చిన్న సినిమాకు థియేటర్లలో ఊహించని క్రేజ్‌! | Prabuthva Junior Kalasala Gets Huge Response In Theatres | Sakshi
Sakshi News home page

Prabuthwa Junior Kalashala: రియల్‌ స్టోరీతో సినిమా.. థియేటర్లలో ఫుల్‌ క్రేజ్‌!

Published Sun, Jun 23 2024 4:22 PM | Last Updated on Sun, Jun 23 2024 4:47 PM

Prabuthwa Junior Kalashala Gets Huge Response In Theatres

ప్రణవ్ ప్రీతం, షాజ్ఞ శ్రీ వేణున్ జంటగా నటించిన చిత్రం  ‘ప్రభుత్వ జూనియర్ కళాశాల పుంగనూరు-500143'. ఓక యదార్థ సంఘటన ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. శ్రీనాథ్ పులకురం దర్శకత్వం వహించగా.. భువన్ రెడ్డి కొవ్వూరి  ఈ సినిమాను నిర్మించారు . జూన్ 21న విడుదలైన ఈ చిత్రం విశేష ఆదరణ దక్కించుకుంటోంది. ముఖ్యంగా యూత్, ఫామిలీ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. 

ఈ వారం విడుదలైన చిత్రాల్లో మా ప్రభుత్వ జూనియర్ కళాశాల కలెక్షన్స్‌తో దూసుకెళ్తోంది. కేవలం మౌత్‌ టాక్‌తోనే ఈ సినిమాకు ఆదరణ వస్తోంది.  సినిమాలో కాలేజీ సన్నివేశాలను ఆడియన్స్ బాగున్నాయని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఈ మూవీని ఎంజాయ్ చేస్తూ తమ కాలేజీ రోజులను ప్రేక్షకులు గుర్తు చేసుకున్నారు. మదర్‌ సెంటిమెంట్ సన్నివేశాలు, పాటలు సైతం ఆడియన్స్‌ను అలరిస్తున్నాయి. సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరు సినిమా బాగుందని ప్రశంసలు కురిపిస్తున్నారని దర్శకుడు శ్రీనాథ్ పులకురం తెలిపారు. కాగా.. ఈ చిత్రంలో రామ్ పటాస్, తేజ గౌడ్, బాంబే పద్మ, శ్రీమునిచంద్ర, మండపేట మల్లిక జాగుల కీలక పాత్రలు పోషించారు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement