Manushi Chhillar Dating Businessman Nikhil Kamath Rumours Goes Viral, Deets Inside - Sakshi
Sakshi News home page

వ్యాపారవేత్తతో మాజీ ప్రపంచసుందరి డేటింగ్..ఎవరంటే!

Nov 21 2022 7:39 PM | Updated on Nov 21 2022 8:10 PM

Manushi Chhillar Dating businessman Nikhil Kamath Goes Viral - Sakshi

మాజీ మిస్ వరల్డ్, నటి, మోడల్ మానుషి చిల్లర్‌పై రూమర్స్ తెగ వైరలవుతున్నాయి. హర్యానాకు చెందిన నటి ఓ వ్యాపారవేత్తతో డేటింగ్‌లో ఉన్నట్లు బీటౌన్‌లో టాక్ నడుస్తోంది. 2021 నుంచి ఈ జంట తరచూ విహారయాత్రలకు వెళ్తున్నట్లు తెలుస్తోంది. జీరోధా సహ వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్‌తో ప్రేమాయణం సాగిస్తున్నట్లు సమాచారం. వీరిద్దరి ప్రేమ విషయం ఇరు కుటుంబాలకు కూడా తెలుసని బాలీవుడ్‌లో టాక్. 

(చదవండి: 'అలా ఆలోచించే వాళ్లయితే ఓకే'.. పెళ్లిపై నిత్యామీనన్ ఆసక్తికర కామెంట్స్..!)

అయితే వ్యాపారవేత్త నిఖిల్ కామత్‌కు ఇదివరకే పెళ్లయింది. 2019లో పెళ్లి చేసుకున్న కామత్ గతేడాదే మొదటి భార్యతో విడాకులు తీసుకున్నారు. అతను ప్రస్తుతం మాజీ విశ్వసుందరి మానుషి చిల్లర్‌తో డేటింగ్‌లో ఉన్నారని నెట్టింట్లో వార్తలు  హల్‌చల్‌ చేస్తున్నాయి. మానుషి ప్రస్తుతం సామ్రాట్ పృథ్వీరాజ్‌ సినిమాతో బాలీవుడ్‌లో అడుగుపెట్టింది. ఈ చిత్రంలో అక్షయ్ కుమార్ సరసన ఆమె నటించింది. అయితే డేటింగ్ వార్తలపై ఇంతవరకు ఎవరూ స్పందించలేదు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement