డేటింగ్‌లో ఉన్నది నిజమే.. కానీ అతనితో కాదు..స్టార్ హీరోయిన్ | Star Heroine Kangana Ranaut Rects On Dating Rumours With Nishant Pitti In Social Media, Deets Inside - Sakshi
Sakshi News home page

Kangana Ranaut On Dating Rumours: డేటింగ్‌లో ఉన్నది నిజమే.. కానీ అతనితో కాదు!!

Published Wed, Jan 24 2024 5:05 PM | Last Updated on Wed, Jan 24 2024 5:58 PM

Star Heroine Open About Dating Rumours On Social Media - Sakshi

బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గతేడాది తేజస్, చంద్రముఖి-2 సినిమాలతో అభిమానులను అలరించింది. ప్రస్తుతం ఎమర్జన్సీ చిత్రంతో బిజీగా ఉంది. ఈ సినిమాను జూన్ 14న రిలీజ్‌ చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించింది. అయితే ఈనెల 22న అయోధ్య బాల రాముని ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి హాజరైంది కంగనా. అదే సమయంలో అక్కడే ఉన్న ఈజ్‌ మై ట్రిప్‌ వ్యవస్థాపకుల్లో ఒకరైన నిషాంత్ పిట్టితో ఓ ఫోటోకు పోజులిచ్చింది. ఇది చూసిన నెటిజన్స్ కొందరు కంగనా అతనితో డేటింగ్‌లో ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు.   
 
నెట్టింట తెగ వైరలవుతున్న రూమర్స్‌పై కంగనా స్పందించింది. ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని తేల్చి చెప్పింది. అవన్నీ కేవలం వదంతులు మాత్రమేనని చెప్పుకొచ్చింది. అతనికి ఇప్పటికే పెళ్లయిందని.. దయచేసి ఇలాంటి వార్తలు ఎవరూ నమ్మవద్దని కోరింది. అయితే తాను ఇంకో వ్యక్తితో డేటింగ్‌లో ఉన్నానని.. సరైన సమయం వచ్చినప్పుడు తానే చెబుతానని కంగనా కుండబద్దలు కొట్టింది. ఒక వ్యక్తితో ఫోటో దిగినంత మాత్రాన ఇలా మాట్లాడడం సరైంది కాదని ఆగ్రహం వ్యక్తం చేసింది. కాగా.. ఇటీవలే అయోధ్యలో జరిగిన బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో కంగనా పాల్గొంది. దీనికి సంబంధించిన ఫోటోలు ట్విటర్‌ వేదికగా పంచుకుంది.

అయితే గతంలో ఆమె ఓ వ్యక్తితో కలిసి ముంబయి వీధుల్లో చక్కర్లు కొట్టారు. ఆ ఫొటోలు నెట్టింట వైరలయ్యాయి. అతను తన హెయిర్‌ స్టైలిష్ట్‌ అని కంగనా సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. అంతలోనే మరోసారి అయోధ్య రామమందిర్‌ ప్రారంభోత్సవంలో కంగనా, నిషాంత్‌ ఫొటోలు వైరల్ కావడంతో రిలేషన్‌లో ఉన్నారంటూ ప్రచారం జరుగుతోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement