వైఎస్ జగన్ ప్రభుత్వం కృషి ఫలితంగానే రాష్ట్రానికి గుర్తింపు
ప్రతిష్టాత్మకమైన గుల్బెంకియన్ అవార్డు ఇచ్చింది 2023–24కు..
తనవల్లే అవార్డు అంటూ చంద్రబాబు డబ్బా
2018–19లో 2.33 లక్షల ఎకరాల్లో ప్రకృతి సాగు
ప్రకృతి సాగును ఉద్యమ రూపంలోకి తీసుకెళ్లిన వైఎస్ జగన్
ప్రకృతి సాగు రైతులకూ అనేక ప్రోత్సాహకాలు
2023–24లో 12.16 లక్షల ఎకరాలకు ప్రకృతి సాగు విస్తరణ
సాక్షి, అమరావతి: వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా రాష్ట్రంలో వ్యవసాయ రంగంలో తెచి్చన సంస్కరణలు, ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించిన తీరు ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. ముఖ్యంగా ప్రకృతి సాగు విస్తరణకు వైఎస్ జగన్ ప్రభుత్వం ఇచ్చిన ప్రోత్సాహం ఫలితంగా ఆంధ్రప్రదేశ్ ప్రజా భాగస్వామ్య ప్రకృతి వ్యవసాయం (ఏపీసీఎన్‌ఎఫ్)కు ప్రతిష్టాత్మకమైన గుల్బెంకియన్ ప్రైజ్ ఫర్ హ్యూమానిటీ గ్లోబల్ అవార్డు పొంది ప్రపంచ చాంపియన్‌గా నిలిచింది.
పోర్చుగల్‌కు చెందిన కలుస్ట్ గుల్బెంకియన్ ఫౌండేషన్ ఏటా ప్రకటించే ఈ ప్రతిష్టాత్మక అవార్డు కోసం 2023–24లో ప్రపంచవ్యాప్తంగా 117 దేశాల నుంచి 181 సంస్థలు నామినేషన్లు సమరి్పంచాయి. వాటిలో భారత్ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఏపీసీఎన్‌ఎఫ్, ఈజిప్‌్టకు చెందిన సెకెమ్ సంస్థ ఉమ్మడి విజేతలుగా నిలిచాయి. 2023 – 24లో ఉన్నది వైఎస్ జగన్ ప్రభుత్వం. జగన్ ప్రభుత్వ కృషి ఫలితమే ఈ అంతర్జాతీయ అవార్డు. అయినా, నెల క్రితమే అధికారాన్ని చేపట్టిన చంద్రబాబు ఈ అవార్డు ఆయన గొప్పతనం వల్లేనని నిస్సిగ్గుగా చెప్పుకొంటున్నారు. ఆంగ్ల పత్రికల్లోనూ పతాక శీర్షికల్లో రాయించుకుంటున్నారు. ఈ వింత వ్యవ హారంపై రైతులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
2019 తర్వాతే ఉద్యమ రూపంలో ప్రకృతి సాగు
సహజ వ్యవసాయాన్ని ప్రోత్సహించడం ద్వారా రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించాలన్న సంకల్పంతో కేంద్ర మార్గదర్శకాల మేరకు రైతు సా«ధికార సంస్థ ద్వారా చాలా ఏళ్ల క్రితం జీరో బేస్డ్ నేచురల్ ఫారి్మంగ్ (జెడ్‌బీఎన్‌ఎఫ్) పేరిట రాష్ట్రంలో ప్రకృతి సాగు మొదలైంది. కేంద్ర ఆరి్థక సహాయంతో పైలెట్ ప్రాజెక్టుగా 704 గ్రామాల్లో 40 వేల మంది రైతులతో 50 వేల ఎకరాల్లో ప్రకృతి సాగు మొదలైంది. 2018–19 నాటికి 1.76 లక్షల మంది రైతులు 2.33 లక్షల్లో ఈ సాగు చేసేవారు.
2019లో అధికారంలోకి వచి్చన వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రకృతి సాగును ఉద్యమ రూపంలోకి తీసుకెళ్లింది. ఫలితంగా 2023–24కు వచ్చేసరికి 10.37 లక్షల మంది రైతులు 12.16 లక్షల ఎకరాలకు ఈ సాగును విస్తరించగలిగారు. గ్రామ స్థాయిలో ఘున, ద్రవ జీవామృతాలు, కషాయాలు రైతులకు అందుబాటులో ఉంచేందుకు 3,909 బయో ఇన్‌పుట్ దుకాణాలను ఏర్పాటు చేశారు. ఈ క్రాప్ ద్వారా ప్రకృతి సాగును గుర్తించడంతో పాటు రైతులకు పంట రుణాలు, సంక్షేమ ఫలాలన్నీ అందేలా కృషి చేశారు. 2019–24 మధ్య వైఎస్ జగన్ ప్రభుత్వం కృషి ఫలితంగా విదేశీ సంస్థల నుంచి ఏపీసీఎన్‌ఎఫ్‌కు రూ.400 కోట్లకుపైగా నిధులు వచ్చాయి.
పులివెందులలో ప్రకృతి సాగుపై రీసెర్చ్ అకాడమీ
ప్రకృతి సాగులో విస్తృత పరిశోధనల కోసం వైఎస్సార్ జిల్లా పులివెందులలో ఇండో జర్మన్ గ్లోబల్ అకాడమీ ఫర్ ఆగ్రో ఎకాలజీ రీసెర్చ్ అండ్ లెరి్నంగ్‌ను వైఎస్ జగన్ ఏర్పాటు చేశారు. ప్రకృతి ఉత్పత్తుల మార్కెటింగ్‌కు ప్రత్యేక చర్యలు చేపట్టారు. 12 రకాల ప్రకృతి ఉత్పత్తులను రైతుల నుంచి మార్క్‌ఫెడ్ ద్వారా 15 శాతం ప్రీమియం ధరకు కొని, టీటీడీకీ సరఫరా చేశారు. రైతు బజార్లలో ప్రత్యేక స్టాళ్లు, ప్రభుత్వ కార్యాలయాల వద్ద వీక్లీ మార్కెట్లు ఏర్పాటు చేశారు. విదేశాలకు ఎగుమతి కోసం పలు జాతీయ, అంతర్జాతీయ సంస్థలతో ఒప్పందాలు చేసుకున్నారు. దీంతో రాష్ట్రంలో ప్రకృతి సాగు వేగంగా విస్తరించింది. ఏపీలో ప్రకృతి సాగుకు జరుగుతున్న కృషిని 2021–22లో సామాజిక ఆర్థిక సర్వేలో కేంద్రం ప్రశంసించింది.
2022–23 ఆరి్థక సర్వేలో నీతి అయోగ్ కూడా ప్రత్యేకంగా ప్రశంసించింది. 2022, 2023 వరుసగా రెండేళ్ల పాటు ఐదు విభాగాల్లో జైవిక్ ఇండియా అవార్డులు, 2022లో ఫ్యూచర్ ఎకానమీ ఫోరం అందించే లీడర్íÙప్ గ్లోబల్ అవార్డు, 2023లో ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫెయిర్, మారికో ఇన్నోవేషన్, ఎంఎస్ స్వామినాథన్ మెమోరియల్, స్త్రీ, కర్మవీరచక్ర వంటి గ్లోబల్ అవార్డులు వరించాయి. ఐదేళ్లలో 45 దేశాల ప్రతిని«ధి బృందాలు ఏపీలో ప్రకృతి సాగుపై అధ్యయనం చేశాయి. ఏపీ స్ఫూర్తితో మధ్యప్రదేశ్, రాజస్థాన్, మేఘాలయ తదితర 12 రాష్ట్రాలు ప్రకృతి సాగు చేపట్టాయి.
వ్యవసాయ రంగంలో వైఎస్ జగన్ సంస్కరణల విప్లవం
2019లో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి వచి్చన వెంటనే వ్యవసాయ రంగంలో విప్లవాత్మక సంస్కరణలు తెచ్చారు. విత్తు నుంచి విక్రయం వరకు రైతుకు వెన్నుదన్నుగా నిలిచేందుకు గ్రామస్థాయిలో సచివాలయాలకు అనుబంధంగా 10,778 ఆర్బీకేలు ఏర్పాటు చేశారు. వీటిలో 16 వేల మంది గ్రామ వ్యవసాయ, ఉద్యాన, మత్స్య, పట్టు, పశుసంవర్ధక సహాయకులతో పాటు ప్రతి ఆర్బీకేకు ఓ వలంటీర్, బ్యాంకింగ్ కరస్పాండెంట్‌లను నియమించారు. నియోజకవర్గ స్థాయిలో ఏర్పాటు చేసిన అగ్రి ల్యాబ్‌లలో సరి్టఫై చేసిన విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులను సీజన్‌కు ముందే ఆర్బీకేల్లో అందుబాటులో ఉంచారు. ఆర్బీకేలకు అనుబంధంగా యంత్ర సేవా కేంద్రాలను ఏర్పాటు చేశారు.
రైతులకు ఏటా మూడు విడతల్లో రూ. 13,500 చొప్పున పెట్టుబడి సాయం అందించారు. రైతులపై పైసా భారం పడకుండా ఉచిత పంటల బీమా, ఏ సీజన్‌లో జరిగిన పంట నష్టానికి అదే సీజన్ ముగిసేలోగా నష్టపరిహారం, సున్నా వడ్డీ రాయితీ.. ఇలా అన్ని విధాలుగా వెన్నుదన్నుగా నిలిచారు. వైఎస్ జగన్ తెచ్చిన సంస్కరణలు, అన్నదాతకు అందించిన ప్రోత్సాహంతో ఐదేళ్లలో వ్యవసాయ రంగంలో స్పష్టమైన మార్పు కని్పస్తోంది. ప్రకృతి సాగును ఉద్యమంలా తీసుకెళ్లడంలో వైఎస్ జగన్ ప్రభుత్వం చేసిన కృషి ఫలితంగానే ప్రతిష్టాత్మకమైన గుల్బెంకియన్ అవార్డు వస్తే ఇదేదో తమ గొప్పతనం అంటూ సీఎం చంద్రబాబు బాకాలు ఊదడం పట్ల రైతులు, వ్యవసాయ రంగ నిపుణులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment