Concussion
-
నటుడు వరుణ్ సూద్‌కు వచ్చిన బ్రెయిన్ ఇంజూరీ అంటే? ఎందువల్ల వస్తుంది?
బాలీవుడ్ టీవీ సీరియల్ నటుడు వరుణ్ సూద్ కంకషన్ (తేలికపాటి బాధాకరమైన మెదడు గాయం)తో బాధపడుతున్నట్లు ఇన్‌స్టాగ్రాంలో తెలిపాడు. తాను చికిత్స తీసుకుంటున్నానని, స్క్రీన్ టైం నివారించమని చెప్పడంతో సోషల్ మీడియాకు దూరంగా ఉంటున్నట్లు చెప్పుకొచ్చాడు. అసలేంటి మెదడు గాయం?. ఎందువల్ల వస్తుందంటే..?నిపుణులు అభిప్రాయం ప్రకారం..హింసాత్మకమైన కుదుపు లేదా తలపై బలంగా తగిలిన దెబ్బ కారణంగా మెదడు గాయం సమస్య వస్తుంది. శిశువుల నుంచి వృద్ధులు వరకు ఎవరైన ఈ సమస్యను బారినపడవచ్చు. ఇది తీవ్రమైన తలనొప్పికి దారితీస్తుంది. సుమారు 14 నుంచి 21 రోజుల్లో రికవరీ అవుతారని వైద్యులు తెలిపారు. ఈ సమస్య వల్ల నరాలు, రక్తనాళాలు తీవ్రంగా గాయపడటం, తద్వారా మెదడులో రసాయన మార్పులకు లోనవ్వడం జరుగుతుంది. దీని ఫలితంగా మెదడు పనితీరుని తాత్కాలికంగా కోల్పోతుంది. ఐతే ఈ సమస్య మెదడుకు శాశ్వత నష్టం కలిగించదు కానీ నిర్మాణాత్మక మార్పులకు దారితీస్తుంది. దీని వల్ల ప్రాణాహాని జరగదు కానీ ప్రభావాలు తీవ్రంగా ఉంటాయి. అది రోజుల, వారాలు లేదా ఎక్కువ కాలం పాటే కొనసాగే అవకాశాలు ఉంటాయి. ఈ సమస్య ఎవరికీ ఎక్కువంటే..నిపుణుల అభిప్రాయం ప్రకారం, కంకషన్ ప్రమాదం ఎక్కువగా ఉన్న వ్యక్తులు ..నాలుగేళ్ల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు, వృద్ధులు ఈ ప్రమాదం బారినపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. యువకులు, బైక్ ప్రమాదాలు, క్రీడలకు సంబంధించిన తల గాయాల కారణంగాసైనిక సిబ్బంది పేలుడు పరికరాలకు గురికావడం వల్ల కారు ప్రమాదంలో తలకు బలమైన గాయమైనశారీరక వేధింపులకు గురైన బాధితులుఅంతకుమునుపు మెదుడు గాయం సమస్యను ఎదుర్కొన్నవారుకౌమారదశలో ఉన్నవారు ఇతర వయస్సుల వారి కంటే కంకషన్ ప్రమాదం ఎక్కువగా ఉంటారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం, వారి మెదడు ఇంకా అభివృద్ధి చెందుతున్నందున ఈ పరిస్థితి ఏర్పడుతుంది.ఈ సమస్య లక్షణాలు..తలనొప్పివికారం లేదా వాంతులుగందరగోళంస్పృహ, తాత్కాలిక నష్టంసంతులనం, మైకం సమస్యలుద్వంద్వ దృష్టిచెవుల్లో మోగుతోందికాంతి, శబ్దానికి సున్నితత్వంఅలసటగా లేదా మగతగా అనిపిస్తుందిఅర్థం చేసుకోవడం లేదా ఏకాగ్రత చేయడంలో సమస్యడిప్రెషన్ లేదా విచారంచిరాకుగా, నాడీగా ఆత్రుతగా ఉండటంశ్రద్ధ పెట్టడం కష్టంమెమరీ నష్టంఅయితే శిశువులు, పసిబిడ్డలు వారి తలపై కంకషన్ కలిగి ఉన్నప్పటికీ వారికి ఎలా అస్తుందనేది తెలియజేయలేరు కాబట్టి రోగనిర్ధారణ చేస్తే గానీ చెప్పడం కష్టమని చెప్పారు. ఇక పిల్లలలో ఈ లక్షణాలు ఎలా ఉంటాయంటే..తలపై గడ్డలువాంతులు అవుతున్నాయిచిరాకుగా, పిచ్చిగా, అనియంత్రిత ఏడుపుతినడం మానేయడంనిద్ర విధానంలో మార్పు, అసాధారణ సమయాల్లో నిద్ర రావడంసాధారణం కంటే ఎక్కువ గజిబిజిగా, ఓదార్చినప్పటికీ ఏడుపు ఆగదుశూన్యంలోకి చూడటంనిర్ధారణ ఎలా?తల గాయానికి దారితీసిన సంఘటన, లక్షణాల గురించి వైద్య నిపుణుడికి చెప్పడం వంటివి చేయాలి. అప్పుడు నరాల పరీక్ష ద్వారా వైద్యులు పరిస్థితిని గుర్తించడం జరుగుతుంది. ఈ పరీక్షలో..నరాల పనితీరు, ప్రతిచర్యలుదృష్టి, కంటి కదలిక, కాంతికి ప్రతిచర్యవినికిడియాక్టివిటీమెడ కండరాలు కదలికలువారి మానసిక స్థితి మార్పులు, నిద్ర మార్పులు లేదా ప్రవర్తనలో ఏవైనా మార్పులను బట్టి ఈ సమస్య బాధపడుతున్నారని గుర్తించొచ్చని వైద్యులు చెబుతున్నారు. -
SL VS PAK 2nd Test Day 3: టెస్ట్ క్రికెట్లో పాక్ తొలిసారి ఇలా..!
టెస్ట్ క్రికెట్లో పాకిస్తాన్ తొలిసారి కంకషన్ సబ్‌స్టిట్యూట్ ఆప్షన్‌ను వినియోగించుకుంది. శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్ట్ మూడో రోజు ఆటలో లంక పేసర్ అసిత ఫెర్నాండో వేసిన బంతి పాక్ ఆటగాడు సర్ఫరాజ్ ఖాన్ తలకు బలంగా తాకగా, అతను మైదానాన్ని వీడాడు. దీంతో సర్ఫరాజ్ స్థానంలో మహ్మద్ రిజ్వాన్ కంకషన్ సబ్‌స్టిట్యూట్‌గా బరిలోకి దిగాడు. రిజ్వాన్ పాక్ తొలి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేయడంతో పాటు, ఆతర్వాత లంక సెకెండ్ ఇన్నింగ్స్‌లో వికెట్‌కీపింగ్ కూడా చేస్తాడు. ప్రస్తుతం పీసీబీ మెడికల్ టీమ్ పర్యవేక్షణలో ఉన్న సర్ఫరాజ్ ఖాన్.. పాక్ సెకెండ్ ఇన్నింగ్స్ సమయానికి కోలుకుంటే తిరిగి అతను బ్యాటింగ్‌కు దిగే అవకాశం ఉంటుంది. Sarfaraz Ahmed Retired Hurt. #SarfarazAhmed #PAKvSL pic.twitter.com/T7yVo2tNlH — Syed Haris Aamir (@_smharis_) July 26, 2023 సర్ఫరాజ్ మైదానాన్ని వీడే సమయానికి 22 బంతుల్లో 3 ఫోర్ల సాయంతో 14 పరుగులు చేశాడు. సర్ఫరాజ్ స్థానంలో బరిలోకి దిగిన రిజ్వాన్ 50 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. టెస్ట్‌ల్లో తొలిసారి కంకషన్ సబ్‌స్టిట్యూట్ ఆప్షన్‌ను వినియోగించున్న పాక్.. వన్డేల్లో తొలిసారి న్యూజిలాండ్‌పై ఈ ఆప్షన్‌ను వినియోగించుకుంది. ఐసీసీ 2019లో తొలిసారి కంకషన్ సబ్‌స్టిట్యూట్ విధానాన్ని ప్రవేశపెట్టింది. అయితే దీన్ని వినియోగించుకుంది మాత్రం 2021లో. ఆ ఏడాది ఆగస్ట్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో జోఫ్రా ఆర్చర్ బౌలింగ్ గాయపడిన స్టీవ్ స్మిత్ స్థానంలో మార్నస్ లబూషేన్ కంకషన్ సబ్‌స్టిట్యూట్‌గా బరిలోకి దిగాడు. కాగా, పాక్ టీమ్ విన్నపం మేరకు మ్యాచ్ రిఫరీ డేవిడ్ బూన్ కంకషన్ సబ్‌స్టిట్యూట్ అవకాశాన్ని వినియోగించుకునే వెసలుబాటు కల్పించాడు. ఇదిలా ఉంటే, శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్ట్ నాలుగో రోజు ఆటలో పాక్ తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. మహ్మద్ రిజ్వాన్ హాఫ్‌సెంచరీ పూర్తి చేయగానే 576 పరుగుల స్కోర్ వద్ద పాక్ ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. దీంతో ఆ జట్టుకు 410 తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. రిజ్వాన్‌తో పాటు అఘా సల్మాన్ (132 నాటౌట్) క్రీజ్‌లో ఉన్నాడు. అనంతరం 411 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన శ్రీలంక.. 10 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 29 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తుంది. ఈ మ్యాచ్‌లో ఇంకా రెండ్రోజుల ఆట (27, 28) మిగిలి ఉంది. -
ప్రపంచకప్‌కు ముందు భారత్‌కు షాక్.. స్టార్ ఓపెనర్ తలకు గాయం!
ICC Women's World Cup: ఐసీసీ మహిళల ప్రపంచకప్ వార్మప్ మ్యాచ్‌లో భాగంగా దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో భారత స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన తలకు గాయమైంది. భారత ఇన్నింగ్స్ 2 ఓవర్లో దక్షిణాఫ్రికా బౌలర్ ఇస్మాయిల్ బౌన్సర్ వేసింది. బౌన్సర్ బంతిని పుల్ షాట్ ఆడటానికి మంధాన ప్రయత్నించగా.. అది మిస్ అయ్యి మంధాన హెల్మెట్‌కు బలంగా తగిలింది. అయితే వెంటనే ఫీల్డ్‌లోకి ఫిజియో వచ్చి మంధానను పరిశీలించాడు. అయితే ఆమెకు ఎలాంటి కంకషన్ లక్షణాలు కనిపించలేదు. దీంతో ఆమెకు తగిలిన గాయం అంత తీవ్రమైనది కాదని ఫిజియో నిర్ధారించాడు. అయినప్పటికీ ముందు జాగ్రత్తగా మంధాన ఫీల్డ్‌ను విడిచి వెళ్లింది. 12 పరుగులు చేసిన ఆమె రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. దక్షిణాఫ్రికాపై భారత్ రెండు పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 244 పరుగులు సాధించి. భారత బ్యాటర్లలో హర్మాన్ ప్రీత్ కౌర్ సెంచరీతో మెరిసింది. భారత ఇన్నింగ్స్‌లో హర్మాన్ ప్రీత్ కౌర్(103), యస్తికా భాటియా(58) పరుగులతో రాణించారు. 245 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ప్రోటిస్ జట్టు 242 పరుగులకే పరిమితమైంది. చదవండి: Rohit Sharma: రోహిత్‌కు షేక్‌హ్యాండ్ ఇచ్చేటపుడు జాగ్రత్త.. పట్టిందల్లా బంగారమే: టీమిండియా మాజీ క్రికెటర్ -
'బుమ్రా.. నన్నెందుకు టార్గెట్ చేశావ్' ; వీడియో వైరల్
లార్డ్స్: టీమిండియా, ఇంగ్లండ్‌ల మధ్య జరుగుతున్ను రెండో టెస్టులో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. మూడో రోజు ఆట మరికాసేపట్లో ముగుస్తుందనగా బుమ్రా వేసిన ఓవర్ ప్రమాదకరంగా కనిపించింది. ఎంతలా అంటే క్రీజులో ఉన్న 11వ నంబర్ ఆటగాడు జేమ్స్ అండర్సన్‌ను టార్గెట్ చేశాడా అనిపించింది. వరుసగా షార్ట్ బంతులు విసురుతూ అండర్సన్‌ను బెంబెలెత్తించాడు. బుమ్రా వేసిన తొలి బంతి హెల్మెట్‌కు తగలడంతో బిత్తరపోయిన అండర్సన్ కన్కషన్ టెస్ట్ కూడా చేయించుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత కూడా బుమ్రా తగ్గలేదు. తర్వాతి బంతి పొత్తికడుపుపై బలంగా తాకగా, మరో బంతి పక్కటెముల మీదకు దూసుకొచ్చింది. ఈ క్రమంలో బుమ్రా ఒకే ఓవర్లో 4 నోబాల్స్ సహా మొత్తం 10 బంతులు విసిరాడు. ఆ తర్వాత షమీ వేసిన ఓవర్లో అండర్సన్ బౌల్డ్ కావడంతో ఇంగ్లండ ఇన్నింగ్స్ ముగిసింది. అనంతరం ఆటగాళ్లు పెవిలియన్‌కు చేరుకుంటున్న క్రమంలో బుమ్రా బౌలింగ్ శైలితో ఇబ్బంది పడిన అండర్సన్ అతని వద్దకు వచ్చి.. '' నన్నెందుకు టార్గెట్ చేశావన్నట్లుగా '' అడిగాడు. దానికి బుమ్రా ఏం చెప్పకుండా చిరునవ్వుతో అతని పక్కనుంచి వెళ్లిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో ట్విటర్లో ప్రత్యక్షం కావడంతో వైరల్‌గా మారింది. ఇక ఇంగ్లండ్ టీమిండియాతో జరుగుతున్న రెండో టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో 391 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో ఇంగ్లండ్‌కు తొలి ఇన్నింగ్స్‌లో 27 పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది. కాగా రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ 8 ఓవర్లలో వికెట్లు నష్టపోకుండా 17 పరుగులు చేసింది. రోహిత్ శర్మ 12, కేఎల్ రాహుల్ 4 పరుగులతో క్రీజులో ఉన్నారు. అంతకముందు టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 364 పరుగులకు ఆలౌట్ అయింది. Anderson vs Bumrah. pic.twitter.com/MJpeDinUB3 — Simran (@CowCorner9) August 15, 2021 -
గ్రౌండ్లో కుప్పకూలిన మరో స్టార్ ప్లేయర్..
మ్యూనిచ్: డెన్మార్క్ ప్లేయర్ క్రిస్టియన్ ఎరిక్సన్ ఘటన మరువకముందే యూరోకప్ 2020లో మరో స్టార్ ప్లేయర్ గ్రౌండ్‌లోనే కుప్పకూలాడు. ఆ ఆటగాడు10 నుంచి 15 సెకన్ల పాటు స్పృహ కోల్పోవడంతో సహచర ఆటగాళ్లు ఆందోళన చెందారు. జర్మనీతో మ్యాచ్ సందర్భంగా ఫ్రాన్స్ డిఫెండర్ బెంజమిన్ పవార్డ్ ప్రత్యర్థి ప్లేయర్ రాబిన్ గోసెన్స్ను ఢీకొట్టడంతో వెంటనే కింద పడిపోయి స్పృహ కోల్పోయాడు. అయితే ఘటన తర్వాత కొన్ని నిమిషాల పాటు పవార్డ్కు చికిత్సనందించడంతో అతను కోలుకున్నాడు. అనంతరం మ్యాచ్‌లో కూడా కొనసాగాడు. అయితే, స్పృహ కోల్పోయిన ఆటగాడిని మ్యాచ్‌లో ఎలా కొనసాగిస్తారని, అతడు కంకషన్‌కు గురయ్యే ప్రమాదం ఉందని సోషల్ మీడియాలో తీవ్ర వ్యతిరేకత ఎదురవడంతో ఫ్రాన్స్ జట్టు యాజమాన్యం అతన్ని మైదానం నుంచి బయటకు పంపింది. అతని స్థానంలో సబ్‌స్టిట్యూట్ ఆటగాడిని బరిలోకి దించింది. ఈ మ్యాచ్‌లో ఫ్రాన్స్ 1-0తో జర్మనీపై గెలుపొందింది. మ్యాచ్ అనంతరం గాయపడిన పవార్డ్ మాట్లాడుతూ.. ప్రత్యర్ధి ఆటగాడు బలంగా ఢీకొట్టడం వల్ల షాక్‌కు లోనయ్యాని, దాంతో కాసేపు స్పృహ కోల్పోయానని చెప్పుకొచ్చాడు. ఇదిలా ఉంటే, ఇదే టోర్నీలో డెన్మార్క్ ప్లేయర్ క్రిస్టియన్ ఎరిక్సన్ కార్డియాక్ అరెస్ట్ కారణంగా మైదానంలోనే కుప్పకూలిన విషయం తెలిసిందే. అతన్ని వెంటనే గ్రౌండ్ నుంచి హాస్పిటల్‌కు తరలించడంతో ప్రాణాపాయస్థితి నుంచి బయటపడి ప్రస్తుతం కోలుకుంటున్నాడు. ఊహించని ఈ పరిణామానికి షాక్ తిన్న ఫుట్‌బాల్ ప్రపంచం, వెంటనే అలాంటి ఘటనే పునరావృతం కావడంతో ఉలిక్కిపడింది. అయితే, పవార్డ్కు ఏమీ కాకపోవడంతో సాకర్ అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. చదవండి: కోక్ బాటిల్ వ్యవహారంతో 30 వేల కోట్లు హాంఫట్, మరి ఈయన బీర్ బాటిల్ తీసేశాడు -
వైడ్ బాల్ విషయంలో వివాదం.. బౌలర్ ముఖంపై దాడి
ఆక్లాండ్: స్థానికంగా జరిగిన ఓ కమ్యూనిటీ క్రికెట్ మ్యాచ్ సందర్భంగా ఆటగాళ్ల మధ్య వివాదం గొడవకు దారితీసింది. సబర్బ్స్ న్యులిన్, హౌవిక్ పకురంగా క్లబ్‌ల మధ్య శనివారం జరిగిన మ్యాచ్‌లో సబర్బ్స్ న్యులిన్ బౌలర్ అర్షద్ బషీర్(41)పై ప్రత్యర్ధి జట్టు ఆటగాడు దాడి చేయడంతో అతను కొన్ని నిమిషాల పాటు స్పృహ కోల్పోయాడు. వైడ్ బాల్ విషయంలో ఇరు జట్ల ఆటగాళ్ల మధ్య వివాదం మొదలవ్వడంతో ఈ సంఘటన చోటు చేసుకుంది. వైడ్ బాల్ విషయంలో మోసం చేయొద్దని అనడంతో రెచ్చిపోయిన ప్రత్యర్ధి జట్టు ఆటగాడు.. గొంతు నులమడంతో పాటు తన ముఖంపై దాడి చేసి గాయపరిచాడని, చికిత్స అనంతరం బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తనపై దాడికి పాల్పడిన ఆటగాడిని నిషేదించాలని బాధితుడు డిమాండ్ చేశాడు. ఈ గొడవ జరగడం వల్ల తాను 300 డాలర్లు నష్టపోయినట్లు అతను ఫిర్యాదులో పేర్కొన్నాడు. మరోవైపు ఈ గొడవపై స్పందించిన ఆక్లాండ్ క్రికెట్ సంఘం.. దాడికి పాల్పడిన ఆటగాడిపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది. కాగా, బాధిత క్రికెటర్ పార్ట్ టైమ్ కింద ట్యాక్సీ డ్రైవింగ్ చేస్తూ ఉపాధి పొందుతున్నాడు. -
క్రికెట్లో బౌన్సర్లను నిషేధించాలి..
లండన్: జూనియర్ స్థాయి క్రికెట్లో బౌన్సర్లను నిషేదించేందుకు క్రికెట్ వర్గాలు కృషి చేయాలని ప్రముఖ కంకషన్ వైద్యుడు మైఖేల్ టర్నర్ పిలుపునిచ్చాడు. బౌన్సర్లు సంధించే క్రమంలో బంతి తలకు బలంగా తగిలితే యువ క్రికెటర్లు కంకషన్‌కు(అపస్మారక స్థితి) గురయ్యే ప్రమాదముందని ఆయన అభిప్రాయపడ్డారు. యుక్త వయసు క్రికెటర్లను బౌన్సర్ల బారి నుంచి కాపాడే బాధ్యత క్రికెట్ చట్టాల రూపకర్తలపై ఉందని, అందుకు వారు సానుకూలంగా స్పందించి సరైన నిర్ణయాన్ని వెల్లడిస్తారని ఆశాభావం వ్యక్తం చేశాడు. ఫ్లాట్ పిచ్‌లపై నుంచి నిప్పులు చెరుగుతూ దూసుకొచ్చే బంతులు యువ క్రికెటర్ల భవిష్యత్తును ప్రశ్నార్ధకంగా మార్చే ప్రమాదముందని ఆయన ఆందోళన వ్యక్తం చేశాడు. బౌన్సర్ల బారి నుండి కాపాడేందుకు అత్యాధునిక హెల్మెట్లు అందుబాటులో ఉన్నా, బంతి వేగం ధాటికి అవి తునాతునకలు కావడం చాలా సందర్భాల్లో గమనించామని ఆయన పేర్కొన్నారు. క్రికెటర్లను.. అందులోనూ జూనియర్ స్థాయి క్రికెటర్లను కంకషన్ బారి నుండి కాపాడాలంటే బౌన్సర్లను నిషేదించడం ఒక్కటే మార్గమని అభిప్రాయపడ్డారు. కాగా, ప్రమాదకర బౌన్సర్ కారణంగా ఆసీస్ మాజీ ఆటగాడు ఫిలిప్ హ్యూస్ మృతి చెందిన నాటి నుండి క్రికెట్లో బౌన్సర్లపై నిషేదం అన్న అంశంపై చర్చ కొనసాగుతూనే ఉంది.. ఆతరువాత కూడా చాలా సందర్భల్లో బంతి తలకు తాకడం వల్ల క్రికెటర్లు అపస్మారక స్థితిలోకి వెళ్లిన ఘటనలు చాలా చూశాం.. ఇది చాలా ప్రమాదకర హెచ్చరిక అని టర్నర్ ఆందోళన వ్యక్తం చేశాడు. -
'కాంకషన్‌పై మాట్లాడే అర్హత ఆసీస్‌కు లేదు'
ఢిల్లీ : ఆసీస్‌తో శుక్రవారం జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో రవీంద్ర జడేజా స్థానంలో కాంకషన్ సబ్‌స్టిట్యూట్‌గా వచ్చిన యజ్వేంద్ర చహల్ మూడు కీలక వికెట్లు తీసి జట్టును గెలిపించాడు. టీమిండియా గెలిచినదానికంటే కాంకషన్ పద్దతిలో ఆటగాడిని తీసుకొచ్చి గెలిచిదంటూ ఆసీస్ జట్టు ఆరోపణలు చేసింది. అయితే టీమిండియా తీసుకున్న కాంకషన్ నిర్ణయం కరెక్టేనా అన్నదానిపై సోషల్ మీడియాలో పెద్ద చర్చే నడుస్తుంది. తాజాగా టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ స్పందించాడు. (చదవండి : టీమిండియా ‘కాంకషన్’ రైటా... రాంగా!) 'టీమిండియా కాంకషన్ సబ్‌స్టిట్యూట్ ప్లేయర్‌పై తీసుకున్న నిర్ణయాన్ని నేను సమర్థిస్తున్నా. బ్యాటింగ్ సమయంలో స్టార్క్ బౌలింగ్‌లో రవీంద్ర జడేజా తలకు బలంగా దెబ్బ తగిలింది. వెంటనే నొప్పి వస్తుందని చెప్పలేం.. గాయం నొప్పి తెలియడానికి గంట పట్టొచ్చు.. ఒక్కసారి 24 గంటలు కావొచ్చు. ఆ సమయంలో జడేజాకు నొప్పి తెలియలేదు.. ఫిజియో రాకపోయినా బ్యాటింగ్ చేశాడు. కానీ ఇన్నింగ్స్ ముగించుకొని డ్రెస్సింగ్ రూమ్‌కు రాగానే హెల్మట్ తీసిన జడేజాకు నొప్పి తెలిసినట్లుంది. అందుకే ఆసీస్ ఇన్నింగ్స్ సమయంలో అతను ఫీల్డింగ్‌కు దూరంగా ఉన్నాడు. మ్యాచ్ సమయంలో ఎవరైనా ఆటగాడు గాయపడితే కాంకషన్ సబ్‌స్టిట్యూట్ కింద వేరొక ఆటగాడిని బ్యాటింగ్ లేదా బౌలింగ్‌కు అనుమతించొచ్చని ఐసీసీ నిబంధనల్లో ఉంది. దానినే టీమిండియా ఆచరించింది. జడేజా స్థానంలో చహల్‌ను కాంకషన్ సబ్‌స్టిట్యూట్ ప్లేయర్‌గా ఆడించింది. చహల్ మూడు వికెట్లు తీసి జట్టును గెలిపించాడు కాబట్టి ఇప్పుడు కాంకషన్ పదం ఆసీస్‌కు వివాదంలా కనిపిస్తుంది. అదే ఒకవేళ టీమిండియా ఓడిపోయుంటే ఆసీస్ ఇలానే వివాదం చేసేదా.. అయినా కాంకషన్ నిర్ణయంపై ఆసీస్‌కు మాట్లాడే అర్హత లేదు, ఎందుకంటే కాంకషన్‌ను మొదట ఉపయోగించిదన్న విషయం అందరికి తెలిసిందే. ఒకప్పుడు ఇదే ఆసీస్ గాయపడిన స్మిత్ స్థానంలో మార్నస్ లబుషేన్‌ను ఆడించింది. ఆ మ్యాచ్‌లో లబుషేన్ రాణించడమే గాక జట్టును గెలిపించాడు.నేను బ్యాటింగ్ చేస్తున్న సమయంలో నా తలకు చాలాసార్లు గాయాలు అయ్యాయి.. ఆ నొప్పి ఎలా ఉంటుందో నాకు తెలుసు.. కానీ మా రోజుల్లో ఇలాంటి రూల్స్ లేకపోవడంతో 10 మందితోనే ఆటను కొనసాగించేవారు. అయినా మ్యాచ్ రిఫరీ బూన్ తన విచక్షణాధికారంతో ఆ నిర్ణయాన్ని తీసుకున్నారు. మ్యాచ్ ముగిసిన తర్వాత కాంకషన్‌పై ఆసీస్ ఫిర్యాదు చేయకుండా ఉండాల్సింది' అంటూ చెప్పుకొచ్చాడు. (చదవండి : నటరాజన్ రాకతో షమీకి కష్టమేనా : మంజ్రేకర్) -
పంత్ తలకు గాయం.. దాంతో
ముంబై : ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో టీమిండియా ఘరో పరాజయం పాలైంది. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా టీమిండియాను బ్యాటింగ్‌కు ఆహ్వానించగా.. భారత్ 49.1 ఓవర్లలో 255 పరుగులకే ఆలౌటైంది. అయితే, పరుగులు చేయడానికి భారత ఆటగాళ్లు ఆపసోపాలు పడిన పిచ్‌పైనే ఆసిస్ ఓపెనర్లు రెచ్చిపోయారు. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ డేవిడ్ వార్నర్ (112 బంతుల్లో 128 నాటౌట్; 17 ఫోర్లు, 3 సిక్సర్లు), కెప్టెన్ ఆరోన్ ఫించ్ (114 బంతుల్లో 110 నాటౌట్; 13 ఫోర్లు, 2 సిక్సర్లు) అద్భుత ప్రదర్శనతో జట్టును గెలిపించారు. ఇక ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్ చేస్తున్న సమయంలో రిషభ్ పంత్ (33 బంతుల్లో 28; ఫోర్లు 2, సిక్స్ 1) గాయం బారిన పడ్డాడు. కీపింగ్ చేయని పంత్ ముగ్గురు ఓపెనర్లు బరిలోకి దిగితే పంత్‌ను తుది జట్టులోంచి తప్పించవచ్చని, రాహుల్ కీపింగ్ చేస్తాడని మ్యాచ్‌కు ముందు వినిపించింది. అయితే పంత్ ఆడినా... చివరకు రాహులే కీపింగ్ చేయాల్సి వచి్చంది. బ్యాటింగ్‌లో పంత్ తలకు దెబ్బ తగలడమే అందుకు కారణం. కమిన్స్ బౌలింగ్‌లో పంత్ అవుటైన బంతి ముందుగా బ్యాట్‌కు తగిలి ఆ తర్వాత అతని తలకు బలంగా తాకి క్యాచ్‌గా మారింది. ఇన్నింగ్స్ అనంతరం పంత్ ‘కన్కషన్’కు గురైనట్లు, అతను కీపింగ్ చేయ లేడని బీసీసీఐ ప్రకటించింది. దాంతో రాహుల్ కీపింగ్ బాధ్యతలు చేపట్టాల్సి వచ్చింది. పంత్ గాయాన్ని ప్రస్తుతం ప్రత్యేక వైద్యులు పర్యవేక్షిస్తున్నారని బోర్డు ప్రకటించింది. -
ఐసీసీ కీలక నిర్ణయం.. అన్ని ఫార్మాట్లలో వర్తింపు
లండన్: అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) క్రికెట్లో మరో విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది. గత రెండేళ్లుగా పెండింగ్‌లో ఉన్న కాంకషన్ సబ్‌స్టిట్యూట్‌కు ఆమోదముద్ర వేసింది. వార్షిక సమావేశంలో భాగంగా ఐసీసీ ఈ కీలక నిర్ణయం తీసుకుంది. తొలుత కేవలం టెస్టుల్లోనే అమలు చేయాలని భావించినా.. మెజారిటీ సభ్యుల విన్నపం మేరకు అన్ని ఫార్మట్లకు వర్తింపచేస్తూ నిబంధనలను రూపొందించింది. దీనిపై పూర్తి అధికారం మ్యాచ్ రిఫరీకే ఉంటుందని ఐసీసీ తేల్చిచెప్పింది. మ్యాచ్ మధ్యలో ఏ జట్టైతే కాంకషన్ సబ్‌స్టిట్యూట్ కోరుతుందో.. ఆ జట్టు డాక్టర్ చేత ఆటగాడి గాయానికి సంబంధించిన వివరాలతో కూడిన రిపోర్టును మ్యాచ్ రిఫరీకి అందజేయాలి. రిఫరీ ఆమోదం తెలిపాకే కాంకషన్ సబ్‌స్టిట్యూట్‌కు అనుమతి లభిస్తుంది. ఇక ఈ విధానం యాషెస్ సిరీస్ నుంచి ప్రారంభం కానుంది. గత రెండేళ్లుగా దీనిపై సుదీర్ఘ అధ్యయనం చేసి, దేశవాళీ క్రికెట్లో అమలు చేసి విజయవంతం అయ్యాకే అంతర్జాతీయ క్రికెట్లోకి ప్రవేశపెడుతున్నామని ఐసీసీకి చెందిన ఓ అధికారి తెలిపారు. కాంకషన్ సబ్‌స్టిట్యూట్‌కు ఐసీసీ ఆమోదం తెలపడంతో క్రికెట్ ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ క్రికెట్ బోర్డులు ఆనందం వ్యక్తం చేశాయి. కాంకషన్ సబ్‌స్టిట్యూట్ అంటే? మైదానంలో ఏ ఆటగాడి తలకైనా బంతి బలంగా తగిలితే దిమ్మ తిరుగుతుంది. కాసేపు ఏం జరుగుతుందో అర్థం కాదు. అతడి పరిస్థితి ఏంటో తెలీదు. దీనినే కాంకషన్ అంటారు. ప్రస్తుత నిబంధనల ప్రకారం సబ్‌స్టిట్యూట్ ఆటగాడికి కేవలం ఫీల్డింగ్ చేసేందుకు అనుమతి ఉంది. బ్యాటింగ్, బౌలింగ్ చేసేందుకు అంగీకరించరు. అయితే కాంకషన్ సబ్‌స్టిట్యూట్ ప్రకారం మరొక ఆటగాడిని జట్టులోకి అనుమతినిస్తారు. దీంతో ఆ ఆటగాడు బ్యాటింగ్, బౌలింగ్ చేసే అవకాశాలు ఉంటాయి. -
ఐసీసీ కీలక నిర్ణయం యాషెస్ నుంచే అమలు!
లండన్: ఈ నెల చివరి వారంలో జరగనున్న వార్షిక సమావేశంలో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) కీలక నిర్ణయం తీసుకోనుంది. గత రెండేళ్లుగా పెండింగ్‌లో కాంకషన్ సబ్‌స్టిట్యూట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. 2014లో ఫిలిప్ హ్యూస్ మరణాంతరం ఐసీసీ ముందుకు క్రికెట్ ఆస్ట్రేలియా ఈ ప్రతిపాదనను తీసుకొచ్చింది. ఇప్పటికే దేశవాళీ క్రికెట్ టోర్నీల్లో 2017 నుంచే సబ్‌స్టిట్యూట్ ఆటగాళ్లు బౌలింగ్, బ్యాటింగ్ చేసేందుకు ప్రయోగాత్మక పద్ధతిలో ఐసీసీ అనుమతి ఇచ్చింది. అయితే ఐసీసీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ‘టెస్టు చాంపియన్ షిప్’లో ఈ విధానానికి అనుమతినివ్వాలని భావిస్తోంది. ఇందులో భాగంగా ప్రయోగాత్మకంగా యాషెస్ సిరీస్‌లో కాంకషన్ సబ్‌స్టిట్యూట్‌ను అమలు చేయాలని అనుకుంటోంది. దీనికోసం రూపొందించాల్సిన నియమ నిబంధనలను ఈ వార్షిక సమావేశంలో చర్చించనుంది. కాంకషన్ సబ్‌స్టిట్యూట్ అంటే? మైదానంలో ఏ ఆటగాడి తలకైనా బంతి బలంగా తగిలితే దిమ్మ తిరుగుతుంది. కాసేపు ఏం జరుగుతుందో అర్థం కాదు. అతడి పరిస్థితి ఏంటో తెలీదు. దీనినే కాంకషన్ అంటారు. ప్రస్తుత నిబంధనల ప్రకారం సబ్‌స్టిట్యూట్ ఆటగాడికి కేవలం ఫీల్డింగ్ చేసేందుకు అనుమతి ఉంది. బ్యాటింగ్, బౌలింగ్ చేసేందుకు అంగీకరించరు. అయితే కాంకషన్ సబ్‌స్టిట్యూట్ ప్రకారం మరొక ఆటగాడిని జట్టులోకి అనుమతినిస్తారు. దీంతో ఆ ఆటగాడు బ్యాటింగ్, బౌలింగ్ చేసే అవకాశాలు ఉంటాయి. ప్రపంచకప్‌లో ఇంగ్లాండ్ పేసర్ జోఫ్రా ఆర్చర్ వేసిన బంతి దక్షిణాఫ్రికా ఓపెనర్ హషీమ్ ఆమ్లా తలకు బలంగా తగిలిన సంగతి తెలిసిందే. దీంతో అతడు రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. -
తలకు బంతి తగిలి కుప్పకూలిన షోయబ్ మాలిక్
హామిల్టన్: న్యూజిలాండ్‌తో జరుగుతున్న నాలుగో వన్డేలో ఫీల్డర్ విసిరిన బంతి నేరుగా తలకు తగలడంతో పాకిస్తాన్ స్టార్ బ్యాట్స్‌మెన్ షోయబ్ మాలిక్ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా భర్త అయిన షోయబ్ మాలిక్.. 32వ ఓవర్ స్పిన్ బౌలింగ్ కావడంతో హెల్మెట్ లేకుండానే బ్యాటింగ్ చేశాడు. ఆఫ్ సైడ్ షాట్ కొట్టి పరుగు కోసం ప్రయత్నించాడు. అయితే బంతి ఫీల్డర్ మన్రో చేతికి చిక్కడంతో అవతలి వైపు ఉన్న మహమ్మద్ హఫీజ్ రన్ వద్దని వారించాడు. దీంతో మాలిక్ వెనక్కి మళ్లాడు. ఈ క్రమంలో రనౌట్ చేసేందుకు ప్రయత్నించిన మన్రో బంతిని బలంగా వికెట్ల వైపు విసిరాడు. అది కాస్తా మాలిక్ తల వెనకవైపు బలంగా తాకింది. దీంతో విలవిల్లాడుతూ అక్కడే కుప్పకూలిపోయాడు. వైద్య సిబ్బంది అతడికి చికిత్స అందించడంతో కోలుకుని తిరిగి బ్యాటింగ్‌కు దిగాడు. అయితే మాలిక్ (6) వెంటనే పెవిలియన్ దారి పట్టాడు. కాగా, పాకిస్తాన్‌తో జరిగిన నాలుగో వన్డేలో న్యూజిలాండ్ విజయం సాధించింది. గ్రాండ్‌హోమ్ (40 బంతుల్లో 74 నాటౌట్; 7 ఫోర్లు, 5 సిక్స్‌లు) మెరుపులు మెరిపించి కివీస్ విజయంలో కీలకపాత్ర పోషించాడు. తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 262 పరుగులు చేసింది. ఫఖర్ జమాన్ (54; 7 ఫోర్లు, ఒక సిక్స్), హారీస్ సోహైల్ (50; 4 ఫోర్లు, ఒక సిక్స్), హఫీజ్ (81; 5 ఫోర్లు, 4 సిక్స్‌లు), సర్ఫరాజ్ అహ్మద్ (51; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధ సెంచరీలతో ఆకట్టుకున్నారు. అనంతరం న్యూజిలాండ్ 45.5 ఓవర్లలో 263 పరుగులు చేసి ఐదు వికెట్ల తేడాతో గెలిచింది. 154 పరుగులకు ఐదు వికెట్లు కోల్పోయి కష్టాలో పడిన కివీస్‌ను గ్రాండ్‌హోమ్, నికోల్స్ (52 నాటౌట్; 3 ఫోర్లు) ఆదుకున్నారు. వీరిద్దరూ ఆరో వికెట్‌కు అజేయంగా 109 పరుగులు జోడించి కివీస్ విజయాన్ని ఖాయం చేశారు. సిరీస్‌లో చివరిదైన ఐదో వన్డే ఈనెల 19న జరుగుతుంది. -
తండ్రిపై కుమారుడి హత్యాయత్నం..?
కడిపికొండలో కలకలం కాజీపేట అర్బన్ : కుమారుడు ఇచ్చిన కూల్‌డ్రింక్ తాగి అపస్మారక స్థితిలోకి వెళ్లి చికిత్స పొందుతున్న ఓ తండ్రి..ఈ విషయం తెలిసిన తనయుడు సైతం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఘటనలో ఇరువురు ప్రాణాపాయస్థితిలోకి చేరుకున్నారు. ఈ సంఘటన శనివారం నగరంలోని 35 డివిజన్ కడిపికొండలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం కడిపికొండ గ్రామానికి చెందిన గంగుల దేవేందర్‌రెడ్డి కాజీపేట రైల్వే స్టేషన్లో గ్యాంగ్‌మెన్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఈ క్రమంలో కొంతకాలంగా ఆరోగ్యం సరిగాలేకపోవడంతో తన కుమారుడు భరత్‌కుమార్‌రెడ్డికి వీఆర్ఎస్లో ఉద్యోగాన్ని ఇప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇదిలా ఉండగా భరత్‌కుమార్‌రెడ్డికి నాలుగునెలల క్రితం వరికోల్ గ్రామానికి చెందిన జ్యోతితో వివాహం జరిగింది.పెళ్లి అయినప్పటి నుంచి ఖాళీగా ఉంటున్న భరత్‌కుమార్‌రెడ్డితో జ్యోతికి గొడవలు జరిగి తన తల్లిగారి ఇంటికి వెళ్లిపోయింది. ఈ క్రమంలో శనివారం తెల్లవారుజామున భరత్‌కుమార్‌రెడ్డి తండ్రికి కూల్‌డ్రింక్ ఇవ్వడంతో అది తాగిన దేవేందర్‌రెడ్డి అపస్మారక స్థితిలోకి వెళ్లారు.ఈ విషయాన్ని ఆయనే స్వయంగా శనివారం పాలప్యాకెట్ల విక్రయదారుడికి వెల్లడించారు. దీంతో సదరు విక్రయదారుడు 108కు సమాచారం అందించడంతో చికిత్స నిమిత్తం సుబేదారిలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం దేవేందర్ రెడ్డి పరిస్థితి విషమంగా ఉంది.ఈ విషయాన్ని తెలుసుకున్న తనయుడు భరత్‌కుమార్‌రెడ్డి సైతం పురుగుల మందు తాగి ఎంజీఎంలో చికిత్స పొందుతున్నాడు. దీనిపై సమాచారం అందుకున్న మడికొండ పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించినట్లు స్థానికులు వెల్లడించారు. కాగా, సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
అయ్యో పాపం
చిన్నారిపై పిచ్చికుక్క దాడి ప్రాణాపాయ స్థితిలో బాధితురాలు మధురానగర్ : పాలప్యాకెట్ తీసుకువచ్చేందుకు బయటకు వెళ్లిన చిన్నారిపై పిచ్చి కుక్క దాడిచేసింది. తీవ్రంగా గాయపడిన బాలిక అపస్మారకస్థితికి చేరుకుంది. 53వ డివిజన్ దేవీన గర్‌లో బుధవారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం దేవీనగర్ బుడమేరుకు చెందిన ముద్రబోయిన నాగరాజు, గంగ దంపతులకు ఒక అమ్మాయి, కుమారుడు ఉన్నారు. బుధవారం ఉదయం పాలప్యాకెట్ కోసం నాగరాజు కుమార్తె ముద్రబోయిన వెన్నెల పాలబూత్‌కు వెళ్లింది. పాలప్యాకెట్ తీసుకువ స్తుండగా పిచ్చికుక్క మీదపడి ఇష్టారాజ్యంగా కరవడంతో వెన్నెల తీవ్రంగా గాయపడింది. ఆమె దేహం రక్తంతో తడిసిపోయింది. ఇది గమనించిన స్థానికులు పిచ్చికుక్కను కర్రలతో కొట్టి చంపారు. అప్పటికే అపస్మారక స్థితిలోకి చేరుకున్న వెన్నెలను ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రభుత్వాస్పత్రిలో వైద్యులు మూడు రోజులు గడిస్తే కానీ చెప్పలేమనడంతో నాగరాజు కుటుంబంలో విషాధఛాయలు అలుముకున్నాయి. స్పందించని అధికారులు వీధి కుక్కల సంచారంపై స్థానికులు భయాందోళన వ్యక్తంచేస్తున్నారు. చీకటిపడితే బయటికి రాలేని పరిస్థితి నెలకొందని చెబుతున్నారు. వీధికుక్కల దాడికి పలువురు గురైన ఘటనలు ఉన్నాయి. వీధికుక్కల సమస్యపై ‘సాక్షి’లో పలుమార్లు కథనాలు ప్రచురితమయ్యాయి. దీనిపై అధికారులు స్పందించి ఉంటే ఈరోజు ఈ ఘటన జరిగి ఉండేది కాదని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. విషయం తెలుసుకున్న వైఎస్సార్ సీపీ డివిజన్ అధ్యక్షులు ముద్రబోయిన దుర్గారావు నాగరాజు కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆస్పత్రికివెళ్లి చిన్నారి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. తాము అండగా ఉంటామని ఆయన హామీ ఇచ్చారు. మరో నాలుగు కుక్కలను కరిచింది వీధి కుక్కల సమస్యను పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకువెళ్లాం. స్పందించలేదు. అధికారు ల నిర్లక్ష్యం వల్ల నేడు ఒక చిన్నారి ప్రాణం మీదకు వ చ్చింది. అప్పుడే స్పందించి తగు చర్యలు తీసుకు ని ఉంటే ఈ పరిస్థితి నెలకొనేది కాదు. వెన్నెలను కరిచిన పిచ్చికుక్క మరో నాలుగు కుక్కలను కరిచి ంది. దీనివల్ల ఆ కుక్కలను సైతం ఇక్కడ నుంచి తరలించి మరోమారు ఇటువంటి ఘటనలు జరగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలి. - ఎం వెంకట దుర్గారావు, స్థానికుడు -
విషమించిన విఠల్ ఆరోగ్యం
► వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న వైనం ► మెరుగైన వైద్యం కోసం ప్రైపెవేట్ ఆస్పత్రికి తరలింపు అనంతపురం : నిద్రమాత్రలు మింగి అపస్మారక స్థితిలో ప్రభుత్వాస్పత్రిలో చేరిన ఎస్కేయూ రిటైర్డ్ డెప్యూటీ రిజిస్ట్రార్ కె.విఠల్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. శుక్రవారం సాయంత్రం నుంచి ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నా శనివారం సాయంత్రం వరకు ఆయన తేరుకోలేదు. శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారడంతో వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు. అయితే మెరుగైన చికిత్స కోసం ఆయన కుటుంబ సభ్యులు అనంతపురంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. విఠల్ కుమారుడు వీఎస్ సాయిచైతన్య నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన యువతిని ప్రేమించి పెళ్లి చేసకున్న సంగతి తెలిసిందే. ఆ జంట ఆజ్ఞాతంలోకి వెళ్లడంతో వారి సమాచారం చెప్పాలంటూ యువతి బంధువులు విఠల్ దంపతులపై తీవ్రస్థాయిలో ఒత్తిళ్లు తెచ్చారు. దీంతో మనస్థాపానికి గురైన విఠల్ నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేసిన సంగతి విదితమే. కలకలం రేపుతోన్న వేలిముద్రల సేకరణ ప్రభుత్వాస్పత్రి ఎమర్జెన్సీ వార్డులో అపస్మారక స్థితిలో చికిత్స పొందుతున్న విఠల్ వద్దకు శుక్రవారం రాత్రి కొందరు వ్యక్తులు వెళ్లి ఖాళీ తెల్లటి కాగితాలపై విఠల్ వేలిముద్రలు తీసుకోవడం కలకలం రేపుతోంది. వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న తన భర్త నుంచి బలవంతంగా వేలిముద్రలు తీసుకున్నారంటూ ఆయన భార్య వాపోయారు. -
కన్న పేగును చిదిమేసింది
► జల్సాలకు అడ్డుగా ఉన్నాడని... గొంతుకు తాడు బిగించి హతం ► పోస్టుమార్టంతో వెలుగులోకి నిందితురాలి అరెస్టు ప్రాపంచిక సుఖాలు మనిషిని మృగంగా మారుస్తాయనడానికి ఇదొక నిదర్శనం. జల్సాలకు అలవాటు పడ్డ ఆమెకు కన్న పేగు అడ్డుగా మారింది. కర్కశంగా గొంతుకు తాడు బిగించి చిన్నారిని హత్య చేసింది. ఈ సంఘటన చిత్తూరులో ఆలస్యంగా శుక్రవారం పోస్టుమార్టంతో వెలుగులోకి వచ్చింది. చిత్తూరు (అర్బన్): చిత్తూరు నగరంలోని దుర్గానగర్‌కు చెందిన రేఖ (20) బెంగళూరు చెందిన ఒక యువకుడిని 2013లో పెళ్లి చేసుకుంది. వారికి యశ్వంత్ అనే తొమ్మిది నెలల కుమారుడు ఉన్నాడు. ఆమె ప్రవర్తన సరిగా లేకపోవడంతో కొంత కాలం క్రితం ఆ యువకుడు భార్యను వదిలేశాడు. ఆమె పుట్టినిల్లు చిత్తూరుకు చేరుకుంది. ఇక్కడ ఒంటరిగా జీవిస్తోంది. ఈ క్రమంలో జల్సా జీవితానికి అలవాటు పడ్డ రేఖకు అడ్డుఅదుపు లేకుండా పోయింది. మార్చి 9న ఇంట్లో పిల్లాడు ఏడుస్తుండగా కోపం వచ్చి గొంతుకు తాడును బి గించి చంపేసింది. తాను వచ్చి చూసే సరికి పిల్లాడు గుక్కపెట్టి ఏడ్చి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడని చుట్టుపక్కల వారిని నమ్మించింది. బిడ్డను తీసుకుని నగరంలోని బౌండి వీధిలో ఉన్న తన చిన్నాన్న చినబాబు ఇంట్లో వదిలి పారిపోయింది. బిడ్డ మృతి చెందిందని గుర్తించిన చినబాబు అదే రోజు అంత్యక్రియలు సైతం చేశాడు. అనంతరం బిడ్డ మృతిపై అనుమానం ఉందని చిత్తూరు టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన ఎస్ఐ ప్రసాద్ రెవెన్యూ అధికారుల సమక్షంలో బిడ్డ మృతదేహానికి పోస్టుమార్టం చేసి మళ్లీ అంత్యక్రియలు చేశారు. బిడ్డ గొంతుకు తాడు బిగించి ఊపిరి ఆడకుండా చేయడం వల్లే చనిపోయినట్లు రెండు రోజుల క్రితం పోస్టుమార్టం నివేదిక వచ్చింది. దీంతో పోలీసులు వెంటనే నిందితురాలు రేఖను అదుపులోకి తీసుకుని విచారించారు. ఆమె పోలీసుల ఎదుట అసలు విషయం ఒప్పుకుంది. ఆమెపై హత్య కేసు నమోదు చేసి అరెస్టు చేసి కోర్టుకు తరలించారు. -
కాన్పు కోసం వెళ్లి వివాహిత మృతి
► ఆసుపత్రిని ధ్వంసం చేసిన బంధువులు ► రాజీచేసిన అధికార పార్టీ నేతలు ఉదయగిరి : కాన్పు కోసం వివాహిత ఆసుపత్రికి వెళ్లి మృతిచెందిన సంఘటన ఉదయగిరిలో చోటుచేసుకుంది. దీంతో వివాహిత బంధువులు వైద్యశాలను ధ్వంసం చేశారు. బాధితుల కథనం మేరకు.. స్థానిక షబ్బీర్ కాలనీకి చెందిన పుట్టా ఆదిలక్ష్మి (20) గర్భిణి. గురువారం రాత్రి ఆమెకు నొప్పులు రావడంతో 7.30 గంటల ప్రాంతంలో కుటుంబసభ్యులతో కోట్నీస్ వైద్యశాలకు వచ్చింది. అక్కడ డాక్టర్ శ్యాంప్రసాద్ ఆమెను అడ్మిట్ చేసుకున్నారు. సిబ్బంది కాన్పయ్యేందుకు కొన్ని రకాల ఇంజెక్షన్లు, మాత్రలు ఇచ్చారు. రాత్రి ఒంటిగంట ప్రాంతంలో అక్కడ పనిచేస్తున్న ఓ మంత్రసాని సాయంతో ఆదిలక్ష్మి పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఆ సమయంలో వైద్యుడు శ్యాంప్రసాద్ అక్కడ లేకుండా నిద్రపోతున్నారు. ఆదిలక్ష్మికి బ్లీడింగ్ ఎక్కువ కావడంతో ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లింది. దీంతో ఆందోళనపడ్డ సిబ్బంది నిద్రపోతున్న వైద్యుడిని లేపడానికి ప్రయత్నించారు. అయితే ఆయనవైపు నుంచి స్పందన రాలేదు. దీంతో ఆందోళన చెందిన బంధువులు తెల్లవారుజామున నాలుగు గంటల ప్రాంతంలో మెరుగైన వైద్యం కోసం ఆత్మకూరు తరలించేందుకు నిర్ణయించుకొని వాహనాన్ని తెచ్చుకున్నారు. ఇంతలో వైద్యుడు పేషంట్ వద్దకు వచ్చి ఖంగారు పడాల్సిన అవసరం లేదని, తానే చూస్తానని బంధువులకు చెప్పడంతో వారు అక్కడే ఉండిపోయారు. ఈ క్రమంలో 4.30 గంటల ప్రాంతంలో ఆదిలక్ష్మి ప్రాణాలు వదిలింది. దీంతో లబోదిబోమంటూ బంధువులు తమ దగ్గరి వారికి ఫోన్ ద్వారా సమాచారం అందించారు. ఉదయం 7 గంటల ప్రాంతంలో మృతురాలి బంధువులు పెద్ద ఎత్తున వైద్యశాలకు చేరుకొని డాక్టర్ నిర్లక్ష్యంపై విరుచుకుపడ్డారు. కొంతమేర ఫర్నీచర్, కిటికీలు పగలగొట్టారు. దాడి జరగవచ్చని భావించిన వైద్యుడు ముందుగానే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఐదు గంటలకే ఎస్సై వెంకటరెడ్డి, విజయకుమార్ తమ సిబ్బందితో ఆసుపత్రి వద్దకు చేరుకున్నాడు. డాక్టర్, సిబ్బందిపై దాడి జరగకుండా అడ్డుకున్నారు. అధికార పార్టీ నేతల రంగప్రవేశం : అధికార పార్టీకి చెందిన కొద్దిమంది నేతలు వైద్యుడి తరపున రంగప్రవేశం చేసి మృతురాలి బంధువులతో బేరసారాలకు దిగారు. ఇరువురుకి రాజీ కుదిర్చారు. ఈ వ్యవహారంలో పెద్ద మొత్తంలో నగదు చేతులు మారినట్లు తెలుస్తోంది. ఈ విషయమై డాక్టర్ శ్యాంప్రసాద్‌ను సాక్షి ఫోన్ ద్వారా వివరణ అడిగేందుకు ప్రయత్నించగా ఆయన స్పందించలేదు. డిప్యూటీ డీఎంహెచ్ఓ రాంప్రసాద్‌ను వివరణ అడగ్గా ఆయన ఈ ఘటనపై విచారణ చేసేందుకు గండిపాలెం పీహెచ్సీ వైద్యుడు ఫైరోజ్‌ను నియమించామన్నారు. పూర్తిస్థాయి నివేదిక తీసుకొని జిల్లా వైద్యాధికారికి నివేదిస్తామని, ఆయనకు ఫోన్ ద్వారా విషయం చెప్పామన్నారు. -
ముప్పుతిప్పలు పెట్టి.. పోలీసులకు చిక్కి..
ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన నిందితుడు ఆస్పత్రిలో చేర్పించిన వైనం పీఎం పాలెం: విద్యార్థినిపై అఘాయిత్యానికి పాల్పడిన గ్యాంగ్‌లోని ప్రధాన నిందితుడు రవీంద్ర పోలీసులకు చిక్కాడు. అపస్మారక స్థితిలో ఉన్న అతడిని పోలీసులు ఆసుపత్రికి తరలించారు. పీఎం పాలెం సీఐ అప్పలరాజు తెలిపిన వివరాలివి. కృష్ణా జిల్లా మైలవరానికి చెందిన రవీంద్ర మధురవాడ ప్రాంతంలోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలో మూడో సంవత్సరం చదువుతున్నాడు. అతడి ఆగడాలు శుతిమించడంతో యాజమాన్యం కళాశాల నుంచి పంపిం చేసింది. అతడు ఆ ప్రాంతంలో ఉంటూ కళాశాలకు చెందిన ఓ విద్యార్థిని ఫొటో తీసి మార్ఫింగ్ చేసి ఆమెను బెదిరించ సాగాడు. తన రూమ్‌కు ఒంటరిగా వస్తే ఫొటోలు ఇస్తానని చెప్పాడు. అతని మాటలు నమ్మి ఆమె వెళ్లగా స్నేహితులతో కలిసి అఘాయిత్యానికి యత్నించాడు. అక్కడి నుంచి తప్పించుకున్న బాధితురాలు పీఎం పాలెం పోలీసులకు ఫిర్యాదు చేసింది. సీఐ ఆధ్వర్యంలో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. భీమిలిలో ఉన్నట్టు సమాచారం తెలుసుకున్న పోలీసులు శక్రవారం అక్కడకు వెళ్లారు. అతడు వారి నుంచి తప్పించుకుని ఆర్కే బీచ్ ప్రాంతానికి చేరుకున్నాడు. పోలీసులకు విష యం తెలిసి గాలింపు ముమ్మరం చేశారు. పోలీసులకు చిక్కడం ఖాయమని భావించిన నిందితుడు శుక్రవారం రాత్రి ఫినాయిల్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. పోలీసులు అప్రమత్తమై అపస్మారక స్థితిలో ఉన్న నిందితుడిని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. నిందితుడికి నేరచరిత్ర నిందితుడు రవీంద్రకు నేరచరిత్ర ఉందని సీఐ అప్పలరాజు తెలిపారు. తన స్వస్థలంలో పలు నేరాలకు పాల్పడి పోలీసు రికార్డులకు ఎక్కాడని పేర్కొన్నారు. 2013లో మధురవాడ ప్రాంతం లో ఓ ఇంజినీరింగ్ విద్యార్థిని గాయపరిచాడని తెలిపారు. ఐదేళ్లలో మూడు కళాశాలలు మారాడని, విద్యార్థులకు, కళాశాలల యాజమాన్యాలకు ఇబ్బందికరంగా మారాడని చెప్పారు. వేధింపులు తాళలేకే ఆత్మహత్యాయత్నం పోలీసులు విచారణ పేరుతో తమ కుమారుడ్ని హింసిస్తున్నారని తండ్రి నాగేశ్వరరావు ఆరోపించారు. వారి హింసను భరించలేకే ఆత్మహత్యాయత్నం చేశాడని విలేకరులకు తెలిపాడు. ఈ విషయమై మానవ హక్కుల కమిషన్‌ను కలిసి ఫిర్యాదు చేయనున్నట్లు పేర్కొన్నాడు. -
దోపిడీ దొంగల కిరాతకం
చోరీకి వచ్చి దాడి.. ముగ్గురు మృతి, ఒకరికి తీవ్రగాయాలు రఘునాథపల్లి: వరంగల్ జిల్లా రఘునాథపల్లి మండల కేంద్రంలోని ఓ ఇంట్లో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. ముగ్గురు కుటుంబ సభ్యులను కిరాతకంగా హత్య చేసి బంగారు ఆభరణాలతో పాటు నగదుతో ఉడాయించారు. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన చెరుకు నర్సింహ అదే గ్రామంలో ఖిలాషాపురం క్రాస్ రోడ్డు వద్ద హోటల్ నిర్వహిస్తున్నాడు. ఇతని ఇంటికి కొంత దూరంలో సోదరుడు సత్తయ్య నివసిస్తున్నాడు. నర్సింహ సోదరుని వద్ద ఉంటున్న వారి తండ్రి ఆరురోజుల క్రితం మరణించాడు. సంప్రదాయాల ప్రకారం గురువారం ఐదవరోజు కార్యక్రమాలు నిర్వహించి రాత్రి నర్సింహ తన సోదరుడి ఇంటి వ ద్దనే భార్య రేణుకతో ఉండిపోయాడు. కుమారుడు హర్షవర్ధన్(08), కూతురు అఖిలానందిని(11), అత్త బూడిద లచ్చమ్మ (51), లచ్చమ్మ తల్లి లింగంపల్లి రాధమ్మ(71)లను ఇంటికి వెళ్లి పడుకోమని పంపాడు. వారు వచ్చి.. హోటల్లోని ఇంట్లో పడుకున్నారు. శుక్రవారం తెల్లవారు జామున దుండగులు ఇంటి వెనకాల తలుపును పైకి లేపి ఇంట్లో దూరారు. మధ్య గదిలో ఉన్న బీరువాను తెరుస్తుండగా అలికిడికి కుటుంబ సభ్యులు లేవడంతో వారిపై దాడికి తెగ బడ్డారు. కత్తి, రాడ్లతో దాడి చేయగా లచ్చమ్మతో పాటు మనుమరాలు అఖిలానందిని అక్కడికక్కడే రక్తపు మడుగులో మృతి చెందారు. అపస్మారక స్థితిలో ఉన్న రాధమ్మను వరంగల్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ప్రాణాలొదిలింది. తీవ్ర గాయాలతో ఉన్న హర్షవర్ధన్ సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. దొంగలు లచ్చమ్మ, రాధమ్మ ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలను దోచుకోవడంతో పాటు బీరువాలోని తొమ్మిది తులాల బంగారం, రూ.90 వేల నగదు ఎత్తుకెళ్లారు. అంతకు ముందు అదే గ్రామానికి చెందిన ఎల్లయ్య ఇంట్లోకి దూరి రూ.11 వేల నగదు, మూడు గ్రాముల బంగారం అపహరించడంతో పాటు మరో రెండిళ్లను దోచుకోవడానికి యత్నించారు. వరంగల్ రేంజ్ డీఐజీ డాక్టర్ కాంతారావు, రూరల్ ఎస్పీ లేళ్ల కాళిదాసు, అడిషనల్ ఎస్పీ కె.శ్రీకాంత్ సంఘటనా స్థలిని సందర్శించారు.