Substitute
-
కొండెక్కిన టమాటా : బోలెడన్ని ప్రత్యామ్నాయాలు, ట్రై చేశారా?
మన వంట ఇంట్లో టమాటా లేనిదే సాధారణంగా ఏ వంటకం పూర్తికాదు. ప్రతీ కూరలో టమాటా ఉండాల్సిందే. ఇపుడేమో టమాటా కొండెక్కి కూచుంది. కిలో వందరూపాయలు పెట్టి కొనాలా? వద్దా అని వంద సార్లు ఆలోచించి. చివరికి పావుకిలోతో సరిపెట్టుకుంటున్న పరిస్థితి. అయితే ఏదైనా ఒకటి మార్కెట్లో ఆకాశాన్నంటుతున్నపుడు ప్రత్యామ్నాయం వెతుక్కోవాల్సిందే. అందుకే టమాటాకు బదులుగా, దాదాపు అదే రుచి, చిక్కదనం వచ్చేలా ఇతర ప్రత్యామ్నాయాల గురించి ఒకసారి చూద్దాం.చింతపండు: సాధారణంగాకూరల్లో గ్రేవీ, పులుపు రుచి కోసం టమాటాను వాడతాం. కాబట్టి టమాటాకు బదులుగా చింతపండును వాడుకోవచ్చు. చిక్కదనం కూడా పొందవచ్చు. వెనిగర్: టామాటామాదిరిగానే వెనిగర్ కూడా పుల్లని రుచి కలిగి ఉంటుంది. సో.. పచ్చడి, పులుసుల్లో వెనిగర్‌తో టమాటా లోటును పూరించుకోవచ్చు. చక్కని రుచి కూడా లభిస్తుంది. మామిడి కాయ: సీజన్‌ను బట్టి పచ్చి మామిడికాయను టమాటాకు బదులుగా వాడుకోవచ్చు. చవగ్గా దొరికితే చింతచిగురు మంచిదే.మామిడి ఒరుగులు: అలాగే వేసవి కాలంలో ఎక్కువగా దొరికే మామిడి కాయలను ఉప్పు వేసి ఊరబెట్టి, బాగా ఎండబెట్టకుని నిల్వ చేసుకని, టమాటాకు బదులుగా వాడుకోచ్చు.పుల్లటి పెరుగు: పెరుగు టమాటాకు బదులు వంటల్లో వాడితే కూర గ్రేవీ వస్తుంది. చిక్క దనాన్ని, టామాటా తిన్న అనుభూతిని ఇస్తుంది. కాబట్టి టామాటాకు బదులు వెజ్, నాన్ వెజ్ అన్ని వంటకాల్లో పెరుగును వేసుకోవచ్చు. గుమ్మడి: సహజమైన తీపితో ఉండే గుమ్మడికాయను వంటకాల్లో టమాటాకు బదులు గుమ్మడికాయను వాడవచ్చు.క్యాప్సికమ్,లేదా బెల్ పెప్పర్: పసుపు, రెడ్, గ్రీన్ కలర్స్ల లభించే క్యాప్సికమ్‌ను కూరల్లో టమాటాకు బదులు, కలుపుగా వాడుకోవచ్చు. ఎలిఫెంట్ యాపిల్ : మన దేశంలో ఎక్కువగా తూర్పువైపున సాగు చేస్తారు. బంగ్లాదేశ్, మలేషియాలో ఎక్కువగా ఉంటాయి. అస్సామీ, బెంగాలీ వంటలలో ప్రత్యేక రుచి కోసం వీటిని వినియోగిస్తారు. దొరికితే ఇవి కూడా వంటలకు టమాటా రుచిని ఇస్తాయి.ఆనియన్ పౌడర్ లేదా గ్రాన్యూల్స్: మార్కెట్లోరెడీమేడ్గా దొరికే ఉల్లిపాయ పొడి ఉల్లి రుచి లోటును తీరుస్తుంది.స్ప్రింగ్ ఆనియన్స్ : నాన్‌వెజ్ లాంటి కూరల్లో స్ప్రింగ్ ఆనియన్స్ ఉపయోగించవచ్చు. చిన్న బాల్కనీల్లో , మిద్దె తోటల్లో ఈజీగా పెంచుకోవచ్చు.పీనట్ పేస్ట్: టమాటా గ్రేవీవాడే కూరల్లో పీనట్ పేస్ట్ మిక్స్ యాడ్ చేసుకోవచ్చు. వేయించిన వేరుశెనగలను మెత్తని పేస్ట్‌గా గ్రైండ్ చేసి గ్రేవీలాగా వాడుకోవడమే.టమాటా ఒరుగులువర్షాల కారణంగా సరఫరా తగ్గిపోవడం, డిమాండ్ పెరగడం, నిల్వలు తగ్గిపోవడం ధరలు పెరగడానికి కారణం. అందుకే టొమాటో తక్కువ రేటులో సులభంగా దొరికినపుడు వాటిని ఎండబెట్టి ఒరుగులు మాదిరిగా చేసుకొని నిల్వ చేసుకోవడం మరో చక్కటి పరిష్కారం. -
షుగర్ ఉందని స్వీట్స్‌కి దూరంగా ఉండాల్సిన పనిలేదు, ఎందుకంటే..
మనలో స్వీట్స్ అంటే ఇష్టం లేనివారు ఉండరేమో. కానీ మారుతున్న జీవనశైలికి అనుగుణంగా దేశంలోనే కాదు ప్రపంచంలో మధుమేహ రోగుల సంఖ్య నానాటికీ పెరుగుతుంది. దీంతో కృత్రిమ స్వీటెనర్ వాడకం కూడా పెరిగింది. చక్కెరకి ప్రత్యామ్నాయంగా వీటి వినియోగం ఇటీవలి కాలంలో విపరీతంగా పెరిగిపోయింది. అయితే షుగర్ బదులు షుగర్-ఫ్రీ స్వీటెనర్స్ వాడడం వల్ల కేలొరీలు తగ్గుతాయి. సహజ ఉత్పత్తుల నుంచి తయారుచేసిన స్వీటెనర్స్ వాడడం వల్ల ఆహారంలో కేలొరీలు తగ్గుతాయి. దీని వల్ల బరువు అదుపులో ఉండటమే కాకుండా మధుమేహం, గుండెజబ్బులు వచ్చే ప్రమాదం కూడా తగ్గుతుంది. ఉదాహరణకి స్టెవియా ఆధారిత స్వీటెనర్లు ఒక మొక్క ఆకుల నుంచి తయారు చేస్తారు. ఈ మధ్యకాలంలో అలాంటి అల్లులోజ్ వాడకం బాగా పెరిగింది. అల్లులోజ్ను D-psicose అని కూడా పిలుస్తారు.ఇది 70% తీపిగా ఉన్న ఫీలింగ్ కలిగినప్పటికీ ఇందులో కేవలం 10% మాత్రమే కేలరీలను కలిగి ఉంటుంది. టైప్-2 డయాబెటిస్ ఉన్నవారిలో బరువు తగ్గడానికి సహాయపడుతుంది. అంతే కాకుండా రక్తంలో గ్లూకోజ్ స్థాయిలని మెరుగుపరుస్తుంది. అయితే ఇన్ని ఉపయోగాలు ఉన్నా నాణ్యత విషయంలో పేలవంగా ఉందని కెనడా సహా మరికొన్ని దేశాల్లో అల్లులోజ్ వాడకంపై బ్యాన్ విధించారు. అయితే ఇప్పుడు యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియా, డేవిస్ (UC డేవిస్) సైంటిస్టులు అల్లులోజ్ క్వాలిటీపై జరిపిన పరీక్షల్లో ముఖ్యమైన పరోగతిని సాధించారు. అల్లులోజ్ చక్కెరకు గొప్ప ప్రత్యామ్నాయమని సైంటిస్టులు తెలిపారు. ఎందుకంటే ఇది గోధుమలు,అత్తిపండ్లు, ఎండుద్రాక్ష వంటి కొన్ని మొక్కలతో తయారుచేశారు. ఇందులో ఒక గ్రాములో కేవలం 0.4 కేలరీలు మాత్రమే కలిగి ఉంటుంది, సుక్రోజ్‌లో గ్రాముకు నాలుగు కేలరీలు ఉంటాయి. అల్లులోజ్ను తిన్న తర్వాత 70% జీర్ణం అవగా, మిగతాది కేవలం 24గంటల వ్యవధిలోనే యూరిన్ ద్వారా బయటకు వస్తుంది. కాబట్టి అల్లులోజ్ రక్తంలో గ్లూకోజ్ లేదా ఇన్సులిన్ స్థాయిలను ప్రభావితం చేయదని పేర్కొన్నారు. -
SL VS PAK 2nd Test Day 3: టెస్ట్ క్రికెట్లో పాక్ తొలిసారి ఇలా..!
టెస్ట్ క్రికెట్లో పాకిస్తాన్ తొలిసారి కంకషన్ సబ్‌స్టిట్యూట్ ఆప్షన్‌ను వినియోగించుకుంది. శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్ట్ మూడో రోజు ఆటలో లంక పేసర్ అసిత ఫెర్నాండో వేసిన బంతి పాక్ ఆటగాడు సర్ఫరాజ్ ఖాన్ తలకు బలంగా తాకగా, అతను మైదానాన్ని వీడాడు. దీంతో సర్ఫరాజ్ స్థానంలో మహ్మద్ రిజ్వాన్ కంకషన్ సబ్‌స్టిట్యూట్‌గా బరిలోకి దిగాడు. రిజ్వాన్ పాక్ తొలి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేయడంతో పాటు, ఆతర్వాత లంక సెకెండ్ ఇన్నింగ్స్‌లో వికెట్‌కీపింగ్ కూడా చేస్తాడు. ప్రస్తుతం పీసీబీ మెడికల్ టీమ్ పర్యవేక్షణలో ఉన్న సర్ఫరాజ్ ఖాన్.. పాక్ సెకెండ్ ఇన్నింగ్స్ సమయానికి కోలుకుంటే తిరిగి అతను బ్యాటింగ్‌కు దిగే అవకాశం ఉంటుంది. Sarfaraz Ahmed Retired Hurt. #SarfarazAhmed #PAKvSL pic.twitter.com/T7yVo2tNlH — Syed Haris Aamir (@_smharis_) July 26, 2023 సర్ఫరాజ్ మైదానాన్ని వీడే సమయానికి 22 బంతుల్లో 3 ఫోర్ల సాయంతో 14 పరుగులు చేశాడు. సర్ఫరాజ్ స్థానంలో బరిలోకి దిగిన రిజ్వాన్ 50 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. టెస్ట్‌ల్లో తొలిసారి కంకషన్ సబ్‌స్టిట్యూట్ ఆప్షన్‌ను వినియోగించున్న పాక్.. వన్డేల్లో తొలిసారి న్యూజిలాండ్‌పై ఈ ఆప్షన్‌ను వినియోగించుకుంది. ఐసీసీ 2019లో తొలిసారి కంకషన్ సబ్‌స్టిట్యూట్ విధానాన్ని ప్రవేశపెట్టింది. అయితే దీన్ని వినియోగించుకుంది మాత్రం 2021లో. ఆ ఏడాది ఆగస్ట్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో జోఫ్రా ఆర్చర్ బౌలింగ్ గాయపడిన స్టీవ్ స్మిత్ స్థానంలో మార్నస్ లబూషేన్ కంకషన్ సబ్‌స్టిట్యూట్‌గా బరిలోకి దిగాడు. కాగా, పాక్ టీమ్ విన్నపం మేరకు మ్యాచ్ రిఫరీ డేవిడ్ బూన్ కంకషన్ సబ్‌స్టిట్యూట్ అవకాశాన్ని వినియోగించుకునే వెసలుబాటు కల్పించాడు. ఇదిలా ఉంటే, శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్ట్ నాలుగో రోజు ఆటలో పాక్ తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. మహ్మద్ రిజ్వాన్ హాఫ్‌సెంచరీ పూర్తి చేయగానే 576 పరుగుల స్కోర్ వద్ద పాక్ ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. దీంతో ఆ జట్టుకు 410 తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. రిజ్వాన్‌తో పాటు అఘా సల్మాన్ (132 నాటౌట్) క్రీజ్‌లో ఉన్నాడు. అనంతరం 411 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన శ్రీలంక.. 10 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 29 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తుంది. ఈ మ్యాచ్‌లో ఇంకా రెండ్రోజుల ఆట (27, 28) మిగిలి ఉంది. -
‘కరోనా సబ్‌స్టిట్యూట్’కు అనుమతి
దుబాయ్: కోవిడ్–19 నేపథ్యంలో జాగ్రత్తలు తీసుకుంటూనే క్రికెట్‌ను కొనసాగించేందుకు చేసిన ప్రతిపాదనలకు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) పచ్చ జెండా ఊపింది. తాత్కాలిక ప్రాతిపదికన ఈ కొత్త నిబంధనలు అమల్లోకి వస్తాయని మంగళవారం ప్రకటించింది. ఆటగాళ్ల ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇస్తూనే మైదానంలో మరికొన్ని సడలింపులు ఇస్తున్నట్లు వెల్లడించింది. అనిల్ కుంబ్లే నాయకత్వంలోని ఐసీసీ క్రికెట్ కమిటీ ఈ ప్రతిపాదనలు చేసింది. మరోవైపు వచ్చే 12 నెలలపాటు ఆటగాళ్లు ధరించే దుస్తులకు సంబంధించి కూడా ఐసీసీ ఒక సడలింపు ఇచ్చింది. స్పాన్సర్షిప్కు సంబంధించి ఇప్పటికే అనుమతించిన మూడు లోగోలతో పాటు ఇకపై ఛాతీ భాగంలో కూడా అదనంగా 32 చదరపు అంగుళాలకు మించకుండా మరో లోగోను ప్రదర్శించుకునేందుకు వీలుంది. ఐసీసీ ఆమోదించిన ప్రధాన అంశాలను చూస్తే... 1. కోవిడ్–19 రీప్లేస్మెంట్ టెస్టు మ్యాచ్ జరిగే సమయంలో ఎవరైనా ఆటగాడికి కరోనా లక్షణాలు కనిపిస్తే కన్కషన్ సబ్‌స్టిట్యూట్ తరహాలోనే అతని స్థానంలో మరొకరిని రిఫరీ అంగీకారంతో ఆడించుకోవచ్చు. అయితే ఈ నిబంధన వన్డే, టి20ల్లో వర్తించదు. 2. ఉమ్మి వాడకుండా నిషేధం ఏ బౌలర్ కూడా బంతి మెరుపు పెంచేందుకు సలైవాను వాడరాదు. ఆటగాళ్లు దీనికి అలవాటు పడే వరకు అంపైర్లు కాస్త స్వేచ్ఛనిస్తారు. ఆ తర్వాత హెచ్చరించడం మొదలవుతుంది. రెండు హెచ్చరికల తర్వాత కూడా అదే చేస్తే బ్యాటింగ్ జట్టుకు 5 పెనాల్టీ పరుగులు ఇస్తారు. ఉమ్మి వాడినట్లు అంపైర్లు గుర్తిస్తే ఆ బంతిని వేసే ముందే తుడిచేయాలని వారు ఆదేశించగలరు. 3. తటస్థ అంపైర్లు రద్దు ప్రస్తుత పరిస్థితుల్లో ఇతర దేశాలకు చెందిన తటస్థ అంపైర్లకు బాధ్యతలు ఇవ్వడం కష్టం కాబట్టి ఆయా క్రికెట్ బోర్డులకు చెందిన అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ఎలైట్ ప్యానెల్ అంపైర్లే మ్యాచ్ విధులు నిర్వర్తిస్తారు. 4. అదనపు డీఆర్ఎస్ రివ్యూ స్థానిక అంపైర్లకు అనుభవం తక్కువగా ఉంటే నిర్ణయాల్లో తప్పులు దొర్లే అవకాశం ఉంటుంది కాబట్టి అదనంగా మరో రివ్యూను ఇస్తారు. దీని ప్రకారం టెస్టుల్లో ఒక్కో ఇన్నింగ్స్‌లో రెండుకు బదులుగా 3 రివ్యూలు ఉంటాయి. వన్డే, టి20ల్లో ఒకటినుంచి రెండుకు పెంచారు. టి20 ప్రపంచ కప్ జరిగేనా! ఆస్ట్రేలియా వేదికపై ఈ ఏడాది జరగాల్సిన టి20 ప్రపంచకప్ నిర్వహణపై నేడు స్పష్టత రానుంది. నేడు జరిగే అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) సమావేశంలో దీనిపై తుది నిర్ణయం తీసుకుంటారు. షెడ్యూల్ ప్రకారం అక్టోబరు 18 నుంచి నవంబర్ 15 వరకు ఈ మెగా టోర్నీ జరగాల్సి ఉంది. నిజానికి మే 28న జరిగిన సమావేశంలోనే ఈ అంశాన్ని తేల్చేస్తారని భావించినా... ఐసీసీ అజెండాలోని అన్ని అంశాలపై నిర్ణయాన్ని జూన్ 10కి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. ఈ ఏడాది ప్రపంచకప్ సాధ్యం కాకపోతే ఒక ఏడాది దానిని వాయిదా వేసి భారత్‌లో జరగాల్సిన 2021 వరల్డ్ కప్‌ను కూడా మరో సంవత్సరం వెనక్కి జరిపే ప్రతిపాదన కూడా వినిపిస్తోంది. మరోవైపు ప్రపంచకప్ జరిగే అవకాశం లేకపోతే అవే తేదీల్లో ఐపీఎల్‌ను నిర్వహించే ఆలోచనలో బీసీసీఐ ఉన్నట్లు సమాచారం. దీనిపై ఒక సీనియర్ అధికారి స్పందిస్తూ ఐసీసీ ముందుగా దీనిపై తమ నిర్ణయం ప్రకటిస్తే ఆపై తాము ఏం చేయాలనేది ఆలోచిస్తామని చెప్పారు. దీంతో పాటు ఐసీసీ చైర్మన్ పదవి గురించి కూడా ఈ సమావేశం ప్రధానంగా చర్చ జరగనుంది. కొత్త చైర్మన్ ఎంపిక కోసం నోటిఫికేషన్ ఇవ్వాలా వద్దా అనేదానిపై కూడా నిర్ణయం తీసుకుంటారు. శశాంక్ మనోహర్ పదవీ కాలం ముగిసిపోగా... ఈ ప్రతిష్టాత్మక పదవి కోసం పలువురు పోటీ పడుతున్నారు. భారత మాజీ కెప్టెన్, బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ కూడా రేసులో ఉన్నాడు. -
ఐసీసీ కీలక నిర్ణయం.. అన్ని ఫార్మాట్లలో వర్తింపు
లండన్: అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) క్రికెట్లో మరో విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది. గత రెండేళ్లుగా పెండింగ్‌లో ఉన్న కాంకషన్ సబ్‌స్టిట్యూట్‌కు ఆమోదముద్ర వేసింది. వార్షిక సమావేశంలో భాగంగా ఐసీసీ ఈ కీలక నిర్ణయం తీసుకుంది. తొలుత కేవలం టెస్టుల్లోనే అమలు చేయాలని భావించినా.. మెజారిటీ సభ్యుల విన్నపం మేరకు అన్ని ఫార్మట్లకు వర్తింపచేస్తూ నిబంధనలను రూపొందించింది. దీనిపై పూర్తి అధికారం మ్యాచ్ రిఫరీకే ఉంటుందని ఐసీసీ తేల్చిచెప్పింది. మ్యాచ్ మధ్యలో ఏ జట్టైతే కాంకషన్ సబ్‌స్టిట్యూట్ కోరుతుందో.. ఆ జట్టు డాక్టర్ చేత ఆటగాడి గాయానికి సంబంధించిన వివరాలతో కూడిన రిపోర్టును మ్యాచ్ రిఫరీకి అందజేయాలి. రిఫరీ ఆమోదం తెలిపాకే కాంకషన్ సబ్‌స్టిట్యూట్‌కు అనుమతి లభిస్తుంది. ఇక ఈ విధానం యాషెస్ సిరీస్ నుంచి ప్రారంభం కానుంది. గత రెండేళ్లుగా దీనిపై సుదీర్ఘ అధ్యయనం చేసి, దేశవాళీ క్రికెట్లో అమలు చేసి విజయవంతం అయ్యాకే అంతర్జాతీయ క్రికెట్లోకి ప్రవేశపెడుతున్నామని ఐసీసీకి చెందిన ఓ అధికారి తెలిపారు. కాంకషన్ సబ్‌స్టిట్యూట్‌కు ఐసీసీ ఆమోదం తెలపడంతో క్రికెట్ ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ క్రికెట్ బోర్డులు ఆనందం వ్యక్తం చేశాయి. కాంకషన్ సబ్‌స్టిట్యూట్ అంటే? మైదానంలో ఏ ఆటగాడి తలకైనా బంతి బలంగా తగిలితే దిమ్మ తిరుగుతుంది. కాసేపు ఏం జరుగుతుందో అర్థం కాదు. అతడి పరిస్థితి ఏంటో తెలీదు. దీనినే కాంకషన్ అంటారు. ప్రస్తుత నిబంధనల ప్రకారం సబ్‌స్టిట్యూట్ ఆటగాడికి కేవలం ఫీల్డింగ్ చేసేందుకు అనుమతి ఉంది. బ్యాటింగ్, బౌలింగ్ చేసేందుకు అంగీకరించరు. అయితే కాంకషన్ సబ్‌స్టిట్యూట్ ప్రకారం మరొక ఆటగాడిని జట్టులోకి అనుమతినిస్తారు. దీంతో ఆ ఆటగాడు బ్యాటింగ్, బౌలింగ్ చేసే అవకాశాలు ఉంటాయి. -
ముంబైపై నార్త్ఈస్ట్ గెలుపు
ముంబై: తమ గత మ్యాచ్‌లో ఏకంగా ఐదు గోల్స్‌తో రెచ్చిపోయిన ముంబై సిటీ ఎఫ్‌సీ శుక్రవారం నార్త్ఈస్ట్ యునెటైడ్ ఎఫ్‌సీతో జరిగిన మ్యాచ్‌లో మాత్రం చేతులెత్తేసింది.డీవై పాటిల్ స్టేడియంలో జరిగిన ఈ పోరులో 0-2తో ఓడింది. 57వ నిమిషంలో కోకే నుంచి అందుకున్న పాస్‌ను గోల్ పోస్టుకు అతి సమీపం నుంచి టోంగా బంతిని నెట్లోకి పంపి 1-0 ఆధిక్యాన్ని అందించాడు. 72వ నిమిషంలో జుంగ్‌బర్గ్ గాయపడి మైదానం వీడాడు. అప్పటికేల సంఖ్య సరిపోయింది. దీనికి తోడు 75వ నిమిషంలో పావెల్ మోవ్స్ రెండో ఎల్లో కార్డ్‌కు గురై మైదానం వీడడంతో ముంబై జట్టు 9 మందితోనే ఆడాల్సి వచ్చింది. ఇక 90+2వ నిమిషంలో ఫెలిపే గోల్‌తో నార్త్ఈస్ట్ 2-0తో నెగ్గింది. ఐఎస్ఎల్లో నేడు ఢిల్లీ డైనమోస్ ఎఫ్‌సీ ఁ చెన్నైయిన్ ఎఫ్‌సీ వేదిక: ఢిల్లీ సమయం: రాత్రి 7 గంటల నుంచి ప్రత్యక్ష ప్రసారం: స్టార్ స్పోర్ట్స్ 2,3