ఓటీటీలోకి వచ్చేసిన ‘ప్రభుత్వ జూనియర్ కళాశాల ’ | Prabuthwa Junior Kalasala Movie Streaming On These OTT Platform | Sakshi
Sakshi News home page

ఓటీటీలోకి వచ్చేసిన ‘ప్రభుత్వ జూనియర్ కళాశాల ’

Sep 26 2024 5:28 PM | Updated on Sep 26 2024 7:06 PM

Prabuthwa Junior Kalasala Movie Streaming On These OTT Platform

ప్రణవ్ ప్రీతం, షాజ్ఞ శ్రీ వేణున్ జంటగా నటించిన ప్రేమ కథాచిత్రం ‘ప్రభుత్వ జూనియర్ కళాశాల పుంగనూరు-500143'. ఒక యదార్థ సంఘటన ఆధారంగా శ్రీనాథ్ పులకురం ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. భువన్ రెడ్డి కొవ్వూరి ఈ సినిమాను నిర్మించారు. జూన్ 21న విడుదలైన ఈ చిత్రం యూత్, ఫ్యామిలీ ప్రేక్షకుల మనసును దోచుకుంది. ఇప్పుడు ఓ టి టి ప్రేక్షకుల కోసం అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది.

‘థియేటర్‌లో యూత్‌ని ఆకర్షించిన మా సినిమా ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ లో ఫామిలీ ప్రేక్షకులను అలరిస్తుంది. ఓటీటీలో విడుదల అయిన తర్వాత చాలామంది ఫోన్ చేసి సినిమా చాలా బాగుంది అని చెప్తున్నారు. ఫ్యామిలీ అందరు కలిసి మంచి కుటుంబ కథ చిత్రం చూడాలి అనుకుంటే మా ప్రభుత్వ జూనియర్ కళాశాల సరైన సినిమా’ అని దర్శక నిర్మాతలు తెలిపారు.

ప్రతి మనిషికి తొలి ప్రేమ ఎంతో మధురంగా, గుండెల్లో పదిలంగా ఉంటుంది. అలాంటి ఓ అందమైన తొలి ప్రేమను ప్రభుత్వ జూనియర్ కళాశాల చిత్రంలో చూపించారు. ఇంటర్మీడియట్ రోజులు.. తొలి ప్రేమ.. విరహ వేదనలు..  ఇలా అన్ని అంశాలతో కుర్రకారుని కట్టి పడేసేలా ఓ అందమైన ప్రేమ కావ్యాన్ని చూపించారు. ప్రస్తుతం ఈ ప్రేమ కథా చిత్రానికి ఓటీటీ ఆడియన్స్ ఫిదా అవుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement