research
-
వాష్‌రూంలో టూత్‌బ్రష్.. మీ పళ్లు మటాష్!!
‘మీ టూత్‌పేస్ట్‌లో ఉప్పుందా?’.. అంటూ వచ్చే టీవీ యాడ్‌ను చూసే ఉంటారుగా.. దృఢమైన దంతాలు, చిగుళ్ల కోసం ఉప్పున్న తమ పేస్ట్‌నే వాడాలంటూ ఓ ప్రముఖ టూత్‌పేస్ట్ కంపెనీ చేసుకొనే ప్రచారం అది. మరి మీ టూత్‌బ్రష్‌లు వాష్‌రూంలో ఉంటాయా? బ్రష్ చేసుకొని తిరిగి వాటిని అక్కడే ఉంచుతారా? అయితే మీకు పంటి సమస్యలు తప్పవని తాజా అధ్యయనం తేల్చిచెబుతోంది!! సాక్షి, సిద్దిపేట: దంతాలు ఆరోగ్యంగా ఉండాలంటే సరైన టూత్‌పేస్ట్‌ను ఎంపిక చేసుకోవడం ఒక్కటే సరిపోదని.. టూత్‌బ్రష్‌లను సరైన చోట ఉంచడం కూడా ముఖ్యమని సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు చేపట్టిన పరిశోధన తేల్చిచెబుతోంది. టూత్‌బ్రష్‌లపై ప్రధానంగా మూడు రకాల బ్యాక్టీరియాలు ఉంటున్నాయని.. బ్రష్‌ల వినియోగంలో తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే అనారోగ్యాలకు గురికావాల్సి వస్తుందని హెచ్చరిస్తోంది. వాష్‌రూంలలో ఉంచితే అంతే.. అటాచ్డ్ వాష్‌రూంలు ఉన్న ఇళ్లలో నివసించే వారిలో చాలా మంది తమ టూత్‌బ్రష్‌లను భద్రపరుస్తుండటం సహజమే. అయితే అలా వినియోగిస్తున్న టూత్‌బ్రష్‌లపై భారీగా సూక్ష్మజీవులు పేరుకుపోతున్నాయని సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థుల అధ్యయనంలో తేలింది. టూత్ బ్రష్‌లను వాష్‌రూంలో ఉంచడం వల్ల ఫ్లష్ చేసిన ప్రతిసారీ కమోడ్ నుంచి నీటితుంపర్లు ఎగిరిపడతాయని.. తద్వారా కమోడ్‌లో ఉండే బ్యాక్టీరియా నీటితుంపర్ల ద్వారా గాల్లో వ్యాపిస్తూ అక్కడ ఉండే బ్రష్‌లపైకి ఎక్కువగా చేరుతున్నాయని నిర్ధారణ అయింది. అదే వాష్‌రూంకు దూరంగా, కాస్త గాలి, ఎండ తగిలే చోట టూత్‌బ్రష్‌లను ఉంచిన చోట సూక్ష్మక్రిములు నశిస్తున్నట్లు పరిశోధనలో వెల్లడైంది. అలాగే ఇంట్లోని అందరి టూత్‌బ్రష్‌లను కూడా ఒకే దగ్గర పెట్టడం అంత సురక్షితం కాదని నిరూపితమైంది. 45 రోజులపాటు సాగిన పరిశోధన టూత్ బ్రష్‌ల శుభ్రత, సూక్ష్మక్రిముల నుంచి సంరక్షణ అనే అంశంపై సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైక్రోబయాలజీ విభాగం ఆధ్వర్యంలో ద్వితీయ, తృతీయ సంవత్సరం విద్యార్థులు పరిశోధన చేపట్టారు. కళాశాల సూక్ష్మ జీవశాస్త్ర ఇన్చార్జి, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ మదన్ మోహన్ పర్యవేక్షణలో 45 రోజులపాటు పరిశోధన చేశారు. కళాశాలకు చెందిన విద్యార్థులు, ఆధ్యాపకులు వినియోగిస్తున్న టూత్‌బ్రష్‌ల నుంచి 100 నమూనాలను శ్వాబ్‌ల ద్వారా సేకరించారు. వాటిలో బ్యాక్టీరియా ఉందా? ఉంటే ఏయే రకాల సూక్ష్మక్రిములు ఉన్నాయనే దానిపై పరిశోధన చేపట్టారు. మూడు రకాల బ్యాక్టీరియాల గుర్తింపు శాంపిల్స్ సేకరించిన టూత్బ్రష్లలో ప్రధానంగా మూడు రకాల బ్యాక్టీరియాలు ఉన్నట్లు విద్యార్థులు గుర్తించారు. స్ట్రెప్టోకోకస్ మ్యుటాన్స్ రకం బ్యాక్టీరియా 50 శాతం, స్టెఫైలోకోకస్ ఆర్‌యస్ 40 శాతం, ఎస్చెరిషియా కోలి (ఈ–కొలి) బ్యాక్టీరియా 20 శాతం ఉన్నట్లుగా తేల్చారు. పిప్పిపళ్లు, దంతాల క్షీణత, అరుగుదలకు స్ట్రెప్టోకోకస్ మ్యుటాన్స్ బ్యాక్టీరియా కారణమవుతుందని చెప్పారు. అలాగే స్టెఫైలోకోకస్ ఆర్‌యస్ వల్ల గొంతు సమస్యలు, మౌత్ అల్సర్, ఈ–కోలి బ్యాక్టీరియా వల్ల జీర్ణసంబంధ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందన్నారు.యూవీ లైట్‌తో బ్యాక్టీరియా మాయంబ్యాక్టీరియా ఉన్న బ్రష్‌లను ఆయా విద్యార్థులు సొంతంగా తయారు చేసిన యూవీ లైట్బాక్స్లో పెట్టి పరీక్షించగా వాటిపై ఎలాంటి క్రిములు లేవని తేలింది. టూత్ బ్రష్‌లను వినియోగించే ముందు యూవీ లైట్ బాక్స్‌లో 5 నుంచి 10 నిమిషాలపాటు ఉంచడం ద్వారా బ్రష్ శానిటైజ్ అవుతుందన్నారు. మరోవైపు ఒకవేళ బ్రష్‌లను ఒకేచోట పెట్టాల్సి వస్తే వాటికి క్యాప్‌లను పెట్టాలని ఈ ప్రయోగంలో పాలుపంచుకున్న విద్యార్థులు సూచిస్తున్నారు. ప్రతిరోజూ వేడినీటితో బ్రష్‌ను శుభ్రం చేశాకే వాడాలని.. మూడు నెలలకోసారి టూత్ బ్రష్‌ను తప్పనిసరిగా మార్చాలని చెబుతున్నారు. ప్రజలకు అవగాహన కల్పించేందుకే ప్రిన్సిపాల్ సునీత సూచనలతో సూక్ష్మజీవశాస్త్ర విభాగాధిపతి డాక్టర్ మదన్మోహన్ పర్యవేక్షణలో టూత్‌బ్రష్‌ల శుభ్రత, సూక్ష్మక్రిముల నుంచి సంరక్షణపై పరిశోధన చేశాం. ప్రజలకు అవగాహన కల్పించాం. యూవీ బాక్స్‌ను సైతం తయారు చేశాం. – విద్యార్థినులు.. మౌనిక, షారోన్, నాగలక్ష్మి, సిద్ద, స్నేహ, సుష్మిత ప్రభుత్వ జిజ్ఞాస పోటీలకు పంపుతాం.. ప్రతి సంవత్సరం ఏదో ఒక అంశంపై పరిశోధన చేస్తాం. రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వం నిర్వహించే జిజ్ఞాస పోటీలకు పంపిస్తున్నాం. టూత్ బ్రష్‌ల ద్వారా బ్యాక్టీరియా వ్యాప్తి చెందుతోందన్న విషయమై ప్రజలకు అవగాహన కల్పించేందుకు పరిశోధన చేపట్టాం. – డాక్టర్ మదన్ మోహన్, సూక్ష్మజీవశాస్త్ర విభాగాధిపతి -
హిండెన్‌బర్గ్ మూసివేత! బెదిరింపులు ఉన్నాయా..?
అదానీ గ్రూప్, నికోలా వంటి కంపెనీలపై తీవ్ర ఆరోపణలు చేసి వార్తల్లో నిలిచిన అమెరికా షార్ట్ సెల్లింగ్ సంస్థ హిండెన్‌బర్గ్ రీసెర్చ్‌ను మూసివేస్తున్నట్లు ప్రకటించారు. కంపెనీ వ్యవస్థాపకుడు నాథన్ అండర్సన్ కంపెనీ వెబ్సైట్లో అప్లోడ్ చేసిన నోట్లో ఈమేరకు నిర్ణయాన్ని వెల్లడించారు. సంస్థ మూసివేతకు సంబంధించి ఏదైనా ప్రత్యేక కారణాలు ఉన్నాయా.. అనే దానిపై అండర్సన్ నోట్లో వివరాలు తెలియజేశారు.‘సంస్థ మూసివేత గురించి కొంతకాలంగా నా ఆత్మీయులు, కుటుంబ సభ్యులు, స్నేహితులతో చర్చించాను. చాలా చర్చలు జరిగిన తర్వాతే సంస్థను మూసివేయాలని నిర్ణయించుకున్నాను. మేము తీసుకున్న ఈ నిర్ణయం వెనుక ఎలాంటి బెదిరింపులు, భయాలు, వ్యక్తిగత అంశాలు లేవు. హిండెన్‌బర్గ్ నా జీవితంలో ఒక మధురమైన అధ్యాయంగా మిగిలిపోతుంది. ఈ సంస్థ వల్ల ఎంతో సాహసం చేశాను. ఎన్నో ఇబ్బందులు, ఒత్తిళ్లు ఎదురైనా ఏ మాత్రం తొనకకుండా సంస్థను నిర్వహించాను. ఈ వ్యవహారం అంతా నాకో ప్రేమకథలా తోస్తుంది. కంపెనీ స్థాపించడానికి ముందు నన్ను నేను నిరూపించుకోవాలని ఎంతో కష్టపడేవాడిని. ప్రస్తుతం కంఫర్ట్ జోన్లో ఉన్నానని అనిపిస్తోంది. ఇకపై భవిష్యత్తు కార్యాచరణపై దృష్టి పెడతాను. నా బృందం మంచి స్థాయికి చేరుకునేందుకు సాయపడతాను’ అని తెలిపారు.ఇదీ చదవండి: రష్యాపై యూఎస్ ఆంక్షలు.. చమురుపై ప్రభావంహిండెన్బర్గ్ గురించి..నాథన్ అండర్సన్ 2017లో దీన్ని స్థాపించారు. యూఎస్‌కు చెందిన ఈ కంపెనీ షార్ట్ సెల్లింగ్ సంస్థగా, ఇన్వెస్టిగేటివ్ రీసెర్చ్‌గా ప్రసిద్ధి చెందింది. దీని ప్రధాన కార్యాలయం న్యూయార్క్‌లో ఉంది. 2023లో అదానీ గ్రూప్ స్టాక్ మానిప్యులేషన్, అకౌంట్స్‌లో మోసం చేసిందని హిండెన్‌బర్గ్ నివేదిక ఆరోపించింది. ఈ నివేదికతో కంపెనీ మార్కెట్ విలువ 100 బిలియన్ డాలర్ల(సుమారు రూ.8.3 లక్షల కోట్లు)కు పైగా తుడిచిపెట్టుకుపోయింది. 2020లో నికోలా తన సాంకేతికతను ఉపయోగించి పెట్టుబడిదారులను మోసం చేసిందని ఆరోపించింది. హిండెన్‌బర్గ్ రద్దు చేయడానికి ముందు పోంజీ పథకాల నివేదికలతో సహా తన తుది దర్యాప్తులను పూర్తి చేసినట్లు తెలిపింది. అండర్సన్ తన కుటుంబంతో ఎక్కువ సమయం గడపాలని నిర్ణయించుకున్నట్లు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వ్యక్తులు తెలిపారు. -
ఆత్మీయ నేస్తాలు.. పుంగనూరు పొట్టి దూడలు
మూడడుగుల ఎత్తుంటాయి.. చూడముచ్చటగా కనిపిస్తాయి. మార్కెట్లో ధర మాత్రం లక్షల్లో పలుకుతాయి. ప్రపంచంలోనే అరుదైన ఈ పుంగనూరు పొట్టి దూడలను పోటీపడి మరీ కొనుగోలు చేస్తుంటారు. అదృష్ట చిహ్నంగా భావించే ఈ దూడలను పెంచుకునేందుకు పెద్దసంఖ్యలో ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. ఈక్రమంలో ఔత్సాహిక రైతులు చిట్టి ‘పొట్టి’ నేస్తాలను ప్రత్యేకంగా ఉత్పత్తి చేయిస్తున్నారు. అపురూప దూడలను విక్రయించి లాభాలను ఆర్జిస్తున్నారు. కృషి విజ్ఞాన కేంద్రం ద్వారా ఈ విశిష్ట జాతిని మరింతగా పెంచేందుకు చర్యలు చేపడుతున్నారు. అందులో భాగంగా పలమనేరులోని పశు పరిశోధన కేంద్రంలోపొట్టి దూడల సంరక్షణకు ఏర్పాట్లు చేశారు. పలమనేరు : పుంగనూరు పొట్టిరకం దూడల పేరు ఇప్పుడు దేశవ్యాప్తంగా మార్మోగుతోంది. పుట్టిన సమయంలో ఈ దూడ కేవలం అడుగు ఎత్తు మాత్రమే ఉంటుంది. జీవితకాలంలో కేవలం మూడడుగులు మాత్రమే పెరుగుతుంది. తోక నేలను తాకేలా ఉండే ఈ రకం దూడలకు ప్రస్తుతం భలే డిమాండ్ వచ్చింది. ఫస్ట్ క్వాలిటీ రకం దూడలు రూ.2 నుంచి 4 లక్షలు పలుకుతున్నాయి. రెండో క్వాలిటీ దూడలు రూ.50వేల నుంచి రూ.లక్ష వరకు రేటుకు అమ్ముడవుతున్నాయి. ఈ దూడలు ఇంట్లో ఇంటే ఆరోగ్యంతో పాటు అదృష్టం వరిస్తుందనే మాట వినిపిస్తోంది. వీటిని కొనేందుకు వందలాదిమంది నిత్యం పశువుల సంతలు, రైతుల వద్దకు తిరుగుతున్నారు. సాధారణంగా ఇళ్లలో పెంపుడు జంతువులైన కుక్కలు, పిల్లుల జాబితాలో ఇప్పుడు పొట్టిదూడలు సైతం చేరిపోయాయి. వీటికి పేరు పెట్టి ఆ పేరుతో పిలిస్తే వెంటనే వచ్చేస్తాయి. 15 సెం.మీ నుంచి 50 సెం.మీ మాత్రమే ఎత్తు కలిగిన ఈ దూడలు ముద్దులొలుకుతుంటాయి. పొట్టి ఆవులు 85 సెం.మీ నుంచి 110 సెం.మీ ఎత్తు పెరుగుతాయి. పలమనేరు ప్రాంతంలో కొందరు రైతులు వీటిని ఫామ్స్‌లో మేపి పొట్టి జాతిని ఉత్పత్తి చేయిస్తూ వాటిని రూ.లక్షలకు విక్రయిస్తున్నారు. సోషల్ మీడియాలోనూ పొట్టి రకం దూడల వ్యాపారం ఊపందుకోవడం విశేషం. ఇందుకే అంత డిమాండ్ పుంగనూరు పశువులు ఆకర్షణీయంగా ఉంటాయి. ఇంటి యజమానులపై విశ్వాసం ప్రదర్శిస్తాయి. æ పొట్టి దూడలు ఇంట్లో తిరుగుతుంటే చాలా మంచిదని జనం నమ్ముతారు. పొట్టి ఆవులు ఇచ్చే పాలలో రోగనిరోధకశక్తి అధికంగా ఉంటుంది. ఈ పాలను సేవిస్తే అనారోగ్యం దరిచేరదని విశ్వాసం.తక్కువ మేత.. అధిక పాల దిగుబడిపలమనేరు సమీపంలోని క్యాటిల్‌ఫామ్ వద్ద 1953లో సంకర జాతి ఆవుల ఉత్పత్తి, పరిశోధన కేంద్రం ప్రారంభమైంది. ఇది 1995 నుంచి పుంగనూరు పొట్టి రకం పశువుల ఉత్పత్తి కేంద్రంగా మారింది. మేలైన పుంగనూరు ఎద్దుల వీర్యాన్ని పుంగనూరు రకం పొట్టి ఆవులను పెంచుతున్న రైతులకు అందిస్తోంది. వీటిని మరింత ఉత్పత్తి చేసేందుకు ఆర్కేవీవై కృషి చేస్తోంది. ప్రస్తుతం దేశంలో ఇలాంటి పశువులు 700 దాకా ఉండగా, ఇందులో 277 వరకు పలమనేరులోని పశు పరిశోధన కేంద్రంలోనే ఉన్నాయి. ఈ పశువులు తక్కువ మేతతో ఎక్కువ వెన్నశాతం కలిగిన పాల దిగుబడినిస్తాయి. వీటి మూత్రంలో సైతం ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్నాయి.రైతులకు అందిస్తున్నాం పలమనేరు పరిశోధన కేంద్రంతోపాటు ఏపీ ఎల్డీఏ ద్వారా కూడా ఈ జాతి వీర్యాన్ని రైతులు పొందవచ్చు. ఆవు ఎదకొచ్చిన తర్వాత స్థానిక వెటర్నరీ వైద్యుడి పర్యవేక్షణలో సెమన్ అందిస్తున్నాం. పుంగనూరు పొట్టిజాతిని అభివృద్ధికి కృషి చేస్తున్నాం. ఈ వీర్యం అవసరమైన రైతులు క్యాటిల్‌ఫామ్‌లో కూడా తీసుకోవచ్చు. –వేణు, శాస్త్రవేత్త, ఎస్వీ వెటర్నరీ వర్సిటీ, తిరుపతి మూడేళ్లుగా పెంచుతున్నా మూడేళ్లుగా పుంగనూరు రకం పొట్టి దూడలు పెంచుతున్నా. దేశవాళీ రకం పుంగనూరు ఆవుల ద్వారా దూడలను ఉత్పత్తి చేయిస్తున్నాం. ఈ ప్రాంతంలో చాలామంది పొట్టి దూడలు పెంచుతున్నారు. వీటికి భారీ డిమాండ్ ఉంది. ఆసక్తి ఉంటే రైతులకు ఇది ఎంతో లాభదాయకం. – మణి, రైతు, మారేడుపల్లె, గంగవరం మండలం -
తాటి.. ఆదాయంలో మేటి
గ్రామీణ భారతంలో తాటిచెట్టుది ప్రత్యేక స్థానం. పేదవాడి కల్పవృక్షంగా పిలిచే తాటిచెట్టులో ఉపయోగపడని భాగమే ఉండదు. మనదేశంలో తీరప్రాంత రాష్ట్రాల్లో తాటిచెట్లు అత్యధికంగా కనిపిస్తుంటాయి. తమిళనాడులో తాటిచెట్లు అధిక సంఖ్యలో ఉండగా తరువాతి స్థానం ఆంధ్రప్రదేశ్‌దే. తాటిచెట్టు (Palm Tree) ప్రయోజనాలను గుర్తించిన మన పూర్వికులు దాన్ని ఇంటికి పెద్దకొడుకుగా భావించేవారు. పొలం గట్టున పది తాటిచెట్లుంటే ప్రశాంతంగా జీవించొచ్చు అనుకునేవారు. ప్రస్తుతం మైదాన ప్రాంతాల్లో వీటిపై ఆసక్తి కొంత తగ్గినప్పటికీ ఏజెన్సీ ప్రాంతాల్లో విరివిగా కనిపించే తాటిచెట్ల నుంచి గిరిజనులకు ఆదాయ మార్గాలను చూపించాలనే లక్ష్యంతో ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రి కల్చర్ రీసెర్చ్ (న్యూఢిల్లీ) ద్వారా అఖిల భారత వన్య పంట పథకంలో భాగంగా పరిశోధనలు చేపట్టారు. ఇందులో భాగంగా చేపట్టిన తొలిదశ పరిశోధనలు ఫలించాయి. భారతదేశంలో (India) 2010 సంవత్సరంలో తాటి చెట్లపై పరిశోధనకు రెండు చోట్ల అనుమతులు ఇచ్చారు. ఒకటి అల్లూరి జిల్లా పందిరిమామిడిలోని డాక్టర్ వైఎస్సార్ హార్టికల్చర్ రీసెర్చ్ సెంటర్, రెండోది తమిళనాడులోని కిలికులం. ఈ రెండు చోట్ల తాటిపై పరిశోధనలు ప్రారంభించారు. తక్కువ సమయంలో కాపునకు వచ్చే రకాలను అభివృద్ధి చేసేందుకు అనేక చోట్ల నుంచి మేలైన తాటి విత్తనాలను సేకరించి అభివృద్ధి పరిచారు. తాటి ఉప ఉత్పత్తులపైనా పరిశోధనలు జరిగాయి. ఇందులో భాగంగా తాటి తేగలతో ఉప ఉత్పత్తులు తయారుచేయడంపై జరిపిన పరిశోధనలు పూర్తయ్యాయి. రెండో దశలో యంత్రాలను ఉపయోగించి వాణిజ్యపరంగా ఉప ఉత్పత్తులు తయారు చేయడంపై పరిశోధనలు ప్రారంభించారు. రెండేళ్ల కిందట తెలంగాణలోని నల్గొండ జిల్లా మల్లేపల్లి, బిహార్‌లోని సబుర్లో ఈ పరిశోధనలు ప్రారంభమయ్యాయి. – రంపచోడవరం(అల్లూరి జిల్లా) లండన్‌కు తేగల పిండి చింతూరు కేంద్రంగా పనిచేస్తున్న ఆశ స్వచ్ఛంద సంస్థ పందిరిమామిడి (Pandiri Mamidi) హెచ్ఆర్ఎస్ హెడ్.. డాక్టర్ పి.సి. వెంగయ్య సహకారంతో 2019–20 సంవత్సరంలో మూడు టన్నుల తేగల పిండిని లండన్‌కు పంపించింది. తరువాత కోవిడ్ కారణంగా ఈ రవాణాకు బ్రేక్ పడింది. తిరిగి మారోమారు లండన్‌కు తేగల పిండిని పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.రెండో దశ వాణిజ్య ప్రయోజనాల కోసం ఇప్పటి వరకు తాటి ఉప ఆహారోత్పత్తులపై పరిశోధనలు జరిగాయి. రెండో దశలో వాణిజ్యపరంగా ప్రయోజనం చేకూర్చేందుకు పరిశోధనలు ప్రారంభమయ్యాయి. తాటి తేగల కోత నుంచి పిండి, రవ్వ తయారీ వంటివాటిని భారీ ఎత్తున యంత్రాలతో చేపట్టడంపై పరిశోధనలు సాగుతున్నాయి. ఆంద్రప్రదేశ్‌లో 3 కోట్ల వరకు తాటి చెట్లు ఉన్నాయి. వీటిలో ఒక్క శాతం ఉపయోగించుకున్నా కోట్ల రూపాయల ఆదాయం పొందవచ్చు. పందిరిమామిడి పరిశోధన స్థానంలో 272 రకాల తాటి చెట్లను అభివృద్ధి చేశాం. – డాక్టర్ పి.సి. వెంగయ్య, అధిపతి, డాక్టర్ వైఎస్సార్ హార్టికల్చర్ రీసెర్చ్ స్టేషన్, పందిరిమామిడి తేగలతో 12 రకాల ఆహార పదార్థాలు అల్లూరి జిల్లా పందిరి మామిడి పరిశోధన స్థానంలో తాటి తేగలతో పిండి, నూక(రవ్వ) తయారు చేసి, మైదా స్థానంలో వీటిని వినియోగించి పోషక విలువలతో కూడిన ఆహారపదార్థాలు తయారు చేశారు. వీటితో కేకులు, బిస్కెట్లు, జంతికలు, బ్రెడ్, నూడుల్స్, రవ్వలడ్డు, పిజ్జా బేస్ తదితర పదార్థాలు తయారు చేస్తున్నారు. తాటి పండు టెంకలు నాటిన 135 రోజుల తరువాత తాటి తేగలు కోతకు వస్తాయి. తేగలు 30 నుంచి 55 సెంటీమీటర్ల పొడువు, 70 గ్రాముల వరకు బరువు ఉంటాయి. తాటి తేగలు ముక్కులు శుభ్రం చేసి కడిగి ఒక ట్రేలో అరబెట్టాలి. వీటిని నాలుగు గంటల పాటు డ్రయ్యర్లో ఉంచాలి. తేగల పిండి తయారుచేయడానికి ఎండిన తేగలను మెత్తగా రుబ్బి జల్లెడ పట్టాలి. తరువాత పిండిని నానబెట్టి చేదు రుచి పోగొట్టేందుకు డిస్టల్డ్ వాటర్‌తో విశ్లేషణ చేయాలి. ఈ తేగల పిండిలో ప్రొటీన్ 3.40 శాతం, ఫైబర్ 8.80 శాతం, కాపర్ 0.05 శాతం, జింక్ 0.41 శాతం, ఐరన్ 2.40 శాతం, మెగ్నీషియమ్ 0.05 శాతం ఉంటాయి. బేకరీ ఉత్పత్తుల తయారీలో మైదాకు బదులు తేగల పిండి(ఫ్లోర్) వినియోగించవచ్చు. దీని ద్వారా అధిక పోషక విలువలతో కూడిన ఆహారాన్ని పొందవచ్చు. పందిరిమామిడి పరిశోధన స్థానంలో తేగల పిండితో బిస్కెట్లు, నూడిల్స్, నూకతో కేక్‌లు తయారు చేశారు. మార్కెట్లో కేజీ తేగల రవ్వ ధర రూ. 170 వరకు ఉంది. పది తాటి చెట్ల ద్వారా ఏడాదిలో రూ. 35 వేల వరకు ఆదాయాన్ని పొందవచ్చు. -
గ్లోబల్ వార్మింగ్‌కు చెక్
సీతంపేట: విద్యార్థ్ధుల్లో నైపుణ్యాలను గుర్తించి ప్రోత్సహిస్తే అద్భుతాలు ఆవిష్కరిస్తారని మరొక సారి రుజువైంది. విశాఖలోని డాక్టర్ లంకపల్లి బుల్లయ్య కళాశాల లైఫ్ సైన్స్ విద్యార్ధుల పరిశోధనకు అంతర్జాతీయ గుర్తింపు లభించింది. డిగ్రీ స్థాయిలోనే అంతర్జాతీయ ప్రతిభ చాటారు బుల్లయ్య కళాశాల విద్యార్ధులు. ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్న గ్లోబల్‌వార్మింగ్‌కు విద్యార్ధులు తమ పరిశోధన ద్వారా చక్కటి పరిష్కారం చూపారు.వాతావరణం వేడెక్కడానికి కారణం అవుతున్న కార్చన్ డయాక్సైడ్ శాతాన్ని వాతావరణంలో తగ్గించేలా తమ పరిశోధనతో పరిష్కారం చూపారు. కళాశాలలో బీఎస్సీ లైఫ్ సైన్స్ ఆఖరి సంవత్సరం చదువుతున్న విద్యార్ధులు హర్షిత, తేజాంబిక్, కార్తికేయ, అశ్విని తమ పరిశోధనల్లో విజయం సాధించారు. విశాఖ సముద్ర తీరంలో సముద్రపు గడ్డి పచ్చిక భూములను పునరుద్ధించే ‘బ్లూ కార్బన్ ఎకో సిస్టం పయనీరింగ్’అను అంశంపై పరిశోధన చేసారు. స్టూడెంట్ సొసైటీ ఫర్ క్లైమేట్ ఛేంజ్ అవేర్నెస్ ( ఎస్‌ఎస్‌సీసీఏ) , సీడ్స్ ఆఫ్ పీస్ ( యూఎస్ఏ) సంస్థలు సంయుక్తంగా దేశవ్యాప్తంగా నిర్వహించిన పోటీలో 33 టీమ్‌లు పాల్గొనగా, బుల్లయ్య కళాశాల విద్యార్థ్ధులు చేసిన పరిశోధనలకు క్లైమేట్ ట్యాంక్ యాక్సిలరేటర్ పోటీలో ప్రథమ స్థానంలో నిలిచి వెయ్యి డాలర్లు బహుమతిగా గెలుపొందారు. ప్రాజెక్టు తదుపరి అధ్యయనాల కోసం విద్యార్థులను 2025 ఫిభ్రవరిలో10 రోజుల ఫెలోషిప్ ప్రోగ్రామ్‌కు యూఎస్ఏ వెళ్లనున్నారు. పరిశోధన ఎలా సాగిందంటే.. హైదరాబాదుకు చెందిన ఎన్జీవో సంస్థ ఎస్‌ఎస్‌సీసీఏ, నూయార్క్ కు చెందిన సీడ్స్ పీస్ ఆర్గనైజేషన్ సంయుక్తంగా ఎన్విరాన్మెంట్కు సంబంధించి ఆరు ఆంశాలపై పరిశోధనలకు విద్యార్థ్ధులకు అవకాశం కల్పించారు. బుల్లయ్య విద్యార్ధులు గ్లోబల్‌వార్మింగ్ తగ్గించడానికి క్లైమేట్‌కి సంబంధించిన టాపిక్ ఎంపిక చేసుకున్నారు. ఈ విధంగా దేశంలో వివిధ కళాశాలల నుంచి 33 టీమ్స్ ఈ పోటీలో పాల్గొన్నాయి. ఈపోటీలో బుల్లయ్య కళాశాల నుంచి 3 టీమ్స్ పాల్గొనగా, ఒక టీమ్‌లో డిగ్రీ (బయోటెక్నాలజి) ఫైనలియర్ చదువుతున్న నలుగురు విద్యార్ధులు , వారికి గైడెన్స్గా ఇద్దరు అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ఉన్నారు. మొదటి అంచెలో ఎంపిక చేసుకున్న టాపిక్‌పై పరిశోధన ఎలా చేలాయన్న విషయంపై ఓరియెంటేషన్ జరిగింది. రెండవ ఫేజ్‌లో ఎంపిక చేసిన టాపిక్‌పై డిస్క్రిప్టివ్ ఐడియాను సిద్ధం చేసారు. పరిశోధన నిమిత్తం సీడ్స్ సంస్థ 200 డాలర్లు అందజేసింది. మొదటి రెండు ఫేజ్‌లు పూర్తి అయిన తర్వాత పరిశోధనకు వాస్తవ రూపం కల్పించారు. తాము ఎంపిక చేసుకున్న గ్లోబల్‌వార్మింగ్ తగ్గించడానికి విద్యార్ధులు ఎన్నో పరిశోధన పత్రాలు చదవి ఒక ఐడియాకు వచ్చారు. విశాఖ సముద్రతీరంలో అంతరించిపోయిన 2 గడ్డి జాతిమొక్కలను మరల ఇక్కడ పునరుద్ధించి తద్వారా కార్బన్ డయాక్సైడ్ శాతాన్ని తగ్గించేలా నమూనాలు తయారు చేసారు. ఒరిస్సాలోని చిలికా సరస్సు నుంచి ‘హలోఫిలా ఓవాలిస్, హలోడ్యూల్ ఫీనిఫోలియా’అను రెండు గడ్డి జాతి మొక్కలను తెచ్చారు. సాధారణ మొక్కల కంటే 33 శాతం అధికంగా వాతావరణంలోని కార్బన్ డయాక్సైడ్ పీల్చుకోవడం వీటి ప్రత్యేకత. తెచి్చన గడ్డి మొక్కలను కళాశాల ల్యాబ్‌లలో అవి పెరిగేలా సముద్ర వాతావరణం కల్పించారు. దీని కోసం చెక్కతో తయారు చేసిన ట్రేలలో కొబ్బరిపీచు, సముద్రపు నీరు,ఇసుక, గడ్డి ఏర్పాటు చేసి మొక్కలను పెంచారు. స్కూబా డ్రైవర్స్ సాయంతో తీరంలో మంగమారిపేట బీచ్‌లో 8 మీటర్ల లోతులో నాటారు. వెయ్యి డాలర్లు బహుమతి డిసెంబరు 12న హైదరాదులో జరిగిన సమావేశంలో విద్యార్ధులు రూపొందించిన వర్కింగ్ మోడల్‌ను యూఎస్ కాన్సులేట్ నుంచి వచి్చన జడ్జిలు పరిశీలించారు.ప్రాజెక్టు పని చేసే తీరును విద్యార్ధులు వారికి ప్రెజెంట్ చేసారు. ఈపోటీలో పాల్గొన్న 33 టీమ్‌లలో తుది దశకు 8 టీమ్‌లు చేరుకోగా అందులో బుల్లయ్య కళాశాల టీమ్ మొదటి స్థానంలో నిలిచి వెయ్యి డాలర్లు బహుమతి గెలుచుకున్నారు. -
ఎక్కడున్నా మొక్కపై నిఘా!
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: వ్యవసాయ శాస్త్రవేత్తలు తమ పరిశోధనల కోసం పంట పొలాల్లో తిరగాల్సి ఉంటుంది. ప్రత్యక్షంగా వెళ్లి మొక్కల తీరును పరిశీలించి డేటాను సేకరించాలి. కానీ, పంటలను ప్రపంచంలో ఎక్కడి నుంచైనా అధ్యయనం చేయ గల ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఇక్రిశాట్లో ఉన్న ప్రత్యేక పరిశోధన క్షేత్రంలో వినియోగిస్తున్నా రు. పంటల వద్దకు వెళ్లకుండానే తామున్న చోట నుంచే పంటల తీరును పరిశీలించేందుకు వీలుండే ఆధునిక సాంకేతికతను వినియోగిస్తున్నారు. ‘హై థ్రోపుట్ ఫినోటైపింగ్ ఫెసిలిటీ’అనే అధునాతన ల్యా బ్ ద్వారా ఇతర దేశాల్లో ఉన్న సైంటిస్టులు కూడా ఇక్కడి పంటల తీరును ఎప్పటికప్పుడు తెలుసుకునే వీలు కలుగుతోంది. ప్రస్తుతానికి ఈ ఆధునిక ప్రయోగశాలలో జొన్న పంటపై పరిశోధన జరుగుతోంది. అంతర్జాతీయ పంటల పరిశోధన సంస్థ.. ఇక్రిశాట్ ప్రధాన కార్యాలయం హైదరాబాద్‌లోని రామచంద్రాపురంలో ఉన్నప్పటికీ.. దీని ప్రాంతీయ కార్యాలయాలు కెన్యా, మాలి, నైజీరియా, మలావీ, ఇథియోఫియా, జింబాబ్వే తదితర ఆఫ్రికా దేశాల్లో ఉన్నాయి. ఆయా దేశాల్లో ఉన్న శాస్త్రవేత్తలు సైతం ఇక్కడి పరిశోధన క్షేత్రంలో పెరుగుతున్న మొక్కలను వీక్షించేందుకు, పరిశీలించేందుకు ఈ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుతున్నారు. మొక్క ప్రతిస్పందనపై క్షణక్షణం నిఘా హైథ్రోపుట్ ఫినోటైపింగ్ ఫెసిలిటీ కేంద్రంలో ప్రస్తుతం జొన్న పంటకు సంబంధించి ఐదు వేల మొక్కలను పెంచుతున్నారు. ఈ సెంటర్ మొక్క ప్రతి స్పందనను క్షణక్షణం రికార్డు చేస్తుంది. ఈ డేటాను ఆన్లైన్లో నిక్షిప్తం చేస్తుంది. మొక్క పత్రహరితానికి సంబంధించిన ఫ్లోరోసెన్స్, మొక్క 3డీ మాడలింగ్, ఆర్జీబీ ఇమేజింగ్, హైపర్ స్పెక్ట్రల్ ఇమేజింగ్, థర్మల్ ఇమేజింగ్.. ఇలా మొక్కను పూర్తిస్థాయిలో స్కాన్ చేయగల ఆధునిక సాంకేతికతను వినియోగిస్తున్నారు. నీటి వాడకానికీ లెక్క ఉంటుంది.. మొక్క ఎప్పడు ఎంత నీటిని వాడుకుంటుందనే వివరాలు కూడా ఈ ల్యాబ్‌లో రికార్డు అవుతాయి. మొక్క ట్రే కింద ప్రత్యేకంగా లోడ్ సెన్సార్ ఉంటుంది. మొక్కకు పట్టిన నీళ్లు ఎన్ని ఆవిరయ్యాయి? ఎంత వినియోగమైంది? అనే వివరాలను సేకరిస్తుంది. వాతావరణంలో వచ్చిన మార్పుల కారణంగా మొక్క ఎంత ఒత్తిడికి గురవుతుంది? మొక్కల ఎదుగుదల ఎలా ఉంటుంది? అనే అంశాలను ఇమేజ్, వీడియో రూపంలో కూడా రికార్డు చేస్తుంది.మొక్కలు ఎంత నీళ్లు ఇస్తే తట్టుకోగలవు. నీళ్లు లేకపోతే ఎంత మేరకు అనుగడ సాధించగలవు? అనే అంశాలను పరిశీలించేందుకు వీలుంటుంది. తద్వారా నీటి కొరతను తట్టుకునే వెరైటీలు, అధిక వర్షాలకు తట్టుకునే వెరైటీలను కనుగొనే అవకాశం ఉంటుందని ఇక్రిశాట్ రిసెర్చ్ స్కాలర్ కల్పన తెలిపారు. -
హైదరాబాద్‌లో ఐసీఏఐ రిసర్చ్ హబ్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ) హైదరాబాద్‌లోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో రిసర్చ్ హబ్‌ను ఏర్పాటు చేసింది. కేంద్ర, రాష్ట్ర బడ్జెట్లు, ఆర్థిక అక్షరాస్యత, విధాన రూపకల్పనలో చార్టర్డ్ అకౌంటెంట్ల పాత్ర, సులభతర వ్యాపారంతో కూడిన సుపరిపాలన తదితర అంశాలపై ఈ కేంద్రం లోతైన అధ్యయనాలను నిర్వహిస్తుందని ఐసీఏఐ ఒక ప్రకటనలో తెలిపింది.ఈ పరిశోధన కార్యక్రమాల ద్వారా వెల్లడైన అంశాలను ప్రభుత్వంతో పంచుకుంటామని వివరించింది. కాగా, సెంటర్ డైరెక్టర్, డీన్‌గా నుపుర్ పవన్ బంగ్ను ఐసీఏఐ నియమించింది. జైపూర్‌లోనూ ఐసీఏఐకి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఉంది. కోల్‌కతలో ఇటువంటి కేంద్రాన్ని 2025 జనవరిలో ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. పరిశోధన, ఆవిష్కరణలు, నైపుణ్యాభివృద్ధిని ప్రోత్సహించడానికి వచ్చే మూడేళ్లలో దేశవ్యాప్తంగా మరో ఎనిమిది సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లను నెలకొల్పాలని ఐసీఏఐ యోచిస్తోంది. దాదాపు 9.85 లక్షల మంది విద్యార్థులు, 4 లక్షల మంది సభ్యులతో ఐసీఏఐ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రొఫెషనల్ అకౌంటెన్సీ సంస్థ కావడం విశేషం. -
మొక్కా.. మొక్కా..నీ పేరేంటి..
పీజీ చేసినా పెరటి మొక్క పేరు తెలియని విద్యార్థులు శాస్త్రీయ నామాలకే నేటి తరం పరిమితం..ఫార్మా పరిశ్రమలకు తగ్గుతున్న పరిశోధనలు బొటానికల్ ఇండియా సర్వేలో తేలిన వాస్తవాలుసాక్షి, హైదరాబాద్: పెరట్లో మొక్కలు.. వాటి పేర్లు, ఉపయోగాల గురించి చిన్నప్పుడు నాయనమ్మో.. అమ్మమ్మో చెబితే నేర్చుకునేవాళ్లు. బడికి వెళ్లాక టీచర్ మొక్కల శాస్త్రీయ నామాలు చెబుతుంటే.. ‘ఓ అదా.. మా పెరట్లోని జిల్లేడు చెట్టు.. పొలం మధ్యలో వావిలాల చెట్టు’ అని తేలికగా గుర్తుపట్టేవాళ్లు. ఇప్పుడు కాలం మారింది. వృక్ష శాస్త్రంలో పీజీ చేసిన విద్యారి్థకి కూడా ఇంట్లోని మందార చెట్టు పేరు తెలియడం లేదు. బొటానికల్ ఇండియా ఇటీవల చేసిన సర్వేలో అనేక ఆశ్చర్యకరమైన విషయాలు బయటపడ్డాయి. విద్యార్థుల వైఖరి ఇలాగే కొనసాగితే వారిలో శాస్త్రీయ కోణమే లోపిస్తుందని బొటానికల్ ఇండియా శాస్త్రవేత్తలు కేంద్ర ప్రభుత్వం దృష్టికి తెచ్చారు. పాఠశాల స్థాయి నుంచే మొక్కలపై అవగాహన పెంచాలని సూచించారు. సర్వేలోని కీలక విషయాలు ⇒ సర్వేలో భాగంగా పీజీ పూర్తిచేసిన 867 మందిని పెరటి మొక్కలపై ప్రశ్నలు అడిగితే.. సొంత ఊరిలో కనిపించే ఔషధ మొక్కల గురించి కూడా కనీస సమాచారం ఇవ్వలేకపోయారు. జిల్లేడు, తిప్పతీగ, బంతి మొక్కలను చూపిస్తే వంద మందిలో 28 మంది మాత్రమే తెలుగు పేర్లు చెప్పారు. మిగతా వాళ్లతా శాస్త్రీయ నామాలే చెప్పారు. కుండీల్లో పెరిగే మొక్కల గురించి ప్రశ్నలు వేసినప్పుడు వందకు 20 శాతం మంది వాటి ఉపయోగాలను వెల్లడించలేకపోయారు. ⇒ నాగజెముడును అనేక ఔషధాల్లో వినియోగిస్తున్నాయి. పల్లె వాకిట్లో తేలికగా దొరికే ఈ మొక్క గురించి వృక్షశాస్త్రంలో డిగ్రీ చేసిన 428 మందిని ప్రశి్నస్తే, 48 శాతం దీని ఆనవాలు తెలియదన్నారు. 26 శాతం ఇదో ఔషధ మొక్క... విదేశాల్లో పండిస్తారని చెప్పారు. 18 శాతం మంది మాత్రమే భారతీయ పల్లె పెరిగే మొక్కగా గుర్తించారు. ⇒ పదేళ్ల క్రితం వరకూ పల్లెల్లో విరివిగా కనిపించిన మంగళగిరి కంచె గురించి 60 శాతం బోటనీ విద్యార్థులకు అవగాహనే లేదు. కార్బన్–డై–ఆక్సైడ్‌ను నియంత్రించడంలో దీని పాత్ర గురించి అసలే చెప్పలేకపోయారు. ⇒ వైద్య రంగంలో ఉన్నవారికి కూడా ఉమ్మెత్త మొక్క గొప్పతనం తెలియడం లేదు. ఇంటర్లో బైపీసీ చదివిన 250 మందిని ఈ మొక్క గురించి ప్రశి్నస్తే.. 186 మంది అదేం మొక్క? అని ఎదురు ప్రశ్నించారు. ఫొటో చూశాక శాస్త్రీయ నామం చెప్పగలిగారు. ⇒ బతకమ్మ సందడి వల్ల తెలుగు విద్యార్థులు తంగేడు చెట్టును గుర్తుపడుతున్నారు. నూటికి 80 శాతం మంది ఇది తంగేడు పూల మొక్క అని చూడగానే చెప్పారు. ⇒ రకరకాల షాంపూల గురించి «గుక్క తిప్పుకోకుండా చెప్పగలిగే ప్రస్తుత యువతరంలో 78 శాతం మందికి కుంకుడు చెట్టు గురించి ఇసుమంతైనా తెలియటంలేదు. ఈ చెట్టు ఆకులు ఎలా ఉంటాయో సర్వేలో పాల్గొన్న 92 శాతం మందికి తెలియలేదు. కాల గర్భంలో ఎన్నో మొక్కలు (బాక్స్) విరిగిన ఎముకలు కట్టుకోవడానికి వాడే నల్లేరు.. కఫంతో ఊపిరి ఆగిపోయే పరిస్థితి నుంచి కాపాడే కరక్కాయ.. ప్రాణం పోయేలా అనిపించే తలనొప్పిని సైతం తగ్గించే శొంఠి.. కురుపు ఏదైనా ఆకుతోనే నయం చేసే జిల్లేడు.. చర్మవ్యాధుల పనిపట్టే మారేడు.. సర్వ రోగ నివారణి తులసి వంటి ఎన్నో అద్భుత ఔషధ మొక్కలు మన పెరటి వైద్యం నుంచి కని్పంచకుండా పోతున్నాయి. ఇలా అయితే కష్టం మొక్కలు, వాటి ప్రయోజనాలు తెలుసుకునే ఆసక్తి విద్యార్థి దశ నుంచే ఏర్పడాలి. లేకపోతే ఔషధ రంగం ఇతర దేశాల చేతుల్లోకి వెళ్తుంది. ఇప్పటివరకు 3.5 లక్షల మొక్క జాతులను వృక్ష శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇందులో 2.78 లక్షల మొక్కలపై ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు జరిగాయి. వీటిల్లో చాలా వరకు మన పల్లెల్లో ఒకప్పుడు కని్పంచినవే. –నవీన్ చావ్లా (ఫార్మా రంగ నిపుణుడు) విద్యలో మార్పు తేవాలి నేడు అందరూ కంప్యూటర్ సైన్స్ వైపు వెళ్తున్నారు. వృక్షశాస్త్ర ప్రాధాన్యత తగ్గుతోంది. మొక్కల ప్రాధాన్యతను భావి తరాలకు చెప్పే బయో డైవర్సిటీ బోర్డులకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలి. అప్పుడే ఈ పరిస్థితిలో మార్పు వస్తుంది. – డాక్టర్ కె తులసీరావు, డైరెక్టర్, గ్లోబల్ బయోడైవర్సిటీ. -
2030 నాటికి సేవల ఎగుమతులదే పైచేయి
న్యూఢిల్లీ: దేశ ఎగుమతుల్లో వస్తువులను సేవలు అధిగమించనున్నాయి. 2030 మార్చి నాటికి 618.21 బిలియన్ డాలర్లకు (51.92లక్షల కోట్లు) చేరుకుంటాయని స్వతంత్ర పరిశోధనా సంస్థ ‘గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనీషియేటివ్’ (జీటీఆర్ఐ) అంచనా వేసింది. అదే కాలంలో వస్తు ఎగుమతుల విలువ 613 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని తెలిపింది. 2018–19 నుంచి 2023–24 వరకు దేశ వస్తు ఎగుమతులు ఏటా 5.8 శాతం చొప్పున కాంపౌండెడ్ వృద్ధి చెందాయని, ఇదే కాలంలో సేవల ఎగుమతులు 10.5 శాతం చొప్పున పెరుగుతూ వచ్చాయని జీటీఆర్ఐ నివేదిక తెలిపింది. ఇదే స్థాయిలో వృద్ధి కొనసాగితే 2030 మార్చి నాటికి సేవల ఎగుమతులు 618.21 బిలియన్ డాలర్లకు, వస్తు ఎగుమతులు 613 బిలియన్ డాలర్లకు చేరుకోవచ్చని అంచనా కట్టింది. ఐటీ, సాఫ్ట్వేర్, ఓబీఎస్ హవా.. భారత సేవల రంగం వృద్ధిలో అధిక భాగం సాఫ్ట్వేర్, ఐటీ సేవలు, ఇతర వ్యాపార సేవల (ఓబీఎస్) నుంచే ఉంటోందని.. 2023–24 ఎగుమతుల్లో వీటి వాటా 86.4 శాతంగా ఉన్నట్టు జీటీఆర్ఐ తెలిపింది. ఓబీఎస్ పరిధిలోని న్యాయ సేవలు, అకౌంటింగ్, పన్ను సంబంధిత సేవలు, మేనేజ్మెంట్ కన్సలి్టంగ్, మార్కెట్ పరిశోధన కలిపి 2023–24లో 10.28 బిలియన్ డాలర్ల ఎగుమతులు నమోదైనట్టు జీటీఆర్ఐ వ్యవస్థాపకుడు అజయ్ శ్రీవాస్తవ తెలిపారు. మొత్తం సేవలు ఎగుమతుల్లో ఓబీఎస్ వాటా 33.2 శాతంగా ఉన్నట్టు చెప్పారు. దేశంలో అత్యంత నైపుణ్య మానన వనరులు, అభివృద్ధి చెందుతున్న ఐటీ సదుపాయాలు అంతర్జాతీయ సేవల కేంద్రంగా భారత్ ప్రతిష్టను పెంచుతున్నట్టు జీటీఆర్ఐ తెలిపింది. జెనరేటివ్ ఏఐ, మెషిన్ లెరి్నంగ్(ఎంఎల్), ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐవోటీ) భారత కంపెనీల అవకాశాలను అధికం చేస్తున్నట్టు పేర్కొంది. ‘‘సాఫ్ట్వేర్, ఐటీ సేవలు అతిపెద్ద విభాగంగా ఉండగా, వృద్ధిలో ఈ విభాగాన్ని ఓబీఎస్ దాటిపోనుంది. ప్రత్యేకమైన సేవలకు అంతర్జాతీయంగా డిమాండ్ పెరుగుతోంది’’అని శ్రీవాస్తవ తెలిపారు. యూఎస్ వెలుపల ఐటీ సేవల విస్తరణ.. యూఎస్‌కు బయట ఐటీ ఎగుమతులను వైవిధ్యం చేసుకోవడం మొదట చేయాల్సిన పనిగా జీటీఆర్ఐ పేర్కొంది. దేశ ఐటీ ఎగుమతుల్లో 70 శాతం యూఎస్‌కే వెళుతున్న నేపథ్యంలో, అక్కడి విధానాల్లో మార్పుల రిస్క్ ఎక్కువగా ఉంటుందని అభిప్రాయపడింది. ‘‘ప్రెసిడెంట్‌గా ఎన్నికైన డోనాల్డ్ ట్రంప్ ఔట్సోర్స్ను విమర్శించడం, హెచ్–1బి వీసా పాలసీల కట్టడి తదితర విధానాలు ఈ రిస్‌్కలను గుర్తు చేస్తున్నాయి. ఆటోమేషన్, కృత్రిమ మేథ (ఏఐ) 40 శాతం మేర ఐటీ ఉద్యోగులకు ముప్పుగా మారే ప్రమాదం కూడా ఉంది’’అని శ్రీవాస్తవ తెలిపారు. ఇతర మార్కెట్లకు విస్తరించడం, డిజిటల్ పరివర్తిన, ఏఐ ఇంటెగ్రేషన్ యూఎస్‌పై ఎక్కువగా ఆధారపడడాన్ని తగ్గిస్తాయని పేర్కొన్నారు. ఓబీఎస్ ఎగుమతులను ప్రోత్సహించాలని జీటీఆర్ఐ నివేదిక సూచించింది. ఈ విభాగంలో ఎగుమతులకు గణనీయమైన అవకాశాలున్నప్పటికీ, భారత సంస్థలు పూర్తి స్థాయిలో వినియోగంచుకోవడం లేదని పేర్కొంది. ఇంజనీరింగ్, పరిశోధన, మేనేజ్మెంట్ నిపుణులకు అంతర్జాతీయంగా ఉన్న అవకాశాలపై అవగాహన పెరిగితే వృద్ధి అవకాశాలను మరింత ఇతోధికం చేసుకోవచ్చని తెలిపింది. -
పాతాళంలోనూ ఇస్రో పరిశోధనలు
సూళ్లూరుపేట: ఆకాశం వైపు గురిపెట్టి అంతరిక్ష ప్రయోగాలు చేయడానికే పరిమితమైన భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మరో అడుగు ముందుకేసి పాతాళంలోకి వెళ్లి పరిశోధనలు చేపట్టేందుకు సిద్ధమైంది. సముద్రయాన్ పేరిట ఈ ప్రయోగాలు చేసేందుకు సన్నద్ధమవుతోంది. గతంలో ఇలాంటి ప్రాజెక్టులు చేపట్టినా.. ఇంతటి సాంకేతికతను ఉపయోగించలేదు. 1980లోనే సముద్రాలపై అధ్యయనం చేయడానికి స్కూబా డైవింగ్ పద్ధతిలో అధ్యయనానికే పరిమితమయ్యారు.దేశం చుట్టూ 7 వేల కిలోమీటర్ల సముద్ర తీరం ఉండటంతో దీనిపై అధ్యయనం చేయాలనే ఆలోచన పురుడు పోసుకుంది. 2019 నుంచి ఈ ప్రయత్నాలు సాగిస్తున్నా.. ఇప్పటికి దీనికి ఓ రూపం వచ్చింది. ప్రస్తుతం సముద్ర గర్భంలో సుమారు 6వేల మీటర్ల లోతుకెళ్లి అధ్యయనం చేసేందుకు సముద్రయాన్ పేరుతో మత్స్య–6000 అనే సబ్మెర్సిబుల్ నౌకను పంపేందుకు ఇస్రో సిద్ధమవుతోంది.సబ్మెర్సిబుల్ వాహనంలో.. ప్రపంచంలో మానవ రహిత జలాంతర్గాములు ఉన్నాయి. భారత్ విషయానికి వస్తే మానవ సహిత జలాంతర్గామిని తయారు చేసిన చరిత్ర ఉంది. సముద్రయాన్ ప్రాజెక్ట్‌లో భాగంగా సముద్ర గర్భంలోకి వెళ్లి పరిశోధనలు చేసేందుకు వీలుగా సబ్మెర్సిబుల్ వాహనాన్ని ఎన్ఐఓటీ డిజైన్ చేసి అభివృద్ధి చేస్తోంది. ఈ వాహనానికి మత్స్య–6000 అని నామకరణం చేశారు. ఈ వాహనం 6 కిలోమీటర్ల లోతుకు వెళ్లినపుడు నీటి పీడనం 600 రెట్లు ఎక్కువగా ఉంటుందని అంచనా వేశారు.ఈ పీడనాన్ని తగ్గించేందుకు టైటానియం అలాయ్‌ను ఉపయోగించి నీటి పీడనాన్ని తట్టుకునేలా సబ్మెర్సిబుల్ వాహనాన్ని డిజైన్ చేస్తున్నారు. 2022 డిసెంబర్లో ‘సాగర్ నిధి’ నౌకను హిందూ మహాసముద్రంలోకి పంపిన విషయం తెలిసిందే. ఓషన్ మినరల్ ఎక్స్‌ప్లోరల్ పేరిట సముద్ర గర్భంలో 5,271 మీటర్ల లోతులో అన్వేషణ సాగించారు. అక్కడున్న మాంగనీస్‌పై పరిశోధించారు. ఇప్పుడు మత్స్య–6000 ప్రయోగంలో ముగ్గురు వ్యక్తులు వాహనంలో వెళ్లేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇందులో ఒకరు సబ్మెర్సిబుల్ వాహనం ఆపరేటర్ కాగా.. మిగిలిన ఇద్దరు పరిశోధకులు ఉంటారు. గంటల తరబడి సముద్రంలోనే.. ఈ వాహనం సముద్ర గర్భంలో 108 గంటలు ఉండేలా వాహనాన్ని డిజైన్ చేస్తున్నారు. సముద్ర గర్భంలోకి పోవడానికి 3 గంటలు, మళ్లీ పైకి రావడానికి 3 గంటలు సమయం తీసుకుంటుందని ఓషన్ టెక్నాలజీ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ సంస్థకు ఇస్రో కొంత సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించింది. ఇస్రో చేసిన చంద్రయాన్–3 ప్రయోగం, భవిష్యత్‌లో చేయబోతున్న గగన్‌యాన్ మిషన్ ప్రయోగ సాంకేతిక పరిజ్ఞానాన్ని కొంతమేరకు వినియోగించుకుంటున్నారు. మత్స్య–6000 జలాంతర్గామిని విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్లో తయారు చేశారు.ఈ వాహనం సంక్లిష్టమైన సమయంలో 96 గంటలు నీటిలోనే ఉండేందుకు వీలుగా 67 ఆక్సిజన్ సిలిండర్లు ఏర్పాటు చేశారు. సముద్రంలో అత్యంత లోతైన ప్రాంతంలో 108 గంటలపాటు సముద్రంలోనే ఉండేలా మత్స్య–6000 డిజైన్ చేశారు. ఈ పరిశోధనల్లో సముద్ర గర్భంలో ఉన్న మాంగనీస్ కోబాల్ట్, నికెల్ లాంటి ఖనిజాల అన్వేషణలతో పాటు సముద్ర గర్భంలో వాతావరణ పరిస్థితులు రుతుపవనాల రాకపోకలు లాంటి వాటిపై అధ్యయనం చేయడానికి ఇది దోహదపడుతుంది.ఖనిజాలు.. వాతావరణ పరిస్థితులపై అధ్యయనానికి.. భారత ప్రభుత్వం మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్స్ ఆధ్వర్యంలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓçషన్ టెక్నాలజీ (ఎన్ఐఓటీ) భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) సంయుక్తంగా సముద్ర గర్భంలో ఖనిజాల అన్వేషణ, సముద్రాల నుంచి వచ్చే రుతు పవనాలు, వాతావరణ పరిస్థితులపై అధ్యయనం చేసేందుకు మత్స్య–6000 అనే పేరుతో సముద్రయాన్ ప్రయోగానికి సిద్ధం చేస్తున్నారు. సముద్రపు అడుగున ఏముందో పరిశోధనలు చేసేందుకు ఈ ప్రయోగాన్ని చేపడుతున్నారు. సుమారు రూ.4 వేల కోట్లతో 2026 నాటికి ఈ ప్రయోగాన్ని చేసేందుకు ఓషన్ టెక్నాలజీ శాస్త్రవేత్తలు, ఇస్రో శాస్త్రవేత్తలు సంయుక్తంగా కార్యాచరణ సిద్ధం చేసుకున్నారు. -
అజ్ఞాన జ్ఞానం
‘ఆదియందు అక్షరమున్నది’(జాన్ 1:1) అని బైబిల్ వాక్కు. అజ్ఞానం అనాది నుంచి ఉన్నది. సృష్టిలో అజ్ఞానానికి ముందు ఏముందో ఎవరికీ తెలీదు. అజ్ఞానం అమేయమైనది; అజ్ఞానం అప్రమేయమైనది; అజ్ఞానం అనాదినిధనమైనది; అజ్ఞానం అప్రయత్నలబ్ధమైనది; అజ్ఞానం అగాధమైనది; అజ్ఞానం అనంతమైనది; అజ్ఞానం అజరామరమైనది. విచిత్రంగా జ్ఞానాజ్ఞానాల నడుమ ఒక సారూప్యత ఉంది. ఇవి రెండూ అగోచరమైనవే! రెండింటికీ ఒక భేదం కూడా ఉంది. జ్ఞానానికి అవధులు ఉంటాయేమో గాని, అజ్ఞానానికి ఎలాంటి అవధులూ ఉండవు.అజ్ఞానం నుంచి మానవాళికి అప్రయత్నంగా దొరికే ఆస్తి– మూర్ఖత్వం. అజ్ఞానం నుంచి ఉద్భవించడం వల్ల మూర్ఖత్వమూ అనంతమైనదే! ‘అనంతమైనవి రెండే రెండు. ఒకటి: ఈ విశ్వం, రెండు: మనుషుల మూర్ఖత్వం; విశ్వం సంగతి నాకింకా పూర్తిగా తెలీదు’ అన్నాడు ప్రపంచ ప్రఖ్యాత భౌతిక శాస్త్రవేత్త, నోబెల్ గ్రహీత అల్బర్ట్ ఐన్‌స్టీన్. మానవ మూర్ఖత్వానికి గల అనంత తత్త్వం అవగతమయ్యే నాటికి పాపం ఆయన తలపండితుడైపోయాడు. అనంతమైన అజ్ఞాన సాగరాన్ని ఈదులాడి ఒడ్డున పడితే తప్ప జ్ఞానమేమిటో తెలియదు. చాలామందికి అజ్ఞానసాగరంలో ఈదులాడుతూ ఒడ్డునున్న వాళ్ల మీదకు అజ్ఞాన తరంగాలను వెదజల్లుతుంటారు. వాళ్లకదో వేడుక!అజ్ఞానానికి గల అనేక పర్యాయపదాల్లో ‘మాయ’ ఒకటి. ఎవరి అజ్ఞానం వారికి తెలీదు. ఎదుటివారి అజ్ఞానాన్ని గుర్తించడంలో మాత్రం ప్రతి ఒక్కరూ జ్ఞానులే! ప్రవచన ప్రసంగాల్లో అజ్ఞానాన్ని నేరుగా ప్రస్తావిస్తే, శ్రోతల మనోభావాలు దెబ్బతినే ప్రమాదం ఉంది. అందువల్ల ప్రవచనకర్తలు అజ్ఞానాన్ని ‘మాయ’ అని సున్నితంగా చెబుతుంటారు. ‘తస్మాదజ్ఞాన సంభూతం హృత్స్థం జ్ఞానాసినాత్మన/ ఛిత్వైనం సంశయం యోగమాతిష్ఠోత్తిష్ఠ భారత’– (4:42) అని భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునుడికి బోధించాడు. అంటే, ‘అజ్ఞానం కలిగిన బుద్ధిలో నిలకడగా ఉన్న ఆత్మ గురించిన సందేహాన్ని జ్ఞానమనే ఖడ్గంతో ఖండించి, తత్త్వజ్ఞానానికి సాధనమైన కర్మయోగాన్ని స్వీకరించు’ అని అర్థం. బుద్ధిలో అజ్ఞానం ఉన్నట్లు శ్రీకృష్ణుడు గుర్తించి చెప్పాడు. కాబట్టి ఆయన జ్ఞాని. అజ్ఞానాన్ని ఖండించడానికి జ్ఞానఖడ్గాన్ని ప్రయోగించాలని ఆయన ఉద్బోధించాడు. శ్రీకృష్ణ పరమాత్ముడి గీతబోధ విన్న అర్జునుడు మొదలుకొని ఎందరెందరో జ్ఞానఖడ్గానికి పదునుపెట్టి అజ్ఞానాన్ని ఖండిస్తూనే ఉన్నారు. ఖండఖండాల అజ్ఞానం కొన్ని మెదళ్లలోకి చేరి, అఖండంగా పెరిగిపోతుండటమే విడ్డూరం. బహుశా, ఇదే మాయ కావచ్చు!‘ఇగ్నోరెన్స్ ఈజ్ బ్లిస్’ అని ఇంగ్లిష్ నానుడి. అంటే, అజ్ఞానమే ఆనందమన్నమాట! ఈ నానుడినే కొంత విస్తరిస్తూ, ‘అజ్ఞానమే ఆనందం అంటుంటారు గాని, అజ్ఞానం మన విధికృతం’ అని చెప్పింది అమెరికన్ రచయిత్రి, పాత్రికేయురాలు గేయిల్ లైండ్స్. విధికృతమైన వాటిని ఎవరు మాత్రం తప్పించుకోగలరు? కాబట్టి అజ్ఞానాన్ని కూడా ఎవరూ తప్పించుకోలేరు. అజ్ఞానాన్ని గురించి తెలుసుకోవాలంటే, జ్ఞానులు ఎంతో ప్రయాసతో ప్రయత్నించవలసి ఉంటుంది. అజ్ఞానులకు ఆ బెడద లేదు. తమకు అప్రయత్నలబ్ధమైన అజ్ఞానానందాన్ని నిక్షేపంగా ఆస్వాదిస్తుంటారు. అజ్ఞానాన్ని గురించి అసలు ఎందుకు తెలుసుకోవాలి? అంటే, జ్ఞానాన్ని పెంచుకోవడానికి అని చెబుతారు చాలామంది. పాపం వాళ్లు చాలా అమాయకులు. అసలు సిసలు ముదురు జ్ఞానులు కొందరు ఉన్నారు. వాళ్లు అజ్ఞానాన్ని గురించి నానా రకాల అధ్యయనాల్లో మునిగి తేలుతూ ఉంటారు. జనబాహుళ్యంలో అజ్ఞాన విస్తరణకు పనికొచ్చే పద్ధతులకు రూపకల్పన చేస్తుంటారు. వాటిని జనాల మీద ప్రయోగిస్తుంటారు. ఇదొక ప్రత్యేక శాస్త్రం. ఇంగ్లిష్‌లో దీనినే ‘ఆగ్నటాలజీ’ అంటారు. అంటే, అజ్ఞానాధ్యయన శాస్త్రం అన్నమాట! మన దేశంలోని విశ్వవిద్యాలయాలు ఈ శాస్త్రం మీద ఇంకా దృష్టి సారించలేదు గాని, అభివృద్ధి చెందిన పాశ్చాత్య దేశాల్లోని పలు విశ్వవిద్యాలయాలు ఈ శాస్త్రం మీద అధ్యయనాలు కొనసాగిస్తున్నాయి. ‘ఆగ్నటాలజీ’ అనే అజ్ఞానాధ్యయన శాస్త్రానికి ఆ పేరుతో పిలవడం ఆలస్యంగా మొదలైంది గాని, అజ్ఞానానికి సంబంధి«ంచిన పరిజ్ఞానం అంతకంటే ముందు నుంచే ఆచరణలో ఉంది. స్కాటిష్ సామాజిక చరిత్రకారుడు అయాన్ బోల్ 1992లో తొలిసారిగా ‘ఆగ్నటాలజీ’ అనే మాటను ప్రయోగించాడు. అమెరికన్ సిగరెట్ తయారీ కంపెనీలు 1969లో ఉద్ధృతంగా చేసిన ప్రచారం ఆగ్నటాలజీకి ఉదాహరణగా నిలుస్తుందని శ్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ రాబర్ట్ ప్రోక్టర్ తేల్చిచెప్పాడు. కార్పొరేట్ సంస్థల నుంచి రాజకీయ పార్టీల వరకు నానా వర్గాలు ఆగ్నటాలజీ పద్ధతులను ఉపయోగించుకుంటూ, ప్రజల అజ్ఞానానికి జ్ఞాన ఖడ్గాల వల్ల ముప్పు లేకుండా కాపాడుతూ తమ ప్రయోజనాలను నెరవేర్చుకుంటున్నాయి.ఇది హైటెక్కు టమారాల యుగం. జ్ఞానం జనాలకు అందుబాటులో లేని సరుకేమీ కాదు. అందుబాటులో ఉన్నంత మాత్రాన జనాలందరూ జ్ఞానాన్ని పొందినట్లు కాదు. ఈ కృత్రిమ మేధ కాలంలో కూడా రాజకీయ, తాత్త్విక అంశాలకు సంబంధించిన జ్ఞానాన్ని జనాలు విశ్వాసాలు, మతాచారాలు, ప్రచారం ద్వారా మాత్రమే పొందుతున్నారు. ఇది విపరీత అజ్ఞాన శకం. పత్రికలు, ప్రసార సాధనాలు, సామాజిక మాధ్యమాలు ఆగ్నటాలజీ ప్రయోగాలకు సాధనాలుగా మారుతున్నాయి. ప్రజలను మాయలో ముంచెత్తుతున్నాయి. ‘మతములన్నియు మాసిపోవును/ జ్ఞానమొక్కటి నిలిచి వెలుగును’ అన్న గురజాడ ఆశయం ఎక్కడ? అజ్ఞానంపై శాస్త్ర పరిశోధనలు సాగిస్తున్న నేటి పరిస్థితులెక్కడ? -
‘హైపర్ లూప్’పై పరిశోధన
సాక్షి, చెన్నై: రవాణా వ్యవస్థలో అతి వేగంగా దూసుకెళ్లే హైపర్ లూప్ టెక్నాలజీ రైలు సేవల మీద ఐఐటీ తయ్యూరు క్యాంపస్‌లో విస్తృత పరిశోధనలు జరుగుతున్నాయి. చెన్నై మెట్రో రైలు, ఐఐటీ సంయుక్తంగా ఈ పరిశోధన మీద దృష్టి పెట్టింది. ఇది విజయవంతమైతే చెన్నై విమానాశ్రయం నుంచి కొత్తగా నిర్మించబోతున్న పరందూరుకు 15 నిమిషాల వ్యవధిలో దూసుకెళ్లే అవకాశం ఉంది. చెన్నైకు ప్రత్యామ్నాయంగా కాంచీపురం పరిధిలోని పరందూరులో గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయం నిర్మాణానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. అదే సమయంలో చెన్నై విమానాశ్రయం నుంచి పరందూరు వైపుగా మెట్రో సేవలకు సైతం ముందుగానే ఏర్పాట్లు చేస్తున్నారు. పూందమల్లి వరకు ఉన్న మెట్రో రైలు సేవలను పరందూరు వరకు పొడిగించే విధంగా కార్యాచరణ చేపట్టనున్నారు. మెట్రో మార్గంలో చెన్నై నుంచి పరందూరుకు గంట సమయం పడుతుందని అంచనా. ఈ పరిస్థితుల్లో అతివేగంగా దూసుకెళ్లే హైపర్ లూప్ టెక్నాలజీ ద్వారా చెన్నై–పరందూరు మధ్య 15 నిమిషాల్లో చేరుకునేలా కొత్తమార్గంపై దృష్టి పెట్టనున్నారు. ఈ టెక్నాలజీ మీద ఐఐటీ తయ్యూరు క్యాంప్ పరిశోధకులు, విద్యార్థులు కొంతమేరకు పరిశోధనలో ఫలితాలు సాధించినట్టు సమాచారం. అసలేంటీ ‘హైపర్ లూప్’లూప్ అనేది పైప్‌లైన్‌లాంటి మార్గం. పాట్ అనే రైలు పెట్టె లాంటి వాహనంలో వాయువేగంలో దూసుకెళ్లే విధంగా ఈ టెక్నాలజీ ఉంటుంది. అయస్కాంతం సహకారంతో గాల్లో వేలాడుతూ గంటకు 600 కి.మీ వేగంతో ఈ హైపర్ లూప్ అతి వేగంగా దూసుకెళ్తుందని చెబుతున్నారు. ఈ హైపర్ లూప్‌లో ఒకే సమయంలో 40 మంది ప్రయాణించేందుకు వీలుంటుందని సమాచారం -
సాంకేతికతను అందిపుచ్చుకోవాలి: ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: ఆధునిక సాంకేతికను ఎప్పటికప్పుడు అందిపుచ్చుకోవాలని, పౌర కేంద్రీకృత విధానాలను అనుసరించాలని ప్రధాని మోదీ అధికారులను కోరారు. ఇందుకు మిషన్ కర్మయోగి ఎంతో సహాయకారిగా ఉంటుందని చెప్పారు. కొత్తకొత్త ఆలోచనల కోసం స్టార్టప్‌లు, పరిశోధన విభాగాలు, యువత నుంచి సలహాలను స్వీకరించాలని సూచించారు. శనివారం ప్రధాని మోదీ డాక్టర్ అంబేడ్కర్ ఇంటర్నేషనల్ సెంటర్లో నేషనల్ లెర్నింగ్ వీక్(కర్మయోగి సప్తాహ్)ను ప్రారంభించి, అధికారులనుద్దేశించి మాట్లాడారు. కృత్రిమ మేధ(ఏఐ)తో ఇన్ఫర్మేషన్ ప్రాసెసింగ్ మరింత సులువుగా మారుతుందంటూ ఆయన..పౌరులకు సమాచారం అందించడంతోపాటు ప్రభుత్వ కార్యకలాపాలన్నింటిపై నిఘాకు ఏఐతో వీలు కలుగుతుందన్నారు. అధికారులు వినూత్న ఆలోచనలు కలిగి ఉండాలన్నారు. పథకాలు, కార్యక్రమాల అమలుపై ప్రజాభిప్రాయాన్ని తెలుసుకునే యంత్రాంగం అన్ని స్థాయిల్లోనూ ఏర్పాటు కావాల్సిన అవసరం ఉందని ప్రధాని మోదీ తెలిపారు. ఉద్యోగుల సామర్థ్యాలను మెరుగుపరచడమే లక్ష్యంగా 2020లో మిషన్ కర్మయోగి కార్యక్రమాన్ని కేంద్రం ప్రారంభించింది. నారీ శక్తి ఆశీర్వాదమే స్ఫూర్తిమహిళల ఆశీర్వచనాలే తనకు దేశాన్ని అభివృద్ధి దిశలో నడిపేందుకు ప్రేరణను అందిస్తాయని మోదీ పేర్కొన్నారు. ‘మోదీకి కృతజ్ఞతగా అందజేయా’లంటూ ఓ గిరిజన మహిళ పట్టుబట్టి మరీ తనకు రూ.100 ఇచ్చారంటూ బీజేపీ ఉపాధ్యక్షుడు బైజయంత్ జయ్ పాండా శనివారం ‘ఎక్స్’లో షేర్ చేసిన ఫొటోలపై ఆయన ఈ మేరకు వ్యాఖ్యానించారు. ఒడిశాలోని సుందర్‌గఢ్ జిల్లాలో బీజేపీ సభ్యత్వ నమోదు సందర్భంగా చోటుచేసుకున్న ఘటనపై ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. ‘‘ఇది నా హృదయాన్ని కదిలించింది. నన్ను సదా ఆశీర్వదించే నారీ శక్తికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. వారి ఆశీస్సులే నాకు నిత్యం ప్రేరణగా నిలుస్తాయి’’ అని ఆయన పేర్కొన్నారు.నేడు వారణాసికి ప్రధాని మోదీ ప్రధాని ఆదివారం వారణాసిలో పర్యటించనున్నారు. శంకర నేత్రాలయం సహా రూ.6,600 కోట్ల విలువైన వివిధ ప్రాజెక్టులను ఈ సందర్భంగా ప్రారంభిస్తారు. -
Sai Priyanka pagadala: అమ్మలాంటి అన్నదాత కోసం...
తల్లి తన ఆకలి గురించి పట్టించుకోదు. పిల్లల కడుపు నిండిందా లేదా అనేదే ఆమెకు ముఖ్యం. రైతులు కూడా అమ్మలాంటి వారే. అందుకే వారిపై దృష్టి పెట్టింది సాయిప్రియాంక. తాను పండించే పంటల ద్వారా ఎంతోమందికి పోషకాహార శక్తిని అందిస్తున్న రైతు ఆ శక్తికి ఎంత దగ్గరలో ఉన్నాడు? ఎంత దూరంలో ఉన్నాడు... అనే ఆసక్తితో పరిశోధన బాట పట్టింది. తన పరిశోధన అంశాలను కొలంబోలో జరిగే అంతర్జాతీయ సదస్సులో వివరించడానికి సిద్ధం అవుతోంది.సాయిప్రియాంక చదువుకున్నది పట్టణాల్లో అయినా ఆమెకు పల్లెలు అంటేనే ఇష్టం. పల్లెల్లో పచ్చటి పొలాలను చూడడం అంటే ఇష్టం. ఆ ఇష్టమే వ్యవసాయం గురించి తెలుసుకోవాలనే ఆసక్తికి కారణం అయింది. ఆ ఆసక్తే తనను ‘అగ్రికల్చరల్ సైంటిస్ట్’ను చేసింది.ఇంటర్నేషనల్ ఫుడ్ పాలసీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (ఐఎఫ్పీఆర్ఐ) అనేది వాషింగ్టన్ కేంద్రంగా పనిచేస్తున్న అంతర్జాతీయ వ్యవసాయ పరిశోధనా కేంద్రం. పోషకాహార లోపానికి సంబంధించి పరిశోధన ఆధారిత పరిష్కారాలను అందించే సంస్థ ఇది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఇతర సంస్థలతో కలిసి ఈ సంస్థ ‘డెలివరింగ్ ఫర్ న్యూట్రిషన్ ఇన్ సౌత్ ఏషియా: కనెక్టింగ్ ది డాట్స్ ఎక్రాస్ సిస్టమ్స్’ అనే అంశంపై కొలంబోలో డిసెంబర్ 3,4,5 తేదీలలో అంతర్జాతీయ సదస్సు ఏర్పాటు చేస్తోంది. పోషకాహారం దాని ప్రభావిత అంశాల గురించి చర్చించడానికి ప్రపంచ వ్యాప్తంగా వివిధ రంగాలకు చెందిన నిపుణులు, విధానకర్తలు, పరిశోధకులను ఏకతాటిపై తీసుకు వస్తోంది.మన దేశం నుంచి ఆరుగురు ప్రతినిధులు ఈ ప్రతిష్ఠాత్మకమైన సదస్సులో పాల్గొనబోతున్నారు. వారిలో సాయి ప్రియాంక ఒకరు. తన పరిశోధనకు సంబంధించిన అంశాలను ఈ అంతర్జాతీయ సదస్సులో ప్రియాంక వివరించనుంది. ప్రత్యేక గ్రామాలు తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లా పస్తాపూర్, అర్జున్ నాయక్ తాండా, బిడకన్నె గ్రామాలకు వ్యవసాయ పరంగా ప్రత్యేకత ఉంది. వీటిని ‘ప్రత్యేక గ్రామాలు’ అనుకోవచ్చు. కొర్రలు, సామలు, ఊదలులాంటి సిరిధాన్యాలతో పాటు సుమారు 20 రకాల ఆకుకూరలు సాగు చేస్తుంటారు అక్కడి రైతులు. రసాయనాలు వినియోగించకుండా సేంద్రియ పంటలను పండిస్తున్నారు. దక్కన్ డవలప్మెంట్ సొసైటీ (డీడీఎస్)లాంటి సంస్థల ప్రోత్సాహంతో ఈ గ్రామాల్లోని రైతులు పౌష్టికాహారాన్ని ఇచ్చే ప్రత్యేక పంటలు సాగు చేస్తున్నారు.పత్తి, సోయా, చెరుకు లాంటి వాణిజ్య పంటలు సాగు చేసే గ్రామాలతో పోల్చితే ఈ ప్రత్యేక గ్రామాల్లోని ప్రజలకు పౌష్టికాహారం ఏ మేరకు అందుతోందనే అంశంపై ఎంతోమంది రైతులతో మాట్లాడింది సాయిప్రియ.‘అగ్రి న్యూట్రీ స్మార్ట్ విలేజెస్’ పేరుతో క్షేత్రస్థాయిలో పరిశోధనలు చేస్తోంది. రైస్, పప్పులులాంటి ఒకేరకమైన ఆహారంతో పాటు ఆకు కూరలు, సిరిధాన్యాలు తీసుకోవడం ద్వారా ఆ మూడు గ్రామాల ప్రజలు మెరుగైన పౌష్టికాహారం పొందగలుగుతున్నారని ఆమె పరిశోధనల్లో తేలింది. ఈ గ్రామాలతో పాటు హరియాణా, ఉత్తర్‌ప్రదేశ్‌లోని గ్రామాల్లో కూడా పరిశోధనలు చేస్తోంది.ఐఏఆర్ఐలో పీహెచ్డీఖమ్మం పట్టణానికి చెందిన పగడాల సాయి ప్రియాంక పదో తరగతి వరకు ఖమ్మంలో, ఇంటర్ విజయవాడలో చదువుకుంది. తల్లిదండ్రులు రాజరాజేశ్వరి, నర్సింహరావులు ఇద్దరూ ప్రభుత్వ ఉద్యోగులే. ‘డాక్టర్ కావాల్సిందే’ ‘ఇంజనీర్ కావాల్సిందే’లాంటి సగటు తల్లిదండ్రుల ఆలోచనకు దూరంగా కూతురుకి వ్యవసాయ రంగంపై ఉన్న ఆసక్తిని ప్రోత్సహించారు.వ్యవసాయ పరిశోధనపై ఎంతో ఆసక్తి ఉన్న సాయి ప్రియాంక అశ్వారావుపేటలో బీఎస్సీ అగ్రికల్చర్, మేఘాలయలోని సెంట్రల్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఎమ్మెస్సీ పూర్తి చేసింది. ఢిల్లీలోని ఐఏఆర్ఐ (ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్)లో పీహెచ్డీ చేస్తోంది. ప్రస్తుతం జహీరాబాద్ ‘కృషి విజ్ఞాన కేంద్రం’లో అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ సైంటిస్ట్‌గా పనిచేస్తోంది.‘ఇవి మాత్రమే మనం చేరుకోవాల్సిన గమ్యాలు’ అని యువతరం ఒకే వైపు దృష్టి సారించినప్పుడు ఎన్నో రంగాలు మూగబోతాయి. ఆ రంగాలలో పరిశోధనలు ఉండవు. ప్రగతి ఉండదు. విభిన్న ఆలోచనలు ఉన్న సాయిప్రియాంక లాంటి అమ్మాయిలు తాము కొత్త దారిలో ప్రయాణించడమే కాదు ‘మనం ప్రయాణించడానికి, అన్వేషణ కొనసాగించడానికి ఒకే దారి లేదు. ఎన్నో దారులు ఉన్నాయి’ అనే విషయాన్ని చెప్పకనే చెబుతున్నారు. ఈ కోణంలో సాయిప్రియాంక ‘కృషి’ యువతరంలో ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తుంది.సంతోషంగా ఉంది‘అగ్రి న్యూట్రీ స్మార్ట్ విలేజ్’ అనే ్రపాజెక్ట్పై మూడు ప్రత్యేక గ్రామాల్లో నా పరిశోధనలు కొనసాగుతున్నాయి. ‘గ్లోబల్ హంగర్ ఇండెక్స్’లాంటి వాటి ఆధారంగా ఈ గ్రామాల్లో ఫుడ్ సెక్యూరిటీ ఇండెక్స్‌ను తయారు చేస్తున్నాము. ఇతర గ్రామాలతో పోల్చితే ఈ ప్రత్యేక గ్రామాల్లో కాస్త మెరుగైన పౌష్టికాహారం అందుతోంది. దక్షిణ ఆసియా దేశాలకు చెందిన సుమారు 600 మంది ప్రతినిధులతో కొలంబోలో జరిగే అంతర్జాతీయ సదస్సులో పాల్గొనే అవకాశం లభించినందుకు ఎంతో సంతోషంగా ఉంది.– సాయి ప్రియాంక, వ్యవసాయ శాస్త్రవేత్త పాత బాల ప్రసాద్, సాక్షి, సంగారెడ్డి -
ప్రతిష్ఠాత్మక ఐబీఆర్‌వో అధ్యక్షురాలిగా శుభా టోలే రికార్డ్ : ఆసక్తికర సంగతులు
బ్రెయిన్ అనేది రహస్యాల గని. భావోద్వేగాల ఫ్యాక్టరీ.‘ సైన్స్ ఆఫ్ ది బ్రెయిన్’ గురించి ఎన్నో దశాబ్దాలుగా కృషి చేస్తోంది ‘ఐబీఆర్‌వో’ అలాంటి ప్రసిద్ధ అంతర్జాతీయ సంస్థకు తొలిసారిగా భారతీయ శాస్త్రవేత్త అధ్యక్షురాలిగా ఎంపికైంది. ఇంటర్నేషనల్ బ్రెయిన్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఐబీఆర్‌వో) అధ్యక్షురాలిగా ప్రముఖ శాస్త్రవేత్త శుభ టోలే నియమితురాలైంది. అభివృద్ధి చెందుతున్న దేశం నుంచి అత్యున్నత స్థానానికి ఎంపికైన తొలి శాస్త్రవేత్తగా ప్రత్యేకత సాధించింది...ప్రపంచవ్యాప్తంగా 57 దేశాలకు చెందిన 69 సైంటిఫిక్ సొసైటీలు, ఫెడరేషన్లకు ఇంటర్నేషనల్ బ్రెయిన్ రీసెర్చి ఆర్గనైజేషన్ (ఐబీఆరోవో) ప్రాతినిధ్యం వహిస్తోంది. 1961లో ఏర్పాటైన ‘ఐబీఆర్‌వో’ నినాదం: ప్రొవైడింగ్ ఈక్వల్ యాక్సెస్ టు గ్లోబల్ న్యూరోసైన్స్ గతంలో ‘ఐబీఆర్‌వో’ అధ్యక్షులుగా యూరోపియన్, ఉత్తర అమెరికా దేశాల నుంచి ఎంపికయ్యారు. భౌగోళికంగా, జనాభాపరంగా ‘ఐబీఆర్‌వో’కు సంబంధించి అతిపెద్ద ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించే అవకాశం శుభ టోలేకు వచ్చింది.‘అభివృద్ధి చెందుతున్న దేశాలలో పనిచేయడానికి ఎన్నో పరిమితులు ఉంటాయి. ప్రయోగాలు, నిధుల జాప్యం నుంచి కొన్ని దేశాలకు సంబంధించి అంతర్జాతీయ సదస్సులు, వీసా అపాయింట్మెంట్లకు హాజరు కావడం వరకు ఇబ్బందులు ఉన్నాయి. చర్చల ద్వారా వాటికి పరిష్కారం దొరుకుతుంది’ అంటుంది శుభ.శుభ ప్రస్తుతం ముంబైలోని ప్రముఖ సైంటిఫిక్ రీసెర్చ్ సంస్థ–టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్‌లో గ్రాడ్యుయేట్ స్టడీస్ డీన్‌గా పనిచేస్తోంది. ఇండియన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ‘ఉమెన్ ఇన్ సైన్స్’ కమిటీకి చైర్‌పర్సన్‌గా పనిచేసింది. విద్యావంతుల కుటుంబంలో ముంబైలో జన్మించింది శుభ. తల్లి అరుణ టోలే ఆక్యుపేషనల్ థెరపిస్ట్. తండ్రి ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్ విభాగానికి చెందిన సంస్థకు డైరెక్టర్‌గా పనిచేశాడు. ముంబైలోని సెయింట్ జేవియర్స్ కాలేజీలో లైఫ్ సైన్సెస్, బయోకెమిస్ట్రీ చదివిన శుభ అమెరికాలోని కాలిఫోర్నియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో మాస్టర్స్, డాక్టోరల్ డిగ్రీ చేసింది. చికాగో యూనివర్శిటీలో పోస్ట్–డాక్టోరల్ రీసెర్చి చేసింది.వెల్కమ్ ట్రస్ట్ సీనియర్ ఇంటర్నేషనల్ ఫెలోషిప్, భారత ప్రభుత్వ సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం నుంచి స్వర్ణజయంతి ఫెలోషిప్ తీసుకొంది. భారత ప్రభుత్వ బయోటెక్నాలజీ విభాగం నుంచి జాతీయ మహిళా బయోసైంటిస్ట్ అవార్డ్, సొసైటీ ఫర్ న్యూరోసైన్స్, యూఎస్ నుంచి రీసెర్చ్ అవార్డ్ ఫర్ ఇన్నోవేషన్ ఇన్ న్యూరోసైన్సెస్ అవార్డ్ అందుకుంది.కథక్ డ్యాన్సర్ కూడాశుభ టోలే శాస్త్రవేత్తే కాదు కథక్ శాస్త్రీయ నృత్యకారిణి కూడా. లాస్ ఏంజిల్స్‌లో పీహెచ్డీ చేస్తున్న కాలంలో గురు అంజనీ అంబేగావ్కర్ దగ్గర కథక్ నేర్చుకుంది. ‘కథక్ చేస్తుంటే ఒత్తిడి దూరం అవుతుంది. మనసు ఆహ్లాదంగా ఉంటుంది. నేను, నా పెద్ద కొడుకు కథక్ ప్రాక్టీస్ చేస్తుంటాం. నా భర్త, ఇద్దరు పిల్లలు తబలాప్రాక్టీస్ చేస్తుంటారు’ అంటుంది శుభ.శుభ భర్త సందీప్ కూడా శాస్త్రవేత్త. ఇద్దరూ శాస్త్రవేత్తలే కాబట్టి ఇంట్లో సైన్స్‌కు సంబంధించిన విషయాలే మాట్లాడుకుంటారనేది అపోహ మాత్రమే. పెయింటింగ్ నుంచి మ్యూజిక్ వరకు ఎన్నో కళల గురించి మాట్లాడుకుంటారు. ‘సైన్స్ అనేది ఒక సృజనాత్మక వృత్తి’ అంటుంది శుభ. -
105 ఏళ్లు బతుకుతానని చెప్పింది!
వాన రాకడ... ప్రాణం పోకడ ఎవరూ చెప్పలేరంటారు. అయితే టెక్నాలజీ మారిపోయింది. ఫలానా సమయంలో.. ఫలానా చోట.. ఇంత మొత్తంలో వర్షం పడుతుందని కూడా చెప్పేయ గలుగుతున్నాం. మరి చావు సంగతి? రోజుల్లో పోతారనుకున్న వాళ్లు నిక్షేపంగా ఏళ్లు గడిపేయడం మనం చూశాం. అలాగే రాయిలా దిట్టంగా ఉన్నవాళ్లు ఉన్నట్టుండి కుప్పకూలిన వైనాలూ మనకు తెలుసు. అందుకే మరణాన్ని అంచనా వేయడం ఇప్పటికీ కష్టమే. కానీ.. మీ వివరాలు నాకివ్వండి.. మీరెంత కాలం బతుకుతారో చెప్పేస్తానంటోంది ఓ కృత్రిమమేధ సాఫ్ట్వేర్. ఆసక్తికరమైన ఆ వివరాలేమిటో చూసేద్దామా...!!!ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా కృత్రిమమేధ సంచలనాల వార్తలే. అడిగిన ప్రశ్నకు తడుముకోకుండా జవాబులు చెప్పడమే కాదు.. ఆఫీసుల్లో, ఫ్యాక్టరీల్లో, ఆసుపత్రుల్లో.. ఇలా అన్నిచోట్ల మనిషి పనిని మరింత సులువు చేసేస్తోంది ఈ కృత్రిమమేధ. ఆఖరకు మనం ఎంత కాలం బతుకుతామో చెప్పగలిగే స్థితికి చేరింది. నిజానికి చిరాయుష్షు.. అది కూడా ఆరోగ్యవంతమైన జీవితం అన్నది మనిషి యుగాలుగా కంటున్న కల. వైద్యులను అడిగితే, లేదా హెల్త్ వెబ్సైట్లు చూస్తే.... మంచి ఆహారం తీసుకోండి.. వ్యాయామం చేయండి. చెడు అలవాట్లకు దూరంగా ఉండండి ఎక్కువ కాలం బతుకుతారని తెలుస్తుంది. ఇలా కాకుండా... ప్రస్తుతం మనం ఎలా ఉన్నామో అలాగే ఉంటే.. అవే అలవాట్లు, ఆహారాన్ని కొనసాగిస్తే ఎంత కాలం బతుకుతామో ‘డెత్ క్లాక్’ వెబ్సైట్ (కథనం చివరలో లింక్ ఉంది) చెబుతుంది. మీరు చేయాల్సిందిల్లా సింపుల్. వెబ్సైట్లోకి ప్రవేశించి వివరాలు ఇవ్వడమే. డెత్ క్లాక్ వెబ్‌సైట్‌ను తెరవగానే... ‘‘నేను ఎప్పుడు చచ్చిపోతాను? అని మీరెప్పుడైనా ప్రశ్నించుకున్నారా’’ అని కనిపిస్తుంది. కిందనే.. మీ ఆయుష్షు తెలుసుకోవాలని అనుకుంటున్నారా? అన్న టీజింగ్ ప్రశ్న కూడా కనిపిస్తుంది. దాని కింద...మీ పుట్టిన రోజు, స్త్రీ/పురుషుడు అన్న వివరం, ధూమపానం చేస్తారా? అన్న ప్రశ్నతోపాటు మరికొన్ని అనుబంధ ప్రశ్నలు ఉంటాయి. అన్నింటి వివరాలు ఇచ్చేస్తే... కృత్రిమమేధ సాయం రంగంలోకి దిగుతుంది. మీరిచ్చిన వివరాల ఆధారంగా ఆయుష్షును లెక్కకడుతుంది.ఇంకెందుకు ఆలస్యం.. మీరూ ట్రై చేయండి మరి..లింక్.. (నోట్: ఇది కేవలం సరదా కోసం ఉద్దేశించింది మాత్రమే. ఇది కచ్చితంగా వాస్తవంగా జరుగుతుందని ఏమీ లేదు. మరణ తేదీని కచ్చితంగా చెప్పలేమని వెబ్సైట్ నిర్వాహకులు కూడా స్పష్టం చేసిన విషయాన్ని గమనించగలరు. ఇప్పటివరకూ ఈ వెబ్సైట్ ద్వారా ఆయుష్షును అంచనా వేసుకున్న వారి సంఖ్య.. 60,039,306)-జి.గోపాలకృష్ణ మయ్యా -
kaleshwaram commission: ‘తెలీదు.. గుర్తులేదు.. మర్చిపోయా..’!
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం కమిషన్ విచారణ మళ్లీ ప్రారంభమైంది. శుక్రవారం.. కమిషన్ ముందుకు తెలంగాణ రీసెర్చ్ అధికారులు హాజరయ్యారు. అయితే, కాళేశ్వరం కమిషన్ ముందు రీసెర్చ్ చీఫ్ ఇంజనీర్ శ్రీదేవి వింత సమాధానాలు చెప్పారు. కమిషన్ అడిగే ప్రశ్నలకు తెలీదు, గుర్తుకు లేదు, మర్చిపోయా అంటూ ఆమె చెప్పిన సమాధానాలకు కమిషన్ చీఫ్ జస్టిస్ చంద్ర ఘోష్ షాక్ అయ్యారు. శ్రీదేవి పని చేసిన పిరియడ్‌లో ఏమి గుర్తుకు ఉందో చెప్పాలని కమిషన్ ఛైర్మన్ అడ్డగా.. ఏ ప్రశ్న అడిగినా తెలీదు, గుర్తుకు లేదు, మర్చిపోయా అంటూ శ్రీదేవి సమాధానాలు చెప్పింది.2017 నుంచి 2020 వరకు కాళేశ్వరం మూడు బ్యారేజీల నిర్మాణం సమయంలో పనిచేసిన శ్రీదేవి.. మోడల్ స్టడీస్ ఎప్పుడు చేశారు? ఫ్లడస్ ఎప్పుడు వచ్చాయి అనే ప్రశ్నలకు తనకు గుర్తుకు లేదంటూ దాటవేసేందుకు యత్నించారు. తెలంగాణ రాష్ట్రంలో మొదటి మహిళా చీఫ్ ఇంజనీర్‌గా ఆమె పదవి బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.కాగా, మూడు బ్యారేజీల కంటే ముందు మోడల్ స్టడీస్ కండక్ట్ చేశారా లేదా అంటూ రీసెర్చ్ ఇంజనీర్లను కమిషన్ ప్రశ్నించింది. నిర్మాణానికి ముందు, మధ్యలో తర్వాత కూడా మోడల్స్ నిర్వహించినట్లు కమిషన్‌కు రీసెర్చ్ ఇంజనీర్లు చెప్పారు. మోడల్ స్టడీస్ పూర్తికాకముందే నిర్మాణాలు మొదలైనట్లు కమిషన్ ముందు రీసెర్చ్ ఇంజనీర్లు ఒప్పుకున్నారు. మేడిగడ్డతో పాటు ఇతర డ్యామేజ్ జరగడానికి కారణం నీళ్లను స్టోరేజ్ చేయడం వల్లేనని కమిషన్‌కు ఇంజనీర్లు తెలిపారు.ఇదీ చదవండి: ‘ఓటుకు నోటు కేసుపై రేవంత్‌కు రిపోర్ట్ చేయొద్దు’వరద ఎక్కువగా వచ్చినప్పుడు గేట్లను ఎత్తకుండా ఫీల్డ్ అధికారులు నిర్లక్ష్యం వహించినట్లు కమిషన్ ముందు చెప్పిన రీసెర్చ్ ఇంజనీర్లు.. మోడల్ స్టడీస్ తర్వాత బఫెల్ బ్లాక్‌లో మార్పులు సవరణలు చేయడానికి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చామన్నారు. బ్యారేజీలు డామేజ్ అవ్వడానికి మోడల్ స్టడీస్‌కి సంబంధం లేదని రీసెర్చ్ అధికారులు స్టేట్మెంట్ ఇచ్చారు. మూడు బ్యారేజీలలో నీళ్లు నిలువ చేయడానికి ఎవరి ఆదేశాలు ఉన్నాయని కాళేశ్వరం కమిషన్.. రీసెర్చ్ ఇంజనీర్లను ప్రశ్నించింది.అన్నారం గ్యారేజీ నిర్మాణం చేసే లొకేషన్ మారినట్లు రీసెర్చ్ ఇంజనీర్ల దృష్టిలో ఉందా?. మూడు బ్యారేజీలలో నీళ్లను స్టోరేజ్ చేయాలని ఎవరి ఆదేశాలు ఉంటాయని కమిషన్ ప్రశ్నించగానిబంధనల ప్రకారమే టీఎస్ ఈఆర్ఎల్ పని చేసిందని కమిషన్ ముందు చెప్పిన ఇంజనీర్లు. లొకేషన్, సీడీవో అథారిటీ రిపోర్ట్స్ ఆధారంగా రీసెర్చ్ చేశామని అధికారులు పేర్కొన్నారు. మొత్తం మూడు బ్యారేజీలలో 2016 నుంచి 2023 వరకు మోడల్ స్టడీస్ రీసెర్చ్ టీం ఆధ్వర్యంలో జరిగినట్లు అధికారులు తెలిపారు. ఒక వైపు నిర్మాణం జరుగుతుండగానే... మరొకవైపు రీసెర్చ్ కొనసాగుతుందని ఇంజనీర్లు పేర్కొన్నారు. -
బరువు తగ్గేందుకు కీటో డైట్ మంచిదేనా..? నిపుణులు ఏమంటున్నారంటే..
కీటోజెనిక్ లేదా కీటో డైట్‌ని మొట్టమొదటగా 1921లో మూర్చ వ్యాధికి ఉపయోగించేవారు. ఈ డైట్లో అధిక కొవ్వు, తగినంత ప్రోటీన్, తక్కువ కార్బోహైడ్రేట్ ఆహారం ఉంటాయి. ఇటీవల అంతా బరవు తగ్గడం కోసి రకరకాల డైట్లు ఫాలో అవుతున్నారు. అందులో ఇది కూడా ఒకటి. ఈ డైట్‌తో బరువు తగ్గడం జరుగుతుంది కానీ పరిశోధనలో ఈ డైట్ కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచి, గట్ బ్యాక్టీరియాను తగ్గిస్తాయని తేలింది. ఇది అంత ఆరోగ్యకరమైనది కాదని వెల్లడయ్యిందని నిపుణులు చెబుతున్నారు. బరువు తగ్గాలనుకునేవారు ఆరోగ్యంగా ఉండటానికి సమహయపడే డైట్‌ని అనుసరించడం ముఖ్యమని చెబుతున్నారు. అసలు ఈ డైట్ ఎలా మంచిది కాదో సవివరంగా చూద్దాం. కీటో డైట్ ఆరోగ్యానికి సురక్షితమైనదేనా కాదా? అని సుమారు 53 మంది ఆరోగ్యవంతమైన పెద్దలపై అధ్యయనం నిర్వహించారు పరిశోధకులు. వారికి తక్కువ చక్కెరతో కూడిన ఆహారం, తక్కువ కార్బోహైడ్రేట్లు, ఇవ్వగా వారి శరీరం కార్బోహైడ్రేట్ల నుంచి వచ్చే గ్లూకోజ్‌కి బదులుగా కాలేయం నిల్వ చేసిన కొవ్వులను ఇంధనంగా ఉపయోగించుకోవడాన్ని గుర్తించారు. దీన్ని కీటోన్ బాడీల ద్వారా కొవ్వులను కాల్చడం అని అంటారు. ఈ డైట్ ప్రకారం వారంతా 20 నుంచి 50 గ్రాముల కంటే తక్కువ పిండిపదార్థాలు తీసుకోవాలి. ఇలా కీటోసిస్ స్థితికి చేరడానికి కొన్ని రోజుల పడుతుంది. ఇందుకోసం అదిక మొత్తంలో ప్రోటీన్ తీసుకోవడం అనేది హానికరమేనని చెబుతున్నారు. ఇక్కడ కీటోడైట్‌లో తీసుకునే ఆహారాల్లో కొబ్బరి నూనె, వెన్న, చికెన్, గుడ్లు, అని కూరగాయలు, కాయధాన్యాలు, పిండి, వోట్స్, చిక్కుళ్ళు, పప్పులు, డ్రై ఫ్రూట్స్, గింజలు, కాటేజ్ చీజ్, మేక, ఫెటా చీజ్ తదితరాలు ఉంటాయి. అలాగే ఈ డైట్ కోసం వోట్స్, కేకులు శుద్ధి చేసిన పిండితో చేసిన డెజర్ట్‌లు, అధిక కార్బ్ ఆహారాలకు దూరంగా ఉండాల్సి ఉంటుంది. ఈ కీటో డైట్‌ని అనుసరిచిన 12 వారాల తర్వాత సగటున శరీరంలో 2.9 కిలోల మేర కొవ్వు తగ్గుతుందన పరిశోధకులు గుర్తించారు. ఇక్కడ చక్కెర నిరోధిత ఆహారం కారణంగా 2.1 కిలోల బరువు కోల్పోయేలా చేస్తుంది. అందువల్లే చాలామంది ఈ డైట్‌ని అనుసరించేందుకు ప్రాముఖ్యత ఇవ్వడం జరుగుతోంది. అయితే ఈ డైట్ వల్ల కొన్ని ప్రతికూల ఆరోగ్య ప్రభావాలు కూడా ఉన్నాయని అధ్యయనంలో వెల్లడించారు పరిశోధకులు. ఎదురయ్యే ప్రతికూల ఆరోగ్య ప్రభావాలు..ఈ కీటో డైట్ శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుతుందని పరిశోధకులు గుర్తించారు. ఇది ధమనులలో ఫలకం ఏర్పడటానికి కారణమవుతుంది. ఈ డైట్‌ని అనుసరించే వారి రక్తంలో అననూకూల స్థాయిలో కొవ్వులు పెరిగినట్లు గుర్తించామన్నారు. ఇలా ఏళ్ల తరబడి ఈ డైట్‌ని ఫాలో అయితే దీర్ఘకాలికా ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందన్నారు. ముఖ్యంగా గుండె జబ్బులు, స్ట్రోక్‌కు దారీతీసే ప్రమాదం ఉంటుందని చెప్పారు. మరోవైపు ఈ తక్కువ చక్కెర ఆహారం చెడు కొలస్ట్రాల్‌ని గణనీయంగా తగ్గించింది కూడా అని చెప్పారు.కీటో డైట్ గట్ మైక్రోబయోమ్ కూర్పును మార్చింది. ముఖ్యంగా బిఫిడోబాక్టీరియాను తగ్గిస్తుంది. ప్రోబయోటిక్స్‌లో తరచుగా కనిపించే ప్రయోజనకరమైన బ్యాక్టీరియా ఇది. ఇది 'బీ' విటమిన్లను ఉత్పత్తి చేస్తుంది. వ్యాధికారక హానికరమైన బ్యాక్టీరియాను నిరోధిస్తుంది. కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. ఇలా గట్ బ్యాక్టీరియా తగ్గిపోతే ప్రకోప ప్రేగు వ్యాధి వంటి జీర్ణ రుగ్మతలు వచ్చే ప్రమాదం ఉంటుంది. వ్యాధి నిరోధకత తగ్గి దీర్ఘకాలికి వ్యాధులు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని అన్నారు పరిశోధకులు.కీటో డైట్ గ్లూకోస్ టాలరెన్స్‌ని తగ్గించింది. అంటే..శరీరం కార్బోహైడ్రేట్లను నిర్వహించడంలో తక్కువ సామర్థ్యాన్ని కలిగి ఉందని అర్థం. ఎప్పుడైన అధిక కార్బోహైడ్రేట్ తీసుకుంటే మాత్రం దీర్ఘకాలంలో టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని హెచ్చరిస్తున్నారు నిపుణలు. ఇక్కడ బరువు తగ్గాలనుకుంటే తక్కువ చక్కెర ఉన్న ఆహారాలు మంచివే కానీ ఫైబర్‌తో కూడిన ఆహారాలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు నిపుణులు.(చదవండి: ఓ సంపన్న కుటుంబం దాష్టికం..ఏకంగా 26 ఏళ్ల పాటు..!) -
పరిశోధనలతో సమాజానికి మేలు
పరిశోధనలు సమాజానికి ఎంతో మేలు చేస్తాయని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ చైర్మన్ మామిడాల జగదీశ్‌కుమార్ స్పష్టం చేశారు. యువత పరిశోధన రంగంలోకి రావాల్సిన ఆవశ్యకత ఉందని నొక్కి చెప్పారు. ఎంత ఎక్కువ మంది పరిశోధనా రంగంలోకి వస్తే అంత ఎక్కువ దేశానికి లబ్ధి చేకూరుతుందని అన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లో ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన జగదీశ్‌కుమార్ ‘సాక్షి’తో మాట్లాడారు.సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ కాలేజీలు, యూనివర్సిటీల్లో బోధనా సిబ్బంది కొరత తీవ్రంగా ఉందని యూజీసీ చైర్మన్ జగదీశ్‌కుమార్ అన్నారు. వీరి నియామకాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకోవాలని సూచించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాల్సిన అవసరం ఉందని అన్నారు. కాంట్రాక్టు అధ్యాపకుల నుంచి నాణ్యమైన పరిశోధనలు ఆశించలేమని. కాంట్రాక్టు పద్ధతిన పనిచేసే వారు నిబద్ధతతో పని చేయలేరని అభిప్రాయ పడ్డారు. విద్యార్థులు, అధ్యాపకుల నిష్పత్తి తగిన విధంగా ఉంటే పరిశోధనల్లో ఆటోమేటిక్‌గా నాణ్యత పెరుగుతుందని స్పష్టం చేశారు. చాలా వర్సిటీల్లో శాశ్వత సిబ్బందిని నియమించకుండా, కాంట్రాక్టు అధ్యాపకులతోనే నడిపిస్తున్నారు కదా! అనే ప్రశ్నకు బదులిస్తూ..ఇది చాలా పెద్ద సమస్య అని, రాష్ట్రాల గవర్నర్లు, ప్రభుత్వాలకు ఈ విషయంలో తాము చాలాసార్లు లేఖలు రాశామని చెప్పారు. తమ పరిధిలో ఉన్నంత వరకు తాము ప్రయత్నిస్తున్నామని, గత వారంలో కూడా దీనిపై చర్చించామని తెలిపారు. ఇప్పటికైనా ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలని సూచించారు. ఉద్యోగం కోసం పీహెచ్డీ చేయకూడదు పరిశోధనా రంగంలోకి ఎక్కువ మంది యువత రావాలనే ఉద్దేశంతోనే.. పీజీతో సంబంధం లేకుండా నాలుగేళ్ల డిగ్రీ తర్వాత పీహెచ్డీ చేసే వెసులుబాటు కల్పించామని జగదీశ్‌కుమార్ వెల్లడించారు. ఈ విధానం విదేశాల్లో ఎప్పటి నుంచో విజయవంతంగా అమలవుతోందని, ఇక్కడ కూడా మంచి ఫలితాలు వస్తాయని ఆశిస్తున్నట్లు చెప్పారు. పీహెచ్డీ చేసిన వారికి జీవనోపాధి కష్టమవుతోందనే అభిప్రాయంపై మాట్లాడుతూ..‘పీహెచ్డీ అంటే ఏదో ఉద్యోగం కోసం చేసే కోర్సు కాదు. రీసెర్చ్‌పై ఆసక్తి (ప్యాషన్) ఉంటేనే ఈ రంగంలోకి రావాలి. దేశానికి సేవ చేయాలనే ఉద్దేశంతో పీహెచ్డీ చేయాలి. అంతేకానీ ఉద్యోగం కోసం మాత్రం రావొద్దు. ఉద్యోగమే కావాలనుకుంటే పీజీ తర్వాత ఏదైనా వేరే కోర్సు చేసి స్థిరపడటం మంచిదని నా అభిప్రాయం..’ అని చెప్పారు. న్యాక్ గుర్తింపు తీసుకోవాలి తెలంగాణ సహా ఎక్కడైనా యూనివర్సిటీలు, డిగ్రీ కాలేజీలు న్యాక్ గుర్తింపు పొందే విషయంలో ఎప్పటికప్పుడూ వర్క్‌షాప్‌లు నిర్వహిస్తూ వారికి అవగాహన కల్పిస్తున్నామని, ఇప్పుడిప్పుడే పరిస్థితులు చక్కబడుతున్నాయని జగదీశ్‌కుమార్ తెలిపారు. న్యాక్ గుర్తింపు కోసం ముందుకు రావాలని విద్యా సంస్థలకు విజ్ఞప్తి చేశారు. అలా రాకపోతే సమాజానికి మేలు చేయని వారిగానే పరిగణించాల్సి వస్తుందని, నాణ్యమైన విద్యను అందించడం అందరి బాధ్యత అని స్పష్టం చేశారు. -
ప్రకృతి సాగులో ప్రపంచ చాంపియన్
సాక్షి, అమరావతి: వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా రాష్ట్రంలో వ్యవసాయ రంగంలో తెచి్చన సంస్కరణలు, ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించిన తీరు ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. ముఖ్యంగా ప్రకృతి సాగు విస్తరణకు వైఎస్ జగన్ ప్రభుత్వం ఇచ్చిన ప్రోత్సాహం ఫలితంగా ఆంధ్రప్రదేశ్ ప్రజా భాగస్వామ్య ప్రకృతి వ్యవసాయం (ఏపీసీఎన్ఎఫ్)కు ప్రతిష్టాత్మకమైన గుల్బెంకియన్ ప్రైజ్ ఫర్ హ్యూమానిటీ గ్లోబల్ అవార్డు పొంది ప్రపంచ చాంపియన్‌గా నిలిచింది.పోర్చుగల్‌కు చెందిన కలుస్ట్ గుల్బెంకియన్ ఫౌండేషన్ ఏటా ప్రకటించే ఈ ప్రతిష్టాత్మక అవార్డు కోసం 2023–24లో ప్రపంచవ్యాప్తంగా 117 దేశాల నుంచి 181 సంస్థలు నామినేషన్లు సమరి్పంచాయి. వాటిలో భారత్ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఏపీసీఎన్ఎఫ్, ఈజిప్‌్టకు చెందిన సెకెమ్ సంస్థ ఉమ్మడి విజేతలుగా నిలిచాయి. 2023 – 24లో ఉన్నది వైఎస్ జగన్ ప్రభుత్వం. జగన్ ప్రభుత్వ కృషి ఫలితమే ఈ అంతర్జాతీయ అవార్డు. అయినా, నెల క్రితమే అధికారాన్ని చేపట్టిన చంద్రబాబు ఈ అవార్డు ఆయన గొప్పతనం వల్లేనని నిస్సిగ్గుగా చెప్పుకొంటున్నారు. ఆంగ్ల పత్రికల్లోనూ పతాక శీర్షికల్లో రాయించుకుంటున్నారు. ఈ వింత వ్యవ హారంపై రైతులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. 2019 తర్వాతే ఉద్యమ రూపంలో ప్రకృతి సాగు సహజ వ్యవసాయాన్ని ప్రోత్సహించడం ద్వారా రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించాలన్న సంకల్పంతో కేంద్ర మార్గదర్శకాల మేరకు రైతు సా«ధికార సంస్థ ద్వారా చాలా ఏళ్ల క్రితం జీరో బేస్డ్ నేచురల్ ఫారి్మంగ్ (జెడ్బీఎన్ఎఫ్) పేరిట రాష్ట్రంలో ప్రకృతి సాగు మొదలైంది. కేంద్ర ఆరి్థక సహాయంతో పైలెట్ ప్రాజెక్టుగా 704 గ్రామాల్లో 40 వేల మంది రైతులతో 50 వేల ఎకరాల్లో ప్రకృతి సాగు మొదలైంది. 2018–19 నాటికి 1.76 లక్షల మంది రైతులు 2.33 లక్షల్లో ఈ సాగు చేసేవారు.2019లో అధికారంలోకి వచి్చన వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రకృతి సాగును ఉద్యమ రూపంలోకి తీసుకెళ్లింది. ఫలితంగా 2023–24కు వచ్చేసరికి 10.37 లక్షల మంది రైతులు 12.16 లక్షల ఎకరాలకు ఈ సాగును విస్తరించగలిగారు. గ్రామ స్థాయిలో ఘున, ద్రవ జీవామృతాలు, కషాయాలు రైతులకు అందుబాటులో ఉంచేందుకు 3,909 బయో ఇన్పుట్ దుకాణాలను ఏర్పాటు చేశారు. ఈ క్రాప్ ద్వారా ప్రకృతి సాగును గుర్తించడంతో పాటు రైతులకు పంట రుణాలు, సంక్షేమ ఫలాలన్నీ అందేలా కృషి చేశారు. 2019–24 మధ్య వైఎస్ జగన్ ప్రభుత్వం కృషి ఫలితంగా విదేశీ సంస్థల నుంచి ఏపీసీఎన్ఎఫ్కు రూ.400 కోట్లకుపైగా నిధులు వచ్చాయి. పులివెందులలో ప్రకృతి సాగుపై రీసెర్చ్ అకాడమీ ప్రకృతి సాగులో విస్తృత పరిశోధనల కోసం వైఎస్సార్ జిల్లా పులివెందులలో ఇండో జర్మన్ గ్లోబల్ అకాడమీ ఫర్ ఆగ్రో ఎకాలజీ రీసెర్చ్ అండ్ లెరి్నంగ్‌ను వైఎస్ జగన్ ఏర్పాటు చేశారు. ప్రకృతి ఉత్పత్తుల మార్కెటింగ్‌కు ప్రత్యేక చర్యలు చేపట్టారు. 12 రకాల ప్రకృతి ఉత్పత్తులను రైతుల నుంచి మార్క్‌ఫెడ్ ద్వారా 15 శాతం ప్రీమియం ధరకు కొని, టీటీడీకీ సరఫరా చేశారు. రైతు బజార్లలో ప్రత్యేక స్టాళ్లు, ప్రభుత్వ కార్యాలయాల వద్ద వీక్లీ మార్కెట్లు ఏర్పాటు చేశారు. విదేశాలకు ఎగుమతి కోసం పలు జాతీయ, అంతర్జాతీయ సంస్థలతో ఒప్పందాలు చేసుకున్నారు. దీంతో రాష్ట్రంలో ప్రకృతి సాగు వేగంగా విస్తరించింది. ఏపీలో ప్రకృతి సాగుకు జరుగుతున్న కృషిని 2021–22లో సామాజిక ఆర్థిక సర్వేలో కేంద్రం ప్రశంసించింది.2022–23 ఆరి్థక సర్వేలో నీతి అయోగ్ కూడా ప్రత్యేకంగా ప్రశంసించింది. 2022, 2023 వరుసగా రెండేళ్ల పాటు ఐదు విభాగాల్లో జైవిక్ ఇండియా అవార్డులు, 2022లో ఫ్యూచర్ ఎకానమీ ఫోరం అందించే లీడర్íÙప్ గ్లోబల్ అవార్డు, 2023లో ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫెయిర్, మారికో ఇన్నోవేషన్, ఎంఎస్ స్వామినాథన్ మెమోరియల్, స్త్రీ, కర్మవీరచక్ర వంటి గ్లోబల్ అవార్డులు వరించాయి. ఐదేళ్లలో 45 దేశాల ప్రతిని«ధి బృందాలు ఏపీలో ప్రకృతి సాగుపై అధ్యయనం చేశాయి. ఏపీ స్ఫూర్తితో మధ్యప్రదేశ్, రాజస్థాన్, మేఘాలయ తదితర 12 రాష్ట్రాలు ప్రకృతి సాగు చేపట్టాయి.వ్యవసాయ రంగంలో వైఎస్ జగన్ సంస్కరణల విప్లవం2019లో వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచి్చన వెంటనే వ్యవసాయ రంగంలో విప్లవాత్మక సంస్కరణలు తెచ్చారు. విత్తు నుంచి విక్రయం వరకు రైతుకు వెన్నుదన్నుగా నిలిచేందుకు గ్రామస్థాయిలో సచివాలయాలకు అనుబంధంగా 10,778 ఆర్బీకేలు ఏర్పాటు చేశారు. వీటిలో 16 వేల మంది గ్రామ వ్యవసాయ, ఉద్యాన, మత్స్య, పట్టు, పశుసంవర్ధక సహాయకులతో పాటు ప్రతి ఆర్బీకేకు ఓ వలంటీర్, బ్యాంకింగ్ కరస్పాండెంట్లను నియమించారు. నియోజకవర్గ స్థాయిలో ఏర్పాటు చేసిన అగ్రి ల్యాబ్‌లలో సరి్టఫై చేసిన విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులను సీజన్‌కు ముందే ఆర్బీకేల్లో అందుబాటులో ఉంచారు. ఆర్బీకేలకు అనుబంధంగా యంత్ర సేవా కేంద్రాలను ఏర్పాటు చేశారు.రైతులకు ఏటా మూడు విడతల్లో రూ. 13,500 చొప్పున పెట్టుబడి సాయం అందించారు. రైతులపై పైసా భారం పడకుండా ఉచిత పంటల బీమా, ఏ సీజన్లో జరిగిన పంట నష్టానికి అదే సీజన్ ముగిసేలోగా నష్టపరిహారం, సున్నా వడ్డీ రాయితీ.. ఇలా అన్ని విధాలుగా వెన్నుదన్నుగా నిలిచారు. వైఎస్ జగన్ తెచ్చిన సంస్కరణలు, అన్నదాతకు అందించిన ప్రోత్సాహంతో ఐదేళ్లలో వ్యవసాయ రంగంలో స్పష్టమైన మార్పు కని్పస్తోంది. ప్రకృతి సాగును ఉద్యమంలా తీసుకెళ్లడంలో వైఎస్ జగన్ ప్రభుత్వం చేసిన కృషి ఫలితంగానే ప్రతిష్టాత్మకమైన గుల్బెంకియన్ అవార్డు వస్తే ఇదేదో తమ గొప్పతనం అంటూ సీఎం చంద్రబాబు బాకాలు ఊదడం పట్ల రైతులు, వ్యవసాయ రంగ నిపుణులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. -
అందం, ఆరోగ్యం అందించేది ఇదే..!
బేబీ క్యారెట్లు గురించి తెలియని వారుండరు. ఇది తినేందుకు కూడా రుచిగా ఉంటాయి. ముఖ్యంగా సాధారణ క్యారెట్స్ కంటే ఈ బేబీ క్యారెట్లు తింటే ఎన్నో లాభాలు పొందొగలమని అమెరికా పరిశోధకులు జరిపిన తాజా అధ్యయనంలో వెల్లడయ్యింది. అందం, ఆరోగ్యానికి కేరాఫ్ అడ్రస్ బేబీ క్యారెట్లని తేల్చి చెబుతున్నారు. అంత మేలు చేసే ఈ బేబీ క్యారెట్లను చిరుతిండిగా తీసుకోవడం వల్ల కలిగే లాభాలు, అధ్యయనంలో వెల్లడైన ఆసక్తికర విషయాలు తదితరాల గురించి సవివరంగా తెలుసుకుందామా..!శాకాహార ప్రియులకు బెస్ట్ స్నాక్ ఐటెంగా తీసుకునే కాయగూర బేబీ క్యారెట్లు. వీటిని స్నాక్ రూపంలో మరేదైన విధంగా తీసుకోవడం చాలా మంచిది. క్రమం తప్పకుండా తీసుకుంటే చర్మానికి, ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. వారానికి మూడుసార్లు తీసుకుంటే చర్మ కెరోటినాయిడ్లు గణనీయంగా పెరుగుతాయని పరిశోధనలో తేలింది. ఈ కెరోటినాయిడ్లు శక్తిమంతమైన యాంటీ ఆక్సిడెంట్లు. ఇవి చర్మంలోని ఫ్రీ రాడికల్స్‌ని తగ్గించగలవు. ఆక్సికరణ ఒత్తిడికి వ్యతిరేకంగా పనిచేస్తాయి. దీర్ఘకాలికి వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. మెరుగైన చర్మం, రోగనిరోధక వ్యవస్థ పనితీరుని మెరుగ్గా ఉంచుతాయి. అధిక స్థాయి కెరోటినాయిడ్లు యాంటీ ఆక్సిడెంట్ రక్షణతో సంబంధం కలిగి ఉన్నాయని, ఇవి గుండె జబ్బులు, కేన్సర్ల వంటి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి పరిశోధకులు చెబుతున్నారు. చర్మ ఆరోగ్యాన్ని ఎలా మెరుగుపరుస్తుందంటే..చికాగోలో జరిగిన అమెరికన్ సొసైటీ ఫర్ న్యూట్రిషన్ చెందిన శాస్త్రవేత్తలు సుమారు 60 మంది యువకులపై అధ్యయనం నిర్వహించగా..స్కిన్ కెరోటినాయిడ్ స్కోర్లు గణనీయంగా 10.8% పెరిగినట్లు గుర్తించారు. సుమారు వందగ్రాములు బేబిక్యారెట్లు తీసుకుంటేనే మంచి ఫలితాలను చూపించిందని అన్నారు. దీని వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు గురించి కూడా వివరించారు. అవేంటంటే..దృష్టి లోపాన్ని మెరుగుపరుస్తుంది: చూపుని రక్షించడంలో సహాయపడుతుంది. వయస్సు సంబంధిత సమస్యల నుంచి కూడా రక్షిస్తుంది. ఇది పిత్తస్రావాన్ని పెంచుతున్నట్లు పరిశోధనలో గుర్తించారు శాస్త్రవేత్తలు. ఇది కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్ స్థాయిలను తగ్గించి గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది.దంతాల ఆరోగ్యాన్ని సంరక్షిస్తుంది. వృద్ధ జపనీస్ జనాభాలో దంతాల నష్టం రేటుని అధ్యయనం చేయగా బీటా కెరోటిన్ ఎక్కువగా తీసుకున్న వారిలో దంత సమస్యలు తగ్గినట్లు గుర్తించారు. అయితే బేబి క్యారెట్లు సాధారణ క్యారెట్లు కంటే తక్కువ రోజులే నిల్వ ఉంటాయి. రిఫ్రిజిరేటర్లో అయితే సుమారు నాలుగు వారాల పాటు నిల్వ చేయవచ్చు. (చదవండి: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వాటర్ బాటిల్!..ఒక లీటర్‌కే..!) -
పరిశోధనల్లో చైనాతో పోటీ పడగలమా?
అంతర్జాతీయంగా ప్రతిష్ఠాత్మక జర్నల్స్ అయిన ‘నేచర్’, ‘ఎకనమిస్ట్’లు శాస్త్రరంగంలో చైనా అత్యంత శక్తిమంతంగా ఎదుగుతోందని ప్రకటించాయి. సైన్స్, టెక్నాలజీ రంగాల్లో మూడో అతిపెద్ద శక్తిగా భారత్ కొనసాగిన విషయం తెలిసిందే. అణు, అంతరిక్ష, వ్యాక్సిన్ అభివృద్ధి రంగాల్లో భారత్ రాణించిందన్నదీ వాస్తవమే. కానీ చైనా పలు కీలక రంగాల్లో భారత్‌తోపాటు అమెరికా, యూరప్‌లను సైతం అధిగమించింది. అంతరిక్ష రంగంలో చైనా మన కన్నా కనీసం పదేళ్లు ముందుంది. 2003లో తొలి మానవ సహిత అంతరిక్ష యాత్ర జరపడమే కాదు, సొంతంగా అంతరిక్ష కేంద్రాన్ని నిర్మిస్తోంది. ప్రపంచ టాప్–10 జాబితాలో భారతీయ పరిశోధన సంస్థలు లేవన్నది గమనార్హం. నిద్రాణంగా ఉన్న భారత్‌కు చైనా పురోగతి ఓ మేలుకొలుపు కావాలి.ఉన్నత విద్యా రంగంలో భారత్ గతంలో ఎన్నడూ లేని స్థాయి సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. వైద్యం, పరిశోధన రంగాల్లో ప్రవేశానికి నిర్వహిస్తున్న పరీక్షల పద్ధతి, ప్రామాణికత రెండూ లీకేజీల పుణ్యమా అని ప్రశ్నార్థకంగా మారాయి. నీట్‌తోపాటు భారతీయ విశ్వవిద్యాలయాల్లో, జాతీయ పరిశోధన సంస్థల్లో రీసెర్చ్ ఫెలోషిప్ కోసం నిర్వహించిన ప్రవేశ పరీక్ష ప్రశ్న పత్రం కూడా లీక్ అయ్యింది. పరిశోధన రంగంలో ప్రాథమిక స్థాయిలో చేరే విద్యార్థుల కోసం ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్, ఐఐటీల వంటి సంస్థలు కూడా నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్‌పై ఆధారపడుతూంటాయి. పీహెచ్‌డీల్లో ప్రవేశానికి ఈ పరీక్షలో అర్హత సాధించడం తప్పనిసరి. బోధన వృత్తుల్లో స్థిరపడే వారికి కూడా. ఈ పరీక్షలను విశ్వసనీయతతో, సకాలంలో నిర్వహించడం భారతదేశ ఉన్నత విద్య, పరిశోధన రంగాలపై ప్రత్యక్షంగా ప్రభావం చూపుతుందన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఒకపక్క ఈ అనూహ్య పరిస్థితిని ఎదుర్కొంటుండగా, ఇంకోపక్క అంతర్జాతీయ స్థాయిలో పరిశోధన రంగంలో వేగంగా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఈ మార్పుల్లో చైనా కంటే భారత్ బాగా వెనుకబడిపోతూండటం గమనార్హం. పరిశోధన పత్రాల్లో టాప్ప్రపంచంలో ఒక దేశపు శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానాల సత్తాను నిర్ధారించేది ఉన్నత విద్య, పరిశోధన రంగాల కోసం ఏర్పాటు చేసిన మౌలిక సదుపాయాల విస్తృతి ఎంత? అన్నది. ఎంత ఉత్పత్తి అవుతోంది? నాణ్యత ఏమిటి? అన్నది నిర్ధారించేందుకు చాలా మార్గాలున్నాయి. పరిశోధన వ్యాసాల ప్రచురణ, సాధించిన పేటెంట్లు, నోబెల్ వంటి అంతర్జాతీయ అవార్డులు, పారిశ్రామిక రంగానికి బదిలీ అయిన టెక్నాలజీలు, పరిశోధనల ద్వారా సమాజానికి ఒనగూరిన లబ్ధి... ఇలా చాలా మార్గాలున్నాయి. పరిశోధన పత్రాల ప్రచురణే ప్రధాన అంశంగా ఏటా రీసెర్చ్ రంగంలో అగ్రస్థానంలో ఉన్న వారి జాబితాను ‘నేచర్’ జర్నల్ ప్రచురిస్తుంటుంది. ఈ జాబితాలో అత్యున్నత స్థాయి పరిశోధన ఫలితాల ఆధారంగా 500 సంస్థలు ఉంటాయి. ఏటా జనవరి 1 నుంచి డిసెంబరు 31 మధ్య పరిణామాలను పరిగణనలోకి తీసుకుంటారు. మొత్తం 145 అంతర్జాతీయ జర్నళ్లలో ప్రచురితమైన పరిశోధన పత్రాలను పరిశీలించి, ఒక స్వతంత్ర శాస్త్రవేత్తల బృందం ఈ జాబితాను సిద్ధం చేస్తుంది. నేచర్ ప్రచురించిన తాజా జాబితాలో దేశాల పరిశోధన సామర్థ్యాల ఆధారంగా అమెరికా, జర్మనీ, యూకే, జపాన్ , ఫ్రాన్స్, కెనడా, దక్షిణ కొరియాలను కూడా అధిగమించి చైనా అగ్రస్థానంలోకి చేరింది. భారత్ తొమ్మిదో స్థానంలో ఉంటూ... టాప్ 10 దేశాల్లో ఒకటిగా ఉన్నామన్న సంతృప్తి మాత్రమే మనకు మిగిల్చింది. భారత్ వంతు గత ఏడాది చైనా వంతు కంటే ఎక్కువ కావడం కూడా గమనార్హం. అయితే సంస్థల స్థాయిలో పరిశోధన పత్రాలను పరిశీలిస్తే నిరాశే మిగులుతుంది. అంతర్జాతీయంగా టాప్ పది పరిశోధన సంస్థల్లో ఏడు చైనావి కావడం... హార్వర్డ్ (రెండో స్థానం), మ్యాక్స్ ప్లాంక్ సొసైటీ (మూడో స్థానం), ఫ్రెంచ్ నేషనల్ సెంటర్ ఫర్ సైంటిఫిక్ రీసెర్చ్ (ఏడో స్థానం) మాత్రమే టాప్ 10లోని ఇతర సంస్థలు కావడం గమనార్హం. మసాచూసెట్స్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, స్టాన్ ఫర్డ్ యూనివర్సిటీలు సైతం 14, 15 స్థానాల్లో నిలిచాయి. చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ అగ్రస్థానంలో ఉంది. టాప్–10లో లేము!టాప్ సంస్థల్లో భారతీయ పరిశోధన సంస్థలు చాలా దిగువన ఉన్నాయి. ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ 174వ స్థానంలో ఉంటే, ఐఐటీ–బాంబే 247లో ఉంది. కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ 275లో, టాటా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ 283వ స్థానంలోనూ ఉన్నాయి. హోమీ భాభా నేషనల్ ఇన్ స్టిట్యూట్(296), ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్–కోల్‌కతా (321), ఐఐటీ–గౌహతి (355), ఇండియన్ అసోసియేషన్ ఫర్ కల్టివేషన్ ఆఫ్ సైన్స్(363), ఐసర్–భోపాల్(379), ఐఐటీ–కాన్పూర్(405), ఐఐటీ–మద్రాస్(407), ఐఐటీ–ఢిల్లీ (428), ఐసర్–పుణె (439), జవహర్లాల్ నెహ్రూ సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ సైంటిఫిక్ రీసెర్చ్(450), అకాడమీ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇన్నొవేటివ్ రీసెర్చ్(487) ర్యాంకింగ్ కూడా దిగువలోనే ఉండటం గమనార్హం. ర్యాంకింగ్‌ల మాట ఇలా ఉంటే, పరిశోధనలు చేస్తున్న రంగాల విషయం చూద్దాం. భౌతిక, రసాయన, భూ, పర్యావరణ రంగాల్లో చైనా అగ్రస్థానంలో ఉండగా... అమెరికా, యూరప్ రెండూ జీవ, వైద్య శాస్త్రల్లో ముందంజలో ఉన్నాయి. అప్లైడ్ సైన్సెస్ రంగంలోనూ చైనా నుంచే అత్యధిక పరిశోధన పత్రాలు ప్రచురితమవుతుండటం విశేషం.చైనా కొన్ని భారీ సైన్స్ ప్రాజెక్టుల్లో పెట్టుబడులు కూడా పెట్టింది. ప్రపంచంలోనే అతిపెద్ద ఫిల్డ్–అపెర్చర్ రేడియో టెలిస్కోపు అలాంటిదే. కృష్ణ పదార్థం ఉనికిని గుర్తించేందుకు చేపట్టిన భారీ భూగర్భ పరిశోధన ఇంకోటి. అలాగే క్వాంటమ్ కంప్యూటింగ్ రంగంలోనూ పలు చైనా సంస్థల్లో ప్రత్యేక బృందాలు పనిచేస్తున్నాయి. అంతరిక్ష రంగం విషయానికి వస్తే... చైనా మన దేశం కంటే కనీసం పదేళ్లు ముందుందని చెప్పాలి. 2003లో తొలి మానవ సహిత అంతరిక్ష యాత్ర జరపడమే కాదు, సొంతంగా అంతరిక్ష కేంద్రాన్ని నిర్మిస్తోంది. ఇటీవలే జాబిల్లి నుంచి రాతి నమూనాలను విజయవంతంగా వెనక్కు తెచ్చిన రోబోటిక్ మిషన్ చేపట్టింది.మన స్పందన ఎలా ఉండాలి?శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞాన రంగాల్లో చైనా పురోగతికి మనం ఎలా స్పందించాలి? పదేళ్లుగా అధికారంలో ఉన్న ప్రభుత్వం చేస్తున్నట్లే వీటిని తిరస్కరించడం సులువైన పని అవుతుంది. జాబితా తయారీలో పలు లోటుపాట్లు ఉన్నాయని చెప్పవచ్చు. అయితే ఇది వాస్తవ పరిస్థితిని మార్చదు. ఇంకో పద్ధతి కూడా ఉంది. ఈ జాబితాను ఉన్నది ఉన్నట్టుగా అంగీకరించడం. టాప్ దేశాల జాబితాలో భారత్ కూడా ఉంది కాబట్టి, దాని ఆధారంగా మరింత ముందుకు వెళ్లేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేయాలి. చైనా ఈ ఘనతలన్నీ సాధించేందుకు ఏం చేసింది? ఎక్కడ తప్పటడుగులు వేసిందన్నది నిజాయితీగా పరిశీలించి గుణపాఠాలు నేర్చుకోవాలి. ‘నైన్ లీగ్’ లేదా ‘ప్రాజెక్ట్ 211’లో భాగంగా దేశవ్యాప్తంగా యూనివర్సిటీలు, ప్రపంచస్థాయి పరిశోధన శాలలను అభివృద్ధి చేసేందుకు చైనా భారీగా నిధులు ఖర్చు పెడుతోంది. ఐసర్ వంటి సంస్థల అభివృద్ధికి భారత్ చేసిన ప్రయత్నంతో ఎన్నో లాభాలు వచ్చినా ఈ విషయంలో చేయాల్సింది ఇంకా మిగిలే ఉంది. పరిశోధన పత్రాల ప్రచురణకు చైనా నగదు బహుమతులను ప్రకటించి తప్పు చేసిందని చెప్పాలి. దీనివల్ల అనైతిక పద్ధతులు పెరిగిపోయాయి. భారత్ ఇలాంటి పని చేయకుండా ఉండటం అవసరం. భారత్‌లో శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞాన రంగాల్లో పురోగతిని అడ్డుకుంటున్న కొన్ని సాధారణ విషయాల్లో జీడీపీలో కొంత శాతాన్ని ఈ రంగాలకు కేటాయించకపోవడం కూడా ఉంది. నిధుల పంపిణీ పద్ధతులు, కొత్త పరిశోధన సంస్థల ఏర్పాటు, విశ్వవిద్యాలయాల్లో పరిశోధనలకు ప్రోత్సాహం వంటివి స్తంభించిపోయి ఉన్నాయి. నేషనల్ సైన్స్ అకాడమీలు, ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ కార్యాలయం, టెక్నాలజీ ఫోర్కాస్టింగ్ ఏజెన్సీ వంటివి కూడా ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న సెల్ఫీ పాయింట్ల వద్ద విజయోత్సవాలను నిర్వహించడంలో బిజీగా ఉండిపోయాయి. నిద్రాణంగా ఉన్న ఇలాంటి వారందరికీ చైనా పురోగతి ఓ మేలుకొలుపు కావాలి. దినేశ్ సి. శర్మ వ్యాసకర్త సైన్స్ అంశాల వ్యాఖ్యాత(‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
పేస్ట్రీ చెఫ్ నుంచి వెల్నెస్ గురుగా..!
ప్రతి రంగంలో మహిళలు పురుషులకు ధీటుగా విజయం సాధిస్తున్నారు. ఒకే టైంలో విభిన్న రంగాల్లో దూసుకుపోతూ ఔరా..! అనిపించుకుంటున్నారు. అలాంటి కోవకు చెందిందే మాన్వి లోహియా. పేస్ట్రీ చెఫ్‌గా మొదలైన ప్రస్థానం న్యూట్రిషినిస్ట్, వెల్నెస్ నిపుణురాలిగా ఉన్నత స్థాయికి చేరుకుని స్ఫూర్తిగా నిలిచింది. ఎవరీమె? ఆమె జర్నీ ఎలా మొదలయ్యిందంటే..29 ఏళ్ల మాన్వి లోహియా తొలుత పేస్ట్రీ, బేకింగ్ వంటి పాక శాస్తంలో నైపుణ్యం సంపాదించి డిస్నీలో ఫడ్ అండ్ బెవరేజ్ డిపార్ట్మెంట్తో కెరీర్‌ని ప్రారంభించింది. సక్సెఫుల్ బిజినెస్ విమెన్‌గా దూసుకుపోతూ ఓ పక్క తనకు ఇష్టమైన వెల్నెస్పై దృష్టిసారించింది. అలా హర్వర్లో బోస్టన్ విశ్వవిద్యాలయం నుంచి ఎపిడెమియాలజీ బయోస్టాటిస్టిక్స్లో మాస్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్‌ని పూర్తి చేసింది. ఆ తర్వాత ఒకటిన్నర ఏడాది గాయం, గుండె మూత్రపిండాలు, జీర్ణశయాంతర ప్రేగులకు సంబంధించిన ఇంటెన్సివ్ కేర్ యూనిట్(ఐసీయూ)లలో పనిచేసింది. కొన్నేళ్లు ఈ విభాగాల్లో పరిశోధనలు చేసింది. ఆ తర్వాత తన మాతృభూమి భారత్‌కు వచ్చి తన దేశ ప్రజల ఆరోగ్యానికి తోడ్పడాలని భావించింది. అలా ఆమె హరిద్వార్‌లో 'ఏకాంత' అనే వెల్నెస్ సెంటర్‌ని ప్రారంభించింది. మాన్వియా ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న రిజిస్టర్డ్ డైటిషియన్. పైగా దాదాపు 500 మందికి పైగా రోగులకు సేవలందించిన అనుభవం గలది. అంతేగాదు ఆమె ఆఫ్రికాలో కరోనా మహమ్మారి పరిస్థితుల్లో సర్టిఫైడ్ హెల్త్‌కేర్ వర్కర్‌గా పనిచేసిన అనుభవం కూడా ఉంది. ఈ నేపథ్యంతోనే మాన్వియా ఏకాంత వెల్నెస్ సెంటర్‌ని ప్రారంభించి ప్రజలకు ఆరోగ్య సంబంధిత సమస్యలకు విశ్వసనీయమైన సలహాలు, పరిష్కారాలను అందిస్తోంది.తమ ఏకాంత వెల్నస్ సెంటర్లో ప్రజలు మంచి ప్రశాంతమైన వాతావరణంలో ఆరోగ్య సంబంధిత సౌకర్యాలన్నింటిని పొందుతారని నమ్మకంగా చెబుతున్నారు మాన్వి. "ప్రజలు నేటి ఉరుకులు పరుగుల జీవితంలో ఆరోగ్యాన్ని సంరక్షించుకోవడంలో చాలా కష్టపడుతున్నారు. ముఖ్యంగా ఆందోళన ఒత్తిడి వంటి సమస్యలతో బాధపడుతున్నారు. దీంతో వారికి సంప్రదాయ వైద్య చికిత్సలు మంచి ప్రభావాన్ని అందించ లేకపోతున్నాయి. ఈ దైనందిన బిజీ జీవితంలో మంచి ఆరోగ్యం కోసం ప్రశాంతత నుంచే స్వస్థత పొందే యత్నం చేయాలి. అది ఇలాంటి వెల్నెస్ సెంటర్‌తోనే సాధ్యం. అంతేగాదు ప్రశాంతత అనేది పచ్చదనంతో కూడిన అభయారణ్యంతోనే సాధ్యమని భావించి ఆ విధంగానే తన వెల్నెస్ సెంటర్‌ని తీర్చిదిద్దినట్లు చెప్పుకొచ్చారు. ఇక్కడకు విదేశీయులు సైతం వచ్చి ఆరోగ్య సంరక్షణకు సంబంధించిన సలహాలు సూచనలు తీసుకుంటారని చెబుతున్నారు మాన్వియా. చెప్పాలంటే ఇక్కడ మాన్వియా తన అభిరుచులకు అనుగుణంగా తన కెరీర్‌ని తీసుకువెళ్లింది. పాకశాస్త్రం, ఆరోగ్య సంరక్షణ రెండు విభిన్న రంగాలు. కానీ ఆమె ఫుడ్ అండ్ బెవరేజ్ డిపార్ట్మెంట్స్ తోపాటు వెల్నెస్ సెంటర్ రన్ చేయడమే గాక ఆరోగ్య నిపుణురాలిగా, న్యూటిషినిస్ట్గా ఉన్నారు. పట్టుదట, సంకల్పం ఉంటే ఏకకాలంలో విభిన్న రంగాల్లో విజయం సాధించగలమని నిరూపించారు మాన్వి.(చదవండి: చేయని నేరానికి ఏకంగా 40 ఏళ్లు..!ఆ మందుల ప్రభావంతో..) -
గాజాలో కూలుతున్న జ్ఞాన వ్యవస్థలు
ప్రపంచ బ్యాంకు ప్రకారం పాలస్తీనా అక్షరాస్యత రేటు 97.51 శాతం. పాలస్తీనియన్లు ‘ప్రపంచంలోనే అత్యుత్తమ విద్యావంతులైన శరణార్థులు’. అయితే గాజాలోని విశ్వవిద్యాలయాలు ఇప్పుడు ఇజ్రాయెల్ దాడిలో నాశనమయ్యాయి. ఇప్పటివరకూ సుమారు 90 మందికి పైగా ప్రొఫెసర్లు ఈ దాడుల్లో మరణించారు. గాజా పిల్లల విద్యావకాశాలను నిర్మూలిస్తూ... పాఠశాలలు, పుస్తకాల దుకాణాలు, లైబ్రరీలు ధ్వంసమయ్యాయి. పాలస్తీనా విజ్ఞానం, జ్ఞానాన్ని ఉత్పత్తి చేసే సంస్థల వినాశనం సమస్త జ్ఞానాన్ని అంతమొందించడం కంటే తక్కువేమీ కాదు! ప్రపంచవ్యాప్తంగా ఉన్న విద్యావేత్తలు దీనిని అర్థం చేసుకున్నారు. అమెరికా, ఇతర దేశాలలోని విశ్వవిద్యాలయాల్లోని విద్యార్థుల ఆందోళనలకు కారణం అదే.గాజాలోని విశ్వవిద్యాలయాలు, ఇతర విద్యా సంస్థలపై ఇజ్రాయెల్ దాడి పాలస్తీనా విజ్ఞాన, పర్యావరణ వ్యవస్థలను నాశనం చేయడానికి చేసిన ఉద్దేశపూర్వక ప్రయత్నంగా కనిపిస్తుంది. ఇప్పటివరకు, మొత్తం 12 విశ్వవిద్యాలయాలు వైమానిక దాడులకు గురయ్యాయి. ఇజ్రాయెల్ లక్ష్యాలలో అల్–అజహర్ విశ్వవిద్యాలయం, ఇస్లామిక్ యూనివర్సిటీ ఆఫ్ గాజా (ఐయూజీ) ఉన్నాయి. దీని ఫలితంగా పాలస్తీనా అధ్యాపకులు, పండితులు, విద్యార్థులు సంవత్సరాల తరబడి సాగించిన పరిశోధన ధ్వంసమైపోయింది.ఐయూజీ ప్రెసిడెంట్, వైస్ ఛాన్స్లర్ ప్రొఫెసర్ సుఫియాన్ తాయెహ్, ఆయన కుటుంబ సభ్యులు విశ్వవిద్యాలయ క్యాంపస్‌పై జరిగిన ఇజ్రాయెల్ దాడిలో మరణించారు. ఐయూజీ అనేది గాజాకు చెందిన ప్రముఖ విద్యాసంస్థ. ప్రొఫెసర్ తాయెహ్ అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన పరిశోధకుడు. అలాగే, కొనసాగుతున్న దాడిలో మరణించిన 90కి పైగా విశ్వవిద్యాలయ ప్రొఫెసర్లలో ఐయూజీలో ఆంగ్ల సాహిత్యం బోధించే డాక్టర్ రెఫాత్ అలరీర్ మరొకరు.పాలస్తీనా విద్యా మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం, 2024 జనవరి 20 వరకు దాదాపు 4,400 మంది విద్యార్థులు మరణించారు, 7,800 మంది గాయపడ్డారు. 231 మంది ఉపాధ్యాయులు, నిర్వాహకులు మరణించారు, 756 మంది గాయపడ్డారు. అలాగే 378 ప్రభుత్వ నిర్వహణలోని పాఠశాలలతోపాటు, గాజాలో యునైటెడ్ నేషన్స్ రిలీఫ్ అండ్ వర్క్స్ ఏజెన్సీ (యూఎన్ఆర్డబ్ల్యూఏ) నిర్వహణలోని పాఠశాలలు పూర్తిగా లేదా పాక్షికంగా ధ్వంసమయ్యాయి. 2023 అక్టోబర్‌లో యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి కనీసం 97 మంది జర్నలిస్టులు, మీడియా కార్యకర్తలతోపాటు 35,000కు పైగా ప్రజలు మరణించారు.‘‘దాదాపు 90,000 మంది పాలస్తీనియన్ విశ్వవిద్యాలయ విద్యార్థులు గాజాలోని విశ్వవిద్యాలయానికి హాజరు కాలేరు. 60 శాతానికి పైగా పాఠశాలలు, దాదాపు అన్ని విశ్వవిద్యాలయాలు, లెక్కలేనన్ని పుస్తకాల దుకాణాలు, లైబ్రరీలు దెబ్బతిన్నాయి లేదా ధ్వంసమయ్యాయి. గాజా పిల్లలు, యువకుల విద్యావకాశాలను నిర్మూలిస్తూ, యూనివర్సిటీల డీ¯Œ లు, ప్రముఖ పాలస్తీనా పండితులతో సహా... వందలాది మంది ఉపాధ్యాయులు, విద్యావేత్తలు చంపబడ్డారు’’ అని దక్షిణాఫ్రికా న్యాయపరమైన అంశాల ప్రతినిధి బ్లిన్నె నీ ఘ్రాలే అంతర్జాతీయ న్యాయస్థానంలో వెల్లడించారు.ప్రజల చిహ్నాలను, డాక్యుమెంట్ చరిత్రను తుడిచిపెడుతూ లైబ్రరీలు, ఆర్కైవ్‌లు, మ్యూజియంలతో సహా అనేక సాంస్కృతిక వారసత్వ ప్రదేశాలు కూడా ధ్వంసమయ్యాయి. పాలస్తీనా మేధావులు దీనిని ‘చరిత్ర నుండి పాలస్తీనా ఉనికిని తుడిచివేయడానికి’ చేసే ప్రయత్నంగా చూస్తున్నారు. కెనడియన్ అసోసియేషన్ ఆఫ్ యూనివర్సిటీ టీచర్స్‌కు రాసిన లేఖలో కెనడాలోని మౌంట్ రాయల్ యూనివర్సిటీకి చెందిన సోషియాలజీ ప్రొఫెసర్ ముహన్నద్ అయ్యాష్ దీనిని ‘రాజకీయ పటం నుండి పాలస్తీనాను తుడిచిపెట్టే ప్రయత్నం’గా పేర్కొన్నారు. ‘పాలస్తీనా విజ్ఞానం, విజ్ఞాన నిర్మాతలు మరియు జ్ఞానాన్ని ఉత్పత్తి చేసే సంస్థల వినాశనం సమస్త జ్ఞానాన్ని అంతమొందించడం(ఎపిస్టెమిసైడ్) కంటే తక్కువేమీ కాదు’ అని వ్యాఖ్యానించారు.‘ఎపిస్టెమిసైడ్’ అంటే జ్ఞాన వ్యవస్థను చంపడం, మూగబోయేలా చేయడం, నాశనం చేయడం లేదా విలువ తగ్గించడం అని అర్థం. సోషియాలజిస్ట్ బోవెంచురా డి సౌసా శాంటోస్ ఈ పదాన్ని రూపొందించారు. ‘వలస పాలన, అణచివేత, మారణహోమాల కారణంగా అధీన సంస్కృతిలో సంభవించే విజ్ఞాన మరణంగా’ దీనిని ఆయన అభివర్ణించారు. ఇది సైనికపరంగా, సైద్ధాంతికపరంగా రెండు విధాలుగానూ ఉండొచ్చు. ఇది విముక్తి పేరుతో స్వాధీనం, శాంతి పేరుతో దురాక్రమణ, జీవన పవిత్రత పేరుతో జీవన విధ్వంసం, హక్కుల పరిరక్షణ పేరుతో మానవ హక్కులను ఉల్లంఘించే రూపంలో జరగవచ్చు.1948లో ఇజ్రాయెల్‌కు స్థానం కల్పించడం కోసం తాము వైదొలగాల్సి వచ్చిన తర్వాత పాలస్తీనియన్ విద్యావంతులైన ఉన్నతవర్గాలు పాలస్తీనా విద్యావ్యవస్థను పునర్నిర్మించడానికి అత్యంత ప్రాధాన్యమిచ్చాయి. వారు విద్యను తమ జీవితాలను పునర్నిర్మించడానికి, పురోగతిని సాధించడానికి ఒక చోదకశక్తిగా భావించారు. అర్థవంతమైన సాంస్కృతిక మార్పిడి, శాస్త్రీయ పురోగతి, చరిత్రపై అవగాహన, సృజనాత్మక సాహిత్య రచనలతో గాజాను పాలస్తీనా సమాజాన్ని అభివృద్ధి చేసే ప్రదేశంగా మార్చాలనే ఆశతో అనేక మంది పండితులు వివిధ ప్రాంతాల నుండి అక్కడికి వెళ్లారు. ఇందులో వారు విజయం సాధించారా లేదా అనేది చర్చనీయాంశం. కానీ కచ్చితంగా, పాలస్తీనా నేడు అత్యధిక అక్షరాస్యత రేటు ఉన్న ప్రాంతాలలో ఒకటిగా పరిగణించబడుతోంది. ప్రపంచ బ్యాంకు అంచనాల ప్రకారం పాలస్తీనా అక్షరాస్యత రేటు 97.51 శాతం. పాలస్తీనియన్లను ‘ప్రపంచంలోనే అత్యుత్తమ విద్యావంతులైన శరణార్థులు’ అంటారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న విద్యావేత్తలు దీనిని అర్థం చేసుకున్నారు. అమెరికా, ఇతర దేశాలలోని విశ్వవిద్యాలయ ప్రొఫెసర్లు, విద్యార్థుల తిరుగుబాటు వెనుక ఉన్న కారణం అదే. పాలస్తీనా విద్యాసంస్థల్లో జరుగుతున్న ప్రతిధ్వనులు విదేశాల్లోని క్యాంపస్‌లలో వినిపిస్తున్నాయి. ఇజ్రాయెల్ దురాక్రమణకు అమెరికా ప్రభుత్వం అందిస్తున్న నిరంతర ద్రవ్య, సైనిక, దౌత్య, నైతిక మద్దతును నిరసిస్తూ అనేక విశ్వవిద్యాలయాలలో శిబిరాలు ఏర్పాటైనాయి. దాదాపు 10 విశ్వవిద్యాలయాలలోకి పోలీసులను పిలిపించారు, 645 మందిని అరెస్టు చేశారు. అరెస్టు చేసిన వారిలో చాలా మందిని తర్వాత విడుదల చేశారు. ఉన్నత స్థాయి కొలంబియా, బోస్టన్ విశ్వవిద్యాలయాలు నిరసనల కేంద్రాలుగా మారాయి. ఈ రెండు విశ్వవిద్యాలయాల క్యాంపస్‌ల నుండి 200 మందికి పైగా అరెస్టులు చేశారు. గాజాలో కాల్పుల విరమణ పిలుపులో గణనీయమైన సంఖ్యలో అధ్యాపకులు పాల్గొన్నారు లేదా మద్దతు ఇచ్చారు. కొన్ని యూనివర్సిటీలలో ఆందోళన చేస్తున్న విద్యార్థులపై పాలనాధికారులు విరుచుకుపడ్డారు, వారిలో కొందరిని బహిష్కరించారు.లాస్ఏంజిల్స్లోని క్యాలిఫోర్నియా విశ్వవిద్యాలయం,ఇతర ప్రదేశాలలో పాలస్తీనా అనుకూల, ఇజ్రాయెల్ అనుకూల ప్రదర్శనకారుల మధ్య గొడవలు జరిగినట్లు వార్తలు వచ్చాయి. పాలస్తీనా విద్యను విధ్వంసకరమైన విభజన దురదృష్టాల నుండి రక్షించడానికి ప్రపంచం తన స్వరాన్ని పెంచాలి. జ్ఞాన వ్యవస్థను నాశనం చేయడానికి వారాలు పడుతుంది. కానీ దానిని పునర్నిర్మించడానికి దశాబ్దాలు పడుతుంది.ఇజ్రాయెల్‌తో జట్టు కట్టిన దేశాలలోని కొన్ని విశ్వవిద్యాలయాలు దురదృష్టవశాత్తూ పాలస్తీనా సంస్థలతో విద్యా మార్పిడి ఒప్పందాలను కుదుర్చుకోవడానికి విముఖత చూపాయి. మరోవైపు, ఇజ్రాయెల్ విశ్వవిద్యాలయాల విద్యార్థులను అంతర్జాతీయ సహకారానికి చెందిన ప్రయోజనాలను ఆస్వాదించడానికి సాదరంగా స్వాగతించారు. ఇజ్రాయెల్ విశ్వవిద్యాలయాలు కెనడాకు చెందిన పోస్ట్–సెకండరీ సంస్థలతో ఇప్పటికే 60 విద్యా ఒప్పందాలను కలిగి ఉన్నాయి.ముఖ్యంగా అభివృద్ధి చెందిన ప్రపంచంలోని విద్యావేత్తలు, అధ్యాపక సంఘాలు, యూనియన్లు... అస్తవ్యస్తంగా ఉన్న పాలస్తీనా వ్యవస్థను పునర్నిర్మించడానికి వాగ్దానం చేయడంతో పాటు, యుద్ధాన్ని ముగించే వైపుగా ప్రజల అభిప్రాయాన్ని నిర్మించడానికి, ఆత్మపరిశీలన చేసుకోవడానికి ఇది తగిన సమయం.- వ్యాసకర్త నార్తర్న్ బ్రిటిష్ కొలంబియా విశ్వవిద్యాలయ విశ్రాంత ప్రొఫెసర్(‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో)- అమర్జీత్ భుల్లర్ -
కాలం చెల్లిన బాబు నమూనా
ఫ్రెంచ్ వనిత డా‘‘ డెలాల్ బెన్బాబాలి ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీలో సోషల్ జాగ్రఫీ – ఆంత్రో పాలజీ స్కాలర్. ఆమె – ‘క్యాస్ట్ డామినెన్స్ అండ్ టెరిటరీ ఇన్ సౌత్ ఇండియా: అండర్స్టాండింగ్ కమ్మాస్ సోషియో –స్పేషియల్ మొబిలిటీ’ అంశంపై పరిశోధన చేశారు. ఆమె తన పరిశోధనలో ప్రధానంగా దృష్టి పెట్టిన అంశం ఆసక్తికరమైనది. ఒక భూభాగంపై ఆధిపత్యం చలాయించే విషయంలో జనాధిక్యత ఉండే కులాలకూ, ఆధిపత్య కులాలకూ మధ్యఉండే వ్యత్యాసాన్ని బహిర్గతం చేసే ప్రయత్నం చేశారామె. ‘హైదరాబాద్ నగరంలో ఆంధ్ర కల్చర్ విస్తరించడంలో కొత్తగా వలస వచ్చినవారి పాత్ర,’ ‘సామాజిక ఊర్ధ్వ చలనానికి దోహదం చేస్తున్న వలసలు’ వంటి మరో రెండు పరిశోధనా పత్రా లను కూడా గమనిస్తే వాటిల్లో ‘కామన్’గా కనిపి స్తున్న అంశాలు మూడు ఉన్నాయి. అవి – భూమి, వలసలు, ఆధిపత్యం. ఈ అంశాలను, ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు అన్వయించడం జరిగింది. ఆమె విదేశీ స్కాలర్ కనుక ఆమెకు ఇక్కడి రాజకీయాలు, కులాల విషయంలో ఇష్టాయిష్టాలకు ఆస్కారం లేదు. పైగా ఆమె పరిశోధనా వ్యాసాలు 2010కి ముందు కాలం నాటివి. కనుక ఆమె సూత్రీక రణలలోని నిజాయతీని అనుమానించడానికి ఆస్కారం కనిపించదు. అయితే, ఆమె తన మొత్తం పరిశోధనను – ‘ఆధిపత్యం’ వద్దకు తెచ్చి ఒక ముగింపు ఇవ్వడం, అందుకు ఆమె తీసుకున్న ఉదాహరణను ముందుగా మనం గుర్తించాలి. ఆంధ్ర ప్రాంతం నుంచి వలసవచ్చిన చంద్రబాబు కులస్థులు హైదరాబాద్ నగరానికి పశ్చిమాన జూబ్లీ హిల్స్–కూకట్ పల్లికి మధ్య ఉన్న భూములను ఆవాసాలుగా చేసుకుని స్థిరపడ్డారు. దాంతో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఆప్రాంతంలో ‘రియల్ ఎస్టేట్’ వ్యాపారాన్ని ప్రోత్స హించి, దాన్ని ‘సైబరాబాద్’ అంటూ వారు ప్రయోజనం పొందే వ్యూహాన్ని అమలు చేశారు. అతని వ్యూహం మేరకు అది విజయవంతం అయినప్పటికీ, హైదరాబాద్ నగరమే కాకుండా తెలంగాణ జిల్లాల్లో కూడా స్థానికులు వీరి ‘ఆధిప త్యాన్ని’ ప్రశ్నించడంతో రాష్ట్ర విభజన జరిగింది. దాంతో ఏపీ సీఎంగా చంద్రబాబు మళ్ళీ అదే పాత ‘సైబరాబాద్’ వ్యూహాన్ని ఈసారి – ‘రాజధాని అమరావతి’ పేరుతో ఇక్కడ అమలుకు తెర తీశారు. బాబు దాని కోసం, భారత ప్రభుత్వం నియమించిన ‘శివరామ కృష్ణన్ కమిటీ’ నివేదికను సైతం పక్కనపెట్టి, అందుకు ‘ఎన్డీయే’లో టీడీపీ భాగస్వామ్యాన్ని అడ్డంగా వాడుకున్నారు. అమరావతి భూమి పూజకు 2016లో వచ్చిననరేంద్రమోదీ ఆ తర్వాత, బాబు ఏపీ తన సొంత జాగీరు అన్నట్టుగా, విదేశీ కంపెనీలతో నిర్మాణ ఒప్పందాలు, ‘అమరావతి’ భూముల్లో వాటాలు ఇచ్చినా, ఏనాడూ ఇక్కడ జరుగుతున్నది ఏమిటి? అని అడిగింది లేదు. బాబు నిజంగా ‘విజనరీ’ అయితే, కొత్త రాష్ట్రం అభివృద్ధి కోసం మొదటి ఐదేళ్లలో పూర్తి చేయగలిగిన ‘ప్లాన్’ మాత్రమే అమలు చేయాలి. అదే జగన్ మోహన్ రెడ్డి విషయంలో చూడండి. అన్ని ఆర్థిక స్థాయుల్లోని వర్గాలకు ‘సంక్షేమం’అందిస్తూనే, రెండున్నర ఏళ్ళ ‘కరోనా’ కాలాన్ని దాటి, తీరాంధ్ర అభివృద్ధిపై దృష్టి పెట్టి 16 వేల కోట్ల రూపాయలతో 4 పోర్టులు, రూ. 3,793 కోట్లతో 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ లేండ్సెంటర్లు నిర్మిస్తున్నారు. అలా శ్రీకాకుళం నుంచి చిత్తూరు సరిహద్దు వరకు సముద్ర తీరం వెంట సహజ ప్రకృతి వనరుల అభివృద్ధికి పెట్టుబడుల్ని వికేంద్రీకరించడం వల్ల; భవిష్యత్తులో ‘భూమి’ దాని సొంతదారు ‘ఆధిపత్యం’ వంటివి ఇకముందు లేకపోగా, ‘వలసలు’ కూడా ఇకముందు తగ్గుతాయి. డా‘‘ డెలాల్ బెన్బాబాలి తన పరిశోధనా వ్యాసాల్లో ప్రస్తావించిన – భూమి, వలసలు, ఆధిపత్యం అంశాలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జగన్ తన తొలి టర్మ్‌లోనే ‘అడ్రెస్’ చేయడం ఇక్కడ ఆసక్తికరమైన అంశం. ఆమె పరిశోధనా వ్యాసాలు– కమ్మ కులం కేంద్రంగా ఉన్నప్పటికీ, రెడ్ల ప్రస్తావనను ఆమె వదిలి పెట్టలేదు. అయినా ఇక్కడ కులాలు ఏవి అనే ఆరా కంటే, ‘ఎప్పుడు’, ‘ఎవరు’ అనే దృష్టి మనకు ముఖ్యం. దేశం స్వతంత్రమై వందేళ్లకు చేరువ అవుతున్నప్పుడు, వనరుల పంపిణీ అన్ని ప్రాంతాలకూ, అన్ని సామాజిక వర్గాలకూ వారి వారి దామాషా మేరకు చేరే ప్రయత్నం మొద లయిందా లేదా అనేది ఇక్కడ కీలకం. తన మొదటి ఐదేళ్ల టర్మ్ లోనే 13 జిల్లాలను 26గా చేసి ప్రభుత్వాన్ని సూక్ష్మ స్థాయికి తీసుకువెళ్లడంలో జగన్ ప్రభుత్వం విజయవంతం అయింది. రాబోయే ఐదేళ్ల కాలంలో ఇప్పుడు జరుగుతున్న వనరుల పంపిణీ ప్రక్రియ మరింత వేగవంతం అవుతుంది. అనుమానం లేదు, అందువల్ల పేద వర్గాల జీవన ప్రమాణాలు మునుపటి కంటే చాలా బాగా మెరుగవుతాయి. - వ్యాసకర్త మాజీ శాసన సభ్యులుమొబైల్: 98481 28844 - అడుసుమిల్లి జయప్రకాష్ -
భూగర్భ డ్రిప్ ‘స్వర్’ రూపశిల్పికి జాతీయ పురస్కారం!
సాక్షి సాగుబడి, హైదరాబాద్: ఉద్యాన పంటల సాగులో నీటిని అతితక్కువగా వినియోగించే వినత్న భూగర్భ డ్రిప్ ‘స్వర్’ పద్ధతిని ఆవిష్కరించిన హైదరాబాద్‌కు చెందిన సెంటర్ ఫర్ ఎన్విరాన్మెంట్ కన్సర్న్స్ (సిఇసి) డైరెక్టర్ కే.ఎస్. గోపాల్ ‘నీటి సుస్థిరత పురస్కారం 2023–24’ విజేతగా నిలిచారు. ప్రపంచ నీటి దినోత్సవం సందర్భంగా న్యూఢిల్లీలో గురువారం సాయంత్రం జరిగిన సభలో జాతీయ మానవ హక్కుల కమిషన్ ప్రధాన కార్యదర్శి, సీఈఓ భరత్ లాల్ చేతుల మీదుగా గోపాల్ పురస్కారాన్ని అందుకున్నారు. ద ఎనర్జీ అండ్ రిసోర్సెస్ ఇన్స్టిట్యూట్ (తెరి), కేంద్ర జలశక్తి శాఖ, యుఎన్‌డిపి ఇండియా సంయుక్తంగా వాటర్ సస్టయినబిలిటీ అవార్డ్స్‌ను వరుసగా మూడో ఏడాది ప్రదానం చేశాయి. సమర్థవంతంగా నీటి వినియోగానికి దోహదపడిన వారికి 8 విభాగాల్లో పురస్కారాలను అందించారు. ‘ఎక్సలెన్స్ ఇన్ వాటర్ యూజ్ ఎఫీషియన్సీ – అగ్రికల్చర్ సెక్టార్’ విభాగంలో ప్రధమ బహుమతిని సిఇసి డైరెక్టర్ గోపాల్ గెల్చుకున్నారు. సాధారణ డ్రిప్ భూమి పైనే బిందువులుగా నీటిని పంటలకు అందిస్తుంది. గోపాల్ రూపొందించిన స్వర్ డ్రిప్ భూమి లోపల మొక్కల వేరే వ్యవస్థకే నేరుగా నీటిని అందిస్తుంది. అందువల్ల సాధారణ డ్రిప్ కన్నా నీటిని మరింత సమర్థవంతంగా వినియోగించుకోవటం దీని ద్వారా సాధ్యమవుతుంది. ఇవి చదవండి: Srinath Ravichandran: స్పేస్ టెక్ స్టార్టప్ - అంతరిక్షంలో అగ్ని సంతకం! -
తీర ప్రాంత శోధన కోసం ఎన్‌సీసీఆర్ కేంద్రం
పెదగంట్యాడ (విశాఖపట్నం): సముద్ర జలాల నాణ్యతను పర్యవేక్షించడంతో పాటు ప్రిడిక్షన్ ఆఫ్ కోస్టల్ వాటర్ క్వాలిటీ (పీడబ్ల్యూక్యూ), ఎకో సిస్టం, సముద్ర తీర ప్రాంతాల్లో పర్యావరణ పరిరక్షణ కోసం తీసుకోవాల్సిన చర్యలు తదితర అంశాలపై పరిశోధనలు చేసేందుకు ఎన్‌సీసీఆర్ ప్రధాన భూమిక పోషిస్తుందని కేంద్ర భూ విజ్ఞాన శాఖ మంత్రి కిరెన్ రిజిజు అన్నారు. మంగళవారం యారాడలోని డాల్ఫిన్ నోస్‌పై కొత్తగా నిర్మించిన మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ అనుబంధ సంస్థ నేషనల్ సెంటర్ ఫర్ కోస్టల్ రీసెర్చ్ (ఎన్‌సీసీఆర్) కేంద్రాన్ని ఢిల్లీ నుంచి ఆయన వర్చువల్‌గా ప్రారంభించారు. 5.5 ఎకరాల విస్తీర్ణంలో రూ.78 కోట్లతో నిర్మించిన ఈ కేంద్రంలో మరో 6నెలల్లో రీసెర్చ్‌కు అవసరమైన పరికరాలను సిద్ధం చేస్తామన్నారు. వాతావరణంలో వస్తున్న మార్పుల కారణంగా తీర ప్రాంతాల్లో ఇటీవల కాలంలో విపత్తులు ఎక్కువయ్యాయని, ఇటీవల సంభవించిన తుపాన్ల వల్ల ముంబై, చెన్నై వంటి నగరాలు వణికిపోయాయని గుర్తు చేశారు. రాష్ట్రంలో 972 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న తీర ప్రాంతాన్ని పూర్తిగా పరిశీలించి, తీరం వెంబడి ఉన్న సమస్యలను తెలుసుకుని వాటిని పరిష్కరించే విధంగా పరిశోధనలు చేయాలని మినిస్ట్రీస్ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ సెక్రటరీ డాక్టర్ ఎం.రవిచంద్రన్ కోరారు. ఇప్పటివరకూ ఎన్‌సీసీఆర్ కేంద్రాన్ని ఆంధ్ర విశ్వవిద్యాలయంలోని ఎన్విరాన్మెంట్ విభాగంలో నిర్వహిస్తూ వస్తున్నామని, ఇకపై ఈ భవనంలోకి దానిని తరలించనున్నామని ఎన్‌సీసీఆర్ డైరెక్టర్ ఎంవీ రమణమూర్తి చెప్పారు. అనంతరం ఈ కేంద్రం ప్రాంగణంలో మొక్కలు నాటారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రోపికల్ మెటరాలజీ (ఐఐటీఎం), ఎంవోఈఎస్ డైరెక్టర్ డాక్టర్ ఆర్.కృష్ణన్, ఎంవోఈఎస్ డైరెక్టర్ డాక్టర్ విజయ్‌కుమార్, సీపీడబ్ల్యూడీ చీఫ్ ఇంజినీర్ ఎం.వెంకటేశ్వరరావు, పలువురు శాస్త్రవేత్తలు, రీసెర్చ్ విద్యార్థులు పాల్గొన్నారు. -
తీరాన్ని శోధించేందుకు సిద్ధం
సాక్షి, విశాఖపట్నం: ఉష్ణమండల తుపానులు... రుతుపవన సీజన్లో వచ్చే వరదలు... సముద్రమట్టాల పెరుగుదల... మడ అడవుల విస్తీర్ణం తగ్గుదల... పెరుగుతున్న కాలుష్య కారకాల కారణంగా సాగర తీరంలో సంభవిస్తున్న పెను మార్పులు... కోతకు గురవుతున్న తీరప్రాంతాలు... ఇటువంటి విపత్తులన్నింటినీ నియంత్రించేందుకు తీసుకోవాల్సి న ముందుజాగ్రత్త చర్యలపై రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం పరిశోధిస్తోంది. ఈ తరుణంలో మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ అనుబంధ సంస్థ నేషనల్ సెంటర్ ఫర్ కోస్టల్ రీసెర్చ్(ఎన్‌సీసీఆర్) ఆంధ్రప్రదేశ్‌లోని తీర ప్రాంత పరిరక్షణకు నడుం బిగించింది. తీరంలో తలెత్తుతున్న అలజడులపై రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో పరిశోధనలు నిర్వహిస్తూ, సమస్యల పరిష్కారానికి ముందస్తు చర్యలు తీసుకునేలా పక్కా ప్రణాళికలతో అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా విశాఖపట్నంలోని డాల్ఫిన్ నోస్‌పై రీసెర్చ్ సెంటర్‌ను నిర్మించింది. రూ.62 కోట్ల వ్యయంతో 5.5 ఎకరాల విస్తీర్ణంలో ఎన్‌సీసీఆర్ సెంటర్‌ను ఏర్పాటు చేసింది. పరిశోధన కేంద్రంతోపాటు ఎర్త్ సైన్స్ విద్యార్థుల కోసం ప్రత్యేక శిక్షణ కేంద్రాన్ని కూడా సిద్ధం చేసింది. లేబొరేటరీ, పరిశోధన భవనం, వర్క్‌షాప్, ఆడిటోరియం, సెమినార్ హాల్, గెస్ట్ హౌస్, హాస్టల్, ఇతర భవనాలు కూడా నిర్మించింది. దీనిని ఈ నెల 14న కేంద్ర ఎర్త్ సైన్స్ శాఖ మంత్రి కిరణ్ రిజిజు ప్రారంభించనున్నారు. ప్రస్తుతం ఎన్‌సీసీఆర్ తాత్కలిక కేంద్రం ఆంధ్ర విశ్వవిద్యాలయంలోని ఎన్విరాన్మెంట్ విభాగం భవనంలో నిర్వహిస్తున్నారు. దీన్ని డాల్ఫిన్నోస్లో నిర్మించిన నూతన భవనంలోకి నెల రోజుల్లో తరలిస్తారు. ఎన్‌సీసీఆర్ ఏం చేస్తుందంటే... ♦ ఆంధ్రప్రదేశ్ తీరంలో ఉన్న సమస్యలపై విశాఖలోని ఎన్‌సీసీఆర్ కేంద్రం పరిశోధనలు నిర్వహించనుంది. ♦ మొత్తం 972 కిలో మీటర్ల తీరం వెంబడి ఏయే సమస్యలు ఉన్నాయనేది ఎన్‌సీసీఆర్ స్వయంగా పరిశీలించనుంది. ప్రతి అంశంపై పరిశోధనలు నిర్వహించి వాటి పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి కృషిచేస్తుంది. ♦ సముద్ర తీరంలో ఎక్కడ, ఎంత మేర కాలుష్యమవుతోంది. దీనివల్ల మత్స్య సంపద, జీవరాశులకు ఎలాంటి విఘాతం కలుగుతోంది. కాలుష్యం వల్ల సముద్రంలో వస్తున్న మార్పులు, మడ అడవుల విస్తీర్ణం తగ్గడం వల్ల తలెత్తుతున్న ప్రమాదాలు వంటి వాటిపై నిరంతరం పరిశోధనలు నిర్వహిస్తుంది. ♦ ఇప్పటికే దేశవ్యాప్తంగా షోర్లైన్ మేనేజ్మెంట్ అట్లాస్ సిద్ధం చేసిన ఎన్‌సీసీఆర్... త్వరలోనే ఆంధ్రప్రదేశ్ షోర్లైన్ మేనేజ్మెంట్ ప్లాన్‌ను కూడా తయారు చేయనుంది. దీనిద్వారా ఏయే తీర ప్రాంతాలు కోతకు గురవుతున్నాయి.. వాటిని ఎలా పరిష్కరించాలనే విషయంపై స్పష్టత ఇవ్వనుంది. దానిప్రకారం ముందు జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉంటుంది. ♦ సముద్రజలాల నాణ్యతను పర్యవేక్షిస్తుంది. ప్రిడిక్షన్ ఆఫ్ కోస్టల్ వాటర్ క్వాలిటీ(పీడబ్ల్యూక్యూ), ఎకో సిస్టం సర్వీస్, సముద్ర తీర ప్రాంతంలో పర్యావరణ పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యలు వంటి అంశాలపై కూడా పరిశోధనలు చేస్తుంది. ♦సముద్రంలో చేరుతున్న కాలుష్య కారకాలు, పెరుగుతున్న ప్లాస్టిక్ వ్యర్థాలపైనా దృష్టి సారిస్తుంది. ఈ సమస్యలను పరిష్కరించేందుకు ఏం చర్యలు చేపట్టాలనే అంశంపై పరిశోధనలు చేసి నివేదికను రూపొందిస్తుంది. దాని ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి తగిన చర్యలు చేపడతారు. -
ఇంధన సామర్థ్య పరిశోధనల్లో ముందడుగు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో వినూత్న ఇంధన సామర్ధ్య సాంకేతికతలను ప్రోత్సహించే లక్ష్యంతో, ఏపీ స్టేట్ ఎనర్జీ ఎఫిషియెన్సీ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీఎస్‌ఈఈడీసీఓ) ముందడుగు వేసింది. ఇంటీరియర్ పర్మనెంట్ మాగ్నెట్ సింక్రోనస్ మోటర్ (ఐపీఎంఎస్‌ఎం) సాంకేతికతతో ఎనర్జీ ఎఫిషియెంట్ సబ్మెర్సిబుల్ మోటార్‌ను విజయవంతంగా తయారు చేసింది. దీని కోసం సబ్మెర్సిబుల్ వాటర్ పంపింగ్ అప్లికేషన్ల కోసం రూపొందించిన ఎలక్ట్రికల్ మోటార్ డ్రైవ్ సిస్టమ్ డిజైన్ ప్రోటోకాల్‌ను ఆంధ్రా విశ్వవిద్యాలయం అభివృద్ధి చేసింది. ఈ పరిశోధన ప్రాజెక్ట్‌లోని మోడల్ మోటార్‌ను ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ విద్యుత్ సౌధలో శుక్రవారం ఆవిష్కరించారు. వ్యవసాయ రంగంలో పంపుసెట్లు కీలకపాత్ర పోషిస్తాయని, ఐపీఎంఎస్‌ఎం మోటార్ల ద్వారా ఈ రంగంలో విద్యుత్‌ను ఆదా చేయవచ్చని ఆయన తెలిపారు. ఏపీ స్టేట్ ఎనర్జీ కన్జర్వేషన్ మిషన్ (ఏపీఎస్ఈసీఎం) ద్వారా బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ (బీఈఈ) నిధులతో దాదాపు 20 వ్యవసాయ పంపుసెట్లలో ఐపీఎంఎస్‌ఎం సాంకేతికతను ప్రయోగాత్మకంగా అమలు చేయాలని ఏపీఈపీడీసీఎల్‌ను ఈ సందర్భంగా విజయానంద్ ఆదేశించారు. ఆంధ్రా వర్సిటీ ప్రొఫెసర్ మల్లికార్జున్ రావు, ఏపీఎస్‌ఈఈడీసీఓ టెక్నికల్ హెడ్ శ్రీనివాసులుతో కలిసి మోటార్ పనితీరును ఏపీఎస్ఈసీఎం సీఈఓ కుమార రెడ్డి వివరించారు. ఐపీఎంఎస్‌ఎం మోటార్లు సంప్రదాయ ఎలక్ట్రిక్ మోటార్లకు ప్రత్యామ్నాయమని, ఇండక్షన్ మోటార్లతో పోల్చితే తక్కువ విద్యుత్ వినియోగం ఉంటుందని ఆయన తెలిపారు. ప్రస్తుతం ఉన్న టెక్నాలజీ మోటార్లకు 80 శాతం సామర్థ్యం ఉండగా, ఐపీఎంఎస్‌ఎం అనేది 90 శాతం ఉందని వెల్లడించారు. సంప్రదాయ మోటారు జీవిత కాలం సుమారు పదేళ్లుకాగా, అధిక గ్రేడ్ మెటీరియల్స్ కారణంగా ఐపీఎంఎస్‌ఎం మోటార్ సుమారు 18 ఏళ్ల నుంచి 20 ఏళ్ల వరకూ పనిచేస్తుందని చెప్పారు. తక్కువ నిర్వహణ వ్యయం,30శాతం తక్కువ విద్యుత్ వినియోగం ఉంటుందని ఆయన వివరించారు. -
విత్తన పరిశోధనకు మరో ముందడుగు
సాక్షి, అమరావతి: విత్తన రంగంలో మరో విప్లవాత్మక సంస్థ రాష్ట్రంలో అందుబాటులోకి రాబోతోంది. కృష్ణాజిల్లా గన్నవరం వద్ద నిర్మిస్తున్న డాక్టర్ వైఎస్సార్ విత్తన పరిశోధన, శిక్షణా సంస్థ భవన నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఖరీఫ్ సీజన్ ప్రారంభానికి ఈ సంస్థ సేవలు అందుబాటులోకి తీసుకురావాలన్న సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం కృషిచేస్తోంది. రైతులకు నాణ్యమైన సర్టీఫై చేసిన విత్తనాలను అందుబాటులోకి తీసుకురావాలన్న సత్సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం గడిచిన నాలుగున్నరేళ్లలో ఎన్నో విప్లవాత్మక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా.. దేశంలోనే తొలిసారిగా నియోజకవర్గ స్థాయిలో వైఎస్సార్ ఇంటిగ్రేటెడ్ అగ్రి టెస్టింగ్ ల్యాబ్స్‌ను తీసుకొచ్చింది. ఇక్కడ సర్టిఫై చేసిన విత్తనాలనే మార్కెట్లోకి విడుదల చేయడమే కాదు.. ఆర్బీకేల ద్వారా గ్రామస్థాయిలో రైతులకు సరఫరా చేస్తోంది. మరోవైపు.. విత్తన పరిశోధనలకు మరింత ఊతమిచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం ఏపీ విత్తనాభివృద్ధి సంస్థకు అనుబంధంగా రాష్ట్ర విత్తన పరిశోధన, శిక్షణా సంస్థను ఏర్పాటుచేస్తోంది. ఈ తరహా పరిశోధనా కేంద్రం జాతీయ స్థాయిలో ఒక్క వారణాసిలో మాత్రమే ఉంది. స్వాతంత్య్రం సిద్ధించిన తర్వాత ప్రభుత్వపరంగా ఈ తరహా పరిశోధనా కేంద్రాల ఏర్పాటుకు దేశవ్యాప్తంగా ఎక్కడా కనీస ప్రయత్నాలు కూడా జరగలేదు. ఇప్పుడు గన్నవరంలోని విత్తనాభివృద్ధి సంస్థకు చెందిన ఎనిమిది ఎకరాల విస్తీర్ణంలో రూ.45 కోట్ల అంచనాతో తలపెట్టిన ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు గతేడాది మార్చిలో శంకుస్థాపన చేశారు. తొలిదశలో రూ.18 కోట్లతో చేపట్టనున్న నిర్మాణాలకు పరిపాలనామోదం ఇవ్వగా, ఏపీ స్టేట్ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ పర్యవేక్షణలో నిర్మిస్తున్నారు. కొత్త రకాల విత్తనాలకు రూపకల్పన.. ఈ సంస్థ ఏర్పాటుతో రాష్ట్రంలో విత్తన నాణ్యత పరీక్షించే యంత్రాంగం బలోపేతం కానుంది. మానవ వనరుల అభివృద్ధి కార్యకలాపాలను నిర్వహించడం ద్వారా సీడ్ సైన్స్, టెక్నాలజీలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రానుంది. వాతావర ణాన్ని తట్టుకోగల, అధిక దిగుబడినిచ్చే కొత్త రకాల విత్తనాల రూపకల్పనతో పాటు సంకర జాతుల అభివృద్ధిలో ఈ సంస్థ భవిష్యత్తులో కీలక భూమిక పోషించనుంది. జాతీయ స్థాయిలో ఈ రంగంలో ఉన్న ఇతర సంస్థల సమన్వయంతో వ్యవసాయ పట్టభద్రులు, డిప్లమో హోల్డర్లకు కెపాసిటీ బిల్డింగ్ కింద శిక్షణ ఇవ్వనున్నారు. ఏటా కనీసం వెయ్యిమంది అగ్రి గ్రాడ్యుయేట్స్, రెండువేల మంది అగ్రి డిప్లమో హోల్డర్స్‌కు శిక్షణ ఇవ్వడం ద్వారా ఉపాధి అవకాశాలు కల్పించాలని లక్ష్యంగా నిర్దేశించారు. అత్యాధునిక సౌకర్యాలు.. ప్రాజెక్టులో భాగంగా రాష్ట్రస్థాయి విత్తన జన్యు బ్యాంకుతో పాటు సీడ్ గ్రో అవుట్ టెస్ట్ ఫామ్, సీడ్ టెస్టింగ్ ల్యాబ్, గ్రీన్ హౌస్, సీడ్ ప్రాసెసింగ్, కోల్డ్‌స్టోరేజ్ యూనిట్లు ఏర్పాటు కాబోతున్నాయి. అలాగే.. ► విత్తనాలు నిల్వచేసేందుకు ప్రత్యేకంగా గోదాములు నిర్మిస్తున్నారు. ► రైతుల శిక్షణ కోసం ఫార్మర్స్ ట్రైనింగ్ సెంటర్‌తో పాటు వ్యవసాయ పట్టభద్రులు, పీజీ, డిప్లమో చదివే విద్యార్థుల సామర్థ్యాన్ని పెంపొందించి ఈ రంగంలో పరిశోధనల వైపు అడుగువేసే వారికి ప్రత్యేకంగా శిక్షణనిచ్చేందుకు ట్రైనింగ్ సెంటర్, హాస్టల్ భవన సముదాయాలు నిర్మిస్తున్నారు. ► ఇప్పటికే పరిశోధనా సంస్థ భవన సముదాయంతో పాటు ట్రైనింగ్ సెంటర్‌కు సంబంధించి గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్, హాస్టల్ బిల్డింగ్స్ నిర్మాణం పూర్తికావచ్చింది. ► వచ్చే జూలై నాటికి వీటి సేవలను అందుబాటులోకి తీసుకురావాలన్న సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తోంది. విత్తన రంగంలో విప్లవాత్మక మార్పులు రైతులకు అధిగ దిగుబడునిచ్చే నాణ్యమైన, మేలు రకం వంగడాలు అందించేందుకు విస్తృత పరిశోధనలు చేసే దిశగా ఆలోచన చేయాలన్న సీఎం జగన్ సూచనల మేరకు డాక్టర్ వైఎస్సార్ విత్తన పరిశోధన, శిక్షణా సంస్థ ఏర్పాటుకు శ్రీకారం చుట్టాం. సంస్థ సేవలు అందుబాటులోకి వస్తే విత్తన రంగంలో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకోను న్నాయి. – డాక్టర్ గెడ్డం శేఖర్‌బాబు, ఎండీ, ఏపీ విత్తనాభివృద్ధి సంస్థ -
సోషల్ మీడియాలో.. 504 కోట్ల మంది
సాక్షి, అమరావతి: ప్రపంచాన్ని సోషల్ మీడియా ఊపేస్తోంది. చిన్నా, పెద్దా తేడా లేకుండా ప్రతి ఒక్కరూ సోషల్ మీడియాలోని వివిధ యాప్‌లలో గంటలు గంటలు గడిపేస్తున్నారు. గ్లోబల్ వెబ్ ఇండెక్స్ పరిశోధన ప్రకారం.. ప్రపంచ జనాభాలో ఏకంగా 62.30 శాతం మంది సోషల్ మీడియాను వినియోగిస్తున్నట్లు తేలింది. గతేడాదితో పోలిస్తే 26.60 కోట్ల మంది కొత్త వినియోగదారులు సోషల్ మీడియాలోకి వచ్చినట్లు నివేదిక పేర్కొంది. మొత్తంగా యూజర్ల సంఖ్య 504 కోట్లకు చేరిందని వెల్లడించింది. వీరిలో 46.50 శాతం మంది మహిళలు, 53.50 శాతం మంది పురుషులు ఉన్నారు. సగటున ఒక వ్యక్తి రోజువారీ సోషల్ మీడియా వినియోగం 2.23 గంటలుగా నమోదయ్యింది. ఇక ఇంటర్నెట్ ఉపయోగిస్తున్న వారిలో అత్యధికంగా 94.20 శాతం మంది సోషల్ మీడియాలోనే ఉంటున్నారని నివేదిక పేర్కొంది. అమెరికాలో యూట్యూబ్ టాప్ గతంలో సగటున ఒక వ్యక్తి సోషల్ మీడియా ప్లామ్‌ఫారమ్‌ల వినియోగం 6.9 శాతంగా ఉంటే ఇప్పుడు 6.7 శాతానికి తగ్గడం విశేషం. మరోవైపు టాప్–4 సోషల్ మీడియా ఫ్లామ్‌ఫారమ్‌లలో మూడు ‘మెటా’కు చెందినవే ఉన్నాయి. అగ్రస్థానంలో ఫేస్బుక్, యూట్యూబ్, వాట్సాప్, ఇన్‌స్ట్రాగామ్ కొనసాగుతున్నాయి. అమెరికాలో మాత్రం ఫేస్‌బుక్‌ను వెనక్కి నెడుతూ యూట్యూబ్ ఎక్కువ మంది వినియోగదారులను ఆకర్షించింది. -
తిరుమల గిరుల్లో తులిప్ విరులు
తులిప్స్.. ఎన్నెన్నో రంగుల్లో మనసుల్ని ఇట్టే కట్టిపడేస్తాయి. మగువలు సిగలో అలంకరించుకునేందుకు ఉపయోగపడకపోయినా.. వేడుకల అలంకరణలో మాత్రం రాజసాన్ని చాటుతాయి. నింగీనేలా చుంబించే లాలిలో ఓలలాడించే ఈ పుష్ప రాజాలు కశ్మీర్, హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్ కొండ ప్రాంతాల్లో మాత్రమే ప్రస్తుతం సాగులో ఉన్నాయి. కళ్లు తిప్పుకోనివ్వని అందాలతో ఆహ్లాదాన్నిపంచే ఈ పుష్పాలు ఉద్యాన శాస్త్రవేత్తల పుణ్యమా అని ఇప్పుడు తిరుమల గిరులపైనా విరబూస్తున్నాయి. సాక్షి, అమరావతి: అంతర్జాతీయ మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్న తులిప్ పూలను ఏపీలోనూ సాగు చేయించాలన్న తలంపుతో వైఎస్సార్ ఉద్యాన యూనివర్సిటీకి అనుబంధంగా ఉన్న తిరుపతిలోని సిట్రస్ పరిశోధనా స్థానం శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనలు ఫలించాయి. వీటి సాగుకు తిరుమల గిరుల్లోనూ అనువైన వాతావరణం ఉన్నట్టు గుర్తించిన శాస్త్రవేత్తలు ప్రయోగాత్మకంగా చేపట్టిన సాగు సత్ఫలితాలనివ్వడంతో భవిష్యత్‌లో మరిన్ని రకాల సాగుకు సన్నాహాలు చేస్తున్నారు. శీతల పరిస్థితులు గల ఎత్తైన కొండ ప్రాంతాల్లో మాత్రమే సాగయ్యే ఈ పూల మొక్కలు జమ్మూకశ్మీర్, హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాలకే పరిమితమైన తులిప్స్ రానున్న రోజుల్లో కలియుగ దైవం కొలువైన ఏడుకొండలపైనా ఇకపై కనువిందు చేయనున్నాయి. తులిప్స్ పూలకు ప్రత్యేకతలెన్నో..: లిలియాసీ (లిల్లీ) పూల జాతికి చెందిన ఈ పుష్పాలు ప్రపంచంలోనే టాప్–10 కట్ ఫ్లవర్స్‌లో ఒకటిగా ఖ్యాతి చెందాయి. తులిప్‌లో దాదాపు వందకు పైగా రకాలు ఉన్నాయి. వీటిని దుంపల ద్వారా సాగు చేస్తారు. తల్లి దుంపల(బల్బ్సŠ)ను నెదర్లాండ్స్ నుంచి దిగుమతి చేసుకుంటారు. తల్లి దుంపల్ని 2 డిగ్రీల ఉష్ణోగ్రతలో 3 నెలలపాటు ఫ్రీజ్ చేస్తారు. అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెలల్లో వీటిని నాటుకుంటారు. దుంపకు దుంపకు మధ్యలో 8–10 సెం.మీ. దూరంలో దుంప సైజును బట్టి 5–8 సెం.మీ. లోతులో నాటుకోవాలి. మొక్కల మధ్య 15 సెం.మీ., వరుసల మధ్య 10 సెం.మీ. దూరం ఉండేలా చూస్తారు. 20 చదరపు అడుగులకు 100 దుంపల చొప్పున ఎకరాకు 45 వేల దుంపల వరకు నాటుకోవచ్చు. ఏడాది పాటు భూమిలోనే ఉంచితే పిల్ల దుంపలు పుట్టుకొస్తాయి. వాటిని సేకరించి మరుసటి ఏడాది నాటుకోవచ్చు. పుషి్పంచే కాలంలో నీరు పెట్టాల్సిన అవసరం లేదు. నాటిన 45–60 రోజుల్లో పుషి్పస్తాయి. పుష్పించే సమయంలో రాత్రి పూట 5–12 డిగ్రీలు, పగటి పూట 20–26 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు ఉండాలి. 10 రోజుల పాటు తాజాగా..: రెండాకులు ఉండేలా పూలను కత్తిరించి, వాటి తాజాదనం కోల్పోకుండా ప్యాకింగ్ చేసి ఎగుమతి చేస్తారు. మొక్కకు ఒక పువ్వు మాత్రమే పూస్తుంది. కత్తిరించిన తర్వాత కనీసం 5–10 రోజుల వరకు తాజాదనం కోల్పోకుండా ఉంటాయి. పూలు కోసిన తరువాత 10 రోజుల్లో మొక్క ఎండిపోతుంది. ఎండిన మొక్కను తొలగించి భూగర్భంలో ఉన్న దుంప బయటకు తీసి మళ్లీ ఫ్రీజ్ చేయాలి. మరుసటి ఏడాది సీజన్ ప్రారంభమైన తర్వాత మళ్లీ నాటుకోవాలి. ఎత్తైన మడుల్లో డ్రిప్ ఇరిగేషన్ సాయంతో కూడా వీటిని సాగు చేసుకోవచ్చు. వసంతకాలంలో 3–7 రోజుల పాటు వికసించే ఈ పూలు దాదాపు అన్ని రంగుల్లోనూ కనువిందు చేస్తాయి. మెజార్టీ రకాల పూలు ఒకే విధమైన ఆకృతిలో ఉంటాయి. అత్యంత ఖరీదైన ఈ పూల రెమ్మలను తింటారు. కొన్ని వంటకాల్లో ఉల్లికి బదులు వీటి రెబ్బలనే వాడుతుంటారు. మార్కెట్లో ఒక్కో పువ్వు రూ.50 నుంచి రూ.75 వరకు ధర పలుకుతుంది. ఫలించిన పరిశోధన తిరుపతిలోని మైదాన ప్రాంతాలతోపాటు సముద్ర మట్టానికి 980 మీటర్ల ఎత్తులో ఉన్న తిరుమల కొండ ప్రాంతాల్లో ప్రత్యేక నర్సరీ నెలకొల్పి వీటి సాగుపై అధ్యయనం చేశారు. ఏడీ రెమ్, డెన్మార్క్, డౌ జోన్స్, రాజవంశం, ఎస్కేప్, గోల్డెన్ పరేడ్, పింక్ ఆర్డోర్, పురిస్సిమా, పర్పుల్ ఫ్లాగ్ సూపర్ మోడల్ రకాలకు చెందిన తులిప్ దుంపలను డిసెంబర్ 2023లో ఎంపిక చేసిన రెండు ప్రాంతాల్లో నాటారు. రెండుచోట్ల మొలకెత్తినట్టు గమనించినప్పటికీ తిరుమలలో మాత్రం నాటిన ప్రతి దుంప మొలకెత్తింది. డెన్మార్క్ రకం 10–12 రోజుల్లో పూర్తిగా పూలు విచ్చుకోవడాన్ని గుర్తించారు. తిరుమలలో తులిప్ పార్క్ అత్యంత శీతల ప్రాంతంలో సాగయ్యే ఈ పూల సాగుపై మేం చేసిన పరిశోధనలు ఫలించాయి. శ్రీనగర్ తరహాలోనే తులిప్ గార్డెన్స్ పెంచేందుకు తిరుమల గిరులు కూడా అనుకూలమని గుర్తించాం. భవిష్యత్‌లో టీటీడీ సౌజన్యంతో వీటి సాగు దిశగా సన్నాహాలు చేయబోతున్నాం. గుర్రం కొండతోపాటు ఇతర ఎత్తైన ప్రాంతాల్లో వీటి సాగును విస్తరించి పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దేందుకు గల అవకాశాలపై కూడా పరిశోధన చేస్తున్నాం. – ఆర్.నాగరాజు, ప్రిన్సిపల్ సైంటిస్ట్, ఉద్యాన పరిశోధనా కేంద్రం, తిరుపతి -
సుంకాలు తగ్గిస్తే ఆటో పరిశ్రమకు చేటు
న్యూఢిల్లీ: బ్రిటన్ వంటి దేశాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల (ఎఫ్‌టీఏ) కింద ఆటోమొబైల్స్‌పై దిగుమతి సుంకాలను తగ్గిస్తే దేశీ పరిశ్రమకు ప్రతికూలం అవుతుందని ఆర్థికవేత్తల సంస్థ గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనీషియేటివ్ (జీటీఆర్ఐ) ఒక నివేదికలో తెలిపింది. ఆగ్నేయాసియా దేశాలు, జపాన్, కొరియాలతో ఉన్న ఎఫ్‌టీఏల్లో కూడా కార్లపై సుంకాలను భారత్ తగ్గించలేదని పేర్కొంది. ‘ఎఫ్‌టీఏల కింద ఎలక్ట్రిక్ వాహనాలు సహా ఆటోమొబైల్స్‌పై కస్టమ్స్ సుంకాలను భారత్ తగ్గించరాదు. అలా చేస్తే భారత్‌లో బిలియన్ల కొద్దీ డాలర్లు పెట్టుబడి పెట్టిన ఆటో దిగ్గజాలపై ప్రతికూల ప్రభావం పడుతుంది. అవి సంస్థలను మూసుకునే పరిస్థితి ఏర్పడుతుంది‘ అని జీటీఆర్ఐ తెలిపింది. బ్రిటన్ ఎక్కువగా యూరోపియన్ యూనియన్, చైనా నుంచి దిగుమతి చేసుకున్న విడిభాగాలతో కార్లను అసెంబుల్ మాత్రమే చేస్తుంది కాబట్టి ఆ దేశానికి సుంకాలపరమైన మినహాయింపుని ఇచ్చేందుకు సరైన కారణమేమీ లేదని స్పష్టం చేసింది. ఒకవేళ బ్రిటన్‌కి గానీ మినహాయింపులు ఇస్తే జపాన్, కొరియా వంటి ఇతరత్రా ఎఫ్‌టీఏ భాగస్వాములు తమకు కూడా ఇవ్వాలంటూ ఒత్తిడి తెచ్చే అవకాశం ఉందని వివరించింది. ఈ నేపథ్యంలో ప్రస్తుత టారిఫ్ విధానాన్ని కొనసాగిస్తూ, అదనంగా ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాలపరమైన మద్దతును పరిశ్రమకు అందించే అవకాశాన్ని పరిశీలించవచ్చని జీటీఆర్ఐ సూచించింది. పరిశోధనలపై ఇన్వెస్ట్ చేయాలి.. 70 శాతం విద్యుదుత్పత్తి బొగ్గు నుంచే ఉంటున్నందున ఎలక్ట్రిక్ వాహనాలనేవి భారత్‌లో అంతగా పర్యావరణ అనుకూలమైనవేమీ కాదని తెలిపింది. ఎలక్ట్రిక్ వాహనాలకు సబ్సిడీలు ఇచ్చే బదులు కొత్త తరం బ్యాటరీ టెక్నాలజీని అభివృద్ధి చేయడానికి సంబంధించి పరిశోధన కార్యకలాపాలపై ఇన్వెస్ట్ చేయడం శ్రేయస్కరమని జీటీఆర్ఐ పేర్కొంది. దిగుమతి సుంకాలను క్రమంగా 45 శాతం నుంచి 5 శాతానికి తగ్గించేయడంతో ఆ్రస్టేలియాలో చాలా మటుకు స్థానిక కార్ల కంపెనీలు మూతబడ్డాయని తెలిపింది. దానికి విరుద్ధంగా భారత్ అధిక సుంకాలను కొనసాగించడం వల్ల కార్ల పరిశ్రమలోకి గణనీయంగా పెట్టుబడులను ఆకర్షించవచ్చని జీటీఆర్ఐ అభిప్రాయపడింది. దీనివల్ల దేశీయంగా కార్లు, ఆటో విడిభాగాల పరిశ్రమ కూడా అభివృద్ధి చెందగలదని పేర్కొంది. -
దానిపైనే కంపెనీల ఫోకస్.. కలవరపెడుతున్న ఇన్ఫోసిస్ రీసెర్చ్!
ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌కు ప్రాధాన్యం పెరిగింది. మరీ ముఖ్యంగా జనరేటివ్ ఏఐపై కంపెనీలు ఫోకస్ పెడుతున్నాయి. ఈ క్రమంలో ఆసియా పసిఫిక్ కంపెనీలు ఉత్పాదక ఏఐ (GenAI)లో పెట్టుబడులను పెంచుతున్నాయి. భారత్ సహా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, చైనా, జపాన్, సింగపూర్లలో కంపెనీలు 2024లో జనరేటివ్ ఏఐపై పెట్టే ఖర్చు దాదాపు మూడు రెట్లు పెరగనుందని, ఈ ఏడాదిలో ఆయా కంపెనీలు 3.4 బిలియన్ డాలర్లు (రూ.28 వేల కోట్లకు పైగా) ఖర్చు చేయనున్నాయని దేశీయ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ చేపట్టిన ఓ అధ్యయనం అంచనా వేస్తోంది. ఇదీ చదవండి: ఐటీ ఉద్యోగులకు దెబ్బ మీద దెబ్బ! మళ్లీ ఇంకో ప్రముఖ కంపెనీ.. కాగా జనరేటివ్ ఏఐపై ఖర్చు విషయంలో ఉత్తర అమెరికా దేశాల కంటే తక్కుగా ఉన్నప్పటికీ ఆసియా పసిఫిక్ దేశాల్లో ఈ సాంకేతికతపై పరిశోధనలు, అభివృద్ధి అత్యధికంగా ఉన్నట్లు ఇన్ఫోసిస్ పరిశోధన విభాగమైన ఇన్ఫోసిస్ నాలెడ్జ్ ఇన్స్టిట్యూట్ (IKI) తెలిపింది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, చైనా, జపాన్, భారతదేశం, సింగపూర్ దేశాల్లోని వెయ్యి మందికిపైగా బిజినెస్ లీడర్లు, ఏఐ పరిశోధకులతో ఇన్ఫోసిస్ ఈ సర్వే చేపట్టింది. జాబ్స్‌పై ప్రభావం ఉంటుందా? ఆసియా పసిఫిక్ ప్రాంతంలో జనరేటివ్ ఏఐపై భారీగా పెట్టుబడి పెడుతున్న దేశాల్లో చైనా అగ్రగామిగా ఉంది. ఈ ఏడాది చైనా కంపెనీలు ఈ టెక్నాలజీపై పెట్టే ఖర్చు 160 శాతానికిపైగా పెరిగి 2.1 బిలియన్ డాలర్లకు చేరుకోనుంది. అయితే దీని ప్రభావం జాబ్స్‌పై కచ్చితంగా ఉంటుందన్న ఆందోళన ఉద్యోగులను కలవపెడుతోంది. -
రాష్ట్రంలో డిపాజిట్లు పెరిగాయి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో డిపాజిట్లు, క్రెడిట్ పెరిగినట్లు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) రీసెర్చ్ నివేదిక వెల్లడించింది. గత ఐదేళ్లలో ఏపీలో డిపాజిట్ల వార్షిక సగటు వృద్ధి 9.4 శాతం ఉంటే.. అదే సమయంలో ప్రజలకు అవసరమైన క్రెడిట్ కూడా వార్షిక సగటు వృద్ధి 14.3 శాతం నమోదైనట్లు పేర్కొంది. ఐదేళ్లలో బ్యాంకుల్లో ప్రజల డిపాజిట్లు సగటు వార్షిక వృద్ధి 9.4 శాతం నమోదవ్వడం అంటే ప్రజల ఆదాయాలు పెరగడమే నిదర్శనంగా కనిపిస్తోంది. కోవిడ్ సమయంలో కూడా రాష్ట్ర ప్రజల జీవనోపాధికి సమస్యల్లేకుండా రాష్ట్ర ప్రభుత్వం అమలుచేసిన పథకాలు సత్ఫలితాలిచ్చాయనడానికి డిపాజిట్లలో వృద్ధి నిదర్శనంగా నిలుస్తోంది. ఇక నవరత్నాలు ద్వారా అర్హులైన పేదలందరి జీవన ప్రమాణాలు పెంచడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం వారికి నేరుగా నగదు బదిలీని అమలుచేసింది. అలాగే, బ్యాంకుల ద్వారా పేదలతో పాటు రైతులకు, స్వయం సహాయక సంఘాల మహిళలకు, ఎంఎస్ఎంఈలతో పాటు వివిధ పథకాల కింద బ్యాంకుల నుంచి రుణాలు ఇప్పించి వారి ఆదాయాలు మెరుగుపడేలా రాష్ట్ర ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగా.. ► ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలతో పాటు మహిళలకు బ్యాంకుల నుంచి రుణాలు విరివిగా లభించేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలను చేపట్టింది. దీంతో గత ఐదేళ్లలో రాష్ట్రంలో వార్షిక సగటు క్రెడిట్ వృద్ధి 14.3 శాతం నమోదైంది. ► అలాగే, ఇచి్చన రుణాలను సకాలంలో చెల్లించేలా ప్రోత్సహించడానికి రాష్ట్ర ప్రభుత్వం రైతులకు, స్వయం సహాయక సంఘాలకు సున్నావడ్డీ పథకాన్ని అమలుచేస్తోంది. ► అంతేకాక.. నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు లబ్ధిదారులకు పావలా వడ్డీకి రుణాలను ఇప్పిస్తోంది. ► వీధుల్లో, వాడల్లో చిరు వ్యాపారాలు చేసుకునే వారికి బ్యాంకులు ద్వారా సున్నావడ్డీకే రుణాలు ఇప్పిస్తోంది. ► ఇక వైఎస్సార్ చేయూత ద్వారా పేద మహిళలకు ప్రభుత్వం ఆరి్థక సాయం అందించడంతో పాటు బ్యాంకుల ద్వారా రుణాలను మంజూరు చేయించడమే కాకుండా వ్యాపారాలు చేసుకునేలా ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. ► దీంతో ఈ వర్గాలన్నింటికీ బ్యాంకులు విరివిగా రుణాలను మంజూరు చేస్తున్నాయి. ఇలా రుణాలు తీసుకున్న వారు సకాలంలో వాటిని తిరిగి చెల్లిస్తున్నారు. -
ఎప్పుడు లేస్తామన్నదీ కీలకమే!
మా పక్కింటాయన నేను నిద్రలేచే సమయానికి చక్కగా స్నానం ముగించుకొని మరికొన్ని పనులు కూడా చేసి ఆనాటి పనికి సిద్ధంగా ఉంటాడు. అసలు మొదటి నుంచి త్వరగా నిద్రకు ఉపక్రమించి, పొద్దున్నే త్వరగా లేచే వాళ్ళు, ఆరోగ్యంగానూ, ఆనందంగానూ ఉంటారని చెబుతారు. అయితే అందరికి ఆ రకంగా ఉండడం వీలు కాదు. కొంతమంది రాత్రి చాలాసేపు వరకు పని చేసి, ఉదయాన కొంచెం నెమ్మదిగా నిద్ర లేస్తారు. ఈ రకం తేడాలను పరిశోధకులు ‘క్రోనోటైప్’ అని గుర్తిస్తుంటారు. వారు మాత్రం త్వరగా నిద్రలేచేవారు గొప్పవారు, మిగతావారు కారు అన్న విషయాన్ని అంత సులభంగా అంగీకరించరు. అన్నిటికన్నా ముందు గుర్తించవలసిన విషయం మరొకటి ఉంది. కనీసం 60 శాతం మంది అటు రాత్రి పని చెయ్యరు, ఇటు ఉదయాన త్వరగా లేవరు. వాళ్ళ పద్ధతి రెండు పద్ధతుల కలగలుపుగా ఉంటుంది. క్రోనోటైప్స్ అన్నది కేవలం నిద్రకు ఉపక్రమించడం, ఉదయాన నిద్ర లేవడం అన్న లక్షణాల మీదనే ఆధారపడి లేదు అంటున్నారు పరిశోధ కులు. ఇంగ్లీష్‌లో రాత్రి పనిచేసే వాళ్లను గుడ్లగూబలు, త్వరగా నిద్రలేచే వాళ్ళను భరత పక్షులు అంటారు. ఈ తేడాలకు రకరకాల కారణాలు ఉంటాయి. కొన్ని ఉద్యోగాలలో రాత్రి పని చేయవలసి వస్తుంది. కొంత మందికి అవసరం ఉండదు. పరిశోధకులు చెబుతున్న ప్రకారం సాధారణంగా ఆడవాళ్ళు రాత్రి ఎక్కువసేపు మెలకువగా ఉంటారు. మగవాళ్లు ఎక్కువగా ఉదయాన త్వరగా లేస్తారు అనే అర్థం అవుతున్నది. ఈ తేడాలకు మరొక కారణంగా వయసు కూడా ఉంది. కుర్రవాళ్లు గబ్బిలాలుగా రాత్రి ఎక్కువ సేపు మేల్కొంటారట. వయసు పెరుగుతున్న కొద్దీ, త్వరగా పడుకుని త్వరగా లేవడం అలవాటు అవుతుందట. ఇంతకు నిద్ర, మెలకువల కారణంగా ఆనందంగా బతకడం గురించి చాలా పరి శోధనలు జరిగాయి. ఉదయాన త్వరగా లేచేవారు దినమంతా హుషారుగా, సాధార ణంగా ఆనందంగా ఉంటారు. టర్కీలోని ఒక విశ్వవిద్యాలయంలో జరిగిన పరిశోధనలో త్వరగా నిద్ర లేచే వాళ్ళు ఎక్కువ ఆనందంగా ఉన్నట్టు తేలింది. విద్యార్థులు త్వరగా నిద్ర లేస్తే పరీక్షల్లో మంచి మార్కులు సంపాదిస్తున్నారు అని కూడా తెలిసింది. విద్యార్థులలో 26.6 శాతం మంది గబ్బిలాలు (అంటే రాత్రి ఎక్కువ సేపు మెలకువగా ఉంటారు). అటువంటి వారికి ఆనందం తక్కువగా ఉందట. భరత పక్షులు అనిపించుకున్న పిల్లలు చురు కుగా ఉన్నారట. ఈ మధ్య ఒక జర్మన్ యూని వర్సిటీ పరిశోధనలో త్వరగా నిద్రలేచే వాళ్ళకు జీవితాలలో మంచి సంతృప్తి ఉంటుంది అని తెలిసింది. ఇక రాత్రి ఎక్కువ కాలం మెలకువ ఉండేవారిలో డిప్రెషన్, కాలానుగుణంగా మరికొన్ని మానసిక సమస్యలు, మత్తు పదార్థాల వాడకం వంటి సమస్యలు కనిపించాయి. విషయం అను కున్నంత సజావుగా లేదు. రాత్రి ఎక్కువ కాలం మెలకువగా ఉన్న వాళ్లు, అసలు తక్కువ కాలం నిద్రపోతున్నట్టు తెలుస్తున్నది. త్వరగా నిద్రలేవడం కన్నా నిద్ర సమయం ఎక్కువ సమస్యగా ఉంటున్నది. త్వరగా నిద్రలేచే వారికీ తమ మీద తమకు మంచి నియంత్రణ ఉన్నట్టు కూడా కనిపించింది. ఇంతకు నిద్రలో ఈ తేడాలు అసలు ఏ కారణంగా మొదలవు తాయి? సహజంగా ఉన్న ఈ పరిస్థితిని ప్రయత్నించి మార్చడానికి వీలు కుదురుతుందా అన్నది మరో ప్రశ్న. ఈ అంశం గురించి వార్విక్ విశ్వవిద్యాలయంలో వివరంగా పరిశోధనలు జరిగాయి. అక్కడ తమను తాము చక్కని క్రమశిక్షణతో నియంత్రించుకోగల వారు త్వరగా పడుకొని త్వరగా నిద్రలేస్తారు అని గమనించారు. అసలు వ్యక్తిత్వంలో స్వయం నియంత్రణ, చక్కని క్రమపద్ధతి, ఆశాభావం ఉంటే నిద్ర వారి నియంత్రణలో ఉంటుంది అని గమనించారు. ఇక సులభంగా మనసును బయటపెట్టి గలగలా మాట్లాడే వారు, రహస్యాలు దాచుకోకుండా ఉండేవారు రాత్రి ఎక్కువ కాలం మెలకువగా ఉంటున్నారని గమనించారు. జన్యుపరంగా వ్యక్తిత్వ లక్షణాలు వచ్చేవారు, దాని ఆధారంగా నిద్ర విషయంగా కూడా తేడాలు కనబరుస్తారని తెలిసింది. అన్నిటికీ మించి మరొక్క విషయం గుర్తించాలి. క్రోనోటైప్స్ అంటే గుడ్లగూబలు (రాత్రి పని చేసేవారు), భరత పక్షులు (త్వరగా నిద్రలేచే వారు) అన్న లక్షణాలు, శిలాక్షరాలుగా గట్టిగా నిలిచి ఉండవు అంటున్నారు. ఈ పరిస్థితి జన్యుపరంగా కాక మరెన్నో లక్షణాల కారణంగా స్థిరమవుతుంది. కేవలం జన్యు కారణాల వల్లనే కాక నిద్ర తీరు మీద మరెన్నో ప్రభావాలు ఉన్నాయి. కనుక ఈ లక్షణాలు కొంత ప్రయత్నిస్తే మారే అవకాశం కూడా ఉంటుంది అంటున్నారు పరిశోధకులు. త్వరగా నిద్ర లేవదలుచుకున్నవారు, రాత్రి నిద్రకు ఉపక్రమించే ముందు, ఫోన్, కంప్యూటర్ వంటి ఎలక్ట్రానిక్ పరికరాలతో ఎక్కువగా పని చేయకుండా ఉండటం మంచిది అంటున్నారు. ఉదయాన త్వరగా నిద్ర లేచినందుకు చక్కని బహుమతి కూడా ఉండేట్లు ఏర్పాటు చేసుకోవాలని వారి సలహా. నిద్ర లేవగానే హాయిగా వేడి వేడి కాఫీ తాగడం కూడా అటువంటి బహుమతులలో ఒకటి కావచ్చు. లేదంటే త్వరగా లేచినందుకు హాయిగా వాకింగ్‌కు వెళ్లి రావచ్చు. వార్సా యూనివర్సిటీలో ఈ అంశం గురించి మరికొన్ని పరిశోధనలు జరిగాయి. రుతువుల ప్రకారం కూడా నిద్రపోయే విషయంలో మార్పులు వస్తాయి అని అక్కడ గమనించారు. దినమంతా చురుకుగా పని చేయాలి, బ్రతుకులో మంచి గమ్యాలు ఉండాలి. అప్పుడు సమయానికి నిద్ర వస్తుంది. కావాలనుకున్నప్పుడు మెలకువ కూడా వస్తుంది. అది చివరగా అర్థం చేసుకోవాల్సిన సూత్రం. వ్యాసకర్త సైన్స్ రచయిత డా‘‘ కె. బి. గోపాలం -
పీఎం స్వనిధిలోనూ అక్కచెల్లెమ్మలదే అగ్రస్థానం
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అత్యున్నత లక్ష్యాల్లో ఒకటైన మహిళా సాధికారత ఈ నాలుగున్నరేళ్ల సుపరిపాలనలో కళ్ల ముందు కనిపిస్తోంది. వైఎస్ జగన్ ప్రభుత్వ ప్రోత్సాహంతో రాష్ట్రంలోని అక్కచెల్లెమ్మలు అన్ని రంగాల్లోనూ ముందడుగు వేస్తున్నారు. చిన్న వ్యాపారులు, సూక్ష్మ పరిశ్రమలకు కేంద్రం అందించే పీఎం స్వనిధి పథకాన్ని సద్వినియోగం చేసుకుని, కుటుంబాలను ఆర్థికంగా బలోపేతం చేసుకోవడంలోనూ రాష్ట్ర మహిళలు దేశంలోనే అగ్రస్థానంలో ఉన్నారు. రాష్ట్రంలోని పీఎం స్వనిధి రుణ గ్రహీతల్లో 74 శాతం మహిళలే. పురుషులు 26 శాతం ఉన్నారు. జాతీయ స్థాయిలో 57 శాతం పురుషులు ఈ రుణాలు తీసుకుంటుండగా, మహిళలు 43 శాతమే ఉన్నారు. ఎస్బీఐ రీసెర్చి నివేదిక ఈ వాస్తవాలను వెల్లడించింది. ఈ రుణాలను చురుగ్గా సద్వినియోగం చేసుకోవడంలోనూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలోనే రెండో స్థానంలో ఉంది. జాతీయ స్థాయిలో రుణాలను చురుగ్గా ఖర్చు చేస్తున్న లబ్దిదారులు 22 శాతం మంది కాగా, ఏపీలో వీరు 28 శాతమని ఎస్బీఐ రిసెర్చి నివేదిక తెలిపింది. తొలి స్థానంలో ఉన్న పంజాబ్ రాష్ట్రంలో 32 శాతం మంది చురుగ్గా వ్యయం చేస్తున్నట్లు పేర్కొంది. అతి తక్కువగా పశ్చిమ బెంగాల్లో 17 శాతం మంది, జార్ఖండ్‌లో 18 శాతం మందే చురుగ్గా వ్యయం చేస్తున్నట్లు నివేదిక పేర్కొంది. లక్ష్యానికి మించి రుణాలు తొలి దశలో రూ.10 వేల చొప్పున దేశవ్యాప్తంగా 50 లక్షల మందికి రుణాలివ్వాలని కేంద్రం నిర్ణయించినప్పటికీ, డిమాండ్ భారీగా ఉండడంతో 2023 డిసెంబర్ నాటికి 63 లక్షల మందికి ఇవ్వాలని నిర్ణయించింది. మొత్తం మూడు దశల్లో 88.5 లక్షల రుణాలివ్వాలని నిర్ణయించింది. అదేవిధంగా రాష్ట్రంలో తొలి దశలో 2,30,000 మందికి వర్తింపజేయాలని నిర్ణయించగా, ఇప్పుడు ఈ లక్ష్యాన్ని 3,15,000కు పెంచింది. రెండో దశలో 1,34,200 మందికి, మూడో దశలో 18,900 మందికి రుణాలు లక్ష్యంగా నిర్దేశించింది. ఇప్పటి వరకు మూడు దశల్లో కలిపి రాష్ట్రంలో 4,02,718 దరఖాస్తులకు రూ.528.85 కోట్ల రుణాలు మంజూరు చేశారు. రాష్ట్రంలో ఈ రుణాలను 15 రోజుల్లోగా బ్యాంకులు మంజూరు చేస్తున్నాయి. దరఖాస్తుదారుల్లో సగటు వయస్సు 42 సంవత్సరాలుగా ఉంది. ఇదీ పథకం.. దేశవ్యాప్తంగా పట్టణ ప్రాంతాల్లోని వీధి వ్యాపారులకు సాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం కోవిడ్ మహమ్మారి సమయంలో 2020 జూన్‌లో ‘ప్రధాన మంత్రి వీధి వ్యాపారుల ఆత్మ నిర్భర్ నిధి (పీఎం స్వనిధి)’ని ప్రవేశపెట్టింది. వీధి వ్యాపారులు, చిన్న వ్యాపారులకు ఈ రుణాలు అందజేస్తారు. ఈ పథకం కింద బ్యాంకుల ద్వారా తొలుత రూ.10 వేలు రుణ సాయం చేస్తారు. ఈ రుణాన్ని సకాలంలో చెల్లించిన వారికి వ్యాపారాభివృద్ధి కోసం రెండో దశలో రూ. 20 వేలు, మూడో దశలో రూ. 50 వేలు మంజూరు చేస్తారు. వీరికి కేంద్రం వడ్డీలో ఏడు శాతం రాయితీ కూడా ఇస్తుంది. -
వ్యక్తిగత డేటా చౌర్యం సంగతే తెలియడం లేదు
న్యూఢిల్లీ: సైబర్ దాడుల బారిన పడినవారిలో చాలా మందికి తమ వ్యక్తిగత డేటా చోరీకి గురైన సంగతే తెలియడం లేదు. ప్రతి ముగ్గురిలో ఒక్కరి పరిస్థితి ఇలాగే ఉంటోంది. సైబర్ సెక్యూరిటీ సంస్థ రుబ్రిక్ తరఫున వేక్ఫీల్డ్ రీసెర్చ్ నిర్వహించిన ఒక సర్వేలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. కనీసం 500 మందికి పైబడి సిబ్బంది ఉన్న 1,600 పైగా సంస్థలు ఇందులో పాల్గొన్నాయి. గత 30 ఏళ్లుగా సైబర్ దాడులను నివారించడంపైనే పరిశ్రమ ఎక్కువగా దృష్టి పెడుతోందని రుబ్రిక్ సీఈవో బిపుల్ సిన్హా తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో సైబర్ దాడులు తప్పకుండా జరిగే అవకాశాలే ఉన్నాయని భావించి, వాటిని దీటుగా ఎదుర్కొనే సన్నద్ధతను సాధించాల్సిన అవసరం ఏర్పడిందని ఆయన పేర్కొన్నారు. ‘అంతర్జాతీయంగా సైబర్ పరిశ్రమ ఏడాదికి 200 బిలియన్ డాలర్ల ఆదాయం ఆర్జిస్తోంది. అయితే, రుబ్రిక్ జీరో ల్యాబ్ రిపోర్ట్ ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ప్రతి ముగ్గురిలో ఒకరి డేటా చౌర్యానికి గురవ్వడమే కాకుండా ఆ విషయం వారికి కనీసం తెలియకపోవడమనేది ఆందోళనకర విషయం‘ అని సిన్హా పేర్కొన్నారు. నివేదికకు సంబంధించిన మరిన్ని విశేషాలు.. ► ఈ ఏడాది జూన్ 30–జులై 11 మధ్య కాలంలో 10 దేశాల్లో ఈ సర్వే నిర్వహించారు. ► నివేదిక ప్రకారం సగం పైగా సంస్థల్లో (53 శాతం) గతేడాది కీలకమైన సమాచారం చోరీకి గురైంది. ప్రతి ఆరు కంపెనీల్లో ఒక సంస్థ (16 శాతం) పలు దఫాలుగా సైబర్ దాడులతో నష్టపోయింది. ► దేశీయంగా ఐటీ లీడర్లలో 49 శాతం మంది .. తమ సంస్థ డేటా పాలసీలో భద్రత అంశం లోపించినట్లు అభిప్రాయపడ్డారు. వచ్చే 12 నెలల్లో తమ సంస్థల్లో కీలక డేటా చోరీకి గురయ్యే రిస్కులు అత్యధికంగా ఉన్నాయని 30 శాతం మంది తెలిపారు. ► సాధారణంగా కంపెనీల్లో డేటా గత 18 నెలల్లో మొత్తం మీద 42 శాతం పెరిగింది. సాఫ్ట్వేర్ యాజ్ ఎ సరీ్వస్ (సాస్) రూపంలో డేటా 145 శాతం, క్లౌడ్‌లో (73 శాతం), సంస్థ భౌతిక కార్యాలయాల్లో 20 శాతం మేర పెరిగింది. ► ఒక సాధారణ సంస్థ భద్రపర్చుకోవాల్సిన డేటా వచ్చే ఏడాదిలో 100 బీఈటీబీ (బ్యాక్–ఎండ్ టెరాబైట్)కి పెరుగుతుందని, వచ్చే అయిదేళ్లలో 7 రెట్లు వృద్ధి చెందుతుందని నివేదిక పేర్కొంది. ► డేటా వృద్ధితో సమానంగా రిస్కులను ఎదుర్కొనేలా డేటా భద్రతను పెంచుకోలేకపోతున్నట్లు 34 శాతం మంది దేశీ ఐటీ లీడర్లు తెలిపారు. కీలకమైన డేటాను కాపాడుకోవడంలో కృత్రిమ మేథ (ఏఐ) వినియోగం సానుకూల ప్రభావం చూపగలదని 54 శాతం దేశీ కంపెనీలు భావిస్తుండగా, ఏఐ ఎటువంటి ప్రభావం చూపదని 24 శాతం సంస్థలు భావిస్తున్నాయి. -
ఫన్సెర్చ్ను క్రియేట్ చేసిన గూగుల్.. ఇదే ప్రత్యేకత
కృత్రిమమేధ ఆవిష్కరణలతో అనేక రంగాల్లో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఈ సాంకేతికత ఆధారంగా గణిత, వైద్య, న్యాయ, మానసిక శాస్త్రాలు, కోడింగ్‌కు సంబంధించి అడిగే కఠిన ప్రశ్నలకు వెంటనే సమాచారం లభిస్తోంది. సమీప భవిష్యత్తులో సమాజానికి ఇది ఎంతో మేలు చేస్తుందని కొందరు భావిస్తున్నారు. ఆధునిక సాంకేతిక ప్రపంచాన్ని కృత్రిమమేధ (ఏఐ) కొత్తపుంతలు తొక్కిస్తోంది. తాజాగా సంక్లిష్ట గణిత సమస్యలను వెంటనే పరిష్కరించే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) మోడల్ ఫన్సెర్చ్ను గూగుల్ డీప్‌మైండ్ పరిశోధకులు క్రియేట్ చేశారు. క్లిష్టమైన గణిత సమస్యలను గూగుల్ ఫన్సెర్చ్ ఏఐ మోడల్ సులభంగా పరిష్కరిస్తుందని చెబుతున్నారు. ఇప్పటివరకూ జవాబు దొరకని కొన్ని గణిత సమస్యలను పరిష్కరించేలా కృషి చేసినట్లు తెలిసింది. లార్జ్ ల్యాంగ్వేజ్ మోడళ్లు (ఎల్ఎల్ఎం)ను ఉపయోగించి ఈ ఆవిష్కరణలు చేసినట్లు ఓ మీడియా కథనం ద్వారా తెలుస్తోంది. ఎల్ఎల్ఎంలు ఇన్నిరోజులు కేవలం ఊహాత్మక కంటెంట్‌ను జనరేట్ చేస్తాయనే భావన ఉండేదని శాస్త్రవేత్తలు చెప్పారు. కానీ వాటిని సరైన రీతిలో వినియోగించుకుని మార్గనిర్దేశం చేస్తే అవి ఆవిష్కరణలకూ తెరతీస్తాయని శాస్త్రవేత్తల బృందం తెలిపింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి డీప్‌మైండ్ ప్రాథమిక గణితం, కంప్యూటర్ సైన్స్‌లోని చాలా సవాళ్లను ఫన్సెర్చ్ ద్వారా సాధించిందని సమాచారం. గూగుల్ డీప్‌మైండ్ వైస్ ప్రెసిడెంట్ పుష్మీత్ కోహ్లీ సారథ్యంలోని ప్రత్యేక పరిశోధక బృందం ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడాలజీ ద్వారా గణితంలో సంక్లిష్ట సమస్యలను పరిష్కరిస్తోందని తెలిసింది. ఇదీ చదవండి: బంగారం, వెండి కొనాలంటే ఇప్పుడు కొనేయండి.. ఎందుకంటే? -
‘ఒంగోలు’ జాతి పరిరక్షణకు గుర్తింపు
సాక్షి, అమరావతి: అరుదైన, అంతరించిపోతున్న ఒంగోలు జాతి ఆవుల పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వ తోడ్పాటుతో కృషిచేస్తున్న శ్రీవేంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయానికి అనుబంధంగా పనిచేస్తున్న గుంటూరు లాంలోని పశుపరిశోధన స్థానాన్ని బ్రీడ్ కన్జర్వేషన్ అవార్డు–2023 వరించింది. జాతీయస్థాయిలో అరుదైన, అంతరించిపోతున్న జాతుల పరిరక్షణకు కృషిచేసే పరిశోధన సంస్థలకు భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి (ఐసీఏఆర్) ఏటా ఈ అవార్డులను ప్రదానం చేస్తుంది. గతేడాది పుంగనూరు జాతి పరిరక్షణ కోసం కృషిచేస్తున్న పలమనేరులోని పుంగనూరు పరిశోధన కేంద్రానికి ఈ అవార్డు లభించింది. ఈ ఏడాది ఒంగోలు జాతి పరిరక్షణకు కృషిచేస్తున్న పరిశోధన స్థానానికి ప్రతిష్టాత్మకమైన బ్రీడ్ కన్జర్వేషన్ అవార్డును ప్రకటించారు. కిసాన్ దివస్ సందర్భంగా ఈ నెల 23న హరియాణలోని కర్నల్ళక్ష జరిగే కార్యక్రమంలో ఈ అవార్డు కింద ప్రత్యేక ప్రశంసాపత్రం, నగదు బహుమతి ప్రదానం చేయనున్నారు ఒంగోలు జాతికి శతాబ్దాల చరిత్ర ఒంగోలు జాతి పశువుల స్వస్థలం ఒకప్పటి ఒంగోలు, గుంటూరు, నరసరావుపేట తాలూకాలైనప్పటికీ వీటి పుట్టినిల్లు దక్షిణాన పెన్నా, ఉత్తరాన కృష్ణానదుల మధ్యకు వ్యాపించింది. 1900 దశకంలో ప్రతి రైతు దగ్గర నాలుగు నుంచి ఎనిమిది ఒంగోలు ఆవులుండేవి. కానీ క్రమేపీ ఇవి అంతరించిపోతున్న జాతుల జాబితాలోకి చేరాయి. మంచి పాలసార కలిగిన జాతిగా ఇవి అంతర్జాతీయ ఖ్యాతి గడించాయి. ఏ వాతావరణాన్ని అయినా తట్టుకునే శక్తి, వ్యా«ధినిరోధక శక్తి కలిగి ఉండడంతో పాటు భారీ శరీరంతో ఆకర్షణీయంగా ఉండడంతో ఒంగోలు జాతిపశువులు విదేశీయులను విశేషంగా ఆకర్షించాయి. ఫలితంగా తొలుత 1875లో బ్రెజిల్, 1885లో అమెరికా వీటిని తమ దేశానికి తీసుకెళ్లాయి. క్రమంగా ఒంగోలు జాతి అక్కడి నుంచి లాటిన్ అమెరికా దేశాలకు విస్తరించింది. బ్రెజిల్లో ఒంగోలు జాతిని నెలోర్, సంబా ఒంగోలు జాతిగా పిలుస్తారు. మన ఒంగోలు, గిర్, కాంక్రెజ్ జాతుల కలయికతో ఇండుబ్రెజిల్ జాతిని అభివృద్ధి చేశారు. అలాగే జమైకాలో ఒంగోలు జాతి ద్వారా బ్రాహ్మన్, వెనెజ్యులాలో ప్రిడియన్, ఒంగోలు జాతుల కలయికతో ఒంక్యాంపో అనే కొత్తజాతిని అభివృద్ధి చేశారు. ఐవీఎఫ్ ద్వారా మేలుజాతి ఒంగోలు ఆవుల అభివృద్ధి 2019లో ‘ఐవీఎఫ్–ఎంబ్రియో ట్రాన్స్ఫర్ టెక్నాలజీ (ఐవీఎఫ్అండ్ఈటీ) ద్వారా మేలు జాతి ఆవుల అభివృద్ధి ప«థకానికి రూ.2.39 కోట్ల అంచనా వ్యయంతో ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అత్యుత్తమ జన్యు లక్షణాలు, మంచి పాలసార గలిగిన దేశీ ఆవుల సంతతిని అభివృద్ది చేయుడం ఈ ప్రాజెక్టు లక్ష్యం. ఈ ప్రాజెక్టు ద్వారా అత్యుత్తమమైన ఇన్విట్రో ఫెర్టిలైజేషన్, పిండ మార్పిడి ప్రక్రియ ద్వారా మేలు జాతి ఒంగోలు, పుంగనూరు జాతి పిండాలు ఉత్పత్తి చేసి తద్వారా ఆ జాతుల పరిరక్షణకు కృషిచేస్తున్నారు. ప్రస్తుతం 450 దేశీయ మేలుజాతి ఒంగోలు పశుసంపద కలిగిన లాం పశుపరిశోధన స్థానం ఒంగోలు జాతి ప్రత్యుత్పత్తి, జీవ సాంకేతికతలో ‘సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్’గా ఉంది. అవార్డుతో మరింత బాధ్యత ఒంగోలు జాతి పరిరక్షణ కోసం దశాబ్దాలుగా కృషిచేస్తున్నప్పటికీ.. నాలుగున్నరేళ్లుగా ఐవీఎఫ్, ఎంబ్రియో ట్రాన్స్ఫర్ టెక్నాలజీ ద్వారా మేలుజాతి ఒంగోలు ఆవుల అభివృద్ధితో విశేష గుర్తింపు లభించింది. గుంటూరు పశుపరిశోధన స్థానాం ద్వారా చేస్తున్న నిర్విరామ కృషికి గుర్తింపుగా హరియాణలోని కర్నల్లోగల ఐసీఏఆర్–నేషనల్ బ్యూరో ఆఫ్ యానిమల్ జెనిటిక్ రిసోర్సస్ (ఐసీఏఆర్ అండ్ ఎన్బీఏజీఆర్) నుంచి ‘జాతి పరిరక్షణ అవార్డు–2023’ లభించింది. ఈ అవార్డు ద్వారా ఒంగోలు జాతి పరిరక్షణ, అభివృద్ధి కోసం మరిన్ని పరిశోధనలు చేసేందుకు యూనివర్సిటీకి మరింత తోడ్పాటు లభించనుంది. – ప్రొఫెసర్ సర్జన్‌రెడ్డి, డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్, శ్రీవేంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం రాష్ట్రంలో భారీగా పెరిగిన ఒంగోలు జాతి పశుసంతతి మన దేశంలో వీటిసంఖ్య క్రమేపి తగ్గి అంతరించిపోతున్న వాటి జాబితాలో చేరడంతో ఒంగోలు జాతి గోవుల అభివృద్దికి శ్రీకారం చుట్టారు. 1926లో ఏర్పాటైన గుంటూరు లాంలోని పరిశోధన స్థానం 1972 నుంచి ఒంగోలు జాతి పరిరక్షణ కోసం కృషిచేస్తోంది. వంద మేలు జాతి ఒంగోలు ఆబోతుల నుంచి దాదాపు 11 లక్షల వీర్య మోతాదులు తయారు చేసి తెలుగు రాష్ట్రాల రైతులకు అందజేశారు. ఫలితంగా రాష్ట్రంలో ఈ జాతి పశుసంపద అభివృద్ధి చెందింది. దేశంలో సుమారు ఏడులక్షల ఒంగోలు గోసంతతి ఉండగా, ఒక్క ఏపీలోనే నాలుగు లక్షలకుపైగా వీటి సంఖ్య పెరిగింది. ఇటీవల మేఘాలయ రాష్ట్ర సంవర్ధకశాఖకు ఒంగోలు జాతి వీర్యంతో పాటు కోడెదూడలను సరఫరా చేశారు. ఒంగోలు జాతి పరిరక్షణ కోసం వివిధ ప్రాజెక్టుల ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తోడ్పాటుతో పాటు శ్రీవేంకటేశ్వర పశు విశ్వవిద్యాలయం నిర్విరామ కృషిచేస్తోంది. -
Aditya-L1 mission: పని మొదలెట్టిన ఆదిత్య–ఎల్ 1
సూళ్లూరుపేట (తిరుపతి జిల్లా): సూర్యుడిని అధ్యయనం చేసేందుకు రోదసీలోకి దూసుకెళ్లిన ఆదిత్య–ఎల్ 1 తన ప్రయాణంలో మరో మైలురాయిని అందుకుంది. ఈ ఉపగ్రహంలోని ఆదిత్య సోలార్ విండ్ పార్టికల్ ఎక్స్పరిమెంట్ అనే పరికరం తన కార్యకలాపాలను మొదలుపెట్టిందని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో ప్రకటించింది. ఈ పరికరంలోని రెండు విభిన్న భాగాలు తమ పరిశోధనలను విజయవంతంగా కొనసాగిస్తున్నాయి. ఇవి సౌర గాలులను అధ్యయనం చేస్తున్నాయి’ అని ఇస్రో వెల్లడించింది. సంబంధిత వివరాలను ఇస్రో తన ‘ఎక్స్’ ఖాతాలో ట్వీట్‌చేసింది. ‘సోలార్ విండ్ పారి్టకల్ ఎక్స్పరిమెంట్’లో భాగమైన సూపర్‌థర్మల్ అండ్ ఎనర్జిటిక్ పారి్టకల్ స్పెక్ట్రోమీటర్(స్టెప్స్)ను సెపె్టంబర్ పదో తేదీన, సోలార్ విండ్ అయాన్ స్పెక్ట్రోమీటర్(స్విస్)ను నవంబర్ రెండో తేదీన యాక్టివేట్ చేయడం తెల్సిందే. ఈ రెండు భాగాలు తమ కార్యకలాపాలను విజయవంతంగా కొనసాగిస్తున్నాయని ఇస్రో పేర్కొంది. స్విస్‌లో ఉన్న రెండు సెన్సార్లు 360 డిగ్రీలో చక్కర్లు కొడుతూ విధులు నిర్వర్తిస్తున్నాయి. నవంబర్ నెలలో సోలార్ విండ్ అయాన్లు, ప్రైమరీ ప్రోటాన్స్, ఆల్ఫా పారి్టకల్స్లను ‘స్విస్’ విజయవంతంగా లెక్కగట్టి విశ్లేíÙంచగలిగిందని ఇస్రో ప్రకటించింది. ఈ సెన్సర్ సేకరించిన ఎనర్జీ హస్ట్రోగామ్ను పరిశీలించారు. దీంతో ప్రోటాన్, అయనీకరణ చెందిన హీలియం, ఆల్ఫా పారి్టకల్స్లో కొన్ని భిన్న లక్షణాలు ఉన్నట్లు గుర్తించారు. ఈ తాజా విశ్లేషణతో సౌర గాలుల విలక్షణతపై ఇన్నాళ్లూ నెలకొన్న ప్రశ్నలకు సమాధానాలు దొరికే అవకాశముందని ఇస్రో శాస్త్రవేత్తలు ఆశాభావం వ్యక్తంచేశారు. సౌర గాలుల్లోని అంతర్గత ప్రక్రియలు.. భూమిపై ఏ విధమైన ప్రభావం చూపుతాయనే విషయంపై సమగ్ర అధ్యయనం చేసేందుకు తాజా డేటా సహాయకారిగా ఉంటుందని ఇస్రో పేర్కొంది. లాగ్రాంజ్ పాయింట్ వద్ద చోటుచేసుకునే కరోనల్ మాస్ ఎజెక్షన్పై ఓ అవగాహనకు రావచ్చని వెల్లడించింది. సూర్యుడిపై అధ్యయనం కోసం ఈ ఏడాది సెప్టెంబరు 2న నింగిలోకి దూసుకెళ్లిన ‘ఆదిత్య – ఎల్ 1’ తన ప్రయాణంలో దాదాపు చివరి దశను చేరుకుంది. భూమి నుంచి 15 లక్షల కి.మీ దూరంలో ఉన్న లాగ్రాంజ్ పాయింట్–1 చేరాక దాని కక్ష్యలో పరిభ్రమిస్తూ ఆదిత్య – ఎల్ 1 సూర్యుడిని అధ్యయనం చేయనుంది. -
రాగితో చౌకగా క్యాన్సర్ మందులు తయారు చేయొచ్చు: సైంటిస్టులు
ఆరోగ్యపరంగా రాగి లోహానికి ఉన్న ప్రయోజనాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కొన్నేళ్లుగా ఆయుర్వేదంలో అనేక వ్యాధుల చికిత్సలో రాగిని వాడుతున్నారు. అయితే ఇప్పుడు రాగిని ఉపయోగించి క్యాన్సర్ డ్రగ్స్ మెడిసిన్స్‌ను చవకగా తయారు చేయొచ్చని యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియా, లాస్ ఏంజిల్స్ సైంటస్టులు జరిపిన అధ్యయనంలో తేలింది. సాధరణంగా క్యాన్సర్ చికిత్సకు వాడే మందులు తయారు చేయడానికి ఒక గ్రాముకు సుమారు రూ. 2 లక్షల 60 వేలకు పైగా ఖర్చు అయితే, రాగిని ఉపయోగించి మెడిసిన్స్ చేయడం వల్ల ఒక గ్రాముకు కేవలం రూ. 250 రూపాయలే అవుతుందని సైంటిస్టులు తమ రీసెర్చ్‌లో తేల్చారు. దీని వల్ల భవిష్యత్తులో చవకగా ఔషధాలు తయారు చేసేందుకు మార్గం సుగుమం అయ్యింది. అదెలాగో తెలుసుకోవాలంటే ఈ స్టోరీని చదవాల్సిందే. మనిషి మొదటగా కనుక్కొని వాడిన లోహం రాగి. కొన్ని వేల ఏళ్లుగా మనం రాగి వస్తువులను, రాగి పాత్రలను వాడుతూనే ఉన్నాం. దీన్ని తామ్రము అని, క్యూప్రమ్ అని కూడా అంటారు. రాగితో చేసిన పాత్రలను వాడటం వల్ల శరీరానికి ఎంతో మేలు చేస్తుందని పలు అధ్యయనాల్లో ఇప్పటికే రుజువైంది. నీటిలో ఉండే బాక్టీరియాను నశింపజేసే శక్తి కూడా రాగికి ఉందని ఆధునిక పరిశోధనలు చెబుతున్నాయి. రాగి లోహాలను వాడటం వల్ల అనేక రోగాలు నయమవుతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ప్రపంచంలోనే అత్యంత ఎక్కువగా,చవకగా దొరికే లోహాల్లో రాగి ఒకటి. దీనికి ఉండే ఔషధ గుణాల రీత్యా క్యాన్సర్ చికిత్సలోనూ వాడేందుకు అనువుగా ఉందని ప్రొఫెసర్ ఓహ్యున్ క్వాన్ అన్నారు. క్యాన్సర్ చికిత్సలో సాధారణంగా వాడే మందుల తయారీకి ఒక గ్రాముకు రూ. 2లక్షల 60 వేల(3వేల డాలర్లు)ఖర్చవగా, రాగిని ఉపయోగించి అదే ఔషధాన్ని తయారు చేసేందుకు కేవలం రూ.250 మాత్రమే అవుతుందని పేర్కొన్నారు. ఈ విధానం ద్వారా క్యాన్సర్ వ్యతిరేక c-Jun N- టెర్మినల్ కినేస్ ఇన్హిబిటర్ను కేవలం మూడు దశల్లోనే ఉత్పత్తి చేయగలిగారు. సాధారణంగా దీనికి 12 రసాయనిక చర్యలు అవసరం అవుతాయి. ఇందులో అడెనోసిన్, N6-మిథైలాడెనోసిన్ను సులువుగా అమైన్గా మార్చగలదు. కణాలు, వ్యాధి ప్రక్రియలు మరియు అభివృద్ధిలో జన్యు వ్యక్తీకరణను నియంత్రించడంలో ఈ అమైన్ ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ప్రస్తుతమున్న క్యాన్సర్ చికిత్సలో దీన్ని ఉత్పత్తి చేయడానికి ఒక గ్రాముకు సుమారు రూ.8వేల 500($103)కు పైగా ఖర్చవుతుంది. అదే రాగిని ఉపయోగించడం వల్ల చాలా చవకగా ఔషధాలను తయారు చేయొచ్చని, భవిష్యత్తులో ఈ పద్దతి మరింత సులభతరం అవుతుందని శాస్త్రవేత్తలు తెలిపారు. -
కోపాన్ని పెంచేస్తున్న కాలుష్యం..
దేశరాజధాని ఢిల్లీలో పెరుగుతున్న కాలుష్యం ప్రజల మానసిక ఆరోగ్యంపై తీవ్రం ప్రభావం చూపుతోంది. వాయు కాలుష్యం కారణంగా ఇక్కడి జనంలో చికాకు, కోపం, ఒత్తిడి తదితర సమస్యలు పెరుగుతున్నాయి. అత్యంత కలుషిత నగరాల్లో నివసించే జనం డిప్రెషన్, నిద్రలేమి, తలనొప్పి, ప్రవర్తనలో మార్పులు, మానసిక అలసట లాంటి సమస్యలను ఎదుర్కొంటారని పలు పరిశోధనలు చెబుతున్నాయి. కాలుష్యం మెదడుపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. దీని కారణంగా మనిషిలో కోపం, హింసాత్మక ప్రవర్తన పెరుగుతుంది. విషపూరితమైన గాలిలో ఉండే హానికరమైన పదార్థాలు మనిషి మెదడుకు చేరి, దానిని దెబ్బతీస్తాయి. ముఖ్యంగా కాలుష్యపూరిత ప్రాంతాల్లో నివసించేవారు అల్జీమర్స్, డిమెన్షియా వంటి వ్యాధుల బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాలుష్యం అనేది మెదడును దెబ్బతీస్తుంది. నాడీ కణాల మధ్య కమ్యూనికేషన్‌ను అడ్డుకుంటుంది. జ్ఞాపకశక్తిని బలహీనపరుస్తుంది. అల్జీమర్స్ వంటి వ్యాధులకు కారణమవుతుందని నిరూపితమయ్యింది. ఎవరైనా కలుషితమైన గాలిని పీల్చినప్పుడు, శరీరంలో ఒత్తిడి హార్మోన్ల స్రావం పెరుగుతుంది. ఈ హార్మోన్లు మనిషి మెదడును ప్రభావితం చేస్తాయి. దాని సాధారణ పనితీరులో జోక్యం చేసుకుంటాయి. ఫలితంగా అసౌకర్యం, ఆందోళన, ఒత్తిడిని ఎదురవుతుంది. అంతేకాకుండా జ్ఞాపకశక్తి, ఏకాగ్రత, నిర్ణయం తీసుకునే శక్తి కూడా తగ్గుతుంది. రాజధానిలో పెరుగుతున్న కాలుష్యం కారణంగా చాలామంది బయటకు వెళ్లడం లేదు. మునుపటిలా స్నేహితులు, బంధువులను కలవడం తగ్గించేశారు. కనీసం పార్కుకు వెళ్లడం లేదా బయట నడవడం కూడా మానుకున్నారు ఫలితంగా ఒంటరితనం, నిరాశకు గురవుతున్నారు. ఫలితంగా అలాంటి వారిలో చికాకు, కోపం పెరుగుతున్నాయి. ఇది కూడా చదవండి: ఒకవైపు కాలుష్యం.. మరోవైపు వణికిస్తున్న చలి! -
మనిషి చెప్పులు వేసుకున్నది ఎన్నడు? ఆశ్చర్యపరుస్తున్న పరిశోధనలు!
నాగరకత తొలినాళ్లలో మనిషి తన శరీరాన్ని రక్షించుకునేందుకు దుస్తులు వాడటం మొదలుపెట్టాడు. మరి కాలికి వేసుకునే చెప్పులు, బూట్ల వాడకం మొదలైందెన్నడు? ఈ ప్రశ్న ఎప్పుడైనా మీ మదిలో మెదిలిందా? దీనికి ఇప్పుడు శాస్త్రవేత్తలు తమ పరిశోధనల ద్వారా సమాధానం కనుగొన్నారు. తాజాగా పురావస్తు శాస్త్రవేత్తలు దక్షిణాఫ్రికాలోని కేప్ కోస్ట్‌లో ఒక అద్భుతమైన ఆవిష్కరణ చేశారు. ఇది మానవజాతి చరిత్రలోని అత్యంత పురాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని తెలియజేస్తుంది. మానవులు మధ్య రాతి యుగంలోనే బూట్లు ధరించి ఉండవచ్చని కొత్త పరిశోధనలు తెలియజేస్తున్నాయి. నాటి కాలాన్ని మెసోలిథిక్ టైమ్ అని కూడా పిలుస్తారు. ఇది ఆఫ్రికన్ పూర్వ చరిత్రలో ఒకనాటి కాలం. ఈ నూతన ఆవిష్కరణ 75 వేల నుంచి ఒక లక్షా 50 వేల సంవత్సరాల క్రితం నాటిదని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. దీని ప్రకారం పురాతన మానవులు.. మనం ఇంతవరకూ భావిస్తున్నదానికన్నా ఎంతో నేర్పరులని తేలింది. ఈస్ట్ హార్ట్‌ఫోర్డ్‌లోని గుడ్విన్ యూనివర్శిటీకి చెందిన ఇంగ్లీష్ ప్రొఫెసర్ అయిన రాండీ లైస్ట్ ఒక వ్యాసంలో మనిషి సాంకేతిక పరిజ్ఞానానికి చెందిన అత్యంత పురాతన ఆవిష్కరణల్లో షూస్ అంటే బూట్లు ఒకటని తెలిపారు. ఈ వివరాలు 2020 ఆగస్టులో ప్రచురితమయ్యాయి. కార్లు, పడవలు, రాకెట్ షిప్‌ల వంటి వాహనాలు భారీ పరమాణంలోని బూట్ల మాదిరిగా ఉంటాయని లైస్ట్ దానిలో పేర్కొన్నారు. బూట్ల ఆలోచన నుంచే ఇటువంటి ఇటువంటి సాంతకేతికత ఆవిర్భవించిందని లైస్ట్ భావించారు. మానవజాతి ప్రారంభ సాంకేతిక ఆవిష్కరణలలో బూట్లు ఒకటి. గత పురావస్తు పరిశోధనలలో బూట్లు దాదాపు ఆరు వేల సంవత్సరాల క్రితం నాటివని, ఇవి ఐరోపాలోని కొన్ని ప్రాంతాల నుండి వచ్చాయని భావించారు. అయితే తాజాగా దక్షిణాఫ్రికాలోని కేప్ కోస్ట్‌లో సాగిన నూతన పరిశోధనలు బూట్ల ఆవిష్కరణకు సంబంధించిన పాత సిద్ధాంతాలను తుడిచిపెట్టాయి. విట్వాటర్రాండ్ విశ్వవిద్యాలయ పరిశోధకుడు బెర్న్‌హార్డ్ జిప్‌ఫెల్ వెల్లడించిన వివరాల ప్రకారం మధ్య రాతి యుగంలో కేప్ తీరం వెంబడి బీచ్‌లో పురాతన మానవుల పాదముద్రల శిలాజాలను పరిశీలించినప్పుడు, వారు బూట్లు ధరించి ఉండవచ్చని పరిశోధనలు స్పష్టంగా తెలియజేస్తున్నాయన్నారు. సదరన్ కేప్ కోస్ట్ ఆ సమయంలో చాలా పదునైన రాళ్లతో ఉండేదని, ఇవి బాధ కలిగించకుండా ఉండేందుకు నాటి మానవులు పాదరక్షలను ఉపయోగించి ఉండవచ్చని ఆయన అన్నారు. అయితే పురాతన మానవులు ఏ రకమైన బూట్లు ధరించారనే దానిపై పురావస్తు శాస్త్రవేత్తలు నేటికీ స్పష్టంగా ఏమీ తెలుసుకోలేకపోయారు. పురాతన పాదముద్రల శిలాజాల లాంటి ఇతర ఆధారాలతో మనిషి ధరించిన నాటి కాలపు పాదరక్షల గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. దీనిపై పరిశోధనలు సాగిస్తున్న ప్రముఖ శాస్త్రవేత్త జిప్‌ఫెల్ స్పందిస్తూ నాటి పురాతన బూట్లు ఇంత కాలం ఉండకపోవచ్చని, నాటి మానవులు పాదముద్రల శిలాజాలు కనుగొనగలిగితే పూర్వీకులు ధరించిన పాదరక్షల గురించి అధ్యయనం చేయడానికి అవకాశం దక్కుతుందని అన్నారు. నాటి మానవులు బూట్లు ధరించారా లేదా అనేదానిని తెలుసుకునేందుకు పరిశోధకులు దక్షిణాఫ్రికాలోని రెండు ప్రదేశాలలో నాటి మనిషి ఎముకల ఆకారం, పరిమాణాన్ని విశ్లేషించారు. అక్కడ నివసించే ప్రజల కాలి ఎముకలు వారి పూర్వీకుల కంటే చాలా సన్నగా, తక్కువ దృఢంగా ఉన్నాయని వారు కనుగొన్నారు. కాలి స్వరూపంలో ఈ మార్పు బూట్లు ధరించడం వల్ల సంభవించవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. షూస్ అనేవి పదునైన రాళ్లు, ముళ్లు, పరాన్నజీవుల నుండి రక్షణను అందిస్తాయి. ఈ అధ్యయనం మధ్య రాతి యుగంనాటి మానవుల సాంస్కృతిక చరిత్ర, పరిజ్ఞానాలను మరింతగా తెలియజేలా ఉంది. ఆ కాలంలో జరిగిన బూట్ల ఆవిష్కరణ, వాటి ఉపయోగం నాటి విస్తృత సాంస్కృతిక మార్పులో భాగంగా ఉండవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అయితే దీనిపై స్పష్టత కోసం శాస్త్రవేత్తలు మరింతగా పరిశోధనలు సాగిస్తున్నారు. ఇది కూడా చదవండి: తుది దశకు రెస్క్యూ ఆపరేషన్ -
గ్రాము ఖరీదు కోట్ల డాలర్లట!... ఏందబ్బా అది?
ఈ భూమండలంపై అత్యంత ఖరీదైన పదార్థమేమిటనే ప్రశ్న ఎవరినైనా అడిగితే ప్లాటినం, వజ్రం లేదా బంగారం అని చెబుతుంటారు. అయితే వీటికి మించిన ఖరీదైన పదార్థం ఒకటుందనే సంగతి మీకు తెలుసా? దాని విలువ ఎంతో తెలిస్తే ఆశ్చర్యం కలుగుతుంది. ప్రపంచంలోని అత్యంత ఖరీదైన ఆ పదార్ధం ఒక గ్రాము ధర 7,553 బిలియన్ డాలర్లకు పైగా ఉంటుంది. (ఒక బిలియన్ అంటే వంద కోట్లు) ఆ ఖరీదైన పదార్ధం పేరు యాంటీమాటర్. దీని గురించి ఎవరూ అంతగా వినివుండకపోవచ్చు. అయితే సైన్స్ ప్రపంచంలో ఇది ఒక రహస్యమైన, శక్తిమంతమైన పదార్ధం. శాస్త్రవేత్తలు తెలిపిన వివరాల ప్రకారం యాంటీమాటర్ అనేది పదార్థంతో సమానంగానే ఉంటుంది. కానీ ఇది సాధారణ పదార్ధానికి పూర్తిగా వ్యతిరేకం. యాంటీమాటర్లోని ఉప పరమాణు కణాలు సాధారణ పదార్థానికి వ్యతిరేక లక్షణాలను కలిగి ఉంటాయి. దీనిని 20 వ శతాబ్దపు ప్రథమార్థంలో కనుగొన్నారు. యాంటీమాటర్ను మొట్టమొదట ప్రపంచానికి 1928 లో శాస్త్రవేత్త పాల్ డిరాక్ పరిచయం చేశారు. న్యూ సైంటిస్ట్ పత్రిక ఈ మహనీయుడిని ‘సర్ ఐజాక్ న్యూటన్ తరువాత గొప్ప బ్రిటిష్ సిద్ధాంతకర్త’ అని అభివర్ణించింది. నాటి నుంచి యాంటీమాటర్ శాస్త్రవేత్తలకు సైతం ఉత్సుకత కలిగించే అంశంగా మారింది. యాంటీమాటర్ అత్యధిక శక్తిని ఉత్పత్తి చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఒక గ్రాము యాంటీమాటర్ 43 మెగాటన్నుల ట్రినిట్రోటోల్యూన్ (టీఎన్టీ) శక్తిని ఉత్పత్తి చేస్తుంది. అంటే జపాన్.. హిరోషిమాపై వేసిన అణు బాంబు కంటే మూడు వేల రెట్లు అధిక శక్తిని ఉత్పత్తి చేస్తుంది. యాంటీమాటర్ అంతరిక్ష ప్రయాణానికి సమర్థవంతమైన ఇంధనంగా లేదా మన గ్రహానికి అత్యధిక శక్తి వనరుగా కూడా ఉపయోగపడుతుంది. విశ్వం యొక్క మూలం, పరిణామాన్ని అర్థం చేసుకోవడానికి యాంటీమాటర్ సహాయపడుతుంది. బిగ్ బ్యాంగ్ సిద్ధాంతం ప్రకారం విశ్వం అనేది అధిక సాంద్రత, ఉష్ణోగ్రత స్థితి నుండి ఉద్భవించింది. ఇక్కడ పదార్థం, యాంటీమాటర్ సమానంగా, సమృద్ధిగా ఉన్నాయి. అయితే ప్రారంభ విశ్వంలో పదార్థం, యాంటీమాటర్ మధ్య కొంత అసమానత లేదా అసమతుల్యత ఉండేదని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఇది యాంటీమాటర్ కంటే పదార్థం అధికంగా ఉండటానికి దారితీసింది. ఇది భౌతిక శాస్త్రంలో అతిపెద్ద పజిల్‌గా నిలిచింది. యాంటీమాటర్ను శాస్త్రీయ పరిశోధనలు, వైద్య అనువర్తనాలకు సాధనంగా ఉపయోగించవచ్చు. ఇది సాంప్రదాయిక పద్ధతులకు మించి మరింత ఖచ్చితంగా క్యాన్సర్ కణాలను లక్ష్యంగా చేసుకునే రేడియేషన్ థెరపీకి ఉపయుక్తమవుతుంది. యాంటీహైడ్రోజన్ (యాంటీమాటర్తో తయారు చేసిన సరళమైన పరమాణువు) సమానత్వ సూత్రం, ఛార్జ్-పారిటీ-టైమ్ (సీపీటీ) సమరూపత వంటి భౌతిక శాస్త్ర సిద్ధాంతాలను పరీక్షించడానికి యాంటీమాటర్ ఉపయోగపడుతుంది. శాస్త్రవేత్తలు చెబుతున్నదాని ప్రకారం యాంటీమాటర్ను సృష్టించడం, నిల్వ చేయడం అంత సులభం కాదు. దీనికి పార్టికల్ యాక్సిలరేటర్లు, వాక్యూమ్ ఛాంబర్లు వంటి అధునాతన సౌకర్యాలు, సాంకేతికతలు అవసరమవుతాయి. ప్రస్తుతం మనం స్వల్ప పరిమాణంలోని యాంటీమాటర్ను మాత్రమే ఉత్పత్తి చేయగలం. దీనికి కూడా అధికంగా ఖర్చు అవుతుంది. నాసా తెలిపిన వివరాల ప్రకారం యాంటీమాటర్ అనేది భూమిపై అత్యంత ఖరీదైన పదార్థం. శాస్త్రవేత్తలు భూమిపైనే లార్జ్ హాడ్రాన్ కొలైడర్ లాంటి అధిక శక్తి కణాల యాక్సిలరేటర్ల ద్వారా యాంటీ పార్టికల్‌ను ఉత్పత్తి చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ పరిశోధనలు విజయవంతం కావాలని కోరుకుందాం. ఇది కూడా చదవండి: సొరంగంలో చిక్కుకున్నవారంతా క్షేమం.. ఫొటో విడుదల! -
వరి ఆకారపు మిల్లెట్లు!
సాక్షి, హైదరాబాద్: మిల్లెట్ డైట్‌ను ప్రోత్సహించేందుకుగాను తాము చేపట్టిన కార్యక్రమాల్లో మిల్లెట్లను బియ్యం ఆకారంలోకి మార్చడం ఒకటని న్యూట్రీహబ్ సీఈవో డాక్టర్ రావు తెలిపారు. సాయిల్ టు సోల్ అనే అంశంపై ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్స్ రీసెర్చ్‌కు విచ్చేసిన మహిళా పారిశ్రామికవేత్తల బృందంతో డాక్టర్ రావు మాట్లాడారు. మిల్లెట్ డైట్‌పై అవగాహన కల్పించి, ఎక్కువ మంది వీటిని తమ డైట్లో భాగం చేసుకునేలా చేసేందుకే తాము ఈ ప్రయత్నం చేస్తున్నామన్నారు. చాలా మంది అన్నం తినడానికి ఇష్టపడతారు. అలాంటి వారికి మిల్లెట్లు అన్నంలాగా కనిపిస్తాయి. బియ్యం ఆకారంలో తృణధాన్యాలను అందజేస్తాం. తద్వారా వాటికి ఆమోదయోగ్యం పెరుగుతుంది మూడు వేల సంవత్సరాల నాటి తృణధాన్యాల సమూహానికి మరింత యాక్సెప్టెన్స్ పెంచడానికి ఇది ఒక చొరవ. మిల్లెట్లను బియ్యంగా పునర్నిర్మించేటప్పుడు వాటి పోషక విలువలు ఏ మాత్రం తగ్గకుండా జాగ్రత్తలు తీసుకుంటాం. మిల్లెట్లను బియ్యం రూపంలోకి మార్చడం ద్వారా, మేము వాటి షెల్ఫ్-లైఫ్‌ను పెంచుతున్నాం. మిల్లెట్లు పురాతన ఆహార ధాన్యాలలో ఒకటని, వాటి సాగు దాదాపు క్రీస్తుపూర్వం మూడు వేల సంవత్సరాల నాటిదని ఆధారాలున్నాయి. ఇది ప్రపంచ విస్తీర్ణంలో 19 %, ప్రపంచ ఉత్పత్తిలో 20%తో భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద మిల్లెట్ ఉత్పత్తిదారుగా ఉంది. ప్రపంచంలో సాగవుతున్న 18 మిల్లెట్లలో 11 భారత్‌లోనే ఉత్పత్తి అవుతున్నాయి. మిల్లెట్లు గుండె జబ్బులు, పెద్దపేగు క్యాన్సర్‌ను నివారిస్తాయి. టైప్-2 డయాబెటిస్‌ను నిరోధించడంలో సహాయపడతాయి. బరువు తగ్గిస్తాయి. మిల్లెట్లు గ్లూటెన్ రహిత ఆహారం. ఇది గర్భిణీ, బాలింతలకు మంచిది, పిల్లలలో పోషకాహార లోపాన్ని నివారిస్తుంది. భారతదేశంలో మిల్లెట్ డిమాండ్‌ను పునరుద్ధరించడానికి ఐఐఎమ్ఆర్ కృషి చేస్తోంది. వాణిజ్యపరంగా ఐఐఎంఆర్‌లో న్యూట్రిహబ్ టీబీఐఎస్సీ ఉంది. ఇది మిల్లెట్స్‌కు ఒక బ్రాండ్‌ను క్రియేట్ చేసింది. ఇది గత ఐదు ఏళ్లలో 400 స్టార్టప్‌లతో సుమారు రెండు కోట్ల వరకు మూలధనాన్ని సేకరించాయి. ప్రస్తుతం వందకు పైగా స్టార్టప్‌లు ఇంక్యుబేట్ చేపడుతున్నాయి. ఇది దాదాపు 70 సాంకేతికతలను అభివృద్ధి చేసిందని డాక్టర్ బి. దయాకర్ రావు తెలిపారు. అంతకుముందు ఐసీఏఆర్- డైరెక్టర్ డాక్టర్ తారా సత్యవతి మాట్లాడుతూ, “మనము ఆహరం పేరిట కేలరీలను మాత్రమే తింటున్నాము. పౌష్టికాహారం ఎక్కువగా తీసుకోవాలి. తృణధాన్యాలతో ఆహార భద్రత నుంచి పౌష్టికాహార భద్రత దిశగా పయనిస్తున్నాం. మిల్లెట్‌ను సూపర్‌ఫుడ్‌గా ప్రదర్శించడం, మనం మర్చిపోయిన వంటకాలను పునరుద్ధరించడం తదితర వాటితో మిల్లెట్ పేద ప్రజల ఆహారం అనే కళంకాన్ని తొలగించే మన ప్రధాన ఆహారంలో భాగంగే చేసే యత్నం చేస్తోంది ఐఐఎంఆర్. ఇక మిల్లెట్ వాల్యూ చైన్‌లో 500కి పైగా స్టార్టప్‌లు పనిచేస్తున్నాయని, ఐఐఎంఆర్ రాష్ట్రీయ కృషి వికాస్ యోజన కింద మరో 250 స్టార్టప్‌లను ప్రారంభించామని ఐసీఏఆర్ డైరెక్టర్ సత్యవతి అన్నారు. దాదాపు 66 స్టార్టప్‌లకు సుమారు రూ. 6.2 కోట్ల నిధులను పంపిణీ చేయగా, మిగిలిన 25 స్టార్టప్లుకు కూడా నిధుల విడుదలకు ఆమోదం లభించినట్లు తెలిపారు. ఈ మేరకు ఎఫ్ఎల్ఓ చైర్పర్సన్ రీతు షా మాట్లాడుతూ.. మిల్లెట్లు ప్రోటీన్, ఫైబర్, కీలకమైన విటమిన్లు, ఖనిజాలకు మంచి మూలమని అన్నారు. ఇది అంతర్జాతీయ మిల్లెట్ సంవత్సరం కాబట్టి ఎఫ్ఎల్ఓ తమ సభ్యులకు మరిన్ని వ్యాపార అవకాశాలను లభించాలని ఆశిస్తోంది. అందుకే ఈ టూర్ ప్లాన్ చేశామని ఆమె తెలిపారు. మిల్లెట్స్‌లో వ్యాపార అవకాశాలను అన్వేషించడానికి ఆసక్తి ఉన్న పలువురు మహిళా పారిశ్రామికవేత్తలు అనేక ప్రశ్నలు సంధించి..వివరణలు పొందారు. ఇక ఈ కార్యక్రమం చివర్లో వారు పారిశ్రామికవేత్తల కోసంఐఐఎంఆర్ సృష్టించిన సౌకర్యాలను కూడా సందర్శించి పరిశీలించారు. (చదవండి: ఆహారానికి ‘అనారోగ్య మూల్యం’ అంతింత కాదయా!) -
పగటి పూటా ఓ కునుకేయండి
సాక్షి, అమరావతి: చక్కటి నిద్ర దివ్యౌషధంగా పని చేస్తుంది. అందులోనూ పగటిపూట తీసే చిన్నపాటి కునుకు మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. రోజూ మధ్యాహ్నం 15–30 నిమిషాలు రెప్పవాల్చితే చిత్తవైకల్య ప్రమాదం తగ్గడంతో పాటు వృద్ధాప్య ఛాయలు త్వరగా దరిచేరవని తాజా అధ్యయనంలో వెల్లడైంది. సాధారణ వ్యక్తులతో పోలిస్తే పగటిపూట నిద్రించే వారిలో 2.6–7 సంవత్సరాల వరకు వృద్ధాప్యం నెమ్మదిస్తుంది. యూనివర్సిటీ కాలేజ్ లండన్, ఉరుగ్వేలోని యూనివర్సిటీ ఆఫ్ రిపబ్లిక్ పరిశోధకులు క్రమం తప్పకుండా పగటిపూట నిద్రపోవడం వల్ల మెదడు కుచించుకుపోయే ప్రమాదాన్ని తగ్గిస్తుందని.. చురుకుదనాన్ని ప్రేరేపిస్తుందని తేల్చారు. ఫలితంగా జ్ఞాన సామర్థ్యం, జ్ఞాపక శక్తి పెరుగుతాయని గుర్తించారు. అయితే.. పగటిపూట 90 నిమిషాల కంటే ఎక్కువసేపు నిద్రపోవడం ఆరోగ్యానికి చేటని సూచిస్తున్నారు. సంపూర్ణ ఆరోగ్యానికి 7 గంటల నిద్ర సంపూర్ణ ఆరోగ్యానికి సుమారు 7 గంటల మంచి నిద్రను శాస్త్రవేత్తలు, వైద్య నిపుణులు ప్రతిపాదిస్తున్నారు. ఇందుకు విరుద్ధంగా భారత్‌లోని పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రపంచంలో నిద్ర లేమితో బాధపడుతున్న దేశాల్లో భారత్ రెండో స్థానంలో ఉండటం ఆందోళన కలిగిస్తోంది. నిద్ర లేకపోవడం వల్ల కలిగే సమస్య కేవలం అలసట ఒక్కటే కాదని.. తీవ్ర దీర్ఘకాలిక అనారోగ్యానికి దారితీస్తుందని హెచ్చరిస్తున్నారు. రాత్రిపూట కలతలేని నిద్రతో అలసట, తలనొప్పి, మూడ్ స్వింగ్స్ నియంత్రణలో ఉండి మానసిక ఉత్సాహంతో పని చేస్తారని చెబుతున్నారు. అయితే.. తక్కువ నిద్రపోయే వారిలో అల్జీమర్స్ వచ్చే అవకాశం 40 శాతం ఎక్కువని అధ్యయనం వెల్లడించింది. అతి నిద్ర ప్రమాదకరం తక్కువ నిద్రతోనే కాదు.. అతి నిద్రతోనూ ఆరోగ్యానికి ముప్పు పొంచి ఉందని పరిశోధకులు చెబుతున్నారు. రోజంతా అదే పనిగా నిద్రపోతే అధిక రక్తపోటు, స్ట్రోక్‌కు గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని తేల్చారు. అతి నిద్ర అంతర్లీన నిద్ర రుగ్మతకు సంకేతమని భావిస్తున్నారు. ఈ రుగ్మతతో ఒత్తిడి, బరువును నియంత్రించే హార్మోన్లపై ప్రభావం చూపుతుందని తేల్చారు. ఫలితంగా చిన్న వయసులోనే ఊబకాయం, బీపీ, టైప్–2 డయాబెటిస్, గుండె జబ్బులు వస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్క్రీనింగ్ సమయంతోనే ముప్పు స్క్రీనింగ్ సమయం నిద్రలేమి స్థాయిని పెంచుతుందని అధ్యయనం చెబుతోంది. నిద్రలేమితో బాధపడే వారిలో దాదాపు 54 మంది డిజిటల్, సోషల్ మీడియాను విరివిగా వినియోగిస్తున్నట్టు గుర్తించింది. దాదాపు 87 శాతం మంది భారతీయులు పడుకునే ముందు తమ ఫోన్లను ఉపయోగిస్తుండటంతో తీవ్రమైన నిద్ర సమస్యకు దారితీస్తుందని పేర్కొంది. ఫలితంగా 56 శాతం మంది పురుషులతో పోలిస్తే 67 శాతం మంది మహిళలు పని సమయంలో నిద్రపోతున్నారని వెల్లడించింది. వీలైనంత వరకు మధ్యాహ్నం 2 గంటలలోపు కెఫిన్ ఉండే పదార్థాలను తగ్గించాలని.. మద్యం తాగి నిద్రపోవడం/నిద్రపోయే మూడు గంటల ముందు మద్యం తీసుకోవడం కూడా ఆరోగ్యానికి చేటని సూచిస్తున్నారు. ముఖ్యంగా నిద్రవేళకు దగ్గర సమయంలో వ్యాయామం చేయడం కూడా నిద్రలేమికి కారణంగా భావిస్తున్నారు. -
మైక్రోప్లాస్టిక్‌పై ప్రత్యక్ష పరిశోధన
ఏయూ క్యాంపస్: ప్రపంచాన్ని కలవరపెడుతున్న అంశాల్లో ప్లాస్టిక్ కూడా ఒకటి. ఇప్పటి దాకా కంటికి కనిపించే ప్లాస్టిక్ ఒక ఎత్తయితే, కనిపించని సూక్ష్మ కణాలుగా మారిన మైక్రో ప్లాస్టిక్ మరింత భయపెడుతోంది. దీనికి కారణం సముద్రాలు సూప్ ఆఫ్ మైక్రోప్లాస్టిక్స్‌గా మారడమే. ఏళ్ల తరబడి పేరుకుపోయిన ప్లాస్టిక్ వస్తువులు సూక్ష్మ కణాలుగా విభజన చెంది, జలచరాల శరీరంలో చేరుతున్నాయి. సీఫుడ్‌ను మానవులు పెద్ద ఎత్తున ఆహారంగా తింటున్న క్రమంలో మైక్రో ప్లాస్టిక్ క్రమేణా మానవుల శరీరాల్లోకి కూడా వచ్చి చేరుతోంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఆంధ్రా యూనివర్సిటీ (ఏయూ) మెరైన్ లివింగ్ రిసోర్సెస్ విభాగం, యూరోపియన్ కమిషన్ సహాయంతో పరిశోధనలు చేపట్టింది. విస్తృత పరిశోధనకు శిక్షణ ఈ పరిశోధనల్లో భాగంగా సముద్ర జీవుల్లో చేరే మైక్రో ప్లాస్టిక్‌ను గుర్తించడం, గణించడం, అధ్యయనం చేయడం ప్రధానంగా జరుగుతోంది. ఈ రంగంలో నిపుణులను తయారు చేసేందుకు తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇందుకోసం శిక్షణ ఇచ్చేందుకు ఆంధ్రా యూనివర్సిటీ 50మందిని ఎంచుకుంది. విశ్వవిద్యాలయం పరిశోధకులు, అధ్యాపకులు, మత్త్స్య శాఖ సిబ్బంది, అధికారులు, జీవీఎంసీ అధికారులను భాగస్వాముల్ని చేసింది. ప్రత్యక్ష నైపుణ్య శిక్షణ అయితే ఈ శిక్షణను ఏయూ ప్రత్యక్ష పద్ధతిలో నిర్వహిస్తోంది. కేవలం పాఠాలకే పరిమితం కాకుండా ప్రత్యక్ష నైపుణ్య శిక్షణతో ప్రతి ఒక్కరిలో దీనిపై విస్తృత అవగాహన ఏర్పడుతోంది. మూడు రోజుల శిక్షణలో భాగంగా రెండు రకాల చేపల్లో మైక్రో ప్లాస్టిక్స్‌ని అధ్యయనం చేశారు. ఐదు మైక్రాన్స్ కంటే తక్కువ మందం కలిగిన సూక్ష్మ ప్లాస్టిక్ కణాలు సముద్రపు నీటిలో, ఇసుకలో, చేపల్లో ఉండటాన్ని ఈ శిక్షణలో ప్రత్యక్షంగా అధ్యయనం చేశారు. చేపల శరీర భాగాల్లో మైక్రోప్లాస్టిక్ గుర్తింపు నాచుపై చేరినప్పుడు చేపలు తినడంతో నాచు, మైక్రోప్లాస్టిక్ వాటి శరీరంలోని లివర్, కిడ్నీ, పేగుల్లో పెద్ద ఎత్తున చేరుతోంది. మూడు అంశాలపై శిక్షణ సేకరించిన సముద్రపు నీటిని వడబోసి, వ్యర్థాలను వేరుచేసి ఫొరియర్ ట్రాన్స్ఫామ్ ఇన్ఫ్రారెడ్ స్పెకోŠట్రస్కోపీ (ఎఫ్టీఐఆర్) సహాయంతో మైక్రోప్లాస్టిక్ పరిమాణాన్ని గణిస్తారు. ఇసుకలో ఉన్న మైక్రోప్లాస్టిక్‌ను ఇలాగే గణిస్తారు. చేపల్లో గుర్తించేందుకు శరీర భాగాలను వేరుచేసి జీవ పదార్థం జీర్ణమయ్యేలా రసాయనాల ప్రక్రియ చేపడుతున్నారు. మిగిలిన పదార్థాలను ఎండబెట్టి ఎఫ్‌టీఐఆర్‌లో పరీక్షిస్తారు. అయితే ప్రజలు ఎక్కువగా తింటున్న పండుగప్ప, కవ్వళ్లు చేపలతో ఈ ప్రయోగం చేయగా, లివర్, కిడ్నీల్లో పెద్ద ఎత్తున మైక్రోప్లాస్టిక్‌ను గుర్తించారు. మంచి ఆలోచన ఎంఎల్ఆర్ విభాగంలో మూడు రోజుల శిక్షణ మంచి ఆలోచన. వర్తమాన సమస్యల్లో ఇది ప్రధానమైన అంశం. మైక్రోప్లాస్టిక్ ప్రమాదం అన్ని జీవులపై ఉంటుంది. సముద్ర జీవుల్లో ఈ అధ్యయనం ఎంతో అభినందనీయం. – డాక్టర్ వి.హేమ శైలజ, ఏయూ పర్యావరణ శాస్త్ర విభాగం విలువైన సమాచారం మూడు రోజుల శిక్షణలో విలువైన సమాచారం, జ్ఞానం పొందాం. నిపుణుల ప్రసంగాలు, ప్రత్యక్ష శిక్షణ ఎంతో ఉపయోగపడ్డాయి. ఇటువంటి శిక్షణ కార్యక్రమాలు నిరంతరం కొనసాగాలి. – డాక్టర్ జి.శ్రావణ్ కుమార్, అధ్యాపకులు, జీవీపీ కళాశాల కమిషన్ సహకారం మరువలేం యూరోపియన్ కమిషన్ సహకారంతో ఈ ప్రాజెక్టును నిర్వహిస్తున్నాం. సమాజ ఉపయుక్త అంశంలో పరిశోధన చేపట్టాలని యూరోపియన్ యూనియన్ సూచించిన విధంగా పరిశోధనలు చేస్తున్నాం. అదే సమయంలో కొంత మందికి శిక్షణ ఇస్తూ అవగాహన పెంచుతున్నాం. – ఆచార్య పి.జానకీరామ్, ప్రిన్సిపల్ ఇన్వెస్టిగేటర్ -
15.5 కోట్ల సంవత్సరాల క్రితం మాయం.. ఆసియా ఖండంలో ప్రత్యక్షం!
15.5 కోట్ల ఏళ్ల క్రితం మాయమైన ఖండాన్ని ఆసియా ఖండంలో శాస్త్రవేత్తలు గుర్తించారు. ‘ఆర్గోల్యాండ్’ (Argoland) అని పిలిచే ఈ ఖండానికి సంబంధించిన శకలాలను ఆగ్నేయాసియాలో కనుగొన్నారు. ఈ శకలాలు మొదట్లో ఆస్ట్రేలియా ఖండంలో భాగంగా ఉండేవి. తర్వాత ఇండోనేషియా తూర్పు భాగం వైపు మళ్లాయి. ఒకప్పుడు 15.5 కోట్ల సంవత్సరాల పురాతన భూభాగంలో భాగంగా ఉండే ఈ ఖండం యునైటెడ్ స్టేట్స్ మాదిరిగా చాలా పెద్దగా విస్తరించి ఉండేది. ఆర్గోల్యాండ్ శకలాల పరిశోధన ఏడేళ్లపాటు సాగిందని నెదర్లాండ్స్‌లోని ఉట్రేచ్ట్ విశ్వవిద్యాలయానికి చెందిన భూవిజ్ఞాన శాస్త్రవేత్త, రచయిత ఎల్డర్ట్ అడ్వోకాట్ పేర్కొన్నారు. ఆగ్నేయాసియా ప్రాంతంలో అక్కడక్కడా విసిరేసినట్టుండే ఈ శకలాలు ఒకే భూభాగం నుంచి వేరుపడినవని కనుగొనేందుకు శాస్త్రవేత్తలు చాలా కష్టపడ్డారు. ఈ శకలాల వరుసను ‘ఆర్గోలాండ్’ అని పిలిచేవారు. ప్రారంభంలో ఇదంతా ఒకే భూభాగంగా ఉండేది. 15.5 కోట్ల ఏళ్ల నాటి ప్రస్థానం ఆగ్నేయాసియా భూభాగం ఆఫ్రికా, దక్షిణ అమెరికా వంటి ఖండాల మాదిరిగా కాకుండా అనేక శకలాలుగా విచ్ఛిన్నమై ఉంటుంది. దీంతో ఆర్గోల్యాండ్ అనేక ముక్కలుగా విడిపోవడంతో దాని ఉనికి మరుగునపడిపోయింది. ప్రస్తుతం ఈ శకలాలకు సంబంధించి లభ్యమైన మ్యాప్ ఆధారంగా ఆర్గోల్యాండ్ అదృశ్యం కాలేదని పరిశోధకులు కనుగొన్నారు. ఈ ఆవిష్కరణతో శాస్త్రవేత్తలు 15.5 కోట్ల నాటి ఆర్గోల్యాండ్ ప్రస్థానాన్ని గుర్తించారు. ఇది దృఢమైన ఒకే భూభాగం కాకుండా సూక్ష్మఖండాల శ్రేణి కాబట్టి ఈ ఖండానికి శాస్త్రవేత్తలు ఆర్గోల్యాండ్కు బదులుగా ‘ఆర్గోపెలాగో’ అని పేరు పెట్టారు. సైన్స్ జర్నల్ ‘గోండ్వానా రీసెర్చ్’లో అక్టోబరు 19న ప్రచురితమైన ఈ పరిశోధన భూ గ్రహం పరిణామం గురించిన ఆధారాలను అందించడమే కాకుండా ప్రస్తుత జీవవైవిధ్యం, పర్యావరణ వ్యవస్థలు ఎలా అభివృద్ధి చెందాయనే విషయాలను కూడా వెలుగులోకి తెచ్చింది. Argoland was once part of the ancient supercontinent of Gondwana. Prior to the current scattered arrangement of continents, there existed supercontinents.@elonmusk pic.twitter.com/KSrK9q3JJk — JeepsyX (@JeepsyX) November 13, 2023 -
ఆకాశానికి నిచ్చెనొద్దు.. చంద్రునికి తాడు బిగించి..
చందమామపై నుంచి బలమైన తాడును ఆకాశం మీదుగా భూమి మీదకు వదిలితే.. మనం అంతరిక్షంలో ఈజీగా చెక్కర్లు కొట్టొచ్చంటున్నారు శాస్త్రవేత్తలు. ‘స్పేస్ లైన్’ ఏర్పాటు ద్వారా అసాధ్యాలు సుసాధ్యమవుతాయని నొక్కివక్కాణిస్తున్నారు. ఇందుకు భారీగా ఖర్చు కూడా కాబోదని చెబుతున్నారు. ఇంతకాలం ఆకాశానికి నిచ్చెన వేయాలనుకుంటున్న మనం ఇప్పుడు దానికి రివర్స్‌లో.. అంటే చంద్రునికి తాడు బిగించే ప్రయత్నం చేయాలంటున్నారు శాస్త్రవేత్తలు. అంతరిక్షయానానికి సంబంధించి శాస్త్రవేత్తలకు ఎదురవుతున్న అతి పెద్ద ప్రతిబంధకం భూ గురుత్వాకర్షణ శక్తిని అధిగమించేందుకు అధిక వ్యయం కావడం. అయితే యూకేలోని కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయానికి చెందిన జెఫిర్ పెనోయ్రే, న్యూయార్క్‌లోని కొలంబియా విశ్వవిద్యాలయానికి చెందిన ఎమిలీ శాండ్ఫోర్డ్ల అభిప్రాయం ప్రకారం ప్రస్తుతం మనం వినియోగిస్తున్న రాకెట్ ఇంజిన్ల పనివిధానాల సూత్రాలే అంతరిక్ష ప్రయోగాలకు అధికవ్యయం అయ్యేందుకు కారణంగా నిలుస్తున్నాయి. ప్రస్తుతమున్న విధానంలో వ్యోమనౌక భూమ్యాకర్షణకు వ్యతిరేక దిశలో ప్రయాణించేందుకు అవసరమయ్యే శక్తిని ఉత్పత్తి చేయడానికి గణనీయమైన మొత్తంలో ఇంధనం అవసరమవుతుంది. ఇందుకోసం అధికవ్యయం చేయాల్సివస్తుంది. దీనికి ప్రతిపాదిత పరిష్కారం స్పేస్ ఎలివేటర్‌ను నిర్మించడం అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే ఈ విధానంలో భూమి ఉపరితలం నుండి నిర్ణీత కక్ష్య వరకు విస్తరించిన ఒక కేబుల్‌ను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఇది అంతరిక్షంలోకి అధిరోహించడానికి ఒక మార్గాన్ని అందిస్తుంది. ఈ వ్యవస్థ అందించే ప్రాథమిక ప్రయోజనం ఏమిటంటే, అధిరోహణ ప్రక్రియ కోసం సౌరశక్తిని ఉపయోగించుకునే అవకాశం కలిగివుండటం. తద్వారా అత్యధిక ఇంధన వినియోగం అవసరమవదు. అయితే స్పేస్ ఎలివేటర్ ఆపరేషన్ కోసం వినియోగించే కేబుల్ అసాధారణమైన బలాన్ని కలిగి ఉండాలి. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ప్రత్యామ్నాయాలలో ఇందుకు అవసరమైన సామర్థ్యం లేదు. అయితే ఆధునిక శాస్త్రవేత్తలు పెనోయ్రే, శాండ్ఫోర్డ్ స్పేస్ ఎలివేటర్ భావనకు ప్రత్యామ్నాయంగా ‘స్పేస్‌లైన్’ అనే సంస్కరణను ప్రతిపాదించారు. ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్న పరికరాలను ఉపయోగించి దీనిని నిర్మించవచ్చని వారు అంటున్నారు. కాగా స్పేస్ ఎలివేటర్ ఏర్పాటులో భూమి లోతుల్లో ఒక కేబుల్ ఉంటుంది. అది భూమికి దాదాపు 42 వేల కిలోమీటర్లు (26,098 మైళ్ళు) దూరంలో ఉన్న జియోసింక్రోనస్ కక్ష్య దాటి విస్తరించి ఉంటుంది. ఈ రకమైన కేబుల్ గణనీయమైన సామర్థ్యాన్ని కలిగి ఉండాలి. అప్పుడే స్పేస్ ఎలివేటర్ ప్రయోగం విజయవంతమవుతుంది. దశాబ్దాలుగా భౌతిక శాస్త్రవేత్తలు, సైన్స్ ఫిక్షన్ రచయితలు తమ స్పేస్ ఎలివేటర్ ఆలోచనలకు ఊపిరి పోస్తున్నారు. అయితే ఈ ప్రయోగానికి తగిన సామర్థాన్ని అందించే పరికరాల లోపంతో ప్రయోగాలకు అడ్డంకులు ఏర్పడుతున్నాయి. ఇంతలో శాస్త్రవేత్తలు పెనోయ్రే, శాండ్ఫోర్డ్లు స్పేస్ ఎలివేటర్‌కు ప్రత్యామ్నాయంగా తాము ప్రతిపాదించిన ‘స్పేస్‌లైన్’ను సూచిస్తున్నారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. చంద్రుడిపై అత్యంత బలమైన తీగ(తాడు) లాంటిదాన్ని బిగించి, దాన్ని భూమి కక్ష్య వరకు వేలాడేలా చేయాలి. దీంతో భూమిపై నుంచి వెళ్లే రాకెట్లు ఈ బలమైన తీగ సహాయంతో అవతలి ఎండ్‌కు చేరుకుంటాయి. సరిగ్గా ఆ ఎండ్ దగ్గరే రాకెట్లు పార్క్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఆస్ట్రోనాట్లు ఈ తీగ వెంబడి మరో రాకెట్లో స్పేస్ ట్రావెల్ చేసి, ఈజీగా చంద్రుణ్ణి చేరుకోవచ్చు. సాధారణంగా రాకెట్ ద్వారా స్పేస్‌లో ప్రయాణించాలంటే ఈ మార్గంలో ఎన్నో అడ్డంకులను ఎదుర్కోవలసి వస్తుంది. మధ్యలో ఎప్పుడైనా ఏ ఆస్టరాయిడ్ అయినా వచ్చి తగిలే అవకాశం ఉంటుంది. అదే ఈ బలమైన తీగ వెంబడి ప్రయాణిస్తే అటువంటి ప్రమాదం ఉండదని శాస్త్రవేత్తలు చెబున్నారు. అంతేకాకుండా ఇటువంటి ప్రయోగం ద్వారా తక్కువ ఇంధనంతోనే ఎక్కువ దూరం ప్రయాణించవచ్చని కూడా చెబుతున్నారు. పైగా ఇందుకు అవసరమయ్యే శక్తిని సౌరశక్తితో అప్పటికప్పుడే జనరేట్ చేసుకోవచ్చంటున్నారు. ఇటువంటి స్పేస్‌లైన్‌ను నిర్మించేందుకు కావాల్సిన అన్ని టెక్నాలజీలు, మెటీరియల్స్ మనకు అందుబాటులోనే ఉన్నాయని శాస్త్రవేత్తలు తెలిపారు. అమెరికా, చైనా, రష్యా లాంటి అగ్రరాజ్యాలు ఇప్పటికే చంద్రునిపై పాగా వేయాలని చూస్తూ, అందుకు తగిన ప్రయోగాలు కూడా చేస్తున్నాయి. ఇదే ఆలోచనతో ఉన్న స్పేస్ ఎక్స్ సంస్థ ఇంకో నాలుగేళ్లలో అంగారకునిపై కాలనీ ఏర్పాటు చేసే ఆలోచనలో ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. భవిష్యత్‌లో ఈ స్పేస్‌లైన్ ప్రాజెక్ట్ విజయవంతం అయితే స్పేస్‌లో పలు అంతరిక్ష పరిశోధన కేంద్రాలను ఏర్పాటు చేసుకునేందుకు కూడా అవకాశముంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇది కూడా చదవండి: కన్నీళ్లకే కన్నీళ్లొచ్చె: సోదరి మృతదేహాన్ని నడుముకు కట్టుకుని.. -
షుగర్ ఉందని స్వీట్స్‌కి దూరంగా ఉండాల్సిన పనిలేదు, ఎందుకంటే..
మనలో స్వీట్స్ అంటే ఇష్టం లేనివారు ఉండరేమో. కానీ మారుతున్న జీవనశైలికి అనుగుణంగా దేశంలోనే కాదు ప్రపంచంలో మధుమేహ రోగుల సంఖ్య నానాటికీ పెరుగుతుంది. దీంతో కృత్రిమ స్వీటెనర్ వాడకం కూడా పెరిగింది. చక్కెరకి ప్రత్యామ్నాయంగా వీటి వినియోగం ఇటీవలి కాలంలో విపరీతంగా పెరిగిపోయింది. అయితే షుగర్ బదులు షుగర్-ఫ్రీ స్వీటెనర్స్ వాడడం వల్ల కేలొరీలు తగ్గుతాయి. సహజ ఉత్పత్తుల నుంచి తయారుచేసిన స్వీటెనర్స్ వాడడం వల్ల ఆహారంలో కేలొరీలు తగ్గుతాయి. దీని వల్ల బరువు అదుపులో ఉండటమే కాకుండా మధుమేహం, గుండెజబ్బులు వచ్చే ప్రమాదం కూడా తగ్గుతుంది. ఉదాహరణకి స్టెవియా ఆధారిత స్వీటెనర్లు ఒక మొక్క ఆకుల నుంచి తయారు చేస్తారు. ఈ మధ్యకాలంలో అలాంటి అల్లులోజ్ వాడకం బాగా పెరిగింది. అల్లులోజ్ను D-psicose అని కూడా పిలుస్తారు.ఇది 70% తీపిగా ఉన్న ఫీలింగ్ కలిగినప్పటికీ ఇందులో కేవలం 10% మాత్రమే కేలరీలను కలిగి ఉంటుంది. టైప్-2 డయాబెటిస్ ఉన్నవారిలో బరువు తగ్గడానికి సహాయపడుతుంది. అంతే కాకుండా రక్తంలో గ్లూకోజ్ స్థాయిలని మెరుగుపరుస్తుంది. అయితే ఇన్ని ఉపయోగాలు ఉన్నా నాణ్యత విషయంలో పేలవంగా ఉందని కెనడా సహా మరికొన్ని దేశాల్లో అల్లులోజ్ వాడకంపై బ్యాన్ విధించారు. అయితే ఇప్పుడు యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియా, డేవిస్ (UC డేవిస్) సైంటిస్టులు అల్లులోజ్ క్వాలిటీపై జరిపిన పరీక్షల్లో ముఖ్యమైన పరోగతిని సాధించారు. అల్లులోజ్ చక్కెరకు గొప్ప ప్రత్యామ్నాయమని సైంటిస్టులు తెలిపారు. ఎందుకంటే ఇది గోధుమలు,అత్తిపండ్లు, ఎండుద్రాక్ష వంటి కొన్ని మొక్కలతో తయారుచేశారు. ఇందులో ఒక గ్రాములో కేవలం 0.4 కేలరీలు మాత్రమే కలిగి ఉంటుంది, సుక్రోజ్‌లో గ్రాముకు నాలుగు కేలరీలు ఉంటాయి. అల్లులోజ్ను తిన్న తర్వాత 70% జీర్ణం అవగా, మిగతాది కేవలం 24గంటల వ్యవధిలోనే యూరిన్ ద్వారా బయటకు వస్తుంది. కాబట్టి అల్లులోజ్ రక్తంలో గ్లూకోజ్ లేదా ఇన్సులిన్ స్థాయిలను ప్రభావితం చేయదని పేర్కొన్నారు. -
అరుదైన మొక్కకు ‘రాజశేఖరుడి’ పేరు
విద్యా రంగానికి దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి చేసిన సేవలకు గుర్తుగా ఓ అరుదైన మొక్కకు ఆయన పేరు పెట్టి యోగి వేమన యూనివర్సిటీ(వైవీయూ) గౌరవించింది. దీనిని లండన్‌లోని రాయల్ బొటానికల్ గార్డెన్, కోల్‌కతాలోని బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియాతో పాటు మరికొన్ని పరిశోధక సంస్థలు ధ్రువీకరించాయి. వివరాలు.. వైవీయూ వృక్షశాస్త్ర విభాగం ప్రొఫెసర్ డాక్టర్ ఎ.మధుసూదన్‌రెడ్డి, పరిశోధకుడు, ఢిల్లీలోని ఎస్వీ కాలేజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డా.కె.ప్రసాద్‌ల బృందం 2020లో వైఎస్సార్ జిల్లా బాలుపల్లి అటవీ రేంజ్‌లోని మొగిలిపెంట ప్రాంతంలో ఓ మొక్కను గుర్తించింది. శాస్త్రీయ పరిశోధనల అనంతరం అరుదైన మొక్కగా గుర్తించి.. నిర్ధారణ కోసం లండన్‌లోని రాయల్ బొటానికల్ గార్డెన్, కోల్‌కతాలోని బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా, చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్, సౌత్ చైనా బొటానికల్ గార్డెన్, గౌన్‌డోంగ్ ప్రావిన్స్ సంస్థలకు పంపించింది. ఆయా సంస్థలు మొక్క శాస్త్రీయతను నిర్ధారించి.. అరుదైన మొక్కగా గుర్తింపునిచ్చాయి. న్యూజిలాండ్‌కు చెందిన సైంటిఫిక్ జర్నల్ ఫైటోటాక్సాలో దీనిని కవర్ పేజీగా ప్రచురించారు. ప్రపంచం మొత్తం మీద శేషాచలం అడవుల్లో మాత్రమే లభించే మొక్కగా నిర్ధారణ అవ్వడంతో.. ఈ ప్రాంతానికి సంబంధించిన పేరు పెట్టుకునే వెసులుబాటు లభించింది. దీంతో పరిశోధకులు, అధికారులు చర్చించి.. వైవీయూ వ్యవస్థాపకుడు, ఫీజు రీయింబర్స్మెంట్ ద్వారా ఎందరో పేద విద్యార్థులకు చదువుకునే అవకాశం కల్పించిన దివంగత సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి పేరు పెట్టారు. ఔషధ విలువలు అధికం లెపిడోగాథిస్ జాతికి చెందిన ఈ మొక్కకు ప్రజాతిగా ‘రాజశేఖరే’(లాటిన్ భాష) పేరును కలిపి నామకరణం చేశారు. లెపిడోగాథిస్ జాతికి చెందిన మొక్కలు ప్రపంచవ్యాప్తంగా 144 ఉండగా.. ఇప్పుడు 145వ మొక్కగా ‘లెపిడోగాథిస్ రాజశేఖరే’ గుర్తింపు పొందింది. భారత్‌లో 34 మొక్కలు ఉండగా.. ఇది 35వది. ఏపీలో 8 మొక్కలు ఉండగా.. ఇది తొమ్మిదవది. ఈ జాతికి సంబంధించిన మొక్కలను స్థానిక భాషలో ముళ్లబంతి, సూర్యకాంతం తదితర పేర్లతో పిలుస్తారు. ఔషధ విలువలు కూడా ఉండటంతో.. సంరక్షించాల్సిన జాతుల కింద వీటిని గుర్తించారు. జ్వరం, ఎగ్జిమా, సోరియాసిస్, ఎపిలెప్సీ, దురద, మౌత్ అల్సర్, కీటకాల కాటు, దెబ్బలు తదితర చికిత్సలకు వీటిని వినియోగిస్తారని వైవీయూ వృక్షశాస్త్ర విభాగ ప్రొఫెసర్ డా.ఎ.మధుసూదన్‌రెడ్డి తెలిపారు. ఈ మొక్కలకు మార్చి, ఏప్రిల్ నెలల్లో మాత్రమే పూలు పూస్తాయని చెప్పారు. వైవీయూలోని బొటానికల్ గార్డెన్లో సంరక్షిస్తున్నట్లు చెప్పారు. –వైవీయూ (వైఎస్సార్ జిల్లా) -
నాగకేసరి చెట్ల నుంచి జీవ ఇంధనం
కొయ్యూరు (అల్లూరి సీతారామరాజు జిల్లా): ఆసక్తి, విషయ పరిజ్ఞానం, సాధించాలనే తపన ఉంటే దేనినైనా సాధించవచ్చని నిరూపించింది ఓ గిరిపుత్రిక. తల్లిదండ్రులు తనని చదివించలేని పరిస్థితుల్లో ఉన్నా, మొక్కవోని దృఢ సంకల్పంతో ఉన్నత చదువుల్లో ప్రతిభ చూపారు రాజేంద్రపాలేనికి చెందిన దిబ్బ చంద్రవతి. ఆమె తల్లిదండ్రులు దిబ్బ సుందర్రావు, సింగారమ్మ కూలీలు. చంద్రవతి పదో తరగతి మండలంలోని పెదమాకవరం పాఠశాలలోను, ఇంటర్ పాడేరు బాలికల గురుకుల జూనియర్ కళాశాలలో పూర్తి చేశారు. డిగ్రీ విశాఖలో చదివారు. అనంతరం ఆంధ్రా యూనివర్సిటీలో రెండేళ్లు ఎంఫిల్ చేశారు. పీహెచ్‌డీలో భాగంగా ‘నాగ కేసరి చెట్ల నుంచి జీవ ఇంధన తయారీ’పై పరిశోధనకు శ్రీకారం చుట్టారు. యూనివర్సిటీ ఆచార్యులు ఎస్బీ పడాల్ పర్యవేక్షణలో పరిశోధన నిర్వహించారు. దీనిపై జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రచురణలు జరగడంతో ఆమెను డాక్టరేట్ వరించింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అటవీ ప్రాంతంలో విలువైన ఔషధాలు ఉన్నాయని తెలిపారు. ఆదిమజాతి గిరిజనులు వృక్షాలతో అన్యోన్యంగా ఉంటారని, వివిధ రకాల రోగాలకు వారి పరిసరాల్లో పెరిగే మొక్కలు, చెట్లను ఉపయోగిస్తారని చెప్పారు. అడవిలో పెరిగే నాగ కేసరి చెట్ల నుంచి సేకరించిన విత్తనాలను నూనెగా మార్చి జీవ ఇంధనంగా తయారు చేశామని ఆమె వివరించారు. తక్కువ ఖర్చుతో ఇంధనాన్ని తయారు చేయవచ్చునని తెలిపారు. పరిశోధన పూర్తి కావడంతో ఏయూ ఉప కులపతి పీవీజీడీ ప్రసాద్ రెడ్డి నుంచి ఈనెల తొమ్మిదిన డాక్టరేట్ అందుకున్నట్టు ఆమె తెలియజేశారు. -
క్యాన్సర్ నుంచి బయటపడొచ్చు.. సైంటిస్టులు కనిపెట్టిన కొత్త రీసెర్చ్
క్యాన్సర్.. ఈ పేరు వింటేనే వెన్నులో వణుకు పుడుతుంది. ఎందుకంటే ఇదో ప్రాణాంతక వ్యాధి. సరైన సమయంలో ట్రీట్మెంట్ తీసుకోకపోతే ప్రాణాలు పోతాయి.అయితే క్యాన్సర్ నుంచి బయట పడేందుకు సైంటిస్టులు ఇప్పుడో కొత్త మార్గాన్ని ఆవిష్కరించారు. క్యాన్సర్ కణాల ఎదుగుదలకు, వ్యాప్తికి సాయపడే పోషకాల స్థానంలో ఉత్తుత్తి పోషకాలను అందిస్తే వ్యాధి వ్యాప్తి నిలిచిపోతుందని, కణితి సైజు తగ్గిపోతుందని శాస్త్రవేత్తలు నిరూపించారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. కాలిఫోర్నియాలోని స్టాన్ఫోర్డ్ బర్న్‌హామ్ ప్రీబిస్ మెడికల్ డిస్కవరీ ఇన్స్టిట్యూట్ జరిపిన ప్రయోగం ప్రకారం..ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కణితి ఎదుగుదలకు, వ్యాధి వ్యాప్తికి కారణమయ్యే పోషకాల స్థానంలో డమ్మీ పోషకాలు ఇవ్వడం ద్వారా క్యాన్సర్‌ను నియంత్రించవచ్చు. క్యాన్సర్లలో ఎన్నో రకాలుంటాయన్నది తెలిసిందే. క్లోమగ్రంథి (పాంక్రియాటిక్)కి వచ్చే క్యాన్సర్ కొంచెం ముదురుటైపు. దీని బారిన పడ్డవారు కోలుకోవడం అసాధారణమే. ఏటా దాదాపు 14 లక్షల మంది ఈ వ్యాధి బారిన పడుతున్నారు. సాధారణంగా 35-39, 85-89 ఏళ్ల మధ్య వయసు వారిలో ఈ క్యాన్సర్ ఎక్కువ. క్లోమ గ్రంథి క్యాన్సర్ వచ్చిన వారిలో మూడు-మూడున్నరేళ్లకు మించి జీవించి ఉండేవారు పది శాతానికి మించి లేరని పరిశోధనలో వెల్లడైంది. జన్యు కారకాలు, వయస్సు, జీవనశైలి కారణంగా ఈ క్యాన్సర్ ప్రమాదం పెరుగుతుంది. క్యాన్సర్ ట్రీట్మెంట్లో అదే కీలకం క్లోమగ్రంథి క్యాన్సర్ సాధారణంగా గ్లుటామైన్ అనే పోషకంపై ఎక్కువగా అధారపడి ఉంటుంది. కాబట్టి దీన్ని అందకుండా చేస్తే క్యాన్సర్ వ్యాప్తి చెందకుండా ఉంటుంది. గ్లుటమైన్ అందుబాటులో లేనప్పుడు క్యాన్సర్ కణాలు ఆస్పరాజైన్‌తో సహా ఇతర పోషకాలపై కాబట్టి ఈ రెండు పోషకాలు అందకుండా చేస్తే వ్యాధిని కట్టడి చేయవచ్చు. ఇందుకోసం శాస్త్రవేత్తలు అచ్చం గ్లుటమైన్ మాదిరిగానే ఉండే 6-డయాజో-5-ఆక్సో-ఎల్-నార్లూసిన్ (DON)ను, ఇప్పటికే ఊపిరితిత్తుల క్యాన్సర్ చికిత్సకు ఉపయోగిస్తున్న L-ఆస్పరాగినేస్లను కలిపి ఎలుకలపై ప్రయోగాలు చేశారు. L-ఆస్పరాగినేస్ అనేది ఆస్పరాజైన్ను విచ్ఛిన్నం చేసే కీమోథెరపీ ఔషధం. ఇది క్యాన్సర్ కణాలను వృద్ది చెందకుండా అడ్డుకుంటుంది. రెండింటినీ కలిపి వాడినప్పుడు ఎలుకల్లోని క్యాన్సర్ కణితి సైజు తగ్గిపోయినట్లు.. వ్యాధి వ్యాప్తి కూడా ఎక్కువ జరగనట్లు తేలింది. క్యాన్సర్ కణాల ప్రొటీన్ ఉత్పత్తికి, కొత్త కణాల తయారీకి ఆస్పరాజైన్ అవసరం. DONను ఇప్పటికే ఊపరితిత్తుల క్యాన్సర్ ట్రీట్మెంట్లో ఉపయోగిస్తున్నారు కానీ... రెండింటినీ కలిపి వాడటం ఇదే మొదటిసారి. ఇప్పుడు ఇదే పద్ధతిని అంటే రెండు రకాల డమ్మీ పోషకాలను కలిపి వాడటం క్లోమగ్రంథి క్యాన్సర్ చికిత్సకూ వాడవచ్చునని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సైలంట్ కిల్లర్... ప్యాంక్రియాటిక్ క్యాన్సర్.. ఈ మధ్య కాలంలో ఎక్కువగా వెలుగు చూస్తున్న క్యాన్సర్లలో ఇది కూడా ఒకటి.అలసట, ఆకలి లేకపోవడం,ఉబ్బినట్లు అనిపించడం వంటి అజీర్ణం లక్షణాలు,అకస్మాత్తుగా బరువు తగ్గడం, శరీరంలో రక్తం గడ్డ కట్టడం వెన్ను నొప్పి, కామెర్లు, విపరీతంగా కడుపునొప్పి వంటివన్నీ ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ లక్షణాలు. ధూమపానం, మధుమేహం ఎక్కువగా సేవించడం, కుటుంబంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ ఉంటే మరింత జాగ్రత్తగా ఉండాలి. ఇతర క్యాన్సర్ల మాదిరిగానే ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ క్లోమ గ్రంథిలో కణాల అసాధారణ పెరుగుదల వల్ల వస్తుంది. ప్యాంక్రియాస్ (క్లోమం) కడుపులో ముఖ్యమైన భాగం. ఇది చిన్న పేగు దగ్గర ఉండే పొడవైన గ్రంథి.ఇది జీర్ణక్రియకు సహాయపడే పదార్థాలు లేదా ఎంజైమ్‌లను ఉత్పత్తి చేయడంలో సహాయపడటమే కాకుండా, రక్తప్రవాహంలో చక్కెర పరిమాణాన్ని నియంత్రించే హార్మోన్లను విడుదల చేయడంలో కూడా సహాయపడుతుంది. ప్యాంక్రియాటిక్ క్యాన్సర్‌ను సైలెంట్ కిల్లర్ క్యాన్సర్ అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఇది వ్యాధి తీవ్రం అయ్యేవరకు ఎలాంటి లక్షణాలను చూపించదు. ఈ రకమైన క్యాన్సర్ చాలా తొందరగా శరీరంలోని ఇతర అవయవాలకి వ్యాపిస్తుంది. ప్యాంక్రియాటిక్ క్యాన్సర్లు తరచుగా పొత్తికడుపు, కాలేయానికి వ్యాప్తి చెందుతాయి. అంతేకాకుండా ఊపిరితిత్తులు, ఎముకలు, మెదడుతో పాటి ఇతర అవయవాలకు కూడా వ్యాప్తి చెందే ప్రమాదం ఉంది. -
సింధు ప్రజల ముఖ ఆకృతి ఎలా ఉండేది? శాస్త్రవేత్తల పరిశోధనల్లో ఏమి తేలింది?
సింధు లోయ నాగరికతకు చెందిన ప్రజల ముఖాలు ఎటువంటి ఆకృతిలో ఉండేవనే ఇన్నాళ్ల సందేహాలకు ఇప్పుడు తెరపడింది. తాజాగా పరిశోధకులు సింధూ ప్రజల ముఖాకృతి ఇదేనంటూ ఒక ఫొటోను విడుదల చేశారు. సింధూ నాగరిత నాటి ఒక స్మశానవాటికలో లభ్యమైన రెండు పుర్రెల ఆధారంగా వాటి ముఖాలకు ఆకృతి తీసుకువచ్చి, లోకం ముందు ఉంచారు. ఈ ఫొటో ఇప్పుడు ఎంతో ఆసకికరంగా మారింది. ప్రపంచంలోని పురాతన నాగరికతలలో సింధు లోయ నాగరికత ఒకటి. ఈ నాగరికత క్రీ.పూ. 3300 నుండి 2500 వరకు కొనసాగింది. ప్రముఖ పత్రిక నేచర్‌లో ప్రచురితమైన పరిశోధనా వ్యాసంలోని వివరాల ప్రకారం సింధు లోయ నాగరికత 8000 సంవత్సరాల పురాతనమైనది. భారతదేశ చరిత్ర హరప్పా నాగరికతగా పేరొందినప్పటికీ, అది కూడా సింధు లోయ నాగరికతతో పాటు ప్రారంభమయ్యిందని చరిత్ర చెబుతోంది. మొహెంజొదారో, కలిబంగా, లోథాల్, ధోలావీరా, రాఖీగర్హి మొదలైనవి హరప్పా, సింధు లోయ నాగరికతలకు ప్రధాన కేంద్రాలుగా పరిగణిస్తారు. సింధు లోయ నాగరికతకు చెందిన పురాతన నగరం 2014లో హర్యానాలోని ఫతేహాబాద్ జిల్లాలోని భిర్దానాలో కనుగొన్నారు. దీని స్థాపన సుమారు క్రీ.పూ. 7570 నాటిదని చెబుతారు. పురావస్తు శాస్త్రవేత్తలు, చరిత్రకారులు సింధు లోయ నాగరికత అత్యంత అభివృద్ధి చెందిన నాగరికత అని అంటారు. సింధు లోయ నాగరికతను అధ్యయనం చేసేందుకు శాస్త్రవేత్తలు నిరంతరం ప్రయత్నిస్తున్నారు. అయితే సింధూ ప్రజల ముఖ రూపాన్ని గుర్తించేందుకు చేసిన ప్రయత్నాలేవీ నేటివరకూ పూర్తిస్థాయిలో విజయవంతం కాలేదు. అయితే తాజాగా పూరాతత్వ పరిశోధకులు క్రీ.పూ. 2273, 2616 నాటిదిగా అంచనా వేసిన సింధునాగరికత స్మశానవాటిక రాఖీగర్హి లో పరిశోధినలు సాగించారు. ఈ నేపధ్యంలో రాఖీగర్హిలో లభ్యమైన రెండు పుర్రెల కంప్యూటెడ్ టోమోగ్రఫీ డేటాను ఉపయోగించి క్రానియోఫేషియల్ రీకన్స్ట్రక్షన్ (సీఎఫ్ఆర్) విధానం ద్వారా సుమారు 4500 సంవత్సరాల క్రితం ఖననం చేసిన సింధు నాగరితక వ్యక్తులకు చెందిన ముఖాలను విజయవంతంగా పునర్నిర్మించామని శాస్త్రవేత్తలు తెలిపారు. సింధు నాగరికుల ముఖ స్వరూపాన్ని అంచనావేసేందుకు శాస్త్రీయంగా జరిగిన మొదటి ప్రయత్నం ఇదేనని వారు పేర్కొన్నారు. ఈ వివరాలను అనాటమికల్ సైన్స్ ఇంటర్నేషనల్ వాల్యూమ్- 95లో శాస్త్రవేత్తలు జూన్ లీ, వసంత్ షిండే, డాంగ్ హూన్ షిన్ షోలు పొందుపరిచారు. ఇది కూడా చదవండి: యూదుల ఇజ్రాయెల్ ఎలా ఏర్పడింది? జనాభా ఎంత? -
TS History:1948 పోలీస్ యాక్షన్ – మరో కోణం
తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం, అది సృష్టించిన సాహిత్యం మన రాజకీయాల్లో, సాహిత్యంలో చివరకు మన జీవితాల్లోనూ విడదీయరాని భాగం. ఇప్పుడు కమ్యూనిస్టు పార్టీలకు రెండు తెలుగు రాష్ట్రాల చట్టసభల్లో ఒక్క ప్రతినిధి కూడా లేడు. అయినప్పటికీ, సామాజిక, సాంస్కృతిక రంగాల్లో వామపక్ష భావజాలమే ఇప్పటికీ బలంగా ఉంది. తెలుగు సాహిత్యంలో అత్యధిక భాగం ‘సామ్యవాద వాస్తవికత’ ప్రభావంలోనే ఉందంటే అతిశయోక్తి కాదు. భాషా ప్రయుక్త రాష్ట్రాల విధానం వచ్చాక 1956లో తెలంగాణ ప్రాంతాన్ని ఆంధ్రరాష్ట్రంతో కలిపి ఆంధ్రప్రదేశ్‌ను ఏర్పాటు చేశారు. నిజాం సంస్థానం చాలా పెద్దది. అందులోని ఐదు ప్రధాన ప్రాంతాల్లో తెలంగాణ ఒకటి. తెలంగాణలోని నల్లగొండ, వరంగల్ రెండు జిల్లాల్లో ప్రధానంగానూ, మరో ఒకటి రెండు జిల్లాల్లో స్వల్పంగానూ తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం సాగింది. ఆనాటి చారిత్రక సంఘటనల మీద తమ అనుభవాలను గ్రంథస్థం చేసిన ఆ పోరాట అగ్రనాయకులు అందరూ తెలంగాణకు పరిమితమయ్యారు. తమ పుస్తకాలకు నిజాయితీగా ‘తెలంగాణ’ అనే శీర్షికలే పెట్టారు. మిగిలిన నిజాం సంస్థానాన్ని వదిలేశారు. దానికి రెండు కారణాలు. మొదటిది ఉర్దూ భాషా సమస్య, రెండోదిముస్లిం మత సమస్య.నిజాం పాలన గురించి మనకు, ముఖ్యంగా, తెలుగు పాఠకులకు తెలిసింది చాలా తక్కువ. నిజాం సంస్థానంలో పెట్టుబడీదారీ అభివృద్ధి గురించి పరిశోధనలు చేసిన ప్రొఫెషనల్స్ కొందరు లేకపోలేదు. వారిలో ఒకడైన సివి సుబ్బారావు ఆ రోజుల్లో జవహర్ లాల్ నెహ్రూ వాగ్దానం చేసిన ఇండియాకన్నా మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ పాలనలోని నిజాం సంస్థానంలో కొనసాగుతున్న అభివృద్ధి మెరుగ్గా ఉందనే నిర్ధారణకు వచ్చాడు.ఇంతకీ తెలంగాణ సాయుధ పోరాటం ద్వారా భారత కమ్యూనిస్టు పార్టీ సాధించిందేమిటి? వాదన కోసం; నిజాం రాచరిక పాలననో, జాగీర్దార్ల భూస్వామ్యాన్నో వాళ్ళు అంతం చేసేశారు అనుకుందాము. భూస్వామ్య వ్యవస్థను అంతం చేశాక పెట్టుబడీదారీ వ్యవస్థ ఏర్పడుతుందని సాక్షాత్తు ‘కమ్యూనిస్టు పార్టీ ప్రణాళిక’లో కార్ల్ మార్క్స్– ఫ్రెడరిక్ ఏంగిల్స్ చెప్పారు. అంతేకాని భూస్వామ్య వ్యవస్థను కూల్చేస్తే సమసమాజం వస్తుందనో, కమ్యూనిస్టు రాజ్యం వస్తుందనో, కనీసం ‘రైతు–కూలీ రాజ్యం’ వస్తుందనో వాళ్ళెక్కడా చెప్పలేదు.తెలంగాణలో కమ్యూనిస్టు పార్టీ రాచరిక – భూస్వామ్య వ్యతిరేక పోరాటం చేసిన తరువాత అక్కడ అత్యంత సహజంగానే పెట్టుబడీదారీ వ్యవస్థ అభివృద్ధి చెందడాన్ని మనందరం చూస్తున్నాం. 1940ల చివర్లో ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీగానీ, 1980ల మొదట్లో నక్సలైట్ పార్టీలుగానీ ఉద్దేశ్యపూర్వకంగా కాకపోయినా పెట్టుబడిదారులు పెరగడానికి కారణమయ్యారు. సమాజానికి తనదైన ఒక రోడ్ మ్యాప్ ఉంటుంది. ఒకరు అనుకున్నా అనుకోకపోయినా అదలా సాగిపోతుందంతే. ఒక కఠోర చారిత్రక వాస్తవం ఏమంటే ప్రపంచంలో ఇప్పటి వరకు పెట్టుబడీదారీ వ్యవస్థ అభివృద్ధి చెందిన ఏ దేశంలోనూ సోషలిస్టు విప్లవం విజయవంతం కాలేదు. 1948 నాటి పోలీస్ యాక్షన్ గురించి కమ్యూనిస్టు నాయకులు చెప్పని ఇంకో పెద్ద నిజం కూడా ఉంది. జె.ఎన్. చౌధరి నాయకత్వంలోని ‘పోలీసు యాక్షన్’ కమ్యూనిస్టు ప్రభావిత జిల్లాలకు చేరుకోవడానికి ముందే నిజాం సంస్థానంలో సాయుధపోరాటంలో మరణించిన 3 వేలకు ఓ పది రెట్లకు పైగా ముస్లింలను అతి క్రూరంగా చంపేశారు. వాళ్ల ఆస్తుల్ని స్వాధీనం చేసుకున్నారు. దీనిపైన నెహ్రూ వేసిన సుందర్ లాల్ బహుగుణ కమిటీ మాత్రమేకాక, ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీకి అప్పటి పార్లమెంటరీ రాజకీయాల వేదికగా ఉన్న ‘పీపుల్స్ డెమోక్రాటిక్ ఫ్రంట్ ’(పీడీఎఫ్) నాయకులు కూడ ఒక నివేదికను కేంద్ర ప్రభుత్వానికి అందచేశారు. సుందర్ లాల్ బహుగుణ నివేదికను జాతీయభద్రత దృష్ట్యా చాలాకాలం దాచిపెట్టారుగానీ ఇప్పుడు అది అందుబాటులో వుంది. ఇండో–అమెరికన్ రచయిత అఫ్సర్ మహమ్మద్ 1948 నాటి పోలీస్ యాక్షన్ బాధిత కుటుంబాల సంతతిని కలిసి వాళ్ళ అనుభవాలను నమోదు చేసే బాధ్యతను భుజాన వేసుకున్నాడు. ఈ అంశం మీద ఓ దశాబ్దం పాటు విçస్తృత పరిశోధనలు చేసి ఇప్పుడు ‘రీమేకింగ్ హిస్టరీ –1948 పోలీస్ యాక్షన్ అండ్ ది ముస్లిమ్స్ ఆఫ్ హైదరాబాద్’ శీర్షికతో ఒక భారీ చారిత్రక డాక్యుమెంట్ ప్రచురించాడు. 2002 గుజరాత్ అల్లర్ల తరువాత తను ముస్లిం సమాజం మీద దృష్టి పెట్టాడు. మొహర్రం పండుగ సందర్భంగా తెలంగాణలో వెల్లివెరిసే మతసామరస్యం మీద పరిశోధన సాగించాడు. ఆ క్రమంలో 1948 పోలీస్ యాక్షన్ బాధితులు అతనికి తారసపడ్డారు. దాచేస్తే దాగని సత్యాలను వెళ్ళడించడానికి సిద్ధపడ్డాడు. దాని ఫలితమే ఈ పరిశోధనా గ్రంథం. ప్రపంచం అనేది చాలా పెద్దది. అందులో మనకు తెలిసింది చాలా తక్కువ, తెలియాల్సింది చాలా ఎక్కువ అనే స్పృహ చాలామందికి ఉండదు. ప్రపంచం మొత్తం తెలియకపోయినా మనదేశం గురించి, మన రాష్ట్రం గురించయినా తెలియాలి. హీనపక్షం మనతో వందల సంవత్సరాలుగా సహజీవనం చేస్తున్న సమూహాల మనోభావాలనైనా తెలుసుకోవాలిగా. దానికి ఈ పుస్తకం తోడ్పడుతుందని ఆశిస్తాను. వ్యాసకర్త సమాజ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్టు మొబైల్: 9010757776 -
ఎలుక పాలు లీటరు 18 లక్షలా..!
ఇంతవరకు అత్యంత ఖరీదైన పాలంటే గాడిద పాలనే భావించేవారు. కానీ కాదట వాటికంటే ఓ చిన్న జీవి, మన వినాయకుడి వాహనం అయిన మూషికం పాలే ఖరీదైనవి. ఏకంగా లక్షలు పలుకుతోంది ధర. పైగా పరిశోధకలకు ఎంత ప్రియమైన జంతువట అది. ఇంతకీ ఎలుక పాలు ఎందుకంత కాస్టలీ? అత్యంత ఖరీదైన పాలు ఎలుక పాలే! షాకింగ్ అనిపిస్తున్నా ఇదే వాస్తవం. ఎలుకపాలు సంపాదించటం అంత ఈజీ కాదు. పైగా ఇది 30 నిమిషాల ప్రక్రియే అయినా ఎలుక నుంచి కొద్ది మొత్తంలోనే పాలు వస్తాయి. ఒక లీటరు పాలను ఉత్పత్తి చేయడానికి దాదాపు 40 వేల ఎలుకలు అవసరం. ఈ ఎలుకల నుంచి సేకరించిన ఒక లీటరు పాల ధర దాదాపు 23 వేల యూరోలు అంటే సుమారు 18 లక్షల రూపాయలు. దేనికీ ఈ పాలు.. ఎలుక పాలను పరిశోధనలకు ఓ సాధనంగా ఉపయోగిస్తారు. మలేరియా బ్యాక్టీరియాను చంపే మందులు తయారీలో ఈ ఎలుక పాలను ఉపయోగిస్తారు. అయితే శాస్త్రవేత్తలు ఆవు పాలకు బదులుగా ఈ ఎలుక పాలేనే ఎందుకు ఉపయోగిస్తున్నారు? అంటే..ఎలుక డీఎన్ఏ ఇతర జంతువుల డీఎన్ఏకంటే ప్రభావవంతంగా ఉంటుంది. పైగా మానవ శరీరానికి సంబంధించింది. అందువల్ల ప్రయోగాల ఫలితాలను విశ్లేషించడం చాలా ఈజీ. ప్రయోగాలకు వేల జంతువులు అవసరం. అదే ఆవు అయితే వేల ఆవులను వినయోగించడం సాధ్యం కాదు. దానికంటే వేల ఎలుకలను ఉపయోగించడమే చాలా ఆచరణాత్మకమైనది, సులభమైనది కూడా. ఏ ఔషధాల్లో ఉపయోగిస్తారంటే.. మలేరియాను నయం చేసే మందుల్లోనే గాక రీసెర్చ్ మెటీరియల్గానూ ఈ పాలను వినియోగిస్తారు. అందువల్ల ఈ ఎలుక పాలు పరిశోధనల పరంగా అత్యంత ఖరీదైనవి. ఏజంతువు ఎక్కువ పాలు ఉత్పత్తి చేస్తుందంటే.. ఒక ఆవు ఏడాదికి దాదాపు 10 వేల లీటర్ పాలను ఉత్పత్తి చేస్తుంది. ఇది దాని బరువు కంటే ఏడు రెట్లు ఎక్కువ. మేకలు ఏడాదికి వాటి బరువు కంటే 12 రెట్లు పాలను ఉత్పత్తి చేస్తాయి. ఇప్పటి వరకు ఉన్న జీవులన్నింటిలో బ్లూ వేల్ రికార్డును కలిగి ఉంది. నీలి తిమింగలం రోజుకు 600 లీటర్ల పాలను ఉత్పత్తి చేస్తుంది. ఈ పాలు చాలా కొవ్వుగా ఉంటాయి. కాబట్టి తిమింగలం పిల్ల రోజుకు 100 కిలోల బరువు పెరుగుతుంది. (చదవండి: వాస్తవికతకే రూపం ఇస్తే..పాజిటివ్ ఎమోషన్..) -
ఆ తిండితో మానసికంగానూ ముప్పే!
సాక్షి, హైదరాబాద్: అల్ట్రా–ప్రాసెస్డ్ ఫుడ్ (యూపీఎఫ్) (ఎక్కువగా ప్రాసెస్ చేసిన ఆహారం) తరచుగా తీసుకోవడం ఊబకాయం, మధుమేహం, గుండె జబ్బులు తదితర సమస్యలకు దోహదం చేస్తుందని గతంలో చేసిన అధ్యయనాలు తేల్చాయి. అయితే వీటి వల్ల మానసిక సామర్ధ్యం సైతం గణనీయంగా తగ్గుతుందని తాజా అధ్యయనం ఒకటి వెల్లడించింది. రోజుకు పలుమార్లు అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ తినే వారు.. ఈ ఆహారాలను అరుదుగా లేదా ఎప్పుడూ తీసుకోని వారితో పోలిస్తే మానసిక ఆరోగ్యంతో బాధపడే అవకాశం దాదాపు మూడు రెట్లు ఎక్కువ అని మన దేశానికి చెందిన 30 వేల మంది వ్యక్తులను భాగస్వాముల్ని చేసిన ఈ అధ్యయనం వెల్లడించింది. ప్రపంచ వ్యాప్తంగా మానసిక శ్రేయస్సును అధ్యయనం చేసే అమెరికాకు చెందిన లాభాపేక్ష లేని స్వచ్ఛంద సంస్థ సేపియన్ ల్యాబ్స్ గ్లోబల్ మైండ్ ప్రాజెక్ట్‌లో ఈ అధ్యయనం ఒక భాగం. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 3 లక్షల మంది నుంచి వచ్చిన ప్రతిస్పందనలు, అధ్యయన ఫలితాలతో ఇటీవల ఒక నివేదిక విడుదల చేశారు. యూపీఎఫ్ అంటే ఏమిటి? యూపీఎఫ్‌ను సరైన విధంగా నిర్వచించడం కొంతవరకు కష్టమే. అయితే సగటు గృహాలలో తయారు కాని, ఇంటి వంటగదికి ఆవల ప్రాసెసింగ్ చేసిన ఆహార పదార్థాలను యూపీఎఫ్‌గా తారా త్యాగరాజన్ నిర్వచిస్తున్నారు. ఎరేటెడ్ డ్రింక్స్ (కొన్నిరకాల శీతల పానీయాలు, ఐస్‌క్రీమ్స్, ప్యాక్ చేసిన చిప్స్, స్నాక్స్, మిఠాయిలు ఈ కోవలోకి వస్తాయి. దీర్ఘకాలం మన్నేందుకు గాను సాల్ట్, సుగర్, ఫ్యాట్ వంటివి అధికంగా కలిపేవి ప్రాసెస్డ్ ఫుడ్ కాగా, అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్‌లో కృత్రిమ స్వీటెనర్లు, ఫ్లేవర్లు ఇతరత్రా కూడా జత కలుస్తాయి. రెడీ టూ ఈట్ మీల్స్, తీపి పానీయాలు వంటివన్నీ వీటిలో భాగమే. నానాటికీ పెరుగుతున్న వినియోగం మన దేశంలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న మార్కెట్లలో యూపీఎఫ్ కూడా ఉంది. ఇండియ¯న్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఇంటర్నేషనల్ ఎకనామిక్ రిలేషన్స్‌తో కలిసి గత ఆగస్టులో ప్రపంచ ఆరోగ్య సంస్థ విడుదల చేసిన ఒక నివేదిక వీటి వినియోగం ఎంతలా ఉందో స్పష్టం చేసింది. కోవిడ్ సందర్భంగా 2020లో కాస్త తగ్గుముఖం పట్టినప్పటికీ ఆ తర్వాత అంతకు ముందుకన్నా రెట్టింపు అమ్మకాలు సాగుతున్నాయని ఈ నివేదిక తేల్చింది. ఈ విజృంభణ ఇలాగే కొనసాగితే 2032 కల్లా పాశ్చాత్య దేశాల్లో ప్రస్తుతం వెల్లువెత్తుతున్న రకరకాల ఆరోగ్య సమస్యలతో మన దేశం కూడా సతమతమవడం తథ్యమని కూడా ఆందోళన వ్యక్తం చేసింది. డిప్రెషనే కాదు అంతకు మించి.. ‘ఈ తరహా ఆహారానికి ఉన్న మన ఆలోచనలు, భావోద్వేగాలను నియంత్రించే సామర్థ్యం ఉందని, దీని అధిక వినియోగం వల్ల డిప్రెషన్ మాత్రమే కాదు అంతకు మించిన మానసిక ఆరోగ్య క్షీణత సంభవిస్తున్నట్టుగా గమనించాం..’అని సేపియన్ ల్యాబ్స్ వ్యవస్థాపకురాలు, చీఫ్ సైంటిస్ట్ తారా త్యాగరాజన్ చెబుతున్నారు. వీటి వినియోగం వల్ల కలిగే మానసిక సమస్యల్లో మానసిక వేదన, నిస్సత్తువ, ఆకలి మందగింపు వంటివి సంభవించే అవకాశం ఉందని అధ్యయనం కనుగొంది. ముఖ్యంగా 18–24 సంవత్సరాల వయస్సు గల యువతలో ఇది బాగా ఎక్కువగా ఉంది. ఎందుకంటే వారు 45 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న పెద్దలతో పోలిస్తే ప్రతిరోజూ అలాంటి ఆహారాన్ని తీసుకునే అవకాశం రెండు రెట్లు ఎక్కువ. పన్నులు విధించాలి..పాఠశాలల్లో నిషేధించాలి గత నెలలో బ్రెస్ట్ ఫీడింగ్ ప్రమోషన్ నెట్వర్క్, న్యూట్రిషన్ అడ్వకసీ ఇన్ పబ్లిక్ ఇంట్రెస్ట్ సంస్థలు సంయుక్తంగా.. మన దేశంలో యూపీఎఫ్‌ల వినియోగం–ప్రభావంపై నిర్వహించిన పరిశోధన పలు హెచ్చరికలు జారీ చేసింది. ఈ సంస్థలు రూపొందించిన నివేదిక.. అన్ని రకాల జంక్ ఫుడ్స్, ప్రీ ప్యాకేజ్డ్ బెవరేజెస్, జ్యూసెస్, బేకరీ ఉత్పత్తులు, కుకీస్, చాకొలెట్స్, కన్ఫెక్షనరీ, హెల్త్ డ్రింక్స్, చిప్స్, ఐస్ క్రీమ్స్, పిజ్జా వంటి ఉత్పత్తులపై వార్నింగ్ లేబుల్ ఉండేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖను కోరడం గమనార్హం. కాగా వీటి వినియోగాన్ని నియంత్రించేలా, నిరుత్సాహ పరిచేలా పాఠశాలలు, ఆసుపత్రులు, ప్రభుత్వ కార్యాలయాల్లో వీటి విక్రయాలను నిషేధించాలని, ఈ ఉత్పత్తులపై భారీ జీఎస్టీని విధించాలని కూడా నివేదిక సూచించింది. -
కలవరపెడుతున్న కాంతి
సాక్షి, అమరావతి: ప్రపంచంలో ఇప్పుడు హాట్ టాపిక్.. వాయు కాలుష్యం. అలాగే శబ్ద కాలుష్యం గురించి కూడా మనకు తెలుసు. వీటితో తలెత్తే అనర్థాలపైన కూడా అవగాహన ఉంది. అయితే కాంతి కాలుష్యం (లైట్ పొల్యూషన్) గురించి మాత్రం అంతగా తెలియదు. అయితే దీనితో కూడా ప్రమాదమేనని తాజా అధ్యయనంలో వెల్లడైంది. కాంతి కాలుష్యంపై తమ దేశంలో నిర్వహించిన పరిశోధనను చైనా తాజాగా వెల్లడించింది. కొన్ని లక్షల మందిపై పరిశోధన చేసి అధ్యయన ఫలితాలను విడుదల చేసింది. ఇందులో షాకింగ్ విషయాలు వెల్లడయ్యాయి. కాంతి కాలుష్యం కారణంగా చైనాలో 90 లక్షల మంది మధుమేహ బాధితులుగా మారారని ఆ అధ్యయనం బాంబుపేల్చింది. వీరంతా చైనాలోని 162 నగరాల్లో నివసిస్తున్నారు. కాంతి కాలుష్యంతో ఏం జరుగుతుంది? అధిక కాంతి వల్ల కాంతి కాలుష్యం ఏర్పడుతుంది. ఉదాహరణకు పండుగల సమయంలో రంగు రంగుల్లో మెరిసే దీపాలు మిరుమిట్లు గొలిపే కాంతులు విరజిమ్ముతుంటాయి. ఇవి కాంతి కాలుష్యానికి కారణమవుతున్నాయి. అలాగే అన్ని రకాల కృత్రిమ కాంతి, మొబైల్ ఫోన్, ల్యాప్‌టాప్, ఎల్ఈడీ, కారు హెడ్‌లైట్, హోర్డింగ్‌ల నుంచి వచ్చే ప్రకాశవంతమైన కాంతి కూడా కాలుష్యాన్ని వెదజల్లుతోంది. ముఖ్యంగా ఈ కాంతి కాలుష్యం వ్యక్తి శరీరాన్ని క్రమంగా ప్రభావితం చేస్తోందని అధ్యయనం తెలిపింది. అంతేకాకుండా మధుమేహ బాధితులుగా మారుస్తోందని పరిశోధకులు వెల్లడించారు. వీధి దీపాలు, స్మార్ట్ ఫోన్లు వంటి అన్ని కృత్రిమ లైట్లు మధుమేహం వచ్చే ప్రమాదాన్ని 25 శాతం పెంచుతాయని స్పష్టమైంది. రాత్రిపూట కూడా మనకు పగటి అనుభూతిని కలిగించే ఈ లైట్లు మానవుల శరీర చక్రాన్ని మారుస్తాయని.. అంతేకాకుండా క్రమంగా ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయని పరిశోధకులు పేర్కొంటున్నారు. దీని కారణంగా రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించే మన శరీర సామర్థ్యం తగ్గుతుందని చెబుతున్నారు. ప్రపంచ జనాభాలో 80% మంది రాత్రిపూట చీకటిలో కాంతి కాలుష్యం బారిన పడుతున్నారని కూడా తెలిపారు. పరిశోధన ప్రకారం.. చీకటిలో కన్నా ఎక్కువసేపు కృత్రిమ కాంతిలో ఉండేవారిలో 28 శాతం మందికి అజీర్తి సమస్యలు ఉన్నాయని తేలింది. శరీరంలో మెలటోనిన్ హార్మోన్ ఉత్పత్తి తగ్గడమే దీనికి కారణం. వాస్తవానికి ఈ హార్మోన్ మన జీవక్రియ వ్యవస్థను చక్కగా ఉంచుతుంది. ఎక్కువసేపు వెలుతురులో ఉండడం వల్ల ఏమీ తినకుండానే శరీరంలో గ్లూకోజ్ స్థాయి పెరుగుతోందని పరిశోధకులు వెల్లడించారు. మన దేశంలో తలసరి ఉద్గారాలు తక్కువే.. ప్రపంచంలో చైనా, అమెరికా, ఈయూల తర్వాత అధిక కర్బన ఉద్గారాలు వెదజల్లుతున్న దేశాల్లో భారత్ నాలుగో స్థానంలో ఉంది. అయితే మనదేశంలో అధిక జనాభా ఉండడం వల్ల తలసరి ఉద్గారాలు మిగతా ప్రధాన దేశాలతో పోలిస్తే తక్కువ. 2030 నాటికల్లా దేశ ఇంధన శక్తిలో 50 శాతాన్ని పునరుత్పాదక వనరుల నుంచే పొందాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుంది. అలాగే అదే సంవత్సరానికి కర్బన ఉద్గారాలను వంద కోట్ల టన్నులు తగ్గించాలని నిర్దేశించుకుంది. దీనికి అనుగుణంగా మన రాష్ట్రంలో పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి, వినియోగానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. వ్యవసాయానికి తొమ్మిది గంటల ఉచిత విద్యుత్ ఇవ్వడానికి సౌర విద్యుత్‌పై దృష్టి సారిస్తోంది. దాదాపు 43,250 మెగావాట్ల పంప్డ్ స్టోరేజ్ పవర్ ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టింది. ఈ నేపథ్యంలో కాంతి కాలుష్యంపైనా భవిష్యత్తులో దృష్టి సారించాల్సిన అవసరం ఉందని తాజా అధ్యయనం హెచ్చరిస్తోంది. -
పరిశోధనలపై దృష్టి పెట్టాలి
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా దిగ్గజాలుగా ఎదగాలంటే పరిశోధన, అభివృద్ధి కార్యకలాపాలకు పెద్ద పీట వేయాలని దేశీ ఫార్మా పరిశ్రమకు కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ సూచించారు. వినూత్న ఉత్పత్తులను రూపొందించడంపై దృష్టి పెట్టాలని ఆయన పేర్కొన్నారు. భారత్‌తో పాటు ప్రపంచ మార్కెట్ల కోసం కీలక యంత్రపరికరాలను తయారు చేయాలని అటు మెడికల్ టెక్నాలజీ కంపెనీలకు సూచించారు. ఫార్మా–మెడ్ టెక్ రంగంలో పరిశోధనలు, అభివృద్ధి, నవకల్పనలపై జాతీయ పాలసీని ఆవిష్కరించిన సందర్భంగా మంత్రి ఈ విషయాలు తెలిపారు. ‘అంతర్జాతీయ బహుళ జాతి కంపెనీలు తమ లాభాల్లో 20–25 శాతాన్ని పరిశోధన, ఆవిష్కరణలపై వెచ్చిస్తుంటాయి. కానీ దేశీ కంపెనీలు సుమారు 10 శాతమే వెచ్చిస్తున్నాయి. మనం పరిశోధన ఆధారిత వినూత్న ఉత్పత్తులను తయారు చేయనంతవరకూ అంతర్జాతీయంగా ఈ విభాగానికి సారథ్యం వహించలేము‘ అని ఆయన చెప్పారు. 2047 నాటికి ఫార్మా పరిశ్రమ స్వావలంబన సాధించుకునే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని మంత్రి వివరించారు. నాణ్యత కూడా ముఖ్యమే.. భారీ పరిమాణంలో ఉత్పత్తి చేయడమే కాకుండా ఉత్పత్తుల నాణ్యతపై కూడా ఫార్మా పరిశ్రమ దృష్టి పెట్టాలని మాండవీయ చెప్పారు. మరోవైపు, ఫార్మా మెడ్‌టెక్ రంగంలో పరిశోధనలు, ఆవిష్కరణలను ప్రోత్సహించే పథకాన్ని (పీఆర్ఐపీ) కూడా కేంద్రం ఆవిష్కరించింది. ఈ స్కీము బడ్జెట్ రూ. 5,000 కోట్లని మాండవీయ చెప్పారు. పరిమాణంపరంగా 50 బిలియన్ డాలర్లతో భారత ఫార్మా పరిశ్రమ ప్రపంచంలోనే మూడో స్థానంలో ఉంది. వచ్చే దశాబ్ద కాలంలో 120–130 బిలియన్ డాలర్లకు ఎదగగలదని అంచనాలు ఉన్నాయి. -
చంద్రునిపై భూకంపాలు వస్తాయా? విజ్ఞానశాస్త్రం ఏమి చెబుతోంది?
చంద్రుని భౌగోళిక నిర్మాణం భూమి తరహాలో లేదు. అక్కడి టెక్టోనిక్ ప్లేట్లు భూమి టెక్టోనిక్ ప్లేట్ల మాదిరిగా చురుకుగా లేవు. చంద్రునిపై భూకంపాలు వస్తుంటాయి. ఇటీవల చంద్రునిపైకి చేరిన విక్రమ్ ల్యాండర్ అక్కడి భూకంప కార్యకలాపాల సంకేతాలను కనుగొంది. చంద్రునిపై వచ్చే భూకంపాలు భూమికి వచ్చే భూకంపాల కంటే శక్తివంతంగా ఉంటాయని, ఒక్కోసారి వాటి తీవ్రత 20 రెట్లు అధికంగా ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. భూమిపై వివిధ రకాల సాధనాలు భూకంపాల గురించిన సమాచారాన్ని అందిస్తాయి. అయితే చంద్రునిపై అపోలో 17లోని వ్యోమగాములు అక్కడ భూకంప కార్యకలాపాలను సంగ్రహించే ప్రదేశాలలో సీస్మోమీటర్లను విడిచిపెట్టారు. చంద్రునిపై ఈ సీస్మోమీటర్లు కేవలం 5 సంవత్సరాలు మాత్రమే చురుకుగా ఉన్నాయి. అయితే అవి ఆ సమయంలో 12 వేల భూకంపాల గురించిన సమాచారాన్ని అందించాయి. చంద్రునిపై నాలుగు రకాల భూకంపాలు ఏర్పడతాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఒకటి లోతైన భూకంపం, మరొకటి తేలికపాటి లేదా నిస్సార భూకంపం, మూడవది ఉల్కా భూకంపం. నాల్గవది థర్మల్ భూకంపం. లోతైన భూకంపాలు లోతైన భూకంపాలు చంద్రునిపై అత్యంత సాధారణ తరహా భూకంపాలు. ఇవి చంద్రుని ఉపరితలం నుండి 700 కిలోమీటర్ల వరకు ఉద్భవించాయి. భూమిపైనున్న మహాసముద్రాలను చంద్రుడు ప్రభావితం చేసిన విధంగా, చంద్రుని లోతైన రాతి కోర్‌పై భూమి ఎక్కువగా ప్రభావితం అవుతుందని, ఇది భూకంపాలకు కారణమవుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఉల్కా భూకంపం చంద్రునిపై ఉల్కలు పరస్పరం ఢీకొనడం వల్ల కూడా భూకంపాలు సంభవిస్తాయి. ఇదేకాకుండా చంద్రుని ఉపరితలంపై మారుతున్న ఉష్ణోగ్రతల కారణంగానూ చంద్రునిపై ఉష్ణ భూకంపాలు సంభవిస్తాయి. రెండు వారాల పాటు చంద్రునిపై చీకటి ఉంటుంది. అప్పుడు ఉష్ణోగ్రత -115 డిగ్రీల సెల్సియస్‌కు తగ్గుతుంది. పగటిపూట +121 డిగ్రీల సెల్సియస్‌కు పెరుగుతుంది. ఈ హెచ్చుతగ్గుల కారణంగా భూకంప తరంగాలు ఉత్పన్నమవుతాయి. తేలికపాటి భూకంపం చంద్రునిపై సంభవించే తేలికపాటి భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.5 కంటే ఎక్కువగా ఉంది. చంద్రుని లోపలున్న టెక్టోనిక్ ప్లేట్, ఇటీవల ఏర్పడిన పెద్ద బిలం మధ్య పరస్పర చర్య ఈ భూకంపాలకు కారణమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. భూకంపాలు ఎంతసేపు ఉంటాయి? భూమిపై భూకంపాలు 10 నుండి 30 సెకన్ల వరకు ఉంటాయి. కొన్ని రెండు నిమిషాల పాటు ఉంటాయి. మరికొన్ని పది నిమిషాల పాటు ఉంటాయి. భూమితో పోలిస్తే చంద్రుని దృఢత్వం అధికం. అందుకే అక్కడ ప్రకంపనలు పది నిమిషాలకు పైగా ఉంటాయి. కొన్ని గంటలపాటు కూడా ప్రభావం చూపిస్తాయి. భవిష్యత్తులో అక్కడ కాలనీ నిర్మించడానికి చంద్రునిపై భూకంపాల అధ్యయనం చాలా ముఖ్యమైనది. రాబోయే కాలంలో మరిన్ని మిషన్లు అక్కడ వివిధ పరికరాలను అమర్చర్చి భూకంపాల గురించి సమగ్ర సమాచారం తెలుసుకుంటాయి. నాసా సమీప భవిష్యత్తులో చంద్రునిపై అనేక సీస్మోమీటర్లను వ్యవస్థాపించే ప్రణాళికను రూపొందిస్తోంది. ఇది కూడా చదవండి: ఫిఫ్త్ ఫ్లోర్లో పెట్రోల్ బంక్ ఎందుకు కట్టారు? వాహనదారులు ఎలా వెళతారు? -
సూర్యుడిపై పరిశోధనల్లోనూ ఈసీఐఎల్ కీలకపాత్ర
కుషాయిగూడ: చంద్రయాన్–3 ప్రయోగానికి డీప్‌స్పేస్ నెట్వర్క్ (డీఎస్ఎన్) యాంటెన్నాను అందజేసిన కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ ఎల్రక్టానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ సూర్యుడిపై పరిశోధనల కోసం చేపట్టిన ఆదిత్య–ఎల్1 శాటిలైట్ ప్రయోగానికి అవసరమైన యాంటెన్నాను సైతం ఇస్రోకు అందజేసి మరోమారు సత్తా చాటుకుంది. శనివారం ప్రయోగించిన ఆదిత్య–ఎల్1కు అవసరమైన కమ్యూనికేషన్ వ్యవస్థను ఈ యాంటెన్నా అందిస్తుందని సంస్థ వర్గాలు పేర్కొన్నాయి. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన ఈ యాంటెన్నా 18 మీటర్ల విస్తీర్ణంలో ఉంటుందన్నాయి. 15 లక్షల కి.మీ. దూరంలో కక్ష్యలో ఉన్న శాటిలైట్‌కు భూమి నుంచి నిర్థిష్టమైన సమాచారాన్ని చేరవేయడంలో యాంటెన్నా కీలకంగా వ్యవహరిస్తుందని వివరించాయి. బెంగళూరుకు 40 కి.మీ. దూరంలోని బైలాలు గ్రామంలో దీన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపాయి. ఎంటీఏఆర్ సహకారం... ఆదిత్య–ఎల్1 ప్రయోగం విజయంలో హైదరాబాద్‌కు చెందిన ఎంటీఏఆర్ టెక్నాలజీస్ లిమిటెడ్ సైతం కీలక సహకారం అందించిందని సంస్థ ఎండీ పర్వత శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. పీఎస్ఎల్వీ–సీ57 మిషన్‌లో భాగంగా లాంచింగ్ వాహనం కోసం లిక్విడ్ ప్రొపల్షన్ ఇంజిన్లు, ఎలక్ట్రో–న్యూమాటిక్ మాడ్యూల్స్, ప్రొపల్షన్ సిస్టమ్, శాటిలైట్ వాల్వ్‌లు, సేఫ్టీ కప్లర్లు, లాంచ్ వెహికల్ యాక్చుయేషన్ సిస్టమ్‌ల కోసం బాల్ స్క్రూలు, కనెక్టర్ అసెంబ్లీలు, యాక్చుయేషన్ సిస్టమ్స్ హార్డ్‌వేర్, నోస్ కోన్ వంటి వాటిని సరఫరా చేశామన్నారు. -
కొత్త వరి వంగడాలు ఆయన చలవే..
సాక్షి, అమరావతి : ‘2004లో వైఎస్ సీఏంగా బాధ్యతలు చేపట్టే సమయానికి నేను మార్టేరు పరిశోధనా కేంద్రంలో ప్రిన్సిపల్ ౖసైంటిస్ట్గా పనిచేస్తున్నా. సీఎంగా బాధ్యతలు చేపట్టిన కొద్దిరోజులకే ఆయన మా కేంద్రానికి వచ్చారు. పరిశోధనలు బాగా పెరగాలి. వాటి ఫలాలు రైతులకు మరింత వేగంగా చేరాలంటే ఏం చేస్తే బాగుంటుందో చెప్పండన్నారు. రూ.100 కోట్లు ఇవ్వండి అని నేను అడగ్గానే పక్కనే ఉన్న మంత్రి రఘువీరారెడ్డి మన దగ్గర డబ్బుల్లేవన్నారు. భలే చెబుతావయ్య అంటూ అక్కడికక్కడే రూ.50 కోట్లు శాంక్షన్ చేశారు. వాటితో పరిశోధనా కేంద్రాల్లో మౌలిక వసతులు కల్పించాం. ఫలితంగా కొత్త రకాలను సృష్టించగలిగాం. ఉత్పత్తిని పెంచగలిగాం. ఈరోజు వందల సంఖ్యలో కొత్త రకాల విత్తనాలు మార్కెట్లోకి వస్తున్నాయంటే ఇదంతా ఆయన చలవే’ అని ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ పూర్వపు వీసీ, ఐసీఏఆర్ గవర్నింగ్ బాడీ మాజీ సభ్యుడు ప్రొ. పోలి రాఘవరెడ్డి అన్నారు. మహానేత హయాంలో డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్‌గా, వీసీగా సేవలందించిన డాక్టర్ రాఘవరెడ్డి ఆ మహానేతతో తనకున్న సాన్నిహిత్యం, ఆయన హయాంలో విద్యా రంగానికి జరిగిన మేలుపై ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఆయన ఏమన్నారో ఆయన మాటల్లోనే.. ఏటా అదనంగా వంద కోట్లు..: వర్సిటీలకు ఆనాడు రూ.400 కోట్ల బడ్జెట్ ఉండేది. ఇది ఏమాత్రం సరిపోవడం లేదని చెప్పడంతో కేంద్రంౖపై ఒత్తిడి తెచ్చి వర్సిటీకి ఏటా రూ.100 కోట్లు అదనంగా మంజూరు చేయించారు. ‘విత్తన గ్రామాల’కు నాంది పలకడమే కాదు రివాల్వింగ్ ఫండ్ పేరిట రూ.20 కోట్లు ఇచ్చారు. ఉత్పత్తి చేసిన విత్తనాలను అమ్మగా వచ్చిన ఆదాయంతో విస్తరణ కార్యక్రమాలు చేపట్టండి అని వైఎస్ సూచించారు. ఆ నిధులు ఇప్పుడు రూ.100 కోట్లకు పైగా ఉన్నాయి. సాగులో రైతులకు తోడుగా నిలవాలన్న ఆలోచనతో దేశంలోనే తొలిసారి ల్యాబ్ టూ ల్యాండ్ అంటూ శాస్త్రవేత్తల బృందాలను పల్లెలకు పంపే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. పొలం బడులకు నాంది పలికారు. వ్యవసాయ వర్సిటీలో సీట్ల పెంపు..: వ్యవసాయ విద్యను మెరుగుపర్చాలంటే ఏం చేయాలని ఓ రోజు వైఎస్ అడిగారు. ఆయన వచ్చేటప్పటికి వర్సిటీ పరిధిలో 400–500 సీట్లు మాత్రమే ఉండేవి. వాటిని 1,000 సీట్లకు పెంచాలని సూచించగానే క్షణం ఆలోచించకుండా పెంచేద్దామన్నారు. స్థానిక ప్రజలకిచ్చిన హామీ మేరకు పశ్చిమ గోదావరి జిల్లాలో ఉద్యాన వర్సిటీ పెడదామని ఆయన అనగా.. అవసరంలేదని నేను చెప్పా. ‘లేదు రాఘవ.. నేను మాటిచ్చాను. పెట్టాల్సిందే’ అంటూ 250 ఎకరాల్లో అత్యాధునిక వసతులతో వర్సిటీని ఏర్పాటుచేశారు. తిరుపతిలో శ్రీ వేంకటేశ్వర వెటర్నరీ యూనివర్శిటీ ఆయన హయాంలో ఏర్పాటైనవే. వైఎస్ హయాంలో రాజమండ్రి, జగిత్యాలలో కొత్త కళాశాలలు వచ్చాయి. బాపట్లలో మాత్రమే అగ్రికల్చర్ ఇంజనీరింగ్ కళాశాల ఉండేది. వైఎస్ హయాంలో కొత్తగా అనంతపురం జిల్లా మడకసిరి, రంగారెడ్డిలలో అగ్రికల్చర్ ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటుచేశారు. పులివెందులలో కొత్తగా కాలేజ్ ఆఫ్ ఫుడ్‌సైన్స్ అండ్ టెక్నాలజీని తీసుకొచ్చారు. ఇక వర్సిటీ పరిధిలో సుమారు 5వేల మంది రైతు కూలీలు రోజువారీ వేతనాలతో పనిచేసేవారు. వీరికి క్లాస్–4 ఎంప్లాయిస్‌కు సమానంగా జీతభత్యాలు ఇవ్వడమే కాదు.. వారికి పింఛన్ సౌకర్యం కూడా కల్పించారు. రైతు మోములో చిరునవ్వులు చూడాలి. అవే మనకు గొప్ప అవార్డులు.. అన్న ఆయన మాటలు నాకు ఇప్పటికీ గుర్తు. -
చివరి దశకు చేరిన చంద్రయాన్–3 మిషన్.. మిగిలింది వారం రోజులే!
న్యూఢిల్లీ: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్–3 మిషన్ ఈ ఏడాది జూలై 14న శ్రీహరికోట నుంచి నింగిలోకి దూసుకెళ్లింది. 41 రోజుల ప్రయాణం అనంతరం ఆగస్టు 23న సాయంత్రం 6.04 గంటలకు ల్యాండర్ విక్రమ్ చందమామ దక్షిణ ధ్రువం ఉపరితలంపై నిర్దేశిత ప్రాంతంలో సురక్షితంగా అడుగుపెట్టింది. జాబిల్లి దక్షిణ ధ్రువంపై దిగిన మొట్టమొదటి మిషన్‌గా చరిత్ర సృష్టించింది. దాదాపు 4 గంటల తర్వాత ల్యాండర్ నుంచి ఆరు చక్రాలతో రోవర్ ప్రజ్ఞాన్ విజయవంతంగా బయటకు వచ్చింది. నెమ్మదిగా అడుగులు వేస్తూ జాబిల్లి ఉపరితలానికి చేరుకుంది. అటూ ఇటూ తిరుగుతూ చంద్రుడిపై పరిశోధనలు ప్రారంభించింది. విలువైన సమాచారాన్ని భూమిపైకి చేరవేస్తోంది. సాఫ్ట్ ల్యాండింగ్ జరిగి వారం రోజులు పూర్తయ్యింది. ఆగస్టు 23 నుంచి ఆగస్టు 29 వరకు మొత్తం ఏడు రోజుల వ్యవధిలో చంద్రయాన్–3 మిషన్ ఏమేం చేసింది? అనే వివరాలను ఇస్రో బహిర్గతం చేసింది. రోవర్ చాకచక్యం చంద్రుడిపై ల్యాండర్ సాఫ్ట్ ల్యాండింగ్, ల్యాండర్ నుంచి రోవర్ విజయవంతంగా బయటికి వచ్చి తన కార్యాచరణ ప్రారంభించడం, చంద్రుడి ఉపరితలంపై పరిశోధనలు అనేవి మూడు ప్రధాన లక్ష్యాలు కాగా, ఆగస్టు 26 నాటికే తొలి రెండు లక్ష్యాలు నెరవేరాయి. ఆగస్టు 27న చంద్రుడి ఉపరితలంపై ఉష్ణోగ్రతల మార్పుల వివరాలను రోవర్ ప్రజ్ఞాన్ భూమిపైకి చేరవేసింది. అందరూ అనుకుంటున్నట్లు చంద్రుడు చల్లగా ఉండడని, ఉపరితలంపై 70 డిగ్రీల దాకా వేడి ఉంటుందని తేల్చింది. ఆగస్టు 28న తన ప్రయాణానికి 4 మీటర్ల లోతున్న గొయ్యి అడ్డు రావడంతో ఇస్రో కమాండ్స్‌ను పాటిస్తూ రోవర్ చాకచక్యంగా తప్పించుకుంది. ఈ మిషన్‌కు ఇంకా వారం రోజుల కాల వ్యవధి మిగిలి ఉంది. ఈ ఏడు రోజుల్లో ల్యాండర్, రోవర్ ఏం చేయనున్నాయన్నది ఆసక్తికరం. సాంకేతికంగా వాటికి ఇదే చివరి దశ. మిగిలిన ఏడు రోజుల్లో చందమామపై ల్యాండర్, రోవర్ మరిన్ని శాస్త్రీయ పరిశోధనలు చేస్తాయి. రోవర్ ప్రజ్ఞాన్ చంద్రుడి ఉపరితలంపై మట్టి స్వభావాన్ని విశ్లేషిస్తుంది. చంద్రుడిపై ఉన్న దుమ్ము ధూళీ, రాళ్లలోని రసాయనిక సమ్మేళనాలను రోవర్ గుర్తిస్తుంది. చందమామ ఉపరితల వాతావరణం, ఉపరితలం లోపలి పరిస్థితుల గురించి సమాచారం అందిస్తుంది. ల్యాండర్ విక్రమ్‌లో నాలుగు పేలోడ్లు ఉన్నాయి. ఇవి చంద్రుడిపై ప్రకంపనలు, ఉపరితలంపై ఉష్ణోగ్రతల స్థితిగతులు, ప్లాస్మాలో మార్పులను అధ్యయనం చేస్తాయి. చంద్రుడికి–భూమికి మధ్యనున్న దూరాన్ని కచ్చితంగా లెక్కించడంలో ల్యాండర్‌లోని పేలోడ్లు సహకారం అందిస్తాయి. చంద్రుడిపై మట్టి స్వభావాన్ని విశ్లేషిం చడం, ఉష్ణోగ్రతలను గుర్తించడం అనేవి అత్యంత కీలకమైనవి. చందమామ దక్షిణ ధ్రువంలో చీకటి పడగానే 14 రోజులపాటు ఉష్ణోగ్రత మైనస్ 230 డిగ్రీలకు పడిపోనుంది. ఈ అత్యల్ప ఉష్ణోగ్రతను తట్టుకొని పనిచేసేలా ల్యాండర్‌ను, రోవర్‌ను డిజైన్ చేయలేదు. ఉపరితలంపై సూర్యాస్తమయం కాగానే ఇవి పనిచేయడం ఆగిపోతుంది. కొన్ని సవాళ్లు ఎదురైనప్పటికీ చంద్రయాన్–3 మిషన్ ఇప్పటిదాకా సాధించింది తక్కువేమీ కాదు. ఎవరూ చూడని జాబిల్లి దక్షిణ ధ్రువం గురించి కీలక సమాచారం అందించింది. చంద్రయాన్–3 చివరి దశలోకి ప్రవేశించడంతో ఇక ల్యాండర్, రోవర్ అందించే సమాచారం కోసం ప్రపంచ దేశాలు ఉత్సుకతతో ఎదురు చూస్తున్నాయి. చంద్రయాన్–3 విజయంపై కేబినెట్ ప్రశంస చందమామపై చంద్రయాన్–3 ల్యాండర్ విక్రమ్ క్షేమంగా దిగడాన్ని ప్రశంసిస్తూ కేంద్ర కేబినెట్ మంగళవారం తీర్మానం ఆమోదించింది. ఇది కేవలం ‘ఇస్రో’ విజయం మాత్రమే కాదని, దేశ ప్రగతికి, అంతర్జాతీయ వేదికపై పెరుగుతున్న దేశ గౌరవ ప్రతిష్టలకు నిదర్శనమని కొనియాడింది. ఆగస్టు 23వ తేదీని ‘నేషనల్ స్పేస్ డే’గా కేంద్ర ప్రభుత్వం ప్రకటించడాన్ని స్వాగతించింది. చంద్రయాన్–3 ప్రయోగాన్ని విజయవంతం చేసిన ఇస్రోను మంత్రివర్గం అభినందించిందని, సైంటిస్టులకు కృతజ్ఞతలు తెలిపిందని మంత్రి అనురాగ్ ఠాకూర్ చెప్పారు. -
సైబర్ ఉగ్రవాదానికి ఇక చెక్
సాక్షి, అమరావతి: సైబర్ ఉగ్రవాదం ముప్పును ఎదుర్కొనేందుకు కేంద్ర హోం శాఖ పటిష్ట కార్యాచరణకు ఉపక్రమిస్తోంది. దేశంలో ఉగ్రవాద నిరోధక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయడంలో సమర్థంగా వ్యవహరిస్తున్న జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ఆధ్వర్వంలోనే ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ‘యాంటీ సైబర్ టెర్రరిజం యూనిట్ (ఏసీటీయూ) పేరిట ఈ ప్రత్యేక విభాగాన్ని నెలకొల్పనుంది. విదేశాలను కేంద్రంగా చేసుకుని దేశంలో ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఉగ్రవాద సంస్థలు పదేళ్లుగా సైబర్ ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తున్నాయి. ప్రధానంగా దేశంలోని ప్రభుత్వ రంగ సంస్థలను లక్ష్యంగా చేసుకుని సైబర్ ఉగ్రవాదానికి పాల్పడుతున్నాయి. రక్షణ, పరిశోధన సంస్థలు, ఇస్రో, విద్యుత్ గ్రిడ్లు, టెలీ కమ్యూనికేషన్లు, బ్యాంకింగ్ తదితర రంగాలను దెబ్బతీయడమే లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఆయా ప్రభుత్వ రంగ సంస్థలకు చెందిన సైబర్ నిపుణులు ఎంత అప్రమత్తంగా ఉంటున్నప్పటికీ పూర్తిస్థాయిలో సైబర్ దాడులను నిరోధించడంలో పూర్తిగా సఫలీకృతం కాలేకపోతున్నాయి. 2018లో దేశంలో ప్రభుత్వ రంగ సంస్థలపై 70,798 సైబర్ దాడులు జరిగాయి. కాగా.. 2023లో మొదటి 6 నెలల్లోనే ఏకంగా 1.12 లక్షల సైబర్ దాడులు జరగడం పరి స్థితి తీవ్రతకు నిదర్శనంగా నిలుస్తోంది. ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) సమాచార వ్యవస్థపై సైబర్ దాడులతో కీలక వైద్య సేవలకు అంతరాయం ఏర్పడింది. విద్యుత్ గ్రిడ్స్పైనా ఉగ్రవాదం గురి లద్దాక్‌లోని విద్యుత్ గ్రిడ్లపై ఇటీవల జరిగిన సైబర్ దాడులతో చైనా సరిహద్దుల్లో విద్యుత్ మౌలిక సదుపాయాల వ్యవస్థకు ఉన్న ముప్పును గుర్తు చేసింది. కేరళ, గుజరాత్, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణతోపాటు దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహిస్తున్న నిషేధిత పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ) సాఫ్ట్వేర్ శిక్షణ సంస్థల పేరుతో ఉగ్రవాద కార్యకలాపాలు ప్రోత్సహిస్తోందని ఎన్ఐఏ కేసులు నమోదు చేసింది. అనుమానితుల నివాసాల్లో సోదాలు నిర్వహించగా.. సైబర్ దాడులకు సంబంధించిన సమాచారం లభ్యమైనట్టు తెలుస్తోంది. ఇవన్నీ కూడా దేశం ఎదుర్కొంటున్న సైబర్ ఉగ్రవాద పెనుముప్పునకు సంకేతంగా నిలుస్తున్నాయి. అందుకే వెంటనే అప్రమత్తమైన కేంద్ర హోం శాఖ ఈ సమస్యకు శాశ్వత పరిష్కారంగానే ఎన్ఐఏలోనే అంతర్భాగంగా యాంటీ సైబర్ టెర్రరిజం యూనిట్(ఏసీటీయూ)ను నెలకొల్పాలని నిర్ణయించింది. రాష్ట్రాలతో అనుసంధానం.. విదేశాలతో సమన్వయం సైబర్ ఉగ్రవాదాన్ని నిరోధించేందుకు యాంటీ సైబర్ టెర్రరిజం యూనిట్ (ఏసీటీయూ) ఏర్పాటు తుది దశకు చేరుకుంది. భారీ స్థాయిలో పోలీస్ అధికారులు, సైబర్ భద్రతా నిపుణులు, ఇతర అధికారులు, సిబ్బందితోపాటు అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో ఏసీటీయూను రూపొందించే ప్రణాళికను కేంద్ర హోం శాఖ ఆమోదించింది. దీని పరిధిలో ఆర్థిక, ఐటీ, రక్షణ, టెలి కమ్యూనికేషన్లు, ఇతర రంగాలకు సంబంధించి సైబర్ సెల్స్ ఏర్పా టు చేస్తారు. దేశంలోని అన్ని పోలీసు శాఖల ఆధ్వర్యంలోని సైబర్ క్రైమ్స్ విభాగాలతోపాటు అన్ని ప్రభుత్వ రంగ సంస్థలు, పరిశోధన సంస్థల సైబర్ సెల్స్‌తో ఏసీటీయూను అనుసంధానిస్తారు. ఈ మేరకు ఇప్పటికే రాష్ట్ర సైబర్ క్రైమ్ విభాగాలకు కేంద్ర హోం శాఖ సమాచారం పంపింది. ఉగ్రవాద సంస్థలు విదేశాలను కేంద్ర స్థానంగా చేసుకునే సైబర్ దాడులకు పాల్పడుతున్నాయి. అందుకు ఏసీటీయూకు విదేశాలతో సమన్వయం చేసుకునేందుకు ఇంటర్ పోల్‌తోపాటు విదేశీ దర్యాప్తు సంస్థలతో సమన్వయం చేసుకునేందుకు అధికారాన్ని కలి్పస్తారు. విదేశాల్లోని దర్యాప్తు సంస్థలతో సమాచార మార్పిడి, ఇతర సహకారం కోసం ప్రత్యేకంగా ఒప్పందాలు చేసుకుంటారు. రెండు నెలల్లో ఏసీటీయూను అధికారికంగా ఏర్పాటు చేయాలని కేంద్ర హోం శాఖ భావిస్తోంది. అందుకోసం ఎన్ఐఏ తుది సన్నాహాలను వేగవంతం చేస్తోంది. -
విద్యార్థులు పరిశోధనలపై ఆసక్తి పెంచుకోవాలి
సూళ్లూరుపేట(తిరుపతి జిల్లా): ఇస్రో తొలినాళ్లలో ఎడ్లబండి, సైకిల్‌పై శాటిలైట్, రాకెట్ పరికరాలను తీసుకువెళ్లే స్థాయి నుంచి చంద్రుడు, అంగారకుడు గ్రహాల మీద పరిశోధనలు చేసేస్థాయికి చేరడానికి నాడు విక్రమ్ సారాభాయ్ వేసిన పునాదులే కారణమని షార్ శాస్త్రవేత్త ఆర్.ప్రీతా చెప్పారు. విద్యార్థులు పరిశోధనలపై ఆసక్తిని పెంపొందించుకుని ఇస్రోలో చేరి దేశానికి సేవ చేయాలని సూచించారు. ఆజాదీకా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా డాక్టర్ విక్రమ్ సారాభాయ్ జన్మదినాన్ని పురస్కరించుకుని భారత అంతరిక్షయానంపై స్థానిక గోకులకృష్ణ కళాశాలలో విద్యార్థులకు శనివారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ప్రీతా మాట్లాడుతూ భారత అంతరిక్ష పరిశోధనా సంస్థను స్థాపించి ప్రపంచస్థాయికి తీసుకువెళ్లడంలో డాక్టర్ విక్రమ్ సారాభాయ్ పాత్రను చరిత్ర మరువలేనిదని చెప్పారు. నెల రోజుల్లో సూర్యుడిపై పరిశోధనల కోసం ఆదిత్య ఎల్–1 అనే ఉపగ్రహాన్ని ప్రయోగించనున్నట్లు తెలిపారు. కళాశాల సెక్రటరీ శ్రీనివాసబాబు, ఇంజినీరింగ్, ఫార్మసీ విభాగాల అధ్యాపకులు పాల్గొన్నారు. -
హైదరాబాద్ కేంద్రంగా ‘హ్యుందాయ్’
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీలో ఉన్న దక్షిణ కొరియా గ్రూప్ హ్యుందాయ్ మోటార్ భారత్‌లో ఎలక్ట్రిక్ వెహికిల్స్ విభాగంలో నాయకత్వ స్థానం కోసం సిద్ధమవుతోంది. భవిష్యత్తులో పోటీతత్వ ఈవీ మార్కెట్‌గా భారత్ అవతరిస్తుందని కంపెనీ మంగళవారం తెలిపింది. 2032 నాటికి దేశీయంగా అయిదు కొత్త ఈవీలను ప్రవేశపెట్టాలని హ్యుందాయ్ నిర్ణయించింది. కొత్త ఈవీల పరిచయం, తయారీ సామర్థ్యాన్ని పెంచేందుకు వచ్చే 10 ఏళ్లలో రూ.20,000 కోట్లకుపైగా పెట్టుబడి చేయనున్నట్టు 2023 మే నెలలో సంస్థ ప్రకటించింది. ఈవీలు, అటానమస్ సహా భవిష్యత్ మోడళ్ల పరిశోధన కోసం హైదరాబాద్‌లోని రిసర్చ్, డెవలప్మెంట్ (ఆర్అండ్డీ) సెంటర్‌ను కేంద్ర బిందువుగా మార్చాలని గ్రూప్ యోచిస్తోంది. ఈ కేంద్రంలో భారతీయ భాషల్లో వాయిస్ రికగి్నషన్ టెక్నాలజీని సైతం అభివృద్ధి చేస్తారు. భారత ప్యాసింజర్ కార్ల పరిశ్రమ 2030 నాటికి 50 లక్షల యూనిట్లను దాటుతుంది. వీటిలో ఎస్‌యూవీల వాటా 48 శాతం. ఆ సమయానికి ఎలక్ట్రిక్ వెహికిల్స్ 10 లక్షల యూనిట్ల మార్కును చేరుకుంటాయని హ్యుందాయ్ తెలిపింది. 2022–23లో భారత్‌లో అన్ని కంపెనీలవి కలిపి 48,104 యూనిట్ల ఎలక్ట్రిక్ కార్లు అమ్ముడయ్యాయి. భవిష్యత్ వ్యూహంపై.. ‘భారత విపణిలో కంపెనీ కార్ల విక్రయాలు పెరిగేందుకు హైదరాబాద్ కేంద్రం కీలక పాత్ర పోషించనుంది. అలాగే కొరియాలోని హుందాయ్–కియా నమ్యాంగ్ ఆర్అండ్డీ సెంటర్‌తో కలిసి భారత మార్కెట్ కోసం వాహనాలను అభివృద్ధి చేస్తుంది. ఇందులో భాగంగా టెస్టింగ్ కోసం కొత్త సదుపాయం నిర్మాణం గత సంవత్సరం ప్రారంభమైంది’ అని కంపెనీ తెలిపింది. హ్యుందాయ్ మోటార్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ చైర్ యూసన్ ఛంగ్ భారత పర్యటనలో భాగంగా హైదరాబాద్‌లోని హ్యుందాయ్ మోటార్ ఇండియా ఇంజనీరింగ్‌తోపాటు చెన్నైలోని తయారీ కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా భవిష్యత్ వ్యూహంపై కంపెనీకి చెందిన కీలక అధికారులతో చర్చించారు. భారీ లక్ష్యంతో.. ఎస్‌యూవీలలో నాయకత్వ స్థానాన్ని బలోపేతం చేయడం, ఈవీ మోడళ్లను విస్తరించడం ద్వారా పరిమాణాత్మకంగా వృద్ధి చెందాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు హ్యుందాయ్ వెల్లడించింది. ‘నాలుగేళ్లలో ఈవీ చార్జింగ్ సెంటర్ల సంఖ్యను 439కి చేర్చనున్నాం. గ్రూప్ కంపెనీ అయిన కియా 2025 నుండి భారత కోసం చిన్న ఈవీలను ఉత్పత్తి చేస్తుంది. ఇతర ఈవీ మోడళ్లతోపాటు వినియోగదార్లు కోరినట్టు కస్టమైజ్డ్ (పర్పస్ బిల్ట్ వెహికల్స్) అందిస్తుంది. కొత్త మోడళ్ల పరిచయం, ప్రస్తుతం ఉన్న 300 షోరూమ్‌లను రెండింతలు చేయాలన్నది కియా ప్రణాళిక. ప్రస్తుతం కియా మార్కెట్ వాటా 6.7% ఉంది. సమీప కాలంలో దీన్ని 10%కి చేర్చాలన్నది కియా 2.0 వ్యూహం’ అని హ్యుందాయ్ తెలిపింది. -
త్వరలో ఆదిత్య–ఎల్1 ప్రయోగం
సూళ్లూరుపేట(తిరుపతి జిల్లా): సూర్యుడిపై పరిశోధనల కోసం సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్(షార్) నుంచి ఈ నెలాఖరులో గానీ సెప్టెంబర్ మొదటివారంలో గానీ పీఎస్ఎల్వీ సీ57 రాకెట్ ద్వారా ఆదిత్య–ఎల్1 ఉపగ్రహాన్ని ఇస్రో శాస్త్రవేత్తలు ప్రయోగించనున్నారు. షార్ కేంద్రంలోని మొదటి ప్రయోగ వేదికకు సంబంధించి వెహికల్ అసెంబ్లింగ్ బిల్డింగ్‌లో రాకెట్ అనుసంధానం పనులు ప్రారంభమయ్యాయి. ఈ ఏడాది చేసిన ఆరు ప్రయోగాలు వరుసగా విజయాలు సాధించడంతో.. రెట్టించిన ఉత్సాహంతో మరో రాకెట్ ప్రయోగానికి ఇస్రో సిద్ధమైంది. -
అద్భుతం.. అన్నదాతల ధాన్యాగారం
సాక్షి ప్రతినిధి, బాపట్ల: బాపట్ల వ్యవసాయ పరిశోధన స్థానం అద్భుత ఫలితాలు సాధిస్తూ అన్నదాతల ధాన్యాగారంగా ప్రగతి పథం వైపు దూసుకుపోతున్నది. ఇక్కడ శాస్త్రవేత్తలు సృష్టిస్తున్న వరి వంగడాలు నాణ్యమైన అధిక దిగుబడితో దేశవ్యాప్తంగా కీర్తిప్రతిష్టలు అందుకుంటున్నాయి. ఇక్కడ ఉత్పత్తి అయిన పలు రకాల వరి వంగడాలు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాక దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో సాగవుతున్నాయి. విదేశాలకు ఏటా లక్షల టన్నుల బీపీటీ రకాల సన్నబియ్యం ఎగుమతి అవుతూ విదేశీ మారకద్రవ్యాన్ని ఆర్జించి పెడుతోంది. దీంతో ఈ పరిశోధన స్థానం ఖ్యాతి అంతర్జాతీయ స్థాయికి ఎగసింది. వరి పరిశోధన స్థానం నేపథ్యం.. 1961లో తెనాలిలో ప్రారంభమైన వరిపరిశోధన స్థానం 1973లో బాపట్లకు మార్చారు. అప్పటి నుంచి బాపట్ల వరి పరిశోధన స్థానంగా పనిచేస్తోంది. 2017లో వరి పరిశోధన స్థానం నుంచి వ్యవసాయ పరిశోధన స్థానంగా అప్‌గ్రేడ్ చేస్తూ.. 15 ఎకరాల నుంచి 40 ఎకరాలకు విస్తరించారు. కొత్త వంగడాల సృష్టి కేంద్రం.. 1982లో సోనామసూరి రకం ( బీపీటీ 3291), ధాన్యలక్ష్మి (బీపీటీ 1235), 1986లో సాంబమసూరి (బీపీటీ 5204) అనే సన్న రకం వంగడాన్ని కనుగొన్నారు. 1987లో బీపీటీ 4358, 2001లో బీపీటీ 1768 సన్నాలు, 2010లో బీపీటీ 2270 రకాల వంగడాలను సృష్టించారు. 2010లో బీపీటీ 2231, 2018లో బీపీటీ 2295 రకం ఉత్పత్తి చేయగా 2019లో బీపీటీ 2595 తేజ రకం ఉత్పత్తి చేశారు. 2020లో బీపీటీ 2782 భవతి, బీపీటీ 2411 సశ్య, 2023లో బీపీటీ 3050, బీపీటీ 2846, బీపీటీ 2841 నల్లబియ్యం, బీపీటీ 2848 హైప్రొటీన్ రకం వంగడాలను ఉత్పత్తి చేశారు. తెగుళ్లను తట్టుకునేలా నాణ్యతతో కూడిన విత్తనాలు ఉత్పత్తి చేయడం వల్లే అధిక దిగుబడులు సాధ్యమవుతున్నాయని రైతులు చెబుతున్నారు. ఇవి కాకుండా బీపీటీ 3082, 2858 రకాలు ఉత్పత్తి అయి మినీకిట్ దశలో ఉన్నాయి. ప్రభుత్వ ప్రోత్సాహంతో ముందుకు.. వరి పరిశోధన స్థానం ఏర్పడి ఇప్పటికి 61 ఏళ్లు గడుస్తోంది. 2018 ఏడాది వరకు 57 ఏళ్ల కాలంలో కేవలం 7 వంగడాలను సృష్టించగా.. గడచిన 4 ఏళ్ల కాలంలోనే 9 రకాల కొత్త వరి వంగడాలు ఉత్పత్తి చేయడం గమనార్హం. వైఎస్ జగన్ప్రభుత్వం ప్రోత్సాహం, తోడ్పాటు వల్లే త్వరితగతిన నూతన వంగడాల సృష్టి సాధ్యమవుతున్నదని ఇక్కడి శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కొత్త వంగడాలు సృష్టించడమే కాకుండా దేశవ్యాప్తంగా రైతులకు అవసరమైన సీడ్‌ను ఉత్పత్తి చేసి అందిస్తున్నారు. ఏటా 60 ప్రైవేటు కంపెనీలకు సీడ్‌ను అందిస్తున్నారు. రెండు, మూడేళ్లుగా ఇక్కడ ఏడాదికి 600 క్వింటాళ్ల బ్రీడర్ సీడ్ తయారు చేస్తున్నారు. బీపీటీ విత్తనాల సాగు ఇలా బాపట్ల వరి పరిశోధన స్థానంలో సృష్టించిన బీపీటీ 5204 రకం విత్తనం మన రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా.. దేశవ్యాప్తంగా సుమారు 75 నుంచి 80 లక్షల ఎకరాల్లో సాగవుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. రైతుల కోసం నాణ్యమైన సీడ్ బాపట్ల వ్యవవసాయ పరిశోధన స్థానంలో నూతన వరి విత్తనాల ఉత్పత్తి జరుగుతున్నది. ఇక్కడ సృష్టించిన బీపీటీ 5204 రకం దేశవ్యాప్తంగా 75 లక్షల ఎకరాలకు పైగా సాగవుతుండగా.. మరికొన్ని రకాల వంగడాలకు డిమాండ్ పెరిగింది. ఇవే కాకుండా బ్లాక్‌రైస్, హైప్రొటీన్రైస్ వంగడాలను సిద్ధం చేశాం. ఇవన్నీ తెగుళ్లు తట్టుకోవడంతోపాటు అధిక దిగుబడినిచ్చి రైతులకు ఆదాయాన్ని తెచ్చి పెడుతున్నాయి. –బి.కృష్ణవేణి, సీనియర్ సైంటిస్ట్ అండ్ హెడ్, బాపట్ల వరి పరిశోధన స్థానం -
