టీమిండియాలో ఛాన్స్‌ కొట్టేశాడు.. కట్‌ చేస్తే! అక్కడ 6 వికెట్లతో అదుర్స్ | India And CSK All-rounder Shivam Dube Impresses On Ranji Trophy Return After Four Years, See Details - Sakshi
Sakshi News home page

IND Vs AFG: టీమిండియాలో ఛాన్స్‌ కొట్టేశాడు.. కట్‌ చేస్తే! అక్కడ 6 వికెట్లతో అదుర్స్

Published Mon, Jan 8 2024 6:19 PM | Last Updated on Mon, Jan 8 2024 8:43 PM

India all-rounder impresses on Ranji Trophy return after four year - Sakshi

రంజీట్రోఫీ-2024 సీజన్‌ను టీమిండియా ఆటగాడు, ముంబై స్టార్‌ ఆల్‌రౌండర్‌ శివమ్‌ దూబే ఘనంగా ఆరంభించాడు. ఎలైట్ గ్రూపు-బిలో భాగంగా బీహార్‌తో జరిగిన మ్యాచ్‌లో దుబే ఆల్‌రౌండ్‌ ప్రదర్శన కనబరిచాడు. ముంబై తొలి ఇన్నింగ్స్‌లో 41 పరుగులతో రాణించిన దూబే.. అనంతరం బౌలింగ్‌లో అదరగొట్టాడు.

మొదటి ఇన్నింగ్స్‌లో రెండు కీలక వికెట్లు పడగొట్టి బీహార్‌ను ఫాలో ఆన్‌ దాటకుండానే కట్టడి చేశాడు. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్‌లో 4 కీలక వికెట్లు పడగొట్టి చావు దెబ్బ కొట్టాడు. ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌లు కలిపి దూబే 6 వికెట్లు సాధించాడు. ఇక ఈ మ్యాచ్‌లో బీహార్‌పై ఇన్నింగ్స్‌ 51 పరుగుల తేడాతో ముంబై ఘన విజయం సాధించింది.

భారత జట్టులో చోటు..
కాగా తాజాగా అఫ్గానిస్తాన్‌తో టీ20 సిరీస్‌కు ప్రకటించిన భారత జట్టులో దూబేకు చోటు దక్కింది. ఈ సిరీస్‌కు గాయం కారణంగా దూరమైన స్టార్‌ ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా స్ధానాన్ని దూబేతో సెలక్టర్లు భర్తీ చేశారు. దూబే చివరగా భారత తరపున ఆసియా క్రీడల్లో ఆడాడు. టీమిండియా తరపున ఇప్పటివరకు 18 టీ20లు ఆడిన దూబే.. 152 పరుగులతో పాటు 6 వికెట్లు పడగొట్టాడు.
చదవండి: IND vs AFG:'హార్దిక్‌ తిరిగొచ్చినా రోహిత్‌ శర్మనే కెప్టెన్‌.. రాసిపెట్టుకోండి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement