సాక్షి, హైదరాబాద్: అమెరికా పర్యటనలో ఉన్న రాష్ట్ర ఐటీ, పరిశ్ర మల శాఖ మంత్రి కె. తారక రామా రావు ఆదివారం షికాగోలో ఫుడ్ ప్రాసె సింగ్ రంగంపై అధ్య యనం చేశారు. ఇందులో భాగంగా పలు కంపెనీల ప్రతినిధుల తో పెట్టుబడులకు సంబంధించి వరుస సమావేశాలు నిర్వహించారు. ‘‘షికాగో ఫుడ్ స్టాప్‘ను సందర్శించి అక్కడ వరల్డ్ బిజినెస్ షికాగో సంస్థ ఏర్పాటుచేసిన సమావేశంలో మాట్లా డారు.
షికాగో ఫుడ్ స్టాప్‌లో ఏర్పాటు చేసిన అనేక షాపులను పరిశీలించారు. స్థానిక వ్యాపారవేత్తలతో సంభాషించారు. షికాగో అనుసరిస్తున్న ఫుడ్ ప్రాసెసింగ్ టెక్నాలజీ, ఫుడ్ ప్రొక్యూర్మెంట్ పద్ధతులపైన చర్చించారు. షికాగో ఫుడ్ స్టాప్ ఇన్నోవేషన్ ఈకో సిస్టం వ్యవస్థను తెలంగాణలో ఏర్పాటు చేసేందుకు సంసిద్ధంగా ఉన్నామని కేటీఆర్ తెలిపారు.
షికాగో ఫుడ్ స్టాప్ మాదిరి తెలంగాణలో కూడా..
షికాగో ఫుడ్ స్టాప్ మాదిరిం ఫుడ్ ప్రాసెసింగ్ పురోగతికి తెలంగాణ ఫుడ్ స్టాప్ ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తామని కేటీఆర్ వెల్లడించారు. ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో ఇన్నో వేషన్ ప్రాధాన్యత ఎంతగానో ఉందని, ఇది కేవలం ఫుడ్
ఇండస్ట్రీకి మాత్రమే కాకుండా వ్యవసాయ రంగంపైన ఆధార పడిన రైతులు, వ్యవసాయ సంబంధిత పరిశ్రమల్లోని భాగస్వాముల అభివృద్ధికి కూడా ఉపయోగపడుతుందని వివరించారు. ఫుడ్ ఇన్నోవేషన్ హబ్‌గా మారేందుకు కావలసిన అన్ని రకాల అవకాశాలు తెలంగాణలో ఉన్నాయన్నారు.
ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమ బలోపేతానికి..
ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమను బలోపేతం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం అనేక కార్యక్రమాలను చేపట్టిందన్నారు. ఆ మేరకే తెలంగాణ రాష్ట్రానికి ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో భారీ ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయని చెప్పారు. కోకా కోల, పెప్సీకో, ఐటీసీ వంటి దిగ్గజ సంస్థలు తెలంగాణ రాష్ట్రంలో పెట్టిన పెట్టుబడుల గురించి ప్రస్తావించారు. తెలంగాణ రాష్ట్రం ఫుడ్ ప్రాసెసింగ్ రంగం అభివృద్ధి కోసం పదివేల ఎకరాలకు పైగా కేటాయించి ప్రత్యేక ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లను ఏర్పాటు చేస్తున్న విషయాన్ని కేటీఆర్ వివరించారు.
నిజామాబాద్ ఐటీ హబ్‌లో క్రిటికల్ రివర్ సంస్థ
నిజామాబాద్ ఐటీ హబ్ లో అమెరికాకు చెందిన క్రిటికల్ రివర్ సంస్థను ఏర్పాటు చేసేందుకు ఆ కంపెనీ ప్రతినిధులు అంగీకరించిన్నట్లు బీఆర్‌ఎస్ ఎన్నారై సెల్ కోఆర్డినేటర్ మహేష్ బిగాల తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment