ముంబైపై నార్త్‌ఈస్ట్ గెలుపు | Northeast win over Mumbai | Sakshi
Sakshi News home page

ముంబైపై నార్త్‌ఈస్ట్ గెలుపు

Published Sat, Oct 25 2014 1:21 AM | Last Updated on Sat, Sep 2 2017 3:19 PM

Northeast win over Mumbai

ముంబై: తమ గత మ్యాచ్‌లో ఏకంగా ఐదు గోల్స్‌తో రెచ్చిపోయిన ముంబై సిటీ ఎఫ్‌సీ శుక్రవారం నార్త్‌ఈస్ట్ యునెటైడ్ ఎఫ్‌సీతో జరిగిన మ్యాచ్‌లో మాత్రం చేతులెత్తేసింది.డీవై పాటిల్ స్టేడియంలో జరిగిన ఈ పోరులో 0-2తో ఓడింది. 57వ నిమిషంలో కోకే నుంచి అందుకున్న పాస్‌ను గోల్ పోస్టుకు అతి సమీపం నుంచి టోంగా బంతిని నెట్‌లోకి పంపి 1-0 ఆధిక్యాన్ని అందించాడు. 72వ నిమిషంలో జుంగ్‌బర్గ్ గాయపడి మైదానం వీడాడు. అప్పటికేల సంఖ్య సరిపోయింది. దీనికి తోడు 75వ నిమిషంలో పావెల్ మోవ్స్ రెండో ఎల్లో కార్డ్‌కు గురై మైదానం వీడడంతో ముంబై జట్టు 9 మందితోనే  ఆడాల్సి వచ్చింది. ఇక 90+2వ నిమిషంలో ఫెలిపే గోల్‌తో నార్త్‌ఈస్ట్ 2-0తో నెగ్గింది.
 
ఐఎస్‌ఎల్‌లో నేడు
 
ఢిల్లీ డైనమోస్ ఎఫ్‌సీ ఁ చెన్నైయిన్ ఎఫ్‌సీ
వేదిక: ఢిల్లీ
సమయం: రాత్రి 7 గంటల నుంచి
ప్రత్యక్ష ప్రసారం: స్టార్ స్పోర్ట్స్ 2,3
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement