Praveen Kumar
-
పాస్టర్ ప్రవీణ్ మృతిపై నిష్పాక్షిక విచారణ జరగాలి: వైఎస్ జగన్
సాక్షి, గుంటూరు: ప్రముఖ మత ప్రబోధకుడు, పాస్టర్ పగడాల ప్రవీణ్ మృతిపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటన అత్యంత బాధాకరమన్న ఆయన.. బాధిత కుటుంబానికి ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. మరోవైపు ప్రవీణ్ మృతిపై అనుమానాలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో.. నిష్పాక్షికంగా విచారణ జరిపించాలని ప్రభుత్వాన్ని కోరారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం శివారు కొంతమూరు వద్ద రోడ్డు ప్రమాదంలో పాస్టర్ పగడాల ప్రవీణ్‌కుమార్ మృతి చెందినట్లు పోలీసులు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే.. ప్రవీణ్‌కుమార్ మృతిపై అనుమానాలు ఉన్నాయంటూ క్రైస్తవ సంఘాల నేతలు ఆందోళన చేపట్టారు. ఘటన జరిగిన ప్రాంతంలో సీసీ టీవీ ఫుటేజీలు పరిశీలించాలని.. అన్ని కోణాల్లో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు వాళ్లు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం శివారు కొంతమూరు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి బుల్లెట్‌పై సోమవారం రాజమహేంద్రవరం బయలుదేరిన ప్రవీణ్‌కుమార్ అర్ధరాత్రి సమయంలో కొంతమూరు వద్ద ప్రమాదానికి గురయ్యారు. మంగళవారం ఉదయం దాకా ఆయన అలా పడి ఉండడం ఎవరూ గమనించకపోవడంతో ప్రాణాలు కోల్పోయారు. ఇదీ చదవండి: పాస్టర్ ప్రవీణ్ ఒంటిపై గాయాలు! -
అమెరికాలో కాల్పులు.. కేశంపేట యువకుడి మృతి
కేశంపేట: ఉన్నత ఆశయాలతో అమెరికా వెళ్లిన ఓ విద్యార్థి.. అక్కడ గుర్తుతెలియని వ్యక్తులు జరిపిన కాల్పుల్లో మృతిచెందాడు. ఈ ఘటన తల్లిదండ్రులకు తీరని విషాదాన్ని మిగిల్చింది. రంగారెడ్డి జిల్లా కేశంపేట మండల కేంద్రానికి చెందిన వ్యాపారి గంప రాఘవులు, రమాదేవి దంపతులకు ప్రవీణ్‌కుమార్ (27), గాయత్రి సంతానం. గీతం యూనివర్సిటీలో ఇంజనీరింగ్ పూర్తిచేసిన ప్రవీణ్.. అనంతరం 2023 ఆగస్టులో అమెరికాలోని మిల్వాకీ పట్టణంలో ఉన్న యూనివర్సిటీ ఆఫ్ విస్కాన్సిన్లో ఎంఎస్ చదివేందుకు వెళ్లాడు. అదే పట్టణంలోని ఓ మాల్లో పార్ట్ టైం ఉద్యోగం చేస్తున్నాడు. గతేడాది డిసెంబర్ 18న ఇంటికి వచ్చిన ప్రవీణ్ జనవరి 20న తిరిగి అమెరికా వెళ్లాడు. భారత కాలమానం ప్రకారం బుధవారం తెల్లవారుజామున 2.50 నిమిషాలకు ప్రవీణ్ తల్లిదండ్రులకు ఫోన్ చేశాడు. అయితే కుటుంబ సభ్యులు ఫోన్ లిఫ్ట్ చేయలేదు. తిరిగి ఉదయాన్నే వాట్సాప్ కాల్ చేయమని మెసేజ్ పెట్టినా ప్రవీణ్ నుంచి రిప్లయ్ రాలేదు. దీంతో ఉదయం 7 గంటలకు కుమారుడి ఫోన్‌కు కాల్ చేశారు. ఫోన్ లిఫ్ట్ చేసిన అవతలి వ్యక్తులు ప్రవీణ్ వివరాలను అడగటంతో సైబర్ నేరగాళ్లు అనుకుని ఫోన్ కట్ చేశారు. మరోసారి ప్రవీణ్‌తో కలిసి రూంలో ఉండే అతని మిత్రులకు ఫోన్ చేశారు. కొద్దిసేపటి తర్వాత వివరాలు తెలుసుకున్న వారు గుర్తుతెలియని వ్యక్తులు మాల్లో ప్రవీణ్‌ను గన్‌తో కాల్చారని, బుల్లెట్ గాయాలతో అక్కడికక్కడే మృతిచెందాడని చెప్పడంతో కుటుంబ సభ్యులు కుప్పకూలారు. ప్రవీణ్ మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. అండగా ఉంటాం: డీకే అరుణ అమెరికాలో మృతిచెందిన ప్రవీణ్‌కుమార్ కుటుంబ సభ్యులకు కేంద్ర ప్రభుత్వం అండగా ఉంటుందని మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ అన్నారు. పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పాలమూరు విష్ణువర్ధన్‌రెడ్డి బుధవారం ప్రవీణ్ తల్లిదండ్రులను కలిసి పరామర్శించారు. అనంతరం ఎంపీతో ఫోన్లో మాట్లాడించారు. వివరాలను అందిస్తే మృతదేహాన్ని త్వరగా స్వదేశానికి తెచ్చేందుకు కృషి చేస్తామని ఆమె వారికి హామీ ఇచ్చారు. -
ఖేల్ రత్న అవార్డులు అందుకున్న గుకేశ్, హర్మన్‌ప్రీత్ సింగ్, మనూ బాకర్, ప్రవీణ్ కుమార్
భారత దేశపు అత్యున్నత క్రీడా పురస్కారం అయిన "మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు" గతేడాది (2024) నలుగురిని వరించింది. చెస్‌లో డి గుకేశ్, పురుషుల హాకీలో హర్మన్‌ప్రీత్ సింగ్, మహిళల షూటింగ్లో మనూ బాకర్, పారా-అథ్లెట్ (హై జంప్) ప్రవీణ్ కుమార్ ప్రతిష్టాత్మక అవార్డుకు ఎంపికయ్యాడు. ఈ నలుగురు ఇవాళ (జనవరి 17) రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఖేల్ రత్న అవార్డులు అందుకున్నారు. అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం రాష్ట్రపతి భవన్లో జరిగింది.A historic moment for 🇮🇳 Indian chess! 🏆Congratulations to 🇮🇳 GM Gukesh on receiving the prestigious Major Dhyan Chand Khel Ratna Award from Hon’ble President Droupadi Murmu👏Your hard work and passion continue to inspire us all—onward and upward 🥳👏@DGukesh📹Doordarshan pic.twitter.com/4AMZ8ClZD9— Chess.com - India (@chesscom_in) January 17, 2025గుకేశ్ అతి చిన్న వయసులో (18) ప్రపంచ చెస్ ఛాంపియన్‌గా అవతరించిన విషయం తెలిసిందే. విశ్వనాథన్ ఆనంద్ తర్వాత ప్రపంచ చెస్ ఛాంపియన్‌గా నిలిచిన రెండవ భారతీయుడు గుకేష్. గుకేశ్ గత నెలలో చైనా గ్రాండ్‌మాస్టర్ డింగ్ లిరెన్‌ను ఓడించి వరల్డ్ ఛాంపియన్‌షిప్‌ను కైవసం చేసుకున్నాడు.హర్మన్‌ప్రీత్ సింగ్ భారత పురుషుల హాకీ జట్టు కెప్టెన్. హర్మన్ సారథ్యంలో భారత్ గతేడాది ఒలింపిక్స్ కాంస్య పతకాన్ని గెలుచుకుంది. భారత్ పతకం సాధించడంలో హర్మన్ కీలకపాత్ర పోషించాడు.మనూ భాకర్ .. ఒకే ఒలింపిక్స్‌లో రెండు మెడల్స్ సాధించిన తొలి భారతీయ అథ్లెట్‌గా రికార్డు నెలకొల్పింది. మనూ బాకర్ గతేడాది ఆగస్టులో జరిగిన విశ్వక్రీడల్లో రెండు కాంస్య పతకాలు (10మీ ఎయిర్ పిస్తోల్, 10మీ ఎయిర్ పిస్తోల్ మిక్స్డ్ టీం ఈవెంట్లలో) గెలుచుకుంది.ప్రవీణ్ కుమార్.. గతేడాది జరిగిన పారాలింపిక్స్‌లో పురుషుల హై జంప్ విభాగంలో స్వర్ణ పతకం సాధించాడు.పై నలుగురు భారత క్రీడా రంగంలో చేసిన విశేష కృషికి గాను ఖేల్ రత్న అవార్డులు అందుకున్నారు. -
నలుగురు ‘ఖేల్ రత్న’లు
సాక్షి, న్యూఢిల్లీ: విశ్వవేదికపై మువ్వన్నెల జెండాను రెపరెపలాడించిన మేటి క్రీడాకారులకు ‘ఖేల్ రత్న’ అవార్డు వరించింది. పారిస్ ఒలింపిక్స్‌లో రెండు పతకాలతో మెరిసిన మహిళా షూటర్ మనూ భాకర్... పిన్న వయసులో చెస్ ప్రపంచ చాంపియన్‌గా అవతరించిన తమిళనాడు గ్రాండ్‌మాస్టర్ దొమ్మరాజు గుకేశ్... భారత పురుషుల హాకీ జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్... పారాథ్లెట్ ప్రవీణ్ కుమార్... 2024 సంవత్సరానికి దేశ అత్యున్నత క్రీడా పురస్కారం ‘మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్‌రత్న’ పురస్కారానికి ఎంపికయ్యారు. వీరితోపాటు మరో 32 మంది ప్లేయర్లకు ‘అర్జున అవార్డు’ దక్కింది. ఇందులో 17 మంది పారాథ్లెట్లు కూడా ఉండటం విశేషం. ఈ మేరకు కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ గురువారం అవార్డుకు ఎంపికైన వారి జాబితాను విడుదల చేసింది. ఈ నెల 17న రాష్ట్రపతి భవన్లో జరగనున్న కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా క్రీడాకారులు ఈ పురస్కారాలు అందుకోనున్నారు. » స్వతంత్ర భారత దేశంలో ఒకే ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించిన తొలి ప్లేయర్‌గా మనూ రికార్డు నెలకొల్పింది. 2024 పారిస్ ఒలింపిక్స్‌లో హరియాణాకు చెందిన 22 ఏళ్ల మనూ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత విభాగంలో, 10 మీటర్ల మిక్స్డ్ టీమ్ విభాగంలో కాంస్యాలు నెగ్గింది. కొన్ని రోజుల క్రితం ఈ అవార్డు కోసం మనూ భాకర్ దరఖాస్తు చేసుకోలేదనే వార్తలు వచి్చనా... చివరకు ‘పారిస్’లోని ఆమె ప్రదర్శనకు అవార్డు దక్కింది. » గత ఏడాది చెస్ ఒలింపియాడ్‌లో భారత పురుషుల జట్టుకు స్వర్ణ పతకం దక్కడంలో కీలకపాత్ర పోషించిన గుకేశ్ ఆ తర్వాత సింగపూర్‌లో జరిగిన ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్‌లో డిఫెండింగ్ చాంపియన్ డింగ్ లిరెన్‌ను ఓడించి జగజ్జేత అయ్యాడు. విశ్వనాథన్ ఆనంద్ తర్వాత (1991–1992లో) ‘ఖేల్ రత్న’ అవార్డు పొందనున్న రెండో చెస్ ప్లేయర్ గుకేశే కావడం విశేషం. » 2024 పారిస్ ఒలింపిక్స్‌లో హర్మన్‌ప్రీత్ సింగ్ నాయకత్వంలో భారత పురుషుల హాకీ జట్టు కాంస్యం సాధించింది. 2020 టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్యం గెలుచుకున్న జట్టులోనూ సభ్యుడైన 28 ఏళ్ల హర్మన్‌ప్రీత్ సింగ్... ఆసియా క్రీడలు, కామన్వెల్త్ క్రీడలు, చాంపియన్స్ ట్రోఫీ తదితర ప్రధాన ఈవెంట్లలో భారత్ పతకాలు గెలుచుకోవడంలో కీలకపాత్ర పోషించాడు. మూడుసార్లు అతను అంతర్జాతీయ హాకీ సమాఖ్య అత్యుత్తమ ఆటగాడిగా నిలిచాడు. » పారా అథ్లెట్ ప్రవీణ్ కుమార్ పేరును కూడా కమిటీ ‘ఖేల్‌రత్న’ కోసం సిఫారసు చేసింది. పారిస్ పారాలింపిక్స్ హైజంప్ (టి64 క్లాస్)లో ప్రవీణ్ స్వర్ణ పతకం గెలుచుకున్నాడు. 2020 టోక్యో ఒలింపిక్స్‌లో ప్రవీణ్ ఇదే విభాగంలో కాంస్యం సాధించాడు. »‘ఖేల్ రత్న’ అవార్డు గ్రహీతలకు అవార్డుతో పాటు రూ. 25 లక్షల నగదు ప్రోత్సాహకం, అర్జున అవార్డీలకు రూ. 15 లక్షల నగదు బహుమతి లభించనుంది. జ్యోతి, దీప్తిలకు ‘అర్జున’ ఆంధ్రప్రదేశ్ వర్ధమాన అథ్లెట్ జ్యోతి యర్రాజీ...తెలంగాణ పారాథ్లెట్ దీప్తి జివాంజిలకు ఉత్తమ క్రీడాకారులకు అందించే ‘అర్జున అవార్డు’ లభించింది. వైజాగ్‌కు చెందిన 25 ఏళ్ల జ్యోతి పారిస్ ఒలింపిక్స్‌లో 100 మీటర్ల హర్డిల్స్‌లో పోటీపడింది. 2023 హాంగ్జౌ ఆసియా క్రీడల్లో రజత పతకం గెలిచింది. 2023 ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్íÙప్లో 100 మీటర్ల హర్డిల్స్‌లో స్వర్ణం, 200 మీటర్లలో రజతం సాధించింది. 2023, 2024లలో జరిగిన ఆసియా ఇండోర్ చాంపియన్‌షిప్‌లో జ్యోతి 60 మీటర్ల హర్డిల్స్‌లో స్వర్ణ, రజతాలు గెలిచింది. వరంగల్ జిల్లా కల్లెడ గ్రామానికి చెందిన 21 ఏళ్ల దీప్తి 2024 పారిస్ పారాలింపిక్స్‌లో 400 మీటర్ల టి20 కేటగిరీలో కాంస్యం... 2024 ప్రపంచ పారాథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం సాధించింది. 2023 హాంగ్జౌ పారా ఆసియా క్రీడల్లో దీప్తి బంగారు పతకం గెలిచింది. దీప్తికి భారత స్పోర్ట్స్ అథారిటీ కోచ్ నాగపురి రమేశ్ కోచ్‌గా వ్యవహరిస్తున్నారు.అవార్డీల వివరాలు‘ధ్యాన్‌చంద్ ఖేల్‌రత్న’: దొమ్మరాజు గుకేశ్ (చెస్), హర్మన్‌ప్రీత్ సింగ్ (హాకీ), ప్రవీణ్ కుమార్ (పారా–అథ్లెటిక్స్), మనూ భాకర్ (షూటింగ్). అర్జున అవార్డు (రెగ్యులర్): జ్యోతి యర్రాజీ, అన్ను రాణి (అథ్లెటిక్స్), నీతు, స్వీటీ బూరా (బాక్సింగ్), వంతిక అగర్వాల్ (చెస్), సలీమా టెటె, అభిషేక్, సంజయ్, జర్మన్‌ప్రీత్, సుఖ్జీత్ సింగ్ (హాకీ), రాకేశ్ కుమార్ (పారా ఆర్చరీ), దీప్తి జివాంజి, ప్రీతి పాల్, అజీత్ సింగ్, సచిన్ ఖిలారి, ధరమ్వీర్, ప్రణవ్ సూర్మ, హొకాటో సీమ, సిమ్రన్, నవ్‌దీప్ (పారా అథ్లెటిక్స్), నితీశ్, తులసిమతి, నిత్యశ్రీ, మనీషా (పారా బ్యాడ్మింటన్), కపిల్ పర్మార్ (పారా జూడో), మోనా అగర్వాల్, రుబీనా (పారా షూటింగ్), స్వప్నిల్ కుసాలే, సరబ్జోత్ (షూటింగ్), అభయ్ సింగ్ (స్క్వాష్), సజన్ ప్రకాశ్ (స్విమ్మింగ్), అమన్ సెహ్రావత్ (రెజ్లింగ్). అర్జున అవార్డు (లైఫ్‌టైమ్): సుచా సింగ్ (అథ్లెటిక్స్), మురళీకాంత్ పేట్కర్ (పారా స్విమ్మింగ్). ద్రోణాచార్య అవార్డు (రెగ్యులర్): సుభాశ్ రాణా (పారా షూటింగ్), దీపాలి దేశ్‌పాండే (షూటింగ్), సందీప్ సాంగ్వాన్ (హాకీ). ద్రోణాచార్య అవార్డు (లైఫ్‌టైమ్): మురళీధరన్ (బ్యాడ్మింటన్), అర్మాండో అనెలో కొలాకో (ఫుట్‌బాల్). -
ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇంట్లో చోరీ.. విలువైన పత్రాలు మాయం!
సాక్షి, కొమురంభీం జిల్లా: కాగజ్ నగర్ మండలం కోసిని గ్రామంలోని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇంట్లో చోరీ జరిగింది. బీరువా తాళాలు పగులగొట్టి విలువైన పత్రాలు ఎత్తుకెళ్లారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.తన ఇంట్లో జరిగిన చోరీ ఘటనపై ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ స్పందించారు. తెలంగాణలో దోపిడీ దొంగల పాలన నడుస్తుందని మండిపడ్డారు. నిన్న సిర్పూర్-కాగజ్ నగర్ కోసిని గ్రామంలోని తన ఇంట్లో దొంగలు పడ్డారని.. కొన్ని విలువైన డాక్యుమెంట్లు దొచుకోని పోయారని తెలిపారు. దీని వెనక ఉన్న కుట్ర కోణాన్ని కూడా శోధించాల్సిందిగా డీజీపీని ఆయన కోరారు.తెలంగాణ లో దోపిడి దొంగల పాలన నడుస్తున్నది. ఇది ముమ్మాటికీ నిజం. నిన్న సిర్పూర్-కాగజ్ నగర్ కోసిని గ్రామంలోని మా స్వగృహం లో దొంగలు పడ్డారు. కొన్ని విలువైన డాక్యుమెంట్లు దొచుకోని పోయారు.దీని వెనక ఉన్న కుట్ర కోణాన్ని కూడా శోధించాల్సిందిగా @TelanganaDGP గారిని కోరుతున్న.My home in… pic.twitter.com/A5ewLPMzCa— Dr.RS Praveen Kumar (@RSPraveenSwaero) October 31, 2024 -
ఇది పక్కా రేవంత్ ప్లాన్..
-
ప్రవీణ్ ‘పసిడి’ వెలుగులు
టోక్యోలో జరిగిన గత పారాలింపిక్స్ క్రీడల్లో భారత ఆటగాళ్లు ఐదు స్వర్ణాలు సాధించారు. ఇప్పుడు దానిని మన బృందం అధిగమించింది. 21 ఏళ్ల భారత అథ్లెట్ ప్రవీణ్ కుమార్ దేశానికి ఆరో పసిడి పతకాన్ని అందించాడు. హైజంప్‌లో అతను ఈ మెడల్‌ను గెలుచుకున్నాడు. శుక్రవారం జరిగిన పోటీల్లో భారత్‌కు స్వర్ణానందం దక్కగా.. ఇతర ఈవెంట్లలో మాత్రం నిరాశాజనక ఫలితాలు ఎదురయ్యాయి. పారిస్: మూడేళ్ల క్రితం టోక్యో ఒలింపిక్స్‌లో రజతపతకంతో సత్తా చాటిన భారత హైజంపర్ ప్రవీణ్ కుమార్ ఈ సారి మరింత బలంగా పైకి లేచాడు. తన ప్రదర్శనను మెరుగుపర్చుకుంటూ అగ్రస్థానాన్ని అందుకున్నాడు. శుక్రవారం జరిగిన పురుషుల హైజంప్ – టి64 ఈవెంట్లో ప్రవీణ్‌కు స్వర్ణపతకం దక్కింది. 2.08 మీటర్ల ఎత్తుకు ఎగిరి ఆసియా రికార్డుతో అతను పసిడిని గెలుచుకున్నాడు. అమెరికాకు చెందిన డెరెక్ లాసిడెంట్ (2.06 మీ.) రజతం గెలుచుకోగా, తెమూర్బెక్ గియాజోవ్ (ఉజ్బెకిస్తాన్ – 2.03 మీ.)కు కాంస్యం దక్కింది. ముందుగా 1.89 మీటర్ల ఎత్తుతో మొదలు పెట్టిన ప్రవీణ్ తన ఏడో ప్రయత్నంలో అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేశాడు. పారిస్ పారాలింపిక్స్‌లో శరద్ కుమార్, మరియప్పన్ తంగవేలు తర్వాత భారత్ తరఫున హైజంప్‌లో పతకం సాధించిన మూడో అథ్లెట్‌గా ప్రవీణ్ నిలిచాడు. కస్తూరికి ఎనిమిదో స్థానం... మహిళల పవర్‌లిఫ్టింగ్ 67 కేజీల విభాగంలో భారత ప్లేయర్ కస్తూరి రాజమణికి నిరాశ ఎదురైంది. మూడు ప్రయత్నాల్లో రెండు ఫౌల్స్ కాగా, అత్యుత్తమంగా 106 కిలోల బరువు మాత్రమే ఎత్తిన కస్తూరి ఎనిమిదో స్థానంతో ముగించింది. మహిళల కనోయింగ్ ‘వా’ సింగిల్ 200 మీ. హీట్స్‌లో రాణించిన ప్రాచీ యాదవ్ సెమీ ఫైనల్‌కు అర్హత సాధించింది. కనోయింగ్ ‘కయాక్’ సింగిల్ 200 మీ. కూడా భారత ప్లేయర్ పూజ ఓఝా సెమీస్‌కు చేరింది. పురుషుల ‘కయాక్’ సింగిల్ 200 మీ.లో యష్ కుమార్ కూడా సెమీ ఫైనల్లోకి అడుగు పెట్టాడు. పురుషుల జావెలిన్ త్రో – ఎఫ్ 54 కేటగిరీలో భారత అథ్లెట్ దీపేశ్ కుమార్ అందరికంటే చివరగా ఏడో స్థానంతో ముగించాడు. అతను జావెలిన్‌ను 26.11 మీటర్ల దూరం విసిరాడు.పురుషుల 400 మీ. – టి47 ఈవెంట్ తొలి రౌండ్ హీట్స్‌లో మూడో స్థానంలో నిలిచి దిలీప్ గవిట్ ముందంజ వేశాడు. మహిళల 200 మీ.–టి12 పరుగు సెమీ ఫైనల్లో రాణించిన సిమ్రన్ ఫైనల్‌కు అర్హత సాధించింది. మహిళల జావెలిన్ త్రో –ఎఫ్ 46లో భావనాబెన్ చౌదరి 39.70 మీటర్లు జావెలిన్‌ను విసిరి ఐదో స్థానంలో నిలిచింది. బరిలోకి దిగితే పతకం ఖాయమే!ఉత్తరప్రదేశ్‌కు చెందిన ప్రవీణ్ కుమార్ పుట్టుకతోనే వికలాంగుడు. అతని ఎడమ కాలు పూర్తిగా ఎదగకుండా చిన్నగా ఉండిపోయింది. చిన్నతనంలో కొందరు హేళన చేయడం అతడిని తీవ్రంగా బాధపెట్టేది. దీనిని మర్చిపోయేందుకు అతను ఆటలపై దృష్టి పెట్టాడు. వైకల్యం ఉన్నా సరే దానిని పట్టించుకోకుండా మిత్రులతో కలిసి వాలీబాల్ ఆడేవాడు. అయితే అనూహ్యంగా ఒక సారి సాధారణ అథ్లెట్లు పాల్గొనే హైజంప్‌లో అతనికీ అవకాశం దక్కింది. దాంతో అథ్లెటిక్స్‌తో తనకు మరిన్ని అవకాశాలు ఉన్నాయని ప్రవీణ్‌కు అర్థమైంది. సత్యపాల్ సింగ్ అనే పారా అథ్లెటిక్స్ కోచ్ అతనిలో ప్రతిభను గుర్తించి హైజంప్‌పై పూర్తిగా దృష్టి పెట్టేలా చేశాడు. అన్ని రకాలుగా ప్రవీణ్‌ను తీర్చిదిద్దాడు.అనంతరం పారా క్రీడల్లో పాల్గొంటూ అతను వరుస విజయాలు సాధించాడు. టోక్యో పారాలింపిక్స్‌లో రజతం, ఇప్పుడు స్వర్ణంలతో పాటు ప్రవీణ్ వరల్డ్ పారా అథ్లెటిక్స్ చాంపియన్íÙప్లో ఒక రజతం, ఒక కాంస్యం కూడా గెలిచాడు. పారిస్ క్రీడలకు ముందు గజ్జల్లో గాయంతో బాధపడిన అతను సరైన సమయానికి కోలుకొని సత్తా చాటాడు. -
సరికొత్త చరిత్ర.. భారత్ ఖాతాలో ఆరో స్వర్ణం
ప్యారిస్ పారాలింపిక్స్-2024లో భారత్ ఖాతాలో ఆరో స్వర్ణం చేరింది. హై జంప్ టీ64 విభాగంలో ప్రవీణ్ కుమార్ పసిడి పతకం సాధించాడు. టోక్యోలో రజతానికి పరిమితమైన ఈ ఉత్తరప్రదేశ్ పారా అథ్లెట్.. ప్యారిస్‌లో మాత్రం పొరపాట్లకు తావివ్వలేదు. శుక్రవారం నాటి ఈవెంట్లో 21 ఏళ్ల ప్రవీణ్.. అత్యుత్తంగా 2.08 మీటర్ల దూరం దూకి గోల్డ్ మెడల్ ఖాయం చేసుకున్నాడు.సరికొత్త చరిత్రఅమెరికాకు చెందిన డెరెక్ లాక్సిడెంట్(2.06మీ.- రెండోస్థానం), ఉజ్బెకిస్తాన్ పారా అథ్లెట్ తెముర్బెక్ గియాజోవ్(2.03 మీ- మూడో స్థానం)లను వెనక్కి నెట్టి.. స్వర్ణం గెలిచాడు. పారా విశ్వక్రీడ వేదికపై త్రివర్ణ పతకాన్ని ప్రవీణ్ కుమార్ రెపరెపలాడించాడు. కాగా పారాలింపిక్స్‌లో భారత్ ఆరు పసిడి పతకాలు సాధించడం ఇదే తొలిసారి. ప్రవీణ్ కుమార్ గోల్డ్‌తో ఈ మేర సరికొత్త చరిత్ర ఆవిష్కృతమైంది. ఇక టోక్యోలో భారత్ ఐదు స్వర్ణాలు గెలిచిన విషయం తెలిసిందే. మోకాలి(రెండుకాళ్లకు సమస్య) దిగువ భాగం సరిగా పనిచేయని హై జంపర్లు టీ64 విభాగంలో పోటీపడతారు. అయితే, ప్రవీణ్ ఒక కాలికి మాత్రమే సమస్య ఉంది. ఇక ప్యారిస్‌లో భారత్‌కు ఇప్పటి వరకు ఆరు పసిడి, తొమ్మిది రజత, పదకొండు కాంస్యాలు వచ్చాయి. ఓవరాల్‌గా 26 మెడల్స్ భారత్ ఖాతాలో ఉన్నాయి.ప్యారిస్ పారాలింపిక్స్‌లో గోల్డ్ మెడల్స్ సాధించిన భారత అథ్లెట్లుఅవనీ లేఖరా- ఆర్2 మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ స్టాండింగ్ ఎస్‌హెచ్1(పారా షూటింగ్)నితేశ్ కుమార్- పురుషుల సింగిల్స్ ఎస్ఎల్3(పారా బ్యాడ్మింటన్)సుమిత్ ఆంటిల్- పురుషుల జావెలిన్ త్రో-ఎఫ్64హర్వీందర్ సింగ్- పురుషుల వ్యక్తిగత రికర్వ్ ఓపెన్(పారా ఆర్చరీ)ధరంబీర్- పురుషుల క్లబ్ త్రో ఎఫ్51(పారా అథ్లెటిక్స్)ప్రవీణ్ కుమార్- పురుషుల హై జంప్ టీ64Praveen Kumar clinches gold 🥇 at #Paris2024 with his season's best jump of 2.08 m 🤯Watch the #Paralympics LIVE on #JioCinema 👈#ParalympicsOnJioCinema #JioCinemaSports #ParalympicsParis2024 #HighJump pic.twitter.com/k6zLWLU9XD— JioCinema (@JioCinema) September 6, 2024 -
అమెరికాలో సూర్యాపేట జిల్లావాసి మృతి
ఆత్మకూర్ (ఎస్): అమెరికాలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న సూర్యాపేట జిల్లా ఆత్మకూర్ (ఎస్) మండలం పాతర్లపహాడ్ గ్రామానికి చెందిన తప్సి ప్రవీణ్‌కుమార్ (39) ప్రమాదవశాత్తు స్విమ్మింగ్ పూల్‌లో పడి మృతిచెందాడు. భారత కాలమాన ప్రకారం శనివారం ఉదయం సుమారు 8 గంటల సమయంలో ప్రవీణ్‌కుమార్ వారి ఇంటి సమీపంలోని స్విమ్మింగ్ పూల్ వద్ద కాలక్షేపం కోసం వెళ్లి అందులో పడి మృతి చెందినట్లు అతడి భార్య శాంతి ఆదివారం ఫోన్ ద్వారా కుటుంబ సభ్యులకు తెలిపారు. పాతర్లపహాడ్ గ్రామానికి చెందిన నాగయ్యకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె సంతానం. మృతుడు ప్రవీణ్ చిన్న కుమారుడు. ఎమ్మెస్సీ చేసిన ప్రవీణ్ హైదరాబాద్‌లో ఉపాధ్యాయుడిగా పనిచేశారు. ఉపాధ్యాయ వృత్తిలో మంచి నైపుణ్యం ఉన్న ప్రవీణ్ ఆ్రస్టేలియా ఇతర దేశాల్లో ఉపాధ్యాయుడిగా పనిచేసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఐదేళ్ల క్రితం మిత్రులతో కలిసి అమెరికాకు వెళ్లిన ప్రవీణ్‌కుమార్ అట్లాంటా ప్రాంతంలో పనిచేస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రవీణ్‌కుమార్ మృతితో పాతర్లపహాడ్ గ్రామంలో విషాదం నెలకొంది. -
విచారణ పేరుతో ఎస్ఐ వేధింపులు
-
'ఐసైపోతారు'..! సహజ రుచులకు ఆహారప్రియులు ఫిదా..
సాక్షి, సిటీబ్యూరో: ఐస్‌క్రీమ్ అంటే ఇష్టపడని వారు ఎవరుంటారు? చిన్న పిల్లల నుంచి పండు ముసలి దాకా ఎగిరి గంతేస్తారు.. అనారోగ్య కారణాల రీత్యా, కృత్రిమ రంగుల వినియోగం వల్ల కొందరు దీనికి దూరంగా ఉంటున్నారు. ఆరోగ్యం, ఆహారంపై కరోనా నేరి్పన గుణపాఠాన్ని నగరవాసులు బాగానే ఒంటబట్టించుకున్నారు. దీన్ని గ్రహించిన అమ్మకం దారులను నయా ట్రెండ్‌లో తమ వ్యాపారాలను అందిపుచ్చుకుంటున్నారు.ఆహార ప్రియుల మనసును గెలుచుకునేందుకు కొత్త తరహాలో సహజమైన పళ్ల రసాల నుంచి ఐస్‌క్రీమ్‌లు తయారు చేస్తున్నారు. వీటిని ఆరగించిన ఆహార ప్రియులు ఐస్ ఐపోతున్నారంటే నమ్మండి.. కొత్త తరహాలో మార్కెట్‌ను ఆక్రమించికుంటున్న ఆ ఆర్టిసానల్ ఉత్పత్తులపైనే ఈ కథనం...మనకు గతంలో ఇంపల్స్ ఐస్ క్రీమ్, టేక్–హోమ్ ఐస్ క్రీం అనే రెండు రకాలు అందుబాటులో ఉండేవి. వీటిలో టేక్–హోమ్ ఐస్ క్రీం మెజారిటీని మార్కెట్ వాటా కలిగి ఉండేది. అయితే ఈ మధ్యకాలంలో పుట్టుకొచి్చన ఆర్టిసానల్ ఐస్ క్రీమ్‌లు శరవేగంగా పుంజుకుంటున్నాయి. ఇటీవలి నివేదికల ప్రకారం కరోనా అనంతరం చలా కాలం తర్వాత గత వేసవిలో ఆర్టిసానల్ ఐస్‌క్రీమ్స్ తమ మార్కెట్‌ని భారీగా ఆక్రమించాయి. అదే ఊపు ఈ వేసవిలోనూ కొనసాగుతోందని విశ్లేషకులు చెబుతున్నారు.ఆర్టిసానల్ అదుర్స్...ఆర్టిసానల్ ఉత్పత్తులు కొన్నేళ్ల క్రితమే నగరవాసులకు అందుబాటులకి వచ్చాయి. ఇందులో పాలు, క్రీమ్, చక్కెర వంటి నాణ్యమైన, సహజమైన ఉత్పత్తులను ఉపయోగిస్తారు. వివిధ ప్లేవర్లు, కలర్ల కోసం పప్పులు, పండ్లను మాత్రమే ఉపయోగిస్తారు. ఉదాహరణకు స్ట్రాబెర్రీ అయితే స్ట్రాబెర్రీ పండ్లను, స్వీట్ పాన్ ఐస్‌క్రీమ్ అయితే స్వీట్పాన్ను, మ్యాంగో ఐస్‌క్రీమ్‌లో మామిడి పండ్లను వినియోగిస్తారు.అయితే ఫ్లేవర్డ్ ఉత్పత్తుల్లా ఇవి 6–24 నెలల వరకూ నిల్వ ఉండవు. కేవలం 5–10 వారాలు మాత్రమే ఉంటాయి. ఈ ఐస్‌క్రీమ్‌లలో ఎలాంటి రసాయనాలూ లేవని నిర్ధారించడానికి వీలుగా అధిక–గ్రేడ్ ప్యాకేజింగ్‌లో వస్తాయి. గడ్డకట్టే ముందు, ఐస్‌క్రీం మిశ్రమాన్ని అధిక ఉష్ణోగ్రతల వద్ద ఉంచడం వల్ల ఇవి సురక్షితంగా బ్యాక్టీరియా రహితంగా మారతాయి.ఆర్టిసానల్కే ఆదరణ.. రుచితోపాటు ఆరోగ్యానికీ ప్రాధాన్యత ఇస్తున్నారు ఆహారప్రియులు. ఖరీదులో భారీ వ్యత్యాసం ఉన్నప్పటికీ ఆర్టిసనాల్ ఐస్క్రీమ్లనే ఇష్టపడుతున్నారు. ఒబెసిటీ సహా మరే ఇతర సమస్యలకూ దోహదం చేసే అవకాశం లేకపోవడం, పైగా పండ్లు, నట్స్ (పప్పులు) వంటివి వీటిలో విరివిగా వాడడం ఆరోగ్యానికి లాభదాయకం.– ఎ. ప్రవీణ్‌కుమార్, సి గుస్తా ఐస్‌క్రీమ్ పార్లర్విస్తృత శ్రేణి రుచులు..ఎటువంటి భయాలు లేకుండా వినియోగదారులు తమ ఉత్పత్తులనే ఎంచుకోవాలనే లక్ష్యంతో పలు ఐస్‌క్రీమ్ బ్రాండ్స్ ఇప్పుడు ఇదే బాట పట్టాయి. దీంతో ఇవి 1–2 రుచులకు మాత్రమే పరిమితం కాకుండా వి్రస్తుతశ్రేణిలో లభ్యమవుతున్నారు. వినియోగదారుల అభిరుచులకు తగ్గట్టుగా ఐస్ క్రీం తయారీదారులు డైరీ–ఫ్రీ నుంచి షుగర్–ఫ్రీ వరకూ ఆరోగ్యకరమైన ఉత్పత్తులపై దృష్టి సారిస్తున్నారు.ఆరోగ్య స్పృహ కలిగిన యువత, మంచి రుచిని ఆస్వాదించాలనే వ్యక్తులను లక్ష్యంగా చేసుకుని, తక్కువ కేలరీల ఐస్‌క్రీమ్ బార్లను కూడా పలు బ్రాండ్స్ అందిస్తున్నాయి. అలాంటి ఉత్పత్తుల్లో ప్రతి సరి్వంగ్కు కేవలం 89–99 కేలరీలు మాత్రమే ఉంటాయి. ఇతర సాధారణ ఐస్‌క్రీమ్‌లతో పోలిస్తే వీటిలో కొవ్వు 60% తక్కువగా ఉంటుంది. రకరకాల థీమ్‌లతో..నాంపల్లిలో రద్దీగా ఉండే ముజంజాహీ మార్కెట్ ప్రాంతంలో హ్యాండ్‌మేడ్ ఐస్‌క్రీమ్స్ లభిస్తున్నాయి. విశేషమేమిటంటే ఇక్కడ నాలుగు తరాల నుంచి నడుస్తున్న ఐస్ క్రీమ్ పార్లర్లు ఉన్నాయి. అంతేగాకుండా ఇక్కడ సీటింగ్ యూరప్ దేశాలను గుర్తుకుతెస్తోంది. అదే విధంగా జూబ్లీహిల్స్‌లోని డా.ఐస్ క్రీం పార్లర్, దాని పేరుకు తగ్గట్టుగా డాక్టర్ థీమ్‌తో ఉండే ఈ పార్లర్లో ఇక్కడ కొన్ని టాపింగ్స్ సిరంజిలను ఉపయోగించి మరీ అందిస్తారు.వనిల్లా, చాక్లెట్ తదితర రుచుల నుంచి బిర్యానీ ఫ్లేవర్ వరకూ వెరైటీ రుచులకు ఇది ప్రసిద్ధి. అలాగే జూబ్లీహిల్స్లోనే ఉన్న మిలానో ఐస్‌క్రీమ్, అబిడ్స్‌లోని సాఫ్ట్ డెన్, రోస్ట్, సిగుస్తా, ఆల్మండ్ హౌస్.. వంటివి హెల్ధీ ఐస్క్రీమ్స్కి చిరునామాగా ఉన్నాయి. యూరోపియన్ శైలిలో అందిస్తే వీటినే ఇటాలియన్ నామం జిలాటోగా పేర్కొంటారు.వీటితో ప్రమాదం..సాధారణంగా మనకు పరిచయమున్న ఐస్‌క్రీమ్స్ ఒబెసిటీ తదితర జీవనశైలి వ్యాధులతో పాటు మరిన్ని ఆరోగ్య సమస్యలను తెచి్చపెట్టే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. దీంతోపాటు ఎక్కువ కాలం నిల్వ ఉండటానికి వీటికి రకరకాల రసాయనాలను మేళవించాల్సి ఉంటుంది. అలాగే ఐస్ స్ఫటికాలు ఏర్పడకుండా ఉండేందుకు ఐస్ క్రీములకు కారాజెనన్, ఎల్బిజి, గ్వార్, అకేసియా వంటివి కలుపుతారు. కొన్నిసార్లు మోనో–డిగ్లిజరైడ్స్ను కూడా కలుపుతారు.ఇవి చదవండి: బోటీ.. లొట్టలేసీ..! 25 ఏళ్లుగా చెరగని టేస్ట్..!! -
పంట ఏదైనా.. ఎత్తుమడులే మేలు!
భరించలేని ఎండలతో జనాన్ని భీతిల్లజేసిన ఎల్‌నినో ముగిసింది. అధిక వర్షాలతో కూడిన లానినాప్రారంభం కానున్న నేపథ్యంలో అధిక వర్షాలకు పంటలు తట్టుకునే వ్యూహాలు అవసరం. అందులో ముఖ్యమైనది.. ఎత్తుమడులు లేదా బోదెల (రెయిజ్డ్ బెడ్స్)పై పంటలు విత్తుకోవటం. అది ఎర్ర నేలైనా, నల్ల నేలైనా.. పత్తి, కంది, మిర్చి, పసుపు, సోయా, వేరుశనగ, కూరగాయలతో టు ఇంకా ఏ ఇతర ఆరుతడి పంటలైనా సరే ఎత్తుమడులపై విత్తుకుంటే నీటి ముంపు నుంచి, ఉరకెత్తటం, అతివృష్ఠి/ అనావృష్ఠి బాధల నుంచి రక్షణ పొందవచ్చని ఆదిలాబాద్ కేవీకే ప్రధాన శాస్త్రవేత్త డా. ప్రవీణ్‌కుమార్ రైతులకు సూచిస్తున్నారు.వర్షాలు తక్కువైనా, ఎక్కువైనా.. వర్షానికి వర్షానికి మధ్య ఎక్కువ రోజుల వ్యవధి వచ్చినా.. నల్ల రేగడైనా, ఎర్ర నేలైనా, బంక మట్టి అయినా సరే.. ఎత్తు మడులు చేసి లేదా బోదెలు తోలి పంటలు విత్తుకోవటం మేలని డా. ప్రవీణ్ కుమార్ గత కొన్ని సంవత్సరాలుగా రైతులకు చెబుతూ వస్తున్నారు.పత్తి సాగులో ఎత్తు మడి లాభాలు..అతివృష్ఠి సమయాల్లో పంటల సంరక్షణకు సమర్థవంతమైన మురుగు నీటి పారుదల వ్యవస్థ కీలకం. ఎత్తు మడుల పద్ధతిలో పత్తి సాగు చేయడం ద్వారా సమస్యలను అధిగమించవచ్చు. ఎత్తుమడులు చేసుకోవడానికి ట్రాక్టర్‌తో అనుసంధానం చేసే రిడ్జర్ లేదా బెడ్ మేకర్‌ను ఉపయోగిస్తారు. పత్తికి ఉద్దేశించిన మడి 15–20 సెం.మీ.ల ఎత్తు ఉంటుంది. మడి వెడల్పు నేల స్వభావం, ఆప్రాంతంలో నమోదయ్యే వర్షపాతాన్ని బట్టి ఎంత కావాలంటే అంత పెట్టుకోవచ్చు.ట్రాక్టర్ ద్వారా ఇలా ఎత్తు మడులు/బోదెలు తోలుకోవాలిపత్తి సాళ్ల మధ్య 180/ 150/ 120 సెం.మీ., మొక్కల మధ్య 30/20/30 సెం.మీ.ల దూరంలో పత్తి పంటను సాగు చేయవచ్చు. సాధారణంగా ఒక ఎకరంలో ఎత్తు మడులు చేయడానికి సుమారు 45 నిమిషాల నుంచి ఒక గంట సమయం పడుతుంది. ఎత్తు మడుల మీద విత్తిన విత్తనం సాధారణ ΄÷లంలో కన్నా ఒకటి రెండు రోజులు ముందే మొలకెత్తుతుంది. సాంప్రదాయ పద్ధతితో పోలిస్తే, మొలక శాతం ఎక్కువ. దాదాపు 90 శాతం విత్తనాలు మొలుస్తాయి.ఎత్తు మడుల వలన మురుగు నీటి వ్యవస్థ మెరుగవుతుంది. వర్షపు నీరు ΄÷లంలో నిలవకుండా, కాలువల ద్వారా బయటికి వెళ్లిపో తుంది. దీనివలన తొలిదశలో మొక్క పెరుగుదల కుంటుపడదు. భారీ వర్షాలు కురిసినప్పుడు నల్లరేగడి నేలల్లో వరద పారుతుంది. ఆ ప్రవాహంలో మొక్కలు కొట్టుకుపోకుండా ఎత్తు మడులు కాపాడుతాయి. వర్షాభావ పరిస్థితుల్లో మడుల్లో నిల్వ ఉండే తేమ పంటకు ఉపయోగపడుతుంది. సాంప్రదాయ పద్ధతిలో పత్తి మొక్కల కింది కొమ్మలకు మొదట్లో వచ్చే 5 నుండి 10 కాయలు కుళ్లాపోతూ ఉంటాయి.ఎత్తుమడులు చేయడం వల్ల గాలి, వెలుతురు బాగా తగిలి కాయకుళ్లు, ఇతర చీడడీడల ఉధృతి తక్కువగా ఉంటుంది. యాంత్రీకరణ ద్వారా కలుపు యాజమాన్యం సులభమవుతుంది. సాధారణ పద్ధతితో పోలిస్తే ఎత్తు మడుల పద్ధతిలో 10–20 శాతం అధిక దిగుబడులు సాధించవచ్చు. నల్లరేగడి నేలలు, తేలికపాటి ఎర్రనేలల్లో ఎత్తు మడుల పద్ధతిలో పత్తిని సాగు చేయవచ్చు. పత్తిలో అంతరపంటగా కందిని విత్తు కుంటే, ఒకవేళ ఏ కారణంగానైనా ఒక పంట దెబ్బతింటే, మరో పంట రైతును ఆదుకుంటుంది.ఇతర వివరాలకు డా. ప్రవీణ్ కుమార్‌ను 99896 23829 నంబరులో సంప్రదించవచ్చు. ఎత్తు మడులపై పత్తి పంటను విత్తుకునే మెళకువలను తెలిపే వీడియో ‘కేవీకే ఆదిలాబాద్’ యూట్యూబ్ ఛానల్లో ఉంది. ఈ క్యూఆర్ కోడ్‌ను స్మార్ట్ ఫోన్‌తో స్కాన్ చేసి చూడొచ్చు. – డా. ప్రవీణ్ కుమార్ -
తిరుపతిలో 144 సెక్షన్ కొనసాగింపు
తిరుపతి అర్బన్: శాంతి భద్రతలకు అత్యంత ప్రాధాన్యత కల్పించాల్సి ఉందని తిరుపతి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ తెలిపారు. బుధవారం ఆయన జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ పటేల్‌తో కలిసి శ్రీపద్మావతి మహిళా వర్సిటీలోని ఇంజినీరింగ్ కళాశాలలో ఈవీఎంలను భద్రపరచిన స్ట్రాంగ్ రూమ్ ప్రాంతాన్ని పరిశీలించారు. అక్కడి అధికారులకు భద్రతా అంశాలపై పలు సూచనలు చేశారు. ఎన్నికల కోడ్ జూన్ 6 వరకు కొనసాగుతుందన్నారు. జిల్లావ్యాప్తంగా ఈ నెల 14వ తేదీ సాయంత్రం 6 గంటల నుంచి 144 సెక్షన్‌ను విధించినట్లు చెప్పారు. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు 144 సెక్షన్ కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఎన్నికల ముందే కాకుండా ఎన్నికల తర్వాత కూడా ప్రశాంతమైన వాతావరణం కల్పించాల్సిన బాధ్యతను గుర్తు చేశారు. అనవసరంగా వివాదాల జోలికి వెళ్లి భవిష్యత్‌ను నాశనం చేసుకోవద్దని సూచించారు. 144 సెక్షన్ నేపథ్యంలో డ్రోన్లు ఎగుర వేస్తే చర్యలు తప్పవని, సభలు, సమావేశాలకు అనుమతి లేదని చెప్పారు. చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలుంటాయన్నారు. పోలీసులు జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక నిఘా పెట్టారని తెలిపారు. -
ప్యాకేజీల కోసం కాదు.. ప్రజాసేవ కోసమే బీఆర్ఎస్ లోకి
-
ఆకాశం నుంచి ఊడిపడ్డాడా?.. రిటైర్ అయితే బెటర్..
భారత క్రికెట్ నియంత్రణ మండలి తీరుపై టీమిండియా మాజీ పేసర్ ప్రవీణ్ కుమార్ మండిపడ్డాడు. ఆటగాళ్లందరినీ బోర్డు సమానంగా చూడాలన్నాడు. అంతేగానీ.. ఒకరు ఎక్కువ.. మరొకరు తక్కువ అనే విధంగా వ్యహరించకూడదని హితవు పలికాడు. కాగా జాతీయ జట్టు తరఫున విధుల్లో లేనపుడు సెంట్రల్ కాంట్రాక్ట్ ఆటగాళ్లంతా రంజీ ట్రోఫీలో ఆడాలని బీసీసీఐ ఇటీవల నిబంధన విధించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో బోర్డు ఆదేశాలను ధిక్కరించారనే ఆరోపణల నేపథ్యంలో మిడిలార్డర్ స్టార్ శ్రేయస్ అయ్యర్, ఓపెనర్ ఇషాన్ కిషన్ల కాంట్రాక్టులు రద్దు చేసింది. దీంతో బీసీసీఐ తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. రెడ్‌బాల్ క్రికెట్‌కు దూరంగా ఉంటున్న హార్దిక్ పాండ్యాకు మాత్రం మినహాయింపులు ఎందుకు ఇచ్చారని ఇర్ఫాన్ పఠాన్ వంటి మాజీ ప్లేయర్లు బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మాజీ పేసర్ ప్రవీణ్ కుమార్ సైతం ఘాటు వ్యాఖ్యలు చేశాడు. ఆకాశం నుంచి ఊడిపడ్డాడా?.. ‘‘హార్దిక్ పాండ్యా ఏమైనా ఆకాశం నుంచి ఊడిపడ్డాడా? అతడు కూడా రంజీలు ఆడాల్సిందే. అతడి ఒక్కడికి మాత్రం రూల్స్ మారిపోతాయా? తప్పకుండా ఆడాల్సిందేనంటూ బోర్డు అతడిని బెదిరించాలి. అతడు కేవలం దేశవాళీ టీ20 టోర్నీలు ఆడితే చాలదు! మూడు ఫార్మాట్లలోనూ ఆడాలి కదా.. జట్టుకు అతడికి అవసరం ఉంది. ఒకవేళ తాను టెస్టులకు పూర్తిగా దూరమవ్వాలని నిర్ణయించుకుంటే రాతపూర్వకంగా బోర్డుకు లేఖ సమర్పించాలి. రిటైర్ అయితే బెటర్.. తాను పూర్తిగా ఈ ఫార్మాట్ నుంచి తప్పుకొంటున్నట్లు ప్రకటించాలి. అంతేగానీ.. విషయంపై ఎటూ తేల్చకుండా నాన్చితే ఎలా? ఒకవేళ అతడు టీ20 జట్టుకు మాత్రమే అతిపెద్ద ఆస్తి అని బీసీసీఐ భావిస్తే.. ఆ విషయాన్ని కూడా స్పష్టంగా చెప్పాలి. ప్రతి ఆటగాడి విషయంలోనూ బీసీసీఐ ఇదే విధానం పాటిస్తే పారదర్శకంగా ఉంటుంది’’ అని ప్రవీణ్ కుమార్ ఓ యూట్యూబ్ చానెల్లో ఈ మేరకు వ్యాఖ్యానించాడు. టెస్టు ఫార్మాట్లో ఆడకూడదని నిర్ణయించుకుంటే.. హార్దిక్ పాండ్యా రిటైర్మెంట్ ప్రకటించడమే సబబుగా ఉంటుందని అభిప్రాయపడ్డాడు. కాగా హార్దిక్ పాండ్యా బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితాలో ‘ఎ’ గ్రేడ్‌లో ఉన్నాడు. ముంబై సారథిగా ఈ క్రమంలో.. వార్షిక వేతనంగా రూ. 5 కోట్లు అందుకుంటున్నాడు. గాయం కారణంగా వన్డే వరల్డ్‌కప్-2023 టోర్నీ మధ్యలోనే నిష్క్రమించిన అతడు.. ఐపీఎల్-2024తో రీఎంట్రీ ఇవ్వనున్నాడు. ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా కొత్త పాత్రలో కనిపించనున్నాడు. ఇక గాయం నుంచి కోలుకున్న తర్వాత డీవై పాటిల్ టోర్నీలో హార్దిక్ పాండ్యా ఆడిన విషయం తెలిసిందే. చదవండి: IPL 2024- RCB: విరాట్ కోహ్లి లేకుండానే.. -
తెలంగాణను కాపాడేందుకే బీఆర్ఎస్తో పొత్తు: ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్
-
‘రోహిత్ శర్మ ఆటగాళ్లను అందుకే తిడతాడు’
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మపై భారత మాజీ పేసర్ ప్రవీణ్ కుమార్ ప్రశంసలు కురిపించాడు. అతడొక అద్భుతమైన నాయకుడని.. జట్టును ముందుకు నడిపించడంలో తనకు తానే సాటి అని కొనియాడాడు. సౌరవ్ గంగూలీ లాంటి క్రమక్రమంగా వాళ్లు పటిష్ట జట్టు నిర్మిస్తే.. రోహిత్ శర్మ తనకు తానుగా జట్టును క్రియేట్ చేసుకున్న ఘటికుడని పేర్కొన్నాడు. అనుభవజ్ఞులు, యువ ఆటగాళ్ల మేళవింపుతో కూడిన టీమ్‌ను సమర్థవంతంగా నడిపిస్తున్న తీరు అమోఘమని ప్రశంసించాడు. రన్‌మెషీన్ విరాట్ కోహ్లి నుంచి భారత కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత రోహిత్ శర్మ పరిమిత ఓవర్ల ద్వైపాక్షిక సిరీస్‌లలో దుమ్ములేపాడు. ముఖ్యంగా పొట్టి ఫార్మాట్లో టీమిండియాను తిరుగులేని జట్టుగా మార్చాడు. కానీ.. టీ20 వరల్డ్‌కప్-2022 టైటిల్ మాత్రం గెలవలేకపోయాడు. అంతేకాదు.. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్లోనూ రోహిత్ శర్మ సేనకు పరాభవం తప్పలేదు. ఇక వన్డేల్లోనూ అదే తరహా దురదృష్టం వెంటాడింది. ద్వైపాక్షిక సిరీస్‌లో సత్తా చాటడం సహా సొంతగడ్డపై అపజయమన్నది ఎరుగక వన్డే ప్రపంచకప్-2023 ఫైనల్ దాకా వెళ్లినా.. రన్నరప్‌తోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో రోహిత్ శర్మ కెప్టెన్సీపై విమర్శలు వచ్చినా.. జట్టును నడిపించిన తీరు బాగుందని ప్రవీణ్ కుమార్ టైమ్స్ ఆఫ్ ఇండియాతో పేర్కొన్నాడు. ‘‘సౌరవ్ గంగూలీ జట్టును నిర్మించాడు. కానీ రోహిత్ తనకంటూ కొత్త జట్టును క్రియేట్ చేసుకున్నాడు. సహచర ఆటగాళ్లతో తనొక స్నేహితుడిలా మెలుగుతాడు. వాళ్లు తప్పుచేసినప్పుడు మాత్రమే తిడతాడు. మళ్లీ వెంటనే వెళ్లి ఆత్మీయంగా హత్తుకుంటాడు కూడా! కెప్టెన్‌గా వాళ్లకు ఆదేశాలు ఇస్తూనే మైదానంలో స్వేచ్ఛగా కదిలే వెసలుబాటు కూడా కల్పిస్తాడు’’ అని ప్రవీణ్ కుమార్ రోహిత్ కెప్టెన్సీ తీరును ప్రశంసించాడు. కాగా స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌తో రోహిత్ శర్మ బిజీగా ఉన్నాడు. కోహ్లి, కేఎల్ రాహుల్, మహ్మద్ షమీ వంటి సీనియర్లు లేకుండానే ఇప్పటికే ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 3-1తో గెలిచాడు. చదవండి: IPL 2024: లక్నో అభిమానులకు గుడ్‌న్యూస్.. కెప్టెన్ వచ్చేశాడు! -
పశుసంవర్థక శాఖ డైరెక్టర్‌గా మంజువాణి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పశుసంవర్థక శాఖ డైరెక్టర్‌గా డాక్టర్ జి.మంజువాణి నియమితులయ్యారు. ప్రస్తుతం డైరెక్టర్‌గా ఉన్న డాక్టర్ ఎస్.రాంచందర్‌ను బదిలీ చేసిన ప్రభుత్వం, ఆయన స్థానంలో మంజువాణిని నియమించింది. ఈ మేరకు పశుసంవర్థక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అధర్ సిన్హా సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వుల ప్రకారం మంజువాణి తెలంగాణ రాష్ట్ర గొర్రెలు, మేకల అభివృద్ధి సహకార సమాఖ్య మేనేజింగ్ డైరెక్టర్‌గా కొనసాగుతారు. డాక్టర్ ఎస్.రాంచందర్‌ను తెలంగాణ పశుగణాభివృద్ధి సంస్థ (టీఎల్‌ఎస్‌డీఏ) సీఈవోగా నియమించారు. కాగ్ నివేదిక నేపథ్యంలో! పశుసంవర్థక శాఖ ఆధ్వర్యంలో గొర్రెల పంపిణీలో జరిగిన కుంభకోణం కారణంగానే ఈ బదిలీలు జరిగాయనే చర్చ సాగుతోంది. గొర్రెల పంపిణీలో చాలా అవకతవకలు జరిగాయని, బైక్‌లపై కూడా గొర్రెలను తీసుకొచ్చారని ఇటీవల కాగ్ తన నివేదికలో వెల్లడించిన నేపథ్యంలో ఉన్నతాధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది. గిరిజన బిడ్డ కావడమే నేరమా?: ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ పశుసంవర్థక శాఖలో జరిగిన బదిలీలపై రాష్ట్ర బహుజన సమాజ్‌పార్టీ అధ్యక్షుడు ఆర్.ఎస్. ప్రవీణ్‌కుమార్ స్పందించారు. నిజాయితీకి మారుపేరైన రాంచందర్‌ను ఆగమేఘాల మీద బదిలీ చేసి బలిపశువును చేశారని, ఆయన తెలంగాణ తండాలలో జని్మంచిన గిరిజన బిడ్డ కావడమే నేరమా అని ఆయన ఎక్స్ వేదికగా ప్రశ్నించారు. ‘గొర్రెల కుంభకోణంలో కీలక పాత్ర పోషించిన మాజీ మంత్రులను, వారి ఓఎస్డీలను, అప్పటి డైరెక్టర్లను ముట్టుకునే దమ్ముందా మీకు? ’అని ప్రభుత్వాన్ని నిలదీశారు. -
రోహిత్‌ను అసభ్యంగా దూషించారు: మాజీ పేసర్ షాకింగ్ కామెంట్స్
'Our Own Abuse Us': ‘‘సాధారణంగా నేను ఎవరితోనూ గొడవ పెట్టుకోను. మెల్బోర్న్లో అనుకుంటా.. ఆరోజు నేను, రోహిత్ శర్మ, మనోజ్ తివారి ఉన్నాం. నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తున్నాం. అప్పుడే అక్కడికి వచ్చిన కొంతమంది ఎందుకో మమ్మల్ని దుర్భాలాషడటం మొదలుపెట్టారు. వాళ్లు టీమిండియా అభిమానులమని చెప్పుకొంటున్నారు. కానీ.. రోహిత్ శర్మను అసభ్య పదజాలంతో దూషించారు. అయినా తను చాలాసేపు ఓపిక పట్టాడు. కానీ వాళ్ల ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో రోహిత్ సహనం కట్టలు తెంచుకుంది. తను కూడా వాళ్లకు తిరిగి బదులివ్వడం మొదలుపెట్టాడు. నేను కూడా తనతో కలిసి వారి మాటకు మాటా సమాధానం చెప్పాను. కానీ ఎందుకో సొంత అభిమానులే మమ్మల్ని దూషించడం బాధించింది’’ అంటూ టీమిండియా మాజీ పేసర్ ప్రవీణ్ కుమార్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. అభిమానులమని చెప్పుకొంటూనే దూషిస్తూ ఆస్ట్రేలియా టూర్‌కు వెళ్లినపుడు తమకు ఎదురైన చేదు అనుభవం గురించి గుర్తు చేసుకున్నాడు. రోహిత్ శర్మను అకారణంగా కొంతమంది దూషించారని వారికి తామిద్దరం కలిసి గట్టిగానే బదులిచ్చామని ప్రవీణ్ కుమార్ పేర్కొన్నాడు. అభిమానులమని చెప్పుకొనే కొంతమంది ఆరోజు హిట్‌మ్యాన్‌కు కించపరిచే విధంగా వ్యవహరించారని తెలిపాడు. సంచలన వ్యాఖ్యలతో వార్తల్లో కాగా ది లలన్‌టాప్‌నకు ఇస్తున్న ఇంటర్వ్యూలో భాగంగా సంచలన వ్యాఖ్యలు చేస్తూ గత కొన్ని రోజులుగా ప్రవీణ్ కుమార్ వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే. టీమిండియాలో చాలా మందికి మద్యం సేవించే అలవాటు ఉన్నా ఓ సీనియర్ ప్లేయర్ మాత్రం తన పేరును హైలైట్ చేశాడని ప్రవీణ్ ఆరోపించాడు. అదే విధంగా చెప్పినట్లు వినకపోతే ఐపీఎల్లో తనకు అవకాశాలు రాకుండా చేస్తానని మాజీ చైర్మన్ లలిత్ మోదీ వార్నింగ్ ఇచ్చాడని ప్రవీణ్ పేర్కొన్నాడు. ఇక బౌలర్లంతా అప్పుడప్పుడు టాంపరింగ్‌కు పాల్పడతారని.. అయితే పాకిస్తాన్ బౌలర్లు మాత్రం ఎక్కువగా ఇలాంటి పనులు చేస్తారని ఆరోపణలు గుప్పించాడు. రీఎంట్రీకి సిద్ధమైన రోహిత్ కాగా 37 ఏళ్ల ప్రవీణ్ కుమార్ టీమిండియా తరఫున అంతర్జాతీయ స్థాయిలో ఆరు టెస్టు, 68 వన్డే, 10 టీ20 మ్యాచ్‌లు ఆడి.. మొత్తంగా 112 వికెట్లు పడగొట్టాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో 119 మ్యాచ్‌లలో కలిపి 90 వికెట్లు తీశాడు. ఇక 2017లో తన చివరి మ్యాచ్ ఆడిన ప్రవీణ్ ఆ తర్వాత ఆటకు గుడ్‌బై చెప్పాడు. ఇదిలా ఉంటే.. రోహిత్ శర్మ ప్రస్తుతం అఫ్గనిస్తాన్‌తో సిరీస్‌కు సిద్ధమైన విషయం తెలిసిందే. సొంతగడ్డపై జరుగుతున్న ఈ సిరీస్ ద్వారా దాదాపు 14 నెలల తర్వాత హిట్‌మ్యాన్ అంతర్జాతీయ టీ20లలో రీఎంట్రీ ఇస్తున్నాడు. చదవండి: Ishan Kishan: అప్పటి వరకు ఇషాన్‌కు టీమిండియాలో స్థానం లేదు.. హింటిచ్చిన ద్రవిడ్ -
అందరూ అలాంటోళ్లే... బద్నామైంది మాత్రం నేనొక్కడిని!
టీమిండియాలో అందరూ తాగేవాళ్లే.. ఈ వ్యాఖ్యలు చేసింది ఎవరో సాదాసీదా వ్యక్తి కాదు. 2007-12 మధ్యలో టీమిండియా అత్యుత్తమ స్వింగ్ బౌలర్‌గా గుర్తింపు తెచ్చుకున్న యూపీ ఆటగాడు ప్రవీణ్ కుమార్. ఐదేళ్ల పాటు టీమిండియాలో తిరుగులేని బౌలర్‌గా, ఆతర్వాత ఐపీఎల్లో అత్యుత్తమ పేసర్‌గా చలామణి అయిన ప్రవీణ్ ఆ తర్వాత వివిధ కారణాల చేత కనుమరుగయ్యాడు. ప్రస్తుతం రాజకీయాల్లో ఉన్న ప్రవీణ్.. తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నాటి తన సహచరులపై వివాదాస్పద ఆరోపణలు చేసి వార్తల్లోకెక్కాడు. లల్లన్‌టాప్ అనే యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రవీణ్ మాట్లాడుతూ.. ఐపీఎల్ సృష్టికర్త లలిత్ మోదీ, నాటి తన టీమిండియా సహచరులు, ప్రత్యేకించి ఓ సీనియర్ ఆటగాడిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. అలాగే పాకిస్తాన్ ఆటగాళ్లపై కూడా ప్రవీణ్ సంచలన ఆరోపణలు చేశాడు. టీమిండియాలో చేరిన కొత్తలో పలువురు సీనియర్లు తనను మద్యం సేవించడం మానుకోవాలని సూచించారని ప్రవీణ్ అన్నాడు. తనకున్న మద్యం అలవాటు కారణంగా ఓ సీనియర్ తనను ప్రత్యేకించి బద్నాం చేసేవాడని ఆరోపించాడు. జట్టులో అందరూ తాగేవాళ్లే అయినప్పటికీ తన పేరును మాత్రమే హైలైట్ చేసేవారని వాపోయాడు. ఐపీఎల్లో తనకు కోచింగ్ అవకాశాలు రాకపోవడంపై కూడా ప్రవీణ్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. తాగుతానని సాకుగా చూపి తన సొంత జట్టు ఉత్తరప్రదేశ్ సైతం తనను పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. గ్రౌండ్లో కాని డ్రెస్సింగ్ రూమ్‌లో కాని తాను తాగలేదు కదా అని ఎదురు ప్రశ్నించాడు. సరైన గుర్తింపు లేక, అవకాశాలు రాక, కనీసం పలకరించే వారు లేక ఓ దశలో డిప్రెషన్లోకి వెళ్లిపోయానని తెలిపాడు. ఐపీఎల్లో ఆర్సీబీకి ఆడకపోతే తన కెరీర్‌ను నాశనం చేస్తానని నాటి ఐపీఎల్ చైర్మన్ లలిత్ మోదీ వార్నింగ్ ఇచ్చాడని బాంబు పేల్చాడు. తన సొంత పట్టణం మీరట్ అయిన కారణంగా తాను ఢిల్లీ డేర్‌డెవిల్స్‌కు ఆడాలనుకున్నానని, అయినా తన అభ్యర్ధనను లలిత్ మోదీ పట్టించుకోకుండా బలవంతంగా ఆర్సీబీతో ఒప్పందం కుదిర్చాడని ఆరోపించాడు. పాకిస్తాన్ బౌలర్లు ఎక్కువగా బాల్ టాంపరింగ్‌కు పాల్పడేవారని ప్రవీణ్ ఆరోపించాడు. దాదాపుగా ప్రతి బౌలర్ కొద్దోగొప్పో బాల్ టాంపరింగ్ చేస్తాడని, పాక్ బౌలర్లు కాస్త ఎక్కువగా చేసే వారని ప్రవీణ్ అన్నాడు. పాక్ ఆటగాళ్లు పైకి ఒకలా లోపల మరోలా ఉండేవారని, వారు ఎక్కువగా అబద్దాలాడేవారని తెలిపాడు. 37 ఏళ్ల ప్రవీణ్‌కు అప్పట్లో అత్యుత్తమ స్వింగ్ బౌలర్‌గా గుర్తింపు ఉండేది. ప్రవీణ్ టీమిండియా తరఫున 6 టెస్ట్‌లు, 68 వన్డేలు, 10 టీ20లు ఆడాడు. అన్ని ఫార్మాట్లలో కలిపి ప్రవీణ్ 112 వికెట్లు పడగొట్టాడు. ప్రవీణ్ ఐపీఎల్లో పలు ఫ్రాంచైజీల తరఫున 119 మ్యాచ్‌లు ఆడి 90 వికెట్లు పడగొట్టాడు. ప్రవీణ్ చివరిసారిగా 2017లో ఐపీఎల్లో ఆడాడు. ఆతర్వాత అవకాశాలు రాకపోవడంతో అతను క్రికెట్లోని అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకున్నాడు. ప్రస్తుతం ప్రవీణ్ కుమార్ రాజకీయాల్లో ఉన్నాడు. అతను గత యూపీ అసెంబ్లీ ఎన్నికల ముందు సమాజ్‌వాది పార్టీలో చేరాడు. -
ఎస్పీ ప్రవీణ్‌కుమార్ బదిలీ
నిర్మల్: ఎస్పీ సీహెచ్ ప్రవీణ్‌కుమార్ బదిలీ అయ్యా రు. కొత్త ఎస్పీగా జీ జానకీషర్మిల నియమితులయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా పోలీస్ అధికారులను బది లీ చేస్తూ బుధవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లా నాలుగో ఎస్పీగా తొలిసారి మహిళా అధికారి నియమితులయ్యారు. తెలంగాణ స్టేట్ పోలీస్ అకాడమీ డిప్యూటీ డైరెక్టర్‌గా ఉన్న జానకీషర్మిలను ఎస్పీగా నియమించారు. ప్రస్తుతం బదిలీపై వెళ్తున్న ఎస్పీ ప్రవీణ్‌కుమార్‌కు కొత్త ఎస్పీ శాఖాపరంగా ఒక ఏ డాది సీనియర్. తన జూనియర్ స్థానంలోకి వస్తున్న ఈ సీనియర్ అధికారి రాష్ట్ర ఇంటెలిజెన్స్ విభాగంలో ఉన్నప్పుడు ఉమ్మడి ఆదిలాబాద్ పరిధిని చూసి న అనుభవం ఉంది. జిల్లా మూడో ఎస్పీగా 2021 మార్చి 14 చల్లా ప్రవీణ్‌కుమార్ నియమితులై మూ డేళ్లు సేవలందించారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో మూడేళ్లు నిండుతున్న అధికారుల బదిలీల్లో భాగంగా ప్రవీణ్‌కుమార్‌ను బదిలీ చేశారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలోని ఎల్బీనగర్ జోన్ డీసీపీగా బదిలీపై వెళ్తున్నారు. జిల్లాపై తనదైన ముద్ర జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణతో పాటు పారదర్శక పోలీస్ విధుల్లో ప్రవీణ్‌కుమార్ తనదైన ముద్రవేశారు. మూడేళ్ల కాలంలో ఎదురైన పలు ఘటనలు, అసెంబ్లీ ఎన్నికలనూ సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. పోలీసుల సంక్షేమానికీ తనవంతు కృషిచేశారు. జిల్లాకేంద్రంలో పోలీస్ పెట్రోల్‌బంక్, ప్రత్యేక పోలీస్ క్యాంటిన్ తీసుకువచ్చారు. జానకీషర్మిల బయోడేటా 2007 మే 31న గ్రూప్–1 ద్వారా డీఎస్పీగా ఎంపిక. 2009 మార్చిలో ఉమ్మడిరాష్ట్రంలో గ్రేహౌండ్స్ అసాల్ట్ కమాండర్‌గా నియామకం. 2009 జులైలో కొవ్వూరు డీఎస్పీగా.. 2009 నవంబర్‌లో రాజమండ్రి అర్బన్ సెంట్రల్‌జోన్ డీఎస్పీగా.. 2011లో రాజమండ్రి అడిషనల్ ఎస్పీగా పదోన్నతి. 2012లో సైబరాబాద్ క్రైమ్స్ అడిషనల్ డీసీపీగా బదిలీ. 2013లో కన్ఫర్డ్ ఐపీఎస్‌గా ఉత్తర్వులు. 2015లో హైదరాబాద్ నార్త్‌జోన్ రీజినల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్‌గా.. 2016లో ఆర్బీవీఆర్ఆర్ తెలంగాణ స్టేట్ పోలీస్ అకాడమీ అసిస్టెంట్ డైరెక్టర్‌గా బదిలీ. 2017లో సైబరాబాద్ క్రైమ్స్ డీసీపీగా పదోన్నతి. 2018లో ఆర్బీవీఆర్ఆర్ తెలంగాణ స్టేట్ పోలీస్ అకాడమీ డిప్యూటీ డైరెక్టర్‌గా బదిలీ. 2024లో నిర్మల్ ఎస్పీగా బదిలీ. -
సిర్పూర్ పైనే ఏనుగంత ఆశ!
సాక్షి, హైదరాబాద్: బహుజన వాదం నినాదంతో రాష్ట్రంలో వేళ్లూనుకోవాలని ఆశపడ్డ బహుజన సమాజ్ పార్టీ ఎన్నికల ఫలితాల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తోంది. స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన ఐపీఎస్ అధికారి ఆర్.ఎస్. ప్రవీణ్‌కుమార్ బీఎస్పీలో చేరి గత రెండేళ్లుగా పార్టీని బలోపేతం చేసేందుకు శాయశక్తులా కృషి చేశారు. శాసనసభ ఎన్నికల్లో ఆయన స్వయంగా ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నుంచి పోటీ చేయడమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులను బరిలోకి దించారు. సిర్పూరులో విజయం సాధిస్తామనే అంచనాతో పాటు పలు నియోజకవర్గాల్లో గెలుపు ఓటములను ప్రభావితం చేసే స్థాయిలో ఓట్లు సాధిస్తుందని ఆ పార్టీ లెక్కలు వేస్తోంది. రాష్ట్రంలో తొలిసారిగా 10 శాతం ఓట్లు సాధించడం లక్ష్యంగా బరిలోకి దిగినట్లు పార్టీ అంతర్గత సమావేశాల్లో చెపుతూ వచ్చారు. ఇందులో భాగంగానే పకడ్బందీగా అభ్యర్థులను ఎంపిక చేసి పలు నియోజకవర్గాల్లో ప్రధాన పార్టీల అభ్యర్థులను భయపెట్టారనే చెప్పాలి. ఆ మూడు పార్టీలు చీల్చుకునే ఓట్లపై.. సిర్పూరులో సిట్టింగ్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, బీజేపీ అభ్యర్థి పాల్వాయి హరీశ్‌బాబు, కాంగ్రెస్ అభ్యర్థి రావి శ్రీనివాస్‌లకు పార్టీ అభ్యర్థి ఆర్.ఎస్. ప్రవీణ్‌కుమార్ ప్రచారం నుంచే గట్టిపోటీ ఇచ్చారు. దళిత, గిరిజనులు, బుద్ధిస్టుల ఓట్లతో పాటు ఎమ్మెల్యే కోనేరు కోనప్ప పట్ల నెలకొన్న వ్యతిరేకత తనకు కలిసి వస్తుందని ఆయన భావిస్తున్నారు. అదే స్థాయిలో ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేశారు. ఈ మేరకు ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్కు దీటుగా ఓట్లు పోలయినట్లు ఆపార్టీ అంచనా వేస్తోంది. బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ ఓట్లు పంచుకుంటే బీఎస్పీ విజయం సాధిస్తుందని ఆ పార్టీ నాయకులు విశ్లేషిస్తున్నారు. అయితే పోలింగ్ రోజు బీజేపీకి భారీగా ఓట్లు పోలవడం కొంత అనుమానాలకు తావిస్తుందనే ప్రచారం జరుగుతోంది. ఈ నియోజకవర్గాల్లో గట్టి పోటీ సిర్పూర్‌తో పాటు చివరి నిమిషంలో బీఎస్పీ నుంచి పోటీ చేసిన కాంగ్రెస్ నాయకుడు నీలం మధు, పెద్దపల్లి నుంచి బరిలో నిలిచిన దాసరి ఉష, సూర్యాపేట నుంచి వట్టె జానయ్య యాదవ్, నకిరేకల్ నుంచి పోటీ చేసిన మేడి ప్రియదర్శిని, ఆలంపూర్ నుంచి బరిలోకి దిగిన ప్రవీణ్‌కుమార్ సోదరుడు ఆర్. ప్రసన్న కుమార్ ప్రధాన పార్టీలకు గట్టి పోటీ ఇచ్చినట్లు పార్టీ భావిస్తోంది. ఈ నియోజకవర్గాలలో గెలవక పోయినా ప్రత్యర్థి పార్టీల ఓటములను నిర్దేశించే స్థితిలో ఓట్లు సాధిస్తుందని భావిస్తున్నారు. కాగా పోటీ చేసిన ఇతర నియోజకవర్గాలలో కూడా పార్టీ మెరుగైన ఓట్లను సాధించడం ద్వారా రాష్ట్రంలో ఓటింగ్ శాతాన్ని మెరుగు పరుచుకుంటుందని ఆ పార్టీ అధ్యక్షుడు ప్రవీణ్‌కుమార్ భావిస్తున్నారు. -
ప్రజాగొంతుకనై ఉంటా!
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల అనంతరం కొత్త ప్రభుత్వ ఏర్పాటులో బీఎస్పీ పాత్ర కీలకం అవుతుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ అన్నారు. ఐపీఎస్ అధికారిగా ఏడేళ్ల సర్విస్‌ను వదులుకొని రాజకీయాల్లోకి వచ్చి ప్రజల గొంతుకగా మారిన తాను ఎన్నికల అనంతరం కూడా అదేవిధంగా ఉంటానని అన్నారు. ఎన్నికల ప్రచారం ముగిసిన నేపథ్యంలో ఆయ న మంగళవారం ‘సాక్షి’తో మాట్లాడారు. రాష్ట్రంలోని 111 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్న బీఎస్పీ అధికార, ప్రతిపక్ష పార్టీలకు గట్టిపోటీ ఇస్తుందన్నారు. చాలా నియోజకవర్గాల్లో అనూహ్య విజయాలు సాధించబోతున్నామని చెప్పారు. అధికార బీఆర్ఎస్తోపాటు కాంగ్రెస్, బీజేపీల ధనబలాన్ని తట్టుకొని బీఎస్పీ అభ్యర్థులు ధీటైన పోటీ ఇస్తున్నారని చెప్పారు. సిర్పూరులో తనతోపాటు చాలా జిల్లాల్లో బీఎస్పీ అభ్యర్థులు విజయం సాధించబోతున్నారని ధీమా వ్యక్తం చేశారు. నిరుద్యోగుల పక్షాన నిలిచిన బీఎస్పీకి రాష్ట్రంలోని 30 లక్షల మంది నిరుద్యోగులు అండగా నిలిచారన్నారు. ఆదివాసీల పోడుభూముల కోసం పోరుబాట పట్టిన విషయాన్ని గుర్తుచేశారు. దళిత, గిరిజన, బీసీ వర్గాలతోపాటు ఆర్థికంగా వెనుకబడ్డ అగ్రవర్ణాల కోసం రెండేళ్లుగా రాజకీయ పోరాటం సాగిస్తున్నానని చెప్పారు. ఈ ఎన్నికల్లో అన్నివర్గాల ప్రజలు అత్యధిక స్థానాల్లో బీఎస్పీ అభ్యర్థులను గెలిపించి ఆదరిస్తారని భావిస్తున్నట్లు చెప్పారు. గెలిచిన తరువాత ప్రభుత్వ ఏర్పాటులో కీలకపాత్ర పోషించడంతోపాటు ప్రజల జీవన ప్రమాణాలు మెరుగయ్యేందుకు, నిరుద్యోగులకు న్యాయం జరిగేందుకు పోరాడతానని చెప్పారు. -
ఆ ట్రిపుల్‌ఐటీలో అసలేం జరుగుతుంది? విద్యార్థిది హత్యా! లేక మరేంటి?
సాక్షి, ఆదిలాబాద్: బాసర ట్రిపుల్‌ఐటీలో ఇంజినీరింగ్ మొదటి సంవత్సరం చదువుతున్న రామాటి ప్రవీణ్‌కుమార్(19) వసతిగృహంలోని గదిలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నాగర్‌కర్నూలు జిల్లాకు చెందిన విద్యార్థి వ్యక్తిగత కారణాలతోనే ఆత్మహత్య చేసుకున్నట్లు ట్రిపుల్ఐటీ అధికారులు చెబుతున్నారు. మృతదేహాన్ని భైంసా ఏరియా ఆస్పత్రిలోని పోస్టుమార్టం గదిలో భద్రపరిచారు. ఔట్‌పాస్ తీసుకుని.. ఇంజినీరింగ్ మొదటి సంవత్సరం చదువుతున్న ప్రవీణ్‌కుమార్ శనివారం ఔట్‌పాస్ తీసుకున్నాడు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఓటు వేసేందుకు విద్యార్థులు ఇళ్లకు వెళ్తున్నారు. శనివారం ఔట్‌పాస్ తీసుకున్న విద్యార్థి ఆత్మహత్య ఎప్పుడు చేసుకున్నాడో అంతుచిక్కడం లేదు. అధికారులైతే ఆదివారం ఉదయం అల్పహారం చేశాడని చెబుతున్నారు. ఒక రోజు ఔట్‌పాస్ తీసుకున్న విద్యార్థి అక్కడే ఎందుకు ఉండిపోయాడనే విషయం అంతుపట్టని ప్రశ్న. ఔట్‌పాస్ తీసుకున్న విద్యార్థులు కళాశాలలో ఉన్నారో బయటికి వెళ్లిపోయారా అనే విషయాన్ని భద్రతా సిబ్బంది చూసుకుంటున్నారో లేదో అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. ఖాళీ గదిలో ఆత్మహత్య.. ప్రవీణ్‌కుమార్ బీహెచ్–1 వసతి గృహంలో ఉంటున్నాడు. ఆదివారం బీహెచ్–2 వసతి గృహంలోని ఖాళీ గదిలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వసతి గృహంలోని ఖాళీ గదుల్లోనే గతంలో విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. వసతి గృహాల్లో ఖాళీ గదులకు తాళాలు ఎందుకు వేయడం లేదనే అనుమానం తలెత్తుతోంది. ఆత్మహత్యకు పాల్పడ్డ విద్యార్థి మెడ భాగం కమిలిపోయి ఉందని, ఆత్మహత్య ఎప్పుడు చేసుకున్నాడో తెలియడం లేదని పలువురు చెబుతున్నారు. పోలీసు భద్రత.. విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న వెంటనే మృతదేహాన్ని అంబులెన్సులో భైంసాకు తరలించారు. పోస్టుమార్టం గది వద్దకు ఎవరిని అనుమతించలేదు. మృతదేహాన్ని లోపల భద్రపరిచి తాళం వేశారు. ఆసుపత్రి వద్ద పోలీసు బందోబస్తు మోహరించారు. ట్రిపుల్‌ఐటీలో విద్యార్థుల ఆత్మహత్యలు ఎందుకు జరుగుతున్నాయనే విషయం అంతుచిక్కడం లేదు. వ్యక్తిగత కారణాలతోనే.. నాగర్‌కర్నూలు జిల్లాకు చెందిన రామాటి ప్రవీణ్‌కుమార్ ఇంజినీరింగ్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఔట్‌పాస్ తీసుకున్నాడు. ఉదయం వేళ అల్పహారం చేసిన ఈ విద్యార్థి బీహెచ్–2 వసతి గృహంలోని ఖాళీగదిలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వ్యక్తిగత కారణాలతోనే ఆత్మహత్యకు పాల్పడినట్లు భావిస్తున్నాం. ఈ విషయాన్ని కుటుంబీకులకు తెలియజేశాం. – ప్రొఫెసర్ వెంకటరమణ, వీసీ ముఖ్య గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com ఇవి కూడా చదవండి: అడవిలో కట్టెలు తీసుకురావడానికి వెళ్లిన యువకుడిని కిరాతకంగా.. -
అందరి తెలంగాణగా మార్చడమే లక్ష్యం
సాక్షి, హైదరాబాద్: కొందరి తెలంగాణను అందరి తెలంగాణ చేయడమే బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) లక్ష్యమని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెప్పారు. సాక్షి టీవీకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన పలు ప్రశ్నలకు సమాధానమిచ్చారు. రాష్ట్రాన్ని దొరల తెలంగాణ కాకుండా పేదల తెలంగాణగా మార్చాలనేది బీఎస్పీ ఆలోచన అని తెలిపారు. తెలంగాణలో దొరలు వదిలిపెట్టిన గడీలు గత తొమ్మిదేళ్లలో మళ్లీ పునర్నిర్మాణమయ్యాయని ఆయన విమర్శించారు. బాంచన్ కాల్మొక్త అనే సంస్కృతి తెలంగాణలో పోలేదని చెప్పారు. అన్ని వర్గాలను కలుపుకుంటాం... పేదల రాజ్యాధికారంతోనే బాంచన్ సంస్కృతి పూర్తిగా పోతుందని ప్రవీ ణ్‌కుమార్ స్పష్టం చేశా రు. స్పష్టమైన ప్రణాళిక తో అన్ని వర్గాలను కలుపుకొని కృషి చేస్తే రాజ్యాధికారం తప్పకుండా సాధ్యమవుతుందన్నారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో డబుల్ డిజిట్ సీట్లు సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. వీలైతే రాజ్యాధికారం చేపడతామని ఆశిస్తున్నట్లు చెప్పారు. జార్ఖండ్‌లో గతంలో స్వతంత్ర ఎమ్మెల్యేగా గెలిచిన మధు కోడా ముఖ్యమంత్రి అయిన విషయాన్ని ప్రవీణ్‌కుమార్ గుర్తుచేశారు. మాయావతి వల్లే యూపీలో బహుజనులకు రాజ్యాధికారం... దళితులు కేవలం ఎమ్మెల్యేలు, మంత్రులైతే సరిపోదని, స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకొనే స్థితిలో ఉంటేనే రాజ్యాధికారం వచ్చినట్లవుతుందని ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్‌లో మాయావతి సీఎం అయిన తర్వాతే బహుజనులకు రాజ్యాధికారం వచ్చిందన్నారు. మాయావతి హయాంలో దళితులకు భూముల పంపిణీ జరిగిందని, ఆమె ప్రభుత్వం మహిళలకు రక్షణ కల్పించిందని చెప్పారు. మాయావతి పాలన వల్ల రెండు, మూడు తరాల బహుజనులు బాగుపడ్డారని ఆయన తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేటులో కలిపి 10 లక్షల ఉద్యోగాలిస్తాం.. ముఖ్యమంత్రిని కలిసి తమ ఆలోచనలు పంచుకొనే అవకాశం రాష్ట్రంలో ఏ అధికారికీ లేదని ప్రవీణ్‌కుమార్ చెప్పా రు. స్పెషల్ చీఫ్ సెక్రటరీ స్థాయి అధికారులు సైతం కానిస్టే బుల్ ఆపితే ప్రగతి భవన్ గేటు వద్ద నుంచే వెనక్కి వెళ్లిన సందర్భాలున్నాని పేర్కొన్నారు. గురుకులాల సెక్రటరీగా వెళ్లిన వెంటనే తాను దళిత, నిమ్న, వెనుకబడిన, అణగారిన అనే పదాలను నిషేధించి స్వేరో అనే పదాన్ని తీసుకొచ్చానని తెలిపారు. తమ పార్టీ మేనిఫెస్టోలో పేర్కొన్న 10 లక్షల ఉద్యోగా ల హామీ మొత్తం ప్రభుత్వ ఉద్యోగాలు కాదని, ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాలన్నీ కలిపి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తా మని ఆయన వివరణ ఇచ్చారు. ఇవేగాక మరిన్ని విషయా లను ప్రవీణ్‌కుమార్ సాక్షి టీవీతో పంచుకున్నారు. -
BSP అధ్యక్షుడిగా ఫస్ట్ పొలిటికల్ ఫైట్ లో పాస్ అవుతారా?
-
తెలంగాణలో అధికారంలోకి వస్తాం
సూర్యాపేట: తెలంగాణలో ఆర్.ఎస్. ప్రవీణ్‌కుమార్ నాయకత్వంలో బీఎస్పీ అధికారంలోకి వస్తుందని బహుజన సమాజ్ పార్టీ జాతీయ అధ్యక్షురాలు మాయావతి ధీమా వ్యక్తం చేశారు. బుధవారం సూర్యాపేట మండలంలోని గాం«దీనగర్‌లో బహుజన రాజ్యాధికార సభ నిర్వహించారు. ఈ సభకు ఆమె ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, కేసీఆర్ పాలనలో రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని మండిపడ్డారు. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్.. అన్నీ సంపన్న వర్గాల కోసం నడుస్తున్న పార్టీలని అన్నారు. కానీ బీఎస్పీ ఒక్కటే బహుజన వర్గాల కోసం ప్రజల విరాళాలతో పనిచేస్తోందని పేర్కొన్నారు. రాజ్యాంగాన్ని మేనిఫెస్టోగా పెట్టుకుని నడుస్తున్న ఏకైక పార్టీ బీఎస్పీ అని చెప్పారు. దేశంలో మిగిలిన పార్టీలన్నీ ఓట్ల ముందు తాయిలాలు ప్రకటిస్తూ ప్రజలను మభ్యపెడుతున్నాయన్నారు. ఇది గమనించిన వట్టె జానయ్య యాదవ్ లాంటి వారు బహుజన జెండాను ఎత్తుకోవడం ఆహా్వనించదగిన పరిణామమని అన్నారు. వట్టె జానయ్యపై జరిగిన దాడి యాదృచ్ఛికం కాదని.. అది బీఆర్ఎస్, కాంగ్రెస్‌లు జరిపించిన వ్యూహాత్మక దాడి అని ఆరోపించారు. ‘మేము తక్కువగా చెప్పి.. ఎక్కువగా పనిచేస్తాం’అని పేర్కొన్నారు. బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ 1,300 మంది విద్యార్థుల ఆత్మబలిదానాలతో వచ్చిన తెలంగాణలో కేసీఆర్ కుటుంబం భోగాలు అనుభవిస్తోందన్నారు. అమరవీరుల కుటుంబాలు ఎక్కడ ఉన్నాయో కూడా కేసీఆర్‌కు తెలియకపోవడం బాధాకరమన్నారు. రాష్ట్రంలో గడీల పాలనను అంతమొందించాలని పిలుపునిచ్చారు. సభలో సూర్యాపేట బీఎస్పీ అభ్యర్థి వట్టె జానయ్యయాదవ్, పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
బహుజన వాదం బలపడేనా.. వినబడేనా?
ఉత్తరప్రదేశ్‌లో బలమైన రాజకీయశక్తిగా ఎదిగిన నాటినుంచి తెలుగునేలపై కాలు మోపాలని యత్నిస్తున్న బహుజన సమాజ్ పార్టీ ఈసారి మాత్రం ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకొంది. అందుకే ఏకంగా రాష్ట్రంలోని 119 నియోజకవర్గాలకు అభ్యర్థులను నిలిపింది. కేవలం ఎన్నికల సమయంలోనే వినిపించే బహుజనవాదాన్ని రెండేళ్లుగా జనాల్లోకి తీసుకెళ్లిన ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్. ప్రవీణ్‌కుమార్ ఈ దఫా బీఎస్పీ సత్తా చూపాలని పట్టుదలతో ఉన్నారు. అభ్యర్థుల ఎంపిక నుంచి ప్రచారం వరకు వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్న ప్రవీణ్ కుమార్ స్వయంగా ఆసిఫాబాద్ జిల్లా సిర్పూరు నుంచి సీనియర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్పను ఢీ కొంటున్నారు. పటాన్చెరు, సూర్యాపేట, పెద్దపల్లి, అలంపూర్, జహీరాబాద్, నకిరేకల్, వర్ధన్నపేట, పాలేరు వంటి పలు నియోజకవర్గాల్లో ప్రధాన పార్టీలకు బీఎస్పీ అభ్యర్థులు సవాల్ విసురుతున్నారు. ప్రధాన పక్షాలుగా ఉన్న బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలకు చెందిన అభ్యర్థుల అధికార, అర్ధబలం తట్టుకొని బీఎస్పీ అభ్యర్థులు చివరి వరకు ఎలా నిలబడతారన్నదే ప్రశ్న అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. బీఎస్పీ అంటే దళితుల పార్టీ అనే ముద్రను చెరిపివేసేందుకు ఆ పార్టీ రాష్ట్ర సారథి ప్రవీణ్ కుమార్ భారీ కసరత్తు చేశారు. ఐపీఎస్‌గా, గురుకులాల కార్యదర్శిగా వ్యవహరించిన సమయంలో ఉన్న సంబంధాలు ఆయనకు రాజకీయంగా ఉపయోగపడ్డాయనే చెప్పాలి. అగ్ర కులాలు మొదలుకొని 60 శాతం మంది బీసీలకు సీట్లిచ్చారు. ప్రవీణ్‌కుమార్ జనరల్ సీటు అయిన సిర్పూరు నుంచి పోటీ చేస్తుండడం గమనార్హం. బహుజన వాదమే ఎజెండాగా చెపుతున్న ఆయన అభ్యర్థుల ఎంపికలోనూ విలక్షతను చాటుకున్నారు. మంథనిలో చల్లా నారాయణరెడ్డి, నల్లగొండలో కోమటి సాయితేజ్ రెడ్డి, పెద్దపల్లిలో ఉష (పద్మశాలి), నిజామాబాద్‌లో షేక్ ఇమ్రాన్‌ఖాన్, సూర్యాపేటలో వట్టె జానయ్య (యాదవ), ఎల్బీనగర్– గువ్వ సాయి రామకృష్ణ ముదిరాజ్ ..ఇలా వివిధ వర్గాల వారికి సీట్లు ఇచ్చారు. వరంగల్ ఈస్ట్ నుంచి ట్రాన్స్‌జెండర్ చిత్రపు పుష్పిత లయకు సీటు కేటాయించడం ద్వారా రాష్ట్రంలో కొత్త సంప్రదాయానికి శ్రీకారం చుట్టారు. 1994 నుంచి బరిలో నిలుస్తున్నా... రాష్ట్రంలో 1994 శాసనసభ ఎన్నికల సమయంలోనే అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో బీఎస్పీ వ్యవస్థాపకుడు కాన్షీరాం, అధ్యక్షురాలు మాయావతి తమ పార్టీ తరపున అభ్యర్థులను నిలబెట్టినా ఫలితం దక్కలేదు. అప్పటి నుంచి అడపాదడపా ఎన్నికల సమయంలో బీఎస్పీ పోటీలో నిలబడడం, ఏనుగు గుర్తుపై అభ్యర్థులు పోటీ చేయడం జరుగుతూ వచ్చింది. 2004 ఎన్నికల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని పాడేరు నుంచి లాకే రాజారావు బీఎస్పీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. తెలంగాణ ఏర్పాటైన తరువాత 2014లో అప్పటి రాజకీయ సమీకరణాల దృష్ట్యా ప్రస్తుత మంత్రి ఎ.ఇంద్రకరణ్‌రెడ్డి నేతృత్వంలో పలువురు అభ్యర్థులు వివిధ నియోజకవర్గాల్లో పోటీ చేశారు నిర్మల్ నుంచి పోటీ చేసిన ఇంద్రకరణ్‌రెడ్డి, సిర్పూరు నుంచి బరిలో నిలిచిన కోనేరు కోనప్ప మాత్రమే విజయం సాధించారు. కానీ గెలిచిన వెంటనే బీఆర్ఎస్ (అప్పటి టీఆర్ఎస్) అధినేత కేసీఆర్ పిలుపు మేరకు అధికార పార్టీలో చేరారు. 2018 ఎన్నికల్లో బెల్లంపల్లి నుంచి పోటీ చేసిన ప్రస్తుత కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వినోద్ రెండోస్థానానికి పరిమితమయ్యారు. రాష్ట్రంలో బీఎస్పీపై ప్రవీణ్ ముద్ర ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా అలంపూర్‌కు చెందిన రేపల్లె శివ ప్రవీణ్‌కుమార్ 1995 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పోలీస్ అధికారిగా వివిధ హోదాల్లో పనిచేసిన ఆయన 2013 నుంచి 2021 జూలై నెలలో వాలంటరీ రిటైర్మెంట్ తీసుకునేంత వరకు ప్రభుత్వ గురుకులాల సంస్థ (స్వేరోస్) కార్యదర్శిగా సేవలు అందించారు. ప్రవీణ్‌కుమార్ అదే సంవత్సరం ఆగస్టులో మాయావతి సమక్షంలో బీఎస్పీలో చేరారు. ప్రభుత్వంలో లోటుపాట్లు, మంచి చెడులు తెలిసిన ఆయన బహుజనవాదం నినాదంతో బీఎస్పీని రాష్ట్రంలో బలమైన శక్తిగా తయారు చేసేందుకు తనవంతు ప్రయత్నం చేశారు. ఇందులో భాగంగా ఏడాది కాలం పాటు పాదయాత్ర జరిపి వేలాది గ్రామాలను చుట్టి వచ్చారు. సొంత నియోజకవర్గం అలంపూర్‌ను కాదని సిర్పూర్ నుంచి బీఎస్పీ అభ్యర్థిగా పోటీ చేస్తూ, మిగతా అన్ని నియోజకవర్గాలకు అభ్యర్థులను నిలిపారు. -పోలంపల్లి ఆంజనేయులు -
మరో 25 మందితో బీఎస్పీ మూడో జాబితా
సాక్షి, హైదరాబాద్: బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ) మూ డో విడత అభ్యర్థుల జాబితాను ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షు డు ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ శనివారం ప్రకటించారు. 25 మందితో కూడిన ఈ జాబితాతో ఇప్పటి వరకు బీఎస్పీ ప్రకటించిన అభ్యర్థుల సంఖ్య 88కు చేరింది. ప్రజల మధ్యన ఉండే వారినే బీఎస్పీ అభ్యర్థులుగా నిర్ణయించడం జరిగిందని ఈ సందర్భంగా ఆయన చెప్పారు. సిర్పూర్ నియోజకవర్గంలో తాను పోటీ చేస్తున్నానని, సిర్పూర్‌ను ఆంధ్ర వలస దారుని పాలన నుంచి విముక్తి కల్పించడమే తన ధ్యేయమన్నారు. 10న నామినేషన్ దాఖలు చేయనున్నట్లు చెప్పారు. కేసీఆర్‌ను పోటీకి అనర్హుడిగా ప్రకటించాలి 2018 శాసనసభ ఎన్నికల్లో గజ్వేల్ నుంచి శాసనసభ్యుడిగా పోటీ చేసిన సీఎం కేసీఆర్ అఫిడవిట్లో తన ఆస్తుల వివరాలను వెల్లడించలేదని ప్రవీణ్‌కుమార్ తెలిపారు. ఆర్టీఐ కింద గజ్వేల్ ఆర్డీవో నుంచి తాము తీసుకున్న వివరాల్లో కేసీఆర్ ఆస్తుల వివరాలు లేవని తెలిపారు. ఆస్తుల వివరాలు వెల్లడించని నామినేషన్‌ను ఆమోదించిన అప్పటి రిటర్నింగ్ అధికారిపై చర్యలు తీసుకోవడంతో పాటు ప్రజా ప్రాతినిధ్య చట్టాన్ని అపహాస్యం చేసిన కేసీఆర్‌ను మళ్లీ పోటీ చేయకుండా అనర్హుడిగా ప్రకటించాలని ఎన్నికల సంఘాన్ని కోరారు. ఈ మేరకు ఎన్నికల కమిషన్‌కు లేఖ రాస్తున్నట్లు చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అక్రమాలపై తాము మొదటి నుంచీ హెచ్చరిస్తున్నామనీ, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టుల భద్రతపై కూడా తమకు అనుమానాలున్నాయని, జనావాసాల మధ్య కట్టిన ఈ ప్రాజెక్టులకు ఏమైనా జరిగితే భారీగా ఆస్తి, ప్రాణ నష్టాలు తప్పవని ప్రవీణ్‌కుమార్ హెచ్చరించారు. -
బీఎస్పీ బహుజన భరోసా!
సాక్షి, హైదరాబాద్, పెద్దపల్లి రూరల్: బహుజన భరోసా పేరుతో బహుజన్ సమాజ్ పార్టీ మేనిఫెస్టోను ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ విడుదల చేశారు. మంగళవారం హైదరా బాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పార్టీ నాయకుల సమ క్షంలో పది ప్రధాన హామీలతో కూడిన మేనిఫెస్టో ను ప్రకటించారు. 3.91 కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు బహుజన భరోసా ఆవిష్కరిస్తున్న ట్లు ఈ సందర్భంగా ప్రవీణ్‌కుమార్ తెలిపారు. పోరాడి సాధించుకున్న తెలంగాణ ఒక కుటుంబం పాలైందని, ఈ రాష్ట్రాన్ని అందరి తెలంగాణగా మార్చేందుకే బహుజన భరోసా ప్రకటిస్తున్నట్లు చెప్పారు. తెలంగాణలో తొమ్మిదిన్నరేళ్లు అధికారం చెలాయించిన బీఆర్ఎస్ ఎన్నికల్లో ఇచ్చిన హామీ లను నెరవేర్చకుండా మేనిఫెస్టోల పేరుతో మరో సారి అంకెల గారడీ చేసిందని విమర్శించారు. గ్రూ ప్ పరీక్షలు రాసి ఉద్యోగం రాదని తెలిసి ఆత్మ హత్యకు పాల్పడ్డ యువతి ప్రవల్లిక వ్యక్తిత్వాన్ని కించపరిచేలా తప్పుడు మాటలు మాట్లాడారని విమర్శించారు. ఈ నేపథ్యంలో భవిష్యత్ తెలంగా ణ ఎలా ఉండాలని మేధావులు, రిటైర్డ్ అధికారు లు, అన్నివర్గాల ప్రజలతో చర్చించి బహుజన భరో సా పేరుతో మేనిఫెస్టో రూపొందించినట్లు ప్రవీణ్ తెలిపారు. ఇది ప్రొవిజనల్ మేనిఫెస్టో మాత్రమే నని, తెలంగాణ ప్రజలు ఇంకా ఏమైనా కోరుకుంటే వారి ఆకాంక్షల మేరకు వాటిని కూడా పొందుపరు స్తామని చెప్పారు. కాగా, పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ని బీఎస్పీ కార్యాలయంలో కాల్వశ్రీరాంపూర్ మండలానికి చెందిన మాజీ మావోయిస్టు నిదానపురం కొమురయ్య బీఎస్పీలో చేరారు. ఆయనకు ప్రవీణ్‌కుమార్ బీఎస్పీ కండువా కప్పి ఆహ్వానించారు. అదేవిధంగా పెద్దపల్లి పట్టణానికి చెందిన బీఆర్ఎస్ నేత మర్రిపల్లి సతీశ్ బీఎస్పీలో చేరారు. మేనిఫెస్టోలో బీఎస్పీ ఇచ్చిన 10 ప్రధాన హామీలు.. 1. ‘కాన్షీ’ యువ సర్కార్: యువతకు ఐదేళ్లలో 10 లక్షల ఉద్యోగాలు. మహిళలకు 5 లక్షల ఉద్యో గాలు. షాడో మంత్రులుగా విద్యార్థి నాయ కులు. 2. పూలే విద్యా దీవెన: మండలానికి ఒక ఇంటర్నేషనల్ స్కూల్, ప్రతి మండలం నుంచి ఏటా 100 మంది విద్యార్థులకు విదేశీ విద్య, డేటా, ఏఐ, కోడింగ్ లో శిక్షణ. 3. బహుజన రైతు ధీమా: ప్రతి పంట కనీస మద్దతు ధరతో కొనుగోలు. రైతులకు విత్తు నుంచి విక్రయం వరకు కచ్చితమైన ప్రభుత్వ రాయితీ. ధరణి పోర్టల్ రద్దు. 4. చాకలి ఐలమ్మ మహిళా జ్యోతి: మహిళా కార్మికులు, మహిళా రైతులకు ఉచిత వాషింగ్ మెషీన్, స్మార్ట్ ఫోన్, డ్రైవింగ్‌లో శిక్షణ. అంగన్ వాడీ, ఆశా వర్కర్ల ఉద్యోగులు క్రమబద్దీకరణ. మహిళా సంఘాలకు ఏటా రూ. 1 లక్ష 5. భీం రక్షా కేంద్రాలు: వృద్ధులకు హాస్టల్, ఆహారం, ఉచిత వైద్య సేవలు. రక్షా కేంద్రాల్లో వికలాంగులకు, ఒంటరి మహిళలకు తోడ్పాటు. 6. బ్లూ జాబ్ కార్డ్: పల్లె, పట్టణాల్లో 150 రోజుల ఉపాధి హామీ, రోజు కూలి రూ. 350 కి పెంపు. కూలీలకు ఉచిత రవాణా, ఆరోగ్య, జీవిత భీమా 7. నూరేళ్ల ఆరోగ్య ధీమా: ప్రతి కుటుంబానికి రూ.15 లక్షల ఆరోగ్య బీమా ప్యాకేజీ. ఏటా రూ. 25,000 కోట్లతో పౌష్టికాహార, ఆహార బడ్జెట్ 8. వలస కార్మికుల సంక్షేమ నిధి: రూ. 5,000 కోట్ల నిధితో గల్ఫ్ కార్మికులకు సంక్షేమ బోర్డు. వలస కార్మికులకు వసతి, కార్మికులు, లారీ, టాక్సీ డ్రైవర్లకు 600 సబ్సిడీ క్యాంటీన్లు. 9. షేక్ బందగీ గృహ భరోసా: ఇల్లు లేని వారికి 550 చదరపు గజాల ఇంటి స్థలం, ఇల్లు కట్టుకునే వారికి రూ. 6 లక్షలు సహాయం. ఇంటి పునర్నిర్మా ణానికి రూ.1 లక్ష సహాయం. 10. దొడ్డి కొమురయ్య భూమి హక్కు: భూమిలేని ప్రతి పేద కుటుంబానికి ఎకరం భూమి, మహిళల పేరిట పట్టా. -
హంగ్ వస్తే.. సీఎం కుర్చీలో బీఎస్పీ
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఒక వేళ హంగ్ పరిస్థితులే ఉంటే సీఎం పదవిని ఆఫర్ చేసిన పార్టీకే తమ మద్దతు ఉంటుందని బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్పీ) రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ప్రకటించారు. ఎన్నికల శంఖారావం పేరుతో కొత్తగూడెంలో జరిగిన భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రభుత్వంపై పలు విమర్శలు చేయడంతో పాటు బీఎస్పీకి సంబంధించిన మేనిఫెస్టోలోని కీలక అంశాలను వెల్లడించారు. పులికి భయమెందుకు.. తెలంగాణ రాష్ట్ర ఖజానా నుంచి నెలకు రూ.3.50 లక్షల జీతం తీసుకుంటున్న సీఎం కేసీఆర్ నెల రోజుల నుంచి ఎందుకు కనిపించడం లేదని ప్రశ్నించారు. అక్టోబర్ 15న పులి బయటకు వస్తుందని మంత్రి కేటీఆర్ అంటున్నారని, ఆయన పులి అయితే ప్రతిపక్షాలంటే ఎందుకు భయపడు తున్నారని, ఎందుకు అక్రమ అరెస్టులు చేస్తున్నారని ప్రశ్నించారు. ప్రతిపక్షాలకు మైండ్ బ్లాంక్ అయ్యే పథకాలతో ప్రజల ముందుకు వస్తామని మంత్రి హరీశ్‌రావు అంటున్నారని, ఇప్పటికే ప్రజల మైండ్లను నాశనం చేశారని ప్రవీణ్ విమర్శించారు. ఈసీకి ఫిర్యాదు చేస్తాం ఎన్నికలను లక్ష్యంగా చేసుకుని అనేక జిల్లాల్లో కీలక పదవుల్లో తమ అడుగులకు మడుగులు ఒత్తే అధికారులను బీఆర్ఎస్ పార్టీ నియమించుకుందని ప్రవీణ్‌కుమార్ ఆరోపించారు. అందరి వివరాలతో జాబితా రెడీ చేస్తున్నామని, త్వరలోనే ఎన్నికల కమిషన్‌ను కలిసి ఈ అంశంపై ఫిర్యాదు చేస్తామని చెప్పారు. వివిధ పదవుల నుంచి రిటైరైన కేసీఆర్ కుటుంబ సభ్యులు, దూరపు బంధువులకు ఇంటెలిజెన్స్ విభాగంలో కీలక బాధ్యతలు అప్పగించినట్టు తమ దృష్టికి వచ్చిందన్నారు. ఎన్నికలు ముగిసేవరకు వారిని ఆ పోస్టులకు దూరంగా ఉంచాలని ఈసీని కోరారు. కొందరు అధికారులు కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత కూడా పాత తేదీలతో సంతకాలు చేస్తున్నారని, ఆ వివరాలను సేకరిస్తున్నామని తెలిపారు. కాగా, కమ్యూనిస్టులు కమ్యూనిజాన్ని మరిచిపోయి దొరల గడీల దగ్గర కాపలా కాస్తున్నారని ఆయన విమర్శించారు. 119 నియోజకవర్గాల్లో పోటీ రాబోయే ఎన్నికల్లో బీఎస్పీ 119 నియోజ కవర్గాల్లో పోటీ చేస్తుందని ప్రవీణ్ కుమార్ ప్రకటించారు. ఈ మేరకు 1,300 దరఖాస్తులు తమకు అందాయన్నారు. ఇందులో మేధా వులు, ప్రొఫెసర్లు, రిటైర్డ్ ఐఏఎస్‌లు, స్కాలర్లు ఉన్నారని తెలిపారు. తాము అధికారంలోకి వస్తే ధరణిని రద్దు చేస్తామని ప్రకటించారు. బీఎస్పీ మేనిఫెస్టోలో కీలక అంశాలు ♦ ఏజెన్సీ ప్రాంతాల్లో ఎస్సీ, బీసీ, అగ్రవర్ణ పేదలకు పోడు పట్టాల పంపిణీ ♦ భూమి లేని వారికి కనీసం ఎకరం భూమి పంపిణీ ♦ ప్రతీ మండలంలో అంతర్జాతీయ ప్రమాణాల తో పాఠశాల ♦ రాష్ట్ర వ్యాప్తంగా ఏసీ సౌకర్యంతో కూడిన కోచింగ్ సెంటర్లు ♦ ప్రతీ కుటుంబం నుంచి ఒకరు విదేశాల్లో విద్యనభ్యసించేలా ప్రణాళిక ♦ ఆయుఃప్రమాణం వందేళ్లకు పెంచేలా వైద్య రంగంలో మార్పులు ♦ మహిళలకు ఉచితంగా డ్రైవింగ్‌లో శిక్షణ ♦ పది లక్షల ఉద్యోగాల కల్పన, అందులో 50 శాతం మహిళలకు.. ♦ కౌలు రైతులను ఆదుకునేలా విధానాలు ♦ జనాభా ప్రాతిపదికన ప్రభుత్వ కాంట్రాక్టుల కేటాయింపులు. -
బీఎస్పీకి అధికారం ఖాయం
సాక్షి, హైదరాబాద్, గన్‌పౌండ్రీ: రానున్న ఎన్నికల్లో ఎవరెన్ని కుట్రలు చేసినా, తెలంగాణలో బీఎస్పీ అధికారంలోకి రావడం ఖాయమని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.ఎస్ ప్రవీణ్‌కుమార్ ధీమా వ్యక్తం చేశారు. ఈ ఎన్నికలు కొండ చిలువలకు, చలిచీమలకు మధ్య పోటీ అని వ్యాఖ్యానించారు. బీఎస్పీ ఆధ్వర్యంలో ఎగ్జిబిషన్ గ్రౌండ్లో సోమవారం కాన్షీరాం 17వ వర్ధంతి సందర్భంగా ఎన్నికల నగారా సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాబలం బీఎస్పీకి ఉందనీ, మరో రెండు నెలలు పార్టీ శ్రేణులు రాత్రింబవళ్లూ కష్టపడి పార్టీని అధికారంలోకి తీసుకురావాలని పిలుపునిచ్చారు. బహుజనులు పాలకులు కావాలని కలలుగన్న కాన్షీరాం పేద ప్రజల గుండెల్లో చిరస్మరణీయంగా నిలిచిపోతారన్నారు. ఎస్సీ, ఎస్టీలపై దాడులు జరుగుతుంటే ఈ వర్గాల ఎమ్మెల్యేలు ప్రభుత్వాన్ని ప్రశ్నించకపోవడం విచారకరమన్నారు. రాష్ట్రంలో ప్రతిపక్ష నేతలపై పోలీసులు అక్రమ కేసులు పెడుతున్నారని ఆరోపించారు. మంత్రి జగదీశ్ రెడ్డి ప్రోద్బలం, ఒత్తిడితోనే వట్టే జానయ్య యాదవ్‌పై నిరాధారంగా పోలీసులు కేసులు పెట్టారని విమర్శించారు. తెలంగాణ గడ్డపై నీలి జెండా ఎగురవేయాలి బీఎస్పీ నేషనల్ కో–ఆర్డినేటర్, రాజ్యసభ సభ్యుడు రాంజీ గౌతమ్ మాట్లాడుతూ ఎన్నికల్లో తెలంగాణ గడ్డపై నీలి జెండా ఎగురవేసి, ఏనుగుపై ప్రగతి భవన్‌కు వెళ్ళాలని పిలుపునిచ్చారు. తెలంగాణలో బీసీ, ఎస్సీ, ఎస్టీల సంక్షేమం గురించి మాట్లాడుతున్న బీజేపీ, కాంగ్రెస్‌లు రాజస్తాన్, మధ్యప్రదేశ్‌లలో ఎందుకు మాట్లాడడం లేదన్నారు. కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలపై దాడులు పెరుగుతున్నాయన్నారు. మెజారిటీ ప్రజలకు అధికారం దక్కాలనేదే బీఎస్పీ ధ్యేయమని పార్టీ రాష్ట్ర చీఫ్ కోఆర్డనేటర్ మంద ప్రభాకర్ అన్నారు. సభలో పార్టీ ఉపాధ్యక్షులు దాగిళ్ళ దయానంద్, చాట్ల చిరంజీవి, రుద్రవరం సునీల్ పాల్గొన్నారు. -
రాజకీయ నిరుద్యోగుల అడ్డాగా టీఎస్పీఎస్సీ
సాక్షి, హైదరాబాద్/పంజగుట్ట: తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్విస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) రాజకీయ నిరుద్యోగులకు అడ్డాగా మారిందని టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ఆరోపించారు. కనీస అర్హతలు లేని వ్యక్తులను కమిషన్ సభ్యులుగా ప్రభుత్వం నియమించడంతో కమిషన్ పనితీరు అస్తవ్యస్తమైందని మండిపడ్డారు. ఫలితంగా లక్షలాది మంది నిరుద్యోగుల భవిష్యత్తు అల్లకల్లోలంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆదివారం సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో నిరుద్యోగ అభ్యర్థుల ఆధ్వర్యంలో జరిగిన టీఎస్పీఎస్సీ ప్రక్షాళన రౌండ్ టేబుల్ సమావేశంలో ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్, టీపీసీసీ అధికార ప్రతినిధి రియాజ్‌లతో కలసి రేవంత్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ వైఖరి, కమిషన్ తీరుపై విరుచుకుపడ్డారు. సీఎం కుటుంబానికి అవి ఏటీఎంలు... మంత్రి కేటీఆర్‌కు టీఎస్పీఎస్సీ, సీఎం కేసీఆర్‌కు కాళేశ్వరం ప్రాజెక్టు, ఎమ్మెల్సీ కవితకు సింగరేణి సంస్థలు ఏటీఎంలుగా మారాయని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. సీఎం కార్యాలయంలో పనిచేసే వ్యక్తుల బంధువులే టీఎస్పీఎస్సీ బోర్డులో అక్రమాలకు పాల్పడ్డారని.. వారిని ఎందుకు అరెస్ట్ చేయడం లేదని ఆయన డిమాండ్ చేశారు. గ్రూప్–1 పరీక్ష విషయంలో ప్రభుత్వ తీరును హైకోర్టు తప్పబట్టినా ఇప్పటికీ బోర్డును రద్దు చేయకుండా మొండిగా వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు. రానున్న ఎన్నికల్లో 30 లక్షల మంది నిరుద్యోగులతోపాటు వారి తల్లిదండ్రులు కలిపి మొత్తం 90 లక్షల మంది ఓటు ద్వారా కేసీఆర్‌కు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. తాము అధికారంలోకి రాగానే ఏటా జనవరిలోనే జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ ఉద్యోగ నియామకాల వ్యవహారంలో ప్రభుత్వ నిర్లక్ష్యం, టీఎస్పీఎస్సీ తీరును నిరసిస్తూ ఈ నెల 14న సడక్ బంద్ (రహదారుల దిగ్బంధం) చేపట్టాలని పిలుపునిచ్చారు. బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ టీఎస్పీఎస్సీ పేపర్ల లీకేజీ కేసులో ‘సిట్’ నివేదిక వివరాలను ప్రభుత్వం ఎందుకు బయటపెట్టడం లేదని ప్రశ్నించారు. తక్షణమే కొత్త బోర్డు ఏర్పాటు చేసి పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. ప్రొఫెసర్ కోదండరాం పిలుపు మేరకు రహదారుల దిగ్బందానికి టీపీసీసీ పూర్తి మద్దతు ప్రకటించింది. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, ప్రొఫెసర్ వినాయక్‌రావు పాల్గొనగా నిరుద్యోగులు శివానంద స్వామి, మహేష్, మిత్రదేవి అధ్యక్షత వహించారు. -
పేపర్లు లీక్ చేసి రూ.వేల కోట్లకు అమ్ముకున్నారు!
సాక్షి, పెద్దపల్లి: టీఎస్పీ ఎస్సీ పరీక్ష పేపర్లు లీక్‌చేసి రూ.వేల కోట్లకు అమ్ముకున్న గజదొంగ కేసీఆర్ అని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. ఉద్యోగ నోటి ఫికేషన్ల పేరిట రాష్ట్రంలోని 30 లక్షల మంది నిరుద్యోగుల నోట్లో మట్టి కొట్టిన కేసీఆర్‌ను వచ్చే ఎన్నికల్లో ఓడించాలని పార్టీ శ్రేణులను కోరారు. శనివారం పెద్దపల్లి జిల్లా కేంద్రంలో పార్టీ ముఖ్యకార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లా డారు. జూన్ 11న టీఎస్పీఎస్సీ రెండోసారి నిర్వహించిన గ్రూప్–1 ప్రిలిమ్స్‌ను రద్దు చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పు టీఎస్పీ ఎస్సీ నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. పేపర్ల లీకేజీ సూత్రధారులు ముఖ్యమంత్రి కార్యాల యంలోనే ఉన్నారని ఆరోపించారు. గ్రూప్–1 ప్రిలిమ్స్‌కు హాజరైన వారికంటే అదనంగా 270 ఓఎంఆర్ షీట్లు ఎలా వచ్చాయో ఆ సంస్థ చైర్మన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశా రు. చైర్మన్ జనార్దన్‌రెడ్డి, సభ్యులను తక్షణమే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దాసరి హనుమయ్య, కార్యదర్శి దేవునూరి సంపత్ తదితరులు పాల్గొన్నారు. -
జనవరిలో రామాయపట్నం పోర్టు ప్రారంభం
సాక్షి, అమరావతి: పోర్టు ఆధారిత పారిశ్రామికీకరణపై ప్రధానంగా దృష్టిసారిస్తున్నామని ఇందులో భాగంగా వచ్చే 4 నెలల్లో ఒక పోర్టును, నాలుగు ఫిషింగ్ హర్బర్లను ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ఏపీ మారిటైమ్ బోర్డు సీఈవో, ఏపీఐఐసీ వీసీ, ఎండీ ప్రవీణ్‌కుమార్ చెప్పారు. రామాయపట్నం పోర్టులో కార్గో బెర్త్ పనుల్ని డిసెంబర్ నాటికి పూర్తిచేసి జనవరిలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించేందుకు కార్యచరణ ప్రణాళికను సిద్ధం చేసుకున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం దేశంలో ఏరాష్ట్రంలో లేనివిధంగా సుమారు రూ.20 వేలకోట్లతో నాలుగు పోర్టులు (రామాయపట్నం, మచిలీపట్నం, మూలపేట, కాకినాడ సెజ్ పోర్టు), 10 ఫిషింగ్ హార్బర్లు నిర్మిస్తున్నట్లు చెప్పారు. ఆయన గురువారం నెల్లూరు జిల్లాలోని రామాయపట్నం పోర్టు, జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్, బాపట్ల జిల్లాలోని నిజాంపట్నం ఫిషింగ్ హర్బర్ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ తొలిదశలో నిర్మాణం చేపట్టిన జువ్వలదిన్నె, నిజాంపట్నం, మచిలీపట్నం, ఉప్పాడ ఫిషింగ్ హార్బర్లను ఈ ఏడాదిలో ప్రారంభించనున్నట్లు తెలిపారు. తొలుత జువ్వలదిన్నె, నిజాంపట్నం ఫిషింగ్ హార్బర్లను ప్రారంభిస్తామన్నారు. నాలుగు పోర్టులతో పాటు వాటి పక్కనే పారిశ్రామిక పార్కులను అభివృద్ధి చేయనున్నట్లు ఆయన చెప్పారు. -
TS Election 2023: పాలమూరు– రంగారెడ్డి పథకానికి ఒక న్యాయం..! కాళేశ్వరానికి మరో న్యాయమా..!?
మహబూబ్‌నగర్: బహుజన రాజ్యం సాధించడానికి ప్రతిఒక్కరు కృషిచేయాలని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ అన్నారు. ఆదివారం నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేటలోని ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహించిన నల్లమల నగారా సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. బహుజన అధికారం తెచ్చి.. ప్రగతిభవన్‌లో సీఎం పీఠంపై కూర్చోబెట్టే వరకు నిద్రపోమన్నారు. బీఆర్ఎస్ నాయకులు దొంగలని కాంగ్రెస్ ప్రచారం చేస్తుందని, వాళ్లు కూడా దొంగలేనని దుయ్యబట్టారు. ఒక శాతం ఓట్లు ఉన్నోళ్లు సీఎంలు, మంత్రులు అయితే.. 99 శాతం ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు ఏమవ్వాలని ప్రశ్నించారు. ఎవరు ఎవరితో పొత్తులు పెట్టుకోవాలో చెప్పేది మీరు కాదు.. మేం అని ఓ పెద్దమనిషికి సమాధానం చెప్పానన్నారు. ఎవరితోనూ పొత్తులు ఉండవని, మాకు మేమే పోటీ చేస్తామని చెప్పారు. రసమయి బాలకిషన్, గువ్వల బాలరాజు దొరల పాట పాడుతున్నారని విమర్శించారు. సాయిచందు బీఆర్ఎస్కు ఊడిగం చేశారని, ఆయన చనిపోతే కనీసం అధికార లాంఛనాలతో అంత్యక్రియలు చేయలేని దుర్మార్గమైన ప్రభుత్వం బీఆర్ఎస్ది అన్నారు. 1,300 మంది తెలంగాణ బిడ్డల త్యాగాల వల్ల వచ్చిన తెలంగాణ నేడు దొంగలు, కబ్జాదారుల పాలైందని దుయ్యబట్టారు. ఈ ప్రాంతంలో ఉన్న అనుబంధం మర్చిపోలేమని, గువ్వల బాలరాజు నేను ఇక్కడ పుట్టి పెరిగినా.. నీవు అతి చేస్తే మా దెబ్బ చూపుతామని హెచ్చరించారు. అంతకు ముందు చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు పృథ్వీరాజ్, అసెంబ్లీ ఇన్చార్జ్ నాగార్జున్, జిల్లా ఉపాధ్యక్షుడు రామన్న, యేసేపు, ప్రధాన కార్యదర్శి రామచందర్, విష్ణువర్ధన్, కుమార్, సుజన, ఈశ్వర్, జాకీర్, రమేష్, రాము పాల్గొన్నారు. పాలమూరు రైతులకు తీరని అన్యాయం.. ప్రత్యేక రాష్ట్రంలోనూ పాలమూరు రైతులకు అన్యాయమే జరుగుతుందని ప్రవీణ్‌కుమార్ విమర్శించారు. తొమ్మిదేళ్లుగా ప్రాజెక్ట్ పూర్తి కాకపోవడంతో స్థానిక రైతులు ఆందోళన చెందుతున్నారన్నారు. రాష్ట్రంలో పాలమూరు– రంగారెడ్డి పథకానికి ఒక న్యాయం.. కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు మరో న్యాయమా అని ప్రశ్నించారు. పాలమూరు ప్రాజెక్ట్‌కు అరకొర నిధులు విడుదల చేయడం వల్లే ఇప్పటి వరకు కాల్వల నిర్మాణమే పూర్తి కాలేదన్నారు. పాలమూరుకు జరుగుతున్న అన్యాయాలపై మంత్రులు, ఎమ్మెల్యేలు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. సమావేశంలో శ్రీనివాస్‌యాదవ్, అధ్యక్షుడు ఆంజనేయులు, స్వాములు పాల్గొన్నారు. -
బాలుడి ప్రాణం తీసిన నీటిగుంత..!
మహబూబ్‌నగర్: ప్రమాదవశాత్తు వ్యవసాయ పొలంలోని నీటిగుంటలో పడి ఓ బాలుడు మృతి చెందిన సంఘటన వనపర్తి జిల్లా పెద్దగూడెంతండా పైగడ్డ సమీపంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. కొత్తకోట మండలం సంకిరెడ్డిపల్లికి చెందిన ఆలకుంట గోపాలకృష్ణ, వనితలకు యశ్వంత్, ప్రణీత్‌కుమార్(7) ఇద్దరు కుమారులు. కుటుంబ కలహాలతో వనిత రెండేళ్ల క్రితం పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. ఏడాది క్రితం గోపాల్ మరో పెళ్లి చేసుకుని ఇద్దరు కుమారులతో కలిసి..హైదరాబాద్‌లో డ్రైవింగ్ చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. దగ్గరి బంధువుల ఇంట్లో పెళ్లి ఉండడంతో రెండు రోజుల క్రితం అందరూ కలిసి వనపర్తి మండలం పెద్దగూడెంతండా పైగడ్డకు వచ్చారు. ఆదివారం పెళ్లి వేడుకల్లో అందరూ సరదాగా గడిపారు. మంగళవారం హైదరాబాద్‌కు తిరిగి వెళదామనుకున్నా.. భారీ వర్షాల వల్ల ఆగిపోయారు. ప్రణీత్‌కుమార్‌తో పాటు బంధువుల అబ్బాయి వినీత్, ఒక బాలుడు కలిసి మంగళవారం ఉదయం ఇంటికి కొంత దూరంలో ఉన్న వ్యవసాయ పొలంలోని నీటి గుంత వద్దకు బహిర్భూమికి వెళ్లారు. ప్రమాదవశాత్తు ప్రణీత్ అందులో పడిపోయాడు. అతన్ని కాపాడేందుకు మిగిలిన ఇద్దరు ప్రయత్నించినా అప్పటికే నీటిలో మునిగిపోయాడు. వెంటనే ఇంటికి వచ్చిన వినీత్ జరిగిన విషయాన్ని కుటుంబసభ్యులకు చెప్పారు. వారు నీటి గుంత వద్దకు చేరుకొని ప్రణీత్‌ను బయటికి తీసి వనపర్తిలోని ఓ ఆస్పత్రికి తీసుకురాగా.. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. మృతుడి తండ్రి గోపాలకృష్ణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని రూరల్ ఎస్ఐ నాగన్న తెలిపారు. సాయంత్రం సంకిరెడ్డిపల్లిలో ప్రణీత్ అంత్యక్రియలు నిర్వహించారు. -
ప్రవీణ్‌కుమార్ హౌస్ అరెస్ట్
బండ్లగూడ, నాంపల్లి: అక్రమంగా అరెస్టులు చేసి తమను భయపెట్టాలని చూస్తే మరింత ఉవ్వెత్తున ఉద్యమిస్తామని బీఎస్పీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.ఎస్.ప్రవీణ్‌కుమార్ హెచ్చరించారు. గ్రూప్–2 పరీక్షలను రద్దు చేయాలని కోరతూ నిరసన చేపట్టేందుకు వెళ్తున్న ఆయనను శనివారం పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. దీంతో ఉదయమే బండ్లగూడలోని ఆయన నివాసంలో సత్యగ్రహ దీక్షకు కూర్చున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ శాంతియుతంగా దీక్ష చేస్తున్న తనను అర్థరాత్రి పోలీసులు అకారణంగా నిర్బంధించారని ఆరోపించారు. తమకు ఆదేశాలు ఉన్నాయంటూ రాద్ధాంతం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. శాంతియుతంగా నిరసన చేపట్టిన తన మాదిరిగానే రాష్ట్రవ్యాప్తంగా వేలాదిమంది బీఎస్పీ కార్యకర్తలను అరెస్టు చేశారని ఆందోళన వ్యక్తం చేశారు. సీఎం పోలీసులను నమ్ముకొని పాలన చేస్తున్నారని, భవిష్యత్‌లో ఇదే కేసీఆర్‌ను ఫామ్‌హౌజ్‌లోనే బందోబస్తు చేస్తారని ధ్వజమెత్తారు. గ్రూప్–2 ఉద్యోగాల్లో కొన్ని తమ అనుచరులకు కావాలని ముందుగానే పబ్లిక్ సర్విస్ కమిషన్‌కు చెప్పారనీ అందుకే నిరుద్యోగుల సమస్యలు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. పబ్లిక్ సరీ్వస్ కమిషన్ బోర్డులో కొంత మంది దొంగలను సీఎం నియమించారని విమర్శించారు. లీకేజీ కారకులను అరెస్టు చేయకుండా పరీక్షలు ఎలా? పేపర్ లీకేజీ కారకులను ఇంతవరకూ అరెస్టు చేయకుండా, తిరిగి వెంటనే పరీక్షలు నిర్వహించడం సరికాదని ప్రవీణ్‌కుమార్ అభిప్రాయపడ్డారు. 2014 నుంచి ఉద్యో గ నియామకాలు చేపట్టకుండా 2022లో ఒకేసారి నోటి ఫికేషన్ ఇచ్చి నిరుద్యోగులపై తీవ్ర భారం మోపారని ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం ఎన్నికల కోసమే ఆగమేఘాల మీద ఉద్యోగ పరీక్షలు నిర్వహిస్తున్నారని నిందించారు. ఇప్పటి వరకు డీఎస్సీ ఎందుకు నిర్వహించలేదని ఆయన ప్రశ్నించారు. నియంత, నిరంకుశ కేసీఆర్ వల్ల ఒక తరం నాశనం అయ్యిందని ప్రవీణ్ ధ్వజమెత్తారు. టీచర్ ఉద్యోగ పరీక్షలు రాసిన వాళ్లు గ్రూప్ పరీక్షలు రాయకూడదనేది కేసీఆర్ కుట్రగా పేర్కొన్నారు. ’’ముఖ్యమంత్రి కొడుకు, మనుమడు, ఎమ్మెల్యేలు, మంత్రులు ఎప్పుడైనా పోటీ పరీక్షలు రాశారా... ఆరునెలల్లో పరీక్ష సిలబస్ మార్చి మెటీరియల్ ఇవ్వకుండా వాళ్లు పరీక్ష రాయగలరా..’’అని నిలదీశారు. ఫేక్ యూనివర్సిటీలు యూనివర్సిటీలు బాగు చేయమంటే ఫేక్ ప్రైవేట్ యూనివర్సిటీలు ఏర్పాటు చేస్తున్నారని ప్రవీణ్‌కుమార్ ఆరోపించారు. తెలంగాణ ఉద్యమంలో పెన్ డౌన్, సకల జనుల సమ్మె, ఇలా ఎన్నో ఉద్యమాలు చేసినప్పుడు ఎలాంటి అణచివేత ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రం కల్వకుంట్ల కుటుంబంగా మారిందని విమర్శించారు. పేపర్ లీకేజీలో రమేష్, రాజశేఖర్‌రెడ్డి దొరికిన వెంటనే కేటీఆర్ దొంగ అని తేలిపోయిందనీ, అందుకే కేటీఆర్ ట్విట్టర్లో కూడా నిరుద్యోగ సమస్యలపై మాట్లాడడం లేదని ప్రవీణ్ విమర్శించారు. పేపర్ లీకేజీపై సీబీఐ విచారణ జరపాలని, విద్యార్థులపై పెట్టిన అక్రమ కేసులు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. బీఎస్పీ నేతల సత్యాగ్రహ దీక్ష భగ్నం గ్రూపు–2 పరీక్షలను వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ శనివారం ఉదయం నగరంలోని గన్‌పార్కు వద్ద సత్యాగ్రహ దీక్షకు దిగన బీఎస్సీ నాయకులు, కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. చేతుల్లో ప్లకార్డులను పట్టుకుని జైభీమ్ అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేస్తూ ప్రధాన రోడ్డు నుండి గన్పార్కులోనికి పరుగులు తీసిన వారిని పోలీసులు అడ్డుకుని బలవంతంగా లాక్కెళ్లారు. గన్‌పార్కు వైపునకు వచ్చినవారిని వచి్చనట్లుగానే అరెస్టు చేశారు. అరెస్టు చేసిన వారిని ముషీరాబాదు, నాంపల్లి పోలీసుస్టేషన్లకు తరలించారు. -
అది ఫ్రెండ్‌షిప్‌డే రోజు కాదు..! తనకి శాశ్వత వీడ్కోలు రోజు..!!
ఆదిలాబాద్: ఆదిలాబాద్ రిమ్స్‌లో పీజీ ఫస్టియర్ చదువుతున్న 9 మంది మిత్రులు ఆదివారం సాత్నాల వాగు సమీపంలోని కోటిలింగాల వద్దకు వెళ్లారు. వాగులో కాలుజారి భూక్యా ప్రవీణ్‌కుమార్ గల్లంతైన విషయం తెలిసిందే. రాత్రి గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టినా ఆచూకీ లభించలేదు. జాలర్లు సోమవారం శవాన్ని బయటకు తీశారు. కళ్లకు గంతలు కట్టినట్లు ఉండటంతో కుటుంబ సభ్యులు మృతిపై అనుమానాలు వ్యక్తం చేశారు. విచారణ చేపట్టాలని పోలీసులను కోరారు. ఆహ్లాదంగా గడిపిన సమయంలో తీసిన ఫొటోలు, వీడియోల్లో తలకు కర్చీప్ కట్టి ఉండటాన్ని పోలీసులు చూపించారు. ఏమైనా సందేహాలుంటే తమను సంప్రదించాలని జైనథ్ సీఐ కోలా నరేశ్‌కుమార్ సూచించారు. డైరెక్టర్ ఛాంబర్లో విహారయాత్రకు వెళ్లిన వైద్యులతో సీఐ సమావేశమై వివరాలు అడిగి తెలుసుకున్నారు. చిన్నతనం నుంచే చదవుల్లో మేటి.. సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం రంగంపేటకు చెందిన భూక్యా ఉస్మాన్ నాయక్ రాథోడ్–లక్ష్మి దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు శేఖర్ నాయక్ వ్యవసాయం చేస్తుండగా చిన్న కుమారుడు ప్రవీణ్‌కుమార్ ఎంబీబీఎస్ పూర్తి చేశారు. ప్రస్తుతం రిమ్స్‌లో ఆర్థోపెడిక్ పీజీ ప్రథఽమ సంవత్సరం చదువుతున్నాడు. కాగా 1 నుంచి ఇంటర్ వరకు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదివాడు. ఆ తర్వాత మొదటి ప్రయత్నంలో ఎంబీబీఎస్ సీటు సాధించగా హైదరాబాద్ గాంధీ మెడికల్ కళాశాలలో విద్యనభ్యసించారు. ఆ తర్వాత తన స్వంత జిల్లాలోని ముస్తాబాద్‌లోని పీహెచ్సీలో మూడు నెలలపాటు మెడికల్ ఆఫీసర్‌గా సేవలందించారు. పీజీ సీటు రావడంతో రిమ్స్‌లో చేరాడు. ప్రయోజకుడై కుటుంబానికి అండగా నిలుస్తాడని అనుకున్న కొడుకు కానరానిలోకాలకు వెళ్లడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఉన్న రెండెకరాల భూమిని సాగు చేసి, కూలీ పనిచేస్తూ చదివించినట్లుగా పేర్కొంటూ రోదించడం అక్కడున్నవారిని కంటతడిపెట్టింది. కాగా బీఆర్ఎస్ నాయకుడు రంగినేని పవన్‌రావు ఫోన్లో బాధిత కుటుంబీకులను మంత్రి కేటీఆర్ పరామర్శించారు. అండగా ఉంటామని భరోసానిచ్చారు. స్నేహితుల దినోత్సవం రోజే.. ఆదివారం స్నేహితుల దినోత్సవం ఉండటంతో 9 మంది తోటి స్నేహితులు తొలుత కుంభఝరి సమీపంలోని కోటి లింగాలను దర్శించుకున్నారు. వీరిలో నలుగురు పురుష వైద్యులు ఉండగా ఆరుగురు మహిళా వైద్యులు ఉన్నట్లుగా రిమ్స్ వర్గాలు తెలిపాయి. ఆ తర్వాత సరాదాగా నీటిలో ఆటలాడుతూ ఉత్సాహంగా గడిపారు. ఇంటికి బయల్దేరే క్రమంలో నీటిని దాటుతుండగా ప్రవీణ్ సెల్‌ఫోన్ నీటిలో పడిపోవడంతో దాన్ని తీసుకునేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో బండపై నాచు ఉండటంతో కాలు జారి నీటిలో పడ్డాడు. స్నేహితులు కార్తీక్, రాజు కాపాడేందుకు ప్రయత్నించగా ఫలితం లేకుండా పోయింది. ప్రవీణ్ గుండంలో చిక్కుకుపోయాడు. వీరిద్దరిని కాపాడేందుకు మిగతా స్నేహితులు ప్రయత్నించగా వీరు సురక్షితంగా బయటపడ్డారు. అప్పటికే ప్రవీణ్ గల్లంతయ్యాడు. డయల్ 100కు సమాచారం ఇవ్వడంతో పోలీసులు, గ్రామస్తులు వాగు వద్దకు చేరుకున్నారు. రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్, మరి కొందరు వైద్యులు అక్కడకు చేరుకుని గజ ఈతగాళ్ల ద్వారా గాలింపు చేపట్టారు. రాత్రి 10 గంటల వరకు ఆచూకీ లభించలేదు. దీంతో పోలీసులు, గ్రామస్తులు నీటి ప్రవాహంలో కొట్టుకుపోకుండా ఉండేలా వలలు కట్టి ఉంచారు. సోమవారం ఉదయం 6 గంటలకే తిరిగి గాలింపు చర్యలు చేపట్టగా 8 గంటల ప్రాంతంలో మృతదేహం లభ్యమైంది. రిమ్స్ మార్చురీలో పోస్టుమార్టం అనంతరం తల్లిదండ్రులకు ప్రవీణ్ భౌతికకాయాన్ని అప్పగించారు. కన్నీటి పర్యంతమైన రిమ్స్.. పీజీ విద్యార్థి మృతిచెందాడని తెలియగానే రిమ్స్ మెడికోలు, వైద్యులు, సిబ్బంది కన్నీటి పర్యంతమయ్యారు. పోస్టుమార్టం అనంతరం డైరెక్టర్ ఛాంబర్ ఎదుట మృతదేహాన్ని ఉంచి నివాళులర్పించారు. కుటుంబీకుల రోదనలతోపాటు తోటి పీజీ విద్యార్థులు, మెడికోలు కన్నీరుమున్నీరయ్యారు. ఒక్కసారిగా ఆ ప్రాంతమంతా ఉద్విగ్న వాతావరణం నెలకొంది. రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్, సూపరింటెండెంట్ అశోక్, వైద్యులు సుమలత, శ్యాంప్రసాద్, వెంకట్‌రెడ్డి, జాడే తానాజీ, అధికారులు పార్థివదేహాంపై పుష్పగుచ్చాలు ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు. -
వరద బాధితుల కోసం ఎయిర్ బోట్స్..
నిర్మల్: వరద నీటిలో చిక్కుకున్న బాధితులను సులువుగా రక్షించేందుకు ఎయిర్ బోట్స్ ఎంతగానో ఉపయోగపడతాయని కలెక్టర్ వరుణ్‌రెడ్డి, ఎస్పీ ప్రవీణ్‌కుమార్ అన్నారు. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రెస్క్యూ సిబ్బందికి జిల్లా కేంద్రంలోని బంగల్పేట్ చెరువులో ఎయిర్ బోట్స్ శిక్షణను శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో భారీ వర్షాల కారణంగా కడెం, స్వర్ణ, గడ్డన్న ప్రాజెక్టులు దాదాపు పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకున్నట్లు తెలిపారు. వరదలతో లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా, పలు రోడ్లు కూడా ధ్వంసమయ్యాయన్నారు. మరోవైపు ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు చేరడంతో ప్రత్యేక దృష్టి పెట్టి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. నిన్నటి వరకు సుమారు 210 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయిందని పేర్కొన్నారు. భైంసా డివిజన్లో చాలా మందిని పోలీస్ శాఖ ద్వారా రెస్క్యూ చేశామని వెల్లడించారు. వివిధ ప్రాంతాల్లో చిక్కుకున్న సుమారు 60 మందిని పోలీసులు ప్రాణాలు పణంగా పెట్టి, రోప్‌తో, లైవ్ జాకెట్స్‌తో కాపాడారని వివరించారు. ఎయిర్ బోట్స్ ఉంటే ఇంకా సులువుగా, సిబ్బందికి కష్టం కలగకుండా కాపాడవచ్చన్నారు. ఎస్పీ, పోలీస్ శాఖతో చర్చించి, ఎయిర్ బోట్స్ శిక్షణకు నిర్ణయం తీసుకున్నట్టు వివరించారు. దీంతో ఎయిర్ బోట్స్, లైవ్ జాకెట్లు రోప్స్ తెప్పించామన్నారు. అనంతరం ఎస్పీ ప్రవీణ్‌కుమార్ ఐపీఎస్ మాట్లాడుతూ.. నిర్మల్ జిల్లాలో అతి భారీ వర్షాల వల్ల వరదల్లో చిక్కుకున్న వారిని కాపాడేందుకు ఎయిర్ బోట్స్, లైవ్ జాకెట్లు, రోప్స్ కొనడానికి సహకరించిన కలెక్టర్‌కు పోలీస్ శాఖ ద్వారా ధన్యవాదాలు తెలిపారు. ప్రజలను మరింత సురక్షితంగా కాపాడలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. జిల్లా పోలీసు యంత్రాంగం ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటుందన్నారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ(ఏఆర్) వెంకటేశ్వర్లు, నిర్మల్ డీఎస్పీ గంగారెడ్డి, ఎస్బీ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, పట్టణ సీఐ పురుషోత్తం, ఆర్ఐలు రమేశ్, రామకృష్ణ, ఎంపీవో వినోద్, ఆర్ఎస్ఐలు సాయికిరణ్, రవికుమార్, దేవేందర్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. -
పెట్టుబడులకు విస్తృత అవకాశాలు
సాక్షి, అమరావతి: పర్యావరణహిత క్లీన్ ఎనర్జీకి ఏపీ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని.. గ్రీన్ హైడ్రోజన్, బయో ఇథనాల్ తయారీ ప్లాంట్లను ప్రోత్సహిస్తోందని రాష్ట్ర పరిశ్రమల శాఖ కమిషనర్ ప్రవీణ్‌కుమార్ తెలిపారు. దేశంలోనే అతిపెద్ద పెట్రోకెమికల్ కారిడార్ ఏపీలో విస్తరించి ఉందని.. దీన్ని వినియోగించుకుంటూ పెట్టుబడులు పెట్టాలని కోరారు. పెట్టుబడులకు ఏపీలో విస్తృత అవకాశాలున్నాయని.. వాటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఢిల్లీలో జరుగుతున్న మూడో ‘గ్లోబల్ కెమికల్స్ అండ్ పెట్రోకెమికల్స్ మాన్యుఫాక్చరింగ్ హబ్స్ ఇన్ ఇండియా’ సదస్సులో గురువారం ప్రవీణ్ పాల్గొన్నారు. దేశంలోనే అతిపెద్ద పెట్రో కెమికల్స్ ఇన్వెస్ట్మెంట్ రీజియన్‌ను అభివృద్ధి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రముఖ కంపెనీలతో చర్చలు జరుపుతోందని చెప్పారు. వయబిలిటీ గ్యాప్ ఫండింగ్, ఇతర ప్రోత్సాహకాలు ఇవ్వడం ద్వారా దీన్ని అభివృద్ధి చేసే అంశాన్ని పరిశీలిస్తోందని తెలిపారు. విశాఖ–చెన్నై పారిశ్రామిక కారిడార్‌లో పారిశ్రామిక పార్కులు, పోర్టులు అందుబాటులోకి వస్తున్నాయన్నారు. పారిశ్రామిక పార్కుల ద్వారా తక్షణమే పెట్టుబడులు పెట్టడానికి 13,772 ఎకరాల భూమి అందుబాటులో ఉందని వివరించారు. ఇప్పటికే పెట్రో కెమికల్స్ రంగంలో హెచ్‌పీసీఎల్, బీపీసీఎల్, ఓఎన్జీసీ, కెయిర్న్, రిలయన్స్, ఆదిత్య బిర్లా, టాటా కెమికల్స్ తదితర దిగ్గజ సంస్థలు పెట్టుబడులు పెట్టాయని తెలిపారు. బయో ఇథనాల్‌కు ఏపీ హబ్‌గా మారిందని ప్రవీణ్ పేర్కొన్నారు. రాష్ట్రంలోని అవకాశాలను సద్వినియోగం చేసుకునేందుకు ఇప్పటికే 20కి పైగా కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చాయన్నారు. అనంతరం ప్రవీణ్‌కుమార్.. సౌదీ అరేబియా బేసిక్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ వైస్ ప్రెసిడెంట్, రీజనల్ హెడ్ జనార్దన్ రామాంజనేయులు, సుర్బానా జురాంగ్ డైరెక్టర్ డెన్నీస్ టాన్, దీపక్ నైట్రేట్ సీఎండీ దీపక్ సీ మెహతా, నయారా ఎనర్జీ ప్రెసిడెంట్ దీపక్ అరోరా, బేయర్ కార్పొరేషన్ ప్రతినిధులతో సమావేశమయ్యారు. వీటిలో కాకినాడ జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా, అనకాపల్లి కలెక్టర్ రవిసుభాష్ తదితరులు పాల్గొన్నారు. -
టీమిండియా క్రికెటర్‌కు తప్పిన పెను ప్రమాదం
టీమిండియా మాజీ క్రికెటర్ ప్రవీణ్ కుమార్ తృటిలో పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని పాండవ్ నగర్ నుంచి మీరట్‌కు వస్తుండగా ప్రవీణ్ కుమార్ ప్రయాణిస్తున్న ల్యాండ్ రోవర్ కారు ప్రమాదానికి గురైంది. ప్రవీణ్ ప్రయాణిస్తున్న కారును వేగంగా వస్తున్న క్యాంటర్ వాహనం ఢీకొట్టింది. ఆ సమయంలో ప్రవీణ్‌తోపాటు అతని కుమారుడు కారులో ఉన్నాడు. అయితే వీరిద్దరు ఎలాంటి గాయాలు లేకుండా సురక్షితంగా బయటపడ్డారు. ప్రమాదానికి కారణమైన వాహనం కారణంగా ప్రవీణ్ ప్రయాణిస్తున్న కారు నుజ్జుగుజ్జయ్యింది. ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్యాంటర్ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. మీరట్ సిటీ ఎంట్రెన్స్‌లో మంగళవారం రాత్రి 10 గంటల ప్రాంతంలో ఈ యాక్సిడెంట్ జరిగింది. ప్రవీణ్ కుమార్ మీరట్‌లోని బాగ్పత్ రోడ్లో ఉన్న ముల్తాన్ నగర్లో నివాసం ఉంటాడు. 36 ఏళ్ల ప్రవీణ్ కుమార్ 2007-12 మధ్యలో టీమిండియాకు ప్రాతినిధ్యం వహించాడు. పరిమిత ఓవర్ల ఫార్మాట్లలో ప్రవీణ్ ప్రధాన బౌలర్‌గా సత్తా చాటాడు. 2008లో ఆస్ట్రేలియాలో జరిగిన కామన్వెల్త్ బ్యాంక్ సిరీస్‌ను టీమిండియా కైవసం చేసుకోవడంలో కీలకపాత్ర పోషించాడు. అంతర్జాతీయ క్రికెట్లో ప్రవీణ్.. 68 వన్డేలు, 10 టీ20లు, 6 టెస్ట్ మ్యాచ్‌లు ఆడాడు. ఇందులో వన్డేల్లో 77, టీ20ల్లో 8, టెస్టుల్లో 27 వికెట్లు పడగొట్టాడు. అంతర్జాతీయ క్రికెట్లోనే కాకుండా ప్రవీణ్ ఐపీఎల్‌లోనూ సత్తా చాటాడు. 119 మ్యాచ్‌ల్లో 90 వికెట్లు పడగొట్టాడు. రైట్ ఆర్మ్ మీడియం పేస్ బౌలర్ అయిన ప్రవీణ్ అడపాదడపా బ్యాట్‌తో కూడా రాణించాడు. వన్డేల్లో అతని పేరిట ఓ అర్ధసెంచరీ ఉంది. చదవండి: #RishabhPant: 'యాక్సిడెంట్ నాకు రెండో లైఫ్'.. 'డేట్ ఆఫ్ బర్త్' మార్చుకున్న పంత్ -
పాస్వర్డ్ గుట్టు వీడలేదు!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌లో (టీఎస్పీఎస్సీ) చోటుచేసుకున్న ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో సిట్ అధికారులు శుక్రవారం తొలి చార్జిషీట్ దాఖలు చేశారు. ఈ కేసులో అరెస్టులు మొదలై 90 రోజులు కావస్తుండటంతో నాంపల్లి న్యాయస్థానంలో సప్లిమెంటరీ చార్జ్‌షీట్ వేశారు. ఇందులో 37 మందిపై అభియోగాలు మోపారు. దర్యాప్తులో వెలుగులోకి వచ్చిన వివరాల ఆధారంగా మిగిలిన వారిపై అదనపు చార్జిషీట్లు దాఖలు చేయనున్నారు. యూజర్ ఐడీ, పాస్వర్డ్ చేతికి చిక్కిందెలా? కాన్ఫిడెన్షియల్ సెక్షన్లో ఉన్న కంప్యూటర్ నుంచి మాస్టర్ ప్రశ్నపత్రాలను కమిషన్ మాజీ ఉద్యోగి పులిదిండి ప్రవీణ్ కుమార్, మాజీ ఔట్ సోర్సింగ్ ఉద్యోగి అట్ల రాజశేఖర్ పెన్‌డ్రైవ్‌లోకి కాపీ చేసుకోవడం ద్వారా చేజిక్కించుకున్నట్లు సిట్ నిర్ధారించింది. అయితే ఆ కంప్యూటర్లోకి చొరబడటానికి వాడిన యూజర్ ఐడీ, పాస్వర్డ్ వారి చేతికి ఎలా చిక్కిందనే అంశంపై మాత్రం ఇప్పటికీ స్పష్టత రాలేదు. నిందితులు పోలీసులకు చెప్పిన వివరాల ప్రకారం కాన్ఫిడెన్షియల్ సెక్షన్ ఇన్చార్జ్గా ఉన్న శంకరలక్ష్మి యూజర్ ఐడీ, పాస్‌వర్డ్స్‌ను తన పుస్తకంలో రాసి పెట్టుకున్నారు. వాటిని ప్రవీణ్ నోట్ చేసుకొని రాజశేఖర్‌కు తెలిపాడని దర్యాప్తు అధికారులు చెప్పారు. ఆపై కంప్యూటర్ను నిందితులు హ్యాక్ చేశారనే ఆరోపణలు వచ్చినా దానికీ ఆధారాలు లభించలేదు. 50 మంది నిందితుల్లో చిక్కిన 49 మంది... బేగంబజార్ పోలీసుస్టేషన్లో నమోదైన ఈ కేసు దర్యాప్తు నిమిత్తం సిట్‌కు బదిలీ అయింది. అదనపు సీపీ ఏఆర్ శ్రీనివాస్ పర్యవేక్షణలో ఏసీపీ పి.వెంకటేశ్వర్లు దర్యాప్తు చేపట్టిన ఈ కేసులో ఇప్పటివరకు 50 మందిని నిందితులుగా తేల్చి 49 మందిని అరెస్టు చేశామని సిట్ అధికారులు శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. న్యూజిల్యాండ్‌లో ఉన్న నిందితుడిని పట్టుకోవాల్సి ఉందన్నారు. 50 మందిలో 16 మంది పేపర్ల విక్రయంలో మధ్యవర్తులుగా వ్యవహరించిన వాళ్లే. అక్రమంగా ఏఈఈ ప్రశ్నపత్రం పొంది పరీక్ష రాసిన వాళ్లు ఏడుగురు, ఏఈ ప్రశ్నపత్రం పొంది రాసిన వాళ్లు 13 మంది, డీఏఓ పేపర్ పొంది పరీక్ష రాసిన వాళ్లు ఎనిమిది మంది ఉన్నారు. అరెస్టు అయిన నిందితుల్లో ప్రవీణ్ కుమార్, రాజశేఖర్‌లతోపాటు షమీమ్, రమేష్ కుమార్‌లు కమిషన్ ఉద్యోగులు. వారిలో రాజశేఖర్ మినహా మిగిలిన ముగ్గురూ గ్రూప్–1 పరీక్ష రాశారు. టీఎస్పీఎస్సీగా అవుట్ సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేసి మానేసిన సురేష్ సైతం గ్రూప్–1 పేపర్ పొంది పరీక్ష రాశాడు. ఇరిగేషన్ శాఖ మాజీ ఏఈ పూల రమేష్ సహకారంతో ఏఈఈ పరీక్షల్లో హైటెక్ మాస్ కాపీయింగ్‌కు పాల్పడిన ముగ్గురినీ సిట్ అరెస్టు చేసింది. ఇప్పటివరకు వెలుగులోకి వచ్చిన వివరాలను బట్టి ప్రశ్నపత్రాల క్రయవిక్రయాల్లో రూ.1.63 కోట్లు చేతులు మారినట్లు తేలింది. నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న పెన్‌డ్రైవ్స్, ల్యాప్టాప్స్, హార్డ్డిసు్కలతోపాటు ఫోన్లను విశ్లేషణ నిమిత్తం సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీకి పంపారు. ఈ వివరాలన్నీ క్రోడీకరించి న్యాయ నిపుణుల అభిప్రాయం తీసుకున్నాక నాంపల్లి కోర్టులో చార్జిషీట్ దాఖలు చేసినట్లు అదనపు సీపీ ఏఆర్ శ్రీనివాస్ పేర్కొన్నారు. మరోవైపు లీకేజీ కేసులో అరెస్టు అయిన మాజీ ఏఈ పూల రమేష్ ఆరు రోజుల పోలీసు కస్టడీ శుక్రవారంతో ముగిసింది. దీంతో ఇతడికి వైద్య పరీక్షల అనంతరం పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. న్యాయమూర్తి ఆదేశాల మేరకు జ్యుడీషియల్ రిమాండ్ నిమిత్తం చంచల్‌గూడ జైలుకు తరలించారు. -
సీవీసీగా ప్రవీణ్ శ్రీవాస్తవ
న్యూఢిల్లీ: సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ (సీవీసీ)గా ప్రవీణ్ కుమార్ శ్రీవాస్తవ నియమితులయ్యారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రస్తుత విజిలెన్స్ కమిషనర్ ప్రవీణ్ కుమార్ శ్రీవాస్తవను సీవీసీగా నియమించారని రాష్ట్రపతి భవన్ ఓ ప్రకటనలో పేర్కొంది. సోమవారం ఉదయం 10.30 గంటలకు ఆయన రాష్ట్రపతి సమక్షంలో ప్రమాణం చేశారని, కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్, ప్రధాని మోదీ కూడా పాల్గొన్నారని తెలిపింది. సీవీసీ సురేశ్ ఎన్ పటేల్ పదవీ కాలం గత ఏడాది డిసెంబర్‌తో పూర్తయింది. అప్పటి నుంచి శ్రీవాస్తవ తాత్కాలిక సీవీసీగా కొనసాగుతున్నారు. సీవీసీగా 65 ఏళ్లు వచ్చే వరకు లేదా నాలుగేళ్ల కాలానికి బాధ్యతల్లో కొనసాగుతారు. 1988 బ్యాచ్ రిటైర్డ్ ఐఏఎస్ అయిన శ్రీవాస్తవ అస్సాం–మేఘాలయ కేడర్‌కు చెందిన వారు. గత ఏడాది జనవరి 31న కేబినెట్ సెక్రటేరియట్ కార్యదర్శిగా పదవీ విరమణ పొందారు. సీవీసీ సారథ్యంలో విజిలెన్స్ కమిషన్‌లో గరిష్టంగా ఇద్దరు కమిషనర్లు ఉండొచ్చు. ఐబీ మాజీ చీఫ్ అర్వింద్ ఒక్కరే ప్రస్తుతం కమిషనర్‌గా ఉన్నారు. మరో కమిషనర్ పోస్టు ఖాళీగా ఉంది. -
రూ. లక్షన్నర కోట్ల ఎగుమతులు
సాక్షి, అమరావతి: వ్యవసాయ, పారిశ్రామిక ఉత్పత్తుల ఎగుమతులను ప్రోత్సహిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయి. 2019–20లో తొలిసారిగా రూ.లక్ష కోట్ల మార్కును చేరుకున్న రాష్ట్ర ఎగుమతులు నాలుగేళ్లలో రూ.1.50 లక్షల కోట్ల మార్కును అధిగమించాయి. 2019–20లో రాష్ట్రం నుంచి రూ.1,04,829 కోట్ల ఎగుమతులు జరగగా 2022–23 నాటికి రూ.1,59,368.02 కోట్ల మార్కును చేరుకోవడం గమనార్హం. నాలుగేళ్లలో ఎగుమతులు దాదాపు రూ.55 వేల కోట్ల మేర పెరిగాయి. రాష్ట్రాల వారీగా ఎగుమతుల వివరాలను కేంద్ర వాణిజ్య శాఖ తాజాగా విడుదల చేసింది. అత్యధికంగా ఆక్వా 2022–23లో దేశవ్యాప్తంగా రూ.36,20,630.9 కోట్ల విలువైన ఎగుమతులు జరగగా 4.41 శాతం వాటాతో ఆంధ్రప్రదేశ్ ఆరో స్థానంలో నిలిచింది. రూ.12,00,001.94 కోట్ల ఎగుమతులతో గుజరాత్ మొదటి స్థానంలో ఉంది. గత ఆర్థిక సంవత్సరంలో ఏపీ నుంచి అత్యధికంగా రూ.19,872.82 కోట్ల విలువైన ఆక్వా ఎగుమతులు జరగగా రూ.9,919 కోట్ల ఎగుమతులతో ఫార్మా రంగం రెండో స్థానంలో నిలిచింది. జిల్లాలవారీగా చూస్తే ఉమ్మడి విశాఖ రూ.48,608.59 కోట్ల విలువైన ఎగుమతులతో అగ్రభాగాన ఉంది. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా రూ.31426.23 కోట్ల ఎగుమతులతో ఆ తర్వాతి స్థానం దక్కించుకుంది. 10 శాతం మార్కెట్ వాటాపై దృష్టి దేశీయ ఎగుమతుల్లో 2030 నాటికి 10 శాతం వాటాను సాధించడం లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అడుగులు వేస్తున్నారు. అందులో భాగంగా 2025–26 నాటికి రాష్ట్రంలో అదనంగా 110 మిలియన్ టన్నుల అదనపు సామర్థ్యం అందుబాటులోకి తెచ్చే విధంగా ఏకకాలంలో నాలుగు పోర్టులను నిర్మిస్తున్నారు. రామాయపట్నం, మూలపేట, మచిలీపట్నం, కాకినాడ సెజ్‌ల్లో కొత్తగా నాలుగు పోర్టుల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా రూ.18,897 కోట్లను వ్యయం చేస్తోంది. రామాయపట్నం పోర్టు ఈ ఏడాది చివరి నాటికి అందుబాటులోకి రానుండగా మిగిలిన పోర్టులు 18 నుంచి 24 నెలల్లో అందుబాటులోకి రానున్నాయి. వీటికి అదనంగా రూ.3,700 కోట్లతో మరో పది ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం జరుగుతోంది. వీటి చెంతనే ఫుడ్ పార్కులను ప్రభుత్వం అభివృద్ధి చేస్తోంది. నాలుగు ఫిషింగ్ హార్బర్లు ఈ సంవత్సరాంతానికి అందుబాటులోకి రానుండగా మిగిలినవి వివిధ దశల్లో ఉన్నాయి. కొత్తగా ని ర్మించే నాలుగు పోర్టుల ద్వారా అదనంగా లక్ష మందికి ఉపాధి లభించడంతో పాటు రాష్ట్ర జీడీపీ, ప్రజల తలసరి ఆదాయంలో గణనీయమైన వృద్ధి నమోదవుతుందని ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు. కొత్త జిల్లాల ఏర్పాటుతో.. రాష్ట్రంలో 13 జిల్లాలను 26 జిల్లాలుగా విస్తరించడంతో జిల్లాల వారీగా ఎగుమతి అవకాశాలపై ప్రత్యేకంగా దృష్టి సారించాం. కొత్త జిల్లాల ఏర్పాటుతో ఎగుమతిదారులకు చేయూతనందించేలా తగినంత మంది అధికారులు అందుబాటులోకి వచ్చారు. విదేశాలకు ఇతర ఉత్పత్తుల ఎగుమతి అవకాశాలతోపాటు కొత్త దేశాల్లో అవకాశాలను గుర్తించి స్థానిక అవకాశాలను పరిశీలిస్తున్నాం. సుదీర్ఘ తీరప్రాంతాన్ని వినియోగించుకుంటూ సముద్ర ఆధారిత వాణిజ్య అవకాశాలపై ప్రధానంగా దృష్టిసారిస్తున్నాం. నాలుగు పోర్టులతో పాటు పోర్టులకు ఆనుకుని పారిశ్రామిక పార్కులను అభివృద్ధి చేస్తున్నాం. – ప్రవీణ్ కుమార్, సీఈవో, ఏపీమారిటైమ్ బోర్డు. -
ఇక మచిలీపట్నం పోర్టుకు పూర్వవైభవం
సాక్షి, అమరావతి: మచిలీపట్నం వాసుల చిరకాల వాంఛ కార్యరూపం దాల్చుతోంది. సుమారు రూ.11,464 కోట్ల భారీ పెట్టుబడితో పోర్టు నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. మొత్తం 16 బెర్తులతో.. 115.97 మిలియన్ టన్నుల సామర్థ్యంతో దీన్ని నిర్మించనుంది. ఇందులో భాగంగా తొలి దశలో రూ.5,156 కోట్లతో నాలుగు బెర్తుల నిర్మాణ పనులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ నెల 22న శంకుస్థాపన చేయనున్నారు. తొలి దశలో 35 మిలియన్ టన్నుల వార్షిక సామర్థ్యంతో పోర్టును నిర్మిస్తారు. ఇందుకు సంబంధించి రూ.3,668.83 కోట్ల విలువైన పనుల కాంట్రాక్టును రివర్స్ టెండరింగ్ విధానంలో మేఘా ఇంజనీరింగ్ లిమిటెడ్ దక్కించుకుంది. తొలి దశలో నిర్మించే నాలుగు బెర్తుల్లో రెండు సాధారణ బెర్తులు కాగా ఒకటి కోల్, మరొకటి మల్టీపర్పస్ బెర్తు. ఈ పోర్టు నిర్మాణం ద్వారా తెలంగాణతో పాటు మన రాష్ట్రంలోని కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల ప్రజలు ప్రయోజనం పొందనున్నారు. ఎరువులు, బొగ్గు, వంట నూనెలు, కంటైనర్ల దిగుమతులకు ఈ పోర్టు అనువుగా ఉంటుందని అంచనా. అలాగే వ్యవసాయ ఉత్పత్తులు, సిమెంట్, సిమెంట్ క్లింకర్, గ్రానైట్ బ్లాక్స్, ముడి ఇనుము ఎగుమతికి ప్రయోజనకరంగా ఉంటుందని అంచనా వేశారు. ఈ పోర్టు అందుబాటులోకి వస్తే ప్రత్యక్షంగా పరోక్షంగా 25 వేల మందికి ఉపాధి లభిస్తుంది. దక్షిణాసియాకు ముఖద్వారంగా.. దేశ తూర్పుతీరంలో దక్షిణాసియా దేశాలకు అత్యంత దగ్గరగా మచిలీపట్నం పోర్టు ఉండటంతో పూర్వకాలంలో మసూలీపటా ఓడరేవు పేరుతో ఇక్కడి నుంచి పర్షియన్ (గల్ఫ్) దేశాలకు ఎగుమతులు, దిగుమతులు జరిగేవి. మచిలీపట్నం ప్రాంతపు చేనేత, కలంకారీ, అద్దకం దుస్తులకు పర్షియా దేశాల్లో మంచి డిమాండ్ ఉండేది. దీంతో ఆంగ్లేయులతోపాటు, డచ్, పోర్చుగీసు వారు మచిలీపట్నంలో వ్యాపార కేంద్రాలను ఏర్పాటు చేసుకున్నారు. 1970 వరకు కార్యకలాపాలు కొనసాగించిన బందరు పోర్టు కాలక్రమంలో కనుమరుగైపోయింది. అన్ని అనుమతులతో ముందుకు.. స్థానిక ప్రజల చిరకాల కోరిక అయిన మచిలీపట్నం పోర్టు నిర్మాణానికి నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 2008, ఏప్రిల్ 23న శంకుస్థాపన చేశారు. అయితే వైఎస్ అకాల మరణానంతరం నిర్మాణ పనులు అటకెక్కాయి. 2014లో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు తన ఐదేళ్ల పాలనలో ఈ ప్రాజెక్టు గురించి అసలు పట్టించుకోలేదు. 2019లో ఎన్నికలకు నెలన్నర ముందు పబ్లిసిటీ స్టంట్‌లో భాగంగా పోర్టు నిర్మాణానికి శంకుస్థాపన అంటూ ఒక కొబ్బరికాయ కొట్టి మమ అనిపించారు. అయితే దీనికి భిన్నంగా ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిధులు సమకూర్చడం దగ్గర నుంచి అన్ని అనుమతులు వచ్చాకే నిర్మాణ పనులకు శ్రీకారం చుడుతున్నారు. ఇందులో భాగంగా అధికారంలోకి వచ్చి ఏడాది కాకముందే 2020 ఫిబ్రవరి 4న మచిలీపట్నం పోర్టు డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ పేరుతో ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేశారు. రూ.5,156 కోట్లతో పోర్టు నిర్మాణానికి పరిపాలన అనుమతులను మంజూరు చేయడమే కాకుండా నిధులను కూడా సమకూర్చారు. ఆ తర్వాత రూ.3,668.83 కోట్లతో నిర్మాణ పనులు ప్రారంభించడానికి టెండరు దక్కించుకున్న మేఘా ఇంజనీరింగ్ లిమిటెడ్‌తో ఈ ఏడాది ఫిబ్రవరి 26న ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. అలాగే పోర్టు నిర్మాణానికి అవసరమైన కీలకమైన పర్యావరణ అనుమతులు ఫిబ్రవరి 28న వచ్చాయి. పోర్టును జాతీయరహదారితో అనుసంధానిస్తూ 6.5 కి.మీ నాలుగులైన్ల రహదారి, ఏడు కి.మీ రైల్వే లైన్ నిర్మాణాలకు కూడా అనుమతులు సాధించారు. తీర ప్రాంతంపై ప్రత్యేక దృష్టి రాష్ట్రంలో 974 కి.మీ. సుదీర్ఘ తీరప్రాంతాన్ని వినియోగించుకోవడం ద్వారా పారిశ్రామికంగా, వాణిజ్యంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలన్నది సీఎం వైఎస్ జగన్ దృఢసంకల్పం. ఇందులో భాగంగా ఏపీ మారిటైమ్ బోర్డును ఏర్పాటు చేయడమే కాకుండా ఏకకాలంలో నాలుగు పోర్టుల నిర్మాణాన్ని చేపడుతున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఐదు నాన్ మేజర్ పోర్టుల వార్షిక సామర్థ్యం 320 మిలియన్ టన్నులుగా ఉంది. 2022–23లో 175 మిలియన్ టన్నుల ఎగుమతులు, దిగుమతులు జరిగాయి. 2025–26 నాటికి ఈ మొత్తానికి అదనంగా మరో 110 మిలియన్ టన్నులు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇందులో భాగంగా రూ.16 వేల కోట్లతో రామాయపట్నం, మూలపేట, మచిలీపట్నం పోర్టులతో పాటు పీపీపీ విధానంలో కాకినాడ వద్ద గేట్‌వే పోర్టు నిర్మాణాన్ని ప్రభుత్వం చేపడుతోంది. ఈ నాలుగు పోర్టుల నిర్మాణం ద్వారా రాష్ట్రంలో అదనంగా 75 వేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభించనుంది. – ప్రవీణ్ కుమార్, సీఈవో, ఏపీ మారిటైమ్ బోర్డు, వీసీ అండ్ ఎండీ ఏపీఐఐసీ -
టీఎస్పీఎస్సీ డీఏవో పరీక్ష పేపర్ కోసం.. ‘ఆడి’ కారు అమ్మి.. అడ్వాన్సు ఇచ్చి
సాక్షి, హైదరాబాద్: టీఎస్పీఎస్సీ డివిజినల్ అకౌంట్స్ ఆఫీసర్ (డీఏఓ) పరీక్ష పేపర్ ఖరీదు చేసిన కేసులో అరెస్టయిన ఖమ్మం జంట సాయి లౌకిక్, సాయి సుస్మిత విచారణలో ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి. వీరిద్దరినీ సిట్ అధికారులు న్యాయస్థానం అనుమతితో తమ కస్టడీలోకి తీసుకుని మూడు రోజులపాటు విచారించారు. ఆదివారం ఆ గడువు ముగియడంతో సోమవారం వైద్యపరీక్షల అనంతరం కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించనున్నారు. సాయి సుస్మిత గ్రూప్–1 పరీక్ష రాసిన తర్వాత ఓఎంఆర్ షీట్లో జరిగిన పొరపాట్లు సరి చేసుకోవడానికి కమిషన్‌కు వచ్చిన సందర్భంలో ప్రవీణ్‌కుమార్‌తో పరిచయమైంది. డీఏఓ మాస్టర్ క్వశ్చన్ పేపర్ తన వద్ద ఉందని ఫిబ్రవరి మూడో వారంలో ఈమెతో చెప్పిన ప్రవీణ్ రూ.10 లక్షలకు విక్రయిస్తానన్నాడు. ఈ విషయాన్ని సుస్మిత తన భర్త లౌకిక్‌కు చెప్పింది. అప్పటికప్పుడు అంత డబ్బు లేకపోవడంతో తమ వద్ద ఉన్న రెండు కార్లలో ‘ఆడి’ కారును తన స్నేహితుడికి విక్రయించిన లౌకిక్ అతడి నుంచి అడ్వాన్స్‌గా రూ.6 లక్షలు తీసుకున్నాడు. ఆ మొత్తాన్ని ప్రవీణ్‌కు ట్రాన్స్ఫర్ చేసి మిగిలిన మొత్తం చెల్లింపునకు గడువు కోరాడు. దీంతో భార్యాభర్తల్ని ఎల్బీనగర్ వద్దకు రమ్మని ప్రవీణ్ చెప్పాడు. ‘ఆ పేపర్ మేం ఎవ్వరికీ ఇవ్వలేదు’ ఫిబ్రవరి 23 రాత్రి ఖమ్మం నుంచి నగరానికి వచ్చిన దంపతులు ఎల్బీనగర్లోని డీ మార్ట్ వద్ద ఉండి ప్రవీణ్‌కు సమాచారం ఇచ్చారు. బడంగ్‌పేట్‌లోని మల్లికార్జున కాలనీలో తన ఇంటి నుంచి అక్కడకు వచ్చిన ప్రవీణ్ మాస్టర్ క్వశ్చన్ పేపర్ ఇచ్చి వెళ్లాడు. ఆ రాత్రి అల్కాపురిలోని లాడ్జిలో బస చేసిన ఈ దంపతులు మరుసటి రోజు ఖమ్మంలోని సమీప బంధువు ఇంటికి వెళ్లారు. అక్కడే రెండు రోజుల ఉండి పరీక్షకు సిద్ధమైన సుస్మిత ఫిబ్రవరి 26న పరీక్ష రాసింది. సిట్ అధికారులు వీరిద్దరినీ తీసుకుని శనివారం ఖమ్మం రాపర్తినగర్‌లోని వారి ఇంట్లో సోదాలు చేశారు. మాస్టర్ ప్రశ్నపత్రంతో పాటు హాల్‌టికెట్ స్వాదీనం చేసుకున్నారు. తాము ఆ ప్రశ్నపత్రాలు మరెవరికీ ఇవ్వలేదని ఇరువురూ సిట్ అధికారులకు తెలిపారు. నేను కష్టపడి చదివా.. మీరు అపోహపడుతున్నారు న్యూజిలాండ్ నుంచి సిట్‌కు ఈ– మెయిల్ చేసిన నిందితుడు ప్రశాంత్ గ్రూప్–1 ప్రశ్నా పత్రాన్ని ప్రధాన నిందితులలో ఒకడైన రాజశేఖర్‌రెడ్డి, న్యూజిలాండ్‌లో ఉన్న తన బావ ప్రశాంత్‌రెడ్డికి పంపించాడు. న్యూజిలాండ్‌లో పరీక్షకు సిద్ధమై, హైదరాబాద్‌కు వచ్చి ప్రశాంత్ గ్రూప్–1 పరీక్ష రాసి వెళ్లాడు. పేపర్ లీకేజీ ఘటన వెలుగులోకి రావడంతో వందకుపైగా మార్కులు వచ్చిన వారిని ఆరా తీస్తున్న క్రమంలో ప్రశాంత్‌రెడ్డికి వందకుపైగా మార్కులు వచ్చిన విషయం వెలుగులోకి వచ్చింది. విచారణలో తన బావకు ప్రశ్న పత్రాన్ని పంపించానని రాజశేఖర్ అంగీకరించాడు. ఈ మేరకు న్యూజిలాండ్‌లో ఉన్న ప్రశాంత్‌కు వాట్సాప్, ఈ మెయిల్ ద్వారా సిట్ నోటీసులు పంపించింది. ఈ నేపథ్యంలో ప్రశాంత్‌రెడ్డి సిట్‌కు ఈ మెయిల్ పంపించాడు. ‘నేను కష్టపడి చదివానని, నేను ఎవరి వద్ద నుంచి ప్రశ్నా పత్రం తీసుకోలేదు, నాకు మార్కులు ఎక్కువగా రావడంతో మీరు అపోహపడుతున్నారు’ అని ఈ మెయిల్లో పేర్కొన్నాడు. కాగా ప్రశ్నా పత్రాన్ని న్యూజిలాండ్‌లో ఉన్న ప్రశాంత్‌కు రిమోట్‌యాప్ అయిన ఎనీడెస్క్ ద్వారా రాజశేఖర్‌రెడ్డి పంపించిన విషయం విచారణలో వెల్లడైన విషయంతెలిసిందే. -
టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసు: ఖాకీ అంటే మోజు.. సెల్యూట్ అంటే క్రేజు!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్విస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) ప్రశ్నపత్రాల లీకేజ్ స్కామ్‌లో సూత్రధారిగా ఉన్న కమిషన్ కార్యదర్శి మాజీ వ్యక్తిగత సహాయకుడు పులిదిండి ప్రవీణ్ కుమార్‌కు పోలీసు డిపార్ట్మెంట్ అంటే ఎంతో మోజు.. యూనిఫామ్‌లో వస్తున్న వారిని చూసి ఎదుటి వాళ్లు చేసే సెల్యూట్ అంటే మహా క్రేజ్. అయితే ‘ఖాకీ’ఉద్యోగం సంపాదించడానికి కష్టపడకుండా ఇతగాడు అడ్డదారులు తొక్కాడు. తండ్రి ఖాకీ ఉద్యోగం రాకపోవడంతో.. ప్రవీణ్ తండ్రి ఏపీ రాజమండ్రికి చెందిన పి.హరిశ్చంద్రారావు డీజీపీ కార్యాలయం ప్రెస్‌కు అదనపు ఎస్పీగా పని చేస్తూ అనారోగ్యంతో మరణించారు. కారుణ్య నియామకం కింద తనకు ఆ ఉద్యోగమే వస్తుందని భావించాడు. నిబంధనలు, అతడి అర్హత పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగం ఇచ్చింది. అయితే ఎలాగైనా డీఎస్పీ లేదా జైళ్ల శాఖలో సూపరింటెండెంట్ అయి యూనిఫామ్ వేసుకోవాలని భావించిన ప్రవీణ్ కుమార్ గ్రూప్–1 పరీక్షకు దరఖాస్తు చేసుకున్నాడు. రాజశేఖర్‌రెడ్డి సహాయంతో కస్టోడియన్ శంకర లక్ష్మి కంప్యూటర్ను యాక్సస్ చేసి గ్రూప్–1 పేపర్ తస్కరించాడు. అయితే ప్రవీణ్ కుమార్ తన ఓఎంఆర్ షీట్‌ను డబుల్ బబ్లింగ్ చేయడంతో తిరస్కరించిన కమిషన్ వాల్యూషన్ చేయలేదు. కనీసం సొమ్మైనా చేసుకుందామని... డబుల్ బబ్లింగ్‌తో ‘ఖాకీ పోస్టుకు’అవకాశం కోల్పోయిన ప్రవీణ్‌కు పేపర్లు అమ్మి సొమ్ము చేసుకోవాలని దుర్భుద్ది పుట్టింది. ఈ నేపథ్యంలోనే మరో ఐదు పరీక్షలకు సంబంధించిన 14 పరీక్ష పత్రాలను రాజశేఖర్ సాయంతో చేజిక్కించుకున్నాడు. వీటిలో ఏఈ ప్రశ్నపత్రంలో పాటు డీఏఓ పేపర్‌ను ఐదుగురికి రూ.50 లక్షలుకు విక్రయించి రూ.29.45 లక్షలు అడ్వాన్స్‌గా తీసుకున్నాడు. మిగిలిన పేపర్లు విక్రయించే ప్రయత్నాల్లో ఉండగానే విషయం వెలుగులోకి రావడంతో కటకటాల్లోకి చేరాడు. తన మాదిరిగానే డబుల్ బబ్లింగ్ చేసిన వాళ్లు దాదాపు 8వేలమంది ఉన్నట్టు ప్రవీణ్ గుర్తించాడు. వీరిలో కొందరిని సంప్రదించి సహాయం చేస్తానని నమ్మబలికి వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి టచ్‌లో ఉన్నాడు. సిట్ దర్యాప్తులో ఇవన్నీ వెలుగులోకి వచ్చాయి. -
డీఏఓ పేపరూ అమ్మేశాడు!
సాక్షి, హైదరాబాద్: టీఎస్పీఎస్సీ పరీక్ష పేపర్ల లీకేజ్ కేసులో కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. అసిస్టెంట్ ఇంజనీర్ (ఏఈ) క్వశ్చన్ పేపర్లతో పాటు డివిజినల్ అకౌంట్స్ ఆఫీసర్ (డీఏఓ) ప్రశ్న పత్రాలనూ సూత్రధారి పి.ప్రవీణ్ కుమార్ విక్రయించినట్లు తాజాగా బయటపడింది. ఈ విషయం గుర్తించిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) శుక్రవారం ఖమ్మం ప్రాంతానికి చెందిన భార్యాభర్తలు సాయి సుస్మిత, సాయి లౌకిక్లను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. కమిషన్ నిర్వహించిన, నిర్వహించాల్సిన ఆరు పరీక్షలకు సంబంధించి 15 ప్రశ్న పత్రాలు లీకైనట్లు ఇప్పటికే సిట్ అధికారులు తమ దర్యాప్తులో గుర్తించారు. వీటిలో గ్రూప్–1 ప్రిలిమ్స్ పరీక్షలకు పంచుకున్నారని, ఏఈ పరీక్షలవి విక్రయించారని, మిగిలినవి ఏ అభ్యర్థుల వద్దకూ వెళ్లలేదని భావించారు. అయితే కమిషన్ కార్యదర్శి అనిత రామ్‌చంద్రన్ వద్ద వ్యక్తిగత సహాయకుడిగా పని చేసిన ప్రవీణ్ కుమార్ బ్యాంకు ఖాతాను విశ్లేషించిన అధికారులు డీఏఓ పరీక్ష పత్రాన్ని కూడా ఇతడు విక్రయించాడని గుర్తించారు. సాయి లౌకిక్ ఖమ్మంలో కార్ల వ్యాపారం చేస్తుండగా, ఈయన భార్య సుస్మిత గతంలో హైదరాబాద్‌లోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో పని చేశారు. టీఎస్పీఎస్సీ నిర్వహించే గ్రూప్–1, డీఏఓ పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న సుస్మిత ఉద్యోగం మాని వీటికోసం సిద్ధమయ్యారు. గతేడాది అక్టోబర్‌లో జరిగిన గ్రూప్–1 ప్రిలిమ్స్ రాసిన ఈమె ఓఎంఆర్ షీట్‌ను రాంగ్ బబ్లింగ్ చేశారు. అంటే నిబంధనలకు విరుద్ధంగా రెండు చోట్ల పెన్నుతో మార్కింగ్ చేశారు. దీంతో ఈమె జవాబు పత్రాన్ని కమిషన్ పరిగణనలోకి తీసుకోలేదు. ఈ అంశంలో తనకు న్యాయం చేయాలని కోరడానికి సుస్మిత పలుమార్లు టీఎస్పీఎస్సీ కార్యాలయానికి వచ్చి, పలువురు అధికారులను కలిశారు. ఇలా కమిషన్ కార్యదర్శి వద్దకు వచ్చిన సందర్భంలోనే ఈమెకు ప్రవీణ్‌తో పరిచయం ఏర్పడింది. మాటల సందర్భంలో తాను డీఏఓ పరీక్షకు సిద్ధమవుతున్నట్లు చెప్పింది. జవాబులతో కూడిన మాస్టర్ పేపర్‌నే ఇస్తా.. ఫిబ్రవరి మూడో వారంలో డీఏఓ పేపర్ చేజిక్కించుకున్న ప్రవీణ్ ఆమెను సంప్రదించారు. తన వద్ద డీఏఓ పరీక్ష పత్రం ఉందని, రూ.10 లక్షలకు విక్రయిస్తానని చెప్పాడు. దీంతో ఆమె విషయాన్ని తన భర్త లౌకిక్‌కు చెప్పింది. ఇద్దరూ కలిసి ప్రవీణ్‌ను కలిసి బేరసారాలు చేశారు. తాను ఇచ్చేది జవాబులతో కూడిన మాస్టర్ పేపర్ అని చెప్పిన అతగాడు రేటు తగ్గించడానికి ససేమిరా అన్నాడు. దీంతో అడ్వాన్స్‌గా రూ.6 లక్షలు ప్రవీణ్ ఖాతాకు బదిలీ చేసిన లౌకిక్ డీఏఓ ప్రశ్నపత్రం ప్రింటెడ్ కాపీ తీసుకున్నాడు. మిగిలిన రూ.4 లక్షలు ఫలితాలు వెలువడిన తర్వాత ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నాడు. ఈ ప్రశ్న పత్రం ఆధారంగానే తర్ఫీదు పొందిన సుస్మిత ఫిబ్రవరి 26న డీఏఓ పరీక్ష రాసింది. నాటకీయ పరిణామాల మధ్య గత నెలలో ఈ పేపర్ల లీకేజ్ వ్యవహారం వెలుగులోకి రావడం, ప్రవీణ్ సహా మొత్తం 15 మంది అరెస్టు కావడం జరిగిపోయాయి. ప్రవీణ్‌ను సిట్ పోలీసులు రెండుసార్లు కస్టడీలోకి తీసుకుని విచారించినా సుస్మిత వ్యవహారం చెప్పలేదు. కేవలం ఏఈ పేపర్లు మాత్రమే విక్రయించానని పదేపదే చెప్తూ సిట్ అధికారులను నమ్మించే ప్రయత్నం చేశాడు. రూ. 6 లక్షలపై తీగ లాగితే... అతడి బ్యాంకు ఖాతాలోకి నగదు లావాదేవీలు పరిశీలించిన అధికారులు రూ.6 లక్షలు ఫిబ్రవరి మూడో వారంలో డిపాజిట్ అయినట్లు గుర్తించారు. ఆ నగదు లావాదేవీల వివరాలు చెప్పాలంటూ విచారణ సందర్భంలో ప్రవీణ్‌ను తమదైన శైలిలో అడిగారు. తన కారు ఖమ్మంలోని కార్ల వ్యాపారి లౌకిక్‌కు విక్రయించానని, దానికి సంబంధించిన మొత్తమే అది అంటూ తొలుత నమ్మించే ప్రయత్నం చేశాడు. దీనిపై సందేహాలు వ్యక్తం చేసిన సిట్ లౌకిక్‌కు సంబం«దీకులు ఎవరైనా టీఎస్పీఎస్సీ పరీక్షలకు దరఖాస్తు చేసుకున్నారా? అనే అంశంపై దృష్టి పెట్టారు. కమిషన్ నుంచి తీసుకున్న ఆయా పరీక్షల అభ్యర్థుల జాబితాలోని వివరాలను సరి చూశారు. దీంతో లౌకిక్ భార్య సుస్మిత గ్రూప్–1తో పాటు డీఏఓ పరీక్ష రాసినట్లు వెల్లడైంది. దీంతో భార్యాభర్తలను సిట్ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించారు. శుక్రవారం ఇరువురినీ అరెస్టు చేసిన సిట్ కోర్టులో హాజరుపరిచి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించింది. వీరి నుంచి ఈ పేపర్ ఇంకా ఎవరికైనా చేరిందా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఈ దంపతుల్ని తమ కస్టడీకి ఇవ్వాలని కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేయాలని సిట్ నిర్ణయించింది. -
TSPSC: 40 లక్షలకు మూడు ఏఈ పేపర్లు లీక్.. సినిమా రేంజ్ ట్విస్ట్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ వ్యవహారం సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఈ కేసు విచారణలో సిట్ ఇప్పటికే స్పీడ్ పెంచింది. కాగా, తాజాగా టీఎస్పీఎస్సీ నిందితుల విచారణలో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఏఈ పేపర్ లీక్‌లో కేతావత్ రాజేశ్వర్ కీలక పాత్ర పోషించినట్టు పోలీసులు గుర్తించారు. అయితే, మూడు ఏఈ పేపర్లను రాజేశ్వర్ రూ.40 లక్షలకు అమ్మినట్టు విచారణలో తేలింది. ఇందుకు రూ. 25 లక్షలను రాజేశ్ అడ్వాన్స్‌గా తీసుకున్నాడు. మిగిలిన డబ్బును పరీక్ష ఫలితాలు వచ్చిన తర్వాత వచ్చేలా ఒప్పందం చేసుకున్నాడు. ఈ క్రమంలో నిందితుల నుంచి పోలీసులు.. రూ. 8.5 లక్షలను రికవరీ చేశారు. ఈ క్రమంలో ప్రవీణ్ కుమార్.. రేణుకకు పేపర్ లీక్ చేశాడు. నమ్మకమైన వారికి పేపర్ అమ్మాలని రేణుకకు సూచించాడు. ఈ సందర్బంగా రూ. 10లక్షలకు రేణుకతో బేరం కుదుర్చుకున్నాడు. దీంతో, రేణుక వద్ద నుంచి ప్రవీణ్ అడ్వాన్స్‌గా రూ. 5లక్షలు తీసుకున్నాడు. ఇక, ఈ పేపర్లను రేణుక తన భర్త డాక్యానాయక్ ద్వారా అమ్మకానికి పెట్టింది. వారి సమీప బంధువైన రాజేశ్వర్‌కు పేపర్ విషయం చెప్పి అమ్మాలని సూచించారు. రంగంలోకి దిగిన రాజేశ్వర్.. మధ్యవర్తులు గోపాల్, నీలేష్, ప్రశాంత్, రాజేంద్రకుమార్‌లకు రూ. 40 లక్షలకు పేపర్లను విక్రయించాడు. వారి వద్ద నుంచి అడ్వాన్స్‌గా రూ. 23 లక్షలు తీసుకున్నాడు. అనంతరం, రూ.10లక్షలు డాక్యానాయక్‌కు ఇచ్చిన రాజేశ్వర్. ఇక, ఇందులో నుంచి మరో రూ.5లక్షలను ప్రవీణ్‌కు డాక్యా నాయక్ ఇచ్చాడు. అయితే, రాజేశ్వర్ తల్లి గండీడ్(మండలం) మన్సూర్‌పల్లి తండా సర్పంచ్. పేపర్లు అమ్మగా వచ్చిన డబ్బుతో రూ. 8లక్షలు వెచ్చించి ఊరిలో రాజేశ్వర్ అభివృద్ధి పనులు చేశారు. ప్రభుత్వం నుంచి బిల్లులు మంజూరయ్యాక రూ.8లక్షలు తీసుకుందామని రాజేశ్వర్ ప్లాన్ చేసుకున్నాడు. -
ఇంటి దొంగలు ఎందరు? 42 మంది టీఎస్పీఎస్సీ ఉద్యోగులకు నోటీసులు
సాక్షి, హైదరాబాద్: టీఎస్పీఎస్సీ పరీక్ష పేపర్ల లీకేజ్ స్కామ్‌ను దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఇంటి దొంగల్ని కనిపెట్టడంపై దృష్టి పెట్టింది. ఇప్పటికే కమిషన్ కార్యదర్శి పీఏ ప్రవీణ్‌కుమార్ అరెస్టు కావడం, మాజీ ఉద్యోగి సురేష్ పేరు వెలుగులోకి రావడంతో లోతుగా ఆరా తీస్తోంది. కమిషన్‌కు చెందిన వివిధ స్థాయిల ఉద్యోగులు 42 మందికి నోటీసులు జారీ చేసి ప్రశ్నించడం ప్రారంభించింది. మరోపక్క తమ కస్టడీలో ఉన్న 9 మంది నిందితులను సిట్ అధికారులు బుధవారం ఏడు గంటల పాటు ప్రశ్నించారు. వీరి కస్టడీ గడువు గురువారంతో ముగియనుండటంతో విచారణ వేగవంతం చేశారు. బుధవారం కమిషన్ కార్యాలయానికి వెళ్లిన సైబర్ క్రైమ్ నిపుణుల బృందం కూడా నిందితులను ప్రశ్నించింది. ఇక టెక్నికల్ టీమ్ వంతు.. టీఎస్పీఎస్సీలో పరీక్షలకు సంబంధించిన ప్రశ్నపత్రాలు భద్రపరిచే కాన్ఫిడెన్షియల్ సెక్షన్ మొదలుపెట్టి అన్ని విభాగాల్లోనూ కలిపి దాదాపు 150 కంప్యూటర్లు ఉన్నాయి. వీటిని పర్యవేక్షించడానికి ప్రత్యేకంగా టెక్నికల్ టీమ్ పని చేస్తుంటుంది. నెట్వర్క్ అడ్మిన్‌గా ఉండి, లీకేజ్ కేసులో అరెస్టు అయిన రాజశేఖర్ ఈ టీమ్‌లో కీలకంగా వ్యవహరించాడు. ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకున్న సిట్ అధికారులు అంతర్గత లోపాలు గుర్తించడానికి టెక్నికల్ టీమ్‌ను ప్రశ్నించాలని నిర్ణయించారు. దీంతో పా టు వీరి బంధువులు, స్నేహితుల్లో ఎవరైనా టీఎస్పీఎస్సీ నిర్వహించిన పరీక్షలు రాశారా? వారికి ఎన్ని మార్కులు వచ్చాయి? గతంలో వారి ప్రతిభ ఎలా ఉంది? తదితర అంశాలను దర్యాప్తు చేస్తున్నారు. ముగ్గురి కోసం గాలింపు గ్రూప్ –1 ప్రిలిమ్స్ పేపర్ లీక్‌లో పాత్ర ఉన్నట్టుగా గుర్తించిన ముగ్గురు అందుబాటులో లేకపోవడంతో, వారిని నిందితులుగా అనుమానిస్తూ సిట్ గాలింపు చేపట్టింది. వీళ్లు కమిషన్ ఉద్యోగులే అని తెలుస్తోంది. 100 కంటే ఎక్కువ మార్కులు సాధించిన పదిమందిలో ఈ ముగ్గురు ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే నిందితులుగా ఉన్న 9 మందికి అదనంగా మరికొందరి పేర్లు జోడిస్తూ అధికారులు గురువారం కోర్టుకు సమాచారం ఇవ్వనున్నారు. శంకరలక్ష్మిది నిర్లక్ష్యమే..? లక్షలాది మంది నిరుద్యోగుల భవిష్యత్తుకు సంబంధించిన పరీక్షల పేపర్లను భద్రపరచడంలో శంకరలక్ష్మి నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు సిట్ భావిస్తోంది. ఈమెకు నోటీసులు జారీ చేసి ఇప్పటికే రెండుసార్లు ప్రశ్నించిన నేపథ్యంలో తదుపరి చర్యలకు సంబంధించి కమిషన్ అధికారులతో సంప్రదింపులు జరుపుతోంది. గ్రూప్–1 ప్రిలిమ్స్ క్వశ్చన్ పేపర్ పరీక్షకు ముందే ప్రవీణ్, రాజశేఖర్, సురే ష్ లతో పాటు మరెవరికైనా చేరిందా అనే దానిపై లోతుగా దర్యాప్తు చేస్తోంది. ఏఈ పరీక్ష పేపర్ క్రయవిక్రయాల్లో ప్రవీణ్, రేణుక, నీలేశ్, గోపాల్ మధ్య జరిగిన రూ.14 లక్షల లావాదేవీలపై అధికారులు ఆరా తీస్తున్నారు. మరోవైపు సైబర్ క్రైమ్ నిపుణుల బృందం కమిషన్ కార్యాలయంలో పని చేస్తున్న కీలక ఉద్యోగుల సెల్ఫోన్లు, వాట్సాప్ సంప్రదింపులను విశ్లేషించడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ కేసులో మరికొన్ని అరెస్టులు చోటు చేసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. గ్రూప్–1లో 10 మంది ఉద్యోగులు పాస్ గతేడాది అక్టోబర్‌లో జరిగిన గ్రూప్–1 ప్రిలిమ్స్ పరీక్ష రాసిన కమిషన్ ఉద్యోగుల్లో ముగ్గురు ఔట్సోర్సింగ్ ఉద్యోగులతో సహా పది మంది ఉత్తీర్ణులయ్యారు. వీరిలో కొందరికి ఊహించని విధంగా మార్కులు వచ్చాయని సిట్ గుర్తించింది. ఇప్పటికే ఈ జాబితాను టీఎస్పీఎస్సీ నుంచి సేకరించిన అధికారులు వారికీ నోటీసులు జారీ చేసి విచారణకు సిద్ధమయ్యారు. కస్టోడియన్‌గా వ్యవహరిస్తున్న కమిషన్ ఉద్యోగిని శంకరలక్ష్మి కంప్యూటర్ నుంచే ప్రశ్నపత్రాలు బయటకు వచ్చాయని ఇప్పటికే నిర్ధారణైంది. వివిధ కోణాల్లో దర్యాప్తు చేసిన అధికారులు తనకు ఉన్న పరిజ్ఞానం వినియోగించిన రాజశేఖర్.. శంకరలక్ష్మి కంప్యూటర్లోకి అక్రమంగా చొరబడి ప్రశ్నపత్రాలు సంగ్రహించాడని తేల్చారు. ఈ విధంగా లీకేజ్ వ్యవహారంలో సైబర్ నేరమూ ఉండటంతో ఇన్ఫర్మేషన్ యాక్ట్‌ను జోడించాలని నిర్ణయించారు. నిందితులను గురువారం కోర్టులో హాజరుపరిచే సమయంలో దీనికి సంబంధించి మెమో దాఖలు చేయనున్నారు. -
ప్రగతిభవన్‌లో పేపర్ లీకేజీ మూలాలు
లక్డీకాపూల్(హైదరాబాద్): టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రం లీకేజీ కేసు మూలాలు ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్ వద్ద ఉన్నాయని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. కేసీఆర్, కేటీఆర్ కుటుంబసభ్యుల కనుసన్నల్లోనే ఈ లీకేజీ జరిగిందన్నారు. ‘టీఎస్పీఎస్సీ పేపర్ల లీకేజీ– ప్రభుత్వ వైఫల్యం–నిరుద్యోగుల గోస’అనే అంశంపై మంగళవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో యువజన సమితి, విద్యార్థి జన సమితి అధ్యక్షులు సలీం పాషా, సర్దార్ వినోద్ కుమార్ అధ్యక్షతన అఖిలపక్షాల రౌండ్‌టేబుల్ సమావేశంజరిగింది. ఈ సందర్భంగా ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ నీళ్లు, నియామకాలు, నిధులు(ట్రిపుల్ ఎన్) కాస్తా లీకులు, లిక్కర్, లిఫ్ట్(ట్రిపుల్ ఎల్)గా మారిందని అన్నారు. పేపర్ లీకేజీ నిందితులందరికీ యావజ్జీవ కారాగార శిక్ష వేయాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ ప్రత్యేక అభివృద్ధి నిధి నుంచి నిరుద్యోగ అభ్యర్థులకు 50 వేల చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగులు ఆవేశపూరితంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని ఆయన కోరారు. కేసీఆర్ కాస్కో: కోదండరాం తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరాం మాట్లాడుతూ ఈ లీకేజీ వ్యవహా రం ఇద్దరు వ్యక్తుల సమస్య కాదని, పాలకులతో దీనికి సంబంధం ఉందని అన్నా రు. ఈ ఘటనపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. లీకేజీ ఘటనకు సీఎం కేసీఆర్‌దే నైతిక బాధ్యత అని అన్నారు. 30 లక్షల మంది నిరుద్యోగులతో ప్రభుత్వం చెలగాటం ఆడుతోందని దుయ్యబట్టారు. ప్రభుత్వ అరాచకాలపై ఐక్యంగా ఉద్యమిస్తామని హెచ్చరించారు. గెలుపు కేసీఆర్ పైసాదో, మా పోరాటపటిమదో చూద్దామని సవాల్ విసిరారు. ‘ఇక ఐక్యంగా ఉద్యమిస్తాం, కేసీఆర్ కాస్కో’అని హెచ్చరించారు. త్వరలో అన్ని పార్టీలతో సమావేశమై కార్యాచరణ ప్రకటిస్తామని కోదండరాం తెలిపారు. విశ్రాంతి ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి మాట్లాడుతూ టీఎస్పీఎస్సీ రిక్రూట్మెంట్ తీరు ఇలా ఉంటే, మిగతా శాఖల్లో నియామకాల పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చన్నారు. ఈ నేపథ్యంలో అన్నిరకాల పరీక్షలను ఒకే గొడుగు కిందకు తీసుకు రావాలని డిమాండ్ చేశారు. రాజకీయ ప్రమేయంలేని వారిని టీఎస్పీఎస్సీ చైర్మన్‌గా, సభ్యులుగా నియమించాలన్నారు. సమావేశంలో ప్రొ.హరగోపాల్, కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు రవి, తెలంగాణ విద్యావంతుల వేదిక కన్వినర్ అంబటి నాగన్న, టీజేఎస్ ఉపాధ్యక్షుడు పీఎల్ విశ్వేశ్వర్రావు, ప్రధాన కార్యదర్శులు ధర్మార్జున్, బైరి రమేశ్, కాంగ్రెస్ నేతలు కిరణ్‌రెడ్డి, భూపతిరెడ్డి, సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ నాయకులు గోవర్ధన్, ఝాన్సీ, ప్రవీణ్, విద్యార్థి సంఘాల నేతలు మహేశ్,, నాగేశ్వర్రావు, పుట్ట లక్ష్మణ్, ఓయూ జేఏసీ నేతలు శ్రీహరి, దయాకర్, నిరుద్యోగుల సంఘం నేత నవీన్ తదితరులు పాల్గొన్నారు. -
ఆహాలో సరికొత్త 'న్యూసెన్స్'.. టీజర్ చూశారా?
నవదీప్, బిందు మాధవి కీలక పాత్రల్లో నటించిన వెబ్ సిరీస్ 'న్యూసెన్స్'. ఈ వెబ్ సిరీస్‌కు ప్రవీణ్ కుమార్ దర్శకత్వం వహించారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ వెబ్ సిరీస్ త్వరలోనే ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. తాజాగా ఈ వెబ్ సిరీస్ టీజర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. టాలీవుడ్ హీరో రానా చేతులమీదుగా టీజర్ విడుదల చేశారు. ఈ టీజర్ చూస్తే పాలిటిక్స్, మీడియాను ఉద్దేశించి తెరకెక్కించినట్లు తెలుస్తోంది. 'ఎవడు మాట విన్నా, వినకపోయినా న్యూస్ రాసేవాడి చేతిలోనే ఉంటుంది చరిత్ర' అన్న నవదీప్ డైలాగ్ ఆసక్తి పెంచుతోంది. త్వరలోనే ఈ సిరీస్ స్ట్రీమింగ్ తేదీని వెల్లడించనున్నారు మేకర్స్. 'పాలిటిక్స్ ను ఆడించే పాళి.. మదనపల్లి రాజకీయాల్లో, కథాకళి.. పవర్పెన్ పాలిటిక్స్!' అనే క్యాప్షన్ ఈ సిరీస్‌పై మరింత ఆసక్తి పెంచుతోంది. పాలిటిక్స్ ను ఆడించే పాళి..🖋 మదనపల్లి రాజకీయాల్లో, కథాకళి..! Power'Pen' Politics... #NewsenseOnAHA Coming Soon@pnavdeep26 @thebindumadhavi @vishwaprasadtg @vivekkuchibotla @peoplemediafcy @SasikiranNaray1 @sureshbobbili9 @sriprawin @APEnt_Hyd pic.twitter.com/zmWnkwo1Pk — ahavideoin (@ahavideoIN) March 21, 2023 -
టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసులో కుట్ర కోణంపై అనుమానాలు: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: టీఎస్పీఎస్సీ లీకేజ్ అంశం చాలా దురదృష్టకరమని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఇద్దరు వ్యక్తులు చేసిన తప్పులతో వ్యవస్థకు చెడ్డపేరు వస్తోందని అన్నారు. ఇది వ్యవస్థ వైఫల్యం కాదని స్పష్టం చేశారు. తప్పులు జరిగినప్పుడు ఎలా సరిదిద్దుకోవాలనే బాధ్యత తమపై ఉందన్నారు. అవకతవకలు జరిగాయనే ఇంటర్వ్యూలు రద్దు చేశామని పేర్కొన్నారు. టీఎస్పీఎస్సీలో గత ఎనిమిదేళ్లలో ఎన్నో సంస్కరణలు చేశామని కేటీఆర్ తెలిపారు. వన్‌టైమ్ రిజిస్ట్రేషన్ ప్రారంభించామని, ఇప్పటి వరకు 99 పరీక్షలు నిర్వహించామని తెలిపారు. దేశంలోనే అత్యధికంగా ఉద్యోగ నియామకాలు చేపట్టామని తెలిపారు. 155 నోటీఫికేషన్ల ద్వారా 35 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని చెప్పారు. యూపీఎస్సీ ఛైర్మన్ రెండుసార్లు వచ్చిన మన సంస్కరణలు అధ్యయనం చేశారని గుర్తు చేశారు. 13 రాష్ట్రాల పబ్లిక్ సర్వీస్ కమిషనర్లు వచ్చి పరిశీలించారని ప్రస్తావించారు. ‘పేపర్ లీకేజీపై సీఎం కేసీఆర్‌కు నివేదిక ఇచ్చాం. ప్రజలకు నిజానిజాలు తెలియాలని సీఎం కేసీఆర్ చెప్పారు. సీఎం ఆదేశాలతోనే సమీక్ష నిర్వహించాం. నిందితులు ప్రవీణ్, రాజశేఖర్ వెనక ఎవరున్న కఠినంగా శిక్షిస్తాం. రద్దైన నాలుగు పరీక్షలకు మళ్లీ ఫీజులు చెల్లించాల్సిన అవసరం లేదు. గతంలో అప్లై చేసుకున్న వారంతా అర్హులే. మొత్తం నాలుగు పరీక్షల కోచింగ్ మెటీరియల్ ఆన్లైన్లో అందుబాటులో పెడతాం. 2 లక్షలకుపైగా ఉద్యోగాల భర్తీ ప్రక్రియ జరుగుతోంది. తెలంగాణ ఉద్యమమే నీళ్లు, నియామకాలు, నిధుల కోసం. యువత విషయంలో రాజకీయాలు చేయవద్దు. ఇద్దరు చేసిన తప్పును యువతలో అశాంతి చెలరేగేలా కొందరు మాట్లాడుతున్నారు. ప్రతిపక్షాలు నోటికొచ్చిన్నట్లు మాట్లాడటం సరికాదు. రాజకీయ నిరుద్యోగులు చేసే విమర్శలకు యువత రెచ్చిపోవద్దు. బీజేపీ నేతల తీరుపై అనుమానాలున్నాయి. నిందితుల్లో ఒకడైన రాజశేఖర్ బీజేపీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నాడు. పేపర్ లీకేజీలో కుట్ర కోణం ఏదైనా ఉందా అనే అనుమానాలున్నాయి. దీనిపై దర్యాప్తు చేయాలని డీజీపీని కోరుతున్నా. సిట్ విచారణపై నమ్మకం లేదని ముందే అంటే ఎలా. ఇంటర్ బోర్డు, పబ్లిక్ సర్వీస్ కమిషన్‌లో ఏదైనా జరిగే ఐటీ మంత్రి రాజీనామా చేయాలంటున్నారు. బీజేపీ పాలిత ప్రాంతాల్లో పేపర్లు లీకైతే మంత్రులు రాజీనామా చేస్తారా?’ అంటూ మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. చదవండి: మహిళా కమిషన్ ముందుకు బండి సంజయ్ -
సూత్రధారి రాజశేఖరే!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పబ్లిక్ సర్వి స్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) పరీక్ష పేపర్ల లీకేజీ స్కామ్‌లో కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ వ్యవహారంలో కమిషన్ కార్యదర్శి వద్ద పీఏగా పని చేస్తున్న ప్రవీణ్‌కుమార్ సూత్రధారి అని ఇప్పటివరకు భావించగా.. అతడిని పథకం ప్రకారం ప్రేరేపించినది రాజశేఖరేనని అధికారులు గుర్తించినట్టు తెలిసింది. రాజశేఖర్‌కు రాజకీయ సంబంధాలు సైతం ఉండటంతో.. ఆ కోణంలోనూ దర్యాప్తు చేపట్టినట్టు సమాచారం. ఇక లీకేజీ కేసును దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) శుక్రవారం టీఎస్పీఎస్సీకి ప్రాథమిక నివేదికను అందించింది. మొత్తం ఐదు పరీక్షల పేపర్లు లీకైనట్టుగా గుర్తించినట్టు తెలిసింది. ముందస్తు ప్లాన్‌తోనే.. రాజశేఖర్ టీఎస్టీఎస్ నుంచి టీఎస్పీఎస్సీకి డిప్యుటేషన్‌పై రావడంలోనూ కుట్ర ఉందని అధికారులు అనుమానిస్తున్నారు. పేపర్లపై కన్నేసిన రాజశేఖర్.. లీకేజీ కోసం ముందుగా ప్లాన్ చేసుకునే వచ్చాడని.. కార్యదర్శికి ప్రవీణ్ పీఏగా మారిన తర్వాత ప్లాన్ అమలు చేశాడని భావిస్తున్నారు. ఇందులో భాగంగానే ప్రవీణ్‌తో సన్నిహితంగా ఉన్నాడని అంటున్నారు. సిస్టమ్ అడ్మిన్ అయిన రాజశేఖరే కస్టోడియన్ శంకరలక్ష్మి కంప్యూటర్ను హ్యాక్ చేసి, పేపర్లు తస్కరించాడని.. వాటిని ప్రవీణ్‌కు ఇచ్చి రేణుకతో అమ్మించాడని అనుమానిస్తున్నారు. గత ఏడాది అక్టోబర్‌లో జరిగిన గ్రూప్–1 ప్రిలిమ్స్ ప్రశ్నపత్రాన్నీ రాజశేఖర్ ఇలానే చేజిక్కించుకుని ప్రవీణ్‌కు ఇచ్చి ఉంటాడని.. దాని ఆ«ధారంగా పరీక్ష రాయడంతోనే ప్రవీణ్‌కు 103 మార్కులు వచ్చి ఉంటాయనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. రాజశేఖర్ పాత్ర కీలకం పేపర్ల లీకేజీపై సిట్ అధికారి, ఏసీపీ వెంకటేశ్వర్లు శుక్రవారం మీడియాతో మాట్లాడారు. ఈ కేసులో రాజకీయ నాయకుడైన రాజశేఖర్ పాత్ర కీలకంగా మారనుందని.. అతడే ప్రవీణ్‌తో కలిసి ఈ లీకేజ్ చేసినట్టుగా ఆధారాలు లభించాయని తెలిపారు. రాజశేఖర్ కొందరు రాజకీయ నాయకులతో కలిసి దిగిన ఫొటోలు లభ్యమయ్యాయని.. ఈ నేపథ్యంలో ఆయా రాజకీయ నేతల పాత్రపైనా దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. ఇక కస్టోడియన్ శంకరలక్ష్మి కంప్యూటర్ నుంచి మొత్తం ఐదు పేపర్లు తస్కరణకు గురయ్యాయని.. వాటిలో ఏయే పేపర్లు లీక్ అయ్యాయనే దానిపై దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. గ్రూప్–1 ప్రిలిమ్స్ పేపర్ వ్యవహారంతోపాటు, ఆ పరీక్ష రాసిన ప్రవీణ్‌కు అన్ని మార్కులు రావడంపైనా దర్యాప్తు చేస్తున్నామన్నారు. ప్రవీణ్ ఈ పరీక్ష పేపర్లను ఎవరెవరికి ఇచ్చాడన్నది ఆరా తీస్తున్నామ ని చెప్పారు. ప్రవీణ్, రాజశేఖర్ సహా నిందితుల ఫోన్లను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించామని, ఆ నివేదిక ఆధారంగా చర్యలు ఉంటాయని తెలిపారు. పోలీసు కస్టడీకి నిందితులు ఈ కేసులో అరెస్టయిన తొమ్మిది మంది నిందితులను పోలీసు కస్ట డీకి ఇస్తూ నాంపల్లి కోర్టు శు క్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. శనివారం నుంచి 23వ తేదీ వ రకు పోలీసులు వారి ని ప్రశ్నించి.. ఈ వ్యవహారంలో అన్ని వివరాలను ఆరా తీయనున్నా రు. ఇదే సమయంలో ప్రవీణ్, రాజశేఖర్, శంకరలక్ష్యలను కలిపి విచారించి.. వాస్తవాలను వెలికితీయాలని అధికారులు నిర్ణయించారు. ఐడీ, పాస్వర్డ్ దొరికిందెలా? కస్టోడియన్ శంకరలక్ష్మి నోట్‌బుక్ నుంచి యూజర్ ఐడీ, పాస్వర్డ్స్ తస్కరించామని.. వాటి ఆధారంగానే ఆమె కంప్యూటర్ను యాక్సెస్ చేసి పరీక్ష పేపర్లు కాపీ చేసుకున్నామని అరెస్టు సమయంలో ప్రవీణ్, రాజశేఖర్ చెప్పారు. కానీ అధికారులు శంకరలక్ష్యని ప్రశ్నించగా.. తాను యూజర్ ఐడీ, పాస్‌వర్డ్స్‌ను ఎక్కడా రాసుకోలేదని చెప్పినట్టు తెలిసింది. దీనితో ఆమె నుంచి అధికారికంగా స్టేట్మెంట్ తీసుకోవడానికి సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. -
పెన్‌డ్రైవ్‌లో పలు పేపర్లు!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) పరీక్షలకు సంబంధించిన ప్రశ్నపత్రాల లీకేజీ కేసు దర్యాప్తులో కీలకాంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ వ్యవçహారంలో కీలక సూత్రధారిగా ఉన్న కమిషన్ కార్యదర్శి మాజీ వ్యక్తిగత సహాయకుడు పులిదిండి ప్రవీణ్‌కుమార్ పెన్‌డ్రైవ్‌లో అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్, గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ పోస్టులకు సంబంధించిన పరీక్షల పేపర్లు ఉన్నట్లు ఫోరెన్సిక్ నిపుణులు గుర్తించారు. మరోపక్క ఈ కేసు దర్యాప్తు కోసం ఏర్పాటైన సిట్ తన పనిలో నిమగ్నమైంది. యూజర్ ఐడీ, పాస్వర్డ్ తస్కరించి.. తన ‘సన్నిహితురాలు’లవడ్యావత్ రేణుక కోరడంతో క్వశ్చన్ పేపర్ల లీక్‌కు ప్రవీణ్‌కుమార్ తెగించాడు. నెట్వర్క్ అడ్మిన్ రాజశేఖర్ సహాయంతో రంగంలోకి దిగాడు. పేపర్లన్నీ కమిషన్ కాన్ఫిడెన్షియల్ సెక్షన్‌లోని కంప్యూటర్లో ఉంటాయి. యూజర్ ఐడీ, పాస్వర్డ్ కస్టోడియన్ శంకరలక్ష్మి వద్ద ఉన్నాయి. వీటిని ఆమె తాను నిత్యం వినియోగించే నోట్ పుస్తకం ఆఖరు పేజీలో రాసి పెట్టుకున్నారు. గత నెల ఆఖరి వారంలో ఆమె కార్యదర్శి పేషీకి వచ్చినప్పుడు దృష్టి మళ్లించడం ద్వారా వాటిని నమోదు చేసుకున్నాడు. టీఎస్పీఎస్సీలోని అన్ని కంప్యూటర్లు ల్యాన్ నెట్‌వర్క్‌తో కనెక్ట్ అయి ఉంటాయి. ఈ విషయం తెలిసిన రాజశేఖర్.. ప్రవీణ్ కంప్యూటర్ నుంచే శంకరలక్ష్మి యూజర్ ఐడీ, పాస్వర్డ్ ఉపయోగించి లాగిన్ అయ్యేలా సహకరించాడు. క్షణాల్లో పని కానిచ్చేయాలని భావించిన ప్రవీణ్ క్వశ్చన్ పేపర్లకు సంబంధించిన ఫోల్డర్ మొత్తం తన పెన్‌డ్రైవ్‌లోకి కాపీ చేసుకున్నాడు. ఫోన్ల విశ్లేషణతోనే పూర్తి స్పష్టత ప్రాథమిక దర్యాప్తు నేపథ్యంలో పోలీసులు ఏఈ పరీక్ష పత్రం మాత్రమే లీక్ అయిందని, ప్రవీణ్ ఫోల్డర్లో ఉన్న మిగిలిన ప్రశ్న పత్రాలు బయటకు రాలేదని తేల్చారు. దీన్ని సాంకేతికంగా నిర్థారించుకోవాలని నిర్ణయించారు. దీనికోసమే నిందితులతో పాటు అనుమానితుల నుంచి స్వాధీనం చేసుకున్న 16 ఫోన్లు, ల్యాప్టాప్స్, పెన్‌డ్రైవ్స్‌లను ఫోరెన్సిక్ పరీక్షలకు పంపారు. వాటిలో ఏఏ క్వశ్చన్ పేపర్ల షేరింగ్ జరిగింది? ఎవరి నుంచి ఎవరికి వెళ్లాయి? వేటిని కాపీ చేశారు? అంశాలను తేల్చనున్నారు. యువతుల వ్యవహారం పరిగణనలోకి.. ఈ కేసు దర్యాప్తు చేపట్టిన సిట్ బృందం బుధవారం కమిషనర్ సీవీ ఆనంద్‌తో సమావేశమైంది. ప్రాథమికంగా ఈ కేసును సీసీఎస్‌లో రీ–రిజిస్టర్ చేశారు. అదనపు సీపీ ఏఆర్ శ్రీనివాస్ కమిషన్ కార్యాలయానికి వెళ్లి కాన్ఫిడెన్షియల్ సెక్షన్‌తో పాటు ప్రశ్న పత్రాలు భద్రపరిచే విధానం తదితరాలను పరిశీలించారు. కస్టోడియన్ శంకరలక్ష్మి వాంగ్మూలం నమోదు చేశారు. ప్రవీణ్‌తో సన్నిహితంగా ఉన్న 46 మంది మహిళలు, యువతుల వ్యవహారాన్నీ పోలీసులు పరిగణనలోకి తీసుకున్నారు. వీరి వ్యవహారాల్లోనూ ఏవైనా లీకేజీలు, ఇతరత్రా కోణాలు ఉన్నాయా? అనేది తేల్చనున్నారు. అవసరమైన వారిని పిలిచి విచారించాలని నిర్ణయించారు. రెండో ప్రయత్నంలో విషయం లీక్.. ఈ ఫోల్డర్లో అప్పటికే జరిగిపోయిన, జరగాల్సిన పరీక్షలకు సంబంధించిన క్వశ్చన్ పేపర్లు ఉండటాన్ని గుర్తించిన ప్రవీణ్ పెన్డ్రైవ్కు లాక్ సెట్ చేశాడు. గత నెల ఆఖరి వారంలోనే రేణుక కోరిన పరీక్ష పత్రం అందజేశాడు. టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీర్ పరీక్ష (ఈ నెల 12న జరగాల్సిన పరీక్ష), ఇంకా తేదీలు ఖరారు కాని అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్, గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ పోస్టుల పేపర్లను అదును చూసుకుని విక్రయించాలని భావించాడు. ఏఈ పేపర్‌ను రేణుక తదితరులు నీలేష్ , గోపాల్‌లకు రూ.10 లక్షల చొప్పున విక్రయించారు. టౌన్ ప్లానింగ్ పరీక్ష పత్రం విషయాన్నీ రేణుక వీరికి చెప్పింది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఉంటే తనకు తెలపాలని కోరింది. ఇలా ఈ పరీక్ష రాసే అభ్యర్థుల కోసం వెతుకుతుండగానే విషయం బయట పడింది. -
పరీక్షల నిర్వహణ యథాతథం
సాక్షి, హైదరాబాద్: ‘తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్దేశించిన తేదీల్లోనే అర్హత పరీక్షలు నిర్వహించేందుకు కృతనిశ్చయంతో ఉన్నాం. కష్టపడి ఉద్యోగాలు సాధించాలన్న తపనతో లక్షలాది మంది నిరుద్యోగులు సిద్ధమవుతున్నారు. వారికి ఏమా త్రం అన్యాయం జరగకూడదనేదే మా లక్ష్యం. వాస్త వ పరిస్థితులకు భిన్నంగా సామాజిక మాధ్యమాల్లో ప్రచారాలు జరుగుతున్నాయి. తొందరపడి వాటిని నమ్మి అభ్యర్థులు సమయాన్ని వృథా చేసుకోవద్దు’అని టీఎస్పీఎస్సీ చైర్మన్ బి.జనార్ధన్‌రెడ్డి స్పష్టం చేశారు. గత 4–5 రోజుల పరిణామాల దృష్ట్యా ఆయన మంగళవారం టీఎస్పీఎస్సీ కార్యాలయంలో కమిషన్ సభ్యులు, కార్యదర్శితో కలసి మీడియా సమావేశం నిర్వహించారు. ప్రశ్నపత్రాల లీకేజీ, పరీక్షల రద్దు, ఇతరత్రా అంశాలపై పలు ప్రచారాల నేపథ్యంలో అభ్యర్థులకు స్పష్టత ఇచ్చేందుకే ఈ సమావేశం నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. 17 వేల పోస్టులు... 26 ప్రకటనలు... ‘వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాల భర్తీ బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం టీఎస్పీఎస్సీకి అప్పగించింది. 17,134 కొలువులకు సంబంధించి ఏడాది కాలంలో 26 ప్రకటనలు జారీ చేశాం. ఇందులో 6 రకాల అర్హత పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాం. గత ఏడేళ్లలో 35 వేల ఉద్యోగాల భర్తీ జరిగితే కేవలం ఏడాదిలోనే 17 వేల కొలువులకు ప్రకటనలు జారీ చేశాం. మరో 10 వేల ఉద్యోగాల భర్తీకి త్వరలో ప్రకటనలు జారీ చేయనున్నాం. టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీర్, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేసిన క్రమంలో అంతర్గత సమాచారం అందింది. దీంతో వెంటనే ఆ రెండు పరీక్షల నిర్వహణను వాయిదా వేశాం. వివిధ ఇంజనీరింగ్ విభాగాల్లో అసిస్టెంట్ ఇంజనీర్, మున్సిపల్ అసిస్టెంట్ ఇంజనీర్, టెక్నికల్ ఆఫీసర్, జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి ఈ నెల 5న నిర్వహించిన అర్హత పరీక్ష ప్రశ్నపత్రం లీకైందని గుర్తించాం. ఇది ఎందరికి చేరింది... ఏయే సమాచారం ఎవరెవరికి చేరిందనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది. సాంకేతికత ఆధారంగా లీకేజీని గుర్తించేందుకు ఫోరెన్సిక్, సైబ ర్ భద్రతా విభాగాలు ప్రయత్నిస్తున్నాయి. దీనిపై మరింత స్పష్టత రావాల్సి ఉంది. అసిస్టెంట్ ఇంజనీర్ పరీక్షపై బుధవారం మళ్లీ సమీక్షించాక నిర్ణయాన్ని ప్రకటిస్తాం’అని జనార్దన్‌రెడ్డి వివరించారు. కార్యాలయానికి కొత్త సాంకేతికత... ప్రస్తుతం టీఎస్పీఎస్సీ కార్యాలయంలో సాంకేతికతను పునరుద్ధరించాలని నిర్ణయం తీసుకున్నాం. కంప్యూటర్ల మార్పుతోపాటు సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా కొత్తగా తయారు చేసేందుకు చర్యలు మొదలుపెట్టాం. అతిత్వరలో ఈ ప్రక్రియ పూర్తవుతుంది. మరోవైపు టౌన్‌ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీర్, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ అర్హత పరీక్షల ప్రశ్నపత్రాలను తిరిగి రూపొందించాలని నిర్ణయించాం. అతిత్వరలోనే ఈ ప్రక్రియ పూర్తి చేసి పరీక్షలు నిర్వహిస్తాం. ఏప్రిల్ 4న నిర్వహించే హార్టికల్చర్ ఆఫీసర్ పరీక్ష నుంచి అన్ని రకాల పరీక్షలను నిర్దేశించిన తేదీల్లోనే నిర్వహిస్తాం. అభ్యర్థులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన పనిలేదు. అత్యంత పారదర్శకతతో అర్హతలున్న వారిని ఎంపిక చేయడయే మా పని’అని జనార్దన్‌రెడ్డి తెలిపారు. నమ్మించి గొంతు కోసినట్లుగా... ‘ఒక కార్యాలయం అన్నాక ఎంతో మంది ఉద్యోగులుంటారు. ప్రతి సమాచారాన్ని గోప్యంగా ఉంచేందుకే ప్రయత్నిస్తాం. అదే సమయంలో సహోద్యోగులకు వివిధ బాధ్యతలు అప్పగించి కార్యక్రమాలను సజావుగా సాగేలా చూస్తాం. ప్రవీణ్‌కుమార్ ఇక్కడ ఏళ్లుగా పనిచేస్తున్నాడు. రాజశేఖర్ రెడ్డి ఔట్సోర్సింగ్ పద్ధతిలో ఏడేళ్లుగా పనిచేస్తున్నాడు. ప్రతి ఉద్యోగి ఎలాంటివాడు? అతని నేప థ్యం ఏమిటని ఆరాతీసే పరిస్థితి ఉండదు. కార్యాలయంలో పనిచేసే వ్యక్తి.. ఏళ్లుగా నమ్మకంతో ఉన్నందున వివిధ బాధ్యతలు అప్పగించాం. రాజశేఖర్‌రెడ్డి నెట్వర్క్ విభాగంలో పనిచేస్తున్నా డు. ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే నమ్మించి గొంతుకోసిన చందంగా ఉంది. ప్రవీణ్ శాఖా పరంగా అనుమతి తీసుకొని గ్రూప్–1 ప్రిలిమిన రీ పరీక్ష రాశాడు. 103 మార్కులు వచ్చినట్లు తెలిసింది. కానీ పేపర్ కోడ్ సరిగ్గా వేయలేదని అనర్హుడైనట్లు సమాచారం. అయితే గ్రూప్–1 ప్రిలిమిన రీ అర్హుల్లో అత్యధిక మార్కులు 103 కంటే ఎక్కు వ. ప్రిలిమినరీ పరీక్షలో ర్యాంకులను పరిగణనలోకి తీసుకోం. దీంతో ఎక్కడా మార్కులు వెల్లడించలేదు. అభ్యర్థులకు మాత్రం వారి మార్కు లు చూసుకొనే వెసులుబాటు కల్పిస్తూ ఓఎంఆర్ పత్రాలను స్కాన్ చేసి వెబ్సైట్లో అందుబాటులో ఉంచాం. ఈ పరీక్ష లీకేజీపై ఇప్పటివరకు ఎలాంటి ఆధారాల్లేవు. సామాజిక మాధ్యమాల్లో అనవసర రాద్ధాంతాన్ని పరిగణించొద్దు. ఒక్క అభ్యర్థికి కూడా అన్యాయం జరగదు. వాస్తవ పరిస్థితులను కనిపెట్టేందుకు దర్యాప్తు కొనసాగుతోంది. దర్యాప్తులో తేలిన అంశాల ప్రకారం చర్యలుంటాయి’అని జనార్దన్‌రెడ్డి స్పష్టం చేశారు. -
TSPSC: ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారం.. ప్రవీణ్ ఫోన్లో మహిళల అసభ్య ఫోటోలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ కేసులో ఇప్పటి వరకు పోలీసులు తొమ్మిది మందిని అరెస్టు చేశారు. టీఎస్పీఎస్సీ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మరికొందరు పరారీలో ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. ఇందుకోసం టాస్క్‌ఫోర్స్ పోలీసులను రంగంలోకి దించారు. తాజాగా ప్రధాన నిందితుడు ప్రవీణ్ విచారణలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నిందితుడు ప్రవీణ్ 2017లో టీఎస్పీఎస్సీలో జూనియర్ అసిస్టెంట్‌గా చేరి నాలుగేళ్ల పాటు వెరిఫికేషన్ విభాగంలో విధులు నిర్వహిస్తున్న క్రమంలోనే అక్కడికి వచ్చే మహిళల ఫోన్ నంబర్లను నిందితుడు తీసుకునేవాడని తేలింది. దరఖాస్తులోని సాంకేతిక సమస్యలను పరిష్కరించి సదరు మహిళలతో సాన్నిహిత్యతం పెంచుకున్నాడు. పలువురు మహిళలలో శారీరక సంబంధం కూడా పెట్టుకున్నట్లు పోలీసులు గుర్తించారు. ప్రవీణ్ సెల్ఫోన్లో ఎక్కువగా మహిళల నంబర్లు, వాట్సాప్ చాటింగ్‌లోనూ మహిళల నగ్న ఫొటోలు, వాట్సాప్‌లో న్యూడ్ చాటింగ్‌లు ఉండడాన్ని గుర్తించారు. ఏఈ పరీక్ష పత్రం కూడా రేణుక కారణంగానే లీక్ అయిందని పోలీసులు తేల్చారు. TSPSC కార్యాలయం వద్ద ఉద్రిక్తత టీఎస్పీఎస్సీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. టీఎస్పీఎస్సీ చైర్మన్‌ను సస్పెండ్ చేయాలని కోరుతూ యువజన, విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టాయి. పేపర్ లీకేజీ వ్యవసహారాన్ని సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. టీఎస్పీఎస్సీ కార్యాలయం లోపలికి విద్యార్థి సంఘాల నాయకులు చొచ్చుకెళ్లడంతో.. పోలీసులు పలువురుని అదుపులోకి తీసుకున్నారు. మరికొన్ని పేపర్ల లీకేజీపై అనుమానాలు ఏఈ పరీక్ష పేపర్లు తీసుకుని నెల 2న రూ.5 లక్షలు ఇచ్చిన రేణు, ఆమె భర్త.. మరోసారి 6న తేదీన ప్రవీణ్‌ను కలిసి ప్రశ్నపత్రాల కాపీలతోపాటు మరో రూ.5 లక్షలు ఇచ్చారు. పేపర్ల లీకేజీపై అనుమానం వచ్చిన టీఎస్పీఎస్సీ శనివారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. సెంట్రల్ జోన్ టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ ఎస్.రఘునాథ్ నేతృత్వంలోని బృందం.. ప్రవీణ్, రాజశేఖర్, రేణుక, లవుడ్యావత్ డాక్యా, రాజేశ్వర్, నీలేశ్, గోపాల్, శ్రీనివాస్, రాజేందర్‌లను అరెస్టు చేసింది. వారి నుంచి పెన్‌డ్రైవ్‌లు, ల్యాప్‌టాప్‌లు, మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకుంది. ప్రవీణ్ పెన్‌డ్రైవ్‌ను పరిశీలించిన పోలీసులు.. అందులో టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీర్ పరీక్ష పేపర్ ఉందని, దాన్ని విక్రయించడానికి ప్రయత్నించాడని గుర్తించారు. ప్రవీణ్ కంప్యూటర్ను ఫోరెన్సిక్ పరీక్షలకు పంపారు. ఆ నివేదిక అందిన తర్వాత.. అతను, రాజశేఖర్ ఎవరెవరి కంప్యూటర్లను యాక్సస్ చేశారు? ఏమేం పేపర్లు డౌన్లోడ్ చేశారనేది తేలుతుందని డీసీపీ వెల్లడించారు. ఉద్యోగులు ఇద్దరిపై వేటు అసిస్టెంట్ ఇంజనీర్ పేపర్ల లీక్ వ్యవహారంలో ఇద్దరు ఉద్యోగులపై టీఎస్పీఎస్సీ వేటు వేసింది. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ప్రవీణ్‌కుమార్‌ను సస్పెండ్ చేయడంతోపాటు శాఖాపరమైన విచారణకు ఆదేశించింది. ఔట్సోర్సింగ్ విధానంలో కంప్యూటర్ నెట్వర్క్ ఎక్స్‌పర్ట్‌గా పనిచేస్తున్న రాజశేఖర్‌రెడ్డిని ఉద్యోగం నుంచి శాశ్వతంగా తొలగించింది. -
ఏఈ పేపర్ లీక్.. స్కామ్‌లో తొమ్మిది మంది అరెస్టు.. నిందితుల్లో కానిస్టేబుల్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) ఈ నెల 5న నిర్వహించిన అసిస్టెంట్ ఇంజనీర్స్ (ఏఈ సివిల్) పరీక్ష పేపర్లు లీకైనట్టు పోలీసులు తేల్చారు. టీఎస్పీఎస్సీ కార్యదర్శి వ్యక్తిగత సహాయకుడైన పి.ప్రవీణ్‌కుమార్ ఈ ప్రశ్నపత్రాలనే టీచర్ రేణుక, ఆమె భర్త లవుడ్యావత్ డాక్యాకు అందించాడని గుర్తించారు. వీటితోపాటు ప్రవీణ్‌కు చెందిన పెన్‌డ్రైవ్‌లో టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీర్ పరీక్ష పేపర్ కూడా ఉందని, దాన్ని విక్రయించేందుకు అతను ఒప్పందం చేసుకున్నాడని ఆధారాలు సేకరించారు. హైదరాబాద్ సౌత్‌వెస్ట్ జోన్ డీసీపీ కిరణ్ సోమవారం రాత్రి టాస్క్‌ఫోర్స్ ఓఎస్డీ పి.రాధాకిషన్‌రావుతో కలసి లీకేజీ వ్యవహారం వివరాలను వెల్లడించారు. కారుణ్య నియామకం కింద వచ్చి.. ఏపీలోని రాజమండ్రికి చెందిన పి.హరిశ్చంద్రరావు కుమారుడు ప్రవీణ్‌కుమార్. హరిశ్చంద్రరావు ఉమ్మడి రాష్ట్రంలో డీజీపీ కార్యాలయం ప్రెస్‌కు అదనపు ఎస్పీగా పనిచేశారు. ఆయన ఉద్యోగంలో ఉండగానే అనారోగ్యంతో మరణించడంతో కారుణ్య నియామకం కింద ప్రవీణ్‌కుమార్‌కు జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగం వచ్చింది. బీటెక్ పూర్తిచేసిన ప్రవీణ్ 2017 నుంచి టీఎస్పీఎస్సీలో పనిచేస్తూ ప్రస్తుతం అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ హోదాలో కమిషన్ కార్యదర్శికి వ్యక్తిగత సహాయకుడిగా వ్యవహరిస్తున్నాడు. ఇక మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన రేణుక 2018లో టీఎస్పీఎస్సీ నిర్వహించిన పరీక్ష ద్వారా గురుకుల హిందీ టీచర్‌గా ఎంపికై.. ప్రస్తుతం వనపర్తిలో విధులు నిర్వర్తిస్తోంది. ఆమె భర్త లవుడ్యావత్ డాక్యా వికారాబాద్‌లోని డీఆర్డీఏలో పనిచేస్తున్నాడు. టీఎస్పీఎస్సీ పరీక్షకు సిద్ధమైన నాటి నుంచీ రేణుక, ప్రవీణ్ మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఆమె తరచూ కమిషన్ కార్యాలయానికి వచ్చి ప్రవీణ్‌ను కలిసేది. ల్యాన్ ద్వారా యాక్సెస్ చేసి.. టీఎస్పీఎస్సీ ఉద్యోగ పరీక్షల పేపర్లు లీక్ చేసేందుకు రేణుక, లవుడ్యావత్ డాక్యా పథకం వేశారు. పేపర్లను తమకు ఇవ్వాలని ప్రవీణ్‌ను రేణుక కోరింది. టీఎస్‌టీఎస్‌లో ఔట్ సోర్సింగ్ విధానంలో నెట్వర్క్ అడ్మిన్‌గా పనిచేస్తున్న అట్ల రాజశేఖర్‌తో ప్రవీణ్ కలిసి పేపర్ లీకేజ్‌కి మార్గాలు అన్వేషించాడు. పరీక్ష పేపర్లన్నీ కమిషన్ కాన్ఫిడెన్షియల్ సెక్షన్‌లోని కంప్యూటర్లో ఉంటాయి. ఈ సెక్షన్‌కు నేతృత్వం వహించే కస్టోడియన్ శంకరలక్ష్మి తన కంప్యూటర్ పాస్వర్డ్, యూజర్ ఐడీలను నిత్యం వినియోగించే పుస్తకం చివరి పేజీలో రాసి పెట్టుకున్నారు. ఈ విషయం తెలిసిన ప్రవీణ్ ఆమె కార్యదర్శి పేషీకి వచ్చినప్పుడు.. ఆమె పుస్తకం నుంచి తస్కరించాడు. ప్రవీణ్ కంప్యూటర్ నుంచే శంకరలక్ష్మి కంప్యూటర్ను యూజర్ ఐడీ, పాస్‌వర్డ్‌తో యాక్సెస్ చేశాడు. ఇద్దరూ కలిసి ఆ కంప్యూటర్లో నుంచి ఏఈ పరీక్షకు సంబంధించిన జనరల్ స్టడీస్, సివిల్ పేపర్లను, టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీర్ పరీక్ష పేపర్‌ను కాపీ చేసుకున్నారు. ప్రవీణ్ వీటిని తన పెన్‌డ్రైవ్‌లో వేసుకున్నాడు. ఏఈ పరీక్ష ప్రశ్నపత్రాలను ప్రింట్ ఔట్ తీసుకున్నాడు. ఇంట్లోనే చదివించి, దగ్గరుండి పరీక్ష రాయించి.. మరోవైపు టీచర్ రేణుక, లవుడ్యావత్ డాక్యా ఏఈ పరీక్ష పేపర్లు విక్రయించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. రేణుక సోదరుడు, మాన్సూర్‌పల్లి తండా సర్పంచ్ కుమారుడైన కేతావత్ రాజేశ్వర్‌నాయక్‌ను.. అతడి ద్వారా మేడ్చల్ ఠాణాలో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న కేతావత్ శ్రీనివాస్ (రాజేశ్వర్ సోదరుడు)ను సంప్రదించి ఏఈ పేపర్ విషయం చెప్పారు. ఎస్సై పరీక్షకు సిద్ధమవుతున్న శ్రీనివాస్.. తనకు ఏఈ పేపర్ వద్దని చెప్పి, పరిచయస్తులైన కేతావత్ నీలేశ్‌నాయక్, పత్లావత్ గోపాల్‌నాయక్‌ల పేర్లు చెప్పాడు. దీనితో వారిని సంప్రదించిన రేణుక, డాక్యా రూ.13.5 లక్షలకు ఒప్పందం కుదుర్చుకుని అడ్వాన్స్ తీసుకున్నారు. ఏఈ పేపర్లు ప్రింట్ తీసుకున్న ప్రవీణ్.. ఈ నెల 2న రేణుక, డాక్యాలకు ఫోన్ చేసి చెప్పాడు. అప్పుడు మహబూబ్‌నగర్‌లో ఉన్న వారిద్దరూ వెంటనే బాలాపూర్ వరకు వచ్చి ప్రవీణ్‌ను కలిశారు. ఏఈ పరీక్ష పేపర్లు తీసుకుని రూ.5 లక్షలు ఇచ్చారు. నీలేశ్, గోపాల్‌తోపాటు నీలేశ్ సోదరుడు రాజేంద్రనాయక్‌లను గండీడ్ మండలం పంచగల్ తండాలోని తమ ఇంటికి తీసుకువెళ్లారు. 5న ఉదయం డాక్యా అభ్యర్థులను వెంటపెట్టుకుని సరూర్‌నగర్‌లోని పరీక్ష కేంద్రం వరకు వచ్చి.. పరీక్ష రాయించాక విడిచిపెట్టాడు. టీఎస్పీఎస్సీ ఉద్యోగులు ఇద్దరిపై వేటు అసిస్టెంట్ ఇంజనీర్ పేపర్ల లీక్ వ్యవహారంలో ఇద్దరు ఉద్యోగులపై టీఎస్పీఎస్సీ వేటు వేసింది. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ప్రవీణ్‌కుమార్‌ను సస్పెండ్ చేయడంతోపాటు శాఖాపరమైన విచారణకు ఆదేశించింది. ఔట్సోర్సింగ్ విధానంలో కంప్యూటర్ నెట్వర్క్ ఎక్స్‌పర్ట్‌గా పనిచేస్తున్న రాజశేఖర్‌రెడ్డిని ఉద్యోగం నుంచి శాశ్వతంగా తొలగించింది. ఇక ఈ వ్యవహారంలో భాగస్వాములైన గురుకుల టీచర్ రేణుక, పంచాయతీరాజ్ శాఖ ఉద్యోగి, పోలీస్ కానిస్టేబుల్ ముగ్గురూ ప్రభుత్వ ఉద్యోగులే కావడంతో.. వారిపైనా చర్యలు తీసుకునేందుకు సంబంధిత శాఖలు సిద్ధమయ్యాయి. మరికొన్ని పేపర్ల లీకేజీపై అనుమానాలు 6న తేదీన మళ్లీ ప్రవీణ్‌ను కలిసిన రేణుక, ఆమె భర్త ప్రశ్నపత్రాల కాపీలతోపాటు మరో రూ.5 లక్షలు ఇచ్చారు. పేపర్ల లీకేజీపై అనుమానం వచ్చిన టీఎస్పీఎస్సీ శనివారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. సెంట్రల్ జోన్ టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ ఎస్.రఘునాథ్ నేతృత్వంలోని బృందం.. ప్రవీణ్, రాజశేఖర్, రేణుక, లవుడ్యావత్ డాక్యా, రాజేశ్వర్, నీలేశ్, గోపాల్, శ్రీనివాస్, రాజేందర్‌లను అరెస్టు చేసింది. వారి నుంచి పెన్‌డ్రైవ్‌లు, ల్యాప్‌టాప్‌లు, మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకుంది. ప్రవీణ్ పెన్‌డ్రైవ్‌ను పరిశీలించిన పోలీసులు.. అందులో టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీర్ పరీక్ష పేపర్ ఉందని, దాన్ని విక్రయించడానికి ప్రయత్నించాడని గుర్తించారు. ప్రవీణ్ కంప్యూటర్ను ఫోరెన్సిక్ పరీక్షలకు పంపారు. ఆ నివేదిక అందిన తర్వాత.. అతను, రాజశేఖర్ ఎవరెవరి కంప్యూటర్లను యాక్సస్ చేశారు? ఏమేం పేపర్లు డౌన్లోడ్ చేశారనేది తేలుతుందని డీసీపీ వెల్లడించారు. -
సీఎం కేసీఆర్‌కు కుర్చీనే దొరకలేదా..?: ప్రవీణ్‌కుమార్
అయిజ: ఎన్నికల్లో గెలిచిన అనంతరం కుర్చీ వేసుకొని కూర్చొని ఆలంపూర్ ఆయకట్టుకు నీరు పారిస్తానని చెప్పిన సీఎం కేసీఆర్‌కు ఇంత వరకు కుర్చీనే దొర కలేదా? జాగా దొరకడం లేదా? అని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ఎద్దేవా చేశారు. బహుజన రాజ్యాధికార యా త్ర మంగళవారం జోగుళాంబ గద్వాల జిల్లా అయిజ మండలంలో కొనసాగింది. ఉత్తనూ రు సమీపంలో ప్రవీణ్ విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రం సిద్ధించినా ఆలంపూర్ నియోజకవర్గం అభివృద్ధికి నోచుకోలేదన్నారు. -
జస్టిస్ ప్రవీణ్‌కుమార్‌కు ఘనంగా వీడ్కోలు
సాక్షి, అమరావతి: నేడు (శనివారం) పదవీ విరమణ చేయనున్న సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ చాగరి ప్రవీణ్‌కుమార్‌కు హైకోర్టు శుక్రవారం ఘనంగా వీడ్కోలు పలికింది. శనివారం హైకోర్టుకు పాలనాపరమైన సెలవు కావడంతో శుక్రవారమే ఆయనకు వీడ్కోలు కార్యక్రమం ఏర్పాటు చేశారు. జస్టిస్ ప్రవీణ్‌కు వీడ్కోలు పలికేందుకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా నేతృత్వంలో న్యాయమూర్తులందరూ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సీజే జస్టిస్ మిశ్రా మాట్లాడుతూ జస్టిస్ ప్రవీణ్‌కుమార్ న్యాయవ్యవస్థకు ఎంతో సేవ చేశారన్నారు. న్యాయమూర్తిగా ఆయన 26 వేల కేసులను పరిష్కరించారని చెప్పారు. హైకోర్టు విభజన తరువాత హైకోర్టు విజయవాడకు వచ్చిన తరువాత తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా ఆయన సమర్థంగా బాధ్యతలు నిర్వర్తించారని తెలిపారు. భవనాలు, ఇతర మౌలిక సదుపాయాల కల్పన విషయంలో ఎంతో కష్టపడ్డారన్నారు. జస్టిస్ ప్రవీణ్‌కుమార్ యువ న్యాయవాదులకు ఆదర్శప్రాయుడని చెప్పారు. ఏపీ జ్యుడిషియల్ అకాడమీ, లీగల్ సర్వీసెస్ అథారిటీ వంటి సంస్థలకు నేతృత్వం వహించి చక్కని సేవలు అందించారన్నారు. పాలనాపరమైన విషయాల్లో తనకు ఎంతో సహకరించారని జస్టిస్ మిశ్రా చెప్పారు. జస్టిస్ ప్రవీణ్‌కుమార్ మాట్లాడుతూ తన తండ్రి పద్మనాభరెడ్డి, చిన్నాన్న జస్టిస్ చిన్నపరెడ్డి తనకు మార్గదర్శకులన్నారు. అనిశ్చిత సమయాల్లో వారే తనకు మార్గదర్శనం చేశారని తెలిపారు. న్యాయవాదిగా, న్యాయమూర్తిగా తన వృత్తి జీవితం తనకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందన్నారు. ఇన్నేళ్ల తన ప్రస్థానంలో తనకు సహకరించిన వారందరికీ ఆయన పేరుపేరున కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎస్.శ్రీరామ్, డిప్యూటీ సొలిసిటర్ జనరల్ (డీఎస్జీ) ఎన్.హరినాథ్ , బార్ కౌన్సిల్ చైర్మన్ గంటా రామారావు మాట్లాడుతూ పదవీ విరమణ తరువాత జస్టిస్ ప్రవీణ్‌కుమార్ న్యాయ సేవలను కొనసాగించాలని ఆకాంక్షించారు. జస్టిస్ ప్రవీణ్‌కుమార్ కుటుంబ సభ్యులు, న్యాయవాదులు, రిజిస్ట్రార్లు పాల్గొన్నారు. అనంతరం హైకోర్టు న్యాయవాదుల సంఘం జస్టిస్ ప్రవీణ్‌కుమార్ దంపతులను ఘనంగా సన్మానించింది. -
ఉద్యోగకల్పనలో బీజేపీ మాటలు ఉత్తవే..
కరీంనగర్ కల్చరల్: కేంద్రంలో రెండుసార్లు అధికారంలోకి వచ్చిన బీజేపీ వాగ్దానాలు నెరవేర్చకుండా ప్రజలను మోసం చేసిందని రాజ్యసభ ఎంపీ, బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి రాంజీ గౌతమ్ విమర్శించారు. ఉద్యోగాలకల్పనలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని, దేశవ్యాప్తంగా పది లక్షలకుపైగా బ్యాక్లాగ్ పోస్టులు ఉన్నాయని పేర్కొన్నారు. గురువారం కరీంనగర్ జిల్లాకేంద్రంలో నిర్వహించిన మానకొండూర్, చొప్పదండి నియోజకవర్గాల ముఖ్యకార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీజేపీ పాలిత రాష్ట్రాలైన ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్‌లో దళితులపై దాడులు జరుగుతున్నాయని, మహిళలపై అత్యాచారాలు, హత్యలు పెరిగాయన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలను మోసం చేస్తున్నారని విమర్శించారు. బీసీ కులగణన చేసి, బీసీల రిజర్వేషన్లు పెంచాలని బీఎస్పీ ఆధ్వర్యంలో రెండు నెలలుగా ధర్నాలు చేస్తున్నా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. తెలంగాణలో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు. కేవలం సెక్రటేరియట్ భవనానికి అంబేడ్కర్ పేరు పెట్టడం లేదా ట్యాంక్ బండ్ మీద అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటు చేసినంత మాత్రాన ఇక్కడి పేదలు సంతోషకరమైన జీవితాన్ని గడపలేరని పేర్కొన్నారు. అంబేడ్కర్, పూలేæ, సాహు మహరాజ్ ఆశయాలను నెరవేర్చే ఏకైక పార్టీ బీఎస్పీ అని గుర్తు చేశారు. -
వాడు నీ కొడుకే.. కిడ్నాప్ కేసులో సినిమా రేంజ్ ట్విస్ట్!
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నుంచి విశాఖ ఏజెన్సీకి పెట్రోలియం ఈథర్... అక్కడ నుంచి ఇక్కడకు హష్ ఆయిల్ అక్రమ రవాణా చేస్తూ హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ (హెచ్–న్యూ) అధికారులకు చిక్కిన ఎన్.ప్రవీణ్ కుమార్‌పై గతంలో కిడ్నాప్ కేసు ఉంది. 2015లో కూకట్పల్లి పోలీసుస్టేషన్లో నమోదైన ఈ కేసు కోర్టులో వీగిపోయింది. ఇప్పటి వరకు అంతా ఆ కిడ్నాప్ కేవలం డబ్బు కోసమే జరిగిందని అంతా భావించారు.. భావిస్తున్నారు. అయితే దాని వెనుక ఉన్న ఆసక్తికర కోణాన్ని ప్రవీణ్ ఇప్పుడు పోలీసుల ఎదుట బయటపెట్టాడు. నిజామాబాద్ మహిళ.. దుబాయ్‌లో సహజీవనం... నిజామాబాద్ ప్రాంతానికి చెందిన మహిళ కొన్నేళ్ల క్రితం బతుకుతెరువు కోసం దుబాయ్ వెళ్లింది. అక్కడే ఉద్యోగం చేస్తున్న మంచిర్యాలకు చెందిన వ్యక్తితో ఈమెకు ఏర్పడిన పరిచయం ప్రేమకు దారి తీసింది. దాదాపు రెండేళ్ల పాటు అతడితో సహజీవనం చేసిన ఆమె ఆపై నిజామాబాద్ తిరిగి వచ్చేసింది. అయితే ఇక్కడ బతకడం కష్టసాధ్యంగా మారడంతో పాటు అనివార్య కారణాల నేపథ్యంలో మళ్లీ విదేశాలకు వెళ్లడం సాధ్యం కాలేదు. దీంతో దుబాయ్‌లో ఉన్న మంచిర్యాల వాసి నుంచి వీలున్నంత డబ్బు గుంజాలని పథకం వేసింది. దీన్ని అమలులో పెట్టడంలో భాగంగా అతడిని పదేపదే ఫోన్లు చేసి ‘నిజామాబాద్ వచ్చాక తాను గర్భం దాల్చిన విషయం తెలిసిందని, తనకు మగ బిడ్డ పుట్టాడని, వాడికి తండ్రివి నువ్వే’ అంటూ చెప్పింది. ఆరేళ్లకు అతడు వస్తాననడంతో... తామిద్దరం బతకడానికి ప్రతి నెలా డబ్బు పంపాలని డిమాండ్ చేసింది. అప్పటికే వివాహితుడైన అతడు తన కుటుంబాన్ని మంచిర్యాలలోనే ఉంచాడు. తాను దుబాయ్‌లో మరో మహిళతో సహజీవనం చేసిన విషయం భార్యకు తెలియనీయలేదు. నిజామాబాద్ మహిళను నిర్లక్ష్యం చేస్తే ఇబ్బందులు వస్తాయని భావించిన అతగాడు ఆమెకు డబ్బు పంపుతూ వచ్చాడు. ఇది జరిగిన ఆరేళ్లకు తాను నిజామాబాద్ వస్తున్నట్లు దుబాయ్ నుంచి సమాచారం ఇచ్చాడు. అలా అతడు వచ్చి తనను కలిస్తే తన బండారం బయటపడటంతో పాటు అసలు విషయం తెలుస్తుందని ఆమె భావించింది. అదే జరిగితే తనకు ప్రతి నెలా వచ్చే డబ్బు రాకపోవడంతో పాటు ఇప్పటి వరకు పంపిందీ తిరిగి ఇమ్మంటాడని భయపడింది. దీంతో అతడు వచ్చేలోపు ఓ ఆరేళ్ల బాలుడు తన వద్ద ఉండాలని భావించింది. అదే విషయాన్ని తన స్నేహితుడికి చెప్పడంతో అతడు, ప్రవీణ్ కుమార్‌తో సహా మొత్తం ఐదుగురు రంగంలోకి దిగారు. ఈ ఐదుగురిలో కూకట్‌పల్లికి చెందిన వాళ్లూ ఉన్నారు. దీంతో వీళ్లు ఆ ప్రాంతంలో కనిపించిన ఓ ఆరేళ్ల బాలుడిని కిడ్నాప్ చేసి నిజామాబాద్‌లో ఆమెకు అప్పగించారు. ఫ్రీగా అప్పగించడం ఇష్టంలేక... దుబాయ్ నుంచి వచ్చిన ‘బాలుడి తండ్రి’ నిజామాబాద్‌లో ఆ మహిళ వద్ద కొన్ని రోజుల పాటు ఉన్నాడు. ఆ చిన్నారి తమకు పుట్టిన బిడ్డగానే భావించాడు. అయితే ఓ రోజు.. ఆ బాలుడు తన కుమారుడు కాదని తెలుసుకొని ఆమెను నిలదీశాడు. ఆ తరువాత వారిని వదిలి మంచిర్యాల వెళ్లిపోయాడు. దీంతో ఆమె బాలుడిని తిరిగి తీసుకువెళ్లాల్సిందిగా ప్రవీణ్ సహా ఐదుగురికీ చెప్పింది. నిజామాబాద్ వెళ్లి బాలుడిని తీసుకువచి్చన వీళ్లు తల్లిదండ్రులకు అప్పగించడానికి వెనుకాడారు. ఊరికే ఇవ్వడం ఎందుకని భావించి ఎంతో కొంత వసూలు చేసే ప్రయత్నం చేశారు. బాలుడి తండ్రికి ఫోన్ చేసి డబ్బు డిమాండ్ చేశారు. అప్పటికే బాలుడు తప్పిపోయినట్లు కేసు నమోదు చేసుకున్న కూకట్పల్లి పోలీసులకు ఈ విషయం తెలిసింది. డబ్బు డిమాండ్ విషయం తెలుసుకున్న పోలీసులు వలపన్ని ఐదుగురినీ అరెస్టు చేశారు. అప్పట్లో విచారణలో మాత్రం తాము కేవలం డబ్బు కోసమే ఈ పని చేశామని నిందితులు చెప్పడంతో అలానే రికార్డుల్లోకి ఎక్కింది. -
కుదుళ్లు కట్టి... డ్రిప్ పెట్టి!
సాక్షి, హైదరాబాద్: అడవి మధ్యలో ఉన్న చదునైన ప్రాంతాల్లో చెల్లాచెదురుగానో, కొండ వాలుల్లోనే గంజాయిని సాగుచేయడం ఇప్పటివరకు వింటూనే ఉన్నాం. పోలీసులు, ప్రత్యేక బలగాలు ఈ తోటల్ని గుర్తించినప్పుడు వీటిని ధ్వంసం చేస్తుంటారు. అయితే హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ (హెచ్–న్యూ) అధికారులు ‘డ్రగ్ డిస్ట్రిబ్యూటర్’ ఎన్.ప్రవీణ్‌కుమార్‌ను విచారించినప్పుడు విశాఖపట్నం ఏజెన్సీ కేంద్రంగా జరుగుతున్న గంజాయి సాగులో కొత్త కోణం వెలుగుచూసింది. ఆధారాల కోసం అన్వేషిస్తుంటే... హైదరాబాద్ నుంచి విశాఖ ఏజెన్సీకి పెట్రోలియం ఈథర్... అక్కడ నుంచి సిటీకి హష్ ఆయిల్ అక్రమ రవాణా చేస్తున్న కుత్బుల్లాపూర్ వాసి ప్రవీణ్ కుమార్‌ను హెచ్–న్యూ మంగళవారం అరెస్ట్ చేసింది. ప్రవీణ్ దందాలకు సంబం«ధించిన ఆధారాల కోసం అన్వేషిస్తూ అతడి ఫోన్‌ను తనిఖీ చేసింది. అందులో కొన్ని తోటలకు సంబంధించిన వీడియోలను గుర్తించింది. కొండలకు సమీపంలో చదునైన ప్రాంతంలో ఉన్న అక్కడి మొక్కలకు కుదుళ్లు కట్టి ఉండటం, నీటి సరఫరా కోసం డ్రిప్ ఇరిగేషన్ పైపులు ఏర్పాటు చేయడం చూసింది. అక్రమార్జన ద్వారా అతడు కూడబెట్టిన సొమ్ముతో దాన్ని ఖరీదు చేసినట్లు భావించింది. దీనిపై ప్రవీణ్‌ను ప్రశ్నించగా... అది ఏజెన్సీలోని గూడెం మాడుగుల మండలంలోని అలగం గ్రామంలో అడవి మధ్యలో గిరిజనులు సాగుచేస్తున్న గంజాయి పంట అని అతడు చెప్పగా, అవాక్కవడం అధికారుల వంతయింది. అరెస్టు అయితే బెయిల్ ఇప్పిస్తాడు సాధారణంగా డ్రగ్స్‌వంటి అక్రమ దందాలు చేసే వాళ్లు ‘క్యాష్ అండ్ క్యారీ’ లేదా అడ్వాన్స్ చెల్లిస్తేనే సరుకు సరఫరా వంటి విధానాలను అవలంబిస్తుంటారు. వీరికి రెగ్యులర్ కస్టమర్లు తక్కువ కావడంతో ఈ పంథా అనుసరిస్తారు. అయితే ప్రవీణ్ మాత్రం తన హష్ ఆయిల్ దందాను క్రెడిట్ విధానంలోనూ చేస్తున్నాడు. నగరంలో ఉన్న 15 మంది పెడ్లర్స్ (అక్రమరవాణా చేసేవారు)కు వాళ్లు ఇచ్చిన ఆర్డర్ ఆధారంగా 20 నుంచి 30 డబ్బాల (ఒక్కోటి 5 ఎంఎల్) హష్ ఆయిల్ ముందే సరఫరా చేస్తాడు. దాన్ని వాళ్లు అమ్ముకున్న తర్వాత ప్రవీణ్‌కు డబ్బు చెల్లిస్తుంటారు. ఇతడి వద్ద పెడ్లర్స్‌గా పనిచేస్తున్న వారిలో ఎవరైనా అరెస్టు అయితే...వారికి బెయిల్ కూడా ఇప్పిస్తుంటాడు. అతడి వాట్సాప్‌లోని ఓ సందేశం ఆధారంగా పోలీసులు ఈ విషయం గుర్తించారు. ఇతడి వద్ద పనిచేసే విక్రమ్ అనే సరఫరాదారుడిని బెంగళూరు పోలీసులు ఇటీవల అరెస్టు చేశారు. అతడికి బెయిల్ ఇవ్వడానికి అదే నగరానికి చెందిన ఓ లాయర్‌తో ప్రవీణ్ సంప్రదింపులు జరిపాడు. అందుకు అవసరమైన ఖర్చులను కూడా పంపించాడు. ఇతడి వ్యవహారాలు, నెట్‌వర్క్‌ను పూర్తిస్థాయిలో గుర్తించడానికి మరోసారి విచారించాలని పోలీసులు నిర్ణయించారు. దీనికోసం అతడిని తమ కస్టడీకి ఇవ్వాలని కోరుతూ పోలీసులు నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. -
రిజర్వేషన్లపై ఎందుకు నిలదీయడం లేదు
జడ్చర్ల టౌన్: బీసీ రిజ ర్వేషన్లలో కోత విధించార ని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్ర శ్నించినట్లే.. బీసీ కుల గణన చేయాలని, జనాభా ప్రకారం రిజర్వేషన్లు పెంచాలని కేంద్రాన్ని ఎందుకు నిలదీయడం లేదని బీజేపీ నాయకులను బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ప్రశ్నించారు. సోమవారం మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లకు వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు. బీసీ రిజర్వేషన్లను జనాభా దామాషా పద్ధతిన పెంచాలని, బీసీ కుల గణన చేపట్టాలని ఇదివరకే రాష్ట్రవ్యాప్త ఉద్యమానికి తాము పిలుపునిచ్చామని చెప్పారు. ఆ ఉద్యమాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు 15 మందితో స్టీరింగ్ కమిటీని నియమించామని వివరించారు. రాష్ట్ర స్టీరింగ్ కమిటీ.. రాష్ట్ర స్టీరింగ్ కమిటీ కన్వీనర్‌గా డా.సాంబశివగౌడ్, కో కన్వీనర్‌గా దాసరి హనుమయ్య, సలహాదా రులుగా చంద్రశేఖర్ ముదిరాజ్, మహతి, రమేష్, రీసెర్చ్ ఇన్‌చార్జ్‌లుగా ఊరుమల్ల విశ్వం, జక్కని విజయ్‌కుమార్, గుర్రప్ప, కల్చరల్ ఇన్చార్జ్గా అశోక్, దయాకరణ్, మౌర్య, కోనేటి సుజాత, మీడి యా ఇన్చార్జ్గా డా.వెంకటేశ్ చౌహాన్, సభ్యులుగా నామాలక్ష్మి, కత్తుల పద్మయాదవ్, మౌలానాషఫి, శాంసన్‌లను నియమించారు. భవిష్యత్ కార్యాచ రణ రూపొందించి కార్యక్రమాలు నిర్వహించాలని వారికి సూచించారు. కాగా, అన్ని పార్టీల్లోని బీసీ నేతలు ఆయా పార్టీల నేతలకు ఊడిగం చేయకుండా బీసీల న్యాయమైన వాటా కోసం పోరాడాలని ప్రవీణ్‌కుమార్ ట్విటర్ వేదికగా పిలుపునిచ్చారు. -
చికోటి వ్యవహారంలో వెలుగులోకి అజ్ఞాత వ్యక్తులు
-
మొక్కలు నాటిన ఎస్ఐ
కాశినాయన : మండలంలోని ఓబుళాపురం సమీపంలోని సగిలేరు ఒడ్డున ఉన్న వివేకానంద సేవాశ్రమంలో ఆదివారం ఆశ్రమ నిర్వాహకులు రామకృష్ణారెడ్డి, రామతులసిలు మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. ముఖ్య అతిథిగా ఎస్ఐ ప్రవీణ్‌కుమార్ హాజరై పలు రకాల మొక్కలు నాటారు. ఎస్ఐ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతిఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలన్నారు. డాక్టర్ పీరారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఉంటే చర్యలు
సాక్షి, అమరావతి: పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్లాస్టిక్ వినియోగాన్ని నియంత్రించేందుకు అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, నగర పంచాయతీల్లో చర్యలు చేపట్టినట్లు ఏపీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ అండ్ డైరెక్టర్ ప్రవీణ్‌కుమార్ తెలిపారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నియంత్రణపై కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ ఆదేశాలను శుక్రవారం నుంచి అమలుచేస్తున్నట్లు ప్రకటించారు. వీటి ప్రకారం.. ఒకసారి వినియోగించి పారేసే (సింగిల్ యూజ్) ప్లాస్టిక్ వస్తువులు తయారుచేయడం, దిగుమతి చేయడం, నిల్వచేయడం, పంపిణీ, విక్రయంతో పాటు ఉపయోగించడం చట్ట ప్రకారం నిషేధించినట్లు ఆయన తెలిపారు. ముఖ్యంగా ప్లాస్టిక్ స్టిక్‌లతో కూడిన ఇయర్ బడ్స్, ప్లాస్టిక్ జెండాలు, క్యాండీ స్టిక్స్, బెలూన్లకు కట్టే ప్లాస్టిక్ స్టిక్కులు, ఐస్‌క్రీమ్ స్టిక్స్‌తో పాటు టీ, కాఫీ కలుపుకునేందుకు వాడే ప్లాస్టిక్ స్టిక్స్‌ను పూర్తిగా నిషేధించినట్లు ప్రవీణ్‌కుమార్ వెల్లడించారు. ఈ మేరకు అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో సింగిల్ యూజ్ ప్లాటిక్ నిషేధంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు వార్డు వలంటీర్లు ప్రచారం చేయాలని ఆదేశించారు. ఇందులో భాగంగా అన్ని వార్డుల్లోను ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ నియమాలపై కరపత్రాలను పంపిణీ చేయాలని, కూడళ్లల్లో హోర్డింగ్స్‌ను ఏర్పాటుచేయాలన్నారు. సినిమా థియేటర్లలో స్లైడ్లను ప్రదర్శించడంతో పాటు, టీవీ స్క్రోలింగ్స్, ర్యాలీలు నిర్వహించాలన్నారు. ఆ వస్తువులు ఉంటే లైసెన్స్ రద్దు వాణిజ్య షాపులు, రిటైలర్లు, అమ్మకందారులు, వీధి వ్యాపారులు, కూరగాయలు, పండ్ల మార్కెట్లు, మాల్స్‌తో పాటు ఇతర సంస్థల్లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ పరికరాలు, క్యారీ బ్యాగులు నిల్వచేయడంతో పాటు వినియోగించినట్లు తేలితే ఆయా దుకాణాలు, షాపుల వాణిజ్య లైసెన్సులు రద్దుచేస్తామని హెచ్చరించారు. దీంతోపాటు భారీగా జరిమానాలు కూడా విధిస్తామన్నారు. ఇక శుక్రవారం నుంచి అమలులోకి వచ్చే నిబంధనలను అమలుచేసేందుకు, దుకాణాలను తనిఖీ చేసేందుకు రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో 805 టాస్క్ఫోర్సు బృందాలను నియమించినట్లు ఆయన తెలిపారు. ఇప్పటిదాకా ఈ బృందాలు 75 మైక్రాన్ల కంటే తక్కువ మందం గల 158 మెట్రిక్ టన్నుల ప్లాస్టిక్ బ్యాగులను సీజ్ చేసి, రూ.1.54 కోట్ల జరిమానా వసూలు చేసినట్టు సీడీఎంఏ ప్రవీణ్‌కుమార్ వివరించారు. -
ఫలితాలిచ్చిన ఆస్తి పన్ను తగ్గింపు
సాక్షి, అమరావతి: పురపాలక, పట్టణాభివృద్ధి విభాగం ఈ ఆర్థిక సంవత్సరానికి ఏప్రిల్‌లో ప్రకటించిన ఆస్తి పన్నుపై ఐదు శాతం తగ్గింపు అవకాశాన్ని పుర ప్రజలు అనూహ్యంగా వినియోగించుకున్నారని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ అండ్ డైరెక్టర్ ప్రవీణ్‌కుమార్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. గత ఏడాది కంటే 55 శాతం అధికంగా పన్ను చెల్లించినట్టు పేర్కొన్నారు. ప్రభుత్వం ఇచ్చిన ప్రస్తుత సంవత్సరం ఆస్తిపన్ను ముందస్తు చెల్లింపు రాయితీపై ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించామని, ఇందులో వార్డు సచివాలయ వ్యవస్థ కీలక పాత్ర పోషించిందన్నారు. పలు దఫాలుగా ఆస్తి పన్ను చెల్లింపులపై సమీక్షలు నిర్వహించామన్నారు. దాంతో పన్ను చెల్లింపులు గత సంవత్సరం వసూలైన రూ.320.13 కోట్లతో పోలిస్తే ఈ ఏడాది గడువు ముగిసే సమయానికి 55 శాతం అధికంగా రూ.496.51 కోట్లు వసూలైందని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ అండ్ డైరెక్టర్ వివరించారు. -
వరంగల్‌లో మెడికల్ సీట్ల మాఫియా
-
కేసీఆర్ హామీలకు మోసపోవద్దు: ప్రవీణ్‌కుమార్
నార్కట్‌పల్లి: సీఎం కేసీఆర్ దళితబంధు, డబుల్ బెడ్రూం ఇళ్ల పేరుతో పేదలను వంచిస్తున్నారని, ఆ మాటలు విని ప్రజలెవరూ మోసపోవద్దని బీఎస్పీ రాష్ట్ర చీఫ్ కోఆర్డినేటర్ ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ సూచించారు. ఆయన చేపట్టిన బహుజన రాజ్యాధికార యాత్ర 22వ రోజు ఆదివారం నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండలంలోని చెర్వుగట్టు, అక్కెనపల్లి గ్రామాల్లో సాగింది. చెర్వుగట్టులోని రామలింగేశ్వర స్వామి ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు చేశారు. అక్కెనపల్లిలోని మసీదును సందర్శించారు. చెర్వుగట్టులో ప్రజలనుద్దేశించి ప్రవీణ్ మాట్లాడుతూ రాష్ట్రంలో తాగునీటి సమస్య నేటికీ పరిష్కారం కాలేదని, మిషన్ భగీరథ పనులు అసంపూర్తిగా మిగిలిపోయాయని విమర్శించారు. ఉపాధి కూలీలకు వేతనాలు చెల్లించడంలో, కొత్త పించన్లు మంజూరు చేయడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. -
దళితబంధు కాదు.. నాణ్యమైన విద్యనందించాలి
కేతేపల్లి/నకిరేకల్: పాఠశాలల్లో కనీస వసతులు కల్పించకుండా, ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయకుండా ప్రభుత్వం విద్యారంగాన్ని నిర్వీర్యం చేసే కుట్ర చేస్తోందని బీఎస్పీ రాష్ట్ర చీఫ్ కోఆర్డినేటర్ ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ఆరోపించారు. బహుజన రాజ్యాధికార యాత్రలో భాగంగా మంగళవారం నల్లగొండ జిల్లా కేతేపల్లి మండలంలోని గుడివాడ, కొత్తపేట, కేతేపల్లి, ఉప్పలపహాడ్, భీమారం, నకిరేకల్ మండలం ఓగోడు గ్రామంలో పర్యటించి ప్రజలతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ప్రవీణ్‌కుమార్ మాట్లాడుతూ నాణ్యమైన విద్యనందించాలని కోరితే పాలకులు మద్యాన్ని ఏరులై పారిస్తున్నాని విమర్శించారు. దళితుల కుటుంబాలకు ప్రభుత్వం జీవిత కాలంలో రూ.10 లక్షలు ఇచ్చే బదులు వారి పిల్లలకు నాణ్యమైన విద్యనందిస్తే వారు నెలకు రూ.5 లక్షలు సంపాదించే ఉద్యోగాలు సాధిస్తారని తెలిపారు. తాను ఇప్పటి వరకు 170 గ్రామాల్లో పర్యటించానని, ఎక్కడ చూసినా ప్రజలు సమస్యలతో సతమతమవుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. వచ్చే ఎన్నికల్లో ప్రజల చేతిలో ఓటమి నుంచి సీఎం కేసీఆర్‌ను ఎవ్వరూ కాపాడలేరని తేల్చిచెప్పారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి చోహన్, నాయకులు కిరణ్, నర్సింహ, సైదులు, జిల్లా మహిళా కన్వీనర్ నిర్మల, ప్రియదర్శిని తదితరులు పాల్గొన్నారు. -
ఐపీఎల్ చరిత్రలో ప్రవీణ్ కుమార్ పేరిట ఉన్న అత్యంత అరుదైన రికార్డు ఏంటో తెలుసా..?
Praveen Kumar: బ్యాటర్ల పండుగా పిలిచే ఐపీఎల్లో బౌలర్లు రికార్డులు సాధించడం చాలా అరుదుగా కనిపిస్తుంది. 14 ఎడిషన్ల ఐపీఎల్ జర్నీలో బౌలర్లు రాణించిన సందర్భాలు చాలా తక్కువనే చెప్పాలి. ఇలాంటి బ్యాటర్ల ఆధిపత్యం ఉన్న క్యాష్ రిచ్ లీగ్‌లో ఓ బౌలర్ ఊహకందని అద్భుత రికార్డును చాలాకాలంగా తన పేరిట భద్రపరుచుకున్నాడు. ఆ రికార్డు ఏంటంటే.. టీ20ల్లో ఒక్క డాట్ బాల్ వేయడమే గగనమనుకుంటే ఓ బౌలర్ తన ఐపీఎల్ కెరీర్లో ఏకంగా 14 మెయిడిన్లు వేసి ఔరా అనిపించాడు. ఐపీఎల్లో వివిధ జట్ల తరఫున 119 మ్యాచ్‌లు ఆడిన టీమిండియా మాజీ పేసర్ ప్రవీణ్ కుమార్.. 14 మెయిడిన్ ఓవర్లు వేసి, ఐపీఎల్ చరిత్రలో అత్యధిక మెయిడిన్ ఓవర్లు వేసిన బౌలర్‌గా రికార్డుల్లో నిలిచాడు. అతని తర్వాత టీమిండియా మాజీ పేసర్ ఇర్ఫాన్ పఠాన్ (103 మ్యాచ్‌ల్లో 10 మెయిడిన్లు), భువనేశ్వర్ కుమార్ (132 మ్యాచ్‌ల్లో 9 మెయిడిన్లు), ధవల్ కులకర్ణి (92 మ్యాచ్‌ల్లో 8 మెయిడిన్లు), లసిత్ మలింగ (122 మ్యాచ్‌ల్లో 8 మెయిడిన్లు), సందీప్ శర్మ (8 మెయిడిన్లు), డేల్ స్టెయిన్ (7), హర్భజన్ సింగ్ (6), జస్ప్రీత్ బుమ్రా (6), దీపక్ చాహర్ (6), అమిత్ మిశ్రా (6), ఇషాంత్ శర్మ (6) వరుస స్థానాల్లో ఉన్నారు. చదవండి: ఐపీఎల్‌కు ముందు పెళ్లి పీటలెక్కిన మరో స్టార్ క్రికెటర్.. ఎవరంటే..? -
దళితబంధుపై కేసీఆర్ డ్రామా
తిరుమలగిరి(తుంగతుర్తి): ముఖ్యమంత్రి కేసీఆర్ దళితబంధు పథకాన్ని ఎలాంటి మార్గదర్శకాలు లేకుండానే ప్రవేశపెట్టారని, ఇది దళితులను మభ్యపెట్టడానికి ఆడుతున్న డ్రామా అని బీఎస్పీ రాష్ట్ర చీఫ్ కోఆర్డినేటర్ ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ విమర్శించారు. టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకే దళితబంధు పథకం దక్కుతోందని ఆరోపించారు. బీఎస్పీ ఆధ్వర్యంలో చేపట్టిన రాజ్యాధికార యాత్ర శుక్రవారం సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో సాగింది. ఉదయం స్థానిక రైతులతో ప్రవీణ్‌కుమార్ మాట్లాడారు. అనంతరం గ్రామంలోని డబుల్ బెడ్రూం ఇళ్లను పరిశీలించారు. కేసీఆర్ ప్రభుత్వంలో అన్నివర్గాల ప్రజలు మోసానికి గురయ్యారన్నారు. రైతుబంధు పథకం భూస్వాములకు బంధుగా మారిందని ఆరోపించారు. ఎరువుల ధరలు రెట్టింపయ్యాయని, రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర మాత్రం రావడం లేదని మండిపడ్డారు. రైతులకు ఉచితంగా ఎరువులు ఇస్తామన్న హామీని అమలు చేయలేదని ఆయన విమర్శించారు. దళితబంధు పథకం ఇప్పిస్తామని దళారులు తయారయ్యారని, ఒక్కొక్కరి నుంచి రూ.లక్ష వరకు దండుకుంటున్నారని విమర్శించారు. ప్రభుత్వ ఆస్పత్రులలో వైద్య సదుపాయాలు లేక ప్రజలు ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లి అప్పులు చేసి ఆర్థికంగా నష్టపోతున్నారని విచారం వ్యక్తం చేశారు. నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వంపై నమ్మకం పోయిందని విమర్శించారు. తుంగతుర్తి నియోజకవర్గంలో బిక్కేరు వాగు నుంచి ఇసుకను అక్రమంగా తరలించడంతో రైతుల బోర్లు ఎండి పోతున్నా పాలకులు పట్టించుకోకపోవడం దారుణమన్నారు. బీఎస్పీకి అధికారం ఇస్తే ఇసుక మాఫియాపై ఉక్కుపాదం మోపుతామని పేర్కొన్నారు. కేసీఆర్ పాలనలో రాష్ట్రం అవినీతి, అక్రమాలకు అడ్డాగా మారిందని ఆరోపించారు. పాలక వర్గాలు ప్రచారం చేస్తున్నట్లు ఎలాంటి అభివృద్ధీ జరగలేదన్నారు. జనాభా ప్రాతిపదికన రాజ్యాధికారం సిద్ధించినప్పుడే అన్ని సామాజిక వర్గాల పేదరికం రూపుమాపడం సాధ్యమవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు మంద ప్రభాకర్, నియోజకవర్గ ఇన్చార్జి బల్గూరి స్నేహ, జిల్లా అధ్యక్షుడు రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. -
బహుజనులకు రాజ్యాధికారమే ధ్యేయం
మోత్కూరు: బహుజనులకు రాజ్యాధికారమే ధ్యేయంగా తమ పార్టీ పని చేస్తోందని బీఎస్పీ రాష్ట్ర చీఫ్ కోఆర్డినేటర్ ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ అన్నారు. బహుజన రాజ్యాధికార యాత్ర గురువారం యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలం కొండగడప గ్రామానికి చేరింది. ఈ సందర్భంగా పలువురు బీఎస్పీలో చేరగా వారికి ప్రవీణ్‌కుమార్ పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. అనంతరం ముశిపట్ల గ్రామానికి యాత్ర చేరింది. ఈ సందర్భంగా ప్రవీణ్‌కుమార్ ఉపాధిహామీ కూలీలతో మాట్లాడారు. వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. బహుజనుల రాజ్యాధికారమే ధ్యేయంగా పని చేస్తున్న తనకు మీ మద్దతు అందించాలని అభ్యర్థించారు. కార్యక్రమంలో బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు మంద ప్రభాకర్, రవికుమార్, నియోజకవర్గ ఇన్చార్జ్ బల్గూరి స్నేహ, మండల నాయకులు ప్రతాప్, బుశిపాక నాగరాజు, నవీన్, సురేశ్, ఉదయ్‌కిరణ్, అశోక్, భిక్షం, రాములు, బండి నరేశ్, అరుణ్, మల్లయ్య పాల్గొన్నారు. -
దొరల పాలన అంతమే బీఎస్పీ లక్ష్యం
మోత్కూరు/కొడకండ్ల/దేవరుప్పల: తెలంగాణ రాష్ట్రంలో దొరల పాలన అంతమే బీఎస్పీ లక్ష్యమని, ఇందుకు ప్రజలంతా తమతో కలిసి రావాలని ఆ పార్టీ రాష్ట్ర చీఫ్ కోఆర్డినేటర్ ఆర్.ఎస్.ప్రవీణ్‌కుమార్ పిలుపునిచ్చారు. బహుజన రాజ్యాధికార యాత్ర బుధవారం రాత్రి యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు పట్టణానికి చేరుకుంది. పట్టణంలోని అంబేద్కర్, పూలే, మహాత్మాగాంధీ విగ్రహాలకు ప్రవీణ్‌కుమార్ పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం గాంధీనగర్‌లో నిర్వహించిన బహిరంగసభలో ప్రవీణ్‌కుమార్ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. సర్దార్ సర్వాయి పాపన్న స్ఫూర్తితో రాష్ట్రంలో మార్చి 6న ఖిలాషాపూర్‌లో ప్రారంభమైన యాత్రను ప్రజలు ఎంతో ఆదరిస్తున్నారన్నారు. కాగా, అంతకుముందు బహుజన రాజ్యాధికార యాత్ర 11వ రోజులో భాగంగా జనగామ జిల్లా కొడకండ్లలో ఆయన పార్టీ జెండాను ఆవిష్కరించి, డబుల్బెడ్రూం ఇళ్ల నిర్మాణాలను పరిశీలించారు. దేవరుప్పల మండలం కడివెండిలో ప్రవీణ్‌కుమార్ మాట్లాడుతూ తమ రాజ్యాధికార యాత్ర ర్యాలీలు, కార్యక్రమాలకు ప్రజలు హాజరుకాకుండా టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు కుట్రలు పన్నుతున్నారని, దళితబంధు రాదని బెదిరిస్తున్నారని ఆరోపించారు. తమది ప్రజలకు అండగా నిల్చే పార్టీ అని, రాబోయే 289 రోజుల యాత్రనూ ఇదే తరహాలో ఆదరించాలని కోరారు. దొడ్డి కొమురయ్య కలలు సాకారం చేయాలంటే బడుగుల రాజ్యాధికారం అనివార్యమన్నారు. -
దళితుల మధ్య చిచ్చు పెట్టేందుకే ‘దళిత బంధు’: ప్రవీణ్‌కుమార్
తొర్రూరు/నాగారం: దళితుల మధ్య చిచ్చు పెట్టేందుకే సీఎం కేసీఆర్ ‘దళితబంధు’కుట్ర పన్నారని బీఎస్పీ రాష్ట్ర చీఫ్ కోఆర్డినేటర్ ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ అన్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యేల అనుచరులకే ‘దళిత బంధు’పథకం ద్వారా లబ్ధి జరుగుతోందని ఆరోపించారు. బీఎస్పీ రాజ్యాధికార యాత్ర మంగళవారం తొర్రూరు పట్టణానికి చేరుకుంది. అనంతరం ఛాంబర్ ఆఫ్ కామర్స్ భవనంలో నిర్వహించిన కాన్షీరాం జయంతి వేడుకల్లో ప్రవీనమార్ ప్రసంగించారు. రైతుబంధు పథకం కింద పంపిణీ చేసిన రూ.50వేల కోట్లలో రూ.10వేల కోట్లు మాత్రమే చిన్న, సన్నకారు రైతులకు అందాయని అన్నారు. రూ.2.50లక్షల కోట్ల రాష్ట్ర బడ్జెట్లో బలహీన వర్గాలు, దళిత, గిరిజనుల వాటా స్వల్పమన్నారు. రాష్ట్రంలో మద్యం ఏరులై పారి ప్రజలను బలిగొంటోందని, గ్రామాల్లో ఐదు ఇళ్లకు ఒక వితంతువు కనిపిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. అంతకుముందు... సూర్యాపేట జిల్లా, నాగారం మండలం, ఫణిగిరిలోని బౌద్ధక్షేత్రం వద్ద స్వేరోస్ అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన భీమ్ దీక్ష కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. జ్ఞానసమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై, పవిత్ర జీవన విధానాన్ని అలవర్చుకోవాలన్నారు. రాజ్యాంగాన్ని రక్షించుకోవాలని, ఓటును వజ్రాయుధంగా భావించాలని, రాజ్యాధికారమే లక్ష్యంగా పనిచేయాలని స్వేరోలకు పిలుపునిచ్చారు. -
నంబర్ వన్ సీఎంకు పీకే, ప్రకాష్‌రాజ్ ఎందుకు?
రఘునాథపల్లి: ‘ప్రపంచం అబ్బురపడే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినం.. ఇంటింటికీ నీళ్లిచ్చే మిషన్ భగీరథ చేపట్టినం.. అన్ని రంగాల్లో నంబర్ వన్ తెలంగాణ’అని చెప్పుకొనే సీఎం కేసీఆర్‌కు పీకే ఎందుకు? ప్రకాష్‌రాజ్ ఎందుకు? అని బీఎస్పీ రాష్ట్ర చీఫ్ కోఆర్డినేటర్ ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ప్రశ్నించారు. బీఎస్పీ ఏనుగులాగ ఘీంకరించగానే కాం ట్రాక్టర్ల వద్ద కమీషన్ల రూపంలో తీసుకున్న రూ.600కోట్లతో పీకేను తెచ్చుకున్నారని ఆయన ఆరోపించారు. బహుజన రాజ్యాధికార యాత్ర సందర్భంగా ఆదివారం రాత్రి జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం ఖిలాషాపూర్‌లో బహిరంగ సభ జరిగింది. బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు తాళ్లపల్లి వెంకటస్వామి అధ్యక్షతన జరిగిన సభలో ప్రవీణ్‌కుమార్ మాట్లాడుతూ... ఇది ప్రవీణ్‌కుమార్ యాత్ర కాదు, తెలంగాణలో మూడు కోట్ల మంది బహుజనులు చేస్తోన్న దండయాత్ర అన్నారు. కేసీఆర్ కుయుక్తులు పసిగట్టి జనం ప్రభుత్వాన్ని గద్దె దించాలని పిలుపు నిచ్చారు. సభలో బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు మంద ప్రభాకర్, రాష్ట్ర కోఆర్డినేటర్లు దేవోళ్ల గంగాధర్, మల్లేశం, బాలస్వామి చంద్రశేఖర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు మహతి రమేష్, గంధం శివ, శేఖర్, వెంకన్న, రాష్ట్ర కార్యర్శులు అనితారెడ్డి, వెంకటేష్, నాయకులు సమ్మయ్య, కందికంటి విజయ్‌కుమార్, శివరాజ్, రంగు రాజశేఖర్‌గౌడ్, ప్రేమ్‌సాగర్ పాల్గొన్నారు. -
ఖిలాషాపూర్ నుంచి బహుజన రాజ్యాధికార యాత్ర
సాక్షి, హైదరాబాద్: బహుజనులకు ఏళ్ల తరబడి జరుగుతున్న అన్యాయాన్ని చాటి చెప్పేందుకు బహుజన సమాజ్ పార్టీ తెలంగాణ విభాగం బహుజన రాజ్యాధికార యాత్రకు శ్రీకా రం చుట్టింది. ఈ క్రమంలో 300 రోజుల పాటు సుదీర్ఘంగా బహుజన రాజ్యాధికార యాత్ర చేపడుతున్నట్టు బహుజన సమాజ్ పార్టీ తెలంగాణ చీఫ్ కో–ఆర్డినేటర్ ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ తెలిపారు. బడుగుల రాజకీయ అధికారం కోసం మూడు శతాబ్దాల క్రితం మొఘల్ చక్రవర్తులకు వ్యతిరేకంగా పోరాడిన బహుజన యోధుడు సర్ధార్ సర్వాయి పాపన్న గౌడ్ స్ఫూర్తితో ఈ యాత్రను ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు. ఆదివారం సాయంత్రం 4గంటలకు జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం ఖిలాషాపూర్ నుంచి యాత్ర ప్రారంభం కానుందని తెలిపారు. ముందుగా అక్కడే ప్రారంభ సభ నిర్వహించనున్నట్టు తెలిపారు. -
చేనేత మృతుల కుటుంబాలను ఆదుకోండి
ఖైరతాబాద్: ఆర్థిక ఇబ్బందులతో మూకుమ్మడిగా ఆత్మ హత్యలకు పాల్పడ్డ కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం కాట్నాపల్లికి చెందిన చేనేత కుటుంబాలకు రూ.10 లక్షల పరిహారం చెల్లించాలని బీఎస్పీ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కోరారు. మృతుల కుటుంబసభ్యుల్లో ఒకరికి ప్రభుత్వోద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సోమవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో జాతీయ చేనేతన్నల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు. కమిటీ చైర్మన్ దాసు సురేష్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ప్రవీణ్‌కుమార్, ఆమ్ ఆద్మీ పార్టీ నాయకురాలు ఇందిరా శోభన్, మాజీ ఎమ్మెల్యే శ్రీరాములు మాట్లాడారు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు సామూహిక ఆత్మహత్యలకు పాల్పడినా ముఖ్యమంత్రి పట్టించుకోకపోవడం దారుణమన్నారు. కార్యక్రమంలో సీపీఐ నేత పాశికంటి లక్ష్మినర్సయ్య, బీసీ మహిళానేత శారద గౌడ్, సాజిదా సికిందర్, బోనం ఊర్మిళ, వీరస్వామి పాల్గొన్నారు. -
Praveen Kumar Sobti: స్వర్ణ, రజత, కాంస్య పతకాలు గెలిచిన అథ్లెట్..భీముడిగా గుర్తింపు
Praveen Kumar Sobti:- న్యూఢిల్లీ: భారత క్రీడల్లో విజేయుడు... ‘మహాభారత్’లో భీముడు ప్రవీణ్ కుమార్ సోబ్టీ కన్నుమూశారు. 74 ఏళ్ల ప్రవీణ్ సోమవారం రాత్రి గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య, కుమార్తె ఉన్నారు. పంజాబ్‌కు చెందిన ప్రవీణ్ బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆసియా క్రీడలు, కామన్వెల్త్ క్రీడల్లో డిస్కస్ త్రో, హ్యామర్ త్రో ఈవెంట్లలో పతకాలు నెగ్గిన ఈ అలనాటి దిగ్గజం ఓ క్రీడాకారుడిగా కంటే విలక్షణ నటుడిగా సుపరిచితం. ఇప్పుడు ఒక్క కాంస్య పతకంతోనే రాత్రికి రాత్రే స్టార్ అవుతుండగా... ఆ కాలంలో స్వర్ణ, రజత, కాంస్య పతకాలతో విజయవంతమైన అథ్లెట్‌గా ఎదిగారు. అయినప్పటికీ క్రీడల్లో రాని గుర్తింపు, పేరు ప్రతిష్టలు ఒక్క ‘మహాభారత్’ సీరియల్‌తోనే వచ్చాయి. ఇవీ ఆయన ఘనతలు ►అమృత్‌సర్‌లో 1947 డిసెంబర్ 6న పుట్టిన ప్రవీణ్ 1960 నుంచి 1974 వరకు పలు మెగా ఈవెంట్లలో పతకాలతో మెరిశారు. ►1966 బ్యాంకాక్ ఆసియా క్రీడల్లో డిస్కస్ త్రోలో చాంపియన్‌గా నిలిచిన ప్రవీణ్ హ్యామర్ త్రోలో కాంస్యం నెగ్గారు. ►అదే ఏడాది కింగ్‌స్టన్‌లో జరిగిన కామన్వెల్త్ క్రీడల్లో హ్యామర్ త్రోలో రజతం గెలుపొందారు. ►1970 బ్యాంకాక్ ఆసియా క్రీడల్లో డిస్కస్ త్రో ఈవెంట్లో టైటిల్ నిలబెట్టుకున్న ప్రవీణ్ 1974 టెహ్రాన్ ఆసియా క్రీడల్లో రజతం గెలిచారు. ►1968 మెక్సికో, 1972 మ్యూనిక్ ఒలింపిక్స్ క్రీడల్లోనూ ప్రవీణ్ భారత్‌కు ప్రాతినిధ్యం వహించారు. భారతంలో భీముడు దూరదర్శన్‌లో 90వ దశకంలో ప్రసారమైన సుప్రసిద్ధ పౌరాణిక ధారావాహిక ‘మహాభారత్’లో పంచ పాండవుల్లో భీముడిగా ప్రవీణ్ దేశ ప్రజల అభిమానాన్ని చూరగొన్నారు. తదనంతరం పలు హిందీ, తమిళ్, తెలుగు చిత్రాల్లో నటించారు. 2013లో రాజకీయాల్లోనూ ప్రవేశించి ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున ఢిల్లీలోని వాజిర్పూర్ అసెంబ్లీ నియోజక వర్గంలో పోటీ చేసి ఓడిపోయారు. తర్వాత బీజేపీలో చేరారు. చదవండి: IND VS WI 2nd ODI: విరాట్ కోహ్లి ఖాతాలో మరో రికార్డు.. సచిన్, ధోని సరసన..! -
విషాదం: 'మహాభారత్' భీముడు కన్నుమూత
Mahabharat Bheem Actor Praveen Kumar Sobti Passes Away: సినీ ఇండస్ట్రీలో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రఖ్యాత మహాభారత్ సీరియల్లో భీముడి పాత్ర పోషించిన నటుడు ప్రవీణ్ కుమార్ సోబ్తీ (75) కన్నుమూశారు. ఈ విషయాన్ని ఆయన కుమార్తె నికునికా అధికారికంగా ధృవీకరించారు. గతరాత్రి 9.30నిమిషాలకు హార్ట్ ఎటాక్ కారణంగా ఇంట్లోనే ఆయన తుదిశ్వాస విడిచినట్లు ఆమె పేర్కొంది. కాగా మభాభారత్ సిరీయల్లో భీముడి పాత్రతో ప్రవీణ్‌కుమార్ దేశ వ్యాప్తంగా పాపులర్ అయ్యారు. రెండు దశాబ్దాల పాటు యాభైకి పైగా సిరియల్స్‌తో పాటు పలు సినిమాల్లో నటించి మెప్పించారు. ప్రవీణ్ కుమార్ మృతి పట్ల పలువురు బీటౌన్ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. -
ప్రతి నెలా రూ. కోటి వడ్డీ కడుతున్నాం.. గత్యంతరం లేక ఐపీ పెట్టాం
సాక్షి, పెనుమూరు(చిత్తూరు): ‘గత్యంతరం లేక ఐపీ పెట్టాం. అప్పు ఇచ్చిన ప్రతి ఒక్కరికీ పాదాభివందనం చేస్తున్నా.. నా పరిస్థితి అర్థం చేసుకోండి. కోర్టులో నడుస్తున్న భూమి కేసు పరిష్కారం అయితే కానీ మా కష్టాలు తీరవు’ ఇది వ్యాపారి కోడూరు రంగయ్య శెట్టి మనువడు ప్రవీణ్‌కుమార్ ఐపీ బాధితులకు పెట్టిన వాట్సప్ మెసేజ్. పెనుమూరులో 60 ఏళ్లుగా వస్త్ర వ్యాపారం చేసిన రంగయ్య శెట్టి గత వారం దాదాపు 997 మందికి రూ.87.40 కోట్లు ఐపీ పెట్టి అదృశ్యమైన సంగతి తెలిసిందే. దీనిపై రుణదాతలు పెనుమూరులో ఈ నెల 6న పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. డీఎస్పీ సుధాకరరెడ్డి, పాకాల సీఐ ఆశీర్వాదం బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో బాధితులు ధర్నా విరమించారు. చదవండి: (‘పండగ పూటా పస్తులేనా?.. మేమేం పాపం చేశాం’) ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి 10 గంటలకు రంగయ్యశెట్టి మనుమడు ప్రవీణ్ రుణదాతలకు వాట్సప్ మెసేజ్ పెట్టారు. అందులో తన తండ్రి చేపట్టిన ట్రావెల్స్, వడ్డీ, గ్రానైట్స్, రియల్ ఎస్టేట్ వ్యాపారాల్లో నష్టపోయినట్లు చెప్పారు. అప్పు ఇచ్చిన ప్రతి ఒక్కరికి ఆరు నెలల క్రితం వరకూ నెలకు రూ. కోటి వడ్డీ కడుతూ వచ్చినట్లు పేర్కొన్నారు. ఇందుకోసం ప్లాట్లు, 70 ఎకరాల భూమి అమ్ముకున్నట్లు మెసేజ్‌లో రాసుకొచ్చారు. ఇక గత్యంతరం లేక ఐపీ పెట్టేందుకు నిర్ణయం తీసుకున్నామని, అప్పు ఇచ్చిన ప్రతి ఒక్కరికీ పాదాభివందనం చేస్తున్నానని, తన పరిస్థితి అర్థం చేసుకోవాలని కోరారు. ప్రస్తుతం తిరుపతిలోని భూమిపై కోర్టులో కేసు నడుస్తోందని, ఆ కేసు పరిష్కారం అయితే తమ కష్టాలు తీరుతాయన్నారు. ప్రస్తుతం తన సమస్యలు తీరేందుకు రెండు మార్గాలు మిగిలాయని, ఒకటి ఆత్మహత్య చేసుకోవడం, రెండు తాను బతికినంత కాలం అప్పు తీర్చేందుకు శ్రమిస్తానంటూ మెసేజ్‌లో రాసుకొచ్చారు. ఆ తర్వాత ప్రవీణ్ వాట్సాప్ చేసిన ఫోన్ స్విచాఫ్ వచ్చింది. పోలీసులు ఆ మెసేజ్ ఆధారంగా దర్యాప్తు చేపడుతున్నారు. -
టోక్యో పారాలింపిక్స్: పురుషుల హై జంప్‌లో భారత అథ్లెట్ ప్రవీణ్ కుమార్ రజత పతకం సాధించాడు
-
ప్రవీణ్ కూమార్‌కు రజతం.. భారత్ ఖాతాలో 11 పతకాలు
టోక్యో: టోక్యోలో జరుగుతున్న పారాలింపిక్స్‌లో భారత అథ్లెట్స్ సత్తా చాటుతున్నారు. శుక్రవారం భారత ఖాతాలో మరో పతకం చేరింది. పురుషుల హైజంప్ T64 విభాగంలో ప్రవీణ్ కూమార్ రజత పతకాన్ని సాధించాడు. దీంతో భారత ఖాతాలోకి 11 పతకాలు చేరాయి. పారాలింపిక్స్‌లో రజత పతకం సాధించిన ప్రవీణ్ కూమార్ను ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు. చదవండి: IND Vs ENG 4th Test: పడినా...పడగొట్టారు..! Proud of Praveen Kumar for winning the Silver medal at the #Paralympics. This medal is the result of his hard work and unparalleled dedication. Congratulations to him. Best wishes for his future endeavours. #Praise4Para — Narendra Modi (@narendramodi) September 3, 2021 -
ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్‌కు కరోనా
సాక్షి, హైదరాబాద్: మాజీ ఐపీఎస్ అధికారి, బీఎస్పీ రాష్ట్ర కో–ఆర్డినేటర్ ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని ఆయన ట్విటర్ వేదికగా వెల్లడించారు. ‘‘గత రెండు రోజులుగా నీరసంగా ఉంటే కోవిడ్ టెస్ట్ చేయించుకున్నాను. పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. వెంటనే గాంధీ ఆస్పత్రికి వెళ్లి చికిత్స చేయించుకుని ఇప్పుడే డిశ్చార్జ్ అయ్యాను. నాతో అతి దగ్గరగా తిరిగిన వ్యక్తులు ఐసోలేషన్‌లో ఉండాలని కోరుకుంటున్నాను. నాకు చాలా స్వల్ప లక్షణాలున్నాయి.. పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు’’ అంటూ ప్రవీణ్ కుమార్ ట్వీట్ చేశారు. గత రెండురోజులుగా నీరసంగా ఉంటే Covid టెస్టు చేయించుకుని, Positive గా నిర్దారణ అయిన వెంటనే ప్రభుత్వ గాంధీ హాస్పిటల్ కు వచ్చి చికిత్స చేయించుకుని ఇప్పుడే డిశ్చార్జి అయ్యాను. నాతో అతి దగ్గరగా తిరిగిన వ్యక్తులూ,Please isolate yourselves. I have mild symptoms. Nothing to worry at all. pic.twitter.com/mqYTfC8fmL — Dr. RS Praveen Kumar (@RSPraveenSwaero) August 10, 2021 ఆదివారం నల్లగొండ ఎన్జీ కాలేజీ మైదానంలో ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ భారీ సభ నిర్వహించిన సంగతి తెలిసిందే. రాజ్యాధికార సంకల్ప సభలో బీఎస్పీ నేషనల్ కోఆర్డినేటర్ రామ్‌జీ గౌతమ్ సమక్షంలో ప్రవీణ్‌కుమార్ బహుజన సమాజ్ పార్టీ(బీఎస్పీ)లో చేరిన సంగతి తెలిసిందే. ఈ సభకు భారీ ఎత్తున జనాలు తరలివచ్చారు. -
భూ అక్రమాలు సహించేది లేదు: జిల్లా కలెక్టర్ ప్రవీణ్‌కుమార్
-
ఏనుగెక్కి ప్రగతి భవన్ పోవాలె..
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: ‘మనం ఏనుగు ఎక్కి ప్రగతి భవన్‌కు పోవాలి. ఎర్రకోటపై మన నీలి జెండా (బీఎస్పీ జెండా)ను ఎగురవేయాలి’ అని మాజీ ఐపీఎస్ అధికారి, బీఎస్పీ రాష్ట్ర కో–ఆర్డినేటర్ ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ పిలుపునిచ్చారు. బహుజనులకు రాజ్యాధికారం ఎంతో దూరంలో లేదని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దళితబంధు పథకానికి ఖర్చు చేయనున్న రూ. 1,000 కోట్లు ఎవరి పైసలని ప్రశ్నించారు. దళితులపై సీఎంకు నిజమైన ప్రేమే ఉంటే ఆయన సొంత ఆస్తులు అమ్మి ఖర్చు పెట్టాలని డిమాండ్ చేశారు. ఆదివారం నల్లగొండలోని ఎన్.జి. కాలేజీ మైదానంలో నిర్వహించిన రాజ్యాధికార సంకల్ప సభలో బీఎస్పీ నేషనల్ కోఆర్డినేటర్ రామ్‌జీ గౌతమ్ సమక్షంలో ప్రవీణ్‌కుమార్ బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ)లో చేరారు. ఆయనకు రాంజీ గౌతమ్ బీఎస్పీ కండువా కప్పి పార్టీ సభ్యత్వం అందించారు. అలాగే ఆయన్ను బీఎస్పీ రాష్ట్ర కో–ఆర్డినేటర్‌గా ప్రకటించారు. సభకు తరలివచ్చిన అశేష జనవాహినిని ఉద్దేశించి ఈ సందర్భంగా ప్రవీణ్‌కుమార్ సుదీర్ఘంగా ప్రసంగించారు. తన రాజకీయ ప్రాధాన్యతలు, ఆకాంక్షలను వివరిస్తూనే రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే... ఆదివారం నల్లగొండలో జరిగిన రాజ్యాధికార సంకల్ప సభకు హాజరైన అశేష జనవాహిని మీ కోసమే రాజకీయాల్లోకి వచ్చా... ‘ఈ సభను చూస్తుంటే దొరల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. మీ ఉత్సాహం చూస్తుంటే ప్రగతి భవన్ చాలా దగ్గరలో ఉన్నట్లుగా కనిపిస్తోంది. బహుజనులు బానిసలు కాదు.. పాలకులుగా మార్చాలన్న బాధ్యతను నాపై పెట్టారు. మీ అందరి కోసమే ఆరున్నర ఏళ్ల సర్వీసు ఉన్నా రాజీనామా చేసి వచ్చా. లక్షల మంది బహుజనుల బతుకులు మార్చాలంటే త్యాగం చేయాల్సిన అవసరం ఉందని అమ్మకు చెప్పా. రెక్కాడితే కానీ డొక్కాడని, ఆకలైతే అన్నం దొరకని కుటుంబాలు ఉన్నాయి. వారందరికీ న్యాయం చేయాలి.. వారి గొంతుకను కావాలని చెప్పి వచ్చా. కొట్లాడి, 1,300 మంది ప్రాణత్యాగం చేసి తెచ్చుకున్న తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద పాదాభివందనం చేశా. మేం కష్టపడి త్యాగాలు చేస్తే అధికారం మరొకరు చెలాయిస్తున్నారు. పంతం నెగ్గే వరకు వదలొద్దని అమరులు నాకు చెప్పి పంపించారు. గొప్పగా బహుజన రాజ్యం... జనాభా ప్రాతిపదికన అధికారంలో వాటా ఇవ్వాలి. ఇవ్వకపోతే గుంజుకుంటాం. మీరు గ్రామాలకు వెళ్లి మన బహుజన రాజ్యం ఎంత గొప్పగా ఉండబోతోందో మన వారికి చెప్పండి. బహుజన రాజ్యంలో అన్ని కులాల వారికీ సమాన అధికారం ఉంటుంది. లక్షల మంది అమెరికాకు వెళతారు. ప్రతి మండలంలో ఒక ఇంటర్నేషనల్ స్కూల్ ఉంటుంది. కల్లుగీత కార్మికుల బిడ్డలు కంప్యూటర్ ఇంజనీర్లుగా ఉంటారు. మైనారిటీలు మిలియనీర్లు అవుతారు. మాల మాదిగలు డాలర్లు సంపాదిస్తారు. బంజారా బిడ్డలు బంగళాలు కొంటరు. గిరిజన బిడ్డలు విదేశాలకు వెళతారు. రాళ్లు గొట్టిన వారు రాకెట్ ప్రయోగిస్తారు. చిందు కళాకారుల బిడ్డలు సినిమా రంగంలోకి వెళ్తారు. మన పిల్లలు కంపెనీలు పెట్టి సంపదను సృష్టించి, ఉద్యోగాలు ఇచ్చేలా చేస్తాం. ప్రైవేటు రంగంలో కూడా రిజర్వేషన్లు రావాలి. అవి సాధించే వరకు నిద్రపోను. బహుజన రాజ్యం మీరంతా తలచుకుంటే వస్తుంది. తరతరాలుగా మనల్ని దోపిడీ చేసి సంపాదించిన ఆధిపత్య కులాల వారు రకరకాల పథకాలు, కుట్రల ద్వారా ఆ సొమ్మును మనపై చల్లుతారు. ఓటును అమ్ముకోవద్దు. నల్లగొండ సభ రాష్ట్ర రాజకీయాలనే కాదు దేశ రాజకీయాలను మార్పు చేసే అవకాశం ఉంది. మీ ఆస్తులమ్మి ‘దళితబంధు’ ఇవ్వండి సీఎం కేసీఆర్ ‘దళితబంధు’కు రూ. 1,000 కోట్లు ఖర్చు పెడుతున్నారు. అవి ఎవరి పైసలు? బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు కష్టపడిన సొమ్ము కాదా? వాటిని మీరు విచ్చలవిడిగా ఖర్చు పెడుతున్నారు. మాపై నిజమైన ప్రేమే ఉంటే మీ ఆస్తులు అమ్మి మాకు పెట్టండి. మా భవిష్యత్ మేమే నిర్ణయించుకునేలా చేయండి. 1,000 గురుకులాలు పెడితే మారిపోతుందా? అందులో చదివేది 4 లక్షల మందే. ఈ కొద్దిమంది చదివితే బంగారు తెలంగాణ అన్నట్టా? రాష్ట్రంలో వేల సంఖ్యలో పాఠశాలల ఉన్నాయి. సీఎం ఎన్నిసార్లు రివ్యూ చేశారు. వారికి ఏం ఒరిగింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ పిల్లలు 61.70 లక్షల మంది స్కూళ్లలో చదువుకుంటున్నారు. వాటిల్లోకి సీఎం ఎందుకు పోవడం లేదు? ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీలు, యూనివర్సిటీల్లో వసతుల్లేవు. నియామకాలు లేవు. బడ్జెట్ ప్రకటనే కానీ నిధుల విడుదల ఏదీ? పేదల బిడ్డలు చదివే విశ్వవిద్యాలయాలను పట్టించుకోకుండా ప్రైవేటు యూనివర్సిటీలు ఇచ్చారు. మాటల గారడీతో ప్రజలు ఏడున్నర ఏళ్లుగా మోసపోతున్నారు. ఇలాంటి వాటికి చరమగీతం పాడే రోజులు దగ్గర పడ్డాయి. అది నల్లగొండ నుంచే మొదలైంది. మీరే అపరజ్ఞానులా? సంపద 5 శాతం మంది చేతిలో ఉంటే 95 శాతం మంది పేదలే. 46 మందికి భారతరత్న వస్తే ఒక్కరే ఓబీసీ ఉన్నారు. దళితులు, బహుజనులు లేరు. 52 శాతం మంది ఓబీసీల్లో అర్హులే లేరా. మాకు చేతగాదా.. మీరే అపరజ్ఞానులా. 60 వేల బుక్కులు చదివారా? 11 మంది సీఎంలు అయ్యారు. అందులో పది మంది ఆధిపత్య కులాల వారే. నేను ఏ కులానికి వ్యతిరేకం కాదు. -
అమరవీరుడి కుమార్తెకు అండగా మోహన్‌బాబు
సాక్షి, హైదరాబాద్: భారతసైన్యంలో వీరమరణం పొందిన ఓ హవల్దార్ కుమార్తెకు శ్రీ విద్యానికేతన్ విద్యాసంస్థల చైర్మన్ డా.మోహన్‌బాబు ఉచిత విద్య అందించనున్నారు. చిత్తూరు జిల్లా రెడ్డివారిపల్లి గ్రామానికి చెందిన సీహెచ్ ప్రవీణ్ కుమార్ (36) గతేడాది నవంబరు 8న ఉగ్రవాదులతో జరిగిన ఎదురుకాల్పుల్లో వీరమరణం పొందాడు. ప్రవీణ్‌కుమార్ కుమార్తె సీహెచ్ లోహితకు ఈ విద్యా సంవత్సరం 4వ తరగతి నుంచి ఉచితవిద్య అందించనున్నట్లు మోహన్‌బాబు తెలిపారు. ఈ మేరకు బాధిత కుటుంబాన్ని కలిసి హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా శ్రీ విద్యానికేతన్ విద్యా సంస్థల సీఈవో మంచు విష్ణుకు ప్రవీణ్‌కుమార్ భార్య కృతజ్ఞతలు తెలిపారు. -
300 మందికి అంత్యక్రియలు చేశాడు.. చివరికి
చండీగఢ్: కరోనా వైరస్ బారినపడి ఎంతోమంది అర్ధాంతరంగా తనువు చాలిస్తున్నారు. మయదారి మహమ్మారి ఎన్నో కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తోంది. తాజాగా కరోనాతో కన్నుమూసిన కొన్ని వందలమందికి అంత్యక్రియలు జరిపిన ఓ వ్యక్తి అదే కోవిడ్ సోకి ప్రాణాలు విడిచాడు. ఈ విషాద ఘటన హర్యానాలో చోటుచేసుకుంది. వివరాలు.. 44 ఏళ్ల ప్రవీణ్ కుమార్ హిసార్ మున్సిపల్ కార్పొరేషన్ ఉద్యోగి. కరోనా వైరస్ రోగుల మృతదేహాలను దహనం చేయడానికి మున్సిపాల్ కార్పొరేషన్ ఏర్పాటు చేసిన బృందానికి ప్రవీణ్ అధిపతి. కరోనా వెలుగు చూసినప్పటి నుంచి కోవిడ్‌తో మృత్యువాతపడిన వారి అంత్యక్రియలు నిర్వహిస్తున్నాడు. ఎలాంటి అనుమానం, భయం లేకుండాఇలా దాదాపు 300కుపైగా జరిపాడు. ఈ క్రమంలో ఇటీవల ప్రవీణకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. అయితే ప్రవీణ్ ఆక్సిజన్ స్థాయి పడిపోవడంతో ఆసుపత్రిలో చేర్చారు. దురదృష్టవశాత్తు కోవిడ్ సోకిన రెండు రోజులకే ఆయన సోమవారం రాత్రి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచాడు. ఎంతో మందికి అంతిమ సంస్కారాలు నిర్వహించిన ప్రవీణ్ ఇలా మరణించడం స్థానికులను కలిచివేస్తోంది. ప్రవీణ్ అంత్యక్రియలను కోవిడ్ నిబంధనలు పాటిస్తూ హిసర్ మేయర్ ఆధ్వర్యంలో రిషినగర్లో మంగళవారం జరిపారు. ప్రవీణ్‌కు భార్య, ఇద్దరు పిల్లలున్నారు. ఇతనిది ఉమ్మడి కుటుంబం. దాదాపు అందరూ మున్సిపల్ కార్పొరేషన్లోనే ఉద్యోగం చేస్తున్నారు. చదవండి:Corona: మృతదేహంపై ఆభరణాలు తీసిచ్చినందుకు రూ.14 వేలు -
సమాచార కమిషనర్ పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం
సాక్షి, అమరావతి: ఖాళీగా ఉన్న రాష్ట్ర సమాచార కమిషనర్ పోస్టులు రెండింటిని భర్తీ చేసేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి(జీపీఎం అండ్ ఏఆర్)కె.ప్రవీణ్ కుమార్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. దరఖాస్తులను ఈనెల 23వ తేదీ సాయంత్రం 5గంటలలోగా వ్యక్తిగతంగా గానీ.. రిజిస్టర్ పోస్టులో గానీ పంపించాలని సూచించారు. సెక్రటరీ, ఏపీఐసీ, మొదటి అంతస్తు, ఎంజీఎం క్యాపిటల్ వద్ద, ఎన్ఆర్ఐ వై జంక్షన్, చినకాకాని గ్రామం, మంగళగిరి–522508, గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్ అనే చిరునామాకు చేరేలాగా రిజిస్టర్ పోస్టు పంపాలని కోరారు. మరిన్ని వివరాలకు 8639376125 నంబర్‌ను సంప్రదించాలని సూచించారు. (చదవండి: 32.70 లక్షల మందికి వ్యాక్సిన్) -
జగనన్న చేదోడు పథకాన్ని ప్రారంభించిన మంత్రి
సాక్షి, విజయవాడ: బీసీ శాఖ మంత్రిగా జగనన్న చేదోడు పథకాన్ని ప్రారంభించడానికి అవకాశం రావటం ఆనందంగా ఉందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ పేర్కొన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మానిఫేస్టోలో పెట్టిన ఈ పథకం ఈ రోజు నుంచి అమలు కానుంది. ఈ సందర్భంగా మంగళవారం విజయవాడలో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రితో పాటు ఐఏస్ అధికారి ప్రవీణ్ కమార్లు, ఏపీ నాయి బ్రహ్మణ కార్పొరేషన్ చైర్మన్ ఏనాదయ్యతో పాటు తదితరులు పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో మంత్రి జగనన్న చేదోడు పథకాన్ని ప్రారంభించారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ... అర్హులైన అబ్దిదారులకు అన్ని పథకాలు అందజేస్తామన్నారు. మొదటి విడతగా 2, 57, 040 మందికి ఈ పథకానికి అర్హులుగా గర్తించి వారికి 247.04 కోట్ల రూపాయలు అందిస్తున్నామన్నారు. గత ప్రభుత్వం లాగా తమ ప్రభుత్వం అర్హులైన వారిని తగ్గించమని, జగనన్న చేదోడు పథకం ద్వారా మొదటి విడతలో 2,47,040 మంది లబ్ధి పొందారని చెప్పారు. ఇవాళ 51, 390 మంది లబ్ది చేకూరుతుందని తెలిపారు. ఈ పథకంలో ఎటువంటి సిఫార్సులు లేకుండా కేవలం అర్హులను వెతికి పట్టుకుని మరి వారికి లబ్ది చేకూర్చుమని చెప్పారు. బీసీలను బ్యాక్ వర్డ్ క్లాస్‌గా చూసే రోజుల నుంచి బీసీ అంటే బ్యాక్ బోన్ క్లాస్‌గా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి భావించారు. ఆయన సీఎం అయ్యాక 139 కులాలకు 56 కార్పొరేషన్లను ఏర్పాటు చేసి ముందుకు నడిపూస్తున్నారన్నారు. గడిచిన ప్రభుత్వాలు ఆరోగ్యశ్రీని నిరారోగ్యశ్రీగా మార్చేశారని పేర్కొన్నారు. వైఎస్ జగన్ సీఎం అయ్యాక మళ్ళీ ఆరోగ్యశ్రీని 221 జబ్బులకు వర్తింప చేసి, మన రాష్ట్రాంలోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా ఆరోగ్యశ్రీ అమలయ్యేలా చర్యలు తీసుకున్నారన్నారు. ఇచ్చిన మాట కోసం ఎంత కష్టాన్ని అయిన భరించి సంక్షోభంలో... సంక్షేమం అమలు చేస్తున్న నాయకుడు సీఎం వైఎస్ జగన్ అన్నారు. ఒక గోప్ప ఆశయంతో ఈ రోజు జగనన్న చేదోడు పథకాన్ని ప్రారంభించామని, బలహీన వర్గాలకు నాయకుడిగా సేవ చేసేందుకు తనకు బీసీ మంత్రిగా అవకాశం ఇవ్వడం తన అదృష్టమని మంత్రి పేర్కొన్నారు. అలాగే ఐఏఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ.. రజక, నాయి బ్రాహ్మణులు, దర్జీలకి ఈ పథకం అమలవుతుందని తెలిపారు. ఈ పథకం ద్వారా లబ్ది పొందిన వారికి ఏడాదికి 10 వేల చప్పున 5సంవత్సరాలు 50 వేలు నేరుగా వారి అకౌంట్‌కు జమ అవుతాయన్నారు. 8 కార్పొరేషన్ల ద్వారా 51,390 లబ్ధిదారులకు 51.39 కోట్ల రూపాయలు ప్రభుత్వం ఇస్తుందని చెప్పారు. ఏపీ నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ ఏనాదయ్య మాట్లాడుతూ.. దాదాపు 139 బీసీ సబ్ కులాలకు వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎం అయ్యాక ప్రాధాన్యత వచ్చిందన్నారు. సీఎం జగన్ ముఖ్యమంత్రి అయ్యాక గడిచిన ఏడాదిన్నర కాలంలోనే 90శాతం హామీలు అమలు చేశారని, దేశ చరిత్రలోనే అప్లై చేసిన అర్హులందరికి ఈ పథకం అమలు చేసిన ఘనత సీఎం వైఎస్ జగన్‌ది అన్నారు. తెలియని కులాలను కూడా బయటకి తీసి వారిని చైర్మన్, డైరెక్టర్లుగా నియమించి వారి సమస్యలను పరిష్కరిస్తున్నారని బ్రహ్మణ కార్పొరేషన్ చైర్మన్ పేర్కొన్నారు. -
మార్చి 7, 8న ఘనంగా లేపాక్షి ఉత్సవాలు
సాక్షి, విజయవాడ: రాయలసీమ సంస్కృతి, సంప్రదాయాలను ఇనుమడింపజేసేలా లేపాక్షి సంస్కృతిక ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నామని అనంతపురం కలెక్టర్ గంధం చంద్రుడు వెల్లడించారు. బుధవారం విజయవాడలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయనతో పాటు పర్యాటక శాఖ ఏండీ ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ... మార్చి 7, 8న ఏపీ పర్యాటక శాక అధ్వర్యంలో అనంతపురంలో జిల్లా అధికార యంత్రాంగంతో కలిసి లేపాక్షి ఉత్సావాలను వైభవం నిర్వహిస్తున్నామని తెలిపారు. ఒక్కో ఏడాది ఒక్కో థీమ్‌తో ఉత్సవాలు జరుగుతాయని, ఈ ఏడాది సంస్కృతిని థీమ్‌గా తీసుకున్నామన్నారు. కాగా ఈ ఉత్సవం నిర్వహణకు 15 కమిటీలు ఏర్పాటు చేశామని వెల్లడించారు. బాహ్య ప్రపంచానికి తెలియజేప్పెలా ఈ ఉత్సవాల నిర్వహణ ఉంటుందని, 2018లో లక్షకు పైగా ప్రజలు వచ్చారన్నారు. ఈసారి ఇంకా ఎక్కువ పర్యటకలు వచ్చే అవకాశం ఉన్నట్లు ఆయన అంచన వేస్తున్నామన్నారు. ఈ ఉత్సవాలలో లేజర్ షో, ప్రముఖ గాయకులతో పాటలు, శోభాయాత్ర నిర్వహిస్తున్నామని తెలిపారు. కాగా పర్యాటకులకు ఒక మంచి అనుభూతిని అందించేందుకు ప్రయత్నం చేస్తున్నామన్నారు. రాయలసీమ వైభవాన్ని తెలిపేలా.. గ్రామీణ పర్యటకాన్ని కూడా అభివృద్ధి చేసే ఉద్దేశంతో ముందుకు వెళ్తున్నామన్నారు. అంతేగాక రాయలసీమ ప్రత్యేక వంటకాలను సైతం ఈ ఉత్సవాల్లో ప్రదర్శించనున్నట్లు తెలిపారు. ఇందుకోసం ఉగ్గాని, రాగి సంగటి, నాటుకోడి కూర, గుత్తి వంకాయ వంటి ప్రత్యేక వంటకాలను సిద్ధం చేస్తున్నామన్నారు. ఈ ఉత్సవాల్లో రాయలసీమ వంటకాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయన్నారు. ఇక రాయలసీమ జీవన శైలిని ఉట్టిపడేలా దీన్ని ఏర్పాటు చేస్తున్నామన్నారు. కాగా అత్యంత వైభవంగా నిర్వహించే ఈ లేపాక్షి వైభవములో అందరూ పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. నేను, నాది కాదు.. మనం, మనది! ఇక పర్యటక శాక ఏండీ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రదేశాలను పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. రాయలసీమలోను మంచి పర్యాటక ప్రదేశాలు ఉన్నాయని, వాటి ద్వారా ఇతర ప్రాంతాల వారిని ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. కాగా జిల్లా అధికార యంత్రాంగంతో కలిసి జిల్లాలోని పర్యాటక ప్రాంతాలను గుర్తించామని తెలిపారు. అన్ని జిల్లాల్లోనూ పర్యాటక ప్రాంతాలను గుర్తిస్తూ వస్తున్నామన్నారు. పర్యాటక రంగం మంచి ఆదాయ వనరని, దీని ద్వారా కేరళ మంచి ఆదాయాన్ని సమకూర్చుకుంటోoదన్నారు. ఈ రంగం ద్వారా స్థానికంగా ఉపాధి కల్పించడంతో పాటు ఉపాధి అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయని తెలిపారు. కాగా కరోనా వార్తల నేపథ్యంలో కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు. ఇందుకోసం వైద్య సిబ్బందిని అందుబాటులో ఉండేలా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. -
భారీ కాయమైనా.. చిన్న గాయమైనా కాకుండా..
గజరాజులకు భుజబలమే కాదు. బుద్ధి బలమూ ఎక్కువే అని మరోసారి నిరూపితమైంది. అనాలోచితంగా, అడ్డదిడ్డంగా కాకుండా.. ఓ ఏనుగు స్మార్ట్‌గా ఆలోచించి గమ్యాన్ని చేరింది. మనుషులకు కూడా కష్టమనిపించే పాడుబడ్డ చిన్న మెట్ల మార్గం గుండా పైకి చేరింది. ఎలాంటి అదురూ బెదురూ లేకుండా.. పైకి చేరిన ఏనుగు ఓసారి వెనక్కి తిరిగి చూసుకుంది. ఇక జంతువులకు సంబంధించి విశేషాలను సోషల్ మీడియాలో పంచుకునే ఐఎఫ్ఎస్ అధికారి ప్రవీణ్ కాశ్వాన్ ఈ వీడియోను షేర్ చేయగా వైరల్ అయింది. గజరాజుకు వేరే ఆప్షన్ లేదు. అందుకే కాస్త కష్టమైనా.. మెట్ల దారినే ఎంచుకుంది. అందుబాటులో ఉన్న వనరుల్ని చక్కగా వినియోగించుకోవడంలో ఏనుగుల తర్వాతే ఏదైనా అని ఆయన పేర్కొన్నారు. అవి త్వరగా నేర్చుకోవగలవని రాసుకొచ్చారు. విద్యుత్ ఫెన్సింగ్‌ను దాటుకుని వెళ్లడం, దారికి అడ్డుగా ఉన్న వాటిని తెలివిగా తొలగించడం ఆ కోవలోనివేనని అన్నారు. ఈ వీడియోపై నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపించారు. ‘భారీ కాయమైనా, చిన్న గాయమైనా కాకుండా శిథిలమైన మెట్ల ద్వారా ఏనుగు పైకి చేరింది. తెలివైన జంతువు’అని కొందరు కామెంట్లు చేస్తున్నారు. ‘అడవిలోని జంతువుల స్వేచ్ఛకు భంగం కలగకుండా చేస్తే.. అవి జనావాసాల్లోకి ఎందుకు చొరబడతాయి. అభివృద్ధి అని చెప్పి ఇష్టారీతిన అడవులను నరకడం, నిర్మాణాలు చేపట్టడం మంచిదా..! అని కొందరు ప్రశ్నిస్తున్నారు. -
భుజబలం ఓకే.. బుద్ధి బలమూ చూడండి..!
-
ఆత్మహత్య చేసుకుందామనుకున్నా: ప్రవీణ్ కుమార్
డిప్రెషన్ కారణంగా కొన్ని నెలల క్రితం ఆత్మహత్య చేసుకోవాలని భావించినట్లు టీమిండియా మాజీ బౌలర్ ప్రవీణ్‌కుమార్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. హరిద్వార్ హైవేపై తన లైసెన్డ్స్ రివాల్వర్‌తో షూట్ చేసుకుందామనుకున్నానని, అయితే చిరునవ్వుతో ఉన్న తన పిల్లల ఫోటో చూశాక ధైర్యం రాలేదన్నాడు. ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రవీణ్ ఈ సంచలన విషయాలను బయటపెట్టాడు. టీమిండియాలో చోటు కోల్పోవడంతో పాటు ఐపీఎల్ కాంట్రాక్ట్ ముగియడం వంటి కారణాలతో తాను పూర్తిగా డిప్రెషన్లోకి వెళ్లిపోయానని పేర్కొన్నాడు. ఈ క్రమంలో ఇవన్నీ ఏమిటీ? ఇక జీవితాన్ని ముగిద్దాం అనుకున్నట్లు పేర్కొన్నాడు. ‘కెరీర్ ఆరంభంలో నన్ను అందరూ మెచ్చుకున్నారు. అదేవిధంగా ఇంగ్లండ్ సిరీస్ అనంతరం టెస్టు క్రికెట్‌పై నేను ఎన్నో ఆశలు పెట్టుకున్నా. కానీ అనూహ్యంగా నన్ను జట్టు నుంచి తప్పించారు. మళ్లీ అవకాశాలు ఇవ్వలేదు. అంతేకాకుండా ఐపీఎల్ కాంట్రాక్ట్ ముగిసిపోవడంతో పూర్తిగా నిరాశ చెందాను. డిప్రెషన్‌తో నరకం చూశాను. అయితే డిప్రెషన్‌ను భారత్‌లో ఎవరూ అర్థం చేసుకోరని ఎవరికీ చెప్పలేదు. దీంతో ఇవన్నీ ఏంటి? ఇక జీవితాన్ని ముగిద్దాం? అనుకొని మీరట్ నుంచి హరిద్వార్‌కు నా లైసెన్డ్స్ రివాల్వర్‌తో బయలుదేరాను. జాతీయ రహదారిపై కారును పక్కకు ఆపి గన్‌తో షూట్ చేసుకుందామనుకున్నా. కానీ నవ్వుతున్న నా పిల్లల ఫోటో చూశాక మనసు రాలేదు. ఎందుకంటే నేను చనిపోతే వారు అనాథలవుతారు. నా కారణంగా అమాయకులైన వారు రోడ్డుపై పడతారు. ఇవన్నీ ఆలోచించి నా నిర్ణయం మార్చుకున్నా. ఇప్పుడంతా కూల్. బాగానే ఉన్నాను. ప్రస్తుతం క్రికెట్ కోచింగ్ వైపు అడుగులు వేస్తున్నా’అని ప్రవీణ్ కుమార్ వివరించాడు. కాగా, ప్రవీణ్ 2007 నవంబర్‌లో పాకిస్తాన్‌తో జరిగిన వన్డే మ్యాచ్‌లో అరంగేట్రం చేశాడు. మార్చి 30, 2012లో దక్షిణాఫ్రికాపై తన చివరి మ్యాచ్ ఆడాడు. టీమిండియా తరుపున ఓవరాల్‌గా 6 టెస్టులు, 68 వన్డేలు, 10 టీ20లు ఆడాడు. అన్ని ఫార్మాట్లలో కలిపి112 వికెట్లు తీశాడు. 2018 అక్టోబర్‌లో రిటైర్మెంట్ ప్రకటించాడు. నిజానికి 2012 మార్చిలోనే ప్రవీణ్ టీమిండియా చోటు కోల్పోయాడు. ఇక టీమిండియాలో అవకాశం లభించే చాన్స్ లేకపోవడంతో తను రిటైర్మెంట్ తీసుకున్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. చదవండి: నాపై వారే చేయి చేసుకున్నారు -
నాపై వారే చేయి చేసుకున్నారు: మాజీ క్రికెటర్
మీరట్: తాను తప్పతాగి పక్కంటి వారిపై దాడి చేసినట్లు వస్తున్న వార్తల్లో ఎటువంటి వాస్తవం లేదని టీమిండియా మాజీ పేసర్ ప్రవీణ్ కుమార్ స్పష్టం చేశాడు. తాను ఎప్పుడూ చీమకు కూడా హాని కల్గించనని, మరి అటువంటిది తాగి ఒక అబ్బాయిపై, అతని తండ్రిపై దాడి చేశానంటూ ఫిర్యాదు చేయడం బాధించిందన్నాడు. కాగా, ఆ అబ్బాయి తండ్రి దీపక్ శర్మనే తనపై చేయి చేసుకున్నాడని ప్రవీణ్ కుమార్ పేర్కొన్నాడు. ‘ నేను అంతర్జాతీయ స్థాయిలో క్రికెట్ ఆడా. నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. నేను ఎప్పుడూ కనీసం చీమను కూడా చంపలేదు. అటువంటప్పుడు ఒక అబ్బాయిపై దాడి ఎందుకు చేస్తాను. మా ఇంటికి సమీపంలో ఆ అబ్బాయి, అతని తండ్రి కలిసి నాతో గొడవ పడ్డారు. నేను కారులో ఉన్న సమయంలో వారిద్దరూ నన్ను బయటలాగి మరీ దాడి చేశారు. ఇలా నేను తాగి వారిని కొట్టాననడం అంతా అబద్ధం. నా గొలుసును లాక్కోవడానికి వారు ప్రయత్నించారు. ఇక్కడ స్థానిక రాజకీయాలతో నాపై ఇలా బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. నేను ఎప్పుడూ ఇక్కడ పెద్దగా ఉండను. నాకు రెండు-మూడు ఇళ్లులు న్నాయి. నేను కేవలం ఇక్కడ పెయింట్ వర్క్ ఎలా జరుగుతుందనే చూద్దామనే వచ్చా. చాలామంది ఇతరుల సక్సెస్ చూసి ఓర్వలేరు. నా ఇమేజ్ను డామేజ్ చేయాలని చూశారు’ అంటూ ప్రవీణ్ కుమార్ పేర్కొన్నాడు. టీమిండియా తరఫున మ్యాచ్‌లు ఆడిన ప్రవీణ్ కుమార్ కాస్త దుందుడుగు స్వభావం కలిగిన వాడు. గతంలో కూడా అతడు తప్ప తాగి గొడవ పడిన సంఘటనలు ఉన్నాయి. అతడి క్రికెట్ కెరీర్ మొదట్లో సాఫీగా సాగినా ఫామ్ ను కోల్పోయి టీమిండియాలో స్థానం కోల్పోయాడు. అయితే ప్రవీణ్ కుమార్ ఫుల్లుగా తాగి తన పక్కింట్లో ఉండే వ్యక్తిని, అతడి కొడుకుని కొట్టాడని పిర్యాదు అందటంతో వారిద్దరూ కేసు పెట్టారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. భారత్ తరఫు ఆరు టెస్టులు, 68 వన్డేలు ఆడిన ప్రవీణ్ కుమార్ 104 వికెట్లు తీశాడు. -
కాపురం ఇష్టం లేకే శ్రావణి ఆరోపణలు
లాలాపేట: తనతో కాపురం చేయడం ఇష్టం లేకే శ్రావణి ఆరోపణలు చేస్తోందని, ఏదో ఆశించి ఆమె తన ఇంటి ఎదుట ఆందోళన చేస్తున్నదని శ్రావణి భర్త ప్రవీణ్‌కుమార్ అన్నారు. తనకు న్యాయం చేయాలని కోరుతూ శ్రావణి అనే మహిళ అత్తింటి ఎదుట ఆందోళన చేపట్టిన సంఘటనపై బుధవారం ఆమె భర్త ప్రవీణ్‌కుమార్ తండ్రి రుక్మయ్యతో కలిసి విలేకరులతో మాట్లాడారు. తన తల్లిదండ్రులు శ్రావణిని వేధించారనడం అవాస్తవమన్నారు. పెళ్లయిన ఐదేళ్ల కాలంలో శ్రావణి తనతో కనీసం ఆరు నెలలు కూడా కలిసి ఉండలేదన్నారు. అప్పుడప్పుడు వచ్చి గొడవ పడి తల్లిగారి ఇంటికి వెళ్లేదన్నారు. తాము కలిసి ఉండలేమని భావించి విడాకులు తీసుకోవాలని నిశ్చయించుకున్నట్లు తెలిపాడు. అయినా తన నుంచి మరేదో ఆశించి తరచూ తనపై ఒత్తిడి చేస్తోందన్నారు. శ్రావణికి కోర్టు ద్వారా విడాకుల నోటీసు సైతం పంపించామన్నారు. తన తల్లిదండ్రులపై నిరాధారమైన ఆరోపణలు చేస్తూ తమ కుటుంబాన్ని అప్రతిష్టపాలు చేస్తుందన్నారు. తమ ఇంటి ఎదుట దీక్ష చేస్తున్న శ్రావణిని అక్కడి నుంచి పంపించాలని కోరుతూ లాలాగూడ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. -
కడప పీడీజేకు ఫోన్ చేసి.. దొరికిపోయాడు!
సాక్షి, అమరావతి : కడప జిల్లా ప్రధాన జడ్జిని బురిడీ కొట్టించేందుకు ఓ వ్యక్తి చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది. హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చాగరి ప్రవీణ్‌కుమార్ ప్రిన్సిపల్ సెక్రటరీనంటూ ఓ నిందితుడి సోదరుడు పీడీజేకి ఫోన్ చేశాడు. వెంటనే అప్రమత్తమైన పీడీజే వాస్తవాలు తెలుసుకొని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు సదరు వ్యక్తిని అరెస్టు చేశారు. కడప జిల్లాలోని రాజంపేట కోర్టులో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేసిన సుమిత్రా నాయక్ ఇటీవల ఓ మహిళ నుంచి రూ.5 వేలు లంచం తీసుకుని బద్వేలు కోర్టు జడ్జి రాజశేఖర్ సంతకాన్ని ఫోర్జరీ చేసి ఆమెకు ఓ అఫిడవిట్ ఇచ్చాడు. ఈ సంతకం ఫోర్జరీ అని తేలడంతో రాజశేఖర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సుమిత్రా నాయక్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా ఇటీవల వైఎస్సార్ జిల్లా ప్రధాన జడ్జికి ఓ నెంబర్(9642118188) నుంచి ఫోన్ చేసి.. తాను హైకోర్టు ఏసీజే జస్టిస్ సి.ప్రవీణ్‌కుమార్ పీఎస్ పి.రవీంద్రన్‌ను మాట్లాడుతున్నానని పరిచయం చేసుకున్నాడు. అనంతరం ఫోర్జరీ కేసులో అరెస్ట్ అయిన సుమిత్రా నాయక్‌పై ఎటువంటి చర్యలు తీసుకోవద్దని ఏసీజే చెప్పారని, ఆయన ఆదేశాల మేరకు నడుచుకోవాలని చెప్పాడు. దీంతో పీడీజే స్వయంగా ఏసీజే పేషీకి ఫోన్ చేసి, పేషీలో రవీంద్రన్ పేరుతో ఎవరైనా ఉన్నారా? అని ఆరా తీశారు. ఆ పేరుతో ఎవరూ లేరన్న విషయం తెలుసుకున్న పీడీజే ఈ విషయాన్ని నేరుగా ఏసీజే దృష్టికి తీసుకొచ్చారు. వెంటనే ఈ విషయంపై తగిన చర్యలు తీసుకోవాలని పీడీజేను ఏసీజే ఆదేశించారు. దీంతో పీడీజే ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన పోలీసులు సుమిత్రా నాయక్ సోదరుడే రవీంద్రన్ పేరుతో ఫోన్ చేసినట్లు గుర్తించి అతన్ని అరెస్ట్ చేశారు. -
విద్యార్థినితో రెండోపెళ్లి, మొదటి భార్య ఫిర్యాదు
సాక్షి, అనంతపురం: విద్యాబుద్ధులు నేర్పించాల్సిన గురువే దారి తప్పాడు. పాఠాలు బోధించాల్సిన అధ్యాపకుడు...విద్యార్థినితో ప్రేమ వ్యవహారం నడపడమే కాకుండా ఏకంగా రెండోపెళ్లి చేసుకున్న సంఘటన అనంతపురం జిల్లా కదిరిలో చోటుచేసుకుంది. మొదటి భార్య ఫిర్యాదుతో అయ్యగారి బాగోతం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే కదిరి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఇంగ్లీష్ లెక్చరర్ ప్రవీణ్ కుమార్.. తాను పనిచేసే కళాశాల విద్యార్థిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అయితే అతడికి ఇంతకు ముందే త్రివేణి అనే యువతితో వివాహం అయ్యింది. అంతేకాకుండా ఆమెను కూడా ప్రేమించే పెళ్లి చేసుకున్నాడు. తనకు వివాహం అయిన విషయాన్ని దాచిపెట్టి రెండోపెళ్లి చేసుకున్న ప్రవీణ్‌కుమార్‌పై మొదటి భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. ముగ్గురు ఏపీఆర్ఎస్ విద్యార్థులపై కేసు.. మరోవైపు విద్యార్థి పట్ల అసభ్యంగా ప్రవర్తించడమే కాకుండా లైంగిక దాడికి యత్నించడం, సహకరించకపోవడంతో ఇష్టారాజ్యంగా చితకబాదిన ఘటన మండలంలోని కొడిగెనహళ్లి ఏపీఆర్ఎస్ ఎక్సలెంట్‌లో ఆలస్యంగా వెలుగుచూసిన విషయం తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి ముగ్గురు విద్యార్థులను పాఠశాల నుంచి సస్పెండ్ చేశారు. కాగా గత ఆగస్టు 15న పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు నలుగురు ఒకే రూంలో ఉన్నారు. ఆ రోజు రాత్రి బాగా పొద్దుపోయాక సహ విద్యార్థిపై మరో ముగ్గురు విద్యార్థులు లైంగిక దాడికి యత్నించారు. ఆ సమయంలో విద్యార్థి అరవకుండా నోట్లో గుడ్డ కుక్కారు. ఎంతకీ సహకరించకపోవడంతో చితకబాదారు. మరుసటి రోజు హౌస్ ఇన్చార్జ్ సుకన్యకు బాధిత విద్యార్థి విషయం తెలపడంతో వెంటనే హిందూపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. విషయాన్ని నిర్వాహకులు గోప్యంగా ఉంచారు. అయితే పాఠశాల ప్రిన్సిపాల్ వాసుదేవరెడ్డి గత ఆదివారం రాత్రి బాధిత, బాధ్యులైన విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశం నిర్వహించారు. బాధ్యులైన ముగ్గురు విద్యార్థులకు టీసీలు ఇచ్చేందుకు సిద్ధపడగా, అందుకు తల్లిదండ్రులు ఒప్పుకోకపోవడంతో, బాధిత విద్యార్థి తండ్రి పోలీసులకు ఫిర్యాదుకు సిద్ధం అయ్యాడు. అయితే రాజీ నేపథ్యంలో క్రమశిక్షణా చర్యల్లో భాగంగా ప్రిన్సిపాల్ వాసుదేవరెడ్డి బాధ్యులైన విద్యార్థులను సస్పెండ్ చేసినట్లు ప్రకటించి 16న రాత్రి విద్యార్థులను వారి తల్లిదండ్రులతో పాటు పంపించేశారు. విద్యార్థులపై కేసు నమోదు అయితే ఈ విషయం ఆనోటా ఈనోటా పోలీసుల దృష్టికి వెళ్లింది. ఘటనను తీవ్రంగా పరిగణించిన పోలీసులు బాధిత విద్యార్థి తండ్రిని పిలిపించి విచారణ చేపట్టారు. లైంగికంగా వేధించడమే కాకుండా అందుకు సహకరించలేదని చితకబాదిన ఆరోపణలపై ప్రాథమిక విచారణ అనంతరం పరిగి పోలీసులు రంగంలోకి దిగారు. బాధ్యులైన ముగ్గురు విద్యార్థులను జే–1, జే–2, జే–3గా పరిగణించి బాధిత విద్యార్థి తండ్రి ఫిర్యాదు మేరకు కేసును నమోదు చేశారు. -
గవర్నర్‌గా విశ్వభూషణ్ ప్రమాణ స్వీకారం
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ కొత్త గవర్నర్‌గా విశ్వభూషణ్ హరిచందన్ బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. విజయవాడలోని రాజ్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో ఆయనతో రాష్ట్ర హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చాగరి ప్రవీణ్‌కుమార్ ప్రమాణ స్వీకారం చేయించారు. బుధవారం ఉదయం 11.29 గంటలకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డితో కలసి విశ్వభూషణ్ కార్యక్రమ వేదికపైకి వచ్చారు. నూతన గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్‌తో హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చాగరి ప్రవీణ్ కుమార్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆ వెంటనే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం.. రాష్ట్ర గవర్నర్‌గా విశ్వభూషణ్ హరిచందన్‌ను నియమిస్తూ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఈ నెల 16న జారీ చేసిన ఉత్తర్వును చదివి వినిపించి, ప్రమాణస్వీకారం చేయాల్సిందిగా ఆయన్ను ఆహ్వానించారు. సరిగ్గా 11.30 గంటలకు జస్టిస్ ప్రవీణ్‌కుమార్.. హరిచందన్‌తో పదవీ ప్రమాణం చేయించారు. గవర్నర్ దేవుని సాక్షిగా ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ సతీమణి సుప్రభ హరిచందన్ కూడా పాల్గొన్నారు. ఇప్పటి వరకు రెండు తెలుగు రాష్ట్రాలకు గవర్నర్‌గా ఈఎస్ఎల్ నరసింహన్ బాధ్యతలు నిర్వహించడం తెలిసిందే. ఇప్పుడు హరిచందన్ పదవీ ప్రమాణంతో రాష్ట్ర విభజన తరువాత ఆంధ్రప్రదేశ్‌కు పూర్తి స్థాయి గవర్నర్ బాధ్యతలు చేపట్టినట్టయింది. నూతన గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్‌తో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, ఆయన మంత్రివర్గ సహచరుల గ్రూప్ ఫొటో కన్నుల పండువగా సాగిన కార్యక్రమం.. రాష్ట్ర విభజన తరువాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నియమితులైన తొలి గవర్నర్ కావడంతో విశ్వభూషణ్ పదవీ ప్రమాణ స్వీకార కార్యక్రమం రాజ్‌భవన్‌లో కన్నుల పండువగా సాగింది. ప్రాంగణమంతటినీ రంగురంగుల పూలతో అలంకరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం, శాసనమండలి చైర్మన్ ఎం.ఏ.షరీఫ్ గవర్నర్‌కు పుష్పగుచ్ఛాలు అందజేసి అభినందనలు తెలిపారు. శాసనసభ ఉప సభాపతి కోన రఘుపతి, ప్రతిపక్ష నేత ఎన్.చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రులు కళత్తూరు నారాయణస్వామి, పిల్లి సుభాష్‌చంద్రబోస్, ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్, అంజాద్ బాష, పాముల పుష్పశ్రీవాణి, మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్, మేకతోటి సుచరిత, బొత్స సత్యనారాయణ, కొడాలి నాని, పేర్ని నాని, అనిల్‌కుమార్ యాదవ్, మోపిదేవి వెంకటరమణ, ఆదిమూలపు సురేష్, చెరుకువాడ రంగనాథరాజు, తానేటి వనిత, వెలంపల్లి శ్రీనివాస్, మేకపాటి గౌతమ్‌రెడ్డి, ధర్మాన కృష్ణదాస్, అవంతి శ్రీనివాస్, బాలినేని శ్రీనివాసరెడ్డి, పినిపె విశ్వరూప్, ఎం.శంకరనారాయణ్, శాసనమండలిలో ప్రభుత్వ చీఫ్ విప్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, తుడా చైర్మన్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, గవర్నర్ కార్యదర్శి ఎం.కె.మీనా, డీజీపీ గౌతమ్ సవాంగ్, జీఏడీ ప్రిన్సిపల్ కార్యదర్శి ఆర్పీ సిసోడియా, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు శామ్యూల్‌తో సహా పలువురు సీనియర్ అధికారులు, ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ తరువాత జరిగిన తేనీటి విందులో గవర్నర్‌తో సహా ఆహూతులందరూ పాల్గొన్నారు. అంతకుముందు రాష్ట్ర గవర్నర్, ముఖ్యమంత్రి, మంత్రులందరితో కలిసి రాజ్‌భవన్ ప్రాంగణంలో గ్రూప్ ఫొటో దిగారు. రాజకీయ దిగ్గజం.. విశ్వభూషణ్ హరిచందన్ ఒడిశాకు చెందిన ప్రముఖ రాజకీయవేత్త. ఒకప్పటి బన్పూర్ రాజవంశానికి చెందినవారు. ఆయన పూర్వీకులు కుర్దా జిల్లాలోని భటపడా గఢ్‌కు పాలకులుగా ఉన్నారు. హరిచందన్ 1934, ఆగస్టు 3న పరశురామ్ దంపతులకు జన్మించారు. విద్యార్థి దశ నుంచే చురుగ్గా వ్యవహరించేవారు. కళాశాల రోజుల్లో క్రీడాకారుడిగా, మంచి వక్తగా పేరు గడించడమేగాక విద్యార్థుల సమస్యల పరిష్కారానికి పోరాడారు. పూరీ కళాశాల నుంచి ఎకనామిక్స్(ఆనర్స్) పట్టాను, కటక్ ఎమ్మెస్ లా కళాశాల నుంచి ఎల్ఎల్బీ డిగ్రీని పొందారు. ఒడిశా హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీసు చేశారు. 1971లో భారతీయ జనసంఘ్‌లో చేరి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తూ 1977లో జాతీయ కౌన్సిల్ సభ్యులయ్యారు. 1980లో బీజేపీకి వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడిగాను, జాతీయ ఎగ్జిక్యూటివ్ సభ్యుడిగాను పనిచేశారు. మానవ హక్కుల పరిరక్షణ కోసం, స్వేచ్ఛకోసం రాజీలేని పోరాటాలు చేశారు. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడి 1975లో జైలుకెళ్లారు. ఒడిశా హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా కూడా ఉన్నారు. జయప్రకాష్ నారాయణ్ సంపూర్ణ విప్లవంలో యువనేతగా కీలక పాత్ర పోషించారు. ఉత్తేజపూరిత ప్రసంగాలు చేయడంలో దిట్ట అయిన హరిచందన్ 1977లో ఇందిరాగాంధీ పాలనకు వ్యతిరేకంగా రాష్ట్రమంతటా తిరిగి ప్రచారం చేశారు. 1977లో ఛిల్కా నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఒడిశా ప్రభుత్వంలో న్యాయ, ఆహార, పౌరసరఫరాలు, కార్మిక, ఉపాధి, గృహ నిర్మాణ, సాంస్కృతిక శాఖల మంత్రిగా వ్యవహరించారు. 1990లో బిజూ పట్నాయక్ మంత్రివర్గంలో ఆహార, పౌరసరఫరాల మంత్రిగా ఉన్నారు. 1996లో భువనేశ్వర్ నియోజకవర్గం నుంచి అసెంబ్లీ ఉప ఎన్నికలో గెలుపొంది బీజేపీ శాసనసభాపక్ష నేతగా పనిచేశారు. మళ్లీ 2000 సంవత్సరంలో 97,536 ఓట్ల భారీ ఆధిక్యతతో అదే నియోజకవర్గం నుంచి గెలుపొందారు. బీజేపీ–బీజేడీ ప్రభుత్వంలో రెవెన్యూ, న్యాయ శాఖల మంత్రిగా పనిచేశారు. 2004లోనూ తిరిగి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఒడిశా రాష్ట్రం కోసం, ఒడిశా ప్రజల కోసం రాజీలేని పోరాటాలు చేసిన హరిచందన్ రాష్ట్రంలో ప్రముఖ కాలమిస్ట్‌గానూ పేరుపొందారు. అనేక అంశాలపై వివిధ పత్రికల్లో వ్యాసాలు రాశారు. -
పల్లె నుంచి అమెరికాకు..
సాక్షి, సూర్యాపేట : అతి సామాన్య రైతు కుటుంబంలో పుట్టి గురుకుల విద్యాసంస్థలో విద్యాబుద్దులు నేర్చుకోని అమెరికాలోని ఇలినోయ్ రాష్ట్రంలోని కాలేజ్ ఆఫ్ డుఫేజ్‌లో వ్యవసాయ ఇంటర్న్‌షిప్ చేసేందుకు ఎంపికైంది. సూర్యాపేట మండలం బాలెంల గ్రామ సమీపంలో గల తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల డిగ్రీ కళాశాల విద్యార్థిని బొల్లేద్దు ఉదయభాను. నల్గొండ జిల్లా కేంద్రానికి చెందిన బొల్లేద్దు హనుమంతు, అం డాలు అతి సామాన్య రైతు కుటుబం. వ్యవసాయ కూలీలుగా పని చేస్తూ జీవనం కొనసాగిస్తున్న వారికి మూడో సంతానం బొల్లేద్దు ఉదయభాను. 1 నుంచి 5వ తరగతి వరకు నల్గొండ జిల్లా కేంద్రంలోని లిటిల్ ఫ్లవర్ పాఠశాలలో విద్యనభ్యసించింది. తదుపరి ఇమాంపేట గురుకుల పాఠశాలలో 6 నుంచి 10వ తరగతి వరకు విద్యనభ్యసించింది. ఇంటర్ హైదరాబాద్‌లోని గౌలిదొడ్డి గురుకుల కళాశాలలో పూర్తి చేసింది. ప్రస్తుతం బాలెంల గ్రామ సమీపంలో గల గురుకుల మహిళా డిగ్రీ కళా శాలలో ఎంజెడ్సీ ప్రథమ సంవత్సరం పూర్తి చేసింది. మొదటి నుంచి చదువులో ముందంజలో ఉండే ఉదయభాను వ్యవసాయంపై సంవత్సరం పాటు అమెరికాలో నిర్వహించే ఇంటర్న్‌షిప్‌కు ఎంపిక కావడం పట్ల తోటి విద్యార్థులు, కళాశాల అధ్యాపక బృందం హర్షం వ్యక్తం చేస్తూ ఉదయభానుకు అభినందనలు తెలుపుతున్నారు. వ్యవసాయంలో నవీన మార్పులు.. వ్యవసాయం గూర్చి సంవత్సరం పాటు అమెరికాలో ఇంటర్న్‌షిప్ పూర్తి చేసి తిరిగి ఇండియాకు వచ్చాక అక్కడ వ్యవసాయంలో నేర్చుకున్న నైపుణ్యాలను తన తల్లిదండ్రుల ఆశయాల మేరకు సమాజ సేవలో భాగస్వామ్యం కావాలని తనకు ఉందని ఉదయభాను పేర్కొంది. దేశంలోని రైతులకు నవీనమైన వ్యవసాయ మెలుకువలు వివరించి పంట దిగుబడి పెంచి వ్యవసాయదారుల ఆర్థిక ఇబ్బందులను దూరం చేయాలనే తన ఉద్ధేశమని ఉదయభాను చెప్పారు. అతి సామాన్య రైతు కుంటుంబంలో పుట్టిన తాను వ్యవసాయరంగంలో మార్పులు తెచ్చేందుకు తన వంతుగా కృషి చేయాలనే లక్ష్యంతో వ్యవసాయరంగాన్ని ఎంచుకున్నట్లు తెలిపింది. అదే విధంగా అమెరికా నుంచి వచ్చాక ఎమ్మెస్సీ అగ్రికల్చర్ పూర్తి చేసిన తన సోదరితో కలిసి వ్యవసాయ రంగంలో పరిశోధన చేస్తూ తక్కువ నీటి వనరులతో, చీడపీడలను ఎదుర్కొని అధిక దిగుబడులను ఇచ్చే స్వల్పకాలిక వంగడాల సృష్టికి కృషి చేస్తానని వెల్లడించింది . తాను అమెరికా వెళ్లేందుకు అవకాశం కల్పించిన టీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్ కార్యదర్శి ప్రవీణ్‌కుమార్, కళాశాల ప్రిన్సిపాల్ వెంకటయ్యకు ధన్యవాదాలు చెబుతున్నట్లు ఉదయభాను తెలిపారు. ఎంపిక ఎలా యూనైటేడ్ స్టేట్స్ అమెరికా ప్రభుత్వం నిర్వహించిన కమ్యూనిటీ కాలేజ్ ఇనుస్ట్యూట్ ప్రొగ్రాంకు తెలంగాణలోని 30 సాంఘిక సంక్షేమ మహిళా డిగ్రీ కళాశాలల నుంచి విద్యార్తినులు పోటీ పడగా సూర్యాపేట ప్రాంతం నుంచి ఉదయభాను ఎంపికైంది. ఎనిమిది నెలలుగా జరుగుతున్న వివిధ పరీక్షల్లో నెగ్గుతూ వచ్చింది. ఈ ఎంపిక ప్రక్రియలో టీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐ సంస్థ రెండు స్క్రీనింగ్ పరీక్షలను నిర్వహించగా పరీక్షలో ఉదయభాను నెగ్గింది. తదుపరి మౌఖిక పరీక్షలు, గ్రూప్ డిస్కషన్ నిర్వహించారు. అనంతరం సీసీఐపీ అప్లికేషన్ ద్వారా ఇంగ్లీష్ రాత పరీక్షలో ఎంపికై యూఎస్ కౌన్సిలేట్లో సెకండ్‌లెవల్ ఇంటర్వ్యూలో నెగ్గి మూడో లెవల్లో టోఫెల్ పరీక్షలో ఉత్తీర్ణత పొందిన అనంతరం పాస్‌ఫోర్ట్, వీసా పొందింది. ఈ నెల 16న అమెరికాకు వెళ్లేందుకు ఉదయభాను ఇప్పటికే సిద్ధమైంది. ఇటీవల గురుకుల విద్యాసంస్థల కార్యదర్శి ప్రవీణ్‌కుమార్‌ను ఉదయభాను హైదరబాద్‌లో కలవడంతో ఉదయభాను అభినందించి స్వీట్ తినిపించారు. -
గ్రామీణ బ్యాంకుల్లో మేమే నెంబర్‌వన్!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశంలోని గ్రామీణ బ్యాంకులన్నింటిలో మిగులు నిధులు, ఆపరేటింగ్ ప్రాఫిట్ పరంగా టాప్‌లో ఉన్నామని ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ చైర్మన్ ప్రవీణ్‌కుమార్ చెప్పారు. బ్యాంకు వద్ద రూ.2286 కోట్ల మిగులు నిధులున్నాయని, నిర్వహణ లాభం 16 శాతం వృద్దితో రూ. 958 కోట్లకు చేరిందని చెప్పారాయన. ఎస్బీఐ ప్రాయోజిత 16 ఆర్ఆర్బీల మొత్తం వ్యాపారంలో తమ వాటా 20 శాతమని తెలిపారు. గతంలో ఐపీఓకి వచ్చే ఆలోచన చేశామని, రాష్ట్ర విభజనానంతరం తలెత్తిన సాంకేతిక సమస్యల వల్ల ఆగిపోయామని, ఇప్పట్లో ఐపీఓకి వచ్చే ఆలోచన లేదని చెప్పారు. 2018–19 ఆర్థిక సంవత్సరానికి బ్యాంకు ఆర్థిక ఫలితాలను ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా ‘సాక్షి’ బిజినెస్ బ్యూరో ప్రతినిధితో ఆయన ప్రత్యేకంగా మాట్లాడారు. గ్రామీణ బ్యాంకుల విలీనంపై... రాష్ట్రానికి ఒకటి లేదా రెండు గ్రామీణ బ్యాంకులే ఉండాలన్న కేంద్ర ఆలోచనకు అనుగుణంగా ఏపీలో గరిష్టంగా రెండు గ్రామీణ బ్యాంకులుంటాయి. చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకు, సప్తగిరి గ్రామీణ బ్యాంకులను ఏపీజీవీబీ, ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకుల్లో విలీనం చేస్తారు. రాష్ట్ర విభజనానంతరం తలెత్తిన సమస్యలను కేంద్రం పరిష్కరించాక విలీన ప్రక్రియ ఉంటుంది. ఇది వచ్చే సెప్టెంబర్ నాటికి పూర్తి కావచ్చు. ప్రస్తుతం బ్యాంకు తెలంగాణలో 5 జిల్లాలు, ఏపీలో 3 జిల్లాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. విలీనంలో భాగంగా తెలంగాణలో శాఖలను తెలంగాణ గ్రామీణ బ్యాంకుతో కలిపే అవకాశముంది. దేశంలో 190 ఆర్ఆర్బీలుండగా అవి ప్రస్తుతం 45కు తగ్గాయి. స్మాల్ ఫైనాన్స్, ప్రైవేట్ బ్యాంకులతో భయం లేదు మేం గ్రామాల్లోకి చొచ్చుకుపోయినట్లు స్మాల్‌ఫైనాన్స్ బ్యాంకులు, ప్రైవేట్ బ్యాంకులు విస్తరించలేదు. అందువల్ల మా వ్యాపారంపై వాటి ప్రభావం ఉండదు. వ్యాపార పరంగా రుణాలు, డిపాజిట్ల విషయంలో చిన్న ఫైనాన్స్ బ్యాంకులకు కొన్ని పరిమితులున్నాయి. అందుకని మాతో ఇవి ఇప్పట్లో పోటీ పడలేవు. మాతృ బ్యాంకులో విలీనం ఉండదు ఏపీజీవీబీలో రెండు రాష్ట్రాల ప్రభుత్వాలకూ 15 శాతం వాటా ఉంది. 50 శాతం కేంద్రానికి, 35 శాతం ఎస్బీఐకి ఉంది. గ్రామీణ బ్యాంకులను మాతృ బ్యాంకుల్లో విలీనం చేసే ఆలోచన లేదు. అలా చేస్తే గ్రామీణ ప్రాంతాల్లో రుణ వృద్ధికి తీవ్ర విఘాతం కలుగుతుంది. స్థానిక రూరల్ బ్యాంకులతో విలీనానంతరం ఏపీజీవీబీ పూర్తిగా ఏపీకే పరిమితమవుతుంది. ప్రస్తుతం బ్యాంకు వ్యాపార విలువ రూ.32వేల కోట్లు కాగా దీన్లో రూ.22వేల కోట్లు తెలంగాణ వాటా. మిగతాది ఏపీది. విలీనానంతరం బ్యాంకు వ్యాపారం రూ.34 వేల కోట్లకు చేరవచ్చని అంచనా. గతేడాది మేం 17 శాతం రుణ వృద్ధి సాధించాం. ఈ ఏడాది 22 శాతాన్ని లకి‡్ష్యస్తున్నాం.మాకు ఎన్పీఏ సమస్య చాలా తక్కువ. ఉన్న కాస్త ఎన్పీఏలు కూడా ఎస్‌హెచ్‌జీలు, వ్యవసాయ రుణాల్లోనే ఉన్నాయి. 2018–19లో నికరలాభం రూ. 112 కోట్లు గత ఆర్థిక సంవత్సరానికి ఏపీజీవీబీ నికరలాభం రూ.112.04 కోట్లకు చేరింది. అంతకు ముందటేడాది సాధించిన రూ.503 కోట్లతో పోలిస్తే దాదాపు 80 శాతం క్షీణించింది. కేంద్ర ఆదేశాలకు అనుగుణంగా పెన్షన్ కేటాయింపులు జరపాల్సి రావడంతో నికరలాభం క్షీణించిందని ప్రవీణ్ కుమార్ వివరించారు. 2018–19 సంవత్సరానికి పెన్షన్ల కోసం రూ. 837 కోట్లు కేటాయించామన్నారు. ఇవి లేకుంటే నికరలాభం రూ.596 కోట్లుండేదని, గ్రామీణ బ్యాంకులన్నింటిలో టాప్‌లో ఉండేవారమని చెప్పారు. 2018–19 సంవత్సరానికి బ్యాంకు వ్యాపారం 14.19 శాతం పెరిగి రూ. 32714 కోట్లకు చేరగా... డిపాజిట్లు 12 శాతం పెరుగుదలతో రూ. 14333 కోట్లకు చేరాయి. మొత్తం రుణ పోర్టుఫోలియోలో సాగు రంగం వాటా 92.68 శాతం. స్థూల ఎన్పీఏలు 1.36 శాతం నుంచి 1.14 శాతానికి దిగిరాగా, నికర ఎన్పీఏలు 0.20 శాతం నుంచి 0.34 శాతానికి పెరిగాయి. -
అన్నదాత.. ఆక్వా జిల్లాకు రెండు కళ్లు
ఆకివీడు: వ్యవసాయం, ఆక్వా రంగాలు జిల్లాకు రెండు కళ్లులాంటివని, వాటి అభివృద్ధికి తగిన ప్రణాళికలు రూపొందిస్తామని కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ చెప్పారు. మండలంలోని చినకాపవరం, రామయ్యగూడెం ప్రాంతాల్లోని ఆక్వా చెరువులను గురువారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా విలేకర్లతో మాట్లాడుతూ జిల్లాలో ప్రధాన వనరులుగా ఉన్న వ్యవసాయం, ఆక్వా రంగాన్ని అభివద్ధి చేసినప్పుడే జిల్లా ప్రగతి పథంలో ముందుకు వెళుతోందని అన్నారు. పారిశ్రామికంగా జిల్లా అంతగా అభివృద్ధి చెందలేదన్నారు. వరి రైతులు పడుతున్న ఇబ్బందుల్ని పరిశీలించి పరిష్కరిస్తున్నామన్నారు. ధాన్యానికి మద్దతు ధర లభించేందుకు, ధాన్యాన్ని కొనుగోలు చేసేలా చర్యలు తీసుకున్నామన్నారు. ఆక్వా సాగులోని ఇబ్బందులను రైతులు, రైతు సంఘాల ప్రతినిధులు తనదృíష్టికి తీసుకువచ్చారని తులిపారు. జిల్లాలో 67,518 హెక్టార్లలో ఆక్వా చెరువులున్నాయని, దీనిలో 21 వేల హెక్టార్లలో రొయ్యల సాగు చేస్తున్నారన్నారు. చేపల సాగులో మేత, ఇతరత్రా వినియోగంలో అధిక వ్యయం తగ్గించుకునేందుకు రైతులకు అవగాహన కల్పిస్తామని చెప్పారు. రొయ్యల సాగు తీవ్ర ఒడిదుడుకుల్లో ఉందని రైతులు చెబుతున్నారన్నారు. నష్టం అపారంగా ఉంటుందని, లాభాలు వస్తే అంతంత మాత్రమేనని రొయ్య రైతులు తెలిపారన్నారు. రొయ్యల ధరను సిండికేట్‌గా ఏర్పడి వ్యాపారులు తగ్గిస్తున్నారనే వాదనను క్షుణ్ణంగా పరిశీలిస్తామన్నారు. రైయ్య రైతులకు కోల్డ్ స్టోరేజ్‌లు, ప్రాసెసింగ్ యూనిట్లు తదితర సమ్యలున్నాయని చెప్పారు. వాటి పరిష్కారానికి ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామన్నారు. జిల్లాకు ప్రధాన ఆదాయం వనరుగా ఉన్న ఆక్వా రంగాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ధాన్యానికి «మద్దతు ధర ప్రకటించినట్లుగా రొయ్యలు, చేపల ధరలు ప్రభుత్వం ప్రకటించకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని రైతులు చెప్పారని కలెక్టర్ తెలిపారు. ఆక్వా జోన్ల ఏర్పాటుకు సన్నాహాలు జిల్లాలో ఆక్వా జోన్ల ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నట్టు కలెక్టర్ చెప్పారు. ఆక్వా అభివృద్ధి జరిగితే జిల్లాలో తలసరి ఆదాయం పెరుగుతుందన్నారు. వరి రైతులకు ఇబ్బంది లేకుండా ఆక్వా రంగాన్ని ప్రోత్సహిస్తామన్నారు. కొత్తగా చెరువులు తవ్వేందుకు అనుమతులను జిల్లా స్టీరింగ్ కమిటీ సమావేశాల ద్వారా మంజూరు చేస్తామన్నారు. రొయ్య రైతుల్ని ఆదుకోవాలి రొయ్య రైతుల్ని ఆదుకోవాలని, ప్రాసెసింగ్ యూనిట్లు, కోల్డ్ స్టోరేజ్‌ల నిర్మాణానికి అనుమతులు ఇవ్వాలని జాతీయ రొయ్య రైతుల సమాఖ్య అధ్యక్షుడు ఇందుకూరి మోహనరాజు, రొయ్య రైతుల సంఘం జిల్లా అధ్యక్షుడు వేగేశ్న సత్యనారాయణరాజు కలెక్టర్‌కు విజ్ఞప్తి చేశారు. పంట చేతికి అందేంత వరకూ నమ్మకం లేదని, 20 నుండి 40 శాతం పంట వైరస్‌కు గురవుతుందని చెప్పారు. కౌంటింగ్ ఉన్న రొయ్యకు ధర లభించడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు.ఆక్వా రైతు, వైఎస్సార్ సీపీ నాయకుడు వేగేశ్న వెంకట్రాజు(యండగండి శ్రీను) మాట్లాడుతూ రొయ్యల ధర నికరంగా ఉండేలా చర్యలు తీసుకోవలని విజ్ఞప్తి చేశారు. కలెక్టర్ వెంట ఆక్వా రైతులు, వైఎస్సార్ సీపీ నాయకులు గొట్టుముక్కల సూర్యనారాయణరాజు(సూరిబాబు), అల్లూరి తమ్మిరాజు, ఇందుకూరి సూర్యనారాయణరాజు, అల్లూరి సత్యనారాయణరాజు, మత్స్యశాఖ జేడీ ఎస్.అంజలి, డీడీ తిరపతయ్య, ఏడీ చాంద్ బాషా, నరసాపురం ఆర్డీఓ సలీం ఖాన్, ఎఫ్డీఓ మంగారావు ఉన్నారు. -
ప్రవీణ్ సేన సర్వసన్నద్ధం
పశ్చిమగోదావరి, ఏలూరు (మెట్రో): వేసవికి ముందే వేడి మొదలైంది. కొద్దిరోజుల్లో సార్వత్రికఎన్నికల షెడ్యూల్ విడుదల కానుంది. దీంతో రాజకీయంగా హడావుడి మొదలైంది. పాలనపరంగానూ వేడి రాజుకుంది. అధికార యంత్రాంగం పూర్తిగా ఎన్నికలకు సన్నద్ధమవుతోంది. నిన్నమొన్నటి వరకూ ప్రభుత్వ కార్యక్రమాలు, అభివృద్ధి పనులంటూ సమీక్షలు, సమావేశాలు, క్షేత్రస్థాయి పర్యటనల్లో బిజీగా గడిపిన అధికారులు ఒక్కసారిగా ఎన్నికల ప్రక్రియలో నిమగ్నమయ్యారు. జిల్లాలోని ఏలూరు, నర్సాపురం లోక్‌సభ స్థానాలతో సహా 15 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో అధికారయంత్రాంగం శరవేగంగా దూసుకుపోతోంది. ప్రారంభమైన ఏర్పాట్లు ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ముందే కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘాలు జిల్లాల అధికారులతో తరచూ వీడియోకాన్ఫరెన్స్, సమీక్షలు నిర్వహిస్తున్నాయి. స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత ఎన్నికల నిర్వహణకు పక్కాగా ఏర్పాట్లు చేపట్టాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాయి. శాంతిభధ్రతల విషయంలో అప్రమత్తం గా ఉండాలని సూచించాయి. దీంతో నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించేందుకు వీలుగా అధికారుల బదిలీలూ ప్రారంభమయ్యాయి. పోలీసు, రెవెన్యూ శాఖల్లో బదిలీలు ఇప్పటికే పూర్తయ్యాయి. పోలింగ్ కేంద్రాల తనిఖీ జిల్లాలో ఎన్నికల ప్రక్రియ సజావుగా నిర్వహించేందుకు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ సన్నద్ధమయ్యారు. ఇప్పటికే జిల్లాలోని 3,411 పోలింగ్ కేంద్రాల తనిఖీకి చర్యలు తీసుకున్నారు. వీవీప్యాట్లు, ఈవీఎంలు భద్రపరిచే గోదామును సోమవారం పరిశీలించారు. పోలింగ్ కేంద్రాల వారీగా సమస్త సమచారాన్ని నివేదికల రూపంలో సిద్ధం చేస్తున్నారు. పోలింగ్ కేంద్రాల్లో మౌలిక వసతులతోసహా సాంకేతిక సౌకర్యాల కల్పనపై నివేదికలు సిద్ధం చేశారు. ఇదే సమయంలో గత ఎన్నికలలో చోటు చేసుకున్న ఘటనలు, కేసులు, రాజకీయ నేతల పాత్రపై ఇప్పటికే పూర్తిస్థాయిలో సమాచారాన్ని పోలీస్, రెవెన్యూ అధికారులతో కలిసి రూపొందిస్తున్నారు. ఇదే నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీలతో జిల్లా రెవెన్యూ అధికారి, జాయింట్ కలెక్టర్ పలుమార్లు సమావేశమయ్యారు. అదనపు అధికారుల నియామకం ఎన్నికల నిర్వహణకు జిల్లాను జోన్లు, రూట్లుగా విభజించి అధికారులను నియమించేందుకు ఏర్పాట్లు చేశారు. ఎన్నికల నియమావళి అమలు, పోస్టల్ బ్యాలెట్లు, సెక్టోరల్, జోనల్ అధికారులు, వ్యయ పరిశీలకులు, వీడియో వ్యూయింగ్, తనిఖీ బృందాలు, కంట్రోల్ రూములు, ఎంసీఎంసీ కమిటీ, ఈవీఎంల నిర్వహణ వంటి 27 రకాల పనుల కోసం, 16 మంది నోడల్ అధికారులను జిల్లాస్థాయిలో నియమించేందుకు అంచనా రూపొందించారు. జిల్లాలోని పోలింగ్ కేంద్రాల్లో విధులు నిర్వహించేందుకు 25వేల మంది ఎన్నికల సిబ్బంది అవసరమని అంచనావేశారు. ఈ మేరకు అధికారులు జాబితాను సిద్ధం చేశారు. జిల్లాలో ఇలా .. ఓటర్లు : 30,57,922 జిల్లా జనాభా : 42,83,945 పోలింగ్స్టేషన్లు : 3,411 అసెంబ్లీ స్థానాలు : 15 లోక్‌సభ స్థానాలు : 2 అవసరతలు ఇలా.. ఎన్నికలకునోడల్ అధికారులు : 16మంది ఎన్నికల సిబ్బంది : 25వేల మంది బ్యాలెట్ యూనిట్లు (ఈవీఎం) : 10,916 వీవీప్యాట్లు : 8,341 -
బ్యాట్స్‌మెన్ వైఫల్యానికి అదే కారణం!
వెల్లింగ్టన్: వరుస మూడు వన్డేల్లో ఘన విజయం సాధించి న్యూజిలాండ్ గడ్డపై చరిత్ర సృష్టించిన టీమిండియా.. అనూహ్యంగా నాలుగో వన్డేలో ఘోరపరాభావాన్ని చవిచూసింది. బ్యాట్స్‌మెన్ ఘోర వైఫల్యంతో 92 పరుగులకే కుప్పకూలి దారుణ పరాభావాన్ని మూటగట్టుకున్న విషయం తెలిసిందే. ఇక చివరి వన్డేలో సైతం టాప్-4 బ్యాట్స్‌మెన్ దారుణంగా విఫలమయ్యారు. ఈ దశలో భారత్‌కు మరో ఓటమి తప్పదా? అని అందరూ భావించారు. కానీ అంబటి రాయుడు, విజయ్ శంకర్ల అద్భుత భాగస్వామ్యం, చివర్లో పాండ్యా మెరుపులు.. జాదవ్ బాధ్యతాయుత ఇన్నింగ్స్‌తో ఆతిథ్య జట్టుకు గౌరవప్రదమైన లక్ష్యాన్ని నిర్ధేశించింది. అయితే బ్యాట్స్‌మెన్ దారుణ వైఫల్యానికి కారణం స్వింగ్‌ను ఎదుర్కోకపోవడమేనని భారత మాజీ పేసర్, స్వింగ్ స్పెషలిస్ట్ ప్రవీణ్ కుమార్ అభిప్రాయపడ్డారు. ఉపఖండ ఫ్లాట్ పిచ్‌లపై ఆడిన భారత ఆటగాళ్లకు స్వింగ్ పిచ్‌లపై ఆడటం కష్టంగా మారిందని చెప్పుకొచ్చాడు. ఇండియా టుడే చానెల్‌తో మాట్లాడుతూ.. ‘బ్యాట్స్‌మెన్ వైఫల్యానికి ప్రధాన కారణం.. మన ఆటగాళ్లు ఎక్కువగా రెగ్యూలర్ ఫ్లాట్ పిచ్‌లపై ఆడటం. దీంతో బ్యాట్స్‌మెన్ బంతి స్వింగ్ అయినప్పుడు అంతేవేగంతో వారి ఫుట్‌వర్క్‌ను మార్చుకోలేకపోతున్నారు. ఇంగ్లండ్, న్యూజిలాండ్‌ల్లో మన బ్యాట్స్‌మెన్ స్వింగ్ ఎదుర్కోకపోవడానికి ఇదే ప్రధాన కారణమని నేను ఫీలవుతున్నాను. స్వింగ్‌తో బ్యాట్స్‌మెన్ భయాందోళనకు గురవుతున్నారు’ అని చెప్పుకొచ్చాడు. ఇక న్యూజిలాండ్ పేస్ ద్వయం ట్రెంట్ బౌల్ట్, హెన్రీలు భారత బ్యాట్స్‌మెన్‌ను స్వింగ్‌తో ఇబ్బంది పెట్టిన సంగతి తెలిసిందే. నాలుగో వన్డేలో ట్రెంట్ బౌల్ట్ ఏకంగా 5 వికెట్లతో చెలరేగగా... చివరి వన్డేలో హెన్రీ 4 వికెట్లతో ఆధిపత్యాన్ని ప్రదర్శించాడు. వీరి స్వింగ్ దాటికి పటిష్టమైన భారత బ్యాటింగ్ ఆర్డర్ కుదేలైంది. ప్రపంచకప్ ముందు బ్యాటింగ్‌లోని లొసుగులు తేటతెల్లమయ్యాయి. స్వింగ్ పిచ్‌లపై కసరత్తు చేయాలన్న విషయం తెలిసొచ్చింది. -
ప్రతి కుటుంబానికీ పక్కా ఇల్లు
ఏలూరు (మెట్రో): జిల్లాలో ప్రతి కుటుంబానికీ పక్కా ఇల్లు ఉండాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని జిల్లా కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ చెప్పారు. స్థానిక కలెక్టరేట్లో బుధవారం సాయంత్రం జిల్లాలో గృహనిర్మాణ ప్రగతి తీరును, సంవత్సరం, పథకాల వారీగా, ఏఈల వారీగా గృహ నిర్మాణాల ఇంజినీర్లతో కలెక్టర్ సమీక్షించారు. కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ మాట్లాడుతూ జిల్లాలో ప్రతి కుటుంబానికి నూరు శాతం ఇళ్లు ఇవ్వాలన్నదే లక్ష్యమన్నారు. ఇంకా ఎవరైనా అర్హులు ఉంటే ఎంతమందికి ఇళ్లు మంజూరు చేయాలో కచ్చితమైన అంచనా వేయాలని అధికారులను ఆదేశించారు. 2017, 2018, 2019 సంవత్సరా ల్లో మంజూరైన ఇళ్లలో ఇంకా ప్రారంభం కాని నిర్మాణాలు ఉన్నాయన్నారు. వాటిపై దృష్టిపెట్టి ఫిబ్రవరి మొదటి వారం నాటికి పనులు ప్రారంభమయ్యేలా శ్రద్ధ పెట్టాలన్నారు. ఈ విషయంలో ఏమాత్రం అశ్రద్ధ వహించవద్దని చెప్పారు. ఇంజినీర్లు వారపు లక్ష్యాలను నిర్దేశించుకుని పనులు పూర్తి చేయాలన్నారు. జిల్లాలో ఫిబ్రవరి 2 నుంచి మూడు రోజుల పాటు నియోజకవర్గ స్థాయిలో పసుపు, కుంకుమ ద్వారా అందించే సహాయం, పెన్షన్ల పంపిణీ వాటితో పాటు దరఖాస్తు చేసుకున్న వారికి ఇళ్ల మంజూరు పత్రాలు అందించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో గృహ నిర్మాణశాఖ ప్రాజెక్టు డైరెక్టర్ ఇ.శ్రీనివాసరావు, టిడ్కో ఎస్ఈ శ్రీనివాసరావు, కమిషనర్ మోహనరావు, మునిసిపల్ కమిషనర్లు పాల్గొన్నారు. సమస్యలు పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశం జిల్లా నలుమూలల నుంచి కలెక్టరేట్‌కు వచ్చిన పలువురు సమస్యలు తెలుసుకుని కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ ఆ సమస్యలు పరిష్కరించాలని సంబంధితాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కలెక్టర్ విధులుకు వస్తున్న సమయంలో కొందరు ప్రజలు సమస్యల అర్జీలతో కలెక్టర్‌కు కనిపించారు. సంబంధిత ప్రజలను కలెక్టర్ పలకరించి ఆ సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. బదిలీ ప్రక్రియ నిర్ణీత సమయంలో పూర్తి ఎన్నికలతో ప్రత్యక్ష సంబంధం ఉన్న అధికారుల బదిలీ ప్రక్రియలను నిర్ణీత సమయంలో పూర్తి చేస్తామని కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ చెప్పారు. ఎన్నికల నిర్వహణ, ఓటర్ల జాబితా, పోలింగ్ స్టేషన్ల సంసిద్ధత వంటి అంశాలపై రెవెన్యూ, పోలీసు శాఖల అధికారులతో బుధవారం సాయంత్రం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్ చంద్ర ఫనేఠ విడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పునేత మాట్లాడుతూ త్వరలో అసెంబ్లీ, పార్లమెంటు స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనున్న దృష్ట్యా ఎన్నికలతో ప్రత్యక్ష సంబంధం ఉన్న అధికారులను బదిలీలు చేయాలని ఆదేశించారు. జిల్లా ఎస్పీ ఎం.రవిప్రకాశ్, జిల్లా రెవెన్యూ అధికారి ఎన్.సత్యనారాయణ, ట్రైనీ కలెక్టర్ ప్రవీణ్ ఆదిత్య పాల్గొన్నారు. -
3న ఏపీ శాశ్వత హైకోర్టుకు శంకుస్థాపన
తుళ్లూరురూరల్(తాడికొండ): ఏపీ రాజధాని అమరావతి ప్రతిపాదిత నేలపాడు గ్రామంలో నిర్మించనున్న శాశ్వత హైకోర్టు భవనానికి శంకుస్థాపన తేదీ ఖరారైంది. గుంటూరు జిల్లా, తుళ్లూరు మండలం నేలపాడు గ్రామంలో నిర్మించిన తాత్కాలిక హైకోర్టు భవనం ప్రారంభోత్సవం నేపథ్యంలో ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్ ప్రవీణ్‌కుమార్ బుధవారం పర్యటించారు. ఫిబ్రవరి మూడో తేదీన తాత్కాలిక హైకోర్టు భవనం ప్రారంభోత్సవం నాడే ..శాశ్వత భవన నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. తొలుత శాశ్వత హైకోర్టు భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసే ప్రదేశాన్ని జస్టిస్ ప్రవీణ్‌కుమార్ పరిశీలించారు. అనంతరం గుంటూరు జిల్లా కలెక్టర్ శశిధర్, రూరల్ జిల్లా ఎస్పీ రాజశేఖరబాబుతో కలిసి భద్రత ఏర్పాట్లపై సమీక్షించారు. తెలంగాణ నుంచి పలువురు న్యాయమూర్తులు వస్తున్న నేపథ్యంలో వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాలని ఆదేశించారు. -
ఓటుతోనే ప్రజాస్వామ్య పరిరక్షణ
సాక్షి, హైదరాబాద్: ప్రజాస్వామ్య విలువలు గొప్పవని, వాటిని కాపాడుకోవాల్సిన అవససరం ఉందని శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. ఓటుతోనే ప్రజాస్వామ్య పరిరక్షణకు అందరూ తోడ్పడాలని ఆయన కోరారు. అసెంబ్లీలో శనివారం గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. శాసనమండలిలో చైర్మన్ వి.స్వామిగౌడ్, శాసనసభలో స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. అంతకుముందు అసెంబ్లీ ఆవరణలోని మహాత్మాగాంధీ, బి.ఆర్.అంబేడ్కర్ విగ్రహాలకు పూలమాలతో నివాళులర్పించారు. ఈ సందర్భంగా స్పీకర్ పోచారం మాట్లాడారు. ‘‘తెలంగాణ రాష్ట్ర, దేశ ప్రజలందరికీ 70వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. దేశానికి దిశానిర్దేశం చేయడానికి రచించిన రాజ్యాంగం అత్యంత విలువైంది. ప్రజాస్వామ్య పరిరక్షణకు రాజ్యాంగమే మూలం. రాజ్యాంగాన్ని దేశంలోని అన్ని వర్గాల ప్రజలు గౌరవిస్తారు. దేశాన్ని అభివృద్ధి పథంలో నడపడానికి అందరూ కృషి చేయాలి. ప్రకృతి, ఆర్థిక సంపదలకు మానవ వనరులు తోడయితే అద్భుతాలు సాధిం చొచ్చు. దేశంలో పేద, ధనికులు మధ్య అంతరాలు పెరుగుతున్నాయి. 30% మంది దగ్గరే మొత్తం సంప ద కేంద్రీకృతమై ఉంది. ఈ వ్యత్యాసాన్ని తగ్గించి అసమానతలను తొలగించే ప్రయత్నం చేయాలి. ప్రజా సమస్యలను సభ దృష్టికి తీసుకొచ్చే పవిత్రమైన శాసన సభలోనూ రాజకీయాలు మాట్లాడితే అభాసుపాలవుతాం. నేరాలు తగ్గి శాంతిభద్రతలు పెరిగితే అభివృద్ధి పెరుగుతుంది. రాష్ట్రంలో నేరాలు తగ్గుతున్నాయి. శాంతిభద్రతలను కాపాడుతున్న పోలీసు సిబ్బందికి గణతంత్ర దినోత్సవం సందర్భంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను’’అన్నారు. ఎమ్మెల్సీలు పాతూరి సుధాకర్‌రెడ్డి, పి.సుధాకర్‌రెడ్డి, ఎన్.రాంచందర్‌రావు, ఆకుల లలిత, ఎం.ఎస్.శ్రీనివాస్‌రావు, బాలసాని లక్ష్మీనారాయణ, పూల రవీందర్, బోడికుంటి వెంకటేశ్వర్లు, అసెంబ్లీ కార్యదర్శి వి.నరసింహాచార్యులు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో తొలిసారి నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ చాగరి ప్రవీణ్‌కుమార్ పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఆ తరువాత జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. -
కలెక్టర్ వీడ్కోలుకు అయ్యన్న దూరం
సాక్షి, విశాఖపట్నం: బదిలీపై వెళ్తున్న జిల్లా కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ వీడ్కోలు సభకు జిల్లా సీనియర్ మంత్రి సీహెచ్ అయ్యన్న పాత్రుడు దూరంగా ఉండడం చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా ఏ జిల్లా కలెక్టర్ అయినా బదిలీపై వెళ్తుంటే ప్రజాప్రతినిధులు, అధికారులు వీడ్కోలు పలకడం ఆనవాయితీ. అలాంటిది ఏకంగా ఆరేళ్ల పాటు జిల్లాలో పనిచేసిన కలెక్టర్ వీడ్కోలు సభకు మంత్రి అయ్యన్న హాజరు కాలేదు. టీడీపీ ప్రభుత్వ హయాంలో దాదాపు నాలుగున్నరేళ్లపాటు ఆయన జిల్లాలోనే వివిధ హోదాల్లో సేవలందించారు. జేసీగా, జీవీఎంసీ కమిషనర్‌గా, గడిచిన రెండున్నరేళ్లుగా కలెక్టర్‌గా పనిచేసి జిల్లా అభివృద్ధిలో తనదైన ముద్ర వేయగలిగారు. కానీ ఆది నుంచి ప్రవీణ్‌కుమార్‌పై మంత్రి గంటాకు అనుకూలమైన వ్యక్తిగా ముద్రపడింది. దీంతో గంటాను విబేధించే అయ్యన్నపాత్రుడు సహజంగానే ప్రవీణ్ కుమార్‌ను అడపాదడపా విమర్శిస్తుండే వారు. ముఖ్యంగా విశాఖ ఉత్సవాలు, సంబరాల పేరిట కో ట్లాది రూపాయల ప్రజాధనాన్ని దుబా రా చేస్తున్నారంటూ మండిపడేవారు. ఆ కారణంగానే గడిచిన నాలుగేళ్లుగా జరిగిన విశాఖ ఉత్సవాల్లో ఏ నాడూ అయ్యన్న పా ల్గొన్న దాఖలాలు లే వు. అంతేకాదు ము ఖ్యమంత్రి, టీడీపీ సీనియర్ మంత్రులు వచ్చినప్పుడు తప్ప జిల్లా సమీక్షలకు కూడా అయ్యన్న దూరంగానే ఉండేవారు. గత కాంగ్రెస్ ప్రభుత్వ హాయంలో జేసీగా ప్రవీణ్‌కుమార్‌ను జిల్లాకు గంటాయే తీసుకొచ్చారు. ఆ తర్వాత గంటా ఒత్తిడితోనే జీవీఎంసీ కమిషనర్‌గా, ఆ తర్వాత కలెక్టర్‌గా ప్రభుత్వం నియమించిందన్న వాదనలున్నాయి. దాదాపు ఆరున్నరేళ్ల తర్వాత బదిలీపై వెళ్తున్న కలెక్టర్ ప్రవీణ్‌కుమార్‌కు జిల్లా స్థాయిలో వీడ్కోలు సభ శుక్రవారం సాయంత్రం దసపల్లాలో నిర్వహించారు. ఈ కార్యక్రమం ఆద్యంతం మంత్రి గంటాయే దగ్గరుండి నడిపించారు. కలెక్టర్‌గా ప్రవీణ్ సేవలను మంత్రి గంటాతో సహా సభకు హాజరైన ప్రజాప్రతినిధులు, అధికారులు కొనియాడారు. కానీ ఈ సభకు మంత్రి అయ్యన్నపాత్రుడుతో పాటు ఇటీవలే బాధ్యతలు చేపట్టిన మరోమంత్రి కిడారి శ్రావణ్‌కుమార్, అయ్యన్న అనుంగ అనుచరుడు వెలగపూడి రామకృష్ణబాబుతో పాటు కొందరు ప్రజాప్రతినిధులు దూరంగా ఉండడం అధికార, రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. -
విశాఖకు భాస్కరుడు.. పశ్చిమకు ప్రవీణుడు
సాక్షి, విశాఖపట్నం: ‘సాక్షి’ చెప్పింది నిజమైంది. జిల్లా కొత్త కలెక్టర్‌గా కాటమనేని భాస్కర్ ఖరారయ్యారు. ఈ విషయాన్ని గతేడాది మార్చిలోనే సాక్షి చెప్పింది. సుదీర్ఘ కాలం పాటు వివిధ హోదాల్లో పనిచేసిన ప్రస్తుత జిల్లా కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ ఎట్టకేలకు బదిలీ అయ్యారు. ఆయనను పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్‌గా నియమించారు. అక్కడి కలెక్టర్ కాటమనేని భాస్కర్‌ను ఇక్కడ నియమిస్తూప్రభుత్వ చీఫ్ సెక్రటరీ అనీల్‌చంద్ర పునేఠా గురువారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. వివిధ హోదాల్లో ఆరేళ్లు: 2006 బ్యాచ్‌కు చెందిన ప్రవీణ్‌కుమార్ 2012లో జాయింట్ కలెక్టర్‌గా జిల్లాలో అడుగుపెట్టారు. ఆతర్వాత జీవీఎంసీ కమిషనర్‌గా.. ప్రస్తుతం జిల్లా కలెక్టర్‌గా.. ఒకే జిల్లాలో మూడు కీలక పదవుల్లో ఏకబికిన పనిచేసిన ఐఏఎస్ అధికారి రాష్ట్రంలో లేరనే చెప్పవచ్చు. 2014 అక్టోబర్ 12న విశాఖపై హుద్‌హుద్ తుఫాన్ విరుచుకుపడిన సమయంలో జేసీ ఉన్న ప్రవీణ్‌కుమార్ అప్పటి జిల్లా కలెక్టర్ యువరాజ్‌తో కలిసి సహాయ, పునరావాస చర్యల్లో తనదైన ముద్ర వేశారు. బాధితులకు పరిహారం పంపిణీలో కొద్దిపాటి ఆరోపణలు వచ్చినా సహాయ చర్యల్లో సఫలమయ్యారన్న పేరుపొందారు. ఆ తర్వాత జీవీఎంసీ కమిషనర్ హోదాలో ఏడాదిన్నర పాటు విశాఖకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో స్మార్ట్‌సిటీ గుర్తింపు తీసుకొచ్చారు. జాతీయ స్థాయిలో విశాఖను టాప్–3లో నిలిపారు. యువరాజ్ కేంద్ర సర్వీసులకు వెళ్లిపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం జిల్లా కలెక్టర్‌గా ప్రవీణ్‌కుమార్‌కు పగ్గాలు అప్పగించింది. జేసీగా, జీవీఎంసీ కమిషనర్‌గా, కలెక్టర్‌గా ఒకేచోట పనిచేసిన ఘనత ఆయన సొంతమైంది. 2016 జూలై 25న కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన ప్రవీణ్‌కుమార్ గత 31 నెలల్లో తీవ్ర ఒత్తిళ్ల మధ్యే విధులు నిర్వర్తించారు. రికార్డుల ట్యాంపరింగ్‌ను బయటపెట్టింది ప్రవీణుడే ప్రభుత్వంపై విమర్శలు వస్తాయంటే ఎవరైనా వెనుకడుగు వేస్తారు. ప్రభుత్వ పెద్దలతో చర్చించి, వారి అనుమతి లేకుండా ఆ విషయాలను బయటపెట్టరు. అలాంటిది జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టి ఏడాది తిరక్కుండానే ప్రవీణ్‌కుమార్ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన రికార్డుల ట్యాంపరింగ్, భూ కబ్జాల భాగోతాన్ని బయటపెట్టి ఒక విధంగా ఇబ్బందులు కొనితెచ్చుకున్నారు. మధురవాడ, కొమ్మాదిల్లో అధికారుల నిర్వాకం వల్ల రూ.2,200కోట్ల కుంభకోణం జరిగిందంటూ ట్యాంపరింగ్‌కు గురైన రికార్డులను బయటపెట్టి సంచలనం సృష్టించారు. దాదాపు లక్ష ఎకరాలకు చెందిన రికార్డులు గల్లంతైన విషయాన్ని కూడా బయటపెట్టి కలకలం సృష్టించారు. ఈ కుంభకోణం విపక్షాలకు ఆయుధం కాగా, ఆ తర్వాత వరుసగా వెలుగు చూసిన భూ కుంభకోణాలు రాష్ట్రాన్ని కుదిపేశాయి. వైఎస్సార్సీపీతో సహా విపక్షాల ఆందోళనల నేపథ్యంలో పరువును కాపాడుకునేందుకు విధిలేని పరిస్థితుల్లో ప్రభుత్వం విశాఖ భూ కుంభకోణాలపై సిట్‌ను ఏర్పాటు చేయాల్సి వచ్చింది. భూ కుంభకోణాలు వెలుగుచూసిన సమయంలోనే ప్రవీణ్‌కుమార్ బదిలీపై ఊహాగానాలు విన్పించాయి. కానీ వెంటనే బదిలీ చేస్తే ప్రజల నుంచి తీవ్రవ్యతిరేకత వ్యక్తమవుతుందన్న భావనతో అప్పట్లో ప్రభుత్వం వెనక్కి తగ్గింది. జాతీయ, అంతర్జాతీయ సదస్సులు: సదస్సులు, సమ్మేళనాల నిర్వహణలో ప్రవీణ్‌కుమార్ అరుదైన రికార్డే సృష్టించారు. అంతర్జాతీయ ప్లీట్ రివ్యూతోపాటు మూడు భాగస్వామ్య సదస్సులు, రెండు ఎడ్యుటెక్ సదస్సులు, కామన్వెల్త్ దేశాల స్పీకర్ల సదస్సు, అగ్రిటెక్, బ్లాక్‌చైన్ కాన్ఫరెన్స్, పిన్‌టెక్, బ్రిక్స్,స్ప్రింగ్ కాన్ఫరెన్స్‌లతో పాటు జాతీయ, అంతర్జాతీయ స్పోర్ట్స్ ఈవెంట్స్, వరుసగా విశాఖ ఉత్సవాలు, విండ్,బెలూన్ ఫెస్టివల్స్.. ఇలా గత ఆరేళ్లలో ఎన్నో ఈవెంట్ల నిర్వహణలో కీలకపాత్ర పోషించారు. మూడో భాగస్వామ్య సదస్సు తర్వాతే బదిలీపై ఊహాగానాలు : గతేడాది ఫిబ్రవరిలో మూడోసారి నిర్వహించిన సీఐఐ భాగస్వామ్య సదస్సు ముగిసిన తర్వాత మళ్లీ ప్రవీణ్‌కుమార్ బదిలీపై అధికార వర్గాల్లో చర్చ ప్రారంభమైంది. సుదీర్ఘకాలం పాటు పనిచేసిన ప్రవీణ్ కుమార్‌కు బదిలీ తప్పదని ప్రభుత్వం నుంచి సంకేతాలు అందాయి. దీంతో అత్యంత ప్రతిష్టాత్మకమైన విశాఖ కలెక్టర్గిరీపై ఆశలు పెట్టుకున్న పలువురు ఐఏఎస్‌లు తీవ్రంగా ప్రయత్నించారు. సీనియర్ ఐఎఎస్ అధికారి ప్రద్యుమ్నతో సహా బాబూరావు నాయుడు, సత్యనారాయణ, కార్తికేయ మిశ్రా, పాటు టీటీడీ జేఈవో శ్రీనివాసరాజులు కలెక్టర్‌గా వచ్చేందుకు పోటీపడ్డారు. కాటమనేనికే పచ్చజెండా: చాలామంది పోటీ పడినా ప్రభుత్వం మాత్రం యువ ఐఏఎస్ అధికారి కాటమనేని భాస్కర్ వైపే మొగ్గు చూపింది. పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్‌గా దాదాపు నాలుగున్నరేళ్లుగా భాస్కర్ సేవలందిస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనుల పర్యవేక్షణలో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్న కాటమనేని భాస్కర్‌ను కాస్త ఆలస్యమైనా విశాఖకు పంపాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఫిబ్రవరి మొదటి వారంలో ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ రానుంది. ఆ తర్వాత సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుంది. దీంతో ఫిబ్రవరి వరకు ఈ ఇరువురి బదిలీలు జరకపోవచ్చునని భావించారు. కానీ ప్రభుత్వం సంక్రాంతి పండుగ ముగిసిన వెంటనే వీరిని బదిలీ చేసింది. చాలా సంతృప్తిగా ఉంది ఒకే జిల్లాలో జేసీగా, జీవీఎంసీ కమిషనర్‌గా, కలెక్టర్‌గా ఆరేళ్లపాటు మూడు కీలక పదవులను నిర్వహించగలిగే అవకాశం రావడం నిజంగా నా అదృష్టం. ఇక్కడ నేను ఎంతో నేర్చుకున్నాను. విశాఖవాసులు నిజంగా ఎంతో సౌమ్యులు. నేను ఎక్కడకు వెళ్లినా వీరు చూపిన ఆదరాభిమానాలు, ఇక్కడ అధికారులు అందించిన సహాయ సహకారాలు మరువలేను. ప్రభుత్వ సహకారంతో ఎన్నో సంస్కరణలు తీసుకురాగలిగాం. ఎన్నో అవార్డులు, రివార్డులు సాధించగలిగాం. జిల్లాను ఓడీఎఫ్ జిల్లాగా తీర్చిదిద్దగలిగాం. ఇక పశ్చిమ గోదావరి జిల్లాలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగస్వామినయ్యే అవకాశం లభించడం అరుదైన గౌరవంగా భావిస్తున్నా.– ప్రవీణ్‌కుమార్, జిల్లా కలెక్టర్ విశాఖ రావడం ఆనందంగా ఉంది రాష్ట్ర ఆర్థిక రాజధాని విశాఖకు కలెక్టర్‌గా రానుండం ఆనందంగా ఉంది. పశ్చిమ గోదావరి జిల్లాలో సుదీర్ఘకాలం పాటు పనిచేసాను. ఇక్కడి ప్రజలు నాపై చూపించిన ఆదరాభిమానాలు మర్చిపోలేను. అమరావతి తర్వాత ఆ స్థాయిలో గుర్తింపు, ప్రాధాన్యత కలిగిన పారిశ్రామిక రాజధాని విశాఖలో పనిచేసే అవకాశం లభించడం అదృష్టంగా భావిస్తున్నా. ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ప్రత్యేకంగా కృషి చేస్తాను.– కాటమనేని భాస్కర్, నూతన కలెక్టర్ -
ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ప్రవీణ్ కుమార్
-
తాజా మొండి బకాయిలు తగ్గాయ్: ఎస్బీఐ
హైదరాబాద్: తాజా మొండి బకాయిలు తగ్గాయని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) రిటైల్ అండ్ డిజిటల్ బ్యాంకింగ్ విభాగ మేనేజింగ్ డైరెక్టర్ ప్రవీణ్ కుమార్ గుప్తా తెలిపారు. భారీ మొండి బకాయిల ఖాతాలకు సంబంధించి పరిష్కారం కోసం ఎన్సీఎల్టీలో ప్రయత్నాలు చేస్తున్నామని, భవిష్యత్తులో మొండి బకాయిలు తగ్గుతాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఎస్బీఐ హైదరాబాద్ మెయిన్ బ్రాంచ్ 150వ వార్షికోత్సవం సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్తులో మొండి బకాయిలు పెరగవు... ఎన్సీఎల్టీకి నివేదించిన భారీ మొండి బకాయిల్లో కొన్ని కేసులు పరిష్కారమయ్యాయని, మరి కొన్ని కేసుల్లో పరిష్కారం తుది దశలో ఉందని ప్రవీణ్ కుమార్ గుప్తా వివరించారు. మొత్తం మీద రానున్న రెండు నెలల్లో ఈ బకాయిల సమస్య ఒక కొలిక్కి రాగలదన్నారు. తాజా మొండి బకాయిలు తగ్గాయంటూ... భవిష్యత్తులో మొండి బకాయిలు పెరిగే సమస్యే లేదని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు. మహారాష్ట్ర, కర్నాటకల్లో మాత్రమే వ్యవసాయ రంగ రుణాల్లో మొండి బకాయిలు పెరిగాయని, దేశవ్యాప్తంగా ఈ ధోరణి లేదని గుప్తా స్పష్టంచేశారు. పాత డెబిట్ కార్డ్‌ల స్థానంలో మరింత సురక్షితమైన ఫీచర్లున్న కొత్త డెబిట్ కార్డ్‌ల జారీ కొనసాగుతోందన్నారు. పాత డెబిట్ కార్డులను మార్చుకోవడానికి ఈ నెల 31 గడువు తేదీ అని, ఇప్పటికే చాలా వరకూ కొత్త కార్డ్‌లను జారీ చేశామని వివరించారు. -
నేడు ప్రవీణ్ అంత్యక్రియలు
ప్రకాశం,రాచర్ల: మండలంలోని గౌతవరం గ్రామానికి చెందిన చట్టి దుర్గా ప్రసాద్, రంగలక్ష్మమ్మ దంపతుల ఏకైక కుమారుడు ప్రవీణ్‌కుమార్ (22) సీఆర్పీఎఫ్ జవాన్‌గా పని చేస్తూ ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల దాడిలో గాయపడి ప్రాణాలు కోల్పోయాడు. ప్రవీణ్‌కుమార్ అంత్యక్రియలు సోమవారం అధికార లాంఛనాలతో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రవీణ్ గిద్దలూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో డిగ్రీ చదువుతూ ఏడాది క్రితం హైదరాబాద్‌లో జరిగిన సీఆర్పీఎఫ్ సెలక్షన్స్‌కు వెళ్లాడు. ఎంపిక అనంతరం శిక్షణ కోసం కేరాళ రాష్ట్రంలో ఏడాది పాటు ఉన్నాడు. అక్కడి నుండి ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి పోస్టింగ్ ఇచ్చారు. ఛత్తీస్‌గఢ్‌లో ఆరు నెలలు విధుల్లో పనిచేసి సెలవుల్లో స్వగ్రామం గౌతవరం గ్రామానికి వచ్చి వినాయక చవితి, పీర్ల పండగులను కుటుంబ సభ్యులతో సంతోషాంగా గడిపి సెలవు పూర్తిగా కాగానే ఈ నెల 15వ తేదీన ఛత్తీస్‌గఢ్ వెళ్లి విధుల్లో చేరాడు. రోజూ తల్లిదండ్రులతో ఫొన్లో మాట్లాడే వాడు. తోటి సీఆర్పీఎఫ్ జవానులతో కలిసి ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బీజపూర్ జిల్లాలో తనిఖీకి వెళ్లివస్తుండగా సీఆర్పీఎఫ్ జవాన్లు ప్రయాణిస్తున్న మైన్‌ప్రూఫ్ వాహనాన్ని శక్తివంతమైన మందుపాతరతో మావోయిస్టులు పేల్చివేయడంతో సంఘటన స్థలం వద్దనే ప్రవీణ్‌కుమార్ మృతి చెందాడు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. తల్లి రంగలక్ష్మమ్మ తన కుమారుడు ఇక లేడనే వార్త విన్నప్పుటి నుంచి తీవ్ర అస్వస్థతకు గురై ఆనారోగ్య బారిన పడింది. ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆమెకు వైద్యులు చికిత్స అందిస్తూనే ఉన్నారు. పెద్ద దిక్కు కోల్పోయా.. దుర్గా ప్రసాద్‌ది నిరుపెద కుటుంబం. ఆయనకు కుమారుడు, కూమార్తె ఉన్నారు. పెద్ద కుమార్తె దుర్గా భారతి చిన్నతనంలో రెండు చేతులకు పోలియో వచ్చింది. దుర్గా ప్రసాద్ వ్యవసాయ పొలాల్లో కూలి పనులు చేసుకుంటూ ప్రవీణ్‌కుమార్‌కు డిగ్రీ వరకూ చదివించారు. హైదరాబాద్‌లో జరిగే సీఆర్పీఎఫ్ సెలక్షన్స్‌కు పంపించారు. కుమారుడికి ఉద్యోగం వచ్చిందని ఎంతో సంతోషంగా ఉన్న సమయంలోనే మావోయిస్టులు పేట్టిన మందుపాతలో ప్రాణాలు కోల్పోయాడు. అధికార లాంఛనాలతో అంత్యక్రియలు గౌతవరంలో సోమవారం అధికార లంఛనాలతో ప్రవీణ్‌కుమార్ అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు తహసీల్దార్ ఎలిజబెత్‌రాణి, ఎస్ఐ నాగశ్రీను తెలిపారు. ఆదివారం అంత్యక్రియలు చేసే ప్రదేశంలో పూర్తి ఏర్పాటు చేశారు. అంత్యక్రియలకు కలెక్టర్ వినయ్‌చంద్, ఎస్పీ సత్యఏసుబాబు హాజరు కానున్నట్లు అధికారులు వివరించారు. -
మరోసారి క్రికెట్ ఫీల్డ్‌లోకి జహీర్
న్యూఢిల్లీ: ఒకప్పటి భారత క్రికెట్ జట్టు ప్రధాన పేసర్ జహీర్ ఖాన్ మళ్లీ మైదానంలోకి అడుగుపెట్టనున్నాడు. వచ్చే నెలలో షార్జాలో ఆరంభం కానున్న టీ10 లీగ్‌లో జహీర్‌ఖాన్ ఆడనున్నాడు. ఈ టోర్నీ నవంబర్ 23 నుంచి ఆరంభం కానుంది. తొలి ఎడిషన్‌లో వీరేంద్ర సెహ్వాగ్ ప్రధాన ఆకర్షణగా నిలిచాడు. ఈ లీగ్‌లో భారత్ నుంచి అప్పుడు ఒక్కడే ఆడగా ఈసారి మాత్రం పలువురు భాగస్వామ్యం అవుతున్నారు. జహీర్ ఖాన్, ప్రవీణ్ కుమార్, ఆర్పీ సింగ్, ఆర్ఎస్ సోధి, సుబ్రమణ్యం బద్రీనాథ్‌తో పాటు మరో ముగ్గురు ఆడనున్నారు. ‘టీ10 రెండో ఎడిషన్‌లో హై ప్రొఫైల్ కల్గిన ఎనిమిది మంది భారత క్రికెటర్లు ఆడటం చాలా సంతోషకరం. రానున్న కాలంలో ఈ లీగ్‌లో దేశవిదేశాలకు చెందిన ఎక్కువ ఆటగాళ్లను ఆకర్షించేందుకు ఇది ఉపయోగపడుతుంది’ అని లీగ్ ఛైర్మన్ షాజీ ఉల్ ముల్క్ తెలిపారు. -
ప్రవీణ్ కుమార్ వీడ్కోలు
లక్నో: భారత పేస్ బౌలర్ ప్రవీణ్ కుమార్ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. ఉత్తర ప్రదేశ్‌కు చెందిన 32 ఏళ్ల ఈ వెటరన్ పేసర్ 2007లో పాకిస్తాన్‌తో జైపూర్‌లో జరిగిన వన్డేతో అంతర్జాతీయ కెరీర్‌ను మొదలుపెట్టాడు. 2012 వరకు సాగిన ఆరేళ్ల అంతర్జాతీయ కెరీర్లో 68 వన్డేలాడి 77 వికెట్లు పడగొట్టాడు. 10 టి20ల్లో 8, 6 టెస్టులాడి 27 వికెట్లు తీశాడు. ప్రవీణ్ అద్భుత ప్రదర్శనతోనే ఆస్ట్రేలియాలో 2008లో జరిగిన ముక్కోణపు వన్డే సిరీస్ ‘కామన్వెల్త్ బ్యాంక్ ట్రోఫీ’ని భారత్ చేజిక్కించుకుంది. ‘నా కెరీర్ ఆసాంతం మనస్ఫూర్తిగా, అంకితభావంతో ఆడాను. నేను తప్పుకుని కుర్రాళ్లకు అవకాశాలివ్వాల్సిన సమయం వచ్చింది. నాకు టీమిండియా సభ్యుడినయ్యే అవకాశమిచ్చిన భగవంతుడికి కృతజ్ఞతలు’ అని ప్రవీణ్ అన్నాడు. ఇకపై బౌలింగ్ కోచ్‌గా సేవలందిస్తానని చెప్పాడు. -
3 నెలలు.. 5,318 పోస్టులు
సాక్షి, హైదరాబాద్: గురుకుల విద్యా సంస్థల నియామకాల బోర్డు (టీఆర్ఈ–ఐఆర్బీ) ద్వారా మూడు నెలల్లో 5,318 పోస్టులు భర్తీ చేయనున్నట్లు బోర్డు చైర్మన్ ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ వెల్లడించారు. ఇప్పటికే 3,213 ఉద్యోగాలకు సంబంధించి రెండు నోటిఫికేషన్లు జారీ చేశామని, వారాంతం లోగా మరో 465 డిగ్రీ లెక్చరర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. బుధవారం హైదరాబాద్ మాసబ్‌ట్యాంక్‌లోని పోలీస్ ఆఫీసర్స్ క్లబ్లో టీఆర్ఈ–ఐఆర్బీ కార్యక్రమాలపై మీడియా సమావేశం నిర్వహించారు. గురుకుల విద్యా సంస్థల్లో యుద్ధ ప్రాతిపదికన నియామకాలు చేపట్టేందుకే ప్రభుత్వం బోర్డు ఏర్పాటు చేసిందని, ఇందులో గురుకుల సొసైటీల్లోని ఉద్యోగులు, సిబ్బందిని డిప్యుటేషన్పద్ధతిలో తీసుకుని కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. బోర్డు నిర్వహణకు గురుకుల సొసైటీల ద్వారా ఆర్థిక సహకారాన్ని తీసుకుంటున్నామని, అక్టోబర్ ఆఖరుకల్లా అభ్యర్థులకు అర్హత పరీక్షలు నిర్వహించి నియామకాల ప్రక్రియను పూర్తి చేస్తామని చెప్పారు. ఇటీవల టీఎస్పీఎస్సీ ద్వారా నియమితులైన టీజీటీ, పీజీటీలకు ప్రత్యేకంగా శిక్షణ కార్యక్రమాలు నిర్వహించామని తెలిపారు. వారికి క్షేత్రస్థాయి శిక్షణ ఇస్తున్నట్లు పేర్కొన్నారు. విద్యార్థులు, వారి కుటుంబ ఆర్థిక పరిస్థితులు, జీవనశైలి తదితర అంశాలను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు కొత్త టీచర్లను విద్యార్థుల తల్లిదండ్రుల వద్దకు పంపుతున్నామని వివరించారు. రెండ్రోజుల పాటు కొనసాగే ఈ కార్యక్రమంలో టీచర్లకు విద్యార్థుల సామాజిక, ఆర్థిక స్థితిగతులు అర్థమవుతాయని, దీంతో బోధన కార్యక్రమాలెలా నిర్వహించాలనే అంశంపై స్పష్టత వస్తుందన్నారు. స్వేరోస్.. విద్యార్థి సంఘం కాదు.. స్వేరోస్ సంస్థ విద్యార్థి నాయకుల సంఘం కాదని ప్రవీణ్‌కుమార్ స్పష్టం చేశారు. స్వేరోస్ కార్యక్రమాలపై విలేకరులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. గురుకుల పాఠశాలల్లో చదువుకున్న పూర్వ విద్యార్థులతో ఏర్పాటైన సంస్థ స్వేరోస్ అని తెలిపారు. ఎస్సీ గురుకులాల్లోని కాంట్రాక్టు పనులను ఎస్సీలకే కేటాయించే క్రమంలో భాగంగా జిల్లాల్లో కలెక్టర్ల ద్వారా స్వేరోస్‌కు కాంట్రాక్టులు ఇస్తున్నామని, సొసైటీ నిబంధనల్లోనే ఈ అంశం ఉందని, ప్రభుత్వ ఆమోదంతోనే ఈ చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. స్వేరోస్ వచ్చిన తర్వాత గురుకులాల్లో చాలా మార్పులు వచ్చాయని, సివిల్ సర్వెంట్లు, డాక్టర్లు, ఇంజనీర్లు, ఐటీ ప్రొఫెషనల్స్ ఇందులో ఉన్నారని, వీరిని ఆదర్శంగా తీసుకుంటూ విద్యార్థులు ముందుకెళ్తున్నారని వివరించారు. విద్యార్థులపై లైంగిక దాడులు జరిగితే సహించబోమని, బాధ్యులు ఎవరైనా వదిలేది లేదన్నారు. అన్ని గురుకుల పాఠశాలల్లో సీసీ కెమెరాల పర్యవేక్షణలో భద్రత కట్టుదిట్టంగా నిర్వహిస్తామని తెలిపారు. సమావేశంలో బోర్డు కన్వీనర్ నవీన్ నికోలస్, సభ్యులు మల్లయ్యభట్టు, సత్యనారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
‘యాత్రికుల పరిస్థితి సమీక్షిస్తున్నాం’
సాక్షి, న్యూఢిల్లీ: యాత్రికుల పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. ఆయన మంగళవారం ఉదయం సాక్షి టీవీతో మాట్లాడుతూ.. నిన్నటి నుంచి నేపాల్‌లోని భారత రాయబార కార్యాలయ అధికారులు, ఢిల్లీలోని కేంద్ర అధికారులతో ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నామన్నారు. ఇప్పటి వరకు మూడు క్యాంపుల్లో కలిపి సుమారు 1500మంది చిక్కుకున్నట్లు సమాచారమని వెల్లడించారు. సిమికోట్‌లో 550, హిల్సాలో 500 మంది, టిబెట్ వైపున 500 మంది చిక్కుకున్నారని, వారిలో మన తెలుగు వాళ్ళు సుమారు 100మంది ఉన్నారన్నారని తెలిపారు. యాత్రికులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలి.. యాత్రికులను సురక్షత ప్రాంతాలకు తరలించాలని అధికారులను కోరామని ప్రవీణ్ కుమార్ తెలిపారు. బేస్ క్యాంపుల్లో ఇప్పటికీ వర్షం పడుతూనే ఉందన్నారు. దీంతో హెలికాప్టర్ల ద్వారా మాత్రమే సహాయం అందించాల్సిన పరిస్థితి నెలకొంది. హెలీకాప్టర్ల సహాయంతో యాత్రికులను సురక్షిత ప్రాంతాలకు తరలించాల్సిందిగా విజ్ఞప్తి చేశామన్నారు. అదేవిధంగా సహాక చర్యలకోసం భారత ఆర్మీని కూడా పంపించాలని విదేశాంగశాఖను కోరామని తెలిపారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూనే తెలుగు వాళ్ళందరూ సురక్షితంగా స్వస్థలాలకు చేరుకొనేలా చూస్తామన్నారు. స్పందించిన తెలంగాణ అధికారులు కాగా, మానస్ సరోవర్ యాత్రలో చిక్కుకున్న తెలంగాణ యాత్రికులతో ఢిల్లీ తెలంగాణ భవన్ అధికారులు ఫోన్లో మాట్లాడారు. తామంతా సురక్షితంగా ఉన్నట్టు అధికారులకు యాత్రికులు తెలిపారు. యాత్రికులకు కావాల్సిన వైద్యం తక్షణమే అందించాలని సంబంధిత అధికారులను కోరినట్లు తెలంగాణ భవన్ అదనపు రెసిడెంట్ కమిషనర్ వేదాంతం గిరి తెలిపారు. -
మరో 9 విదేశీ బ్రాంచ్‌లను మూసివేయనున్న ఎస్బీఐ
న్యూఢిల్లీ: దేశీ అతిపెద్ద ప్రభుత్వ రంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) మరో తొమ్మిది విదేశీ బ్రాంచ్‌లను మూసివేయనుంది. ఇప్పటికే బ్యాంక్ గత రెండేళ్ల కాలంలో విదేశాల్లోని ఆరు బ్రాంచ్‌లలో కార్యకలాపాలకు స్వస్తి పలికింది. విదేశీ కార్యకలాపాల హేతుబద్ధీకరణ ప్రక్రియలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నామని ఎస్బీఐ మేనేజింగ్ డైరెక్టర్ (రిటైల్, డిజిటల్ బ్యాంకింగ్) ప్రవీణ్ కుమార్ గుప్తా తెలిపారు. కాగా ఎస్బీఐ 36 దేశాల్లో 190 బ్రాంచ్‌లతో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ‘విదేశీ భూభాగాల్లోని అన్ని బ్రాంచ్‌లు పూర్తిస్థాయి కార్యాలయాలు కాదు. బంగ్లాదేశ్, దక్షిణాఫ్రికా వంటి దేశాల్లో చిన్న బ్రాంచ్‌లతోపాటు రిటైల్ బ్రాంచ్‌లు కూడా ఉన్నాయి. వీటిని హేతుబద్ధీకరించాల్సిన అవసరముంది’ అని గుప్తా వివరించారు. ‘బ్రాంచ్‌ల హేతుబద్ధీకరణ కొనసాగుతున్న ప్రక్రియ. వాణిజ్యపరంగా అనవసరం అయితే ఆ బ్రాంచ్‌లలో సేవలు కొనసాగించడం అవివేకం అవుతుంది’ అన్నారు. బ్రాంచ్‌లను మూసివేయడమంటే కార్యకలాపాల నుంచి పూర్తిగా వైదొలగినట్లేనా? అనే ప్రశ్నకు.. తాము ఆ దేశాల నుంచి తప్పకున్నట్లు కాదని, అయితే చిన్న బ్రాంచ్‌లను మూసివేస్తామని, లేకపోతే రెండు లేదా మూడు బ్రాంచ్‌లను కలిపి ఒకటిగా చేస్తామని పేర్కొన్నారు. ఈ ఆర్థిక సంవత్సరం దేశీయంగా దాదాపు 300–350 బ్రాంచ్‌లను ఏర్పాటు చేస్తామని, వీటిల్లో ఎక్కువ భాగం గ్రామీణ ప్రాంతాల్లో ప్రారంభిస్తామని గుప్తా తెలిపారు. కాగా, ఈ ఏడాది మార్చి నాటికి ప్రభుత్వ బ్యాంకులు 35 విదేశీ బ్రాంచ్‌లను మూసివేశాయి. -
మాతృమరణాలు తగ్గవా?
సాక్షి, విశాఖపట్నం: ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోరా మీరు..? మాతృమరణాలు పెరుగుతున్నాయే తప్ప తగ్గడం లేదు. ఏం చేస్తున్నారో అర్థం కావడం లేదు..? అంటూ జిల్లా కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ వైద్య ఆరోగ్యశాఖాధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం సాయంత్రం స్థానిక కలెక్టరేట్ మీటింగ్ హాలులో మాతృమరణాలపై సమీక్షించారు. గత క్వార్టర్లీ సమావేశంలో 12 మాతృమరణాలు సంభవిస్తేనే చాలా ఎక్కువని భావించామని, కానీ ఈసారి ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ నెలల్లో 16 మరణాలు చోటుచేసుకున్నాయంటే ఏం అనుకోవాలో అర్థం కావడం లేదన్నారు. మాతృమరణాల ప్రాంతాల మెడికల్ ఆఫీసర్లు, ఎఎన్ఎంలు, ఆశావర్గర్లపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని డీఎంఅండ్‌హెచ్‌వోను ఆదేశించారు. పునరావృతం కాకుండా చూడాలన్నారు. హైరిస్క్ కేసులను ముందుగానే గుర్తించి వారి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అవసరం మేరకు మందులు, పౌష్టికాహారం అందించేలా చూడాలన్నారు. వైద్య పరీక్షలు నిర్వహించి తీవ్రతను బట్టి దగ్గర్లోని ప్రభుత్వాస్పత్రుల్లో చేర్పించాలన్నారు. హెచ్‌బీ, బీపీ, తదితర పరీక్షలను నిర్వహించాలన్నారు. ఏజెన్సీలో సరైన రోడ్డు సౌకర్యం లేక వాహనాలు అందుబాటులో లేక గర్భిణులు, బాలింతలు నడిచి వెళ్లడం వంటి కారణాల వల్ల మరణాలు ఎక్కువగా సంభవిస్తున్నాయని వైద్యాధికారులు వివరించగా కలెక్టర్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఇలాంటి కేసులను ముందుగానే గుర్తించి ఆస్పత్రిలో చేర్చించే ప్రయత్నం ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ రమేష్ మాట్లాడుతూ ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్‌లలో హైబీపీ, హైపోథైరాయిడ్, గుండె సంబంధిత సమస్యల వల్ల 16 మాతృ మరణాలు సంభవించాయన్నారు. మాతృమరణాలు తగ్గించేందుకు పీహెచ్‌సీల పరిధిలో ప్రత్యేక వైద్యాధికారులతో శిక్షిణ ఇస్తామన్నారు. సమావేశంలో డీసీహెచ్ఎస్ డాక్టర్ నాయక్, జిల్లా వైద్యాధికారులు, ఎఎన్ఎంలు పాల్గొన్నారు. -
టీడీపీ పనుల్లో కలెక్టర్ బిజీ
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: అవును.. మీరు చదివింది నిజమే.. పార్టీలకు అతీతంగా వ్యవహరించాల్సిన జిల్లా కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ తెలుగుదేశం పార్టీ వ్యవహారాల్లో బిజీ అయిపోయారు. ఎవరేమనుకుంటే మాకేంటి.. అన్న రీతిలో నిబంధనలను పక్కనపెట్టి టీడీపీ సొంత పనుల్లో ఈయనా భాగస్వాములవుతున్నారు. ప్రత్యేక హోదా డిమాండ్‌తో తెలుగుదేశం పార్టీ అధిష్టానం రాష్ట్రంలోని అన్ని నగరాల్లోధర్మపోరాట సభలు నిర్వహించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు తొలిసభ గత నెల 30న తిరుపతిలో నిర్వహించారు. మలి సభను ఈనెల 22న విశాఖలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పూర్తిగా పార్టీపరమైన ఈ రాజకీయ సభతో ఏమాత్రం సంబంధం లేకపోయినా.. జిల్లా కలెక్టర్ ప్రవీణ్‌కుమార్, పోలీస్ కమిషనర్ టి.యోగానంద్ ఆ ఏర్పాట్లలో తలమునకలవడం చర్చనీయాంశమవుతోంది. సభా ఏర్పాట్లపై గురువారం సాయంత్రం సర్క్యూట్ హౌస్‌లో జిల్లా ఇన్చార్జి మంత్రి, ఉపముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, మంత్రి గంటా శ్రీనివాసరావుల ఆధ్వర్యంలో జరిగిన సమీక్ష సమావేశంలో టీడీపీ ఎమ్మెల్యేలతోపాటు కలెక్టర్, సీపీలు హాజరు కావడం చర్చకు తెరలేపింది. హోం మంత్రి చినరాజప్ప రాకతో బందోబస్తు ఏర్పాట్లు సమీక్షించేందుకు సీపీ యోగానంద్ వెళ్లారని భావించినా.. కలెక్టర్ వెళ్లడంపై మాత్రం ఆక్షేపణలు వ్యక్తమవుతున్నాయి. సభ నిర్వహణకు, జిల్లా కలెక్టర్‌కు సంబంధం ఏమిటన్న వాదనలు వినిపిస్తున్నాయి. మరో పక్క జీవీఎంసీ ఉన్నతాధికారులు కూడా సభ ఏర్పాట్లలో ఇప్పటి నుంచే మునిగితేలుతుండటం వివాదాస్పదమవుతోంది. గతంలో ఏయూ ఇంజనీరింగ్ కళాశాల గ్రౌండ్స్‌లోనే మహానాడు నిర్వహించి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న టీడీపీ ఇప్పుడు ధర్మపోరాట సభనూ అక్కడే నిర్వహించాలని నిర్ణయించడంపై కూడా భిన్నవాదనలు వినిపిస్తున్నాయి. ఈ అంశంలో ఏయూ పాలకమండలిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అప్పట్లో ఉన్నత విద్యామండలి ఆదేశాల మేరకే మహానాడుకు అనుమతినిచ్చామని, భవిష్యత్తులో ఎటువంటి రాజకీయ పార్టీ సదస్సుల నిర్వహణకు అనుమతివ్వబోమని చెప్పుకొచ్చారు. దానికి విరుద్ధంగా ఇప్పుడు టీడీపీ ధర్మపోరాట సభకు అనుమతినివ్వడం గమనార్హం. -
ఎలక్ట్రిక్ కారును నడిపిన తొలి కలెక్టర్
సాక్షి, విశాఖ : దేశంలోనే ప్రథమంగా ఎలక్ట్రికల్ కారును విశాఖ జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ వినియోగించారు. బుధవారం ఉదయం ఆయన క్యాంప్ కార్యాలయం నుండి స్వయంగా కారు నడుపుకొని జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వచ్చారు. -
కొత్త కలెక్టర్‌గా కాటమనేని?
సాక్షి, విశాఖపట్నం: సుదీర్ఘ కాలం పాటు విశాఖలోనే వివిధ హోదాల్లో పనిచేసిన కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ త్వరలో బదిలీకానున్నారు. నెలాఖరులోగా బదిలీ ఉత్తర్వులు వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో పలువురు ఐఏఎస్ అధికారులు ఇక్కడికి వచ్చేందుకు ఇప్పట్నుంచే ప్రయత్నాలు మొదలుపెట్టారు. ప్రధానంగా ఐదుగురు ఐఏఎస్‌లు ఈ పోస్టుపై కన్నేసినప్పటికీ యువ ఐఏఎస్ అధికారి కాటమనేని భాస్కర్ వైపే ప్రభుత్వం మొగ్గు చూపుతోంది. జేసీగా వచ్చి.. జాయింట్ కలెక్టర్‌గా వివాఖ వచ్చిన ప్రవీణ్‌కుమార్, ఆ తర్వాత జీవీఎంసీ కమిషనర్‌గా, ప్రస్తుతం కలెక్టర్‌గా.. ఇలా ఒకే జిల్లాలో మూడు కీలక పదవుల్లో సుదీర్ఘ కాలం పనిచేసిన ఐఏఎస్ అధికారి మరే జిల్లాలో లేరు. హుద్‌హుద్ తుఫాన్ సమయంలో జేసీగా ఉన్న ప్రవీణ్‌కుమార్ అప్పటి కలెక్టర్ యువరాజ్‌తో కలిసి సహాయ, పునరావాస చర్యల్లో తనదైన ముద్ర వేశారు. ఆ తర్వాత జీవీఎంసీ కమిషనర్‌గా ఏడాదిన్నర పాటు పనిచేసిన ఆయన స్మార్ట్ సిటీగా విశాఖకు జాతీయ, అంత ర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చేందుకు కృషి చేశారు. 2016 జూలై 25న కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన ఆయన తీవ్ర ఒత్తిళ్ల మధ్య విధులు నిర్వర్తించారు. భూ కుంభకోణాన్ని బయటపెట్టి.. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన రికార్డుల ట్యాంపరింగ్, భూ కబ్జాల భాగోతాన్ని బయటపెట్టి ఒక విధంగా ఇబ్బందులు కొనితెచ్చుకున్నారు. కలెక్టరే స్వయంగా రూ.2,200 కోట్ల కుంభకోణం జరిగిందని చెప్పడం విపక్షాలకు ఆయుధమైంది. ఆ తర్వాత వరుసగా వెలుగు చూసిన భూ కుంభకోణాలు.. విపక్షాల ఆందోళనల నేపథ్యంలో విధిలేని పరిస్థితుల్లో ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటు చేసింది. వరుసగా మూడుసార్లు భాగస్వామ్య సదస్సులు, అగ్రిటెక్‌తో పాటు ఫ్లీట్ రివ్యూ వంటి జాతీయ, అంతర్జాతీయ సదస్సులు, సమ్మేళనాలు, వేడుకలు విజయవంతంగా నిర్వహించడం ద్వారా జిల్లాపై తనదైన ముద్ర వేశారు. గత ఏడాది భూ కుంభకోణాలు వెలుగు చూసిన సమయంలోనే ప్రవీణ్‌కుమార్ బదిలీపై ఊహాగానాలు విన్పించాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో మూడోసారి భాగస్వామ్య సదస్సు ఉన్నందున అప్పటివరకు కదపకూడదని భావించిన ప్రభుత్వం కలెక్టర్ బదిలీ నిర్ణయాన్ని పక్కనపెట్టింది. సదస్సు ముగిసినప్పటి నుంచి మళ్లీ ప్రవీణ్ కుమార్ బదిలీపై అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది. సుదీర్ఘకాలం పాటు పనిచేసిన ప్రవీణ్‌కుమార్‌కు బదిలీ తప్పదని ప్రభుత్వం సంకేతాలు కూడా ఇచ్చింది. ఎవరి ప్రయత్నాల్లో వారు నెలాఖరులోగా రాష్ట్రంలో భారీగా ఐఏఎస్, ఐపీఎస్‌ల బదిలీలుంటాయని తెలుస్తోంది. ఎప్పుడు ఈ పోస్టు ఖాళీ అవుతుందా? ఎప్పుడు వద్దామా? అని పలువురు సీనియర్లు గత రెండేళ్లుగా ఎదురు చూస్తున్నారు. తామేమీ తీసిపోమన్నట్టుగా నిన్నగాక మొన్న కలెక్టర్ పోస్టు అందుకున్న వారు సైతం ఈ జాబితాలో చేరారు. రెండేళ్లుగా ఈ పోస్టుపై ఆశలు పెట్టుకున్న సీనియర్ ఐఏఎస్ అధికారి ప్రద్యుమ్నతో సహా పలువురు ఐఏఎస్‌లు ఇక్కడకు వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. గతంలో ఇక్కడ పనిచేసి ప్రస్తుతం కడప కలెక్టర్‌గా ఉన్న బాబూరావునాయుడు, సత్యనారాయణ, కార్తికేయ మిశ్రాలు ఆశావహుల్లో ఉన్నారు. అయితే ప్రభుత్వం మాత్రం యువ అధికారి కాటమనేని భాస్కర్ వైపే మొగ్గు చూపుతున్నట్టు తెలిసింది. ప్రస్తుతం ఈయన పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్‌గా సుమారు నాలుగేళ్లుగా పని చేస్తున్నారు. కలెక్టర్ ప్రవీణ్‌తో పాటు జీవీఎంసీ కమిషనర్ హరినారాయణన్ కూడా బదిలీ అయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఈయన కూడా వచ్చి మూడేళ్లు కావస్తోంది. -
భవిష్యత్తులో ‘గురుకుల’ వర్సిటీలు
జోగిపేట: భవిష్యత్తులో గురుకుల వర్సిటీ లు ఏర్పాటయ్యే ఆలోచనలో ప్రభుత్వం ఉందని గురుకుల పాఠశాలల కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ అన్నారు. శుక్రవారం అందోలు గురుకుల బాలికల పాఠ శాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశా రు. అనంతరం విలేకరులతో మాట్లాడు తూ.. గురుకుల పాఠశాలల్లో కొత్తగా లలితకళల కోర్సులను కూడా ప్రారంభించనున్నామని, ఎవరైనా సినిమా రంగంపై ఆసక్తి ఉన్న విద్యార్థులకు ఇందులో ప్రత్యేకంగా శిక్షణ ఇస్తామన్నారు. -
నాపై నిషేధం.. న్యాయ సూత్రాలకు విరుద్ధం
హైకోర్టులో జేసీ పిటిషన్ సాక్షి, హైదరాబాద్: తనపై దేశీయ విమాన యాన సంస్థలు నిషేదం విధించడం న్యాయసూత్రాలకు విరుద్ధమని అనం తపురం ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి మంగళ వారం హైకోర్టులో పిటిషన్ దాఖలుచేశా రు. దేశీయ విమానాల్లో రాకపోకలు సాగిం చేందుకు తనపై విధించిన నిషేధాన్ని ఎత్తివేసేలా వాటిని ఆదేశించాలని కోరారు. ఈ వ్యాజ్యంపై బుధవారం న్యాయమూర్తి జస్టిస్ సి.ప్రవీణ్‌కుమార్ విచారణ జరపనున్నారు. -
రాణించిన అనంత బ్యాట్స్మెన్లు
అనంతపురం సప్తగిరి సర్కిల్ : వైఎస్సార్ కడప జిల్లాలో జరుగుతున్న ఏసీఏ అండర్–19 అంతర్ జిల్లా క్రికెట్ పోటీల్లో అనంత బ్యాట్స్మెన్లు రాణించడంతో అనంత జట్టు భారీ ఆధిక్యతను నమోదు చేసింది. గురువారం రెండవ రోజు అనంత జట్టు మ్యాచ్‌పై పూర్తి పట్టును సాధించింది. తొలిరోజు నెల్లూరు జట్టు 105 పరుగులు చేయగా, అనంతపురం జట్టు 442 పరుగులు చేసింది. జట్టులో ప్రవీణ్‌కుమార్ 87, యోగానంద 72, షాకిర్ 54, రాజశేఖర్ 60, ముదస్సిర్ 49 పరుగులు చేయడంతో జట్టు పటిష్ట పరిస్థితికి చేరుకుంది. రెండవ రోజు ఆట ముగిసే సమయానికి నెల్లూరు జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 48 పరుగులకు 1 వికెట్ కోల్పోయింది. -
గురుకులాల్లో సీట్ల భర్తీకి 5న కౌన్సెలింగ్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ పరిధిలోని గురుకుల పాఠశాలల్లో 6 నుంచి 9 తరగతుల్లో ఖాళీ సీట్ల భర్తీకి నిర్వహించిన పరీక్ష ఫలితాలను శనివారం విడుదల చేయనున్నట్లు సొసైటీ కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపికైన అభ్యర్థులకు ఈ నెల 5న కౌన్సెలింగ్ నిర్వహిస్తామన్నారు. -
పాత నోట్లు.. కోట్లు కోట్లు
⇔ రూ.9.10 కోట్ల పాత సొమ్ము పట్టివేత ⇔ శాసనమండలి మాజీ అధ్యక్షుని అల్లుడే సూత్రధారి! ⇔ కొత్త నోట్ల మార్పిడికి ప్రయత్నం ⇔ సీసీబీ పోలీసుల మెరుపు దాడి సాక్షి, బెంగళూరు: పాత నోట్లకు కొత్త నోట్లు... దందా ఇంకా ఆగడం లేదు. కర్ణాటకలో సగటున వారానికి ఒక చోట ఏదో ఒకచోట ఈ అక్రమం వెలుగుచూ స్తూనే ఉంది. తాజాగా ఆదివారం బెంగళూరులో రూ.500, రూ.1,000 నోట్లతో కూడిన రూ.9.10 కోట్ల విలువైన నగదు పోలీసు దాడుల్లో పట్టుబడింది. 14 మంది నిందితులను అరెస్టు చేశారు. ఇందులో అధికార కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, శాసనమండలి మాజీ అధ్యక్షుడు వీరణ్ణమత్తికట్టి అల్లుడు ప్రవీణ్‌కుమార్ ప్రధాన ముద్దాయి కావడం గమనార్హం. సీసీబీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం వివరాలు పాత నోట్లు తీసుకుని సొమ్ము మొత్తంలో 45 శాతం కొత్త నోట్లను తిరిగి ఇచ్చే దందా నడుస్తోందని సమాచారం అందింది. నగరంలోని జాన్సన్ టౌన్ ఒకటో క్రాస్ వద్ద ఉన్న ఇంటిపై అదనపు పోలీస్ కమిషనర్ రవి నేతృత్వంలో ఇన్స్పెక్టర్లు మహదేవప్ప, సుధాకర్, ఎం.సీ రవికుమార్, బీ.రాజు ఆర్. బానుప్రసాద్‌లు దాడి చేసి రూ.9.10 కోట్ల పాత నోట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ నగదును ఇక్కడ నగదు నిల్వచేయడానికి సహకరించిన ఎడ్విన్, ఉమేష్, అన్బళగన్, ఎస్.కిషోర్ కుమార్, ప్రభు, మోహన్, నారాయణభట్, చంద్రశేఖర్, శ్రీనివాస్, అరుణ్, మహ్మద్ ఇమ్రాన్, హ్యారిష్, శేఖర్‌లను అరెస్టు చేశారు. అంతేకాకుండా నిందితుల నుంచి 2 కార్లు, 2 ద్విచక్రవాహనాలు, వివిధ కంపెనీలకు చెందిన 15 ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. వదిలేయాలని హోంమంత్రిపై ఒత్తిళ్లు? ప్రవీణ్‌కుమార్‌కు సంబంధించిన ఇంట్లోనే సొమ్ము దొరికినట్లు తెలుస్తోంది. శనివారం రాత్రి జరిగిన ఈ ఘటన బయటికి రాకుండా వీరణ్ణ మత్తికట్టి అధికారులపై ఒత్తిడి తీసుకువచ్చినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. తాము ఏమీ చేయలేమని చెప్పడంతో ఆయన హోంశాఖ మంత్రి పరమేశ్వర్‌కు కూడా ఫోన్‌చేసి విషయం బయటికి రాకుండా చూడాలని కోరినట్లు తెలుస్తోంది. వ్యవహారం అప్పటికే తన చెయ్యి దాటిపోయిందని పరమేశ్వర్ స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా సీసీబీ పోలీసులకు పట్టుబడ్డ ప్రవీణ్‌కుమార్ తన అల్లుడేనని వీరణ్ణమత్తికట్టే పేర్కొన్నారు. అయితే ఆరునెలల నుంచి అతనితో తనకు గాని, తన కుటుంబ సభ్యులకు కాని ఎటువంటి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. బీజేపీ ఎంపీ శోభా ధ్వజం నోట్ల రద్దు తర్వాత రాష్ట్రంలో నడుస్తున్న బ్లాక్ అండ్ వైట్ దందాలో కాంగ్రెస్‌పార్టీ నాయకులే ఉన్నారని బీజేపీ నాయకురాలు శోభాకరంద్లాజే పేర్కొన్నారు. ఇందుకు తాజా ఉదంతమే ప్రత్యేక్ష ఉదాహరణ అని తెలిపారు. ఈ విషయంలో నిందితులను కఠినంగా శిక్షించాలని నంజనుగూడులో మీడియా ప్రతినిధులతో పేర్కొన్నారు. -
కలెక్టర్ ప్రవీణ్‌కుమార్‌కు ఊరట
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ విశాఖపట్నం మునిసిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) పూర్వ కమిషనర్, ప్రస్తుత జిల్లా కలెక్టర్ ప్రవీణ్‌కుమార్‌కు హైకోర్టు ఊరటనిచ్చింది. కోర్టు ఉత్తర్వులను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించారంటూ కోర్టు ధిక్కార కేసులో ఆయనకు నెల రోజుల జైలుశిక్ష, రూ.1500 జరిమానా విధిస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పు అమలును ధర్మాసనం నిలిపేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ షమీమ్ అక్తర్‌లతో కూడిన ధర్మాసనం గురువారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. విశాఖకు చెందిన జుపిటర్ ఆటోమొబైల్స్ వాల్తేర్‌లో తాము చేపట్టిన నిర్మాణానికి అనుమతులు మంజూరు చేసేలా జీవీఎంసీని ఆదేశించాలంటూ హైకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయమూర్తి జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు జుపిటర్ ఆటోమొబైల్స్‌కు భవన నిర్మాణ అనుమతినివ్వాలంటూ జీవీఎంసీని ఆదేశించారు. అయితే ఈ ఆదేశాలను అమలు చేయకపోవడంతో సదరు సంస్థ జీవీఎంసీ అప్పటి కమిషనర్ ప్రవీణ్‌కుమార్‌పై కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ జరిపిన జస్టిస్ రామచంద్రరావు జీవీఎంసీ కమిషనర్ తీరును తప్పుపట్టారు. కమిషనర్ ఉద్దేశపూర్వకంగానే కోర్టు ఉత్తర్వులను అమలు చేయలేదని తేల్చారు. ఇందుకు గాను కోర్టు ధిక్కారం కింది కమిషనర్ ప్రవీణ్‌కుమార్‌కు నెల రోజుల జైలుశిక్ష, రూ.1500 జరిమానా విధిస్తూ ఇటీవల తీర్పునిచ్చారు. ఈ తీర్పుపై అప్పీల్ దాఖలు చేసేందుకు వీలుగా తీర్పు అమలును నాలుగు వారాల పాటు నిలిపేశారు. ఈ నేపథ్యంలో సింగిల్ జడ్జి తీర్పును సవాలు చేస్తూ ప్రవీణ్‌కుమార్ ఏసీజే నేతత్వంలోని ధర్మాసనం ముందు అప్పీల్ దాఖలు చేశారు. ఈ అప్పీల్‌పై జస్టిస్ రమేశ్ రంగనాథన్ నేతత్వంలోని ధర్మాసనం గురువారం విచారణ జరిపింది. కమిషనర్ తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్ హాజరయ్యారు. సింగిల్ జడ్జి తీర్పు గురించి ఏజీ వివరించారు. అనంతరం ఆ తీర్పు అమలును నిలిపేస్తూ ఈ వ్యాజ్యాన్ని విచారణకు స్వీకరిస్తున్నట్లు ధర్మాసనం స్పష్టం చేసింది. ఆ మేర మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. -
కానిస్టేబుల్ హత్య
► మహిళా కానిస్టేబుల్ సహా ఇద్దరి అరెస్ట్ ► మరో ముగ్గురు కానిస్టేబుళ్ల వద్ద విచారణ తిరువళ్లూరు: తిరువళ్లూరులో మహిళా కానిస్టేబుల్ నడిపిన వివాహేతర సంబంధం ఒకరి హత్యకు దారితీసింది. మృతుడు, హంతకుడు ఇద్దరూ పోలీసులు కావడం గమనార్హం. ఈ సంఘటన శనివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. వివరాలు.. తేనీ జిల్లా కూంబై గ్రామానికి చెందిన ప్రవీణ్‌కుమార్(30) బీఎస్ఎఫ్ ఉద్యోగి. ఇతని భార్య (23) తిరువళ్లూరు జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఆయుధ విభాగం (వీఆర్)లో కానిస్టేబుల్. ఈమె తిరువళ్లూరులోని పూంగానగర్లో ఇంటిని అద్దెకు తీసుకుని తండ్రి (70), అక్క తో కలిసి నివసిస్తోంది. ఇలాఉండగా తిరునల్వేలి జిల్లా వన్నియకుళం గ్రామానికి చెందిన ఇరుళపాండ్యన్ కుమారుడు అమృతరాజ్(25) చెన్నైలో వీఆర్ కానిస్టేబుల్. ఆరు నెలల కిందట ఢిల్లీలో శిక్షణ కోసం వెళ్లిన సమయంలో ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడి వివాహేతర సంబంధానికి దారితీసింది. అంతకుముందు తిరువళ్లూరులో పనిచేస్తున్న వీఆర్ కానిస్టేబుల్ కల్లన్ తో ఆమెకు వివాహేతర సంబంధం ఉన్నట్టు తెలిసింది. ఒకరికి తెలియకుండా మరొకరితో ఆమె సంబంధం కొనసాగిస్తూ వచ్చింది. ఈ క్రమంలో శనివారం రాత్రి అమృతరాజ్ ఆమె ఇంటికి వెళ్లాడు. అప్పుడు కల్లన్ తో సబంధం గురించి తెలుసుకుని అతనికి ఫోన్ చేసి హెచ్చరించాడు. ఈ విషయంపై ఇరువురి మధ్య వాగ్వాదం ఏర్పడింది. మద్యం మత్తులో వెళ్లి హత్యకు గురైన కానిస్టేబుల్: అమృతరాజ్ హెచ్చరించిన విషయాన్ని కల్లన్ తన సహచరులతో చెప్పాడు. అనంతరం సహచరులు మదురై ఉసిలంబట్టికి చెందిన సుందరపాండ్యన్ (24), ఊత్తపాళ్యంకు చెందిన చంద్రన్ మదురైకు చెందిన సంతానకుమార్(26)తో కలిసి మద్యం తాగి సదరు మహిళ ఇంటికి వెళ్లి ఘర్షణకు దిగారు. ఆ సమయంలో అమృతరాజ్ అక్కడే ఉండడంతో వారు అతనితో ఘర్షణ పడ్డారు. అమృతరాజ్ ఇంటిపైకి వెళ్లగా సుందరపాండ్యన్ అతన్ని వెంబడిస్తూ వెళ్లాడు. ఆ సమయంలో అమృతరాజ్ పక్కన ఉన్న కత్తితో సుందరపాండ్యన్ పై విచక్షణారహితంగా దాడిచేశాడు. దీనిపై అతని సహచరులు తిరువళ్లూరు టౌన్ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అక్కడికి చేరుకుని సుందరపాండ్యన్ ను తిరువళ్లూరు వైద్యశాలకు తరలించగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. పోలీసులు అమృతరాజ్, కల్లన్, చంద్రన్, సంతానకుమార్, మహిళా కానిస్టేబుల్ వద్ద విచారణ చేపట్టారు. నిందితులను డీఐజీ ఆదివారం మధ్యాహ్నం విచారించారు. -
అరచేతిలో సమాచారం
మణికొండ: సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల పాఠశాలలు, కళాశాలల విద్యార్థులకు పాఠ్యాంశాలకు సంబంధించిన అదనపు సమాచారం అరచేతిలో ఉంటుందని ఆ శాఖ రాష్ట్ర కమిషనర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు. మంగళవారం నార్సింగ్ గురుకుల పాఠశాలలో మూడు స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ కియోస్క్‌లను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఏటీఎంల తరహాలో ఇవి పాఠశాలల ఆవరణలో 24 గంటలూ అందుబాటులో ఉంటాయన్నారు. గూగుల్‌లో వెతికినట్టు వెతికితే పాఠ్యాంశానికి సంబంధించిన చిత్రాలు, వీడియోలు, యానిమేషన్లు విద్యార్థులకు అందుబాటులోకి వస్తాయన్నారు. ఎక్కువ సమాచార సేకరణతో పాటు... పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించేందుకు ఇవి దోహద పడతాయని పేర్కొన్నారు. టచ్సీ్క్రన్ రూపంలో ఇవి పని చేస్తాయన్నారు. త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గురుకులాల్లో ఇలాంటివి ప్రవేశపెడతామన్నారు. పరిరక్షించుకుందాం: పర్యావరణాన్ని పరిరక్షించుకునేందుకు ప్రతి ఒక్కరం పాటుపడాల్సిన అవసరం ఉందని సాంఘిక సంక్షేమ శాఖ గురుకులాల రాష్ట్ర కమిషనర్ ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ పేర్కొన్నారు. మంగళవారం నార్సింగ్ గురుకుల పాఠశాలలో ఢిల్లీకి చెందిన టెరీ యూనివర్సిటీ విద్యార్థులు పర్యావరణంపై నిర్వహించిన అవగాహన సదస్సును ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అడవుల సంరక్షణతో పాటు వాతావరణ కాలుష్యం లేకుండా చూసుకోవాలని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో నార్సింగి, షేక్‌పేట్, మహీంద్రాహిల్స్, ఇబ్రహీంపట్నం కళాశాలలకు చెందిన 120 మంది విద్యార్థులు, గురుకుల సంస్థ ప్రాంతీయ సమన్వయకర్త ఏవీ రంగారెడ్డి, నార్సింగ్ ప్రిన్సిపాల్ ధనలక్ష్మి, వైస్ ప్రిన్సిపాల్ అనిత తదితరులు పాల్గొన్నారు. -
లెక్చరర్ మృతిపై పోలీసులకు ఫిర్యాదు
వరంగల్: లెక్చరర్ ప్రవీణ్‌కుమార్ అనుమానాస్పద మృతి నేపథ్యంలో అతని కుటుంబసభ్యులు శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. హైదరాబాద్ లోని ఎంఎస్ కాలేజీలో లెక్చరర్‌గా పనిచేస్తున్న ప్రవీణ్‌కుమార్ రెండు రోజుల క్రితం వరంగల్ లో అనుమానాస్పదంగా మృతి చెందిన విషయం విదితమే. అయితే, అంతకుముందే తను పనిచేస్తున్న కళాశాలలో ఐఎస్ తీవ్ర వాద శిక్షణ కొనసాగుతోందని, తన ప్రాణాలుకు ముప్పు ఉందని ప్రవీణ్ ఫేస్బుక్ లో పోస్టులు పెట్టాడు. దీంతో కళాశాల నిర్వాహకులే అతడిని వేధించి మరణానికి కారణ మయ్యారని ఆరోపిస్తూ అతని కుబుంబసభ్యులు వరంగల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇందులో భాగంగా వారు వెంటనే హైదరాబాద్ రానున్నారు. ఇక్కడి పోలీసు అధికారుల సహకారంతో కేసు దర్యాప్తును వేగవంతం చేయనున్నారు. -
కలెక్టరేట్లో కమాండ్ కంట్రోల్ సెంటర్
జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ ఆన్లైన్లో మానిటరింగ్‌కు త్వరలో శ్రీకారం బీచ్‌రోడ్: కలెక్టరేట్లో ‘కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్’ను త్వరలో ఏర్పాటు చేయాలని కలెక్టర్ ప్రవీణ్ కుమార్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లోని పలు విభాగాలను ఆయన పరిశీలించారు. కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటుకు అనువైన గదిని గుర్తించారు. అధునాతన కంప్యూటర్లు, సర్వర్లు, నిఘా కెమేరాలతో ఈ సెంటర్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. రాష్ట్ర రాజధాని నుంచి జిల్లా కేంద్రాన్ని అనుసంధానించేందుకు ఏ విధంగా ఓ సెంటర్ పనిచేస్తోందో, అదే తరహాలో జిల్లా కేంద్రం నుంచి క్షేత్ర స్థాయిలో అమలయ్యే పలు ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాల్ని అన్లైన్లో పర్యవేక్షించేందుకు వీలుగా సెంటర్‌ను ఏర్పాటు చేయాలన్నారు. పోలీస్, సివిల్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ల వల్ల మంచి ఫలితాలే వచ్చాయన్నారు. విశాఖ నగరంలో నీటి సరఫరా, వీధిదీపాలు, పారిశుద్ధ్య నిర్వహణ తదితర కార్యక్రమాల్ని అన్లైన్ ద్వారా పర్యవేక్షించేందుకు జీవీఎంసీలో ఏర్పాటు చేసిన కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ కూడా మంచి ఫలితాలను ఇస్తోందన్నారు. అదే తరహాలో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో నేషనల్ ఇన్ఫర్మేటిక్ సెంటర్ (ఎన్ఐసీ) అధికారి మూర్తి, ఏవో సూర్యప్రకాష్ పాల్గొన్నారు. -
తాను చనిపోతూ... మరికొందరి జీవితాల్లో వెలుగులు
- బ్రెయిన్ డెడ్‌తో మృతి చెందిన ప్రవీణ్ - అవయవదానం చేసిన కుటుంబ సభ్యులు - మృతుని అవయవాలు ఇతర రాష్ట్రాలకు చిగరపల్లె(చిత్తూరు): ప్రమాదవశాత్తు తాను చనిపోతూ మరికొందరి జీవితాల్లో వెలుగులు నింపాడు ఐరాల మండలం చిగరపల్లెకు చెందిన ప్రవీణ్. కుటుంబ సభ్యుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన భాస్కర్‌రెడ్డి, కుమారి దంపతుల కుమారుడు ప్రవీణ్(37). పూతలపట్టు మండలం అనంతాపురానికి చెందిన భవ్యతో ఐదేళ్ల క్రితం వివాహమైంది. వీరు గ్రామంలోని ప్రవీణ్ తల్లిదండ్రుల వద్ద నివాసముంటున్నారు. ఆదివారం రాత్రి పది గంటల ప్రాంతంలో ఇంటి పరిసరాల్లో తిరుగుతూ ప్రవీణ్ కాలుజారి కిందపడ్డాడు. వెంటనే అతడిని అరగొండ అపోలో ఆస్పత్రికి తీసుకు వెళ్లారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం వేలూరు సీఎంసీకి తరలించినా ఫలితం లేదు. రెండు రోజుల వరకు చలనం లేకపోవడంతో కుటుంబసభ్యులు అతన్ని చెన్నై అపోలో ఆస్పత్రికి తరలించారు. అక్కడ గురువారం ఉదయం ప్రవీణ్ మృతిచెందాడు. తల్లిదండ్రులు, భార్య స్పందించారు. మరికొందరి జీవితాల్లో వెలుగులు నింపాలని సంకల్పించారు. చెన్నై వైద్యులను సంప్రదించి అక్కడే అవయవాలు దానం చేయాలని కోరారు. కుటుంబ సభ్యుల కోరిక మేరకు వారు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. ప్రవీణ్ మృత్యదేహన్ని శుక్రవారం స్వగ్రామానికి తీసుకురానున్నట్లు సమాచారం. ప్రవీణ్ గుండెను దిల్లీకి, కాలేయం, కిడ్నీలు, నేత్రాలు ఇతర రాష్ట్రాలకు పంపినున్నట్లు వైద్యులు తెలిపారు. -
గురుకులాల్లో ఆంగ్లంలోనే మాట్లాడాలి
ఉపాధ్యాయులకు ప్రవీణ్‌కుమార్ సూచన సాక్షి, హైదరాబాద్: గురుకుల విద్యాలయాల్లో ఉపాధ్యాయులు ఆంగ్లంలోనే మాట్లాడాలని, దీనివల్ల విద్యార్థుల్లో ఈ భాషపై అవగాహన పెరుగుతుందని ఎస్సీ, ఎస్టీ గురుకులాల కార్యదర్శి డా. ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ సూచించారు. రాజేంద్రనగర్‌లోని టీఎస్ ఐపార్డులో ప్రిన్సిపాళ్లకు ఇన్‌సర్వీస్ ట్రైనింగ్‌లో భాగంగా ‘అడ్వాన్స్డ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇన్ ఇంగ్లిష్’’పై నిర్వహిస్తున్న కార్యక్రమాన్ని సోమవారం ఆయన ప్రారంభించి, ప్రసంగించారు. ఆంగ్లంలో మాట్లాడటం వల్ల తమ మాతృభాషలకు ఏ విధమైన నష్టం జరగదన్నారు. విద్యార్థులకు ఈ భాషలో నైపుణ్యం పెరిగితే వారిలో ఆత్మవిశ్వా సం పెరుగుతుందని, దాని ద్వారా విద్యలో ఉన్నతస్థానానికి చేరుకునేం దుకు ఆస్కారం ఏర్పడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రొ.కనకదుర్గ, ఎస్టీ గురుకులాల డెరైక్టర్ ఖాసిం తదితరులు పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో ఇంజనీరింగ్ విద్యార్థుల మృతి
తూర్పు గోదావరి జిల్లా, పెద్దాపురం మండలం పరిధిలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థులు మృతిచెందారు. బీహార్, జార్ఖండ్ రాష్ట్రాలకు చెందిన అమిత్ కుమార్, ప్రవీణ్ కుమార్ గండేపల్లి మండలం సూరంపాలెంలలోని ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాలలో ఇటీవలే ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ పూర్తి చేశారు. స్వస్థలాలకు వెళ్లేందుకు రైలు టికెట్ రిజర్వేషన్ చేసుకుందామని సామర్ల కోటకు స్కూటర్ పై బయల్దేరారు. పెద్దాపురం సమీపంలోని అరవింద ప్లాస్టిక్స్ కంపెనీ వద్ద మూల మలుపులో వారి స్కూటర్ స్కిడ్ అయ్యి లారీ కిందకు దూసుకు పోవడంతో అక్కడికక్కడే మృతి చెందారు. -
దండలు వేసేవారే అంటరాని వారిగా చేస్తున్నారు
నూతన సమాజం కోసం స్వేరోస్ కృషి చేయాలి కోరికలు అదుపులో ఉంచుకున్నప్పుడే అభివృద్ధి గిరిజన శాఖ కార్యదర్శి డాక్టర్ ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ ములుగు : రాజ్యాంగ నిర్మాతగా కొనియాడుతూ అంబేద్కర్ విగ్రహానికి దండలు వేసే వారే త మ ఇళ్లకు చేరుకున్నాక అంబేద్కర్‌ను అంటరా ని వారిగా భావించడం సిగ్గుచేటని స్వేరోస్ చైర్మన్, సాంఘిక సంక్షేమ, గిరిజన శాఖ కార్యదర్శి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. మండలకేంద్రంలోని డీఎల్ఆర్ ఫంక్షన్హాల్లో స్వేరోస్ ఆధ్వర్యం లో బుధవా రం నిర్వహించిన భీందీక్ష సభకు ఆయన ము ఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పరాజిత జాతులకు లక్ష్యాన్ని సాధించుకోవాలని గొప్ప సక ల్పం ఉంటుందని, అయితే దానిని ఆచరణ లో పెట్టినప్పుడే లక్ష్యాన్ని చేరుకోగలమని అ న్నారు. చేసే పనిలో మనసును లగ్నం చేసుకొ ని ముందుకు సాగాలని అన్నారు. ప్రతి ఇంట్లో దేవుని గదితో పాటు పుస్తకాల గదిని ఏర్పాటు చేసుకోవడం ఉత్తమ లక్షణమని తెలిపారు. కో రికలను అదుపులో ఉంచుకున్నప్పుడే భవిష్యత్తులో ఎదుగుతామన్నారు. నేటి యువత ఈ అంశాలను దృష్టిలో పెట్టుకోవాలన్నారు. చరిత్రను విస్మరించే జాతి సమాజంలో అనగదొక్కబడుతుంది.. ముఖ్యంగా నేటి సమాజం మూడు ప్రధాన అంశాలను గుర్తుంచుకోవాలని ప్రవీణ్‌కుమార్ తెలిపారు. ఏ జాతులైతే తమ చరిత్రను విస్మరిస్తాయో ఆ జాతులు సమాజంలో అనగదొక్కబడుతాయన్నారు. ఏ జాతులైతే రాబోయే ప్రమాదాలను ఎదుర్కోవడంలో విఫలమవుతాయో ఆ జాతులు ప్రమాదం బారిన పడి అణగారిన వర్గాలుగా మిగిలిపోతాయన్నారు. ఏ జాతులైతే బలహీనతను అధిమించవోప్రపంచ ం చేతిలో బానిసత్వాలుగా మిగిలిపోతాయని అన్నారు. నూతన సమాజం కోసం స్వేరోస్ పాటు పడాలని సూచించారు. అనంతరం స్వేరోస్ ఆధ్వర్యంలో ప్రవీణ్‌కుమార్‌ను సన్మానించారు. కార్యక్రమంలో ఏఎస్పీ విశ్వజిత్ కాంపాటి, డివిజన్ అధ్యక్షుడు బొట్ల కార్తీక్ , జాతీయ కమిటీ నాయకులు ఆరూరి సుధాకర్, డాక్టర్ రామకృష్ణ, స్వేరోస్ రాష్ట్ర నాయకులు పట్టాబి రవికుమార్, జిల్లా అధ్యక్షుడు పుల్ల కిషన్, డివిజన్ గౌవర అధ్యక్షుడు గుగిళ్ల సాగర్, తదితరులు పాల్గొన్నారు. 2035నాటికి 47శాతం ఉద్యోగాలు కంప్యూటర్లే చేస్తాయి.. 2035వ సంవత్సరం నాటికి 47శాతం ఉద్యోగాలను కంప్యూటర్లే చేస్తాయని, రాబోయే కాలం లో మనిషి చేసే ప్రతి పనిని రోబోలే చేస్తాయనడ ంలో సందేహం లేదని అన్నారు. మిషన్ లర్నింగ్, అర్టిఫిషీయల్ ఇంటలిజెన్స్ సంబంధించి ప్రత్యేక రోబోల తయారీకి దేశాలు పోటీ పడుతున్నాయని అన్నారు. మనిషి లాగా ఆలోచించే మరమనుషులు ఫ్యాక్టరీలలో తయారవుతున్నాయని అన్నారు. భవిష్యత్తులో మనుషులతో కాకుండా మిషన్లతో పోరాడే సమయం వస్తుందని జోస్యం చెప్పారు. -
భార్య, కుమారుడికి బిర్యానీలో విషం పెట్టి...
► భర్త ఆదుకోలేదని ఫాదర్‌కు చెప్పుకున్న నాగేశ్వరి ►దీంతో కసి పెంచుకున్న భర్త ప్రవీణ్‌కుమార్ ► బిర్యానీలో విషం కలిపి భార్య, కొడుకును హత్య ► పాలకొండల్లో మృతదేహాల ఖననం ► ‘సాక్షి’ వరుస కథనాలతో దర్యాప్తు ముమ్మరం.. తతంగం బట్టబయలు కడప : ఉన్నత చదువు అభ్యసించిన నాగేశ్వరి జీవితం అనూహ్యంగా అర్ధంతరంగా ముగిసింది. దాంపత్య జీవితంలో అష్టకష్టాలు అనుభవించి తుదకు భర్త చేతిలో మృతి చెందింది. నిరాదరణకు గురిచేసిన భర్తే కుటుంబ పరువు పోతుందని ఆమెను అంతమొందించాడు. ఈ క్రమంలో ముక్కుపచ్చలారని కుమారుడిని సైతం మట్టుబెట్టాడు. విశ్వసనీయ సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. కడప నగరానికి చెందిన ఎన్.నాగేశ్వరీ ఎంఏ, బీఈడి చదివింది. 2003లో అక్కాయపల్లెకు చెందిన ప్రవీణ్‌కుమార్‌తో వివాహం చేశారు. తొలిబిడ్డ జన్మించాక అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చింది. దీంతో గత కొంతకాలంగా నాగేశ్వరి(33).. కుమారుడు ప్రణీత్‌రాజ్(7)తో కలిసి విడిగా ఉండేది. ఈ మధ్య కాలంలో కుటుంబ పోషణ భారం కావడంతో చర్చి ఫాదర్‌ను ఆశ్రయించి.. భర్తకు సర్ది చెప్పి న్యాయం చేయాలని కోరింది. దీంతో కుటుంబం పరువు పోయిందని భావించిన భర్త ప్రవీణ్‌కుమార్ వ్యూహాత్మకంగా ఆమెను అంతమొందించినట్లు సమాచారం. తన కుమార్తె కనిపించడం లేదని ఆమె తండ్రి పోలీసులను ఆశ్రయించినా పట్టించుకోని వైనంపై ‘సాక్షి’ ఈ నెల11, 13న ‘హత్యా.. అదృశ్యమా..?’ ‘ఛేజింగ్‌లో మిస్!’ శీర్షికలతో ప్రత్యేక కథనాలు వెలువరించింది. భర్త ఫోన్ కాల్స్ ఆధారంగా దర్యాప్తు సాగలేదని ఎత్తిచూపింది. ఆపై చేపట్టన దర్యాప్తులో అసలు విషయం వెలుగు చూసినట్లు సమాచారం. నమ్మకంగా ఉన్నట్లు నటించి మట్టుబెట్టాడు.. దశాబ్దానికి పైబడి నిరాదరణకు గురైన నాగేశ్వరి ఒక్కమారుగా భర్తలో వచ్చిన మార్పు చూసి సంతోషపడింది. భర్తతో కలిసిమెలిసి జీవించే అవకాశం రానుందని ఆశించి మరింత చేరువగా మెలిగింది. ఆ చేరువే అనుమానం లేకుండా హత్య చేసేందుకు ఆస్కారం ఏర్పడినట్లు సమాచారం. ఆమేరకే భర్త ప్రవీణ్‌కుమార్ అక్టోబర్ నుంచి ఎక్కువ చనువుగా ఉంటూ తరచూ ఫోన్ కాల్స్ చేస్తూ ఆమెకు దగ్గరైనట్లు సమాచారం. ఈక్రమంలో తినుబండారాలు సమకూరుస్తూ, అవసరమైన మేరకు డబ్బులు ఇచ్చినట్లు తెలుస్తోంది. డిసెంబర్ 10 వరకూ అదే ధోరణితో వ్యవహారించిన ప్రవీణ్ ఆ తర్వాత భార్య నాగేశ్వరి మరో యువకుడితో పరార్ అయినట్లు కట్టుకథ సృష్టించాడు. ఆమేరకు అనుమానం లేకుండా నాగేశ్వరి సెల్ నుంచి అమె సోదరికి ఎస్ఎంఎస్ పంపాడు. ఆపై తనపరపతితో ఎలాంటి ఇబ్బందులు లేకుండా పోలీసుల నుంచి ఒత్తిడి లేకుండా చాకచక్యంగా వ్యవహరించాడు. ఈ నేపథ్యంలో డిసెంబర్ 10 తర్వాత భార్య సెల్‌కు ఒక్కమారు కూడా ఫోన్ చేయకపోవడంపై ‘సాక్షి’ అనుమానం వ్యక్తం చేసింది. ఆ దిశగా దర్యాప్తు సాగించిన పోలీసులు.. కుమారుడి సహా ఆమె భర్త చేతిలో హత్యకు గురైనట్లు తెలుసుకున్నారు. ఐజాక్ తరహాలోనే.. జియాన్ కళాశాల అధిపతి రాజా రత్నం ఐజాక్ తన సొంత పాఠశాలలో కుమారుడు, కోడలు.. వారి ముగ్గురు పిల్లల మృతదేహాలను ఖననం చేయించిన రీతిలో ప్రవీణ్‌కుమార్ సైతం వ్యవహారం నడిపించి ఏమీ తెలియనట్లు నటిస్తున్నారని తెలుస్తోంది. ఇందులో భాగంగా నగర శివారులోకి కారులో భార్య, కుమారున్ని షికారుకు తీసుకెళ్లి నాగేశ్వరికి బిర్యానీలో, కుమారుడు ప్రణీత్రాజ్కు దోశలో విషం కలిపి ఇచ్చినట్లు సమాచారం. భర్త రోజురోజుకు చేరువ అవుతుండడంతో నమ్మిన నాగేశ్వరి బిర్యాని తింటూ.. కుమారుడికి తిన్పిస్తూ కారులో వెళ్లినట్లు తెలుస్తోంది. కొంత సేపటికి వారిద్దరూ స్పృహ తప్పి పడిపోగా, వారు చనిపోయారని ధ్రువీకరించుకున్న భర్త పాలకొండల్లోకి తీసుకెళ్లినట్లు సమాచారం. ముందస్తుగా కారులో సిద్ధం చేసుకున్న గోనె సంచుల్లో మృతదేహాలను కుక్కి ఓ గొయ్యిలో పూడ్చిపెట్టినట్లు తెలుస్తోంది. ఈ మేరకు పోలీసుల దర్యాప్తులో నిగ్గుతేలినట్లు సమాచారం. తహశీల్దార్ సమక్షంలో బుధవారం మృతదేహాలను వెలికి తీయనున్నారు. -
ఫలించని చివరి ప్రయత్నం...
-
యాదగిరిగుట్టకు రూ.లక్ష విరాళం
హైదరాబాద్: యాదగిరిగుట్ట అభివృద్ధికి ఇన్క్రెడిబుల్ ఇండియా ప్రాజెక్టు ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ రూ.లక్ష విరాళం అందజేసింది. కేరళ భవన్ శంకుస్థాపన సందర్భంగా యాదగిరిగుట్ట అభివృద్ధికి విరాళం ఇస్తామని ఆ సంస్థ డెరైక్టర్ ప్రవీణ్ కుమార్ నెడుంగడి ప్రకటించారు. అందుకు సంబంధించిన చెక్కును గురువారం రోజున ముఖ్యమంత్రి కార్యాలయానికి పంపించారు. -
‘సీట్ల’పై అసంతృప్తి లేదు: మాంఝీ
160 సీట్లలో పోటీకి బీజేపీ యోచన! న్యూఢిల్లీ: బిహార్ శాసనసభ ఎన్నికల్లో తమ పార్టీకి బీజేపీ కేటాయించిన సీట్ల సంఖ్యపై తనకు అసంతృప్తి లేదని ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, హిందుస్తాన్ అవామ్ మోర్చా(హెచ్ఏఎం) అధినేత జితిన్ రాం మాంఝీ ఆదివారం తెలిపారు. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల మధ్య సీట్ల పంపకాల్లో భాగంగా మాంఝీ పార్టీకి సుమారు 15 సీట్లు ఇస్తామని బీజేపీ శనివారం ప్రతిపాదించింది. అలాగే.. మాంఝీకి మద్దతుగా ఉన్న ఐదుగురు ప్రస్తుత శాసనసభ్యులు బీజేపీ టికెట్లపై పోటీ చేయాలని సూచించింది. ఈ ప్రతిపాదనపై మాంఝీ అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో ఎన్నికల వ్యవహారాలను పర్యవేక్షిస్తున్న బీజేపీ నేతల బృందం శనివారం సమావేశమై చర్చించింది. ఆదివారం ఢిల్లీలో మాంఝీని కేంద్రమంత్రులు అనంత్‌కుమార్, ధర్మేంద్రప్రధాన్ తదితరులు కలిసి మాట్లాడారు. 20 సీట్లు తీసుకోవడానికి మాంఝీ ఒప్పుకున్నట్లు తెలిసింది. మొత్తం 243 అసెంబ్లీ స్థానాల్లో సుమారు 160 సీట్లలో తాను పోటీ చేయాలని బీజేపీ భావిస్తోంది. పోలీసుల అదుపులో మాంఝీ తనయుడు జితిన్‌రామ్ మాంఝీ కుమారుడు ప్రవీణ్‌కుమార్ తన కారులో రూ. 4.65 లక్షల నగదుతో ప్రయాణిస్తుండగా అదుపులోకి తీసుకున్నట్లు ఆ రాష్ట్ర పోలీసులు తెలిపారు. గయ -జెహానాబాద్ చెక్‌పోస్ట్ వద్ద తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులు.. పట్నా నుంచి గయకు వెళుతున్న ప్రవీణ్ కారును తనిఖీ చేశారని.. ఆయన తన వద్ద ఉన్న నగదుకు సంబంధించిన సరైన వివరాలు చెప్పకపోవటంతో అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నామని వివరించారు. అయితే.. తాను పట్నాలో నిర్మిస్తున్న తన ఇంటి కోసం ఈ డబ్బును తన సోదరుల వద్ద నుంచి తీసుకెళుతున్నట్లు ప్రవీణ్ విలేకరులతో పేర్కొన్నారు. కాగా, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఈ నెల 19 నుంచి బిహార్‌లో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ 125వ జయంత్యుత్సవాలను ఏడాది పొడుగునా నిర్వహిస్తున్న కాంగ్రెస్.. అందులో భాగంగా 19వ తేదీన ‘సమత - సామరస్యత’ పేరుతో పశ్చిమ చంపారన్ జిల్లాలోని రామ్‌నగర్‌లో బహిరంగ సభను నిర్వహించాలని యోచిస్తోంది. మహాత్మా గాంధీ 1917లో ఇక్కడి నుంచే నీలిమందు రైతుల కోసం తొలి సత్యాగ్రహాన్ని ప్రారంభించారు. మజ్లిస్ పోటీ బీజేపీకి లాభం: కాంగ్రెస్ ఈ ఎన్నికల్లో పోటీ చేయాలన్న మజ్లిస్ పార్టీ నిర్ణయం బీజేపీ విస్తరణకు ఉపయోగపడుతుంది కానీ మజ్లిస్ పార్టీకి కాదని కాంగ్రెస్ పార్టీ విమర్శించింది. -
పోలీసుల పేరుతో హల్చల్: నలుగురి అరెస్టు
భాగ్యనగర్‌కాలనీ(హైదరాబాద్): పోలీసులమంటూ రాత్రి వేళల్లో వాహనదారులను ఆపి డబ్బులు వసూలు చేస్తున్న ముఠాను కూకట్పల్లి పోలీసులు పట్టుకున్నారు. ఎస్సై క్రాంతి తెలిపిన వివరాలివీ.. విజయ్‌నగర్‌కాలనీకి చెందిన షేక్ కరీం(22), మాధవరంనగర్ కాలనీకి చెందిన సత్యనారాయణ (30), బాగ్అమీర్కు చెందిన ప్రవీణ్‌కుమార్ (24), మాధవరంనగర్కు చెందిన గోపాలకృష్ణ (30) స్నేహితులు. అయితే, రాత్రి సమయాల్లో వీరంతా మద్యం తాగి వాహనదారులను బెదిరింపులకు గురిచేసేవారు. బుధవారం రాత్రి పటేల్‌కుంట పార్కు సమీపంలో ద్విచక్ర వాహనదారులను ఆపి వాహనం పత్రాలు చూపించాలని, లేదంటే పక్కన ఎస్ఐ ఉన్నాడని బెదిరించేవారు. ఈ క్రమంలోనే జగద్గిరిగుట్టకు చెందిన రాజేష్ ఉషాముళ్లపూడి రోడ్డు నుంచి జగద్గిరిగుట్టకు వెళ్లే క్రమంలో అతని బైక్ ఆపారు. అయితే, అతని వాహనం పేపర్లు అన్నీ సక్రమంగా ఉండటంతో హెల్మెట్లేదని వెయ్యి రూపాయలు అడిగారు. తన వద్ద డబ్బులు లేవు అనడంతో పర్సు తీయమన్నారు. పర్సులో ఉన్న 4 వేలతో పాటు అతని ఏటీఎం కార్డు లాక్కొని భాగ్యనగర్‌కాలనీలోని ఏటీఎం సెంటర్‌కు వెళ్లి పిన్ నంబర్ అడిగారు. అతడు ఎంతకూ పిన్ నెంబర్ చెప్పకపోవడంతో ఏటీఎం సెక్యూరిటీగార్డుతో వాదనకు దిగారు. అతడు వెంటనే పోలీసులకు సమాచారం అందించగా ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 4 వేలతో పాటు ఒక సెల్‌ఫోన్, మూడు బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. -
పుష్కర స్నానానికి వెళ్లి ఇద్దరు గల్లంతు
ఏటూరునాగారం : పుష్కర స్నానం చేసేందుకు గోదావరి నదిలో లోతుకు వెళ్లడంతో ప్రమాదవశాత్తు ఇద్దరు గల్లంతైన సంఘటన శనివారం వరంగల్ జిల్లా ఏటూరునాగారం మండల కేంద్రంలోని సింగారంలో చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు, గ్రామస్తుల కథనం ప్రకారం.. సింగారం గ్రామానికి చెందిన గడ్డం ముకుందరావు, ఆయన భార్య స్వాతి, యశ్వంత్, భార్గవి, తన అక్క కొడుకు గడ్డం ప్రవీణ్‌కుమార్‌తో కలిసి గోదావరి స్నానానికి వెళ్లారు. గోదావరిలో సరదాగా ముకుందరావు, ప్రవీణ్ కుమార్‌లు ఈతకొడుతుండగా ఒక్కసారిగా నదిలో పెద్ద గొయ్యి రావడంతో మునిగిపోయారు. నీళ్లు మింగుతూ బుడుగలు పైకి వ చ్చారుు. ఒడ్డుపై ఉన్న స్వాతి, గ్రామస్తులు ఇద్దరు మునిగిపోతున్నారని కేకలు వేసి లబోదిబోమని మొత్తుకున్నారు. ఆ సమయంలో ఈత వచ్చిన వ్యక్తులు దగ్గరలో లేకపోవడంతో వారిని కాపాడుకోలేకపోయామని స్వాతి రోదిస్తూ తెలిపింది. -
గురుకులాలు దేశానికే గర్వకారణం
అలంపూర్ రూరల్: తెలంగాణ గురుకులాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని సాంఘిక సంక్షేమశాఖ గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ కొనియాడారు. గురుకులాలను ఆదర్శవంతంగా తీర్చిదిద్ది అం దరి ఆదరాభిమానాలు పొందానని అన్నా రు. ఇక్కడ చదువుతున్న పేదవిద్యార్థులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించానని పేర్కొన్నారు. శుక్రవారం ఆయన తన సొంతూరు అలంపూర్‌కు వచ్చారు. స్థానిక సంతోష్‌నగర్ కాలనీలో అంబేద్కర్ విజ్ఞానకేంద్రాన్ని సందర్శించి అక్కడివారితో మాట్లాడారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ.. అనేక రాష్ట్రా లు తమ విద్యాలయాల విధానాలనే పాటిస్తున్నాయని చెప్పారు. అన్ని వి ద్యాలయాల్లో అన్ని హంగులతో అధునాతన సౌకర్యాలు కల్పించామన్నారు. ఇక్కడ విలువలతో కూడిన విద్యను అందిస్తున్నామని వివరించారు. గత వేసవిసెలవుల్లో విద్యార్థులకు ఎన్నో అంశాలతో శిక్షణ ఇచ్చామని తెలిపారు. వివిధ దేశాల నిపుణులతో కోచింగ్ ఇప్పించామన్నారు. జిల్లాలోని ఇటిక్యాల, గోపాలపేటలో రూ.30కోట్లతో గురుకుల విద్యాలయాన్ని నిర్మిస్తున్నామని వివరించారు. ఇటిక్యాల గురుకుల పాఠశాల విద్యార్థులు సుందర్రాజు, ఈదన్న థాయ్‌లాండ్‌లో జరిగిన యోగాపోటీల్లో చాంపియన్లుగా నిలవడం గర్వంగా ఉందన్నారు. రాష్ట్రంలో ఉన్న 135 గురుకులాల్లో 19వేల సీట్ల కోసం 89వేల దరఖాస్తులు వచ్చాయని వివరించారు. కేజీ టు పీజీ విద్యావిధానంలో సాంఘిక సంక్షేమశాఖ గురుకుల విద్యాలయాలు ప్రధాన భూమిక పోషిస్తున్నాయని అన్నారు. పదో తరగతిలో ప్రైవేట్‌సంస్థలకు దీటుగా 89శాతం ఫలితాలు సాధించామన్నారు. 40మంది విద్యార్థులను ఐఐటీకి పంపించామని, ప్రముఖ అజీమ్ ప్రేమ్‌జీ యూనివర్సిటీలో 30సీట్లకు 27 సీట్లు తమ విద్యార్థులకే వచ్చాయని చెప్పారు. ఆయన వెంట ఏపీ ఉమెన్స్ కమిషన్ సభ్యురాలు సునితాకృష్ణన్ ఉన్నారు. అక్టోబర్ నాటికి గురుకుల పాఠశాలను ప్రారంభిస్తాం ఇటిక్యాల: గోపాల్పేట, ఇటిక్యాల సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలను అక్టోబర్ నాటికి ప్రారంభిస్తామని డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ తెలిపారు. శుక్రవారం ఇటిక్యాల మండల కేంద్రంలో నిర్మాణమవుతున్న గురుకుల భవనాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. విద్యార్థులకు సౌకర్యాలు కల్పిస్తామన్నా రు. భవన నిర్మాణాన్ని నాణ్యవంతంగా చేపట్టాలని కాంట్రాక్టర్‌కు సూచించారు. విద్యార్థుల్లో దాగిఉన్న సృజనాత్మకతను వెలికి తీసేందుకు పలు కార్యక్రమాలు చేపడుతున్న వివరించారు. ఆయన వెంట అలంపూర్ గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ రవీందర్, భవననిర్మాణ సైట్ ఇంజనీర్ ఆంజనేయులు ఉన్నారు. -
‘ప్రైవేటు’టీచర్లలోనే క్వాలిటీ ఉందంటే రాజీనామా
సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల కార్యదర్శి ప్రవీణ్ కుమార్ సవాల్ హైదరాబాద్: ప్రభుత్వ టీచర్లలో ఉన్న క్వాలిటీ ప్రైవేట్ టీచర్లలో ఉందని నిరూపిస్తే తన ఉద్యోగానికి రాజీనామా చేస్తానని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల కార్యదర్శి ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ సవాల్ విసిరారు. శనివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో టిఎస్‌యుటిఎఫ్, ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ఐ, ఐద్వా ఆధ్వర్యంలో ప్రభుత్వ విద్యా సమస్యలపైన సదస్సు జరిగింది. ఈ సందర్భంగా ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వ విద్యావిధానం బలంగానే ఉంద న్నారు. ప్రైవేట్ సంస్థలు తమకు వచ్చిన కొద్ది ర్యాంకులను పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నాయన్నారు. మాజీ ఎమ్మెల్సీ కె.నాగేశ్వర్, ఎస్టీఎఫ్ఐ జాతీయ ఉపాధ్యక్షులు నారాయణ, టీఎస్‌యూటీఎఫ్, ఎస్ఎఫ్ఐ, ఐద్వా, డీవైఎఫ్ఐ నాయకులు చావా రవి, సాంబశివ, హైమావతి, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. -
హిందూపురం వద్ద రైలు ప్రమాదం
-
హిందూపురం వద్ద రైలు ప్రమాదం
హిందూపురం (అనంతపురం జిల్లా): అనంతపురం నుంచి బెంగళూరువైపు వెళుతున్న హంపీ ఎక్స్‌ప్రెస్ కాపలా లేని గేటువద్ద ఆగివున్న లారీని ఢీకొనడంతో లారీ డ్రైవర్ అక్కడికక్కడే మృతిచెందారు. ఈ సంఘటన బుధవారం వేకువజామున 3.30 గంటలకు హిందూపురం సమీపంలోని దేవరపల్లి సమీపంలో జరిగింది. ఫలితంగా బెంగుళూరు వైపు వెళ్లే రైళ్ల రాకపోకలకు కాసేపు అంతరాయం కలిగింది. దేవరపల్లి వద్ద కాలపాలేని రైల్వే గేటు ఉంది. బెంగుళూరు నుంచి హిందూపురం పారిశ్రామిక వాడకు తుక్కు ఇనుము లోడుతో వెళుతున్న ఒక లారీ సాంకేతిక లోపంతో రైలు పట్టాలపై ఆగిపోయింది. అదే సమయంలో అనంతపురం నుంచి బెంగుళూరు వైపు వెళుతున్న హంపీ ఎక్స్‌ప్రెస్ వేగంగా వచ్చి రైలును ఢీకొంది. ఈ సంఘటనలో లారీ డ్రైవర్ ప్రవీణ్‌కుమార్ అక్కడికక్కడే మృతిచెందాడు. లారీని చాలాదూరం లాక్కెళ్లిన రైలు ఆగిపోయింది. అయితే రైలు ప్రయాణికులకెవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. రైలు ఆగిపోవడంతో ప్రయాణికులు చీకట్లో ఏమి జరిగిందో తెలియక భయభ్రాంతులకు గురై హాహాకారాలు చేశారు. రైలు ఆగిన వెంటనే విషయం తెలుసుకుని ఊపిరి పీల్చుకున్నారు. స్థానికుల సమాచారంతో సంఘటన స్థలానికి చేరుకున్న ఆర్పీఎఫ్ పోలీసులు లారీ డ్రైవర్ మృతదేహాన్ని హిందూపురం ప్రభుత్వ ఆసత్రికి తరలించారు. కాసేపు ఆగిన రైలు యథావిధిగా వెళ్లిపోయింది. హిందూపురం రైల్వే పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు ప్రవీణ్‌కుమార్ హిందూపురం పట్టణానికి చెందినవాడు. -
ప్రేమ.. సహజీవనం.. మరో యువతితో పెళ్లి
-
ప్రేమ.. సహజీవనం.. మరో యువతితో పెళ్లి
ఖమ్మం : ఓ యువతిని ప్రేమించాడు.. ఇద్దరూ సహ జీవనం చేశాడు. గర్భవతి అయిన ఆమె పెళ్లి ప్రస్తావన తెచ్చేసరికి యువకుడు మొహం చాటేశాడు. దాంతో ఆ యువతి న్యాయం చేయాలంటూ పోలీసులను ఆశ్రయించింది. పెళ్లి చేసుకోడానికి తనకు కొంత సమయం కావాలని అతగాడు కోరాడు. తర్వాత పత్తా లేకుండా పోయాడు. మరోవైపు ఓ యువతితో పెళ్లికి సిద్దమయ్యాడు. సమాచారం అందుకున్న ప్రియురాలు ఘటనా స్థలానికి చేరుకుని ఆ ప్రబుద్ధుడికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ఖమ్మం జిల్లా మణుగూరుకు చెందిన ప్రవీణ్ కుమార్.. హైదరాబాద్‌లో ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఆ సమయంలో ఖమ్మానికి చెందిన ఓ యువతితో పరిచయమైంది. అది కాస్తా ప్రేమగా మారి, సహజీవనానికి దారి తీసింది. ఫలితంగా ఆమె గర్భవతి అయ్యింది. కానీ ఆమెతో పెళ్లికి ప్రవీణ్ కుమార్ సాకులు చెపుతూ కాలయాపన చేయటంతో బాధితురాలు పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. అతనిపై కేసు నమోదైంది. దాంతో అతడు వివాహానికి కొంత సమయం కావాలని కోరి, అనంతరం మణుగూరుకు మకాం మార్చాడు. తర్వాత మరో యువతితో పెళ్లికి రెడీ అయ్యాడు. విషయం తెలుసుకున్న బాధితురాలు, బంధువులు శనివారం పెళ్లి వేదిక వద్దకు చేరుకుని ప్రవీణ్ కుమార్‌పై చేయి చేసుకున్నారు. అమ్మాయి, అబ్బాయి వైపు బంధువులంతా జుట్లు జుట్లు పట్టుకుని తెగ కొట్టుకున్నారు. -
ప్రతిపక్షాల నజర్
ఎమ్మెల్సీ స్థానంపై ఆశలు మెజారిటీ లేకపోయినా పీఠం కోసం ప్రయత్నాలు హైదరాబాద్‌లో రహస్య సమావేశం టీఆర్ఎస్ తరఫున తెరపైకి టీఎన్జీవో నేత దేవిప్రసాద్ సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : మూడేళ్లుగా ఖాళీగా ఉంటున్న స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానంపై ప్రతిపక్ష పార్టీలు కూడా కన్నేశాయి. స్థానిక సంస్థల్లో అధికార టీఆర్ఎస్ పార్టీకి పూర్తి మెజారిటీ ఉంది. ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీ, టీడీపీలకు ఏ ఒక్క పార్టీకి సొంతంగా గానీ, అన్ని పార్టీలు ఏకమై బరిలోకి దిగినా ఈ పీఠాన్ని గెలుచుకునేందుకు సరి పడా మెజారిటీ లేదు. అయినా.. ఈ స్థానం కోసం ప్రతిపక్ష పార్టీల నే తలు ఒకరిద్దరు తెరవెనుక పావులు కదుపుతున్నా రు. ప్రతిపక్ష పార్టీల ప్రజాప్రతినిధులతోపాటు, అధికార పార్టీ సభ్యులకు కూడా భారీ మొత్తంలో నజరానాలు ఇచ్చి గట్టెక్కేందుకు ఇప్పటి నుంచే ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ మేరకు మూడు ప్రతిపక్ష పార్టీల నేతలు కొందరు ఇటీవల హైదరాబాద్‌లో సమావేశమవడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీస్తోంది. గతంలో కూడా స్థానిక సంస్థల్లో కాంగ్రెస్‌కు మెజారిటీ లేకపోయినా, కాంగ్రెస్‌కు చెందిన ప్రేంసాగర్‌రావు ఇలాగే ఎమ్మెల్సీగా విజయం సాధించారు. అప్పట్లో స్థానిక సంస్థల్లో కాంగ్రెస్ కన్నా టీడీపీకి సుమారు 160 మంది సభ్యుల మెజారిటీ ఉండేది. అయినా కొందరు టీడీపీ సభ్యుల సహకారంతో కాంగ్రెస్ నుంచి ప్రేంసాగర్‌రావు గట్టెక్కారు. ఈసారీ అలాంటి ఎత్తుగడలు వేసేందుకు టీఆర్ఎస్యేతర పార్టీల నేతలు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. కొద్ది రోజుల్లోనే పట్టభద్రులు, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల నగారా మోగనుంది. చివరిసారిగా జిల్లాలోని స్థానిక సంస్థలకు 2007లో ఎన్నికలు జరిగాయి. గెలుపొందిన ప్రేంసాగర్‌రావుకు లాటరీలో ఆరేళ్ల పదవీ కాలం లభించింది. 2013తో ఆయన పదవీకాలం ముగిసింది. అప్పటి నుంచి ఈ స్థానం ఖాళీగా ఉంటోంది. తెరపైకి దేవిప్రసాద్ పేరు.. అధికార టీఆర్ఎస్ పార్టీ తరఫున కొత్తగా టీఎన్జీవో నేత దేవిప్రసాద్ పేరు తెరపైకి వచ్చింది. గతంలో ఆయనకు ఇచ్చిన హామీ మేరకు దేవిప్రసాద్‌ను ఇక్కడి నుంచి బరిలోకి దింపాలని అధినేత కేసీఆర్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే నిర్మల్‌కు చెందిన ఆ పార్టీ సీనియర్ నేత శ్రీహరిరావు కూడా ఎమ్మెల్సీ కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఆ పార్టీకి చెందిన తూర్పు, పశ్చిమ జిల్లాల అధ్యక్షులు పురాణం సతీష్, లోక భూమారెడ్డిల పేర్లు మొదటి నుంచీ వినిపిస్తున్నాయి. సామాజిక సమీకరణాల్లో భాగంగా ఆ పార్టీ బెల్లంపల్లి నియోజకవర్గ ఇన్‌చార్జీగా పనిచేసిన ప్రవీణ్‌కుమార్ పేరు కూడా అధినేత పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. గెలుపు అవకాశాలు పూర్తిస్థాయిలో ఉన్న జిల్లా నుంచి టీఎన్జీవో నేత దేవిప్రసాద్‌ను బరిలోకి దింపాలనే యోచనలో అధినేత కేసీఆర్ ఉన్నట్లు తెలుస్తోంది. టీఆర్ఎస్కు అత్యధిక బలం.. వరుస ఎన్నికల్లో జిల్లాలో విజయ ఢంకా మోగించిన టీఆర్ఎస్ స్థానిక సంస్థలపై గులాబీ జెండాను ఎగురవేసింది. జిల్లా పరిషత్‌తోపాటు, భైంసా మినహా మిగిలిన ఐదు మున్సిపాలిటీలను తన ఖాతాలో వేసుకుంది. అలాగే 52 మండలాల్లో 42కు పైగా మండల పరిషత్‌లను టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. కొన్ని మండలాల్లో అసలు ప్రతిపక్ష పార్టీల ఉనికే లేకుండా పోయింది. పూర్తి మెజారిటీ ఉన్న టీఆర్ఎస్కు విజయావకాశాలున్నాయి. ఈ ఎన్నికల నిర్వహణకు జిల్లా అధికార యంత్రాంగం ముందస్తు ఏర్పాట్లు ఎప్పుడో పూర్తి చేసింది. ఈ స్థానిక సంస్థల జిల్లా ప్రజాప్రతినిధుల ఓటరు జాబితాను రెండు నెలల క్రితమే ఎన్నికల సంఘానికి పంపారు.