సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో టీమిండియా ఆటగాళ్లు, ముంబై ప్లేయర్లు శివమ్ దూబే, సూర్యకుమార్ యాదవ్ రెచ్చిపోయారు. సర్వీసెస్‌తో ఇవాళ (డిసెంబర్ 5) జరిగిన మ్యాచ్‌లో స్కై విధ్వంసం సృష్టిస్తే.. శివమ్ దూబే ప్రత్యర్ధి బౌలర్లను ఊచకోత కోశాడు. స్కై 46 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 70 పరుగులు చేయగా.. దూబే 36 బంతుల్లో 2 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో అజేయమైన 71 పరుగులు చేశాడు.
The Surya-Dube show for Mumbai. 🤯pic.twitter.com/wNgwqLA7Cd
— Mufaddal Vohra (@mufaddal_vohra) December 3, 2024
దూబే సిక్సర్ల వర్షానికి హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం తడిసి ముద్దైంది. గాయం కారణంగా గత మూడు నెలలుగా కాంపిటేటివ్ క్రికెట్‌కు దూరంగా ఉన్న దూబే ఈ మ్యాచ్‌తోనే రీఎంట్రీ ఇచ్చాడు. రీఎంట్రీలోనే దూబే అదరగొట్టాడు. ఈ మ్యాచ్‌లో దూబే బంతితోనూ రాణించాడు. 3 ఓవర్లు వేసి 21 పరుగులిచ్చి ఓ వికెట్ తీశాడు.
మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై సూర్యకుమార్ యాదవ్ (70), శివమ్ దూబే (71) చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. ఓపెనర్ పృథ్వీ షా తన పేలవ ఫామ్‌ను కొనసాగిస్తూ డకౌట్ కాగా.. మరో ఓపెనర్ అజింక్య రహానే 18 బంతుల్లో 3 బౌండరీల సాయంతో 22 పరుగులు చేశాడు. అనంతరం వన్‌డౌన్‌లో వచ్చిన కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 14 బంతుల్లో 4 ఫోర్ల సాయంతో 20 పరుగులు చేశాడు. సర్వీసెస్ బౌలర్లలో పూనియా, విశాల్ గౌర్, వికాస్ యాదవ్, శుక్లా తలో వికెట్ పడగొట్టారు.
అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన సర్వీసెస్ 19.3 ఓవర్లలో 153 పరుగులకే ఆలౌటై, 39 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. శార్దూల్ ఠాకూర్ 4 వికెట్లు తీసి సర్వీసెస్ పతనాన్ని శాశించాడు. షమ్స్ ములానీ 3, మోహిత్ అవస్తి, శివమ్ దూబే తలో వికెట్ పడగొట్టారు. సర్వీసెస్ ఇన్నింగ్స్‌లో మోహిత్ అహ్లావత్ (54) ఒక్కడే అర్ద సెంచరీతో రాణించాడు. సర్వీసెస్ ఇన్నింగ్స్‌లో ముగ్గురు డకౌట్ అయ్యారు. ఈ గెలుపుతో ముంబై గ్రూప్-ఈ పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి ఎగబాకింది.
Comments
Please login to add a commentAdd a comment