'Our Own Abuse Us': ‘‘సాధారణంగా నేను ఎవరితోనూ గొడవ పెట్టుకోను. మెల్‌బోర్న్‌లో అనుకుంటా.. ఆరోజు నేను, రోహిత్ శర్మ, మనోజ్ తివారి ఉన్నాం. నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తున్నాం. అప్పుడే అక్కడికి వచ్చిన కొంతమంది ఎందుకో మమ్మల్ని దుర్భాలాషడటం మొదలుపెట్టారు. వాళ్లు టీమిండియా అభిమానులమని చెప్పుకొంటున్నారు. కానీ.. రోహిత్ శర్మను అసభ్య పదజాలంతో దూషించారు.
అయినా తను చాలాసేపు ఓపిక పట్టాడు. కానీ వాళ్ల ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో రోహిత్ సహనం కట్టలు తెంచుకుంది. తను కూడా వాళ్లకు తిరిగి బదులివ్వడం మొదలుపెట్టాడు.
నేను కూడా తనతో కలిసి వారి మాటకు మాటా సమాధానం చెప్పాను. కానీ ఎందుకో సొంత అభిమానులే మమ్మల్ని దూషించడం బాధించింది’’ అంటూ టీమిండియా మాజీ పేసర్ ప్రవీణ్ కుమార్ షాకింగ్ కామెంట్స్ చేశాడు.
అభిమానులమని చెప్పుకొంటూనే దూషిస్తూ
ఆస్ట్రేలియా టూర్‌కు వెళ్లినపుడు తమకు ఎదురైన చేదు అనుభవం గురించి గుర్తు చేసుకున్నాడు. రోహిత్ శర్మను అకారణంగా కొంతమంది దూషించారని వారికి తామిద్దరం కలిసి గట్టిగానే బదులిచ్చామని ప్రవీణ్ కుమార్ పేర్కొన్నాడు. అభిమానులమని చెప్పుకొనే కొంతమంది ఆరోజు హిట్‌మ్యాన్‌కు కించపరిచే విధంగా వ్యవహరించారని తెలిపాడు.
సంచలన వ్యాఖ్యలతో వార్తల్లో
కాగా ది లలన్‌టాప్‌నకు ఇస్తున్న ఇంటర్వ్యూలో భాగంగా సంచలన వ్యాఖ్యలు చేస్తూ గత కొన్ని రోజులుగా ప్రవీణ్ కుమార్ వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే. టీమిండియాలో చాలా మందికి మద్యం సేవించే అలవాటు ఉన్నా ఓ సీనియర్ ప్లేయర్ మాత్రం తన పేరును హైలైట్ చేశాడని ప్రవీణ్ ఆరోపించాడు.
అదే విధంగా చెప్పినట్లు వినకపోతే ఐపీఎల్‌లో తనకు అవకాశాలు రాకుండా చేస్తానని మాజీ చైర్మన్ లలిత్ మోదీ వార్నింగ్ ఇచ్చాడని ప్రవీణ్ పేర్కొన్నాడు. ఇక బౌలర్లంతా అప్పుడప్పుడు టాంపరింగ్‌కు పాల్పడతారని.. అయితే పాకిస్తాన్ బౌలర్లు మాత్రం ఎక్కువగా ఇలాంటి పనులు చేస్తారని ఆరోపణలు గుప్పించాడు.
రీఎంట్రీకి సిద్ధమైన రోహిత్
కాగా 37 ఏళ్ల ప్రవీణ్ కుమార్ టీమిండియా తరఫున అంతర్జాతీయ స్థాయిలో ఆరు టెస్టు, 68 వన్డే, 10 టీ20 మ్యాచ్‌లు ఆడి.. మొత్తంగా 112 వికెట్లు పడగొట్టాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో 119 మ్యాచ్‌లలో కలిపి 90 వికెట్లు తీశాడు.
ఇక 2017లో తన చివరి మ్యాచ్ ఆడిన ప్రవీణ్ ఆ తర్వాత ఆటకు గుడ్‌బై చెప్పాడు. ఇదిలా ఉంటే.. రోహిత్ శర్మ ప్రస్తుతం అఫ్గనిస్తాన్‌తో సిరీస్‌కు సిద్ధమైన విషయం తెలిసిందే. సొంతగడ్డపై జరుగుతున్న ఈ సిరీస్ ద్వారా దాదాపు 14 నెలల తర్వాత హిట్‌మ్యాన్ అంతర్జాతీయ టీ20లలో రీఎంట్రీ ఇస్తున్నాడు.
చదవండి: Ishan Kishan: అప్పటి వరకు ఇషాన్‌కు టీమిండియాలో స్థానం లేదు.. హింటిచ్చిన ద్రవిడ్
Comments
Please login to add a commentAdd a comment