Kangana Ranaut Revealed That She Had to Mortgage All of Her Property for The Emergency Film - Sakshi
Sakshi News home page

Kangana Ranaut: ‘ఎమర్జెన్సీ’ కోసం చాలా ఇబ్బంది పడ్డా..ఆస్తులన్నీ తనఖా పెట్టాను

Published Sat, Jan 21 2023 6:39 PM | Last Updated on Sat, Jan 21 2023 6:56 PM

Kangana Ranaut Reveals She Put All Her Property For Emergency Movie - Sakshi

‘ఎమర్జెన్సీ ’ సినిమా కోసం ఆర్థికంగా, ఆరోగ్యం పరంగా చాలా ఇబ్బంది పడ్డాడని బాలీవుడ్‌ హీరోయిన్‌ కంగనా రనౌత్‌ అన్నారు. ఆమె స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం ‘ఎమర్జెన్సీ’. ఇందులో కంగన .. ఇందిరా గాంధీ పాత్ర పోషించారు. తాజాగా ఈ సినిమా షూటింగ్‌ పూర్తయింది. ఈ సందర్భంగా సోషల్‌ మీడియాలో ఆమె ఓ ఎమోషనల్‌ పోస్ట్‌ పెట్టింది.

ఒక నటిగా ‘ఎమర్జెన్సీ’షూటింగ్‌ పూర్తి చేశాను. నా జీవితంలో అద్భుతమైన ఘట్టం చివరిదశకు చేరుకుంది. ఈ సినిమా షూటింగ్‌ ఎంతో గొప్పగా జరిగిందని నేను చెప్పొచ్చు. కానీ అది అబద్దమే అవుతుంది. ఈ సినిమా కోసం నా ఆస్తులన్ని తానఖా పెట్టాను. ఫస్ట్ షెడ్యూల్ సమయంలోనే నేను డెంగీ బారిన పడ్డాడు. అప్పుడు ఎన్నో కష్టాలు ఎదురయ్యాయి. రక్తకణాలు తగ్గిపోయాయి. నా మీద నాకే అనుమానం వచ్చే స్థితికి వచ్చాను.. ఆ దేవుడు నాకు పరీక్షలు పెడుతున్నట్టుగా అనిపించింది.

సోషల్‌ మీడియాలో ఎప్పుడైనా నా భావాలను పంచుకున్నానే తప్ప.. నా ఆరోగ్య సమస్యల గురించి ఎక్కడ ప్రస్తావించలేదు. ఎందుకంటే నన్ను ప్రేమించే వారంతా కూడా ఆందోళన చెందొద్దని కోరుకున్నాను.ఇప్పుడు ఇదంతా నేను చెప్పడానికి ఓ కారణం ఉంది.. మన మీద మనకు నమ్మకం ఉండి.. మనం కష్టపడి పని చేస్తే..  నువ్ సమర్థురాలివి అయితే నిన్ను ఆ దేవుడు మరింత ఎక్కువగా పరీక్షిస్తుంటాడు.. ఆ పరీక్షల్లో నెగ్గాల్సిందే. దానికి కష్టపడాల్సిందే. సాధించే వరకు వదిలిపెట్టొద్దు.. ఎందుకంటే ఇప్పుడు ఇది మనకు పునఃజర్మ వంటిది.  నా టీంకు థాంక్స్.. నా గురించి ఎవ్వరూ కంగారు పడకండి.. నేను ఆరోగ్యంగానే ఉన్నాను.. ఇప్పుడు మీ ప్రేమ, ఆశీస్సులు నాకు కావాలి’ అంటూ రాసుకొచ్చింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement