మొబైల్ ఫోన్ల రంగంలోకి ఉషా శ్రీరామ్ | Usha Shriram to foray into mobile phone market | Sakshi
Sakshi News home page

మొబైల్ ఫోన్ల రంగంలోకి ఉషా శ్రీరామ్

Published Fri, Jan 15 2016 2:31 AM | Last Updated on Sun, Sep 3 2017 3:41 PM

మొబైల్ ఫోన్ల రంగంలోకి ఉషా శ్రీరామ్

మొబైల్ ఫోన్ల రంగంలోకి ఉషా శ్రీరామ్

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: గృహోపకరణాల తయారీలో ఉన్న ఉషా శ్రీరామ్ మొబైల్ ఫోన్ల విపణిలోకి అడుగు పెడుతోంది. జీఎస్‌ఎం, సీడీఎంఏ విభాగాల్లో ఫీచర్ ఫోన్లతోపాటు స్మార్ట్‌ఫోన్లను ప్రవేశపెట్టనుంది. ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లో కంపెనీ ప్రధానంగా దృష్టిసారిస్తుంది. ఇక ధరల శ్రేణి రూ.700 నుంచి రూ.10,000 వరకు ఉంటుంది. ముందుగా ఆరు ఫీచర్, నాలుగు స్మార్ట్ ఫోన్లను ప్రవేశపెడతామని ఉషా శ్రీరామ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ సత్నామ్ సంధు తెలిపారు. ఫిబ్రవరి చివరికల్లా ఇవి మార్కెట్లో ఉంటాయని చెప్పారు. ‘2016లో నెలకు 2 లక్షల యూనిట్లను విక్రయించాలన్నది కంపెనీ లక్ష్యం’అన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement