Sector
-
కార్మికా.. మేలుకో
రోజంతా రెక్కాడితే గానీ డొక్కాడని కూలీ కుటుంబాలవి. చేతినిండా పని దొరికితేనే కడుపు నిండేది. లేకపోతే పస్తులు ఉండాల్సి వస్తుంది. భవన నిర్మాణ రంగంలో పని చేసే దినసరి కార్మికుల పరిస్థితి ఇలా ఉంటుంది. ఈ క్రమంలోనే వారి సంక్షేమం కోసం కార్మిక శాఖ పలు సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టింది. అయితే, ఈ ప్రయోజనాలను అందిపుచ్చుకోవాలంటే రిజిస్ట్రేషన్ కార్డు అవసరం ఉంటుంది. ఇందులో సభ్యుడిగా చేరడం వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయి. ఈ నేపథ్యంలోనే ఈ కార్డును ఎలా తీసుకోవాలి? ఇందువల్ల కలిగే ఉపయోగాలు ఏంటో తెలుసుకుందాం. కడప కోటిరెడ్డిసర్కిల్: భవన నిర్మాణ రంగ కార్మికులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందని ద్రాక్షలా మారాయి. రిజి్రస్టేషన్ చేసుకున్న కార్మికులకు సంబంధించి కడప నగరంతోపాటు జిల్లా వ్యాప్తంగా 3,65,648 మందికి పైగా కార్మికులు ఉన్నారు. అయితే గుర్తింపు కార్డు పొందని కార్మికులు కూడా అధిక సంఖ్యలో ఉన్నట్లు తెలుస్తోంది. భవన నిర్మాణ రంగంతోపాటు పెయింటర్లు, కార్పెంటర్లు, ఫ్లంబర్లుగా అనేక మంది పని చేస్తున్నారు. ప్రస్తుతం కార్మికులు రోజూ పని కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొంది. కడప నగరంతోపాటు చుట్టు పక్కల ప్రాంతాల నుంచి ఉదయం జెడ్పీ కార్యాలయం, అప్సర సర్కిల్లోని అడ్డాలకు చేరుకుని వేచి చూస్తుంటారు. కొందరికి పని దొరకుతున్నా, మరికొందరు ఇబ్బంది పడుతున్నారు. అవగాహన లేమితో నష్టపోతున్న వైనం కార్మికులకు అవగాహన లేకపోవడంతో ఎక్కువ మంది గుర్తింపు కార్డులు పొందలేకపోతున్నారు. కార్డులు కలిగిన కార్మికులకు నైపుణ్యం పెంచుకునేందుకు శిక్షణ ఇవ్వాల్సి ఉండగా, శిక్షణ కాలంలో రూ.300 స్టయిఫండ్ ఇస్తారు. అలాగే 60 ఏళ్లు దాటిన కార్మికులకు రూ.1000–5000 పెన్షన్ అందజేస్తారు. కార్మికుల పిల్లలకు ఉచిత విద్య, వివాహాలకు నగదు అందిస్తారు. భవన యజమానులు నిర్మాణ రిజిస్ట్రేషన్ చేసి.. పని చేసే కార్మికుల పేరిట ఒక శాతం కార్మిక శాఖకు సెస్ చెల్లించాలి. వీటిపై అధికారులు సరైన అవగాహన కల్పించకపోవడంతో కార్మికులు నష్టపోతున్నారు. ఈ విషయాలపై అధికారులు అవగాహన కల్పించి.. అన్ని పథకాలు అందేలా చూడాలని పలువురు కార్మికులు కోరుతున్నారు. వివిధ వృత్తుల్లో..భవన నిర్మాణ రంగానికి సంబంధించి పలు విభాగాల కార్మికులు పని చేస్తున్నారు. మట్టి పని, పునాది గుంతలు తీయడం, చదును, తాపీ మేస్త్రీ, కూలీలు, రాడ్‌బెండింగ్, కార్పెంటర్లు, పెయింటర్లు, సెంట్రింగ్, ఫ్లంబర్లు, ఎల్రక్టీíÙయన్లు, పాలీష్ వేసే వారు ఉన్నారు. సీలింగ్, కంకర కార్మికులు, రోడ్డు నిర్మాణ కూలీలు, క్రేన్, పొక్లెయినర్ ఆపరేటర్లు తమ పనులు చేసుకుంటూ జీవిస్తుంటారు. చెరువులు తవ్వడం, పూడిక తీయడం, బోర్‌వెల్స్, సిమెంటు ఇటుకలు తయారు చేసే వారు ఇదే రంగంపై ఆధారపడి ఉన్నారు. వీరికి ప్రభుత్వం గుర్తింపు కార్డులు మంజూరు చేయడంతోపాటు పని భద్రత కల్పించాలి. గుర్తింపు కార్డులు పొందాలంటే కార్మిక శాఖ కార్యాలయంలో ఆధార్, రెండు ఫొటోలు, నామిని ఆధార్ కార్డుతోపాటు రూ.50 సభ్యత్వ రుసుం చెల్లించాలి. -
నిర్మాణ రంగం కుప్పకూలింది
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో నిర్మాణ రంగం కుప్పకూలిపోయిందని, ఇందుకు ప్రధాన కారణం బ్లాక్ మార్కెటింగ్, నిర్వహణ లోపాలు, అక్రమ కార్యకలాపాలే కారణమని అధికార యంత్రాంగం ప్రభుత్వానికి నివేదించింది. ఇసుక ఉచితం ప్రకటనలకే పరిమితమని, ధరలు మాత్రం భారీగా పెరిగాయని పేర్కొంది. ఇసుక బ్లాక్ మార్కెట్‌కు తరలి వెళ్లడం, అక్రమ విక్రయాల కారణంగా డిమాండ్‌కు తగినట్లుగా సరఫరా చేయలేకపోతున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. సుమారు 40 లక్షల మంది కార్మికులకు జీవనోపాధి కల్పించే నిర్మాణ రంగం కుప్పకూలిపోవడానికి ఇసుక ధరలు భారీగా పెరగడంతో పాటు లభ్యత లేకపోవడమేనని కారణమని తేల్చారు. ఈ ఆర్థిక ఏడాది మొదటి ఆరు నెలల కాలానికి నిర్మాణ రంగంలో జీఎస్టీ ద్వారా రూ.1,260 కోట్ల మేర ఆదాయం రావాల్సి ఉండగా కేవలం రూ.955 కోట్లు మా త్రమే సమకూరినట్లు ప్రభుత్వానికి నివేదించారు. రూ.300 కోట్లకుపైగా ఆదాయం పడిపోవడానికి కారణం నిర్మాణ రంగం కార్యకలాపాలు తగ్గిపోవడమేనని, ఇసుక లభ్యత లేకపోవడం తీవ్ర ప్రభావం చూపిందని తెలిపారు. గత ఆర్నెళ్లలో 75 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుకకు డిమాండ్ ఉండగా కే వలం 32 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే సరఫరా చేసి నట్లు తెలిపారు. ఇసుక రీచ్‌లను దక్కించుకునేందుకు తక్కువ ధరకు కోట్ చేసిన ప్రైవేట్ ఏజెన్సీలు అక్రమాలకు తెరతీశాయన్నారు. గత 30 రోజుల్లో సగటున రోజుకు 26, 000 మెట్రిక్ టన్నుల చొప్పున 5.62 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే ఇసుక సరఫరా చేసినట్లు చెబుతున్నారు. వాస్తవానికి రోజుకు 80,000 నుంచి 90,000 మెట్రిక్ టన్నుల ఇసుక అవసరం ఉందని స్పష్టం చేస్తున్నారు. వాస్తవాలు ఇలా ఉండగా ఇసుక కొరతకు గత సర్కారు విధానాలే కారణమంటూ ప్రభుత్వ పెద్దలు నిందలు మోపడంపై అధికార యంత్రాంగంలో తీవ్ర విస్మయం వ్యక్తమవుతోంది. గత ప్రభుత్వంలో సగటు వార్షిక వృద్ధి రేటు 21 శాతం పెరుగుదల ఇసుక కొరతతో లక్షల మంది భవన నిర్మాణ కార్మికుల ఉపాధి దెబ్బతిందని, నిర్మాణ రంగం కార్యకలాపాలు తగ్గిపోయాయని ఎన్నికల ముందు కూటమి నేతలు చేసిన ఆరోపణల్లో నిజం లేదని అధికారుల నివేదికలు, గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. 2019–20లో జీఎస్టీ రూపంలో రూ.974 కోట్లు ఆదాయం రాగా 2023–24 నాటికి రూ.2,083 కోట్లకు పెరిగిందని, అంటే సగటు వార్షిక వృద్ధి రేటు 21 శాతం మేర పెరిగిందని అధికారులు తెలిపారు. -
దళారులెవరు బాబూ.. తమ్ముళ్లేగా?
సాక్షి, అమరావతి: అధికారంలోకి రాగానే స్టాక్ యార్డుల్లో భద్రపరిచిన లక్షల టన్నుల ఇసుక నిల్వలను కరిగించేసి నాలుగు నెలల పాటు నిర్మాణ రంగాన్ని స్తంభింప చేసిన కూటమి సర్కారు తన నిర్వాకాలను కప్పిపుచ్చుకునేందుకే దళారులు బ్లాక్ మార్కెట్లో విక్రయిస్తున్నారనే నాటకానికి తెర తీసినట్లు ప్రజల్లో విస్తృతంగా చర్చ జరుగుతోంది. వర్షాకాలంలో అవసరాల కోసం వైఎస్సార్సీపీ హయాంలో 80 లక్షల టన్నుల ఇసుకను స్టాక్ యార్డుల్లో నిల్వ చేసిన విషయం తెలిసిందే. కూటమి సర్కారు రావడమే ఆలస్యం పచ్చ ముఠాలు సగం నిల్వలను అమ్ముకుని సొమ్ము చేసుకోగా, మిగతా ఇసుకను సైతం ఒక్క రేణువు కూడా మిగల్చకుండా ఆరగించేశాయి. రాష్ట్రవ్యాప్తంగా విచ్చలవిడిగా తవ్వేసి అందినకాడికి దండుకోవడంతో సామాన్యులకు అందుబాటులో లేకుండా పోయింది. 40 లక్షల మంది ఆధారపడ్డ నిర్మాణ రంగం కుదేలవడంతో భవన నిర్మాణ కార్మికులు జోవనోపాధి కోల్పోయి అల్లాడుతున్నారు. ఈ ఇసుక దోపిడీని ప్రతిపక్షం ఎక్కడికక్కడ ఎండగట్టడం, ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత పెల్లుబుకుతుండటంతో చేసిన తప్పులను కప్పి పుచ్చి మభ్యపెట్టే యత్నాల్లో భాగంగానే బ్లాక్ మార్కెట్ నాటకానికి కూటమి సర్కారు తెర తీసినట్లు సర్వత్రా చర్చించుకుంటున్నారు. ఉచిత ఇసుక పేరుతో జనం జేబులను గుల్ల చేసి గుమ్మడి కాయ దొంగలా జేబులు తడుముకోవడంపై విస్మయం వ్యక్తమవుతోంది. -
కార్పొరేట్ ట్రావెల్ 20.8 బిలియన్ డాలర్లు
ముంబై: కార్పొరేట్ ట్రావెల్ రంగం భారత్‌లో 2029–30 నాటికి ఏటా 10.1 శాతం వార్షిక వృద్ధితో 20.8 బిలియన్ డాలర్లకు చేరుతుందని డెలాయిట్ నివేదిక వెల్లడించింది. సాంకేతికత తోడుగా వ్యక్తిగతీకరించిన, స్థిర పరిష్కారాలు పరిశ్రమను నడిపిస్తాయని వివరించింది. ప్రస్తుతం ఈ రంగం 10.6 బిలియన్ డాలర్లుగా ఉంది. 45 మంది ట్రావెల్ మేనేజర్లు, వివిధ రంగాలకు చెందిన 160కిపైగా కార్పొరేట్ ట్రావెలర్స్ నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా నివేదిక రూపొందింది.నివేదిక ప్రకారం.. మహమ్మారి తర్వాత వ్యాపారాలు హైబ్రిడ్ వర్క్ మోడళ్లతో తమ ప్రయాణ వ్యూహాలను పునఃపరిశీలిస్తున్నందున.. భారత కార్పొరేట్ ట్రావెల్ సెక్టార్ పరిశ్రమను ఆవిష్కరణ, వ్యయ సామర్థ్యం, స్థిరత్వం యొక్క కొత్త శకంలోకి నడిపించడంలో ట్రావెల్ మేనేజ్మెంట్ కంపెనీలు (టీఎంసీ) కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఆర్టిఫీíÙయల్ ఇంటెలిజెన్స్ శక్తితో పనిచేసే చాట్బాట్లు, వాయిస్–సహాయక బుకింగ్ సిస్టమ్‌లు, రియల్ టైమ్ డేటా అనలిటిక్స్‌ను ఉపయోగించి మరింత లోతుగా, వేగంగా నిమగ్నం అయ్యే కొత్త తరం ప్రయాణికుల అవసరాలను తీర్చడానికి టీఎంసీలు తమ వ్యూహాలను పునరుద్ధరించాయి. ఒకే కంపెనీ రూ.2,600 కోట్లు.. చిన్న, మధ్య స్థాయి సంస్థలకు (250 మంది ఉద్యోగుల వరకు) ప్రయాణ ఖర్చు సంవత్సరానికి రూ.1 కోటికి చేరుకుంటోంది. పెద్ద సంస్థలు (250–5,000 ఉద్యోగులు) ప్రయాణ ఖర్చుల కోసం ఏటా రూ.10 కోట్లు కేటాయిస్తున్నాయి. భారీ పరిశ్రమలకు (5,000 కంటే ఎక్కువ మంది ఉద్యోగులు) ప్రయాణ ఖర్చులు ఉద్యోగుల సంఖ్యకు నేరుగా అనులోమానుపాతంలో ఉంటాయి. అగ్రశ్రేణి 100 లిస్టెడ్ సంస్థల విశ్లేషణలో ప్రముఖ ఐటీ సంస్థ అత్యధికంగా 2022–23లో రూ.2,600 కోట్లకు పైగా వెచ్చించినట్లు నివేదిక పేర్కొంది. సహాయక సేవలకు డిమాండ్ పెరుగుతోంది.సర్వేలో పాల్గొన్నవారిలో 72 శాతం మంది టాక్సీ సేవలను కోరారు. 63 శాతం మంది ప్రయాణ ప్లాట్‌ఫామ్‌లపై వీసా సహాయం డిమాండ్ చేస్తున్నారు. తద్వారా సమగ్ర ప్రయాణ పరిష్కారాల అవసరాన్ని నొక్కి చెప్పారు. ఐటీ సేవలు, బీఎఫ్ఎస్ఐ, ఇంజనీరింగ్, ఏవియేషన్, ఆయిల్–గ్యాస్, ఫార్మా, ఎఫ్ఎంసీజీ, ఆటోమొబైల్స్ రంగాలు కార్పొరేట్ ప్రయాణ వ్యయాలను పెంచే అగ్ర పరిశ్రమలుగా గుర్తింపు పొందాయి. భారత్‌లోని టాప్ 100 లిస్టెడ్ సంస్థలలో ప్రయాణ వ్యయంలో ఈ రంగాల వాటా 86 శాతం ఉంది. -
ఎల్ఓసీలోకి చొరబాటుదారులు.. కొనసాగుతున్న సెర్చ్ ఆపరేషన్
గత కొంతకాలంగా జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాద కార్యకలాపాలు తరచూ చోటుచేసుకుంటున్నాయి. తాజాగా జమ్ములోని పాలన్‌వాలా సెక్టార్‌లోని నియంత్రణ రేఖ (ఎల్ఓసీ) వద్ద అనుమానాస్పద కార్యకలాపాలు గమనించిన భద్రతా దళాలు కాల్పులు జరిపాయి.భద్రతా దళాలకు నలుగురు చొరబాటుదారుల కదలిక కనిపించింది. దీంతో బలగాలు రాత్రిపూట లైట్లతో ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి. డ్రోన్ల ద్వారా నిఘాను కూడా కొనసాగిస్తున్నారు. అయితే ఈ ప్రాంతంలో అడవులు, కొండలు ఉండడంతో సెర్చ్ ఆపరేషన్ నిర్వహించేందుకు భద్రతా సిబ్బంది ఇబ్బందులను ఎదుర్కొంటోంది.ఆర్టికల్ 370 రద్దుకు అయిదవ వార్షికోత్సవం దృష్ట్యా, ఖౌడ్, జ్యోడియన్ ప్రాంతాల్లో సైన్యం, పోలీసులు ఇప్పటికే నిఘాను కట్టుదిట్టం చేశారు. ఈ ప్రాంతంలోని చెక్‌పోస్టుల వద్ద భద్రతా సిబ్బంది సంఖ్యను పెంచారు ఆ ప్రాంతానికి వచ్చిపోయే ప్రతి వ్యక్తిని తనిఖీ చేస్తున్నారు.మరోవైపు సరిహద్దు భద్రతా దళం తాజాగా ఒక పాక్ చొరబాటుదారుడి మృతదేహాన్ని పాక్ రేంజర్స్‌కు అప్పగించింది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం మృతుడిని పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌కు చెందిన ముహమ్మద్ అఫియల్‌గా గుర్తించారు. అతని మృతదేహాన్ని సుచేత్‌గఢ్ సెక్టార్‌లోని ఆక్ట్రాయ్ పోస్ట్‌లో పాకిస్తాన్ రేంజర్స్‌కు అప్పగించారు. -
కశ్మీర్లో ఉగ్రవాదుల చొరబాటు యత్నం విఫలం
జమ్ముకశ్మీర్‌లోని బట్టాల్ సెక్టార్‌లోకి చొరబడేందుకు పాక్ ఉగ్రవాదులు చేసిన ప్రయత్నాన్ని భారత ఆర్మీ సిబ్బంది భగ్నం చేసింది. ఈ సందర్భంగా ఓ జవాను తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది.ఘటన జరిగిన ప్రాంతంలో దట్టమైన పొగమంచు నెలకొన్న కారణంగా విజిబులిటీ సున్నాగా ఉంది. అటువంటి పరిస్థితిలోనూ ఇండియన్ ఆర్మీ ఎంతో సమర్థవంతంగా సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తోంది. జమ్ము ప్రాంతంలో ఇటీవలి కాలంలో ఉగ్రదాడులు పెరుగుతున్నాయి. భారత ఆర్మీ ఎప్పటికప్పుడు ఉగ్రవాదుల చర్యలను తిప్పికొడుతూనే ఉంది. ఈ క్రమంలో ఈరోజు(మంగళవారం) మరోసారి బట్టాల్ ప్రాంతంలో పాక్ ఉగ్రవాదులు చొరబాటుకు యత్నించారు.తెల్లవారుజామున మూడు గంటలకు ఆర్మీ బృందం ఈ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించింది. మీడియాకు అందిన సమాచారం ప్రకారం కొందరు పాక్ ఉగ్రవాదులు అర్థరాత్రి నుంచి కశ్మీర్లో చొరబడేందుకు ప్రయత్నిస్తున్నారు. అప్రమత్తమైన భారత ఆర్మీ దళాలు ఉగ్రవాదుల చొరబాటుయత్నాలను భగ్నం చేశాయి.ఈ సందర్భంగా ఇరువర్గాల మధ్య కాల్పులు జరిగాయి. ఈ నేపధ్యంలో ఒక సైనికుడు గాయపడ్డారు. -
మైక్రోసాఫ్ట్ ఎఫెక్ట్.. ఈ రంగాలపైనే ప్రభావం!
మైక్రోసాఫ్ట్‌లో ఏర్పడ్డ సమస్య పలు రంగాల్లో తీవ్ర అంతరాయాలను కలిగించాయి. టికెట్ బుకింగ్స్ నుంచి చెక్ ఇన్ వరకు అన్నింటికీ అవాంతరాలు ఏర్పడ్డాయి. దీంతో ప్రపంచంలోని పలు దిగ్గజ సంస్థలు సైతం తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నాయి.భారతదేశంలో మాత్రమే కాకుండా.. అమెరికా, జపాన్, కెనడా, ఆస్ట్రేలియాలో మైక్రోసాఫ్ట్ సర్వర్ డౌన్ అయింది. క్రౌడ్‌స్ట్రైక్ సమస్యను తామే పరిష్కరిస్తామంటూ వెల్లడించింది. ఈ తరుణంలో అమెరికా ఎమర్జెన్సీ కాలర్ సెంటర్ ఏర్పాటు చేసింది. ఆస్ట్రేలియా అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ ఘటనపై మైక్రోసాఫ్ట్ తీవ్ర విచారం వ్యక్తం చేసింది.మైక్రోసాఫ్ట్‌లో తలెత్తిన సమస్య భారతీయ విమాన, ఐటీ సేవలకు మాత్రమే కాకుండా బ్యాంకులు, టెలికాం, మీడియా సంస్థలు కూడా ఈ అంతరాయాన్ని ఎదుర్కొన్నాయి. లండన్ స్టాక్ ఎక్స్ఛేంజ్లో సేవలు పూర్తిగా నిలిచిపోయాయి, విమానాశ్రయాల్లో మాన్యువల్ తనిఖీలు మొదలయ్యాయి. మైక్రోసాఫ్ట్ సమస్య ఎక్కువగా ఆస్ట్రేలియాలో ఎవివిధ రంగాలపై ప్రభావం చూపింది.బ్రిటన్‌లో విమాన సర్వీసులు మాత్రమే కాకుండా.. రైల్వే, హాస్పిటల్ సర్వీసుల్లోనూ అంతరాయాలు ఏర్పడ్డాయి. అక్కడి స్కైన్యూస్ ప్రసారాలు కూడా పూర్తిగా ఆగిపోయాయి. ఇలా ప్రపంచంలోని చాలా దేశాల్లో ఇలాంటి సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని మైక్రోసాఫ్ట్ ఎక్స్ (ట్విటర్) వేదికగా ట్వీట్ చేసింది. -
ప్రకృతి సాగులో ప్రపంచ చాంపియన్
సాక్షి, అమరావతి: వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా రాష్ట్రంలో వ్యవసాయ రంగంలో తెచి్చన సంస్కరణలు, ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించిన తీరు ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. ముఖ్యంగా ప్రకృతి సాగు విస్తరణకు వైఎస్ జగన్ ప్రభుత్వం ఇచ్చిన ప్రోత్సాహం ఫలితంగా ఆంధ్రప్రదేశ్ ప్రజా భాగస్వామ్య ప్రకృతి వ్యవసాయం (ఏపీసీఎన్ఎఫ్)కు ప్రతిష్టాత్మకమైన గుల్బెంకియన్ ప్రైజ్ ఫర్ హ్యూమానిటీ గ్లోబల్ అవార్డు పొంది ప్రపంచ చాంపియన్‌గా నిలిచింది.పోర్చుగల్‌కు చెందిన కలుస్ట్ గుల్బెంకియన్ ఫౌండేషన్ ఏటా ప్రకటించే ఈ ప్రతిష్టాత్మక అవార్డు కోసం 2023–24లో ప్రపంచవ్యాప్తంగా 117 దేశాల నుంచి 181 సంస్థలు నామినేషన్లు సమరి్పంచాయి. వాటిలో భారత్ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఏపీసీఎన్ఎఫ్, ఈజిప్‌్టకు చెందిన సెకెమ్ సంస్థ ఉమ్మడి విజేతలుగా నిలిచాయి. 2023 – 24లో ఉన్నది వైఎస్ జగన్ ప్రభుత్వం. జగన్ ప్రభుత్వ కృషి ఫలితమే ఈ అంతర్జాతీయ అవార్డు. అయినా, నెల క్రితమే అధికారాన్ని చేపట్టిన చంద్రబాబు ఈ అవార్డు ఆయన గొప్పతనం వల్లేనని నిస్సిగ్గుగా చెప్పుకొంటున్నారు. ఆంగ్ల పత్రికల్లోనూ పతాక శీర్షికల్లో రాయించుకుంటున్నారు. ఈ వింత వ్యవ హారంపై రైతులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. 2019 తర్వాతే ఉద్యమ రూపంలో ప్రకృతి సాగు సహజ వ్యవసాయాన్ని ప్రోత్సహించడం ద్వారా రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించాలన్న సంకల్పంతో కేంద్ర మార్గదర్శకాల మేరకు రైతు సా«ధికార సంస్థ ద్వారా చాలా ఏళ్ల క్రితం జీరో బేస్డ్ నేచురల్ ఫారి్మంగ్ (జెడ్బీఎన్ఎఫ్) పేరిట రాష్ట్రంలో ప్రకృతి సాగు మొదలైంది. కేంద్ర ఆరి్థక సహాయంతో పైలెట్ ప్రాజెక్టుగా 704 గ్రామాల్లో 40 వేల మంది రైతులతో 50 వేల ఎకరాల్లో ప్రకృతి సాగు మొదలైంది. 2018–19 నాటికి 1.76 లక్షల మంది రైతులు 2.33 లక్షల్లో ఈ సాగు చేసేవారు.2019లో అధికారంలోకి వచి్చన వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రకృతి సాగును ఉద్యమ రూపంలోకి తీసుకెళ్లింది. ఫలితంగా 2023–24కు వచ్చేసరికి 10.37 లక్షల మంది రైతులు 12.16 లక్షల ఎకరాలకు ఈ సాగును విస్తరించగలిగారు. గ్రామ స్థాయిలో ఘున, ద్రవ జీవామృతాలు, కషాయాలు రైతులకు అందుబాటులో ఉంచేందుకు 3,909 బయో ఇన్పుట్ దుకాణాలను ఏర్పాటు చేశారు. ఈ క్రాప్ ద్వారా ప్రకృతి సాగును గుర్తించడంతో పాటు రైతులకు పంట రుణాలు, సంక్షేమ ఫలాలన్నీ అందేలా కృషి చేశారు. 2019–24 మధ్య వైఎస్ జగన్ ప్రభుత్వం కృషి ఫలితంగా విదేశీ సంస్థల నుంచి ఏపీసీఎన్ఎఫ్కు రూ.400 కోట్లకుపైగా నిధులు వచ్చాయి. పులివెందులలో ప్రకృతి సాగుపై రీసెర్చ్ అకాడమీ ప్రకృతి సాగులో విస్తృత పరిశోధనల కోసం వైఎస్సార్ జిల్లా పులివెందులలో ఇండో జర్మన్ గ్లోబల్ అకాడమీ ఫర్ ఆగ్రో ఎకాలజీ రీసెర్చ్ అండ్ లెరి్నంగ్‌ను వైఎస్ జగన్ ఏర్పాటు చేశారు. ప్రకృతి ఉత్పత్తుల మార్కెటింగ్‌కు ప్రత్యేక చర్యలు చేపట్టారు. 12 రకాల ప్రకృతి ఉత్పత్తులను రైతుల నుంచి మార్క్‌ఫెడ్ ద్వారా 15 శాతం ప్రీమియం ధరకు కొని, టీటీడీకీ సరఫరా చేశారు. రైతు బజార్లలో ప్రత్యేక స్టాళ్లు, ప్రభుత్వ కార్యాలయాల వద్ద వీక్లీ మార్కెట్లు ఏర్పాటు చేశారు. విదేశాలకు ఎగుమతి కోసం పలు జాతీయ, అంతర్జాతీయ సంస్థలతో ఒప్పందాలు చేసుకున్నారు. దీంతో రాష్ట్రంలో ప్రకృతి సాగు వేగంగా విస్తరించింది. ఏపీలో ప్రకృతి సాగుకు జరుగుతున్న కృషిని 2021–22లో సామాజిక ఆర్థిక సర్వేలో కేంద్రం ప్రశంసించింది.2022–23 ఆరి్థక సర్వేలో నీతి అయోగ్ కూడా ప్రత్యేకంగా ప్రశంసించింది. 2022, 2023 వరుసగా రెండేళ్ల పాటు ఐదు విభాగాల్లో జైవిక్ ఇండియా అవార్డులు, 2022లో ఫ్యూచర్ ఎకానమీ ఫోరం అందించే లీడర్íÙప్ గ్లోబల్ అవార్డు, 2023లో ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫెయిర్, మారికో ఇన్నోవేషన్, ఎంఎస్ స్వామినాథన్ మెమోరియల్, స్త్రీ, కర్మవీరచక్ర వంటి గ్లోబల్ అవార్డులు వరించాయి. ఐదేళ్లలో 45 దేశాల ప్రతిని«ధి బృందాలు ఏపీలో ప్రకృతి సాగుపై అధ్యయనం చేశాయి. ఏపీ స్ఫూర్తితో మధ్యప్రదేశ్, రాజస్థాన్, మేఘాలయ తదితర 12 రాష్ట్రాలు ప్రకృతి సాగు చేపట్టాయి.వ్యవసాయ రంగంలో వైఎస్ జగన్ సంస్కరణల విప్లవం2019లో వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచి్చన వెంటనే వ్యవసాయ రంగంలో విప్లవాత్మక సంస్కరణలు తెచ్చారు. విత్తు నుంచి విక్రయం వరకు రైతుకు వెన్నుదన్నుగా నిలిచేందుకు గ్రామస్థాయిలో సచివాలయాలకు అనుబంధంగా 10,778 ఆర్బీకేలు ఏర్పాటు చేశారు. వీటిలో 16 వేల మంది గ్రామ వ్యవసాయ, ఉద్యాన, మత్స్య, పట్టు, పశుసంవర్ధక సహాయకులతో పాటు ప్రతి ఆర్బీకేకు ఓ వలంటీర్, బ్యాంకింగ్ కరస్పాండెంట్లను నియమించారు. నియోజకవర్గ స్థాయిలో ఏర్పాటు చేసిన అగ్రి ల్యాబ్‌లలో సరి్టఫై చేసిన విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులను సీజన్‌కు ముందే ఆర్బీకేల్లో అందుబాటులో ఉంచారు. ఆర్బీకేలకు అనుబంధంగా యంత్ర సేవా కేంద్రాలను ఏర్పాటు చేశారు.రైతులకు ఏటా మూడు విడతల్లో రూ. 13,500 చొప్పున పెట్టుబడి సాయం అందించారు. రైతులపై పైసా భారం పడకుండా ఉచిత పంటల బీమా, ఏ సీజన్లో జరిగిన పంట నష్టానికి అదే సీజన్ ముగిసేలోగా నష్టపరిహారం, సున్నా వడ్డీ రాయితీ.. ఇలా అన్ని విధాలుగా వెన్నుదన్నుగా నిలిచారు. వైఎస్ జగన్ తెచ్చిన సంస్కరణలు, అన్నదాతకు అందించిన ప్రోత్సాహంతో ఐదేళ్లలో వ్యవసాయ రంగంలో స్పష్టమైన మార్పు కని్పస్తోంది. ప్రకృతి సాగును ఉద్యమంలా తీసుకెళ్లడంలో వైఎస్ జగన్ ప్రభుత్వం చేసిన కృషి ఫలితంగానే ప్రతిష్టాత్మకమైన గుల్బెంకియన్ అవార్డు వస్తే ఇదేదో తమ గొప్పతనం అంటూ సీఎం చంద్రబాబు బాకాలు ఊదడం పట్ల రైతులు, వ్యవసాయ రంగ నిపుణులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. -
వైద్య రంగంలో విప్లవాత్మక ఫలితాలు
లబ్బీపేట (విజయవాడతూర్పు): వైద్య రంగంలో రాష్ట్రప్రభుత్వం అవలంభిస్తున్న విప్లవాత్మక విధానాలతో సత్ఫలితాలొస్తున్నాయని రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ స్పష్టం చేశారు. వైద్య సేవలనే కాకుండా, వైద్య విద్యను సైతం అందరికీ చేరువ చేసినట్లు చెప్పారు. రాష్ట్రంలోని ప్రతిష్టాత్మక డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్య విజ్ఞాన విశ్వ విద్యాలయం 26వ స్నాతకోత్సవాలు మంగళవారం ఘనంగా జరిగాయి. విజయవాడ నగరంలోని ఓ ప్రైవేటు హాలులో జరిగిన వేడుకల్లో యూనివర్సిటీ చాన్సలర్ హోదాలో గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, ముఖ్యఅతిథిగా బెంగళూరుకు చెందిన నిమ్హాన్స్ డైరెక్టర్ డాక్టర్ ప్రతిమా మూర్తి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమెకు యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేసింది. అంతేకాకుండా 60 మంది విద్యార్థులకు మెడల్స్ అందజేశారు. గవర్నర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజారోగ్య సంరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ, ఆరోగ్యవంతమైన సమాజ స్థాపనకు కృషి చేస్తున్నదని తెలిపారు. సమాజంలో వైద్య రంగానికి ప్రత్యేక గుర్తింపు ఉందని, నిరుపేదలకు ఉపయోగపడేలా సేవాభావంతో వైద్యం చేయాలన్నారు. ఆరోగ్యశ్రీ సేవలకు అందలం రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ సేవలను ప్రభుత్వం మరింత విస్తరించిందన్నారు. ఆ పథకంలో చికిత్సల పరిమితిని రూ.25 లక్షలకు పెంచడంతో పాటు, 3,257 వైద్య ప్రక్రియలతో సహా, అన్ని రకాల క్యాన్సర్ వ్యాధులకు ఎలాంటి వ్యయ పరిమితి లేకుండా ఉచితంగా చికిత్స అందించడం శుభపరిణామమన్నారు. ప్రభుత్వాస్పత్రుల్లో 53,126 మంది వైద్య సిబ్బందిని నియమించినట్లు తెలిపారు. రాష్ట్రంలో గతంలో ఉన్న 11 వైద్య కళాశాలలకు అదనంగా 17 కొత్త మెడికల్ కళాశాలలను ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. ఇప్పటికే ఐదు మెడికల్ కళాశాలల్లో కోర్సులు ప్రారంభమైనట్లు తెలిపారు. రాష్ట్రంలో 10,132 విలేజ్ హెల్త్ క్లినిక్‌లు, 1,142 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 177 కమ్యునిటీ హెల్త్ సెంటర్లు, 53 ఏరియా ఆస్పత్రులు, 12 జిల్లా ఆస్పత్రులు, 11 టీచింగ్ ఆస్పత్రులు, 15 స్పెషాలిటీ ఆస్పత్రులు, 542 యూపీహెచ్‌సీలు రోగుల ఆరోగ్యానికి భద్రత ఇస్తున్నట్లు చెప్పారు. ముఖ్యఅతిథి నిమ్హాన్స్ డైరెక్టర్ డాక్టర్ ప్రతిమామూర్తి మాట్లాడుతూ ఆరోగ్యకరమైన సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. వైద్యులు నిత్య విద్యార్థిగా ఉండాలని సూచించారు. యూనివర్సిటీ వైస్ చాన్సలర్ డాక్టర్ కె.బాబ్జి, రిజిస్ట్రార్ డాక్టర్ వి.రాధికారెడ్డి, అకడమిక్ జాయింట్ రిజిస్ట్రార్ అజయ, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ డైరెక్టర్ సుమిత శంకర్, జాయింట్ రిజిస్ట్రార్ (ఎగ్జామినేషన్స్) పి.ప్రవీణ్‌కుమార్, యూనివర్సిటీ సభ్యులు డాక్టర్ ఇండ్ల రామసుబ్బారెడ్డి, సిద్ధార్థ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కంచర్ల సుధాకర్, పూర్వ వైస్ ఛాన్సలర్ డాక్టర్ పి.శ్యామ్‌ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
రైతులకు మరింత ఆర్థిక చేయూత ఇవ్వండి
సాక్షి, అమరావతి: రైతులకు మరింత ఆర్థిక చేయూతనిచ్చేందుకు బ్యాంకర్లు ఉదారంగా ముందుకు రావాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్థనరెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం సచివాలయంలో నాబార్డ్ క్రెడిట్ సెమినార్ జరిగింది. ఇందులో 2024–25కు నాబార్డ్ రూ.3.55 లక్షల కోట్ల అంచనాతో రూపొందించిన స్టేట్ ఫోకస్ పేపర్‌ను కాకాణి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐదేళ్లలో ఎన్నో విప్లవాత్మక సంస్కరణలు తీసుకొచ్చామన్నారు. గ్రామీణాభివృద్ధి రంగం బలోపేతం కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలకు అన్ని విధాలుగా చేయూతనిచ్చిన నాబార్డ్‌ను అభినందిస్తున్నానన్నారు. వ్యవసాయం, నీటిపారుదల, సామాజిక, గ్రామీణ రంగాల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం రాష్ట్ర ప్రభుత్వానికి నాబార్డ్ మద్దతునివ్వడం అభినందనీయమని తెలిపారు. వ్యవసాయ రంగంలో సవాళ్ల పరిష్కారం, స్థిరమైన వృద్ధి సాధన కోసం ప్రభుత్వం, కార్పొరేట్ రంగం, ఆర్థిక సంస్థలతో కలిసి నాబార్డ్ రోడ్‌మ్యాప్ తయారుచేయాలని సూచించారు. రైతు ఉత్పత్తిదారుల సంఘాలు, వ్యవసాయ ఉత్పత్తుల వ్యాల్యూ చైన్, విలువ జోడింపు, కౌలు రైతులకు విరివిగా రుణ సదుపాయం కల్పించాలన్నారు. నాబార్డ్ చీఫ్ జనరల్ మేనేజర్ ఎంఆర్ గోపాల్ మాట్లాడుతూ 2024–25కి రాష్ట్ర రుణ ప్రణాళికను రూ.3.55 లక్షల కోట్లుగా అంచనా వేశామన్నారు. ఇది 2023–24తో పోలిస్తే 24 శాతం అధికమన్నారు. ఈసారి 38 శాతం పంట రుణాలు, 25 శాతం ఎంఎస్ఎంఈ, 13 శాతం వ్యవసాయ టర్మ్, 4 శాతం వ్యవసాయ అనుబంధ అవసరాలకు, 2 శాతం వ్యవసాయ మౌలిక వసతుల కల్పనకు, 18 శాతం ఇతర రంగాలకు రుణాలు ఇచ్చేలా æప్రణాళిక తయారు చేశామన్నారు. వ్యవసాయ అనుబంధ రంగాలకు రూ.2.04 లక్షల కోట్లు, పంట రుణాలకు రూ.1.36 లక్షల కోట్లుగా అంచనా వేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సహకార, మార్కెటింగ్ శాఖ ముఖ్య కార్యదర్శి చిరంజీవి చౌదరి, కమిషనర్ ఆఫ్ కోఆపరేటివ్స్ అహ్మద్ బాబు, వ్యవసాయ, ఉద్యాన శాఖల కమిషనర్లు శేఖర్‌బాబు, శ్రీధర్, పౌరసరఫరాల సంస్థ ఎండీ వీరపాండ్యన్, ఆర్బీఐ జీఎం ఆర్కే మహానా, ఎస్ఎల్బీసీ కన్వ్నిర్ ఎం.రవీంద్రబాబు, నాబార్డ్ జీఎం డాక్టర్ కేవీఎస్ ప్రసాద్, ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వీసీ డాక్టర్ శారదా జయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
ఓటమి నుంచే గాంధీ నేర్చుకున్నారు..
సాక్షి, హైదరాబాద్: ‘‘గెలుపు కన్నా ఓటమి నుంచే ఎక్కువగా నేర్చుకుంటాం.. గాంధీజీ సైతం అలాగే ఓటమి నుంచే నేర్చుకున్నారు.. అందుకని ఏ రంగంలోనైనా ఓడిపోతే కుంగిపోకూడదు ’’ అని ఒడిశా హైకోర్ట్ మాజీ చీఫ్ జస్టిస్ ఎస్.మురళీధర్ ఉద్బోధించారు. గాంధీ జయంతి నాడు ప్రముఖుల ప్రసంగాలకు పట్టం కట్టే మంథన్ సంవాద్ వార్షిక చర్చాగోష్టిని నగరంలోని శిల్పకళా వేదికలో సోమవారం నిర్వహించింది. కార్యక్రమంలో మాజీ చీఫ్ జస్టిస్ మురళీధర్ మాట్లాడుతూ రాజకీయా ల్లోకి రాక పూర్వం న్యాయవాదిగా గాంధీజీ ఎదుర్కొన్న వృత్తిపరమైన ఆటుపోట్లు, దక్షిణాఫ్రికా లో రెండు దశాబ్దాల పాటు న్యాయవాద వృత్తిలో పొందిన అనుభవాలను ప్రస్తావించారు. ఎటువంటి పరిస్థితుల్లోనూ సహనం కోల్పోకుండా, నేర్చుకోవడాన్ని మానకుండా సత్యాన్ని వీడకుండా నిరుపేదలకు అండగా గాంధీజీ న్యాయవాదిగా తన ప్రస్థానాన్ని కొనసాగించారని గుర్తు చేశారు. నవతరం న్యాయవాదులు గాంధీజీ న్యాయవాద ప్రస్థానం నుంచి నేర్చుకోవాల్సినవి ఎన్నో ఉన్నాయని పేర్కొన్నారు. ఉపాధికి దోహదం చేయలేని ఆర్ధికాభివృద్ధి: యామినీ అయ్యర్ సిటిజన్ వర్సెస్ లాభార్థి? అంశంపై ఢిల్లీలోని సెంటర్ ఫర్ పాలసీ రీసెర్చ్ అధ్యక్షుడు యామినీ అయ్యర్ మాట్లాడారు. దేశంలో పేర్కొంటున్న ఆర్థికాభివృద్ధి లాభదాయకమైన ఉపాధి అవకా శాలకు, ఉద్యోగాలకు దోహదం చేయలేకపోతోందని అభిప్రాయపడ్డారు. నిజమైన సంక్షేమానికి ఇంకా సరైన నిర్వచనాన్ని వెదికే క్రమంలోనే ఉన్నామన్నారు. ది క్వశ్చన్ ఆఫ్ అకడమిక్ ఫ్రీడమ్ అనే అంశంపై లండన్‌లోని కింగ్స్ కాలేజ్‌కు చెందిన ప్రొఫెసర్ నీరజా గోపాల్ జయాల్ మాట్లాడుతూ విద్యా సంబంధ స్వేచ్ఛ (అకడమిక్ ఫ్రీడమ్) అనేది మన దేశంలో ఇంకా తగిన స్థాయిలో లేదన్నారు. సదస్సులో ‘‘వై ఇండిపెండెంట్ న్యూస్ మీడియా షుడ్ త్రైవ్’’ అనే అంశంపై ది న్యూస్ మినిట్ ఎడిటర్ ఇన్ ఛీఫ్ ధన్యా రాజేంద్రన్ మాట్లాడుతూ పారిశ్రామికవేత్త అదానీపై వచ్చిన ఆరోపణల విషయంలో మీడియా పూర్తిస్థాయిలో నిష్పక్షపాత్ర పోషించలేకపోయిందన్నారు. ఫైటింగ్ ది ఫేక్ న్యూస్ పాండమిక్ అనే అంశంపై కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి సుప్రియా శ్రీనాటె మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ఆధ్వర్యంలో ఫేక్ న్యూస్ ప్రచారం సాగుతోందని ఆరోపించారు. విధి సెంటర్ ఫర్ లీగల్ పాలసీ డైరెక్టర్ ఆర్ఘ్యాసేన్గుప్తా ‘ది గ్లోబల్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా’ అనే అంశంపై మాట్లాడారు. సదస్సులో హిందీ కవి,వ్యంగ్యరచయిత సంపత్ సరళ్ పలు కవితలు,వ్యంగ్యరచనలు వినిపించారు. -
అతి నియంత్రణ అనర్ధదాయకం..
న్యూఢిల్లీ: ఓవర్–ది–టాప్ (ఓటీటీ) సర్విసులని, మరొకటని ఇంటర్నెట్ సేవలను వేర్వేరుగా వర్గీకరిస్తూ ’అతిగా నియంత్రించడం’ అనర్ధదాయకంగా మారే ప్రమాదముందని స్టార్టప్‌లు ఆందోళన వ్యక్తం చేశాయి. దీనివల్ల వివిధ రకాల సేవలు అందించే సంస్థలు వివక్షకు గురయ్యే అవకాశం ఉందని పేర్కొన్నాయి. టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ చైర్మన్ పీడీ వాఘేలాకు 129 అంకుర సంస్థల వ్యవస్థాపకులు ఈ మేరకు సంయుక్త లేఖ రాశారు. జిరోధాకు చెందిన నితిన్ కామత్, పేటీఎం వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మ తదితరులు వీరిలో ఉన్నారు. ఓటీటీలు భారీగా డేటాను వినియోగిస్తుండటం వల్ల తమ నెట్‌వర్క్‌లపై భారం పెరిగిపోతోందని, వ్యయాలను భర్తీ చేసుకునేందుకు సదరు ఓటీటీ సంస్థల లాభాల్లో కొంత వాటా తమకూ ఇప్పించాలని టెల్కోలు కోరుతున్న నేపథ్యంలో స్టార్టప్‌ల లేఖ ప్రాధాన్యం సంతరించుకుంది. స్పీడ్, లభ్యత, వ్యయాలపరంగా ఏ యాప్‌పైనా టెలికం, ఇంటర్నెట్ సేవల ప్రొవైడర్లు వివక్ష చూపకుండా తటస్థంగా వ్యవహరించే నెట్ న్యూట్రాలిటీ విధానానికే తమ మద్దతని లేఖలో స్టార్టప్‌ల వ్యవస్థాపకులు తెలిపారు. ఓటీటీ వంటి సర్విసులు అందించే సంస్థలను టెలికమ్యూనికేషన్స్ సర్వీస్ ప్రొవైడర్స్ (టీఎస్పీ) నియంత్రణ వ్యవస్థ పరిధిలోకి తేవడానికి తాము వ్యతిరేకమని స్పష్టం చేశారు. ఇంటర్నెట్ యాప్స్, సర్విసులకు టెలికం లైసెన్సింగ్ నిబంధనలను వర్తించేస్తే దేశీ స్టార్టప్ వ్యవస్థకు తీవ్ర హాని జరుగుతుందని వివరించాయి. ఇవన్నీ కూడా బడా బహుళజాతి సంస్థలకే లబ్ధి చేకూరుస్తాయని అంకుర సంస్థల వ్యవస్థాపకులు లేఖలో తెలిపారు. -
యూపీఐ లావాదేవీలు 1,000 కోట్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: డిజిటల్ పేమెంట్స్ రంగంలో దేశవ్యాప్తంగా యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) సరికొత్త రికార్డు నమోదు చేసింది. 2023 ఆగస్ట్‌లో యూపీఐ లావాదేవీల సంఖ్య ఏకంగా 1,000 కోట్ల మార్కును దాటి 1,024.17 కోట్లకు చేరుకుంది. వీటి విలువ రూ.1518456.40 కోట్లు. 2022 ఆగస్ట్‌లో లావాదేవీల సంఖ్య 658.19 కోట్లు కాగా, విలువ రూ.10,73,162 కోట్లు నమోదైంది. ఈ ఏడాది ఆగస్ట్‌లో వ్యక్తుల నుంచి వ్యక్తులకు 74.79 శాతం వాటాతో రూ.11,79,095.6 కోట్ల విలువైన 438.8 కోట్ల లావాదేవీలు జరిగాయి. అలాగే వ్యక్తుల నుంచి వర్తకులకు 25.21 శాతం వాటాతో రూ.3,97,440.9 కోట్ల విలువైన 619.7 కోట్ల లావాదేవీలు నమోదయ్యాయి. క్షణాల్లో చెల్లింపులు జరిపే వీలుండడంతో యూపీఐ యాప్స్‌కు ఊహించనంతగా ఆదరణ పెరుగుతోంది. భారత్‌లో యూపీఐ సేవలను 484 బ్యాంకులు, డిజిటల్ పేమెంట్స్ సంస్థలు అందిస్తున్నాయి. యూపీఐ యాప్స్‌లో టాప్–5లో వరుసగా ఫోన్‌పే, గూగుల్ పే, పేటీఎం, క్రెడ్, యాక్సిస్ బ్యాంక్ నిలిచాయి. చిన్న మొత్తాలే అధికం.. పరిమాణం పరంగా వ్యక్తుల నుంచి వర్తకులకు రూ.500 లోపు విలువ చేసే లావాదేవీల సంఖ్య ఏకంగా 84.5 శాతం వాటాతో 523.7 కోట్లు జరిగాయి. రూ.501–2,000 మధ్య 10.8 శాతం వాటాతో 67 కోట్లు, రూ.2,000లపైన 4.67 శాతం వాటాతో 28.9 కోట్ల లావాదేవీలు నమోదయ్యాయి. అలాగే వ్యక్తుల నుంచి వ్యక్తులకు రూ.500 లోపు విలువ చేసేవి 55.6 శాతం వాటాతో 244 కోట్లు, రూ.501–2,000 విలువ కలిగినవి 22 శాతం వాటాతో 96.6 కోట్లు, రూ.2,000లపైన విలువైనవి 22.3 శాతం వాటాతో 97.9 కోట్ల లావాదేవీలు రిజిష్టర్ అయ్యాయి. విలువ పరంగా వ్యక్తుల నుంచి వ్యక్తులకు రూ.500 లోపు నమోదైన లావాదేవీల విలువ 3.44 శాతం వాటాతో రూ.40,558 కోట్లు. అలాగే రూ.501–2,000 మధ్య రూ.1,17,782 కోట్లు చేతులు మారాయి. రూ.2,000లపైన జరిగిన లావాదేవీల విలువ 86.57 శాతం వాటాతో రూ.10,20,754.8 కోట్లుగా ఉంది. ఇక వ్యక్తుల నుంచి వర్తకులకు రూ.500 వరకు విలువ చేసే రూ.59,992.7 కోట్ల లావాదేవీలు జరిగాయి. రూ.501–2,000 మధ్య రూ.68,665 కోట్లు, రూ.2,000లపైన రూ.2,68,782.5 కోట్ల విలువైన లావాదేవీలు నమోదయ్యాయి. -
సాగుకూ ఏఐ సాయం!
సాక్షి ప్రతినిధి, గుంటూరు: ఇప్పుడు ప్రపంచం మొత్తం కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్–ఏఐ) వైపు చూస్తోంది. ఇప్పటికే అన్ని రంగాల్లోనూ ఏఐ తన ప్రభావం చూపిస్తోంది. తాజాగా వ్యవసాయ రంగంలోనూ అడుగుపెట్టనుంది. ఈ రంగంలోని అన్ని విభాగాల్లో కృత్రిమ మేధను అమలు చేయడానికి గుంటూరులోని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం అడుగులేస్తోంది. ఇప్పటికే కలుపు తీసే రోబోట్లపైన ప్రయోగాలు చేస్తోంది. ఇవి పూర్తయ్యాక పూర్తి స్థాయిలో కృత్రిమ మేధను అమల్లోకి తేవాలని నిర్ణయించింది. రైతులకు ప్రయోజనకరం ఏఐ.. మనదేశంలో ఉన్న 143 మిలియన్ హెక్టార్లలో వ్యవసాయం చేయడానికి అవసరమైనంత మంది రైతులు అందుబాటులో ఉండటం లేదు. యువతరానికి వ్యవసాయం మీద పూర్తిస్థాయి అవగాహన ఉండటం లేదు. చదువులు, ఉద్యోగాలకు వారు వెళ్లిపోతున్నారు. ఈ నేపథ్యంలో ఏఐలాంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని వ్యవసాయరంగంలో ప్రవేశపెడితే కూలీలు, మానవవనరుల కొరతకు చెక్ పెట్టొచ్చని నిపుణులు చెబుతున్నారు. గతంలో చేలో మందు కొట్టడానికి రెండు గంటలు పట్టేది. ఇప్పుడు డ్రోన్లు అందుబాటులోకి వచ్చాక ఆరు నిమిషాల్లోనే పని పూర్తవుతోంది. ఉద్యోగాలు చేసుకుంటూనే వీకెండ్ వ్యవసాయం చేద్దామనుకునేవారు డ్రోన్లు అందుబాటులోకి వచ్చాక ఇటు వైపు మొగ్గు చూపుతున్నారు. బీమా కంపెనీలు, ప్రభుత్వాలు రైతులకు పంట నష్టపరిహారం ఇవ్వడానికి కూడా ఈ కృత్రిమ మేధ ఉపయోగపడుతుంది. వాతావరణంలో తేమ శాతం ఎంత ఉందో ఒక్క క్షణంలోనే ఏఐ పరిజ్ఞానం ద్వారా చెప్పొచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రస్తుతం 167 భూసార పరీక్షా కేంద్రాలను మన రాష్ట్రంలో ఏర్పాటు చేస్తున్నారు. వీటికి శాంపిల్స్ తీయడం కష్టమవుతుండటంతో ఒక రోబోట్ రూపకల్పనపై వ్యవసాయ వర్సిటీ పరిశోధనలు చేస్తోంది. ఏఐ పరిజ్ఞానంతో ఏదైనా పంటకు రాబోతున్న తెగులును కూడా ముందుగానే తెలుసుకునే వీలుంటుందని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. తద్వారా దాని నివారణకు చర్యలు చేపట్టవచ్చంటున్నారు. సాగులో తగ్గనున్న ఖర్చు.. దేశంలో ఇప్పటికే నీటిపారుదలను నియంత్రించే యాప్‌లు, ట్రాక్టర్లను నడిపించే జీపీఎస్ సిస్టమ్‌లు, పశువులను పర్యవేక్షించే ఆర్ఎఫ్ఐడీ–చిప్డ్ ఇయర్ ట్యాగ్లు ఉన్నాయి. వ్యవసాయంలో సాంకేతిక స్థిరత్వం రావాలంటే కృత్రిమ మేధ అవసరం ఎంతైనా ఉందని అంటున్నారు. సంప్రదాయ పద్ధతుల కంటే సులువుగా, ఖర్చు తగ్గించేలా చేయడానికి వ్యవసాయ వర్సిటీ కృషి చేస్తోంది. దేశంలోనే అత్యాధునిక ఏరియల్ రోబో డ్రోన్లను అందుబాటులోకి తెచ్చింది. ప్రస్తుతం రాష్ట్రంలో 4 లక్షల ఎకరాల్లో ఈ డ్రోన్లను వినియోగిస్తున్నారు. వీటి ద్వారా పురుగు, కలుపు, తెగుళ్ల మందుల పిచికారీలే కాకుండా విత్తనాలు వేయడం, యూరియా, డీఏపీ లాంటి ఎరువులు చల్లడం వంటివి చేస్తున్నారు. ప్రయోగాత్మకంగా వ్యవసాయ రోబో.. వ్యవసాయ రంగంలో ఎల్వోటీ, బిగ్‌డేటా ఎనలిటిక్స్, బ్లాక్ చైన్ టెక్నాలజీ లాంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాలను రైతుల ముంగిట్లోకి తేవడానికి వర్సిటీ పరిశోధనలను ముమ్మరం చేసింది. తద్వారా కూలీల కొరత, ఖర్చు, వాతావరణ మార్పుల వల్ల వచ్చే సమస్యలను పరిష్కరించవచ్చని పరిశోధకులు అన్నారు. సాగు పనులకు వ్యవసాయ రోబోను వర్సిటీ ప్రయోగాత్మకంగా పరీక్షించింది. సంప్రదాయ సాగు పద్ధతులతో పోలిస్తే వ్యవసాయ రోబో 4–5 రెట్ల సామర్థ్యంతో పనిచేస్తుందంటున్నారు. అదే డ్రోన్ల ద్వారా అయితే పదిరెట్ల పని సామర్థ్యం ఉంటుందని పేర్కొంటున్నారు. వీటితో రైతులకు ఖర్చులూ తగ్గిపోతాయని అంటున్నారు. కూలీలు దొరక్కపోయినా మందులు, పోషకాలను అందించి పంటను కాపాడతాయి. ఈ నేపథ్యంలో వ్యవసాయ వర్సిటీ రోబోలను అందుబాటులో తేవడానికి వడివడిగా అడుగులేస్తోంది. వచ్చే మూడేళ్లలో అందుబాటులోకి.. మానవ రహిత వ్యవసాయంతోపాటు, ఖచ్చిత వ్యవసాయం చేసేందుకు కృత్రిమ మేధ దోహదపడుతుంది. వచ్చే మూడేళ్లలో పూర్తిస్థాయిలో కృత్రిమ మేధను వ్యవసాయంలో అందుబాటులోకి తీసుకురావడానికి ప్రయతి్నస్తున్నాం. పరిశోధనలు ముమ్మరం చేశాం. – అంగిరేకుల సాంబయ్య, సీనియర్ శాస్త్రవేత్త, ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, గుంటూరు -
ఫీడ్ ధరలకు ముకుతాడు
సాక్షి, అమరావతి: రొయ్య రైతులకు రాష్ట్ర ప్రభుత్వం అడుగడుగునా అండగా నిలుస్తోంది. తాజాగా రొయ్యల మేత (ఫీడ్) ధరలు పెంచేందుకు కంపెనీలు ప్రయత్నాలు ప్రారంభించాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో ఏపీ ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ అథారిటీ (అప్సడా) రంగంలోకి దిగింది. ఈ ఏడాది సెప్టెంబర్ నుంచి ఫీడ్ ధర టన్నుకు రూ.103 నుంచి రూ.256 వరకు పెంచుతూ సీపీఎఫ్ కంపెనీ నిర్ణయం తీసుకుంది. పెంచిన ధరలను తక్షణమే అమలు చేయాలంటూ డిస్ట్రిబ్యూటర్లకు ఆదేశాలు సైతం జారీ చేసింది. సీపీఎఫ్ బాటలోనే మిగిలిన కంపెనీలు కూడా ధరల పెంచేందుకు సిద్ధమయ్యాయి. ఈ విషయాన్ని రొయ్య రైతులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు అప్సడా సీపీఎఫ్ కంపెనీ ప్రతినిధులతో చర్చించింది. పెంచిన ధరలను ఉపసంహరించుకునేలా చర్యలు చేపట్టింది. ప్రభుత్వంతో చర్చించకుండా ధరలు పెంచొద్దని ఫీడ్ కంపెనీలకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో మిగిలిన అన్ని కంపెనీలు ధరల పెంపుదల నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నాయి. తాజాగా ధరల పెంపు ఉపసంహరణ ఫలితంగా కిలో రొయ్యల ఉత్పత్తిపై రూ.4.50 చొప్పున భారం తగ్గింది. గతంలోనూ ధరల పెంపును అడ్డుకున్న ప్రభుత్వం ప్రస్తుతం మేత కోసం ప్రతి రైతు కిలో రొయ్యల ఉత్పత్తికి రూ.90 వరకు ఖర్చు చేస్తున్నారు. ఏటా ఫీడ్ అమ్మకాల ద్వారా రూ.12,600 కోట్ల టర్నోవర్ జరుగుతోంది. గతంలో ఏటా కనీసం రెండు, మూడుసార్లు ఫీడ్ కంపెనీలు ధరలు పెంచేవి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఫీడ్ తయారీ, అమ్మకాలను సైతం అప్సడా చట్టం పరిధిలోకి తీసుకురావడంతో ఇష్టానుసారంగా ధరల పెంపునకు కళ్లెం పడింది. ప్రభుత్వ అనుమతి లేకుండా 2022 మే 19న టన్నుకు రూ.256 చొప్పున పెంచేందుకు కంపెనీలు ప్రయత్నించాయి. అంతర్జాతీయ ఒడిదుడుకులతో ఆశించిన ధర లేక సతమతమవుతున్న అప్పటి తరుణంలో రైతులపై పైసా భారం మోపడానికి వీల్లేదని ప్రభుత్వం తేల్చిచెప్పడంతో కంపెనీలు పెంపు ప్రతిపాదనలను పూర్తిగా వెనక్కి తీసుకున్నాయి. అదే రీతిలో 2022 అక్టోబర్ 13న టన్నుకు రూ.260 చొప్పున పెంచాయి. ప్రభుత్వ ఆదేశాలతో పెంచిన నాలుగు రోజులకే కంపెనీలు వెనక్కి తీసుకున్నాయి. ఇలా రెండేళ్లలో మూడుసార్లు పెంచిన ధరలను వెనక్కి తీసుకోవడంతో సగటున కిలోకు రూ.8.60 చొప్పున మేత ఖర్చుల భారం రైతులకు తగ్గింది. సీఎం జగన్ ఆదేశాలతో.. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు అప్సడా ఆధ్వర్యంలో సీపీఎఫ్ కంపెనీ ప్రెసిడెంట్ సహా ఇతర ఉన్నతాధికారులను పిలిపించి సమావేశం నిర్వహించాం. ధరల పెంపు ప్రతిపాదనను ఉపసంహరింప చేసుకునేలా ఆదేశాలిచ్చాం. ప్రభుత్వాదేశాలతో సీపీఎఫ్తో సహా ఇతర కంపెనీలు కూడా ధరల పెంపు ప్రతిపాదనలను ఉపసంహరించుకున్నాయి. – వడ్డి రఘురాం, కో–వైస్ చైర్మన్, అప్సడా -
35 మందితో కాంగ్రెస్ తొలి జాబితా!
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల కోసం వేగంగా సన్నద్ధమవుతున్న కాంగ్రెస్ పార్టీ.. ఈ నెలాఖరులోగా అభ్యర్థుల తొలి జాబితా ప్రకటించేందుకు రంగం సిద్ధం చేస్తోంది. తొలి విడతలో బలమైన, ముఖ్యమైన అభ్యర్థులతో ఏకాభిప్రాయం ఉన్న 30–35 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించాలని నిర్ణయించినట్టు తెలిసింది. తొలి జాబితాలో పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సీతక్క, పొదెం వీరయ్య, శ్రీధర్‌బాబు, జగ్గారెడ్డి, దామోదర రాజనర్సింహ, జీవన్‌రెడ్డి, జి.వినోద్, షబ్బీర్‌అలీ, సంపత్‌కుమార్, వంశీచంద్‌రెడ్డి, గడ్డం ప్రసాద్‌కుమార్, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు, తుమ్మల నాగేశ్వర్రావు, ఫిరోజ్‌ఖాన్, ప్రేమ్‌సాగర్‌రావు, అంజన్‌కుమార్ యాదవ్, పద్మావతిరెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డి, విజయరమణారావు, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, వంశీకృష్ణ తదితరులు పేర్లు ఉండొచ్చని భావిస్తున్నారు. అక్టోబర్ రెండో వారానికి పూర్తి జాబితా... అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో భాగంగా ఇప్పటికే హైదరాబాద్‌లో తొలి భేటీ జరిపిన కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ.. గురువారం ఢిల్లీలోని కాంగ్రెస్ వార్‌రూమ్‌లో రెండో భేటీ నిర్వహించింది. కమిటీ చైర్మన్ మురళీధరన్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కమిటీ సభ్యులతో పాటు రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్‌రావ్ ఠాక్రే, రేవంత్‌రెడ్డి, భట్టి విక్రమార్క, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, మధుయాష్కీగౌడ్, ఎన్నికల వ్యూహకర్త సునీల్ కనుగోలు, ఇతర కార్యదర్శులు పాల్గొన్నారు. సుదీర్ఘంగా 8 గంటల పాటు జరిగిన ఈ భేటీలో 119 నియోజకవర్గాల నుంచి షార్ట్‌లిస్ట్ చేసిన 300 పేర్లపై చర్చించారు. అందులో ఒకే అభ్యర్థి ఉన్న స్థానాలు 30–35 వరకు ఉండగా.. రెండేసి పేర్లున్న స్థానాలు 20–30, ముగ్గురి చొప్పున ఉన్నవి 30–35, నలుగురు, ఆపైన పోటీపడుతున్న స్థానాలు 10–15 వరకు ఉన్నట్టు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. ఇందులో ఒకే అభ్యర్థి ఉన్న జాబితాకు పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ ఆమోదం తీసుకుని.. ఈ నెలాఖరులోగా ప్రకటించాలని నిర్ణయించినట్టు సమాచారం. అక్టోబర్ తొలివారంలో రెండో జాబితా, రెండో వారంలో తుది జాబితా ప్రకటించాలని యోచనకు వచ్చినట్టు తెలిసింది. వరుసగా మూడుసార్లు ఓడిన నేతలకు టికెట్లు ఇవ్వకూడదని సమావేశంలో అభిప్రాయం వ్యక్తమైనట్టు తెలిసింది. ఇలాంటి నియోజకవర్గాలు 6 నుంచి 8 వరకు ఉన్నట్టు సమాచారం. సర్వేల ఆధారంగా.. స్క్రీనింగ్ కమిటీ సమావేశంలో ఎన్నికల వ్యూహకర్త సునీల్ కనుగోలు తాము చేసిన సర్వేల నివేదికను అందజేసినట్టు తెలిసింది. ఇద్దరు, ముగ్గురు, అంతకన్నా ఎక్కువ మంది పోటీపడుతున్న స్థానాల్లో ఎవరెవరికి ఎంత శాతం గెలుపు అవకాశాలు ఉన్నాయ న్న వివరాలను అందజేసినట్టు సమాచారం. దీనిని పరిగణనలోకి తీసుకున్న కమిటీ నేతలు.. అందులో నియోజకవర్గాల వారీగా 35 శాతానికిపైగా గెలుపు అవకాశాలున్న నేతల పేర్లను పరిగణనలోకి తీసుకుంటూ షార్ట్ లిస్ట్ సిద్ధం చేసినట్టు తెలిసింది. మరోవైపు బీజేపీ నుంచి చేరికలు ఉంటాయన్న అంశం కూడా భేటీలో ప్రస్తావనకు వచ్చింది. అలా చేరే అవకాశమున్న స్థానాలకు అభ్యర్థుల ప్రకటనను వారం పాటు పెండింగ్‌లో పెట్టాలని అభిప్రాయానికి వచ్చినట్టు తెలిసింది. టికెట్ దక్కని నేతలకు హామీలు! టికెట్ ఆశించి దక్కని నేతలకు వారి ప్రాధాన్యాన్ని బట్టి నేరుగా హైకమాండ్ పెద్దలతో పార్టీ, ప్రభుత్వ పదవులపై హామీలు ఇప్పించాలని స్క్రీనింగ్ కమిటీ భేటీలో నిర్ణయించినట్టు తెలిసింది. పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఎమ్మెల్సీలు, వివిధ కార్పొరేషన్ పదవులతోపాటు పారీ్టలో ప్రాధాన్యం కలి్పంచే విషయాన్ని పార్టీ పెద్దలు మల్లికార్జున ఖర్గే, రాహుల్, ప్రియాంకగాంధీలతో చెప్పించనున్నారని సమాచారం. కాగా, టికెట్ ఆశిస్తున్న కొందరు నేతలు ఢిల్లీకి వెళ్లి అక్కడే మకాం వేసి ముఖ్య నేతలను ప్రస న్నం చేసుకునే ప్రయత్నాలు మొదలుపెట్టారు. 6 చోట్ల ప్రాధాన్యత కోరిన పొంగులేటి! స్క్రీనింగ్ కమిటీ భేటీ ముందు ఠాక్రే, రేవంత్, ఉత్తమ్, భట్టిలతో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి భేటీ అయ్యారు. ఖమ్మం జిల్లాకు సంబంధించి అభ్యర్థుల ఎంపికపై తన అభి ప్రాయాలను నేతలకు పొంగు లేటి వివరించి నట్టు తెలిసింది. ఖమ్మం, పాలేరు, సత్తుపల్లి, కొత్తగూడెం, అశ్వారావుపేట, పినపాక నియోజ కవర్గాల్లో తన వర్గం నేతలకు అవకాశం ఇవ్వా లని ఆయన కోరినట్టు సమాచారం. తనతో పాటు పార్టీలో చేరిన తుడి మేఘారెడ్డికి వన పర్తిలో ప్రాధాన్యం ఇవ్వాలని ప్రతిపాదించి నట్టు తెలిసింది. సర్వేలతో పోల్చి చూసి ఖరారు చేస్తామని ఠాక్రే హామీ ఇచ్చినట్టు తెలిసింది. -
తప్పుడు ప్రచారం చేస్తే రుణాలు ఆపేస్తాం
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వంపై విద్యుత్ రంగానికి సంబంధించి తెలంగాణ ముఖ్యమంత్రి తప్పుడు ప్రచారం చేస్తే.. రుణాలు, సబ్సిడీలు ఆపేస్తామని కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్. కె.సింగ్ హెచ్చరించారు. వ్యవసాయ పంపుసెట్లకు మీటర్ల ఏర్పాటు, విద్యుత్ సంస్థలను ప్రైవేటీకరణ చేస్తారంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ విషప్రచారం చేస్తున్నారని, వ్యవసాయ పంపుసెట్లకు మినహా అన్నింటికి మీటర్లు ఏర్పాటు చేయాలని కేంద్రం స్పష్టం చేసిందని చెప్పారు. విద్యుత్ సంస్థల ఆడిట్ నివేదికలు, ఎనర్జీ ఆడిట్ ఎప్పటికప్పుడు చేయించాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ విద్యుత్ సంస్థలు రుణాలు చెల్లించే స్థితిలో లేవని తమకు సమాచారం అందిందని మంత్రి తెలిపారు. గురువారం ఇక్కడ మంత్రి ఆర్.కె. సింగ్, పర్యాటక శాఖ మంత్రి కిషన్‌రెడ్డి, విద్యుత్ శాఖ సహాయ మంత్రి క్రిషన్‌పాల్ గుర్జర్లు ‘విద్యుత్ శాఖ’పై ఏర్పాటైన పార్లమెంట్ సభ్యుల కన్సల్టేటివ్ కమిటీ సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం ఆర్.కె. సింగ్ మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వానికి గడిచిన తొమ్మిదేళ్ల కాలంలో రూరల్ ఎలక్ట్రికల్ కార్పొరేషన్ (ఆర్ఈసీ) రూ.1.57 లక్షల కోట్ల రుణం మంజూరు చేస్తే అందులో ఇప్పటికే రూ. 1.38 లక్షల కోట్లు విడుదల చేసినట్లు కేంద్ర మంత్రి వివరించారు. అలాగే పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ (పీఎఫ్సీ) నుంచి రూ.1.10 లక్షల కోట్లు మంజూరు అయితే.. రూ.91 వేల కోట్లు విడుదల చేసినట్లు మంత్రి వెల్లడించారు. ఎన్టీపీసీ 4 వేల మెగావాట్ల విద్యుత్ ప్లాంట్లు నిర్మిస్తుంది..: రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీ మేరకు తెలంగాణలో ఎన్టీపీసీ 4 వేల మెగావాట్ల థర్మల్ విద్యుత్ ప్లాంట్లను నిర్మిస్తుందని కేంద్ర మంత్రి ఆర్.కె. సింగ్ తేల్చి చెప్పారు. ఇప్పటికే ఒక్కొక్కటి 800 మెగావాట్ల రెండు యూనిట్లు సిద్ధమయ్యాయని, ఈనెల 26న ఒక యూనిట్ వాణిజ్య ఉత్పత్తి ప్రారంభిస్తుందని, మరొకటి డిసెంబర్లో ఉత్పత్తి ప్రారంభిస్తుందని ఆయన వెల్లడించారు. వీటిని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభిస్తారని చెప్పారు. మిగిలిన 2,400 మెగావాట్ల విద్యుత్ కేంద్రాలకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు చేసుకోవాలని ఎన్టీపీసీ కోరినా స్పందించడం లేదన్నారు. అయితే తెలంగాణ ప్రభుత్వం స్పందించకపోయినా ఎన్టీపీసీ ఒక్కొక్కటీ 800 మెగావాట్లుగల మూడు యూనిట్లను నిర్మిస్తుందని తేల్చి చెప్పారు. కాగా, దేశం మొత్తాన్ని ఒకే గ్రేడ్ కిందకు తీసుకువచ్చి 1.97 లక్షల కిలోమీటర్ల ట్రాన్స్మిషన్ లైన్లు వేసినట్లు చెప్పారు. తద్వారా దేశంలో ఏకకాలంలో 1.20 లక్షల మెగావాట్ల విద్యుత్‌ను ఎక్కడి నుంచి ఎక్కడికైనా సరఫరా చేస్తే సామర్థ్యం ఏర్పడిందని మంత్రి వివరించారు. -
పేదరికం పై పైకి!
యూకేను దెబ్బతీసిన కోవిడ్, యుద్ధాలు ప్రపంచదేశాలన్నింటి మాదిరిగానే యూకే కూడా కోవిడ్ వల్ల ఇబ్బందులు పడింది. ఇక అఫ్గానిస్తాన్ యుద్ధం, ప్రస్తుత రష్యా–ఉక్రెయిన్ల మధ్య నడుస్తున్న యుద్ధం వల్ల కూడా ఆర్థిక వ్యవస్థకు నష్టం జరిగింది. ఫలితంగా జీవన వ్యయం పెరిగిపోయింది. దీని ప్రభావం యూకేపై కూడా పడింది. – గారెత్ ఓవెన్, బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్, హైదరాబాద్ (కంచర్ల యాదగిరిరెడ్డి): కోవిడ్ మహమ్మారి ప్రపంచాన్ని రకరకా లుగా మార్చేసిందనడంలో సందేహం లేదు! ప్రజల జీవనశైలి, ఆలోచనా విధానంలో మార్పు వచ్చింది. ఆర్థిక స్థితిగతుల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. ఉద్యోగాల తీరుతెన్నులు మారిపోయాయి. కొందరికి కొత్త ఉద్యోగాలు వస్తే.. ఇంకొందరికి ఉన్నవి ఊడిపోయాయి. ఉద్యోగాలు ఉన్నా వేతనాలు తగ్గా యి. ముఖ్యంగా ప్రపంచం మొత్తమ్మీద పేదరికం పెరిగింది. ప్రపంచ బ్యాంకు మొదలుకొని అనేక అంతర్జాతీయ సంస్థలు దీన్ని ధ్రువీకరిస్తున్నాయి. మరి ఎందుకు పేదరికం పెరిగింది? ఎలా పెరిగింది? ఎందరు పేదలుగా మారిపోయారు? పేదరికం పెంచిన కోవిడ్ కోవిడ్ మహమ్మారి కారణంగా అనేక మంది ఆదాయాలు పడిపోయాయని, ఫలితంగా దేశంలో 10 కోట్ల మంది దారిద్య్ర రేఖకు దిగువకు చేరారని తాజా లెక్కలు చెబుతున్నాయి. అయితే పేదరికం పెరగడం అనేది కోవిడ్ వల్ల మాత్రమే జరిగిన పరిణామం కాదని, లెక్కలు తప్పడం వల్ల నిన్నమొన్నటివరకూ పేదల సంఖ్య స్పష్టంగా ప్రపంచానికి తెలియలేదని ప్రపంచ బ్యాంకు అంటోంది. అనేక అభివృద్ధి చెందిన దేశాల్లో జీవన వ్యయాన్ని లెక్కవేయడంలో జరిగిన పొరపాట్ల కారణంగా పేదలు తక్కువగా ఉన్నట్లు కనిపించిందని, వాస్తవానికి వీరి సంఖ్య చాలా ఎక్కువని, గోరుచుట్టుపై రోకటిపోటు చందంగా కోవిడ్ వచ్చిపడటంతో పేదరికం మరింత పెరిగిపోయిందని చెబుతోంది. ఉద్యోగాలు, ఆదాయంపై ప్రభావం కోవిడ్ మహమ్మారి సమయంలో చాలామంది తమ ఉద్యోగాలు కోల్పోవడం తెలిసిందే. అయితే వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ అంచనాల ప్రకారం ఇది కేవలం ఉద్యోగాలు కోల్పోవడానికి మాత్రమే పరిమితం కాలేదు. చాలామందికి ఆదాయం తగ్గింది. మరికొంతమంది ఇళ్లూ కోల్పోయారు. ఫలితంగా పేదరికమూ పెరిగింది. పేదల్లోని దిగువ 40 శాతం మందికి 2021లో సగటు ఆదాయం 6.7 శాతం తగ్గిందని వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ అధ్యయనం తేల్చింది. అదే సమయంలో ధనికులైన 40 శాతం మందిలో ఈ తగ్గుదల కేవలం 2.8 శాతం మాత్రమే. కోవిడ్ దెబ్బ నుంచి కోలుకోలేకపోవడం పేదల ఆదాయం తగ్గేందుకు కారణమైంది. అయితే ధనికుల్లో సగం మంది తమ కష్టాల నుంచి బయటపడటం గమనార్హం. ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిస్కల్ స్టడీస్ ప్రకారం యూకేలో కోవిడ్ దాదాపు ఏడు లక్షల మందిని పేదరికంలోకి నెట్టేసింది. కోవిడ్‌కు ముందు జనాభాలో 15 శాతం మంది పేదరికంలో మగ్గుతుండగా.. తదనంతర పరిస్థితుల్లో ఇది 23 శాతానికి చేరుకోవడం గమనార్హం. అమెరికన్ సెన్సస్ బ్యూరో అంచనాల ప్రకారం 2021లో పేదరికంలో ఉన్న జనాభా 11.6 శాతం. అంటే సుమారు నలభై లక్షల మంది. అయితే కోవిడ్ ముట్టడించిన 2020తో పోలిస్తే ఇందులో పెద్దగా తేడా ఏమీ లేకపోవడం ఆసక్తికరమైన అంశం. యూరప్ విషయానికి వస్తే, చాలా దేశాల్లో నిరుద్యోగ సమస్య బాగా ఎక్కువైంది. యూరోపియన్ కమిషన్ ప్రాంతంలో సుమారు కోటీ ఇరవై లక్షల మంది నిరుద్యోగులు ఉన్నట్లు డిబేటింగ్ యూరప్ సంస్థ చెబుతోంది. ఉద్యోగాల్లో ఉన్నవారిలోనూ మూడొంతుల మంది వేతనాలు తగ్గాయి. దీంతో ఇక్కడ కూడా పేదరికం పెరుగుతున్నట్లు తెలుస్తోంది. అమెరికా లెక్క అలా.. మనది ఇలా రోజుకు 1.90 డాలర్లు లేదా అంతకంటే తక్కువ ఆదాయం కలిగిన వారందరూ పేదలే అని ప్రపంచ బ్యాంకు చెబుతోంది. కోవిడ్ కంటే ముందు ఇంతకంటే ఎక్కువ ఆదాయమున్న వారు కూడా మహమ్మారి కారణంగా పేదలుగా మారిపోయారని అంటోంది. ప్రపంచ వ్యాప్తంగా పేదరికంలో ఉన్న వారి మోతాదు 7.8 శాతం నుంచి 9.1 శాతానికి చేరుకుందని లెక్క గట్టింది. ప్రపంచ బ్యాంకు లెక్కల ప్రకారం కూడు, గుడ్డ, నీడలకు కావాల్సినంత కూడా సంపాదించలేని వారే పేదలు. ఈ కనీస అవసరాలు తీర్చుకునేందుకు సగటున 1.90 డాలర్ల వరకూ ఖర్చవుతుందని అంచనా వేసింది. అయితే మన దేశంలో ఈ మూడింటితో పాటు ఆరోగ్యం, విద్య కూడా పొందలేని వారిని దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న వారిగా వర్గీకరిస్తున్నాం. భారత్‌లో పేదరికాన్ని కొలిచేందుకు ‘టెండుల్కర్ మెథడాలజీ’ని ఉపయోగిస్తారు. దీని ప్రకారం మనిషి మనుగడ సాగిచేందుకు కావాల్సిన కనిష్ట మోతాదు కేలరీలకు అయ్యే ఖర్చుతో పాటు, దుస్తులు, నివసించేందుకు పెట్టే వ్యయాన్ని బట్టి పేదలా? కాదా? అన్న వర్గీకరణ జరుగుతుంది. 2021 నాటి జనాభా లెక్కల ప్రకారం దేశ జనాభాలో 9.2 శాతం మంది పేదరికంలో మగ్గుతున్నారు. అయితే వీరి సంఖ్య అన్ని రాష్ట్రాల్లోనూ ఒకేతీరున లేదు. బిహార్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో ఎక్కువగానూ, కేరళ, పంజాబ్ వంటిచోట్ల తక్కువగానూ ఉంది. 2020లోనే పేదల సంఖ్య సుమారు ఏడు కోట్లకు చేరుకుందని రెండు, మూడేళ్లలోనే ఈ సంఖ్య తొమ్మిది కోట్లకు చేరుకుందని ప్రపంచ బ్యాంకు అంచనాలు చెబతున్నాయి. 16.3 కోట్ల దిగువ మధ్యతరగతి? రోజుకు 1.90 డాలర్ల కంటే తక్కువ సంపాదించే వారు పేదలైతే..5.5 డాలర్లు సంపాదించేవారిని దిగువ మధ్య తరగతి వారిగా పరిగణిస్తున్నారు. ఈ వర్గీకరణలోకి వచ్చేవారు దేశం మొత్తమ్మీద 16.3 కోట్ల మంది ఉన్నారని ప్రపంచ బ్యాంకు లెక్కలు చెబుతున్నాయి. పేదరికంపై నడ్జ్ ఫౌండేషన్ పోరు ‘ద నడ్జ్ ఇన్స్టిట్యూట్’ 2015లో బెంగళూరు కేంద్రంగా ప్రారంభమైన లాభాపేక్ష లేని సంస్థ. పేదరిక నిర్మూలన మా లక్ష్యం. ప్రభుత్వం, పౌర సమాజం, కార్పొరేట్ సంస్థలతో కలిసి పనిచేస్తున్నాం. యువతకు వేర్వేరు అంశాల్లో నైపుణ్యాలు అందించేందుకు ఒక డిజిటల్ ప్లాట్‌ఫామ్ ద్వారా కృషి చేస్తున్నాం. అలాగే గ్రామీణ ప్రాంతాల్లోని నిరుపేదల కోసం గ్రామీణాభివృద్ధి కేంద్రం కూడా నడుపుతున్నాం. వీరికోసం రూపొందించిన ప్రత్యేక కార్యక్రమం ఇప్పుడు కర్ణాటక సహా ఎనిమిది రాష్ట్రాల్లో అమలవుతోంది. సమాజ సేవ చేయాలనుకునే సీఈవో, సీఓఓలకూ అవకాశాలు కల్పిస్తున్నాం. ఇప్పటికే సుమారు 30 మంది సీఈవో, సీఓఓలు ఎనిమిది రాష్ట్రాల్లో ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులతో కలిసి పనిచేస్తున్నారు. స్వయం సహాయక బృందాల్లోని సభ్యులకు వ్యక్తిగతంగా రుణాలిచ్చేందుకు, వడ్డీ సబ్సిడీలు కల్పించేందుకు ఆలోచన చేసి అమలు చేయడం వీరు సాధించిన విజయాల్లో ఒకటిగా చెప్పవచ్చు.– సుధా శ్రీనివాసన్, సీఈవో,ద నడ్జ్ ఫౌండేషన్ -
ఫుడ్ ప్రాసెసింగ్ రంగంతోనే రైతుల ఆర్థిక ప్రగతి: మంత్రి కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: అమెరికా పర్యటనలో ఉన్న రాష్ట్ర ఐటీ, పరిశ్ర మల శాఖ మంత్రి కె. తారక రామా రావు ఆదివారం షికాగోలో ఫుడ్ ప్రాసె సింగ్ రంగంపై అధ్య యనం చేశారు. ఇందులో భాగంగా పలు కంపెనీల ప్రతినిధుల తో పెట్టుబడులకు సంబంధించి వరుస సమావేశాలు నిర్వహించారు. ‘‘షికాగో ఫుడ్ స్టాప్‘ను సందర్శించి అక్కడ వరల్డ్ బిజినెస్ షికాగో సంస్థ ఏర్పాటుచేసిన సమావేశంలో మాట్లా డారు. షికాగో ఫుడ్ స్టాప్‌లో ఏర్పాటు చేసిన అనేక షాపులను పరిశీలించారు. స్థానిక వ్యాపారవేత్తలతో సంభాషించారు. షికాగో అనుసరిస్తున్న ఫుడ్ ప్రాసెసింగ్ టెక్నాలజీ, ఫుడ్ ప్రొక్యూర్మెంట్ పద్ధతులపైన చర్చించారు. షికాగో ఫుడ్ స్టాప్ ఇన్నోవేషన్ ఈకో సిస్టం వ్యవస్థను తెలంగాణలో ఏర్పాటు చేసేందుకు సంసిద్ధంగా ఉన్నామని కేటీఆర్ తెలిపారు. షికాగో ఫుడ్ స్టాప్ మాదిరి తెలంగాణలో కూడా.. షికాగో ఫుడ్ స్టాప్ మాదిరిం ఫుడ్ ప్రాసెసింగ్ పురోగతికి తెలంగాణ ఫుడ్ స్టాప్ ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తామని కేటీఆర్ వెల్లడించారు. ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో ఇన్నో వేషన్ ప్రాధాన్యత ఎంతగానో ఉందని, ఇది కేవలం ఫుడ్ ఇండస్ట్రీకి మాత్రమే కాకుండా వ్యవసాయ రంగంపైన ఆధార పడిన రైతులు, వ్యవసాయ సంబంధిత పరిశ్రమల్లోని భాగస్వాముల అభివృద్ధికి కూడా ఉపయోగపడుతుందని వివరించారు. ఫుడ్ ఇన్నోవేషన్ హబ్‌గా మారేందుకు కావలసిన అన్ని రకాల అవకాశాలు తెలంగాణలో ఉన్నాయన్నారు. ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమ బలోపేతానికి.. ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమను బలోపేతం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం అనేక కార్యక్రమాలను చేపట్టిందన్నారు. ఆ మేరకే తెలంగాణ రాష్ట్రానికి ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో భారీ ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయని చెప్పారు. కోకా కోల, పెప్సీకో, ఐటీసీ వంటి దిగ్గజ సంస్థలు తెలంగాణ రాష్ట్రంలో పెట్టిన పెట్టుబడుల గురించి ప్రస్తావించారు. తెలంగాణ రాష్ట్రం ఫుడ్ ప్రాసెసింగ్ రంగం అభివృద్ధి కోసం పదివేల ఎకరాలకు పైగా కేటాయించి ప్రత్యేక ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లను ఏర్పాటు చేస్తున్న విషయాన్ని కేటీఆర్ వివరించారు. నిజామాబాద్ ఐటీ హబ్‌లో క్రిటికల్ రివర్ సంస్థ నిజామాబాద్ ఐటీ హబ్ లో అమెరికాకు చెందిన క్రిటికల్ రివర్ సంస్థను ఏర్పాటు చేసేందుకు ఆ కంపెనీ ప్రతినిధులు అంగీకరించిన్నట్లు బీఆర్ఎస్ ఎన్నారై సెల్ కోఆర్డినేటర్ మహేష్ బిగాల తెలిపారు. -
కార్పొరేట్‌ను తలదన్నేలా...
ఇక్కడ కనిపిస్తున్న రెండు ఫొటోల్లో మొదటిది బొబ్బిలి సామాజిక ఆరోగ్య కేంద్రం పాత భవనం. పక్క ఫొటోలో కనిపిస్తున్నది అదే ఆవరణలో రూ.3.50 కోట్లతో అత్యాధునిక వసతులతో నూతనంగా నిర్మించిన సీహెచ్‌సీ నూతన భవనం. ఇది కార్పొరేట్ ఆస్పత్రిని తలదన్నేలా నిర్మించింది. ఈ ఆస్పత్రే కాదు... వైద్య విధాన్ పరిషత్ ఆస్పత్రులను ఎనిమిదింటిని పూర్తి స్థాయి వసతులతో ఇలానే నిర్మిస్తున్నారు. రాష్ట్రంలో జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం వచ్చాక వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. నాడు – నేడు ద్వారా ఆస్పత్రులను అధునాతనంగా మార్చింది. ఆహ్లాదకర వాతావరణం నెలకొనేలా తీర్చిదిద్దింది. వైద్యులు, సిబ్బంది కొరత లేకుండా చర్యలు చేపట్టింది. రోగులకు కావాల్సినన్ని సదుపాయాలు కల్పించింది. దీంతో రోగులు కార్పొరేట్‌ను కాదని ప్రభుత్వ ఆస్పత్రుల వైపు అడుగులు వేస్తున్నారు. విజయనగరం ఫోర్ట్: రాష్ట్రంలో గత టీడీపీ ప్రభుత్వం వైద్య రంగాన్ని పూర్తిగా గాలికొదేలిసింది. ఆస్పత్రుల్లో తగినంత మంది వైద్యులు, సిబ్బందిని నియమించక, కనీస వసతులు కల్పించక.. కావాలనే కార్పొరేట్‌ను ప్రొత్సహించేలా ఇలా వ్యహరించిందన్న విమర్శలు అప్పట్లో లేకపోలేదు. ప్రస్తుతం పరిస్థితి మారింది. రాష్ట్రంలో జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజారోగ్యమే పరమావధిగా ఆస్పత్రుల రూపురేఖలనే సమూలంగా మార్చివేసింది. కార్పొరేట్‌ను తలదన్నేలా తీర్చిదిద్దింది. అవసరమైనంత మంది వైద్యులు, సిబ్బందిని నియమించి... ఆరోగ్యశ్రీ వంటి సేవలతో కార్పొరేట్‌కు దీటుగా మార్చేసింది. రూ.కోట్లు ఖర్చు పెట్టి వైద్య విధాన్ పరిషత్ ఆస్పత్రులను నిర్మిస్తోంది. ఇప్పటికే కొన్ని ఆస్పత్రుల నిర్మాణం పూర్తి కాగా.. మరికొన్ని నిర్మాణ దశలో దూసుకుపోతున్నాయి. రూ.58.58 కోట్లతో 8 ఆస్పత్రుల నిర్మాణం జిల్లాలో వైద్య విధాన్ పరిషత్‌కు చెందిన 8 ఆస్పత్రులను రూ.58.58 కోట్లతో నిర్మాణం చేపట్టారు. పాత ఆస్పత్రి ఆవరణలో కొత్తగా నిర్మాణం చేపట్టారు. వీటిలో బొబ్బిలి, చీపురుపల్లి ఆస్పత్రుల నిర్మాణం పూర్తయి ఇప్పటికే ప్రారంభించారు. భోగాపురం ఆస్పత్రి నిర్మాణం దాదాపు పూర్తి కావొచ్చింది. త్వరలోనే దీన్ని ప్రారంభించనున్నారు. ఎస్.కోట, బాడంగి, నెల్లిమర్ల, రాజాం, గజపతినగరం ఆస్పత్రులు నిర్మాణ దశలో ఉన్నాయి. వీటి నిర్మాణాలు కూడా వేగవంతం అయ్యే విధంగా అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఆస్పత్రులు ఇలా... ప్రతి ఆస్పత్రిలోని క్యాజువాలటీ, ఓపీ విభాగం, మేల్, ఫీమేల్ వార్డులు, చేంజింగ్ రూమ్, ల్యాబొరేటరీ, అత్యా«ధునిక సౌకర్యాలతో కూడిన ఆపరేషన్ థియేటర్, ఎక్స్‌రే విభాగం, కార్యాలయ నిర్మాణాలు ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా నిర్మిస్తున్నారు. కార్పొరేట్ ఆస్పత్రులకు ధీటుగా ఆస్పత్రులను నిర్మిస్తున్నారు. నాణ్యతలో రాజీ పడకుండా రోగులకు సేవలే లక్ష్యంగా దూసుకుపోతున్నారు. అన్ని వసతులతో... వైద్య విధాన్ పరిషత్ పరిధిలో 8 ఆస్పత్రులను ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా అన్ని వసతులతో రూ.58.58 కోట్లతో నిర్మిస్తున్నాం. రెండు ఆస్పత్రులు నిర్మాణం పూర్తవ్వడంతో వాటిని ప్రారంభించి వినియోగంలోకి తీసుకొచ్చాం. మరో ఆస్పత్రి ప్రారంభానికి సిద్ధంగా ఉంది. మిగిలిన ఆస్పత్రుల నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. కలెక్టర్ ప్రతి నెల ఆస్పత్రుల నిర్మాణం పురోగతిపై సమీక్ష నిర్వహిస్తున్నారు. – డాక్టర్ బి.గౌరీశంకర్, జిల్లా ఆస్పత్రుల సేవల సమన్వయధికారి (డీసీహెచ్ఎస్) -
వ్యవసాయ రంగ అభివృద్ధికి వెన్నెముక నాబార్డ్
సాక్షి, అమరావతి: దేశంలో వ్యవసాయ రంగ అభివృద్ధికి నాబార్డు వెన్నెముకగా నిలుస్తోందని గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ అన్నారు. విజయవాడలో మంగళవారం నాబార్డు ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన గవర్నర్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో సహకార పరపతి సంఘాల ద్వారా రైతులకు సులభంగా రుణ సౌకర్యం అందుబాటులోకి తేవడం నాబార్డు సాధించిన అతి పెద్ద విజయమన్నారు. వ్యవసాయ పరపతి స్వరూపాన్ని సమూలంగా మార్చేసి రైతులకు ప్రయోజనకారిగా నిలిచిందని చెప్పారు. నాబార్డు చీఫ్ జనరల్ మేనేజర్ ఎం.ఆర్.గోపాల్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌కు ఈ ఆర్ధిక సంవత్సరంలో రూ.2.86 లక్షల కోట్ల పరపతి సౌకర్యం కల్పించాలని నిర్ణయించామన్నారు. 1982లో కేవలం రూ.4,500 కోట్ల మూలధనంతో ఏర్పడిన నాబార్డు 2022–23 నాటికి రూ.8.01 లక్షల కోట్ల స్థాయికి చేరుకుందని వివరించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన స్టాల్స్‌ను గవర్నర్ సందర్శించి నాబార్డు కార్యకలాపాలపై రూపొందించిన బుక్‌లెట్‌ను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో మార్కెటింగ్, సహకారశాఖ ముఖ్యకార్యదర్శి చిరంజీవి చౌదరి, ఆర్బీఐ రీజనల్ డైరెక్టర్ భాస్కర్ పాల్గొన్నారు. -
కనీస వేతనం రూ.18 వేలకు పెంచా«లి
ఏలూరు (సెంట్రల్) : రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో పనిచేస్తున్న కార్మికులందరికీ కనీస వేతనం రూ.18 వేలు అమలు చేయాలని, కనీసవేతనాల షెడ్యూల్‌ను వెంటనే సవరించాలని డిమాండ్ చేస్తూ స్థానిక కలెక్టరేట్ వద్ద గురువారం సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వి.ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ పదేళ్లుగా కార్మికుల కనీస వేతన చట్టాన్ని సవరించని ప్రభుత్వం ఎమ్మెల్యేలకు మాత్రం జీతాలు పెంచిన ఘనత ముఖ్యమంత్రికే దక్కుతుందన్నారు. కార్మికులందరికీ కనీస వేతనం రూ.18 వేలు అమలు చేయాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు కె.రాజారామ్మోహన్రాయ్ డిమాండ్ చేశారు. అనంతరం కలెక్టర్ కార్యాలయంలో వినతిపత్రాన్ని సమర్పించారు. సీఐటీయూ నాయకులు డీఎన్‌వీడీ ప్రసాద్, పి.కిషోర్, చింతకాయల బాబూరావు, ఆర్.లింగరాజు పాల్గొన్నారు. -
ప్రైవేట్ కంపెనీలకు పనిగంటలు తగ్గింపు!
దుబాయ్ః రంజాన్ నెలలో ప్రైవేట్ కంపెనీల పనిగంటలపై యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. రంజాన్ పవిత్ర మాసంలో కార్మికులకు ఎటువంటి జీతం తగ్గింపు లేకుండా రెండు గంటల పని సమయాన్ని తగ్గిస్తూ ప్రకటన చేసింది. కార్మిక సంబంధాలు, సవరణల నియంత్రణకు సంబంధించిన 1980 ఫెడరల్ చట్టం 08, ఆర్టికల్ 65 నిబంధన ప్రకారం కార్మికుల పనిగంటలకు సంబంధించిన నిబంధన అమల్లోకి తెచ్చినట్లు యూఏఈ మానవ వనరుల మంత్రిత్వ శాఖ నివేదించింది. ప్రభుత్వ మానవ వనరుల శాఖ ఫెడరల్ అథారిటీ ప్రకటన ప్రకారం రంజాన్ నెలలో ఉదయం 9 గంటలనుంచి 2గంటల వరకూ పని గంటలను సవరించినట్లు ప్రభుత్వం ప్రకటన జారీ చేసింది. తాజా ప్రకటన ప్రకారం అటు ప్రైవేట్ తో పాటు అన్ని ప్రభుత్వ రంగ సంస్థల్లోనూ రంజాన్ నెలంతా రెండు గంటల పని సమయం తగ్గిస్తూ తెచ్చిన నిబంధన అమల్లోకి వస్తుంది. తాజా నిబంధననను సోమవారం అమల్లోకి తెచ్చిన సందర్భంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రభుత్వ అధ్యక్షుడు షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్, యుఏఈ వైస్ ప్రెసిడెంట్, దుబాయ్ ప్రధానమంత్రి హెచ్ హెచ్ షేక్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్టౌమ్, ప్రజలకు రంజాన్ పండుగ సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. -
మొబైల్ ఫోన్ల రంగంలోకి ఉషా శ్రీరామ్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: గృహోపకరణాల తయారీలో ఉన్న ఉషా శ్రీరామ్ మొబైల్ ఫోన్ల విపణిలోకి అడుగు పెడుతోంది. జీఎస్ఎం, సీడీఎంఏ విభాగాల్లో ఫీచర్ ఫోన్లతోపాటు స్మార్ట్ఫోన్లను ప్రవేశపెట్టనుంది. ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లో కంపెనీ ప్రధానంగా దృష్టిసారిస్తుంది. ఇక ధరల శ్రేణి రూ.700 నుంచి రూ.10,000 వరకు ఉంటుంది. ముందుగా ఆరు ఫీచర్, నాలుగు స్మార్ట్ ఫోన్లను ప్రవేశపెడతామని ఉషా శ్రీరామ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ సత్నామ్ సంధు తెలిపారు. ఫిబ్రవరి చివరికల్లా ఇవి మార్కెట్లో ఉంటాయని చెప్పారు. ‘2016లో నెలకు 2 లక్షల యూనిట్లను విక్రయించాలన్నది కంపెనీ లక్ష్యం’అన్నారు. -
ఇంకా ఎన్ని నెలలో..?
సాక్షి, బళ్లారి : కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, పురసభ సభ్యులుగా గెలుపొందిన ప్రజాప్రతినిధులు నెల కాదు.. రెండు నెలలు కాదు ఏకంగా 11 నెలలు కావస్తున్నా అధికార బాధ్యతలు అప్పగించకపోవడంతో వారు ఉత్సవ విగ్రహాల్లా ఉన్నారు. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులుగా గెలుపొందిన వారు వెంటనే అధికార బాధ్యతలు చేపట్టి తమను గెలిపించిన ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు సిద్ధం అవుతుంటారు. అయితే ఇక్కడ ప్రజాప్రతినిధులుగా ఎన్నికై ఏడాది కావస్తున్నప్పటికీ బాధ్యతలు చేపట్టకపోవడంతో చేసేదేమీ లేక మిన్నకుండిపోతున్నారు. బళ్లారి జిల్లాలోనే కాక రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికల కంటే ముందే జరిగాయి. కార్పొరేషన్, మున్సిపాలిటీ, పట్టణ పంచాయతీ ఎన్నికలు జరిగిన తర్వాత అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. మార్చి నెలలో రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికలు జరిగాయి. కార్పొరేటర్లుగా గెలుపొందిన వారు తమకు అధికార బాధ్యతలు వెంటనే అప్పగిస్తారని ఆశించారు. అసెంబ్లీ ఎన్నికల కోడ్ రావడంతో మేయర్, ఉప మేయర్, మున్సిపాలిటీ, పురసభ అధ్యక్ష, ఉపాధ్యక్ష స్థానాలకు ఎన్నికలు వాయిదా పడ్డాయి. అప్పటి నుంచి నేటి వరకు స్థానిక సంస్థల తరుపున ప్రజాప్రతినిధులకు గ్రహణం పట్టింది. అనంతరం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మేయర్, ఉపమేయర్ ఎన్నికలకు రిజర్వేషన్లు ఖరారు చేశారు. రాష్ట్రంలో ఉన్న 9 కార్పొరేషన్లలో రెండు కార్పొరేషన్లకు ఎన్నికలు పూర్తి చేశారు. తర్వాత మంగళూరుకు చెందిన ఓ కార్పొరేటర్ మేయర్, ఉపమేయర్ల రిజర్వేషన్ల ప్రక్రియ సక్రమంగా లేదని కోర్టుకు వెళ్లడంతో స్థానిక సంస్థల తరుపున ఎన్నికైన ప్రజాప్రతినిధులందరికీ పదవులు అలంకరణకు శాపమైంది. ప్రజాప్రతినిధులుగా ఎంపికై 11 నెలలైనా ఎలాంటి బాధ్యతలు చేపట్టకపోవడంతో తమను ప్రజలకు సమాధానం చెప్పలేక సతమతమవుతున్నారు. కొంత కాలం కోర్టులో నానుతూ వచ్చిన ఈ వ్యవహారం ఎట్టకేలకు రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి చేసి రెండు నెలలలోపు మేయర్, ఉపమేయర్లతోపాటు మిగిలిన స్థానిక సంస్థలకు చెందిన రిజర్వేషన్ల ప్రక్రియ సక్రమంగా చేపట్టాలని సూచించడం తెలిసిందే. అయితే రెండు నెలల గడువు ఇవ్వడంతో ఇప్పట్లో ఎన్నికలు జరిగే అవకాశాలు కనిపించడం లేదని కార్పొరేటర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే లోక్‌సభ ఎన్నికల తర్వాతనే రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి చూసే అవకాశాలు కనిపిస్తున్నాయని పేరు చెప్పని ఓ కార్పొరేటర్ ఆవేదన వ్యక్తం చేశాడు. గెలుపొందిన ప్రజాప్రతినిధులకు బాధ్యతలు లేకపోవడంతో బళ్లారితోపాటు జిల్లా వ్యాప్తంగా మున్సిపాలిటి, పురసభల్లో సమస్యలు కుప్పలు తెప్పలుగా దర్శనమిస్తున్నాయి. అధికారులది ఆడిందే ఆట పాడిందే పాటగా మారిందని పలువురు కార్పొరేటర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.