Emergency Movie
-
కంగనా రనౌత్ 'ఎమర్జెన్సీ' విడుదలకు లైన్ క్లియర్
కంగనా రనౌత్ 'ఎమర్జెన్సీ' సినిమా విడుదలపై మరోసారి అధికారిక ప్రకటన వచ్చేసింది. కంగనా లీడ్ రోల్లో నటించి, దర్శకత్వం వహించిన ఈ చిత్రం విడుదల కోసం ఆమె అనేక ఇబ్బందులు ఎదుర్కొంటుంది. వాస్తవంగా ఈ చిత్రం గతేడాదిలోనే విడుదల కావాల్సి ఉంది. అయితే, సెన్సార్ చిక్కుల వల్ల పలు ఇబ్బందలు రావడంతో రిలీజ్ విషయంలో పలుమార్లు వాయిదా పడుతూనే వస్తుంది.ఎట్టకేలకు ఎమర్జెన్సీ చిత్రాన్ని వచ్చే ఏడాది జనవరి 17న విడుదల చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈమేరకు ఒక పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. ఈ చిత్రంలో తమ వర్గాన్ని తక్కువ చేసి చూపించారని కొందరు సిక్కులు మధ్యప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించడంతో విడుదల విషయంలో చిక్కులు వచ్చాయి. వారి వాదనలను పరిగణనలోకి తీసుకోవాలని సీబీఎఫ్‌సీని మధ్యప్రదేశ్ హైకోర్టు ఆదేశించడంతో మరోసారి ఈ చిత్రం సెన్సార్ పూర్తి చేసుకుంది. ఎట్టకేలకు కోర్టు నుంచి కూడా అడ్డంకులు లేకపోవడంతో 2025 జనవరి 17న ఈ చిత్రం విడుదల కానుంది.1975లో ఇందిరా గాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో విధించిన ఎమర్జెన్సీ టైమ్‌లో జరిగిన ఘటనలతో ఈ మూవీ రూపొందింది. ఈ సినిమా పలుమార్లు విడుదల (2023 నవంబరు 24, 2024 జూన్ 14, 2024 సెప్టెంబర్ 6) వాయిదా పడింది. ఈ చిత్రం కోసం నిర్మాతగా మారిన కంగనా రనౌత్ తన సొంత ఆస్తులను కూడా విక్రయించుకున్నారు. -
కంగనా 'ఎమర్జెన్సీ'కి లైన్ క్లియర్! అందుకు ఓకే అంటేనే..
కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో నటించి, స్వీయ దర్శకత్వం వహించిన ఎమర్జెన్సీ సినిమా విడుదలకు త్వరలోనే లైన్ క్లియర్ కానుంది. సెన్సార్ సర్టిఫికెట్ విషయంలో ఓ నిర్ణయానికి రావాలని బాంబే హైకోర్టు.. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్(సీబీఎఫ్సీ)ను ఇటీవలే ఆదేశించింది. సెప్టెంబర్ 25లోగా ఓ నిర్ణయానికి రావాలని సూచించింది. తాజాగా ఈ అంశంపై బుధవారంనాడు హైకోర్టులో విచారణ జరిగింది.సెప్టెంబర్ 30కి విచారణ వాయిదామీ దగ్గర ఏదైనా గుడ్‌న్యూస్ ఉందా? అని జస్టిస్ బిపి కొలబావాలా, జస్టిస్ ఫిర్దోష్ పోనివాలాలతో కూడిన ధర్మాసనం సీబీఎఫ్‌సీని అడిగింది. సినిమాలో కొన్ని కట్స్ సూచించామని, అవి అమలు చేస్తే సెన్సార్ సర్టిఫికెట్ ఇస్తామని, సినిమా థియేటర్లలో విడుదల చేసుకోవచ్చని సీబీఎఫ్సీ తెలిపింది. దీంతో నిర్మాణసంస్థ జీ స్టూడియోస్.. తమకు ఆలోచించుకోవడానికి కొంత సమయం కావాలని కోరింది. బెంచ్ తదుపరి విచారణను సెప్టెంబర్ 30కు వాయిదా వేసింది. సోమవారం అయినా ఎమర్జెన్సీ సినిమాకు చిక్కులు తొలగిపోతాయేమో చూడాలి!ఎమర్జెన్సీఎమర్జెన్సీ మూవీ విషయానికి వస్తే.. 1975లో ఇందిరా గాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో ఎమర్జెన్సీ విధించినప్పుడు జరిగిన సంఘటనల ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. ఈ మూవీ 2023 నవంబర్ 24న విడుదల కావాల్సింది. కానీ సెన్సార్ సర్టిఫికెట్ ఆలస్యం కావడంతో ఏడాదిగా వాయిదా పడుతూ వస్తోంది.చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన ‘ప్రభుత్వ జూనియర్ కళాశాల -
అప్పుడు పెళ్లి చేసుకుంటే ఏం లాభం? : కంగనా రనౌత్
బాలీవుడ్ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ పెళ్లిపై తన మనసులోని మాటను బటయపెట్టింది. అందరిలాగే తనకు కూడా వైవాహిక జీవితాన్ని ఆస్వాదించాలని ఉందని చెప్పింది. అయితే దానికి సరైన సమయం రావాలని, అప్పుడే పెళ్లి చేసుకుంటానని తెలిపింది. పదవిలో ఉండగానే పెళ్లి!తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కంగనాకు పెళ్లిపై ఓ ప్రశ్న ఎదురరైంది. ‘ఎంపీగా ఉన్న సమయంలోనే పెళ్లి చేసుకుంటారా?’ అని ఓ విలేకరి ప్రశ్నించగా.. ‘దేవుడి దయ వల్లే అదే జరగాలని కోరుకుంటున్నాను. ఎంపీగా ఉన్నప్పుడు పెళ్లి చేసుకుంటాను. ఈ పదవి కాలం ముగిసిన తర్వాత పెళ్లి చేసుకున్న ఏం లాభం’ అని కంగనా నవ్వుతూ బదులిచ్చింది. 2024 ఎన్పికల్లో కంగనా.. బీజేపీ తరపున ఎంపీగా పోటీ చేసి గెలిచింది. 2029 వరకు ఆమె ఈ పదవిలో కొనసాగుతారు. ఈ లోపే పెళ్లి చేసుకొని కొత్త జీవితాన్ని ప్రారంభించాలని కంగానా భావిస్తున్నట్లు ఉంది. పెద్దల సమక్షంలో పెళ్లి జరగాలిఅయితే పెళ్లి గురించి కంగనా మాట్లాడడం కొత్తేమి కాదు. గతంలో కూడా ఓ సినిమా ప్రమోషన్లో భాగంగా మీడియాతో మాట్లాడుతూ.. ‘ప్రతి అమ్మాయి తన పెళ్లి, పిల్లలు, ఫ్యామిలీ గురించి కలలు కంటుంది. నేను కూడా కుటుంబ వ్యవస్థలకు గౌరవం ఇస్తాను. పెళ్లి చేసుకోవాలని, నాకంటూ ఓ ఫ్యామిలీ ఉండాలనుకుంటున్నారు. రానున్న ఐదేళ్లలో పెళ్లి చేసుకుంటాను. అయితే అది పెద్దలు కుదిర్చిన ప్రేమ వివాహం అయితేనే చేసుకుంటాను. నా పెళ్లి పెద్దల సమక్షంలో జరగాలని కోరుకుంటున్నాను’అని కంగనా తెలిపింది. (చదవండి: స్త్రీ-2 దెబ్బకు షారూక్ జవాన్ రికార్డ్ బ్రేక్.. ఎన్ని కోట్లంటే?)ఇక సినిమాల విషయానికొస్తే.. కంగనా దర్శకత్వం వహించి, నటించిన సినిమా ‘ఎమర్జెన్సీ’ విడుదలకు సిద్ధమైంది. వాస్తవానికి ఈ సినిమా సెప్టెంబర్ 6న రిలీజ్ కావాల్సింది. కానీ సెన్సార్ సర్టిఫికేట్ రాకపోవడంతో విడుదల వాయిదా వేశారు. త్వరలోనే రిలీజ్ డేట్‌ను ప్రకటించనున్నారు. -
అందుకే నా బంగ్లాను అమ్మేశా: కంగనా రనౌత్
బాలీవుడ్ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ ఒకవైపు సినిమాలు, మరోవైపు రాజకీయాల కాంట్రవర్సీలతో నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. పలు కారణాల వల్ల ఆమె నటించి, దర్శకత్వం వహించిన ‘ఎమెర్జెన్సీ’ సినిమా వాయిదా పడింది. ఈ చిత్రం కోసం ఆమె తన ఆస్తులను సైతం తాకట్టు పెట్టింది. అయితే విడుదల వాయిదా పడడంతో డబ్బు కోసం తను ఇష్టంగా కొనుగోలు చేసిన బంగ్లాను అమ్మినట్లు వార్తలు వచ్చాయి. తాజాగా ఈ పుకార్లపై ఆమె స్పందిస్తూ.. బంగ్లాను అమ్మిన మాట నిజమేనని, ఎందుకు అమ్మాల్సి వచ్చిందో కూడా వివరించింది.(చదవండి: 'జాన్వీకపూర్‌ను చూస్తే ఆమెనే గుర్తొచ్చింది'.. జూనియర్ ఎన్టీఆర్ కామెంట్స్!)‘నాకు తెలిసి ఆస్తులు అంటే మనకు అవసరం అయినప్పుడు ఆదుకునేవే. నేను దర్శకత్వం వహించి, నిర్మించిన చిత్రం ‘ఎమర్జెన్సీ’ విడుదల వాయిదా పడింది. నా దగ్గరు ఉన్న డబ్బంతా ఈ సినిమాపై పెట్టాను. విడుదల అయితే తప్ప నాకు డబ్బు రాదు. అందుకే నేను ఇష్టంగా కొనుగోలు చేసిన బంగ్లాను అమ్మేశాను’ అని కంగనా చెప్పుకొచ్చింది. కంగనా అమ్మిన బంగ్లా.. ముంబైలో ఉన్న బాంద్రాలోని పాలిహిల్ పాత్రంలో ఉంది. 2017లో ఈ బంగ్లాను కొనుగోలు చేసింది. తాజాగా రూ. 32 కోట్లకు ఈ బంగ్లాను విక్రయించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. (చదవండి: త్రివిక్రమ్‌పై ఆరోపణలు.. పూనమ్ షాకింగ్ ట్వీట్)ఇక ఎమర్జెన్సీ విషయానికొస్తే.. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తయింది. వాస్తవానికి సెప్టెంబర్ 6న విడుదల కావాల్సింది. అయితే సెన్సార్ సర్టిఫికేట్ రాకపోవడంతో చివరి నిమిషంలో విడుదల వాయిదా పడింది. త్వరలోనే రిలీజ్ డేట్‌ని ప్రకటించనున్నారు. -
'ఎమర్జెన్సీ' మరోసారి వాయిదా.. కంగనా రనౌత్ ఎమోషనల్ పోస్ట్
