బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ తెరకెక్కించిన చిత్రం ఎమర్జన్సీ. చాలాసార్లు వాయిదా పడుతూ వచ్చినా ఈ చిత్రం ఈ వారంలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీ తానే దర్శకత్వం వహించారు. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ విధించిన ఎమర్జన్సీ నాటి పరిస్థితుల నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించారు.
తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాను బంగ్లాదేశ్‌లో బ్యాన్ చేయాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయించినట్లు వార్తలొచ్చాయి. హసీనా ప్రభుత్వం పడిపోయాక.. భారత్- బంగ్లాదేశ్ మధ్య సత్సంబంధాలు దెబ్బతిన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఎమర్జన్సీ మూవీని అక్కడ బ్యాన్ చేయనున్నారని లేటేస్ట్ టాక్.
ఈ ఈ చిత్రంలో ఇందిరా గాంధీగా కంగనా రనౌత్ నటించారు. జయప్రకాశ్ నారాయణ్ పాత్రలో అనుపమ్ ఖేర్, అటల్ బిహారీ వాజ్‌పేయీగా శ్రేయాస్ తల్పడే కనిపించనున్నారు. ఈ సినిమా ఈ నెల 17న బాక్సాఫీసు ముందుకు రానుంది.
ఎమర్జన్సీ వీక్షించిన కేంద్రమంత్రి..
కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ఇటీవల ఎమర్జన్సీ మూవీని వీక్షించారు. ఆయన కోసం కంగనా రనౌత్ స్పెషల్ స్క్రీనింగ్ ఏర్పాటు చేశారు.
(ఇది చదవండి: ఆస్కార్ చిత్రాల ఎంపిక.. కంగనా రనౌత్ సంచలన కామెంట్స్!)
ఎమర్జెన్సీ కథేంటంటే..
కంగనా రనౌత్ లీడ్ రోల్‌లో నటించిన పొలిటికల్ డ్రామా ఎమర్జెన్సీ. గతంలో ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో విధించిన ఎమర్జెన్సీ ఆధారంగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ చిత్రంలో అనుపమ్ ఖేర్, శ్రేయాస్ తల్పాడే, విశాక్ నాయర్, మహిమా చౌదరి, మిలింద్ సోమన్, సతీష్ కౌశిక్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. 1975 నుంచి 1977 వరకు 21 నెలల పాటు భారతదేశంలో విధించిన ఎమర్జెన్సీ, ఆ తరువాతి పరిణామాల ఆధారంగా తెరకెక్కించారు. ఈ చిత్రంలో కంగనా మాజీ ప్రధాని ఇందిరా గాంధీ పాత్రను పోషించారు.
ఆది నుంచి వివాదాలే..
ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ కాగా.. ఈ సినిమాపై మొదటి నుంచి వివాదాలు నడుస్తున్నాయి. సెన్సార్ బోర్డు నిబంధనలకు అనుగుణంగా ఈ మూవీని విడుదల చేసేందుకు మేకర్స్ నిర్ణయించారు. ఇప్పటికే ఎమర్జెన్సీ చిత్రానికి యూఏ సర్టిఫికేట్ జారీ చేసింది. అయితే కొన్ని సీన్స్ మాత్రం మార్పులు చేయాలని సూచించింది. కొందరు తమను టార్గెట్ చేసి చెడుగా చూపిస్తున్నారని ఓ వర్గం ఆరోపిస్తోంది. దీంతో సినిమా విడుదల వాయిదా వేయాల్సి వచ్చింది.
సెన్సార్ బోర్డుకు ఫిర్యాదులు..
ఈ సినిమా ఓ వర్గం వారిని కించపరిచేలా ఉందంటూ పలువురు సెన్సార్ బోర్డుకు లేఖ రాశారు. దీంతో సెన్సార్ బోర్డు కొన్ని సన్నివేశాల్లో అభ్యంతరం వ్యక్తం చేసింది. అప్పట్లో సెన్సార్ బోర్డు తమ చిత్రానికి సర్టిఫికెట్ ఇవ్వడం లేదంటూ కంగన మండిపడ్డారు. ఇటీవలే సెన్సార్ పూర్తి చేసుకున్న చిత్రం కొత్త ఏడాదిలో థియేటర్లలో సందడి చేయనుంది.
Comments
Please login to add a commentAdd a comment