Shivam Dube
-
ఒకే ఓవర్లో మూడు వికెట్లు.. సూర్యకుమార్ యాదవ్, శివం దూబే డకౌట్
రంజీ ట్రోఫీ సెమీ ఫైనల్ మ్యాచ్‌లో ముంబై స్టార్ బ్యాటర్లు పూర్తిగా విఫలమయ్యారు. విదర్భతో పోరులో కెప్టెన్ అజింక్య రహానే(Ajinkya Rahane)తో పాటు టీమిండియా స్టార్లు సూర్యకుమార్ యాదవ్(Suryakumar Yadav), శివం దూబే(Shivam Dube) చేతులెత్తేశారు. ఫలితంగా ముంబై జట్టు పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. కాగా రంజీ ట్రోఫీ ఎలైట్ 2024-25 సీజన్లో డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన రహానే సేన సెమీస్ చేరిన విషయం తెలిసిందే.ఈ క్రమంలో సెమీ ఫైనల్-2లో భాగంగా విదర్భ జట్టుతో తలపడుతోంది. నాగ్‌పూర్ వేదికగా.. విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో సోమవారం మొదలైన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆతిథ్య జట్టు తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే, ఆరంభంలోనే ఓపెనర్ అథర్వ టైడే(4) వికెట్ కోల్పోయిన విదర్భను మరో ఓపెనర్ ధ్రువ్ షోరే అర్ధ శతకం(74)తో ఆదుకున్నాడు. వన్‌డౌన్‌లో వచ్చిన స్పిన్ బౌలర్ పార్థ్ రేఖడే(Parth Rekhade) కూడా 23 పరుగులతో ఫర్వాలేదనిపించాడు.383 పరుగులుఇక మిడిలార్డర్లో ప్రతి ఒక్కరు రాణించడంతో విదర్భ తొలి ఇన్నింగ్స్‌లో 383 పరుగులు చేయగలిగింది. డానిష్ మాలేవార్(79), కరుణ్ నాయర్(45), యశ్ రాథోడ్(54) మెరుగైన ఇన్నింగ్స్ ఆడగా.. కెప్టెన్ అక్షయ్ వాడ్కర్ 34, హర్ష్ దూబే 18, నచికేత్ భూటే 11, దర్శన్ నాల్కండే 12*, యశ్ ఠాకూర్ 3 పరుగులు చేశారు.ముంబై బౌలర్లలో పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ శివం దూబే ఐదు వికెట్లతో చెలరేగగా.. రాయ్స్టన్ దాస్, షామ్స్ ములానీ రెండేసి వికెట్లు దక్కించుకున్నారు. అదే విధంగా.. శార్దూల్ ఠాకూర్ ఒక వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక విదర్భ మొదటి ఇన్నింగ్స్ 383 పరుగులు చేసి మెరుగైన స్థితిలో నిలవగా.. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ముంబై మాత్రం కష్టాలపాలైంది.పార్థ్ రేఖడే విజృంభణఓపెనర్ ఆయుశ్ మాత్రే తొమ్మిది పరుగులకే నిష్క్రమించగా.. మరో ఓపెనర్ ఆకాశ్ ఆనంద్(171 బంతుల్లో 67 నాటౌట్ ) పట్టుదలగా క్రీజులో నిలబడ్డాడు. సిద్దేశ్ లాడ్ 35 పరుగులతో ఫర్వాలేదనిపించగా.. కెప్టెన్ అజింక్య రహానే 18 పరుగులకే నిష్క్రమించాడు. ఇక టీమిండియా టీ20 జట్టు సారథి సూర్యకుమార్ యాదవ్, శివం దూబే మరీ దారుణంగా డకౌట్ అయ్యారు.ఈ ముగ్గురిని విదర్భ బౌలర్ పార్థ్ రేఖడే ఒకే ఓవర్లో పెవిలియన్‌కు పంపడం విశేషం. ముంబై ఇన్నింగ్స్‌లో 41వ ఓవర్ వేసిర పార్థ్.. తొలి బంతికే రహానేను బౌల్డ్ చేశాడు. ఈ క్రమంలో క్రీజులోకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్ పార్థ్ బౌలింగ్‌లో డానిష్ మాలేవర్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. అనంతరం శివం దూబే వికెట్‌ను కూడా పార్థ్ దక్కించుకున్నాడు. కాగా సూర్య, దూబేలకు తొలుత డాట్ బాల్ వేసిన పార్థ్ ఆ మరుసటి బంతికే వాళ్లిద్దరిని అవుట్ చేయడం విశేషం.ఇక ఆ తర్వాత కూడా విదర్భ బౌలర్ల విజృంభణ కొనసాగింది. షామ్స్ ములానీ(4)ని హర్ష్ దూబే వికెట్ల ముందు దొరకబుచ్చుకోగా.. వేగంగా ఆడుతున్న శార్దూల్ ఠాకూర్(41 బంతుల్లో 37)ను యశ్ ఠాకూర్ పెవిలియన్‌కు చేర్చాడు. ఈ క్రమంలో మంగళవారం నాటి రెండో రోజు ఆట ముగిసే సరికి ముంబై 59 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసి.. విదర్భ కంటే 195 పరుగులు వెనుకబడి ఉంది. ఆకాశ్ ఆనంద్ 67, తనుశ్ కొటియాన్ 5 పరుగులతో క్రీజులో ఉన్నారు. విదర్భ బౌలర్లలో పార్థ్ రేఖడే మూడు వికెట్లు కూల్చగా.. యశ్ ఠాకూర్‌కు రెండు, దర్శన్ నల్కండే, హర్ష్ దూబేలకు ఒక్కో వికెట్ దక్కాయి.చదవండి: బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌కు భారత తుదిజట్టు ఇదే! రోహిత్ కోరుకుంటేనే అతడికి ఛాన్స్ Suryakumar Yadav 360° batting today pic.twitter.com/SZoVId69lE— Abhi (@79off201) February 18, 2025 -
శివమ్ దూబే విజృంభణ.. కీలక మ్యాచ్‌లో ఐదు వికెట్లు
భారత స్టార్ ఆల్‌రౌండర్ శివమ్ దూబే (Shivam Dube) రంజీ ట్రోఫీ సెమీ ఫైనల్లో (Ranji Semi Finals) చెలరేగిపోయాడు. విదర్భతో జరుగుతున్న మ్యాచ్‌లో దూబే (ముంబై) ఐదు వికెట్ల ప్రదర్శనతో మెరిశాడు. తరుచూ బ్యాట్‌తో సత్తా చాటే దూబే ఈ మ్యాచ్‌లో బంతితో చెలరేగాడు. దూబే ధాటికి విదర్భ తొలి ఇన్నింగ్స్‌లో 383 పరుగులకు ఆలౌటైంది.ఓవర్‌నైట్ స్కోర్ 308/5 వద్ద రెండో రోజు ఆటను ప్రారంభించిన విదర్భ మరో 75 పరుగులు మాత్రమే జోడించి మిగతా ఐదు వికెట్లు కోల్పోయింది. తొలి రోజు ఆటలో 2 వికెట్లు తీసిన దూబే.. రెండో రోజు చెలరేగిపోయి మరో 3 వికెట్లు తీశాడు. ఈ మ్యాచ్‌లో దూబే.. పార్థ్ రేఖడే, కీలకమైన కరుణ్ నాయర్, హర్ష్ దూబే, భూటే, యశ్ ఠాకూర్ వికెట్లు తీశాడు. ముంబై బౌలర్లలో షమ్స్‌ములానీ, రాయ్స్టన్ డయాస్ తలో రెండు, శార్దూల్ ఠాకూర్ ఓ వికెట్ తీశారు.విదర్భ ఇన్నింగ్స్‌లో దృవ్ షోరే (74), దినిశ్ మాలేవార్ (79), యశ్ రాథోడ్ (54) అర్ద సెంచరీలతో రాణించగా.. కరుణ్ నాయర్ (45), కెప్టెన్ అక్షయ్ వాద్కర్ (34) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. అథర్వ తైడే 4, పార్థ్ రేఖడే 23, హర్ష్ దూబే 18, భూటే 11, యశ్ ఠాకూర్ 3 పరుగులు చేసి ఔట్ కాగా.. దర్శన్ నల్కండే 12 పరుగులతో అజేయంగా నిలిచాడు.అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ముంబై.. 18 పరుగుల వద్దే తొలి వికెట్ కోల్పోయింది. దర్శన్ నల్కండే బౌలింగ్‌లో దనిశ్ మలేవార్‌కు క్యాచ్ ఇచ్చి ఆయుశ్ మాత్రే (9) ఔటయ్యాడు. ప్రస్తుతం ఆకాశ్ ఆనంద్ (7), సిద్దేశ్ లాడ్ (0) క్రీజ్‌లో ఉన్నారు. 4.4 ఓవర్ల అనంతరం ముంబై తొలి ఇన్నింగ్స్ స్కోర్ 18/1గా ఉంది. విదర్భ తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు ముంబై ఇంకా 365 పరుగులు వెనుకపడి ఉంది.మరో సెమీఫైనల్లో గుజరాత్, కేరళ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేస్తున్న కేరళ భారీ స్కోర్ దిశగా పయనిస్తుంది. రెండో రోజు తొలి సెషన్ సమయానికి ఆ జట్టు 5 వికెట్ల నష్టానికి 293 పరుగులు చేసింది.మొహమ్మద్ అజహారుద్దీన్ (85), సల్మాన్ నిజర్ (28) క్రీజ్‌లో ఉన్నారు. కేరళ ఇన్నింగ్స్‌లో కెప్టెన్ సచిన్ బేబి (69) అర్ద సెంచరీతో రాణించగా.. అక్షయ్ చంద్రన్, రోహన్ కున్నుమ్మల్, జలజ్ సక్సేనా తలో 30 పరుగులు చేశారు. వరుణ్ నయనార్ 10 పరుగులకు ఔటయ్యాడు. గుజరాత్ బౌలర్లలో అర్జన్ నగస్వల్లా 2, పి జడేజా, రవి బిష్ణోయ్ తలో వికెట్ పడగొట్టారు. -
మళ్లీ ఫెయిలైన సూర్యకుమార్.. ఇప్పట్లో రీఎంట్రీ కష్టమే!
భారత పురుషుల టీ20 క్రికెట్ జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్(Suryakumar Yadav) బ్యాటింగ్ వైఫల్యాల పరంపర కొనసాగుతోంది. ఫార్మాట్ మారినా అతడి ఆట తీరులో మాత్రం మార్పరాలేదు. ఇటీవల ఇంగ్లండ్(India vs England)తో స్వదేశంలో పొట్టి సిరీస్‌లో సారథిగా అదరగొట్టిన ఈ ముంబైకర్.. బ్యాటర్‌గా మాత్రం పూర్తిగా విఫలమైన విషయం తెలిసిందే. తాజాగా రంజీ ట్రోఫీ(Ranji Trophy) మ్యాచ్‌లోనూ సూర్య నిరాశపరిచాడు.ఫోర్‌తో మొదలుపెట్టిహర్యానాతో మ్యాచ్‌లో క్రీజులోకి రాగానే ఫోర్ బాది దూకుడుగా ఇన్నింగ్స్ ఆరంభించిన సూర్యకుమార్.. మరుసటి ఓవర్లోనే వెనుదిరిగాడు. కేవలం తొమ్మిది పరుగులు చేసి నిష్క్రమించాడు. కాగా సూర్య చివరగా ఈ రంజీ సీజన్లో భాగంగా మహారాష్ట్రతో మ్యాచ్ సందర్భంగా బరిలోకి దిగాడు. అయితే, ఆ మ్యాచ్‌లో కేవలం ఏడు పరుగులే చేసి అవుటయ్యాడు. ఈ నేపథ్యంలో టీ20 కెప్టెన్ ఇక టెస్టుల గురించి మర్చిపోవాల్సిందేనంటూ టీమిండియా అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.కాగా దేశీ ఫస్ట్‌క్లాస్ క్రికెట్ ప్రతిష్టాత్మక టోర్నమెంట్ రంజీ ట్రోఫీ(Ranji Trophy) క్వార్టర్ ఫైనల్స్ శనివారం ఆరంభమయ్యాయి. ఇందులో భాగంగా.. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా ముంబై- హర్యానా మధ్య క్వార్టర్ ఫైనల్-3 మొదలైంది. ఇందులో టాస్ గెలిచిన ముంబై తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే, హర్యానా పేసర్ల ధాటికి అజింక్య రహానే సేనకు ఆరంభంలోనే ఎదురుదెబ్బలు తగిలాయి.సుమిత్ దెబ్బకు బౌల్డ్ఓపెనర్ ఆయుశ్ మాత్రే(0)ను అన్షుల్ కాంబోజ్ డకౌట్ చేయగా.. మరో ఓపెనర్, వికెట్ కీపర్ బ్యాటర్ ఆకాశ్ ఆనంద్‌ను పది పరుగుల వద్ద సుమిత్ కుమార్ బౌల్డ్ చేశాడు. ఇక వన్‌డౌన్‌లో వచ్చిన సిద్ధేశ్ లాడ్(4) అన్షుల్ వేసిన బంతికి బౌల్డ్‌కాగా.. ఐదో స్థానంలో బ్యాటింగ్ చేసిన సూర్యకుమార్ యాదవ్ సుమిత్ దెబ్బకు క్లీన్‌బౌల్డ్ అయ్యాడు.ముంబై ఇన్నింగ్స్ ఏడో ఓవర్ మొదటి బంతికి సిద్ధేశ్ అవుట్ కాగా.. సూర్య క్రీజులోకి వచ్చాడు. అన్షుల్ బౌలింగ్‌లో ఫోర్ కొట్టి ఘనంగా ఆరంభించాడు. ఎనిమిదో ఓవర్లో సుమిత్ బౌలింగ్‌లోనూ తొలి బంతినే బౌండరీకి తరలించిన సూర్య.. ఆ మరుసటి రెండో బంతికి పెవిలియన్ చేరాడు. మొత్తంగా ఐదు బంతులు ఎదుర్కొని రెండు ఫోర్ల సాయంతో తొమ్మిది పరుగులు చేసి ఈ కుడిచేతి వాటం బ్యాటర్ అవుటయ్యాడు.ఈ క్రమంలో 29 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాలో పడిన ముంబై జట్టును కెప్టెన్ అజింక్య రహానే, ఆల్‌రౌండర్ శివం దూబే ఆదుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఇటీవల ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌లో సూర్యకుమర్ యాదవ్ తొలి మ్యాచ్‌లోనే డకౌట్ అయిన విషయం తెలిసిందే.ఇప్పట్లో టీమిండియా రీఎంట్రీ కష్టమేఆ తర్వాత కూడా వరుస మ్యాచ్‌లలో సూర్య నిరాశపరిచాడు. రెండో టీ20లో 12, మూడో టీ20లో 14 పరుగులు చేసిన అతడు.. నాలుగో టీ20లో మళ్లీ సున్నా చుట్టాడు. ఆఖరిదైన ఐదో టీ20లోనూ రెండు పరుగులే చేసి వెనుదిరిగాడు. అయితే, కెప్టెన్‌గా మాత్రం ఈ ఐదు టీ20ల సిరీస్‌లో 4-1తో సూర్య ఘన విజయం అందుకున్నాడు. ఇక ఇప్పటికే ఫామ్‌లేమి కారణంగా వన్డే జట్టులో ఎప్పుడో స్థానం కోల్పోయిన సూర్య.. రంజీల్లో వరుస వైఫల్యాలతో ఇప్పట్లో టెస్టుల్లోకి వచ్చే అవకాశం కూడా లేకుండా చేసుకుంటున్నాడు. కాగా 2023లో బోర్డర్- గావస్కర్ ట్రోఫీ సందర్భంగా నాగ్‌పూర్ వేదికగా టెస్టుల్లో అరంగేట్రం చేసిన సూర్య.. దారుణంగా విఫలమయ్యాడు. ఆస్ట్రేలియాతో తొలి టెస్టులో 8 పరుగులు మాత్రమే చేశాడు.చదవండి: Ind vs Eng: అద్భుతమైన ఆటగాడు.. అతడినే పక్కనపెడతారా?: ఆసీస్ దిగ్గజం -
చరిత్ర సృష్టించిన శివమ్ దూబే.. వరల్డ్‌లోనే తొలి ప్లేయర్‌గా
ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన ఐదో టీ20లో భారత్ 150 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యచ్‌లో అభిషేక్ శర్మతో పాటు శివమ్ దూబే(Shivam Dube) కూడా ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టాడు. తొలుత బ్యాటింగ్‌లో మెరుపు ఇన్నింగ్స్ (13 బంతుల్లో 30 పరుగులు) ఆడిన దూబే.. అనంతరం బౌలింగ్‌లో రెండు వికెట్లతో సత్తాచాటాడు. ఫిల్ సాల్ట్, జాకబ్ బెతల్ వంటి కీలక వికెట్లు పడగొట్టి భారత విజయంలో తనవంతు పాత్ర పోషించాడు. ఈ క్రమంలో దూబే ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. దూబే వరల్డ్ రికార్డు..అంతర్జాతీయ టీ20ల్లో వరుసగా 30 విజయాలు సాధించిన జట్టులో భాగమైన తొలి క్రికెటర్‌గా దూబే వరల్డ్ రికార్డు సృష్టించాడు. దూబేకు భారత్ తరపున ఇది వరుసగా 30వ టీ20 విజయం కావడం గమనార్హం. దూబే తన కెరీర్లో టీమిండియా తరపున ఇప్పటివరకు 35 టీ20లు ఆడాడు. 2019లో ఢిల్లీ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టీ20తో దూబే అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టాడు.ఈ మ్యాచ్‌లో భారత్ 7 వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఆ తర్వాత అతడి ఐదో టీ20లో సైతం బంగ్లాదేశ్‌లో భారత్ ఓటమి చవిచూసింది. అప్పటి నుంచి దూబే ఆడిన ఏ టీ20 మ్యాచ్‌లోనూ టీమిండియా పరాజయం పాలవ్వలేదు. వరుసగా భారత్ 30 మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించింది.ఈ అరుదైన ఫీట్ సాధించిన దూబేకు ఐపీఎల్ ఫ్రాంచైజీ చెన్నై సూపర్ కింగ్స్ అభినందనలు తెలిపింది. "దూబే ఆడితే భారత్ గెలవాల్సిందే. దూబే ఆడిన 30 మ్యాచ్‌ల్లోనూ భారత్ వరుసగా విజయం సాధిచిందని సీఎస్కే ఎక్స్‌లో రాసుకొచ్చింది.కాగా ఇంగ్లండ్‌తో టీ20లకు దూబేకు తొలుత భారత జట్టులో చోటు దక్కలేదు. నితీశ్ కుమార్ రెడ్డి గాయపడడంతో దూబే జట్టులోకి వచ్చాడు. పుణే వేదికగా జరిగిన నాలుగో టీ20తో తుది జట్టులోకి వచ్చిన దూబే.. అద్భుతమైన హాఫ్ సెంచరీతో చెలరేగాడు. ఆ మ్యాచ్‌లో కంకషన్‌కు గురికావడంతో బౌలింగ్ చేసే అవకాశం రాలేదు.ఆఖరి టీ20లో మాత్రం తనకు వచ్చిన అవకాశాన్ని ఈ ముంబై ఆటగాడు అందిపుచ్చుకున్నాడు. కాగా టీ20 సిరీస్ ముగియడంతో దూబే ముంబై తరపున రంజీల్లో ఆడనున్నాడు. ఇక ఇది ఇలా ఉండగా.. భారత్-ఇంగ్లండ్ మధ్య మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ నాగ్‌పూర్ వేదికగా ఫిబ్రవరి 6 నుంచి ప్రారంభం కానుంది.జట్లుభారత్: రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్, యశస్వి జైస్వాల్, రిషభ్ పంత్, రవీంద్ర జడేజాఇంగ్లండ్: హ్యారీ బ్రూక్, బెన్ డకెట్, జోరూట్, జాకోబ్ బెతెల్, లియామ్ లివింగ్‌స్టోన్, బ్రైడన్ కార్స్, జేమీ ఓవర్టన్, జోస్ బట్లర్, జేమీ స్మిత్, ఫిలిప్ సాల్ట్, జోఫ్రా ఆర్చర్, గస్ అట్కిన్సన్, ఆదిల్ రషీద్, సకీబ్ మహ్మూద్, మార్క్ వుడ్.చదవండి: ఇంగ్లండ్‌తో తొలి వన్డే.. సచిన్ వరల్డ్ రికార్డుపై కన్నేసిన కోహ్లి -
రంజీ బాట పట్టిన టీమిండియా విధ్వంసకర వీరులు
హర్యానాతో జరిగే రంజీ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ (ఫిబ్రవరి 8-12) కోసం 18 మంది సభ్యుల ముంబై జట్టును ఇవాళ (ఫిబ్రవరి 3) ప్రకటించారు. వెటరన్ బ్యాటర్ అజింక్య రహానే ఈ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఈ మ్యాచ్ కోసం ముంబై సెలెక్టర్లు భారత టీ20 జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, టీమిండియా విధ్వంసకర బ్యాటర్ శివమ్ దూబేను ఎంపిక చేశారు. ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్ నేపథ్యంలో శ్రేయస్ అయ్యర్, రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్ పేర్లను ముంబై సెలెక్టర్లు పరిగణలోకి తీసుకోలేదు. ఈ ముగ్గురు భారత వన్డే జట్టులో సభ్యులుగా ఉన్నారు. ముంబై జట్టులో యువ బ్యాటర్లు ఆయుశ్ మాత్రే, అంగ్క్రిష్ రఘువంశీ, సిద్దేశ్ లాడ్ చోటు దక్కించుకున్నారు. ముంబై బౌలింగ్ అటాక్‌ను శార్దూల్ ఠాకూర్ లీడ్ చేస్తాడు. బౌలింగ్ విభాగంలో మోహిత్ అవస్తి, శివమ్ దూబే, తనుశ్ కోటియన్, షమ్స్ ములానీ సభ్యులుగా ఉన్నారు. ఆకాశ్ ఆనంద్, హార్దిక్ తామోర్ వికెట్ కీపర్లుగా ఎంపికయ్యారు.కాగా, ముంబై జట్టు గ్రూప్ దశలో తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో మేఘాలయాపై ఘన విజయం సాధించి క్వార్టర్ ఫైనల్‌కు చేరింది. ఈ మ్యాచ్‌లో ముంబై భారీ తేడాతో గెలుపొందడంతో బోనస్ పాయింట్ కూడా సాధించింది. ఈ మ్యాచ్‌లో ముంబై కేవలం ఒకే ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేసి ఇన్నింగ్స్ 456 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన మేఘాలయా 86 పరుగులకే కుప్పకూలింది. శార్దూల్ ఠాకూర్ హ్యాట్రిక్ సాధించాడు. మేఘాలయా ఇన్నింగ్స్‌లో మొదటి ఆరుగురు బ్యాటర్లలో ఐదుగురు డకౌట్లయ్యారు. అనంతరం ముంబై తొలి ఇన్నింగ్స్‌లో 671 పరుగులు చేసింది. సిద్దేశ్ లాడ్ (145), ఆకాశ్ ఆనంద్ (103), షమ్స్ ములానీ (100 నాటౌట్) సెంచరీలు చేశారు. ఆజింక్య రహానే (96), శార్దూల్ ఠాకూర్ (84) సెంచరీలు మిస్ చేసుకున్నారు. అనంతరం మేఘాలయా రెండో ఇన్నింగ్స్‌లో 129 పరుగులకే కుప్పకూలి ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది.ముంబై జట్టు అజింక్య రహానే (కెప్టెన్), ఆయుష్ మాత్రే, అంగ్క్రిష్ రఘువంశీ, అమోఘ్ భత్కల్, సూర్యకుమార్ యాదవ్, సిద్ధేష్ లాడ్, శివమ్ దూబే, ఆకాశ్ ఆనంద్ (వికెట్‌కీపర్), హార్దిక్ తమోర్ (వికెట్‌కీపర్), సూర్యాంశ్ షెడ్గే, శార్దూల్ ఠాకూర్, షమ్స్ ములానీ, తనుశ్ కోటియన్, మోహిత్ అవస్తి, సిల్వెస్టర్ డిసౌజా, రాయ్స్టన్ డయాస్, అథర్వ అంకోలేకర్, హర్ష్ తన్నా -
హర్షిత్ బదులు అతడిని పంపాల్సింది: భారత మాజీ క్రికెటర్ ఫైర్
ఇంగ్లండ్‌తో నాలుగో టీ20(India vs England)లో టీమిండియా యాజమాన్యం వ్యవహరించిన తీరును భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా తప్పుబట్టాడు. శివం దూబే(Shivam Dube)కు కంకషన్ సబ్‌స్టిట్యూట్‌గా.. హర్షిత్ రాణా(Harshit Rana)ను పంపడం నిబంధనలకు విరుద్ధమని అభిప్రాయపడ్డాడు. ఇలా చేయడం ద్వారా పుణె మ్యాచ్‌లో భారత జట్టు పన్నెండు మంది ఆటగాళ్లతో బరిలోకి దిగినట్లు అయిందంటూ ఘాటు వ్యాఖ్యలు చేశాడు.కాగా టీమిండియా స్వదేశంలో ప్రస్తుతం ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా కోల్‌కతా, చెన్నై మ్యాచ్‌లలో గెలిచిన సూర్యకుమార్ సేన.. రాజ్‌కోట్‌లో జరిగిన మూడో టీ20లో మాత్రం ఓటమిపాలైంది. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య పుణెలో శుక్రవారం నాలుగో టీ20 జరిగింది.ఆదిలోనే ఎదురుదెబ్బఇందులో టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. టాస్ విషయంలో కెప్టెన్ నమ్మకాన్ని నిజం చేస్తూ ఇంగ్లండ్ పేసర్ సకీబ్ మహమూద్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఓపెనర్ సంజూ శాంసన్(1), వన్‌డౌన్ బ్యాటర్ తిలక్ వర్మ(0), కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్(0)లను అవుట్ చేసి టీమిండియాను దెబ్బకొట్టాడు.దూబే, హార్దిక్ అదరగొట్టారుఈ క్రమంలో అభిషేక్ శర్మ(29) కాసేపు క్రీజులో నిలబడగా.. రింకూ సింగ్(30) ఫర్వాలేదనిపించాడు. అయితే, పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్లు శివం దూబే, హార్దిక్ పాండ్యా రాకతో సీన్ మారింది. దూబే 34 బంతుల్లో 53 పరుగులతో దంచికొట్టగా.. పాండ్యా 30 బంతుల్లోనే 53 పరుగులతో దుమ్ములేపాడు. వీరిద్దరి మెరుపు ఇన్నింగ్స్ కారణంగా టీమిండియా నిర్ణీత ఇరవై ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది.హర్షిత్ రాణా రాకతో..అయితే, ఆఖరి ఓవర్లో జేమీ ఓవర్టన్ బౌలింగ్‌లో దూబే హెల్మెట్‌కు బంతి బలంగా తాకగా.. ఫిజియో వచ్చి పరీక్షించాడు. తాను బాగానే ఉన్నానని చెప్పిన దూబే.. బ్యాటింగ్‌ను కొనసాగించాడు. కానీ ఆ తర్వాత అతడు ఫీల్డింగ్‌కు మాత్రం రాలేదు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్ మొదలైన రెండు ఓవర్ల తర్వాత హర్షిత్ రాణాను మేనేజ్మెంట్ మైదానంలోకి పంపింది.ఈ క్రమంలో తన టీ20 అరంగేట్రం చేసిన హర్షిత్ రాణా అద్భుత బౌలింగ్(3/33)తో ఇంగ్లండ్‌ను దెబ్బకొట్టి.. టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు. అయితే, ఆల్‌రౌండర్ దూబే స్థానంలో స్పెషలిస్టు ఫాస్ట్బౌలర్ను కాంకషన్ సబ్‌స్టిట్యూట్‌గా పంపడం విమర్శలకు దారితీసింది.నిబంధనలకు విరుద్ధంఈ విషయంపై టీమిండియా మాజీ ఓపెనర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా స్పందించాడు. ‘‘ఐసీసీ నిబంధనల ప్రకారం.. బౌలర్ స్థానంలో బౌలర్.. బ్యాటర్ స్థానంలో బ్యాటర్.. ఆల్‌రౌండర్ స్థానంలో ఆల్‌రౌండర్(like-for-like replacement) కంకషన్ సబ్‌స్టిట్యూట్‌గా రావాలి. రూల్ బుక్‌లో ఇది స్పష్టంగా రాసి ఉంది.ఉదాహరణకు.. బెక్ డకెట్ తలకు గాయమైతే.. ఫీల్డింగ్ సమయంలో అతడి స్థానంలోమరో బ్యాటర్‌నే పంపాలి. కానీ బౌలర్‌ను పంపకూడదు. ఎందుకంటే.. అతడు బౌలింగ్ చేయలేడు .ఒకవేళ బౌలర్ గాయపడితే అతడి స్థానంలో మరో బౌలర్‌నే పంపాలి. కానీ.. ఇక్కడ శివం దూబేకు 20 ఓవర్లో తలకు గాయమైనప్పుడు.. కంకషన్ సబ్‌స్టిట్యూట్‌గా హర్షిత్ రాణాను రప్పించారు. హర్షిత్‌కు బదులు మహ్మద్ షమీని రప్పించవచ్చు కదా.12 మంది ప్లేయర్లతో ఆడి గెలిచాంఎందుకంటే.. హర్షిత్ రాణా నైపుణ్యాలకు.. శివం దూబే స్కిల్స్‌కు పోలికే లేదు. దూబే ఎక్కువగా బ్యాటింగ్ చేస్తాడు. అప్పుడప్పుడు గంటకు 115- 120 కిలోమీటర్ల వేగంతో మాత్రమే బౌలింగ్ చేస్తాడు. కానీ.. హర్షిత్ రాణా పూర్తిస్థాయి ఫాస్ట్ బౌలర్. గంటకు 140 -145 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేస్తాడు. ఎవరు ఏమన్నా ఇదే వాస్తవం.ఈరోజు శివం దూబే 53 పరుగులు చేశాడు. హర్షిత్ రాణా నాలుగు ఓవర్ల కోటాను పూర్తి చేసి.. కీలక వికెట్లు తీశాడు. ఇండియా గెలిచింది. నిజానికి ఈరోజు మనం 12 మంది ప్లేయర్లతో ఆడి గెలిచాం. రమణ్‌దీప్ సింగ్‌ను పంపాల్సిందిదూబే బ్యాటింగ్ చేశాడు.. హర్షిత్ బౌలింగ్ చేశాడు’’ అని ఆకాశ్ చోప్రా వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. దూబేకు కాంకషన్ సబ్‌స్టిట్యూట్‌గా రమణ్‌దీప్ సింగ్‌ను పంపాల్సిందని అభిప్రాయపడ్డాడు. కాగా పుణె మ్యాచ్‌లో ఇంగ్లండ్‌పై పదిహేను పరుగుల తేడాతో గెలిచిన టీమిండియా సిరీస్‌ను 3-1తో కైవసం చేసుకుంది.చదవండి: Suryakumar Yadav: వారిద్దరి వల్లే గెలిచాము.. కానీ అది మాత్రం ఊహించలేదు -
సబ్‌స్ట్యూట్‌గా వచ్చాడు.. గేమ్నే మార్చేశాడు! రూల్స్ ఏమి చెబుతున్నాయి?
పుణే వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన నాలుగో టీ20లో 15 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించింది. దీంతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 3-1 తేడాతో టీమిండియా సొంతం చేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 181 పరుగులు చేసింది.భారత బ్యాటర్లలో హార్దిక్ పాండ్యా(53), శివమ్ దూబే(53) హాఫ్ సెంచరీలతో రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో షోయబ్ మహ్మద్ మూడు వికెట్లు పడగొట్టగా.. ఓవర్టన్ రెండు , రషీద్, కార్స్ తలా వికెట్ సాధించారు. అనంతరం లక్ష్య చేధనలో ఇంగ్లండ్ 166 పరుగులకు ఆలౌటైంది. ఇంగ్లండ్ బ్యాటర్లలో హ్యారీ బ్రూక్(51), డకెట్(39) మెరుపు మెరిపించినప్పటికి తమ జట్టును గెలిపించలేకపోయారు.కంకషన్ సబ్‌స్టిట్యూట్‌గా వచ్చి..ఇక ఈ మ్యాచ్‌లో యువ పేసర్ హర్షిత్ రాణా(Harshit Rana) కంకషన్ సబ్‌స్టిట్యూట్‌గా వచ్చి తన టీ20 అరంగేట్రం చేశాడు. వాస్తవానికి నాలుగో టీ20 మ్యాచ్ తుది జట్టులో హర్షిత్ రాణాకు చోటు దక్కలేదు. ఆల్‌రౌండర్ శివమ్ దూబే స్ధానంలో హర్షిత్ రాణా మైదానంలో అడుగుపెట్టాడు. భారత ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్ వేసిన జేమీ ఓవర్టన్ బౌలింగ్‌లో ఓ బంతి దూబే హెల్మెట్ బలంగా తాకింది. వెంటనే ఫిజియో మైదానంలోకి వచ్చి అతడిని పరీక్షించారు.అయితే దూబే తనకు బాగనే ఉందని చెప్పడంతో ఫిజియో వెనక్కి వెళ్లిపోయాడు. దూబే సైతం తన ఇన్నింగ్స్‌ను కొనసాగించాడు. కానీ ఫీల్డింగ్ సమయంలో మాత్రం దూబే మైదానంలో అడుగుపెట్టలేదు. రెండు ఓవర్ల తర్వాత అతడికి బదులు హర్షిత్‌ను మేనేజ్మెంట్ తీసుకుంది. కంకషన్ సబ్‌స్టిట్యూట్‌గా వచ్చిన హర్షిత్ రాణా మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శన కనబరిచాడు. తన నాలుగు ఓవర్ల కోటాలో మూడు వికెట్లు తీసి 33 పరుగులు ఇచ్చాడు. అదేవిధంగా ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్‌ను అద్బుతమైన క్యాచ్‌తో పెవిలియన్‌కు పంపాడు. అయితే దూబే స్ధానంలో హర్షిత్ రాణా రావడంపై జోస్ బట్లర్‌తో సహా పలువురు మాజీ క్రికెటర్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ క్రమంలో అస్సలు రూల్స్ ఏమి చెబుతున్నాయో ఓ లుక్కేద్డాం.రూల్స్ ఇవే..ఐసీసీ ప్లే కండిషన్స్ నియమం 1.2.7.3 ప్రకారం.. కంకషన్ సబ్‌స్టిట్యూట్‌గా ఒకరికి బదులు మరొకరిని ఆడేందుకు అనుమతించొచ్చు. అయితే ఆ కంకషన్ రీప్లేస్మెంట్ అభ్యర్థనను ఐసీసీ మ్యాచ్ రిఫరీ ఆమోదించాలి. 'లైక్ ఫర్ లైక్ రీప్లేస్మెంట్’ విధానాన్ని పాటించాలి. అంటే బ్యాటర్ స్ధానంలో బ్యాటర్, బౌలర్ స్ధానంలో బౌలరే, ఆల్‌రౌండర్ స్ధానంలో ఆల్‌రౌండర్ మాత్రమే కంకషన్ సబ్‌స్టిట్యూట్‌గా బరిలో దిగాలి. అయితే దీనిపై మ్యాచ్ రిఫరీదే తుది నిర్ణయం. దీనిపై ప్రత్యర్థి జట్టుకు అప్పీలు చేసేందుకూ హక్కు ఉండదు. ఇక మ్యాచ్‌లో దూబే ఆల్‌రౌండర్ కాబట్టి అతడి స్దానంలో హర్షిత్ రాణాను ఆల్‌రౌండర్‌గా పరిగణించి మ్యాచ్ రిఫరీ కంకషన్ సబ్‌స్ట్యూట్‌గా అనుమతిచ్చాడు.జడ్డూ స్ధానంలో చాహల్..కాగా కంకషన్ సబ్‌స్టిట్యూట్‌ను ఉపయోగించుకోవడం ఇదేమి తొలిసారి కాదు. 2020లో ఆస్ట్రేలియాతో జరిగిన టీ20లో జడేజా స్థానంలో కంకషన్ రీప్లేస్‌మెంట్‌గా వచ్చిన యుజువేంద్ర చాహల్ కంకషన్ సబ్‌స్టిట్యూట్ వచ్యాడు. చాహల్ ఏకంగా 3 వికెట్లు తీసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు.చదవండి: పాండ్యా, దూబే మెరుపులు.. సిరీస్ టీమిండియా వశం -
పాండ్యా, దూబే మెరుపులు.. 3–1తో సిరీస్ టీమిండియా వశం (ఫొటోలు)
-
పాండ్యా, దూబే మెరుపులు.. సిరీస్ టీమిండియా వశం
టాప్–ఫోర్ పరుగుల్లో వెనుకబడినా... ఓ దశలో జట్టు స్కోరు(12/3) గుబులు రేపినా... మిడిలార్డర్లో హార్దిక్ పాండ్యా, శివమ్ దూబేల మెరుపులతో భారత్ మ్యాచ్ గెలిచి టి20 సిరీస్ కైవసం చేసుకుంది. వరుణ్ మాయాజాలం మలుపుతిప్పగా... రవి బిష్ణోయ్, హర్షిత్ రాణాల బౌలింగ్ భారత్ నాలుగో టి20లో గెలిచేలా చేసింది. పుణే: సమం కాదు... సొంతమే! సిరీస్‌ను ఆఖరి సమరం దాకా లాక్కెళ్ల కుండా భారత్ నాలుగో టి20లోనే తేల్చేసింది. శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో సూర్యకుమార్ సేన 15 పరుగులతో ఇంగ్లండ్‌పై గెలిచి ఇంకో మ్యాచ్ మిగిలుండగానే సిరీస్ కైవసం చేసుకుంది. మొదట భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. హార్దిక్ పాండ్యా (30 బంతుల్లో 53; 4 ఫోర్లు, 4 సిక్స్‌లు), ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ శివమ్ దూబే (34 బంతుల్లో 53; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) మెరిపించారు. ఇంగ్లండ్ బౌలర్ సకిబ్ మహమూద్ 3, జేమీ ఓవర్టన్ 2 వికెట్లు తీశారు. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన ఇంగ్లండ్ 19.4 ఓవర్లలో 166 పరుగుల వద్ద ఆలౌటైంది. హ్యారీ బ్రూక్ (26 బంతుల్లో 51; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు), డకెట్ (19 బంతుల్లో 39; 7 ఫోర్లు, 1 సిక్స్) ఉన్నంతసేపూ దంచేశారు. అయితే గత మ్యాచ్ మాదిరి వరుణ్ చక్రవర్తి (2/28) స్పిన్ మలుపు మరుగున పడకుండా... దూబే స్థానంలో ‘కన్కషన్’గా వచ్చిన హర్షిత్ రాణా (3/33), రవి బిష్ణోయ్ (3/28) పేస్–స్పిన్‌ల వైవిధ్యం ఇంగ్లండ్‌ను లక్ష్యానికి దూరం చేసింది. దూబే, పాండ్యా ఫిఫ్టీ–ఫిఫ్టీ సంజూ సామ్సన్ (1), తిలక్‌వర్మ (0), కెపె్టన్ సూర్యకుమార్ (0)ల వైఫల్యంతో భారత్ 12/3 స్కోరు వద్ద కష్టాల్లోపడింది. అభిõÙక్ (19 బంతుల్లో 29; 4 ఫోర్లు, 1 సిక్స్), రింకూ సింగ్ (26 బంతుల్లో 30; 4 ఫోర్లు, 1 సిక్స్)ల జోరు ఎంతోసేపు సాగలేదు. ఈ దశలో దూబే, పాండ్యా ఆరో వికెట్‌కు వేగంగా 87 పరుగులు జోడించారు.27 బంతుల్లో హార్దిక్, 31 బంతుల్లో దూబే అర్ధసెంచరీలు సాధించారు. దీంతో భారత్ పోరాడే లక్ష్యం నిర్దేశించగలిగింది. మరోవైపు డకెట్, సాల్ట్ (23; 4 ఫోర్లు)లు ధాటిగా ఛేదన ఆరంభించారు. ఇంగ్లండ్ స్కోరు 62కు చేరగానే డకెట్, కాసేపటికే సాల్ట్, బట్లర్ (2)... వందకు చేరే క్రమంలో లివింగ్‌స్టోన్ (9) అవుటయ్యారు. అయినా 14 ఓవర్లలో 124/4 స్కోరు వద్ద ఇంగ్లండ్ పటిష్టంగానే కనిపించింది. ఈ దశలో 15వ ఓవర్ వేసిన వరుణ్ క్రీజులో పాతుకుపోయిన బ్రూక్‌తో పాటు బ్రైడన్ కార్స్ (0)లను అవుట్ చేయడంతో 30 బంతుల్లో 49 పరుగుల సమీకరణం విజయానికి ఊపిరిపోసింది. బిష్ణోయ్, రాణాలు వరుస విరామాల్లో వికెట్లు తీయడంతో ఇంగ్లండ్‌కు ఓటమి తప్పలేదు. స్కోరు వివరాలు భారత్ ఇన్నింగ్స్: సామ్సన్ (సి) కార్స్ (బి) సకిబ్ 1; అభిషేక్ (సి) జాకబ్ (బి) రషీద్ 29; తిలక్ (సి) ఆర్చర్ (బి) సకిబ్ 0; సూర్యకుమార్ (సి) కార్స్ (బి) సకిబ్ 0; రింకూసింగ్ (సి) రషీద్ (బి) కార్స్ 30; దూబే రనౌట్ 53; పాండ్యా (సి) బట్లర్ (బి) ఓవర్టన్ 53; అక్షర్ (సి) జాకబ్ (బి) ఓవర్టన్ 5; అర్ష్ దీప్ రనౌట్ 0; రవిబిష్ణోయ్ నాటౌట్ 0; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 181. వికెట్ల పతనం: 1–12, 2–12, 3–12, 4–57, 5–79, 6–166, 7–180, 8–180, 9–181. బౌలింగ్: ఆర్చర్ 4–0–37–0, సకిబ్ 4–1–35–3, బ్రైడన్ కార్స్ 4–0–39–1, ఓవర్టన్ 4–0–32–2, అదిల్ రషీద్ 4–0–35–1. ఇంగ్లండ్ ఇన్నింగ్స్: సాల్ట్ (బి) అక్షర్ 23; డకెట్ (సి) సూర్యకుమార్ (బి) బిష్ణోయ్ 39; బట్లర్ (సి) రాణా (బి) బిష్ణోయ్ 2; బ్రూక్ (సి) అర్ష్ దీప్ (బి) వరుణ్ 51; లివింగ్‌స్టోన్ (సి) సామ్సన్ (బి) రాణా 9; జాకబ్ (సి) సూర్యకుమార్ (బి) రాణా 6; కార్స్ (సి) అర్ష్ దీప్ (బి) వరుణ్ 0; ఓవర్టన్ (బి) రాణా 19; ఆర్చర్ (బి) బిష్ణోయ్ 0; రషీద్ నాటౌట్ 10; సకిబ్ (సి) అక్షర్ (బి) అర్ష్ దీప్ 1; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (19.4 ఓవర్లలో ఆలౌట్) 166. వికెట్ల పతనం: 1–62, 2–65, 3–67, 4–95, 5–129, 6–133, 7–137, 8–146, 9–163, 10–166. బౌలింగ్: అర్ష్ దీప్‌సింగ్ 3.4–0–35–1, హార్దిక్ పాండ్యా 1–0–11–0, వరుణ్ చక్రవర్తి 4–0–28–2, అక్షర్ పటేల్ 3–0–26–1, రవి బిష్ణోయ్ 4–0–28–3, హర్షిత్ రాణా 4–0–33–3. -
Ind vs Eng: వాళ్లిద్దరిపై వేటు.. తుదిజట్టులో రెండు మార్పులు! ఎందుకంటే
ఇంగ్లండ్‌తో నాలుగో టీ20(India vs England)కి టీమిండియా సిద్ధమైంది. పుణెలో గెలిచి.. మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్‌ను కైవసం చేసుకోవాలని పట్టుదలగా ఉంది. గత మ్యాచ్ తాలూకు తప్పులు సరిదిద్దుకుని.. పరుగుల వరదకు ఆస్కారమిచ్చే పిచ్‌పై బ్యాట్ ఝులిపించడమే లక్ష్యంగా బరిలోకి దిగనుంది.పక్కనపెడితేనే బెటర్‌ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా(Aakash Chopra) కీలక సూచనలు చేశాడు. పుణె టీ20లో భారత జట్టు రెండు మార్పులతో రంగంలోకి దిగాలని సూచించాడు. ధ్రువ్ జురెల్(Dhruv Jurel), వాషింగ్టన్ సుందర్(Washington Sundar) సేవలను మేనేజ్మెంట్ పూర్తి స్థాయిలో వాడుకోవడం లేదన్న ఆకాశ్ చోప్రా.. వారిద్దరిని పక్కనపెడితేనే బాగుంటుందని అభిప్రాయపడ్డాడు.ఈ మేరకు తన యూట్యూబ్ చానెల్ వేదికగా మాట్లాడుతూ.. ‘‘వాషింగ్టన్ సుందర్‌ను బౌలర్‌గా వాడుకోవడం లేదని స్పష్టంగా తెలుస్తూనే ఉంది. అతడిని రెండు మ్యాచ్‌లలో ఆడించారు. తన మొదటి మ్యాచ్‌లో అతడు తొలి బంతికే వికెట్ తీశాడు. బెన్ డకెట్‌ను అవుట్ చేశాడు.అంతేకాదు.. తన తొలి ఓవర్లో ఎక్కువగా పరుగులు కూడా ఇవ్వలేదు. అయినా సరే.. అతడికి రెండో ఓవర్ వేసే అవకాశం ఇవ్వలేదు. ఇక తన రెండో మ్యాచ్‌లో వాషీ తొలి ఓవర్లోనే పరుగులు ఇచ్చుకున్నాడు. ఆ తర్వాత మళ్లీ అతడి చేతికి బంతిని ఇవ్వలేదు.ఒకవేళ ఒకే ఒక్క ఓవర్ వేయించాలనుకుంటే అతడిని జట్టులోకి తీసుకోవడం ఎందుకు?.. వేరే వాళ్లకు అవకాశం ఇవ్వవచ్చు కదా! .. ఇక ధ్రువ్ జురెల్ సేవలను కూడా సరిగ్గా వాడుకోవడం లేదు. అలాంటప్పుడు అతడు కూడా జట్టులో ఉండటం వల్ల పెద్దగా ఉపయోగం లేదు’’ అని ఆకాశ్ చోప్రా తన అభిప్రాయాలు పంచుకున్నాడు.నలుగురు బౌలర్లుఇక ఇంగ్లండ్‌తో నాలుగో టీ20లో భారత తుదిజట్టు కూర్పు గురించి మాట్లాడుతూ.. ‘‘నా అభిప్రాయం ప్రకారం... అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ ఓపెనర్లుగానే ఉండాలి. తిలక్ వర్మ వన్‌డౌన్‌లో.. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ నాలుగు, ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ఐదో స్థానంలో ఆడాలి.ఇక ఆరోస్థానంలో శివం దూబేను ఆడిస్తే బాగుంటుంది’’ అని ఆకాశ్ చోప్రా పేర్కొన్నాడు. లోయర్- మిడిల్ ఆర్డర్లో లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్‌గా అతడు చక్కటి ఆప్షన్ అని తెలిపాడు. రాజ్‌కోట్‌లో మూడో టీ20లో ఎడమచేతి వాటం బ్యాటర్ కోసమే వాషీని పంపినప్పుడు.. ఈసారి దూబే సేవలు వినియోగించుకోవడంలో తప్పులేదని పేర్కొన్నాడు.అదే విధంగా... ‘‘ఏడో స్థానంలో వైస్ కెప్టెన్ అక్షర్ పటేల్ ఉండాలి. ఈ మ్యాచ్‌లో నలుగురు బౌలర్లు ఉండాలి. అందుకే.. మరో బ్యాటర్ లేదంటే.. ఆల్‌రౌండర్ గురించి నేను ఆలోచించడం లేదు. స్పిన్నర్లు రవి బిష్ణోయి, వరుణ్ చక్రవర్తిలతో పాటు.. అర్ష్‌దీప్ సింగ్, మహ్మద్ షమీలను ఆడించాలి’’ అని ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు.నలుగురు స్పెషలిస్టు బౌలర్లతో పాటు.. హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ కూడా బౌల్ చేయగలరన్న ఆకాశ్ చోప్రా.. తిలక్ వర్మ, అభిషేక్ శర్మ కూడా బంతితో రాణించగలరని పేర్కొన్నాడు. ఏదేమైనా ఇంగ్లండ్‌తో నాలుగో టీ20లో వాషింగ్టన్ సుందర్, ధ్రువ్ జురెల్‌ల బదులు.. అర్ష్‌దీప్ సింగ్, శివం దూబేలను ఆడించాలని సూచించాడు.ఇంగ్లండ్‌తో నాలుగో టీ20కి ఆకాశ్ చోప్రా ఎంచుకున్న భారత తుది జట్టుఅభిషేక్ శర్మ, సంజూ శాంసన్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, శివం దూబే, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, వరుణ్ చక్రవర్తి, అర్ష్‌దీప్ సింగ్, మహ్మద్ షమీ.చదవండి: చరిత్ర సృష్టించిన సౌరాష్ట్ర బ్యాటర్.. రంజీల్లో ఆల్‌టైమ్ రికార్డు -
టీమిండియాకు భారీ షాక్.. ఇంగ్లండ్ సిరీస్ నుంచి ఇద్దరు స్టార్లు ఔట్
చెన్నై వేదికగా రెండో టీ20లో తలపడేందుకు టీమిండియా, ఇంగ్లండ్ జట్లు సిద్దమయ్యాయి. ఈ మ్యాచ్‌కు ముందు భారత్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. భారత స్టార్ ఆల్‌రౌండర్లు నితీశ్ కుమార్ రెడ్డి, రింకూ సింగ్‌లు గాయాల బారిన పడ్డారు. ప్రాక్టీస్ సెషన్లో నితీశ్‌కు ప్రక్కెటెముకల(సైడ్ స్ట్రెయిన్) గాయానికి గురయ్యాడు. దీంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో మిగిలిన మ్యాచ్‌లకు మొత్తానికి ఈ ఆంధ్ర ఆటగాడు దూరమయ్యాడు. మరోవైపు రింకూ సింగ్ ప్రస్తుతం వెన్ను నొప్పితో బాధపడుతున్నాడు. దీంతో రింకూ రెండో, మూడో టీ20 నుంచి తప్పుకున్నాడు. ఈ విషయాన్ని బీసీసీఐ అధికారికంగా ధ్రువీకరించింది. "జనవరి 24న చెన్నైలో జరిగిన ప్రాక్టీస్ సెషన్లో ఆల్‌రౌండర్ నితీష్ రెడ్డి ప్రక్కెటెముకల నొప్పితో బాధపడ్డాడు. ఈ క్రమంలో ఐదు టీ20ల సిరీస్‌లో మిగిలిన మ్యాచ్‌లకు అతడు దూరమయ్యాడు. నితీశ్ బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌కి వెళ్లనున్నాడు.అదేవిధంగా తొలి టీ20లో ఫీల్డింగ్ చేస్తుండగా రింకూ సింగ్‌కు వెన్నునొప్పి వచ్చింది. అతడు ప్రస్తుతం కోలుకుంటున్నాడు. రింకూ ప్రస్తుతం మా వైద్య బృందం పర్యవేక్షణలో ఉన్నాడు. అయితే అతడు ఈ సిరీస్‌లో రెండు, మూడు టీ20లకు దూరం కానున్నాడు" అని బీసీసీఐ ఓ ప్రకటనలో పేర్కొంది. కాగా నితీశ్, రింకూ స్ధానాలను బీసీసీఐ శివమ్ దూబే, రమణ్‌దీప్ సింగ్‌లతో భర్తీ చేసింది.ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌కి అప్డేటడ్ భారత జట్టు: సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అక్షర్ పటేల్ (వైస్ కెప్టెన్), సంజు శాంసన్ (వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, రింకు సింగ్, హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్, మహ్మద్ షమీ, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్, వాషింగ్టన్ సుందర్, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), శివమ్ దూబే, రమణదీప్ సింగ్.చదవండి: WPL 2025: ఆర్సీబీకి బ్యాడ్ న్యూస్.. సీజన్ మెత్తానికి స్టార్ ప్లేయర్ దూరం -
Ind vs Eng: అతడికి గాయం.. భారత జట్టులోకి శివం దూబే!
ముంబై ఆల్‌రౌండర్ శివం దూబే(Shivam Dube) టీమిండియాతో చేరేందుకు సిద్ధమైనట్లు సమాచారం. దాదాపు ఆరు నెలల విరామం తర్వాత అతడు భారత టీ20 జట్టులో పునరాగమనం చేయనున్నట్లు తెలుస్తోంది. టీమిండియా యువ సంచలనం నితీశ్ కుమార్ రెడ్డి(Nitish Kumar Reddy) స్థానాన్ని అతడు భర్తీ చేయనున్నాడని సమాచారం.లంక పర్యటనలో ఆఖరిగాకాగా టీ20 ప్రపంచకప్-2024(T20 World Cup 2024) గెలిచిన భారత జట్టులో భాగమైన శివం దూబే ఆ తర్వాత.. శ్రీలంకతో టీ20లలో ఆడాడు. అనంతరం సొంతగడ్డపై జరిగిన బంగ్లాదేశ్‌తో పొట్టి ఫార్మాట్ సిరీస్‌కు ఎంపిక చేసి జట్టులో.. అదే విధంగా సౌతాఫ్రికాకు వెళ్లిన టీమ్‌లోనూ శివం దూబేకు సెలక్టర్లు చోటివ్వలేదు.తాజా రంజీ మ్యాచ్‌లో డకౌట్లుఈ క్రమంలో అతడు తన సొంత జట్టు ముంబై తరఫున దేశవాళీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ, వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ, రంజీ మ్యాచ్‌లలోనూ భాగమయ్యాడు. తాజాగా జమ్మూ కశ్మీర్‌తో శనివారం ముగిసిన మ్యాచ్‌లోనూ శివం దూబే ఆడాడు. అయితే, తొలి ఇన్నింగ్స్‌లో డకౌట్ అయిన ఈ లెఫ్టాండ్ బ్యాటర్.. రెండో ఇన్నింగ్స్‌లోనూ సున్నా చుట్టాడు.నితీశ్ రెడ్డికి గాయం?అయితే, ఈ పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ ఓ వికెట్ మాత్రం తన ఖాతాలో వేసుకోగలిగాడు. అయితే, అనూహ్యంగా శివం దూబేకు టీమిండియా మేనేజ్మెంట్ నుంచి పిలుపు వచ్చినట్లు ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కథనం పేర్కొంది. ప్రాక్టీస్ సెషన్ సందర్భంగా గాయపడిన మరో పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి.. స్థానాన్ని దూబేతో భర్తీ చేసినట్లు తెలిపింది.అయితే, నితీశ్ రెడ్డి గాయం తాలూకు వివరాలు మాత్రం పూర్తిగా వెల్లడికాలేదు. కానీ వెంటనే అతడు మైదానంలో దిగే పరిస్థితి మాత్రం కనిపించడం లేదని సమాచారం. కాగా టీమిండియా ప్రస్తుతం స్వదేశంలో ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడుతోంది. ఇందులో భాగంగా కోల్‌కతాలో బుధవారం తొలి మ్యాచ్ జరిగింది.తొలి టీ20లో భారత్ విజయంఈడెన్ గార్డెన్స్ వేదికగా సాగిన ఈ టీ20లో సూర్యకుమార్ సేన ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసన బట్లర్ బృందం 132 పరుగులకే ఆలౌట్ కాగా.. 12.5 ఓవర్లలో కేవలం మూడు వికెట్లు నష్టపోయిన భారత్ లక్ష్యాన్ని ఛేదించింది.ఇక ఈ మ్యాచ్‌లో నితీశ్ కుమార్ రెడ్డికి బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్ చసే అవకాశం కూడా రాలేదు. కాగా ఆస్ట్రేలియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీ సందర్భంగా టెస్టుల్లోనూ అరంగేట్రం చేసిన ఈ ఆంధ్ర క్రికెటర్.. ప్రఖ్యాత మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్లో చిరస్మరణీయ శతకం సాధించాడు. దూబే జట్టుతో చేరేది అపుడేఅనంతరం స్వదేశంలో ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌తో బిజీ అయిన 21 ఏళ్ల నితీశ్.. దురదృష్టవశాత్తూ గాయపడినట్లు సమాచారం. ఇదిలా ఉంటే.. ఇండియా- ఇంగ్లండ్ మధ్య చెన్నై వేదికగా శనివారం రెండో టీ20 జరుగనుంది. అయితే, ఇదే రోజు రంజీ మ్యాచ్ ముగించుకున్న శివం దూబే ఇప్పటికిప్పుడు భారత జట్టుతో చేరలేడు. రాజ్‌కోట్‌లో మంగళవారం జరిగే మూడో టీ20 నుంచి అతడు టీమిండియాతో చేరనున్నట్లు సమాచారం. మరోవైపు.. యువ ఓపెనర్ అభిషేక్ శర్మ కూడా గాయపడినట్లు తెలుస్తోంది. చదవండి: ICC టీ20 జట్టు ప్రకటన.. కెప్టెన్‌గా రోహిత్ శర్మ, నో కోహ్లి! భారత్ నుంచి నలుగురు -
తుస్సుమన్న టీమిండియా స్టార్లు.. శ్రేయస్, శివమ్ దూబే కూడా..!
రంజీ ట్రోఫీ 2024-25 ఎడిషన్‌లో భాగంగా జమ్మూ అండ్ కశ్మీర్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో స్టార్ ప్యాకప్ ఉన్న ముంబై టీమ్ పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. తొలి ఇన్నింగ్స్‌లో 120 పరుగులకే ఆలౌటైన ఈ మాజీ రంజీ ఛాంపియన్.. రెండో ఇన్నింగ్స్‌లోనూ పేలవ ప్రదర్శన కొనసాగిస్తుంది. రెండో రోజు లంచ్ విరామం సమయానికి ముంబై 86 పరుగులకే సగం వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం ఆ జట్టు జమ్మూ అండ్ కశ్మీర్ తొలి ఇన్నింగ్స్ స్కోర్‌ను సమం చేసింది. జమ్మూ అండ్ కశ్మీర్ తొలి ఇన్నింగ్స్‌లో 206 పరుగులు చేసింది.రెండో ఇన్నింగ్స్‌లోనూ విఫలమైన స్టార్లు జమ్మూ అండ్ కశ్మీర్‌తో మ్యాచ్‌లో ముంబై తరఫున బరిలోకి దిగిన టీమిండియా స్టార్లు రెండో ఇన్నింగ్స్‌లోనూ విఫలమయ్యారు. తొలి ఇన్నింగ్స్‌లో 4 పరుగులు చేసిన యశస్వి జైస్వాల్.. సెకెండ్ ఇన్నింగ్స్‌లో 26 పరుగులకు (5 ఫోర్లు) ఔటయ్యాడు. తొలి ఇన్నింగ్స్‌లో 3 పరుగులే బిచానా ఎత్తిన రోహిత్ శర్మ.. సెకెండ్ ఇన్నింగ్స్‌లో కాస్త పర్వాలేదన్నట్టుగా 35 బంతుల్లో 28 పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్‌లో రోహిత్ 2 సొగసైన బౌండరీలు, 3 భారీ సిక్సర్లు బాది తన పాత రోజులను గుర్తు చేశాడు.శ్రేయస్ మరోసారి..!ఈ మ్యాచ్‌లో టీమిండియా వన్డే ప్లేయర్ శ్రేయస్ అయ్యర్‌కు రెండు ఇన్నింగ్స్‌ల్లో శుభారంభాలే లభించాయి. అయితే వాటిని పెద్ద స్కోర్లుగా మలచడంలో విఫలమయ్యాడు. తొలి ఇన్నింగ్స్‌లో తొలి బంతికే సిక్సర్ బాది జోష్ మీదున్నట్లు కనిపించిన శ్రేయస్ 7 బంతుల్లో 11 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. సెకెండ్ ఇన్నింగ్స్‌లోనూ అదే జోష్‌ను ప్రదర్శించిన శ్రేయస్.. వచ్చీ రాగానే ఎడాపెడా నాలుగు బౌండరీలు (16 బంతుల్లో 17 పరుగులు) బాది ఔటయ్యాడు.రెండో ఇన్నింగ్స్‌లోనూ డకౌటైన శివమ్ దూబేఈ మ్యాచ్‌లో విధ్వంసకర ఆటగాడు శివమ్ దూబే రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ డకౌటై నిరాశపరిచాడు. శ్రేయస్, శివమ్ దూబేల వికెట్లు ఒకే స్కోర్ వద్ద కోల్పోవడంతో ముంబై కష్టాల్లో పడింది. లంచ్ సమయానికి రహానే (12), షమ్స్ ములానీ (0) క్రీజ్‌లో ఉన్నారు.ముంబై పరువు కాపాడిన శార్దూల్ఈ మ్యాచ్‌లో ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్ ముంబై పరువు కాపాడాడు. 100లోపే ఆలౌటైయ్యేలా కనిపించిన ముంబైను శార్దూల్ తన హాఫ్ సెంచరీతో గట్టెక్కించాడు. తొలి ఇన్నింగ్స్‌లో మొత్తం 57 బంతులు ఎదుర్కొన్న శార్దూల్ 5 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 51 పరుగులు చేశాడు. శార్దూల్‌కు తనుశ్ కోటియన్ (26, 5 ఫోర్లు) కాసేపు సహకరించడంతో ముంబై 100 పరుగుల మార్కును దాటింది. -
రోహిత్ శర్మనే బోల్తా కొట్టించాడు.. ఎవరీ ఉమర్ నజీర్?
టీమిండియా స్టార్ల రాకతో రంజీ ట్రోఫీ(Ranji Trophy)కి కొత్త కళ వస్తుందనుకుంటే... దాదాపుగా అందరూ ఉసూరుమనిపించారు. భారత టెస్టు కెప్టెన్ రోహిత్ శర్మ, వికెట్ కీపర్ రిషభ్ పంత్(Rishabh Pant), శుభ్‌మన్ గిల్, రవీంద్ర జడేజా(Ravindra Jadeja), యశస్వి జైస్వాల్ గురువారం మొదలైన రంజీ రెండో దశ బరిలో దిగిన విషయం తెలిసిందే.తొలిరోజు జడ్డూ ఒక్కడే హిట్ముంబై తరఫున ఓపెనింగ్ చేసిన టీమిండియా ఓపెనర్ల జోడీ రోహిత్ శర్మ(3)- జైస్వాల్(4) పూర్తిగా విఫలమయ్యారు. మిగతా వాళ్లలో ఢిల్లీ స్టార్ రిషభ్ పంత్(1), పంజాబ్ ఓపెనర్ శుబ్‌మన్ గిల్(4) కూడా నిరాశపరిచారు. అయితే, సౌరాష్ట్ర స్పిన్నర్ రవీంద్ర జడేజా మాత్రం ఐదు వికెట్లతో చెలరేగాడు.ఆరడుగుల బుల్లెట్.. ఎవరీ ఉమర్ నజీర్?అయితే, ఈ అందరు స్టార్ల నడుమ ఈనాటి మ్యాచ్‌లో ఓ ఆరడుగుల బౌలర్ హైలైట్‌గా నిలిచాడు. అతడి పేరు ఉమర్ నజీర్ మీర్. జమ్మూ కశ్మీర్ ఫాస్ట్ బౌలర్. ముంబై బ్యాటర్లకు చుక్కలు చూపించిన ఈ స్పీడ్‌స్టర్ రోహిత్ శర్మ వికెట్ తీయడం ద్వారా క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాడు.ముంబైలోని శరద్ పవార్ క్రికెట అకాడమీ బీకేసీ మైదానంలో ముంబై- జమ్మూ కశ్మీర్ మధ్య గురువారం మొదలైన రంజీ మ్యాచ్‌లో ఆతిథ్య జట్టు టాస్ గెలిచింది. తొలుత బ్యాటింగ్‌కు దిగి కశ్మీర్ జట్టును బౌలింగ్‌కు ఆహ్వానించింది. అయితే, ఊహించని రీతిలో పట్టుమని పది పరుగులు కూడా చేయకుండానే ఓపెనర్లు వెనుదిరిగారు.రోహిత్‌నే బోల్తా కొట్టించాడుజైస్వాల్ను ఆకిబ్ నబీ అవుట్ చేస్తే.. రోహిత్ శర్మ ఉమర్ నజీర్ బౌలింగ్‌లో కెప్టెన్ పారస్ డోగ్రాకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఇక టీమిండియా కెప్టెన్‌ను అవుట్ చేయడం ద్వారా వికెట్ల వేట మొదలుపెట్టిన నజీర్.. హార్దిక్ తామోర్(40 బంతుల్లో 7), ముంబై సారథి అజింక్య రహానే(12), ఆల్‌రౌండర్ శివం దూబే(0) రూపంలో మరో మూడు కీలక వికెట్లు కూల్చాడు.అలా మొత్తంగా నాలుగు వికెట్లు కూల్చి ముంబై బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని నజీర్ శాసించాడు. దీంతో అతడి వివరాలపై టీమిండియా అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. జమ్మూ కశ్మీర్‌లోని పుల్వామా సమీపంలో ఉన్న మాలిక్పొరాలో నజీర్ జన్మించాడు. అతడి ఎత్తు ఆరడుగుల నాలుగు అంగుళాలకు పైమాటే. అదే అతడికి సానుకూలాంశం అయింది.ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో భేష్‌ఈ పొడగరి స్పీడ్‌స్టర్ తనదైన బౌలింగ్ శైలితో దేశవాళీ క్రికెట్లో ఎంతో మంది బ్యాటర్లకు పీడకలలు మిగిల్చాడు. 31 ఏళ్ల ఈ రైటార్మ్ పేసర్‌కు.. టీమిండియాకు ఆడాలనేది చిరకాల కోరిక. అయితే, ఇంత వరకు నజీర్‌కు ఆ అవకాశం రాలేదు.అయితే, ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో మాత్రం నజీర్ గణాంకాలు మెరుగ్గానే ఉన్నాయి. మొత్తంగా 57 మ్యాచ్‌లలో అతడు 138 వికెట్లు పడగొట్టాడు. గతేడాది రంజీ ట్రోఫీ సందర్భంగా సర్వీసెస్ జట్టుపై అత్యుత్తమంగా 6/53తో రాణించాడు. తాజా రంజీ ఎడిషన్‌లో సూపర్ ఫామ్‌లో ఉన్న నజీర్... గత మూడు మ్యాచ్‌లలో కలిపి పదకొండు వికెట్లు తీశాడు. అతడి ఎకానమీ రేటు 2.64గా నమోదు కావడం గమనార్హం.కుప్పకూలిన ముంబై టాప్, మిడిల్ ఆర్డర్ఇక మ్యాచ్ విషయానికొస్తే.. జైస్వాల్(4), రోహిత్ శర్మ(3), హార్దిక్ తామోర్(7), అజింక్య రహానే(12), శ్రేయస్ అయ్యర్(11), శివం దూబే(0), షామ్స్ ములానీ(0) వెంటవెంటనే పెవిలియన్ చేరడంతో ముంబై కష్టాల్లో కూరుకుపోయింది.బ్యాట్ ఝులిపించిన శార్దూల్అయితే, పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్ బ్యాట్ ఝులిపించడంతో కాస్త ఊపిరి పీల్చుకుంది. 57 బంతుల్లో శార్దూల్ ఏకంగా 51 పరుగులు సాధించాడు. అతడికి తోడుగా తనూష్ కొటియాన్(26) రాణించాడు. వీరిద్దరి కారణంగా ముంబై గౌరవప్రదమైన స్కోరు చేసింది. 33.2 ఓవర్లలో 120 పరుగులకు ఆలౌట్ అయింది.జమ్మూ కశ్మీర్ బౌలర్లలో ఉమర్ నజీర్, యుధ్వీర్ సింగ్ నాలుగేసి వికెట్లు కూల్చగా... ఆకిబ్ నబీ రెండు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక గురువారం నాటి తొలిరోజు ఆట ముగిసే సరికి జమ్మూ కశ్మీర్ 42 ఓవర్లలో ఏడు వికెట్లు నష్టపోయి 174 పరుగులు చేసింది. ముంబై కంటే 54 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. చదవండి: అతడొక సూపర్‌స్టార్.. మా ఓటమికి కారణం అదే: బట్లర్ -
అతడిని ఎందుకు సెలక్ట్ చేయలేదు?: భారత మాజీ క్రికెటర్ ఫైర్
ఆస్ట్రేలియా పర్యటనలో పరాభవం చవిచూసిన టీమిండియా.. తదుపరి సొంతగడ్డపై పరిమిత ఓవర్ల సిరీస్‌కు సిద్ధమైంది. ఇంగ్లండ్(India vs England)తో ఐదు టీ20లు, మూడు వన్డే మ్యాచ్‌ల సిరీస్‌లు ఆడనుంది. ఇరుజట్ల మధ్య జనవరి 22 నుంచి తొలి టీ20తో ఈ మెగా సమరం మొదలుకానుంది.ఈ సిరీస్‌తో షమీ రీఎంట్రీఈ నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ఇప్పటికే టీ20 సిరీస్‌కు తమ జట్టును ప్రకటించింది. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో ఆడబోయే ఈ జట్టులో పదిహేను మందికి చోటు ఇచ్చినట్లు తెలిపింది. ఈ సిరీస్‌తో టీమిండియా సీనియర్ పేసర్ మహ్మద్ షమీ సుదీర్ఘ కాలం తర్వాత పునరాగమనం చేయనున్నాడు.స్టార్ క్రికెటర్లు దూరంవన్డే వరల్డ్‌కప్-2023 తర్వాత చీలమండ గాయానికి శస్త్ర చికిత్స చేయించుకున్న షమీ.. దాదాపు ఏడాది తర్వాత రీఎంట్రీ ఇచ్చేందుకు ముహూర్తం ఖరారైంది. ఇదిలా ఉంటే.. ఇంగ్లండ్‌తో టీ20లకు యశస్వి జైస్వాల్‌తో పాటు శుబ్‌మన్ గిల్, రిషభ్ పంత్, జస్ప్రీత్ బుమ్రా వంటి స్టార్ క్రికెటర్లు దూరమయ్యారు.బ్యాటర్ల కోటాలో సూర్యకుమార్ యాదవ్, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, రింకూ సింగ్ చోటుదక్కించుకోగా.. వికెట్ కీపర్ల కోటాలో సంజూ శాంసన్, ధ్రువ్ జురెల్‌లకు అవకాశం దక్కింది. ఇక ఆల్‌రౌండర్ల జాబితాలో హార్దిక్ పాండ్యా, నితీశ్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ ఉండగా.. బౌలింగ్ విభాగంలో పేసర్లు మహ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణాతో పాటు.. స్పిన్నర్లు వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయి స్థానం సంపాదించారు.శివం దూబేకు దక్క ని చోటుఅయితే, ఈ జట్టులో భారత ఆల్‌రౌండర్, విధ్వంసకర వీరుడు శివం దూబే(Shivam Dube)కు మాత్రం చోటు దక్కలేదు. టీ20 ప్రపంచకప్-2024 గెలిచిన భారత జట్టులో భాగం కావడంతో పాటు.. ఇటీవల దేశీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో అతడు దంచికొట్టాడు. అయినప్పటికీ సెలక్టర్లు దూబే పేరును పరిగణనలోకి తీసుకోలేదు.ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ ఓపెనర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా బీసీసీఐ సెలక్షన్ కమిటీ తీరును విమర్శించాడు. ‘‘శివం దూబేకు ఏమైంది? నిజానికి రుతురాజ్ గైక్వాడ్ గురించి కూడా మాట్లాడాల్సి ఉంది. అయితే, ప్రస్తుత పరిస్థితుల్లో తన బ్యాటింగ్ స్థానం(ఓపెనర్) దృష్ట్యా అతడిని ఎంపిక చేయడం వీలుకాకపోవచ్చు.అలాగే రజత్ పాటిదార్‌కు కూడా మొండిచేయి ఎదురైంది. కానీ.. శివం దూబేను ఎందుకు పక్కనపెట్టారో అర్థం కావడం లేదు. టీ20 ప్రపంచకప్-2024(T20 World Cup 2024)గెలిచిన భారత జట్టులో అతడు సభ్యుడు. సౌతాఫ్రికాతో ఫైనల్ మ్యాచ్‌లో కీలక ఇన్నింగ్స్ ఆడాడు.టీ20 ప్రపంచకప్ చాంపియన్‌ను ఎందుకు సెలక్ట్ చేయలేదు?కాబట్టి జట్టు గెలిచినపుడు.. జట్టులోని ప్రతి సభ్యుడికి తమ క్రెడిట్ ఇవ్వాలి. వరల్డ్‌కప్ లీగ్ మ్యాచ్‌లలో ఫీల్డింగ్, బ్యాటింగ్ విషయంలో అతడిపై విమర్శలు వచ్చాయి. కానీ తర్వాత అతడు అన్నీ సరిదిద్దుకున్నాడు. టీ20 ప్రపంచకప్ చాంపియన్ అయ్యాడు. అయినా.. ఎందుకు అతడిని టీ20 సిరీస్‌కు ఎంపిక చేయలేదు?’’ అని ఆకాశ్ చోప్రా ప్రశ్నించాడు. కాగా వెస్టిండీస్ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన వరల్డ్‌కప్ ఫైనల్ మ్యాచ్‌లో దూబే 16 బంతుల్లోనే మూడు ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 27 పరుగులు సాధించాడు. ఇదిలా ఉంటే.. టీమిండియా చివరగా ఆస్ట్రేలియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీ ఆడింది. ఈ ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో కంగారూ జట్టు చేతిలో 3-1తో ఓడి.. పదేళ్ల తర్వాత ఈ ప్రతిష్టాత్మక ట్రోఫీని చేజార్చుకుంది.చదవండి: అతడు లేకుంటే.. బోర్డర్-గావస్కర్ ట్రోఫీ మనమే గెలిచేవాళ్లం: అశ్విన్ -
తండ్రైన టీమిండియా విధ్వంసకర ఆటగాడు
టీమిండియా విధ్వంసకర ఆటగాడు శివమ్ దూబే రెండోసారి తండ్రి అయ్యాడు. దూబే భార్య అంజుమ్ ఖాన్ నిన్న (జనవరి 3) ఆడబిడ్డకు జన్మనిచ్చింది. బిడ్డ పుట్టిన విషయాన్ని దూబే ఇవాళ సోషల్‌మీడియా వేదికగా షేర్ చేశాడు. మేము 4 మంది కుటుంబంగా మారడంతో మా హృదయాలు పెద్దవిగా మారాయి. మెహ్విష్ శివమ్ దూబేకు స్వాగతం అంటూ దూబే తన ఇన్‌స్టా ఖాతాలో రాసుకొచ్చాడు. View this post on Instagram A post shared by shivam dube (@dubeshivam)31 ఏళ్ల దూబేకు 2021 జులై 16న అంజుమ్ ఖాన్‌తో వివాహమైంది. వీరికి 2022 ఫిబ్రవరి 13న బాబు జన్మించాడు. బాబుకు అయ్యాన్ దూబే అని పేరు పెట్టారు.దూబే క్రికెటింగ్ కెరీర్ విషయానికొస్తే.. ప్రస్తుతం అతను ముంబై తరఫున విజయ్ హజారే ట్రోఫీ ఆడుతున్నాడు. ఈ టోర్నీలో అతను ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్‌ల్లో 80 పరుగులు చేసి ఓ వికెట్ తీసుకున్నాడు. దూబే.. 2024 సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ గెలిచిన ముంబై జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. ఈ టోర్నీలో దూబే ఐదు మ్యాచ్‌లు ఆడి 75.50 సగటున 151 పరుగులు చేశాడు. సర్వీసెస్‌పై దూబే మ్యాచ్ విన్నింగ్ నాక్ (71 నాటౌట్) ఆడాడు.వరల్డ్‌కప్ గెలిచిన జట్టులో సభ్యుడు2019 నవంబర్‌లో టీమిండియా తరఫున అరంగేట్రం చేసిన దూబే.. 2024 టీ20 వరల్డ్‌కప్ గెలిచిన భారత జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. మెగా టోర్నీలో దూబే ప్రతి మ్యాచ్ ఆడాడు. ఆ టోర్నీలో దూబే ఎనిమిది ఇన్నింగ్స్‌ల్లో 22.16 సగటున 133 పరుగులు చేశాడు. సౌతాఫ్రికాతో జరిగిన ఫైనల్లో దూబే కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఆ మ్యాచ్‌లో దూబే 16 బంతుల్లో 27 పరుగులు చేయడంతో భారత్ నిర్ణీత ఓవర్లలో 176 పరుగులు చేయగలిగింది. రోహిత్ శర్మ నేతృత్వంలో భారత్ టీ20 వరల్డ్‌కప్ విజేతగా నిలిచింది. టీమిండియా పొట్టి ప్రపంచకప్‌ను సాధించడం అది రెండోసారి.దూబే టీమిండియా తరఫున 33 టీ20లు ఆడి 29.86 సగటున 448 పరుగులు చేశాడు. ఇందులో మూడు అర్ద సెంచరీలు ఉన్నాయి. బౌలింగ్ ఆల్‌రౌండర్ అయిన దూబే 11 వికెట్లు కూడా తీశాడు. టీమిండియా తరఫున నాలుగు వన్డేలు కూడా ఆడిన దూబే 43 పరుగులు చేసి ఓ వికెట్ పడగొట్టాడు. -
శ్రేయస్ అయ్యర్ ఊచకోత.. వన్డేలో విధ్వంసకర శతకం
దేశవాళీ వన్డే టోర్నమెంట్ విజయ్ హజారే ట్రోఫీ(వీహెచ్‌టీ) తొలి మ్యాచ్‌లోనే ముంబై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దంచికొట్టాడు. కర్ణాటక బౌలింగ్‌ను ఊచకోత కోస్తూ విధ్వంసకర శతకం బాదాడు. అయ్యర్ ధనాధన్ ఇన్నింగ్స్ కారణంగా ముంబై భారీ స్కోరు సాధించింది.కాగా వీహెచ్‌టీ 2024-25 ఎడిషన్ రౌండ్ వన్‌లో భాగంగా గ్రూప్-‘సి’లో ఉన్న ముంబై కర్ణాటకతో తమ తొలి మ్యాచ్ ఆడుతోంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం బి గ్రౌండ్ ఇందుకు వేదిక. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన కర్ణాటక తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఆయుశ్, హార్దిక్ హాఫ్ సెంచరీలుఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఆరంభంలోనే ఓపెనర్ అంగ్క్రిష్ రఘువంశీ(6) వికెట్ కోల్పోయింది. అయితే, మరో ఓపెనర్ ఆయుశ్ మాత్రే(78)తో కలిసి వన్‌డౌన్ బ్యాటర్ హార్దిక్ తామోర్(84) ముంబై ఇన్నింగ్స్ చక్కదిద్దాడు. అయ్యర్ విశ్వరూపంఇక నాలుగో స్థానంలో వచ్చిన శ్రేయస్ అయ్యర్ ఆకాశమే హద్దుగా చెలరేగుతూ కర్ణాటక బౌలర్లపై విరుచుకుపడ్డాడు. కేవలం 55 బంతుల్లోనే 114 పరుగులతో ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు. ఐదు ఫోర్లు, పది సిక్సర్ల సాయంతో 207కు పైగా స్ట్రైక్‌రేటు నమోదు చేశాడు.ఇక శ్రేయస్ అయ్యర్ కెప్టెన్ ఇన్నింగ్స్‌తో దుమ్ములేపగా.. పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ శివం దూబే కూడా ధనాధన్ దంచికొట్టాడు. 36 బంతుల్లో ఐదు ఫోర్లు, ఐదు సిక్స్‌ల సాయంతో దూబే 63 పరుగులు చేసి.. అయ్యర్‌తో కలిసి ఆఖరి వరకు నాటౌట్‌గా నిలిచాడు.టీ20 తరహాలో వీరబాదుడుకాగా వన్డేలో టీ20 తరహాలో వీరబాదుడు బాదిన ఈ ఇద్దరి కారణంగా ముంబై నిర్ణీత 50 ఓవర్లలో కేవలం నాలుగు వికెట్ల నష్టానికి ముంబై 382 పరుగులు సాధించింది. అయితే, ఈ మ్యాచ్‌లో టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మాత్రం విఫలమయ్యాడు.మొత్తంగా పదహారు బంతులు ఎదుర్కొన్న ‘స్కై’ 20 పరుగులు చేసి నిష్క్రమించాడు. ఇక కర్ణాటక బౌలర్లలో ప్రవీణ్ దూబే రెండు, విద్యాధర్ పాటిల్, శ్రేయస్ గోపాల్ ఒక్కో వికెట్ తీశారు.ముంబై వర్సెస్ కర్ణాటక తుదిజట్లుకర్ణాటకమయాంక్ అగర్వాల్ (కెప్టెన్), అనీష్ కేవీ, నికిన్ జోస్, స్మరన్ రవిచంద్రన్, అభినవ్ మనోహర్, కృష్ణన్ శ్రీజిత్(వికెట్ కీపర్), శ్రేయస్ గోపాల్, విజయ్‌కుమార్ వైశాఖ్, ప్రవీణ్ దూబే, వాసుకి కౌశిక్, విద్యాధర్ పాటిల్.ముంబైఅంగ్క్రిష్ రఘువంశీ, ఆయుష్ మాత్రే, శ్రేయస్ అయ్యర్(కెప్టెన్), సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ తామోర్(వికెట్ కీపర్), శివం దూబే, సూర్యాన్ష్ షెడ్గే, అథర్వ అంకోలేకర్, శార్దూల్ ఠాకూర్, ఎం.జునేద్ ఖాన్, తనూష్ కొటియన్.చదవండి: SA vs PAK: చరిత్ర సృష్టించిన పాకిస్తాన్.. ప్రపంచంలోనే తొలి జట్టుగా -
కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్.. అతడిపై వేటు! సూర్యకు చోటు
దేశవాళీ వన్డే టోర్నమెంట్లో విజయ్ హజారే ట్రోఫీ తాజా ఎడిషన్ నేపథ్యంలో ముంబై క్రికెట్ అసోసియేషన్ తమ జట్టును ప్రకటించింది. శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో ఈ టోర్నీ ఆడబోయే పదిహేడు మంది సభ్యుల పేర్ల(తొలి మూడు మ్యాచ్‌లు)ను మంగళవారం వెల్లడించింది. టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌తో పాటు ఆల్‌రౌండర్ శివం దూబే కూడా ఈ టోర్నీలో పాల్గొనునున్నట్లు తెలిపింది.అతడిపై వేటుఅయితే, ఓపెనర్ పృథ్వీ షాకు మాత్రం ఈ జట్టులో చోటు దక్కలేదు. నిలకడలేమి ఫామ్‌తో సతమవుతున్న ఈ కుడిచేతి వాటం బ్యాటర్‌పై సెలక్టర్లు వేటు వేశారు. మరోవైపు.. సూపర్ ఫామ్‌లో ఉన్న అజింక్య రహానే వ్యక్తిగత కారణాల దృష్ట్యా సెలక్షన్‌కు అందుబాటులో లేడని తెలుస్తోంది.గత కొంతకాలంగా పృథ్వీ షా గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. క్రమశిక్షణా రాహిత్యం, ఫిట్నెస్ లేమి తదితర కారణాలతో రంజీ జట్టుకు అతడు కొన్నాళ్లుపాటు దూరంగా ఉండాల్సి వచ్చింది. తిరిగి వచ్చినా కేవలం 59 పరుగులే చేశాడు.మరోవైపు.. ఐపీఎల్ మెగా వేలం-2025లో రూ. 75 లక్షల కనీస ధరకే అందుబాటులో ఉన్నా ఒక్క ఫ్రాంఛైజీ పృథ్వీ షా వైపు కన్నెత్తి చూడలేదు. ఫలితంగా ఒకప్పటి ఈ స్టార్ బ్యాటర్ అమ్ముడుపోకుండా మిగిలిపోయాడు.ఇక దేశవాళీ టీ20 టోర్నమెంట్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలోనూ పృథ్వీ షా స్థాయికి తగ్గట్లు రాణించలేకపోయాడు. ఈ టోర్నీలో 25 ఏళ్ల పృథ్వీ తొమ్మిది మ్యాచ్‌లలో కలిపి.. 197 పరుగులే చేయగలిగాడు. మధ్యప్రదేశ్‌తో ఫైనల్లోనూ పది పరుగులే చేశాడు. ఈ నేపథ్యంలోనే అతడిపై సెలక్టర్లు వేటు వేశారు.రహానే దూరంమరోవైపు.. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ముంబైని విజేతగా నిలిపిన టీమిండియా స్టార్ శ్రేయస్ అయ్యర్.. విజయ్ హజారే ట్రోఫీలోనూ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఇక పొట్టి ఫార్మాట్లో విధ్వంసకర బ్యాటింగ్‌తో ప్రత్యర్థి జట్లకు చుక్కలు చూపించి ముంబైని చాంపియన్‌గా నిలపడంలో కీలక పాత్ర పోషించిన రహానే.. వన్డే టోర్నీలో మాత్రం ఆడటం లేదు. కాగా డిసెంబరు 21 నుంచి విజయ్ హజారే ట్రోఫీ మొదలుకానుంది.తిరుగులేని ముంబైకాగా భారత దేశవాళీ క్రికెట్లో ముంబై జట్టు ఇప్పటికి 63 టైటిల్స్ గెలిచింది. రంజీ ట్రోఫీని 42 సార్లు నెగ్గిన ముంబై జట్టు ఇరానీ కప్‌ను 15 సార్లు దక్కించుకుంది. విజయ్ హజారే వన్డే ట్రోఫీలో 4 సార్లు విజేతగా నిలిచిన ముంబై.. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ టీ20 టోర్నీ టైటిల్‌ను రెండుసార్లు కైవసం చేసుకుంది. ఇప్పుడు మరో టైటిల్ లక్ష్యంగా బరిలోకి దిగనుంది.విజయ్ హజారే వన్డే టోర్నీ 2024 -25కి తొలి మూడు మ్యాచ్‌లకు ముంబై జట్టుశ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), ఆయుష్ మాత్రే, అంగ్క్రిష్ రఘువంశీ, జే బిస్తా, సూర్యకుమార్ యాదవ్, శివం దూబే, సూర్యాన్ష్ షెడ్గే, సిద్ధేశ్ లాడ్, హార్దిక్ తామోర్, ప్రసాద్ పవార్, అధర్వ అంకోలేకర్, తనూష్ కొటియన్, శార్దూల్ ఠాకూర్, రాయ్స్టన్ డయాస్, జునేద్ ఖాన్, హర్ష్ తనా, వినాయక్ భోయిర్. చదవండి: శెభాష్.. గండం నుంచి గట్టెక్కించారు! మీరే నయం -
హార్దిక్ పాండ్యా విఫలం
దేశవాళీ టీ20 క్రికెట్ టోర్నమెంట్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ ముగింపు దశకు చేరుకుంది. ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో భాగంగా శుక్రవారం రెండు సెమీఫైనల్ మ్యాచ్‌లకు బెంగళూరు ఆతిథ్యమిస్తోంది. ఈ క్రమంలో తొలి సెమీస్‌లో బరోడాతో ముంబై జట్టు తలపడుతోంది. చిన్నస్వామి స్టేడియంలో టాస్ గెలిచిన ముంబై తొలుత బౌలింగ్ చేసింది.బరోడా నామమాత్రపు స్కోరుఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన బరోడా నామమాత్రపు స్కోరుకే పరిమితమైంది. ఓపెనర్లలో శశ్వత్ రావత్(33) ఫర్వాలేదనిపించినా.. అభిమన్యు రాజ్‌పుత్(9) విఫలమయ్యాడు. వన్‌డౌన్‌లో వచ్చిన కెప్టెన్ కృనాల్ పాండ్యా 24 బంతుల్లో నాలుగు ఫోర్ల సాయంతో 30 పరుగులు చేయగా.. నాలుగో నంబర్ బ్యాటర్ భాను పనియా(2) నిరాశపరిచాడు.ఈ దశలో శివాలిక్ శర్మ ఇన్నింగ్స్ చక్కదిద్దే బాధ్యత తీసుకున్నాడు. మొత్తంగా 24 బంతులు ఎదుర్కొన్న ఈ ఎడమచేతి వాటం బ్యాటర్.. రెండు ఫోర్లు, రెండు సిక్స్‌ల సాయంతో 36 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఇక హార్దిక్ పాండ్యా ఐదు పరుగులకే నిష్క్రమించగా.. ఆల్‌రౌండర్ అతిత్ సేత్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. పద్నాలుగు బంతులు ఎదుర్కొని రెండు ఫోర్లు, ఒక సిక్స్ సాయంతో 22 పరుగులతో.. శివాలిక్ శర్మకు సహకారం అందించాడు.పాండ్యాను అవుట్ చేసిన దూబేఇక బరోడా ఇన్నింగ్స్ ఆఖరి బంతికి మహేశ్ పితియా సిక్సర్ బాదాడు. ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో బరోడా ఏడు వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. ముంబై బౌలర్లలో సూర్యాంశ్ షెడ్గే రెండు వికెట్లు పడగొట్టగా.. మోహిత్ అవస్థి, శార్దూల్ ఠాకూర్, శివం దూబే, తనుష్ కొటియాన్, అథర్వ అంకోలేకర్ ఒక్కో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. ఇక ఈ మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యాను శివం దూబే అవుట్ చేసిన తీరు హైలైట్‌గా నిలిచింది. ఈ ఇద్దరు టీమిండియా పేస్ ఆల్‌రౌండర్ల మధ్య పోరులో దూబే పైచేయి సాధించాడు. దూబే బౌలింగ్‌లో అతడికే క్యాచ్ ఇచ్చి హార్దిక్ అవుటయ్యాడు. కాగా ఫామ్‌లో ఉన్న ముంబై బరోడా విధించిన 159 పరుగుల లక్ష్యాన్ని సులువుగానే పూర్తి చేస్తుందని ఆ జట్టు అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.ముంబై జట్టులో మ్యాచ్ విన్నర్లకు కొదవలేదుక్వార్టర్ ఫైనల్లో విదర్భ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని ఛేదించి ముంబై సెమీస్‌కు చేరితే... బెంగాల్‌పై గెలిచి బరోడా ముందడుగు వేసిన విషయం తెలిసిందే. ముంబై తరఫున సీనియర్ బ్యాటర్ అజింక్యా రహానే ఫుల్ ఫామ్‌లో ఉండగా... గత మ్యాచ్‌లో ఓపెనర్ పృథ్వీ షా కూడా రాణించాడు. శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబే, సూర్యాంశ్ షెగ్డె, శార్దూల్ ఠాకూర్ ఇలా ముంబై జట్టులో మ్యాచ్ విన్నర్లకు కొదవలేదు.ఢిల్లీతో మధ్యప్రదేశ్..మరోవైపు బరోడా జట్టుకు హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా రూపంలో కీలక ఆటగాళ్లు అందుబాటులో ఉన్నా బ్యాటింగ్ పరంగా పెద్దగా ప్రయోజనం లేకపోయింది. ఇక రెండో సెమీఫైనల్లో ఆయుశ్ బదోనీ సారథ్యంలోని ఢిల్లీ జట్టు... మధ్యప్రదేశ్‌తో తలపడనుంది. ఢిల్లీకి అనూజ్ రావత్, యశ్ ధుల్ కీలకం కానుండగా... రజత్ పాటిదార్, వెంకటేశ్ అయ్యర్‌పై మధ్యప్రదేశ్ జట్టు భారీ అంచనాలు పెట్టుకుంది. pic.twitter.com/DrAAm9Ubd1— Sunil Gavaskar (@gavaskar_theman) December 13, 2024 -
విధ్వంసం సృష్టించిన షా, రహానే, దూబే
సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీలో ముంబై జట్టు వరుస విజయాలతో దూసుకుపోతుంది. ఇవాళ (డిసెంబర్ 11) జరిగిన క్వార్టర్ ఫైనల్-4లో ముంబై విదర్భపై 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. తద్వారా సెమీస్‌కు చేరుకుంది.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన విదర్భ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 221 పరుగుల భారీ స్కోర్ చేసింది. అథర్వ తైడే (66), వాంఖడే (51) అర్ద సెంచరీలతో రాణించగా.. ఆఖర్లో శుభమ్ దూబే (43 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు.THE SIX HITTING MACHINE - SHIVAM DUBE 🥶 pic.twitter.com/Qy2uhlXKBp— Johns. (@CricCrazyJohns) December 11, 2024అనంతరం బరిలోకి దిగిన ముంబై.. 19.2 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. ఓపెనర్లు పృథ్వీ షా (26 బంతుల్లో 49; 5 ఫోర్లు, 4 సిక్సర్లు), అజింక్య రహానే (45 బంతుల్లో 84; 10 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు ఆరంభాన్ని అందించగా.. ఆఖర్లో శివమ్ దూబే (22 బంతుల్లో 37 నాటౌట్; ఫోర్, 2 సిక్సర్లు), సూర్యాంశ్ షేడ్గే (12 బంతుల్లో 36 నాటౌట్; ఫోర్, 4 సిక్సర్లు) బౌండరీలు, సిక్సర్లతో విరుచుకుపడి విధ్వంసం సృస్టించారు. MUMBAI INTO SEMIS OF SMAT...!!!Suryansh Shedge with another masterclass. 🙇♂️👌 pic.twitter.com/6FxuxENHc4— Mufaddal Vohra (@mufaddal_vohra) December 11, 2024ఈ మ్యాచ్‌లో ముంబై గెలుపుపై ఆశలు వదులుకున్న తరుణంలో శివమ్ దూబే, సూర్యాంశ్ సుడిగాలి ఇన్నింగ్స్‌లు ఆడారు. ముంబై విజయానికి షా, రహానే బీజం వేసినప్పటికీ.. మధ్యలో టీమిండియా స్టార్లు శ్రేయస్ అయ్యర్ (5), సూర్యకుమార్ యాదవ్ (9) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు.సూపర్ ఫామ్‌లో రహానేఈ టోర్నీలో ముంబై కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న అజింక్య రహానే సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. రహానే గత ఐదు ఇన్నింగ్స్‌ల్లో వరుసగా 52, 68, 22, 95, 84 పరుగులు స్కోర్ చేశాడు. విదర్భతో జరిగిన క్వార్టర్ ఫైనల్లో రహానే కేవలం 27 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. -
సూర్యకుమార్ యాదవ్ విధ్వంసం.. శివమ్ దూబే ఊచకోత
సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో టీమిండియా ఆటగాళ్లు, ముంబై ప్లేయర్లు శివమ్ దూబే, సూర్యకుమార్ యాదవ్ రెచ్చిపోయారు. సర్వీసెస్‌తో ఇవాళ (డిసెంబర్ 5) జరిగిన మ్యాచ్‌లో స్కై విధ్వంసం సృష్టిస్తే.. శివమ్ దూబే ప్రత్యర్ధి బౌలర్లను ఊచకోత కోశాడు. స్కై 46 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 70 పరుగులు చేయగా.. దూబే 36 బంతుల్లో 2 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో అజేయమైన 71 పరుగులు చేశాడు. The Surya-Dube show for Mumbai. 🤯pic.twitter.com/wNgwqLA7Cd— Mufaddal Vohra (@mufaddal_vohra) December 3, 2024దూబే సిక్సర్ల వర్షానికి హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం తడిసి ముద్దైంది. గాయం కారణంగా గత మూడు నెలలుగా కాంపిటేటివ్ క్రికెట్‌కు దూరంగా ఉన్న దూబే ఈ మ్యాచ్‌తోనే రీఎంట్రీ ఇచ్చాడు. రీఎంట్రీలోనే దూబే అదరగొట్టాడు. ఈ మ్యాచ్‌లో దూబే బంతితోనూ రాణించాడు. 3 ఓవర్లు వేసి 21 పరుగులిచ్చి ఓ వికెట్ తీశాడు.మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై సూర్యకుమార్ యాదవ్ (70), శివమ్ దూబే (71) చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. ఓపెనర్ పృథ్వీ షా తన పేలవ ఫామ్‌ను కొనసాగిస్తూ డకౌట్ కాగా.. మరో ఓపెనర్ అజింక్య రహానే 18 బంతుల్లో 3 బౌండరీల సాయంతో 22 పరుగులు చేశాడు. అనంతరం వన్‌డౌన్‌లో వచ్చిన కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 14 బంతుల్లో 4 ఫోర్ల సాయంతో 20 పరుగులు చేశాడు. సర్వీసెస్ బౌలర్లలో పూనియా, విశాల్ గౌర్, వికాస్ యాదవ్, శుక్లా తలో వికెట్ పడగొట్టారు.అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన సర్వీసెస్ 19.3 ఓవర్లలో 153 పరుగులకే ఆలౌటై, 39 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. శార్దూల్ ఠాకూర్ 4 వికెట్లు తీసి సర్వీసెస్ పతనాన్ని శాశించాడు. షమ్స్ ములానీ 3, మోహిత్ అవస్తి, శివమ్ దూబే తలో వికెట్ పడగొట్టారు. సర్వీసెస్ ఇన్నింగ్స్‌లో మోహిత్ అహ్లావత్ (54) ఒక్కడే అర్ద సెంచరీతో రాణించాడు. సర్వీసెస్ ఇన్నింగ్స్‌లో ముగ్గురు డకౌట్ అయ్యారు. ఈ గెలుపుతో ముంబై గ్రూప్-ఈ పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి ఎగబాకింది. -
IND VS SA T20 Series: శివమ్ దూబే, రియాన్ పరాగ్‌కు ఏమైంది..?
సౌతాఫ్రికాతో నాలుగు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం భారత జట్టును నిన్న (అక్టోబర్ 25) ఎంపిక చేశారు. అందరి అంచనాలకు తగ్గట్టుగానే ఈ జట్టు ఎంపిక జరిగినప్పటికీ.. ఇద్దరు, ముగ్గురు ఆటగాళ్లకు చోటు దక్కకపోవడం చర్చనీయాంశమైంది. ఇటీవల జరిగిన సిరీస్‌లలో జట్టుతో పాటు ఉన్న శివమ్ దూబే, రియాన్ పరాగ్, మయాంక్ యాదవ్ దక్షిణాఫ్రికాతో సిరీస్‌కు ఎంపిక కాలేదు. వీరిని ఎంపిక చేయకపోవడంపై బీసీసీఐ క్లారిటీ ఇచ్చింది.మయాంక్ యాదవ్, శివమ్ దూబే గాయాల బారిన పడటంతో వారిని పరిగణలోకి తీసుకోలేదని చెప్పిన బీసీసీఐ.. రియాన్ పరాగ్ భుజం సమస్య కారణంగా సెలెక్షన్‌కు అందుబాటులో లేడని వివరణ ఇచ్చింది. ప్రస్తుతం రియాన్ బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో రిపోర్ట్ చేసినట్లు తెలిపింది. ఫామ్‌లో ఉన్న ఆటగాళ్లను ఎంపిక చేయని అంశాన్ని పక్కన పెడితే.. జట్టులో రెండు అనూహ్య ఎంపికలు జరిగాయి.బౌలింగ్ ఆల్‌రౌండర్ రమన్‌దీప్ సింగ్, పేస్ బౌలర్ విజయ్‌కుమార్ వైశాఖ్ ఊహించని విధంగా జట్టులోకి వచ్చారు. వీరిద్దరికి చోటు దక్కుతుందని ఎవరు ఊహించలేదు. ఇవి మినహా మిగతా జట్టు ఎంపిక అంతా ఊహించిన విధంగానే జరిగింది. కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్ కొనసాగనుండగా.. వికెట్కీపర్లుగా సంజూ శాంసన్, జితేశ్ శర్మ ఎంపికయ్యారు. కాగా, దక్షిణాఫ్రికా సిరీస్‌తో పాటు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కోసం కూడా భారత జట్టును నిన్ననే ప్రకటించారు.దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌కు భారత జట్టు: సూర్యకుమార్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజూ శాంసన్, రింకూ సింగ్, తిలక్ వర్మ, జితేశ్ శర్మ, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రమణ్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్, అర్ష్ దీప్, విజయ్ కుమార్ వైశాఖ్, అవేశ్ ఖాన్, యశ్ దయాళ్సౌతాఫ్రికాతో టీ20 సిరీస్..తొలి మ్యాచ్- నవంబర్ 8 (డర్బన్)రెండో మ్యాచ్- నవంబర్10 (గ్వెకెర్బా)మూడో మ్యాచ్- నవంబర్ 13 (సెంచూరియన్)నాలుగో మ్యాచ్- నవంబర్ 15 (జోహనెస్బర్గ్)చదవండి: ఆ్రస్టేలియా పర్యటనకు నితీశ్ కుమార్ రెడ్డి -
బంగ్లాతో టీ20 సిరీస్.. టీమిండియాకు బిగ్ షాక్! స్టార్ ప్లేయర్ దూరం
గ్వాలియర్ వేదికగా ఆదివారం బంగ్లాదేశ్‌తో జరగనున్న తొలి టీ20కు టీమిండియా ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. స్టార్ ఆల్‌రౌండర్ శివమ్ దూబే గాయం కారణంగా బంగ్లాతో టీ20 సిరీస్‌కు దూరమయ్యాడు. దూబే ప్రస్తుతం వెన్ను నొప్పితో బాధపడుతున్నాడు.ఈ క్రమంలోనే అతడు బంగ్లాతో వైట్‌బాల్ సిరీస్ నుంచి తప్పుకున్నాడు. ఈ విషయాన్ని బీసీసీఐ ధ్రువీకరించింది. వెన్ను గాయం కారణంగా దూబే బంగ్లాతో మూడు టీ20ల సిరీస్ నుంచి తప్పుకున్నాడు. అతడి స్ధానాన్ని తిలక్ వర్మతో సెలక్షన్ కమిటీ భర్తీ చేసింది. ఆదివారం ఉదయం గ్వాలియర్‌లో తిలక్ జట్టుతో చేరనున్నాడని బీసీసీఐ ఓ ప్రకటనలో పేర్కొంది. తిలక్ వర్మ భారత్ తరపున ఇప్పటివరకు 16 టీ20లు ఆడి 336 పరుగులు చేశాడు. కాగా ఐపీఎల్-2024 తర్వాత ఈ హైదరాబాదీ గాయ పడ్డాడు. దీంతో అతడిని జింబాబ్వే, శ్రీలంకతో టీ20లకు సెలక్టర్లు ఎంపిక చేయలేదు. ఇప్పుడు పూర్తి ఫిట్నెస్ సాధించడంతో మరోసారి అతడికి భారత జట్టులో చోటు దక్కింది.భారత టీ20 జట్టుసూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజు శాంసన్ (వికెట్ కీపర్), రింకు సింగ్, హార్దిక్ పాండ్యా, రియాన్ పరాగ్, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, వరుణ్ చక్రవర్తి, జితేష్ శర్మ (వికెట్ కీపర్), అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణా, మయాంక్ యాదవ్, తిలక్ వర్మచదవండి: IPL 2025: రోహిత్, కిషన్‌కు నో ఛాన్స్.. ముంబై రిటెన్షన్ లిస్ట్ ఇదే! -
లంకతో మూడో వన్డే.. రాహల్‌పై వేటు! టీమిండియాలోకి విధ్వంసకర ఆటగాడు?
శ్రీలంకతో టీ20 సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా.. వన్డేల్లో మాత్రం తమ మార్క్‌ను చూపించలేకపోతుంది. తొలి వన్డేలో ఈజీగా గెలవాల్సిన మ్యాచ్‌ను చేజేతులా టై చేసుకున్న భారత్.. రెండో వన్డేలో 32 పరుగుల తేడాతో అనుహ్యంగా ఓటమి చవిచూసింది. ఈ క్రమంలో కీలకమైన మూడో వన్డేలో శ్రీలంకతో తలపడేందుకు టీమిండియా సిద్దమైంది. బుధవారం కొలంబో వేదికగా మూడో వన్డేలో ఇరు జట్లు అమీతుమీ తెల్చుకోనున్నాయి. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి సిరీస్‌ను 1-1తో సమం చేయాలని రోహిత్ సేన పట్టుదలతో ఉంది. మరోవైపు శ్రీలంక మాత్రం ఆఖరి మ్యాచ్‌లోనూ తమ జోరుని కొనసాగించి సిరీస్‌ను సొంతం చేసుకోవాలని భావిస్తోంది. కాగా భారత్‌పై శ్రీలంక వన్డే సిరీస్ గెలిచి దాదాపు 27 ఏళ్లు కావస్తోంది. ఇక ఇది ఇలా ఉండగా.. మూడో వన్డేలో టీమిండియా రెండు మార్పులతో బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. తొలి రెండు వన్డేల్లో తమ స్ధాయికి తగ్గ ప్రదర్శన చేయకపోయిన కేఎల్ రాహుల్, శివమ్ దూబేపై జట్టు మెనెజ్‌మెంట్ వేటు వేయనున్నట్లు సమాచారం. వారిద్దరి స్ధానంలో రిషబ్ పంత్, రియాన్ పరాగ్‌లకు చోటు ఇవ్వనున్నట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. కేఎల్ రాహుల్ వికెట్ల వెనక కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. రెండో వన్డేలో ఈజీగా క్యాచ్‌లు విడిచి విమర్శలు ఎదుర్కొన్నాడు. ఈ క్రమంలోనే రిషబ్ పంత్‌ను బరిలోకి దించాలని గంభీర్, రోహిత్ శర్మ నిర్ణయించుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.భారత తుది జట్టు(అంచనా)రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, రిషభ్ పంత్, రియాన్ పరాగ్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్. -
ఆ ఒక్క పరుగు చేయాల్సింది.. వారి వల్లే: రోహిత్ శర్మ
‘‘మెరుగ్గా బ్యాటింగ్ చేస్తే ఛేదించగల స్కోరే ఇది. నిజానికి మేము బాగానే ఆడాం. అయితే, నిలకడలేమి బ్యాటింగ్ వల్లే ఈ పరిస్థితి తలెత్తింది. పది ఓవర్ల తర్వాత.. ఒక్కసారి స్పిన్నర్లు బరిలోకి వచ్చారంటే మ్యాచ్ స్వరూపం మారిపోతుందని ముందే ఊహించాం. అందుకే ఆరంభంలో దూకుడుగా ఆడుతూ వీలైనన్ని పరుగులు స్కోరు చేశాం.లక్ష్య ఛేదన మొదలుపెట్టిన సమయంలో మాదే పైచేయి. అయితే, వరుస విరామాల్లో వికెట్లు కోల్పోవడం ప్రభావం చూపింది. కేఎల్ రాహుల్- అక్షర్ పటేల్ వల్ల తిరిగి పుంజుకున్నాం. అయితే, ఆఖర్లో 14 బంతులు ఉండి కూడా ఒక్క పరుగు తీయలేకపోవడం తీవ్ర నిరాశ కలిగించింది.ఆటలో ఇలాంటివన్నీ సహజమే. అయితే, శ్రీలంక ఈరోజు అద్బుతంగా ఆడింది. పిచ్ మొదటి నుంచి ఒకేలా ఉంది. తొలి 25 ఓవర్లలో మేము కూడా బాగా బౌలింగ్ చేశాం. తర్వాత వికెట్.. బ్యాటింగ్‌కు కాస్త అనుకూలంగా మారింది. ఏదేమైనా మేము చివరిదాకా పోరాడిన తీరు పట్ల గర్వంగా ఉంది.రెండు జట్ల మధ్య విజయం దోబూచులాడింది. మేము కనీసం ఒక్కటంటే ఒక్క పరుగు చేయాల్సింది’’ అని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. శ్రీలంకతో తొలి వన్డే ‘టై’గా ముగియడం పట్ల విచారం వ్యక్తం చేశాడు. కాగా టీ20 ప్రపంచకప్-2024 తర్వాత రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి తొలిసారిగా లంకతో వన్డే సిరీస్‌లో పాల్గొంటున్నారు.దంచికొట్టిన రోహిత్ఈ క్రమంలో శుక్రవారం కొలంబో వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌లో భారత జట్టుకు నిరాశే ఎదురైంది. టాస్ ఓడి తొలుత బౌలింగ్ చేసిన టీమిండియా.. ఆతిథ్య జట్టును 230 పరుగులకు పరిమితం చేయగలిగింది. అయితే, లక్ష్య ఛేదనను ఘనంగా ఆరంభించినా మిడిలార్డర్ విఫలం కావడంతో కష్టాల్లో పడింది.ఓపెనర్ రోహిత్ శర్మ 47 బంతుల్లో 58 పరుగులతో కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడగా.. మరో ఓపెనర్ శుబ్‌మన్ గిల్(35 బంతుల్లో 16 రన్స్) మాత్రం తీవ్రంగా నిరాశపరిచాడు. వన్‌డౌన్ బ్యాటర్ విరాట్ కోహ్లి ఆదుకుంటాడని భావిస్తే.. అతడు కూడా 32 బంతుల్లో కేవలం 24 పరుగులకే పరిమితమయ్యాడు.విజయానికి ఒక పరుగు దూరంలోవాషింగ్టన్ సుందర్(5) తేలిపోగా.. రీఎంట్రీ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ 23 పరుగులతో ఫర్వాలేదనిపించాడు. ఇక వికెట్ కీపర్ బ్యాటర్ కేఎల్ రాహుల్(31), అక్షర్ పటేల్(33) కాసేపు పోరాడగా.. శివం దూబే 25 పరుగులతో గెలుపు ఆశలు రేపాడు.అయితే, కేవలం 14 బంతుల్లో ఒక్క పరుగు అవసరమైన వేళ.. శ్రీలంక కెప్టెన్ చరిత్ అసలంక 48వ ఓవర్లో దూబే, అర్ష్‌దీప్ సింగ్(0)ను అవుట్ చేయడంతో టీమిండియా ఆలౌట్ అయింది. విజయానికి ఒక పరుగు దూరంలో నిలిచి.. మ్యాచ్‌ను టై చేసుకుంది. భారత ఓపెనర్ల వికెట్లు తీసిన శ్రీలంక స్పిన్నర్ దునిత్ వెల్లలగే(2/39) ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. చదవండి: గురి చెదిరింది.. కాంస్యం చేజారింది -
IND vs SL: 4 ఏళ్ల తర్వాత భారత స్టార్ ప్లేయర్ రీ ఎంట్రీ..! ఎవరంటే?
టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ శివమ్ దూబే దాదాపు నాలుగేళ్ల తర్వాత తిరిగి వన్డేల్లో పునరాగమనం చేశాడు. కొలంబో వేదికగా శ్రీలంకతో జరుగుతున్న తొలి వన్డేలో భారత తుది జట్టులో చోటు దక్కించుకున్న దూబే.. తన 1670 రోజుల నిరీక్షణకు తెరదించాడు. డిసెంబర్ 15, 2019న వెస్టిండీస్‌పై వన్డే అంతర్జాతీయ అరంగేట్రం చేసిన దూబే.. తన మొదటి మ్యాచ్‌లో నిరాశపరిచాడు. తన డెబ్యూ మ్యాచ్‌లో 6 బంతులు ఎదుర్కొన్న శివమ్ కేవలం 9 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. దీంతో ఆ తర్వాత అతడికి భారత జట్టులో చోటు దక్కలేదు. అయితే ఐపీఎల్-2024తో పాటు దేశీవాళీ క్రికెట్లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచి భారత టీ20 జట్టులోకి వచ్చిన దూబే.. ఇప్పుడు వన్డేల్లో కూడా రీఎంట్రీ ఇచ్చాడు. ముఖ్యంగా శ్రీలంకతో వన్డే సిరీస్‌కు స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా దూరం కావడంతో దూబేకు రీఎంట్రీ సుగమమైంది. తొలి వన్డేకు పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్‌గా భారత తుది జట్టులో ఈ ముంబైకర్ చోటు దక్కించుకున్నాడు. టీ20 వరల్డ్‌కప్-2024లో కూడా దూబే పర్వాలేదన్పించాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్లో 27 పరుగులు చేసిన దూబే.. భారత్ ఛాంపియన్స్‌గా నిలవడంలో తన వంతు పాత్ర పోషించాడు. దూబే తన లిస్ట్-ఎ కెరీర్లో ఇప్పటివరకు 54 మ్యాచ్‌లు ఆడి 975 పరుగులతో పాటు 40 వికెట్లు పడగొట్టాడు.తుది జట్లు..భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, వాషింగ్టన్ సుందర్, శివమ్ దూబే, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, మొహమ్మద్ సిరాజ్శ్రీలంక: చరిత్ అసలంక (కెప్టెన్), పథుమ్ నిస్సంక, అవిష్క ఫెర్నాండో, కశాల్ మెండిస్ (వికెట్‌కీపర్), సధీర సమరవిక్రమ, దునిత్ వెల్లలగే, వనిందు హసరంగ, జనిత్ లియనగే, అఖిల ధనంజయ, అషిత ఫెర్నాండో, మొహ్మద్ సిరాజ్ -
Ind vs Zim: ఆ ముగ్గురిపై వేటు.. దూబేకూ చోటు
జింబాబ్వేతో మూడో టీ20లో టీమిండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. హరారే వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌తో ప్రపంచకప్-2024 విజేత జట్టులోని ముగ్గురు స్టార్లు పునరాగమనం చేశారు.ఓపెనర్ యశస్వి జైస్వాల్, వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్, పవర్ హిట్టర్ శివం దూబే తుదిజట్టులో చోటు దక్కించుకున్నారు. వీరి రాకతో సాయి సుదర్శన్, ధ్రువ్ జురెల్‌లపై వేటు పడింది.అదే విధంగా.. పేసర్ ముకేశ్ కుమార్‌కు విశ్రాంతినిచ్చారు. ఈ నేపథ్యంలో టాస్ సందర్భంగా టీమిండియా కెప్టెన్ శుబ్‌మన్ గిల్ మాట్లాడుతూ.. వరల్డ్‌కప్ విన్నర్ల రాకతో తమ జట్టు మరింత పటిష్టమైందని పేర్కొన్నాడు.తుది జట్లు..భారత్: యశస్వి జైస్వాల్, అభిషేక్ శర్మ, శుభమన్ గిల్(కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, సంజు శాంసన్(వికెట్‌కీపర్), శివమ్ దూబే, రింకూ సింగ్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, అవేష్ ఖాన్, ఖలీల్ అహ్మద్జింబాబ్వే: తాడివానాషే మారుమణి, వెస్లీ మాధేవేరే, బ్రియాన్ బెన్నెట్, డియోన్ మైయర్స్, సికందర్ రజా (కెప్టెన్), జోనాథన్ కాంప్‌బెల్, క్లైవ్ మదాండే(వికెట్‌కీపర్), వెల్లింగ్టన్ మసకద్జా, రిచర్డ్ నగరవ, బ్లెస్సింగ్ ముజరబానీ, టెండై చతారా. -
జింబాబ్వేతో టీ20 సిరీస్.. భారత జట్టులో కీలక మార్పులు! సంజూ, దూబే ఔట్
జింబాబ్వేతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో తలపడేందుకు టీమిండియా సిద్దమైంది. టీ20 వరల్డ్‌కప్-2024లో భాగమైన ఆటగాళ్లందరికి దాదాపుగా జింబాబ్వే పర్యటనకు సెలక్టర్లు విశ్రాంతి ఇచ్చారు. దీంతో ఈ సిరీస్‌లో భారత జట్టుకు యువ ఓపెనర్ శుబ్‌మన్ గిల్ సారథ్యం వహించనున్నాడు. అభిషేక్ శర్మ, రియాన్ పరాగ్ వంటి యువ ఆటగాళ్లకు తొలిసారి భారత జట్టులో చోటు దక్కింది. ఇక ఈ సిరీస్ కోసం ఇప్పటికే శుబ్‌మన్ గిల్ సారథ్యంలోని భారత జట్టు జింబాబ్వేకు పయనమైంది.భారత జట్టులో కీలక మార్పులు..ఇక ఈ సిరీస్‌కు ముందు భారత జట్టులో పలు కీలక మార్పులు బీసీసీఐ చేసింది. టీ20 వరల్డ్‌కప్ 2024 భారత జట్టులో భాగమైన సంజూ శాంసన్, యశస్వీ జైశ్వాల్, శివమ్ దూబేలను జింబాబ్వే సిరీస్‌కు ఎంపిక చేసిన జట్టు నుంచి బీసీసీఐ రిలీజ్ చేసింది. వారి స్ధానంలో తొలి రెండు టీ20లకు హర్షిత్ రానా, సాయి సుదర్శన్, జితేష్ శర్మలను బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఎంపిక చేసింది. కాగా హర్షిత్ రానా, సాయిసుదర్శన్ తొలిసారి భారత జట్టుకు ఎంపికయ్యారు. కాగా ఈ సిరీస్ జులై 6 నుంచి ప్రారంభం కానుంది. హరారే వేదికగా జులై 6, 7, 10, 13, 14 తేదీల్లో మ్యాచ్‌లు జరుగనున్నాయి.జింబాబ్వేతో తొలి రెండు టీ20లకు భారత జట్టుశుభమాన్ గిల్ (కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, అభిషేక్ శర్మ, రింకు సింగ్, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), రియాన్ పరాగ్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, అవేష్ ఖాన్, ఖలీల్ అహ్మద్, ముఖేష్ కుమార్, తుషార్ దేశ్‌పాండే, సాయి సుదర్శన్, జితేష్ శర్మ (వికెట్ కీపర్) , హర్షిత్ రాణా -
T20 World Cup 2024 Final: శివమ్ దూబేనా..సంజూ శాంసనా..?
మరికొద్ది గంటల్లో టీ20 వరల్డ్‌కప్ 2024 ఫైనల్ ప్రారంభం కానుంది. బార్బడోస్ వేదికగా భారత్-సౌతాఫ్రికా జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ మ్యాచ్ భారతకాలమానం ప్రకారం ఇవాళ (జూన్ 29) రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్‌లో గెలిచి టైటిల్ సాధించాలని ఇరు జట్లు పట్టుదలగా ఉన్నాయి. ఈ టైటిల్ ఓ జట్టుకేమో (టీమిండియా) 13 ఏళ్ల నిరీక్షణ.. మరో జట్టుకు (సౌతాఫ్రికా) చిరకాల కోరిక. ఈ తుది సమరం కోసం కోట్లాది మంది క్రికెట్ అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ మ్యాచ్‌కు వరుణుడు అడ్డుతగిలేలా ఉన్నాడు. ఒకవేళ ఇవాళ మ్యాచ్ రద్దైనా రిజర్వ్ డే ఉంది. ఒకవేళ రిజర్వ్ డేలో కూడా మ్యాచ్ సాధ్యపడకపోతే ఇరు జట్లను సంయుక్త విజేతలుగా ప్రకటిస్తారు. సంయుక్త విజేతలుగా నిలవడం ఇరు జట్ల ఆటగాళ్లుకు, అభిమానులు ఇష్టం ఉండదు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మ్యాచ్ జరగాలనే దేవుళ్లను ప్రార్ధిస్తున్నారు.ఇదిలా ఉంటే, ఫైనల్ మ్యాచ్ కోసం భారత తుది జట్టు కూర్పులో ఓ తలనొప్పి ఉంది. వరుసగా విఫలమవుతున్న శివమ్ దూబేను ఫైనల్లో ఆడించాలా వద్దా అని మేనేజ్మెంట్ తలలు పట్టుకు కూర్చుంది. ఫామ్‌లోని లేని దూబేని ఫైనల్లో కూడా కొనసాగిస్తే.. టీమిండియా విజయావకాశాలను దెబ్బతినే ప్రమాదముందని అభిమానులు భావిస్తున్నారు. ఒకవేళ దూబేని తప్పిస్తే జట్టు లయ దెబ్బతీనే ప్రమాదం కూడా లేకపోలేదు.ప్రస్తుతం భారత జట్టు బ్యాటర్లు, ఆల్‌రౌండర్లు, బౌలర్లతో సమతూకంగా ఉంది. ఒకవేళ దూబే స్థానంలో సంజూ శాంసన్ లేదా యశస్వి జైస్వాల్‌ను తుది జట్టులోకి తీసుకుంటే భారత్‌కు ఓ ఆల్‌రౌండర్ తక్కువ అవుతాడు. ఈ టోర్నీలో దూబేతో బౌలింగ్ చేయించనప్పటికీ అతన్ని ఆల్‌రౌండర్‌గానే పరిగణించాలి. బౌలర్‌గా అతనికి ఓ మోస్తరు ట్రాక్ రికార్డు ఉంది. బార్బడోస్ పిచ్ బౌలర్లకు అనుకూలించే అవకాశం ఉండటంతో జట్టు మేనేజ్మెంట్ దూబేని తప్పించే సాహసం చేయకపోవచ్చు. కెప్టెన్ రోహిత్ శర్మ, కోచ్ ద్రవిడ్‌కు కూడా దూబేని మార్చడం ఇష్టం ఉండకపోవచ్చు. ఈ నేపథ్యంలో ఫైనల్ మ్యాచ్‌లో భారత తుది జట్టుపై మీ అంచాలనేమో కామెంట్ చేయండి. శివమ్ దూబేని ఆడిస్తే బాగుంటుందా లేక సంజూ శాంసన్, యశస్వి జైస్వాల్‌లలో ఒకరికి అవకాశమిస్తే బాగుంటుందా..? -
Shivam Dube: ఐపీఎల్లో హీరో.. ఇండియా తరఫున జీరో
ప్రస్తుతం జరుగుతున్న టీ20 వరల్డ్‌కప్ 2024లో టీమిండియా ఆటగాడు శివమ్ దూబే వరుసగా విఫలమవుతున్నాడు. మెగా టోర్నీలో ఇప్పటివరకు ఆడిన 7 మ్యాచ్‌ల్లో కేవలం 106 పరుగులు మాత్రమే చేశాడు. దూబే వరుస వైఫల్యాల నేపథ్యంలో భారత క్రికెట్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దూబేను తక్షణమే జట్టు నుంచి తప్పించాలని డిమాండ్ చేస్తున్నారు. దూబే స్థానంలో రింకూ సింగ్, సంజూ శాంసన్, యశస్వి జైస్వాల్‌లలో ఎవరో ఒకరికి అవకాశం ఇవ్వాలని సూచిస్తున్నారు. ఆల్‌రౌండర్ కోటాలో జట్టులోకి తీసుకుంటే కనీసం బ్యాటింగ్కైనా న్యాయం చేయలేకపోతున్నాడని మండిపడుతున్నారు. ఐపీఎల్ 2024 ఫామ్‌ను (14 మ్యాచ్‌ల్లో 162.30 స్ట్రయిక్‌రేట్‌తో 396 పరుగులు, 3 అర్దసెంచరీలు) చూసి హార్దిక్‌తో పోల్చి తప్పు చేశామని బాధపడుతున్నారు. ఐపీఎల్లో హీరో ఇండియా తరఫున జీరో అంటూ ధ్వజమెత్తుతున్నారు. తాజాగా ఇంగ్లండ్‌తో జరిగిన సెమీఫైనల్లో గోల్డెన్ డకౌట్ కావడంతో దూబేపై అభిమానుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. కొందరు అభిమానులు దూబేపై వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారు. కీలకమైన మ్యాచ్‌లో కీలక సమయంలో బ్యాటింగ్‌కు దిగి తొలి బంతికే ఔట్ కావడాన్ని అభిమానులు సహించలేకున్నారు. వరుసగా విఫలమవుతున్నా దూబేకు అవకాశాలు ఇస్తున్నందుకు కెప్టెన్ రోహిత్ శర్మను తప్పుబడుతున్నారు. ఇచ్చిన అవకాశాలు చాలు ఫైనల్లో దూబేని తప్పించి ఇతరులకు అవకాశం ఇవ్వాలని పెద్ద ఎత్తున డిమాండ్లు వినిపిస్తున్నారు.కాగా, ఇంగ్లండ్‌తో నిన్న (జూన్ 27) జరిగిన సెమీఫైనల్లో టీమిండియా 68 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి ఫైనల్స్‌కు చేరింది. ఈ మ్యాచ్‌లో దూబే విఫలమైనా టీమిండియా తొలుత బ్యాటింగ్ చేస్తూ 7 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది.రోహిత్ శర్మ (39 బంతుల్లో 57; 6 ఫోర్లు, 2 సిక్సర్లు), సూర్యకుమార్ యాదవ్ (36 బంతుల్లో 47; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), హార్దిక్ పాండ్యా (13 బంతుల్లో 23, ఫోర్, 2 సిక్సర్లు) రాణించగా.. కోహ్లి (9), దూబే (0), పంత్ (4) నిరాశపరిచాడు. ఇంగ్లండ్ బౌలర్లలో క్రిస్ జోర్డన్ 3 వికెట్లు పడగొట్టగా.. రీస్ టాప్లీ, జోఫ్రా ఆర్చర్, సామ్ కర్రన్, ఆదిల్ రషీద్ తలో దక్కించుకున్నారు.అనంతరం 172 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లండ్.. కుల్దీప్ యాదవ్ (4-0-19-3), అక్షర్ పటేల్ (4-0-23-3), బుమ్రా (2.4-0-12-2) ధాటికి 16.4 ఓవర్లలో 103 పరుగులకే చాపచుట్టేసింది. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో జోస్ బట్లర్ (23), హ్యారీ బ్రూక్ (25), జోఫ్రా ఆర్చర్ (21), లివింగ్‌స్టోన్ (11) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగలిగారు. కాగా, భారతకాలమానం రేపు (జూన్ 29) రాత్రి 8 గంటలకు ప్రారంభమయ్యే ఫైనల్లో టీమిండియా.. సౌతాఫ్రికాతో అమీతుమీ తేల్చుకుంటుంది. -
Ind vs Zim: నితీశ్ రెడ్డికి చేదు అనుభవం.. శివం దూబేకు ఛాన్స్
ఆంధ్ర క్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. ఈ యువ ఆల్‌రౌండర్ గాయం బారిన పడ్డాడు. ఫలితంగా జింబాబ్వేతో టీ20 సిరీస్‌కు దూరమయ్యాడు. ఈ క్రమంలో తీశ్ రెడ్డి స్థానంలో శివం దూబేను ఎంపిక చేశారు సెలక్టర్లు. ఈ విషయాన్ని భారత క్రికెట్ నియంత్రణ మండలి బుధవారం ప్రకటించింది.వైజాగ్ కుర్రాడుకాగా విశాఖపట్నానికి చెందిన పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి జింబాబ్వే పర్యటనకు ఎంపికైన విషయం తెలిసిందే. ఐపీఎల్-2024లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) తరఫున అదరగొట్టిన ఈ 21 ఏళ్ల కుడిచేతి వాటం బ్యాటర్.. ‘ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ద సీజన్ 2024’ అవార్డు కూడా అందుకున్నాడు.జింబాబ్వే పర్యటన కోసంఈ సీజన్ ఆసాంతం నిలకడైన ప్రదర్శనతో ఆకట్టుకున్న నితీశ్ కుమార్ రెడ్డి టీమిండియా సెలక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. ఈ క్రమంలో సీనియర్లు విశ్రాంతి తీసుకుంటున్న జింబాబ్వే పర్యటన కోసం అతడిని ఎంపిక చేశారు.ఈ క్రమంలో టీమిండియా టీ20 జట్టుకు సెలక్ట్ అయిన తొలి ఆంధ్ర క్రికెటర్‌గా నితీశ్ రెడ్డి చరిత్రకెక్కాడు. అయితే, ప్రస్తుతం అతడు గాయంతో బాధపడుతున్నట్లు బీసీసీఐ వెల్లడించింది.అతడితో భర్తీనితీశ్ రెడ్డి చికిత్స నిమిత్తం ప్రస్తుతం బీసీసీఐ వైద్య బృందం పర్యవేక్షణలో ఉన్నట్లు తెలిపింది. ఈ క్రమంలో నితీశ్ రెడ్డి స్థానాన్ని ముంబై పేస్ ఆల్‌రౌండర్ శివం దూబేతో భర్తీ చేస్తున్నట్లు వెల్లడించింది.కాగా టీ20 ప్రపంచకప్-2024 తర్వాత సీనియర్లంతా విశ్రాంతి తీసుకోనున్న నేపథ్యంలో జింబాబ్వే టూర్‌కు యువ జట్టును ఎంపిక చేశారు. ఈ జట్టుకు శుబ్‌మన్ గిల్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు.ఇక జూలై 6 నుంచి టీమిండియా జింబాబ్వేతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడనుంది. ఈ మ్యాచ్‌లన్నింటికీ హరారే వేదిక.జింబాబ్వేతో టీ20 సిరీస్‌కు భారత జట్టు(రివైజ్డ్)శుబ్‌మన్ గిల్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్, అభిషేక్ శర్మ, రింకూ సింగ్, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), ధృవ్ జురెల్ (వికెట్ కీపర్), రియాన్ పరాగ్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, అవేష్ ఖాన్, ఖలీల్ అహ్మద్, ముఖేష్ కుమార్, తుషార్ దేశ్‌పాండే, శివం దూబే.చదవండి: ఒకే ఓవర్లో 43 రన్స్.. 134 ఏళ్ల చరిత్రలో ఇదే తొలిసారి!Nitish Kumar Reddy: అప్పుడే నా కల పూర్తిగా నెరవేరుతుంది -
సిక్సర్ల కింగ్ శివమ్ దూబే.. బర్త్‌డే స్పెషల్ (ఫోటోలు)
-
ఆస్ట్రేలియాపై భారత్ ఘన విజయం..సెమీస్‌కు టీమిండియా (ఫొటోలు)
-
Ind vs Ban: అతడిపై వేటు.. సంజూకు ఛాన్స్!
టీ20 ప్రపంచకప్-2024 సూపర్-8లో శుభారంభం చేసిన టీమిండియా అదే జోరును కొనసాగించాలని భావిస్తోంది. తమ రెండో మ్యాచ్‌లో భాగంగా బంగ్లాదేశ్‌ను ఓడించి సెమీస్ అవకాశాలను మెరుగుపరచుకోవాలని పట్టుదలగా ఉంది.ఈ నేపథ్యంలో ఇప్పటికే రోహిత్ సేన నెట్స్‌లో తీవ్రంగా చెమటోడ్చింది. అఫ్గనిస్తాన్‌తో గురువారం నాటి మ్యాచ్‌లో విజయానంతరం.. మరుసటి రోజే ప్రాక్టీస్ సెషన్‌తో బిజీగా గడిపింది.ప్రత్యేకంగా ప్రాక్టీస్ఫామ్లేమితో సతమతమవుతున్న కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లి, రవీంద్ర జడేజా కూడా నెట్ సెషన్లో పాల్గొన్నట్లు సమాచారం. సర్ వివియన్ రిచర్డ్స్ స్టేడియంలో శుక్రవారం జరిగిన సెషన్లో సంజూ శాంసన్‌తో రిజర్వ్ బౌలర్ ఖలీల్ అహ్మద్ ప్రత్యేకంగా ప్రాక్టీస్ చేసినట్లు తెలుస్తోంది.ముఖ్యంగా సంజూ శాంసన్ కెప్టెన్ రోహిత్ శర్మ, హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ ఆధ్వర్యంలో దాదాపు రెండు గంటల పాటు నెట్ సెషన్లో పాల్గొన్నట్లు సమాచారం. సంజూ బ్యాటింగ్‌ను వీరిద్దరు పరిశీలించినట్లు రెవ్‌స్పోర్ట్స్ వెల్లడించింది.అతడిపై వేటు?ఈ నేపథ్యంలో... టోర్నీ ఆరంభం నుంచి బెంచ్‌కే పరిమితమైన సంజూ శాంసన్‌కు బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో అవకాశం ఇచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ శివం దూబే స్థానంలో ఈ కేరళ బ్యాటర్‌ను తుదిజట్టులోకి తీసుకోనున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.హిట్టర్‌గా ఐపీఎల్-2024లో ఇరగదీసిన శివం దూబే వరల్డ్‌కప్-2024లో మాత్రం బ్యాట్ ఝులిపించలేకపోతున్నాడు. ఇప్పటి వరకు ఆడిన నాలుగు మ్యాచ్‌లలో కలిపి 44 పరుగులే చేశాడు. స్ట్రైక్‌రేటు 83.అందుకే సంజూకు లైన్ క్లియర్ఈ నేపథ్యంలో దూబేను తప్పించి సంజూకు మార్గం సుగమం చేయాలని మేనేజ్మెంట్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. బంగ్లాదేశ్‌తో మ్యాచ్ తర్వాత టీమిండియా తదుపరి ఆస్ట్రేలియాతో తలపడనుంది.పటిష్ట ఆసీస్‌ను ఢీకొట్టేకంటే ముందే తుదిజట్టులో ఈ మేరకు మార్పులతో ప్రయోగం చేయాలని బోర్డు భావిస్తున్నట్లు సమాచారం. మరోవైపు.. మిడిలార్డర్లో ఉన్న ఒకే ఒక్క లెఫ్టాండర్ బ్యాటర్ శివం దూబే విషయంలో టీమిండియా రిస్క్ చేయకపోవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాగా అంటిగ్వాలోని వివియన్ రిచర్ట్స్ స్టేడియంలో శనివారం టీమిండియా- బంగ్లాదేశ్‌తో తలపడనుంది. అయితే, ఈ మ్యాచ్‌కు వర్ష సూచన ఉండటం ఆందోళనకరంగా పరిణమించింది.చదవండి: టీమిండియా స్టార్ పేసర్ రీ ఎంట్రీకి సిద్ధం.. ఆ సిరీస్ నాటికి!Barbados ✈️ Antigua #TeamIndia have arrived for today's Super 8 clash against Bangladesh 👌👌#T20WorldCup pic.twitter.com/RM54kEWP3W— BCCI (@BCCI) June 22, 2024 -
ఇక్కడ గెలవడం అంత సులువు కాదు.. క్రెడిట్ వాళ్లకే: రోహిత్ శర్మ
టీ20 ప్రపంచకప్-2024 లీగ్ దశలో తమకు ఇంకో మ్యాచ్ మిగిలి ఉండగానే టీమిండియా సూపర్-8లో అడుగుపెట్టింది. ఆతిథ్య అమెరికా జట్టుపై బుధవారం నాటి మ్యాచ్‌లో ఏడు వికెట్ల తేడాతో గెలుపొంది తదుపరి దశకు అర్హత సాధించింది.అయితే, పసికూనే అయినా అమెరికాపై రోహిత్ సేనకు ఈ విజయం అంత సులువుగా రాలేదు. 111 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆరంభంలో తడబడిన భారత జట్టు సూర్యకుమార్ యాదవ్(50), శివం దూబే(31) అద్భుత అజేయ ఇన్నింగ్స్ కారణంగా గట్టెక్కింది.బ్యాటింగ్ అనుకూలించని పిచ్‌పై వీరిద్దరు మెరుగైన భాగస్వామ్యం నెలకొల్పి జట్టును విజయతీరాలకు చేర్చారు. ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం కెప్టెన్ రోహిత్ శర్మ సూర్య, దూబేలపై ప్రశంసలు కురిపించాడు.గెలుపు అంత తేలికగా రాదని తెలుసుఅదే విధంగా.. అమెరికాపై విజయంలో బౌలర్ల పాత్ర కూడా ఎంతో కీలకమని పేర్కొన్నాడు. ‘‘ఈ మ్యాచ్‌లో గెలుపు అంత తేలికగా రాదని తెలుసు. మా వాళ్ల మెరుగైన భాగస్వామ్యం వల్లే ఇది సాధ్యమైంది.బౌలర్లు కూడాసూర్య, దూబే ఆద్యంతం పట్టుదలగా నిలబడి పరిణతితో కూడిన ఇన్నింగ్స్ ఆడారు. అందుకు వాళ్లకు క్రెడిట్ ఇవ్వాల్సిందే. ఇక మా బౌలర్లు కూడా అద్భుతంగా రాణించారు.ముఖ్యంగా అర్ష్‌దీప్. దూబే రూపంలో మాకు మరో ఆప్షన్ ఉంది కాబట్టి.. ఈ మ్యాచ్‌లో ప్రయత్నించి చూశాం. ఎందుకంటే ఈరోజు పిచ్ సీమర్లకు ఎక్కువగా అనుకూలించింది. కాబట్టి అతడి సేవలను వాడుకున్నాం. అతిపెద్ద ఊరటఇక సూపర్-8కు క్వాలిఫై అవటం అనేది అతిపెద్ద ఊరట. ఇలాంటి పిచ్‌లపై విజయాలు అంత సులువేమీ కాదు. ప్రతి మ్యాచ్‌ను చాలెంజింగ్‌గా తీసుకున్నాం.మూడింట మూడు విజయాలు సాధించాం. ఫలితంగా మా ఆత్మవిశ్వాసం మరింత పెరిగింది. సూర్యకుమార్ యాదవ్ లాంటి అనుభవజ్ఞుడైన ఆటగాడి నుంచి మేము ఏం ఆశిస్తామో.. ఈరోజు అదే అతడు చేసి చూపించాడు.కఠినమైన పిచ్‌పై తనదైన శైలిలో రాణించి విజయాన్ని అందించాడు’’ అని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు. సమిష్టి కృషితో సూపర్-8కు అర్హత సాధించడం సంతోషంగా ఉందని హర్షం వ్యక్తం చేశాడు.టీ20 ప్రపంచకప్-2024: ఇండియా వర్సెస్ యూఎస్ఏ స్కోర్లు👉వేదిక: న్యూయార్క్👉టాస్: ఇండియా బౌలింగ్👉యూఎస్ఏ స్కోరు- 110/8 (20)👉ఇండియా స్కోరు- 111/3 (18.2)👉ఫలితం- ఏడు వికెట్ల తేడాతో యూఎస్ఏపై ఇండియా విజయం👉ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: అర్ష్‌దీప్ సింగ్(4/9).చదవండి: రూ. 250 కోట్లు.. బ్యాటర్లకు చుక్కలే! కూల్చేయనున్న ఐసీసీ? View this post on Instagram A post shared by ICC (@icc) -
టి20 వరల్డ్ కప్ : అమెరికాపై గెలుపు..‘సూపర్–8’కు భారత్ (ఫొటోలు)
-
అమెరికాతో మ్యాచ్.. దూబేపై వేటు! శాంసన్‌కు ఛాన్స్
టీ20 వరల్డ్‌కప్-2024లో టీమిండియా మరో ఆసక్తికర పోరుకు సిద్దమైంది. ఈ మెగా టోర్నీలో వరుస విజయాలతో దూసుకుపోతున్న ఆతిథ్య అమెరికాతో బుధవారం న్యూయర్క్ వేదికగా భారత్ తలపడనుంది. ఇరు జట్లు కూడా తమ చివరి మ్యాచ్‌లో పాకిస్తాన్నే ఓడించడం గమనార్హం. ఆదివారం(జూన్ 9)స్కోరింగ్ థ్రిల్లర్‌లో పాకిస్తాన్‌పై భారత్ సంచలన విజయం సాధించగా.. అమెరికా సూపర్ ఓవర్లో పాకిస్తాన్‌ను చిత్తు చేసింది. కాగా పాక్‌పై గెలిచి మంచి జోష్‌లో ఉన్న టీమిండియా యూఎస్ఎపై కూడా అదే జోరును కొనసాగించాలని భావిస్తోంది. కానీ అమెరికా జట్టును ఏ మాత్రం తక్కువ అంచనా వేసినా భారత్ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు.ఈ క్రమంలో టీమిండియా మెనెజ్‌మెంట్ తమ తుది జట్టులో పలు మార్పులు చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ మెగా ఈవెంట్లో తొలి రెండు మ్యాచ్‌ల్లో నిరాశపరిచిన ఆల్‌రౌండర్ శివమ్ దూబేపై వేటు వేయాలని మెన్జ్మెంట్ నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఐపీఎల్లో అదరగొట్టి భారత వరల్డ్‌కప్ జట్టులో చోటు దక్కించుకున్న దూబే.. తన స్ధాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతున్నాడు. బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్ అన్ని విభాగాల్లో దూబే నిరాశపరుస్తున్నాడు. ఈ క్రమంలో అతడి స్ధానంలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్‌కు ఛాన్స్ ఇవ్వాలని కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు మెనెజ్‌మెంట్ భావిస్తున్నట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి.మరోవైపు ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాకు కూడా విశ్రాంతి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అతడి స్ధానంలో చైనామాన్ బౌలర్ కుల్దీప్ యాదవ్ తుది జట్టులోకి రానున్నట్లు వినికిడి. ఇప్పటివరకు జరిగిన ఈ రెండు మ్యాచ్‌ల్లోనూ జడేజా పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు.భారత తుది జట్టు(అంచనా)రోహిత్ శర్మ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, సంజు శాంసన్, హార్దిక్ పాండ్యా, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్ -
టి20 వరల్డ్ కప్ : తొలి మ్యాచ్‌లో భారత్ ఘన విజయం (ఫొటోలు)
-
శివమ్ దూబేపై వేటు.. వరల్డ్‌కప్ జట్టులో ఫినిషర్‌కు చోటు!
ఐపీఎల్-2024 ఫస్ట్‌హాఫ్‌లో అదరగొట్టిన చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ ఆల్‌రౌండర్ శివమ్ దూబే.. సెకెండ్ హాఫ్‌లో మాత్రం పూర్తిగా తేలిపోయాడు. స్పిన్నర్లు అద్బుతంగా ఎదుర్కొంటాడని పేరొందిన దూబే.. ఇప్పుడు అదే స్పిన్ బౌలింగ్ అతడి వీక్నెస్గా మారింది. మిడిలార్డర్లో బ్యాటింగ్‌కు వచ్చి సీఎస్కేకు అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ఆడడంతో ఏకంగా అతడికి టీ20 వరల్డ్‌కప్ భారత జట్టులో సెలక్టర్లు చోటు ఇచ్చారు. కానీ వరల్డ్‌కప్‌నకు ఎంపికైన తర్వాత అతడి ఆటతీరు పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు ఆడుతున్నది నిజంగా దూబేనేనా అన్నట్లు ఉంది. తొలి 9 మ్యాచ్ ల్లో 172.4 స్ట్రైక్ రేట్‌తో 350 పరుగులు చేసిన దూబే.. చివరి 5 మ్యాచ్ ల్లో కేవలం 46 పరుగులు మాత్రమే చేశాడు. తొలి 9 మ్యాచ్ ల్లో ఏకంగా 26 సిక్సర్లు బాదిన దూబే.. చివరి 5 మ్యాచ్ ల్లో కేవలం 2 సిక్సర్లు మాత్రమే కొట్టాడు. ఆర్సీబీతో జరిగిన కీలక మ్యాచ్ లో దూబే 15 బంతుల్లో కేవలం 7 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో టీ20 వరల్డ్‌కప్‌నకు ముందు శివమ్ దూబే ఫామ్ భారత జట్టు మెనెజ్‌మెంట్‌కు ఆందోళన కలిగిస్తోంది. అయితే వరల్డ్‌కప్ ప్రకటించిన జట్టులో మే 25లోపు మార్పులు చేసుకోవచ్చు. ఈ క్రమంలో రిజర్వ్ జాబితాలో ఉన్న రింకూకు ప్రధాన జట్టులోకి ప్రమోట్ చేసి.. మెయిన్ జట్టులో ఉన్న దూబేకు స్టాండ్‌బై లిస్ట్‌లోకి డిమోట్ చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటివరకు అయితే బీసీసీఐ నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. -
వరల్డ్‌కప్ సెలక్టయ్యాడు.. వరుసగా రెండో మ్యాచ్‌లో గోల్డెన్ డక్
ఐపీఎల్-2024లో టీమిండియా ఆల్‌రౌండర్, చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ శివమ్ దూబే వరుసగా రెండో మ్యాచ్‌లో నిరాశపరిచాడు. ఈ లీగ్ ఫస్ట్‌హాఫ్‌లో అదరగొట్టిన దూబే.. సెకెండ్ హాఫ్‌లో మాత్రం తన మార్క్ చూపించలేకపోతున్నాడు. ఈ మెగా ఈవెంట్లో భాగంగా ఆదివారం ధర్మశాల వేదికగా పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో దూబే గోల్డన్ డక్‌గా వెనుదిరిగాడు. రుతురాజ్ గైక్వాడ్ ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన దూబే.. స్పిన్నర్ రాహుల్ చాహర్ బౌలింగ్‌లో తన ఎదుర్కొన్న తొలి బంతికే ఔటయ్యాడు. దూబే గోల్డెన్ డక్‌గా వెనుదిరగడం వరుసగా ఇది రెండో సారి. అంతకముందు కూడా చెపాక్ వేదికగా పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ దూబే ఖాతా తెరవకుండానే ఔటయ్యాడు. స్పిన్నర్లను అద్భుతంగా ఆడిగల్గే దూబే.. అదే స్నిన్నర్ల బౌలింగ్‌లో ఔట్ అవుతుండడం సీఎస్కే అభిమానులను కలవరపెడతోంది. అంతేకాకుండా ఐపీఎల్లో అద్భుతమైన ప్రదర్శర కనబరచడంతో దూబేకు టీ20 వరల్డ్‌కప్ భారత జట్టులో చోటు దక్కింది. ఇప్పుడు ఈ మెగా టోర్నీకి ముందు దూబే వరుసగా విఫలం కావడడం జట్టు మెనెజ్‌మెంట్‌ను ఆందోళన కలిగిస్తోంది. Wickets ki aayi bahar, jaise hi aaye Rahul Chahar 🔥#IPLonJioCinema #TATAIPL #PBKSvCSK #IPLinPunjabi pic.twitter.com/urm9eFIDOW— JioCinema (@JioCinema) May 5, 2024 -
హార్దిక్ బదులు అతడిని ఎంపిక చేయాల్సింది: పాక్ మాజీ స్టార్
టీ20 వరల్డ్‌కప్-2024 నేపథ్యంలో బీసీసీఐ ప్రకటించిన జట్టుపై పాకిస్తాన్ మాజీ స్పిన్నర్ డానిష్ కనేరియా తన అభిప్రాయాలు పంచుకున్నాడు. యశస్వి జైస్వాల్ వంటి యంగ్ స్టార్లకు చోటివ్వడం సరైన నిర్ణయమని.. అయితే, రింకూ సింగ్‌కు మాత్రం అనాయ్యం జరిగిందని పేర్కొన్నాడు.లోయర్ ఆర్డర్లో హిట్టింగ్ ఆడగల రింకూను పక్కన పెట్టడం సరికాదని టీమిండియా సెలక్టర్ల తీరును కనేరియా విమర్శించాడు. హార్దిక్ పాండ్యా బదులు రింకూను జట్టుకు ఎంపిక చేయాల్సిందని అభిప్రాయపడ్డాడు.రింకూ సింగ్‌కు అనాయ్యంకాగా జూన్ 1 నుంచి అమెరికా- వెస్టిండీస్ వేదికగా మొదలయ్యే ప్రపంచకప్‌నకు బీసీసీఐ మంగళవారం 15 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది. రోహిత్ శర్మ సారథ్యంలోని ఈ టీమ్‌లో రింకూ సింగ్‌కు స్థానం దక్కలేదు. రిజర్వ్ ప్లేయర్‌గా మాత్రమే అతడు ఎంపికయ్యాడు.వీళ్లంతా భేష్‌ఈ నేపథ్యంలో డానిష్ కనేరియా మాట్లాడుతూ.. ‘‘నాణ్యమైన క్రికెటర్లను ఉత్పత్తి చేస్తుందనే పేరు భారత్‌కు ఉంది. ఇటీవలి కాలంలో దుమ్ములేపుతున్న యశస్వి జైస్వాల్, అంగ్క్రిష్ రఘువంశీ ఇందుకు చక్కని ఉదాహరణలు.మయాంక్ యాదవ్ సైతం తన పేస్ నైపుణ్యాలతో అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు. ఇక అభిషేక్ శర్మ పవర్ హిట్టింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.పాండ్యాకు ఎందుకు చోటిచ్చారు?రింకూ విషయానికొస్తే.. అతడు కచ్చితంగా టీ20 వరల్డ్‌కప్ జట్టులో ఉండాల్సింది. నా అభిప్రాయం ప్రకారం.. ఐపీఎల్ ప్రదర్శనను గనుక పరిగణనలోకి తీసుకుంటే హార్దిక్ పాండ్యాను ప్రపంచకప్‌నకు ఎంపిక చేయకుండా ఉండాల్సింది.ఇప్పటికే జట్టులో శివం దూబే ఉన్నాడు. అందుకే పాండ్యా బదులు రింకూను ఎంపిక చేస్తే డౌన్ ఆర్డర్లో శక్తిమంతమైన కూర్పు కుదిరి ఉండేది’’ అని స్పోర్ట్స్ నౌ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.కాగా ప్రపంచకప్ ఈవెంట్లో కెప్టెన్ రోహిత్ శర్మకు డిప్యూటీగా హార్దిక్ పాండ్యాను ఎంపిక చేసింది బీసీసీఐ. అయితే, డానిష్ కనేరియా మాత్రం వైస్ కెప్టెన్‌నే పక్కనపెట్టాల్సిందని చెప్పడం గమనార్హం.టీ20 ప్రపంచకప్-2024 టోర్నీకి బీసీసీఐ ప్రకటించిన జట్టురోహిత్ శర్మ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, సంజూ శాంసన్, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, యజ్వేంద్ర చాహల్, అర్ష్‌దీప్ సింగ్, మహ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా.రిజర్వ్ ప్లేయర్లు: శుబ్‌మన్ గిల్, రింకూ సింగ్, ఖలీల్ అహ్మద్, అవేశ్ ఖాన్.చదవండి: అమెరికా వరల్డ్‌కప్ జట్టులో ఐదుగురు భారత సంతతి ఆటగాళ్లు.. -
వరల్డ్‌కప్‌కు సెలక్టయ్యాడు.. తొలిసారి డకౌటయ్యాడు! వీడియో వైరల్
ఐపీఎల్-2024లో చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ ఆల్‌రౌండర్ శివమ్ దూబే తొలిసారి నిరాశపరిచాడు. ఈ మెగా ఈవెంట్లో భాగంగా చెపాక్ వేదికగా పంజాబ్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో శివమ్ దూబే గోల్డన్ డక్‌గా వెనుదిరిగాడు. రహానే ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన దూబే.. తను ఎదుర్కొన్న తొలి బంతికే ఔటయ్యాడు. స్పిన్‌ను అద్బుతంగా ఆడే దూబే.. లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ హార్ప్రీత్ బ్రార్ బౌలింగ్‌లో ఔట్ కావడం గమనార్హం. 9వ ఓవర్ వేసిన హార్ప్రీత్ బ్రార్ బౌలింగ్‌లో దూబే వికెట్ల ముందు దొరికిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా ఐపీఎల్లో దూబే గోల్డన్ డక్‌గా వెనుదిరిగడం ఇదే మొదటి సారి. కాగా ఈ ఏడాది సీజన్లో దూబే అద్భుత ప్రదర్శన కనబరుస్తున్న సంగతి తెలిసిందే. ఈ ప్రదర్శన కారణంగానే టీ20 వరల్డ్‌కప్-2024 భారత జట్టులో దూబేకు చోటు దక్కింది. అయితే టీ20 వరల్డ్‌కప్‌కు ప్రకటించిన తర్వాత రోజే దూబే డకౌట్ కావడం గమనార్హం. ఈ ఏడాది సీజన్లో ఇప్పటివరకు 10 మ్యాచ్‌లు ఆడిన దూబే.. 171.57 స్ట్రైక్ రేటుతో 350 పరుగులు చేశాడు.Double strike from Harpreet Brar 🔥#TATAIPL #CSKvPBKS #IPLonJioCinema #IPLinHindi pic.twitter.com/O5lVM6nog2— JioCinema (@JioCinema) May 1, 2024 -
T20 WC: తుదిజట్టులో చోటివ్వాల్సిందే.. కెప్టెన్ కూడా కాదనలేడు!
చెన్నై సూపర్ కింగ్స్ ఆల్‌రౌండర్ శివం దూబే మరోసారి అద్భుత ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో ఆదివారం నాటి మ్యాచ్‌లో 20 బంతుల్లో ఒక ఫోర్, నాలుగు సిక్సర్ల సాయంతో 39 పరుగులతో అజేయంగా నిలిచాడు.కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్(98), డారిల్ మిచెల్(52)తో కలిసి చెన్నై సూపర్ కింగ్స్‌కు 212 పరుగుల భారీ స్కోరు అందించాడు. తద్వారా రైజర్స్పై 78 పరుగుల తేడాతో గెలుపొందడంలో తన వంతు పాత్ర పోషించాడు.కాగా ఐపీఎల్-2024లో ఈ లెఫ్టాండర్ బ్యాటర్ దుమ్మురేపుతున్న విషయం తెలిసిందే. సీఎస్కే తరఫున మిడిలార్డర్ బ్యాటర్‌గా బరిలోకి దిగుతున్న దూబే.. తొమ్మిది ఇన్నింగ్స్‌లో కలిపి 350 పరుగులు చేశాడు.ధనాధన్ ఇన్నింగ్స్ ఆడి జట్టు ఇప్పటి దాకా సాధించిన ఐదు విజయాల్లో తనదైన ముద్ర వేశాడు. ఈ నేపథ్యంలో టీ20 వరల్డ్‌కప్-2024 ఆడనున్న టీమిండియాలో అతడికి తప్పక చోటివ్వాలని డిమాండ్లు పెరిగాయి.ఈ నేపథ్యంలో సీఎస్కే తాజా విజయం నేపథ్యంలో దూబే ఇన్నింగ్స్‌పై స్పందించిన భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘ఈ పిల్లాడు సంచలన ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాడు. అతడిని కేవలం ప్రపంచకప్ జట్టుతో పంపించడమే కాదు.తుదిజట్టులోనూ అతడిని తప్పక ఆడించాలి. కేవలం ఎంపిక గురించి కాదు.. ప్లేయింగ్ ఎలెవన్‌లోనూ చోటివ్వాలని సెలక్టర్లు ఫిక్సైపోవాలి. కెప్టెన్‌గానీ.. మేనేజ్మెంట్ గానీ అతడిని విస్మరించడానికి వీల్లేదు.ప్రస్తుత టీమిండియా ప్లేయర్లలో అతడి కంటే బెటర్‌గా హిట్టింగ్ ఆడే బ్యాటర్ మరొకరు లేరు. ఒకవేళ అతడిని గనుక బెంచ్‌కే పరిమితం చేస్తే అంతకంటే అన్యాయం మరొకటి ఉండదు’’ అని ఆకాశ్ చోప్రా చెప్పుకొచ్చాడు. కాగా జూన్ 1 నుంచి అమెరికా- వెస్టిండీస్ వేదికగా టీ20 ప్రపంచకప్-2024 మొదలుకానుంది. ఈ నేపథ్యంలో జట్ల ప్రకటనకు మే 1 ఆఖరి తేదీగా పేర్కొంది ఐసీసీ. -
రోహిత్, స్కై కాదు!.. వరల్డ్‌కప్‌లో ఒకే ఓవర్లో 6 సిక్స్‌లు కొట్టేది ఇతడే!
2007.. అంతర్జాతీయ క్రికెట్ మండలి మొట్టమొదటి సారి నిర్వహించిన టీ20 వరల్డ్‌కప్ టోర్నీలో నాటి టీమిండియా స్టార్ యువరాజ్ సింగ్ సృష్టించిన పరుగుల విధ్వంసాన్ని అభిమానులు అంత తేలికగా మర్చిపోలేరు.ఒకే ఓవర్లో ఏకంగా ఆరు సిక్సర్లు బాది యువీ అభిమానులకు కన్నుల పండుగ చేశాడు. ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్‌లో ఆరు బంతుల్లో ఆరు సిక్స్‌లు కొట్టి ఏకంగా 36 పరుగులు పిండుకుని.. ప్రపంచంలో ఈ ఘనత సాధించిన తొలి క్రికెటర్‌గా చరిత్రకెక్కాడు.‘న భూతో న భవిష్యతి’ అన్న రీతిలో తాను సాధించిన ఘనత గురించి ఎదురైన ప్రశ్నకు యువరాజ్ సింగ్ ఆసక్తికర సమాధానం ఇచ్చాడు. టీ20 ప్రపంచకప్-2024లో టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా తన ఫీట్‌ను పునరావృతం చేయగలడని భావిస్తున్నట్లు తెలిపాడు.జూన్ 1 నుంచి అమెరికా- వెస్టిండీస్ వేదికగా వరల్డ్‌కప్ ఈవెంట్ ఆరంభం కానున్న విషయం తెలిసిందే. ఈ ఐసీసీ టోర్నీ కోసం మే 1 లోపు జట్లను ప్రకటించేందుకు ఇరవై దేశాల బోర్డులు సిద్ధమయ్యాయి. ఈ నేపథ్యంలో టీమిండియా ఎంపిక గురించి ఇప్పటికే చాలా మంది మాజీ క్రికెటర్లు తమ అభిప్రాయాలు పంచుకున్నారు.అతడికి కూడా ఛాన్స్ ఇవ్వాలిఐపీఎల్-2024లో పేలవ ప్రదర్శన కనబరుస్తున్న పేస్ ఆల్‌రౌండర్, ముంబై ఇండియన్స్ సారథి హార్దిక్ పాండ్యాకు ఈ జట్టులో చోటు దక్కడం కష్టమేనని భావిస్తున్నారు. అతడికి బదులు చెన్నై సూపర్ కింగ్స్ ఆల్‌రౌండర్ శివం దూబేకు ఛాన్స్ ఇవ్వాలని బీసీసీఐకి విజ్ఞప్తి చేస్తున్నారు.ఈ నేపథ్యంలో ఐసీసీతో మాట్లాడిన సందర్భంగా.. ‘‘ఈసారి వరల్డ్‌కప్‌లో ఒకే ఓవర్లో ఆరు సిక్స్‌లు కొట్టగల సత్తా ఎవరికి ఉంది?’’ అని యువరాజ్ సింగ్‌కు ప్రశ్న ఎదురైంది. ఇందుకు బదులిస్తూ.. ‘‘నేనైతే హార్దిక్ పాండ్యానే సాధిస్తాడనుకుంటున్నా’’ అని యువీ పేర్కొన్నాడు. అదే సమయంలో ప్రపంచకప్ జట్టులో శివం దూబేకు కూడా చోటు ఇవ్వాలని యువీ అభిప్రాయపడ్డాడు. ‘‘టీమిండియాలో అతడికి సుస్థిర స్థానం ఉండటం లేదు. కానీ ఐపీఎల్లో మాత్రం బ్యాటింగ్‌తో అదరగొడుతున్నాడు.కాబట్టి అతడిని జట్టులోకి తీసుకుంటే ఉపయోగకరంగా ఉంటుంది’’ అని యువరాజ్ సింగ్ పేర్కొన్నాడు. కాగా వరల్డ్‌కప్-2024లో జూన్ 5న టీమిండియా ఐర్లాండ్‌తో తమ తొలి మ్యాచ్ ఆడనుంది. జూన్ 9న చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో అమీతుమీ తేల్చుకోనుంది.ఇక తొట్టతొలి పొట్టి ప్రపంచకప్-2007ను ధోని సేన గెలుచుకున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత ఇంత వరకు మళ్లీ టీ20 ఫార్మాట్లో టీమిండియా టైటిల్ గెలవలేదు.చదవండి: సహనం కోల్పోయిన గంభీర్... అంపైర్‌తో గొడవ! ఆఖరికి.. View this post on Instagram A post shared by ICC (@icc) -
T20 World Cup 2024: ఓ ఆటగాడి కోసం చీఫ్ సెలెక్టర్‌కు రెకమండ్ చేసిన రైనా
టీమిండియా మాజీ క్రికెటర్, మిస్టర్ ఐపీఎల్ సురేశ్ రైనా ఓ ఆటగాడిగా కోసం బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్‌కు రెకమండ్ చేశాడు. పొట్టి ఫార్మాట్లో భీకర ఫామ్‌లో ఉన్న శివమ్ దూబేను టీ20 వరల్డ్‌కప్ 2024కు ఎంపిక చేయాలని విజ్ఞప్తి చేశాడు. ఈ మేరకు ఓ ట్వీట్ చేశాడు. శివమ్ దూబే కోసం వరల్డ్‌కప్ లోడ్ అవుతుంది. అగార్కర్ భాయ్.. దయ చేసి దూబేని సెలెక్ట్ చేయండని రైనా ట్వీట్ ద్వారా అగార్కర్‌ను కోరాడు.ఓ మాజీ ఆటగాడు ఓ ఆటగాడి కోసం రెకమండ్ చేయడం చాలా అరుదుగా చూస్తుంటాం. బహుశా పేరున్న ఏ క్రికెటర్ కూడా ఇలా చేసి ఉండడు. అయితే రైనా మాత్రం తన ఇగోను, ఇతర విషయాలను పక్కన పెట్టి భీకర ఫామ్‌లో ఉన్న శివమ్ దూబేను వరల్డ్‌కప్ జట్టుకు సెలెక్ట్ చేయాలని చీఫ్ సెలక్టర్‌ను కోరాడు. ఏప్రిల్ నెలాఖరులోపు వరల్డ్‌కప్‌లో పాల్గొనే భారత జట్టును ఎంపిక చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో రైనా ప్రతిపాదన ట్వీట్ ప్రాధాన్యత సంతరించుకుంది. World Cup loading for Shivam dube ! @imAagarkar bhai select karo please 🇮🇳🙏 https://t.co/b7g0BxHRSp— Suresh Raina🇮🇳 (@ImRaina) April 23, 2024 కాగా, మీడియం పేస్ బ్యాటింగ్ ఆల్‌రౌండర్ అయిన శివమ్ దూబే ఇటీవలి కాలంలో అద్భుతంగా రాణిస్తున్నాడు. టీమిండియాలో ఆల్‌రౌండర్ స్థానానికి దూబే పర్ఫెక్ట్ సూట్ అని చాలామంది అభిప్రాయపడుతున్నారు. టీమిండియా ఆల్‌రౌండర్‌గా చెప్పుకునే హార్దిక్ పాండ్యా చెత్త ప్రదర్శనలతో కాలం వెల్లదీస్తున్న తరుణంలో దూబే భారత క్రికెట్ అభిమానుల పాలిట ఆశాదీపంలా కనిపిస్తున్నాడు.దూబేకు బంతితోనూ సరైన అవకాశాలు లభిస్తే.. వరల్డ్‌కప్‌లో సంచలనాలు సృష్టించే అవకాశం ఉంది. దూబే బ్యాటింగ్ సామర్థ్యం గురించి ఇప్పటికే చాలా తెలుసుకున్నాం. ఇటీవల ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన టీ20 సిరీస్‌లోనూ దూబే వరుస అర్దశతకాలతో విరుచుకుపడ్డాడు. ఐపీఎల్లో దూబే బ్యాటింగ్ మెరుపులు పతాక స్థాయిలో ఉన్నాయి.ప్రస్తుత సీజన్లో అతను ఇప్పటికే మూడు అర్దసెంచరీలు చేశాడు. తాజాగా లక్నోతో జరిగిన మ్యాచ్‌లో ఇరదీశాడు. ఈ మ్యాచ్‌లో అతను 27 బంతుల్లో 3 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 66 పరుగులు చేశాడు. ఐపీఎల్లో ఇంపాక్ట్ ప్లేయర్ ఆప్షన్ వల్ల దూబేకు బౌలింగ్ చేసే అవకాశం రావడం లేదు. దూబే ఒకటి రెండు మ్యాచ్‌ల్లో బంతితో రాణిస్తే వరల్డ్‌కప్ బెర్త్ దక్కడం ఖాయం. -
శివాలెత్తిన శివమ్ దూబే.. వరల్డ్ కప్ టికెట్ పక్కా? వీడియో వైరల్
ఐపీఎల్-2024లో చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ ఆల్‌రౌండర్ శివమ్ దూబే మరోసారి సంచలన ఇన్నింగ్స్ ఆడాడు. ఈ మెగా ఈవెంట్లో భాగంగా చెపాక్ వేదికగా లక్నో సూపర్ జెయింట్స్‌తో మ్యాచ్‌లో దూబే ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. లక్నో బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఎప్పుడూ స్పిన్నర్లను టార్గెట్ చేసే దూబే.. ఈ మ్యాచ్‌లో మాత్రం లక్నో ఫాస్ట్ బౌలర్లను ఊచకోత కోశాడు. ముఖ్యంగా లక్నో పేసర్ యష్ ఠాకూర్‌ను దూబే ఓ ఆట ఆడుకున్నాడు. 16 ఓవర్ వేసిన యష్ ఠాకూర్ బౌలింగ్‌లో హ్యాట్రిక్ సిక్స్‌లు బాదాడు. ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో కేవలం 27 బంతులు మాత్రమే ఎదుర్కొన్న దూబే.. 3 ఫోర్లు, 7 సిక్స్‌లతో 66 పరుగులు చేశాడు. అతడి విధ్వంసకర ఇన్నింగ్స్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్లు దూబేకు టీ20 వరల్డ్‌కప్ జట్టులో కచ్చితంగా చోటుదక్కుతుందని కామెంట్లు చేస్తున్నాడు. కాగా ఈ ఏడాది సీజన్లో దూబే అదరగొడుతున్నాడు. ఇప్పటివరకు 8 మ్యాచ్‌లు ఆడిన దూబే.. 51.83 సగటుతో 311 పరుగులు చేశాడు. ఈ క్రమంలో టీ20 వరల్డ్‌కప్ జట్టులో హార్దిక్ పాండ్యా స్ధానంలో దూబేకు ఛాన్స్ ఇవ్వాలని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. pic.twitter.com/uaqdwKYbWm — Cricket Videos (@cricketvid123) April 23, 2024 -
దూబే చీటింగ్ చేశాడా..? జేబులు చెక్ చేసిన అంపైర్! ఫోటోలు వైరల్
ఐపీఎల్-2024లో చెన్నై సూపర్ కింగ్స్ మూడో ఓటమి చవిచూసింది. ఏక్నా స్టేడియం వేదికగా లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో సీఎస్కే ఓటమి పాలైంది. చెన్నై బ్యాటింగ్‌లో పర్వాలేదన్పించనప్పటికి.. బౌలింగ్‌లో మాత్రం పూర్తిగా తేలిపోయింది. 177 పరుగుల లక్ష్యాన్ని సీఎస్కే బౌలర్లు కాపాడుకోలేకపోయారు. 177 పరుగుల లక్ష్యాన్ని లక్నో 19 ఓవర్లలో కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి చేధించింది. అయితే ఈ మ్యాచ్‌లో ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. సీఎస్కే బ్యాటింగ్ సందర్భంగా ఆ జట్టు మిడిల్ ఆర్డర్ బ్యాటర్ శివమ్ దూబే జేబులను ఆన్ ఫీల్డ్ అంపైర్ చెక్ చేశాడు. దూబే క్రీజులోకి వచ్చిన తర్వాత ఇన్నింగ్స్ మధ్యలో అంపైర్ అనిల్ చౌదరీ.. అతడి దగ్గరకు వెళ్లి అనుమానాస్పదంగా జేబులను తనిఖీ చేశాడు. ఇందుకు సంబంధిచిన ఫోటోలు సోషల్ మీడియా కాగా అంపైర్లు ఇలా ఆటగాళ్ల జేబులను చెక్ చేయడం చాలా అరుదుగా జరుగుతుంటుంది. అయితే అంపైర్ దూబే పాకెట్స్‌ను చెక్ చేయడానికి గల కారణమైతే ఇప్పటివరకు తెలియలేదు. కానీ అంపైర్లు అప్పుడప్పుడు ఆటగాళ్లు తమతో పాటు బంతి స్ధితిని మార్చే వస్తువులు ఏమైనా తీసుకు వచ్చారేమోనని అనుమానంతో తనిఖీ చేస్తూ ఉంటారు. అదే విధంగా ఆటగాళ్లు అంపైర్లు అనుమతి లేకుండా ఎటువంటి క్రీమ్స్ గానీ అయింట్మెంట్లు గాని వాడకూడదు. కాగా ఈ మ్యాచ్‌లో దూబే కేవలం 3 పరుగులు మాత్రమే చేశాడు. What Umpire is checking on the Shivam Dube's Pocket? pic.twitter.com/xi4ipbWyNR — Jay Cricket. (@Jay_Cricket18) April 19, 2024 What’s happening here between the umpire and #ShivamDube?#IPL2024 #CSKvsLSG #MSDhoni #Thala #Mahi #Yellove #WhistlePodu pic.twitter.com/Q5AZ5z1Rn1 — Run Chase HQ (@runchaseHQ) April 19, 2024 -
ఆ రూల్ వల్ల భారత ఆల్రౌండర్లకు చాలా నష్టపోతున్నారు: రోహిత్ శర్మ
ఐపీఎల్లో అమల్లో ఉన్న ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధనపై టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఈ నిబంధన వల్ల భారత ఆల్‌రౌండర్లు చాలా నష్టపోతున్నారని వాపోయాడు. వాషింగ్టన్ సుందర్, శివమ్ దూబే లాంటి వారు తమ బౌలింగ్ నైపుణ్యాన్ని ప్రదర్శించుకోవడానికి వీలు లేకుండా పోయిందని అన్నాడు. ఓవరాల్‌గా ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధనకు తాను అభిమానిని కాదని పేర్కొన్నాడు. వినోదం కోసం నిబంధనలను ఇంతలా సడలించాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డాడు. తాజాగా జరిగిన ఓ పోడ్కాస్ట్లో హిట్‌మ్యాన్ ఇంపాక్ట్ ప్లేయర్ రూల్‌పై తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. ఈ పోడ్కాస్ట్లో రోహిత్ క్రికెటర్లకు సంబంధించిన చాలా విషయాలను షేర్ చేసుకున్నాడు. కాగా, ఐపీఎల్లో ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధనను 2023 సీజన్లో ప్రవేశపెట్టారు. ఈ రూల్ వల్ల అన్ని జట్లు అవసరానికి అనుగుణంగా ఓ అదనపు ప్లేయర్ సేవలను వినియోగించుకునే అవకాశం ఉంటుంది. ఉదాహరణకు తొలుత బ్యాటింగ్ చేసే జట్టు అదనంగా ఓ బ్యాటర్‌ను వినియోగించుకుంటుంది. అలాగే తొలుత బౌలింగ్ చేసే జట్టుకు అదనంగా ఓ బౌలర్ సేవలు వినియోగించుకునే అవకాశం ఉంటుంది. మొత్తంగా చూస్తే 11 మంది ఆడాల్సిన క్రికెట్ ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన వల్ల 12 మంది క్రికెట్‌గా మారింది. శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్ లాంటి ఆల్‌రౌండర్లు కేవలం బ్యాటింగ్‌కే పరిమితమవుతున్నారు. దీని వల్ల వారిని ఆల్రౌండర్లుగా పరిగణించలేని పరిస్థితి ఏర్పడింది. దేశానికి ప్రాతినిథ్యం వహించే సమయంలో ఆల్రౌండర్లకు డిమాండ్ ఉంటుంది. అలాంటప్పుడు వీరు ఏదో ఒక విభాగానికే పరిమితమైతే వారి కెరీర్లు ఇరుకున పడే ప్రమాదం ఉంది. -
పేసర్లనూ చితక్కొడుతున్నాడు.. ఈ హిట్టర్‌కు చోటిచ్చేస్తారా?
చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ శివం దూబే సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. గతేడాది అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న ఈ పేస్ ఆల్‌రౌండర్.. ఐపీఎల్-2024లోనూ బ్యాట్ ఝులిపిస్తూ సత్తా చాటుతున్నాడు. తాజాగా ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లోనూ శివం శివాలెత్తిపోయాడు. నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేసిన ఈ లెఫ్టాండర్ మొత్తంగా 38 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్స్‌ల సాయంతో 66 పరుగులతో అజేయంగా నిలిచాడు. వాంఖడేలో ముంబై జట్టును సీఎస్కే మట్టికరిపించడంలో కీలక పాత్ర పోషించాడు. Dube not leaving the shift key today, IYKYK 😉😏#MIvCSK #TATAIPL #IPLonJioCinema #IPLinBhojpuri pic.twitter.com/vHZH0TWe4q — JioCinema (@JioCinema) April 14, 2024 ఈ క్రమంలో శివం దూబేపై ప్రశంసల వర్షం కురుస్తోంది. టీమిండియా వైస్ కెప్టెన్, పేస్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాతో పోలుస్తూ శివం దూబేకే టీ20 ప్రపంచకప్-2024లో ఆడే అర్హత ఎక్కువగా ఉందంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. అయితే, శివం దూబే కేవలం స్పిన్నర్ల బౌలింగ్‌లో మాత్రమే ఆడగలడని.. కాబట్టి ప్రపంచకప్ టోర్నీలో ఆడించాలనడం తొందరపాటే అవుతుందని కొంతమంది విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. ఈ వాదనలను తాజాగా తప్పని నిరూపించాడు దూబే. ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో స్పిన్ బౌలింగ్‌లో అతడు ఒకే ఒక్క బంతి ఎదుర్కొన్నాడు. మిగిలిన ముప్పై ఏడు బంతులు పేసర్లు సంధించినవే! దూబేను అవుట్ చేసేందుకు జస్ప్రీత్ బుమ్రా వంటి వరల్డ్ క్లాస్ బౌలర్‌తో పాటు.. ఆకాశ్ మధ్వాల్, రొమారియో షెఫర్డ్లతో తానూ బరిలోకి దిగినా ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఫలితం రాబట్టలేకపోయాడు. Most sixes since IPL 2022 - 🔹 66 Shivam Dube 🔹 66 Nicholas Pooran Dube : 34 sixes vs Spinners, 32 sixes vs Pacers - He is not just a spin smasher 💥#TATAIPL #IPL2024 #MIvCSK #MIvsCSK #CSKvsMI #CSKvMIpic.twitter.com/5cQlVDyTMr — TCTV Cricket (@tctv1offl) April 15, 2024 బంతిని సరిగ్గా అంచనా వేస్తూ తెలివైన షాట్లతో విరుచుకుపడుతున్న దూబేను ఆపడం ముంబై పేసర్ల తరం కాలేదు. తద్వారా ఫాస్ట్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కోలేడన్న అభిప్రాయాలను పటాపంచలు చేశాడు. రానున్న వరల్డ్‌కప్‌లో ఆడేందుకు తనకు వందకు వంద శాతం ఆడే అర్హత ఉందని తన బ్యాటింగ్ నైపుణ్యాలతో చెప్పకనే చెబుతున్నాడీ లెఫ్టాండ్ బ్యాటర్. ఈ నేపథ్యంలో విండీస్ దిగ్గజం బ్రియన్ లారా వంటి దిగ్గజాలు సైతం వెస్టిండీస్- అమెరికా వేదికగా సాగే టీ20 వరల్డ్‌కప్ ఈవెంట్‌కు భారత జట్టులో శివం దూబేకు చోటు ఇవ్వాలని టీమిండియా సెలక్టర్లకు విజ్ఞప్తి చేస్తున్నారు. మరోవైపు.. హార్దిక్ పాండ్యా అటు ముంబై ఇండియన్స్ సారథిగా.. ఇటు ఆల్‌రౌండర్‌గా చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేకపోతున్నాడు. ఫలితంగా దూబేనే ప్రత్యామ్నాయంగా కనిపిస్తున్నాడు. మరి మీరేమంటారు?!.. ఐపీఎల్-2023 నుంచి తాజా ఎడిషన్‌లో ఇప్పటి వరకు శివం దూబే ఇన్నింగ్స్ ఇలా... 19(18), 27(16), 28(26), 8(9), 52(27), 50(21), 52(33), 28(17), 26*(18), 25(12), 48*(34), 22(9), 1(3), 32*(21), 34*(28), 51(23), 18(17), 45(24), 28(18) & 66*(38). హిట్టర్ సిక్స్‌ల వర్షం ఇక ఐపీఎల్-2022 నుంచి ఇప్పటి వరకు శివం దూబే మొత్తంగా 66 సిక్సర్లు బాదాడు. ఇందులో స్పిన్నర్ల బౌలింగ్‌లో బాదినవి 34.. పేసర్ల బౌలింగ్‌లో సాధించినవి 32. చదవండి: #DHONI: ‘మరేం పర్లేదు’.. రోహిత్‌ను ఓదార్చిన ధోని.. ఫొటోలు వైరల్ var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_7552012696.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
టీ20 వరల్డ్‌కప్ జట్టులో హార్దిక్‌కు నో ఛాన్స్.. అతడికే అవకాశం?
ఐపీఎల్-2024 సీజన్ ముగిసిన వెంటనే మరో క్రికెట్ మహాసంగ్రామానికి తెరలేవనుంది. జాన్ 1 నుంచి టీ20 వరల్డ్‌కప్-2024 షురూ కానుంది. ఈ ఏడాది పొట్టిప్రపంచకప్నకు అమెరికా, వెస్టిండీస్‌లు సంయుక్తంగా సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్నాయి. అయితే ఈ మెగా ఈవెంట్ కోసం భారత జట్టును బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఏప్రిల్ చివరి ప్రకటించే అవకాశముంది. ఈ నేపథ్యంలో భారత టీ20 వరల్డ్‌కప్ జట్టులో ఎవరుండాలన్న అన్న విషయంపై మాజీలు తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. తాజాగా ఈ జాబితాలో భారత మాజీ క్రికెటర్ మనోజ్ తివారీ చేరాడు. వరల్డ్‌కప్ జట్టులో హార్దిక్ పాండ్యాకు కాకుండా ఆల్‌రౌండర్ శివమ్ దూబేకు ఛాన్స్ ఇవ్వాలని తివారీ సూచించాడు. "హార్దిక్ పాండ్యా ఆల్ రౌండర్‌గా భారత టీ20 ప్రపంచకప్ జట్టులో చోటు దక్కించుకోవాలంటే కచ్చితంగా ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో బౌలింగ్ చేయాలి. గత మూడు మ్యాచ్‌ల నుంచి హార్దిక్ బౌలింగ్ చేయడం లేదు. అంతకముందు బౌలింగ్ చేసినా దాదాపు 11 పైగా ఏకనామీతో పరుగులు సమర్పించుకున్నాడు. హార్దిక్ ప్రస్తుత ఫామ్‌ను చూస్తే టీ20 వరల్డ్‌కప్ జట్టులో చోటు దక్కించుకోవడం కష్టమనే చెప్పుకోవాలి. అగార్కర్ సెలక్షన్ కమిటీ చైర్మెన్‌గా ఉన్నాడు కాబట్టి కచ్చితంగా కొన్ని సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటాడు. శివమ్ దూబే కచ్చితంగా సెలక్టర్ల దృష్టిలో ఉంటాడని నేను భావిస్తున్నాను. ఒక వేళ టీ20 ప్రపంచకప్ జట్టులో దూబేకు చోటు దక్కకపోతే అందుకు బాధ్యత సీఎస్కే వహించాల్సి ఉంటుంది. ఎందుకంటే ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో చెన్నై అతడికి బౌలింగ్ చేసే ఛాన్స్ ఇవ్వడం లేదు. హార్దిక్‌కు ప్రత్నామ్యాయంగా దూబేను సెలక్టర్లు ఎంపిక చేస్తారని నేను ఆశిస్తున్నానని" క్రిక్‌బజ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తివారీ పేర్కొన్నాడు. కాగా ఐపీఎల్-2024లో శివమ్ దూబే దుమ్ములేపుతున్నాడు. మిడిలార్డర్ బ్యాటర్లలో బ్యాటింగ్‌కు వచ్చి సీఎస్కే విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. -
హార్దిక్ పాండ్యాపై సంచలన వ్యాఖ్యలు చేసిన టీమిండియా మాజీ క్రికెటర్
ముంబై ఇండియన్స్ సారధి హార్దిక్ పాండ్యాపై టీమిండియా మాజీ ప్లేయర్, బెంగాల్ క్రీడా మంత్రి మనోజ్ తివారీ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుత ఫామ్‌తో హార్దిక్ టీ20 వరల్డ్‌కప్‌కు ఎంపిక కావడం కష్టమని మనోజ్ అన్నాడు. హార్దిక్‌కు ప్రత్యామ్నాయంగా ఆల్‌రౌండర్ కోటాలో శివమ్ దూబేను ఎంపిక చేయాలని సూచించాడు. ఐపీఎల్లో హార్దిక్ బౌలర్‌గా పేలవ ప్రదర్శన చేస్తున్నాడని తెలిపాడు. వరల్డ్‌కప్‌కు ఎంపిక కావాలంటే హార్దిక్ బౌలింగ్‌పై దృష్టి పెట్టాలని సూచించాడు. ఐపీఎల్లో హార్దిక్ గత మూడు మ్యాచ్‌ల్లో కలిపి కేవలం ఒకే ఒక ఓవర్ వేశాడని.. ఈ సీజన్లో అతని ఎకానమీ రేట్ 11కు పైగా ఉందని గుర్తు చేశాడు. భారత జట్టు తరఫున ఆల్‌రౌండర్‌గా ఆడాలంటే హార్దిక్ బౌలింగ్‌లో తప్పక రాణించాల్సి ఉందని అన్నాడు. బౌలర్‌గా సత్తా చాటకపోతే భారత చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ హార్దిక్‌కు వరల్డ్‌కప్ జట్టుకు ఎంపిక చేయడని చెప్పాడు. హార్దిక్‌కు ప్రత్యామ్నాయంగా ఎంపిక కావాలంటే దూబే కూడా బౌలింగ్‌లో రాణించాల్సి ఉంటుందని తెలిపాడు. కేవలం బ్యాటింగ్ మెరుపులతో శివమ్ దూబే వరల్డ్‌కప్ జట్టుకు ఎంపిక కాలేడని అన్నాడు. దూబే వరల్డ్‌కప్ జట్టుకు ఎంపిక కావాలంటే ఐపీఎల్లో ఎక్కువగా బౌలింగ్ చేయాలని సూచించాడు. ఒకవేళ దూబే వరల్డ్‌కప్ జట్టుకు ఎంపిక కాలేదంటే అది సీఎస్కే తప్పే అవుతుందని అన్నాడు. సీఎస్కే కెప్టెన్ దూబేను బౌలర్‌గా కూడా వాడుకోవాలని సూచించాడు. ఈ సీజన్లో దూబే బౌలింగ్ సేవలను సీఎస్కే పెద్దగా వినియోగించుకోలేదని గుర్తు చేశాడు. దూబే చాలా తెలివైన బౌలర్ అని మనోజ్ కితాబునిచ్చాడు. ఇలాంటి స్మార్ట్ బౌలర్‌ను సీఎస్కే ఎందుకు వినియోగించుకోవడం లేదో అర్దం కావట్లేదని ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. దూబే, వెంకటేశ్ అయ్యర్ (కేకేఆర్ ఆల్‌రౌండర్) లాంటి ఆల్‌రౌండర్లతో ఆయా జట్లు ఎందుకు బౌలింగ్ చేయించట్లేదో అంతు చిక్కడం లేదని అన్నాడు. కాగా, ఈ ఏడాది జూన్ 1 నుంచి మొదలయ్యే టీ20 వరల్డ్‌కప్ కోసం భారత జట్టును ఈ నెలాఖరులోగా ప్రకటించే అవకాశం ఉంది. టీమిండియా బెర్తులు ఎవరెవరికి ఖరారవుతాయనేది ఐపీఎల్ ప్రదర్శనలపై ఆధారపడి ఉంటుంది. శివమ్ దూబేను సెలెక్టర్లు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్లు తెలుస్తుంది. -
'అతడొక సూపర్ స్టార్.. టీ20 వరల్డ్‌కప్‌లో ఆడాల్సిందే'
ఐపీఎల్-2024లో చెన్నై సూపర్ కింగ్స్ ఆల్‌రౌండర్ శివమ్ దూబే తన సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. ఈ మెగా ఈవెంట్లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో శివమ్ దూబే మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. క్రీజులోకి వచ్చినప్పటి నుంచే ప్రత్యర్ధి బౌలర్లపై దూబే విరుచుకుపడ్డాడు. తన ట్రేడ్ మార్క్ షాట్లతో దూబే అలరించాడు. స్పిన్నర్లను దూబే టార్గెట్ చేశాడు. కేవలం 24 బంతుల్లో 4 సిక్స్‌లు , 2 ఫోర్లతో 45 పరుగులు చేసి ఔటయ్యాడు. ఈ నేపథ్యంలో దూబేపై భారత మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ ప్రశంసల వర్షం కురిపించాడు. దూబే అద్బుతమైన బ్యాటింగ్ స్కిల్స్ కలిగి ఉన్నాడని పఠాన్ కొనియాడు. "నేనే సెలక్టర్ అయితే శివమ్ దూబేను కచ్చితంగా టీ20 వరల్డ్‌కప్‌నకు ఎంపిక చేస్తాను. అతడికి అద్బుతమైన పవర్ హిట్టింగ్ స్కిల్స్ ఉన్నాయి. అంతే కాకుండా స్పిన్నర్లను చీల్చి చెండాడతున్నాడు. క్రీజులోకి వచ్చినప్పటి నుంచే స్పిన్నర్లను ఎటాక్ చేస్తున్నాడు. ఈ ఏడాది సీజన్లో కాకుండా గత ఏడాది సీజన్లో కూడా దూబే స్పిన్నర్లకు అద్బుతంగా ఆడాడు. అటువంటి ఆటగాడు జట్టుకు అందుబాటులో ఉన్నప్పుడు ఎందుకు ఎంపికచేయరు? అతడి ఆటను సెలక్టర్లు చూస్తున్నరని నేను భావిస్తున్నాను. కాబట్టి టీ20 వరల్డ్‌కప్ జట్టులో చోటు ఇవ్వండి. దూబే స్పిన్నర్లను మాత్రం కాదు ఫాస్ట్ బౌలర్లకు కూడా అద్బుతంగా ఆడుతాడు. అతడు ముంబై నుండి వచ్చాడని మర్చిపోవద్దు. ముంబైలో పిచ్‌లు ఎక్కువగా బౌన్స్ అవుతాయి. కాబట్టి అతడు పేసర్లను కూడా సమర్ధవంతంగా ఎదుర్కోగలడని" స్టార్ స్పోర్ట్స్ షోలో పఠాన్ పేర్కొన్నాడు. -
CSK: ఆ రెండు తప్పుల వల్లే ఓడిపోయాం: రుతురాజ్
సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్‌లో మెరుగైన ఆరంభం అందుకున్నా .. దానిని నిలబెట్టుకోలేకపోయామని చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ అన్నాడు. ఉప్పల్ పిచ్‌పై 170- 175 పరుగులు చేసి ఉంటే ఫలితం కాస్త వేరుగా ఉండేదని అభిప్రాయపడ్డాడు. ఏదేమైనా సన్‌రైజర్స్ ఆటగాళ్లు తెలివిగా బ్యాటింగ్ చేశారని కొనియాడాడు. కాగా ఐపీఎల్-2024లో సీఎస్కే తమ నాలుగో మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌తో తలపడింది. హైదరాబాద్‌లో శుక్రవారం జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆతిథ్య జట్టు తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఓపెనర్లలో రచిన్ రవీంద్ర(12) మరోసారి తేలిపోగా.. రుతురాజ్ గైక్వాడ్(26) కాస్త మెరుగ్గా బ్యాటింగ్ చేశాడు. ఇక ఉప్పల్ పిచ్ స్లోగా ఉండటంతో రన్స్ తీయడానికి ఇబ్బంది పడ్డ రహానే 30 బంతులు ఎదుర్కొని 35 పరుగులు చేయగా.. శివం దూబే మాత్రం మెరుపులు(24 బంతుల్లో 45) మెరిపించాడు. స్పిన్నర్లను అటాక్ చేస్తూ పరుగులు రాబట్టాడు. 𝘿𝙪𝙗𝙚 𝘿𝙚𝙢𝙤𝙡𝙞𝙩𝙞𝙤𝙣 💥#SRHvCSK #TATAIPL #IPLonJioCinema pic.twitter.com/j2pCdp0VAF — JioCinema (@JioCinema) April 5, 2024 దీంతో స్పిన్నర్లను పక్కనపెట్టి పేసర్లను దించిన రైజర్స్ సారథి ప్యాట్ కమిన్స్ తన బౌలింగ్‌లో దూబేను అవుట్ చేశాడు. అనంతరం జడ్డూ(31- నాటౌట్), డారిల్ మిచెల్(13) కాసేపు బ్యాట్ ఝులిపించినా.. ఆఖరి ఐదు ఓవర్లలో సీఎస్కేకు కేవలం 38 పరుగులు మాత్రమే వచ్చాయి. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి సీఎస్కే 165 పరుగులు చేసింది. అనంతరం సన్‌రైజర్స్ 18.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి విజయఢంకా మోగించింది. ఆరంభంలో ట్రవిస్ హెడ్ క్యాచ్‌ను మొయిన్ అలీ మిస్ చేయగా అతడికి లైఫ్ లభించింది. ఇక పవర్ ప్లేలో విధ్వంసరచన చేసిన అభిషేక్ శర్మ (12 బంతుల్లోనే 37 రన్స్)రైజర్స్ గెలుపులో కీలక పాత్ర పోషించాడు. Abhishek sambhavam 🔥🤩#SRHvCSK #IPLonJioCinema #TATAIPL pic.twitter.com/rkekTCQOve — JioCinema (@JioCinema) April 5, 2024 ఆ రెండు తప్పులే కొంపముంచాయి ఈ నేపథ్యంలో ఓటమిపై స్పందించిన సీఎస్కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్.. ‘‘ఈ పిచ్ చాలా స్లోగా ఉంది. వాళ్ల బౌలర్లు పరిస్థితులను చక్కగా ఉపయోగించుకుని మమ్మల్ని దెబ్బకొట్టారు. ఆరంభంలో మేము బాగానే ఆడాం. అయితే, తర్వాత వాళ్లు పైచేయి సాధించారు. ఇది నల్లరేగడి పిచ్.. నెమ్మదిగా ఉంటుందని ముందే అంచనా వేశాం. కానీ.. కానీ మ్యాచ్ సాగుతున్న కొద్దీ మరింత స్లో అయిపోయింది. పవర్ ప్లేలో మేము ధారాళంగా పరుగులు సమర్పించుకోవడం, ఓ క్యాచ్ మిస్ చేయడం తీవ్ర ప్రభావం చూపింది. అయినప్పటికీ ప్రత్యర్థిని 19వ ఓవర్ వరకు తీసుకువచ్చాం’’ అని పేర్కొన్నాడు. ఆఖరి వరకు లక్ష్యాన్ని కాపాడుకునేందుకు తాము పోరాడమని చెప్పుకొచ్చాడు. ఏదేమైనా పవర్ ప్లేలో రైజర్స్‌ను కట్టడి చేయకపోవడమే తమ ఓటమికి కారణం అని రుతురాజ్ గైక్వాడ్ అంగీకరించాడు. చదవండి: జడ్డూ అవుట్ కావాలి కదా? కమిన్స్ ఎందుకు వదిలేశాడు? వీడియో వైరల్ var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_7522010156.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
శివమ్ దూబే మెరుపులు.. టీ20 వరల్డ్‌కప్‌కు ఎంపిక చేయాల్సిందే! వీడియో వైరల్
ఐపీఎల్-2024లో చెన్నై సూపర్ కింగ్స్ ఆల్‌రౌండర్ శివమ్ దూబే మరోసారి మెరుపులు మెరిపించాడు. ఈ మెగా ఈవెంట్లో భాగంగా హైదరాబాద్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్‌లో దూబే అద్బుత ఇన్నింగ్స్ ఆడాడు. నాలుగో స్ధానంలో బ్యాటింగ్‌కు వచ్చిన దూబే ఎస్ఆర్హెచ్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ముఖ్యంగా స్పిన్నర్లను దూబే టార్గెట్ చేశాడు. దూబే కేవలం 24 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్‌లతో 45 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్లు దూబేను కచ్చితంగా టీ20 వరల్డ్ కప్‌నకు ఎంపిక చేయాలని కామెంట్లు చేస్తున్నారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే..తొలుత బ్యాటింగ్‌కు దిగిన సీఎస్కే నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. సీఎస్కే బ్యాటర్లలో శివమ్ దూబే(45) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. రహానే(35), జడేజా(31) పరుగులతో రాణించాడు. ఇక ఎస్ఆర్హెచ్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. భువనేశ్వర్ కుమార్, టి నటరాజన్, పాట్ కమ్మిన్స్, జయ్‌దేవ్ ఉనద్కట్, షాబాజ్ అహ్మద్ తలా వికెట్ సాధించారు. DUBE goes 𝘄𝗵𝗮𝗺-𝗯𝗮𝗺! 💥💥#ShivamDube's 45 (24) gave #CSK the momentum they needed! How many more runs will Chennai post on the board tonight? Tune in to #SRHvCSK in #IPLOnStar LIVE NOW only on Star Sportspic.twitter.com/iVf1H5VASW — Star Sports (@StarSportsIndia) April 5, 2024 -
వాళ్లిద్దరూ అదరగొట్టారు.. ఫీల్డింగ్ కూడా అద్భుతం: రుతురాజ్
ఐపీఎల్-2024లో వరుసగా రెండో విజయం సాధించడం పట్ల చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ హర్షం వ్యక్తం చేశాడు. సమిష్టి కృషితో గుజరాత్ టైటాన్స్ వంటి పటిష్ట జట్టును ఓడించామని పేర్కొన్నాడు. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో ప్రతి ఒక్క సీఎస్కే ఆటగాడూ రాణించాడని ప్రశంసలు కురిపించాడు. కాగా క్యాష్ రిచ్ లీగ్ పదిహేడో ఎడిషన్ ఆరంభ మ్యాచ్‌లో ఆర్సీబీని ఓడించిన సీఎస్కే.. తాజాగా గుజరాత్ టైటాన్స్‌ను చిత్తు చేసింది. సొంతమైదానం చెపాక్‌లో మంగళవారం నాటి మ్యాచ్‌లో 63 పరుగుల తేడాతో శుబ్‌మన్ గిల్ సేనపై జయభేరి మోగించింది. 2⃣ in 2⃣ for Chennai Super Kings 👏👏 That's some start to #TATAIPL 2024 for the men in yellow 💛 Scorecard ▶️ https://t.co/9KKISx5poZ#TATAIPL | #CSKvGT | @ChennaiIPL pic.twitter.com/njrS8SkqcM — IndianPremierLeague (@IPL) March 26, 2024 ఈ నేపథ్యంలో విజయానంతరం సీఎస్కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ మాట్లాడుతూ.. ‘‘ఈరోజు మ్యాచ్ పరిపూర్ణమైంది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో మా వాళ్లు అదరగొట్టారు. సాధారణంగా చెన్నైలో వికెట్ ఎలా ఉంటుందో కచ్చితంగా అంచనా వేయలేం. అందుకే తొలుత బ్యాటింగ్ చేసినా.. బౌలింగ్ చేసినా రాణించడం మాత్రం ముఖ్యం. అయితే, వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడితే ఆఖర్లో మనకు ఉపయోగకరంగా ఉంటుంది. ఇక ఈరోజు రచిన్ పవర్ ప్లేలో అత్యద్బుతంగా బ్యాటింగ్ చేశాడు. మ్యాచ్ స్వరూపాన్ని మార్చి వేశాడు. అదే విధంగా.. దూబే.. అతడికి ఆత్మవిశ్వాసం మెండు. మేనేజ్మెంట్తో పాటు మహీ భాయ్ కూడా వ్యక్తిగతంగా అతడిని మెటివేట్ చేశాడు. జట్టులో తన పాత్ర ఏమిటో అతడికి బాగా తెలుసు. దూబే జట్టుతో ఉండటం మాకు అతిపెద్ద సానుకూలాంశం. ఇక ఈరోజు నేను మా వాళ్ల ఫీల్డింగ్‌కు కూడా ఫిదా అయ్యాను’’ అని పేర్కొన్నాడు. గుజరాత్‌తో మ్యాచ్‌లో ఆటగాళ్లంతా సమిష్టిగా రాణించడం వల్లే గెలుపు సాధ్యమైందని రుతురాజ్ గైక్వాడ్ పేర్కొన్నాడు. కాగా మంగళవారం నాటి మ్యాచ్‌లో టాస్ గెలిచిన గుజరాత్ తొలుత బౌలింగ్ చేసింది. Jubilant Chepauk 🏟️ witnessed @ChennaiIPL's consecutive win as they beat @gujarat_titans by a resounding 63 runs 💪 Recap of the #CSKvGT clash 🎥 👇 #TATAIPL pic.twitter.com/reeLzs1IEh — IndianPremierLeague (@IPL) March 27, 2024 చెన్నై ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్(36 బంతుల్లో 46), రచిన్ రవీంద్ర(20 బంతుల్లో 46) రాణించగా.. నాలుగో స్థానంలో వచ్చిన శివం దూబే(23 బంతుల్లో 51) ధనాధన్ ఇన్నింగ్స్‌తో మెరుపు అర్ధ శతకం సాధించాడు. డారిల్ మిచెల్(24- నాటౌట్) సైతం తన వంతు పరుగులు జతచేశాడు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి చెన్నై 206 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. లక్ష్య ఛేదనలో తడబడ్డ గుజరాత్ 143 పరుగుల వద్దే నిలిచిపోవడంతో సీఎస్కే చేతిలో ఓటమి తప్పించుకోలేకపోయింది. చెన్నై బౌలర్లలో దీపక్ చహర్, ముస్తాఫిజుర్ రహ్మాన్, తుషార్ దేశ్‌పాండే తలా రెండు వికెట్లు పడగొట్టగా.. డారిల్ మిచెల్, మతీశ పతిరణ ఒక్కో వికెట్ తీశారు. చదవండి: #WHAT A CATCH: వారెవ్వా ధోని.. 42 ఏళ్ల వయస్సులో కళ్లు చెదిరే క్యాచ్! వీడియో -
CSK Vs GT: చెన్నై ధనాధన్ గెలుపు
చెన్నై: డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్‌కింగ్స్ ఆల్‌రౌండ్ షోకు నిరుటి రన్నరప్ గుజరాత్ టైటాన్స్ పోరాటం వదిలి చేతులెత్తేసింది. మంగళవారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో చెన్నై 63 పరుగుల తేడాతో గుజరాత్‌పై ఘనవిజయం సాధించింది. మొదట చెన్నై 20 ఓవర్లలో 6 వికెట్లకు 206 పరుగుల భారీస్కోరు చేసింది. శివమ్ దూబే (23 బంతుల్లో 51; 2 ఫోర్లు, 5 సిక్స్‌లు), రచిన్ రవీంద్ర (20 బంతుల్లో 46; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు) చెలరేగారు. అనంతరం గుజరాత్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 143 పరుగులే చేసి ఓడింది. సాయి సుదర్శన్ (31 బంతుల్లో 37; 3 ఫోర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. పరుగుల తేడా పరంగా ఐపీఎల్లో గుజరాత్‌కిదే అతిపెద్ద ఓటమి. చెన్నై బౌలర్లు దీపక్ చహర్, తుషార్ దేశ్‌పాండే, ముస్తఫిజుర్ తలా 2 వికెట్లు తీశారు. ముందు రచిన్... తర్వాత దూబే... చెన్నై ఇన్నింగ్స్ తొలి 10 ఓవర్లు, తర్వాత 10 ఓవర్లు అన్నట్లుగా రెండు దశలూ ధనాధన్‌గా సాగింది. తొలి దశను ఓపెనర్ రచిన్ దూకుడుగా మొదలుపెట్టాడు. అతను క్రీజులో ఉన్నది కాసేపే అయినా... భారీ షాట్లతో విరుచుకుపడటంతో మెరుపు వేగంతో చెన్నై స్కోరు దూసుకెళ్లింది. ఆరో ఓవర్ రెండో బంతికి రషీద్ అతని జోరుకు కళ్లెం వేశాడు. ఓపెనింగ్ జోడీ 32 బంతుల్లో 62 పరుగులు జతచేయగా, ఇందులో 46 పరుగులు ఒక్క రచిన్వే కావడం విశేషం. తర్వాత రహానే (12), కెపె్టన్ రుతురాజ్ గైక్వాడ్ (36 బంతుల్లో 46; 5 ఫోర్లు, 1 సిక్స్) చెన్నైను నడిపించారు. 10 ఓవర్లలో చెన్నై 104/1 స్కోరు చేసింది. తర్వాతి ఓవర్ తొలి బంతికే రహానే అవుట్‌కాగా... శివమ్ దూబే రావడంతో రెండో దూకుడు కొత్తగా మొదలైంది. స్పిన్, పేస్ ఏ బౌలర్‌కు తలొగ్గకుండా దూబే బ్యాట్ దంచేసింది. మిచెల్ (20 బంతుల్లో 24 నాటౌట్; 2 ఫోర్లు) అండతో శివమెత్తడంతో... ఈ జోడీ కూడా 35 బంతుల్లో 57 పరుగులు జోడించింది. 22 బంతుల్లో దూబే అర్ధసెంచరీ పూర్తయిన వెంటనే నిష్క్రమించాడు. సమీర్ రిజ్వీ (6 బంతుల్లో 14; 2 సిక్స్‌లు) మెరుపులతో చెన్నై స్కోరు 200 పైచిలుకు చేరింది. టైటాన్స్ వల్ల కాలేదు! కొండంత లక్ష్యం చూసే గుజరాత్ భీతిల్లినట్లుంది. ఓపెనర్లు మొదలు ఆఖరి వరుసదాకా అందరి బ్యాటర్లదీ అదే తీరు! ఛేదించాల్సిన లక్ష్యం కోసం ఆడాల్సిన తీరు ఏ ఒక్కరిలోనూ కనిపించలేదు. పవర్‌ప్లేలోనే కెపె్టన్ శుబ్‌మన్ గిల్ (8), సాహా (17 బంతుల్లో 21; 4 ఫోర్లు) పెవిలియన్‌కు వెళ్లిపోయారు. వన్‌డౌన్‌లో వచ్చిన సాయి సుదర్శన్ టాప్‌స్కోరర్‌గా నిలిచాడు. కానీ మెరిపించలేదు... కాసేపైనా మురిపించ లేదు. హిట్టర్లు విజయ్ శంకర్ (12), మిల్లర్ (16 బంతుల్లో 21; 3 ఫోర్లు), రాహుల్ తెవాటియా (6) అంతా చెన్నై కట్టుదిట్టమైన బౌలింగ్‌కు వికెట్లు అప్పగించేశారు. స్కోరు వివరాలు చెన్నై సూపర్‌కింగ్స్ ఇన్నింగ్స్: రుతురాజ్ (సి) సాహా (బి) జాన్సన్ 46; రచిన్ (స్టంప్డ్) సాహా (బి) రషీద్ ఖాన్ 46; రహానే (స్టంప్డ్) సాహా (బి) సాయికిషోర్ 12; దూబే (సి) శంకర్ (బి) రషీద్ ఖాన్ 51; మిచెల్ (నాటౌట్) 24; సమీర్ రిజ్వీ (సి) మిల్లర్ (బి) మోహిత్ 14; జడేజా (రనౌట్) 7; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 206. వికెట్ల పతనం: 1–62, 2–104, 3–127, 4–184, 5–199, 6–206. బౌలింగ్: అజ్మతుల్లా 3–0–30–0, ఉమేశ్ 2–0–27–0, రషీద్ ఖాన్ 4–0–49–2, సాయికిషోర్ 3–0–28–1, జాన్సన్ 4–0–35–1, మోహిత్ శర్మ 4–0–36–1. గుజరాత్ టైటాన్స్ ఇన్నింగ్స్: సాహా (సి) తుషార్ (బి) దీపక్ 21; గిల్ (ఎల్బీడబ్ల్యూ) (బి) దీపక్ 8; సాయి సుదర్శన్ (సి) సమీర్ (బి) పతిరణ 37; విజయ్ శంకర్ (సి) ధోని (బి) మిచెల్ 12; మిల్లర్ (సి) రహానే (బి) తుషార్ 21; అజ్మతుల్లా (సి) రచిన్ (బి) తుషార్ 11; తెవాటియా (సి) రచిన్ (బి) ముస్తఫిజుర్ 6; రషీద్ ఖాన్ (సి) రచిన్ (బి) ముస్తఫిజుర్ 1; ఉమేశ్ (నాటౌట్) 10; జాన్సన్ (నాటౌట్) 5; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 143. వికెట్ల పతనం: 1–28, 2–34, 3–55, 4–96, 5–114, 6–118, 7–121, 8–129. బౌలింగ్: దీపక్ చహర్ 4–0–28–2, ముస్తఫిజుర్ 4–0–30–2, తుషార్ దేశ్‌పాండే 4–0–21–2, జడేజా 2–0–15–0, మిచెల్ 2–0–18–1, పతిరణ 4–0–29–1. ఐపీఎల్లో నేడు హైదరాబాద్ X ముంబై వేదిక: హైదరాబాద్ రాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో సినిమా యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం -
CSK Vs GT: శివాలెత్తిన శివమ్ దూబే.. సిక్సర్ల వర్షం! వీడియో వైరల్
ఐపీఎల్-2024లో చెన్నై సూపర్ కింగ్స్ ఆల్‌రౌండర్ శివమ్ దూబే తన సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. ఆర్సీబీతో జరిగిన తొలి మ్యాచ్‌లో మ్యాచ్ విన్నింగ్ నాక్ ఆడిన దూబే.. ఇప్పుడు గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. గుజరాత్ బౌలర్లకు దూబే చుక్కలు చూపించాడు. బౌలర్ ఎవరన్నది సంబంధం లేకుండా సిక్సర్ల వర్షం కురిపించాడు. ముఖ్యంగా స్పిన్నర్లను అయితే ఊచకోత కోశాడు. కేవలం 23 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్స్‌లతో 51 పరుగులు చేశాడు. గతేడాది సీజన్లో కూడా దూబే అద్బుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఇక ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సీఎస్కే నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 206 పరుగుల భారీ స్కోర్ సాధించింది. సీఎస్కే బ్యాటర్లలో దూబేతో పాటు రచిన్ రవీంద్ర(20 బంతుల్లో 46, 6 ఫోర్లు, 3 సిక్స్‌లు), రుతురాజ్ గైక్వాడ్ (20 బంతుల్లో 46, 5 ఫోర్లు, 1సిక్స్‌లు) అద్బుతమైన ఇన్నింగ్స్‌లు ఆడారు. గుజరాత్ బౌలర్లలో రషీద్ ఖాన్ రెండు వికెట్లు పడగొట్టగా.. సాయి కిషోర్, జాన్సన్, మొహిత్ శర్మ తలా వికెట్ పడగొట్టారు. Shivam Smashing Dube at work in Chepauk! #IPL2024 #CSKvsGT pic.twitter.com/7lTRzlhy7y — OneCricket (@OneCricketApp) March 26, 2024 -
ఆర్సీబీతో మ్యాచ్ అంటే శివాలెత్తిపోతాడు.. ఇదే రుజువు!
Shivam Dube vs RCB in the IPL: రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ అంటే చాలు శివాలెత్తిపోతాడు చెన్నై సూపర్ కింగ్స్ ఆల్‌రౌండర్ శివం దూబే. తాజాగా ఐపీఎల్-2024 ఆరంభ మ్యాచ్‌లోనూ మరోసారి ఈ విషయాన్ని నిరూపించాడు. ఇంపాక్ట్ ప్లేయర్‌గా బరిలోకి దిగి ధనాధన్ ఇన్నింగ్స్‌తో చెలరేగాడు. మరో ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాతో కలిసి స్కోరును బోర్డును పరుగులు పెట్టించి జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఈ మ్యాచ్‌లో ఐదో స్థానంలో వచ్చిన శివం 28 బంతుల్లో 4 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 34 పరుగులు చేయగా.. ఆరో స్థానంలో బ్యాటింగ్ చేసిన జడ్డూ 17 బంతుల్లో 25 రన్స్ చేశాడు. ఆఖరి వరకు ఇద్దరూ అజేయంగా నిలిచారు. ఇక ఐపీఎల్-2023 ఫైనల్లోనూ దూబే- జడేజా ద్వయం ఇదే తరహాలో నాటౌట్‌గా నిలిచి గుజరాత్ టైటాన్స్‌పై చెన్నై గెలుపొందడంలో కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. నాటి మ్యాచ్‌లో వన్‌డౌన్‌లో వచ్చిన దూబే 32, ఏడో స్థానంలో వచ్చిన జడేజా 15 పరుగులతో అజేయంగా నిలిచారు. నేను, జడేజా నాటౌట్‌గానే ఉన్నాం ఈ నేపథ్యంలో తాజా విజయం తర్వాత శివం దూబే మాట్లాడుతూ.. ‘‘2023 నుంచి ఇప్పటి దాకా నేను, జడేజా నాటౌట్‌గానే ఉన్నాం. చెన్నై తరఫున మ్యాచ్ ఫినిష్ చేయడం ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటుంది. మహీ భాయ్ నుంచి నేను నేర్చుకున్నది అదే. ప్రతి మ్యాచ్‌లోనూ తనలాగే ఫినిషర్ పాత్ర పోషించాలని భావిస్తాను. ఐపీఎల్ తాజా ఎడిషన్ తొలి మ్యాచ్‌లోనే నాకు ఆ అవకాశం దక్కింది. బాల్‌ను సరిగ్గా అంచనా వేసి బాదడంపైనే దృష్టి సారించాను. ఆఖరి వరకు క్రీజులో ఉంటే నేను ఏం చేయగలనో నాకు తెలుసు’’ అని పేర్కొన్నాడు. సహచర ప్లేయర్ రచిన్ రవీంద్రతో సంభాషిస్తూ శివం దూబే ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు. ఆర్సీబీతో మ్యాచ్ అంటే పూనకాలే! ఇప్పటి వరకు ఆర్సీబీతో మ్యాచ్‌లలో మొత్తంగా 133 బంతులు ఎదుర్కొన్న శివం దూబే సగటు 113.50తో 227 పరుగులు చేశాడు. ఇందులో 16 ఫోర్లు, 16 సిక్సర్లు కూడా ఉన్నాయి. 2021లో ఆర్సీబీతో మ్యాచ్‌లో 46(32), 2022లో 95*(46), 2023లో 52(27).. తాజాగా 34*(28) పరుగులు చేశాడు శివం దూబే!! Talk about living upto the Impact Player tag! 👏 👏 That was one fine knock from Shivam Dube in the chase! 👌 👌 Scorecard ▶️ https://t.co/4j6FaLF15Y#TATAIPL | #CSKvRCB | @IamShivamDube | @ChennaiIPL pic.twitter.com/207zz2Jz8l — IndianPremierLeague (@IPL) March 22, 2024 -
IPL 2024: ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చాడు.. ఆర్సీబీని ముంచేశాడు!
ఐపీఎల్-2024లో చెన్నై సూపర్ కింగ్స్ శుభారంభం చేసింది. చెపాక్ వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో సీఎస్కే ఘన విజయం సాధించింది. 174 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సీఎస్కే కేవలం 4 వికెట్లు మాత్రమే కోల్పోయి 18.4 ఓవర్లలో ఛేదించింది. ఈ మ్యాచ్‌లో ఇంపాక్ట్ ప్లేయర్‌గా బరిలోకి దిగిన సీఎస్కే ఆటగాడు శివమ్ దూబే అదరగొట్టాడు. ఆఖరి వరకు క్రీజులో ఉండి సీఎస్కే విజయంలో కీలక పాత్ర పోషించాడు. రహానే ఔటయ్యక క్రీజులోకి వచ్చిన దూబే.. ఆచితూచి ఆడుతూ స్కోర్ బోర్డును ముందుకు నడిపించాడు. డారిల్ మిచెల్ ఔటయ్యాక తన ఆటలో దూకుడు పెంచిన దూబే.. మ్యాచ్‌ను త్వరగా ముగించాడు. 28 బంతులు ఎదుర్కొన్న దూబే.. 4 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 34 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. అతడితో పాటు రచిన్ రవీంద్ర(37) పరుగులతో అదరగొట్టాడు. కాగా ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. ఆర్సీబీ బ్యాటర్లలో అనుజ్ రావత్(48) టాప్ స్కోరర్‌గా నిలవగా.. దినేష్ కార్తీక్(38 నాటౌట్), డుప్లెసిస్(35) పరుగులతో రాణించాడు. సీఎస్కే బౌలర్లలో ముస్తుఫిజర్ రెహ్మాన్ నాలుగు వికెట్లు పడగొట్టాడు. Shivam Dube - the backbone of CSK middle order. 🫡pic.twitter.com/fWAXiy4Kzm — Mufaddal Vohra (@mufaddal_vohra) March 22, 2024 -
BCCI: వాళ్లపై వేటు.. 30 ఏళ్ల వయసులో వీళ్లకు ఛాన్స్! రూ. కోటి..
ఇచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటున్న యువ ఆటగాళ్లపై భారత క్రికెట్ నియంత్రణ మండలి వరాల జల్లు కురిపించింది. ప్రతిభను నిరూపించుకునే వారికి సముచిత స్థానం కల్పిస్తూ తాజా వార్షిక కాంట్రాక్ట్‌ల(2023-24)లో పెద్దపీట వేసింది. అదే సమయంలో క్రమశిక్షణారాహిత్యం ప్రదర్శించిన ఆటగాళ్లను సహించేది లేదంటూ కొరడా ఝులిపించింది. ‘వార్షిక కాంట్రాక్ట్‌లలో ఈ సారి శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్ల పేర్లను పరిశీలించడం లేదు’ అని బోర్డు అధికారికంగా ప్రకటించడం ఇందుకు నిదర్శనం. రంజీల్లో ఆడమని ఆదేశించినా వీరిద్దరు బేఖాతరు చేసినందుకు వల్లే ఇలా వేటు పడిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వీరి సంగతి ఇలా ఉంటే.. యువ సంచలనం, డబుల్ సెంచరీల వీరుడు యశస్వి జైస్వాల్ డబుల్ ప్రమోషన్ పొంది నేరుగా ‘బి’ గ్రేడ్ క్రాంటాక్ట్ దక్కించుకున్నాడు. అతడితో పాటు మరో పది మంది కొత్తగా బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టులు చేజిక్కించుకున్నారు. వీరంతా ‘సి’ గ్రేడ్‌లో ఉండటం గమనార్హం. అంటే మ్యాచ్ ఫీజులతో పాటు రూ. కోటి వార్షిక వేతనం అందుకుంటారన్నమాట..! ఆ పది మంది ఎవరు? వారి ప్రదర్శన ఎలా ఉంది?! రింకూ సింగ్ దేశవాళీ క్రికెట్, ఐపీఎల్లో సత్తా చాటిన ఉత్తరప్రదేశ్ బ్యాటర్ రింకూ సింగ్. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత గతేడాది ఐర్లాండ్‌తో టీ20 సిరీస్ సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. నయా ఫినిషర్‌గా నీరాజనాలు అందుకుంటున్నాడు. ఇక రింకూ ఇప్పటి వరకు భారత్ తరఫున 15 టీ20లు ఆడి 176.23 స్ట్రైక్‌రేటుతో 356 పరుగులు చేశాడు. ఇందులో రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇప్పటి వరకు 20 సిక్స్‌లు, 31 ఫోర్లు బాదాడు. ఇక వన్డేల్లోనూ అడుగుపెట్టిన 26 ఏళ్ల లెఫ్టాండర్ రింకూ సింగ్ రెండు మ్యాచ్‌లలో కలిపి 55 పరుగులు సాధించాడు. నంబూరి తిలక్ వర్మ హైదరాబాదీ స్టార్ తిలక్ వర్మ అండర్19 వరల్డ్‌కప్‌లో సత్తా చాటి ఐపీఎల్-2022లో ముంబై ఇండియన్స్ తరఫున ఎంట్రీ ఇచ్చాడు. రెండు సీజన్లలో కలిసి 740 పరుగులు చేసి టీమిండియా సెలక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. తద్వారా అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన ఈ 21 ఏళ్ల లెఫ్టాండ్ బ్యాటర్.. రైటార్మ్ ఆఫ్ బ్రేక్ స్పిన్నర్ కూడా!ఇప్పటి వరకు టీమిండియా తరఫున 16 టీ20లు ఆడి 336, నాలుగు వన్డేలు ఆడి 68 పరుగులు చేశాడు. రుతురాజ్ గైక్వాడ్ దేశవాళీ క్రికెట్లో సత్తా చాటి చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ ఓపెనర్‌గా పేరొందిన మహారాష్ట్ర క్రికెటర్ రుతురాజ్ గైక్వాడ్. టీమిండియా తరఫున ఆరు వన్డేలు ఆడి 115, 19 టీ20లు ఆడి 500 పరుగులు చేశాడు. ఇందులో ఓ సెంచరీ, మూడు అర్ధ శతకాలు ఉన్నాయి. గతేడాది ఆసియా క్రీడల్లో భారత ద్వితీయ శ్రేణి జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన 27 ఏళ్ల ఈ రైట్‌హ్యాండ్ బ్యాటర్ గోల్డ్ మెడల్ అందించాడు. శివం దూబే సీఎస్కే స్టార్ క్రికెటర్, ముంబై పేస్ ఆల్‌రౌండర్ శివం దూబే 2019లోనే టీమిండియా తరఫున ఎంట్రీ ఇచ్చాడు. అయితే, చాలాకాలం పాటు మళ్లీ జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు. ఈ క్రమంలో హార్దిక్ పాండ్యా గైర్హాజరీ నేపథ్యంలో ఈ ఏడాది అఫ్గనిస్తాన్‌తో జరిగిన టీ20 సిరీస్‌తో పునరాగమనం చేసిన 30 ఏళ్ల దూబే.. అదిరిపోయే ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. భారత్ తరఫున ఇప్పటి వరకు 21 టీ20లు ఆడి 276 పరుగులు చేసి, ఎనిమిది వికెట్లు తీశాడు. రవి బిష్ణోయి రాజస్తాన్‌కు చెందిన రవి బిష్ణోయి 2022లో టీమిండియా తరఫున అరంగేట్రం చేశాడు. ఈ కుడిచేతి వాటం స్పిన్నర్.. ఇటీవలి కాలంలో అద్భుత ప్రదర్శనతో ఐసీసీ ర్యాంకింగ్స్‌లో నంబర్ వన్ స్థానాన్ని దక్కించుకున్నాడు. ఇప్పటి వరకు 24 టీ20లు, ఒక వన్డే ఆడి ఆయా ఫార్మాట్లలో 36, 1 వికెట్ పడగొట్టాడీ 23 ఏళ్ల బౌలర్. ముకేశ్ కుమార్ బెంగాల్ పేసర్, 30 ఏళ్ల ముకేశ్ కుమార్ గతేడాది టీమిండియాలో అడుగుపెట్టాడు. ఇప్పటి వరకు 3 టెస్టులు, 6 వన్డేలు, 14 టీ20లు ఆడిన ఈ రైటార్మ్ బౌలర్ ఆయా ఫార్మాట్లలో వరుసగా 7, 5, 12 వికెట్లు తీశాడు. ప్రసిద్ కృష్ణ 2021లో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు రైటార్మ్ ఫాస్ట్‌బౌలర్ ప్రసిద్ కృష్ణ. 28 ఏళ్ల ఈ కర్ణాటక బౌలర్ ఇప్పటి వరకు అంతర్జాతీయ క్రికెట్లో రెండు టెస్టుల్లో రెండు వికెట్లు తీసిన 28 ఏళ్ల ప్రసిద్.. 17 వన్డేలు, 5 టీ20లలో 29, 8 వికెట్లు పడగొట్టాడు. ఆవేశ్ ఖాన్ మధ్యప్రదేశ్‌కు చెందిన ఫాస్ట్ బౌలర్ ఆవేశ్ ఖాన్. 27 ఏళ్ల ఈ రైటార్మ్ పేసర్ 2022లో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. ఇప్పటి వరకు భారత్ తరఫున 8 వన్డేలు, 20 టీ20 మ్యాచ్‌లు ఆడి 9, 19 వికెట్లు తీశాడు. రజత్ పాటిదార్ లేటు వయసులో టీమిండియా సెలక్టర్ల పిలుపు అందుకున్న మధ్యప్రదేశ్ క్రికెటర్ రజత్ పాటిదార్. 1993లో ఇండోర్‌లో జన్మించిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్ 2023లో తొలిసారి టీమిండియా(వన్డే)కు ఆడాడు. తాజాగా ఇంగ్లండ్‌తో స్వదేశంలో సిరీస్‌తో టెస్టుల్లో ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పటి వరకు ఒక వన్డేలో 22, మూడు టెస్టుల్లో కలిపి 63 పరుగులు సాధించాడు. జితేశ్ శర్మ విదర్భ వికెట్ కీపర్ బ్యాటర్ జితేశ్ శర్మ.. 2022లో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. 30 ఏళ్ల ఈ రైట్‌హ్యాండర్ ఇప్పటి వరకు 9 టీ20లు ఆడి 100 పరుగులు చేశాడు. చదవండి: BCCI Annual Players Contract List: పూర్తి వివరాలు.. విశేషాలు -
శ్రేయస్ అయ్యర్ కూడా అవుట్.. ముషీర్ ఖాన్ ఎంట్రీ
టీమిండియా స్టార్ క్రికెటర్ శ్రేయస్ అయ్యర్ రంజీ ట్రోఫీ 2023-24 సీజన్ నాకౌట్ మ్యాచ్‌లకు అందుబాటులో ఉండటం లేదు. ఈ విషయాన్ని ముంబై క్రికెట్ అసోసియేషన్ ధ్రువీకరించింది. క్వార్టర్ ఫైనల్స్‌లో అయ్యర్ ఆడటం లేదని అధికారిక ప్రకటన విడుదల చేసింది. కాగా ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌కు ముందు టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్‌ను రంజీల్లో ఆడమని బీసీసీఐ ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ముంబై తరఫున బరిలోకి దిగిన అయ్యర్ ఆంధ్రతో మ్యాచ్ ఆడి.. 48 పరుగులు చేశాడు. అనంతరం భారత జట్టుతో చేరి తొలి రెండు టెస్టుల్లో భాగమయ్యాడు. అయితే, రెండు సందర్భాల్లోనూ ఆశించిన మేర రాణించలేకపోయాడు. రెండు మ్యాచ్‌లలో కలిపి 104 పరుగులు మాత్రమే చేశాడు. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్‌తో మిగిలిన మూడు టెస్టులకు ప్రకటించిన జట్టులో బీసీసీఐ ఈ ముంబై బ్యాటర్‌కు స్థానం కల్పించలేదు. ఈ క్రమంలో వెన్నునొప్పి కారణంగా అయ్యర్ జట్టుకు దూరమయ్యాడనే వార్తలు వినిపించాయి. అయితే, బీసీసీఐ మాత్రం ఇందుకు సంబంధించి ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇదిలా ఉంటే.. జాతీయ జట్టుకు దూరమైన ఆటగాళ్లు తిరిగి టీమిండియాకు ఆడాలనుకుంటే కచ్చితంగా రంజీల్లో ఆడాల్సిందేనని బీసీసీఐ కార్యదర్శి జై షా స్పష్టం చేశాడు. ఈ నేపథ్యంలో శ్రేయస్ అయ్యర్ రంజీ ట్రోఫీ టోర్నీలో తిరిగి అడుగుపెడతాడని భావించగా.. గాయం కారణంగా తాను అందుబాటులో ఉండటం లేదని ముంబై మేనేజ్మెంట్కు చెప్పినట్లు సమాచారం. ఇదిలా ఉంటే.. టీమిండియా ఆల్‌రౌండర్, ముంబైని క్వార్టర్ ఫైనల్స్‌కు చేర్చడంలో కీలక పాత్ర పోషించిన శివం దూబే కూడా జట్టుకు దూరమయ్యాడు. అతడి స్థానంలో సర్ఫరాజ్ ఖాన్ తమ్ముడు, భారత యువ సంచలనం ముషీర్ ఖాన్ ముంబై జట్టులోకి వచ్చాడు. కాగా ఫిబ్రవరి 23 నుంచి బరోడాతో క్వార్టర్ ఫైనల్లో ముంబై తలపడనుంది. రంజీ క్వార్టర్ ఫైనల్స్-2024కు ముంబై జట్టు: అజింక్య రహానే (కెప్టెన్), పృథ్వీ షా, అమోగ్ భత్కల్, భూపేన్ లల్వానీ, ముషీర్ ఖాన్, సూర్యాన్ష్ షెడ్గే, ప్రసాద్ పవార్ (వికెట్ కీపర్), హార్దిక్ తామోర్ (వికెట్ కీపర్), శార్దూల్ ఠాకూర్, తనూష్ కొటియాన్, షామ్స్ ములానీ, ఆదిత్య ధుమాల్, మోహిత్ అవస్థి, తుషార్ దేశ్‌పాండే, ధవళ్ కులకర్ణి, రాయ్స్టాన్ డయాస్. Mumbai squad for Ranji Trophy 2023-2024 Quarter Final match against Baroda to be played from 23rd to 26th February 2024 at MCA Sharad Pawar Cricket Academy, Bandra Kurla Complex, Mumbai. No Shivam Dube & Shreyas Iyer For Mumbai Musheer Khan returns to Mumbai squad… pic.twitter.com/YERqPzA248 — Rajesh Khilare (@Cricrajeshpk) February 20, 2024 -
సెంచరీ వీరుడికి గాయం.. సర్ఫరాజ్ తమ్ముడికి లక్కీ ఛాన్స్!
రంజీ ట్రోఫీ 2023- 24 సీజన్ క్వార్టర్ ఫైనల్‌కు ముందు ముంబై జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు కీలక ఆటగాడు, టీమిండియా ఆల్‌రౌండర్ శివం దూబే గాయపడ్డాడు. పక్కటెముకల నొప్పి తీవ్రమైతరమైన నేపథ్యంలో రంజీ సీజన్లో మిగిలిన మ్యాచ్‌లకు అతడు దూరం కానున్నట్లు సమాచారం. కాగా స్వదేశంలో అఫ్గనిస్తాన్‌తో టీ20 సిరీస్‌లో టీమిండియా తరఫున అదరగొట్టిన శివం దూబే.. వెంటనే రంజీ బరిలో దిగాడు. ముంబై తరఫున ఆల్‌రౌండ్ ప్రతిభ కనబరుస్తూ జట్టు క్వార్టర్ ఫైనల్ చేరడంలో కీలక పాత్ర పోషించాడు. ముఖ్యంగా బ్యాట్‌తో మ్యాజిక్ చేస్తూ రెండు సెంచరీలతో పాటు రెండు అర్ధ శతకాలు బాదాడు. చివరగా అసోంతో మ్యాచ్‌లో 140 బంతుల్లో 121 పరుగులు చేసిన దూబే నాటౌట్‌గా నిలిచి సత్తా చాటాడు. ఈ మ్యాచ్‌కు ముందు విశ్రాంతి తీసుకున్న ఈ ఆల్‌రౌండర్.. మ్యాచ్ అనంతరం మళ్లీ పక్కటెముల నొప్పితో ఇబ్బంది పడినట్లు సమాచారం. ఈ విషయం గురించి ముంబై క్రికెట్ వర్గాలు టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ.. ‘‘దూబే గాయపడిన కారణంగా రంజీ ట్రోఫీ సీజన్లో మిగిలిన మ్యాచ్‌లకు దూరం కానున్నాడు. అసోంతో మ్యాచ్‌లో బ్యాటింగ్ చేస్తున్న సమయంలోనే పక్కటెముకలు పట్టేశాయి. అందుకే రెండో ఇన్నింగ్స్‌లో అతడు మళ్లీ మైదానంలో దిగలేదు’’ అని పేర్కొన్నాయి. కాగా ముంబై తదుపరి క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో బరోడాతో తలపడనుంది. ఫిబ్రవరి 23 నుంచి మొదలుకానున్న ఈ మ్యాచ్‌కు శివం దూబే దూరం కానుండగా.. భారత యువ సంచలనం ముషీర్ ఖాన్ అతడి స్థానాన్ని భర్తీ చేయనున్నట్లు తెలుస్తోంది. రంజీల్లో పరుగుల వరద పారించి ఇంగ్లండ్‌తో మూడో టెస్టు సందర్భంగా టీమిండియా తరఫున అరంగేట్రం చేసిన సర్ఫరాజ్ ఖాన్ తమ్ముడే ముషీర్ ఖాన్. ఇటీవల ముగిసిన అండర్-19 వరల్డ్‌కప్ టోర్నీలో భారత్ తరఫున 338 పరుగులు చేశాడీ ఆల్‌రౌండర్. అదే విధంగా ముంబై తరఫున ఇప్పటి వరకు మూడు ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడి 96 రన్స్ సాధించాడు. చదవండి: రోహిత్, కోహ్లిలా హీరో అయ్యే వాడిని.. కానీ ఆరోజు ధోని ఎందుకలా చేశాడో? -
రెచ్చిపోయిన చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయర్లు
రంజీ ట్రోఫీ 2024 సీజన్లో భాగంగా ఇవాళ (ఫిబ్రవరి 16) మొదలైన వేర్వేరు మ్యాచ్‌ల్లో చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయర్లు రుతురాజ్ గైక్వాడ్, శివమ్ దూబే, శార్దూల్ ఠాకూర్ ఇరగదీశారు. సర్వీసెస్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రుతురాజ్ గైక్వాడ్ (మహారాష్ట్ర) తృటిలో సెంచరీ (96) చేజార్చుకోగా.. అసోంతో జరుగుతున్న మ్యాచ్‌లో శివమ్ దూబే మెరుపు శతకంతో (95 బంతుల్లో 101 నాటౌట్; 10 ఫోర్లు, 5 సిక్సర్లు) విరుచుకుపడ్డాడు. ఇదే మ్యాచ్‌లో మరో సీఎస్కే ప్లేయర్ శార్దూల్ ఠాకూర్ బంతితో వీరవిహారం చేశాడు. శార్దూల్ కేవలం 21 పరుగులిచ్చి 6 వికెట్లు పడగొట్టాడు. ఇలా ఒకే రోజు ముగ్గురు సీఎస్కే ఆటగాళ్లు సత్తా చాటడంతో ఆ ఫ్రాంచైజీ అభిమానులు సంబురపడిపోతున్నారు. ఈసారి కూడా ప్రత్యర్దులకు దబిడిదిబిడే అంటూ రచ్చ చేస్తున్నారు. సీఎస్కే ఆటగాళ్లు ఇదే ఫామ్‌ను కొనసాగిస్తే.. టైటిల్ నిలబెట్టుకోవడం ఖాయమని కామెంట్స్ చేస్తున్నారు. గతేడాది ఐపీఎల్లో ధోని నేతృత్వంలో సీఎస్కే ఐదో సారి ఛాంపియన్‌గా నిలిచిన విషయం తెలిసిందే. రాబోయే సీజన్‌కు సంబంధించి సీఎస్కే ఇప్పటికే ట్రైనింగ్ క్యాంప్‌ను స్టార్ట్ చేసింది. కెప్టెన్ ధోనితో పాటు అందుబాటులో ఉన్న ప్లేయర్లతో క్యాంప్ నడుస్తుంది. కాగా, సీఎస్కే ఆటగాళ్లు రాణించడంతో అసోంతో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై పట్టుబిగించింది. శార్దూల్ ఠాకూర్ ఆరేయడంతో అసోం తొలి ఇన్నింగ్స్‌లో 84 పరుగులకే కుప్పకూలింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ముంబై.. తొలి రోజు ఆట ముగిసే సమయానికి 6 వికెట్ల నష్టానికి 217 పరుగులు చేసింది. 101 పరుగులతో దూబే, 2 పరుగులతో శార్దూల్ క్రీజ్‌లో ఉన్నారు. ఇప్పటికే ఆ జట్టు 133 పరుగుల లీడ్‌లో ఉంది. సర్వీసెస్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రుతురాజ్ రాణించినప్పటికీ మహారాష్ట్ర తడబడింది. సర్వీసెస్ బౌలర్లు అర్జున్ శర్మ (5/59), వరుణ్ చౌదరీ (4/39) విజృంభించడంతో ముంబై 225 పరుగులకే ఆలౌటైంది. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన సర్వీసెస్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 27 పరుగులు చేసింది. -
మెరుపు శతకంతో విరుచుకుపడిన శివమ్ దూబే
రంజీ ట్రోఫీ 2024లో భాగంగా అసోంతో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఆటగాడు శివమ్ దూబే మెరుపు శతకంతో విరుచుకుపడ్డాడు. కేవలం 87 బంతుల్లో 10 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో శతక్కొట్టాడు. ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన దూబే అసోం బౌలర్లపై నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడ్డాడు. ముంబై ఇన్నింగ్స్‌లో రెండో అత్యధిక స్కోర్ 31 పరుగులు (షమ్స్ ములానీ) కాగా.. దూబే ఒక్కడే వన్ మ్యాన్ షో నడిపించాడు. గత మ్యాచ్‌లో రెస్ట్ తీసుకున్న దూబే రీఎంట్రీలో అదగొట్టాడు. ఈ ఇన్నింగ్స్‌లో 95 బంతులు ఎదుర్కొన్న దూబే 101 పరుగులతో అజేయంగా నిలిచాడు. అతనితో పాటు శార్దూల్ ఠాకూర్ (2) క్రీజ్‌లో ఉన్నాడు. ముంబై ఇన్నింగ్స్‌లో పృథ్వీ షా 30, భుపేన్ లాల్వాని 0, హార్దిక్ తామోర్ 22, కెప్టెన్ అజింక్య రహానే 22, సుయాంశ్ షేడ్గే 0, షమ్స ములానీ 31 పరుగులు చేసి ఔటయ్యారు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి ముంబై స్కోర్ తొలి ఇన్నింగ్స్‌లో 217/6గా ఉంది. అసోం బౌలర్లలో దిబాకర్ జోహ్రి, రాహుల్ సింగ్ చెరో 2 వికెట్లు పడగొట్టగా.. సునీల్ లచిత్, కునాల్ శర్మ తలో వికెట్ దక్కించుకున్నారు. ఇవాళే మొదలైన ఈ మ్యాచ్‌లో అసోం టాస్ ఓడి ముంబై ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్ చేసింది. అసోం బ్యాటర్లను శార్దూల్ ఠాకూర్ ఉతికి ఆరేశాడు (6/21). శార్దూల్‌తో పాటు షమ్స్ ములానీ (2/8), తుషార్ దేశ్‌పాండే (1/32), మోహిత్ అవస్థి (1/10) కూడా చెలరేగడంతో అసోం ఇన్నింగ్స్ పేకమేడలా కూలింది. ఆ జట్టు 84 పరుగులకే ఆలౌటైంది. అసోం ఇన్నింగ్స్‌లో అభిషేక్ ఠాకూరీ (31), సాహిల్ జైన్ (12), అబ్దుల్ అజీజ్ ఖురేషి (15) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. -
శివం దూబే దూరం.. శార్దూల్ ఠాకూర్ ఎంట్రీ!
Ranji Trophy 2023-24: ముంబై తాత్కాలిక కెప్టెన్ శివం దూబే జట్టుకు దూరమయ్యాడు. కండరాల నొప్పితో బాధపడుతున్న అతడికి సెలక్టర్లు విశ్రాంతినిచ్చారు. కాగా అఫ్గనిస్తాన్‌తో టీమిండియా టీ20 సిరీస్ ముగించుకున్న తర్వాత ఆల్‌రౌండర్ శివం దూబే ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌పై దృష్టి పెట్టాడు. పరిమిత ఓవర్ల క్రికెట్‌తో పాటు టీమిండియా టెస్టు రేసులోనూ అదృష్టం పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యాడు. ఇందులో భాగంగా ముంబై తరఫున రంజీ ట్రోఫీ 2023-24 సీజన్ బరిలో దిగాడు. ఇప్పటి వరకు ఆడిన మ్యాచ్‌లలో రెండు హాఫ్ సెంచరీలతో పాటు ఓ శతకం(117) బాదాడు. బౌలింగ్‌లోనూ ఆకట్టుకునే ప్రదర్శన చేశాడు. బెంగాల్‌తో మ్యాచ్‌లో కెప్టెన్‌గా హిట్ ఈ క్రమంలో అజింక్య రహానే గైర్హాజరీలో ఆఖరిగా ముంబై ఆడిన మ్యాచ్‌లో కెప్టెన్‌గా వ్యవహరించే అవకాశం దక్కించుకున్నాడు. బెంగాల్‌తో ఆదివారం ముగిసిన ఈ మ్యాచ్‌లో దూబే 72 పరుగులు సాధించాడు. అదే విధంగా రెండు వికెట్లు కూడా తీసి ముంబై విజయంలో కీలక పాత్ర పోషించాడు. అయితే, బెంగాల్‌తో మ్యాచ్ సందర్భంగా శివం దూబే కండరాలు పట్టేసినట్లు సమాచారం. ఈ విషయం గురించి ముంబై చీఫ్ సెలక్టర్ రాజు కులకర్ణి మాట్లాడుతూ.. ముందు జాగ్రత్త చర్యలో భాగంగానే దూబేకు రెస్ట్ ఇచ్చినట్లు తెలిపాడు. శార్దూల్ ఠాకూర్ ఎంట్రీ నాకౌట్ మ్యాచ్‌ల సమయానికి అతడు అందుబాటులోకి వస్తాడని తెలిపాడు. ఇదిలా ఉంటే.. టీమిండియా ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్ ముంబై తరఫున రీఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది. సౌతాఫ్రికా టూర్లో గాయపడిన అతడు రంజీ బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు.. ఫిబ్రవరి 9 నుంచి ఛత్తీస్‌గఢ్‌తో మ్యాచ్‌కు కెప్టెన్ అజింక్య రహానే తిరిగి జట్టుతో చేరనున్నాడు. చదవండి: అరిచీ.. అరిచీ.. నా గొంతు పోయింది: రోహిత్ శర్మ వ్యాఖ్యలు వైరల్ -
శతక్కొట్టిన రాణా.. 5 వికెట్లతో చెలరేగిన భువీ! రహానే మళ్లీ..
Ranji Trophy 2023-24- Mumbai vs Uttar Pradesh: రంజీ ట్రోఫీ 2023-24లో ఉత్తరప్రదేశ్ ముంబై జట్టుపై గెలుపొందింది. నువ్వా- నేనా అన్నట్లుగా సాగిన మ్యాచ్‌లో ఆఖరికి 2 వికెట్ల తేడాతో విజయం నమోదు చేసింది. ముంబైతో మ్యాచ్‌లో యూపీ కెప్టెన్ నితీశ్ రాణా శతక్కొట్టగా.. పేసర్ భువనేశ్వర్ కుమార్ మొత్తం ఐదు వికెట్లు పడగొట్టాడు. మరో యువ పేసర్ ఆకిబ్ ఖాన్ సైతం అద్భుతంగా రాణించి జట్టు విజయానికి తానూ కారణమయ్యాడు. కాగా ముంబైలోని ప్రఖ్యాత వాంఖడే వేదికగా జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచిన యూపీ తొలుత బౌలింగ్ చేసింది. కొనసాగుతున్న రహానే వైఫల్యం ముంబై కెప్టెన్ అజింక్య రహానే వైఫల్యం కొనసాగగా.. వికెట్ కీపర్ ప్రసాద్ పవార్(36), షమ్స్ ములానీ చెప్పుకోదగ్గ(57)ప్రదర్శన చేశారు. మిగతా వాళ్లు నామమాత్రపు స్కోరుకే పరిమితం కావడంతో ముంబై తొలి ఇన్నింగ్స్‌లో 198 పరుగులకే ఆలౌట్ అయింది. రాణా శతకం యూపీ బౌలర్లలో భువీ రెండు, అంకిత్ రాజ్‌పుత్ మూడు, ఆకిబ్ ఖాన్ మూడు, శివం శర్మ రెండు వికెట్లు తీశారు. ఈ క్రమంలో బ్యాటింగ్ మొదలుపెట్టిన ఉత్తరప్రదేశ్‌కు ఓపెనర్ సమర్థ్ సింగ్(63) శుభారంభం అందించగా.. కెప్టెన్ నితీశ్ రాణా(106) శతక్కొట్టాడు. దూబే సెంచరీ కొట్టినా దీంతో 324 పరుగులకు తొలి ఇన్నింగ్స్ ముగించిన యూపీ 126 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ముంబై శివం దూబే(117) మెరుపు శతకం కారణంగా.. 320 పరుగులు చేయగలిగింది. కాగా ముంబై రెండో ఇన్నింగ్స్‌లో టాపార్డర్, మిడిలార్డర్‌ను ఆకిబ్ ఖాన్, భువీ కుప్పకూల్చారు. ఆకిబ్ టాప్-3 వికెట్లు పడగొట్టగా.. భువీ మొత్తం మూడు వికెట్లు తీశాడు. దూబే రూపంలో కరణ్ శర్మ కీలక వికెట్ దక్కించుకున్నాడు. రెండు వికెట్ల తేడాతో విజయం ఈ క్రమంలో ముంబై విధించిన 195 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన యూపీ 8 వికెట్లు కోల్పోయి టార్గెట్‌ను ఛేదించింది. యూపీ కెప్టెన్ నితీశ్ రాణాకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఇక ఈ మ్యాచ్‌లోనూ ముంబై సారథి అజింక్య రహానే బ్యాటింగ్ వైఫల్యం కొనసాగింది. రెండు ఇన్నింగ్స్‌లో కలిపి కేవలం 17 (8, 9) పరుగులు మాత్రమే చేశాడు. టీమిండియాలో రీఎంట్రీ ఇవ్వాలని భావిస్తున్న అతడు ఇప్పటి వరకు రంజీ-2024లో ఒక్కటైనా చెప్పుకోదగ్గ స్కోరు చేయలేదు. మరోవైపు టీమిండియా తరఫున రీ ఎంట్రీలో టీ20లలో సత్తా చాటిన శివం దూబే అద్భుత బ్యాటింగ్ తీరుతో టెస్టు రేసులోకి దూసుకురావడం విశేషం. చదవండి: Ind Vs Eng 2nd Test: విశాఖ టెస్టు.. విద్యార్థులతో పాటు వాళ్లకూ ఫ్రీ ఎంట్రీ -
శివమ్ దూబే మెరుపు శతకం
రంజీ ట్రోఫీ 2024లో భాగంగా ఉత్తర్‌ప్రదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబైకి ప్రాతినిథ్యం వహిస్తున్న టీమిండియా ఆటగాడు శివమ్ దూబే చెలరేగిపోయాడు. సెకెండ్ ఇన్నింగ్స్‌లో తన జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు (86/6) దూబే మెరుపు శతకంతో విరుచుకుపడ్డాడు. 130 బంతుల్లో 9 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 117 పరుగులు చేసి ఏడో వికెట్‌గా వెనుదిరిగాడు. దూబేకు షమ్స్ ములానీ (63), మోహిత్ అవస్థి (49) సహకరించడంతో ముంబై సెకెండ్ ఇన్నింగ్స్‌లో 320 పరుగులు చేసి ఆలౌటైంది. అంతకుముందు దూబే బౌలింగ్‌లోనూ రాణించాడు. తొలి ఇన్నింగ్స్‌లో అతను అత్యంత పొదుపుగా బౌలింగ్ చేయడంతో పాటు మూడు వికెట్లతో చెలరేగాడు. ఇటీవల స్వదేశంలోనే ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో అద్భుతంగా రాణించి, హార్దిక్‌కు ప్రత్యామ్నాయ ఆటగాడిగా పేరు తెచ్చుకున్న దూబే మరో అద్భుత ఇన్నింగ్స్ ఆడి టీమిండియాలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. మ్యాచ్ విషయానికొస్తే.. దూబే సెంచరీతో కదంతొక్కినప్పటికీ ముంబై మ్యాచ్ కాపాడుకునే పరిస్థితి కనపడటం లేదు. 195 పరుగుల లక్ష్య ఛేదనలో ఉత్తర్‌ప్రదేశ్ 2 వికెట్ల నష్టానికి 88 పరుగులు చేసి (నాలుగో రోజు లంచ్ విరామం సమయానికి) లక్ష్యానికి 107 పరుగుల దూరంలో ఉంది. యూపీ ఇన్నింగ్స్‌లో సమర్థ్ సింగ్ (2), ప్రియం గార్గ్ (4) ఔట్ కాగా.. ఆర్యన్ జుయల్ (54), కరణ్ శర్మ (28) క్రీజ్‌లో ఉన్నారు. మోహిత్ అవస్థి, రాయ్స్టన్ డయాస్ తలో వికెట్ పడగొట్టారు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై యూపీ బౌలర్లు మూకుమ్మడిగా రాణించడంతో 198 పరుగులకే ఆలౌటైంది. అంకిత్ రాజ్‌పుత్, ఆకిబ్ ఖాన్ తలో 3 వికెట్లు, భువనేశ్వర్ కుమార్, శివమ్ శర్మ చెరో 2 వికెట్లు పడగొట్టారు. ముంబై ఫస్ట్ ఇన్నింగ్స్‌లో షమ్స్ ములానీ (57) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అనంతరం యూపీ తొలి ఇన్నింగ్స్‌లో 324 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ నితీశ్ రాణా (106) సెంచరీతో కదంతొక్కగా.. ఓపెనర్ సమర్థ్ సింగ్ (63) అర్ధసెంచరీ సాధించాడు. ముంబై బౌలర్లలో శివమ్ దూబే, రాయ్స్టన్ డయాస్ చెరో 3 వికెట్లు, మోహిత్ అవస్థి, డిసౌజా, షమ్స్ ములానీ, తనుష్ కోటియన్ తలో వికెట్ పడగొట్టారు. -
అతడిని చూస్తే యువీ గుర్తుకొస్తున్నాడు.. హార్దిక్‌ను వదిలేసి!
India Potential Selection Dilemma For T20 World Cup 2024: టీమిండియా ఆల్‌రౌండర్ శివం దూబేపై భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా ప్రశంసలు కురిపించాడు. దూబే ఆట తీరు చూస్తుంటే తనకు యువరాజ్ సింగ్ గుర్తుకు వస్తున్నాడని పేర్కొన్నాడు. టీ20 ప్రపంచకప్-2024 జట్టులో ఈ ముంబై బ్యాటర్‌కు కచ్చితంగా చోటివ్వాలని ఆకాశ్ చోప్రా బీసీసీఐకి విజ్ఞప్తి చేశాడు. అఫ్గనిస్తాన్‌తో టీ20 సిరీస్ సందర్భంగా చాలా ఏళ్ల తర్వాత టీమిండియా తరఫున బరిలోకి దిగిన శివం దూబే.. అద్భుత ఆట తీరుతో ఆకట్టుకున్నాడు. స్వదేశంలో జరిగిన ఈ సిరీస్‌లో మూడు మ్యాచ్‌లలో కలిపి 124 పరుగులు సాధించిన ఈ పేస్ ఆల్‌రౌండర్.. రెండు వికెట్లు తీశాడు. పాండ్యా గైర్హాజరీలో చోటు సంపాదించి.. సత్తా చాటి తద్వారా టీమిండియా 3-0తో విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచాడు. గాయం కారణంగా దూరమైన హార్దిక్ పాండ్యా స్థానంలో వచ్చిన అవకాశాన్ని ఇలా పూర్తిగా సద్వినియోగం చేసుకున్న దూబే.. ప్రపంచకప్-2024 రేసులో తానూ ఉన్నానంటూ సెలక్టర్లకు గట్టి సందేశమే పంపాడు. ఈ నేపథ్యంలో ఆకాశ్ చోప్రా మాట్లాడుతూ.. ‘‘శివం అతి సుందరం.. పవర్ హిట్టర్.. మూడో టీ20లో అతడిని ఇంకాస్త లేట్‌గా బ్యాటింగ్‌కు పంపాల్సింది. శివం కంటే ముందుగా సంజూ శాంసన్ లేదంటే.. రింకూ సింగ్‌ను బరిలోకి దించితే బాగుండేది. ఎందుకంటే శివం.. ఆచితూచి ఆడే ప్లేయర్ కాదు.. అటాకర్. అటాకర్.. అచ్చం యూవీ మాదిరే బౌలర్లపై ఆధిపత్యం కొనసాగిస్తూ దూకుడు ప్రదర్శించగలడు. నాకు అతడిని చూస్తే యువీ గుర్తుకువస్తాడు. శివంను లోయర్ ఆర్డర్లో ఆడిస్తేనే ఇంకా మెరుగైన ఫలితాలు ఉంటాయి’’ అని అభిప్రాయపడ్డాడు. ఇద్దరూ జట్టులో ఉండాలి అదే విధంగా.. ‘‘తొలి రెండు మ్యాచ్‌లలో శివం దూబే ఎంత శక్తిమంతంగా సిక్సర్లు బాదాడో చూశాం. అతడి ఆట తీరుకు ముచ్చటపడి కొందరైతే హార్దిక్‌ను వదిలేసి.. దూబేను జట్టులోకి తీసుకోవాలని సూచిస్తున్నారు. నా వరకైతే ఈ ఇద్దరూ జట్టులో ఉంటే బాగుంటుంది. అఫ్గన్‌తో మూడు మ్యాచ్‌లలో అదరగొట్టి తాను ప్రపంచకప్ రేసులో ఎవరి కంటే తక్కువ కాదని దూబే నిరూపించాడు. అసలైన పోటీదారు అనిపించుకున్నాడు. ఐపీఎల్‌లోనూ దూబే ఇలాగే రాణిస్తే.. టీమిండియాలోకి రాకుండా అతడిని ఎవరూ ఆపలేరు’’ అని మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాలు పంచుకున్నాడు. చదవండి: Ayodhya Ram Mandir Inauguration: అయోధ్యకు వెళ్లి తీరతా.. ఏం చేస్తారో చేసుకోండి: హర్భజన్ సింగ్ Ranji Trophy 2024: బ్యాట్‌తో చెలరేగిన దూబే.. టెస్టుల్లోనూ ఎంట్రీకి సై! -
రంజీలోనూ బ్యాట్‌తో చెలరేగిన దూబే.. టెస్టుల్లోనూ ఎంట్రీకి సై!
Ranji Trophy 2024 Kerala Vs Mumbai -Shivam Dube: టీమిండియా పేస్ ఆల్‌రౌండర్ శివం దూబే ప్రస్తుతం సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. ఇటీవల అఫ్గనిస్తాన్‌తో ముగిసిన టీ20 సిరీస్‌లో ఈ ముంబై బ్యాటర్ వరుస అర్ధ శతకాలతో అలరించిన విషయం తెలిసిందే. అదే విధంగా.. కీలక సమయాల్లో రెండు వికెట్లు కూడా తీసి జట్టు విజయాల్లో భాగమయ్యాడు. ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ మొత్తంగా మూడు మ్యాచ్‌లలో కలిపి 124 పరుగులు సాధించిన దూబే.. టీమిండియా సిరీస్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. తద్వారా ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు కూడా అందుకున్నాడు. 2019లో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టినప్పటికీ.. తాజా ప్రదర్శనతోనే ఎక్కువ గుర్తింపు తెచ్చుకున్నాడీ బౌలింగ్ ఆల్‌రౌండర్. ఇక ఇప్పటికే టీమిండియా తరఫున టీ20, వన్డేల్లో ఎంట్రీ ఇచ్చిన శివం దూబే.. టెస్టు జట్టులోనూ చోటు దక్కించుకోవడంపై దృష్టి సారించాడు. ఇందులో భాగంగా రంజీ ట్రోఫీ-2024లో ముంబై తరఫున ఆడిన తొలి మ్యాచ్‌లోనే హాఫ్ సెంచరీతో చెలరేగి సత్తా చాటాడు. రహానే గోల్డెన్ డక్ ఎలైట్ గ్రూప్-బిలో భాగంగా కేరళ- ముంబై మధ్య శుక్రవారం మ్యాచ్ మొదలైంది. తిరువనంతపురం వేదికగా టాస్ గెలిచిన ముంబై కెప్టెన్ అజింక్య రహానే తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ క్రమంలో బౌలింగ్ అటాక్ మొదలుపెట్టిన కేరళ పేసర్ బాసిల్ థంపి.. తొలి బంతికే ఓపెనర్ జై గోకుల్ బిస్తాను అవుట్ చేశాడు. అతడి స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన కెప్టెన్ రహానేను కూడా గోల్డెన్ డక్ చేశాడు. ఇలా ఆరంభంలోనే రెండు కీలక వికెట్లు కోల్పోయిన వేళ మరో ఓపెనర్ భూపేన్ లల్వానీ ఆచితూచి ఆడాడు. దూబే హాఫ్ సెంచరీ మిగతా వాళ్లలో సువేద్ పార్కర్(18), ప్రసాద్ పవార్(28) ఓ మోస్తరుగా రాణించగా.. ఆరో స్థానంలో బ్యాటింగ్ చేసిన శివం దూబే.. లల్వానీతో కలిసి భాగస్వామ్యం నెలకొల్పాడు. లల్వానీ(50), దూబే(72 బంతుల్లో 51 రన్స్)లతో పాటు.. తనూష్ కొటైన్(56) కూడా అర్ధ శతకంతో జట్టును ఆదుకున్నాడు. ఈ ముగ్గురి ప్రదర్శన కారణంగా తొలి రోజు ఆట ముగిసే సరికి ముంబై 78.4 ఓవర్లలో 251 పరుగులకు ఆలౌట్ అయింది. ఇక.. టీమిండియాలో రీఎంట్రీ ఇస్తానని ధీమాగా ఉన్న ముంబై కెప్టెన్ అజింక్య రహానే విఫలం కావడం.. అదే సమయంలో శివం దూబే హాఫ్ సెంచరీతో సత్తా చాటడం శుక్రవారం నాటి ఆటలో హైలెట్‌గా నిలిచాయి. చదవండి: #Viratkohli: కోహ్లి ఆ రన్స్ సేవ్ చేయడం వల్లే ఇదంతా.. రోహిత్ రియాక్షన్ చూశారా? -
Ind vs Afg: ఉత్కంఠ పోరులో అఫ్గన్‌పై భారత్ విజయం.. సిరీస్ కైవసం
India vs Afghanistan 3rd T20I- Updates: అఫ్గన్‌పై భారత్ విజయం సాధించింది. దాంతో సిరీస్‌ను టీమిండియా కైవసం చేసుకుంది. రెండో సూపర్ ఓవర్లో తేలిన మ్యాచ్ ఫలితం. తొలి సూపర్ ఓవర్లో 16 పరుగులు చేసిన ఇరు జట్లు రెండో సూపర్ ఓవర్లో ఉత్కంఠ పోరులో టీమిండియా గెలుపొందింది. స్కోర్లు IND 212/4 (20), AFG 212/6 (20) మొదటి సూపర్ ఓవర్లో కూడా మ్యాచ్ టై అయింది. అఫ్గన్ ఆరు వికెట్లు కోల్పోయిన తరువాత మ్యాచ్ టై అయింది (సూపర్ ఓవర్ ప్రోగ్రెస్‌లో ఉంది) 16.2: నాలుగో వికెట్ కోల్పోయిన అఫ్గన్ సుందర్ బౌలింగ్‌లో నబీ అవుట్.. స్కోరు 164/4 (16.3) ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీసిన వాషింగ్టన్ సుందర్ 12.4: అజ్మతుల్లా అవుట్.. మూడో వికెట్ కోల్పోయిన అఫ్గనిస్తాన్ 12.4: సుందర్ బౌలింగ్‌లో జద్రాన్ స్టంపౌట్. 10.6: తొలి వికెట్ కోల్పోయిన అఫ్గన్ కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో గుర్బాజ్ అవుట్. వాషింగ్టన్ సుందర్‌కు క్యాచ్ ఇచ్చి 50 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద నిష్క్రమించాడు. స్కోరు: 93-1(11 ఓవర్లలో). పవర్ ప్లేలో అఫ్గనిస్తాన్ స్కోరు: 51/0 (6) ►నిలకడగా ఆడుతున్న అఫ్గన్ ఓపెనర్లు.. ఇబ్రహీం జద్రాన్ 28, రహ్మనుల్లా గుర్బాజ్ 21 పరుగులతో క్రీజులో ఉన్నారు. శతక్కొట్టిన రోహిత్.. రింకూ సింగ్ ధనాధన్ ఇన్నింగ్స్ బెంగళూరు వేదికగా అఫ్గనిస్తాన్‌తో మూడో టీ20లో టాస్ గెలిచిన టీమిండియా తొలుత బ్యాటింగ్ చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ సునామీ ఇన్నింగ్స్‌కు తోడు రింకూ సింగ్ ధనాధన్ బ్యాటింగ్ కారణంగా భారీ స్కోరు చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో కేవలం నాలుగు వికెట్లు నష్టపోయి 212 పరుగులు సాధించింది. రోహిత్ శర్మ 69 బంతుల్లో 121 పరుగులతో చెలరేగగా.. రింకూ 39 బంతుల్లో 69 పరుగులతో ఆకట్టుకున్నాడు. ఈ మ్యాచ్ సందర్భంగా రోహిత్ తన అంతర్జాతీయ టీ20 కెరీర్లో ఏకంగా ఐదో సెంచరీ సాధించాడు. ఈ ఘనత సాధించిన ఏకైక బ్యాటర్‌గా నిలిచాడు. అదే విధంగా పొట్టి ఫార్మాట్లో తన అత్యధిక స్కోరు నమోదు చేసి దటీజ్ హిట్‌మ్యాన్ అనిపించుకున్నాడు. 🎥 That Record-Breaking Moment! 🙌 🙌@ImRo45 notches up his 5⃣th T20I hundred 👏 👏 Follow the Match ▶️ https://t.co/oJkETwOHlL#TeamIndia | #INDvAFG | @IDFCFIRSTBank pic.twitter.com/ITnWyHisYD — BCCI (@BCCI) January 17, 2024 18.6: రింకూ సింగ్ హాఫ్ సెంచరీ రోహిత్ 104, రింకూ 51 పరుగులతో క్రీజులో ఉన్నారు. 18.4: శతక్కొట్టిన రోహిత్ శర్మ అంతర్జాతీయ టీ20లలో 5 శతకాలు బాదిన ఏకైక క్రికెటర్‌గా చరిత్ర. దటీజ్ హిట్‌మ్యాన్ అంటూ ప్రశంసల జల్లు దంచి కొడుతున్న రోహిత్, రింకూ.. టీమిండియా స్కోరు: 144/4 (17) రోహిత్ 57 బంతుల్లో 80, రింకూ సింగ్ 32 బంతుల్లో 42 పరుగులతో క్రీజులో ఉన్నారు. నిలకడగా ఆడుతున్న రోహిత్, రింకూ సింగ్ 16 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా స్కోరు: 131/4 100 పరుగుల భాగస్వామ్యం 15.3: సలీం సఫీ నోబాల్.. రోహిత్ శర్మ, రింకూ సింగ్ వంద పరుగుల భాగస్వామ్యం పూర్తి చేసుకున్నారు. 12.6: రోహిత్ శర్మ హాఫ్ సెంచరీ అఫ్గన్‌తో తొలి రెండు మ్యాచ్‌లలో డకౌట్ అయిన రోహిత్ శర్మ.. మూడో టీ20 అర్ధ శతకంతో మెరిశాడు. 13 ఓవర్లలో టీమిండియా స్కోరు: 97-4. రింకూ 30 పరుగులతో రోహిత్‌కు తోడుగా ఉన్నాడు. నిలకడగా రోహిత్.. స్పీడు పెంచిన రింకూ 12: వరుసగా రెండు సిక్సర్లు బాదిన రోహిత్ శర్మ . 12 వ ఓవర్ ముగిసే సరికి రోహిత్ 41, రింకూ 23 పరుగులతో క్రీజులో ఉన్నారు. 10 ఓవర్లలో టీమిండియా స్కోరు- 61/4 రోహిత్ 27, రింకూ 19 పరుగులతో ఉన్నారు. వీరిద్దరు నిలకడగా ఆడుతూ మెరుగైన భాగస్వామ్యం నమోదు చేసే దిశగా వెళ్తున్నారు. ఎనిమిది ఓవర్లలో టీమిండియా స్కోరు: 48-4 పవర్ ప్లేలో టీమిండియా స్కోరు: 30-4 రోహిత్ 13, రింకూ 2 పరుగులతో క్రీజులో ఉన్నారు. సంజూ శాంసన్ డకౌట్ 4.3: ఫరీద్ అహ్మద్ బౌలింగ్‌లో డకౌట్‌గా వెనుదిరిగిన సంజూ. రాకరాక వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయిన వికెట్ కీపర్ బ్యాటర్. సంజూ స్థానంలో రింకూ సింగ్ క్రీజులోకి వచ్చాడు. రోహిత్ 8 పరుగులతో ఆడుతున్నాడు. స్కోరు: 22-4 (5 ఓవర్లు) దూబే అవుట్.. మూడో వికెట్ డౌన్ 3.6: అజ్మతుల్లా బౌలింగ్‌లో శివం దూబే వికెట్ కీపర్ క్యాచ్‌గా అవుటయ్యాడు. గత రెండు మ్యాచ్‌లలో వరుసగా అర్ధ శతకాలు బాదిన ఈ ఆల్‌రౌండర్.. బెంగళూరులో ఒక్క పరుగుకే పరిమితమయ్యాడు. దూబే స్థానంలో సంజూ శాంసన్ క్రీజులోకి వచ్చాడు. స్కోరు: 21-3(4) కోహ్లి డకౌట్.. టీమిండియా స్కోరు 19-2(3) 2.4: ఫరీద్ అహ్మద్ బౌలింగ్‌లో కోహ్లి గోల్డెన్ డకౌట్‌గా వెనుదిరిగాడు. అంతర్జాతీయ టీ20 కెరీర్లో కోహ్లి ఇలా ఎదుర్కొన్న తొలి బంతికే అవుట్ కావడం ఇదే తొలిసారి. కాగా ఇబ్రహీం జద్రాన్‌కు క్యాచ్ ఇచ్చి పరుగుల ఖాతా తెరవకుండానే నిష్క్రమించాడు. అతడి స్థానంలో శివం దూబే క్రీజులోకి వచ్చాడు. రోహిత్ నాలుగు పరుగులతో ఆడుతున్నాడు. తొలి వికెట్ కోల్పోయిన టీమిండియా 2.3: యశస్వి జైస్వాల్(4) రూపంలో టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. ఫరీద్ అహ్మద్ బౌలింగ్‌లో నబీకి క్యాచ్ ఇచ్చి జైస్వాల్ పెవిలియన్ చేరగా.. విరాట్ కోహ్లి క్రీజులోకి వచ్చాడు. రెండు ఓవర్లలో టీమిండియా స్కోరు: 13-0 టీమిండియా ఇన్నింగ్స్ ఆరంభించిన యశస్వి, రోహిత్ 1.3: ఎట్టకేలకు రీఎంట్రీలో.. ఈ సిరీస్‌లోనూ పరుగుల ఖాతా తెరిచిన రోహిత్. అజ్మతుల్లా బౌలింగ్‌లో సింగిల్ తీసిన హిట్‌మ్యాన్. సంజూకు ఛాన్స్ తొలి రెండు మ్యాచ్‌లలో మొదట బౌలింగ్ చేశాం కాబట్టి.. ఈసారి బ్యాటింగ్ ఎంచుకుంటున్నట్లు కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు.అదే విధంగా ఈ మ్యాచ్‌లో మూడు మార్పులతో బరిలోకి దిగనున్నట్లు హిట్‌మ్యాన్ వెల్లడించాడు. నామమాత్రపు మ్యాచ్ సందర్భంగా భిన్నమైన కాంబినేషన్లు ట్రై చేయాలని భావిస్తున్నట్లు తెలిపాడు. అందుకే.. అక్షర్ పటేల్, జితేశ్ శర్మ, అర్ష్‌దీప్ సింగ్‌ల స్థానంలో కుల్దీప్ యాదవ్, సంజూ శాంసన్, ఆవేశ్ ఖాన్లకు తుదిజట్టులో చోటిచ్చినట్లు రోహిత్ శర్మ వెల్లడించాడు. క్లీన్‌స్వీప్‌పై కన్ను కాగా టీ20 ప్రపంచకప్-2024కు ముందు భారత జట్టు ఆడుతున్న ఆఖరి టీ20 సిరీస్ ఇది. ఇందులో భాగంగా.. ఇప్పటికే రెండు మ్యాచ్‌లు గెలిచి సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకున్న రోహిత్ సేన... అఫ్గన్‌తో మూడో టీ20లోనూ గెలిచి క్లీన్‌స్వీప్‌తో సత్తా చాటాలని పట్టుదలగా ఉంది. మరోవైపు.. కనీసం ఒక్క మ్యాచ్ అయినా గెలిచి పరువు నిలుపుకోవాలని అఫ్గనిస్తాన్ భావిస్తోంది. ఇక ఈ మ్యాచ్ సందర్భంగా తాము కూడా తుదిజట్టులో మూడు మార్పులు చేసినట్లు అఫ్గనిస్తాన్ కెప్టెన్ ఇబ్రహీం జద్రాన్ తెలిపాడు. షరాఫుద్దీన్ అష్రఫ్, కైస్ అహ్మద్, మహ్మద్ సలీం సఫీ, ఫరీద్ అహ్మద్ మాలిక్‌లను ఆడించనున్నట్లు వెల్లడించాడు. తుదిజట్లు టీమిండియా యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ(కెప్టెన్), విరాట్ కోహ్లి, శివమ్ దూబే, సంజూ శాంసన్(వికెట్ కీపర్), రింకూ సింగ్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, ముకేశ్ కుమార్, కుల్దీప్ యాదవ్, ఆవేశ్ ఖాన్. అఫ్గనిస్తాన్ రహ్మనుల్లా గుర్బాజ్(వికెట్ కీపర్), ఇబ్రహీం జద్రాన్(కెప్టెన్), గుల్బదిన్ నైబ్, అజ్మతుల్లా ఒమర్జాయ్, మహ్మద్ నబీ, నజీబుల్లా జద్రాన్, కరీం జనత్, షరాఫుద్దీన్ అష్రఫ్, కైస్ అహ్మద్, మహ్మద్ సలీం సఫీ, ఫరీద్ అహ్మద్ మాలిక్. -
హార్దిక్ తిరిగొచ్చినా వరల్డ్‌కప్‌లో ఆడేది అతడే: టీమిండియా దిగ్గజం
T20 WC 2024: టీమిండియా ఆల్‌రౌండర్ శివం దూబేపై భారత క్రికెట్ దిగ్గజం సునిల్ గావస్కర్ ప్రశంసలు కురిపించాడు. అద్భుత ప్రదర్శనలతో ఆకట్టుకుంటున్న ఈ ముంబై బ్యాటర్... టీ20 ప్రపంచకప్-2024 జట్టులో చోటు దక్కించుకోవడం ఖాయమని అంచనా వేశాడు. ఇలాగే ధనాధన్ ఇన్నింగ్స్‌తో చెలరేగితే సెలక్టర్లు అతడిని పక్కనపెట్టే సాహసం చేయలేరని పేర్కొన్నాడు. కాగా 2019లో బంగ్లాదేశ్ టూర్ సందర్భంగా అంతర్జాతీయ టీ20లలో అడుగుపెట్టాడు పేస్ ఆల్‌రౌండర్ శివం దూబే. ఢిల్లీ వేదికగా జరిగిన నాటి మ్యాచ్‌లో కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసి నిరాశపరిచాడు. అదే విధంగా ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. ఆ తర్వాత అడపాదడపా వచ్చిన అవకాశాలను కూడా సద్వినియోగం చేసుకోలేకపోయాడు. పాండ్యా గాయం.. దూబే పాలిట వరం! దీంతో బీసీసీఐ సెలక్టర్లు శివం దూబేను పక్కనపెట్టారు. అయితే, ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున గతేడాది సత్తా చాటిన దూబేను.. హార్దిక్ పాండ్యా గాయం రూపంలో అదృష్టం వరించింది. ప్రపంచకప్-2024కు ముందు స్వదేశంలో టీమిండియా అఫ్గనిస్తాన్‌తో ఆడుతున్న టీ20 సిరీస్‌కు పాండ్యా దూరమయ్యాడు. చీలమండ నొప్పి కారణంగా అందుబాటులో లేకుండా పోయాడు. ఈ క్రమంలో హార్దిక్ పాండ్యా స్థానంలో పేస్ ఆల్‌రౌండర్‌గా శివం దూబేకు అవకాశం వచ్చింది. అయితే, పునరాగమనంలో దూబే తప్పులను పునరావృతం చేయలేదు. వరుస హాఫ్ సెంచరీలు మొహాలీ వేదికగా తొలి టీ20లో ఒక వికెట్ తీయడంతో పాటు.. లక్ష్య ఛేదనలో దంచికొట్టాడు. కేవలం 40 బంతుల్లోనే 60 పరుగులు రాబట్టి ఆఖరి వరకు అజేయంగా నిలిచి జట్టును గెలుపుతీరాలకు చేర్చాడు. తద్వారా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. ఇక రెండో టీ20లోనూ ఆకాశమే హద్దుగా దూసుకుపోయిన శివం దూబే.. ఒక వికెట్ పడగొట్టడంతో పాటు.. 32 బంతుల్లోనే 63 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. మరోసారి జట్టును గెలిపించాడు. తద్వారా టీమిండియా 2-0తో సిరీస్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. సెలక్టర్లకు తలనొప్పి ఇక బుధవారం నాటి మూడో టీ20లోనూ సత్తా చాటి.. ఆపై ఐపీఎల్-2024లోనూ అద్భుతాలు చేస్తే దూబేకు తిరుగు ఉండదు. ఈ నేపథ్యంలో సునిల్ గావస్కర్ క్రిక్‌బజ్‌తో మాట్లాడుతూ.. ‘‘ఒకవేళ హార్దిక్ పాండ్యా ఫిట్‌గా లేకపోతే టీమిండియా పరిస్థితి ఏంటి? అని మనమంతా ఆందోళనకు గురయ్యాం. కానీ.. ఇప్పుడు హార్దిక్ పూర్తి ఫిట్‌గా ఉన్నా శివం దూబే అమెరికా ఫ్లైట్ ఎక్కడం ఖాయం. ఇలాగే తన ప్రదర్శనను కొనసాగిస్తే... అతడిని జట్టు నుంచి తప్పించాలన్న ఆలోచనే రాదు. హార్దిక్ తిరిగి వస్తే సెలక్టర్లకు పెద్ద తలనొప్పిగా మారుతుంది. గత రెండు మ్యాచ్‌లతో దూబే తన స్థాయిని పెంచుకున్నాడు. తనదైన శైలిలో ఆడుతూ విజయవంతమవుతున్నాడు. ఎవరినీ అనుకరించే ప్రయత్నం చేయడం లేదు. ప్రపంచకప్ జట్టులో చోటు దక్కించుకోవడానికి తానేం చేయాలో అంతా చేస్తున్నాడు’’ అని పేర్కొన్నాడు. కాగా జూన్ 4 నుంచి అమెరికా-వెస్టిండీస్ వేదికగా టీ20 ప్రపంచకప్-2024 ఆరంభం కానుంది. చదవండి: లక్ష్యం 110.. నరాలు తెగే ఉత్కంఠ! ఏకంగా 7 వికెట్లు కూల్చి.. -
యశస్వి, శివమ్ దూబేలకు బంపర్ ఆఫర్..!
టీమిండియా ఆటగాళ్లు యశస్వి జైస్వాల్, శివమ్ దూబేలకు బంపర్ ఆఫర్ తగిలేలా ఉంది. ఈ ఇద్దరికి బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ ఇవ్వాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది. గతకొంతకాలంగా పొట్టి క్రికెట్లో విశేషంగా రాణిస్తున్న వీరిరువురికి సెంట్రల్ కాంట్రాక్ట్‌తో గుర్తింపునివ్వాలని బీసీసీఐ యోచిస్తున్నట్లు సమాచారం. త్వరలోనే వీరు శుభవార్త వినే అవకాశం ఉందని భారత క్రికెట్ సర్కిల్స్ కోడైకూస్తున్నాయి. బీసీసీఐ గతేడాది (2022-23) మొత్తం 26 మంది ఆటగాళ్లకు సెంట్రల్ కాంట్రాక్ట్ అందించింది. 2023-24 బీసీసీఐ కాంట్రాక్ట్ ఆటగాళ్ల జాబితాలో కొత్తగా యశస్వి, దూబే చేరవచ్చు. కాగా, ప్రస్తుతం స్వదేశంలో ఆఫ్ఘనిస్తాన్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌లో యశస్వి, దూబే ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నారు. ముఖ్యంగా శివమ్ దూబే తన కెరీర్లో అత్యుత్తమ ఫామ్‌లో కొనసాగుతున్నాడు. ఆఫ్ఘన్‌తో తొలి రెండు మ్యాచ్‌ల్లో అతను రెండు అజేయ అర్ధశతకాలతో (60, 63) పాటు మూడు వికెట్లు పడగొట్టి టీమిండియా విజయాల్లో కీలకపాత్ర పోషించాడు. గతేడాది ఐర్లాండ్ టూర్‌తో మూడేళ్ల తర్వాత టీమిండియాలోకి (టీ20 జట్టు) రీఎంట్రీ ఇచ్చిన దూబే అప్పటి నుంచి విశేషంగా రాణిస్తున్నాడు (20 టీ20ల్లో 45.83 సగటున 275 పరుగులు, 8 వికెట్లు). అంతకముందు ఐపీఎల్ 2023లో దూబే సీఎస్కే తరఫున విశ్వరూపమే ప్రదర్శించాడు. ఆ సీజన్లో అతను 16 మ్యాచ్‌ల్లో 158.33 స్ట్రయిక్‌రేట్‌తో 418 పరుగులు చేశాడు. ఇందులో మూడు హాఫ్ సెంచరీలు, 35 సిక్సర్లు ఉన్నాయి. దూబే బౌలింగ్‌లో ఇంకాస్త మెరుగై, బ్యాటింగ్ ప్రదర్శనను ఇలాగే కొనసాగిస్తే హార్దిక్‌కు ప్రత్యామ్నాయంగా మారడం ఖాయమని విశ్లేషకులు అంటున్నారు. మరోవైపు జైస్వాల్ అరంగేట్రం నాటి నుంచి టెస్ట్, టీ20ల్లో చెలరేగిపోతున్నాడు. గతేడాది వెస్టిండీస్ పర్యటనలో అంతర్జాతీయ క్రికెట్లోకి ఎంట్రీ ఇచ్చిన జైస్వాల్.. నాటి నుంచి 4 టెస్ట్‌లు, 16 వన్డేలు ఆడి 2 సెంచరీలు, 5 అర్ధసెంచరీలు చేశాడు. తాజాగా ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన రెండో టీ20లో జైస్వాల్ (68).. దూబేతో కలిసి భారత్‌కు అద్భుత విజయాన్ని అందించారు. -
ధనాధన్ దూబే.. కోహ్లితో సమానంగా.. హార్దిక్ స్థానానికి ఎసరు పెట్టేలా..!
టీమిండియా ఆల్‌రౌండర్ శివమ్ దూబే ఫేట్ ఒక్కసారిగా మారిపోయింది. ఆఫ్ఘనిస్తాన్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌లో వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఆల్‌రౌండర్‌గా సత్తా చాటిన దూబే.. భావి భారత కెప్టెన్‌గా అనుకుంటున్న హార్దిక్ పాండ్యా స్థానానికే ఎసరు పెట్టాడు. హార్దిక్ పాండ్యాలా పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ అయిన దూబే.. హార్దిక్ గైర్హాజరీలో అద్భుతంగా రాణిస్తూ అతని స్థానాన్నే ప్రశ్నార్థకంగా మార్చాడు. ఇటీవలికాలంలో ఫార్మాట్లకతీతంగా విశేషంగా రాణిస్తున్న దూబే.. ఇలాగే తన మెరుపులు కొనసాగిస్తే టీమిండియాలో హార్దిక్ స్థానం గల్లంతవడం ఖాయమని విశ్లేషకులు అంటున్నారు. తరుచూ గాయపడే హార్దిక్ కన్నా దూబే చాలా బెటర్ అని వారు అభిప్రాయపడుతున్నారు. ఒకవేళ హార్దిక్‌ను తీసుకున్నా దూబేని టీ20 ప్రపంచకప్‌కు ఎంపిక చేయాలని డిమాండ్ చేస్తున్నారు. 30 ఏళ్ల దూబే ఆటతీరులో ఇటీవలికాలంలో చాలా మార్పులు వచ్చాయి. ఐపీఎల్ 2023 తర్వాత అతను బాగా రాటుదేలాడు. దేశవాలీ క్రికెట్లోనూ దూబే సత్తా చాటాడు. చాలాకాలంగా పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ కోసం ఎదురు చూస్తున్న టీమిండియాకు దూబే కరెక్ట్ మ్యాచ్ అని మాజీలు అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉంటే, ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన తొలి టీ20లో అజేయమైన అర్ధసెంచరీ (60 నాటౌట్) సహా వికెట్ (2-0-9-1) తీసి టీమిండియాను గెలిపించిన దూబే.. రెండో మ్యాచ్‌లోనూ ఇంచుమించు అదే ప్రదర్శనతో (32 బంతుల్లో 63 నాటౌట్; 5 ఫోర్లు, 4 సిక్సర్లు, 3-0-36-1) భారత్‌ను విజయతీరాలకు చేర్చాడు. కోహ్లి సరసన.. రెండో టీ20 ప్రదర్శనతో దూబే ఏకంగా లెజెండ్ విరాట్ కోహ్లి సరసన చేరాడు. విరాట్ టీ20ల్లో రెండు సార్లు అర్ధసెంచరీతో పాటు వికెట్ తీయగా.. దూబే సైతం అన్నే సార్లు ఈ ఘనత సాధించాడు. భారత్ తరఫున అత్యధిక సార్లు ఈ ప్రదర్శన నమోదు చేసిన ఆటగాడిగా యువరాజ్ సింగ్ నిలిచాడు. యువీ మూడుసార్లు ఓ మ్యాచ్‌లో 50 పరుగులతో పాటు వికెట్ తీశాడు. భారత్ తరఫున హార్ధిక్, అక్షర్ పటేల్, తిలక్ వర్మ, వాషింగ్టన్ సుందర్ తలోసారి 50 స్కోర్‌తో పాటు వికెట్ తీశారు. కాగా, దూబేతో పాటు యశస్వి జైస్వాల్ (34 బంతుల్లో 68; 5 ఫోర్లు, 6 సిక్సర్లు) చెలరేగడంతో రెండో టీ20లో భారత్ ఆఫ్ఘనిస్తాన్‌ను 6 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. ఫలితంగా టీమిండియా మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0తో కైవసం చేసుకుంది. సిరీస్ గెలుపుతో భారత్ స్వదేశంలో తమ అజేయ యాత్రను కొనసాగించింది. సొంతగడ్డపై టీమిండియాకు గత 15 టీ20 సిరీస్‌ల్లో (2019 నుంచి) ఓటమిలేదు. -
జైస్వాల్ అద్భుతం.. అతడేమో బిగ్ ప్లేయర్.. గర్వంగా ఉంది: రోహిత్
అఫ్గనిస్తాన్‌తో రెండో టీ20లో విజయంపై టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ హర్షం వ్యక్తం చేశాడు. యువ ఆటగాళ్ల ప్రదర్శన పట్ల తానెంతో గర్వపడుతున్నానని పేర్కొన్నాడు. గత రెండు మ్యాచ్‌లలో తాము అన్ని బాక్సులను టిక్ చేశామని.. సమిష్టి ప్రదర్శనతో గెలుపొందామని జట్టును ప్రశంసించాడు. ముఖ్యంగా విజయాల్లో కీలక పాత్ర పోషించిన శివం దూబే, యశస్వి జైస్వాల్‌లను ఈ సందర్భంగా రోహిత్ శర్మ కొనియాడాడు. కాగా స్వదేశంలో అఫ్గనిస్తాన్‌తో టీ20 సిరీస్‌ను టీమిండియా 2-0తో సొంతం చేసుకుంది. ఇండోర్‌లో ఆదివారం నాటి టీ20లో ఆరు వికెట్ల తేడాతో జట్టును గెలిపించి.. మరో మ్యాచ్ మిగిలి ఉండగానే కుర్రాళ్లు భారత్‌కు విజయాన్ని బహుమతిగా అందించారు. ఇక కెప్టెన్ రోహిత్ శర్మ కెరీర్లో ఇది 150వ అంతర్జాతీయ టీ20 కావడం విశేషం. తద్వారా మెన్స్ క్రికెట్లో ఈ ఘనత సాధించిన తొలి ఆటగాడిగా హిట్‌మ్యాన్ చరిత్ర సృష్టించాడు. ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ.. ‘‘ఇదొక గొప్ప అనుభూతి. 2007లో మొదలైన ఈ ప్రయాణం ఎన్నో మధుర జ్ఞాపకాలతో ఇక్కడిదాకా సాగింది. ఇక ఈ సిరీస్ విషయానికొస్తే.. మేము ఎలాంటి ప్రయోగాలు చేయాలనుకున్నామో అన్నీ చేశాం. జట్టులోని ప్రతి ఆటగాడి నుంచి ఎలాంటి ప్రదర్శన ఆశిస్తున్నామో ముందే స్పష్టంగా వివరించాం. అందుకు తగ్గట్లుగానే అందరూ రాణించారు. నన్ను గర్వపడేలా చేశారు. గత రెండు మ్యాచ్‌లలో అన్ని విభాగాల్లోనూ అనుకున్న ప్రణాళికలు అమలు చేయగలిగాం. జైస్వాల్ తొలుత టెస్టుల్లో తనను తాను నిరూపించుకున్నాడు. ఇప్పుడు టీ20లలోనూ సత్తా చాటుతున్నాడు. ఆటగాడిగా తన నైపుణ్యాలేమిటో.. సామర్థ్యం ఏపాటిదో మరోసారి చూపించాడు. జైస్వాల్ ప్రతిభావంతుడు. వైవిధ్యమైన గొప్ప షాట్లు ఆడగలడు. ఇక దూబే బిగ్ ప్లేయర్. అత్యంత శక్తిమంతమైన ఆటగాడు. స్పిన్నర్ల బౌలింగ్‌ను చిత్తు చేయగలడు. జట్టులోకి వచ్చాడు.. రెండు విలువైన ఇన్నింగ్స్ ఆడాడు. తన పాత్రను చక్కగా పోషించాడు’’ అని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు. కాగా దాదాపు నాలుగేళ్ల తర్వాత టీమిండియాలో రీఎంట్రీ ఇచ్చిన పేస్ ఆల్‌రౌండర్ శివం దూబే.. అఫ్గన్‌తో సిరీస్‌లో సత్తా చాటాడు. తొలి టీ20లో ఒక వికెట్ తీయడంతో పాటు.. 40 బంతుల్లో 60 పరుగులతో అజేయంగా నిలిచి జట్టును విజేతగా నిలిపాడు. తాజాగా రెండో టీ20లోనూ ఒక వికెట్ తీసిన అతడు.. 32 బంతులు ఎదుర్కొని 63 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఓపెనర్ యశస్వి జైస్వాల్(34 బంతుల్లో 68)తో కలిసి టీమిండియాను గెలిపించాడు. ఇదిలా ఉంటే.. అఫ్గన్‌తో సిరీస్‌తో అంతర్జాతీయ టీ20లలో రీఎంట్రీ ఇచ్చిన రోహిత్ రెండు మ్యాచ్‌లలో డకౌట్ కాగా.. రెండో టీ20తో పునరాగమనం చేసిన విరాట్ కోహ్లి 16 బంతుల్లో 29 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. చదవండి: రీఎంట్రీలో కోహ్లి దంచికొడితే.. జైస్వాల్, దూబే దుమ్ములేపారు! అదొక్కటే లోటు.. -
Ind vs Afg: రీఎంట్రీలో కోహ్లి మార్కు .. జైస్వాల్, దూబే దంచికొట్టారు!
India vs Afghanistan, 2nd T20I: అఫ్గనిస్తాన్‌తో రెండో టీ20లో టీమిండియా జయభేరి మోగించింది. ఇబ్రహీం జద్రాన్ బృందాన్ని ఆరు వికెట్ల తేడాతో ఓడించింది. తద్వారా మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్‌ను 2-0తో గెలుచుకుంది. టీ20 ప్రపంచకప్-2024కు ముందు ఆడుతున్న ఆఖరిదైన ద్వైపాక్షిక సిరీస్‌లో అఫ్గన్‌పై ఆద్యంతం ఆధిపత్యం కనబరుస్తూ సత్తా చాటుకుంది. ముఖ్యంగా యువ ఆటగాళ్లే ఈ విజయంలో కీలక పాత్ర పోషించడం విశేషం. కాగా టీమిండియాతో తొలిసారి టీ20 సిరీస్ ఆడేందుకు అఫ్గనిస్తాన్ భారత పర్యటనకు వచ్చిన విషయం తెలిసిందే. స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ గైర్హాజరీలో యువ బ్యాటర్ ఇబ్రహీం జద్రాన్ ఈ జట్టుకు సారథ్యం వహిస్తున్నాడు. 172 పరుగులకు అఫ్గన్ ఆలౌట్ ఈ క్రమంలో మొహాలీ వేదికగా తొలి మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో భారత్ చేతిలో ఓడిన అఫ్గన్ జట్టు.. ఆదివారం నాటి మ్యాచ్‌లోనూ ఆరు వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఇండోర్ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన జద్రాన్ బృందం నిర్ణీత 20 ఓవర్లలో 172 పరుగులకు ఆలౌట్ అయింది. టీమిండియా బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్ మూడు, రవి బిష్ణోయి రెండు, అక్షర్ పటేల్ రెండు, శివం దూబే ఒక వికెట్ పడగొట్టారు. రనౌట్ల రూపంలో రెండు వికెట్లు వచ్చాయి. కాగా గుల్బదిన్ నైబ్ (35 బంతుల్లో 57), కరీం జనత్(10 బంతుల్లో 20), ముజీబ్ ఉర్ రహ్మాన్(9 బంతుల్లో 21) మెరుపు ఇన్నింగ్స్ కారణంగా ఈ మేరకు స్కోరు చేయగలిగింది. ఇది మెరుగైన స్కోరే అయినప్పటికీ.. పరుగుల వరదపారించడానికి వీలైన హోల్కర్ స్టేడియంలో టీమిండియాను నిలువరించడం అంతతేలిక కాదని అఫ్గన్‌కు త్వరగానే అర్థమైంది. ఇండియా ఇన్నింగ్స్‌లో ఐదో బంతికే కెప్టెన్ రోహిత్ శర్మను డకౌట్ చేసినప్పటికీ.. మరో ఓపెనర్ యశస్వి జైస్వాల్ అఫ్గన్ బౌలర్లకు కొరకరాని కొయ్యలా మారాడు. విరాట్ కోహ్లి (16 బంతుల్లో 29 పరుగులు) కూడా త్వరగానే పెవిలియన్ చేరినా పట్టుదలగా క్రీజులో నిలబడ్డాడు. కోహ్లి దంచికొడితే.. జైస్వాల్, దూబే దుమ్ములేపారు కోహ్లి స్థానంలో క్రీజులోకి వచ్చిన శివం దూబేతో కలిసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. జైస్వాల్ 34 బంతుల్లో 5 ఫోర్లు, ఆరు సిక్సర్లతో చెలరేగి 68 పరుగులు సాధించగా.. దూబే 32 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్‌ల సాయంతో 63 పరుగులతో అజేయంగా నిలిచాడు. వీరిద్దరి సునామీ ఇన్నింగ్స్ కారణంగా 15.4 ఓవర్లలోనే టీమిండియా అఫ్గన్ విధించిన 173 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. సిరీస్‌ను 2-0తో సొంతం చేసుకుంది. కీలక సమయంలో అఫ్గన్ కీలక వికెట్లు(జద్రాన్, గుల్బదిన్) తీసిన అక్షర్ పటేల్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. అదొక్కటే లోటు అంతాబాగానే ఉన్నా తొలి టీ20 మాదిరే రెండో టీ20లోనూ రోహిత్ శర్మ డకౌట్ కావడం అభిమానులకు నిరాశ కలిగింది. రీఎంట్రీలో హిట్‌మ్యాన్ మెరుపులు చూడాలనుకుంటే ఆ లోటు ఇప్పటికి అలాగే మిగిలిపోయింది. -
IND Vs AFG, 1st T20I: కుర్రాళ్లు గెలిపించారు
విరాట్ కోహ్లి ఆడలేదు... రోహిత్ శర్మ విఫలమయ్యాడు... అయినా సరే యువ ఆటగాళ్ల ప్రదర్శనతో భారత్ విజయాన్ని అందుకుంది. అఫ్గానిస్తాన్‌తో పోరులో అక్కడక్కడా కాస్త శ్రమించినా... చివరకు గెలుపు టీమిండియాదే అయింది. ముందుగా అక్షర్ పటేల్ కట్టుదిట్టమైన బౌలింగ్, ఆపై బ్యాటింగ్‌లో శివమ్ దూబే మెరుపులు జట్టును సిరీస్‌లో ఆధిక్యంలో నిలిపాయి. అఫ్గాన్ ఆటగాళ్లు కొంత పోరాడినా... మంచు ప్రభావంతో పాటు ఒత్తిడిలో ఆ జట్టు చిత్తయింది. మొహాలి: అఫ్గానిస్తాన్‌తో టి20 సిరీస్‌లో భారత్ 1–0తో ముందంజ వేసింది. గురువారం జరిగిన తొలి పోరులో భారత్ 6 వికెట్ల తేడాతో అఫ్గాన్‌ను ఓడించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన అఫ్గానిస్తాన్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. నబీ (27 బంతుల్లో 42; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. అనంతరం భారత్ 17.3 ఓవర్లలో 4 వికెట్లకు 159 పరుగులు చేసి గెలిచింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ శివమ్ దూబే (40 బంతుల్లో 60 నాటౌట్; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) అజేయ అర్ధ సెంచరీ సాధించగా, జితేశ్ శర్మ (20 బంతుల్లో 31; 5 ఫోర్లు) రాణించాడు. నబీ మెరుపులు... అఫ్గాన్‌కు ఓపెనర్లు ఇబ్రహీమ్ జద్రాన్ (22 బంతుల్లో 25; 2 ఫోర్లు, 1 సిక్స్), గుర్బాజ్ (28 బంతుల్లో 23; 2 ఫోర్లు, 1 సిక్స్) మెరుగైన ఆరంభం అందించారు. వీరిద్దరు తొలి వికెట్‌కు 48 బంతుల్లో 50 పరుగులు జోడించారు. 1 పరుగు వద్ద ఇబ్రహీమ్ ఇచ్చిన క్యాచ్‌ను దూబే వదిలేయడం కూడా జట్టుకు కలిసొచ్చింది. అయితే ఒకే స్కోరు వద్ద వీరిద్దరిని అవుట్ చేసి భారత్ పైచేయి సాధించింది. తొలి అంతర్జాతీయ టి20 ఆడుతున్న రహ్మత్ షా (3) కూడా విఫలమయ్యాడు. ఈ దశలో నబీ, అజ్మతుల్లా (22 బంతుల్లో 29; 2 ఫోర్లు, 1 సిక్స్) భాగస్వామ్యంతో అఫ్గాన్ కోలుకుంది. ముఖ్యంగా నబీ దూకుడు ప్రదర్శించడంతో స్కోరు వేగంగా దూసుకుపోయింది. రవి బిష్ణోయ్ ఓవర్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 16 పరుగులు రాగా... ముకేశ్ వేసిన తర్వాతి ఓవర్లో నబీ 2 సిక్స్‌లు బాదాడు. నబీ, అజ్మతుల్లా నాలుగో వికెట్‌కు 43 బంతుల్లో 68 పరుగులు జత చేయగా... ముకేశ్ ఒకే ఓవర్లో వీరిని పెవిలియన్ పంపించాడు. చివరి 2 ఓవర్లలో అఫ్గాన్ 6 ఫోర్లతో 28 పరుగులు రాబట్టింది. రోహిత్ డకౌట్... ఛేదనలో రెండో బంతికే భారత్‌కు అనూహ్య షాక్ తగిలింది. శుబ్‌మన్ గిల్ (12 బంతుల్లో 23; 5 ఫోర్లు)తో సమన్వయ లోపంతో కెపె్టన్ రోహిత్ శర్మ (0) రనౌట్‌గా వెనుదిరిగాడు. మిడాఫ్ దిశగా ఆడిన రోహిత్ సింగిల్ కోసం దూసుకుపోగా, గిల్ ఏమాత్రం స్పందించకుండా తన క్రీజ్‌లోనే ఉండిపోయాడు. దాంతో డకౌట్ అయిన రోహిత్ తన సహచరుడిపై తీవ్ర ఆగ్రహాన్ని ప్రదర్శిస్తూ వెనుదిరిగాడు. ఆ తర్వాత కొన్ని చక్కటి బౌండరీలు కొట్టిన గిల్ అదే జోరులో ముందుకొచ్చి ఆడబోయి స్టంపౌట్‌గా వెనుదిరిగాడు. భారీ షాట్లు ఆడటంలో తడబడిన తిలక్ వర్మ (22 బంతుల్లో 26; 1 ఫోర్, 1 సిక్స్) కూడా ఎక్కువసేపు నిలవలేకపోయాడు. ఈ దశలో దూబే, జితేశ్ భాగస్వామ్యం జట్టును గెలుపు దిశగా నడిపించింది. అఫ్గాన్ పేలవ ఫీల్డింగ్ కూడా భారత్‌కు సానుకూలంగా మారింది. జితేశ్ వెనుదిరిగినా... రింకూ సింగ్ (9 బంతుల్లో 16 నాటౌట్; 2 ఫోర్లు) సహకారంతో దూబే మరో 15 బంతులు మిగిలి ఉండగానే మ్యాచ్‌ను ముగించాడు. స్కోరు వివరాలు అఫ్గానిస్తాన్ ఇన్నింగ్స్: గుర్బాజ్ (స్టంప్డ్) జితేశ్ (బి) అక్షర్ 23; ఇబ్రహీమ్ (సి) రోహిత్ (బి) దూబే 25; అజ్మతుల్లా (బి) ముకేశ్ 29; రహ్మత్ (బి) అక్షర్ 3; నబీ (సి) రింకూ (బి) ముకేశ్ 42; నజీబుల్లా (నాటౌట్) 19; కరీమ్ (నాటౌట్) 9; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 158. వికెట్ల పతనం: 1–50, 2–50, 3–57, 4–125, 5–130. బౌలింగ్: అర్ష్‌దీప్ 4–1–28–0, ముకేశ్ 4–0–33–2, అక్షర్ 4–0–23–2, సుందర్ 3–0–27–0, దూబే 2–0–9–1, బిష్ణోయ్ 3–0–35–0. భారత్ ఇన్నింగ్స్: రోహిత్ (రనౌట్) 0; శుబ్‌మన్ గిల్ (స్టంప్డ్) గుర్బాజ్ (బి) ముజీబ్ 23; తిలక్ (సి) గుల్బదిన్ (బి) అజ్మతుల్లా 26; శివమ్ దూబే (నాటౌట్) 60; జితేశ్ శర్మ (సి) ఇబ్రహీమ్ (బి) ముజీబ్ 31; రింకూ సింగ్ (నాటౌట్) 16; ఎక్స్‌ట్రాలు 3; మొత్తం (17.3 ఓవర్లలో 4 వికెట్లకు) 159. వికెట్ల పతనం: 1–0, 2–28, 3–72, 4–117. బౌలింగ్: ఫారుఖీ 3–0–26–0, ముజీబ్ 4–1–21–2, మొహమ్మద్ నబీ 2–0–24–0, నవీన్ 3.3–0–43–0, అజ్మతుల్లా 4–0–33–1, గుల్బదిన్ 1–0–12–0. -
అతడొక అద్భుతం.. నేను అనుకున్నది జరగలేదు! గిల్ కూడా: రోహిత్
మొహాలీ వేదికగా అఫ్గానిస్తాన్‌తో జరిగిన తొలి టీ20లో టీమిండియా ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టింది. అ మ్యాచ్‌లో ప్రత్యర్ధి అఫ్గానిస్తాన్‌ను 6 వికెట్ల తేడాతో భారత్ చిత్తు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. అఫ్గాన్ బ్యాటర్లలో మహ్మద్ నబీ(42) పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడగా.. ఓమర్జాయ్(29), ఇబ్రహీం జద్రాన్(25) రాణించారు. భారత బౌలర్లలో ముఖేష్ కుమార్, అక్షర్ పటేల్ తలా రెండు వికెట్లు పడగొట్టగా.. శివమ్ దుబే ఒక్క వికెట్ సాధించాడు. అనంతరం 159 పరుగుల లక్ష్యాన్ని భారత్ 17.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. భారత బ్యాటర్లలో శివమ్ దూబే(60 నాటౌట్) హాప్ సెంచరీతో చెలరేగాడు. అతడి ఇన్నింగ్స్‌లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లు ఉన్నాయి. అంతకుముందు బౌలింగ్‌లోనూ దూబే ఓ కీలక వికెట్ పడగొట్టాడు. అతడి ఆల్‌రౌండ్ ప్రదర్శనకు మ్యాన్ ఆఫ్‌ది మ్యాచ్ అవార్డు లభించింది. ఇక ఈ విజయంపై మ్యాచ్ అనంతరం టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించాడు. మొహాలీలో వాతావరణ పరిస్థితులు చాలా కష్టతరంగా ఉన్నప్పటికీ.. తమ కుర్రాళ్లు అద్భుత ప్రదర్శన కనబరిచారని రోహిత్ కొనియాడాడు. "మొహాలీలో విపరీతమైన చలిగా ఉంది. ఫీల్డింగ్‌లో తొలుత బంతి చేతి వేలికి తాకగానే తీవ్రమైన నొప్పితో బాధపడ్డాను. వెంటనే ఫిజియో హాట్ వాటర్ బ్యాగ్స్ తీసుకువచ్చాడు. ఆ తర్వాత వేడి నీటిలో వేలిని ఉంచితే నొప్పి తగ్గింది. ఇక ఈ మ్యాచ్‌లో మాకు చాలా సానుకూలంశాలు ఉన్నాయి. ముఖ్యంగా బౌలింగ్‌లో మేము అద్భుతమైన ప్రదర్శన కనబరిచాం. ఇక్కడ పరిస్థితిలు చాలా క్లిష్టంగా ఉన్నాయి. మా స్పిన్నర్లు బాగా బౌలింగ్ చేశారు . అదే విధంగా సీమర్లు కూడా అద్భుతంగా రాణించారని" రోహిత్ శర్మ పోస్ట్ మ్యాచ్ ప్రేజేంటేషన్‌లో తెలిపాడు. ఇక ఈ మ్యాచ్‌లో తన రనౌట్ గురించి హిట్‌మ్యాన్ మాట్లాడుతూ.. ఇటువంటివి సాధారణంగా జరుగుతూనే ఉంటాయి. దురదృష్టవశాత్తూ రనౌట్ అయితే ఎవరైనా నిరుత్సాహానికి గురవుతారు. ప్రతీ ఆటగాడు జట్టు విజయంలో భాగం కావాలని కోరుకుంటాడు. నేను కూడా కొన్ని పరుగులు చేయాలనకున్నాను. కానీ కొన్ని సార్లు మనం అనుకున్నది జరగదు. ఏదైనప్పటికీ ఈ మ్యాచ్‌లో మేము గెలిచాం. నేను ఔటైనప్పటికీ గిల్ మ్యాచ్‌ను ఫినిష్ చేయాలని కోరుకున్నాను. కానీ అతడు కూడా మంచి ఇన్నింగ్స్ ఆడిన తర్వాత ఔట్ అయ్యాడు.శివమ్ దూబే, జితేష్ బ్యాటింగ్ చేసిన విధానం అద్భుతం. తిలక్, రింకూ కూడా తమ వంతు పాత్ర పోషించారని పేర్కొన్నాడు. -
దంచి కొట్టిన దూబే.. అఫ్గాన్‌ను చిత్తు చేసిన భారత్
అఫ్గానిస్తాన్‌తో మూడో టీ20ల సిరీస్‌లో టీమిండియా శుభారంభం చేసింది. మొహాలీ వేదికగా అఫ్గాన్‌తో జరిగిన తొలి టీ20లో 6 వికెట్ల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. 159 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 17.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. భారత విజయంలో ఆల్‌రౌండర్ శివమ్ దూబే ముఖ్య భూమిక పోషించాడు. తొలుత బౌలింగ్‌లో కీలక వికెట్ పడగొట్టిన దూబే.. అనంతరం బ్యాటింగ్‌లోనూ అదరగొట్టాడు. 40 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 60 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. దూబేతో పాటు జితేష్ శర్మ(31), తిలక్ వర్మ(26) కీలక ఇన్నింగ్స్ ఆడారు. అఫ్గాన్ బౌలర్లలో ముజీబ్ రెహ్మన్ రెండు వికెట్లు పడగొట్టారు. అంతకముందు బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. అఫ్గాన్ బ్యాటర్లలో మహ్మద్ నబీ(42) పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడగా.. ఓమర్జాయ్(29), ఇబ్రహీం జద్రాన్(25) రాణించారు. భారత బౌలర్లలో ముఖేష్ కుమార్, అక్షర్ పటేల్ చెరో రెండు వికెట్లు పడగొట్టగా.. శివమ్ దుబే ఒక్క వికెట్ సాధించాడు. కాగా దాదాపు 14 నెలల తర్వాత టీ20ల్లో రీఎంట్రీ ఇచ్చిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ.. ఈ మ్యాచ్‌లో డకౌట్‌గా వెనుదిరిగాడు. ఇక ఇరు జట్ల మధ్య రెండో టీ20 ఇండోర్ వేదికగా జనవరి 14న జరగనుంది. -
టీమిండియాలో ఛాన్స్ కొట్టేశాడు.. కట్ చేస్తే! అక్కడ 6 వికెట్లతో అదుర్స్
రంజీట్రోఫీ-2024 సీజన్‌ను టీమిండియా ఆటగాడు, ముంబై స్టార్ ఆల్‌రౌండర్ శివమ్ దూబే ఘనంగా ఆరంభించాడు. ఎలైట్ గ్రూపు-బిలో భాగంగా బీహార్‌తో జరిగిన మ్యాచ్‌లో దుబే ఆల్‌రౌండ్ ప్రదర్శన కనబరిచాడు. ముంబై తొలి ఇన్నింగ్స్‌లో 41 పరుగులతో రాణించిన దూబే.. అనంతరం బౌలింగ్‌లో అదరగొట్టాడు. మొదటి ఇన్నింగ్స్‌లో రెండు కీలక వికెట్లు పడగొట్టి బీహార్‌ను ఫాలో ఆన్ దాటకుండానే కట్టడి చేశాడు. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్‌లో 4 కీలక వికెట్లు పడగొట్టి చావు దెబ్బ కొట్టాడు. ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌లు కలిపి దూబే 6 వికెట్లు సాధించాడు. ఇక ఈ మ్యాచ్‌లో బీహార్‌పై ఇన్నింగ్స్ 51 పరుగుల తేడాతో ముంబై ఘన విజయం సాధించింది. భారత జట్టులో చోటు.. కాగా తాజాగా అఫ్గానిస్తాన్‌తో టీ20 సిరీస్‌కు ప్రకటించిన భారత జట్టులో దూబేకు చోటు దక్కింది. ఈ సిరీస్‌కు గాయం కారణంగా దూరమైన స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా స్ధానాన్ని దూబేతో సెలక్టర్లు భర్తీ చేశారు. దూబే చివరగా భారత తరపున ఆసియా క్రీడల్లో ఆడాడు. టీమిండియా తరపున ఇప్పటివరకు 18 టీ20లు ఆడిన దూబే.. 152 పరుగులతో పాటు 6 వికెట్లు పడగొట్టాడు. చదవండి: IND vs AFG:'హార్దిక్ తిరిగొచ్చినా రోహిత్ శర్మనే కెప్టెన్.. రాసిపెట్టుకోండి -
IND vs AFG: సెలక్టర్ల నిర్ణయం సరైనదే! హార్దిక్ స్ధానంలో అతడే బెటర్
అఫ్గానిస్తాన్‌తో సిరీస్‌కు 16 మంది సభ్యలతో కూడిన భారత జట్టును బీసీసీఐ తాజాగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సిరీస్‌తో టీమిండియా సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి తిరిగి టీ20ల్లో రీ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్దమయ్యారు. 14 నెలల తర్వాత వీరిద్దరూ టీ20ల్లో భారత జట్టు తరపున బరిలోకి దిగనున్నారు. ఇక సిరీస్‌కు హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్, రుత్‌రాజ్ గాయం కారణంగా దూరం కాగా.. శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్‌కు సెలక్టర్లు విశ్రాంతి ఇచ్చారు. ఇక హార్దిక్ పాండ్యా స్ధానంలో పేస్ ఆల్‌రౌండర్ శివమ్ దూబేకు సెలక్టర్లు ఛాన్స్ ఇచ్చారు. గతేడాది ఐర్లాండ్‌తో టీ20 సిరీస్, ఆసియా క్రీడల్లో అద్భుతంగా రాణించిన దూబేకు ఎట్టకేలకు జట్టులో చోటు దక్కింది. ఈ నేపథ్యంలో దూబేను ఉద్దేశించి భారత మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. "శివమ్ దూబే తిరిగి మళ్లీ జట్టులోకి వచ్చాడు. సెలక్టర్లు సరైన నిర్ణయం తీసుకున్నారు. సెలక్టర్ల నిర్ణయం నన్ను ఏమి ఆశ్చర్యపరచలేదు. జట్టుకు ప్రస్తుతం హార్దిక్ పాండ్యా స్ధానాన్ని భర్తీ చేసే ఆటగాడి కావాలి. ఆ సత్తా దూబేకు ఉంది. అతడిని దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌కు ఎంపిక చేస్తారని భావించాను. అతడిని సౌతాఫ్రికాకు తీసుకువెళ్లి ఉంటే విదేశీ పిచ్‌లపై ఎలా ఆడేవాడన్నది మేనెజ్మెంట్కు ఒక అవగహన వచ్చి ఉండేది. కానీ సెలక్షన్ కమిటీ అతడిని పరిగణలోకి తీసుకోలేదు. స్వదేశంలో ఆసీస్ సిరీస్‌లో కూడా అదే పరిస్థితి. జట్టులో ఉన్నప్పటికి సిరీస్ మొత్తం బెంచ్‌కే పరిమితమయ్యాడు. కచ్చితంగా జట్టుకు ఆరో బౌలర్ అవసరం. కాబట్టి దుబేకు ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు దక్కుతుందని ఆశిస్తున్నాను" అని చోప్రా తన యూట్యాబ్ ఛానల్లో పేర్కొన్నాడు. కాగా భారత తరపున ఇప్పటివరకు 18 టీ20లు ఆడిన దూబే.. 152 పరుగులతో పాటు 6 వికెట్లు పడగొట్టాడు. మొహాలీ వేదికగా జరగనున్న తొలి టీ20తో ఈ టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. చదవండి: Ind vs Eng: మహ్మద్ షమీ మరికొన్నాళ్లు.. ఇప్పట్లో కష్టమే!