కంగనా రనౌత్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఎమర్జెన్సీ’ విడుదలలో మరింత జాప్యం కానుంది. సెప్టెంబర్ 6న విడుదల కావాల్సిన ఈ సినిమా మరోసారి వాయిదా పడింది. ఇదే విషయాన్ని తాజాగా కంగనా రనౌత్ ప్రకటించారు. ఈ సినిమా విడుదల విషయంలో ఇప్పటికే పలుమార్లు వాయిదా పడుతూ వచ్చిన విషయం తెలిసిందే. ఎమర్జెన్సీ సినిమా చుట్టూ వివాదాలు చుట్టుముట్టడంతో సెన్సార్ బోర్టు సర్టిఫికెట్ జారీ చేయలేదు. దీంతో ఈ సినిమా విడుదలకు మరోసారి బ్రేక్ పడింది.ఎమర్జెన్సీ సినిమా వాయిదా పడుతుందని తాజాగా కంగనా రనౌత్ ఒక పోస్ట్ చేశారు. ' ఎంతో ప్రతిష్టాత్మకంగా నా దర్శకత్వంలో తెరకెక్కిన 'ఎమర్జెన్సీ' విడుదల మరోసారి వాయిదా పడిందని చెప్పడానికి చాలా బాధగా ఉంది. సెన్సార్ బోర్డు నుంచి అనుమతి కోసం ఇప్పటికీ నేను ఎదురుచూస్తూనే ఉన్నాను. అడ్డంకులు అన్నీ తొలిగిపోతాయని ఆశిస్తున్నాను. సాధ్యమైనంత త్వరగా కొత్త విడుదల తేదీని ప్రకటిస్తాం. ఈ విషయంలో ప్రేక్షకులు మమ్మల్ని అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను.' అని కంగనా పేర్కొంది.కంగనా రనౌత్ నటించి, స్వీయ దర్శకత్వంలో రూపొందించిన చిత్రం ‘ఎమర్జెన్సీ’. భారత దివంగత ప్రధాని ఇందిరా గాంధీ జీవితం నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం ఇది. గత ఏడాది నవంబరులో విడుదల కావాల్సిన ఈ చిత్రం వాయిదా పడుతూ వచ్చింది. సినిమా ప్రారంభం నుంచే చాలా విమర్శలు వచ్చాయి. సినిమా విడుదల కోసం ముంబై హైకోర్టును కూడా కంగనా ఆశ్రయించారు. కానీ, అక్కడ కూడా ఆమెకు ఊరట లభించలేదు. సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వాలని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్‌ను తాము ఆదేశించలేమని ముంబై హైకోర్టు తెలిపింది. దీంతో మరోసారి వాయిదా తప్పలేదు.ఎమర్జెన్సీ సినిమా విషయంలో ఇందిరా గాంధీ హత్యను చూపించకూడదనీ, భింద్రన్‌వాలేను చూపించవద్దనీ, పంజాబ్ అల్లర్లను చూపించవద్దనే ఒత్తిడి తనపై ఉందని కంగనా తెలిపారు. ఇవేవీ చూపించొద్దంటే ఇక చూపించడానికి ఏం మిగిలి ఉంటుందో..? అని ఆమె ప్రశ్నించారు. కొన్ని సినిమాలు రూపొందించడానికి కొందరికి మాత్రమే సెన్సార్షిప్ ఉంటుందని ఆమె ఘాటుగా స్పందించారు. ఈ సినిమా విషయంలో కంగనాపై హత్య బెదిరింపులు కూడా వచ్చిన విషయం తెలిసిందే. -
కంగన ‘ఎమర్జెన్సీ’కి దక్కని ఊరట
ముంబై: కంగనా రనౌత్ నటించి, స్వీయ దర్శకత్వంలో రూపొందించిన ‘ఎమర్జెన్సీ’సినిమాకు విడుదల కష్టాలు తప్పట్లేవు. షెడ్యూల్ ప్రకారం సెప్టెంబర్ ఆరో తేదీన సినిమా విడుదల కావాల్సి ఉన్నా ఇంతవరకు సినిమా సర్టిఫికేషన్ పూర్తవలేదు. తక్షణం సర్టిఫై చేయాల్సిందిగా సెన్సార్ బోర్డును ఆదేశించలేమని జస్టిస్ బీపీ కోలాబవాలా, జస్టిస్ ఫిర్దోశ్ పూనీవాలాల బాంబే హైకోర్టు ధర్మాసనం బుధవారం స్పష్టంచేసింది. సినిమాకు సర్టిఫికేట్ ఇచ్చేలా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్(సీబీఎఫ్సీ)ను ఆదేశించాలంటూ సినిమా నిర్మాణసంస్థ జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్ వేసిన పిటిషన్‌ను బాంబే హైకోర్టు బుధవారం విచారించింది. సినిమాలో తమ వర్గాన్ని తక్కువ చేసి చూపించారని కొందరు సిక్కులు మధ్యప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించడం తెల్సిందే. దీంతో సినిమాకు సరి్టఫికేట్ ఇచ్చే ముందు వీరి వాదనలను పరిగణనలోకి తీసుకోవాలని సీబీఎఫ్‌సీని మధ్యప్రదేశ్ హైకోర్టు ఆదేశించడం తెల్సిందే. ఈ అంశాన్ని బుధవారం బాంబే హైకోర్టు ప్రస్తావించింది. ‘సర్టిఫికేషన్ అంశంలో ఇప్పటికే మధ్యప్రదేశ్ హైకోర్టు ఆదేశాలిచి్చంది. ఆ ఉత్తర్వులు లేకపోయి ఉంటే ఈరోజే సరి్టఫై చేయాలని సీబీఎఫ్‌సీని ఆదేశించేవాళ్లం. ఈ దశలో మేం కలుగజేసుకోవడం సబబు కాదు. అందుకే తక్షణం సర్టిఫై చేయాలని ఆదేశించలేం. అయితే సినిమాపై వస్తున్న అభ్యంతరాలపై ఈనెల 18లోపు సీబీఎఫ్సీ నిర్ణయం తీసుకోవాలి’అని హైకోర్టు సూచించింది. సినిమాకు ఎలాంటి ఊరట లభించకపోవడంతో కంగన అసహనంతో ఒక పోస్ట్‌చేశారు. ‘‘ఎమర్జెన్సీ సినిమాకు సర్టిఫికేట్ ఇవ్వకుండా సెన్సార్‌బోర్డు చట్టవ్యతిరేకంగా వ్యవహరిస్తోందని స్వయంగా బాంబే హైకోర్టే చెబుతోంది’అని కంగన ‘ఎక్స్’లో వ్యాఖ్యానించారు. -
కంగనా రనౌత్‌కు కోర్టు నోటీసులు.. 'ఎమర్జెన్సీ' వాయిదా తప్పదా..?
బాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ కంగనా రనౌత్‌కు తాజాగా మధ్యప్రదేశ్ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. స్వీయ దర్శకత్వంలో కంగనా రనౌత్ నటించిన ‘ఎమర్జెన్సీ’ సినిమా విషయంలో నోటీసులు జారీ అయ్యాయి. ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలు ఒక వర్గానికి సంబంధించిన ప్రాథమిక హక్కులను ఉల్లంఘించేలా ఉన్నాయంటూ న్యాయస్థానం నోటీసులు పంపించింది. ఆమెతో పాటు కేంద్ర ప్రభుత్వం, మధ్యప్రదేశ్ ప్రభుత్వాలకు కూడా నోటీసులు జారీ అయ్యాయి. ఎమర్జెన్సీ చిత్రాన్ని తెరకెక్కించిన మణికర్ణిక ఫిల్మ్స్‌తో పాటు సెన్సార్ బోర్డు, జీ స్టూడియోస్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌లకు కోర్టు నోటీసులు జారీ చేసింది.ఎమర్జెన్సీ సినిమాను అడ్డుకుంటున్నారని ఇప్పటికే కంగనా రనౌత్ పలుమార్లు చెప్పుకొచ్చారు. తాజాగా కోర్టు నోటీసులతో సినిమా వాయిదా పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఎమర్జెన్సీ సినిమా విషయంలో 24 గంటల్లోపు స్పందించాలని వారందరికీ నోటీసులు జారీ అయ్యాయి. తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేస్తున్నట్లు కోర్టు తెలిపింది. భారత తొలి మహిళా ప్రధాని ఇందిరా గాంధీ రాజకీయ జీవితం ఆధారంగా ఎమర్జెన్సీ సినిమా తెరకెక్కింది. సెప్టెంబరు 6న విడుదలకు సిద్ధమవుతున్న సమయంలో కంగనా రనౌత్‌కు అడ్డంకులు ఎదురౌతున్నాయి. అయితే, ఈ సినిమా మరోసారి వాయిదా పడనున్నట్టు ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతుంది. -
వాళ్ల వేధింపులు తట్టుకోలేక దేశం విడిచి వెళ్లాలనుకున్నా: కంగనా రనౌత్
‘‘సినిమా పరిశ్రమలో దాదాపు పదేళ్ల పాటు నాకు అవకాశాలు రాకుండా కొంతమంది కుట్రలు చేశారు. వారి వేధింపులు తట్టుకోలేక ఆ సమయంలో దేశం విడిచిపెట్టి వెళ్లాలనుకున్నాను’’ అని నటి, మండీ లోక్‌సభ ఎంపీ కంగనా రౌత్ అన్నారు. ఆమె లీడ్ రోల్లో నటించి, దర్శకత్వం వహించిన తాజా చిత్రం ‘ఎమర్జెన్సీ’. ఈ నెల 6న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ చిత్రం ప్రమోషన్లో భాగంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కంగనా రనౌత్ తన కెరీర్లో ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి కీలక విషయాలు వెల్లడించారు. ‘‘సినిమా పరిశ్రమ అంటే నాకు చిన్నప్పటి నుంచి ఎంతో ఇష్టం. ఎప్పటికైనా మంచి హీరోయిన్ కావాలనే ఆశతో 2004లో ముంబైకి వచ్చాను. 2005–06లో ‘గ్యాంగ్‌స్టర్’, ‘వో లమ్హే’ సినిమాల్లో నటించాను. మాదక ద్రవ్యాలకు అలవాటు పడిన సూపర్ మోడల్, గ్యాంగ్‌స్టర్ వంటి ఎన్నో పాత్రలు పోషించాను. నా నటనకు మంచి ప్రశంసలు దక్కాయి. పొగడ్తలు పక్కన పెడితే దాదాపు పదేళ్ల పాటు నాకు అవకాశాలు లేక ఇబ్బందులు ఎదుర్కొన్నా. ఎన్నో ప్రయత్నాలు చేసినా ఛాన్సులు దొరకలేదు. నాకు అవకాశాలు రాకపోవడానికి కారణం బాలీవుడ్ మాఫియా అని అర్థం అయ్యింది. ఒకానొక సమయంలో దేశమే నన్ను బహిష్కరించిందనిపించింది.. విదేశాలకు వెళ్లిపోవాలనుకున్నాను. అమెరికాకు వెళ్లిపోయి ఓ షార్ట్ ఫిలిం కూడా తీశాను. అయితే 2014లో విడుదలైన ‘క్వీన్’ సినిమా నా కెరీర్‌ను మలుపు తిప్పింది’’ అని కంగనా తెలిపారు. ఇంకా ఆమె మాట్లాడుతూ– ‘‘నాకు నటించడం సులభం. కానీ, నటిగా చేయడం పెద్దగా ఇష్టం లేదు. డైరెక్టర్‌గా ఉండటం ఇష్టం. నటిగా ఉంటే సెట్స్‌లో ఏం జరుగుతుందో పూర్తిగా తెలియదు. అదే డైరెక్టర్‌గా ఉంటే పూర్తి విషయాలు తెలుస్తాయి. పైగా సెట్స్‌లో డైరెక్టర్‌కు ఎక్కువ గౌరవం ఉంటుంది’’ అన్నారు. -
నాకు అత్యాచార బెదిరింపులు వస్తున్నాయి: కంగనా రనౌత్
బాలీవుడ్ టాప్ హీరోయిన్, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ నటిస్తూ.. స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఎమర్జెన్సీ’. సెప్టెంబరు 6న విడుదల కానున్న ఈ సినిమా మాజీ ప్రధాని ఇందిరా గాంధీ అత్యవసర పరిస్థితిని ప్రకటించిన అంశాన్ని తెరపై చూపించనున్నారు. అయితే, ఈ సినిమా విడుదలను ఆపేయాలని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్(సీబీఎఫ్సీ)ని శిరోమణి అకాలీదళ్ డిల్లీ(ఎస్ఏడీ) పార్టీ కోరింది. ఈ సినిమాతో చరిత్రను తప్పుగా చూపించనున్నారని ఆ పార్టీ అధ్యక్షుడు పరమజిత్ సింగ్ సర్నా ఒక లేఖ రాశారు. ఇందులోని సీన్స్ మతపరమైన ఉద్రిక్తతలను రెచ్చగొట్టేలా ఉన్నాయని ఆయన అన్నారు.అత్యాచారాలపై కంగనా రనౌత్‌కు చాలా అనుభవం ఉంది: మాజీ ఎంపీకంగనా రనౌత్‌పై పంజాబ్ మాజీ ఎంపీ, అకాలీదళ్ నేత వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. గతంలో రైతుల నిరసనల సందర్భంగా లైంగిక దాడులు జరిగాయని బాలీవుడ్ క్వీన్ చేసిన వ్యాఖ్యలపై తాజాగా సిమ్రంజిత్ సింగ్ మాన్ భగ్గుమన్నారు. లైంగిక దాడి ఎలా జరుగుతుందో కంగనా రనౌత్‌ను అడగండి అంటూ మీడియా సమావేశంలో వ్యాఖ్యానించారు. అత్యాచారాలపై ఆమెకు చాలా అనుభవం ఉందని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎమర్జెన్సీ సినిమాను అడ్డుకుంటామని కూడా ఆయన తెలిపారు.రేప్‌ను సైకిల్ తొక్కడంతో పోల్చడం సిగ్గుచేటు : కంగనాసినిమా విడుదలకు మందే తనకు రేప్ బెదిరింపులు వస్తున్నాయని, అలాంటి బెదిరింపు వ్యూహాలతో తన గొంతును ఆపలేరని కంగనా రనౌత్ నొక్కి చెప్పారు. ప్రముఖ మీడియా సంస్థతో కంగనా రనౌత్ మాట్లాడుతూ.. 'కొందరు నాపై తుపాకీలు ఎక్కుపెట్టారు. ఒక కళాకారుడి గొంతు అణచివేయాలని చూస్తున్నారు. నేను వారి తుపాకీలకు భయపడను. ఈ దేశం అత్యాచారాలను చిన్నచూపు చూస్తుందేమో అనిపిస్తోంది. ఈరోజు ఈ సీనియర్ రాజకీయ నాయకుడు అత్యాచారానికి గురికావడాన్ని సైకిల్ తొక్కడంతో పోల్చడం ఆశ్చర్యపోనవసరం లేదు. సరదా కోసం మహిళలపై అత్యాచారాలు చేస్తున్నారు అనేలా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయి. అని ఆమె అన్నారు.ఎవరు అడ్డుకుంటారో చూస్తా: కంగనాఎమర్జెన్సీ సినిమా రిలీజ్‌కు పంజాబ్‌లో తీవ్ర అడ్డంకులు ఎదురవుతున్నాయి. ఈ సినిమాను విడుదలను ఆపేయాలని ఆప్ ప్రభుత్వం కోరుతోంది. ఖలిస్తాన్ మద్దతుదారులు కూడా ఈ సినిమాకు వ్యతిరేకంగా స్టేట్మెంట్ ఇచ్చారు. తమ అభిప్రాయాన్ని లెక్కచేయకుండా సినిమాను విడుదల చేస్తే కంగనాను చంపేస్తామని ఒక వీడియో ద్వారా హెచ్చరికలు కూడా వారు జారీ చేశారు. అయితే బెదిరిపులకు భయపడే ప్రసక్తే లేదంటూ కంగానా చెప్పారు. ఎవరు అడ్డుకుంటారో చూస్తానని ఎదురుదాడికి దిగారు. అయితే, తన సినిమాపై ఇంత జరుగుతున్నప్పటికీ బాలీవుడ్ నుంచి తనకు మద్దతు లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. -
ఎమర్జెన్సీ చిత్రం.. కంగనా రనౌత్‌కు బెదిరింపులు
బాలీవుడ్ ప్రముఖ హీరోయిన్, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్‌పై హత్య బెదిరింపులు వచ్చాయి. అందుకు సంబంధించిన ఒక వీడియో సోషల్‌మీడియాలో వైరల్ అవుతుంది. కంగనా నిర్మించిన ఎమర్జెన్సీ సినిమానే ఈ బెదిరింపులకు కారణమని తెలుస్తోంది. ఈ సినిమాలో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ పాత్రను కంగనా పోసిస్తున్నారు.సెప్టెంబర్ 6న ప్రపంచవ్యాప్తంగా ఎమర్జెన్సీ సినిమా విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే కంగనాపై ఇలాంటి బెదిరింపులు వస్తున్నాయి. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియోలో విక్కీ థామస్ సింగ్ అనే వ్యక్తి మాట్లాడుతూ.. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ హత్య గురించి ప్రస్తావనకు తీసుకొచ్చాడు. ' ఈ సినిమాలో అతన్ని (ఖలిస్థాన్ ఉగ్రవాది జర్నైల్ సింగ్ భింద్రన్‌వాలే) టెర్రరిస్ట్‌గా చిత్రీకరిస్తే, మీరు ఎవరి గురించి సినిమా తీస్తున్నారో ఆ వ్యక్తి (ఇందిరా గాంధీ)కి ఏమి జరిగిందో గుర్తుంచుకోండి? సత్వంత్ సింగ్, బియాంత్ సింగ్ ఆమెను ఎలా చంపారో గుర్తు చేసుకోండి. వారి మాదిరే మేమూ మా తల అర్పిస్తాం.. లేదా తల నరికివేయవచ్చు కూడా..' అని ఆ వ్యక్తి వీడియోలో చెప్పాడు. సత్వంత్ సింగ్, బియాంత్ సింగ్ ఇద్దరూ ఇందిరాగాంధీపై కాల్పులు జరిపి హత్య చేసిన విషయం తెలిసిందే. అయితే, ఎమర్జెన్సీ సినిమాలో ఖలిస్థాన్ ఉగ్రవాది జర్నైల్ సింగ్ భింద్రన్‌వాలేను టెర్రరిస్ట్‌గా చూపిస్తే సహంచమని కంగనాను వారు హెచ్చరించారు. పంజాబ్‌లో వేర్పాటువాదం కోరుకొన్నవారిలో భింద్రన్‌వాలే ఒకరు అని తెలిసిందే. వారు మాట్లాడిన వీడియోను మహారాష్ట్ర, పంజాబ్ పోలీసులకు ట్యాగ్ చేస్తూ కంగనా రనౌత్ షేర్ చేశారు.ఈ విషయంపై నెటిజన్లు మండిపడుతున్నారు. ఇంతకూ ఈ దేశంలో ఏమి జరుగుతోంది..? బీజేపీ ఎంపీ, బాలీవుడ్ నటి కంగనా రనౌత్‌పై ఇలా బహిరంగంగానే బెదిరింపులకు దిగడమేంటి..? కేవలం భారతదేశ చరిత్రను తెరపై చూపించే ప్రయత్నం చేస్తే చంపేస్తామని వార్నింగ్ ఇస్తారా.. దేశంలో ఎంతో బలమైన ప్రధాన మంత్రులలో ఒకరిగా గుర్తింపు ఉన్న ఉక్కు మహిళ ఇందిరా గాంధీ గురించి సినిమాగా చెప్పడం తప్పా..? అంటూ దయచేసి మీ భద్రతను పెంచుకోండి అని కంగనా రనౌత్‌కు నెటిజన్లు సూచిస్తున్నారు.What is happening in our nation? People are openly threatening the life of BJP MP and Bollywood actress 𝗞𝗮𝗻𝗴𝗮𝗻𝗮 𝗥𝗮𝗻𝗮𝘂𝘁 simply for portraying India's history. Is it wrong to tell the story of the Iron Lady of India, who is celebrated as one of the country's strongest… pic.twitter.com/w1QWJhAkG3— Rahul Chauhan (@RahulCh9290) August 26, 2024 -
బాలీవుడ్లో నాకు వ్యతిరేకంగా కుట్రలు చేశారు: కంగనా రనౌత్
‘‘బాలీవుడ్‌లోని పలువురు వ్యక్తులు నాకు వ్యతిరేకంగా కుట్రలు పన్నారు. నా సినిమాల్లో నటించొద్దని చాలామందికి ఫోన్స్ చేసి మరీ చెప్పారు’’ అన్నారు హీరోయిన్ కంగనా రనౌత్. ఆమె లీడ్ రోల్లో నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘ఎమర్జెన్సీ’. దివంగత ప్రధాని ఇందిరా గాంధీ బయోపిక్‌గా రూపొందిన ఈ సినిమాని కంగనా రనౌత్, రేణు పిట్టి నిర్మించారు. పలు వాయిదాల తర్వాత సెప్టెంబర్ 6న ఈ చిత్రం విడుదల కానుంది.ఈ సందర్భంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో కంగనా రనౌత్ మాట్లాడుతూ– ‘‘బాలీవుడ్లో నాకు వ్యతిరేకంగా కుట్రలు చేశారు. పలువురు క్యాస్టింగ్ దర్శకులు, సినిమాటోగ్రాఫర్స్ నాతో పని చేయడానికి నిరాకరించారు. అంతేకాదు... నాతో పని చేయొద్దని చాలామంది నటులకు ఫోన్లు చేశారు. ఎన్నో క్లిష్ట పరిస్థితులు, సవాళ్ల మధ్య అనుపమ్ ఖేర్, సతీష్ కౌశిక్, మహిమా చౌదరి వంటి నటీనటులతో ‘ఎమర్జెన్సీ’ కోసం పని చేయడం అదృష్టంగా భావిస్తున్నాను. వారు నా సినిమాలో భాగమవడంతో పాటు నన్నెంతో ప్రేమగా చూసుకున్నందుకు కృతజ్ఞతలు’’ అన్నారు. -
'ఎమర్జెన్సీ'ని ప్రకటించిన కంగనా రనౌత్
బాలీవుడ్ టాప్ హీరోయిన్ కంగనా రనౌత్ నటించిన చిత్రం 'ఎమర్జెన్సీ'. కంగనా రనౌత్ రచన, దర్శకత్వం, నిర్మించిన ఈ చిత్రం విడుదల కానున్నట్లు అధికారికంగా ప్రకటన వచ్చేసింది. ఈ సినిమా విడుదల విషయంలో ఇప్పటికే పలుమార్లు వాయిదా పడింది. అయితే, దేశంలో ఎమర్జెన్సీ విధించి నేటితో 49 ఏళ్లు పూర్తి కానున్నాయి. 50వ ఏడాదిలోకి అడుగుపెడుతుంది. 1975 జూన్ 25వ తేదీ అర్ధరాత్రి ఆనాటి ప్రధాని ఇందిరా గాంధీ భారత్‌లో ఎమర్జెన్సీ విధించారు. 'ఎమర్జెన్సీ చీకటిరోజులు' అంటూ తాజాగా తను నిర్మిస్తున్న ఎమర్జెన్సీ సినిమా విడుదల తేదీని కంగనా రనౌత్ ప్రకటించారు.మాజీ ప్రధాని ఇందిరా గాంధీ బయోపిక్‌గా తెరకెక్కిన 'ఎమర్జెన్సీ' చిత్రం 2024 సెప్టెంబర్ 6న విడుదల కానుందని కంగనా రనౌత్ తెలిపారు. అందుకు సంబంధించిన కొత్త పోస్టర్‌ను ఆమె పంచుకున్నారు. వాస్తవంగా జూన్ 14న విడుదల చేయాలని నిర్ణయించారు. అయితే కంగనా రాజకీయ రంగ ప్రవేశం చేయడంతో ఈ సినిమా విడుదల విషయంలో జాప్యం ఏర్పడింది. బీజేపీ నుంచి బరిలోకి దిగిన ఆమె హిమాచల్‌లోని 'మండి' నియోజకవర్గం నుంచి భారీ మెజారిటీతో గెలుపొందిన విషయం తెలిసిందే.మణికర్ణిక ప్రొడక్షన్‌పై ఎమర్జెన్సీ చిత్రాన్ని కంగనా రనౌత్ నిర్మించారు. ఓ సందర్భంలో కంగనా ఈ సినిమా గురించి మాట్లాడుతూ.. తనకు సంబంధించిన ఆస్తులన్నింటినీ దీని కోసం తనఖా పెట్టినట్లు ఆమె చెప్పారు. భారీ బడ్జెట్లో ఈ చిత్రాన్ని కంగనా నిర్మించారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జీవితం ఆధారంగా ఈ సినిమాని ఆమె తెరకెక్కించారు. కంగనా ఇందిరాగాంధీ పాత్రలో నటించగా.. జయప్రకాష్ నారాయణ్ పాత్రలో అనుపమ్ ఖేర్, మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయీ పాత్రలో శ్రేయస్ తల్పడే కనిపించనున్నారు. View this post on Instagram A post shared by Kangana Ranaut (@kanganaranaut) -
కంగనా రనౌత్ 'ఎమర్జెన్సీ' మరొసారి వాయిదా.. కారణం ఇదే
బాలీవుడ్ టాప్ హీరోయిన్ కంగనా రనౌత్ నటించిన చిత్రం 'ఎమర్జెన్సీ'. కంగనా రనౌత్ రచన, దర్శకత్వం, నిర్మించిన ఈ చిత్రం 2024లో విడుదల కానుంది. ఈ సినిమాపై చాలామంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా సినిమా విడుదల విషయంలో ఆమెకు చెందిన నిర్మాణ సంస్థ నుంచి కీలక ప్రకటన వచ్చింది. మరోసారి వాయిదా వేస్తున్నట్లు వారు ప్రకటించారు. తదుపరి అధికారిక తేదీని త్వరలో ప్రకటిస్తామని కంగనా టీమ్ తెలిపింది.మాజీ ప్రధాని ఇందిరా గాంధీ బయోపిక్‌గా తెరకెక్కిన 'ఎమర్జెన్సీ' చిత్రం ముందుగా జూన్ 14న విడుదల చేయాలని నిర్ణయించారు. అయితే కంగనా రాజకీయ రంగ ప్రవేశం చేశారు. బీజేపీ నుంచి బరిలోకి దిగిన ఆమె హిమాచల్‌లోని 'మండి' నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. రెండు రోజుల క్రితమే సుమారు పది లక్షల మంది అభిమానుల సమక్షంలో ఆమె నామినేషన్ కూడా వేశారు. ఎన్నికల్లో ఆమె బిజీగా ఉన్న కారణంగానే సినిమా విడుదల తేదీని వాయిదా వేశారు.ఎమర్జెన్సీ సినిమాను వాయిదా వేస్తూ తనకు సంబంధించిన మణికర్ణిక ప్రొడక్షన్ నుంచి సోషల్‌మీడియాలో ఒక పోస్ట్ షేర్ చేశారు. 'క్వీన్ కంగనా రనౌత్ పట్ల ప్రజలు ఎంతో ప్రేమ చూపుతున్నారు. దీంతో మా హృదయాలు నిండిపోయాయి. ప్రస్తుతం ఆమె దేశసేవకే ప్రాధాన్యత ఇచ్చారు. అందుకే ఎమర్జెన్సీ సినిమా పనులకు కంగనా దూరంగా ఉన్నారు. దీంతో విడుదల తేదీని వాయిదా వేస్తున్నాం. కొత్త విడుదల తేదీని త్వరలో తెలియచేస్తాం. మీ నిరంతర మద్దతుకు ధన్యవాదాలు.' అంటూ ఆమెకు చెందిన ప్రొడక్షన్ నుంచి ప్రకటన విడుదలైంది. త్వరలో ఎమర్జెన్సీ విడుదల కొత్త తేదీని తెలుపుతామని వారు తెలిపారు.ఓ సందర్భంలో కంగనా ఈ సినిమా గురించి మాట్లాడుతూ.. తనకు సంబంధించిన ఆస్తులన్నింటినీ దీని కోసం తనఖా పెట్టినట్లు చెప్పారు. భారీ బడ్జెట్లో ఈ చిత్రాన్ని కంగనా నిర్మిస్తున్నారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జీవితం ఆధారంగా ఈ సినిమాని ఆమె తెరకెక్కించారు. కంగనా ఇందిరాగాంధీ పాత్రలో నటించగా.. జయప్రకాష్ నారాయణ్ పాత్రలో అనుపమ్ ఖేర్, మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయీ పాత్రలో శ్రేయస్ తల్పడే కనిపించనున్నారు. View this post on Instagram A post shared by Manikarnika Films Production (@manikarnikafilms) -
కంగనా రనౌత్ 'ఎమర్జెన్సీ' సినిమాపై కీలక అప్టేడ్
చంద్రముఖి-2 సినిమాతో తెలుగు ప్రేక్షకులను బాలీవుడ్ నటి కంగనా రనౌత్ పలకరించారు. ఈ సినిమా ఆశించిన స్థాయిలో థియేటర్స్‌లలో మెప్పించలేకపోయింది. తాజాగా ఆమె నుంచి వస్తునన మరో చిత్రం 'ఎమర్జెన్సీ' ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రం భారతదేశపు మొదటి మహిళా ప్రధాని ఇందిరా గాంధీ రాజకీయ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. పీరియాడిక్ డ్రామాగా రానున్న ఈ సినిమాలో కంగనా రనౌత్ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఈ మూవీ నవంబర్ 24న విడుదల కానున్నట్లు మేకర్స్ చాలా రోజుల క్రితం ప్రకటించారు. కానీ ఆ సమయంలో విడుదల చేయడంలేదని తాజాగా కంగనా ప్రకటించింది. వచ్చే సంవత్సరంలో 'ఎమర్జెన్సీ' చిత్రాన్ని విడుదల చేస్తామని ఆమె అధికారికంగా ప్రకటించారు. ఇదే విషయాన్ని ఆమె తన ఎక్స్ ద్వారా ఇలా తెలిపారు. 'ఎమర్జెన్సీ అనేది నాకు సినిమా మాత్రమే కాదు, ఒక వ్యక్తిగా నా విలువ, నా పాత్రకు పరీక్ష. టీజర్ వల్ల వచ్చిన అద్భుతమైన స్పందన మమ్మల్ని ఎంతగానో ప్రోత్సహించింది. నేను ఎక్కడికి వెళ్లినా ప్రజలు నన్ను ఎమర్జెన్సీ విడుదల తేదీ గురించి అడుగుతున్నారు. కొన్ని కారణాల వల్ల ముందుగా అనుకున్న సమయానికి ఈ సినిమాను విడుదల చేయలేకపోతున్నాము. 2024లో సినిమా విడుదల ఉంటుంది. త్వరలో తేదీ కూడా ప్రకటిస్తాం.' అని కంగనా తెలిపారు. ఎమర్జెన్సీ చిత్రానికి కంగనానే దర్శకత్వం వహిస్తున్నారు. -
ఇందిరాగాంధీ పాత్రలో కంగన..‘ఎమర్జెన్సీ’ టీజర్ చూశారా?
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఎమర్జెన్సీ’. ఇందులో కంగన .. ఇందిరా గాంధీ పాత్ర పోషించారు. తాజాగా ఈ చిత్రం విడుదల తేదిని ప్రకటిస్తూ టీజర్‌ని విడుదల చేశారు మేకర్స్. దేశంలో ఎమర్జెన్సీ విధించిన జూన్ 25, 1975 తేదీతో టీజర్ ప్రారంభమవుతుంది. ఇందిరా ఈజ్ ఇండియా..ఇండియా ఈజ్ ఇందిరా అనే డైలాగ్‌లో టీజర్ ముగుస్తుంది. (చదవండి: 48 ఏళ్ల వయసులో తల్లి కాబోతున్న కమెడియన్) 1975 నుంచి 1977 వరకు దేశంలో విధించిన ‘అత్యవసర పరిస్థితి’ నేపథ్యంలో ఎమర్జెనీ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ మూవీ టీజర్‌ని కంగనా తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేస్తూ.. ‘రక్షకుడా లేక నియత? మన దేశ లీడర్ తన ప్రజలపై యుద్ధం ప్రకటించిన రోజు చరిత్రలోనే చీకటి రోజుగా ఉంది’అని రాసుకొచ్చింది. కాగా ఈ సినిమా నవంబర్ 24న థియేటర్స్‌లో విడుదల కానుంది. -
‘ఎమర్జెన్సీ’ కోసం చాలా ఇబ్బంది పడ్డా..ఆస్తులన్నీ తనఖా పెట్టాను: కంగన
‘ఎమర్జెన్సీ ’ సినిమా కోసం ఆర్థికంగా, ఆరోగ్యం పరంగా చాలా ఇబ్బంది పడ్డాడని బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ అన్నారు. ఆమె స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం ‘ఎమర్జెన్సీ’. ఇందులో కంగన .. ఇందిరా గాంధీ పాత్ర పోషించారు. తాజాగా ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో ఆమె ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. ఒక నటిగా ‘ఎమర్జెన్సీ’షూటింగ్ పూర్తి చేశాను. నా జీవితంలో అద్భుతమైన ఘట్టం చివరిదశకు చేరుకుంది. ఈ సినిమా షూటింగ్ ఎంతో గొప్పగా జరిగిందని నేను చెప్పొచ్చు. కానీ అది అబద్దమే అవుతుంది. ఈ సినిమా కోసం నా ఆస్తులన్ని తానఖా పెట్టాను. ఫస్ట్ షెడ్యూల్ సమయంలోనే నేను డెంగీ బారిన పడ్డాడు. అప్పుడు ఎన్నో కష్టాలు ఎదురయ్యాయి. రక్తకణాలు తగ్గిపోయాయి. నా మీద నాకే అనుమానం వచ్చే స్థితికి వచ్చాను.. ఆ దేవుడు నాకు పరీక్షలు పెడుతున్నట్టుగా అనిపించింది. సోషల్ మీడియాలో ఎప్పుడైనా నా భావాలను పంచుకున్నానే తప్ప.. నా ఆరోగ్య సమస్యల గురించి ఎక్కడ ప్రస్తావించలేదు. ఎందుకంటే నన్ను ప్రేమించే వారంతా కూడా ఆందోళన చెందొద్దని కోరుకున్నాను.ఇప్పుడు ఇదంతా నేను చెప్పడానికి ఓ కారణం ఉంది.. మన మీద మనకు నమ్మకం ఉండి.. మనం కష్టపడి పని చేస్తే.. నువ్ సమర్థురాలివి అయితే నిన్ను ఆ దేవుడు మరింత ఎక్కువగా పరీక్షిస్తుంటాడు.. ఆ పరీక్షల్లో నెగ్గాల్సిందే. దానికి కష్టపడాల్సిందే. సాధించే వరకు వదిలిపెట్టొద్దు.. ఎందుకంటే ఇప్పుడు ఇది మనకు పునఃజర్మ వంటిది. నా టీంకు థాంక్స్.. నా గురించి ఎవ్వరూ కంగారు పడకండి.. నేను ఆరోగ్యంగానే ఉన్నాను.. ఇప్పుడు మీ ప్రేమ, ఆశీస్సులు నాకు కావాలి’ అంటూ రాసుకొచ్చింది. View this post on Instagram A post shared by Kangana Ranaut (@kanganaranaut)