India vs Afghanistan
-
అఫ్గానిస్తాన్‌కు షాక్.. గుడ్‌బై చెప్పనున్న రషీద్ ఖాన్!
టీమిండియా, అఫ్గానిస్తాన్ మధ్య ఏకైక టెస్టు మ్యాచ్ ప్రారంభానికి ముందు ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అఫ్గానిస్తాన్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ టెస్టు రిటైర్మెంట్పై త్వరలో కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. అయితే భారత్‌తో జరగనున్న ఏకైక టెస్టు మ్యాచ్‌కు రషీద్ ఖాన్ దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. టెస్టు క్రికెట్లో చాలాసేపు బౌలింగ్ చేయాల్సి రావడంతో, దీర్ఘకాలిక వెన్నునొప్పి వల్ల ఎక్కువ బంతులు వేయలేనని రషీద్ ఖాన్ గతం లోనే స్పష్టం చేశాడు. అయితే తాజాగా రషీద్ ఖాన్ టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు పలకనున్నాడా అనే దానిపై ఆ జట్టు కోచ్ రిచర్డ్ ఫైబస్ స్పం దించారు. 'రషీద్ ఖాన్ దీర్ఘకాలిక నడుమునొప్పితో బాధపడుతున్నాడు. టెస్టు క్రికెట్‌కు దూరమవ్వాలని రషీద్ ఎప్పుడో నిర్ణయిం చుకున్నాడు.అతడు దేశంతో పాటు చాలా ప్రైవేటు లీగ్స్‌లో ఆడుతుంటాడు. అయితే రషీద్ మా జట్టుకు ఫ్రంట్‌లైన్ బౌలర్ కావడంతో అతడిని జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరముంది. టెస్టు క్రికెట్‌కు దూరంగా ఉండాలని భావిస్తున్న రషీద్‌తో నేను రెడ్‌బాల్ క్రికెట్లో కొనసాగాలని అడుగుతాను. కానీ ఆడతాడా లేదా అన్నది అతడి నిర్ణయంపైనే ఆధారపడి ఉంది.27 ఏళ్ల రషీద్ ఖాన్ 2023 వన్డే ప్రపంచకప్‌కు ముందు నుంచే వెన్నుగాయం తీవ్రంగా ఇబ్బంది పెడుతూ వస్తోంది. అప్పటినుంచి ఎక్కువసేపు బౌలింగ్ చేయడంలో రషీద్ ఖాన్ తీవ్రంగా ఇబ్బంది పడుతూ వస్తున్నాడు. అయితే ఈ ఏడాది ఏప్రిల్‌లో తాను టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు పలకాలని నిర్ణయించుకున్నా అని రషీద్ ఖాన్ తెలిపాడు. కాబట్టి టెస్టు క్రికెట్లో ఆడాలా వద్దా అనేది అతడి ఇష్టానికే వదిలేస్తున్నాం' అని తెలిపాడు.కాగా రషీద్ ఖాన్ గైర్హాజరీలో అఫ్గానిస్తాన్ జట్టుకు హష్మతుల్లా షాహిది జట్టును నడిపించనున్నాడు. జట్టులో రహమనుల్లా జద్రన్, అఫ్సర్ జజాయ్, ఇక్రమ్ అలీఖిలి, అజ్మతుల్లా ఒమర్జయ్లు కీలక ఆటగాళ్లుగా ఉన్నారు. ఇక అఫ్గానిస్తాన్ 2018లో టెస్టు హోదా పొందింది. అప్పటినుంచి 12 మ్యాచ్‌లాడగా, నాలుగు విజయాలు, ఏడు ఓటములు, ఒక డ్రా నమోదు చేసింది. అఫ్గానిస్తాన్ చివరగా గతేడాది అక్టోబర్‌లో జింబాబ్వేతో టెస్టు మ్యాచ్ ఆడింది. అయితే ఆ మ్యాచ్‌లో అఫ్గానిస్తాన్ 73 పరుగుల తేడాతో ఓటమి చవిచూసింది. అఫ్గానిస్తాన్ స్టార్ బౌలర్‌గా వెలుగొందుతున్న రషీద్ ఖాన్ ఆల్‌రౌండర్‌గా రాణిస్తున్నాడు. ఆ జట్టు తరఫున ఆరు టెస్టుల్లో 154 పరుగులు, 45 వికెట్లు; 117 వన్డేల్లో 1,393 పరుగులు, 210 వికెట్లు; 113 టీ20ల్లో 622 పరుగులు, 190 వికెట్లు తీశాడు.చదవండి: ఆసీస్‌పై సిరీస్ విజయం.. పాక్ క్రికెటర్‌కు బంపరాఫర్! -
గాయాల బారిన సీనియర్లు.. టీమిండియాకు షాక్ తప్పదా?
ఐపీఎల్ 2026 సీజన్ ముగియడంతో టీమిండియా ప్రస్తుతం అఫ్గానిస్తాన్‌తో జరగనున్న టెస్టుతో పాటు వన్డే సిరీస్‌పై దృష్టి సారించింది. రేపటి నుంచి భారత్, అఫ్గానిస్తాన్ మధ్య ముల్లన్పూర్ వేదికగా ఏకైక టెస్టు మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌కు గిల్ నేతృత్వంలోని టీమిండియా స్టేడియానికి చేరుకొని ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టేసింది. టెస్టు సిరీస్ ముగిసిన తర్వాత వెంటనే మూడు వన్డే మ్యాచ్‌ల సిరీస్ జరగనుంది. ఈ సిరీస్‌కు సీనియర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ పేర్లను పరిగణలోకి తీసుకొని ఎంపిక చేశారు. అయితే పిక్క కండరాల గాయంతో కోహ్లీ ఈ సిరీస్‌కు దూరమైనట్లు బీసీసీఐ ప్రకటించింది. దీంతో కోహ్లీ స్థానంలో జట్టులోకి వచ్చేది ఎవరనే దానిపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఆఫ్గన్‌తో వన్డే సిరీస్‌కు కోహ్లీ స్థానంలో రుతురాజ్ గైక్వాడ్‌ను ఎంపిక చేసినట్లు వార్తలు వచ్చాయి. జూన్ 13న ధర్మశాల వేదికగా జరగనున్న తొలి వన్డేకు రుతురాజ్ అందుబాటులో ఉంటాడని బీసీసీఐ ప్రకటన విడుదల చేసినట్లు నివేదికలు వచ్చాయి. కానీ రుతురాజ్ గైక్వాడ్ భారత-ఏ జట్టుతో కలిసి శ్రీలంక పర్యటనకు బయల్దేరి వెళ్లిన ఫొటోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షం కావడంతో ఈ వార్తలన్నింటికీ ఫుల్స్టాప్ పడినట్లయింది.లంక పర్యటనలో భారత్.. శ్రీలంక-ఏ, అప్గానిస్తాన్-ఏ జట్లతో కలిసి ట్రై సిరీస్ ఆడనుంది. తాజాగా రుతురాజ్ కొలంబోలో దర్శనమివ్వడంతో మరి కోహ్లీ స్థానంలో ఆడే ఆటగాడు ఎవరన్నది ఇంకా మిస్టరీగానే ఉండిపోయింది. అయితే ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటీదార్ పేరు కూడా పరిశీలనలో ఉన్నట్లు సమాచారం.ఎటూ తేల్చని బీసీసీఐ?ఆఫ్గన్‌తో వన్డే సిరీస్‌కు 15 మందితో జట్టును ప్రకటించడంతో కోహ్లీ దూరమైన అతడి స్థానాన్ని ఆ సిరీస్‌కు ఎంపికైన ఆటగాళ్లలో ఒకరితోనే భర్తీ చేయాలనే నిర్ణయానికి బీసీసీఐ వచ్చినట్లు తెలుస్తోంది. కోహ్లీతో పాటు రోహిత్ శర్మ కూడా ఆఫ్గన్‌తో వన్డే సిరీస్ ఆడడం అనుమానంగానే ఉంది. అతడు కూడా పిక్క కండరాల గాయంతో బాధపడుతుండడం టీమిండియాకు ప్రతికూలంగా మారనుంది. మరోవైపు ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా కూడా వెన్నునొప్పితో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఇలా జట్టులోని సీనియర్లంతా గాయాల బారిన పడడంతో వన్డే సిరీస్‌లో అప్గానిస్తాన్ మనకు షాక్ ఇచ్చినా ఆశ్చర్యపోనసరం లేదని అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. కోహ్లీ, రోహిత్, పాండ్యాలు దూరమైతే మాత్రం బీసీసీఐ వీరి స్థానంలో కనీసం ఇద్దరినైనా జట్టులోకి తీసుకోవాల్సిన అవసరముంటుంది. అయితే వన్డే సిరీస్‌కు ఇంకా సమయం ఉండడంతో బీసీసీఐ దీనిపై ఏదో ఒక నిర్ణయం తీసుకోనుంది.ఆఫ్గన్‌తో వన్డే సిరీస్‌కు టీమిండియాశుబ్మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, శ్రేయస్ అయ్యర్ (వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ, ప్రిన్స్ యాదవ్, గుర్నూర్ బ్రార్, హర్ష్ దూబేచదవండి: ఫిఫాకు ట్రోఫీ తిరిగివ్వని బ్రెజిల్.. విలువెంతో తెలుసా? -
అతడికి అన్యాయం.. ఛాన్సులు ఇవ్వలేదు: గంభీర్
టీమిండియా స్వదేశంలో అఫ్గనిస్తాన్‌తో సిరీస్‌కు సిద్ధమైంది. ఇందులో భాగంగా తొలుత ముల్లన్పూర్ వేదికగా ఏకైక టెస్టు ఆడనుంది. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఇప్పటికే తమ జట్టును ప్రకటించింది.వన్‌డౌన్‌లో ఎవరు?శుబ్‌మన్ గిల్ సారథ్యంలోని టెస్టు జట్టులో కొత్తగా మానవ్ సుతార్, గుర్నూర్ బ్రార్, హర్ష్ దూబే కొత్తగా చోటు దక్కించుకున్నారు. ఇదిలా ఉంటే.. మూడో స్థానం కోసం సాయి సుదర్శన్, దేవ్‌దత్ పడిక్కల్ మధ్య పోటీ నెలకొంది. సాయి సుదర్శన్ చివరగా స్వదేశంలో సౌతాఫ్రికాతో రెండో టెస్టులో టీమిండియా తరఫున బరిలో దిగాడు.ఈ మ్యాచ్‌లో సాయి దారుణంగా విఫలమయ్యాడు. తొలి ఇన్నింగ్స్‌లో 15 పరుగులు చేసిన అతడు.. రెండో ఇన్నింగ్స్‌లో 14 పరుగులకే వెనుదిరిగాడు. ఈ నేపథ్యంలో అఫ్గన్‌తో టెస్టులో సాయికి కాకుండా పడిక్కల్‌కు అవకాశం ఇస్తారనే చర్చ నడుస్తోంది. ఈ విషయంపై టీమిండియా హెడ్‌కోచ్ గౌతం గంభీర్ స్పందించాడు.న్యాయంగా మరొక్క ఛాన్స్ ఇవ్వాలిఅఫ్గన్తో శనివారం నాటి టెస్టుకు ముందు మీడియాతో మాట్లాడుతూ.. ‘‘సాయి సుదర్శన్‌కు సరైన అవకాశాలు లభించలేదు. అతడు ఎక్కువగా ఇంగ్లండ్‌లోనే ఆడాడు. అతడికి న్యాయంగా మరొక్క ఛాన్స్ ఇవ్వాలని నేను బలంగా విశ్వసిస్తున్నా.ఏదేమైనా మేము పదకొండు మందిని మాత్రమే తుదిజట్టులోకి ఎంపిక చేస్తాము కదా!.. సాయి ఫామ్ కూడా మరీ అంత చెత్తగా ఏమీ లేదు. ఇటీవల ఐపీఎల్లో అతడు 700కు పైగా పరుగులు సాధించాడు. కేవలం 4-5 మ్యాచ్‌ల ద్వారా సాయి ఆట తీరుపై నిర్ణయానికి రాకూడదు’’ అని గంభీర్ పేర్కొన్నాడు.పడిక్కల్ మరోసారి బెంచ్‌కే తద్వారా అఫ్గనిస్తాన్‌తో ఏకైక టెస్టులో సాయి సుదర్శన్‌లో వన్‌డౌన్‌లో ఆడిస్తామని గంభీర్ పరోక్షంగా సంకేతాలు ఇచ్చాడు. దీంతో పడిక్కల్ మరోసారి బెంచ్‌కే పరిమితమయ్యే పరిస్థితి కనిపిస్తోంది.కాగా కర్ణాటక బ్యాటర్ పడిక్కల్ రంజీ ట్రోఫీ 2025-26 సీజన్లో 543 పరుగుల సాధించి మంచి ఫామ్‌లో ఉన్నాడు. అయితే, గంభీర్ మాత్రం సాయి వైపే మొగ్గుచూపడం గమనార్హం.ఇదిలా ఉంటే.. చివరగా సొంతగడ్డపై సౌతాఫ్రికాతో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆడిన టీమిండియా.. ప్రత్యర్థి చేతిలో 2-0తో వైట్‌వాష్ అయింది. ఇదిలా ఉంటే.. అఫ్గన్‌తో టెస్టు ప్రపంచకప్ టెస్టు చాంపియన్‌షిప్ సైకిల్లో భాగం కాదు. అయితే, ఈ మ్యాచ్ ద్వారా టీమిండియా తమ బలాన్ని పరీక్షించుకునే వీలు దొరికింది. కాగా టెస్టు తర్వాత టీమిండియా అఫ్గన్‌తో మూడు వన్డేలు ఆడనుంది.చదవండి: ‘ఇండియాలో లైఫ్ కోహ్లికి అస్సలు నచ్చదు’ -
భారత తుది జట్టు ఇదే.. ఆ ఇద్దరి అరంగేట్రం ఫిక్స్?
ఐపీఎల్-2026 సీజన్ మెరుపులు తర్వాత సంప్రదాయ క్రికెట్ సమరానికి రంగం సిద్దమైంది. భారత్-అఫ్గానిస్తాన్ మధ్య ఏకైక టెస్ట్ మ్యాచ్ శనివారం నుంచి ముల్లాన్‌పూర్ వేదికగా ప్రారంభం కానుంది. ఇది వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ (WTC)లో భాగం కానప్పటికీ.. అందరి దృష్టి మాత్రం ఈ ఏకైక మ్యాచ్ పైనే ఉంది. ఎందుకంటే సౌతాఫ్రికా చేతిలో టెస్ట్ సిరీస్ క్లీన్ స్వీప్ తర్వాత స్వదేశంలో భారత్ ఆడుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ ఇది.అంతకంటే ముందు సొంతగడ్డపై న్యూజిలాండ్ చేతిలో కూడా టీమిండియాకు ఘోర పరభావం ఎదురైంది. ఈ నేపథ్యంలో భారత జట్టు స్వదేశంలో తమను తాము నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. అఫ్గాన్ కంటే భారత్ అన్ని విధాలగా పటిష్టంగా ఉన్నప్పటికి.. మైదానంలో ఆధిపత్య క్రికెట్ ఆడగలరా? లేదా అన్నది వేచి చూడాలి. ఈ మ్యాచ్‌తో కొన్ని కొత్త ముఖాలు అంతర్జాతీయ క్రికెట్‌కు పరిచయం అయ్యే అవకాశముంది. హర్ష్ దూబే, గుర్నార్ బ్రార్ వంటి యువ ఆటగాళ్లు డెబ్యూ చేయనున్నట్లు తెలుస్తోంది.అదేవిధంగా దేవ్‌దత్త్ పడిక్కల్ టెస్టుల్లో తిరిగి పునరాగమనం చేయనున్నట్లు సమాచారం. సాయిసుదర్శన్ స్ధానంలో అతడిని ఆడించనున్నట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. పడిక్కల్ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. రంజీ ట్రోఫీ సీజన్ 2025-26లో ఈ కర్ణాటక బ్యాటర్ 54.30 సగటుతో 543 పరుగులు చేశాడు.ధ్రువ్ జురెల్ లేదా నితీశ్ కుమార్ రెడ్డిలో ఎవరికో ఒకరికే తుది జట్టులో చోటు దక్కే సూచనలు కనిపిస్తున్నాయి. రెగ్యులర్ వికెట్ కీపర్‌గా రిషబ్ పంత్ ఉండడంతో జురెల్‌ను బెంచ్‌కే పరిమితం చేసే అవకాశముంది. స్పెషలిస్ట్ బ్యాటర్‌ను ఆడించాలనుకుంటే నితీశ్‌ను పక్కన పెట్టక తప్పదు. ఫాస్ట్ బౌలింగ్ విభాగాన్ని సిరాజ్ లీడ్ చేయనున్నాడు.భారత తుది జట్టు(అంచనా)శుబ్‌మన్ గిల్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, కెఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), రిషబ్ పంత్ (వికెట్ కీపర్), దేవ్‌దత్త్ పడిక్కల్. నితీష్ కుమార్ రెడ్డి/ ధ్రువ్ జురెల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, గుర్నూర్ బ్రార్, హర్ష్ దుబే.చదవండి: క్రికెట్ దేవుడి రికార్డుకే ఎసరు.. చరిత్ర సృష్టించనున్న సూర్యవంశీ -
పంత్‌కు గంభీర్ క్లాస్.. లీక్ చేసిన అసిస్టెంట్ కోచ్!
అఫ్గానిస్తాన్‌తో ఏకైక టెస్ట్ మ్యాచ్‌కు ముందు టీమిండియా వైస్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి రిషబ్ పంత్‌ను తప్పించిన సంగతి తెలిసిందే. అతడి స్ధానంలో సీనియర్ బ్యాటర్ కేఎల్ రాహుల్‌ను టెస్ట్ జట్టు వైస్ కెప్టెన్‌గా బీసీసీఐ నియమించింది. గతేడాది రోహిత్ శర్మ నుంచి భారత టెస్ట్ జట్టు పగ్గాలను చేపట్టిన గిల్‌కు డిప్యూటీగా పంత్ ఎంపికయ్యాడు. కానీ ఆ తర్వాత అతడి ఫామ్ దారుణంగా పడిపోయింది. ఇంగ్లండ్, దక్షిణాఫ్రికాతో జరిగిన సిరీస్‌లలో రిషబ్ పేలవమైన ప్రదర్శనలు కనబరిచాడు. దీంతో అతడిని వైస్ కెప్టెన్సీ నుంచి తప్పించారు. ఈ నేపథ్యంలో పంత్‌తో హెడ్‌కోచ్ గౌతమ్ గంభీర్ సుదీర్ఘ చర్చలు జరిపినట్లు తెలుస్తోంది.అఫ్గాన్‌తో జరిగే టెస్టు మ్యాచ్‌లో ఒక సీనియర్ ఆటగాడిగా ఎలా వ్యవహరించాలనే విషయంపై గంభీర్ పంత్‌తో మాట్లాడాడు. ఈ విషయాన్ని ప్రీ మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో భారత అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డెష్కాట్ వెల్లడించాడు."రిషబ్ ఒక సీనియర్ ప్లేయర్‌గా జట్టులో బాధ్యతాయుతమైన పాత్ర పోషించేందుకు సిద్దంగా ఉన్నాడు. యువ ఆటగాళ్లతో కమ్యూనికేషన్ ఎలా ఉండాలి, పరిస్థితులకు తగ్గట్టుగా ఆటను ఎలా మార్చుకోవాలి అనే విషయాలపై గంభీర్, పంత్ మధ్య చర్చ జరిగింది. జట్టులో ఒక రోల్ మోడల్‌గా పంత్ నిలుస్తాడని ఆశిస్తున్నాను" అని డెష్కాట్ పేర్కొన్నాడు. కాగా 2025లో రిషబ్ మొత్తం 7 టెస్టులు ఆడి, 48.38 సగటుతో 629 పరుగులు చేశాడు. ఇందులో 2 సెంచరీలు, 4 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఓవరాల్‌గా రికార్డు బాగున్నప్పటికీ, సౌతాఫ్రికాతో జరిగిన సిరీస్‌లోని నాలుగు ఇన్నింగ్స్‌ల్లో అతను కేవలం 27, 2, 7, 13 పరుగులు మాత్రమే చేసి తీవ్రంగా నిరాశపరిచాడు. ఐపీఎల్-2026లో కూడా అదే తీరును కనబరిచాడు. ఐపీఎల్లో 12 మ్యాచ్‌లు ఆడి కేవలం 27.88 సగటుతో 251 పరుగులు మాత్రమే చేశాడు. అనంతరం లక్నో కెప్టెన్సీ నుంచి కూడా తప్పుకొన్నాడు.చదవండి: AUS vs PAK: షాహీన్ దెబ్బ.. ఆసీస్ అబ్బా! వన్డే సిరీస్ పాక్‌దే -
రోహిత్- కోహ్లి ఆడతారా?.. స్పందించిన టీమిండియా కోచ్
అఫ్గనిస్తాన్‌తో వన్డే సిరీస్‌కు భారత బ్యాటింగ్ దిగ్గజాలు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ అందుబాటులో ఉంటారా? లేదా?.. క్రికెట్ వర్గాల్లో ఇప్పుడిదే చర్చనీయాంశం. ఐపీఎల్-2026లో కోహ్లి అదరగొట్టిన సంగతి తెలిసిందే.రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఓపెనర్‌గా కొనసాగుతున్న కోహ్లి.. ఈ సీజన్లో 16 మ్యాచ్‌లలో కలిపి 675 పరుగులు సాధించాడు. గుజరాత్ టైటాన్స్‌తో ఫైనల్లో 75 పరుగులతో అజేయంగా నిలిచి ఆర్సీబీ వరుసగా రెండోసారి ట్రోఫీ ముద్దాడటంలో కీలక పాత్ర పోషించాడు.అంతలోనే గాయమా?ఇక ఆర్సీబీ రెండోసారి టైటిల్ విజేతగా అవతరించిన తరుణంలో కోహ్లి సంబరాలు అంబరాన్నంటాయి. భార్య అనుష్క శర్మ, సహచర ఆటగాళ్లతో కలిసి అతడు ఉత్సాహంగా డాన్స్ చేసిన దృశ్యాలు వైరల్‌గా మారాయి. అయితే, అంతలోనే కోహ్లి తొడ కండరాల గాయంతో బాధపడుతున్నాడనే వార్త బయటకు వచ్చింది.ఫలితంగా అఫ్గనిస్తాన్‌తో వన్డే సిరీస్‌కు కోహ్లి దూరమయ్యాడనే వార్త చక్కర్లుకొడుతోంది. మరోవైపు.. ముంబై ఇండియన్స్ స్టార్ రోహిత్ శర్మ తొడ కండరాల గాయం కారణంగా ఐదు మ్యాచ్‌లకు దూరమయ్యాడు. ఆ తర్వాత తిరిగి వచ్చినా ఇంపాక్ట్ ప్లేయర్‌గానే బరిలోకి దిగాడు.రోహిత్ కూడా డౌటేఈ నేపథ్యంలో రోహిత్ శర్మ సైతం సిరీస్‌కు అందుబాటులో ఉంటాడా? లేదా? అన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఈ విషయంపై టీమిండియా అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డష్కాటే తాజాగా స్పందించాడు. అఫ్గనిస్తాన్‌తో టీమిండియా ఏకైక టెస్టుకు ముందు మీడియాతో మాట్లాడుతూ..కోచ్ ఏమన్నాడంటే..‘‘ఇప్పటి వరకు మాకు కూడా అధికారిక సమాచారం అందలేదు. విరాట్, రోహిత్ వంటి స్టార్ ప్లేయర్లు గాయాల వల్ల దూరవుతున్నారంటే అది నిజంగా పెద్ద వార్తే. అయితే, ఏ ఆటగాడి విషయంలోనైనా ప్రొటోకాల్ ఒకేలా ఉంటుంది.వాళ్లు ఫిట్నెస్ పరీక్ష ఎదుర్కోవాల్సి ఉంటుంది. మ్యాచ్ ఆడేందుకు ఫిట్‌గా ఉన్నారా? లేరా? అన్నది మా వైద్య బృందం నిర్ణయిస్తుంది. వారి సూచన ప్రకారమే రో-కోలను ఆడించాలా? వద్దా? అన్నది తేలుతుంది.ఒకవేళ వాళ్లు దూరమైతే వారి స్థానాలను భర్తీ చేసే అంశంపై కూడా యాజమాన్యం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది’’ అని డష్కాటే తెలిపాడు. కాగా జూన్ 6- 20 మధ్య టీమిండియా స్వదేశంలో అఫ్గనిస్తాన్‌తో ఒక టెస్టు, మూడు వన్డేలు ఆడేందుకు షెడ్యూల్ ఖరారైంది. ఏం జరుగుతోంది?ఇదిలా ఉంటే.. ఇప్పటికే అంతర్జాతీయ టీ20, టెస్టు ఫార్మాట్‌కు వీడ్కోలు పలికిన రోహిత్ శర్మ- విరాట్ కోహ్లి.. కేవలం వన్డేల్లో కొనసాగుతున్నారు. వన్డే వరల్డ్‌కప్-2027 ఆడటమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. ఈ మెగా టోర్నీకి ముందు కొన్ని వన్డేలు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఇలాంటి తరుణంలో రో-కో గాయాల బారిన పడటం అభిమానుల్లో ఆందోళనకు కారణమైంది. చదవండి: ‘పంజాబ్ కింగ్స్ ఈ ఐదుగురిని వదిలేయాలి’ -
టీమిండియాలోకి కొత్త ముఖం.. కన్ఫర్మ్ చేసిన కోచ్
మరో రెండు రోజుల్లో (జూన్ 6) ఆఫ్ఘనిస్తాన్‌తో జరుగబోయే ఏకైక టెస్ట్ మ్యాచ్ (ముల్లాన్‌పూర్) కోసం టీమిండియా సర్వం సిద్దం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో భారత్ తరఫున ఓ యువ ఆటగాడు అరంగేట్రం చేసే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి.టీమిండియా సహాయ కోచ్ ర్యాన్ టెన్ డస్కటే ప్రీ మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ.. యువ స్పిన్నర్లు హర్ష్ దూబే, మానవ్ సుతార్‌లో ఎవరో ఒకరికి తుది జట్టులో చోటు దక్కవచ్చని సంకేతాలు ఇచ్చాడు. దీంతో వీరిలో ఒకరు టెస్టు క్యాప్ అందుకోవడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది.ముల్లాన్‌పూర్ పిచ్ స్పిన్నర్లకు అనుకూలంగా ఉండే అవకాశముండటంతో భారత్ ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగే అవకాశం ఉంది. ప్రధాన స్పిన్నర్‌గా కుల్దీప్ యాదవ్, రెండో స్పిన్నర్‌గా ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ బరిలోకి దిగడం దాదాపుగా ఖాయం కాగా.. మూడో స్పిన్నర్ స్థానం కోసం హర్ష్, సుతార్ మధ్య పోటీ నెలకొన్నట్లు తెలుస్తోంది. పేసర్లుగా మొహమ్మద్ సిరాజ్, ప్రసిద్ద్ కృష్ణ పేర్లు ఖరారయ్యాయి. బుమ్రా గైర్హాజరీలో సిరాజ్ పేస్ విభాగానికి నాయకత్వం వహిస్తాడు. పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్‌గా నితీశ్ రెడ్డి బరిలోకి దిగడం కూడా ఖయంగా తెలుస్తోంది.బ్యాటింగ్ విషయానికొస్తే.. శుభ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్, సాయి సుదర్శన్, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్ పేర్లు దాదాపుగా ఖరారయ్యాయి. మేనేజ్మెంట్ ఒకవేళ మరో స్పెషలిస్ట్ బ్యాటర్‌తో బరిలోకి దిగాలని భావిస్తే.. నితీశ్‌ను పక్కన పెట్టి ధృవ్ జురెల్‌కు అవకాశం ఇవ్వవచ్చు. -
‘సొంతగడ్డపై టీమిండియా పటిష్టంగా కనిపించట్లేదు’
గత కొంతకాలంగా టెస్టుల్లో టీమిండియా స్థాయికి తగ్గట్లు రాణించడం లేదు. ముఖ్యంగా గౌతం గంభీర్ హెడ్‌కోచ్‌గా వచ్చిన తర్వాత భారత్‌కు ఘోర పరాజయాలు ఎదురయ్యాయి. సొంతగడ్డపై న్యూజిలాండ్ చేతిలో ఏకంగా 3-0తో వైట్‌వాష్‌కు గురైంది టీమిండియా.ఇక ఆస్ట్రేలియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీని 3-2తో కోల్పోయింది. దాదాపుగా దశాబ్దకాలం తర్వాత టీమిండియా ఈ సిరీస్ కోల్పోవడం ఇదే తొలిసారి. అనంతరం ఇంగ్లండ్ పర్యటనలో 2-2తో డ్రా చేసుకోవడంతో జట్టుపై విమర్శల జడి కాస్త తగ్గింది.ఇదిలా ఉంటే.. చాన్నాళ్ల తర్వాత టీమిండియా టెస్టు బరిలో దిగనుంది. స్వదేశంలో అఫ్గనిస్తాన్‌తో ఏకైక టెస్టు ఆడనుంది. జూన్ 6 నుంచి ముల్లన్‌పూర్‌లో ఈ మ్యాచ్ నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది. అయితే, ఈ మ్యాచ్ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2025-27 సైకిల్లో భాగం కాదు.భారత్‌కు అత్యంత ముఖ్యంఅయినప్పటికీ ఈ మ్యాచ్ భారత్‌కు అత్యంత ముఖ్యమని అంటున్నాడు టీమిండియా మాజీ క్రికెటర్ సబా కరీం. జియోస్టార్‌తో మాట్లాడుతూ.. ‘‘ఈ టెస్టు మ్యాచ్ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌లో భాగం కాదు. అయినప్పటికీ ఈ మ్యాచ్‌ను తేలికగా తీసుకోకూడదు.టీమిండియాకు ఇది అతి ముఖ్యమైన మ్యాచ్. ఈ మ్యాచ్ ద్వారా తమ లోపాల్ని సరిచేసుకుని.. జట్టును పరీక్షించుకునే వీలు కలిగింది. బ్యాటింగ్, బౌలింగ్ పరంగా ఉన్న సమస్యలను గుర్తించి వాటిని అధిగమించాల్సి ఉంది.టెస్టు క్రికెట్‌పై భారత జట్టు మరింత దృష్టి పెట్టాల్సిన ఆవశ్యకత ఉంది. ముఖ్యంగా సొంతగడ్డపై గతంలో మాదిరి టీమిండియా పటిష్టంగా కనిపించడం లేదు’’ అని సబా కరీం అభిప్రాయపడ్డాడు.యువ ఆటగాళ్లను పరీక్షించే అవకాశంఅదే విధంగా.. ‘‘అఫ్గన్‌తో టెస్టు రూపంలో యువ ఆటగాళ్లను కూడా పరీక్షించే అవకాశం వచ్చింది. కొత్త కొత్త కాంబినేషన్లు ప్రయత్నించండి. ఒకవేళ వాళ్లు బాగా ఆడితే తదుపరి సిరీస్‌లకు కూడా ఎంపిక చేయండిజఇది ఇప్పటికప్పుడు ఆశించిన ఫలితాలు రాకపోవచ్చు. అయితే, భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని కొన్నిసార్లు ప్రయోగాలు చేయాల్సి ఉంటుంది. ఇది గెలుపోటముల గురించి ఆలోచించే సమయం కాదు. భవిష్యత్తును తప్పక దృష్టిలో పెట్టుకోండి’’ అని సబా కరీం సెలక్టర్లకు సూచించాడు.అఫ్గనిస్తాన్‌తో ఏకైక టెస్టుకు భారత జట్టుశుబ్‌మన్ గిల్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), సాయి సుదర్శన్, రిషభ్ పంత్, దేవ్‌దత్ పడిక్కల్, నితీశ్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, మొహమ్మద్ సిరాజ్, ప్రసిద్ కృష్ణ, మానవ్ సుతార్, గుర్నూర్ బ్రార్, హర్ష్ దూబే, ధ్రువ్ జురెల్.చదవండి: కావ్యా మారన్‌పై SRH ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు -
ఆఫ్ఘన్ సిరీస్‌కు విరాట్ ప్రత్యామ్నాయం ఇతడే..!
త్వరలో (జూన్ 13) స్వదేశంలో ఆఫ్ఘనిస్తాన్‌తో జరుగబోయే 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్ నుంచి టీమిండియా దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లి గాయం కారణంగా తప్పుకున్న విషయం తెలిసిందే. విరాట్ తాజాగా ముగిసిన ఐపీఎల్ 2026లో హ్యామ్ స్ట్రింగ్ గాయానికి గురయ్యాడు. ఈ గాయం విషయమై వైద్యులను సంప్రదించగా.. రెండు వారాల విశ్రాంతిని సూచించారు. దీంతో ఆఫ్ఘనిస్తాన్ సిరీస్ నుంచి తప్పుకుంటున్నట్లు విరాట్ ప్రకటించాడు.ఈ నేపథ్యంలో ఆఫ్ఘన్ సిరీస్‌కు విరాట్ ప్రత్యామ్నాం ఎవరనే చర్చ పొద్దున్నుంచి నడుస్తుంది. ఈ విషయమై ఎవరి అభిప్రాయాలు వారికి ఉన్నా.. బీసీసీఐ ఓ వ్యక్తిని ఫైనల్ చేసిందని సమాచారం. విరాట్ రీప్లేస్మెంట్ కోసం తిలక్ వర్మ, దేవదత్ పడిక్కల్, రజత్ పాటిదార్ పోటీపడినప్పటికీ.. సెలెక్టర్లు రుతురాజ్ గైక్వాడ్వైపు మొగ్గుచూపారని తెలుస్తోంది.ఇప్పటికే ఇండియా-ఏ జట్టులో చోటు దక్కించుకున్న గైక్వాడ్.. త్వరలో మరోసారి భారత వన్డే జట్టు తరఫున బరిలోకి దిగడం దాదాపుగా ఖరారైనట్లు సమాచారం. దక్షిణాఫ్రికాతో జరిగిన తన చివరి వన్డే సిరీస్‌లో గైక్వాడ్ అద్భుతంగా రాణించాడు. మూడు మ్యాచ్‌ల్లో 113 పరుగులు చేయడంతో పాటు రెండో వన్డేలో శతకం (105) నమోదు చేసి సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. ఈ ప్రదర్శనను దృష్టిలో పెట్టుకొనే సెలెక్టర్లు తిలక్, పడిక్కల్, పాటిదార్‌ను కాదని రుతురాజ్వైపు మొగ్గు చూపినట్లు సమాచారం. -
విరాట్ కోహ్లి అవుట్.. టీమిండియాలోకి హైదరాబాదీ!
అఫ్గానిస్తాన్‌తో వన్డే సిరీస్ ఆరంభానికి ముందు టీమిండియాకు విరాట్ కోహ్లి రూపంలో భారీ షాక్ తగిలింది. ఈ సిరీస్‌కు తొడ కండరాల గాయం కారణంగా కోహ్లి దూరమయ్యాడు. ఐపీఎల్-2026 ఫైనల్లో కూడా గాయంతో బాధపడుతూనే ఆడాడు. అయితే గాయం తీవ్రత ఎక్కువ కావడంతో అఫ్గాన్ సిరీస్ నుంచి తప్పుకోవాలని విరాట్ నిర్ణయించుకున్నాడు. దీంతో కోహ్లి స్ధానాన్ని భర్తీ చేసే పనిలో బీసీసీఐ సెలక్షన్ కమిటీ పడింది.ఈ క్రమంలో విరాట్ స్ధానంలో జట్టులోకి వచ్చే అవకాశమున్న ఆటగాళ్లపై ఓ లుక్కేద్దాం.తిలక్ వర్మహైదరాబాదీ తిలక్ వర్మ ప్రస్తుత రేసులో అందరికంటే ముందున్నాడు. టీ20 జట్టులో రెగ్యులర్ సభ్యునిగా కొనసాగుతున్న తిలక్‌ను.. ఇప్పుడు వన్డే జట్టులోకి తీసుకునే సూచనలు ఎక్కువగా కన్పిస్తున్నాయి. ఈ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్‌కు మిడిలార్డర్లో రాణించే సత్తా ఉంది. అతడు ఇప్పటివరకు భారత్ తరపున కేవలం 5 వన్డేలు మాత్రమే ఆడాడు. కాగా సెలక్టర్లు ఇటీవలే తిలక్‌ను శ్రీలంక టూర్ కోసం భారత-ఎ జట్టు కెప్టెన్ ఎంపిక చేశారు. ఒకవేళ తిలక్‌ను వన్డే జట్టులోకి తీసుకోవాలని భావిస్తే ఇండియా-ఎ టీమ్ కెప్టెన్‌గా మరొకరని నియమించే అవకాశముంది.దేవదత్ పడిక్కల్కర్ణాటక ఆటగాడు దేవదత్ పడిక్కల్ కూడా సెలక్టర్ల రాడార్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. అఫ్గానిస్తాన్‌తో ఏకైక టెస్టుకు ఎంపిక చేసిన భారత జట్టులో పడిక్కల్ భాగంగా ఉన్నాడు. ఇప్పుడు వన్డే జట్టులోకి తీసుకున్న ఆశ్చర్యపోనక్కర్లేదు. పడిక్కల్ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఐపీఎల్-2026లో ఆర్సీబీ తరపున పడిక్కల్ దుమ్ములేపాడు. టీమిండియా మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ సైతం తన ప్రత్యామ్నాయ జట్టులో పడిక్కల్‌ను నెం.3 స్థానానికి ఎంపిక చేయడం విశేషం.రజత్ పాటిదార్ఇక ఆర్సీబీకి వరుసగా రెండో టైటిల్‌ను అందించిన కెప్టెన్ పాటిదార్‌ను జట్టులోకి తీసుకోవడానికి ఇదొక మంచి అవకాశమని క్రికెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నాడు. పాటిదార్ కూడా టాపర్డర్తో పాటు మిడిలార్డర్లో కూడా రాణించగలడు. అతడు మంచి ఫామ్‌లో కూడా ఉన్నాడు. వీరితో పాటు రుతురాజ్ గైక్వాడ్ రేసులో ఉన్నాడు. కానీ రుతురాజ్ భారత-ఎ జట్టు వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. వీరిలో ఎవరు వైపు సెలక్టర్లు మొగ్గు చూపుతారో వేచి చూడాలి. -
టీమిండియాకు బిగ్ షాక్!
అఫ్గానిస్తాన్‌తో వన్డే సిరీస్‌కు ముందు టీమిండియాకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి హ్యామ్‌స్ట్రింగ్ గాయం కారణంగా ఈ సిరీస్ నుంచి తప్పుకొన్నాడు. ఈ విషయాన్ని బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు ధ్రువీకరించారు. కాగా అఫ్గాన్‌తో మూడు వన్డేల సిరీస్ కోసం విరాట్ కోహ్లి, రోహిత్ శర్మలు జూన్ 9న ముల్లాన్‌పూర్‌లో భారత జట్టుతో కలవనున్నట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. కానీ ఇప్పుడు తొడ కండరాల గాయం బారిన పడడంతో విరాట్ సిరీస్ మొత్తానికే దూరం కావాల్సి వచ్చింది. వన్డే ప్రపంచకప్-2027 సన్నాహకాల్లో భాగంగా జరుగుతున్న ఈ వైట్‌బాల్ సిరీస్‌కు కోహ్లి దూరం కావడం భారత్‌కు నిజంగా గట్టి ఎదురు దెబ్బే అనే చెప్పాలి.విరాట్ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఐపీఎల్-2026లో గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన ఫైనల్లో మ్యాచ్ విన్నింగ్ నాక్ ఆడి ఆర్సీబీకి వరుసగా రెండో టైటిల్‌ను అందించాడు. ఐపీఎల్లో దుమ్ములేపిన విరాట్‌ను భారత జెర్సీలో చూడాలని భావించిన అభిమానులకు నిరాశే ఎదురైంది. అతడు మళ్లీ జూలైలో ఇంగ్లండ్‌తో జరగనున్న వన్డే సిరీస్‌లో బరిలోకి దిగననున్నాడు.మరోవైపు టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ఈ సిరీస్‌లో ఆడటంపై కూడా ఇంకా పూర్తి స్పష్టత రాలేదు. రోహిత్ కూడా ప్రస్తుతం తొడ కండరాల గాయంతోనే బాధపడుతున్నాడు. ఈ సిరీస్ ప్రారంభానికి ముందు రోహిత్ తన ఫిట్నెస్ను నిరూపించుకోవాల్సి ఉంది. ఫిట్నెస్ పరీక్షలలో అతడు పాసైతేనే జట్టులో కొనసాగనున్నాడు. లేదంటే అతడి స్ధానాన్ని యశస్వి జైశ్వాల్‌తో భర్తీ చేయనున్నారు. ఇక అఫ్గాన్-భారత్ మధ్య మూడు వన్డేల సిరీస్ జూన్ 13 న ధర్మశాల వేదికగా ప్రారంభం కానుంది.అఫ్గానిస్తాన్‌తో వన్డేలకు భారత జట్టుశుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, శ్రేయస్ అయ్యర్ (వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్, కుల్దీప్, అర్ష్‌దీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ, ప్రిన్స్ యాదవ్, గుర్నూర్ బ్రార్, హర్ష్ దూబే, హార్దిక్ పాండ్యాచదవండి: ఆ తప్పిదమే పంజాబ్ కింగ్స్ కొంపముంచింది: సచిన్ -
కింద పడ్డ రోహిత్ శర్మ.. అభిమానుల్లో ఆందోళన
టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మకు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఈ వీడియోలో రోహిత్ నడుస్తూ బ్యాలెన్స్ కోల్పోయి నేలపై ముందుకు పడ్డాడు. ఈ వీడియో ఇప్పటిదా లేక పాతదా అన్న విషయంపై క్లారిటీ లేనప్పటికీ.. రోహిత్ అభిమానులు మాత్రం ఆందోళన చెందుతున్నారు. తమ ఆరాధ్య ఆటగాడు ఆఫ్ఘనిస్తాన్ సిరీస్‌కు అందుబాటులో ఉంటాడా లేదా అని గాబరా పడుతున్నారు.రోహిత్ త్వరలో ఆఫ్ఘనిస్తాన్‌తో జరుగబోయే వన్డే సిరీస్‌కు ఎంపికైన విషయం తెలిసిందే. అతడు టెస్ట్, టీ20 ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించి టీ20ల్లో మాత్రమే కొనసాగుతున్నాడు. రోహిత్ తాజాగా ముగిసిన ఐపీఎల్ 2026లో హ్యామ్‌స్ట్రింగ్ గాయంతో పలు మ్యాచ్‌లకు దూరంగా ఉన్నాడు. అయితే ఆడిన మ్యాచ్‌ల్లో మాత్రం తనదైన క్లాస్‌ను ప్రదర్శించి మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్‌లు ఆడాడు.🚨🚨ROHIT SHARMA OUT OF THE FIRST 2 ODIs AGAINST AFGHANISTAN [CRICBUZZ]According to reliable sources and reports, Rohit Sharma suffered a knee twist after losing balance and is feeling discomfort. As per reports, he won't be available for the opening two games. India's… pic.twitter.com/xVn7qXcQg0— Oxygen (@Oxygen18_) June 3, 2026కాగా, ఆఫ్ఘనిస్తాన్‌తో జరుగబోయే వన్డే సిరీస్‌కు రోహిత్‌తో పాటు విరాట్ కోహ్లి కూడా ఎంపికయ్యాడు. అతడు కూడా రోహిత్‌లాగే టెస్ట్, అంతర్జాతీయ టీ20 ఫార్మాట్లకు గుడ్‌బై చెప్పి, కేవలం వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్నాడు. ఐపీఎల్ 2026లో రోహిత్‌తో పోలిస్తే విరాట్ చాలా మెరుగ్గా ఆడాడు. వరుసగా రెండో ఎడిషన్‌లో తన జట్టు ఛాంపియన్‌గా నిలపడంలో ప్రధానపాత్ర పోషించాడు. గుజరాత్‌తో జరిగిన ఫైనల్స్‌లో అజేయమైన అర్ద సెంచరీతో తన జట్టును ఛాంపియన్‌గా నిలిపాడు.రోహిత్, విరాట్ 2027 వన్డే ప్రపంచకప్ దృష్ట్యా అంతర్జాతీయ వన్డేల్లో కొనసాగుతున్నారు. ఆ సమయం వరకు ఫామ్‌లో ఉండి, ఫిట్నెస్ కాపాడుకుంటూ ఉంటేనే జట్టులో ఉంటారని సెలెక్టర్లకు వారిద్దరికి ఖరాకండిగా చెప్పారు. ఈ మేరకే రో-కో అడుగులు వేస్తున్నారు. ఆఫ్ఘనిస్తాన్‌తో వన్డే మ్యాచ్‌లు జూన్ 13, 17, 20 తేదీల్లో ధర్మశాల, లక్నో, చెన్నై వేదికలుగా జరుగనున్నాయి. -
హార్దిక్, రోహిత్‌లకు బీసీసీఐ కీలక ఆదేశాలు.. ఒకవేళ అదే జరిగితే?
అఫ్గానిస్తాన్‌తో వన్డే సిరీస్‌కు ముందు టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా తన ఫిట్నెస్ను పరీక్షించుకునేందుకు బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీఓఈ)కి వెళ్లనున్నాడు. వారం రోజుల పాటు అతను ఇక్కడ ఉండి వివిధ రకాల డ్రిల్స్‌లో పాల్గొనడంతోపాటు ‘మ్యాచ్ సిమ్యులేషన్స్’లో సాధన చేస్తాడు. ఐపీఎల్లో గాయం కారణంగా నాలుగు మ్యాచ్‌లకు దూరమైన అతను కోలుకొని మళ్లీ బరిలోకి దిగాడు.అయితే భారత వన్డే జట్టులోకి ఎంపిక కావడంలో బీసీసీఐ వైద్య బృందం అతడిని ఫిట్నెస్ నిరూపించుకోవాల్సిందిగా సూచించింది. ఫిట్‌గా ఉంటేనే టీమ్‌లో అతని ఎంపిక ఖాయమవుతుంది. దాంతో పాండ్యా సీఓఈకి చేరాడు. పాండ్యాతో పాటు మాజీ కెప్టెన్ రోహిత్ శర్మను కూడా సీఓఈలో హాజరు కావాలని వైద్యులు చెప్పగా... ఇప్పటి వరకు రోహిత్ విషయంలో మాత్రం ఎలాంటి సమాచారం లేదు. హిట్‌మ్యాన్ ప్రస్తుతం తొడ కండరాల గాయంతో బాధపడుతున్నాడు.ఈ గాయం కారణంగానే ఇటీవల ముగిసిన ఐపీఎల్-2026లో రోహిత్ నాలుగు మ్యాచ్‌లకు దూరమయ్యాడు. అంతేకాకుండా ఈ ముంబైకర్ దాదాపు చాలా మ్యాచ్‌లలో ఇంపాక్ట్ ప్లేయర్‌గా బరిలోకి దిగాడు. అఫ్గానిస్తాన్‌తో వన్డేలకు రోహిత్ ఎంపికైనప్పటికి.. తన ఫిట్నెస్ను మాత్రం నిరూపించుకోవాల్సి ఉంది. ఒకవేళ ఫిట్నెస్ పరీక్షలో రోహిత్ విఫలమైతే ఈ వన్డే సిరీస్‌కు దూరం కానున్నాడు. అతడికి బ్యాకప్‌గా యువ ఓపెనర్ యశస్వి జైశ్వాల్‌ను బీసీసీఐ సెలక్షన్ కమిటీ రిజర్వ్‌లో ఉంచినట్లు తెలుస్తోంది. అఫ్గాన్‌తో వన్డే సిరీస్ జూన్ 13 నుంచి ప్రారంభం కానుంది.అఫ్గాన్‌తో వన్డేలకు భారత జట్టు ఇదే:శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ(ఫిట్నెస్ లోబడి), విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ (వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ, ప్రిన్స్ యాదవ్, గుర్నూర్ బ్రార్, హర్ష్ దూబే.చదవండి: IND vs AFG: టీమిండియా కెప్టెన్‌గా కేఎల్ రాహుల్? -
టీమిండియా కెప్టెన్‌గా కేఎల్ రాహుల్?
అఫ్గానిస్తాన్‌తో ఈ నెల 6 నుంచి జరిగే ఏకైక టెస్టు మ్యాచ్ కోసం భారత జట్టు సన్నద్ధమవుతోంది. మంగళవారం ముల్లాన్‌పూర్‌కు చేరుకున్న టీమిండియా తమ ప్రాక్టీస్‌ను మొదలు పెట్టింది. ఈ మ్యాచ్ కోసం రెగ్యులర్ టీమ్ సభ్యులతో పాటు అదనంగా నెట్ ప్రాక్టీస్ కోసం ఆరుగురు బౌలర్లను బీసీసీఐ ఎంపిక చేసింది. పేసర్లు ఆఖిబ్ నబీ, ప్రిన్స్ యాదవ్, గుర్జప్నీత్ సింగ్ పేస్ బౌలింగ్‌ను నెట్స్‌లో భారత బ్యాటర్లు ఎదుర్కోనున్నారు.లెగ్ స్పిన్నర్ జీషాన్ అన్సారి, ఎడంచేతి వాటం మణికట్టు స్పిన్నర్ శివాంగ్ కుమార్, ఆఫ్ స్పిన్నర్ సారాంశ్ జైన్ కూడా ఈ జాబితాలో ఉన్నారు. టెస్టు జట్టులోని ప్రధాన పేసర్లు సిరాజ్, ప్రసిధ్ ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్ తరఫున ఐదు రోజుల వ్యవధిలో మూడు కీలక మ్యాచ్‌లు ఆడి తీవ్రంగా అలసిపోయారు.వేడి వాతావరణం నేపథ్యంలో వారికి తగినంత విశ్రాంతినిచ్చేందుకు నెట్ బౌలర్ల అవసరం ఏర్పడిందని బీసీసీఐ అధికారి ఒకరు వెల్లడించారు. టెస్టుకు ముందు భారత బ్యాటర్లకు తగినంత ప్రాక్టీస్ అవసరమని, అందుకే అదనపు బౌలర్లను ఎంపిక చేశామని ఆయన అభిప్రాయపడ్డారు.కెప్టెన్‌గా రాహుల్!కాగా ఐపీఎల్ 2026 ముగిసిన వెంటనే ఆటగాళ్లు ముల్లన్పూర్ చేరుకోవాల్సి ఉన్నప్పటికీ, కొంతమంది కీలక ఆటగాళ్లు ఇంకా జట్టుతో కలవలేదు. ఈ జాబితాలో కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌తో పాటు తన సహచరులు సాయి సుదర్శన్, మానవ్ సుతార్, ప్రసిద్ధ్ కృష్ణ, వాషింగ్టన్ సుందర్, మహమ్మద్ సిరాజ్ ఉన్నారు. వీరంతా ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ ఆడిన గుజరాత్ జట్టులో భాగంగా ఉన్నారు.అయితే ఐపీఎల్ ఫైనల్ ముగిసిన తర్వాత గుజరాత్ టైటాన్స్ జట్టు ప్రయాణిస్తున్న బస్సులో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఊహించని ఘటన వల్ల గుజరాత్ ఆటగాళ్లు తొలి బృందంతో కలిసి చండీగడ్‌కు చేరుకోలేకపోయారని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి.ఇక ఇది ఇలా ఉండగా.. ఈ ఏకైక టెస్ట్ మ్యాచ్‌కు గిల్‌తో పాటు పేసర్ మహ్మద్ సిరాజ్‌కు విశ్రాంతి ఇవ్వనున్నట్లు వార్తలు వస్తున్నాయి. గిల్ స్ధానంలో కేఎల్ రాహుల్ జట్టును నడిపించనున్నట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. అదేవిధంగా సిరాజ్ స్ధానంలో గుర్నూర్ బ్రార్ టెస్ట్ అరంగేట్రం చేసే అవకాశముంది.ఆఫ్ఘనిస్తాన్ టెస్టుకు భారత జట్టుశుభమన్ గిల్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), సాయి సుదర్శన్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), దేవదత్ పడిక్కల్, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, మానవ్ సుతార్, హర్ష్ దూబే, ధృవ్ జురెల్ (వికెట్ కీపర్)నెట్ బౌలర్లు: గుర్జప్నీత్ సింగ్, అకిబ్ నబీ, ప్రిన్స్ యాదవ్, శరన్ష్ జైన్, జీషన్ అన్సారీ, శివంగ్ కుమార్ -
కెప్టెన్‌గా శ్రేయస్.. భువీ రీఎంట్రీ..!
భారత్-ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య తొలిసారి ద్వైపాక్షిక టీ20 సిరీస్ జరుగనుందన్న ఓ వార్త ఇవాళ (జూన్ 2) సోషల్‌మీడియాలో వైరలైంది. ఈ సిరీస్ ఈ ఏడాది సెప్టెంబర్‌లో న్యూఢిల్లీలో జరుగనుందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో ఈ చారిత్రక సిరీస్‌లో భారత జట్టు ఎలా ఉండబోతుందోనన్న అంచనాలు ఇప్పటి నుంచే మొదలయ్యాయి.ఈ సిరీస్ కోసం ఐపీఎల్ స్టార్లకు అధిక అవకాశాలు ఇవ్వవొచ్చని అభిమానులు భావిస్తున్నారు. ఈ అంచనాల ప్రకారం పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌కు పగ్గాలు అప్పగించే అవకాశం ఉంది. వికెట్‌కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్‌కు వైస్ కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించవచ్చు. వీరిద్దరూ ఇటీవలికాలంలో కెప్టెన్సీ బాధ్యతలను సమర్దవంతంగా నిర్వర్తించడంతో పాటు వ్యక్తిగతంగానూ విశేషంగా రాణించారు.ఐపీఎల్ 2026 పెను సంచలనం, రాజస్థాన్ రాయల్స్ చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీకి ఈ జట్టులో చోటు దక్కడం ఖాయమని జోరుగా ప్రచారం జరుగుతోంది. అలాగే తాజా ఐపీఎల్ సీజన్లో అద్భుతంగా రాణించిన పంజాబ్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ ఓపెనర్లు ప్రభ్‌సిమ్రన్ సింగ్, సాయి సుదర్శన్లకు కూడా ఈ జట్టులో చోటు ఖాయమని అనుకుంటున్నారు.మిడిలార్డర్లో ఆర్సీబీకి రెండుసార్లు టైటిల్ అందించిన రజత్ పాటిదార్, ముంబై ఇండియన్స్ ఆటగాడు నమన్ ధిర్, ఢిల్లీ విధ్వంసకర బ్యాటర్ అశుతోష్ శర్మ పేర్లు బలంగా వినిపిస్తున్నాయి.ఆల్రౌండర్లుగా ఆర్సీబీ సంచలనాలు కృనాల్ పాండ్యా, రసిక్ సలాం దార్‌కు చోటు దక్కవచ్చని అంచనా.బౌలింగ్ విషయానికొస్తే.. ఆర్సీబీ వెటరన్ పేసర్ భువనేశ్వర్ కుమార్ పేరు అందరి నోటా వినిపిస్తుంది. ఈ సిరీస్‌తో అతడు రీఎంట్రీ ఇవ్వడం ఖాయమని అంతా భావిస్తున్నారు. మిగతా పేసర్లుగా సీఎస్కే అన్షుల్ కంబోజ్, కేకేఆర్ కార్తీక్ త్యాగి, లక్నో ప్రిన్స్ యాదవ్‌లకు అవకాశం దక్కవచ్చనే అంచనాలు ఉన్నాయి. స్పిన్ బాధ్యతలు రవి బిష్ణోయ్‌కు అప్పగించవచ్చనే ప్రచారం జరుగుతుంది.అంచనా భారత జట్టు:వైభవ్ సూర్యవంశీ, ప్రభ్‌సిమ్రన్ సింగ్, సాయి సుదర్శన్, శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), రజత్ పాటిదార్, ఇషాన్ కిషన్ (వైస్ కెప్టెన్), నమన్ ధిర్, ఆశుతోష్ శర్మ, కృనాల్ పాండ్యా, రసిక్ సలామ్, అన్షుల్ కంబోజ్, కార్తిక్ త్యాగి, ప్రిన్స్ యాదవ్, రవి బిష్ణోయ్, భువనేశ్వర్ కుమార్.ఇదిలా ఉంటే, ఈ జట్టు అధికారిక జట్టు కాదు. ఐపీఎల్ ప్రదర్శనలు, ప్రస్తుత ఫామ్, జట్టు అవసరాలను ఆధారంగా చేసుకుని రూపొందించిన అంచనా జట్టు మాత్రమే. ఈ సిరీస్‌పై బీసీసీఐ నుంచి అధికారిక ప్రకటన కూడా లేదు. ఇది కేవలం సోషల్‌మీడియాలో ప్రచారం మాత్రమే. ఈ సిరీస్ విషయాన్ని పక్కన పెడితే.. జూన్ 6 నుంచి భారత్-ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య ఏకైక టెస్ట్ మ్యాచ్, 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్ జరుగనుంది. ఈ సిరీస్‌ల కోసం భారత జట్లను ఇదివరకే ప్రకటించారు. -
భారత టెస్ట్ జట్టులో మార్పులు.. ఐపీఎల్ స్టార్లకు ప్రత్యేక అవకాశం
త్వరలో (జూన్ 6 నుంచి) ఆఫ్ఘనిస్తాన్‌తో జరుగబోయే ఏకైక టెస్ట్ కోసం ఎంపిక చేసిన భారత జట్టులో మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ జట్టుకు అదనంగా ఆరుగురు ప్లేయర్లను భారత సెలెక్షన్ కమిటీ ఎంపిక చేసింది. వీరిలో కొందరు ఐపీఎల్ 2026లో సత్తా చాటిన బౌలర్లు. వీరిని మెయిన్ జట్టులో కాకుండా నెట్ బౌలర్లుగా ఎంపిక చేశారు.బీసీసీఐ అధికారికంగా విడుదల చేసిన జాబితా ప్రకారం.. గుర్జప్నీత్ సింగ్, ఆకిబ్ నబీ, ప్రిన్స్ యాదవ్, సరాన్ష్ జైన్, జీషన్ అన్సారీ, శివాంగ్ కుమార్ ఆఫ్ఘనిస్తాన్‌తో జరుగబోయే ఏకైక టెస్ట్ కోసం భారత జట్టు నెట్ బౌలర్లుగా ఎంపికయ్యారు. వీరు ప్రధాన జట్టులో సభ్యులు కాకపోయినా, భారత బ్యాటర్లకు నెట్ ప్రాక్టీస్‌లో సహాయపడతారు.పై బౌలర్లను టీమిండియా నెట్ బౌలర్లుగా తీసుకోవడానికి ప్రధాన కారణం ఐపీఎల్ 2026 వల్ల రెగ్యులర్ బౌలర్లపై పడిన శారీరక ఒత్తిడి అని తెలుస్తోంది. ఫైనల్ వరకు ఆడిన మహ్మద్ సిరాజ్, ప్రసిద్ద్ కృష్ణ, వాషింగ్టన్ సుందర్, మానవ్ సుతార్, గుర్నూర్ బ్రార్ (రెగ్యులర్ జట్టు సభ్యులు) శారీరక అలసట కారణంగా ప్రాక్టీస్ సెషన్స్‌కు అందుబాటులో ఉండటం లేదు. దీంతో బ్యాటర్లకు సరైన ప్రాక్టీస్ కల్పించేందుకు అదనపు బౌలర్లను ఎంపిక చేశారు.అయితే ఈ ఎంపికలను కేవలం నెట్ బౌలర్ల అవసరంగా మాత్రమే చూడడం లేదు. భారత టెస్టు జట్టు ప్రస్తుతం మార్పుల దశలో ఉంది. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ప్రతిభావంతులైన యువ బౌలర్లను దగ్గరగా పరిశీలించాలనే ఉద్దేశంతోనే బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకున్నట్లు క్రికెట్ వర్గాలు భావిస్తున్నాయి. జట్టుతో కలిసి శిక్షణ పొందడం ద్వారా అంతర్జాతీయ స్థాయి వాతావరణాన్ని అర్థం చేసుకునే అవకాశం వీరికి లభించనుంది.ఈ ఆరుగురిలో కొందరు దేశీయ క్రికెట్లో అద్భుత ప్రదర్శనలతో గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యంగా ఆకిబ్ నబీ దేశీయ సీజన్లో 10 మ్యాచ్‌ల్లో 60 వికెట్లు తీసి సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. అలాగే జీషన్ అన్సారీ తన లెగ్‌స్పిన్‌తో మంచి పేరు సంపాదించాడు. గుర్జప్నీత్ సింగ్, సరాన్ష్ జైన్ కూడా రెడ్‌బాల్ క్రికెట్లో నిలకడైన ప్రదర్శనలు చేశారు.ప్రిన్స్ యాదవ్, శివాంగ్ కుమార్‌లకు ఐపీఎల్ 2026 ప్రదర్శనలు ఈ అవకాశాన్ని తెచ్చిపెట్టాయి. ముఖ్యంగా ప్రిన్స్ యాదవ్ తన వేగం, క్రమశిక్షణతో ఆకట్టుకుని ఇప్పటికే అఫ్ఘనిస్తాన్‌తో వన్డే సిరీస్‌కు భారత జట్టులో చోటు సంపాదించాడు.అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టే ముందు భారత జట్టు డ్రెస్సింగ్‌రూమ్ వాతావరణాన్ని అనుభవించడం యువ ఆటగాళ్లకు ఎంతో ఉపయోగపడుతుంది. అందుకే ఈ ఆరుగురి ఎంపికను భవిష్యత్ భారత టెస్టు జట్టు నిర్మాణంలో ఒక కీలక అడుగుగా విశ్లేషకులు భావిస్తున్నారు. అఫ్ఘనిస్తాన్ టెస్టులో ప్రత్యక్షంగా ఆడే అవకాశం లేకపోయినా, జట్టుతో కలిసి పనిచేసే ఈ అనుభవం వారి కెరీర్‌కు కీలక మలుపుగా మారే అవకాశముంది.ఆఫ్ఘనిస్తాన్‌తో ఏకైక టెస్ట్ కోసం భారత రెగ్యులర్ జట్టు..శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), యశస్వి జైశ్వాల్, కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), సాయి సుదర్శన్, రిషభ్ పంత్, దేవ్‌దత్ పడిక్కల్, వాషింగ్టన్ సుందర్, మహమ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, నితీశ్ కుమార్ రెడ్డి, మానవ్ సుతార్, ప్రసిద్ధ్ కృష్ణ, గూర్నూర్ బ్రార్, ధ్రువ్ జురెల్, హర్ష్ దూబే -
ODI WC: రోహిత్ శర్మ ఎందుకిలా చేస్తున్నాడు?
దాదాపు రెండు నెలల పాటు అంతర్జాతీయ క్రికెట్‌కు దూరంగా ఉంది టీమిండియా. భారత జట్టులోని ప్రధాన ఆటగాళ్లంతా ఐపీఎల్-2026తో బిజీ బిజీగా గడిపారు. ఇక ఈ మెగా టోర్నీకి ఆదివారం నాటి ఫైనల్‌తో తెరపడింది.ఈ నేపథ్యంలో జూన్ 6 నుంచే టీమిండియా రంగంలోకి దిగనుంది. స్వదేశంలో అఫ్గనిస్తాన్‌తో తొలుత ఓ టెస్టు మ్యాచ్ ఆడి.. ఆ తర్వాత మూడు వన్డేల సిరీస్ ఆడేందుకు షెడ్యూల్ ఖరారైంది. ఇక అఫ్గన్‌తో మ్యాచ్‌లకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఇప్పటికే తమ జట్లను ప్రకటించిన సంగతి తెలిసిందే.ఫిట్‌నెస్‌లోబడే...శుబ్‌మన్ గిల్ సారథ్యంలో అఫ్గన్‌తో ఆడే ఈ జట్లలో వన్డేలకు మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ, ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ఎంపికయ్యారు. అయితే, వీరిద్దరు ఫిట్‌నెస్‌లోబడే ఆడతారని బీసీసీఐ స్పష్టం చేసింది. కాగా ఐపీఎల్-2026లో హార్దిక్ పాండ్యా సారథ్యంలో ముంబై ఇండియన్స్‌కు ఆడిన రోహిత్ శర్మ.. సీజన్ మధ్యలో గాయపడ్డాడు.తొడ కండరాల గాయంతో ఐదు మ్యాచ్‌లకు రోహిత్ దూరమయ్యాడు. ఆ తర్వాత తిరిగి జట్టుతో చేరినా ఇంపాక్ట్ ప్లేయర్‌గానే బరిలోకి దిగాడు. మరోవైపు.. హార్దిక్ పాండ్యా సైతం వెన్నునొప్పితో నాలుగు మ్యాచ్‌లు ఆడలేకపోయాడు.క్లియరెన్స్ వస్తేనే..ఈ నేపథ్యంలో రోహిత్, హార్దిక్‌లను అఫ్గన్‌తో సిరీస్‌కు ఎంపిక చేసినప్పటికీ.. ఫిట్నెస్ ఆధారంగానే వారు ఆడతారో, లేదో తేలుతుందని బీసీసీఐ జట్టు ప్రకటన సమయంలో వెల్లడించింది. అదే విధంగా.. వీరిద్దరిని సిరీస్ ఆరంభానికి రెండు వారాల ముందే బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో రిపోర్టు చేయాల్సిందిగా ఆదేశించింది.ఇంత వరకు రిపోర్టు చేయని రోహిత్!అక్కడి వైద్య బృందాన్ని సంప్రదించి.. వేగంగా కోలుకొనే అంశంపై దృష్టి పెట్టాలని.. వారి నుంచి ఫిట్నెస్ క్లియరెన్స్ సర్టిఫికెట్ తీసుకోవాలని బోర్డు స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో హార్దిక్ పాండ్యా మంగళవారం (జూన్ 2)న బెంగళూరుకు పయనం కానుండగా.. రోహిత్ శర్మ మాత్రం ఇంత వరకు రిపోర్టు చేయలేదని ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ వెల్లడించింది.కాగా వన్డే వరల్డ్‌కప్-2027 టోర్నీకి ముందు టీమిండియా కొద్ది వన్డేలు మాత్రమే ఆడనుంది. ఇలాంటి తరుణంలో రోహిత్ గాయపడటం.. బోర్డు ఆదేశాలు పాటించే అంశంలో స్పష్టత లేకపోవడం సందేహాలకు తావిస్తోంది.రేసులోకి జైసూ!ఇప్పటికే రోహిత్‌కు బదులు యశస్వి జైస్వాల్, ఇషాన్ కిషన్ పేర్లను శుబ్‌మన్ గిల్ ఓపెనింగ్ జోడీగా పరిగణించాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి. ఈ విషయంలో బోర్డు కూడా సానుకూలంగా ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో 39 ఏళ్ల రోహిత్ శర్మనే స్వయంగా తప్పుకోనున్నాడనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉంటే.. ముల్లన్‌పూర్‌లో భారత్- అఫ్గన్ మధ్య ఏకైక టెస్టు జరుగనుండగా.. జూన్ 13, 17, 20 తేదీల్లో వన్డే సిరీస్ నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది.చదవండి: IPL 2026: అత్యుత్తమ జట్టు ఇదే! -
క్రికెట్ చరిత్రలోనే మొదటిసారి.. బీసీసీఐ సంచలన నిర్ణయం!
ప్రపంచ క్రికెట్లో మరో చారిత్రాత్మక ద్వైపాక్షిక సిరీస్ నిర్వహణకు రంగం సిద్దమవుతోంది. భారత్‌తో మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌కు ఆతిథ్యమిచ్చేందుకు అఫ్గానిస్తాన్ క్రికెట్ బోర్డు పావులు కదపుతోంది. ఇదే విషయంపై ఏసీబీ ఇప్పటికే భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI)తో సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. అయితే అఫ్గానిస్తాన్‌లో నెలకొన్న రాజకీయ పరిస్థితులు, భద్రతా కారణాల వల్ల అక్కడ అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడేందుకు ఐసీసీ నుంచి అనుమతి లేదు. దీంతో భారత్‌తో సిరీస్‌ను న్యూఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా నిర్వహించడానికి అఫ్గాన్ క్రికెట్ బోర్డు ప్రణాళికలు రచిస్తోంది. అఫ్గాన్-భారత్ మధ్య టీ20 సిరీస్ ఈ ఏడాది ఆఖరిలో జరిగే అవకాశముంది."బీసీసీఐ, ఏసీబీ మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి. ఐర్లాండ్, శ్రీలంక, జింబాబ్వే వంటి ఇతర బోర్డులను ఆర్థికంగా ఆదుకోవడానికి బీసీసీఐ భారత జట్టును అక్కడికి పంపించి మ్యాచ్‌లు ఆడిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు అఫ్గానిస్తాన్‌కు కూడా భారత క్రికెట్ బోర్డు అండగా నిలవనుంది. ఇరు దేశాల క్రికెట్ బోర్డుల మధ్య దైపాక్షిక టీ20 సిరీస్ నిర్వహణ విషయంలో చర్చలు జరుగుతున్నాయి. ఫార్మాలిటీస్ పూర్తి అయిన తర్వాత దీనిపై అధికారిక ప్రకటన వెలువడుతుంది. ఈ సిరీస్ కోసం అఫ్ఘనిస్తాన్ జట్టుకు ఢిల్లీని 'హోమ్ గ్రౌండ్' గా కేటాయించనున్నారు. ఇప్పటికే ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ (DDCA) తో బీసీసీఐ చర్చలు జరిపింది. ఇందుకోసం డీడీసీఏ 'ఢిల్లీ ప్రీమియర్ లీగ్ టీ20' షెడ్యూల్‌ను కూడా మార్చుకోవడానికి సిద్ధమైందని" బీసీసీఐ అధికారి ఒకరు టైమ్స్ ఇండియాతో పేర్కొన్నారు. కాగా అఫ్గానిస్తాన్ జట్టు భారత్‌ను తమ హోమ్ గ్రౌండ్‌గా వాడుకోవడం ఇదే మొదటిసారి కాదు. గతంలోనూ పలు సిరీస్‌లు ఇండియా వేదికగా జరిగాయి.భారత్‌లో హోంగ్రౌండ్ అఫ్గానిస్తాన్ ఆడిన సిరీస్‌లు2017: ఐర్లాండ్‌తో సిరీస్ (గ్రేటర్ నోయిడా)2018: బంగ్లాదేశ్‌తో సిరీస్ (డెహ్రాడూన్)2024: న్యూజిలాండ్‌తో ఏకైక టెస్ట్ మ్యాచ్ (గ్రేటర్ నోయిడా)ఇక హష్మతుల్లా షాహిదీ నేతృత్వంలోని అఫ్గాన్ జట్టు ప్రస్తుతం భారత పర్యటనలో ఉంది. ఈ టూర్లో భాగంగా ఆతిథ్య జట్టుతో ఏకైక టెస్ట్‌తో మూడు వన్డేల సిరీస్‌లో అఫ్గాన్ తలపడనుంది. జూన్ 6 నుంచి ముల్లాన్‌పూర్ వేదికగా టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కానుంది. -
అతడేమి రోబో కాదు.. బీసీసీఐ తప్పు చేస్తోంది?
మహ్మద్ సిరాజ్.. ప్రస్తుతం అత్యంత ఫిట్‌గా ఉన్న భారత క్రికెటర్లలో ఒకడు. ఎంత అలసిపోయినా అదే వేగంతో, పట్టుదలతో బౌలింగ్ చేయడం అతడి ప్రత్యేకత. అది కొత్త సీజన్‌లోని మొదటి బంతి అయినా.. 5 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లోని చివరి రోజైనా సరే సిరాజ్‌లో ఏ మాత్రం అలుపు కనిపించదు.2026లో సిరాజ్ ఇప్పటికే విశ్రాంతి లేకుండా దాదాపు 6 లిస్ట్ ఎ మ్యాచ్‌లు, 18 టీ20 మ్యాచ్‌లు, 2 ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లు ఆడాడు. అంతకముందు ఇంగ్లండ్ పర్యటనలో కూడా సిరాజ్ మొత్తం 5 మ్యాచ్‌లు ఆడి మరోసారి తన ఫిట్నెస్ను నిరూపించుకున్నాడు. ఆ తర్వాత టీ20 ప్రపంచకప్-2026, ఐపీఎల్-2026లో కూడా ఈ హైదరాబాదీ భాగమయ్యాడు.సిరాజ్‌కు విశ్రాంతి?ఈ నేపథ్యంలో జూన్ 6 నుంచి అఫ్గానిస్తాన్‌తో ప్రారంభం కానున్న ఏకైక టెస్ట్‌కు సిరాజ్‌కు విశ్రాంతి ఇవ్వాలని క్రికెట్ నిపుణులు బీసీసీఐని సూచిస్తున్నారు. బుమ్రా తరహాలోనే సిరాజ్ వర్క్‌లోడ్‌ను కూడా మేనేజ్ చేయాల్సిన అవసరముందని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లో సిరాజ్ ఏకంగా 17 మ్యాచ్‌లు ఆడాడు. సిరాజ్ చివరగా మే 31న ఫైనల్లో గుజరాత్ టైటాన్స్ తరఫున బరిలోకి దిగాడు.ఇప్పుడు కేవలం ఐదు రోజుల వ్యవధిలోనే.. అఫ్గాన్‌తో టెస్ట్‌లో అతడు ఆడాల్సి ఉంది. 4 నెలల పాటు విరామం లేకుండా క్రికెట్ ఆడిన ఒక ఫాస్ట్ బౌలర్‌ను 5 రోజుల సుదీర్ఘ టెస్ట్ మ్యాచ్ ఆడమనడం ఎంతవరకు సమంజసం? ఫ్యాన్స్ మండిపడుతున్నారు. అతడేమి రోబో కాదు కదా? అని సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెడుతున్నారు.ఇదే కొనసాగితే అతడు గాయాల బారిన పడే అవకాశముంది. కాబట్టి బీసీసీఐ అతడి విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని మాజీ క్రికెటర్లు సైతం హెచ్చరిస్తున్నారు. అఫ్గానిస్తాన్‌తో జరిగే వన్డే సిరీస్ నుండి సిరాజ్‌కు విశ్రాంతి ఇచ్చినప్పటికీ, ఆ తర్వాత ఇంగ్లండ్ టూర్, శ్రీలంకతో 2 టెస్టులు, న్యూజిలాండ్ పర్యటనలతో మళ్లీ బిజీ కానున్నాడు.ముఖ్యంగా శ్రీలంక, న్యూజిలాండ్‌తో జరిగే రెడ్ బాల్ సిరీస్‌లు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో భాగంగా జరగనున్నాయి. ఈ సిరీస్‌ల సమయానికి సిరాజ్ 100% ఫిట్నెస్తో ఉండటం ముఖ్యం. కాగా అఫ్గాన్‌తో జరిగే టెస్ట్ మ్యాచ్ డబ్ల్యూటీసీ పరిధిలోకి రాదు. కాబట్టి ఈ మ్యాచ్ కోసం ప్రసిద్ధ్ కృష్ణ, గుర్నూర్ బ్రార్, నితీష్ కుమార్ రెడ్డి లాంటి యువ పేసర్లను వాడుకుంటే సరిపోతుంది. అంతేకాకుండా ముల్లాన్‌పూర్ పిచ్ ఎక్కువగా స్పిన్నర్లకు అనుకూలిస్తోంది. జట్టులో కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, హర్ష్ దూబే వంటి స్పిన్నర్లు ఉన్నారు.చదవండి: ఒకే ఓవర్లో 6 సిక్స్‌లు -
ఐపీఎల్ ముగిసింది.. వారంలోపే రంగంలోకి దిగనున్న టీమిండియా
ఐపీఎల్ 2026 ముగిసిన వారం వ్యవధిలోనే టీమిండియా రంగంలోకి దిగనుంది. జూన్ 6 నుంచి ఆఫ్ఘనిస్తాన్‌తో జరుగబోయే ఏకైక టెస్ట్, 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌తో భారత క్రికెట్ జట్టు అంతర్జాతీయ షెడ్యూల్ మొదలుకానుంది. ఈ ఏడాది ఆసాంతం టీమిండియా అన్ని ఫార్మాట్ల సిరీస్‌లతో బిజీగా ఉండనుంది. ఐపీఎల్ తర్వాత టీమిండియా ఆడబోయే సిరీస్‌ల వివరాలు ఇలా ఉన్నాయి.భారత్‌లో ఆఫ్ఘనిస్తాన్ జట్టు పర్యటనజూన్ 6-10: ఆఫ్ఘనిస్తాన్‌తో ఏకైక టెస్ట్ (ముల్లాన్‌పూర్)జూన్ 13- ఆఫ్ఘనిస్తాన్‌తో తొలి వన్డే (ధర్మశాల)జూన్ 17- ఆఫ్ఘనిస్తాన్‌తో రెండో వన్డే (లక్నో)జూన్ 20- ఆఫ్ఘనిస్తాన్‌తో మూడో వన్డే (చెన్నై)ఐర్లాండ్‌లో టీమిండియా పర్యటనజూన్ 26- తొలి టీ20 (బెల్ఫాస్ట్)జూన్ 28- రెండో టీ20 (బెల్ఫాస్ట్)టీమిండియా టూర్ ఆఫ్ ఇంగ్లండ్జులై 1- తొలి టీ20 (చెస్టర్ లీ స్ట్రీట్)జులై 4- రెండో టీ20 (మాంచెస్టర్)జులై 7- మూడో టీ20 (నాటింగ్హమ్)జులై 9- నాలుగో టీ20 (బ్రిస్టల్)జులై 11- ఐదో టీ20 (సౌతాంప్టన్)జులై 14- తొలి వన్డే (ఎడ్జ్‌బాస్టన్)జులై 16- రెండో వన్డే (కార్డిఫ్)జులై 19- మూడో వన్డే (లండన్)టీమిండియా టూర్ ఆఫ్ జింబాబ్వేజులై 23- తొలి టీ20 (హరారే)జులై 25- రెండో టీ20 (హరారే)జులై 26- మూడో టీ20 (హరారే)టీమిండియా టూర్ ఆఫ్ శ్రీలంక (అధికారికంగా ఖరారు కాలేదు)2 టెస్టులు, 3 టీ20లుఏషియన్ గేమ్స్ 2026 (టీ20 ఫార్మాట్, సెప్టెంబర్ 17 – అక్టోబర్ 3)ఈ ఖండాంతర ఈవెంట్లో టీమిండియా డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగుతుంది.భారత్‌లో వెస్టిండీస్ జట్టు పర్యటనసెప్టెంబర్ 27- తొలి వన్డే (తిరువనంతపురం)సెప్టెంబర్ 30- రెండో వన్డే (గౌహతి)అక్టోబర్ 3- మూడో వన్డే (ముల్లాన్‌పూర్)అక్టోబర్ 6- తొలి టీ20 (లక్నో)అక్టోబర్ 9- రెండో టీ20 (రాంచీ)అక్టోబర్ 11- మూడో టీ20 (ఇండోర్)అక్టోబర్ 14- నాలుగో టీ20 (హైదరాబాద్)అక్టోబర్ 17- ఐదో టీ20 (బెంగళూరు)భారత్‌లో శ్రీలంక జట్టు పర్యటనడిసెంబర్ 13- తొలి వన్డే (ఢిల్లీ)డిసెంబర్ 16- రెండో వన్డే (బెంగళూరు)డిసెంబర్ 19- మూడో వన్డే (అహ్మదాబాద్)డిసెంబర్ 22- తొలి టీ20 (రాజ్‌కోట్)డిసెంబర్ 24- రెండో టీ20 (కటక్)డిసెంబర్ 27- మూడో టీ20 (పూణే)భారత్‌లో జింబాబ్వే జట్టు పర్యటన2027, జనవరి 3- తొలి వన్డే (కోల్‌కతా)జనవరి 6- రెండో వన్డే (హైదరాబాద్)జనవరి 9- మూడో వన్డే (ముంబై)భారత్‌లో ఆస్ట్రేలియా పర్యటనజనవరి 21- తొలి టెస్ట్ (నాగ్‌పూర్)జనవరి 29- రెండో టెస్ట్ (చెన్నై)ఫిబ్రవరి 11- మూడో టెస్ట్ (గౌహతి)ఫిబ్రవరి 19- నాలుగో టెస్ట్ (రాంచీ)ఫిబ్రవరి 27- ఐదో టెస్ట్ (అహ్మదాబాద్) -
జైస్వాల్‌కు క్షమాపణ చెప్పండి.. రోహిత్ ఎందుకు?
టీమిండియా తరఫున అరంగేట్రంలోనే సెంచరీతో చెలరేగాడు యశస్వి జైస్వాల్. వెస్టిండీస్‌తో టెస్టులో శతక్కొట్టి జట్టును గెలిపించాడు. ఆ పర్యటనలోనే అంతర్జాతీయ టీ20లలోనూ అడుగుపెట్టాడు.టెస్టుల్లో స్టార్ ఓపెనర్‌గా ఎదిగిన జైస్వాల్ (Yashasvi Jaiswal).. వన్డే అరంగేట్రానికి మాత్రం రెండేళ్లు ఎదురుచూడాల్సి వచ్చింది. ఎట్టకేలకు గతేడాది సెలక్టర్లు అతడి నిరీక్షణకు తెరదించారు. స్వదేశంలో ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌కు అతడిని ఎంపిక చేశారు.అజేయ శతకంఈ క్రమంలో ఇంగ్లండ్‌తో తొలి వన్డేలో రోహిత్ శర్మకు ఓపెనింగ్ జోడీగా బరిలోకి దిగిన జైసూ.. 15 పరుగులకే అవుటయ్యాడు. ఆ తర్వాత మళ్లీ తుదిజట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు. అనంతరం సొంతగడ్డపై గతేడాది సౌతాఫ్రికాతో తన చివరి వన్డే ఆడిన ఈ లెఫ్టాండర్ బ్యాటర్.. అజేయ శతకం (116)తో ఆకట్టుకున్నాడు.ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్, కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ టీమిండియా సెలక్టర్లు, దిగ్గజ ఓపెనర్ రోహిత్ శర్మను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశాడు. జైస్వాల్‌ను సెలక్టర్లు క్షమాపణ కోరాలని సూచించాడు. స్పోర్ట్స్‌స్టార్ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ..సెలక్టర్ల ఆలోచన ఏమిటి?‘‘యశస్వి జైస్వాల్ తన చివరి వన్డే ఇన్నింగ్స్‌లో 116 పరుగులతో అజేయంగా నిలిచాడు. అప్పటి నుంచి ఇప్పటిదాకా అతడు మళ్లీ వన్డే ఆడనే లేదు. సెలక్టర్లు 24 ఏళ్ల జైస్వాల్‌కు బదులు.. ఫిట్‌నెస్‌పై స్పష్టత లేని వెటరన్ బ్యాటర్ (రోహిత్ శర్మ) వైపు మొగ్గుచూపుతున్నారు.అతడు ఇప్పుడు ఫామ్‌లో కూడా లేడు. దీని వెనుక ఉన్న లాజిక్ ఏమిటో నాలాంటి వాళ్లకు కాస్త అర్థమయ్యేలా వివరించండి. అసలు వన్డే వరల్డ్‌కప్-2027 సన్నద్ధత విషయంలో సెలక్టర్ల ఆలోచన ఏమిటి?ఫోన్ చేసి మరీ క్షమాపణలు చెప్పాలిరోహిత్ శర్మ విషయంలో వాళ్లు రాజీ పడాల్సి వచ్చిందో.. లేదంటే ఇంకెందుకు అతడిని కొనసాగిస్తున్నారో నాకైతే తెలియదు. ఏదేమైనా వాళ్లు జైస్వాల్‌కు ఫోన్ చేసి మరీ క్షమాపణలు చెప్పాలి. కఠినమైన టెస్టు ఫార్మాట్లో ఈ యువ ఆటగాడు ఎన్నో అద్భుత విజయాలు అందించాడు.24 ఏళ్ల వయసులోపే ఎన్నెన్నో శతకాలు బాదాడు. అతడి బంగారు భవిష్యత్తును ప్రశ్నార్థకం చేయకండి. విరాట్ కోహ్లి విషయం పక్కనపెడితే.. రోహిత్ శర్మను ఇంకెందుకు కొనసాగిస్తున్నారు?రోహిత్ ఇంకెందుకు?అజిత్ అగార్కర్ టీమిండియా విషయంలో సరైన నిర్ణయాలు తీసుకుంటున్నాడని నాకైతే అనిపించడం లేదు. ఇప్పటికీ రోహిత్ మాత్రమే వన్డేల్లో కీలక ఓపెనర్ అని భావిస్తున్నారా? అతడికి బదులు జైస్వాల్ లేదంటే సాయి సుదర్శన్‌కు అవకాశం ఇవ్వొచ్చు కదా!’’ అని సంజయ్ మంజ్రేకర్ చెప్పుకొచ్చాడు.కాగా వన్డే వరల్డ్‌కప్-2023లో కెప్టెన్‌గా టీమిండియాను ఫైనల్‌కు చేర్చిన రోహిత్ శర్మ.. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025లో విజేతగా నిలిపాడు. అయితే, ఆ తర్వాత అనూహ్య రీతిలో మేనేజ్మెంట్ అతడిని కెప్టెన్సీ నుంచి తప్పించి.. పగ్గాలు శుబ్‌మన్ గిల్‌కు అప్పగించింది. అతడి సారథ్యంలో భారత్ ఇప్పటికి ఒక్క సిరీస్ గెలవలేదు.ఇదిలా ఉంటే.. ఐపీఎల్-2026 ముగిసిన తర్వాత టీమిండియా స్వదేశంలో అఫ్గనిస్తాన్‌తో ఓ టెస్టు, మూడు వన్డేలు ఆడుతుంది. వన్డే సిరీస్‌లో ఫిట్‌నెస్‌కు లోబడి రోహిత్ శర్మ ఆడతాడని సెలక్టర్లు స్పష్టం చేశారు. ఈ జట్టులో జైస్వాల్‌కు చోటు దక్కలేదు. చదవండి: మేము ఇక్కడిదాకా రావటమే గొప్ప: రియాన్ పరాగ్ -
టీమిండియాతో సిరీస్‌లకు ఆఫ్ఘనిస్తాన్ జట్ల ప్రకటన
ఐపీఎల్ 2026 ముగిసిన తర్వాత ఆఫ్ఘనిస్తాన్ జట్టు భారత పర్యటనకు రానుంది. ఈ పర్యటనలో టీమిండియా-ఆఫ్ఘన్ జట్ల మధ్య ఏకైక టెస్ట్ మ్యాచ్, 3 వన్డేల సిరీస్ జరుగనుంది. ఈ సిరీస్‌ల కోసం వేర్వేరు ఆఫ్ఘనిస్తాన్ జట్లను ఇవాళ (మే 26) ప్రకటించారు. ఈ రెండూ ఫార్మాట్ల జట్లకు హష్మతుల్లా షాహిది కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ఈ జట్టు అనుభవజ్ఞులు, యువ ఆటగాళ్ల సమ్మేళనంగా ఉంది.ఇటీవలికాలంలో ఫిట్నెస్ సమస్యలతో బాధపడుతున్న స్టార్ ఆల్‌రౌండర్ అజ్మతుల్లా ఒమర్జాయ్ టెస్టు జట్టులో చోటు దక్కించుకున్నాడు. అతడు పూర్తిస్థాయి ఫిట్‌నెస్‌లో లేకపోయినా, కీలక పర్యటన కావడంతో సెలెక్టర్లు అతడిపై నమ్మకం ఉంచారు.వన్డే జట్టులో అనుభవజ్ఞులైన రహ్మత్ షా, రహ్మానుల్లా గుర్బాజ్‌తో పాటు యువ ఆటగాళ్లకు కూడా అవకాశం లభించింది. వికెట్కీపర్లుగా అఫ్సర్ జజాయ్, ఇక్రామ్ అలీఖిల్లను ఎంపిక చేశారు.బౌలింగ్ విభాగంలో స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ జట్టుకు ప్రధాన బలంగా నిలవనున్నాడు. అతడి అనుభవం భారత పిచ్‌లపై ఆఫ్ఘనిస్తాన్‌కు కీలకంగా మారనుంది.2027 వన్డే వరల్డ్‌కప్ దృష్ట్యా ఇరు జట్లకు ఈ సిరీస్ కీలకంగా మారింది. బెంచ్ స్ట్రెంత్‌ను పరీక్షించుకోవడం, కొత్త కాంబినేషన్లను సిద్ధం చేయడం ఈ సిరీస్ ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది. మరోవైపు టెస్టు ఫార్మాట్లో భారత్ లాంటి బలమైన జట్టుతో ఆడటం ఆఫ్ఘనిస్తాన్‌కు విలువైన అనుభవాన్ని అందించనుంది. గత కొన్నేళ్లుగా టెస్టు క్రికెట్లో నిలదొక్కుకునేందుకు ప్రయత్నిస్తున్న ఆఫ్ఘనిస్తాన్‌కు ఈ సిరీస్ పెద్ద పరీక్షగా మారింది. ఈ సిరీస్‌ల కోసం భారత జట్లను ఇదివరకే ప్రకటించిన విషయం తెలిసిందే.భారత పర్యటనకు ఆఫ్ఘనిస్తాన్ వన్డే జట్టు:హష్మతుల్లా షాహిదీ (కెప్టెన్), అబ్దుల్ మాలిక్, సెదీకుల్లా అతల్, రహ్మత్ షా, రహ్మనుల్లా గుర్బాజ్, రహ్మనుల్లా జద్రాన్, అఫ్సర్ జజాయ్, ఇక్రామ్ అలీఖిల్, అజ్మతుల్లా ఒమర్జాయ్, షరఫుద్దీన్ అష్రఫ్, నంగ్యాల్ ఖరోటాయ్, ఖైస్ అహ్మద్, బిలాల్ సామీ, జియా షరీఫీ, సలీం సఫీ, రషీద్ ఖాన్.భారత పర్యటనకు ఆఫ్ఘనిస్తాన్ టెస్టు జట్టు:హష్మతుల్లా షాహిదీ (కెప్టెన్), అబ్దుల్ మాలిక్, సెదీకుల్లా అతల్, రహ్మత్ షా, రహ్మనుల్లా గుర్బాజ్, రహ్మనుల్లా జద్రాన్, అఫ్సర్ జజాయ్, ఇక్రామ్ అలీఖిల్, అజ్మతుల్లా ఒమర్జాయ్, షరఫుద్దీన్ అష్రఫ్, నంగ్యాల్ ఖరోటాయ్, ఖైస్ అహ్మద్, బిలాల్ సామీ, జియా షరీఫీ, సలీం సఫీ.ఆఫ్ఘనిస్తాన్ భారత పర్యటన షెడ్యూల్ఏకైక టెస్ట్ మ్యాచ్- జూన్ 6-10 (ముల్లాన్‌పూర్)తొలి వన్డే- జూన్ 14 (ధర్మశాల)రెండో వన్డే- జూన్ 17 (లక్నో)మూడో వన్డే- జూన్ 20 (చెన్నై) -
ఇదేం సెలక్షన్?.. మరీ ఇంత దారుణమా?
టీమిండియా సెలక్షన్ కమిటీ తీరుపై మాజీ చీఫ్ సెలక్టర్ దిలీప్ వెంగ్‌సర్కార్ మండిపడ్డాడు. ఆటగాళ్లను ఏ ప్రాతిపదికన ఎంపిక చేస్తున్నారో అర్థం కావడం లేదన్నాడు. రంజీల్లో సత్తా చాటిన వారికి జట్టులో చోటు ఇవ్వనపుడు.. అసలు ఇలాంటి టోర్నీలు ఎందుకు నిర్వహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశాడు.అఫ్గనిస్తాన్‌తో స్వదేశంలో ఏకైక టెస్టు, మూడు వన్డేలకు భారత జట్టును ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు విశ్రాంతినిచ్చిన సెలక్టర్లు బౌలింగ్ విభాగంలో మహ్మద్ సిరాజ్, ప్రసిద కృష్ణ, మానవ్ సుతార్, గుర్నూర్ బ్రార్, హర్ష్ దూబేలకు చోటిచ్చారు.60 వికెట్లు కూల్చిన ఆకిబ్ నబీఅయితే, 2025-26 రంజీ సీజన్లో జమ్మూ కశ్మీర్ తరఫున ఏకంగా 60 వికెట్లు కూల్చిన ఆకిబ్ నబీని మాత్రం పక్కనపెట్టారు. జమ్మూ జట్టు తొలిసారి రంజీ చాంపియన్‌గా నిలపడంలో ఈ ఫాస్ట్ బౌలర్‌దే కీలక పాత్ర. దీంతో సర్వత్రా ప్రశంసలు కురవగా.. అఫ్గన్‌తో టెస్టు జట్టుకు ఎంపిక చేయడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.అతడికి అన్యాయం చేశారుఅయితే, అనూహ్య రీతిలో సెలక్టర్లు ఆకిబ్‌ను పక్కనపెట్టారు. ఈ నేపథ్యంలో మాజీ చీఫ్ సెలక్టర్ దిలీప్ వెంగ్‌సర్కార్.. సెలక్షన్ కమిటీ నాయకుడు అజిత్ అగార్కర్ తీరుపై మండిపడ్డాడు. ‘‘ఈ సెలక్టర్లు ఆకిబ్‌ను ఎంపిక చేయకపోవడం ఆశ్చర్యపరిచింది. అసలు ఇదేం సెలక్షన్?..ఇది ఎంతమాత్రం ఆమోదయోగ్యనీయం కాదు. వీళ్లంతా కలిసి అతడికి అన్యాయం చేశారు. నిజంగా అతడిని పక్కనపెట్టడం అర్థంలేని చర్య. ప్రస్తుతం అతడి మానసిక స్థితి ఎలా ఉంటుందో ఊహింగచలరా? బీసీసీఐ వెంటనే వీటిని తీసేయాలిరంజీ ట్రోఫీలో ఒక సీజన్లో 60 వికెట్లు తీశాడు. అయినా సరే అతడిని ఎంపిక చేయలేదు. దేశీ క్రికెట్లో సత్తా చాటడం పనికిరాదని సెలక్టర్లు భావిస్తే.. బీసీసీఐ వెంటనే ఈ టోర్నీలను తీసేయాలి.వికెట్లు తీసే బౌలర్లను పక్కనపెట్టడం ఏమిటి? అతడి వేగం తక్కువగా ఉండొచ్చు. కానీ నిలకడగా వికెట్లు తీయడంలో అతడు దిట్ట. టీమిండియాలోకి వస్తే కోచ్‌లు అతడిని మరింత మెరుగ్గా తీర్చిదిద్దవచ్చు. కానీ మీరేం చేస్తున్నారు?’’ అని దిలీప్ వెంగ్‌సర్కార్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు.అఫ్గనిస్తాన్‌తో ఏకైక టెస్టుకు టీమిండియాశుబ్మన్ గిల్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, కెఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), సాయి సుదర్శన్, రిషబ్ పంత్, దేవదత్ పడిక్కల్, వాషింగ్టన్ సుందర్, మహ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, నితీశ్ కుమార్ రెడ్డి, ధ్రువ్ జురెల్, ప్రసిధ్ కృష్ణ, గుర్నూర్ బ్రార్, హర్ష్ దూబే.అఫ్గనిస్తాన్‌తో వన్డే సిరీస్‌కు టీమిండియాశుబ్మన్ గిల్ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ (వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్, అర్ష్‌దీప్ సింగ్, ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, ప్రసిధ్ కృష్ణ, ప్రిన్స్ యాదవ్, గుర్నూర్ బ్రార్, హర్ష్ దూబే, రోహిత్ శర్మ*, హార్దిక్ పాండ్యా*.చదవండి: సన్‌రైజర్స్‌కు తప్పని గండం.. అలా అయితేనే టాప్-2లో చోటు! -
నిరాశపరిచారు: టీమిండియా సెలక్టర్లపై విమర్శలు
టీమిండియా సెలక్షన్ కమిటీ తీరును ప్రముఖ కామెంటేటర్ హర్షా భోగ్లే విమర్శించాడు. దేశవాళీ క్రికెట్లో సత్తా చాటే ఆటగాళ్లను విస్మరించడం ఎంతమాత్రం తగదన్నాడు. అఫ్గనిస్తాన్‌తో ఏకైక టెస్టుకు జమ్మూ కశ్మీర్ ఎక్స్‌ప్రెస్ ఆకిబ్ నబీని ఎంపిక చేయకపోవడం తనను తీవ్రంగా నిరాశపరిచిందని ఈ సందర్భంగా పేర్కొన్నాడు.ఐపీఎల్-2026 ముగిసిన వెంటనే భారత జట్టు అంతర్జాతీయ క్రికెట్ (జూన్ 6 నుంచి)తో బిజీ కానుంది. ఇందులో భాగంగా తొలుత స్వదేశంలో అఫ్గనిస్తాన్ ఒక టెస్టు, మూడు వన్డేలు ఆడనుంది. ఇందుకు సంబంధించి భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) జట్లను ప్రకటించింది.గుర్నూర్ బ్రార్‌కు తొలిసారి పిలుపు ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు విశ్రాంతినివ్వగా.. గుర్నూర్ బ్రార్ తొలిసారి టెస్టు జట్టులో చోటు దక్కించుకున్నాడు. మహ్మద్ సిరాజ్, ప్రసిద్ కృష్ణతో కలిసి పేస్ దళంలో చేరాడు. అయితే, మెజారిటీ మంది విశ్లేషకులు అఫ్గన్‌తో టెస్టుకు ఆకిబ్ నబీని తప్పక ఎంపిక చేస్తారని భావించారు.కానీ సెలక్టర్లు మాత్రం అతడికి మొండిచేయి చూపారు. ఈ నేపథ్యంలో ఆకిబ్ నబీ పట్ల సెలక్షన్ కమిటీ వ్యవహారశైలిపై హర్ష్ భోగ్లే అసంతృప్తి వ్యక్తం చేశాడు. ‘‘ఈ జట్టులో ఆకిబ్ నబీ తప్పక ఉంటాడని నేను విశ్వసించాను. అతడి గురించి చర్చ కూడా జరిగింది.అతడిని ఎందుకు ఎంపిక చేయలేదు?అతడి బౌలింగ్‌లో తగినంత పేస్ ఉందా? లేదా? అన్న విషయంతో నాకు సంబంధం లేదు. బౌలింగ్ చేస్తున్న సమయంలో అతడు బ్యాలెన్స్ చేసుకుంటున్నాడా? లేదా? అన్నది కూడా నాకు అక్కర్లేదు.ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో రెండేళ్లలో అతడు వందకు పైగా వికెట్లు కూల్చాడు. అలాంటి బౌలర్‌కు ప్రోత్సాహం అందించడం కనీస బాధ్యత. అతడిని ఎంపిక చేసి ఉంటే దేశీ క్రికెట్లో సత్తా చాటే ఆటగాళ్లకు మంచి బూస్టప్ లభించేది.టెస్టుల్లో రాణించాలనే కసి మరింత పెరిగేది. అఫ్గన్‌తో టెస్టులో తుదిజట్టులో ఆకిబ్ నబీకి చోటు ఇవ్వకున్నా పర్లేదు. కానీ పదిహేను మంది సభ్యుల జట్టుకు మాత్రం అతడిని ఎంపిక చేయాల్సింది. అతడికి ఫిట్నెస్ సమస్యలు కూడా లేవు.ఏం మెసేజ్ ఇస్తు న్నారు?దేశీ క్రికెట్లో ఓ బౌలర్‌గా ఎంతగా రాణించాలో.. అంతా చేసి చూపాడు. బ్యాటింగ్ ఆర్డర్లో తొమ్మిదో స్థానంలో మెరుగ్గా ఆడగలడు. అయినప్పటికీ అతడిని ఎంపిక చేయకపోవడం నిజంగా నిరాశాజనకం. ఈ సెలక్షన్ కమిటీకి ఆకిబ్ నబీని ఎంపిక చేయకపోవడానికి గల కారణాలు ఎన్నో ఉండి ఉంటాయి. కానీ వారి చర్యల ద్వారా ఇచ్చే సందేశం మాత్రం సరిగ్గా లేదు’’ అని హర్షా భోగ్లే యూట్యూబ్ చానెల్ వేదికగా తన అభిప్రాయాలు పంచుకున్నాడు. కాగా 2025-26 సీజన్లో పది మ్యాచ్‌లలో ఆకిబ్ నబీ జమ్మూ కశ్మీర్ తరఫున 60 వికెట్లు తీశాడు. తన జట్టు తొలిసారి రంజీ ట్రోఫీ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. ఇక అంతకుముందు సీజన్లో ఆకిబ్.. 44 వికెట్లతో సత్తా చాటాడు.చదవండి: నితీశ్ రెడ్డి, ఇషాన్‌లకు లక్కీ ఛాన్స్.. పాపం పంత్!.. కొత్త ముఖాలు ఇవే -
అతడి గురించి అసలు చర్చించనేలేదు: అగార్కర్
వెటరన్ పేసర్ మహ్మద్ షమీకి టీమిండియా సెలక్టర్లు మరోసారి మొండిచేయి చూపారు. అఫ్గనిస్తాన్‌తో ఏకైక టెస్టు, వన్డే సిరీస్‌కు ఎంపిక చేసిన జట్లలో అతడికి చోటు ఇవ్వలేదు. దీంతో పునరాగమనం చేయాలని ఉవ్విళ్లూరుతున్న షమీ.. మరికొంత కాలం వేచిచూడక తప్పని పరిస్థితి.శుబ్‌మన్ గిల్ కెప్టెన్సీలోకాగా స్వదేశంలో జూన్ 6 నుంచి అఫ్గనిస్తాన్‌తో టీమిండియా ఒక టెస్టు, మూడు వన్డేలు ఆడనుంది. ఇందుకు సంబంధించిన జట్లను భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) మంగళవారం ప్రకటించింది. శుబ్‌మన్ గిల్ కెప్టెన్సీలో సాగే ఈ సిరీస్‌లలో కొత్తగా యువ పేసర్లు గుర్నూర్బ్రార్, ప్రిన్స్ యాదవ్ (వన్డేలకు మాత్రమే)లకు సెలక్టర్లు చోటిచ్చారు.పేస్ దళ నాయకుడిగా సిరాజ్ఇక ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు విశ్రాంతినివ్వగా.. హైదరాబాదీ స్టార్ మహ్మద్ సిరాజ్ పేస్ దళ నాయకుడిగా ముందుండి నడిపించనున్నాడు. అతడితోడు ప్రసిద్ కృష్ణ కూడా ఉన్నాడు. ఇక వన్డే జట్టులో వీరితో పాటు అర్ష్‌దీప్ సింగ్‌కు సెలక్టర్లు చోటిచ్చారు.మరోవైపు.. స్పిన్ విభాగంలో వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, హర్ష్ దూబే స్థానం సంపాదించారు. ఈ నేపథ్యంలో షమీ గురించి ప్రశ్న ఎదురుకాగా.. చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ మరోసారి పాత పాటే పాడాడు. షమీ కేవలం పొట్టి ఫార్మాట్‌కు మాత్రమే సిద్ధంగా ఉన్నాడంటూ మళ్లీ అతడిని ఉడికించాడు.అసలు చర్చే జరుగలేదు‘‘ప్రస్తుత పరిస్థితుల్లో అతడు టీ20 క్రికెట్ ఆడేందుకు మాత్రమే సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఈసారి మహ్మద్ షమీ గురించి మా మధ్య అసలు చర్చే జరుగలేదు’’ అని అగార్కర్ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. షమీకి బదులు జమ్మూ కశ్మీర్ పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ ఆకిబ్ నబీ గురించి చర్చ జరిగిందని.. అయితే, అతడికి కూడా స్థానం దక్కలేదని పేర్కొన్నాడు.కాగా గతేడాది ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ పర్యటనలకు కూడా షమీని సెలక్ట్ చేయలేదన్న సంగతి తెలిసిందే. సర్జరీ తర్వాత అతడు ఫిట్‌గా లేడన్న కారణంగానే ఎంపిక చేయలేదని అగార్కర్ నాడు పేర్కొన్నాడు.సత్తా చాటినా...ఇందుకు షమీ గట్టిగానే బదులిచ్చాడు. తాను పూర్తి ఫిట్‌గా ఉన్నానని.. కావాలనే పక్కనపెడుతున్నారని ఆరోపించాడు. అంతేకాదు.. రంజీ తాజా ఎడిషన్‌లో బెంగాల్ తరఫున సత్తా చాటి మరోసారి తనను తాను నిరూపించుకున్నాడు.అయినప్పటికీ సెలక్టర్లు షమీకి అవకాశం ఇవ్వలేదు. ఇప్పుడు మళ్లీ కూడా ఫిట్నెస్ కారణాలు చూపుతూ అతడిని పక్కనపెట్టామని అగార్కర్ చెప్పడం గమనార్హం. దీనిని బట్టి 35 ఏళ్ల షమీ ఇక టీమిండియా తరఫున పునరాగమనం చేయడం దాదాపు అసాధ్యమనే తేలిపోయింది.67 వికెట్లు పడగొట్టినా..కాగా వన్డే వరల్డ్‌కప్-2023లో భారత్ ఫైనల్ చేరడంలో షమీ కీలక పాత్ర పోషించాడు. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025లో టీమిండియా చాంపియన్‌గా నిలవడంలోనూ ఈ రైటార్మ్ పేసర్ హస్తం ఉంది. అయితే ఆ తర్వాత.. అతడు పరిమిత ఓవర్ల జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు.ఇక చివరగా 2023 జూన్‌లో టీమిండియా తరఫున టెస్టు మ్యాచ్ ఆడిన షమీ.. రీఎంట్రీ కోసం పరితపిస్తున్నాడు. బెంగాల్ తరఫున 2025-26 సీజన్లో షమీ మొత్తంగా 67 వికెట్లు కూల్చాడు. అయినప్పటికీ టీమిండియా సెలక్టర్లు అతడి పేరును పరిగణనలోకి తీసుకోకపోవడం గమనార్హం. ప్రస్తుతం ఐపీఎల్-2026లో లక్నో సూపర్ జెయింట్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న షమీ.. 12 మ్యాచ్‌లలో కలిపి 10 వికెట్లు కూల్చాడు.చదవండి: టీమిండియాలోకి వైభవ్.. అగార్కర్ కీలక వ్యాఖ్యలు -
నితీశ్ రెడ్డి, ఇషాన్‌కు లక్కీ ఛాన్స్.. పాపం పంత్!
అఫ్గనిస్తాన్‌తో టెస్టు, వన్డే సిరీస్‌కు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) తమ జట్టును ప్రకటించింది. శుబ్‌మన్ గిల్ సారథ్యంలో సొంతగడ్డపై అఫ్గన్‌తో తలపడే జట్ల వివరాలను మంగళవారం వెల్లడించింది. ఇందులో ప్రధానంగా గమనించదగ్గ అంశాలు ఏమిటంటే..పాపం పంత్!ఐపీఎల్-2026లో వరుస వైఫల్యాలతో సతమతమైన లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ రిషభ్ పంత్‌కు సెలక్టర్లు షాకిచ్చారు. ఈ వికెట్ కీపర్ బ్యాటర్‌ను టెస్టు జట్టు వైస్ కెప్టెన్ పదవి నుంచి తొలగించారు. పంత్ స్థానంలో సీనియర్ బ్యాటర్ కేఎల్ రాహుల్‌ను గిల్ డిప్యూటీగా నియమించారు.అంతేకాదు వన్డే జట్టులోనూ పంత్‌కు చోటు దక్కలేదు. కేఎల్ రాహుల్‌తో కలిసి వికెట్ కీపర్ కోటాలో ఇషాన్ కిషన్ చోటు దక్కించుకున్నాడు. కాగా 2023 అక్టోబరులో చివరగా టీమిండియా తరఫున వన్డే ఆడిన ఇషాన్ కిషన్.. ఈ సిరీస్‌తో రీఎంట్రీ ఇస్తున్నాడు. అతడికి ఇదొక గోల్డెన్ ఛాన్స్ఇటీవల దేశీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో సత్తా చాటిన ఈ జార్ఖండ్ పాకెట్ డైనమైట్.. ఏకంగా టీ20 ప్రపంచకప్-2026లో ఆడిన సంగతి తెలిసిందే. మూడేళ్ల తర్వాత వచ్చి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన ఇషాన్.. ఐపీఎల్-2026లో సన్‌రైజర్స్ తరఫునా సత్తా చాటుతున్నాడు. వారిద్దరికి విశ్రాంతిఈ క్రమంలోనే వన్డే జట్టులోనూ అతడికి సెలక్టర్లు చోటిచ్చారు. నిజంగా అతడికి ఇదొక గోల్డెన్ ఛాన్స్ లాంటిదే. ఇక ముందుగా ఊహించినట్లుగానే ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు సెలక్టర్లు విశ్రాంతినిచ్చారు. అతడిపై పనిభారాన్ని తగ్గించే క్రమంలో భాగంగా ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.అయితే, స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాను కూడా ఈ సిరీస్‌లకు ఎంపిక చేయకపోవడం గమనార్హం. అతడికి కూడా విశ్రాంతినిచ్చినట్లు తెలుస్తోంది. అదే విధంగా.. రంజీల్లో సత్తా చాటిన జమ్మూ కశ్మీర్ ఎక్స్‌ప్రెస్ ఆకిబ్ నబీకి సెలక్టర్లు మొండిచేయి చూపారు.కొత్త ముఖాలకు చోటుతాజా ఎడిషన్‌లో ఆకిబ్ 60 వికెట్లు తీసినప్పటికీ అతడికి అవకాశం ఇవ్వలేదు. ఇక ఐపీఎల్, దేశీ క్రికెట్లో సత్తా చాటుతున్న యువ పేసర్ ప్రిన్స్ యాదవ్‌కు మాత్రం తొలిసారి జాతీయ జట్టులో చోటు దక్కింది. అఫ్గనిస్తాన్‌తో వన్డే సిరీస్‌కు బీసీసీఐ ప్రిన్స్‌ను ఎంపిక చేసింది.రోహిత్, హార్దిక్ డౌటేఇక ప్రిన్స్ యాదవ్‌తో పాటు పేసర్ గుర్నూర్ బ్రార్, స్పిన్నర్ మానవ్ సుతార్, స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ హర్ష్ దూబే వంటి కొత్త ఆటగాళ్లు కూడా తొలిసారి టీమిండియాలో చోటు దక్కించుకున్నారు. ఇదిలా ఉంటే.. ప్రధాన పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా, దిగ్గజ ఓపెనర్ రోహిత్ శర్మ ఫిట్‌నెస్‌కు లోబడి అందుబాటులో ఉంటారని బీసీసీఐ తెలిపింది.ఇప్పటికే టెస్టు జట్టులో పాతుకుపోయిన ఆంధ్ర పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి.. హార్దిక్ ఫిట్నెస్ సమస్యల దృష్ట్యా వన్డే జట్టులోనూ చోటు సంపాదించాడు. ఇక వన్డే జట్టు వైస్ కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ తన స్థానం నిలబెట్టుకోగా.. అఫ్గన్‌తో సిరీస్ ద్వారా దిగ్గజ బ్యాటర్, వన్డే రారాజు విరాట్ కోహ్లి రీఎంట్రీ ఇవ్వనున్నాడు.అఫ్గనిస్తాన్‌తో ఏకైక టెస్టుకు భారత జట్టుశుబ్‌మన్ గిల్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, కెఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), సాయి సుదర్శన్, రిషబ్ పంత్, దేవదత్ పడిక్కల్, వాషింగ్టన్ సుందర్, మహ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, నితీశ్ కుమార్ రెడ్డి, ధ్రువ్ జురెల్, ప్రసిధ్ కృష్ణ, గుర్నూర్ బ్రార్, హర్ష్ దూబే.అఫ్గనిస్తాన్‌తో వన్డే సిరీస్‌కు భారత జట్టుశుబ్‌మన్ గిల్ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ (వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్, అర్ష్‌దీప్ సింగ్, ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, ప్రసిధ్ కృష్ణ, ప్రిన్స్ యాదవ్, గుర్నూర్ బ్రార్, హర్ష్ దూబే, రోహిత్ శర్మ*, హార్దిక్ పాండ్యా*.టీమిండియా- అఫ్గనిస్తాన్ టెస్టు, వన్డే సిరీస్ షెడ్యూల్ఏకైక టెస్టు: జూన్ 6 నుంచి మొదలు- న్యూ చండీగఢ్- ఉదయం 9.30 గంటలకు ఆరంభంతొలి వన్డే: జూన్ 14- ధర్మశాల- మధ్యాహ్నం 1.30 గంటలకు ఆరంభంరెండో వన్డే: జూన్ 17- లక్నో- మధ్యాహ్నం 1.30 గంటలకు ఆరంభంమూడో వన్డే: జూన్ 20- చెన్నై- మధ్యాహ్నం 1.30 గంటలకు ఆరంభం.చదవండి: IPL 2026: ముంబై ఇండియన్స్ కీలక ప్లేయర్లు అవుట్ -
అఫ్గాన్‌తో సిరీస్‌కు భారత జట్టు ప్రకటన
ఐపీఎల్ 2026 సీజన్లో వేర్వేరు జట్లలో ఆడుతున్న టీమిండియా ఆటగాళ్లు మళ్లీ ఒక్కటిగా కలిసి ఆడనున్నారు. ఐపీఎల్ ముగిసిన వెంటనే టీమిండియా స్వదేశంలో అప్గానిస్తాన్‌తో ఒక టెస్టు సహా మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. ఈ నేపథ్యంలో బీసీసీఐ సెలెక్షన్ కమిటీ మంగళవారం భారత జట్టును ప్రకటించింది. ఏకైక టెస్టుతో పాటు వన్డేలకు శుబ్‌మన్ గిల్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. జూన్ 6 నుంచి ముల్లన్పూర్ వేదికగా భారత్, అఫ్గానిస్తాన్‌ల మధ్య ఏకైక టెస్టు మ్యాచ్ జరగనుంది.ఏకైక టెస్టు మ్యాచ్‌కు కెప్టెన్ గిల్‌కు కేఎల్ రాహుల్ డిప్యూటీగా వ్యవహరించనున్నాడు. మరోవైపు వన్డేలకు శ్రేయస్ అయ్యర్ వైస్ కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వహించనున్నాడు. వికెట్ కీపర్ రిషబ్ పంత్ టెస్టు జట్టులో చోటు దక్కించుకున్నప్పటికీ వైస్ కెప్టెన్సీ బాధ్యతలు కోల్పోయాడు. ఇక ఐపీఎల్ 2026 సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్ తరఫున నిలకడగా రాణిస్తున్న ప్రిన్స్ యాదవ్‌కు తొలిసారి భారత జట్టుకు ఎంపికయ్యాడు.ఇక టీమిండియా సీనియర్ క్రికెటర్లు రవీంద్ర జడేజాతో పాటు స్పీడస్టర్ జస్ప్రీత్ బుమ్రాలకు అఫ్గాన్‌తో సిరీస్‌కు విశ్రాంతి కల్పించిట్లు బీసీసీఐ తెలిపింది. అఫ్గానిస్తాన్‌తో ఒకే టెస్టు మ్యాచ్ కావడంతో జడేజాను తప్పించామని, టీ20 ప్రపంచకప్ నుంచి బిజీగా క్రికెట్ ఆడుతున్న బుమ్రాను భవిష్యత్తులో టీమిండియా ఆడబోయే కీలక సిరీస్‌లను దృష్టిలో ఉంచుకొని అతడికి విశ్రాంతి కల్పిస్తున్నట్లు పేర్కొంది. ఇక సీనియర్ ఆటగాడు కోహ్లీ తన స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. మరో సీనియర్ క్రికెటర్ రోహిత్ శర్మ, ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాలను వన్డే జట్టులోకి ఎంపిక చేసినప్పటికీ, ఫిట్నెస్ నిరూపించుకోవాల్సిన అవసరముందని అభిప్రాయపడింది. ఐపీఎల్లో అదరగొడుతున్న టీమిండియా సీనియర్ భువనేశ్వర్ కుమార్‌ను సెలెక్టర్లు పట్టించుకోలేదు. మరోవైపు మహ్మద్ షమీ విషయంలో సెలెక్షన్ కమిటీలో ఎలాంటి చర్చ జరగలేదని అగార్కర్ తెలిపాడు. ఇక తెలుగు క్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డి టెస్టు జట్టులో తన స్థానాన్ని నిలుపుకున్నాడు.అఫ్గాన్‌తో ఏకైక టెస్టుకు టీమిండియా: శుబ్‌మన్ గిల్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), సాయి సుదర్శన్, రిషబ్ పంత్, దేవదత్ పడిక్కల్, వాషింగ్టన్ సుందర్, మహ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, నితీష్ కుమార్ రెడ్డి, ధ్రువ్ జురెల్, ప్రసిధ్ కృష్ణ, గుర్నూర్ బ్రార్, హర్ష్ దూబే.అఫ్గాన్‌తో వన్డేలకు భారత జట్టు: శుబ్‌మన్ గిల్ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ (వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్, అర్ష్‌దీప్ సింగ్, ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, ప్రసిధ్ కృష్ణ, ప్రిన్స్ యాదవ్, గుర్నూర్ బ్రార్, హర్ష్ దూబే, రోహిత్ శర్మ*, హార్దిక్ పాండ్యా*.మ్యాచ్‌ల షెడ్యూల్..జూన్ 6 నుంచి 10 వరకు- ఏకైక టెస్టు (ముల్లన్ పూర్, ఛండీగఢ్)తొలి వన్డే : జూన్ 14 (ధర్మశాల)రెండో వన్డే : జూన్ 17 (లక్నో)మూడో వన్డే : జూన్ 20 (చెన్నై)🚨 News 🚨Presenting #TeamIndia's squads for the @IDFCFIRSTBank Test match and the 3️⃣-match ODI series against Afghanistan in June 🙌#INDvAFG pic.twitter.com/hFiABALLld— BCCI (@BCCI) May 19, 2026📸The Men's Selection Committee Meeting for #TeamIndia's squad announcement for the upcoming @IDFCFIRSTBank Test match and the three-match ODI series against Afghanistan is underway in Guwahati.#INDvAFG pic.twitter.com/VlA94h1nFC— BCCI (@BCCI) May 19, 2026చదవండి: ధోని వీడ్కోలు.. ఒక శకం ముగిసింది! -
‘సత్తా చాటినా.. టీమిండియాకు అతడి ఎంపిక కష్టమే’
ఐపీఎల్-2026 ముగిసిన వారం వ్యవధిలోపే టీమిండియా అంతర్జాతీయ క్రికెట్ బరిలో దిగనుంది. స్వదేశంలో అఫ్గనిస్తాన్‌తో ఒక టెస్టు, మూడు వన్డేలు ఆడేందుకు షెడ్యూల్ ఖరారైంది. ఈ నేపథ్యంలో భారత జట్టు ఎంపిక ఎలా ఉండబోతుందన్న అంశం ఆసక్తికరంగా మారింది.బుమ్రాకు విశ్రాంతిప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు విశ్రాంతినివ్వడం ఖాయంగానే కనిపిస్తోంది. ఇక సొంతగడ్డపై స్పిన్నర్ల ప్రభావమే ఎక్కువ కాబట్టి.. రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్‌లకు బౌలింగ్ విభాగంలో చోటు ఖాయం.ఇక బుమ్రా లేకపోయినా మహ్మద్ సిరాజ్, ప్రసిద్ కృష్ణ పేస్ దళంలో ఉండనే ఉన్నారు. అయితే, అఫ్గన్ బలహీన జట్టు కాబట్టి ఈసారి ప్రయోగాలు చేయాలని టీమిండియా యాజమాన్యం భావిస్తున్నట్లు వినికిడి.ఆకిబ్ నబీ ఎంపికపై చర్చఈ నేపథ్యంలో గత ఏడాది రంజీల్లో అత్యధిక వికెట్లతో సత్తా చాటిన జమ్మూ కశ్మీర్ ఎక్స్‌ప్రెస్ ఆకిబ్ నబీ ఎంపికపై చర్చ నడుస్తోంది. అతడిని తప్పక ఈ సిరీస్‌కు ఎంపిక చేస్తారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, తాజాగా ఓ జర్నలిస్టు సోషల్ మీడియా వేదికగా నబీ అరంగేట్రం ఇప్పట్లో కష్టమనే సంకేతాలు ఇచ్చారు.పేస్ లేదు‘‘అఫ్గనిస్తాన్‌తో టెస్టుకు రిషబ్ పంత్ వైస్ కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు. ఆకిబ్ నబీ 60 వికెట్లు తీసినా.. అతడి బౌలింగ్‌లో పెద్దగా పేస్ లేదనే చర్చ జరిగింది. అతడు అందరినీ ఆకట్టుకోలేకపోయాడు.ఒకవేళ అతడికి పదిహేను మంది సభ్యుల టెస్టు జట్టులో చోటు దక్కినా.. ఇప్పట్లో అరంగేట్రం చేయడం కష్టమే. అంతేకాదు ఈసారి కూడా అతడిని ఎంపిక చేసే అవకాశాలు చాలా తక్కువ’’ అని కుశన్ సర్కార్ అనే జర్నలిస్టు ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. ప్రిన్స్ యాదవ్‌కు అవకాశం!ఇదిలా ఉంటే.. అఫ్గనిస్తాన్ వన్డే సిరీస్‌కు మాత్రం బీసీసీఐ కొత్త ఆటగాళ్లను ఎంపిక చేసే అవకాశం లేకపోలేదు. దేశీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో 17 వికెట్లు పడగొట్టడంతో పాటు ప్రస్తుత ఐపీఎల్లో కూడా చెలరేగుతున్న ప్రిన్స్ యాదవ్ పేరు తెరమీదకు వచ్చింది.హర్షిత్ రాణా ఇంకా ఫిట్నెస్ సాధించకపోవడంతో ప్రిన్స్‌ను ఎంపిక చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. కాగా మే 31న ఫైనల్‌తో ఐపీఎల్ తాజా సీజన్ ముగియనున్న సంగతి తెలిసిందే.భారత్ వర్సెస్ అఫ్గనిస్తాన్ సిరీస్‌ల షెడ్యూల్👉ఏకైక టెస్టు: జూన్ 6 నుంచి ఆరంభం, న్యూ చండీగఢ్👉తొలి వన్డే: జూన్ 14, ధర్మశాల👉రెండో వన్డే: జూన్ 17, లక్నో👉మూడో వన్డే: జూన్ 20, చెన్నై.చదవండి: రిటైర్మెంట్పై స్పష్టమైన సంకేతాన్నిచ్చిన ధోని -
టీమిండియాలోకి ఎవరూ ఊహించని ప్లేయర్?
అఫ్గానిస్తాన్‌తో జరిగే ఏకైక టెస్టు, మూడు వన్డేల సిరీస్ కోసం భారత జట్టును బీసీసీఐ సెలక్షన్ కమిటీ మే 19న ప్రకటించనుంది. ఈ సందర్భంగా అజిత్ అగార్కర్ అండ్ కో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా అఫ్గాన్‌తో టెస్టుకు స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు సెలక్టర్లు విశ్రాంతి ఇవ్వనున్నట్లు సమాచారం.వన్డేల్లో మాత్రం బుమ్రా ఆడనున్నట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. వన్డే వరల్డ్‌కప్-2027 సన్నాహాకాల్లో భాగంగా ఈ సిరీస్ జరగనుంది. ఈ నేపథ్యంలో విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, బుమ్రా, రాహుల్ వంటి శ్రేయస్ అయ్యర్, వంటి స్టార్ ప్లేయర్లు బరిలోకి దిగనున్నారు.భారత జట్టులోకి ఆకిబ్ నబీ!ఇక దేశవాళీ క్రికెట్లో దుమ్ములేపుతున్న జమ్మూ కాశ్మీర్ పేసర్ ఆకిబ్ నబీ భారత టెస్ట్ జట్టులోకి రావడం దాదాపు ఖాయమైంది. బుమ్రా గైర్హజారీలో మొహ్మద్ సిరాజ్ పేస్ బౌలింగ్ ఎటాక్‌ను లీడ్ చేసే అవకాశముంది. అదేవిధంగా ఆకాష్ దీప్, హర్షిత్ ఇద్దరూ గాయపడటంతో ప్రసిద్ద్ కృష్ణ కూడా తిరిగి టెస్ట్ స్క్వాడ్‌లోకి రానున్నాడు. వీరితో పాటు ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి బంతిని పంచుకోనున్నాడు.భారత్ ఇద్దరు ఫ్రంట్‌లైన్ పేసర్లతోనే బరిలోకి దిగే అవకాశముంది. ఎందుకంటే ఉపఖండ పిచ్‌లపై స్పిన్నర్ల ఆధిపత్యం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్ వంటి స్పిన్నర్లు తుది జట్టులో ఉండడానికి అస్కారం ఉంది.ఇక బ్యాటింగ్ విషయానికి వస్తే సౌతాఫ్రికా సిరీస్‌లో విఫలమైన దేవ్‌దత్త్ పడిక్కల్‌కు సెలక్టర్ల మరో అవకాశమివ్వనున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా తమిళనాడు స్టార్ సాయిసుదర్శన్‌ను కూడా అఫ్గాన్ టెస్టుకు ఎంపిక చేయనున్నట్లు సమాచారం.ప్రిన్స్‌కు పిలుపు!మరోవైపు అఫ్గాన్‌తో వన్డే సిరీస్‌కు ఢిల్లీ స్పీడ్‌స్టర్ ప్రిన్స్ యాదవ్ పేరును సెలక్టర్లు పరిశీలిస్తున్నట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. ప్రిన్స్ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఐపీఎల్-2026లో లక్నో సూపర్ జెయింట్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న అతడు.. ఇప్పటివరకు 16 వికెట్లు పడగొట్టాడు. అదేవిధంగా దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలోనూ ప్రిన్స్ సత్తాచాటాడు. హర్షిత్ రాణా గాయపడడంతో అతడి స్ధానంలో ప్రిన్స్ పరీక్షించాలని బీసీసీఐ భావిస్తుందంట.చదవండి: గిల్, పృథ్వీ షాతో కలిసి ఆడాడు.. కట్ చేస్తే! ఇప్పుడు ఓ జట్టునే కొనేశాడు -
పంత్‌కు షాక్.. కిషన్‌కు జాక్‌పాట్!
ఐపీఎల్-2026 ముగిసిన వెంటనే టీమిండియా జాతీయ విధుల్లో బీజీ కానుంది. తొలుత స్వదేశంలో అఫ్గానిస్తాన్‌తో ఏకైక టెస్టు, మూడు వన్డేల సిరీస్‌లో భారత్ తలపడనుంది. అయితే ఈ సిరీస్‌ల కోసం అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ మే 19న భారత జట్టును ప్రకటించే అవకాశం ఉంది.ఈ సిరీస్‌లకు పలువురు సీనియర్లకు విశ్రాంతినిస్తూ, కొత్త ముఖాలకు అవకాశం కల్పించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా అఫ్గాన్‌తో జరిగే ఏకైక టెస్టుకు టీమిండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు విశ్రాంతి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అతడితో పాటు కెప్టెన్ శుభ్‌మన్ గిల్, కేఎల్ రాహుల్ వంటి స్టార్ బ్యాటర్లు సైతం అఫ్గాన్‌తో టెస్టుకు దూరమయ్యే సూచనలు కన్పిస్తున్నాయి. అయితే దేశవాళీ క్రికెట్లో అదరగొడుతున్న గుర్నూర్ బ్రార్, ఆకిబ్ నబీలకు తొలిసారి భారత జట్టులో చోటు దక్కనున్నట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. మరోవైపు న్‌రైజర్స్ హైదరాబాద్ తరపున మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడుతున్న ఇషాన్ కిషన్ కూడా సెలక్టర్ల దృష్టిలో ఉన్నాడు. రిజర్వ్ వికెట్ కీపర్‌గా పంత్ స్థానంలో ఇషాన్‌ను తీసుకునే అవకాశం ఉంది. పంత్ ప్రస్తుతం పేలవ ఫామ్‌తో సతమతమవుతున్నాడు. అదేవిధంగా వెన్నునొప్పి సమస్యతో ముంబై ఇండియన్స్‌కు దూరమైన హార్దిక్ పాండ్యా అఫ్గాన్‌తో వన్డేల్లో ఆడుతాడా లేదా అన్నది ఇంకా స్పష్టత లేదు. అతడు అందుబాటులో లేకపోతే నితీశ్ కుమార్ రెడ్డిని ఎంపిక చేసే ఛాన్స్ ఉంది. నితీశ్ ప్రస్తుతం బ్యాట్‌తో పాటు బంతితో కూడా రాణిస్తున్నాడు. ఇక అఫ్గాన్-భారత్ మధ్య ఏకైక టెస్ట్ మ్యాచ్ జూన్ 6న ముల్లాన్ పూర్ వేదికగా ప్రారంభం కానుంది.చదవండి: ముంబై ఇండియన్స్ అరుదైన రికార్డు.. 19 ఐపీఎల్ చరిత్రలోనే -
లీకైన భారత టెస్ట్ జట్టు.. గుజరాత్ స్టార్ ప్లేయర్‌పై వేటు
ఐపీఎల్ 2026 తర్వాత స్వదేశంలో ఆఫ్ఘనిస్తాన్‌తో జరుగబోయే ఏకైక టెస్ట్ కోసం భారత జట్టును మరికొద్ది రోజుల్లో ప్రకటించే అవకాశం ఉంది. దీనిపై అధికారిక ప్రకటన వెలువడకముందే సోషల్‌మీడియా జట్టు వివరాలు లీకయ్యాయి.ఈ జట్టుకు కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్ కొనసాగనున్నాడు. సీనియర్లు కేఎల్ రాహుల్, పంత్, జడేజా, సిరాజ్, జైస్వాల్ కొనసాగనున్నారు. షమీ పునరాగమనం చేశాడు. ఐపీఎల్ ప్రదర్శనల ఆధారంగా అన్షుల్ కంబోజ్‌కు అవకాశం దొరికింది. రంజీ ప్రదర్శనల ఆధారంగా ఆకిబ్ నబీ, హర్ష్ దూబేకు చోటు కల్పించారు.ఆసక్తికరంగా గుజరాత్ టైటాన్స్ స్టార్ ఓపెనర్ సాయి సుదర్శన్‌పై వేటు పడింది. సాయి ఐపీఎల్ 2026లో మంచి ప్రదర్శనలు చేస్తున్నా, గత టెస్ట్ ప్రదర్శనల దృష్ట్యా అతనిని తప్పించినట్లు తెలుస్తోంది. సాయి స్థానంలో ఇటీవలికాలంలో ఫార్మాట్లకతీతంగా చెలరేగుతున్న దేవ్‌దత్ పడిక్కల్‌కు ఛాన్స్ ఇచ్చారు. స్టార్ పేసర్ బుమ్రాకు విశ్రాంతినిచ్చారు.వాస్తవానికి ఆఫ్ఘనిస్తాన్‌తో ఏకైక టెస్ట్‌కు సీనియర్లకంతా విశ్రాంతినిస్తారని ప్రచారం జరిగింది. లీకైన జట్టును బట్టి చూస్తే అలాంటిదేమీ లేదని తెలుస్తోంది. మరో పక్క ఇదే జట్టు కొనసాగుతుందన్న గ్యారెంటీ అయితే లేదు. కేవలం సోషల్‌మీడియాలో జరుగుతున్న ప్రచారం మాత్రమే ఇది. జట్టుపై త్వరలో అధికారిక ప్రకటన రావొచ్చు. ఒక్కటైతే గ్యారెంటీ జట్టు దాదాపుగా ఇలాగే ఉండవచ్చు. ఎందుకంటే సెలెక్టర్లు ఇప్పటికే జట్టును డిసైడ్ చేసినట్లు సమాచారం. ఆఫ్ఘనిస్తాన్‌తో టెస్ట్ మ్యాచ్ ఐపీఎల్ ముగిసిన తర్వాత జూన్ 6 నుంచి ముల్లాన్‌పూర్ వేదికగా ప్రారంభం కానుంది. ఈ పర్యటనలో ఆఫ్ఘనిస్తాన్ మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ కూడా ఆడనుంది. ఆ మ్యాచ్‌లు జూన్ 14, 17, 20 తేదీల్లో ధర్మశాల, లక్నో, చెన్నై వేదికలుగా జరుగనున్నాయి. సోషల్‌మీడియాలో ప్రచారం జరుగుతున్న భారత జట్టు:శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్, దేవదత్ పడిక్కల్, రిషభ్ పంత్, ధృవ్ జురెల్, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా,కుల్దీప్ యాదవ్, మొహమ్మద్ సిరాజ్, ఆకిబ్ నబీ, హర్ష్ దూబే, మహ్మద్ షమీ, అన్షుల్ కంబోజ్ -
షమీ రీఎంట్రీకి ముహూర్తం ఖరారు..!
వెటరన్ పేసర్ మహ్మద్ షమీ టీమిండియా రీఎంట్రీకి ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది. ఈ విషయమై బీసీసీఐలో సీరియస్‌గా చర్చలు జరుగుతున్నాయని సమాచారం. ఐపీఎల్ తర్వాత ఆఫ్ఘనిస్తాన్‌తో జరుగబోయే ఏకైక టెస్ట్ కోసం షమీ ఎంపికకు లైన్ క్లియర్ అయినట్లు తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటనే తారువాయి అని ఓ ప్రముఖ వెబ్సైట్ రాసుకొచ్చింది.షమీ గతకొంతకాలంగా ఫార్మాట్లకతీతంగా ప్రతి దేశవాలీ పోటీలో సత్తా చాటుతున్నాడు. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్‌లోనూ లక్నో సూపర్ జెయింట్స్ తరఫున మెరుగ్గా రాణిస్తున్నాడు. వాస్తవానికి షమీ రీఎంట్రీ ఎప్పుడో జరగాల్సింది. కానీ, ఎందుకో వాయిదా పడుతూ వస్తుంది. ఎట్టకేలకు సెలెక్టర్లు అతన్ని కరుణించినట్లు తెలుస్తోంది. అతడు చివరిగా 2025 ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడాడు.చాలామంది షమీ కెరీర్ ఖతమైందని అనుకున్నారు. కానీ అతడు మాత్రం ఎప్పుడూ ఆశ వదులుకోలేదు. రోజురోజుకు మెరుగవుతూ 35 ఏళ్ల లేటు వయసులో రీఎంట్రీకి సిద్దమయ్యాడు. ప్రస్తుతం షమీ పూర్తి ఫిట్నెస్తో ఉన్నాడు. ఈ మధ్యలో అతను ఎలాంటి గాయాల బారిన పడకపోతే, ఆఫ్ఘనిస్తాన్‌తో ఏకైక టెస్ట్‌లో బరిలోకి దిగడం దాదాపుగా ఖాయమైనట్లే.ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్ కోసం మరో సీనియర్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు విశ్రాంతి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. వర్క్‌లోడ్ దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్‌లో సిరాజ్‌కు జోడీగా షమీ బంతిని షేర్ చేసుకోవచ్చు. ఈ మ్యాచ్ కోసం ప్రిన్స్ యాదవ్, మొహ్సిన్ ఖాన్, కార్తిక్ త్యాగి లాంటి యువ పేసర్ల పేర్లను కూడా పరిగణలోకి తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. వీరంతా ప్రస్తుత ఐపీఎల్లో ఇరగదీస్తున్నారు. కాగా, ఆఫ్ఘనిస్తాన్‌తో ఏకైక టెస్ట్ మ్యాచ్ జూన్ 6 నుంచి ముల్లాన్‌పూర్ వేదికగా జరుగనున్న విషయం తెలిసిందే. -
టీమిండియాకు భారీ ఎదురుదెబ్బ
భారత సీనియర్ పురుషుల క్రికెట్ జట్టుకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఐపీఎల్ 2026 తర్వాత జరుగబోయే ఆఫ్ఘనిస్తాన్, ఇంగ్లండ్ సిరీస్‌లకు ఇద్దరు యువ పేసర్లు దూరమయ్యారు. ఆ ఇద్దరి పేర్లు హర్షిత్ రాణా, ఆకాశ్‌దీప్. వీరిద్దరు గాయాల కారణంగా జట్టుకు దూరమయ్యారు. ఈ విషయాన్ని ఓ ప్రముఖ వార్తా సంస్థ వెల్లడించింది.హర్షిత్ మోకాలి గాయంతో ఇటీవల శస్త్రచికిత్స చేయించుకోగా.. ఆకాశ్‌దీప్ వెన్ను గాయం నుంచి కోలుకుంటున్నాడు. ఇద్దరి రిహాబిలిటేషన్ సక్రమంగా సాగుతున్నప్పటికీ, పూర్తి ఫిట్నెస్ సాధించేందుకు చాలా సమయం అవసరమని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. గాయాల కారణంగా హర్షిత్, ఆకాశ్‌దీప్ ఐపీఎల్‌కు కూడా దూరమయ్యారు.కాగా, ఐపీఎల్ ముగిసిన వెంటనే భారత జట్టు స్వదేశంలోనే ఆఫ్ఘనిస్తాన్‌తో ఏకైక టెస్ట్ మ్యాచ్, మూడు వన్డేలు ఆడనుంది. అనంతరం ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనలకు వెళ్లనుంది. ఈ కీలక పర్యటనల్లో ఇద్దరు ప్రధాన పేసర్లు అందుబాటులో లేకపోవడం జట్టుకు పెద్ద లోటే. -
టీమిండియా కెప్టెన్‌గా రిషబ్ పంత్.. ? వారికి లక్కీ ఛాన్స్?
ఐపీఎల్-2026 సీజన్ ముగిసిన తర్వాత భారత క్రికెట్ జట్టు వరుస ద్వైపాక్షిక సిరీస్‌లతో బిజీబిజీగా గడపడనుంది. తొలుత స్వదేశంలో అఫ్గానిస్తాన్‌తో ఏకైక టెస్టుతో పాటు మూడు వన్డేల సిరీస్‌లో తలపడనుంది. కాగా అఫ్గాన్‌తో టెస్టు మ్యాచ్ ఐపీఎల్ ఫైనల్ ముగిసిన వారం రోజులకే ప్రారంభం కానుంది.దీంతో ఈ మ్యాచ్‌కు భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌తో పాటు సీనియర్ ప్లేయర్లు జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, కేఎల్ రాహుల్‌కు బీసీసీఐ విశ్రాంతి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. జూన్‌లో ఇంగ్లండ్‌తో వైట్‌బాల్ సిరీస్‌ల దృష్ట్యా భారత క్రికెట్ బోర్డు ఈ నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.అంతేకాకుండా ఈ టెస్టు మ్యాచ్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ (WTC) పరిధిలోకి రాదు. కాబట్టి సీనియర్లను ఈ మ్యాచ్‌లో రిస్క్ తీసుకోకడదని మేనెజ్మెంట్ భావిస్తోంది. అయితే ప్రస్తుతం కేవలం టెస్టులకే పరిమితమైన వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్.. అఫ్గానిస్తాన్‌తో టెస్టులో భారత జట్టును నడిపించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. రిషబ్ భారత తరపున వైట్ బాల్ క్రికెట్ ఆడి దాదాపు రెండేళ్లు అవుతోంది. ఇప్పుడు ఇంగ్లండ్ టూర్‌కు అతడు ఎంపికయ్యే సూచనలు కన్పించడం లేదు. దీంతో అఫ్గాన్‌తో టెస్టు మ్యాచ్‌లో అతడికి జట్టు పగ్గాలను అప్పగించేందుకు అజిత్ అగార్కర్ అండ్ కో భావిస్తున్నట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. ఈ ఏడాది జూలైలో శ్రీలంకతో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో తలపడనుంది. అప్పటివరకు పంత్‌కు విశ్రాంతి లభించనుంది. ఒకవేళ అతడు భారత వన్డే జట్టుకు ఎంపికైన తుది జట్టులో మాత్రం చోటు కష్టమే. పంత్ ఇప్పటివరకు భారత్ కెప్టెన్‌గా ఆరు మ్యాచ్‌లలో వ్యవహరించాడు.ఇక ఇది ఇలా ఉండగా.. అఫ్గాన్ టెస్టు మ్యాచ్‌కు దేశవాళీ క్రికెట్లో అదరగొడుతున్న యువ ఆటగాళ్లకు ఛాన్స్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఈ జాబితాలో గుర్నూర్ బ్రార్ (ఫాస్ట్ బౌలర్), మానవ్ సుతార్ (స్పిన్నర్), హర్ష్ దూబే, ఆకిబ్ నబీ (ఫాస్ట్ బౌలర్), దేవ్ దత్ పడిక్కల్(బ్యాటర్) ఉన్నారు."ఐపీఎల్ ఫైనల్‌కు అఫ్గానిస్తాన్ టెస్టుకు మధ్య పెద్దగా గ్యాప్ లేదు. కాబట్టి ఆటగాళ్లు వర్క్‌లోడ్‌ను దృష్టిలో పెట్టుకుని సెలెక్టర్లు జట్టును ఎంపిక చేస్తారు. ఆ తర్వాత అఫ్గాన్‌తో వన్డే సిరీస్, ఇంగ్లండ్ వైట్‌బాల్ సిరీస్‌లు భారత్‌కు ఉన్నాయి. అఫ్గానిస్తాన్ డబ్ల్యూటీసీ పరిధిలోకి రాదు.భారత టెస్టు జట్టులోని కొంతమంది సభ్యులు దాదాపు రెండు నెలల పాటు బిజీబిజీగా గడపనున్నారు. దీంతో వారికి అఫ్గాన్‌తో టెస్టుకు విశ్రాంతి ఇచ్చే అవకాశముంది. గుర్నూర్, మానవ్ సుత్తార్, పడిక్కల్, హర్ష్ దూబేలు సెలెక్టర్ల రాడార్‌లో ఉన్నారని" బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు పేర్కొన్నారు. కాగా అఫ్గాన్-భారత్ మధ్య టెస్టు మ్యాచ్ జూన్ 6 నుంచి 10 వరకు ముల్లాన్‌పూర్ వేదికగా జరగనుంది.చదవండి: అదే మా కొంపముంచింది.. అతడు మాత్రం అద్భుతం: శ్రేయస్ -
టీమిండియాకు భారీ షాక్
ఐపీఎల్-2026 సీజన్ ముగిసిన తర్వాత భారత క్రికెట్ జట్టు స్వదేశంలో అఫ్గానిస్తాన్‌తో ఏకైక టెస్టుతో పాటు మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. తొలుత జూన్ 6 నుంచి 10 ముల్లాన్‌పూర్ వేదికగా భారత్-అఫ్గాన్ టెస్టు మ్యాచ్ జరగనుంది. అయితే ఈ మ్యాచ్‌కు టీమిండియాకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది.స్టార్ పేసర్ ఆకాష్ దీప్ గాయం కారణంగా ఈ ఏకైక టెస్టుకు దూరం కానున్నట్లు తెలుస్తోంది. ఆకాష్ ప్రస్తుతం వెన్ను గాయంతో బాధపడుతున్నాడు. ఈ గాయంతోనే అతడు ఐపీఎల్-2026 సీజన్ నుంచి కూడా తప్పుకొన్నాడు. గతేడాది జరిగిన మినీ వేలంలో అతడిని రూ.కోటికి కేకేఆర్ సొంతం చేసుకుంది.కానీ అతడు కనీసం ఒక్క మ్యాచ్ కూడా ఆడకుండా వైదొలిగాడు. అతడు తన గాయం నుంచి కోలుకోవాడనికి మరో రెండు నెలల సమయం పట్టనున్నట్లు తెలుస్తోంది. అతడు తిరిగి శ్రీలంకతో టెస్టు సిరీస్‌కు అందుబాటులోకి వచ్చే అవకాశముంది. భారత టెస్టు సెటాప్‌లో ఆకాష్ దీప్ కీలక సభ్యుడు.జస్ప్రీత్ బుమ్రా, సిరాజ్ తర్వాత టెస్టుల్లో మూడో పేసర్‌గా ఆకాష్ దీప్ ఉన్నాడు. చివరగా ఇంగ్లండ్ పర్యటనలో కూడా అతడు అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఆ సిరీస్‌లో 3 టెస్టులు ఆడిన ఆకాష్ దీప్..13 వికెట్లు పడగొట్టి సత్తాచాటాడు. మరి ఇప్పుడు అతడు గాయం కారణంగా దూరం కావడంతో బీసీసీఐ సెలక్షన్ కమిటీ అతడి స్ధానాన్ని ఎవరితో భర్తీ చేస్తుందో చూడాలి.చదవండి: IPL 2026: రిషబ్ పంత్ సంచలన నిర్ణయం..! సీజన్ మధ్యలోనే? -
BCCI: టీమిండియా ప్లేయర్లను ‘చంపేస్తారా’?
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) తీరుపై ఐపీఎల్ సృష్టికర్త లలిత్ మోదీ మండిపడ్డాడు. ‘డబ్బు కోసం కక్కుర్తి పడి.. ఆటగాళ్లను చంపకండి’ అంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తాడు. బోర్డు మెదడుతో కాకుండా మనసుతో స్పందించి తమ ఆటగాళ్లను కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నాడు.బిజీ షెడ్యూల్కాగా గత కొన్నేళ్లుగా టీమిండియా బిజీ షెడ్యూల్‌తో తలమునకలై ఉన్న సంగతి తెలిసిందే. ఇక ఐపీఎల్-2026 ముగిసిన వెంటనే స్వదేశంలో అఫ్గనిస్తాన్‌తో టెస్టు మ్యాచ్ తర్వాత ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లనుంది. ఆ తర్వాత ఐర్లాండ్, జింబాబ్వే తదితర టూర్లు.ఇక ఐపీఎల్ తాజా ఎడిషన్ మే 31న ముగియనుండగా.. జూన్ 6న అఫ్గన్‌తో టెస్టు మ్యాచ్ ఆరంభం కానుంది. ఈ నేపథ్యంలో టీమిండియా హెడ్‌కోచ్ గౌతం గంభీర్ (Gautam Gambhir) బిజీ షెడ్యూల్‌పై గుర్రుగా ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ‘‘జట్టులోని చాలా మంది ఆటగాళ్లు మే 31 వరకు ఐపీఎల్‌తోనే బిజీగా గడపుతారు.స్వల్ప వ్యవధిలోనే జాతీయ జట్టు తరఫున విధుల్లో చేరడం ఒత్తిడిని పెంచుతుంది’’ అని గంభీర్ బోర్డు వద్ద తన వాదనను వినిపించినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన వార్తను ఓ యూజర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. లలిత్ మోదీ తీవ్రంగా స్పందించాడు.టీమిండియా ప్లేయర్లను ‘చంపేస్తారా’?‘‘గంభీర్ వాదనతో నేను ఏకీభవిస్తాను. విరామం లేని షెడ్యూల్‌తో బీసీసీఐ తమ ఆటగాళ్లను చంపినంత పని చేస్తోంది. ఇలాంటి భయంకరమైన విధానాన్ని ఆపేయండి. ఆటగాళ్లను కాస్త ఊపిరి తీసుకోనివ్వండి. వాళ్లకు కూడా కుటుంబాలు ఉన్నాయి. కుటుంబ సభ్యులతో కాస్త ఆనందంగా గడపనివ్వండి.భారీ ఆదాయానికి బీజం వేశానుఅయినా మీకు ఇప్పుడు అంతగా డబ్బు అవసరం ఏముంది? నేను ఇప్పటికే ఐపీఎల్ ద్వారా ఏడాదికి కావాల్సినంత ఆదాయం వచ్చేలా బీజం వేశాను కదా! ప్రపంచంలో అందరి కంటే బీసీసీఐ సంపన్న బోర్డు కావడానికి ఇదో కారణం. కాబట్టి మీరు డబ్బు గురించి బెంగ పడకండి.ఆటగాళ్ల క్షేమం గురించి కూడా ఆలోచించండి. ప్రొఫెషనల్ సీఈఓను నియమించండి. భారీగా జీతం ఇచ్చి HRను పెట్టుకోండి. ఆటగాళ్ల సెల్ఫ్ డెవలప్మెంట్పై కూడా కొంచెం ఖర్చు చేయండి. స్టేడియాలను మరింత గొప్పగా తీర్చిదిద్దండి. ప్రేక్షకులకు వరల్డ్‌క్లాస్ ఎక్స్పీరియన్స్ అందించండి.మనసుతో ఆలోచించండిఆటగాళ్లేమీ యంత్రాలు కాదు. మీరు మెదడుతో కాకుండా మనసుతో కూడా ఆలోచించండి’’ అని ఎక్స్ వేదికగా లలిత్ మోదీ బీసీసీఐ తీరును తూర్పారబట్టాడు. కాగా లలిత్ మోదీ ఆలోచనతో 2008లో ఐపీఎల్ రూపుదిద్దుకోగా.. లీగ్ తొలి చైర్మన్‌గా అతడే వ్యవహరించాడు. కానీ కొన్నేళ్లకే మనీ లాండరింగ్ ఆరోపణలతో వివాదంలో చిక్కుకున్నాడు. ఆర్థిక నేరగాడిగా ముద్రపడి.. లండన్‌కు పారిపోయి దశాబ్దకాలానికిపైగా అక్కడే నివాసం ఉంటున్నాడు. చదవండి: ఇప్పటికీ బాధపడుతున్నా: రోహిత్‌కు మాజీ కెప్టెన్ క్షమాపణలు -
గిల్ స్థానంలో కెప్టెన్‌గా పంత్..?
ఐపీఎల్ 2026 ముగిసిన తర్వాత స్వదేశంలో ఆఫ్ఘనిస్తాన్‌తో జరుగబోయే ఏకైక టెస్ట్ కోసం భారత సెలెక్టర్లు సీనియర్లకు విశ్రాంతినివ్వడం దాదాపుగా ఖరారైనట్లు తెలుస్తుంది. సీనియర్ల జాబితాలో కెప్టెన్ శుభ్‌మన్ గిల్, స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఉన్నట్లు సమాచారం.ఒకవేళ గిల్ ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్‌కు దూరమైతే అతని స్థానంలో కెప్టెన్ ఎవరన్న ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ఈ నేపథ్యంలో గిల్‌కు ప్రత్యామ్నాయంగా ముగ్గురి పేర్లు పరిశీలను రావచ్చు. వీరిలో ముందుగా రిషబ్ పంత్ పేరు ఉంటుంది. కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా పేర్లు కూడా పరిశీలనలో ఉంటాయి.రిషబ్ పంత్ విషయానికొస్తే.. ప్రస్తుతం అతను భారత టెస్టు జట్టుకు వైస్ కెప్టెన్‌గా ఉన్నాడు. ఈ కారణంగా గిల్ స్థానంలో అతడే సహజమైన ప్రత్యామ్నాయంగా కనిపిస్తున్నాడు. దూకుడు నాయకత్వం, మ్యాచ్‌ను ఒంటరిగా మలుపు తిప్పగల సామర్థ్యం పంత్ ప్రత్యేకత. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా దేశాల్లోని కఠిన పిచ్‌లపై సెంచరీలు సాధించడం అతని స్థాయి తెలియజేస్తుంది. ఇప్పటికే నాయకత్వ అనుభవం ఉండటం కూడా అతనికి అదనపు బలం.కేఎల్ రాహుల్భారత సెలెక్టర్లు ఒకవేళ పంత్‌కు కూడా విశ్రాంతినివ్వాలని భావిస్తే, తదుపరి ప్రత్యామ్నాయంగా కేఎల్ రాహుల్ ఉంటాడు. రాహుల్‌కు గతంలో భారత టెస్ట్ జట్టుకు సారథ్యం వహించిన అనుభవం ఉంది. 2022 బంగ్లాదేశ్ పర్యటనలో జట్టును విజయవంతంగా నడిపించడం అతని నాయకత్వ నైపుణ్యాన్ని నిరూపించింది.గిల్‌కు మూడో ప్రత్యామ్నాయ ఆప్షన్‌గా రవీంద్ర జడేజా ఉంటాడు. జడ్డూ జట్టులో అత్యంత అనుభవజ్ఞుల్లో ఒకరు. బౌలింగ్, బ్యాటింగ్ రెండింటిలోనూ కీలక పాత్ర పోషించే ఆల్‌రౌండర్‌గా జడేజా ఎప్పుడూ జట్టుకు ఆధారంగా ఉంటాడు. గతంలో వైస్ కెప్టెన్‌గా పనిచేసిన అనుభవం ఉంది. -
సెలెక్టర్ల పరిధిలో లేని గిల్, బుమ్రా
ఐపీఎల్ ముగిసిన తర్వాత ఆఫ్ఘనిస్తాన్‌తో జరుగబోయే ఏకైక టెస్ట్ మ్యాచ్ కోసం టీమిండియా ఎంపికను భారత సెలెక్టర్లు ఇప్పటి నుంచే పరిశీలిస్తున్నారు. జూన్ 6 నుంచి న్యూ చంఢీఘడ్‌లో జరుగబోయే ఈ మ్యాచ్ కోసం సీనియర్లకు విశ్రాంతినివ్వాలని వారు యోచిస్తున్నారు. సీనియర్ల జాబితాలో కెప్టెన్ శుభ్‌మన్ గిల్, స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఉన్నట్లు తెలుస్తుంది. ఈ మ్యాచ్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో భాగం కాకపోవడంతో సెలెక్టర్లు ఈ మేరకు నిర్ణయించుకున్నట్లు సమాచారం. వర్క్‌లోడ్ మరో కారణంగా తెలుస్తుంది.భారత పర్యటనలో ఆఫ్ఘనిస్తాన్ టెస్ట్ మ్యాచ్‌తో పాటు మూడు వన్డేలు కూడా ఆడనుంది. ఆతర్వాత భారత జట్టు రెండు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం ఐర్లాండ్‌కు వెళ్లనుంది. అనంతరం భారత్ 5 టీ20లు, 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం ఇంగ్లండ్‌కు వెళ్లనుంది. ఇంగ్లండ్ సిరీస్ నేపథ్యంలో భారత సెలెక్టర్లు గిల్, బుమ్రాకు విశ్రాంతినివ్వాలని అనుకుంటున్నారు. టీమిండియా-ఇంగ్లండ్ సిరీస్ జులై 1 నుంచి ప్రారంభమవుతుంది.ఆఫ్ఘనిస్తాన్, ఐర్లాండ్ సిరీస్‌లకు గిల్, బుమ్రాకు విశ్రాంతినివ్వడానికి సెలెక్టర్ల వద్ద మరో కారణం కూడా ఉంది. 2027 వన్డే వరల్డ్‌కప్‌కు వీరిద్దరు కీలకం కాబటి, మెగా టోర్నీకి ముందు వీలైనంత విశ్రాంతినివ్వవచ్చు. గిల్, బుమ్రా ఇటీవల తరుచూ గాయాల బారిన పడుతుండటంతో సెలెక్టర్లు వీరి విషయంలో రిస్క్ తీసుకునే సాహసం చేయరు. ఒకవేళ ప్రపంచకప్ దృష్ట్యా వన్డేల్లో ఆడించాలని అనుకుంటే మాత్రం ఆఫ్ఘనిస్తాన్ సిరీస్‌కు ఎంపిక చేయవచ్చు.బుమ్రా, గిల్ గైర్హాజరీలో ఆకిబ్ నబీ, దేవదత్ పడిక్కల్, నితీశ్ కుమార్ రెడ్డి తదితర పేర్లను సెలెక్టర్లు పరిశీలిస్తున్నట్లు తెలుస్తుంది. వీరిలో నబీ పేరు ఖరారైందని సమాచారం. -
టీమిండియాలోకి సంచలన ఫాస్ట్ బౌలర్
రాబోయే అంతర్జాతీయ సీజన్‌ను దృష్టిలో పెట్టుకుని బీసీసీఐ కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్ ముగిసిన తర్వాత (జూన్‌లో) ఆఫ్ఘనిస్తాన్‌తో జరుగబోయే సిరీస్ (టెస్ట్, మూడు వన్డేలు) కోసం సీనియర్లకు విశ్రాంతినిచ్చి యువ ప్రతిభకు అవకాశాలు ఇవ్వాలని యోచిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో జమ్మూ కశ్మీర్ ఫాస్ట్ బౌలర్ అకిబ్ నబీని ఎంపిక చేయనున్నట్లు తెలుస్తోంది. నబీ ఎంపిక దాదాపుగా ఖరారైనట్లు సమాచారం. నబీ ఈ సీజన్ రంజీ ట్రోఫీలో విశేషంగా రాణించి 60 వికెట్లు తీసి, లీడింగ్ వికెట్ టేకర్‌గా నిలిచాడు. నబీ సంచలన ప్రదర్శనల కారణంగా జమ్మూ కశ్మీర్ తమ తొలి రంజీ ట్రోఫీని కైవసం చేసుకుంది. నబీ స్థిరమైన వేగంతో పాటు బంతిని ఇరు వైపుల స్వింగ్ చేయగల సమర్దుడు. 41 మ్యాచ్‌ల ఫస్ట్ క్లాస్ కెరీర్లో అతను 156 వికెట్లు తీశాడు.భారత టెస్టు జట్టులో గత కొంతకాలంగా పేస్ బౌలింగ్ భారం ఎక్కువగా బుమ్రాపైనే పడుతుంది. ఇతర బౌలర్లు కూడా కొంతమేరకు సహకరించినప్పటికీ, స్థిరమైన ప్రత్యామ్నాయం అవసరం ఉందని నిపుణులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో నబీ వంటి యువ బౌలర్ జట్టులోకి వస్తే బుమ్రాపై ఒత్తిడి తగ్గడమే కాకుండా బౌలింగ్ విభాగానికి లోతు పెరుగుతుంది.అందుకే భారత సెలెక్టర్లు నబీని సిద్దం చేస్తున్నట్లు సమాచారం. అయితే ఇక్కడ ఓ సమస్య ఉంది. నబీ బౌలింగ్ శైలి సుదీర్ఘ ఫార్మాట్‌కు మాత్రమే పనికొచ్చేలా కనిపిస్తుంది. దేశవాలీ క్రికెట్లో అద్భుత ప్రదర్శనల కారణంగా ఐపీఎల్ ఛాన్స్ కొట్టేసిన నబీ.. ఇక్కడ అంచనాలకు తగ్గట్టుగా రాణించలేకపోతున్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున అతను 2 మ్యాచ్‌ల్లో వికెట్లు తీయలేకపోగా.. ధారాళంగా పరుగులు సమర్పించుకున్నాడు. మరి సెలెక్టర్లు నబీని టెస్ట్‌లకే పరిమితం చేస్తారో లేక పరిమిత ఓవర్ల ఫార్మాట్లోనూ అవకాశాలు ఇస్తారో చూడాలి. -
టీమిండియా అభిమానులకు పండుగే పండుగ!
టీ20 ప్రపంచకప్-2026 టోర్నీని విజయవంతంగా ముగించుకున్న భారత ఆటగాళ్లు తదుపరి ఐపీఎల్ పందొమ్మిదో ఎడిషన్‌తో బిజీ కానున్నారు. మార్చి 28న ఈ మెగా ఈవెంట్‌కు తెరలేవనుంది. ఇక ఐపీఎల్-2026 ముగిసిన తర్వాత జూన్ 6-20 మధ్య టీమిండియా- అఫ్గనిస్తాన్ మధ్య సిరీస్ జరుగుతుంది.ముందుగా ఐర్లాండ్ టూర్‌కు!ఇందులో భాగంగా భారత్- అఫ్గన్ జట్లు ఒక టెస్టు, మూడు వన్డేలు ఆడతాయి. అనంతరం టీమిండియా ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లాల్సి ఉంది. అయితే, అంతకంటే ముందు భారత జట్టు ఐర్లాండ్ టూర్‌కు వెళ్లనున్నట్లు సమాచారం.ఐర్లాండ్ హై పర్ఫామెన్స్ డైరెక్టర్ గ్రాహమ్ వెస్ట్ ఈ విషయాన్ని ధ్రువీకరించాడు. ఇరుజట్ల మధ్య టీ20 సిరీస్ జరుగనుందని సంకేతాలు ఇచ్చాడు. కాగా టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో ఐర్లాండ్ కనీసం సూపర్-8 దశకు కూడా చేరుకుండానే నిష్క్రమించింది.మంచి బూస్ట్ఇందుకు బాధ్యత వహిస్తూ పాల్ స్టెర్లింగ్ కెప్టెన్ పదవికి రాజీనామా చేశాడు. ఈ నేపథ్యంలో.. ‘‘టీ20 ప్రపంచకప్-2028 సన్నాహకాల్లో భాగంగా పాల్ స్టెర్లింగ్ రాజీనామా చేయగా.. అతడి స్థానంలో వచ్చే కొత్త కెప్టెన్‌కు జూన్‌లో టీమిండియాతో జరిగే సిరీస్‌తో మంచి బూస్ట్ లభిస్తుంది’’ అని గ్రాహమ్ వెస్ట్ ప్రకటన విడుదల చేశాడు. తద్వారా భారత్- ఐర్లాండ్ సిరీస్ విషయాన్ని ఖరారు చేశాడు.కాగా గత ఏడేళ్లలో ఇప్పటి వరకు టీమిండియా ఐర్లాండ్‌లో మూడుసార్లు (2018, 2022, 2023)లో పర్యటించింది. ఇదిలా ఉంటే.. స్వదేశంలో అఫ్గనిస్తాన్‌తో సిరీస్ ముగించుకున్న తర్వాత టీమిండియా జూలైలో ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లేలా ముందుగా షెడ్యూల్ ఖరారైంది. జూలై 1- 19 వరకు ఇరుజట్ల మధ్య ఐదు టీ20, మూడు వన్డే మ్యాచ్‌ల సిరీస్‌లు నిర్వహించాలని నిర్ణయించారు.మరింత బిజీగాఅయితే, తాజాగా ఐర్లాండ్ టూర్‌తో భారత జట్టు షెడ్యూల్ మరింత బిజీగా మారింది. దీంతో తమకు ఈ ఏడాదంతా పండుగేనని అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా టీ20 ప్రపంచకప్ టోర్నీలో భారత్ విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. తద్వారా స్వదేశంలో మొట్టమొదటిసారి, వరుసగా రెండోసారి, ఓవరాల్‌గా మూడోసారి టీ20 వరల్డ్‌కప్ ట్రోఫీ గెలిచిన ఏకైక జట్టుగా టీమిండియా చరిత్ర సృష్టించింది.చదవండి: ODI WC: ఇప్పటికే ఇరవై మందిని షార్ట్‌లిస్ట్ చేసిన బీసీసీఐ? -
T20 WC 2026: బీసీసీఐ కీలక ప్రకటన
టీమిండియా జూన్ షెడ్యూల్‌ను భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) తాజాగా విడుదల చేసింది. భారత క్రికెట్ జట్టు స్వదేశంలో అఫ్గనిస్తాన్‌తో సిరీస్‌లు ఆడనుందని వెల్లడించింది. ఇందుకు సంబంధించి సోమవారం అధికారిక ప్రకటన విడుదల చేసింది.సెమీ ఫైనల్లో భారత్‌కాగా టీమిండియా ప్రస్తుతం టీ20 ప్రపంచకప్-2026 టోర్నమెంట్‌తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. గ్రూప్ దశలో అజేయంగా నిలిచిన భారత్.. సూపర్-8లో జింబాబ్వే, వెస్టిండీస్‌లను ఓడించి సెమీ ఫైనల్లో అడుగుపెట్టింది. ఈ క్రమంలో ఇంగ్లండ్‌తో గురువారం (మార్చి 5) సెమీస్ మ్యాచ్‌లో తలపడేందుకు షెడ్యూల్ ఖరారైంది.మళ్లీ జూన్లోనేఈ మ్యాచ్‌లో గెలిచి ఫైనల్‌కు చేరితే మార్చి 8న టైటిల్ పోరులో టీమిండియా తలపడుతుంది. అనంతరం భారత జట్టులోని ఆటగాళ్లంతా ఐపీఎల్-2026 (IPL)తో బిజీ అవుతారు. ఈ క్రమంలో మళ్లీ జూన్‌లోనే అంతర్జాతీయ క్రికెట్లో టీమిండియా తరఫున విధుల్లో పాల్గొంటారు.అఫ్గనిస్తాన్‌తో సిరీస్‌ఈ నేపథ్యంలో బీసీసీఐ టీమిండియా తదుపరి షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఒక టెస్టు, మూడు వన్డేలు ఆడేందుకు అఫ్గనిస్తాన్ క్రికెట్ జట్టు భారత్‌లో పర్యటిస్తుందని పేర్కొంది. జూన్ 6-10 మధ్య టెస్టు జరుగనుండగా.. ఇరుజట్ల మధ్య జూన్ 14, 17, 20 తేదీల్లో వన్డే సిరీస్ జరుగనుంది. భారత్- అఫ్గన్ టెస్టుకు న్యూ చండీగఢ్ వేదిక కాగా.. వన్డే సిరీస్‌కు ధర్మశాల, లక్నో, చెన్నై ఆతిథ్యం ఇవ్వనున్నాయి.రో-కో రీఎంట్రీ డేట్ ఫిక్స్.. అభిమానులు ఖుష్అంతర్జాతీయ టీ20, టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన భారత బ్యాటింగ్ దిగ్గజాలు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ వన్డేలలో మాత్రం కొనసాగుతున్న విషయం తెలిసిందే. వీరిద్దరు చివరగా ఈ ఏడాది జనవరిలో న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్ బరిలో దిగారు.రోహిత్ శర్మ ఫర్వాలేదనిపించగా.. కోహ్లి వరుస సెంచరీలతో ఆకట్టుకున్నాడు. అయితే ఈ సిరీస్‌లో భారత్ కివీస్ చేతిలో ఓడిపోయింది. ఇక తదుపరి అఫ్గనిస్తాన్‌తో సిరీస్ సందర్భంగా జూన్ 14న రో-కో టీమిండియా తరఫున రీఎంట్రీ ఇవ్వనున్నారు. అంతకంటే ముందు ఐపీఎల్లో బెంగళూరు తరఫున కోహ్లి.. ముంబైకి ఆడుతూ రోహిత్ అభిమానులను అలరించనున్నారు.భారత్ వర్సెస్ అఫ్గనిస్తాన్ షెడ్యూల్👉జూన్ 6- 10 టెస్టు మ్యాచ్, న్యూ చంఢీగఢ్ (ఉదయం 9. 30 నిమిషాలకు ఆరంభం)👉జూన్ 14- తొలి వన్డే, ధర్మశాల👉జూన్ 17- రెండో వన్డే, లక్నో👉జూన్ 20- మూడో వన్డే, చెన్నై.👉వన్డే మ్యాచ్‌లన్నీ మధ్యాహ్నం 1.30 నిమిషాలకు ఆరంభం. చదవండి: T20 WC: పాకిస్తాన్ క్రికెట్ బోర్డు సంచలన నిర్ణయం.. ఆటగాళ్లకు భారీ షాక్! -
భారత్‌ను పదోసారి ఫైనల్‌కు చేర్చిన ఈ 'ఆరోన్ జార్జ్' ఎవరు..?
అండర్ 19 ప్రపంచకప్‌లో భారత్ పదోసారి ఫైనల్‌కు చేరింది. ఈ టోర్నీ చరిత్రలో ఇప్పటివరకు ఏ జట్టూ ఇన్ని సార్లు ఫైనల్స్‌కు చేరలేదు. ఇందులో టీమిండియా ఐదు సార్లు (2000, 2008, 2012, 2018, 2022) ఛాంపియన్‌గా నిలిచి, నాలుగు సందర్భాల్లో (2006, 2016, 2020, 2024) రన్నరప్‌గా నిలిచింది. ఏ జట్టూ ఇన్ని సార్లు ఛాంపియన్‌గా, రన్నరప్‌గానూ నిలవలేదు. యంగ్ ఇండియా మరోసారి ఫైనల్‌కు చేరి అండర్ 19 ప్రపంచకప్ చరిత్రలో తిరుగులేని జట్టుగా తమ ఆధిపత్యాన్ని కొనసాగించింది.నిన్న జరిగిన 2026 ఎడిషన్ రెండో సెమీఫైనల్లో భారత్ ఆఫ్ఘనిస్తాన్‌ను 7 వికెట్ల తేడాతో చిత్తు చేసి ఫైనల్‌కు చేరింది. ఈ మ్యాచ్‌లో ఓపెనర్ ఆరోన్ జార్జ్ అద్భుత శతకం (104 బంతుల్లో 115; 15 ఫోర్లు, 2 సిక్సర్లు) సాధించి భారత్‌ను ఒంటిచేత్తో గెలిపించాడు. 311 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో ఆరోన్ ఏమాత్రం తడబడకుండా ఇన్నింగ్స్‌ను ఆరంభించాడు. మరో ఓపెనర్ వైభవ్ సూర్యవంశీతో (33 బంతుల్లో 68; 9 ఫోర్లు, 4 సిక్సర్లు) కలిసి తొలి వికెట్‌కు 90 పరుగులు, వన్‌డౌన్ బ్యాటర్ ఆయుశ్ మాత్రేతో (59 బంతుల్లో 62; 5 ఫోర్లు, 4 సిక్సర్లు) కలిసి రెండో వికెట్‌కు 114 పరుగులు, ఆతర్వాత వేదాంత్ మల్హోత్రాతో (47 బంతుల్లో 38 నాటౌట్; 3 ఫోర్లు) కలిసి 96 పరుగులు జోడించి, భారత్ గెలుపు ఖరారయ్యాక మూడో వికెట్‌గా వెనుదిరిగాడు. మొత్తంగా ఆరోన్ వన్‌మ్యాన్ షో కారణంగా భారత్ 41.1 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.అత్యుత్తమ ఛేదనఈ ఛేదన అండర్ 19 వరల్డ్‌కప్ చరిత్రలోనే అత్యధికం, అత్యుత్తమం. గతంలో ఏ జట్టూ ఇంత భారీ లక్ష్యాన్ని ఛేదించలేదు. గతంలో ఈ రికార్డు న్యూజిలాండ్ పేరిట ఉండేది. 2006 ఎడిషన్‌లో ఐర్లాండ్ నిర్దేశించిన 305 పరుగుల లక్ష్యాన్ని న్యూజిలాండ్ ఛేదించింది.ఆఫ్ఘన్ ఆటగాళ్లు శతకాలు వృధాఅంతకుముందు ఆఫ్ఘనిస్తాన్ టాస్ గెలిచి తొలి బ్యాటింగ్ చేసి నిర్ణీత 50 ఓవర్లలో నాలుగు వికెట్లు నష్టపోయి 310 పరుగులు సాధించింది. ఫైజల్ షినోజాదా (110), ఉజైరుల్లా నియాజాయ్ (101 నాటౌట్) శతకాలతో రాణించారు. భారత బౌలర్లలో దీపేశ్ దేవేంద్రన్, కనిష్క్ చౌహాన్ తలో 2 వికెట్లు తీశారు. ఆరోన్ అద్భుత సెంచరీతో భారత్‌ను గెలిపించడంతో ఫైజల్, ఉజైరుల్లా శతకాలు వృధా అయ్యాయి.ఇంగ్లండ్‌తో అమీతుమీతొలి సెమీ ఫైనల్లో ఇంగ్లండ్ ఆస్ట్రేలియాను ఓడించి టైటిల్ పోరుకు అర్హత సాధించింది. బులవాయోలో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ 27 పరుగుల తేడాతో ఆసీస్‌ను ఓడించి ఫైనల్లోకి దూసుకెళ్లింది. మొదట ఇంగ్లండ్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లకు 277 పరుగులు చేసింది.ఇంగ్లండ్ కెప్టెన్ థామస్ ర్యూ (107 బంతుల్లో 110; 14 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీ సాధించాడు. అనంతరం 278 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆస్ట్రేలియా 47.3 ఓవర్లలో 250 పరుగులకు ఆలౌటై ఓడిపోయింది. కెప్టెన్ ఒలివర్ పీక్ (88 బంతుల్లో 100; 10 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీతో రాణించినా ఫలితం లేకపోయింది. ఇక శుక్రవారం (ఫిబ్రవరి 6) జరిగే ఫైనల్లో భారత్-ఇంగ్లండ్ అమీతుమీ తేల్చుకుంటాయి.భారత్‌ను ఫైనల్‌కు చేర్చిన ఈ ఆరోన్ జార్జ్ ఎవరు..?ఆఫ్ఘనిస్తాన్‌తో నిన్న జరిగిన సెమీఫైనల్లో సూపర్ సెంచరీతో భారత్‌ను ఫైనల్స్‌కు చేర్చిన ఆరోన్ జార్జ్ గురించి తెలుసుకునేందుకు క్రికెట్ అభిమానులు తెగ ఆసక్తి ప్రదర్శిస్తున్నారు. తాజా సెంచరీ తర్వాత చాలామంది ఆరోన్ గురించిన సమాచారం కోసం గూగుల్ చేస్తున్నారు.మన హైదరాబాదీనే..!19 ఏళ్ల ఆరోన్ జార్జ్ పుట్టింది కేరళలో అయినా.. జానియర్ స్దాయిలో హైదరాబాద్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. జార్జ్‌కు అద్భుతమైన బ్యాటింగ్ స్కిల్స్ ఉన్నాయి. ఈ మిడిలార్డర్ ఆటగాడికి పరిస్థితులకు తగ్గట్టు ఆడే సత్తా ఉంది. ముఖ్యంగా జట్టు కష్టాల్లో ఉందంటే అందరి చూపు జార్జ్‌పైనే ఉంటుంది.సంజూ శాంసన్‌లా..!అతడి బ్యాటింగ్ శైలి టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్‌ను పోలి ఉంటుంది. అదేవిధంగా అతడికి మంచి కెప్టెన్సీ స్కిల్స్ కూడా ఉన్నాయి. దాదాపు 38 ఏళ్ల తర్వాత కెప్టెన్‌గా హైదరాబాద్‌కు వినూ మాన్కడ్ ట్రోఫీని ఆరోన్ అందించాడు. విజయ్ మర్చంట్ ట్రోఫీ(2022-23)లో బీహార్‌పై ట్రిపుల్ సెంచరీ సాధించి తొలిసారిగా అందరి దృష్టిని ఆకర్షించాడు.పరుగుల వరదగత రెండు సీజన్లలో కలిపి 700 పైగా పరుగులు చేసి హైదరాబాద్ జట్టుకు కీలక ఆటగాడిగా మారాడు. అంతేకాకుండా గత నెలలో బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో జరిగిన అండర్-19 ట్రై-సిరీస్‌లో ఇండియా-బి జట్టుకు కెప్టెన్‌గా కూడా వ్యవహరించాడు.అప్పడు పాక్‌పై..ఆసియాకప్ 2025లోనూ పాకిస్తాన్‌పై 85 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. అయితే ఐపీఎల్-2026 వేలంలో మాత్రం జార్జ్ అమ్ముడుపోలేదు. రూ.30 లక్షల బేస్ ప్రైస్‌తో వేలంలోకి వచ్చిన అతడిని ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపలేదు. ఒకవేళ ఎవరైనా గాయపడితే జార్జ్‌ను ప్రత్నమ్నాయంగా తీసుకునే అవకాశముంది. -
ప్రపంచకప్ సెమీఫైనల్.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆఫ్ఘనిస్తాన్
అండర్ 19 ప్రపంచకప్ 2026లో భాగంగా ఇవాళ (ఫిబ్రవరి 4) రెండో సెమీఫైనల్ జరుగుతుంది. హరారే వేదికగా భారత్-ఆఫ్ఘనిస్తాన్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్ కెప్టెన్ మహబూబ్ ఖాన్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్ కోసం భారత్ ఎలాంటి మార్పులు చేయలేదు. గత మ్యాచ్‌లో పాక్‌తో ఆడిన జట్టునే కొనసాగించారు. నిన్న జరిగిన తొలి సెమీఫైనల్లో ఇంగ్లండ్ డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియాపై విజయం సాధించి ఫైనల్‌కు చేరుకుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు ఫిబ్రవరి 6న ఇంగ్లండ్ తాడోపేడో తేల్చుకుంటుంది.తుది జట్లు..ఆఫ్ఘనిస్తాన్: ఉస్మాన్ సదాత్, ఖలీద్ అహ్మద్జాయ్, ఫైసల్ షినోజాదా, ఉజైరుల్లా నియాజై, మహబూబ్ ఖాన్(w/c), అజీజుల్లా మియాఖిల్, అబ్దుల్ అజీజ్, ఖతీర్ స్టానిక్జాయ్, రూహుల్లా అరబ్, నూరిస్తానీ ఒమర్జాయ్, వహిదుల్లా జద్రాన్భారత్: ఆరోన్ జార్జ్, వైభవ్ సూర్యవంశీ, ఆయుష్ మ్హత్రే(సి), వేదాంత్ త్రివేది, విహాన్ మల్హోత్రా, అభిజ్ఞాన్ కుందు(w), RS అంబరీష్, కనిష్క్ చౌహాన్, ఖిలాన్ పటేల్, హెనిల్ పటేల్, దీపేష్ దేవేంద్రన్ -
IND vs PAK T20: భారత్- పాకిస్తాన్ మ్యాచ్ ఆరోజే
దుబాయ్: ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) రైజింగ్ స్టార్స్ టీ20 టోర్నమెంట్ ఈ నెల 14 నుంచి ప్రారంభం కానుంది. దోహా, ఖతర్ వేదికగా జరగనున్న ఈ టోర్నీలో మొత్తం 8 జట్లు రెండు గ్రూప్‌లుగా పాల్గొననున్నాయి. ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్’ పేరుతోఒమన్, పాకిస్తాన్, యూఏఈతో కలిసి భారత్ గ్రూప్ ‘బి’లో పోటీ పడుతుండగా... అఫ్గానిస్తాన్, బంగ్లాదేశ్, హాంకాంగ్, శ్రీలంక గ్రూప్ ‘ఎ’ నుంచి బరిలోకి దిగనున్నాయి. గతంలో ఏసీసీ ‘ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్’ పేరుతో నిర్వహించిన ఈ టోర్నీని ఈ సారి ‘రైజింగ్ స్టార్స్ టి20 టోర్నమెంట్’ పేరుతో నిర్వహించనున్నారు. ఇందులో భారత్, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్ దేశాలకు చెందిన ‘ఎ’ జట్లు పాల్గొననుండగా... మిగిలిన మూడు అసోసియేట్ దేశాలైన హాంకాంగ్, ఒమాన్, యూఏఈ ప్రధాన జట్లు బరిలోకి దిగనున్నాయి. ఈ నెల 14 నుంచి 19 వరకు రోజుకు రెండు మ్యాచ్‌ల చొప్పున నిర్వహించనున్నారు. నవంబర్ 16నఇందులో భాగంగా నవంబర్ 16న దాయాది పాకిస్తాన్‌తో భారత్ మ్యాచ్ ఆడనుంది. నవంబర్ 21న సెమీఫైనల్స్ నిర్వహించనుండగా... నవంబర్ 23న ఫైనల్ జరగనుంది. 2013 నుంచి ఎమర్జింగ్ టీమ్స్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నారు. ఈ టోర్నీ ఆరంభంలో అండర్–23 జట్లు పోటీపడగా... ఆ తర్వాత ‘ఎ’ జట్లకు మార్చారు. చివరిసారిగా 2024లోఇప్పటి వరకు పాకిస్తాన్, శ్రీలంక జట్లు రెండేసి సార్లు విజేతగా నిలవగా... భారత్, అఫ్గానిస్తాన్ ఒక్కోసారి ట్రోఫీ చేజిక్కించుకున్నాయి. చివరిసారిగా 2024లో జరిగిన ఈ టోర్నమెంట్లో అఫ్గానిస్తాన్ విజేతగా నిలిచింది. ఒమన్‌లో జరిగిన టోర్నీ ఫైనల్లో శ్రీలంకపై అఫ్గాన్ విజయం సాధించింది. చదవండి: పీఎకేల్-2025 విజేతగా దబంగ్ ఢిల్లీ -
ఆసియా కప్-2025 విజేతలుగా మనోళ్లే.. కానీ ఆ జట్టుతో జాగ్రత్త!
ఆసియా కప్-2025 (Asia Cup) టోర్నమెంట్ రూపంలో మినీ క్రికెట్ సంగ్రామం అభిమానులకు కావాల్సినంత మజా పంచనుంది. ఈసారి పొట్టి ఫార్మాట్లో నిర్వహించే ఈ ఖండాంతర టోర్నీకి సెప్టెంబరు 9న తెరలేవనుంది. ఆతిథ్య హక్కులు భారత్‌వే అయినా.. పాకిస్తాన్ క్రికెట్ బోర్డుతో గత ఒప్పందం దృష్ట్యా తటస్థ వేదికైన యూఏఈలో ఆసియా కప్ ఈవెంట్ జరుగనుంది.పాకిస్తాన్‌ను చిత్తు చేసిగ్రూప్-‘ఎ’ నుంచి భారత్, పాకిస్తాన్, యూఏఈ, ఒమన్.. గ్రూప్-‘బి’ నుంచి శ్రీలంక, అఫ్గనిస్తాన్, బంగ్లాదేశ్, హాంకాంగ్ ఈ టోర్నీలో తలపడనున్నాయి. కాగా చివరగా 2022లో టీ20 ఫార్మాట్లో ఆసియా కప్ జరుగగా.. నాటి ఫైనల్లో శ్రీలంక పాకిస్తాన్‌ను చిత్తు చేసి టైటిల్ గెలిచింది. ఆనాడు రోహిత్ శర్మ సారథ్యంలోని టీమిండియా సూపర్ ఫోర్ దశలో ఊహించని రీతిలో పాకిస్తాన్, శ్రీలంక చేతిలో ఓడి ఇంటిబాట పట్టింది.ప్రపంచకప్ టోర్నీలో సత్తా చాటిన భారత్అయితే, ఆ చేదు జ్ఞాపకాన్ని చెరిపివేసేలా రోహిత్ సేన.. టీ20 ప్రపంచకప్-2024 (T20 World Cup) ట్రోఫీని సొంతం చేసుకుంది. టోర్నీ ఆసాంతం అజేయంగా నిలిచి టైటిల్‌ను గెలుచుకుంది. ఈ టోర్నీలో పాక్ కనీసం సెమీస్ కూడా చేరకుండానే నిష్క్రమించింది. అంతేకాదు.. అమెరికా వంటి పసికూన చేతిలో ఓడి ఓటమిపాలైంది.చాంపియన్స్ ట్రోఫీ కూడా టీమిండియాదేఇదిలా ఉంటే.. గత ఆసియా కప్-2023 టోర్నీ వన్డే ఫార్మాట్లో జరుగగా రోహిత్ సేన విజేతగా నిలిచింది. అనంతరం సొంతగడ్డపై వన్డే వరల్డ్‌కప్-2023లో అద్భుత ప్రదర్శన కనబరిచిన టీమిండియా.. ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓటమిపాలై రన్నరప్‌తో సరిపెట్టుకుంది. అయితే, యాభై ఫార్మాట్లోనే జరిగే ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025లో రోహిత్ సేన టైటిల్ గెలిచి సత్తా చాటింది.పాకిస్తాన్ ఈ టోర్నీకి ఆతిథ్యం ఇవ్వగా తటస్థ వేదికైన దుబాయ్‌లో టీమిండియా తమ మ్యాచ్‌లు ఆడింది. ఈ టోర్నీలో పాక్ జట్టు గెలుపున్నదే లేకుండా నిష్క్రమించగా.. శ్రీలంక అసలు ఈ ఈవెంట్‌కు అర్హతే సాధించలేదు. మరోవైపు.. బంగ్లాదేశ్ కూడా వరుస ఓటములతో ఇంటిబాట పట్టింది.అఫ్గనిస్తాన్ అద్భుత ప్రదర్శనలుఅయితే, టీ20 ప్రపంచకప్-2024లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వంటి పటిష్ట జట్లను ఓడించడంతో పాటు.. సెమీస్ చేరి అఫ్గనిస్తాన్ సంచలనం సృష్టించింది. అంతేకాదు.. వన్డే వరల్డ్‌కప్-2023 సందర్భంగా తొలిసారి పాకిస్తాన్‌ను ఓడించి సెమీ ఫైనల్ దగ్గరగా వచ్చింది.కానీ.. ఆఖరి నిమిషంలో ఒత్తిడిలో చిత్తై లీగ్ దశలోనే నిష్క్రమించినా.. తొలిసారి ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీకి మాత్రం అర్హత సాధించింది అఫ్గన్ జట్టు. ఈ మెగా టోర్నీలో ఇంగ్లండ్‌ను ఓడించి సత్తా చాటింది. ఈ పరిణామాల నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ మదన్ లాల్ ఆసియా కప్ విజేత ఎవరన్న అంశంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.విజేత టీమిండియానే.. కానీ ఆ జట్టుతో జాగ్రత్త‘‘టీమిండియా అద్భుత నైపుణ్యాలు గల జట్టు. కచ్చితంగా హాట్ ఫేవరెట్ టీమిండియానే. అయితే, టీ20 ఫార్మాట్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ ఊహించలేరు. పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్ ప్రదర్శనలను ఓసారి పరిశీలించాలి.ముఖ్యంగా అఫ్గనిస్తాన్. గత కొన్నాళ్లుగా ఈ ఫార్మాట్లో వాళ్లు అద్భుత విజయాలు అందుకుంటున్నారు. కచ్చితంగా పాకిస్తాన్‌కు అఫ్గనిస్తాన్ గట్టి పోటీ ఇస్తుంది. అఫ్గన్ల ఆత్మవిశ్వాసం, ఫామ్ అసాధారణంగా ఉన్నాయి.కాబట్టి శ్రీలంక, బంగ్లాదేశ్‌లతో పాటు అఫ్గనిస్తాన్‌ను కూడా ఈ టోర్నీలో స్ట్రాంగ్ కంటెండర్‌గా పేర్కొనవచ్చు’’ అని వార్తా సంస్థ ANIతో మదన్ లాల్ తన అభిప్రాయాలు పంచుకున్నాడు. కాగా సెప్టెంబరు 9న అఫ్గనిస్తాన్- హాంకాంగ్ మ్యాచ్‌తో మొదలయ్యే ఆసియా కప్-2025 టోర్నీ సెప్టెంబరు 28న ఫైనల్‌తో ముగుస్తుంది.చదవండి: ఇంకెంత రెస్ట్ కావాలి: రోహిత్‌పై గంభీర్ ఫైర్.. నాడు.. -
ఆసీస్‌తో నాలుగో టెస్టు.. ముంబై యువ సంచలనానికి పిలుపు!?
ముంబై స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ తనుష్ కోటియన్‌కు తొలిసారి భారత సెలక్టర్ల నుంచి పిలుపు వచ్చింది. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో మిగిలిన రెండు టెస్టుల కోసం అతడిని సెలక్టర్లు ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. మూడో టెస్టు అనంతరం అంతర్జాతీయ క్రికెట్‌కు విడ్కోలు పలికిన రవిచంద్రన్ అశ్విన్ స్ధానాన్ని 26 ఏళ్ల తనీష్ భర్తీ చేయనున్నాడు.స్పోర్ట్స్‌స్టార్ నివేదిక ప్రకారం..కోటియన్ మంగళవారం (డిసెంబర్ 24) ఆస్ట్రేలియాకు పయనం కానున్నట్లు సమాచారం. దీంతో ప్రస్తుతం జరుగుతున్న విజయ్ హజారే ట్రోఫీ నుంచి కోటియన్ వైదొలగనున్నాడు. ఈ టోర్నీలో సోమవారం హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో తనుష్ ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టాడు. బౌలింగ్‌లో రెండు వికెట్లతో సత్తాచాటిన ఈ ముంబైకర్.. బ్యాటింగ్‌లో 39 పరుగులతో ఆజేయంగా నిలిచాడు. దీంతో ప్లేయర్ ఆఫ్‌ది మ్యాచ్ అవార్డు తనుష్కు దక్కింది.ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో అదుర్స్.. కాగా తనీష్‌కు ఫస్ట్ క్లాస్ క్రికెట్లో అద్బుతమైన రికార్డు ఉంది. ఇప్పటివరకు 33 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడిన కోటియన్.. 25.70 సగటుతో 101 వికెట్లు పడగొట్టాడు. బ్యాటింగ్‌లోనూ కోటియన్‌కు సూపర్ ట్రాక్ రికార్డు ఉంది. 33 మ్యాచ్‌ల్లో 41.21 2523 పరుగులు చేశాడు. రంజీ ట్రోఫీ 2023-24 సీజన్ విజేతగా ముంబై నిలవడంలో కోటియన్ కీలక పాత్ర పోషించాడు. ఈ టోర్నీలో 10 మ్యాచ్‌లు ఆడిన అతడు 29 వికెట్లతో పాటు 500 పైగా పరుగులు చేశాడు.అంతేకాకుండా బీజీటీ ట్రోఫీ ఆరంభానికి ముందు ఆస్ట్రేలియా-ఎతో భారత్-ఎ జట్టు తరపున అనాధికారిక టెస్టు మ్యాచ్ కూడా ఆడాడు. బౌలింగ్‌లో ఓ కీలక వికెట్ పడగొట్టిన తనుష్.. బ్యాటింగ్‌లో 44 పరుగులతో రాణించాడు. ఈ క్రమంలో అతడు అశ్విన్ వారుసుడిగా ఎదిగే ఛాన్స్ ఉంది. ఇక ఆస్ట్రేలియా-భారత్ మధ్య నాలుగో టెస్టు డిసెంబర్ 26 నుంచి ప్రారంభం కానుంది.మిగిలిన రెండు టెస్టులకు ఆసీస్ జట్టు ఇదే.. యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), రోహిత్ శర్మ (కెప్టెన్), నితీష్ కుమార్ రెడ్డి, హర్షిత్ రాణా, జస్ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), మహమ్మద్ సిరాజ్, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, దేవదత్ పడిక్కల్, రవీంద్ర జడేజా, సర్ఫరాజ్ ఖాన్, అభిమన్యు ఈశ్వరన్, ప్రసిద్ధ్ కృష్ణ, ఆకాష్ దీప్, తనుష్ కోటియన్* -
IND A Vs AFG A: టీమిండియాకు బిగ్ షాక్.. సెమీస్‌లో అఫ్గాన్ చేతిలో ఓటమి
ఎమర్జింగ్ ఆసియాకప్-2024లో భారత్-ఎ జట్టు ప్రయాణం ముగిసింది. అల్ఎమరత్ వేదికగా అఫ్గానిస్తాన్-ఎతో జరిగిన రెండో సెమీఫైనల్లో 20 పరుగుల తేడాతో భారత్ ఓటమి చవిచూసింది. 207 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 186 పరుగులు మాత్రమే చేయగల్గింది. భారత బ్యాటర్లలో రమణ్‌దీప్ సింగ్(64) ఆఖరి వరకు పోరాడినప్పటికి జట్టును మాత్రం గెలిపించలేకపోయాడు. రమణ్‌దీప్, బదోని(31) మినహా మిగితా ఎవరూ చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేకపోయారు. అఫ్గాన్ బౌలర్లలో ఘజన్ఫర్,రహమన్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. ఇక తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 206 పరుగుల భారీ స్కోర్ సాధించింది. అఫ్గాన్ బ్యాటర్లలో ఓపెనర్లు జుబైద్ అక్బారిక్, సెదిఖుల్లా అటల్ ఆకాశమే హద్దుగా చెలరేగారు. వీరిద్దరూ భారత బౌలర్లను ఊచకోత కోశారు. సెదిఖుల్లా(52 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్స్‌లతో 83 పరుగులు) జుబైద్ (41 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్‌లతో 64 పరుగులు) అద్భుతమైన హాఫ్ సెంచరీలతో చెలరేగారు. భారత బౌలర్లలో రసిఖ్ దార్ సలామ్ 3 వికెట్లు పడగొట్టగా.. అకిబ్ ఖాన్ ఒక్క వికెట్ సాధించాడు. కాగా ఆదివారం జరగనున్న ఫైనల్లో శ్రీలంక, అఫ్గాన్ జట్లు తలపడనున్నాయి. -
IND A Vs AFG A: అఫ్గాన్ బ్యాటర్ల విధ్వంసం.. భారత్ టార్గెట్ ఎంతంటే?
ఎమర్జింగ్ ఆసియాకప్-2024లో ఒమన్ వేదికగా భారత్-ఎతో జరుగుతున్న రెండో సెమీఫైనల్లో అఫ్గానిస్తాన్-ఎ బ్యాటర్లు విధ్వంసం సృష్టించారు. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 206 పరుగుల భారీ స్కోర్ సాధించింది.అఫ్గాన్ బ్యాటర్లలో ఓపెనర్లు జుబైద్ అక్బారిక్, సెదిఖుల్లా అటల్ ఆకాశమే హద్దుగా చెలరేగారు. వీరిద్దరూ భారత బౌలర్లను ఊచకోత కోశారు. సెదిఖుల్లా(52 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్స్‌లతో 83 పరుగులు) జుబైద్ (41 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్‌లతో 64 పరుగులు) అద్భుతమైన హాఫ్ సెంచరీలతో చెలరేగారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 137 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పారు. వీరద్దరితో పాటు కరీం జనత్( 20 బంతుల్లో 41) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. భారత బౌలర్లలో రసిఖ్ దార్ సలామ్ 3 వికెట్లు పడగొట్టగా.. అకిబ్ ఖాన్ ఒక్క వికెట్ సాధించాడు.చదవండి: IPL 2025: 'ధోని వారసుడు అతడే.. వేలంలోకి వస్తే రికార్డులు బద్దలవ్వాల్సిందే' Sediqullah hit two birds with ZERO stones! ⚡@ACBofficials #MensT20EmergingTeamsAsiaCup2024 #INDvAFG #ACC pic.twitter.com/MNdGmFiNgb— AsianCricketCouncil (@ACCMedia1) October 25, 2024 -
భారత్ వర్సెస్ అఫ్గాన్ సెకెండ్ సెమీస్.. తుది జట్లు ఇవే
ఎమర్జింగ్ ఆసియాకప్-2024లో సెకెండ్ సెమీఫైనల్‌కు రంగం సిద్దమైంది. రెండో సెమీఫైనల్లో భాగంగా అల్ అమెరత్(ఒమన్) వేదికగా భారత్-ఎ, అఫ్గానిస్తాన్-ఎ జట్లు తలపడుతున్నాయి. టాస్ గెలిచిన అఫ్గాన్ జట్టు తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో భారత్ రెండు మార్పులతో బరిలోకి దిగింది. అన్షుల్ కాంబోజ్, ప్రభ్సిమ్రాన్ సింగ్ తుది జట్టులోకి వచ్చారు. మరోవైపు అఫ్గానిస్తాన్ మాత్రం ఏకంగా నాలుగు మార్పులు చేసింది. బిలాల్ సమీ, మహమ్మద్ ఇషాక్, అల్లా గజన్ఫర్, జుబైద్ అక్బరీ జట్టులోకి రీ ఎంట్రీ ఇచ్చారు. కాగా ఈ టోర్నీలో ఇప్పటివరకు ఇరు జట్లు కూడా ఆజేయంగా నిలిచాయి. అదే జోరును సెమీస్‌లో కనబరచాలని ఇరు జట్లు ఉవ్విళ్లూరుతున్నాయి.తుది జట్లుఇండియా-ఎ : ప్రభ్సిమ్రాన్ సింగ్(వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ(కెప్టెన్), ఆయుష్ బదోని, నెహాల్ వధేరా, రమణదీప్ సింగ్, నిశాంత్ సింధు, అన్షుల్ కాంబోజ్, రాహుల్ చాహర్, రసిఖ్ దార్ సలామ్, ఆకిబ్ ఖాన్ఆఫ్ఘనిస్తాన్-ఎ: సెదిఖుల్లా అటల్, జుబైద్ అక్బరీ, దర్విష్ రసూలీ(కెప్టెన్), మహ్మద్ ఇషాక్(వికెట్ కీపర్), కరీం జనత్, షాహిదుల్లా కమల్, షరాఫుద్దీన్ అష్రఫ్, అబ్దుల్ రెహమాన్, అల్లా గజన్ఫర్, కైస్ అహ్మద్, బిలాల్ సమీ -
T20 WC: ఈసారి ఫైనలిస్టులు ఈ జట్లే: భజ్జీ కామెంట్స్ వైరల్
పొట్టి క్రికెట్ తాజా ప్రపంచకప్ సమరం తుది అంకానికి చేరుకుంది. మరో రెండు నాలుగు రోజుల్లో వరల్డ్‌కప్-2024 టోర్నీకి తెరపడనుంది. ఇప్పటికే గ్రూప్-1 నుంచి టీమిండియా, అఫ్గనిస్తాన్.. అదే విధంగా గ్రూప్-2 నుంచి సౌతాఫ్రికా, ఇంగ్లండ్ సెమీ ఫైనల్ చేరిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలో తొలి సెమీస్ మ్యాచ్‌లో సౌతాఫ్రికా- అఫ్గనిస్తాన్ ట్రినిడాడ్ వేదికగా.. రెండో సెమీ ఫైనల్లో టీమిండియా- ఇంగ్లండ్ గయానా వేదికగా తలపడనున్నాయి. ఈ రెండు మ్యాచ్‌లు భారత కాలమానం ప్రకారం గురువారమే జరుగనున్నాయి.తొలి మ్యాచ్ ఉదయం ఆరు గంటలకు ప్రారంభం కానుండగా.. రిజర్వ్ డే కూడా ఉంది. ఇక రెండో సెమీ ఫైనల్ రాత్రి ఎనిమిది గంటలకు మొదలుకానుంది. ఈ మ్యాచ్‌కు మాత్రం రిజర్వ్ డే లేదు.కాగా చాలా మంది మాజీ క్రికెటర్లు ఊహించినట్లుగానే ఈసారి టీమిండియా, ఇంగ్లండ్, సౌతాఫ్రికా సెమీస్ చేరగా.. అనూహ్య రీతిలో అఫ్గనిస్తాన్ కూడా రేసులోకి దూసుకువచ్చింది. అందరి అంచనాలు తలకిందులు చేస్తూ ఆస్ట్రేలియాను వెనక్కి నెట్టి సెమీస్ బెర్తు ఖరారు చేసుకుంది.ఈ నేపథ్యంలో టీమిండియా స్పిన్ దిగ్గజం హర్భజన్ సింగ్ చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. టీ20 ప్రపంచకప్-2024 ఫైనలిస్టులను అంచనా వేస్తూ.. ‘‘ఈసారి వాళ్లు కూడా ఫైనల్‌కు వస్తారనే అనిపిస్తోంది.ఏదేమైనా టీమిండియానే ట్రోఫీ గెలుస్తుంది’’ అని పేర్కొన్నాడు. అఫ్గనిస్తాన్ జట్టును ఉద్దేశించి భజ్జీ ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు. తుదిపోరులో భారత్‌తో అఫ్గన్ తలపడే అవకాశం ఉందని.. రోహిత్ సేన ఈ మ్యాచ్‌లో గెలుస్తుందని తన అభిప్రాయం వెల్లడించాడు. కాగా జూన్ 29న వరల్డ్‌కప్-2024 ఫైనల్ మ్యాచ్ జరుగనుంది. బార్బడోస్‌లోని బ్రిడ్జ్‌టౌన్‌లో గల కెన్సింగ్టన్ ఓవల్ మైదానం ఇందుకు వేదిక. -
ఒకరితో చెప్పించుకునే స్థితిలో రోహిత్ లేడు: టీమిండియా దిగ్గజం
టీ20 ప్రపంచకప్-2024లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఇంత వరకు స్థాయికి తగ్గ ప్రదర్శన చేయనేలేదు. ఆడిన నాలుగు మ్యాచ్‌లలో కలిపి కేవలం 76 పరుగులే చేశాడు.ఇక కీలకమైన సూపర్-8 తొలి మ్యాచ్‌లోనూ రోహిత్ విఫలమైన విషయం తెలిసిందే. అఫ్గనిస్తాన్‌తో గురువారం నాటి మ్యాచ్ సందర్భంగా 13 బంతులు ఎదుర్కొని కేవలం ఎనిమిది పరుగులే చేశాడు రోహిత్.అఫ్గన్ లెఫ్టార్మ్ పేసర్ ఫజల్హక్ ఫారూకీ బౌలింగ్‌లో రషీద్ ఖాన్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఇక ఈ మ్యాచ్‌లో టీమిండియా అఫ్గనిస్తాన్‌పై గెలిచినప్పటికీ రోహిత్ శర్మ బ్యాటింగ్ తీరుపై మాత్రం విమర్శలు వచ్చాయి.లెఫ్టార్మ్ పేసర్లను ఎదుర్కోలేడంటూ రోహిత్‌ను ఉద్దేశించి నెట్టింట ట్రోలింగ్ జరిగింది. ఈ నేపథ్యంలో టీమిండియా దిగ్గజం సునిల్ గావస్కర్ కీలక వ్యాఖ్యలు చేశాడు.‘‘అతడు అనుభవం ఉన్న ఆటగాడు. ఎప్పుడు ఏం చేయాలో అతడికి బాగా తెలుసు. నిజానికి తన ఆట ఎలా ఉండాలో ఒకరితో చెప్పించుకోవాల్సిన స్థితిలో రోహిత్ శర్మ లేనే లేడు.ప్రత్యర్థి బౌలర్ ఎవరన్న అంశంతో అతడికి సంబంధం లేదు. అయితే, ఒక్కోసారి మన బలహీనతలు తెలిసిన బౌలర్ ఎదురుగా ఉన్నపుడు ఆన్‌సైడ్ హిట్టింగ్ చేయడం కరెక్ట్ కాదని మీరు అనొచ్చు.ఇలాంటి సమయంలో ఎక్స్ట్రా కవర్ మీదుగా ఇన్సైడ్ అవుట్ షాట్ ఆడవచ్చు కదా అని భావించవచ్చు. ఇవి కేవలం బయట నుంచి చూసి చెప్పేవి మాత్రమే.తీరికగా కూర్చుని.. ఎవరు ఎలాంటి షాట్ ఆడాలో చెప్పడం తేలికే. కానీ మైదానంలో దిగి ఆడితేనే కదా తెలిసేది’’ అంటూ గావస్కర్ రోహిత్ శర్మ విమర్శకులకు కౌంటర్ ఇచ్చాడు. స్టార్ స్పోర్ట్స్ షోలో ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు.కాగా సూపర్-8 దశను అఫ్గన్‌పై విజయంతో మొదలుపెట్టిన టీమిండియా.. శనివారం తమ రెండో మ్యాచ్ ఆడనుంది. ఆంటిగ్వా వేదికగా బంగ్లాదేశ్‌తో తలపడేందుకు సిద్ధమైంది. అయితే, వర్షం కారణంగా ఈ మ్యాచ్‌కు అంతరాయం ఏర్పడే పరిస్థితి ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. -
ఈజీ క్యాచ్ విడిచిపెట్టిన కోహ్లి.. రోహిత్ షాకింగ్ రియాక్షన్!
టీ20 వరల్డ్‌కప్-2024లో టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి తన స్ధాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతున్నాడు. ఈ మెగా టోర్నీ లీగ్ స్టేజీలో నిరాశపరిచిన కింగ్ కోహ్లి.. ఇప్పుడు సూపర్-8లో కూడా అదే తీరును కనబరుస్తున్నాడు.సూపర్-8లో భాగంగా బార్బోడస్ వేదికగా గురువారం అఫ్గానిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో కోహ్లి విఫలమయ్యాడు. ఈ మ్యాచ్‌లో 24 బంతులు ఎదుర్కొన్న కోహ్లి.. సరిగ్గా 24 పరుగులు చేసి రషీద్ ఖాన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. అఫ్గాన్ బౌలర్లను ఎదుర్కొనేందుకు కోహ్లి కాస్త ఇబ్బంది పడ్డాడు.ఇక ఈ మ్యాచ్‌లో విరాట్ బ్యాటింగ్ పరంగానే కాకుండా ఫీల్డింగ్‌లో కూడా నిరాశపరిచాడు. అఫ్గాన్ ఇన్నింగ్స్ మూడో ఓవర్ వేసిన అర్ష్‌దీప్ సింగ్ బౌలింగ్‌లో ఇబ్రహీం జద్రాన్ ఇచ్చిన ఈజీ క్యాచ్‌ను కోహ్లి జారవిడిచాడు. ఎన్నో సంచలన క్యాచ్‌లు అందుకున్న కింగ్ కోహ్లి.. ఈ మ్యాచ్‌లో సునాయస క్యాచ్‌ను జారవిడిచడంతో అంతా ఆశ్చ్యర్యపోయారు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తన చేతులు తలపై పెట్టుకుని షాకింగ్ రియాక్షన్ ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. అయితే అదృష్టవశాత్తు కోహ్లి విడిచిపెట్టిన క్యాచ్ పెద్ద కాస్ట్లీగా మారలేదు. ఎందకుంటే ఆ తర్వాతి ఓవరే జద్రాన్(8) అక్షర్‌పటేల్ బౌలింగ్‌లో ఔటయ్యాడు.pic.twitter.com/MkAFbNakRq— Bangladesh vs Sri Lanka (@Hanji_CricDekho) June 20, 2024 -
వాళ్లిద్దరు సూపర్.. జట్టులో మార్పులకు సిద్ధం: రోహిత్ శర్మ
వెస్టిండీస్‌లో పిచ్‌ల గురించి తమకు అవగాహన ఉందని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. గత రెండేళ్లుగా విండీస్‌లో అనేక టీ20 మ్యాచ్‌లు ఆడామని.. ఆ అనుభవం ఇప్పుడు అక్కరకు వస్తోందని తెలిపాడు.తమ బౌలింగ్ విభాగం పటిష్టంగా ఉందని.. అందుకే అఫ్గనిస్తాన్‌పై అలవోకగా విజయం సాధించామని రోహిత్ శర్మ హర్షం వ్యక్తం చేశాడు. టీ20 ప్రపంచకప్-2024 సూపర్-8లో తమ తొలి మ్యాచ్‌లో టీమిండియా గెలుపొందిన విషయం తెలిసిందే.బార్బడోస్‌లోని బ్రిడ్జ్‌టౌన్ వేదికగా గురువారం జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా తొలుత బ్యాటింగ్ చేసింది. సూర్యకుమార్ యాదవ్(28 బంతుల్లో 53), హార్దిక్ పాండ్యా(24 బంతుల్లో 32) రాణించారు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి భారత్ 181 పరుగులు చేసింది.ఈ క్రమంలో లక్ష్య ఛేదనకు దిగిన అఫ్గనిస్తాన్ భారత బౌలర్లు 134 పరుగులకే ఆలౌట్ చేశారు. ఫలితంగా 47 పరుగుల తేడాతో టీమిండియా గెలుపొందింది.కాగా పేసర్లు జస్ప్రీత్ బుమ్రా 3, అర్ష్‌దీప్ సింగ్ 3 వికెట్లు తీయగా.. స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్ రెండు, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ ఒక్కో వికెట్ పడగొట్టారు.ఈ నేపథ్యంలో రోహిత్ శర్మ మాట్లాడుతూ అఫ్గన్‌పై విజయానికి బౌలర్లే కారణమంటూ వారికి క్రెడిట్ ఇచ్చాడు. ‘‘మా బౌలింగ్ విభాగంలో టాప్ క్లాస్ ఆటగాళ్లు ఉన్నారు. ప్రతి ఒక్కరు తమ విధిని సమర్థవంతంగా పూర్తి చేస్తారు.వారిపై మాకు నమ్మకం ఉంది. ఇక బుమ్రా ఏం చేయగలడో మా అందరికీ తెలుసు. అతడి సేవలను మరింత తెలివిగా ఉపయోగించుకోవడం ముఖ్యం.అతడు జట్టులో ఉన్నాడంటే కచ్చితంగా తన వంతు బాధ్యత పూర్తి చేస్తాడు. ఇక సూర్య, హార్దిక్ భాగస్వామ్యం వల్లే మేము మెరుగైన స్కోరు చేయగలిగాం. తదుపరి మ్యాచ్‌లలో ప్రత్యర్థి జట్టు బలాబలాలకు అనుగుణంగా అవసరమైతే మా తుదిజట్టులో మార్పులు చేసుకుంటాం. ఏదేమైనా జట్టులో ముగ్గురు స్పిన్నర్లు ఉంటే మంచిదని భావిస్తున్నాం.ఒకవేళ అత్యవసరమైతే ముగ్గురు సీమర్లతో వెళ్లడానికి కూడా నేను సిద్ధమే’’ అని రోహిత్ శర్మ పేర్కొన్నాడు. కాగా టీమిండియా తదుపరి బంగ్లాదేశ్‌తో శనివారం మ్యాచ్ ఆడనుంది. View this post on Instagram A post shared by ICC (@icc) -
మరీ ఓవర్ చేయకు: పంత్ క్యాచ్.. రోహిత్ రియాక్షన్ వైరల్
టీ20 ప్రపంచకప్-2024లో టీమిండియా జైత్రయాత్ర కొనసాగుతోంది. అమెరికా వేదికగా లీగ్ దశలో ఓటమన్నదే ఎరుగుక ముందుకు సాగిన రోహిత్ సేన.. వెస్టిండీస్‌లో జరుగుతున్న సూపర్-8లోనూ శుభారంభం చేసింది.గ్రూప్-1లో భాగంగా అఫ్గనిస్తాన్ గురువారం నాటి మ్యాచ్‌లో జయభేరి మోగించింది. అఫ్గన్ జట్టును 47 పరుగుల తేడాతో చిత్తు చేసింది. ఈ విజయంలో కీలక పాత్ర పోషించిన వరల్డ్ నంబర్ వన్ టీ20 బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్(28 బంతుల్లో 53) ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు.ఇదిలా ఉంటే.. అఫ్గనిస్తాన్‌తో మ్యాచ్ సందర్భంగా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ- వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ మధ్య ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. అఫ్గన్ ఇన్నింగ్స్‌లో పంత్- రోహిత్ క్యాచ్‌ల విషయంలో పోటాపోటీగా తలపడ్డారు.బార్బడోస్‌లోని బ్రిడ్జ్‌టౌన్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో పంత్ మొత్తంగా మూడు క్యాచ్‌లు అందుకోగా.. రోహిత్ శర్మ రెండు క్యాచ్‌లు పట్టాడు. అఫ్గనిస్తాన్ ఇన్నింగ్స్ పదకొండో ఓవర్‌ను కుల్దీప్ యాదవ్ వేశాడు.ఈ క్రమంలో రెండో బంతిని అఫ్గన్ బ్యాటర్ గుల్బదిన్ నయీబ్ షాట్ ఆడేందుకు ప్రయత్నించి విఫలమయ్యాడు. కుల్దీప్ వేసిన గూగ్లీని ఆడబోయి బంతిని గాల్లోకి లేపాడు. క్యాచ్‌కు ఆస్కారం ఉన్న నేపథ్యంలో పంత్ పరిగెత్తుకు వెళ్లి బంతిని అందుకున్నాడు.ఆ సమయంలో రోహిత్ కూడా పంత్‌కు సమీపంలోనే ఉండగా.. ఎగ్జైట్మెంట్లో పంత్ అతడి దగ్గరకు పరిగెత్తుకు వెళ్లి సంతోషం పంచుకున్నాడు. ఈ క్రమంలో.. ‘‘ఈ క్యాచ్ నీదేలే.. నేనేమీ అడ్డుపడను’’ అన్నట్లుగా రోహిత్ ఇచ్చిన ఎక్స్ప్రెషన్ వైరల్‌గా మారింది.కాగా అఫ్గనిస్తాన్‌తో మ్యాచ్‌లో పంత్.. రహ్మనుల్లా గుర్బాజ్(11), గుల్బదిన్ నయీబ్(17), నవీన్ ఉల్ హక్(0) క్యాచ్‌లు అందుకోగా.. రోహిత్ శర్మ ఇబ్రహీం జద్రాన్(8), నూర్ అహ్మద్(12) ఇచ్చిన క్యాచ్‌లను ఒడిసిపట్టాడు. View this post on Instagram A post shared by ICC (@icc) -
T20 World Cup 2024: నిప్పులు చెరిగిన బుమ్రా.. 24 బంతుల్లో 20 డాట్ బాల్స్
టీమిండియా పేసు గుర్రం జస్ప్రీత్ బుమ్రా మరోసారి విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. టీ20 వరల్డ్‌కప్ 2024 సూపర్-8 మ్యాచ్‌ల్లో భాగంగా ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో నిప్పులు చెరిగే బంతులతో ప్రత్యర్ది బ్యాటర్లపై విరుచుకుపడ్డాడు. ఈ మ్యాచ్‌లో 24 బంతులు వేసిన బుమ్రా ఏకంగా 20 డాట్ బాల్స్ సంధించి ప్రత్యర్థులను ఉక్కిరిబిక్కిరి చేశాడు. కేవలం 7 పరుగులు మాత్రమే ఇచ్చి 3 కీలకమైన వికెట్లు పడగొట్టాడు. బుమ్రా మెరుపు ప్రదర్శనతో విరుచుకుపడటంతో భారత్ నిర్ధేశించిన 182 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆఫ్ఘనిస్తాన్ 134 పరుగులకు కుప్పకూలింది. ఫలితంగా భారత్ 47 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.ప్రస్తుత ప్రపంచకప్‌లో బుమ్రా చెలరేగడం ఇది తొలిసారి కాదు. టోర్నీ ఆరంభం నుంచి ప్రత్యర్థులపై విరుచుకుపడుతున్నాడు. గ్రూప్ దశలో ఐర్లాండ్‌పై 2/6, పాకిస్తాన్‌పై 3/14 మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శనలు చేసి రెండు సందర్భాల్లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు గెలచుకున్నాడు. ఆఫ్ఘనిస్తాన్‌తో మ్యాచ్‌లో మరింత డోస్ పెంచిన బుమ్రా.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు గెలవలేదు కానీ.. జట్టు గెలుపులో ప్రధానపాత్ర పోషించాడు. బుమ్రాకు జతగా బ్యాటింగ్‌లో సూర్యకుమార్ (28 బంతుల్లో 53; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) చెలరేగడంతో భారత్ సునాయాస విజయం సాధించింది. ఓవరాల్‌గా ఆఫ్ఘన్‌పై గెలుపులో అందరూ తలో చేయి వేసి టీమిండియాకు సూపర్ విక్టరీ అందించారు. బ్యాటింగ్‌లో విరాట్ కోహ్లి (24), రిషబ్ పంత్ (20), హార్దిక్ పాండ్యా (32).. బౌలింగ్‌లో అర్ష్‌దీప్ (4-0-36-3), కుల్దీప్ (4-0-32-2), అక్షర్ పటేల్ (3-1-15-1), రవీంద్ర జడేజా (3-0-20-1) భారత్ గెలుపుకు దోహదపడ్డారు. -
కోహ్లికి 121 మ్యాచ్‌లు అవసరమైతే.. సూర్యకుమార్ కేవలం 64 మ్యాచ్‌ల్లోనే సాధించాడు..!
గత రెండేళ్లుగా నంబర్ వన్ టీ20 బ్యాటర్‌గా చలామణి అవుతున్న టీమిండియా విధ్వంసకర వీరుడు సూర్యకుమార్ యాదవ్ పొట్టి క్రికెట్లో తాజాగా మరో ఘనత సాధించాడు. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు (15) గెలుచుకున్న ఆటగాడిగా విరాట్ కోహ్లి రికార్డును సమం చేశాడు. టీ20 వరల్డ్‌కప్ 2024 సూపర్-8 మ్యాచ్‌ల్లో భాగంగా ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు గెలుచుకోవడం ద్వారా స్కై ఈ రికార్డు నెలకొల్పాడు.విరాట్‌కు 15 ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు గెలుచుకునేందుకు 121 మ్యాచ్‌లు అవసరమైతే.. స్కై కేవలం 64 మ్యాచ్‌ల్లోనే ఈ ఘనత సాధించాడు. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు గెలుచుకున్న ఆటగాళ్ల జాబితాలో స్కై, విరాట్ తర్వాత విరన్‌దీప్ సింగ్ (14), సికందర్ రజా (14), మొహమ్మద్ నబీ (14) ఉన్నారు.భారత్-ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో సూర్యకుమార్ మెరుపు అర్దశతకం (28 బంతుల్లో 53; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) సాధించి, టీమిండియా గెలుపులో కీలకపాత్ర పోషించాడు. తద్వారా ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు గెలుచున్నాడు. ఏకపక్షంగా సాగిన ఈ మ్యాచ్‌లో టీమిండియా ఆఫ్ఘనిస్తాన్‌ను 47 పరుగుల తేడాతో చిత్తు చేసింది.తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. స్కై ఆకాశమే హద్దుగా చెలరేగడంతో నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. భారత ఇన్నింగ్స్‌లో విరాట్ కోహ్లి (24), రిషబ్ పంత్ (20), హార్దిక్ పాండ్యా (32) ఓ మోస్తరు స్కోర్లు చేయగా.. రోహిత్ శర్మ (8), శివమ్ దూబే (10), రవీంద్ర జడేజా (7) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. ఆఖర్లో అక్షర్ పటేల్ (12) ఆకట్టుకున్నాడు. ఆఫ్ఘన్ బౌలర్లలో రషీద్ ఖాన్, ఫజల్ హక్ ఫారూఖీ తలో 3 వికెట్లు పడగొట్టగా.. నవీన్ ఉల్ హక్ ఓ వికెట్ దక్కించుకున్నాడు.నిప్పులు చెరిగిన బుమ్రా..182 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆఫ్ఘనిస్తాన్.. బుమ్రా (4-1-7-3) నిప్పులు చెరగడంతో 134 పరుగులకే ఆలౌటైంది. భారత బౌలర్లలో అర్ష్‌దీప్ 3, కుల్దీప్ 2, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా తలో వికెట్ పడగొట్టారు. ఆఫ్ఘనిస్తాన్ బ్యాటర్లలో అజ్మతుల్లా ఒమర్జాయ్ (26) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. -
T20 World Cup 2024 Super 8: ఆఫ్ఘనిస్తాన్‌ను చిత్తు చేసిన టీమిండియా
టీ20 వరల్డ్‌కప్ 2024లో భాగంగా బార్బడోస్ వేదికగా ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన సూపర్-8 మ్యాచ్‌లో టీమిండియా 47 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేయగా.. ఛేదనలో చేతులెత్తేసిన ఆఫ్ఘనిస్తాన్ 20 ఓవర్లలో 134 పరుగులకు చాపచుట్టేసింది.స్కై మెరుపులు..టాస్ ఓడి ప్రత్యర్ధి ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా.. సూర్యకుమార్ యాదవ్ (28 బంతుల్లో 53; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు అర్ద సెంచరీతో సత్తా చాటడంతో భారీ స్కోర్ చేసింది. భారత ఇన్నింగ్స్‌లో విరాట్ కోహ్లి (24), రిషబ్ పంత్ (20), హార్దిక్ పాండ్యా (32) ఓ మోస్తరు స్కోర్లు చేయగా.. రోహిత్ శర్మ (8), శివమ్ దూబే (10), రవీంద్ర జడేజా (7) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. ఆఖర్లో అక్షర్ పటేల్ (12) ఆకట్టుకున్నాడు. ఆఫ్ఘన్ బౌలర్లలో రషీద్ ఖాన్, ఫజల్ హక్ ఫారూఖీ తలో 3 వికెట్లు పడగొట్టగా.. నవీన్ ఉల్ హక్ ఓ వికెట్ దక్కించుకున్నాడు.నిప్పులు చెరిగిన బుమ్రా..182 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆఫ్ఘనిస్తాన్.. బుమ్రా (4-1-7-3) నిప్పులు చెరగడంతో 134 పరుగులకే ఆలౌటైంది. భారత బౌలర్లలో అర్ష్‌దీప్ 3, కుల్దీప్ 2, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా తలో వికెట్ పడగొట్టారు. ఆఫ్ఘనిస్తాన్ బ్యాటర్లలో అజ్మతుల్లా ఒమర్జాయ్ (26) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. -
T20 World Cup 2024: సత్తా చాటిన సూర్యకుమార్.. ఆఫ్ఘనిస్తాన్ ముందు భారీ లక్ష్యం
టీ20 వరల్డ్‌కప్ 2024లో భాగంగా బార్బడోస్ వేదికగా ఆఫ్ఘనిస్తాన్‌తో ఇవాళ (జూన్ 20) జరుగుతున్న సూపర్-8 మ్యాచ్‌లో టీమిండియా టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో భారత్ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. సూర్యకుమార్ యాదవ్ (28 బంతుల్లో 53; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు అర్ద సెంచరీతో సత్తా చాటగా.. విరాట్ కోహ్లి (24), రిషబ్ పంత్ (20), హార్దిక్ పాండ్యా (32) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. రోహిత్ శర్మ (8), శివమ్ దూబే (10), రవీంద్ర జడేజా (7) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. ఆఖర్లో అక్షర్ పటేల్ (12) రెండు బౌండరీలు బాది ఆకట్టుకున్నాడు. ఆఫ్ఘన్ బౌలర్లలో రషీద్ ఖాన్, ఫజల్ హక్ ఫారూఖీ తలో 3 వికెట్లు పడగొట్టగా.. నవీన్ ఉల్ హక్ ఓ వికెట్ దక్కించుకున్నాడు. తుది జట్లు..భారత్: రోహిత్ శర్మ(కెప్టెన్), విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్(వికెట్‌కీపర్), సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రాఆఫ్ఘనిస్తాన్ : రహ్మానుల్లా గుర్బాజ్(వికెట్‌కీపర్), ఇబ్రహీం జద్రాన్, నజీబుల్లా జద్రాన్, హజ్రతుల్లా జజాయ్, గుల్బాదిన్ నైబ్, అజ్మతుల్లా ఒమర్జాయ్, మహ్మద్ నబీ, రషీద్ ఖాన్(కెప్టెన్), నూర్ అహ్మద్, నవీన్-ఉల్-హక్, ఫజల్ హక్ ఫారూఖీ -
T20 World Cup 2024: మెల్బోర్న్ ఐకానిక్ సిక్స్‌ను రిపీట్ చేసిన విరాట్
టీ20 వరల్డ్‌కప్ 2024లో భాగంగా ఆఫ్ఘనిస్తాన్‌తో ఇవాళ (జూన్ 20) జరుగుతున్న సూపర్-8 మ్యాచ్‌లో టీమిండియా టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో భారత్ 14 ఓవర్లు ముగిసే సరికి 4 వికెట్ల నష్టానికి 115 పరుగులు చేసింది. రోహిత్ శర్మ (8), విరాట్ కోహ్లి (24), రిషబ్ పంత్ (20), శివమ్ దూబే (10) ఔట్ కాగా.. సూర్యకుమార్ యాదవ్ (34), హార్దిక్ పాండ్యా (11) క్రీజ్‌లో ఉన్నారు. ఆఫ్ఘన్ బౌలర్లలో రషీద్ ఖాన్ 3 వికెట్లు పడగొట్టగా.. ఫజల్ హక్ ఫారూఖీ ఓ వికెట్ దక్కించుకున్నాడు.THE GOAT HAS ARRIVED IN T20I WORLD CUP 2024. 🇮🇳 pic.twitter.com/5vZTr1vTHK— Johns. (@CricCrazyJohns) June 20, 2024ఐకానిక్ సిక్స్‌ను రిపీట్ చేసిన విరాట్ఈ మ్యాచ్‌లో విరాట్ 2022 టీ20 వరల్డ్‌కప్‌లో మెల్బోర్న్ మైదానంలో పాక్ పేసర్ హరీస్ రౌఫ్ బౌలింగ్‌లో బాదిన ఐకానిక్ సిక్స్‌ను రిపీట్ చేశాడు. నవీన్ ఉల్ హక్ బౌలింగ్‌లో విరాట్ కొట్టిన సిక్సర్ మెల్బోర్న్ ఐకానిక్ సిక్సర్‌ను గుర్తు చేసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరలవుతుంది. ఇక ఈ మ్యాచ్‌లో మాంచి టచ్‌లో ఉన్నట్లు కనిపించిన విరాట్.. 24 బంతుల్లో సిక్సర్ సాయంతో 24 పరుగులు చేసి రషీద్ ఖాన్ బౌలింగ్‌లో మొహమ్మద్ నబీకి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. -
T20 World Cup 2024: భారత్-ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్.. తుది జట్టులో కుల్దీప్
టీ20 వరల్డ్‌కప్ 2024 గ్రూప్-8 మ్యాచ్‌ల్లో భాగంగా ఇవాళ (జూన్ 20) భారత్, ఆఫ్ఘనిస్తాన్ జట్లు తలపడుతున్నాయి. బార్బడోస్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ భారతకాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ కోసం భారత్, ఆఫ్ఘనిస్తాన్ జట్లు చెరో మార్పు చేశాయి. భారత్‌కు సంబంధించి సిరాజ్ స్థానంలో కుల్దీప్ యాదవ్ తుది జట్టులోకి రాగా.. ఆప్ఘనిస్తాన్ తరఫున కరీమ్ జనత్ స్థానంలో హజ్రతుల్లా జజాయ్ తుది జట్టులోకి వచ్చాడు.తుది జట్లు..భారత్: రోహిత్ శర్మ(కెప్టెన్), విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్(వికెట్‌కీపర్), సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రాఆఫ్ఘనిస్తాన్: రహ్మానుల్లా గుర్బాజ్(వికెట్‌కీపర్), ఇబ్రహీం జద్రాన్, నజీబుల్లా జద్రాన్, హజ్రతుల్లా జజాయ్, గుల్బాదిన్ నైబ్, అజ్మతుల్లా ఒమర్జాయ్, మహ్మద్ నబీ, రషీద్ ఖాన్(కెప్టెన్), నూర్ అహ్మద్, నవీన్-ఉల్-హక్, ఫజల్ హక్ ఫారూఖీ -
అఫ్గాన్‌తో మ్యాచ్.. టీమిండియాలో కీలక మార్పు! సిరాజ్‌కు నో ఛాన్స్
టీ20 వరల్డ్‌కప్-2024లో సూపర్ ఎయిట్ సమరానికి టీమిండియా సిద్దమైంది. సూపర్-8లో భాగంగా గురువారం బార్బడోస్ వేదికగా అఫ్గానిస్తాన్‌తో భారత్ అమీతుమీ తెల్చుకోనుంది. ఈ మ్యాచ్ కోసం భారత జట్టు తమ ఆస్త్రశాస్త్రాలను సిద్దం చేసుకుంది.ఈ మ్యాచ్‌లో గెలిచి సెమీస్ దిశగా అడుగులు వేయాలని టీమిండియా భావిస్తుంటే.. అఫ్గాన్ కూడా న్యూజిలాండ్ మాదిరే భారత్‌కు కూడా షాక్ ఇవ్వాలని ప్రణాళికలు రచిస్తోంది. అయితే అఫ్గానిస్తాన్‌తో పోరుకు భారత జట్టులో ఓ కీలక మార్పు చోటుచేసుకోనున్నట్లు తెలుస్తోంది. బార్బడోస్‌లోని కెన్సింగ్టన్ ఓవల్ పిచ్ స్పిన్నర్లకు అనుకూలించే అవకాశం ఉంది. దీంతో భారత జట్టు మెనెజ్‌మెంట్ అఫ్గాన్‌తో మ్యాచ్‌లో అదనపు స్పిన్నర్‌ను ఆడించాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఈ క్రమంలో పేసర్ మహ్మద్ సిరాజ్‌పై వేటు వేసి చైనామన్ కుల్దీప్ యాదవ్‌కు చోటు ఇవ్వనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.కుల్దీప్ ఇప్పటివరకు ఈ ఏడాది టోర్నీలో ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. కుల్దీప్తో పాటు మరో లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ కూడా బెంచ్‌లో ఉన్నాడు. కానీ ఇటీవల కాలంలో చాహల్ కంటే కుల్దీప్నే మెరుగ్గా రాణిస్తున్నాడు. ఐపీఎల్లో కూడా కుల్దీప్ అద్బుతమైన ప్రదర్శన కనబరిచాడు.ఐపీఎల్‌తో పాటు అంతర్జాతీయ క్రికెట్లోనూ యాదవ్ సత్తాచాటుతున్నాడు. ఈ క్రమంలోనే జట్టుమెనెజ్మెంట్ చాహల్ కంటే కుల్దీప్ వైపే మొగ్గు చూపుతున్నట్లు వినికిడి. ఇక ఈ ఒక్కటి మినహా జట్టులో ఇంకా ఎటువంటి మార్పులు ఉండకపోవచ్చు.అఫ్గాన్‌తో మ్యాచ్‌కు భారత తుది జట్టు(అంచనా): రోహిత్ శర్మ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్(వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా -
Ind vs Afg: అతడు వద్దు.. కోహ్లి విషయంలో అలా చేయొద్దు!
టీ20 ప్రపంచకప్-2024 సూపర్-8 సమరానికి టీమిండియా సిద్ధమైంది. వెస్టిండీస్‌లోని బార్బడోస్ వేదికగా అఫ్గనిస్తాన్‌తో గురువారం తమ తొలి మ్యాచ్ ఆడనుంది.ఇందుకోసం రోహిత్ సేన ఇప్పటికే పూర్తి స్థాయిలో సన్నద్ధమైంది. లీగ్ దశలో న్యూయార్క్ పిచ్‌పై పరుగులు రాబట్టేందుకు ఆపసోపాలు పడ్డ బ్యాటర్లు.. బ్రిడ్జ్‌టౌన్ పిచ్‌పై బ్యాట్ ఝులిపించాలని పట్టుదలగా ఉన్నారు.ఈ క్రమంలో ఇప్పటికే నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తూ.. స్కిల్ సెషన్స్‌ను సద్వినియోగం చేసుకున్నారు టీమిండియా స్టార్లు. ఇక విండీస్ పిచ్‌లు స్పిన్‌కు అనుకూలించే అవకాశం ఉంది కాబట్టి.. టీమిండియా తుదిజట్టు ఎలా ఉండబోతున్నది ఆసక్తికరంగా మారింది.అమెరికాలో ముగ్గురు పేసర్లు, ఇద్దరు స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్లతో బరిలోకి దిగిన రోహిత్ సేన.. వెస్టిండీస్‌లో ఓ పేసర్‌పై వేటు వేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. అదే విధంగా.. ఓపెనింగ్ జోడీని మారిస్తే ఎలా ఉంటుందన్న అంశం మీద కూడా చర్చ జరుగుతోంది.కోహ్లి విషయంలో ప్రయోగాలు వద్దుఈ నేపథ్యంలో టీమిండియా మాజీ బౌలర్ ఇర్ఫాన్ పఠాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రోహిత్ శర్మకు జోడీగా విరాట్ కోహ్లి మాత్రమే ఉండాలని పేర్కొన్నాడు. కీలక మ్యాచ్‌లలో ఒత్తిడిని అధిగమించగల కోహ్లి.. అఫ్గన్‌తో పోరులోనూ ఓపెనర్‌గానే రావాలని ఆకాంక్షించాడు.న్యూయార్క్‌లో పరిస్థితులు వేరని.. విండీస్ పిచ్‌లపై కోహ్లి కచ్చితంగా బ్యాట్‌తో మ్యాజిక్ చేస్తాడని ఇర్ఫాన్ పఠాన్ ధీమా వ్యక్తం చేశాడు. కోహ్లి ప్రత్యేకమైన నైపుణ్యాలున్న ఆటగాడని.. అతడి విషయంలో ప్రయోగాలు అనవసరం అని పఠాన్ అభిప్రాయపడ్డాడు.అదే విధంగా.. అఫ్గనిస్తాన్‌తో మ్యాచ్‌లో మహ్మద్ సిరాజ్‌ను తప్పించి.. అతడి స్థానంలో చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌ను ఆడించాలని ఇర్ఫాన్ పఠాన్ సూచించాడు. పేస్ దళంలో నాయకుడు జస్ప్రీత్ బుమ్రాతో పాటు అర్ష్‌దీప్ సింగ్ ఉంటే ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నాడు.అఫ్గనిస్తాన్‌తో సూపర్-8 మ్యాచ్‌కు ఇర్ఫాన్ పఠాన్ ఎంచుకున్న భారత జట్టురోహిత్ శర్మ (కెప్టెన్), విరాట్ కోహ్లి, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్.చదవండి: -
కొత్తగా చేయాల్సిందేమీ లేదు.. థాంక్యూ: ద్రవిడ్ కౌంటర్
భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ తీవ్ర అసహనానికి గురయ్యాడు. బ్యాటర్‌గా తన ఆట తీరును గుర్తుచేస్తూ.. టీమిండియాను కించపరచాలని చూసిన జర్నలిస్టుకు దిమ్మతిరిగేలా కౌంటర్ ఇచ్చాడు.కాగా టీ20 ప్రపంచకప్-2024 లీగ్ మ్యాచ్‌లను అమెరికాలో ఆడిన టీమిండియా.. సూపర్-8 కోసం వెస్టిండీస్‌కు చేరుకుంది. ఇందులో భాగంగా గురువారం తొలి మ్యాచ్ ఆడనుంది. బార్బడోస్‌లోని బ్రిడ్జ్‌టౌన్ వేదికగా అఫ్గనిస్తాన్‌తో తలపడనుంది.ఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్‌ను తన ప్రశ్నలతో ఇరుకున పెట్టాలని ఓ జర్నలిస్టు ప్రయత్నించాడు. ఆటగాడిగా ఇదే వేదికపై ద్రవిడ్‌కు, టీమిండియాకు గతంలో ఎదురైన చేదు అనుభవాన్ని గుర్తు చేశాడు.‘‘రాహుల్.. మీరు ఇక్కడ మ్యాచ్‌లు ఆడారు కదా. కానీ 97 టెస్టులో మీకంటూ గొప్ప జ్ఞాపకాలు ఏమీ లేవు’’ అని సదరు జర్నలిస్టు ద్రవిడ్‌తో అన్నాడు.ఇందుకు బదులిస్తూ.. ‘‘గీజ్.. ఈ ప్రశ్న అడిగినందుకు ధన్యవాదాలు! ఇక్కడ నాకు కొన్ని మధుర జ్ఞాపకాలు కూడా ఉన్నాయి’’ అని ద్రవిడ్ పేర్కొన్నాడు.అయితే, అంతటితో సంతృప్తి చెందని రిపోర్టర్.. ‘‘నేనూ అదే అంటున్నా. ఇక్కడ మీకున్న కాస్తో కూస్తో మంచి జ్ఞాపకాలను గొప్ప జ్ఞాపకాలుగా మార్చుకుంటారా?’’ అని ప్రశ్నించాడు.దీంతో సహనం కోల్పోయిన ద్రవిడ్.. ‘‘అన్నీ తెలిసిన వ్యక్తి కదా మీరు.. నేను ఇక్కడ కొత్తగా చేయాల్సిందేమీ లేదయ్యా. గతాన్ని మరిచి ముందుకు సాగడంలో నేను ముందుంటాను. వెనక్కి తిరిగి చూసుకుని.. పదే పదే గతాన్ని తవ్వుకోవడం నాకు అలవాటు లేదు.ప్రస్తుతం నేను ఏం చేస్తున్నాను, నా విధి ఏమిటన్న అంశాలపైనే దృష్టి పెడతాను. 97లో ఏం జరిగింది? ఆ తర్వాతి సంవత్సరంలో ఏం జరిగింది? అంటూ కూర్చోను.ఈ మ్యాచ్ గెలిచిన తర్వాత కూడా ఇలాంటి ప్రశ్నలు రావచ్చు. మంచైనా.. చెడైనా.. రెండింటినీ సమంగా స్వీకరిస్తాను. ఆటగాడిగా ఉన్ననాటి విషయాల గురించి ఆలోచించే సమయమే లేదు. భవిష్యత్తు గురించి మాత్రమే ఆలోచిస్తా. ఈ మ్యాచ్ ఎలా గెలవాలన్న విషయం మీద మాత్రమే ఫోకస్ చేస్తా’’ అంటూ ద్రవిడ్ కౌంటర్ ఇచ్చాడు.కాగా 1997లో బార్బడోస్ వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన టెస్టులో రాహుల్ ద్రవిడ్ రెండు ఇన్నింగ్స్‌లో వరుసగా 78, 2 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో టీమిండియా 38 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. నాటి విషయాన్ని గుర్తు చేస్తూ.. సదరు రిపోర్టర్ ద్రవిడ్ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేయగా.. ఇలా గట్టిగానే కౌంటర్ ఇచ్చాడు. ప్రస్తుతం... కోచ్‌గా జట్టును సరైన దిశలో నడపడం మాత్రమే తన తక్షణ కర్తవ్యమని సమాధానమిచ్చాడు. కాగా ఈ మెగా టోర్నీ తర్వాత ద్రవిడ్ హెడ్ కోచ్‌గా వైదొలగనున్న విషయం తెలిసిందే. అతడిస్థానంలో గౌతం గంభీర్ ఈ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది.చదవండి: T20 WC 2024: అఫ్గాన్‌తో అంత ఈజీ కాదు.. కోహ్లి ఫామ్‌లోకి వస్తాడా? -
అఫ్గాన్‌తో అంత ఈజీ కాదు.. కోహ్లి ఫామ్‌లోకి వస్తాడా?
టీ20 వరల్డ్‌కప్-2024 సూపర్-8లో తమ తొలి పోరుకు టీమిండియా సిద్దమైంది. సూపర్-8లో భాగంగా గురువారం బార్బోడస్ వేదికగా అఫ్గానిస్తాన్‌తో భారత్ తలపడనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచి సూపర్-8 రౌండ్‌ను విజయంతో ఆరంభించాలని రోహిత్ సేన భావిస్తోంది. ఇప్పటికే కరేబియన్ దీవులకు చేరుకున్న భారత జట్టు తీవ్రంగా శ్రమించింది.అఫ్గాన్‌తో అంత ఈజీ కాదు..అయితే అఫ్గానిస్తాన్‌తో మ్యాచ్ అంత ఈజీ కాదు. ఒకప్పుడు అఫ్గాన్ వేరు ఇప్పుడు అఫ్గాన్ వేరు. రషీద్ ఖాన్ నేతృత్వంలోని అఫ్గానిస్తాన్ సంచలనాలు సృష్టిస్తోంది. ఇప్పటికే ఈ మెగా టోర్నీలో న్యూజిలాండ్ వంటి పటిష్ట జట్టును మట్టికరిపించిన అఫ్గాన్.. భారత్, ఆస్ట్రేలియా వంటి వరల్డ్‌క్లాస్ జట్లకు సవాలు విసిరేందుకు సిద్దమైంది. అఫ్గాన్ గ్రూపు-స్టేజిలో ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో మూడింట విజయం సాధించి సూపర్-8లో అడుగుపెట్టింది. సూపర్-8 రౌండ్ గ్రూపు-1లో భారత్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్‌తో పాటు అఫ్గానిస్తాన్ చోటు దక్కించుకుంది. అఫ్గాన్ బలాలు, బలహీనతలు..అఫ్గానిస్తాన్ బ్యాటింగ్, బౌలింగ్ పరంగా పటిష్టంగా కన్పిస్తోంది. అయితే అఫ్గాన్ ప్రధాన బలం బౌలింగ్ అనే చెప్పాలి. అఫ్గాన్ జట్టులో అద్బుతమైన ఫాస్ట్ బౌలర్లు, స్పిన్నర్లు ఉన్నారు. ఈ మెగా టోర్నీలో గ్రూపు స్టేజిలో వెస్టిండీస్‌పై మినహా మిగితా మూడు మ్యాచ్‌ల్లోనూ అఫ్గాన్ బౌలర్లు సంచలన ప్రదర్శన కనబరిచారు.తొలి మ్యాచ్‌లో ఉగండాను కేవలం 58 పరుగులకే ఆలౌట్ చేసిన రషీద్ సేన.. అనంతరం వరల్డ్‌క్లాస్ కివీస్‌ను 75 పరుగులకే అఫ్గాన్ బౌలర్లు కుప్పకూల్చారు. ఆ తర్వాతి మ్యాచ్‌లో పపువా న్యూగినిను 95 పరుగులకే కట్టడి చేశారు.ముఖ్యంగా అఫ్గాన్ పేసర్ ఫజల్హక్ ఫరూఖీ తన కెరీర్లోనే సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. తన పేస్ బౌలింగ్‌తో ప్రత్యర్ధి బ్యాటర్లకు చుక్కలు చూపిస్తున్నాడు. ఇప్పటివరకు ఈ టోర్నీలో నాలుగు మ్యాచ్‌లు ఆడిన ఫరూఖీ 12 వికెట్లు పడగొట్టి లీడింగ్ వికెట్ టేకర్‌గా కొనసాగుతున్నాడు. అతడితో పాటు మరో పేసర్ నవీన్ ఉల్ హాక్ తన వంతు న్యాయం చేస్తున్నాడు. ఇక స్పిన్ విభాగంలో కెప్టెన్ రషీద్ ఖాన్‌తో పాటు ఆల్‌రౌండర్ మహ్మద్ నబీ సత్తాచాటుతున్నారు. అయితే స్టార్ స్పిన్నర్ ముజీబ్ ఉర్ రెహ్మన్ గాయం కారణంగా టోర్నీ మొత్తానికి దూరం కావడం అఫ్గాన్‌కు నిజంగా గట్టి ఎదురుదెబ్బ అనే చెప్పుకోవాలి. ముజీబ్ ఉర్ రెహ్మన్ స్ధానంలో నూర్ అహ్మద్ తుది జట్టులోకి వచ్చాడు. నూర్‌కు కూడా తన స్పిన్మయాజలంతో ప్రత్యర్ధి బ్యాటర్లను కట్టడిచేసే సత్తా ఉంది. ఇక బ్యాటింగ్‌లో ఓపెనర్లు గుర్బాజ్, ఇబ్రహీం జద్రాన్ సంచలన ఫామ్‌లో ఉన్నారు. వారు మరోసారి చెలరేగితే భారత బౌలర్లకు కష్టాలు తప్పవు. వీరిద్దరితో పాటు గుల్బాదిన్ నైబ్, అజ్మతుల్లా వంటి ఆల్‌రౌండర్లు సైతం బ్యాట్‌తో పర్వాలేదన్పిస్తున్నారు.అయితే అఫ్గాన్‌కు ఉన్న ఏకైక బలహీనత మిడిలార్డర్. అఫ్గాన్ బ్యాటింగ్ విభాగంలో మిడిలార్డర్ అంత పటిష్టంగా కన్పించడం లేదు. నజీబ్ జద్రాన్, కరీం జనత్, నబీ వంటి వారు తమ స్ధాయికి దగ్గ ప్రదర్శన చేయలేకపోతున్నారు. మరి సూపర్-8లోనైనా వీరు ముగ్గురూ తమ బ్యాట్‌కు పనిచెబుతారో లేదో వేచి చూడాలి. ఇక చివరగా అఫ్గానిస్తాన్‌ను తక్కువగా అంచనా వేస్తే భారత్ భారీ మూల్యం చెల్లుంచుకోక తప్పదు.కోహ్లి ఫామ్‌లోకి వస్తాడా?కాగా అఫ్గానిస్తాన్‌తో మ్యాచ్‌లో అందరి కళ్లు టీమిండియా స్టార్ విరాట్ కోహ్లిపైనే ఉన్నాయి. గ్రూపు స్టేజిలోకి దారుణమైన ప్రదర్శన కనబరిచిన కోహ్లి.. సూపర్-8లోనైనా సత్తాచాటాలని అభిమానులు కోరుకుంటున్నారు.గ్రూపు స్టేజిలో మూడు మ్యాచ్‌లు ఆడిన కోహ్లి కేవలం 5 పరుగులు మాత్రమే చేశాడు. గతంలో కూడా దాదాపు రెండేళ్ల పాటు ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడ్డ కింగ్ కోహ్లి.. ఆసియాకప్-2022లో అఫ్గానిస్తాన్పైనే తన రిథమ్‌ను తిరిగి పొందాడు. ఆ మ్యాచ్‌లో విరాట్ అద్బుతమైన సెంచరీతో చెలరేగాడు. దీంతో మళ్లీ అఫ్గాన్‌తో మ్యాచ్‌లో జరగనున్న నేపథ్యంలో విరాట్ నుంచి భారీ ఇన్నింగ్స్ కచ్చితంగా వస్తుందని కింగ్ ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. -
పిచ్ ఎలా ఉంది బుమ్రా?.. అయినా మాకిదే అలవాటే: రోహిత్
టీ20 ప్రపంచకప్-2024 సూపర్-8 మ్యాచ్‌లకు టీమిండియా పూర్తి స్థాయిలో సన్నద్ధమవుతోంది. అమెరికాలో లీగ్ దశ మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న రోహిత్ సేన.. ఇప్పటికే వెస్టిండీస్‌లో అడుగుపెట్టిన విషయం తెలిసిందే.ఇందులో భాగంగా సూపర్-8లో తమ తొలి మ్యాచ్‌లో గురువారం అఫ్గనిస్తాన్‌తో తలపడనుంది టీమిండియా. ఈ క్రమంలో కెప్టెన్ రోహిత్ శర్మ సహా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి, ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా తదితరులు ప్రాక్టీసులో తలమునకలయ్యారు.విండీస్ పిచ్‌లు స్పిన్నర్లకు కాస్త అనుకూలంగా ఉంటాయన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ కూడా నెట్స్‌లో చెమటోడుస్తున్నాడు.పిచ్ ఎలా ఉండబోతోంది?ఇదిలా ఉంటే.. టీమిండియా- అఫ్గనిస్తాన్‌కు మ్యాచ్‌కు వేదికైన బ్రిడ్జ్‌టౌన్(బార్బడోస్) పిచ్ ఎలా ఉండబోతున్నది ఆసక్తికరంగా మారింది. న్యూయార్క్‌లోని నసావూ వికెట్ బ్యాటర్లకు చుక్కలు చూపించిన విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో బ్రిడ్జ్‌టౌన్ పిచ్‌ను పరిశీలించిన రోహిత్ శర్మ కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘‘మా జట్టులోని ప్రతి ఒక్క ఆటగాడికి తమవైన ప్రత్యేక నైపుణ్యాలు ఉన్నాయి. వాటిని మరింత మెరుగుపరచుకునేందుకు స్కిల్ సెషన్స్‌ను ఉపయోగించుకుంటున్నాం.మాకిది అలవాటేతొలి మ్యాచ్ తర్వాత మూడు- నాలుగు రోజుల వ్యవధిలోనే మేము మళ్లీ రెండు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. విరామం లేని షెడ్యూల్ వల్ల కాస్త కష్టంగానే ఉంటుంది. అయితే, మాకిది అలవాటే.ప్రస్తుతం మా దృష్టి మొత్తం సమిష్టిగా ఎలా రాణించాలన్న అంశం మీదే ఉంది. ప్రతి ఒక్కరికి తమ పాత్ర ఏమిటో తెలుసు. అందరం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం’’ అని రోహిత్ శర్మ పేర్కొన్నాడు.పిచ్ ఎలా ఉంది బుమ్రాఈ సందర్భంగా తమ ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రాను ఉద్దేశించి.. ‘‘పిచ్ ఎలా ఉంది’’ అని రోహిత్ శర్మ ప్రశ్నించగా.. అతడు బాగానే ఉందంటూ బదులిచ్చాడు. కాగా సూపర్-8 మ్యాచ్‌ల వేదికలకు అనుగుణంగా టీమిండియా బౌలింగ్ విభాగంలో ఇద్దరు పేసర్లు, ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. ఇక అఫ్గన్ తర్వాత టీమిండియా శనివారం బంగ్లాదేశ్, సోమవారం ఆస్ట్రేలియాతో తలపడనుంది.చదవండి: పాకిస్తాన్‌ను వీడి.. ఇండియా హెడ్‌కోచ్‌గా వచ్చెయ్: భజ్జీ -
T20 World Cup 2024: సూపర్-8లో టీమిండియా ప్రత్యర్థులు వీరే..!
టీ20 వరల్డ్‌కప్ 2024లో గ్రూప్ స్టేజీ మ్యాచ్‌లు చివరి దశకు వచ్చాయి. ఈ దశలో మరో 11 మ్యాచ్‌లు జరగాల్సి ఉన్నా.. సూపర్-8కు చేరే జట్లపై ఓ అంచనా వచ్చేసింది. గ్రూప్-సి నుంచి ఆఫ్ఘనిస్తాన్, వెస్టిండీస్ సూపర్-8కు అర్హత సాధించగా.. ఉగాండ, పపువా న్యూ గినియా, న్యూజిలాండ్ టోర్నీ నుంచి నిష్క్రమించాయి. గ్రూప్-బి నుంచి ఆస్ట్రేలియా సూపర్-8 బెర్త్ ఖరారు చేసుకోగా.. నమీబియా, ఒమన్ జట్లు నిష్క్రమించాయి. ఈ గ్రూప్ నుంచి రెండో బెర్త్ కోసం స్కాట్లాండ్, ఇంగ్లండ్ మధ్య పోటీ నెలకొంది. గ్రూప్-డి విషయానికొస్తే.. ఈ గ్రూప్ నుంచి సౌతాఫ్రికా సూపర్-8కు క్వాలిఫై కాగా.. శ్రీలంక ఎలిమినేట్ అయ్యింది. ఈ గ్రూప్‌లో నేపాల్, నెదర్లాండ్స్ అధికారికంగా సూపర్-8 రేసులో ఉన్నప్పటికీ.. అనధికారికంగా బంగ్లాదేశ్ సూపర్-8 బెర్త్‌ను ఖరారు చేసుకుంది.గ్రూప్-ఏ విషయానికొస్తే.. ఈ గ్రూప్ నుంచి భారత్ సైపర్-8కు అర్హత సాధించగా.. అధికారికంగా మిగతా జట్లన్నీ సూపర్-8 రేసులో ఉన్నాయి. వీటిలో ఐర్లాండ్, కెనడా నామమాత్రంగా రేసులో ఉండగా.. ప్రధాన పోటీ యూఎస్ఏ, పాక్ మధ్యలోనే నెలకొంది. ఇవాళ (జూన్ 14) జరుగబోయే మ్యాచ్‌లో యూఎస్ఏ.. ఐర్లాండ్‌ను ఓడించినా లేక ఈ మ్యాచ్ రద్దైనా యూఎస్ఏ సూపర్-8కు చేరుకుంటుంది. పాక్ తదుపరి ఆడబోయే మ్యాచ్‌తో సంబంధం లేకుండానే టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది.సూపర్-8లో టీమిండియా ప్రత్యర్థులు వీరే..!సూపర్-8 బెర్త్‌లపై ఓ అంచనా వచ్చిన నేపథ్యంలో ఈ దశలో టీమిండియా ఆడబోయే మ్యాచ్‌లపై కూడా క్లారిటీ వచ్చింది. ఈ దశలో భారత్.. ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్/నెదర్లాండ్స్, ఆప్ట్రేలియా జట్లతో పోటీడనుంది. గ్రూప్-డి నుంచి సూపర్-8 బెర్త్ రేసులో నెదర్లాండ్స్ కంటే బంగ్లాదేశ్‌కే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి.జూన్ 20- భారత్ వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్జూన్ 22- భారత్ వర్సెస్ బంగ్లాదేశ్/నెదర్లాండ్స్ (గ్రూప్-డిలో రెండో స్థానంలో నిలిచే జట్టు)జూన్ 24- భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా -
చరిత్ర సృష్టించనున్న భారత కెప్టెన్.. తొలి ఇండియన్‌గా రికార్డు
గువాహటి: భారత ఫుట్‌బాల్ జట్టు ఇప్పుడు సొంతగడ్డపై అఫ్గానిస్తాన్‌తో పోరుకు సిద్ధమైంది. 2026 ప్రపంచకప్ ఆసియా క్వాలిఫయిర్స్లో భాగంగా సౌదీ అరేబియాలో జరిగిన అఫ్గానిస్తాన్ హోం మ్యాచ్ ఒక్క గోల్ నమోదు కాకుండానే ‘డ్రా’గా ముగిసింది. ఇప్పుడు సొంత ప్రేక్షకుల మధ్య మంగళవారం జరిగే పోరులో భారత్ గోల్సే లక్ష్యంగా బరిలోకి దిగనుంది. రాత్రి 7 గంటలకు మొదలయ్యే ఈ మ్యాచ్‌ను స్పోర్ట్స్ 18 చానెల్స్, జియో సినిమా యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. మరోవైపు భారత దిగ్గజం, కెప్టెన్ సునీల్ ఛెత్రికిది 150వ అంతర్జాతీయ మ్యాచ్ కానుంది. 2005లో అంతర్జాతీయ ఫుట్‌బాల్‌లో అరంగేట్రం చేసిన సునీల్ ఛెత్రి... 19 ఏళ్ల సుదీర్ఘ కెరీర్లో 93 గోల్స్ చేశాడు. భారత్ తరఫున 150 మ్యాచ్‌లు ఆడిన ఏకైక ఆటగాడు ఛెత్రినే కావడం విశేషం. ప్రపంచవ్యాప్తంగా కేవలం 40 మంది మాత్రమే 150 మ్యాచ్‌ల మైలురాయిని తాకారు. -
‘ఫీల్డర్ ఆఫ్ ది సిరీస్’ మెడల్ కోహ్లిదే.. రోహిత్ రియాక్షన్ వైరల్
టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి మేటి బ్యాటర్ మాత్రమే కాదు.. అద్భుతమైన ఫీల్డర్ కూడా! ఈ విషయాన్ని ఇప్పటికే ఎన్నోసార్లు నిరూపించిన ఈ రన్‌మెషీన్.. అఫ్గనిస్తాన్‌తో మూడో టీ20 సందర్భంగా.. మరోసారి అసాధారణ ఫీల్డింగ్ నైపుణ్యాలతో ఆకట్టుకున్నాడు. బెంగళూరు వేదికగా నువ్వా-నేనా అన్నట్లుగా టీమిండియాతో సాగిన మ్యాచ్‌లో అఫ్గనిస్తాన్ అసాధారణ పోరాటం చేసిన విషయం తెలిసిందే. రెండు సూపర్ ఓవర్ల తర్వాత గానీ జద్రాన్ బృందం రోహిత్ సేన ముందు తలవంచలేదు. ఆద్యంతం అత్యంత ఆసక్తి రేకెత్తించిన ఈ మ్యాచ్ నిజానికి సూపర్ ఓవర్ దాకా వచ్చేదే కాదు. టీమిండియా విధించిన 213 లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో అఫ్గన్ ఇన్నింగ్స్ పదిహేడో ఓవర్లో కోహ్లి ఓ అద్భుతం చేశాడు. వాషింగ్టన్ సుందర్ వేసిన బంతిని.. కరీం జనత్ లాంగాన్ దిశగా సిక్సర్‌గా మలిచేందుకు భారీ షాట్ ఆడాడు. అయితే.. అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న కోహ్లి గాల్లోకి ఎగిరి బంతిని ఒడిసిపట్టి.. బౌండరీ రోప్ దాటకుండా లోపలికి విసిరాడు. Excellent effort near the ropes! How's that for a save from Virat Kohli 👌👌 Follow the Match ▶️ https://t.co/oJkETwOHlL#TeamIndia | #INDvAFG | @imVkohli | @IDFCFIRSTBank pic.twitter.com/0AdFb1pnL4 — BCCI (@BCCI) January 17, 2024 అప్పటికి కరీం ఒక్క పరుగు మాత్రమే తీయగా.. కోహ్లి ఎఫర్ట్ వల్ల టీమిండియాకు ఐదు పరుగులు సేవ్ అయ్యాయి. అప్పటికి అఫ్గనిస్తాన్ స్కోరు 165-4. ఒకవేళ ఆ ఐదు పరుగులు వచ్చి అఫ్గన్‌కు వచ్చి ఉంటే మ్యాచ్ టై అయ్యేదీ కాదూ.. సూపర్ ఓవర్ల దాకా వచ్చేది కాదు! అలా కోహ్లి ప్రత్యర్థి జట్టును దెబ్బకొట్టాడన్న మాట!! ఈ నేపథ్యంలో టీమిండియా ఫీల్డింగ్ కోచ్ టి.దిలీప్ విరాట్ కోహ్లిపై ప్రశంసల జల్లు కురిపించాడు. యువ ఆటగాళ్లకు సవాల్ విసిరేలా.. మైదానంలో పాదరసంలా కదులుతున్న కోహ్లి.. అందరికీ స్ఫూర్తిదాయకమని కొనియాడాడు. ఈ క్రమంలో ‘ఫీల్డర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డు విజేతగా కోహ్లిని ప్రకటించిన దిలీప్.. అతడికి మెడల్ అందజేశాడు. ఆ సమయంలో డ్రెస్సింగ్ రూంలో ఉన్న టీమిండియా క్రికెటర్లంతా చప్పట్లతో కోహ్లిని అభినందించారు. ముఖ్యంగా కెప్టెన్ రోహిత్ శర్మ అమితానందం వ్యక్తం చేస్తూ సహచర ఆటగాడి నైపుణ్యాలను మెచ్చుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. కాగా అఫ్గనిస్తాన్‌తో టీ20 సిరీస్ ద్వారా అంతర్జాతీయ టీ20లలో రీఎంట్రీ ఇచ్చిన విరాట్ కోహ్లి.. వ్యక్తిగత కారణాలతో తొలి మ్యాచ్‌కు దూరమయ్యాడు. రెండో టీ20లో 16 బంతుల్లో 29 పరుగులు చేసిన అతడు.. బుధవారం నాటి మూడో మ్యాచ్‌లో మాత్రం గోల్డెన్ డకౌట్ అయ్యాడు. అయితే, ఫీల్డర్‌గా మాత్రం సూపర్ సక్సెస్ అయి టీమిండియా విజయంలో తన వంతు పాత్ర పోషించాడు. 𝗗𝗿𝗲𝘀𝘀𝗶𝗻𝗴 𝗥𝗼𝗼𝗺 𝗕𝗧𝗦 | 𝗙𝗶𝗲𝗹𝗱𝗲𝗿 𝗼𝗳 𝘁𝗵𝗲 𝗦𝗲𝗿𝗶𝗲𝘀 After a fantastic 3⃣-0⃣ win over Afghanistan, it's time to find out who won the much-awaited Fielder of the Series Medal 🏅😎 Check it out 🎥🔽 #TeamIndia | #INDvAFG | @IDFCFIRSTBank pic.twitter.com/N30kVdndzB — BCCI (@BCCI) January 18, 2024 చదవండి: #IndvsAus2021: మళ్లీ గోల్డెన్ డక్.. రీఎంట్రీ మర్చిపోవ్సాలిందే? -
కోహ్లి అలా చేయడు.. కానీ ఈసారి!.. సంజూ కూడా అంతే: రోహిత్ శర్మ
India vs Afghanistan, 3rd T20I- Rohit Comments On Kohli: అంతర్జాతీయ టీ20 పునరాగమనంలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి తమదైన ముద్ర వేయగలిగారు. అఫ్గనిస్తాన్‌తో తొలి రెండు మ్యాచ్‌లలో డకౌట్‌గా వెనుదిరిగిన రోహిత్.. ఆఖరి టీ20లో మాత్రం సంచలన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. సహచర ఆటగాళ్లంతా పెవిలియన్‌కు వరుస కట్టిన వేళ అజేయ శతకంతో రాణించాడు. తద్వారా అంతర్జాతీయ టీ20 కెరీర్లో అత్యధిక సెంచరీలు(5) బాదిన క్రికెటర్‌గా రోహిత్ శర్మ చరిత్రకెక్కాడు. మరోవైపు.. తొలి మ్యాచ్‌కు దూరంగా ఉన్న కోహ్లి.. రెండో మ్యాచ్ ద్వారా రీఎంట్రీ ఇచ్చి విలువైన ఇన్నింగ్స్ ఆడాడు. 🎥 That Record-Breaking Moment! 🙌 🙌@ImRo45 notches up his 5⃣th T20I hundred 👏 👏 Follow the Match ▶️ https://t.co/oJkETwOHlL#TeamIndia | #INDvAFG | @IDFCFIRSTBank pic.twitter.com/ITnWyHisYD — BCCI (@BCCI) January 17, 2024 విలువైన ఇన్నింగ్స్‌తో పదహారు బంతుల్లో 29 పరుగులు రాబట్టి జట్టు విజయంలో తన వంతు పాత్ర పోషించాడు. అయితే, బుధవారం నాటి మూడో టీ20లో మాత్రం తన శైలికి భిన్నంగా ఆది నుంచే దూకుడు ప్రదర్శించాలని యత్నించి విఫలమయ్యాడు. తాను ఎదుర్కొన్న తొలి బంతికే అవుటైన కోహ్లి.. తద్వారా తన ఇంటర్నేషనల్ టీ20 కెరీర్లో తొలిసారి గోల్డెన్ డకౌట్‌గా వెనుదిరిగాడు. సంజూ కూడా డకౌట్ మరోవైపు.. వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ కూడా రాకరాక వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేక కోహ్లి మాదిరే వచ్చీ రాగానే పెవిలియన్‌కు చేరాడు. ఈ నేపథ్యంలో కెప్టెన్ రోహిత్ శర్మ వీరిద్దరి ప్రదర్శన గురించి చేసిన వ్యాఖ్యలు అభిమానులను ఆకర్షిస్తున్నాయి. టీమిండియా- అఫ్గనిస్తాన్ టీ20 సిరీస్ బ్రాడ్‌కాస్టర్ జియో సినిమాతో మాట్లాడుతూ.. ‘‘ఏ స్థానంలో బ్యాటింగ్ చేయాలి.. వాళ్ల నుంచి మేము ఎలాంటి ప్రదర్శన ఆశిస్తున్నామన్న అంశాల గురించే జట్టులోని ఆటగాళ్లకు చెప్తాము. మైదానంలో దిగిన తర్వాత ఏం చేయాలో, ఎలా ఆడాలో వాళ్లకంటూ ఓ వ్యూహం ఉంటుంది. అలాగే వాళ్లు ఎలా ఆడాలని మేము కోరుకుంటున్నామో కూడా పూర్తి అవగాహనతో ఉంటారు. కోహ్లి అలా చేయడు.. కానీ ఈసారి మాత్రం ఈ మ్యాచ్‌లో కోహ్లి ఆరంభం నుంచే దూకుడుగా ఆడాలని ప్రయత్నించాడు. సాధారణంగా అతడు ఇలా చేయడు. అయితే, జట్టు కోసం ఏదైనా భిన్నంగా చేయాలనే తాపత్రయంతోనే కోహ్లి అలా ఆడాడు. శాంసన్ కూడా అంతే.. ఎదుర్కొన్న తొలి బంతికే షాట్‌కు యత్నించాడు. ఏదేమైనా వాళ్ల ఉద్దేశం మాత్రం సరైందే’’ అని రోహిత్ శర్మ.. విరాట్ కోహ్లి, సంజూ శాంసన్‌లను సమర్థించాడు. కాగా అఫ్గనిస్తాన్‌తో మూడో టీ20లో ఫరీద్ అహ్మద్ బౌలింగ్‌లో విరాట్ కోహ్లి, సంజూ శాంసన్ సున్నా పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద నిష్క్రమించారు. ఇదిలా ఉంటే.. స్వదేశంలో అఫ్గన్‌తో టీ20 సిరీస్‌ను టీమిండియా 3-0తో గెలుచుకున్న విషయం తెలిసిందే. చదవండి: IND vs AFG 3rd T20I Highlights: రోహిత్ సూపర్... భారత్ ‘డబుల్ సూపర్’... Rohit Sharma 🤝 Rinku Singh OuR’RR’ 😎 💪#TeamIndia | #INDvAFG | @IDFCFIRSTBank | @ImRo45 | @rinkusingh235 pic.twitter.com/SfKSl07JoE — BCCI (@BCCI) January 17, 2024 -
సూపర్ ఓవర్ అంటే చాలు హిట్‌మ్యాన్‌కు పూనకం వస్తుంది..!
సూపర్ ఓవర్ అంటే చాలు టీమిండియా సారధి రోహిత్ శర్మకు పూనకం వస్తుంది. అంతర్జాతీయ టీ20ల్లో ఇప్పటివరకు మూడు సూపర్ ఓవర్లు ఆడిన హిట్ మ్యాన్ ఈ సందర్భం వచ్చిన ప్రతిసారి సూపర్ మ్యాన్‌లా రెచ్చిపోయాడు. నిన్న ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన మూడో టీ20లో రెండు సూపర్ ఓవర్లలో విధ్వంసం సృష్టించిన (4 బంతుల్లో 2 సిక్సర్ల సాయంతో 13, 3 బంతుల్లో సిక్స్, ఫోర్ సాయంతో 11) రోహిత్.. 2018లో న్యూజిలాండ్‌తో జరిగిన సూపర్ ఓవర్లో 4 బంతుల్లో 15 పరుగులు చేసి టీమిండియాను గెలిపించాడు. ఈ మూడు సందర్భాల్లో రోహిత్ ఆటతీరును చూసిన వారు సూపర్ ఓవర్లో హిట్‌మ్యాన్ కాస్త సూపర్ మ్యాన్ అయిపోతాడంటూ కామెంట్లు చేస్తున్నారు. మ్యాచ్ విషయానికొస్తే.. నిన్నటి మ్యాచ్‌లో రోహిత్ సూపర్ ఓవర్లోనే కాకుండా అంతకుమందు కూడా విశ్వరూపం ప్రదర్శించాడు. ఈ సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌ల్లో డకౌట్ అయిన రోహిత్.. ఈ మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. తొలుత ఆచితూచి ఆడిన హిట్‌మ్యాన్ ఆతర్వాత పూనకం వచ్చినట్లు ఊగిపోయి, కెరీర్లో ఐదో టీ20 శతకం బాదాడు. రోహిత్‌తో పాటు రింకూ సింగ్ కూడా రెచ్చిపోవడంతో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 212 పరుగులు చేసింది. అనంతరం ఛేదనలో ఆఫ్ఘనిస్తాన్ కూడా అంతే స్కోర్ చేయడంతో మ్యాచ్ టై అయ్యి సూపర్ ఓవర్‌కు దారి తీసింది. సూపర్ ఓవర్లో సైతం మరోసారి స్కోర్లు సమం కావడంతో రెండో సూపర్ ఓవర్ అనివార్యమైంది. ఈ సూపర్ ఓవర్లో భారత్ ఎట్టకేలకు విజయం సాధించింది. -
టాప్-10లోకి దూసుకొచ్చిన జైస్వాల్, అక్షర్ పటేల్
ఐసీసీ తాజాగా (భారత్-ఆఫ్ఘనిస్తాన్ మూడో టీ20 అనంతరం) విడుదల చేసిన టీ20 ర్యాంకింగ్స్‌లో టీమిండియా ఆటగాళ్లు సత్తా చాటారు. బ్యాటింగ్‌లో యశస్వి జైస్వాల్, బౌలింగ్‌లో అక్షర్ పటేల్ టాప్-10లోకి దూసుకొచ్చారు. ఆఫ్ఘనిస్తాన్‌తో రెండో టీ20లో మెరుపు ఇన్నింగ్స్‌తో విజృంభించిన యశస్వి.. ఏడు స్థానాలు మెరుగుపర్చుకుని ఆరో స్థానానికి ఎగబాకగా.. ఇదే సిరీస్‌లో విశేషంగా రాణించిన అక్షర్ పటేల్ ఏకంగా 12 స్థానాలు ఎగబాకి ఐదో ప్లేస్‌కు చేరుకున్నాడు. ఆఫ్ఘనిస్తాన్ సిరీస్‌లో ఆడనప్పటికీ సూర్యకుమార్ యాదవ్ టాప్ ప్లేస్‌ను కాపాడుకోగా.. ఆఫ్ఘన్ సిరీస్‌కు దూరమైన రుతురాజ్ ఓ స్థానం కోల్పోయి తొమ్మిదో ప్లేస్‌కు పడిపోయాడు. ఈ జాబితాలో ఫిలప్ సాల్ట్, మొహమ్మద్ రిజ్వాన్, బాబర్ ఆజమ్, ఎయిడెన్ మార్క్రమ్ రెండు నుంచి ఐదు స్థానాల్లో ఉన్నారు. బౌలింగ్ విషయానికొస్తే.. ర్యాంకింగ్స్‌లో అక్షర్ పటేల్ ఎఫెక్ట్ సహచర బౌలర్ రవి భిష్ణోయ్పై పడింది. తాజా ర్యాంకింగ్స్‌లో బిష్ణోయ్ ఏకంగా నాలుగు స్థానాలు దిగజారి ఆరో ప్లేస్‌కు పడిపోయాడు. జింబాబ్వే సిరీస్‌లో రాణించిన లంక బౌలర్లు హసరంగ, తీక్షణ ఒకటి, రెండు స్థానాలు మెరుగుపర్చుకుని సంయుక్తంగా మూడో స్థానానికి ఎగబాకారు. ఆదిల్ రషీద్ అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. అకీల్ హొసేన్ ఓ స్థానం మెరుగుపర్చుకుని రెండో ప్లేస్‌కు చేరాడు. ఇదిలా ఉంటే, ఆఫ్ఘనిస్తాన్‌తో నిన్న ముగిసిన టీ20 సిరీస్‌ను టీమిండియా 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది. రసవత్తరంగా సాగిన నిన్నటి సమరంలో భారత్ రెండో సూపర్ ఓవర్లో విజయం సాధించింది. తొలుత రోహిత్ శర్మ మెరుపు శతకంతో విరుచుకుపడటంతో భారత్ 212 పరుగులు చేయగా.. ఛేదనలో ఆఫ్ఘనిస్తాన్ కూడా అంతే స్కోర్ చేసింది. దీంతో మ్యాచ్ టై అయ్యి సూపర్ ఓవర్‌కు దారి తీసింది. సూపర్ ఓవర్లో సైతం మరోసారి స్కోర్లు సమం కావడంతో రెండో సూపర్ ఓవర్ అనివార్యమైంది. ఈ సూపర్ ఓవర్లో భారత్ ఎట్టకేలకు విజయం సాధించింది. -
అఫ్గన్ బౌలింగ్‌ను చీల్చి చెండాడిన రోహిత్, రింకూ.. ఆల్‌టైమ్ రికార్డు
అఫ్గనిస్తాన్‌తో మూడో టీ20లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, నయా ఫినిషర్ రింకూ సింగ్ అద్భుతమైన ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నారు. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఇద్దరూ కలిసి పరుగుల వరద పారించారు. పవర్ ప్లేలో 30 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి జట్టులో కష్టాల్లో కూరుకుపోయిన వేళ.. రోహిత్ శర్మ, రింకూ సింగ్ పట్టుదలగా నిలబడ్డారు. ఆకాశమే హద్దుగా చెలరేగుతూ అఫ్గన్ ఆటగాళ్ల బౌలింగ్‌ను చీల్చి చెండాడారు. మొత్తంగా.. 69 బంతుల్లో.. 11 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో 121 పరుగులు బాదిన రోహిత్ హిట్‌మ్యాన్ అనే బిరుదును సార్థకం చేసుకున్నాడు. మరో ఎండ్ నుంచి కెప్టెన్ రోహిత్‌కు అన్ని విధాలా అండగా నిలిచిన రింకూ సైతం బ్యాట్ ఝులిపించాడు. ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన ఈ యూపీ కుర్రాడు.. 39 బంతుల్లో 69 పరుగులు చేసి విధ్వంసం సృష్టించాడు. రింకూ ఇన్నింగ్స్‌లో 2 ఫోర్లు, 6 సిక్స్‌లు ఉండటం విశేషం. ఇక రోహిత్- రింకూ పటిష్ట భాగస్వామ్యం కారణంగా టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 212 పరుగులు చేసింది.మరి ఈ మ్యాచ్ సందర్భంగా.. రోహిత్ శర్మ- రింకూ సింగ్ నమోదు చేసిన రికార్డులు గమనిద్దాం! Rohit Sharma 🤝 Rinku Singh OuR’RR’ 😎 💪#TeamIndia | #INDvAFG | @IDFCFIRSTBank | @ImRo45 | @rinkusingh235 pic.twitter.com/SfKSl07JoE — BCCI (@BCCI) January 17, 2024 అంతర్జాతీయ టీ20లలో ఏ వికెట్‌కైనా అత్యధిక భాగస్వామ్యం నమోదు చేసింది వీళ్లే ►రోహిత్ శర్మ- రింకూ సింగ్- అఫ్గనిస్తాన్ మీద- 190 నాటౌట్- 2024లో ►సంజూ శాంసన్- దీపక్ హుడా- ఐర్లాండ్ మీద- 176 రన్స్- 2022లో ►రోహిత్ శర్మ- కేఎల్ రాహుల్- శ్రీలంక మీద- 165 రన్స్- 2017లో ►యశస్వి జైశ్వాల్- శుబ్‌మన్ గిల్- వెస్టిండీస్ మీద- 165 రన్స్- 2023లో. అంతర్జాతీయ టీ20లలో ఒక ఓవర్లో అత్యధిక పరుగులు సాధించిన క్రికెటర్లు ►36- స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్‌లో యువరాజ్ సింగ్-డర్బన్- 2007లో ►36- అకిల ధనంజయ బౌలింగ్‌లో- కీరన్ పొలార్డ్- కూలిడ్జ్- 2021లో ►36- కరీం జనత్ బౌలింగ్‌లో- రోహిత్ శర్మ, రింకూ సింగ్- బెంగళూరుల- 2024లో. చదవండి: రోహిత్ విధ్వంసకర ఇన్నింగ్స్.. దెబ్బకు రికార్డులన్నీ బద్దలు! ఇది కదా ఊచకోత -
రోహిత్ విధ్వంసకర ఇన్నింగ్స్.. దెబ్బకు రికార్డులన్నీ బద్దలు! ఇది కదా ఊచకోత
#RohitSharma Comeback- Hitman 5th T20I Century: అఫ్గనిస్తాన్ మూడో టీ20 సందర్భంగా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ వింటేజ్ హిట్‌మ్యాన్‌ను గుర్తు చేశాడు. తొలి రెండు మ్యాచ్‌లలో డకౌట్ అయిన ఈ ఓపెనింగ్ బ్యాటర్.. ఆ వైఫల్యాలను మరిపించేలా ఆకాశమే హద్దుగా చెలరేగాడు. అఫ్గన్ బౌలర్ల ధాటికి సహచరులంతా పెవిలియన్‌కు క్యూ కట్టిన వేళ తానున్నానంటూ భరోసా ఇచ్చాడు. కాగా బెంగళూరులో టాస్ గెలిచిన తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా.. పవర్ ప్లేలోనే యశస్వి జైస్వాల్(4), విరాట్ కోహ్లి(0), శివం దూబే(1), సంజూ శాంసన్(0) రూపంలో టీమిండియా కీలక వికెట్లు కోల్పోయింది. రోహిత్‌కు తోడై దంచికొట్టిన రింకూ అప్పటికి జట్టుకు స్కోరు 30 పరుగులు మాత్రమే! అలాంటి సమయంలో ఆచితూచి ఆడుతూనే.. ఏదేమైనా తగ్గేదేలే అన్నట్లు రోహిత్ శర్మ ప్రత్యర్థి జట్టు బౌలర్లపై అటాకింగ్ మొదలుపెట్టాడు. అగ్నికి ఆజ్యంలా రోహిత్‌కు తోడైన యంగ్ బ్యాటర్ రింకూ సింగ్(69 నాటౌట్) కూడా ధనాధన్ బ్యాటింగ్‌తో అఫ్గన్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఈ క్రమంలో సెంచరీ పూర్తి చేసుకున్నా రోహిత్ శర్మ పరుగుల దాహం తీరలేదు. 11 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో పరుగుల సునామీ సృష్టించి ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు. మొత్తంగా 69 బంతుల్లో 121 పరుగులు సాధించాడు. 2019 తర్వాత పొట్టి ఫార్మాట్లో తన తొలి శతకం నమెదు చేశాడు. అంతేకాదు అంతర్జాతీయ టీ20లలో రోహిత్‌కు ఇదే అత్యధిక స్కోరు కావడం విశేషం. Rohit Sharma 🤝 Rinku Singh OuR’RR’ 😎 💪#TeamIndia | #INDvAFG | @IDFCFIRSTBank | @ImRo45 | @rinkusingh235 pic.twitter.com/SfKSl07JoE — BCCI (@BCCI) January 17, 2024 అదే విధంగా.. రోహిత్ శర్మకు అంతర్జాతీయ టీ20లలో ఇది ఐదవ సెంచరీ కావడం గమనార్హం. తద్వారా ప్రపంచంలో ఈ ఘనత సాధించిన ఏకైక బ్యాటర్‌గా హిట్‌మ్యాన్ చరిత్ర సృష్టించాడు. అంతర్జాతీయ టీ20లలో అత్యధిక సెంచరీలు బాదిన క్రికెటర్లు 1.రోహిత్ శర్మ(ఇండియా)- 5 2.సూర్యకుమార్ యాదవ్(ఇండియా)- 4 3.గ్లెన్ మాక్స్వెల్(ఆస్ట్రేలియా)- 4. 🎥 That Record-Breaking Moment! 🙌 🙌@ImRo45 notches up his 5⃣th T20I hundred 👏 👏 Follow the Match ▶️ https://t.co/oJkETwOHlL#TeamIndia | #INDvAFG | @IDFCFIRSTBank pic.twitter.com/ITnWyHisYD — BCCI (@BCCI) January 17, 2024 కోహ్లి ఆల్‌టైమ్ రికార్డు బ్రేక్ అంతర్జాతీయ టీ20లలో అత్యధిక పరుగులు సాధించిన టీమిండియా కెప్టెన్‌గా రోహిత్ శర్మ(1643 పరుగులు) అవతరించాడు. తద్వారా విరాట్ కోహ్లి పేరిట(1570 రన్స్) ఉన్న ఆల్‌టైమ్ రికార్డు బద్దలు కొట్టాడు. చదవండి: Ind vs Afg T20I: గోల్డెన్ డక్‌గా వెనుదిరిగిన కోహ్లి.. కెరీర్లో ఇదే తొలిసారి -
T20I: గోల్డెన్ డక్‌గా వెనుదిరిగిన కోహ్లి.. కెరీర్లో ఇదే తొలిసారి
Ind vs Afg- Virat Kohli Golden Duck: అఫ్గనిస్తాన్‌తో మూడో టీ20లో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి పూర్తిగా నిరాశపరిచాడు. తాను ఎదుర్కొన్న తొలి బంతికే అవుటై పెవిలియన్ చేరాడు. కాగా టీ20 ప్రపంచకప్-2024కు ముందు టీమిండియా ఆఖరిగా ఆడుతున్న ఈ సిరీస్‌తోనే కోహ్లి అంతర్జాతీయ టీ20లలో పునరాగమనం చేశాడు. వ్యక్తిగత కారణాలతో తొలి మ్యాచ్‌కు దూరమైన ఈ రన్‌మెషీన్.. ఇండోర్‌లో ఆదివారం జరిగిన రెండో మ్యాచ్‌తో రీఎంట్రీ ఇచ్చాడు. మొత్తంగా 16 బంతుల్లో 29 పరుగులతో రాణించాడు. అయితే, బెంగళూరులో జరుగుతున్న మూడో టీ20లో మాత్రం పూర్తిగా విఫలమయ్యాడు. ఓపెనర్ యశస్వి జైస్వాల్(4) స్థానంలో క్రీజులోకి వచ్చిన కోహ్లి.. గోల్డెన్ డకౌట్‌గా వెనుదిరిగాడు. తొలిసారిగా గోల్డెన్ డక్ అఫ్గన్ పేసర్ ఫరీద్ అహ్మద్ బౌలింగ్‌లో.. టీమిండియా ఇన్నింగ్స్ మూడో ఓవర్ నాలుగో బంతికి.. పుల్ షాట్ ఆడేందుకు ప్రయత్నించిన కోహ్లి విఫలమయ్యాడు. ఈ క్రమంలో మిడాఫ్‌లో ఫీల్డింగ్ చేస్తున్న ఇబ్రహీం జద్రాన్‌కు క్యాచ్ ఇచ్చి పరుగుల ఖాతా తెరకుండానే నిష్క్రమించాడు. తద్వారా తన అంతర్జాతీయ టీ20 కెరీర్లో తొలిసారిగా గోల్డెన్ డక్ నమోదు చేశాడు కోహ్లి. అది కూడా ఐపీఎల్లో తన సొంతమైదానం అయిన చిన్నస్వామి స్టేడియంలో ఈ చెత్త రికార్డు మూటగట్టుకోవడం గమనార్హం. స్టేడియం మొత్తం గప్‌చుప్ దీంతో.. కోహ్లి బ్యాటింగ్ మెరుపులు చూడాలని ఆశపడ్డ అభిమానులకు నిరాశే మిగిలింది. విరాట్ కోహ్లి అవుట్ కాగానే స్టేడియం మొత్తం నిశ్శబ్దంగా మారిపోయింది. -
Ind vs Afg: ఉత్కంఠ పోరులో అఫ్గన్‌పై భారత్ విజయం.. సిరీస్ కైవసం
India vs Afghanistan 3rd T20I- Updates: అఫ్గన్‌పై భారత్ విజయం సాధించింది. దాంతో సిరీస్‌ను టీమిండియా కైవసం చేసుకుంది. రెండో సూపర్ ఓవర్లో తేలిన మ్యాచ్ ఫలితం. తొలి సూపర్ ఓవర్లో 16 పరుగులు చేసిన ఇరు జట్లు రెండో సూపర్ ఓవర్లో ఉత్కంఠ పోరులో టీమిండియా గెలుపొందింది. స్కోర్లు IND 212/4 (20), AFG 212/6 (20) మొదటి సూపర్ ఓవర్లో కూడా మ్యాచ్ టై అయింది. అఫ్గన్ ఆరు వికెట్లు కోల్పోయిన తరువాత మ్యాచ్ టై అయింది (సూపర్ ఓవర్ ప్రోగ్రెస్‌లో ఉంది) 16.2: నాలుగో వికెట్ కోల్పోయిన అఫ్గన్ సుందర్ బౌలింగ్‌లో నబీ అవుట్.. స్కోరు 164/4 (16.3) ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీసిన వాషింగ్టన్ సుందర్ 12.4: అజ్మతుల్లా అవుట్.. మూడో వికెట్ కోల్పోయిన అఫ్గనిస్తాన్ 12.4: సుందర్ బౌలింగ్‌లో జద్రాన్ స్టంపౌట్. 10.6: తొలి వికెట్ కోల్పోయిన అఫ్గన్ కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో గుర్బాజ్ అవుట్. వాషింగ్టన్ సుందర్‌కు క్యాచ్ ఇచ్చి 50 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద నిష్క్రమించాడు. స్కోరు: 93-1(11 ఓవర్లలో). పవర్ ప్లేలో అఫ్గనిస్తాన్ స్కోరు: 51/0 (6) ►నిలకడగా ఆడుతున్న అఫ్గన్ ఓపెనర్లు.. ఇబ్రహీం జద్రాన్ 28, రహ్మనుల్లా గుర్బాజ్ 21 పరుగులతో క్రీజులో ఉన్నారు. శతక్కొట్టిన రోహిత్.. రింకూ సింగ్ ధనాధన్ ఇన్నింగ్స్ బెంగళూరు వేదికగా అఫ్గనిస్తాన్‌తో మూడో టీ20లో టాస్ గెలిచిన టీమిండియా తొలుత బ్యాటింగ్ చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ సునామీ ఇన్నింగ్స్‌కు తోడు రింకూ సింగ్ ధనాధన్ బ్యాటింగ్ కారణంగా భారీ స్కోరు చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో కేవలం నాలుగు వికెట్లు నష్టపోయి 212 పరుగులు సాధించింది. రోహిత్ శర్మ 69 బంతుల్లో 121 పరుగులతో చెలరేగగా.. రింకూ 39 బంతుల్లో 69 పరుగులతో ఆకట్టుకున్నాడు. ఈ మ్యాచ్ సందర్భంగా రోహిత్ తన అంతర్జాతీయ టీ20 కెరీర్లో ఏకంగా ఐదో సెంచరీ సాధించాడు. ఈ ఘనత సాధించిన ఏకైక బ్యాటర్‌గా నిలిచాడు. అదే విధంగా పొట్టి ఫార్మాట్లో తన అత్యధిక స్కోరు నమోదు చేసి దటీజ్ హిట్‌మ్యాన్ అనిపించుకున్నాడు. 🎥 That Record-Breaking Moment! 🙌 🙌@ImRo45 notches up his 5⃣th T20I hundred 👏 👏 Follow the Match ▶️ https://t.co/oJkETwOHlL#TeamIndia | #INDvAFG | @IDFCFIRSTBank pic.twitter.com/ITnWyHisYD — BCCI (@BCCI) January 17, 2024 18.6: రింకూ సింగ్ హాఫ్ సెంచరీ రోహిత్ 104, రింకూ 51 పరుగులతో క్రీజులో ఉన్నారు. 18.4: శతక్కొట్టిన రోహిత్ శర్మ అంతర్జాతీయ టీ20లలో 5 శతకాలు బాదిన ఏకైక క్రికెటర్‌గా చరిత్ర. దటీజ్ హిట్‌మ్యాన్ అంటూ ప్రశంసల జల్లు దంచి కొడుతున్న రోహిత్, రింకూ.. టీమిండియా స్కోరు: 144/4 (17) రోహిత్ 57 బంతుల్లో 80, రింకూ సింగ్ 32 బంతుల్లో 42 పరుగులతో క్రీజులో ఉన్నారు. నిలకడగా ఆడుతున్న రోహిత్, రింకూ సింగ్ 16 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా స్కోరు: 131/4 100 పరుగుల భాగస్వామ్యం 15.3: సలీం సఫీ నోబాల్.. రోహిత్ శర్మ, రింకూ సింగ్ వంద పరుగుల భాగస్వామ్యం పూర్తి చేసుకున్నారు. 12.6: రోహిత్ శర్మ హాఫ్ సెంచరీ అఫ్గన్‌తో తొలి రెండు మ్యాచ్‌లలో డకౌట్ అయిన రోహిత్ శర్మ.. మూడో టీ20 అర్ధ శతకంతో మెరిశాడు. 13 ఓవర్లలో టీమిండియా స్కోరు: 97-4. రింకూ 30 పరుగులతో రోహిత్‌కు తోడుగా ఉన్నాడు. నిలకడగా రోహిత్.. స్పీడు పెంచిన రింకూ 12: వరుసగా రెండు సిక్సర్లు బాదిన రోహిత్ శర్మ . 12 వ ఓవర్ ముగిసే సరికి రోహిత్ 41, రింకూ 23 పరుగులతో క్రీజులో ఉన్నారు. 10 ఓవర్లలో టీమిండియా స్కోరు- 61/4 రోహిత్ 27, రింకూ 19 పరుగులతో ఉన్నారు. వీరిద్దరు నిలకడగా ఆడుతూ మెరుగైన భాగస్వామ్యం నమోదు చేసే దిశగా వెళ్తున్నారు. ఎనిమిది ఓవర్లలో టీమిండియా స్కోరు: 48-4 పవర్ ప్లేలో టీమిండియా స్కోరు: 30-4 రోహిత్ 13, రింకూ 2 పరుగులతో క్రీజులో ఉన్నారు. సంజూ శాంసన్ డకౌట్ 4.3: ఫరీద్ అహ్మద్ బౌలింగ్‌లో డకౌట్‌గా వెనుదిరిగిన సంజూ. రాకరాక వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయిన వికెట్ కీపర్ బ్యాటర్. సంజూ స్థానంలో రింకూ సింగ్ క్రీజులోకి వచ్చాడు. రోహిత్ 8 పరుగులతో ఆడుతున్నాడు. స్కోరు: 22-4 (5 ఓవర్లు) దూబే అవుట్.. మూడో వికెట్ డౌన్ 3.6: అజ్మతుల్లా బౌలింగ్‌లో శివం దూబే వికెట్ కీపర్ క్యాచ్‌గా అవుటయ్యాడు. గత రెండు మ్యాచ్‌లలో వరుసగా అర్ధ శతకాలు బాదిన ఈ ఆల్‌రౌండర్.. బెంగళూరులో ఒక్క పరుగుకే పరిమితమయ్యాడు. దూబే స్థానంలో సంజూ శాంసన్ క్రీజులోకి వచ్చాడు. స్కోరు: 21-3(4) కోహ్లి డకౌట్.. టీమిండియా స్కోరు 19-2(3) 2.4: ఫరీద్ అహ్మద్ బౌలింగ్‌లో కోహ్లి గోల్డెన్ డకౌట్‌గా వెనుదిరిగాడు. అంతర్జాతీయ టీ20 కెరీర్లో కోహ్లి ఇలా ఎదుర్కొన్న తొలి బంతికే అవుట్ కావడం ఇదే తొలిసారి. కాగా ఇబ్రహీం జద్రాన్‌కు క్యాచ్ ఇచ్చి పరుగుల ఖాతా తెరవకుండానే నిష్క్రమించాడు. అతడి స్థానంలో శివం దూబే క్రీజులోకి వచ్చాడు. రోహిత్ నాలుగు పరుగులతో ఆడుతున్నాడు. తొలి వికెట్ కోల్పోయిన టీమిండియా 2.3: యశస్వి జైస్వాల్(4) రూపంలో టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. ఫరీద్ అహ్మద్ బౌలింగ్‌లో నబీకి క్యాచ్ ఇచ్చి జైస్వాల్ పెవిలియన్ చేరగా.. విరాట్ కోహ్లి క్రీజులోకి వచ్చాడు. రెండు ఓవర్లలో టీమిండియా స్కోరు: 13-0 టీమిండియా ఇన్నింగ్స్ ఆరంభించిన యశస్వి, రోహిత్ 1.3: ఎట్టకేలకు రీఎంట్రీలో.. ఈ సిరీస్‌లోనూ పరుగుల ఖాతా తెరిచిన రోహిత్. అజ్మతుల్లా బౌలింగ్‌లో సింగిల్ తీసిన హిట్‌మ్యాన్. సంజూకు ఛాన్స్ తొలి రెండు మ్యాచ్‌లలో మొదట బౌలింగ్ చేశాం కాబట్టి.. ఈసారి బ్యాటింగ్ ఎంచుకుంటున్నట్లు కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు.అదే విధంగా ఈ మ్యాచ్‌లో మూడు మార్పులతో బరిలోకి దిగనున్నట్లు హిట్‌మ్యాన్ వెల్లడించాడు. నామమాత్రపు మ్యాచ్ సందర్భంగా భిన్నమైన కాంబినేషన్లు ట్రై చేయాలని భావిస్తున్నట్లు తెలిపాడు. అందుకే.. అక్షర్ పటేల్, జితేశ్ శర్మ, అర్ష్‌దీప్ సింగ్‌ల స్థానంలో కుల్దీప్ యాదవ్, సంజూ శాంసన్, ఆవేశ్ ఖాన్లకు తుదిజట్టులో చోటిచ్చినట్లు రోహిత్ శర్మ వెల్లడించాడు. క్లీన్‌స్వీప్‌పై కన్ను కాగా టీ20 ప్రపంచకప్-2024కు ముందు భారత జట్టు ఆడుతున్న ఆఖరి టీ20 సిరీస్ ఇది. ఇందులో భాగంగా.. ఇప్పటికే రెండు మ్యాచ్‌లు గెలిచి సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకున్న రోహిత్ సేన... అఫ్గన్‌తో మూడో టీ20లోనూ గెలిచి క్లీన్‌స్వీప్‌తో సత్తా చాటాలని పట్టుదలగా ఉంది. మరోవైపు.. కనీసం ఒక్క మ్యాచ్ అయినా గెలిచి పరువు నిలుపుకోవాలని అఫ్గనిస్తాన్ భావిస్తోంది. ఇక ఈ మ్యాచ్ సందర్భంగా తాము కూడా తుదిజట్టులో మూడు మార్పులు చేసినట్లు అఫ్గనిస్తాన్ కెప్టెన్ ఇబ్రహీం జద్రాన్ తెలిపాడు. షరాఫుద్దీన్ అష్రఫ్, కైస్ అహ్మద్, మహ్మద్ సలీం సఫీ, ఫరీద్ అహ్మద్ మాలిక్‌లను ఆడించనున్నట్లు వెల్లడించాడు. తుదిజట్లు టీమిండియా యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ(కెప్టెన్), విరాట్ కోహ్లి, శివమ్ దూబే, సంజూ శాంసన్(వికెట్ కీపర్), రింకూ సింగ్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, ముకేశ్ కుమార్, కుల్దీప్ యాదవ్, ఆవేశ్ ఖాన్. అఫ్గనిస్తాన్ రహ్మనుల్లా గుర్బాజ్(వికెట్ కీపర్), ఇబ్రహీం జద్రాన్(కెప్టెన్), గుల్బదిన్ నైబ్, అజ్మతుల్లా ఒమర్జాయ్, మహ్మద్ నబీ, నజీబుల్లా జద్రాన్, కరీం జనత్, షరాఫుద్దీన్ అష్రఫ్, కైస్ అహ్మద్, మహ్మద్ సలీం సఫీ, ఫరీద్ అహ్మద్ మాలిక్. -
చరిత్రకు ఆరు పరుగుల దూరంలో కోహ్లి.. కొడితే!
Ind vs Afg 3rd T20- Virat Kohli On Cusp Of Becoming...: సమకాలీన క్రికెటర్లకు ఎవరికీ సాధ్యం కాని రీతిలో ఇప్పటికే ఎన్నెన్నో ఘనతలు సాధించాడు టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి. అఫ్గనిస్తాన్‌తో మూడో టీ20 సందర్భంగా ఈ రన్‌మెషీన్‌ను మరో అరుదైన రికార్డు ఊరిస్తోంది. రీఎంట్రీలో దూకుడుగా కాగా టీ20 ప్రపంచకప్-2022 తర్వాత దాదాపు పద్నాలుగు నెలల విరామం అనంతరం కోహ్లి అంతర్జాతీయ టీ20లలో పునరాగమనం చేశాడు. స్వదేశంలో అఫ్గనిస్తాన్‌తో సిరీస్‌కు అందుబాటులోకి వచ్చాడు. మొహాలీ వేదికగా తొలి టీ20తోనే బరిలోకి దిగాల్సి ఉండగా.. కూతురు వామిక పుట్టినరోజు(జనవరి 11) నేపథ్యంలో ఆ మ్యాచ్‌కు దూరంగా ఉండిపోయాడు. ఈ క్రమంలో ఇండోర్‌లో ఆదివారం నాటి రెండో టీ20 సందర్భంగా రంగంలోకి దిగిన విరాట్ కోహ్లి.. 16 బంతుల్లో 29 పరుగులతో ఆకట్టుకున్నాడు. క్రీజులో ఉన్నది కాసేపే అయినా దూకుడుగా ఆడుతూ అఫ్గన్ బౌలర్లపై విరుచుకుపడుతూ అభిమానులకు వినోదాన్ని పంచాడు. ఐపీఎల్ హోం గ్రౌంగ్లో సిక్స్‌తో ఆరంభిస్తే ఇక ఇప్పటికే ఈ సిరీస్‌ను టీమిండియా 2-0తో గెలుచుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బెంగళూరులో బుధవారం నాటి నామమాత్రపు మూడో టీ20కి ఇరు జట్లు సన్నద్ధమవుతున్నాయి. విరాట్ కోహ్లికి ఐపీఎల్లో హోం గ్రౌండ్ అయిన చిన్నస్వామి స్టేడియం ఇందుకు వేదిక. ఈ మ్యాచ్ సందర్భంగా విరాట్ కోహ్లి ఆరు పరుగులు సాధిస్తే.. టీ20 ఫార్మాట్లో 12 వేల పరుగుల మైలురాయిని అందుకుంటాడు. తద్వారా ఈ ఘనత సాధించిన మొట్టమొదటి భారత క్రికెటర్‌గా చరిత్ర సృష్టిస్తాడు. ఓవరాల్‌గా ఈ జాబితాలో క్రిస్ గేల్(14562), షోయబ్ మాలిక్(12993), కీరన్ పొలార్డ్(12430) తర్వాతి స్థానాల్లో నిలుస్తాడు. Indore ✈️ Bengaluru#TeamIndia in town for the 3⃣rd & final T20I 👏 👏#INDvAFG | @IDFCFIRSTBank pic.twitter.com/xKKRi6yf9W — BCCI (@BCCI) January 15, 2024 పొట్టి ఫార్మాట్లో అన్నీ కలిపి దేశవాళీ క్రికెట్లో ఢిల్లీ తరఫున సయ్యద్ ముస్తాక్ అలీ(టీ20) ట్రోఫీలో భాగమైన కోహ్లి.. ఐపీఎల్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు సహా టీమిండియాకు ఆడుతూ.. అన్నీ కలిపి పొట్టి ఫార్మాట్లో పదకొండు వేలకు పైగా పరుగులు సాధించాడు. ఇదిలా ఉంటే అంతర్జాతీయ స్థాయిలో టీ20లలో 4037 పరుగులు సాధించిన విరాట్ కోహ్లి నంబర్ వన్(అత్యధిక రన్స్) బ్యాటర్‌గా కొనసాగుతున్నాడు. అదే విధంగా.. ఐపీఎల్‌లోనూ 7263 రన్స్‌తో హయ్యస్ట్ రన్ స్కోరర్‌గా ఉన్నాడు. చదవండి: లక్ష్యం 110.. నరాలు తెగే ఉత్కంఠ! ఏకంగా 7 వికెట్లు కూల్చి.. -
హార్దిక్ తిరిగొచ్చినా వరల్డ్‌కప్‌లో ఆడేది అతడే: టీమిండియా దిగ్గజం
T20 WC 2024: టీమిండియా ఆల్‌రౌండర్ శివం దూబేపై భారత క్రికెట్ దిగ్గజం సునిల్ గావస్కర్ ప్రశంసలు కురిపించాడు. అద్భుత ప్రదర్శనలతో ఆకట్టుకుంటున్న ఈ ముంబై బ్యాటర్... టీ20 ప్రపంచకప్-2024 జట్టులో చోటు దక్కించుకోవడం ఖాయమని అంచనా వేశాడు. ఇలాగే ధనాధన్ ఇన్నింగ్స్‌తో చెలరేగితే సెలక్టర్లు అతడిని పక్కనపెట్టే సాహసం చేయలేరని పేర్కొన్నాడు. కాగా 2019లో బంగ్లాదేశ్ టూర్ సందర్భంగా అంతర్జాతీయ టీ20లలో అడుగుపెట్టాడు పేస్ ఆల్‌రౌండర్ శివం దూబే. ఢిల్లీ వేదికగా జరిగిన నాటి మ్యాచ్‌లో కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసి నిరాశపరిచాడు. అదే విధంగా ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. ఆ తర్వాత అడపాదడపా వచ్చిన అవకాశాలను కూడా సద్వినియోగం చేసుకోలేకపోయాడు. పాండ్యా గాయం.. దూబే పాలిట వరం! దీంతో బీసీసీఐ సెలక్టర్లు శివం దూబేను పక్కనపెట్టారు. అయితే, ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున గతేడాది సత్తా చాటిన దూబేను.. హార్దిక్ పాండ్యా గాయం రూపంలో అదృష్టం వరించింది. ప్రపంచకప్-2024కు ముందు స్వదేశంలో టీమిండియా అఫ్గనిస్తాన్‌తో ఆడుతున్న టీ20 సిరీస్‌కు పాండ్యా దూరమయ్యాడు. చీలమండ నొప్పి కారణంగా అందుబాటులో లేకుండా పోయాడు. ఈ క్రమంలో హార్దిక్ పాండ్యా స్థానంలో పేస్ ఆల్‌రౌండర్‌గా శివం దూబేకు అవకాశం వచ్చింది. అయితే, పునరాగమనంలో దూబే తప్పులను పునరావృతం చేయలేదు. వరుస హాఫ్ సెంచరీలు మొహాలీ వేదికగా తొలి టీ20లో ఒక వికెట్ తీయడంతో పాటు.. లక్ష్య ఛేదనలో దంచికొట్టాడు. కేవలం 40 బంతుల్లోనే 60 పరుగులు రాబట్టి ఆఖరి వరకు అజేయంగా నిలిచి జట్టును గెలుపుతీరాలకు చేర్చాడు. తద్వారా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. ఇక రెండో టీ20లోనూ ఆకాశమే హద్దుగా దూసుకుపోయిన శివం దూబే.. ఒక వికెట్ పడగొట్టడంతో పాటు.. 32 బంతుల్లోనే 63 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. మరోసారి జట్టును గెలిపించాడు. తద్వారా టీమిండియా 2-0తో సిరీస్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. సెలక్టర్లకు తలనొప్పి ఇక బుధవారం నాటి మూడో టీ20లోనూ సత్తా చాటి.. ఆపై ఐపీఎల్-2024లోనూ అద్భుతాలు చేస్తే దూబేకు తిరుగు ఉండదు. ఈ నేపథ్యంలో సునిల్ గావస్కర్ క్రిక్‌బజ్‌తో మాట్లాడుతూ.. ‘‘ఒకవేళ హార్దిక్ పాండ్యా ఫిట్‌గా లేకపోతే టీమిండియా పరిస్థితి ఏంటి? అని మనమంతా ఆందోళనకు గురయ్యాం. కానీ.. ఇప్పుడు హార్దిక్ పూర్తి ఫిట్‌గా ఉన్నా శివం దూబే అమెరికా ఫ్లైట్ ఎక్కడం ఖాయం. ఇలాగే తన ప్రదర్శనను కొనసాగిస్తే... అతడిని జట్టు నుంచి తప్పించాలన్న ఆలోచనే రాదు. హార్దిక్ తిరిగి వస్తే సెలక్టర్లకు పెద్ద తలనొప్పిగా మారుతుంది. గత రెండు మ్యాచ్‌లతో దూబే తన స్థాయిని పెంచుకున్నాడు. తనదైన శైలిలో ఆడుతూ విజయవంతమవుతున్నాడు. ఎవరినీ అనుకరించే ప్రయత్నం చేయడం లేదు. ప్రపంచకప్ జట్టులో చోటు దక్కించుకోవడానికి తానేం చేయాలో అంతా చేస్తున్నాడు’’ అని పేర్కొన్నాడు. కాగా జూన్ 4 నుంచి అమెరికా-వెస్టిండీస్ వేదికగా టీ20 ప్రపంచకప్-2024 ఆరంభం కానుంది. చదవండి: లక్ష్యం 110.. నరాలు తెగే ఉత్కంఠ! ఏకంగా 7 వికెట్లు కూల్చి.. -
రోహిత్, పంత్‌లను అధిగమించిన యశస్వి జైస్వాల్
టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఓ విషయంలో టీమిండియా స్టార్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, రిషబ్ పంత్‌లను అధిగమించాడు. ఆఫ్ఘనిస్తాన్‌తో రెండో టీ20 అనంతరం యశస్వి సాధించిన ఈ ఘనతకు సంబంధించిన విశేషాలు బయటికి వచ్చాయి. టీ20ల్లో 23 ఏళ్లు దాటక ముందే అత్యధిక హాఫ్ సెంచరీలు సాధించిన భారత బ్యాటర్‌గా యశస్వి రికార్డు నెలకొల్పాడు. ఈ క్రమంలో అతను టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ ఆటగాడు రిషబ్ పంత్, అప్ కమింగ్ ప్లేయర్ తిలక్ వర్మల పేరిట సంయుక్తంగా ఉన్న రికార్డును అధిగమించాడు. రోహిత్, పంత్, తిలక్ ముగ్గురూ 23 ఏళ్లు దాటకముందు రెండు హాఫ్ సెంచరీలు నమోదు చేయగా.. యశస్వి ఏకంగా నాలుగు హాఫ్ సెంచరీలు, ఓ సెంచరీ బాదాడు. 22 ఏళ్ల యశస్వి 16 టీ20ల్లోనే 163.83 స్ట్రయిక్‌రేట్‌తో 498 పరుగులు చేశాడు. Young and unstoppable! Yashasvi Jaiswal notches up five fifties in T20Is before turning 23, setting a new record for the most by an Indian player. pic.twitter.com/IFNTeB35iW— CricTracker (@Cricketracker) January 16, 2024 కాగా, ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన రెండో టీ20లో 34 బంతుల్లోనే 5 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 68 పరుగులు చేసిన యశస్వి టీమిండియా విజయంలో కీలకపాత్ర పోషించాడు. యశస్వితో పాటు శివమ్ దూబే (63 నాటౌట్) కూడా మెరుపులు మెరిపించడంతో ఈ మ్యాచ్‌లో భారత్ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్.. గుల్బదిన్ (57) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 172 పరుగులకు ఆలౌటైంది. అర్ష్‌దీప్ 3, అక్షర్, భిష్ణోయ్ తలో 2 వికెట్లు, శివమ్ దూబే ఓ వికెట్ పడగొట్టారు. ఛేదనలో దూబే, జైస్వాల్ భారత్ ఘన విజయం సాధించి, మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0తో కైవసం చేసుకుంది. నామమాత్రపు మూడో టీ20 బెంగళూరు వేదికగా జనవరి 17న జరుగనుంది. -
నాకు అప్పగించిన పని పూర్తి చేశా.. ఇక: శ్రేయస్ అయ్యర్
అఫ్గనిస్తాన్‌తో టీ20 సిరీస్ ఆడుతున్న టీమిండియాలో చోటు దక్కకపోవడంపై మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ స్పందించాడు. తన ఆధీనంలో లేని విషయాల గురించి పట్టించుకోనని.. తనకు ఇచ్చిన బాధ్యతను సక్రమంగా నిర్వర్తించడంపై మాత్రమే శ్రద్ధ పెడతానని తెలిపాడు. ప్రస్తుతం తను అదే పనిలో ఉన్నానని పేర్కొన్నాడు. యువ బ్యాటర్లకు అవకాశం సౌతాఫ్రికా పర్యటనలో స్థాయికి తగ్గట్లు రాణించలేక చతికిలపడ్డ శ్రేయస్ అయ్యర్‌ను అఫ్గన్‌తో స్వదేశంలో టీ20 సిరీస్‌కు ఎంపిక చేయలేదు బీసీసీఐ సెలక్టర్లు. శుబ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ, రింకూ సింగ్ వంటి యువ బ్యాటర్లకు అవకాశం ఇచ్చారు. అదే విధంగా.. స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా గైర్హాజరీలో శివం దూబేకు దాదాపు నాలుగేళ్ల తర్వాత పిలుపునిచ్చారు. వీళ్లంతా వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుని సిరీస్ 2-0తో గెలవడంలో తమ వంతు పాత్ర పోషించారు. టీ20 ప్రపంచకప్-2024 బెర్తులను ఖాయం చేసుకునే పనిలో పడ్డారు. ఇలా వీరంతా టీ20 సిరీస్‌తో బిజీగా ఉంటే.. శ్రేయస్ అయ్యర్‌కు మాత్రం దేశవాళీ క్రికెట్ ఆడాలనే ఆదేశాలు వెళ్లాయి. ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌నకు సన్నద్ధం కావాల్సిందిగా మేనేజ్మెంట్ సూచించింది. రంజీ ట్రోఫీ-2024 బరిలో అందుకు తగ్గట్లుగానే ముంబై తరఫున రంజీ ట్రోఫీ-2024 బరిలో దిగాడు. ఆంధ్రతో జరిగిన మ్యాచ్‌లో 48 పరుగులతో ఆకట్టుకున్న అయ్యర్.. 145కు పైగా ఓవర్లపాటు ఫీల్డింగ్ చేశాడు. ఇక ఈ మ్యాచ్‌లో ఆంధ్ర జట్టుపై ముంబై 10 వికెట్ల తేడాతో జయభేరి మోగించింది. ఈ నేపథ్యంలో విజయానంతరం శ్రేయస్ అయ్యర్ మాట్లాడుతూ.. "గతం గురించి ఆలోచించను. వర్తమానంలో జీవించాలనుకుంటున్నాను. నాకు ఏ పనినైతే అప్పగించారో అది విజయవంతంగా పూర్తి చేశాను. రంజీ ఆడమన్నారు. వచ్చాను.. ఆడాను.. నా ప్రణాళికలు అమలు చేశాను. కావాల్సినంత ప్రాక్టీస్ నా ప్రదర్శన పట్ల సంతోషంగా ఉన్నాను. కొన్ని విషయాలు మన ఆధీనంలో ఉండవు. అలాంటి వాటి గురించి ఆలోచించకపోవడమే మంచిది. ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్ సందర్భంగా బాల్ బాగా టర్న్ అయ్యే వికెట్లు అందుబాటులో ఉండటం సహజం. నాకు ఇది సానుకూలాంశం. ఏదేమైనా ఈ రంజీ మ్యాచ్ ద్వారా నాకు కావాల్సినంత ప్రాక్టీస్ లభించింది. మ్యాచ్ ఫిట్నెస్ సాధించాను. ఇంగ్లండ్‌తో మొదటి రెండు టెస్టుల్లో ఎలా ఆడాలన్నదాని గురించే ప్రస్తుతం ఆలోచిస్తున్నా. నా ధ్యాసంతా ఆ రెండు మ్యాచ్‌లపైనే ఉంది" అని పేర్కొన్నాడు. కాగా స్వదేశంలో ఇంగ్లండ్‌తో టీమిండియా ఐదు టెస్టుల సిరీస్ జనవరి 25 నుంచి ఆరంభం కానుంది. ఇందుకు సంబంధించి తొలి రెండు మ్యాచ్‌లకు బీసీసీఐ ప్రకటించిన జట్టులో శ్రేయస్ అయ్యర్‌కు చోటు దక్కింది. -
టీ20లలో కోహ్లి ప్రపంచ రికార్డు.. ఏకైక బ్యాటర్‌గా ఘనత
అంతర్జాతీయ టీ20 పునరాగమనం సందర్భంగా టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి సరికొత్త రికార్డు సాధించాడు. పొట్టి ఫార్మాట్లో ఇంత వరకు ఏ క్రికెటర్‌కూ సాధ్యం కాని ఫీట్ నమోదు చేశాడు. టీ20 ప్రపంచకప్-2022 తర్వాత కోహ్లి ఏడాదికి పైగా టీ20 జట్టుకు దూరంగా ఉన్నాడు. ఈ క్రమంలో... టీ20 వరల్డ్ కప్-2024కు ముందు టీమిండియా ఆడుతున్న ఆఖరి సిరీస్‌తో రీ ఎంట్రీ ఇచ్చాడు. అఫ్గనిస్తాన్‌తో స్వదేశంలో జరుగుతున్న రెండో టీ20 సందర్భంగా బరిలోకి దిగాడు. 16 బంతుల్లో 29 కాగా.. ఇండోర్ వేదికగా ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా తొలుత బౌలింగ్ చేసింది. పర్యాటక అఫ్గనిస్తాన్ జట్టును 172 పరుగులకు ఆలౌట్ చేసింది. లక్ష్య ఛేదనలో యశస్వి జైస్వాల్(68), శివం దూబే(63- నాటౌట్) దంచి కొట్టగా.. కోహ్లి సైతం దూకుడుగా ఆడాడు. కేవలం 16 బంతుల్లోనే నాలుగు ఫోర్ల సాయంతో 29 పరుగులు సాధించాడు. ప్రపంచంలో ఏకైక క్రికెటర్‌గా.. ఈ క్రమంలో ఇంటర్నేషనల్ టీ20 ఛేజింగ్ మ్యాచ్‌లలో 2000 పరుగుల మైలురాయిని అందుకున్నాడు కోహ్లి. తద్వారా ప్రపంచంలో ఈ అరుదైన ఘనత సాధించిన ఏకైక క్రికెటర్‌గా చరిత్రకెక్కాడు. ఇప్పటి వరకు పొట్టి ఫార్మాట్ ఛేజింగ్‌లో కోహ్లి 46 ఇన్నింగ్స్ ఆడి 136.96 స్ట్రైక్‌రేటుతో 2012 పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఇందులో 20 అర్ధ శతకాలు ఉన్నాయి. వన్డేల్లోనూ ఈ రికార్డుల రారాజే ఇక వన్డేల్లోనూ సెకండ్ బ్యాటింగ్‌లో ఈ రికార్డుల రారాజే అత్యధిక పరుగుల వీరుడిగా ఉన్నాడు. ఇప్పటివరకు ఛేజింగ్‌లో 152 ఇన్నింగ్స్ ఆడి 7794 రన్స్ పూర్తి చేసుకున్నాడు కోహ్లి. ఇందులో 27 సెంచరీలు, నలభై ఫిఫ్టీలు ఉన్నాయి. ఇదిలా ఉంటే.. అఫ్గనిస్తాన్‌తో రెండో మ్యాచ్‌లో టీమిండియా ఆరు వికెట్ల తేడాతో గెలుపొందింది. తద్వారా మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-0తో సొంతం చేసుకుంది. అన్నట్లు ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లి.. పేసర్ నవీన్ ఉల్ హక్కు వికెట్ సమర్పించుకోవడం గమనార్హం. -
ఈసారి తప్పు ముమ్మాటికీ రోహిత్‌దే.. చెత్త సెలక్షన్: మాజీ బ్యాటర్
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఆట తీరుపై భారత మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా విమర్శలు గుప్పించాడు. అఫ్గనిస్తాన్‌తో టీ20 సిరీస్‌లో హిట్‌మ్యాన్ నుంచి ఇలాంటి ప్రదర్శన ఊహించలేదన్నాడు. ముఖ్యంగా రెండో టీ20లో రోహిత్ వికెట్ పారేసుకున్న విధానం విస్మయపరిచిందని ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. రీఎంట్రీలో రనౌట్ సుమారు పద్నాలుగు నెలల విరామం తర్వాత రోహిత్ శర్మ అంతర్జాతీయ టీ20లలో పునరాగమనం చేసిన విషయం తెలిసిందే. సొంతగడ్డపై అఫ్గన్‌తో తొలి మ్యాచ్ ద్వారా రీఎంట్రీ ఇచ్చిన ఈ స్టార్ ఓపెనర్.. రనౌట్‌గా వెనుదిరిగి పూర్తిగా నిరాశపరిచాడు. ఇండోర్‌లో డకౌట్ మొహాలీ మ్యాచ్‌లో ఈ మేరకు.. శుబ్‌మన్ గిల్‌తో సమన్వయలోపం కారణంగా పరుగుల ఖాతా తెరవకుండానే నిష్క్రమించాడు రోహిత్. ఈ నేపథ్యంలో కనీసం రెండో టీ20లోనైనా హిట్‌మ్యాన్ మెరుపులు చూడాలని ఆశించిన వాళ్లకు మళ్లీ నిరాశే మిగిలింది. ఇండోర్‌లో ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో రోహిత్.. డకౌట్ అయ్యాడు. తప్పుడు షాట్ సెలక్షన్ అఫ్గన్ బౌలర్ ఫజల్హక్ ఫారూకీ సంధించిన బంతికి బౌల్డ్ అయ్యాడు. ఈ నేపథ్యంలో మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా రోహిత్ శర్మ బ్యాటింగ్‌ను విశ్లేషిస్తూ.. "రోహిత్ అవుటైన తీరు ఆశ్చర్యపరిచింది. తాను ఎదుర్కొన్న తొలి బంతికే ఇలాంటి షాట్ ఎందుకు ఆడాడో అర్థం కాలేదు. బంతి నేరుగా స్టంప్స్ ను హిట్ చేసింది. సాధారణంగా రోహిత్ అలాంటి షాట్లు ఆడడు. తొలి టీ20లో సున్నాకే రనౌట్ అయ్యాడు. అందులో అతడి తప్పేమీ లేదు. కానీ రెండో టీ20లో తప్పుడు షాట్ సెలక్షన్‌తో మూల్యం చెల్లించాడు. ఈసారి తప్పు ముమ్మాటికీ అతడిదే. ఆ రోహిత్ కావాలి రోహిత్ శర్మ టీ20 ఆట తీరు, సామర్థ్యాలపై ఎవరికీ ఎలాంటి సందేహాలు లేవు. కానీ అతడి నుంచి ఇలాంటి ప్రదర్శన ఎవరూ ఊహించరు. ఐపీఎల్ ద్వారానైనా రోహిత్ ఫామ్‌లోకి రావాలి. వన్డే వరల్డ్ కప్‌లో దంచికొట్టిన రోహిత్ శర్మ మనకి కావాలి" అని పేర్కొన్నాడు. ఏదేమైనా ఐపీఎల్-2024లో రోహిత్ బ్యాట్ ఝులిపిస్తేనే టీమిండియాకు వరల్డ్ కప్‌లో సానుకూలంగా ఉంటుందని ఆకాశ్ చోప్రా ఈ సందర్భంగా అభిప్రాయపడ్డాడు. కాగా.. అఫ్గనిస్తాన్‌తో రెండో టీ20లో రోహిత్ శర్మ విఫలం కాగా.. మరో ఓపెనర్ యశస్వి జైస్వాల్, పేస్ ఆల్‌రౌండర్ శివం దూబే ధనాధన్ ఇన్నింగ్స్ ఆడారు. వీరిద్దరి కారణంగా రెండో టీ20లో గెలిచిన టీమిండియా సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకుంది. -
Viral Video: విరాట్ క్రేజ్ అట్లుంటది మరి..!
టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లికి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. కోహ్లి ప్రపంచంలోని ఏ మూలలో ఉన్నా జనాలు అతని దర్శనం కోసం ఎగబడతారు. భారత్‌లో అయితే పరిస్థితి ఇంకోలా ఉంటుంది. విరాట్ ఎక్కడ ఉంటే అక్కడ జాతరను తలపిస్తుంది. రన్ మెషీన్‌ను చూసేందుకు జనాలు పోటెత్తుతారు. ఈ మధ్యకాలంలో అయితే కోహ్లి ఆన్ ద ఫీల్డ్ ఉన్నా అభిమానులు వదిలిపెట్టడం లేదు. మైదానంలోకి దూసుకొచ్చి మరీ తమ ఆరాధ్య క్రికెటర్‌ను కలుస్తున్నారు. ఇలాంటి ఘటనే తాజాగా మరొకటి జరిగింది. The moment when a fan touched Virat Kohli's feet and hugged him. - King Kohli, the crowd favourite. 😍pic.twitter.com/NfShGwtF8I — Mufaddal Vohra (@mufaddal_vohra) January 15, 2024 ఇండోర్ వేదికగా ఆఫ్ఘనిస్తాన్‌తో నిన్న (జనవరి 14) జరిగిన రెండో టీ20 సందర్భంగా ఓ అభిమాని కోహ్లిని కలిసేందుకు మైదానంలోకి చొచ్చుకొచ్చాడు. సదరు ఫ్యాన్ గ్రౌండ్ సిబ్బంది కళ్లు కప్పి బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న కోహ్లి వద్దకు వచ్చి కాళ్లు మొక్కి, కౌగిలించుకున్నాడు. తొలుత ఆ అభిమాని తనవైపు వస్తున్నప్పుడు కాస్త అసౌకర్యంగా కనిపించిన కోహ్లి ఆ తర్వాత అతన్ని హత్తుకున్నాడు. ఈలోపు సిబ్బంది వచ్చి ఆ అభిమానికి ఎత్తుకెళ్లిపోయారు. ఈ ఘటన కారణంగా మ్యాచ్‌కు కాసేపు అంతరాయం కలిగింది. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఇదిలా ఉంటే, 429 సుదీర్ఘ విరామం తర్వాత నిన్నటి మ్యాచ్‌తోనే విరాట్ తిరిగి అంతర్జాతీయ టీ20ల్లోకి అడుగుపెట్టాడు. ఈ మ్యాచ్‌లో కింగ్ 16 బంతుల్లో 5 ఫోర్ల సాయంతో 29 పరుగులు చేసి పర్వాలేదనిపించాడు. ఈ మ్యాచ్‌లో యశస్వి జైస్వాల్ (68), శివమ్ దూబే (63 నాటౌట్) చెలరేగడంతో భారత్.. ఆఫ్ఘనిస్తాన్ నిర్ధేశించిన 173 పరుగుల లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్‌ను భారత బౌలర్లు అర్ష్‌దీప్ సింగ్ (3/32), అక్షర్ పటేల్ (2/17), రవి భిష్ణోయ్ (2/39), శివమ్ దూబే (1/36) కట్టడి చేశారు. ఈ మ్యాచ్‌లో గెలుపుతో భారత్ మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకుంది. -
ధనాధన్ దూబే.. కోహ్లితో సమానంగా.. హార్దిక్ స్థానానికి ఎసరు పెట్టేలా..!
టీమిండియా ఆల్‌రౌండర్ శివమ్ దూబే ఫేట్ ఒక్కసారిగా మారిపోయింది. ఆఫ్ఘనిస్తాన్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌లో వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఆల్‌రౌండర్‌గా సత్తా చాటిన దూబే.. భావి భారత కెప్టెన్‌గా అనుకుంటున్న హార్దిక్ పాండ్యా స్థానానికే ఎసరు పెట్టాడు. హార్దిక్ పాండ్యాలా పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ అయిన దూబే.. హార్దిక్ గైర్హాజరీలో అద్భుతంగా రాణిస్తూ అతని స్థానాన్నే ప్రశ్నార్థకంగా మార్చాడు. ఇటీవలికాలంలో ఫార్మాట్లకతీతంగా విశేషంగా రాణిస్తున్న దూబే.. ఇలాగే తన మెరుపులు కొనసాగిస్తే టీమిండియాలో హార్దిక్ స్థానం గల్లంతవడం ఖాయమని విశ్లేషకులు అంటున్నారు. తరుచూ గాయపడే హార్దిక్ కన్నా దూబే చాలా బెటర్ అని వారు అభిప్రాయపడుతున్నారు. ఒకవేళ హార్దిక్‌ను తీసుకున్నా దూబేని టీ20 ప్రపంచకప్‌కు ఎంపిక చేయాలని డిమాండ్ చేస్తున్నారు. 30 ఏళ్ల దూబే ఆటతీరులో ఇటీవలికాలంలో చాలా మార్పులు వచ్చాయి. ఐపీఎల్ 2023 తర్వాత అతను బాగా రాటుదేలాడు. దేశవాలీ క్రికెట్లోనూ దూబే సత్తా చాటాడు. చాలాకాలంగా పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ కోసం ఎదురు చూస్తున్న టీమిండియాకు దూబే కరెక్ట్ మ్యాచ్ అని మాజీలు అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉంటే, ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన తొలి టీ20లో అజేయమైన అర్ధసెంచరీ (60 నాటౌట్) సహా వికెట్ (2-0-9-1) తీసి టీమిండియాను గెలిపించిన దూబే.. రెండో మ్యాచ్‌లోనూ ఇంచుమించు అదే ప్రదర్శనతో (32 బంతుల్లో 63 నాటౌట్; 5 ఫోర్లు, 4 సిక్సర్లు, 3-0-36-1) భారత్‌ను విజయతీరాలకు చేర్చాడు. కోహ్లి సరసన.. రెండో టీ20 ప్రదర్శనతో దూబే ఏకంగా లెజెండ్ విరాట్ కోహ్లి సరసన చేరాడు. విరాట్ టీ20ల్లో రెండు సార్లు అర్ధసెంచరీతో పాటు వికెట్ తీయగా.. దూబే సైతం అన్నే సార్లు ఈ ఘనత సాధించాడు. భారత్ తరఫున అత్యధిక సార్లు ఈ ప్రదర్శన నమోదు చేసిన ఆటగాడిగా యువరాజ్ సింగ్ నిలిచాడు. యువీ మూడుసార్లు ఓ మ్యాచ్‌లో 50 పరుగులతో పాటు వికెట్ తీశాడు. భారత్ తరఫున హార్ధిక్, అక్షర్ పటేల్, తిలక్ వర్మ, వాషింగ్టన్ సుందర్ తలోసారి 50 స్కోర్‌తో పాటు వికెట్ తీశారు. కాగా, దూబేతో పాటు యశస్వి జైస్వాల్ (34 బంతుల్లో 68; 5 ఫోర్లు, 6 సిక్సర్లు) చెలరేగడంతో రెండో టీ20లో భారత్ ఆఫ్ఘనిస్తాన్‌ను 6 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. ఫలితంగా టీమిండియా మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0తో కైవసం చేసుకుంది. సిరీస్ గెలుపుతో భారత్ స్వదేశంలో తమ అజేయ యాత్రను కొనసాగించింది. సొంతగడ్డపై టీమిండియాకు గత 15 టీ20 సిరీస్‌ల్లో (2019 నుంచి) ఓటమిలేదు. -
India vs Afghanistan 3rd T20I: ఆడుతూ పాడుతూ...
ఇండోర్: ముందుగా బౌలింగ్‌లో, ఆ తర్వాత బ్యాటింగ్‌లో చెలరేగిన భారత్ స్వదేశంలో మరో ద్వైపాక్షిక టి20 సిరీస్‌ను సొంతం చేసుకుంది. 2019 నుంచి సొంతగడ్డపై టి20 సిరీస్‌లలో ఓటమిలేని భారత్ అదే జోరును అఫ్గానిస్తాన్‌పై కూడా కొనసాగించింది. మూడు టి20 మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా అఫ్గానిస్తాన్‌తో ఆదివారం జరిగిన రెండో మ్యాచ్‌లో టీమిండియా ఆరు వికెట్ల తేడాతో గెలిచింది. మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 2–0తో సిరీస్‌ను దక్కించుకుంది. చివరిదైన మూడో టి20 మ్యాచ్ బుధవారం బెంగళూరులో జరుగుతుంది. టాస్ గెలిచిన భారత కెపె్టన్ రోహిత్ శర్మ ఫీల్డింగ్ ఎంచుకోగా... మొదట బ్యాటింగ్‌కు దిగిన అఫ్గానిస్తాన్ సరిగ్గా 20 ఓవర్లలో 172 పరుగులకు ఆలౌటైంది. గుల్బదిన్ (35 బంతుల్లో 57; 5 ఫోర్లు, 4 సిక్స్‌లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. భారత బౌలర్లలో అర్‡్షదీప్ సింగ్ 3 వికెట్లు తీయగా... ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. 173 పరుగుల లక్ష్యాన్ని భారత్ కేవలం 15.4 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి ఛేదించి గెలిచింది. యశస్వి జైస్వాల్ (34 బంతుల్లో 68; 5 ఫోర్లు, 6 సిక్స్‌లు), శివమ్ దూబే (32 బంతుల్లో 63 నాటౌట్; 5 ఫోర్లు, 4 సిక్స్‌లు) అఫ్గాన్ బౌలర్ల భరతం పట్టి అర్ధ సెంచరీలు సాధించారు. కెపె్టన్ రోహిత్ శర్మ (0) వరుసగా రెండో మ్యాచ్‌లోనూ ‘డకౌట్’కాగా... 14 నెలల తర్వాత మళ్లీ టి20 మ్యాచ్ ఆడిన కోహ్లి (16 బంతుల్లో 29; 5 ఫోర్లు) క్రీజులో ఉన్నంతసేపు దూకుడుగా ఆడాడు. స్కోరు వివరాలు అఫ్గానిస్తాన్ ఇన్నింగ్స్: గుర్బాజ్ (సి) దూబే (బి) రవి బిష్ణోయ్ 14; ఇబ్రహీమ్ (బి) అక్షర్ పటేల్ 8; గుల్బదిన్ (సి) రోహిత్ శర్మ (బి) అక్షర్ పటేల్ 57; అజ్మతుల్లా ఒమర్జాయ్ (బి) శివమ్ దూబే 2; మొహమ్మద్ నబీ (సి) రింకూ సింగ్ (బి) రవి బిష్ణోయ్ 14; నజీబుల్లా (బి) అర్‡్షదీప్ 23; కరీమ్ (సి) అక్షర్ పటేల్ (బి) అర్‡్షదీప్ 20; ముజీబ్ (రనౌట్) 21; నూర్ అహ్మద్ (సి) కోహ్లి (బి) అర్‡్షదీప్ 1; నవీన్ ఉల్ హఖ్ (నాటౌట్) 1; ఫరూఖీ (రనౌట్) 0; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (20 ఓవర్లలో ఆలౌట్) 172. వికెట్ల పతనం: 1–20, 2–53, 3–60, 4–91, 5–104, 6–134, 7–164, 8–170, 9–171, 10–172. బౌలింగ్: అర్‡్షదీప్ సింగ్ 4–0–32–3, ముకేశ్ కుమార్ 2–0–21–0, రవి బిష్ణోయ్ 4–0–39–2, అక్షర్ పటేల్ 4–0–17–2, శివమ్ దూబే 3–0–36–1, వాషింగ్టన్ సుందర్ 3–0–23–0. భారత్ ఇన్నింగ్స్: యశస్వి జైస్వాల్ (సి) గుర్బాజ్ (బి) కరీమ్ 68; రోహిత్ శర్మ (బి) ఫరూఖీ 0; విరాట్ కోహ్లి (సి) ఇబ్రహీమ్ (బి) నవీన్ 29; శివమ్ దూబే (నాటౌట్) 63; జితేశ్ శర్మ (సి) నబీ (బి) కరీమ్ 0; రింకూ సింగ్ (నాటౌట్) 9; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (15.4 ఓవర్లలో 4 వికెట్లకు) 173. వికెట్ల పతనం: 1–5, 2–62, 3–154, 4–156. బౌలింగ్: ఫరూఖీ 3.4–0–28–1, ముజీబ్ ఉర్ రెహ్మాన్ 2–0–32–0, నవీన్ ఉల్ హఖ్ 3–0–33–1, నూర్ అహ్మద్ 3–0–35–0, నబీ 2–0–30–0, కరీమ్ 2–0–13–2. 150: అంతర్జాతీయ టి20ల్లో 150 మ్యాచ్‌లు ఆడిన తొలి ప్లేయర్‌గా రోహిత్ శర్మ గుర్తింపు పొందాడు. 12: అంతర్జాతీయ టి20ల్లో భారత్ తరఫున అత్యధికంగా 12 సార్లు ‘డకౌట్’ అయిన ప్లేయర్ రోహిత్ శర్మ. కేఎల్ రాహుల్ (5) రెండో స్థానంలో ఉన్నాడు. 15: స్వదేశంలో జరిగిన గత 15 ద్వైపాక్షిక టి20 సిరీస్‌లలో భారత్ అజేయంగా నిలిచింది. 2019 నుంచి భారత జట్టు 13 టి20 సిరీస్‌లను నెగ్గి, రెండింటిని ‘డ్రా’గా ముగించింది. -
జైస్వాల్ అద్భుతం.. అతడేమో బిగ్ ప్లేయర్.. గర్వంగా ఉంది: రోహిత్
అఫ్గనిస్తాన్‌తో రెండో టీ20లో విజయంపై టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ హర్షం వ్యక్తం చేశాడు. యువ ఆటగాళ్ల ప్రదర్శన పట్ల తానెంతో గర్వపడుతున్నానని పేర్కొన్నాడు. గత రెండు మ్యాచ్‌లలో తాము అన్ని బాక్సులను టిక్ చేశామని.. సమిష్టి ప్రదర్శనతో గెలుపొందామని జట్టును ప్రశంసించాడు. ముఖ్యంగా విజయాల్లో కీలక పాత్ర పోషించిన శివం దూబే, యశస్వి జైస్వాల్‌లను ఈ సందర్భంగా రోహిత్ శర్మ కొనియాడాడు. కాగా స్వదేశంలో అఫ్గనిస్తాన్‌తో టీ20 సిరీస్‌ను టీమిండియా 2-0తో సొంతం చేసుకుంది. ఇండోర్‌లో ఆదివారం నాటి టీ20లో ఆరు వికెట్ల తేడాతో జట్టును గెలిపించి.. మరో మ్యాచ్ మిగిలి ఉండగానే కుర్రాళ్లు భారత్‌కు విజయాన్ని బహుమతిగా అందించారు. ఇక కెప్టెన్ రోహిత్ శర్మ కెరీర్లో ఇది 150వ అంతర్జాతీయ టీ20 కావడం విశేషం. తద్వారా మెన్స్ క్రికెట్లో ఈ ఘనత సాధించిన తొలి ఆటగాడిగా హిట్‌మ్యాన్ చరిత్ర సృష్టించాడు. ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ.. ‘‘ఇదొక గొప్ప అనుభూతి. 2007లో మొదలైన ఈ ప్రయాణం ఎన్నో మధుర జ్ఞాపకాలతో ఇక్కడిదాకా సాగింది. ఇక ఈ సిరీస్ విషయానికొస్తే.. మేము ఎలాంటి ప్రయోగాలు చేయాలనుకున్నామో అన్నీ చేశాం. జట్టులోని ప్రతి ఆటగాడి నుంచి ఎలాంటి ప్రదర్శన ఆశిస్తున్నామో ముందే స్పష్టంగా వివరించాం. అందుకు తగ్గట్లుగానే అందరూ రాణించారు. నన్ను గర్వపడేలా చేశారు. గత రెండు మ్యాచ్‌లలో అన్ని విభాగాల్లోనూ అనుకున్న ప్రణాళికలు అమలు చేయగలిగాం. జైస్వాల్ తొలుత టెస్టుల్లో తనను తాను నిరూపించుకున్నాడు. ఇప్పుడు టీ20లలోనూ సత్తా చాటుతున్నాడు. ఆటగాడిగా తన నైపుణ్యాలేమిటో.. సామర్థ్యం ఏపాటిదో మరోసారి చూపించాడు. జైస్వాల్ ప్రతిభావంతుడు. వైవిధ్యమైన గొప్ప షాట్లు ఆడగలడు. ఇక దూబే బిగ్ ప్లేయర్. అత్యంత శక్తిమంతమైన ఆటగాడు. స్పిన్నర్ల బౌలింగ్‌ను చిత్తు చేయగలడు. జట్టులోకి వచ్చాడు.. రెండు విలువైన ఇన్నింగ్స్ ఆడాడు. తన పాత్రను చక్కగా పోషించాడు’’ అని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు. కాగా దాదాపు నాలుగేళ్ల తర్వాత టీమిండియాలో రీఎంట్రీ ఇచ్చిన పేస్ ఆల్‌రౌండర్ శివం దూబే.. అఫ్గన్‌తో సిరీస్‌లో సత్తా చాటాడు. తొలి టీ20లో ఒక వికెట్ తీయడంతో పాటు.. 40 బంతుల్లో 60 పరుగులతో అజేయంగా నిలిచి జట్టును విజేతగా నిలిపాడు. తాజాగా రెండో టీ20లోనూ ఒక వికెట్ తీసిన అతడు.. 32 బంతులు ఎదుర్కొని 63 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఓపెనర్ యశస్వి జైస్వాల్(34 బంతుల్లో 68)తో కలిసి టీమిండియాను గెలిపించాడు. ఇదిలా ఉంటే.. అఫ్గన్‌తో సిరీస్‌తో అంతర్జాతీయ టీ20లలో రీఎంట్రీ ఇచ్చిన రోహిత్ రెండు మ్యాచ్‌లలో డకౌట్ కాగా.. రెండో టీ20తో పునరాగమనం చేసిన విరాట్ కోహ్లి 16 బంతుల్లో 29 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. చదవండి: రీఎంట్రీలో కోహ్లి దంచికొడితే.. జైస్వాల్, దూబే దుమ్ములేపారు! అదొక్కటే లోటు.. -
Ind vs Afg: రీఎంట్రీలో కోహ్లి మార్కు .. జైస్వాల్, దూబే దంచికొట్టారు!
India vs Afghanistan, 2nd T20I: అఫ్గనిస్తాన్‌తో రెండో టీ20లో టీమిండియా జయభేరి మోగించింది. ఇబ్రహీం జద్రాన్ బృందాన్ని ఆరు వికెట్ల తేడాతో ఓడించింది. తద్వారా మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్‌ను 2-0తో గెలుచుకుంది. టీ20 ప్రపంచకప్-2024కు ముందు ఆడుతున్న ఆఖరిదైన ద్వైపాక్షిక సిరీస్‌లో అఫ్గన్‌పై ఆద్యంతం ఆధిపత్యం కనబరుస్తూ సత్తా చాటుకుంది. ముఖ్యంగా యువ ఆటగాళ్లే ఈ విజయంలో కీలక పాత్ర పోషించడం విశేషం. కాగా టీమిండియాతో తొలిసారి టీ20 సిరీస్ ఆడేందుకు అఫ్గనిస్తాన్ భారత పర్యటనకు వచ్చిన విషయం తెలిసిందే. స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ గైర్హాజరీలో యువ బ్యాటర్ ఇబ్రహీం జద్రాన్ ఈ జట్టుకు సారథ్యం వహిస్తున్నాడు. 172 పరుగులకు అఫ్గన్ ఆలౌట్ ఈ క్రమంలో మొహాలీ వేదికగా తొలి మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో భారత్ చేతిలో ఓడిన అఫ్గన్ జట్టు.. ఆదివారం నాటి మ్యాచ్‌లోనూ ఆరు వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఇండోర్ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన జద్రాన్ బృందం నిర్ణీత 20 ఓవర్లలో 172 పరుగులకు ఆలౌట్ అయింది. టీమిండియా బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్ మూడు, రవి బిష్ణోయి రెండు, అక్షర్ పటేల్ రెండు, శివం దూబే ఒక వికెట్ పడగొట్టారు. రనౌట్ల రూపంలో రెండు వికెట్లు వచ్చాయి. కాగా గుల్బదిన్ నైబ్ (35 బంతుల్లో 57), కరీం జనత్(10 బంతుల్లో 20), ముజీబ్ ఉర్ రహ్మాన్(9 బంతుల్లో 21) మెరుపు ఇన్నింగ్స్ కారణంగా ఈ మేరకు స్కోరు చేయగలిగింది. ఇది మెరుగైన స్కోరే అయినప్పటికీ.. పరుగుల వరదపారించడానికి వీలైన హోల్కర్ స్టేడియంలో టీమిండియాను నిలువరించడం అంతతేలిక కాదని అఫ్గన్‌కు త్వరగానే అర్థమైంది. ఇండియా ఇన్నింగ్స్‌లో ఐదో బంతికే కెప్టెన్ రోహిత్ శర్మను డకౌట్ చేసినప్పటికీ.. మరో ఓపెనర్ యశస్వి జైస్వాల్ అఫ్గన్ బౌలర్లకు కొరకరాని కొయ్యలా మారాడు. విరాట్ కోహ్లి (16 బంతుల్లో 29 పరుగులు) కూడా త్వరగానే పెవిలియన్ చేరినా పట్టుదలగా క్రీజులో నిలబడ్డాడు. కోహ్లి దంచికొడితే.. జైస్వాల్, దూబే దుమ్ములేపారు కోహ్లి స్థానంలో క్రీజులోకి వచ్చిన శివం దూబేతో కలిసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. జైస్వాల్ 34 బంతుల్లో 5 ఫోర్లు, ఆరు సిక్సర్లతో చెలరేగి 68 పరుగులు సాధించగా.. దూబే 32 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్‌ల సాయంతో 63 పరుగులతో అజేయంగా నిలిచాడు. వీరిద్దరి సునామీ ఇన్నింగ్స్ కారణంగా 15.4 ఓవర్లలోనే టీమిండియా అఫ్గన్ విధించిన 173 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. సిరీస్‌ను 2-0తో సొంతం చేసుకుంది. కీలక సమయంలో అఫ్గన్ కీలక వికెట్లు(జద్రాన్, గుల్బదిన్) తీసిన అక్షర్ పటేల్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. అదొక్కటే లోటు అంతాబాగానే ఉన్నా తొలి టీ20 మాదిరే రెండో టీ20లోనూ రోహిత్ శర్మ డకౌట్ కావడం అభిమానులకు నిరాశ కలిగింది. రీఎంట్రీలో హిట్‌మ్యాన్ మెరుపులు చూడాలనుకుంటే ఆ లోటు ఇప్పటికి అలాగే మిగిలిపోయింది. -
Ind Vs Afg: దూబే ధనాధన్ ఇన్నింగ్స్.. టీమిండియాదే సిరీస్
India vs Afghanisthan 2nd T20I 2024 Updates: అఫ్గనిస్తాన్‌తో రెండో టీ20లో టీమిండియా ఘన విజయం సాధించింది. ఇండోర్ మ్యాచ్‌లో జద్రాన్ బృందాన్ని ఆరు వికెట్ల తేడాతో చిత్తు చేసింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ 34 బంతుల్లో 68 పరుగులతో దంచికొట్టగా.. ఆల్‌రౌండర్ శివం దూబే 30 బంతుల్లో 63 పరుగులతో అజేయంగా నిలిచాడు. వీరిద్దరి విధ్వంసకర ఇన్నింగ్స్ కారణంగా రోహిత్ సేన అఫ్గన్‌తో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకుంది. 14 ఓవర్లలో టీమిండియా స్కోరు: 164/4 విజయానికి 9 పరుగుల దూరంలో టీమిండివయా. దూబే 62, రింకూ 2 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఒకే ఓవర్లో రెండు వికెట్లు డౌన్ 12.6: జితేశ్ శర్మ రూపంలో నాలుగో వికెట్ కోల్పోయిన టీమిండియా. శివం దూబే 12.3: కరీం జనత్ బౌలింగ్‌లో జైస్వాల్ ఔట్. 11.6: దూబే ధనాధన్ హాఫ్ సెంచరీ 22 బంతుల్లో అర్ధ శతకం పూర్తి చేసుకున్న శివం దూబే 9.1: జైస్వాల్ హాఫ్ సెంచరీ 27 బంతుల్లో 50 పరుగుల మార్కును అందుకున్న యశస్వి జైస్వాల్. మరో ఎండ్‌లో శివం దూబే(15 బంతుల్లో 34 పరుగులు) కూడా జోరుగా ఆడుతున్నాడు. 10 ఓవర్లలో టీమిండియా స్కోరు: 116/2. విజయానికి 57 పరుగుల దూరం ఉంది. 5.3: రెండో వికెట్ కోల్పోయిన టీమిండియా విరాట్ కోహ్లి రూపంలో టీమిండియా రెండో వికెట్ కోల్పోయింది. నవీన్ ఉల్ హక్ బౌలింగ్‌లో కోహ్లి పెవిలియన్ చేరాడు. 16 బంతులు ఎదుర్కొని 29 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద నిష్క్రమించాడు. శివం దూబే క్రీజులోకి వచ్చాడు. ఓపెనర్ యశస్వి జైస్వాల్ దంచి కొడుతుండటంతో పవర్ ప్లేలో భారత్ 69-2 స్కోరు చేయగలిగింది. మూడు ఓవర్లలో టీమిండియా స్కోరు: 32-1 కోహ్లి 12, యశస్వి 20 పరుగులతో క్రీజులో ఉన్నారు. రోహిత్ మళ్లీ డకౌట్ 0.5: టీమిండియాకు ఆదిలోనే షాక్ తగిలింది. ఓపెనర్, కెప్టెన్ రోహిత్ శర్మ డకౌట్‌గా వెనుదిరిగాడు. ఫజల్హక్ బౌలింగ్‌లో బౌల్డ్ అయి వెనుదిరిగాడు. కాగా తొలి టీ20లోనూ హిట్‌మ్యాన్ పరుగుల ఖాతా తెరవకుండానే నిష్క్రమించిన విషయం తెలిసిందే. టార్గెట్ 173 టీమిండియా ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గనిస్తాన్ మెరుగైన స్కోరు సాధించింది. నిర్ణీత 20 ఓవర్లలో 172 పరుగులకు ఆలౌట్ అయింది. భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్ మూడు, రవి బిష్ణోయి రెండు, అక్షర్ పటేల్ రెండు, శివం దూబే ఒక వికెట్ తీశారు. రనౌట్ల రూపంలో రెండు వికెట్లు దక్కాయి. ఆఖరి ఓవర్లో 4 వికెట్లు కోల్పోయిన అఫ్గనిస్తాన్ 19.6: ఫజల్హక్ రనౌట్ 19.6 వైడ్: తొమ్మిది బంతుల్లోనే 21 పరుగులు చేసిన ముజీబ్ రనౌట్ 19.5: నూర్ అహ్మద్ అవుట్(1). 19.1: ఏడో వికెట్ కోల్పోయిన అఫ్గన్ అర్ష్‌దీప్ బౌలింగ్‌లో కరీం జనత్(20) అవుట్. నూర్ అహ్మద్ క్రీజులోకి వచ్చాడు. నజీబుల్లా అవుట్ 17.1: అర్ష్‌దీప్ బౌలింగ్‌లో ఆరో వికెట్‌గా వెనుదిరిగిన నజీబుల్లా. 23 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద బౌల్డ్ అయ్యాడు. ముజీబ్ ఉర్ రహ్మాన్ క్రీజులోకి వచ్చాడు. స్కోరు: 144-6(18). 15 ఓవర్లలో అఫ్గన్ స్కోరు: 109-5 నజీబుల్లా 4, కరీముల్లా ఒక పరుగుతో క్రీజులో ఉన్నారు. ఐదో వికెట్ కోల్పోయిన అఫ్గన్ 14.2: మహ్మద్ నబీ రూపంలో అఫ్గనిస్తాన్ ఐదో వికెట్ కోల్పోయింది. రవి బిష్ణోయి బౌలింగ్‌లో రింకూ సింగ్‌కు క్యాచ్ ఇచ్చి నబీ 14 పరుగుల వద్ద నిష్క్రమించాడు. కరీం జనత్ క్రీజులోకి వచ్చాడు. అర్ధ శతక వీరుడు అవుట్ 11.3: అర్ధ శతకంతో జోరు మీదున్న గుల్బదిన్‌ను అక్షర్ పటేల్ పెవిలియన్‌కు పంపాడు. 35 బంతుల్లో 57 పరుగుల వ్యక్తిగత స్కోరువద్ద రోహిత్ శర్మకు క్యాచ్ ఇచ్చి గుల్బదిన్ అవుట్ అయ్యాడు. దీంతో అఫ్గన్ నాలుగో వికెట్ కోల్పోయింది. నజీబుల్లా జద్రాన్ క్రీజులోకి వచ్చాడు. గుల్బదిన్ హాఫ్ సెంచరీ 9.5: అక్షర్ పటేల్ బౌలింగ్‌లో సింగిల్ తీసి హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న గుల్బదిన్. 27 బంతుల్లోనే అతడు 50 పరుగుల మార్కును అందుకున్నాడు. మరోవైపు.. నబీ 4 పరుగులతో క్రీజులో ఉన్నాడు. స్కోరు: 81/3 (10). మూడో వికెట్ కోల్పోయిన అఫ్గనిస్తాన్ 6.5: శివం దూబే బౌలింగ్‌లో ఒమర్జాయ్(2) క్లీన్ బౌల్డ్. మూడో వికెట్ కోల్పోయిన అఫ్గనిస్తాన్. మహ్మద్ నబీ క్రీజులోకి వచ్చాడు. స్కోరు: 60-3(7) రెండో వికెట్ కోల్పోయిన అఫ్గనిస్తాన్ 5.4: అక్షర్ పటేల్ బౌలింగ్‌లో అఫ్గన్ కెప్టెన్ ఇబ్రహీం జద్రాన్(8) క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. అజ్మతుల్లా ఒమర్జాయ్ క్రీజులోకి వచ్చాడు. స్కోరు: 58-2(6) హాఫ్ సెంచరీ పూర్తి చేసిన అఫ్గనిస్తాన్ వన్‌డౌన్ బ్యాటర్ గుల్బదిన్ దంచికొడుతున్నాడు. 13 బంతుల్లోనే 26 పరుగులు చేసి దూకుడు మీద ఉన్నాడు. దీంతో 5 ఓవర్లలోనే అఫ్గన్ 50 పరుగుల మార్కు అందుకుంది. గుల్బదిన్తో పాటు జద్రాన్ 7 పరుగులతో క్రీజులో ఉన్నాడు. తొలి వికెట్ కోల్పోయిన అఫ్గన్ 2.2: భారత స్పిన్నర్ రవి బిష్ణోయి బౌలింగ్‌లో శివం దూబేకు క్యాచ్ ఇచ్చి రహ్మనుల్లా గుర్బాజ్(14) అవుటయ్యాడు. ఈ వికెట్ కీపర్ బ్యాటర్ రూపంలో అఫ్గన్ తొలి వికెట్ కోల్పోయింది. గుల్బదిన్ నైబ్ క్రీజులోకి వచ్చాడు. స్కోరు: 22-1 (3). బ్యాటింగ్ చేస్తున్న అఫ్గనిస్తాన్ టాస్ గెలిచిన టీమిండియా ఆహ్వానం మేరకు అఫ్గనిస్తాన్ తొలుత బ్యాటింగ్ చేస్తోంది. రెండు ఓవర్లు ముగిసే సరికి అఫ్గన్ స్కోరు: 20/0. ఓపెనర్లు ఇబ్రహీం జద్రాన్ 4, రహ్మనుల్లా గుర్బాజ్ 14 పరుగులతో క్రీజులో ఉన్నారు. బౌలింగ్ ఎంచుకున్న రోహిత్ టీమిండియా- అఫ్గనిస్తాన్ మధ్య రెండో టీ20 మొదలైంది. ఇండోర్ వేదికగా ఆదివారం నాటి మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. రన్‌మెషీన్ రీఎంట్రీ ఇక.. ఈ మ్యాచ్ ద్వారా దాదాపు పద్నాలుగు నెలల విరామం తర్వాత టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి అంతర్జాతీయ టీ20లలో పునరాగమనం చేశాడు. ఈ రన్‌మెషీన్ రాకతో హైదరాబాద్ స్టార్ తిలక్ వర్మపై వేటు పడింది. గిల్‌కు నో ఛాన్స్ అదే విధంగా.. గజ్జల్లో గాయం కారణంగా మొదటి టీ20కి దూరమైన యంగ్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ తిరిగి వచ్చాడు. దీంతో శుబ్‌మన్ గిల్‌కు భారత తుదిజట్టులో చోటు దక్కలేదు. రోహిత్‌కు జోడీగా యశస్వి ఈ మ్యాచ్‌లో భారత ఇన్నింగ్స్ ఆరంభించనున్నాడు. ఈ మేరకు టీమిండియా రెండు మార్పులతో బరిలోకి దిగగా.. అఫ్గనిస్తాన్ ఒక మార్పుతో మైదానంలో దిగనుంది. రహ్మత్ షా స్థానంలో నూర్ అహ్మద్ జట్టులోకి వచ్చినట్లు అఫ్గన్ కెప్టెన్ ఇబ్రహీం జద్రాన్ వెల్లడించాడు. కాగా మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా భారత్ ఇప్పటికే 1-0తో అఫ్గన్ కంటే ముందంజలో ఉంది. తుది జట్లు ఇవే టీమిండియా రోహిత్ శర్మ(కెప్టెన్), యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లి, శివమ్ దూబే, జితేశ్ శర్మ, రింకు సింగ్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, ముకేష్ కుమార్. అఫ్గనిస్తాన్ రహ్మనుల్లా గుర్బాజ్(వికెట్ కీపర్), ఇబ్రహీం జద్రాన్(కెప్టెన్), అజ్మతుల్లా ఒమర్జాయ్, మహ్మద్ నబీ, నజీబుల్లా జద్రాన్, కరీం జనత్, గుల్బదిన్ నైబ్, నూర్ అహ్మద్, ఫజల్హక్ ఫారూఖీ, నవీన్ ఉల్ హక్, ముజీబ్ ఉర్ రెహ్మాన్. -
ఆఫ్ఘనిస్తాన్‌తో రెండో టీ20.. భారీ రికార్డుపై కన్నేసిన కోహ్లి
భారత్-ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య ఇండోర్ వేదికగా ఇవాళ (జనవరి 14) రెండో టీ20 జరుగనుంది. రాత్రి 7 గంటలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచ్ ద్వారా టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి అంతర్జాతీయ టీ20ల్లోకి రీఎంట్రీ ఇవ్వనున్నాడు. కోహ్లి చివరిసారిగా 2022 టీ20 వరల్డ్‌కప్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్ ఆడాడు. ఆ మ్యాచ్‌లో భారత్ 10 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. తిరిగి 429 రోజుల సుదీర్ఘ విరామం తర్వాత కోహ్లి మళ్లీ పొట్టి క్రికెట్లోకి పునరాగమనం చేయనున్నాడు. వాస్తవానికి ఈ సిరీస్‌లో తొలి మ్యాచ్‌లోనే విరాట్ ఆడాల్సి ఉండింది. అయితే వ్యక్తిగత కారణాల వల్ల అతను ఆ మ్యాచ్‌కు దూరమయ్యాడు. మొహాలీ వేదికగా జరిగిన ఆ మ్యాచ్‌లో భారత్.. 6 వికెట్ల తేడాతో ఆఫ్ఘనిస్తాన్‌ను చిత్తు చేసి మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. ఆఫ్ఘన్‌తో రెండో టీ20కి ముందు విరాట్‌ను ఓ భారీ రికార్డు ఊరిస్తుంది. ఈ మ్యాచ్‌లో కోహ్లి 35 పరుగులు చేస్తే.. టీ20ల్లో 12000 పరుగుల మార్కును అందుకున్న తొలి భారత ఆటగాడిగా రికార్డు నెలకొల్పుతాడు. పొట్టి ఫార్మాట్లో అత్యధిక పరుగులు చేసిన రికార్డు విండీస్ విధ్వంసకర ఆటగాడు క్రిస్ గేల్ (14562) పేరిట ఉంది. ఈ జాబతాలో పాకిస్తాన్ ఆటగాడు షోయబ్ మాలిక్ (12993), విండీస్ టీ20 స్పెషలిస్ట్ కీరన్ పోలార్డ్ (12430) గేల్ తర్వాతి స్థానాల్లో ఉన్నారు. -
సంచలన రికార్డుపై రోహిత్ శర్మ కన్ను..
India vs Afghanistan, 2nd T20I - Rohit Sharma Eyes On Rare Record: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అత్యంత అరుదైన రికార్డు ముంగిట నిలిచాడు. అంతర్జాతీయ టీ20లలో ఇంత వరకు ఏ క్రికెటర్‌కూ సాధ్యం కాని ఫీట్ నమోదు చేయడానికి అడుగుదూరంలో ఉన్నాడు. దాదాపు పద్నాలుగు నెలల సుదీర్ఘ విరామం తర్వాత రోహిత్ ఇంటర్నేషనల్ పొట్టి ఫార్మాట్లో పునరాగమనం చేశాడు. టీ20 వరల్డ్‌కప్-2022 సెమీస్‌లో భారత జట్టు ఓటమి తర్వాత.. మళ్లీ తాజాగా అఫ్గనిస్తాన్‌తో సిరీస్‌తో రీఎంట్రీ ఇచ్చాడు. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా మొహాలీలో మరోసారి కెప్టెన్‌గా బరిలోకి దిగిన రోహిత్ శర్మ దురదృష్టవశాత్తూ రనౌట్ అయ్యాడు. రీఎంట్రీలో డకౌట్ అయినా వరల్డ్ రికార్డు మరో ఓపెనర్ శుబ్‌మన్ గిల్‌తో సమన్వయలోపం కారణంగా డకౌట్‌గా వెనుదిరిగాడు. అయితే, ఈ మ్యాచ్‌లో టీమిండియా ఆరు వికెట్ల తేడాతో అఫ్గనిస్తాన్‌ను చిత్తు చేయడంతో సారథిగా రోహిత్ ఖాతాలో మరో విజయం నమోదైంది. తద్వారా.. అంతర్జాతీయ టీ20లలో 100 మ్యాచ్‌లు గెలిచిన ఏకైక పురుష క్రికెటర్‌గానూ హిట్‌మ్యాన్ చరిత్ర సృష్టించాడు. అదే జరిగితే ప్రపంచంలోనే ఏకైక క్రికెటర్‌గా ఇదిలా ఉంటే.. ఇప్పటికే అఫ్గన్‌తో సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలో ఉన్న టీమిండియా ఇండోర్ వేదికగా ఆదివారం (జనవరి 14) రెండో మ్యాచ్‌లో తలపడనుంది. రోహిత్ శర్మ కెరీర్లో ఇది 150వ అంతర్జాతీయ టీ20 కావడం విశేషం. ఏ ఆటంకాలు లేకుండా హిట్‌మ్యాన్ ఈ మ్యాచ్ పూర్తి చేస్తే ప్రపంచంలో ఈ ఘనత సాధించిన ఏకైక క్రికెటర్‌గా చరిత్రకెక్కుతాడు. అదండీ విషయం..!! అంతర్జాతీయ టీ20లలో ఇప్పటివరకు అత్యధిక మ్యాచ్‌లు ఆడిన టాప్-5 క్రికెటర్లు 1. రోహిత్ శర్మ(ఇండియా)- 149 2. పాల్ స్టిర్లింగ్(ఐర్లాండ్)- 134 3.జార్జ్ డాక్రెల్(ఐర్లాండ్)- 128 4. షోయబ్ మాలిక్(పాకిస్తాన్)- 124 5. మార్టిన్ గప్టిల్(న్యూజిలాండ్)- 122. చదవండి: Ind vs Eng: తండ్రి కార్గిల్ యుద్ధంలో.. బంగారు గొలుసు అమ్మిన తల్లి త్యాగం! టీమిండియాలో ఎంట్రీ.. -
వెళ్లడం వరకే నీ ఇష్టం!.. ద్రవిడ్ ‘వార్నింగ్’ తర్వాత ఇషాన్ ఫస్ట్ రియాక్షన్
Rahul Dravid- Ishan Kishan: టీమిండియా యువ క్రికెటర్ ఇషాన్ కిషన్ భవితవ్యంపై గత కొన్ని రోజులుగా క్రికెట్ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. సౌతాఫ్రికా పర్యటన మధ్యలోనే స్వదేశానికి తిరిగి వచ్చిన ఇషాన్ ఇంకా సెలవులోనే ఉన్నాడు. ఈ నేపథ్యంలో.. అఫ్గనిస్తాన్‌తో టీ20 సిరీస్‌కు అతడు అందుబాటులోకి వస్తాడని భావించినా.. అలా జరుగలేదని టీమిండియా హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్ స్వయంగా వెల్లడించాడు. అంతేకాదు.. ఇషాన్ మళ్లీ భారత జట్టుతో చేరాలంటే దేశవాళీ క్రికెట్ ఆడాల్సి ఉంటుందంటూ గట్టిగానే వార్నింగ్ ఇచ్చాడు. ఈ క్రమంలో.. మానసికంగా అలసిపోయానని తనకు తాను తప్పుకొన్న ఇషాన్ కిషన్.. పార్టీలు చేసుకుంటూ ఎంజాయ్ చేస్తుండటం బీసీసీఐ పెద్దలకు ఆగ్రహం తెప్పించిందనే వార్తలు వినిపించాయి. వెళ్లడం వరకే మీ ఇష్టం.. తిరిగి రావాలంటే ఈ నేపథ్యంలోనే .. ‘‘జట్టును వీడి వెళ్లాలా వద్దా అనేది మాత్రమే ఆటగాళ్ల ఇష్టం.. వాళ్లను తిరిగి తీసుకోవాలా వద్దా అనేది మాత్రం మా ఇష్టమే’’ అన్న అర్థం ద్రవిడ్ మాటల్లో ధ్వనించిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వీలైనప్పుడల్లా అవకాశాలు ఇస్తున్నా.. తనను కావాలనే పక్కనపెడుతున్నారని ఇషాన్ ఇగోకు పోయి తన కెరీర్‌ను తానే నాశనం చేసుకుంటున్నాడనే మాటలూ వినిపిస్తున్నాయి. రంజీల్లో ఆడతాడో లేదో చెప్పలేదు.. వస్తే మాత్రం మరోవైపు.. ద్రవిడ్ చెప్పిన తర్వాత ఇషాన్ కిషన్ రంజీ ట్రోఫీ-2024 సీజన్లో కచ్చితంగా ఆడతాడని అంతా భావించారు. ఇంగ్లండ్‌తో స్వదేశంలో టెస్టు సిరీస్‌కు ముందు ఇషాన్.. దేశవాళీ క్రికెట్లో తాను ప్రాతినిథ్యం వహిస్తున్న జార్ఖండ్ తరఫున బరిలోకి దిగుతాడని ఊహించారు. కానీ.. ఇందుకు సంబంధించి తమకు ఇషాన్ నుంచి ఎలాంటి సమాచారం లేదని జార్ఖండ్ క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి దేబాశిష్ చక్రవర్తి వార్తా సంస్థ పీటీఐకి తెలిపాడు. ఒకవేళ ఇషాన్ రంజీల్లో ఆడాలనుకుంటే నేరుగా తుదిజట్టులో చేర్చుకుంటామని స్పష్టం చేశాడు. అయినప్పటికీ ఈ పరిణామాలపై ఇషాన్ కిషన్ ఇంత వరకు నేరుగా స్పందించకపోవడం గమనార్హం. అయితే, తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్లో ఓ వీడియోతో ప్రత్యక్షమయ్యాడు ఈ వికెట్ కీపర్ బ్యాటర్. యోగా చేస్తూ, మైదానంలో పరుగులు తీస్తూ ఇందులో... యోగా చేస్తూ, మైదానంలో పరుగులు తీస్తూ కనిపించాడు. దీనిని బట్టి త్వరలోనే రీఎంట్రీ ఇచ్చేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు ఇషాన్ చెప్పకనే చెప్పినట్లయింది. అయితే, ఇప్పటికే శుబ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్‌లతో పాటు రుతురాజ్ గైక్వాడ్ నుంచి ఓపెనింగ్ స్థానానికి ఇషాన్ గట్టి పోటీని ఎదుర్కొంటున్నాడు. మరోవైపు... కేఎల్ రాహుల్- శ్రీకర్ భరత్(టెస్టు), సంజూ శాంసన్- జితేశ్ శర్మ(వన్డే, టీ20లలో) రూపంలో వికెట్ కీపర్ స్థానానికి తీవ్రమైన పోటీ ఎదురవుతోంది. ఈ నేపథ్యంలో ఇషాన్ కిషన్ విషయంలో మేనేజ్మెంట్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది. చదవండి: NZ vs Pak: చరిత్ర సృష్టించిన కివీస్ పేసర్: ప్రపంచంలోనే ఏకైక బౌలర్‌గా రికార్డు 🏃♂️ pic.twitter.com/XjUfL18Ydc — Ishan Kishan (@ishankishan51) January 12, 2024 -
రోహిత్ రనౌట్.. తప్పు అతడిదే: టీమిండియా మాజీ బ్యాటర్
India vs Afghanistan, 1st T20I - Rohit Sharma Run Out: అంతర్జాతీయ టీ20 పునరాగమనంలో విఫలమైన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు భారత మాజీ క్రికెటర్ పార్థివ్ పటేల్ అండగా నిలిచాడు. శుబ్‌మన్ గిల్ కారణంగానే రోహిత్ వికెట్ పారేసుకోవాల్సి వచ్చిందని అభిప్రాయపడ్డాడు. గిల్ గనుక సరైన సమయంలో స్పందించి ఉంటే రోహిత్ ఆట తీరు మరోలా ఉండేదని పేర్కొన్నాడు. సుమారు 14 నెలల విరామం తర్వాత రోహిత్ శర్మ ఇంటర్నేషనల్ టీ20లలో రీఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. అఫ్గనిస్తాన్‌తో స్వదేశంలో సిరీస్ సందర్భంగా తిరిగి టీ20 జట్టు పగ్గాలు చేపట్టిన హిట్‌మ్యాన్.. ఆరంభ మ్యాచ్‌లోనే రనౌట్ అయ్యాడు. గిల్ కదల్లేదు.. రోహిత్ రనౌట్ మొహాలీ వేదికగా గురువారం నాటి మ్యాచ్‌లో భారత ఇన్నింగ్స్‌లో రెండో బంతికే డకౌట్‌గా వెనుదిరిగాడు ఈ ఓపెనింగ్ బ్యాటర్. నిజానికి బంతిని బాదిన తర్వాత వేగంగా క్రీజును వీడిన రోహిత్ శర్మ.. తన జోడీ గిల్‌ను పరుగుకు రావాల్సిందిగా పిలిచాడు. కానీ ఫీల్డర్ల విన్యాసాలు గమనిస్తూ.. బంతిని చూస్తూ అలాగే ఉండిపోయిన గిల్ అక్కడి నుంచి కదల్లేదు. అప్పటికే రోహిత్.. గిల్ ఉన్న ఎండ్‌కి వచ్చేయగా.. అఫ్గనిస్తాన్ వికెట్ కీపర్ రహ్మనుల్లా గుర్బాజ్ వికెట్లను గిరాటేశాడు. అంతే.. రోహిత్ శర్మ సున్నాకే పెవిలియన్ చేరాడు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన అతడు గిల్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ మైదానం వీడాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌కాగా.. తప్పు ఎవరిదన్న చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో భారత మాజీ వికెట్ కీపర్ బ్యాటర్ పార్థివ్ పటేల్ స్పందించాడు. రోహిత్ శర్మపై నమ్మకం ఉంచాల్సింది స్టార్ స్పోర్ట్స్ షోలో మాట్లాడుతూ.. ‘‘రోహిత్ శర్మపై శుబ్‌మన్ గిల్ నమ్మకం ఉంచాల్సింది. అంతర్జాతీయ టీ20లలో వాళ్లిద్దరు కలిసి ఓపెనింగ్ చేయడం ఇదే తొలిసారి అని తెలుసు. కానీ వన్డే, టెస్టుల్లో వారిద్దరు ఇప్పటికే ఎన్నో మ్యాచ్‌లలో కలిసి ఆడారు. శుబ్‌మన్ గిల్ బాల్నే చూస్తూ ఉండటం వల్ల సమన్వయలోపం చోటుచేసుకుంది. గిల్ అలా చేసే బదులు రోహిత్ పిలవగానే పరిగెత్తుకుని వస్తే బాగుండేది’’ అని పార్థివ్ పటేల్ అభిప్రాయపడ్డాడు. ఏదేమైనా రీఎంట్రీలో రోహిత్ శర్మ ఇలా డకౌట్ కావడం నిరాశపరిచిందని విచారం వ్యక్తం చేశాడు. కాగా అఫ్గనిస్తాన్‌తో మొదటి టీ20లో ఆరు వికెట్ల తేడాతో గెలుపొందిన రోహిత్ సేన.. ఇండోర్‌లో జనవరి 14న రెండో మ్యాచ్‌లో తలపడనుంది. చదవండి: Ind vs Afg: కావాలనే అలా చేశాం: రోహిత్ శర్మ Ind vs Afg: కోహ్లి రీఎంట్రీ.. అతడిపై వేటు? సంజూకు మళ్లీ నో ఛాన్స్ -
Ind vs Afg: కోహ్లి రీఎంట్రీ.. అతడిపై వేటు? సంజూకు మళ్లీ నో ఛాన్స్
India vs Afghanistan, 2nd T20I- Virat Kohli Re-Entry: అఫ్గనిస్తాన్‌తో సిరీస్ ద్వారా అంతర్జాతీయ టీ20 ఫార్మాట్లో టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి పునరాగమనం చేయనున్నాడు. వ్యక్తిగత కారణాల దృష్ట్యా తొలి మ్యాచ్‌కు దూరమైన ఈ రన్‌మెషీన్.. ఇండోర్‌లో రెండో టీ20కి అందుబాటులోకి రానున్నాడు. ఈ విషయాన్ని టీమిండియా హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్ స్వయంగా ప్రకటించాడు. కోహ్లి రాక.. వేటు ఎవరిపై? మరి.. సీనియర్ ప్లేయర్, స్టార్ బ్యాటర్ కోహ్లి తిరిగి టీ20 జట్టుతో చేరితే ఎవరిపై వేటు పడనుంది?! మొహాలీ వేదికగా అఫ్గన్‌తో జరిగిన తొలి టీ20లో రోహిత్ శర్మతో పాటు శుబ్‌మన్ గిల్ ఓపెనింగ్ చేసిన విషయం తెలిసిందే. లెఫ్టాండర్ యశస్వి తిరిగి వస్తే లెఫ్ట్- రైట్ కాంబినేషన్ కోసం రోహిత్‌కు జోడీగా యశస్వి జైస్వాల్‌ను ఆడిస్తామని ద్రవిడ్ ముందే చెప్పినప్పటికీ.. గజ్జల్లో గాయం కారణంగా జైస్వాల్ సెలక్షన్‌కు అందుబాటులో లేకుండా పోయాడు. దీంతో గిల్‌ను అదృష్టం వరించింది. మరోవైపు.. కోహ్లి గైర్హాజరీలో హైదరాబాద్ బ్యాటర్ తిలక్ వర్మకు వన్‌డౌన్‌లో ఆడే అవకాశం దక్కింది. సాధారణంగా తిలక్ బ్యాటింగ్ ఆర్డర్లో నాలుగో స్థానంలో వస్తాడు. అయితే, తొలి టీ20లో మాత్రం అతడు టాపార్డర్‌కు ప్రమోట్ అయ్యాడు. తిలక్ వర్మ సైతం.. ఇక ఈ మ్యాచ్‌లో గిల్‌తో సమన్వయలోపంతో రోహిత్ శర్మ రనౌట్(డక్) కాగా.. గిల్ 12 బంతుల్లోనే 23 పరుగులతో రాణించాడు. తిలక్ వర్మ సైతం 22 బంతుల్లో 26 రన్స్ సాధించాడు. ఇలా వీరిద్దరు తమ వంతు బాధ్యతను చక్కగానే పూర్తి చేశారు. అయితే.. అఫ్గనిస్తాన్‌తో రెండో టీ20కి కోహ్లితో పాటు.. ఒకవేళ యశస్వి జైస్వాల్ కూడా అందుబాటులోకి వస్తే వీళ్లిద్దరిలో ఒకరిపై వేటు పడటం ఖాయం. ముఖ్యంగా వీరిద్దరి రాకతో గిల్‌కే ఎక్కువ ప్రమాదం పొంచి ఉంది. ఎందుకంటే.. ఓపెనర్‌గా యశస్వి, వన్‌డౌన్‌లో కోహ్లి ఆడితే.. బ్యాటింగ్ ఆర్డర్లో మిగిలిన ఏ స్థానంలో గిల్ బ్యాటింగ్ చేసే అవకాశం లేదు. యశస్వి రాకుంటే అలా కాకుండా.. గిల్ అదృష్టం బాగుండి యశస్వికి విశ్రాంతిని పొడిగిస్తే మాత్రం అతడికి లైన్ క్లియర్ అవుతుంది. అప్పుడు తిలక్ వర్మ ప్లేస్ గల్లంతవుతుంది. కోహ్లి కోసం తిలక్ తప్పుకోవాల్సి ఉంటుంది. కాగా అఫ్గనిస్తాన్‌తో తొలి టీ20లో టీమిండియా ఆరు వికెట్ల తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే. వాషీని వద్దనుకుంటే.. అప్పుడు సేఫ్ ఒకవేళ.. షార్ట్ బౌండరీలకు ప్రసిద్ధి పొందిన ఇండోర్ పిచ్‌పై బ్యాటింగ్ డెప్త్ కోసం ఐదుగురు బౌలర్లతోనే బరిలోకి దిగాలనుకుంటే అప్పుడు వాషింగ్టన్ సుందర్‌పై వేటు పడే అవకాశం ఉంటుంది. తొలి టీ20 హీరో శివం దూబే(పేస్ ఆల్‌రౌండర్), అక్షర్ పటేల్(స్పిన్ ఆల్‌రౌండర్), రవి బిష్ణోయి(స్పిన్నర్), పేసర్లు అర్ష్‌దీప్ సింగ్, ముకేశ్ కుమార్‌లను ఆడించి .. వాషీని పక్కనపెడితే అప్పుడు తిలక్ కూడా సేఫ్‌గానే ఉంటాడు. ఇదిలా ఉంటే.. వికెట్ కీపర్ బ్యాటర్ జితేశ్ శర్మ తనకు వచ్చిన అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకున్నాడు. ఐదో స్థానంలో బ్యాటింగ్ చేసిన అతడు 20 బంతుల్లోనే 31 పరుగులతో ఆకట్టుకున్నాడు. సంజూ శాంసన్‌ను కాదని సెలక్టర్లు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. కాబట్టి రెండో టీ20లో సంజూకు మరోసారి మొండిచేయే ఎదురయ్యే ఛాన్స్ ఉంది. అఫ్గనిస్తాన్‌తో రెండో టీ20(జనవరి 14)కి భారత జట్టు(అంచనా) రోహిత్ శర్మ(కెప్టెన్), యశస్వి జైస్వాల్/శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, శివం దూబే, జితేశ్ శర్మ(వికెట్ కీపర్), రింకూ సింగ్, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయి, అర్ష్‌దీప్ సింగ్, ముకేశ్ కుమార్. చదవండి: NZ vs Pak: చరిత్ర సృష్టించిన కివీస్ పేసర్: ప్రపంచంలోనే ఏకైక బౌలర్‌గా రికార్డు -
Ind vs Afg: కావాలనే అలా చేశాం: రోహిత్ శర్మ
India vs Afghanistan, 1st T20I- Rohit Sharma Comments: టీ20 ప్రపంచకప్-2024కు సన్నద్ధమయ్యే క్రమంలో టీమిండియా యువ క్రికెటర్లు కఠిన సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుందని కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. ఇందుకోసం ఉద్దేశపూర్వకంగానే వాళ్లను కొన్నిసార్లు ఒత్తిడిలోకి నెట్టాలని నిర్ణయించుకున్నట్లు తెలిపాడు. మెగా టోర్నీకి సిద్ధమయ్యే క్రమంలో ప్రయోగాలకు వెనుకాడబోవద్దని మేనేజ్మెంట్ స్పష్టంగా చెప్పినట్లు పేర్కొన్నాడు. 14 నెలల తర్వాత రీఎంట్రీ కాగా వరల్డ్‌కప్‌నకు ముందు భారత జట్టు అఫ్గనిస్తాన్‌తో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడేందుకు షెడ్యూల్ ఖరారైన విషయం తెలిసిందే. సీనియర్, స్టార్ బ్యాటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి ఈ సిరీస్ ద్వారా దాదాపు 14 నెలల విరామం తర్వాత రీఎంట్రీకి సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా మొహాలీ వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌తో రోహిత్ పునరాగమనం చేయగా.. రెండో టీ20 నుంచి కోహ్లి అందుబాటులోకి రానున్నాడు. ఇదిలా ఉంటే.. అఫ్గన్‌తో గురువారం మొదటి మ్యాచ్‌లో టీమిండియా ఆరు వికెట్ల తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే. రోహిత్, అక్షర్ పటేల్ మినహా మిగతా అంతా కుర్రాళ్లే ఆడిన ఈ టీ20లో తాము అమలు చేసిన ప్రణాళికల గురించి హిట్‌మ్యాన్ వివరించాడు. మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ.. ‘‘ఆటలో వైవిధ్యం చూపేందుకు ప్రయోగాలు చేయాలని నిర్ణయించుకున్నాం. ముఖ్యంగా మా బౌలర్లను అన్ని రకాల పరిస్థితుల్లో మెరుగ్గా బౌలింగ్ చేసేందుకు సంసిద్ధులను చేయాలని భావించాం. అందుకే 19వ ఓవర్లో అతడి చేతికి బంతి అందులో భాగంగానే.. ఈరోజు వాషీ(వాషింగ్టన్ సుందర్) చేత 19వ ఓవర్ వేయించడం మీరంతా చూసే ఉంటారు. ఎక్కడైతే మా యంగ్ ప్లేయర్లు కాస్త వెనుకబడి ఉన్నారు?.. ఒత్తిడిలో ఉన్నపుడు నేర్పుతో అధిగమించగలరా లేదా అని పరీక్షించాలనుకున్నాం. అందుకు అనుగుణంగానే ఈరోజు మా వ్యూహాలు అమలు చేశాం. అయితే, మ్యాచ్‌ను మూల్యంగా చెల్లించే పరిస్థితులు మాత్రం రాకూడదని జాగ్రత్తపడ్డాం. ఏదేమైనా ఈరోజు సానుకూలంగా ముగిసింది’’ అని రోహిత్ శర్మ హర్షం వ్యక్తం చేశాడు. శివాలెత్తిన శివం దూబే కాగా మొహాలీ మ్యాచ్‌లో స్పిన్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ కట్టుదిట్టంగా బౌలింగ్(2/23).. మరో స్పిన్నర్ రవి బిష్ణోయి మూడు ఓవర్ల బౌలింగ్‌లో ఏకంగా 35 పరుగులు ఇచ్చుకున్నాడు. ఇక వాషింగ్టన్ సుందర్ 3 ఓవర్లలో 23 పరుగులు ఇచ్చాడు. అయితే, 19వ ఓవర్లోనే ఏకంగా అతడు 13 పరుగులు సమర్పించుకోవడం విశేషం. ఇదిలా ఉంటే.. అఫ్గన్ విధించిన 159 పరుగుల లక్ష్య ఛేదనలో ఆల్‌రౌండర్ శివం దూబే 40 బంతుల్లో 60 పరుగులతో అజేయంగా నిలిచి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. తద్వారా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. కాగా అఫ్గనిస్తాన్ సిరీస్ ముగిసిన తర్వాత ఐపీఎల్-2024లో ఆటగాళ్లు పాల్గొననున్నారు. ఆ తర్వాత జూన్ 4 నుంచి టీ20 ప్రపంచప్ టోర్నీ ఆరంభం కానుంది. చదవండి: Rohit Sharma: రీఎంట్రీలో రోహిత్ డకౌట్.. మరీ ఘోరంగా..! తప్పు ఎవరిది? Acing the chase 😎 Conversations with Captain @ImRo45 👌 Message for a special bunch 🤗 Hear from the all-rounder & Player of the Match of the #INDvAFG T20I opener - @IamShivamDube 👌👌 - By @ameyatilak WATCH 🎥🔽 #TeamIndia | @IDFCFIRSTBank pic.twitter.com/edEH8H3O5f — BCCI (@BCCI) January 12, 2024 -
పొట్టి ఫార్మాట్లో రోహిత్ శర్మ ప్రపంచ రికార్డు!
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన ఘనత సాధించాడు. అంతర్జాతీయ టీ20ల్లో 100 విజయాల్లో భాగమైన తొలి పురుష క్రికెటర్‌గా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. గురువారం ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన తొలి టీ20లో టీమిండియా విజయం సాధించడం ద్వారా హిట్‌మ్యాన్ ఖాతాలో ఈ రికార్డు చేరింది. రోహిత్ ఈ ఘనతను కేవలం 149 మ్యాచ్‌ల్లోనే అందుకున్నాడు. ఈ మ్యాచ్‌లో రోహిత్ ఖాతా తెరవకుండానే ఔటైనా అతని ఖాతాలో ప్రపంచ రికార్డు చేరడం విశేషం. Players to be part of most wins in T20I history: 1) Rohit Sharma - 100* 2) Shoaib Malik - 86 Hitman created history in Mohali. pic.twitter.com/x7UkiRwMUv — Johns. (@CricCrazyJohns) January 11, 2024 ఓవరాల్‌గా అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక విజయాల్లో భాగమైన రికార్డు ఇంగ్లండ్ మహిళా క్రికెటర్ డ్యానీ వ్యాట్ (111) పేరిట ఉండగా.. పురుషుల క్రికెట్లో రోహిత్ తర్వాత ఈ రికార్డు పాక్ ఆటగాడు షోయబ్ మాలిక్ (124 మ్యాచ్‌ల్లో 86 విజయాలు) పేరిట ఉంది. రోహిత్ తర్వాత భారత్ తరఫున అత్యధిక టీ20 విజయాల్లో భాగమైన ఘనత విరాట్ కోహ్లి (115 మ్యాచ్‌ల్లో 73 విజయాలు) సొంతం చేసుకున్నాడు. ఆఫ్ఘన్‌తో తొలి టీ20లో విజయం సాధించడం ద్వారా హిట్‌మ్యాన్ కెప్టెన్‌గానూ అరుదైన గుర్తింపు దక్కించుకున్నాడు. హిట్‌మ్యాన్ సారథ్యంలో టీమిండియా కేవలం 52 మ్యాచ్‌ల్లోనే 40 విజయాలు సాధించింది. Rohit Sharma has 40 wins from just 52 games in T20I as a captain 🇮🇳 - One of the most successful captains in T20I history. pic.twitter.com/Tpas68JN4M — Johns. (@CricCrazyJohns) January 12, 2024 మ్యాచ్ విషయానికొస్తే.. శివమ్ దూబే ఆల్‌రౌండ్ ప్రదర్శనతో (1/9, 60 నాటౌట్) చెలరేగడంతో భారత్ 6 వికెట్ల తేడాతో ఆఫ్ఘనిస్తాన్‌ను చిత్తు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్.. నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. మొహమ్మద్ నబీ (42) మెరుపు ఇన్నింగ్స్‌తో రాణించగా.. గుర్బాజ్ (23), కెప్టెన్ ఇబ్రహీం జద్రాన్ (25), అజ్మతుల్లా (29), నజీబుల్లా (19 నాటౌట్) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. భారత బౌలర్లలో ముకేశ్ కుమార్, అక్షర్ పటేల్ తలో 2 వికెట్లు పడగొట్టగా.. శివమ్ దూబే ఓ వికెట్ దక్కించుకున్నాడు. అనంతరం ఛేదనలో భారత్ ఖాతా తెరవకుండానే రోహిత్ (0) వికెట్ కోల్పోయినా కుర్రాళ్లు జట్టును గెలిపించారు. శుభ్‌మన్ గిల్ (23), తిలక్ వర్మ (26), శివమ్ దూబే (60 నాటౌట్), జితేశ్ శర్మ (31 ), రింకూ సింగ్ (16 నాటౌట్) టీమిండియాను విజయతీరాలకు చేర్చారు. ఆఫ్ఘన్ బౌలర్లలో ముజీబ్ 2, ఒమర్జాయ్ ఓ వికెట్ పడగొట్టారు. ఈ గెలుపుతో భారత్ మూడు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. రెండో టీ20 ఇండోర్ వేదికగా జనవరి 14న జరుగనుంది. -
అతడొక అద్భుతం.. నేను అనుకున్నది జరగలేదు! గిల్ కూడా: రోహిత్
మొహాలీ వేదికగా అఫ్గానిస్తాన్‌తో జరిగిన తొలి టీ20లో టీమిండియా ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టింది. అ మ్యాచ్‌లో ప్రత్యర్ధి అఫ్గానిస్తాన్‌ను 6 వికెట్ల తేడాతో భారత్ చిత్తు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. అఫ్గాన్ బ్యాటర్లలో మహ్మద్ నబీ(42) పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడగా.. ఓమర్జాయ్(29), ఇబ్రహీం జద్రాన్(25) రాణించారు. భారత బౌలర్లలో ముఖేష్ కుమార్, అక్షర్ పటేల్ తలా రెండు వికెట్లు పడగొట్టగా.. శివమ్ దుబే ఒక్క వికెట్ సాధించాడు. అనంతరం 159 పరుగుల లక్ష్యాన్ని భారత్ 17.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. భారత బ్యాటర్లలో శివమ్ దూబే(60 నాటౌట్) హాప్ సెంచరీతో చెలరేగాడు. అతడి ఇన్నింగ్స్‌లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లు ఉన్నాయి. అంతకుముందు బౌలింగ్‌లోనూ దూబే ఓ కీలక వికెట్ పడగొట్టాడు. అతడి ఆల్‌రౌండ్ ప్రదర్శనకు మ్యాన్ ఆఫ్‌ది మ్యాచ్ అవార్డు లభించింది. ఇక ఈ విజయంపై మ్యాచ్ అనంతరం టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించాడు. మొహాలీలో వాతావరణ పరిస్థితులు చాలా కష్టతరంగా ఉన్నప్పటికీ.. తమ కుర్రాళ్లు అద్భుత ప్రదర్శన కనబరిచారని రోహిత్ కొనియాడాడు. "మొహాలీలో విపరీతమైన చలిగా ఉంది. ఫీల్డింగ్‌లో తొలుత బంతి చేతి వేలికి తాకగానే తీవ్రమైన నొప్పితో బాధపడ్డాను. వెంటనే ఫిజియో హాట్ వాటర్ బ్యాగ్స్ తీసుకువచ్చాడు. ఆ తర్వాత వేడి నీటిలో వేలిని ఉంచితే నొప్పి తగ్గింది. ఇక ఈ మ్యాచ్‌లో మాకు చాలా సానుకూలంశాలు ఉన్నాయి. ముఖ్యంగా బౌలింగ్‌లో మేము అద్భుతమైన ప్రదర్శన కనబరిచాం. ఇక్కడ పరిస్థితిలు చాలా క్లిష్టంగా ఉన్నాయి. మా స్పిన్నర్లు బాగా బౌలింగ్ చేశారు . అదే విధంగా సీమర్లు కూడా అద్భుతంగా రాణించారని" రోహిత్ శర్మ పోస్ట్ మ్యాచ్ ప్రేజేంటేషన్‌లో తెలిపాడు. ఇక ఈ మ్యాచ్‌లో తన రనౌట్ గురించి హిట్‌మ్యాన్ మాట్లాడుతూ.. ఇటువంటివి సాధారణంగా జరుగుతూనే ఉంటాయి. దురదృష్టవశాత్తూ రనౌట్ అయితే ఎవరైనా నిరుత్సాహానికి గురవుతారు. ప్రతీ ఆటగాడు జట్టు విజయంలో భాగం కావాలని కోరుకుంటాడు. నేను కూడా కొన్ని పరుగులు చేయాలనకున్నాను. కానీ కొన్ని సార్లు మనం అనుకున్నది జరగదు. ఏదైనప్పటికీ ఈ మ్యాచ్‌లో మేము గెలిచాం. నేను ఔటైనప్పటికీ గిల్ మ్యాచ్‌ను ఫినిష్ చేయాలని కోరుకున్నాను. కానీ అతడు కూడా మంచి ఇన్నింగ్స్ ఆడిన తర్వాత ఔట్ అయ్యాడు.శివమ్ దూబే, జితేష్ బ్యాటింగ్ చేసిన విధానం అద్భుతం. తిలక్, రింకూ కూడా తమ వంతు పాత్ర పోషించారని పేర్కొన్నాడు. -
దంచి కొట్టిన దూబే.. అఫ్గాన్‌ను చిత్తు చేసిన భారత్
అఫ్గానిస్తాన్‌తో మూడో టీ20ల సిరీస్‌లో టీమిండియా శుభారంభం చేసింది. మొహాలీ వేదికగా అఫ్గాన్‌తో జరిగిన తొలి టీ20లో 6 వికెట్ల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. 159 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 17.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. భారత విజయంలో ఆల్‌రౌండర్ శివమ్ దూబే ముఖ్య భూమిక పోషించాడు. తొలుత బౌలింగ్‌లో కీలక వికెట్ పడగొట్టిన దూబే.. అనంతరం బ్యాటింగ్‌లోనూ అదరగొట్టాడు. 40 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 60 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. దూబేతో పాటు జితేష్ శర్మ(31), తిలక్ వర్మ(26) కీలక ఇన్నింగ్స్ ఆడారు. అఫ్గాన్ బౌలర్లలో ముజీబ్ రెహ్మన్ రెండు వికెట్లు పడగొట్టారు. అంతకముందు బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. అఫ్గాన్ బ్యాటర్లలో మహ్మద్ నబీ(42) పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడగా.. ఓమర్జాయ్(29), ఇబ్రహీం జద్రాన్(25) రాణించారు. భారత బౌలర్లలో ముఖేష్ కుమార్, అక్షర్ పటేల్ చెరో రెండు వికెట్లు పడగొట్టగా.. శివమ్ దుబే ఒక్క వికెట్ సాధించాడు. కాగా దాదాపు 14 నెలల తర్వాత టీ20ల్లో రీఎంట్రీ ఇచ్చిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ.. ఈ మ్యాచ్‌లో డకౌట్‌గా వెనుదిరిగాడు. ఇక ఇరు జట్ల మధ్య రెండో టీ20 ఇండోర్ వేదికగా జనవరి 14న జరగనుంది. -
టీమిండియాతో మ్యాచ్.. చరిత్ర సృష్టించిన జద్రాన్ బృందం
టీమిండియాతో తొలి టీ20లో అఫ్గనిస్తాన్ మెరుగైన స్కోరు సాధించింది. నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. తద్వారా భారత జట్టుపై పొట్టి ఫార్మాట్లో తమకున్న రికార్డును జద్రాన్ బృందం తాజాగా బ్రేక్ చేసింది. టీ20 సిరీస్ ఆడేందుకు తొలిసారిగా భారత్‌లో పర్యటిస్తున్న అఫ్గనిస్తాన్‌కు 22 ఏళ్ల బ్యాటర్ ఇబ్రహీం జద్రాన్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ వెన్నునొప్పి సర్జరీ కారణంగా ఆటకు దూరం కాగా.. అతడి స్థానంలో జద్రాన్ సారథ్య బాధ్యతలు చేపట్టాడు. ఈ క్రమంలో మొహాలీ వేదికగా మొదటి టీ20లో టాస్ ఓడిన అఫ్గనిస్తాన్ టీమిండియా ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్ చేసింది. ఓపెనర్లు రహ్మనుల్లా గుర్బాజ్(23), ఇబ్రహీం జద్రాన్(25) శుభారంభం అందించగా.. వన్‌డౌన్ బ్యాటర్ అజ్మతుల్లా ఒమర్జాయ్ 29 పరుగులతో రాణించాడు. Nabi power 💪🔥 The Afghan veteran is striking them hard in the 1st #INDvAFG T20I! 🙌#IDFCFirstBankT20ITrophy #JioCinemaSports #GiantsMeetGameChangers pic.twitter.com/BMMMJEnB3G — JioCinema (@JioCinema) January 11, 2024 అరంగేట్ర ప్లేయర్ రహ్మత్ షా(3) విఫలం కాగా.. మహ్మద్ నబీ 42 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఆఖర్లో నజీబుల్లా 11 బంతుల్లో 19, కరీం జనత్ 5 బంతుల్లో 9 పరుగులతో ధనాధన్ ఇన్నింగ్స్ ఆడారు. దీంతో అఫ్గన్ 158 పరుగులు స్కోరు చేయగలిగింది. టీమిండియా బౌలర్లలో అక్షర్ పటేల్, ముకేశ్ కుమార్ రెండేసి వికెట్లు పడగొట్టగా.. శివం దూబే ఒక వికెట్ దక్కించుకున్నాడు. రవి బిష్ణోయి 3 ఓవర్ల బౌలింగ్‌లో ఏకంగా 35 పరుగులు ఇచ్చి చెత్త ప్రదర్శన నమోదు చేశాడు. ఇదిలా ఉంటే.. టీమిండియాపై టీ20లలో అఫ్గనిస్తాన్‌కు ఇదే అత్యధిక స్కోరు కావడం విశేషం. టీ20 వరల్డ్‌కప్-2021లో భాగంగా అబుదాబిలో టీమిండియాతో జరిగిన మ్యాచ్‌లో అఫ్గన్ ఏడు వికెట్ల నష్టానికి 144 పరుగులు చేసింది. తాజాగా జద్రాన్ బృందం ఆ రికార్డును తిరగరాసి చరిత్ర సృష్టించింది. -
Ind vs Afg: రీఎంట్రీలో రోహిత్ డకౌట్! తప్పు తనదే అయినా..
Ind vs Afg 1st T20I Rohit Sharma Duck Out: అఫ్గనిస్తాన్‌తో తొలి టీ20లో టీమిండియా కెప్టెన్, ఓపెనర్ రోహిత్ శర్మకు చేదు అనుభవం ఎదురైంది. దాదాపు 14 నెలల తర్వాత అంతర్జాతీయ టీ20లలో పునరాగమనం చేసిన హిట్‌మ్యాన్ డకౌట్ అయ్యాడు. మరో ఓపెనర్ శుబ్‌మన్ గిల్‌తో సమన్వయ లోపం కారణంగా రనౌట్ అయి పెవిలియన్ చేరాడు. పరుగుల ఖాతా తెరవకుండానే సున్నా చుట్టి నిష్క్రమించాడు. దీంతో టీమిండియా తరఫున రీఎంట్రీలో రోహిత్ బ్యాటింగ్ మెరుపులు చూడాలని ఆశపడ్డ అభిమానులకు నిరాశే ఎదురైంది. హిట్‌మ్యాన్ సైతం ఊహించని ఈ పరిణామంతో కంగుతిని గిల్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ అసంతృప్తితో డగౌట్ చేరాడు. ఈ నేపథ్యంలో నెట్టింట రోహిత్ శర్మ పేరు వైరల్‌గా మారింది. ఈ నేపథ్యంలో.. ‘‘అయ్యో పాపం.. రోహిత్ దురదృష్టం కారణంగానే ఇలా జరిగింది’’ అని అభిమానులు అంటుండగా.. మరికొంత మంది నెటిజన్లు మాత్రం.. ‘‘చూసుకుని ఆడాలి కదా! సీనియర్.. పైగా రీఎంట్రీ.. కెప్టెన్ ఇలా బాధ్యతారహితంగా ఆడితే మిగతా వాళ్ల పరిస్థితి ఏంటి?’’ అని ట్రోల్ చేస్తున్నారు. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా మొహాలీ వేదికగా తొలి టీ20లో టాస్ గెలిచిన టీమిండియా తొలుత బౌలింగ్ ఎంచుకుంది.బ్యాటింగ్‌కు దిగిన అఫ్గనిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 158 పరుగులు చేసింది. ఈ క్రమంలో లక్ష్య ఛేదనలో రెండో బంతికే టీమిండియా రోహిత్ శర్మ వికెట్ కోల్పోయింది. Nabi power 💪🔥 The Afghan veteran is striking them hard in the 1st #INDvAFG T20I! 🙌#IDFCFirstBankT20ITrophy #JioCinemaSports #GiantsMeetGameChangers pic.twitter.com/BMMMJEnB3G — JioCinema (@JioCinema) January 11, 2024 ఫజల్హక్ ఫారూకీ బౌలింగ్‌లో రోహిత్ మిడాఫ్ దిశగా షాట్‌కి యత్నించాడు. ఈ క్రమంలో పరుగు తీసేందుకు వెళ్లగా గిల్‌తో సమన్వయలోపం ఏర్పడింది. అప్పటికే అద్భుతరీతిలో డైవ్ చేసిన అఫ్గన్ కెపెన్ జద్రాన్ బంతి దాటిపోకుండా ఆపేశాడు. కానీ అప్పటికే క్రీజు వీడిన రోహిత్.. గిల్‌ను రమ్మని పిలవగా బంతిని ఫీల్డర్ అందుకోవడం చూసిన అతడు అక్కడే ఉండిపోయాడు. అయితే, తాను అవుట్ కావడంతో రోహిత్ శర్మ గిల్‌పై ఆగ్రహం వ్యక్తం చేయడం గమనార్హం.మరోవైపు.. జద్రాన్, వికెట్ కీపర్ రహ్మనుల్లా గుర్బాజ్ కలిసి రోహిత్ రనౌట్‌లో పాలుపంచుకున్నారు. బిగ్‌వికెట్ దక్కడంతో అఫ్గన్ సంబరాలు అంబరాన్నంటాయి. -
ద్రవిడ్ చెప్పినా .. యశస్వి బదులు గిల్! ఎందుకంటే?
మొహాలీలోని ఐఎస్ బింద్రా క్రికెట్ స్టేడియంలో భారత్-అఫ్గానిస్తాన్ జట్లు తొలి టీ20 తలపడుతున్నాయి. అయితే ఈ మ్యాచ్‌కు భారత తుది జట్టులో యువ ఓపెనర్ యశస్వీ జైశ్వాల్‌కు చోటు దక్కకపోవడం అందరిని ఆశ్చర్యపరిచింది. ఎందుకంటే భారత ఇన్నింగ్స్‌ను రోహిత్ శర్మతో కలిసి జైశ్వాల్ ప్రారంభిస్తాడని హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్ ఇప్పటికే స్పష్టం చేశాడు. ఈ క్రమంలో జైశ్వాల్‌కు ఎందుకు చోటు దక్కలేదని నెటిజన్లు తెగ చర్చించుకుంటున్నారు. కారణమిదే.. అయితే గాయం కారణంగా ఆఖరి నిమిషంలో జైశ్వాల్ దూరమైనట్లు బీసీసీఐ ఒక ప్రకటనలో బీసీసీఐ పేర్కొంది. కుడి గజ్జలో నొప్పితో బాధపడుతున్నాడని, ఆడే పరిస్థితుల్లో లేడని బీసీసీఐ ఎక్స్ వేదికగా తెలిపింది. భారత ఇన్నింగ్స్‌ను రోహిత్ శర్మ, శుబ్‌మన్ గిల్ ప్రారంభించనున్నారు. అదే విధంగా ఈ మ్యాచ్‌కు వికెట్ కీపర్ సంజూ శాంసన్‌కు కూడా చోటు దక్కలేదు. అతడి స్ధానంలో జితేష్ శర్మకు ఛాన్స్ ఇచ్చారు. తుది జట్లు భారత్: రోహిత్ శర్మ(కెప్టెన్), శుబ్‌మన్ గిల్, తిలక్ వర్మ, శివమ్ దూబే, జితేశ్ శర్మ, రింకు సింగ్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, ముఖేష్ కుమార్ అఫ్గానిస్తాన్: రహ్మానుల్లా గుర్బాజ్(వికెట్ కీపర్), ఇబ్రహీం జద్రాన్(కెప్టెన్), రహమత్ షా, అజ్మతుల్లా ఒమర్జాయ్, మహ్మద్ నబీ, నజీబుల్లా జద్రాన్, కరీం జనత్, గుల్బాదిన్ నాయబ్, ఫజల్హాక్ ఫారూఖీ, నవీన్-ఉల్-హక్, ముజీబ్ ఉర్ రహ్మాన్ -
శివాలెత్తిన శివమ్ దూబే.. అఫ్గాన్‌పై టీమిండియా ఘన విజయం
India vs Afghanistan, 1st T20I Updates: టీమిండియా ఘన విజయం.. మొహాలీ వేదికగా అఫ్గాన్‌తో జరిగిన తొలి టీ20లో 6 వికెట్ల తేడాతో టీమిండియా ఘన విజయం సాధించింది. 159 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 17.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. భారత విజయంలో ఆల్‌రౌండర్ శివమ్ దూబే ముఖ్య భూమిక పోషించాడు. తొలుత బౌలింగ్‌లో కీలక వికెట్ పడగొట్టిన దూబే.. అనంతరం బ్యాటింగ్‌లోనూ అదరగొట్టాడు. 40 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 60 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. దూబేతో పాటు జితేష్ శర్మ(31), తిలక్ వర్మ(26) కీలక ఇన్నింగ్స్ ఆడారు. అఫ్గాన్ బౌలర్లలో ముజీబ్ రెహ్మన్ రెండు వికెట్లు పడగొట్టారు. అంతకుముందు అఫ్గానిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. అఫ్గాన్ బ్యాటర్లలో మహ్మద్ నబీ(42) పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడగా.. ఓమర్జాయ్(29), ఇబ్రహీం జద్రాన్(25) రాణించారు. భారత బౌలర్లలో ముఖేష్ కుమార్, అక్షర్ పటేల్ చెరో రెండు వికెట్లు పడగొట్టగా.. శివమ్ దుబే ఒక్క వికెట్ సాధించాడు. టీమిండియా నాలుగో వికెట్ డౌన్ 117 పరుగుల వద్ద టీమిండియా నాలుగో వికెట్ కోల్పోయింది. 31 పరుగులు చేసిన జితేష్ శర్మ.. ముజీబ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 13 ఓవర్లకు టీమిండియా స్కోర్: 112/3 13 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా 3 వికెట్ల నష్టానికి 112 పరుగులు చేసింది. భారత విజయానికి 42 బంతుల్లో 47 పరుగులు కావాలి. క్రీజులో జితేష్ శర్మ(27), శివమ్ దుబే(34) పరుగులతొ ఉన్నారు. మూడో వికెట్ డౌన్.. 72 పరుగుల వద్ద టీమిండియా మూడో వికెట్ కోల్పోయింది. 26 పరుగులు చేసిన తిలక్ వర్మ.. ఓమర్జాయ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. పవర్ ప్లేలో అఫ్గన్ పైచేయి కట్టుదిట్టంగా అఫ్గన్ బౌలింగ్.. టీమిండియా స్కోరు: 36-2(6) 3.5: రెండో వికెట్ కోల్పోయిన టీమిండియా శుబ్‌మన్ గిల్(23) రూపంలో టీమిండియా రెండో వికెట్ కోల్పోయింది. 12 బంతుల్లో 5 ఫోర్లతో దూకుడుగా ఆడిన గిల్ ముజీబ్ ఉర్ రహ్మాన్ బౌలింగ్‌లో స్టంప్ అవుట్అయ్యాడు. తిలక్ వర్మ(5) , శివం దూబే క్రీజులో ఉన్నారు. స్కోరు: 28-2(4) ►టీమిండియా స్కోరు: 8/1 (2) 0.2: రోహిత్ శర్మ రనౌట్ అఫ్గాన్ విధించిన 159 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు ఆదిలోనే షాక్ తగిలింది. దాదాపు 14 నెలల తర్వాత అంతర్జాతీయ టీ20లలో రీఎంట్రీ ఇచ్చిన కెప్టెన్ రోహిత్ శర్మ రనౌట్‌గా వెనుదిరిగాడు. డకౌట్‌గా పెవిలియన్ చేరాడు. అతడి రూపంలో టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. తిలక్ వర్మ, గిల్ క్రీజులో ఉన్నారు. టీమిండియా టార్గెట్ 159 పరుగులు మొహాలీ వేదికగా టీమిండియాతో జరుగుతున్న తొలి టీ20లో మొదట బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్తాన్ మెరుగైన ప్రదర్శన కనబరిచింది. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి అఫ్గానిస్తాన్ 158 పరుగులు చేసింది. అఫ్గాన్ బ్యాటర్లలో మహ్మద్ నబీ(42) పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడగా.. ఓమర్జాయ్(29), ఇబ్రహీం జద్రాన్(25) రాణించారు. భారత బౌలర్లలో ముఖేష్ కుమార్, అక్షర్ పటేల్ చెరో రెండు వికెట్లు పడగొట్టగా.. శివమ్ దుబే ఒక్క వికెట్ సాధించాడు. 19వ ఓవర్లో 13 పరుగులు ఇచ్చుకున్న వాషింగ్టన్ సుందర్ ఒకే ఓవర్లో ముకేశ్‌కు రెండు వికెట్లు 17.6: మహ్మద్ నబీ రూపంలో అఫ్గానిస్తాన్ ఐదో వికెట్ కోల్పోయింది. 18వ ఓవర్ మొదటి బంతికి అజ్మతుల్లాను బౌల్డ్ చేసిన ముకేశ్ నబీ(42)ని కూడా పెవిలియన్‌కు పంపాడు. స్కోరు: 130-5(18). నజీబుల్లా, కరీం క్రీజులో ఉన్నారు. నాలుగో వికెట్ కోల్పోయిన అఫ్గానిస్తాన్ 17.1: ముకేశ్ కుమార్ బౌలింగ్‌లో అజ్మతుల్లా బౌల్డ్(20). అతడి స్థానంలో నజీబుల్లా జద్రాన్ క్రీజులోకి వచ్చాడు. స్కోరు: 129/4 (17.4) 15 ఓవర్లకు అఫ్గాన్ స్కోర్: 105/3 15 ఓవర్లు ముగిసే సరికి అఫ్గానిస్తాన్ 3 వికెట్ల నష్టానికి 105 పరుగులు చేసింది. ఒమర్జాయ్(25), నబీ(26) అఫ్గాన్ ఇన్నింగ్స్ చక్కదిద్దారు. మూడో వికెట్ కోల్పోయిన అఫ్గానిస్తాన్.. 57 పరుగుల వద్ద అఫ్గానిస్తాన్ మూడో వికెట్ కోల్పోయింది. కేవలం 3 పరుగులు మాత్రమే చేసిన రెహమత్ షా.. అక్షర్ పటేల్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు రెండో వికెట్ డౌన్.. అఫ్గానిస్తాన్ వరుసగా రెండు వికెట్లు కోల్పోయింది. 25 పరుగులు చేసిన అఫ్గాన్ కెప్టెన్ ఇబ్రహీం జద్రాన్.. శివమ్ దుబే బౌలింగ్‌లో ఔటయ్యాడు. 9 ఓవర్లకు అఫ్గాన్ స్కోర్: 53/2 తొలి వికెట్ కోల్పోయిన అఫ్గాన్.. 50 పరుగుల వద్ద అఫ్గానిస్తాన్ తొలి వికెట్ కోల్పోయింది. 23 పరుగులు చేసిన గుర్భాజ్.. అక్షర్ పటేల్ బౌలింగ్‌లో స్టంపౌట్‌గా వెనుదిరిగాడు. 6 ఓవర్లకు అఫ్గానిస్తాన్ స్కోర్ 6 ఓవర్లు ముగిసే సరికి అఫ్గానిస్తాన్ వికెట్ నష్టపోకుండా 33 పరుగులు చేసింది. క్రీజులో గుర్భాజ్(16), ఇబ్రహీం జద్రాన్(15) పరుగులతో ఉన్నారు. 3 ఓవర్లకు అఫ్గానిస్తాన్ స్కోర్: 15/0 3 ఓవర్లు ముగిసే సరికి అఫ్గానిస్తాన్ వికెట్ నష్టపోకుండా 15 పరుగులు చేసింది. క్రీజులో గుర్భాజ్(10), ఇబ్రహీం జద్రాన్(2) పరుగులతో ఉన్నారు. మెయిడిన్‌తో ఆరంభం.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియాకు యువ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ అద్భుతమైన ఆరంభాన్ని ఇచ్చాడు. తొలి ఓవర్ వేసిన అర్ష్‌దీప్ సింగ్ మెయిడిన్ చేశాడు. భారత్-అఫ్గానిస్తాన్ మధ్య మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ప్రారంభమైంది. మొహాలీ వేదిగా తొలి టీ20లో టీమిండియా-అఫ్గానిస్తాన్ జట్లు తలపడతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా తొలుత బౌలింగ్ ఎంచుకుంది. కాగా దాదాపు ఏడాది తర్వాత టీ20ల్లో రోహిత్ శర్మ భారత జట్టు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. అయితే ఈ మ్యాచ్‌కు స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి వ్యక్తిగత కారణాలతో దూరమయ్యాడు. అదే విధంగా యువ ఓపెనర్ యశస్వీ జైశ్వాల్, వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్‌కు తుది జట్టులో చోటు దక్కలేదు. తుది జట్లు భారత్: రోహిత్ శర్మ(కెప్టెన్), శుబ్‌మన్ గిల్, తిలక్ వర్మ, శివమ్ దూబే, జితేశ్ శర్మ, రింకు సింగ్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, ముఖేష్ కుమార్ అఫ్గానిస్తాన్: రహ్మానుల్లా గుర్బాజ్(వికెట్ కీపర్), ఇబ్రహీం జద్రాన్(కెప్టెన్), రహమత్ షా, అజ్మతుల్లా ఒమర్జాయ్, మహ్మద్ నబీ, నజీబుల్లా జద్రాన్, కరీం జనత్, గుల్బాదిన్ నాయబ్, ఫజల్హాక్ ఫారూఖీ, నవీన్-ఉల్-హక్, ముజీబ్ ఉర్ రహ్మాన్ -
రోహిత్‌ను అసభ్యంగా దూషించారు: మాజీ పేసర్ షాకింగ్ కామెంట్స్
'Our Own Abuse Us': ‘‘సాధారణంగా నేను ఎవరితోనూ గొడవ పెట్టుకోను. మెల్బోర్న్లో అనుకుంటా.. ఆరోజు నేను, రోహిత్ శర్మ, మనోజ్ తివారి ఉన్నాం. నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తున్నాం. అప్పుడే అక్కడికి వచ్చిన కొంతమంది ఎందుకో మమ్మల్ని దుర్భాలాషడటం మొదలుపెట్టారు. వాళ్లు టీమిండియా అభిమానులమని చెప్పుకొంటున్నారు. కానీ.. రోహిత్ శర్మను అసభ్య పదజాలంతో దూషించారు. అయినా తను చాలాసేపు ఓపిక పట్టాడు. కానీ వాళ్ల ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో రోహిత్ సహనం కట్టలు తెంచుకుంది. తను కూడా వాళ్లకు తిరిగి బదులివ్వడం మొదలుపెట్టాడు. నేను కూడా తనతో కలిసి వారి మాటకు మాటా సమాధానం చెప్పాను. కానీ ఎందుకో సొంత అభిమానులే మమ్మల్ని దూషించడం బాధించింది’’ అంటూ టీమిండియా మాజీ పేసర్ ప్రవీణ్ కుమార్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. అభిమానులమని చెప్పుకొంటూనే దూషిస్తూ ఆస్ట్రేలియా టూర్‌కు వెళ్లినపుడు తమకు ఎదురైన చేదు అనుభవం గురించి గుర్తు చేసుకున్నాడు. రోహిత్ శర్మను అకారణంగా కొంతమంది దూషించారని వారికి తామిద్దరం కలిసి గట్టిగానే బదులిచ్చామని ప్రవీణ్ కుమార్ పేర్కొన్నాడు. అభిమానులమని చెప్పుకొనే కొంతమంది ఆరోజు హిట్‌మ్యాన్‌కు కించపరిచే విధంగా వ్యవహరించారని తెలిపాడు. సంచలన వ్యాఖ్యలతో వార్తల్లో కాగా ది లలన్‌టాప్‌నకు ఇస్తున్న ఇంటర్వ్యూలో భాగంగా సంచలన వ్యాఖ్యలు చేస్తూ గత కొన్ని రోజులుగా ప్రవీణ్ కుమార్ వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే. టీమిండియాలో చాలా మందికి మద్యం సేవించే అలవాటు ఉన్నా ఓ సీనియర్ ప్లేయర్ మాత్రం తన పేరును హైలైట్ చేశాడని ప్రవీణ్ ఆరోపించాడు. అదే విధంగా చెప్పినట్లు వినకపోతే ఐపీఎల్లో తనకు అవకాశాలు రాకుండా చేస్తానని మాజీ చైర్మన్ లలిత్ మోదీ వార్నింగ్ ఇచ్చాడని ప్రవీణ్ పేర్కొన్నాడు. ఇక బౌలర్లంతా అప్పుడప్పుడు టాంపరింగ్‌కు పాల్పడతారని.. అయితే పాకిస్తాన్ బౌలర్లు మాత్రం ఎక్కువగా ఇలాంటి పనులు చేస్తారని ఆరోపణలు గుప్పించాడు. రీఎంట్రీకి సిద్ధమైన రోహిత్ కాగా 37 ఏళ్ల ప్రవీణ్ కుమార్ టీమిండియా తరఫున అంతర్జాతీయ స్థాయిలో ఆరు టెస్టు, 68 వన్డే, 10 టీ20 మ్యాచ్‌లు ఆడి.. మొత్తంగా 112 వికెట్లు పడగొట్టాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో 119 మ్యాచ్‌లలో కలిపి 90 వికెట్లు తీశాడు. ఇక 2017లో తన చివరి మ్యాచ్ ఆడిన ప్రవీణ్ ఆ తర్వాత ఆటకు గుడ్‌బై చెప్పాడు. ఇదిలా ఉంటే.. రోహిత్ శర్మ ప్రస్తుతం అఫ్గనిస్తాన్‌తో సిరీస్‌కు సిద్ధమైన విషయం తెలిసిందే. సొంతగడ్డపై జరుగుతున్న ఈ సిరీస్ ద్వారా దాదాపు 14 నెలల తర్వాత హిట్‌మ్యాన్ అంతర్జాతీయ టీ20లలో రీఎంట్రీ ఇస్తున్నాడు. చదవండి: Ishan Kishan: అప్పటి వరకు ఇషాన్‌కు టీమిండియాలో స్థానం లేదు.. హింటిచ్చిన ద్రవిడ్ -
Dravid: అప్పటి వరకు ఇషాన్‌కు టీమిండియాలో స్థానం లేదు
Ishan Kishan Return?: టీమిండియా యువ క్రికెటర్ ఇషాన్ కిషన్‌పై బీసీసీఐ గుర్రుగా ఉందన్న వార్తల నేపథ్యంలో హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. దేశవాళీ క్రికెట్లో నిరూపించుకున్న తర్వాతే ఈ వికెట్ కీపర్ బ్యాటర్ మళ్లీ సెలక్షన్‌కు అందుబాటులోకి వస్తాడని తెలిపాడు. అంతవరకు ఇషాన్ కిషన్‌కు టీమిండియాలో స్థానం దక్కదని ద్రవిడ్ సంకేతాలు ఇచ్చాడు. కాగా సౌతాఫ్రికా పర్యటనలో భాగంగా టెస్టులకు ఎంపికైన ఇషాన్ సిరీస్ ఆరంభానికి ముందే స్వదేశానికి తిరిగి వచ్చాడు. మానసికంగా అలసిపోయానని.. కుటుంబంతో గడిపేందుకు తనకు సెలవు మంజూరు చేయాలని అతడు విజ్ఞప్తి చేయగా.. మేనేజ్మెంట్ అంగీకరించినట్లు వార్తలు వచ్చాయి. నమ్మకాన్ని వమ్ము చేశాడంటూ వదంతులు అయితే, బీసీసీఐ పెద్దల నమ్మకాన్ని వమ్ము చేసేలా ఇషాన్ వ్యవహరించాడన్న కారణంతోనే అతడిని అఫ్గనిస్తాన్‌తో సిరీస్‌కు పక్కనపెట్టినట్లు వదంతులు వ్యాపించాయి. ఈ నేపథ్యంలో.. తొలి టీ20 ఆరంభానికి ముందు మీడియాతో మాట్లాడిన రాహుల్ ద్రవిడ్‌కు ఇషాన్ గురించి ప్రశ్న ఎదురైంది. అప్పుడే మళ్లీ టీమిండియాలోకి ఇషాన్ ఎంట్రీ.. తేల్చేసిన ద్రవిడ్ ఇందుకు బదులిస్తూ.. ‘‘అలాంటిదేమీ లేదు. సెలక్షన్‌కు అతడు అందుబాటులో లేడు. నిజానికి సౌతాఫ్రికా టూర్లో ఉన్నపుడే తనకు బ్రేక్ కావాలని ఇషాన్ అడిగాడు. మేము కూడా అందుకు అంగీకరించాం. అన్ని విధాలా మద్దతుగా నిలబడ్డాం. సమస్యకు తగిన పరిష్కారం వెదకాలని సూచించాం. ఆ తర్వాత అతడు ఇంత వరకు సెలక్షన్‌కు అందుబాటులోకి రాలేదు. ఒకవేళ తను మళ్లీ మైదానంలో దిగాలనుకుంటే.. దేశవాళీ క్రికెట్ ఆడి.. అప్పుడు సెలక్షన్‌కు అవైలబుల్గా ఉంటాడు’’ అని ద్రవిడ్ స్పష్టం చేశాడు. సంజూ, జితేశ్‌లకు లక్కీ ఛాన్స్ కాగా స్వదేశంలో అఫ్గనిస్తాన్‌తో టీ20 సిరీస్‌కు ఇషాన్ కిషన్ స్థానంలో సంజూ శాంసన్, జితేశ్ శర్మ వికెట్ కీపర్లుగా చోటు దక్కించుకున్నారు. ఇక టీ20 ప్రపంచకప్-2024కు ముందు టీమిండియా ఆడే ఆఖరి సిరీస్ ఇదే కావడం గమనార్హం. మళ్లీ ఐపీఎల్-2024లో ప్రదర్శనను బట్టే ఇషాన్ వరల్డ్‌కప్ నాటికి తిరిగి వస్తాడా లేదా అన్నది తేలనుంది. అయితే, అంతకంటే ముందు ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్ ఆడే జట్టులో చోటు దక్కించుకోవాలంటే జార్ఖండ్ తరఫున ఇషాన్ రంజీల్లో ఆడటం తప్ప మరోమార్గం లేదు. అక్కడ తనను తాను నిరూపించుకున్నా.. కేఎల్ రాహుల్ రూపంలో వికెట్ కీపర్ స్థానానికి గట్టి పోటీ ఎదుర్కోవాల్సి ఉంటుంది. చదవండి: Ind vs Afg: అఫ్గన్ బ్యాటింగ్ సంచలనం.. 22 ఏళ్ల కెప్టెన్! రోహిత్ సేనతో ఢీ అంటే ఢీ! ఎవరితడు? -
అఫ్గన్ బ్యాటింగ్ సంచలనం.. 22 ఏళ్ల కెప్టెన్! రోహిత్ సేనతో ఢీ అంటే ఢీ!
ఇబ్రహీం జద్రాన్.. ఒకప్పుడు జట్టులో చోటే కరువు.. కానీ ఇప్పుడు.. అఫ్గనిస్తాన్ పరిమిత ఓవర్ల క్రికెట్ జట్టులో కీలక సభ్యుడు.. కెప్టెన్‌గానూ తనకు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటున్నాడు. తద్వారా భారత్ వేదికగా పటిష్ట టీమిండియాతో తొలిసారిగా తలపడే టీ20 జట్టుకు సారథిగా వ్యవహరించే గోల్డెన్ ఛాన్స్ దక్కించుకున్నాడు. రోహిత్ సేనను చూసి భయపడే ప్రసక్తే లేదని.. ఇలాంటి బలమైన జట్టుతో పోటీపడటం కంటే మజానిచ్చే సవాల్ మరొకటి ఉండదంటూ సానుకూల దృక్పథంతో ముందుకు సాగుతున్నాడీ 22 ఏళ్ల యువ బ్యాటర్. టీమిండియాతో సిరీస్‌లో తాము కచ్చితంగా అద్భుత ప్రదర్శన కనబరుస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నాడు. తమ దేశ ప్రజలకు ప్రస్తుతం వినోదం అందించే ఏకైక అంశం క్రికెట్ మాత్రమే అని.. వారి ముఖాల్లో చిరునవ్వు నింపేందుకు శాయశక్తులా కృషి చేస్తామని చెబుతున్నాడు. ఇంతకీ సాదాసీదా ఇబ్రహీం జద్రాన్ బ్యాటింగ్ సెన్సేషన్‌గా ఎలా మారాడు?! జట్టులో తనకన్నా సీనియర్లు ఉన్నా తాత్కాలిక కెప్టెన్‌గా మేనేజ్మెంట్ అతడిపై నమ్మకం ఉంచడానికి కారణం ఏమిటి?! భారత్‌లోనే అరంగేట్రం భారత్ వేదికగా 2019లో వెస్టిండీస్‌తో జరిగిన వన్డే సిరీస్ సందర్భంగా అఫ్గనిస్తాన్ తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు జద్రాన్. విండీస్‌తో ఆఖరి వన్డేలో ఆడే అవకాశం దక్కించుకున్న అతడు కేవలం రెండు పరుగులు మాత్రమే చేశాడు. పూర్తిగా విఫలం అయినప్పటికీ వెస్టిండీస్‌తో తదుపరి జరిగిన టీ20 సిరీస్‌లో జద్రాన్ ఆడించేందుకు సెలక్టర్లు నిర్ణయించారు. అయితే, ఈసారి కూడా అతడు పూర్తిగా నిరాశపరిచాడు. అరంగేట్ర టీ20 సిరీస్‌లో మూడు మ్యాచ్‌లలో కలిపి ఈ రైట్‌హ్యాండ్ బ్యాటర్ 14 పరుగులు(2,11,1) మాత్రమే చేసి పూర్తిగా విఫలమయ్యాడు. టెస్టులో సక్సెస్ అయినా.. డొమెస్టిక్ క్రికెట్ గణాంకాల దృష్ట్యా మేనేజ్మెంట్ అతడిపై నమ్మకం ఉంచింది.. అదే ఏడాది టెస్టుల్లోనూ అడుగుపెట్టే అవకాశం ఇచ్చింది. ఈసారి తనపై సెలక్టర్లు పెట్టుకున్న నమ్మకాన్ని నిజం చేస్తూ.. బంగ్లాదేశ్‌తో 2019లో జరిగిన మ్యాచ్‌లో జద్రాన్ 108 పరుగులతో సత్తా చాటాడు. వన్డేల్లో సంచలనాలు సృష్టిస్తూ ఆ తర్వాత వన్డే ఫార్మాట్‌పై మరింత దృష్టి సారించిన ఇబ్రహీం జద్రాన్ తనకు వచ్చిన ప్రతి అవకాశాన్ని పూర్తిగా వినియోగించుకున్నాడు. ముఖ్యంగా శ్రీలంకతో 2022లో జరిగిన సిరీస్ సందర్భంగా ఆఖరి మ్యాచ్‌లో అద్భుత సెంచరీతో ఆకట్టుకున్నాడు. 138 బంతుల్లోనే 162 పరుగులు సాధించి సంచలనం సృష్టించాడు. జద్రాన్ ఇన్నింగ్స్‌లో ఏకంగా 15 ఫోర్లు, 4 సిక్సర్లు ఉండటం విశేషం. ప్రపంచకప్-2023లో ఆకాశమే హద్దుగా చెలరేగి ఈ మ్యాచ్‌తో క్రికెట్ ప్రేమికుల దృష్టిని తన వైపునకు తిప్పుకున్న ఇబ్రహీం జద్రాన్.. వన్డే వరల్డ్‌కప్-2023 జట్టులో చోటు దక్కించుకున్నాడు. భారత్ వేదికగా జరిగిన ఈ మెగా ఈవెంట్లోనూ ఆకాశమే హద్దుగా చెలరేగిన ఇబ్రహీం జద్రాన్ పలు రికార్డులు బద్దలు కొట్టాడు. ముఖ్యంగా ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో శతకం బాదిన ఈ యువ బ్యాటర్.. అఫ్గనిస్తాన్ తరఫున వరల్డ్‌కప్ ఈవెంట్లో సెంచరీ చేసిన తొలి క్రికెటర్‌గా చరిత్ర సృష్టించాడు. అంతేకాదు.. వన్డే ప్రపంచకప్‌లో అత్యంత పిన్న వయసులో(21 ఏళ్ల 330 రోజులు) శతకం బాదిన ఆటగాళ్ల జాబితాలోనూ చోటు సంపాదించాడు. సచిన్, కోహ్లిలను వెనక్కినెట్టి ఈ లిస్టులో టీమిండియా దిగ్గజం సచిన్ టెండుల్కర్(22 ఏళ్ల 300 రోజులు), రన్‌మెషీన్ విరాట్ కోహ్లి(22 ఏళ్ల 106 రోజులు)లను అధిగమించి నాలుగో స్థానంలో నిలిచాడు. అంతేకాదు అఫ్గన్ తరఫున వన్డేల్లో అత్యంత వేగంగా 1000 పరుగుల మార్కు అందుకున్న తొలి బ్యాటర్‌గా రికార్డులకెక్కాడు. అఫ్గన్ తరఫున ఏకైక సెంచరీ ఇక.. నాడు ముంబైలో ఆసీస్‌తో నువ్వా- నేనా అన్న రీతిలో సాగిన మ్యాచ్‌లో ఇబ్రహీం జద్రాన్ 143 బంతులు ఎదుర్కొని 129 పరుగులతో అజేయంగా నిలిచాడు. తద్వారా వరల్డ్‌కప్ చరిత్రలో అఫ్గనిస్తాన్ తమ అత్యధిక స్కోరు నమోదు చేయడంలో కీలక పాత్ర పోషించాడు. ఇక ప్రపంచప్-2023లో మొత్తంగా ఆడిన 9 మ్యాచ్‌లలో కలిపి 376 పరుగులు సాధించాడీ కుర్ర బ్యాటర్. అఫ్గన్ తరఫున టాప్ స్కోరర్‌గా నిలిచి ఆ జట్టు భవిష్యత్ ఆశాకిరణం అనే నమ్మకం కలిగించాడు. కెప్టెన్‌గా తొలి విజయం ఈ నేపథ్యంలో... ఈ మెగా టోర్నీ తర్వాత అఫ్గనిస్తాన్ టీ20 సిరీస్ ఆడేందుకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ పర్యటనకు వెళ్లింది. ఈ జట్టుకు స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ సారథ్యం వహించాల్సింది. కానీ అతడు వెన్నునొప్పి కారణంగా దూరం కావడంతో ఇబ్రహీం జద్రాన్‌ను అదృష్టం వరించింది. రోహిత్ సేనతో ఢీ అంటే ఢీ కెప్టెన్‌గా యూఏఈతో సిరీస్‌లో బరిలోకి దిగిన అతడు 2-1తో జట్టును గెలిపించాడు. ఈ క్రమంలో టీమిండియాతో సిరీస్‌కు అందుబాటులో ఉన్నపటికీ రషీద్ పూర్తిగా కోలుకోకపోవడంతో మరోసారి కెప్టెన్‌గా జద్రాన్ వైపు మొగ్గు చూపింది మేనేజ్మెంట్. రోహిత్ సేనతో జనవరి 11 నుంచి మొదలుకానున్న టీ20 సిరీస్‌కు రషీద్ ఖాన్‌ను ప్లేయర్‌గా ఎంపిక చేసి సారథ్య బాధ్యతలను ఇబ్రహీం జద్రాన్‌కు అప్పగించింది. ఈ టూర్లో గనుక 22 ఏళ్ల ఇబ్రహీం బ్యాటర్‌గా, కెప్టెన్‌గా సత్తా చాటితే అతడికి ఇక ఎదురు ఉండదని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అంతర్జాతీయ కెరీర్లో ఇలా.. ఫస్ట్‌క్లాస్, లిస్ట్-ఏ క్రికెట్లో సత్తా చాటిన అఫ్గనిస్తాన్ తరఫున అరంగేట్రం చేసిన ఇబ్రహీం జద్రాన్ ఇప్పటి వరకు 5 టెస్టులు, 28 వన్డేలు, 27 టీ20లు ఆడాడు. ఆయా ఫార్మాట్లలో వరుసగా 362, 1284, 616 పరుగులు సాధించాడు. పార్ట్‌టైమ్ రైటార్మ్ పేసర్ అయిన అతడి ఖాతాలో ఒక వికెట్ కూడా ఉందండోయ్!! అన్నట్లు ఇబ్రహీం జద్రాన్ అఫ్గనిస్తాన్‌లోని కోస్త్ ప్రాంతానికి చెందినవాడు. చదవండి: Ind vs Afg T20Is: గిల్‌కు నో ఛాన్స్! రోహిత్‌తో ఓపెనింగ్ చేసేది అతడే: ద్రవిడ్ -
పంత్ ఒక్క కాలితో ఫిట్‌గా ఉన్నా టీ20 వరల్డ్‌కప్ ఆడాలి..!
టీమిండియా చిచ్చరపిడుగు రిషబ్ పంత్‌పై క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. పంత్ ఒక్క కాలితో ఫిట్‌గా ఉన్నా త్వరలో జరుగనున్న టీ20 వరల్డ్‌కప్‌లో ఆడాలని అన్నాడు. ఫార్మాట్ ఏదైనా పంత్ గేమ్ ఛేంజర్ అని, అందుకే అతను ఒక్క కాలితో ఫిట్‌గా ఉన్నా జట్టులోకి రావాలని కోరుకుంటున్నానని తెలిపాడు. నేను సెలెక్టర్‌ను అయితే ఈ పనిని తప్పక చేస్తానని సెన్సేషనల్ కామెంట్స్ చేశాడు. దీని ముందు గవాస్కర్ కేఎల్ రాహుల్‌ను ఉద్దేశిస్తూ కూడా పలు కామెంట్స్ చేశాడు. టీ20 వరల్డ్‌కప్‌లో కేఎల్ రాహుల్ కూడా వికెట్‌కీపింగ్ కమ్ బ్యాటింగ్‌కు బెస్ట్ ఛాయిసే. అయినా నా ఓటు మాత్రం పంత్‌కే అని అన్నాడు. పంత్ అందుబాటులో ఉన్నంత కాలం అతనే తన ఫస్ట్ ఛాయిస్ అని తెలిపాడు. ఒకవేళ పంత్ అందుబాటులో లేకపోతే మాత్రం తన ఓటు కేఎల్ రాహుల్‌కు ఉంటుందని చెప్పిన గవాస్కర్.. రాహుల్ వల్ల టీమిండియా సమతూకంగా ఉంటుందని అభిప్రాయపడ్డాడు. రాహుల్ వికెట్‌కీపింగ్ చేస్తూ మిడిలార్డర్లో అయినా ఓపెనర్‌గా అయినా సింక్ అవుతాడని తెలిపాడు. స్టార్ స్పోర్ట్స్ ఛానల్లో జరిగిన గేమ్ ప్లాన్ అనే షోలో గవాస్కర్ ఈ మేరకు వ్యాఖ్యానించాడు. కాగా, 2022 చివర్లో జరిగిన కార్ యాక్సిడెంట్లో రిషబ్ పంత్ తీవ్రంగా గాయపడిని విషయం తెలిసిందే. అప్పటి నుంచి టీమిండియా సిరీస్‌కు ఒకరు చొప్పున పార్ట్‌టైమ్ వికెట్‌కీపర్ కమ్ బ్యాటర్లతో నెట్టుకొస్తుంది. ఇటీవలి కాలంలో కేఎల్ రాహుల్ ఈ పాత్రలో పర్ఫెక్ట్గా ఫిట్ అయ్యాడు. వన్డే వరల్డ్‌కప్‌లో అతను పలు చిరస్మరణీయ ఇన్నింగ్స్‌లు ఆడటంతో పాటు అద్భుతంగా వికెట్‌కీపింగ్ చేశాడు. పంత్ తిరిగి జట్టులోకి వస్తే రాహుల్ కేవలం బ్యాటింగ్ వరకు మాత్రమే పరిమితం కావచ్చు. ఏడాదికి పైగా జట్టుకు దూరంగా ఉంటున్న పంత్.. ఈ ఏడాది ఐపీఎల్ సమయానికంతా పూర్తి ఫిట్నెస్ సాధించి బరిలోకి దిగుతాడని ప్రచారం జరుగుతుంది. ఇదిలా ఉంటే, ఆఫ్ఘనిస్తాన్‌తో ఇవాల్టి నుంచి ప్రారంభంకాబోయే టీ20 సిరీస్ కోసం భారత సెలెక్టర్లు రాహుల్‌ను కానీ ఇషాన్ కిషన్‌ను కాని వికెట్కీపర్లుగా ఎంపిక చేయలేదు. ఈ జట్టులో వికెట్‌కీపర్ కమ్ బ్యాటర్లుగా సంజూ శాంసన్, జితేశ్ శర్మ ఎంపిక చేయబడ్డారు. రాహుల్, ఇషాన్‌లకు రెస్ట్ ఇచ్చినట్లు సెలెక్టర్లు చెబుతున్నారు. మొహాలీ వేదికగా భారత్-ఆఫ్ఘనిస్తాన్ల మధ్య ఇవాళ రాత్రి 7 గంటలకు తొలి టీ20 ప్రారంభంకానుంది. ఈ మ్యాచ్‌కు టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి దూరమయ్యాడు. వ్యక్తిగత కారణాల చేత కోహ్లి తొలి మ్యాచ్‌కు అందుబాటులో ఉండడని కోచ్ రాహుల్ ద్రవిడ్ ప్రకటించాడు. -
India Vs Afghanistan T20I: టీమిండియాతో తొలి టీ20.. ఆఫ్ఘనిస్తాన్‌కు భారీ షాక్
టీమిండియాతో టీ20 సిరీస్‌కు ముందు ఆఫ్ఘనిస్తాన్‌కు భారీ షాక్ తగిలింది. గాయం నుంచి పూర్తిగా కోలుకోని కారణంగా ఆ జట్టు స్టార్ ఆటగాడు రషీద్ ఖాన్ భారత్‌తో సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. ఈ సిరీస్ కోసం రషీద్ జట్టుతో పాటు భారత్‌కు విచ్చేసినప్పటికీ.. గాయం పూర్తిగా తగ్గకపోవడంతో సెలెక్టర్లు అతన్ని తిరిగి ఇంటికి పంపించాలని నిర్ణయించినట్లు తెలుస్తుంది. ఇదే గాయం కారణంగా రషీద్ బిగ్‌బాష్ లీగ్, సౌతాఫ్రికా టీ20 లీగ్‌లకు కూడా దూరంగా ఉన్నాడు. రషీద్ భారత్‌తో టీ20 సిరీస్ మొత్తానికి దూరమైనట్లు ఆ జట్టు తాత్కాలిక కెప్టెన్ ఇబ్రహీం జద్రాన్ ప్రకటించాడు. కాగా, రషీద్ వన్డే వరల్డ్‌కప్ అనంతరం వెన్నెముక సర్జరీ చేయించుకున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే, భారత్-ఆఫ్ఘనిస్తాన్ల మధ్య మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఇవాల్టి నుంచి ప్రారంభంకానుంది. మొహాలీ వేదికగా తొలి మ్యాచ్ జరుగనుంది. రాత్రి ఏడు గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్ అనంతరం జనవరి 14న రెండో టీ20 (ఇండోర్), జనవరి 17న (బెంగళూరు) మూడో టీ20 జరుగనున్నాయి. తొలి టీ20కి కోహ్లి దూరం.. చాలాకాలంగా టీ20ల్లో తన బ్యాటింగ్ చూడాలని వెయ్యి కళ్లతో ఎదురుచూసిన అభిమానులకు టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి ఊహించని షాక్ ఇచ్చాడు. వ్యక్తిగత కారణాల చేత అతను ఆఫ్ఘనిస్తాన్‌తో తొలి టీ20కి దూరమయ్యాడు. కోహ్లి రెండో టీ20 నుంచి తిరిగి అందుబాటులోకి వస్తాడని భారత హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ ప్రకటించాడు. -
అందుకే అయ్యర్‌పై వేటు?.. క్లారిటీ ఇచ్చిన ద్రవిడ్
Ind vs Afg T20Is- Rahul Dravid Comments On Shreyas Iyer: టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ గురించి వస్తున్న వార్తలను హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్ ఖండించాడు. క్రమశిక్షణా రాహిత్యం వల్లనే అతడిని జట్టు నుంచి తప్పించారన్న వదంతులను కొట్టిపారేశాడు. కాగా వన్డే వరల్డ్‌కప్-2023 తర్వాత టీమిండియా స్వదేశంలో ఆస్ట్రేలియాతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడిన విషయం తెలిసిందే. ఆసీస్ సిరీస్‌కు వైస్ కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో జరిగిన ఈ సిరీస్ తాలుకు ఆఖరి రెండు మ్యాచ్‌లకు శ్రేయస్ అయ్యర్ వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ఆ తర్వాత సౌతాఫ్రికా పర్యటనకు వెళ్లిన టీ20 జట్టులోనూ చోటు దక్కించుకున్నాడు. కానీ.. పొట్టి ఫార్మాట్లో సఫారీలతో జరిగిన సిరీస్‌లో అతడికి ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం రాలేదు. అఫ్గన్‌తో సిరీస్‌కు పక్కనపెట్టేశారు ఈ క్రమంలో సొంతగడ్డపై జనవరి 11 నుంచి మొదలుకానున్న అఫ్గనిస్తాన్‌తో సిరీస్‌కు అతడిని పక్కనపెట్టడం చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో క్రమశిక్షణను ఉల్లంఘించిన కారణంగానే అయ్యర్‌పై వేటు వేశారంటూ వదంతులు వ్యాపించాయి. ఈ విషయంపై తాజాగా స్పందించిన హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్.. ‘‘అఫ్గన్‌తో సిరీస్‌కు శ్రేయస్ అయ్యర్‌ను ఎంపిక చేయకపోవడానికి డిసిప్లినరీ యాక్షన్ కారణమన్నది పూర్తిగా అవాస్తవం. అతడు ఈ సిరీస్ మిస్సయ్యాడంతే! చాలా మంది ఉన్నారు జట్టులో ఇప్పటికే చాలా మంది బ్యాటర్లు ఉన్నారు. అందుకే సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌లోనూ అతడికి ఆడే అవకాశం రాలేదు. ఈ విషయాన్ని మీరు గమనించే ఉంటారు. జట్టులో ఎక్కువ మంది బ్యాటర్లు ఉన్నందువల్ల గట్టి పోటీ ఉంది. ప్రతి ఒక్కరిని తుదిజట్టులో ఆడించడం కుదరదు కదా. అందుకే అయ్యర్‌ను పక్కనపెట్టాల్సి వచ్చింది. అంతేగానీ క్రమశిక్షణారాహిత్యం వల్ల అతడిని తప్పించామనడం సరికాదు. అసలు ఈ విషయం గురించి సెలక్టర్లతో నేను ఎలాంటి చర్చలు జరుపలేదు’’ అని స్పష్టతనిచ్చాడు. రంజీల్లో అయ్యర్ ఆట కాగా అఫ్గన్‌తో సిరీస్‌కు ఎంపిక కాని శ్రేయస్ అయ్యర్ ఇంగ్లండ్‌తో టెస్టులకు సన్నద్ధమయ్యే పనిలో పడ్డాడు. ముంబై తరఫున రంజీ ట్రోఫీ-2024 సీజన్లో ఆడేందుకు అతడు నిర్ణయించుకున్నాడు. ఆంధ్రా జట్టుతో జనవరి 12 నుంచి మొదలుకానున్న మ్యాచ్‌లో పాల్గొనే ముంబై జట్టులో సెలక్టర్లు అయ్యర్ పేరును చేర్చారు. చదవండి: IND Vs AFG T20I Series: రీఎంట్రీలో అభిమానులకు ఊహించని ట్విస్ట్ ఇచ్చిన కోహ్లి -
గిల్‌కు నో ఛాన్స్! రోహిత్‌తో ఓపెనింగ్ చేసేది అతడే: ద్రవిడ్
అఫ్గనిస్తాన్‌తో టీ20 సిరీస్‌లో ఆడబోయే ఓపెనింగ్ జోడీ గురించి టీమిండియా హెడ్‌కోచ్ హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు యువ బ్యాటర్ యశస్వి జైస్వాల్ భారత ఇన్నింగ్స్ ఆరంభిస్తాడని తెలిపాడు. కాగా సౌతాఫ్రికా పర్యటన ముగించుకుని స్వదేశానికి వచ్చిన టీమిండియా అఫ్గనిస్తాన్‌తో టీ20 సిరీస్ ఆడనుంది. సొంతగడ్డపై జరుగనున్న ఈ మూడు మ్యాచ్‌ల సిరీస్ ద్వారా కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి అంతర్జాతీయ టీ20లలో పునరాగమనం చేసేందుకు సిద్దమయ్యారు. ఇదిలా ఉంటే.. జనవరి 11నాటి తొలి మ్యాచ్ కోసం భారత జట్టు ఇప్పటికే మొహాలీకి చేరుకుంది. ఈ నేపథ్యంలో మ్యాచ్ ఆరంభానికి ముందు కోచ్ రాహుల్ ద్రవిడ్ మీడియాతో మాట్లాడాడు. ఈ సందర్భంగా టీ20లలో ఓపెనర్‌గా యశస్వి జైస్వాల్‌పై తమకు పూర్తి నమ్మకం ఉందని తెలిపాడు. అతడి ప్రదర్శనల పట్ల మేనేజ్మెంట్ సంతృప్తిగా ఉందని.. అందుకే ఈసారి కూడా అవకాశం ఇవ్వాలనుకుంటున్నట్లు తెలిపాడు. ఈ మేరకు.. ‘‘రోహిత్, జైస్వాల్‌తో ఓపెనింగ్ చేయించాలనుకుంటున్నాం. ఇలాంటి అద్భుతమైన టీమ్ అందుబాటులో ఉన్నపుడు జట్టుకు ప్రయోజనం చేకూర్చే విధంగా ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. అందరికీ అన్నిసార్లు అవకాశాలు రాకపోవచ్చు. ఏదేమైనా జైస్వాల్ ఓపెనర్‌గా విజయవంతమైన తీరు పట్ల సంతోషంగా ఉన్నాం. అతడి వల్ల టాపార్డర్‌లో లెఫ్ట్-రైట్ కాంబినేషన్ కుదిరింది’’ అని ద్రవిడ్ పేర్కొన్నాడు. కాగా టీమిండియా తరఫున ఇప్పటి వరకు ఆడిన 15 టీ20లలో యశస్వి జైస్వాల్ 159కి పైగా స్ట్రైక్‌రేటుతో 430 పరుగులు చేశాడు. ఇందులో మూడు ఫిఫ్టీలు, ఓ సెంచరీ ఉండటం విశేషం. ఇక అఫ్గన్‌తో సిరీస్‌లో రోహిత్‌కు జోడీగా యశస్వి దిగనుండటంతో మరో స్టార్ ఓపెనర్ శుబ్‌మన్ గిల్ పరిస్థితి ఏమిటన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే, తొలి టీ20కి విరాట్ కోహ్లి అందుబాటులో ఉండటం లేదు కాబట్టి అతడు వన్‌డౌన్‌లో ఆడే అవకాశం దక్కించుకోవచ్చు. చదవండి: Ind Vs Afg: అఫ్గన్‌తో టీమిండియా సిరీస్: షెడ్యూల్, జట్లు, లైవ్ స్ట్రీమింగ్.. పూర్తి వివరాలు -
బీసీసీఐతో ఇషాన్‌కు విభేదాలా? అందుకే సెలక్ట్ చేయలేదా?!
యువ క్రికెటర్ ఇషాన్ కిషన్ పట్ల భారత క్రికెట్ నియంత్రణ మండలి వ్యవహరిస్తున్న తీరుపై అతడి అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విరాట్ కోహ్లి వంటి సీనియర్లకు, కిషన్ లాంటి యువ ఆటగాళ్లకు వేర్వేరు నిబంధనలు ఉంటాయా అని ప్రశ్నిస్తున్నారు. ఇందుకు కారణం ఏమిటంటే?!.. జట్టుతోనే ఉన్నా నో ఛాన్స్ గతేడాది కాలంగా జట్టులో పాటే ప్రయాణిస్తున్నా ఇషాన్ కిషన్‌కు తుదిజట్టులో చోటు కరువైంది. మూడు ఫార్మాట్లలో ఓపెనింగ్ బ్యాటర్ స్థానంలో శుబ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్ నుంచి.. వికెట్ కీపర్‌గా కేఎల్ రాహుల్ నుంచి ఈ జార్ఖండ్ ప్లేయర్ తీవ్రమైన పోటీ ఎదుర్కొంటున్నాడు. ఈ నేపథ్యంలో అడపాదడపా మాత్రమే అవకాశాలు వస్తున్నాయి. సౌతాఫ్రికా పర్యటన మధ్యలోనే స్వదేశానికి ఇషాన్ ఈ క్రమంలో సౌతాఫ్రికా పర్యటన నుంచి ఇషాన్ అకస్మాత్తుగా తిరిగి రావడం ప్రాధాన్యం సంతరించింది. మానసికంగా అలసిపోయానని.. అందుకే కొంతకాలం బ్రేక్ తీసుకోవాలని అతడు నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి. నిజానికి.. జట్టుతో పాటు ప్రయాణిస్తున్నా తగినంత ప్రాధాన్యం దక్కడం లేదనే ఆవేదనతో ఇషాన్ ఆటకు విరామం ఇవ్వాలని భావించినట్లు సమాచారం. అప్పటి నుంచే బీసీసీఐతో విభేదాలు? స్వదేశంలో ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్ నుంచే తనకు సెలవులు కావాలని ఇషాన్ అడిగినా.. మేనేజ్మెంట్ సానుకూలంగా స్పందించలేదని జాతీయ మీడియా సంస్థలు పేర్కొన్నాయి. ఎట్టకేలకు అతడి అభ్యర్థనను పరిగణనలోకి తీసుకుని రిలీవ్ చేస్తే.. విశ్రాంతి తీసుకోకుండా దుబాయ్‌లో ట్రిప్ ఎంజాయ్ చేయడం ఏమిటని కొందరు బీసీసీఐ పెద్దలు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు వదంతులు వచ్చాయి. అందుకే సెలక్ట్ చేయలేదా? ఈ నేపథ్యంలో ఇషాన్ కిషన్ ఫ్యాన్స్- నెటిజన్లకు మధ్య సోషల్ మీడియాలో వార్ నడుస్తోంది. వరల్డ్‌కప్-2024కు ముందు కీలకమైన అఫ్గనిస్తాన్‌తో సిరీస్‌కు ఇషాన్ కావాలనే అందుబాటులో ఉండకపోవడం అతడి పొగరుబోతుతనానికి సూచిక అని కొంతమంది తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఇలాంటి ఆటిట్యూడ్ ఉన్న ఆటగాడిని ప్రపంచకప్ టోర్నీలో ఆడించాలనే ఆలోచన ఉంటే మానుకోవాలని సూచిస్తున్నారు. ఇచ్చిన సెలవు ఎలా వాడుకుంటే వాళ్లకెందుకు?! అయితే, ఇషాన్ కిషన్ అభిమానులు ఇందుకు ఘాటుగానే బదులిస్తున్నారు. ‘‘విరాట్ కోహ్లి తాను మానసికంగా అలసిపోయానని సుదీర్ఘకాలం విశ్రాంతి తీసుకుంటూ.. విదేశాలకు వెళితే తప్పు లేదు.. కానీ ఇషాన్ లాంటి వాళ్లు సెలవు అడిగి ట్రిప్‌నకు వెళ్తే నేరమా? కావాలనే అఫ్గనిస్తాన్ సిరీస్ నుంచి తప్పించి.. పైగా అతడిపైనే నిందలు మోపడం సరికాదు. ఇచ్చిన సెలవును ఎలా వాడుకుంటే వాళ్లకెందుకు?’’ అని కౌంటర్ వేస్తున్నారు. దీంతో ఇషాన్ కిషన్ పేరు ఎక్స్ వేదికగా ట్రెండింగ్‌లోకి వచ్చింది. అందుకే దుబాయ్‌కి వెళ్లిన ఇషాన్ కాగా తన సోదరుడి పుట్టినరోజు వేడుకల్లో పాల్గొనేందుకు ఇషాన్ దుబాయ్‌కు వెళ్లడం గమనార్హం. ఇదిలా ఉంటే.. అఫ్గనిస్తాన్‌తో జనవరి 11 నుంచి టీ20 సిరీస్ ఆడేందుకు టీమిండియా సిద్ధమవుతోంది. కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి ఈ సిరీస్‌తో రీఎంట్రీ ఇస్తున్నారు. చదవండి: Ind Vs Afg: అఫ్గన్‌తో టీమిండియా సిరీస్: షెడ్యూల్, జట్లు, లైవ్ స్ట్రీమింగ్.. పూర్తి వివరాలు -
T20 WC: ఈసారి టీ20 వరల్డ్‌కప్ టీమిండియాదే: డివిలియర్స్
AB de Villiers Comments on Virat Kohli and Rohit Sharma: అంతర్జాతీయ టీ20లలో టీమిండియా స్టార్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ పునరాగమనంపై సౌతాఫ్రికా దిగ్గజ బ్యాటర్ ఏబీ డివిలియర్స్ స్పందించాడు. టీ20 ప్రపంచకప్-2024కు ముందు వారిద్దరిని జట్టులోకి రప్పించి మంచి పని చేశారంటూ సెలక్టర్ల నిర్ణయాన్ని సమర్థించాడు. ఐసీసీ టోర్నీలలో ఇలాంటి సీనియర్ స్టార్లను ఆడించడం వల్ల జట్టుకు మేలు చేకూరుతుందని ఏబీడీ అభిప్రాయపడ్డాడు. వీరిద్దరి రాకతో యువ క్రికెటర్లు మరి కొంతకాలం వేచి చూడక తప్పదని.. అయితే.. జట్టు ప్రయోజనాల దృష్ట్యా మేనేజ్మెంట్ కొన్నిసార్లు కఠిన నిర్ణయాలు తీసుకోవడం సహజమేనని పేర్కొన్నాడు. సెమీస్‌లో నిష్క్రమణ.. అనేక మార్పులు కాగా టీ20 ప్రపంచకప్-2022 సెమీస్‌లోనే టీమిండియా నిష్క్రమించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జట్టు వైఫల్యంపై తీవ్రంగా స్పందించిన బీసీసీఐ ప్రక్షాళన చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా సెలక్షన్ కమిటీని రద్దు చేస్తూ కఠిన నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో అనేక తర్జనభర్జనల అనంతరం మరోసారి చేతన్ శర్మకే చీఫ్ సెలక్టర్ బాధ్యతలు అప్పగించిన బీసీసీఐ.. టీమిండియా ఆటగాళ్లపై అతడి వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో వేటు వేసింది. చర్చోపర్చల అనంతరం భారత మాజీ బౌలర్ అజిత్ అగార్కర్‌ను సెలక్షన్ కమిటీ చైర్మన్‌గా నియమించింది. అప్పటి నుంచే రోహిత్, కోహ్లి దూరం సెలక్టర్ల సంగతి ఇలా ఉంటే.. ఈ టోర్నీ ముగిసిన తర్వాత రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి మళ్లీ ఇంతవరకు టీమిండియా తరఫున ఒక్క టీ20 కూడా ఆడలేదు. ఈ క్రమంలో 14 నెలల సుదీర్ఘ విరామం తర్వాత అఫ్గనిస్తాన్‌తో టీ20 సిరీస్ సందర్భంగా రీఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. ప్రపంచకప్-2024కు ముందు భారత్ ఆడనున్న చివరి సిరీస్ ఇదే కావడంతో వీరిద్దరి పునరాగమనం ప్రాధాన్యం సంతరించుకుంది. మెగా ఈవెంట్లో వీళ్లను ఆడించేందుకే సెలక్టర్లు ఈ నిర్ణయం తీసుకున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో కొంతమంది విరాహిత్ ద్వయం రాకను సౌరవ్ గంగూలీ, సునిల్ గావస్కర్ వంటి వారు స్వాగతిస్తుండగా.. మరికొందరు మాజీలు మాత్రం విమర్శిస్తున్నారు. వీరిద్దరి కారణంగా రింకూ సింగ్ వంటి యువ ఆటగాళ్లకు అవకాశాలు కరువవుతాయని పేర్కొంటున్నారు. అందుకే వాళ్లను విమర్శిస్తున్నారు ఈ విషయంపై ఏబీ డివిలియర్స్ స్పందిస్తూ.. ‘‘రోహిత్, కోహ్లి విషయంలో విమర్శలు ఎందుకు వస్తున్నాయో అర్థం చేసుకోగలను. ఏదేమైనా త్వరలోనే క్రికెట్ వరల్డ్‌కప్ టోర్నీ జరుగబోతోంది. ఒకవేళ కోహ్లి ఆడేందుకు ఫిట్‌గా ఉంటే కచ్చితంగా అతడిని ఆడించాలి. వయసుతో సంబంధం లేకుండా పాత కోహ్లిని గుర్తుచేస్తూ అతడు ముందుకు సాగుతున్నాడు. 20 ఏళ్ల కుర్ర ఆటగాళ్లు ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. 35 ఏళ్ల వయసులో నాకు ఇలాంటి సపోర్టు ఉంటే రోహిత్, విరాట్ ఉంటే టీ20 వరల్డ్‌కప్‌లో టీమిండియా గెలుస్తుందని మేనేజ్మెంట్ భావిస్తే కచ్చితంగా వాళ్లను ఆడిస్తుంది. నిజానికి 35 ఏళ్ల వయసులో ఉన్నపుడు నాకు కూడా మేనేజ్మెంట్ నుంచి ఇలాంటి మద్దతు ఉంటే ఎంతో బాగుండేది. ఈసారి ప్రపంచకప్ టీమిండియాదే ఏదేమైనా అఫ్గనిస్తాన్‌తో సిరీస్‌కు కోహ్లి, రోహిత్‌లను పిలిపించడం ద్వారా వాళ్లిద్దరు టీ20 ప్రపంచకప్ టోర్నీలోనూ భాగమవుతారని బీసీసీఐ తన ఉద్దేశాన్ని తెలియజేసింది. ఇది సరైన నిర్ణయం. అత్యుత్తమ ప్లేయర్లను ఆడించాలని భావించిన టీమిండియా ప్రపంచకప్ గెలిచే అవకాశం ఉంది’’ అని డివిలియర్స్ తన యూట్యూబ్ చానెల్ వేదికగా అభిప్రాయాలు పంచుకున్నాడు. కాగా జనవరి 11 నుంచి అఫ్గన్‌తో టీమిండియా సిరీస్ ఆరంభం కానుంది. ఇక అమెరికా- వెస్టిండీస్ వేదికగా జూన్ 4 నుంచి ప్రపంచకప్-2024 నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది. అంతకంటే ముందు ఐపీఎల్ 2024 రూపంలో ఆటగాళ్లకు కావాల్సినంత ప్రాక్టీస్ దొరకనుంది. చదవండి: Ind Vs Afg: అఫ్గన్‌తో టీమిండియా సిరీస్: షెడ్యూల్, జట్లు, లైవ్ స్ట్రీమింగ్.. పూర్తి వివరాలు -
ఆఫ్ఘనిస్తాన్‌తో టీ20 సిరీస్.. ఓపెనర్‌గా విరాట్ కోహ్లి..?
ఆఫ్ఘనిస్తాన్‌తో గురువారం నుంచి ప్రారంభం కాబోయే టీ20 సిరీస్‌లో టీమిండియా ఓపెనర్‌గా విరాట్ కోహ్లి వస్తాడనే వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఈ ప్రచారాన్ని చూసి కోహ్లి అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తుంటే, కొందరు విశ్లేషకులు మాత్రం ఇది సాధ్యమయ్యే విషయం కాదని సదరు ప్రచారాన్ని కొట్టిపారేస్తున్నారు. వాస్తవానికి కోహ్లి గత ఐపీఎల్ సీజన్లో ఓపెనర్ అవతారమెత్తినప్పటికీ, అది క్యాష్ రిచ్ లీగ్ వరకే పరిమతమైంది. గత సీజన్లో అతను ఓపెనర్‌గా పరుగుల వరద పారించినా, ఆతర్వాత అంతర్జాతీయ టీ20లు ఆడలేదు. దీంతో ఆ అంశం అప్పటితో మరుగున పడిపోయింది. అయితే తాజాగా కోహ్లి అంతర్జాతీయ టీ20ల్లోకి రీఎంట్రీ ఇవ్వడంతో ఓపెనర్ ప్రస్తావన మళ్లీ తెరపైకి వచ్చింది. పొట్టి ఫార్మాట్లో కోహ్లిని ఓపెనర్‌గా పంపాలని చాలామంది డిమాండ్ చేస్తున్నారు. అయితే ప్రస్తుత సమీకరణల ప్రకారం ఇది సాధ్యపడకపోవచ్చనే చెప్పాలి. ఈ ఏడాది టీ20 వరల్డ్‌కప్ ఉన్న నేపథ్యంలో టీమిండియా మేనేజ్మెంట్ ఇలాంటి సాహసాల జోలికి పోకపోవచ్చు. అలాగే ఆఫ్ఘనిస్తాన్‌తో సిరీస్‌కు సైతం భారత సెలెక్టర్లు రోహిత్‌కు జతగా శుభ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్‌లను ఓపెనర్లును ఎంపిక చేశారు. రోహిత్‌కు జతగా కోహ్లి ఇన్నింగ్స్‌ను ఓపెన్ చేస్తే వీరి పరిస్థితి ఏంటనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ఇప్పటికే గిల్ టెస్ట్‌ల్లో ఓపెనర్‌గా తన స్థానాన్ని కోల్పోయి జట్టులో చోటే ప్రశ్నార్ధకంగా మార్చుకున్నాడు. ఈ పరిస్థితుల్లో టీమ్ మేనేజ్మెంట్ కోహ్లిని ఓపెనర్‌గా పంపించే సాహసం చేస్తుందో లేదో వేచి చూడాలి. వాస్తవానికి కోహ్లి వన్‌డౌన్‌లో వస్తే టీమిండియాకు కొండంత బలం ఉంటుంది. ఈ విషయాన్ని కూడా చాలామంది మాజీలు ప్రస్తావిస్తూ, కోహ్లి ఇన్నింగ్స్‌ను ఓపెన్ చేయడాన్ని వ్యతిరేకిస్తున్నారు. మరి కోహ్లి విషయంలో జరుగుతున్న ప్రచారం నిజమో లేదో తేలాలంటే మరికొద్ది గంటలు వేచి చూడాల్సిందే. ఇదిలా ఉంటే, ఆఫ్ఘనిస్తాన్‌తో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ జనవరి 11, 14, 17 తేదీల్లో జరుగనుంది. చాలాకాలంగా అంతర్జాతీయ టీ20లకు దూరంగా ఉన్న రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి ఈ సిరీస్ ద్వారా టీమిండియాలోకి రీఎంట్రీ ఇచ్చారు. ఆఫ్ఘన్‌తో సిరీస్ అనంతరం టీమిండియా స్వదేశంలోనే ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ఆడుతుంది. ఓపెనర్‌గా టీ20ల్లో విరాట్ గణాంకాలు.. 107 మ్యాచ్‌లు 107 ఇన్నింగ్స్‌లు 4011 పరుగులు 122 నాటౌట్ అత్యధిక స్కోర్ 44.56 సగటు 137.64 సగటు 8 శతకాలు 28 అర్ధశతకాలు టీమిండియా: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభమన్ గిల్, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, తిలక్ వర్మ, రింకూ సింగ్, జితేష్ శర్మ (వికెట్‌కీపర్), సంజు శాంసన్ (వికెట్‌కీపర్), శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్ , అవేష్ ఖాన్, ముఖేష్ కుమార్ అఫ్గనిస్తాన్: ఇబ్రహీం జద్రాన్ (కెప్టెన్), రహ్మతుల్లా గుర్బాజ్ (వికెట్ కీపర్), ఇక్రమ్ అలీఖిల్ (వికెట్ కీపర్), హజ్రతుల్లా జజాయ్, రహ్మత్ షా, నజీబుల్లా జద్రాన్, మహ్మద్ నబీ, కరీం జనత్, అజ్మతుల్లా ఒమర్జాయ్, షరాఫుద్దీన్ అష్రఫ్, ముజీబ్ ఉర్ రెహ్మాన్, ఫజల్ హక్ ఫారూఖీ, ఫరీద్ అహ్మద్, నవీన్ ఉల్ హక్, నూర్ అహ్మద్, మహ్మద్ సలీం, కైస్ అహ్మద్, గుల్బదిన్ నైబ్, రషీద్ ఖాన్. -
టీమిండియాలో నో ఛాన్స్.. రంజీల్లో ఆడనున్న శ్రేయస్ అయ్యర్
టీమిండియా స్టార్ ఆటగాడు శ్రేయస్ అయ్యర్ రంజీల్లో ఆడనున్నాడు. రంజీ ట్రోఫీ-2024లో భాగంగా జనవరి 12 నుంచి 15 వరకు ఆంధ్రాతో జరగనున్న మ్యాచ్‌కు ముంబై జట్టులో అయ్యర్ పేరును సెలక్టర్లు చేర్చారు. సర్ఫరాజ్ ఖాన్ స్ధానాన్ని అయ్యర్‌తో ముంబై సెలక్టర్లు భర్తీ చేశారు. అహ్మదాబాద్‌లో ఇంగ్లండ్ ఎతో జరిగే సిరీస్‌లో భారత్ ఎ జట్టుకు సర్ఫరాజ్ ఖాన్ ఎంపికైన విషయం తెలిసిందే. కాగా స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరగనున్న టెస్టు సిరీస్ సన్నాహకాల్లో భాగంగానే రంజీల్లో ఆడాలని అయ్యర్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. కాగా ఇటీవలే దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్‌లో శ్రేయస్ చెప్పుకొదగ్గ ప్రదర్శన చేయలేకపోయాడు. ఇక ఇది ఇలా ఉండగా.. అఫ్గానిస్తాన్‌తో టీ20 సిరీస్‌కు ఎంపిక చేసిన భారత జట్టులో శ్రేయస్ అయ్యర్‌కు చోటు దక్కపోయిన సంగతి తెలిసిందే. అతడికి సెలక్టర్లు విశ్రాంతి ఇచ్చారో లేదా ఉద్దేశపూర్వకంగానే పక్కన పెట్టారో ఇప్పటివరకు అయితే ఎటువంటి సమాచారం లేదు. ముంబై జట్టు: జింక్యా రహానే (కెప్టెన్), శ్రేయాస్ అయ్యర్, జే బిస్తా, భూపేన్ లల్వానీ, అమోఘ్ భత్కల్, సువేద్ పార్కర్, ప్రసాద్ పవార్ (వికెట్ కీపర్), హార్దిక్ తమోర్, షామ్స్ ములానీ, తనుష్ కోటియన్, అథర్వ అంకోలేకర్, మోహిత్ అవస్తి, ధావల్ అవస్తి , రాయ్స్టన్ డయాస్, సిల్వెస్టర్ డిసౌజా. -
రోహిత్ శర్మ సొంత తమ్ముడు.. కవల పిల్లలు! అతడి పరిస్థితి?
సాధారణ కుటుంబం నుంచి వచ్చి టీమిండియా కెప్టెన్ స్థాయికి ఎదిగాడు రోహిత్ శర్మ. ఆర్థిక పరిస్థితుల కారణంగా చిన్ననాడు తల్లిదండ్రులతో కలిసి ఒకే ఇంటిలో జీవించే భాగ్యానికి కూడా దూరమైన అతడు.. ‘హిట్‌మ్యాన్’గా కోట్లాది మంది అభిమానుల గుండెల్లో గూడు కట్టుకున్నాడు. పేదరికాన్ని జయించి అత్యంత సంపన్న క్రికెటర్లలో ఒకడిగా నిలిచి.. విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నాడు. మరి ఆ లైఫ్‌లో కేవలం భార్య రతిక సజ్దే, కూతురు సమైరా శర్మ మాత్రమే ఉన్నారా?! రోహిత్ తల్లిదండ్రులు, తోడబుట్టిన తమ్ముడి పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది? వైజాగ్ మనుమడు రోహిత్ శర్మ తల్లిదండ్రుల పేర్లు గురునాథ్ శర్మ, పూర్ణిమా శర్మ. పూర్ణిమ విశాఖపట్నానికి చెందిన వారు. ఈ దంపతులకు 1987, ఏప్రిల్ 30న కుమారుడు రోహిత్ శర్మ జన్మించాడు. అనంతరం మరో కుమారుడు జన్మించగా అతడికి విశాల్ శర్మగా నామకరణం చేశారు. మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో జన్మించిన రోహిత్‌కు రెండేళ్ల వయసు ఉన్నపుడు వాళ్ల కుటుంబం డోంబివలీ ఏరియాకు మారింది. గురునాథ్ శర్మ ఓ ట్రాన్స్పోర్ట్ సంస్థలో స్టోర్‌హౌజ్ కేర్‌టేకర్‌గా పనిచేసేవారు. తల్లిదండ్రులకు దూరంగా అయితే, కుటుంబాన్ని పోషించుకోవడానికి కావాల్సినంత ఆదాయం లభించేది కాదు. అందుకే డోంబివలీకి మకాం మార్చిన గురునాథ్ శర్మ.. తన పెద్ద కుమారుడు రోహిత్‌ను అతడి బామ్మతాతయ్యల వద్దకు పంపించారు. వాళ్ల దగ్గరే పెరిగిన రోహిత్ శర్మ వారాంతాల్లో మాత్రం తల్లిదండ్రులను చూసేందుకు వచ్చేవాడు. అప్పుడే తమ్ముడు విశాల్‌తో ఆడుకునే సమయం దొరికేది. ఇద్దరూ కలిసి క్రికెట్ ఆడుతూ కబుర్లు చెప్పుకొనేవారు. అయితే, రోహిత్లో దాగున్న ప్రతిభను గమనించిన అతడి అంకుల్ క్రికెట్ క్యాంపులో.. రోహిత్ పేరును నమోదు చేయించాడు. 14వ ఏట అలా క్రికెట్లో అడుగుపెట్టిన ‘హిట్‌మ్యాన్’.. ఒక్కో మెట్టు ఎక్కుతూ భారత జట్టులో కీలక సభ్యుడిగా.. ప్రస్తుతం కెప్టెన్‌గా మారాడు. తమ్ముడిని ఉద్యోగం మాన్పించి తనకు మేనేజర్‌గా వ్యవహరించిన రితికా సజ్దేను పెళ్లాడగా.. వీరికి కుమార్తె సమైరా జన్మించింది. భార్యా, కుమార్తెతో కలిసి ముంబైలోని లగ్జరీ ఏరియాలో నివసించే రోహిత్ శర్మ తన తల్లిదండ్రులు, తమ్ముడి కోసం అతడి ఇంటికి కాస్త దూరంలో మరో ఇల్లును కొనుగోలు చేశాడు. పెద్ద కొడుకుగా కుటుంబం పట్ల తన బాధ్యతలన్నీ నెరవేరుస్తున్న రోహిత్ శర్మ.. తమ్ముడు విశాల్‌కు కూడా దన్నుగా నిలిచాడు. క్రికెటర్‌గా తను ఉన్నత స్థాయికి చేరుకున్న తర్వాత విశాల్ వేరే చోట ఉద్యోగం చేయకుండా తన క్రికెట్ అకాడమీలను పర్యవేక్షించే బాధ్యత అప్పగించాడు. విశాల్ శర్మ ప్రస్తుతం ఇండియా, సింగపూర్‌లో ఉన్న రోహిత్ క్రిక్‌కింగ్‌డమ్ క్రికెట్ అకాడమీ ఆపరేషన్స్ హెడ్‌గా ఉన్నాడు. కవల కుమార్తెలతో విశాల్ శర్మ PC: Vishal Sharma Instagram కవల పిల్లలతో ముచ్చటైన కుటుంబం ఇక విశాల్ వ్యక్తిగత జీవితాన్ని పరిశీలిస్తే.. దీపాలి షిండే అనే అమ్మాయితో అతడికి వివాహం జరిగింది. ఈ జంటకు 2021లో కవల కూతుళ్లు అనైరా, అనైషా జన్మించారు. వీరిద్దరి పుట్టినరోజు నేడు(జనవరి 9). ఈ సందర్భంగా విశాల్ - దీపాలి తమ కుమార్తెలకు బర్త్‌డే విషెస్ తెలియజేస్తూ అందమైన ఫొటోలు షేర్ చేశారు. అదండీ సంగతి!! అఫ్గన్‌తో సిరీస్‌తో అంతర్జాతీయ టీ20లలో.. ఇదిలా ఉంటే.. సౌతాఫ్రికా పర్యటన ముగించుకున్న రోహిత్ శర్మ జనవరి 11 నుంచి అఫ్గనిస్తాన్‌తో మొదలయ్యే సిరీస్‌తో టీమిండియా తరఫున టీ20లలో రీఎంట్రీ ఇవ్వనున్నాడు. ఈ సిరీస్‌లో భాగంగా రోహిత్ సారథ్యంలో భారత్ మూడు మ్యాచ్‌లు ఆడనుంది. చదవండి: IND vs SA 2nd Test: రెండు రోజుల్లోనే ముగిసిన మ్యాచ్.. కేప్‌టౌన్ పిచ్‌పై ఐసీసీ సీరియస్ -
టీమిండియాలో ఛాన్స్ కొట్టేశాడు.. కట్ చేస్తే! అక్కడ 6 వికెట్లతో అదుర్స్
రంజీట్రోఫీ-2024 సీజన్‌ను టీమిండియా ఆటగాడు, ముంబై స్టార్ ఆల్‌రౌండర్ శివమ్ దూబే ఘనంగా ఆరంభించాడు. ఎలైట్ గ్రూపు-బిలో భాగంగా బీహార్‌తో జరిగిన మ్యాచ్‌లో దుబే ఆల్‌రౌండ్ ప్రదర్శన కనబరిచాడు. ముంబై తొలి ఇన్నింగ్స్‌లో 41 పరుగులతో రాణించిన దూబే.. అనంతరం బౌలింగ్‌లో అదరగొట్టాడు. మొదటి ఇన్నింగ్స్‌లో రెండు కీలక వికెట్లు పడగొట్టి బీహార్‌ను ఫాలో ఆన్ దాటకుండానే కట్టడి చేశాడు. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్‌లో 4 కీలక వికెట్లు పడగొట్టి చావు దెబ్బ కొట్టాడు. ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌లు కలిపి దూబే 6 వికెట్లు సాధించాడు. ఇక ఈ మ్యాచ్‌లో బీహార్‌పై ఇన్నింగ్స్ 51 పరుగుల తేడాతో ముంబై ఘన విజయం సాధించింది. భారత జట్టులో చోటు.. కాగా తాజాగా అఫ్గానిస్తాన్‌తో టీ20 సిరీస్‌కు ప్రకటించిన భారత జట్టులో దూబేకు చోటు దక్కింది. ఈ సిరీస్‌కు గాయం కారణంగా దూరమైన స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా స్ధానాన్ని దూబేతో సెలక్టర్లు భర్తీ చేశారు. దూబే చివరగా భారత తరపున ఆసియా క్రీడల్లో ఆడాడు. టీమిండియా తరపున ఇప్పటివరకు 18 టీ20లు ఆడిన దూబే.. 152 పరుగులతో పాటు 6 వికెట్లు పడగొట్టాడు. చదవండి: IND vs AFG:'హార్దిక్ తిరిగొచ్చినా రోహిత్ శర్మనే కెప్టెన్.. రాసిపెట్టుకోండి -
'హార్దిక్ తిరిగొచ్చినా రోహిత్ శర్మనే కెప్టెన్.. రాసిపెట్టుకోండి'
టీ20ల్లో మరోసారి భారత జట్టును నడిపించేందుకు రోహిత్ శర్మ సిద్దమయ్యాడు. అఫ్గానిస్తాన్‌తో టీ20 సిరీస్‌కు ఎంపిక చేసిన భారత జజట్టులో రోహిత్ శర్మకు చోటు దక్కింది. రోహిత్‌తో పాటు మరో సీనియర్ ఆటగాడు విరాట్ కోహ్లికి అవకాశం లభించింది. దాదాపు 4 నెలల తర్వాత రోహిత్, కోహ్లి తిరిగి టీమిండియా టీ20 జట్టులో చేరారు. ఈ సీనియర్లు ఇద్దరూ టీ20 ప్రపంచకప్-2024లో కూడా భాగమయ్యే సూచనలు కన్పిస్తున్నాయి. అయితే ఈ సిరీస్‌కు భారత టీ20 తాత్కాలిక కెప్టెన్ హార్దిక్ పాండ్యా గాయం కారణంగా దూరమయ్యాడు. అయితే హార్దిక్ గాయం నుంచి తిరిగి కోలుకుంటే రోహిత్ భారత జట్టుకు సారథ్యం వహిస్తాడా లేదా సెలక్టర్లు పాండ్యా వైపే మొగ్గు చూపుతారన్నది ప్రస్తుతం అందరి మెదడలను తొలుస్తున్న ప్రశ్న. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ ఆటగాడు ఆకాష్ చోప్రా తన అభిప్రాయాలను వెల్లడించాడు. హార్దిక్ పాండ్యా తిరిగి జట్టులోకి వచ్చినా టీ20 వరల్డ్‌కప్‌లో రోహిత్ శర్మనే జట్టుకు నాయకత్వం వహిస్తాడని చోప్రా తెలిపాడు. టీ20ల్లో రోహిత్ శర్మను తిరిగి కెప్టెన్‌గా చూడడం చాలా సంతోషంగా ఉంది. రోహిత్ అఫ్గాన్ సిరీస్‌తో పాటు టీ20 ప్రపంచకప్‌లో కూడా భారత జట్టును నడిపిస్తాడు. అందులో ఎటువంటి సందేహం లేదు. హార్దిక్ తిరిగి వచ్చిన తర్వాత కెప్టెన్ అయ్యే ఛాన్స్ లేదు. ఇది రాసిపెట్టుకోండి. రోహిత్ జట్టులో ఉంటే హార్దిక్ కెప్టెన్సీ బాధ్యతలు అప్పజెప్పే అవకాశాలు చాలా తక్కువ అని చోప్రా తన యూట్యూబ్ ఛానల్లో పేర్కొన్నాడు. చదవండి: Ind vs Eng: మహ్మద్ షమీ మరికొన్నాళ్లు.. ఇప్పట్లో కష్టమే! -
ఆఫ్ఘనిస్తాన్‌తో టీ20 సిరీస్.. ఎవరికీ సాధ్యం కాని రికార్డుపై కన్నేసిన రోహిత్
ఆఫ్ఘనిస్తాన్‌తో జరుగబోయే టీ20 సిరీస్‌కు ముందు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఎవరికీ సాధ్యం కాని ఓ భారీ రికార్డుపై కన్నేశాడు. ఈ సిరీస్‌లో హిట్‌మ్యాన్ మరో 18 సిక్సర్లు బాదితే టీ20ల్లో 200 సిక్సర్లు కొట్టిన తొలి క్రికెటర్‌గా రికార్డుల్లోకెక్కుతాడు. రోహిత్ ఇప్పటివరకు 148 మ్యాచ్‌ల్లో 182 సిక్సర్లు కొట్టి, టీ20ల్లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా కొనసాగుతున్నాడు. రోహిత్ తర్వాత అత్యధిక సిక్సర్లు కొట్టిన ఘనత న్యూజిలాండ్ ఆటగాడు మార్టిన్ గప్తిల్ (122 మ్యాచ్‌ల్లో 173 సిక్సర్లు) పేరిట ఉంది. ఈ జాబితాలో ఆసీస్ మాజీ కెప్టెన్ ఆరోన్ ఫించ్ (125), యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ (124), టీమిండియా విధ్వంసకర ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ (123) వరుసగా మూడు నుంచి ఐదు స్థానాల్లో ఉన్నారు. 117 సిక్సర్లతో విరాట్ కోహ్లి తొమ్మిదో స్థానంలో నిలిచాడు. కాగా, జనవరి 11 (మొహాలీ), 14 (ఇండోర్), 17 (బెంగళూరు) తేదీల్లో ఆఫ్ఘనిస్తాన్‌తో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ జరుగనుంది. ఈ సిరీస్ కోసం ఇరు జట్లను ఇదివరకే ప్రకటించారు. భారత్ తరఫున రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి చాలాకాలం తర్వాత టీ20ల్లో బరిలోకి దిగుతున్నారు. టీమిండియా: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభమన్ గిల్, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, తిలక్ వర్మ, రింకూ సింగ్, జితేష్ శర్మ (వికెట్‌కీపర్), సంజు శాంసన్ (వికెట్‌కీపర్), శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్ , అవేష్ ఖాన్, ముఖేష్ కుమార్ అఫ్గనిస్తాన్: ఇబ్రహీం జద్రాన్ (కెప్టెన్), రహ్మతుల్లా గుర్బాజ్ (వికెట్ కీపర్), ఇక్రమ్ అలీఖిల్ (వికెట్ కీపర్), హజ్రతుల్లా జజాయ్, రహ్మత్ షా, నజీబుల్లా జద్రాన్, మహ్మద్ నబీ, కరీం జనత్, అజ్మతుల్లా ఒమర్జాయ్, షరాఫుద్దీన్ అష్రఫ్, ముజీబ్ ఉర్ రెహ్మాన్, ఫజల్ హక్ ఫారూఖీ, ఫరీద్ అహ్మద్, నవీన్ ఉల్ హక్, నూర్ అహ్మద్, మహ్మద్ సలీం, కైస్ అహ్మద్, గుల్బదిన్ నైబ్, రషీద్ ఖాన్. -
IND vs AFG: సెలక్టర్ల నిర్ణయం సరైనదే! హార్దిక్ స్ధానంలో అతడే బెటర్
అఫ్గానిస్తాన్‌తో సిరీస్‌కు 16 మంది సభ్యలతో కూడిన భారత జట్టును బీసీసీఐ తాజాగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సిరీస్‌తో టీమిండియా సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి తిరిగి టీ20ల్లో రీ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్దమయ్యారు. 14 నెలల తర్వాత వీరిద్దరూ టీ20ల్లో భారత జట్టు తరపున బరిలోకి దిగనున్నారు. ఇక సిరీస్‌కు హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్, రుత్‌రాజ్ గాయం కారణంగా దూరం కాగా.. శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్‌కు సెలక్టర్లు విశ్రాంతి ఇచ్చారు. ఇక హార్దిక్ పాండ్యా స్ధానంలో పేస్ ఆల్‌రౌండర్ శివమ్ దూబేకు సెలక్టర్లు ఛాన్స్ ఇచ్చారు. గతేడాది ఐర్లాండ్‌తో టీ20 సిరీస్, ఆసియా క్రీడల్లో అద్భుతంగా రాణించిన దూబేకు ఎట్టకేలకు జట్టులో చోటు దక్కింది. ఈ నేపథ్యంలో దూబేను ఉద్దేశించి భారత మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. "శివమ్ దూబే తిరిగి మళ్లీ జట్టులోకి వచ్చాడు. సెలక్టర్లు సరైన నిర్ణయం తీసుకున్నారు. సెలక్టర్ల నిర్ణయం నన్ను ఏమి ఆశ్చర్యపరచలేదు. జట్టుకు ప్రస్తుతం హార్దిక్ పాండ్యా స్ధానాన్ని భర్తీ చేసే ఆటగాడి కావాలి. ఆ సత్తా దూబేకు ఉంది. అతడిని దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌కు ఎంపిక చేస్తారని భావించాను. అతడిని సౌతాఫ్రికాకు తీసుకువెళ్లి ఉంటే విదేశీ పిచ్‌లపై ఎలా ఆడేవాడన్నది మేనెజ్మెంట్కు ఒక అవగహన వచ్చి ఉండేది. కానీ సెలక్షన్ కమిటీ అతడిని పరిగణలోకి తీసుకోలేదు. స్వదేశంలో ఆసీస్ సిరీస్‌లో కూడా అదే పరిస్థితి. జట్టులో ఉన్నప్పటికి సిరీస్ మొత్తం బెంచ్‌కే పరిమితమయ్యాడు. కచ్చితంగా జట్టుకు ఆరో బౌలర్ అవసరం. కాబట్టి దుబేకు ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు దక్కుతుందని ఆశిస్తున్నాను" అని చోప్రా తన యూట్యాబ్ ఛానల్లో పేర్కొన్నాడు. కాగా భారత తరపున ఇప్పటివరకు 18 టీ20లు ఆడిన దూబే.. 152 పరుగులతో పాటు 6 వికెట్లు పడగొట్టాడు. మొహాలీ వేదికగా జరగనున్న తొలి టీ20తో ఈ టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. చదవండి: Ind vs Eng: మహ్మద్ షమీ మరికొన్నాళ్లు.. ఇప్పట్లో కష్టమే! -
అఫ్గన్‌తో టీమిండియా సిరీస్: షెడ్యూల్, లైవ్ స్ట్రీమింగ్.. పూర్తి వివరాలు
Afghanistan tour of India, 2024: టీ20 ప్రపంచకప్-2024కు ముందు ఆఖరి సిరీస్ ఆడేందుకు టీమిండియా సిద్ధమైంది. స్వదేశంలో అఫ్గనిస్తాన్‌తో మూడు టీ20లలో పోటీపడనుంది. ఈ సిరీస్‌తో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్లో 14 నెలల తర్వాత పునరాగమనం చేస్తున్నారు. వీళ్లిద్దరి రాకతో.. పండుగ వేళ ఈ సిరీస్ మరింత హైలైట్ కానుంది. కాగా అఫ్గనిస్తాన్ టీ20 సిరీస్ కోసం భారత్‌లో పర్యటించడం ఇదే తొలిసారి. రెగ్యులర్ కెప్టెన్ రషీద్ ఖాన్ గాయం కారణంగా మైదానంలో దిగే పరిస్థితి లేకపోవడంతో.. యువ బ్యాటర్ ఇబ్రహీం జద్రాన్ అఫ్గన్ సారథిగా వ్యవహరించనున్నాడు. ఇలా ఓవైపు స్టార్ల రాకతో టీమిండియా మరింత పటిష్టకాగా.. నంబర్ 1 జట్టుతో ఢీకొట్టేందుకు అఫ్గనిస్తాన్ కూడా సై అంటోంది. రోహిత్ సేనకు గట్టి పోటీనిచ్చి.. అండర్డాగ్స్ అనే ముద్రను చెరిపివేసుకోవడమే లక్ష్యంగా భారత్‌లో అడుగుపెడుతున్నట్లు చెబుతోంది. ఈ సిరీస్‌కు సంబంధించిన పూర్తి విశేషాలు మీకోసం.. టీమిండియా వర్సెస్ అఫ్గనిస్తాన్ టీ20 సిరీస్ షెడ్యూల్ ►తొలి టీ20: జనవరి 11- పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ ఐఎస్ బింద్రా స్టేడియం మొహాలీ, పంజాబ్ ►రెండో టీ20: జనవరి 14- హోల్కర్ క్రికెట్ స్టేడియం- ఇండోర్, మధ్యప్రదేశ్ ►మూడో టీ20: జనవరి 17- ఎం. చిన్నస్వామి స్టేడియం- బెంగళూరు, కర్ణాటక. మ్యాచ్ ఆరంభ సమయం భారత కాలమానం ప్రకారం రాత్రి ఏడు గంటలకు ఇండియా- అఫ్గనిస్తాన్ మ్యాచ్‌లు ప్రారంభమవుతాయి. ప్రత్యక్ష ప్రసారం ఎక్కడ? ►ఇండియా- అఫ్గనిస్తాన్ మ్యాచ్‌లను భారత్‌లో స్పోర్ట్స్ 18 నెట్‌వర్క్‌లో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. ►ఇక డిజిటల్ మాధ్యమంలో జియో సినిమా యాప్, వెబ్సైట్లో ప్రేక్షకులు ఈ మ్యాచ్‌లను వీక్షించవచ్చు. మొహాలీ చేరుకున్న అఫ్గనిస్తాన్ జట్టు టీమిండియాతో సిరీస్ కోసం అఫ్గన్ జట్టు ఇప్పటికే భారత్‌లో అడుగుపెట్టింది. తొలి మ్యాచ్‌కు సన్నద్ధమయ్యే క్రమంలో మొహాలీకి చేరుకుంది. కాగా ఈ సిరీస్ కంటే ముందు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో పర్యటించిన అఫ్గనిస్తాన్ జట్టు 2-1తో ట్రోఫీ గెలిచింది. టీమిండియాతో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు అఫ్గనిస్తాన్ జట్టు ఇబ్రహీం జద్రాన్ (కెప్టెన్), రహ్మతుల్లా గుర్బాజ్ (వికెట్ కీపర్), ఇక్రమ్ అలీఖిల్ (వికెట్ కీపర్), హజ్రతుల్లా జజాయ్, రహ్మత్ షా, నజీబుల్లా జద్రాన్, మహ్మద్ నబీ, కరీం జనత్, అజ్మతుల్లా ఒమర్జాయ్, షరాఫుద్దీన్ అష్రఫ్, ముజీబ్ ఉర్ రెహ్మాన్, ఫజల్ హక్ ఫారూఖీ, ఫరీద్ అహ్మద్, నవీన్ ఉల్ హక్, నూర్ అహ్మద్, మహ్మద్ సలీం, కైస్ అహ్మద్, గుల్బదిన్ నైబ్, రషీద్ ఖాన్. అఫ్గనిస్తాన్‌తో టీ20 సిరీస్‌కు టీమిండియా: రోహిత్ శర్మ (కెప్టెన్), శుబ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్, కోహ్లి, తిలక్ వర్మ, రింకూ సింగ్, జితేశ్ శర్మ, సంజూ శాంసన్, శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, అవేశ్ ఖాన్, ముకేశ్ కుమార్. చదవండి: #ExploreIndianIslands: ప్రధాని మోదీపై అనుచిత వ్యాఖ్యలు: మాల్దీవులకు వెళ్లొద్దంటున్న క్రికెటర్లు! -
IPL 2024: ముంబై ఇండియన్స్‌కు మరో బిగ్ షాక్!
Suryakumar Yadav- Setback To Mumbai Indians Ahead IPL 2024?: టీమిండియా టీ20 స్టార్ సూర్యకుమార్ యాదవ్ మరి కొన్నాళ్లపాటు క్రికెట్‌కు దూరం కానున్నాడు. ఇప్పటికే చీలమండ గాయంతో బాధపడుతున్న ఈ డాషింగ్ బ్యాటర్ ను మరో ఆరోగ్య సమస్య వేధిస్తున్నట్లు తెలుస్తోంది. స్పోర్ట్స్ హెర్నియా వల్ల అతడు ఇబ్బందిపడుతున్నట్లు సమాచారం. సర్జరీ కోసం జర్మనీకి ఈ నేపథ్యంలో సర్జరీ కోసం సూర్యకుమార్ జర్మనీ వెళ్లేందుకు సిద్ధమైనట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం వెలువరించింది. ‘‘సూర్యకుమార్ యాదవ్ స్పోర్ట్స్ హెర్నియాతో బాధపడుతున్నాడు. ప్రస్తుతం అతడు బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో చికిత్స పొందుతున్నాడు. రానున్న రెండు- మూడు రోజుల్లో అతడు సర్జరీ కోసం జర్మనీలోని మ్యూనిచ్కు పయనమవుతాడు. కాబట్టి రంజీ ట్రోఫీ టోర్నీతో పాటు ఐపీఎల్-2024 ఆరంభ మ్యాచ్‌లకు సూర్య దూరంగా ఉంటాడు. రంజీలు ఆడడు.. ఐపీఎల్ ఆరంభ మ్యాచ్‌లకు దూరం! రంజీల్లో ముంబై తరఫున ఆడటం వీలుపడదు. ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ తరఫున కొన్ని మ్యాచ్‌లకు కూడా అతడు అందుబాటులో ఉండడు’’ అని బీసీసీఐ వర్గాలు వెల్లడించినట్లు తెలిపింది. జూన్‌లోనే టీ20 వరల్డ్‌కప్-2024 మొదలుకానుంది కాబట్టి.. సూర్య పూర్తిగా కోలుకునేలా మేనేజ్మెంట్ అన్ని రకాల చర్యలు చేపట్టిందని సదరు వర్గాలు పేర్కొన్నట్లు వెల్లడించింది. కాగా చీలమండ నొప్పి వల్ల సూర్యకుమార్ యాదవ్ ఇప్పటికే అఫ్గనిస్తాన్‌తో టీ20 సిరీస్‌కు దూరమయ్యాడు. ఇప్పటికే హార్దిక్ దూరమయ్యాడు! ఇదిలా ఉంటే.. సూర్య గనుక ఆరంభ మ్యాచ్‌లకు దూరమైతే ముంబై ఇండియన్స్ ఎదురుదెబ్బ తగినట్లే! ఇప్పటికే కెప్టెన్ హార్దిక్ పాండ్యా కూడా చీలమండ నొప్పితో ఆటకు దూరంగా ఉన్నాడు. అతడు ఎప్పుడు జట్టుతో చేరతాడన్న అంశంలో స్పష్టత లేదు. ఇప్పుడు సూర్య కూడా దూరం కావడంతో ఇద్దరు కీలక ఆటగాళ్లు లేకుండానే ముంబై ఐపీఎల్-2024 సీజన్‌ను ఆరంభించాల్సి ఉంటుంది. స్పోర్ట్స్ హెర్నియా అంటే? WebMD హెల్త్ అండ్ ఫిట్నెస్ గైడ్ ప్రకారం.. కండరాల్లో నొప్పి లేదంటే గజ్జల్లో గాయం.. లేదంటే పొట్ట దిగువన(మృదువైన కణజాలం) తీవ్రమైన నొప్పి రావడాన్ని సాధారణంగా స్పోర్ట్స్ హెర్నియాగా వ్యవహరిస్తారు. కేవలం ప్రొఫెషనల్ ప్లేయర్లే గాకుండా.. ఆటలు ఆడే చాలా మందిలో సాధారణంగా కనిపించే సమస్యే ఇది. మెడికల్ ప్రొఫెషనల్స్ దీనిని స్పోర్ట్స్ హెర్నియా లేదంటే.. అథ్లెటిక్ పబల్గియాగా వ్యవహరిస్తారు. ఇదిలా ఉంటే.. మానవ శరీరంలో నిర్దిష్ట ప్రాంతంలో ఉండాల్సిన అవయవాలు మరొక భాగంలోకి చొచ్చుకువచ్చే స్థితిని సాధారణంగా హెర్నియా అని పిలుస్తారు. స్పోర్ట్స్ హెర్నియా, దీని లక్షణాలు వేర్వేరుగా ఉంటాయి. చదవండి: అఫ్ఘనిస్తాన్‌తో సిరీస్ కోసం భారత జట్టు ప్రకటన.. రోహిత్, కోహ్లి రీఎంట్రీ, సంజూకు ఛాన్స్ -
ఆఫ్ఘనిస్తాన్‌తో సిరీస్ కోసం భారత జట్టు ప్రకటన.. రోహిత్, కోహ్లి రీఎంట్రీ, సంజూకు ఛాన్స్
జనవరి 11 14, 17 తేదీల్లో ఆఫ్ఘనిస్తాన్‌తో జరుగబోయే మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం భారత జట్టును ఇవాళ (జనవరి 7) ప్రకటించారు. ఈ జట్టుకు కెప్టెన్‌గా రోహిత్ శర్మ వ్యవహరించనున్నాడు. చాలాకాలం తర్వాత రోహిత్, విరాట్లు పొట్టి ఫార్మాట్లోకి (అంతర్జాతీయ క్రికెట్) రీఎంట్రీ ఇవ్వనున్నారు. ఇటీవలే సౌతాఫ్రికాపై సెంచరీ (వన్డేలో) చేసిన సంజూ శాంసన్‌కు టీ20 జట్టులో చోటు లభించింది. సౌతాఫ్రికాతో రెండో టెస్ట్‌లో నిప్పులు చెరిగిన బుమ్రా, సిరాజ్‌లకు సెలెక్టర్లు విశ్రాంతినిచ్చారు. గాయాల కారణంగా ఇన్ ఫామ్ ఆటగాళ్లు రుతురాజ్ గైక్వాడ్, సూర్యకుమార్ యాదవ్ జట్టుకు దూరమయ్యారు. వన్డే వరల్డ్‌కప్ సందర్భంగా గాయపడిన హార్దిక్ ఇంకా కోలుకోలేదని సెలెక్టర్లు చెప్పారు. ఈ ఏడాది జరుగునున్న టీ20 వరల్డ్‌కప్‌ను దృష్టిలో పెట్టుకుని సెలెక్టర్లు యువ జట్టును ఎంపిక చేశారు. రవీంద్ర జడేజా, కేఎల్ రాహుల్‌లకు రెస్ట్ ఇచ్చిన సెలెక్టర్లు.. ప్రసిద్ద్ కృష్ణపై వేటు వేశారు. కాగా, ఈ సిరీస్ కోసం ఆఫ్ఘనిస్తాన్ జట్టును ఇదివరకే ప్రకటించారు. ఆ జట్టుకు సారధిగా ఇబ్రహీం జద్రాన్ వ్యవహరించనున్నాడు. ఇటీవలే వెన్నునొప్పికి సర్జరీ చేయించుకున్న రషీద్ ఖాన్ కూడా ఈ జట్టుకు ఎంపికయ్యాడు. ఈ సిరీస్ కోసం ఆఫ్ఘనిస్తాన్ ప్లేయర్లు ఇవాళే భారత్‌కు చేరుకున్నారు. టీమిండియా: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభమన్ గిల్, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, తిలక్ వర్మ, రింకూ సింగ్, జితేష్ శర్మ (వికెట్‌కీపర్), సంజు శాంసన్ (వికెట్‌కీపర్), శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్ , అవేష్ ఖాన్, ముఖేష్ కుమార్ అఫ్గనిస్తాన్: ఇబ్రహీం జద్రాన్ (కెప్టెన్), రహ్మతుల్లా గుర్బాజ్ (వికెట్ కీపర్), ఇక్రమ్ అలీఖిల్ (వికెట్ కీపర్), హజ్రతుల్లా జజాయ్, రహ్మత్ షా, నజీబుల్లా జద్రాన్, మహ్మద్ నబీ, కరీం జనత్, అజ్మతుల్లా ఒమర్జాయ్, షరాఫుద్దీన్ అష్రఫ్, ముజీబ్ ఉర్ రెహ్మాన్, ఫజల్ హక్ ఫారూఖీ, ఫరీద్ అహ్మద్, నవీన్ ఉల్ హక్, నూర్ అహ్మద్, మహ్మద్ సలీం, కైస్ అహ్మద్, గుల్బదిన్ నైబ్, రషీద్ ఖాన్. -
టీమిండియాకు బిగ్ షాక్
జనవరి 11 14, 17 తేదీల్లో ఆఫ్ఘనిస్తాన్‌తో జరుగబోయే మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు ముందు టీమిండియాకు భారీ షాక్ తగిలింది. గాయం కారణంగా ఇన్ ఫామ్ ఆటగాళ్లు రుతురాజ్ గైక్వడ్, సూర్యకుమార్ యాదవ్ ఆఫ్ఘన్ సిరీస్‌కు దూరమయ్యారు. వన్డే వరల్డ్‌కప్ సందర్భంగా గాయపడ్డ హార్దిక్ పాండ్యా కూడా ఈ సిరీస్‌కు దూరంగా ఉండనున్నాడు. ఈ విషయాన్ని ఈఎస్పీఎన్ క్రిక్ఇన్ఫో వెల్లడించింది. కాగా, ఆఫ్ఘనిస్తాన్‌తో టీ20 సిరీస్ కోసం జట్టును ఎంపిక చేసేందుకు సెలెక్టర్లు ఇవాళ ముంబైలో సమావేశం కానున్నారు. అజిత్ అగర్కార్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ ఆఫ్ఘనిస్తాన్ సిరీస్‌తో పాటు ఆతర్వాత ఇంగ్లండ్‌తో జరుగబోయే టెస్ట్ సిరీస్ (తొలి రెండు టెస్ట్‌లకు) కోసం కూడా భారత జట్టును ఎంపిక చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఆఫ్ఘనిస్తాన్ సిరీస్‌తో రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి తిరిగి టీ20ల్లోకి పునరాగమనం చేయనున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే, టీమిండియాతో సిరీస్ కోసం ఆఫ్ఘనిస్తాన్ జట్టును ఇదివరకే ప్రకటించారు. ఆఫ్ఘన్ జట్టుకు సారధిగా ఇబ్రహీం జద్రాన్ వ్యవహరించనున్నాడు. ఇటీవలే వెన్నునొప్పికి సర్జరీ చేయించుకున్న రషీద్ ఖాన్ కూడా ఈ జట్టుకు ఎంపికయ్యాడు. టీమిండియాతో టీ20 సిరీస్‌కు అఫ్గనిస్తాన్ జట్టు.. ఇబ్రహీం జద్రాన్ (కెప్టెన్), రహ్మతుల్లా గుర్బాజ్ (వికెట్ కీపర్), ఇక్రమ్ అలీఖిల్ (వికెట్ కీపర్), హజ్రతుల్లా జజాయ్, రహ్మత్ షా, నజీబుల్లా జద్రాన్, మహ్మద్ నబీ, కరీం జనత్, అజ్మతుల్లా ఒమర్జాయ్, షరాఫుద్దీన్ అష్రఫ్, ముజీబ్ ఉర్ రెహ్మాన్, ఫజల్ హక్ ఫారూఖీ, ఫరీద్ అహ్మద్, నవీన్ ఉల్ హక్, నూర్ అహ్మద్, మహ్మద్ సలీం, కైస్ అహ్మద్, గుల్బదిన్ నైబ్, రషీద్ ఖాన్. -
అఫ్గాన్‌తో సిరీస్‌కు జట్టు ఎంపిక నేడే.. ?ముంబైకు చేరుకున్న రోహిత్ శర్మ. . వీడియో వైరల్
దక్షిణాఫ్రికా పర్యటనను విజయంతో ముగించిన భారత జట్టు.. శనివారం ముంబైకు చేరుకుంది. టీమిండియాకు ముంబై ఎయిర్‌పోర్ట్‌లో అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఈ క్రమంలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కొంతమంది ఎయిర్పోర్ట్ సిబ్బందితో కలిసి ఫోటోలకు ఫోజులు ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. కాగా కేప్‌టౌన్ వేదికగా ప్రోటీస్‌తో జరిగిన రెండో టెస్టులో 7 వికెట్ల తేడాతో భారత్ చారిత్రాత్మక విజయం సాధించింది. ఈ మ్యాచ్‌ను కేవలం రెండు రోజుల్లోనే టీమిండియా ముగించింది. దీంతో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను 1-1తో భారత్ సమం చేసింది. అంతకుముందు ఇదే పర్యటనలో సఫారీలతో జరిగిన టీ20, వన్డే సిరీస్‌ను టీమిండియానే సొంతం చేసుకుంది. ఇక స్వదేశానికి చేరుకున్న భారత జట్టు అఫ్గానిస్తాన్‌తో టీ20 సిరీస్‌కు సిద్దం కానుంది. ఈ సిరీస్‌కు భారత జట్టును ఆదివారం అజిత్ అగర్కార్ నేతృత్వంలోని బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఎంపిక చేసే ఛాన్స్ ఉంది. కాగా ఈ సిరీస్‌తో రెగ్యూలర్ కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి తిరిగి టీ20ల్లో పునరాగమనం చేయనున్నట్లు తెలుస్తోంది. జనవరి 11న మొహాలీ వేదికగా జరగనున్న తొలి మ్యాచ్‌తో ఈ మూడు టీ20ల సిరీస్ ప్రారంభం కానుంది. చదవండి: BBL 2023-24: ఏంటి బ్రో ఇది.. నాటౌట్‌కు ఔట్ ఇచ్చేసిన థర్డ్ అంపైర్! వీడియో వైరల్ View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
టీమిండియాతో సిరీస్‌కు అఫ్గన్ జట్టు ప్రకటన: ప్లేయర్‌గా రషీద్.. కెప్టెన్?
Ind vs Afg T20 Serie- Rashid Khan returns in squad but might not play: టీమిండియాతో టీ20 సిరీస్‌కు అఫ్గనిస్తాన్ తమ జట్టును ప్రకటించింది. భారత్ వేదికగా జరుగనున్న సిరీస్‌కు 19 మంది సభ్యులతో కూడిన టీమ్‌ను ఎంపిక చేసింది. వెన్నునొప్పితో బాధపడుతున్న కెప్టెన్, స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్‌కు కూడా ఈ జట్టులో చోటిచ్చినట్లు వెల్లడించింది. కెప్టెన్‌గా మళ్లీ అతడే అయితే, భారత జట్టుతో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో.. అతడు ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం లేదని పేర్కొంది. రషీద్ ఖాన్ స్థానంలో ఇబ్రహీం జద్రాన్ మరోసారి కెప్టెన్‌గా వ్యవహరించనున్నట్లు తెలిపింది. ఇందుకు సంబంధించి అఫ్గనిస్తాన్ క్రికెట్ బోర్డు శనివారం ప్రకటన విడుదల చేసింది. కాగా జనవరి 11 నుంచి టీమిండియా- అఫ్గనిస్తాన్ మధ్య మూడు మ్యాచ్‌ల సిరీస్ ఆరంభం కానుంది. కాగా గాయం కారణంగా రషీద్ ఖాన్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌తో టీ20 సిరీస్‌కు దూరం కాగా.. అతడి స్థానంలో స్టార్ బ్యాటర్ ఇబ్రహీం జద్రాన్ సారథ్య బాధ్యతలు నిర్వహించాడు. ఇక ఈ 22 ఏళ్ల రైట్‌హ్యాండ్ బ్యాటర్ కెప్టెన్సీలో యూఏఈ సిరీస్‌ను పర్యాటక అఫ్గనిస్తాన్ 2-1తో అఫ్గన్ గెలుచుకుంది. సర్జరీ చేయించుకున్న రషీద్ ఖాన్.. అఫ్గన్‌కు ఇదే తొలిసారి ఇక వెన్నునొప్పికి సర్జరీ చేయించుకున్న రషీద్ ఖాన్.. ఇంకా పూర్తి స్థాయి ఫిట్నెస్ సాధించలేదు. కాబట్టి.. జట్టుకు ఎంపికైనప్పటికీ అతడు టీమిండియాతో మ్యాచ్‌లు ఆడే అవకాశం లేదు. ఇదిలా ఉంటే.. టీ20 సిరీస్ కోసం అఫ్గనిస్తాన్ భారత్‌లో పర్యటించడం ఇదే తొలిసారి. ఈ నేపథ్యంలో పటిష్ట, నంబర్ 1 టీమిండియాతో పోటీపడటం తమకు సంతోషాన్నిస్తోందన్న అఫ్గన్ బోర్డు.. మెరుగైన ప్రదర్శనతో అండర్ డాగ్స్ అనే ముద్ర చెరిపేసుకుంటామని పేర్కొంది. టీమిండియాతో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు అఫ్గనిస్తాన్ జట్టు ఇబ్రహీం జద్రాన్ (కెప్టెన్), రహ్మతుల్లా గుర్బాజ్ (వికెట్ కీపర్), ఇక్రమ్ అలీఖిల్ (వికెట్ కీపర్), హజ్రతుల్లా జజాయ్, రహ్మత్ షా, నజీబుల్లా జద్రాన్, మహ్మద్ నబీ, కరీం జనత్, అజ్మతుల్లా ఒమర్జాయ్, షరాఫుద్దీన్ అష్రఫ్, ముజీబ్ ఉర్ రెహ్మాన్, ఫజల్ హక్ ఫారూఖీ, ఫరీద్ అహ్మద్, నవీన్ ఉల్ హక్, నూర్ అహ్మద్, మహ్మద్ సలీం, కైస్ అహ్మద్, గుల్బదిన్ నైబ్, రషీద్ ఖాన్. చదవండి: శతక్కొట్టిన పుజారా: ఇంగ్లండ్‌తో సిరీస్‌కు ముందు సెలక్టర్లకు స్ట్రాంగ్ మెసేజ్ -
T20 WC: కోహ్లి, రోహిత్‌లను తప్పక ఆడించాలి: టీమిండియా దిగ్గజం
టీమిండియా స్టార్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి అంతర్జాతీయ టీ20లలో పునరాగమనం చేయాలని భారత క్రికెట్ దిగ్గజం సునిల్ గావస్కర్ ఆకాంక్షించాడు. పరిమిత ఓవర్ల క్రికెట్లో వీరిద్దరు సూపర్ ఫామ్‌లో ఉన్నారని.. టీ20 ప్రపంచకప్ నాటికి జట్టుతో చేరితే ప్రయోజనకరంగా ఉంటుందని పేర్కొన్నాడు. ముఖ్యంగా విరాట్ కోహ్లి గత ఏడాదిన్నర కాలంగా ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్నాడన్న గావస్కర్.. వన్డే వరల్డ్‌ప్-2023లో అద్భుత ప్రదర్శనతో వింటేజ్ కోహ్లిని గుర్తుకుతెచ్చాడన్నాడు. టీ20 ప్రపంచకప్‌లోనూ ఈవిధంగానే రాణించగల సత్తా అతడికి ఉందని అభిప్రాయపడ్డాడు. కాగా జూన్ 4 నుంచి అమెరికా- వెస్టిండీస్ వేదికగా వరల్డ్‌కప్-2024 ఆరంభం కానున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా టీమిండియా జూన్ 5న తమ తొలి మ్యాచ్‌లో ఐర్లాండ్‌తో తలపడనుంది. మరోవైపు.. ఈ మెగా టోర్నీకి ముందు భారత్‌కు ఇంకా కేవలం మూడు టీ20లు మాత్రమే మిగిలి ఉన్నాయి. స్వదేశంలో జనవరి 11 నుంచి అఫ్గనిస్తాన్‌తో ఇందుకు సంబంధించిన సిరీస్ ఆరంభం కానుంది. ఈ నేపథ్యంలో కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి ఈ సిరీస్‌తో తిరిగి టీమిండియా తరఫున టీ20లలో ఎంట్రీ ఇస్తేనే.. వరల్డ్‌కప్ ఆడే అవకాశాలున్నాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు.. గాయాల కారణంగా హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్ జట్టుకు దూరంగా ఉన్నారు కాబట్టి విరాహిత్ ద్వయం పునరాగమనం పక్కా అని విశ్లేషుకులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో సునిల్ గావస్కర్ సైతం ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తూ.. కోహ్లి, రోహిత్‌లకు అంతర్జాతీయ టీ20లలో ఇంకా భవిష్యత్తు మిగిలే ఉందన్నాడు. ఈ మేరకు.. ‘‘గత ఏడాదిన్నర కాలంగా విరాట్ కోహ్లి సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. వన్డే వరల్డ్‌కప్‌లో అద్భుతంగా ఆడిన తీరును అందరం చూశాం. కాబట్టి పరిమిత ఓవర్ల క్రికెట్లో అతడికి భవిష్యత్తు ఉందా? లేదా అన్న అంశం మీద చర్చ అనవసరం. కోహ్లితో పాటు రోహిత్ శర్మ కూడా ఫామ్‌లోనే ఉన్నాడు. ఇప్పటికీ వీరిద్దరు అత్యద్భుతమైన ఫీల్డర్లుగా కొనసాగుతున్నారు. చాలా మంది 35-36 ఏళ్లు వచ్చేసరికి స్లో అయిపోతారు. వీళ్లిద్దరు మాత్రం ఇందుకు మినహాయింపు. ఫీల్డ్‌లో పాదరసంలా కదులుతూ క్యాచ్‌లు అందుకోవడం చూస్తూనే ఉన్నాం’’ అంటూ స్టార్ స్పోర్ట్స్ షోలో రోహిత్, కోహ్లిల ఆట తీరును ప్రశంసించాడు. అయితే, కేవలం ఫీల్డింగ్‌లో చురుగ్గా ఉన్నారన్న ఒకే ఒక్క కారణం వల్ల కాకుండా సీనియారిటి, బ్యాటింగ్ నైపుణ్యాల ఆధారంగా వారిని ప్రపంచకప్ జట్టుకు ఎంపిక చేస్తే బాగుంటుందని గావస్కర్ ఈ సందర్భంగా మేనేజ్మెంట్కు సూచించాడు. కాగా వరల్డ్‌కప్ కంటే ముందు టీమిండియాతో పాటు పలువురు విదేశీ ఆటగాళ్లకు ఐపీఎల్-2024 ద్వారా కావాల్సినంత ప్రాక్టీస్ దొరకనుంది. -
T20 WC: అగార్కర్ ఒప్పించేశాడు.. కోహ్లి, రోహిత్ రీఎంట్రీ!?
టీమిండియా స్టార్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి అభిమానులకు శుభవార్త! ఈ మేటి బ్యాటర్లు ఇద్దరూ అంతర్జాతీయ టీ20లలో పునరాగమనం చేసేందుకు సిద్ధమైనట్లు సమాచారం. స్వదేశంలో అఫ్గనిస్తాన్‌తో సిరీస్‌కు ‘విరాహిత్’ ద్వయం అందుబాటులో ఉండనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కాగా టీ20 ప్రపంచకప్-2022 ముగిసిన తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మ, రన్‌మెషీన్ విరాట్ కోహ్లి టీమిండియా తరఫున పొట్టి ఫార్మాట్లో ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. రోహిత్ గైర్హాజరీలో ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా, నంబర్ వన్ టీ20 బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ పలు సందర్భాల్లో సారథులుగా జట్టును ముందుండి నడిపించారు. అదే విధంగా.. రోహిత్- కోహ్లి ఏడాదికి పైగా టీ20ల సెలక్షన్‌కు అందుబాటులో లేకపోవడంతో యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్ వంటి యువ ఆటగాళ్లకు ఎక్కువ అవకాశాలు లభించాయి. పలు మ్యాచ్‌లలో వీరిద్దరు అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుని జట్టు విజయాల్లో తమ వంతు పాత్ర పోషించారు. ఈ నేపథ్యంలో రోహిత్- కోహ్లి లేకుండా పాండ్యా కెప్టెన్సీలోని యువ జట్టుతోనే టీమిండియా టీ20 ప్రపంచకప్-2024 ఆడనుందనే సంకేతాలు వెలువడ్డాయి. అయితే, హార్దిక్ పాండ్యాతో పాటు సూర్యకుమార్ యాదవ్ కూడా గాయాల కారణంగా ఆటకు దూరం కావడం మేనేజ్మెంట్ను కలవరపెడుతోంది. వరల్డ్‌కప్‌నకు ముందు కేవలం అఫ్గనిస్తాన్‌తో సిరీస్ మాత్రమే మిగిలి ఉండటం.. సదరు సిరీస్‌కు పాండ్యా, సూర్య అందుబాటులోకి రాకుంటే కెప్టెన్ ఎవరన్న ఆందోళనలు రేకెత్తాయి. ఈ నేపథ్యంలో చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ టీ20 రీఎంట్రీ గురించి రోహిత్ శర్మ, విరాట్ కోహ్లితో చర్చలు జరిపినట్లు సమాచారం. ఈ క్రమంలో వారిద్దరు అఫ్గన్‌తో సిరీస్ సెలక్షన్‌కు అందుబాటులో ఉంటామని మాట ఇచ్చినట్లు తెలుస్తోంది. మరోవైపు.. సౌతాఫ్రికాతో రెండో టెస్టు రెండో రోజే ముగిసిపోవడంతో ‘విరాహిత్’ ద్వయానికి కాస్త విశ్రాంతి కూడా లభించడం సానుకూలాంశంగా మారింది. ఈ నేపథ్యంలో అఫ్గనిస్తాన్‌తో టీ20 సిరీస్ ఆడే భారత జట్టును శుక్రవారమే ఫైనల్ చేసేందుకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ సిద్ధమైనట్లు తెలుస్తోంది. కాగా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి ఈ సిరీస్ ఆడటం దాదాపుగా ఖాయమైపోగా.. పేసర్లు జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్‌లకు మాత్రం మేనేజ్మెంట్ విశ్రాంతినివ్వనున్నట్లు సమాచారం. అయితే, ఫిట్నెస్ సమస్యలతో బాధపడుతున్న మరో సీనియర్ పేసర్ మహ్మద్ షమీ ఈ సిరీస్‌తో రీఎంట్రీ ఇస్తాడా లేదా అన్న విషయంపై మాత్రం స్పష్టత లేదు. కాగా జనవరి 11 నుంచి టీమిండియా- అఫ్గనిస్తాన్ మధ్య టీ20 సిరీస్ ఆరంభం కానుంది. ఇక జూన్ 4 నుంచి టీ20 ప్రపంచకప్-2024 నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది. మరోవైపు.. ఏడాది కాలంగా టీమిండియా తరఫున టీ20లకు దూరంగా ఉన్నప్పటికీ ఐపీఎల్ ద్వారా రోహిత్, కోహ్లి పొట్టి ఫార్మాట్లో టచ్‌లోనే ఉన్నారన్న సంగతి తెలిసిందే. ప్రపంచకప్-2024 కంటే ముందు వాళ్లిద్దరు ఐపీఎల్-2024లో భాగం కానున్నారు. చదవండి: Ind vs SA: సచిన్‌కు కూడా సాధ్యం కాలేదు.. భారత తొలి క్రికెటర్‌గా బుమ్రా రికార్డు -
9 వికెట్ల తేడాతో ఆఫ్ఘనిస్తాన్‌ను చిత్తు చేసిన భారత్
సౌతాఫ్రికాలో జరుగుతున్న అండర్ 19 ముక్కోణపు సిరీస్‌లో యువ భారత జట్టు విజయపరంపర కొనసాగుతుంది. ఈ సిరీస్‌లో ఇప్పటికే ఆఫ్ఘనిస్తాన్, సౌతాఫ్రికా జట్లను మట్టికరిపించిన భారత్.. తాజాగా ఆఫ్ఘనిస్తాన్‌ను మరోసారి చిత్తు చేసింది. ఇవాళ జరిగిన మ్యాచ్‌లో భారత అండర్ 19 జట్టు ఆఫ్ఘనిస్తాన్‌ను 9 వికెట్ల తేడాతో ఓడించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్.. నమన్ తివారీ (7-1-11-4), ప్రియాన్షు మోలియా (5-0-15-2), ఆరాధ్య శుక్లా (6-1-20-2), ధనుశ్ గౌడ (8-2-23-2) ధాటికి 33 ఓవర్లలో 88 పరుగులకే చాపచుట్టేసింది. ఆఫ్ఘన్ ఇన్నింగ్స్‌లో ముగ్గురు డకౌట్లు కాగా.. నసీర్ హస్సన్ (31), సోహిల్ ఖాన్ (21), రహీముల్లా జుర్మతై (11) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన భారత్.. ఆదర్శ్ సింగ్ (52 నాటౌట్) అర్దసెంచరీతో రాణించడంతో కేవలం 12.1 ఓవర్లలోనే వికెట్ కోల్పోయి విజయతీరాలకు చేరింది. మహాజన్ 12 పరుగులకు ఔట్ కాగా.. ముషీర్ ఖాన్ 14 పరుగులతో అజేయంగా నిలిచాడు. అల్లా ఘజన్ఫర్కు మహాజన్ వికెట్ దక్కింది. ఈ సిరీస్‌లో జనవరి 6న జరుగబోయే తదుపరి మ్యాచ్‌లో భారత్.. సౌతాఫ్రికాతో తలపడనుంది. 8వ తేదీన సౌతాఫ్రికా-ఆఫ్ఘనిస్తాన్, జనవరి 10న ఫైనల్ మ్యాచ్‌లు జరుగనున్నాయి. -
Tilak Varma: క్యాప్షన్, వీడియో రెండూ నకిలీవే: అక్షర్ పటేల్
Tilak VarmaTraining Video: టీమిండియా యువ బ్యాటర్, హైదరాబాదీ స్టార్ తిలక్ వర్మ అఫ్గనిస్తాన్‌తో టీ20 సిరీస్‌కు సన్నద్ధం అవుతున్నాడు. ఇందులో భాగంగా జిమ్‌లో చెమటోడుస్తూ ఫిట్నెస్ మెరుగుపరుచుకునే పనిలో ఉన్నాడు. ఈ నేపథ్యంలో తన వర్కౌట్లకు సంబంధించిన వీడియోను తిలక్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ‘‘కొత్త ఏడాది చేసుకున్న తీర్మానాలకు కట్టుబడి ఉంటాను. 2024ను ఆరంభించడానికి ఇంతకంటే గొప్ప మార్గం ఇంకొకటి లేదు’’ అని తిలక్ వర్మ సదరు వీడియోకు క్యాప్షన్ ఇచ్చాడు. ఇందుకు బదులుగా టీమిండియా వైస్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్.. ‘‘నీకు ఇలాంటి నకిలీ క్యాప్షన్లు ఎవరు ఇస్తారు’’ అంటూ సరదాగా ట్రోల్ చేశాడు. క్యాప్షన్, వీడియో రెండూ నకిలీవే మరో టీమిండియా స్టార్, ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ కూడా సూర్యకు వత్తాసు పలుకుతూ.. ‘‘క్యాప్షన్ ఒక్కటే కాదు.. ఆ వీడియో కూడా నకిలీదే. డిసెంబరు 30నాటి ట్రెయినింగ్ సెషన్‌కు సంబంధించిన వీడియో అది’’ అంటూ తిలక్ వర్మను ఆటపట్టించాడు. తిలక్‌ను ఉద్దేశించి సూర్య, అక్షర్ చేసిన కామెంట్లు అభిమానుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ప్రపంచకప్ జట్టులో చోటే లక్ష్యంగా కాగా అండర్-19 వరల్డ్‌కప్‌లో సత్తా చాటి ఐపీఎల్ ఫ్రాంఛైజీల దృష్టిని ఆకర్షించిన హైదరాబాదీ బ్యాటర్ తిలక్ వర్మ.. ముంబై ఇండియన్స్ తరఫున ఆడే అవకాశం దక్కించుకున్నాడు. ఐపీఎల్-2022, 2023 సీజన్లలో మెరుగైన ప్రదర్శనతో ఆకట్టుకుని.. టీమిండియాలో ఎంట్రీ ఇచ్చాడు. వెస్టిండీస్‌తో టీ20 సిరీస్ సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన ఈ లెఫ్టాండర్.. ఇటీవల దక్షిణాఫ్రికాతో ముగిసిన సిరీస్‌లోనూ ఆడాడు. అంతర్జాతీయ కెరీర్లో ఇప్పటి వరకు మొత్తంగా 15 టీ20లు, 4 వన్డేలు ఆడిన తిలక్ వర్మ.. ఆయా ఫార్మాట్లలో వరుసగా 310, 68 పరుగులు సాధించాడు. అదే విధంగా రెండు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడీ పార్ట్‌టైమ్ స్పిన్నర్. తదుపరి జనవరి 11 నుంచి మొదలుకానున్న అఫ్గనిస్తాన్ సిరీస్‌లో తనను తాను నిరూపించుకుని టీ20 ప్రపంచకప్ జట్టులో చోటే లక్ష్యంగా తిలక్ వర్మ ముందుకుసాగుతున్నాడు. చదవండి: T20 WC 2024: రోహిత్, కోహ్లి విషయంలో బీసీసీఐ చీఫ్ సెలక్టర్ అగార్కర్ కీలక నిర్ణయం! View this post on Instagram A post shared by Tilak Varma (@tilakvarma9) -
గుడ్‌న్యూస్ చెప్పిన హార్దిక్ పాండ్యా.. రీఎంట్రీ అప్పుడే?
Hardik Pandya's Gym Video: తన అభిమానులకు అదిరిపోయే శుభవార్త అందించాడు టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా! తన గాయంపై అప్డేట్ అందిస్తూ వీడియోతో ముందుకు వచ్చాడు. రోజురోజుకీ పురోగతి సాధిస్తున్నానని.. త్వరలోనే తిరిగి మైదానంలో అడుగుపెడతాననే సంకేతాలు ఇచ్చాడు. వరల్డ్‌కప్ మ్యాచ్‌లకు దూరమై కాగా వన్డే వరల్డ్‌కప్-2023లో భాగంగా బంగ్లాదేశ్‌తో మ్యాచ్ సందర్భంగా హార్దిక్ పాండ్యా గాయపడిన విషయం తెలిసిందే. పుణె వేదికగా జరిగిన నాటి మ్యాచ్‌లో తన బౌలింగ్‌లో బ్యాటర్ ఇచ్చిన క్యాచ్‌ను అందుకునే క్రమంలో పట్టుతప్పి పడిపోయిన పాండ్యా కాలు మెలిక పడింది. ఈ నేపథ్యంలో అతడి చీలమండకు గాయం కాగా.. ఈ ఐసీసీ టోర్నీ మొత్తానికి అతడు దూరమయ్యాడు. ఈ క్రమంలో సౌతాఫ్రికాతో పరిమిత ఓవర్ల సిరీస్ నాటికి పాండ్యా అందుబాటులోకి వస్తాడని భావించగా.. గాయం తీవ్రత దృష్ట్యా అతడు ఆటకు దూరంగానే ఉండిపోయాడు. అఫ్గన్ సిరీస్‌తో రీఎంట్రీ? అయితే, జనవరిలో అఫ్గనిస్తాన్‌తో టీ20 సిరీస్ సమయానికైనా హార్దిక్ మైదానంలో దిగుతాడనుకుంటే.. అతడు ఇంకా కోలుకోలేదనే వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో మంగళవారం జిమ్ వీడియో షేర్ చేసిన పాండ్యా.. ఫిట్నెస్పరంగా రోజురోజుకీ మెరుగవుతున్నట్లు తెలిపాడు. త్వరలోనే రీఎంట్రీ ఇస్తానని వెల్లడించాడు. ఈ దృశ్యాలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి. భారీ మొత్తంతో ముంబై కెప్టెన్‌గా ఇదిలా ఉంటే.. ఐపీఎల్-2024 వేలానికి ముందు టీమిండియా భావి కెప్టెన్ హార్దిక్ పాండ్యా గుజరాత్ టైటాన్స్‌కు షాకిచ్చిన విషయం తెలిసిందే. భారీ మొత్తానికి ట్రేడ్ అయి తిరిగి ముంబై ఇండియన్స్ గూటికి చేరిన ఈ బరోడా క్రికెటర్.. ఏకంగా ఆ జట్టు కెప్టెన్‌గా నియమితుడయ్యాడు. టీమిండియా సారథి రోహిత్ శర్మ స్థానంలో ముంబై జట్టు పగ్గాలు చేపట్టాడు. అయితే, గాయం నుంచి పూర్తిగా కోలుకుని ఫిట్నెస్ సాధించకపోతే మాత్రం హార్దిక్ పాండ్యా ఐపీఎల్-2024 ఆరంభ మ్యాచ్‌లకు దూరమయ్యే సూచనలు ఉన్నాయి. చదవండి: Aus Vs Pak: నా రికార్డు బ్రేక్ చేసే సత్తా అతడికే ఉంది: ఆసీస్ దిగ్గజ బౌలర్ View this post on Instagram A post shared by Hardik Himanshu Pandya (@hardikpandya93) -
అఫ్గానిస్తాన్‌తో టీ20 సిరీస్.. టీమిండియా కొత్త కెప్టెన్ అతడే!? రోహిత్ డౌటే?
దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్ అనంతరం టీమిండియా స్వదేశంలో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో అఫ్గానిస్తాన్‌తో తలపడనుంది. వచ్చే ఏడాది జనవరి 11న జరగనున్న తొలి టీ20తో ఈ వైట్‌బాల్ సిరీస్ ప్రారంభం కానుంది. టీ20 వరల్డ్‌కప్-2024కు ముందు భారత జట్టు ఆడనున్న ఆఖరి సిరీస్ ఇదే. ఈ సిరీస్‌కు భారత జట్టును మరో వారం రోజుల్లో ప్రకటించే అవకాశం ఉంది. భారత కెప్టెన్ ఎవరు? అయితే అఫ్గాన్ సిరీస్‌లో భారత జట్టు సారథిగా ఎవరు పగ్గాలు చేపడతారన్నది సందిగ్ధం నెలకొంది. ఇప్పటివరకు టీ20ల్లో భారత జట్టును సారథిలుగా వ్యవహరించిన హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్, రుత్‌రాజ్ గైక్వాడ్‌లు గాయాల బారిన పడ్డాడు. వన్డే వరల్డ్‌కప్-2023లో గాయపడిన హార్దిక్.. కోలుకోవడానికి మరి కొంత సమయం పట్టనున్నట్లు తెలుస్తోంది. అదే విధంగా సౌతాఫ్రికా పర్యటనలో గాయపడిన సూర్య, రుత్‌రాజ్ సైతం పూర్తిగా కోలుకోవడానికి మరో రెండు నెలల సమయం పట్టనున్నట్లు సమాచారం. ఈ క్రమంలో జట్టు పగ్గాలు ఎవరికి అప్పజెప్పాలని బీసీసీఐ సెలక్షన్ కమిటీ తలలు పట్టుకుంటుంది. అయితే గత కొంత కాలంగా టీ20లకు దూరంగా ఉంటున్న టీమిండియా రెగ్యూలర్ కెప్టెన్ రోహిత్ శర్మతో బీసీసీఐ ఛీప్ సెలక్టర్ అజిత్ అగార్కర్ చర్చలు జరిపినట్లు సమాచారం. అఫ్గాన్ సిరీస్‌లో జట్టును నడిపించాలని కోరినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే హిట్‌మ్యాన్ తన నిర్ణయాన్ని వెల్లడించేందుకు కొద్ది రోజుల సమయం అడిగినట్లు వినికిడి. ఒక వేళ రోహిత్ అందుకు అంగీకరించకపోతే.. అఫ్గాన్ సిరీస్‌లో జట్టు పగ్గాలను మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్‌కు అప్పగించే యోచనలో బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఉన్నట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. అయ్యర్‌కు సారథిగా అనుభవం ఉంది. ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్, కేకేఆర్ జట్లకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. శ్రేయస్ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. దక్షిణాఫ్రికాతో టీ20, వన్డే సిరీస్‌లలో అదరగొట్టిన అయ్యర్.. ఇప్పుడు టెస్టుల్లో తన మార్క్‌ను చూపిస్తున్నాడు. చదవండి: AUS vs PAK: 5 వికెట్లతో చెలరేగిన కమ్మిన్స్.. 264 పరుగులకు పాక్ ఆలౌట్ -
టీమిండియా ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. స్టార్ ఆల్‌రౌండర్ వచ్చేస్తున్నాడు!?
టీమిండియా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్. గాయం కారణంగా జట్టుకు దూరంగా ఉంటున్న స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్.. త్వరలోనే తిరిగి మైదానంలో అడుగుపెట్టనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో ఉన్న హార్దిక్ వేగంగా కోలుకుంటున్నట్లు క్రికెట్ వర్గాలు వెల్లడించాయి. అంతేకాకుండా అఫ్గానిస్తాన్ సిరీస్‌కు, ఐపీఎల్ సీజన్‌కు దూరమవుతాడని వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. వచ్చే ఏడాది జనవరిలో అఫ్గానిస్తాన్‌తో టీ20 సిరీస్ సమయానికి పాండ్యా పూర్తి ఫిట్నెస్ సాధిస్తాడని సమాచారం. ఈ క్రమంలో అఫ్గానిస్తాన్ సిరీస్‌లో భారత జట్టును హార్దికే సారధిగా నడిపిస్తాడని వార్తలు వినిపిస్తున్నాయి. స్వదేశంలో జనవరి 11 నుంచి అఫ్గాన్‌తో భారత్ మూడు టీ20ల సిరీస్ ఆడనుంది. కాగా వన్డే వరల్డ్‌కప్-2023లో బంగ్లాదేశ్‌తో మ్యాచ్ సందర్భంగా హార్దిక్ పాండ్యా గాయపడిన విషయం తెలిసిందే. తన బౌలింగ్‌లో బ్యాటర్ కొట్టిన షాట్‌ను ఆపేందుకు విఫలయత్నం చేసిన పాండ్యా.. అదుపుతప్పి పడిపోయాడు. దీంతో అతడి చీలమండకు గాయమైంది. అప్పటి నుంచి ఆటకు హార్దిక్ దూరంగా ఉంటున్నాడు. ఈ క్రమంలోనే ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా సిరీస్‌లకు హార్దిక్ దూరమయ్యాడు. ఇక ఐపీఎల్-2024 సీజన్‌కు ముందు గుజరాత్ టైటాన్స్ నుంచి హార్దిక్ పాండ్యాను ముంబై ఇండియన్స్ ట్రేడ్ చేసుకుంది. అంతేకాకుండా రోహిత్ శర్మను తప్పించి తమ జట్టు పగ్గాలను కూడా అప్పగించింది. చదవండి: IPL 2024: లక్నో సూపర్ జెయింట్స్ కీలక నిర్ణయం..!? సురేష్ రైనాకు.. -
IPL 2024: ముంబై అభిమానులకు బ్యాడ్‌న్యూస్.. కెప్టెన్ దూరం!
IPL 2024- MI- Hardik Pandya: ఐపీఎల్-2024కు ముందు ముంబై ఇండియన్స్‌కు ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్యా సీజన్ మొత్తానికి దూరం కానున్నట్లు సమాచారం. క్యాష్ రిచ్ లీగ్ తాజా ఎడిషన్ మొదలయ్యే నాటికి అతడు అందుబాటులోకి వచ్చే సూచనలు కనిపించడం లేదు. కాగా వన్డే వరల్డ్‌కప్-2023లో బంగ్లాదేశ్‌తో మ్యాచ్ సందర్భంగా.. హార్దిక్ పాండ్యా గాయపడిన విషయం తెలిసిందే. తన బౌలింగ్‌లో బ్యాటర్ కొట్టిన షాట్‌ను ఆపేందుకు విఫలయత్నం చేసిన పాండ్యా.. అదుపుతప్పి పడిపోయాడు. దీంతో అతడి చీలమండకు గాయమైంది. వరల్డ్‌కప్ సందర్భంగా గాయపడ్డ పాండ్యా నొప్పి తీవ్రం కావడంతో మైదానం వీడిన ఈ స్టార్ ఆల్‌రౌండర్.. ఐసీసీ టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. ఆస్ట్రేలియా, సౌతాఫ్రికాలతో సిరీస్‌లకు కూడా అందుబాటులో లేకుండా పోయాడు. ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్న హార్దిక్ పాండ్యా కోలుకోవడానికి నెలలపాటు విశ్రాంతి అవసరం అని వైద్యులు చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో జనవరిలో అఫ్గనిస్తాన్‌తో టీమిండియా ఆడనున్న టీ20 సిరీస్‌తో పాటు ఐపీఎల్-2024 ఎడిషన్‌కు అతడు దూరం కానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మేరకు ఎన్డీటీవీ కథనం వెలువరించింది. టైటాన్స్ నుంచి భారీ మొత్తానికి ట్రేడ్ చేసుకున్న ముంబై కాగా తాజా ఐపీఎల్ వేలానికి ముందు ముంబై ఇండియన్స్.. హార్దిక్ పాండ్యాను గుజరాత్ టైటాన్స్ నుంచి ట్రేడ్ చేసుకున్న సంగతి తెలిసిందే. అదే విధంగా.. ఐదుసార్లు ట్రోఫీ అందించిన రోహిత్ శర్మను తప్పించి అతడి స్థానంలో హార్దిక్ పాండ్యాను కెప్టెన్‌గా నియమించింది. ఒకవేళ హార్దిక్ పాండ్యా గనుక కోలుకోకపోతే ముంబై ఇబ్బందులు ఎదుర్కోకతప్పదు. ఇదిలా ఉంటే.. టీ20 ప్రపంచకప్-2024కు ముందు టీమిండియా స్వదేశంలో చివరి సిరీస్ ఆడనుంది. అఫ్గనిస్తాన్‌తో జరుగనున్న ఈ సిరీస్‌కు ఇప్పటికే తాత్కాలిక కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ దూరమైనట్లు తెలుస్తోంది. తాజాగా పాండ్యా కూడా దూరం కానున్నాడన్న వార్తల నేపథ్యంలో జట్టును ఎవరు ముందుకు నడిపిస్తారన్న అంశం ఆసక్తికరంగా మారింది. చదవండి: సఫారీ పిచ్‌లపై బ్యాటింగ్ కష్టం.. అలా అయితేనే గెలుస్తాం: గంభీర్ -
టీమిండియాకు ఊహించని షాక్.. సూర్యకుమార్ గాయం తీవ్రం! ఇక నుంచి..
Suryakumar Yadav out of action till..: అఫ్గనిస్తాన్‌తో టీ20 సిరీస్‌కు ముందు టీమిండియాకు ఎదురుదెబ్బ! భారత టీ20 జట్టు తాత్కాలిక కెప్టెన్, ప్రపంచ నంబర్ వన్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ సుమారు నెలన్నర పాటు ఆటకు దూరం కానున్నట్లు సమాచారం. చీలమండ గాయం తీవ్రం కావడంతో అతడికి దీర్ఘకాలం విశ్రాంతినివ్వాలని వైద్యులు సూచించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో స్వదేశంలో అఫ్గనిస్తాన్‌తో జరిగే టీ20 సిరీస్‌కు సూర్యకుమార్ యాదవ్ కానున్నాడని బీసీసీఐ వర్గాలు వెల్లడించినట్లు ఇండియన్ ఎక్స్‌ప్రెస్ తన కథనంలో పేర్కొంది. కాగా వన్డే వరల్డ్‌కప్-2023లో ప్రభావం చూపలేకపోయిన సూర్య.. ఈ మెగా టోర్నీ ముగిసిన తర్వాత ఆస్ట్రేలియాతో పొట్టి ఫార్మాట్ సిరీస్‌లో దుమ్ములేపాడు. ఆస్ట్రేలియాతో సిరీస్‌లో కెప్టెన్‌గా సత్తా సొంతగడ్డపై.. తొలిసారిగా టీమిండియా కెప్టెన్‌గా పగ్గాలు చేపట్టిన ఈ ముంబై బ్యాటర్.. 4-1తో ఆసీస్‌పై ఐదు మ్యాచ్‌ల సిరీస్ నెగ్గాడు. ఆ తర్వాత సౌతాఫ్రికా పర్యటనలో భాగంగా టీ20 సిరీస్‌ను 1-1తో సమం చేసి సత్తా చాటాడు. ఆటగాడిగా, సారథిగా అద్భుతంగా రాణించి సఫారీ గడ్డపై ఆతిథ్య జట్టుతో ట్రోఫీని పంచుకున్నాడు. సౌతాఫ్రికాలో సుడిగాలి శతకంతో చెలరేగి ముఖ్యంగా సౌతాఫ్రికాతో నిర్ణయాత్మక మూడో టీ20లో సెంచరీతో చెలరేగి జట్టును గెలిపించాడు. 56 బంతుల్లోనే 100 పరుగులు చేసి సుడిగాలి ఇన్నింగ్స్‌తో టీమిండియా 106 పరుగుల తేడాతో భారీ విజయం అందుకోవడంలో కీలక పాత్ర పోషించాడు. అయితే, ఈ మ్యాచ్ సందర్భంగానే సూర్యకుమార్ యాదవ్ గాయపడిన విషయం తెలిసిందే. జొహన్నస్‌బర్గ్‌లో డిసెంబరు 16న జరిగిన మూడో టీ20లో ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో సూర్య అదుపుతప్పి కిందపడిపోయాడు. గాయం తీవ్రం.. దీంతో అతడి మడిమ మెలిక పడింది. ఈ క్రమంలో నొప్పితో విలవిల్లాడిన సూర్యను పర్యవేక్షించి చికిత్స అందించింది వైద్య బృందం. ఈ నేపథ్యంలో సూర్య మైదానాన్ని వీడగా రవీంద్ర జడేజా సారథిగా వ్యవహరించాడు. అయితే, మ్యాచ్ అనంతరం సూర్య మాట్లాడుతూ.. తాను బాగానే ఉన్నట్లు తెలిపాడు. కానీ.. తాజా సమాచారం ప్రకారం.. సూర్య చీలమండ నొప్పి తీవ్రమైనట్లు తెలుస్తోంది. ఈ విషయం గురించి బీసీసీఐ వర్గాలు ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌తో మాట్లాడుతూ.. ‘‘కోలుకోవడానికి సూర్యకుమార్‌కు మరికొంత సమయం కావాలి. అఫ్గనిస్తాన్‌తో సిరీస్‌కు దూరం జాతీయ క్రికెట్ అకాడమీలో పునరావాసం పొందిన అనంతరం ఈ విషయంపై పూర్తి స్పష్టత వస్తుంది. అయితే, అతడు కచ్చితంగా అఫ్గనిస్తాన్ సిరీస్‌కు మాత్రం దూరమవుతాడు’’ అని పేర్కొన్నాయి. కాగా జనవరి 11 నుంచి స్వదేశంలో టీమిండియా అఫ్గనిస్తాన్‌తో టీ20 సిరీస్ ఆడనుంది. ఇప్పటికే రోహిత్ శర్మ టీ20లకు దూరంగా ఉండగా.. అతడి స్థానాన్ని భర్తీ చేస్తున్న హార్దిక్ పాండ్యా గాయం కారణంగా ఆటకు విరామం ఇచ్చాడు. ఈ నేపథ్యంలో హార్దిక్ స్థానంలో కెప్టెన్‌గా వచ్చిన సూర్య సైతం ఇలా జట్టుకు దూరం కావడం టీమిండియాలో ఆందోళనకు కారణమైంది. జూన్ నుంచి మొదలుకానున్న టీ20 ప్రపంచకప్-2024కు ముందు ఇలా వరుస ఎదురుదెబ్బలు తగలడం మేనేజ్మెంట్ను కలవరపెడుతోంది. ఈ మెగా టోర్నీకి ముందు టీమిండియా అఫ్గన్‌తో తమ ఆఖరిసారి టీ20 సిరీస్ ఆడనుంది. చదవండి: అది గతం.. ఇప్పుడు రోహిత్ మునుపటిలా లేడు.. ఈసారి కచ్చితంగా: మంజ్రేకర్ -
ఆసియాకప్‌లో టీమిండియా బోణీ.. అఫ్గానిస్తాన్ చిత్తు
అండర్-19 ఆసియాకప్‌లో టీమిండియా బోణీ కొట్టింది. దుబాయ్ వేదికగా అఫ్గానిస్తాన్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో భారత యువ జట్టు ఘన విజయం సాధించింది. భారత విజయంలో కెప్టెన్ కులకర్ణి ఆల్‌రౌండ్ ప్రదర్శనతో కీలక పాత్ర పోషించాడు. తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్తాన్ 50 ఓవర్లలో 173 పరుగులకే కుప్పకూలింది. భారత బౌలర్లలో రాజ్ లింబానీ, కులకర్ణి తలా మూడు వికెట్లు పడగొట్టి అఫ్గాన్ పతనాన్ని శాసించగా.. నమాన్ తివారీ రెండు వికెట్లు సాధించాడు. అఫ్గాన్ బ్యాటర్లలో ఓపెనర్ జమ్షీడ్ జద్రాన్ 43 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అనంతరం 174 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 37.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. భారత ఇన్నింగ్స్‌లో కెప్టెన్ కులకర్ణి(70) పరుగులతో ఆజేయంగా నిలిచి మ్యాచ్‌ను ఫినిష్ చేశాడు. అతడితో పాటు ముషీర్ ఖాన్ 48 పరుగులతో రాణించాడు. ఇక టీమిండియా తమ తదుపరి మ్యాచ్‌లో డిసెంబర్ 10న దాయాది పాకిస్తాన్‌తో తలపడనుంది. -
పాకిస్తాన్ పొమ్మంది.. సల్మాన్ బట్కు అఫ్గానిస్తాన్ బంపరాఫర్!?
భారత పర్యటనకు ముందు అఫ్గానిస్తాన్ క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. తమ జట్టు బ్యాటింగ్ కన్సల్టెంట్ పాకిస్తాన్ మాజీ కెప్టెన్ సల్మాన్ బట్‌ను నియమించాలని అఫ్గానిస్తాన్ క్రికెట్ బోర్డు భావిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఏఆర్వై న్యూస్ రిపోర్టు ప్రకారం.. ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు(ఏసీబీ) తమ సీనియర్ పురుషుల జట్టు బ్యాటింగ్ కన్సల్టెంట్‌గా బాధ్యతలు చేపట్టాలని ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. అయితే ఏసీబీ ప్రతిపాదనను అతడు అంగీకరిస్తారా లేదా అన్నది వేచి చూడాలి. భారత పర్యటనలో భాగంగా అఫ్గానిస్తాన్ మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడనుంది. జనవరి 11న మొహాలీ వేదికగా జరగనున్న తొలి టీ20తో ఈ సిరీస్ ప్రారంభం కానుంది. 24 గంట్లలోనే వేటు.. కాగా ఇటీవల పాకిస్తాన్ సెలక్షన్ కమిటీ సభ్యుడిగా సల్మాన్ బట్ ఎంపికయ్యాడు. అయితే అతడిని సెలక్షన్ ప్యానల్ కన్సల్టెంట్ మెంబర్‌గా నియమించడం పట్ల పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడిన ఆటగాడిని సెలక్షన్ కమిటీ సభ్యుడిగా ఎలా నియమిస్తారని ఆ దేశ మాజీ ఆటగాళ్లు ప్రశ్నల వర్షం కురిపించారు. దీంతో పాకిస్తాన్ ఛీప్ సెలక్టర్ వహాబ్ రియాజ్.. 24 గంటలు తిరగకముందే సల్మాన్‌ను తన పదవి నుంచి తప్పించాడు. చదవండి: National T20 Cup: దురదృష్టం అంటే నీదే భయ్యా.. పాపం ఎవరికీ ఈ కష్టం రాకూడదు! -
ఆసియాకప్‌కు భారత జట్టు ప్రకటన.. కెప్టెన్ ఎవరంటే?
అండర్-19 ఆసియాకప్ 2023కు 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును బీసీసీఐ జూనియర్ క్రికెట్ సెలక్షన్ కమిటీ ప్రకటించింది. ఈ జట్టుకు ఉదయ్ సహారన్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. అతడికి డిప్యూటీగా సౌమీ కుమార్ పాండే వ్యవహరించనున్నాడు. ఈ జట్టుతో పాటు ముగ్గురు ట్రావిలింగ్ స్టాండ్‌బై ఆటగాళ్లను సెలక్టర్లు ఎంపిక చేశారు. కాగా ఈ మెగా టోర్నీ దుబాయ్ వేదికగా డిసెంబర్ 8 నుంచి అదే నెల 17 వరకు జరగనుంది. వన్డే ఫార్మాట్లో జరగనున్న ఈ మెగా ఈవెంట్లో మొత్తం 8 జట్లు పాల్గోనున్నాయి. గ్రూప్-ఎలో భారత్, నేపాల్, ఆఫ్గానిస్తాన్, పాకిస్తాన్ జట్లు ఉన్నాయి. గ్రూపు-బిలో శ్రీలంక, బంగ్లాదేశ్, జపాన్, ఆతిథ్య యూఏఈ ఉన్నాయి. తొలి మ్యాచ్ ఎప్పుడంటే? డిసెంబర్ 8న భారత్- ఆఫ్గానిస్తాన్ మధ్య మ్యాచ్‌తో ఈ మెగా ఈవెంట్ ఆరంభం కానుంది. ఈ ఆసియా జెయింట్స్ మధ్య పోరులో లీగ్ మ్యాచ్‌లు అన్నీ ఐసీసీ అకాడమీలో జరగనున్నాయి. సెమీఫైనల్-1, ఫైనల్ దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా జరగనున్నాయి. ఇక ఈ టోర్నీలో డిసెంబర్ 10న చిరకాల ప్రత్యర్ధి పాకిస్తాన్‌తో టీమిండియా తలపడనుంది. భారత అండర్-19 జట్టు: ఉదయ్ సహారన్ (కెప్టెన్), సౌమ్య్ కుమార్ పాండే (వైస్ కెప్టెన్), అర్షిన్ కులకర్ణి, ఆదర్శ్ సింగ్, రుద్ర మయూర్ పటేల్, సచిన్ దాస్, ప్రియాంషు మోలియా, ముషీర్ ఖాన్, ధనుష్ గౌడ, అవినాష్ రావు (వికెట్ కీపర్), అభిషేక్, ఇన్నేష్ మహాజన్ , ఆరధ్య శుక్లా, రాజ్ లింబాని, నమన్ తివారీ. స్టాండ్‌బై ఆటగాళ్లు: ప్రేమ్ దేవ్కర్, అన్ష్ గోసాయి, మహ్మద్ అమన్. రిజర్వ్ ఆటగాళ్లు: దిగ్విజయ్ పాటిమ్ జయంత్ గోయత్, పి విఘ్నేష్, కిరణ్ చోర్మలే. చదవండి: IPL 2024: ముంబై ఇండియన్స్ సంచలన నిర్ణయం.. 17 కోట్ల ఆటగాడికి గుడ్‌బై! -
గుజరాత్ టైటాన్స్‌కు బిగ్ షాక్.. రషీద్ ఖాన్‌కు సర్జరీ!? ఐపీఎల్‌కు దూరం
బిగ్ బాష్ లీగ్-2023 నుంచి అఫ్గానిస్తాన్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ తప్పుకున్నాడు. గత కొంత కాలంగా వెన్ను నొప్పితో బాధపడుతున్న రషీద్.. త్వరలో శస్త్రచికిత్స చేయించుకోనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే బిగ్ బాష్ లీగ్ నుంచి రషీద్ వైదొలిగినట్లు సమాచారం. ఈ విషయాన్ని అడిలైడ్ స్ట్రైకర్స్ ప్రాంఛైజీ దృవీకరించింది. గత కొన్ని సీజన్ల నుంచి అడిలైడ్ స్ట్రైకర్స్‌కు రషీద్ ప్రాతినిథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. కాగా రషీద్ ఒక వేళ తన వెన్నెముకకు సర్జరీ చేసుకుంటే కచ్చితంగా క్రికెట్‌కు దాదాపు ఐదు నంచి ఆరు నెలల పాటు దూరం కానున్నాడు. ఈ క్రమంలో భారత్-అఫ్గానిస్తాన్ టీ20 సిరీస్‌కు, ఐపీఎల్-2024 సీజన్‌కు దూరమయ్యే ఛాన్స్ ఉంది. ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్ తరపున రషీద్ ఆడుతున్నాడు. వచ్చే ఏడాది వెస్టిండీస్ వేదికగా జరగనున్న టీ20 వరల్డ్‌కప్ సమయానికి పూర్తి ఫిట్నెస్తో ఉండాలని రషీద్ భావిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే సర్జరీ చేసుకోవాలని రషీద్ నిర్ణయించకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కాగా టీ20ల్లో అఫ్గానిస్తాన్ కెప్టెన్‌గా రషీద్ ఖాన్ వ్యవహిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల ముగిసిన వన్డే వరల్డ్‌కప్-2023లోనూ రషీద్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఇంగ్లండ్, పాకిస్తాన్ వంటి వరల్డ్‌క్లాస్ జట్లను ఓడించడంలో రషీద్ కీలక పాత్ర పోషించాడు. చదవండి: విండీస్ టీ20 ప్రపంచకప్ వీరుడికి బిగ్ షాకిచ్చిన ఐసీసీ.. -
WC 2011లో నేనే కెప్టెన్ అయి ఉంటే అతడిని తప్పక తీసుకునేవాడిని.. కానీ!
ICC WC 2023- Rohit Sharma: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మను ఉద్దేశించి భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వన్డే వరల్డ్‌కప్-2011 సమయంలో తాను సెలక్టర్ లేదంటే కెప్టెన్ అయి ఉంటే.. రోహిత్‌ను తప్పక జట్టుకు ఎంపిక చేసేవాడినని పేర్కొన్నాడు. అయితే, నాడు రోహిత్ శర్మ ఇలా లేడన్న వీరూ భాయ్.. జట్టు ప్రయోజనాలకు అనుగుణంగానే అప్పటి కెప్టెన్, సెలక్టర్లు నిర్ణయం తీసుకుని ఉంటారని పేర్కొన్నాడు. బహుశా అప్పుడలా జట్టులో చోటు దక్కకపోవడం వల్లే హిట్‌మ్యాన్‌కు మేలు జరిగిందని అభిప్రాయపడ్డాడు. రోహిత్‌ను వద్దని అతడి వైపు మొగ్గు కాగా మహేంద్ర సింగ్ ధోని సారథ్యంలో 2011లో సొంతగడ్డ మీద టీమిండియా వన్డే ప్రపంచకప్ ట్రోఫీని గెలిచిన విషయం తెలిసిందే. నాటి జట్టులో భారత దిగ్గజ బ్యాటర్లు సచిన్ టెండుల్కర్, వీరేంద్ర సెహ్వాగ్ సహా విరాట్ కోహ్లి వంటి యువకులకు చోటు దక్కింది. అయితే, రోహిత్ శర్మకు మాత్రం మొండిచేయి ఎదురైంది. జట్టు సమతూకం కోసం స్పిన్నర్ పీయూష్ చావ్లా వైపు మొగ్గుచూపాడు ధోని. దీంతో ఈ ముంబై బ్యాటర్ ఆశలకు గండిపడింది. ఈ నేపథ్యంలో నాడు స్వదేశంలో వరల్డ్‌కప్ ఆడలేకపోయిన రోహిత్ శర్మ.. పుష్కరకాలం తర్వాత సొంతగడ్డపై టీమిండియా కెప్టెన్ హోదాలో బరిలోకి దిగడం విశేషం. View this post on Instagram A post shared by ICC (@icc) సెంచరీతో రికార్డులు బద్దలు ఈ క్రమంలో వన్డే వరల్డ్‌కప్-2023లో భాగంగా అఫ్గనిస్తాన్‌తో మ్యాచ్‌లో అద్భుత ఇన్నింగ్స్‌తో సరికొత్త చరిత్ర సృష్టించాడు. వరల్డ్‌కప్‌లో ఈ టోర్నీ చరిత్రలో అత్యధిక సెంచరీలు(7) చేసిన ఆటగాడిగా నిలిచి.. సచిన్ టెండూల్కర్ (6) పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టాడు. అదే విధంగా.. అంతర్జాతీయ క్రికెట్లో (మూడు ఫార్మాట్లలో కలిపి) 556 సిక్సర్లు బాదిన రోహిత్.. క్రిస్‌గేల్ (553) రికార్డు అధిగమించాడు. అంతేకాదు.. ఈ మ్యాచ్‌లో 63 బంతుల్లోనే సెంచరీ చేసి.. వరల్డ్‌కప్‌లో భారత్ తరఫున ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేశాడు. ఇక ఈ మ్యాచ్‌లో అఫ్గన్‌పై 8 వికెట్ల తేడాతో గెలుపొందిన టీమిండియా టోర్నీలో వరుసగా రెండో విజయం నమోదు చేసింది. నేనైతే రోహిత్‌ను సెలక్ట్ చేసేవాడిని.. కానీ ఈ మ్యాచ్ అనంతరం క్రిక్‌బజ్ షోలో సెహ్వాగ్ మాట్లాడుతూ.. ‘‘ఆరోజు నేను కెప్టెన్ లేదంటే సెలక్టర్ అయి ఉంటే రోహిత్‌ను తప్పకుండా జట్టుకు ఎంపిక చేసేవాడిని. అయితే, అప్పుడు రోహిత్ ఇప్పటిలా లేడు. ఏదేమైనా జట్టును సమతూకంగా ఉంచేందుకు నాడు కెప్టెన్(ధోని) ఆ నిర్ణయం తీసుకున్నాడు. అయితే, ఆరోజు జట్టులో చోటు లేకపోవడాన్ని జీర్ణించుకోలేకపోయిన రోహిత్.. రియలైజ్ అయి తనను తాను మార్చుకున్నాడు. నిలకడైన ఆటతో ఈ స్థాయికి చేరుకున్నాడు. మరి ఈసారి వరల్డ్‌కప్‌లో వచ్చిన ఛాన్స్‌ను ఎలా మిస్ చేసుకుంటాడు’’ అని ప్రశంసలు కురిపించాడు. 2011లో యూసఫ్ పఠాన్ కొన్ని కీలక ఇన్నింగ్స్ ఆడిన కారణంగా రోహిత్ శర్మను కాదని అదృష్టం అతడిని వరించిందని సెహ్వాగ్ చెప్పుకొచ్చాడు. చదవండి: WC: అప్పుడు స్మిత్.. ఇప్పుడు నవీన్! కోహ్లి చర్య వైరల్.. గంభీర్ ప్రశంసలు View this post on Instagram A post shared by ICC (@icc) -
Rohit-Gayle: జెర్సీలపై 45.. వారికి నచ్చేది మాత్రం 6..!
వన్డే వరల్డ్‌కప్-2023లో భాగంగా ఆఫ్ఘనిస్తాన్‌తో నిన్న జరిగిన మ్యాచ్‌లో మెరుపు శతకంతో (84 బంతుల్లో 131; 16 ఫోర్లు, 5 సిక్సర్లు) విజృంభించిన రోహిత్ శర్మ, టీమిండియాను ఒంటిచేత్తో గెలిపించాడు. ఈ శతకంతో హిట్‌మ్యాన్ పలు ప్రపంచ రికార్డులు బద్దలుకొట్టాడు. ఇందులో అత్యధిక సిక్సర్ల రికార్డు ముఖ్యమైనది. విండీస్ విధ్వంసకర వీరుడు క్రిస్ గేల్ పేరిట ఉన్న ఈ రికార్డును రోహిత్ నిన్నటి మ్యాచ్‌లో అధిగమించాడు. అంతర్జాతీయ క్రికెట్లోని మూడు ఫార్మాట్లలో కలిపి గేల్ 553 సిక్సర్లు సాధించగా.. రోహిత్ ఆఫ్ఘన్‌తో మ్యాచ్‌లో ఈ సంఖ్యను అధిగమించాడు. ప్రస్తుతం రోహిత్ ఖాతాలో 556 సిక్సర్లు ఉన్నాయి. The 45s love their 6⃣s 👍 pic.twitter.com/5FHEP0xEwL — ESPNcricinfo (@ESPNcricinfo) October 12, 2023 హిట్‌మ్యాన్ తన రికార్డును బద్దలుకొట్టిన నేపథ్యంలో గేల్ అతనికి శుభాకాంక్షలు తెలిపాడు. ఇందుకు రోహిత్ థ్యాంక్స్ చెబుతూ.. 4, 5 మన జెర్సీలపై ఉండే సంఖ్యలు.. మన ఫేవరెట్ మాత్రం 6 అంటూ తన సోషల్‌మీడియా ఖాతాలో రాసుకొచ్చాడు. ఈ ఇద్దరు సిక్సర్ల వీరుల మధ్య జరిగిన ఈ సరదా సంభాషణ ప్రస్తుతం నెట్టింట వైరలవుతుంది. ఇది చూసి వారి అభిమానులు మురిసిపోతున్నారు. కాగా, రోహిత్, క్రిస్ గేల్లు 45 సంఖ్య జెర్సీలు ధరిస్తారన్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే, నిన్నటి మ్యాచ్‌లో టీమిండియా.. ఆఫ్ఘనిస్తాన్‌ను 8 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్.. హష్మతుల్లా షాహిది (80), అజ్మతుల్లా ఒమర్జాయ్(62) అర్ధసెంచరీలతో రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 272 పరుగులు చేసింది. అనంతరం నామమాత్రపు లక్ష్య ఛేదనకు దిగిన భారత్.. ఆడుతూపాడుతూ 35 ఓవర్లలో లక్ష్యాన్ని చేరుకుంది. భారత ఇన్నింగ్స్‌లో రోహిత్ సెంచరీతో కదంతొక్కగా.. కోహ్లి (55 నాటౌట్), ఇషాన్ కిషన్ (47), శ్రేయస్ అయ్యర్ (25 నాటౌట్) రాణించారు. -
CWC 2023: భారత్-ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్.. కొట్టుకున్న అభిమానులు
న్యూఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో నిన్న జరిగిన భారత్-ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్ సందర్భంగా ఓ ఆసక్తిర ఘటన చోటు చేసుకుంది. మ్యాచ్ జరుగుతుండగా మైదానంలోని స్టాండ్స్‌లో అభిమానుల మధ్య ఘర్షణ జరిగింది. గొడవకు గల కారణాలు తెలియరాలేదు కాని గొడవకు సంబంధించిన వీడియో మాత్రం నెట్టింట వైరలవుతుంది. వీడియోలో కనిపిస్తున్న దాని ప్రకారం ఓ వ్యక్తిపై సామూహిక దాడి జరిగినట్లు తెలుస్తుంది. దెబ్బలు తిన్న వ్యక్తి, దాడి చేసిన వ్యక్తులు అంతా టీమిండియా అభిమానులే ఉన్నట్లున్నారు. దాడి జరిగిన సన్నివేశాలను ఓ అభిమాని సోషల్‌మీడియాలో పోస్ట్ చేస్తూ "నిజమైన ఢిల్లీ అనుభవం" అని కామెంట్ చేశాడు. మ్యాచ్ గురించి ఏమో కాని ప్రస్తుతం సోషల్‌మీడియాలో దీనిపైనే జర్చ జరుగుతుంది. Lafda bhi ho gya pic.twitter.com/qFSm6dufCr — KUNAL DABAS (@kunaldabas_) October 11, 2023 ఇదిలా ఉంటే, నిన్నటి మ్యాచ్‌లో టీమిండియా ఆఫ్ఘనిస్తాన్పై సూపర్ విక్టరీ సాధించిన విషయం తెలిసిందే. రోహిత్ శర్మ విధ్వంసకర శతకంతో (84 బంతుల్లో 131; 16 ఫోర్ల, 5 సిక్సర్లు) టీమిండియాను ఒంటిచేత్తో గెలిపించాడు. కోహ్లి (55 నాటౌట్), ఇషాన్ కిషన్ (47), శ్రేయస్ అయ్యర్ (25 నాటౌట్) రోహిత్‌కు సహకరించారు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్.. కెప్టెన్ హష్మతుల్లా షాహిది (80), అజ్మతుల్లా ఒమర్జాయ్(62) అర్ధసెంచరీలతో రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 272 పరుగులు చేసింది. బుమ్రా (4/39), హార్దిక్ (2/43), శార్దూల్ (1/31), కుల్దీప్ (1/40) కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి ఆఫ్ఘనిస్తాన్‌ను కట్టడి చేశారు. అనంతరం ఛేదనలో రోహిత్ చెలరేగడంతో టీమిండియా సునాయాస విజయం సాధించింది. కాగా, భారత్ అక్టోబర్ 14న జరిగే తమ తదుపరి మ్యాచ్‌లో పాకిస్తాన్‌ను ఢీకొంటుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతుంది. -
CWC 2023: టీమిండియా చేతిలో ఓటమికి అదే కారణంగా: ఆఫ్ఘన్ కెప్టెన్
న్యూఢిల్లీ వేదికగా టీమిండియాతో నిన్న జరిగిన మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్ 8 వికెట్ల తేడాతో ఘోర పరాజయాన్ని చవిచూసిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్.. కెప్టెన్ హష్మతుల్లా షాహిది (80), అజ్మతుల్లా ఒమర్జాయ్(62) అర్ధసెంచరీలతో రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 272 పరుగులు చేసింది. బుమ్రా (4/39), హార్దిక్ (2/43), శార్దూల్ (1/31), కుల్దీప్ (1/40) కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి ఆఫ్ఘనిస్తాన్‌ను నామమాత్రపు స్కోర్‌కు కట్టడి చేశారు. అనంతరం ఛేదనలో రోహిత్ శర్మ (84 బంతుల్లో 131; 16 ఫోర్ల, 5 సిక్సర్లు) శతక్కొట్టడంతో టీమిండియా సునాయాస విజయం సాధించింది. విరాట్ కోహ్లి (55 నాటౌట్) బాధ్యతాయుతమైన హాఫ్ సెంచరీతో రాణించగా.. ఇషాన్ కిషన్ (47), శ్రేయస్ అయ్యర్ (25 నాటౌట్) పర్వాలేదనిపించారు. ఆఫ్ఘన్ బౌలర్లలో రషీద్ ఖాన్ ఒక్కడే 2 వికెట్లు పడగొట్టాడు. మ్యాచ్ అనంతరం ఆఫ్ఘన్ కెప్టెన్ హష్మతుల్లా షాహిది తమ ఓటమికి గల కారణాలను విశ్లేషించాడు. ఆరంభంలో వరుసగా వికెట్లు కోల్పోవడమే తమ ఓటమికి గల ప్రధాన కారణమని అభిప్రాయపడ్డాడు. బరిలోకి దిగే ముందు 300కు పైగా పరుగులు సాధించాలని అనుకున్నాం. దురదృష్టవశాత్తు అది సాధ్యపడలేదు. పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండింది. వీలైనన్ని ఎక్కువ పరుగులు చేసి పటిష్టమైన బ్యాటింగ్ లైనప్ కలిగిన టీమిండియాపై ఒత్తిడి తేవాలనుకున్నాం. ఈ విషయంలో మేం విఫలమయ్యాం. నామమాత్రపు స్కోర్‌కే పరిమితమయ్యాం. 63 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన తరుణంలో అప్పుడే క్రీజ్‌లోకి వచ్చిన అజ్మతుల్లాకు డాట్ బాల్స్ గురించి ఆలోచించకు, క్రీజ్‌లో కుదురుకున్నాక పరుగులు వాటంతటవే వస్తాయని చెప్పాను. మేమిద్దం కుదురుకోవడంతో మేం ఓ మోస్తరు స్కోర్ చేయగలిగాం. అయితే తాము చేసిన స్కోర్‌ను డిఫెండ్ చేసుకునే అవకాశాన్ని రోహిత్ మా నుంచి లాగేసుకున్నాడు. రోహిత్ మా బౌలర్లపై ఎదురుదాడికి దిగి మా ఆశలను నీరుగార్చడు. ఈ ఓటమిని ఇక్కడితో వదిలి జరుగబోయే మ్యాచ్‌లపై దృష్టి సారిస్తాం. టోర్నీలో మాకు ఇంకా ఏడు మ్యాచ్‌లు ఉన్నాయి. ఈ మ్యాచ్‌ల్లో విజయాల కోసం ప్రయత్నిస్తాం. గతంలో జరిగిన తప్పిదాలు మున్ముందు పునరావృతం కాకుండా చూసుకుంటాం. -
CWC 2023: ఆఫ్ఘనిస్తాన్పై గెలుపు అనంతరం రోహిత్ శర్మ ఏమన్నాడంటే..?
వన్డే వరల్డ్‌కప్ 2023లో భాగంగా న్యూఢిల్లీ వేదికగా ఆఫ్ఘనిస్తాన్‌తో నిన్న జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ (84 బంతుల్లో 131; 16 ఫోర్ల, 5 సిక్సర్లు) మెరుపు శతకంతో విరుచుకుపడి టీమిండియాను గెలిపించాడు. ఆఫ్ఘనిస్తాన్ నిర్ధేశించిన 273 పరుగుల లక్ష్య ఛేదనలో రోహిత్ సెంచరీతో కదంతొక్కితే, విరాట్ కోహ్లి (55 నాటౌట్) బాధ్యతాయుతమైన హాఫ్ సెంచరీతో రాణించాడు. భారత గెలుపులో ఇషాన్ కిషన్ (47), శ్రేయస్ అయ్యర్ (25 నాటౌట్) తలో చేయి వేశారు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్.. కెప్టెన్ హష్మతుల్లా షాహిది (80), అజ్మతుల్లా ఒమర్జాయ్(62) అర్ధసెంచరీలతో రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 272 పరుగులు చేసింది. భారత బౌలర్లలో బుమ్రా 4, హార్దిక్ 2, శార్దూల్, కుల్దీప్ తలో వికెట్ పడగొట్టాడు. ఛేదనలో సుడిగాలి శతకంతో విరుచుకుపడిన రోహిత్ శర్మకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. ప్రజెంటేషన్ సెర్మనీ సందర్భంగా హిట్‌మ్యాన్ మాట్లాడుతూ.. ఇది బ్యాటింగ్ చేయడానికి మంచి పిచ్. నా సహజమైన ఆటను ఆడాను. క్రీజ్‌లో కుదురుకున్నాక పరుగులు రాబట్టడం తేలికవుతుందని తెలుసు. అందుకు తగ్గట్టుగా ఆడాను. ప్రపంచకప్‌లో సెంచరీ సాధించడం ఓ ప్రత్యేక అనుభూతి. సంతోషంగా ఉంది. రికార్డులపై (వరల్డ్‌కప్‌లలో అత్యధిక సెంచరీలు (7)) ఎక్కువ దృష్టి పెట్టను. అవి ఆటపై దృష్టిని మళ్లిస్తాయి. మొత్తంగా ఈ ఇన్నింగ్స్‌లో మంచి షాట్లు ఆడాను. ఛేజింగ్‌లో ఇలాంటి ఇన్నింగ్స్‌లే ఆడాలి. అప్పుడే విజయాలు సులువవుతాయి. కొన్ని సందర్భాల్లో బౌలర్లపై ఎదురుదాడి వర్కౌట్ అవుతుంది, కొన్ని సార్లు కాదు. ఏదిఏమైనా ప్రత్యర్ధిని ఒత్తిడికి గురి చేస్తూ ముందుకు సాగాలి. విన్నింగ్ కెప్టెన్‌గా హిట్‌మ్యాన్ మాట్లాడుతూ.. ఇది మాకు మంచి విజయం. టోర్నీ ప్రారంభంలో ఇలాంటి ఊపు లభించడం చాలా ముఖ్యం. ఒత్తిడిని అధిగమించి, మైదానంలో సరైన నిర్ణయాలు తీసుకుంటే విజయాలు వాటంతటవే వస్తాయి. ప్రతి మ్యాచ్‌లో ప్రత్యర్దులకు ఓ మంచి స్పెల్ వస్తుంది. అలాంటి సమయంలోనే ఒత్తిడిని జయించాలి. ప్రస్తుత టోర్నీలో మేము ఇదే ఫార్ములాను అమలు చేశాము. జట్టు విషయానికొస్తే.. మా బృందంలో విభిన్న నైపుణ్యాలు కలిగిన ఆటగాళ్లు ఉన్నారు. సందర్భాన్ని బట్టి వారు తమ నైపుణ్యాలను ఉపయోగిస్తారు. మా జట్టులో బెదురు లేని బ్యాటింగ్ చేయగల సమర్దులు ఉన్నారు, అలాగే చివరి గేమ్లోలా (ఆసీస్) ఒత్తిడిలో నిలకడ ప్రదర్శించగల ఘనాపాటిలు (కోహ్లి, రాహుల్‌ను ఉద్దేశిస్తూ) ఉన్నారు. పాక్‌తో మ్యాచ్‌పై స్పందిస్తూ.. ఇది మాకు చాలా ముఖ్యమైన మ్యాచ్. ఈ మ్యాచ్‌కు ముందు మేము ఆటకు సంబంధించని విషయాల గురించి ఆలోచించం. ఏ అంశాలయితే మా నియంత్రణలో ఉంటాయో వాటి గురించే మేము ఆలోచిస్తాం. అంతిమంగా మేము మా సహజసిద్దమైన ఆటను ఆడి పాక్‌పై గెలిచేందుకు ప్రయత్నిస్తాం. -
CWC 2023 IND VS AFG: సచిన్ రికార్డు బద్దలు కొట్టిన విరాట్
న్యూఢిల్లీ వేదికగా ఆఫ్ఘనిస్తాన్‌తో నిన్న జరిగిన వరల్డ్‌కప్ మ్యాచ్‌లో టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి.. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌కు చెందిన ఓ రికార్డును బద్దలు కొట్టారు. ఈ మ్యాచ్‌లో 56 బంతుల్లో 6 ఫోర్ల సాయంతో 55 పరుగులు చేసి అజేయంగా నిలిచిన విరాట్.. ప్రపంచకప్ టోర్నీల్లో (వన్డే, టీ20) అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా అవతరించారు. గతంలో ఈ రికార్డు సచిన్ పేరిట ఉండేది. సచిన్ 44 వరల్డ్‌కప్ ఇన్నింగ్స్‌ల్లో 2278 పరుగులు చేయగా.. విరాట్ తాజా ఇన్నింగ్స్ కలుపుకుని 53 ఇన్నింగ్స్‌ల్లో 60కిపైగా సగటుతో 2311 పరుగులు చేశాడు. 2011 వన్డే వరల్డ్‌కప్‌తో వరల్డ్‌కప్ అరంగేట్రం చేసిన విరాట్.. బంగ్లాదేశ్‌తో జరిగిన తన వరల్డ్‌కప్ డెబ్యూ మ్యాచ్‌లోనే సెంచరీ (100 నాటౌట్) చేసి అదరగొట్టాడు. ఆ వరల్డ్‌కప్‌లో కోహ్లి 9 ఇన్నింగ్స్‌ల్లో 282 పరగులు చేసి ఆకట్టుకున్నాడు. తదనంతర వన్డే వరల్డ్‌కప్‌ల్లో వెనుదిరిగి చూసుకోని కోహ్లి పరుగుల వరద పారిస్తున్నాడు. ప్రస్తుతం కోహ్లి వన్డే వరల్డ్‌కప్‌ల్లో భారత్ తరఫున సచిన్, గంగూలీ తర్వాత మూడో అత్యధిక రన్ స్కోరర్‌గా (1170 రన్స్) కొనసాగుతున్నాడు. టీ20 వరల్డ్‌కప్‌ల విషయానికొస్తే.. కెరీర్లో 5 పొట్టి వరల్డ్‌కప్ టోర్నీల్లో పాల్గొన్న కోహ్లి లీడింగ్ రన్ స్కోరర్‌గా కొనసాగుతున్నాడు. ఈ టోర్నీల్లో మొత్తంగా 25 ఇన్నింగ్స్‌లు ఆడిన అతను 81.50 సగటున 14 హాఫ్ సెంచరీల సాయంతో 1141 పరుగులు చేశాడు. ఇదిలా ఉంటే, ఆఫ్ఘనిస్తాన్‌తో నిన్న జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 272 పరుగులు చేయగా.. రోహిత్ శర్మ (84 బంతుల్లో 131; 16 ఫోర్ల, 5 సిక్సర్లు) శతక్కొట్టుడు, విరాట్ కోహ్లి (55 నాటౌట్) బాధ్యతాయుతమైన హాఫ్ సెంచరీతో రాణించడంతో భారత్ 35 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. -
కలిసిపోయిన విరాట్ కోహ్లి-నవీన్ ఉల్ హక్! వీడియో వైరల్
వన్డే ప్రపంచకప్-2023లో టీమిండియా తమ జోరును కొనసాగిస్తోంది. ఈ టోర్నీలో భాగంగా ఢిల్లీ వేదికగా ఆఫ్గానిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో భారత్ ఘన విజయం సాధించాడు. ఈ మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(54 బంతుల్లో 131) విధ్వంసకర శతకంతో చెలరేగాడు. 274 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 35 ఓవర్లలో కేవలం 2 వికెట్లు కోల్పోయి ఛేదించింది. కలిసిపోయిన విరాట్ కోహ్లి-నవీన్ ఇక ఇది ఇలా ఉండగా.. ఈ మ్యాచ్‌లో ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి, ఆఫ్గానిస్తాన్ పేసర్ నవీన్-ఉల్-హక్ కలిసిపోయారు. ఈ మ్యాచ్ సందర్భంగా ఒకరినొకరు కౌగిలించుకుని తమ మధ్య ఉన్న వైరానికి ఫుల్స్టాప్ పెట్టారు. కాగా ఐపీఎల్-2023లో ఆర్సీబీ వర్సెస్ లక్నో మ్యాచ్ సందర్భంగా నవీన్ ఉల్ హక్కు కోహ్లికి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో విరాట్ అభిమానులు నవీన్ ఎక్కడ కన్పించిన కోహ్లి కోహ్లి అంటూ అరుస్తూ అతడిని టార్గెట్ చేస్తూ వస్తున్నాడు. ఈ వరల్డ్‌కప్ మ్యాచ్‌లో కూడా 'కోహ్లీ కోహ్లి' నినాదాలతో స్టేడియం దద్దరిల్లిపోయింది. ఈ మ్యాచ్‌లో కోహ్లి, నవీన్‌కు మధ్య మంచి పోటీ ఉంటుందని అంతా భావించారు. కోహ్లి కూడా నవీన్‌ను టార్గెట్ చేస్తాడని అంతా అనుకున్నారు. కానీ అదేమి జరగలేదు. అందరి ఊహలను తలకిందలు చేస్తూ ఇద్దరూ క్రీడా స్పూర్తిని ప్రదర్శించారు. ఒకరికొకరు ఆప్యాయంగా మాట్లాడుకుంటూ అలింగనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైరల్‌గా మారాయి. ఇది చూసిన నెటిజన్లే మా కింగ్ కోహ్లితో అట్లుంటది కామెంట్లు చేస్తున్నారు. చదవండి: WC 2023 IND Vs AFG: రోహిత్ శర్మ ఊచకోత.. ఆఫ్గాన్‌ను చిత్తు చేసిన భారత్ #INDvsAFG #ViratKohli𓃵 #CricketTwitter So it's finally over 🫂 naveen vs kohli pic.twitter.com/EUC96FjWbk — movie enthusiast (@OKAYCHILL07) October 11, 2023 Virat Kohli 🤝 Naveen Ul Haq. This is why cricket is more than a game. pic.twitter.com/5n3QQevYXy — Johns. (@CricCrazyJohns) October 11, 2023 -
రోహిత్ శర్మ ఊచకోత.. ఆఫ్గాన్‌ను చిత్తు చేసిన భారత్
వన్డే ప్రపంచకప్-2023లో టీమిండియా వరుసగా రెండో విజయం నమోదు చేసింది. ఢిల్లీ వేదికగా ఆఫ్గానిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. ఈ విజయంతో పాయింట్ల పట్టికలో రెండో స్ధానానికి భారత్ చేరింది. 274 పరగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 35 ఓవర్లలో కేవలం 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. భారత బ్యాటర్లలో కెప్టెన్ రోహిత్ శర్మ విధ్వంసకర శతకంతో విరుచుకుపడ్డాడు. కేవలం 63 బంతుల్లోనే హిట్‌మ్యాన్ తన సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. ఆఫ్గానిస్తాన్ బౌలర్లకు రోహిత్ చుక్కలు చూపించాడు. ఇన్నింగ్స్ ఆరంభం నుంచే రోహిత్ బౌండరీల వర్షం కురిపించాడు. ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో 84 బంతులు ఎదుర్కొన్న రోహిత్.. 16 ఫోర్లు, 5 సిక్స్‌లతో 131 పరుగులు చేశాడు. అతడితో పాటు విరాట్ కోహ్లి(55) హాఫ్ సెంచరీతో రాణించాడు. ఆఫ్గాన్ బౌలర్లలో రషీద్ ఖాన్ రెండు వికెట్లు సాధించాడు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన ఆఫ్గానిస్తాన్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 272 పరుగులు చేసింది. ఆఫ్గాన్ బ్యాటర్లలో కెప్టెన్ హష్మతుల్లా షాహిదీ(80) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. అజ్మతుల్లా ఒమర్జాయ్(62) పరుగులతో రాణించాడు. భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా నాలుగు వికెట్లు పడగొట్టగా.. హార్దిక్ పాండ్యా రెండు, కుల్దీప్, శార్థూల్ ఠాకూర్ తలా వికెట్ సాధించారు. చదవండి: WC 2023: రోహిత్ శర్మ విధ్వంసం.. వరల్డ్ కప్‌లో ఫాస్టెస్ట్ సెంచరీ! సచిన్ రికార్డు బద్దలు -
CWC 2023 IND Vs AFG Highlights Pics: ఆఫ్గానిస్తాన్‌ను చిత్తు చేసిన టీమిండియా (ఫోటోలు)
-
రోహిత్ శర్మ విధ్వంసం.. వరల్డ్ కప్‌లో ఫాస్టెస్ట్ సెంచరీ! సచిన్ రికార్డు బద్దలు
వన్డే ప్రపంచకప్-2023లో భాగంగా ఢిల్లీ వేదికగా ఆఫ్గానిస్తాన్‌తో జరగుతున్న మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అద్బుతమైన సెంచరీతో చెలరేగాడు. 274 పరుగుల లక్ష్య ఛేదనలో ఆఫ్గాన్ బౌలర్లకు హిట్‌మ్యాన్ చుక్కలు చూపించాడు. కేవలం 63 బంతుల్లోనే రోహిత్ శర్మ తన సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో 84 బంతులు ఎదుర్కొన్న రోహిత్.. 16 ఫోర్లు, 5 సిక్స్‌లతో 131 పరుగులు చేశాడు. తద్వారా పలు అరుదైన రికార్డులను హిట్‌మ్యాన్ తన పేరిట లిఖించుకున్నాడు. రోహిత్ సాధించిన రికార్డులు ఇవే.. ►వన్డే ప్రపంచకప్‌లో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన భారత ఆటగాడిగా రోహిత్ శర్మ చరిత్ర సృష్టించాడు. రోహిత్ కేవలం 63 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. ►వన్డే వరల్డ్‌కప్ టోర్నీల్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా రోహిత్ శర్మ నిలిచాడు. రోహిత్ ఇప్పటివరకు వన్డే ప్రపంచకప్‌లో 7 సెంచరీలు చేశాడు. ఈ క్రమంలో సచిన్ టెండూల్కర్(6) రికార్డును హిట్‌మ్యాన్ బ్రేక్ చేశాడు. ►అంతర్జాతీయ వన్డే క్రికెట్లో అత్యధిక సెంచరీలు చేసిన మూడో ఆటగాడిగా హిట్‌మ్యాన్ రికార్డులకెక్కాడు. రోహిత్ ఇప్పటివరకు వన్డేల్లో 31 సెంచరీలు చేశాడు. ఈ క్రమంలో ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం రికీ పాంటింగ్(30)ను అధిగమించాడు. ఈ జాబితాలో సచిన్ టెండూల్కర్ 49 సెంచరీలతో అగ్రస్ధానంలో ఉన్నాడు. ►వరల్డ్‌కప్‌లో ఓవరాల్‌గా అత్యంతవేగవంతమైన సెంచరీ చేసిన ఆరో ఆటగాడిగా రోహిత్ నిలిచాడు. ఈ జాబితాలో దక్షిణాఫ్రికా ఆటగాడు ఐడైన్ మారక్రమ్ తొలి స్ధానంలో ఉన్నాడు. ఈ ఏడాది వరల్డ్‌కప్‌లో శ్రీలంకపై కేవలం 49 బంతుల్లోనే సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. ►వన్డేల్లో ఓపెనర్‌గా అత్యధిక సెంచరీలు చేసిన రెండో ఆటగాడిగా రోహిత్ నిలిచాడు. రోహిత్ ఇప్పటివరకు ఓపెనర్‌గా 29 సెంచరీలు చేశాడు. ఈ క్రమంలో శ్రీలంక క్రికెట్ దిగ్గజం సనత్ జయసూర్య(28)ను వెనక్కినెట్టాడు. ►అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక సిక్స్‌లు కొట్టిన ఆటగాడిగా రోహిత్ శర్మ నిలిచాడు. రోహిత్ ఇప్పటివరకు అంతర్జాతీయ క్రికెట్లో 554 సిక్స్‌లు బాదాడు. కాగా ఇప్పటి వరకు ఈ రికార్డు వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం క్రిస్ గేల్(553) పేరిట ఉండేది. తాజా మ్యాచ్‌తో గేల్ రికార్డును హిట్‌మ్యాన్ బద్దలు కొట్టాడు. -
చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ.. ప్రపంచ క్రికెట్లో తొలి ఆటగాడిగా
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన ఘనత సాధించాడు. అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక సిక్స్‌లు కొట్టిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. వన్డే ప్రపంచకప్-2023లో భాగంగా ఆఫ్గానిస్తాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రోహిత్ ఈ అరుదైన మైలు రాయిని అందుకున్నాడు. భారత ఇన్నింగ్స్ 8వ ఓవర్ వేసిన నవీన్ ఉల్ బౌలింగ్‌లో ఐదో బంతిని సిక్స్‌గా మలిచిన రోహిత్.. ఈ రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. రోహిత్ ఇప్పటివరకు అంతర్జాతీయ క్రికెట్లో 554 సిక్స్‌లు బాదాడు. కాగా ఇప్పటి వరకు ఈ రికార్డు వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం క్రిస్ గేల్(553) పేరిట ఉండేది. తాజా మ్యాచ్‌తో గేల్ రికార్డును హిట్‌మ్యాన్ బద్దలు కొట్టాడు. చదవండి: WC 2023: సెంచరీతో చెలరేగిన రిజ్వాన్ వివాదస్పద ట్వీట్! ఆటను వదిలి ఇతర అంశాల్లోకి! View this post on Instagram A post shared by ICC (@icc) -
నవీన్ ఉల్ హక్ రనౌట్ మిస్.. రాహుల్‌పై కోహ్లి సీరియస్! వీడియో వైరల్
వన్డే ప్రపంచకప్-2023లో భాగంగా ఢిల్లీ వేదికగా భారత్-ఆఫ్గానిస్తాన్ జట్లు తలపడతున్నాయి. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్గానిస్తాన్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 272 పరుగులు చేసింది.ఆఫ్గాన్ బ్యాటర్లలో కెప్టెన్ హష్మతుల్లా షాహిదీ(80) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. అజ్మతుల్లా ఒమర్జాయ్(62) పరుగులతో రాణించాడు. భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా నాలుగు వికెట్లు పడగొట్టగా.. హార్దిక్ పాండ్యా రెండు, కుల్దీప్, శార్థూల్ ఠాకూర్ తలా వికెట్ సాధించారు. విరాట్ కోహ్లి సీరియస్.. ఇక ఈ మ్యాచ్‌లో టీమిండియా వికెట్ కీపర్ కేఎల్ రాహుల్‌పై స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి సీరియస్ అయ్యాడు. ఆఫ్ఘనిస్తాన్ ఇన్నింగ్స్ 49 ఓవర్లో రషీద్ ఖాన్ ఔట్ కాగానే నవీన్ ఉల్ హక్ క్రీజులోకి వచ్చాడు. ఈ క్రమంలో ఫ్యాన్స్ అందరూ కోహ్లి, కోహ్లి అని గట్టిగా అరవడం మొదలు పెట్టారు. ఈ క్రమంలో నవీన్ తన ఎదుర్కొన్న తొలి బంతిని ఫైన్ లెగ్ వైపు ఆడాడు. తొలి పరుగు పూర్తి చేసుకున్న నవీన్ రెండో పరుగు కోసం పరిగెత్తాడు. అయితే ఫైన్ లెగ్‌లో ఉన్న కోహ్లి అద్బుతంగా ఫీల్డింగ్ చేసి వికెట్ కీపర్ రాహుల్ వైపు త్రో చేశాడు. రాహుల్ బంతిని సరిగ్గా అందుకోవడంలో విఫలమయ్యాడు. దీంతో విరాట్ కోహ్లి ఒక్కసారిగా రాహుల్ వైపు చూస్తూ కోపంతో ఊగిపోయాడు. ఒక వేళ రాహుల్ బంతిని సరిగ్గా పట్టి స్టంప్స్‌ను పడగొట్టి నవీన్ రనౌట్‌గా వెనుదిరిగాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా ఐపీఎల్-2023 సందర్భంగా కోహ్లి,నవీన్ ఉల్- హక్ మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. Naveen ul Haq comes to bat and Entire packed Delhi crowddd goess KOHLIII KOHLIII.... Insaneeee🔥 pic.twitter.com/SW3eyQgtXA — Pranjal (@Pranjal_one8) October 11, 2023 -
చరిత్ర సృష్టించిన ఆఫ్గానిస్తాన్ కెప్టెన్.. వరల్డ్‌కప్‌లో తొలి క్రికెటర్‌గా!
ఆఫ్గానిస్తాన్ కెప్టెన్ హష్మతుల్లా షాహిదీ అరుదైన ఘనత సాధించాడు. వన్డే వరల్డ్‌కప్‌లో అత్యధిక ఫిప్టి ప్లస్ స్కోర్లు సాధించిన ఆఫ్గాన్ క్రికెటర్‌గా నిలిచాడు. వన్డే ప్రపంచకప్-2023లో భాగంగా ఢిల్లీ వేదికగా భారత్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో హాఫ్ సెంచరీతో చెలరేగిన హష్మతుల్లా షాహిదీ.. ఈ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. ఇప్పటివరకు వరల్డ్‌కప్‌లో షాహిదీ 3సార్లు ఏభై పైగా పరుగులు సాధించాడు. అంతకుముందు ఈ రికార్డు ఆఫ్గాన్ మిడిలార్డర్ బ్యాటర్ నజీబుల్ జర్డాన్(2సార్లు) పేరిట ఉండేది. అదే విధంగా వరల్డ్‌కప్‌లో ఫిప్టీ ఫ్లస్ స్కోర్ సాధించిన తొలి ఆఫ్గాన్ కెప్టెన్‌గా కూడా షాహిదీ రికార్డులకెక్కాడు. ఇక టీమిండియాతో మ్యాచ్‌లో 88 బంతులు ఎదుర్కొన్న షాహిదీ 8 ఫోర్లు, 1 సిక్స్‌తో 80 పరుగులు చేశాడు. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఆఫ్గాన్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 272 పరుగులు చేసింది. ఆఫ్గాన్ బ్యాటర్లలో కెప్టెన్ హష్మతుల్లా షాహిదీ(80) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. అజ్మతుల్లా ఒమర్జాయ్(62) పరుగులతో రాణించాడు. భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా నాలుగు వికెట్లు పడగొట్టగా.. హార్దిక్ పాండ్యా రెండు, కుల్దీప్, శార్థూల్ ఠాకూర్ తలా వికెట్ సాధించారు. -
అతడేం తప్పు చేశాడు: రోహిత్ శర్మపై మండిపడ్డ టీమిండియా దిగ్గజం
ICC WC ODI 2023: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ నిర్ణయంపై భారత క్రికెట్ దిగ్గజం సునిల్ గావస్కర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. వన్డే వరల్డ్‌కప్-2023లో ఆఫ్గనిస్తాన్‌తో మ్యాచ్ ఆడే జట్టులో ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌కు ఎందుకు చోటివ్వలేదని ప్రశ్నించాడు. అసలు అశూ ఏం తప్పు చేశాడో అర్థం కావడం లేదంటూ అసహనం వ్యక్తం చేశాడు. కాగా చెన్నైలో ఆస్ట్రేలియాతో ఆరంభ మ్యాచ్ ఆడిన టీమిండియా 6 వికెట్ల తేడాతో నెగ్గిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో బుధవారం(అక్టోబరు 11)న ఆఫ్గనిస్తాన్‌తో రెండో మ్యాచ్‌కు సిద్ధమైంది. ఢిల్లీలోని అరుణ్‌జైట్లీ స్టేడియం ఇందుకు వేదికకాగా.. భారత జట్టు ఒక మార్పుతో బరిలోకి దిగింది. శార్దూల్ ఠాకూర్ తుదిజట్టులోకి వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ స్థానంలో పేస్ ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్ తుదిజట్టులోకి వచ్చాడు. ఆఫ్గనిస్తాన్‌పై మెరుగైన రికార్డు ఉన్నప్పటికీ సీనియర్ ఫాస్ట్‌బౌలర్ మహ్మద్ షమీని కాదని.. లోయర్ ఆర్డర్లో బ్యాటింగ్ చేయగల సత్తా ఉన్న శార్దూల్వైపే మేనేజ్మెంట్ మొగ్గుచూపింది. ప్రతిసారి ఇలాగే.. ఈ విషయంపై స్పందించిన సునిల్ గావస్కర్.. అశ్విన్‌ను ఎందుకు తప్పించారో.. షమీని ఎందుకు జట్టులోకి తీసుకోవడం లేదో అర్థం కావడం లేదంటూ మండిపడ్డాడు. ‘‘మరోసారి అశ్విన్‌ను తప్పించారు. అసలు అతడేం తప్పు చేశాడో అర్థం కావడం లేదు. ప్రతిసారి ఇలాగే.. ఒక మ్యాచ్‌లో ఆడించడం.. తదుపరి మ్యాచ్‌లో పక్కనపెట్టడం పరిపాటిగా మారింది. ఇక షమీ.. 2019లో షమీ అఫ్గనిస్తాన్ మీద చెలరేగిన విషయం మర్చిపోయినట్టున్నారు. కనీసం అతడినైనా ఆడించాల్సి కదా!’’ అని స్టార్ స్పోర్ట్స్ షోలో అసహనం ప్రదర్శించాడు. అశ్విన్, షమీల విషయంలో రోహిత్ నిర్ణయాన్ని ఈ మాజీ కెప్టెన్ ఈ సందర్భంగా తప్పుబట్టాడు. నాటి మ్యాచ్‌లో షమీకే ఎక్కువ వికెట్లు కాగా 2019 వరల్డ్‌కప్‌లో ఆఫ్గన్‌తో మ్యాచ్‌లో షమీ 9.5 ఓవర్ల బౌలింగ్‌లో కేవలం 40 పరుగులిచ్చి 4 వికెట్లు తీశాడు. ఆ మ్యాచ్‌లో టీమిండియా 11 పరుగుల తేడాతో గెలుపొందింది. గావస్కర్ ఇలా.. గంభీర్ అలా ఇక తాజా మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆఫ్గనిస్తాన్ తొలుత బ్యాటింగ్ చేసి నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 272 పరుగులు చేసింది. పేసర్లు బుమ్రా నాలుగు, హార్దిక్ రెండు, శార్దూల్ ఠాకూర్ ఒకటి.. చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ఒక్కో వికెట్ తీశారు. కాగా అరుణ్‌జైట్లీ స్టేడియం పిచ్ ఆఫ్ స్పిన్నర్లకు అనుకూలించకపోవచ్చంటూ మ్యాచ్‌కు ముందు ఢిల్లీ మాజీ బ్యాటర్ గౌతం గంభీర్ వ్యాఖ్యానించడం గమనార్హం. చదవండి: WC 2023: వన్డే ర్యాంకింగ్స్‌లో అదరగొట్టిన కోహ్లి.. రాహుల్ ఏకంగా.. -
'అయ్యో షమీ.. రోహిత్ శర్మ కావాలనే అలా చేస్తున్నాడు'
వన్డే ప్రపంచకప్-2023లో భాగంగా ఢిల్లీ వేదికగా ఆఫ్గానిస్తాన్‌తో టీమిండియా తలపడతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆఫ్గానిస్తాన్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే భారత వెటరన్ పేసర్ మహ్మద్ షమీకి మరోసారి తుది జట్టులో చోటు దక్కలేదు. ఆఫ్గాన్‌తో మ్యాచ్‌కు స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌కు విశ్రాంతి ఇచ్చిన జట్టు మేనెజ్మెంట్.. ఆల్‌రౌండర్ శార్ధూల్ ఠాకూర్‌కు తుది జట్టులో చోటు కల్పించింది. ఈ నిర్ణయం తీసుకున్న టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు జట్టు మేనెజ్మెంట్పై ఫ్యాన్స్ విమర్శల వర్షం కురిపిస్తున్నారు. షమీ భారత్‌కు కాకుండా వేరే దేశం తరపున ఆడాల్సింది, ఈజీగా ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు దక్కుతుందని ఓ నెటిజన్ ఎక్స్(ట్విటర్)లో రాసుకొచ్చాడు. మరి కొంతమంది అయితే రోహిత్ శర్మ కావాలనే షమీని తప్పిస్తున్నాడని కామెంట్లు చేస్తున్నారు. కాగా వరల్డ్‌కప్‌కు ముందు స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌లో షమీ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. మొహలీ వేదికగా జరిగిన తొలి వన్డేలో ఐదు వికెట్లతో షమీ అదరగొట్టాడు. అదే విధంగా వరల్డ్‌కప్‌లో కూడా షమీకి మంచి రికార్డు ఉంది. ఇంగ్లండ్ వేదికగా జరిగిన 2019 వరల్డ్‌కప్‌లో ఆఫ్గానిస్తాన్‌పై షమీ హ్యాట్రిక్ వికెట్లు పడగొట్టాడు. చదవండి: CWC 2023 BAN Vs ENG: ఇంగ్లండ్ చేతిలో ఖంగుతిన్న బంగ్లాదేశ్‌కు మరో షాక్


