పుణే వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన నాలుగో టీ20లో 15 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించింది. దీంతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 3-1 తేడాతో టీమిండియా సొంతం చేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 181 పరుగులు చేసింది.
భారత బ్యాటర్లలో హార్దిక్ పాండ్యా(53), శివమ్ దూబే(53) హాఫ్ సెంచరీలతో రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో షోయబ్ మహ్మద్ మూడు వికెట్లు పడగొట్టగా.. ఓవర్టన్ రెండు , రషీద్, కార్స్ తలా వికెట్ సాధించారు. అనంతరం లక్ష్య చేధనలో ఇంగ్లండ్ 166 పరుగులకు ఆలౌటైంది. ఇంగ్లండ్ బ్యాటర్లలో హ్యారీ బ్రూక్(51), డకెట్(39) మెరుపు మెరిపించినప్పటికి తమ జట్టును గెలిపించలేకపోయారు.
కంకషన్ సబ్‌స్టిట్యూట్‌గా వచ్చి..
ఇక ఈ మ్యాచ్‌లో యువ పేసర్ హర్షిత్ రాణా(Harshit Rana) కంకషన్ సబ్‌స్టిట్యూట్‌గా వచ్చి తన టీ20 అరంగేట్రం చేశాడు. వాస్తవానికి నాలుగో టీ20 మ్యాచ్ తుది జట్టులో హర్షిత్ రాణాకు చోటు దక్కలేదు. ఆల్‌రౌండర్ శివమ్ దూబే స్ధానంలో హర్షిత్ రాణా మైదానంలో అడుగుపెట్టాడు. భారత ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్ వేసిన జేమీ ఓవర్టన్ బౌలింగ్‌లో ఓ బంతి దూబే హెల్మెట్ బలంగా తాకింది. వెంటనే ఫిజియో మైదానంలోకి వచ్చి అతడిని పరీక్షించారు.
అయితే దూబే తనకు బాగనే ఉందని చెప్పడంతో ఫిజియో వెనక్కి వెళ్లిపోయాడు. దూబే సైతం తన ఇన్నింగ్స్‌ను కొనసాగించాడు. కానీ ఫీల్డింగ్ సమయంలో మాత్రం దూబే మైదానంలో అడుగుపెట్టలేదు. రెండు ఓవర్ల తర్వాత అతడికి బదులు హర్షిత్‌ను మేనేజ్‌మెంట్ తీసుకుంది.
కంకషన్ సబ్‌స్టిట్యూట్‌గా వచ్చిన హర్షిత్ రాణా మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శన కనబరిచాడు. తన నాలుగు ఓవర్ల కోటాలో మూడు వికెట్లు తీసి 33 పరుగులు ఇచ్చాడు. అదేవిధంగా ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్‌ను అద్బుతమైన క్యాచ్‌తో పెవిలియన్‌కు పంపాడు. అయితే దూబే స్ధానంలో హర్షిత్ రాణా రావడంపై జోస్ బట్లర్‌తో సహా పలువురు మాజీ క్రికెటర్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ క్రమంలో అస్సలు రూల్స్ ఏమి చెబుతున్నాయో ఓ లుక్కేద్డాం.
రూల్స్ ఇవే..
ఐసీసీ ప్లే కండిషన్స్ నియమం 1.2.7.3 ప్రకారం.. కంకషన్ సబ్‌స్టిట్యూట్‌గా ఒకరికి బదులు మరొకరిని ఆడేందుకు అనుమతించొచ్చు. అయితే ఆ కంకషన్ రీప్లేస్‌మెంట్ అభ్యర్థనను ఐసీసీ మ్యాచ్ రిఫరీ ఆమోదించాలి. 'లైక్ ఫర్ లైక్ రీప్లేస్‌మెంట్’ విధానాన్ని పాటించాలి.
అంటే బ్యాటర్ స్ధానంలో బ్యాటర్, బౌలర్ స్ధానంలో బౌలరే, ఆల్‌రౌండర్ స్ధానంలో ఆల్‌రౌండర్ మాత్రమే కంకషన్ సబ్‌స్టిట్యూట్‌గా బరిలో దిగాలి. అయితే దీనిపై మ్యాచ్ రిఫరీదే తుది నిర్ణయం. దీనిపై ప్రత్యర్థి జట్టుకు అప్పీలు చేసేందుకూ హక్కు ఉండదు. ఇక మ్యాచ్‌లో దూబే ఆల్‌రౌండర్ కాబట్టి అతడి స్దానంలో హర్షిత్ రాణాను ఆల్‌రౌండర్‌గా పరిగణించి మ్యాచ్ రిఫరీ కంకషన్ సబ్‌స్ట్యూట్‌గా అనుమతిచ్చాడు.
జడ్డూ స్ధానంలో చాహల్..
కాగా కంకషన్ సబ్‌స్టిట్యూట్‌ను ఉపయోగించుకోవడం ఇదేమి తొలిసారి కాదు. 2020లో ఆస్ట్రేలియాతో జరిగిన టీ20లో జడేజా స్థానంలో కంకషన్ రీప్లేస్‌మెంట్‌గా వచ్చిన యుజువేంద్ర చాహల్ కంకషన్ సబ్‌స్టిట్యూట్ వచ్యాడు. చాహల్ ఏకంగా 3 వికెట్లు తీసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు.
చదవండి: పాండ్యా, దూబే మెరుపులు.. సిరీస్ టీమిండియా వశం
Comments
Please login to add a commentAdd a comment