Prabuthwa Junior Kalashala Movie
-
చీరకట్టులో కొత్త హీరోయిన్ షాజ్ఞ శ్రీ వేణున్ మెరుపులు (ఫొటోలు)
-
ఓటీటీలోకి వచ్చేసిన ‘ప్రభుత్వ జూనియర్ కళాశాల ’
ప్రణవ్ ప్రీతం, షాజ్ఞ శ్రీ వేణున్ జంటగా నటించిన ప్రేమ కథాచిత్రం ‘ప్రభుత్వ జూనియర్ కళాశాల పుంగనూరు-500143'. ఒక యదార్థ సంఘటన ఆధారంగా శ్రీనాథ్ పులకురం ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. భువన్ రెడ్డి కొవ్వూరి ఈ సినిమాను నిర్మించారు. జూన్ 21న విడుదలైన ఈ చిత్రం యూత్, ఫ్యామిలీ ప్రేక్షకుల మనసును దోచుకుంది. ఇప్పుడు ఓ టి టి ప్రేక్షకుల కోసం అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది.‘థియేటర్లో యూత్‌ని ఆకర్షించిన మా సినిమా ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ లో ఫామిలీ ప్రేక్షకులను అలరిస్తుంది. ఓటీటీలో విడుదల అయిన తర్వాత చాలామంది ఫోన్ చేసి సినిమా చాలా బాగుంది అని చెప్తున్నారు. ఫ్యామిలీ అందరు కలిసి మంచి కుటుంబ కథ చిత్రం చూడాలి అనుకుంటే మా ప్రభుత్వ జూనియర్ కళాశాల సరైన సినిమా’ అని దర్శక నిర్మాతలు తెలిపారు.ప్రతి మనిషికి తొలి ప్రేమ ఎంతో మధురంగా, గుండెల్లో పదిలంగా ఉంటుంది. అలాంటి ఓ అందమైన తొలి ప్రేమను ప్రభుత్వ జూనియర్ కళాశాల చిత్రంలో చూపించారు. ఇంటర్మీడియట్ రోజులు.. తొలి ప్రేమ.. విరహ వేదనలు.. ఇలా అన్ని అంశాలతో కుర్రకారుని కట్టి పడేసేలా ఓ అందమైన ప్రేమ కావ్యాన్ని చూపించారు. ప్రస్తుతం ఈ ప్రేమ కథా చిత్రానికి ఓటీటీ ఆడియన్స్ ఫిదా అవుతున్నారు. -
చిన్న సినిమాకు థియేటర్లలో ఊహించని క్రేజ్!
ప్రణవ్ ప్రీతం, షాజ్ఞ శ్రీ వేణున్ జంటగా నటించిన చిత్రం ‘ప్రభుత్వ జూనియర్ కళాశాల పుంగనూరు-500143'. ఓక యదార్థ సంఘటన ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. శ్రీనాథ్ పులకురం దర్శకత్వం వహించగా.. భువన్ రెడ్డి కొవ్వూరి ఈ సినిమాను నిర్మించారు . జూన్ 21న విడుదలైన ఈ చిత్రం విశేష ఆదరణ దక్కించుకుంటోంది. ముఖ్యంగా యూత్, ఫామిలీ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ వారం విడుదలైన చిత్రాల్లో మా ప్రభుత్వ జూనియర్ కళాశాల కలెక్షన్స్‌తో దూసుకెళ్తోంది. కేవలం మౌత్ టాక్‌తోనే ఈ సినిమాకు ఆదరణ వస్తోంది. సినిమాలో కాలేజీ సన్నివేశాలను ఆడియన్స్ బాగున్నాయని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఈ మూవీని ఎంజాయ్ చేస్తూ తమ కాలేజీ రోజులను ప్రేక్షకులు గుర్తు చేసుకున్నారు. మదర్ సెంటిమెంట్ సన్నివేశాలు, పాటలు సైతం ఆడియన్స్‌ను అలరిస్తున్నాయి. సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరు సినిమా బాగుందని ప్రశంసలు కురిపిస్తున్నారని దర్శకుడు శ్రీనాథ్ పులకురం తెలిపారు. కాగా.. ఈ చిత్రంలో రామ్ పటాస్, తేజ గౌడ్, బాంబే పద్మ, శ్రీమునిచంద్ర, మండపేట మల్లిక జాగుల కీలక పాత్రలు పోషించారు. -
'ప్రభుత్వ జూనియర్ కళాశాల' సినిమా రివ్యూ
కాలేజీ ప్రేమకథా సినిమాలకు ఉండే డిమాండే వేరు. 'కొత్త బంగారు లోకం' నుంచి 'కలర్ ఫోటో' వరకు చెప్పుకొంటే ఎన్నో మూవీస్ ఉంటాయి. ఇప్పుడు ఇలాంటి కాన్సెప్ట్‌తో వచ్చిన సినిమానే 'ప్రభుత్వ జూనియర్ కళాశాల'. అందరూ కొత్తోళ్లే నటించిన ఈ మూవీ తాజాగా థియేటర్లలోకి వచ్చింది. మరి ఇది ఎలా ఉంది? ఏంటనేదే ఇప్పుడు రివ్యూలో చూద్దాం.(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి 11 మూవీస్.. మొత్తంగా 17 రిలీజ్)కథేంటి?అది 2004. రాయలసీమలోని పుంగనూరు అనే ఊరు. ఇంటర్మీడియట్ ఫస్టియర్ కుర్రాడు వాసు (ప్రణవ్ ప్రీతమ్). అదే కాలేజీలో సీఈసీ చదువుతున్న కుమారి (శాగ్నశ్రీ వేణున్) అనే అమ్మాయి. అసలు పరిచయమే లేని వీళ్లిద్దరూ అనుకోని పరిస్థితుల్లో ఫ్రెండ్స్ అవుతారు. ఆ తర్వాత ప్రేమలో పడతారు. కానీ కుమారి గురించి కొన్ని విషయాలు తెలిసేసరికి ఆమెతో గొడవపడతాడు. ఆ తర్వాత పురుగుల మందు తాగి ఆత్మహత్య ప్రయత్నం చేస్తాడు. వాసు ఎందుకు చనిపోవాలనుకున్నాడు? చివరకు వీళ్ల ప్రేమ కంచికి చేరిందా? అనేదే స్టోరీ.ఎలా ఉందంటే?తొలి ప్రేమ.. ప్రతి ఒక్కరి జీవితంలో మర్చిపోలేని ఓ జ్ఞాపకం. అయితే అది మంచి జ్ఞాపకమా? చేదు జ్ఞాపకమా అనేది ఆయా పరిస్థితులు బట్టి ఆధారపడి ఉంటుంది. 'ప్రభుత్వ జూనియర్ కళాశాల' కూడా అలాంటి ఓ స్టోరీనే. ఇంటర్మీడియట్ చదివే కుర్రాడి జీవితంలో తొలి ప్రేమ అనేది తీపి గుర్తుల్ని మిగిల్చిందా? చేదు అనుభవాల్ని పరిచయం చేసిందా అనేదే మెయిన్ పాయింట్.ఫస్టాప్ అంతా కూడా గవర్నమెంట్ కాలేజీలో వాసు, అతడి ఫ్రెండ్స్, చుట్టూ ఉండే వాతావరణం, కుమారితో ప్రేమ లాంటివి చూపిస్తూ వెళ్లారు. ఇక సెకండాఫ్ వచ్చేసరికి ప్రేమలో కలతలు, మనస్పర్థలు లాంటివి ఉంటాయి. ఇందులో చెప్పుకోవడానికి కథేం కొత్తగా ఉండదు. ఇప్పటికే ఎన్నో కాలేజీ లవ్ స్టోరీల్లో కనిపించే సీన్స్ ఉంటాయి. కానీ అంతా కూడా మలయాళ సినిమాల్లో తీసినట్లు చాలా నిదానంగా అదే టైంలో క్యూట్‌గా సాగుతుంది. 90ల్లో పుట్టి పెరిగిన వాళ్లు ఈ సినిమా చూస్తే.. గత జ్ఞాపకాల్లోకి వెళ్లిపోతారు. తొలి ప్రేమ, తొలి ముద్దు లాంటివి మనసులో గిలిగింతలు పెట్టేస్తాయి. పాత ప్రేమలు మళ్లీ గుర్తొస్తాయి.(ఇదీ చదవండి: 'నింద' సినిమా రివ్యూ)మధ్య మధ్యలో ఫన్ మూమెంట్స్, జోకులతో సినిమా అంతా సరదా సరదాగా సాగిపోతుంది. కానీ క్లైమాక్స్‌కి వచ్చేసరికి ఎమోషనల్‌గా ఎండ్ చేయడం బాగుంది. సినిమాలో పెద్ద కంప్లైంట్స్ ఏం లేవా అంటే ఉన్నాయి. ఇది అందరికీ కనెక్ట్ అయ్యే మూవీ కాదు. 90ల్లో పుట్టి, ఫోన్లు లేని కాలంలో ఇంటర్మీడియట్ చేసిన అమ్మాయిలు అబ్బాయిలకు అయితే బాగా నచ్చుతుంది. ఈ కాలంలో పుట్టి పెరిగిన కుర్రాళ్లకు అబ్బే అని చెప్పి విసుగు వచ్చేస్తుంది.ఎవరెలా చేశారు?లీడ్ రోల్స్ చేసిన ప్రణవ్, శాగ్నశ్రీ.. ఇద్దరూ భలే క్యూట్‌గా చేశారు. వీళ్ల మధ్య కెమిస్ట్రీ కూడా బాగా వర్కౌట్ అయింది. ఇక మిగిలిన పాత్రధారులు తమ తమ పాత్రలకు న్యాయం చేశారు. టెక్నికల్ విషయాలకొస్తే.. సినిమాటోగ్రఫీ చాలా రిచ్‌గా ఉంది. పాటలు పెద్దగా గుర్తుండవు కానీ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ వినసొంపుగా ఉంది. రైటర్, ఎడిటర్, దర్శకుడు.. ఇలా అన్ని బాధ్యతలు భుజానికెత్తుకున్న శ్రీనాథ్ పులకరం.. ఫీల్ గుడ్ మూవీని అందించాడు. కానీ 'కల్కి' మేనియాలో దీన్ని పట్టించుకుంటారా అనేది సస్పెన్స్.-చందు డొంకాన, సాక్షి వెబ్ డెస్క్(ఇదీ చదవండి: ప్రభాస్ ఫ్యాన్స్‌కి బ్యాడ్ న్యూస్.. 'కల్కి' అది లేనట్లే?) -
క్వాలిటీ పరంగా మాది చాలా పెద్ద చిత్రం : దర్శకుడు శ్రీనాథ్ పులకురం
‘క్వాలిటీలో కాంప్రమైజ్ కాకుండా ‘ప్రభుత్వ జూనియర్ కళాశాల పుంగనూరు-500143′ సినిమా తెరకెక్కించాం. ఈ సినిమా రిహార్సల్స్, వర్క్ షాప్స్ కు కొన్ని నెలల టైమ్ కేటాయించాం. ఆర్టిస్టులను మా ఊరు పుంగనూరు తీసుకెళ్లి రాయలసీమ యాస నేర్పించాం. డబ్బింగ్ కోసమే 8 నెలల టైమ్ వెచ్చించాం.ఆర్టిస్టుల పరంగా మాది చిన్న సినిమానే కానీ క్వాలిటీ పరంగా చాలా పెద్ద సినిమా’ అని అన్నారు దర్శకుడు శ్రీనాథ్ పులకురం. ఆయన దర్శకత్వం వహించిన తాజా చిత్రం ‘ప్రభుత్వ జూనియర్ కళాశాల పుంగనూరు-500143’. ఓ యదార్థ సంఘటన ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం ప్రణవ్ ప్రీతం, షాజ్ఞ శ్రీ వేణున్ హీరోహీరోయిన్లుగా నటించారు. ఈ నెల 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా చిత్రబృందం ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో దర్శకుడు శ్రీనాథ్ పులకురం మాట్లాడుతూ.. నాకు సినిమా అంటే ఇష్టం. కానీ చాలా మందికి సినిమా అంటే వ్యాపారం. అలాంటి వారి వల్ల ఇబ్బందులు ఎదుర్కొన్నా. ఇవన్నీ దాటుకుని ఈ నెల 21న గ్రాండ్ గా మా మూవీ థియేట్రికల్ రిలీజ్ కు వస్తోంది.మూవీ మీకు తప్పకుండా నచ్చుతుంది. చూసి మీ సపోర్ట్ అందిస్తారని కోరుకుంటున్నా. ‘ప్రభుత్వ జూనియర్ కళాశాల పుంగనూరు-500143′ సినిమా చూశాక మీరు మీ పేరెంట్స్ ను గుర్తు తెచ్చుకుంటారు’అన్నారు. మేము ఇచ్చిన లిమిటెడ్ బడ్జెట్ లో ‘ప్రభుత్వ జూనియర్ కళాశాల పుంగనూరు-500143′సినిమాను శ్రీనాథ్ అందరికీ నచ్చేలా రూపొందించాడు. ఈ సినిమా ప్రతి ఒక్కరికి నచ్చుతుందని ఆశిస్తున్నాను’అని నిర్మాత భువన్‌రెడ్డి కొవ్వూరి అన్నారు. ‘కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో అన్ని ఎమోషన్స్ కలిసి ఉన్న సినిమా ఇది. ఇలాంటి మంచి మూవీని సపోర్ట్ చేయండని రిక్వెస్ట్ చేస్తున్నా’ అని హీరోయిన్ షాజ్ఞ అన్నారు. ‘ఈ సినిమా మా అందరికి చాలా స్పెషల్. హీరోయిన్‌తో పాటు నాక్కుడా మంచి పేరు తెచ్చిపెడుతుందని ఆశిస్తున్నాను’అని హీరో ప్రణవ్ ప్రీతం అన్నారు. -
ప్రభుత్వ జూనియర్ కళాశాల సినిమా నుంచి వీడియో సాంగ్ లాంచ్
ప్రణవ్, షజ్ఞ శ్రీ హీరో హీరోయిన్లుగా శ్రీనాథ్ పులకురం దర్శకత్వంలో కొవ్వూరి అరుణ గారి సమర్పణ లో భువన్ రెడ్డి కొవ్వూరి నిర్మాతగా వస్తున్న సినిమా ప్రభుత్వ జూనియర్ కళాశాల. గతంలో ఈ సినిమా నుంచి ఫస్ట్ గ్లింప్స్, టీజర్ అండ్ సాంగ్ విడుదలై మంచి సక్సెస్ అందుకున్నాయి. ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన రెండో సాంగ్ చల్లగాలి అంటూ సాగే రొమాంటిక్ పాటని వీడియో సాంగ్ రిలీజ్ చేశారు. ఇప్పటివరకు లిరికల్ సాంగ్స్ రిలీజ్ అవ్వడమే కానీ ఫస్ట్ టైం మూవీకి సంబంధించిన వీడియో సాంగ్ మూవీ రిలీజ్‌కు ముందే విడుదల చేయడం చాలా కొత్తగా ప్లాన్ చేశారు టీం. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సీనియర్ జర్నలిస్ట్ ప్రభు విచ్చేశారు. సీనియర్ జర్నలిస్ట్ ప్రభు మాట్లాడుతూ : 2000's బ్యాక్ డ్రాప్ నేటివిటికి తగినట్టుగా సినిమాను తీసుకొచ్చారు. విజువల్స్ చాలా బాగున్నాయి. మంచి సినిమా, మంచి కంటెంట్‌కు మీడియా సపోర్ట్‌తో పాటు ప్రేక్షకుల సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది అన్నారు. దర్శకుడు శ్రీనాథ్ పులకురం మాట్లాడుతూ : ఈ కాలంలో ప్రైవేట్ కాలేజీలు తప్ప ప్రభుత్వ జూనియర్ కళాశాల అనే మాట చాలా తక్కువ వినిపిస్తోంది. 2000's బ్యాక్ డ్రాప్లో పుంగనూరు గ్రామంలో జరిగిన ఒక రియల్ ఇన్సిడెంట్ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కించడం జరిగింది. చిన్న సినిమా పెద్ద సినిమా అని చూస్తున్నారు కానీ మేము ఒక మంచి సినిమా మంచి బ్యానర్ అండ్ డీసెంట్ బడ్జెట్ తో సినిమాను తెరకెక్కించాం. ఈ సినిమాను ప్రేక్షకులు, మీడియా సపోర్ట్ చేసి మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను అన్నారు. నిర్మాత భువన్ రెడ్డి కొవ్వూరి మాట్లాడుతూ : శ్రీనాథ్ చెప్పిన కథ బాగా నచ్చి తనని నమ్మి కథను నమ్మి సినిమా దర్శకుడు అని పేరే కానీ అన్ని దగ్గరుండి చూసుకుని మంచి కాన్సెప్ట్ తో కొత్త కథగా ఈ సినిమాను మీ ముందుకు తీసుకురాబోతున్నాడు. సినిమా మంచి సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను అన్నారు. హీరో ప్రణవ్ మాట్లాడుతూ : డైరెక్టర్ శ్రీనాథ్ గారు నన్ను నమ్మి ఈ కథకు నన్ను సెలెక్ట్ చేశారు సంతోషంగా ఉంది. షార్ట్ ఫిలిమ్స్ చేసుకుంటూ ఒక యాక్టర్ గా ఎదగాలనుకున్న నన్ను హీరోను చేశారు. కథ చాలా కొత్తగా ఉంటుంది రెండు దశాబ్దాల వెనక్కు వెళ్లేలా రియలిస్టిక్ గా ఈ సినిమాను చేసాం. మ్యూజిక్ డైరెక్టర్ కార్తీక్ చాలా మంచి మ్యూజిక్ ఇచ్చాడు. చిన్మయి పాడిన ఈ పాట కూడా మంచి సక్సెస్ అవుతుంది. సినిమాను మంచి సక్సెస్ చేసి మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాము అన్నారు. హీరోయిన్ షజ్ఞ శ్రీ మాట్లాడుతూ : ఈ సినిమాకి నన్ను సెలెక్ట్ చేసుకున్నందుకు మా డైరెక్టర్ శ్రీనాథ్‌కు థాంక్స్ చెప్పుకుంటున్నాను. ముఖ్యంగా ఇప్పుడు ఈ సాంగ్ గురించి మాట్లాడదలుచుకున్నాను. విజువల్స్ చాలా బాగా వచ్చాయి డైరెక్టర్ టేకింగ్‌తో పాటు ప్రొడ్యూసర్ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ఈ సాంగ్‌ను అలాగే సినిమాని మీ ముందుకు తీసుకొస్తున్నారు. మీడియా తలుచుకుంటే ఏదైనా చేయగలదు. మీడియా ప్రేక్షకులు ఈ సినిమాని ఆదరించి సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను అన్నారు. -
Prabuthwa Junior Kalashala: మంగ్లీ మార్కుతో ‘డూడుం డుక్కుడుం’
కాలేజీ నేపథ్యంలో టాలీవుడ్లో చాలా సినిమాలు వచ్చాయి. వాటిల్లో చాలా వరకు సూపర్ హిట్లుగా నిలిచాయి. త్వరలోనే మరో కాలేజీ ప్రేమ కథ తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఓ యదార్థ సంఘటన ఆధారంగా డైరెక్టర్ శ్రీనాథ్ పులకురం తెరకెక్కించిన తాజా చిత్రం ‘ప్రభుత్వ జూనియర్ కళాశాల పుంగనూరు-500143′. ప్రణవ్ సింగంపల్లి, షాజ్ఞ శ్రీ వేణున్, రామ్ పటాస్, తేజ గౌడ్, బాంబే పద్మ, శ్రీమునిచంద్ర, మండపేట మల్లిక జాగుల ప్రధాన పాత్రలు పోషించారు. ఇప్పటికే షూటింగ్ , పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి చేసుకున్న ఈ సినిమా రిలీజ్ కు సిద్దమైన క్రమంలో మేకర్స్ ప్రమోషన్స్‌పై ఫోకస్ పెట్టారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి పలు పోస్టర్లు టీజర్ రిలీజ్ చేయగా అన్ని మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. ఇక ఇప్పుడు తాజాగా ఈ సినిమా నుంచి ఒక సాంగ్ రిలీజ్ చేశారు మేకర్స్. మోస్ట్ హపెనింగ్ సింగర్ మంగ్లీ పాడిన డూడుం డుక్కుడుం సాంగ్ ను స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ కుమార్ చేతులమీదుగా రిలీజ్ చేశారు. కాలేజీ జంట మధ్య డూడుం డుక్కుడుం అంటూ సాగుతున్న ఈ సాంగ్ అత్యంత ఆసక్తికరంగా ఉంది. ఈ పాటకు కార్తీక్ రోడ్రిగ్జ్ అందించిన బాణీలు అందించగా.. శ్రీ సాయి కిరణ్ అర్థవంతమైన లిరిక్స్ రాశాడు. మంగ్లీ అద్భుతంగా ఆలపించారు.