మనలో స్వీట్స్ అంటే ఇష్టం లేనివారు ఉండరేమో. కానీ మారుతున్న జీవనశైలికి అనుగుణంగా దేశంలోనే కాదు ప్రపంచంలో మధుమేహ రోగుల సంఖ్య నానాటికీ పెరుగుతుంది. దీంతో కృత్రిమ స్వీటెనర్ వాడకం కూడా పెరిగింది. చక్కెరకి ప్రత్యామ్నాయంగా వీటి వినియోగం ఇటీవలి కాలంలో విపరీతంగా పెరిగిపోయింది.
అయితే షుగర్ బదులు షుగర్-ఫ్రీ స్వీటెనర్స్ వాడడం వల్ల కేలొరీలు తగ్గుతాయి. సహజ ఉత్పత్తుల నుంచి తయారుచేసిన స్వీటెనర్స్ వాడడం వల్ల ఆహారంలో కేలొరీలు తగ్గుతాయి. దీని వల్ల బరువు అదుపులో ఉండటమే కాకుండా మధుమేహం, గుండెజబ్బులు వచ్చే ప్రమాదం కూడా తగ్గుతుంది.
ఉదాహరణకి స్టెవియా ఆధారిత స్వీటెనర్లు ఒక మొక్క ఆకుల నుంచి తయారు చేస్తారు. ఈ మధ్యకాలంలో అలాంటి అల్లులోజ్ వాడకం బాగా పెరిగింది. అల్లులోజ్‌ను D-psicose అని కూడా పిలుస్తారు.ఇది 70% తీపిగా ఉన్న ఫీలింగ్ కలిగినప్పటికీ ఇందులో కేవలం 10% మాత్రమే కేలరీలను కలిగి ఉంటుంది. టైప్-2 డయాబెటిస్ ఉన్నవారిలో బరువు తగ్గడానికి సహాయపడుతుంది.
అంతే కాకుండా రక్తంలో గ్లూకోజ్ స్థాయిలని మెరుగుపరుస్తుంది. అయితే ఇన్ని ఉపయోగాలు ఉన్నా నాణ్యత విషయంలో పేలవంగా ఉందని కెనడా సహా మరికొన్ని దేశాల్లో అల్లులోజ్ వాడకంపై బ్యాన్ విధించారు. అయితే ఇప్పుడు యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియా, డేవిస్ (UC డేవిస్) సైంటిస్టులు అల్లులోజ్ క్వాలిటీపై జరిపిన పరీక్షల్లో ముఖ్యమైన పరోగతిని సాధించారు.
అల్లులోజ్ చక్కెరకు గొప్ప ప్రత్యామ్నాయమని సైంటిస్టులు తెలిపారు. ఎందుకంటే ఇది గోధుమలు,అత్తిపండ్లు, ఎండుద్రాక్ష వంటి కొన్ని మొక్కలతో తయారుచేశారు. ఇందులో ఒక గ్రాములో కేవలం 0.4 కేలరీలు మాత్రమే కలిగి ఉంటుంది, సుక్రోజ్‌లో గ్రాముకు నాలుగు కేలరీలు ఉంటాయి. అల్లులోజ్‌ను తిన్న తర్వాత 70% జీర్ణం అవగా, మిగతాది కేవలం 24గంటల వ్యవధిలోనే యూరిన్ ద్వారా బయటకు వస్తుంది. కాబట్టి అల్లులోజ్ రక్తంలో గ్లూకోజ్ లేదా ఇన్సులిన్ స్థాయిలను ప్రభావితం చేయదని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment