పాండ్యా, దూబే మెరుపులు.. సిరీస్‌ టీమిండియా వశం | England lost by 15 runs in the fourth T20 | Sakshi
Sakshi News home page

పాండ్యా, దూబే మెరుపులు.. సిరీస్‌ టీమిండియా వశం

Feb 1 2025 3:45 AM | Updated on Feb 1 2025 7:15 AM

England lost by 15 runs in the fourth T20

సిరీస్‌తో మురిసిన భారత్‌ 

నాలుగో టి20లో 15 పరుగులతో ఇంగ్లండ్‌ ఓటమి 

3–1తో సిరీస్‌ టీమిండియా వశం 

తిప్పేసిన వరుణ్, బిష్ణోయ్‌ 

రేపు ముంబైలో ఆఖరి పోరు

టాప్‌–ఫోర్‌ పరుగుల్లో వెనుకబడినా... ఓ దశలో జట్టు స్కోరు(12/3) గుబులు రేపినా... మిడిలార్డర్‌లో హార్దిక్‌ పాండ్యా, శివమ్‌ దూబేల మెరుపులతో భారత్‌ మ్యాచ్‌ గెలిచి టి20 సిరీస్‌ కైవసం చేసుకుంది. వరుణ్‌ మాయాజాలం మలుపుతిప్పగా... రవి బిష్ణోయ్, హర్షిత్‌ రాణాల బౌలింగ్‌ భారత్‌ నాలుగో టి20లో గెలిచేలా చేసింది.  

పుణే: సమం కాదు... సొంతమే! సిరీస్‌ను ఆఖరి సమరం దాకా లాక్కెళ్ల కుండా భారత్‌ నాలుగో టి20లోనే తేల్చేసింది. శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో సూర్యకుమార్‌ సేన 15 పరుగులతో ఇంగ్లండ్‌పై గెలిచి ఇంకో మ్యాచ్‌ మిగిలుండగానే సిరీస్‌ కైవసం చేసుకుంది. మొదట భారత్‌ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. హార్దిక్‌ పాండ్యా (30 బంతుల్లో 53; 4 ఫోర్లు, 4 సిక్స్‌లు), ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ శివమ్‌ దూబే (34 బంతుల్లో 53; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) మెరిపించారు. 

ఇంగ్లండ్‌ బౌలర్‌ సకిబ్‌ మహమూద్‌ 3, జేమీ ఓవర్టన్‌ 2 వికెట్లు తీశారు. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన ఇంగ్లండ్‌ 19.4 ఓవర్లలో 166 పరుగుల వద్ద ఆలౌటైంది. హ్యారీ బ్రూక్‌ (26 బంతుల్లో 51; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు), డకెట్‌ (19 బంతుల్లో 39; 7 ఫోర్లు, 1 సిక్స్‌) ఉన్నంతసేపూ దంచేశారు. అయితే గత మ్యాచ్‌ మాదిరి వరుణ్‌ చక్రవర్తి (2/28) స్పిన్‌ మలుపు మరుగున పడకుండా... దూబే స్థానంలో ‘కన్‌కషన్‌’గా వచ్చిన హర్షిత్‌ రాణా (3/33), రవి బిష్ణోయ్‌ (3/28)  పేస్‌–స్పిన్‌ల వైవిధ్యం ఇంగ్లండ్‌ను లక్ష్యానికి దూరం చేసింది. 

దూబే, పాండ్యా ఫిఫ్టీ–ఫిఫ్టీ 
సంజూ సామ్సన్‌ (1), తిలక్‌వర్మ (0), కెపె్టన్‌ సూర్యకుమార్‌ (0)ల వైఫల్యంతో భారత్‌ 12/3 స్కోరు వద్ద కష్టాల్లోపడింది. అభిõÙక్‌ (19 బంతుల్లో 29; 4 ఫోర్లు, 1 సిక్స్‌), రింకూ సింగ్‌ (26 బంతుల్లో 30; 4 ఫోర్లు, 1 సిక్స్‌)ల జోరు ఎంతోసేపు సాగలేదు. ఈ దశలో దూబే, పాండ్యా ఆరో వికెట్‌కు వేగంగా 87 పరుగులు జోడించారు.

