
టెస్ట్ క్రికెట్‌లో పాకిస్తాన్ తొలిసారి కంకషన్ సబ్‌స్టిట్యూట్ ఆప్షన్‌ను వినియోగించుకుంది. శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్ట్ మూడో రోజు ఆటలో లంక పేసర్ అసిత ఫెర్నాండో వేసిన బంతి పాక్ ఆటగాడు సర్ఫరాజ్ ఖాన్ తలకు బలంగా తాకగా, అతను మైదానాన్ని వీడాడు. దీంతో సర్ఫరాజ్ స్థానంలో మహ్మద్ రిజ్వాన్ కంకషన్ సబ్‌స్టిట్యూట్‌గా బరిలోకి దిగాడు.
రిజ్వాన్ పాక్ తొలి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేయడంతో పాటు, ఆతర్వాత లంక సెకెండ్ ఇన్నింగ్స్‌లో వికెట్‌కీపింగ్ కూడా చేస్తాడు. ప్రస్తుతం పీసీబీ మెడికల్ టీమ్ పర్యవేక్షణలో ఉన్న సర్ఫరాజ్ ఖాన్.. పాక్ సెకెండ్ ఇన్నింగ్స్ సమయానికి కోలుకుంటే తిరిగి అతను బ్యాటింగ్‌కు దిగే అవకాశం ఉంటుంది.
Sarfaraz Ahmed Retired Hurt. #SarfarazAhmed #PAKvSL pic.twitter.com/T7yVo2tNlH
— Syed Haris Aamir (@_smharis_) July 26, 2023
సర్ఫరాజ్ మైదానాన్ని వీడే సమయానికి 22 బంతుల్లో 3 ఫోర్ల సాయంతో 14 పరుగులు చేశాడు. సర్ఫరాజ్ స్థానంలో బరిలోకి దిగిన రిజ్వాన్ 50 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. టెస్ట్‌ల్లో తొలిసారి కంకషన్ సబ్‌స్టిట్యూట్ ఆప్షన్‌ను వినియోగించున్న పాక్.. వన్డేల్లో తొలిసారి న్యూజిలాండ్‌పై ఈ ఆప్షన్‌ను వినియోగించుకుంది.
ఐసీసీ 2019లో తొలిసారి కంకషన్ సబ్‌స్టిట్యూట్ విధానాన్ని ప్రవేశపెట్టింది. అయితే దీన్ని వినియోగించుకుంది మాత్రం 2021లో. ఆ ఏడాది ఆగస్ట్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో జోఫ్రా ఆర్చర్ బౌలింగ్ గాయపడిన స్టీవ్ స్మిత్ స్థానంలో మార్నస్ లబూషేన్ కంకషన్ సబ్‌స్టిట్యూట్‌గా బరిలోకి దిగాడు. కాగా, పాక్ టీమ్ విన్నపం మేరకు మ్యాచ్ రిఫరీ డేవిడ్ బూన్ కంకషన్ సబ్‌స్టిట్యూట్ అవకాశాన్ని వినియోగించుకునే వెసలుబాటు కల్పించాడు.
ఇదిలా ఉంటే, శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్ట్ నాలుగో రోజు ఆటలో పాక్ తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. మహ్మద్ రిజ్వాన్ హాఫ్‌సెంచరీ పూర్తి చేయగానే 576 పరుగుల స్కోర్ వద్ద పాక్ ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. దీంతో ఆ జట్టుకు 410 తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. రిజ్వాన్‌తో పాటు అఘా సల్మాన్ (132 నాటౌట్) క్రీజ్‌లో ఉన్నాడు. అనంతరం 411 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన శ్రీలంక.. 10 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 29 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తుంది. ఈ మ్యాచ్‌లో ఇంకా రెండ్రోజుల ఆట (27, 28) మిగిలి ఉంది.