Rapper Badshah In Dating With Isha Rikhi, Rumours Goes Viral On Social Media - Sakshi
Sakshi News home page

Badshah Dating With Isha Rikhi: భార్యతో విడిపోయి రెండేళ్లు.. పంజాబీ నటితో ఏడాదిగా సింగర్‌ డేటింగ్‌? సెర్చ్‌ చేస్తున్న ఫ్యాన్స్‌!

Published Wed, Oct 12 2022 7:02 PM | Last Updated on Wed, Oct 12 2022 8:02 PM

Punjab Rapper Badshah is Dating Isha Rikhi Goes Viral In Social Media - Sakshi

ప్రముఖ గాయకుడు, పంజాబ్‌కు చెందిన బాద్‌షాపై రూమర్లు గుప్పుమంటున్నాయి. పంజాబీ నటి ఇషా రిఖీతో డేటింగ్‌లో ఉన్నట్లు వార్తలు నెట్టింట్లో హల్‌చల్‌ చేస్తున్నాయి. దాదాపు రెండేళ్ల క్రితం తన భార్య జాస్మిన్‌తో విడిపోయాక ఆమెతో చనువుగా ఉంటున్నట్లు తెలుస్తోంది. వీరిద్దరు ఏడాదిగా డేటింగ్‌లో ఉన్నా ఇప్పటివరకు ఎక్కడా బయట పడకుండా జాగ్రత్త వహించారు. తాజాగా వీరిద్దరు ఓ స్నేహితుని పార్టీలో కలుసుకోవడంతో డేటింగ్‌లో ఉన్నట్లు అభిమానులు భావిస్తున్నారు.

ఈ విషయం తెలుసుకున్న బాద్‌షా అభిమానులు ఈషా రిఖీ కోసం నెట్టింట్లో వెతకడం ప్రారంభించారు. ఆమె గురించి తెలుసుకునేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. అయితే ఈ విషయం ఈ జంట వారి కుటుంబాలతో ముందుగానే చెప్పినట్లు  తెలుస్తోంది.  వీరిద్దరి బంధాన్ని బాద్‌షా కుటుంబ సభ్యులు కూడా సంతోషంగా అంగీకరించినట్లు సమాచారం. ఇద్దరు చలనచిత్ర పరిశ్రమకే చెందినవారే కావడంతో ఇరు కుటుంబాల సభ్యులు ఎలాంటి అభ్యంతరం చెప్పలేదని తెలుస్తోంది. 

(చదవండి: బిగ్‌ బాస్‌ కంటెస్టెంట్‌పై లైంగిక ఆరోపణలు.. మహిళా కమిషన్ చీఫ్ సంచలన వ్యాఖ్యలు)

బాద్‌షా అసలు పేరు ఆదిత్య ప్రతీక్ సింగ్ సిసోడియా. అతని అభిమానులు ముద్దుగా బాద్‌ షా అని  పిలుస్తారు. పంజాబీ చలనచిత్ర పరిశ్రమలో గాయకుడిగా, నిర్మాతగా స్టార్‌డమ్‌ సంపాందించుకున్నారు. హిందీ, హర్యానా, పంజాబీ సంగీతంతో ఫేమస్‌ అయ్యారు. హిప్ హాప్ గ్రూప్ మాఫియా ముందీర్‌లో కలిసి 2006లో తన కెరీర్ ప్రారంభించాడు. 

కాగా.. ఇషా రిఖి స్వస్థలం పంజాబ్‌లోని చంఢీఘడ్. మోడల్‌గా కెరీర్ ప్రారంభించిన ఆమె పంజాబీ చిత్రం జట్ బాయ్స్ పుట్ జట్టన్ దే సినిమాతో తెరపైకి అడుగుపెట్టింది. పంజాబీ నటుడు అమ్రీందర్ గిల్‌తో కలిసి హ్యాపీ గో లక్కీ చిత్రంలోనూ నటించింది. ఆ తర్వాత వరుసగా 2014, 2015లో మేరే యార్ కమీనీ, వాట్ ది జాట్‌ మూవీల్లో కనిపించింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement