బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ తెరకెక్కించిన పొలిటికల్ మూవీ ఎమర్జన్సీ. భారత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ ఎమర్జన్సీ నాటి పరిస్థితుల ఆధారంగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ మూవీ ఇందిరాగాంధీ పాత్రలో కంగనా రనౌత్ నటించడంతో పాటు దర్శకత్వం వహించారు. గతంలోనే విడుదల కావాల్సిన ఈ సినిమా పలుసార్లు వాయిదా పడుతూ వస్తోంది. ఈనెల 17న థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో సినీ ప్రియులకు మూవీ టీమ్ బంపర్ ఆఫర్ ప్రకటించింది.
ఈ సినిమా విడుదల రోజు టికెట్లను రూ.99 లకే అందుబాటులో ఉంచనున్నట్లు కంగనా రనౌత్ ప్రకటించింది. ఈ మేరకు ట్విటర్ ద్వారా పోస్టర్‌ను షేర్ చేసింది. రిలీజ్ రోజే ఈ ఆఫర్ ప్రకటించడం విశేషం. ఇటీవల సోనూ సూద్ సైతం ఫతే సినిమాకు ఇలాంటి ఆఫర్‌ను ప్రకటించాడు. ఈ విషయంలో సోనూ సూద్‌నే కంగనా రనౌత్ ఫాలో అయినట్లు తెలుస్తోంది.
(ఇది చదవండి: ఆస్కార్ చిత్రాల ఎంపిక.. కంగనా రనౌత్ సంచలన కామెంట్స్!)
ఎమర్జెన్సీ కథేంటంటే..
కంగనా రనౌత్ లీడ్ రోల్‌లో నటించిన పొలిటికల్ డ్రామా ఎమర్జెన్సీ. గతంలో ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో విధించిన ఎమర్జెన్సీ ఆధారంగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ చిత్రంలో అనుపమ్ ఖేర్, శ్రేయాస్ తల్పాడే, విశాక్ నాయర్, మహిమా చౌదరి, మిలింద్ సోమన్, సతీష్ కౌశిక్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. 1975 నుంచి 1977 వరకు 21 నెలల పాటు భారతదేశంలో విధించిన ఎమర్జెన్సీ, ఆ తరువాతి పరిణామాల ఆధారంగా తెరకెక్కించారు. ఈ చిత్రంలో కంగనా మాజీ ప్రధాని ఇందిరా గాంధీ పాత్రను పోషించారు.
17th jan, #emergency day 🇮🇳 pic.twitter.com/71dWpvnGGk
— Kangana Ranaut (@KanganaTeam) January 16, 2025
వివాదాలతో ఆలస్యం..
ట్రైలర్ రిలీజ్ అయినప్పటి నుంచి ఈ సినిమాపై వివాదాలు నడుస్తున్నాయి. ఓ వర్గం వారిని కించపరిచేలా ఉందంటూ కొందరు సెన్సార్ బోర్డుకు ఫిర్యాదు చేశారు. దీంతో కొన్ని సీన్స్ తొలగించాలని సెన్సార్ బోర్డు ఆదేశించింది. నిబంధనలకు అనుగుణంగా ఈ మూవీని విడుదల చేసేందుకు మేకర్స్ నిర్ణయించారు. సెన్సార్ బోర్డు చెప్పిన ఆదేశాలు పాటించడంతో ఎమర్జెన్సీ చిత్రానికి యూ/ఏ సర్టిఫికేట్ జారీ చేసింది.
ఎమర్జన్సీ వీక్షించిన నితిన్ గడ్కరీ..
ఇటీవల కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ఎమర్జన్సీ చిత్రాన్ని వీక్షించారు. ఆయన ప్రత్యేక షోను ఏర్పాటు చేయగా.. కంగనా రనౌత్‌తో పాటు పలువురు ఎంపీలు ఈ మూవీని చూశారు.
Comments
Please login to add a commentAdd a comment