Tamannaah Bhatia and Vijay Varma Pose Together in Mumbai Once Again - Sakshi
Sakshi News home page

Tamannaah: మళ్లీ దొరికిపోయిన తమన్నా .. అతనితో డేటింగ్‌పై చర్చ..!

Published Mon, Jan 16 2023 4:17 PM | Last Updated on Mon, Jan 16 2023 4:59 PM

Tamannaah Bhatia and Vijay Varma pose together in Mumbai once Again - Sakshi

మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా ఇటీవల ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది.  న్యూ ఇయర్ వేడుకల్లో గోవాలో సందడి చేసిన భామపై డేటింగ్ రూమర్స్  పెద్దఎత్తున హల్‌చల్ చేశాయి. బాలీవుడ్ నటుడు విజయ్ వర్మకు ముద్దు పెడుతున్న వీడియా సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొట్టింది. దీంతో ఈ ముద్దుగుమ్మ అతనితో డేటింగ్‌లో ఉన్నట్లు గాసిప్స్ గుప్పుమన్నాయి. ఆ తర్వాత వీరిద్దరు ఎయిర్‌పోర్ట్‌లోనూ కనిపించడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. 

అయితే తాజాగా మరోసారి మిల్కీ బ్యూటీ కెమెరాకు చిక్కింది. మరోసారి విజయ్ వర్మతో కలిసి ముంబయిలో జరిగిన ఓ వేడుకల్లో తళుక్కున మెరిసింది . దీంతో ఆమె అభిమానులు మరోసారి ఆశ్చర్యానికి గురయ్యారు. అతనితో తమన్నా ఉన్న వీడియో  ప్రస్తుతం  సోషల్ మీడియాలో వైరలవుతోంది. వీరిద్దరు కలిసి ఫోటోలకు ఫోజులిస్తూ నవ్వుతూ కనిపించారు. దీంతో ఇప్పటికే వీరిపై వస్తున్న డేటింగ్‌ వార్తలపై మరోసారి చర్చ మొదలైంది. నిజంగా ఈ జంట డేటింగ్‌లో ఉందా అనే అనుమానాలు మరోసారి తెరపైకి వస్తున్నాయి. ఈ వార్తలపై వీరు ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే. 

తమన్నా రాబోయే ప్రాజెక్ట్‌లు

తమన్నా, విజయ్ తొలిసారిగా 'లస్ట్ స్టోరీస్ 2'లో కనిపించనున్నారు. ఆ తర్వాత ఆమె చిరంజీవి, కీర్తి సురేష్‌లతో కలిసి 'భోళా శంకర్'లో కనిపించనుంది. ఇది తెలుగులో ఏప్రిల్ 14, 2023న థియేటర్లలో రిలీజ్ కానుంది.  మరోవైపు, విజయ్ 'ది డివోషన్ ఆఫ్ సస్పెక్ట్ ఎక్స్'లో నటించనున్నారు. ఇందులో కరీనా కపూర్ ఖాన్, జైదీప్ అహ్లావత్‌ కనిపించనున్నారు. ఆ తర్వాత సోనాక్షి సిన్హాతో 'దహాద్', సుమిత్ సక్సేనా చిత్రం 'మిర్జాపూర్ 3' లో నటించనున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement