
బాలీవుడ్ ఫైర్‌బ్రాండ్ కంగనా రనౌత్ (Kangana Ranaut) ప్రధాన పాత్రలో నటించి, స్వీయదర్శకత్వం వహించిన చిత్రం ఎమర్జెన్సీ (Emergency Movie). పలుమార్లు వాయిదాపడుతూ వచ్చిన ఈ మూవీ ఎట్టకేలకు జనవరి 17న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ ఆశించిన ఫలితాలను అందుకోలేకపోయింది. బాక్సాఫీస్ వద్ద కేవలం రూ.21 కోట్లు మాత్రమే రాబట్టింది. తాజాగా ఈ చిత్రం ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అయింది. ఈ విషయాన్ని కంగనా సింపుల్‌గా తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో వెల్లడించింది. ఎమర్జెన్సీ మార్చి 17న నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులోకి రానున్నట్లు ప్రకటించింది. థియేటర్లలో మిస్ అయినవారు ఎమర్జెన్సీ చిత్రాన్ని ఓటీటీలో చూసేయండి.

ఎమర్జెన్సీ కథ
ఇందిరా గాంధీ ప్రధానిగా ఉన్న కాలంలో విధించిన ఎమర్జెన్సీ, ఆపరేషన్ బ్లూస్టార్ వంటి సంఘటనల ఆధారంగా ఈ మూవీ తెరకెక్కింది. ఇందులో కంగనా.. ఇందిరాగాంధీగా నటించింది. అనుపమ్ ఖేర్, శ్రేయాస్ తల్పడే, విశాక్ నాయర్, మిలింద్ సోమన్ సహా దివంగత నటుడు సతీశ్ కౌశిక్ ముఖ్య పాత్రలు పోషించారు. కంగనా ఈ చిత్రానికి నిర్మాతగానూ వ్యవహరించింది.
చదవండి: ఛత్రపతి శివాజీగా ఆయన బాగా సెట్ అవుతారు: పరుచూరి గోపాలకృష్ణ
Comments
Please login to add a commentAdd a comment