
బాలీవుడ్ ఫైర్‌బ్రాండ్ కంగనా రనౌత్ (Kangana Ranaut) ప్రధాన పాత్రలో నటించి, స్వీయదర్శకత్వం వహించిన చిత్రం ఎమర్జెన్సీ (Emergency Movie). చాలాసార్లు వాయిదాపడుతూ వచ్చిన ఈ మూవీ ఎట్టకేలకు ఈ ఏడాది జనవరి 17న ప్రేక్షకుల ముందుకొచ్చింది. కానీ బాక్సాఫీస్ వద్ద పెద్దగా రాణించలేకపోయింది. బాక్సాఫీస్ వద్ద కేవలం రూ.21 కోట్లు మాత్రమే రాబట్టింది. తాజాగా ఈ చిత్రం ఓటీటీలో సందడి చేస్తోంది. ఈ మూవీలో కంనగా ఇందిరా గాంధీ పాత్రలో నటించి ప్రశంసలు అందుకుంది.
ప్రస్తుతం ఈ సినిమా ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్ వేదికగా ఆడియన్స్‌ను అలరిస్తోంది. బాక్సాఫీస్ వద్ద విఫలమైన ఈ సినిమా ఓటీటీలో దూసుకెళ్తోంది. నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోన్న ఇండియన్ సినిమాల జాబితాలో టాప్ ప్లేస్‌లో ట్రెండింగ్ అవుతోంది. నాగచైతన్య మూవీ తండేల్, అజయ్ దేవగణ్ ఆజాద్ సినిమాలను వెనక్కి నెట్టేసింది.
ఈ నేపథ్యంలో కొందరు నెటిజన్స్ ఎమర్జన్సీ చిత్రాన్ని ఉద్దేశించి ట్వీట్స్ చేశారు. ఈ చిత్రాన్ని భారత్ నుంచి ఆస్కార్ పంపాలని పోస్ట్ చేశాడు. వీటికి సోషల్ మీడియా వేదికగా కంగనా రిప్లై ఇచ్చింది. ఇన్‌స్టా లో ట్వీట్స్‌ను షేర్ చేస్తూ తనదైన శైలిలో స్పందించింది. అమెరికా లాంటి దేశం ఇలాంటి సినిమాలను గుర్తించడానికి ఇష్టపడరు. వారు అభివృద్ధి చెందుతున్న దేశాలను అణచివేస్తారు. అదే ఈ ఎమర్జన్సీలో చూపించాను. వారి సిల్లీ ఆస్కార్ అవార్డ్‌ను వాళ్ల వద్దే ఉంచుకోనివ్వండి. మాకు నేషనల్ అవార్డులు ఉన్నాయని నెటిజన్‌కు రిప్లై ఇచ్చింది.
బాలీవుడ్ చిత్ర నిర్మాత సంజయ్ గుప్తా కూడా ఈ చిత్రాన్ని ప్రశంసించారు. ఈ రోజు నేను ఎమర్జెన్సీ మూవీని చూశాను. చాలా స్పష్టంగా చెప్పాలంటే.. నేను ముందుగా అంచనా వేసినట్లుగా ఈ సినిమాను ప్లాన్ చేయలేదని అన్నారు. ఈ సినిమాలో కంగనా నటన, దర్శకత్వం రెండూ అద్భుతంగా ఉన్నాయని కొనియాడారు. దీనికి కంగనా బదులిస్తూ 'సినిమా పరిశ్రమ తన ద్వేషం, పక్షపాతాల నుంచి బయటపడాలి.. మంచి పనిని ఎప్పటికీ గుర్తించాలి సంజయ్ జీ.. మీరు ఆ అడ్డంకిని బద్దలు కొట్టినందుకు ధన్యవాదాలు అని పోస్ట్ చేసింది.

కాగా.. నెట్‌ఫ్లిక్స్‌లో శుక్రవారం విడుదలైన ఎమర్జెన్సీ మూడు రోజుల్లోనే నెట్‌ఫ్లిక్స్ సినిమాల జాబితాలో టాప్ ట్రెండింగ్‌లో ఉంది. అజయ్ దేవగన్ ఆజాద్, నాగ చైతన్య తండేల్ చిత్రాలను అధిగమించింది. ఈ చిత్రం కంగనా రనౌత్ మాజీ ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ పాత్రలో నటించారు. 1975లో అప్పటి ప్రధానమంత్రి విధించిన 21 నెలల ఎమర్జెన్సీ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ చిత్రంలో అనుపమ్ ఖేర్, శ్రేయాస్ తల్పాడే, విశాక్ నాయర్, మిలింద్ సోమన్, దివంగత నటుడు సతీష్ కౌశిక్ కూడా నటించారు. ఈ మూవీని జీ స్టూడియోస్, మణికర్ణిక ఫిలిమ్స్ సంయుక్తంగా నిర్మించాయి.
Comments
Please login to add a commentAdd a comment