవీణ్‌కుమార్ మాట్లాడారు. తెలంగాణలో అగ్రకులాలు పేదలను విభజించి పాలిస్తున్నాయని మండిపడ్డారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ అహంకారంతో వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. ఏకంగా బీఆర్ అంబేడ్కర్ రాసిన రాజ్యాంగాన్నే మార్చాలంటున్నారని విమర్శించారు. ‘నేను సిరిసిల్లకు వస్తుంటే అనేక అడ్డంకులు సృష్టించారు, మీ నాయన కుట్రలను భరించలేకనే 26 ఏళ్లు చేసిన ఉద్యోగాన్ని వదిలేసి ప్రజల కోసం బయటకు వచ్చా’అని ప్రవీణ్‌కుమార్.. మంత్రి కేటీఆర్‌ను ఉద్దేశించి అన్నారు. ప్రగతిభవన్ వేదికగా అనేక కుట్రలు జరుగుతున్నాయన్నారు. ‘బహుజనులంతా ఒకరితో ఒకరు కలుద్దాం.. నిలుద్దాం.. గెలుద్దాం’అని పిలుపునిచ్చారు. అంతకుముందు ఆయన గంభీరావుపేట మండలం నర్మాలలో కూడా మాట్లాడారు. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ పేరిట 200 మంది పేదల వద్ద బలవంతంగా 370 ఎకరాల భూములు లాక్కున్నారని ప్రవీణ్‌కుమార్ ఆరోపించారు. వారికి ఎకరానికి రూ.5 లక్షలు మాత్రమే చెల్లించారని, ఈ భూముల్లో అధికార పార్టీ నేతలు విల్లాలు కడుతున్నారని మండిపడ్డారు. బాధితులకు అండగా ఉంటానని ప్రవీణ్‌కుమార్ హామీ ఇచ్చారు. సిరిసిల్లలో దీక్షలు చేస్తున్న వీఆర్ఏల శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపారు. సిరిసిల్ల సభలో విశ్వకర్మ నాయకులు దాసోజు శ్రవణ్, ఆచారి, మురళి, మధుచారి తదితరులు పాల్గొన్నారు. -
పేదలకు ఎకరం భూమి.. 10 లక్షల ఉద్యోగాలు
హన్మకొండ అర్బన్: జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం ఖిలాషాపూర్‌లో మార్చి 6న ప్రారంభమైన బహుజన రాజ్యాధికార యాత్ర బహుజనుడిని ముఖ్యమంత్రి చేసేవరకు ఆగేదిలేదని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు, రిటైర్డ్ ఐపీఎస్ అధికారి డాక్టర్ ఆర్ఎస్.ప్రవీణ్‌కుమార్ అన్నారు. 2023లో తెలంగాణ లో బీఎస్పీ అధికారంలోకి వస్తుందని, ప్రగ తిభవన్‌పై నీలిజెండా ఎగురుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అధికార పార్టీ లో ఉండి దొరలకు చెంచా కొడుతున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ నాయకులు బీఎస్పీలో చేరాలని ఆయన పిలుపునిచ్చారు. బహుజన రాజ్యాధికార యాత్ర వంద రోజులు పూర్తిచేసుకున్న సందర్భంగా హనుమకొండలోని హయగ్రీవాచారి మైదానంలో ఆదివారం రాత్రి ఏర్పాటు చేసిన సభలో బీఎస్పీ నేషనల్ కోఆర్డినేటర్ ఆకాశ్‌ఆనంద్, ఎంపీ రాంజీగౌతం, ఇతర నాయకులు ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రవీణ్‌కుమార్ మాట్లాడుతూ తమ పార్టీ అధికారంలోకి రాగానే రాష్ట్రంలో అర్హులైన ప్రతి నిరుపేద కుటుంబానికి ఎకరం భూమి, ఉచితంగా విద్య, వైద్యం అందిస్తామన్నారు. పది లక్షల ఉద్యోగావకాశాలు కల్పిస్తామన్నారు. 60వేల పుస్తకాలు చదివిన మేధావులకు ప్రశాంత్‌కిశోర్ సలహా లు ఎందుకని ప్రశ్నించారు. బీఎస్పీలో 60 వేల పుస్తకాలు చదివిన మేధావులు, 90 ఎంఎల్ తాగుబోతులు లేరని ఎద్దే వా చేశారు. తమ వెనక పార్టీని నడపడానికి స్వామీజీలు లేరని, మెగా, మైహోం లు లేవని, కాళేశ్వరం ప్రా జెక్టులు లేవని, బహుజనుల గుండె ధైర్యం ఉందని అన్నారు. -
బెటాలియన్‌ను సీఎం ఫామ్‌హౌస్‌లో నిర్మించాలి: ఆర్ఎస్పీ
గోవిందరావుపేట: 5వ బెటాలియన్ ఏర్పాటుకు పేదల భూములే దొరికా యా? సీఎం కేసీఆర్ ఫామ్‌హౌస్‌లో నిర్మించవచ్చు కదా అని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ప్రశ్నించారు. బహుజన రాజ్యాధి కార యాత్ర సోమ వారం ములుగు జిల్లా ఏటూరునాగారం మండలంలో సాగింది. ఈ సందర్భంగా బెటాలియన్ ఏర్పాటులో భూములు పోతున్న చల్వాయి రైతులతో ప్రవీణ్ మాట్లాడారు. పేదలకు చెందిన 105 ఎకరాల భూమిని 5వ బెటాలియన్ కోసం కేటాయించారని, నిర్వాసితులకు ఉద్యోగం, నివాస స్థలం ఇస్తామని హామీ ఇచ్చి మోసం చేశారని ఆరోపించారు. పేదల తరపున మాట్లాడే వారేలేరని, వారికి నోరులేదని అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరించారని మండిపడ్డారు. నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పోడు భూములకు పట్టాలు ఇవ్వకుండా అడిగిన వారిని జైలుకు పంపుతున్నారని ప్రవీణ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. బీఎస్పీ అధికారంలోకి వస్తే గిరిజనుల పోడు భూములకు పట్టాలిస్తుందని హామీ ఇచ్చారు. -
గిరిజనులపై ప్రభుత్వం మొసలి కన్నీరు: ఆర్ఎస్పీ
భద్రాచలంఅర్బన్: గిరిజనుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం మొసలి కన్నీరు కారుస్తోందని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.ఎస్.ప్రవీణ్‌కుమార్ ఆరోపించారు. ఆయన చేపట్టిన బహుజన రాజ్యాధికార యాత్ర సోమవారం భద్రాచలం చేరుకుంది. మొదట అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ప్రభుత్వం ఆర్టీసీ చార్జీలు పెంచి సామాన్య ప్రజలను, బస్‌పాస్ చార్జీలు పెంచి విద్యార్థులను ఇబ్బంది పెడుతోందన్నారు. రాష్ట్రంలో ‘మన ఊరు – మన బడి’కార్యక్రమానికి సంవత్సరానికి రూ.7,800కోట్లు ఖర్చు చేస్తున్నారని, ఈ నిధులతో బడులు బాగుపడటమేమో కానీ.. కాంట్రాక్టర్లు బాగా సొమ్ము చేసుకుంటున్నారని ఆరోపించారు. ఉద్యోగాల నోటిఫికేషన్ కూడా ఎన్నికల డ్రామానేనని విమర్శించారు. భద్రాద్రి జిల్లాలో పోడు భూముల సమస్య అధికంగా ఉందన్న ఆర్ఎస్పీ ఈ సమస్య పరిష్కరిస్తానని 2018 ఎన్నికల సమయంలో కేసీఆర్ చేసిన వాగ్దానాన్ని గుర్తు చేశారు. -
కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దింపడమే లక్ష్యం
కామేపల్లి: అవినీతిమయంగా మారిన సీఎం కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దింపడమే లక్ష్యంగా బీఎస్పీ పని చేస్తోందని, ఇందులో భాగంగానే బహుజన రాజ్యధికార యాత్ర చేపట్టామని బీఎస్పీ రాష్ట్ర చీఫ్ కోఆర్డినేటర్ ఆర్.ఎస్.ప్రవీణ్‌కుమార్ తెలిపారు. ఆయన చేపట్టిన బహుజన రాజ్యాధికార యాత్ర మహబూబాబాద్ నుంచి ఖమ్మం జిల్లా కామేపల్లి మండలానికి చేరుకుంది. ఈ సందర్భంగా మండలంలోని పలు గ్రామాల్లో మంగళవారం ప్రవీణ్‌కుమార్ మాట్లాడారు. టీఆర్ఎస్ ప్రభుత్వం హరితహారం పేరుతో గిరిజనులు సాగు చేసుకుంటున్న పోడు భూములను లాక్కుంటూ అక్రమ కేసులు బనాయిస్తోందని ఆరోపించారు. అకాల వర్షం, తెగుళ్లతో పంటలు నష్టపోయి రైతులు ఆత్మహత్య చేసుకుంటుంటే పట్టించుకోని సీఎం కేసీఆర్.. పంజాబ్ రైతులకు రూ.18 కోట్లకు పరిహారం ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు. సర్పంచ్‌లు అప్పులు తెచ్చి గ్రామాల్లో పనులు చేస్తే బిల్లులు చెల్లించకపోవడంతో వారు రోడ్డున పడ్డారని ఆవేదన వ్యక్తంచేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అధ్వానంగా మారిన నేపథ్యంలో జూన్‌లో రైతుబంధు, ఉద్యోగుల వేతనాలకు నిధులు ఎలా సమకూరుస్తారో శ్వేతపత్రం విడుదల చేయాలని ప్రవీణ్ డిమాండ్ చేశారు. తాము అధికారంలోకి వస్తే పోడు భూములకు పట్టాలివ్వడంతో పాటు ఎస్సీ, బీసీ కులాలకు ప్రత్యేక ప్యాకేజీ, గిరిజనులకు 10% రిజర్వేషన్ కల్పిస్తామన్నారు. -
గనులు తవ్వమంటే.. మసీదులు తవ్వుతారా?
బయ్యారం: గనులను తవ్వి ఉపాధి కల్పించమంటే బీజేపీ నాయకులు మసీదులు తవ్వు తామంటున్నారని బీఎస్పీ రాష్ట్ర చీఫ్ కోఆర్డినేటర్ ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ మండిపడ్డారు. బ హుజన రాజ్యాధికారయాత్ర లో భాగంగా సోమవారం ఆయన మహబూబాబాద్ జిల్లా బయ్యారంలోని ఇనుప రాయిగుట్టపై ఇనుపరాయిని పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రవీణ్ మాట్లాడుతూ.. ఉక్కు పరిశ్రమ నిర్మాణంపై బీజేపీ, టీఆర్ఎస్ పరస్పర ఆరోపణలు చేసుకుంటూ కాలయాపన చేస్తున్నాయని విమర్శించారు. రాష్ట్రంలో మైనింగ్ శాఖమంత్రిగా కొనసాగుతున్న కేటీఆర్ ట్వీట్లు పెడుతున్నారనే తప్ప పరిశ్రమ ఏర్పాటుకు ముందుకు రావడం లేద న్నారు. ఇప్పటికైనా ఉక్కు పరిశ్రమను నిర్మించాలని ప్రవీణ్ డిమాండ్ చేశారు. -
దళితబంధు కాదు.. దగా బంధు: ఆర్ఎస్పీ
జూలూరుపాడు: దళితుల అభ్యున్నతి కోసమే దళితబంధు పథ కాన్ని ప్రవేశపెట్టామని టీఆర్ఎస్ సర్కార్ గొప్పలు చెబుతున్నా.. అది దళి తులను దగా చేసేందుకేనని బీఎస్పీ రాష్ట్ర చీఫ్ కోఆర్డినేటర్ ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ఆరోపిం చారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు, వారి అను చరులకే తప్ప నిరుపేదలకు దళిత బంధు అందడం లేదన్నారు. ప్రవీణ్ చేపట్టిన బహుజ న రాజ్యాధికార యాత్ర మంగళవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం లోని అనంతారం, కాకర్ల, పడమట నర్సాపు రం, బేతాళపాడు, గుండ్లరేవు, అన్నారుపాడు, పాపకొల్లు, జూలూరుపాడు గ్రామాల్లో కొనసాగింది. ఆయన మాట్లాడుతూ.. దేశ వ్యాప్తంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ జరుపుకుంటున్నా పేదలు మాత్రం ఇంకా దుఃఖంలోనే ఉన్నారని ఆవేదన వ్యక్తంచేశారు. -
ఓట్లు పేదలవి.. కోట్లు పాలకులవి: ఆర్ఎస్పీ
అశ్వారావుపేట రూరల్: పేదల ఓట్లతో గద్దెనెక్కిన పాలకులు కోట్ల రూపాయలు దండుకుంటున్నారని, ప్రజలు మాత్రం అక్కడే ఉన్నారని బీఎస్పీ రాష్ట్ర ముఖ్య సమన్వయకర్త ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ విమర్శించారు. ఆయన చేపట్టిన రాజ్యాధికార యాత్ర ఆదివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం వినాయకపురం, ఆసుపాక, నారాయణపురం, నందిపాడు, ఖమ్మంపాడు, బచ్చువారిగూడెం, దురదపాడు, తిరుమలకుంట గ్రామాల్లో కొనసాగింది. ఈ సందర్భంగా ప్రవీణ్ మాట్లాడుతూ ఏళ్లుగా పేదలను మోసం చేస్తున్న కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్లను ఇంటికి పంపించి, బహుజన రాజ్యం కోసం బీఎస్పీని అధికారంలోకి తేవాలని పిలుపునిచ్చారు. మండలంలోని గుమ్మడవల్లి గ్రామం వద్ద 40 ఏళ్ల క్రితం నిర్మించిన పెదవాగు ప్రాజెక్టు కింద భూములు కోల్పోయిన నిర్వాసితులకు నేటికీ నష్ట పరిహారం ఇవ్వకపోవడం పాలకుల అసమర్థతకు నిదర్శమని మండిపడ్డారు. కార్యక్రమంలో రిటైర్డ్ డీఐజీ కోటేశ్వరరావు, జిల్లా ఇన్చార్జి కృష్ణార్జునరావు పాల్గొన్నారు. -
70 మంది బీసీలను అసెంబ్లీకి పంపడమే లక్ష్యం: ఆర్ఎస్పీ
వేంసూరు: వచ్చే ఎన్నికల్లో 70 మంది బీసీలను ఎమ్మెల్యేలుగా అసెంబ్లీకి పంపడమే బీఎస్పీ లక్ష్యమని ఆ పార్టీ రాష్ట్ర ముఖ్య సమన్వయకర్త ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ తెలిపారు. ఆయన చేపట్టిన బహుజన రాజ్యాధికార యాత్ర గురువారంతో 50 రోజులు పూర్తి చేసుకుంది. ఖమ్మం జిల్లా వేంసూరు, సత్తుపల్లి మండలాల్లో కొనసాగిన యాత్రలో ప్రవీణ్‌కుమార్ మాట్లాడుతూ... వడ్డించేవాడు బహుజనుడైతేనే అందరి ఆకలి తీరు తుందన్నారు. అందుకు వచ్చే ఎన్నికల్లో 70 మంది బీసీ ప్రతినిధులను అసెంబ్లీకి పంపించేందుకు ప్రతి బహుజన బిడ్డ పనిచేయా లని కోరారు. మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని సీఎం కేసీఆర్ నేడు నాలుగు లక్షల కోట్ల అప్పుల్లోకి నెట్టారని విమర్శించారు. పనికి రాని పథకాలతో ప్రజలను మోసం చేస్తున్నారని, పేదలకు ఉచిత విద్య, వైద్యం అంది స్తే ఉచిత పథకాలతో పనేమిటని ప్రవీణ్‌కుమార్ ప్రశ్నించా రు. దళితబంధు పథకంతో టీఆర్ఎస్ పార్టీ నాయకులకే లబ్ధి జరిగేలా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదల హక్కుల కోసం కాపలాగా ఉంటానని ప్రవీణ్‌కుమార్ స్పష్టం చేశారు. -
కరప్షన్.. కలెక్షన్.. కేసీఆర్..! : ఆర్ఎస్పీ
కోదాడ: తెలంగాణ అంటే కరప్షన్.. కలెక్షన్.. కేసీఆర్.. అన్నట్లు తయ్యారైందని బీఎస్పీ రాష్ట్ర చీఫ్ కోఆర్డినేటర్ ఆర్.ఎస్.ప్రవీణ్‌కుమార్ ఆరోపించారు. విద్యార్థుల బలిదానం, మేధావుల శ్రమదానం, తెలంగాణ వాదుల పోరాటంతో అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వ అధినేతలు అవినీతిలో కూరుకొని పోయారన్నారు. ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేయదనే సామెతను నిజం చేస్తూ ఆ పార్టీ ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లో పడి దోచుకుంటున్నారని మండిపడ్డారు. రాజ్యాధికార యాత్రలో భాగంగా ఆదివారం రాత్రి సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని బాలుర పాఠశాలలో నిర్వహించిన సభ లో ప్రవీణ్‌కుమార్ మాట్లాడారు. రైతులు ధాన్యం కొనేవారు లేక ఇబ్బంది పడుతుంటే రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు విమానాల్లో ఢిల్లీ వెళ్లి గంట సేపు ధర్నా చేసివచ్చారని, దానివల్ల రైతులకు ఒరిగింది ఏమిటని ఆయన ప్రశ్నించారు. రాజ్యాధికారం చేతికి వచ్చినపుడే బహుజనులు అభివృద్ధి చెందుతారని, పల్లకీ బోయిలుగా కాకుండా పల్లకిలో కూర్చోవడానికి కృషి చేయాలని కోరారు.వచ్చే ఎన్నికల్లో బడుగు, బలహీన వర్గాలకు తమ పార్టీ 70 శాతం సీట్లను కేటాయిస్తుందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో మేధావులు మౌనంగా ఉండవద్దని బయటికి వచ్చి మేలు చేసే వ్యక్తులను అధికారంలో కూర్చోబెట్టాలని కోరారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు పిల్లుట్ల శ్రీనివాస్, గుండెపంగు రమేశ్ తదితరులు పాల్గొన్నారు. -
రాజ్యాధికారం దక్కే వరకు పోరాటం
కూసుమంచి: బహుజనులకు రాజ్యాధికారం దక్కేదాకా పోరాటం ఆగదని బీఎస్పీ రాష్ట్ర చీఫ్ కోఆర్డినేటర్ ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ చెప్పారు. ఆయన చేపట్టిన బహుజనుల రాజ్యాధికార యాత్ర సోమవారం ఖమ్మం జిల్లాలోకి ప్రవేశించింది. జిల్లా సరిహద్దు నాయకన్‌గూడెం వద్ద ప్రవేశించిన యాత్ర పాలేరు, కూసుమంచి, గట్టుసింగారం, మల్లేపల్లి, జుజుల్‌రావుపేట, లోక్యాతండా, కోక్కాతండా, నేలపట్ల, అగ్రహారం గ్రామాల్లో కొనసాగింది. ఆయన పలు కాలనీలు, వసతిగృహాలను సందర్శించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆయా గ్రామాల్లో జరిగిన సభల్లో ప్రవీణ్‌కుమార్ మాట్లాడుతూ.. రాష్ట్రాన్ని దోచుకుంటున్న సీఎం కేసీఆర్ కుటుంబం పాలనలో ఘోరంగా విఫలమైన విషయాన్ని ప్రజలు గుర్తించారన్నారు. కేసీఆర్ హామీ ఇచ్చినట్లుగా దళితుడు సీఎం కాలేదని, దళితులకు మూడెకరాల భూమిదక్కలేదని, తాజాగా ప్రవేశపెట్టిన దళితబంధు పథకం కూడా అదే కోవలోకి వెళ్తుందని పేర్కొన్నారు. టీఆర్ఎస్ అరాచక పాలనను ప్రజల్లో ఎండగట్టి బహుజనులను ఏకం చేసి రాజ్యాధికారం సాధించేదిశగా ఈ పాదయాత్ర చేపట్టినట్లు చెప్పారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా సీఎం కేసీఆర్‌కు పరాజయం తప్పదని, వచ్చే ఎన్నికల్లో తాము విజయం సాధించి రాష్ట్రంలో పాగా వేయటం ఖాయమన్నారు. యాత్రలో బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు ఉపేంద్ర సాహూ తదితరులు పాల్గొన్నారు. -
రాష్ట్రంలో ఆటవిక పాలన
సాక్షి, ఆదిలాబాద్: రాష్ట్రంలో టీఆర్ఎస్ పాలన ఆటవిక రాజ్యాన్ని తలపిస్తోందని బీఎస్పీ రాష్ట్ర చీఫ్ కోఆర్డినేటర్ ఆర్ఎస్.ప్రవీణ్‌కుమార్ విరుచుకుపడ్డారు. శనివారం ఆదిలాబాద్ జిల్లా పర్యటనకు వచ్చిన ఆయన నార్నూర్ మండల కేంద్రంలో స్వేరోస్ జైభీమ్ దీక్ష ముగింపు కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం స్థానికంగా జరిగిన జిల్లా బీఎస్పీ సమావేశంలో మాట్లాడారు. కామారెడ్డి పట్టణంలో తల్లీకొడుకుల ఆత్మహత్యలకు టీఆర్ఎస్ దౌర్జన్యమే కారణమని ఆరోపించారు. కాగజ్‌నగర్‌లో ఎమ్మెల్యే కోనేరు కోనప్ప దౌర్జన్యం, ఇసుక మాఫియా, ప్రశ్నించే అధికారులపై దాడులు ఆటవిక రాజ్యం కాకపోతే మరేంటని ప్రశ్నించారు. జీవో 3ని సుప్రీంకోర్టు రద్దు చేస్తే రాష్ట్ర ప్రభు త్వం ఎలాంటి రివ్యూ పిటిషన్ వేయకపోవడం గిరిజనులపై ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనమని మండిపడ్డారు. దళితబంధు కింద లబ్ధిదారులకు వాహనాలు ఇస్తున్నట్లు చూపిస్తున్నప్పటికీ డబ్బులు కట్టకపోవడంతో ఆ వాహనాలను షోరూం యాజమాన్యాలు లాక్కెళ్తున్నాయని ప్రవీణ్ తెలిపారు. -
దౌర్జన్యాలకు పాల్పడుతున్న టీఆర్ఎస్: ఆరెస్పీ
సూర్యాపేట: పలు గ్రామాల్లో టీఆర్ఎస్ నేతలు అసైన్డ్ భూములను కబ్జా చేస్తున్నారని, అక్రమాలను ప్రశ్నిస్తున్న తమ పార్టీ కార్యకర్తలపై దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని బీఎస్పీ రాష్ట్ర ముఖ్య సమన్వయకర్త ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ఆరోపించారు. బహుజన రాజ్యాధికారయాత్రలో భాగంగా ఆయన గురువారం సూర్యాపేట పట్టణంలోని పలు ప్రాం తాల్లో పర్యటించారు. తొలుత అంబేడ్కర్ జయంతి సందర్భంగా ఖమ్మం క్రాస్‌రోడ్డులోని విగ్రహానికి నివాళులర్పించేందుకు ప్రవీణ్‌కుమార్ వెళుతుండగా పోలీసులు అడ్డుకున్నారు. మంత్రి జగదీశ్‌రెడ్డి వచ్చేవరకు అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు ఎవరూ వేయొద్దని నిలిపివేయడంతో బీఎస్పీ కార్యకర్తలు, పోలీసుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అదేసమయంలో అక్కడికి వచ్చిన మంత్రి తన తోపాటు ప్రవీణ్‌కుమార్‌ను విగ్రహం వద్దకు తీసుకెళ్లడంతో వివాదం సద్దుమణిగింది. అనంతరం ప్రవీణ్‌కుమార్ మాట్లాడుతూ వరి వేయొద్దన్న తెలంగాణ ప్రభుత్వమే ఢిల్లీకి వెళ్లి డ్రామాలు వేసి చివరకు వడ్లు కొంటామంటోందన్నారు. మిల్లర్ల వద్ద రైతు లను బలిపశువును చేస్తోం దని దుయ్యబట్టారు. తాను ఎక్కడి నుంచి పోటీ చేయాలో ప్రజలే నిర్ణయిస్తారని చెప్పారు. కార్యక్రమంలో బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు చడపంగు రవి, నియోజకవర్గ అధ్యక్షుడు యాతాకుల సునీల్ తదితరులు పాల్గొన్నారు. -
ముందస్తుకు సిద్ధమయ్యే ప్రజాకర్షక పథకాలు
హుజూర్నగర్/పెన్‌పహాడ్: ముందస్తు ఎన్నికలకు సిద్ధమయ్యే సీఎం కేసీఆర్ ప్రజాకర్షక పథకాలు ప్రవేశపెడుతున్నారని బీఎస్పీ చీఫ్ కోఆర్డినేటర్ ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ విమర్శించారు. బహుజన రాజ్యాధికార యాత్రలో భాగంగా మంగళవారం సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ పరిధిలో ఆయన పర్యటించారు. పెన్‌పహాడ్‌లో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం వివిధ అవసరాలకు పేదల అసైన్డ్ భూములను బలవంతంగా గుంజుకుంటోందని ఆరోపించారు. భూనిర్వాసితులకు మార్కెట్ ధరల ప్రకారం నష్టపరిహారం చెల్లించట్లేదని మండిపడ్డారు. ఇకపై అధికారులు అసైన్డ్ భూముల సర్వేకు వస్తే అడ్డుకోవాలని రైతులకు పిలుపునిచ్చారు. అంతకుముందు ఫణిగిరిగుట్ట వద్ద రూ. 150 కోట్లతో నిర్మిస్తున్న ఆదర్శ కాలనీని ఆయన పరిశీలించారు. ఈ ప్రాజెక్టు డంపింగ్ యార్డుగా మారడానికి కాంగ్రెస్, టీఆర్ఎస్ ప్రభుత్వాలే కారణమన్నారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు చడపంగు రవి, నియోజకవర్గ ఇంచార్జ్ సాంబశివగౌడ్, అధ్యక్షుడు కొండమీది నరసింహారావు, కస్తాల కిశోర్, జిలకర రామస్వామి, వాస పల్లయ్య, పిడమర్తి శీను పాల్గొన్నారు. -
ప్రజల్లోకి ‘బహుజన సిద్ధాంతం’
ఆర్మూర్/దుబ్బాకటౌన్: అమ్ముడుపోని సమాజాన్ని స్థాపించినపుడే బహుజనులకు రాజ్యాధికారం సాధ్యమని బీఎస్పీ నేషనల్ కో–ఆర్డినేటర్, రాజ్యసభ సభ్యుడు రాంజి గౌతమ్, రాష్ట్ర చీఫ్ కో–ఆర్డినేటర్ ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ అన్నారు. తెలంగాణలో బహుజన రాజ్య స్థాపనకు బీఎస్పీ సిద్ధాంతాలు, జెండాను, పార్టీ గుర్తును ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఇరువురు నేతలు కార్యకర్తలకు పిలుపునిచ్చారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మినీ స్టేడియంలో ఆదివారం రాత్రి నిర్వహించిన ‘బీసీలకు రాజ్యాధికార సంకల్పసభ’లో వారు మాట్లాడారు. బీసీలు వెనకబడ్డ తరగతుల వారు కాదని, వెనక్కి నెట్టివేయబడిన తరగతుల వారని ప్రవీణ్‌కుమార్ అన్నారు. అంతకుముందు స్వేరో స్టూడెంట్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన బహుజన రాజ్యాధికార సంకల్ప సైకిల్‌యాత్ర ముగింపు సభ సిద్ది పేట జిల్లా దుబ్బాకలో జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ తెలంగాణలో రాబోయేది బహుజన రాజ్యమేనన్నారు. బహుజన రాజ్యస్థాపనకు 26 రోజులుగా 235 గ్రామాల్లో పర్యటించానన్నారు. స్వేరోస్ స్టూడెంట్స్ యూనియన్ తప్ప మిగతావన్నీ ఆధిపత్య కులాలకు పెంపుడు కుక్కల్లా మారాయన్నారు. -
బెల్టు షాపులు లేకుండా చేస్తాం: ప్రవీణ్‌కుమార్
కనగల్: బీఎస్పీ అధికారంలోకి వస్తే బెల్టుషాపులు లేకుండా చేస్తామని ఆ పార్టీ రాష్ట్ర చీఫ్ కో–ఆర్డినేటర్ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ అన్నారు. 24వ రోజుకు చేరిన బహుజన రాజ్యాధికార యాత్ర మంగళవారం కనగల్‌లో కొనసాగింది. కనగల్ నుంచి క్రాస్‌రోడ్డు వరకు పాదయాత్ర నిర్వహించిన ప్రవీణ్‌కుమార్ అక్కడ పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... బెల్టుషాపుల వల్ల గ్రామాల్లో మద్యం ఏరులై పారుతోందన్నారు. మద్యానికి బానిసలై చాలా మంది చిన్నవయస్సులోనే అనారోగ్యం పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అభివృద్ధిలో ఏమోగానీ రాష్ట్రం మద్యం విక్రయించడంలో మాత్రం నంబర్‌వన్ స్థానంలో నిలిచిందని విమర్శించారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే ఉచితంగా నాణ్యమైన విద్య, వైద్యం అందిస్తామని తెలిపారు. కూలీలుగా ఉన్న బడుగుబలహీన వర్గాలను ఓనర్లను చేయడమే తమ లక్ష్యమన్నారు. ఏనుగు గర్తుకు ఓటేసి, ప్రగతి భవన్‌పై నీలిజెండా ఎగురవేసేందుకు బడుగు బలహీనవర్గాలు పాటుపడాలని పిలుపునిచ్చారు. -
కేసీఆర్ హామీలకు మోసపోవద్దు: ప్రవీణ్‌కుమార్
నార్కట్‌పల్లి: సీఎం కేసీఆర్ దళితబంధు, డబుల్ బెడ్రూం ఇళ్ల పేరుతో పేదలను వంచిస్తున్నారని, ఆ మాటలు విని ప్రజలెవరూ మోసపోవద్దని బీఎస్పీ రాష్ట్ర చీఫ్ కోఆర్డినేటర్ ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ సూచించారు. ఆయన చేపట్టిన బహుజన రాజ్యాధికార యాత్ర 22వ రోజు ఆదివారం నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండలంలోని చెర్వుగట్టు, అక్కెనపల్లి గ్రామాల్లో సాగింది. చెర్వుగట్టులోని రామలింగేశ్వర స్వామి ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు చేశారు. అక్కెనపల్లిలోని మసీదును సందర్శించారు. చెర్వుగట్టులో ప్రజలనుద్దేశించి ప్రవీణ్ మాట్లాడుతూ రాష్ట్రంలో తాగునీటి సమస్య నేటికీ పరిష్కారం కాలేదని, మిషన్ భగీరథ పనులు అసంపూర్తిగా మిగిలిపోయాయని విమర్శించారు. ఉపాధి కూలీలకు వేతనాలు చెల్లించడంలో, కొత్త పించన్లు మంజూరు చేయడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. -
దళితబంధు కాదు.. నాణ్యమైన విద్యనందించాలి
కేతేపల్లి/నకిరేకల్: పాఠశాలల్లో కనీస వసతులు కల్పించకుండా, ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయకుండా ప్రభుత్వం విద్యారంగాన్ని నిర్వీర్యం చేసే కుట్ర చేస్తోందని బీఎస్పీ రాష్ట్ర చీఫ్ కోఆర్డినేటర్ ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ఆరోపించారు. బహుజన రాజ్యాధికార యాత్రలో భాగంగా మంగళవారం నల్లగొండ జిల్లా కేతేపల్లి మండలంలోని గుడివాడ, కొత్తపేట, కేతేపల్లి, ఉప్పలపహాడ్, భీమారం, నకిరేకల్ మండలం ఓగోడు గ్రామంలో పర్యటించి ప్రజలతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ప్రవీణ్‌కుమార్ మాట్లాడుతూ నాణ్యమైన విద్యనందించాలని కోరితే పాలకులు మద్యాన్ని ఏరులై పారిస్తున్నాని విమర్శించారు. దళితుల కుటుంబాలకు ప్రభుత్వం జీవిత కాలంలో రూ.10 లక్షలు ఇచ్చే బదులు వారి పిల్లలకు నాణ్యమైన విద్యనందిస్తే వారు నెలకు రూ.5 లక్షలు సంపాదించే ఉద్యోగాలు సాధిస్తారని తెలిపారు. తాను ఇప్పటి వరకు 170 గ్రామాల్లో పర్యటించానని, ఎక్కడ చూసినా ప్రజలు సమస్యలతో సతమతమవుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. వచ్చే ఎన్నికల్లో ప్రజల చేతిలో ఓటమి నుంచి సీఎం కేసీఆర్‌ను ఎవ్వరూ కాపాడలేరని తేల్చిచెప్పారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి చోహన్, నాయకులు కిరణ్, నర్సింహ, సైదులు, జిల్లా మహిళా కన్వీనర్ నిర్మల, ప్రియదర్శిని తదితరులు పాల్గొన్నారు. -
బహుజన రాజ్యస్థాపనే లక్ష్యం: ఆర్ఎస్పీ
నూతనకల్, అర్వపల్లి: ఆధిపత్య వర్గాలకు అధికారాన్ని దూరం చేసి బహుజన రాజ్యస్థాపనే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పని చేయాలని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర చీఫ్ కోఆర్డినేటర్ ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ పిలుపునిచ్చారు. ఆదివారం సూర్యాపేట జిల్లా నూతనకల్ మండల పరిధిలోని వెంకెపల్లి, చిల్ప కుంట్ల, నూతనకల్, యడవెళ్లి, తాళ్లసింగారం గ్రామాల్లో నిర్వహించిన రాజ్యాధికార యాత్రలో ఆయన వివిధ చోట్ల పార్టీ జెండాలను ఆవిష్కరిం చారు. అనంతరం అర్వపల్లి మండలం లోయపల్లి గ్రామానికి యాత్ర చేరింది. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన కొంతమంది బీఎస్పీలో చేరారు. ప్రవీణ్‌కుమార్ మాట్లాడుతూ ఆధిపత్య వర్గాలకు అధికారం ఉండటం వల్ల ఆ వర్గాలకే ప్రయోజనాలు చేకూరాయన్నారు. సీఎం కేసీఆర్ ఇంతకాలం నిరుద్యోగ సమస్యను గాలికి వదిలేసి ఇప్పుడు నోటిఫికేషన్లు విడుదల చేస్తామ నడం ఆ యన రాజకీయ ప్రయోజనాలకోసమేనని అన్నారు. జీఓ 111ను రద్దు చేయడం వల్ల అగ్రవర్ణాలకే ప్రయోజనం కలుగుతుందన్నారు. రాష్ట్రంలో పేదలకు డబుల్ బెడ్రూం ఇళ్లు నిర్మిస్తామని హామీ ఇచ్చిన కేసీఆర్ వాటి నిర్మాణాలను గాలికి వదిలేశారని, కొన్ని ఇళ్లు నిర్మాణాలు పూర్తి చేసుకొని కూలడానికి సిద్ధంగా ఉన్నాయని, మరికొన్ని పిల్లర్లకే పరిమితమయ్యాయని విమర్శించారు. -
అన్ని పార్టీలది అదే ‘దారి’... ఒక్క టీఆర్ఎస్ది తప్ప.. నెక్ట్స్ ఎవరో?
రాష్ట్రంలో పాదయాత్రల సీజన్ నడుస్తోంది. అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడు వస్తాయో కానీ.. రాజకీయ పార్టీల పాదయాత్రలు మాత్రం జోరందుకుంటున్నాయి. అధికార టీఆర్ఎస్ మినహా కొత్తగా ఏర్పాటైన పార్టీలు, చిన్నాచితకా పార్టీలతోపాటు ప్రధాన పక్షాలైన కాంగ్రెస్, బీజేపీ కూడా పాదయాత్రల ద్వారా ప్రజల్లోకి వెళ్తున్నాయి. వైఎస్సార్టీపీ, బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ)ల నేతృత్వంలో ఇప్పటికే యాత్రలు ప్రారంభమయ్యాయి. ఆ పార్టీల అగ్రనేతలు వైఎస్ షర్మిల, ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్‌లు తమ కార్యాచరణను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు యత్నిస్తున్నారు. కొత్తగా ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కూడా పాదయాత్రకు సై అంటోంది. – సాక్షి, హైదరాబాద్ కమలం.. హస్తం ఇలా.. వచ్చే నెల 14 నుంచి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నేతృత్వంలో రెండో విడత పాదయాత్ర ప్రారంభం కానుంది. బీజేపీ శ్రేణులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యాయి. ఈ యాత్రలో భాగంగానే పలు ప్రధాన పార్టీల నేతలు బీజేపీలో చేరతారని, అన్ని పక్షాల నేతలు తమతో టచ్‌లో ఉన్నారని ఆ పార్టీ సీనియర్ నేత నల్లు ఇంద్రసేనారెడ్డి ప్రకటించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక, ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ కూడా రాష్ట్రవ్యాప్త పాదయాత్ర చేయాలనే యోచనలో ఉంది. ఇందుకోసం అధిష్టానం అనుమతి కూడా కోరింది. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి నేతృత్వంలో ఉత్తర తెలంగాణలోని నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో, ఇతర ముఖ్య నేతల ఆధ్వర్యంలో హైదరాబాద్ మినహా దక్షిణ తెలంగాణలో పాదయాత్ర ఉంటుందని తెలుస్తోంది. ఇక, హైదరాబాద్‌లో పార్టీ అగ్ర నాయకత్వం అంతా మరో రూపంలో యాత్ర చేయాలనే యోచనలో ఉన్నట్టు గాంధీభవన్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. షర్మిల.. తలపెట్టారిలా.. రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్రను అందరికంటే ముందుగా వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల ప్రారంభించారు. గత అక్టోబర్ 20న ఆమె రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో ప్రజాప్రస్థానం యాత్రను ప్రారంభించారు. 21 రోజులపాటు యాత్ర సాగింది. తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ దృష్ట్యా తాత్కాలికంగా నిలిపివేయగా కోవిడ్ ఉధృతితో నవంబర్ 9న యాత్రకు బ్రేక్ పడింది. షర్మిల 21 రోజుల యాత్రలో 15 మండలాలు, 5 మున్సిపాలిటీలు, 122 గ్రామాల్లో పర్యటించారు. షర్మిల రెండో విడత పాదయాత్ర ఈనెల 11న నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లిలో ప్రారంభమైంది. భట్టి... మధిర చుట్టుముట్టి కాంగ్రెస్ శాసనసభాపక్షం (సీఎల్పీ) నేత మల్లు భట్టి విక్రమార్క ‘పీపుల్స్ మార్చ్’ పేరుతో మధిర నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్నారు. గత నెల 27న ముదిగొండ మండలం ఎడవెల్లి నుంచి ప్రారంభించిన ఈ యాత్ర 50 రోజులపాటు 506 కి.మీ. సాగేలా షెడ్యూల్ రూపొందించారు. అయితే, అసెంబ్లీ సమావేశాలతో ఈనెల 5న ఈ యాత్రకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. అప్పటికే భట్టి 102 కి.మీ. తిరిగారు. ఈనెల 25 నుంచి పీపుల్స్ మార్చ్‌ను కొనసాగించేందుకు భట్టి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఆర్ఎస్పీ.. ఫర్ బీఎస్పీ మాజీ ఐపీఎస్ అధికారి, బీఎస్పీ ఇంచార్జి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ కూడా రాష్ట్రవ్యాప్త రాజ్యాధికార యాత్రలో ఉన్నారు. ఈ నెల 6న జనగామ జిల్లా నుంచి ‘బహుజన రాజ్యాధికార యాత్ర’ పేరుతో ప్రారంభమైన ఈ యాత్ర 300 రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా కొనసాగనుంది. ఆమ్ ఆద్మీ ‘క్రేజ్’ పంజాబ్ ఎన్నికల్లో విజయంతో ఊపు మీదున్న ఆప్ కూడా తెలంగాణపై దృష్టి సారించింది. ఇందులో భాగంగానే ఆ పార్టీ తెలంగాణలో రాష్ట్రవ్యాప్త పాదయాత్రకు శ్రీకారం చుడుతోంది. పార్టీ రాష్ట్ర నాయకురాలు ఇందిరాశోభన్ ఈ పాదయాత్ర చేస్తారని సమాచారం. వచ్చే 14 నుంచి ఈ యాత్ర ప్రారంభమవుతుందని, ఆప్ జాతీయ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ యాత్ర ప్రారంభ కార్యక్రమంలో పాల్గొంటారని ఆ పార్టీ వర్గాలు చెప్పాయి. సర్వోదయ... వార్ధా వరకు భూదానోద్యమ స్ఫూర్తితో రాష్ట్రంలో మరో పాదయాత్ర జరుగుతోంది. రాజీవ్‌గాంధీ పంచాయతీరాజ్ సంఘటన్ చైర్పర్సన్, కాంగ్రెస్ నేత మీనాక్షి నటరాజన్‌తోపాటు పలు జాతీయ సం స్థల ఆధ్వర్యంలో ఈ నెల 14న యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్‌పోచంపల్లిలో సర్వోదయ యాత్ర ప్రారంభమైంది. రాష్ట్రంలో 26 రోజులపాటు సాగిన అనంతరం మహారాష్ట్రలోని వార్ధా వద్ద యాత్ర ముగియనుంది. భూదానోద్యమం ప్రారంభమై 75 ఏళ్లు పూర్తవుతున్న సం దర్భంగా చేపట్టిన ఈ యాత్రకు కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్‌గాంధీ కూడా హాజరుకానున్నారు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్‌కుమార్ గౌడ్ పర్యవేక్షణలో సాగుతున్న యాత్ర ప్రస్తుతం సిద్దిపేట జిల్లాకు చేరుకుంది. శనివారం యాత్ర లో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పాల్గొన్నారు. -
దళితబంధుపై కేసీఆర్ డ్రామా
తిరుమలగిరి(తుంగతుర్తి): ముఖ్యమంత్రి కేసీఆర్ దళితబంధు పథకాన్ని ఎలాంటి మార్గదర్శకాలు లేకుండానే ప్రవేశపెట్టారని, ఇది దళితులను మభ్యపెట్టడానికి ఆడుతున్న డ్రామా అని బీఎస్పీ రాష్ట్ర చీఫ్ కోఆర్డినేటర్ ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ విమర్శించారు. టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకే దళితబంధు పథకం దక్కుతోందని ఆరోపించారు. బీఎస్పీ ఆధ్వర్యంలో చేపట్టిన రాజ్యాధికార యాత్ర శుక్రవారం సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో సాగింది. ఉదయం స్థానిక రైతులతో ప్రవీణ్‌కుమార్ మాట్లాడారు. అనంతరం గ్రామంలోని డబుల్ బెడ్రూం ఇళ్లను పరిశీలించారు. కేసీఆర్ ప్రభుత్వంలో అన్నివర్గాల ప్రజలు మోసానికి గురయ్యారన్నారు. రైతుబంధు పథకం భూస్వాములకు బంధుగా మారిందని ఆరోపించారు. ఎరువుల ధరలు రెట్టింపయ్యాయని, రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర మాత్రం రావడం లేదని మండిపడ్డారు. రైతులకు ఉచితంగా ఎరువులు ఇస్తామన్న హామీని అమలు చేయలేదని ఆయన విమర్శించారు. దళితబంధు పథకం ఇప్పిస్తామని దళారులు తయారయ్యారని, ఒక్కొక్కరి నుంచి రూ.లక్ష వరకు దండుకుంటున్నారని విమర్శించారు. ప్రభుత్వ ఆస్పత్రులలో వైద్య సదుపాయాలు లేక ప్రజలు ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లి అప్పులు చేసి ఆర్థికంగా నష్టపోతున్నారని విచారం వ్యక్తం చేశారు. నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వంపై నమ్మకం పోయిందని విమర్శించారు. తుంగతుర్తి నియోజకవర్గంలో బిక్కేరు వాగు నుంచి ఇసుకను అక్రమంగా తరలించడంతో రైతుల బోర్లు ఎండి పోతున్నా పాలకులు పట్టించుకోకపోవడం దారుణమన్నారు. బీఎస్పీకి అధికారం ఇస్తే ఇసుక మాఫియాపై ఉక్కుపాదం మోపుతామని పేర్కొన్నారు. కేసీఆర్ పాలనలో రాష్ట్రం అవినీతి, అక్రమాలకు అడ్డాగా మారిందని ఆరోపించారు. పాలక వర్గాలు ప్రచారం చేస్తున్నట్లు ఎలాంటి అభివృద్ధీ జరగలేదన్నారు. జనాభా ప్రాతిపదికన రాజ్యాధికారం సిద్ధించినప్పుడే అన్ని సామాజిక వర్గాల పేదరికం రూపుమాపడం సాధ్యమవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు మంద ప్రభాకర్, నియోజకవర్గ ఇన్చార్జి బల్గూరి స్నేహ, జిల్లా అధ్యక్షుడు రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. -
బీజేపీ సొంతంగా సాధించిన సీట్లు ఎన్నో తెలుసా?
సార్వత్రిక ఎన్నికలకు సెమీఫైనల్‌గా భావిస్తున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు సవ్యంగా ముగిశాయి. నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ ప్రభంజనం సృష్టించగా, పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ విజయ దుందుభి మోగించింది. కీలకమైన ఉత్తరప్రదేశ్‌లో వరుసగా రెండో పర్యాయం విజయం సాధించిన బీజేపీ 2017 ఎన్నికలతో పోలిస్తే తాజా ఎన్నికల్లో ఓటింగ్ శాతాన్ని స్వల్పంగా మెరుగు పరుచుకుంది. 403 అసెంబ్లీ స్థానాలున్న యూపీ అసెంబ్లీలో మిత్రపక్షాలతో కలిసి బీజేపీ 273 సీట్లలో విజయం సాధించింది. బీజేపీకి మైనస్.. ఎస్పీకి ప్లస్ తాజా ఎన్నికల్లో బీజేపీకి ఓటింగ్ శాతం పెరిగినా 57 సీట్లు తగ్గాయి. కమలం పార్టీ సొంతంగా 255 స్థానాల్లో విజయం సాధించింది. 2017 ఎన్నికల్లో బీజేపీ 312 సీట్లు గెలిచిన సంగతి తెలిసిందే. ఈసారి బీజేపీ మిత్రపక్షాలు అప్నా దల్ (సోనీలాల్) 12, నిర్బల్ ఇండియన్ శోషిత్ హమారా ఆమ్ దల్ 6 సీట్లు దక్కించుకున్నాయి. అఖిలేశ్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్‌వాదీ పార్టీ గతంతో పోలిస్తే అదనంగా 64 సీట్లను సాధించింది. గత ఎన్నికల్లో 47 సీట్లకే పరిమితమైన అఖిలేశ్ పార్టీ ఇప్పుడు 111 స్థానాలు గెలిచింది. సమాజ్‌వాదీ మిత్రపక్షాలు రాష్ట్రీయ లోక్ దళ్ 8, సుహెల్దేవ్ భారతీయ సమాజ్ పార్టీ 6 స్థానాలు గెలిచాయి. బీఎస్పీ, కాంగ్రెస్ ఫట్! బహుజన్ సమాజ్ పార్టీ, కాంగ్రెస్ పార్టీలకు దారుణమైన ఫలితాలు వచ్చాయి. గత ఎన్నికల్లో 19 స్థానాలు సాధించిన బీఎస్పీ ఏకంగా 18 సీట్లు కోల్పోయి సింగిల్ సీట్‌కే పరిమితమైంది. 2017 ఎన్నికల్లో ఏడు చోట్ల విజయం సాధించిన కాంగ్రెస్ 5 సీట్లు కోల్పోయి రెండు స్థానాలను మాత్రమే గెలుకోగలిగింది. 10 శాతం పెరిగిన ఎస్పీ ఓట్లు తాజా ఎన్నికల్లో బీజేపీ 41.3 శాతం ఓట్లు సాధించింది. 2017 ఎన్నికలతో(39.67) పోలిస్తే ఇది 1.7 శాతం ఎక్కువ. సమాజ్‌వాదీ పార్టీ గతంతో పోలిస్తే ఏకంగా 10.3 శాతం ఓటింగ్ షేర్ అదనంగా సాధించింది. ప్రస్తుత ఎన్నికల్లో 32.1 శాతం ఓట్లు సాధించగా.. 2017లో 21.82 శాతం ఓట్లు దక్కించుకుంది. బీఎస్పీ 9.38, కాంగ్రెస్ 3.92 శాతం ఓట్ షేర్ కోల్పోయాయి. ఈ ఎన్నికల్లో బీఎస్పీకి 12.88, కాంగ్రెస్‌కు 2.33 శాతం ఓట్లు వచ్చాయి. ఇతరులు 6.74 శాతం, రాష్ట్రీయ లోక్ దళ్ 2.85 శాతం ఓట్లు తెచ్చుకున్నాయి. (క్లిక్: తెలంగాణలో జోరందుకున్న పాదయాత్రలు) బీజేపీకి 3, ఎస్పీకి 2, బీఎస్పీకి 1 అత్యధిక సీట్లు సాధించిన బీజేపీకి మొత్తంగా 3 కోట్ల 80 లక్షల 51 వేల 721 ఓట్లు వచ్చాయి. సమాజ్‌వాదీ పార్టీ 2 కోట్ల 95 లక్షల 43 వేల 934 ఓట్లు దక్కించుకుంది. మాయావతి నేతృత్వంలోని బీఎస్పీకి కోటి 18 లక్షల 73 వేల 137 ఓట్లు దక్కాయి. ఇతరులు 62 లక్షల 13 వేల 262 ఓట్లు తెచ్చుకున్నారు. (క్లిక్: యూపీ ఫలితాలు: 2024 ఎన్నికలకు బీజేపీకి బిగ్ బూస్ట్) ‘నోటా’నే బెటర్! యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో కొన్ని పార్టీల కంటే ‘నోటా’కే ఎక్కువ ఓట్లు వచ్చాయి. ఈసారి నోటాకు 0.69 శాతం ఓట్లు పోలయ్యాయి. ఎఐఎం 0.49, ఆప్ 0.38, జేడీ(యూ) 0.11, సీపీఐ 0.07, ఎన్సీపీ 0.05, ఎస్హెచ్ఎస్ 0.02, సీపీఐ(ఎం), సీపీఐ(ఎంఎల్), ఎల్జేపీఆర్వీ 0.01 శాతం చొప్పున ఓట్లు దక్కించుకున్నాయి. (క్లిక్: మూడు జంటలు.. ముచ్చటైన విజయాలు) -
ఓటమికి కారణం ఇదే: మాయావతి
-
యూపీ ఎన్నికల్లో కొత్త ట్విస్ట్.. టెన్షన్లో రాజకీయ పార్టీలు
లక్నో: ఉత్తరప్రదేశ్ ఎన్నికల పర్వంలో కొత్త అంశం కనిపించింది. పోటాపోటీగా ప్రచారం చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్), జేడీ(యూ) పార్టీల కంటే ‘నన్ ఆఫ్ ది ఎబో(నోటా)’ మీటకు పడిన ఓట్లే ఎక్కువ అని కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) వెబ్‌సైట్‌లోని గణాంకాల్లో వెల్లడైంది. మొత్తం పోలైన ఓట్లలో ఆప్‌నకు 0.35 శాతం, జేడీయూకు 0.11 శాతం ఓట్లు పడ్డాయి. అయితే, వీటికంటే ఎక్కువగా నోటాకు 0.69 శాతం ఓట్లు పడటం విశేషం. ఎంఐఎం పార్టీకి 0.47 శాతం ఓట్లు పడ్డాయి. సీపీఐ పార్టీకి 0.07 శాతం, ఎన్సీపీ పార్టీకి 0.05 శాతం, శివసేనకు 0.03 శాతం ఓట్లు పోలయ్యాయి. ఇక సీపీఎం, సీపీఐ(ఎంఎల్), ఎన్జేపీ(ఆర్వీ) పార్టీలు 0.01 శాతం ఓట్లు దక్కించుకున్నాయి. ఏఐఎఫ్బీ, ఐయూఎంఎల్, ఎల్జేపీలకు ఒక్క ఓటు కూడా పడలేదని ఈసీ గణాంకాలు చెబుతున్నాయి. ఇక భారీ మెజారిటీతో గెలిచి అధికారాన్ని కైవసం చేసుకున్న బీజేపీకి 41.6 శాతం ఓట్లు పడ్డాయి. సమాజ్‌వాదీ పార్టీకి 32 శాతం ఓట్లు, బీఎస్పీకి 12.8 శాతం, రాష్ట్రీయ లోక్‌దళ్‌కు 3.02 శాతం ఓట్లు పోలయ్యాయి. కాంగ్రెస్ 2.38 శాతం ఓట్లు సాధించింది. మరోవైపు.. దశాబ్దాల పాటు దేశాన్ని అప్రతిహతంగా ఏలిన కాంగ్రెస్ పార్టీ నానాటికీ తీసికట్టుగా మారుతూ వస్తోంది. ముఖ్యంగా 2014 నుంచి ఒకటీ అరా తప్పిస్తే ప్రతి ఎన్నికల్లోనూ ఘోర పరాభవాలే చవిచూస్తోంది. పంజాబ్‌లో కాంగ్రెస్ పార్టీ అంతర్గత కలహాలు ప్రధానంగా ఆ పార్టీ ఓటమికి కారణాలయ్యాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ మణిపూర్, గోవా రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ఆశించిన ఫలితాలను దక్కించుకోలేదు. -
సీఎం చన్నీని పక్కన పెడతారు
చండీగఢ్: పంజాబ్‌లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చడంలో విఫలమైందని బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) అధినేత్రి మాయావతి విమర్శించారు. తన రాజకీయ ప్రయోజనాల కోసం దళిత ముఖ్యమంత్రిని వాడుకుంటోందని ధ్వజమెత్తారు. శిరోమణి అకాలీదళ్ (ఎస్ఏడీ)తో పొత్తు పెట్టుకుని పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీ పోటీ చేస్తోంది. ఈ నేపథ్యంలో ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న మాయావతి కాంగ్రెస్, బీజేపీలపై విమర్శలు గుప్పించారు. పంజాబ్‌లో గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్న కారణంగానే దళితుడిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా కాంగ్రెస్ ప్రకటించిందన్నారు. కాంగ్రెస్ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుందని అనుకోవడం లేదని, ఒకవేళ అధికారాన్ని నిలబెట్టుకున్నా చరణ్‌జీత్ సింగ్ చన్నీని పక్కన పెడతారని జోస్యం చెప్పారు. హిమాచల్ గుడికి వెళ్లే బదులు సంత్ రవిదాస్ ఆశీస్సులు తీసుకోవడానికి సీఎం చన్నీ వెళితే బాగుండేదన్నారు. ఆయన ఆలయాన్ని సందర్శించడంపై తమకు ఎలాంటి అభ్యంతరం లేదని, దళితులకు కూడా సానుకూల సందేశం పంపి ఉండాల్సిందని మాయావతి అభిప్రాయపడ్డారు. బీజేపీ కూడా కాంగ్రెస్ బాటలోనే పయనిస్తోందని, పెట్టుబడిదారులకు కొమ్ము కాస్తోందని మండిపడ్డారు. ఆమ్ ఆద్మీ పార్టీ అబద్దపు హామీలతో ఓటర్లకు గాలం వేస్తోందని ఆరోపించారు. (క్లిక్: పంజాబ్‌లో ఆప్ టెన్ పాయింట్ అజెండా) బీఎస్పీ-ఎస్ఏడీ కూటమికి ఓటు వేయాలని ఈ సందర్భంగా పంజాబ్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తాము అధికారంలోకి రాగానే కేంద్రం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలను రద్దు చేస్తామని హామీయిచ్చారు. పంజాబ్‌లో బీఎస్పీ-ఎస్ఏడీ కూటమి అధికారంలోకి వస్తే డిప్యూటీ సీఎంగా సుఖ్బీర్ బాదల్‌ను ఎన్నుకుంటామని మాయావతి ప్రకటించారు. (క్లిక్: పంజాబ్‌లో మోదీ చరిష్మా పనిచేసేనా!) -
Ground Report: ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో ఈసారి పరిస్థితి ఏమిటి?
కంచర్ల యాదగిరిరెడ్డి, దొడ్డ శ్రీనివాసరెడ్డి: గౌతమబుద్ధనగర్ (యూపీ) నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధులు ఓటు బ్యాంక్‌లో తేడాలు వస్తే లాభపడేదెవరు? నష్టపోయేదెవరు? ఉత్తరప్రదేశ్‌లో కీలకమైన పశ్చిమ ప్రాంతంపైనే ఈసారి అన్ని పార్టీల గురి... మతకల్లోలాలు, ఉద్రిక్తతలే ఆసరాగా ఆ ప్రాంతంలో ఓటు బ్యాంకు పెంచుకున్న కమలనాథులు హిందువులతో పాటు ఓబీసీలు, దళితులు కూడా బీజేపీ వైపు మళ్లించుకొని 2017లో అధికారపీఠాన్ని అందుకున్నారు. ఈసారి బీజేపీ సాంప్రదాయ ఓటు బ్యాంకుకు గండిపడే అవకాశం.. క్షేత్రస్థాయిలో బీజేపీ వ్యూహాలు ఫలించడం లేదనే అభిప్రాయం హిందూ, ముస్లిం వర్గాల మధ్య సామరస్య వాతావరణం... దారి చూపిన రైతు పోరుబాట ఎస్పీ, ఆర్ఎల్డీ కూటమికి గణనీయంగా ఓట్ల బదిలీ జరుగుతుందంటున్న విశ్లేషకుల అంచనాలు ఉన్నాయి. బీఎస్పీ, కాంగ్రెస్‌లు ఇక్కడ నామమాత్రమే.. ఈ నేపథ్యంలో యూపీకి దిక్సూచిగా నిలిచే పశ్చిమాన ఎవరికి మెజారిటీ వస్తే... వారికే లక్నో పీఠం దక్కేది! ఉత్తరప్రదేశ్‌లో పార్టీల గెలుపోటములను నిర్ణయించే జాట్లు, ముస్లింలు ఈ ఎన్నికల్లో ఎటువైపు మొగ్గుచూపుతున్నారన్నది ఆసక్తికరంగా మారింది. గడచిన శాననసభ ఎన్నికల్లో మెజారిటీ జాట్ కులస్తులు భారతీయ జనతా పార్టీ (బీజేపీ)కి మద్దతు పలికారు. ముస్లింల ఓట్లను సమాజ్‌వాదీ పార్టీ, బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ) పంచుకున్నాయి. మొదటి రెండు విడతల్లో జరగనున్న ఎన్నికల్లో జాట్లు, ముస్లింలదే నిర్ణయాత్మక పాత్ర. గడచిన ఎన్నికల్లో 50 శాతంకు పైగా జాట్లు బీజేపీకి మద్దతు పలికితే, మిగిలిన 50 శాతం ఓట్లు అన్ని పార్టీలు పంచుకున్నాయి. ఇక ముస్లిం ఓటర్లలో 60 శాతం మంది ఎస్పీకి, 30 శాతం మంది బీఎస్పీకి ఓటేయగా మిగిలిన 10 శాతం మంది ఇతర పార్టీలకు మద్దతు పలికారు. జరగబోయే ఎన్నికల్లో ఈ పరిస్థితి తారుమారవుతుందని ప్రముఖ సర్వే సంస్థలతో పాటు ఆయా ప్రాంతాల్లో పర్యటించిన సాక్షి ప్రతినిధుల క్షేత్రస్థాయి అధ్యయనంలో వెల్లడైంది. గతంలో ఓట్లేసిన జాట్లలో 25 శాతం మంది ఈసారి ఓటేయకపోతే బీజేపీకి మొత్తం ఐదు శాతం మేర ఓట్లు తగ్గుతాయి. గతంలో బీఎప్పీకి ఓట్లేసిన ముస్లింలలో 15 శాతం మంది ఈసారి మద్దతు ఇవ్వకపోతే ఆ పార్టీకి వచ్చే ఓట్ల సంఖ్య బాగా తగ్గుతుంది. ఈ మేరకు ఆ ఓట్లు ఎస్పీ, ఆర్ఎల్డీ కూటమికి బదిలీ అయితే పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లో రాజకీయ సమీకరణాలు తారుమారయ్యే అవకాశాలు సుస్పష్టంగా కనపడుతున్నాయనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. ఈ రెండు విశ్లేషణలను పరిశీలిస్తే పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ సాంప్రదాయ ఓటుకు ఈ ఎన్నికలలో గండి పడుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కుల మతాలతో ప్రమేయం లేకుండా అన్ని వర్గాలకు చెందిన రైతులు ఆ పార్టీకి దూరమైన కారణంగా ఈసారి గడ్డు పరిస్థితి ఎదుర్కోనున్నదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. పశ్చిమ యూపీలో ఎస్పీ, బీఎస్పీల కంటే బీజేపీ సాంప్రదాయ ఓటు ఎక్కువ. 1991 నుంచి గణాంకాలను పరిశీలిస్తే బీజేపీకి సగటున 34, ఎస్పీకి 29, బీఎస్పీకి 21 శాతం ఓట్లు లభిస్తున్నాయి. 2014 ఎన్నికల్లో ఎన్డీయే 42.6 శాతం ఓట్లతో ఏకంగా 71 లోక్‌సభ స్థానాల్లో విజయం సాధించడానికి పశ్చిమ ఉత్తరప్రదేశ్ దీనికి గణనీయంగా దోహదపడింది. ఆగ్రా, అలీఘర్, మీరట్, ముజఫర్‌నగర్, ఫిరోజాబాద్, ఘజియాబాద్, మీరట్ తదితర ప్రాంతాల్లోని 20 లోక్‌సభ స్థానాలు కమలదళం గెలుచుకుంది. గడచిన శాసనసభ ఎన్నికల్లోనూ బీజేపీ ఈ ప్రాంతంలో 83 స్థానాలను కైవసం చేసుకుంది. ఈసారి పరిస్థితి ఏమిటి? మొదటి రెండు దశల్లోనే పశ్చిమ యూపీలో ఎన్నికలు జరగనున్నాయి. నిజానికి ఇక్కడ మొత్తం ఉన్నవి 78 సీట్లే. అయితే తొలి రెండు విడతల్లో కలిపితే... 113 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగనున్నాయి. అభ్యర్థుల విజయంపై అన్ని పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. మొదటి రెండు దశల్లో ఎన్నికలు జరగనున్న బిజ్నౌర్ ప్రాంతంతో కలుపుకుంటే మొత్తం 113 స్థానాలకు గాను 2017 అసెంబ్లీ ఎన్నికల్లో 91 చోట్ల బీజేపీ, 17 స్థానాల్లో ఎస్పీ విజయం సాధింంచగా, బీఎస్పీ, కాంగ్రెస్‌లు రెండు స్థానాల చొప్పున, ఆర్ఎల్డీ ఒక చోట గెలుపొందాయి. కానీ, ప్రస్తుత పరిస్థితుల్లో బీజేపీ నుంచి 5, బీఎస్పీ నుంచి 10 శాతం ఓట్లు ఎస్పీ కూటమికి బదిలీ అవుతాయనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. అదే జరిగితే పశ్చిమ యుపీలో ఎస్పీ–ఆర్ఎల్డీ కూటమి 60 నుంచి 70 శాతం సీట్లు సాధించే అవకాశం ఉన్నదని సీఎస్డీఎస్ సర్వే నిపుణుడు ప్రభాత్ కుమార్ అంచనా వేశారు. (క్లిక్: టెన్షన్.. టెన్షన్..! పశ్చిమ యూపీలో ఒక్కో ఓటుకై పార్టీల ఆరాటం) గత ఎన్నికల్లో జాట్ సామాజిక వర్గానికి చెందిన 50 శాతం ఓటర్లు బీజేపీ వైపు మొగ్గుచూపారు. మిగిలిన 50 శాతం మంది జాట్లు అన్ని పార్టీలకు మద్దతిచ్చారు. ఇప్పుడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమం కారణంగా 25 శాతం మంది జాట్లు బీజేపీకి దూరమైనా ఆ పార్టీ ఓటు బ్యాంకులో కనీసం 5 శాతం ఓట్లు ఎస్పీ కూటమికి బదిలీ అవుతాయి. అదే జరిగితే కనీసం 25 అసెంబ్లీ స్థానాలను బీజేపీ అక్కడ కోల్పోనుంది. అదే సమయంలో ఎస్పీ కూటమికి 29 సీట్లు పెరగనున్నాయి. ఇక, బీఎస్పీ ఓటు బ్యాంకుగా చెప్పుకునే 21 శాతం ఓట్లలో బీజేపీ, ఎస్పీ కూటమికి ఎంత బదిలీ అవుతుందన్నది కూడా ఈసారి ఎన్నికల్లో కీలకం కానుంది. బీఎస్పీ ఓటు బ్యాంకు 5–10 శాతం ఎస్పీ కూటమికి బదిలీ అవుతుందనే అంచనా మేరకు ఎస్పీ కూటమి భారీగా లాభపడనుందని రాజకీయ నిపుణులు చెపుతున్నారు. ఇక, సర్వేలు, ఒపీనియన్ పోల్స్ పేరిట కూడా అనేక విశ్లేషణలు వస్తున్నాయి. ఇవి కూడా యోగి నేతృత్వంలోని బీజేపీ, అఖిలేశ్ సారథ్యంలోని ఎస్పీ కూటముల మధ్య పెద్ద అంతరం లేదని, ఈసారి తీవ్ర పోటీ తప్పదని అంచనా వేస్తున్నాయి. స్వామి ప్రసాద్ మౌర్య లాంటి కీలక ఓబీసీ నేతల రాక కూడా సమాజ్‌వాదీ శిబిరానికి అదనపు బలం కానుంది. రైతాంగ పోరాటంతో ఏకతాటిపైకి వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా 13 నెలల పాటు జరిగిన రైతాంగ ఉద్యమం బీజేపీ రాజకీయ వ్యూహాలను కుదిపేస్తోంది. కుల, మతాలలో ప్రమేయం లేకుండా అన్ని వర్గాలకు చెందిన రైతులను ఈ ఉద్యమం ఏకతాటిపైకి తెచ్చింది. ‘హిందూ, ముస్లిం వర్గాల మధ్య సామరస్య పూర్వక వాతావరణాన్ని కూడా ఈ ఉద్యమం తీసుకు రాగలిగింది’ అని మీరట్ కు చెందిన హిందూ–ముస్లిం సమభావన సమితి కార్యదర్శి మహమ్మద్ అలియా భట్ అన్నారు. దీనికి తోడు పశ్చిమ యూపీలో శాంతియుత వాతావరణం కోసం ఆర్ ఎల్డీ నిర్వహించే ‘భాయ్ చరా’ సమావేశాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఆ పార్టీ అధినేత దివంగత అజిత్ సింగ్ ఇలాంటి సమావేశాలు ఎన్నో నిర్వహించారు. బీజేపీ ఎంపీ హుకుం సింగ్ మరణానంతరం సమాజ్ వాదీ నాయకురాలు తబస్సుమ్ బేగంను ఆర్ఎల్డీ అభ్యర్థిగా కైరానా లోక్ సభ నుంచి బరిలో దింపి విజయ తీరాన్ని చేర్చింది కూడా ఈ సమావేశాలతోనే. అజిత్ సింగ్ మరణానంతరం ఆయన కుమారుడు జయంత్ కూడా ఇలాంటి సమావేశాలు నిర్వహిస్తూ ప్రజల్లో ఐక్యత, సుహృద్భావ వాతావరణాన్ని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారు. (చదవండి: యోగికి దడ పుట్టిస్తున్న ‘ఆలూ’ సినిమా!) హిందూ ఓటు బ్యాంక్ తమదేనన్న ధీమా! కానీ, కమలదళం మాత్రం హిందువుల ఓటు బ్యాంకు తమదేనన్న ధీమాతో ఉంది. వ్యవసాయ చట్టాల రద్దు కోసం రైతులు చేసిన పోరాటాన్ని ప్రశంసిస్తూనే ఆ చట్టాలు రద్దు చేసినందున వ్యతిరేకత తగ్గిపోయిందని ప్రచారం చేస్తోంది. యుపీలో రైతాంగానికి 50 శాతం విద్యుత్ బిల్లుల తగ్గింపు తమకు మేలు చేస్తుందని, ఈసారి కూడా అధికారాన్ని నిలబెట్టుకుంటామని కేంద్ర మంత్రి సంజీవ్ ధీమా వ్యక్తం చేశారు. ముజఫర్ నగర్లో ప్రచారం చేస్తున్న ఆయన సాక్షి ప్రతినిధులతో ముచ్చటిస్తూ ఎస్పీ–ఆర్ఎల్డీ కూటమిని నీటి బుడగగా అభివర్ణించారు. అంతే కాదు బీజేపీ ఈసారి కూడా హిందూ ఓటు బ్యాంకును తన వైపునకు తిప్పుకునే వ్యూహానికే పదును పెడుతోంది. అందులో భాగంగానే కైరానా నుంచే తన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన అమిత్ షా ’పలాయన్’ అంశాన్ని తెరపైకి తెచ్చారు. ముజఫర్ నగర్ ఘర్షణల్లో వలస వెళ్లి తిరిగి వచ్చిన కుటుంబాలను కలిసి పరామర్శించారు. అంతే కాదు యోగి పాలనలో శాంతి భద్రతలు మెరుగు పడినందునే ఈ ప్రాంత ప్రజలు శాంతి యుతంగా జీవించగలుగుతున్నారని కితాబునిచ్చారు కూడా. అయితే, ఈ కితాబులు, కమల వ్యూహాలు ఏ మేరకు ఫలిస్తాయి..? గత రెండు, మూడు ఎన్నికల్లో బీజేపీకి అండగా నిలుస్తున్న పశ్చిమ యూపీ గ్రామీణ, సెమీ అర్బన్ ఓటరు ఈసారి ఏం చేస్తాడు? కమల వికాసానికి తోడ్పడుతాడా? ఏనుగు దిగి, హ్యాండిచ్చి మరీ సైకిల్ ఎక్కుతాడా? ముజఫర్‌నగర్ నుంచి మీరట్ వరకు ఓటరన్న ఏ పార్టీ వైపు మొగ్గుచూపుతాడన్నది ఉత్తరప్రదేశ్ మాత్రమే కాదు దేశ రాజకీయ వర్గాల్లోనూ ఆసక్తిని కలిగిస్తోంది. (క్లిక్: అన్నయ్యతో అవ్వట్లేదు... ప్రియాంక అలుపెరుగని పోరాటం) క్షేత్రస్థాయిలో పని చేయని బీజేపీ వ్యూహాలు ఈ ఎన్నికల్లో బీజేపీ వ్యూహాలు క్షేత్ర స్థాయిలో ప్రభావం చూపుతున్నట్టు కనిపించడం లేదు. విభజన రాజకీయాలను తాము గ్రహించగలిగామని, మళ్లీ ఆ ఉచ్చులో పడబోమనే నినాదం ఇక్కడి స్థానికుల నుంచి వినిపిస్తోంది. ఈ అంశంలో తమ పాచికలు పారడం లేదని గ్రహించిన కేంద్ర మంత్రి, కైరానా ఎంపీ సంజీవ్ బలియాన్ ఇప్పుడు ముస్లిం సానుభూతిపరుడిగా మారిపోయారు. ముజఫర్ నగర్ లోని ఆరు అసెంబ్లీ స్థానాల్లో ఒక్క చోట కూడా ఎస్పీ, ఆర్ఎల్డీలు ముస్లిం అభ్యర్థులను ఎందుకు నిలబెట్టడం లేదంటూ వీలు దొరికినప్పుడల్లా ప్రశ్నిస్తున్నారు. బీజేపీ రాజకీయ వ్యూహాలను తిప్పి కొట్టేందుకు స్థానిక ముస్లింలు సహన పరీక్ష ఎదుర్కొనవలసి వస్తోందని ఇమామ్‌ల సంఘం నేతలంటున్నారంటే పశ్చిమ యూపీలో మారిన రాజకీయ పరిస్థితులను అర్థం చేసుకోవచ్చు. రైతు ఉద్యమకారుడు మహేంద్ర సింగ్ తికాయత్ ఏర్పాటు చేసిన బీకేయూ కూడా మత సామరస్యం కోసం పని చేస్తూ గత ఎన్నికల్లో బీజేపీకి మద్దతునిచ్చింది. ‘ఈసారి గతంలో మాదిరి తప్పులు చేయం. మా భవిష్యత్ ఏమిటో మాకు తెలిసివచ్చింది’ అని మహేంద్ర సింగ్ కుమారులు రాకేశ్, నరేశ్ తికాయత్‌లు సాక్షి ప్రతినిధులతో చెప్పారు. (క్లిక్: యోగీకి కలిసొచ్చే, సవాల్ విసిరే అంశాలివే!) -
మాతో పెట్టుకుంటే మడతడిపోద్దీ!
సాక్షి, న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ సింహాసనాన్ని ఎవరు అధిరోహించాలన్నది నిర్ణయించడంలో యువతే కీలక భూమిక పోషించనుంది. తమ భవిష్యత్తు అవసరాలను తీర్చగలవని నమ్మిన పార్టీలను ఎన్నుకుంటూ వస్తూనే.. తమ కలలను నెరవేర్చని ప్రభుత్వాలను కూలదోస్తూ.. ప్రతి ఎన్నికలో కీలకంగా మారింది. అందుకే యూపీ జనాభాలో పావు శాతానికిపైగా ఉన్న యువతే లక్ష్యంగా ప్రధాన పార్టీలు వ్యూహాలు పన్నుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ అయితే.. ఏకంగా యువత కోసం ప్రత్యేక మేనిఫెస్టోనే విడుదల చేసింది. నిర్ణయాత్మకంగా మారడంతో.. యూపీలో ప్రస్తుత ఎన్నికల్లో 15.02 కోట్ల మంది ఓటు వేయనుండగా.. అందులో ఏకంగా 4 కోట్ల మంది 18–39 ఏళ్ల మధ్య వయసున్న యువతే. అందులోనూ కొత్తగా 19.89 లక్షల మంది తొలిసారి ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఇంత భారీ సంఖ్యలో ఉన్న యువత ఓట్లను దృష్టిలో పెట్టుకొనే అన్ని రాజకీయ పార్టీలు వారిచుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నాయి. ఆకట్టుకునే హామీలతోపాటు, మెజార్టీ సంఖ్యలో సీట్లను కేటాయిస్తున్నాయి. ఈ క్రమంలోనే 2007 నుంచి ప్రతి ఎన్నికలో సుమారు 70 మంది యువ ఎమ్మెల్యేలు యూపీ అసెంబ్లీకి వస్తున్నారు. ప్రస్తుతం ముగుస్తున్న అసెంబ్లీలోనూ 71 మంది ఎమ్మెల్యేల వయసు 40 ఏళ్లకన్నా తక్కువే కావడం గమనార్హం. ఇక 40 నుంచి 50 ఏళ్ల మధ్య వయసున్న ఎమ్మెల్యేలు ఏకంగా 128 మంది వరకు ఉన్నారు. హామీ మరిస్తే ఇంటికే.. ప్రభుత్వాలు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోకున్నా, నిధుల కేటాయింపులో ప్రాధాన్యం తగ్గినా యువత తమ సత్తా చూపిస్తోంది. 2007లో మాయావతి (బహుజన సమాజ్ పార్టీ–బీఎస్పీ) యువత లక్ష్యంగా.. ఉద్యోగాల కల్పన, విద్యా ఖర్చుల తగ్గింపు, పారిశ్రామిక అభివృద్ధి ద్వారా ఉపాధి వంటి హామీలు ఇచ్చారు. దానితో దళిత, ముస్లిం యువత మొత్తం ఆమె వెంట నడిచింది. ఆమె మొత్తం 403 సీట్లకుగాను 206 సీట్లు గెలుపొందారు. కానీ ఆమె అధికారంలోకి వచ్చాక 18–30 ఏళ్ల యువత కోసం ఒక్క పథకాన్ని కూడా తీసుకురాలేదు. ఐదేళ్ల పాలనా కాలంలో 91 వేల ప్రభుత్వ ఉద్యోగాలను మాత్రమే ఇచ్చారు. పెద్ద ఎత్తున పరిశ్రమల ఏర్పాటు హామీ నీరుగారింది. దీనిపై ఆగ్రహించిన యువత బీఎస్పీకి దూరమైంది. ఫలితంగా 2012లో బీఎస్పీకి 80 సీట్లు మాత్రమే వచ్చాయి, 2017 నాటికి 19 సీట్లకు పడిపోయాయి. ►సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) నేత అఖిలేష్‌యాదవ్.. 2012 ఎన్నికల్లో 3.8 కోట్ల మంది యువ ఓటర్లను దృష్టిలో పెట్టుకొని, తమ మేనిఫెస్టోలో అనేక హామీలు గుప్పించారు. 10వ తరగతి పిల్లలకు ట్యాబ్లెట్, 12వ తరగతి పాసైన వారికి ల్యాప్‌టాప్, బాలికలకు గ్రాడ్యుయేషన్ వరకు ఉచిత విద్య, నిరుద్యోగ భృతి కింద ప్రతి ఏటా రూ.12 వేలు వంటి హామీలు ఇచ్చారు. యువత మద్దతుగా నిలవడంతో ఎస్పీ ఏకంగా 224 సీట్లు గెలుచుకొని అధికారంలో వచ్చింది. అఖిలేష్‌యాదవ్ అధికారంలోకి వచ్చాక.. విద్యార్థులకు ట్యాబ్లెట్లు, ల్యాప్‌ట్యాప్‌ల పంపిణీ నామమాత్రంగానే సాగింది. ఆయన ఐదేళ్ల పాలనలో 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు మాత్రమే భర్తీ చేశారు. ఇతర హామీలూ పూర్తిగా అమలుకాలేదు. దానితో 2017 ఎన్నికల్లో యువత దూరమై.. ఎస్పీ కేవలం 47 స్థానాలకే పరిమితమైంది. ►2017 అసెంబ్లీ ఎన్నికల్లో ఒక పోలింగ్ బూత్, ఐదుగురు యువకులు అనే నినాదంతో బీజేపీ ముందుకెళ్లింది. నాలుగు లక్షల ఉద్యోగాల కల్పనకు హామీ ఇచ్చింది. ఆ ఎన్నికల్లో బీజేపీ ఏకంగా 312 సీట్లు గెలిచింది. కానీ హామీ ఇచ్చిన మేరకు ఉద్యోగాల కల్పనలో బీజేపీ సఫలం కాలేకపోయింది. పైగా నిరుద్యోగం పెరగడంతో యువత రోడ్లెక్కారు. ప్రయాగ్‌రాజ్, లక్నోలలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టారు. మరోవైపు టెట్ ప్రశ్నపత్రం లీకేజీ అంశం సుమారు 20లక్షల మంది యువతను ఇబ్బందుల్లో నెట్టడంతో బీజేపీ సర్కారు అపఖ్యాతి పాలైంది. ఈ నష్టాన్ని పూడ్చుకొనేందుకు బీజేపీ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయాల్సి వచ్చింది. అందులో రవికిషన్, గౌతమ్ గంభీర్, బబితా ఫోగట్, తేజస్వి సూర్య వంటి నాయకులకు ప్రాతినిధ్యం కల్పించి.. యువ, ప్రగతిశీల ఓటర్లలో బీజేపీని విస్తరించేలా కార్యక్రమాలు నిర్వహించింది. ప్రత్యేక మేనిఫెస్టోతో కాంగ్రెస్.. యువత ప్రాధాన్యాన్ని దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ ఏకంగా యూత్ మేనిఫోస్టోనే తెరపైకి తెచ్చింది. రెండు రోజుల కింద కాంగ్రెస్ ఎంపీ రాహుల్‌గాంధీ, ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ దీనిని ఆవిష్కరించారు. ‘భారతీ విధాన్’ పేరుతో 20 లక్షల ఉద్యోగావకాశాలు కల్పిస్తామని, ఇందులో 8లక్షల ఉద్యోగాలు మహిళలకు కేటాయిస్తామని ప్రకటించారు. గతంలో 25–30 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామంటూ బీజేపీ ప్రభుత్వం పెద్ద పెద్ద ప్రకటనలు చేసి విఫలమైందని.. కాంగ్రెస్ అమలుచేసి చూపించి యువత విశ్వాసాన్ని పునరుద్ధరిస్తుందని వారు పేర్కొన్నారు. -
పోటీకి మాయావతి దూరం
లక్నో: ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్పీ) చీఫ్ మాయావతి ఈసారి ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేయడం లేదు. ఈ విషయాన్ని పార్టీ ప్రధాన కార్యదర్శి ఎస్సీ మిశ్రా వెల్లడించారు. అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పార్టీ అభ్యర్థిగా బరిలో దిగకపోయినా, మాయావతి తన సొంత పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటారని మిశ్రా వివరించారు. -
విజయతీరాలను చేరాలని.. ‘సామాజిక’ ఫార్ములా!
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజకీయ భవిష్యత్తును నిర్ణయించే ఉత్తర్‌ప్రదేశ్ ఎన్నికల్లో ప్రధాన పార్టీల విజయావకాశాలన్నీ రాజకీయ వ్యూహాల్లో దిట్టలైన సామాజిక ఇంజనీర్లు(పొలిటికల్ సోషల్ ఇంజనీర్స్), వారు సిద్ధం చేసే సోషల్ ఇంజనీరింగ్ మీదే ఆధారపడి ఉంటోంది. పార్టీకి విజయవంతమైన ఎన్నికల ప్రచారాన్ని సిద్ధం చేయడం, సామాజిక సమూహాలు, వారి అవసరాలను గుర్తించడం, ఆపై పథకాలు, ప్రోత్సాహకాలు ప్రకటించడం, సామాజిక మాధ్యమాల్లో సందేశాల ద్వారా పార్టీకి అనుకూలంగా వారిని సానుకూలంగా ప్రభావితం చేసే వ్యూహాన్ని సిద్ధం చేయడంతో సోషల్ ఇంజనీర్లే కీలక భూమిక పోషిస్తున్నారు. దేశంలో 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు నుంచే ప్రతి పార్టీ సోషల్ ఇంజనీరింగ్ ప్రాధాన్యాన్ని బాగా గుర్తించాయి. సామాజిక సమీకరణ కోసం వివిధ కులాలు, వర్గాలు, మత సమూహాలతో తమ పార్టీలకు సంబంధాలను బలపరిచే, సామాజిక పొత్తులను నిర్మించగల శక్తిసామర్థ్యాలున్న నేతలను దీనికి వినియోగిస్తున్నాయి. వీరికి ప్రజాకర్షక శక్తి లేకున్నా.. తెరవెనుక వ్యవహారాలను చక్కబెట్టగల నేర్పు ముఖ్యం. హోంమంత్రి అమిత్ షా బీజేపీకి గొప్ప సోషల్ ఇంజనీర్ అనేది గత సార్వత్రిక, వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో నిరూపితమైంది. ప్రధాన్ నేతృత్వంలో బీజేపీ... ప్రస్తుతం అమిత్ షా కేంద్ర వ్యవహారాల్లో బిజీగా ఉండటంతో యూపీ ఎన్నికల్లో సోషల్ ఇంజనీరింగ్ బాధ్యతలను సమర్థ్ధుడైన ధర్మేంద్ర ప్రధాన్‌కు బీజేపీ కట్టబెట్టింది. ప్రధాన సామాజికవర్గాల్లో ఏదైనా అసంతృప్తి ఉంటే దానిని వెంటనే గుర్తించి, వాటితో చర్చలు జరిపి, వారి ద్వారా అందే ఫీడ్‌బ్యాక్ ఆధారంగా పరిష్కారాలు చూపించే పనిని ప్రధాన్ బృందం సూక్ష్మస్థాయిలో చేస్తోంది. ముఖ్యంగా పూర్వాంచల్. తూర్పు యూపీలో బ్రాహ్మణ వర్గం బీజేపీకి దూరమవుతోంది. రాజ్‌పుత్‌లకు అధిక ప్రాధాన్యమిస్తున్నారన్న కినుకతో వారు ఎస్పీలో చేరుతున్నారు. దీంతో యూపీలో 14 శాతం ఉన్న బ్రాహ్మణులు దూరం కాకుండా కమలదళం చర్యలు చేపట్టింది. లఖీంపూర్ ఖేరీ ఘటనలో బ్రాహ్మణ వర్గానికి చెందిన కేంద్ర మంత్రి అజయ్ మిశ్రాకు ఉద్వాసన పలకాలని ఎంత గట్టిగా డిమాండ్లు వచ్చినా, ఆ వర్గానికి ఆగ్రహం కల్గించరాదన్న ఉద్దేశంతోనే ఆయనకు బీజేపీ కాపు కాస్తోంది. మరోవైపు రాజ్‌పుత్ ఓట్లు జారిపోకుండా కీలక నేతలందరితో ఎప్పటికప్పుడు మంతనాలు చేస్తోంది. ముఖ్యంగా రైతుల్లో ఎక్కువగా బీసీలు, ఎస్సీ వర్గాల వారే ఉండటంతో వారిని మచ్చిక చేసుకునేలా ఇప్పటికే రూ.35 వేల కోట్ల రుణాలను అందించగా, 2.21 కోట్ల మంది రైతులను ఫసల్ బీమా యోజనలో చేర్చింది. వీటన్నింటినీ బీజేపీ బృందాలు ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లి వారిని ఆకర్షించే పనిలో పడ్డాయి. బ్రాహ్మణ వర్గాన్ని ఆకర్షిస్తున్న ఎస్పీ ఇక యూపీ ఎన్నికల్లో బీజేపీని బలంగా ఎదుర్కోవాలని గట్టి పట్టుదలతో ఉన్న విపక్షాలు సైతం తమతమ సోషల్ ఇంజనీరింగ్‌కు పదునుపెట్టాయి. సమాజ్‌వాదీ పార్టీ కోసం అఖిలేశ్ యాదవ్ సోషల్ ఇంజనీరింగ్ వ్యూహాన్ని రచిస్తున్నారు. మహాన్ దళ్, సుహల్దేవ్ భారతీయ సమాజ్ పార్టీ వంటి యాదవేతర కుల ఆధారిత పార్టీలతో పొత్తులు ఏర్పరచుకోవడం ద్వారా వివిధ సామాజిక వర్గాలను దగ్గర చేసుకునే యత్నాలకు దిగారు. ముఖ్యంగా బీజేపీ అనుబంధంగా ఉంటున్న బ్రాహ్మణులకు దగ్గరయ్యేలా ఆయన చేరికలను ప్రోత్సహిస్తున్నారు. ఇటీవలే బ్రాహ్మణ వర్గానికి చెందిన బీఎస్పీ మాజీ ఎంపీ రాకేశ్ పాండేని పార్టీలో చేర్చుకున్నారు. 2012 ఎన్నికల్లో ఎస్పీ 224 ఓట్లు సాధించడంలో ఓబీసీలు, ముస్లిం, వైశ్యులు కీలకంగా ఉన్నారు. 19 శాతంగా ఉన్న ముస్లింలకు 2017లో అధిక సీట్లు కేటాయించినా, కేవలం మూడో వంతు మాత్రమే ఎస్పీ నుంచి గెలిచారు. ఓట్ల చీలిక ఇక్కడ ప్రధాన భూమిక పోషించింది. ఈ దృష్ట్యా ముస్లింల ఓట్లు చీలకుండా కాంగ్రెస్‌లో కీలకంగా ఉన్న మాజీ ఎంపీ సలీమ్ షేర్వానీని ఇప్పటికే పార్టీలో చేర్చుకోగా, కొత్తగా కాంగ్రెస్ జాతీయ కార్యదర్శి ఇమ్రాన్ మసూద్‌ను పార్టీలోకి ఆహ్వానించారు. అఖిలేశ్ ఇటీవల నిర్వహించిన విజయ్ రథయాత్రకు ముస్లిం ఓటర్లు ఎక్కువగా హాజరయ్యేలా పార్టీ జాగ్రత్తలు తీసుకుంది. ఇక పశ్చిమ యూపీలో జాట్ల మద్దతు కూడగట్టేందుకు ఆర్ఎల్డీతో ప్రాథమిక చర్చలు పూర్తి చేసింది. ఓబీసీల ఓట్లు కొల్లగొట్టేందుకు ఆయన బీసీ కులగణన అంశానికి మద్దతిస్తున్నారు. రిజర్వ్డ్ స్థానాలతో పాటు ముస్లిం ఓట్లపై కన్నేసిన బీఎస్పీ ఇక మాయావతి నేతృత్వంలోని బహుజన్ సమాజ్ పార్టీ కోసం సోషల్ ఇంజనీరింగ్ వ్యూహాన్ని పార్టీ ప్రధాన కార్యదర్శి సతీశ్ చంద్ర మిశ్రా రూపొందిస్తున్నారు. బ్రాహ్మణులతో సహా దళితేతర కులాల నుండి వీలైనంత ఎక్కువ మంది మద్దతు పొందే వ్యూహాలను సిద్ధం చేస్తున్నారు. ’బహుజన్ టు సర్వజన్’ అనే నినాదం ఆధారంగా ఆయన వ్యూహాలున్నాయి. గతంలో రెండుసార్లు అధికారంలోకి వచ్చిన సందర్భాల్లో 86 ఎస్సీ రిజర్వ్డ్ స్థానాల్లో బీఎస్పీ 60కి పైగా స్థానాలను గెలుచుకుంది. ఇప్పుడు ఆ స్థానాల్లో పార్టీ నేత సతీశ్‌చంద్ర శర్ము రెండుసార్లు పర్యటించి వచ్చారు. ఇదే సమయంలో ముస్లిం ఓటర్లు గంపగుత్తగా ఎస్పీ వైపునకు వెళ్లకుండా 2012–17 మధ్య అఖిలేశ్ సీఎంగా ఉన్న సమయంలో 134 చోట్ల మతకల్లోల సంఘటనలు జరిగిన అంశాన్ని పదేపదే ప్రస్తావిస్తున్నారు. ఇదే అంశాన్ని సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచారం చేస్తున్నారు. ‘ఆడపిల్లను... పోరాడగలను’ యూపీలో కాంగ్రెస్ ప్రాబల్యం నానాటికీ తగ్గుతూ వస్తోందనేది అక్షరసత్యం. 2019లో కాంగ్రెస్ కంచుకోటగా భావించే అమేథిలో రాహుల్‌గాంధీ ఓడిపోయారు. దేశంలోనే అతిపెద్ద రాష్ట్రంలో కాంగ్రెస్‌ను గౌరవప్రదమైన స్థానంలో నిలపడానికి ప్రియాంకా గాంధీ శ్రమిస్తున్నారు. స్వయం సహాయక బృందాలు, ఇతర మహిళా సంస్థలతో ఎక్కువగా టచ్‌లో ఉంటూ వారి మద్దతు కూడగట్టే యత్నాలు చేస్తున్నారు.‘లడ్కీ హూ..లడ్ సక్తీ హూ’ నినాదాన్ని బలంగా తీసుకెళ్తున్నారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు కావాలి, మహిళలకు భద్రత కావాలి, మహిళలకు 40 శాతం ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని ఎస్పీ లేదా బీజేపీ హామీ ఇవ్వగలవా? అని ప్రశ్నిస్తున్నారు. ఇక రాష్ట్రీయ లోక్‌దళ్ అధ్యక్షుడు జయంత్ చౌదరి జాట్లు అధికంగా ఉండే పశ్చిమ యూపీలో తన ప్రాబల్యాన్ని నిలుపుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగా ఆయన భారతీయ కిసాన్ యూనియన్ నాయకుడు రాకేశ్ తికాయత్‌తో సంబంధాలు నెరుపుతున్నారు. ముస్లిం–జాట్ కాంబినేషన్ సైతం మంచి ఫలితాలిస్తాయని ఆశిస్తున్న జయంత్ చౌదరి ఎస్పీతో పరస్పర అంగీకారం దిశగా చర్చలు చేస్తున్నారు. -
‘మాఫియా లీడర్లకు, బాహుబలలకు టికెట్లు ఇవ్వం’
లక్నో: వచ్చే ఏడాది జరగనున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో మాఫియా లీడర్లకు, బాహుబలులకు టికెట్లు ఇచ్చేది లేదని బహుజన్ సమాజ్ పార్టీ అధ్యక్షురాలు మాయావతి స్పష్టం చేశారు. మావు అసెంబ్లీ నియోజకవర్గం టికెట్ ఆశించిన గ్యాంగ్‌స్టర్, రాజకీయ నాయకుడు ముఖ్తార్ అన్సారీకి పార్టీ టికెట్ నిరాకరిస్తూ.. మాయావతి ఈ వ్యాఖ్యలు చేశారు. మావు స్థానం నుంచి యూపీ బీఎస్పీ అధ్యక్షుడు భీమ్ రాజ్‌భర్ పేరు ఖరారు చేస్తున్నట్లు ప్రకటించారు. మావు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న అన్సారీ ప్రస్తుతం బండాలోని జైలులో ఉన్నారు. అంతేకాక ఉత్తర ప్రదేశ్‌తో పాటు ఇతర ప్రాంతాల్లో 52 కేసులను ఎదుర్కొంటున్నారు. వీటిలో 15 కేసులు విచారణ దశలో ఉన్నాయని ఏఎన్ఐ నివేదించింది. వచ్చే ఏడాది జరగనున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని తాజాగా ప్రారంభించిన మాయావతి.. ప్రజల ఆకాంక్షలు, అంచనాలకు అనుగుణంగా అభ్యర్థులను ఎంపిక చేసే విధంగా శ్రద్ధ వహించాలని పార్టీ ఇంచార్జీకి విజ్ఞప్తి చేసినట్లు పేర్కొన్నారు. (చదవండి: చిన్న పార్టీల జోరు.. అధిక సీట్ల కోసం బేరసారాలు) 1. बीएसपी का अगामी यूपी विधानसभा आमचुनाव में प्रयास होगा कि किसी भी बाहुबली व माफिया आदि को पार्टी से चुनाव न लड़ाया जाए। इसके मद्देनजर ही आजमगढ़ मण्डल की मऊ विधानसभा सीट से अब मुख्तार अंसारी का नहीं बल्कि यूपी के बीएसपी स्टेट अध्यक्ष श्री भीम राजभर के नाम को फाइनल किया गया है। — Mayawati (@Mayawati) September 10, 2021 దీనిపై శుక్రవారం మాయావతి తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా స్పందిస్తూ ‘‘రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీ నుంచి మాఫియా నేపథ్యం ఉన్నవారు బాహుబలులు ఎవరూ పోటీ చేయరు. దీనిని దృష్టిలో ఉంచుకుని మావు నియోజకవర్గం నుంచి ముఖ్తార్ అన్సారీని తొలగించి యూపీ బీఎస్పీ అధ్యక్షుడు భీమ్ రాజ్‌భర్‌ను ఖరారు చేశాం. ప్రజల అంచనాలను చేరుకోవాడానికి పార్టీ అందుకునే విధంగా అభ్యర్థుల ఎంపిక జరగాలని పార్టీ ఇంచార్జీకి విజ్ఞప్తి చేశాను. సమస్యలు లేకుండా ఇటువంటి అంశాలపై చర్యలు తీసుకోవాలి. రాష్ట్రమే కాకుండా దేశం మొత్తం చట్టం ద్వారా నిర్మితమైన చట్టబద్ధ పాలన కావాలని బీఎస్పీ సంకల్పిస్తోంది. యూపీ ప్రస్తుత చిత్రాన్ని మార్చడానికి బీఎస్పీ కృషి చేస్తుంది. బీఎస్పీ ఏం చెప్పినా చేసి చూపిస్తుంది. అదే మా పార్టీకి నిజమైన గుర్తింపు’’ అని మాయావతి వరుస ట్వీట్లు చేశారు. 2. जनता की कसौटी व उनकी उम्मीदों पर खरा उतरने के प्रयासों के तहत ही लिए गए इस निर्णय के फलस्वरूप पार्टी प्रभारियों से अपील है कि वे पार्टी उम्मीदवारों का चयन करते समय इस बात का खास ध्यान रखें ताकि सरकार बनने पर ऐसे तत्वों के विरूद्ध सख्त कार्रवाई करने में कोई भी दिक्कत न हो। — Mayawati (@Mayawati) September 10, 2021 చదవండి: బుజ్జగింపులో వింత కోణం -
ప్రగతి భవన్‌కు గజరాజు మీద వెళ్లే రోజు ఎంతో దూరం లేదు
హస్తినాపురం(హైదరాబాద్): తెలంగాణలో దోపిడీ, గడీల పాలనకు చరమగీతం పాడాల్సిన అవసరం ఉందని.. బంగారు తెలంగాణ కాదు బంజరు తెలంగాణగా తయారయ్యిందని మాజీ ఐపీఎస్ అధికారి, బీఎస్పీ రాష్ట్ర చీఫ్ కో–ఆర్డినేటర్ డా.ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ అన్నారు. గురువారం హస్తినాపురం డివిజన్లో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఇబ్రాం శేఖర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉమ్మడి రంగారెడ్డి జిల్లా బీఎస్పీ కార్యకర్తల సమీక్షా సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... సబ్బండవర్గాలు ఉద్యమం చేస్తేనే తెలంగాణ వచ్చిందన్నారు. అది మరచిపోయి అనచివేతే లక్ష్యంగా పని చేయడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. రాష్ట్రంలో దళితులకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదన్నారు. రాజ్యాధికారమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. ప్రగతిభవన్‌కు గజరాజు మీద వెళ్లే రోజులు ఎంతో దూరం లేదని పేర్కొన్నారు. ఈ సందర్భంగా దాదాపు 800మంది వివిధ పార్టీల నుంచి ప్రవీణ్‌కుమార్ సమక్షంలో బీఎస్పీలో చేరారు. కార్యక్రమంలో బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు మంద ప్రభాకర్, రాష్ట్ర నాయకులు పసుల బాలస్వామి, కటికల శ్రీహరి, దర్మేందర్, రాంచందర్, విజయ్, జగన్ తదితరులు పాల్గొన్నారు. చదవండి: కేసీఆర్ పోటీ చేస్తే బరిలోకి రేవంత్‌రెడ్డి -
ఈసారి అధికారంలోకి వస్తే విగ్రహాలు పెట్టం.. అభివృద్ధి చేస్తాం
సాక్షి, న్యూఢిల్లీ: వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న ఉత్తర్‌ప్రదేశ్‌లో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. రాష్ట్రంలోని రాజకీయ పార్టీలు పలు మార్గాల్లో ఓటర్లను తమవైపు తిప్పుకొనే పనిలో బిజీగా ఉన్నాయి. తాజాగా మంగళవారం లక్నోలో జరిగిన ప్రబుద్ధ్ వర్గ్ విచార్ సమ్మేళన్ కార్యక్రమంలో బీఎస్పీ అధినేత్రి మాయావతి ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. 2007లో ఫలితాన్ని ఇచ్చిన దళితులు– బ్రాహ్మణుల ఫార్ములాతో 2022లో మరోసారి అధికార పీఠాన్ని దక్కించుకోవాలని మాయావతి ఆకాంక్షిస్తున్నారు. అందులో భాగంగానే ఎన్నికల ప్రచారంలో బ్రాహ్మణులు కేంద్రంగా ఉంటారని మాయావతి స్పష్టం చేశారు. వేదికపై నుంచి త్రిశూలాన్ని ఊపుతూ, ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో కనీసం వెయ్యిమంది బ్రాహ్మణ కార్యకర్తలను పార్టీ తయారు చేస్తుందని బీఎస్పీ అధినేత్రి తెలిపారు. అంతేగాక వచ్చే ఎన్నికల్లో బీఎస్పీ అధికారంలోకి వస్తే గతంలో మాదిరిగా విగ్రహాలు, స్మారకాల ఏర్పాటు కాకుండా రాష్ట్ర ముఖచిత్రాన్ని మార్చే విధంగా అన్ని ప్రాంతాల అభివృద్ధిపై దృష్టిపెడతానని మాయావతి పేర్కొన్నారు. (చదవండి: వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ముఖ్యమంత్రి తండ్రి అరెస్ట్) ఇటీవల ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలను ఉటంకిస్తూ మైనారిటీలను దత్తత తీసుకున్నట్లుగా ఆర్ఎస్ఎస్, బీజేపీ ఎందుకు పరిగణిస్తున్నాయని ఆమె విమర్శించారు. అదే సమయంలో తమ పార్టీ ఏ వర్గంపట్ల వివక్ష చూపదని ఆమె భరోసా ఇచ్చారు. 2022లో సంపూర్ణ మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత 2007లో చేసిన విధంగా ‘సర్వజన్ హితయ్.. సర్వజన్ సుఖయ్’ అనే విధానాన్ని అమలు చేస్తామని మాయావతి హామీ ఇచ్చారు. గతంలో తాము కేవలం దళితులు, వెనుకబడిన వారి ప్రయోజనాలను మాత్రమే చూడలేదని, అగ్రవర్ణాలకు సైతం సమప్రాధాన్యత ఇచ్చామని పేర్కొన్నారు. బీఎస్పీ ఒక కులం లేదా మతం కోసం పనిచేసే పార్టీ కాదని, ఇది సమాజంలోని అన్ని వర్గాల పార్టీ అని పునరుద్ఘాటించారు. కేబినెట్లో బ్రాహ్మణులకు సముచిత స్థానం గత కొన్ని సంవత్సరాలుగా సమాజ్‌వాదీ పార్టీ, బీజేపీలు తమ ప్రభుత్వాల విధానాలతో పేదలు, కార్మికులు, ఉద్యోగులు, రైతులు, చిన్న వ్యాపారులు, దళితులు, వెనుకబడిన వర్గాలను అణగదొక్కారని మాయావతి ఆరోపించారు. అంతేగాక బీజేపీ ప్రభుత్వంలో బ్రాహ్మణ సమాజంలోని ప్రజలు చాలా వేధింపులకు గురయ్యారని, 2022లో ఏర్పడే కేబినెట్లో బ్రాహ్మణ సమాజంలోని వారికి గౌరవనీయమైన స్థానాన్ని ఇస్తామని ఆమె హామీ ఇచ్చారు. ప్రభుత్వం ఏర్పడితే బ్రాహ్మణ సమాజ భద్రత, పూర్తి గౌరవం దక్కేలా చూసుకుంటామన్నారు. ఇప్పటికే బీఎస్పీతో బ్రాహ్మణ సామాజిక వర్గాన్ని కలిపే ప్రణాళికల్లో భాగంగా మొదటి దశలో తమ పార్టీ నేత సతీష్ చంద్ర మిశ్రా విజయవంతంగా పనిచేశారని మాయావతి తెలిపారు. ఇక రెండవ దశలో చిన్న పట్టణాలు, గ్రామాల్లో యుద్ధ ప్రాతిపదికన బీఎస్పీతో అనుసంధానించే ప్రచారం జరుగుతుందని, ప్రతి సభలో బ్రాహ్మణ సమాజానికి చెందిన కనీసం వెయ్యిమంది కార్యకర్తలు సిద్ధంగా ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేశామని తెలిపారు. అంతేగాక ఈసారి ఎన్నికల్లో బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన మహిళలను సైతం పార్టీతో అనుసంధానం చేసే పని జరుగుతుందని పేర్కొన్నారు. మరోవైపు బీజేపీ ప్రభుత్వంలో రైతుల ఆదాయం రెట్టింపు కాలేదని, 3 వ్యవసాయ చట్టాల ద్వారా రైతులను మరింత హింసించారని మాయావతి ఆరోపించారు. ఉత్తర్‌ప్రదేశ్‌లో 13% బ్రాహ్మణ ఓటర్లు దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తర్‌ప్రదేశ్ రాజకీయాలలో బ్రాహ్మణులు కీలక పాత్ర పోషిస్తున్నారు. జనాభాపరంగా రాష్ట్రంలో దాదాపు 13% మంది బ్రాహ్మణులు ఉన్నారు. కొన్ని అసెంబ్లీ స్థానాలలో అయితే బ్రాహ్మణ ఓటర్లు 20% కంటే ఎక్కువగా ఉన్నారు. దీంతో రాష్ట్రంలోని ప్రతి రాజకీయపార్టీ బ్రాహ్మణ ఓటుబ్యాంకును తమవైపు తిప్పుకొనేందుకు సర్వశక్తులు ఒడ్డుతాయి. మహారాజ్‌గంజ్, గోరఖ్‌పూర్, దేవరియా, జౌన్పూర్, అమేథి, వారణాసి, చందౌలి, కాన్పూర్, ప్రయాగరాజ్, బలరాంపూర్, బస్తీ, సంత్ కబీర్ నగర్ల్లో బ్రాహ్మణ ఓట్లు 15% కంటే ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ అభ్యర్థి గెలుపోటముల్లో బ్రాహ్మణ ఓటర్లు ముఖ్యమైన పాత్ర పోషిస్తారని రాజకీయ విశ్లేషకులు తెలిపారు. 2017లో బ్రాహ్మణ అభ్యర్థులు 56 సీట్లను గెలుచుకున్నారు. కాగా 2007లో మాయావతి నాయకత్వంలోని బీఎస్పీ బ్రాహ్మణ, దళిత, ముస్లిం ఫార్ములాతో బరిలో నిలిచి అధికార పీఠాన్ని దక్కించుకున్నారు. 2007 ఎన్నికల్లో బీఎస్పీ బ్రాహ్మణ అభ్యర్థులకు 86 టిక్కెట్లు ఇచ్చిన విషయం తెలిసిందే. -
హుజూరాబాద్ బరిలో బీఎస్పీ.. ప్రవీణ్ కుమార్‌పై ఒత్తిడి
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: హుజూరాబాద్ ఉపఎన్నికలో త్వరలో ఆసక్తికర పరిణామా లు చోటు చేసుకునే అవకాశాలు కనిపి స్తున్నాయి. ప్రస్తుతానికి ఇక్కడ టీఆర్ఎస్–బీజేపీల మధ్య ద్విముఖ పోరే నడు స్తోంది. కాంగ్రెస్ పార్టీ ఇంకా తమ పార్టీ అభ్యర్థిని ఖరారు చేయనప్పటికీ.. బలమైన అభ్యర్థిని బరిలోకి దింపేందుకు ఏర్పాట్లు చేసుకుంది. తాజాగా.. హుజూరాబాద్ బరిలో బీఎస్పీ దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. హుజూరాబాద్ ఉప ఎన్నికలో పోటీ చేయాలంటూ పలువురు బీఎస్పీ నేతలు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌పై ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది. ఈనెల 26వ తేదీన ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన పలువురు నేతలు బీఎస్పీలో చేరుతుండగా.. ఈ సందర్భంగా నిర్వహించే సభలో ఆయన హుజూరాబాద్ ఉపఎన్నికలో పోటీ చేయాలా? వద్దా? అన్న విషయంపై నిర్ణయం ప్రకటిస్తారని సమాచారం. (చదవండి: Huzurabad : కాంగ్రెస్ నుంచి బరిలోకి మాజీమంత్రి కొండా సురేఖ..?) బీఎస్పీతోనే బహుజన రాజ్యాధికారం: ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ దేవరకొండ: బీఎస్పీ తోనే బహుజన రాజ్యా ధికారం సాధ్యమని బీఎస్పీ రాష్ట్ర కోఆర్డినేటర్ ఆర్.ఎస్.ప్రవీణ్‌కుమార్ అన్నారు. సోమవారం నల్లగొండ జిల్లా దేవరకొండలో జరిగిన బీసీ కులాల చర్చా కార్యక్రమంలో ఆయ న మాట్లాడారు. బీసీలు, బీసీ ఉపకులాల భవిష్యత్తు ఇప్పటికీ అగమ్యగోచరంగానే ఉందని ఆందోళన వ్యక్తంచేశారు. దేశంలో బహుజనులకు విముక్తి కలి్పంచే పార్టీ బీఎస్పీ అని, బీసీలంతా ఐక్యంగా ఉద్యమించి రాజ్యాధికారం దిశగా అడుగులు వేయాలని పిలుపునిచ్చారు. ఇప్పటికీ బీసీ గణనకు భారత ప్రభుత్వం ఒప్పుకోవట్లేదని, 2014లో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సకల జనుల వివరాలు ఎందుకు తెలపడం లేదని ప్రశ్నించారు. తెలంగాణ భవన్ పేరును బహుజన భవన్‌గా మార్చాలన్నారు. ఈ సందర్భంగా పలువురు బీఎస్పీలో చేరారు. బీఎస్పీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు సిద్ధార్థ పూలే, నాయకులు రాజారావు, ప్రముఖ విద్యావేత్త వెంకటేశ్వర్లు, రాష్ట్ర కార్యదర్శి రాజు తదితరులు పాల్గొన్నారు. -
ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్‌కు కరోనా
గాంధీ ఆస్పత్రి: బీఎస్పీ రాష్ట్ర సమన్వయకర్త, మాజీ ఐపీఎస్ అధికారి, ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ కరోనా బారిన పడ్డారు. గత రెండు రోజులుగా నీరసంగా ఉన్న ఆయన మంగళవారం కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయించుకోగా పాజిటివ్‌గా తేలింది. దీంతో తక్షణమే సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో చేరారు. ఆయనకు వైద్యపరీక్షలు నిర్వహించిన వైద్యులు హోంఐసోలేషన్లో ఉండాలని సూచించారు. తనకు కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని, స్వల్ప లక్షణాలు ఉన్నాయని, వైద్యుల సూచన మేరకు హోంఐసోలేషన్లో ఉంటున్నానని ప్రవీణ్‌కుమార్ తెలిపారు. కార్యకర్తలు, అభిమానులు ఆందోళన చెందాల్సిన పనిలేదని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. నల్లగొండలోనే సోకిందా... ఐపీఎస్‌కు రాజీనామా చేసిన ప్రవీణ్‌కుమార్ గత పదిరోజులుగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించారు. ఈనెల 8న నల్లగొండలో జరిగిన రాజ్యాధికార సంకల్ప సభలో పాల్గొని బీఎస్పీలో చేరారు. ఈ సభకు హాజరైన ఆయనతో పెద్దసంఖ్యలో నాయకులు, కార్యకర్తలు, అభిమానులు సన్నిహితంగా మెలిగారు. నల్లగొండ సభ పూర్తయిన తర్వాతే ప్రవీణ్‌కుమార్ ఆరోగ్యంలో స్వల్ప మార్పులు కనిపించాయి. దీంతో నల్లగొండ సభలోనే ప్రవీణ్‌కుమార్‌కు కరోనా సోకినట్లు భావిస్తున్నారు. -
బీఎస్పీలో చేరిన ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్
-
ఏనుగెక్కి ప్రగతి భవన్ పోవాలె..
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: ‘మనం ఏనుగు ఎక్కి ప్రగతి భవన్‌కు పోవాలి. ఎర్రకోటపై మన నీలి జెండా (బీఎస్పీ జెండా)ను ఎగురవేయాలి’ అని మాజీ ఐపీఎస్ అధికారి, బీఎస్పీ రాష్ట్ర కో–ఆర్డినేటర్ ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ పిలుపునిచ్చారు. బహుజనులకు రాజ్యాధికారం ఎంతో దూరంలో లేదని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దళితబంధు పథకానికి ఖర్చు చేయనున్న రూ. 1,000 కోట్లు ఎవరి పైసలని ప్రశ్నించారు. దళితులపై సీఎంకు నిజమైన ప్రేమే ఉంటే ఆయన సొంత ఆస్తులు అమ్మి ఖర్చు పెట్టాలని డిమాండ్ చేశారు. ఆదివారం నల్లగొండలోని ఎన్.జి. కాలేజీ మైదానంలో నిర్వహించిన రాజ్యాధికార సంకల్ప సభలో బీఎస్పీ నేషనల్ కోఆర్డినేటర్ రామ్‌జీ గౌతమ్ సమక్షంలో ప్రవీణ్‌కుమార్ బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ)లో చేరారు. ఆయనకు రాంజీ గౌతమ్ బీఎస్పీ కండువా కప్పి పార్టీ సభ్యత్వం అందించారు. అలాగే ఆయన్ను బీఎస్పీ రాష్ట్ర కో–ఆర్డినేటర్‌గా ప్రకటించారు. సభకు తరలివచ్చిన అశేష జనవాహినిని ఉద్దేశించి ఈ సందర్భంగా ప్రవీణ్‌కుమార్ సుదీర్ఘంగా ప్రసంగించారు. తన రాజకీయ ప్రాధాన్యతలు, ఆకాంక్షలను వివరిస్తూనే రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే... ఆదివారం నల్లగొండలో జరిగిన రాజ్యాధికార సంకల్ప సభకు హాజరైన అశేష జనవాహిని మీ కోసమే రాజకీయాల్లోకి వచ్చా... ‘ఈ సభను చూస్తుంటే దొరల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. మీ ఉత్సాహం చూస్తుంటే ప్రగతి భవన్ చాలా దగ్గరలో ఉన్నట్లుగా కనిపిస్తోంది. బహుజనులు బానిసలు కాదు.. పాలకులుగా మార్చాలన్న బాధ్యతను నాపై పెట్టారు. మీ అందరి కోసమే ఆరున్నర ఏళ్ల సర్వీసు ఉన్నా రాజీనామా చేసి వచ్చా. లక్షల మంది బహుజనుల బతుకులు మార్చాలంటే త్యాగం చేయాల్సిన అవసరం ఉందని అమ్మకు చెప్పా. రెక్కాడితే కానీ డొక్కాడని, ఆకలైతే అన్నం దొరకని కుటుంబాలు ఉన్నాయి. వారందరికీ న్యాయం చేయాలి.. వారి గొంతుకను కావాలని చెప్పి వచ్చా. కొట్లాడి, 1,300 మంది ప్రాణత్యాగం చేసి తెచ్చుకున్న తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద పాదాభివందనం చేశా. మేం కష్టపడి త్యాగాలు చేస్తే అధికారం మరొకరు చెలాయిస్తున్నారు. పంతం నెగ్గే వరకు వదలొద్దని అమరులు నాకు చెప్పి పంపించారు. గొప్పగా బహుజన రాజ్యం... జనాభా ప్రాతిపదికన అధికారంలో వాటా ఇవ్వాలి. ఇవ్వకపోతే గుంజుకుంటాం. మీరు గ్రామాలకు వెళ్లి మన బహుజన రాజ్యం ఎంత గొప్పగా ఉండబోతోందో మన వారికి చెప్పండి. బహుజన రాజ్యంలో అన్ని కులాల వారికీ సమాన అధికారం ఉంటుంది. లక్షల మంది అమెరికాకు వెళతారు. ప్రతి మండలంలో ఒక ఇంటర్నేషనల్ స్కూల్ ఉంటుంది. కల్లుగీత కార్మికుల బిడ్డలు కంప్యూటర్ ఇంజనీర్లుగా ఉంటారు. మైనారిటీలు మిలియనీర్లు అవుతారు. మాల మాదిగలు డాలర్లు సంపాదిస్తారు. బంజారా బిడ్డలు బంగళాలు కొంటరు. గిరిజన బిడ్డలు విదేశాలకు వెళతారు. రాళ్లు గొట్టిన వారు రాకెట్ ప్రయోగిస్తారు. చిందు కళాకారుల బిడ్డలు సినిమా రంగంలోకి వెళ్తారు. మన పిల్లలు కంపెనీలు పెట్టి సంపదను సృష్టించి, ఉద్యోగాలు ఇచ్చేలా చేస్తాం. ప్రైవేటు రంగంలో కూడా రిజర్వేషన్లు రావాలి. అవి సాధించే వరకు నిద్రపోను. బహుజన రాజ్యం మీరంతా తలచుకుంటే వస్తుంది. తరతరాలుగా మనల్ని దోపిడీ చేసి సంపాదించిన ఆధిపత్య కులాల వారు రకరకాల పథకాలు, కుట్రల ద్వారా ఆ సొమ్మును మనపై చల్లుతారు. ఓటును అమ్ముకోవద్దు. నల్లగొండ సభ రాష్ట్ర రాజకీయాలనే కాదు దేశ రాజకీయాలను మార్పు చేసే అవకాశం ఉంది. మీ ఆస్తులమ్మి ‘దళితబంధు’ ఇవ్వండి సీఎం కేసీఆర్ ‘దళితబంధు’కు రూ. 1,000 కోట్లు ఖర్చు పెడుతున్నారు. అవి ఎవరి పైసలు? బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు కష్టపడిన సొమ్ము కాదా? వాటిని మీరు విచ్చలవిడిగా ఖర్చు పెడుతున్నారు. మాపై నిజమైన ప్రేమే ఉంటే మీ ఆస్తులు అమ్మి మాకు పెట్టండి. మా భవిష్యత్ మేమే నిర్ణయించుకునేలా చేయండి. 1,000 గురుకులాలు పెడితే మారిపోతుందా? అందులో చదివేది 4 లక్షల మందే. ఈ కొద్దిమంది చదివితే బంగారు తెలంగాణ అన్నట్టా? రాష్ట్రంలో వేల సంఖ్యలో పాఠశాలల ఉన్నాయి. సీఎం ఎన్నిసార్లు రివ్యూ చేశారు. వారికి ఏం ఒరిగింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ పిల్లలు 61.70 లక్షల మంది స్కూళ్లలో చదువుకుంటున్నారు. వాటిల్లోకి సీఎం ఎందుకు పోవడం లేదు? ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీలు, యూనివర్సిటీల్లో వసతుల్లేవు. నియామకాలు లేవు. బడ్జెట్ ప్రకటనే కానీ నిధుల విడుదల ఏదీ? పేదల బిడ్డలు చదివే విశ్వవిద్యాలయాలను పట్టించుకోకుండా ప్రైవేటు యూనివర్సిటీలు ఇచ్చారు. మాటల గారడీతో ప్రజలు ఏడున్నర ఏళ్లుగా మోసపోతున్నారు. ఇలాంటి వాటికి చరమగీతం పాడే రోజులు దగ్గర పడ్డాయి. అది నల్లగొండ నుంచే మొదలైంది. మీరే అపరజ్ఞానులా? సంపద 5 శాతం మంది చేతిలో ఉంటే 95 శాతం మంది పేదలే. 46 మందికి భారతరత్న వస్తే ఒక్కరే ఓబీసీ ఉన్నారు. దళితులు, బహుజనులు లేరు. 52 శాతం మంది ఓబీసీల్లో అర్హులే లేరా. మాకు చేతగాదా.. మీరే అపరజ్ఞానులా. 60 వేల బుక్కులు చదివారా? 11 మంది సీఎంలు అయ్యారు. అందులో పది మంది ఆధిపత్య కులాల వారే. నేను ఏ కులానికి వ్యతిరేకం కాదు. -
బీఎస్పీలో చేరిన ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్
సాక్షి, నల్లగొండ: మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ఆదివారం బహుజన్ సమాజ్ వాదీ పార్టీలో చేరారు. బీఎస్పీ నేషనల్ కోఆర్డినేటర్ రాంజీ గౌతమ్ సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. బీఎస్పీలో చేరిన ప్రవీణ్‌కుమార్ తెలంగాణ రాష్ట్ర కోఆర్డినేటర్‌గా నియమించబడ్డారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దళితుల బతుకులు బాగు పడాలంటే విద్య, ఉపాధి కావాలని తెలిపారు. తాను రాజీనామా చేసిన రోజే కేసుపెట్టారని చెప్పారు. ఎన్ని కుట్రలు చేసిన జన సునామీని ఎవరూ ఆపలేరని పేర్కొన్నారు. బహుజన సమాజంలో బానిసలం కామని, పాలకులమని ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ అన్నారు. దళిత బంధు కోసం రూ.1000 కోట్లు ఖర్చు పెడుతున్నామని అంటున్నారు.. ఆ డబ్బులు ఎవరివని సీఎం కేసీఆర్‌ని ప్రశ్నించారు. దళితులపై ప్రేమ ఉంటే కేసీఆర్ తన ఆస్తులు అమ్మి దళితబంధు అమలు చేయాలన్నారు. తెలంగాణలో ఇప్పటివరకు సీఎం కేసీఆర్ ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారని ప్రశ్నించారు. ఇన్నేళ్లలో తెలంగాణలో ఎన్ని ఆస్పత్రులు కట్టారు? ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు ఎందుకు ఉండకూడదు? అని నిలదీశారు. ఇప్పటివరకు సంపద మొత్తం 5 శాతం వర్గాల వద్దే ఉందని మండిపడ్డారు. -
నేడు బీఎస్పీలో చేరనున్న ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్
నల్లగొండ: బహుజన సమాజ్‌పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం నల్లగొండలో బహిరంగ సభ జరగనుంది. అందుకు జిల్లా పార్టీ భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తోంది. తెలుగు రాష్ట్రాలతోపాటు ఇతర ప్రాంతాలనుంచి బహుజన సమాజ్‌పార్టీ కార్యకర్తలు, స్వేరోలు, ప్రవీణ్‌కుమార్ అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొనే అవకాశం ఉంది. నల్లగొండలోని ఎన్జీ కాలేజీ మైదానంలో సాయంత్రం 4గంటలకు సభ నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు. సభాస్థలిలో కూడా ప్రవీణ్‌కుమార్, ముఖ్య అతిథులతో కూడిన ఫొటోలతో భారీ కట్అవుట్లను ఏర్పాటు చేస్తున్నారు. రాజకీయ పార్టీలకు భిన్నంగా కార్యకర్తలు కూర్చునే విధంగా కుర్చీలను ఏర్పాటు చేస్తున్నారు. బహుజన సమాజ్‌పార్టీ జిల్లా ఇన్చార్జ్, ఆర్ఎస్పీ రాజకీయ సంకల్ప సభకు కన్వీనర్ పూదరి సైదులు ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేస్తున్నారు. బహిరంగ సభకు ముఖ్య అతిథిగా బీఎస్పీ నేషనల్ కోఆర్డినేటర్, రాజ్యసభ సభ్యుడు రాంజీగౌతమ్ హాజరవుతున్నారు. అదేవిధంగా రాష్ట్ర , తెలంగాణ జిల్లాల ఇన్‌చార్జ్‌లు, జిల్లాకు చెందిన బీఎస్పీ నేతలు కూడా హాజరుకానున్నారు. బీఎస్పీలో చేరనున్న ప్రవీణ్‌కుమార్... నల్లగొండలో జరిగే బహిరంగ సభలో ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ బీఎస్పీలో అధికారికంగా చేరుతున్నారు. ప్రస్తుతం ఆయన గురుకుల కార్యదర్శి పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. సొంతంగా పార్టీ పెడతరా లేదా ఇతర అధికార పార్టీలో చేరుతారన్న వదంతులు వచ్చాయి. కానీ, ఆయన బీఎస్పీలో చేరుతున్నట్లు ప్రకటించారు. అందులో భాగంగానే ఆదివారం నల్లగొండలో జరిగే బహిరంగ సభలో బీఎస్పీలో చేరి రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించనున్నారు. 4 గంటలకు బహిరంగ సభ బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం 4గంటలకు ఎన్‌జీకళాశాల మైదానంలో బహిరంగ సభ జరుగునుంది. పోలీసులు కూడా సభాస్థలితో పాటు పార్కింగ్ తదితర వాటిని ఏర్పాట్లు చేశారు. అయితే బహిరంగ సభ రోజు ఉదయం డాన్‌బోస్కో నుంచి నల్లగొండ టౌన్లోకి 1000 మందితో ఫిట్ ఇండియా 5కే రన్ నిర్వహించనున్నారు. ఇదంతా స్వేరోల ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. మధ్యాహ్నం మర్నిగూడ బైపాస్ నుంచి ర్యాలీ మధ్యాహ్నం 2:30 గంటలకు నల్లగొండ పట్టణ సమీపంలోని అద్దెంకి బైపాస్ వద్ద ముఖ్య అతిథులకు కార్యకర్తలంతా స్వాగతం పలుకుతారు. అక్కడి నుంచి డప్పు కళాకారులు , కోలాట కళాకారులతో ర్యాలీ ప్రారంభం కానుంది. రెండు గంటలపాటు ర్యాలీ నిర్వహించనున్నారు. తర్వాత 4గంటలకు ఎన్జీ కాలేజీ సభ స్థలి చేరుకుంటారు. కార్యకర్తలు స్వచ్ఛందంగా.. బహిరంగ సభకు ఎలాంటి వాహనాలు ఏర్పాటు చేయడం లేదు. ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ అభిమానులు, స్వేరో కార్యకర్తలంతా స్వచ్ఛందంగానే సభకు హాజరవుతారని జిల్లా ఇన్చార్జి సైదులు తెలిపారు. కరోనా నిబంధనలు పాటిస్తూ సభను నిర్వహించబోతున్నాం. శానిటైజర్ , మాస్కులు తప్పనిసరి , సమావేశం పూర్తయిన తర్వాత కూడా రాజకీయ పార్టీలకు అతీతంగా సభ జరగనుంది. -
బీఎస్పీలోకి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్!?
సాక్షి, హైదరాబాద్: ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ బహుజన సమాజ్‌పార్టీ (బీఎస్పీ)లో చేరతారన్న చర్చ ఊపందుకుంటోంది. స్థానిక మీడియాతోపాటు జాతీయ చానళ్లలోనూ ఈ వార్త ప్రముఖంగా వినిపిస్తోంది. బీఎస్పీ జాతీయస్థాయి నేతలతో ఆయన సంప్రదింపులు జరిపారని, అందులో చేరికకు రంగం సిద్ధం చేసుకుంటున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు మంగళవారం పలువురు స్వేరో ప్రతినిధుల పేరిట సోషల్‌మీడియాలో సందేశాలు వైరల్‌గా మారాయి. ఆగస్టు 8న నల్లగొండ జిల్లాలోని ఎన్జీ కాలేజ్ మైదానంలో ఐదు లక్షలమందితో భారీ బహిరంగసభ ఏర్పాటుచేసి, ప్రవీణ్ బీఎస్పీలో చేరతారన్నది వీటి సారాంశం. మరోవైపు తెలంగాణలోని ఉమ్మడి జిల్లాల వారీగా ప్రవీణ్‌కుమార్ వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. బీఎస్పీలో చేరాలా? లేదా స్వతంత్ర వేదిక ఏర్పాటు చేయాలా? అనే దానిపై సమాలోచనలు సాగిస్తున్నారు. ప్రవీణ్‌కుమార్ ఏ నిర్ణయం తీసుకున్నా వెంట నిలుస్తామని స్వేరో, పలు ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు అంటున్నాయి. పీడిత వర్గాలకు ఏకవచన సంబోధనా: ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ అగ్రవర్ణాల నాయకులను గారు అని సంబోధించి, పీడితవర్గాల నాయకులను ఏకవచనంతో సంబోధించారంటూ ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇటీవల ప్రగతిభవన్‌లో జరిగిన దళిత సాధికారికత సమావేశంలో వేదికపైకి హుజూరాబాద్ నాయకులకు స్వాగతం పలుకుతూ కౌశిక్‌రెడ్డి వ్యవహరించిన తీరుపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేస్తూ మంగళవారం ట్వీట్‌చేశారు. ఇలాంటి దురహంకార భావజాలం వల్లనే జనాలు బహుజన రాజ్యం రావాలంటున్నారని పేర్కొన్నారు. దీనిపై కౌశిక్‌రెడ్డి కూడా ట్వీట్చేస్తూ.. ఎడిట్ చేసిన వీడియోను చూసి విమర్శలు చేయడం మీ స్థాయికి తగదని బదులిచ్చారు. త్వరలోనే రాజకీయ కార్యాచరణ భానుపురి(సూర్యాపేట): ఉమ్మడి నల్లగొండ జిల్లాలో త్వరలో బహిరంగసభ నిర్వహించి భవిష్యత్ రాజకీయ కార్యాచరణ ప్రకటిస్తానని గురుకుల పాఠశాలల మాజీ కార్యదర్శి, రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ వెల్లడించారు. మంగళవారం సూర్యాపేటలో నిర్వహించిన బహుజన ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల ఆత్మీయ సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. తన వద్ద డబ్బుల్లేవని, తన రాజకీయ కార్యాచరణకు ప్రతి ఒక్కరూ చందాలు వేసుకుని ముందుకు రావాలన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అంబేద్కర్ చిత్రపటానికి నివాళులర్పించి గౌరవిస్తున్నారని, కానీ, ఎస్సీ ఉద్యోగుల ప్రమోషన్లు ఆపి అగౌరవ పర్చుతున్నారన్నారు. -
ఉగ్రవాద కుట్ర నిజమైతే.. రాజకీయాలు చేయొద్దు: మాయావతి
లక్నో: ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో ఆత్మాహుతి దాడులు జరిపేందుకు కుట్ర పన్నిన ఆల్ కాయిదా ఉగ్రవాదులు ఇద్దరిని యాంటీ టెర్రరిజం స్వ్కాడ్(ఏటీఎస్) ఆదివారం అదుపులోకి తీసుకుంది. ఈ ఘటనపై బహుజన్ సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షురాలు మాయావతి సోమవారం స్పందిస్తూ.. లక్నోలో ఉగ్రవాదుల కుట్ర జరిగిందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్న విషయం నిజమైతే తీవ్రంగా పరిగణించాలని తెలిపారు. అదే విధంగా ఈ విషయంలో ఎటువంటి రాజకీయలు చేయవద్దని పేర్కొన్నారు. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగన్న నేపథ్యంలో ఇటువంటి ఘటనలు అనుమానాలకు తావిస్తాయని అన్నారు. ఒకవేళ నిజంగానే ఆ ఇద్దరిని ఉగ్రవాద కుట్రలో భాగంనే అదుపులోకి తీసుకుంటే.. ఇన్ని రోజులుగా పోలీసులు ఏం చేశారని సూటిగా ప్రశ్నించారు. ఇదే ప్రశ్న ప్రజలు కూడా అడుగుతారని, ప్రజల్లో అశాంతిని పెంచే చర్యలను ప్రభుత్వం తీసుకోకూడదని మాయావతి ట్విటర్లో పేర్కొన్నారు. యూపీ పోలీసులపై నమ్మకం లేదు: అఖిలేశ్ యాదవ్ ఉగ్రవాదులను అదుపులోకి తీసుకున్న వ్యవహారంపై సమాజ్‌వాదీ పార్టీ నేత అఖిలేశ్ యాదవ్ స్పందిస్తూ.. రాష్ట్రంలో వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇద్దరిని అదుపులోకి తీసుకోవటం వెనుక రాజకీయ కోణం ఉన్నట్లు అనుమానం వ్యక్తమవుతుందన్నారు. తనకు యూపీ పోలీసులు, రాష్ట్ర బీజేపీ ప్రభుత్వంపై అస్సలు నమ్మకం లేదని ఆయన పేర్కొన్నారు. అదుపులోకి తీసుకున్న నిందితులను లక్నోకు చెందిన మిన్హాజ్ అహ్మద్, మసీరుద్దీన్లుగా గుర్తించినట్లు సీనియర్ పోలీసు అధికారి వెల్లడించారు. జనాలతో రద్దీగా ఉండే ప్రాంతాల్లో ఆత్మాహుతి దాడికి పాల్పడేందుకు వారు ప్రణాళిక రచించారని పేర్కొన్నారు. -
ఎన్నికల వేళ: మాయావతికి ఎదురుదెబ్బ
సాక్షి, లక్నో: ఉత్తరప్రదేశ్‌లో అపుడు ఎన్నికల వేడి రాజుకుంటోంది. వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీఎన్నికలకుముందు బీఎస్పీ అధినేత మాయావతికి భారీ ఎదురు దెబ్బ తగల నుందా? పార్టీకి చెందిన తొమ్మిదిమంది ఎమ్మెల్యేలు పార్టీనుంచి జంప్ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ రెబల్ ఎమ్మెల్యేలంతా ఉత్తరప్రదేశ్ మాజీ మంత్రి, సమాజ్ వాద్ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్‌తో లక్నోలో భేటీ పలు ఊహాగానాలకు తెర తీసింది. ఎమ్మెల్యేలు హకీమ్ లాల్ బింద్ (హండియా), వందన సింగ్ (సాగ్రి), రామ్‌వీర్ ఉపాధ్యాయ (సదాబాద్), అనిల్ కుమార్ సింగ్ (పూర్వా), అస్లాం రైనీ (భింగా), అస్లాం అలీ (ధోలానా), ముజ్తాబా సిద్దిఖీ (ప్రతాపూర్), హర్గోవింద్ భార్గవ సిధౌలి) సుష్మా పటేల్ (ముంగ్రా బాద్షాపూర్) అఖిలేష్‌లను కలిశారు. లక్నోలోని పార్టీ కార్యాలయంలో మంగళవారం ఈ భేటీ జరిగింది. త్వరలోనే వీరంతా సమాజ్ వాదీ పార్టీకి మారవచ్చనే వాదనలు ఊపందుకున్నాయి. కాగా 2017 యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీ19 సీట్లు గెలుచుకుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి-మార్చిలో ఉత్తరప్రదేశ్ ఎన్నికలకు సిద్దమవుతోంది. గత ఏడాది రాజ్యసభ ఎన్నికల సందర్భంగా ఏడుగురు, లాల్జీ వర్మ, రామ్ అచల్ సహా మొత్తం 11మంది ఎమ్మెల్యేలను మాయావతి బహిష్కరించిన సంగతి తెలిసిందే. 2019లో ఒక ఎమ్మెల్యే రాజీనామా చేశారు. దీంతో ఇపుడు 7 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. చదవండి: ట్విటర్‌కు మరోసారి నోటీసులు -
నామినేషన్‌ను ఉపసంహరించుకుని బీజేపీలోకి..
కాసరగోడ్: కేరళలోని కాసరగోడ్ జిల్లా మంజేశ్వరం నియోజకవర్గం నుంచి బీఎస్పీ తరఫున పోటీకి దిగిన కె. సుందర తన నామినేషన్‌ను ఉపసంహరించుకుని బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ నియోజకవర్గంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.సురేంద్రన్ పోటీ చేస్తున్నారు. సోమవారం సుందర మీడియాతో మాట్లాడుతూ.. తన నామినేషన్‌ను ఉపసంహరించుకున్నాననీ, ఇకపై బీజేపీ అభ్యర్థి సురేంద్రన్ విజయం కోసం అలుపెరగకుండా పని చేస్తానని ప్రకటించారు. అయితే, సుందరను బీజేపీ బెదిరించి నామినేషన్ ఉపసంహరించుకునేలా చేసిందంటూ ఊహానాలు వెలువడ్డాయి. కె.సుందర, కె. సురేంద్రన్ పేర్లు ఒకేలా ఉండటంతో 2016 ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉన్న సుందరకు 467 ఓట్లు పడ్డాయి. ఆ ఎన్నికల్లో ఐయూఎంఎల్ అభ్యర్థి అబ్దుల్ రజాక్ చేతిలో కె.సురేంద్రన్ కేవలం 89 ఓట్లతో ఓటమి చవిచూశారు. అబ్దుల్ రజాక్‌కు బోగస్ ఓట్లు పడ్డాయంటూ సురేంద్రన్ కోర్టుకు కూడా వెళ్లారు. అయితే, రజాక్ 2018లో చనిపోవడంతో ఆయన ఆ కేసును ఉపసంహరిం చుకున్నారు. బీజేపీ కేరళ రాష్ట్ర అధ్యక్షుడు కె. సురేంద్రన్ -
బీఎస్పీ సీటు దక్కలేదన్న మనస్తాపంతో..
లక్నో : బహుజన్ సమాజ్ వాదీ పార్టీ(బీఎస్పీ) సీటు దక్క లేదన్న మనస్తాపంతో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాపూర్లో శుక్రవారం వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఘజియాపూర్‌కు చెందిన మున్ను ప్రసాద్ అనే వర్తకుడు గత కొన్ని సంవత్సరాలుగా బీఎస్పీలో పని చేస్తున్నాడు. 2022లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో సీటు కోసం తీవ్రంగా ప్రయత్నించాడు. అయితే పార్టీ అధ్యక్షురాలు మాయావతి అతడి వద్దనుంచి 2 కోట్ల రూపాయలు డిమాండ్ చేసిందని ఆరోపిస్తూ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ( ఉగ్ర ఘాతుకం: బీజేపీ నేతల కాల్చివేత ) ఆమె అడిగిన మొత్తం ఇవ్వలేని స్థితిలో ఉన్న తనకు ఆత్మహత్యే శరణ్యమని సూసైడ్ నోట్లో పేర్కొన్నాడు. దీనిపై బీఎస్పీ కోఆర్డినేటర్ గుడ్డు రామ్ మాట్లాడుతూ.. మున్ను ప్రసాద్‌కు పార్టీతో సంబంధం లేదని, సూసైడ్ నోట్ పార్టీ పేరును దిగజార్చేలా ఉందని అన్నారు. అయితే మున్ను బీఎస్పీకి సంబంధించిన అన్ని కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవాడని, తనకు మాయావతి కచ్చితంగా సీటు ఇస్తుందనే వాడని స్థానికులు చెబుతున్నారు. -
బీఎస్పీకి ఆరుగురు ఎమ్మెల్యేలు గుడ్‌బై!
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో రాజ్యసభ ఎన్నికలు ప్రతిపక్ష బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ)లో మంటలు రాజేస్తున్నాయి. ఆరుగురు ఎమ్మెల్యేలు ఆ పార్టీపై తిరుగుబాటు ప్రారంభించారు. సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ)లో చేరబోతున్నామంటూ సంకేతాలిచ్చారు. యూపీలో 10 రాజ్యసభ స్థానాలకు నవంబర్ 9న ఎన్నికలు జరగనున్నాయి. అసెంబ్లీలో తన బలం దృష్ట్యా బీఎస్పీ తన అభ్యర్థిగా రామ్‌జీ గౌతమ్‌ను రంగంలోకి దింపింది. ఆయన పేరును 10 మంది బీఎస్పీ ఎమ్మెల్యేలు ప్రతిపాదించారు. ఈ మేరకు నామినేషన్ పత్రాలపై సంతకాలు చేశారు. అయితే తమ సంతకాలను ఫోర్జరీ చేశారని, రాజ్యసభ ఎన్నికల్లో బీఎస్పీ అభ్యర్థికి తాము మద్దతు ఇవ్వబోమని ఆరుగురు ఎమ్మెల్యేలు బుధవారం తేల్చిచెప్పారు. పార్టీ అధినేత మాయావతిపై తమకు ఎలాంటి అసంతృప్తి లేదని వారు స్పష్టం చేశారు. రాజ్యసభ ఎన్నికల్లో ప్రకాశ్ బజాజ్ అనే పారిశ్రామికవేత్త స్వతంత్ర అభ్యర్థిగా చివరి నిమిషంలో పోటీకి దిగారని, ఆయనను గెలిపించేందుకు తమ పార్టీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలను కొనేశారని బీఎస్పీ సీనియర్ నేత, ఎమ్మెల్యే ఉమాశంకర్ సింగ్ ఆరోపించారు. -
ప్రభుత్వంతో చర్చించి నిర్ణయం తీసుకోవాలి: సీపీఎం
సాక్షి, అమరావతి: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో ఎన్నికల కమిషన్, ప్రభుత్వంతో సంప్రదించి నిర్ణయం తీసుకోవాలని సీపీఎం పార్టీ పేర్కొంది. వివాదాలకు తావులేకుండా వ్యవహరించాలని ఈసీకి విజ్ఞప్తి చేసింది. ప్రభుత్వంతో సంప్రదించి స్థానిక ఎన్నికలపై నిర్ణయం తీసుకోవాలన్న సుప్రీంకోర్టు వ్యాఖ్యలను ఈ సందర్భంగా ప్రస్తావించింది. కరోనా పేరిట వాయిదా వేయడంతో మధ్యలో నిలిచిపోయిన స్థానిక ఎన్నికలను తిరిగి నిర్వహించే అంశంపై అభిప్రాయాలను తెలుసుకునేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ బుధవారం వివిధ రాజకీయ పార్టీల నేతలతో భేటీ అవుతున్న విషయం తెలిసిందే. (చదవండి: రాష్ట్ర ఎన్నికల కమిషన్ తీరుపై విస్మయం) ఈ నేపథ్యంలో.. సీపీఎం తన అభిప్రాయాలను వెల్లడిస్తూ..‘‘గతంలో కరోనా ఉందని ఎన్నికలు వాయిదా వేశారు. ఇప్పుడు అంతకంటే ఎక్కువ కేసులు ఉన్నాయి. అన్ని జిల్లాల్లోనూ కంటైన్మెంట్ జోన్లు ఉన్నాయి. వరదలు వచ్చాయి. వ్యవసాయ పనులు జరుగుతున్నాయి. స్కూళ్లు కూడా ప్రారంభం కానున్నాయి. ఇటువంటి సమయంలో ఈసీ ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి’’ అని పేర్కొంది. (చదవండి: స్థానిక ఎన్నికల నిర్వహణపై నేడు అభిప్రాయ సేకరణ) ఇక సీపీఐ నేత రామకృష్ణ మాట్లాడుతూ.. కరోనా కేసుల నేపథ్యంలో వైద్య ఆరోగ్యశాఖ అభిప్రాయాన్ని.. ఈసీ పరిగణనలోకి తీసుకోవాలన్నారు. ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వంతో ఈసీ చర్చించాలని అభిప్రాయపడ్డారు. కాగా గత ఎన్నికలను రద్దు చేయాలని, తాజాగా ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయాలని బీజేపీ పేర్కొంది. ఇక బీఎస్పీ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. గత నోటిఫికేషన్ రద్దు చేయాలని ఈసీకి తెలిపామని, వెంటనే ఎన్నికలను నిర్వహించాలని కోరినట్లు వెల్లడించింది. కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత ఎన్నికలు నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ సూచించింది. గతంలో కోవిడ్ నేపథ్యంలో ఎన్నికలు వాయిదా వేశారని.. ఇప్పుడు కరోనా ప్రభావం ఉందా, లేదా అనేది ఈసీ చెప్పాలని ప్రశ్నించింది. ఇప్పటికిప్పుడు రాష్ట్రంలో ఎన్నికలు జరిగే పరిస్థితి లేదని కాంగ్రెస్ పార్టీ నేతలు స్పష్టం చేశారు. ఈసీ సమావేశం ఆశ్చర్యకరంగా ఉంది వ్యక్తిగతంగా, ఓ పార్టీ వ్యక్తిగా ఈసీ సమావేశం ఆశ్చర్యాన్ని కలిగించిందని మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. అప్పటికి.. ఇప్పటికి పరిస్థితి ఏం మారిందని ఈసీ సమావేశం పెట్టారని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం అభిప్రాయాలను తీసుకోవాలని సుప్రీంకోర్టు చెప్పినా, ఈసీ పట్టించుకోవడం లేదని విమర్శించారు. ‘‘ప్రభుత్వాన్ని సంప్రదించకుండా ఎన్నికలకు ఎలా సిద్ధమవుతారు.. నిమ్మగడ్డ ప్రభుత్వాన్ని శత్రువుగా చూస్తున్నారా.. అసలు ఈ సమావేశం వెనుక ఉన్న రహస్య అజెండా ఏంటి’’ అని ప్రశ్నించారు. ఓ ప్రైవేటు హోటల్లో నిమ్మగడ్డ జరిపిన మంతనాలు ప్రజలంతా చూశారన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్ని వర్గాలకు పూర్తిగా న్యాయం చేస్తున్నారని, ఎన్నికలు ఎప్పుడు జరిగినా తాము విజయం సాధిస్తామని మంత్రి ధీమా వ్యక్తం చేశారు. -
కెమెరాకు అడ్డంగా దొరికిపోయారు..
జైపూర్: న్యాయస్థానాల్లో ఎంతో మర్యాదగా మెలగాలి. ఎంత పెద్ద నాయకుడైనా, సెలబ్రిటీ అయినా సరే కోర్టు వ్యవహారాల్లో చాలా జాగ్రత్తగా ఉంటారు. అసలు కోర్టు హాల్లో సెల్‌ఫోన్ కూడా మోగకూడదు. అంత క్రమశిక్షణగా ఉండాలి. ఇక లాయర్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ప్రస్తుతం ఓ సీనియర్ న్యాయవాది ప్రవర్తన పట్ల దేశవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమవుతోంది. కారణం ఏంటంటే ఓ కేసు విచారణ జరుగుతుండగా.. సదరు లాయర్ తాపీగా హుక్కా పీల్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరలవ్వడంతో అతడి మీద ఆగ్రహం వ్యక్తం అవుతోంది. ఆ వివరాలు.. రాజస్తాన్ రాజకీయాలకు సంబంధించిన ఓ ముఖ్యమైన కేసును ఆ రాష్ట్ర హైకోర్టు గురువారం ఆన్లైన్లో విచారణ జరిపింది. ఈ సమయంలో సీనియర్ న్యాయవాది రాజీవ్ ధావన్ హుక్కా(సిగరెట్ లాంటి) సేవించారు. ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. రాజస్తాన్‌లో బీఎస్పీ పార్టీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి మద్దతిస్తున్న విషయం తెలిసిందే. దీన్ని సవాలు చేస్తూ కోర్టులో కేసు దాఖలైంది. ఈ రోజు కోర్టు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ జరిపింది. ఈ సమయంలో సీనియర్ న్యాయవాది రాజీవ్ ధావన్ హుక్కా పీలుస్తూ కనిపించారు. కాగితాలు అడ్డం పెట్టుకుని మరి ఈ పని హుక్కా పీల్చారు. విచారణలో కాంగ్రెస్ పార్టీ తరఫున కపిల్ సిబాల్ వాదించారు. కాగా అశోక్ గహ్లోత్ సారథ్యంలోని రాజస్తాన్ సర్కార్‌పై యువనేత సచిన్ పైలట్ తిరుగుబాటు చేసిన విషయం తెలిసిందే. అయితే హైకమాండ్‌తో చర్చల అనంతరం ఆయన తిరిగి సొంతగూటికి చేరారు. చదవండి: పైలట్ తొందరపడ్డారా!? There is no smoke without fire: #Rajasthan High Court hearing on disqualification of the 6 BSP MLAs who later merged with #Congress. That's Sr Adv Rajeev Dhavan, using a hookah. He is also the lawyer for adv Prashant Bhushan in the latter's contempt case. pic.twitter.com/iF0FmeUuaV — Utkarsh Anand (@utkarsh_aanand) August 12, 2020 -
గహ్లోత్ సర్కార్‌కు ఊరట
జైపూర్ : రాజస్తాన్‌లో రాజకీయ హైడ్రామా కొనసాగుతోంది. పాలక కాంగ్రెస్‌లో ఆరుగురు బీఎస్పీ ఎమ్మెల్యేల విలీన ప్రక్రియను నిలిపివేయాలని బీఎస్పీ దాఖలు చేసిన పిటిషన్‌ను రాజస్తాన్ హైకోర్టు కొట్టివేయడంతో అశోక్ గహ్లోత్ సారథ్యంలోని కాంగ్రెస్ సర్కార్‌కు ఊరట లభించింది. సచిన్ పైలట్ సహా 19 మంది రెబెల్ ఎమ్మెల్యేల తిరుగుబాటుతో అసెంబ్లీలో మెజారిటీ నిరూపించుకునేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్న గహ్లోత్ సర్కార్‌కు ఈ పరిణామం భారీ ఊరటగా భావిస్తున్నారు. రాజస్తాన్ అసెంబ్లీలో మెజారిటీ మార్క్‌కు ఒక్కరు అధికంగా తనకు 102 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని గహ్లోత్ చెబుతున్నారు. బీఎస్పీ ఎమ్మెల్యేల విలీనం నిలిపివేస్తే గహ్లోత్ మద్దతుదారుల సంఖ్యాబలం 102 నుంచి 96కు పడిపోయి మెజారిటీ నిరూపణకు ఆయన తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చేది. 200 మంది సభ్యులతో కూడిన రాజస్తాన్ అసెంబ్లీలో బీజేపీకి 72 మంది ఎమ్మెల్యేలు ఉండగా, ముగ్గురు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు, తిరుగుబాటు ఎమ్మెల్యేలతో కలుపుకుని ప్రత్యర్థి వర్గానికి 97 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. 2019 సెప్టెంబర్‌లో కాంగ్రెస్‌లో ఆరుగురు బీఎస్పీ ఎమ్మెల్యేల విలీనాన్ని సవాల్ చేస్తూ బీఎస్పీ, బీజేపీలు కోర్టును ఆశ్రయించాయి. సభా కార్యకలాపాల్లో ఆరుగురు ఎమ్మెల్యేలను పాల్గొనకుండా స్టే విధించాలని ఆ పార్టీలు కోరుతున్నాయి. చదవండి : ‘గహ్లోత్ ఆనందం ఆవిరే’ -
‘ఆ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌తోనే ఉన్నారు’
జైపూర్: బహుజన సమాజ్‌వాది పార్టీ(బీఎస్పీ)కి చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌కు చెందిన వారేనని ఆ పార్టీ ఎమ్మెల్యే రామ్‌నారయణ్ మీనా తెలిపారు. స్పీకర్ వారిని కాంగ్రెస్‌కు చెందిన ఎమ్మెల్యేలుగా గుర్తించినట్లు చెప్పారు. ఎమ్మెల్యేల సభ్యత్వం గురించి మీనా మాట్లాడుతూ, ‘బీఎస్పీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారిని స్పీకర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలుగా గుర్తించారు. నేను ఎలాగైతే ఎమ్మెల్యేనో వారు కూడా అంతే. దాంట్లో ఎలాంటి అనుమానం లేదు’ అని తెలిపారు. బీఎస్పీ అధినేత్రి మాయావతి విప్ జారీ చేయడంపై ఆయన మాట్లాడుతూ, మాయావతి దళిత పార్టీ సమావేశాలకు హాజరుకారని, ఆమె కేవలం ఉపన్యాసాలు మాత్రమే ఇస్తారని అని విమర్శించారు. ఆమె అసలు నాయకురాలు కాదని, కాన్షీరామ్‌ను ఆమెలో చూసుకోవడం కారణంగా నాయకురాలిగా మారారని ధ్వజమెత్తారు. రాజస్తాన్ రాజకీయ సంక్షోభం నేపథ్యంలో కాంగ్రెస్‌కు మద్దతుగా తమ పార్టీ ఎమ్మెల్యేలు ఓటు వేయకూడదని మాయావతి విప్ జారీ చేశారు. దీంతో రాజస్తాన్ రాజకీయ సంక్షోభం మరింత ముదిరింది. చదవండి: మాయావతి విప్ : గహ్లోత్ సర్కార్‌కు షాక్ -
‘రాజస్తాన్‌లో రాష్ట్రపతి పాలన విధించాలి’
న్యూఢిల్లీ: ఆడియో టేపుల వ్యవహారం రాజస్తాన్ రాజకియాల్లో మరింత దుమారం రేపుతోంది. ఈ నేపథ్యంలో బీఎస్పీ అధినేత్రి మాయావతి రాజస్తాన్‌లో రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేశారు. అశోక్ గహ్లోత్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యే భన్వర్‌లాల్ శర్మతో కలిసి కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, బీజేపీ నేత సంజయ్ జైన్ కుట్రలు పన్నారని కాంగ్రెస్ రాజస్తాన్ పోలీస్ స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ (ఎస్ఓజీ)నకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ మహేష్ జోషి ఫిర్యాదు మేరకు ఎస్ఓజీ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. అయితే, ఫేక్ ఆడియో టేపులతో రాజకీయంగా తమపై బురదజల్లే యత్నం చేస్తున్నారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. అదే విధంగా ఈ వ్యవహారంపై సీబీఐ దర్యాప్తు జరిపాలని డిమాండ్ చేశారు. (రాజస్తాన్ హైడ్రామా: పోలీసులకు బీజేపీ ఫిర్యాదు) ఇక దీనిపై మాయావతి స్పందిస్తూ.. రాజస్తాన్ సీఎం అశోక్ గహ్లోత్ మొదట ఫిరాయింపుల వ్యతిరేక చట్టాన్ని ఉల్లంఘించారని మండిపడ్డారు. బీఎస్పీ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ చేర్చుకున్నారని దుయ్యబట్టారు. ఆడియో టేపుల విషయంలో మరో చట్టవిరుద్ధమైన నిర్ణయం తీసుకున్నారని తీవ్రంగా విమర్శించారు. రాజస్తాన్‌లో రాష్ట్రపతి పాలనను గవర్నర్ సిఫార్సు చేయాలన్నారు. రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ ప్రతిష్టంభన, అస్థిరతను గవర్నర్ పూర్తిస్థాయిలో తెలుసుకొని రాష్ట్రపతి పాలనకు సిఫార్సు చేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని మాయావతి ట్విటర్లో పేర్కొన్నారు. (‘105 మంది ఎమ్మెల్యేల్లో కొందరు టచ్‌లో ఉన్నారు’)