27 బంతుల్లో హార్దిక్, 31 బంతుల్లో దూబే అర్ధసెంచరీలు సాధించారు. దీంతో భారత్‌ పోరాడే లక్ష్యం నిర్దేశించగలిగింది. మరోవైపు డకెట్, సాల్ట్‌ (23; 4 ఫోర్లు)లు ధాటిగా ఛేదన ఆరంభించారు. ఇంగ్లండ్‌ స్కోరు 62కు చేరగానే డకెట్, కాసేపటికే సాల్ట్, బట్లర్‌ (2)... వందకు చేరే క్రమంలో లివింగ్‌స్టోన్‌ (9) అవుటయ్యారు. అయినా 14 ఓవర్లలో 124/4 స్కోరు వద్ద ఇంగ్లండ్‌ పటిష్టంగానే కనిపించింది. 

ఈ దశలో 15వ ఓవర్‌ వేసిన వరుణ్‌ క్రీజులో పాతుకుపోయిన బ్రూక్‌తో పాటు బ్రైడన్‌ కార్స్‌ (0)లను అవుట్‌ చేయడంతో 30 బంతుల్లో 49 పరుగుల సమీకరణం విజయానికి ఊపిరిపోసింది. బిష్ణోయ్, రాణాలు వరుస విరామాల్లో వికెట్లు తీయడంతో ఇంగ్లండ్‌కు ఓటమి తప్పలేదు. 
 


స్కోరు వివరాలు 
భారత్‌ ఇన్నింగ్స్‌: సామ్సన్‌ (సి) కార్స్‌ (బి) సకిబ్‌ 1; అభిషేక్‌ (సి) జాకబ్‌ (బి) రషీద్‌ 29; తిలక్‌ (సి) ఆర్చర్‌ (బి) సకిబ్‌ 0; సూర్యకుమార్‌ (సి) కార్స్‌ (బి) సకిబ్‌ 0; రింకూసింగ్‌ (సి) రషీద్‌ (బి) కార్స్‌ 30; దూబే రనౌట్‌ 53; పాండ్యా (సి) బట్లర్‌ (బి) ఓవర్టన్‌ 53; అక్షర్‌ (సి) జాకబ్‌ (బి) ఓవర్టన్‌ 5; అర్ష్ దీప్‌ రనౌట్‌ 0; రవిబిష్ణోయ్‌ నాటౌట్‌ 0; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 181. వికెట్ల పతనం: 1–12, 2–12, 3–12, 4–57, 5–79, 6–166, 7–180, 8–180, 9–181. బౌలింగ్‌: ఆర్చర్‌ 4–0–37–0, సకిబ్‌ 4–1–35–3, బ్రైడన్‌ కార్స్‌ 4–0–39–1, ఓవర్టన్‌ 4–0–32–2, అదిల్‌ రషీద్‌ 4–0–35–1. 

ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌: సాల్ట్‌ (బి) అక్షర్‌ 23; డకెట్‌ (సి) సూర్యకుమార్‌ (బి) బిష్ణోయ్‌ 39; బట్లర్‌ (సి) రాణా (బి) బిష్ణోయ్‌ 2; బ్రూక్‌ (సి) అర్ష్ దీప్‌ (బి) వరుణ్‌ 51; లివింగ్‌స్టోన్‌ (సి) సామ్సన్‌ (బి) రాణా 9; జాకబ్‌ (సి) సూర్యకుమార్‌ (బి) రాణా 6; కార్స్‌ (సి) అర్ష్ దీప్‌ (బి) వరుణ్‌ 0; ఓవర్టన్‌ (బి) రాణా 19; ఆర్చర్‌ (బి) బిష్ణోయ్‌ 0; రషీద్‌ నాటౌట్‌ 10; సకిబ్‌ (సి) అక్షర్‌ (బి) అర్ష్ దీప్‌ 1; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (19.4 ఓవర్లలో ఆలౌట్‌) 166. వికెట్ల పతనం: 1–62, 2–65, 3–67, 4–95, 5–129, 6–133, 7–137, 8–146, 9–163, 10–166. బౌలింగ్‌: అర్ష్ దీప్‌సింగ్‌ 3.4–0–35–1, హార్దిక్‌ పాండ్యా 1–0–11–0, వరుణ్‌ చక్రవర్తి 4–0–28–2, అక్షర్‌ పటేల్‌ 3–0–26–1, రవి బిష్ణోయ్‌ 4–0–28–3, హర్షిత్‌ రాణా 4–0–33–3.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement