Businessman
-
వ్యాపారవేత్తతో నటి పెళ్లి ఫిక్స్ : భలే ఇంప్రెస్ చేశాడుగా! ఎంగేజ్మెంట్ ఫోటోలు వైరల్
హౌస్‌ఫుల్ 2-స్టార్, సింగర్ షాజాన్ పదమ్సీ గుడ్‌న్యూస్ చెప్పేసింది. తన చిరకాల ప్రియుడు,వ్యాపారవేత్త ఆశిష్ కనకియాతో వచ్చే ఏడాది వివాహ బంధంలోకి అడుగు పెట్టనుంది. అంతేకాదు అతనితో ఎంగేజ్మెంట్ పూర్తి చేసుకున్న షాజాన్ దీనికి సంబంధించిన ఫోటోలను ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. కలకాలం నీతో జీవించేందుకు ఎదురు చూస్తున్నా అని పేర్కొంది. మూవీమాక్స్ సినిమాస్ సీఈఓ, కనకియా గ్రూప్ డైరెక్టర్ ఆశిష్‌ను వచ్చే ఏడాది పెళ్లాడనుంది. ఈ సందర్భంగా తమ లవ్ స్టోరీని, ఆశిష్ ఆకట్టుకునే అద్భుతమైన సెట్టింగ్‌తో తనను ఇంప్రెస్ చేసిన తీరును వెల్లడించింది. తనను తాను ఓల్డ్-స్కూల్ రొమాంటిక్ అని చెప్పుకునే షాజాన్, బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్‌తో కలిసి రాకెట్ సింగ్ , హౌస్‌ఫుల్ 2 సినిమాలతో బాగా పాపులర్ అయింది. ఈమె మంచి గాయని కూడా. బాలీవుడ్ ప్రముఖ గాయని షారన్ ప్రభాకర్, గాంధీ సినిమాలో జిన్నా పాత్రలో మెప్పించిన నటుడు దివంగత అలిక్ పదమ్‌సీల కుమార్తె షాజాన్.ఆశిష్ అందమైన పూలతో అలకరించిన వేదికపై ఆమెకు అందంగా ప్రతిపాదించాడు. గత రెండున్నరేళ్లలో వారి చిత్రాలు జ్ఞాపకాలన్నింటినీ కలిపి కస్టమైజ్ చేసిన ఫోటో వాల్‌తో నవంబర్ 13న షాజాన్కు ప్రపోజ్ చేశాడు. షాజాన్ తన చిన్ననాటి స్నేహితురాలు ద్వారా ఆశిష్‌ని కలిసినటటు తెలిపింది. అలా సాగిన పరిచయం, డేటింగ్, పెళ్లి దాకా వచ్చిందని గుర్తు చేసుకుంది. తాము విభిన్న నేపథ్యాలనుండి వచ్చినప్పటికీ, అభిరుచులూ, ప్రధాన విలువలు ఒకటేనని తెలిపింది. ముఖ్యంగా కొత్త ప్రదేశాలకు వెళ్లడం , ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంగీత ఉత్సవాలకు వెళ్లడంపై ఆసక్తి ఇద్దరికీ ఉందని వెల్లడించింది. అంతేకాదు తన కాబోయే భర్త క్రమశిక్షణ, నీట్నెస్ ఫ్రీక్ అని,ఆశిష్‌కు నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం కూడా మెండుగా ఉందంటూ మురిసిపోయింది. View this post on Instagram A post shared by Shazahn Padamsee (@shazahnpadamsee) -
ఈ అరటి పండు రూ. 52 కోట్లు
వీధుల్లో దొరికే పెద్ద సైజు అరటి పండు ఒకటి మహా అంటే ఐదారు రూపాయలు ఉంటుందేమో. అందులోనూ ఇంట్లో పిల్లాడు ఆడుకుంటూ ఒక అరటి పండును గోడకు ఒక గట్టి టేప్‌తో అతికించాక దాని విలువ ఎంత అంటే.. అనవసరంగా పండును పాడుచేశావని పిల్లాడిని అంతెత్తున కోప్పడతాం. అయితే అచ్చం అలాంటి అరటి పండునే, అలాగే ఒక ఫ్రేమ్‌కు గట్టి టేప్‌తో అతికిస్తే ఒక ఔత్సాహిక కళా ప్రేమికుడు ఏకంగా రూ.52 కోట్లు పెట్టి కొన్నారంటే నమ్మగలరా?. కానీ ఇది వంద శాతం వాస్తవం. అచ్చంగా అమెరికాలోని న్యూయార్క్ నగరంలో బుధవారం జరిగిన వేలంపాటలో ఇది 6.2 మిలియన్ అమెరికన్ డాలర్లకు అమ్ముడుపోయింది. చిత్రమైన కళాఖండాలు సృష్టించే ఇటలీ కళాకారుడు మారిజో కాటెలాన్ మనోఫలకం నుంచి జాలువారి ఫ్రేమ్‌కు అతుక్కున్న కళాఖండమిది అని అక్కడి కళాపోషకులు ఆయనను పొగడ్తల్లో ముంచెత్తడం విశేషం. పాశ్చాత్య కళాకారుల్లో చిలిపివాడిగా మారిజోకు పేరుంది. బుధవారం ప్రఖ్యాత ‘సోత్వే’ వేలం సంస్థ నిర్వహించిన వేలంపాటలో మరో ఆరుగురు బిడ్డర్లను వెనక్కినెట్టి మరీ చైనాకు చెందిన క్రిప్టోకరెన్సీ యువ వ్యాపారవేత్త జస్టిన్ సన్ ఈ కళాఖండాన్ని ఇన్ని డబ్బులు పోసిమరీ సొంతంచేసుకున్నారు. ‘‘ ఇలాంటి అపూర్వ కళాఖండాలంటే నాకెంతో ఇష్టం. ఈ అరటి పండును చూస్తుంటే తినాలనిపిస్తుంది. త్వరలో దీనిని అమాంతం ఆరగిస్తా’ అని జస్టిన్ సన్ సరదాగా వ్యాఖ్యానించారు. అమెరికాలో అత్యున్నత శ్రేణి పండ్ల దుకాణంలో దాదాపు రూ.30 ఉండే ఈ ఒక్క అరటి పండు ఇంతటి ధర పలకడం ప్రపంచవ్యాప్తంగా కళాఖండాలను కొనే వ్యాపారులనూ ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఊహించిన ధర కంటే నాలుగు రెట్లు అధిక ధరకు అమ్ముడుపోయిందని సోత్బే సంస్థ పేర్కొంది. వేలంపాటల చరిత్రలో ఒక ఫలం ఇంతటి ధర పలకడం ఇదే తొలిసారి అని వేలంపాట వర్గాలు వెల్లడించాయి. 2019లో మియామీ బీచ్‌లోని ఆర్ట్ బాసెల్ షోలో తొలిసారిగా ‘కమేడియన్’ పేరిట ఈ పండును ప్రదర్శించారు. దానిని చూసినవారంతా ‘అసలు ఇదేం ఆర్ట్?. దీనిని కూడా ఆర్డ్ అంటారా?’ అంటూ పలువురు విమర్శించారు. అయితే ఐదేళ్ల క్రితమే ఇది 1,20,000 డాలర్ల ధర పలికి ఔరా అనిపించింది. గతంలో వచ్చిన విమర్శలపై తాజాగా జస్టిన్ సన్ స్పందించారు. ‘‘ ఈ ఘటనను కేవలం కళగానే చూడకూడదు. ఇదొక సాంస్కృతిక ధోరణుల్లో మార్పుకు సంకేతం. కళలు, మీమ్స్, క్రిప్టో కరెన్సీ వర్గాల మధ్య వారధిగా దీనిని చూడొచ్చు. పండు ఇంతటి ధర పలకడం ఏంటబ్బా ? అని మనుషుల ఆలోచనలకు, చర్చలకు ఇది వేదికగా నిలుస్తుంది. చరిత్రలోనూ స్థానం సంపాదించుకుంటుంది’ అని జస్టిన్ వ్యాఖ్యానించారు. మారుతున్న పండు !వాస్తవానికి 2019లో ప్రదర్శించిన పండు ఇది కాదు. 2019లో దీనిని ప్రదర్శించినపుడు అది పాడయ్యేలోపే అక్కడి కళాకారుడు డేవిడ్ డట్యూనా తినేశాడు. ఆకలికి ఆగలేక గుటకాయ స్వాహా చేశానని చెప్పాడు. ‘‘ప్రపంచంలో క్షుద్బాధతో ఎంతో మంది అల్లాడుతుంటే పోషకాల పండును ఇలా గోడకు అతికిస్తారా?. అయినా 20 సెంట్లు విలువచేసే పండు నుంచి కోట్లు కొల్లకొ డుతున్న ఈ కళాకారుడు నిజంగా మేధావి’’ అని డేవిడ్ వ్యాఖ్యానించాడు. 1,20,000 డాలర్లకు అమ్ముడుపోయాక దీనిని ఆయన తిన్నారు. తర్వాత మరో పండును ప్రదర్శనకు పెట్టారు. దానిని గత ఏడాది దక్షిణకొరియాలోని సియోల్ సిటీలోని ‘లీయిమ్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్’లో ప్రదర్శనకు ఉంచినపుడు నోహ్ హుయాన్ సో అనే విద్యార్థి తినేశాడు. ఇప్పుడు వేలంపాటలో అమ్ముడుపోయింది కొత్త పండు. అత్యంత గట్టిగా అతుక్కునే ‘డక్ట్’ టేప్‌తో ఫ్రేమ్‌కు ఈ పండును అతికించారు. ఈ కళాఖండాన్ని సృష్టించిన మారి జో కాటెలాన్ గతంలో ఇలాంటి వింత కళారూ పాలను తయారుచేశారు. 18 క్యారెట్ల పుత్తడితో నిజమైన టాయిలెట్‌ను రూపొందించారు. దానికి ‘అమెరికా’ అని పేరు పెట్టారు. దీనిని ప్రదర్శనకు పెట్టుకుంటే అప్పుగా ఇస్తానని కాబోయే అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు ఈయన గతంలో ఒక ఆఫర్ కూడా ఇచ్చాడట. కొన్న వ్యక్తిపై గతంలో ఆరోపణలుపండును కొనుగోలుచేసిన జస్టిన్ సన్ ప్రస్తుతం చైనాలో ట్రోన్ పేరిట బ్లాక్‌చైన్ నెట్వర్క్ వ్యాపారం చేస్తున్నారు. కొన్ని క్రిప్టోకరెన్సీల లావాదేవీలను పర్యవేక్షిస్తు న్నారు. ట్రోన్ క్రిప్టో టోకెన్ అయిన టీఆర్ఎస్ విలువను కృత్రిమంగా అమాంతం పెంచేసి మోసానికి పాల్పడుతున్నాడని జస్టిన్‌పై అమెరికా ప్రభుత్వం ఆరోపించింది. ఈ మేరకు అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్సే్ఛంజ్ కమిషన్ కేసు కూడా వేసింది. అయితే ఆ ఆరోపణలను జస్టిన్ తోసిపు చ్చారు. 2021–23లో ఈయన ప్రపంచ వాణిజ్య సంస్థలో గ్రెనడే దేశ శాశ్వత ప్రతినిధిగా ఉన్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఆర్ధిక ఇబ్బందులు తాళలేక.. వ్యాపారవేత్త ఆత్మాహుతి
బెంగళూరు: ఆర్థిక ఇబ్బందులు నిండు ప్రాణాల్ని బలి తీసుకున్నాయి. ఓ వ్యాపారి ఆర్థిక ఇబ్బందులు తాళలేక బతికుండగానే ఆత్మాహుతికి పాల్పడ్డాడు.పోలీసుల వివరాల మేరకు.. ప్రదీప్ హోటల్ కన్సల్టెంట్ బిజినెస్ చేస్తున్నారు. అయితే వ్యాపారంలో నష్టం రావడంతో ఆర్ధిక ఇబ్బందులు తలెత్తాయి. తీసుకున్న అప్పులకు వడ్డీలు పెరిగిపోవడం, అప్పులు ఇచ్చిన వారి నుంచి ఒత్తిడి ఎక్కువైంది. దీంతో ఆర్ధిక ఇబ్బందులు తాళలేక ప్రదీప్ బతికుండగానే ఆత్మాహుతి చేసుకోవడంతో విషాదం చోటు చేసుకుంది.బెంగళూరు నగర శివారు ప్రాంతమైన ముద్దీన్పాళ్యకు ప్రదీప్ తన స్కోడా కారులో వచ్చాడు. అనంతరం కారు సీట్లో ఉన్న ప్రదీప్ కారుకు నిప్పంటించాడు. అయితే కారు నుంచి మంటలు రావడంతో భయాందోళనకు గురైన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కారులో ఉన్న ప్రదీప్ ఊపిరాడక ప్రాణాలు కోల్పోయినట్లు నిర్ధారించారు. అంనతరం బాధితుడి కుటుంబానికి సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. On Saturday afternoon,a 42 yr old businessman Mr Pradeep was charred to death inside his car at Muddinpalya in Bengaluru. Prima Facie suggests a case of death by suicide.Police have registered the case of Unnatural Death.. pic.twitter.com/JOCTeYLBif— Yasir Mushtaq (@path2shah) November 16, 2024 -
బిల్డింగ్ కట్టిన కాంట్రాక్టర్‌కు కోటి రూపాయల వాచ్ గిఫ్ట్
పంజాబ్‌లో నివాస భవనాన్ని నిర్మించిన కాంట్రాక్టర్‌కు కోటి రూపాయల విలువైన రోలెక్స్ వాచ్‌ను బహుమతిగా ఇచ్చాడో వ్యాపారవేత్త. నాణ్యతగా, వేగవంతంగా నిర్మాణాన్ని పూర్తి చేయడంతలో కాంట్రాక్టర్ రాజిందర్ సింగ్ రూప్రా చూపిన ఖచ్చితమైన శ్రద్ధను గుర్తిస్తూ ఆయనకు ఈ బహుమతి అందించినట్లు భవన యజమాని గుర్దీప్ దేవ్‌బత్ చెప్పారు.కాంట్రాక్టర్ రాజిందర్ సింగ్ రూప్రా అందుకున్న ఈ వాచ్ 18-క్యారెట్ల బంగారంతో రూపొందించిన రోలెక్స్ ఓస్టెర్ పెర్పెచ్యువల్ స్కై-డ్వెల్లర్. చూడగానే బంగారు కాంతులతో ధగాధగా మెరిసిపోతున్న ఈ వాచ్‌కి బలమైన బంగారు లింక్‌లతో తయారైన సిగ్నేచర్ ఓస్టెర్ బ్రాస్లెట్ ఉంది. అలాగే ఇందులో షాంపైన్-రంగు డయల్ కూడా ఉంది.200 మందికిపైగా కార్మికులుపంజాబ్లోని జిరాక్పూర్ సమీపంలో 9 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన భవనం విషయానికి వస్తే ఇది ఆధునిక కోటను పోలి ఉంటుంది. పంజాబ్‌లోని షాకోట్‌కు చెందిన రూప్రా అనే కాంట్రాక్టర్ అనుకున్న ప్రకారం రెండు సంవత్సరాల వ్యవధిలో 200 మందికి పైగా కార్మికులతో నిరంతరం పనులు చేసి నిర్మాణం పూర్తి చేశారు.వాస్తుశిల్పి రంజోద్ సింగ్ భవనం డిజైన్‌ను రూపొందించారు. దృఢమైన సరిహద్దు గోడతో ఒక ప్రైవేట్ కోటలా దీన్ని నిర్మించారు. ఇందులో విశాలమైన హాళ్లు, అత్యంత సుందరంగా తీర్చిదిద్దిన గార్డెన్లు ఉన్నాయి. అంతేకాకుండా నిర్మాణపరంగా విశిష్టమైన ప్రత్యేకతలెన్నో ఈ భవనంలో ఉన్నాయి. -
IT Raid : దుల్హన్ హమ్ లేజాయేంగే..
ఐటీ టీమ్‌ల గ్రేట్ డ్రామాదుమ్మురేపిన బారాత్బడాబాబులు బేజారు రెండేళ్ల కిందట.. మహారాష్ట్ర, జాల్నా.. ప్రధాన రహదారంతా పెళ్లి బారాత్‌తో నిండిపోయింది. అవును మరి.. ఒకటా రెండా.. దాదాపు 120 కార్లలో బయలుదేరారు మగపెళ్లివారు. ‘దుల్హన్ హమ్ లేజాయేంగే’ అనే స్టికర్స్‌ని విండ్ షీల్డ్స్ మీద అతికించుకుని! పాటలు పాడుతూ, మధ్యమధ్యలో ఆ కార్లను స్లో చేసుకుంటూ.. బ్యాండ్ మేళం వాయించే బాలీవుడ్ పాటలకు స్టెప్పులు వేస్తూ.. పెళ్లి కొడుకు చేత డాన్స్ చేయిస్తూ.. లోకంలోని పెళ్లి కళ, సందడంతా వాళ్లతోనే అన్నట్లుంది ఆ సంబడం! ఆ దారి పొడవున ఉన్న జాల్నా వాసులంతా ఆశ్చర్యపోయారు ‘ఎవరింటికబ్బా.. ఇంత ఘనమైన బారాత్’ అనుకుంటూ! ఓ కూడలి దాకా వెళ్లగానే ఆ 120 కార్లు అయిదు టీమ్‌లుగా విడిపోయాయి. ఓ టీమ్ జాల్నాలోని ఓ స్టీల్ ఫ్యాక్టరీని, ఇంకో టీమ్ టెక్స్టైల్ మిల్‌ను, మరో టీమ్ ఆ రెండు ఫ్యాక్టరీలకు చెందిన యజమానుల ఇళ్లను, వేరే టీమ్ ఫామ్హౌసెస్ను, ఒక టీమేమో అక్కడి కో ఆపరేటివ్ బ్యాంక్‌కి.. వెళ్లాయి. ఆయా చోట్లకు చేరుకోగానే ఆ బృందాల్లోని సభ్యులంతా ఒక్కసారిగా సీరియస్ అయిపోయారు. ‘ఫ్రమ్ నాసిక్ ఐటీ డిపార్ట్మెంట్’ అని ఐడీ చూపిస్తూ రెయిడ్స్‌కి దిగారు. సదరు యజమానులు హతాశులయ్యారు. బ్యాంక్ వాళ్లు .. ఐటీ ఉద్యోగులకు అవసరమైన సమాచారం ఇవ్వడానికి సిద్ధపడ్డారు. సోదాలు మొదలయ్యాయి. ఫ్యాక్టరీల్లో, ఇళ్లల్లో ఏమీ దొరకలేదు. ఫామ్హౌసెస్ను అంగుళం అంగుళం గాలించారు. అక్కడ సీక్రెట్ రూమ్స్ బయటపడ్డాయి. వాటిల్లోనే లెక్కతేలని డబ్బు కోట్లలో దొరికింది. డాక్యుమెంట్స్ కూడా కనిపించాయి. బినామీ పేర్లతో ఉన్న అకౌంట్ల వివరాలు తెలిశాయి. వెంటనే వీళ్లు కో ఆపరేటివ్ బ్యాంక్‌లో తనిఖీలో ఉన్న ఐటీ టీమ్‌కి సమాచారమిచ్చారు. దాంతో బ్యాంక్‌లోని టీమ్ పని సులువైపోయింది. ఆ వివరాల ప్రకారం అకౌంట్స్ చెక్ చేశారు. లాకర్స్‌లో ఉన్న నగలను తీశారు. అదే సమయంలో యజమానులకు సంబంధించి ఔరంగాబాద్, నాసిక్, ముంబైల్లో ఉన్న ఇళ్లు, ఆఫీస్‌లలోనూ సోదా జరిగింది. రూ. 56 కోట్ల డబ్బు, 32 కిలోల బంగారం, రూ.14 కోట్ల విలువైన ముత్యాలు, వజ్రాలను సీజ్ చేశారు. మొత్తం అన్ని చోట్లా దొరికిన ఆ ఆస్తుల విలువ రూ. 390 కోట్లు. లెక్కాపత్రాల్లేని ఆ డబ్బునంతా జాల్నా స్టేట్ బ్యాంక్ మెయిన్ బ్రాంచ్‌కి తీసుకెళ్లి లెక్కించారట. దాన్ని లెక్కించడానికి ఐటీ టీమ్‌కి పదమూడు గంటల సమయం పట్టింది. స్టీల్, టెక్స్టైల్, రియల్ ఎస్టేట్ రంగాల్లో పేరుమోసిన వ్యాపార సంస్థలు ఎస్సార్జే పీటీ స్టీల్స్ ప్రైవేట్ లిమిటెడ్, కలికా స్టీల్ మాన్యుఫాక్చర్స్కి సంబంధించిన యజమానులపై జరిగిన ఈ రెయిడ్ దాదాపు అయిదురోజుల పాటు సాగింది. ఇందులో నాసిక్, పుణే, ఠాణే, ముంబై ఐటీ డిపార్ట్మెంట్లోని సుమారు 260 మంది ఉద్యోగులు పాల్గొన్నారు. జాల్నాకు చెందిన ఓ సోర్స్ ద్వారా సమాచారం అందుకున్న నాసిక్ ఐటీ డిపార్ట్మెంట్ ఈ రెయిడ్కి రూపకల్పన చేసింది. యజమానులకు ఏ మాత్రం అనుమానం రాకుండా జాగ్రత్తపడింది. డిపార్ట్మెంట్ వాహనాలు వాడితే యజమానులు అప్రమత్తమవుతారని భావించి 120 వాహనాలను అద్దెకు తీసుకున్నారు. అలాగే ఫార్మల్గా వెళితే వాళ్లకు ఉప్పందే ప్రమాదం ఉంటుందని అలా పెళ్లి బృందంలా తయారయ్యారు. ఆ ఆపరేషన్‌కి ‘దుల్హన్ హమ్ లేజాయేంగే’ అని పేరుపెట్టుకున్నారు. సినిమా ఫక్కీలో జరిగిన ఈ రెయిడ్ దేశవ్యాప్తంగా వైరల్ అయింది. -
భార్య ముందే వేరే యువతులతో భర్త అశ్లీల పనులు..
రాయచూరు రూరల్: ఏడడుగులు నడిచి అగ్ని సాక్షిగా చేసుకున్న వైవాహిక బంధం కొందరి వల్ల నవ్వుల పాలవుతోంది. దంపతుల్లో ఎవరో ఒకరు పర వ్యామోహానికి గురై కాపురంలో చిచ్చు పెట్టుకుంటున్నారు. ఆపై చట్టానికి చిక్కి ఊచలు లెక్కించే ఘటనలు ఎక్కడో ఒకచోట బయటపడుతున్నాయి. బెళగావి నగరంలోనూ అదే జరిగింది.చంపి, కళ్లను దానం చేసివివరాలు.. ఈ నెల 9వ తేదీన బెళగావి మహంతేష్ నగరలో నివాసమున్న పారిశ్రామికవేత్త సంతోష్ పద్మణ్ణవర్ (47) గుండెపోటుతో చనిపోయాడని ఆయన భార్య ఉమ పద్మణ్ణవర్ అందరికీ చెప్పి అంత్యక్రియలు జరిపించింది. పైగా భర్త కళ్లను దానం చేసింది. బెంగళూరులో చదువుకుంటున్న వారి కుమార్తె సంజన ఇంటికి వచ్చాక ఏదో జరిగిందని గ్రహించి 3 రోజుల కిందట స్థానిక మాళమారుతి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు లోతుగా దర్యాప్తు చేయగా నివ్వెరపరిచే సంగతులు వెలుగు చూశాయి. సంతోష్ నిరంతరం యువతులను ఇంటికి తెచ్చుకుని వారితో గడిపేవాడు. ఇంట్లో భార్య ముందే వారితో నగ్నంగా సంచరించేవాడు. ఇంటి సీసీ కెమెరాల 13 హార్డ్ డిస్కులను, రికార్డర్లను తనిఖీ చేయగా అవే దృశ్యాలు కనిపించడంతో కంగుతిన్నారు.విరక్తి పుట్టి..భర్త వైఖరిని చూసి భార్య ఉమకు విరక్తి పుట్టింది. ఫేస్బుక్ స్నేహితులైన ఇద్దరు యువకులు శోభిత్ గౌడ (31), పవన్ (35)కు విషయం తెలిపింది. ప్లాన్ ప్రకారం సంతోష్‌కు నిద్రమాత్రలు మింగించారు. నిద్రలోకి జారుకోగానే దిండుతో ఊపిరాడకుండా హత్యచేశారు. పోలీసులు ఉమ ను విచారించగా భర్త ప్రవర్తనను ఏకరువు పెట్టింది. తమ పిల్లల ముందు కూడా నగ్నంగా తిరిగేవాడని, ఇది తట్టుకోలేక తాను ఫేస్బుక్ మిత్రులతో కలసి భర్తను హత్య చేశామని నేరం అంగీకరించింది. ఆ కుటుంబం కథ విని పోలీసులే ఆశ్చర్యపోయారు. ఆమె శోభిత్ గౌడతో సన్నిహితంగా ఉండేదని గుర్తించారు.హార్డ్ డిస్కుల నిండా అవేబనశంకరి: సంతోష్ ఇంటిలో సీజ్ చేసిన హార్డ్ డిస్కుల్లో హతుడు సంతోష్ యువతులు, మహిళలతో ఉన్న ప్రైవేటు వీడియోలు అనేకం ఉన్నాయి. మహిళలతో గడుపుతూ మొబైల్‌తో వీడియోలు తీసుకునేవాడు. తరువాత వాటిని కంప్యూటర్లో భద్రపరిచేవాడు. నిందితులను జైలుకు తరలించారు. -
రతన్ టాటా వ్యాపారవేత్త మాత్రమే కాదు.. స్టార్ హీరోతో సినిమా
ప్రముఖ వ్యాపారవేత్త, టాటా గ్రూప్ దిగ్గజం రతన్ నావల్ టాటా నింగికేగిశారు. అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన ఆయన తుదిశ్వాస విడిచారు. మనదేశంలో దిగ్గజ వ్యాపారవేత్తగా పేరు గడించారు. ఆయన మృతి పట్ల దేశవ్యాప్తంగా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మరణం పట్ల దేశవ్యాప్తంగా ప్రజలు కూడా నివాళులర్పిస్తున్నారు.అయితే రతన్ నావల్ టాటా కేవలం వ్యాపారవేత్త అని మనందరికీ తెలుసు. కానీ ఆయన కళాపోషణ కూడా ఉందన్నది చాలామందికి తెలియదు. కేవలం పారిశ్రామికవేత్తగానే కాకుండా.. రతన్ టాటాకు సినిమాలంటే అమితమైన ఆసక్తి. గతంలో అంటే 2004లో ఒక బాలీవుడ్ చిత్రానికి సహ నిర్మాతగా ఉన్నారు. అమితాబ్ బచ్చన్, జాన్ అబ్రహం, బిపాసా బసు నటించిన ఏట్బార్ అనే మూవీ నిర్మాతల్లో ఒకరిగా ఉన్నారు. రతన్ టాటా ఈ చిత్రాన్ని జతిన్ కుమార్‌తో కలిసి టాటా బీఎస్ఎస్ బ్యానర్‌పై నిర్మించారు. ఈ సినిమాకు విక్రమ్ భట్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాను రొమాంటిక్ సైకలాజికల్ థ్రిల్లర్‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.అయితే ఈ మూవీకి బాక్సాఫీస్ వద్ద పెద్దగా రాణించలేకపోయింది. బాలీవుడ్ స్టార్స్ ఉన్నప్పటికీ బాక్సాఫీస్ వద్ద కష్టాల్లో పడింది. ఈ సినిమాను రూ. 9.50 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించగా.. కేవలం రూ.7.96 కోట్లు మాత్రమే వసూలు చేసింది. రతన్ టాటా నిర్మించిన ఏకైక చిత్రం ఇదే కావడం విశేషం. -
వ్యాపారి అదృశ్యం కలకలం.. బిడ్జ్ వద్ద ప్రమాదానికి గురైన కారు
బెంగళూరు: కర్నాటకలో ఓ వ్యాపారవేత్త అదృశ్యం కలకలం రేపుతోంది. ఆ వ్యాపారికి సంబంధించి ప్రమాదానికి గురైన బీఎండబ్ల్యూ కారును మంగళూరులోని ఓ బిడ్జ్ వద్ద ఆదివారం పోలీసులు గుర్తించారు. కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే మొహియుద్దీన్ బావా సోదరుడు వ్యాపారవేత్త ముంతాజ్ అలీ ఆదివారం ఉదయం నుంచి కనిపించకుండా పోయారు. ఆయన కుమార్తె పోలీసులు ఇచ్చిన ఫిర్యాదు ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. రంగంలోకి దిగిన పోలీసులు ఆయన కోసం సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం తెల్లవారుజామున 3 గంటలకు వ్యాపారవేత్త ముంతాజ్ అలీ తన ఇంటి నుంచి బయలుదేరి కారులో మంగళూరు నగరం చుట్టూ తిరిగారు. 5 గంటల సమయంలో మంగళూరులోని కులూరు వంతెన దగ్గర ఆయన కారు ఆపారు. కారులో ప్రమాదానికి సంబంధించిన కొన్ని గుర్తులు ఉన్నాయని తెలిపారు. తన తండ్రి అదృశ్యానికి సంబంధించి ముంతాజ్ అలీ కుమార్తె స్థానిక పోలీసులకు సమాచారం అందించటంతో ఈ విషయం వెలుగులోకి వచ్చిందని మంగళూరు పోలీస్ కమిషనర్ అనుపమ్ అగర్వాల్ వెల్లడించారు.ముంతాజ్ అలీ కోసం పోలీసులు గాలింపు చర్యలు ప్రారంభించారు. అయితే.. ఆయన వంతెనపై నుంచి దూకి ఉండవచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నదిలో గాలించడానికి స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, కోస్ట్ గార్డ్లను మోహరించినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.చదవండి: రూ. 1,800 కోట్ల విలువైన భారీ డ్రగ్స్ పట్టివేత -
మిడిల్ క్లాస్ అబ్బాయి.. నేడు బిలియనీర్ కుర్రాడు
అత్యంత పోటీ ఉండే వ్యాపార రంగంలో కొంతమంది సంచలనంగా దూసుకొస్తారు. అలాంటివారిలో ఒకరే పెరల్ కపూర్. ఎన్నో ఏళ్లు వ్యాపారంలో తలలు పండితేగానీ రాని గుర్తింపు, ఘనతలు ఈయన చిన్న వయసులోనే సొంతం చేసుకున్నారు. 27 ఏళ్ల వయసుకే బిలియన్ డాలర్ల సంపదను ఆర్జించారు. పెరల్ కపూర్ దేశంలోనే అత్యంత పిన్న వయస్కుడైన బిలియనీర్‌గా నిలిచారు.ప్రపంచంలో అత్యంత ప్రభావశీలురైన బిజినెస్మెన్లలో ఒకరైన పెరల్ కపూర్‌కు అంతర్జాతీయ రియల్ ఎస్టేట్ కంపెనీ ఉంది. అలాగే బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ, సైబర్ సెక్యూరిటీలో అగ్రగామి సంస్థ అయిన జైబర్ 365 గ్రూప్ వ్యవస్థాపకుడు, ఛైర్మన్‌గా ఉన్నారు. మరిన్ని వ్యాపారాలు స్థాపించే యోచనలో ఉన్న పెరల్ కపూర్ ప్రస్తుత నెట్‌వర్త్ 1.1 బిలియన్ డాలర్లు అంటే భారత కరెన్సీలో సుమారు రూ. 9,243 కోట్లు.మధ్యతరగతి కుటుంబం నుంచి..పెరల్ కపూర్ ప్రయాణం అంత సునాయాసంగా సాగలేదు. మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన కపూర్ ఎప్పుడూ ఏదో ఒకటి సాధించాలనే కసితో ఉండేవాడు. కంప్యూటర్ సైన్స్, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్‌లో రాణించిన పెరల్‌కు చిన్ననాటి నుంచే టెక్నాలజీపై ఆసక్తి ఉండేది. పాఠశాల విద్యను పూర్తి చేసిన తర్వాత కపూర్ ప్రతిష్టాత్మకమైన క్వీన్ మేరీ యూనివర్శిటీ ఆఫ్ లండన్‌లో సీటు సాధించి ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్‌లో ఎంఎస్ఈ చేశారు. లండన్‌లో ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్‌గా తన వృత్తిని ప్రారంభించి బ్లాక్‌చెయిన్ ఎడ్యుకేషన్, సైబర్‌సెక్యూరిటీలో సంచలనాత్మక వెంచర్‌ను స్థాపించారు.ఇంటర్న్‌షిప్‌లతో ప్రారంభంపెరల్ కపూర్ కెరియర్ దేశ, విదేశాలలోని ప్రముఖ టెక్ సంస్థలలో ఇంటర్న్‌షిప్‌లతో చాలా సాంప్రదాయ మార్గంలో ప్రారంభమైంది. లండన్‌లోని ఇన్వెస్ట్మెంట్ బ్యాంకులలోనూ ఆయన ఇంటర్న్‌షిప్‌లు చేశారు. అయినప్పటికీ ఆయనలో ఉన్న వ్యవస్థాపక స్ఫూర్తి అనతికాలంలోనే బయటపడింది. 2019లో లండన్‌లోని క్వీన్ మేరీ యూనివర్శిటీ నుండి పోస్ట్ గ్రాడ్యుయేట్ అయిన తర్వాత 2023 మేలో జైబర్ (Zyber) 365 గ్రూప్‌ని స్థాపించి సాహసోపేతమైన అడుగు వేశారు.జైబర్ 365 గ్రూప్ వెంచర్ క్యాపిటల్ ప్రపంచం దృష్టిని తక్కువ రోజుల్లోనే ఆకర్షించింది. పెట్టుబడి పెట్టేందుకు ఇన్వెస్టర్లు ముందుకువచ్చారు. ప్రీ రెవెన్యూ నిధుల సేకరణలో జైబర్ 365 గ్రూప్ విశేషమైన ప్రయాణం టెక్ పరిశ్రమలో ఒక కొత్త ఉదాహరణను నెలకొల్పింది. కంపెనీ వాల్యుయేషన్ పెరుగుతున్న ట్రెండ్‌ను ప్రతిబింబిస్తుంది. ఉత్పత్తులు ఇంకా మార్కెట్‌కు సిద్ధంగా లేకపోయినా వినూత్న ఆలోచనలకు మద్దతు ఇవ్వడానికి ఇన్వెస్టర్లు సిద్ధంగా ఉన్నారు.నిరాడంబర జీవనశైలి పెరల్ కపూర్ ప్రస్తుతం మొనాకోలో నివసిస్తున్నారు. ఎప్పుడూ పనిలోనే నిమగ్నమయ్యే పెరల్ విలాసవంతమైన జీవితానికి కాస్త దూరంగానే ఉంటారు. అంత సంపద ఉన్నప్పటికీ నిరాడంబరమైన జీవనశైలికి ప్రసిద్ధి చెందారు. కొత్త వ్యాపార వెంచర్లతో కొత్త ఆలోచనలను తీసుకురావడానికి తన టీమ్‌తో కలిసి పని చేస్తూ ఎక్కువ సమయం ఆఫీసులోనే గడుపుతారు. చదవడం, ప్రయాణించడంతోపాటు కొత్త సాంకేతిక పోకడలను అన్వేషించడాన్ని ఆనందిస్తారు. బుగట్టి సెంటోడీసి, కోయినిగ్సెగ్ వంటి సూపర్ కార్లంటే ఆయనకు ఇష్టం. సంగీతం వినడం, క్రికెట్, టేబుల్ టెన్నిస్ ఆడటాన్ని కూడా ఇష్టపడతారు. -
పాపం ఏ కష్టమొచ్చిందో.. వ్యాపారి కుటుంబమంతా ఒకేసారి!
తమిళనాడులో విషాదం చోటుచేసుకుంది. తిరుచ్చి-కరైకుడి జాతీయ రహదారిపై పాడుబడిన కారులో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురి మృతదేహాలు లభ్యమయ్యాయి. వీరిని స్థానిక వ్యాపారవేత్త కుటుంబంగా పోలీసులు గుర్తించారు.నామనసముద్రం గ్రామ సమీపంలో పార్క్ చేసిన వాహనం మంగళవారం సాయంత్రం నుంచి అదే స్థలంలో ఉండడం స్థానికుల పోలీసులకు సమాచారం వచ్చారు. దీంతోప రంగంలోకి దిగిన పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టానికి తరలించారు. అయితే బాధితులు విషం సేవించి ఉంటారని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది.కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.మృతులను మణికందన్ (50) కుటుంబ సభ్యులగా గుర్తించారు. చనిపోయిన వారిలో అతని భార్య నిత్య, తల్లి సరోజ, ఇద్దరు పిల్లలు ఉన్నారు. వారు నివాసముండే సేలానికి దాదాపు 200 కిలోమీటర్ల దూరంలో వీరి మృతదేహాలు కనిపించాయి. మెటల్ వ్యాపారంలో నష్టాలు రావడంతోనే వీరు ఆత్మహత్యకు పాల్పడినట్టు భావిస్తున్నారు. కారులోంచి సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆర్థిక కష్టాలు, ముఖ్యంగా వడ్డీ వ్యాపారుల ఒత్తిళ్లే ఈ నిర్ణయానికి దారితీసాయా అనే కోణంలో చర్యకు నెట్టివేసి ఉంటాయా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. -
జిమ్మూలేదూ, ఫ్యాన్సీ ఫుడ్డూ లేదు..కానీ ఇలా అయ్యాడట!
గుజరాత్‌కు చెందిన వ్యాపారవేత్త ఫిట్నెస్ జర్నీ ఇంటర్నెట్లో హాట్ టాపిక్‌గా నిలుస్తోంది. జిమ్‌కి వెళ్లకుండా, ఫ్యాన్సీ డైట్‌ని అనుసరించకుండానే 10 నెలల్లో 23 కిలోల బరువు తగ్గించు కున్నాడు. దీంతో అంతకుముందు ముద్దుగా బొద్దుగా ఉండేవాడు కాస్త, నాజూగ్గా మారిపోయాడు.వ్యాపారవేత్త నీరజ్ బరువు తగ్గేందుకు ఎలా నియమాలు పాటించింది వరుస పోస్ట్‌ల ద్వారా ఫిట్నెస్ కన్సల్టెంట్, సతేజ్ గోహెల్ వివరించారు. అలాగే దీనికి సంబంధించిన ఫోటోలను కూడా పోస్ట్ చేశాడు. గోహెల్ అందించిన వివరాల ప్రకారం కేవలం ఇంట్లో తయారు చేసిన ఆహారాన్ని తింటూ, ఇంట్లోనే వ్యాయామాలు చేస్తూ నీరజ్ అనుకున్న లక్ష్యాన్ని చేరుకో గలిగాడు.వృత్తి రీత్యా బిజీగా ఉండే నీరజ్ మొదట తన ఆరోగ్యం గురించి పట్టించుకోలేదు. తరువాత కూడా అనుభవం లేక జిమ్‌కి వెళ్లడానికి సంకోచించేవాడు. దీంతో అతని కోసం ఇంట్లో వినియోగించుకునేలా డంబెల్స్ తయారు చేసి ఇచ్చాడు గోహెల్. అలాగే ఇంటి ఫుడ్ సాధారణ నడక అలవాటు చేశాడు. మొదట్లో నీరజ్ 10 వేల అడుగులు వేయడానికి చాలా కష్టపడే వాడు. కానీ ఆ తరువాతికాలంలో నడక అలవాటుగా మారిపోయింది.ఫలితంగా 10 నెలల్లో నీరజ్ 23 కేజీల బరువు తగ్గాడు. 91.9 కేజీల నుంచి 68.7 కేజీలకు ఆయన బరువు దిగివచ్చింది. ఆహారంలో పనీర్, సోయా చంక్స్, పప్పు, ఇతర శాఖాహార ప్రోటీన్ ఫుడ్ ఎక్కువగా తీసుకునేవాడట. దీంతోపాటు చక్కెర పదార్థాలను బాగా తగ్గిం చేశాడు. ఇది పూర్తిగా టీం వర్క్, వారం వారం అతనితో టచ్‌లో ఉంటూ, అతనికిష్టమైన ఆహారాన్ని అందిస్తూనే, వర్కౌట్లు ప్లాన్ చేసినట్టు గోహెల్ తన పోస్ట్‌లో వెల్లడించాడు. అయితే దీనిపై నెటిజన్టు భిన్నంగా స్పందించారు. నీరజ్ సంకల్పాన్ని కొందరు ప్రశంసించగా, ఫిట్నెస్ పరిశ్రమ గురించి గొప్పగా చెప్పుకున్నట్టుగా ఉందంటూ మరొకరు విమర్శించారు.ముఖ్యంగా ‘‘నో నూట్రిషనిస్ట్, నో వర్కౌట్..నో నాన్ వెజ్ ..గురూ..(పోషకాహార నిపుణుడు లేడు, వర్కౌట్లు లేవు, మాంసాహారం లేదు గురు) డైటింగ్ అస్సలే లేదు.. కేవలం చురుకైన నడక, సైక్లింగ్, రోజువారీ 900-1000 కిలోల కేలరీలు బర్నింగ్ అని మరో యూజర్ ఒక పోస్ట్ పెట్టడం గమనార్హం. -
మీకు తెలుసా? ప్రముఖ వ్యాపారవేత్తల ఫస్ట్ జాబ్స్ ఇవే..
భారతదేశంలో అత్యంత సంపన్నులైన గౌతమ్ అదానీ, రతన్ టాటా, ఇంద్రా నూయీ, అర్దేషిర్ గోద్రెజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. అయితే వీరందరూ ప్రారంభంలో ఎలాంటి ఉద్యోగాలు చేశారనేది చాలామందికి తెలియకపోవచ్చు. ఈ కథనంలో ఆ వివరాలను వివరంగా తెలుసుకుందాం.రతన్ టాటాప్రముఖ పారిశ్రామిక వేత్త రతన్ టాటా.. భారతదేశంలో విజయవంతమైన వ్యాపారవేత్తల్లో ఒకరు. దేశం కోసం ఎంతో కృషి చేసిన ఈయన 1961లో టాటా స్టీల్ కంపెనీలో చేరారు. ఇదే ఆయన మొదటి ఉద్యోగం. ఆ తరువాత క్రమంగా ఎదిగి టాటా గ్రూప్ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వహించారు.గౌతమ్ అదానీభారతదేశంలో అత్యంత సంపన్నుడైన గౌతమ్ అదానీ 1978లో మహేంద్ర బ్రదర్స్ అనే వజ్రాల దుకాణంలో పనిచేసినట్లు సమాచారం. ఇదే అదానీ మొదటి ఉద్యోగం. అక్కడే మూడు సంవత్సరాలు పనిచేసి ముంబయిలోని సొంతంగా వజ్రాల వ్యాపారాన్ని ప్రారంభించి నేడు బిలినీయర్ల జాబితాలోకి చేరారు.ఇంద్రా నూయీ1955లో జన్మించిన ఇంద్రా నూయీ ప్రపంచంలో అతిపెద్ద కంపెనీలలో ఒకటైన పెప్సికోకు 12 ఏళ్లపాటు సీఈఓగా పనిచేశారు. ఈమె 18 సంవత్సరాల వయసులో ఓ బ్రిటీష్ టెక్స్టైల్ కంపెనీలో పనిచేసినట్లు సమాచారం. ఆ తరువాత ముంబయిలోని జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీలో ప్రొడక్ట్ మేనేజర్‌గా పనిచేశారు.అర్దేషిర్ గోద్రెజ్గోద్రెజ్ గ్రూప్ సంస్థల అధినేత అర్దేషిర్ గోద్రెజ్ మొదట్లో ఓ కెమిస్ట్ అసిస్టెంట్‌గా పనిచేశారు. ఆ తరువాత ఓ చిన్న షెడ్లో తాళాలు తయారు చేసే వ్యాపారం ప్రారంభించి క్రమంగా ఎదిగారు. ప్రస్తుతం దిగ్గజ వ్యాపారసంస్థల సరసన గోద్రెజ్ గ్రూప్ నిలిచింది. -
అవును వాళ్లిద్దరూ ఒక్కటయ్యారు.. అతనికి 93, ఆమెకు 67!
ఆస్ట్రేలియన్-అమెరికన్ వ్యాపారవేత్త, ప్రముఖ పెట్టుబడాదారుడు మీడియా దిగ్గజం రూపెర్ట్ ముర్డోక్ 93 ఏళ్ల వయసులో ఐదోసారి వివాహం చేసుకున్నారు. శనివారం ఎలెనా జుకోవా (67)ను పెళ్లాడాడు. ప్రస్తుతం వీరి పెళ్లివార్త హాట్ టాపిక్‌గా నిలిచింది. ఇంతకీ ముర్డోక్ పెళ్లాడింది ఎవరిని? తెలుసుకుందాం ఈ కథనంలో..!న్యూయార్క్ టైమ్స్ నివేదిక ప్రకారం రూపర్ట్ మర్దోక్ లాస్ ఏంజెల్స్‌లోని బెల్ ఎయిర్‌లోని మోరగా వైన్యార్డ్ ఎస్టేట్‌లో తన కంటే 25 ఏళ్లు చిన్న అయిన మాజీ శాస్త్రవేత్త ఎలీనా జుకోవాను పెళ్లాడారు. గత సంవత్సరం ఫాక్స్, న్యూస్ కార్పొరేషన్ బోర్డుల నుండి పదవీ విరమణ చేసిన మీడియా మొగల్, లాస్ ఏంజిల్స్‌లోని బెల్ ఎయిర్‌లోని మోరగా వైన్యార్డ్ ఎస్టేట్‌లో ఇరువురూ జంటగా మారారు. ఈ వివాహ వేడుకకు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఈ జంట మార్చిలో తమ నిశ్చితార్థాన్ని ప్రకటించిన సంగతి విదితమే.ఎమీలియా విక్‌స్టెడ్ రూపొందించిన అద్భుతమైన వైట్ గౌనులో మెరిసిపోగా, మర్డోక్ స్నీకర్స్ బ్లేక్ సూట్లో కనిపించారు. వీరి పెళ్లికి విచ్చసిన ప్రముఖ అతిథులలో న్యూ ఇంగ్లాండ్ పేట్రియాట్స్ యజమాని రాబర్ట్ కె క్రాఫ్ట్, న్యూస్ కార్ప్ సీఈఓ రాబర్ట్ థామ్సన్ తదితరులు ఉన్నారు.ఎలెనా జుకోవా ఎవరు?మాస్కో మేధావి వర్గం కుటుంబానికి చెందిన ఎలెనా జుకోవా ఒక రిటైర్డ్ మాలిక్యులర్ బయాలజిస్ట్. మధుమేహం పరిశోధనలో ఆమె ప్రత్యేకతను సాధించారు. ఈ రంగంలో లాస్ ఏంజిల్స్‌లోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో ఆమె విశేష కృషి చేశారు. 1991లో మాస్కో నుండి అమెరికాకు వలస వచ్చారు. రష్యన్ రాజకీయవేత్త, బిలియనీర్ ఎనర్జీ ఇన్వెస్టర్ అలెగ్జాండర్ జుకోవ్‌తో వివాహం, మూడేళ్ల తర్వాత వీరు విడిపోయారు. వీరికి దశా జుకోవా అనే కుమార్తె ఉంది. ఇన్నాళ్లకు జుకోవాకు మార్చిలో ముర్డోక్‌తో నిశ్చితార్థం జరిగింది.వాల్ స్ట్రీట్ జర్నల్, ది సన్, ది టైమ్స్, న్యూయార్క్ పోస్ట్, హెరాల్డ్ సన్, ఫాక్స్ న్యూస్, ది డైలీ టెలిగ్రాఫ్‌తో సహా ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన మీడియా అవుట్లెట్లకు యజమాని. 2022 నాటికి అమెరికాలోని 31వ ధనవంతుడు. అలాగే ఫోర్బ్స్ ప్రకారం ప్రపంచంలో 71వ కుబేరుడు. రూపర్ట్ మర్దోక్ నికర విలువ 21.7 బిలియన్ డాలర్లు.ఇక మర్దోక్‌కు మొదట పాట్రీషియా బుకర్‌తో పెళ్లి కాగా 1960లో విడిపోయారు. ఆ తర్వాత మరియామన్, విన్‌డీ డెండ్, జెర్రీ హాల్‌లనూ పరిణయమాడి పలు కారణాలతో విడాకులు తీసుకున్నారు.నాల్గవ భార్య, సూపర్ మోడల్ జెర్రీ హాల్‌కి 2022లో విడాకులు ఇచ్చాడు. అతగాడికి వెండి డెంగ్, అన్నా ముర్డోక్ మాన్ , ప్యాట్రిసియా బుకర్ అనే మొత్తం ఆరుగురు పిల్లలు ఉన్నారు. గత సంవత్సరం పదవీ విరమణ అనంతరం, తన కుమారుడు లాచ్లాన్కు న్యూస్ కార్ప్‌లో తన ప్రధాన పాత్ర నుండి పగ్గాలను అప్పగించాడు. నలుగురు ద పిల్లలు వాటాలతో కుటుంబ ట్రస్ట్ ద్వారా కంపెనీ నిర్వహణ సాగుతోంది. -
అతనితో రవితేజ హీరోయిన్ పెళ్లి.. ఇప్పుడేమో వేల కోట్లకు!
అమ్మా, నాన్న.. ఓ తమిళ అమ్మాయి చిత్రంతో రవితేజ సరసన తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మలయాళీ భామ ఆసిన్. ఆ తర్వాత శివమణి, లక్ష్మీనరసింహా, షుర్షణ, అన్నవరం లాంటి చిత్రాల్లో స్టార్ హీరోలతో నటించింది. తమిళంతో పాటు హిందీలోనూ పలు సినిమాల్లో కనిపించింది. కోలీవుడ్‌లో కమల్ హాసన్ సరసన దశవతారం, సూర్యకు జంటగా గజిని లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాల్లో నటించింది. అయితే ఆసిన్ 2001లో మలయాళ చిత్రం నరేంద్రన్ మకాన్ జయకాంతన్ వకాతో సినిమాల్లో అడుగుపెట్టింది.అయితే ఆసిన్ చివరిసారిగా 2015లో వచ్చిన అభిషేక్ బచ్చన్, రిషి కపూర్, సుప్రియా పాఠక్‌లతో కలిసి ఆల్ ఈజ్ వెల్ అనే కామెడీ చిత్రంలో కనిపించింది. అంతకుముందు బాలీవుడ్లో అమీర్ ఖాన్ నటించిన గజిని, రెడీ, బోల్ బచ్చన్, హౌస్‌ఫుల్ -2 లాంటి హిట్ చిత్రాలలో నటించింది. కాగా.. అసిన్ 2016లో మైక్రోమ్యాక్స్ సహ వ్యవస్థాపకుడు రాహుల్ శర్మను వివాహం చేసుకున్నారు. ఈ జంటకు అక్టోబర్ 2017లో తమ అరిన్ జన్మించింది. అయితే రాహుల్ శర్మను పెళ్లాడిన తర్వాత ఆసిన్ సినిమాలకు పూర్తిగా దూరమైంది. అయితే తాజాగా ఆసిన్ భర్త రాహుల్ శర్మ గురించి ఆసక్తికర విషయం బయటకొచ్చింది. వ్యాపారరంగంలోకి అడుగుపెట్టిన ఆయన కెరీర్ సక్సెస్ వెనుక పెద్ద స్టోరీనే ఉంది. ఇప్పుడు అదేంటో తెలుసుకుందాం.రాహుల్ శర్మ మహారాష్ట్రలోని రాష్ట్రసంత్ తుకాడోజీ మహారాజ్ నాగ్‌పూర్ యూనివర్సిటీ నుంచి మెకానికల్ ఇంజనీరింగ్ పట్టా అందుకున్నారు. అనంతరం కెనడా వెళ్లి సస్కట్చేవాన్ యూనివర్సిటీ నుంచి కామర్స్ బ్యాచిలర్ డిగ్రీ చేశాడు. చదువు పూర్తయిన వెంటనే రాహుల్ శర్మ తన తండ్రి వద్ద రూ. 3 లక్షలు అప్పుగా తీసుకుని వ్యాపారం ప్రారంభించారు. అప్పుడు కేవలం రూ. 3 లక్షల మొదలైన వ్యాపారం ఇప్పుడేమో ఏకంగా రూ. 1300 కోట్లకు చేరుకుంది.రాహుల్ శర్మ మొదట మైక్రో మ్యాక్స్ సహ వ్యవస్థాపకుడి, సీఈఓగా ఉన్నాడు. తన ముగ్గురు స్నేహితులతో కలిసి 2000 మైక్రోమ్యాక్స్ ఇన్ఫర్మేటిక్స్ అనే సాఫ్ట్వేర్ కంపెనీ స్థాపించారు. ఆ తరువాత 2008లో మొబైల్ రంగంలోకి ప్రవేశించారు. 2010 నాటికి హ్యూ జాక్మాన్ బ్రాండ్ అంబాసిడర్‌గా తక్కువ ధరలోనే స్మార్ట్ ఫోన్లను అందించే సంస్థగా దేశంలోనే టాప్ లో నిలిచింది. 2017లో భారతదేశపు తొలి ఏఐ బేస్డ్ ఎలక్ట్రిక్ బైక్‌ను పరిచయం చేసిన రివోల్ట్ ఇంటెల్లి కార్ప్ కంపెనీకి వ్యవస్థాపకుడు కూడా రాహుల్ శర్మనే. కేవలం రూ.3 లక్షలతో వ్యాపార మొదలు పెట్టి.. వందల కోట్లకు చేరుకున్న రాహుల్ శర్మ నిజ జీవితంలో ప్రతి ఒక్కరికీ ఆదర్శంగా నిలిచారు. అక్షయ్ కుమార్ వల్లే పరిచయం..ఆసిన్‌ను పెళ్లి చేసుకోవడానికి రాహుల్ శర్మకు బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ సహకరించాడు. అక్షయ్ కుమార్, అసిన్ కలిసి నటించిన కామెడీ చిత్రం హౌస్‌ఫుల్ 2. అదే సమయంలో అక్షయ్ తన బెస్ట్ ఫ్రెండ్ రాహుల్ శర్మకు ఆసిన్‌ను పరిచయం చేశాడు. అలా రాహుల్, అసిన్ పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం ఆసిన్ ఫ్యామిలీ ఢిల్లీలో ఉన్నారు. వీరికి ఢిల్లీలో ఫామ్‌హౌస్ ఉంది. అతని వద్ద ఖరీదైన బెంట్లీ సూపర్‌స్పోర్ట్ లిమిటెడ్ ఎడిషన్, బీఎండబ్య్లూ, మెర్సిడెజ్ బెంజ్, రోల్స్ రాయిస్ కార్లు ఉన్నాయి. -
తెలంగాణ డీజీపీ పేరుతో వ్యాపారవేత్త కూతురికి బెదిరింపులు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ డీజీపీ పేరుతో వ్యాపారవేత్త కూతురికి బెదిరింపులు కలకలం సృష్టించాయి. డ్రగ్స్ కేసులో అరెస్ట్ చేస్తామంటూ యువతిని అగంతకుడు బెదిరించాడు. వ్యాపారవేత్త కూతురికి వాట్సాప్ కాల్చేసి కేసు నుంచి తప్పించేందుకు రూ.50వేలు ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. దీనిపై అనుమానం వచ్చిన బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.+92 కోడ్‌తో వాట్సాప్ కాల్ వచ్చినట్లు చెబుతున్నారు. ఇది పాకిస్తాన్ కోడ్ అంటున్న సైబర్ పోలీసులు.. ఇలాంటి ఘటనలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. -
లేటు వయసులో పెళ్లికి సిద్ధమైన బుల్లితెర నటి..!
ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. సినీ తారలు సైతం ఈ ఏడాదిలో ఎక్కువగా వివాహాబంధంలోకి అడుగు పెడుతున్నారు. రకుల్ ప్రీత్ సింగ్, తాప్సీ ఇటీవలే పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా బుల్లితెర నటి, బిగ్‌బాస్ బ్యూటీ ఆర్తీ సింగ్ పెళ్లికి రెడీ అయిపోయింది. దాదాపు 39 ఏళ్ల భామ ఈనెల 25న ప్రముఖ వ్యాపారవేత్త దీపక్ చౌహాన్‌ను పెళ్లాడనుంది. ఈ విషయాన్ని నటి వెల్లడించారు. ఈ రోజు తన పుట్టిన రోజు కావడంతో ఆర్తి సింగ్ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు. ఏప్రిల్ 25న ముంబైలోని తమ సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో పెళ్లి చేసుకోనున్నట్టు ఆర్తి తెలిపారు. హల్దీ, మెహందీతో పాటు ఫెరాస్ వంటి వేడుకలు జరుగుతాయని పేర్కొన్నారు. అయితే మాది అరెంజ్డ్ మ్యారేజ్ అని వెల్లడించారు. ఢిల్లీలోని గురూజీ ఆలయంలో దీపక్ నిశ్చితార్థం చేసుకున్నట్లు తెలిపింది. ఈ వివాహానికి నటులు గోవిందా, సల్మాన్ ఖాన్, సిద్ధార్థ్ శుక్లా, షెహనాజ్ గిల్ లాంటి బాలీవుడ్ ప్రముఖులు హాజరు కానున్నారు. కాగా.. ఆర్తి ప్రధానంగా మాయకా, గృహస్తి, ఉత్తరన్, ఉడాన్, పరిచయ్, ససురల్ సిమర్ కా, దేవాన్ కే దేవ్...మహదేవ్, వారిస్ లాంటి టీవీ సీరియల్స్‌లో నటించింది. 2019లో బిగ్ బాస్ -13 సీజన్లో కంటెస్టెంట్‌గా పాల్గొని నాలుగో రన్నరప్‌గా నిలిచింది. సల్మాన్ ఖాన్ హోస్ట్ చేసిన ఈ రియాలిటీ షోలో రెండేళ్లుగా పని లేకపోవడం వల్ల డిప్రెషన్‌కు గురయ్యానని వెల్లడించింది. ఆర్తి ప్రస్తుతం ఉమ్మీద్ కి రోష్ని శ్రావణి అనే సీరియల్లో నటిస్తోంది. View this post on Instagram A post shared by Arti singh sharma (@artisingh5) -
కుర్రాళ్ల హార్ట్ బ్రేక్ చేయనున్న బంగారం హీరోయిన్
మాఘమాసం వచ్చేసింది.. పెళ్లి సంబరాలు తెచ్చేసింది.. ఇప్పటికే ఒక్కొక్కరుగా మూడుముళ్ల బంధంలో అడుగుపెడుతుండగా, పలువురూ వారి పెళ్లికి ముహూర్తం పిక్స్ చేసుకుంటున్నారు. ఈ రోజు (ఫిబ్రవరి 21న) రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లి చేసుకోగా తాజాగా మరో బ్యూటీ మీరా చోప్రా వివాహానికి రెడీ అవుతోంది. ఈ ఏడాది కొత్త జీవితం మొదలుపెడతానని గతంలోనే హింటిచ్చింది. అన్నట్లుగానే మార్చి 11 లేదా 12న జైపూర్‌లో పెళ్లి చేసుకోనుందట! ఇప్పటికే మీరాతో పాటు ఆమె కుటుంబం పెళ్లి పనుల్లో తలమునకలైందట! తన పెళ్లికి 150 మందికిపైగా అతిథులు హాజరవుతారంది మీరా చోప్రా. పెళ్లి తర్వాత సెలబ్రిటీలు, బాలీవుడ్‌లోని ఫ్రెండ్స్ కోసం ముంబైలో గ్రాండ్‌గా రిసెప్షన్ కూడా ఏర్పాటు చేస్తానంటోంది. ఇకపోతే ఈమె స్టార్ హీరోయిన్ ప్రియాంక, పరిణీతి చోప్రాకు కజిన్ అవుతుంది. కాగా మీరా చోప్రా 2005లో అన్బే ఆరుయిరే అనే తమిళ సినిమాతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చింది. తెలుగులో బంగారం, మారో, వాన, గ్రీకువీరుడు సినిమాలు చేసింది. ద టాటూ మర్డర్డ్స్ అనే వెబ్ సిరీస్‌తో ఓటీటీ ప్రపంచంలోనూ అడుగుపెట్టింది. ఆమె నటించిన సఫేద్ మూవీ ఈ గతేడాది జీ5లో అందుబాటులోకి వచ్చింది. చదవండి: అనసూయ గ్లామర్ వెనుక కష్టాలు ఎవరికీ తెలియవు.. తనలాంటి అమ్మాయి.. -
రాముడు మతాన్ని మించిన వ్యక్తి - ఆనంద్ మహీంద్రా
సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్‌గా ఉండే పారిశ్రాక దిగ్గజం 'ఆనంద్ మహీంద్రా' (Anand Mahindra) అయోధ్యలో బాలరాముని ప్రాణ ప్రతిష్టవేళ ఒక ఫోటోను తన ఎక్స్ (ట్విటర్) వేదికగా షేర్ చేశారు. ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్న దీని గురించి మరిన్ని వివరాలు ఇక్కడ చూద్దాం. ఈ రోజు నా మండే మోటివేషన్ ఆశ్చర్యం కలిగించలేదు, ఎందుకంటే అయోధ్య రాముడు మతాన్ని మించిన వ్యక్తి, ఒకరి విశ్వాసం ఏమైనప్పటికీ.. మనమందరం గౌరవంగా, మంచి విలువలతో జీవించడానికి అంకితమైన వ్యక్తి భావనకు ఆకర్షితులౌతాము. అతని బాణాలు చెడును, అన్యాయాన్ని దూరం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నాయి. రామరాజ్య పాలన అనేది సమాజం ఆకాంక్ష, రామ్ అనే పదం ప్రపంచానికి చెందినదని.. ఆనంద్ మహీంద్రా రాముని ఫోటో షేర్ చేస్తూ ట్వీట్ చేశారు. ఇదీ చదవండి: అయోధ్యకు వ్యాపారవేత్తల క్యూ.. ఆనంద్ మహీంద్రా చేసిన ట్వీట్.. వేలమందిని ఆకర్శించింది. కొందరు నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ కూడా చేస్తున్నారు. యావత్ భారతదేశం మొత్తం ఈ రోజు రామ నామం జపిస్తోంది. ఈ రోజు అయోధ్యలో జరిగే ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి ఆనంద్ మహీంద్రా కూడా హాజరుకానున్నారు. It won’t surprise you that my #MondayMotivation this morning is the #MaryadaPurushottam Lord Ram. Because he is a figure that transcends Religion. No matter what one’s faith, we are all drawn to the concept of a being that is dedicated to living with honour and with strong… pic.twitter.com/MLX4tWYsft — anand mahindra (@anandmahindra) January 22, 2024 -
ట్రాన్స్ జెండర్‌పై అనుచిత వ్యాఖ్యలు..
చెన్నై: ట్రాన్స్‌జెండర్ వ్యాపారవేత్త, ఏఐఏడీఎంకే అధికారి ప్రతినిధి అప్సరా రెడ్డిని అప్రతిష్టపాలు చేసిన ఓ యూట్యూబర్‌కు మద్రాస్ హైకోర్టు రూ.50 లక్షల జరిమానా విధించింది! ఆమె ప్రొవోగ్ మేగజీన్‌లో పని చేసిన రోజుల్లో మైకేల్ ప్రవీణ్ అనే సహోద్యోగితో విభేదాలొచ్చాయి. దాంతో అతను అప్సరను కించపరుస్తూ 10 వీడియోలను యూట్యూబ్‌లో పోస్ట్ చేశాడు. ప్రవీణ్ నుంచి రూ.1.25 కోట్లు పరిహారం కోరుతూ కోర్టులో పిటిషన్ వేశారు. ఆమెకు రూ.50 లక్షలు చెల్లించాలని కోర్టు ఆదేశించింది. ‘‘సోషల్ మీడియాలో పోస్టులతో ఇతరుల గోప్యతకు భంగం కలిగించొద్దు. ఏ హక్కయినా పరిమితులకు లోబడి ఉంటుంది’’ అని పేర్కొంది. -
Vibrant Gujarat: తొలిరోజే రూ.2.35 లక్షల కోట్లు!
గాంధీనగర్: గత రెండు దశాబ్దాలుగా వైబ్రంట్ గుజరాత్ సదస్సు అంతర్జాతీయ బిజినెస్ నెట్వర్కింగ్ ఈవెంట్‌గా ఆవిర్భవించింది. తద్వారా కార్పొరేట్ ప్రపంచం నుంచి భారీ పెట్టుబడులను ఆకట్టుకుంటోంది. తాజాగా 10వ వైబ్రంట్ గుజరాత్(2024) సదస్సులో రిలయన్స్ గ్రూప్ అధినేత ముకేశ్ అంబానీ, అదానీ గ్రూప్ వ్యవస్థాపకుడు గౌతమ్ అదానీ, సుజుకీ మోటార్ కార్ప్ ప్రెసిడెంట్ తోషిహిరో సుజుకీ, టాటా సన్స్ చైర్మన్ ఎన్.చంద్రశేఖరన్ తదితరులు పెట్టుబడులకు ఆసక్తిని ప్రదర్శించారు. వెరసి తొలి రోజే రూ. 2.35 లక్షల కోట్ల పెట్టుబడి ప్రణాళికలను ప్రకటించారు. దేశ, విదేశీ దిగ్గజాల నుంచి భారీ పెట్టుబడులను ఆకట్టుకుంటున్న రాష్ట్రాలలో గుజరాత్ ఒకటిగా నిలుస్తున్న సంగతి తెలిసిందే. వివరాలు చూద్దాం.. రిలయన్స్.. కార్బన్ ఫైబర్ ప్లాంట్ హజీరాలో దేశంలోనే తొలి కార్బన్ ఫైబర్ ప్లాంటును ఏర్పాటు చేయనున్నట్లు డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ చీఫ్ ముకేశ్ అంబానీ పేర్కొన్నారు. గుజరాత్ కేంద్రంగా రిలయన్స్ కార్యకలాపాలు కొనసాగనున్నట్లు తెలియజేశారు. గత దశాబ్ద కాలంలో ప్రపంచస్థాయి ఆస్తులు, సామర్థ్యాలను అభివృద్ధి చేయడంలో దేశవ్యాప్తంగా 150 బిలియన్ డాలర్లు(రూ. 12 లక్షల కోట్లు) వెచ్చించినట్లు వివరించారు. వీటిలో మూడో వంతు పెట్టుబడులను గుజరాత్‌లోనే చేపట్టినట్లు తెలియజేశారు. తద్వారా ఈ ప్రాంతానికి తామిస్తున్న ప్రాధాన్యతను ప్రస్తావించారు. టాటా.. సెమీకండక్టర్ ఫ్యాబ్రికేషన్ ఈ ఏడాది(2024) చివరిలో నూతన సెమీకండక్టర్ ఫ్యాబ్రికేషన్ ప్లాంటును గుజరాత్లో ఏర్పాటు చేయనున్నట్లు టాటా సన్స్ చైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్ పేర్కొన్నారు. దేశీయంగా చిప్స్ తయారీకి ప్రధాని మోడీ ఇస్తున్న ప్రాధాన్యతకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలియజేశారు. అంతేకాకుండా ఆటో రంగ దిగ్గజం టాటా మోటార్స్ సాణంద్‌లో లిథియమ్ అయాన్ బ్యాటరీల తయారీ కేంద్రానికి తెరతీయనున్నట్లు వెల్లడించారు. ప్రాథమిక దశలో 20 గిగావాట్ స్టోరేజీ బ్యాటరీ సామర్థ్యంతో తయారీ ప్లాంటును ఏర్పాటు చేయనున్నట్లు తెలియజేశారు. ఎలక్ట్రిక్ వాహనా (ఈవీ)లకు పెరుగుతున్న డిమాండుకు అనుగుణంగా పెట్టుబడులు చేపట్టనున్నట్లు వివరించారు. రెండు దశలలో చేపట్టనున్న ప్రాజెక్ట్ పనులు రెండు నెలల్లోగా ప్రారంభంకానున్నట్లు తెలియజేశారు. ఆర్సెలర్‌మిట్టల్.. అతిపెద్ద స్టీల్‌ప్లాంట్ ప్రపంచంలోనే ఒకే ప్రాంతంలో అతిపెద్ద స్టీల్ ఫ్యాక్టరీని హజీరాలో ఏర్పాటు చేయనున్నట్లు ఆర్సెలర్‌మిట్టల్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ లక్ష్మీ మిట్టల్ పేర్కొన్నారు. జేవీ ఆర్సెలర్‌మిట్టల్ నిప్పన్ స్టీల్ ఇండియా ద్వారా 2029కల్లా ప్లాంటు నిర్మాణం పూర్తికాగలదని తెలియజేశారు. ప్లాంటును వార్షికంగా 2.4 కోట్ల టన్నుల స్టీల్ తయారీ సామర్థ్యంతో నెలకొల్పనున్నట్లు వెల్లడించారు. 2026లో తొలి దశ ప్రారంభంకావచ్చని తెలియజేశారు. మైక్రాన్.. రూ. 6,760 కోట్లు సెమీకండక్టర్ల తయారీలో భారత్‌ను అంతర్జాతీయ కేంద్రంగా నిలపాలన్న కేంద్ర ప్రభుత్వ లక్ష్యాలను మైక్రాన్ టెక్నాలజీ సీఈవో సంజయ్ మెహ్రోత్రా ప్రశంసించారు. ఈ యూఎస్ చిప్ తయారీ దిగ్గజం సాణంద్‌లో 2.75 బిలియన్ డాలర్ల సెమీకండక్టర్ టెస్టింగ్, ప్యాకేజింగ్ ప్లాంటు నిర్మాణాన్ని సెప్టెంబర్‌లోనే ప్రారంభించింది. పెట్టుబడుల్లో మైక్రాన్ 82.5 కోట్ల డాలర్లు (సుమారు రూ. 6,760 కోట్లు) ఇన్వెస్ట్ చేయనుంది. మిగిలిన నిధులను ప్రభుత్వం రెండు దశలలో సబ్సిడీ రూపంలో సమకూర్చనుంది. -
సందడి చేయడానికి సిద్ధంగా ఉండండి.. ఆనంద్ మహీంద్రా ట్వీట్ వైరల్
ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం 'ఆనంద్ మహీంద్రా' (Anand Mahindra) ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ.. ఆసక్తికరమైన ఎన్నో సంఘటనలను పోస్ట్ చేస్తూ ఉంటారు. ఇందులో భాగంగానే తాజాగా మరో వీడియో తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో పోస్ట్ చేశారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ఆనంద్ మహీంద్రా తన ఎక్స్ ఖాతాలో మహమ్మద్ అలీకి సంబంధించిన ఒక వీడియో షేర్ చేశారు. ఇందులో 10 సెకన్లలో ప్రత్యర్థి 21 పంచ్‌ల నుంచి తప్పించుకోవడం చూడవచ్చు. ఈ సంఘటన ఒకప్పుడు పెద్ద సంచలనం సృష్టించింది. ఈ వీడియోను ఆనంద్ మహీంద్రా షేర్ చేస్తూ 2023లో ఎన్నో ఎదురుదెబ్బలను తట్టుకొని నిలబడగలిగాము. మొత్తానికి 2023 ముగియనుంది. రాబోయే కొత్త సంవత్సరం 2024లో సందడి చేయడానికి సిద్ధంగా ఉండాలని ట్వీట్ చేశారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్న ఈ వీడియోను వేలమంది వీక్షించగా.. కొందరు నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ కూడా చేస్తున్నారు. The world in 2023. It managed to survive a flurry of potential knock-out blows. We’re all alive and ready to rumble in ‘24. Bring it on… (Muhammad Ali. Dodging 21 punches from Dokes in 10 seconds) pic.twitter.com/MpZa60R5kv — anand mahindra (@anandmahindra) December 29, 2023 -
ఇలాంటి టెక్నాలజీ తెలంగాణలో ఫస్ట్.. వీడియో షేర్ చేసిన ఆనంద్ మహీంద్రా
దేశీయ పారిశ్రామిక దిగ్గజం 'ఆనంద్ మహీంద్రా' (Anand Mahindra) సోషల్ మీడియా వేదికగా ఎప్పటికప్పుడు ఆసక్తికరమైన విషయాలను షేర్ చేస్తూ ఉంటారు. ఇందులో భాగంగానే ఇటీవల హైదరాబాద్‌కు సంబంధించిన ఒక వీడియో షేర్ చేశారు. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో అధికారులు ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ బేస్డ్ స్మార్ట్ బ్యాగేజీ ట్రాలీలు ప్రారంభించారు. ప్రయాణికుల సౌకర్యార్ధం కొత్త టెక్నాలజీ ప్రారంభించిన తొలి రాష్ట్రంగా తెలంగాణా రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ ట్రాలీలు టెర్మినల్ చుట్టూ ప్రయాణికులకు మార్గనిర్దేశం చేయడమే కాకుండా.. విమానాశ్రయ ప్రవేశ మార్గాలు, బయలుదేరే సమయం, గేట్లకు రూట్, ఆఫర్స్ వంటి ఉపయోగకరమైన సమాచారాన్ని తెలియజేస్తూ చాలా సహాయపడతాయి. ప్రస్తుతం ఎయిర్‌పోర్ట్‌లో 3 వేల బ్యాగేజీ ట్రాలీలు ఉన్నట్లు సమాచారం. ప్రపంచంలో స్మార్ట్ బ్యాగేజీ ట్రాలీ సదుపాయాన్ని తొలిసారిగా మ్యూనిక్ ఎయిర్‌పోర్టులో తీసుకొచ్చారు. ఆ తర్వాత రెండో ఎయిర్పోర్ట్ హైదరాబాద్ కావడం విశేషం. వినియోగదారు ఈ ట్రాలీని నో జోన్ ఏరియాలోకి తీసుకెళ్తే వెంటనే అప్రమత్తం చేస్తుంది. ఫ్లైట్ లేట్ అయితే కూడా ముందస్తుగా నోటిఫికేషన్ రూపంలో డిస్ప్లే చేస్తుంది. ఇదీ చదవండి: బెడ్ అమ్మబోయి రూ.68 లక్షలు పోగొట్టుకున్న టెకీ.. ఎలా అంటే? ఈ ట్రాలీపై ఉన్న డ్యాష్ బోర్డులో మన బోర్డింగ్ పాస్ వివరాలను ఎంటర్ చేస్తే.. ఫ్లైట్ టైమింగ్స్‌తో పాటు గేట్ నంబర్ వివరాలు కూడా స్క్రీన్ మీద కనిపిస్తాయి. గేట్ వద్దకు చేరుకొనే మార్గాన్ని కూడా అదే చూపుతుంది. బోర్డింగ్‌కు టైమ్ ఉంటే షాపింగ్ చేసుకునేందుకు వీలుగా అన్ని వివరాలు డ్యాష్ బోర్డ్ ద్వారా తెలుసుకోవచ్చు. ఇందులో షాపులు, దాని వివరాలు, ఆఫర్లు తదితర వివరాలు తెలుసుకోవచ్చు. వాటితో పాటు వాష్ రూంలు, రెస్టారెంట్లు, ఫుడ్ వివరాల గురించి వివరాలు కనిపిస్తాయి. ఆనంద్ మహీంద్రా ట్వీట్.. స్మార్ట్ బ్యాగేజీ ట్రాలీలకు సంబంధించిన వీడియోను ఆనంద్ మహీంద్రా తన ఎక్స్(ట్విటర్) ఖాతాలో షేర్ చేస్తూ.. ఈ టెక్నాలజీ చాలా బాగుందని, విదేశాల్లో కూడా ఇలాంటి టెక్నాలజీ చూడలేదని ఇది 'ప్రెట్టీ కూల్' అంటూ పేర్కొన్నాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. కొందరు నెటిజన్లు దీనిపైన తమదైన రీతిలో కామెంట్స్ కూడా చేస్తున్నారు. That IS pretty cool. I’ve never encountered such trolleys in overseas airports…but I may be wrong. Are we truly amongst the very first to introduce these? 👏🏽👏🏽👏🏽 pic.twitter.com/IEbZVI4BbM — anand mahindra (@anandmahindra) December 15, 2023 -
దిగ్గజ కంపెనీల నిర్ణయంపై 'ఎలాన్ మస్క్' ఘాటు వ్యాఖ్యలు
ఎలాన్ మస్క్ (Elon Musk) ఆధ్వర్యంలో ఉన్న ఎక్స్ (ట్విటర్)లో వాణిజ్య ప్రకటనలు నిలిపివేస్తున్నట్లు అమెరికన్ సంస్థలు ఇటీవలే ప్రకటించాయి. దీనిపైన తాజాగా మస్క్ స్పందించారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో చూసేద్దాం.. అమెరికన్ కంపెనీలైన యాపిల్, డిస్నీ, ఐబీఎం, ఒరాకిల్, లయన్స్ గేట్ ఎంటర్టైన్మెంట్ కార్పొరేషన్, వార్నర్ బ్రోస్ డిస్కవరీ, పారామౌంట్ గ్లోబల్, బ్రావో టెలివిజన్ నెట్వర్క్, కామ్‌కాస్ట్ ఇక మీద ఎలాంటి ప్రకటనలు ఇవ్వబోమని గత వారంలో వెల్లడించాయి. ఇజ్రాయెల్ - హమాస్ యుద్ధ సమయంలో ఎక్స్(ట్విటర్)లో యూదు వ్యతిరేఖ పోస్టులు వెల్లువెత్తాయి. వీటికి మస్క్ మద్దతు పలకడంతో అగ్రరాజ్యం మండిపడింది. ఇది యూదు కమ్యూనిటినీ ప్రమాదంలో పడేస్తుందని మస్క్ తీరుపైన మండిపడ్డారు. ఈ కారణంగానే దిగ్గజ కంపెనీలు ఈ నిర్ణయం తీసుకున్నాయి. ఇదీ చదవండి: రతన్ టాటా మేనేజర్ కొత్త కారు ఇదే.. చూసారా! ప్రకటనలు నిలిపివేస్తామన్న కంపెనీలపై ఎలాన్ మస్క్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. తాను చేసిన కొన్ని వ్యాఖ్యలను సాకుగా తీసుకుని, బెదిరించాలనుకున్నట్లు, అలాంటి ప్రకటనలు తమకు అవసరం లేదని.. వెళ్లాలనుకునే వారి వెళ్లిపోవచ్చని కఠినంగా వ్యాఖ్యానించారు. మస్క్ వ్యాఖ్యలపై సదరు కంపెనీలు ఎలా స్పందిస్తాయనేది తెలియాల్సిన విషయం. -
రూ.7250 కోట్లు విరాళం ప్రకటించిన వారెన్ బఫెట్ - ఎవరికో తెలుసా?
ప్రపంచ ధనవంతుల జాబితాలో ఒకరైన 'వారెన్ బఫెట్' (Warren Buffett) గతంలోనే తన సంపదలో 99 శాతాన్ని ఛారిటీకి అందిస్తానని వెల్లడించారు. అన్నమాట ప్రకారమే చేస్తున్న బఫెట్ తాజాగా స్వచ్ఛంద సంస్థలకు 876 మిలియన్ డాలర్ల విలువైన బెర్క్‌షైర్ హాత్వే షేర్లను అందించారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. వారెన్ బఫెట్ బిలియనీర్ అయినప్పటికీ సాధారణ జీవితాన్ని గడుపుతూ తమ పిల్లలు నిర్వహిస్తున్న స్వచ్చంద సంస్థలకు వేలకోట్లు విరాళాలు అందిస్తుంటాడు. ఇందులో భాగంగానే గత మంగళవారం 876 మిలియన్ డాలర్ల (భారతీయ కరెన్సీ ప్రకారం సుమారు రూ. 7250 కోట్లు) షేర్లను గిఫ్ట్‌గా ప్రకటించారు. ఇదీ చదవండి: ఇషా అంబానీ రైట్ హ్యాండ్ ఇతడే.. జీతం లక్షల్లో కాదు కోట్లల్లోనే.. వారెన్ బఫెట్ భార్య పేరు మీద ఉన్న 'సుసాన్ థాంప్సన్ బఫ్ఫెట్ ఫౌండేషన్'కు 1.5 మిలియన్ క్లాస్ B షేర్లను ప్రకటించారు. తమ పిల్లలు నిర్వహిస్తున్న మూడు ఫౌండేషన్లకు (షేర్వుడ్ ఫౌండేషన్, హోవార్డ్ జి. బఫ్ఫెట్ ఫౌండేషన్, నోవో ఫౌండేషన్) ఒక్కొక్క దానికి 3,00,000 బెర్క్‌షైర్ హాత్వే షేర్లను విరాళంగా ఇచ్చేసారు. గత ఏడాది కూడా భారీ షేర్లను విరాళంగా అందించారు. -
వ్యాపారి భార్యపై దొంగల అఘాయిత్యం: సిగరెట్లతో కాల్చి టార్చర్
ఉత్తరప్రదేశ్‌లో దారుణ ఘటన వెలుగు చూసింది. ఒక వ్యాపారి ఇంట్లోకి చొరబడిన దుండగులు అతని భార్యను గ్యాంగ్ రేప్ చేసి, సిగరెట్లతో కాల్చిన ఘటన సంచలనం రేపింది. యూపీ బిజోర్లోని నగీనా దేహత్‌లో మంగళవారం ఈ ఘటన జరిగింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోలీసుల సమాచరం పెయింట్-హార్డ్‌వేర్ హోల్‌సేల్ వ్యాపారి తన తల్లి ,పిల్లలతో కలిసి మందులు కొనడానికి బయటకు వెళ్లారు. అదును చూసిఇంట్లోకి చొరబడిన ఐదుగురు దొంగలు మహిళపై దాడి చేసి, ఆమెను కట్టేసి, సిగరెట్ పీకలతో కాల్చి టార్చర్ పెట్టారు. అంతటితో వారి ఆగడాలు ఆగలేదు. ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. దీంతో ఆమె స్పృహ తప్పడంతో ఇంట్లోని అల్మారాల తాళాలు పగులగొట్టి బంగారు ఆభరణాలు, రెండు కిలోల వెండి, సుమారు రూ. 1.5 లక్షల విలువైన నగదును దోచేశారు. అనంతరం ఇంట్లో ఉన్న స్కూటర్‌తో అక్కడినుంచి పరారయ్యారు. బాధిత మహిళ ఫిర్యాదు మేరకు వైద్య పరీక్షల కోసం పంపించామని రూరల్ పోలీస్ సూపరింటెండెంట్ రామ్ అర్జ్ తెలిపారు. ఈ ఘటనపై విచారణకు మూడు బృందాలను ఏర్పాటు చేశామని తెలిపారు.