కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో నటించి, స్వీయ దర్శకత్వం వహించిన ఎమర్జెన్సీ సినిమా విడుదలకు త్వరలోనే లైన్ క్లియర్ కానుంది. సెన్సార్ సర్టిఫికెట్ విషయంలో ఓ నిర్ణయానికి రావాలని బాంబే హైకోర్టు.. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్(సీబీఎఫ్‌సీ)ను ఇటీవలే ఆదేశించింది. సెప్టెంబర్ 25లోగా ఓ నిర్ణయానికి రావాలని సూచించింది. తాజాగా ఈ అంశంపై బుధవారంనాడు హైకోర్టులో విచారణ జరిగింది.
సెప్టెంబర్ 30కి విచారణ వాయిదా
మీ దగ్గర ఏదైనా గుడ్‌న్యూస్ ఉందా? అని జస్టిస్ బిపి కొలబావాలా, జస్టిస్ ఫిర్దోష్ పోనివాలాలతో కూడిన ధర్మాసనం సీబీఎఫ్‌సీని అడిగింది. సినిమాలో కొన్ని కట్స్ సూచించామని, అవి అమలు చేస్తే సెన్సార్ సర్టిఫికెట్ ఇస్తామని, సినిమా థియేటర్లలో విడుదల చేసుకోవచ్చని సీబీఎఫ్‌సీ తెలిపింది. దీంతో నిర్మాణసంస్థ జీ స్టూడియోస్.. తమకు ఆలోచించుకోవడానికి కొంత సమయం కావాలని కోరింది. బెంచ్ తదుపరి విచారణను సెప్టెంబర్ 30కు వాయిదా వేసింది. సోమవారం అయినా ఎమర్జెన్సీ సినిమాకు చిక్కులు తొలగిపోతాయేమో చూడాలి!
ఎమర్జెన్సీ
ఎమర్జెన్సీ మూవీ విషయానికి వస్తే.. 1975లో ఇందిరా గాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో ఎమర్జెన్సీ విధించినప్పుడు జరిగిన సంఘటనల ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. ఈ మూవీ 2023 నవంబర్ 24న విడుదల కావాల్సింది. కానీ సెన్సార్ సర్టిఫికెట్ ఆలస్యం కావడంతో ఏడాదిగా వాయిదా పడుతూ వస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment