dating rumours
-
కూతురిపై డేటింగ్ రూమర్స్.. తనకేలాంటి బాధలేదన్న హీరోయిన్
బాలీవుడ్ నటి శ్వేత తివారీ గురించి పరిచయం అక్కర్లేదు. బీటౌన్‌లో పలు సీరియల్స్‌తో పాటు సినిమాల్లోనూ నటించింది. ఆమె కూతురు పాలక్ తివారీ సైతం సినిమాల్లోకి అడుగుపెట్టింది. శ్వేత వారసురాలిగా బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చింది. గతేడాది సల్మాన్ ఖాన్ నటించిన కిసీ కా భాయ్.. కిసీ కా జాన్ మూవీలో కనిపించింది.డేటింగ్ రూమర్స్..అయితే పాలక్ తివారీపై గతంలో చాలాసార్లు డేటింగ్ రూమర్స్ వినిపించాయి. సోషల్ మీడియాలో పెద్దఎత్తున ట్రోలింగ్ కూడా చేశారు. సైఫ్ అలీఖాన్ కుమారుడు ఇబ్రహీం అలీఖాన్‌తో డేటింగ్లో చేస్తున్నారని వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా తన కూతురిపై వచ్చిన డేటింగ్ రూమర్స్‌పై ఆమె తల్లి శ్వేత తివారీ తాజా ఇంటర్వ్యూలో స్పందించింది. అయితే అవన్నీ కేవలం నాలుగు గంటలు మాత్రమే ఉంటాయని.. ఆ తర్వాత వాళ్లే మర్చిపోతారంటూ కొట్టిపారేసింది.శ్వేత తివారీ మాట్లాడుతూ..' తన కూతురిపై వస్తున్న రూమర్స్ నన్ను బాధించవు. ఎందుకంటే అవీ కేవలం 4 గంటలు మాత్రమే ఉంటాయి. ఆ తర్వాత వాళ్లే వార్తలను మరచిపోతారు. అందుకే వాటి గురించి బాధపడటం ఎందుకు?. అలాగే తన వ్యక్తిగత జీవితం గురించి ఇంటర్నెట్లో తరచుగా ఊహాగానాలు వస్తున్నాయి. తాను మళ్లీ పెళ్లి చేసుకోబోతున్నట్లు రూమర్స్ కూడా వినిపించాయి. అలా రూమర్స్ ప్రకారం నాకు ఇప్పటికే మూడు వివాహాలు జరిగాయి. అయినప్పటికీ ఇలాంటి విషయాలు నన్ను ప్రభావితం చేయలేవు. ఇంతకుముందు సోషల్ మీడియా లేనప్పుడు కొంతమంది జర్నలిస్టులు నా గురించి మంచి విషయాలు రాసేందుకు ఎప్పుడూ ఇష్టపడలేదు. నటీనటుల గురించి నెగెటివ్ రాస్తేనే వాళ్ల మార్కెట్ నడుస్తుంది. ఇవన్నీ నన్ను ఏ విధంగానూ ప్రభావితం చేయలేవు" అని తెలిపింది. అయితే తన కుమార్తె పాలక్ తివారీపై నెగెటివ్ ప్రచారం పట్ల ఒక తల్లిగా ఆందోళన చెందుతున్నట్లు అంగీకరించింది.మొదట తనపై వచ్చే ట్రోల్‌లను డీల్ చేసిన పాలక్ తివారీని చూసి వాటిని హ్యాండిల్ చేయడం నేర్చుకున్నానని శ్వేత తివారీ వివరించింది. ఎలాంచి రూమర్స్ వచ్చినా తన కూతురు బలంగా ఉన్నప్పటికీ అది కొన్నిసార్లు తనను భయపెడుతుందని తెలిపింది. నా కూతురు చాలా అమాయకంగా ఉంటుందని.. తనపై వస్తున్న రూమర్స్‌కు తిరిగి స్పందించదని వెల్లడించింది. ఆ సమయంలో ఒక తల్లిగా నాపై కొంత ప్రభావం ఉంటుందని శ్వేత చెప్పుకొచ్చింది. ఒకసారి నా స్నేహితులతో కూర్చుని మాట్లాడుతుండగా.. మా అమ్మ దేనికీ భయపడదని పాలక్ చెప్పిందని గుర్తు చేసుకుంది. కాగా.. శ్వేతా తివారీ చివరిసారిగా మిత్రన్ దా నా చల్దా, ఉమానియా, ఇండియన్ పోలీస్ ఫోర్స్ చిత్రాల్లో కనిపించారు. -
బాయ్ ఫ్రెండ్ తో బ్రేకప్.. హార్దిక్ తో డేటింగ్..!
-
హార్దిక్ పాండ్యాను ఫాలో అవుతున్న విజయ్ దేవరకొండ హీరోయిన్..!
లైగర్ మూవీతో టాలీవుడ్లో అడుగుపెట్టిన బ్యూటీ అనన్య పాండే. ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ సరసన మెప్పించింది. అయితే ఈ సినిమా డిజాస్టర్ కావడంతో ఆ తర్వాత పెద్దగా అవకాశాలు రాలేదు. ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉన్న ముద్దుగుమ్మ ఇటీవల అనంత్ అంబానీ- రాధిక మర్చంట్ పెళ్లిలో సందడి చేసింది. బారాత్ వేడుకల్లో రణ్వీర్ సింగ్, హార్దిక్ పాండ్యాలతో కలిసి చిందులు వేసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో పెద్దఎత్తున వైరలైంది.అయితే ఈ పెళ్లి తర్వాత అనన్య పాండే సోషల్ మీడియాలో హార్దిక్ పాండ్యాను ఫాలో అవుతోంది. హార్దిక్ పాండ్యా సైతం అనన్యను ఫాలో అవుతున్నారు. వీరిద్దరూ కలిసి బరాత్‌లో డ్యాన్స్ చేస్తూ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. అయితే సోషల్ మీడియాలో ఒకరినొకరు ఫాలో చేసుకోవడంతో నెటిజన్స్ ఆసక్తికర కామెంట్స్ చేస్తున్నారు. వీరిద్దరూ డేటింగ్లో ఉన్నారా? అంటూ క్రేజీ పోస్టులు పెడుతున్నారు.ఎందుకంటే ఇటీవల హార్దిక్ పాండ్యా తన భార్య నటాసా స్టాంకోవిచ్‌తో విడిపోయినట్లు ప్రకటించారు. పరస్పర అంగీకారంతో విడిపోతున్నట్లు వెల్లడించారు. అంతేకాకుండా అనన్య పాండే సైతం తన బాయ్‌ఫ్రెండ్ ఆదిత్య రాయ్ కపూర్‌లో బ్రేకప్ చేసుకుంది. అయితే ఈ విషయాన్ని అధికారికంగా మాత్రం వెల్లడించలేదు. ఈ నేపథ్యంలోనే వీరిద్దరు ఒకరినొకరు ఫాలో చేసుకోవడంతో డేటింగ్ రూమర్స్ మొదలయ్యాయి. View this post on Instagram A post shared by Instant Bollywood (@instantbollywood) -
మరోసారి జంటగా లవ్ బర్డ్స్.. వీడియో వైరల్!
బొమ్మరిల్లు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన హీరో సిద్ధార్ఠ్. గతేడాది చిన్నా సినిమాతో అభిమానులను అలరించారు. అయితే సినిమాల కంటే ఎక్కువగా హీరోయిన్ ఆదితి రాయ్ హైదరతోనే ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారు. ఇటీవలే న్యూ ఇయర్ సందర్భంగా వీరిద్దరు జంటగా కనిపించారు. ఇప్పటికే చాలాసార్లు జంటగా కనిపించిన వీరిద్దరిపై డేటింగ్ రూమర్స్ వచ్చాయి. తాజాగా రూమర్ జంట మరోసారి కెమెరాలకు చిక్కింది. ముంబైలో ఓ ఫంక్షన్‌కు హాజరైన వీరిద్దరు ఫోటోలకు పోజులిచ్చారు. తాజాగా ముంబయికి చెందిన నటి నటాషా పూనావాలా తన నివాసంలో నిర్వహించిన కచేరీకి పార్టీకి ఈ జంట హాజరయ్యారు. ఈ ఈవెంట్లో పలువురు బాలీవుడ్ ప్రముఖులు సైతం పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి వెళ్తున్న అదితి, సిద్ధార్థ్ కెమెరాల కంటికి చిక్కారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతోంది. వీరిని చూసిన ఫోటోగ్రాఫర్ 'ఆదితి జీ ఏక్ కపుల్ ఫోటో ప్లీజ్' అంటూ సరదాగా ఆమెను ప్రశ్నించారు. దీనికి నవ్వులు చిందిస్తూ ఫోటోలకు పోజులిచ్చింది. వీరితో పాటు అక్కడే ఉన్న నటుడు ఇషాన్ ఖట్టర్ కూడా కనిపించారు. అయితే వీరిద్దరిపై వస్తున్న డేటింగ్ రూమర్స్ పట్ల ఇంతవరకు ఎవరూ స్పందించలేదు. సినిమాల విషయానికొస్తే అదితి ప్రస్తుతం ఇండో-యుకె కో-ప్రొడక్షన్ 'లయనెస్'లో నటించనున్నట్లు తెలుస్తోంది. అంతే కాకుండా అదితి.. సంజయ్ లీలా భన్సాలీ 'హీరమండి' చిత్రంలో కనిపించనుంది. View this post on Instagram A post shared by Instant Bollywood (@instantbollywood) -
డేటింగ్లో ఉన్నది నిజమే.. కానీ అతనితో కాదు..స్టార్ హీరోయిన్
బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గతేడాది తేజస్, చంద్రముఖి-2 సినిమాలతో అభిమానులను అలరించింది. ప్రస్తుతం ఎమర్జన్సీ చిత్రంతో బిజీగా ఉంది. ఈ సినిమాను జూన్ 14న రిలీజ్ చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించింది. అయితే ఈనెల 22న అయోధ్య బాల రాముని ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి హాజరైంది కంగనా. అదే సమయంలో అక్కడే ఉన్న ఈజ్ మై ట్రిప్ వ్యవస్థాపకుల్లో ఒకరైన నిషాంత్ పిట్టితో ఓ ఫోటోకు పోజులిచ్చింది. ఇది చూసిన నెటిజన్స్ కొందరు కంగనా అతనితో డేటింగ్లో ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు. నెట్టింట తెగ వైరలవుతున్న రూమర్స్‌పై కంగనా స్పందించింది. ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని తేల్చి చెప్పింది. అవన్నీ కేవలం వదంతులు మాత్రమేనని చెప్పుకొచ్చింది. అతనికి ఇప్పటికే పెళ్లయిందని.. దయచేసి ఇలాంటి వార్తలు ఎవరూ నమ్మవద్దని కోరింది. అయితే తాను ఇంకో వ్యక్తితో డేటింగ్లో ఉన్నానని.. సరైన సమయం వచ్చినప్పుడు తానే చెబుతానని కంగనా కుండబద్దలు కొట్టింది. ఒక వ్యక్తితో ఫోటో దిగినంత మాత్రాన ఇలా మాట్లాడడం సరైంది కాదని ఆగ్రహం వ్యక్తం చేసింది. కాగా.. ఇటీవలే అయోధ్యలో జరిగిన బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో కంగనా పాల్గొంది. దీనికి సంబంధించిన ఫోటోలు ట్విటర్ వేదికగా పంచుకుంది. అయితే గతంలో ఆమె ఓ వ్యక్తితో కలిసి ముంబయి వీధుల్లో చక్కర్లు కొట్టారు. ఆ ఫొటోలు నెట్టింట వైరలయ్యాయి. అతను తన హెయిర్ స్టైలిష్ట్ అని కంగనా సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. అంతలోనే మరోసారి అయోధ్య రామమందిర్ ప్రారంభోత్సవంలో కంగనా, నిషాంత్ ఫొటోలు వైరల్ కావడంతో రిలేషన్లో ఉన్నారంటూ ప్రచారం జరుగుతోంది. Yehi janmbhoomi hai param pujya Shri Ram ki, ek naye yug ka aarambh 🚩 pic.twitter.com/TBFAtWAYu3 — Kangana Ranaut (@KanganaTeam) January 22, 2024 -
లైగర్ భామతో డేటింగ్.. యంగ్ హీరో రిప్లై ఇదే !
బాలీవుడ్ తారలే కాదు.. సినీ ఇండస్ట్రీలో డేటింగ్ రూమర్స్ తరచుగా వినిపిస్తుంటాయి. అలా రూమర్స్ కొన్నిసార్లు నిజమైన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. అలానే రూమర్స్‌తో మొదలైన పెళ్లిబంధంతో ఒక్కటైన బాలీవుడ్ జంటలు కూడా ఉన్నాయి. వారిలో సిద్ధార్థ్ మల్హోత్రా-కియారా అద్వానీ, పరిణీతి చోప్రా-రాఘవ్ చద్దా, ఇటీవలే పెళ్లి చేసుకున్న రణ్‌దీప్ హుడా-లైస్రామ్ కూడా ఉన్నారు. తాజాగా ఈలిస్ట్‌లో లైగర్ భామ అనన్య పాండే, బాలీవుడ్ హీరో ఆదిత్య రాయ్ కపూర్ చేరిపోయినట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఈ జంట డేటింగ్లో ఉన్నట్లు పెద్దఎత్తున రూమర్స్ వైరలవుతున్న సంగతి తెలిసిందే. అంతే కాకుండా గతంలో అనన్య బర్త్‌డేను విదేశాల్లో సెలబ్రేట్ చేసుకున్నారు. అయితే ఎక్కడా కూడా తమ రిలేషన్‌పై నోరు విప్పలేదు. అయితే తాజాగా కాఫీ విత్ కరణ్ టాక్ షోకు హాజరైన ఆదిత్య రాయ్ కపూర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. అర్జున్ కపూర్‌తో కలిసి పాల్గొన్న ఈ షోకు సంబంధించిన ప్రోమో రిలీజ్ చేశారు మేకర్స్. అయితే అనన్యతో డేటింగ్ గురించి ప్రశ్నలు సంధించారు కరణ్ జోహార్. అయితే ఆ ప్రశ్నకు ఆదిత్య రాయ్ కపూర్ చాలా ఫన్నీగా సమాధానమిచ్చారు. ఆదిత్య మాట్లాడుతూ..'నన్ను రహస్యాలు మాత్రం అడగవద్దు. అయితే నేను కచ్చితంగా అబద్ధాలైతే మాత్రం చెప్పను' అని అన్నారు. అంతే కాకుండా తన మాజీ లవర్ శ్రద్ధా కపూర్ గురించి కూడా ఓ ఆసక్తికర ప్రశ్న వేశారు కరణ్. మీరు అనన్య పాండే, శ్రద్ధా కపూర్‌తో కలిసి లిఫ్ట్‌లో చిక్కుకుంటే.. ఏం చేస్తారని ఆదిత్యను అడిగారు. అయితే దీనికి పక్కనే ఉన్న అర్జున్ కపూర్ ఫన్నీ ఆన్సరిచ్చాడు. 'కచ్చితంగా రొమాన్స్ చేస్తాడు.. కానీ ఎవరితో చేస్తాడో మాత్రం తెలియదు'.. ఐ యామ్ జస్ట్ జోకింగ్ అని నవ్వుతూ చెప్పాడు. అనన్య, ఆదిత్య రిలేషన్ కాగా.. లైగర్ భామ అనన్య, ఆదిత్య రాయ్ కపూర్ కొంతకాలంగా డేటింగ్లో ఉన్నారు. గతేడాది కృతి సనన్ దీపావళి పార్టీలోనూ జంటగా కనిపించారు. అప్పటి నుంచే రూమర్స్ మొదలయ్యాయి. ఆ తర్వాత వీరిద్దరు చాలాసార్లు విదేశాలకు వెళ్తూ విమానాశ్రయాల్లో జంటగా కనిపించారు. అంతకు ముందే సారా అలీఖాన్‌తో కలిసి అనన్య పాండే సైతం కాఫీ విత్ కరణ్ షోకు హాజరైంది. మేమిద్దరం మంచి స్నేహితులమని చెప్పుకొచ్చింది. కాగా.. ఈ ఎపిసోడ్ డిసెంబర్ 14న డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వేదికగా ప్రసారం కానుంది. మరోవైపు ప్రస్తుతం ఆదిత్య, అనన్య సినిమాలతో బిజీగా ఉన్నారు. అనన్య పాండే నటించిన డ్రీమ్ గర్ల్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. View this post on Instagram A post shared by Karan Johar (@karanjohar) -
మృణాల్తో డేటింగ్ వార్తలు.. స్పందించిన బాద్షా!
సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్ ఇటీవల ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. సినిమాల కంటే ఎక్కువగా సోషల్ మీడియాలో ట్రోలింగ్‌కు గురవుతోంది. గతంలోనే ఓ టాలీవుడ్ హీరోను పెళ్లి చేసుకోబోతోందని వార్తలొచ్చాయి. తాజాగా మరోసారి మృణాల్ డేటింగ్లో ఉందంటూ నెటిజన్స్ కామెంట్స్ చేశారు. దీనికి ప్రధాన కారణం ముంబయిలో జరిగిన శిల్పాశెట్టి దివాళీ బాష్‌కు హాజరవ్వడమే. పార్టీకి హాజరైన ముద్దుగుమ్మ ప్రముఖ బాలీవుడ్ ర్యాపర్ బాద్షాతో సన్నిహితంగా కనిపించింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కావడంతో డేటింగ్ రూమర్స్ మొదలయ్యాయి. సోషల్ మీడియా వేదికగా వీరిద్దరు డేటింగ్లో ఉన్నారా నెటిజన్స్ కామెంట్స్ చేశారు. తాజాగా నెట్టింట వైరలవుతున్న మృణాల్ ఠాకూర్‌తో డేటింగ్ రూమర్స్‌పై ర్యాపర్ బాద్షా స్పందించారు. ‘మిమ్మల్ని నిరాశపరిచినందుకు నన్ను క్షమించండి. మీరు అనుకుంటున్నట్లు అలాంటిదేం లేదు' అంటూ తన ఇన్‌స్టాలో స్టోరీస్‌లో పోస్ట్ చేశారు. అయితే వీరిద్దరి వస్తున్న రూమర్స్ గురించే ఈ పోస్ట్ పెట్టాడని ఫ్యాన్స్ భావిస్తున్నారు. దీపావళి బాష్‌లో రాపర్ బాద్షా, మృణాల్ ఠాకూర్ చేయి పట్టుకుని నడుస్తూ వీడియోలో కనిపించారు. కాగా. మృణాల్ ఇటీవలే ఇషాన్ ఖట్టర్‌తో కలిసి యుద్ధ నేపథ్యంలో తెరకెక్కించిన 'పిప్పా'లో కనిపించింది. బ్రిగేడియర్ బలరామ్ సింగ్ మెహతా రచించిన 'ది బర్నింగ్ ఛాఫీస్' పుస్తకం ఆధారంగా రాజా కృష్ణ మీనన్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అమెజాన్ ప్రైమ్‌లో నవంబర్ 10న విడుదలైన ఈ మూవీకి ఊహించని రెస్పాన్స్ వస్తోంది. ఈ చిత్రంలో ప్రియాంషు పైన్యులి, సోని రజ్దాన్ కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మృణాల్ ఠాకూర్ టాలీవుడ్‌లోనూ హాయ్ నాన్న, ఫ్యామిలీ స్టార్ చిత్రాల్లో నటిస్తోంది. -
డేటింగ్లో స్టార్ హీరోయిన్.. ముచ్చటగా మూడోసారి!
బాలీవుడ్ భామ శ్రద్ధా కపూర్ బీ టౌన్లో పరిచయం అక్కర్లేని పేరు. ఆమె ప్రముఖ నటుడు శక్తి కపూర్ కుమార్తెగా ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. 2010లో టీన్ పట్టి సినిమాలో ఒక చిన్న పాత్ర ద్వారా కెరీర్ ప్రారంభించిన శ్రద్ధా.. లవ్ కా ది ఎండ్ సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. 2013లో విడుదలైన ఆషికి- 2 చిత్రంలో నటనకు విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ సినిమాలోని ఆమె నటనకు ఫిలింఫేర్ ఉత్తమ నటి పురస్కారానికి నామినేషన్ కూడా లభించింది. శ్రద్దా సినిమాల్లో నటించడంతో పాటు మంచి సింగర్ కూడా. తన సినిమాల్లో చాలా పాటలు పాడింది. (ఇది చదవండి: ప్రతి తండ్రికి ఈ పాట అంకితం: మహేశ్ బాబు ప్రశంసలు) అయితే తాజాగా ఈ భామకు సంబంధించిన ఓ న్యూస్ నెట్టింట తెగ వైరలవుతోంది. గతంలో ఆషికి-2 నటుడు ఆదిత్య రాయ్కపూర్తో డేటింగ్లో ఉన్నట్లు రూమర్స్ వచ్చిన సంగతి తెలిసిందే. వారి ఆన్-స్క్రీన్ కెమిస్ట్రీ చూసి.. ఆఫ్ స్క్రీన్‌లోనూ రిలేషన్లో ఉన్నారని అప్పట్లో టాక్ వినిపించింది. ఆ తర్వాత ప్రముఖ ఫోటోగ్రాఫర్ రోహన్ శ్రేష్ఠతో చెట్టాపట్టాలేసుకుని పలు పార్టీలకు హాజరైంది. ఆ సమయంలో శ్రద్దా కపూర్‌పై డేటింగ్ రూమర్స్ వచ్చాయి. తాజాగా శ్రద్ధా కపూర్ అతనితో డేటింగ్లో ఉందన్న వార్త బీటౌన్‌లో హాట్‌టాపిక్‌గా మారింది. తు జూతీ మైన్ మక్కర్' చిత్రానికి సహ రచయితగా పనిచేసిన రాహుల్ మోడీతో శ్రద్ధా కపూర్ డేటింగ్ చేస్తోందని బీ టౌన్ టాక్. అయితే ఈ రూమర్స్‌పై ఇప్పటివరకు అధికారికంగా ఎవరూ స్పందించలేదు. అయితే ఈ జోడీ రిలేషన్లో ఉన్నట్లు వస్తున్న వార్తలపై ఫ్యాన్స్ ఆసక్తి చూపుతున్నారు. నెటిజన్స్ సైతం న్యూ లవ్ బర్డ్స్ ఇన్ బాలీవుడ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా.. ఇటీవలే మహాదేవ్ బెట్టింగ్ యాప్ కేసులో శ్రద్ధా కపూర్‌కు ఈడీ సమన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే. (ఇది చదవండి: 'నా భార్య అర్థం చేసుకుంటది.. నువ్వు నా మాట విను'.. ప్రశాంత్‌పై శివాజీ ఎమోషనల్!) కాగా.. తూ ఝూతీ మైన్ మక్కర్ చిత్రం 2023లో విడుదలైంది. లవ్ ఫిల్మ్స్, టి-సిరీస్ ఫిల్మ్స్ బ్యానర్లపై లవ్ రంజన్, అంకుర్ గార్గ్ నిర్మించిన ఈ సినిమాకు లవ్ రంజన్ దర్శకత్వం వహించాడు. ఈ చిత్రంలో రణ్‌బీర్ కపూర్, శ్రద్ధా కపూర్, డింపుల్ కపాడియా, అనుభవ్ సింగ్ బస్సీ ప్రధాన పాత్రల్లో నటించారు. -
ఆ వార్తలు నా మనసును తీవ్రంగా బాధపెట్టాయి: సబా
బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అతనితో నటి సబా ఆజాద్ రిలేషన్లో ఉందంటూ చాలా సార్లు బీటౌన్‌లో రూమర్స్ వచ్చిన సంగతి తెలిసిందే. అంతే కాకుండా వీరిద్దరు జంటగా పలు ఈవెంట్లకు హాజరు కావడంతో ఈ వార్తలు మరింత ఊపందుకున్నాయి. కాగా.. సబా ఆజాద్ ప్రస్తుతం హూ ఈజ్ యువర్ గైనెక్? అనే వెబ్ సిరీస్‌లో నటిస్తోంది. ఈ షో అమెజాన్ మినీ టీవీలో ప్రసారం అవుతోంది. ప్రస్తుతం ఈ సిరీస్ ప్రమోషన్స్‌లో భాగంగా ఆమె వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన సబా ఆజాద్ తనపై వస్తున్న రూమర్స్‌పై తొలిసారి స్పందించారు. తమ రిలేషన్షిప్ గురించి చాలామంది ట్రోల్స్ చేశారని ఆమె చెప్పుకొచ్చారు. వాటితో తాను చాలా ఇబ్బందులు పడినట్లు తెలిపింది. (ఇది చదవండి: 'మీకు దమ్ముంటే హౌస్‌లోకి వెళ్లండి'.. ట్రోలర్స్‌కు ఇచ్చిపడేసిన అఖిల్!) సబా ఆజాద్ మాట్లాడుతూ.. 'ఇతరుల నుంచి వచ్చే విమర్శలు తట్టుకోవడానికి నాకు చాలా సమయం పట్టింది. ఎందుకంటే నేనేం రాయిని కాదు కదా. వారు చేసే కామెంట్స్ నా మనసును బాధపెట్టాయి. ఆ ట్రోలింగ్స్ చూసి నేను మీకు ఏం అన్యాయం చేశాను? నా జీవితం నా ఇష్టం కదా. మీరు కూడా మీ లైఫ్‌ను మీకు ఇష్టమొచ్చినట్లు జీవించండి అని చెప్పాలనుకున్నా.' అని అన్నారు. అయితే కొన్ని రోజులకు ఇలాంటి మాటలను పట్టించుకోకూడదని పూర్తిగా అర్థమైంది. అప్పటి నుంచి ట్రోల్స్‌ను పట్టించుకోవడం మానేసి మనశ్శాంతితో జీవిస్తున్నట్లు తెలిపారు. హృతిక్ రోషన్, నటి సబా ఆజాద్ రిలేషన్లో ఉన్నట్లు అధికారికంగా ఎక్కడా మాట్లాడలేదు. కానీ సోషల్ మీడియా వేదికగా ఒకరిపై ఒకరు తన ప్రేమ చూపిస్తూ వచ్చారు. వయసులో తనకంటే 12 ఏళ్లు పెద్ద వ్యక్తితో ప్రేమలో ఉండటంపై సబాను పలువురు ట్రోల్ చేశారు. విడాకులు తీసుకున్న వ్యక్తితో ప్రేమాయణం ఏంటి? అని ప్రశ్నించారు. కాగా.. హృతిక్ డిసెంబర్ 20, 2000లో సుస్సానే ఖాన్‌ను వివాహం చేసుకున్నారు. ఈ జంట నవంబర్ 2014లో విడాకులు తీసుకున్నారు. ఈ జంటకు ఇద్దరు కుమారులు హ్రేహాన్, హృదాన్ ఉన్నారు. దీంతో హృతిక్, సబా జంటగా కనిపించడంతో డేటింగ్ ఉన్నట్లు రూమర్స్ వచ్చాయి. ప్రస్తుతం హృతిక్ ఏరియల్ యాక్షన్ డ్రామా 'ఫైటర్'లో నటిస్తున్నారు. ఈ సినిమాలో దీపికా పదుకొణె, అనిల్ కపూర్ కనిపించనున్నారు. (ఇది చదవండి: శ్రీదేవి మృతిపై అసలు నిజాలు బయటపెట్టిన బోనీ కపూర్!) -
హీరోయిన్‌పై బ్రేకప్ రూమర్స్.. ఆ ఒక్క వీడియోతో !
బాలీవుడ్ భామ మలైకా అరోరా ఇటీవల తరచుగా వార్తల్లో నిలుస్తోంది. గత కొద్ది రోజులుగా ఆమె తన ప్రియుడు అర్జున్ కపూర్‌తో బ్రేకప్ చేసుకున్నారంటూ సోషల్ మీడియాలో పెద్దఎత్తున వైరలైన సంగతి తెలిసిందే. బ్రేకప్ రూమర్స్ వస్తున్న నేపథ్యంలో మలైకా ఆరోరా గట్టి సమాధానం ఇచ్చారు. ఆదివారం అర్జున్ కపూర్‌తో లంచ్ డేట్‌కు వెళ్లి మలైకా ఆరోరా రూమర్స్‌కు చెక్ పెట్టారు. తాజాగా ముంబయిలోని ఓ రెస్టారెంట్ నుంచి ఈ జంట బయటకు వస్తూ కనిపించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. (ఇది చదవండి: 'పుష్ప' లాంటి స్టోరీతో మరో సినిమా) కాగా.. ఇన్‌స్టాగ్రామ్‌లో సోదరీమణులు అన్షులా కపూర్, జాన్వీ కపూర్లతో సహా అర్జున్ కుటుంబాన్ని మలైకా అన్‌ఫాలో చేయడంతో వీరిద్దరి రిలేషన్‌పై రూమర్స్ వచ్చాయి. కాగా.. ఇటీవలే తన భర్త జోరావర్ సింగ్ అహ్లువాలియాతో విడాకులు తీసుకున్న నటి కుషా కపిలాతో అర్జున్‌కి రిలేషన్ ఉందన్న వార్తల నేపథ్యంలో ఈ గాసిప్స్ వినిపించాయి. అయితే ఈ విషయాన్ని కుషా కపిలా తీవ్రంగా ఖండించింది. కాగా.. గతంలో తామిద్దరం కలిసి జీవించాలనుకుంటున్నామని.. తమ బంధాన్ని భవిష్యత్తులోనూ కొనసాగించాలని భావిస్తున్నట్లు మలైకా వెల్లడించింది. మలైకా అరోరా బాలీవుడ్లో స్టార్ హీరోలందరితో సినిమాల్లో నటించింది. అయితే 2008లో ఈమె మాజీ భర్త అర్బాజ్ ఖాన్ తో కలిసి అర్బాజ్ ఖాన్ ప్రొడక్షన్స్ పేరుతో చిత్ర నిర్మాణ సంస్థను కూడా స్థాపించింది. ఈ సంస్థ దబాంగ్ పేరుతో సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో వరస చిత్రాలని నిర్మించింది. ఆ తర్వాత 2017తో తన భర్తతో విడాకులు తీసుకున్న మలైకా.. ప్రస్తుతం అర్జున్ కపూర్‌తో రిలేషన్లో ఉంది. (ఇది చదవండి: అభిమానులకు సర్ప్రైజ్ ఇచ్చిన కిచ్చా.. ఆ లుక్‌తో కనిపించి! ) View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
స్టార్ హీరోతో డేటింగ్లో లైగర్ భామ.. స్పందించిన హీరోయిన్ తండ్రి!
ఇటీవల బాలీవుడ్ భామ అనన్య పాండే ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. ఆమె డేటింగ్లో ఉన్నట్లు బీ టౌన్లో రూమర్స్ వినిపిస్తున్నాయి. స్టార్ హీరో ఆదిత్య రాయ్ కపూర్‌తో పీకల్లోతు ప్రేమలో ఉందంటూ సోషల్ మీడియాలో పెద్దఎత్తున వైరలైన సంగతి తెలిసిందే. ఎందుకంటే గత నెలలో ఈ జంట ఇటీవల పోర్చుగల్ ట్రిప్‌కు వెళ్లగా.. అక్కడ వీధులు, రెస్టారెంట్లలో జంటగా దిగిన ఫోటోలు కాస్తా నెట్టింట దర్శనమివ్వడంతో డేటింగ్ గాసిప్స్ ఊపందుకున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఆమె తండ్రి చంకీ పాండే ఈ వార్తలపై స్పందించారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఆయన కూతురి రిలేషన్‌పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. (ఇది చదవండి: ఓటీటీకి వచ్చేసిన 'భాగ్ సాలే'.. స్ట్రీమింగ్ ఎక్కడో తెలుసా?) చంకీ పాండే మాట్లాడుతూ..' నటీనటుల జీవితంలో రిలేషన్స్‌పై రూమర్స్ రావడమనేది సాధారణమైన విషయం. మేము గ్లామర్‌లో వృత్తిలో ఉన్నాం. ఇలాంటివన్నీ జరగాల్సినవే. కెరీర్‌కు ఇది నష్టం కలిగించినప్పటికీ.. వీటిని మనం కట్టడి చేయలేం. అనన్య చాలామంది హీరోలతో అద్భుతంగా నటించింది. 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2'లో టైగర్ ష్రాఫ్ సరసన, 'పతి, పత్నీ ఔర్ వో'లోని కార్తీక్ ఆర్యన్‌తో సినిమాలు చేసింది. ఆమెకు ఇది ఓ అద్భుతమైన ప్రయాణం. ఈ విషయంలో నాకు ఎవరినీ వ్యతిరేకించాల్సిన అవసరం లేదు. తనకి నేను చెప్పేది ఒక్కటే.. నా కంటే మెరుగ్గా ఉండాలి.' అని అన్నారు. కాగా.. స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ -2’తో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన.. విజయ్ దేవరకొండతో 'లైగర్' చిత్రంలో కనిపించింది. ప్రస్తుతం ఆమె ఆయుష్మాన్ ఖురానాతో 'డ్రీమ్ గర్ల్' సీక్వెల్ కోసం సిద్ధమవుతోంది. ఆ తర్వాత విక్రమాదిత్య మోత్వానే దర్శకత్వంలో ఓ థ్రిల్లర్ మూవీలో నటించనుంది. ఆదిత్య రాయ్ కపూర్'ది నైట్ మేనేజర్'లో తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఈ సిరీస్ ప్రస్తుతం హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. (ఇది చదవండి: 83 ఏళ్ల వయసులో తండ్రైన నటుడు.. అప్పుడేమో డౌట్.. ఇప్పుడు ఏకంగా!) -
నేను వాటిని పట్టించుకోను.. కాబోయే వాడు మాత్రం ఇలా ఉంటేనే: శోభిత ధూళిపాళ
తెలుగమ్మాయి శోభిత ధూళిపాళ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆ మధ్య ఎక్కువగా అక్కినేని నాగచైతన్యతో డేటింగ్లో ఉన్నట్లు పెద్దఎత్తున రూమర్స్ కూడా వినిపించాయి కానీ తనపై వస్తున్న రూమర్స్‌కు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని కొట్టిపారేసింది. ఓసారి లండన్ వెకేషన్లో, మరోసారి రెస్టారెంట్లో ఇద్దరూ జంటగా కనిపించడంతో డేటింగ్ గాసిప్స్ గుప్పుమన్నాయి. తాజాగా ది నెట్ మేనేజర్-2 ప్రమోషన్లలో పాల్గొన్న శోభిత ధూళిపాళ తనకు కాబోయే వ్యక్తి ఎలా ఉండాలో క్లారిటీ ఇచ్చింది. (ఇది చదవండి: చైతో డేటింగ్ అంటూ రూమర్స్.. స్పందించిన శోభిత ధూళిపాళ) శోభిత మాట్లాడుతూ.. 'నేను పెళ్లి చేసుకోబోయే వ్యక్తికి ఇలాంటి లక్షణాలు ఉండాలి. జీవితంలో ఎంత ఎదిగినా అణగిమణిగి ఉండాలి. సింపుల్‌గా, మంచి మనసు, ఇతరుల పట్ల దయ కలిగి ఉండాలి. ప్రకృతిని ప్రేమించాలి. ఈ జీవితం చాలా చిన్నదనే విషయాన్ని కూడా అర్థం చేసుకోవాలి. అందుకు అనుగుణంగా జీవితంలోని ప్రతిక్షణాన్ని ఆస్వాదించాలి.' అని తన మనసులోని మాటలను చెప్పుకొచ్చింది. తనపై వస్తున్న రూమర్స్ గురించి మాట్లాడుతూ... 'అలాంటి వార్తలు నన్ను ఇబ్బంది పెట్టలేవు. ఎవరైనా నా వర్క్ లైఫ్ గురించి మాట్లాడితే సంతోషిస్తా. ఎందుకంటే.. ఎన్నో ఆడిషన్స్ తర్వాత నాకు సినిమాల్లో నటించే అవకాశం వచ్చింది. అప్పటి నుంచి ఇప్పటివరకూ ప్రతి రోజు కష్టపడుతున్నా. అని అన్నారు. కాగా.. నాగ చైతన్యతో శోభితా రిలేషన్లో ఉందంటూ రూమర్స్ వచ్చిన సంగతి తెలిసిందే. (ఇది చదవండి: ప్రేమ పెళ్లి.. విడిపోయిన జంట.. నటికి భర్త అసభ్యకర సందేశాలు! ) కాగా.. గూఢచారి సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన శోభిత అంతకన్నా ముందు బాలీవుడ్లో అడుగుపెట్టింది. తెలుగు, హిందీలోనే కాకుండా మలయాళంలోనూ సినిమాలు చేసింది. పొన్నియన్ సెల్వన్ 1లో నటించిన ఈ భామ రెండో భాగంలోనూ యాక్ట్ చేసింది. మంకీ మ్యాన్ అనే హాలీవుడ్ సినిమాలోనూ శోభిత నటించింది. ప్రస్తుతం ఆమె ది నైట్ మేనేజర్-2తో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. -
స్టార్ హీరో మనవరాలు డేటింగ్.. సోషల్ మీడియాలో వీడియో వైరల్!
అమితాబ్ బచ్చన్ మనవరాలు నవ్య నవేలి నందా గురించి బీటౌన్‌లో పరిచయం అక్కర్లేని పేరు. నవేలి గతేడాది 'వాట్ ది హెల్' అనే పాడ్‌కాస్ట్‌తో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ప్రస్తుతం ఆమె లింగ సమానత్వం కోసం పోరాడుతున్నారు. కొత్తగా ఆమె పేరుతోనే నవేలి అనే ప్రాజెక్ట్‌ను ప్రారంభించారు. ఈ షోలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చిస్తున్నారు. అయితే తాజాగా నవేలి నందాకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట్లో తెగ వైరలవుతోంది. (: ఇది చదవండి: ఆ క్షణాలు అద్భుతం.. ఉపాసన ట్వీట్ వైరల్!) బాలీవుడ్ నటుడు సిద్ధాంత్ చతుర్వేదితో నవ్య నవేలి నందాతో డేటింగ్లో ఉందంటూ బీటౌన్‌లో గాసిప్స్ గుప్పమంటున్నారు. ఈ జంట బుధవారం రాత్రి ముంబయిలోని ఓ థియేటర్ వద్ద జంటగా వెళ్తూ కెమెరాల కంటికి చిక్కారు. దీంతో వీరిద్దరూ డేటింగ్లో ఉన్నారంటూ పెద్ద ఎత్తున రూమర్స్ వినిపిస్తున్నాయి. కాగా.. నవేలి నందా అమితాబ్ -జయా బచ్చన్ కూతురు శ్వేతా బచ్చన్ కుమార్తె. సిద్ధాంత్ చతుర్వేది.. గల్లీ బాయ్ చిత్రంలో బాలీవుడ్లో అరంగేట్రం చేశారు. సిద్ధాంత్ చతుర్వేది చివరిసారిగా కత్రినా కైఫ్, ఇషాన్ ఖట్టర్‌లతో హారర్-కామెడీ చిత్రం ఫోన్ భూత్‌లో కనిపించారు. మరోవైపు ఆదర్శ్ గౌరవ్, అనన్య పాండేతో పాటు ఖో గయే హమ్ కహాన్, మాళవిక మోహనన్‌తో కలిసి యాక్షన్-థ్రిల్లర్ యుధ్రాతో సిద్ధాంత్ నటిస్తున్నారు. ( ఇది చదవండి: స్టార్ హీరోయిన్ కూతురు ఆడుకుంటున్న బ్యాగు ధరెంతో తెలుసా?) View this post on Instagram A post shared by Manav Manglani (@manav.manglani) -
ఆ ప్లేస్‌లో ప్రభాస్‌ను తప్ప ఎవరినీ ఊహించుకోలేను: కృతి సనన్
బాలీవుడ్ భామ కృతి సనన్ గురించి పరిచయం అక్కర్లేదు. మహేశ్ బాబు హీరోగా నటించిన నేనొక్కడినే సినిమాతో టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత నాగ చైతన్య సరసన దోచేయ్ చిత్రంలో కనిపించింది. గతడేది వరుణ్ ధావన్‌తో కలిసి భేడియా చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ప్రభాస్ సరసన నటించిన ఆదిపురుష్ ఈనెల 16న విడుదల కాబోతోంది. (ఇది చదవండి: తనతో చాలా అసభ్యంగా ప్రవర్తించాడు.. ఆదిపురుష్ హీరోయిన్) బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కించిన ఈ చిత్రంలో కృతి సనన్ సీత పాత్రలో కనిపించనుంది. అయితే తాజాగా మూవీ ప్రమోషన్లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న బాలీవుడ్ భామ ప్రభాస్ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. గతంలో ప్రభాస్‌తో డేటింగ్లో ఉందంటూ రూమర్స్ వచ్చిన సంగతి తెలిసిందే. రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో మొదటిసారి ప్రభాస్‌తో కలిసి పనిచేయడం ఎలా ఉందని కృతి సనన్‌ను ప్రశ్నించగా వాటికి సమాధానమిచ్చింది ముద్దుగుమ్మ. కృతి మాట్లాడుతూ.. 'ప్రభాస్ చాలా ప్రశాంతంగా ఉంటారు. ఎదుటివారిని గౌరవిస్తారు. మొదట్లో అతను సిగ్గుపడేవాడు. నేను తొలిసారి నటించిన తెలుగు సినిమా గురించి మాట్లాడటం ప్రారంభించా. మనకు రాని భాషలో నటించడం చాలా కష్టమని నాకు తెలియదు అని చెప్పా. ఆ తర్వాతే ప్రభాస్ నాతో మాట్లాడారు. నేను మామూలుగానే మాట్లాడేదాన్ని. కానీ ప్రభాస్ చాలా ఒపెన్‌గా ఉండేవారు. ఆయన చాలా సైలెంట్‌గా తన పని చేసుకోపోయేవారు. ప్రభాస్ కళ్లతోనే తన భావాలను వ్యక్తం చేస్తాడు. ఆదిపురుష్‌లో రాఘవగా ప్రభాస్‌ను తప్ప మరొకరిని ఊహించుకోలేను.' అని అన్నారు. గత కొంతకాలంగా కృతి, ప్రభాస్ డేటింగ్ చేస్తున్నారనే రూమర్స్ వినిపించాయి. - ఐవీవీ సుబ్బరాజు (ఇది చదవండి : షూటింగ్లో ప్రమాదం.. బిగ్ బాస్ నటికి తీవ్రగాయాలు!) -
క్రికెటర్‌ను పెళ్లి చేసుకుంటున్నారా?.. ఓపెన్‌గానే చెప్పేసిన హీరోయిన్!
బాలీవుడ్ నటి సారా అలీ ఖాన్ ఇటీవల తరచుగా వార్తల్లో నిలుస్తోంది. తాజాగా విక్కీ కౌశల్‌తో జంటగా నటించిన చిత్రం జరా హాట్కే జరా బచ్కే. థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. అయితే సారా అలీ ఖాన్ టీమిండియా క్రికెటర్ శుభ్‌మాన్ గిల్‌తో డేటింగ్లో ఉన్నట్లు వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. (ఇది చదవండి: ఆదిపురుష్ టీం సంచలన నిర్ణయం..వారి కోసమే!) తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొన్న సారాను మీరు క్రికెటర్‌ను పెళ్లి చేసుకుంటున్నారా? అని ప్రశ్నించారు. అయితే దీనికి తనదైన స్టైల్లో రిప్లై ఇచ్చింది బాలీవుడ్ భామ. తనకు వారు ఎలాంటి వృత్తిలో ఉన్నారనే విషయాన్ని పెద్దగా పట్టించుకోనని ఓపెన్‌గానే చెప్పేసింది. వారు నటుడు, క్రికెటర్, వ్యాపారవేత్త, డాక్టరైనా సరేనని చెప్పుకొచ్చింది. తన మేధోస్థాయికి సరిపోయే వ్యక్తిగా ఉంటే చాలని ఆమె పేర్కొంది. కాగా.. గతంలో తన అమ్మమ్మ, ప్రముఖ నటి షర్మిలా ఠాగూర్.. మాజీ భారత క్రికెటర్ మన్సూర్ అలీ ఖాన్ పటౌడీని పెళ్లాడిన సంగతి తెలిసిందే. సారా, శుభ్‌మాన్ డేటింగ్ రూమర్స్ కాగా.. గతంలో సారా, శుభ్‌మాన్ డేటింగ్ డిన్నర్ డేట్లో ఒకే రెస్టారెంట్లో కనిపిచండంతో రూమర్స్ ఊపందుకున్నాయి. ఇటీవల సోషల్ మీడియాలో ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకోవడంతో వీరిద్దరు విడిపోయినట్లు వైరలైంది. సారా ప్రస్తుతం కరణ్ జోహార్ ఏ వతన్ మేరే వతన్‌లో కనిపించనుంది. ఇది ఓటీటీలో విడుదల కానుంది. హోమీ అదాజానియా మూవీ 'మర్డర్ ముబారక్', ఆదిత్య రాయ్ కపూర్ సరసన అనురాగ్ బసు చిత్రం 'మెట్రో...ఇన్ డినో'లో కూడా సారా నటిస్తోంది. (ఇది చదవండి: రాజకీయాల్లోకి మరో స్టార్ హీరో.. టార్గెట్ అదే..) -
శర్వానంద్ పెళ్లికి హాజరైన లవ్ బర్డ్స్.. సోషల్ మీడియాలో వైరల్!
యంగ్ హీరో సిద్దార్థ్‌తో హీరోయిన్ అదితి రావు హైదరీ డేటింగ్లో ఉన్నట్లు పలుసార్లు రూమర్స్ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ జంట ఎక్కువగా పార్టీల్లో కనిపించడంతో అభిమానులు వీరి గురించే చర్చించుకుంటున్నారు. అయితే వీరిద్దరి రిలేషిప్పై ఇంతవరకు ఎక్కడా స్పందించలేదు. గతంలో శర్వానంద్ నిశ్చితార్థంలో సిద్ధార్థ్-అదితిలు జంటగా కనిపించడంలో వీరు రిలేషన్లో ఉన్నారని అంతా ఫిక్స్ అయిపోయారు. తాజాగా ఈ జంట జైపూర్‌లో జరిగిన శర్వానంద్ పెళ్లికి కూడా హాజరయ్యారు. (ఇది చదవండి: ప్రేమికుల రోజున సీనియర్ హీరోకి అదితి ప్రపోజ్! సిద్ధార్థ్ రియాక్షన్ ఇదే..) శర్వానంద్ పెళ్లికి జైపూర్ వెళ్తూ అదితి, సిద్ధార్థ్ ఇటీవల ముంబై విమానాశ్రయంలో జంటగా కనిపించారు. సిద్ధార్థ్, అదితి విమానాశ్రయం లోపలికి వెళ్తూ కనిపించారు. అంతే కాకుండా జైపూర్‌లో రాజస్థాన్ నటి, రాజకీయవేత్త బినా కాక్ ఇంటికి కూడా వెళ్లారు. ఆమెతో కలిసి దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరలయ్యాయి. ఈ ఫోటోలు చూసిన అభిమానులు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. కాగా.. అదితి, సిద్ధార్థ్ జంటగా అజయ్ భూపతి దర్శకత్వం వహించిన మహా సముద్రంలో మూవీలో నటించారు. ఇందులో శర్వానంద్ కూడా ఉన్నారు. ఈ చిత్రం షూటింగ్ సమయంలో ఈ జంట ఒకరినొకరు ప్రేమించుకున్నట్లు వార్తలొచ్చాయి. తాజాగా శర్వానంద్ పెళ్లికి జంటగా వెళ్లడంతో మరోసారి డేటింగ్ రూమర్స్ ఊపందుకున్నాయి. (ఇది చదవండి: త్రిషకు అతనితో పెళ్లి చేయడమే పెద్ద మైనస్.. డైరెక్టర్ కామెంట్స్ వైరల్) View this post on Instagram A post shared by Bina Kak (@kakbina) -
మరోసారి జంటగా లవ్ బర్డ్స్.. డేటింగ్‌పై మొదలైన చర్చ!
మిల్కీ బ్యూటీ తమన్నా గురించి పరిచయం అక్కర్లేదు. టాలీవుడ్ పలు సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన భామ.. ప్రస్తుతం బాలీవుడ్లో బిజీగా ఉంది. అయితే ఈ ఏడాది ప్రారంభంలో నటుడు విజయ్ వర్మతో కలిసి గోవాలో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకుంది. ఆ రోజు తమన్నాను విజయ్ ముద్దు పెట్టుకోవడం హాట్ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. ఇప్పటికే వీరిద్దరిపై పలుసార్లు డేటింగ్లో ఉన్నారని రూమర్స్ వినిపించాయి. అయితే తాజాగా మరోసారి ఈ జంట కెమెరా కంటికి చిక్కింది. ఓ డిన్నర్ పార్టీ నుంచి బయటకు వస్తూ జంటగా కనిపించడంతో లవ్‌బర్డ్స్ అంటూ మరోసారి రూమర్స్ మొదలయ్యాయి. (ఇది చదవండి: నా తమన్నాతో తిరుగుతున్నావా?.. విజయ్ వర్మపై నటుడి కామెంట్స్ వైరల్!) శుక్రవారం రాత్రి ముంబయిలోని బాంద్రాలో డిన్నర్ పార్టీలో తళుక్కున మెరిశారు. ఇద్దరు కూడా బ్లాక్ అవుట్‌ఫిట్‌లో కనిపించారు. దీంతో మరోసారి ఈ జంట డేటింగ్ గురించి బీటౌన్‌లో చర్చ మొదలైంది. కాగా.. విజయ్ వర్మ ఇటీవలే రిలీజైన దహాద్ వెబ్ సిరీస్‌లో కనిపించారు. ప్రస్తుతం ఓ క్రైమ్ థ్రిల్లర్ చిత్రంలో కనిపించనున్నారు. ఇందులో కరీనా కపూర్ ఖాన్, జైదీప్ అహ్లావత్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తమన్నా ప్రస్తుతం మెగాస్టార్ సరసన భోళాశంకర్‌లో నటిస్తోంది. ఈ చిత్రం ఆగస్ట్ 11న ప్రేక్షకుల ముందుకురానుంది. (ఇది చదవండి: ఆ విషయంలో నచ్చకపోతే మొహం మీదే చెప్పేస్తా: అనుపమ) View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
సారా- గిల్ డేటింగ్ రూమర్స్.. అంతలోనే విడిపోయారా?
బాలీవుడ్ నటి సారా అలీ ఖాన్, టీమిండియా యంగ్ క్రికెటర్ శుభ్‌మన్ గిల్ గతంలో డేటింగ్లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ జంట దుబాయ్‌లోని ఓ రెస్టారెంట్లో డిన్నర్ చేస్తూ కనిపించడంతో అప్పటి నుంచి డేటింగ్ రూమర్స్ ఊపందుకున్నాయి. అయితే దీనిపై ఎవరూ కూడా నోరు విప్పలేదు. (ఇది చదవండి: Shubman Gill: ‘సారా’తో దుబాయ్‌లో శుబ్‌మన్ గిల్.. ఫొటో వైరల్! అయితే ఈసారి..) అయితే అంతలా కలిసి తిరిగినా వీరిద్దరు తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకరిని ఒకరు అన్‌ఫాలో చేసుకోవడంతో మరోసారి వార్తల్లో నిలిచారు. దీంతో ఈ జంట తమ బంధానికి గుడ్ బై చెప్పినట్లేనా అంటూ నెటిజన్స్ భావిస్తున్నారు. దీని వెనుక కారణం ఏమై ఉంటుందని మరికొందరు ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం ఐపీఎల్లో సూపర్ ఫామ్‌లో ఉన్న గిల్.. గతంలోనూ సచిన్ కూతురు సారా టెండూల్కర్‌తో డేటింగ్లో ఉన్నట్లు రూమర్స్ వినిపించాయి. వీరిద్దరూ సోషల్ మీడియాలో ఒకరినొకరు ఫాలో అవుతూ ఒకరి పోస్టులకు మరొకరు కామెంట్లు పెట్టడంతో ఈ వార్తలు పుట్టుకొచ్చాయి. ఆ తర్వాత వీరిద్దరు ఎక్కడే గానీ డేటింగ్ గురించి స్పందించలేదు. (ఇది చదవండి: దానివల్లే శాకుంతలం సినిమాకు కలెక్షన్స్ రాలేదు: పరుచూరి) అయితే కొన్ని నెలల క్రితం సోనమ్ బజ్వాతో ఇంటర్వ్యూలో గిల్ చివరకు సారాతో డేటింగ్‌పై అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. మీరు సారాతో డేటింగ్ చేస్తున్నారా?" గిల్‌ని ప్రశ్నించగా.. అవ్వొచ్చు.. కాకపోవచ్చు అంటూ బదులిచ్చారు. కాగా.. సారా అలీ ఖాన్ ప్రస్తుతం 'జరా హాట్కే జరా బచ్కే' మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉంది. మరోవైపు శుభ్‌మన్ గిల్ ఐపీఎల్ మ్యాచ్‌లతో బిజీగా ఉన్నారు. -
కీర్తిసురేష్ పెళ్లి చేసుకునేది ఇతడినేనా? ట్వీట్‌తో క్లారిటీ వచ్చేసింది
హీరో,హీరోయిన్ల సినిమా సంగతులతో పాటు వారి పర్సనల్ విషయాలు తెలుసుకోవాలనే కుతూహాలం ఫ్యాన్స్‌లో ఎక్కువగా ఉంటుంది. ఈ క్రమంలో గత కొన్నిరోజులుగా హీరోయిన్ కీర్తిసురేష్ పెళ్లి విషయం ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా మారింది. ఓ బిజినెస్ మ్యాన్‌తో కీర్తిసురేష్ లవ్‌లో ఉందని, త్వరలోనే వీరి వివాహం జరగనుందంటూ వార్తలు షికార్లు చేస్తున్నాయి. రీసెంట్గా కీర్తి ఓ అబ్బాయి ఫోటో షేర్ చేయడంతో ఇతడే మహానటికి కాబోయే వరుడు అంటూ ఒక్కసారిగా కథనాలు వెలువడ్డాయి. దీనికి తోడు కీర్తి షేర్ చేసిన ఫోటోల్లో ఇద్దరూ ఒకే కలర్ డ్రెస్ దుస్తులు వేసుకోవడంతో ఈ అనుమానాలకు మరింత బలం చేకూరినట్లయ్యింది. దీంతో కీర్తిసురేష్ పెళ్లిపై ఫిల్మీదునియాలో రకరకాలుగా రూమర్స్ వస్తున్నాయి. తాజాగా ఈ వార్తలపై కీర్తి స్వయంగా స్పందించింది. ఈ మేరకు ట్వీట్ చేస్తూ.. 'ఈసారి నా బెస్ట్ ఫ్రెండ్‌ను ఈ వార్తల్లోకి తీసుకొచ్చారా?నా జీవితంలోని నిజమైన మిస్టరీ మ్యాన్‌ను తప్పకుండా సమయం వచ్చినప్పుడు రివీల్ చేస్తాను. అప్పటిదాకా చిల్‌గా ఉండండి' అంటూ పేర్కొంది. దీంతో రీసెంట్గా కీర్తి షేర్ చేసిన ఆ అబ్బాయి బాయ్‌ఫ్రెండ్ కాదని తేలిపోయింది. అయితే సమయం వచ్చినప్పుడు చెబుతాను అనడంతో కీర్తి లైఫ్‌లో మిస్టరీ మ్యాన్ ఉన్నడన్నది మాత్రం స్పష్టమైంది. ఆయన ఎవరన్నది త్వరలోనే తెలియనుంది. Hahaha!! Didn’t have to pull my dear friend, this time! I will reveal the actual mystery man whenever I have to 😉 Take a chill pill until then! PS : Not once got it right 😄 https://t.co/wimFf7hrtU — Keerthy Suresh (@KeerthyOfficial) May 22, 2023 -
బెల్లంకొండ హీరోయిన్ “యో...యో”
-
ప్రభాస్‌ను ఆకాశానికెత్తేసిన హీరోయిన్ కృతిసనన్.. కామెంట్స్ వైరల్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సినిమా ఆదిపురుష్. బాలీవుడ్ దర్శకుడు ఓంరౌత్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ట్రైలర్ విడుదలై అద్భుతమైన రెస్పాన్స్ అందుకుంటుంది. టీజర్‌తో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న మేకర్స్ ట్రైలర్‌తో మాత్రం ప్రశంసలు అందుకుంటున్నారు. టీజర్‌కు వంద రెట్లు ట్రైలర్ మెరుగ్గా ఉందని, విజువల్స్ అద్భుతంగా ఉన్నాయంటూ ప్రేక్షకులు కామెంట్స్ చేస్తున్నారు. రామాయణం ఆధారంగా రూపొందిన ఈ చిత్రంలో ప్రభాస్ రాముడిగా, కృతిసనన్ సీత పాత్రలో నటించారు. లక్ష్మణుడిగా సన్నీ సింగ్, రావణుడిగా సైఫ్ అలీఖాన్ నటించారు.ఇండియాతో పాటు యూఎస్ఏ, యుకే, కెనడా సహా 70 దేశాల్లో అత్యధిక స్క్రీన్స్‌లో ట్రైలర్‌ను లాంచ్ చేశారు. ఈ సందర్భంగా ముంబైలో జరిగిన గ్రాండ్ ఈవెంట్లో హీరోయిన్ కృతిసనన్ ప్రభాస్‌పై ప్రశంసలు కురిపించింది. రాముడిలాగే ప్రభాస్ చాలా మంచివాడని, అతను చాలా సింపుల్ అంటూ ఆకాశానికెత్తేసింది. ఆదిపురుష్ షూటింగ్ సమయంలోనే ప్రభాస్-కృతిసనన్ ప్రేమలో పడ్డారని, త్వరలోనే తమ రిలేషన్షిప్ స్టేటస్ అనౌన్స్ చేస్తారంటూ గతంలో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా కృతిసనన్ ప్రభాస్‌పై చేసిన ఈ కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి. -
హనీసింగ్‌తో ఛత్రపతి హీరోయిన్ డేటింగ్? నటి ఏమందంటే?
బాలీవుడ్ హీరోయిన్ నుస్రత్ బరూచా, ర్యాపర్, సింగర్ హనీ సింగ్ ఇటీవల ఓ ఈవెంట్లో కలిసి కనిపించారు. హనీసింగ్ ఆమె చేతులు పట్టుకుని వెళ్తూ కెమెరాల కంటికి చిక్కాడు. ఇంకేముంది, వీరి మధ్య సమ్‌థింగ్ సమ్‌థింగ్ జరుగుతోందంటూ బీటౌన వార్తలు గుప్పుమన్నాయి. తాజాగా ఈ రూమర్స్ నుస్రత్ చెవిన పడ్డాయి. ఈ వార్తలు విన్న భామ ఆగ్రహమో, అసహనమో వ్యక్తం చేయకుండా ఎగిరి గంతేసినంత పని చేసింది. నుస్రత్ బరూచా హిందీ ఛత్రపతి సినిమాలో బెల్లంకొండ శ్రీనివాస్‌తో జోడీ కట్టింది. ఈ మూవీ ఈ నెల 12న విడుదల కానుంది. ప్రమోషన్స్‌లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆమెకు హనీసింగ్‌తో డేటింగ్‌పై ప్రశ్న ఎదురైంది. దీనికామె స్పందిస్తూ.. 'మీకో విషయం తెలుసా, ఇది నా జీవితంలోనే ఫస్ట్ డేటింగ్ రూమర్. నేను పెద్దగా ఎవరితోనూ తిరగను కాబట్టి నాపై ఇంతవరకు ఎలాంటి రూమర్ రాలేదు. కానీ ఈ పుకారు గురించి విన్నాక.. వావ్, నాకూ ఒకరు ఉన్నారన్నమాట అని సర్ప్రైజ్ అయ్యా. ఇక మీదట ఎవరడిగినా సరే, నాపై కూడా ఓ లవ్ రూమర్ ఉందని చెప్పుకోవచ్చు. అయినా జనాలకు బొత్తిగా పని లేకుండా పోయింది. ఏదేదో ఊహించుకుంటూ ఎప్పుడూ ఊహల్లోనే బతికేస్తున్నారు. సరే, నా గురించి కూడా ఏదేదో అనుకోండి, నేనేం పట్టించుకోను, నాకే సమస్యా లేదు' అని చెప్పుకొచ్చింది హీరోయిన్. కాగా నుస్రత్, హనీ సింగ్ 2021లో వచ్చిన ఓ మ్యూజిక్ వీడియోలో కనిపించారు. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) చదవండి: తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో ఒత్తిడి, సినిమాలు వదిలేసుకున్నా: హీరో అవే మనల్ని దూరం చేశాయి: సమంత -
నా తమన్నాతో తిరుగుతున్నావా?.. విజయ్ వర్మపై నటుడి కామెంట్స్ వైరల్!
మిల్కీ బ్యూటీ తమన్నా గురించి పరిచయం అక్కర్లేదు. టాలీవుడ్ పలు సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన భామ.. ప్రస్తుతం బాలీవుడ్లో బిజీగా ఉంది. అయితే ఈ ఏడాది ప్రారంభంలో నటుడు విజయ్ వర్మతో కలిసి గోవాలో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకుంది. ఆ రోజు తమన్నాను విజయ్ ముద్దు పెట్టుకోవడం హాట్ టాపిక్‌గా మారింది. అప్పటి నుంచి ఈ జంట ఎక్కడా చూసిన కనిపించడంతో డేటింగ్ రూమర్స్ ఊపందుకున్నాయి. చాలా సార్లు విమానాశ్రయాల్లో ఇద్దరు కెమెరాలకు చిక్కడంతో ఆ వార్తలకు మరింత బలం చేకూరింది. తాజాగా మరోసారి ఇద్దరు కలిసి కారులో వెళ్తూ కనిపించారు. దీంతో మిల్కీ బ్యూటీ- విజయ్ వర్మ డేటింగ్ రూమర్స్ మరోసారి హాట్ టాపిక్‌గా మారాయి. (ఇది చదవండి: ఆ సినిమా ఫలితం తీవ్ర నిరాశకు గురి చేసింది: మధుబాల) అయితే తాజాగా వీరిద్దరి రిలేషన్‌పై విజయ్ వర్మ స్నేహితుడు, సహానటుడు గుల్షన్ దేవయ్య క్రేజీ కామెంట్స్ చేశారు. విజయ్ వర్మ తన ఇన్‌స్టాలో 'దహాద్' థ్రిల్లర్ వెబ్ సిరీస్ టీజర్‌ను పోస్ట్ చేశారు. ఈ టీజర్ చూసిన గుల్షన్.. తమన్నాతో విజయ్ వర్మ డేటింగ్‌పై ఫన్నీగా పోస్ట్ చేశారు. గుల్షన్ తన కామెంట్లో రాస్తూ..' నా తమన్నాతో నువ్వు తిరుగుతున్నావ్. నాకు సరైన బుద్ధి చెప్పావ్ విజయ్. ఇంకా నా పరువు తీయనందుకు నీకు చాలా థ్యాంక్స్. లేకపోతే ఏం జరిగేదో.. హే రామ్' అంటూ పోస్ట్ చేశారు. అయితే ఇది కావాలనే విజయ్ వర్మను ఆటపట్టించేందుకు చేశాడని ఫ్యాన్స్ భావిస్తున్నారు. (ఇది చదవండి: అమెరికాలో లయ.. ఎలాంటి జాబ్ చేస్తుందో తెలుసా?) అయితే ఈ జంట తమ రిలేషన్‌పై ఇప్పటివరకు స్పందించలేదు. కాగా.. తమన్నా, విజయ్ మొదటిసారిగా 'లస్ట్ స్టోరీస్ 2' సినిమాలో కలిసి నటించబోతున్నారు. కాగా.. క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ 'దహాద్'లో విజయ్ వర్మ, సోనాక్షి సిన్హా, గుల్షన్ దేవయ్య ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ వెబ్ సిరీస్ మే 12న అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజ్ కానుంది. ఈ సిరీస్ ట్రైలర్‌ను మే 3న రిలీజ్ చేయనున్నారు. View this post on Instagram A post shared by Vijay Varma (@itsvijayvarma) -
హీరోయిన్‌తో సింగర్ డేటింగ్.. సోషల్ మీడియాలో వైరల్!
బాలీవుడ్ సింగర్, ర్యాపర్ యోయో హనీ సింగ్ గురించి బీ టౌన్లో పరిచయం అక్కర్లేని పేరు. తాజాగా ముంబయిలో జరిగిన ఓ గ్రాండ్ ఈవెంట్లో ఆయన ప్రదర్శన చేశారు. ఈ ప్రోగ్రామ్‌లో బీ టౌన్‌కు చెందిన పలువురు అగ్ర తారలు హాజరయ్యారు. అయితే ఈవెంట్లో బాలీవుడ్ నటి నుస్రత్ బరుచా అందరి దృష్టిని ఆకర్షించింది. ఎందుకంటే హనీ సింగ్ ఆమె చేతులు పట్టుకుని వెళ్తూ కెమెరాల కంటికి చిక్కారు. దీంతో వీరిద్దరి డేటింగ్లో ఉన్నారంటూ బీటౌన్‌లో వార్తలు గుప్పుమంటున్నాయి. తాజాగా దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. అంతే కాకుండా ఈ జంట ఫోటోలకు కూడా ఫోజులిచ్చారు. ఓ నెటిజన్ రాస్తూ వారిద్దరు డేటింగ్లో ఉన్నారా? అని ప్రశ్నించారు. మరో నెటిజన్ వీరి మధ్య ఏదో జరుగుతోంది అంటూ కామెంట్ చేశాడు. కాగా.. హనీ సింగ్ ఇటీవలే తన కొత్త పాటను రిలీజ్ చేశారు. ఆ సాంగ్ ఇప్పటికే యూట్యూబ్‌లో మిలియన్ల వ్యూస్ సాధించింది. మరోవైపు నుస్రత్ ప్రస్తుతం 'చోరీ' సినిమా కోసం సిద్ధమవుతోంది. ఆమె చివరిసారిగా అక్షయ్ కుమార్, ఇమ్రాన్ హష్మీలతో కలిసి 'సెల్ఫీ' చిత్రంలో కనిపించింది. రణబీర్ కపూర్, శ్రద్ధా కపూర్ నటించిన 'తు ఝూతీ మైన్ మక్కార్'లో కూడా నుష్రత్ ప్రత్యేక అతిథి పాత్రలో కనిపించింది. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
సల్మాన్ ఖాన్ తో డేటింగ్ ? పూజ హెగ్డే షాక్ కామెంట్స్..