
జడ్చర్ల టౌన్: బీసీ రిజ ర్వేషన్లలో కోత విధించార ని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్ర శ్నించినట్లే.. బీసీ కుల గణన చేయాలని, జనాభా ప్రకారం రిజర్వేషన్లు పెంచాలని కేంద్రాన్ని ఎందుకు నిలదీయడం లేదని బీజేపీ నాయకులను బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ ప్రశ్నించారు. సోమవారం మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లకు వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు. బీసీ రిజర్వేషన్లను జనాభా దామాషా పద్ధతిన పెంచాలని, బీసీ కుల గణన చేపట్టాలని ఇదివరకే రాష్ట్రవ్యాప్త ఉద్యమానికి తాము పిలుపునిచ్చామని చెప్పారు. ఆ ఉద్యమాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు 15 మందితో స్టీరింగ్ కమిటీని నియమించామని వివరించారు.
రాష్ట్ర స్టీరింగ్ కమిటీ..
రాష్ట్ర స్టీరింగ్ కమిటీ కన్వీనర్‌గా డా.సాంబశివగౌడ్, కో కన్వీనర్‌గా దాసరి హనుమయ్య, సలహాదా రులుగా చంద్రశేఖర్ ముదిరాజ్, మహతి, రమేష్, రీసెర్చ్ ఇన్‌చార్జ్‌లుగా ఊరుమల్ల విశ్వం, జక్కని విజయ్‌కుమార్, గుర్రప్ప, కల్చరల్ ఇన్‌చార్జ్‌గా అశోక్, దయాకరణ్, మౌర్య, కోనేటి సుజాత, మీడి యా ఇన్‌చార్జ్‌గా డా.వెంకటేశ్ చౌహాన్, సభ్యులుగా నామాలక్ష్మి, కత్తుల పద్మయాదవ్, మౌలానాషఫి, శాంసన్‌లను నియమించారు. భవిష్యత్ కార్యాచ రణ రూపొందించి కార్యక్రమాలు నిర్వహించాలని వారికి సూచించారు. కాగా, అన్ని పార్టీల్లోని బీసీ నేతలు ఆయా పార్టీల నేతలకు ఊడిగం చేయకుండా బీసీల న్యాయమైన వాటా కోసం పోరాడాలని ప్రవీణ్‌కుమార్ ట్విటర్ వేదికగా పిలుపునిచ్చారు.