3 కొత్త పొగాకు వంగడాల విడుదల
రాజమహేంద్రవరం రూరల్: కేంద్ర పొగాకు పరిశోధనా సంస్థ (ఐసీఏఆర్–సీటీఆర్ఐ) ద్వారా దక్షిణ, ఉత్తర ప్రాంత తేలిక నేలలు, బర్లీ ప్రాంతాలకు అనువైన 3 అధిక దిగుబడులను ఇచ్చే పొగాకు వంగడాలు విడుదలయ్యాయి. ఈ విషయాన్ని తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం సీటీఆర్ఐ డైరెక్టర్ డా.మాగంటి శేషుమాధవ్ గురువారం తెలిపారు. ఎఫ్‌సీఆర్–15 (సీటీఆర్ఐ శ్రేష్ట) వంగడం దక్షిణ తేలిక నేలలకు అనువైనదన్నారు. ఇది అధిక దిగుబడిని (హెక్టార్‌కు 3,000 కిలోలు) ఇస్తుందన్నారు. ఇది శీతాఫల తెగులు తట్టుకునే బ్యారన్ పొగాకు రకమన్నారు. ఎఫ్సీజే–11 (సీటీఆర్ఐ నవీన) వంగడం ఉత్తర తేలిక నేలలకు అనువైనదన్నారు. ఇది కూడా ఎక్కువ దిగుబడినిచ్చే (హెక్టార్‌కు 3,300 కిలోలు) వంగడమని పేర్కొన్నారు. తక్కువ నత్రజనితో సాగు సామర్థ్యం కలిగిన బ్యారన్ పొగాకు రకమన్నారు. వైబీ–22 (విజేత) వంగడం అధిక దిగుబడినిచ్చే (హెక్టార్‌కు 2,900 కిలోలు), శీతాఫల తెగులు తట్టుకునే బర్లీ పొగాకు రకమన్నారు. ఈ 3 వంగడాలను స్టేట్ వెరైటీ రిలీజ్ కమిటీ (ఎస్వీఆర్సీ) విడుదల చేసిందన్నారు. ఈ వంగడాల విత్తనాలు ప్రస్తుత సీజన్లో సీటీఆర్‌ఐలో లభ్యమవుతున్నాయని చెప్పారు. -
నిఖిల గోవతి పరిశోధనను సేవబాట పట్టించింది
డిగ్రీలు చేసి, ఉద్యోగాలు చూసుకొని స్థిరపడిపోవడం గురించి ఆలోచిస్తుంటారు చాలా మంది. తమ చదువు పేదలకు ఉపయోగపడితే ఎంతో మేలు అని ఆశిస్తుంటారు కొంతమంది. అలాంటి కోవకి చెందుతుంది కర్పూరం గోవతి నిఖిల. సికింద్రాబాద్ సీతాఫల్మండిలో ఉండే నిఖిల గుర్గావ్ మేదాంత ది మెడిసిటీ హాస్పిటల్లో డిస్ఫేజియా స్పెషలిస్ట్‌గా పరిశోధనలు చేస్తోంది. గోవతి పేరుతో ఫౌండేషన్ ఏర్పాటు చేసి, ఇప్పటి వరకు 5వేల మంది పేదవారికి కంటి, గుండె, క్యాన్సర్ చికిత్సలలో సహాయసహకారాలు అందించింది. ఈ యేడాది యంగెస్ట్ రీసెర్చర్ ఇన్ డిస్ఫేజియా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్, భారత్ గౌరవరత్న శ్రీ సమ్మాన్ కౌన్సిల్ అవార్డులు పొందింది. ఈ సందర్భంగా మాట్లాడినప్పుడు ఎన్నో విషయాలను ఇలా పంచుకుంది. ‘‘తెలియని తపన నన్ను ఓ కొత్త మార్గంవైపు నడిపించింది. పరిశోధనల వైపుగా అడుగులు వేయించింది. ఈ మూడేళ్లలో 5 వేల మందికి సాయం చేసేలా మార్చింది. బీఎస్సీ ఆడియాలజీ పూర్తయ్యాక ఎమ్మెస్సీలో చేరాను. ఫైనల్ ఇయర్ ఎగ్జామ్ పూర్తవగానే మేదాంత హాస్పిటల్ నుంచి ఫోన్ కాల్ వచ్చింది తమ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లో చేరమని. కాలేజీలో కండక్ట్ చేసిన ఎగ్జామ్స్ నుంచి వచ్చిన అవకాశమని తెలిసి చాలా ఆనందించాను. పరిశోధనలో.. అనేక ఆరోగ్య సమస్యలలో ముఖ్యంగా నిమోనియా, గుండెకు సంబంధించిన చికిత్సలు జరిగినప్పుడు కొన్నాళ్ల వరకు ఆహారాన్ని మింగడంలో కలిగే ఇబ్బందుల కారణంగా మరణాల రేటు పెరుగుతోందని మా పరిశోధనలో తేలింది. న్యూరో పేషంట్స్లో 80 శాతం డిస్ఫేజియా సమస్య ఉంటుంది. ఆహారాన్ని మింగే పద్ధతిలో తేడా ఉంటే ఆ ఆహారం నేరుగా లంగ్స్‌లోకి చేరి, ప్రమాదం కలుగుతుంది. అందుకని ఈ పేషెం ట్స్‌కు, వీళ్లను చూసుకునేవారికి ఏ విధంగా ఆహారాన్ని తీసుకోవాలనే విషయాల మీద గైడెన్స్ ఇస్తుంటాను. ఈ వైపుగా మన దగ్గర ఇంకా ఆలోచన పెరగలేదు. అమెరికాలో ఈ విషయాలపట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. దీంతో ఈ విభాగంలో నాకు ఆసక్తి కలిగింది. లోతుగా పరిశోధనలు చేయడం మొదలు పెట్టాను. నాకు అడ్వైజ్ చేసే డాక్టర్లు, ప్రొఫెసర్ల సలహాలు మరెన్నో విషయాలను పరిచయం చేసింది. ఢిల్లీ సమీపంలోని హాస్పిటల్ కావడంతో వచ్చే పేషెంట్స్ సంఖ్య కూడా ఎక్కువే. ప్రతి ఒక్క పేషెంట్ నుంచి వారి ఆరోగ్యసమస్యల ద్వారా తెలుసుకునే విషయాలు ఎన్నో ఉంటాయి. అలా నా పరిశోధనకు సంబంధించి 31 ఆర్టికల్స్ మెడికల్ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. జైపూర్, రాజస్థాన్, యూపీ నుంచి వచ్చే స్టూడెంట్స్‌కు సెషన్స్ కండక్ట్ చేస్తుంటాను. కరోనా నుంచి.. అవసరమైన వారికి సాధ్యమైనంత వరకు నా స్నేహబృందంతో సాయం అందిస్తూ వచ్చాను. అప్పటి నుంచి కంటి, గుండె చికిత్సలు, నిమోనియా, పార్కిన్సన్స్, నీ రీప్లేస్మెంట్, న్యూరో డిజార్డర్స్ వంటి ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి డాక్టర్లతో మాట్లాడి ఫీజు తగ్గింపులో సాయం చేస్తుండేదాన్ని. కోవిడ్ పేషెంట్స్పైన రీసెర్చ్ చేసినప్పుడు మరణాలు పెరగడానికి అందరికీ ఒకే విధమైన చికిత్స అందించడం సరికాదని తెలుసుకున్నాను. ప్రతి ఒక్కరూ భిన్నంగా చికిత్స చేయాలనే అంశాల మీద చేసిన రీసెర్చ్ పేపర్స్‌కి మంచి ప్రశంసలు అందాయి. ఈ సమయంలోనే ఫౌండేషన్‌గా సేవలను ఒక గ్రూప్కిందకు తీసుకురావాలనిపించింది. అందుకు, మా ప్రొఫెసర్లు, కుటుంబసభ్యుల సపోర్ట్ ఉంది. అభ్యర్థన మేరకు ప్రభుత్వ, కార్పోరేట్ హాస్పిటల్స్‌లోని డాక్టర్స్ నెట్వర్క్ నుంచి పరిచయాలు ఉన్నాయి. వారిని అభ్యర్థించి పేదవాళ్లలో ఆరోగ్య సమస్యలకు పరిష్కారాలు సూచించడం, వారి చేత హెల్త్ క్యాంపులు నిర్వహించడం చేస్తుంటాను. ఏయే సమయాల్లో క్యాంపులను నిర్వహించాలో ముందే ప్లానింగ్ ఉంటుంది కాబట్టి, దానిని అనుసరించి డాక్టర్లను అభ్యర్థిస్తుంటాను. మా నాన్న హరిరాజ్ కుమార్ రేషన్ షాప్ నిర్వహిస్తుంటారు. అక్కడకు వచ్చేవాళ్లలో దాదాపు పేదవాళ్లే ఉంటారు. వాళ్లకు అవసరమయ్యేలా క్యాంపులు నిర్వహించాను. నోటి మాట ద్వారా సాయం చేస్తూ వెళ్లడమే. దీని కోసం నేనేమీ డబ్బులు ఖర్చు పెట్టడం లేదు. ఎవరి నుంచీ సాయం తీసుకోవడం లేదు. నాకున్న నెట్వర్క్ ద్వారా నోటి మాట ద్వారా సాయం చేయడం ప్రస్తుతం చేస్తున్న పని. మెడిసిన్స్ అవసరం ఉన్న పేషెంట్స్‌కు జెనెరిక్ మెడిసిన్ ద్వారా సర్వీస్ చేయడం, నర్సుల సాయం తీసుకోవడం వంటివీ జరుగుతుంటాయి. నా టీమ్‌లో అందరూ స్వచ్ఛందంగా సేవ చేసేవారే. ఇంటి వద్ద ఉన్నప్పుడే కాదు గుర్గావ్లో ఉన్నా ఫోన్ కాల్ ద్వారా అవసరమైన వారికి అందుబాటులో ఉండే ప్రయత్నం చేస్తుంటాను’’ అని వివరించింది నిఖిల. ఒప్పించి.. మెప్పించాను.. అమ్మనాన్నలు ఇంజనీరింగ్ చేసి త్వరగా స్థిరపడిపోతే చాలు అనుకునేవారు. కానీ, అనుకోకుండా మెyì కల్ వైపుగా వచ్చాను. ఎమ్మెస్సీ తర్వాత గుర్గావ్లో ఇంటర్వ్యూ ఉందనే విషయం కూడా ఇంట్లో చెప్పలేదు, వద్దంటారు అనే ఆలోచనతో. అమ్మమ్మతో కలిసి ఢిల్లీ టూర్ వెళతాను అని ఒప్పించి వెళ్లాను. అక్కడ మెదంతాలో సీట్ వచ్చాక అప్పుడు విషయాన్ని చెప్పాను. నాకున్న ఆసక్తిని చూసి అమ్మనాన్నలు సరే అన్నారు. కూతురు అంత దూరంలో ఎలా ఉంటుందో అనే బెంగ వాళ్లను ఒప్పుకోనివ్వదని ఆ పని చేశాను. ఇప్పుడు నేను చేస్తున్న రీసెర్చ్‌కి, సర్వీస్‌కు అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. నాకు ఇంత మంచి గుర్తింపు రావడం గర్వంగా భావిస్తుంటారు. – డా.కర్పూరం గోవతి నిఖిల -
ఏపీలో అమెరికా పూల సోయగాలు
సాక్షి, అమరావతి: లిసియాంతస్.. ఉత్తర అమెరికా ప్రాంతానికి చెందిన ఈ పువ్వులు గులాబీలను పోలి ఉండే కట్ ఫ్లవర్స్. విభిన్న రంగుల్లో ఉండే ఇవి మైదాన, కొండ ప్రాంతాల్లోనే కాదు ఇంటి ఆవరణలో పూలకుండీల్లోనూ పెంచుకునేందుకు అనువైనవి. బొకేలు, అలంకరణకు ఉపయోగించే ఈ పూలకు విదేశాల్లో మంచి డిమాండ్ ఉంది. వీటిని ఏపీలోనూ సాగు చేసేవిధంగా శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనలు ఫలించాయి. దేశంలోని బెంగళూరు పరిసర ప్రాంతాల్లో కొద్దిపాటి విస్తీర్ణంలో లిసియాంతస్ పూల ను సాగు చేస్తున్నారు. వీటి సాగుకు ఆంధ్రప్రదేశ్‌లోనూ అనువైన వాతావరణం ఉన్నట్టు వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు గుర్తించారు. అల్లూరి జిల్లాలోని చింతపల్లి ఉద్యాన పరిశోధన కేంద్రంలోని పాలీహౌస్లో 6 రకాల లిసియాంతస్పై పరిశోధనలు జరిపారు. పింక్, ఆకుపచ్చ, పసుపు, తెలుపు, నీలం, పికోటీ, చాంపేన్ రకాలను ప్రయోగాత్మకంగా సాగు చేశారు. శీతాకాలంలో మైదాన ప్రాంతాల్లోను, కొండ ప్రా ంతాల్లో వేసవి కాలంలోనూ వీటిని సాగు చేయవచ్చని గుర్తించారు. ఇండోర్ డెకరేషన్‌కు ఉప యోగించే ఈ పూలు కనీసం ఐదారు రోజుల పాటు తాజాదనం కోల్పోకుండా ఉంటున్నాయి. అలంకరణ కోసం ఉపయోగించే ఈ పూలకు యూరోప్, చైనా, ఇంగ్లాండ్, వియత్నాం, మలేíÙ యా, జపాన్ దేశాల్లో మంచి డిమాండ్ ఉంది. రూ.40 లక్షల ఆదాయం వీటి పంట కాలం నాలుగు నెలలు. నర్సరీల్లో 70 నుంచి 75 రోజులు ఉంచాలి. నాటిన 60 రోజులకు పుష్పిస్తాయి. ఒక మొక్క మూడు కొమ్ములతో ఉంటుంది. కాండానికి 9 నుంచి 12 పువ్వులు వస్తాయి. సీజన్ బట్టి ఒక్కొక్క పువ్వు రూ.20 నుంచి రూ.35 వరకు పలుకుతుంది. రూ.24 లక్షల వరకు పెట్టుబడి పెడితే.. రూ.40 లక్షల వరకు ఆదాయం వస్తుంది. పెట్టుబడి పోనూ రూ.12 లక్షల నుంచి రూ.16 లక్షల నికర ఆదాయం పొందొచ్చు. మన ప్రాంతానికి రోసిట 3 బ్లూ పికోటీ వెరైటీ–2, ఎక్స్ కాలిబూర్ 3 బ్లూ పికోటీ, రోసిట 4 ప్యూర్ వైట్, రోసిట 3 పింక్ పికోటీ, రోసిట 4 గ్రీన్ రకాలు అనుకూలమని తేల్చారు. -
పాలపుంతలో గురుత్వాకర్షణ తరంగాల గుట్టు
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: ఖగోళ రహస్యాలను తేల్చే పరిశోధనలో భాగంగా.. పాలపుంతలో గురుత్వాకర్షణ తరంగాల ఆధారాలను కనుగొన్న బృందంలో హైదరాబాద్ ఐఐటీ పరిశోదకులూ భాగస్వాములయ్యారు. ‘ఇండియన్ పల్సర్ టైమింగ్ అర్రే (ఐఎన్పీటీఏ)’తోపాటు జపాన్, యూరప్ దేశాల అంతరిక్ష శాస్త్రవేత్తలు సంయుక్తంగా ఈ పరిశోధన చేశారని ఐఐటీ హైదరాబాద్ బుధవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. ప్రపంచంలోని ఆరు అత్యాధునిక రేడియో టెలిస్కోప్‌లను ఉపయోగించి ఖగోళాన్ని పరిశీలించామని.. పాలపుంతలో అతి తక్కువ పౌనఃపున్యం ఉన్న గురుత్వాకర్షణ తరంగాలకు సంబంధించిన ఆధారాలను కనుగొన్నామని తెలిపింది. ఈ వివరాలు ఆస్ట్రానమీ అండ్ ఆస్ట్రోఫిజిక్స్ జర్నల్‌లో ప్రచురితం అయ్యాయని పేర్కొంది. ఐఐటీ హైదరాబాద్ భౌతికశాస్త్ర విభాగం ప్రొఫెసర్ శంతన్దేశాయ్, అమన్ శ్రీవాత్సవ, ఫిజిక్స్ పీహెచ్డీ విద్యార్థి దివ్యనాశ్ కర్బందా, బీటెక్ విద్యార్థులు శ్వేత అర్ముగం, ప్రజ్ఞ మాండిపాక తదితరులు పరిశోధన బృందంలో ఉన్నారని వివరించింది. -
కెఫిన్ లేని కాఫీ గింజలు..హాయిగా సిప్ చేయొచ్చు
కాఫీ అంటే ఇష్టపడనివారు ఉండరు. ఐతే ఈ కాఫీలో ఉండే కెఫిన్ మన శరీరంలో అత్యంత దుష్పరిణామాలకు దారితీస్తోంది. అందుకనే రోజుకు రెండు నుంచి మూడు కప్పులకు మించి కాఫీ తీసుకోకూడదని నిపుణులు చెబుతున్నారు. దీంతో పలు కంపెనీలు కెఫిన్ లేని కాఫీ పొడిని తయారు చేస్తున్నాయి. కానీ వాటి ఖరీదు ఎక్కువ. అందరూ కొనుగోలు చేయలేరు. ఆ సమస్యకు చెక్‌పెట్టి ఆరోగ్యకరమైన కాఫీని ఆస్వాదించేలా కెఫిన్ లేని కాఫీ గింజలను ఉత్పత్తి చేసేందుకు నాంది పలికారు బ్రెజిల్ శాస్త్రవేత్తలు. ఈ మేరకు బ్రెజిలియన్ కాఫీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కి చెందిన శాస్త్రవేత్తలు చేపట్టిన రెండు దశాబ్దాల ప్రాజెక్టులో చాలా వరకు పురోగతి సాధించారు. ఈ పరిశోధనలు ప్రముఖ కాఫీ పరిశోధనా కేంద్రం ఇన్స్టిట్యూటో అగ్రోనోమికో డీ కాంపినాస(ఐఏఎస్) ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. ఈ పరిశోధన ఫలితంగా అధిక దిగుబడినిచ్చే కాఫీ మొక్కలను అభివృద్ధి చేశారు శాస్త్రవేత్తలు. దీంతో బ్రెజిల్ వాణిజ్య పరంగా కాఫీ ప్రపంచ మార్కెట్లో పవర్‌హౌస్‌గా మారుతుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అనేక ఏళ్లుగా కెఫిన్ కంటెంట్ తక్కువుగా ఉన్న వివిధ కాఫీ మొక్కలను అభివృద్ధి చేయడమే గాక క్షేత్ర స్థాయిలో ట్రయల్స్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇది గనుక విజయవంతమైతే అతి పెద్ద వినియోగదారులైన యూరప్, యునైటెడ్ స్టేట్స్ వంటి వాటితో బ్రెజిల్‌కి సముచిత వాణజ్య మార్కెట్ ఏర్పడే అవకాశం ఉంటుందని చెప్పారు. అంతేగాక డీకాఫీన్(కెఫిన్ శాతం తగ్గించడం) తయారు చేస్తున్న కంపెనీలు తమ ఖర్చులను తగ్గించేందుకు మొగ్గు చూపతాయని అంటున్నారు. ప్రస్తుతం తాము బ్రెజిల్లో వివిధ ప్రాంతాల్లో ఈ డీకాఫిన్ మొక్కలను పెంచుతున్నామని, అవి గింజలను ఉత్పత్తి చేయడానికి సాధారణంగా రెండు నుంచి మూడేళ్ల పడుతుందని చెబుతున్నారు. అందువల్ల తమ పరిశోధన మరింత విజయవంతం కావడానికి తాము ఇంకాస్త సమయం నిరీక్షించాల్సి ఉందని చెబుతున్నారు. వాస్తవానికి సాధారణ కాఫీలో ఉండే కాఫీ మనల్ని ఉత్సాహంగా ఉంచేలా చేయడమే గాక రోజంతా మేల్కోని ఉండేలా శక్తినిస్తుంది. కానీ ఈ కెఫిన్ కడుపులో యాసిడ్లను పెంచి మంట లేదా గుండెల్లో నొప్పికి దారితీసే ప్రమాదం పొంచి ఉంది. దాన్ని నివారించేందుకే కెఫిన్ తక్కువగా ఉండే కాఫీ మొక్కలను అభివృద్ధి చేసే ప్రాజెక్టు తెరపైకి వచ్చింది. ఇప్పటికే యూఎస్ వంటి దేశాల్లో 10 శాతం కెఫిన్ ఉన్న కాఫీని తయారు చేస్తున్నాయి కొన్ని కార్పొరేట్ సంస్థలు. ఇది కాస్త ఖర్చుతో కూడుకున్నది. దీన్ని అధిగమించేందుకే శాస్త్రవేత్తలు ఈ పరిశోధనలు చేస్తున్నారు. కాగా, శాస్త్రవేత్తల బృందం మాత్రం తమ పరిశోధనలు విజయవంతమవుతాయని ధీమగా చెబుతున్నారు. (చదవండి: 127 గంటలు.. డ్యాన్స్!) -
అది నిగూఢ రహస్యాన్ని దాచుకున్న సరస్సు.. రాత్రి కాగానే..
ప్రపంచంలో అంతుచిక్కని వింతలెన్నో ఉన్నాయి. వీటి రహస్యాల ముడి విప్పాలని శాస్త్రవేత్తలు ఏళ్ల తరబడి ఎంతగానో ప్రయత్నిస్తున్నారు. అయినా ఫలితం లేకపోతోంది. అలాంటి అత్యంత వింత సరస్సు గురించి ఇప్పుడు తెలుసుకుందాం. వింతలు, విశేషాలు అందరినీ ఇట్టే ఆకర్షిస్తుంటాయి. ఈ కోవలోకి వచ్చే ఒక వింత సరస్సు అటు పరిశోధకులను, శాస్త్రవేత్తలను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఆ సరస్సులోని నీటి రహస్యం గురించి తెలుసుకోవాలని ప్రపంచవ్యాప్తంగా పలువురు శాస్త్రవేత్తలు తమ పరిశోధనలను నిరంతరం కొనసాగిస్తూనే ఉన్నారు. రాత్రయ్యే సరికి ఆ సరస్సులోని నీరు నీలి రంగులోకి ఎందుకు మారిపోతున్నదో ఇంతవరకూ ఎవరికీ అంతుచిక్కలేదు. ఈ నేపధ్యంలో పలువురు శాస్త్రవేత్తలు తమ వాదనలు వినిపించినా, అవి ఇప్పటివరకూ పూర్తిస్థాయి సమాధానాన్ని ఇవ్వలేదు. అదరగొట్టే ఉష్ణోగ్రత.. ఈ సరస్సు ఇండోనేషియాలో ఉంది. దీనిని కవాహ్ ఇజేన్ లేక్ అని అంటారు. ఇది చూసేందుకు ఇతర సరస్సుల మాదిరిగానే కనిపిస్తుంది. ఈ సరస్సులోని నీరు ఎంతో ఉప్పగా ఉంటుందని చెబుతారు. ఈ నీరు 200 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత కలిగివుండటం విశేషం. ఉదయం వేళలో ఈ సరస్సులోని నీరు సాధారణంగానే కనిపిస్తుంది. మధ్యరాత్రి సమయానికి గాఢమైన నీలిరంగులోకి మారిపోతుంది. అలాగే మెరుస్తూ కనిపిస్తుంటుంది. ఇది ఎంతో ఆకర్షించే విషయమైనప్పటికీ, టూరిస్టులు ఇక్కడికి రాకపోవడం విశేషం. సరస్సులోని వేడి నీటి కారణంగా ఇక్కడికి వచ్చేవారెవరూ ఎక్కువసేపు ఇక్కడ ఉండలేరు. శాస్త్రవేత్తలు కూడా ఈ కారణంగానే తమ పరిశోధనలు ముందుకు సాగడం లేదని చెబుతుంటారు. ఇది కూడా చదవండి: ఒడిశా రైలు ప్రమాద బాధితుల వింత ప్రవర్తన రసాయన వాయువులే కారణమా? పలు దేశాలకు చెందిన శాస్త్రవేత్తలు ఈ సరస్సుపై లెక్కలేనన్ని పరిశోధనలు సాగించారు. అయితే ఇప్పటి వరకూ ఈ నీటి వెనుకనున్న రహస్యాన్ని ఎవరూ కనుగొనలేకపోయారు. ఈ సరస్సుకు సమీపంలో పలు అగ్నిపర్వతాలు ఉన్నాయని, అవి అప్పుడప్పుడు పేలు తుంటాయని, ఈ కారణంగానే ఈ ప్రాంతంలో భూకంపాలు వస్తుంటాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. అగ్నిపర్వతాలు పేలడం వలన హైడ్రోజన్ ఫ్లోరైడ్, సల్ఫ్యూరిక్ డయాక్సైడ్ తదితర వాయువులు వెలువడతాయి. ఈ వాయువుల రియాక్షన్ కారణంగానే సరస్సులోని నీటి రంగు మారుతుందని పరిశోధకులు భావిస్తున్నారు. అయితే ఈ విధంగా నిరంతరం వాయువులు వెలువడినప్పుడు ఉదయం వేళలో నీటి రంగు మారకుండా, రాత్రివేళలో మాత్రమే నీటి రంగు ఎందుకు మారుతున్నదనే ప్రశ్న అలానే మిగిలిపోయింది. మరి దీనికి సమాధానం ఎప్పుడు వస్తుందో వేచి చూడాలి. ఇది కూడా చదవండి: ‘తాజ్’ యమ క్రేజ్.. ఆదాయంలో టాప్ వన్! -
ఏ కాలంలో బాగా నిద్రపడుతుందంటే..
ఎవరైనాసరే రోజంతా ఏవో ఒక వ్యాపకాలలో మునిగిపోయాక, రాత్రయ్యాక ఇంటికి చేరుకుని నిద్రిస్తారు. అయితే వాతావరణం మారినప్పుడు ఆ ప్రభావం నిద్రపై ఉంటుందనే సంగతి మీకు తెలుసా? ఈ అంశంపై నిర్వహించిన ఒక అధ్యయనంలో పలు ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి. ఎవరికైనా సరే వేసవిలో అంత సులభంగా నిద్రరాదని, చలికాలంలో నిద్ర త్వరగా వస్తుందని పలు పరిశోధనల్లో వెల్లడయ్యింది. ఇంతకూ వాతావరణానికి, నిద్రకు మధ్యగల సంబంధం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. అమెరికన్ అకాడమి ఆఫ్ న్యూరాలజీకి చెందిన పరిశోధకులు సంవత్సరంలోని వివిధ కాలాల్లో మనిషి నిద్రపై అధ్యయనం చేశారు. ఈ వివరాలను ‘న్యూరాలజీ’ జర్నల్‌లో ప్రచురించారు. చలికాలం ముగిసిన వెంటనే వేసవి కాలం వస్తుంది. ఈ తరుణంలో రాత్రి సమయం తగ్గి, పగటి సమయం పెరిగినట్లు అనిపిస్తుంది. దీనిని డే- లైట్ సేవింగ్ టైమ్ అని అంటారు. విపరీతమై చలికాలం ఉన్న సమయంలో రాత్రి సమయం పెరిగి, పగటి సమయం తగ్గుతుంది. దీనిని స్టాండర్డ్ టైమ్ అని అంటారు. ఈ అధ్యయనంలో వెల్లడైన వివరాల ప్రకారం డే-లైట్ సేవింగ్ టైమ్ నుంచి స్టాండర్డ్ టైమ్‌కు మారే సమయంలో చాలామందికి స్లీపింగ్ డిజార్డర్ సమస్య తలెత్తుతుంది. అయితే స్టాండర్డ్ టైమ్ నుంచి డే-లైట్ సేవింగ్ టైమ్నకు మారేటప్పుడు ఎటువంటి సమస్య తలెత్తదు. దీనిగురించి అమెరికన్ అకాడమీ ఆఫ్ న్యూరాలజీ మెంబర్ రాన్ బీ పోస్టుమ్ మాట్లాడుతూ కాలాల మార్పు కారణంగా నిద్ర రావడంలో చాలా రోజుల పాటు మార్పులు రావు. ఇటువంటి మార్పు కేవలం 14 రోజులు మాత్రమే ఉంటుందన్నారు. ఈ పరిశోధనలో 45 నుంచి 85 ఏళ్ల మధ్య వయసు కలిగిన 30,097 మంది పాల్గొన్నారు. అధ్యయనంలో భాగంగా నిద్రకు సంబంధించిన ప్రశ్నలను వీరిని అడిగారు. మీరు ఎంత సేపు నిద్రపోతారు? మీకు నిద్ర ఎంతసేపటిలో పడుతుంది? ఎంత ఘాడమైన నిద్ర వస్తుందనే ప్రశ్నలను వారిపై సంధించారు. వీటితో పాటు గడచిన నెలలో ఎన్నిసార్లు నిద్రపట్టేందుకు 30 నిముషాల కన్నా అధికసమయం పట్టిందని కూడా ప్రశ్నించారు. అలాగే ఎన్నిసార్లు నిద్ర మధ్యలో లేచారు? అటువంటప్పుడు ఉదయం నిద్రపోయారా అనే ప్రశ్నలు వేశారు. ఈ పరిశోధనలో ఎవరైతే ఒకవారం వ్యవధిలో మూడు లేదా అంతకన్నా ఎక్కువసార్లు నిద్రపట్టేందుకు 30 నిముషాల కన్నా అధికసమయం పట్టిందో లేదా వారి నిద్ర చెదిరిపోయిందో లేదా ఉదయం త్వరగా మెలకువ వచ్చేస్తోందో వారంతా నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారని తేలింది. పరిశోధకులు కాలాల మార్పు కారణంగానూ నిద్రలో వచ్చే మార్పులపై అధ్యయనం చేశారు. వేసవిలో చక్కగా నిద్రపోయవారు 6.76 గంటలు నిద్రపోతారని, చలికాలంలో దీనికన్నా 5 నిముషాలు అధికంగా అంటే 6.84 నిముషాలు నిద్రపోతారని తేలింది. చదవండి: నీటి అడుగు రాజ్యాలు.. కాలుష్య కాసారాలు -
అదే ఆరోగ్యానికి కేరాఫ్ అడ్రస్.. 15 వేలమందిపై సర్వే.. ఆసక్తికర వివరాలు వెల్లడి!
మనిషి ప్రకృతికి ఎంత దగ్గరగా ఉంటే అంత ఆరోగ్యంగా ఉంటాడని చెబుతారు. శాంతియుతంగా జీవించాలన్నా, ఆనందంగా ఉండాలన్నా ఇదే ఉత్తమ మార్గమని పరిశోధకులు, నిపుణులు కూడా చెబుతుంటారు. ఈ సలహాలు, సూచనల నేపధ్యంలోనే చాలామంది ప్రకృతితో మమేకమై జీవించాలనుకుంటారు. తాజాగా పరిశోధకులు ఈ అంశానికి సంబంధించిన మరికొన్ని విషయాలు తెలిపారు. సముద్రతీరంలో నివసించేవారు అరోగ్యంగా ఉంటారని వారు పేర్కొన్నారు. ‘కమ్యూనికేషన్ అర్త్ అండ్ ఎన్విరాన్మెంట్’లో ప్రచురితమైన అధ్యయనంలో ఈ వివరాలు వెల్లడయ్యాయి. ఈ అధ్యయనాన్ని యూనివర్శిటీ ఆఫ్ వియానాకు చెందిన ఎన్విరాన్మెంటల్ సైకాలజీ గ్రూప్ చేపట్టింది. ఈ బృందానికి సాండ్రా జోయిగర్ సారధ్యం వహించారు. సముద్రతీరం మనిషి ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని ఈ అధ్యయనంలో పేర్కొన్నారు. అందుకే మనుషులు సాగరతీరంలో కాలం గడిపేందుకు ప్రయత్నించాలని సూచించారు. చాలా దేశాలు సముద్రతీరం వెంబడి ఉన్నాయని, సాగరతీర ప్రాంతాల్లో ఉన్నవారు మిగిలినవారికన్నా ఆరోగ్యంగా ఉంటున్నట్లు తేలిందన్నారు. పరిశోధకులు తెలిపిన వివరాల ప్రకారం 1660వ సంవత్సరంలోనే దీనిపై పరిశోధనలు ప్రారంభమయ్యాయన్నారు. ఆ కాలంలో ఆంగ్ల ఫిజీషియన్లు తమ దగ్గరకు వచ్చేవారికి సముద్ర స్నానం చేయాలని, సముద్రతీరంలో నడవాలని సూచించేవారు. ఈ దిశగా ప్రోత్సహించేవారు. అలాగే 19వ శతాబ్ధపు మధ్యభాగంలో యూరప్‌కు చెందిన ధనవంతులు సముద్ర తీరంలో సేదతీరేందుకు తహతహలాడిపోయేవారు. 20వ శతాబ్ధంలో ఈ దిశగా జనం ఆసక్తి తగ్గింది. అయితే ఇప్పుడు తాజాగా పరిశోధకులు సముద్రతీరప్రాంతంలో పర్యటించడం ఆరోగ్యకరమని చెబుతున్నారు. ఈ అధ్యయనంలో భాగంగా పరిశోధనకులు సముద్రతీర ప్రాంతాల్లో నివసించే 15 వేల జనాభా ఆరోగ్యంపై సర్వేచేశారు. దీనిని క్రోడీకరించి సముద్రతీరంలో నివాసం ఉండటం ఎంతో లాభదాయకమని తేల్చిచెప్పారు. -
కళ్లకు కట్టినట్టు సాక్ష్యాలు.. తవ్వినకొద్దీ వెలుగులోకి వస్తోన్న మన చరిత్ర
సాక్షి, నాగర్‌కర్నూల్: తెలంగాణ పల్లెల్లో దాగి ఉన్న చారిత్రక ఆనవాళ్లు, పురాతన మూలాలను తెలుసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో మన ఊరు– మన చరిత్ర కార్యక్రమాన్ని చేపట్టింది. ఆయా గ్రామాలకు ఉన్న పేర్లు ఎలా వచ్చాయి.. గతంలో ఎలాంటి చరిత్ర ఉండేదన్న ఆసక్తికరమైన అంశాలపై అధ్యయనం కొనసాగుతోంది. జిల్లాలో ఈ కార్యక్రమానికి కోఆర్డినేటర్‌గా పాలెం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ పెబ్బేటి మల్లికార్జున్‌ను నియమించగా.. జిల్లాలోని డిగ్రీ కళాశాలల నుంచి ఆరుగురు అధ్యాపకులు సభ్యులుగా ఉన్నారు. వెలుగులోకి కొత్త చరిత్ర.. జిల్లాలో నెల రోజులుగా మన ఊరు– మన చరిత్ర కార్యక్రమ అధ్యయన బృందం గ్రామాల్లో క్షేత్రస్థాయిలో పర్యటిస్తోంది. వాటి చరిత్రను అవలోకనం చేసుకునేందుకు గ్రామాల్లో వివిధ వర్గాల నుంచి సమాచారాన్ని సేకరించి ఫొటోలతో సహా పుస్తకాల్లో నిక్షిప్తం చేసే ప్రయత్నం కొనసాగుతోంది. అయితే క్షేత్రస్థాయి పరిశీలనలో పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. జిల్లాలోని బిజినేపల్లి మండలంలోని మహదేవునిపేట గ్రామాన్ని సందర్శించినప్పుడు గ్రామం చుట్టుపక్కల గొలుసుకట్టు చెరువులతోపాటు కాకతీయుల కాలం నాటి పురాతన ఆలయాలను గుర్తించారు. ఆలయాల వద్ద ఆనాటి కాలంలో తవ్విన పురాతన బావులు ఇప్పటికీ ఉన్నాయి. ఇక్కడి పురాతన ఆలయంలోని శివలింగం తెలుపు రంగులో ఉండటం విశేషం. అంతకు ముందు ఈ గ్రామం పేరు తుర్కలపల్లిగా ఉండగా ఈ శివలింగం కారణంగానే మహదేవునిపేటగా స్థిరపడినట్టు బృందం సభ్యులు గుర్తించారు. ఈ గ్రామంలో హిందు, ముస్లిం గురువులు వేర్వేరుగా ఆధ్యాత్మిక ప్రచారం చేస్తూ అక్కడే సమాధి అయ్యారని తెలుసుకున్నారు. ఈ గ్రామం మత సామరస్యానికి ప్రతీకగా నిలిచిందని బృందం సభ్యులు అభివర్ణిస్తున్నారు. ● గంగారం సమీపంలోని గుట్టల నుంచి ఎత్తైన రాళ్లను పగులగొట్టి నందివడ్డెమాన్ ఆలయాలను నిర్మించినట్టు తెలుసుకున్నారు. వడ్డెమాన్‌లోని త్రికూట ఆలయాల వద్దనున్న బుద్ధుడి ప్రతిమను బట్టి అక్కడ బౌద్ధమతం సైతం విలసిల్లిందని అధ్యాపకులు భావిస్తున్నారు. గ్రామాల్లో మన ఊరు– మన చరిత్ర కార్యక్రమం ‘ఇక్కడ కనిపిస్తున్నది బిజినేపల్లి మండలం గంగారం గ్రామ సమీపంలోని అటవీప్రాంతం. చరిత్రాత్మకంగా ప్రసిద్ధిచెందిన నందివడ్డెమాన్‌లోని ఆలయాలు, పురాతన కోట నిర్మాణం కోసం ఇక్కడి రాళ్లనే వినియోగించారు. ఈ ప్రాంతంలోని ఎత్తైన రాళ్లను పగులగొట్టిన ఆనవాళ్లు ఇప్పటికీ నాటి చరిత్రకు ఆధారంగా నిలుస్తున్నాయి’. ‘ఈ ఫొటోలో రాజసంగా కనిపిస్తున్న భవనం జిల్లాలోని బిజినేపల్లి మండలం వట్టెం గ్రామంలోని పురాతన కోట. సుమారు 1625 సంవత్సరం నుంచి స్వాతంత్య్రం వచ్చే వరకు ఈ కోట కేంద్రంగా రెడ్లు పాలన సాగించేవారు. వట్టెం కేంద్రంగా కొంతకాలం పాటు రెడ్డి వంశస్తుల పాలన సాగిందని మన ఊరు– మన చరిత్ర పరిశోధన బృందం వెలుగులోకి తీసుకొచ్చింది. మరింత లోతుగా పరిశోధన చేస్తే చాలా వరకు చరిత్ర బయటపడుతుందని వారు చెబుతున్నారు.’ ఆలయాలపై ప్రధాన దృష్టి.. గ్రామాల చరిత్రతోపాటు ఆయా గ్రామాల్లోని ఆలయాలపై సమగ్రంగా దృష్టిసారించి అధ్యయనాన్ని సాగిస్తున్నారు. జిల్లాలోని ఉప్పునుంతల మండలంలోని మామిళ్లపల్లిలో ఉన్న నారసింహుని ఆలయానికి సంబంధించిన 1171 నాటి శాసనాన్ని గుర్తించారు. 12వ శతాబ్దంలోనే 500 ఎకరాల భూమిని ఆలయానికి దానం ఇచ్చినట్టుగా శాసనంలో పేర్కొని ఉంది. ● ఒక గ్రామం గురించి అధ్యయనం మొదలుపెట్టినప్పుడు గ్రామానికి ఆ పేరెలా వచ్చింది.. గ్రామానికి ఉన్న ప్రధాన చారిత్రక మూలాలేంటి అన్నదానిపై పరిశోధన మొదలవుతుంది. క్రమంగా గ్రామ భౌగోళిక నైసర్గిక స్వరూపం, సమీపంలో ఉన్న వాగులు, సెలయేర్లు, చెరువులు, కొండల వంటి వివరాలను సమగ్రంగా తెలుసుకుని పొందుపరుస్తారు. ● గ్రామంలోని పురాతన ఆలయాలు, వాటి చరిత్ర, మతసామరస్యం వంటి అంశాలను తెలుసుకునేందుకు గ్రామంలోని వృద్ధులు, స్వాతంత్య్ర సమరయోధులు, గ్రామ పెద్దలు, పురోహితులు, ఔత్సాహికుల నుంచి సమాచారం సేకరిస్తున్నారు. ఆసక్తికర విషయాలు.. మన ఊరు– మన చరిత్ర కార్యక్రమంలో భాగంగా జిల్లాలో గ్రామాల వారీగా చరిత్రను తెలుసుకునేందుకు అధ్యయనాన్ని మొదలుపెట్టాం. క్షేత్రస్థాయి సందర్శనలో పలు గ్రామాల్లో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. జిల్లాలోని మారుమూల గ్రామాల్లో మనకు తెలియని ఎంతో చరిత్ర దాగి ఉంది. వివిధ వర్గాల సహకారంతో విడతల వారీగా సమాచారాన్ని సేకరిస్తున్నాం. ఈ కార్యక్రమం ద్వారా ప్రస్తుత తరం వారిలో తమ ఊరి పట్ల మమకారం మరింత పెరుగుతుంది. – మల్లికార్జున్,ప్రాజెక్టు జిల్లా కోఆర్డినేటర్ -
వైద్య పరిశోధనలకు ప్రోత్సాహం
లబ్బీపేట (విజయవాడ తూర్పు): విజయవాడలోని సిద్ధార్థ ప్రభుత్వ వైద్య కళాశాలలో నూతన వైద్య విధానాలపై పరిశోధనలు చేసేలా వైద్యులు, విద్యార్థులను ప్రోత్సహిస్తున్నారు. మన ప్రాంతంలో సోకే వ్యాధులకు అవసరమైన వైద్య పరిష్కారాలపై ఇక్కడ పరిశోధనలు సాగిస్తున్నారు. ఇందుకు కళాశాలలో మల్టిడిసిప్లినరీ రీసెర్చ్ యూనిట్(ఎంఆర్‌యూ)ను ఏర్పాటు చేశారు. దీని కేంద్రంగా వివిధ విభాగాల్లోని వైద్యులు, పోస్ట్రుగాడ్యుయేట్ విద్యార్థులు పరిశోధనలు చేస్తున్నారు. అందుకయ్యే ఖర్చును కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ విడుదల చేయనుంది. అయితే ముందుగా పరిశోధనలకు కళాశాల ఎథికల్ కమిటీ నుంచి అనుమతి పొందాలి. ఇలా అనుమతి పొందిన పరిశోధనలకు అయ్యే ఖర్చు మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వమే భరిస్తుంది. ఏం పరిశోధనలు చేయాలనుకుంటున్నారు? ఎలా చేస్తారు? ఏ అంశంపై చేస్తారు? అనే వివరాలను పేపర్ ప్రజెంటేషన్ రూపంలో సమర్పించాల్సి ఉంది. వీటిని వైద్య కళాశాలలోని ఎథికల్ కమిటీ పరిశీలించి అనుమతి ఇస్తుంది. తర్వాత కేంద్ర ప్రభుత్వ అనుమతి కోసం పంపుతారు. అక్కడి నుంచి అనుమతులు వచ్చాక పరిశోధనలు ప్రారంభించవచ్చు. పలు విభాగాల్లో పరిశోధనలు సిద్ధార్థ ప్రభుత్వ వైద్య కళాశాలలో ఇప్పటికే ఎనస్థీషియా, మైక్రోబయాలజీ విభాగాల్లో పరిశోధనలు పూర్తి చేశారు. ప్రస్తుతం కమ్యూనిటీ మెడిసిన్(ఎస్పీఎం)లో పరిశోధనలు కొనసాగుతున్నాయి. అలాగే పీడియాట్రిక్, జనరల్ మెడిసిన్, కమ్యూనిటీ మెడిసిన్, మైక్రోబయాలజీ విభాగాల్లో పరిశోధనలకు ఎథికల్ కమిటీ నుంచి అనుమతి పొంది కేంద్ర ప్రభుత్వానికి పంపించారు. అక్కడి నుంచి అనుమతి రావాల్సి ఉంది. క్లినికల్ రీసెర్చ్ సైతం.. ఔషధ రంగంలో కొత్తగా కనిపెట్టిన మందుల పనితీరుపై కూడా సిద్ధార్థ వైద్య కళాశాలలో క్లినికల్ రీసెర్చ్ చేస్తున్నారు. ఆయా వ్యాధులకు మందులు ఎలా పనిచేస్తున్నాయి? వంటి అంశాలపై పరిశోధనలు కొనసాగిస్తున్నారు. వీటికి సైతం ముందుగా ఎథికల్ కమిటీ నుంచి అనుమతులు తప్పనిసరి. అలాగే రోగి అంగీకారం కూడా అవసరం. కాగా కళాశాలలో జీనోమ్ సీక్వెన్స్ ల్యాబ్ అందుబాటులో ఉంది. ఇందులో కొత్తగా సోకే వ్యాధుల జీన్స్, ఏ రకం వ్యాధి అనేది గుర్తించనున్నారు. కరోనాలో కొత్త వేరియెంట్లతో పాటు హెచ్3ఎన్2 వైరస్ వంటి వాటిని కూడా గుర్తించే సదుపాయం ఉంది. అందుబాటులోకి నూతన వైద్య విధానాలు ఇప్పటివరకు వివిధ వ్యాధులకు ఎక్కడో చేసిన పరిశోధనల ఆధారంగా చికిత్స అందిస్తున్నారు. అలా కాకుండా మన ప్రాంతంలో సోకే వ్యాధులకు అవసరమైన వైద్య పద్ధతులపై ఇక్కడే పరిశోధనలు చేయడం ద్వారా నూతన వైద్య విధానాలు అందుబాటులోకి రానున్నాయి. వైద్యులు చేసే పరిశోధనల్లో వైద్య విద్యార్థులు సైతం భాగస్వాములు కానుండటంతో వారికి కూడా ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని నిపుణులు అంటున్నారు. చదువుకునే సమయంలోనే పరిశోధనలపై పట్టు సాధించడంతో పాటు కొత్త విధానాలను తెలుసుకునే అవకాశం లభిస్తుందని చెబుతున్నారు. కొత్త చికిత్సలపై అవగాహన పెరుగుతుంది.. వైద్య కళాశాలలోని పలు విభాగాల్లో పరిశోధనలతో వైద్య విద్యార్థుల్లో పరిజ్ఞానం మరింత పెరుగుతుంది. నూతన వైద్య విధానాలు, కొత్త చికిత్సలపై అవగాహన పెంపొందించుకోవచ్చు. ప్రస్తుతం ఎనస్థీషియా, మైక్రోబయాలజీ విభాగాల్లో పరిశోధనలు పూర్తయ్యాయి. పరిశోధనల కోసం వైద్య కళాశాలలో ప్రత్యేకంగా మలీ్టడిసిప్లినరీ రీసెర్చ్ యూనిట్‌ను ఏర్పాటు చేశాం. –డాక్టర్ కంచర్ల సుధాకర్, ప్రిన్సిపాల్, సిద్ధార్థ ప్రభుత్వ వైద్య కళాశాల, విజయవాడ -
అధిక దిగుబడి, అత్యధిక ప్రొటీన్ @ బీపీటీ 2848
సాక్షి ప్రతినిధి, బాపట్ల: దేశంలోనే మొదటిసారిగా అత్యధిక ప్రొటీన్ అందించే అరుదైన వరి వంగడాన్ని బాపట్ల వరి పరిశోధన కేంద్రం శాస్త్రవేత్తలు సృష్టించారు. 12 ఏళ్లపాటు విస్తృత పరిశోధనలు చేసి అధిక దిగుబడి.. అత్యధిక ప్రొటీన్ అందించే వరి వంగడాలకు రూపకల్పన చేశారు. వీటిని బీపీటీ 2848 పేరుతో పిలుస్తున్నారు. గతేడాది డిసెంబర్లో ఢిల్లీలోని నేషనల్ బ్యూరో ఆఫ్ ప్లాంట్ జెనెటిక్ రిసోర్సెస్‌లో దీన్ని నమోదు చేశారు. ఇలా ఒక కొత్త వంగడాన్ని సృష్టించి నమోదు చేయడం ఇదే ప్రథమమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 25 నుంచి 30 బస్తాల వరకు దిగుబడి నల్ల రకం వరి విత్తనంగా బీపీటీ 2848ని శాస్త్రవేత్తలు రూపొందించారు. ఆర్బీ బయో 2026/ఐఆర్జీసీ 48493 రకం వంగడాన్ని సంకరం చేసి ఈ కొత్త వంగడాన్ని సృష్టించారు. ఈ విత్తనాల పంట కాలం 125 నుంచి 130 రోజులు ఉంటుందని చెబుతున్నారు. ఇప్పటికే దేశీయ రకాల్లో నల్ల రకం ఉన్నా అవి ఎకరానికి 10 నుంచి 15 బస్తాలకు మించి దిగుబడి ఉండటం లేదు. సగటున 12 బస్తాలకు దిగుబడి మించే పరిస్థితి లేదు. పైగా ఇవి లావు రకాలు. కొత్తగా రూపొందించిన బీపీటీ 2848 సన్నరకం వంగడాలతో ఎకరానికి 25 నుంచి 30 బస్తాల వరకు దిగుబడి వస్తుంది. ఈ సన్న రకం 1,000 బియ్యపు గింజల బరువు 13 గ్రాములు మాత్రమే ఉంటుంది. తినడానికి రుచిగా, అనువుగా ఉంటాయి. మిగిలిన వరి రకాల్లో ప్రొటీన్ల శాతం 6 నుంచి 7 శాతానికి మించదని.. బీపీటీ 2848 ముడి బియ్యంలో 13.7 శాతం ప్రొటీన్లు ఉంటాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ ముడి బియ్యాన్ని పాలిష్ చేసినా 10.5 శాతం తగ్గకుండా ప్రొటీన్లు ఉంటాయని పేర్కొంటున్నారు. పలు రాష్ట్రాల్లో పరిశోధనలు.. బీపీటీ 2848 రకం వంగడంపై జాతీయ స్థాయిలో పరిశోధనలు జరిగాయి. ప్రధానంగా ఒడిశా, పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్, తెలంగాణ, ఢిల్లీ, కర్ణాటక, తమిళనాడు, బిహార్, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ తదితర రాష్ట్రాల్లో పరిశోధనలు చేశారు. అన్నిచోట్లా శాంపిల్స్ తీసి కటక్ (ఒడిశా)లోని నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (ఎన్ఆర్ఆర్ఐ)లో పరీక్షించారు. బీపీటీ 2848లో సగటున 10.5 శాతం ప్రొటీన్లు ఉన్నట్లు స్పష్టమైంది. గతంలో ఒడిశాలో సీఆర్ధన్ 310 రకం వంగడాన్ని అక్కడి శాస్త్రవేత్తలు సృష్టించారు. దీంట్లోనూ 10.5 శాతం ప్రోటీన్లు ఉన్నాయి. అయితే అది లావు రకం గింజ. అన్ని ప్రాంతాల వారు దాన్ని తినలేరు. ఇందుకు భిన్నంగా బాపట్ల వరి పరిశోధన కేంద్రం బీపీటీ 2848 వంగడాన్ని సృష్టించింది. ఈ విత్తనాలను వచ్చే ఏడాది నుంచి రైతులకు అందించనుంది. అత్యధిక ప్రొటీన్లు అందించే రైస్.. బీపీటీ 2848 రకం కొత్త వంగడాన్ని 12 ఏళ్ల కృషితో బాపట్ల వరి పరిశోదన కేంద్రంలో సృష్టించాం. ఇది బ్లాక్ రైస్. దేశంలోనే అత్యధిక ప్రొటీన్లు అందించే సన్నరకం రైస్ ఇవే. తినటానికి అనువుగా ఉంటుంది. వచ్చే ఏడాది నుంచి ఈ వంగడాలను రైతులకు అందుబాటులోకి తెస్తాం. – డాక్టర్ బి.కృష్ణవేణి, సీనియర్ సైంటిస్ట్ అండ్ హెడ్, బాపట్ల వరి పరిశోధన కేంద్రం